1 00:00:19,478 --> 00:00:20,729 లిన్? 2 00:00:20,812 --> 00:00:23,023 అయిదు గంటల నుండీ వాంతులు చేసుకుంటూనే ఉన్నాడు. 3 00:00:23,106 --> 00:00:25,317 ఏం చేయాలో అర్థమే కావట్లేదు. ఆసుపత్రిలోని వాళ్లు అడ్మిట్ చేసుకోవడం లేదు. 4 00:00:25,400 --> 00:00:27,653 మూడు, నాలుగు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకొని, నీళ్లు బాగా తాగితే, 5 00:00:27,736 --> 00:00:30,697 -ఇట్టే బాగైపోతుందని అంటున్నారు. -జితేంద్ర, నా మాటలు వినిపిస్తున్నాయా? 6 00:00:30,781 --> 00:00:32,908 లిన్, ఏమైపోయావు? త్వరగా రా. పార్వతికి… 7 00:00:32,991 --> 00:00:35,619 పార్వతికి తర్వాత అయినా చూడవచ్చు! నా భర్త పరిస్థితిని ఓసారి చూడు. 8 00:00:35,702 --> 00:00:37,746 నీ భర్తకు ఎలా ఉందో, పార్వతికి కూడా అలాగే ఉంది. 9 00:00:37,829 --> 00:00:39,331 ఇక మాట్లాడకు, ప్రభు! 10 00:00:39,414 --> 00:00:41,959 పార్వతి కన్నా ముందే, నేను నా బిడ్డని ఇక్కడి తీసుకొచ్చా. 11 00:00:42,835 --> 00:00:43,669 ప్రభు! 12 00:00:43,752 --> 00:00:46,380 -నా జితేంద్రకి బాగాలేదని కనిపించట్లేదా? -ప్రభు! 13 00:00:48,715 --> 00:00:51,009 ఏం జరుగుతోంది, గురూ? ఇంకా ఎంత మంది ఇలా ఉన్నారు? 14 00:00:51,093 --> 00:00:52,094 అందరికీ ఆరోగ్యం బాగాలేదు. 15 00:00:52,177 --> 00:00:54,721 కానీ పార్వతికి కూడా బాగాలేదు. దయచేసి త్వరగా రా! 16 00:00:54,805 --> 00:00:56,932 సరే. సరే. వస్తాను. నేను వస్తాను. సరేనా? 17 00:00:58,892 --> 00:01:01,770 అందరూ పక్కకు జరగండి. కాస్త గాలి ఆడనివ్వండి. 18 00:01:03,564 --> 00:01:04,940 జితేంద్ర, వెల్లకిలా పడుకో. 19 00:01:35,888 --> 00:01:39,933 ఇది ఇక్కడే ఉండేలా చూసుకోవాలి. 20 00:01:40,851 --> 00:01:41,852 సరేనా? 21 00:01:50,319 --> 00:01:53,197 -మన్నించు. మన్నించు. -ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు? 22 00:01:53,280 --> 00:01:56,825 -ఇంటికి వెళ్లిపో! ఇక్కడే తిరుగుతున్నంత మాత్రాన… -సరే. నాతో రా. 23 00:01:56,909 --> 00:01:58,785 -…తనకేమీ బాగైపోదు. -మన్నించండి. మన్నించండి! 24 00:02:05,083 --> 00:02:07,294 దేవుడు ఎందుకు తనని ఇలా శిక్షిస్తున్నాడు? 25 00:02:07,377 --> 00:02:09,922 "ఆ దరిద్రుడైన ప్రభుకు దూరంగా ఉండు," అని తనని హెచ్చరిస్తున్నాడా? 26 00:02:10,005 --> 00:02:11,215 దేవుడు చెప్పేది అదేనా? 27 00:02:11,298 --> 00:02:13,217 మేము అసలు వాళ్లకి తెలీకుండా వెళ్లుండాల్సింది కాదు. 28 00:02:13,300 --> 00:02:16,136 -ఇదంతా నా వల్లే జరిగింది, లిన్ బాబా. -తనకే కాదు, అందరికి అలాగే ఉంది. 29 00:02:16,220 --> 00:02:18,055 -అందరి విషయంలోనూ నిందించుకుంటావా? -ఇక చాలు. 30 00:02:18,138 --> 00:02:20,015 నువ్వు ఇలా మాట్లాడకు. పైగా నువ్వు వెళ్లిపోతున్నావు కూడా. 31 00:02:20,098 --> 00:02:22,142 -నువ్వు వెళ్లిపోయాక మా గతి ఏంటి? -నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. 32 00:02:22,226 --> 00:02:23,852 పాస్ పోర్ట్ రాలేదనేగా ఉంటున్నావు. 33 00:02:23,936 --> 00:02:26,063 నీ చేతికి అది దక్కాక, ఇక్కడి నుండి చెక్కేస్తావు కదా? 34 00:02:26,146 --> 00:02:28,607 ఏం జరిగినా, తర్వాతి రెండు రోజులు నేను ఎక్కడికీ వెళ్లను. 35 00:02:32,486 --> 00:02:34,112 ఒక్క నిమిషం. తప్పుకోండి. 36 00:02:34,196 --> 00:02:35,572 నాకు అర్థం కావట్లేదు. 37 00:02:35,656 --> 00:02:38,325 -నీళ్లు వేడి చేసుకోవాలి, అది కూడా కష్టమేనా… -ఖాసిమ్. 38 00:02:38,408 --> 00:02:41,245 ఖాసిమ్! ఇది కలరా అని అనిపిస్తోంది. 39 00:02:41,328 --> 00:02:43,205 లక్షణాలు అలాగే ఉన్నాయి, ఇది వ్యాపించే విధానం కూడా అలాగే ఉంది. 40 00:02:43,288 --> 00:02:46,124 అవును. ఇక్కడి నుండి థానే మధ్య ఇలాగే మూడు చోట్ల కలరా వ్యాపిస్తోంది. 41 00:02:46,208 --> 00:02:49,002 నేను చెప్తున్నా కదా, జానీ, అన్నింటి కన్నా ముఖ్యమైనది, ఉప్పు. 42 00:02:49,086 --> 00:02:52,297 -ఉప్పు, బియ్యం. -హేయ్. హేయ్. మనం ఒక ప్లాన్ వేసుకోవాలి. 43 00:02:52,381 --> 00:02:54,383 అందరికీ చికిత్స చేయడానికి సరిపడా సామాగ్రి నా దగ్గర లేదు. 44 00:02:54,466 --> 00:02:56,552 మిస్టర్ లిన్, ఇది మాకేమీ కొత్త కాదు. 45 00:02:56,635 --> 00:02:58,220 ఈ జాబితాని మీ తమ్ముడికి చూపించు. 46 00:02:58,303 --> 00:03:00,722 నీతో సహా, అందరూ ఏమేం పనులు చేయాలో మేము నిర్ణయించాం. 47 00:03:02,015 --> 00:03:03,225 లిన్ బాబా, పద. 48 00:03:03,308 --> 00:03:05,561 అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ముసలి, ముతకతో సహా అందరికీ 49 00:03:05,644 --> 00:03:08,397 వాళ్లు చేయాల్సిందేంటో వివరించడం. 50 00:03:19,950 --> 00:03:22,786 ఓయ్, టిఫిన్ చేద్దాం పద. 51 00:03:23,745 --> 00:03:25,581 ఆకలేస్తోంది. 52 00:03:26,415 --> 00:03:29,751 నేను బెడ్ మీదే టిఫిన్ చేస్తాను. 53 00:03:29,835 --> 00:03:31,503 ఈ బెడ్ అంత పెద్దది కాదు. 54 00:03:32,462 --> 00:03:34,464 నాకు టిఫిన్ కి చాలా తినాలనుంది. 55 00:03:40,846 --> 00:03:45,851 బట్టర్, టోస్ట్, జామ్, దోశ. 56 00:03:46,852 --> 00:03:48,312 చాయ్? కాఫీ? 57 00:03:48,395 --> 00:03:51,648 -బయటే పెట్టేయ్. -వద్దు, ఆగు. అబ్బా. 58 00:04:19,051 --> 00:04:21,928 సునీత బంగారం, లోపలికి వచ్చేయ్. 59 00:04:23,680 --> 00:04:24,932 కంగారుపడకు. 60 00:04:25,015 --> 00:04:28,810 మనిద్దరం కలిసి ఉండగా ఎవరి కంటా పడకూడదని నీకు తెలుసు కదా. 61 00:04:29,394 --> 00:04:31,271 మనం బొంబాయి నుండి చాలా దూరంలో ఉన్నాం. 62 00:04:31,355 --> 00:04:33,690 నువ్వు కానీ, నీ భార్య కానీ ఎలా ఉంటారు అనేది 63 00:04:33,774 --> 00:04:37,486 ఇక్కడున్న వాళ్లు పట్టించుకుంటారు అంటావా, మిస్టర్ పాండే? 64 00:04:38,529 --> 00:04:42,241 సరే. నీకు పిచ్చిపిచ్చిగా మాట్లాడటం నచ్చదు, కదా? 65 00:04:43,158 --> 00:04:46,119 నన్ను నీకు సెక్రటరీగా పెట్టుకో రాదూ. 66 00:04:46,203 --> 00:04:47,454 మనం కెనడాకి మకాం మార్చినప్పుడు. 67 00:04:48,247 --> 00:04:53,001 అయ్యగారి ప్రస్థానం ఇప్పుడే మొదలైంది, అప్పుడే కెనడా అంటూ మాట్లాడుతున్నాడే. 68 00:04:53,919 --> 00:04:59,341 నువ్వు వలీద్ భాయ్ డబ్బు తీసుకున్నావు, ఇక ఎప్పటికీ ఈదేశంలో ఉండిపోవాల్సిందే. 69 00:04:59,424 --> 00:05:02,678 బంగారం, అది చాలా కష్టం. 70 00:05:04,054 --> 00:05:06,723 నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 71 00:05:07,724 --> 00:05:09,142 అది నీకు తెలుసు కదా? 72 00:05:10,310 --> 00:05:11,603 ఇంకాసేపు పండగ చేసుకుందాం కానివ్వు. 73 00:05:20,863 --> 00:05:23,198 సాగర్ వాడ అంతా పనిలో మునిగిపోయింది, 74 00:05:23,282 --> 00:05:25,659 ఎవరూ సాయం చేయరని, వాళ్లకు వాళ్లే చేసుకోవాలని వాళ్లకి తెలుసు. 75 00:05:26,159 --> 00:05:29,079 వాళ్ల దృష్టిలో డాక్టర్ అంటే నేనే. 76 00:05:29,162 --> 00:05:31,957 పరారీలో ఉన్న పారామెడిక్ ని నేను, ఈ పరిస్థితి నా స్థాయికి మించినది. 77 00:05:45,596 --> 00:05:47,681 ఒకటి రత్న ఆంటికీ, ఇంకొకటి లిల్లీకి ఇవ్వు. 78 00:05:47,764 --> 00:05:49,808 రవి, నువ్వు ఒకటి మనూకి, ఇంకొకటి పింకీకి తీసుకుపో. 79 00:05:50,559 --> 00:05:52,519 ఒకటి జీతూకి ఇవ్వు. వెళ్లు, వెళ్లు! 80 00:05:52,603 --> 00:05:54,396 వాళ్లు వీటిని తప్పనిసరిగా తాగాలని చెప్పండి. 81 00:06:05,991 --> 00:06:10,245 ఒకటి, రెండు, మూడు. మిగతావి తీసుకెళ్లండి. త్వరగా, త్వరగా వెళ్లండి! 82 00:06:10,829 --> 00:06:12,789 మళ్లీ ఖాళీ సీసాలని తీసుకురండి. 83 00:06:14,249 --> 00:06:18,462 -ఇది ఎందుకు తిరిగి ఇచ్చావు? త్వరగా వెళ్లు! -ఆ పనికిమాలినోడిని పంపు. 84 00:06:19,046 --> 00:06:21,924 ఇక వదిలేయండిలే, కుమార్ గారూ. 85 00:06:22,007 --> 00:06:24,510 అతను కూడా ఆమె కోసమే బతుకుతున్నాడు. 86 00:06:48,242 --> 00:06:50,160 థ్యాంక్యూ. థ్యాంక్యూ. 87 00:06:55,165 --> 00:06:57,000 హాయ్. నాకు రెండు ఇవ్వరా? 88 00:07:04,091 --> 00:07:07,302 గుడ్లు తెచ్చాను. ఆమ్లెట్ చేద్దామని తెచ్చా. 89 00:07:07,928 --> 00:07:09,179 కాఫీ చేశావా? 90 00:07:11,348 --> 00:07:13,684 ఇవాళ కూడా మామూలు రోజే అన్నట్టుగా ప్రవర్తిస్తావా? అంతేనా? 91 00:07:14,685 --> 00:07:18,313 సెబాస్టియన్, నీకు ఏదైనా సమస్య ఉంటే, ఆ ముక్క మరీజియోకే చెప్పి ఉండవచ్చు కదా? 92 00:07:18,397 --> 00:07:20,858 నువ్వు "చేయను" అని చెప్పవచ్చు అన్నాను కదా. 93 00:07:20,941 --> 00:07:23,235 ఆ మాట నువ్వు చెప్తావేమో అని చూశా. 94 00:07:25,279 --> 00:07:26,280 నా కోసం. 95 00:07:28,115 --> 00:07:30,534 కానీ నువ్వేం చేశావు? ఏమీ చేయలేదు. 96 00:07:35,205 --> 00:07:36,665 నాకు రహీమ్ గురించి అనవసరం. 97 00:07:36,748 --> 00:07:39,168 కానీ మనలో ఎవరోకరు ఏదోకటి చేయాలి కాబట్టి, ఆ పని నేనే చేస్తున్నాను. 98 00:07:39,251 --> 00:07:41,920 నేను అతనితో పడక పంచుకోవడం వల్ల మనం ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్లిపోగలమంటే, 99 00:07:42,004 --> 00:07:43,130 అలాగే కానిద్దాం. 100 00:07:49,219 --> 00:07:50,596 నేను పడుకొనేది నీతో. 101 00:07:52,764 --> 00:07:54,016 నిద్ర లేచేది నీతో. 102 00:07:55,684 --> 00:07:57,352 టిఫీన్ చేసేది నీతో. 103 00:08:03,192 --> 00:08:05,444 నేను అతడిని ముద్దు కూడా పెట్టను, ఎందుకంటే వేశ్యగా నేనెప్పుడూ ఆ పని చేయను. 104 00:08:06,361 --> 00:08:09,364 వేశ్యగా చేయాల్సింది చేసి పని ముగించుకొని వచ్చేస్తా. 105 00:08:26,381 --> 00:08:27,382 దిగు. 106 00:08:28,300 --> 00:08:31,887 లేకపోతే, ఈ కారు వెనక్కి తిప్పి మళ్లీ నిన్ను ఖండాలాకి ఎత్తుకెళ్లిపోతా. 107 00:08:33,972 --> 00:08:35,057 దిగేయ్. 108 00:09:03,377 --> 00:09:06,421 పది కిలోలా? చాలా పెద్ద ఆర్డరే. 109 00:09:06,505 --> 00:09:10,425 -అంత తెచ్చివ్వలేవా? -ఎవరు ఎవరి కింద పని చేస్తున్నారనే విషయం మర్చిపోకు. 110 00:09:10,509 --> 00:09:11,969 నేను తెచ్చివ్వగలను. 111 00:09:12,052 --> 00:09:14,680 కానీ అంత పెద్ద సరుకు అంటే, అందరి దృష్టి దాని మీద పడే అవకాశం ఉంది. 112 00:09:16,056 --> 00:09:18,141 హెరాయిన్ నీకు ఎక్కడి నుండి వస్తుందో ఎవరెవరికి తెలుసు? 113 00:09:19,017 --> 00:09:20,561 నా భాగస్వామి మొడీనాకి మాత్రమే తెలుసు. 114 00:09:23,605 --> 00:09:26,692 మరి ఆ అమెరికన్ వేశ్య లీసాకి తెలుసా? 115 00:09:27,317 --> 00:09:29,611 తనకి ఏమీ తెలీదు. మొడీనాకి ఆమె మీద కోరిక అంతే. 116 00:09:30,612 --> 00:09:36,326 ఇందులో నా ప్రమేయం ఉందనే విషయం బయటపడితే, పద్మ నీ తుక్కు రేగ్గొడుతుంది, మరీజియో. 117 00:09:36,410 --> 00:09:37,452 అది మర్చిపోకు. 118 00:09:39,621 --> 00:09:42,749 ఖాదర్ భాయ్ కి తెలిసిపోతే, ఆ పని చేయడానికి పద్మ ఉండదుగా. 119 00:09:46,086 --> 00:09:47,629 ఇంతకీ మనం తెచ్చివ్వగలమా, లేదా? 120 00:09:57,806 --> 00:10:00,392 -ఇంకోటి ఉందా? -ఒక్కమాట. 121 00:10:02,436 --> 00:10:06,565 ప్రతీ రెండు నిమిషాలకొకసారి తనకి ఇది రెండు సార్లు తాగించాలి. 122 00:10:37,471 --> 00:10:40,098 సునీత! సునీత, పైకి చూడు! 123 00:10:40,182 --> 00:10:44,436 ఆనందంతో వెలిగిపోతున్నావే! ఎలా జరిగిందేంటి? 124 00:10:59,201 --> 00:11:00,410 తను ఒక వేశ్య. 125 00:11:01,119 --> 00:11:03,038 తనని ఫాలో అయి వేశ్యా వాటిక దాకా వెళ్లా. 126 00:11:03,121 --> 00:11:05,749 ఉంపుడుగత్తే అయినా పర్లేదు కానీ, తక్కువ కుల వేశ్యతో అక్రమ సంబంధం అంటే 127 00:11:05,832 --> 00:11:07,668 మనకి మరింత పట్టు దొరికినట్టే. 128 00:11:07,751 --> 00:11:10,671 ఈ వేశ్య గురించి వలీద్ కి కనుక తెలిస్తే, అప్పటికప్పుడే తనని లేపేస్తాడు. 129 00:11:11,421 --> 00:11:13,924 పాండేకి తన శాఖ పోతే, బొక్క అతనికే కదా. 130 00:11:14,007 --> 00:11:15,509 అబ్దులా అన్నది నిజమే. 131 00:11:15,592 --> 00:11:17,970 పాండేపైకి తనని మనం అస్త్రంగా వాడుకోవాలంటే, తను ఒక సురక్షితమైన చోట ఉండాలి, 132 00:11:18,053 --> 00:11:20,514 ఆ చోటు మన నియంత్రణలో ఉండాలి. 133 00:11:20,597 --> 00:11:22,808 మూడో కంటికి తెలీకుండా మనం ఈ పని చేయాలి. 134 00:11:23,392 --> 00:11:26,311 అనుమానం రాకుండా వేశ్యని కొనుగోలు చేసే వ్యక్తి మనకి కావాలి. 135 00:11:28,355 --> 00:11:30,399 మేడమ్ జూ ఎలాగూ మీకు రుణపడి ఉంది కదా, ఆ రుణం తీర్చుకోమని అడగండి. 136 00:11:30,482 --> 00:11:32,234 ఆ అమ్మాయిని ప్యాలెస్ కి తీసుకొచ్చుకోమని తనకి చెప్పండి. 137 00:11:32,317 --> 00:11:35,070 వద్దు. ఇంకో మార్గం ఏమీ లేదా? 138 00:11:35,153 --> 00:11:37,573 నీకేమైనా మంచి ఐడియా తడితే, చెప్పు. 139 00:11:37,656 --> 00:11:40,617 నేను ఇక్కడికి రాక ముందే మీరు దీని గురించి ఒక మాట అనేసుకున్నారు. 140 00:11:40,701 --> 00:11:42,619 కాబట్టి, నా అభిప్రాయంతో పనేముంది? 141 00:11:43,745 --> 00:11:45,247 అబ్దులా దాని సూచించాడన్నది నిజమే. 142 00:11:45,330 --> 00:11:47,291 కానీ నీతో మళ్లీ దాని గురించి చర్చిస్తున్నాం కదా. 143 00:11:49,376 --> 00:11:53,505 కార్లా, నీ మనస్సాక్షికి నచ్చని పనేమీ మేం చేయం. 144 00:11:57,092 --> 00:11:59,386 -మళ్లీ మనకి నీళ్లు ఎప్పుడు వస్తాయి? -మంగళవారం. 145 00:12:02,681 --> 00:12:04,808 రోగం బారిన పడ్డవారికి అల్లా తోడుగా ఉన్నాడు. 146 00:12:05,767 --> 00:12:09,479 మరి ముప్పై వేల మందికి మరిన్ని నీళ్ల కోసం మూడు రోజులు ఆగేలా చేస్తున్నందుకు అల్లాకి సంతోషమేనా? 147 00:12:09,563 --> 00:12:11,648 కాదు, కానీ నగరంలో పరిస్థితి అలా ఉంది. 148 00:12:12,691 --> 00:12:16,737 మిస్టర్ లిన్. ప్రతీ ఏడాది మేము కలరాతో యుద్ధం చేస్తుంటాము, 149 00:12:16,820 --> 00:12:19,198 మా చేతనైనంత చేసి, కాపాడగలిగినంత మందిని కాపాడుతుంటాం. 150 00:12:19,907 --> 00:12:22,367 కానీ నువ్వు మా చెంత ఉండగా ఇక మాకు డాక్టర్ ఎందుకు దండగ? 151 00:12:22,451 --> 00:12:24,494 నేను అసలైన డాక్టరుని కాదు, ఖాసిమ్ భాయ్. 152 00:12:24,578 --> 00:12:26,747 అయితే? నేను కూడా నిజమైన భాయ్ లాగానే ఉన్నానా? 153 00:12:27,998 --> 00:12:30,959 సర్లే, నువ్వు జుగాడ్ డాక్టరువి. 154 00:12:31,627 --> 00:12:34,671 -మరి సాగర్ వాడలో ఉండేది కూడా జుగాడే కదా? -అసలు జుగాడ్ అంటే ఏంటి? 155 00:12:35,589 --> 00:12:39,676 జుగాడ్ అంటే, ఉన్నవాటినే మెరుగ్గా ఉపయోగించుకోగలగడం. 156 00:12:40,177 --> 00:12:42,930 అది బొంబాయికే పుట్టిన పదం అని చెప్పవచ్చు. ఇక్కడి జీవితానికి సరిగ్గా సరిపోతుంది. 157 00:13:12,417 --> 00:13:15,128 మంచి జరగాలని. అది ఇప్పుడు చాలా అవసరం మనకి. 158 00:13:38,318 --> 00:13:39,903 ఒక్క కారేనా? 159 00:13:41,280 --> 00:13:44,449 అతనికి హెరాయిన్ గురించి తెలిసుంటే చాలా కార్లు వేసుకొని వచ్చుండేవాడు. 160 00:13:48,287 --> 00:13:49,788 ఒకవేళ నన్ను చంపాలనుకుంటే. 161 00:13:58,255 --> 00:14:00,424 వెళ్లి పలకరించుపో. 162 00:14:15,772 --> 00:14:17,399 బాగానే ఉన్నావా, బంగారం? 163 00:14:20,569 --> 00:14:23,780 మనం మరొక దారిని కనుగొనగలం అన్నాను కదా, అది నిజంగానే అన్నాను. 164 00:14:23,864 --> 00:14:28,035 మన సంభాషణని గుర్తు తెచ్చుకో. నేరంలో పాపం భాగం మరీ ఎక్కువ ఉంటే… 165 00:14:31,079 --> 00:14:32,497 పని కానిచ్చేద్దాం పదండి. 166 00:14:42,633 --> 00:14:47,846 అయితే, ఈ అమ్మాయిని తీసుకొని, మంచి గది ఇచ్చి, మంచి ఆహారం ఇవ్వమని నన్ను అడుగుతున్నారా? 167 00:14:47,930 --> 00:14:49,223 ఖర్చంతా మీరే భరిస్తానంటున్నారా? 168 00:14:49,306 --> 00:14:51,975 ఈ పని చేస్తే, నువ్వు నా రుణం తీర్చుకున్నదానివి అయిపోతావు. 169 00:14:52,059 --> 00:14:54,978 నీ ప్రాణం కోసం ఈ చిన్న పని చేయలేవా, ఏమంటావు? 170 00:14:59,942 --> 00:15:03,612 సరే కానీ, మీరు నాకు చెప్పకుండా ఉంటున్న విషయం ఏంటి, ఖాదర్ భాయ్? 171 00:15:03,695 --> 00:15:06,156 ఈ వేశ్య గురించి? 172 00:15:06,949 --> 00:15:09,117 నీకు తెలియాల్సింది చెప్పేశా. 173 00:15:10,118 --> 00:15:12,746 కానీ మీకు, తనకి లింక్ ఉందని ఎవరికీ తెలీకూడదు, 174 00:15:12,829 --> 00:15:15,374 అలాగే తను ఒకచోటి నుండి ఇంకో చోటుకు ఎందుకు వెళ్తుందో ఎవరూ అడగకూడదు, అంతేగా? 175 00:15:15,457 --> 00:15:18,293 మగాడి కోరికలకు తగ్గట్టుగా వేశ్యలను సరఫరా చేస్తావని నీకు మంచి పేరే ఉంది కదా. 176 00:15:18,377 --> 00:15:20,838 అంటే, కామాతిపుర నుండి అప్పుడప్పుడూ వేశ్యలనూ తీసుకుంటూ ఉంటావేమో కదా? 177 00:15:22,005 --> 00:15:25,425 బొంబాయిలోని వేశ్యల గురించి నీకు బాగానే తెలిసినట్టుందే. 178 00:15:26,552 --> 00:15:29,388 అసలు నీకు ఇక్కడ ఏం పనో చెప్పగలవా? 179 00:15:29,471 --> 00:15:32,057 నువ్వు ఈ పని చేయగలవా, లేదా? 180 00:15:33,892 --> 00:15:34,893 తప్పకుండా. 181 00:15:36,144 --> 00:15:40,440 కానీ కామాతిపురలో మంది ఉంటారు కానీ పస ఉండదు అని పేరు ఉంది. 182 00:15:40,524 --> 00:15:43,694 అక్కడి అమ్మాయిలను… తక్కువగా చూస్తారు. 183 00:15:44,736 --> 00:15:46,947 మీ ఉద్దేశం ఎవరికీ తెలీకూడదంటే, 184 00:15:47,030 --> 00:15:49,950 అక్కడి వేశ్యలను మనం చాలా మందిని కొంటే మేలనిపిస్తోంది. 185 00:15:50,033 --> 00:15:52,035 అప్పుడు తక్కువ మంది తక్కువ ప్రశ్నలు అడుగుతారు. 186 00:15:52,828 --> 00:15:54,830 సరే. నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయ్. 187 00:15:56,540 --> 00:15:57,541 పద్మ. 188 00:16:04,256 --> 00:16:07,050 పని సక్రమంగా జరుగుతుందని నిర్ధారించుకోవడానికి కార్లా ఇక్కడే ఉంటుంది. 189 00:16:08,093 --> 00:16:09,303 తను ఏం చెప్పినా, నేను చెప్పినట్టే. 190 00:16:09,386 --> 00:16:11,889 అలా ఎప్పట్నుంచీ నడుస్తోంది? 191 00:16:18,145 --> 00:16:20,105 దాని వల్ల నీకేమైనా సమస్యనా? 192 00:16:22,065 --> 00:16:23,233 అస్సలు కాదు. 193 00:17:06,359 --> 00:17:09,363 సెబాస్టియన్, ఇక నువ్వు వెళ్ళు. ప్లీజ్. 194 00:17:11,323 --> 00:17:14,910 నేను కిందే ఉంటా. నీ పని అయ్యేదాకా అక్కడే ఉంటా. 195 00:17:26,588 --> 00:17:28,089 గుడ్ ఈవినింగ్. 196 00:17:42,604 --> 00:17:44,940 నీ కోసమే వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నా. 197 00:17:48,944 --> 00:17:51,321 ఆ ఎదురు చూపు ఫలించింది అనుకో. 198 00:17:54,283 --> 00:17:57,244 డ్రింక్ కానీ షాంపేన్ కానీ తీసుకురానా? 199 00:18:02,583 --> 00:18:03,959 బట్టలు విప్పేయ్. 200 00:18:17,931 --> 00:18:18,932 జీతూ. 201 00:18:19,474 --> 00:18:22,561 జీతూ, జీతూ! జీతూ? జీతు! 202 00:18:25,689 --> 00:18:27,816 నన్ను చూడనివ్వు. నన్ను చూడనివ్వు, రత్న. 203 00:18:48,962 --> 00:18:50,714 జీతూ. జీతూ! 204 00:19:51,358 --> 00:19:53,068 అది డా హంగ్ పావో టీ. 205 00:19:54,236 --> 00:19:56,905 నాకు అత్యంత కావలసిన అతిథులకు అత్యుత్తమైన దాన్నే అందిస్తాం. 206 00:19:57,614 --> 00:19:59,741 నీ క్లయింట్స్ టీ గురించి పట్టించుకుంటారని నిజంగానే అనుకుంటున్నావా? 207 00:20:00,701 --> 00:20:03,453 వాళ్లు తాగినా, తాగకపోయినా దానికి డబ్బులైతే వసూలు చేస్తాం. 208 00:20:05,080 --> 00:20:06,582 నేను ఇక్కడ దేన్ని అమ్ముతానని అనుకుంటున్నావు? 209 00:20:08,625 --> 00:20:10,502 శృంగారమేలే… 210 00:20:13,714 --> 00:20:15,841 కానీ దానికి తోడు ఒక మర్మమైన లోకాన్ని, 211 00:20:15,924 --> 00:20:17,217 అద్వితీయమైన సుఖాన్ని, 212 00:20:18,302 --> 00:20:21,263 అందరికీ అందని అమృతాన్ని ఇక్కడ అందిస్తాం. 213 00:20:23,640 --> 00:20:25,517 నిర్దిష్ట పద్ధతిలో శిక్షణ ఇవ్వబడిన నిర్దిష్ట అమ్మాయి 214 00:20:25,601 --> 00:20:31,440 అందించే సుఖాన్ని పొందడం కోసం మగాళ్లు ఎక్కడెక్కడ నుండో వస్తారు. 215 00:20:33,692 --> 00:20:37,696 అందుకే అమ్మాయిలు నాకు నచ్చినప్పుడు బయటకు పోతానంటే, నేను పంపించలేను. 216 00:20:38,697 --> 00:20:42,159 ఖాదర్ ఎలాగైతే రుజూల్ విషయంలో సమయాన్ని, వనరులను వెచ్చించాడో, 217 00:20:42,951 --> 00:20:45,996 నేను కుడా అలాగే వీళ్ళపై అవి వెచ్చిస్తున్నాను. 218 00:20:46,079 --> 00:20:47,080 రుజూల్ కన్నా నువ్వే మంచి ఉదాహరణ. 219 00:20:47,164 --> 00:20:49,583 నువ్వు చేసే పనులను నా ముందు నువ్వేమీ సమర్థించుకోనక్కర్లేదు. 220 00:20:50,709 --> 00:20:53,003 నిజమే. ఆ అవసరం నాకు లేదు. 221 00:20:54,838 --> 00:20:57,007 రుజూల్ గురించి ఖాదర్ కి చెప్పింది నువ్వే. 222 00:20:58,258 --> 00:21:01,261 లీసా నీకు చెప్పింది, నువ్వు ఖాదర్ కి చెప్పేశావు. 223 00:21:01,345 --> 00:21:02,346 అవును. 224 00:21:05,265 --> 00:21:07,351 నీ గురించి తెలీనట్టు అతను నటించాడు. 225 00:21:08,810 --> 00:21:12,105 నటనలో అతను బాగా ఆరితేరిన మనిషి. నేను కూడా అతడిని నమ్మేశాను. 226 00:21:14,066 --> 00:21:16,527 నీకు ఏ అబద్ధాలు చెప్తున్నాడో ఏమోలే. 227 00:21:18,779 --> 00:21:21,198 నా ప్రాణాన్ని తీసుకొని పోయి అతని చేతుల్లో పెట్టావు. 228 00:21:21,782 --> 00:21:23,450 నీ కాలు పట్టుకొని క్షమించమని అడగాలా ఏంటి? 229 00:21:27,120 --> 00:21:30,582 నువ్వు చేసిన పనే, నేను చేసినందుకు నువ్వు నాపై పగను పెంచుకున్నావు. 230 00:21:30,666 --> 00:21:33,460 -మోసాన్ని శిక్షించినందుకు. -రుజూల్ ని నేనేం చంపలేదు. 231 00:21:37,047 --> 00:21:40,008 నీ పాత మిత్రుడు అహ్మద్ ని చంపంది కూడా నేను కాదు. 232 00:21:40,092 --> 00:21:41,218 నేనే నేరుగా చంపలేదు. 233 00:21:43,428 --> 00:21:45,264 కానివ్వు. తాగు. 234 00:21:46,390 --> 00:21:49,935 నువ్వు టీని తాగుతూ కూడా నన్ను అసహ్యించుకోవచ్చు. 235 00:22:00,445 --> 00:22:04,241 భయంకరమైన బాధని, భయాన్ని, ఆ నిస్సహాయ స్థితిని నేను తాళలేకపోయాను. 236 00:22:05,242 --> 00:22:07,995 సిగ్గు, బాధ నన్ను కమ్మేస్తున్నాయి. 237 00:22:08,662 --> 00:22:09,788 ఉన్నవాటితోనే సర్దుకుపోవడమనేది చాలదు… 238 00:22:09,872 --> 00:22:11,582 -లిన్! -…అది ఎప్పటికీ చాలనే చాలదు. 239 00:22:11,665 --> 00:22:14,835 లిన్, పార్వతి ఆరోగ్యం మెరుగవ్వట్లేదు. దయచేసి, వచ్చి ఏదోకటి చేయ్. 240 00:22:14,918 --> 00:22:17,671 -తనని కాపాడతావని నాకు మాటివ్వవా… -జితేంద్రని నేనేమైనా కాపాడానా? 241 00:22:18,755 --> 00:22:20,174 లక్ష్మీని నేనేమైనా కాపాడానా? 242 00:22:21,258 --> 00:22:24,011 -మరి పార్వతిని ఎలా కాపాడగలనని అనుకుంటున్నావు? -కనీసం ప్రయత్నమైనా చేయ్. పద. 243 00:22:24,720 --> 00:22:27,181 నువ్వు చేయలేనిది నేను ఎలా చేయగలను అనుకుంటున్నావు? 244 00:22:28,307 --> 00:22:30,100 హేయ్, నీకు కళ్లు కనబడట్లేదా ఏంటి? 245 00:22:30,184 --> 00:22:34,521 నన్ను చూడు, అలాగే నిన్ను నువ్వు చూసుకో. నేనిలా ఉన్నందుకు ఏమేం చేయలేనో, 246 00:22:34,605 --> 00:22:36,732 నువ్వు ఇలా ఉన్నందుకు ఏమేం చేయగలవో ఒకసారి గమనించు. 247 00:22:41,653 --> 00:22:42,654 లిన్? 248 00:22:58,170 --> 00:23:00,047 నువ్వు ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తావు! 249 00:23:00,130 --> 00:23:01,840 ఎక్కడికి వెళ్తున్నావు, మిస్టర్ లిన్? 250 00:23:07,054 --> 00:23:10,599 ఉండి లాభం ఏంటి, ఖాసిమ్? మనకి కావాల్సింది నిజమైన సాయం. 251 00:23:11,850 --> 00:23:13,268 ఎవరూ రారు. 252 00:23:13,352 --> 00:23:14,770 ఇంకా ఆ విషయం నీకు తెలీలేదా? 253 00:23:14,853 --> 00:23:17,606 హా, నీలి చేతి ముద్రలు వేసినంత మాత్రాన అంతా బాగైపోదని మాత్రం తెలుసుకున్నాను. 254 00:23:17,689 --> 00:23:19,107 నన్ను మన్నించండి. నేనిదంతా చేయలేను… 255 00:23:21,109 --> 00:23:22,778 నేను ఇది చేయలేను. 256 00:23:22,861 --> 00:23:25,697 లేదు, మిస్టర్ లిన్. నీ విషయంలో మన్నించమని నేనే అడగాలి. 257 00:23:44,091 --> 00:23:45,425 నాణ్యత బాగుంది. 258 00:23:47,094 --> 00:23:49,263 ఇంట్లో చేసినవి, పద్మ గారు. 259 00:23:49,346 --> 00:23:53,016 వీటిని మా ఖుషీ బంగారమే మా వంట గదిలో చేసింది, 260 00:23:53,559 --> 00:23:55,811 వాళ్ల కుటుంబం తరతరాలుగా బేకరీ నడుపుతోంది. 261 00:23:57,229 --> 00:23:58,730 ఇంకోటి తీసుకోండి. 262 00:23:58,814 --> 00:24:00,816 నేను నాజూగ్గా ఉండాలి కదా. 263 00:24:02,568 --> 00:24:06,446 మీ లాంటి వాళ్లు, మా అమ్మాయిలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకోవడం… 264 00:24:08,073 --> 00:24:10,284 మా పూర్వ జన్మ సుకృతం అనవచ్చు. 265 00:24:22,296 --> 00:24:24,673 ఇంకా ఆ బేకర్. 266 00:24:28,510 --> 00:24:30,971 మీ భవిష్యత్తు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది. 267 00:24:35,601 --> 00:24:39,188 లేదు. నాకు వెళ్లాలని లేదు. 268 00:24:39,271 --> 00:24:40,939 చెప్పినట్టు చేయ్. 269 00:24:41,565 --> 00:24:44,693 ఆమె ఇచ్చే డబ్బుల కన్నా నువ్వు ఎక్కువ ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా? 270 00:24:44,776 --> 00:24:47,696 అలాంటప్పుడు చెప్పింది చేయ్. 271 00:25:00,626 --> 00:25:04,213 రేనాల్డోస్ కెఫే 272 00:25:05,130 --> 00:25:07,132 హమ్మద్! హాయ్! 273 00:25:09,384 --> 00:25:10,385 చాన్, ఎలా ఉన్నావు? 274 00:25:11,762 --> 00:25:13,430 నీ స్నేహితులని నాకు పరిచయం చేస్తావా లేదా? 275 00:25:15,849 --> 00:25:18,185 -నువ్వు కూడా. -సరే, నేను టచ్ లో ఉంటాను. సరే. 276 00:25:18,268 --> 00:25:19,269 ఇప్పుడే వస్తాను. 277 00:25:23,857 --> 00:25:25,192 నీ పేరు మరీజియో కదా? 278 00:25:26,443 --> 00:25:28,820 నేనెవరో తెలుసా? ఎవరి దగ్గర పని చేస్తానో తెలుసా? 279 00:25:31,490 --> 00:25:34,159 నీ హెరాయిన్ దందా ఇప్పటితో ఆగిపోవాలి, మరీజియో. 280 00:25:34,910 --> 00:25:37,329 -నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు… -సొల్లు వద్దు. నాకు తెలుసు. 281 00:25:40,249 --> 00:25:42,668 నీ వల్ల జనాల జీవితాలు నాశనమవ్వడం ఒకరికి ఇష్టం లేదు. 282 00:25:43,752 --> 00:25:46,255 నిన్ను చంపే పని స్వయంగా నేనే చేస్తా, 283 00:25:46,338 --> 00:25:49,883 కానీ ఇప్పుడు నాకు అస్సలు తీరికే లేదు. కాబట్టి నువ్వు నాకు ఇంకో పని కల్పించకు. 284 00:25:52,261 --> 00:25:54,221 ఇదే నీకు దక్కే ఆఖరి అవకాశం. అర్థమైందా? 285 00:25:55,389 --> 00:25:56,890 ఆ అవకాశం ఇంతటితో ముగిసింది అనుకో. 286 00:25:57,891 --> 00:25:59,142 దందాని వెంటనే ఆపేయ్. 287 00:26:05,482 --> 00:26:06,817 ముందు అమ్మాయిలు. 288 00:26:06,900 --> 00:26:07,985 నాకు వద్దులే. 289 00:26:09,069 --> 00:26:10,404 నీకు ఇది అక్కర్లేదులే. 290 00:26:12,614 --> 00:26:14,241 నువ్వు బెబ్బులివి. 291 00:26:14,950 --> 00:26:16,326 నువ్వు కూడా తక్కువేం కాదులే. 292 00:26:19,162 --> 00:26:20,706 ఎక్కడికి వెళ్తున్నావు? 293 00:26:20,789 --> 00:26:22,124 ఇంటికి. 294 00:26:22,207 --> 00:26:24,459 లేదు, లేదు, లేదు. 295 00:26:27,171 --> 00:26:29,089 నీతో ఒకరాత్రి గడపాలని అన్నాను. 296 00:26:33,719 --> 00:26:35,554 ఆ హెరాయిన్ ని నేను కొనాలంటే, 297 00:26:37,306 --> 00:26:41,185 నేనేం చెప్తే అది చేయ్, నాకెంత సేపు కావాలంటే అంత సేపు చేయ్. 298 00:26:53,322 --> 00:26:54,907 ఉదయం దాకా ఉంటానంతే. 299 00:27:38,283 --> 00:27:39,535 అంతే. 300 00:27:58,887 --> 00:28:00,806 ఇంత పొద్దుపోయాక కూడా నన్ను కలవడానికి వచ్చినందుకు థ్యాంక్స్. 301 00:28:16,989 --> 00:28:19,074 చివరిసారి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు, 302 00:28:19,157 --> 00:28:23,036 సాగర్ వాడలో కొన్ని నియమాలు ఉన్నాయని, వాటికి నువ్వు కట్టుబడి ఉండాలని అన్నావు. 303 00:28:28,542 --> 00:28:31,086 ఖాసిమ్ మనం దీని నుండి బయటపడతాం, 304 00:28:32,129 --> 00:28:33,589 ఇది మాకు కొత్తేం కాదు అని చెప్తూనే ఉన్నాడు. 305 00:28:35,757 --> 00:28:37,301 కానీ పోయిన ప్రాణాలు ఆ మాట అనలేవుగా. 306 00:28:40,095 --> 00:28:42,556 నా పొరుగువారికి శుభ్రమైన నీరు కావాలి. 307 00:28:42,639 --> 00:28:45,309 ఇతర మందులు కూడా కావాలి, కానీ అన్నింటికన్నా ముందు, శుభ్రమైన నీరు కావాలి. 308 00:28:46,101 --> 00:28:48,896 నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, మరి ఖాసిమ్ భాయ్ ఏమంటున్నాడు? 309 00:28:50,189 --> 00:28:51,315 అతనికి తెలీదు. 310 00:28:52,733 --> 00:28:54,568 అయితే, నువ్వు నియమాలను అతిక్రమించేశావు అన్నమాట. 311 00:28:56,528 --> 00:28:58,530 -నాకు మరో దారి లేదు. -ఎందుకు లేదు! 312 00:28:59,615 --> 00:29:02,951 నువ్వు ఇక్కడికి దూరంగా వెళ్లిపోవచ్చు. అలాంటప్పుడు ఇంకా ఇక్కడే ఎందుకు ఉండటం? 313 00:29:08,665 --> 00:29:11,293 వాళ్లు నేను ఎంత గొప్పవాడినని అనుకుంటున్నారో, నాకు అంత గొప్పవాడిగా ఉండాలనుంది, 314 00:29:11,376 --> 00:29:12,961 నా గురించి నేను అనుకుంటున్న వాడిలా కాదు. 315 00:29:14,880 --> 00:29:17,132 మరి అలా ఉండాలనుకున్నప్పుడు వాళ్ల చావుకు వాళ్లని వదిలేసి ఎలా వెళ్లను! 316 00:29:21,011 --> 00:29:22,471 ఒకానొకప్పుడు, 317 00:29:22,554 --> 00:29:25,891 ఈ గడ్డ మీద నివసించిన మనుషులు ఒక విషయాన్ని నమ్మేవారు, నీటి దానం చేసిన వ్యక్తులకు 318 00:29:26,767 --> 00:29:28,977 జీవితంలో సంపూర్ణ సంతృప్తి లభిస్తుందని. 319 00:29:33,190 --> 00:29:35,442 నీరు జీవనాధారం. 320 00:29:36,777 --> 00:29:39,613 భారతదేశంలోని అత్యధిక శాతం మంది, ఇతరులకు గ్లాసుడు నీళ్లు ఖచ్చితంగా ఇస్తారు, 321 00:29:40,489 --> 00:29:42,950 వారు పగవాడైనా సరే, పరిచయం లేని వాడైనా సరే. 322 00:29:44,284 --> 00:29:48,288 దాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నాకు మరో దారి ఏమైనా ఉందంటావా? 323 00:29:53,043 --> 00:29:54,253 దీని ద్వారా మీరు ఏ ప్రయోజనం ఆశిస్తున్నారు? 324 00:29:57,631 --> 00:30:00,884 మనందరం కూడా మనలోని చెడును మంచి పనులు చేసి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయాలి, లిన్. 325 00:30:02,594 --> 00:30:04,263 నా దగ్గర సాయపడే వీలు ఉన్నప్పుడు, 326 00:30:04,888 --> 00:30:07,224 సాయం అందించకపోతే, నన్ను మనిషని అంటారా? 327 00:30:10,435 --> 00:30:13,939 నేను చేసిన సాయం రహస్యంగా ఉండకూడదు. 328 00:30:14,022 --> 00:30:15,148 అది బాగా అర్థం చేసుకో. 329 00:30:17,025 --> 00:30:20,028 అక్కడ జీవించే ప్రతిఒక్కరి తరఫున నువ్వు ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నావు, 330 00:30:20,112 --> 00:30:23,282 కాబట్టి అక్కడున్న ప్రతిఒక్కరూ దాన్ని అంగీకరించాలి. 331 00:30:25,492 --> 00:30:26,618 వాళ్లు అంగీకరిస్తారంటావా? 332 00:30:32,875 --> 00:30:34,710 ఎప్పట్నుంచీ అతనితో కలిసి పని చేస్తున్నావు? 333 00:30:35,294 --> 00:30:36,879 నీ ఖాదర్ భాయ్ తో. 334 00:30:40,424 --> 00:30:41,550 మీరిద్దరూ ప్రేమికులా? 335 00:30:42,426 --> 00:30:43,427 కాదు. 336 00:30:44,511 --> 00:30:46,305 అతను నిన్ను నమ్ముతున్నాడు. అది స్పష్టంగా తెలిసిపోతోంది. 337 00:30:47,389 --> 00:30:48,724 నువ్వు విధేయురాలివని భావిస్తున్నాడు. 338 00:30:48,807 --> 00:30:49,808 నేను విధేయురాలినే. 339 00:30:53,228 --> 00:30:58,233 విధేయత అనేది ప్రేమ ఉన్నప్పుడు కానీ, భయం ఉన్నప్పుడు కానీ, రుణం ఉన్నప్పుడు కానీ ఉంటుంది. 340 00:30:59,151 --> 00:31:02,321 ఖాదర్ భాయ్ పై నీకు ప్రేమ లేదంటే, అతనంటే నీకు భయముందా, లేదా అతనికి రుణపడి ఉన్నావా? 341 00:31:02,404 --> 00:31:04,114 నీ విషయంలో పద్మకి కూడా ఉండేది అదేనా? 342 00:31:08,452 --> 00:31:13,498 పద్మ నా దగ్గర ఎప్పట్నుంచో ఉంది, కాబట్టి తను ఆ మూడు కారణాలనూ చెప్పెస్తోంది. 343 00:31:15,792 --> 00:31:20,297 లేదు, లేదు. నా కోసం పద్మ తన ప్రాణాన్నే ఇచ్చేస్తుంది. 344 00:31:21,173 --> 00:31:23,091 విధేయత అనేది పరస్పరంగా ఉండాలి. 345 00:31:25,802 --> 00:31:26,803 నిజంగానా? 346 00:31:33,060 --> 00:31:34,061 వచ్చినట్టున్నారు. 347 00:31:55,332 --> 00:31:56,583 తనే అయ్యుంటుంది. 348 00:32:00,504 --> 00:32:03,131 తనకి చెప్పింది దీని గురించి కాదని తనకి తెలుసు. 349 00:32:04,299 --> 00:32:07,261 తను ఎంత భయపడిపోతోందో చూడు. 350 00:32:13,433 --> 00:32:15,310 నువ్వు నా కన్నా మంచి దానివి అనుకుంటున్నావా? 351 00:32:17,604 --> 00:32:21,316 మనిద్దరి మధ్య ఉన్న ఏకైక తేడా ఏంటంటే, నేను ఎవరి కిందా పని చేయట్లేదు. 352 00:32:22,317 --> 00:32:24,152 ఒక మగాడి కింద అయితే అస్సలు కాదు. 353 00:32:30,659 --> 00:32:32,327 తలుపు తెరవండి! 354 00:32:34,162 --> 00:32:35,330 దయచేసి తెరవండి! 355 00:32:36,498 --> 00:32:37,499 తెరవండి! 356 00:32:39,918 --> 00:32:41,837 తలుపు తెరవండి! 357 00:32:42,421 --> 00:32:44,423 నాకు ఇక్కడ ఉండాలని లేదు! 358 00:32:45,090 --> 00:32:46,175 దయచేసి నన్ను వదిలేయండి! 359 00:33:11,783 --> 00:33:12,910 హేయ్, లిన్ బాబా. 360 00:33:20,751 --> 00:33:23,003 ఆ తర్వాత నువ్వు అసలైన భాగాన్ని చూడలేదు. 361 00:33:27,674 --> 00:33:29,885 ఆ తర్వాత హఠాత్తుగా జీపును పక్క నుండి ట్రక్కు గుద్దేస్తుంది, 362 00:33:29,968 --> 00:33:34,556 దానితో అది కొండ మీద నుండి దొర్లుకుంటూ కింద పడి ముక్కలు ముక్కలు అయిపోతుంది. 363 00:33:39,770 --> 00:33:42,773 బచ్చన్ అన్నయ్యని చచ్చిపొమ్మని అలా వదిలేసి వెళ్లిపోతారు. 364 00:33:44,650 --> 00:33:51,532 ఆ దుష్టుడు కాళీరామ్, మందు తాగుతూ, అమ్మాయిలతో చిందులు వేస్తూ పండగ చేసుకోవాలనుకుంటాడు. 365 00:33:51,615 --> 00:33:56,662 బుద్వా ఒక గ్రామానికి వెళ్తాడు, అక్కడ వాళ్లెవరికీ తెలీని విషయం జరుగుతోంది, 366 00:33:57,496 --> 00:34:03,335 అందాల రాశి ఫుల్వా, బచ్చన్ అన్నయ్యకి తగిలిన గాయాలకు చికిత్స చేస్తోంది. 367 00:34:03,961 --> 00:34:07,214 నువ్వు ఊహించింది నిజమే, బచ్చన్ అన్నయ్య చనిపోలేదు. 368 00:34:07,297 --> 00:34:09,382 ఎలా చస్తాడు మరి? 369 00:34:10,967 --> 00:34:17,056 కాబట్టి, ఆ రాత్రి కాళీరామ్ తాగుతూ, అమ్మాయిలతో చిందులు వేస్తున్నప్పుడు… 370 00:34:23,813 --> 00:34:26,650 వాళ్ల మధ్య మారువేషంలో ఉన్న ఒక అందమైన యువకుడు కూడా 371 00:34:28,610 --> 00:34:32,406 చిందులు వేస్తూ ఉంటాడు, అతను ఎవరో చెప్పుకో. 372 00:34:44,376 --> 00:34:47,212 ఇంకెవరు మన బచ్చన్ అన్నయ్యే. 373 00:34:48,380 --> 00:34:52,426 ఆ దరిద్రుడు కాళీరామ్ తాగుతూనే ఉన్నాడు, ఆ మత్తులో గుర్తుపట్టలేకపోతాడు. 374 00:34:53,760 --> 00:34:55,219 కాబట్టి, బచ్చన్ అన్నయ్య పాడుతూ ఉంటాడు… 375 00:35:39,973 --> 00:35:40,974 సెబాస్టియన్. 376 00:35:42,643 --> 00:35:43,644 సెబాస్టియన్. 377 00:35:44,561 --> 00:35:45,687 వెళ్దాం పద. 378 00:35:57,407 --> 00:36:01,411 నీళ్లు! నీళ్లు! పదండి! 379 00:36:10,754 --> 00:36:13,131 బిందెలు అక్కర్లేదు! నీళ్ల సీసాలు వచ్చాయి! 380 00:36:40,367 --> 00:36:43,120 ధీబర్ వాటర్ 381 00:36:53,839 --> 00:36:58,886 నేను బొంబాయిలోకి అడుగుపెట్టినప్పుడు, నేను కూడా వీధుల్లోనే తిరుగుతూ గడిపాను. 382 00:36:59,720 --> 00:37:03,515 ఇక్కడి నా మొదటి ఇల్లు, మురికివాడలోని ఒక గుడారం. 383 00:37:03,599 --> 00:37:06,602 మీరు ఇప్పుడున్న నేలపైనా, నేను కూడా ఒకప్పుడు గడిపాను. 384 00:37:08,353 --> 00:37:12,482 కాబట్టి, మీరు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు, నేను మౌనంగా ఎలా ఉండగలను? 385 00:37:15,194 --> 00:37:17,738 ఈ బొంబాయి నగరం మనది. 386 00:37:18,572 --> 00:37:20,991 ఇక్కడ బతుకు సాగించడం చాలా కష్టం. 387 00:37:22,117 --> 00:37:28,415 కానీ, ఒక మెరుగైన జీవనం అందగలదనే ఆశతో మనందరమూ ఇక్కడికి వచ్చాం. 388 00:37:29,958 --> 00:37:30,959 ఎందుకు? 389 00:37:31,960 --> 00:37:36,006 ఎందుకంటే, బొంబాయిలోని అందమైన జీవితం ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. 390 00:37:37,382 --> 00:37:39,384 నేను మీకు సాయపడతాను. 391 00:37:39,968 --> 00:37:43,222 కాబట్టి, నా ఈ స్నేహ హస్తాన్ని మీరు స్వీకరిస్తే, 392 00:37:43,305 --> 00:37:45,140 మీకు మెరుగైన జీవనాన్ని అందించడంలో నేను సాయపడతాను. 393 00:37:45,224 --> 00:37:49,478 మరి, అన్ని స్నేహబంధాలలో ఉన్నట్టుగానే, 394 00:37:49,978 --> 00:37:56,568 మీరు నా పక్షాన నిలవాల్సిన రోజు కూడా తప్పకుండా ఎప్పుడోకప్పుడు వస్తుంది. 395 00:38:17,464 --> 00:38:19,383 ఎక్కడికి వెళ్తున్నారు అందరూ? 396 00:38:21,552 --> 00:38:23,595 -ఒక్కసారి ఆలోచించండి! -థ్యాంక్యూ. థ్యాంక్యూ. 397 00:38:23,679 --> 00:38:24,930 ఎక్కడికి వెళ్తున్నారు? 398 00:38:25,514 --> 00:38:29,852 అతను మన నుండి ఏదో ఆశించే మనతో స్నేహం చేస్తున్నాడు. 399 00:38:35,816 --> 00:38:38,777 నా వల్ల ఖాసిమ్ నాయకుని స్థానం పోయింది, కానీ అది నేను పట్టించుకోలేదు. 400 00:38:39,361 --> 00:38:42,447 నేను వీళ్లందరినీ వదిలేసి మళ్లీ పారిపోయే ముందు, వీళ్లందరూ ఆరోగ్యంగా ఉండేలా చేసి, 401 00:38:42,531 --> 00:38:45,033 నా మనస్సాక్షికి నేను ఏ తప్పూ చేయలేదని సర్దిచెప్పుకోవాలనుకున్నా, అంతే. 402 00:38:49,496 --> 00:38:51,540 వద్దు, ఆగండి. దయచేసి నా మాట వినండి. 403 00:38:51,623 --> 00:38:53,750 వద్దు, వద్దు. మీరు ధన్యవాదాలు చెప్పాల్సింది నాకు కాదు. 404 00:38:54,626 --> 00:38:56,378 ఈ పెద్దమనిషికి. 405 00:39:02,509 --> 00:39:03,802 ఖాదర్ భాయ్! 406 00:39:04,595 --> 00:39:06,096 ఖాదర్ భాయ్! 407 00:39:47,387 --> 00:39:49,223 లిన్, నువ్వు అతని దగ్గరికి ఎందుకు వెళ్లావు? 408 00:39:50,140 --> 00:39:52,726 ఎందుకు? దీని అర్థం ఏంటో నీకు తెలుస్తోందా? 409 00:39:55,020 --> 00:39:58,273 జనాలు చస్తున్నారు, ఖాసిమ్. నేను పరిస్థితిని మెరుగుపరిచానంతే. 410 00:39:59,441 --> 00:40:02,277 ఒకసారి ఆలోచించు. ఉన్నవాటితో సర్దుకుపోవడం వల్ల ఈ స్థితిలో ఒరిగేదేమీ లేదని అంగీకరించు. 411 00:40:10,077 --> 00:40:11,870 వాళ్ల హృదయాల్లో చోటు సంపాదించేశారు. 412 00:40:13,080 --> 00:40:14,289 లిన్ పుణ్యమా అని. 413 00:40:16,291 --> 00:40:17,835 అవును, అది నిజమే. 414 00:40:33,517 --> 00:40:34,518 లిన్! 415 00:40:35,978 --> 00:40:37,396 నువ్వు నా మాట వినలేదు. 416 00:40:38,438 --> 00:40:41,441 "గూండాలకు దూరంగా ఉండు," అని నేను నీకు చెప్తూనే ఉన్నాను. 417 00:40:41,525 --> 00:40:42,651 కానీ నువ్వు పట్టించుకోలేదు. 418 00:40:47,656 --> 00:40:49,449 -లిన్! -ఏంటి? ఏం కావాలి? 419 00:40:55,914 --> 00:40:59,376 థ్యాంక్యూ, లిన్ బాబా. నా మాట పట్టించుకోనందుకు థ్యాంక్స్. 420 00:41:04,339 --> 00:41:06,508 నువ్వు మంచి స్నేహితుడివి, లిన్ బాబా. 421 00:41:07,843 --> 00:41:10,637 మంచి స్నేహితుడివి, మంచి మనిషివి కూడా. 422 00:41:13,348 --> 00:41:16,602 నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావని తప్పుగా అనుకున్నా. పొరపాటు చేశాను. 423 00:41:16,685 --> 00:41:18,687 వెళ్లి పడుకోపో. 424 00:41:19,855 --> 00:41:23,442 సాయంత్రం వచ్చి లేపుతాను, డిడియర్ సర్ దగ్గరికి వెళ్లి నీ పాస్ పోర్ట్ తెచ్చుకుందాం, సరేనా? 425 00:41:25,360 --> 00:41:28,488 నిన్ను ఎంతలా మిస్ అవుతానో తలచుకుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తోంది. 426 00:41:30,032 --> 00:41:31,200 కానీ వెళ్లాల్సిందే కదా? 427 00:41:32,201 --> 00:41:33,202 అవును. 428 00:41:35,996 --> 00:41:38,874 అందుకే, వీడ్కోలు రూపంలో మాకు ఈ కానుక ఇచ్చి వెళ్లిపోతున్నావు, 429 00:41:39,625 --> 00:41:42,586 ఆ దుష్టులెవరో నిన్ను కనిపెట్టేలోపే. 430 00:41:59,311 --> 00:42:00,312 వెళ్లు! 431 00:42:48,777 --> 00:42:52,406 ఆ తర్వాత, కాళీరామ్ మంట ఉన్న కట్టెతో బచ్చన్ అన్నయ్య పైకి దూకుతాడు. 432 00:42:55,993 --> 00:42:57,744 బచ్చన్ అన్నయ్య వాడిని ఒక్క తన్ను తంతాడు. 433 00:42:58,370 --> 00:43:00,664 ఆ కట్టె ఎగురుకుంటూ దూరాన పడిపోతుంది. 434 00:43:01,874 --> 00:43:05,794 కాళీరామ్ ఫుల్వాని పట్టుకొని, ఆమెని బచ్చన్ అన్నయ మీదికి విసురుతాడు… 435 00:43:07,004 --> 00:43:08,463 కిటికి గుండా బయటకు దూకి… 436 00:43:13,427 --> 00:43:15,095 రోప్ ట్రాలీ వద్దకు పరుగెత్తుతున్నాడు. 437 00:43:17,139 --> 00:43:21,894 కానీ, బచ్చన్ అన్నయ్య అతడి వెంట పడుతున్నాడు! 438 00:43:22,811 --> 00:43:25,063 కాళీరాం గూండాల తుక్కు రేగ్గొడతాడు… 439 00:43:29,735 --> 00:43:32,654 ఆ తర్వాత గాల్లోకి ఎగిరి, 440 00:43:32,738 --> 00:43:35,115 ట్రాలీ అడుగు భాగాన్ని పట్టుకోగలుగుతాడు! 441 00:43:37,117 --> 00:43:40,913 కాళీరామ్ అతని చేతులని కాళ్లతో కొడతాడు… 442 00:43:43,707 --> 00:43:47,753 కానీ బచ్చన్ అన్నయ్య వదలకుండా గట్టిగా పట్టేసుకున్నాడు కదా. 443 00:43:47,836 --> 00:43:48,962 ఓయ్, బచ్చన్ బాబూ, 444 00:43:49,046 --> 00:43:53,050 నువ్వు చేసే కోతి పనులు తనకు లోపలి నుండి కనబడవు కదా? 445 00:43:54,343 --> 00:43:57,763 నీ తొక్కలో ఫైటింగ్ లోపలికి వచ్చి చూపించు. రా. 446 00:44:09,650 --> 00:44:12,903 అక్కడే అలా నిలబడకు. లోపలికి గాలి రానివ్వు! 447 00:44:13,487 --> 00:44:14,488 రా. 448 00:45:02,703 --> 00:45:04,663 గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ రచించిన శాంతారాం ఆధారంగా తెరకెక్కించబడింది 449 00:46:24,701 --> 00:46:26,703 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్