1 00:00:01,000 --> 00:00:02,419 లో ఇంతకు ముందు... 2 00:00:02,503 --> 00:00:03,836 ఫారా ఒక యుద్ధ నౌక కోసం ఇదంతా చేస్తుంది. 3 00:00:03,921 --> 00:00:05,297 ఇన్విక్టస్? 4 00:00:05,380 --> 00:00:08,258 శాల్, నా సూట్ పని చేయట్లేదు. థ్రస్టర్లు ప్రతిస్పందించడం లేదు. 5 00:00:08,342 --> 00:00:09,301 హ్యూగో. 6 00:00:09,384 --> 00:00:11,261 ఈ నౌక దారిని మార్చడంలో నువ్వు మాకు సాయపడాలి. 7 00:00:11,345 --> 00:00:14,223 ఆ తర్వాత మేం దీన్ని నేరుగా ట్రాంటార్ ప్రధాన భాగంలోకి పోనిస్తాం. 8 00:00:14,306 --> 00:00:17,142 ఒక చచ్చినవాడి అహానికి ప్రతిధ్వనులు మాత్రమే మీరు. 9 00:00:17,226 --> 00:00:19,686 జెఫిర్ హలీమా చెప్పినదాని ప్రకారం, నాకు ఆత్మ లేదు. 10 00:00:19,770 --> 00:00:23,357 నేను స్వయంగా దేవతా త్రయానికే విజ్ఞప్తి చేసుకోవాలి. 11 00:00:23,440 --> 00:00:25,526 గొప్పదైన స్పైరల్ కు నేను నడచి వెళ్తాను. 12 00:00:25,609 --> 00:00:26,985 చిక్కుముళ్ళు ఉన్నా కానీ... 13 00:00:28,320 --> 00:00:29,363 సమస్యను పరిష్కరించవచ్చు. 14 00:00:29,446 --> 00:00:31,990 అసలు ఇక్కడ ఉండాల్సింది, రేయిచ్. నువ్వు కాదు. 15 00:00:32,073 --> 00:00:34,660 ఇది వినీ వినీ నేను అలసిపోయాను. 16 00:00:36,954 --> 00:00:38,872 నాకు భవిష్యత్తు తెలుస్తుందనుకుంటా. 17 00:01:47,357 --> 00:01:49,359 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించబడింది 18 00:02:04,374 --> 00:02:08,253 అనాక్రీయాన్ 19 00:03:06,394 --> 00:03:07,812 ఇలెక్స్! 20 00:03:15,028 --> 00:03:17,405 వాళ్లు నాశనం చేసి పోయాక, పిల్లలనే వారే మిగలలేదు. 21 00:03:18,281 --> 00:03:19,783 యోధులే మిగిలారు. 22 00:03:20,659 --> 00:03:25,372 నేనెంత కాలం నా బతుకుని ఈడ్చానంటే, నాకు యుద్ధం యొక్క గొప్ప వేటగత్తె పేరునిచ్చారు. 23 00:03:27,958 --> 00:03:31,670 సాధారణ జీవితకాలం కన్నా నేను మూడు రెట్లు ఎక్కువ కాలం జీవించాను. 24 00:03:31,753 --> 00:03:36,007 ప్రతీకారం తీర్చుకొనే దాకా వీల్డ్ దేవతలు నన్ను చావనివ్వడం లేదు. 25 00:03:38,176 --> 00:03:39,469 నేను సిద్ధంగా ఉన్నప్పుడు... 26 00:03:41,304 --> 00:03:43,056 వాళ్ళు నాకు రెండవ కానుకను అందించారు. 27 00:03:43,139 --> 00:03:44,558 ఇన్విక్టస్? 28 00:03:44,641 --> 00:03:46,893 ఏదో వరంలాగా అది కక్ష్యలో ప్రత్యక్షమైంది. 29 00:03:47,978 --> 00:03:49,437 అప్పుడు నేను గ్రహించాను, 30 00:03:49,521 --> 00:03:53,149 సామ్రాజ్యాన్ని నాశనం చేయాలనే నా లక్ష్యాన్ని దేవతలు కేవలం ఆమోదించలేదని, 31 00:03:53,859 --> 00:03:54,901 వాళ్లే దానికి రూపకల్పన చేశారని. 32 00:03:54,985 --> 00:03:56,903 నీ ప్రజలకి ఏమైందో చూశావు కదా. 33 00:03:58,738 --> 00:04:03,910 ఏదో కొందరు చేసిన పాపానికి, మహారాజు మీ సగం ప్రపంచాన్ని నాశనం చేశాడు. 34 00:04:04,494 --> 00:04:08,498 నువ్వు ట్రాంటార్ మీద దాడి చేస్తే, సూదూర భాగంలో ఉండే ప్రపంచాలన్నీ నాశనమవుతాయి. 35 00:04:08,582 --> 00:04:10,959 నీకు ప్రతీకారం అంటే ఏంటో తెలీదు కదా? 36 00:04:12,502 --> 00:04:14,421 మానవ జాతి ఏమైపోయినా నాకు అనవసరం. 37 00:04:16,965 --> 00:04:20,218 ఈ నౌకే నా లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. 38 00:04:21,261 --> 00:04:24,306 తదుపరి ప్రయాణాన్ని నిర్దేశించడంలో నువ్వే నాకు సాయపడాలి. 39 00:04:26,975 --> 00:04:28,268 నువ్వు నిరాకరిస్తే, 40 00:04:29,728 --> 00:04:31,730 టర్మినస్ లో ఉండే ప్రతీ మహిళని, చిన్నారిని 41 00:04:32,814 --> 00:04:37,569 నా మనుషులు నరికేస్తారు, 42 00:04:37,652 --> 00:04:39,154 ఆ పని మీ అమ్మతోనే మొదలవుతుంది. 43 00:04:44,534 --> 00:04:46,286 ఇప్పటికే మీ నాన్న బలిదానం చేశాడు. 44 00:04:47,704 --> 00:04:49,456 ఇప్పుడు మీ అమ్మను కూడా చంపుకుంటావా? 45 00:04:51,374 --> 00:04:53,543 ఇందులో మన డీల్ చాలా తేలికైనది, వార్డెన్. 46 00:04:56,755 --> 00:04:58,089 ట్రాంటార్ ని ధ్వంసం చేయ్... 47 00:04:59,299 --> 00:05:03,345 అప్పుడు ఆ తర్వాత జరిగే పరిణామాలకు నీకు విలువైన పునాది 48 00:05:04,346 --> 00:05:07,807 బలికాకుండా ఉండే అవకాశం కాస్తయినా, రవ్వంతైనా ఉంటుంది. 49 00:05:10,644 --> 00:05:13,647 ఇంకాస్త అదనపు సమయం కోసం ఒక మనిషి ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు కదా? 50 00:05:42,133 --> 00:05:43,844 ఇలా ఎంత కాలం నుండి చేయగలుగుతున్నావు? 51 00:05:45,428 --> 00:05:47,055 నాకు ఊహ తెలిసినప్పటి నుండి. 52 00:05:49,599 --> 00:05:51,768 ఎక్కువగా, అదో భావనలా అనిపిస్తుంది. 53 00:05:52,853 --> 00:05:54,229 ఇప్పుడు అనిపించిన విధంగా, కానీ... 54 00:05:56,356 --> 00:05:58,275 ఇతర సందర్భాలలో, కలల రూపంలో వస్తాయి. 55 00:06:00,569 --> 00:06:02,445 నా కలలో ఒక అల వచ్చేది. 56 00:06:03,864 --> 00:06:05,115 అదెంత పెద్దదంటే... 57 00:06:05,740 --> 00:06:10,954 నా ఊపిరి బిగపట్టి దానిలో కొట్టుకోవడానికి సిద్ధపడటం తప్ప ఇంకేమీ చేయలేకపోయేదాన్ని. 58 00:06:12,330 --> 00:06:14,791 అది నా ఇంటిని, నా కుటుంబాన్ని 59 00:06:14,875 --> 00:06:17,878 నా మొత్తం ప్రపంచాన్నే నాశనం చేస్తుందని నాకు తెలుసు. 60 00:06:19,963 --> 00:06:23,008 ఆ కలను ఎంత ప్రయత్నించినా వదిలించుకోలేకపోయాను, హారి. 61 00:06:24,885 --> 00:06:26,219 అది నన్ను వేధించింది. 62 00:06:26,303 --> 00:06:29,306 అది నిజ జీవితంలో జరగకూడదని, దాన్ని ఎలాగైనా నివారించాలని 63 00:06:29,389 --> 00:06:32,309 సొంతంగా మ్యాథ్స్ నేర్చుకున్నాను. 64 00:06:32,392 --> 00:06:36,313 దాన్ని ఎలాగైనా నిరోధించాలని నాకు తోచిన ప్రతీ సంభావ్యతను, 65 00:06:36,396 --> 00:06:38,064 అలాగే మానవ మాత్ర ప్రయత్నాన్ని పరిశీలించాను. 66 00:06:41,902 --> 00:06:43,403 కానీ నాకు ఏ దారీ లభించలేదు. 67 00:06:45,030 --> 00:06:47,741 ఆ కలే నిన్ను మ్యాథ్స్ వైపు నడిపించింది, 68 00:06:47,824 --> 00:06:51,036 అలా అది కల కాదని, ఒక హెచ్చరిక అని తెలిసింది. 69 00:06:52,120 --> 00:06:53,413 నీలో ఏదో ముందు చూపు చూసే శక్తి ఉందని, 70 00:06:53,496 --> 00:06:56,374 దాని వల్ల మ్యాథ్స్ పై నీకు పైచేయి ఉంటుందని, 71 00:06:56,458 --> 00:06:57,918 నాకు తెలిసినా పెద్ద ఆశ్చర్యపోయుండేవాడిని కాదు. 72 00:06:58,668 --> 00:07:00,128 దాని సాయంతో అబ్రాక్సాస్ ని నేర్చుకొన్నావని అర్థమయ్యేది. 73 00:07:01,755 --> 00:07:05,091 నేను బాగా కష్టపడ్డాను కాబట్టే అబ్రాక్సాస్ ని పరిష్కరించగలిగాను. 74 00:07:05,175 --> 00:07:07,969 అవును, నేను కూడా నువ్వు అసాధారణమైనదానివి అనే చెప్తున్నా. 75 00:07:14,351 --> 00:07:15,810 లోపల వేడిగా అవుతోంది. 76 00:07:15,894 --> 00:07:18,063 రాళ్ళ దిబ్బ గుండా వెళ్తున్నప్పుడు ఎదురయ్యే రాపిడి వల్ల అలా అవుతుంది. 77 00:07:18,146 --> 00:07:20,690 నౌకకున్న రేడియేటర్లు, వేడిని తగ్గించేస్తాయి. 78 00:07:20,774 --> 00:07:24,653 ఉష్ణ బదిలీ వ్యవస్థను ప్రారంభించబడుతోంది. సర్దుకుంటోంది. 79 00:07:25,153 --> 00:07:26,905 హెలికాన్ కి ఎందుకు వెళ్తున్నావు, హారి? 80 00:07:27,405 --> 00:07:28,907 నువ్వు, రేయిచ్ ఏ ప్రణాళిక వేశారు? 81 00:07:29,407 --> 00:07:30,951 నీకు ఇదివరకే చెప్పా కదా. 82 00:07:31,034 --> 00:07:32,827 లేదు, నేను ఊహించి చెప్పా, దాన్ని నువ్వు తిరస్కరించలేదంతే. 83 00:07:32,911 --> 00:07:33,954 ఎందుకంటే, నువ్వన్నది నిజమే కాబట్టి. 84 00:07:34,746 --> 00:07:36,915 ఇంకా నాకు ఏం చెప్పకుండా ఉందామనుకుంటున్నావా? 85 00:07:36,998 --> 00:07:39,501 మొదట్నుంచీ కూడా నేను నీకు ఏం చెప్పకుండా ఉంటేనే బాగుండేది. 86 00:07:39,584 --> 00:07:41,211 అంటే నీ ఉద్దేశం ఏంటి? 87 00:07:41,711 --> 00:07:42,838 మనం జాగ్రత్తగా లేకపోతే, 88 00:07:42,921 --> 00:07:47,551 నీ అతీతశక్తి, సైకో హిస్టరీని నాశనం చేసే అవకాశం ఉంది. 89 00:07:47,634 --> 00:07:49,553 నీకూ, రేయిచ్ కి ఏమైందో చూడు. 90 00:07:49,636 --> 00:07:51,054 ఇక్కడ అతను ఉండాలి, కానీ నువ్వున్నావు. 91 00:07:53,306 --> 00:07:55,100 మాట జారాను. దాన్ని ఉపసంహరించుకుంటున్నాను. 92 00:07:55,183 --> 00:07:57,143 నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 93 00:07:57,227 --> 00:08:01,439 మానవ జాతి మనుగడ అనేది, మేము హెలికాన్ కి చేరుకోవడం మీద ఆధారపడుంది. 94 00:08:01,523 --> 00:08:04,526 మన మనుగడ పునాది మీద ఆధారపడుంది అనుకున్నానే. 95 00:08:04,609 --> 00:08:06,319 నిజమే, అది కొంత వరకు మాత్రమే. 96 00:08:09,948 --> 00:08:13,785 కానీ అలా అవ్వడానికి, దానికి ఒక అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేయాలి. 97 00:08:13,869 --> 00:08:15,912 అయితే ఇక్కడ ద్వితీయ పునాదిని ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. 98 00:08:15,996 --> 00:08:20,292 అవును, చిట్టచివరి గ్రహమైన హెలికాన్ లో. 99 00:08:41,229 --> 00:08:42,355 సంప్రదింపుల ప్రసార కేంద్రం 100 00:09:28,735 --> 00:09:29,653 నా పేరు హ్యూగో క్రాస్ట్... 101 00:09:31,988 --> 00:09:33,073 నా పేరు కియాన్ యున్ ఏడన్, 102 00:09:34,491 --> 00:09:36,618 నేను తెస్పిస్ మాజీ పౌరుడిని, 103 00:09:38,161 --> 00:09:41,706 నేను తెస్పిన్ కి అత్యవసర సందేశం పంపుతున్నాను. 104 00:09:42,666 --> 00:09:46,878 యాభై తొమ్మిదవ శిబిరం వద్ద అనాక్రీయాన్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. 105 00:09:49,589 --> 00:09:51,091 ఎవరికైనా నా సందేశం అందిందా? 106 00:09:53,009 --> 00:09:54,511 ఎవరికైనా నా సందేశం అందిందా? 107 00:09:58,139 --> 00:09:59,266 ఎవరికైనా నా సందేశం అందిందా? 108 00:10:39,639 --> 00:10:43,643 స్పైరల్, దేహానికి ఉన్న సహన శక్తిని పరీక్షించేలా ఉంటుంది. 109 00:10:43,727 --> 00:10:49,232 ఆహారం, నీరు, విశ్రాంతి లేకుండా ఏకధాటిగా 170 కిలోమీటర్లు ప్రయాణించాలి. 110 00:10:49,316 --> 00:10:51,026 ఆరోగ్య సంబంధిత ముఖ్యమైన అంశాలన్నీ బాగానే ఉన్నాయి. 111 00:10:53,570 --> 00:10:57,157 మీరు కర్బనేతర పరికరాలను తీసుకుపోకూడదు. 112 00:10:57,824 --> 00:10:59,034 మీ రక్షిత శక్తి... 113 00:11:11,129 --> 00:11:12,589 ఇంకా మీ ఇంపీరియల్ నానోబోట్లను కూడా. 114 00:11:16,843 --> 00:11:20,388 మీ జీవితంలో తొలిసారిగా, మీకు గాయలవ్వడం, 115 00:11:21,097 --> 00:11:23,058 -అలసట కలగడం... -నేను అర్థం చేసుకోగలను. 116 00:11:23,141 --> 00:11:24,935 మార్గం మధ్యలో యాత్రికులెవరైనా తడబడితే 117 00:11:25,018 --> 00:11:27,562 తోటి యాత్రికులు వారికి సహాయపడవచ్చు. 118 00:11:27,646 --> 00:11:30,232 కానీ ఒక మోకాలి మీద కూలబడినప్పుడు మాత్రమే ఆ సహాయం అందించబడుతుంది. 119 00:11:31,399 --> 00:11:34,819 రెండు మోకాళ్లతోనూ కూలబడితే, అది లొంగిపోయారనడానికి సంకేతం. 120 00:11:35,987 --> 00:11:39,449 ఆ యాత్రికుడు శక్తినంతా కూడదీసుకొని తిరిగి వచ్చేయాలి, 121 00:11:39,533 --> 00:11:41,576 లేదా అక్కడే చనిపోతాడు. 122 00:11:43,495 --> 00:11:47,249 యాత్ర ప్రారంభించిన వారిలో సగం మంది కూడా స్పైరల్ దాకా చేరుకోలేరు. 123 00:11:47,332 --> 00:11:50,752 అక్కడ వారు తల్లి గర్భం అని పిలవబడే ఒక పవిత్రమైన గుహలోకి ప్రవేశిస్తారు. 124 00:11:51,628 --> 00:11:53,171 అ గుహలో నీళ్ళు ఉంటాయి. 125 00:11:53,755 --> 00:11:56,675 ఆ కొలను చుట్టూ ఉన్న నీటికి నిర్దిష్ట ఐయానిక్ ఛార్జ్ ఉంటుంది. 126 00:11:56,758 --> 00:12:00,470 దాన్ని తాకిన వారికి అది షాక్ లాంటిది కలిగిస్తుంది. 127 00:12:00,554 --> 00:12:06,142 మీరు అక్కడున్న కొలనులోకి దిగాక, మదర్ కి ఇష్టముంటే, 128 00:12:06,768 --> 00:12:08,436 మీకు ఒక దృశ్యాన్ని చూపుతుంది. 129 00:12:09,437 --> 00:12:11,273 మీరు విజయవంతమయి, తిరిగి వచ్చాక, 130 00:12:11,940 --> 00:12:14,860 మీరు ఏం చూశారో జెఫిర్ల ప్యానెల్ నిర్వచించి చెప్తుంది. 131 00:12:14,943 --> 00:12:16,444 ఇతర యాత్రికులకి ఏం కనబడింది? 132 00:12:16,945 --> 00:12:19,698 ఒక్కొక్కరికీ ఒక్కోటి కనిపిస్తుంది, అంతేగాక, అది వ్యక్తిగతం కూడా. 133 00:12:20,282 --> 00:12:22,993 వాళ్లకి ఆహారానికి సంబంధించిన భ్రమలే వస్తుంటాయేమో. 134 00:12:24,369 --> 00:12:25,829 నానోబోట్లను తీసేశాం. 135 00:12:28,039 --> 00:12:31,334 ఈ పని చాలా ప్రమాదకరమైనది, మహారాజా. 136 00:12:31,918 --> 00:12:34,546 మీకు భౌతిక హాని కలిగే ప్రమాదమే గాక, 137 00:12:34,629 --> 00:12:36,006 ఒకవేళ... 138 00:12:36,089 --> 00:12:38,091 మీరు గమ్యస్థానానికి చేరుకోలేకపోతే, 139 00:12:38,175 --> 00:12:40,343 మీ విమర్శకులకు ఆయుధం ఇచ్చినట్టవుతుంది. 140 00:12:40,886 --> 00:12:42,304 నేను గమ్యస్థానానికి ఖచ్చితంగా చేరుకుంటాను. 141 00:12:46,766 --> 00:12:48,268 నీ ఉప్పు బ్రేస్లెట్ ఇవ్వు. 142 00:13:06,786 --> 00:13:07,996 నేను దీన్ని తీసుకెళ్తున్నాను. 143 00:13:10,207 --> 00:13:12,292 ఇది నా దగ్గర ఉంటే, నువ్వు నా చెంతే ఉన్నట్టు అనిపిస్తుంది. 144 00:13:13,376 --> 00:13:15,295 ఎప్పుడూ ఎలా ఉంటావో, అలాగే అన్నమాట. 145 00:14:13,937 --> 00:14:16,439 విశ్వాసంతో మెల్లగా సాగాలి. 146 00:14:18,316 --> 00:14:20,151 ఈ మధ్య దారులు భ్రమలు కలిగించగలవు. 147 00:14:21,027 --> 00:14:23,029 నిజంగా మనం ఉన్న దూరం కన్నా ఇంకా దూరం ఉన్నామనే భ్రమను కలిగిస్తాయి. 148 00:14:24,239 --> 00:14:26,449 మీ ఒంట్లో ఎప్పుడూ కాస్త శక్తి ఉండేలా చూసుకోండి. 149 00:14:26,992 --> 00:14:28,201 ఈ యాత్ర ఇంతకుముందు చేశారా? 150 00:14:28,910 --> 00:14:32,455 లేదు, లేదు. కానీ చేసిన చాలా మందితో మాట్లాడాను. 151 00:14:37,210 --> 00:14:39,004 ఏవైనా పనికి వచ్చే చిట్కాలు చెప్పగలరా? 152 00:14:40,505 --> 00:14:42,174 ఇది సులభంగా చేసే యాత్ర అస్సలు కాదు. 153 00:14:42,841 --> 00:14:44,217 అదే కదా విషయం. 154 00:14:45,093 --> 00:14:46,511 మెల్లగా ముందుకు సాగిపోవాలి. 155 00:14:47,637 --> 00:14:49,222 ఒక అడుగు తర్వాత మరొకటి. 156 00:14:49,931 --> 00:14:51,725 ఆ దేవతాత్రయమే మనకి దారి చూపుతుంది. 157 00:14:53,935 --> 00:14:56,855 వీళ్ళు తమకు గుహలో ఏం కనిపించిందో చెప్తారా? 158 00:15:01,443 --> 00:15:04,112 ఒక యాత్రికురాలు నాకు చెప్పాడు, 159 00:15:04,196 --> 00:15:09,534 తన కళ్ళెదుటే, కొలను చుట్టూ ఉన్న ఉప్పు గాల్లో సుడులు తిరిగిందట. 160 00:15:10,827 --> 00:15:12,287 తర్వాత ఏం జరిగిందో ఆమె చెప్పలేదు, 161 00:15:12,370 --> 00:15:15,290 కానీ అంత అందమైనదాన్ని తాను ఎప్పుడూ చూడలేదని మాత్రం చెప్పింది. 162 00:15:20,921 --> 00:15:24,090 -మీది ఏ ప్రపంచం? -బాల్టారోస్. మీది? 163 00:15:24,174 --> 00:15:27,511 -నిషాయ. -ఉత్పత్తుల తయారీ గ్రహం. 164 00:15:28,678 --> 00:15:31,848 ట్రాంటార్లో ఉత్పత్తి చేయడానికి విషపూరితమైనవన్నీ మా గ్రహంలో చేస్తారు. 165 00:15:32,933 --> 00:15:34,434 ఎక్కువగా టెక్స్ టైల్స్ ని. 166 00:15:34,976 --> 00:15:38,355 మహారాజుకు నచ్చిన కొన్ని రకాల సెరామిక్ పూత పూసిన ఉత్పత్తులు. 167 00:15:39,981 --> 00:15:41,191 అందుకు నిషాయ సరైన ప్రదేశం, 168 00:15:41,274 --> 00:15:44,027 ఎందుకంటే మా వాయుమండలం చిక్కగా పొగమంచుతో కూడుకొని ఉంటుంది, 169 00:15:44,110 --> 00:15:48,198 కాలుష్యం అందులో బాగా కలిసిపోతుంది, కాలుష్యం ఉందనే తెలీదన్నమాట. 170 00:15:49,866 --> 00:15:51,243 ఆ పొగ మంచు. 171 00:15:51,868 --> 00:15:52,869 మా అమ్మ ఓ విషయం చెప్పేది, 172 00:15:52,953 --> 00:15:55,789 తను మా నాన్నను బాగా చూసేసరికి, వాళ్లకి అప్పటికే... 173 00:15:56,456 --> 00:15:58,166 ముగ్గురు పిల్లలు ఉన్నారట. 174 00:16:00,126 --> 00:16:02,629 మీరు కూడా ఏదైనా ఫ్యాక్టరీలో పని చేసేవారా? 175 00:16:02,712 --> 00:16:04,798 లేదు. నేను కూలీని. 176 00:16:05,590 --> 00:16:07,217 సామాగ్రిని వ్యోమ నౌకల్లోకి ఎక్కించడం నా పని. 177 00:16:09,970 --> 00:16:12,097 అవి చాలా గొప్ప యంత్రాలు కదా? 178 00:16:12,180 --> 00:16:13,181 అవును. 179 00:16:13,807 --> 00:16:16,351 ఇక్కడికి రావడానికే తొలిసారిగా ఒక నౌకను ఎక్కాను. 180 00:16:17,102 --> 00:16:19,229 టిక్కెట్ బుక్ చేసుకోవడానికి నేను ఆదా చేసుకున్నదంతా ఖర్చు చెసేశాను. 181 00:16:21,022 --> 00:16:24,192 బాల్టారోస్ నుండి కదా? మీరు కూడా ఒక నౌకలోనే వచ్చి ఉంటారు. 182 00:16:24,276 --> 00:16:25,277 అవును. 183 00:16:27,571 --> 00:16:29,030 నాకు కూడా నౌకని ఎక్కడం తొలిసారే. 184 00:16:31,074 --> 00:16:33,827 ఒక గెలాక్సీ నుండి మరొక గెలాక్సీకి ప్రయాణిస్తూ 185 00:16:33,910 --> 00:16:36,037 ఎప్పుడూ యాత్రలోనే ఉండే వాళ్ళంటే నాకు కాస్త కుళ్ళుగా ఉండేది. 186 00:16:36,621 --> 00:16:41,459 కానీ... కానీ నా విషయంలో అయితే, ఈ యాత్ర తప్ప నాకు ఇంకేవీ అవసరం లేదు. 187 00:16:43,503 --> 00:16:44,838 మీకు కూడా అంతే అని ఆశిస్తున్నాను. 188 00:16:47,382 --> 00:16:48,633 ద్వితీయ పునాదా? 189 00:16:48,717 --> 00:16:51,636 టర్మినస్, సామ్రాజ్యం ఆధీనంలో ఉండే గ్రహం, 190 00:16:51,720 --> 00:16:54,764 కాబట్టి దాని మీద దాడులు జరిగే అవకాశముంది. 191 00:16:55,348 --> 00:16:59,352 కానీ ద్వితీయ పునాది ఎక్కడ ఉందో రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది, 192 00:17:00,896 --> 00:17:02,564 ఆ విషయం తొలి పునాదికి కూడా తెలియకూడదు. 193 00:17:03,315 --> 00:17:05,025 ఎందుకు? అసలు దాని లక్ష్యం ఏంటి? 194 00:17:08,111 --> 00:17:11,323 నువ్వు నాపై విశ్వాసం ఉంచకపోతే, నేను హెలికాన్ కి రాను. 195 00:17:12,282 --> 00:17:13,700 పిచ్చిపిచ్చిగా మాట్లాడకు, గాల్. 196 00:17:14,326 --> 00:17:16,995 హెలికాన్లో నాకు కావలసిన వనరులు ఉన్నాయి. మిత్రపక్షాలు ఉన్నారు. 197 00:17:17,078 --> 00:17:19,956 ఇప్పుడు నీ సామర్థ్యాలు మనకు తెలిశాయి కనుక, వాటిని మనం అధ్యయనం చేయవచ్చు. 198 00:17:20,040 --> 00:17:21,416 వాటిని మనకు అనుకూలంగా వాడుకోవచ్చు. 199 00:17:21,500 --> 00:17:24,127 నన్ను వాడుకుంది ఇక చాలు. 200 00:17:24,878 --> 00:17:27,839 నేను వెళ్లిపోవాలనుకుంటున్నాను. వెంటనే. 201 00:17:27,923 --> 00:17:31,927 నువ్వు నాకు చెప్పాలి, లేదా నేను ఎలా అయితే వచ్చానో, అలాగే వెళ్లిపోతాను. 202 00:17:37,057 --> 00:17:38,183 ఎక్కడికి వెళ్తావు? 203 00:17:38,266 --> 00:17:40,352 టర్మినస్ కి చేరుకోవడానికి చాలా దశాబ్దాలు పడుతుంది. 204 00:17:40,435 --> 00:17:42,687 ట్రాంటార్? నిన్ను మహారాజు వెలివేస్తాడు. 205 00:17:42,771 --> 00:17:45,440 అవి కాక ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. మా అమ్మ వాటి పేర్లను నాకు చెప్పింది. 206 00:17:49,568 --> 00:17:51,947 నా ప్రవృత్తి చాలా ముఖ్యమని అన్నావు కదా. 207 00:17:52,489 --> 00:17:54,199 ఇప్పుడు అదే నాకు చెప్తోంది. 208 00:17:54,282 --> 00:17:56,326 ఈ తలుపును తెరువు. 209 00:17:56,409 --> 00:18:00,372 -నువ్వు పూర్తి వివేకంతో ఆలోచించట్లేదు. -నేనేం ఆలోచించాలో కూడా నువ్వే చెప్పకు. 210 00:18:00,455 --> 00:18:01,957 తెరువు. 211 00:18:07,295 --> 00:18:08,296 తెరువు! 212 00:18:09,631 --> 00:18:10,674 తెరువు! 213 00:18:13,468 --> 00:18:15,053 తలుపు తెరువు! 214 00:19:22,078 --> 00:19:25,165 శక్తినంతా కూడదీసుకోండి, బాబూ. మనం చేరువ అవుతున్నాం. 215 00:19:36,134 --> 00:19:37,135 అంతే. 216 00:19:45,936 --> 00:19:50,023 ముప్పై... లేదు ప్రయాణం ఆరంభమవ్వడానికి 29 నిమిషాలు ఉంది. 217 00:19:55,403 --> 00:19:56,655 తన ప్లాన్... 218 00:19:58,073 --> 00:19:59,533 మీరు విజయవంతమైనా, 219 00:20:01,409 --> 00:20:03,745 మహారాజు మీ మిగిలిన వాళ్ళని కూడా ఊచకోత కోస్తాడు. 220 00:20:04,538 --> 00:20:06,498 కానీ ఈ సారి, పోయినసారి చేసినట్టుగా సగం సగం చేయరు. 221 00:20:08,542 --> 00:20:09,709 ప్రతీ ఒక్కరిని చంపేస్తారు. 222 00:20:11,336 --> 00:20:13,255 ఆ తదనంతరం అలుముకొనే అలజడిలో... 223 00:20:15,423 --> 00:20:16,716 దాన్ని మర్చిపోతారు. 224 00:20:18,885 --> 00:20:22,556 ఫారా తనని తాను మృత్యువును జయించిన వీరనారిగా భావిస్తోందని నాకు తెలుసు... 225 00:20:24,891 --> 00:20:27,477 కానీ అనాక్రీయాన్ జాతి ఇంకా వర్ధిల్లుతోంది కదా. 226 00:20:32,399 --> 00:20:33,984 నీకు కూడా సంతానం ఉంది కదా? 227 00:20:36,152 --> 00:20:37,279 ఒక పాప. 228 00:20:39,698 --> 00:20:41,950 -ఒక పాప అనిపిస్తోంది. -నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? 229 00:20:42,033 --> 00:20:44,452 జనాల ముఖాల చూసి మొత్తం చెప్పేయగలను. ఆ విషయం ఫారా నీకు చెప్పలేదా? 230 00:20:46,663 --> 00:20:49,249 తనలో నాకు అంధకారం తప్ప ఇంకేమీ కనబడలేదు. 231 00:20:49,332 --> 00:20:51,543 కానీ నీలో నాకు సంశయం కనిపిస్తోంది. 232 00:20:53,503 --> 00:20:55,672 అనాక్రీయాన్ కి ఇంకా భవిష్యత్తు ఉంది. 233 00:20:56,548 --> 00:20:58,466 చనిపోయినవారికి ఆత్మశాంతి కలిగించడానికి అంత కన్నా మంచి మార్గం ఇంకేముంటుంది? 234 00:20:59,676 --> 00:21:02,053 -అందరూ దాక్కోండి! -జసెంటా! 235 00:21:06,600 --> 00:21:07,601 ఇదేం చెత్త నౌకరా బాబు. 236 00:21:08,727 --> 00:21:09,936 రోవాన్. 237 00:21:24,910 --> 00:21:25,911 ఇక్కడ తిరుగుబాటు జరిగింది. 238 00:21:27,245 --> 00:21:30,081 ఈ వంతెనకు కాపలాగా ఆఫీసర్లు ఆ తుపాకీని ఇక్కడ పెట్టుంటారు. 239 00:21:37,631 --> 00:21:39,132 ఓయ్. 240 00:21:39,216 --> 00:21:40,967 నువ్వు దాన్ని నిన్ను కాల్చేలా చేయాలి, ఈలోపు నేను దాన్ని నిర్వీర్యం చేస్తా. 241 00:21:41,051 --> 00:21:42,052 నువ్వు నిర్వీర్యం చేయలేకపోతే? 242 00:21:42,677 --> 00:21:43,720 అప్పుడు చస్తావు, అంతే. 243 00:22:04,741 --> 00:22:05,909 సమయం మించిపోతోంది, వార్డెన్. 244 00:22:47,701 --> 00:22:51,329 -అదృష్టం కలిసొచ్చి భలే తగిలిందిలే. -అదృష్టం కావలసింది నీకు, నాకు ప్రతిభ ఉంది. 245 00:22:52,038 --> 00:22:53,164 ఇంకొక అడ్డంకి. 246 00:22:55,584 --> 00:22:56,751 నీకేం చేయాలో తెలుసు కదా. 247 00:23:23,820 --> 00:23:25,488 -ఒంగో. -లూయిస్! 248 00:23:35,957 --> 00:23:37,417 పద. 249 00:23:37,501 --> 00:23:39,419 ఆ తలుపును దాటి ఇక్కడికి రావడానికి వాళ్ళకి ఎంతో సేపు పట్టదు. 250 00:23:48,386 --> 00:23:49,638 తలుపును ఓవర్ రైడ్ చేసి తెరువు. 251 00:23:55,894 --> 00:23:57,312 మనకి సమయం మించిపోతోంది! 252 00:24:27,300 --> 00:24:28,426 కెప్టన్ ఆత్మహత్య చేసుకుంది. 253 00:24:30,470 --> 00:24:31,680 "బయటి." 254 00:24:32,806 --> 00:24:35,725 అంటే, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ? 255 00:24:35,809 --> 00:24:38,520 తన కింది వారెవరైనా తనని మోసం చేశారా? 256 00:24:38,603 --> 00:24:41,022 బయటి అంటే "బయటి నుండి" అని కూడా కావచ్చు. 257 00:24:41,898 --> 00:24:43,149 గెలాక్సీ బయటివారా? 258 00:24:45,277 --> 00:24:47,279 గెలాక్సీ బయట నుండి వచ్చినదేదైనా దాడి చేసిందా? 259 00:24:56,121 --> 00:24:57,581 వ్యక్తిగత కార్య పాడ్లు. 260 00:25:00,167 --> 00:25:01,501 వీటిలో ఒకటి గమనాన్ని నిర్దేశిస్తుంది. 261 00:25:03,128 --> 00:25:07,048 దాన్ని మనం కనుక్కోగలిగితే, మనం తర్వాతి ప్రయాణాన్ని నియంత్రించవచ్చు. 262 00:25:07,132 --> 00:25:08,133 ఆయుధాలా? 263 00:25:08,967 --> 00:25:10,177 ఆయుధం కాదు. 264 00:25:11,094 --> 00:25:12,387 ప్రొపల్షన్. 265 00:25:13,180 --> 00:25:15,307 సరఫరాలు కూడా అందనంత దూరానికి జంప్ చేసుంటారు. 266 00:25:16,850 --> 00:25:19,769 అలా ఒక్కొక్క జంప్ కి మరింత దూరం వెళ్లిపోయుంటారు. 267 00:25:19,853 --> 00:25:23,315 హెచ్చరిక. ప్రయాణానికి ఇరవై నిమిషాలు ఉంది. 268 00:25:24,524 --> 00:25:26,902 ప్రయాణ ప్రోటోకాల్స్ ని ప్రారంభించండి. 269 00:25:26,985 --> 00:25:27,986 నాకు ఇప్పుడు అర్థమైంది. 270 00:25:28,069 --> 00:25:29,988 ఈ లైట్లు ప్రయాణ ప్రోటోకాల్స్ ఆ? 271 00:25:30,071 --> 00:25:31,823 ఈ నౌకలో స్పేసర్స్ లేరు. 272 00:25:31,907 --> 00:25:35,911 అలాంటప్పుడు, జంప్ కి ముందు సిబ్బంది తమకు తాము మత్తు ఎక్కించుకోవాల్సి వచ్చేది. 273 00:25:36,411 --> 00:25:39,372 జంప్ కి ఎంత సమయం ఉందో వాళ్ళకి ఈ లైట్స్ చెప్పేవి. 274 00:25:39,456 --> 00:25:40,457 మనకి సమయం మించిపోతోంది. 275 00:25:41,541 --> 00:25:42,542 అక్కడ ఉంది. 276 00:25:50,967 --> 00:25:53,678 ఇదే. ఇదే గమన పాడ్. 277 00:25:54,679 --> 00:25:56,097 సామ్రాజ్యం వద్ద స్పేసర్స్ లేనప్పుడు, 278 00:25:56,181 --> 00:25:59,184 ఈ పాత నౌకలకు, వాటి జంప్ లకు మార్గనిర్దేశం చేయడానికి 279 00:25:59,267 --> 00:26:00,560 భారీ ప్రాసెసింగ్ పవర్ ఉండేది ఒకటి అవసరం ఉండేది. 280 00:26:00,644 --> 00:26:04,189 విశ్వాన్ని మడవడమంటే సైన్స్ యే కావచ్చు, కానీ అది మనస్సుకు సంబంధించింది కూడా. 281 00:26:05,649 --> 00:26:07,067 అది కోరుకోవడం లాంటిది. 282 00:26:07,150 --> 00:26:11,071 అంత గొప్ప జంప్ అంటే, బతికున్న మనిషి మెదడే చేయగలుగుతుంది. 283 00:26:11,863 --> 00:26:13,114 కానీ తేడా ఎక్కడ వస్తుందంటే, 284 00:26:13,198 --> 00:26:15,784 జంప్ తాలూకు ప్రభావాన్ని తట్టుకోగలిగేలా స్పేసర్లు జన్యుపరంగా మార్చబడతారు, 285 00:26:15,867 --> 00:26:19,788 కానీ ఈ మనుషులకు ఆ అవకాశం లేదు. 286 00:26:22,207 --> 00:26:23,375 చావకుండా ఉండాలంటే... 287 00:26:26,419 --> 00:26:31,258 వాళ్ళు నౌకలకు కనెక్ట్ అయ్యుండాల్సిందే. 288 00:26:34,094 --> 00:26:36,721 ఇతడిని కాల్చేశారు. నౌక ఇతని కోసమే వెతుకుతోంది. 289 00:26:38,932 --> 00:26:40,475 దానంతట అది గమనాన్ని నిర్దేశించుకోలేకపోతోంది కనుక. 290 00:26:48,358 --> 00:26:50,402 సర్జరీ అవసరం లేకుండా ఎవరినైనా కనెక్ట్ చేయవచ్చా? 291 00:26:53,530 --> 00:26:54,823 కృతిమ మేధస్సుకు ఇంద్రియజ్ఞానముంటే, 292 00:26:56,366 --> 00:26:58,451 ఆ ఇంటర్ఫేజ్ సరైన న్యూరాన్ల కోసం చూడదా? 293 00:26:58,535 --> 00:27:02,372 చూస్తుంది. ఆ అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఎక్కువ సేపు ప్రాణాలను నిలుపుకోలేరు. 294 00:27:04,624 --> 00:27:06,042 జంపును నియంత్రించేంత సేపు బతికి ఉంటారా? 295 00:27:09,921 --> 00:27:11,590 పునాది కొనసాగగలదని నిర్ధారించుకోవడానికి. 296 00:27:11,673 --> 00:27:13,592 అనంత విశ్వంలోకి ఒక జంప్ కోసమా? 297 00:27:16,636 --> 00:27:18,972 బతకగలిగే అవకాశం ఉంది, కానీ... 298 00:27:19,055 --> 00:27:20,557 అలా చేస్తే చావు తప్పదు. 299 00:27:22,809 --> 00:27:24,895 మనలో ఎవరైనా త్యాగం చేయాలంటే, 300 00:27:24,978 --> 00:27:26,396 అది నాలాంటి ఇమడివారే చేస్తే బాగుంటుంది. 301 00:27:26,938 --> 00:27:28,148 దీన్ని ఎలా చేయాలో కనిపెట్టడంలో నాకు సాయపడు. 302 00:27:31,610 --> 00:27:33,111 కానీ మనం వెళ్లేది అనంత విశ్వంలోకి కాదు. 303 00:27:35,864 --> 00:27:37,782 నేను ఈ నౌకను టర్మినస్ కి తీసుకువెళ్తాను. 304 00:28:20,367 --> 00:28:22,911 ఈమె మీతో మాట్లాడాలనుకుంటోంది, లెఫ్టినెంట్. 305 00:28:25,580 --> 00:28:28,291 -లెఫ్టినెంట్, మన ముందో సమస్య ఉంది. -దాని వల్లేనా? 306 00:28:28,375 --> 00:28:30,335 మేము దాన్ని వాల్ట్ అని అంటాం. అదేంటో మాకు తెలీదు, 307 00:28:30,418 --> 00:28:32,963 కాకపోతే దాని చుట్టూ ఒక సిగ్నల్ క్షేత్రం ఉంటుంది, అది జనాలకు హాని చేస్తుంది. 308 00:28:33,046 --> 00:28:35,173 జనాలకు బైర్లు కమ్మి వాళ్ళు మూర్ఛపోతారు. 309 00:28:35,799 --> 00:28:39,010 మీ వేటగత్తె కూడా దాని ప్రభావానికి గురైంది. 310 00:28:39,094 --> 00:28:41,012 నా కూతురు ఆమెని అలానే పట్టుకోగలిగింది. 311 00:28:41,096 --> 00:28:42,430 సుదీర్ఘకాలం పాటు దాని ప్రభావం ఎలా ఉంటుందో మాకు తెలీదు, 312 00:28:42,514 --> 00:28:45,642 కానీ దాని చుట్టూ ఉన్న క్షేత్రం విస్తరిస్తోంది. 313 00:28:45,725 --> 00:28:46,935 మనం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి. 314 00:28:48,562 --> 00:28:49,771 ఇదేమీ కుట్ర కాదు. 315 00:28:51,022 --> 00:28:53,608 నువ్వు ఏ గ్రహం నుండి వచ్చావో అనేది శూన్య క్షేత్రానికి అనవసరం. 316 00:28:53,692 --> 00:28:56,403 మనం ఏమీ చేయకుండా ఉంటే, అది మనల్ని కమ్మేస్తుంది. 317 00:28:56,987 --> 00:28:58,738 మీరు కంచెని నిర్వీర్యం చేయాలి. 318 00:29:29,519 --> 00:29:31,104 మదర్ నన్ను పిలుస్తోంది. 319 00:29:31,188 --> 00:29:34,649 -లేదు. మీలో ఇంకా శక్తి ఉంది. -లేదు. 320 00:29:47,871 --> 00:29:51,458 కనీసం మిమ్మల్ని దారి పక్కకు అయినా తీసుకు వెళ్తాను, ఎవరైనా మీకు సహాయపడగలరు. 321 00:30:01,968 --> 00:30:03,220 మీరు ఇక్కడే చావకూడదు. 322 00:30:04,137 --> 00:30:06,264 నేను తనువు చాలించడానికి ఇంతకన్నా మంచి చోటు ఇంకేముంటుంది? 323 00:30:07,682 --> 00:30:09,100 ఒక ప్రశాంతమైన చావు. 324 00:30:10,310 --> 00:30:12,395 ఇది పవిత్రమైన పునర్జన్మకు... 325 00:30:14,272 --> 00:30:15,565 మదర్ ఇచ్చే ఒక అద్భుతమైన వరం. 326 00:30:16,525 --> 00:30:18,568 ఒకవేళ పునర్జన్మ అనేదే లేకపోతే? 327 00:30:19,569 --> 00:30:23,448 ఈ జన్మే ముగింపు అయితే? 328 00:30:33,667 --> 00:30:35,168 బహుశా మనం మళ్లీ కలుసుకోవచ్చేమో. 329 00:30:37,295 --> 00:30:39,297 మీరేం చూశారో నాకు చెప్పవచ్చు. 330 00:33:57,829 --> 00:34:04,753 మీరు మదర్, మేయిడెన్, క్రోన్ యొక్క ప్రతినిధుల సమక్షంలో ఉన్నారు. 331 00:34:05,921 --> 00:34:09,466 స్పైరల్ దాకా చేరుకొన్నవాళ్ళంతా మాకు ఆరాధ్యసమానులే. 332 00:34:10,133 --> 00:34:14,971 గర్భంలో మీ అనుభవాన్ని మాకు వివరించగలరా? 333 00:34:16,765 --> 00:34:18,433 నేను అక్కడ ఉన్నప్పుడు... 334 00:34:21,144 --> 00:34:22,812 ఉప్పు కదలడం మొదలైంది. 335 00:34:24,523 --> 00:34:26,816 అది సుడులు తిరగడం మొదలైంది. 336 00:34:26,900 --> 00:34:30,862 మొదట్లో మెల్లగానే తిరుగుతుంది, ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. 337 00:34:33,031 --> 00:34:35,242 అది గుహలో నేల మీద నుండి గాల్లోకి లేసింది. 338 00:34:39,496 --> 00:34:42,165 అది ఒక కాండం రూపంలోకి మారుతుంది... 339 00:34:45,210 --> 00:34:47,128 ఆ తర్వాత దానికి మూడు పెద్ద రేకులు ఏర్పడతాయి. 340 00:34:51,174 --> 00:34:53,467 అదంతా నా భ్రమేమో అని కంగారుపడ్డాను. 341 00:34:55,177 --> 00:34:56,887 కానీ అది నిజమే. 342 00:35:08,358 --> 00:35:11,027 బర్త్ రూట్ కుసుమానికి సంబంధించిన పురాణం గురించి మీకు తెలుసా? 343 00:35:14,906 --> 00:35:16,241 తెలీదు. 344 00:35:18,784 --> 00:35:22,706 డోల్, సూరాను గుద్దుకొని, మూడు చంద్రుళ్ళను సృష్టించిన తర్వాత, 345 00:35:22,789 --> 00:35:25,250 మేయిడెన్ ని బర్త్ రూట్లు కప్పేశాయి. 346 00:35:25,333 --> 00:35:30,255 మా ప్రపంచం జీవాన్ని సపోర్ట్ చేయగలదని దేవతాత్రయం మాకు ఇచ్చిస సంకేతమది. 347 00:35:30,338 --> 00:35:33,800 శతబ్దాలు గడిచే కొద్దీ, క్రమంగా ఆ పూలు వాడిపోయాయి. 348 00:35:33,884 --> 00:35:37,804 ఇక్కడ మేము వాటిని చూసి వేయి ఏళ్ళు పైనే గడిచింది. 349 00:35:37,888 --> 00:35:39,389 దానర్థం ఏంటి? 350 00:35:39,472 --> 00:35:44,311 స్వభావరీత్యా, మూడు రేకుల పూలు మోనోకాట్ విత్తనాల నుండి మొలకెత్తుతాయి. 351 00:35:44,394 --> 00:35:49,316 మరో విధంగా చెప్పాలంటే, ఒక మూలకం నుండి మూడు మూలకాలు ప్రాణం పోసుకున్నాయి. 352 00:35:49,399 --> 00:35:51,318 నేనూ, నా సోదరులలాగానే. 353 00:35:51,818 --> 00:35:53,904 అలాగే దేవతాత్రయంలాగా. 354 00:35:53,987 --> 00:35:56,740 మీరు చాలా పవిత్రమైనదాన్ని తిలకించారు, మహారాజా. 355 00:35:57,991 --> 00:36:00,994 నిజానికి, మీరు ఇక్కడ ఉండటమే పవిత్రమైన విషయం, 356 00:36:01,536 --> 00:36:05,040 ఈ యాత్రను మీ ముందున్న వారెవరూ చేసే సాహసమే చేయలేదు. 357 00:36:05,582 --> 00:36:10,003 మీ ఆత్మ మార్పుకు లోబడదు అనే విషయం బూటకమని తెలిసిపోతోంది. 358 00:36:12,422 --> 00:36:17,135 అలా ఎవరైనా అన్నా కూడా, మోక్షాన్ని పొందనివ్వకుండా ఒక ఆత్మను అడ్డుకున్న 359 00:36:17,219 --> 00:36:23,517 పాపము వారికి తగులుతుంది, వారిని దోషులుగా పరిగణించడం జరుగుతుంది. 360 00:36:23,600 --> 00:36:28,313 నేటి నుండి, ఏ జెఫిర్ కూడా మీ దారికి అడ్డురారు. 361 00:37:02,264 --> 00:37:03,765 నువ్వు అనవసరంగా కష్టపడుతున్నావు. 362 00:37:05,392 --> 00:37:08,854 అధిక వేడిమి ప్రమాదానికి గురికాకుండా ఈ రాళ్ళదిబ్బను దాటేదాకా విశ్రాంతి తీసుకో. 363 00:37:12,357 --> 00:37:13,942 ఇప్పుడు ఎంత ఉష్ణోగ్రత ఉంది? 364 00:37:14,442 --> 00:37:17,404 ముప్పై ఎనిమిది డిగ్రీలు. గరిష్ఠంగా 41 దాకా పెరగవచ్చు. 365 00:37:19,239 --> 00:37:20,657 ఒకవేళ అదే గరిష్ఠమైనది కాకపోతే? 366 00:37:26,121 --> 00:37:27,205 నువ్వేం చేయాలనుకుంటున్నావు? 367 00:37:28,665 --> 00:37:31,710 మూసుకో. నోర్మూసుకో. 368 00:37:32,669 --> 00:37:33,670 గాల్. 369 00:37:33,753 --> 00:37:35,505 అత్యధిక ఉష్ణోగ్రతకు చేరుకుంటోంది. 370 00:37:35,589 --> 00:37:38,008 ఉష్ణ బదిలీ వ్యవస్థ ప్రారంభించబడుతోంది. 371 00:37:38,508 --> 00:37:40,719 -గాల్. -సర్దుబాటు అవుతోంది. 372 00:37:40,802 --> 00:37:42,512 ఇక ఏవీ సగం సగం చెప్పకు. 373 00:37:43,013 --> 00:37:45,974 నాకు మొత్తం చెప్పేయ్, లేదా ఈ ప్రయాణానికి ఇక్కడితో ముగింపు పలుకుతాను. 374 00:37:46,057 --> 00:37:47,225 నిజంగానే చెప్తున్నా, హారి. 375 00:37:47,309 --> 00:37:49,853 నేను అలా చేస్తే, ద్వితీయ పునాది అనేది రూపుదిద్దుకో ముందే, 376 00:37:49,936 --> 00:37:51,354 దానికి బీటలు పట్టే అవకాశం ఉంది. 377 00:37:51,438 --> 00:37:54,024 -చెప్పు! -నీకస్సలు అర్థం కూడా కావట్లేదు... 378 00:37:54,107 --> 00:37:57,944 -ఆపు! ఆపు! ఆపు! -ఇక పట్టించుకొనే ఓపిక నాకు లేదు! 379 00:38:12,417 --> 00:38:13,627 నువ్వెంత పని చేశావో తెలుసా? 380 00:38:16,129 --> 00:38:17,631 ఉష్ణ బదిలీ వ్యవస్థే లేకపోతే, 381 00:38:17,714 --> 00:38:21,176 నువ్వు హెలికాన్ కి చేరుకోక ముందే నేను మాడి మసైపోయుంటాను. 382 00:38:22,010 --> 00:38:24,513 సమాచారానికి అంతం ఉండదు అని అంటారు. 383 00:38:25,138 --> 00:38:26,264 కాబట్టి నువ్వు బతకవచ్చేమో. 384 00:38:28,266 --> 00:38:29,726 కానీ నేను అయితే తప్పకుండా చస్తాను. 385 00:38:39,903 --> 00:38:41,571 ఏమంటావు, హారి? 386 00:38:42,989 --> 00:38:47,494 నేను తగలబడిపోవడం నీ కళ్ళారా చూస్తావా, లేదా నన్ను ఇక్కడి నుండి పంపించేస్తావా? 387 00:38:55,252 --> 00:38:59,297 సైరోపాడ్ ని నేను అనుకొన్న చోటుకు వెళ్లేలా ప్రోగ్రామ్ చేయగలనని నీకు తెలుసు కదా. 388 00:38:59,381 --> 00:39:02,926 నీకు నా అవసరం లేదు, హారి. మొదట్నుంచీ కూడా నీకు నా అవసరం లేదు. 389 00:39:03,009 --> 00:39:04,010 అది నిజం కాదు. 390 00:39:04,094 --> 00:39:05,262 అదే నిజం. 391 00:39:06,304 --> 00:39:09,891 లెక్క ప్రకారం నా కథ టర్మినస్ లో ముగియాలి. అలా అని స్వయంగా నువ్వే అన్నావు. 392 00:39:10,392 --> 00:39:14,062 నువ్వూ, రేయిచ్, మొదట్నుంచీ నన్ను వదిలేయాలనే అనుకున్నారు, కాబట్టి... 393 00:39:16,147 --> 00:39:17,274 నన్ను వదిలేయ్. 394 00:39:19,401 --> 00:39:20,402 దయచేసి వదిలేయ్. 395 00:39:47,429 --> 00:39:48,680 సెలవు, హారి. 396 00:39:49,931 --> 00:39:51,141 సెలవు, గాల్. 397 00:40:32,057 --> 00:40:33,725 గమ్యస్థానాన్ని పేర్కొనండి. 398 00:40:36,686 --> 00:40:39,314 బ్లూ డ్రిఫ్ట్ కి చేరుకోవడాని ఎంత సమయం పడుతుందో చూడు. 399 00:40:39,397 --> 00:40:40,649 సినాక్స్ కి. 400 00:40:42,067 --> 00:40:45,904 వ్యవధి, 138 ఇంపీరియల్ స్టాండర్డ్ ఏళ్ళు. 401 00:40:52,619 --> 00:40:54,120 అక్కడికే పద. 402 00:41:01,127 --> 00:41:05,257 86,982,041. 403 00:41:07,092 --> 00:41:11,721 86,982,043. 404 00:41:13,348 --> 00:41:18,186 86,982,061… 405 00:42:06,902 --> 00:42:08,069 జెఫిర్ హలీమా. 406 00:42:11,823 --> 00:42:15,952 నాలో మార్పు తీసుకువచ్చిన ఈ యాత్ర చేపట్టేలా నాకు స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు. 407 00:42:18,371 --> 00:42:20,373 మీ ప్రార్థనా కార్యక్రమానికే నేను వచ్చి ఉండకపోతే, 408 00:42:21,625 --> 00:42:26,588 స్పైరల్ దాకా వెళ్లడానికి నేను సాహసం చేసి ఉండేవాడిని కాదు. 409 00:42:37,933 --> 00:42:41,102 ముగ్గురు దేవతల ఆశిస్సులు మీతో ఉండుగాక, మహారాజా. 410 00:42:43,522 --> 00:42:44,689 మీకు కూడా. 411 00:43:19,349 --> 00:43:21,977 దయచేసి, లోపలికి రండి. 412 00:43:23,854 --> 00:43:25,146 లోపలికి ఎవరైనా రావచ్చు. 413 00:43:27,399 --> 00:43:29,192 నేను నా సానుభూతిని తెలపాలని వచ్చాను. 414 00:43:30,235 --> 00:43:32,529 మీరు చాలా మంచి ప్రాక్సిమా అయ్యుండేవారు. 415 00:43:32,612 --> 00:43:33,780 అవును. 416 00:43:35,240 --> 00:43:37,701 క్లియాన్ కి అది ఇష్టం లేదనుకుంటా. 417 00:43:39,661 --> 00:43:42,289 ఏదేమైనా కానీ, ఆయనకి కావలసింది ఆయనకి దక్కింది. 418 00:43:44,749 --> 00:43:51,298 జెఫిర్ గిలాట్ ని ప్రాక్సిమాగా ప్రకటిస్తారు, నన్ను నా ప్రపంచానికి పంపించేస్తారు. 419 00:43:57,137 --> 00:43:58,847 ఫలితం విషయంలో మీకు సంతృప్తిగా లేదా? 420 00:44:00,432 --> 00:44:04,019 మహరాజుకు అలా చెప్పమని మీరే చెప్పారని అనుకున్నాను. 421 00:44:04,102 --> 00:44:06,688 నేనేమీ చెప్పలేదు. 422 00:44:07,272 --> 00:44:11,651 ఇంకో విషయం, నా ఆనందంతో ఎవరికీ పని లేదు. 423 00:44:12,485 --> 00:44:13,528 నేను ఒప్పుకోను. 424 00:44:16,198 --> 00:44:23,038 చూడండి, తమ ప్రవృత్తులను పట్టించుకోకుండా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి దక్కే 425 00:44:23,538 --> 00:44:26,500 ప్రతీ అవకాశాన్ని వదులుకోవడానికి జనాలు పునర్జన్మను సాకుగా వాడుకుంటారు. 426 00:44:26,583 --> 00:44:31,880 కానీ నువ్వు అలా చేస్తే, నువ్వు ఎలా ఎదగగలవు? 427 00:44:31,963 --> 00:44:33,423 ఇది నా ఎదుగుదల గురించి కాదు. 428 00:44:33,507 --> 00:44:38,220 మీరు ఆయన్ని సపోర్ట్ చేయకపోతే, ఇంకో మార్గాన్ని మీరు వెతుక్కోవచ్చు. 429 00:44:38,303 --> 00:44:39,429 అది సాధ్యం కాదు. 430 00:44:39,513 --> 00:44:41,181 ఎందుకు సాధ్యం కాదు? మీరేమీ బంధీ కాదు కదా. 431 00:44:41,264 --> 00:44:42,974 మీకు అర్థం కావడం లేదు. నాకు మరో దారి లేదు. 432 00:44:43,058 --> 00:44:45,894 ప్రతీఒక్కరికీ దారి ఉంటుంది. లేదు అని అనిపించినా కూడా. 433 00:44:45,977 --> 00:44:49,439 మీకు నమ్మకశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ ప్రమాణపూర్తిగా నాకు మరో దారి లేదు. 434 00:44:49,523 --> 00:44:50,690 అది ఎలా సాధ్యమవుతుంది? 435 00:44:58,073 --> 00:45:01,243 ఒకప్పుడు స్పైరల్ దాకా నడిచివెళ్లి వచ్చారని కూడా మీరు అన్నారు కదా. 436 00:45:02,619 --> 00:45:03,620 ఎప్పుడు అది? 437 00:45:08,750 --> 00:45:10,502 పదకొండు వేల ఏళ్ళ క్రితం. 438 00:45:17,050 --> 00:45:19,135 అయితే అది నిజమేనా? 439 00:45:20,762 --> 00:45:26,059 గెలాక్సీలోని అత్యంత తెలివైన రోబోట్లలో ఆఖరిది క్లియాన్ వద్ద ఉందని విన్నాను. 440 00:45:28,061 --> 00:45:30,438 మీరు ఎన్నో చూసుంటారు... 441 00:45:30,522 --> 00:45:33,942 కానీ ఇప్పుడు మీరు అతని పక్కన ఉండి, అతను చెప్పిందల్లా... 442 00:45:42,826 --> 00:45:44,202 అతనే మిమ్మల్ని ఇక్కడికి పంపాడు. 443 00:45:50,167 --> 00:45:54,004 అయితే, నన్ను చంపమనే ఆయన మిమ్మల్ని పంపాడు కదా? 444 00:45:55,839 --> 00:45:58,175 అందుకే మీరు నాకు నిజం చెప్పారు. 445 00:46:06,183 --> 00:46:11,521 మహారాజులాగా, నాకు కూడా ఫలానా వ్యక్తిత్వం అనేది లేదు. 446 00:46:13,440 --> 00:46:16,359 అందుకని నాకు కూడా మనస్సు లాంటిదేమీ ఉండకూడదు. 447 00:46:17,819 --> 00:46:22,032 ఒకవేళ ఉండుంటే, ఆయన ఆదేశాలను ధిక్కరించి ఉండేదాన్నేమో. 448 00:46:26,286 --> 00:46:28,455 నీకు మనస్సు లేదని నువ్వు నిజంగానే అనుకుంటున్నావా? 449 00:46:30,207 --> 00:46:35,003 ఇప్పుడు మీరు నా నుండి పారిపోతే, ఎంత కావాలనుకున్నా నన్ను నేను ఆపుకోలేను. 450 00:46:36,046 --> 00:46:39,674 నేను మిమ్మల్ని వేటాడతాను. వధించి తీరుతాను. 451 00:46:48,850 --> 00:46:50,060 నన్ను క్షమించండి. 452 00:46:53,772 --> 00:46:58,568 మీ హృదయంలో నాకు నిజమైన కనికరం కనబడుతోంది. 453 00:46:59,152 --> 00:47:04,282 నిజమైన బాధ. నేను సరిగ్గా వివరించలేను కానీ, 454 00:47:05,450 --> 00:47:08,495 మీకు మనస్సు ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. 455 00:47:10,038 --> 00:47:12,791 కానీ ఎవరైతే బలవంతంగా నీ చేత ఇవన్నీ చేయిస్తున్నారో, 456 00:47:13,625 --> 00:47:17,462 ఎవారైతే క్రూరంగా నీ నమ్మకాన్ని, విధేయతను పరీక్షిస్తున్నారో, 457 00:47:18,672 --> 00:47:20,340 ఆయనకు మనస్సు లేదు. 458 00:47:25,095 --> 00:47:26,471 నేను నిన్ను క్షమించేస్తున్నా, డెమెర్జల్. 459 00:47:28,723 --> 00:47:31,643 హేయ్, నీ ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకో. 460 00:47:34,479 --> 00:47:37,274 నాకు ఇది అంతం కాదు. 461 00:47:38,316 --> 00:47:39,985 నేను మళ్లీ పుడతాను. 462 00:47:40,569 --> 00:47:44,573 నిన్ను నా వద్దకు మదరే పంపింది, క్లియాన్ కాదు. 463 00:47:46,366 --> 00:47:47,826 నువ్వు చేయాల్సింది చేసేయ్. 464 00:47:50,537 --> 00:47:51,621 తన అభీష్టం ప్రకారం. 465 00:47:52,247 --> 00:47:53,582 తన అభీష్టం ప్రకారం. 466 00:48:02,549 --> 00:48:06,303 ఇప్పుడు, ఎలా చంపుతావు? 467 00:48:06,386 --> 00:48:08,180 ఇప్పటికే ఆ పని జరిగిపోయింది. 468 00:48:10,724 --> 00:48:13,643 మన చర్మం పరస్పరం తాకినప్పుడు విషం మీకు అంటింది. 469 00:48:14,352 --> 00:48:15,604 మీకు ఏ బాధా ఉండదు. 470 00:48:38,752 --> 00:48:42,297 హెచ్చరిక. ప్రయాణానికి అయిదు నిమిషాలు ఉంది. 471 00:48:42,380 --> 00:48:43,673 ప్రయాణానికి సిద్ధం కండి. 472 00:48:43,757 --> 00:48:45,258 నౌక జంప్ కోసం సిద్ధమవుతోంది! 473 00:48:45,884 --> 00:48:48,887 ఈ లాక్ ని నేను తెరవలేకపోతున్నాను. 474 00:48:48,970 --> 00:48:50,555 ఏదోకటి చేసి నన్ను అవతలి వైపుకు పోనివ్వు. 475 00:49:08,907 --> 00:49:10,200 సరే మరి, నన్ను కనెక్ట్ చేయండి. 476 00:49:10,283 --> 00:49:12,410 చూడు, శాల్వార్, ఇది అస్సలు సాధ్యమవుతుందో లేదో కూడా నాకు తెలీదు. 477 00:49:12,494 --> 00:49:15,539 ఒక గ్రహ కక్ష్యలోకి జంప్ చేయాలంటే చాలా ఖచ్చితత్వం అవసరమవుతుంది. 478 00:49:15,622 --> 00:49:16,790 అదృష్టం కూడా కావాలేమో. 479 00:49:17,833 --> 00:49:19,376 నువ్వు నాతో మాట్లాడుతున్నావని మర్చిపోకు. 480 00:49:21,294 --> 00:49:24,589 ఇది కూడా నాణాన్ని కొన్నిసార్లు తిప్పడం లాంటిదే కదా? 481 00:49:26,299 --> 00:49:28,468 కొన్నిసార్లు కాకుండా కొన్ని వేలసార్లు తిప్పడమేమో. 482 00:49:33,515 --> 00:49:34,558 తిప్పడం మొదలుపెడదాం మరి. 483 00:49:34,641 --> 00:49:37,394 -నిన్ను చంపమని చెప్తున్నావు నాకు. -లూయిస్, నీకు అర్థం కావట్లేదా? 484 00:49:38,687 --> 00:49:40,230 నేను చేయాల్సిన పని ఇదే. 485 00:49:41,648 --> 00:49:44,860 ఇప్పటిదాకా జరిగింది, నన్ను ఇక్కడికి చేర్చింది. 486 00:49:47,320 --> 00:49:49,072 ఇది తప్ప మనకు మరో మార్గమే లేదు. 487 00:49:49,155 --> 00:49:51,074 కనుక నేను తప్పనిసరిగా ప్రయత్నించాలి. 488 00:49:51,825 --> 00:49:53,660 మనం ప్రయత్నించాలి. 489 00:49:53,743 --> 00:49:55,996 సంక్షోభంలో మనం చేయగలిగిందే అది. 490 00:49:57,622 --> 00:49:58,623 ప్రయత్నించడం. 491 00:50:16,141 --> 00:50:18,393 నేను చనిపోతే, దీన్ని మా అమ్మకు ఇవ్వు, సరేనా? 492 00:50:23,231 --> 00:50:24,482 నీలో ఏదో ఉంది, శాల్వార్. 493 00:50:26,443 --> 00:50:27,986 ఆ విషయాన్ని నేను ముందే గమనించి ఉంటే బాగుండు. 494 00:50:28,778 --> 00:50:29,946 ఇక మొదలుపెట్టు. 495 00:50:31,781 --> 00:50:32,824 చేయ్. 496 00:50:36,786 --> 00:50:37,871 లూయిస్? 497 00:50:44,085 --> 00:50:45,003 తనని చంపేయ్! 498 00:50:45,086 --> 00:50:47,547 నీకు ఏమీ కాదు, సరేనా? నిబ్బరంగా ఉండు, లూయిస్. 499 00:50:48,131 --> 00:50:49,716 ఆ దరిద్రపుగొట్టుదాన్ని చంపేయ్! 500 00:50:49,799 --> 00:50:50,634 నిబ్బరంగా ఉండు. 501 00:50:50,717 --> 00:50:51,635 తనకు అటు వైపు వెళ్లు! 502 00:50:56,973 --> 00:50:58,934 శత్రు నౌకలు గుర్తించబడ్డాయి. 503 00:50:59,017 --> 00:51:00,810 ఆటోమేటిక్ గా రక్షణా వ్యవస్థలు ప్రారంభమయ్యాయి. 504 00:51:03,647 --> 00:51:04,648 తెస్పిన్ లాన్సర్లు. 505 00:51:04,731 --> 00:51:06,024 నువ్వు సాధించావు, హ్యూగో. 506 00:51:06,107 --> 00:51:08,318 ప్రయాణానికి ముప్పై సెకన్లు ఉంది. 507 00:51:08,401 --> 00:51:10,320 వెంటనే సైరోపాడ్లకు వెళ్లండి. 508 00:51:11,154 --> 00:51:13,490 ఇక మీ దాడిని ఆపండి, అనాక్రియాన్లారా. 509 00:51:13,573 --> 00:51:16,826 తక్షణమే నౌకను మాకు అప్పగించండి లేదా మీ చావు ఖాయం. 510 00:51:17,744 --> 00:51:19,829 వాళ్ల మీదకి ఎన్ని తుపాకులను కుదిరితే అన్ని ప్రయోగించు. 511 00:51:27,546 --> 00:51:28,421 పదిహేను... 512 00:51:29,130 --> 00:51:32,133 పద్నాలుగు, పదమూడు... 513 00:51:36,555 --> 00:51:37,931 పదకొండు... 514 00:51:40,183 --> 00:51:42,185 పది, తొమ్మిది... 515 00:51:43,061 --> 00:51:44,437 ఎనిమిది... 516 00:51:47,482 --> 00:51:49,693 ఆరు, అయిదు... 517 00:51:51,820 --> 00:51:53,113 నాలుగు... 518 00:51:54,155 --> 00:51:56,700 మూడు, రెండు... 519 00:51:57,993 --> 00:51:59,411 ఒకటి... 520 00:52:03,790 --> 00:52:04,791 మనం జంప్ చేస్తున్నాం. 521 00:52:32,194 --> 00:52:33,195 పని ఏమైంది? 522 00:52:33,987 --> 00:52:34,988 సఫలమైంది. 523 00:52:35,906 --> 00:52:38,325 తనది సహజ మరణంలానే అనిపిస్తుంది. 524 00:52:38,408 --> 00:52:41,536 మంచిది. ఎంతైనా మతపరమైన యుద్ధం జరిగితే, అది మనకే మంచిది కాదు. 525 00:52:46,208 --> 00:52:48,335 నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? 526 00:52:48,418 --> 00:52:51,421 మీరు ఆమెపై విజయం సాధించేశారు కదా. గెలిచింది మీరే కదా. 527 00:52:51,505 --> 00:52:55,842 నీకు అర్థం కాకపోయినంత మాత్రాన నేను నీకు వివరణ ఇవ్వాల్సిన పని లేదు. 528 00:52:55,926 --> 00:52:57,302 అక్కర్లేదులెండి. 529 00:52:57,385 --> 00:52:59,012 మీరు మహారాజు. 530 00:53:00,222 --> 00:53:01,681 మీరు పవిత్రమైన దృశ్యాన్ని చూశారు. 531 00:53:01,765 --> 00:53:03,391 అవును. 532 00:53:08,605 --> 00:53:12,275 నా వానిటీ క్యాబినెట్ పై ప్రాచీన బర్త్ రూట్ కుసుమం బొమ్మని ముద్రించుకున్నా. 533 00:53:12,859 --> 00:53:15,820 నేను స్పైరల్ వద్దకు వెళ్లినప్పుడు అక్కడి నుండి తెచ్చుకున్నాను. 534 00:53:15,904 --> 00:53:17,614 ఇక్కడికి వచ్చేటప్పుడు దాన్ని కూడా తెచ్చుకున్నా. 535 00:53:18,281 --> 00:53:19,491 అవునా? 536 00:53:20,325 --> 00:53:24,371 ఆ రాత్రి మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు అది చూశారేమో అనుకున్నాను. 537 00:53:24,454 --> 00:53:26,957 లేదు, నాకు తెలిసి నేనేం చూడలేదు. 538 00:53:27,040 --> 00:53:28,959 అది కాకతాళీయమైన మంచి కాకతాళీయమే అయినట్టుంది. 539 00:53:29,042 --> 00:53:30,919 అదే మీరు కూడా అదే పువ్వును చూడటం. 540 00:53:32,128 --> 00:53:36,299 ఏదేమైనా, నేనేం మీ విషయాల్లోకు దూరాలనుకోవడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కోటి కనిపిస్తాయి. 541 00:53:36,383 --> 00:53:39,636 నేను దాన్ని చూసి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా కూడా... 542 00:53:41,221 --> 00:53:43,098 అది నా దృష్టికోణన్నే మార్చేసింది. 543 00:53:44,224 --> 00:53:47,102 రోబోట్ అయిన నీకు కూడా ఒక దృశ్యం కనబడిందా? 544 00:53:47,185 --> 00:53:51,439 కనిపించింది. మీకు కూడా కనిపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 545 00:53:53,275 --> 00:53:54,609 ఏదీ కనబడకపోవడం... 546 00:53:57,445 --> 00:53:59,948 ఆ శూన్యత ఎవరిలోనూ ఉండకూడదు. 547 00:54:03,618 --> 00:54:05,120 మన ట్రాంటార్ కి తిరుగు ప్రయాణ సమయంలో 548 00:54:05,203 --> 00:54:07,873 మీరు తిలకించిన దృశ్యం మీకు తగినంత శక్తి ఇస్తుందని కోరుకుంటున్నా, మహారాజా. 549 00:54:08,456 --> 00:54:11,960 ప్రయాణం కోసం మిమ్మల్ని సిద్ధం చేయవలసిందిగా స్పేసర్స్ కి చెప్తాను. 550 00:55:24,115 --> 00:55:27,077 ఏదీ కనబడకపోవడం... 551 00:55:28,161 --> 00:55:31,623 ఆ శూన్యత ఎవరిలోనూ ఉండకూడదు. 552 00:56:51,661 --> 00:56:53,663 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య