1 00:00:20,771 --> 00:00:23,190 హేయ్, నీకు పెద్ద సమస్య వచ్చి పడింది. 2 00:00:25,150 --> 00:00:28,737 నువ్వు నమ్మకద్రోహానికి పాల్పడిన కుక్కవని హ్యారీ బార్న్స్ విన్నాడు. 3 00:00:29,571 --> 00:00:30,948 నీ అంతు తేల్చడానికి వస్తాడట. 4 00:00:31,782 --> 00:00:33,200 నేను నమ్మకద్రోహానికి పాల్పడలేదు, నెడ్. 5 00:00:34,660 --> 00:00:36,328 నైటింగేల్ కి నేనేమీ చెప్పలేదు. 6 00:00:37,371 --> 00:00:38,539 చెప్పావనే వాళ్లు అనుకుంటున్నారు. 7 00:00:41,959 --> 00:00:42,960 ఇది తీసుకో. 8 00:00:47,047 --> 00:00:49,800 ఇప్పటిదాకా నేనెవరినీ పొడవలేదు. ఇప్పుడు ఆ పని చేయను కూడా. 9 00:00:49,883 --> 00:00:52,761 నీ తొక్కలో పుస్తకాల వల్ల ఇక్కడ ఏ లాభమూ ఉండదు. 10 00:00:52,845 --> 00:00:54,596 నా మాట విని ఇది తీసుకో. 11 00:01:07,109 --> 00:01:08,235 బార్న్స్, ఎవడొచ్చాడో చూడు. 12 00:01:08,318 --> 00:01:09,987 హాయ్, బార్న్స్. ఎలా ఉన్నావు? 13 00:01:13,490 --> 00:01:15,158 చూడు, నువ్వు ఏం విన్నావో నాకు తెలిసింది, 14 00:01:15,242 --> 00:01:17,911 కానీ నేను పెదవి విప్పట్లేదని కావాలని ఆ నైటింగేల్ గాడు నేను ద్రోహిననే పుకారు లేపాడు. 15 00:01:18,829 --> 00:01:20,581 ఒకవేళ నేను అలాంటి వాడినే అయితే, ఇక్కడికి వచ్చేవాడిని కాదు… 16 00:01:23,709 --> 00:01:26,920 -వావ్. -సూపర్. 17 00:01:27,004 --> 00:01:27,963 హేయ్. హేయ్. 18 00:01:35,012 --> 00:01:36,889 నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తానురా, కుక్కా. 19 00:01:45,397 --> 00:01:46,440 ఓయ్! 20 00:01:47,441 --> 00:01:49,234 వద్దు, హేయ్! 21 00:02:02,080 --> 00:02:03,457 దగ్గరకి రాకండి. 22 00:02:06,585 --> 00:02:09,713 నైటింగేల్ నన్ను కావాలని ఇరికిస్తున్నాడు. అది అబద్దం. 23 00:02:10,422 --> 00:02:12,424 నేను ద్రోహిని కాదు. ఆ మాట చెప్పు. 24 00:02:13,008 --> 00:02:14,551 -చెప్పరా! -నువ్వు ద్రోహివి కాదు. 25 00:02:14,635 --> 00:02:15,802 వాళ్లకి వినిపించేలా చెప్పు! 26 00:02:15,886 --> 00:02:17,221 వీడు ద్రోహి కాదు. 27 00:02:24,811 --> 00:02:26,855 ఇది ఇంతటితో ముగిసిపోవాలి. అర్థమైందా? 28 00:02:36,532 --> 00:02:39,618 మనం వెనక్కి వెళ్లి, అసలేం జరుగుతోందో కనుగొనాలి. 29 00:02:40,327 --> 00:02:43,330 జరిగేదేదీ మంచిది కాదు. కాబట్టి, మనకి విషయం తెలిసేదాకా నువ్వు ఎవరికీ కనిపించకుండా ఉంటే మేలు. 30 00:02:44,581 --> 00:02:46,291 అలా ఉంటానని మాట ఇవ్వు. 31 00:02:48,502 --> 00:02:50,295 హా, సరే. 32 00:02:50,379 --> 00:02:54,132 కానీ నాకొక్క సాయం చేయ్. అబ్దులాకి ఈ విషయం చెప్పి, నన్ను ఇక్కడ కలవమని చెప్పు. 33 00:02:54,216 --> 00:02:56,844 ఆ గూండా వల్ల పరిస్థితి ఇంకా అధ్వాన్నమవుతోంది. మనకి అతని అవసరం లేదులే. 34 00:02:56,927 --> 00:02:59,263 -మనకి ఇప్పుడు అతని అవసరమే ఉంది. -సరే. 35 00:02:59,346 --> 00:03:00,347 అతను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టు. 36 00:03:14,236 --> 00:03:16,405 పరిస్థితులన్నీ దారుణంగా తయారయ్యాయి, 37 00:03:16,488 --> 00:03:18,782 కవిత, కార్లా. 38 00:03:18,866 --> 00:03:20,993 మళ్లీ నిస్సహాయత నన్ను కమ్మేసింది. 39 00:03:21,869 --> 00:03:25,205 నా బతుకు ఇంకొకరి చేతుల్లో ఉండటం అనేది నాకేమీ కొత్త కాదు, 40 00:03:25,706 --> 00:03:26,874 నాకు అది అస్సలు ఇష్టం లేదు. 41 00:03:31,461 --> 00:03:35,007 రాత్రంతా బయటే ఉన్నావు, అదే డ్రెస్… పిచ్చెక్కించినట్టున్నావుగా. 42 00:03:35,090 --> 00:03:36,383 నాకు వివరంగా చెప్పాలి. 43 00:03:41,513 --> 00:03:42,556 అంత బాగుందా? 44 00:03:50,063 --> 00:03:51,815 లిన్ ఇక్కడే ఉండగల మార్గం నాకు దొరికిందనుకుంటా. 45 00:03:51,899 --> 00:03:53,817 మరి నీ ముఖంలో సంతోషం కనబడట్లేదే? 46 00:03:53,901 --> 00:03:55,861 అంటే, నేను ఇక్కడ ఉండకూడదని అర్థం. 47 00:03:55,944 --> 00:03:58,989 జూ గురించి, ప్యాలెస్ గురించి, వలీద్ గురించి, 48 00:03:59,072 --> 00:04:01,283 ఇంకా సాగర్ వాడ అంతటి గురించి కవితకి చెప్పేస్తానని మాటిచ్చా. 49 00:04:01,992 --> 00:04:03,660 అంటే, ఒక కోణాన్నే అనుకో. 50 00:04:04,703 --> 00:04:06,580 నేను ఉన్నా ఉండకపోయినా, లిన్ ఖచ్చితంగా ఉండాలి. 51 00:04:06,663 --> 00:04:08,749 మా ఇద్దరిలో ఒకరికి, మాకు కావలసిందే దక్కవచ్చు. 52 00:04:11,168 --> 00:04:13,795 ఇప్పుడు కూడా నీకు ఊరు వదిలి వెళ్లిపోవాలనుందా? నాతో? 53 00:04:14,546 --> 00:04:16,130 నువ్వు లేనప్పుడు మొడీనా వచ్చాడు. 54 00:04:16,214 --> 00:04:18,841 మాకు కొత్త పాస్ పోర్టులు నువ్వు ఏర్పాటు చేయగలిగితే, మన ముగ్గురం కలిసి వెళ్లిపోవచ్చు. 55 00:04:19,676 --> 00:04:22,888 జూ, ఇంకా ప్యాలెస్ గురించి కవితతో మాట్లాడతావా? 56 00:04:22,971 --> 00:04:25,724 తనకి మాటిచ్చా కాబట్టి, నువ్వు చెప్పాల్సిన అవసరం రావచ్చు. 57 00:04:25,807 --> 00:04:30,062 అది ఆ చెత్త జూకి బాధ కలిగించి, నీకు ఉపయోగపడుతుందంటే, తప్పకుండా ఇస్తా. 58 00:04:31,939 --> 00:04:34,483 కానీ, ఆ ఆర్టికల్ బయటకు రాక ముందే మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 59 00:04:34,566 --> 00:04:35,609 అది తప్పదులే. 60 00:04:36,652 --> 00:04:39,071 -నువ్వేం చేస్తున్నావో లిన్ కి చెప్తావా? -చెప్పను. 61 00:04:39,154 --> 00:04:40,364 మరి ఖాదర్ కి? 62 00:04:40,447 --> 00:04:41,448 అతనికి కూడా చెప్పను. 63 00:04:44,868 --> 00:04:47,788 నేను వాళ్లకి కావలసింది వాళ్లకి ఇవ్వగలను, కానీ అది వాళ్లకి తెలీనప్పుడు మాత్రమే జరుగుతుంది. 64 00:04:48,830 --> 00:04:50,374 నువ్వు ఇంతే. 65 00:04:51,124 --> 00:04:53,877 ఎట్టకేలకు నీకు ఒకడు నచ్చుతాడు, ఆ తర్వాత లేనిపోని సమస్యలన్నిటినీ సృష్టించి, 66 00:04:53,961 --> 00:04:55,546 అతనికి దూరంగా ఉండిపోతావు. 67 00:05:36,295 --> 00:05:37,754 లిన్, నేనే. 68 00:05:43,260 --> 00:05:44,261 రండి. 69 00:05:47,973 --> 00:05:49,266 విషయమేంటో చెప్పు, డిడియర్. 70 00:05:49,349 --> 00:05:54,479 హా. నీ కోసం రహీమ్ అనే నైజీరియన్ వెతుకుతున్నాడు. 71 00:05:54,563 --> 00:05:57,691 అతడిని నువ్వు మోసం చేశావని అనుకుంటున్నాడు, 72 00:05:57,774 --> 00:06:00,194 నువ్వు చావాలని, అతని డబ్బు అతను దక్కించుకోవాలని అతని ప్లాన్. 73 00:06:00,277 --> 00:06:02,237 అసలు వాడెవడో కూడా నాకు తెలీదు. 74 00:06:03,155 --> 00:06:05,824 అతను మరీజియో బెల్కాన్ నుండి హెరాయిన్ కొనే వ్యక్తి. 75 00:06:06,408 --> 00:06:07,826 మరీజియో? 76 00:06:08,577 --> 00:06:10,871 -వాడు కావాలని నా పేరు చెప్పాడంటావా? -అవును. 77 00:06:10,954 --> 00:06:12,831 ఆ చచ్చినోడు. 78 00:06:15,292 --> 00:06:16,960 వాడిని చంపేస్తా నేను. 79 00:06:17,044 --> 00:06:20,631 నేను వాడి దగ్గరకి వెళ్లి విషయం చెప్తా. అతనికి కావాల్సింది నువ్వు కాదని అతనికి అర్థమవుతుంది. 80 00:06:20,714 --> 00:06:23,884 ఖాదర్ అడ్డాలో రహీమ్ హెరాయిన్ కొంటున్నాడంటే, అది నేను చూసుకోవాల్సిన విషయం. 81 00:06:23,967 --> 00:06:26,678 -వాడికి కావాల్సింది నేను. -కానీ ఆ సంగతి నేను చూసుకుంటా అంటున్నా. 82 00:06:27,721 --> 00:06:30,432 రహీమ్ కి నా చావు కావాలంటే, ఆ సంగతేంటో నేనే చూసుకోవాలి. 83 00:06:30,516 --> 00:06:32,518 మనిద్దరం వెళ్దాం. 84 00:06:32,601 --> 00:06:35,103 నేనిక్కడికి ముందుగా నీ అన్నగా వచ్చా. ఎలా అయినా, ఫలితంలో మాత్రం మార్పు ఉండదు. 85 00:06:39,107 --> 00:06:41,318 -చావాలనుకుంటున్నావా ఏంటి! -సరే. సరే. 86 00:06:41,401 --> 00:06:43,028 వచ్చే ముందు తలుపు తట్టాలి కదా, బాసూ. 87 00:06:45,531 --> 00:06:48,617 సరే. లిన్ కోసం గాలిస్తున్న ఈ రహీమ్ గాడు ఎక్కడ ఉండేది 88 00:06:48,700 --> 00:06:49,910 మీకు తెలుసుకోవాలని లేదా ఏంటి? 89 00:06:49,993 --> 00:06:51,203 సరే, నేను వెళ్లిపోతాలే. 90 00:06:51,286 --> 00:06:53,705 ప్రభు, అతను ఎక్కడ ఉంటున్నాడో చెప్పు. 91 00:06:53,789 --> 00:06:55,249 అతను ఉండేది ఎక్కడో చెప్పు. 92 00:06:57,084 --> 00:07:01,463 కొలాబా దగ్గర్లోని ఒక హోటల్ లో, భయంకరంగా ఉండే ఇద్దరు మనుషులతో ఉంటున్నాడు, బాబోయ్. 93 00:07:03,799 --> 00:07:05,092 సరే, పదండి వెళ్దాం. 94 00:07:05,175 --> 00:07:06,760 ఆగండి… ఆగండి. 95 00:07:08,011 --> 00:07:10,764 -నువ్వు ఇప్పటికే చాలా కష్టపడ్డావు. -మీకు ఆ హోటల్ లో ఎవరైనా తెలుసా? 96 00:07:11,974 --> 00:07:13,767 రహీమ్ ఏ గదిలో ఉంటాడో తెలుసా? 97 00:07:13,851 --> 00:07:17,104 తెలీదు కదా? నాకు తెలిసినవాళ్ల సాయంతో మనం వాడిని బోల్తా కొట్టించవచ్చు. 98 00:07:19,189 --> 00:07:20,274 వాడి ఖర్మ మరి. 99 00:07:21,233 --> 00:07:22,317 లిన్, ఒక్క నిమిషం ఆగు. 100 00:07:24,027 --> 00:07:25,362 ఇది తీసుకో. 101 00:07:27,656 --> 00:07:30,367 దాన్ని ఇక వాడనని ప్రమాణం చేసుకున్నా. 102 00:07:40,252 --> 00:07:42,963 బొంబాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాగతం. 103 00:07:45,382 --> 00:07:46,592 రెండవ వ్యక్తి, మీరు పదండి. 104 00:07:47,342 --> 00:07:50,679 కస్టమ్స్ సిబ్బందికి దయచేసి మీ పాస్ పోర్ట్, ఇంకా వీసాలను చూపండి. 105 00:07:54,850 --> 00:07:56,435 తర్వాతి వాళ్లు రావాలి. 106 00:07:59,021 --> 00:08:00,063 మీ రాక ఉద్దేశం? 107 00:08:01,023 --> 00:08:03,775 నేను డిటెక్టివ్ నైటింగేల్ ని. ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసుని. 108 00:08:03,859 --> 00:08:06,737 అధికారిక పని మీద వచ్చాను. మహా అయితే ఓ వారం ఉంటా. 109 00:08:06,820 --> 00:08:09,990 నిజానికి, మీ వాళ్లలో ఒకరు ఇక్కడ నన్ను కలవాలి, 110 00:08:10,073 --> 00:08:11,533 ఇవన్నీ వాళ్లే చూసుకోవాలి. 111 00:08:12,367 --> 00:08:15,579 మీరు ఇక్కడ మూడు నుండి ఆరు నెలలు ఉంటారని పేర్కొన్నారు, 112 00:08:15,662 --> 00:08:19,041 అధికారిక పని మీద కాకుండా విహారయాత్రకు వస్తున్నారని పేర్కొన్నారు. 113 00:08:19,124 --> 00:08:20,626 మీరు కొత్త ఫారాన్ని పూరించాలి. 114 00:08:20,709 --> 00:08:21,710 చూడండి. 115 00:08:22,628 --> 00:08:25,964 -మీలాగే నేను కూడా పోలీసుని. -మ్. 116 00:08:31,553 --> 00:08:32,763 ఇక్కడ కాదు, సర్. 117 00:08:32,846 --> 00:08:36,600 మీరు ఈసారి సరిగ్గా ఫారాన్ని పూరించి, మళ్లీ క్యూలో వచ్చి సమర్పించాల్సి ఉంటుంది. 118 00:08:36,683 --> 00:08:37,976 ఛ. 119 00:08:38,059 --> 00:08:40,102 మీ సూపర్వైజర్ ఎక్కడ? 120 00:08:40,187 --> 00:08:43,482 సర్, ఇక్కడ సూపర్వైజరుని నేనే. 121 00:08:43,565 --> 00:08:46,401 జనాలు క్యూలో ఉన్నారు, మీరు పక్కకు వెళ్తే, వాళ్లు ముందుకు రాగలరు. 122 00:08:53,200 --> 00:08:54,243 కాస్త పక్కకు జరగరా! 123 00:09:05,629 --> 00:09:07,548 లిన్, అబ్దులా, ఇతను నా స్నేహితుడు, మోహిత్. 124 00:09:07,631 --> 00:09:11,468 మన కారణంగా ఇతనికి మిస్ అయ్యే టిప్స్ ని మనమే ఇస్తామని నేను మాటిచ్చాను. 125 00:09:12,970 --> 00:09:13,971 అలాగే. 126 00:09:20,686 --> 00:09:21,687 పట్టుకోండి. 127 00:09:38,453 --> 00:09:39,705 సరే. ఇక వెళ్దాం. 128 00:09:46,503 --> 00:09:47,838 నా దగ్గర అది ఒకటే ఉంది. 129 00:09:53,802 --> 00:09:55,512 నువ్వు ఇక్కడికి రావాల్సిన పని లేదు. 130 00:09:59,141 --> 00:10:00,517 రూమ్ సర్వీస్. 131 00:10:02,227 --> 00:10:04,980 మేమేమీ ఆర్డర్ చేయలేదు. వెళ్లిపో. 132 00:10:07,983 --> 00:10:13,030 సర్, లిన్ ఫోర్డ్ గురించి డిడియర్ లెవీ నాకొక సందేశాన్ని ఇచ్చి పంపారు. 133 00:10:20,287 --> 00:10:21,538 ఎవరు మీరు? 134 00:10:48,148 --> 00:10:49,358 తలుపు మూసేయ్, వెంటనే! 135 00:10:54,613 --> 00:10:56,156 నా కోసం ఎందుకు గాలిస్తున్నావు? 136 00:10:56,240 --> 00:10:57,866 నువ్వేనా లిన్ ఫోర్డ్? నువ్వు నా డబ్బును కాజేశావు! 137 00:10:57,950 --> 00:10:59,910 నీ డబ్బు గురించి నాకేమీ తెలీదు! 138 00:10:59,993 --> 00:11:03,247 మరీజియో బెల్కాన్ నా దగ్గరి నుండి అడ్వాన్స్ తీసుకొని సరుకు ఎగ్గొట్టాడు. 139 00:11:03,330 --> 00:11:06,625 -ఆ డబ్బును నువ్వు తీసుకున్నావని అన్నాడు. -అవునా? వాడు అబద్ధం చెప్పాడు. 140 00:11:06,708 --> 00:11:09,753 నేను చెప్తున్నా కదా, లిన్ కి ఈ విషయంలో ఏ సంబంధమూ లేదు. 141 00:11:10,796 --> 00:11:14,299 ఎందుకంటే, వాడు కొలాబాలో హెరాయిన్ అమ్ముతున్నాడంటే, వాడిని చంపాల్సింది నేను. 142 00:11:15,259 --> 00:11:17,469 అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఎవరో తెలుసా? 143 00:11:18,345 --> 00:11:19,388 నేను అతని మనిషిని. 144 00:11:27,771 --> 00:11:30,274 నన్ను వదిలేయండి, నైజీరియాలో నా బతుకు నేను బతుకుతాను, 145 00:11:31,191 --> 00:11:33,527 మరీజియో ఎక్కడున్నాడో మీకు చెప్తాను. 146 00:11:34,570 --> 00:11:38,031 ఆ డబ్బు మీరే ఉంచుకోండి, ఇంకెప్పుడూ మీకు నేను కనబడను. ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 147 00:11:41,285 --> 00:11:43,036 మరీజియో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియాలి. 148 00:12:02,264 --> 00:12:04,558 మరీజియో మనతో అబద్ధం చెప్పాడు. 149 00:12:04,641 --> 00:12:06,935 లిన్ ఫోర్డ్ మనల్ని మోసం చేయలేదు. 150 00:12:07,019 --> 00:12:11,231 అతను ఇప్పుడు అక్కడికే వస్తున్నాడు, నువ్వు మరీజియోని అతనికి అప్పగించు. 151 00:12:12,065 --> 00:12:16,695 కానీ ముందు ఆ డబ్బులు ఎక్కడ పెట్టాడో వాడి చేత చెప్పించు. 152 00:12:17,279 --> 00:12:19,990 వాడి ఎముకలన్నీ విరిగిపోవాలి. అర్థమైందా? 153 00:12:20,073 --> 00:12:21,200 అర్థమైంది, బాస్. 154 00:12:24,494 --> 00:12:25,913 నువ్వు అయిపోయావురా! 155 00:12:30,000 --> 00:12:31,376 వాడు అక్కడ ఉంటాడు. 156 00:12:35,797 --> 00:12:36,798 హేయ్. 157 00:12:38,050 --> 00:12:41,261 వాళ్ల పని పట్టడానికి మా మనుషులని ఇక్కడికి రప్పిస్తా, ఆ తర్వాత మనం మరీజియో దగ్గరికి వెళ్లవచ్చు. 158 00:12:41,345 --> 00:12:43,639 ఆ దరిద్రుని పని పట్టడానికి నాకు ఎవరి సాయం అక్కర్లేదులే. 159 00:12:45,140 --> 00:12:46,683 వాడిని కుర్చీకి కట్టేశారు. 160 00:12:52,606 --> 00:12:55,734 లిన్! నాతో సాగర్ వాడకి వచ్చేయ్. 161 00:12:55,817 --> 00:12:58,028 ఈ రౌడీయిజం నీకు వద్దు, లిన్. 162 00:12:58,111 --> 00:13:01,073 చూడు, వీళ్ల దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావో నేను అర్థం చేసుకోగలను. 163 00:13:01,156 --> 00:13:04,618 కానీ మరీజియో పైకి ఆవేశంగా వెళ్లడం ఎందుకు? ప్రతీకారంతో నీకు వచ్చేది ఏముంది? 164 00:13:04,701 --> 00:13:06,995 నువ్వు చావలేదు కదా, అదే పది వేలు. ఇక ఇక్కడితో వదిలేయ్. 165 00:13:07,079 --> 00:13:09,122 వాడు చంపాలని చూసింది నిన్ను కాదు కదా. 166 00:13:10,791 --> 00:13:12,835 ఇలాంటి వాళ్లని వదిలేస్తే, వాళ్లు ఇలాంటివి చేస్తూనే ఉంటారు. 167 00:13:12,918 --> 00:13:16,421 నువ్వు నా మాట విను. అబ్దులా మాటలు కానీ, నీ మనస్సు చెప్పే మాటలు కానీ వినవద్దు. 168 00:13:17,297 --> 00:13:20,133 నాపై నమ్మకం ఉంచు, మిత్రమా. 169 00:13:21,093 --> 00:13:23,136 నాతో ఇంటికి వచ్చేయ్. 170 00:13:30,936 --> 00:13:32,604 నేను ఆ మాటలను విని ఉండాల్సింది, 171 00:13:32,688 --> 00:13:35,357 కానీ ఇన్నేళ్లుగా దాగి ఉన్న కోపం, 172 00:13:36,191 --> 00:13:39,570 జైలులో ఉండగా అణుచుకొని ఉంచిన క్రోధం, అన్నీ ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చేశాయి. 173 00:13:39,653 --> 00:13:42,447 మళ్లీ ఒకరు నన్ను ఇరికించారని అవధుల్లేని కోపం. 174 00:13:43,907 --> 00:13:48,412 వేరే వాళ్ల అబద్ధాల వల్ల నా ప్రాణాలు ప్రమాదంలో పడటం. 175 00:14:11,101 --> 00:14:12,519 ఇది ముగిసే విషయం కాదురా, ద్రోహి. 176 00:14:26,533 --> 00:14:28,368 అయ్య బాబోయ్. 177 00:14:29,912 --> 00:14:31,413 చూడు ఎలా ఉన్నావో. 178 00:14:33,874 --> 00:14:36,835 లీటరు రక్తం కోల్పోయావని ఎవరో చెప్పారు. 179 00:14:38,170 --> 00:14:39,755 నేను కొట్టినోడి పరిస్థితిని చూడాల్సింది నువ్వు. 180 00:14:40,255 --> 00:14:43,550 అవకాశం దొరికినప్పుడే వాడిని చంపేసుండాల్సింది నువ్వు. 181 00:14:45,761 --> 00:14:48,138 వాళ్లు నీపై దాడి చేయడం ఆపరు, డేల్. 182 00:14:48,931 --> 00:14:49,932 ఎప్పటికీ ఆపరు. 183 00:14:58,690 --> 00:15:00,275 నాకు తెలీదు! 184 00:15:00,859 --> 00:15:02,069 డబ్బు ఎక్కడ ఉంది? 185 00:15:35,394 --> 00:15:38,355 నీ పనే అయిపోయిందిరా. నీ పనే. 186 00:15:52,327 --> 00:15:55,706 కస్టమ్స్ సిబ్బందికి దయచేసి మీ పాస్ పోర్ట్, ఇంకా వీసాలను చూపండి. 187 00:16:04,256 --> 00:16:06,466 భారతదేశానికి స్వాగతం, మిస్టర్ నైటింగేల్. 188 00:16:10,137 --> 00:16:11,138 డిటెక్టివ్ నైటింగేల్? 189 00:16:11,221 --> 00:16:12,222 నైటింగేల్ 190 00:16:12,306 --> 00:16:14,808 నా పేరు చవాన్ శర్మ. బొంబాయి పోలీసు శాఖ మీకు సహాయంగా ఉండమని నన్ను నియమించింది. నేను… 191 00:16:14,892 --> 00:16:18,979 హేయ్. వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు సాయపడకుండా ఏం చేస్తున్నారు? 192 00:16:20,981 --> 00:16:25,152 డిటెక్టివ్, మీ పని ఎలా చేయాలి అని వేరెవరైనా మీకు చెప్తే మీకు బాగుంటుందా? 193 00:16:27,446 --> 00:16:30,199 నాకు కూడా నచ్చదు. అతనికి కూడా నచ్చదు అనుకుంటా. 194 00:16:31,700 --> 00:16:33,660 అందరికీ ఖుషీగా ఉంటే ఓకే మరి. 195 00:16:35,245 --> 00:16:37,206 రండి, బయట కారు ఉంది. 196 00:16:37,289 --> 00:16:39,583 మిమ్మల్ని పోలీసు స్టేషనుకి తీసుకెళ్తాను, అక్కడ మనం ఫార్మాలిటీలన్నిటినీ… 197 00:16:39,666 --> 00:16:44,296 లేదు. ముందు, "బొంబాయి నేషనల్"లో పని చేసే నిషాంత్ పటేల్ తో నేను మాట్లాడాలి. 198 00:16:44,796 --> 00:16:46,757 ఇప్పటికే చాలా సమయం వృథా అయిపోయింది. థ్యాంక్స్. 199 00:16:53,180 --> 00:16:57,017 సాగర్ వాడపై హక్కులని దక్కించుకోవడానికి వలీద్ నన్ను రుజూల్ తో పడుకోబెట్టాడు. 200 00:16:57,643 --> 00:17:00,395 వాళ్లు ఏం అడిగితే, అది చేయమని మేడమ్ జూ నాకు చెప్పింది. 201 00:17:00,479 --> 00:17:01,730 నువ్వు రుజూల్ తో పడక పంచుకున్నావా? 202 00:17:02,231 --> 00:17:03,815 అవును, వలీద్ చూస్తూ ఉండగా. 203 00:17:04,858 --> 00:17:06,568 వాళ్లు మాట్లాడుకున్నదంతా విన్నాను. 204 00:17:09,279 --> 00:17:10,906 రుజూల్ ఆ ఒప్పందానికి అంగీకరించాడా? 205 00:17:14,451 --> 00:17:17,954 లేదు. తనని కొనడం అసాధ్యమని వలీద్ కి చెప్పాడు. 206 00:17:18,497 --> 00:17:19,957 కానీ నాతో బాగా గడిపాక ఆ మాట చెప్పాడు. 207 00:17:20,832 --> 00:17:22,209 వలీద్ కి మండింది. 208 00:17:22,291 --> 00:17:24,127 అందుకే రుజూల్ శవమై తేలాడు. 209 00:17:25,921 --> 00:17:27,756 ఇదంతా మేడమ్ జూకి తెలుసా? 210 00:17:28,507 --> 00:17:30,801 ప్యాలెస్ లో ఏం జరిగినా, తనకి తెలిసే జరుగుతుంది. 211 00:17:30,884 --> 00:17:33,136 ఇవన్నీ నువ్వు అధికారికంగా కూడా చెప్పగలవా? 212 00:17:35,681 --> 00:17:36,932 చెప్పగలను. 213 00:17:37,015 --> 00:17:38,559 నీకన్నీ చెప్పేస్తాను, 214 00:17:39,351 --> 00:17:42,145 కానీ నేను ఈ ఊరి నుండి వెళ్లిపోయాకే నువ్వు ఆర్టికల్ ని ప్రచురిస్తావని మాటివ్వాలి. 215 00:17:42,813 --> 00:17:47,150 తర్వాత రుజూల్ డెప్యూటీ మినిస్టర్ అయిన ఆకాష్ పాండేకి ఆ పదవి లభించింది. 216 00:17:47,693 --> 00:17:49,736 టేపులలో ఉన్నదాని ప్రకారం, 217 00:17:49,820 --> 00:17:53,866 అతను వలీద్ డబ్బును తీసుకొని, రుజూల్ తిరస్కరించిన ఒప్పందానికి అంగీకరించాడు, అంతే కదా? 218 00:17:54,491 --> 00:17:56,326 అది నువ్వే విన్నావు కదా. 219 00:17:56,410 --> 00:17:57,703 ఈ ఫోటోలలో ఉన్న అమ్మాయి ఎవరు? 220 00:17:57,786 --> 00:18:00,664 తన పేరు సునీత. తను కామాతిపురలోని వేశ్య. 221 00:18:02,165 --> 00:18:06,461 ప్రభుత్వ అవినీతి, వేశ్యలు, రౌడీలు, విదేశీయులు నడిపించే వేశ్యావాటిక. 222 00:18:07,504 --> 00:18:08,964 నీకు ఇంకేం కావాలి, కవిత? 223 00:18:11,300 --> 00:18:14,636 బెదిరింపుకు సంబంధించిన ఇవన్నీ మీకు ఎక్కడివి? 224 00:18:14,720 --> 00:18:16,263 అవన్నీ నేను ఏర్పాటు చేసినవే. 225 00:18:17,556 --> 00:18:20,517 పాండే ఒకవేళ తన మనస్సు మార్చుకుంటే, అతడిని బెదిరించడానికి వలీద్ కి ఏదోకటి కావాల్సి వచ్చింది. 226 00:18:20,601 --> 00:18:23,729 పాండే మాట నిలబెట్టుకోకపోతే, వలీద్ అతని బండారం బయటపెట్టేస్తాడు. 227 00:18:24,730 --> 00:18:26,899 ఇప్పుడు నువ్వు వలీద్ షాని మోసం చేస్తున్నావా? 228 00:18:27,482 --> 00:18:28,567 అవును. 229 00:18:28,650 --> 00:18:31,737 లిన్ కోసం నీ ప్రాణాన్నే పణంగా పెడుతున్నాను అంటావు! 230 00:18:31,820 --> 00:18:33,447 నేను ఎందుకు చేస్తున్నానో నీకు అక్కర్లేదు కదా? 231 00:18:35,574 --> 00:18:38,785 నాకు నువ్వు మాటివ్వాలి. మన మధ్య అంగీకారం కుదిరినట్టేనా? 232 00:18:45,542 --> 00:18:48,712 టేపులలో ఉన్నది తన గొంతే అని ఆ అమ్మాయి నిర్ధారించాలి. 233 00:18:48,795 --> 00:18:50,672 -తనని నా దగ్గరకి తీసుకురాగలవా? -అలాగే. 234 00:18:53,634 --> 00:18:54,635 సరే మరి. 235 00:18:55,636 --> 00:18:59,223 ప్యాలెస్. నాకు దాని గురించి మొత్తం చెప్పు. 236 00:20:09,835 --> 00:20:11,086 లీసా కార్టర్ ఇల్లినాయి, యుఎస్ఏ 237 00:20:12,921 --> 00:20:13,922 స్పెయిన్ పాస్ పోర్ట్ 238 00:20:28,896 --> 00:20:30,355 మనం పోలీసులకు కాల్ చేయాలి. 239 00:20:36,153 --> 00:20:38,947 రేనాల్డోస్ కెఫే 240 00:20:39,031 --> 00:20:42,201 ఎవరూ కాల్ చేయలేదా? ఎవరూ ఏమీ చెప్పలేదా? 241 00:20:42,284 --> 00:20:43,660 లేదు. మీ కోసం ఏవీ లేవు. 242 00:21:32,751 --> 00:21:33,877 హేయ్, లీసా. 243 00:21:37,673 --> 00:21:40,175 -దెబ్బ బాగా తగిలినట్టుందే. అయ్యో. -అది చిన్నదేలే. 244 00:21:45,931 --> 00:21:47,432 నీ ముఖానికి ఏమైంది? 245 00:21:48,308 --> 00:21:49,685 పనిలో బాగా కష్టపడిపోయానులే. 246 00:21:50,727 --> 00:21:54,022 నీకు డ్రైవరుగా పని చేయడం కన్నా నాకు వేరే పనులు కూడా ఉంటాయని తెలుసు కదా? 247 00:21:54,106 --> 00:21:55,774 వచ్చినందుకు థ్యాంక్స్. 248 00:21:55,858 --> 00:22:00,320 ఖాదర్ భాయ్ వెళ్లమన్నాడు. నీ ఆనందం గురించి ఈ మధ్య ఆయన తెగ ఆలోచించేస్తున్నాడు. 249 00:22:01,238 --> 00:22:02,739 డబ్బు అందులో ఉందా? 250 00:22:02,823 --> 00:22:03,824 రెండు లక్షలు. 251 00:22:03,907 --> 00:22:05,367 అది తనకి దక్కాల్సిన డబ్బే. 252 00:22:05,450 --> 00:22:07,411 కామాతిపుర వేశ్య మహారాణిలా బతకవచ్చు. 253 00:22:09,496 --> 00:22:12,249 తనకి ఏమైతే నీకు ఎందుకు? 254 00:22:12,875 --> 00:22:14,710 మగాడివి అనిపించుకున్నావు. 255 00:22:14,793 --> 00:22:16,336 సునీతకి నేను మాటిచ్చాను. 256 00:22:16,420 --> 00:22:19,756 ఒక్కోసారి మనకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కన్నా ఇంకో మార్గం ఉండదు. 257 00:22:20,716 --> 00:22:22,301 నీకేమైనా పిచ్చి పట్టిందా, కార్లా? 258 00:22:23,427 --> 00:22:26,680 సాగర్ వాడ మన చేతుల్లోకి వస్తుంది. ఖాదర్ మెచ్చి, నీకు చాలా డబ్బులు ఇస్తాడు. 259 00:22:26,763 --> 00:22:28,223 నువ్వు ఆనందపడాలి. 260 00:22:28,849 --> 00:22:31,894 నువ్వు నాకు సాయపడితే ఆనందపడతాలే. 261 00:22:33,562 --> 00:22:36,857 లీసాకి, మొడీనాకి నాకు పాస్ పోర్టులు, ఇంకా ఎగ్జిట్ వీసాలు కావాలి. 262 00:22:37,649 --> 00:22:39,735 ఫోటోలు, ఇంకా కావలసినవన్నీ లోపల ఉన్నాయి. 263 00:22:39,818 --> 00:22:42,196 వాటిని నేరుగా పాస్ పోర్టులు తయారు చేసే చోటికే పంపించేయవా? 264 00:22:42,905 --> 00:22:44,948 -ఎందుకంత తొందర? -నేనేమీ నిన్ను అడగట్లేదు. 265 00:22:47,034 --> 00:22:50,078 నువ్వు చేస్తావా, లేదా వెళ్లి నేరుగా ఖాదర్ ని అడగనా? 266 00:22:59,463 --> 00:23:01,298 బొంబాయి నేషనల్ 267 00:23:09,515 --> 00:23:13,519 నా ఫోన్ కి నాలుగు వాయిస్ మెయిల్స్ పంపావు, ఏంటి అంత కొంపలు అంటుకుపోయే పని? 268 00:23:13,602 --> 00:23:15,562 నేను ఒక ఆర్టికల్ పనిలో ఉన్నా. అది ఒక… 269 00:23:17,439 --> 00:23:21,068 ఏ ఆర్టికల్? మా దేశం నుండి పారిపోయిన ఖైదీ గురించేనా? 270 00:23:21,568 --> 00:23:22,903 మీరు ఎవరు? 271 00:23:24,613 --> 00:23:27,699 డిటెక్టివ్ వాల్టర్ నైటింగేల్ ని. ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు. 272 00:23:27,783 --> 00:23:30,494 మా వాడిని మళ్లీ మా దేశానికి తీసుకెళ్లిపోవడానికి వచ్చా. 273 00:23:30,577 --> 00:23:32,996 ఇక్కడి చవాన్ మాకు సాయపడుతున్నాడు. 274 00:23:34,289 --> 00:23:35,749 ఇంతకీ ఇతను ఏ నేరం చేశాడు? 275 00:23:35,832 --> 00:23:39,878 డేల్ కాంటీ, సాయుధ బ్యాంక్ దోపిడీ చేశాడు, జైలు నుండి తప్పించుకున్నాడు. 276 00:23:41,713 --> 00:23:42,923 అతను లేడు. 277 00:23:44,883 --> 00:23:47,094 ఏంటి? లేడా? ఎక్కడికి వెళ్లిపోయాడు? 278 00:23:47,177 --> 00:23:51,306 ఏమో మరి. నేను ఆర్టికల్ రాస్తున్నానని గ్రహించి, ఎటో చెక్కేశాడు. 279 00:23:51,890 --> 00:23:55,310 కామెడీ చేస్తున్నారా? మీరేం జర్నలిస్ట్ అండీ బాబూ? 280 00:23:56,395 --> 00:24:01,608 ఏమో. జైలు నుండి పారిపోతున్నా ఏమీ చేయలేని పోలీసుల లాంటి దాన్నే ఏమో? 281 00:24:03,819 --> 00:24:06,196 మీరు పెద్ద తెలివిమంతులు అనుకుంటున్నారా? 282 00:24:06,280 --> 00:24:09,324 నేను అధికారిక ఆస్ట్రేలియన్ పని మీద వచ్చా. ఇక్కడ తేరగా కూర్చొని, మీరు చెప్పే సోదంతా… 283 00:24:09,408 --> 00:24:12,911 కానీ నేను ఆస్ట్రేలియన్ ని కాదు, ఇది ఆస్ట్రేలియా కూడా కాదు. 284 00:24:15,289 --> 00:24:18,834 సమాజంలో మంచి పేరున్న భారతదేశ పౌరులని ఇబ్బంది పెట్టే అధికారం ఈ తెల్లోడికి ఉందా? 285 00:24:19,626 --> 00:24:22,254 లేదా బొంబాయి విలేఖరులపై ఇది పోలీసుల ఉక్కుపాదమా? 286 00:24:22,337 --> 00:24:25,215 అది కూడా ఒక కథ కాగలదేమో? 287 00:24:26,049 --> 00:24:29,052 మీరు మహిళా పోలీసును కూడా తీసుకురాలేదు కదా. 288 00:24:29,595 --> 00:24:33,307 మీ పోలీసు శాఖ నియమాలు మీకు తెలీదా, సర్? 289 00:24:33,932 --> 00:24:36,935 -డిటెక్టివ్ నైటింగేల్, మనం ఇక బయలుదేరాలి. -ఆగండి, తనకి అన్నీ తెలుసు, కానీ చెప్పట్లేదు. 290 00:24:37,019 --> 00:24:38,103 మనం వెళ్లిపోవాలి. 291 00:24:47,696 --> 00:24:49,198 తను పచ్చి అబద్ధాలాడుతోంది. 292 00:24:49,948 --> 00:24:53,327 నాకు చెప్పకుండా ఫ్యాక్స్ ఎందుకు పంపించావు? 293 00:24:53,952 --> 00:24:55,579 నువ్వు నాకు థ్యాంక్స్ కదా చెప్పాలి! 294 00:24:55,662 --> 00:24:59,458 నీ స్లమ్ దేవుడు, బ్యాంక్ దోపిడీ చేశాడు, జైలు నుండి పారిపోయి వచ్చాడు. 295 00:25:00,083 --> 00:25:01,710 ఇది అద్భుతమైన కథ. నువ్వన్నది నిజమే. 296 00:25:01,793 --> 00:25:03,545 నువ్వేదీ చెడగొట్టలేదని ఆశిస్తున్నా. 297 00:25:04,630 --> 00:25:05,631 నాకు అంతా అయోమయంగా ఉంది. 298 00:25:06,507 --> 00:25:08,342 నా దగ్గర దీన్ని తలదన్నే కథ ఉంది. 299 00:25:08,425 --> 00:25:10,886 నిన్నటి దాకా దీనిపై తెగ ఉత్సాహంగా పని చేశావు, అదే సమయంలో నీకు నేను సాయం చేయగానే 300 00:25:10,969 --> 00:25:13,388 వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు, అంటే, దీని కన్నా గొప్పదా? 301 00:25:13,472 --> 00:25:17,768 హా, చాలా గొప్పది. కానీ అది దక్కాలంటే, లిన్ ఫోర్డ్ పై ఈగ కూడా వాలకూడదు. 302 00:25:18,644 --> 00:25:19,728 లిన్ కథకి బదులు దీనికి ఒప్పుకున్నా. 303 00:25:20,312 --> 00:25:21,522 దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? 304 00:25:21,605 --> 00:25:25,192 విదేశీ వేశ్యలు, హత్య, ప్రభుత్వ అవినితి, 305 00:25:25,275 --> 00:25:29,488 ఇంకా వలీద్ షా నడిపిస్తున్న భారీ ల్యాండ్ స్కామ్. 306 00:25:30,822 --> 00:25:33,033 నా దగ్గర సాక్షులు ఉన్నారు, ఫోటోలు, ఆడియో టేపులు ఉన్నాయి. 307 00:25:33,116 --> 00:25:37,120 కానీ నీకు అది కావాలంటే, మనం లిన్ కథని పక్కకు పెట్టేయాలి. 308 00:25:40,666 --> 00:25:41,667 కార్లా? 309 00:25:43,669 --> 00:25:44,920 కార్లా, ఇంట్లో ఉన్నావా? 310 00:25:50,008 --> 00:25:51,093 లిన్. 311 00:25:52,803 --> 00:25:54,054 మరీ మంచిది. 312 00:25:55,764 --> 00:25:58,267 కార్లాకి నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసేమో అని కనుక్కుందామని వచ్చా. 313 00:25:58,350 --> 00:25:59,893 నాతో నీకు ఏం పని? 314 00:26:00,561 --> 00:26:02,729 హా, ఒక విషయం జరిగిందిలే. 315 00:26:02,813 --> 00:26:07,359 మరీజియో కొందరి నైజీరియన్ గూండాలని మోసం చేసి, నిందని నాపై వేసేశాడు. 316 00:26:23,667 --> 00:26:25,794 అందులో మొడీనాకి కూడా పాత్ర ఉందని అనిపిస్తోంది. 317 00:26:28,005 --> 00:26:30,132 అతనే ఉంటే, నీకు కూడా పాత్ర ఉంటుంది. 318 00:26:31,508 --> 00:26:33,218 -నాకేమీ తెలీదు, లిన్… -వద్దు… 319 00:26:34,970 --> 00:26:36,096 అబద్ధాలు ఆడకు. 320 00:26:38,390 --> 00:26:39,933 నాకు ఓపిక లేదు, లీసా. 321 00:26:41,560 --> 00:26:43,228 నువ్వు విషయం చెప్తే మంచిది. 322 00:26:44,855 --> 00:26:45,981 సరే, నువ్వు ఊహించింది నిజమే. 323 00:26:50,235 --> 00:26:54,615 మరీజియో రహీమ్ ని మోసం చేశాడు, ఆ తర్వాత మరీజియో నుండి మొడీనా డబ్బులను దొంగిలించాడు. 324 00:26:54,698 --> 00:26:56,491 ఆ విషయం నాకు తెలీదు, కానీ ఆ తర్వాత… 325 00:26:57,784 --> 00:27:00,287 మరీజియో వీరావేశంతో ఊగిపోయి, ఇక్కడికి వచ్చి మా పాస్ పోర్టులను తీసుకొని వెళ్లిపోయాడు. 326 00:27:02,039 --> 00:27:03,540 అతనికి తన డబ్బు కావాలి. 327 00:27:05,125 --> 00:27:07,377 నాకు ఇంతకన్నా ఇంకేమీ తెలీదు, లిన్. అమ్మ తోడు. 328 00:27:08,295 --> 00:27:09,755 మరీజియో నీపై నింద వేశాడని తెలిసుంటే… 329 00:27:10,255 --> 00:27:14,468 నీకు చెప్పేదాన్ని, లిన్. నిజంగానే చెప్పేదాన్ని. 330 00:27:15,302 --> 00:27:17,971 -అవునా? చెప్పేదానివా? -హా. 331 00:27:28,690 --> 00:27:30,943 చూడు, లీసా, ఇవాళ నువ్వు నక్క తోక తొక్కావు. 332 00:27:33,487 --> 00:27:34,947 నాకు మరీజియో కావాలి. 333 00:27:36,490 --> 00:27:38,700 -ఆ… -కాబట్టి, నువ్వు నాకు సాయం చేయాలి, 334 00:27:39,201 --> 00:27:40,994 నీ పాస్ పోర్టులు నీకు ఇచ్చే పూచీ నాది. 335 00:27:41,078 --> 00:27:43,372 ఆ తర్వాత నువ్వు వాడి గురించి కంగారుపడాల్సిన పనే ఉండదు. 336 00:27:43,455 --> 00:27:45,457 లేదు, ఇందులో నేను దూరలేను, లిన్. 337 00:27:46,792 --> 00:27:48,293 మాకు కొత్త పాస్ పోర్టులు వస్తాయి… 338 00:27:49,586 --> 00:27:51,004 ఇవాళ మాత్రం రావు. 339 00:27:51,839 --> 00:27:55,384 నీ గురించి అడగడానికి నేను వచ్చిన మొదటి చోటులోనే నువ్వు ఉన్నావు. 340 00:27:56,593 --> 00:27:59,346 మరీజియో ఇక్కడికి రావడానికి పెద్ద ఎక్కువ సమయం పడుతుందనుకుంటున్నావా? 341 00:28:01,306 --> 00:28:02,933 అప్పుడు ఏం చేస్తావు? 342 00:28:03,684 --> 00:28:05,310 ఇది నీ సమస్య, లీసా. 343 00:28:06,311 --> 00:28:09,147 నీ సమస్యను నేను పరిష్కరిస్తాను, కానీ నీ వంతు నువ్వు చేయాలి. 344 00:28:12,359 --> 00:28:13,777 నీకు ఇది ఓకేనా? 345 00:28:14,570 --> 00:28:15,737 తనకి ఓకేనే. 346 00:28:19,867 --> 00:28:21,785 లిన్, రేపటికి నీ పాస్ పోర్ట్ సిద్ధంగా ఉంటుంది. 347 00:28:21,869 --> 00:28:24,955 మరీజియోకి చాలా ముఖ్యమైన పనులున్నాయి, నీ గురించి ఆలోచించే తీరిక ఉండదు. 348 00:28:25,038 --> 00:28:29,168 ఇక లీసా, మొడీనాల వ్యవహారం, అది నీకు సంబంధించినది కాదు. 349 00:28:29,751 --> 00:28:31,253 -వదిలేయ్. -నేను వదిలేయలేను. 350 00:28:31,336 --> 00:28:32,588 ఎందుకని? 351 00:28:33,172 --> 00:28:37,092 ఎందుకంటే ఈసారి, నన్ను ఇరికించినవాడి మక్కెలు విరగ్గొట్టందే నేను ఊరుకొనే ప్రసక్తే లేదు. 352 00:28:37,176 --> 00:28:40,387 ఏది చేసినా చేయకపోయినా, బొంబాయి నుండి వెళ్లే ముందు ఆ పని మాత్రం చేసే వెళ్తాను. 353 00:28:41,054 --> 00:28:43,348 నాకు అర్థం కావట్లేదు. ఈసారా? 354 00:28:44,099 --> 00:28:45,309 నీకు అర్థం కానక్కర్లేదు. 355 00:28:46,727 --> 00:28:51,815 లిన్, నేను నీకు రుణపడున్నాను, కానీ ఈ విధంగా ఆ రుణం తీర్చుకోలేను. 356 00:28:54,860 --> 00:28:56,737 నువ్వు కాల్ చేస్తావా లేదా? 357 00:28:59,198 --> 00:29:02,701 కాల్ చేస్తాను. లీసా సందేశం మరీజియోకి అందుతుంది. 358 00:29:03,660 --> 00:29:04,786 థ్యాంక్యూ. 359 00:29:17,674 --> 00:29:18,926 ఇది నీ రక్తమేనా? 360 00:29:20,093 --> 00:29:21,094 కొంత నాది. 361 00:29:22,679 --> 00:29:27,893 నా డ్రగ్స్ ఎక్కడ? పోనీ వాళ్ల దగ్గరి నుండి తీసుకున్న డబ్బేది? 362 00:29:29,645 --> 00:29:30,854 ఆ రెండూ నా దగ్గర లేవు. 363 00:29:32,814 --> 00:29:34,608 డబ్బుని నా దగ్గరి నుండి మొడీనా దొంగిలించేశాడు. 364 00:29:35,526 --> 00:29:39,238 రహీమ్ నన్ను చంపబోయాడు, ఎలాగోలా తప్పించుకున్నా, వాడి మనిషిని చంపాల్సి వచ్చింది… 365 00:29:41,740 --> 00:29:43,909 ఇప్పుడు మొడీనాగాడి ఆచూకీ కనిపెట్టాలి. మన డబ్బు వాడి దగ్గరే ఉంది. 366 00:29:55,879 --> 00:29:57,422 మరి నువ్వు ఎందుకు ఇంకా పారిపోలేదు? 367 00:29:57,506 --> 00:29:58,966 పారిపోవాలా? దేనితో పారిపోవాలి? 368 00:30:00,259 --> 00:30:03,095 ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప నా దగ్గర ఏమీ లేవు. 369 00:30:03,178 --> 00:30:04,429 నాకు ఆ డబ్బు కావాలి. 370 00:30:04,513 --> 00:30:05,848 కార్లా వచ్చింది. 371 00:30:17,651 --> 00:30:20,737 అరగంటలో నేను రాకపోతే, నా కోసం లోపలికి రా. 372 00:30:25,701 --> 00:30:27,494 వాడితో తనకేంటి పని? 373 00:30:28,620 --> 00:30:30,205 వాళ్ల బాస్ యవ్వారం ఇదంతా. 374 00:30:34,209 --> 00:30:36,503 కార్లా, ఖాదర్ ఖాన్ కోసం పని చేస్తోందా? 375 00:30:41,341 --> 00:30:43,844 దీని దుంప దెగ. 376 00:30:44,761 --> 00:30:46,430 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 377 00:30:47,222 --> 00:30:49,808 ఏమీ లేదులే. అది ఇప్పుడు ముఖ్యం కాదులే. 378 00:30:50,809 --> 00:30:54,980 నీ కోసం పాండే చచ్చినా తన కుటుంబాన్ని వదులుకొని రాడు. 379 00:30:55,814 --> 00:30:58,525 అంత మాత్రాన నిన్ను వదిలేయడం న్యాయం కాదు కదా. 380 00:30:59,860 --> 00:31:04,072 నాకేదో మంచి జరుగుతుందని ఆశించాను, అదే నా తప్పు. 381 00:31:06,241 --> 00:31:07,618 నా ముఖానికి అన్ని కోరికలు అవసరమా? 382 00:31:09,578 --> 00:31:11,163 చాలా పిచ్చిగా ప్రవర్తించాను. 383 00:31:12,706 --> 00:31:17,002 సునీత, నీ విలువేంటో నువ్వు తెలుసుకోవాలి. 384 00:31:17,085 --> 00:31:18,378 నేను చెప్పేది అర్థమవుతోందా? 385 00:31:19,171 --> 00:31:21,965 పాండే ఒక పిరికిపంద, అబద్ధాలకోరు. 386 00:31:22,674 --> 00:31:24,635 తనతో జీవితం గడపాలని ఎందుకు అనుకుంటున్నావు? 387 00:31:25,219 --> 00:31:26,845 నా జీవితం ఎట్ట పోతే నీకెందుకు? 388 00:31:27,513 --> 00:31:29,264 నీకు కావలసినవన్నీ నీ దగ్గర ఉన్నాయి. 389 00:31:30,390 --> 00:31:32,601 నేను నీకు మాట ఇచ్చాను. 390 00:31:32,684 --> 00:31:34,645 నేను నీకు మాట ఇచ్చాను. 391 00:31:36,188 --> 00:31:38,607 అయితే, నేను ఇక్కడి నుండి బయటపడగలనా? 392 00:31:38,690 --> 00:31:41,193 అందుకే కదా నేను ఇక్కడికి వచ్చింది. 393 00:31:42,027 --> 00:31:43,946 నువ్వు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్లు. 394 00:31:44,571 --> 00:31:47,199 కావాలంటే, కామాతిపురకే వెళ్లిపో. 395 00:31:48,784 --> 00:31:49,868 లేదంటే… 396 00:31:50,536 --> 00:31:55,791 నీకు నచ్చిన చోట ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సరిపడా డబ్బులు నీకు ఇస్తాను. 397 00:32:01,213 --> 00:32:02,714 మరి అందుకు నేనేం చేయాలి? 398 00:32:03,549 --> 00:32:07,386 జరిగిన దాన్నంతటి గురించి రిపోర్టర్ అయిన నా స్నేహితురాలితో 399 00:32:08,011 --> 00:32:10,430 నువ్వు మాట్లాడాలి, 400 00:32:10,514 --> 00:32:16,103 పాండే ఎలా నిన్ను వాడుకున్నాడో, ఎలా వదిలించుకున్నాడో. 401 00:32:16,186 --> 00:32:17,437 మొత్తం చెప్పాలి. 402 00:32:17,521 --> 00:32:20,274 అలా చెప్తే బుక్ అయిపోతాడు. 403 00:32:20,357 --> 00:32:24,194 ఎవరు ముఖ్యమో, ఎవరు ముఖ్యం కాదో తెలుస్తుంది కదా. 404 00:32:33,745 --> 00:32:35,122 ఎంత ఇస్తున్నావు? 405 00:32:40,252 --> 00:32:41,253 రెండు లక్షలు. 406 00:32:43,505 --> 00:32:48,886 కానీ నువ్వు బొంబాయి నుండి వెళ్లిపోవాలి, ఇంకెప్పటికీ రాకూడదు. 407 00:33:01,607 --> 00:33:04,067 ఇంతటితో మన వ్యవహారం ముగిసినట్టుందే. 408 00:33:05,444 --> 00:33:09,239 మన సునీతని ఆమె కారు దగ్గరకి తీసుకెళ్లు. నేను కార్లాతో ఏకాంతంగా మాట్లాడాలి. 409 00:33:10,240 --> 00:33:14,244 తనకేమీ కాదు. నేను మాట ఇస్తున్నా. 410 00:33:20,959 --> 00:33:24,796 ఈ పని చేస్తే నాకేమీ కాదు అని ఖాదర్ మాట ఇచ్చినట్టే. 411 00:33:24,880 --> 00:33:26,924 దుక్కలా ఇక్కడ బాగానే నిలబడి ఉన్నావుగా. 412 00:33:27,007 --> 00:33:29,676 మన వ్యవహారాన్ని రహస్యంగా ఉంచు, ఆ మాట అలాగే నిలబడుతుంది. 413 00:33:31,595 --> 00:33:33,013 నేను కూడా అదే చెప్తున్నా. 414 00:33:33,096 --> 00:33:34,473 బెదిరిస్తున్నావా? 415 00:33:34,556 --> 00:33:36,475 లేదు. లేదు. 416 00:33:38,560 --> 00:33:39,895 విన్నవించుకుంటున్నా. 417 00:33:40,979 --> 00:33:46,568 మనందరి పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. 418 00:33:50,155 --> 00:33:53,116 మనల్ని మన రహస్యాలే పట్టి ఉంచుతున్నాయి, కార్లా. 419 00:34:26,775 --> 00:34:28,193 వాళ్ల వెంట ఎవరినైనా పంపుతున్నావా? 420 00:34:28,277 --> 00:34:29,277 హా. 421 00:34:45,710 --> 00:34:46,879 హలో? 422 00:34:46,962 --> 00:34:48,463 డిడియర్ నుండి నీ సందేశం నాకు అందింది. 423 00:34:49,172 --> 00:34:51,466 నీ డబ్బు నీకు ఇచ్చేయమని మొడీనాకి చెప్పా. 424 00:34:51,550 --> 00:34:54,428 మాకు 20 వేలు ఇచ్చి, మా పాస్ పోర్టులు ఇచ్చేస్తే చాలు. 425 00:34:54,511 --> 00:34:55,971 నాకు అది ఓకే. 426 00:34:57,014 --> 00:34:59,016 మమ్మల్ని ఏమీ చేయనని నువ్వు మాటివ్వాలి. 427 00:34:59,600 --> 00:35:01,768 డబ్బు తీసేసుకో, ఆ తర్వాత నువ్వెవరో, మేమెవరో. 428 00:35:01,852 --> 00:35:03,687 దీన్ని ప్రారంభించింది నేను కాదు, లీసా. 429 00:35:04,813 --> 00:35:08,442 వాడే. మనందరి మధ్య ఏమీ ఉండకూడదనే నా ప్రయత్నం. 430 00:35:11,987 --> 00:35:14,072 రాత్రి పది గంటలకి మొడీనా ఇంటికి రా. 431 00:35:18,202 --> 00:35:19,453 అతను ఇంట్లో ఉంటాడు. 432 00:35:20,078 --> 00:35:21,371 నువ్వు కూడా నాతో రావాలి. 433 00:35:22,456 --> 00:35:24,041 దయచేసి ఇక నన్ను వదిలేయ్. 434 00:35:24,124 --> 00:35:25,709 అంతా బాగానే ఉందని అతనికి అనిపించాలి. 435 00:35:25,792 --> 00:35:28,462 నువ్వు అక్కడ లేకపోతే, అతనికి అనుమానం వస్తుంది. 436 00:35:28,545 --> 00:35:29,880 ఎందుకు ఈ విషయంలో నీకు అంత పట్టుదల? 437 00:35:31,048 --> 00:35:34,343 వెళ్లి నీ మురికివాడలో వైద్య సేవలు అందించవచ్చు కదా? 438 00:35:35,010 --> 00:35:38,931 మన్నించు, లీసా. చేసినదానికి వాడు అనుభవించి తీరాలి. 439 00:35:39,515 --> 00:35:41,183 అయితే, అతడిని చంపేస్తావా? 440 00:35:43,227 --> 00:35:45,020 వాడు చేసింది ఎంత తప్పో వాడికి తెలిసొచ్చేలా చేస్తాను. 441 00:36:03,580 --> 00:36:04,915 ఎక్కడికి తీసుకొచ్చావు? 442 00:36:04,998 --> 00:36:08,794 సునీత క్షేమంగా ఉండటానికి నేను ఇలా ఏర్పాటు చేశా. ఇక్కడి నుండి వెళ్లిపోవడంలో తనకి వాళ్లు సాయపడతారు. 443 00:36:08,877 --> 00:36:10,838 -ఎవరు? -నేస్తంలే. 444 00:36:10,921 --> 00:36:12,422 ఇంటికి నేను ఒక్కదాన్నే వెళ్లగలనులే. 445 00:36:37,281 --> 00:36:39,992 కవిత, తనే సునీత. 446 00:36:42,619 --> 00:36:43,620 రండి. 447 00:36:52,004 --> 00:36:53,005 పోలీసు 448 00:36:53,088 --> 00:36:54,298 మీకు ఇక్కడ అధికారం లేదు, 449 00:36:54,381 --> 00:36:57,426 మీరు ఏం చేయాలనుకున్నా కానీ, దానికి మా పై అధికారులు సమ్మతించాలి, 450 00:36:57,509 --> 00:36:59,970 ఆ తర్వాత నా సహకారంతో కానీ, లేక ఒక నియమిత అధికారి సహకారంతో కానీ అది మీరు చేయాలి. 451 00:37:00,053 --> 00:37:02,306 హా, కానీ హోటల్స్ లో వెతకాలని నేను చేసిన అభ్యర్థనని మీరు ఆమోదించారా? 452 00:37:02,389 --> 00:37:03,724 దానికి చాలా సమయం పడుతుంది. 453 00:37:03,807 --> 00:37:05,767 కానీ అది ప్రాసెస్ లో ఉందా? ఇంకా, ఆ అమ్మాయి సంగతేంటి? 454 00:37:05,851 --> 00:37:07,644 న్యూస్ పేపర్ ఆఫీసుకు వెళ్లి ఆమెని ఇంకోసారి విచారణ చేద్దామా? 455 00:37:07,728 --> 00:37:09,438 ఆమె చేత మనమేమీ చెప్పించలేం. 456 00:37:09,521 --> 00:37:12,065 తను చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తికి అండగా ఉంది. అలా అంటే ఎలా! 457 00:37:12,149 --> 00:37:13,442 మీ దగ్గర అందుకు ఏ ఆధారమూ లేదు. 458 00:37:13,525 --> 00:37:15,235 పైగా, ఆ న్యూస్ పేపర్ వాళ్లు రచ్చ రచ్చ చేసే రకం. 459 00:37:19,406 --> 00:37:21,116 ఇది మీకు కేటాయించిన ఆఫీసు. 460 00:37:28,248 --> 00:37:29,374 వావ్. 461 00:37:31,627 --> 00:37:32,878 బాబోయ్, చాలా వేడిగా ఉంది. 462 00:37:33,879 --> 00:37:36,089 మీకోసం ఏమైనా తీసుకురానా? 463 00:37:36,173 --> 00:37:38,967 టీ కానీ ఆహారం కానీ? విమానం దిగిన తర్వాత నుండి మీరేమీ తినలేదు. 464 00:37:39,051 --> 00:37:41,261 సమోసా? నాన్? వెజ్ రోల్? 465 00:37:41,887 --> 00:37:44,223 మీరు తినే కారపు ఆహారాన్ని నేను తినలేను. 466 00:37:45,307 --> 00:37:46,850 ఉడికించిన గుడ్లను కొన్నింటిని తీసుకురండి. 467 00:37:46,934 --> 00:37:48,101 అలాగే. 468 00:38:08,539 --> 00:38:09,665 లీసా? 469 00:38:14,044 --> 00:38:15,170 లీసా? 470 00:38:21,635 --> 00:38:22,761 లీసా? 471 00:38:59,715 --> 00:39:01,550 వెధవ వేషాలేవైనా వేస్తే, మొదటి తూటా నీలోకే దిగుతుంది. 472 00:39:02,509 --> 00:39:06,471 సెబాస్టియన్? తనపై తుపాకీ పెట్టున్నాను. 473 00:39:06,555 --> 00:39:08,223 అవును. ఇతని దగ్గర తుపాకీ ఉంది. 474 00:39:09,600 --> 00:39:11,268 లోపలికి పద, లైట్ ఆన్ చేయ్. 475 00:39:12,227 --> 00:39:13,353 ఇప్పుడే. 476 00:39:24,198 --> 00:39:27,743 ఆగు, లిన్, ఆగు. డబ్బు. 477 00:39:27,826 --> 00:39:29,870 డబ్బు ఎక్కడ ఉందో ఆమెకి తెలుసు. ఆగు. 478 00:39:29,953 --> 00:39:31,872 డబ్బుపై నాకు ఆశ లేదు! 479 00:39:33,790 --> 00:39:34,791 నువ్వు నన్ను ఇరికించావు. 480 00:39:34,875 --> 00:39:35,876 లేదు. లేదు, లేదు. 481 00:39:37,252 --> 00:39:39,379 నేను చావాలని కోరుకున్నావా? హా? 482 00:39:39,463 --> 00:39:41,381 -లేదు. లేదు! -నేను చావడమేనా నీకు కావలసింది? 483 00:39:41,465 --> 00:39:43,967 -ఎలా అనిపిస్తోంది? ఎలా అనిపిస్తోంది? -క్షమించు, లిన్. 484 00:39:44,051 --> 00:39:46,595 చావబోతున్నావని తెలిసి, ఇక ఏ దారీ లేక అలా అంటున్నావా? 485 00:39:46,678 --> 00:39:47,721 నువ్వే అనుకున్నా! 486 00:39:47,804 --> 00:39:49,890 టాహేరీకి నా గురించి చెప్పింది నువ్వే అనుకున్నా. 487 00:39:49,973 --> 00:39:52,142 -నన్ను చంపిద్దామని చూశావు అనుకున్నా. -అబద్ధం! 488 00:39:52,226 --> 00:39:55,187 -కానీ అది కార్లా అని నాకు తెలీదు. -ఆపు, మరీజియో! 489 00:39:58,398 --> 00:39:59,816 -ఏం మాట్లాడుతున్నావు నువ్వు? -లిన్. 490 00:39:59,900 --> 00:40:01,360 నోర్మూసుకో! 491 00:40:03,487 --> 00:40:04,863 మళ్లీ చెప్పు. 492 00:40:04,947 --> 00:40:09,284 నేను తప్పు చేశాను. కానీ నన్ను చంపకు. సరేనా? 493 00:40:09,368 --> 00:40:12,371 కార్లా, ఖాదర్ భాయ్ కోసం పని చేస్తోందని నాకు తెలీదు. సరేనా? 494 00:40:12,454 --> 00:40:15,958 అబ్దులాకి చెప్పి, నన్ను ఇరికించింది నువ్వేనని అనుకున్నా. 495 00:40:16,041 --> 00:40:18,335 కానీ అది తను చేసిన పని. తను చేసిన పని. 496 00:40:18,418 --> 00:40:20,504 ఈ ఆడాళ్లు… ఈ ఆడాళ్లు నన్ను ఇరికించేశారు. 497 00:40:20,587 --> 00:40:22,673 వద్దు. వద్దు. 498 00:41:00,043 --> 00:41:01,420 ఏంటివన్నీ? 499 00:41:01,503 --> 00:41:03,964 ఉడకపెట్టిన గుడ్లు, ఇంకా మీరు కోరిన హోటల్ రికార్డులు. 500 00:41:07,301 --> 00:41:09,928 ఇవన్నీ నేను ఒక్కడినే ఎలా చూడగలను? 501 00:41:10,012 --> 00:41:12,556 మేము చూశామంటే మేము ఏమైనా మిస్ కావచ్చు, 502 00:41:12,639 --> 00:41:15,642 కానీ మీరు మంచి డిటెక్టివ్ కాబట్టి, మీరన్నీ పక్కాగా చూడగలరని ఇలా ఏర్పాటు చేశా. 503 00:41:16,560 --> 00:41:19,479 ఇవన్నీ ఇంగ్లీషులోనే ఉన్నాయా? చవాన్? 504 00:41:26,195 --> 00:41:27,738 నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు? 505 00:41:29,448 --> 00:41:30,532 ఏం జరుగుతోంది? 506 00:41:38,874 --> 00:41:40,417 ఇంత సేపూ అవి నీ దగ్గరే ఉన్నాయా? 507 00:41:41,335 --> 00:41:42,794 దరిద్రుడా. 508 00:41:42,878 --> 00:41:44,630 మనందరం అబద్ధాలకోరులమే అనుకుంటా. 509 00:41:44,713 --> 00:41:46,590 అసలు ఏం జరుగుతోందో ఎవరైనా చెప్తారా? 510 00:41:46,673 --> 00:41:47,674 -వద్దు. -వాడు… 511 00:41:53,013 --> 00:41:54,181 ఏంటిదంతా? 512 00:42:06,151 --> 00:42:07,402 లిన్, చెప్పు. 513 00:42:13,325 --> 00:42:15,869 ఎవరైనా ఈ ముక్క నీకు చెప్పడం గుర్తుందా… 514 00:42:18,121 --> 00:42:21,375 జీవితంలోని ప్రశ్నలకు చాలా వరకు సమాధానాలు 515 00:42:21,458 --> 00:42:22,960 భాగవతంలో లభిస్తాయి అని. 516 00:42:26,338 --> 00:42:28,632 ఆ రోజు రాత్రే నేను ఖాదర్ ఖాన్ కి నిన్ను పరిచయం చేశాను. 517 00:42:37,975 --> 00:42:39,309 అప్పుడు నువ్వు నాతో అబద్ధమాడావు, 518 00:42:40,477 --> 00:42:42,855 అప్పట్నుంచీ అబద్ధాలు ఆడుతూనే ఉన్నావు. 519 00:42:43,438 --> 00:42:45,148 మొదట్నుంచి ఇది మీ ప్లానా? 520 00:42:47,568 --> 00:42:51,488 రుజూల్ కోసం, సాగర్ వాడ కోసం నన్ను వాడుకోవాలనుకోవడం. 521 00:42:52,281 --> 00:42:54,575 నన్ను తోలుబొమ్మలా మీ ఇద్దరూ ఆడించడం? 522 00:42:56,201 --> 00:43:01,039 నన్ను ముగ్గులోకి దించడం, నీపై మనస్సు పారేసుకొనేలా చేయడం నీకు అప్పగించిన పనా? 523 00:43:02,541 --> 00:43:06,336 అతని పనులన్నింటినీ చేయడానికి నన్ను అక్కడే ఉండేలా చూసుకోవడం? 524 00:43:11,925 --> 00:43:15,304 నాకు బాగాలేనప్పుడు నువ్వు నన్ను చూసుకున్నావు కదా? 525 00:43:16,972 --> 00:43:20,851 అది కూడా మీ ప్లానులో భాగమేనా? నాపై నీకు ప్రేమ ఉందని నమ్మించడానికేనా? 526 00:43:25,063 --> 00:43:27,900 -ఇప్పుడు కూడా ఏమీ చెప్పవా? -నేనేం చెప్పినా కానీ ఇప్పుడు నువ్వు… 527 00:43:27,983 --> 00:43:30,360 నేను తప్పుగా ఆలోచిస్తున్నానని చెప్పు. 528 00:43:32,613 --> 00:43:37,618 నేను నీకు మొత్తం చెప్పేశాను… కానీ నువ్వు నాకు ఏమీ చెప్పలేదు. 529 00:43:40,829 --> 00:43:42,998 అసలు నాపై ఎప్పుడైనా నీకు మనస్సు కలిగిందా? 530 00:43:43,081 --> 00:43:44,082 కలిగింది. 531 00:43:46,043 --> 00:43:47,544 అయినా కానీ నాతో అబద్ధం చెప్పావా? 532 00:43:47,628 --> 00:43:48,629 అవును. 533 00:43:51,465 --> 00:43:52,799 నీకు థ్యాంక్స్ చెప్పాలేమో. 534 00:43:56,345 --> 00:43:59,181 ఇక్కడి నుండి వెళ్లిపోతున్నందుకు మొట్టమొదటిసారిగా నాకు సంతోషంగా ఉంది. 535 00:43:59,264 --> 00:44:01,725 -నువ్వు వెళ్లాల్సిన పని లేదు. -ఏంటి? 536 00:44:01,808 --> 00:44:03,519 నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. 537 00:44:04,186 --> 00:44:06,522 నువ్వు చెప్పినదంతా నిజమే. 538 00:44:08,023 --> 00:44:10,651 కానీ దయచేసి నేను చెప్పేది విను. నేను చేయగలిగేది ఏమైనా ఉందంటే, నేను… 539 00:44:10,734 --> 00:44:13,278 నువ్వు నాకేమీ చేసి పెట్టనక్కర్లేదు. 540 00:44:16,156 --> 00:44:17,991 ఇక జన్మలో నీ ముఖం చూడను. 541 00:44:47,729 --> 00:44:49,690 గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ రచించిన శాంతారాం ఆధారంగా తెరకెక్కించబడింది 542 00:46:07,726 --> 00:46:09,728 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్