1 00:00:18,435 --> 00:00:19,728 నీ వాటా. 2 00:00:22,773 --> 00:00:26,026 ఇదిగో పాస్ పోర్ట్. దీనికి డబ్బులు నేనే కట్టా. 3 00:00:27,819 --> 00:00:29,029 నాకు అదే న్యాయమైనది అనిపించింది. 4 00:00:33,534 --> 00:00:35,369 నిన్ను బాగా హింసించినట్టున్నారు. 5 00:00:39,748 --> 00:00:41,625 వాళ్లకి కావాల్సింది ఏంటో నా దగ్గర ఉంది, 6 00:00:43,252 --> 00:00:44,294 ఏమంటావు, చార్లీ? 7 00:00:44,378 --> 00:00:45,754 అబ్బా, డేల్. 8 00:00:47,005 --> 00:00:48,465 నీకు ధన్యవాదాలు చెప్పాలని పరోక్షంగా చెప్తున్నావా? 9 00:00:49,299 --> 00:00:51,260 సరే, అలాగే. థ్యాంక్యూ. 10 00:00:52,010 --> 00:00:55,848 నన్ను కొట్టాలనుకుంటున్నావా? అలాగే కానివ్వు. వచ్చి మొహం మీద కొట్టు. 11 00:00:57,683 --> 00:00:58,851 నా కొంప నేనే కొల్లేరు చేసుకున్నా. 12 00:01:02,229 --> 00:01:06,733 కానీ ఇప్పుడు, నాకు స్వేచ్ఛ ఉంటే, నీతో పెట్టుకొనే పెంట పని చేయడం కన్నా 13 00:01:07,776 --> 00:01:10,404 ఇంకెక్కడికైనా వెళ్లిపోవడం మంచిది. 14 00:01:18,120 --> 00:01:19,872 న్యూజిలాండ్ పాస్ పోర్ట్ 15 00:01:20,873 --> 00:01:22,207 న్యూజిలాండ్ పౌరుడిగానా? 16 00:01:22,291 --> 00:01:24,543 ఇంత తక్కువ సమయంలో అది మాత్రమే కుదిరింది. 17 00:01:25,377 --> 00:01:26,503 సరే. 18 00:01:26,587 --> 00:01:27,880 ఎక్కడికి వెళ్తున్నావో నిర్ణయించుకున్నావా? 19 00:01:29,965 --> 00:01:30,966 హా. 20 00:01:33,135 --> 00:01:35,512 నీ గురించి లోతుగా తెలుసుకుందామని వెళ్తున్నావా, డేల్? 21 00:01:36,471 --> 00:01:40,100 లేదు. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా. 22 00:02:00,537 --> 00:02:01,747 ఓయ్. 23 00:02:03,707 --> 00:02:05,417 ఓయ్, ఆసుపత్రికి ఏమైనా వెళ్తావా? 24 00:02:05,501 --> 00:02:08,211 వద్దు. ఆసుపత్రి వద్దు. 25 00:02:12,841 --> 00:02:14,051 నాకేమీ కాలేదు. 26 00:02:27,523 --> 00:02:30,275 ఈ ప్రాంతంలో ఇతని కన్నా మంచి నైట్ మేనేజర్ 27 00:02:30,359 --> 00:02:33,445 ఇంకెవరూ ఉండరు. కొలాబాలో ఇది అత్యుత్తమమైన, అత్యంత చవకైన హోటల్. 28 00:02:33,529 --> 00:02:35,697 ప్రభు, ఇప్పుడు సమయం ఎంతో తెలుసా? 29 00:02:36,406 --> 00:02:39,284 ఇంత పొద్దుపోయాక తెల్లోళ్లకి గదులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. 30 00:02:39,368 --> 00:02:41,119 కానీ వాళ్లు బాగా అలసిపోయున్నారు, 31 00:02:41,203 --> 00:02:43,288 ఏదైనా గది ఇవ్వగలిగితే, వాళ్లు చాలా సంతోషిస్తారు. 32 00:02:43,372 --> 00:02:44,915 దయచేసి గది ఇవ్వు. 33 00:02:45,916 --> 00:02:48,627 -కేవలం నీ కోసమే ఇస్తున్నాను. -ఇవ్వు మరి. 34 00:02:50,128 --> 00:02:52,089 -సరే మరి. ఇక్కడ మీ వివరాలు పూరించండి. -థ్యాంక్స్. 35 00:02:52,589 --> 00:02:54,883 ఇతను ఈ హోటల్ లో ఉంటున్నాడా? 36 00:02:54,967 --> 00:02:56,093 ఎవరు? 37 00:02:56,176 --> 00:02:58,887 ఇతను ఈ హోటల్ లో ఉంటాడట. అది నిజమేనా? 38 00:02:58,971 --> 00:03:00,764 అవును, ఆయన ఇక్కడే ఉంటున్నాడు. 39 00:03:00,848 --> 00:03:01,932 ఇతని పేరేంటి? 40 00:03:02,015 --> 00:03:03,600 -ఒక్క నిమిషం. రిజిస్టర్ చూసి చెప్తాను. -నేనే చూస్తాలే. 41 00:03:03,684 --> 00:03:06,228 -నేను చూపిస్తానులెండి, సర్. -నాకు ఇవ్వు. 42 00:03:08,605 --> 00:03:09,773 అతని సీ-ఫారాన్ని చూపించు. 43 00:03:09,857 --> 00:03:12,025 సీ-ఫారమ్ అయితే ఇక్కడ ఉంటుంది. 44 00:03:18,407 --> 00:03:21,076 ఆ దరిద్రుడు గొడవ పడి దెబ్బలు తిన్నాడు, కానీ ఆసుపత్రికి మాత్రం వెళ్లడట. 45 00:03:21,159 --> 00:03:24,079 -అవునా? -త్వరగా. ఎందుకంత ఆలస్యం? 46 00:03:25,789 --> 00:03:28,166 ఏమైంది? ఈ పోలీసొడు పరమ దరిద్రుడు. 47 00:03:28,250 --> 00:03:31,128 వాడికి లంచం ఇవ్వకపోతే, జైల్లో వేస్తాడు. ఏం జరిగింది? 48 00:03:31,211 --> 00:03:32,296 నన్ను దోచుకున్నారు. 49 00:03:33,463 --> 00:03:36,049 నిలువునా దోచుకున్నారు, నా బూట్లతో సహా. 50 00:03:36,133 --> 00:03:37,384 మొత్తం దోచేసుకున్నారా? 51 00:03:37,467 --> 00:03:38,969 నేను కాసేపు పడుకోవాలి. 52 00:03:39,678 --> 00:03:41,722 అతని గదిని చూపించు. వెంటనే. 53 00:03:42,431 --> 00:03:45,809 -లిన్. పాస్ పోర్టు, డబ్బులు లేకపోతే… -ఏం చేస్తున్నావు? 54 00:03:45,893 --> 00:03:48,228 …బొంబాయిలో బతకడం చాలా కష్టం. 55 00:03:48,312 --> 00:03:50,272 మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు, లిన్. పద. 56 00:03:51,732 --> 00:03:53,233 -త్వరగా కానివ్వు! -అలాగే, సర్. 57 00:03:54,943 --> 00:03:56,403 ఈ గదే. 58 00:04:30,896 --> 00:04:32,189 సరే మరి. 59 00:04:34,024 --> 00:04:35,359 హా, సర్. 60 00:04:47,371 --> 00:04:50,374 సరే. ఇదుగోండి నీరు. 61 00:05:11,186 --> 00:05:14,398 ఇంత మంచి మెడిసిన్ బాక్సును ఎందుకు పట్టుకు తిరుగుతున్నావో, ఇప్పుడు నాకు అర్థమైంది. 62 00:05:16,358 --> 00:05:19,528 అలాగే నీ దగ్గర ఇంకో షూస్ జత కూడా ఉండి ఉంటే బాగుండేది, కదా? 63 00:05:33,625 --> 00:05:34,877 దేనికైనా మందు ఇదే. 64 00:05:48,307 --> 00:05:51,894 రేపు ఉదయాన్నే నిన్ను న్యూజిలాండ్ కాన్సెలేటుకు తీసుకెళ్తాను. 65 00:05:51,977 --> 00:05:55,063 వాళ్లు నీకు కొత్త పాస్ పోర్ట్, డబ్బు ఇస్తారు. 66 00:05:55,147 --> 00:05:56,732 నేను అధికారుల దగ్గరకి వెళ్లలేను. 67 00:05:59,860 --> 00:06:01,403 ఆ పని నేను చేయలేను. 68 00:06:04,823 --> 00:06:06,033 సరే. 69 00:06:07,284 --> 00:06:09,494 దయచేసి వచ్చి తిను. 70 00:06:10,245 --> 00:06:11,496 ఇప్పుడు నువ్వు నా అతిథివి, 71 00:06:11,580 --> 00:06:15,876 పక్క ఇంట్లో ఉండే లక్ష్మీ… 72 00:06:17,669 --> 00:06:18,962 సూపర్ రోటీలను చేస్తుంది. 73 00:06:20,589 --> 00:06:21,632 థ్యాంక్యూ. 74 00:06:34,186 --> 00:06:36,021 బాగుంది కదా? 75 00:06:36,104 --> 00:06:39,024 వావ్. చాలా కారంగా ఉంది. 76 00:06:44,696 --> 00:06:47,908 నువ్వు నా కోసం చేసిన వాటన్నింటికీ ధన్యవాదాలు. 77 00:06:52,788 --> 00:06:56,124 నీ సంగతి తెలీదు కానీ, నాకు మాత్రం ఒక డ్రింక్ కావాలి. 78 00:06:59,545 --> 00:07:00,546 అంటే ఏంటి? 79 00:07:00,629 --> 00:07:03,924 వచ్చి మూడు వారాలైంది కానీ, ఈ తల ఊపడాలను మాత్రం ఇప్పటిదాకా అర్థం చేసుకోలేకపోయాను. 80 00:07:04,925 --> 00:07:06,218 సరే. 81 00:07:06,301 --> 00:07:10,556 ఇప్పుడు దాని అర్థం ఏమిటంటే, "తప్పకుండా నేను కూడా నీతో కలిసి తాగుతాను," అని. 82 00:07:10,639 --> 00:07:14,351 కానీ దాని అర్థం "లేదు," లేదా "నమస్తే" కూడా కావచ్చు. 83 00:07:15,143 --> 00:07:17,271 లేదా "నాకు అర్థమైందిలే," అని. 84 00:07:17,855 --> 00:07:23,986 లేదా "నేను గొడవలకు దూరంగా ఉండే మనిషిని, దయచేసి నన్ను ఏమీ చేయకండి," అని. 85 00:07:24,069 --> 00:07:26,321 దీన్ని నువ్వు నేర్చుకోవచ్చు! 86 00:07:26,405 --> 00:07:29,199 అప్పుడు ఈ దెబ్బలన్నీ నీకు తగిలి ఉండేవే కాదు. 87 00:07:29,783 --> 00:07:31,159 ముందు నువ్వు తాగు. 88 00:07:46,758 --> 00:07:48,760 ఓయ్, నిదానం. 89 00:07:52,347 --> 00:07:53,724 చాలా బాగుంది. 90 00:07:53,807 --> 00:07:55,434 చక్కగా మంచి కిక్కు ఇస్తోంది. 91 00:07:56,977 --> 00:07:58,103 సరే. 92 00:08:01,231 --> 00:08:02,399 ఓయ్. 93 00:08:05,527 --> 00:08:06,820 ఉంచుకో. 94 00:08:12,534 --> 00:08:13,911 ఏమైనా సమస్యా? 95 00:08:15,162 --> 00:08:16,663 అదేం లేదు. ఏంటంటే… 96 00:08:17,831 --> 00:08:20,667 ఈ విస్కీ నాది, నీది కాదు అని నాకు తెలిసి ఉంటే, 97 00:08:20,751 --> 00:08:25,964 నేను దీన్ని అంత ఎక్కువగా తాగి ఉండేవాడిని కాదు కదా? 98 00:08:27,674 --> 00:08:28,675 అవునా? 99 00:08:37,183 --> 00:08:40,645 ఏం చేస్తున్నావు? ఏం… హేయ్! 100 00:08:44,775 --> 00:08:46,193 నీకేమైనా పిచ్చా? 101 00:08:49,321 --> 00:08:51,740 ఈ చొక్కాని ఇవాళే ఉతుక్కున్నాను, దోస్త్. 102 00:08:57,955 --> 00:08:59,081 తీసుకో. 103 00:09:00,624 --> 00:09:01,667 ఇది నీకే. 104 00:09:04,795 --> 00:09:05,838 నిజంగానా? 105 00:09:59,057 --> 00:10:00,684 డేల్! 106 00:10:50,776 --> 00:10:52,361 ఒరేయ్ పిచ్చి కుక్క! 107 00:10:55,739 --> 00:10:56,990 నువ్వు ఉండాల్సిన చోటుకే వచ్చేశావు. 108 00:11:01,578 --> 00:11:05,415 కల అంటే మన కోరిక, భయం కలిసే చోటు అని నాకు ఎవరో చెప్పారు. 109 00:11:06,959 --> 00:11:11,129 ఆ కోరిక, భయం రెండూ ఒకటే అయినప్పుడు, ఆ కలని మనం పీడకల అంటాం. 110 00:11:29,147 --> 00:11:30,774 అది రుజూలే అని నీకు ఖచ్చితంగా తెలుసా? 111 00:11:31,400 --> 00:11:33,694 లావుగా, ఒంటి నిండా బంగారంతో ధగధగా మెరిసిపోతున్నాడు. 112 00:11:34,695 --> 00:11:36,822 చిన్ని వేళ్లు, చిట్టి పురుషాంగం. 113 00:11:39,366 --> 00:11:40,659 వలీద్ తనని ప్రోత్సహిస్తున్నప్పుడు 114 00:11:42,035 --> 00:11:43,579 తన పేరు విన్నాను. 115 00:11:47,499 --> 00:11:50,919 వలీద్ కి రుజూల్ సాగర్ వాడ మురికివాడని ఇస్తానని మాటిచ్చాడని నీకు ఖచ్చితంగా తెలుసా? 116 00:11:53,589 --> 00:11:54,631 హా. 117 00:11:55,215 --> 00:11:58,760 మేము వాళ్లకి సుఖాన్ని ఇస్తూ, తద్వారా ఒప్పందాన్ని ఖరారు చేయడానికి తోడ్పడే సాధనాలం అన్నమాట. 118 00:12:07,436 --> 00:12:11,440 ఇంకో అమ్మాయి అయిన, సన్నీకి మొత్తం అర్థమైపోయింది, 119 00:12:11,523 --> 00:12:13,567 వాళ్లు ఎవరు, ఏం చేస్తున్నారు అని. 120 00:12:14,818 --> 00:12:17,362 రుజూల్, వలీద్ లు మేము వింటున్నామా లేదా అనేది అస్సలు పట్టించుకోనే లేదు. 121 00:12:19,907 --> 00:12:22,117 రెసిడెన్షియల్ టవర్ 122 00:12:22,201 --> 00:12:24,661 ఆ తర్వాత సన్నీ ఏమైపోయిందో తెలియదు, జూ అసలు నన్ను బయటకు వెళ్లనివ్వలేదు. 123 00:12:27,581 --> 00:12:29,124 నీకు చెప్పడానికి ఆ పని మనిషికి డబ్బులిచ్చి రావాల్సి వచ్చింది. 124 00:12:31,752 --> 00:12:33,420 సన్నీ చనిపోయి ఉంటుంది కదా? 125 00:12:36,840 --> 00:12:38,717 నాకు నువ్వు తెలిసి ఉండకపోయుంటే, నేను కూడా చనిపోయి ఉండేదాన్ని. 126 00:13:37,818 --> 00:13:41,113 వాళ్లు అందరూ నన్ను ఎలా గుచ్చి గుచ్చి చూశారంటే, వాళ్లకి నేనంటే పడదేమో అన్నట్టు అనిపించింది. 127 00:13:42,114 --> 00:13:44,575 కానీ, వాళ్లు కేవలం నాలోని భయాన్ని మాత్రమే అలా చూశారని ఇప్పుడు నాకు అర్థమయింది. 128 00:13:45,075 --> 00:13:48,370 జనాలకు, వాళ్ల గురించి వాళ్లకు తెలిసింది, అలాగే వాళ్లని భయపెట్టేది అదే. 129 00:13:53,834 --> 00:13:56,170 ఏవండి. టాయిలెట్ ఎక్కడ ఉంది? 130 00:14:07,347 --> 00:14:10,100 నిన్న రాత్రి నువ్వు ఒకటే అరుస్తున్నావు! 131 00:14:10,184 --> 00:14:13,562 పీడకలలా? అందుకే ఉదయం నిన్ను లేపలేదు. 132 00:14:13,645 --> 00:14:15,772 మంచిది. చూడు, నాకు అర్జంట్… 133 00:14:15,856 --> 00:14:17,733 హేయ్! లిన్, తనే లక్ష్మీ. 134 00:14:17,816 --> 00:14:19,651 నిన్న రాత్రి మనం తిన్న రోటీలను చేసింది తనే. 135 00:14:19,735 --> 00:14:23,363 హాయ్. హేయ్. థ్యాంక్యూ. రోటీ చాలా బాగుంది. 136 00:14:29,745 --> 00:14:30,996 ఈ ప్రాంతం పేరేంటి? 137 00:14:31,079 --> 00:14:33,457 ఇది సాగర్ వాడ మురికివాడ. 138 00:14:33,540 --> 00:14:34,833 నా నివాసప్రాంతం. 139 00:14:34,917 --> 00:14:37,169 మేము ఇక్కడ అక్రమంగా ఉంటున్నాం, 140 00:14:37,252 --> 00:14:42,257 మేముండే ఈ గుడిసెలన్నీ అక్రమంగా కట్టుకున్నవే. 141 00:14:49,681 --> 00:14:50,807 ఇవి ఎవరివి? 142 00:14:54,311 --> 00:14:56,021 తన భర్తవి. ఆయన లేడులే. 143 00:14:57,856 --> 00:14:59,775 తన చనిపోయిన భర్త బూట్లను నేను తీసుకోలేను. 144 00:15:00,984 --> 00:15:02,736 చనిపోలేదు, లిన్ బాబా. 145 00:15:02,819 --> 00:15:05,447 దుబాయికి వెళ్లి అక్కడ పని చేస్తున్నాడు. 146 00:15:10,244 --> 00:15:11,828 థ్యాంక్యూ. థ్యాంక్యూ. 147 00:15:15,541 --> 00:15:17,793 -నాకు అర్జంట్ టాయిలెట్ వస్తోంది. -పద. 148 00:15:19,378 --> 00:15:20,754 త్వరగా రండి. 149 00:15:24,758 --> 00:15:25,843 బాగున్నాయా? 150 00:15:45,237 --> 00:15:46,363 నేను దీన్ని తాగనా? 151 00:15:46,446 --> 00:15:47,865 అది నీకు సాయపడుతుంది అనిపిస్తే, తాగు. 152 00:15:49,241 --> 00:15:50,450 మరీ బాధను అయితే కలిగించదు కదా. 153 00:15:50,951 --> 00:15:52,578 నువ్వు మానేస్తాను అన్నావు కదా. 154 00:15:56,206 --> 00:15:59,334 రుజూల్ గురించి ఖాదర్ భాయ్ కి చెప్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా? 155 00:16:02,462 --> 00:16:03,463 నేను జూ చెర నుండి బయటపడ్డా. 156 00:16:05,174 --> 00:16:06,592 మనం నిశ్శబ్దంగా ఉండిపోవచ్చు కదా. 157 00:16:06,675 --> 00:16:09,678 రుజూల్ మనల్ని మోసం చేసే పనిలో ఉంటే, పోయిన ఏడాది నేను కష్టపడింది అంతా వృథా అయిపోతుంది. 158 00:16:09,761 --> 00:16:11,430 నీ అమూల్యమైన భూమికి సంబంధించిన ఒప్పందం 159 00:16:11,513 --> 00:16:13,765 నాకు తెలియకపోయి ఉంటే, నన్ను ప్యాలెస్ లోనే చావనిచ్చి ఉండేదానివి నువ్వు. 160 00:16:15,392 --> 00:16:16,935 నన్ను వాడుకున్నావు నువ్వు. 161 00:16:17,019 --> 00:16:19,897 మరీజియో, మొడీనాలకు, నీకూ తేడా ఏంటి? 162 00:16:19,980 --> 00:16:21,732 వాడుకొనే పనిలో ఉంది నువ్వేనేమో. 163 00:16:23,192 --> 00:16:24,818 నీకు రుజూల్ గురించి అనవసరం. 164 00:16:24,902 --> 00:16:27,112 డ్రగ్స్, నేను, వాళ్లు, ఎవరైనా కానీ, 165 00:16:27,196 --> 00:16:30,991 అందరి మీద నింద వేసేసి, ఏ బరువు బాధ్యతా లేకుండా ఉండటమే నీకు కావలసింది. 166 00:16:42,336 --> 00:16:44,546 ఎలా ఉన్నావు, అరుణ్? జానీ? 167 00:16:44,630 --> 00:16:45,714 ప్రభు. 168 00:16:48,842 --> 00:16:51,011 -నేను చూస్తాలే. -నువ్వు వద్దు. నేనే చూస్తా. 169 00:16:52,429 --> 00:16:53,680 వెళ్లి ఆ టేబుల్ ని శుభ్రం చేయ్. 170 00:16:55,432 --> 00:16:56,808 ఏం కావాలి? 171 00:16:56,892 --> 00:16:59,228 మా ఇద్దరికీ చాయ్, రోటీ. 172 00:16:59,311 --> 00:17:00,604 ఎలా ఉన్నారు? 173 00:17:01,688 --> 00:17:02,814 రా. కూర్చో. 174 00:17:04,775 --> 00:17:10,071 కూర్చో. నందిత చేసే చాయ్, ఈ బొంబాయిలో ఇంకెక్కడా దొరకదు. సూపర్ గా ఉంటుంది. 175 00:17:10,155 --> 00:17:11,156 సరే. 176 00:17:13,534 --> 00:17:16,369 థ్యాంక్యూ, ఆంటీ. థ్యాంక్యూ. 177 00:17:16,453 --> 00:17:17,454 థ్యాంక్యూ. 178 00:17:21,708 --> 00:17:23,669 ఈ తెల్లోడు ఎవడు? 179 00:17:25,753 --> 00:17:28,257 -నా కొత్త బిజినెస్ పార్ట్నర్. -బిజినెస్ పార్ట్నర్? 180 00:17:29,216 --> 00:17:31,385 మేమిద్దరమూ కలిసి ఒక టూరిస్ట్ బిజినెస్ ప్రారంభించబోతున్నాం. 181 00:17:34,179 --> 00:17:35,472 పార్వతి? 182 00:17:35,556 --> 00:17:36,723 వస్తున్నా! 183 00:17:37,432 --> 00:17:40,477 -తనతో ఏం అన్నావు? -నువ్వు నాకు మంచి స్నేహితునివి అని. 184 00:17:41,770 --> 00:17:45,357 తను పార్వతి, తనని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, లిన్ బాబా. 185 00:17:45,440 --> 00:17:47,234 ఆమె నీ గర్ల్ ఫ్రెండా? 186 00:17:47,317 --> 00:17:49,069 గర్ల్ ఫ్రెండ్ అని నేను చెప్పలేదు. 187 00:17:49,152 --> 00:17:51,780 అసలు మేము మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. 188 00:17:53,198 --> 00:17:54,825 తనతో ఇప్పటి దాకా నువ్వు మాట్లాడనే లేదా? 189 00:17:55,659 --> 00:17:56,994 ఈ రోజు మామూలు రోజు కాదు. 190 00:17:58,245 --> 00:17:59,997 ఆ రోజులో భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 191 00:18:01,164 --> 00:18:04,626 చూడు, బాసూ. నా పరిస్థితిని త్వరగా తేల్చాల్సిన అవసరం ఉంది. 192 00:18:06,461 --> 00:18:08,046 నువ్వు అధికారుల దగ్గరికి వెళ్లలేవు కదా. 193 00:18:08,130 --> 00:18:10,382 -గట్టిగా మాట్లాడకు… -కానీ నీకు డబ్బు కావాలి, కదా? 194 00:18:10,465 --> 00:18:13,427 నువ్వు వేగంగా డబ్బు సంపాదించే మార్గాన్ని నేను ఆలోచించాను. 195 00:18:14,136 --> 00:18:16,680 మీ ఊరికి కొన్న రైలు టికెట్ల సంగతేంటి? 196 00:18:16,763 --> 00:18:18,974 అవి నీ దగ్గరే ఉన్నాయి కదా? వాటిని మనం అమ్మగలమా? 197 00:18:19,641 --> 00:18:23,604 వెళ్లిపోయిన రైలుకు టికెట్లు ఎవరు కొంటారు! అది జరగని పని. 198 00:18:23,687 --> 00:18:28,525 అదిరిపోయే ఐడియా ఏంటంటే, బిజినెస్ పార్ట్నర్స్ అవ్వడం. ఏమంటావు? 199 00:18:28,609 --> 00:18:30,360 ఇద్దరం కలిసి బొంబాయి గైడ్స్ అవుదాం. 200 00:18:30,444 --> 00:18:32,738 -నేను ఇక్కడ ఉండలేను, ప్రభు. -ఒకసారి ఆలోచించు, లిన్ బాబా. 201 00:18:32,821 --> 00:18:34,823 -చాలా డబ్బు సంపాదించవచ్చు. -నేను కార్లా దగ్గరికి వెళ్లాలి. 202 00:18:34,907 --> 00:18:38,076 -దయచేసి నా మాట విను. మన ఇద్దరం కలిసి… -నా వల్ల కాదు, ప్రభు. 203 00:18:47,044 --> 00:18:49,171 హేయ్. హేయ్. 204 00:18:52,216 --> 00:18:54,176 నిన్న రాత్రి నువ్వు చేసిన దానికి థ్యాంక్స్. సరేనా? 205 00:18:54,259 --> 00:18:56,637 నువ్వు నిన్న నా ప్రాణాలు కాపాడావు. నిజంగానే చెప్తున్నా. 206 00:18:56,720 --> 00:18:58,555 కానీ నేను ఇక్కడే ఉండి, ఏది పడితే అది చేయలేను, సరేనా? 207 00:18:58,639 --> 00:19:01,016 అది జరగని పని. సరేనా? 208 00:19:04,228 --> 00:19:06,522 సరే మరి. నేను తర్వాత వచ్చి నా సామాను తీసుకెళ్తా. 209 00:19:21,453 --> 00:19:23,080 కార్లా, నేను లిన్ ని. 210 00:19:23,622 --> 00:19:26,416 కార్లా, ఉన్నావా? నేను నీతో మాట్లాడాలి. 211 00:19:31,380 --> 00:19:34,216 -ఏం జరిగింది? -మేడమ్ జూ కనిపెట్టేసింది. 212 00:19:35,092 --> 00:19:36,510 వాళ్లు నన్ను చంపినంత పని చేశారు. 213 00:19:39,179 --> 00:19:41,181 నా డబ్బులు, పాస్ పోర్ట్, నా దగ్గర ఉన్నవన్నీ తీసేసుకున్నారు. 214 00:19:42,140 --> 00:19:45,853 -అది చాలా ప్రమాదకరమని ముందే హెచ్చరించాను. -అది నిజమే. కానీ నా బతుకు బస్టాండ్ అయిపోయింది. 215 00:19:45,936 --> 00:19:47,312 అయితే, మీ ఎంబసీకి వెళ్లు. 216 00:19:49,606 --> 00:19:50,649 నేను వెళ్లలేను. 217 00:19:51,483 --> 00:19:53,026 మరి నన్నేం చేయమంటావు? 218 00:19:55,445 --> 00:19:56,572 ఏంటి అలా మాట్లాడుతున్నావు? 219 00:19:57,573 --> 00:19:59,825 కార్లా, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. 220 00:19:59,908 --> 00:20:00,909 నేను సాయపడమని కోరుతున్నాను. 221 00:20:03,328 --> 00:20:05,247 కార్లా, నువ్వు నాకు సాయపడాలి. 222 00:20:05,831 --> 00:20:07,332 నేను సాయపడనక్కర్లేదు. 223 00:20:08,333 --> 00:20:09,710 నాకు పని ఉంది. 224 00:20:14,464 --> 00:20:15,716 తనకి ఏమైనా పిచ్చి పట్టిందా? 225 00:20:17,926 --> 00:20:19,595 నీకు డ్రింక్ కావాలనుకుంటా. 226 00:20:23,974 --> 00:20:26,143 నిన్న రాత్రి నువ్వు నాకు మొత్తం డ్రగ్స్ ని ఇవ్వలేదని నాకు తెలుసు. 227 00:20:37,821 --> 00:20:40,616 ఇప్పుడు నా వంతు వచ్చింది, తనది కాదు. 228 00:20:47,581 --> 00:20:49,583 అలాంటి వాళ్లని ఎంత దూరం నుండైనా చూసి పసిగట్టేయగలదు కార్లా. 229 00:20:50,667 --> 00:20:51,877 ఎలాంటి వాళ్లని? 230 00:20:51,960 --> 00:20:53,212 తను వాడుకోగల వాళ్లని. 231 00:20:54,087 --> 00:20:56,215 తనేమీ నన్ను బలవంతపెట్టలేదులే. 232 00:20:56,298 --> 00:20:59,551 ఆ అవసరం తనకి అక్కర్లేదు. అదే తన ప్రతిభ. 233 00:21:01,845 --> 00:21:03,722 అయినా, కార్లాలో అంత ప్రత్యేకత ఏముంది? 234 00:21:05,224 --> 00:21:07,351 నేను కూడా తనంత అందంగానే ఉంటా. 235 00:21:09,520 --> 00:21:11,480 తన కన్నా ఎక్కువ సుఖాన్ని అందించగలను. 236 00:21:11,563 --> 00:21:12,731 ఆగు. 237 00:21:15,400 --> 00:21:16,860 లీసా, నువ్వు ఇలా చేయాల్సిన పని లేదు. 238 00:21:17,903 --> 00:21:19,321 బహుశా నాకు ఆ సుఖం కావాలేమో. 239 00:21:21,073 --> 00:21:24,076 నీకు వద్దా? మనం కలిసి మజా చేసుకోవచ్చు. 240 00:21:25,369 --> 00:21:26,370 లీసా? 241 00:21:28,956 --> 00:21:30,374 నువ్వు బాగా మత్తులో ఉన్నావు. 242 00:21:38,966 --> 00:21:40,384 మగాళ్లు వేశ్యలంటే ఎందుకు అంత పడి చస్తారు? 243 00:21:41,093 --> 00:21:42,135 అది నిజమే. 244 00:21:44,847 --> 00:21:46,849 వాళ్లని చీదరించుకొనే అమ్మాయిలకే పడిపోతారు. 245 00:21:46,932 --> 00:21:48,267 అయినా కానీ వాళ్లకి సంతృప్తి దక్కదు. 246 00:21:53,063 --> 00:21:54,398 ఈ జీవితం దరిద్రంగా ఉంది. 247 00:21:56,650 --> 00:21:58,235 ఇదివరకు ఎన్నడూ నువ్వు మానేయడానికి ప్రయత్నించలేదా? 248 00:22:02,447 --> 00:22:03,699 నాకు మత్తులో ఉంటేనే బాగుంటుంది. 249 00:22:05,492 --> 00:22:07,995 బాధలన్నింటికీ దూరంగా ఉండటమే నాకు ఇష్టం. 250 00:22:10,289 --> 00:22:11,874 జీవితంలో ఎదురయ్యే సవాళ్లను నేను తీసుకోలేను. 251 00:22:13,083 --> 00:22:14,251 మొదట్నుంచీ అది నా వల్ల అయ్యే పనే కాదు. 252 00:22:16,420 --> 00:22:19,047 బహుశా కార్లా అది నీకు కనిపించాలనే అక్కడ పెట్టి వెళ్లిందేమో. 253 00:22:21,466 --> 00:22:22,593 బాబోయ్, నువ్వు ఊహించింది నిజమే. 254 00:22:23,969 --> 00:22:27,222 నేను దీన్ని తీసుకుంటే, నన్ను తను తరిమివేయగలదు. 255 00:22:30,475 --> 00:22:32,311 నువ్వు కనిపించేంత దద్దమ్మవి కాదు, లిన్. 256 00:22:35,772 --> 00:22:36,982 నాకు వాంతి వస్తోంది. 257 00:22:47,326 --> 00:22:49,912 ఇంకెంత కాలం నేను ఈ నరకం అనుభవించాలి? 258 00:22:49,995 --> 00:22:51,413 ఇంకొన్ని రోజులు. 259 00:22:52,456 --> 00:22:53,916 ఆ తర్వాత బాగవుతుందా? 260 00:22:54,791 --> 00:22:56,126 అవును. 261 00:23:09,306 --> 00:23:10,599 నీకు తీసుకోవాలని అనిపించట్లేదా? 262 00:23:12,809 --> 00:23:14,228 ప్రతిరోజూ అనిపిస్తుంది. 263 00:23:47,010 --> 00:23:48,136 ఖాదర్ భాయ్. 264 00:23:50,180 --> 00:23:51,390 నమస్తే. 265 00:23:51,473 --> 00:23:52,933 నమస్తే. 266 00:23:56,061 --> 00:23:58,355 నిన్ను కలవడం బాగుంది. కూర్చో. 267 00:23:58,438 --> 00:23:59,439 థ్యాంక్యూ. 268 00:24:02,985 --> 00:24:06,154 అంతా బాగానే ఉందా? ఏదో అత్యవసర పని అన్నావే. 269 00:24:08,323 --> 00:24:09,950 నిన్న రాత్రి ప్యాలెస్ కి వెళ్లాను. 270 00:24:10,659 --> 00:24:14,705 నీకు జూపై ఉండే ద్వేషం, నువ్వు దాన్ని గెలుకుతూనే ఉంటే, అది ఎప్పటికీ తగ్గదు. 271 00:24:14,788 --> 00:24:17,165 జూ, నా స్నేహితురాలైన లీసాని బంధీగా ఉంచింది. 272 00:24:17,249 --> 00:24:18,584 లీసాకి ఒక విషయం తెలుసు, అందుకని. 273 00:24:21,253 --> 00:24:22,337 మనం వంచనకు గురవుతున్నాం. 274 00:24:27,885 --> 00:24:31,638 మన వ్యాపార వ్యవహారాలన్నీ సాధారణ బొంబాయి దందాకే పరిమితమయ్యాయి, 275 00:24:31,722 --> 00:24:34,725 లంచాలు, అంగీకారాలు, అందరూ ఊహించేవే. 276 00:24:36,101 --> 00:24:39,271 కానీ నాకు వేరే పనులు కూడా ఉన్నాయి. అది నీకూ తెలుసు. 277 00:24:41,523 --> 00:24:43,233 నీ మీద ఉండే గౌరవం, ఇంకా ప్రేమతో, 278 00:24:43,317 --> 00:24:47,029 నాకు ఉండే మరో ప్రపంచంలో నిన్ను అడుగుపెట్టనివ్వలేదు, కార్లా. 279 00:24:49,531 --> 00:24:51,867 -నీకు పక్కాగా తెలుసా? -తెలుసు కాబట్టే వచ్చాను. 280 00:24:51,950 --> 00:24:55,454 నా ఉద్దేశం, ఏ వంచన గురించి అయితే నువ్వు ఇప్పుడు చెప్పబోతున్నావో, 281 00:24:55,537 --> 00:24:58,957 దానికి సంబంధించిన పర్వవసానాలను ఎదుర్కోవడానికి నువ్వు సిద్దంగా ఉండాలి. 282 00:25:00,959 --> 00:25:04,254 నాకు తెలిసింది నీకు చెప్పకపోతే, అప్పుడు నీకే ఇబ్బంది. 283 00:25:05,339 --> 00:25:06,965 కాబట్టి నాకోసం నువ్వు సమస్యల్లో చిక్కుకుంటున్నావా? 284 00:25:07,841 --> 00:25:09,551 నా కోసం నువ్వు చాలా చేశావు. 285 00:25:09,635 --> 00:25:11,094 మనిద్దరి మధ్య రుణానుబంధం ఏమీ లేదు. 286 00:25:11,178 --> 00:25:15,891 ప్రేమలో ఇచ్చిపుచ్చుకోవడాలు, బదులు తీర్చుకోవడాలు లాంటివేవీ ఉండవు. 287 00:25:17,267 --> 00:25:21,438 మనకి అది ఇష్టం కాబట్టి చేస్తాం, ఏమీ ఆశించకుండానే చేస్తాం. 288 00:25:22,147 --> 00:25:28,362 అన్నింటి కన్నా ముఖ్యంగా ఈ విషయాన్ని నువ్వు ఇంకా నేర్చుకోలేదు, కార్లా. 289 00:25:33,951 --> 00:25:38,413 రుజూల్ ఆడేకర్, వలీద్ షాని కలుస్తున్నాడు, 290 00:25:40,249 --> 00:25:43,877 అతను సాగర్ వాడ విషయంలో వలీద్ ఆఫర్ అంగీకరించబోతున్నాడు, మనది కాదు. 291 00:25:50,884 --> 00:25:53,470 ఈ విషయం నీకు పక్కాగా తెలుసు కదా. 292 00:26:21,748 --> 00:26:22,833 థ్యాంక్యూ. 293 00:26:26,461 --> 00:26:28,255 జనం మంచిగా ఎందుకు ప్రవర్తించలేరో నాకు తెలీదు. 294 00:26:30,549 --> 00:26:31,633 దానికి కారణం అమ్మాయేనా? 295 00:26:32,885 --> 00:26:34,928 నువ్వు డ్రగ్స్ పుచ్చుకోవడానికి కారణం? 296 00:26:36,221 --> 00:26:37,514 ఎవరు తను? 297 00:26:38,807 --> 00:26:40,392 ఎవరైతే ఏంటిలే. 298 00:26:41,435 --> 00:26:43,854 ప్రేమే మనల్ని పాతాళానికి నెట్టి వేస్తుంది. 299 00:26:53,906 --> 00:26:54,990 నీకు భయంగా ఉందా? 300 00:26:56,200 --> 00:26:57,451 నీ మీద నమ్మకం ఉంది. 301 00:27:04,124 --> 00:27:07,878 భారతదేశానికి వెళ్లేంత డబ్బు మన చేతికి వచ్చాక, మనం రోజంతా ఇలాగే బతికేయవచ్చు. 302 00:27:14,635 --> 00:27:17,304 మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, బంగారం. 303 00:27:30,526 --> 00:27:33,654 నాకొక సాయం చేయగలవా? ఆ చెత్తని ఎక్కడైనా పారేయ్. 304 00:27:34,613 --> 00:27:35,614 అలాగే. 305 00:27:40,369 --> 00:27:41,537 లీసా. హేయ్. 306 00:27:42,996 --> 00:27:44,665 ఈ రుజూల్ ఆడేకర్ ఎవరు? 307 00:27:46,792 --> 00:27:48,210 ఆ పేరు నీకు వినబడిందనే సంగతి మర్చిపో. 308 00:27:48,293 --> 00:27:49,503 చెప్పు. 309 00:27:49,586 --> 00:27:51,296 వద్దు. వదిలేయ్. 310 00:27:53,507 --> 00:27:56,218 నువ్వు నాకు సాయపడ్డావు. నేను కూడా నీకు సాయపడుతున్నా. 311 00:28:07,980 --> 00:28:12,150 ప్యాలెస్, ఎప్పుడూ కూడా తటస్థంగానే వ్యవహరించింది, అందుకే ఇంకా అది ఉనికిలో ఉంది. 312 00:28:12,234 --> 00:28:15,863 జూకి, తను ఎలా పని చేయాల్సిన అవసరం ఉందో అనేది గుర్తు చేస్తాములే. 313 00:28:18,490 --> 00:28:20,993 నీకు సహకరించిన వ్యక్తి గురించి చెప్పు. 314 00:28:22,744 --> 00:28:24,204 అతని పేరు లిన్ ఫోర్డ్. 315 00:28:24,788 --> 00:28:27,875 అతను ఊరు విడిచి వెళ్లిపోబోతున్నాడని తెలుసు, అందుకే అతని సాయంతో లీసాని విడిపించాను. 316 00:28:27,958 --> 00:28:30,836 నువ్వు అతడిని నమ్మి ఉండాలి. అది నీకు చిన్న విషయం కాదు. 317 00:28:31,420 --> 00:28:33,672 నేను త్వరపడాల్సిన పరిస్థితి. అతను దానికి తగినవాడు. 318 00:28:37,092 --> 00:28:38,886 రుజూల్ గురించి అతనికి తెలుసా? 319 00:28:38,969 --> 00:28:41,930 పెరు విన్నాడు. కానీ అంతకుమించి ఏమీ తెలీదు. 320 00:28:42,014 --> 00:28:43,682 ఇదంతా ఏంటో కూడా అతనికి తెలీదు. 321 00:28:43,765 --> 00:28:47,060 కానీ అతను తెలివైన ప్రయోజకుడు కాబట్టి, ఆరా తీసే అవకాశం ఉంది. 322 00:28:48,896 --> 00:28:50,731 రేనాల్డోస్ కెఫే 323 00:28:52,065 --> 00:28:54,985 సరే మరి. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్యూ. థ్యాంక్యూ. 324 00:28:55,068 --> 00:28:57,321 భలేవారే. మనం ఇలా చేద్దాం, సరేనా? 325 00:28:57,404 --> 00:28:58,405 హేయ్. 326 00:29:00,240 --> 00:29:01,909 నీ ముఖానికి ఏమైంది? 327 00:29:01,992 --> 00:29:03,285 నేను దోపిడీకి గురయ్యాను. 328 00:29:04,453 --> 00:29:05,787 -వావ్. -నాకు కొత్త గుర్తింపు పత్రాలు కావాలి. 329 00:29:07,331 --> 00:29:09,082 నన్ను ఎందుకు అడుగుతున్నావు? 330 00:29:09,166 --> 00:29:11,543 ఎందుకంటే, బొంబాయిలో నీ అంత పెద్ద క్రిమినల్ ఎవరూ నాకు తెలీదు. 331 00:29:11,627 --> 00:29:13,462 -తప్పుగా అనుకోకు. -అనుకోలేదులే. 332 00:29:14,046 --> 00:29:16,507 ఇంకా నా అంచనా ప్రకారం నువ్వు కాన్సులేటుకు వెళ్లలేవు, 333 00:29:16,590 --> 00:29:18,383 ఆ కారణాలు నాకు అక్కర్లేదు అనుకో. 334 00:29:19,927 --> 00:29:21,762 అవును. లేకపోతే నాకు నీలాంటి క్రిమినల్ అవసరం లేదు. 335 00:29:21,845 --> 00:29:25,015 నేను ఒక పాస్ పోర్టును కొనాలి. నీకు అలాంటి వ్యక్తి తెలుసని అన్నావు. 336 00:29:25,098 --> 00:29:27,976 బొంబాయిలో గుర్తింపు పత్రాల దందా అంతా అబ్దుల్ ఖాదర్ ఖాన్ చేతిలో ఉంటుంది. 337 00:29:28,060 --> 00:29:29,937 అతన్ని నాకు పరిచయం చేస్తావా? 338 00:29:30,604 --> 00:29:33,774 ఒకవేళ నా పాస్ పోర్టుని అతనికి అమ్ముంటే, బహుశా అతను నాకే దాన్ని తిరిగి అమ్మవచ్చేమో. 339 00:29:36,527 --> 00:29:38,820 నువ్వు "గాడ్ ఫాదర్" పుస్తకం చదివావా, లిన్? 340 00:29:39,863 --> 00:29:40,864 సినిమా చూశా. 341 00:29:41,532 --> 00:29:42,950 ఖాదర్ ఖాన్ కూడా అంతే. 342 00:29:43,033 --> 00:29:45,452 అతనితో పరిచయం చేయడం అంత ఆషామాషీ కాదు. 343 00:29:45,536 --> 00:29:47,538 అతనికి ఏం ఇస్తావు? నీ దగ్గర డబ్బులు లేవు అన్నావు కదా. 344 00:29:47,621 --> 00:29:51,166 ఒక మంచి పాస్ పోర్ట్, అంటే పనికి వచ్చే పాస్ పోర్ట్ కావాలంటే, వెయ్యి డాలర్లు అవుతుంది. 345 00:29:51,708 --> 00:29:53,001 వెయ్యి డాలర్లు. 346 00:29:53,544 --> 00:29:56,129 అబ్బా. నేను చేయగలిగింది ఏదోకటి ఉండే ఉంటుంది. 347 00:29:56,213 --> 00:29:57,881 ఈ చోటు గురించి నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. 348 00:29:59,174 --> 00:30:00,968 మనం స్నేహితులం అనుకున్నాను నేను. 349 00:30:01,051 --> 00:30:05,472 ఇలాంటి సందర్భాలు వస్తాయనే నేను స్నేహబంధాల్లాంటివి పెట్టుకోను. 350 00:30:07,349 --> 00:30:08,684 నేను ఏదోకటి చేయాలి. 351 00:30:09,685 --> 00:30:11,854 నిన్న రాత్రి నేను ఒక మురికివాడలో పడుకున్నా. 352 00:30:11,937 --> 00:30:13,856 బొంబాయిలోని సగం జనాభా పరిస్థితి కూడా అదే. 353 00:30:18,318 --> 00:30:23,448 నీకు రుజూల్ ఆడేకర్ ఎవరో తెలుసా? అడేకరో అడీకరో నాకు సరిగ్గా తెలీదు. 354 00:30:23,532 --> 00:30:25,158 తెలుసు. అతను స్థానిక రాజకీయ నాయకుడు. 355 00:30:25,242 --> 00:30:28,662 మేడమ్ జూకి చెందిన చోటైన ప్యాలెస్ లో అతను ఏదో నేరానికి పాల్పడ్డాడు… 356 00:30:28,745 --> 00:30:29,746 కాస్త… మెల్లిగా… 357 00:30:29,830 --> 00:30:32,082 ఆ సమాచారం ఎవరికైనా చెప్తే, ఏమైనా లాభం ఉంటుందేమో. 358 00:30:32,165 --> 00:30:36,211 -నువ్వు ఆరా తీసి చెప్పగలవా? -కాస్త మెల్లిగా మాట్లాడు. 359 00:30:36,295 --> 00:30:38,463 తొక్కేం కాదు. నాకు నా స్వేచ్ఛ కావాలి, డిడియర్. 360 00:30:38,547 --> 00:30:41,675 -అది నాకు దక్కే దాకా… -కాస్త నువ్వు శాంతిస్తావా? 361 00:30:41,758 --> 00:30:44,094 …జూ, కార్లా, గాడ్ ఫాదర్, రుజూల్ లాంటి వారు ఎవరు నాశనమై పోయినా నాకేం పర్లేదు. 362 00:30:44,178 --> 00:30:45,762 -అబ్బా. -మిత్రులారా. 363 00:30:47,514 --> 00:30:50,851 "డర్టీ హారీ" సినిమాని నేను వీసీఆర్ లో చూశాను, లిన్. 364 00:30:51,643 --> 00:30:54,938 అది కౌబాయ్ సినిమా కాదు, కానీ మంచి సినిమానే. 365 00:30:55,022 --> 00:30:58,317 "ఆరు సార్లు కాల్చానా, లేకపోతే అయిదు సార్లే కాల్చానా? 366 00:30:59,860 --> 00:31:02,487 -అది చాలా బాగుంది. -గుడ్ లక్, లిన్. సరేనా? 367 00:31:02,571 --> 00:31:04,072 నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. 368 00:31:08,243 --> 00:31:10,871 నాకు నచ్చిన సినిమా అంటే, "ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్". 369 00:31:10,954 --> 00:31:12,706 ఆ తర్వాత "జోసీ వేల్స్" అని చెప్పవచ్చు. 370 00:31:12,789 --> 00:31:15,584 కాదు, నిజానికి "డాలర్స్" ట్రయాలజీకే నేను మొదటి మూడు ర్యాంకులని ఇస్తాను. 371 00:31:15,667 --> 00:31:19,713 ఆ తర్వాత నాల్గవ స్థానం "జోసీ వేల్స్" సినిమాది, ఎందుకంటే… అతను ఎంత బాగా నటిస్తాడంటే… 372 00:31:24,468 --> 00:31:26,011 నేను నీతో కాస్త మాట్లాడాలి. 373 00:31:28,096 --> 00:31:30,807 ఇతనికి కాస్త పిచ్చి. ఓసారి చూడండి ఎలా ఉన్నాడో. 374 00:31:30,891 --> 00:31:32,309 ఇతడిని వదిలించుకుంటాను, ఆగండి. మన్నించాలి. 375 00:31:32,392 --> 00:31:34,186 నేను ఇరుక్కుపోయాను, బాసూ. 376 00:31:34,686 --> 00:31:36,438 రాత్రే నన్ను పిచ్చి కొట్టుడు కొట్టారు. 377 00:31:36,522 --> 00:31:39,066 ప్యాలెస్ నుండి లీసాని విడిపించడంలో కార్లాకి సహకరించిన తర్వాత నుండి. 378 00:31:39,733 --> 00:31:41,860 ఏంటి? లీసాకి ఏమైంది? 379 00:31:42,402 --> 00:31:43,654 నీకు తెలీదా? 380 00:31:44,154 --> 00:31:46,532 తనని జూ బంధీగా ఉంచింది. తన మానసిక స్థితి ఇప్పుడు ఏం బాగాలేదు. 381 00:31:48,367 --> 00:31:50,577 మన్నించాలి. ఇక మీరు బయలుదేరాలి. 382 00:31:50,661 --> 00:31:51,662 థ్యాంక్యూ. 383 00:31:51,745 --> 00:31:53,413 వద్దు, వద్దు, వద్దు. 384 00:31:53,497 --> 00:31:55,415 ఎక్కడికి వెళ్తున్నారు? అది జోక్. ఎక్కడికి వెళ్తున్నారు? 385 00:32:00,254 --> 00:32:04,466 నువ్వు నా వ్యవహరాల్లో తలదూర్చడం మానుకోవాలి. 386 00:32:05,175 --> 00:32:07,344 లిన్, లీసా బాగానే ఉందా? ఇప్పుడు ఎక్కడ ఉంది? 387 00:32:07,427 --> 00:32:09,221 ఏంటి, మీ సన్నాసులకి చెప్తానా ఏంటి? 388 00:32:10,806 --> 00:32:14,351 జూ మనుషులు నా డబ్బును, పాస్ పోర్టును తీసేసుకున్నారు. 389 00:32:15,435 --> 00:32:18,647 -నా దృష్టిలో, దానికి మీరే కారణం. -హేయ్, హేయ్. 390 00:32:19,815 --> 00:32:21,650 ఓ డ్రగ్స్ బానిస అయిన వేశ్య కోసం నువ్వు హీరోవని ఫీల్ అయ్యి వెళ్లుంటే 391 00:32:21,733 --> 00:32:23,026 అది లీసా సమస్య. 392 00:32:24,194 --> 00:32:27,948 కార్లాని మెప్పించడానికి నువ్వు ఆ పని చేసుంటే… ఓయ్, ఓయ్. అది కార్లా సమస్య. 393 00:32:28,031 --> 00:32:30,993 కానీ మనిద్దరి మధ్యా ఏమీ లేదు. 394 00:32:31,660 --> 00:32:32,744 నేను నీకు ఏమీ చేయాల్సిన పని లేదు. 395 00:32:33,495 --> 00:32:35,330 ఆ విషయంలో నువ్వు పొరబడుతున్నావు. 396 00:32:37,583 --> 00:32:39,918 -మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్లిపోతున్నావు! -మిత్రులారా, ఆగండి. 397 00:32:40,002 --> 00:32:42,671 -పర్వాలేదు. మరేం పర్వాలేదు. -ఇక్కడ ఇవన్నీ కుదరవు. దయచేసి, కూర్చోండి. 398 00:32:42,754 --> 00:32:43,755 ఇద్దరూ కూర్చోండి. 399 00:32:43,839 --> 00:32:45,215 -ముందు నువ్వు కూర్చో. -కూర్చో. 400 00:32:49,595 --> 00:32:53,724 అసలు నీ గురించి నువ్వేం అనుకుంటున్నావు? 401 00:32:54,766 --> 00:32:56,810 ఇక్కడికి వచ్చేసి పిస్తాలా ఫీల్ అయిపోతున్నావా? 402 00:32:59,813 --> 00:33:02,816 తీరుతెన్నులు తెలుసుకోకుండా, లేదా బరిలో ఉన్న ఇతరుల గురించి తెలుసుకోకుండా 403 00:33:04,151 --> 00:33:05,777 పిచ్చోళ్లే ఆట ఆడతారు. 404 00:33:07,946 --> 00:33:09,406 పద, మొడీనా. 405 00:33:13,076 --> 00:33:15,829 వాడి నవ్వే ముఖాన్ని పచ్చడి చేయాలనిపించింది. 406 00:33:16,455 --> 00:33:20,042 ఎందుకంటే, ఆ పని నేను చేయగలనని, అది సూపర్ గా ఉంటుందని నాకు తెలుసు. 407 00:33:20,125 --> 00:33:22,085 కానీ అన్నింటికన్నా ముఖ్యంగా, వాడు అన్నది నిజమే కాబట్టి. 408 00:33:35,807 --> 00:33:36,808 ప్రభు. 409 00:33:40,187 --> 00:33:43,315 చూడు, ఈ ఉదయం జరిగిన విషయం తర్వాత, నువ్వు నన్ను దొబ్బేయమన్నా అర్థం చేసుకోగలను, 410 00:33:44,233 --> 00:33:46,610 కానీ నేను అర్జంటుగా ఒక ఫోన్ చేయాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు. 411 00:33:50,697 --> 00:33:51,698 సరేనా? 412 00:33:52,533 --> 00:33:53,700 సరే. థ్యాంక్యూ. 413 00:34:06,755 --> 00:34:08,590 నేను వేరే దేశానికి కాల్ చేయవచ్చా? 414 00:34:08,674 --> 00:34:09,675 తప్పకుండా, లిన్ బాబా. 415 00:34:09,757 --> 00:34:11,844 మూడు రూపాయలుంటే, ప్రపంచంలో ఎక్కడికైనా కాల్ చేసేయవచ్చు. 416 00:34:11,927 --> 00:34:15,597 కానీ ఒక్క విషయం. సహాయం కోరడానికి నీకు ఎవరూ లేరు అనుకున్నానే. 417 00:34:15,681 --> 00:34:17,139 నాకు ఒక వ్యక్తి రుణపడి ఉన్నాడు. 418 00:34:17,766 --> 00:34:18,851 ఐ.ఎస్.డీ. 419 00:34:21,687 --> 00:34:23,146 -థ్యాంక్యూ. -డయల్ చేయ్. 420 00:34:36,201 --> 00:34:37,536 లైన్ కలుస్తోందా? 421 00:34:42,958 --> 00:34:45,878 -ఎవరు? -హేయ్, నేనే. 422 00:34:49,755 --> 00:34:51,132 చార్లీ, లైనులో ఉన్నావా? నేను డేల్ ని. 423 00:34:52,134 --> 00:34:55,679 నువ్వు నాకు కాల్ చేయకూడదు. ఇకపై నువ్వు నన్ను సంప్రదించకూడదని అనుకున్నాం కదా. 424 00:34:56,889 --> 00:34:58,515 తెలుసు. నాకు తెలుసు, బాసూ. 425 00:34:58,599 --> 00:35:01,643 చూడు, నేను బొంబాయిలో ఉన్నాను, నువ్వు నాకు కొంచెం డబ్బు పంపాలి. 426 00:35:02,311 --> 00:35:04,813 డేల్, నీకు దక్కాల్సింది దక్కింది. 427 00:35:04,897 --> 00:35:07,649 నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి ఇలా పిండుకుంటూ ఉంటే ఎలా, గురూ! 428 00:35:09,860 --> 00:35:11,778 నేను పెద్ద సమస్యలో ఉన్నాను, చార్లీ. 429 00:35:11,862 --> 00:35:13,780 అది నీకు అలవాటే కదా? 430 00:35:13,864 --> 00:35:15,741 ఎప్పుడూ ఏదోకటి గెలుక్కుంటూనే ఉంటావు. 431 00:35:16,575 --> 00:35:18,368 దీనికీ, నాకు ఏ సంబంధమూ లేదు. 432 00:35:18,452 --> 00:35:21,872 సంబంధం ఉంది, ఎందుకంటే నీ వల్లే నా మొత్తం జీవితం నాశనం అయిపోయింది. 433 00:35:24,708 --> 00:35:27,002 అలా అనకు, చార్లీ. దయచేసి నాకు సాయపడు. 434 00:35:28,128 --> 00:35:30,672 -నువ్వు నాకు రుణపడి ఉన్నావు. -ఆ రుణం ఎప్పుడో తీరిపోయింది. 435 00:35:30,756 --> 00:35:32,799 లేదు, నువ్వు ఇంకా నాకు రుణపడే ఉన్నావు. 436 00:35:33,759 --> 00:35:36,803 నేనే కనుక లేకపోయుంటే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. 437 00:35:39,348 --> 00:35:40,432 చార్లీ. 438 00:35:44,561 --> 00:35:46,021 నీ యెంకమ్మ! నీ… 439 00:35:48,315 --> 00:35:49,358 లిన్. 440 00:35:59,409 --> 00:36:00,410 లిన్! 441 00:36:03,413 --> 00:36:04,540 లిన్! 442 00:36:11,588 --> 00:36:13,799 -లిన్, ఆగు! -ఏంటి? ఏంటి? ఎందుకు? 443 00:36:14,675 --> 00:36:16,051 నాకు ఎందుకు సాయపడాలనుకుంటున్నావు? 444 00:36:16,718 --> 00:36:18,887 నీ గురించి నాకు తెలిసింది అంతంత మాత్రమే. నా గురించి నీకు ఏమీ తెలీదు. 445 00:36:19,596 --> 00:36:21,390 ఎందుకంటే, నువ్వు నా స్నేహితుడివి. 446 00:36:21,473 --> 00:36:23,267 హా, స్నేహితులం. స్నేహితులం. 447 00:36:23,350 --> 00:36:25,435 నేను చెప్తున్నాకదా, స్నేహితులను నమ్ముకోకు, నట్టేట్లో ముంచుతారు. 448 00:36:28,355 --> 00:36:30,023 -లిన్. -ఏంటి? 449 00:36:30,107 --> 00:36:32,943 చూడు. ఇక్కడ మాకేమీ లేదు. 450 00:36:34,611 --> 00:36:38,407 ఇక్కడ అందరం సహకరించుకుంటుంటాం కాబట్టే ఈ చోటు ఇంకా ఉనికిలో ఉంది. 451 00:36:39,700 --> 00:36:41,743 నేను కూడా నీకు అలాగే సాయపడాలనుకుంటున్నా, లిన్. 452 00:36:51,587 --> 00:36:52,671 సరేనా? 453 00:37:04,099 --> 00:37:06,310 ఈ రోజంతా నీతో నేను చాలా పరుషంగా ప్రవర్తించాను. 454 00:37:06,393 --> 00:37:07,978 అవును. 455 00:37:08,061 --> 00:37:11,690 నీ పరిస్థితి అంత బాగాలేదని అర్థమవుతోంది. 456 00:37:13,567 --> 00:37:15,569 అలాగే నీ స్థితి నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. 457 00:37:15,652 --> 00:37:18,739 కానీ ఇప్పుడిప్పుడే నీకు అర్థమవుతోంది. 458 00:37:18,822 --> 00:37:20,824 -ఏంటి? నా బతుకు బస్టాండ్ అనే విషయమా? -అవును. 459 00:37:22,409 --> 00:37:25,162 కాబట్టి ఇప్పుడు నీకు అర్థమవుతోంది, మనం కలిసి నీ బతుకు కాస్తంత… 460 00:37:26,538 --> 00:37:27,664 మెరుగుపరచగలం అని. 461 00:37:27,748 --> 00:37:29,458 -మెరుగుపరుస్తారా! -హా, అవును. 462 00:37:30,375 --> 00:37:32,544 మనిద్దరం కలిసి పని చేసి, 463 00:37:33,795 --> 00:37:37,382 మనం చిటికెలో చాలా డబ్బులు సంపాదించవచ్చు, లిన్ బాబా. 464 00:37:44,223 --> 00:37:48,060 సరే. ఇక ఆ పని మీద ఉందాం. 465 00:37:48,977 --> 00:37:52,231 చలో. చలో, గురూ. 466 00:37:52,314 --> 00:37:55,484 ఈ లిన్ ఎలాంటి వాడు అంటావు? 467 00:37:55,567 --> 00:37:58,820 ఏమో. కానీ కార్లా సాయం అడగ్గానే చేసేశాడు. 468 00:37:59,446 --> 00:38:01,156 నాకు రేనాల్డోస్ నుండి కాల్ వచ్చింది. 469 00:38:01,240 --> 00:38:03,033 అతను అక్కడ పెద్ద సీన్ చేశాడట. 470 00:38:03,909 --> 00:38:07,746 అతనికి తెలియాల్సిన వాటి కన్నా చాలా తెలుసు, అతను మాట్లాడేవి కూడా నాకు నచ్చట్లేదు. 471 00:38:14,962 --> 00:38:16,380 నమస్తే. 472 00:38:16,463 --> 00:38:20,384 నమస్తే. వచ్చినందుకు థ్యాంక్స్, మంత్రివర్యా. 473 00:38:20,467 --> 00:38:22,302 భలేవాడివే. నువ్వు కాల్ చేస్తే రాకుండా ఉంటానా! 474 00:38:24,847 --> 00:38:27,391 నీ పని నువ్వు చేసుకుంటున్నట్టున్నావుగా. 475 00:38:27,474 --> 00:38:29,518 జ్ఞానమే కొండంత బలం కదా, రుజూల్. 476 00:38:30,102 --> 00:38:34,064 దానికి డబ్బు, పలుకుబడి జత అయితేనే. 477 00:38:34,147 --> 00:38:36,400 లేదా, నా కేసులో, ఒక మంచి ప్రభుత్వ పదవి. 478 00:38:38,193 --> 00:38:41,905 సాగర్ వాడలో ఉన్న జనాలందరికీ తమ బతుకు బుగ్గిపాలు అవ్వనుందని తెలుసు. 479 00:38:42,656 --> 00:38:45,492 కానీ, వాళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. 480 00:38:45,576 --> 00:38:48,662 ఇలాంటి మురికివాడలకు నువ్వు చివరిగా ఎప్పుడు వెళ్లావు? 481 00:38:48,745 --> 00:38:50,581 అక్కడ ఉండే జనాలను చూడటానికి. 482 00:38:50,664 --> 00:38:54,918 మొదటిసారి బొంబాయి వచ్చినప్పుడు, నేను అక్కడే గడిపాను. 483 00:38:55,002 --> 00:38:56,670 అది చాలా కాలం క్రిందటి మాటలే, 484 00:38:56,753 --> 00:39:01,675 కానీ అప్పుడు నేను చూసింది, ఇప్పుడు కూడా చూస్తున్నది ఏంటంటే, వాళ్లేమీ వాళ్ల పనైపోయిందని అనుకోవట్లేదు. 485 00:39:02,342 --> 00:39:06,096 వాళ్లకి బుర్ర లేదు, అభిరుచుల వెంట పడటానికి చదువు కూడా లేదు. 486 00:39:06,889 --> 00:39:10,392 -అభిరుచి గల వాడు ఎప్పటికీ సంతృప్తి చెందడు. -మన లాంటి వాళ్లా? 487 00:39:10,475 --> 00:39:13,353 అవును, మిత్రమా. మన లాంటి వాళ్లే. 488 00:39:14,730 --> 00:39:16,315 నువ్వు ఇప్పుడు మురికివాడల్లో లేవు కదా. 489 00:39:16,398 --> 00:39:19,401 కానీ, అక్కడ నేను నేర్చుకొన్న పాఠాలను ఎప్పటికీ మర్చిపోలేను. 490 00:39:20,194 --> 00:39:22,863 విధేయతే అన్నింటి కన్నా ముఖ్యం. 491 00:39:24,489 --> 00:39:28,076 జూకి చెందిన ప్యాలెస్ లో వలీద్ కి ఏం తెలిసింది అంటావు! 492 00:39:29,411 --> 00:39:33,207 నువ్వు నన్ను మోసం చేసి 493 00:39:34,291 --> 00:39:37,169 సాగర్ వాడని వలీద్ షాకి అమ్మాలనుకుంటున్నావని నాకు తెలుసు. 494 00:39:38,587 --> 00:39:40,339 ఏ విషయంలోనైనా నా వల్ల నీకు లోటు జరిగిందా? 495 00:39:41,715 --> 00:39:42,716 ఖాదర్ భాయ్… 496 00:39:42,799 --> 00:39:45,177 నీ రాజకీయ జీవితం అంతటికీ నిధులను నేనే అందించాను. 497 00:39:45,802 --> 00:39:47,471 మనం స్నేహితులుగా ఉన్నాం. 498 00:39:48,180 --> 00:39:49,389 కాబట్టి చెప్పు… 499 00:39:51,683 --> 00:39:53,101 ఏ విషయంలోనైనా నా వల్ల నీకు లోటు జరిగిందా? 500 00:40:00,651 --> 00:40:02,277 నువ్వు వెనుకపడి పోయావు. 501 00:40:04,238 --> 00:40:09,409 నువ్వు గంజాయి, వ్యభిచారం వంటి వాటి జోలికి అస్సలు పోవు, 502 00:40:09,993 --> 00:40:13,121 అంటే సాగర్ వాడకి వలీద్ ఇచ్చే రేటు నువ్వు ఇవ్వలేవు. 503 00:40:15,249 --> 00:40:17,459 అయితే, నా వల్ల నీకు ఏ లోటూ జరగలేదు, అంతే కదా? 504 00:40:18,544 --> 00:40:21,046 నీ తొక్కలో నైతికత వల్ల 505 00:40:21,129 --> 00:40:23,841 నేను తక్కువ డబ్బుతో సరిపెట్టుకోవాలా? 506 00:40:24,466 --> 00:40:27,719 నువ్వు వచ్చి చెప్పుంటే, వినేవాడిని కదా. 507 00:40:30,180 --> 00:40:31,348 కానీ ఏమీ చేసేవాడివి కాదు. 508 00:40:33,600 --> 00:40:34,935 నువ్వు బలహీనుడివి అయిపోయావు, ఖాదర్. 509 00:41:00,127 --> 00:41:01,211 లీసా. 510 00:41:04,006 --> 00:41:05,132 లీసా, నేను సెబాస్టియన్ ని. 511 00:41:13,390 --> 00:41:14,933 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 512 00:41:15,017 --> 00:41:19,271 నేను, ఆ… నువ్వు ఎలా ఉన్నావో చూద్దామని, నీకేమైనా కావాలో తెలుసుకుందామని వచ్చా. 513 00:41:19,354 --> 00:41:20,814 నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? 514 00:41:21,565 --> 00:41:24,818 లిన్. అతను రేనాల్డోస్ కి వచ్చి మరీజియోతో గొడవపడ్డాను. 515 00:41:24,902 --> 00:41:26,820 అతను… అతను చాలా ప్రమాదకరమైన వాడు అనుకుంటా. 516 00:41:26,904 --> 00:41:28,322 నన్ను విడిపించింది అతనే. 517 00:41:29,489 --> 00:41:31,992 అతనికి నా పేరు కూడా సరిగ్గా తెలీదు, కానీ నా కోసం ప్రాణాన్ని పణంగా పెట్టాడు. 518 00:41:42,294 --> 00:41:44,129 నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మరీజియోకి తెలుసా? 519 00:41:45,255 --> 00:41:46,798 -తెలీదు. -నిన్ను పంపింది అతనేనా? 520 00:41:46,882 --> 00:41:47,883 లేదు. లీసా… 521 00:41:49,635 --> 00:41:54,348 లీసా, నిన్ను మరీజియో అలాంటి చోటికి పంపించాలనుకున్నప్పుడు, నేను అడ్డుకొని ఉండాల్సింది. 522 00:41:54,431 --> 00:41:57,476 నేను అతనికి చెప్పి ఉండాల్సింది. నన్ను క్షమించు, లీసా. 523 00:41:59,228 --> 00:42:00,979 ఇప్పుడు నన్ను నువ్వు చీదరించుకుంటున్నావని తెలుసు. 524 00:42:01,063 --> 00:42:02,231 అది నాకు జరగాల్సిందే. 525 00:42:03,273 --> 00:42:04,983 నువ్వు బలహీనుడివి, అందులో నీ తప్పేముందిలే. 526 00:42:13,534 --> 00:42:16,411 నేను… నిన్ను ప్రేమిస్తున్నాను. 527 00:42:17,579 --> 00:42:21,041 అవును. కానీ నువ్వు నన్ను చూసుకోలేవు కదా. 528 00:42:24,086 --> 00:42:25,087 నేను… 529 00:42:27,214 --> 00:42:28,632 నీకు ఇది అవసరం ఉంటుందేమో అని తెచ్చా. 530 00:42:30,384 --> 00:42:31,552 నువ్వే తెచ్చావా? 531 00:42:32,719 --> 00:42:35,764 లేకపోతే మరీజియో ఇచ్చి పంపాడా? ఇది ఎక్కించుకొని మళ్లీ అతని మాట వింటానని. 532 00:42:35,848 --> 00:42:38,308 లేదు, లీసా. నేను ఇక్కడికి వచ్చినట్టు మరీజియోకి తెలీదు. నేను… 533 00:42:39,226 --> 00:42:41,854 నువ్వు ఆనందంగా ఉండటమే నాకు కావాలి. అంతే. 534 00:42:42,604 --> 00:42:44,982 నీకు అతను కావాలో, నేను కావాలో నువ్వు ఎంచుకోవాలి, మొడీనా. 535 00:42:45,065 --> 00:42:48,110 నువ్వే కావాలి, లీసా. ఎప్పుడైనా నిన్నే ఎంచుకుంటా. ఎప్పుడైనా. 536 00:42:51,280 --> 00:42:52,698 నీకు ఇది కావాలా? నేను… నేను… 537 00:42:52,781 --> 00:42:54,741 లేదు. నేను మానేద్దామని అనుకుంటున్నా. 538 00:42:55,534 --> 00:42:58,161 నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు కదా, అయితే ఆ విషయంలో నాకు సాయపడు. 539 00:42:59,204 --> 00:43:01,498 లీసా. ఎలా సాయపడాలో చెప్పు. 540 00:43:18,682 --> 00:43:20,559 ఇతని పేరు ప్రభు. 541 00:43:20,642 --> 00:43:22,269 నా వ్యక్తిగత అనుభవాల ఆధారంగా నేను మీకు ఏం చెప్పగలనంటే, 542 00:43:22,352 --> 00:43:24,646 మీకేం కావాలన్నా, ఇతను మీకు తక్కువ ధరలకే వాటిని అందించగలడు. 543 00:43:24,730 --> 00:43:28,609 వీళ్లు డీటర్, సారా, ఇంకా ఫ్రాంస్వాస్. అంతే కదా? 544 00:43:28,692 --> 00:43:31,486 -అవును. -కొంత మంచి నాణ్యత గల కొకెయిన్ కావాలట. 545 00:43:32,321 --> 00:43:33,572 మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. 546 00:43:34,156 --> 00:43:36,575 -మీకు ఎంత కొకెయిన్ కావాలి? -ఒక అర కిలో కావాలి. 547 00:43:39,328 --> 00:43:40,621 అంటే, చాలా ఎక్కువే. 548 00:43:41,496 --> 00:43:42,581 నువ్వు తెప్పించగలవా? 549 00:43:43,290 --> 00:43:45,459 భలేవారే, ఏ సమస్యా లేదు. 550 00:43:45,542 --> 00:43:47,711 మీరు వెళ్లి బీర్లు తాగండి, మంచి సంగీతం వినండి. 551 00:43:47,794 --> 00:43:49,505 -దాన్ని నేను తీసుకొస్తా, సరేనా? -మంచిది. 552 00:43:49,588 --> 00:43:51,840 -సరే. నేను ఒక్క నిమిషంలో వస్తాను. -థ్యాంక్యూ. 553 00:43:52,758 --> 00:43:55,260 చెప్పా కదా, లిన్ బాబా, మంచి వ్యాపారమని. 554 00:43:55,344 --> 00:43:56,637 దీనికి చాలా డబ్బులు వస్తాయి. 555 00:44:01,517 --> 00:44:02,518 ఆగు. 556 00:44:04,937 --> 00:44:07,814 ఏంటి? 557 00:44:09,525 --> 00:44:11,985 ఇందులో వెయ్యి డాలర్లు ఉన్నాయి, నువ్వు పడిన ఇబ్బందులకు బదులుగా ఇస్తున్నా, 558 00:44:12,653 --> 00:44:14,780 అలాగే ఇందులో అహ్మదాబాదులోని ఒక వ్యక్తి పేరు, చిరునామా ఉన్నాయి. 559 00:44:15,822 --> 00:44:16,990 వాళ్లకి నువ్వు వస్తావని తెలుసు. 560 00:44:17,074 --> 00:44:19,117 నా సొంత ఖర్చుతో వాళ్లు నీకు ఒక కొత్త పాస్ పోర్ట్ చేసిస్తారు. 561 00:44:19,868 --> 00:44:21,328 నీకు కూడా కావాల్సింది అదే కదా? 562 00:44:22,287 --> 00:44:23,956 ఉదయం ఒకలా మాట్లాడావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? 563 00:44:27,668 --> 00:44:30,003 నేను పెదవి విప్పకుండా ఉండాలనే కదా? 564 00:44:30,879 --> 00:44:34,216 నువ్వు దేని కోసం చూస్తున్నావో తెలీదు కానీ, అది మాత్రం ఇక్కడ లేదు, లిన్. అస్సలు లేదు. 565 00:44:35,050 --> 00:44:36,510 నాకు కావాల్సింది నువ్వే అనుకున్నానే. 566 00:44:38,345 --> 00:44:39,888 అది జరగదని ఇప్పుడు నీకు తెలిసింది కదా. 567 00:45:06,957 --> 00:45:08,458 కొకెయిన్ ఒప్పందంలో నీకు రావాల్సిన సగం వాటా. 568 00:45:08,542 --> 00:45:11,545 లేదు, దీన్ని నువ్వే ఉంచుకో. నాకు కావాల్సింది దక్కింది. 569 00:45:14,131 --> 00:45:16,258 చూడు, నువ్వు నన్ను వెధవ అనుకున్నా నేను అర్థం చేసుకోగలను, 570 00:45:16,341 --> 00:45:20,095 కానీ నువ్వు నాకు మంచిగా వీడ్కోలు చెప్పాలి. 571 00:45:36,320 --> 00:45:38,322 మనిద్దరం మళ్లీ కలుసుకోవడం జరగదు కదా? 572 00:45:39,615 --> 00:45:40,616 అవును. 573 00:45:45,078 --> 00:45:46,997 నువ్వు మంచివాడివి, లిన్ బాబా. 574 00:46:53,438 --> 00:46:55,649 -నువ్వు ఖాదర్ కి చెప్పేశావా? -అవును. 575 00:46:57,609 --> 00:46:59,236 అంటే మన వల్ల ఒకడు చనిపోయాడు అన్నమాట. 576 00:47:00,779 --> 00:47:01,989 నీకు కాస్తయినా బాధగా అనిపించట్లేదా? 577 00:47:02,823 --> 00:47:04,116 నా దారిని నేను ఎంచుకున్నా. 578 00:47:06,326 --> 00:47:08,120 నువ్వు వదిలి వెళ్లిన గంజాయిని చూశా. 579 00:47:09,663 --> 00:47:11,456 నేనేం చేస్తానో చూడాలనుకున్నావు కదా? 580 00:47:12,374 --> 00:47:13,667 మరి ఏం చేశావు? 581 00:47:13,750 --> 00:47:15,002 దాన్ని ముట్టుకోవద్దని లిన్ చెప్పాడు. 582 00:47:15,836 --> 00:47:17,087 దాన్ని పారేయమని అతనికి చెప్పాను. 583 00:47:19,506 --> 00:47:20,632 నాకు మారాలనుంది. 584 00:47:24,428 --> 00:47:26,138 నువ్వు అతనితో ఉంటే బాగుండేదేమో. 585 00:47:29,933 --> 00:47:32,227 ఇవాళ రాత్రి బొంబాయి నుండి వెళ్లిపోవడానికి అతనికి నేనొక దారి చూపాను. 586 00:47:33,645 --> 00:47:35,397 నేను అతనికి చేసే మేలు ఏదైనా ఉందంటే, అది అదే. 587 00:47:35,480 --> 00:47:37,191 ఓ పక్క ప్రాణం తీయడం, ఇంకో పక్క పోయడమా? 588 00:47:38,734 --> 00:47:40,027 దానితో అంతా సరి అయిపోతుందా? 589 00:47:56,793 --> 00:47:59,296 ఒకానొకప్పుడు, మనిద్దరం ఎప్పుడూ డాన్స్ చేస్తూనే ఉండేవాళ్లం. గుర్తుందా? 590 00:48:00,214 --> 00:48:01,340 గుర్తుంది. 591 00:48:06,553 --> 00:48:07,804 అప్పుడు నీపై నాకు ప్రేమ ఉండేది. 592 00:48:10,307 --> 00:48:12,392 నువ్వు నాకు ఎలా అయితే అనిపించావో, నేను అలాగే కావాలనుకొనే దాన్ని. 593 00:48:14,186 --> 00:48:15,437 అది నీకూ తెలుసు కదా. 594 00:48:31,578 --> 00:48:32,746 అబ్బా. 595 00:48:34,164 --> 00:48:35,874 నేను వెళ్లిపోతున్నా. సరేనా? 596 00:48:35,958 --> 00:48:39,419 ఆ పిచ్చి జూకి చెప్పు, నేను దూరంగా వెళ్లిపోతున్నా అని. 597 00:48:39,503 --> 00:48:42,089 నేను బొంబాయి నుండి వెళ్లిపోతున్నా. ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. 598 00:48:42,756 --> 00:48:44,007 నీ యెంకమ్మ! 599 00:48:50,389 --> 00:48:51,431 ఛ. 600 00:50:08,133 --> 00:50:10,260 తగిలిన ఎదురుదెబ్బల నుండి నేర్చుకొన్న గుణపాఠం ప్రకారం నడుచుకున్నా. 601 00:50:10,761 --> 00:50:13,931 తెలివిగా వ్యవహరించి, బతకడానికి ఏం చేయాలో, అదే చేయాలని. 602 00:50:14,556 --> 00:50:15,766 అలా చేసి స్వేచ్ఛగా జీవించాలని. 603 00:50:45,212 --> 00:50:47,172 గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ రచించిన శాంతారాం ఆధారంగా తెరకెక్కించబడింది 604 00:52:07,211 --> 00:52:09,213 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్