1 00:00:01,168 --> 00:00:02,878 Foundationలో ఇంతకు ముందు... 2 00:00:02,961 --> 00:00:04,171 మన మీద దాడి జరిగింది. 3 00:00:05,130 --> 00:00:06,632 అది మీకెలా అనిపిస్తోంది? 4 00:00:06,715 --> 00:00:08,090 నాకు భయంగా ఉంది. 5 00:00:08,175 --> 00:00:12,513 అందుకే ఇప్పుడు మనం అందరికీ స్థైర్యంగా ఉన్నామని చూపాలి. 6 00:00:15,057 --> 00:00:16,600 -ఏం చేశావు నువ్వు? -నువ్వు ఇక్కడ ఉండకూడదు. 7 00:00:16,683 --> 00:00:19,019 పెనుగులాడకు. శాంతించు. నీకు శ్వాస ఆడుతుంది. 8 00:00:19,728 --> 00:00:22,773 ఒక కొత్త వేకువ సోదరుడు ఉదయించాడు. 9 00:00:22,856 --> 00:00:24,691 -ఏదో తేడాగా ఉంది. -తేడాగా ఉందా? 10 00:00:24,775 --> 00:00:26,985 ఏదో తేడాగా అనిపిస్తోంది. అలా సరిహద్దు దాకా వెళ్లి చూసొస్తా. 11 00:00:27,069 --> 00:00:28,570 అవి యుద్ధనౌకలు. 12 00:00:28,654 --> 00:00:30,531 కమ్యూనికేషన్స్ సర్వర్ ప్రతిస్పందించడం లేదు. దానికి సిగ్నల్ అందడం లేదు. 13 00:00:30,614 --> 00:00:33,033 వాళ్లు రావడానికి, వాల్ట్ కీ ఏదో సంబంధం ఉండుంటుంది. శూన్య క్షేత్రం విస్తరిస్తోంది. 14 00:00:33,116 --> 00:00:35,118 ఆ తర్వాతి రోజే, అనాక్రియాన్లు వచ్చారు. 15 00:01:44,270 --> 00:01:46,272 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించబడింది 16 00:02:13,341 --> 00:02:17,887 ఒకసారి, ఒక వ్యక్తి హారీ సెల్డన్ ని కలిసి తన జాతకం చెప్పమన్నాడు. 17 00:02:25,812 --> 00:02:27,021 ఆయన చెప్పే జాతక ఫలితాలు 18 00:02:27,105 --> 00:02:30,399 తన జీవిత ప్రాముఖ్యాన్ని పెంచగలవేమో తెలుసుకోవాలన్నది అతని ఉద్దేశం. 19 00:02:35,196 --> 00:02:39,200 కానీ జన సమూహాల కదలికలను మాత్రమే జోస్యం చెప్పగలనని హారీ అన్నాడు. 20 00:02:42,245 --> 00:02:47,125 వ్యక్తుల జాతకం ఎప్పుడూ నిగూఢంగానే ఉంటుంది. 21 00:03:31,043 --> 00:03:33,379 నాగరికతా భాగాలు... 22 00:03:36,215 --> 00:03:38,718 సంస్కృతుల ఉత్థాన పతనాలు... 23 00:03:41,220 --> 00:03:43,389 ఆదర్శాలు, ప్రపంచాలు... 24 00:03:46,350 --> 00:03:50,104 ఈ సమాధానాలను హారీ సెల్డన్ ఎంతో కాలం క్రితమే విడమరచి చెప్పాడు. 25 00:03:52,440 --> 00:03:55,860 నమ్మకం అనేది ఒక శక్తిమంతమైన ఆయుధం. 26 00:03:57,612 --> 00:04:01,949 అందువల్లనే హారీ సెల్డన్ జోస్యమంటే మహారాజుకు ఎంతో భయం. 27 00:04:03,618 --> 00:04:09,624 సామ్రాజ్యాలు ప్రపంచాలని పాలిస్తాయి, కానీ ఆ తరువాత వచ్చేదేమిటి? మన ఆత్మలేనా? 28 00:04:10,374 --> 00:04:12,585 ఈ రాజ్యాలే విశ్వాసానికి హద్దు. 29 00:04:12,668 --> 00:04:17,840 విశ్వాసమనేది అనంతమైన మంటల్లోంచి రూపుదిద్దుకున్న కత్తివంటిది. 30 00:05:03,052 --> 00:05:05,888 మహారాజా? మీకు వేరే విధమైన వినోదం కావాలా? 31 00:05:05,972 --> 00:05:10,476 సాధారణమైన ఆనందాలను మామూలుగా అందించడానికి భిన్నంగా నువ్వు ఇవ్వగలవు. 32 00:05:10,560 --> 00:05:13,146 మీకు ఎలాంటి వినోదం కావాలి, మహారాజా? 33 00:05:14,105 --> 00:05:18,317 కేవలం వినోదం మాత్రమే అందిస్తావా? అది సాధ్యమేనా? 34 00:05:19,068 --> 00:05:22,071 మిమ్మల్ని స్పర్శించేందుకు ఎవరినీ అనుమతించరట కదా, నిజమేనా? 35 00:05:24,991 --> 00:05:26,367 నిస్సంకోచంగా మాట్లాడుతున్నావు కదా? 36 00:05:26,451 --> 00:05:31,205 నేను 24 గంటలు మాత్రమే మీ సేవలో ఉంటాను. దానిని సద్వినియోగం చేసుకుంటాను. 37 00:05:33,916 --> 00:05:35,334 అయితే నన్ను ముట్టుకునేందుకు ప్రయత్నించు. 38 00:05:39,130 --> 00:05:40,840 చెబుతున్నాగా, ముట్టుకో. 39 00:06:08,826 --> 00:06:10,620 పరిమళం గతి శక్తిని వెనక్కు నెడుతోంది. 40 00:06:12,705 --> 00:06:17,001 మళ్లీ ప్రయత్నించు. మృదువుగా స్పర్శించు, 41 00:06:18,795 --> 00:06:19,796 నెమ్మదిగా. 42 00:06:24,342 --> 00:06:25,343 నెమ్మదిగా. 43 00:06:42,568 --> 00:06:44,362 అయితే... 44 00:06:44,445 --> 00:06:45,488 ...మిగతావి ఎలా పనిచేస్తాయి? 45 00:07:00,962 --> 00:07:02,380 ఏంటి? 46 00:07:02,463 --> 00:07:04,090 మీతో అవసరం పడింది, మహారాజా. 47 00:07:05,508 --> 00:07:09,011 మహారాజుకి శారీరక సౌఖ్యం అవసరం ఉందన్న సంగతి నాకు తెలుసు. 48 00:07:09,095 --> 00:07:11,722 కానీ దానికంటే ప్రస్తుత విషయం ఇంకా ముఖ్యమైనది. 49 00:07:25,820 --> 00:07:27,196 రాయబారి తాన్వల్. 50 00:07:28,072 --> 00:07:31,117 పరమ పూజ్యులు, ప్రకాశవంతమైన ఘన కీర్తి గల మహారాజా... 51 00:07:31,200 --> 00:07:32,743 పొగడ్తలు చాలించండి, రాయబారీ. 52 00:07:34,162 --> 00:07:37,165 ప్రాక్సిమా ఓపల్ మరణించింది, మహారాజా. 53 00:07:37,248 --> 00:07:38,374 మా ప్రగాఢ సానుభూతి. 54 00:07:38,458 --> 00:07:40,501 హృదయపూర్వక నివాళులు. 55 00:07:40,585 --> 00:07:42,462 ధన్యవాదాలు, మహారాజా. 56 00:07:42,545 --> 00:07:46,048 ఆమె జాతివారంతా ఆమెను కోల్పోతారు, ఎంతగానో సంతాపం వ్యక్తం చేస్తారు. 57 00:07:46,132 --> 00:07:50,344 ఇక ఇప్పుడు ధర్మసభ ఆమె వారసురాలు, జెఫిర్ గిలాట్ కు పట్టం కడుతుంది. 58 00:07:50,428 --> 00:07:52,555 ఆమె సమర్థత గల అభ్యర్ధి. మాకూ ఆమె పట్ల అభిమానం ఉంది. 59 00:07:53,055 --> 00:07:55,558 మా నివాళులు తెలియజేయండి, రాయబారీ. 60 00:07:55,641 --> 00:07:59,645 ట్రాంటార్ కు ఆమెను స్వాగతిస్తున్నట్లు గిలాట్ కు చెప్పండి. 61 00:07:59,729 --> 00:08:03,608 మహారాజా, వారసురాలి విషయానికొస్తే, 62 00:08:03,691 --> 00:08:06,861 ఒక చర్చకు తెరలేచింది. 63 00:08:07,570 --> 00:08:10,865 వేరొక అభ్యర్ధికి మద్దతు పెరుగుతోంది. 64 00:08:12,325 --> 00:08:13,326 జెఫిర్ హలీమా. 65 00:08:14,368 --> 00:08:18,539 మునుపటి ప్రాక్సిమాల మాదిరిగా ఆమోదింపబడిన సిద్ధాంతానికి 66 00:08:18,623 --> 00:08:21,250 హలీమా ఇఫా కట్టుబడి ఉండదు. 67 00:08:21,334 --> 00:08:25,088 ప్రైమరీ ఆక్టావోకు తిరిగి రావాలని ఆమె వాదిస్తోంది. 68 00:08:26,506 --> 00:08:27,673 ఆమెకి చావాలనుందా? 69 00:08:28,716 --> 00:08:30,927 మా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేందుకు ఆమె ఎవరు? 70 00:08:31,010 --> 00:08:32,887 క్షమించాలి, మహారాజా. నేను... 71 00:08:32,970 --> 00:08:35,098 -దీని గురించి నీకు తెలుసా? -ఇప్పుడే తెలిసింది. 72 00:08:35,890 --> 00:08:37,475 ఓపల్ అంత్యక్రియలు ఎప్పుడు? 73 00:08:37,558 --> 00:08:39,268 రెండు రోజుల్లో, మహారాజా. 74 00:08:52,406 --> 00:08:55,993 ఈ సంభాషణ గురించి ఎక్కడా అనకు. నిన్ను త్వరలో సంప్రదిస్తాం. 75 00:09:04,460 --> 00:09:06,963 మునుపటి ప్రాక్సిమాను నెలకొల్పడంలో నేను సాయపడ్డాను. 76 00:09:07,046 --> 00:09:09,549 వీలైనంత త్వరలో ధర్మసభకు హాజరవుతాను. 77 00:09:09,632 --> 00:09:12,468 అది అంత అవసరమా? మీరు హోలో-కాస్ట్ అయితే సరిపోతుంది కదా? 78 00:09:12,551 --> 00:09:13,553 ఈసారికి వీలు కాదు. 79 00:09:13,636 --> 00:09:19,434 లుమినిజమ్ కు మూడు లక్షల కోట్ల అనుచరులు ఉన్నారు. వ్యక్తిగతంగా హాజరైతే మంచిది. 80 00:09:27,650 --> 00:09:29,694 ప్రైమరీ ఆక్టోవా అంటే ఏమిటి? 81 00:09:30,528 --> 00:09:33,865 అది ఒక మతోన్మాద గ్రంథం. సామ్రాజ్యానికి ముందు నుంచీ ఉన్నది. 82 00:09:35,032 --> 00:09:38,161 అది ఆత్మను నేరుగా ప్రత్యేకమైన వ్యక్తిత్వానికి అనుసంధానిస్తుంది. 83 00:09:38,745 --> 00:09:42,165 -అంటే ఏమిటి అర్థం... -ప్రత్యేకమైన వ్యక్తిత్వం అంటే. 84 00:09:42,248 --> 00:09:43,958 ఆలోచించు, వేకువ సోదరా. 85 00:09:44,041 --> 00:09:46,669 ఆత్మ ఒక వ్యక్తికి మాత్రమే అనుసంధానించబడి ఉంటే, 86 00:09:46,753 --> 00:09:50,047 అది ప్రత్యేకమైన వ్యక్తిత్వానికి కాదన్న సందేహం ఉద్భవిస్తుంది. 87 00:09:52,300 --> 00:09:57,513 క్లియాన్లందరూ మొదటివారిని ఖచ్చితంగా పోలి ఉండే జన్యుపరమైన కాపీలు. 88 00:09:57,597 --> 00:09:58,598 కాబట్టి... 89 00:09:59,432 --> 00:10:01,100 మనకు ఆత్మలనేవి లేవు. 90 00:10:02,059 --> 00:10:05,188 అందువల్ల, ఈ హలీమా అనే మహిళ మనం ఏంటని అంటోంది? 91 00:10:06,689 --> 00:10:07,815 మనం మనుషులం కామని అంటోందా? 92 00:10:07,899 --> 00:10:09,484 పరోక్షంగా అలాగే అంటోంది, కానీ... 93 00:10:09,567 --> 00:10:11,569 కానీ తమ నాయకులు తమకంటే 94 00:10:11,652 --> 00:10:14,864 గొప్పవారు కాకుండా, తక్కువ వారని గాలక్సీ నమ్మిన పక్షంలో, 95 00:10:14,947 --> 00:10:16,657 వారిని అనుసరించడం మానేయవచ్చు. 96 00:10:21,788 --> 00:10:23,247 మనం ఒక గాజు పాత్రలాంటివాళ్లం... 97 00:10:24,916 --> 00:10:27,043 నైపుణ్యంతో తిప్పాలి. 98 00:10:29,712 --> 00:10:34,092 లోపల ఒత్తిడి పెరిగి తిరగడం మొదలయ్యాక, మనమంతా ఒకే విధంగా తిప్పకపోతే... 99 00:10:37,303 --> 00:10:38,513 మనం పగిలిపోవచ్చు. 100 00:10:44,644 --> 00:10:46,729 -ఎవరు నువ్వు? -శాల్వార్ హార్డిన్. 101 00:10:48,147 --> 00:10:49,315 టర్మినస్ వార్డెన్ ని. 102 00:10:54,362 --> 00:10:56,656 సామ్రాజ్యపు నేలపై కాలు మోపేందుకు అనాక్రీయాన్లకు అనుమతి లేదు. 103 00:11:00,743 --> 00:11:01,828 ఇక్కడ ఏం చేస్తున్నావు? 104 00:11:01,911 --> 00:11:03,287 చెత్త ఏరుతున్నా. 105 00:11:03,371 --> 00:11:04,831 ఇక్కడ ఏరేందుకు చాలా చెత్త ఉంది. 106 00:11:04,914 --> 00:11:06,916 మేం నౌకకి సంబంధించిన నావిగేషన్ మాడ్యూల్ కోసం చూస్తున్నాం. 107 00:11:06,999 --> 00:11:09,877 ఈ నౌకలో నుంచి క్లిష్టమైన భాగాలన్నీ దశాబ్దాల క్రితమే తొలగించబడ్డాయి. 108 00:11:09,961 --> 00:11:12,713 కానీ, ఒక అసలైన స్క్రాపర్ కే అది తెలుస్తుంది. 109 00:11:12,797 --> 00:11:16,426 మహారాజుకి మీ గురించి తెలియకముందే మీరిక్కడి నుంచి వెళ్లిపోవాలి. 110 00:11:16,509 --> 00:11:18,428 మావాళ్లు మహారాజుకి భయపడే రకం కాదు. 111 00:11:23,474 --> 00:11:26,060 నువ్వు నాకు దొరికిపోయావు, 112 00:11:26,144 --> 00:11:27,520 ఇప్పుడేమో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. 113 00:11:29,105 --> 00:11:32,275 నన్ను చంపేదానివే అయితే, ఇప్పటికే చంపి ఉండేదానివి. 114 00:11:32,358 --> 00:11:33,651 ఏంటి నీ ఆలోచన? 115 00:11:39,699 --> 00:11:42,201 అదిగో స్తంభం. అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లు. 116 00:11:42,285 --> 00:11:43,327 దేనికి? 117 00:11:46,164 --> 00:11:48,291 నీకు స్పష్టంగా చెబుతున్నా, వార్డెన్. 118 00:11:48,374 --> 00:11:51,127 మాకు కనిపించిన ప్రతి వనరునీ ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు. 119 00:11:52,086 --> 00:11:54,380 ఇందాక మేం కొందరు పిల్లల్ని చూశాం, 120 00:11:54,464 --> 00:11:57,049 వేకువ కాకముందే వాళ్లెలా తప్పించుకున్నారో మేం చూశాం, 121 00:11:57,133 --> 00:11:59,635 వాళ్లు మీ అందరికీ దూరంగా పారిపోయారు. 122 00:11:59,719 --> 00:12:04,140 మమ్మల్ని ఆ స్తంభం దగ్గరకి తీసుకెళ్లకపోతే, వాళ్లలో ఒకరిని మేం ఉపయోగించుకుంటాం. 123 00:12:04,223 --> 00:12:06,434 అంది అంత తేలిక కాదు. మాకు కంచె ఉంది. 124 00:12:06,517 --> 00:12:07,810 ఆ కంచె గురించి మాకూ తెలుసు. 125 00:12:07,894 --> 00:12:09,896 ఆ కంచె దగ్గర నువ్వు పనిచేస్తుంటే మేం ఇందాక చూశాం. 126 00:12:09,979 --> 00:12:13,566 మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్లగలిగే దానివి నువ్వేనని అప్పుడే గ్రహించాం. 127 00:12:14,275 --> 00:12:15,401 ఆ స్తంభం దగ్గరకు తీసుకెళ్ళు! 128 00:12:30,249 --> 00:12:32,251 ఆ కంచెకు డి.ఎన్.ఏ గుర్తించే శక్తి ఉంది. 129 00:12:34,170 --> 00:12:36,339 డేటాబేస్ లో లేని వాళ్లను అది మాడ్చి మసి చేస్తుంది. 130 00:12:42,136 --> 00:12:43,596 నేను మీలో ఒకరిని తీసుకువెళ్లగలను. 131 00:12:43,679 --> 00:12:44,972 నా వెనకే వస్తే, 132 00:12:45,056 --> 00:12:47,391 కంచె రెండో వ్యక్తిని ఎర్రర్ గా గుర్తించి వదిలేయగలదు. 133 00:12:47,475 --> 00:12:48,643 అలా అయితే మమ్మల్ని అందర్నీ తీసుకెళ్లు. 134 00:12:48,726 --> 00:12:51,145 ఇది ఒకసారి మాత్రమే పనిచేస్తుందనుకుంటా. 135 00:12:54,690 --> 00:12:57,652 నేను ఈ కంచె దగ్గరకు ఒకసారి ఒక వ్యక్తిని తీసుకెళ్లాను. అతను వెంటనే చనిపోయాడు. 136 00:13:06,244 --> 00:13:10,081 నువ్వు కంగారు పడుతున్నావని తెలుస్తోంది. కంగారు పడకు. 137 00:13:10,164 --> 00:13:14,585 ఆమె కాసేపట్లో వెనక్కి తిరిగి రాకపోతే, మీ నగరాన్ని నేలమట్టం చేస్తాం, జాగ్రత్త. 138 00:13:31,018 --> 00:13:32,562 వెళ్లు, మిగతావాళ్లని తీసుకురా. 139 00:13:32,645 --> 00:13:34,439 వెనక్కి వెళ్లి దూరంగా నిలబడండి. 140 00:13:44,991 --> 00:13:46,617 నా చేతిలో తుపాకీ ఉంది. నువ్వే నడుపు. 141 00:13:57,670 --> 00:13:58,963 కనీసం నీ పేరైనా చెబుతావా? 142 00:13:59,922 --> 00:14:01,215 మనమేమైనా స్నేహితులమా? 143 00:14:01,716 --> 00:14:03,259 మీరు ఇక్కడకు వచ్చి చాలా ప్రమాదంలో పడ్డారు. 144 00:14:03,342 --> 00:14:05,678 మేం ఎలాంటి ప్రమాదాన్నయినా ఎదుర్కోగలం, వార్డెన్. 145 00:14:12,185 --> 00:14:16,689 -మన దారిలో ఓ కుర్రాడు ఉన్నాడు! -అతి చేయకు, నాకూ కళ్లున్నాయి. 146 00:14:26,866 --> 00:14:27,867 స్తంభం ఆవైపు ఉంది. 147 00:14:27,950 --> 00:14:30,036 దగ్గరిదారిలో తీసుకెళ్తున్నా. ఇటువైపు కొద్దిమంది మాత్రమే వాచ్ మేన్లు ఉంటారు. 148 00:14:34,749 --> 00:14:36,167 ఏంటది? 149 00:14:41,130 --> 00:14:42,131 ఆపు. 150 00:14:47,220 --> 00:14:48,429 ఆపు. 151 00:14:54,602 --> 00:14:58,064 శాల్వార్ హార్డిన్ గురించి కథలా? మామూలుగా అవి ఇక్కడే మొదలవుతాయి. 152 00:14:59,273 --> 00:15:01,442 వార్డెన్ మరియు దెయ్యం, 153 00:15:01,526 --> 00:15:03,653 చెప్పలేని విధంగా కలసిపోయారు. 154 00:15:03,736 --> 00:15:04,737 ధన్యవాదాలు. 155 00:15:13,704 --> 00:15:15,456 వాళ్లు మన రాడార్ నుంచి ఎలా తప్పించుకోగలిగారు? 156 00:15:15,540 --> 00:15:18,459 బహుశా, తక్కువ ఎత్తు నుంచి ఎగురుతూ వచ్చి ఉండవచ్చు, 157 00:15:18,543 --> 00:15:19,752 వాళ్ళ నౌకల గురించి ఏమైనా తెలిసిందా? 158 00:15:19,836 --> 00:15:23,047 తాము స్క్రాపర్లమని చెప్పుకుంటున్నారు. ఓ నావిగేషన్ మాడ్యూల్ కోసం వచ్చామన్నారు. 159 00:15:23,131 --> 00:15:25,383 -అదంతా పచ్చి అబద్ధం. -మనం మహారాజుకు చెప్పవలసిందే. 160 00:15:25,466 --> 00:15:26,968 ఏ అధికారమూ లేకుండా మనం ఏమీ చెయ్యలేం. 161 00:15:27,051 --> 00:15:29,887 అమ్మా. మనం పేరుకు మాత్రమే ఈ స్థావరం వద్ద ఉన్నాం. 162 00:15:29,971 --> 00:15:32,265 వాళ్లు మనల్ని సంప్రదించింది ఎప్పుడు? పదేళ్ల క్రితమా? 163 00:15:32,348 --> 00:15:34,475 వాళ్లు మనల్ని రక్షించరు. మనల్ని మనమే రక్షించుకోవాలి. 164 00:15:34,559 --> 00:15:37,019 ఆగు. చివరి అస్త్రంగా హింసను... 165 00:15:37,103 --> 00:15:39,689 ఆశ్రయించేది అసమర్థులు మాత్రమే. నాకు తెలుసు. అది ఒక ముసలాడి సిద్ధాంతం. 166 00:15:39,772 --> 00:15:41,732 నీకంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు నేను గ్రహించిన సత్యం అది. 167 00:15:41,816 --> 00:15:45,069 మనం సాయం కోసం చూడాలా లేక మనంతట మనమే రంగంలోకి దిగాలా? హారి ఎత్తుగడ ఏంటి? 168 00:15:45,153 --> 00:15:48,239 హారి ఇక్కడ లేడమ్మా. మన తంటాలు మనమే పడాలి. 169 00:15:52,410 --> 00:15:54,245 స్నేహితురాలా, స్వాగతం. 170 00:15:55,163 --> 00:15:58,458 మనం సరిగ్గా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సమయంలో నువ్వు సంభాషణ ఆపేశావు. 171 00:15:59,250 --> 00:16:01,627 తలనొప్పా? పళ్లు ఊడిపోతున్నట్టుగా కూడా ఉందా? 172 00:16:01,711 --> 00:16:03,421 ఆ శాపగ్రస్తమైన విషయం ఏమిటి? 173 00:16:03,504 --> 00:16:05,506 మేం టర్మినస్ కు వలస వచ్చినప్పుడు అది ఇక్కడ ఉంది. 174 00:16:05,590 --> 00:16:09,177 అది మా స్కాన్లలో కనిపించలేదు. మీకు కూడా కనిపించలేదనుకుంటా. 175 00:16:09,260 --> 00:16:11,220 మరి నీపై ప్రభావం చూపించట్లేదేం? 176 00:16:11,304 --> 00:16:14,891 టర్మినస్ లో నాకు ఎదురైతే నీ గతి ఇక అంతే అని అనుకో. 177 00:16:15,767 --> 00:16:16,851 కాబట్టి... 178 00:16:18,144 --> 00:16:19,687 ఇప్పుడేం జరుగుతుంది, వార్డెన్? 179 00:16:21,856 --> 00:16:23,566 ఆమె వెనక ఓ చిన్నపాటి సైన్యం ఉంది. 180 00:16:23,649 --> 00:16:25,860 వాళ్ల అడుగులు కొన్ని చాాలా లోతుగా పడ్డాయి. 181 00:16:25,943 --> 00:16:29,405 చిన్న చిన్న అంగలు వేస్తూ నడిచారు. ఏవో భారీ పరికరాలు మోస్తున్నట్టుగా. 182 00:16:29,947 --> 00:16:31,866 వాళ్లు ఇక్కడ ఆశ్రయం ఏర్పరచుకునే పనిలో ఉన్నట్టున్నారు, నాన్నా. 183 00:16:32,366 --> 00:16:34,619 -సరే, మరిప్పుడు ఏం చేస్తావు? -ఏమో మరి. 184 00:16:35,203 --> 00:16:37,121 నాకేం తోస్తే అది చేస్తాను, అలాగే... 185 00:16:37,205 --> 00:16:38,831 ఏమో, ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్లడమే. 186 00:16:38,915 --> 00:16:41,292 నీకేం తోస్తే అది చేస్తే, నువ్వు నౌకల వరకూ వెళ్లేదానివి కావు. 187 00:16:41,375 --> 00:16:43,544 అవే నిన్ను ఆమె వద్దకు తీసుకెళ్లాయి. ఆమెను ఆపగలిగావు. 188 00:16:45,004 --> 00:16:46,339 నీకు లెక్కలు బాగా వస్తే, 189 00:16:46,422 --> 00:16:49,926 అదృష్టమంటే మాటిమాటికీ దక్కే విషయం కాదని నీకు అర్థమవుతుంది, శాల్వార్. 190 00:16:50,843 --> 00:16:52,762 మీ అమ్మ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, 191 00:16:52,845 --> 00:16:56,849 మేం నీ నాయకత్వంలోనే ముందుకు నడుస్తున్నాం. 192 00:16:57,767 --> 00:17:01,437 జనం నిన్ను వార్డెన్ గా చేయడమనేది ఏదో ప్రమాదవశాత్తూ జరిగింది కాదు. 193 00:17:02,980 --> 00:17:04,148 కాబట్టి మాకు నాయకత్వం వహించు. 194 00:17:16,327 --> 00:17:19,622 మీకు సేవ చేసే భాగ్యం నాకింకా కలగలేదు, మహారాజా. మీకు ఎలా సహాయపడగలను? 195 00:17:19,705 --> 00:17:20,957 నువ్వు కెప్టెన్ ఓబ్రెట్, కదా? 196 00:17:21,040 --> 00:17:24,460 నేను షాడో మాస్టర్ ని, మహారాజా. షాడో మాస్టర్ ఓబ్రెట్ ని. 197 00:17:24,544 --> 00:17:25,795 ఆకారమూ, పనీ రెండు సరిగ్గా సరిపోయాయి. 198 00:17:28,339 --> 00:17:31,551 రాజభవనం పనిమనిషిపై చర్యలు తీసుకోవడానికి ప్రోటోకాల్ ఏమిటి? 199 00:17:31,634 --> 00:17:33,761 ఏ స్థాయి పనిమనిషి, మహారాజా? 200 00:17:34,512 --> 00:17:37,849 -తోటలో పని చేసే పనిమనిషి. -సమస్య ఏంటో తెలుసుకోవచ్చా? 201 00:17:37,932 --> 00:17:40,393 నీకు అది అనవసరం. ఆమె పేరు చెప్పు, చాలు. 202 00:17:41,018 --> 00:17:44,855 కనుక్కుంటాను, మహారాజా. మీకు ఇంకేమైనా కావాలా? 203 00:17:44,939 --> 00:17:46,149 ఇప్పటికి అది చాలు. 204 00:17:55,450 --> 00:17:58,452 కంచెకు ఆవల పన్నెండుమందికి పైగా అనాక్రీయాన్లు ఉండటం నేను చూశాను. 205 00:17:58,536 --> 00:18:00,455 ట్రావిక్, నువ్వు దక్షిణభాగానికి వెళ్లు. 206 00:18:00,538 --> 00:18:02,206 కలిన్, నువ్వు పశ్చిమం వైపు రక్షణ చూడు. 207 00:18:02,289 --> 00:18:06,043 యేట్, నువ్వు తూర్పును చూసుకో. ఆ గుట్ట నుంచి ఎవరైనా ప్రవేశిస్తుంటే కనిపెట్టవచ్చు. 208 00:18:06,127 --> 00:18:09,881 మాకు ఎవరైనా కనిపిస్తే, ఏం చేయాలి? 209 00:18:09,964 --> 00:18:10,965 ఏమీ చేయవద్దు. 210 00:18:11,048 --> 00:18:14,051 వాళ్లను కాల్చవద్దు. వాళ్లతో మాట్లాడవద్దు. వాళ్లను గమనిస్తూ ఉండండి, నాకు చెప్పండి. 211 00:18:14,135 --> 00:18:16,763 -టర్మినస్ పై అనాక్రీయాన్లకు ఏం పని? -ఆమె తన పేరు ఫారా అని చెబుతోంది. 212 00:18:16,846 --> 00:18:19,307 దానికిమించి ఆమె చెబుతున్నదేదీ నమ్మశక్యంగా లేదు. 213 00:18:19,390 --> 00:18:21,726 ఎవరైనా అబద్ధాలు చెబుతున్నారంటే, అది నువ్వు మాత్రమే. 214 00:18:21,809 --> 00:18:24,103 అదీ సంగతి. ఆమె అబద్ధం చెబుతోందో, లేక 215 00:18:24,187 --> 00:18:25,938 నిజం చెప్పడం లేదో నేను చెప్పగలను. 216 00:18:26,022 --> 00:18:27,190 ఆ రెండింటికీ ఏదైనా తేడా ఉందా? 217 00:18:27,732 --> 00:18:29,901 నాదగ్గర ఒక ప్లాన్ ఉంది. కానీ అందుకు నీ సాయం కావాలి. 218 00:18:35,990 --> 00:18:38,075 ఏంటి? నన్ను హింసిస్తారా? 219 00:18:38,159 --> 00:18:40,536 ఇతను సేవకుడు. 220 00:18:40,620 --> 00:18:43,998 ఏం కావాలంటే అది అందిస్తాడు. నా బూట్లు పాడయితే బాగు చేసి ఇస్తాడు. 221 00:18:44,082 --> 00:18:49,420 మావాళ్లు చెప్పిన గడువు ముగిసిపోయిందనుకుంటా. 222 00:18:49,504 --> 00:18:50,880 అసలు ఇక్కడికి ఎందుకొచ్చావు, ఫారా? 223 00:18:52,381 --> 00:18:54,383 ఎదుటివాళ్ల మనసులో ఏముందో చదవగల నేర్పు శాల్వార్ కి ఉంది. 224 00:18:55,384 --> 00:18:58,012 అది ఎంతో అసాధారణమైన విషయం. ఆమె తల్లికి దీని గురించే చెబుతున్నా. 225 00:18:58,513 --> 00:18:59,722 ఆమె నిన్ను నమ్మదు. 226 00:18:59,806 --> 00:19:02,475 నువ్వే నాకు యజమానివని చెప్పావుగా. నిన్ను పొగిడినా తను అబద్ధమనే అనుకుంటుంది. 227 00:19:02,558 --> 00:19:04,102 పునాది స్తంభంపై ఎందుకు కన్నేశారు? 228 00:19:04,185 --> 00:19:08,189 మాకు మాడ్యూల్ కావాలి. ఆ విషయం ఇప్పటికే చెప్పా. అయినా అదే అడుగుతున్నారు. 229 00:19:08,272 --> 00:19:11,150 నిజం ఏమిటో చెప్పేందుకు నీకొక అవకాశం ఇస్తున్నాను. 230 00:19:11,234 --> 00:19:12,568 బొమ్మ. 231 00:19:15,613 --> 00:19:18,199 నువ్వు దేని గురించి వెతుకుతున్నావో నాకు తెలుసు. 232 00:19:18,282 --> 00:19:22,537 మావద్ద అనాక్రీయాన్ విమానాలేం లేవు. భారీ ఆయుధాలూ లేవు. మరి... 233 00:19:22,620 --> 00:19:23,871 చెప్పిందే చెబుతున్నారు. 234 00:19:25,331 --> 00:19:26,332 ఆమెకు వివరంగా చెప్పు. 235 00:19:26,833 --> 00:19:28,501 ఆమె ఏం అడుగుతోందో అది చెప్పేయ్. 236 00:19:28,584 --> 00:19:30,670 నీ యాస అంత భయంకరంగా ఏమీ లేదు. 237 00:19:31,087 --> 00:19:33,798 బహుశా పోర్ట్ సిటీలో ఎవరి దగ్గరో నేర్చుకుని ఉంటావు. 238 00:19:34,632 --> 00:19:36,008 ఆ హల్లులూ అవీను. 239 00:19:36,092 --> 00:19:37,510 నేనొక వ్యాపారిని. 240 00:19:38,010 --> 00:19:40,430 మీవాళ్లతో అప్పుడప్పుడు వ్యాపార లావాదేవీలు చేస్తూ ఉంటాను. 241 00:19:40,805 --> 00:19:43,599 నువ్వు తెస్పిన్ వాడివని నాకనిపిస్తోంది. 242 00:19:43,933 --> 00:19:46,644 నాకు నావిగేషన్ మాడ్యూల్ కావాలి, అంతే. 243 00:19:46,727 --> 00:19:47,895 ఇది మరొక అబద్ధం. 244 00:19:48,438 --> 00:19:49,772 నువ్వు కూడా అనాక్రీయాన్ మాట్లాడగలవా? 245 00:19:49,856 --> 00:19:50,940 ఒక్క పదం కూడా రాదు. 246 00:19:51,023 --> 00:19:52,608 -అయినా నేను అబద్ధమే చెబుతున్నానంటావా? -బొరుసు. 247 00:19:55,069 --> 00:19:56,154 సగం సగం ఛాన్సు మాత్రమే ఉంది. 248 00:19:56,237 --> 00:19:57,613 మళ్లీ బొరుసే. నిజంగా ఎవరు నువ్వు? 249 00:20:01,242 --> 00:20:03,244 ఇరవై ఐదు శాతం మాత్రమే చాన్స్ ఉంది. 250 00:20:03,327 --> 00:20:04,620 మళ్ళీ బొరుసే. 251 00:20:05,997 --> 00:20:08,708 పన్నెండున్నర శాతం మాత్రమే చాన్సుంది. మళ్లీ బొరుసే. ఇక్కడికి ఎందుకొచ్చావు? 252 00:20:09,667 --> 00:20:10,835 మళ్లీ బొరుసు పడింది. 253 00:20:23,931 --> 00:20:28,394 నేను నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాను. కానీ పునరావృతమయ్యే అదృష్టం, అదృష్టమే కాదు. 254 00:20:33,649 --> 00:20:34,650 ఎవరు నువ్వు? 255 00:20:35,151 --> 00:20:37,612 మేం స్క్రాపర్లమే. మాడ్యూల్ కోసమే వచ్చా. 256 00:20:37,695 --> 00:20:40,740 మీరు స్క్రాపర్లు కాదు. నావిగేషన్ మాడ్యూల్ అని చెప్పడం తప్పుదారి పట్టించేందుకే... 257 00:20:40,823 --> 00:20:42,450 ఈ చిన్న పిల్లల ఆటలు ఇక ఆపు. 258 00:20:42,533 --> 00:20:45,203 ఈ తెస్పిన్ దొంగ వెధవని నాపైకి ఉసిగొల్పు. నన్ను చావబాదమని చెప్పు! 259 00:20:45,286 --> 00:20:46,287 నీ ఒంటిపై ఆ మచ్చలు... 260 00:20:47,580 --> 00:20:48,581 ఉబ్బెత్తుగా ఉన్న గాయాలు కదా. 261 00:20:53,503 --> 00:20:54,962 నీ ఎడమ కంటికి... 262 00:20:56,547 --> 00:20:57,548 నానో గ్లాస్ పెట్టుకున్నావు. 263 00:20:57,632 --> 00:21:00,426 అనాక్రీయాన్ పై మహారాజు బాంబులు వేయించినప్పుడు నీ కన్ను పోయిందా? 264 00:21:00,510 --> 00:21:03,679 అప్పటికి నీకు ఐదారేళ్లు ఉంటాయేమో కదా? 265 00:21:03,763 --> 00:21:08,434 న్యూట్రాన్ బాంబుల పేలుడు శక్తి తక్కువే, కానీ రేడియో ధార్మికత తీవ్రంగా ఉంటుంది. 266 00:21:08,518 --> 00:21:12,563 పేలుడు జరిగిన వారంలోగా 50 శాతంమంది జనాభా కన్నుమూసి ఉంటారు, 267 00:21:12,647 --> 00:21:15,691 మరో 20 లేక 30 శాతం మంది, ఆ తర్వాత ఏడాదిలోగా మరణించి ఉండవచ్చు. 268 00:21:16,275 --> 00:21:19,028 నీలాంటివాళ్లంతా అనాథలుగా మిగిలిపోయి ఉంటారు, అవునా? 269 00:21:20,613 --> 00:21:24,075 బహుశా మీ అమ్మనూ, నాన్ననూ కూడా కోల్పోయి ఉంటావు. 270 00:21:24,909 --> 00:21:27,036 జీవచ్ఛవంలా మారావు. 271 00:21:28,746 --> 00:21:30,832 లేదంటే కాస్త నెమ్మదిగా. 272 00:21:31,624 --> 00:21:32,625 కాన్సర్ సోకిందా. 273 00:21:35,086 --> 00:21:39,882 మీ అమ్మకు థైరాయిడ్ ఉండి, చనిపోయే సమయంలో ఆమె గొంతు మారిపోయి ఉండవచ్చు. 274 00:21:39,966 --> 00:21:42,593 ఇంకెవరిని కోల్పోయావు? సోదరినా? 275 00:21:47,723 --> 00:21:48,808 సోదరుడినా. 276 00:21:52,061 --> 00:21:53,729 తమ్ముడినా. 277 00:22:11,122 --> 00:22:13,458 ఆమెలో ఒక రకమైన జడత్వం చోటుచేసుకుంది. అది... 278 00:22:13,541 --> 00:22:16,836 లోతు తెలియని బావిలాంటిది. అన్నింటినీ తనలో ఇముడ్చుకుంటుంది. 279 00:22:18,504 --> 00:22:19,714 తను చనిపోవాలనుకుంటోంది. 280 00:22:21,299 --> 00:22:25,011 అందరూ చనిపోవాలనుకుంటోంది. నాకు తెలుస్తోంది ఆ సంగతి. 281 00:22:30,725 --> 00:22:32,977 ఆమె ఏడుస్తూ ఏం అంది, నీకేమైనా అర్థమైందా? 282 00:22:33,060 --> 00:22:35,688 కొంచెం అర్థమైంది. పురాతన అనాక్రీయాన్ భాషలో మాట్లాడింది. అది ఇప్పుడు వాడుకలో లేదు. 283 00:22:35,772 --> 00:22:39,150 తను నోరు జారినట్టు నాకూ అర్థమైంది. 284 00:22:39,942 --> 00:22:43,488 నాకు ఒక పేరు గుర్తుకొస్తోంది. ఆ పేరు లార్కెన్ కయీన్. 285 00:22:47,325 --> 00:22:48,951 ఆంథోర్ బెల్ట్ వివాదంలో, 286 00:22:49,035 --> 00:22:51,287 మహారాజు కోసం అనాక్రీయాన్, తెస్పిస్ బహుమతులు తీసుకువచ్చారు. 287 00:22:51,370 --> 00:22:52,872 మావాళ్లు తీర్థస్నానాలకు చెందిన పుస్తకం తెచ్చారు... 288 00:22:52,955 --> 00:22:55,249 తమ గొప్ప వేటగాడి కోసం అనాక్రీయాన్లు ఒక చక్కటి విల్లును తెచ్చారు. 289 00:22:55,875 --> 00:22:57,543 -ఆ వేటగాడు లార్కెన్ కయీన్. -అంటే? 290 00:22:57,627 --> 00:22:59,378 ఫారా కేవలం చెత్త ఏరుకునేది కాదు. 291 00:23:00,213 --> 00:23:02,090 ఆమె అనాక్రీయాన్ కు చెందిన గొప్ప వేటగత్తె. 292 00:23:12,266 --> 00:23:15,520 ఈ అశాంతికి కారణమెవరు? 293 00:23:16,229 --> 00:23:18,856 సింకర్లు. అజ్ఞాతంలో ఉన్న స్వతంత్ర సమర యోధులు. 294 00:23:19,357 --> 00:23:24,904 77వ లెవల్ వద్ద హీట్ సింక్ కరిగిపోయాక. నక్షత్ర వారధి కూలిపోయాక ఇది సంభవించింది. 295 00:23:24,987 --> 00:23:28,866 ముప్పై అయిదు ఏళ్ల తర్వాత, ఇప్పటికీ దాని దుష్పరిణామాలతో బాధపడుతున్నాం. 296 00:23:31,327 --> 00:23:36,499 సామ్రాజ్యంలోని వ్యాపారాలు పోటీ ప్రాధాన్యతల వల్ల పతనావస్థలో ఉన్నాయి. 297 00:23:37,125 --> 00:23:40,336 పగటి సోదరుడికి నీ మద్దతు అవసరం. నేనేమో ధర్మసభకు మొగ్గు చూపుతున్నా. 298 00:23:41,295 --> 00:23:42,505 ఇది అనివార్యం. 299 00:23:42,588 --> 00:23:43,798 ఒక మనిషికి. 300 00:23:44,882 --> 00:23:47,427 అదృష్టవశాత్తూ, మనం ముగ్గురం ఉన్నాం. 301 00:23:47,510 --> 00:23:51,180 మూడు వైపుల నుంచీ దుర్వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయం విన్నావా, సోదరా? 302 00:23:51,931 --> 00:23:55,852 ఆర్క్టురస్ సెక్టార్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఒకటి ఆఫ్ లైన్ లోకి వచ్చేసింది. 303 00:23:55,935 --> 00:23:58,896 అవి ఎప్పుడూ ఆఫ్ లైన్లోనే ఉండాలి, తెలిసిందా? 304 00:23:58,980 --> 00:24:01,274 అవి బహుశా మన గాలెక్సీ మొత్తం మీద వేల సంఖ్యలో ఉన్నాయి. 305 00:24:01,357 --> 00:24:02,608 లక్షల సంఖ్యలో. 306 00:24:02,692 --> 00:24:05,945 కానీ సుదూర భాగంలో కమ్యూనికేషన్లను సరిచూసేది ఒకే ఒకటి ఉంది. 307 00:24:07,196 --> 00:24:09,532 ఆ ప్రాముఖ్యతను గుర్తించడంలో నువ్వు విఫలమయ్యావు. 308 00:24:10,241 --> 00:24:11,659 అది టర్మినస్. 309 00:24:13,161 --> 00:24:16,706 హారి సెల్డన్ అనుచరులను రాత్రి సోదరుడు బహిష్కరించిన చోటు అది. 310 00:24:20,418 --> 00:24:25,173 రీచ్. ధర్మ సభ. తిరుగుబాటు... 311 00:24:26,966 --> 00:24:29,135 వీటి మధ్య ఉన్న పోలిక నీకు కనిపించట్లేదా? 312 00:24:30,136 --> 00:24:31,137 చూపించు. 313 00:24:33,014 --> 00:24:37,268 ఈ బలహీన సందర్భాన్ని ఆసరాగా తీసుకొని, ఇతరులూ ఒత్తిడి పెట్టడం ఆరంభిస్తారు. 314 00:24:37,935 --> 00:24:42,607 ఖచ్చితంగా గెలాక్సీలోని ఒక ప్రధాన మతం నుండి ప్రోత్సాహం అందుతుంది. 315 00:24:42,690 --> 00:24:45,526 లేదా ఇక్కడ ట్రాంటార్ లోనే విప్లవం మొలకెత్తవచ్చు 316 00:24:46,194 --> 00:24:51,783 పతనం వేగవంతమవ్వగలదు అంటే, దాని వేగాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంటుందా? 317 00:24:51,866 --> 00:24:52,992 ఇక నీ సంగతి చూడు, సోదరా. 318 00:24:53,075 --> 00:24:56,496 మధ్య సింహాసనంపై దర్జాగా, ఆత్మ విశ్వాసంతో కూర్చుని ఉన్నావు. 319 00:24:56,579 --> 00:24:58,915 నేను ఆ చిరునవ్వును అద్దంలో చూస్తూ ప్రాక్టీస్ చేసేవాణ్ని. 320 00:24:58,998 --> 00:25:01,084 చాలు. ఇక ఇది ఎలా పరిసమాప్తమవుతుందో నాకు తెలుసు. 321 00:25:01,167 --> 00:25:02,960 కానీ దాని నుంచి నువ్వు పాఠాలు నేర్చుకున్నావా? 322 00:25:03,044 --> 00:25:06,047 లుమినిజం. ఇప్పుడు సింకర్ల తిరుగుబాటు జరుగుతోంది. 323 00:25:06,130 --> 00:25:08,674 నువ్వు చేయవలసిన పనులను నీకు సెల్డన్ దాదాపు చెప్పాడు. 324 00:25:09,926 --> 00:25:10,927 అతన్ని నువ్వు విస్మరించావు. 325 00:25:11,010 --> 00:25:12,637 ఎందుకంటే అతను డాంబికుడు కాబట్టి. 326 00:25:12,720 --> 00:25:14,472 మీరు కొత్తదనాన్ని అస్సలు అందించడం లేదు. 327 00:25:15,014 --> 00:25:17,934 రక్తం కొత్తది అంతే... 328 00:25:18,518 --> 00:25:19,644 అదే మనస్తత్వం, 329 00:25:20,144 --> 00:25:22,980 అవే ఆలోచనలు. 330 00:25:23,064 --> 00:25:25,149 మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు... 331 00:25:25,233 --> 00:25:27,193 కానీ మీ ప్రతిష్ఠని కాపాడుకోగలరు. 332 00:25:28,861 --> 00:25:30,905 హారి సెల్డన్ మరణించి చాలాకాలం అయింది. 333 00:25:32,115 --> 00:25:34,367 అతని ఆశ్రితుడే అతన్ని చంపాడు. 334 00:25:34,450 --> 00:25:37,078 అతను హత్య చేయబడ్డాడు. కానీ ఉద్యమం మాటేమిటి, సోదరా? 335 00:25:39,330 --> 00:25:41,541 అమరవీరులు ప్రజల మనసులో చిరకాలం జీవిస్తారు. 336 00:25:50,216 --> 00:25:54,137 నీకు ధన్యవాదాలు, దౌత్యపరంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. 337 00:25:54,220 --> 00:25:56,180 నేనేం చేయాలి, లూయిస్? 338 00:25:56,264 --> 00:25:58,057 నన్ను చంపేసి, ఫారాను పిల్లల వద్దకు వెళ్ళనిద్దామా? 339 00:25:58,141 --> 00:25:59,767 నేను లేకుండా నువ్వు ఆమెను ప్రశ్నించి ఉండాల్సింది కాదు. 340 00:25:59,851 --> 00:26:01,519 అందుకు సంతోషించండి. ఆమె ఎవరో మాకు బాగా తెలుసు. 341 00:26:01,602 --> 00:26:03,604 మనకొక వెసులుబాటు ఉంది. ఆమె అనుచరులతో మనం బేరమాడే వీలు ఉంది. 342 00:26:03,688 --> 00:26:05,481 ఈ అవకాశం నగరంలో హింసను ప్రేరేపిస్తే, 343 00:26:05,565 --> 00:26:07,442 మమ్మల్నందరినీ ఆత్మహత్య చేసుకొమ్మని చెప్పినట్టే. 344 00:26:07,525 --> 00:26:09,902 మొదటి సంక్షోభం నుంచి పునాది గట్టెక్కుతుందని హారి చెప్పాడు కదా? 345 00:26:09,986 --> 00:26:13,781 చెప్పాడు, నిజమే. కానీ, నేను ఇంతకుముందే చెప్పినట్టు, నువ్వు బయటివ్యక్తివి. 346 00:26:13,865 --> 00:26:14,991 -అంటే? -శాల్వార్. 347 00:26:15,074 --> 00:26:16,659 అంటే నువ్వు లెక్కలోకి రావని. 348 00:26:16,742 --> 00:26:18,202 నీకు వాల్ట్ తో సంబంధం ఉంది. 349 00:26:18,286 --> 00:26:20,538 బహుశా అది ముందుగా చెప్పబడలేదు. 350 00:26:20,621 --> 00:26:22,081 జోస్యం చెప్పేటప్పుడు నిన్ను పరిగణనలోకి తీసుకోలేదు. 351 00:26:22,165 --> 00:26:23,624 నేను దేవుడి ప్లాన్ లో భాగం కాదని చెబుతున్నావు కదూ. 352 00:26:23,708 --> 00:26:25,960 నేను అంటున్నది ఏమిటంటే వ్యక్తులను సైకో హిస్టరీ పరిగణనలోకి తీసుకోదని 353 00:26:26,043 --> 00:26:27,545 అంటే, నేను దేవుడి ప్లాన్ ని ధ్వంసం చేశానని అంటున్నావా? 354 00:26:27,628 --> 00:26:29,964 -వెనక్కు తగ్గాల్సిన సమయం ఇది, శాల్వార్. -వెనక్కు తగ్గడమా? 355 00:26:30,047 --> 00:26:32,008 ఊహించనిదేదైనా ఎదురైతే సిద్ధంగా ఉండాలన్నదే 356 00:26:32,091 --> 00:26:34,469 పునాది ప్రధానోద్దేశమని నేను భావించాను. 357 00:26:34,552 --> 00:26:36,637 మరిన్ని ఆయుధాలు ఇమ్మని నేను కోరితే, 358 00:26:36,721 --> 00:26:39,265 అసలు దాడి జరగడానికి అవకాశమే లేదని మీరు కొట్టిపారేశారు. 359 00:26:39,348 --> 00:26:41,392 మరింత శిక్షణ అవసరమని నేనంటే, అక్కర్లేదని అన్నారు. 360 00:26:41,976 --> 00:26:43,770 అందువల్లనే, ఇప్పుడు ఎలాంటి సన్నద్ధతా లేకుండా ఉన్నాం. 361 00:26:43,853 --> 00:26:48,065 నేను బయటివ్యక్తినే కావచ్చు, కానీ ప్లాన్ ని పాడు చేస్తోంది మాత్రం నేను కాదు, లూయిస్. 362 00:26:55,281 --> 00:26:57,325 లూయిస్ పైరీన్, డైరెక్టర్. 363 00:26:57,408 --> 00:27:01,329 ఒక సామ్రాజ్య స్థావరానికి తమ అత్యున్నత ర్యాంక్ అధికారిని అనాక్రీయాన్ మండలి 364 00:27:01,412 --> 00:27:03,206 ఎందుకు పంపించవలసి వచ్చింది? 365 00:27:03,289 --> 00:27:05,875 మీరు ఊహిస్తున్న ప్రళయం అప్పుడే వచ్చేసినట్లు నటిస్తున్నారా? 366 00:27:05,958 --> 00:27:07,794 ఎందుకంటే, నాకు సామ్రాజ్యమన్నదే ఎక్కడా కనిపించట్లేదు. 367 00:27:07,877 --> 00:27:11,464 నాకు కనిపిస్తున్నది విద్యావేత్తలు, కార్మికులు, కొన్ని తుపాకులు మాత్రమే. 368 00:27:11,547 --> 00:27:12,840 మీరు కమ్యూనికేషన్ల వ్యవస్థను నేలకూల్చారు. 369 00:27:12,924 --> 00:27:16,469 కావచ్చు. నిఘా కళ్లను తప్పించుకునేందుకు మేం ప్రైవేటుగా దాన్ని నిర్వహించాలనుకున్నాం. 370 00:27:16,552 --> 00:27:19,639 విచారణ కోసం మహారాజు ఎవరినైనా పంపించే అవకాశం ఉందని మీరు తెలుసుకోవాలి. 371 00:27:20,473 --> 00:27:21,766 లేకపోతే అదే అసలు విషయమా? 372 00:27:21,849 --> 00:27:23,684 మీ మగవాళ్ల కంటే ఆడవాళ్లే తెలివైనవారుగా కనిపిస్తున్నారు. 373 00:27:24,894 --> 00:27:28,606 అనాగరిక రాజ్యాలు బహిష్కరింపబడ్డాయి. మీకు ఇక్కడ పని లేదు. 374 00:27:30,316 --> 00:27:31,567 "అనాగరికులం." 375 00:27:32,568 --> 00:27:34,862 మాపై ఎవరైనా నింద వేయొచ్చు. కానీ నీలాంటివాడు వేయకూడదు. 376 00:27:35,446 --> 00:27:39,033 మనల్ని చావమని ట్రాంటార్ ఇక్కడ వదలిపోయింది. మీ వాళ్లూ, మా వాళ్లూ కూడా. 377 00:27:39,117 --> 00:27:40,910 మనమంతా చనిపోబోతున్నాం. కాస్త ముందూ వెనకగా. 378 00:27:40,993 --> 00:27:42,328 పునాది అంతమయిపోవడం లేదు. 379 00:27:42,412 --> 00:27:45,998 హారి సెల్డన్ మనకు అప్పగించిన పనిని పూర్తి చేసి తీరతాం. 380 00:27:46,082 --> 00:27:49,752 గేలక్సీ అంచున పతనం మొదలవుతుందని కూడా సెల్డన్ ఊహించాడు. 381 00:27:50,878 --> 00:27:52,296 -ఇక్కడి నుంచే. -సామ్రాజ్య భవనాన్ని కాపాడిన 382 00:27:52,380 --> 00:27:54,382 అదే సైన్స్ నక్షత్ర వారధి కూలిపోయినప్పుడు 383 00:27:54,465 --> 00:27:55,675 టర్మినస్ నగరాన్ని రక్షించింది మరి. 384 00:27:55,758 --> 00:27:57,176 నీ శక్తి నిరోధకత అని నువ్వు అనుకుంటున్నావా? 385 00:27:58,344 --> 00:28:02,306 కత్తిని పట్టుకున్నవాడిలాగే కత్తి కూడా ఎంతో పదునైనది. 386 00:28:17,530 --> 00:28:18,781 కలిన్, అక్కడ నీ పరిస్థితి ఎలా ఉంది? 387 00:28:18,865 --> 00:28:20,783 ఇక్కడ చాలామంది ఉన్నారు. 388 00:28:20,867 --> 00:28:23,119 -నాకు సాయంగా మరికొందరు అవసరం. -అది జరిగే పని కాదు. 389 00:28:23,202 --> 00:28:26,497 శాల్వార్ పన్నెండు మంది అంది. నువ్వు చాలా మంది ఉన్నారంటున్నావా? 390 00:28:26,581 --> 00:28:29,417 మన పట్టణాన్ని ఆక్రమించేందుకు కావలసినంతమంది ఉన్నారు వాళ్లు. 391 00:28:30,835 --> 00:28:31,919 మహారాజా. 392 00:28:36,340 --> 00:28:37,550 మనం చర్చించుకున్న విషయం? 393 00:28:38,801 --> 00:28:42,388 ఆమె పేరు అజూరా ఒడీలి. 13 ఏళ్ళ నుండి కోటలో బోటనిస్ట్ గా ఉంది. 394 00:28:42,972 --> 00:28:46,434 చనిపోయిన ఆమె తండ్రి కూడా మన తోటల్లో ఆగ్రోఎకాలజిస్టుగా పనిచేశాడు. 395 00:28:46,976 --> 00:28:50,188 ఆమె తల్లి ఇకెబెనా స్కూలును స్థాపించింది. ఇప్పుడది మూతబడింది. 396 00:28:51,647 --> 00:28:53,107 ఆమెతో ఏదో సమస్య ఉందన్నారు? 397 00:28:54,776 --> 00:28:58,070 సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు? 398 00:28:58,821 --> 00:29:03,326 లక్ష్యాన్ని చేరుకునే ఏ విధానమైనా పర్వాలేదు. సమస్యల పరిష్కారమే నా పని, మహారాజా. 399 00:29:15,963 --> 00:29:17,715 అజూరా ఒడీలి. 400 00:29:20,593 --> 00:29:22,595 ఒడీలియా లేక ఒడైలీయా? 401 00:29:22,678 --> 00:29:23,763 డీ, మహారాజా. 402 00:29:23,846 --> 00:29:25,765 ఇంతకుముందు నువ్వు నా ఛాంబర్ బయట కనిపించావు. 403 00:29:27,350 --> 00:29:29,977 -అక్కడ ఏం చూశావో చెప్పు. -నేనేం చూడలేదు, మహారాజా. 404 00:29:30,061 --> 00:29:31,813 లేదు. నువ్వేదో చూశావు. 405 00:29:31,896 --> 00:29:34,065 మహారాజు నన్ను చూడాలనుకుంటున్నారని మాత్రమే నాకు తెలుసు. 406 00:29:34,148 --> 00:29:36,400 నేను తలచుకుంటే నిన్ను పనిలోంచి తీసేయగలను, 407 00:29:37,485 --> 00:29:39,654 ఎనభైవ లెవల్ పై హీట్ సింకులను తుడిచే పనిలో పెట్టగలను. 408 00:29:39,737 --> 00:29:42,990 నిన్నేమైనా చేయగలను. దారుణమైన పనులు చేయగలను 409 00:29:43,074 --> 00:29:44,283 నీకు తెలుసు. 410 00:29:44,367 --> 00:29:46,869 మహారాజా, రాత్రి సోదరుడు మిమ్మల్ని రమ్మంటున్నారు. 411 00:29:46,953 --> 00:29:48,287 వస్తున్నానని చెప్పు. 412 00:29:50,248 --> 00:29:51,749 ఈ పూలనన్నింటినీ ఇక్కడి నుంచి తీసెయ్. 413 00:29:52,375 --> 00:29:55,128 నా చాంబర్లోకి వచ్చే వీటి వాసన చిరాకు తెప్పిస్తోంది. 414 00:29:55,211 --> 00:29:58,381 -మహారాజా, ఇవన్నీ మీకెందుకు... -అయిపోయిందిలే. నువ్వు వెళ్లు. 415 00:30:02,343 --> 00:30:03,845 ఉల్వ్స్ బ్రెత్ నొప్పి నివారణకు పనికొస్తుంది. 416 00:30:04,679 --> 00:30:06,431 ఆకులు ఎరుపు చారలతో గోధుమ-ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. 417 00:30:06,514 --> 00:30:08,015 అవి వాపులను, గాయాలను మాన్పుతాయి... 418 00:30:08,099 --> 00:30:10,560 నీ వైద్య సలహాల కోసం నేను ఇక్కడకు రాలేదు. 419 00:30:12,437 --> 00:30:13,438 ఏది? 420 00:30:36,502 --> 00:30:37,628 ఆకులు పదునుగా ఉన్నాయి. 421 00:30:50,641 --> 00:30:51,642 ఏంటిది? 422 00:30:52,143 --> 00:30:53,770 లూపి స్పిరిటస్. 423 00:30:54,353 --> 00:30:57,857 ఉల్వ్స్ బ్రెత్, మహారాజా. మన ఔషధ తోటలోనిదే. 424 00:30:57,940 --> 00:31:00,735 ఇది బాధానివారిణి. అంతేకాదు, రక్త నాళాలను వెడల్పు చేస్తుంది కూడా. 425 00:31:00,818 --> 00:31:01,903 ఇది విషపూరితమైనదా? 426 00:31:01,986 --> 00:31:06,240 కాదు. ఉల్వ్స్ బ్రెత్ ను టీలోనూ, టింక్చర్లలోనూ వాడతారు. 427 00:31:06,324 --> 00:31:09,619 రక్తనాళాలను ఉత్తేజితం చేసి, నయమయ్యేందుకు... 428 00:31:09,702 --> 00:31:10,870 తిను. 429 00:31:15,666 --> 00:31:17,585 నువ్వు మరికొన్ని గంటల్లో చావకపోతే, 430 00:31:17,668 --> 00:31:19,796 నాకు ఒక కిలోగ్రామ్ పంపు. 431 00:31:19,879 --> 00:31:21,089 అలాగే, మహారాజా. 432 00:31:27,595 --> 00:31:30,348 లేలో ఫుల్హమ్, వెంటనే వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లిపో! 433 00:31:30,431 --> 00:31:31,432 వాళ్లు ఇక్కడికి వచ్చేస్తారా? 434 00:31:31,516 --> 00:31:32,600 రాకపోవచ్చు. 435 00:31:33,518 --> 00:31:38,815 అందరూ దయచేసి ఇళ్లకు వెళ్లిపొండి. ఇక్కడ మీకు రక్షణ లేదు. వెళ్లండి. వెళ్లండి. 436 00:31:40,483 --> 00:31:42,110 నువ్వు ఇక్కడికి రావాలి. ఇప్పుడే. 437 00:31:42,193 --> 00:31:43,277 నేను కాస్త బిజీగా ఉన్నాను, యేట్. 438 00:31:43,361 --> 00:31:44,904 తెలుసు, అయినా రమ్మంటున్నాను. 439 00:31:44,987 --> 00:31:48,157 అనాక్రీయాన్ దళాలు తూర్పు, పడమర, దక్షిణం వైపుల నుంచి కమ్ముకొస్తున్నాయి, 440 00:31:48,241 --> 00:31:49,992 బహుశా ఉత్తరం వైపు నుంచి కూడా. 441 00:31:51,536 --> 00:31:53,746 తుపాకీని ఎలా పట్టుకోవాలో తెలుసా, ముసలోడా? 442 00:31:53,830 --> 00:31:54,914 బారెల్ ముందుకు ఉండాలి కదా? 443 00:31:55,623 --> 00:31:58,376 కంచెకు వెలుపల అనాక్రీయాన్లు అనేక ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించాం. 444 00:31:59,001 --> 00:32:00,753 -నేను పడమరకు వెళ్తాను. -మేం ఉత్తరం వైపుకు. 445 00:32:01,254 --> 00:32:03,631 నేను వెళ్లను. లూయిస్ ఇక్కడ ఏదో ఒకటి చేసే ప్రమాదం ఉంది. 446 00:32:03,714 --> 00:32:05,174 నేను అతన్ని గమనిస్తూ ఉంటాను, ఒట్టు. 447 00:32:06,050 --> 00:32:07,218 సరే. 448 00:32:08,386 --> 00:32:11,180 నేను విన్నది నిజమేనా? అనాక్రీయాన్ల సేనాపతిని పట్టుకున్నావట? 449 00:32:11,264 --> 00:32:12,515 తాగి ఉన్నావా, ముల్లర్? 450 00:32:12,598 --> 00:32:15,768 ఇది గేలక్సీకి చివరి అంచు కదూ? హారి జోస్యం నిజం కాబోతోందన్నమాట. 451 00:32:15,852 --> 00:32:18,271 నువ్వు వదంతుల్ని నమ్ముతున్నావు, ముల్లర్. పట్టుకున్నది ఒక మామూలు దొంగని మాత్రమే. 452 00:32:18,354 --> 00:32:19,939 వాళ్లు దాదాపు ఇక్కడికి వచ్చేశారుగా? 453 00:32:20,815 --> 00:32:23,276 హేయ్, ఒక్క క్షణం ఇలా వస్తావా. 454 00:32:37,915 --> 00:32:38,916 హేయ్! 455 00:32:39,625 --> 00:32:40,877 నిన్నేమీ కొట్టను. 456 00:32:44,338 --> 00:32:45,465 నువ్వెవరివో చెప్పు చాలు. 457 00:32:46,382 --> 00:32:47,550 శాల్. 458 00:32:48,050 --> 00:32:49,051 శాల్. 459 00:32:49,135 --> 00:32:51,637 శాల్. హేయ్, హేయ్. ఏమైంది? 460 00:32:51,721 --> 00:32:53,681 ట్రాంటార్ లో ఉన్న ఇంపీరియల్ లైబ్రరీకి వెళ్లాను. 461 00:32:53,765 --> 00:32:56,726 -అక్కడికి వెళ్లానంటే ఏంటి అర్థం? -తుపాకులు ఉన్న చోటికి. 462 00:32:57,393 --> 00:32:59,520 పైకప్పు చెక్కతో చేసి ఉంది. అక్కడ మార్బుల్ తో చేసిన విగ్రహాలున్నాయి. 463 00:32:59,604 --> 00:33:01,189 అక్కడొక కుర్రాడు కత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు. 464 00:33:02,815 --> 00:33:04,984 నన్ను అనాక్రీయాన్ల వద్దకు తీసుకెళ్లిన కుర్రాడే అతను. 465 00:33:06,319 --> 00:33:10,364 అది వాల్ట్. నాకు తెలుస్తోంది, హ్యూగో. అనాక్రీయాన్ల గురించి, ఈ సంక్షోభం గురించి 466 00:33:10,448 --> 00:33:13,493 అది నాకేదో చెప్పాలనుకుంటోంది. 467 00:33:13,576 --> 00:33:17,455 సరే, విను. ఈ గ్రహంలో నువ్వు ఉండకూడదని నీకు మొదట్నుంచీ చెప్తూనే ఉన్నాను. 468 00:33:18,498 --> 00:33:23,127 కానీ నీ పనితీరు చూస్తుంటే, లోపల ఫారా ఏం చేస్తోందో నువ్వు గ్రహించగలవు... 469 00:33:24,837 --> 00:33:25,838 అది ఎంతో ప్రత్యేకమైన విద్య. 470 00:33:26,422 --> 00:33:28,091 ఇతరులెవరూ అలా చేయలేరు, శాల్. 471 00:33:28,174 --> 00:33:29,801 నాకు నీపై పూర్తిగా నమ్మకం ఉంది. 472 00:33:33,096 --> 00:33:35,890 నీపై నాకు అపారమైన నమ్మకం ఉంది. 473 00:33:56,202 --> 00:33:58,955 మీలో గణిత శాస్త్రవేత్త టివోలి ఎవరు? 474 00:34:02,959 --> 00:34:06,045 మహారాజా. ఈ కాంతి ఎన్నడూ తగ్గకుండా ఉండుగాక. 475 00:34:06,129 --> 00:34:07,672 ఈ కాంతి ఎన్నడూ తగ్గకుండా ఉండుగాక. 476 00:34:07,755 --> 00:34:10,466 -నేనడిగిన ప్రశ్న విన్నారు కదా. -విన్నాను మహారాజా. 477 00:34:10,550 --> 00:34:12,718 కానీ నాకింకా ఫలితాలు అందలేదు. 478 00:34:12,802 --> 00:34:15,847 మిమ్మల్ని ఈ పనిలో రాత్రి సోదరుడు నియమించి ఎన్నేళ్లయింది? 479 00:34:16,431 --> 00:34:17,557 మూడు దశాబ్దాలు అయిందా? 480 00:34:17,640 --> 00:34:21,811 ఫలితం రాబట్టలేకపోతే, మీరు ఆ స్మారక భవనంలో 481 00:34:21,894 --> 00:34:25,189 కూర్చుని ఏం చేస్తున్నట్లు? 482 00:34:26,983 --> 00:34:30,486 ఏం ప్రగతి సాధించారు? 483 00:34:31,654 --> 00:34:37,952 హారి సెల్డన్ చెప్పిన జోస్యం వాస్తవ విరుద్ధమైనదని మేం విశ్వసిస్తున్నాం. 484 00:34:40,496 --> 00:34:42,665 ఎందుకని అలా అంటున్నారు? 485 00:34:43,332 --> 00:34:48,253 సెల్డన్ భవిష్య వాణి వినిపించిన తర్వాత, ఈ 35 ఏళ్లలో, 486 00:34:48,337 --> 00:34:52,759 ఇంపీరియమ్ కుచించుకుపోకుండా, ఎంతో విస్తరించింది... 487 00:34:52,842 --> 00:34:53,842 ఆపు. 488 00:34:55,094 --> 00:34:56,471 సెల్డన్ జోస్యం. 489 00:34:56,554 --> 00:35:01,184 అతని "గణిత విశ్లేషణ" గురించి నాకు వివరించండి. 490 00:35:01,267 --> 00:35:03,936 అవి తన జోస్యాన్ని ప్రజలు నమ్మేలా 491 00:35:04,020 --> 00:35:07,982 సెల్డన్ వేసిన కుయుక్తులు మాత్రమే. 492 00:35:09,275 --> 00:35:13,613 తిరోగమన నమూనాలలో అతను కనుగొన్న ధృవీకరణకు ఎవరి మద్దతూ లేదు. 493 00:35:13,695 --> 00:35:17,492 మరి, ఇటీవల జరుగుతున్న సంఘటనల మాటేమిటి? 494 00:35:17,575 --> 00:35:18,867 ఈ ధర్మసభ? లుమినిజమ్? 495 00:35:18,951 --> 00:35:23,121 అంతా నిరాధారమే. అదంతా సందిగ్ధమైనదీ, మద్దతు లేనిదీను. 496 00:35:23,915 --> 00:35:27,543 ఛాందసత్వానికి తిరిగి వచ్చేవారెవరైనా ఊహించవచ్చు. 497 00:35:28,503 --> 00:35:33,132 సైకో హిస్టరీ అనేది ఒక ముసలివాడి చపలచిత్తమైన సృజన. 498 00:35:33,215 --> 00:35:35,843 అది ఒక ముసలివాడి చపలచిత్తమైన సృజన కాకపోయుంటే, మరేమిటి? 499 00:35:35,927 --> 00:35:39,889 ఇదంతా నిజమయ్యేందుకు గల అవకాశం ఏపాటిది? ప్రతి జోస్యమూ అంతేనా? 500 00:35:40,723 --> 00:35:42,892 తేడా తెలియనంత చిన్నది, మహారాజా. 501 00:35:42,975 --> 00:35:44,310 చిన్నదే తప్ప సున్నా కాదన్నమాట. 502 00:35:46,646 --> 00:35:47,897 అంతేనా? 503 00:35:48,856 --> 00:35:50,900 సున్నా కాదు కదా? 504 00:35:51,651 --> 00:35:54,821 మీరంతా మూర్ఖులే కదా? 505 00:35:54,904 --> 00:35:58,074 వెయ్యిమందికి పైగా గణిత శాస్త్రవేత్తలు, 506 00:35:58,157 --> 00:36:01,035 ఒక వ్యక్తి వేసిన సంఖ్యలను తేల్చలేరా? 507 00:36:01,119 --> 00:36:05,581 అయితే గేలక్సీలో ఎవరూ కూడా చేయగలిగింది ఏమీ లేదా? 508 00:36:08,167 --> 00:36:11,796 అంతేకదా? మీరు నాకిచ్చేది ఇదేగా? 509 00:36:13,673 --> 00:36:16,592 చెప్పు. చెప్పు! 510 00:36:18,636 --> 00:36:21,389 చెప్పు! 511 00:36:32,275 --> 00:36:34,569 ఒక మనిషి మృత్యువుకు సమీపమయ్యే కాలంలో, అతని ఆత్మకథ, 512 00:36:35,153 --> 00:36:37,321 ముగింపుకు దగ్గరవుతున్న వేళ, 513 00:36:37,947 --> 00:36:40,491 తన జీవితానికి అర్ధం ఏమిటో తెలుసుకునేందుకు అతనిలో తాపత్రయం పెరుగుతుంది... 514 00:36:42,452 --> 00:36:46,080 తనకంటే ముందు గతించిన ఇతరుల జీవితాలతో పోల్చి చూసుకునే ప్రయత్నం చేస్తాడు. 515 00:36:49,625 --> 00:36:52,962 నా జీవితానికి అర్థం ఏమిటి? నా నిర్ణయాలన్నీ నావేనా? 516 00:36:53,755 --> 00:36:57,508 లేదంటే అదృశ్య హస్తమేదో నా గమ్యాన్ని నిర్దేశిస్తోందా? 517 00:37:09,562 --> 00:37:11,647 పగటి సోదరా. మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నావా? 518 00:37:11,731 --> 00:37:14,525 నీ గణిత శాస్త్రవేత్తలను నేను కలిశాను. 519 00:37:14,609 --> 00:37:17,528 వాళ్ళ ఫలితాలు వారి వాదనకు ఎంత బలోపేతం చేస్తున్నాయో గమనించదగినది. 520 00:37:17,612 --> 00:37:21,991 నువ్వు ట్రాంటార్ లోనే ఉండి అక్కడే జరిగేవన్నీ గమనించడం మంచిది. 521 00:37:22,867 --> 00:37:26,454 మహరాజా, సార్వత్రిక సామ్రాజ్యం ఏర్పడిన నాటి నుంచీ ఏ ప్రైమరీ క్లియాన్ కూడా 522 00:37:26,537 --> 00:37:28,664 ట్రాంటార్ హృదయాన్ని విడచిపెట్టలేదు. 523 00:37:28,748 --> 00:37:29,749 డెమెర్జల్ చెప్పింది నిజమే. 524 00:37:30,625 --> 00:37:33,419 మనకు ఈ నియమ నిబంధనలు ఉండటానికి ఒక కారణం ఉంది. 525 00:37:33,503 --> 00:37:40,093 ఈ నియమ నిబంధనలే మన ప్రశాంతతకు కారణమని నేను చెప్పగలను. 526 00:37:40,802 --> 00:37:42,887 నాలాగ నువ్వు కూడా మధ్య సింహాసనంపై కూర్చుని, 527 00:37:42,970 --> 00:37:45,389 అనాక్రీయాన్లు, తెస్పిస్ ల గురించి ఏం చేద్దామని చర్చిస్తే, 528 00:37:45,473 --> 00:37:48,684 మన స్పందన ఎలా ఉంటుంది, అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? 529 00:37:50,144 --> 00:37:51,145 నాకు గుర్తుంది. 530 00:37:52,230 --> 00:37:53,606 ఇంకా అది నిన్ననే జరిగినట్టుగా ఉంది. 531 00:37:54,190 --> 00:37:55,441 అప్పుడు నాకు ఏడేళ్లు. 532 00:37:55,525 --> 00:37:58,611 మన పెద్దన్నయ్య క్షమాభిక్ష పెట్టాలని వాదించారు. 533 00:37:58,694 --> 00:38:01,447 అప్పుడు నువ్వు నావైపు తిరిగి, "ఏమంటావు, కాబోయే వేకువా?" అన్నావు. 534 00:38:02,740 --> 00:38:04,242 నువ్వు క్షమాభిక్షకు వ్యతిరేకమని, 535 00:38:04,867 --> 00:38:07,787 అనాగరిక రాజ్యాలపై బాంబు దాడులు చేయాలన్నది నీ ఆలోచన అనీ నాకు తెలుసు. 536 00:38:07,870 --> 00:38:12,041 కానీ నేను భయపడ్డాను. ఆ మాట పైకి చెప్పలేకపోయాను. 537 00:38:12,875 --> 00:38:15,294 ఇక నేను దేనికీ భయపడను. 538 00:38:16,129 --> 00:38:22,009 మీ అధికారంలోనే నక్షత్ర వారధి కూలిపోయింది. అక్కడి నుంచే తిరుగుబాటు మొదలైంది. 539 00:38:22,093 --> 00:38:24,512 మీరు అధికారంలో ఉన్నప్పుడే అమాయకుల గురించీ, పర్యవసానాల గురించీ 540 00:38:24,595 --> 00:38:27,140 ఆలోచించకుండా రెండు ప్రపంచాలను భస్మీపటలం చేశారు. 541 00:38:27,223 --> 00:38:30,643 మీరు అధికారంలో ఉన్నప్పుడే, హారీ సెల్డన్, ఆయన అనుచరులనూ పారిపోనిచ్చారు. 542 00:38:31,185 --> 00:38:34,605 హడావిడిగా నాకు సామ్రాజ్యాన్ని కట్టబెట్టారు. 543 00:38:34,689 --> 00:38:38,609 అలాంటి పని నేను చేయలేను. నేను అధికారంలో ఉండగా జరగదు. 544 00:38:39,193 --> 00:38:41,612 మన వారసత్వాన్ని నేను రక్షిస్తాను. 545 00:38:41,696 --> 00:38:42,697 సోదరా... 546 00:38:44,031 --> 00:38:48,286 చాలాకాలం క్రితమే చనిపోయిన ఒక మనిషి తాలూకు దెయ్యం మిమ్మల్ని వెంటాడుతోంది. 547 00:38:48,369 --> 00:38:50,621 మనందరినీ, సోదరా. 548 00:38:55,251 --> 00:38:57,003 మీ అధికారం ఇక ముగిసింది. 549 00:38:58,463 --> 00:39:02,800 మీరు ట్రాంటార్ లోనే ఉండి, మీ కారణంగా ఉత్పన్నమైన బాధలను తగ్గిస్తూ ఉండండి 550 00:39:04,343 --> 00:39:05,887 వెళ్లండి. 551 00:39:05,970 --> 00:39:08,431 రాత్రి సోదరుడి వస్తువులన్నింటినీ రాజ భవనంలోకి తీసుకురండి. 552 00:39:19,650 --> 00:39:23,571 ఇకపై సామ్రాజ్యం అకస్మాత్తుగా ఎవరో కట్టబెట్టినది కాబోదు. 553 00:39:55,770 --> 00:39:56,896 నన్ను పిలిచారా, మహారాజా? 554 00:39:56,979 --> 00:39:59,690 సూదూర భాగంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పాడైంది. 555 00:40:01,025 --> 00:40:02,485 మీ బృందాన్ని తీసుకెళ్లి, విచారణ ప్రారంభించండి. 556 00:40:03,319 --> 00:40:04,529 ఇప్పుడే బయల్దేరుతాం, మహారాజా. 557 00:40:05,029 --> 00:40:06,030 డార్విన్. 558 00:40:06,948 --> 00:40:09,617 మనం పునాది నుంచి పంపిస్తున్న సమాచారం అప్పుడప్పడు అందట్లేదు. 559 00:40:09,700 --> 00:40:10,785 అక్కడికి కూడా ఒకసారి వెళ్లు. 560 00:40:10,868 --> 00:40:14,747 అలాగే మహారాజుకి తెలియకుండా ఏదీ చేయవద్దని పునాదిని హెచ్చరించండి. 561 00:41:18,895 --> 00:41:21,147 -అది... -ఏమీ బాగోలేదు, కదా? 562 00:41:40,041 --> 00:41:44,045 లూయిస్ ఇక్కడ ఇంఛార్జ్ ఎవరు? నువ్వా లేక నాణేలతో జిమ్మిక్కులు చేసే ఆ వార్డెనా? 563 00:41:44,128 --> 00:41:46,464 ఎందుకంటే విషయాలన్నింటినీ ఆమె క్లిష్టతరం చేస్తున్నట్టు అనిపిస్తోంది. 564 00:41:46,547 --> 00:41:48,883 -అర్థమయ్యేలా చెప్తాను, వేటగత్తె కీయాన్... -గొప్ప వేటకత్తె. 565 00:41:48,966 --> 00:41:50,510 మేం సంక్షోభానికి ఎదుర్కోవడానికి కారణం 566 00:41:50,593 --> 00:41:54,055 నువ్వు మా మహారాజుకు చెందిన వ్యక్తిగత ప్రదేశంలోకి చొరబడటమే. 567 00:41:54,138 --> 00:41:57,350 శాల్వార్ నన్ను ఆ స్తంభం వద్దకు తీసుకెళ్లి, నేను అడిగింది ఇచ్చి ఉంటే, 568 00:41:57,433 --> 00:41:59,060 మేం ఈపాటికే ఈ గ్రహాన్ని వదిలి వెళ్లిపోయేవాళ్లం. 569 00:41:59,143 --> 00:42:00,645 మా సాధారణ నౌక నుంచి మాడ్యూల్ కావాలా? 570 00:42:00,728 --> 00:42:03,231 మీకు అది అక్కర్లేదు కాబట్టి మాకు ఇమ్మనడం లేదు. 571 00:42:03,731 --> 00:42:07,318 మీరు టెర్నినస్ లో చిక్కుబడ్డారు. ఆ విషయం మహారాజుకు స్పష్టంగా తెలుసు. 572 00:42:07,401 --> 00:42:08,736 లూయిస్. 573 00:42:09,654 --> 00:42:10,655 అది మీకెందుకు అవసరం? 574 00:42:11,155 --> 00:42:13,366 మా ప్రజలు సాంకేతికంగా దివాలా తీశారు. 575 00:42:13,449 --> 00:42:15,076 మేం చచ్చిపోతున్నాం, డైరెక్టర్. 576 00:42:15,868 --> 00:42:19,372 మా వాతావరణాన్ని మహారాజు అగ్నికి ఆహుతి చేసినప్పటినుంచీ మా పరిస్థితి అదే. 577 00:42:19,455 --> 00:42:23,292 చేయని నేరానికి మాలో సగంమంది చనిపోయారు. 578 00:42:23,376 --> 00:42:25,211 మీలా కాకుండా, మాకు ఎన్నో నౌకలున్నాయి. 579 00:42:25,294 --> 00:42:28,881 విషపూరితమైన మా ప్రపంచాన్ని వదిలేసి, మరో నక్షత్ర వ్యవస్థని వెదుక్కోగలం. 580 00:42:28,965 --> 00:42:32,135 శూన్యంలో నావిగేట్ చేయగలిగిన వనరులు మా వద్ద ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. 581 00:42:32,218 --> 00:42:33,928 నీకు సాయపడితే మా మహారాజు మమ్మల్ని నాశనం చేస్తాడు. 582 00:42:34,011 --> 00:42:35,763 మీ సహకారం అవసరం, డైరెక్టర్. 583 00:42:36,764 --> 00:42:38,641 ఎందుకంటే మేం కోల్పోవడానికి ఇక మావద్ద ఏదీ లేదు. 584 00:42:39,600 --> 00:42:42,812 నగరం తగలబడుతూ ఉంటే నువ్వు ఫిడేలు వాయిస్తూ కూర్చోలేవు. 585 00:42:46,816 --> 00:42:48,860 అది బాంబులు కురిపించే సాధనం కాదు కాదా? 586 00:42:48,943 --> 00:42:51,529 కంచెలోకి చొరబడేందుకే అయితే వారి ప్రయత్నం వృథాయే. 587 00:42:51,612 --> 00:42:55,074 ఇవేమీ నిజం కాదు. ఫారా ఇంతకంటే తెలివైనది. 588 00:42:55,158 --> 00:42:57,577 కమ్యూనికేషన్ వ్యవస్థను నాశనం చేశారు, వాళ్లు సర్వసన్నద్ధంగానే వచ్చారు. 589 00:42:57,660 --> 00:43:00,329 వాళ్లు ఏదో పెద్ద ఎత్తుగడే వేశారు. అదేమిటో నాకు అంతుపట్టడం లేదు. 590 00:43:00,413 --> 00:43:02,665 వేర్వేరు నక్షత్రాలకు వెళ్లి సాయం రమ్మని అడిగేందుకు నేను నా నౌకలో బయల్దేరి వెళ్లనా? 591 00:43:02,749 --> 00:43:06,127 వద్దు. నువ్వు కక్ష్యలోకి ప్రవేశించే ముందే నిన్ను ఆకాశంలోనే వాళ్లు కాల్చి చంపేస్తారు. 592 00:43:07,170 --> 00:43:08,921 అవకాశం దొరికినప్పుడు పారిపోలేదేమని తర్వాత బాధపడవు కదా? 593 00:43:09,005 --> 00:43:11,674 నా జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, శాల్వార్ హార్డిన్. 594 00:43:11,758 --> 00:43:13,593 నీతోబాటే ఉండటం అలాంటి తప్పుల్లో ఒకటి కాబోదు. 595 00:43:14,927 --> 00:43:16,345 నువ్వు అత్తుత్తమ సేవకుడివి. 596 00:43:27,648 --> 00:43:29,192 వాల్ట్ అనాక్రీయాన్ వాళ్లది కాదు... 597 00:43:30,067 --> 00:43:31,110 అలాగని గ్రహాంతరవాసులది కూడా కాదు. 598 00:43:31,194 --> 00:43:32,653 అది హారితో అనుసంధానమై ఉండాలి. 599 00:43:32,737 --> 00:43:33,738 అది నీకెలా తెలుసు? 600 00:43:33,821 --> 00:43:35,698 నన్ను బ్లాక్ చేసినప్పుడు నాకు కనిపించింది అదే, 601 00:43:36,324 --> 00:43:40,953 హారి లైబ్రరీలోని ట్రాంటార్ పై ఒక కుర్రాడు కత్తి పట్టుకుని నాకు కనిపించాడు. 602 00:43:41,746 --> 00:43:43,414 అది నన్ను దూరంగా చెప్పేందుకు చేసిన హెచ్చరికేమో? 603 00:43:44,665 --> 00:43:46,167 లూయిస్ చెప్పిందే నిజమేమో? 604 00:43:46,250 --> 00:43:49,378 అతను చెప్పినట్టే నేను బయటివ్యక్తినేమో, జులాయిలా తిరుగుతూ, అన్నింటినీ చెడగొడుతూ, 605 00:43:49,462 --> 00:43:50,755 సెల్డన్ ప్లాన్ ని నాశనం చేస్తున్నానేమో? 606 00:43:50,838 --> 00:43:53,341 శాల్వార్, నువ్వు సెల్డన్ ప్లాన్ లో భాగమేమో? 607 00:43:55,593 --> 00:43:59,305 వ్యక్తుల జాతకం ఎప్పుడూ నిగూఢమే. 608 00:43:59,388 --> 00:44:03,768 మీ నగరాన్ని నేలమట్టం చేస్తానన్న నా ప్రతిజ్ఢ గుర్తుంది కదా, వార్డెన్? 609 00:44:03,851 --> 00:44:05,812 కానీ జన సమూహాల కదలికలు, 610 00:44:05,895 --> 00:44:09,440 సంస్కృతుల ఉత్థాన పతనాలు, ఆదర్శాలు, ప్రపంచాలు... 611 00:44:10,274 --> 00:44:13,444 ఈ సమాధానాలను హారీ సెల్డన్ ఎంతో కాలం క్రితమే విడమరచి చెప్పాడు. 612 00:44:14,112 --> 00:44:15,404 ఇదే సరైన సమయం. 613 00:44:15,488 --> 00:44:19,283 ఇక అంతానికి ఆరంభం, ఆ గ్రహం పేరుకు తగ్గట్టుగానే, 614 00:44:19,367 --> 00:44:21,160 టర్మినస్ పై చోటుచేసుకుంది. 615 00:45:42,325 --> 00:45:44,327 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య