1 00:00:10,719 --> 00:00:13,639 రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది! మాకు రేడియేషన్ వద్దు! 2 00:00:13,722 --> 00:00:16,725 రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది! మాకు రేడియేషన్ వద్దు! 3 00:00:16,808 --> 00:00:17,809 ముందుకు రాకండి! 4 00:00:17,893 --> 00:00:18,727 సౌర శక్తిని వినియోగించుకోండి 5 00:00:18,810 --> 00:00:20,020 యురేనియం తవ్వకాలను నిషేధించండి 6 00:00:20,103 --> 00:00:21,730 అస్ట్రేలియాని యురేనియం రహితంగా మార్చండి 7 00:00:21,813 --> 00:00:23,148 సౌర శక్తి 8 00:00:29,613 --> 00:00:31,823 హేయ్, హాయ్. నన్ను ఒక పురుగు కుట్టింది. 9 00:00:32,616 --> 00:00:33,617 కూర్చోండి. 10 00:00:46,880 --> 00:00:49,466 పురుగు కుట్టడం అనేది విప్లవాలను కుదిపేసేంత గొప్పదన్నమాట. 11 00:00:50,843 --> 00:00:52,177 కామెడీ చేస్తున్నారా? 12 00:00:52,678 --> 00:00:53,679 హా, కాస్తంత. 13 00:00:54,263 --> 00:00:56,390 ఇది చాలా చిన్నది. 14 00:00:56,473 --> 00:00:58,392 హా, కానీ బాగా నొప్పి పుట్టింది, సరేనా? 15 00:00:59,268 --> 00:01:02,604 వాళ్లు మమ్మల్ని బాగా కుమ్మేయాలని మీకు ఉంది కదా? 16 00:01:02,688 --> 00:01:04,940 మాకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదు మరి. 17 00:01:05,022 --> 00:01:06,441 నన్ను పోలీసు అనుకుంటున్నారా? 18 00:01:07,359 --> 00:01:11,405 నేను ఇక్కడ విద్యార్థిని. అదనపు డబ్బు కోసం వీకెండ్ కి ఇక్కడ పని చేస్తున్నానంతే. 19 00:01:11,488 --> 00:01:12,573 ఈ విశ్వవిద్యాలయంలోనే చదువుతున్నారా? 20 00:01:13,574 --> 00:01:14,825 ఫిలాసఫీ అండర్ గ్రాడ్యుయేట్ ని. 21 00:01:15,325 --> 00:01:17,286 ప్రపంచాన్నంతటినీ మార్చేయను కానీ దాని గురించి ఆలోచిస్తానులే. 22 00:01:19,288 --> 00:01:22,708 విషయం ఏంటి? మీరు ఆలస్యంగా చేరారా? అంటే, మీ వయస్సు ఎంత అని? 23 00:01:23,625 --> 00:01:26,211 కొంత మందికి తమకి కావలసిన దాన్ని దక్కించుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. 24 00:01:26,295 --> 00:01:27,963 నాతో అందరూ చేతులు కలుపుతారా? 25 00:01:50,110 --> 00:01:51,445 ఆ గొడవలో మీరు కూడా పాల్గొనాలి కదా? 26 00:01:55,157 --> 00:01:56,992 -మీ పేరేంటి? -జెమ్మా. 27 00:01:58,118 --> 00:01:59,828 మిమ్మల్ని కలవడం బాగుంది, జెమ్మా. నా పేరు డేల్. 28 00:02:04,750 --> 00:02:05,834 అయితే, డేల్… 29 00:02:07,085 --> 00:02:09,378 ఇక్కడ మీ దగ్గర చాలా గమ్మత్తైన మందులు ఉంటాయి కదా. 30 00:02:11,089 --> 00:02:13,008 మీకు కావాలంటే ఆస్పిరిన్ ఇవ్వగలను. 31 00:02:13,675 --> 00:02:14,676 ఏడ్చినట్టుంది. 32 00:02:16,178 --> 00:02:17,638 మీరు ఎప్పుడూ ఇలానే చప్పగా మాట్లాడతారా, డేల్? 33 00:02:19,723 --> 00:02:22,309 మీరు ఇలా పరుషంగా మాట్లాడితే, మిమ్మల్ని నా ఆంబులెన్స్ నుండి గెంటేయాల్సి ఉంటుంది. 34 00:02:31,985 --> 00:02:34,279 నేను నీతో ఇక్కడే ఉంటాను. 35 00:02:43,747 --> 00:02:44,915 నీకేమీ కాలేదు. 36 00:02:46,083 --> 00:02:47,543 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 37 00:02:48,836 --> 00:02:51,088 నిన్ను ఆఖరిసారిగా చూసి పోదామని వచ్చా, బంగారం. 38 00:02:51,964 --> 00:02:53,257 నీ కోసం కనీసం నేను ఆ పని అయినా చేయాలి కదా. 39 00:02:53,340 --> 00:02:54,633 ఆఖరిసారిగానా? 40 00:02:56,593 --> 00:02:58,554 నీకు 19 ఏళ్ల శిక్ష విధించారు, డేల్. 41 00:03:04,017 --> 00:03:05,811 మనం ఇండియాకి వెళ్లవచ్చనే ఇలా చేశా. 42 00:03:05,894 --> 00:03:09,189 బంగారం, నువ్వు నా గురించి కంగారు పడనక్కర్లేదు. 43 00:03:09,273 --> 00:03:10,774 నేను డ్రగ్స్ కి దూరంగా ఉంటున్నా. 44 00:03:10,858 --> 00:03:13,068 క్లినిక్ కి అయిన ఖర్చంతా నాన్నే భరించాడు. 45 00:03:14,069 --> 00:03:15,320 నాకేమీ కాదు. 46 00:03:27,666 --> 00:03:29,042 నువ్వు బాగానే ఉంటావు కదా? 47 00:05:13,272 --> 00:05:15,858 హేయ్. హేయ్, హేయ్. 48 00:05:15,941 --> 00:05:17,651 హేయ్, హేయ్. నిదానం. 49 00:05:19,570 --> 00:05:21,530 లేదు. నువ్వు ఇక్కడ ఉండకూడదు. 50 00:05:21,613 --> 00:05:23,490 -నువ్వు లేవకు. -నాకు కలరా ఉంది. 51 00:05:23,574 --> 00:05:24,908 నీకు సురక్షితం కాదు. 52 00:05:25,534 --> 00:05:26,869 ఏం పర్వాలేదు. 53 00:05:35,377 --> 00:05:36,837 ఇంతకీ జెమ్మా ఎవరు? 54 00:05:46,013 --> 00:05:47,264 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 55 00:05:48,807 --> 00:05:52,186 చేసిన తప్పులని సరిదిద్దుకోవాలని చూసే హక్కు కేవలం నీకు ఒక్కడికే ఉందా ఏంటి! 56 00:05:55,272 --> 00:05:56,648 దీన్ని తాగగలవా? 57 00:06:17,294 --> 00:06:19,338 గోడకు ఆనుకొని నిలబడండి. 58 00:06:59,336 --> 00:07:00,921 నువ్వు… నువ్వు అటు వైపు వెళ్లు. 59 00:07:03,006 --> 00:07:05,133 నువ్వు… నువ్వు నాతో రా. తను ఎక్కడుందో కనిపెట్టు! 60 00:07:08,178 --> 00:07:09,263 పద! పద! 61 00:07:12,808 --> 00:07:14,101 ఇక్కడికి రండి! 62 00:07:29,616 --> 00:07:30,659 తను ఇక్కడ ఉంది. 63 00:07:32,619 --> 00:07:34,288 తనని గదికి తీసుకెళ్లండి. 64 00:07:35,330 --> 00:07:38,584 వదిలేయండి. నన్ను వదిలేయండి. 65 00:07:40,711 --> 00:07:42,796 నన్ను వదిలేయండి. 66 00:07:54,266 --> 00:07:58,645 మీ అమ్మానాన్నలకు ఆరవ అంతస్థులో ఉన్న ఈ ఇంటిని అమ్మేసి, 67 00:08:00,397 --> 00:08:04,568 ఒక మంచి భవనంలో, అది కూడా లిఫ్ట్ ఉన్న భవనంలో 68 00:08:06,236 --> 00:08:07,362 ఒక మంచి ఇంటిని తీసుకోమని చెప్పు. 69 00:08:08,197 --> 00:08:09,823 వీటిని లోపల పెట్టేయండి. 70 00:08:12,409 --> 00:08:13,869 ఏంటి ఇవి? 71 00:08:15,037 --> 00:08:16,079 ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ నోటీసులు. 72 00:08:19,833 --> 00:08:22,753 లిన్ పరారీలో ఉన్నవాడే అయితే, ఈ ఫైల్సులో అతని పేరు ఉంటుంది. 73 00:08:22,836 --> 00:08:25,506 సీబీఐ వారి వస్తువులను వారి పరిసరాల నుండి బయటకు పంపించకూడదు కాబట్టి 74 00:08:25,589 --> 00:08:28,967 ఆఫీసర్ మిష్రా కూడా వీటి దగ్గర ఉంటాడు, అందుకు నేను బలవంతంగానే ఒప్పుకోవాల్సి వచ్చింది. 75 00:08:29,051 --> 00:08:33,304 కాబట్టి, నీ ఇల్లు ఇప్పుడు ఒక తాత్కాలిక సీబీఐ ఆఫీస్ అని అనవచ్చు, 76 00:08:33,804 --> 00:08:35,390 కాకపోతే ఇక్కడ ఒక్కరే సిబ్బంది ఉంటారు. 77 00:08:35,474 --> 00:08:37,058 నాకు తెలియాల్సిన షరతులు ఇంకేమైనా ఉన్నాయా? 78 00:08:37,768 --> 00:08:40,187 హా, లిన్ కి ఏదైనా పెద్ద నేరంతో సంబంధం ఉంటే, మా అంకుల్ కి చెప్తానని 79 00:08:40,270 --> 00:08:42,856 నేను మాట ఇచ్చాను. 80 00:08:42,940 --> 00:08:46,318 అతని పేరు ఇందులో ఉంది అంటే, అతనికి పెద్ద నేరంతో సంబంధం ఉన్నట్టే. 81 00:08:57,788 --> 00:08:58,956 ఇప్పుడు చాలా బాగా ఉంది. 82 00:09:03,001 --> 00:09:04,002 నా బట్టలు విప్పావా? 83 00:09:04,086 --> 00:09:06,672 నీ బట్టలన్నీ చండాలంగా ఉన్నాయి, మరి తీయక తప్పలేదు. 84 00:09:07,798 --> 00:09:09,299 ఎందుకు? నిన్ను చూసి ఏమైనా అనుకుంటాను అనా? 85 00:09:10,300 --> 00:09:12,094 నేను ప్యాంటులో కూర్చున్నా, అందుకని. 86 00:09:13,428 --> 00:09:16,557 నువ్వు మొదటిసారి నన్ను బట్టలు లేకుండా ఇలా ఉన్నప్పుడు చూడాల్సి వస్తుందని నేను ఊహించలేదు. 87 00:09:16,640 --> 00:09:18,016 అయితే ఊహించుకున్నావా? 88 00:09:23,313 --> 00:09:25,649 చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిపై కామెడీ చేస్తున్నావే, నువ్వు అసలు మంచిదానివే కాదు. 89 00:09:25,732 --> 00:09:28,861 నువ్వేమీ చావు బతుకుల్లో లేవు. నేను కూడా మంచిదాన్నని ఎప్పుడూ చెప్పలేదు. 90 00:09:30,153 --> 00:09:31,154 తిను. 91 00:09:39,204 --> 00:09:40,205 బాగుంది. 92 00:09:43,959 --> 00:09:45,961 ఇందాక తప్పులను సరిదిద్దుకోవడం అన్నావు కదా, ఎందుకలా అన్నావు? 93 00:09:47,504 --> 00:09:48,505 ఏంటి? 94 00:09:51,008 --> 00:09:54,303 సన్మార్గంలో వెళ్లే అవసరం ఉండేది నాకు మాత్రమే కాదు అన్నావు కదా. 95 00:09:55,179 --> 00:09:58,432 ఇంత రిస్క్ తీసుకొని నువ్వు ఇక్కడికి రావడం చిన్న విషయం కాదు కదా. 96 00:09:59,725 --> 00:10:01,894 నీకు బాధగా ఉంది అనుకుంటా. 97 00:10:01,977 --> 00:10:03,562 ఎందుకని? 98 00:10:03,645 --> 00:10:06,023 మేడమ్ జూ. ప్యాలెస్ లోని తతంగం. 99 00:10:08,192 --> 00:10:09,610 అంటే, జూ నా మీదికి మనుషులను పంపించింది, 100 00:10:09,693 --> 00:10:12,613 కాబట్టి, నేను దోపిడీకి గురయి, నాకు కలరా సోకి చావు అంచుల దాకా వెళ్లడానికి, 101 00:10:12,696 --> 00:10:17,367 ఒక రకంగా నువ్వే కారణం. 102 00:10:18,327 --> 00:10:19,661 అన్నింటికీ కారణం నేనే. 103 00:10:22,122 --> 00:10:23,123 నేనేదో సరదాగా జోక్ చేశా. 104 00:10:24,082 --> 00:10:25,834 కానీ అందులో నిజం లేకపోలేదు. 105 00:10:25,918 --> 00:10:30,589 నాకు రిస్క్ ఉందని తెలుసు. కానీ అప్పటికి, నువ్వు నాకు తెలీని వ్యక్తివి. 106 00:10:31,965 --> 00:10:32,966 కాబట్టి, నిన్ను వాడుకున్నా. 107 00:10:33,842 --> 00:10:37,221 మనం ప్యాలెస్ లో ఉన్నప్పుడు, జూ, అహ్మద్ పేరును ప్రస్తావించింది, నేను అతడి సూటే కదా వేసుకుంది. 108 00:10:38,764 --> 00:10:41,725 -అసలు అక్కడ ఏం జరిగింది? అతనూ, నువ్వు ఏమైనా… -లేదు, లేదు. అస్సలు లేదు. 109 00:10:43,310 --> 00:10:44,478 మేము స్నేహితులం. 110 00:10:45,020 --> 00:10:48,732 జూ దగ్గరున్న అమ్మాయిలలో ఒకరైన క్రిస్టీనా మీద అహ్మద్ ప్రేమలో పడ్డాడు. 111 00:10:49,733 --> 00:10:53,570 తనని వదిలేయమని జూపై ఒత్తిడి పెట్టాడు, కానీ జూ దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. 112 00:10:53,654 --> 00:10:55,364 ఆ తర్వాత, జూ అతనిపైకి మనుషులను పంపించిందా? 113 00:10:56,281 --> 00:10:57,491 క్రిస్టీనాపైకి పంపించింది. 114 00:10:59,368 --> 00:11:01,620 ఎవరో ఆమె ముఖంపై యాసిడ్ పోశారు. 115 00:11:02,412 --> 00:11:03,914 అహ్మద్ పగ తీర్చుకోవాలనుకున్నాడు. 116 00:11:04,498 --> 00:11:07,334 నేను అతనికి సర్దిచెప్పాననే అనుకున్నా, కానీ పొరబడ్డాను. 117 00:11:08,585 --> 00:11:11,171 కొన్ని రోజుల తర్వాత అతని శవం కనిపించింది. 118 00:11:11,255 --> 00:11:13,215 అతని చావుకు కారణం జూ, నువ్వు కాదు. 119 00:11:13,298 --> 00:11:14,383 అవునులే. 120 00:11:16,218 --> 00:11:19,847 అహ్మద్, క్రిస్టీనాని ప్రేమించాడు. కానీ నేను ఆమెని నమ్మలేదు. 121 00:11:20,514 --> 00:11:22,349 ఆమె కేవలం అతడిని వాడుకుంటోందనే భావించాను. 122 00:11:23,851 --> 00:11:25,060 కానీ అతను వినిపించుకోలేదు. 123 00:11:25,143 --> 00:11:29,147 ఆ తర్వాత, ప్యాలెస్ లో పని చేయమని క్రిస్టీనాని ఎవరో అడిగారు. 124 00:11:29,231 --> 00:11:31,942 నేను జూతో పని చేస్తున్నానని తనకి తెలుసు, కాబట్టి సలహా కోసం తను నా దగ్గరికి వచ్చింది. 125 00:11:32,901 --> 00:11:35,195 అక్కడ అంతా బాగానే ఉంటుందని నేను చెప్పాను. 126 00:11:36,405 --> 00:11:38,156 తను దూరమైపోవాలన్నదే నా మనస్సులో ఉంది. 127 00:11:39,825 --> 00:11:41,577 దానికి నిన్ను నువ్వు నిందించుకుంటే ఎలా? 128 00:11:41,660 --> 00:11:44,413 నీ మీద ఒకరు దాడి చేశారు, దాని వల్ల ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది. 129 00:11:45,414 --> 00:11:47,958 ఆ అబ్బాయి వాళ్ల అమ్మ చనిపోయింది నీ వల్లనే అని నువ్వు అన్నావు. 130 00:11:49,001 --> 00:11:50,919 దానికి కారణం వాళ్లే కదా, నువ్వు ఎలా అయ్యావు? 131 00:11:53,046 --> 00:11:55,465 అహ్మద్ చనిపోవడానికి నేనే కారణం. 132 00:12:22,409 --> 00:12:23,660 సునీత ఇక్కడే ఉండేదా? 133 00:12:24,912 --> 00:12:28,874 నా చోటికి వచ్చే ప్రతీ మగాడి ముఖం నాకు గుర్తే. 134 00:12:30,125 --> 00:12:32,044 నిన్ను ఎప్పుడూ నేను ఇక్కడ చూడలేదే. 135 00:12:32,127 --> 00:12:33,378 నేను నీకు డబ్బులు ఇస్తాను. 136 00:12:41,011 --> 00:12:45,599 సునీత అనే అమ్మాయి ఒకప్పుడు ఇక్కడే పని చేసింది, కానీ కొన్ని రోజుల క్రితం తను వెళ్లిపోయింది. 137 00:12:45,682 --> 00:12:47,559 ఆ సమాచారం చాలదు. 138 00:12:50,646 --> 00:12:53,106 నీ ముఖాన్ని నేను బాగా గమనించి గుర్తుపెట్టుకోక ముందే నువ్వు వెళ్లిపోతే మంచిది. 139 00:13:02,533 --> 00:13:04,660 నేను ఈ ఊరి నుండి వెళ్లిపోవాలి. 140 00:13:07,204 --> 00:13:08,580 రేనాల్డోస్ లో నేను బాగా తాగి 141 00:13:08,664 --> 00:13:11,250 పిచ్చివాగుడు వాగిన నాటి నుండి కవిత నా గురించి ఆరా తీస్తోంది. 142 00:13:13,377 --> 00:13:15,045 నా గురించి ఒక ఆర్టికల్ రాయాలని చూస్తోంది. 143 00:13:15,796 --> 00:13:18,715 నేను తనతో మాట్లాడి, ఆ పని ఆపమని ఒప్పించే ప్రయత్నం చేయగలను. 144 00:13:19,633 --> 00:13:23,554 తన స్థానంలో నువ్వే ఉంటే ఆపేస్తావా? లేదా మరింత ఆసక్తిని పెంచుకుంటావా? 145 00:13:25,430 --> 00:13:26,765 నాకు ఇంకో దారి లేదు. 146 00:13:28,058 --> 00:13:31,270 వాళ్లకి నా ఆచూకీ తెలిస్తే, నేను జైలుకు పోతా, లేదా ఇంకా దారుణంగా ఏమైనా జరగవచ్చు. 147 00:13:34,439 --> 00:13:36,191 కానీ నాకు వెళ్లిపోవాలని లేదు, ఎందుకంటే… 148 00:13:37,693 --> 00:13:39,111 నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 149 00:13:47,160 --> 00:13:48,704 ఆ విషయంలో నా ఉద్దేశం ఏంటో కూడా నీకు చెప్పా. 150 00:13:48,787 --> 00:13:51,164 హా, కానీ నువ్వు అబద్ధమాడుతున్నావు. 151 00:13:52,833 --> 00:13:56,336 చూడు, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని చెప్పు అని నేను అడగడం లేదు, దానికి నువ్వు ఏ పేరు అయినా పెట్టుకో, 152 00:13:56,420 --> 00:14:00,132 -కానీ నాపై ఉన్న ఫీలింగ్ ని నువ్వు కాదనలేవు… -నాకు నువ్వంటే ఇష్టమే, లిన్. 153 00:14:01,049 --> 00:14:03,677 నీలాంటి వాడిపై నేను పీకల్లోతు ప్రేమలో మునిగిపోయే అవకాశం ఉంది. 154 00:14:07,222 --> 00:14:09,641 నువ్వు వెళ్లిపోతే మంచిది అని అనడానికి ఇది కూడా ఇంకో కారణం. 155 00:14:14,271 --> 00:14:15,480 మనకి శుభ్రమైన నీరు కావాలి. 156 00:15:51,076 --> 00:15:54,371 నా కూతురిని ప్రేమించడానికి నీకు అనుమతి ఇచ్చేస్తున్నా పో. 157 00:16:15,225 --> 00:16:16,518 సమయం ఎంతైంది? 158 00:16:23,942 --> 00:16:25,402 కార్లా? 159 00:16:41,919 --> 00:16:45,339 చూడండి, లిన్ బాబాకి ఇప్పుడు బాగు అయిపోయింది. 160 00:16:59,061 --> 00:17:02,314 అరె, లిన్ బాబా! 161 00:17:08,278 --> 00:17:11,198 నిన్ను చూసి మూడు రోజులు అయింది. 162 00:17:11,281 --> 00:17:15,117 నీకు ఏమీ కానందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు చాలా మంచి రోజు, గురూ! 163 00:17:15,202 --> 00:17:16,703 నీకు ఒక మంచి విషయం చెప్పాలి. 164 00:17:16,787 --> 00:17:19,205 నేను కుమార్ చాయ్ అంగడిలో పనులు చేస్తూ ఉన్నానా, 165 00:17:19,289 --> 00:17:22,542 పార్వతిని ప్రేమించవచ్చని వాళ్లు నాకు చెప్పారు. 166 00:17:22,626 --> 00:17:25,212 -అది చాలా మంచి విషయం. చూడు, ప్రభు. -ఇదేదీ సాధ్యం కాదు, నీ వల్ల కాకపోతే… 167 00:17:25,295 --> 00:17:26,964 -చెప్పు. -నేను కూర్చోడానికి వెళ్లాలి. 168 00:17:27,047 --> 00:17:28,966 నేను వెళ్తే, వీళ్లు కూడా నా వెనకే వస్తారా? 169 00:17:29,758 --> 00:17:32,344 ఆ సంగతి నాకు వదిలేయ్. 170 00:17:32,427 --> 00:17:36,723 చూడండి! లిన్ బాబా కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లాలి. 171 00:17:38,225 --> 00:17:39,226 అతనొక్కడే వెళ్తాడు! 172 00:17:41,854 --> 00:17:43,981 -థ్యాంక్స్, బాసూ. -పర్లేదులే. 173 00:17:48,527 --> 00:17:51,113 రా, రా. అయితే బాగానే నిద్ర పట్టిందా? 174 00:17:52,155 --> 00:17:53,156 హా. 175 00:17:53,240 --> 00:17:55,993 అవునా? కార్లా మేడమ్ ఏది? 176 00:17:56,076 --> 00:17:57,077 నీకు తెలిస్తే నాకు చెప్పు. 177 00:18:11,091 --> 00:18:12,509 రెండు లక్షలు. 178 00:18:16,972 --> 00:18:18,015 లెక్క సరిగ్గా ఉంది. 179 00:18:21,268 --> 00:18:22,394 ఆ లీసా, 180 00:18:23,312 --> 00:18:24,605 తను మామూలుది కాదు రా నాయనా. 181 00:18:30,444 --> 00:18:32,321 మేమిద్దరం కలిసి మంచం విరగ్గొటినంత పని చేశాం. 182 00:18:33,322 --> 00:18:35,365 నాకే ఊపిరాడకుండా చేసేసింది తను. 183 00:18:38,368 --> 00:18:40,621 తనకి, నీకూ మధ్య ఏదో ఉందని అనుకున్నానే, 184 00:18:40,704 --> 00:18:44,625 కానీ అలాంటి అమ్మాయిని ఎలా పంచగలుగుతున్నావు నువ్వు? 185 00:18:47,586 --> 00:18:50,005 నువ్వన్నది నిజమే. లెక్క సరిపోయింది. 186 00:18:58,263 --> 00:19:00,098 -అబ్బా. ఇది మరీ ఎబ్బెట్టుగా ఉంది. -అరె, కంగారుపడకు. 187 00:19:00,182 --> 00:19:02,643 వెళ్లి నీ పని కానించు. నీ పని కానించు, గురూ. 188 00:19:04,353 --> 00:19:07,147 -ఇప్పుడు కూడా నువ్వు కలుగజేసుకుంటున్నావా? -నాకు ఆనందంగా ఉంది. అందుకే. 189 00:19:11,527 --> 00:19:13,904 అతను మీరు అనుకుంటున్న వాడు కాదు. 190 00:19:16,865 --> 00:19:17,991 దరిద్రుడు! 191 00:19:19,576 --> 00:19:20,827 హంతకుడు! 192 00:19:21,912 --> 00:19:23,080 ఏం చేస్తున్నావు, రవి? 193 00:19:23,163 --> 00:19:24,706 వాడు నా అమ్మను చంపాడు. 194 00:19:26,667 --> 00:19:29,086 -మనం దీని గురించి ముందే మాట్లాడుకున్నాం… -తనే మా అమ్మను చంపేశాడు. 195 00:19:29,169 --> 00:19:31,922 అతను మీ అమ్మ ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించాడు, రవి… 196 00:19:32,005 --> 00:19:33,590 అగ్నిప్రమాదానికి అతనే కారణం. 197 00:19:33,674 --> 00:19:38,387 అతను, ఇంకా ఆ తెల్లావిడ మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను! 198 00:19:39,847 --> 00:19:41,598 -అతని వల్ల మంటలు పుట్టాయి! -చెప్పేది విను. 199 00:19:42,558 --> 00:19:44,059 నువ్వు ఏం విన్నావని అనుకుంటున్నావో కానీ… 200 00:19:44,142 --> 00:19:46,854 చూడు, రవి, 201 00:19:47,396 --> 00:19:51,191 ఈ అబద్ధాన్ని కనుక నువ్వు చెప్తే, జనం భయాందోళనలకు గురవుతారు. 202 00:19:52,192 --> 00:19:54,862 మంటలు మొదలైనప్పుడు లిన్ నాతోనే ఉన్నాడు. 203 00:19:55,612 --> 00:19:57,906 అతను నాతోనే ఉన్నాడు. 204 00:19:57,990 --> 00:19:59,825 నాతోనే ఉన్నాడు. 205 00:20:01,410 --> 00:20:04,037 మళ్లీ నువ్వు ఇలా మాట్లాడితే, 206 00:20:04,121 --> 00:20:09,418 ఖాసిమ్ భాయ్ తో మాట్లాడి, నువ్వు పుకార్లు సృష్టిస్తున్నావని చెప్తాను. అర్థమైందా? 207 00:20:10,836 --> 00:20:12,838 ఇక వెళ్లు. 208 00:20:23,599 --> 00:20:24,975 అది మన డబ్బేనా? 209 00:20:39,656 --> 00:20:41,867 మీరిద్దరూ స్వర్గసుఖాలు అనుభవించారని రహీమ్ అన్నాడు. 210 00:20:43,994 --> 00:20:44,995 డబ్బు కోసం ఆ పని ఓకేనా? 211 00:20:46,622 --> 00:20:48,498 బాగా ఎంజాయ్ చేశావా, లీసా? 212 00:20:49,917 --> 00:20:50,918 ఏం ఎంజాయ్ చేశానని అడుగుతున్నావు? 213 00:20:52,544 --> 00:20:54,630 అతనితో నేను పడక పంచుకున్న సమయాన్నా? 214 00:20:55,380 --> 00:20:57,966 లేదు, నన్ను చూడు. దీన్ని మొదలుపెట్టింది నువ్వే. 215 00:20:59,176 --> 00:21:02,346 నా వల్లే ఆ డబ్బు మనకి వచ్చింది. అతనితో నేను పడుకున్నందుకే అది వచ్చింది. 216 00:21:03,722 --> 00:21:04,848 దాన్ని నేను సంపాదించాను. 217 00:21:05,516 --> 00:21:08,936 మన కోసం నా వంతు నేను చేశాను, ఆ విషయంలో నేను గర్వపడగలను కూడా, నువ్వు ఇంకేదైనా చేయాలని చూస్తే తప్ప. 218 00:21:16,193 --> 00:21:17,486 ఎక్కడికి వెళ్తున్నావు? 219 00:21:17,569 --> 00:21:18,654 కామెడీ చేస్తున్నావా! 220 00:21:18,737 --> 00:21:21,156 నీ పాటికి నువ్వు వచ్చి, గొడవ మొదలుపెట్టి, పారిపోతున్నావే? 221 00:21:21,240 --> 00:21:22,783 నీకు ఇదే కదా కావాల్సింది. కానివ్వు మరి! 222 00:21:24,535 --> 00:21:25,702 సెబాస్టియన్… 223 00:21:35,003 --> 00:21:36,338 ధీబర్ వాటర్ 224 00:22:01,196 --> 00:22:02,656 వీడు ఇక్కడేం చేస్తున్నాడు? 225 00:22:03,657 --> 00:22:07,035 -వీళ్లు వలీద్ షా మనుషులు. -వాళ్లకి ఏం కావాలి, లిన్ బాబా? 226 00:22:08,078 --> 00:22:10,914 దీనికి కారణం నేనేనని లోలోపల నాకు తెలుస్తోంది. 227 00:22:11,415 --> 00:22:15,043 -గూండాలతో పెట్టుకుంటే, ఇలాంటిది జరిగి తీరుతుంది కదా. -వలీద్ భాయ్ ఒక సందేశాన్ని పంపుతున్నారు. 228 00:22:15,127 --> 00:22:17,337 ఖాదర్ ఖాన్ తో ఇక మీరు ఏ లావాదేవీలు జరపకూడదు. 229 00:22:17,421 --> 00:22:19,756 మీకు నీరు లేదు, తొక్కా లేదు. 230 00:22:20,424 --> 00:22:23,093 మీ నీరు… నాశనం. 231 00:22:47,451 --> 00:22:48,785 వద్దు, లిన్, వాళ్లు చాలా మంది ఉన్నారు. 232 00:22:54,041 --> 00:22:56,460 నువ్వు ఇంకా ఉండకూడని పక్షం వైపు ఉన్నావు, డాక్టరోడా. 233 00:23:01,507 --> 00:23:03,091 హేయ్, ఏం చేస్తున్నారు? 234 00:23:08,805 --> 00:23:11,225 మేము రోజూ వచ్చి చూస్తాం. 235 00:23:11,308 --> 00:23:13,060 ఎందుకిలా చేస్తున్నారు? 236 00:23:23,820 --> 00:23:25,364 ఇప్పుడు ఆనందంగా ఉందా, మిస్టర్ లిన్? 237 00:23:25,906 --> 00:23:28,575 గూండాలతో లావాదేవీలు జరిపితే ఏం అవుతుందో తెలిసిందా? 238 00:23:32,579 --> 00:23:36,083 ఇప్పుడు మేము రెండు గ్యాంగుల మధ్య నలిగిపోవాలి. నీ వల్లే మేము ఇది అనుభవిస్తున్నాం. 239 00:23:37,793 --> 00:23:39,419 దీనికంతటికీ నువ్వే కారణం. 240 00:23:59,565 --> 00:24:02,067 నేను లిన్ దగ్గరకి వెళ్లానని ఖాదర్ కి చెప్పావా? 241 00:24:02,734 --> 00:24:04,152 లేదు. 242 00:24:04,236 --> 00:24:07,281 కానీ ఇంకెవరైనా ఆయనకి చెప్పవచ్చు. సాగర్ వాడలో ఆయనకి చాలా మంది కొత్త మిత్రులు తయారయ్యారు. 243 00:24:07,865 --> 00:24:09,074 లిన్ కారణంగా. 244 00:24:10,284 --> 00:24:12,119 అతనికి భలే దూరంగా ఉంటున్నాం కదా మనం. 245 00:24:12,202 --> 00:24:13,412 కానీ లినే ఆయన దగ్గరకి వచ్చాడు. 246 00:24:16,623 --> 00:24:18,500 లిన్ ఎలా ఉన్నాడు? 247 00:24:18,584 --> 00:24:19,710 అతనికి నయం అయిపోతుందిలే. 248 00:24:21,503 --> 00:24:22,504 నువ్వు ఎలా ఉన్నావు? 249 00:24:23,213 --> 00:24:24,298 నేను కూడా కుదుటపడిపోతానులే. 250 00:24:28,760 --> 00:24:32,222 నీకు ఇది నచ్చదని నాకు తెలుసు, కానీ ఇది త్వరలోనే ముగిసిపోతుంది. 251 00:24:58,790 --> 00:25:00,417 నువ్వు సునీత, కదా? 252 00:25:02,419 --> 00:25:04,463 చాలా సేపు నిన్ను ఇలా అంధకారంలో ఉంచినందుకు క్షమించు. 253 00:25:05,088 --> 00:25:06,882 ఇది నీకు నరకంగానే అనిపించి ఉంటుంది. 254 00:25:10,010 --> 00:25:11,803 మన్నించు, హిందీలో మాట్లాడతాను. 255 00:25:14,932 --> 00:25:16,099 నువ్వేనా మేడమ్ జూ అంటే? 256 00:25:16,183 --> 00:25:19,853 కాదు, కానీ నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని నేనే చెప్పా. 257 00:25:19,937 --> 00:25:22,689 నా కోసమే పద్మ నిన్ను విడిపించి తెచ్చింది. 258 00:25:22,773 --> 00:25:24,107 ఎందుకు? 259 00:25:24,191 --> 00:25:27,736 నువ్వు నాకు ఓ పని చేసి పెట్టాలి. 260 00:25:27,819 --> 00:25:31,907 నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. 261 00:25:31,990 --> 00:25:35,160 నన్ను వదిలేయండి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా. 262 00:25:35,244 --> 00:25:37,663 నాకు స్నేహితులు ఉన్నారు, చాలా పలుకుబడి ఉన్నవారు, వాళ్లు… 263 00:25:37,746 --> 00:25:39,748 ఆ దోస్తు గురించే నేను మాట్లాడాలి. 264 00:25:42,167 --> 00:25:44,670 నీ ఖండాలా దోస్తు. 265 00:25:45,420 --> 00:25:47,965 అతని పేరు బయటకు చెప్పవద్దు, సునీత. 266 00:25:48,799 --> 00:25:50,926 నేను చెప్పినట్టు చేయ్. 267 00:25:51,718 --> 00:25:53,846 నీ రుణం తీరిపోతుంది. 268 00:25:55,180 --> 00:26:01,937 అప్పుడు నువ్వు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు, నీకు నచ్చింది చేసుకోవచ్చు. 269 00:26:02,020 --> 00:26:04,147 ఇంతకీ నేనేం చేయాలి? 270 00:26:04,940 --> 00:26:06,692 నువ్వు నీ దోస్తుకు కాల్ చేయ్. 271 00:26:07,317 --> 00:26:11,154 అంతా బాగానే ఉందని చెప్పి, ఇక్కడికి రమ్నని పిలువు. 272 00:26:12,281 --> 00:26:15,409 ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, నీకు విముక్తి లభించేస్తుంది. 273 00:26:19,955 --> 00:26:20,956 లేదు. 274 00:26:22,207 --> 00:26:26,795 అతను నీతో మంచిగా ఉన్నాడని నాకు తెలుసు, కానీ అతను నీకు ఎంత ఇచ్చినా, దానికి ఈ నరకం అవసరమా? 275 00:26:27,921 --> 00:26:32,968 అతను నాకేమీ ఇవ్వట్లేదు, నేను అతనికి హాని కలిగించే పని చేయను. 276 00:26:34,261 --> 00:26:37,097 అది కూడా నీలాంటి పనికిమాలినదాని కోసం అస్సలు చేయను. 277 00:26:37,181 --> 00:26:41,018 మేం ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. అర్థమైందా? 278 00:26:43,228 --> 00:26:44,271 ఇక వెళ్లిపో. 279 00:26:45,105 --> 00:26:46,106 వెళ్లిపో! 280 00:27:03,290 --> 00:27:04,333 సరే మరి. 281 00:27:06,126 --> 00:27:08,337 -అంతా ఓకే, జానీ. -థ్యాంక్యూ, లిన్ బాబా. 282 00:27:17,554 --> 00:27:19,056 నీకు ఏదైనా కావాలా? 283 00:27:22,935 --> 00:27:26,021 అగ్నిప్రమాదానికి కారణం నువ్వేనని రవి నాతో అన్నాడు. 284 00:27:29,566 --> 00:27:30,776 ఒక రకంగా అది నిజమే. 285 00:27:45,791 --> 00:27:47,376 స్నేహితుల మధ్య రహస్యాలు ఉండకూడదు. 286 00:27:49,169 --> 00:27:50,295 ముఖ్యంగా అలాంటి విషయాల్లో. 287 00:27:50,379 --> 00:27:54,007 నీకు సాయం అవసరమని నాకు తెలీనప్పుడు నేను నీకు ఎలా సాయపడగలను? 288 00:27:55,300 --> 00:27:58,512 ఏం పర్వాలేదులే. మంటలు ప్రారంభమైనప్పుడు నువ్వు నాతోనే ఉన్నావని రవికి చెప్పాను. 289 00:28:01,306 --> 00:28:02,599 ఎందుకు అబద్ధమాడావు? 290 00:28:02,683 --> 00:28:04,268 అది జరిగిపోయిన విషయం. 291 00:28:04,351 --> 00:28:06,144 మేలు కలుగుతున్నప్పుడు అబద్ధాన్నే నిజంగా కొనసాగించవచ్చు. 292 00:28:06,228 --> 00:28:07,312 నీ మందులు లాగా. 293 00:28:08,647 --> 00:28:12,943 నాకు అర్థమైంది. ఒక తప్పును సరిదిద్దుకోవడానికి నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు, 294 00:28:14,403 --> 00:28:15,946 నువ్వు త్వరలోనే వెళ్లిపోతున్నావు, కదా? 295 00:28:16,530 --> 00:28:19,825 జనాల నమ్మకాలను నువ్వు ఇప్పుడు వమ్ము చేస్తే, దానికన్నా స్వార్థమైన పని ఇంకేమైనా ఉంటుందా? 296 00:28:19,908 --> 00:28:21,618 ఇంతా కాలమూ నేను స్వార్థంగా వ్యవహరిస్తూ వస్తున్నా. 297 00:28:23,495 --> 00:28:24,872 అలా ఎలా అనగలవు? 298 00:28:24,955 --> 00:28:28,792 నువ్వు మా కోసం చేసినవన్నీ, చావు అంచు దాకా వెళ్లడం, నీళ్లు తెప్పించడం… 299 00:28:28,876 --> 00:28:30,919 అది నేను మీ గురించి చేయలేదు. నా కోసమే చేశా. 300 00:28:32,045 --> 00:28:33,714 ఖాన్ గురించి ఖాసిమ్ నన్ను హెచ్చరించాడు కూడా, 301 00:28:33,797 --> 00:28:36,175 అయినా కానీ నా మనస్సుకు ఊరట కలగాలని నేను వెళ్లి ఖాన్ ని కలిశాను. 302 00:28:37,926 --> 00:28:41,138 వెళ్లిపోయే ముందు రుణం తీర్చుకొని వెళ్దామనుకున్నా. 303 00:28:41,722 --> 00:28:42,806 నువ్వు వెళ్లకపోయుంటే… 304 00:28:45,058 --> 00:28:46,977 ఈపాటికి నా పార్వతి చనిపోయి ఉండేదేమో. 305 00:28:50,355 --> 00:28:52,274 నువ్వు చాలా మంచి వాడివి, అతిగా ఆలోచిస్తావంతే. 306 00:29:07,956 --> 00:29:11,752 నువ్వు ఎవరిని ఏమార్చాలని చూస్తున్నావో కానీ, ఈ అమ్మాయి మాత్రం అతడిని గాఢంగా ప్రేమిస్తోంది. 307 00:29:12,920 --> 00:29:14,254 అతను కూడా ఆమెని ప్రేమిస్తున్నాడనే అనుకుంటోంది. 308 00:29:14,338 --> 00:29:15,714 నువ్వు విన్నావు అన్నమాట. 309 00:29:16,673 --> 00:29:17,799 అవును మరి. 310 00:29:25,349 --> 00:29:30,103 ఒక వేశ్య ప్రేమలో పడితే, ఆమె కన్నా వెర్రిది, మొండిది ఇంకెవరూ ఉండరు. 311 00:29:31,146 --> 00:29:32,648 నీ అనుభవం ఆధారంగా చెప్తున్నావా ఏంటి? 312 00:29:36,068 --> 00:29:37,486 నమ్మడానికి అంత కష్టంగా ఉందా? 313 00:29:37,569 --> 00:29:39,905 నీ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. 314 00:29:39,988 --> 00:29:41,698 -ఏది నిజమో ఎవరికి తెలుసు? -హా. 315 00:29:42,866 --> 00:29:45,327 అందులో చాలా కథలు నేను సృష్టించినవే. 316 00:29:46,828 --> 00:29:50,290 కానీ మంచి కథలలో, ఎప్పుడూ కాస్తంత నిజం కూడా ఉంటుంది. 317 00:29:51,875 --> 00:29:57,256 ఒక కేజీబీ ఏజెంటుకి నేను ఉంపుడుగత్తెని అనే కథని నువ్వు వినే ఉంటావు కదా. 318 00:30:00,175 --> 00:30:01,260 ఆ కథ ప్రకారం… 319 00:30:04,638 --> 00:30:07,558 ఒకరోజు అతను నన్ను వదిలేసి ఇండియాని వదిలేసి వెళ్లిపోతాడు. 320 00:30:08,392 --> 00:30:11,812 అతని కోసం వచ్చిన మనుషులు నన్ను పట్టుకుంటారు. 321 00:30:12,813 --> 00:30:15,190 వాళ్ల చిరాకులన్నీ పోగొట్టుకోవడానికి నన్ను వాడుకుంటారు. 322 00:30:16,650 --> 00:30:22,698 ప్రేమ కన్నా శక్తివంతమైనదేంటో తెలుసా, ఆ ప్రేమ పోగా, మిగిలిపోయే ద్వేషం. 323 00:30:28,120 --> 00:30:31,456 భయాన్ని పెరగనివ్వు. తన ప్రేమని ప్రశ్నించుకొనేలా ఈ సునీతని చేయ్. 324 00:30:33,166 --> 00:30:36,920 ఆ ప్రేమని దూరం చేస్తే, తను నీకు ఏం కావాలంటే అది చేస్తుంది. 325 00:30:39,089 --> 00:30:42,092 ఎంతైనా చివరికి, నువ్వు తనకి చేసేది మేలే అవుతుంది. 326 00:30:44,386 --> 00:30:45,387 నువ్వు ఇప్పుడు ఆనందంగా ఉన్నావా? 327 00:30:48,599 --> 00:30:51,185 నువ్వు నిర్మించిన ఈ చోటు వలన 328 00:30:52,436 --> 00:30:53,854 నీకు సంతృప్తి లభిస్తోందా? 329 00:30:54,855 --> 00:30:58,734 ఇది నాకు శక్తిని, నియంత్రణని అందిస్తుంది. 330 00:30:58,817 --> 00:31:00,527 వాటి వల్ల నీకు ఆనందంగా ఉందా? 331 00:31:03,405 --> 00:31:06,825 అవి లేనప్పటి కన్నా ఇప్పుడు ఆనందంగానే ఉందిలే. 332 00:31:08,535 --> 00:31:10,621 వేరే మార్గంలో వెళ్లి ఉండాల్సింది అని నీకు ఎప్పుడూ అనిపించలేదా? 333 00:31:10,704 --> 00:31:11,997 ఎక్కడికి? 334 00:31:12,706 --> 00:31:16,210 బజారున వదిలేసిన వేశ్యకి సుఖ సంతోషాల జీవితం ఉంటుందా? 335 00:31:17,419 --> 00:31:19,588 బహుశా ఆ ప్రశ్న మీ సునీతని అడిగి తెలుసుకుందాం. 336 00:31:33,810 --> 00:31:35,145 నేను వచ్చేశా. 337 00:31:40,567 --> 00:31:42,236 దీన్ని రహీమ్ దగ్గరికి తీసుకువెళ్లనా? 338 00:31:42,319 --> 00:31:43,320 వద్దు. 339 00:31:45,197 --> 00:31:47,783 నిన్న రాత్రి అబ్దులా టాహేరీ వచ్చి నన్ను కలిశాడు, 340 00:31:47,866 --> 00:31:51,495 -మన దందా ఆపివేయమని చెప్పాడు. -నిన్న… మరి నాకు ఎందుకు చెప్పలేదు? 341 00:31:51,578 --> 00:31:53,705 డబ్బు కోసం నేను రహీమ్ దగ్గరికి వెళ్లినప్పుడు అతను గమనిస్తూ ఉండవచ్చు! 342 00:31:53,789 --> 00:31:56,583 హా, కానీ అతనికి ఎలా తెలిసింది? 343 00:31:57,417 --> 00:31:59,503 -నువ్వు ఎవరికి చెప్పావు? -నేనెవరికీ చెప్పలేదు. 344 00:32:00,128 --> 00:32:01,129 అబ్బా. 345 00:32:05,759 --> 00:32:07,511 -డిడియర్ ఎవరికైనా చెప్పి ఉంటాడా? -డిడియర్. 346 00:32:07,594 --> 00:32:10,055 డిడియర్, అతను… మనకి క్లయింట్స్ ని పంపమని అతడిని అడిగావు కదా. 347 00:32:10,138 --> 00:32:12,683 -కొలాబాలో ఉండే సగం రహస్యాలు డిడియర్ దగ్గరే ఉంటాయి. -ఛ. 348 00:32:14,518 --> 00:32:16,478 మనల్ని ఇలా ముంచాలని ఎవరికి ఉంటుంది? 349 00:32:24,069 --> 00:32:25,404 లిన్ సంగతేంటి? 350 00:32:27,281 --> 00:32:30,409 అతను అబ్దులాకి, అలాగే డిడియర్ కి కూడా సన్నిహితుడే. 351 00:32:31,994 --> 00:32:33,412 పైగా మీ ఇద్దరికీ పడదు. 352 00:32:35,247 --> 00:32:37,374 మొన్నే నేను వాళ్లిద్దరూ కలిసి ఉండగా చూశా. 353 00:32:38,041 --> 00:32:39,877 దరిద్రుడా అని ఒక మాట అన్నాడు కూడా. 354 00:32:39,960 --> 00:32:41,962 నేను వాడి పీకని కోసేసి ఉండాల్సింది. 355 00:32:43,088 --> 00:32:44,089 లిన్. 356 00:32:44,882 --> 00:32:47,176 ఏంటంటే… లిన్ గాడిని గంగలో దూకమను. 357 00:32:48,594 --> 00:32:49,595 లిన్ గాడిని గంగలో దూకమను. 358 00:32:49,678 --> 00:32:54,850 లిన్, ఖాదర్ ఖాన్, రహీమ్, జూ, వీళ్లందరినీ కలిసి కట్టుగా గంగలో దూకమను. 359 00:32:56,894 --> 00:32:59,771 ఈ రెండు లక్షలను మనమే ఉంచుకుందాం, సరేనా? మన దగ్గర ఉన్న డ్రగ్స్ ధరని తగ్గించి అమ్మేద్దాం… 360 00:32:59,855 --> 00:33:00,856 వద్దు, వద్దు. 361 00:33:00,939 --> 00:33:03,901 …ఆ తర్వాత, మనం మోసం చేశామని తెలిసేలోపే బొంబాయి నుండి ఉడాయించేద్దాం. హేయ్! 362 00:33:06,236 --> 00:33:08,155 చూడు, నీకు నచ్చకపోతే, నా అంతట నేనే చేసేస్తాను, 363 00:33:08,238 --> 00:33:10,240 -కానీ నీకు నయాపైసా ఇవ్వను. -అబ్బా. ఛ. 364 00:33:10,324 --> 00:33:11,867 -ఛ. -ఏమీ ఇవ్వను. 365 00:33:12,618 --> 00:33:13,619 ఇటు చూడు. 366 00:33:14,661 --> 00:33:16,496 మొత్తం కావాలా, ఏమీ వద్దా? నువ్వే తేల్చుకో, మొడీనా. 367 00:33:21,585 --> 00:33:24,129 కానివ్వు, మొడీనా. వాళ్లందరూ సర్వనాశనం అయిపోనీ. 368 00:33:25,047 --> 00:33:26,048 సరే. 369 00:33:26,757 --> 00:33:28,717 -సరే, అలాగే. -సరేనా? అలాగేనా? 370 00:33:28,800 --> 00:33:30,135 -సరే. -సరేనా? 371 00:33:31,470 --> 00:33:32,721 సూపర్. 372 00:33:32,804 --> 00:33:34,306 పద. వెళ్దాం పద. 373 00:33:34,389 --> 00:33:37,309 వలీద్ షా, ఇంకో కంపెనీకి నాయకుడు. 374 00:33:37,392 --> 00:33:38,644 కంపెనీలా? 375 00:33:39,228 --> 00:33:40,437 మీ ఉద్దేశం ఇంకో ముఠాకా? 376 00:33:41,688 --> 00:33:43,607 మీరు నీటిని అందిస్తే అతనికి ఏమైంది? 377 00:33:43,690 --> 00:33:45,651 నేను సాగర్ వాడని కొనాలనుకుంటున్నానని అతనికి తెలుసు. 378 00:33:46,235 --> 00:33:47,319 తనకి కూడా అది కావాలి. 379 00:33:48,237 --> 00:33:49,238 లిన్, 380 00:33:50,322 --> 00:33:51,406 కనీసం కూర్చో. 381 00:33:52,115 --> 00:33:53,367 దయచేసి కూర్చో. 382 00:34:03,377 --> 00:34:05,546 -ఏదోకటి తాగు. -పర్వాలేదు. 383 00:34:07,673 --> 00:34:09,466 సాగర్ వాడ, ఉండే ప్రదేశం 384 00:34:09,550 --> 00:34:12,261 ప్రపంచంలోని అత్యంత విలువైన స్థిరాస్థులలో ఒకటి. 385 00:34:13,679 --> 00:34:17,683 వలీద్ షా, ల్యాండ్ మినిస్టరును కొనేశాడు, 386 00:34:17,766 --> 00:34:19,560 అతని కోరిక ఫలించగలదనే ఆశతో. 387 00:34:20,310 --> 00:34:23,397 కానీ సాగర్ వాడలో వేలాది మంది జీవిస్తున్నారు, 388 00:34:23,480 --> 00:34:26,358 జనాలు ఎక్కడ ఉంటే, శక్తి అక్కడ ఉంటుంది. 389 00:34:27,525 --> 00:34:31,196 మినిస్టర్, వలీద్ చేతిలో పావు. అతనికి ఓట్లు నా నియంత్రణలో ఉండటం ఇష్టం లేదు. 390 00:34:31,280 --> 00:34:32,947 అయితే, వాళ్లనేం చేయమంటారు? 391 00:34:34,283 --> 00:34:36,827 తమ సొంత గూటిని నాశనం చేసినందుకు ఓట్లు వేయమంటారా? 392 00:34:36,909 --> 00:34:41,123 మన నగరానికి పట్టిన దౌర్భాగ్యం అదే, 393 00:34:41,206 --> 00:34:44,376 తమని తరిమివేస్తారా లేదా అనే విషయం పేదవారి చేతుల్లో ఉండదు, 394 00:34:44,458 --> 00:34:48,213 కానీ, వారిని ఎవరు తరిమివేయగలరు అనే విషయం వారి చేతుల్లోనే ఉంటుంది. 395 00:34:48,797 --> 00:34:51,592 వారి నుండి నేనేం తీసుకుంటున్నానో నాకు తెలియదు అనుకుంటున్నావా? 396 00:34:51,675 --> 00:34:52,676 మీకు ఎలా తెలుస్తుంది? 397 00:34:53,302 --> 00:34:58,015 నాకు 15 ఏళ్లున్నప్పుడు, నా సొంత ఇంటిని లాగేసుకున్నారు. 398 00:34:59,600 --> 00:35:01,977 ఈ బాధ ఎప్పటికీ పోయేది కాదు. 399 00:35:03,061 --> 00:35:05,147 నీ క్లినిక్ కి నేను నిధులు ఇచ్చాను. 400 00:35:05,230 --> 00:35:07,274 మందులను, నీటిని అందించాను. 401 00:35:07,816 --> 00:35:11,612 వాళ్ల గుడిసెలు నిలిచినంత కాలం, వాళ్లకి ఏదోక విధంగా సాయం చేయాలనే అనుకుంటున్నా. 402 00:35:11,695 --> 00:35:13,655 కానీ సాగర్ వాడని ఖచ్చితంగా అమ్మేస్తారు. 403 00:35:14,198 --> 00:35:16,950 -ఇది దారుణం. -ఇది బొంబాయి. 404 00:35:17,034 --> 00:35:18,785 మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? 405 00:35:18,869 --> 00:35:20,954 చెప్పుంటే, నువ్వు నీటికి ఒప్పుకొని ఉండేవాడివి కాదు. 406 00:35:31,798 --> 00:35:33,675 ఇప్పుడు యుద్ధంలో వారికి కూడా భాగం ఉన్నట్టే కదా, 407 00:35:33,759 --> 00:35:35,761 -వాళ్లు పోరాడగలరా? -నాకు తెలీదు. 408 00:35:37,262 --> 00:35:38,805 ఇక బ్రోకరుగా ఉండటం నా వల్ల కాదు, ఖాదర్ భాయ్. 409 00:35:38,889 --> 00:35:41,391 వారి నుండి మీకేమైనా కావాలంటే, మీరే వాళ్లని అడగండి. 410 00:35:41,934 --> 00:35:42,935 తప్పకుండా. 411 00:35:46,396 --> 00:35:47,397 హేయ్. 412 00:35:48,398 --> 00:35:50,400 హేయ్. 413 00:35:52,861 --> 00:35:54,154 నిన్ను చూడటం బాగుంది. 414 00:35:55,656 --> 00:35:56,657 నిన్ను కూడా. 415 00:35:59,159 --> 00:36:01,495 అదే అస్సలు విషయం. ఎవరికీ అతని గురించి అంతగా తెలీదు. 416 00:36:01,578 --> 00:36:03,830 అతను పెద్దగా మాట్లాడడు కదా, అందుకేనేమో. 417 00:36:04,790 --> 00:36:07,084 తొమ్మిది సంతానంలో అతనే ఆఖరి వాడు, కడు పేదరికంలో పెరిగాడు, 418 00:36:07,167 --> 00:36:10,087 కాబట్టి ఎవరూ అతడిని పెద్దగా పట్టించుకోలేదు, అలానే అతను పెరుగుతూ వచ్చాడు. 419 00:36:11,713 --> 00:36:14,007 కానీ, మేమిద్దరమే ఉన్నప్పుడు, వేరుగా ఉంటాడు. 420 00:36:14,591 --> 00:36:15,717 భలే తమాషాగా ఉంటాడు. 421 00:36:16,927 --> 00:36:18,053 ప్రేమనూ కురిపిస్తాడు. 422 00:36:21,723 --> 00:36:24,059 నేను సంతోషంగా ఉండటమే అతనికి కావాలి. 423 00:36:25,519 --> 00:36:27,187 కానీ అతను చాలా పిరికి. 424 00:36:31,316 --> 00:36:33,360 అలా అనిపించదు కానీ, నువ్వు చెప్పిందే నేను చేశా, 425 00:36:33,443 --> 00:36:35,821 నా విషయంలో, అలాగే అతని విషయంలో నేనే బాధ్యత తీసుకున్నా. 426 00:36:35,904 --> 00:36:38,824 నేను ఆ రహీమ్ గాడితో పడుకోవలసి వచ్చింది, అయితే ఏంటి? 427 00:36:40,200 --> 00:36:42,870 ఎందుకంటే, ఈ ఉదయం మొడీనా డబ్బుతో వచ్చినప్పుడు, 428 00:36:44,621 --> 00:36:46,164 మొట్టమొదటిసారిగా నాకు… 429 00:36:47,833 --> 00:36:48,917 అధికారం వచ్చినట్టుగా అనిపించింది. 430 00:36:51,545 --> 00:36:53,046 నేను పిచ్చిదానిలా నీకు అనిపిస్తూ ఉండవచ్చు. 431 00:36:53,130 --> 00:36:56,466 జీవిత సలహాల కోసం నా దగ్గరికి వచ్చుంటే, నీకు నిజంగా పిచ్చే. 432 00:36:59,928 --> 00:37:01,513 నువ్వేం చేయాలనుకున్నా కానీ… 433 00:37:03,557 --> 00:37:07,019 ఇక్కడ నీకు ఎల్లప్పుడూ చోటు ఉంటుంది. 434 00:37:12,858 --> 00:37:15,485 కానీ, అవకాశం ఉన్నప్పుడే నువ్వు మొడీనాతో కలిసి వెళ్లిపోవాలనుకుంటా. 435 00:37:16,695 --> 00:37:21,950 నీ దగ్గర ఉన్నదంతా సర్దుకొని, బొంబాయి నుండి వెళ్లిపో. 436 00:38:17,089 --> 00:38:19,258 రేనాల్డోస్ కెఫే 437 00:38:51,456 --> 00:38:52,457 బాగా పొద్దుపోయింది. 438 00:38:53,375 --> 00:38:56,712 కావాలంటే నువ్వు వెళ్లి విశ్రాంతి తీసుకో. నాకు ఇక్కడ మిష్రా ఉన్నాడులే. 439 00:38:58,839 --> 00:38:59,840 అయ్యో… 440 00:39:01,508 --> 00:39:03,468 ఉన్నాడు అనుకున్నానే. 441 00:39:09,099 --> 00:39:10,976 కనీసం బూట్లైనా తీశాడులే, ఏమంటావు? 442 00:39:33,081 --> 00:39:36,543 మా పరిస్థితిని మార్చగలది ఇప్పుడు నువ్వు నాకేం చూపబోతున్నావు? 443 00:39:36,627 --> 00:39:38,879 ఈ గూండాలను తరిమేసే మెషిన్ గన్లనా? 444 00:39:38,962 --> 00:39:42,257 నువ్వు వినవు, నేర్చుకోవు, కానీ నిర్ణయాలన్నీ నువ్వే తీసుకోవాలంటావు. 445 00:39:42,341 --> 00:39:43,967 లేదు. ఇక నేను వాటన్నింటికీ దూరంగా ఉంటాను. 446 00:39:46,470 --> 00:39:47,638 అందుకే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చా. 447 00:39:57,814 --> 00:39:58,982 నమస్తే. 448 00:39:59,066 --> 00:40:00,526 నమస్తే. 449 00:40:01,318 --> 00:40:04,071 నీ ముందు నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది, ఖాసిమ్ భాయ్. 450 00:40:05,656 --> 00:40:07,533 కానీ అది నిజం కాదని మనిద్దరికీ తెలుసు. 451 00:40:08,325 --> 00:40:10,494 అది నొక్కి చెప్పడానికే మీరు వచ్చారు అనుకుంటా. 452 00:40:10,577 --> 00:40:13,622 ఖాదర్ కి కావలసిందేంటో నేరుగా నీతోనే చెప్పేందుకు నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. 453 00:40:13,705 --> 00:40:15,582 మీరు వివేకవంతులని లిన్ అంటుంటాడు. 454 00:40:15,666 --> 00:40:19,628 మిస్టర్ లిన్ ఏమనుకుంటున్నాడో పక్కన పెడ్తే, అతనికి నా గురించి తెలిసింది చాలా తక్కువ. 455 00:40:20,879 --> 00:40:24,258 అలాగే మీ గురించి, అసలు అన్ని విషయాల్లోనూ అతనికి తెలిసింది చాలా తక్కువే. 456 00:40:24,341 --> 00:40:27,219 విధేయత కొనగలిగేది కాదని, దాన్ని సంపాదించుకోవాలని అతనికి తెలుసు. 457 00:40:27,928 --> 00:40:30,138 దాన్ని నాకు గుర్తు చేసి మంచి పని చేశాడు. 458 00:40:31,932 --> 00:40:33,642 సాగర్ వాడ విషయంలో మన ప్లాన్ గురించి చర్చించడానికి వచ్చాను. 459 00:40:34,434 --> 00:40:39,273 మరి ఆ ప్లాన్ లో, నా ఇల్లు నా ఆధీనంలోనే ఉండే అవకాశం ఉందా? 460 00:40:39,356 --> 00:40:40,357 లేదు. 461 00:40:41,316 --> 00:40:42,317 చివరికి, మీ ఇళ్లు మీకు ఉండవు. 462 00:40:44,862 --> 00:40:46,738 కనీసం, ఈ విషయంలో మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. 463 00:40:47,823 --> 00:40:48,824 కూర్చోండి. 464 00:40:54,371 --> 00:40:56,832 ఈ ఉదయం, ఒక వ్యక్తి నాకు ఇది ఇచ్చాడు. 465 00:40:59,251 --> 00:41:00,627 దీన్ని మీకు ఇమ్మని కోరాడు. 466 00:41:01,461 --> 00:41:04,381 ఇది అసలైన బంగారం కాదు, కానీ… 467 00:41:05,174 --> 00:41:07,843 ఇది వాళ్ల కుటుంబంలో మూడు తరాల నుండీ ఉంది. 468 00:41:09,052 --> 00:41:10,220 దీనికి ఓ చరిత్ర ఉంది. 469 00:41:11,763 --> 00:41:13,932 అలాంటి దాన్ని తేలిగ్గా ఇచ్చేయడం సరైన పని కాదు. 470 00:41:14,892 --> 00:41:18,604 "ఉంగరం తాలూకు గొప్పతనం నీకు తెలిసి ఉన్నా, ఉంగరం తాలూకు విలువ గురించి నీకు సగం తెలిసి ఉన్నా, 471 00:41:18,687 --> 00:41:20,647 లేదా ఉంగరం నీ దగ్గర ఉండటం నీ అదృష్టమని నీకు తెలిసి ఉన్నా, 472 00:41:20,731 --> 00:41:22,983 నువ్వు ఈ ఉంగరాన్ని ఇచ్చి ఉండేవాడివి కాదు." 473 00:41:24,318 --> 00:41:26,403 నేను ఈయనకి ఉంగరం ఇస్తే, ఈయనేంటి పొడుపు కథ విప్పమంటున్నాడు. 474 00:41:27,863 --> 00:41:28,947 చూడు, నన్ను క్షమించు… 475 00:41:29,031 --> 00:41:30,240 నాకు చదువు లేదు అని 476 00:41:30,324 --> 00:41:33,410 -గుర్తు చేసినందుకు థ్యాంక్యూ, ఖాదర్ భాయ్. -ఖాసిమ్, తప్పుగా అనుకోవద్దు. 477 00:41:34,411 --> 00:41:36,079 నిన్ను వెక్కిరించడం నా ఉద్దేశం కాదు. 478 00:41:36,955 --> 00:41:39,249 అది ఒక నాటికలోని డైలాగ్. 479 00:41:39,333 --> 00:41:42,711 నువ్వు ఇచ్చిన ఉంగరాన్ని అటువంటి పరీక్షగానే నేను భావిస్తున్నాను. 480 00:41:44,713 --> 00:41:46,882 మీ భూమిపై హక్కులు నా చేతికి వస్తే, 481 00:41:48,091 --> 00:41:50,052 అభివృద్ధి పనులు మొదలవ్వడానికి చాలా ఏళ్లు పడుతుంది. 482 00:41:50,135 --> 00:41:52,804 ఆ సమయంలో, ఇక్కడి వారికి అండగా ఉండాలనుకుంటున్నాను. 483 00:41:52,888 --> 00:41:56,391 మొదట్లో, నిర్మాణానికి విద్యుత్తు, 484 00:41:56,475 --> 00:41:57,893 సరైన పైపు పని వంటివి చాలా అవసరమవుతాయి. 485 00:41:57,976 --> 00:42:01,146 నిర్మాణాన్ని మొదలుపెట్టే ముందు మీకు ఈ రూపంలో ప్రయోజనాలు లభిస్తాయి. 486 00:42:01,230 --> 00:42:04,691 ఉద్యోగ కల్పనకు, చట్టపరమైన ఉద్యోగ కల్పనకు సాయపడాలనుకుంటున్నాను. 487 00:42:04,775 --> 00:42:06,318 మా నుండి మా ఇళ్లను మీరు లాగేసుకున్నప్పుడు, 488 00:42:06,401 --> 00:42:08,362 మా ఇళ్ల కంటే గొప్ప వాటిని మీరు మాకు కల్పించాల్సిన అవసరం ఉంది. 489 00:42:08,445 --> 00:42:10,113 అది నిజమే. 490 00:42:10,197 --> 00:42:12,991 ఇక్కడికి వచ్చేటప్పుడు, దార్లో నాకు కొన్ని బల్లలు కనిపించాయి. 491 00:42:13,075 --> 00:42:17,204 నేను మీకు బడి కట్టిస్తాను, టీచర్లు, పుస్తకాల ఖర్చు నేనే భరిస్తాను. 492 00:42:17,955 --> 00:42:19,414 ఆ తర్వాత నిర్మాణ పనులు మొదలుపెడతారా? 493 00:42:20,582 --> 00:42:21,875 అప్పుడు మా గతేంటి? 494 00:42:22,501 --> 00:42:25,671 దేవుని దయతో మీకు ఉండటానికి ఇళ్లని ఏర్పాటు చేయడంలో నేను సాయపడతాను. 495 00:42:31,301 --> 00:42:32,511 నాకు ఉంగరాన్ని ఇచ్చేయండి. 496 00:42:33,637 --> 00:42:36,431 నేను దీన్ని ఆ వ్యక్తికే ఇచ్చేసి, తన కూతురికి ఇవ్వమని చెప్తాను. 497 00:42:37,558 --> 00:42:40,978 అలాగే ఆమె పిల్లలకు, ఆ తదుపరి తరాలకు కూడా. 498 00:42:45,148 --> 00:42:47,609 మీ నాటికని రాసిన వ్యక్తి చాలా తెలివైన మనిషి. 499 00:42:47,693 --> 00:42:50,946 జీవితంలోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలు 500 00:42:51,029 --> 00:42:52,364 భాగవతంలో దొరుకుతాయి. 501 00:42:55,325 --> 00:43:00,205 మరి నీ సమాధానమేంటి, ఖాసిమ్? 502 00:43:14,011 --> 00:43:16,263 మూడు లక్షలు ఉన్నాయా? 503 00:43:16,346 --> 00:43:19,641 దీనితో మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లవచ్చు. 504 00:43:19,725 --> 00:43:20,726 నేను సుసు పోసుకొని వస్తా. 505 00:43:20,809 --> 00:43:22,895 రహీమ్ కి అనుమానం రాకముందే మనం ఈ రాత్రికే చెక్కేద్దాం. 506 00:43:22,978 --> 00:43:24,229 నేను లీసాని తీసుకొని వస్తా. 507 00:43:24,313 --> 00:43:26,940 లీసా, లీసా. ఆ లీసాని వదిలేయ్. 508 00:43:27,024 --> 00:43:28,400 తను మనతో రావడానికి వీల్లేదు. 509 00:43:28,984 --> 00:43:31,028 తనతో మన అవసరం తీరిపోయింది, సరేనా? 510 00:43:31,111 --> 00:43:33,322 అదీగాక, ఒక వేశ్యకి ఈ డబ్బులో చిల్లి గవ్వను కూడా నేను ఇవ్వను. 511 00:43:34,448 --> 00:43:38,243 నువ్వు ఒక పక్షాన్ని ఎంచుకోవాలి, మొడీనా. నేనూ, డబ్బా? లేదా తనా? 512 00:43:39,328 --> 00:43:40,579 చెప్తున్నా కదా, ఈ డబ్బుతో, 513 00:43:40,662 --> 00:43:43,207 మనం ఎక్కడికి వెళ్లినా కానీ, అమ్మాయిలను ఇట్టే పడేయవచ్చు. 514 00:43:43,707 --> 00:43:45,792 లీసా ఏమంత ప్రత్యేకమైంది కాదు, మొడీనా. 515 00:43:46,793 --> 00:43:49,046 మనం ఏ నగరానికి వెళ్లినా, ప్రతీ రాత్రి 516 00:43:49,129 --> 00:43:50,547 నువ్వు ఒక మహిళతో గడపవచ్చు. 517 00:43:52,716 --> 00:43:53,967 ఏమంటావు, మొడీనా? 518 00:43:54,051 --> 00:43:57,971 ఎక్కడికి వెళ్దామంటావు? ఇటలీకా? స్పెయిన్ కా? దక్షిణ అమెరికాకా… 519 00:44:09,525 --> 00:44:15,113 నిన్ను బతిమాలతాననే అపోహలో నువ్వు ఉన్నావేమో, అది జరగని పని. 520 00:44:18,200 --> 00:44:21,828 బతిమాలి బతిమాలి నాకు విసుగొచ్చేసింది. 521 00:44:23,038 --> 00:44:26,458 ఇంతకు ముందు నేను అన్న మాటలకు మన్నించు. 522 00:44:27,376 --> 00:44:29,294 ఏదేదో ఊహించుకొని మాట్లాడి ఉండాల్సింది కాదు. 523 00:44:29,878 --> 00:44:32,881 ఈ లోకంలో నాకు చోటు లేదు. 524 00:44:35,342 --> 00:44:37,761 నా కన్న తల్లే నన్ను అమ్మేసింది. 525 00:44:39,680 --> 00:44:42,140 మగాళ్లు నన్ను వాడుకున్నారు. 526 00:44:43,892 --> 00:44:46,395 కానీ ఆకాష్ నన్ను ప్రేమిస్తున్నాడు. 527 00:44:47,688 --> 00:44:52,192 అతని స్థాయిలో ఉన్న వ్యక్తికి, నా లాంటి దాన్ని ప్రేమించడం తేలిక అనుకున్నావా? 528 00:44:53,443 --> 00:44:55,988 మా గురించి ఎవరికైనా తెలిస్తే, 529 00:44:56,071 --> 00:45:00,701 అతను తన పదవి, కుటుంబం, అన్నింటినీ కోల్పోతాడు. 530 00:45:02,578 --> 00:45:07,541 అతను తన పదవిని, కుటుంబాన్ని వదులుకోలేకపోతే… 531 00:45:08,250 --> 00:45:10,669 నీ కన్నా అతనికి అవే ముఖ్యం అయితే, 532 00:45:11,628 --> 00:45:13,755 మీ ప్రేమలో ఏదో లోటు ఉందని అర్థం. 533 00:45:14,715 --> 00:45:16,842 మగాళ్లు మనల్ని ప్రేమించే విధానం వేర్వేరుగా ఉంటుంది. 534 00:45:18,135 --> 00:45:21,263 ఎంతైనా తనని తాను ప్రేమించుకోని మగాడు అంటూ దాదాపుగా ఎవరూ ఉండరు. 535 00:45:24,808 --> 00:45:27,394 నువ్వు కామాతిపురలోని వేశ్యవి, సునీత. 536 00:45:28,604 --> 00:45:33,108 నీతో లేచిపోతానని అతను కల్లబొల్లి కబుర్లు చెప్తాడు, కానీ అతను ఆ పని చేయడు. 537 00:45:33,817 --> 00:45:36,445 నీ కోసం కానీ, ఎవ్వరి కోసమైనా కానీ అతను ఆ పని చేయడు. 538 00:45:37,196 --> 00:45:41,658 అతను నిన్ను మోసం చేసినప్పుడు, నీకు దిక్కు ఎవరు? 539 00:45:44,453 --> 00:45:48,290 నీ జీవితం అతను లేనప్పుడు బాగానే ఉండేదన్న విషయం అప్పుడు నువ్వు గ్రహిస్తావు. 540 00:45:49,875 --> 00:45:51,752 అతని నుండి నీకేం కావాలి? 541 00:45:53,337 --> 00:45:54,796 అతను, తన పని చేస్తే చాలు. 542 00:45:56,131 --> 00:45:58,967 ఆకాష్ కి హాని తలపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు, 543 00:46:00,177 --> 00:46:01,386 నేను మాటిస్తున్నా. 544 00:46:02,054 --> 00:46:06,600 నువ్వు అతనికి ఫోన్ చేస్తే, అతడిని నేనేమీ చేయనని 545 00:46:08,268 --> 00:46:10,896 మాట ఇస్తున్నాను. 546 00:46:13,565 --> 00:46:15,442 ఇప్పుడు నువ్వు మేడమ్ జూ ఆధీనంలో ఉన్నావు. 547 00:46:16,902 --> 00:46:20,197 త్వరలోనే, ఆమె నీతో వేశ్య పని చేయిస్తుంది. 548 00:46:20,280 --> 00:46:23,408 అప్పుడు కూడా పాండే నిన్ను ఇష్టపడతాడా? 549 00:46:25,327 --> 00:46:29,790 కాల్ చేసి చూడు, నిన్ను తీసుకుపోవడానికి అతను వస్తే, 550 00:46:29,873 --> 00:46:34,628 నువ్వు అంటున్నట్టు నిజంగా అతనికి నీపై ప్రేమ ఉందో లేదో తెలిసిపోతుంది. 551 00:46:42,010 --> 00:46:44,972 నీ జీవితంలో నువ్వు ఎవరినీ ప్రేమించలేదు అనుకుంటా. 552 00:48:51,640 --> 00:48:55,143 మీరు చచ్చార్రా, సన్నాసులారా! 553 00:48:55,727 --> 00:48:59,773 మీకు మా నీళ్లతో ఏం పని రా? మీ శవాల మీద చల్లుతాం ఆగండ్రా వాటిని! 554 00:51:04,648 --> 00:51:05,732 లిన్ బాబా! 555 00:51:05,816 --> 00:51:07,901 ఇప్పటి నుండి నిన్ను నెత్తురు తాగే జానీ అని పిలవాలా? 556 00:51:08,902 --> 00:51:10,654 ఈ కల్లు తాగు. మత్తులో తూలిపో. 557 00:51:10,737 --> 00:51:13,031 -వద్దు. నాకు వద్దులే. -తాగాల్సిందే. 558 00:51:16,910 --> 00:51:20,914 వీళ్లందరూ తమ విజయాన్ని ఆస్వాదిస్తుండగా నా హృదయం కంపించిపోవడం నాకు తెలుస్తూనే ఉంది. 559 00:51:21,456 --> 00:51:24,793 తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ, నేడు తమ విజయ ధరహాసాన్ని ఎవరూ దూరం చేయలేరు. 560 00:51:25,752 --> 00:51:28,380 వారికి రుణపడి ఉన్నాను, అందుకే ఇప్పటిదాకా అక్కడ ఉన్నాను. 561 00:51:28,463 --> 00:51:31,258 కానీ, నాకు ఇప్పుడు వెళ్లిపోవాలని అస్సలు లేదు. 562 00:51:54,698 --> 00:51:56,116 అరె, లిన్ బాబా! 563 00:52:22,684 --> 00:52:23,769 ఉండేలు. 564 00:52:30,108 --> 00:52:31,193 నీకు గురిపెట్టి కొట్టడం అస్సలు రాదు. 565 00:52:32,444 --> 00:52:33,570 బలి అయింది నేనే కదా. 566 00:52:35,614 --> 00:52:37,616 నా సోదరుడు లిన్ ని ఎందుకు కొట్టాలనుకున్నావు? 567 00:52:39,201 --> 00:52:40,410 అతను మా అమ్మని చంపాడు. 568 00:52:42,329 --> 00:52:44,915 వీళ్లేమో అది నిజం కాదని అంటున్నారు, కానీ అదే నిజమని నాకు తెలుసు. 569 00:52:47,543 --> 00:52:50,754 మా అమ్మ కూడా చనిపోయింది. ఈ విషయంలో మనిద్దరికీ పోలిక ఉంది. 570 00:52:53,048 --> 00:52:54,466 మరి మీరేం చేశారు? 571 00:52:55,092 --> 00:52:56,927 నాకంటూ సొంతంగా ఉండేలా ఒకదాన్ని చూసుకున్నాను. 572 00:52:59,721 --> 00:53:01,849 అబ్దుల్ ఖాదర్ ఖాన్ సేనాధిపతి. 573 00:53:01,932 --> 00:53:03,851 సేనాధిపతి దగ్గర యోధులు ఉండాలి కదా మరి. 574 00:53:06,645 --> 00:53:09,273 ఏదోకరోజు మీ దగ్గర ఉన్న బైక్ లాంటిదే నేను కూడా తెచ్చిపెట్టుకోవాలనుకుంటున్నా. 575 00:53:13,735 --> 00:53:14,903 ఏదోకరోజు అది సాధ్యం అవ్వచ్చు. 576 00:53:16,446 --> 00:53:19,950 కానీ యోధుడు ఆదేశాలను పాటించాలి, అవి అతనికి నచ్చినా, నచ్చకపోయినా. 577 00:53:21,660 --> 00:53:24,246 ఏం చేయాలో చెప్పండి చాలు. ఏమైనా చేసేస్తా. 578 00:53:24,329 --> 00:53:26,665 లిన్, ఖాదర్ భాయ్ కి చాలా ముఖ్యమైన మనిషి. 579 00:53:27,291 --> 00:53:28,417 అతను కూడా యోధుడే. 580 00:53:29,376 --> 00:53:31,712 అతనికేమైనా జరిగితే, అది మాకు అస్సలు నచ్చదు. 581 00:53:33,213 --> 00:53:35,340 -నీకు బాగా అర్థమైంది కదా? -హా. 582 00:53:40,679 --> 00:53:42,222 యోధునికి ఆయుధం కావాలి. 583 00:53:43,765 --> 00:53:46,185 వెళ్లి సాధన చేయ్. లేకపోతే మేం బలవుతాం. 584 00:54:01,116 --> 00:54:02,868 ఒకరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, 585 00:54:03,660 --> 00:54:05,954 "నీకు చాలా ఆనందంగా ఉన్నప్పుడు, 586 00:54:06,038 --> 00:54:08,665 కానీ దాని వలన చివరికి మిగిలేది బాధే అని నీకు మొదట్నుంచీ తెలిసినా కూడా, 587 00:54:09,917 --> 00:54:13,003 ఆ ఆనందాన్ని నువ్వు ఎంచుకుంటావా, దానికి దూరంగా ఉంటావా?" అని. 588 00:54:14,713 --> 00:54:18,133 ఆ క్షణాన నాకు సమాధానం దొరికేసింది. 589 00:54:19,468 --> 00:54:23,263 నేను ఆనందాన్నే ఎంచుకుంటాను. అది ఎంత బాధ కలిగించినా కానీ. 590 00:54:25,682 --> 00:54:27,518 అయినా కానీ, నేను పారిపోవాల్సిన అవసరం ఉంది. 591 00:54:43,158 --> 00:54:45,077 గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ రచించిన శాంతారాం ఆధారంగా తెరకెక్కించబడింది 592 00:56:05,157 --> 00:56:07,159 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్