1 00:00:15,849 --> 00:00:18,810 ప్రేమ, విధి, తప్పులను సరిదిద్దుకోవడం వంటి వాటి గురించి తెలుసుకోవడానికి 2 00:00:18,894 --> 00:00:23,690 నాకు చాలా సమయం పట్టింది, దానికి కొన్ని గట్టి గుణపాఠాలు కూడా తోడ్పడ్డాయి. 3 00:00:23,774 --> 00:00:27,027 ఆ కథలో భాగంగా మూడు ఖండాలలో నేను తన్నులు తిన్నాను, ఆరాధించబడ్డాను, 4 00:00:27,110 --> 00:00:28,612 స్నేహితునిగా ఉన్నాను, ఇంకా బంధీగా గడిపాను. 5 00:00:28,695 --> 00:00:31,156 కానీ అదంతా నేను ఎంచుకోవాల్సి వచ్చిన ఒక సాదాసీదా మార్గం కారణంగా ప్రారంభమైంది, 6 00:00:31,240 --> 00:00:33,450 ఆ మార్గాలు చావడమా, పరారైపోవడమా! 7 00:00:35,953 --> 00:00:37,913 ఒంటి గంటకల్లా మళ్లీ ఇక్కడికి వచ్చేయాలిరా, సన్నాసులారా. 8 00:00:38,789 --> 00:00:40,707 దమ్ము కొట్టి పావు గంట ఆగి వేళ్దాంలే అని అనుకోకండి. అర్థమైందా? 9 00:00:40,791 --> 00:00:41,792 11:00 వర్క్ షాప్ గార్డుల సంఖ్య: 9 10 00:00:41,875 --> 00:00:43,627 -హా, సరే. -తెలుసు. 11 00:00:44,336 --> 00:00:47,422 పెంట్రిడ్జ్ జైలు ఆస్ట్రేలియా 12 00:00:54,346 --> 00:00:56,807 -వస్తున్నాడు హీరో. -నమస్తే రా, కుక్కా. 13 00:00:59,726 --> 00:01:01,144 ఒరేయ్ పిచ్చి కుక్క! 14 00:01:01,979 --> 00:01:04,313 -నీ ఖేల్ ఖతమ్, గురూ. -చచ్చావు పో! 15 00:01:05,941 --> 00:01:07,651 నీకు తగిన శాస్తే జరగబోతోందిరా, కుక్కా. 16 00:01:11,405 --> 00:01:12,698 నీకు మూడింది. 17 00:01:22,249 --> 00:01:24,376 బార్న్స్ ని ఆ భయంకరమైన జైలు నుండి విడుదల చేసేశారు. 18 00:01:25,085 --> 00:01:28,255 తెలుసు. ఇందాకే చూశా వాడిని. ఇంకా ఒక నెల అక్కడే ఉండాలి కదా వాడు? 19 00:01:28,338 --> 00:01:30,090 వాడికి పై అధికారుల్లో చాలా మంది తెలిసిన వాళ్లున్నారు మరి! 20 00:01:31,717 --> 00:01:32,885 నేను సిద్ధంగా లేను. 21 00:01:32,968 --> 00:01:35,262 డేల్, నువ్వు ఆ పారిపోవడం అనే ఆలోచనను పక్కకు పెట్టేస్తావా? 22 00:01:35,345 --> 00:01:37,431 ఆ చెత్త పోలీసోడికి కావాల్సింది చెప్పేయ్. 23 00:01:37,514 --> 00:01:40,100 ఆ తర్వాత? నేనేం కుక్కని కాదు, నెడ్. 24 00:01:40,184 --> 00:01:44,396 ఇక్కడున్న ప్రతీ ఖైదీ నువ్వు కుక్కవనే అనుకుంటున్నారు. 25 00:01:44,479 --> 00:01:48,108 అబ్బా, ఆ బార్న్స్ నిన్ను కిందటి సారి దాదాపుగా చంపినంత పని చేశాడు. 26 00:01:50,611 --> 00:01:53,322 ఈసారి చంపకుండా ఉంటాడు అంటావా? 27 00:02:00,329 --> 00:02:03,749 -ఏదైతే అది అయింది! నేను వెళ్లిపోతున్నా. -ఏంటి? 28 00:02:07,085 --> 00:02:09,378 డేల్! మరి నా సంగతేంటి? 29 00:02:10,339 --> 00:02:11,715 నువ్వు నన్ను కూడా తీసుకొని వెళ్లాలి. 30 00:04:18,841 --> 00:04:20,636 డేల్. డేల్! 31 00:04:21,136 --> 00:04:24,348 ఒంటి గంట కావస్తోంది. వీటితో పని జరిగే అవకాశమే లేదు. 32 00:04:25,140 --> 00:04:26,725 డేల్, మనం వెనక్కి వెళ్లిపోవాలి. 33 00:04:27,476 --> 00:04:28,602 డేల్, చెప్పేది విను! 34 00:04:28,685 --> 00:04:30,979 అందరూ వచ్చారో లేదో వాళ్లు తనిఖీ చేసే లోపు మనం మన జైళ్లలోకి వెళ్లిపోవచ్చు. 35 00:04:38,737 --> 00:04:40,239 కింది అంతస్థులో ఒక రంపం ఉంది. 36 00:04:41,156 --> 00:04:43,909 -లేదు. దాన్ని ఎవరో తీశారని వాళ్లకి తెలిసిపోతుంది. -తెలీకపోవచ్చు. 37 00:04:43,992 --> 00:04:45,702 అయినా కానీ, ఆ శబ్దం వాళ్లకి వినబడుతుంది కదా? 38 00:04:45,786 --> 00:04:47,538 కార్మికులు వచ్చే దాకా మనం ఆగుదాం. 39 00:04:47,621 --> 00:04:49,331 -ఇది పని చేయదు. -పని చేస్తుంది. 40 00:04:49,414 --> 00:04:52,543 ఎందుకంటే, ముందుగోడ ద్వారా పారిపోయేందుకు తెలివున్న ఖైదీలు ఎవరూ పవర్ తో నడిచే 41 00:04:52,626 --> 00:04:54,169 రంపాన్ని వాడరనే ఆలోచనలో వాళ్లు ఉంటారు. 42 00:04:54,253 --> 00:04:57,339 అది నిజమే. దీన్ని వదిలేసి వెనక్కి వెళ్లిపోదాం పదా. 43 00:04:57,965 --> 00:04:59,424 గురూ, నేను వెనక్కి వెళ్లలేను. 44 00:05:53,228 --> 00:05:55,189 -కానివ్వు, కానివ్వు. -మీ నలుగురూ ఆగండి. 45 00:05:55,272 --> 00:05:56,565 మనం పని మొదలుపెట్టాలి, 46 00:05:56,648 --> 00:05:58,734 ఆ తర్వాత వెనుక వైపు గుండా వాటిని పైకి తీసుకెళ్లండి. 47 00:06:42,945 --> 00:06:43,904 అబ్బా! 48 00:06:56,416 --> 00:06:57,584 బాబోయ్. 49 00:07:33,662 --> 00:07:36,039 నా పక్కనే ఉండు. ఇక్కడ ఉంటే వాళ్లకి కనబడం. 50 00:07:36,123 --> 00:07:37,165 సరే. 51 00:07:44,715 --> 00:07:46,049 ఎంత ఎత్తు ఉంది? 52 00:07:46,133 --> 00:07:48,594 -ముప్పై, 40 అడుగులు ఉండవచ్చు. -ఆహా. 53 00:07:49,595 --> 00:07:51,346 మన కాళ్లు విరుగుతాయేమో. 54 00:07:52,890 --> 00:07:55,893 -పద. -డేల్, నాకు ఎత్తులంటే భయం. 55 00:07:55,976 --> 00:07:57,769 నీకేం కాదు, గురూ. 56 00:08:00,731 --> 00:08:03,942 ఓ విషయం చెప్పనా? నువ్వు వెళ్లిపోలే. నేను వెనక్కి వెళ్లిపోతా, నువ్వు వెళ్లిపో. 57 00:08:04,818 --> 00:08:08,405 -నీ యెంకమ్మ, కాస్త శాంతించు. -నన్ను వదిలేయ్. ఈ పని నేను చేయలేను. 58 00:08:09,198 --> 00:08:12,576 నువ్వు వెనక్కి వెళ్లకూడదు. నువ్వు వెళ్తే, నేను తప్పించుకున్నానని వాళ్లకి తెలిసిపోతుంది. 59 00:08:13,243 --> 00:08:17,581 -హా, కానీ… -హేయ్. నువ్వే ముందు వెళ్లాలి. 60 00:08:30,093 --> 00:08:31,094 బాబోయ్. 61 00:09:38,120 --> 00:09:40,998 అప్పుడు, నాకు తుపాకీ తూటా ఖచ్చితంగా తగులుతుందేమో అనిపించింది. 62 00:09:43,000 --> 00:09:44,877 జైలు నుండి బయటపడగలననే ఆలోచనని కూడా నేను రానివ్వలేదు. 63 00:10:22,289 --> 00:10:23,540 పోలీసులు ఇక్కడికి వచ్చారా? 64 00:10:24,124 --> 00:10:25,417 లేదు. 65 00:10:26,543 --> 00:10:28,170 ఇక్కడికి వచ్చే ముందు ఎక్కడికి వెళ్లావు? 66 00:10:28,253 --> 00:10:29,296 నేరుగా ఇక్కడికే వచ్చా. 67 00:10:30,631 --> 00:10:31,673 మీ అమ్మ ఇంటికి వెళ్లలేదా? 68 00:10:33,759 --> 00:10:35,427 పోలీసులు ముందుగా అక్కడికే వెళ్తారు కదా. 69 00:10:36,345 --> 00:10:38,931 మీ అమ్మ తర్వాత నీకు నేనే గుర్తొచ్చాను అన్నమాట. ఎందుకు? 70 00:10:39,014 --> 00:10:40,057 ఏమో మరి. 71 00:10:41,183 --> 00:10:43,894 దాని గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. గోడ దూకి వచ్చేశానంతే. 72 00:10:43,977 --> 00:10:46,563 అంతకు మించి నాకు వేరే ప్లాన్ ఏదీ లేదు. 73 00:10:46,647 --> 00:10:50,484 నువ్వు ఇప్పుడున్న స్థితిలో నాకన్నా మరింత బాగా ఉపయోగపడేవాళ్లు నీకు తెలిసే ఉంటారు కదా. 74 00:10:50,567 --> 00:10:52,653 ఒక విధంగా చెప్పాలంటే, పరారీలో ఉన్న నీలాంటి వ్యక్తికి. 75 00:10:54,655 --> 00:10:56,156 ఇప్పుడు నువ్వు నా విద్యార్థివి కాదు, డేల్. 76 00:10:56,240 --> 00:10:58,659 అదీగాక, జైలు నుండి పారిపోయే వాళ్ళకి సాయం చేసే వృత్తి నాది కాదు కూడా. 77 00:10:58,742 --> 00:11:00,160 సర్, నాకు పారిపోవడం తప్ప ఇంకో దారి లేదు. 78 00:11:00,244 --> 00:11:03,997 అక్కడే ఉంటే నన్ను చంపేస్తారు. నాకు ఇంకో మార్గం లేదనే చెప్పాలి. 79 00:11:04,081 --> 00:11:05,666 నీకు మార్గం ఉంది. 80 00:11:05,749 --> 00:11:07,042 అది చెప్పినంత సులువు కాదు. 81 00:11:08,585 --> 00:11:12,005 అంటే, నేను మళ్లీ కాలేజీకి వెళ్లలేను, పారామెడిక్ ని కాలేను. 82 00:11:13,298 --> 00:11:14,758 నాకు పెద్దగా అవకాశాలేమీ లేవు. 83 00:11:21,431 --> 00:11:22,683 ఒకప్పుడు గర్వంగా ఫీల్ అయిపోయేవాడిని, 84 00:11:24,309 --> 00:11:26,144 నా బ్యాక్ గ్రౌండ్ నుండి ఆ స్థితికి చేరుకున్నందుకు, 85 00:11:28,272 --> 00:11:29,982 మా అమ్మ నన్ను చూసి గర్వపడినందుకు… 86 00:11:32,067 --> 00:11:33,777 మీరు నాలోని ప్రతిభ చూసినందుకు. 87 00:11:35,028 --> 00:11:36,780 ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఏంటో! 88 00:11:36,864 --> 00:11:38,949 నేను విఫలమైన విద్యార్థిని, విఫలమైన కొడుకుని… 89 00:11:41,201 --> 00:11:43,328 విఫలమైన నేరస్థుడిని, ఇంకా విఫలమైన డ్రగ్స్ బానిసని. 90 00:11:45,289 --> 00:11:46,874 నువ్వు వాటన్నింటి నుండి ఎదగగల సమర్థుడివి. 91 00:11:48,208 --> 00:11:49,209 లేదు. 92 00:11:52,337 --> 00:11:53,839 లేదు, నేనేం చేశానో నాకు తెలుసు… 93 00:11:56,258 --> 00:11:57,634 నేను మూల్యం చెల్లించాల్సింది దేనికో నాకు తెలుసు. 94 00:12:00,637 --> 00:12:02,848 జైలులో చచ్చినంత మాత్రాన, అది సరి అయిపోదు. 95 00:12:02,931 --> 00:12:07,603 నువ్వు దేని నుండైనా తప్పించుకోవాలంటే, ముందు ఎదగాలి, కాబట్టి… 96 00:12:10,230 --> 00:12:11,607 ఏం అవ్వాలనుకుంటున్నావో చెప్పు. 97 00:12:12,316 --> 00:12:15,319 దీనిలోకి దిగకపోయి ఉంటే ఏం అయ్యుండేవాడినో అదే కావాలనుకుంటున్నా. 98 00:12:15,402 --> 00:12:18,322 అది జరగని పని. ఇక్కడైతే అసలు కుదరదు. 99 00:12:23,702 --> 00:12:24,995 అయితే, నేను ఇక్కడ ఉండకూడదు. 100 00:12:37,508 --> 00:12:38,509 ఎందుకు? 101 00:12:38,592 --> 00:12:40,677 ఎందుకంటే, నువ్వు నిజంగా ఎవరో నాకు తెలుసు. 102 00:12:41,261 --> 00:12:44,473 ఆ విషయం నీకు ఎవరోకరు గుర్తు చేయాలి, అందుకే ఇక్కడికి వచ్చావు. 103 00:12:49,770 --> 00:12:50,979 ఇక తుపాకులకు దూరంగా ఉండు, డేల్. 104 00:12:52,814 --> 00:12:54,316 తుపాకులతో దోచుకోవడాలకు, డ్రగ్స్ కు దూరంగా ఉండు. 105 00:12:55,734 --> 00:12:57,277 నన్ను వెధవని చేయకు. 106 00:13:10,415 --> 00:13:13,877 బొంబాయి భారతదేశం 107 00:13:16,547 --> 00:13:18,382 ఫోర్డ్, లిండ్సే ఆక్లండ్ న్యూజిలాండ్ 108 00:13:19,466 --> 00:13:22,052 సోదరసోదరీమణులారా, బొంబాయికి స్వాగతం. 109 00:13:22,135 --> 00:13:23,971 పైనున్న లగేజ్ క్యాబిన్స్ ని… 110 00:13:24,054 --> 00:13:25,430 -పదండి. పదండి. -…జాగ్రత్తగా తెరవండి. 111 00:13:29,643 --> 00:13:31,812 అక్కడ దిగగానే మొట్టమొదటగా ఒక రకమైన వాసన నన్ను కమ్మేసింది. 112 00:13:32,896 --> 00:13:35,816 బొంబాయిలో దిగిన ఆ క్షణాన, దాన్ని నేను గ్రహించలేకపోయాను. 113 00:13:35,899 --> 00:13:39,862 కానీ ఇప్పుడు గ్రహించాను. అది ఆశ తాలూకు పరిమళం. 114 00:13:39,945 --> 00:13:41,530 -తర్వాతి వాళ్లు రావాలి. -సోదరసోదరీమణులారా, 115 00:13:41,613 --> 00:13:43,866 బొంబాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాగతం… 116 00:13:43,949 --> 00:13:47,536 కానీ వేరొకరి పేరుతో, నకిలీ పాస్ పోర్టుతో అక్కడ నిలబడి ఉన్నప్పుడు 117 00:13:47,619 --> 00:13:50,873 నాకు ఆశ, భయం రెండూ ఒకేలా అనిపించాయి. 118 00:13:50,956 --> 00:13:52,165 న్యూజిలాండ్ పౌరుడు 119 00:15:08,992 --> 00:15:11,078 గుడ్ మార్నింగ్, సర్! 120 00:15:11,161 --> 00:15:12,871 బొంబాయిలో నన్ను మించిన గైడ్ ఎవరూ లేరు. 121 00:15:12,955 --> 00:15:16,208 నా బంగారు నగరం గురించి నాకు తెలియని విషయమంటూ ఏదీ లేదు. 122 00:15:16,291 --> 00:15:19,127 మీకు సహాయం కావాలా? నేను మీకు అన్నీ చూపగలను. 123 00:15:20,546 --> 00:15:23,465 -హేయ్… థ్యాంక్యూ, కానీ వద్దులే. -సర్, నన్ను సాయపడనివ్వండి. 124 00:15:24,049 --> 00:15:25,175 అలాగే, సర్. 125 00:15:25,259 --> 00:15:28,470 కానీ మన్నించాలి, సర్, మీరు వద్దు అని ఒక్కసారే చెప్పారు కదా? 126 00:15:28,554 --> 00:15:31,598 మా దేశంలో అయితే, ఒకసారి వద్దు అని చెప్పినంత మాత్రాన అది వద్దు అయిపోదు. 127 00:15:31,682 --> 00:15:33,767 అవునా? మరి ఎన్నిసార్లు చెప్పాలేంటి? 128 00:15:34,476 --> 00:15:37,521 మూడు సార్లు తర్వాత కూడా వద్దు అని చెప్తేనే, నిజంగా వద్దు అన్నట్టు. 129 00:15:38,564 --> 00:15:41,942 నా మాట వినండి, సర్. మీకు చవకగా ఒక మంచి హోటల్ చూపిస్తాను. 130 00:15:42,025 --> 00:15:43,735 అది చూశాక, మీకు ఎంత తోచితే అంత ఇవ్వండి. 131 00:15:43,819 --> 00:15:45,362 ఒకవేళ నేనేమీ ఇవ్వాలనుకోకపోతే? 132 00:15:45,445 --> 00:15:47,698 అది మీ ఇష్టం, సర్. 133 00:15:47,781 --> 00:15:49,783 కానీ మీరు మాత్రం ఇవ్వకుండా ఉండరు. 134 00:15:49,867 --> 00:15:52,202 బొంబాయిలో నేనే నంబర్ వన్ గైడ్ ని. 135 00:15:52,828 --> 00:15:54,746 నంబర్ వన్ జిడ్డుగాడివి నువ్వు. 136 00:15:55,747 --> 00:15:59,334 అవును, సర్. మామూలు జిడ్డుగాడిని కాదు. అందరూ అదే అంటుంటారు. మీకు నా గురించి బాగా తెలిసిపోతోంది. 137 00:15:59,418 --> 00:16:01,837 -మా సరుకులను కొంటారా? -లేదు. 138 00:16:02,671 --> 00:16:03,797 సర్. 139 00:16:04,673 --> 00:16:05,674 నా పేరు, ప్రభు. 140 00:16:07,885 --> 00:16:08,886 లిండ్సే. 141 00:16:08,969 --> 00:16:10,637 -లిన్-సీ. -లిండ్సే. 142 00:16:10,721 --> 00:16:12,973 లిన్-సీ. సర్, తప్పుగా అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను, సరేనా? 143 00:16:13,056 --> 00:16:15,893 కానీ… మీ పేరు అంత బాగా లేదు. 144 00:16:17,269 --> 00:16:18,645 -వద్దు. వద్దు, థ్యాంక్యూ. -వద్దా? 145 00:16:20,189 --> 00:16:24,026 ఈ దేశంలోని జనాలకు అది చాలా పొడవుగా అనిపిస్తుంది, సరిగ్గా పలకలేరు. 146 00:16:24,109 --> 00:16:26,111 -సరే. -చిన్న పేరైతే మేలు. 147 00:16:26,195 --> 00:16:27,988 -అది… -"లిన్" అయితే బాగుంటుంది. 148 00:16:28,071 --> 00:16:30,616 -హా, పర్వాలేదు. -మీకు పర్వాలేదా? మిమ్మల్ని లిన్ అని పిలవవచ్చా? 149 00:16:30,699 --> 00:16:32,075 -లిన్ ఓకే. -సూపర్. 150 00:16:32,159 --> 00:16:33,827 అదీగాక, ఆ పేరుకు మంచి అర్థం కూడా ఉంది. 151 00:16:33,911 --> 00:16:36,121 -అవునా? ఏంటి ఆ అర్థం? -"మహా పురుషాంగం." 152 00:16:37,873 --> 00:16:39,082 మహా పురుషాంగమా? 153 00:16:39,166 --> 00:16:41,793 అంటే, సరిగ్గా అదే అర్థం కాదు, కానీ అది వినడానికి "లింగం"లా అనిపిస్తోంది, 154 00:16:41,877 --> 00:16:43,712 "లింగం" అంటే "మహా పురుషాంగం" అని అర్థం. 155 00:16:44,296 --> 00:16:45,506 -చూసుకో. -లేదు, లేదు. 156 00:16:45,589 --> 00:16:46,840 నేను చెప్తున్నా కదా, 157 00:16:48,300 --> 00:16:51,053 అది చాలా శక్తివంతమైన పేరు, చాలా అదృష్టం తెచ్చిపెట్టగల పేరు. 158 00:16:51,136 --> 00:16:54,556 ఆ పేరును వినగానే, ఎవరైనా దాన్ని ఇట్టే ఇష్టపడిపోతారు. మీకే తెలుస్తుంది. 159 00:17:00,771 --> 00:17:01,855 సరే, నువ్వే గెలిచావు. 160 00:17:03,357 --> 00:17:04,566 నాకు ఏదైనా ఒక హోటల్ ని చూపించు. 161 00:17:08,278 --> 00:17:09,363 రండి, సర్. 162 00:17:16,662 --> 00:17:17,954 నచ్చిందా? 163 00:17:27,047 --> 00:17:28,048 నచ్చింది. 164 00:17:30,467 --> 00:17:32,386 మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? 165 00:17:35,681 --> 00:17:36,807 న్యూజిలాండ్. 166 00:18:14,928 --> 00:18:16,346 నువ్వు ఫిలాసఫీ చదివావు, కదా? 167 00:18:18,182 --> 00:18:19,641 ఈ పరిస్థితిలో అది నీకేమైనా ఉపయోగపడుతోందా? 168 00:18:21,185 --> 00:18:24,313 ఫిలాసఫీ గురించి చర్చించడానికే మనం ఇక్కడ ఉన్నామా? 169 00:18:25,522 --> 00:18:27,858 ఏంటి, నువ్వు నా కంటే తెలివైన వాడివని ఫీల్ అయిపోతున్నావా, డేల్? 170 00:18:27,941 --> 00:18:29,985 నేను వెర్రి పోలీసోడినే. 171 00:18:30,068 --> 00:18:32,779 కానీ ఇన్నేళ్ల అనుభవం వల్ల నాకొక విషయం బోధపడింది, 172 00:18:33,405 --> 00:18:36,825 ఆధారాల ఆధారితమైన పరిశోధన ద్వారా నాకు తెలిసిందేంటంటే, 173 00:18:37,409 --> 00:18:42,497 పగలు తర్వాత రాత్రి ఎలా అయితే వస్తుందో, ప్రతీ వ్యక్తీ ఎప్పటికైనా తన అసలైన స్వభావానికి లొంగిపోవాల్సిందే, 174 00:18:43,165 --> 00:18:44,791 నీలాంటి తెలివైన వాడు అయినా సరే. 175 00:18:45,584 --> 00:18:47,002 మీ అమ్మ గర్వపడిపోతోంది అనుకుంటున్నావా? 176 00:18:47,085 --> 00:18:50,088 కోర్టులో ఉన్నప్పుడు, ఆమె తనని తాను నిందించుకుంటూ ఉండగా చూశాను. 177 00:18:51,006 --> 00:18:54,009 -నువ్వు ఆ మనస్సును విరగ్గొట్టేశావు. -మా అమ్మ గురించి మాట్లాడకు. 178 00:18:54,635 --> 00:18:58,639 ఇక్కడ ఉన్న దరిద్రుల కన్నా నువ్వు ఇంకా అష్ట దరిద్రుడివి, ఎందుకో తెలుసా? 179 00:18:59,431 --> 00:19:01,642 ఎందుకంటే, నీకు వీళ్లలా కాకుండా వేరేగా ఉండగల అవకాశం ఉంది. 180 00:19:02,226 --> 00:19:06,522 మీ అమ్మ ఎంతో కష్టపడి నీకెన్నో ప్రయోజనాలని అందించింది, అయినా నువ్వు ఇక్కడికే వచ్చి పడ్డావు. 181 00:19:06,605 --> 00:19:09,149 ఒక మంచి వ్యక్తి కూడా చనిపోయాడు. 182 00:19:09,233 --> 00:19:11,068 ఆఫీసర్ ఫ్లోరిస్ ని ఎవరు చంపారు? 183 00:19:11,902 --> 00:19:13,487 ఎవరో చెప్పు. 184 00:19:14,780 --> 00:19:16,281 చెప్పు. 185 00:19:20,994 --> 00:19:22,663 నాకు గుర్తు లేదు. 186 00:19:27,501 --> 00:19:28,544 గుర్తు తెప్పిస్తాలే. 187 00:19:47,062 --> 00:19:50,607 మేలుకో, లిన్ బాబా! నేను నీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి. 188 00:19:52,317 --> 00:19:53,819 రోజుకు 100 రూపాయాలు ఇవ్వాలి. 189 00:19:53,902 --> 00:19:57,239 వంద ఇస్తే, నీకు మొత్తం చూపిస్తా. 190 00:19:57,322 --> 00:19:58,448 ట్యాక్సీలకు టూరిస్టులే పెట్టుకోవాలి. 191 00:20:01,201 --> 00:20:04,162 ఈ నికృష్టుడిని చుట్టూ తిప్పి తీసుకెళ్దామా? 192 00:20:11,044 --> 00:20:12,254 టీకి కూడా. 193 00:20:12,337 --> 00:20:13,338 నేనే పెట్టుకోవాలా? 194 00:20:14,464 --> 00:20:16,550 ఈ నికృష్టుడు ఊర్లోకి వచ్చి ఎంత కాలమైంది? 195 00:20:17,718 --> 00:20:19,219 నికృష్టుడు అంటే ఏంటి? 196 00:20:19,303 --> 00:20:20,345 అంటే, దరిద్రుడని అర్థం. 197 00:20:20,429 --> 00:20:22,931 చాలా మంచి తిట్టు, లిన్ బాబా. అందరూ దాన్ని వాడతారు. 198 00:20:23,015 --> 00:20:24,558 వెర్రిబాగులోడు అనేది కూడా ఉంది. అంటే పిచ్చోడు అని. 199 00:20:24,641 --> 00:20:25,726 పిచ్చోడా? 200 00:20:30,814 --> 00:20:31,815 ఓరి నాయనోయ్! 201 00:20:33,567 --> 00:20:34,735 ఇతనికేమైనా పిచ్చా? 202 00:20:42,492 --> 00:20:43,952 మనం లంచ్ కోసం ఎక్కడైనా ఆగితే… 203 00:20:45,078 --> 00:20:47,748 ఈ నికృష్టుడు దగ్గరి నుండి ఎంత తీసుకుంటున్నావేంటి? 204 00:20:47,831 --> 00:20:49,416 నికృష్టుడు అని ఎవరిని అంటున్నావు? 205 00:21:12,981 --> 00:21:15,734 మా దేశంలో నా కోసం పోలీసులు గాలిస్తున్నారు, 206 00:21:15,817 --> 00:21:18,320 పరారీలో ఉన్న ఊరూ, ఇల్లూ లేని వాడిని నేను. 207 00:21:19,363 --> 00:21:21,031 కానీ ప్రస్తుతానికి, స్వేచ్ఛగా జీవిస్తున్నాను. 208 00:21:22,115 --> 00:21:24,243 ప్రతీ రోజూ పరుగెత్తూ ఉండటమే జీవితం అయిపోయింది. 209 00:21:24,910 --> 00:21:26,995 ఆ కొత్తదనంలో ఏదో ఆశ, ఉల్లాసం ఉంటాయి. 210 00:21:27,079 --> 00:21:28,455 నాకు బట్టలేమీ వద్దు. 211 00:21:28,539 --> 00:21:31,583 మళ్లీ రేపు వస్తాలే. రేపు వస్తా. రేపు. 212 00:21:31,667 --> 00:21:34,378 -మీరు మళ్లీ ఇక్కడికి తప్పక వస్తారు. -థ్యాంక్యూ. 213 00:21:56,275 --> 00:21:57,109 జాగ్రత్త! 214 00:21:59,987 --> 00:22:01,405 నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. 215 00:22:05,284 --> 00:22:07,202 బహుశా మీరు నా అదృష్ట దేవత ఏమో. 216 00:22:07,995 --> 00:22:09,746 కాదు. అస్సలు కాదు. 217 00:22:09,830 --> 00:22:11,623 నాలో చాలా చెడు ఉంది, కాబట్టి నేను దేవతను కాలేను. 218 00:22:12,332 --> 00:22:15,335 -మీలో ఎంత చెడు ఉందేంటి? -హేయ్, కార్లా! రా. 219 00:22:15,961 --> 00:22:18,881 ఎప్పుడైనా రేనాల్డోస్ కి వచ్చి చూస్తే, ఆ విషయం మీకే తెలుస్తుంది. 220 00:22:22,718 --> 00:22:23,719 కార్లా! 221 00:22:26,096 --> 00:22:28,432 -ఎవరు అతను? -కొత్త స్నేహితుడు తయారయ్యాడా? 222 00:22:34,646 --> 00:22:36,273 రేనాల్డోస్ కెఫే 223 00:22:36,356 --> 00:22:39,902 చిరునామా కనుగొని వచ్చేశారన్నమాట. నా పేరు కార్లా సారనెన్. 224 00:22:40,694 --> 00:22:43,322 లిండ్సే ఫోర్డ్. అందరూ నన్ను లిన్ అని పిలుస్తారు. 225 00:22:44,072 --> 00:22:45,490 అవునా? 226 00:22:45,574 --> 00:22:47,826 హా, దాని అర్థం "మహా పురుషాంగం" అని తెలుసులే. 227 00:22:47,910 --> 00:22:49,411 "పురుషాంగం" అంతే, "మహా" ఏమీ కాదు. 228 00:22:49,494 --> 00:22:52,706 అంటే, మామూలు, సాదాసీదా… 229 00:22:54,499 --> 00:22:55,959 సరే. 230 00:22:56,043 --> 00:22:59,213 ఆమె చతుర్లతో, హొయలతో జాగ్రత్త, కుర్రాడా. 231 00:23:00,672 --> 00:23:02,549 -డిడియర్ లెవీ. -లిండ్సే ఫోర్డ్. 232 00:23:06,512 --> 00:23:08,388 -ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావా? -హా? ఇప్పుడే వచ్చా. 233 00:23:08,472 --> 00:23:11,433 మరి ఎందుకు ఇక్కడే నిలబడి ఉన్నారు? 234 00:23:11,517 --> 00:23:12,768 మీరు కూడా రండి. 235 00:23:13,352 --> 00:23:15,395 అవసరమైనప్పుడు నిలబడి అన్నం తినవచ్చు. 236 00:23:15,479 --> 00:23:20,192 సత్తా ఉంటే నిలబడి ఆ పని కూడా చేయవచ్చు, కానీ నిలబడి తాగడం మాత్రం అసాధ్యం. 237 00:23:20,275 --> 00:23:22,569 అది అనాగరికమైన పని, 238 00:23:22,653 --> 00:23:25,656 ఒక గుంట దగ్గర నిలబడి అడవి జంతువు నీరు తాగినట్టు ఉంటుంది. 239 00:23:27,491 --> 00:23:28,617 విస్కీ… 240 00:23:29,576 --> 00:23:30,577 అదే. 241 00:23:30,661 --> 00:23:33,497 రేనాల్డోస్ ని, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగే అనధికార అడ్డాగా భావించవచ్చు, 242 00:23:33,997 --> 00:23:36,875 స్థానిక పోలీసులు కూడా చూసీచూడనట్టే ఉంటారు. 243 00:23:38,544 --> 00:23:40,754 డిడియర్ ఎప్పుడూ అక్కడే ఉంటాడు, 244 00:23:40,838 --> 00:23:44,550 విక్రేతలను, కొనుగోలుదారులను ఒకచోటికి తెచ్చి, కమిషన్ సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. 245 00:23:45,175 --> 00:23:48,303 కానీ అక్కడ జరిగే వ్యాపార లావాదేవీలన్నీ కఠినమైన నియమాల నడుమ జరుగుతాయి. 246 00:23:48,887 --> 00:23:52,683 టేబుల్స్ దగ్గర డ్రగ్స్, అక్రమంగా దిగుమతైన వస్తువుల డీల్స్ అన్నీ బాహాటంగానే జరుగుతుంటాయి, 247 00:23:53,267 --> 00:23:56,520 కానీ ఈ ఒప్పందాలన్నీ బయట ఉన్న ఫుట్ పాత్ పైనే నిర్ధారితమవుతుంటాయి. 248 00:23:57,980 --> 00:24:00,607 వేశ్యలు, డ్రగ్స్ డీలర్స్, జూదరులు, గూండాలు. 249 00:24:01,108 --> 00:24:04,111 ఏ రోజైన వాళ్లు ఒకరినొకరు చంపుకోవచ్చు, అది వాళ్లకి తెలుసు కూడా. 250 00:24:04,194 --> 00:24:07,698 కానీ, రేనాల్డోస్ లో, హింసకు తావే ఉండదు. 251 00:24:10,117 --> 00:24:12,661 అక్కడ ఉన్న రఫీక్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. 252 00:24:12,744 --> 00:24:14,538 బుక్స్ విషయంలో అక్రమ దందా చేసేవాడు. 253 00:24:15,414 --> 00:24:17,583 -బుక్స్? -పాస్ పోర్టులు. 254 00:24:17,666 --> 00:24:20,043 తన బుక్స్ వ్యాపారాన్ని పోగొట్టుకున్నందుకు రఫీక్ పేట్రేగిపోతున్నాడు. 255 00:24:20,127 --> 00:24:21,420 చాలా మంది చనిపోయారు. 256 00:24:24,882 --> 00:24:27,259 -అతను ఎవరు? -విజేత. 257 00:24:27,342 --> 00:24:28,802 అబ్దులా టాహేరీ. 258 00:24:29,303 --> 00:24:33,557 అతను అబ్దుల్ ఖాదర్ ఖాన్ కింద పని చేస్తుంటాడు, అతను ఈ నగరంలో ఒకానొక పెద్ద డాన్ అన్నమాట. 259 00:24:33,640 --> 00:24:35,309 డిడియర్, మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. 260 00:24:48,822 --> 00:24:53,202 ఇక్కడ బొంబాయిలో అన్ని తీవ్రమైన గాయాలు అవుతాయని అనుకుంటున్నావా, 261 00:24:53,285 --> 00:24:54,494 లిన్ బాబా? 262 00:24:55,370 --> 00:24:58,207 అది అలవాటు అయిపోయింది. మా దేశంలో నేను ఆంబోని. 263 00:24:58,874 --> 00:25:01,168 -ఆంబో అంటే? -ఆంబులెన్స్ తోలే వాడిని. 264 00:25:02,753 --> 00:25:04,838 నువ్వు డాక్టరులా నటిస్తే సూపర్ గా ఉంటుంది. 265 00:25:05,631 --> 00:25:07,591 అలా మనిద్దరం చాలా డబ్బులు వెనకేసుకోవచ్చు. 266 00:25:07,674 --> 00:25:10,177 చిన్న కమిషన్ కి నేను చాలా రోగులని తీసుకురాగలను. 267 00:25:10,260 --> 00:25:11,929 దీని గురించి ఎవరికీ చెప్పకుండే ఉంటే మంచిది. 268 00:25:27,653 --> 00:25:31,365 ఈ సన్ గ్లాసెస్ అదిరిపోయాయి. "త్రిశూల్" సినిమాలో అమితాబ్ లా ఉన్నాను. 269 00:25:31,448 --> 00:25:32,533 అలా చేయకు. 270 00:25:32,616 --> 00:25:33,951 ఇది స్టయిల్, గురూ. 271 00:25:34,576 --> 00:25:36,036 ఇద్దరం మార్చుకుందామా? 272 00:25:37,663 --> 00:25:38,789 మార్చుకుందామా? 273 00:25:42,251 --> 00:25:47,005 కానీ… నిజానికి, ఈ కళ్లజోడు చవకైనది, అంత నాణ్యమైనది కూడా కాదు. 274 00:25:48,340 --> 00:25:49,925 నా కళ్లజోడు నీకు కావాలా వద్దా? 275 00:25:52,177 --> 00:25:53,554 ఈ పని ఎందుకు చేస్తున్నావు? 276 00:25:54,096 --> 00:25:55,264 నువ్వు నా మిత్రుడివి కాబట్టి. 277 00:26:02,980 --> 00:26:04,815 -ఏంటి? -నేను ఇక్కడికి షూస్ లేకుండా వచ్చా, 278 00:26:04,898 --> 00:26:06,441 ఎందుకంటే, ఒకడు నా షూస్ లో చెత్త పని చేశాడు. 279 00:26:07,109 --> 00:26:09,403 చూడటానికి మామూలుగానే అనిపించాడు, నేను బాత్రూమ్ కి వెళ్లాను. 280 00:26:09,486 --> 00:26:11,613 బయటకు వచ్చి చూస్తే, వాడి చేతిలో వాడి పురుషాంగం ఉంది, 281 00:26:11,697 --> 00:26:13,240 నా షూస్ లో పాడు పని చేస్తూ ఉన్నాడు. 282 00:26:13,323 --> 00:26:14,449 ఓరి దేవుడా. 283 00:26:14,533 --> 00:26:15,534 యాక్, లీసా. 284 00:26:17,536 --> 00:26:18,537 నాకు ఆ షూస్ అంటే చాలా ఇష్టం. 285 00:26:18,620 --> 00:26:20,163 -అయ్యో పాపం. -ఇప్పుడు నేను వాటిని ఎలా వేసుకోవాలి? 286 00:26:22,249 --> 00:26:24,293 లీసా, కార్లా ఎప్పట్నుంచో స్నేహితులు. 287 00:26:24,918 --> 00:26:28,130 తన మొహంలో బాధ కనబడుతుంది, అదే సమయంలో తను కత్తిలా కూడా ఉంటుంది. 288 00:26:28,213 --> 00:26:29,464 పిచ్చోళ్లందరూ నన్ను ప్రేమిస్తుంటారు. 289 00:26:30,174 --> 00:26:32,134 లేదు, డబ్బులిచ్చి నిన్ను ప్రేమిస్తారు. రెంటికీ చాలా తేడా ఉంది. 290 00:26:32,217 --> 00:26:33,886 నీకు దొబ్బేయమని నేను ఇంకా చెప్పలేదా, డిడియర్? 291 00:26:33,969 --> 00:26:36,054 లేదు, కానీ నీ ప్రవర్తనని మన్నించేస్తున్నాను పో. 292 00:26:36,138 --> 00:26:40,684 మనలో మన మాట, లీసా, అలాంటివన్నీ అర్థమైపోతుంటాయి, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 293 00:26:41,643 --> 00:26:44,271 నువ్వు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి, లీసా. అజ్ఞాతంగానే అనుకో. 294 00:26:44,354 --> 00:26:47,733 -అవును. -నీ కథ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. 295 00:26:47,816 --> 00:26:50,235 తన షూస్ లో పాడు పని చేసిన వాడి కథ జనాలను బాగా ఆకట్టుకుంటుందా? 296 00:26:50,319 --> 00:26:52,738 -హా. -దాన్ని ఎవరు చదువుతారు, కవ్వీ? 297 00:26:53,488 --> 00:26:55,908 విక్రమ్ కన్నా, బాలీవుడ్ లో స్టంట్ మ్యాన్. 298 00:26:56,408 --> 00:26:58,243 అతని చెల్లెలు కవిత, విలేఖరి. 299 00:26:58,327 --> 00:27:01,538 తెలివైన, చక్కని అభిరుచి గల అమ్మాయి, తనదైన ముద్ర వేయాలని తపించే అమ్మాయి. 300 00:27:02,456 --> 00:27:04,082 ఇంతకీ బొంబాయికి ఏ పని మీద వచ్చావు, లిన్? 301 00:27:06,084 --> 00:27:07,419 తనకి చెప్పకు, లిన్. 302 00:27:07,503 --> 00:27:10,130 బొంబాయిలో ఎవరి కథ వారి దగ్గరే ఉంచుకోవాలి, 303 00:27:10,214 --> 00:27:11,840 పాపం కవ్వీకి అది పిచ్చెక్కించే విషయం. 304 00:27:12,424 --> 00:27:14,259 అది నిజం. అది నిజమే. 305 00:27:15,052 --> 00:27:16,386 మరీజియో. 306 00:27:16,470 --> 00:27:20,224 లీసా ఎక్కడికి వెళ్లినా కానీ, ఆమె బ్రోకర్లు అయిన మరీజియో, మొడీనాలు 307 00:27:20,307 --> 00:27:22,809 -అక్కడక్కడే తిరుగుతుంటారు. -ఇతను లిన్. న్యూజిలాండ్ నుండి వచ్చాడు. 308 00:27:22,893 --> 00:27:25,020 లిన్, వీళ్లు మరీజియో, మొడీనాలు. 309 00:27:25,646 --> 00:27:26,647 లిన్. 310 00:27:28,190 --> 00:27:30,609 అంటే హిందీలో పురుషాంగం అని కదా? 311 00:27:31,318 --> 00:27:33,362 వాడు కూడా చూడటానికి అలానే ఉన్నాడు. 312 00:27:34,530 --> 00:27:38,700 అలాంటి వాళ్లకి లోకమంతా అలాగే కనిపిస్తుంది. 313 00:27:39,326 --> 00:27:41,286 మా బామ్మ వాళ్ల ఊరు, పాడోవా. 314 00:27:42,454 --> 00:27:43,747 వావ్! 315 00:27:45,874 --> 00:27:49,253 మున్ముందు పరాభావాలు కలగకుండా ఉండటానికి అడుగుతున్నా, నీకు ఇంకే భాషలైనా తెలుసా? 316 00:27:49,336 --> 00:27:52,047 ఈ మధ్య మరాఠీ, హిందీ భాషల్లో బూతులు బాగానే తిడుతున్నా. 317 00:27:52,965 --> 00:27:57,261 అవసరానికి తగ్గట్టు నేను అమెరికన్ యాసలో ధారాళంగా మాట్లాడగలను కూడా. 318 00:27:57,344 --> 00:28:00,222 బాగా మాట్లాడావు. ఇంకాస్త మాట్లాడు. 319 00:28:01,306 --> 00:28:03,517 "నన్ను క్షమించమని నిన్ను కోరడం లేదు. 320 00:28:03,600 --> 00:28:05,727 నేనెప్పటికీ అర్థం చేసుకోలేను, నన్ను మన్నించుకోలేను కూడా. 321 00:28:05,811 --> 00:28:09,648 నేనేదైనా తూటాకి బలి అయితే, నాకు సాయపడు, వెధవలా ప్రవర్తించినందుకు నవ్వుకుంటాను. 322 00:28:09,731 --> 00:28:14,778 కానీ నాకు ఒకటి మాత్రం బాగా తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నానే విషయం, స్కార్లెట్." 323 00:28:14,862 --> 00:28:16,655 వావ్. 324 00:28:17,906 --> 00:28:21,493 -క్లింట్ ఈస్ట్ వుడ్ లాగా చేయగలవా? -అవును. అవును. 325 00:28:22,077 --> 00:28:24,913 "నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి. 326 00:28:24,997 --> 00:28:26,331 'నేను అదృష్టవంతుడినేనా?' 327 00:28:27,124 --> 00:28:29,001 నువ్వు అదృష్టవంతుడివేనా, బాసూ?" 328 00:28:30,878 --> 00:28:33,380 -ఏంటది… -అది "డర్టీ హారీ" సినిమాలోది. 329 00:28:34,339 --> 00:28:37,301 -అది కౌబాయ్ సినిమానా? -నీకు "డర్టీ హారీ" సినిమా తెలీదా? 330 00:28:37,384 --> 00:28:39,344 ""డర్టీ హారీ!" నీకు "డర్టీ హారీ" తెలీదా? 331 00:28:39,428 --> 00:28:41,305 అందులో హీరో క్లింటేనా? అది కౌబాయ్ సినిమా కాకపోతే, నేను చూడను. 332 00:28:41,388 --> 00:28:43,182 నువ్వు నటుడివి కావాలి, లిన్. 333 00:28:43,765 --> 00:28:45,350 మనం ఎప్పుడైనా డిన్నర్ ప్లాన్ చేద్దాం. 334 00:28:45,434 --> 00:28:48,103 రాత్రంతా నాతో అమెరికన్ యాసలో మాట్లాడుతూ నన్ను మురిపించవచ్చు. 335 00:28:48,604 --> 00:28:49,688 బై, బై. 336 00:28:50,355 --> 00:28:52,149 -బై, మరీజియో. -బై. 337 00:28:52,232 --> 00:28:54,693 -మంచిది. బై, మరీజియో. -బై. 338 00:28:56,653 --> 00:28:58,197 -మనోడికి కోపం వచ్చేసింది. -వాడు… 339 00:28:58,280 --> 00:29:00,991 -అతని ముఖంపై నవ్వు లేదు. -నువ్వు అతడిని ఇబ్బంది పెట్టేసినట్టున్నావు. 340 00:29:05,329 --> 00:29:07,331 భగవద్గీత 341 00:29:13,045 --> 00:29:17,466 మొదట్లో కొన్ని వారాలు, విటులు వస్తూ పోతూ ఉండటం నేను గమనించాను, 342 00:29:17,549 --> 00:29:19,134 ఆ తర్వాత జ్ఞానోదయానికి, ఏకాంతానికి, 343 00:29:19,218 --> 00:29:23,180 ఇంకా స్వీయ వికాసానికి వీలు కల్పించే "అసలైన భారతదేశం" వైపు అడుగులు వేశాను. 344 00:29:24,014 --> 00:29:25,974 కానీ నేను చేసిన పనుల వల్ల కాస్త బలవంతంగానే అలా చేయాల్సి వచ్చింది. 345 00:29:29,144 --> 00:29:32,314 కానీ, బొంబాయిలో నాకు చాలా స్వేచ్ఛగా అనిపించింది, 346 00:29:32,397 --> 00:29:34,316 ఇక్కడ అందరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. 347 00:29:34,900 --> 00:29:37,361 దానికి నేను మనస్ఫూర్తిగా ప్రతిస్పందించాను. 348 00:29:38,612 --> 00:29:40,113 నువ్వు బొంబాయిలో ఉండకూడదు, లిన్. 349 00:29:40,948 --> 00:29:44,243 బ్రహ్మ దేవుడు "దరిద్రం" అనే పదాన్ని, ఈ ప్రదేశాన్ని ఒకేసారి కనిపెట్టాడు. 350 00:29:45,160 --> 00:29:47,204 నువ్వు వారణాసికో, రాజస్థాన్ కో వెళ్లాలి. 351 00:29:47,287 --> 00:29:49,498 ఏమో మరి. నాకు ఇక్కడ బాగుంది. 352 00:29:49,581 --> 00:29:53,710 బహుశా లిన్ కి ఇంకెక్కడా దొరకంది బొంబాయిలో దొరుకుతుందేమో. 353 00:29:54,294 --> 00:29:55,546 అవునా? 354 00:30:06,557 --> 00:30:08,600 నేను ఇచ్చానని దీన్ని కార్లాకి ఇవ్వు. 355 00:30:08,684 --> 00:30:11,687 కంగారుపడవద్దని నేను చెప్పానని చెప్పు. నా సంగతి నేను చూసుకోగలను. 356 00:30:14,690 --> 00:30:17,609 -బై, డిడియర్. లిన్. -మరీజియో. 357 00:30:17,693 --> 00:30:20,112 పద. మేడమ్ జూ దగ్గరకి వెళ్లడం ఆలస్యమైతే బాగుండదు, సరేనా? 358 00:30:29,830 --> 00:30:31,248 ఏంటి ఆ హడావిడి? 359 00:30:32,791 --> 00:30:34,960 ఆహారం విషయంలో, ఫ్రెంచి వాళ్లలా బాగా తింటాను. 360 00:30:35,043 --> 00:30:36,837 ప్రేమ విషయంలో, ఇటలీ వాళ్లలా దాన్ని కుమ్మరిస్తాను. 361 00:30:36,920 --> 00:30:40,257 కానీ వ్యాపార వ్యవహారాల విషయానికి, నేను స్విట్జర్లాండ్ వాళ్ల లాంటి వాడిని, 362 00:30:40,340 --> 00:30:44,261 తటస్థంగా ఉంటాను, ప్రత్యేకించి ఇతరుల వ్యవహారాల్లో అయితే అస్సలు దూరను. 363 00:30:44,344 --> 00:30:45,804 నువ్వు కూడా అలాగే ఉంటే నీకే మంచిది. 364 00:30:52,352 --> 00:30:54,229 ఇక నాకు సెలవిస్తే, 365 00:30:54,313 --> 00:30:58,066 నాకు సిరులు పండించగల వ్యక్తి ఒకడు కనిపిస్తున్నాడు, వెళ్లి కలిసి వస్తాను. 366 00:30:58,150 --> 00:30:59,860 గుడ్ లక్, లిన్. 367 00:31:04,531 --> 00:31:08,035 -నేనేమైనా అన్నానా ఏంటి? -లేదు, ఏదో పని ఉండి వెళ్లాడు. 368 00:31:09,786 --> 00:31:13,290 -మీ సమావేశం బాగానే జరిగిందా? -నిజానికి చాలా అంటే చాలా బాగా జరిగింది. 369 00:31:14,875 --> 00:31:17,628 ఇప్పుడే లీసా వెళ్లిపోయింది. నీకు ఇమ్మని తను నాకొకటి ఇచ్చింది. 370 00:31:18,253 --> 00:31:19,505 నాతో అలా నడకకు వస్తావా? 371 00:31:36,021 --> 00:31:38,690 నువ్వు ఇది ఎందుకు అని అడగలేదు చూడు, అది నాకు నచ్చింది. 372 00:31:39,900 --> 00:31:41,401 అది నాకు సంబంధించింది కాదుగా. 373 00:31:41,485 --> 00:31:43,904 అయినా, ఇక్కడికి వచ్చావు. ఎందుకు? 374 00:31:46,406 --> 00:31:48,909 లీసా అడిగింది. తనంటే నాకు ఇష్టం. 375 00:31:50,911 --> 00:31:54,081 లీసాని అలా వదిలేస్తే, తన డబ్బులన్నీ డ్రగ్స్ కు తగలేస్తుంది. 376 00:31:54,831 --> 00:31:57,751 ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఉంటాయని, డబ్బును దాచమని తనకి చెప్పాను. 377 00:31:57,835 --> 00:31:59,294 తన తరఫున నేను దాచి పెడతాను అన్నమాట. 378 00:31:59,378 --> 00:32:01,296 -"అత్యవసర సమయాల్లో పనికి వచ్చే డబ్బు." -అవును. 379 00:32:02,130 --> 00:32:03,340 కానీ తను ఎప్పుడూ దాన్ని వాడదు. 380 00:32:04,466 --> 00:32:09,012 గంజాయి సంగతి దేవుడు ఎరుగు, లీసాకి ఏంటంటే, తనని ఎవరోకరు చూసుకొనే వాళ్లు ఉండాలి అన్నమాట, 381 00:32:09,596 --> 00:32:12,558 అది తనకి సమస్యలు తెచ్చిపెట్టే మరీజియో లాంటి వాళ్లైనా పర్లేదు. 382 00:32:13,308 --> 00:32:14,852 ఏదోకరోజు ఆ అవసరం తనకి లేదని నీకు నిరూపిస్తుందేమో. 383 00:32:15,894 --> 00:32:18,605 నాకు అనుమానమే. తన వ్యక్తిత్వం అదే. 384 00:32:21,775 --> 00:32:23,402 జనాలు మారే అవకాశం లేదంటావా? 385 00:32:26,488 --> 00:32:27,698 మారక తప్పదు. 386 00:32:29,616 --> 00:32:32,995 జీవితం అనేది సముద్రం మధ్యలో ఉన్న రద్దీగా ఉన్న పడవ లాంటిది. 387 00:32:34,037 --> 00:32:36,456 ఆ పడవలోనే ఉండటానికి మనం ఆత్మాభిమానాన్ని వదులుకోవాల్సి రావచ్చు, 388 00:32:37,583 --> 00:32:39,710 మన ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛని కూడా వదులుకోవాల్సి రావచ్చు. 389 00:32:39,793 --> 00:32:43,213 ఆ తర్వాత, జనాలను నీళ్లలోకి తోసేయడం మొదలుపెడతాం, 390 00:32:43,839 --> 00:32:46,842 అలా స్నేహితులను, మనకి తెలిసిన వాళ్లందరినీ తోసేస్తాం, అయినా కానీ మనకు ఆ స్థలం చాలదు. 391 00:32:48,468 --> 00:32:51,471 పడవ మునగుతూనే ఉంటుంది, దానితో పాటు మనం కూడా మునుగుతాం. 392 00:32:51,555 --> 00:32:53,765 అదే లీసా. తను ఆ పడవ నుండి ఎప్పటికీ బయటపడలేదు. 393 00:33:02,232 --> 00:33:03,859 నువ్వు బుద్దిగా విన్నావే. 394 00:33:04,568 --> 00:33:07,362 అది చాలా ప్రమాదకరం, ఎందుకంటే, అది అవతలి వారిని అయస్కాంతంగా లాగుతుంది. 395 00:33:07,446 --> 00:33:08,572 చెప్పేది వినేవాళ్లుండటం… 396 00:33:09,198 --> 00:33:10,991 నిజంగా వినేవాళ్లుండటం అనేది… 397 00:33:11,992 --> 00:33:13,035 చాలా అరుదు. 398 00:33:13,702 --> 00:33:15,329 ఒక వ్యక్తికి, తాను ప్రత్యేకమనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. 399 00:33:23,629 --> 00:33:27,216 సరే, ఇక నువ్వు నీ వినే గుణాన్ని పక్కకు పెట్టేయాలి. 400 00:33:29,009 --> 00:33:30,719 నువ్వు బొంబాయిలో ఏం చేస్తుంటావు? 401 00:33:33,722 --> 00:33:37,184 కొంత కాలం, పాశ్చాత్య దేశస్థులకు… 402 00:33:38,602 --> 00:33:41,188 …ఇక్కడి స్థానికులకు మధ్య వ్యాపార లావాదేవీలలో సహాయపడే అనువాదకురాలిగా పని చేశాను. 403 00:33:41,980 --> 00:33:44,608 ఆ తర్వాత, నా వల్లే వ్యాపార ఒప్పందాలు కుదురుతున్నాయంటే, 404 00:33:44,691 --> 00:33:46,193 ఆ ఒప్పందాలేవో నేనే చేసుకోవచ్చుగా అనే విషయాన్ని గ్రహించా. 405 00:33:47,027 --> 00:33:50,280 బొంబాయి చాలా వేగంగా మారిపోతోంది. ఇక్కడ బాగా డబ్బు సంపాదించవచ్చు. 406 00:33:51,490 --> 00:33:52,908 నీకు కావలసింది డబ్బేనా? 407 00:33:52,991 --> 00:33:55,827 నాకు కావలసిందల్లా నా జీవితం నా గుప్పెట్లో ఉండటమే. 408 00:33:56,662 --> 00:33:58,455 డబ్బు వల్ల ఆ స్వేచ్ఛ లభిస్తుంది. 409 00:34:02,417 --> 00:34:03,919 నిన్ను నిరాశపరిచానా, లిన్? 410 00:34:06,213 --> 00:34:08,257 లేదు. అస్సలు లేదు. 411 00:34:10,425 --> 00:34:13,929 మనకి కావలసింది స్వేచ్ఛే అనుకుంటా, దాన్ని మనం ఎలా దక్కించుకున్నా కూడా. 412 00:34:16,098 --> 00:34:18,225 నీ దృష్టిలో స్వేచ్ఛ అంటే ఏంటి? 413 00:34:21,687 --> 00:34:24,857 ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎవరితో ఉండాలో… 414 00:34:26,984 --> 00:34:28,068 ఎంచుకొనే శక్తి ఉండటం. 415 00:34:29,862 --> 00:34:31,029 నాకు అవన్నీ ఉన్నాయిగా. 416 00:34:37,619 --> 00:34:38,704 ఇదే నా ఇల్లు. 417 00:34:42,291 --> 00:34:45,252 ఇంత పొద్దుపోయే దాకా నిన్ను నాతోనే ఉంచుకున్నందుకు క్షమించు. 418 00:34:45,335 --> 00:34:46,920 ట్యాక్సీలో వెళ్లు. డబ్బులు నేనే ఇస్తా. 419 00:34:47,963 --> 00:34:51,425 నడుస్తానులే. అలా వెళ్తే నగరం గురించి బాగా తెలుస్తుంది. 420 00:34:52,176 --> 00:34:53,510 అంతే అంటావా? 421 00:34:55,596 --> 00:35:01,560 దీనికి, అలాగే నడిచేటప్పుడు నాకు తోడుగా ఉన్నందుకు థ్యాంక్యూ. 422 00:35:02,477 --> 00:35:03,604 నాకు బాగా అనిపించింది. 423 00:35:04,897 --> 00:35:05,981 హా, నాకు కూడా. 424 00:35:24,833 --> 00:35:26,043 ఛ. 425 00:35:52,694 --> 00:35:53,862 అక్కడే ఆగు! 426 00:35:54,446 --> 00:35:56,323 -ఇటు రా. -హేయ్! 427 00:35:58,242 --> 00:35:59,409 ఎక్కడికి వెళ్తున్నావు? 428 00:36:02,037 --> 00:36:05,624 ఎక్కడికీ లేదు. నేను టూరిస్టుని. దారి తప్పానంతే. 429 00:36:05,707 --> 00:36:07,835 హేయ్, ఇప్పుడు కర్ఫ్యూ అమలులో ఉంది. 430 00:36:08,961 --> 00:36:10,629 అవునా? 431 00:36:10,712 --> 00:36:12,548 నీ పత్రాలు చూపించు. 432 00:36:12,631 --> 00:36:14,174 నీ పాస్ పోర్ట్ చూపించు. 433 00:36:33,360 --> 00:36:36,697 కర్ఫ్యూని ఉల్లంఘించడం మంచి విషయం కాదు. 434 00:36:38,073 --> 00:36:39,741 -నువ్వు జైలుకు వెళ్లాలి. -అబ్బా… 435 00:36:39,825 --> 00:36:41,910 హేయ్! జైలుకు వెళ్తావా, తెల్లోడా? 436 00:36:44,246 --> 00:36:45,247 లేదు. 437 00:36:46,164 --> 00:36:48,792 జైలుకు వెళ్తే ఇక అంతే, మిస్టర్… 438 00:38:33,188 --> 00:38:34,898 చూడు, నేను బొంబాయి నుండి వెళ్లిపోతున్నా. 439 00:38:36,692 --> 00:38:37,860 వేరే చోటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. 440 00:38:39,403 --> 00:38:40,445 ఎక్కడికి? 441 00:38:40,988 --> 00:38:43,740 ఏమో. గోవాకో, వారణాసికో? 442 00:38:43,824 --> 00:38:45,868 -ఎప్పుడు. -రేపే. రేపట్నుంచీ మనం కలుసుకోలేం. 443 00:38:45,951 --> 00:38:50,080 హా, హా. కానీ తెల్లోళ్లు వెళ్లే ఈ ప్రాంతాలు నీకు నచ్చవు అనుకుంటా. 444 00:38:50,163 --> 00:38:52,499 -ఎప్పటికీ ఇక్కడే ఉండిపోలేను కదా. -నాకు అది తెలుసు. 445 00:38:53,083 --> 00:38:55,085 కానీ నువ్వు ఒక అసలైన భారత దేశపు పల్లెటూరిని చూడాలి కదా? 446 00:38:56,003 --> 00:38:57,004 నా మాట విను. 447 00:38:57,546 --> 00:38:58,797 వింటున్నా. 448 00:38:58,881 --> 00:39:02,801 నీకు కావాలంటే, నా పనులన్నింటినీ కాసేపటికి ఆపుకొని, 449 00:39:03,343 --> 00:39:04,761 నిన్ను మా పల్లెటూరికి తీసుకెళ్తాను. 450 00:39:06,096 --> 00:39:09,391 ఒక తెల్లోడితో నేనెప్పుడూ ఇలా అనలేదు, కానీ నువ్వు నాకు మంచి స్నేహితునివి. 451 00:39:13,687 --> 00:39:15,063 ఎంత దూరం? 452 00:39:15,647 --> 00:39:18,233 ఒక రైలు ఎక్కాలి, రెండు బస్సులు ఎక్కాలి. ఊరు చాలా అందంగా ఉంటుంది. 453 00:39:19,484 --> 00:39:20,861 నువ్వు వస్తావు కదా? 454 00:39:23,739 --> 00:39:24,907 ఆనందంగా వస్తాను. 455 00:39:26,283 --> 00:39:28,368 బొంబాయిలో ఎంత అయితే తీసుకుంటానో, అక్కడ కూడా అంతే తీసుకుంటా. 456 00:39:28,452 --> 00:39:29,745 రోజుకు 100 రూపాయలు. 457 00:39:31,705 --> 00:39:33,373 రైలు టికెట్లు నేనే కొనాలి కదా? 458 00:39:33,457 --> 00:39:37,586 నువ్వు అంతలా చెప్పాక, నేను ఎలా కాదనగలను, లిన్. 459 00:39:45,469 --> 00:39:47,095 -ఎవరు? -కార్లా. 460 00:40:06,031 --> 00:40:07,282 బట్టలు ఉతుక్కుంటున్నావా? 461 00:40:08,158 --> 00:40:09,159 హా. 462 00:40:10,744 --> 00:40:12,162 నేను ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతున్నాను. 463 00:40:13,205 --> 00:40:14,581 వెళ్లేముందు వచ్చి బై చెప్దామనుకున్నావా? 464 00:40:16,291 --> 00:40:18,377 హా, రాత్రికి రేనాల్డోస్ కి వచ్చి చెప్దామనుకున్నా. 465 00:40:21,713 --> 00:40:22,714 లోపలికి రా. 466 00:40:25,676 --> 00:40:26,927 ఈ మచ్చలు చిన్న మచ్చలు కావే! 467 00:40:28,971 --> 00:40:31,306 హా. మామూలు పనుల్లో తగిలినవేలే. 468 00:40:33,475 --> 00:40:34,518 ఏంటి సంగతి? 469 00:40:36,395 --> 00:40:38,939 ఓ విషయంలో నాకు సాయపడగలవేమో అని అడగడానికి వచ్చాను. 470 00:40:40,607 --> 00:40:41,608 సరే. 471 00:40:43,819 --> 00:40:46,321 లీసా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగా లేదు. 472 00:40:46,405 --> 00:40:49,783 ప్యాలెస్ అనే వేశ్య వాటికలో పని చేసేలా మరీజియో తనని ఒప్పించాడు. 473 00:40:50,951 --> 00:40:53,912 అది అంత మంచిది కాదు. అక్కడ విటులదే ఇష్టారాజ్యం. 474 00:40:53,996 --> 00:40:57,624 ఆ వాటికని నడిపించే మేడమ్ జూ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. 475 00:40:59,376 --> 00:41:00,711 మరీజియో ఏమంటున్నాడు? 476 00:41:01,628 --> 00:41:04,173 మరీజియోకి, తన స్వార్థం తప్ప పక్కనోళ్ళ గురించి అస్సలు పట్టదు. 477 00:41:05,549 --> 00:41:10,637 పార్కర్ నాతో అక్కడికి రావాల్సి ఉంది, లీసా అమెరికా పౌరురాలు కాబట్టి తనని వదిలివేయాలని డిమాండ్ చేయడం కోసం. 478 00:41:11,722 --> 00:41:13,265 గిల్బర్ట్ పార్కర్ యుఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్ 479 00:41:13,348 --> 00:41:16,268 మేడమ్ జూ ప్రమాదకరమైన వ్యక్తే, కానీ అమెరికన్ ఎంబసీతో సమస్యలు పెట్టుకోవాలని తనకి లేదు. 480 00:41:17,936 --> 00:41:19,229 ప్లాన్ బాగానే ఉంది. 481 00:41:19,313 --> 00:41:22,149 అవును, కానీ పార్కర్ ఊరు వదిలి వెళ్లిపోయాడు. 482 00:41:27,487 --> 00:41:30,240 లీసా అక్కడ బంధీగా ఉంటుంది అనే ఆలోచననే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. 483 00:41:31,491 --> 00:41:35,829 అప్పుడు, నువ్వు ఆ రోజు రకరకాల యాసలు మాట్లాడిన విషయం గుర్తు వచ్చింది. 484 00:41:35,913 --> 00:41:37,623 నువ్వు చాలా బాగా మాట్లాడావని లీసా చెప్పింది. 485 00:41:38,665 --> 00:41:40,667 నన్ను ఈ వ్యక్తిలా నటించమని అడగడానికి వచ్చావా? 486 00:41:41,293 --> 00:41:42,503 అవును. 487 00:41:44,796 --> 00:41:49,009 నేను… చూడు, కార్లా, నన్ను క్షమించు, కానీ… ఈ పని నేను చేయలేను. 488 00:41:49,760 --> 00:41:50,761 నువ్వు చేయగలవు. 489 00:41:51,595 --> 00:41:54,431 అంటే, నువ్వేమీ ప్రపంచాన్ని చుట్టిరావాలని తిరిగే యాత్రికుడివి కాదు కదా, లిన్, 490 00:41:54,515 --> 00:41:55,974 లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు. 491 00:41:57,017 --> 00:41:58,852 బహుశా అందుకే నేను దూరంగా ఉండాలనుకుంటున్నానేమో. 492 00:42:00,562 --> 00:42:02,648 ఇక్కడ ఉండే వాళ్లందరూ, ఏదో విషయంలో తప్పించుకొని తిరుగుతున్నవాళ్లే. 493 00:42:02,731 --> 00:42:04,942 హా, నాకు తెలుసు. ఆ పనే నేను కొనసాగిద్దాం అనుకుంటున్నా. 494 00:42:05,025 --> 00:42:09,446 నేను చెప్తున్నా కదా, అది పని చేయదు. నీ అసలైన స్వభావాన్ని ఎప్పటికీ నువ్వు దూరం చేసుకోలేవు. 495 00:42:11,448 --> 00:42:13,033 నా గురించి నీకేమీ తెలీదు. 496 00:42:15,452 --> 00:42:17,621 కానీ తెలుసుకోదగిన గాథ రవ్వంతైనా ఉంటుందని భావించానే. 497 00:42:18,163 --> 00:42:19,289 నేను పొరబడ్డానేమో. 498 00:42:35,389 --> 00:42:37,391 ఎలాగైనా, నీ చేత నిజాన్ని రాబడతాం. 499 00:42:37,474 --> 00:42:38,934 కాబట్టి, చెప్పేయ్, సరేనా? 500 00:42:39,518 --> 00:42:42,354 ట్రిగ్గర్ ఎవరు నొక్కారు? 501 00:42:43,063 --> 00:42:44,523 నేను కుక్కని కాదు. 502 00:42:45,315 --> 00:42:47,568 నేను ఇక్కడికి, నేను చేసిన నేరాలు అనుభవించడానికే వచ్చాను. 503 00:42:47,651 --> 00:42:51,154 లేదు, లేదు. అలా ఇక్కడ పని చేయదు. 504 00:42:51,238 --> 00:42:52,990 నీకు రవ్వంత ఉపశమనం కూడా లభించదు. 505 00:42:53,574 --> 00:42:55,951 శిక్ష అనుభవించాల్సిందే. నొప్పి భరించాల్సిందే. 506 00:42:58,954 --> 00:43:00,038 ఛ! 507 00:43:00,622 --> 00:43:03,166 ఇక్కడ నీకేమీ జ్ఞానోదయం అయిపోదు, బాసూ. సరేనా? 508 00:43:03,250 --> 00:43:04,751 నీకు నొప్పి తప్ప ఇంకేమీ తెలీకుండా చేస్తాం. 509 00:43:05,419 --> 00:43:07,546 నీలాంటి వాళ్లకి విముక్తి అనేది ఉండదు. 510 00:43:26,190 --> 00:43:28,859 వచ్చే ముందు కనీసం ఒక్కసారైనా తలుపు తట్టవా? 511 00:43:30,027 --> 00:43:32,321 మనం రేపటికి రైలు టికెట్లను ఇప్పుడే వెళ్లి తెచ్చుకోవాలి. 512 00:43:32,404 --> 00:43:34,323 ఇలా చేస్తే, ఆఖరి క్షణంలో ఏ కంగారూ లేకుండా ఎక్కవచ్చు. 513 00:43:34,406 --> 00:43:38,076 అదీగాక, మా పల్లెటూరిలో ఉండే వాళ్లందరికీ మనం కానుకలను కొనాలి. 514 00:43:38,160 --> 00:43:39,161 అందరికీనా? 515 00:43:42,372 --> 00:43:44,750 కాపాడండి! కాపాడండి! 516 00:43:45,959 --> 00:43:46,960 ఎవరైనా ఆంబులెన్స్ కి కాల్ చేయండి! 517 00:43:47,836 --> 00:43:48,837 నేను వెళ్లి ఎవరినైనా తీసుకొస్తా. 518 00:43:48,921 --> 00:43:51,131 ఇది మనకి సంబంధించినది కాదు, లిన్. వెళ్దాం పద, లిన్! 519 00:43:51,215 --> 00:43:53,800 -దయచేసి, నాకు సాయపడండి. -నేను చూస్తాను. నేను చూస్తా ఆగండి. 520 00:43:53,884 --> 00:43:55,427 -చివరిసారి ఎప్పుడు ఎక్కించుకున్నాడు? -చనిపోతున్నాడు! 521 00:43:55,511 --> 00:43:56,887 -చివరిగా ఎప్పుడో చెప్పండి! -నాకు తెలీదు. 522 00:43:56,970 --> 00:43:58,764 -అందరూ కాస్త గాలి ఆడనివ్వండి. -ఎవరైనా పోలీసులకి కాల్ చేయండి. 523 00:43:58,847 --> 00:44:00,974 లిన్, ఇది మనకి సంబంధించినది కాదు. మనం ఇరుక్కుపోతాం. 524 00:44:01,058 --> 00:44:03,227 -చివరిగా ఎప్పుడు ఎక్కించుకున్నాడు? -మనం తలదూర్చకుంటేనే మంచిది! 525 00:44:03,310 --> 00:44:05,479 -లిన్, పద! -ఒక గంట? నాకు తెలీదు. 526 00:44:07,731 --> 00:44:09,316 లిన్, పోలీసులు వస్తున్నారు! 527 00:44:09,399 --> 00:44:12,528 -మనం వెళ్లిపోవాలి! లేదంటే మనందరినీ అరెస్ట్ చేసేస్తారు! -దయచేసి కాపాడండి! 528 00:44:12,611 --> 00:44:15,906 -పద, పద. మెట్లు దిగి పద. -దయచేసి వెళ్లిపోకండి! చనిపోతాడు! 529 00:44:15,989 --> 00:44:20,244 వెళ్లిపోకండి! రండి! రండి! 530 00:44:27,376 --> 00:44:28,836 నేను అతడిని కాపాడగలిగి ఉండేవాడిని. 531 00:44:30,504 --> 00:44:32,297 ఇంతకు ముందు నేను డ్రగ్ ఓవర్ డోస్ కేసులకి చికిత్స ఇచ్చా కూడా. 532 00:44:32,381 --> 00:44:33,882 అతడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? 533 00:44:33,966 --> 00:44:36,385 ఏమో, లిన్ బాబా. అతడిని చూస్తే నాకు చనిపోయినట్టే అనిపించాడు. 534 00:44:36,885 --> 00:44:38,428 కనీసం ప్రయత్నించి అయినా ఉండేవాడిని. 535 00:44:39,429 --> 00:44:40,973 దానికి, నాకు సంబంధమే లేదు. 536 00:44:41,932 --> 00:44:43,350 మనం జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. 537 00:44:43,433 --> 00:44:44,268 ఆంబులెన్స్ 538 00:44:44,351 --> 00:44:46,478 -మీరు కూడా మాతో రావాలి. -మీతో రావాలని నాకు లేదు. 539 00:44:46,562 --> 00:44:47,688 అసలు ఏంటి ప్రయోజనం, ప్రభు, 540 00:44:49,523 --> 00:44:52,276 ఇక్కడున్న ప్రతిక్షణం నేను భయపడుతూ బతకాల్సి వస్తే? 541 00:44:56,697 --> 00:44:58,448 ఎందుకు భయపడుతున్నావు, లిన్? 542 00:45:10,294 --> 00:45:11,670 నేను ఏదోకటి చేయాలి. 543 00:45:11,753 --> 00:45:13,714 హేయ్, లిన్, మనం రేపు ఉదయాన్నే బయలుదేరాలి. 544 00:45:17,092 --> 00:45:20,012 చూడు, నువ్వు వెళ్లి రైలు టికెట్లు తీసుకో. 545 00:45:20,095 --> 00:45:22,472 రేపు ఉదయానికి నేను ఇక్కడికి వచ్చేస్తా. అనుకున్నట్టే మనం బయలుదేరుదాం. 546 00:45:24,683 --> 00:45:26,185 కానీ ఇప్పుడు, నేను ఒక చోటికి వెళ్లాలి. 547 00:45:32,399 --> 00:45:34,818 -ఎవరు? -నేను. లిన్ ని. 548 00:45:40,240 --> 00:45:42,367 -ఆ పని నేను చేస్తాను. -ఏ పని? 549 00:45:42,951 --> 00:45:43,952 లీసా పని. 550 00:45:46,872 --> 00:45:48,540 మనం ఇవాళ రాత్రి వెళ్లగలిగితే, నేను చేస్తా. 551 00:45:48,624 --> 00:45:50,959 ఏదేమైనా, రేపు ఉదయాన్నే నేను బొంబాయి నుండి వెళ్లిపోతున్నా. 552 00:45:52,085 --> 00:45:53,212 మనస్సును ఎందుకు మార్చుకున్నావు? 553 00:45:53,837 --> 00:45:56,798 పారిపోవడం కన్నా దాన్ని ఎదిరిస్తేనే ఫలితం ఉంటుంది అనుకుంటా. 554 00:45:58,717 --> 00:45:59,927 ఇటు రా. 555 00:46:10,562 --> 00:46:11,730 ఏదైనా మంచి డ్రెస్ ని ఎంచుకో. 556 00:46:13,190 --> 00:46:15,275 ఇక్కడ మగవాళ్ల బట్టలు చాలానే ఉన్నాయే. 557 00:46:15,359 --> 00:46:17,611 ఇక్కడ చివరిగా ఉన్న ఇద్దరు మగవాళ్లు హఠాత్తుగా వెళ్లిపోయారు. 558 00:46:18,737 --> 00:46:20,364 కానీ సామాన్లు తీసుకెళ్లలేదా? 559 00:46:20,447 --> 00:46:23,158 ఒకడు చట్టాన్ని ఉల్లంఘించాడు. కాబట్టి ఉన్న పళంగా వెళ్లిపోవలసి వచ్చింది. 560 00:46:26,828 --> 00:46:28,288 నీకు ఏది కావాలంటే అది వేసుకో. 561 00:46:38,715 --> 00:46:39,800 బాగానే సరిపోయింది. 562 00:46:41,885 --> 00:46:44,054 మరి ఇక్కడ ఉండిన ఇంకో వ్యక్తికి ఏమైంది? 563 00:46:45,264 --> 00:46:46,265 అతను చనిపోయాడు. 564 00:46:48,058 --> 00:46:50,185 ఇది ఎవరి సూట్? చెడ్డవాడిదా, చనిపోయినవాడిదా? 565 00:46:50,686 --> 00:46:54,064 అహ్మద్ ని పూడ్చేటప్పుడు ఈ సూట్ వేయాలని తెచ్చాను. కానీ చివరికి, మేము ఉపయోగించలేదు. 566 00:46:54,147 --> 00:46:55,607 ఏమంటున్నావు, కార్లా! 567 00:46:55,691 --> 00:46:59,111 నువ్వు ఇలాంటివి నమ్ముతావని మాత్రం చెప్పకు. పైగా నీ లాంటి వాడు నమ్మడమా? 568 00:47:00,529 --> 00:47:02,614 నా లాంటి వాడంటే ఏంటి? 569 00:47:04,157 --> 00:47:06,869 నాకు తెలీదు. అదే కదా అసలు విషయం? 570 00:47:13,584 --> 00:47:14,960 నువ్వు ఎవరి కింద పని చేస్తున్నావు? 571 00:47:17,171 --> 00:47:20,174 రాజకీయ వ్యవహారాల కౌన్సిలర్, ఆర్లెన్ హేస్. 572 00:47:20,257 --> 00:47:21,466 నీ స్వస్థలం? 573 00:47:21,550 --> 00:47:23,177 లింకన్, నెబ్రాస్కా. 574 00:47:23,260 --> 00:47:24,553 మిషన్ కి డిప్యూటీ ఛీఫ్? 575 00:47:28,765 --> 00:47:30,225 డోనల్డ్… డోనల్డ్ గేబుల్. 576 00:47:43,864 --> 00:47:47,659 జూ, ఒక రష్యన్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏజెంట్ కి ప్రియురాలని అందరూ అంటుంటారు. 577 00:47:47,743 --> 00:47:49,953 కానీ జనాలు ఆమె గురించి చాలా విచిత్రమైన విషయాలు చెప్తుంటారు. 578 00:47:51,163 --> 00:47:55,501 విషయం ఏంటంటే, తను తెలివైనది, పగ తీర్చుకొనే రకం, ఇంకా ప్రమాదకరమైనది. 579 00:47:56,460 --> 00:47:59,546 లీసాకి ముందు ప్యాలెస్ నుండి చాలా మంది పారిపోయి ఉంటారు. 580 00:48:19,650 --> 00:48:21,610 తన గురించి నీకు అన్ని విషయాలు ఎలా తెలుసు? 581 00:48:22,319 --> 00:48:25,531 ఒప్పందాలను ఖరారు చేయడానికి నేను డబ్బులు తీసుకుంటా. వాటిలో కొన్ని ఆ చోట జరిగాయి. 582 00:48:31,662 --> 00:48:33,080 అయ్య బాబోయ్. 583 00:48:51,682 --> 00:48:52,975 నమస్తే, మిస్ కార్లా. 584 00:48:53,559 --> 00:48:54,560 పద్మ. 585 00:48:55,853 --> 00:48:57,604 సర్, మీరు దయచేసి మీ బిజినెస్ కార్డ్ చూపిస్తారా? 586 00:49:02,818 --> 00:49:05,696 మిస్టర్ పార్కర్. కార్లాకి దారి తెలుసు, మీరు తనతో వెళ్లవచ్చు. 587 00:49:24,590 --> 00:49:25,632 సిద్ధమేనా? 588 00:49:45,194 --> 00:49:46,904 ఇతనేనా నీ అమెరికా వాడు? 589 00:49:50,032 --> 00:49:53,160 నా పేరు గిల్బర్ట్ పార్కర్. నేను అమెరికన్ ఎంబసీలో పని చేస్తున్నా. 590 00:49:54,119 --> 00:49:58,248 నేనేమీ అధికారికంగా రాలేదు. ప్రస్తుతానికి అయితే కాదు అనుకోండి. 591 00:49:59,082 --> 00:50:01,585 -అంటే, ఇప్పుడు మీరు చేసేది సహాయం అంటున్నారా? -అవును. 592 00:50:03,003 --> 00:50:05,255 -మీకు. -నాకు అలా అనిపించట్లేదే. 593 00:50:06,089 --> 00:50:07,591 మీరు ప్రేమలో ఉన్నారా, మిస్టర్ పార్కర్? 594 00:50:08,884 --> 00:50:11,553 -ఏంటి? -మీరు కార్లాతో ప్రేమలో పడ్డారు అనుకుంటా. 595 00:50:12,638 --> 00:50:15,766 అలా పడేసే, మీ చేత ఈ పని చేయించుకుంటుంది, అంతే కదా? 596 00:50:18,685 --> 00:50:23,065 ఒక అమెరికన్ పౌరురాలిని, తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంచుతున్నారని నాకు తెలిసింది, అందుకే వచ్చా. 597 00:50:23,148 --> 00:50:26,818 కార్లా కూడా మిమ్మల్ని ఎప్పటికైనా ప్రేమిస్తుందని మీరు భ్రమపడకండి. 598 00:50:27,569 --> 00:50:32,074 ఈ మాట నేను మీకు చేసే సహాయంలా భావించండి, మిస్టర్ పార్కర్. 599 00:50:34,117 --> 00:50:38,455 తప్పకుండా. ఇంతకీ లీసా కార్టర్ ఎక్కడుందో చెప్పండి. 600 00:50:38,997 --> 00:50:40,832 లీసా తన ఇష్టప్రకారమే ఇక్కడ ఉంటోంది. 601 00:50:41,542 --> 00:50:44,878 అయితే, తనని తీసుకురండి, ఆ మాట తన నోటితోనే వింటాను. 602 00:50:48,048 --> 00:50:49,633 అది జరగని పని. 603 00:50:53,637 --> 00:50:55,722 పద. దీని వల్ల సమయం వృథా తప్పితే మరో లాభం లేదు. 604 00:51:00,143 --> 00:51:01,186 కార్లా. 605 00:51:04,606 --> 00:51:08,193 ఇది మనిద్దరి మధ్య విషయం, తనకి సంబంధించింది కాదు. 606 00:51:09,236 --> 00:51:12,030 మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే మీరు దౌత్యవేత్తలా అనిపించట్లేదు. 607 00:51:13,991 --> 00:51:18,203 లేదు, నేను ఎంబసీ బయటి పనులు చూసుకుంటుంటాను. 608 00:51:19,162 --> 00:51:20,747 నేను దౌత్యవేత్త అని నేను అనలేదే. 609 00:51:21,748 --> 00:51:25,169 నా శాఖ, విషయాన్ని నేరుగా వెళ్లి తేల్చుకొని వచ్చే పనులు చూసుకుంటుంది. 610 00:51:25,752 --> 00:51:26,795 పార్కర్. 611 00:51:29,006 --> 00:51:31,091 కాబట్టి మీరు లీసా కార్టర్ ని తీసుకురావాలి. 612 00:51:32,551 --> 00:51:34,928 ఎందుకంటే, మీరు ఇంకో నిమిషం నా సమయం వృథా చేసినా, 613 00:51:35,012 --> 00:51:37,055 నా ఏజెంట్లను ఈ భవనం ముందు పెడతాను, 614 00:51:37,139 --> 00:51:40,142 వాళ్లు వచ్చేపోయేవాళ్ల ఫోటోలు తీస్తారు. 615 00:51:41,351 --> 00:51:44,855 ఇక ప్యాలెస్ కి, అమెరికా ప్రభుత్వానికి మధ్య యుద్ధం నడుస్తోందని 616 00:51:44,938 --> 00:51:49,985 బొంబాయిలోని అధికార యంత్రాంగానికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను. 617 00:51:55,073 --> 00:51:57,910 మంచి కుక్కనే తీసుకువచ్చి బెదిరిస్తున్నావు, కార్లా. 618 00:51:59,828 --> 00:52:01,705 అహ్మద్, క్రిస్టీనా గురించే ఇదంతా చేస్తున్నావా? 619 00:52:03,332 --> 00:52:07,586 నువ్వెంత చేసినా, వాళ్లు ఇప్పుడు లేరనేది నిజం. 620 00:52:13,008 --> 00:52:17,429 నేను ఇక్కడి నుండి ఉత్త చేతులతో వెళ్తే, ఆ తర్వాత పరిణామాలు నా చేయి దాటిపోతాయి. 621 00:52:29,608 --> 00:52:30,859 సరే. 622 00:52:31,818 --> 00:52:34,863 మీ ఇష్టప్రకారమే కానివ్వండి, మిస్టర్ పార్కర్. 623 00:52:34,947 --> 00:52:36,615 లీసాని తీసుకెళ్లండి. 624 00:52:37,616 --> 00:52:42,120 కార్లా మీకు ఏం చెప్పి ఇక్కడికి తీసుకువచ్చిందో, అది నెరవేరుస్తుందన్నది అనుమానమే. 625 00:53:07,271 --> 00:53:08,689 తను నిజంగానే నన్ను వదిలేస్తోందా? 626 00:53:09,439 --> 00:53:12,651 మిస్టర్ పార్కర్, ఇంకా మేడమ్ జూ ఒక అంగీకారానికి వచ్చారు. 627 00:53:14,820 --> 00:53:16,905 అయితే మిస్టర్ పార్కర్ కి నేను ధన్యవాదాలు చెప్పాలి. 628 00:53:18,866 --> 00:53:21,410 తను మనస్సు మార్చుకోక ముందే ఇక్కడి నుండి వెళ్లిపోదాం. 629 00:53:30,252 --> 00:53:32,921 తనపై అలా మీదమీదకి వెళ్లిపోయావేంటి? 630 00:53:33,005 --> 00:53:34,673 తను బయటపడటమే కదా నీకు కావాల్సింది! 631 00:53:34,756 --> 00:53:36,383 తనని నేను వదిలేసి రాలేను. 632 00:53:47,477 --> 00:53:48,812 నాకు డ్రగ్స్ కావాలి, కార్లా. 633 00:53:49,521 --> 00:53:51,899 నాకు అక్కడ ఉండాలని ఉందని చెప్తేనే జూ నాకు డ్రగ్స్ ఇస్తానంది. 634 00:53:52,482 --> 00:53:55,027 కానీ నా సందేశం అందగానే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేస్తావని నాకు తెలుసు. 635 00:53:55,569 --> 00:53:56,570 ఇలా వచ్చి కూర్చో. 636 00:54:03,076 --> 00:54:04,369 నేను సిద్ధంగా ఉన్నాను. 637 00:54:05,078 --> 00:54:06,205 డ్రగ్స్ ని మానేస్తాను. 638 00:54:06,955 --> 00:54:08,415 కానీ ఒకేసారి మానేస్తే అది ప్రమాదకరం కదా. 639 00:54:10,501 --> 00:54:13,378 లీసా. నాకు పేరు చెప్పు. 640 00:54:16,507 --> 00:54:17,966 నాకు పేరు చెప్పు. 641 00:54:28,227 --> 00:54:29,311 రుజూల్. 642 00:54:30,312 --> 00:54:31,980 నేను రుజూల్ ఆడేకర్ ని చూశాను. 643 00:54:38,487 --> 00:54:39,821 అంతా సర్దుకుంటుందిలే. 644 00:55:03,971 --> 00:55:04,972 ఆగు! 645 00:55:07,683 --> 00:55:10,143 లిన్, ఆగు! ఆగు! 646 00:55:11,395 --> 00:55:12,396 దయచేసి మాట విను. 647 00:55:12,479 --> 00:55:14,606 ఎందుకు? మేడమ్ జూ గురించి, ఇంకా తనకీ, నీకు మధ్య ఉన్న గొడవ గురించి 648 00:55:14,690 --> 00:55:16,650 ఇంకా సొల్లు కొడదామనా? 649 00:55:16,733 --> 00:55:19,236 ఆ చనిపోయిన వ్యక్తి, అహ్మద్ పేరు తన నోటి వెంట రావడం నేను విన్నాను, 650 00:55:20,904 --> 00:55:22,447 అతని సూటే కదా అప్పుడు నేను వేసుకొని ఉంది. 651 00:55:24,658 --> 00:55:27,870 -నేను దీనికి ఒప్పుకుంది, తనకి డ్రగ్స్ ఇవ్వడానికి కాదు. -చాలా ఉంది, నీకు కావాలంటే తీసుకో. 652 00:55:30,747 --> 00:55:31,748 మాట్లాడకు నువ్వు అసలు. 653 00:55:34,877 --> 00:55:36,545 లోపల లీసా అన్న మాటలను నేను విన్నాను. 654 00:55:37,796 --> 00:55:40,632 తన చేత ఒకరి పేరు చెప్పించుకోవడానికే నువ్వు తనని విడిపించావు. 655 00:55:42,050 --> 00:55:43,719 తనని ఏదో కాపాడేద్దామని కాదు. 656 00:55:43,802 --> 00:55:48,056 మరి నువ్వు వీరుడిలా ముందుకు వచ్చావు కదా, అంత అపరాధ భావం నీలో ఎందుకు ఉందంటావు? 657 00:55:54,897 --> 00:55:58,108 అయితే, నేను ఏం చెప్తే ఒప్పుకుంటానో తెలిసే, నాకు ఆ సోదంతా చెప్పావా? 658 00:55:58,901 --> 00:56:00,319 మనందరికీ రహస్యాలు ఉన్నాయి, లిన్. 659 00:56:01,028 --> 00:56:03,780 నీ రహస్యాలేంటో తెలుసుకోవాలని నాకు లేదు, ఎందుకంటే నీకు నావి చెప్పాలనే ఉద్దేశం నాకు లేదు. 660 00:56:05,073 --> 00:56:08,243 కానీ నువ్వు అన్నది నిజమే. నా స్వార్థం కోసమే నేను లీసాని విడిపించాను. 661 00:56:08,869 --> 00:56:11,038 కానీ ఎంతైనా, నువ్వు చేసిన మంచి, మంచి కాకుండా పోదు కదా. 662 00:56:12,289 --> 00:56:13,582 ఆ రెంటికీ తేడా ఉంది, అది గుర్తించు. 663 00:56:17,044 --> 00:56:18,795 నీకు కావలసింది దొరుకుతుందనే ఆశిస్తున్నా. 664 00:57:11,098 --> 00:57:12,474 అబ్బా! 665 00:57:21,275 --> 00:57:24,027 పోలీసులు! పారిపోదాం పదండి! 666 00:57:38,333 --> 00:57:41,962 నన్ను సముద్రం అట్టడుగుకు జారవిడిచేసినట్టుగా ఆ క్షణం నాకు అనిపించింది. 667 00:57:42,462 --> 00:57:44,464 నా చుట్టూ అన్నీ నాశనమైపోతున్నట్టు అనిపించింది. 668 00:57:51,930 --> 00:57:55,392 ఆ క్షణం నాకు తెలీలేదు, ఆ రాత్రి జరిగిన దాని పర్యవసానాలు 669 00:57:55,475 --> 00:57:56,768 భవిష్యత్తులో చవిచూడాల్సి వస్తుందని… 670 00:57:56,852 --> 00:57:59,855 బొంబాయిలో నన్ను మించిన గైడ్ ఎవరూ లేరు. ఇక్కడ నాకు తెలియనిది అంటూ ఏదీ లేదు… 671 00:57:59,938 --> 00:58:02,733 …అవి నా స్నేహితులను, శత్రువులను ప్రభావితం చేసి… 672 00:58:12,284 --> 00:58:15,162 వారి జీవితాలను శాశ్వతంగా మార్చేస్తాయని ఊహించలేదు. 673 00:58:37,601 --> 00:58:39,520 గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ రచించిన "షాంతారాం" అనే నవల ఆధారంగా రూపొందింది 674 00:59:59,600 --> 01:00:01,602 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్