1 00:00:01,168 --> 00:00:02,920 Foundationలో ఇంతకు ముందు... 2 00:00:03,003 --> 00:00:04,838 అక్కడ ఏం చూశావో చెప్పు. 3 00:00:05,339 --> 00:00:07,132 నేనేం చూడలేదు, మహారాజా. 4 00:00:07,216 --> 00:00:09,092 ఉల్వ్స్ బ్రెత్ నొప్పి నివారణకు పనికొస్తుంది. 5 00:00:09,176 --> 00:00:11,303 ప్రాక్సిమా ఓపల్ మరణించింది. 6 00:00:11,386 --> 00:00:14,181 వేరొక అభ్యర్ధికి మద్దతు పెరుగుతోంది. 7 00:00:14,264 --> 00:00:16,892 ఈ విభేదాల దృష్ట్యా వ్యక్తిగతంగా హాజరైతే మంచిది. 8 00:00:16,975 --> 00:00:18,477 ఫారా కంచెని ఆఫ్ చేస్తోంది. 9 00:00:19,269 --> 00:00:20,270 వెనక్కి వెళ్లండి! 10 00:00:20,354 --> 00:00:22,606 మనం పునాది నుంచి పంపిస్తున్న సమాచారం అప్పుడప్పడు అందట్లేదు. 11 00:00:22,689 --> 00:00:26,151 మహారాజుకి తెలియకుండా ఏదీ చేయవద్దని పునాదిని హెచ్చరించండి. 12 00:01:40,809 --> 00:01:42,853 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించబడింది 13 00:01:59,828 --> 00:02:02,998 చిన్నప్పుడు, నేను గెలాక్సీ నడి మధ్యన, ఒకప్పుడు గ్రహం, 14 00:02:04,499 --> 00:02:07,753 ఇప్పుడు నగరమైన ట్రాంటార్ గురించి చాలా కథలు విన్నాను. 15 00:02:09,796 --> 00:02:14,092 అక్కడున్న జనాలు పాపులని, స్లీపర్ కన్నా తనకు తాను గొప్ప అనుకొనే... 16 00:02:16,261 --> 00:02:19,765 ఒక నకిలీ ప్రభువును వారు దేవునిగా కొలిచారని నాకు చెప్పారు. 17 00:02:21,558 --> 00:02:23,143 అతడిని కలుసుకొనేదాకా 18 00:02:24,019 --> 00:02:25,145 ఆ కథలను నేను నమ్మలేదు. 19 00:02:35,447 --> 00:02:38,283 మీరు శరవేగవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేశారు, మహారాజా. 20 00:02:39,284 --> 00:02:42,578 మనం కొన్ని గంటల్లో సూరా సిస్టమ్ కు చేరుకుంటాం. 21 00:02:58,303 --> 00:03:02,975 మహారాజు ప్రపంచాలను సృష్టించగలడు, అలాగే నాశనం చేయగలడని, 22 00:03:03,058 --> 00:03:08,063 మరణంపైనే జయించి, చావు అనేదే లేకుండా జీవించగలడని నాకు చెప్పారు. 23 00:03:09,231 --> 00:03:10,983 నేను అతడిని కళ్లలోకి చూసినప్పుడు... 24 00:03:12,192 --> 00:03:17,197 ఎప్పుడూ సంశయమనేదే ఎరుగని అతనికి, హారి సెల్డన్ ని... 25 00:03:20,117 --> 00:03:23,203 కలిశాక సంశయం ఏర్పడటం నాకు కనబడింది. 26 00:03:46,310 --> 00:03:47,936 నేను సమీక్షించడానికి సిద్ధంగా... 27 00:03:50,272 --> 00:03:53,608 ఒక్క నిమిషం, మహారాజా. మీరు ఇంత త్వరగా వస్తారని నేను ఊహించలేదు. 28 00:03:58,447 --> 00:04:01,116 మీ చిన్నప్పుడు కూడా నేను ఎలా తయారయ్యేదాన్నో మీరు చూశారు కదా. 29 00:04:11,918 --> 00:04:14,087 మీరు బాగానే ఉన్నారా, మహారాజా? 30 00:04:14,796 --> 00:04:16,173 ప్రయాణం వల్ల కాస్త అదోలా ఉంది. 31 00:04:17,716 --> 00:04:21,928 దాన్ని తట్టుకోగలిగేలానే స్పేసర్లని మార్చడం జరిగింది, కానీ వారు మనుషుల్లా అనిపించరు. 32 00:04:23,722 --> 00:04:26,516 అది కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుందిలెండి. 33 00:04:27,726 --> 00:04:28,769 శరవేగవంతమైన ప్రయాణ సమయంలో... 34 00:04:29,978 --> 00:04:31,647 మేల్కొని ఉంటే ఎలా ఉంటుంది? 35 00:04:31,730 --> 00:04:33,231 విశ్వం ముడుచుకున్నప్పుడా? 36 00:04:35,317 --> 00:04:38,612 మానవ మెదడు ఆ విచ్ఛిన్నతను తట్టుకోలేదు. 37 00:04:38,695 --> 00:04:39,696 కానీ... 38 00:04:41,698 --> 00:04:42,949 మీ మెదడు తట్టుకోగలదు. 39 00:04:43,033 --> 00:04:46,662 నేను ఆ అనుభవాన్ని వివరించగలిగితే, మీకు ఆ సమయంలో నిద్రపోవాల్సిన పనుండేది కాదు. 40 00:04:53,877 --> 00:04:55,671 లివాయతన్ క్రిస్టల్. 41 00:04:55,754 --> 00:04:59,508 మేయిడెన్ లోని లివాయతన్ గనుల నుండి తీయబడిన ఉప్పు. 42 00:04:59,591 --> 00:05:01,301 మరి దాని ప్రాముఖ్యత? 43 00:05:01,385 --> 00:05:04,012 ఇది ముగ్గురు దేవతల ప్రయాణానికి గుర్తు. 44 00:05:04,096 --> 00:05:06,098 మేయిడెన్, మదర్ మరియు క్రోన్. 45 00:05:06,181 --> 00:05:09,977 అనుచరులు, దీన్ని సంప్రదాయబద్ధంగా తాకి ప్రార్థిస్తారు. 46 00:05:12,562 --> 00:05:14,398 లుమినిజమ్ యొక్క ప్రధాన నమ్మకాన్ని సూచిస్తుంది, 47 00:05:14,481 --> 00:05:18,318 కాలచక్రాలు, ఆత్మలు, మరణం తర్వాత పుట్టుక వంటివి. 48 00:05:19,444 --> 00:05:20,529 దీని మూలం? 49 00:05:20,612 --> 00:05:23,991 ఆ ముగ్గురు దేవతలు, మొదట ఒకే దేవతగా ఉండేవారని లుమినిజమ్ అనుచరుల నమ్మకం, 50 00:05:24,074 --> 00:05:27,327 కానీ సూరా ఆ గ్రహాన్ని గుద్దాక, ఆ గ్రహం పేరు ఏంటంటే... 51 00:05:30,414 --> 00:05:31,748 దాని పేరు డీ అక్షరంతో మొదలవుతుంది. 52 00:05:32,749 --> 00:05:34,042 డోల్. 53 00:05:34,710 --> 00:05:38,046 అది ఆ దేవతను మూడు చందమామలుగా ముక్కలు చేసింది. 54 00:05:38,630 --> 00:05:40,590 అందులో జీవించగల ఏకైక చందమామ, మేయిడెన్. 55 00:05:41,800 --> 00:05:43,093 ఆ మతం ఎప్పట్నుంచి ఉంది? 56 00:05:43,176 --> 00:05:45,304 పదిహేను వేల ఏళ్ల నుండి. 57 00:05:47,514 --> 00:05:49,433 సామ్రాజ్యం ముందు నుండీ ఉంది. 58 00:05:50,809 --> 00:05:52,394 దాన్ని ఎంత మంది అనుసరిస్తున్నారు? 59 00:05:53,020 --> 00:05:54,354 మూడు లక్షల కోట్ల మంది. 60 00:06:03,113 --> 00:06:04,531 నేను ఎప్పుడూ నిన్ను ఈ ప్రశ్న అడగలేదు, 61 00:06:05,824 --> 00:06:08,327 నువ్వు ఎలా దాన్ని అనుసరిస్తున్నావు? 62 00:06:09,953 --> 00:06:12,497 ఎలానా? లేక ఎందుకు అనా? 63 00:06:12,581 --> 00:06:13,665 ఎందుకు అని. 64 00:06:15,959 --> 00:06:20,464 మీరు పుట్టిన నాటి నుండి, మీకూ, మీ సోదరులకూ, మీ లక్ష్యం ఏంటో తెలుసు. 65 00:06:20,547 --> 00:06:23,091 కానీ మా లాంటి మిగతావాళ్ళు, దాన్ని మేమే సొంతంగా వెతుక్కోవాలి. 66 00:06:23,175 --> 00:06:26,261 కానీ... నీ లక్ష్యం ఏంటో నీకు తెలుసు కదా. 67 00:06:27,679 --> 00:06:30,724 నా సోదరులను, నన్ను, అన్నింటికన్నా ముఖ్యంగా సామ్రాజ్యానికి సేవలందించడం. 68 00:06:30,807 --> 00:06:32,559 అది నీ కోడ్ లోనే రాసి ఉంది కదా. 69 00:06:32,643 --> 00:06:35,354 ఆ సేవలో నాకు బాగా సంతృప్తిగానే ఉంది. 70 00:06:36,396 --> 00:06:39,775 కానీ పరమార్థం కోసం అన్వేషించడమంటే జవాబు కోసం వెతకడం మాత్రమే కాదు. 71 00:06:39,858 --> 00:06:42,444 జ్ఞానోదయం పొందాలని కూడా అన్వేషించవచ్చు. 72 00:06:43,779 --> 00:06:46,740 దేవతలు ముగ్గురుగా విడిపోవాలని భావించలేదు. 73 00:06:47,366 --> 00:06:49,201 వాళ్లు మళ్లి ఎప్పుడెప్పుడు ఒకటి అవుదామా అని చూస్తున్నారు. 74 00:06:50,077 --> 00:06:53,330 మేయిడెన్ లో ఉన్న ఉప్పు ప్రాంతం వారి కన్నీళ్లని చెప్తుంటారు. 75 00:06:53,413 --> 00:06:57,292 కానీ వాళ్ల త్యాగమే మమ్మల్ని ఇంత పరిపూర్ణులను చేసింది. 76 00:06:57,376 --> 00:07:01,546 జీవితం మనకి ప్రతి క్షణం మన సొంత దారిని ఎంచుకొనే అవకాశం ఇస్తుంది. 77 00:07:01,630 --> 00:07:06,593 మనందరం గెలాక్సీ చుట్టూ తిరుగుతున్నట్టే, ఆ దేవతలు 78 00:07:07,386 --> 00:07:09,888 మమ్మల్ని సేవ, అలాగే సత్యం వైపు నడిపిస్తారు. 79 00:07:13,934 --> 00:07:18,230 మరి మనల్ని సవాలు చేస్తున్న ఈ జెఫిర్ హలీమా ప్రస్థానం గురించి చెప్పు, 80 00:07:18,772 --> 00:07:22,401 తన గ్రహం మిర్రస్ ట్వల్వ్, తనది పుట్టుక నుంచీ ఆ మతమే. 81 00:07:22,484 --> 00:07:25,612 అక్కడ భూకంపాలు జరిగాక, సహాయక చర్యలకు నాయకత్వం వహించి, 82 00:07:25,696 --> 00:07:27,489 అందరి మదిలో మంచి స్థానం సంపాదించింది. 83 00:07:27,572 --> 00:07:30,158 కానీ తను జెఫిర్ అయ్యి ఒక ఏడాది కూడా కాలేదు. 84 00:07:31,201 --> 00:07:34,037 తనకి పదోన్నతి లభించింది ఈమధ్యే అన్నమాట. 85 00:07:34,997 --> 00:07:37,416 అంతరాయానికి మన్నించాలి, మహారాజా, మనం మేయిడెన్ వాయుమండంలోకి ప్రవేశించాం, 86 00:07:37,499 --> 00:07:39,793 కాసేపట్లో సాల్ట్ ప్యాలెస్ కి చేరుకుంటాం. 87 00:08:05,027 --> 00:08:07,070 సంబరాలలో మునిగి తేలే జనాల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నావా? 88 00:08:08,113 --> 00:08:10,532 నేను నౌకలోనే ఉండాలనుకుంటున్నాను. 89 00:08:10,615 --> 00:08:11,783 ఎందుకు? 90 00:08:11,867 --> 00:08:14,828 మేయిడెన్ లో ఉన్న చాలా మందికి నేను వాళ్ల మతానికి చెందినదాన్నే అని తెలుసు. 91 00:08:15,329 --> 00:08:17,539 దాన్ని మీకు వ్యతిరేకంగా వాడే అవకాశం ఉంది. 92 00:08:17,623 --> 00:08:19,124 పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. 93 00:08:20,584 --> 00:08:24,921 ల్యుమినిస్ట్ నమ్మకాల గురించి నాకు సలహాలు ఇచ్చేవాళ్లు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. 94 00:08:29,259 --> 00:08:30,260 నువ్వు కూడా వస్తున్నావు. 95 00:08:58,497 --> 00:09:00,040 జెఫిర్ హలీమా. 96 00:09:01,291 --> 00:09:03,418 మేయిడెన్ కి స్వాగతం, మహారాజా. 97 00:09:05,170 --> 00:09:09,090 అధికారిక స్వాగత వేడుకలు సన్నాహాలు చేయడం హడావిడిగా ఉంటుందని నాకు తెలుసు, 98 00:09:09,590 --> 00:09:11,551 అందుకే నేను జెఫిర్ల కౌన్సిల్ కి మనవి చేసుకోని, మీకు ఒంటరిగా 99 00:09:11,634 --> 00:09:14,304 స్వాగతం పలికే భాగ్యాన్ని దక్కించుకున్నాను. 100 00:09:15,013 --> 00:09:16,098 ఒంటరిగానా? 101 00:09:16,181 --> 00:09:20,477 మహారాజు గారు అట్టహాసంగా సాగే స్వాగత వేడుకలకు అలవాటు పడుంటారు, 102 00:09:21,061 --> 00:09:24,564 కానీ ప్రాక్సిమా మరణం తర్వాత అలుముకొనున్న ఈ విచారకరమైన వాతావరణంలో, 103 00:09:25,357 --> 00:09:27,818 అట్టహాసంగా స్వాగత సత్కారాలు చేస్తే... 104 00:09:28,902 --> 00:09:30,237 సముచితంగా ఉండదు అనిపించింది. 105 00:09:30,320 --> 00:09:31,363 నిజమే. 106 00:09:32,447 --> 00:09:36,493 మా గ్రహానికి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 107 00:09:36,576 --> 00:09:41,123 మహారాజు దృష్టిలో లుమినిజమ్ కి ఎంత ప్రాధాన్యత ఉందో మీ రాక తెలియజేస్తోంది. 108 00:09:41,707 --> 00:09:46,044 అందుకు కృతజ్ఞతగా నేను మీకు ఈ డ్రింక్ ని అందించాలనుకుంటున్నాను. 109 00:09:55,637 --> 00:09:58,598 ఇవి స్వయంగా మదర్ గర్భం నుండి తీసిన నీళ్ళు. 110 00:09:59,182 --> 00:10:02,311 ఈ నీటిని తాగిన వాళ్ల మదిలో ఏమైనా దురాలోచనలు ఉంటే. 111 00:10:02,394 --> 00:10:04,313 వాటిని ఈ కప్పులోని ఉప్పు దూరం చేస్తుందని అంటుంటారు. 112 00:10:04,396 --> 00:10:08,066 కానీ బాధాకరమైన విషయమేంటంటే, పరీక్షించని ద్రవాలను మహారాజుగారు స్వీకరించలేరు. 113 00:10:08,150 --> 00:10:13,363 నాలో ఏవైనా దురాలోచనలు ఉంటే, అవి నాలోనే దాగి ఉండాలి అనుకుంటా. 114 00:10:13,447 --> 00:10:16,283 మీకు కావలసింది అదే అని నాకు అనిపిస్తోంది. 115 00:10:18,619 --> 00:10:22,122 ఏదేమైనా, మన మధ్య పరిచయం పెరగాలని కోరుకుంటున్నాను. 116 00:10:23,498 --> 00:10:25,167 మీ అందరికీ ముగ్గురు దేవతల ఆశిస్సులు ఎల్లపుడూ ఉండుగాక. 117 00:10:35,135 --> 00:10:37,471 ఈ సందర్భానికి ఏ పదం సరిగ్గా సరిపోతుంది? 118 00:10:38,055 --> 00:10:39,056 అంత అవసరమా? 119 00:10:39,848 --> 00:10:40,974 అది సరిపోతుందిలే. 120 00:10:42,517 --> 00:10:45,020 తను నీకు విషం ఇస్తోందని నాకు అనిపించడం లేదు. 121 00:10:45,103 --> 00:10:46,938 అలా అని కాదు. 122 00:10:47,022 --> 00:10:49,232 కానీ, నేను స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసినప్పుడు, 123 00:10:49,316 --> 00:10:52,194 వచ్చేవాళ్లలో ఎవరికీ కూడా దురాలోచనలు లేకుండా ఉండవు కదా. 124 00:11:11,171 --> 00:11:12,381 జాగ్రత్తగా ఉండండి. 125 00:11:12,965 --> 00:11:14,675 మన శత్రువు సాయుధుడై ఉండవచ్చు. 126 00:11:16,009 --> 00:11:17,594 అతను చనిపోయి ఉంటాడేమో. 127 00:11:18,679 --> 00:11:19,680 అతను బతికే ఉన్నాడు. 128 00:11:20,180 --> 00:11:23,016 సామ్రాజ్యం నౌకలు, వాళ్ల మనుషులను కాపాడగలిగేలా, ఇతరుల ప్రాణాలను... 129 00:11:23,558 --> 00:11:25,102 హరించివేసేలా రూపొందించబడి ఉంటాయి. 130 00:11:35,654 --> 00:11:38,448 కమాండర్, మీతో మాకు పనుంది కాబట్టే, మీరు బతికి బట్ట కట్టారు. 131 00:11:39,658 --> 00:11:41,201 మీరు చచ్చినట్టే లెక్క. 132 00:11:43,829 --> 00:11:45,247 కానీ ఆ విషయం మీకు ఇంకా అర్థం కాలేదు. 133 00:11:45,330 --> 00:11:46,540 మాకు తెలుసులే. 134 00:11:49,042 --> 00:11:50,877 మాది దెయ్యాల సైన్యం. 135 00:12:15,402 --> 00:12:17,612 హేయ్. ఇటు వైపు రా. 136 00:12:41,762 --> 00:12:42,804 నీకు ఏమీ కాలేదు కదా? 137 00:12:45,432 --> 00:12:46,808 గియా. 138 00:12:50,228 --> 00:12:51,355 ఇక్కడ ఏమైంది? 139 00:12:54,524 --> 00:12:55,859 అయ్యయ్యో. 140 00:12:55,942 --> 00:12:58,320 పర్వాలేదులే. నీకేం కాలేదు. 141 00:12:59,404 --> 00:13:02,157 మనం దీన్ని నుంచి బయటపడితే, దాని గురించి కథలుకథలుగా చెప్పుకోవచ్చు. 142 00:13:06,495 --> 00:13:08,997 తుపాకీ తూటాకి బలికాక ముందే ఇక్కడి నుండి వెళ్లిపోదాం పద. 143 00:13:27,224 --> 00:13:28,767 మనకి ప్రయాణికుల జాబితా చిక్కింది. 144 00:13:29,476 --> 00:13:31,144 పేర్లను పరిశీలించండి. 145 00:13:31,228 --> 00:13:36,233 నాకు పర్యావరణ, చోదన, ఇంకా వ్యోమయాన శాస్త్ర ఇంజనీర్లు కావాలి. 146 00:13:36,817 --> 00:13:38,568 ఆల్డర్ బృందానికి కబురు పంపు. 147 00:13:39,403 --> 00:13:41,321 నాకు యుద్ధ నౌకలు ప్రయోగానికి సిద్ధంగా ఉండాలి. 148 00:13:41,863 --> 00:13:43,740 వాళ్లు ఇంకా గొయ్యలోనే ఉన్నారు. 149 00:13:43,824 --> 00:13:46,201 పని త్వరగా కానివ్వమని చెప్పు. 150 00:13:47,035 --> 00:13:48,870 ఇన్విక్టస్ నౌక ఎల్లకాలం అక్కడే ఉండదు. 151 00:13:50,580 --> 00:13:51,581 తనని చంపేయకుండా ఎందుకు ఉంచారు? 152 00:13:54,334 --> 00:13:56,378 వాల్ట్ కోసం. 153 00:13:56,795 --> 00:13:58,297 అది అస్సలు అంతుబట్టని విషయంలా ఉంది. 154 00:13:59,172 --> 00:14:01,174 దానికి, ఈమెకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. 155 00:14:02,926 --> 00:14:04,678 దాన్ని మన నిర్వీర్యం చేశాక, 156 00:14:04,761 --> 00:14:06,388 తనని చంపేద్దాం. 157 00:14:07,306 --> 00:14:09,308 ఇది సఫలం అవుతుందంటావా, వేటగత్తె? 158 00:14:09,766 --> 00:14:11,977 ఇన్విక్టస్ మనకి విమోచనం లాంటిది, 159 00:14:12,686 --> 00:14:15,814 మనం ఎన్నో కష్టాలు పడి దాన్ని పొందడానికి అర్హులమయ్యాం. 160 00:14:31,788 --> 00:14:32,831 సిద్ధంగా ఉన్నావా? 161 00:14:44,176 --> 00:14:45,969 ఆ నౌకలో ప్రయాణించిన సిబ్బంది పేర్లు ఇవేనా? 162 00:14:46,553 --> 00:14:49,181 డెలివరెన్స్ లో సేవలందిన ప్రతీ వ్యక్తి పేర్లు అందులో ఉన్నాయి. 163 00:14:49,931 --> 00:14:54,353 టర్మినస్ కి వచ్చాక వృద్ధాప్యం వల్లనో లేక ప్రమాదాల వల్లనో కొందరు చనిపోయారు. 164 00:14:54,853 --> 00:14:56,730 నాకు పర్యావరణ ఇంజనీర్ ని చూపండి. 165 00:15:08,158 --> 00:15:10,827 రోవ్, జసెంటా పర్యావరణ ఇంజనీర్ 166 00:15:10,911 --> 00:15:12,371 వ్యోమయాన శాస్త్ర ఇంజనీర్? 167 00:15:14,122 --> 00:15:15,248 ఆయన తర్వాత సీనియర్ ఎవరు? 168 00:15:16,500 --> 00:15:19,211 నేనే. ఆ బాధ్యతను నేనే తీసుకున్నాను. 169 00:15:20,796 --> 00:15:22,130 చోదన శాస్త్ర ఇంజనీర్? 170 00:15:24,091 --> 00:15:27,135 క్రిటో ఆర్బిటల్ అకాడమీలో విద్యాభ్యాసం. 171 00:15:28,220 --> 00:15:34,393 ఇంపీరియల్ రవాణా, ఇంకా వాణిజ్య నౌకల్లో, కాంతి వేగానికి అటూఇటూ కూడా 172 00:15:34,476 --> 00:15:35,978 ఐదు వేల గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం ఉంది. 173 00:15:39,064 --> 00:15:41,024 నువ్వు వ్యోమనౌకకు సిబ్బంది కోసం చూస్తున్నావు. 174 00:15:41,108 --> 00:15:43,318 అలాంటప్పుడు కమాండర్ డార్విన్ నౌకను ఎందుకు కూల్చారు? 175 00:15:43,902 --> 00:15:47,823 ఎందుకంటే, నాకు కమాండర్ కావాలి, ఆ తొక్కల నౌక కాదు. 176 00:15:47,906 --> 00:15:50,284 నువ్వు చేసిన పని వల్ల యుద్ధం ప్రారంభమయ్యే ప్రమాదముంది. 177 00:15:50,867 --> 00:15:52,119 మనకి కావాలసిన వాళ్ళందరూ దొరికేశారు. 178 00:15:52,202 --> 00:15:55,080 కంచెకు విద్యుత్తును పునరుద్ధరించి దాన్ని సురక్షితం చేయండి. 179 00:15:55,163 --> 00:15:57,666 మా పనయ్యేదాకా వీళ్లకి దొంగచాటుగా పారిపోయే అవకాశం ఇవ్వకూడదు. 180 00:16:04,131 --> 00:16:06,216 -హాయ్. -హాయ్. 181 00:16:18,979 --> 00:16:20,897 నేను మీకు ఈ విషయం ఒకసారే చెప్తాను. 182 00:16:21,690 --> 00:16:24,526 మా దగ్గర లేని జ్ఞాన సంపద పునాది వద్ద ఉంది. 183 00:16:25,110 --> 00:16:27,738 కాబట్టి, ఒక నౌకకు మరమత్తు చేయడంలో మాకు సహాయపడటానికి 184 00:16:28,530 --> 00:16:31,199 మాకు మీలో కొందరు కావాలి. 185 00:16:31,283 --> 00:16:33,452 మరమత్తులన్నీ అనుకున్నదాని ప్రకారం జరిగితే, 186 00:16:33,535 --> 00:16:37,497 మేము టర్మినస్ ని వదిలి వెళ్లిపోతాము, ఇక మీ జీవితాలు మీవి. 187 00:16:37,581 --> 00:16:40,334 మీరు సహకరించకపోతే, మనమందరం చనిపోతాం. 188 00:16:41,126 --> 00:16:43,003 అనాక్రియాన్లు వాళ్లు, అలాగే టర్మినస్ వాళ్లు కూడా చస్తారు. 189 00:16:43,086 --> 00:16:45,547 జసెంటా రోవ్, ముందుకు రావాలి. 190 00:16:50,385 --> 00:16:53,138 నువ్వు "డెలివరెన్స"లో పర్యావరణ ఇంజనీరుగా పని చేశావు కదా? 191 00:16:53,221 --> 00:16:55,474 అవును. కానీ మీ కోసం నేను పని చేయను. 192 00:16:55,974 --> 00:16:58,060 నేను కేవలం పునాదికే విధేయంగా ఉంటాను. 193 00:17:07,110 --> 00:17:09,071 నేను ఒక కాలినే కాల్చాను. 194 00:17:09,154 --> 00:17:10,781 నీ భర్తకి ఇంకో కాలు కూడా ఉంది. 195 00:17:11,448 --> 00:17:13,158 మన మధ్య అంగీకారం కుదిరినట్టేనా? 196 00:17:19,498 --> 00:17:20,666 అకీవా లీ. 197 00:17:24,252 --> 00:17:27,506 నువ్వు అల్టేయిర్ క్లాస్ యుద్ధనౌకలో క్యాంటమ్ ఫోల్డింగ్ ఇంజన్ ని నిర్వహించగలవా? 198 00:17:28,924 --> 00:17:29,925 నిర్వహించగలను. 199 00:17:36,556 --> 00:17:37,933 లూయిస్ పైరీన్. 200 00:17:38,016 --> 00:17:40,602 దయచేసి వినండి, ముప్పై ఏళ్లయింది నేను... 201 00:17:47,985 --> 00:17:50,612 మనకి కావలసిన వాళ్లందరూ వీళ్లేనా? 202 00:17:57,286 --> 00:17:59,413 నువ్వు నాకు విషం ఇచ్చావని అనుకున్నాను. 203 00:18:01,039 --> 00:18:03,458 ఉల్వ్స్ బ్రెత్ ఆకులు నిజంగా చాలా మేలు చేశాయి. 204 00:18:04,376 --> 00:18:06,044 నాకు ఇవాళ కాస్త నొప్పి తగ్గింది. 205 00:18:06,128 --> 00:18:07,421 అందుకు నాకు ఆనందంగా ఉంది, మహారాజా. 206 00:18:08,255 --> 00:18:10,549 మీకు ఇంకేమైనా సాయం కావాలంటే నేను ఆనందంగా చేస్తాను. 207 00:18:10,632 --> 00:18:13,093 మొన్న నీతో అలా దురుసుగా ప్రవర్తించినందుకు 208 00:18:13,677 --> 00:18:18,473 నా క్షమాపణలను మన్నిస్తే నాకు సాయం చేసినదానివి అవుతావు. 209 00:18:24,896 --> 00:18:26,440 ఇక్కడ అన్నీ చాలా చూడచక్కగా ఉన్నాయి. 210 00:18:27,107 --> 00:18:28,859 మేము ప్రతీరోజూ వీటిని కత్తిరిస్తాం. 211 00:18:29,651 --> 00:18:32,404 నియత్రింప సాధ్యం కానిదాన్ని నియంత్రించాలనుకోవడం వెర్రితనం. 212 00:18:39,286 --> 00:18:41,955 ఏ మొక్క అయినా కాంతి ఏ వైపు నుండి వస్తే, ఆ వైపే పెరుగుతుంది... 213 00:18:43,624 --> 00:18:44,625 అంతే కదా? 214 00:18:45,709 --> 00:18:46,835 అవును, మహారాజా. 215 00:18:57,721 --> 00:18:59,973 వాటిని తీసేయమని నేనే నీకు చెప్పానని తెలుసు... 216 00:19:02,476 --> 00:19:03,477 కానీ వాటిని అలానే వదిలేయ్. 217 00:19:04,686 --> 00:19:06,438 కాంతి ఎప్పటికీ మసకబారదేమో. 218 00:19:07,856 --> 00:19:09,066 మసకబారదనే అనుకుంటా. 219 00:19:15,238 --> 00:19:19,576 నేను నిన్ను పిలిచినప్పుడు, నువ్వు సమయానికి వచ్చేయాలి. 220 00:19:20,827 --> 00:19:23,747 చూస్తున్నావు కదా, నీకో సర్ప్రైజ్ ఏర్పాటు చేశాను. 221 00:19:24,331 --> 00:19:27,000 నీ తొలి వేటకు నీకో సవాలు. 222 00:19:27,084 --> 00:19:30,337 గిల్లీ రాప్టర్లు, ఇవి తమ చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి రంగులను మారుస్తాయి, 223 00:19:30,420 --> 00:19:33,131 కాల్చడం అటుంచితే, అసలు వాటిని కనిపెట్టడమే మహా కష్టం. 224 00:19:33,757 --> 00:19:37,135 కదలిక కోసం చూడాలి, రంగు కోసం కాదు. 225 00:19:38,261 --> 00:19:41,974 సాధారణంగా అయితే, నీకు వేట గురించి పగటి సోదరుడు పరిచయం చేసేవాడు. 226 00:19:42,057 --> 00:19:45,435 కానీ ఆయన సంప్రదాయాన్ని పక్కన పెట్టి ట్రాంటార్ ని వదిలి వెళ్లిన కారణంగా, 227 00:19:45,519 --> 00:19:47,771 ఇప్పుడు ఆ బాధ్యత నా భుజాలపై పడింది. 228 00:19:47,854 --> 00:19:49,815 -అతను వర్తమానమేమైనా పంపాడా? -లేదు. 229 00:19:50,399 --> 00:19:51,733 నీకు కూడా పంపడు. 230 00:19:53,110 --> 00:19:55,696 ఇది స్వేచ్ఛగా ఉండటానికి 231 00:19:55,779 --> 00:19:59,408 నీకు దక్కిన ఒక అరుదైన అవకాశంగా భావించు. 232 00:20:08,166 --> 00:20:09,668 ఈ రోజు తొలి వేట. 233 00:20:09,751 --> 00:20:12,754 నేను కాల్చక ముందు అసలు నువ్వు దాన్ని చూశావో లేదో... 234 00:20:19,886 --> 00:20:21,221 అదృష్టవశాత్తు తగిలింది. 235 00:20:21,305 --> 00:20:22,306 అవును. 236 00:20:22,973 --> 00:20:25,976 ఈ రోజంతా నన్ను నీతో ఉండనిస్తే, ఆ అదృష్టాన్ని నీ ప్రతిభగా మలచగలను. 237 00:20:26,560 --> 00:20:28,437 నేనే మలుచుకుంటానులే. 238 00:20:29,563 --> 00:20:32,274 అయితే, బాగా వేటాడు మరి. 239 00:20:33,442 --> 00:20:34,484 మీకు కూడా. 240 00:20:39,448 --> 00:20:42,242 ఓరి నాయనోయ్, ఈమె చాలా బరువు ఉంది. 241 00:20:42,326 --> 00:20:43,785 -పాలీ? -అయ్యయ్యో. 242 00:20:45,037 --> 00:20:46,371 అబ్బా, పాలీ. నొప్పి పుట్టింది. 243 00:20:46,455 --> 00:20:47,706 మన్నించు. 244 00:20:49,082 --> 00:20:50,083 అసలు మనం ఎక్కడ ఉన్నాం? 245 00:20:50,167 --> 00:20:51,585 జియోథర్మల్ సొరంగాలలో ఉన్నాం. 246 00:20:51,668 --> 00:20:53,795 నిన్ను చెరసాలలో ఉండటం చూసి, అక్కడి నుండి ఇక్కడి దాకా లాక్కుంటూ వచ్చాం. 247 00:20:54,671 --> 00:20:56,465 కనబడవు కానీ నువ్వు చాలా బరువు ఉన్నావు. 248 00:20:59,801 --> 00:21:00,802 ధన్యవాదాలు. 249 00:21:03,597 --> 00:21:04,598 వార్డెన్? 250 00:21:05,098 --> 00:21:06,350 ఇన్విక్టస్ అంటే ఏంటి? 251 00:21:06,933 --> 00:21:08,185 ఆ పేరును మీరు ఎప్పుడు విన్నారు? 252 00:21:09,019 --> 00:21:13,023 నువ్వు ఫారా దగ్గర ఉన్నప్పుడు ఫారా అంది. నాకు ఆ పదం తప్ప ఇంకేమీ అర్థం కాలేదు. 253 00:21:13,523 --> 00:21:16,777 అది ఒక గొప్ప యుద్ధ నౌక. కానీ చాలా శతాబ్దాల క్రితమే కనబడకుండా పోయింది. 254 00:21:16,860 --> 00:21:18,236 దాన్ని ఒక మాయా నౌక అని చెప్పవచ్చు. 255 00:21:18,320 --> 00:21:21,156 దాన్ని ఫారా కనిపెట్టేసింది అనుకుంటా. 256 00:21:29,164 --> 00:21:31,667 -నేల మీద పడుకోండి. పడుకోండి! -పడుకోండి. పడుకోండి. 257 00:21:32,292 --> 00:21:34,711 -శాల్వార్. -నాన్నా. నాన్నా. 258 00:21:34,795 --> 00:21:36,088 హ్యూగో! 259 00:21:37,798 --> 00:21:40,133 -నీకు కూడా! -మేయర్ హార్డిన్. 260 00:21:41,426 --> 00:21:42,678 హమ్మయ్య. 261 00:21:42,761 --> 00:21:44,304 ఇక్కడ మీరేం చేస్తున్నారు? 262 00:21:44,388 --> 00:21:46,682 అనాక్రియాన్లు కంచె కోడ్ ని మార్చేశారు, దానితో మేము కంచె దాటి వెళ్లలేకపోతున్నాం. 263 00:21:46,765 --> 00:21:49,267 ఈ నౌక భాగం అయితే దాగి ఉండటానికి చాలా సురక్షితంగా ఉంటుందని గ్రహించాం. 264 00:21:49,351 --> 00:21:51,478 నువ్వు రాత్రుళ్లు రౌండ్స్ వేసేటప్పుడు తరచుగా ఇక్కడికి వస్తుంటావని అతనికి చెప్పా. 265 00:21:51,561 --> 00:21:53,522 మీరు మీ సరసాలు తర్వాత ఆడుకోండి. 266 00:21:53,605 --> 00:21:55,440 ఇప్పుడు మనం లోపలికి ఎలా వెళ్ళాలో, అది అలోచించాలి. 267 00:21:55,524 --> 00:21:57,234 మనం లోపలికి వెళ్లడం లేదు. 268 00:21:57,317 --> 00:21:59,152 అంటే నీ ఉద్దేశం ఏంటి? 269 00:22:01,613 --> 00:22:04,157 అనాక్రీయాన్ యుద్ధనౌకలు జియోథర్మల్ క్షేత్రంలో ఉన్నాయి. 270 00:22:04,241 --> 00:22:07,828 యుద్ధనౌకల సంగతిని వదిలేయ్. మనం పునాదిని కాపాడుకోవాలి కదా. 271 00:22:07,911 --> 00:22:10,414 నేను పునాదిని కాపాడుకోవడం గురించే మాట్లాడుతున్నాను. 272 00:22:10,497 --> 00:22:14,334 ఫారా ఒక యుద్ధ నౌక కోసం ఇదంతా చేస్తుంది. అది గ్రహాలను నాశనం చేయగలది అనుకుంటా. 273 00:22:14,418 --> 00:22:17,379 అది తనకి కానీ దక్కితే, తను మొత్తం గెలాక్సీ మధ్య అగ్గి రాజేయగలదు. 274 00:22:17,462 --> 00:22:19,756 సెల్డన్ చెప్పిన మొదటి సంక్షోభం ఇదే. 275 00:22:20,340 --> 00:22:23,802 వాల్ట్ యాక్టివ్ అవ్వడం, నాకు సిక్స్త్ సెన్స్ లా ఏవేవో అనిపిస్తుండటం... 276 00:22:25,512 --> 00:22:29,558 అనాక్రియాన్లను ఆపడానికే ఇక్కడ నన్ను హారి పెట్టాడు, ఎలా అని ఆయనే సాయపడుతున్నాడు. 277 00:22:30,475 --> 00:22:33,478 కనుక నేను కూడా నా సిక్స్త్ సెన్స్ ప్రకారం నడుచుకుంటున్నాను, 278 00:22:33,562 --> 00:22:36,231 కాబట్టి ఆ యుద్ధనౌకలను మనం నాశనం చేసేయాలి. అర్థమైందా? 279 00:22:37,983 --> 00:22:39,401 -అలాగే, మేడమ్ గారు. -అలాగే, మేడమ్ గారు. 280 00:22:39,484 --> 00:22:41,403 మీరిద్దరూ ఇక్కడే ఉండండి. 281 00:22:41,486 --> 00:22:42,738 కానీ మేము నిన్ను కాపాడాము కదా. 282 00:22:43,780 --> 00:22:45,490 దానికి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. 283 00:22:45,574 --> 00:22:47,200 కానీ ఇది చాలా ప్రమాదకరమైంది, 284 00:22:47,284 --> 00:22:49,202 మీ ఇద్దరికి నా వల్ల ఏమైనా అయితే, దాన్ని నేను తట్టుకోలేను. 285 00:23:02,341 --> 00:23:03,884 మహాప్రభూ. 286 00:23:03,967 --> 00:23:07,387 నా రాకను పురస్కరించుకొని జనాలు సంబరాలతో నన్ను ఆహ్వానిస్తారని ఆశించాను, 287 00:23:07,471 --> 00:23:10,182 కానీ నాకు ఒక పాపిష్ఠి వ్యక్తి స్వాగతం పలికింది. 288 00:23:10,265 --> 00:23:12,476 క్షమించండి, మహారాజా. 289 00:23:12,559 --> 00:23:15,312 మీకు తగిన స్వాగత సత్కారాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. 290 00:23:17,189 --> 00:23:19,483 మీకు జెఫిర్ గిలాట్ ని పరిచయం చేస్తున్నాను. 291 00:23:20,400 --> 00:23:22,361 ముగ్గురు దేవతల ఆశిస్సులు మిమ్మల్ని చల్లగా చూడాలి, మహారాజా. 292 00:23:23,362 --> 00:23:25,280 మిమ్మల్ని కలవడం నా భాగ్యం, జెఫిర్. 293 00:23:25,781 --> 00:23:29,785 ప్రాక్సిమా ఓపల్ మరణానికి నేను నా సంతాపం తెలియజేస్తున్నాను. 294 00:23:29,868 --> 00:23:33,956 ధన్యవాదాలు, మహారాజా. ఇది విచారకరమైన సందర్భం, కానీ ఆశాజనకమైనది కూడా. 295 00:23:34,039 --> 00:23:35,582 ప్రత్యేకించి మీకు. 296 00:23:35,666 --> 00:23:39,169 జెఫిర్ల కౌన్సిల్ ఏం నిర్ణయిస్తే, దాన్ని నేను వినయపూర్వకంగా ఆహ్వానిస్తాను. 297 00:23:39,252 --> 00:23:41,421 ప్రస్తుతం వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారని మీకు అనిపిస్తోంది. 298 00:23:41,505 --> 00:23:44,841 ప్రాక్సిమాగా నియమించబడటానికి ఇంకా జెఫిర్ గిలాట్ కే ఎక్కువ అవకాశం ఉంది. 299 00:23:44,925 --> 00:23:49,721 కానీ, అనుకోనిది జరగడానికి పెద్ద సమయమేమీ పట్టకపోవచ్చు. 300 00:23:49,805 --> 00:23:50,806 నాకు అర్థమైంది. 301 00:23:52,557 --> 00:23:55,268 మా సాధ్యమైనంత మేరకు, మేము మీకు సాయపడతాం. 302 00:23:55,352 --> 00:23:57,187 మీ మంచితనానికి జోహార్లు. 303 00:23:57,270 --> 00:24:01,525 హలీమాలో సహజంగానే ఆకట్టుకొనే గుణం ఉందన్నది వాస్తవం. 304 00:24:02,317 --> 00:24:05,862 అందుకని, నిజంగా పనికి వచ్చేది జనాలకు అందించానని భావిస్తున్నాను. 305 00:24:05,946 --> 00:24:10,867 సగౌరవంగా, మహారాజా, మా మౌలిక వసతులన్నీ కుప్పకూలిపోతున్నాయి. 306 00:24:10,951 --> 00:24:14,246 తాజా నీటికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తోంది, అంత తేలిగ్గా దొరకడం లేదు కూడా. 307 00:24:14,329 --> 00:24:18,125 తమ దాహాన్ని ఈ హలీమా తీర్చగలదేమో అని వాళ్ళు భావిస్తున్నారు. 308 00:24:18,208 --> 00:24:20,460 మా దగ్గర దానికో పరిష్కారముంది. 309 00:24:20,544 --> 00:24:24,631 మీరు పోలిక కోసం అన్నదాన్ని నేను అక్షరాలా నిజం చేస్తాను. 310 00:24:29,261 --> 00:24:34,308 జెఫిర్ గిలాట్, ప్రాక్సిమాగా మీరు ఎన్నుకోబడుతున్న శుభ సందర్భాన, 311 00:24:34,391 --> 00:24:37,894 సామ్రాజ్యం, ఈ చందమామ అంతటా మంచి నీటి కర్మాగారాలని ఏర్పాటు చేస్తుంది. 312 00:24:38,478 --> 00:24:42,524 ఇంకెప్పటికీ మీ ప్రజలకు తాగు నీటి కొరత ఏర్పడదు. 313 00:24:47,112 --> 00:24:50,032 నా నోట మాటలు రావడం లేదు, మహారాజా. 314 00:24:51,325 --> 00:24:54,620 ముగ్గురు దేవతల ఆశిస్సులు మీ వెంటే ఉండాలి, జెఫిర్ గిలాట్. 315 00:25:12,679 --> 00:25:13,680 నీకు బాగానే ఉందా? 316 00:25:14,389 --> 00:25:16,725 ఈ గాలులను నా శరీరం తట్టుకోలేదు. 317 00:25:17,309 --> 00:25:20,145 తొలినాళ్లలో పిడికిళ్లు బిగించుకొని గడిపేవాడిని. 318 00:25:20,646 --> 00:25:21,813 ఒక రోజు మీ అమ్మ, 319 00:25:21,897 --> 00:25:24,274 "పిడికిళ్ళు బిగించడం ఆపు. గాలిని గుద్దగలవా ఏంటి," అని అంది. 320 00:25:24,358 --> 00:25:26,610 నువ్వు వెళ్లు, హ్యూగో. మేము కాసేపట్లో వస్తాం. 321 00:25:30,238 --> 00:25:34,451 ట్రాంటార్ లో పెరగడం, చిన్నతనమంతా నాలుగు గోడల మధ్య గడవడం... 322 00:25:36,078 --> 00:25:37,329 సున్నితంగా చేస్తుంది. 323 00:25:38,705 --> 00:25:41,083 నువ్వు ట్రాంటార్ గురించి ఎప్పుడూ అంతగా మాట్లాడలేదే? 324 00:25:42,292 --> 00:25:43,460 మాట్లాడి లాభమేముంది? 325 00:25:44,336 --> 00:25:45,712 మనం ఎలాగూ అక్కడికి మళ్లీ వెళ్లం కదా. 326 00:25:46,213 --> 00:25:47,464 దరిద్రంగా ఉండేదా? 327 00:25:48,215 --> 00:25:51,051 కాదు. చాలా బాగుండేది. 328 00:25:51,134 --> 00:25:54,972 మీ నానమ్మ తాతయ్యలు నక్షత్ర వారధిలో పనిచేసేవాళ్లు, మాకు డబ్బులకు లోటు లేదు. 329 00:25:55,597 --> 00:25:57,015 అక్కడ అన్నీ అద్భుతాలే దర్శనమిచ్చేవి. 330 00:25:58,016 --> 00:26:00,143 గాల్లో తేలే ఫౌంటేయిన్లు, 331 00:26:00,227 --> 00:26:03,146 తిమింగాలతో లయబద్ధంగా సాగే వాటర్ షోలు, 332 00:26:03,230 --> 00:26:06,108 జీరో గ్రావిటీలో మన తలపై వస్తువులు తేలడం. 333 00:26:06,817 --> 00:26:08,652 ఇక ఆహారమైతే... దేవుడా. 334 00:26:08,735 --> 00:26:10,946 అన్నీ చాలా అద్భుతంగా ఉండేవి. 335 00:26:11,571 --> 00:26:13,073 అప్పుడు ఎంత లావుగా ఉండేవాడినో తెలుసా? 336 00:26:15,492 --> 00:26:17,035 కానీ ఒక విషయం, శాల్. 337 00:26:19,037 --> 00:26:25,043 అది అబద్ధాలు, మోసాలు మీద నిర్మించిన నగరమని మాకు తెలుసు, 338 00:26:26,003 --> 00:26:28,588 పైకి తళతళలాడిపోయేలా కనబడటానికి తెర వెనుక నుండి 339 00:26:28,672 --> 00:26:30,132 లక్ష కోట్ల మంది శ్రమిస్తుంటారు. 340 00:26:30,215 --> 00:26:33,218 నువ్వు మహారాజును కాస్తంత ప్రశ్నించినా ఆయన తాళలేరు. 341 00:26:34,469 --> 00:26:37,306 మరి హారి ఏమో పతనమంటూ పెద్ద అలజడే సృష్టించాడు. 342 00:26:37,389 --> 00:26:40,934 అతను చెప్పేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. 343 00:26:41,018 --> 00:26:43,061 కానీ నువ్వు ప్లాన్ ని నమ్మావు. 344 00:26:43,145 --> 00:26:46,815 నేను మారి హార్డిన్ అనే అమ్మాయిని నమ్మాను, 345 00:26:46,898 --> 00:26:49,526 తనను ఎలాగైనా పడేయాలని అనుకున్నాను. 346 00:26:49,609 --> 00:26:50,986 నాన్నా. 347 00:26:52,946 --> 00:26:54,781 తను నమ్మింది ప్లాన్ ని. 348 00:26:55,365 --> 00:26:57,284 ఒక అమ్మాయి కోసం పునాదిలో చేరావా? 349 00:26:57,367 --> 00:26:58,827 అవును. 350 00:26:58,910 --> 00:27:01,455 ఇక్కడికి వచ్చి ఇలా జీవించవలసి రావడం వలన చేరినందుకు ఎప్పుడైనా బాధపడ్డావా? 351 00:27:05,751 --> 00:27:07,753 చేరడం వల్లే నువ్వు నాకు దక్కావు కదా? 352 00:27:08,712 --> 00:27:09,713 పద. 353 00:27:34,196 --> 00:27:35,697 ఇది మంచి విషయం కాదు. 354 00:27:42,287 --> 00:27:44,790 హైడ్రో సెల్స్ కి బాంబులు పెడుతున్నారు. 355 00:27:44,873 --> 00:27:46,416 అది ఊరినంతా ధ్వంసం చేస్తుంది. 356 00:27:47,209 --> 00:27:49,503 వాళ్ల ప్లాన్ విజయవంతం కాకుండా చేయడానికి మనం బాగా కష్టపడాలి. 357 00:27:52,297 --> 00:27:55,509 నేను దగ్గరగా వెళ్తే, ఆ బాంబుల్లో ఒక దాన్ని నాశనం చేయగలను, 358 00:27:56,009 --> 00:27:58,095 ఒకటో రెండో యుద్ధ నౌకలను కూడా ధ్వంసం చేయగలను. 359 00:28:00,263 --> 00:28:02,933 మంచి షూటర్ అయితే, దూరానే ఉండి ఆ మూడింటినీ ధ్వంసం చేయవచ్చు. 360 00:28:03,016 --> 00:28:04,101 అబ్బా, శాల్వార్. 361 00:28:04,184 --> 00:28:05,936 లేదు. ఇదే ఫైనల్, నాన్నా. 362 00:28:06,019 --> 00:28:08,146 నీకు వయసైపోయింది, లావుగా ఉన్నావు, నీ చూపు కూడా మందగించింది. 363 00:28:08,230 --> 00:28:09,356 నువ్వు ఆ పని చేయలేవు. 364 00:28:10,357 --> 00:28:12,734 నువ్వు కూడా మీ అమ్మలాగే నాపై పెత్తనం చలాయిస్తున్నావు. 365 00:28:26,623 --> 00:28:29,126 మీ ఏకాగ్రత, నైపుణ్యం వర్ణణాతీతం, మహారాజా. 366 00:28:29,876 --> 00:28:31,295 ఆరింటిని చంపారు. 367 00:28:31,378 --> 00:28:35,215 రాత్రి సోదరుడు ఆశ్చర్యపడిపోతారు. మీరు వారి రికార్డును బద్దలు కొట్టేశారు. 368 00:28:35,299 --> 00:28:36,633 ఆయన ఎన్ని చంపారు? 369 00:28:36,717 --> 00:28:38,427 ఒకరోజు ఎక్కువగా అంటే మూడింటిని చంపారు. 370 00:28:38,510 --> 00:28:40,178 చాలా ప్రాక్టీస్ కూడా ఉపయోగపడిందనుకోండి. 371 00:28:41,596 --> 00:28:43,473 నా నుండి తప్పించుకోలేవు. 372 00:28:44,725 --> 00:28:46,268 దానితో కలిపి నాలుగింటిని చంపాను. 373 00:28:46,852 --> 00:28:49,521 వీటిని పొదల్లో పడేయ్. వెంటనే తీసుకొని పడేయ్. నేను మూడింటినే చంపాను. 374 00:28:50,397 --> 00:28:52,399 నేను చంపింది మూడింటినే. అర్థమైందా? త్వరగా పడేయ్! 375 00:28:56,403 --> 00:28:59,114 వేకువ సోదరా, నీ వేట ఎలా సాగింది? 376 00:29:00,073 --> 00:29:01,074 మూడింటిని చంపావే. 377 00:29:01,158 --> 00:29:03,785 నీ తొలి ప్రయత్నంలోనే నా రికార్డును సమం చేసేశావు. 378 00:29:03,869 --> 00:29:05,412 రోమస్ బాగా సాయపడ్డాడు. 379 00:29:06,288 --> 00:29:07,789 అదరగొట్టేశావు, వేకువ సోదరా. 380 00:29:07,873 --> 00:29:09,583 వేట నీకు సహజంగానే అబ్బిన విద్య. 381 00:29:10,083 --> 00:29:11,209 ఈ సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి ఇదిగో. 382 00:29:18,967 --> 00:29:23,055 ఒక మగాడిలా వేటాడావు. మరి ఇప్పుడు నువ్వు మగాడివి అనుకుంటున్నావా? 383 00:29:24,014 --> 00:29:26,266 ఏమో మరి. అవుననేమో? 384 00:29:26,350 --> 00:29:29,811 ఒక మగాడే మరో మగాడి స్థానాన్ని తీసుకోగలడు. 385 00:29:32,105 --> 00:29:35,317 నిన్ను గొసామర్ కోర్టుకు తీసుకువెళ్లాల్సిన సమయం వచ్చిందనుకుంటా. 386 00:29:37,152 --> 00:29:41,114 మహారాజు అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంటుంది. 387 00:29:41,198 --> 00:29:43,492 ఎంతైనా మనం కూడా మనుషులమే కదా. 388 00:29:43,575 --> 00:29:48,830 మన భయాలను, విద్వేషాలను, విచారాలను బయటకు కక్కేయాల్సిన అవసరం ఉంది. 389 00:29:49,456 --> 00:29:52,292 ట్రాంటార్ నుండి వెళ్లిపోయే ముందు వారి జ్ఞాపకాలను తొలగించేస్తారు. 390 00:29:52,376 --> 00:29:55,295 క్లియాన్ I ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. 391 00:29:55,379 --> 00:29:56,630 ఇది నిజంగా చాలా గొప్పది. 392 00:29:57,631 --> 00:29:58,632 అయితే? 393 00:30:01,176 --> 00:30:02,678 నీకెవరు నచ్చారు? 394 00:30:07,307 --> 00:30:10,018 మీకెలాంటి సౌఖ్యాలు కావాలి, మహారాజా? 395 00:30:10,102 --> 00:30:11,895 నీకు దీని జ్ఞాపకాలు ఉండవా? 396 00:30:13,605 --> 00:30:15,857 రాత్రి గడిచిపోయాక ఏవీ ఉండవు, మహారాజా. 397 00:30:16,942 --> 00:30:20,320 నేను నీతో ఏమైనా చెప్పవచ్చు, 398 00:30:21,071 --> 00:30:22,572 నీకు అవేవీ రేపు జ్ఞాపకం ఉండవా? 399 00:30:22,656 --> 00:30:23,824 ఉండవు. 400 00:30:24,533 --> 00:30:26,201 మరి ఆ విషయంలో నీకు బాధగా లేదా? 401 00:30:27,202 --> 00:30:29,329 సంభోగం తాలూకు జ్ఞాపకాలు ఉండాల్సింది నాకు కాదు. 402 00:30:30,122 --> 00:30:31,665 అవి మహారాజుకు ఉండాలి. 403 00:30:39,131 --> 00:30:43,176 మీకు చర్చలు జరపడమంటే ఇష్టమా? నాకు చాలా విషయాల్లో అవగాహన ఉంది. 404 00:30:58,275 --> 00:30:59,318 అటు వైపుకు తిరుగు. 405 00:31:13,415 --> 00:31:15,083 నువ్వు మంచి సుఖాన్ని అందించావని చెప్తాను. 406 00:31:17,127 --> 00:31:20,672 నీకు గుర్తున్నంత వరకు, నువ్వు ఇచ్చావనే గుర్తుంచుకో. 407 00:31:22,466 --> 00:31:24,009 ఆయన నన్ను తాకను కూడా లేదు. 408 00:31:25,010 --> 00:31:26,470 అయితే మరేం చేశాడు? 409 00:31:28,430 --> 00:31:29,514 మాట్లాడాడంతే. 410 00:31:32,184 --> 00:31:34,019 అతను ఏం మాట్లాడాడో చెప్పు. 411 00:31:44,446 --> 00:31:45,697 మంచి పొజిషన్ లోకి వెళ్లావా, శాల్? 412 00:31:46,281 --> 00:31:47,616 దాదాపుగా పరిధిలోకి వచ్చేశాను. 413 00:31:47,699 --> 00:31:49,952 గాలి వేగాన్ని అంచానా వేయాల్సి ఉంది, ఆ తర్వాత నేను ప్రారంభించవచ్చు. 414 00:32:09,846 --> 00:32:11,723 శాల్వార్? శాల్? 415 00:32:13,225 --> 00:32:14,643 -అది మళ్లీ జరిగింది? -ఏం జరిగింది? 416 00:32:14,726 --> 00:32:16,937 మెదడు గాడి తప్పింది, మూర్ఛ లాంటిదేదో. 417 00:32:17,771 --> 00:32:19,898 మనం తనని తీసుకురాకపోతే, తనని వాళ్లు కనిపెట్టేస్తారు. 418 00:32:19,982 --> 00:32:23,318 శాల్వార్ ని నువ్వు తీసుకురా. యుద్ధ నౌకల సంగతి నేను చూసుకుంటాను. 419 00:32:27,614 --> 00:32:31,076 ప్లాన్ ప్రకారం నువ్వు ఈ నౌకను విడిచి వెళ్లడానికి నీకొక మార్గమే ఉంది, 420 00:32:31,159 --> 00:32:35,580 ఆ ప్లాన్ ప్రకారం, నువ్వు ఈ నౌకలో ఉండకూడదు. 421 00:32:35,664 --> 00:32:37,749 నా ప్రాణాన్ని నేను తీసుకోను. 422 00:32:40,085 --> 00:32:41,128 నువ్వు చంపాలి. 423 00:32:42,129 --> 00:32:44,548 నువ్వు హారి సెల్డన్ వి. దీన్ని నువ్వు సరి చేయగలవు. 424 00:32:44,631 --> 00:32:46,425 నేను సరిచేయలేనని చెప్తున్నాను కదా. 425 00:32:46,508 --> 00:32:47,843 నీకు అర్థంకావడం లేదా? 426 00:32:47,926 --> 00:32:53,807 నువ్వు తనతో ఉంటే, మన ప్లాన్ అంతా విఫలమైపోతుంది. 427 00:32:54,641 --> 00:32:58,770 ప్రతిఒక్కరూ చేసిన త్యాగాలన్నీ వృథా అయిపోతాయి. 428 00:32:59,479 --> 00:33:01,690 నేను చెప్పేది నిజమని నీకు తెలుసు. 429 00:33:02,983 --> 00:33:04,318 నీకు గణితం మీద నమ్మకం ఉందా? 430 00:33:05,402 --> 00:33:06,570 నాకు గణితం అంటే అసహ్యం కలుగుతోంది. 431 00:33:07,362 --> 00:33:08,655 నీకు నా మీద నమ్మకం ఉందా? 432 00:33:09,156 --> 00:33:10,949 నిన్ను అసలు కలవకుంటే బాగుండని, 433 00:33:11,450 --> 00:33:13,493 అసలు ఆ చెత్త పుస్తకాలను దొంగలించకుండా ఉంటే బాగుండని కోరుకుంటున్నా. 434 00:33:14,578 --> 00:33:15,662 కానీ ఎలాగైతేనే, దొంగలించావు. 435 00:33:16,496 --> 00:33:18,624 ఇప్పుడు ఈ పరిస్థితికి చేరుకున్నాం, 436 00:33:19,291 --> 00:33:24,087 ఒక గెలాక్సీ భవిష్యంతా నువ్వు చేసే పనుల మీద ఆధారపడుంది. 437 00:33:31,720 --> 00:33:35,223 నేరుగా సైరోపాడ్ దగ్గరికి వెళ్లు. అది నీ కోసమే ప్రోగ్రామ్ చేయబడింది. 438 00:33:35,307 --> 00:33:37,768 తనకి గుడ్ బై చెప్పడానికి ఆగకు. 439 00:33:39,144 --> 00:33:40,937 ఇందులోకి తనని లాగకు. 440 00:34:02,000 --> 00:34:03,543 శాల్వార్? 441 00:34:05,545 --> 00:34:08,173 -అది మళ్లీ జరిగింది. -తెలుసు. తుపాకీ వాడగలవా? 442 00:34:08,256 --> 00:34:10,092 -వాడగలను. -అయితే పద. పద. 443 00:34:35,993 --> 00:34:37,661 నాన్న ఎక్కడ? 444 00:34:37,744 --> 00:34:40,205 నువ్వు మూర్ఛపోయినప్పుడు, యుద్ధ నౌకలను నాశనం చేద్దామని వెళ్లాడు. 445 00:34:42,624 --> 00:34:44,001 ఆయన్ని చంపేస్తారు. 446 00:34:50,173 --> 00:34:51,675 చాలా మంది ఉన్నారు. 447 00:35:20,829 --> 00:35:23,165 నన్ను కవర్ చేస్తూ ఉండు, శాల్. ఆ నౌకల సంగతి నేను చూసుకుంటా. 448 00:35:23,247 --> 00:35:25,042 వద్దు, నాన్నా. వద్దు. 449 00:35:45,896 --> 00:35:47,397 కాపాడు! 450 00:35:48,732 --> 00:35:49,733 నాన్నా! 451 00:35:56,073 --> 00:35:58,408 టర్మినస్ వార్డెన్ అయిన, శాల్వార్ హార్డిన్. 452 00:35:58,492 --> 00:36:01,495 -నాన్నా. -నువ్వు ప్లాన్ ని రక్షించాలి. 453 00:36:01,578 --> 00:36:03,121 నాన్నా, వద్దు. 454 00:36:30,983 --> 00:36:32,776 పిడికిళ్ళు బిగించకు, శాల్వార్. 455 00:36:37,030 --> 00:36:38,448 నాన్నా, వద్దు! 456 00:36:38,532 --> 00:36:40,242 గాలికి ఎదురెళ్లకు. 457 00:36:46,164 --> 00:36:48,375 నాన్నా! 458 00:36:49,584 --> 00:36:50,585 అయ్యో. 459 00:36:52,004 --> 00:36:54,172 అయ్యో. 460 00:37:14,192 --> 00:37:16,320 ఇక్కడి నుండి చూస్తే అదిరిపోతుంది. 461 00:37:22,367 --> 00:37:24,745 మహారాజా, నేను నేను ఇక్కడ ఉండకూడదు. 462 00:37:27,331 --> 00:37:29,458 రా. పర్వాలేదులే. 463 00:37:41,470 --> 00:37:42,804 నీకు ఇది నచ్చుతుందని అనుకున్నా. 464 00:37:59,112 --> 00:38:00,197 పూలతోటలు. 465 00:38:02,324 --> 00:38:03,367 నడవడానికి దారులు. 466 00:38:05,077 --> 00:38:06,119 పచ్చిక బయళ్ళు. 467 00:38:08,538 --> 00:38:11,875 ఎంత ఖచ్చితంగా, ఎంత చక్కగా ఉన్నాయో చూడు. 468 00:38:12,876 --> 00:38:14,461 అన్నీ ఎలా ఉండాలో అలా చక్కగా ఉన్నాయి. 469 00:38:17,255 --> 00:38:18,465 నాకు అది చాలా బాగా నచ్చుతుంది. 470 00:38:21,593 --> 00:38:23,220 వచ్చి ఇక్కడి నుండి చూడు. 471 00:38:30,936 --> 00:38:33,188 నాకు ఫోర్స్ ఫీల్డ్ లేదు, మహారాజా. 472 00:38:35,607 --> 00:38:36,692 దీన్ని పెట్టుకుంటే నీకు కూడా ఉంటుంది. 473 00:38:52,165 --> 00:38:53,250 తీసుకో. 474 00:38:55,961 --> 00:38:57,087 మీ దగ్గర లేకపోతే నాకూ వద్దు. 475 00:39:06,013 --> 00:39:07,222 చాలా అందంగా ఉంది. 476 00:39:09,558 --> 00:39:11,560 అందాన్ని చూడగలిగితే తెలుస్తుంది. 477 00:39:13,437 --> 00:39:14,730 అవేంటో చెప్పు. 478 00:39:17,941 --> 00:39:19,109 రోజా పూల తోటనా? 479 00:39:20,402 --> 00:39:23,155 రోసా అర్వెన్సిస్, రోసా పెర్సికా. 480 00:39:23,238 --> 00:39:25,615 -రోసా కోర్డెసా... -వాటి రంగులు ఏంటో చెప్పు. 481 00:39:26,658 --> 00:39:27,951 తెల్లవి, పసుపువి. 482 00:39:28,785 --> 00:39:31,079 పసుపు రంగుతో, మధ్యలో ముదురు ఎరుపు రంగు ఉన్నవి, 483 00:39:32,581 --> 00:39:34,708 ఇంకా ముదురు ఎరుపు రంగువి. 484 00:39:34,791 --> 00:39:37,294 ఆ ఎరుపు రంగుతో ఇంకేమేమి ఉంటాయి? 485 00:39:38,503 --> 00:39:39,755 ప్రకృతిలోనా? 486 00:39:40,589 --> 00:39:42,215 స్కార్లెట్ మ్యాపుల్ వృక్షం. 487 00:39:43,258 --> 00:39:44,926 ఎర్ర పాల పిట్ట. 488 00:39:45,719 --> 00:39:47,429 ఎర్ర ఎండ్రకాయ పెంకు. 489 00:39:48,221 --> 00:39:49,556 ఎర్ర చందనం. 490 00:39:54,144 --> 00:39:56,355 మహారాజు గారికి వర్ణాంధత్వం ఉందని నాకు తెలీదు. 491 00:39:58,106 --> 00:39:59,566 అలాంటిదేమీ లేదు. 492 00:39:59,650 --> 00:40:01,693 క్లియాన్లు క్లోన్స్ అన్నమాట. 493 00:40:02,611 --> 00:40:04,655 నా ముందు వాళ్లెవ్వరికీ... 494 00:40:07,616 --> 00:40:08,617 వర్ణాంధత్వం లేదు. 495 00:40:09,910 --> 00:40:11,370 అది మగాళ్లలో సర్వసాధారణంగా ఉండేదే కదా? 496 00:40:12,788 --> 00:40:14,456 దాన్ని చాలా తేలిగ్గా సరి చేసేయవచ్చు. 497 00:40:14,539 --> 00:40:15,874 కానీ మాకు అది సాధారణం కాదు. 498 00:40:18,293 --> 00:40:19,711 కానీ ఇది చిన్న విషయం కాదు. 499 00:40:21,463 --> 00:40:22,673 ఇదే నా రహస్యం. 500 00:40:25,342 --> 00:40:26,593 ఇప్పుడు ఆ రహస్యం నీకు కూడా తెలిసిపోయింది. 501 00:40:29,513 --> 00:40:30,764 ఇప్పుడు నేనేం చేయాలి? 502 00:40:43,110 --> 00:40:46,863 నేనేదైనా రహస్యాన్ని దాస్తూ ఉంటే, అవతలి వ్యక్తిని తోసేస్తాను. 503 00:40:46,947 --> 00:40:49,449 నేను ఎవరికీ చెప్పకుండా ఉంటానని అలా చేయడం ద్వారా నిర్ధారించుకోవచ్చు. 504 00:40:58,292 --> 00:40:59,376 మీరు నన్ను తోసేయవచ్చు. 505 00:42:11,865 --> 00:42:13,116 శాల్. 506 00:42:15,535 --> 00:42:17,537 ప్రేమించిన అమ్మాయి కోసం ఆయన పునాదిలో చేరారు. 507 00:42:21,833 --> 00:42:23,001 అది వింతగా ఉంది కదా? 508 00:42:25,128 --> 00:42:26,922 అతను పునాదిని ఆఖర్లో నమ్మాడు, కానీ... 509 00:42:29,049 --> 00:42:30,801 ఇదంతా ఆయన అమ్మ కోసం చేశాడు. 510 00:42:35,764 --> 00:42:37,057 నేను చాలా చింతిస్తున్నాను. 511 00:42:45,899 --> 00:42:47,567 ఇదంతా నా వల్లే జరిగింది, హ్యూగో. 512 00:42:49,194 --> 00:42:51,863 నేను మూర్ఛపడిపోకుంటే, మా నాన్న ఇప్పుడు బతికుండేవాడే. 513 00:42:51,947 --> 00:42:53,407 లేదు. 514 00:42:53,991 --> 00:42:57,911 వాళ్ళ నౌకలను ధ్వంసం చేయడమే మంచి పనని నేను బలంగా నమ్మాను. 515 00:42:57,995 --> 00:42:59,204 బహుశా అదే మంచి పనేమో. 516 00:42:59,955 --> 00:43:01,581 మిగతా పనులు చేస్తే, ఇంత కన్నా దారుణమైన ఫలితాలు ఎదురవుతాయేమో. 517 00:43:03,583 --> 00:43:06,753 హారీ అన్నాడు... మొత్తం గెలాక్సీ భవితవ్యం 518 00:43:06,837 --> 00:43:08,880 ఒక వ్యక్తి చేసే పనుల పైన ఆధారపడుంటాయి అన్నాడు. 519 00:43:09,464 --> 00:43:11,591 అయితే నువ్వు కూడా అలాంటి వ్యక్తులలో ఒకదానివే, కదా? 520 00:43:12,217 --> 00:43:14,344 ప్లాన్ కి ఏమీ కాకుండా చూడటానికి హారి నీకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. 521 00:43:15,971 --> 00:43:19,141 ఎందుకు, నేనేదో స్పెషల్ అనా? 522 00:43:20,767 --> 00:43:23,603 నా వల్లనే అనాక్రియాన్లు మన ఊరిని హస్తగతం చేసుకోగలిగారు... 523 00:43:23,687 --> 00:43:27,190 కాదు. లూయిస్ వల్ల, టవర్లోని దద్దమ్మల వల్ల వాళ్లు హస్తగతం చేసుకున్నారు. 524 00:43:29,276 --> 00:43:31,445 ప్రస్తుతానికి, ఈ సంక్షోభం నుండి బయటపడటానికి 525 00:43:31,528 --> 00:43:33,655 పునాదికి ఉన్న ఒకే ఒక్క దారి నువ్వే. 526 00:43:35,365 --> 00:43:36,992 సంక్షోభం గురించి నేను పట్టించుకోను. 527 00:43:37,909 --> 00:43:39,953 దీనికి ఫారా తగిన మూల్యం చెల్లించుకోవాలి, ఇప్పుడునాకు కావలసిందదే. 528 00:43:41,663 --> 00:43:42,998 మనం తన నౌకలని ధ్వంసం చేసేశాం. 529 00:43:43,081 --> 00:43:44,958 ఈ గ్రహం నుండి బయటపడాలంటే ఇప్పుడు వారు నీ నౌక నుండే బయటపడాలి. 530 00:43:45,042 --> 00:43:48,045 వారి కన్నా ముందే మనం బెగ్గర్ ని చేరుకుంటే, ఇక వారు ఇక్కడే ఇరుక్కుపోతారు. పద. 531 00:43:58,013 --> 00:44:02,643 మనం ప్రాక్సిమా ఓపల్ కరుణను, స్థైర్యాన్ని తలుచుకుంటూనే, 532 00:44:03,226 --> 00:44:05,687 ఆవిడ మనకి అందించిన సేవలకు కృతజ్ఞతగా నడుచుకుందాం. 533 00:44:06,688 --> 00:44:09,775 ఓపల్ తదుపరి జన్మకు గౌరవార్థంగా, 534 00:44:09,858 --> 00:44:13,570 అలాగే మన తదుపరి ప్రాక్సిమాపై నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తూ, 535 00:44:13,654 --> 00:44:20,327 మన గౌరవ మహారాజు మన చందమామ అంతా తాగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 536 00:44:25,165 --> 00:44:27,751 మహారాజుగారిని స్తుతించి, 537 00:44:27,834 --> 00:44:31,838 న్యూ ఓక్టావోలోని ప్రార్థన చేద్దాం. 538 00:44:34,633 --> 00:44:37,177 "మన సంరక్షకుల నుండి అందిన వరాలతో... 539 00:44:39,054 --> 00:44:40,222 మన హృదయాలు... 540 00:44:44,685 --> 00:44:49,523 మన హృదయాలు అనేకమై, మన ఆత్మలకు మరింత ధైర్యం చేకూరింది. 541 00:44:49,606 --> 00:44:53,610 వారి ఆత్మలు, మన ఆత్మలతో ఏకమై"... 542 00:44:56,905 --> 00:44:58,031 "మన మార్గం"... 543 00:45:07,249 --> 00:45:09,876 జెఫిర్ గిలాట్ పవిత్రమైన పలుకులు పలుకుతున్నారు, 544 00:45:11,003 --> 00:45:12,671 అందుకు ఆమెకి ధన్యవాదాలు. 545 00:45:16,383 --> 00:45:18,927 మేము మహారాజుగారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 546 00:45:19,636 --> 00:45:23,682 ప్రాక్సిమా ఓపల్ మరణాంతర జీవితాన్ని పురస్కరించుకొని జరిగే ఈ వేడుకలో భాగంగా, 547 00:45:24,641 --> 00:45:28,437 మదర్ వరప్రసాదమైన పునర్జన్మకి ఒక నిమిషం పాటు 548 00:45:29,479 --> 00:45:31,773 కృతజ్ఞత తెలుపుదాం. 549 00:45:34,276 --> 00:45:37,321 కొన్ని వేల సంవత్సరాల క్రిందట, 550 00:45:38,447 --> 00:45:41,158 మన దేహాలు కొవ్వొత్తుల్లా కరిగిపోయేవి. 551 00:45:41,241 --> 00:45:43,994 వాటిని పూర్తిగా దహనం చేసేవాళ్లు. 552 00:45:44,911 --> 00:45:48,373 కానీ మదర్ దాన్ని గమనించి, అది సరిపోదని గ్రహించింది. 553 00:45:49,416 --> 00:45:52,586 ఒకే ఒక్క దేహంలో ఒకే ఒక్క ప్రాణం, 554 00:45:53,587 --> 00:45:55,797 అది కూడా ఒకే ఒక్క లోకంలో, 555 00:45:57,049 --> 00:46:02,888 అలాంటి ఆత్న, అజ్ఞానం అనే భావి నుండి 556 00:46:03,555 --> 00:46:05,682 విజ్ఞానమనే లోకాన్ని బయటకు వచ్చి చూడలేదు. 557 00:46:06,683 --> 00:46:10,812 కాబట్టి మదర్ అలాంటి జీవితాన్ని 558 00:46:10,896 --> 00:46:13,315 వృత్తాకారంలోకి మలచి, 559 00:46:13,940 --> 00:46:17,110 పునర్జన్మ అనే వరాన్ని మనకి ఇచ్చింది. 560 00:46:18,528 --> 00:46:20,238 కానీ ఈ వరం యొక్క పరమార్థం ఏంటి? 561 00:46:20,739 --> 00:46:23,408 ఈ పునర్జన్మ తాలూకు అర్థం, 562 00:46:23,492 --> 00:46:27,162 సంపూర్ణంగా మోక్షం పొందడమని కొందరు నమ్ముతారు. 563 00:46:28,705 --> 00:46:30,499 కానీ మనకి అది నిజం కాదని తెలుసు కదా? 564 00:46:30,582 --> 00:46:33,752 ఎందుకంటే ఈ మజిలీకి అంతమనేదే లేదు. 565 00:46:34,544 --> 00:46:36,880 మన అభివృద్ధికి 566 00:46:38,131 --> 00:46:39,800 ఎల్లలు అనేవే లేవు. 567 00:46:41,218 --> 00:46:45,514 నాలుగు వందల ఏళ్ల క్రితం పవిత్రంగా అనిపించిన మనిషి, 568 00:46:46,723 --> 00:46:49,518 ఇప్పుడు పవిత్రం అనిపించకపోవచ్చు. 569 00:46:50,936 --> 00:46:53,438 ఇదే మదర్ మనకి చెప్పే పాఠం. 570 00:46:54,022 --> 00:46:56,608 గెలాక్సీ మారేకొద్దీ, మనం కూడా మారాలి. 571 00:46:57,275 --> 00:47:01,488 మనం పరివర్తనం విలువను, పరిణామం విలువను, 572 00:47:01,571 --> 00:47:03,198 అలాగే భిన్నత్వం విలువను 573 00:47:04,241 --> 00:47:05,909 గౌరవించాలి. 574 00:47:05,993 --> 00:47:08,870 మానవాళి యొక్క గొప్ప వైఫల్యం, 575 00:47:08,954 --> 00:47:12,749 మదర్ మీద మనం చూపే అగౌరవం ఏంటంటే అలాగే ఎదుగుబొదుగూ లేకుండా ఉండిపోవడం. 576 00:47:14,251 --> 00:47:16,086 కాబట్టి మనం ప్రాక్సిమా ఓపల్ ఆత్మ 577 00:47:16,878 --> 00:47:22,175 అలాగే ఉండిపోయి అవినీతికి లోను కాకుండా ఉన్నందుకు వేడుక చేసుకుందాం. 578 00:47:23,010 --> 00:47:28,390 ఆమె ఆత్మ, మార్పు చెందని అదే దేహానికి కట్టుబడకుండా ఉన్నందుకు వేడుక చేసుకుందాం. 579 00:47:29,766 --> 00:47:33,895 తన ఆత్మ నిత్యం మారుతూ, పరిణామం చెందుతున్నందుకు వేడుక చేసుకుందాం. 580 00:47:40,235 --> 00:47:42,946 ఈ శరీరాల్లో మన జీవితం శాశ్వతం కాకపోవచ్చు... 581 00:47:44,740 --> 00:47:47,659 కానీ మన ఆత్మలు శాశ్వతమైనవి. 582 00:47:47,743 --> 00:47:53,040 పవిత్రత సిద్ధించుకోవడానికని మనం సాగించే ఈ అంతేలేని ప్రయాణానికి మన ఆత్మలను 583 00:47:53,123 --> 00:47:54,249 మనం సిద్ధం చేసుకోవాలి, గుర్తుంచుకోండి. 584 00:47:55,250 --> 00:48:01,048 ఈ మీ జీవితం శాశ్వతం కాదు. కానీ ఇప్పుడు మీ జీవితం ఇదే. 585 00:48:01,757 --> 00:48:04,301 మీ ఎంపిక ఇదే. 586 00:48:05,344 --> 00:48:08,472 మీ మార్పు ఇదే. 587 00:48:09,431 --> 00:48:10,807 దాన్ని సద్వినియోగం చేసుకోండి! 588 00:48:14,978 --> 00:48:16,188 మదర్ కి జయహో! 589 00:48:16,271 --> 00:48:17,689 మదర్ కి జయహో! 590 00:49:02,067 --> 00:49:03,068 పద. 591 00:49:24,423 --> 00:49:25,716 ఆమెని చంపేయ్. 592 00:49:25,799 --> 00:49:27,509 బెగ్గర్, ప్రోటోకాల్ లో మార్పులు చేయ్. 593 00:49:27,592 --> 00:49:29,928 నౌక నియంత్రణని శాల్వార్ హార్డిన్ కి మార్చు. లాక్ చేసేయ్ 594 00:49:32,973 --> 00:49:34,725 ఏం చేశావు నువ్వు ఇప్పుడు? 595 00:49:35,350 --> 00:49:37,185 నేను ఈ నౌక నియంత్రణని శాల్వార్ చేతుల్లోకి మార్చాను. 596 00:49:37,269 --> 00:49:39,855 ఇప్పట్నుంచీ, తన ఆమోదం లేకుండా నౌక ఏ పనీ చేయదు. 597 00:49:39,938 --> 00:49:43,317 దాన్ని మార్చు. తనకి చెప్పు దాన్ని మార్పించు! 598 00:49:43,900 --> 00:49:46,069 నేను దాన్ని లాక్ చేసేశాను. ఇప్పుడు దాన్ని నేను మార్చలేను. 599 00:49:46,153 --> 00:49:49,489 కాబట్టి సామ్రాజ్యం సైన్యమంతా వచ్చేదాకా మీరు ఇక్కడే ఇరుక్కుపోతారు. 600 00:49:49,573 --> 00:49:51,783 దాన్ని ప్రోగ్రామ్ ని వెంటనే మార్చు. 601 00:49:51,867 --> 00:49:53,869 ఇప్పుడు అది నా మాట వినదు. 602 00:49:53,952 --> 00:49:56,538 తెస్పిన్ నౌకలు ఒకసారి ఒక కెప్టన్ మాటలనే వింటాయి. 603 00:49:57,289 --> 00:49:59,041 ఇప్పట్నుంచీ, ఈ నౌక తనది. 604 00:49:59,124 --> 00:50:01,418 కాబట్టి, మీకు ఏ చెత్త ప్లాన్స్ ఉన్నా కానీ, 605 00:50:02,377 --> 00:50:04,171 తను లేకుండా అవి సఫలం కావు. 606 00:50:05,422 --> 00:50:06,465 మరయితే నేను నిన్ను చంపేయవచ్చులే. 607 00:50:06,548 --> 00:50:09,676 పిచ్చిగా ప్రవర్తించకు. నౌకను ఎలా నడపాలో నాకు అక్షరం ముక్క కూడా రాదు. 608 00:50:10,510 --> 00:50:12,554 నా పక్కనే కూర్చొని నాకు మార్గనిర్దేశం చేయడానికి నాకు అతను కావాలి. 609 00:50:12,638 --> 00:50:13,889 మీకు కూడా అతను కావాలి. 610 00:50:24,858 --> 00:50:28,362 నీకు కూడా మాతో ప్రయాణించే భాగ్యం దక్కిందనుకుంటా, వార్డెన్. 611 00:50:38,497 --> 00:50:40,958 మీ దగ్గర ఇక్కడ స్పేస్ సూట్లు ఉన్నాయా? 612 00:50:41,041 --> 00:50:42,751 డెలివరెన్స్ నౌకలో మీరు ధరించినవి? 613 00:50:42,834 --> 00:50:45,087 ఉన్నాయి, కానీ అవి 30 ఏళ్ళ క్రిందటివి. 614 00:50:45,170 --> 00:50:46,380 అవే మీకు దిక్కు. 615 00:50:49,466 --> 00:50:51,176 నా మాట జాగ్రత్తగా వినండి. 616 00:50:51,259 --> 00:50:54,763 మేము మా బలగాలను ఇక్కడే ఉంచి వెళ్తున్నాం. 617 00:50:54,846 --> 00:50:59,851 మీరు మా వేటగత్తే ఆదేశాలను అనుసరించకపోయినా, ఏ విధంగానైనా తనని ధిక్కరించినా, 618 00:51:01,144 --> 00:51:05,399 మీ ఆత్మీయుల గురించి ఓసారి ఆలోచించి, తదనుగుణంగా మసులుకోండి. 619 00:51:08,110 --> 00:51:09,653 -లూయిస్. -డారా. 620 00:51:15,993 --> 00:51:18,829 ఏం పర్వాలేదు, బంగారం. వాళ్లు చేయమన్నది చేయ్ చాలు. 621 00:51:19,413 --> 00:51:20,539 దయచేసి, ఇలా... 622 00:51:21,707 --> 00:51:22,874 ప్లీజ్. 623 00:51:23,959 --> 00:51:25,711 వదలండి. వదలండి. 624 00:51:27,754 --> 00:51:29,214 అమ్మా! 625 00:51:37,723 --> 00:51:38,932 మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? 626 00:51:42,394 --> 00:51:43,478 అబ్బాస్ ఎక్కడ ఉన్నాడు? 627 00:51:45,772 --> 00:51:49,609 అమ్మా, నన్ను క్షమించు. నేను చాలా ప్రయత్నించాను. 628 00:52:30,359 --> 00:52:31,568 మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లు. 629 00:52:31,652 --> 00:52:34,279 ఇందాకే చెప్పా కదా, ఇది ఇప్పుడు శాల్వార్ నౌక. 630 00:52:37,449 --> 00:52:39,368 కంట్రోల్స్ ని పట్టుకో, నీ మీద నమ్మకం ఉంచు. 631 00:52:40,285 --> 00:52:41,370 సరే. 632 00:52:44,456 --> 00:52:46,583 మీ గమ్యస్థానాన్ని నమోదు చేయండి. 633 00:52:47,376 --> 00:52:49,336 నౌక, గమస్థానాన్ని అడుగుతోంది. 634 00:52:49,419 --> 00:52:51,004 ఎక్కడికి వెళ్లాలో చెప్తావా? 635 00:52:51,588 --> 00:52:52,839 ఆంథోర్ బెల్ట్. 636 00:52:54,925 --> 00:52:56,927 ఎక్కడైనా కూర్చోని సీటు బెల్టు పెట్టుకో. గాల్లోకి ఎగిరేటప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి. 637 00:52:57,010 --> 00:52:58,053 నాకు ఇలానే బాగుందిలే. 638 00:53:00,639 --> 00:53:02,724 నేను గనుల ఉత్పత్తుల కోసం అన్ని గ్రహాలకు వెళ్లేవాడిని కదా, 639 00:53:02,808 --> 00:53:04,393 అప్పుడు బెల్ట్ స్థానాన్ని నౌక న్యావిగేషన్ వ్యవస్థలో సేవ్ చేశా. 640 00:53:05,060 --> 00:53:07,104 ఈ వాయుమండలం ఆవలకు పోనివ్వు, అప్పుడు అంతా సర్దుకుంటుంది. 641 00:53:23,578 --> 00:53:24,621 ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. 642 00:53:24,705 --> 00:53:25,789 ఇప్పుడు ఇంజన్లు. 643 00:53:38,760 --> 00:53:39,928 మెల్లగా. 644 00:53:49,604 --> 00:53:50,897 అంతా బాగానే ఉంది కదా? 645 00:53:52,441 --> 00:53:54,776 నౌక ఏం చేయాలనుకుంటుందో ఆ కంట్రోల్ స్టిక్ చెప్తుంది. 646 00:53:54,860 --> 00:53:57,404 నువ్వు దాన్ని కంట్రోల్ చేయడం లేదు. ఇది పరస్పర సహకారం లాంటిది. 647 00:53:57,487 --> 00:54:00,449 నేను కంట్రోల్ చేయకపోతే, మరి వీటికి కంట్రోల్స్ అని పేరు ఎందుకు పెట్టడం. 648 00:54:05,579 --> 00:54:08,123 థస్ట్ ని 20 శాతం పెంచి, తూర్పు వైపు నుండి వచ్చే గాలుల ప్రభావం తగ్గించు. 649 00:54:10,334 --> 00:54:11,460 బూస్టర్ల వేగం పెరిగింది. 650 00:54:17,132 --> 00:54:19,468 సూపర్. ఇప్పుడు మనకిక ఏ ప్రమాదమూ లేదు. 651 00:54:21,720 --> 00:54:22,971 బొమ్మ. 652 00:55:59,568 --> 00:56:01,570 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య