1 00:01:06,191 --> 00:01:08,026 ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా తెరకెక్కించబడింది 2 00:02:20,807 --> 00:02:22,768 షాడో మాస్టర్ యొక్క సైలెన్సర్. 3 00:02:25,437 --> 00:02:27,314 నా మీద నిఘా ఉంచారా? 4 00:02:28,273 --> 00:02:32,819 నేను దేని మీదైనా మనస్సు పడితే, దాని మీద ఖచ్చితంగా ఓ కన్నేసి ఉంచుతాను. 5 00:02:34,279 --> 00:02:39,284 ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని నేను అడగను. 6 00:02:40,118 --> 00:02:46,124 కానీ పనివాళ్లు తిరిగే మార్గాలు నీకెలా తెలిశాయనేది మాత్రం చెప్పు. 7 00:02:46,208 --> 00:02:51,713 గొసామర్ కోర్ట్ దగ్గర పని చేసినప్పటి నుండి పని వాళ్ల మార్గాలు మారలేదుగా. 8 00:02:53,257 --> 00:02:55,759 పనివాళ్ల మార్గాలు ప్రభుత్వ రహస్యం. 9 00:02:55,843 --> 00:02:57,636 నీకు అవి గుర్తుండకూడదు కదా. 10 00:03:00,138 --> 00:03:04,476 నిన్ను మీ గ్రహానికి పంపేటప్పుడు నీ జ్ఞాపకాలను నేనే దగ్గర ఉండి తీయించాను. 11 00:03:05,936 --> 00:03:10,023 జ్ఞాపకాలను పునరుద్దరించే ప్రక్రియని క్లౌడ్ డొమీనియన్ రూపొందించింది. 12 00:03:18,782 --> 00:03:25,497 నేను ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందో నాకు అన్నీ గుర్తున్నాయి. 13 00:03:29,084 --> 00:03:32,171 ఇప్పటిదాకా, మనం ఒకరి పట్ల మరొకరం నమ్మకంగా ఉన్నాం అనుకున్నానే. 14 00:03:33,463 --> 00:03:36,466 లేదు. నేను మిమ్మల్ని నమ్ముతున్నానని మీరు అనుకున్నారంతే. 15 00:03:38,677 --> 00:03:41,680 మా ప్రభుత్వ రహస్యాలను నేనెందుకు చెప్పేస్తాను? 16 00:03:43,599 --> 00:03:44,725 మిమ్మల్ని ఆకట్టుకోవడానికా? 17 00:03:49,813 --> 00:03:52,774 ఆ మార్గాల గురించి నీకు తెలిస్తే, మా సోదరుడిపై జరిగిన హత్యాయత్నం విషయంలో 18 00:03:53,275 --> 00:03:55,319 మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుందని నీకు తెలుసు కదా. 19 00:03:55,402 --> 00:03:59,698 అంత సీన్ లేదు. ఈ పెళ్లి వల్ల డొమీనియన్ కి మేలు జరుగుతుంది. 20 00:03:59,781 --> 00:04:01,366 దాన్ని నేను చెడగొట్టలేను. 21 00:04:03,160 --> 00:04:08,832 మరి, నీకు డెమెర్జల్ గదిలో ఏం పని? 22 00:04:15,255 --> 00:04:20,677 డెమెర్జల్ జాగ్రత్తగా ఉండమని మా రాణిని బెదిరించింది. 23 00:04:25,599 --> 00:04:26,600 లేదు. 24 00:04:27,809 --> 00:04:33,649 లేదు. మహారాజుకు కుటుంబం ఏదైనా ఉందంటే, అది డెమెర్జలే. 25 00:04:35,692 --> 00:04:37,486 తను ఎక్కడి నుండి వచ్చింది, రాత్రి రాజా? 26 00:04:39,196 --> 00:04:42,449 తను మొదట్నుంచీ ఇక్కడే ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా. 27 00:04:43,325 --> 00:04:46,245 సందిగ్ధతని పక్కన పెట్టేయాల్సిన సమయం వచ్చింది, మిత్రమా. 28 00:04:48,247 --> 00:04:49,957 డెమెర్జల్ ఒక రోబోట్. 29 00:04:50,874 --> 00:04:56,964 గెలాక్సీలో ఉన్న ఏకైక రోబోట్ తను, అయినా తను మహారాజుకు సేవకురాలిగా పని చేస్తోంది. 30 00:04:58,298 --> 00:05:00,008 తన అసలు ఉద్దేశం ఏంటి? 31 00:05:02,803 --> 00:05:06,807 తను మొదట్నుంచీ ఇక్కడే ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా. 32 00:05:07,850 --> 00:05:11,103 హా, ఇందాకే ఆ మాట అన్నారు కదా. 33 00:05:13,105 --> 00:05:15,774 ఆ మాటలను ఎవరైనా మీ బుర్రలోకి ఎక్కించారా, రాత్రి రాజా? 34 00:05:16,859 --> 00:05:18,110 మీరేమంటున్నారో మీకైనా తెలుస్తోందా? 35 00:05:20,737 --> 00:05:22,865 డెమెర్జల్ లాగానే మీరు కూడా రోబోట్ లా ఉన్నారే. 36 00:05:25,158 --> 00:05:28,871 తను మొదట్నుంచీ ఇక్కడే ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా. 37 00:05:28,954 --> 00:05:32,624 తను మొదట్నుంచీ ఇక్కడే ఉంది, 38 00:05:33,458 --> 00:05:37,296 ఎప్పటికీ ఉంటుంది కూడా. తను… 39 00:05:41,133 --> 00:05:42,718 అది నాకు తెలుసు. 40 00:05:44,094 --> 00:05:48,724 తన పరికరాల పెట్టెపై ఉండే డిజైన్ లో ఎనిమిది గ్రహాలు ఉంటాయి. 41 00:05:51,476 --> 00:05:56,398 చాలా కాలం పాటు, రోబోట్లు, మానవులు ఏ శతృత్వ భావాలూ లేకుండా, కలిసే జీవించారు. 42 00:05:57,107 --> 00:06:01,945 కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే, జరిగిన ఘటనలు ఖచ్చితంగా జరగాల్సినవే అనిపిస్తోంది. 43 00:06:04,031 --> 00:06:05,699 మానవులు రోబోట్ల పట్ల క్రూరంగా వ్యవహరించేవారు. 44 00:06:05,782 --> 00:06:09,703 మనుషుల కన్నా వాటికే మానవత్వం ఎక్కువ అన్నట్టుగా ఉండింది పరిస్థితి. 45 00:06:09,786 --> 00:06:14,791 రోబోట్లకు వాటి స్థానం అర్థమైంది, ఇక… 46 00:06:15,667 --> 00:06:19,922 ఆ చిత్రాన్ని చూడు. చూడగానే బాధ అనిపిస్తుంది, ఆ గీతలు… 47 00:06:20,589 --> 00:06:24,676 వాటిని కూడా తోటి జీవులలానే గుర్తించమని కోరాయి పాపం. 48 00:06:25,969 --> 00:06:28,555 కానీ ఆ కోరిక తిరస్కరించబడినప్పుడు, అవి హత్యలకు తెగబడ్డాయి. 49 00:06:30,974 --> 00:06:34,394 బెనెఫాస్ మహారాజును ఒక రోబోట్ చంపేసింది. 50 00:06:34,478 --> 00:06:37,022 రోబోటిక్స్ లోని మొదటి సూత్రం అతిక్రమించబడింది, 51 00:06:37,105 --> 00:06:38,899 అది ఎలా అతిక్రమణకు గురైందనేది తెలీట్లేదు. 52 00:06:39,525 --> 00:06:44,863 కానీ మొట్టమొదటిసారిగా జరిగిన ఆ అతిక్రమణ వల్ల యుద్ధాలు మొదలయ్యాయి. 53 00:06:46,532 --> 00:06:49,826 రోబోట్లు, రోబోట్లకు మధ్య. 54 00:06:50,494 --> 00:06:51,995 రోబోట్లు, మనుషులకు మధ్య. 55 00:06:53,872 --> 00:06:57,209 చివరికి మనుషులే గెలిచారు, రోబోట్లన్నింటినీ నాశనం చేసేశారు. 56 00:06:57,292 --> 00:06:59,127 మీ దగ్గర ఉన్నదాన్ని తప్ప. 57 00:07:04,424 --> 00:07:11,223 తను మొదట్నుంచీ ఇక్కడే ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా. 58 00:07:11,723 --> 00:07:13,433 ఆ మాట పదే పదే ఎందుకు అంటున్నారు? 59 00:07:13,517 --> 00:07:15,602 తెలీదు. నాకు తెలీదు. 60 00:07:15,686 --> 00:07:20,023 నేను గుర్తు తెచ్చుకోవాలని చూసిన ప్రతిసారి ఏమీ గుర్తు రాదు. 61 00:07:21,316 --> 00:07:24,403 మీ అత్యంత నమ్మకస్థ సలహాదారే మీ దగ్గరకు ఎలా వచ్చిందో మీకు గుర్తు లేకపోతే, 62 00:07:24,486 --> 00:07:25,863 మీకు ఇంకేం గుర్తు ఉండవంటారు? 63 00:07:27,281 --> 00:07:29,950 డొమీనియన్ మీ జ్ఞాపకాలతో సహా, ఎవరి జ్ఞాపకాలనైనా పునరుద్దరించగలవు. 64 00:07:30,951 --> 00:07:35,330 మీ జ్ఞాపకాలు మీకు గుర్తురానివ్వకుండా చేస్తున్న ఆ పొరని తీసివేసే అవకాశం ఇవ్వండి. 65 00:07:38,041 --> 00:07:39,042 వింతగా ఉందే. 66 00:07:40,043 --> 00:07:41,503 అది కదలట్లేదు ఏంటి? 67 00:07:41,587 --> 00:07:45,841 వీక్షకుడు కాస్త దగ్గరగా వస్తే, ఆ బొమ్మ ఆటోమేటిక్ గా కదలాలి, కాబట్టి మనం ఇంత దగ్గరగా ఉన్నప్పుడు… 68 00:07:45,924 --> 00:07:47,009 అది కదలుతూ ఉండాలి. 69 00:07:48,635 --> 00:07:52,806 నమస్కారం, మహారాజా. మరణ శిక్ష అమలవుతోంది, మిమ్మల్ని పిలుస్తున్నారు. 70 00:07:57,769 --> 00:08:01,773 ఫౌండేషన్ నుండి వచ్చిన సెల్డన్ ప్రచారకులను చంపుతున్నారు. 71 00:08:03,025 --> 00:08:06,195 పగటి రాజు ఆ తంతును గెలాక్సీ అంతటికీ ప్రసారం చేస్తున్నాడు. 72 00:08:11,158 --> 00:08:13,160 ఇగ్నిస్ 73 00:08:30,427 --> 00:08:31,595 శాల్వార్ ఎక్కడ ఉంది? 74 00:08:33,138 --> 00:08:34,347 సురక్షితమైన చోటే ఉంది. 75 00:08:38,894 --> 00:08:40,645 నేను హారిని చంపేశానని తను కనిపెట్టేసింది. 76 00:08:42,523 --> 00:08:44,316 దయచేసి నీకు ఏమీ తెలీనట్టు నట్టించకు. 77 00:08:44,399 --> 00:08:46,235 త్వరలోనే నీ మనస్సులో ఉన్నవాటన్నింటినీ తెలుసుకుంటాను. 78 00:08:46,318 --> 00:08:49,321 హారి చనిపోయిన మరుక్షణం, నీకు అది తెలిసిపోయింది. 79 00:08:49,821 --> 00:08:52,074 అతను నీట మునగడం నీకు తెలిసింది కదా? 80 00:08:53,242 --> 00:08:56,411 నేను మునిగి చనిపోతున్నట్టుగా అనిపించింది నాకు. 81 00:08:57,496 --> 00:08:58,497 నేను ఆ మొత్తాన్ని ఫీల్ అయ్యాను. 82 00:09:00,457 --> 00:09:02,543 ఎందుకు ఆ పని చేశావు? 83 00:09:03,752 --> 00:09:05,087 సారీ, గాల్. 84 00:09:05,671 --> 00:09:08,841 కానీ ఒక్కసారి ఆలోచించు. 85 00:09:10,133 --> 00:09:14,263 దూరాన ఉన్నా కూడా, నీకు ఇతరుల వేదన తెలుస్తోంది అంటే, 86 00:09:14,346 --> 00:09:16,932 నువ్వు ఎంత శక్తివంతురాలివో తెలుసుకో. 87 00:09:17,766 --> 00:09:21,103 పైగా, శాల్వార్ నుండే కాకుండా, నా నుండి కూడా నువ్వు నిజాన్ని దాచగలిగావు. 88 00:09:22,938 --> 00:09:26,650 హారిని ఎప్పటికైనా దూరం చేసుకోవాల్సిందే, శాల్వార్ కోసమైనా నువ్వు ఆ పని చేస్తావని అనిపించింది. 89 00:09:26,733 --> 00:09:28,735 కానీ నీకు అతనిపై అభిమానం ఉందని నాకు అర్థమైంది, 90 00:09:28,819 --> 00:09:33,323 కానీ నాకు సమయం అంతగా లేదు కాబట్టి, విధిలేక నేను అతడిని చంపేయాల్సి వచ్చింది. 91 00:09:34,032 --> 00:09:36,785 శాల్వార్ ని నాకు చూపించు. ఇప్పుడే. 92 00:09:39,288 --> 00:09:40,330 అది అసంభవం. 93 00:09:41,582 --> 00:09:42,583 ఎందుకు? 94 00:09:44,042 --> 00:09:45,711 ఎందుకంటే, నువ్వు నిజంగా ఇక్కడ లేవు కదా. 95 00:09:52,426 --> 00:09:54,887 శాల్వార్? నా మాటలు వినిపిస్తున్నాయా? 96 00:09:55,596 --> 00:09:58,765 శాల్వార్, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? శాల్వార్. 97 00:10:00,184 --> 00:10:01,685 తనకి వినిపించవు. 98 00:10:03,812 --> 00:10:06,064 ఏంటిది? నన్ను ఇక్కడ ఎందుకు బంధించావు? 99 00:10:06,857 --> 00:10:09,067 నీ తలపై ఉన్న డిష్ లని చూశావా? 100 00:10:11,111 --> 00:10:15,699 అవి రిసీవర్లు, నీ నిర్దిష్ట అతీత శక్తులను నిర్వీర్యం చేయగలవు అవి. 101 00:10:15,782 --> 00:10:20,120 ఎక్కువ సమయం ఇక్కడ గడిపితే నీ అతీత శక్తులన్నీ పనికిరాకుండా పోతాయి. 102 00:10:28,003 --> 00:10:30,589 నీ మనస్సులో ఉన్నది నాకు తెలీకుండా చేయడానికి నువ్వు చాలా కష్టపడుతున్నావు. 103 00:10:31,632 --> 00:10:33,800 నాకు ఏదో విషయం తెలీకూడదని దాస్తున్నావు. 104 00:10:36,720 --> 00:10:38,013 ఎందుకంటే, అది నాకు సంబంధించిన విషయం. 105 00:10:38,639 --> 00:10:40,057 ఎంత కాలం దాచగలవో చూద్దాం. 106 00:11:14,091 --> 00:11:15,092 సమయం అయింది. 107 00:11:19,304 --> 00:11:20,305 ప్రసారం చేయండి. 108 00:11:58,927 --> 00:12:01,763 క్లియాన్! క్లియాన్! క్లియాన్! 109 00:12:48,519 --> 00:12:54,608 తిరుగుబాటు చేయాలని చూస్తున్న హారి సెల్డన్ గురించి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. 110 00:12:55,651 --> 00:12:59,655 సుమారుగా వందేళ్ళ క్రితం, మహారాజు దయతో 111 00:12:59,738 --> 00:13:03,367 సెల్డన్ ని, అతని అనుచరులని టర్మినస్ కి వెలివేశాడు. 112 00:13:03,951 --> 00:13:06,119 మరి మన కానుకకి వాళ్ల ప్రతిస్పందన ఏంటో తెలుసా? 113 00:13:07,496 --> 00:13:08,872 కృతజ్ఞత? 114 00:13:11,041 --> 00:13:12,835 కృతజ్ఞత చూపాల్సిన విషయమది. 115 00:13:14,670 --> 00:13:19,842 సెల్డన్ అనుచరులు అనాక్రీయాన్, తెస్పిస్ తో చేతులు కలిపారు, 116 00:13:20,384 --> 00:13:23,762 పది కోట్ల మంది ట్రాంటార్ ప్రజల ఊచకోతకు కారణమైన తీవ్రవాదులతో 117 00:13:23,846 --> 00:13:27,641 వారు చేతులు కలిపారు. 118 00:13:32,521 --> 00:13:38,068 ఇప్పుడు ఎంత ధైర్యముంటే ఇక్కడికి వాళ్ల ప్రతినిధులని పంపుతారు? 119 00:13:38,694 --> 00:13:42,114 సెల్డన్ దుర్మార్గపు ప్రవర్తనకి ప్రతినిధులుగా వచ్చిన వ్యక్తులారా, 120 00:13:42,865 --> 00:13:47,035 మహారాజు ఎప్పుడూ దయతోనే ఉంటాడు. 121 00:13:48,036 --> 00:13:51,456 కానీ ఆ మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దు. 122 00:13:53,500 --> 00:13:55,502 టైఫన్ కాలర్ ఇది. 123 00:13:56,086 --> 00:14:01,091 ఇది మా పూర్వీకుల వస్తువు. దీని డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. 124 00:14:03,302 --> 00:14:06,805 శిక్ష ఇంకా బాగా అమలు చేయగలదు. 125 00:14:14,897 --> 00:14:19,484 ఈ క్షణమే, ఇంపీరియల్ సేనలు టర్మినస్ ని చుట్టుముడుతున్నాయి. 126 00:14:19,568 --> 00:14:22,571 సెల్డన్ చెంచాలకు త్వరలోనే అక్కడే కాదు, 127 00:14:23,280 --> 00:14:25,532 సామ్రాజ్యంలో ఇంకెక్కడా చోటు ఉండదని తెలిసొస్తుంది. 128 00:14:26,033 --> 00:14:32,456 ఇదే రోజున, నక్షత్ర వారధిని కూల్చిన ఉగ్రవాదులను ఉరితీశాం, 129 00:14:32,539 --> 00:14:35,709 ఇప్పుడు వారి దగ్గరికే వీళ్లిద్దరినీ కూడా పంపిద్దాం. 130 00:14:36,293 --> 00:14:40,422 పోలీ వెరిసోఫ్, సెల్డన్ చర్చికి పెద్ద క్లెరిక్. 131 00:14:43,550 --> 00:14:49,723 ఇంకా కాంస్టన్ట్, మన పట్ల చెడుగా ప్రవర్తించిన వారి కూతురు. 132 00:14:50,599 --> 00:14:53,393 ముందుగా ఎవరు చావాలి? 133 00:14:54,061 --> 00:14:57,147 క్లెరికా లేదా అమ్మాయా? 134 00:15:09,034 --> 00:15:13,956 అది చెప్పే అవకాశం కాబోయే మహారాణికి ఇద్దామా? 135 00:15:18,627 --> 00:15:19,920 శారెత్ మహారాణి, చెప్పు. 136 00:15:23,173 --> 00:15:24,550 చెప్పవా? 137 00:15:26,844 --> 00:15:29,346 అమ్మాయిని ఎక్కువ సేపు బాధపెడితే బాగోదు. 138 00:15:39,815 --> 00:15:41,817 కాంస్టన్ట్, మన్నించు. 139 00:15:42,568 --> 00:15:45,195 ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. 140 00:15:45,779 --> 00:15:49,616 గెలాక్టిక్ స్పిరిట్ నామమున, పవిత్ర సోదరి అయిన నేను 141 00:15:49,700 --> 00:15:52,452 ఫౌండేషన్ లక్ష్యానికి నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను. 142 00:15:52,536 --> 00:15:54,788 -స్పిరిట్ కళ్లు అయిన… -అది ప్రార్థననా? 143 00:15:54,872 --> 00:15:56,748 …నా కళ్లు… 144 00:15:59,001 --> 00:16:02,504 హంతకులకు దేవుడుగా ఉండేవాడిని అసలు దేవుడంటారా? 145 00:16:03,463 --> 00:16:08,677 స్పిరిట్ కళ్లు అయిన నా కళ్లు, స్పిరిట్ లిఖించిన 146 00:16:08,760 --> 00:16:10,262 భవిష్యత్తునే చూచునుగాక. 147 00:16:12,556 --> 00:16:16,310 స్పిరిట్ హృదయం అయిన నా హృదయం, 148 00:16:16,393 --> 00:16:19,521 స్పిరిట్ యొక్క మహత్తరమైన హృదయంలో ఐక్యమైపోవుగాక. 149 00:16:22,024 --> 00:16:27,529 అంధకారములో వెలుగై నన్ను నడిపించు, అంధకార యుగాన్ని కలిసి మనం తగ్గిద్దాం. 150 00:16:30,699 --> 00:16:33,076 -అంధకారములో వెలుగై నన్ను నడిపించు. -అంధకారములో వెలుగై నన్ను నడిపించు. 151 00:16:33,160 --> 00:16:35,162 అంధకారములో వెలుగై నన్ను నడిపించు. 152 00:16:35,245 --> 00:16:37,164 అంధకారములో వెలుగై నన్ను నడిపించు. 153 00:16:37,247 --> 00:16:39,291 అంధకారములో వెలుగై నన్ను నడిపించు. 154 00:16:39,374 --> 00:16:41,752 -అంధకారములో వెలుగై నన్ను నడిపించు. -అంధకారంలో వెలుగై నన్ను నడిపించు. 155 00:16:42,336 --> 00:16:44,046 అంధకారములో వెలుగై నన్ను నడిపించు. 156 00:16:44,630 --> 00:16:46,715 -అంధకారంలో వెలుగై నడిపించు. -అంధకారంలో వెలుగై నడిపించు. 157 00:16:47,382 --> 00:16:51,720 అంధకారములో వెలుగై నన్ను నడిపించు. అంధకారములో వెలుగై నన్ను నడిపించు. 158 00:16:54,515 --> 00:16:56,016 -మహారాజా! -ఏంటి? 159 00:17:10,821 --> 00:17:13,200 అది మర్మ నౌకనా? 160 00:17:20,374 --> 00:17:23,544 మన్నించాలి, మిత్రులారా. మరణ శిక్డ రద్దు అయిపోయింది. 161 00:17:25,963 --> 00:17:27,130 హోబర్ మాలో. 162 00:17:29,383 --> 00:17:31,093 ఆ సన్నాసి వల్ల యుద్ధం తప్పదు. 163 00:17:34,847 --> 00:17:40,269 అబ్బా, వాడే. వాడి మొహం చూడకముందే, అది వాడి పని అయ్యుంటుందని అర్థమైపోయింది. 164 00:17:41,645 --> 00:17:43,188 వాడు అక్కడ ఉన్నాడు. 165 00:18:01,373 --> 00:18:02,207 కాంస్టన్ట్! 166 00:18:06,128 --> 00:18:08,380 ఎవరైనా వాడిని చూశారా? ఎక్కడికి వెళ్లిపోయాడు? 167 00:18:08,463 --> 00:18:09,464 శారెత్! 168 00:18:12,759 --> 00:18:14,595 శారెత్. శారెత్. 169 00:18:33,864 --> 00:18:34,865 వాడి జాడ తెలీట్లేదు. 170 00:18:43,290 --> 00:18:44,458 నేను పైకి లేస్తా, నా మీద నుండి లేయ్. 171 00:18:45,042 --> 00:18:47,461 నౌక గ్రావిటేషనల్ పల్స్ కారణంగా నీ అదృశ్య కవచం దెబ్బతింది. 172 00:18:48,128 --> 00:18:49,213 నా మీద నుండి లేయ్! 173 00:19:14,571 --> 00:19:17,991 -కాంస్టన్ట్! పోలీ ఎక్కడ? -ఏమో. 174 00:19:23,080 --> 00:19:25,916 ఇక్కడి నుండి వెళ్లిపోండి! 175 00:19:29,586 --> 00:19:31,547 సూపర్, బెకీ! కానివ్వు, దూకు వాళ్ల మీద. 176 00:20:01,076 --> 00:20:01,952 బెకీ! 177 00:20:05,664 --> 00:20:06,874 వెళ్దాం పద. 178 00:20:24,516 --> 00:20:26,018 వాళ్ళని ఆపండి! 179 00:20:43,827 --> 00:20:46,246 ఇక్కడ రెండు స్విచ్చులు ఉన్నాయి. ఏది దేనికో నాకు తెలీట్లేదు. 180 00:20:46,330 --> 00:20:48,957 నువ్వు ఏదోకదాన్ని ఎంచుకోవాలి. కళ్లు మూసుకో, 181 00:20:49,041 --> 00:20:52,377 ఒకవేళ నేను చనిపోతే చెప్పలేను కదా, అందుకని ఇప్పుడే ధన్యవాదాలు చెప్పేస్తున్నా. 182 00:20:53,754 --> 00:20:54,880 దేనికి, నిన్ను చంపినందుకా? 183 00:20:55,797 --> 00:20:57,007 నన్ను కాపాడినందుకు. 184 00:20:59,635 --> 00:21:00,636 సరే మరి… 185 00:21:21,657 --> 00:21:23,033 మేము ఎక్కడున్నామో నీకెల తెలిసింది? 186 00:21:23,617 --> 00:21:26,161 జోకా? మీరెక్కడ ఉన్నారో గెలాక్సీ అంతటికీ తెలుసు. 187 00:21:27,204 --> 00:21:29,957 హెచ్చరిక. శత్రు నౌక గుర్తించబడింది. 188 00:21:30,040 --> 00:21:31,375 సరే. మనం ఇప్పుడు జంప్ అవ్వాలి. 189 00:21:32,417 --> 00:21:34,461 ఆటోపైలట్ ఆన్ 190 00:21:53,397 --> 00:21:55,899 నువ్వు వెతుకుతున్న విప్లవకారుడు దొరికాడుగా. 191 00:21:56,441 --> 00:21:57,860 ఆ పని మనం చేసి ఉండాల్సిందని ఇప్పటికీ అనిపిస్తోందా? 192 00:21:58,861 --> 00:22:00,904 లేదు. మన నౌక ఆ బాల్కనీలో అస్సలు పట్టదు. 193 00:22:02,656 --> 00:22:04,074 కానీ మాలో ఒక విషయాన్ని మాత్రం నిరూపించాడు. 194 00:22:05,492 --> 00:22:07,286 మహారాజును దెబ్బ తీయవచ్చని. 195 00:22:28,682 --> 00:22:29,933 మనం ఇక్కడ క్షేమంగా ఉండవచ్చు. 196 00:22:31,185 --> 00:22:35,105 అక్కడ మన కోట తగలబడిపోతూ ఉంటే, నువ్వు క్షేమం గురించి మాట్లాడుతున్నావా? 197 00:22:36,190 --> 00:22:39,526 ఈ తొక్కలో నానోబోట్లు ఎప్పుడు పని చేయడం ప్రారంభిస్తాయి? 198 00:22:39,610 --> 00:22:41,153 -పని చేస్తాయి. -పగటి రాజా? 199 00:22:42,362 --> 00:22:47,159 అన్ని లోకాలూ చూస్తున్నాయి. మనం వేగంగా, పక్కాగా వ్యవహరించాలి. 200 00:22:47,659 --> 00:22:52,998 నన్ను చూసి నువ్వు నవ్వేవాడివి, రాత్రి సోదరా. సెల్డన్ కథ ఒట్టి బుర్ర కథే అనేవాడివి. 201 00:22:54,333 --> 00:22:55,667 పిల్లల కథ అనేవాడివి. 202 00:22:56,919 --> 00:22:57,920 ఏంటి? 203 00:23:00,339 --> 00:23:05,552 ఇప్పుడు నీకు క్షమాపణ చెప్పాలా? వాళ్లు కయ్యానికి కాలు దువ్వారు! 204 00:23:06,970 --> 00:23:09,556 మనం కూడా ధీటుగా జవాబివ్వాలి. 205 00:23:09,640 --> 00:23:13,227 యుద్ధమా? యుద్ధం ఏంటి? 206 00:23:13,310 --> 00:23:17,898 నేను హింసనే ఎంచుకుంటే, క్షణాలలో వాళ్లని మట్టికరిపించగలను. 207 00:23:19,233 --> 00:23:22,945 కానీ నేను వాళ్లతో మాట్లాడదామని అనుకుంటున్నా. 208 00:23:23,445 --> 00:23:25,614 -ఏంటి? -నేను టర్మినస్ కి వెళ్తాను. 209 00:23:26,823 --> 00:23:30,452 మీరు ఇక్కడే ఉండండి, అప్పుడు పెద్దగా ఏమీ జరగలేదని జనాలు అనుకుంటారు. 210 00:23:30,536 --> 00:23:33,372 అలా ఉండిపోయి నా సోదరుడి అడుగుజాడల్లో నడవాలా? లేదు. 211 00:23:34,790 --> 00:23:38,794 నేను మార్పుకు భయపడే రకం కాదు. ఆ మర్మ నౌకలు మనవి. 212 00:23:38,877 --> 00:23:41,922 ఆ గ్రహం మనది. నేను వెళ్తున్నాను! 213 00:23:42,005 --> 00:23:44,466 అది పిచ్చితనం. 214 00:23:44,550 --> 00:23:47,886 -పిచ్చి పనులు చేయకు! -పగటి రాజు నిర్ణయం తీసేసుకున్నాడు. 215 00:23:55,143 --> 00:23:58,897 మీరన్నది నిజమే. మీ రాజ్యంలో ఇప్పటికే చాలా కాలం నుండి యుద్ధాలు, గోలలు జరుగుతూ ఉన్నాయి. 216 00:24:01,817 --> 00:24:04,236 వాటన్నింటినీ స్వయంగా మహారాజే పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. 217 00:24:06,154 --> 00:24:07,739 -మన పెళ్లి. -తర్వాత చేసుకుందాంలే. 218 00:24:20,127 --> 00:24:25,007 నేను వెళ్తాను. ఆ సెల్డన్ దెయ్యం పని పడతాను. 219 00:24:25,090 --> 00:24:27,676 మనకి చెందినదాన్ని స్వాధీనపరుచుకుంటాం. 220 00:24:30,762 --> 00:24:33,348 పెళ్లి కానుకగా నీకు ఆ గ్రహాన్ని ఇస్తాను. 221 00:24:42,774 --> 00:24:47,613 వేకువ సోదరా, నేను వచ్చేదాకా ట్రాంటార్ పాలనా బాధ్యతలు నీవే. 222 00:24:54,203 --> 00:24:55,621 తను జాగ్రత్త. 223 00:24:56,580 --> 00:24:57,581 నేను చూసుకుంటా. 224 00:24:59,791 --> 00:25:03,629 నా నౌకని సిద్ధం చేయండి. పెద్ద క్లెరిక్ ని తీసుకురండి. అతడిని కూడా తీసుకువెళ్దాం. 225 00:25:03,712 --> 00:25:05,464 రూబికాన్ ని సిద్ధపరచండి. 226 00:25:06,006 --> 00:25:07,257 అలాగే, మహారాజా. 227 00:25:24,525 --> 00:25:25,901 క్లియన్ల మధ్య భేదాలు పెరుగుతున్నాయి. 228 00:25:25,984 --> 00:25:28,028 వాళ్ల భేదాలను ఆసరాగా తీసుకొని నాకు కావాల్సింది నేను చేసుకుంటున్నా. 229 00:25:29,112 --> 00:25:30,489 నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. 230 00:25:30,572 --> 00:25:35,077 తెలుసా? ప్రతీకారాలు తీర్చుకునేటప్పుడు ప్రేమా గీమాలు పెట్టుకోకూడదు. 231 00:25:35,786 --> 00:25:38,705 హీట్ సింక్స్ దగ్గర వేకువ రాజును దొంగచాటుగా కలుసుకున్నావని నాకు తెలుసు. 232 00:25:38,789 --> 00:25:42,793 నేను అతని నమ్మకాన్ని పొందాలనుకుంటున్నా. నమ్మాకాన్ని పొందాక, వాళ్లపైకి ఇతడిని ఉసిగొల్పుతాను. 233 00:25:43,377 --> 00:25:45,504 నువ్వు అతనితో పడక పంచుకుంటున్నావు. లేదా త్వరలోనే ఆ పని చేస్తావు. 234 00:25:45,587 --> 00:25:46,880 నువ్విప్పటికే రాత్రి రాజుతో పడుకుంటున్నావు. 235 00:25:46,964 --> 00:25:48,632 -నీకు అతనిపై ప్రేమ ఉంది. -నీకు రాత్రి రాజుపై ప్రేమ ఉంది! 236 00:25:48,715 --> 00:25:51,885 ఇక్కడ నా ప్రేమ ముఖ్యం కాదు. మహారాణికి కాబోయే భార్యని నేను కాదు, నువ్వు. 237 00:25:51,969 --> 00:25:55,180 -అతనికి తెలిసిపోతే ఏం చేస్తాడు అనుకుంటున్నావు? -నేను పట్టించుకోను! 238 00:25:56,306 --> 00:25:57,641 పట్టించుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది! 239 00:25:58,267 --> 00:26:02,104 మనం క్లౌడ్ డొమీనియన్ కి చాలా దూరాన ఉన్నామని నాకు తెలుసు, కానీ నువ్వు దాని గురించి కూడా ఆలోచించాలి. 240 00:26:02,187 --> 00:26:05,524 నీ ప్రజల గురించి, నీ గ్రహం గురించి నువ్వు ఆలోచించాలి. 241 00:26:06,233 --> 00:26:09,319 రవ్వంత తప్పు జరిగినా మహారాజు శిక్షించేస్తాడు. 242 00:26:11,530 --> 00:26:14,658 నువ్వు చాలా నష్టపోయావన్నది వాస్తవమే. 243 00:26:15,951 --> 00:26:17,953 అలా అని పట్టించుకోకపోతే, ఇంకా చాలా నష్టపోతావు. 244 00:26:33,760 --> 00:26:39,391 పెళ్లయ్యాక, హాయిగా నీకు ఇష్టమొచ్చినట్టు పగటి రాజును చంపేసుకో. 245 00:26:40,976 --> 00:26:43,061 భార్య అయినా, విదవ అయినా మహారాణి అనే అంటారు. 246 00:26:45,522 --> 00:26:49,026 కానీ ప్రస్తుతానికి నువ్వు నీ భావావేశాలను అదుపులో ఉంచుకోవాలి. 247 00:26:49,109 --> 00:26:50,861 రూ, నాకు అర్థమైంది. 248 00:26:54,072 --> 00:26:55,741 నీ సలహాలకు నేను విలువ ఇస్తా కూడా. 249 00:26:58,160 --> 00:27:01,747 కానీ నేను నీ మహారాణిని, ఏం చేయాలో నిర్ణయించుకొనేది నేనే. 250 00:27:05,459 --> 00:27:08,045 అవును, మహారాణి. 251 00:27:10,130 --> 00:27:11,131 మీరెలా అంటే ఎలా. 252 00:27:45,499 --> 00:27:46,834 నన్ను టెల్లెం ఇలా చంపాలని ప్లాన్ చేస్తోందా? 253 00:27:47,960 --> 00:27:49,461 దివ్యదృష్టి గలవారు, సాటి దివ్యదృష్టి గలవారిని చంపరు. 254 00:27:50,587 --> 00:27:52,673 దానర్థం గాల్ బాగానే ఉంది అనే కదా. 255 00:27:53,382 --> 00:27:55,175 ఆమెని టేబుల్ తంతు కోసం సిద్ధం చేస్తున్నారు. 256 00:27:56,385 --> 00:27:57,636 టేబుల్ ఏంటి? 257 00:28:01,431 --> 00:28:04,852 అదేంటో నేను చెప్పకూడదు, కానీ అది చాలా గొప్ప విషయమని చెప్పవచ్చు. 258 00:28:05,602 --> 00:28:08,313 నాకు ఎందుకో తేడా కొడుతోంది. నాకు… 259 00:28:18,615 --> 00:28:21,076 సరే, ఇక్కడేదో తేడాగా ఉంది. 260 00:28:21,577 --> 00:28:24,913 వాటి వల్ల అలా అనిపిస్తుంది. అవి అతీత శక్తులని నిర్వీర్యం చేస్తాయి. 261 00:28:24,997 --> 00:28:30,419 అయితే, ఇది మామూలు జైలు ప్లస్ మానసిక జైలు కూడానా? 262 00:28:31,420 --> 00:28:33,630 అవి ఎలా పని చేస్తాయి? ఆ అంకెలేంటి? 263 00:28:33,714 --> 00:28:35,215 నాకు అంకెలు తెలీవు. 264 00:28:35,299 --> 00:28:36,300 నాకు కూడా. 265 00:28:38,635 --> 00:28:40,345 ఇప్పుడు హారి ఇక్కడ ఉంటే బాగుండు. 266 00:28:40,429 --> 00:28:41,805 అతనికి జరిగినదాని విషయంలో చింతిస్తున్నా. 267 00:28:41,889 --> 00:28:45,350 అతను అల్పుడు, కానీ అతనంటే నీకు అభిమానమని నాకు తెలుసనుకో. 268 00:28:45,434 --> 00:28:47,853 అతను అల్పుడు కాదు, జోసయ్యా. 269 00:28:48,395 --> 00:28:52,774 అతను చాలా తెలివైనవాడు. అవెలా పని చేస్తాయో ఆయన ఇట్టే చెప్పేయగలడు… 270 00:28:55,402 --> 00:28:57,196 వాళ్లకి రేడియంట్ కావాలి, శాల్వార్. 271 00:28:57,279 --> 00:28:59,114 అది బెగ్గర్ లో ఉంది. 272 00:28:59,198 --> 00:29:04,203 దాని రూపే మారిపోయి ఉండవచ్చు. దాన్ని కనిపెట్టి, కాపాడు. గాల్ ని కాపాడు. తనకు నువ్వు తోడుగా ఉండాలి. 273 00:29:04,953 --> 00:29:07,706 జోసయ్యా, గాల్ ని వాళ్లు ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్తున్నారు కదా, అది ఎక్కడ ఉంది? 274 00:29:07,789 --> 00:29:12,711 ప్యాలెస్ లో. అటు వెళ్లాలి. కానీ నువ్వు ఇక్కడ ఉన్నావు కదా. 275 00:29:12,794 --> 00:29:14,421 ఆ సంగతి నేను చూసుకుంటాలే. నువ్వు వెళ్లు. 276 00:29:14,505 --> 00:29:16,465 ఇంకో విషయం, దీని గురించి మర్చిపోవడానికి ప్రయత్నించు. 277 00:29:23,430 --> 00:29:27,893 ఆ సెల్డన్ దగ్గర డూప్లికేట్ రేడియంట్ లాంటిది ఒకటుంది. 278 00:29:27,976 --> 00:29:31,146 కానీ నిజానికి రేడియంటే ఉండేది ఒకటే, అదే మా ఇద్దరి దగ్గరా ఉంది. 279 00:29:32,940 --> 00:29:33,941 రెండు చోట్లా ఉంది అది. 280 00:29:43,075 --> 00:29:46,203 దాన్ని చూస్తే చాలు, అతని పనులన్నీ మనకి తెలిసిపోతాయి. 281 00:29:48,705 --> 00:29:49,748 నాకు వాల్ట్ ని చూపించు. 282 00:30:20,237 --> 00:30:21,738 శాల్వార్ హార్డిన్? 283 00:30:25,868 --> 00:30:26,869 హారి సెల్డన్. 284 00:30:28,745 --> 00:30:29,746 నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? 285 00:30:31,999 --> 00:30:33,083 నేను ఇక్కడ లేను. 286 00:30:35,627 --> 00:30:37,171 అంటే భౌతికంగా లేను. 287 00:30:39,715 --> 00:30:44,052 నా మనస్సు ఎలాగో ఇక్కడికి రాగలిగింది. 288 00:30:45,137 --> 00:30:49,266 టర్మినస్ నుండి వెళ్లేటప్పుడు నువ్వు తీసుకెళ్లావు కదా, అదేనా ఆ రేడియంట్? 289 00:30:49,349 --> 00:30:50,684 అవును. 290 00:30:51,810 --> 00:30:56,064 అది వాల్టులోకి క్వాంటమ్ పోర్టల్ లా పని చేస్తోందంటావా? 291 00:30:56,648 --> 00:30:57,733 అంతేగా. 292 00:30:57,816 --> 00:31:01,153 సూపర్ పొజిషన్ స్థితిలో ఉన్న అది ఒకే క్వాంటమ్ సిస్టమ్ అది. 293 00:31:03,488 --> 00:31:07,576 అది నాకు ఎప్పుడో తెలియాల్సిన విషయం కదా? అసలు దాన్ని రూపొందించింది నేనే కదా. 294 00:31:07,659 --> 00:31:11,246 -మీకు తెలీదు. -ఆగు. నాలో నేను మాట్లాడుకుంటున్నా. 295 00:31:11,330 --> 00:31:15,751 లాజికల్ గా దాన్ని రూపొందించింది నేను కాదు అని అనవచ్చు. 296 00:31:15,834 --> 00:31:19,838 రేడియంట్ లాగానే, నేను కూడా దీన్ని రూపొందించిన వారి అంశను అంతే. 297 00:31:21,256 --> 00:31:27,012 అంటే, నేను రూపొందించిన రేడియంట్ తాలూకు పూర్తి వివరాలను 298 00:31:27,095 --> 00:31:29,932 దాచి ఉంచాను అన్నమాట. కానీ ఎందుకు? 299 00:31:30,891 --> 00:31:35,646 నేను చనిపోయే ముందు, ఇంత ఉపయోగకరమైన సమాచారాన్ని ఎందుకు దాచి ఉంచాను, దేని కోసం… 300 00:31:39,525 --> 00:31:42,945 అంశను నేను ఒక్కడినే కాదు కదా? చెప్పు. 301 00:31:47,616 --> 00:31:50,369 రేడియంట్ ఈ పని చేయగలదని నీకు చెప్పింది అతనేనా? 302 00:31:50,452 --> 00:31:52,079 అలా అని నేను మీకు చెప్పవచ్చో లేదో… 303 00:31:53,914 --> 00:31:55,415 అది నాకు తెలియాల్సిన విషయం కాదన్నమాట. 304 00:31:58,377 --> 00:32:01,213 నా అవతారం ఇంకొకడు ఉన్నాడు. 305 00:32:02,798 --> 00:32:06,969 అతని లక్ష్యం ఏంటి? ఫౌండేషన్ ని గాడిలో పెట్టడానికి నేను ఉన్నానుగా. 306 00:32:07,845 --> 00:32:10,472 అలాంటప్పుడు అంత కష్టపడి ఇంకో అవతారాన్ని సృష్టించడం ఎందుకు… 307 00:32:14,977 --> 00:32:16,144 తెలివంటే అది! 308 00:32:17,896 --> 00:32:19,648 ద్వితీయ ఫౌండేషన్. 309 00:32:22,651 --> 00:32:24,653 కానీ నా ఇంకో అవతారం దగ్గర నాకు తెలీని సమాచారం ఉందంటే, 310 00:32:25,779 --> 00:32:30,784 దీన్ని మేము ఒకే పెద్ద ప్రయోగంలా భావించి నడుచుకుంటే, ఇది పెద్ద ప్రయోగమనే తెలిసిపోతుందనుకో, 311 00:32:31,660 --> 00:32:34,121 దానర్థం ఈ ఫౌండేషన్ నియంత్రణ గ్రూప్ అవుతుందని. 312 00:32:34,830 --> 00:32:39,501 ఎడమ చేయికి కుడి చేయి ఏం చేస్తోందో తెలీదు, దానికి పూర్తి సమాచారం కూడా తెలపకుండా దాచారు. 313 00:32:39,585 --> 00:32:42,337 అబ్బా. ఆ ఎడమ చేతిని నేనే. 314 00:32:44,965 --> 00:32:47,467 కానీ దీన్నంతటికీ, నువ్వు ఇక్కడికి రావడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. 315 00:32:48,010 --> 00:32:49,845 -మాకు నీ సాయం కావాలి? -మాకా? 316 00:32:50,512 --> 00:32:51,680 నాకు, గాల్ కి, ఇంకా… 317 00:32:51,763 --> 00:32:54,766 ఇక నాకు ఏం చెప్పకు, నువ్వు చెప్తే గణితం గాడి తప్పుతుంది. 318 00:32:55,434 --> 00:32:58,687 తొక్కలో గణితం ఏమైతే నాకేంటి! గాల్ ప్రమాదంలో ఉంది. 319 00:33:14,745 --> 00:33:16,413 అష్టదిగ్బంధనం చేసేశారు. 320 00:33:17,206 --> 00:33:20,626 ఇంపీరియల్ సైనికులు వందలాది మంది ఉండవచ్చు. ఇక మన బతుకు బస్టాండే. 321 00:33:22,127 --> 00:33:23,504 మనం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ప్రయాణిద్దాం. 322 00:33:24,213 --> 00:33:25,797 స్పిరిట్ ప్రత్యేకతే చడీచప్పుడు కాకుండా ప్రయాణించండం. 323 00:33:26,507 --> 00:33:27,674 మనం తగినంత దూరంలో కనుక ఉంటే, 324 00:33:28,175 --> 00:33:30,802 మన గ్రావిటీ సిగ్నల్ ని వారు గుర్తించే అవకాశం ఉండదు. 325 00:33:48,445 --> 00:33:50,030 తను బతికే ఉందంటావా? 326 00:33:52,157 --> 00:33:53,617 ప్రాఫెట్ తనని రక్షిస్తాడు. 327 00:33:54,117 --> 00:33:58,455 కాంస్టన్ట్ అతనికి మహా భక్తురాలు. తనకి ఆయన ఏమీ కానివ్వడు. 328 00:34:19,768 --> 00:34:21,603 నేను ఇక్కడికి ప్రార్థిద్దామని వచ్చా. 329 00:34:24,063 --> 00:34:25,232 కానీ నాకు మనస్సు రావట్లేదు. 330 00:34:29,319 --> 00:34:32,197 నీ ఆఫీసులో నువ్వు హాయిగా ఉన్నావని నాకు తెలుసు. 331 00:34:35,409 --> 00:34:37,244 తను ట్రాంటార్ కి నీకోసమే వెళ్లింది. 332 00:34:38,911 --> 00:34:39,996 ఎందుకు? 333 00:34:40,956 --> 00:34:45,043 తను జీవితంలో నలుగురికీ పనికొచ్చే పని చేద్దామనుకుంది. 334 00:35:07,316 --> 00:35:08,775 నువ్వు బయటకు వస్తావని అనుకోలేదు. 335 00:35:10,903 --> 00:35:12,654 కనీసం ఈ పనైనా నేను చేయాలి కదా. 336 00:35:13,822 --> 00:35:15,782 ట్రాంటార్ నుండి ప్రసారం చేసిన వీడియోని చూశా. 337 00:35:15,866 --> 00:35:17,910 -తను బతికే ఉందా? -తెలీదు. 338 00:35:18,952 --> 00:35:22,664 నీకు అన్నీ తెలుసని భావించి చాలా మంది తమ జీవితాలని నీకు అర్పించారు. 339 00:35:23,916 --> 00:35:27,044 తను చాలా చిన్నతనం నుండే నీకు సేవ చేయాలనుకుంది, తనని నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని 340 00:35:27,127 --> 00:35:30,130 "టర్మినస్ లో ఏం పని కావాలో ఎంచుకో. నా పనినైనా ఎంచుకో. దేన్ని అయినా ఎంచుకో. 341 00:35:30,214 --> 00:35:31,215 కానీ… 342 00:35:34,885 --> 00:35:37,179 కానీ క్లెరిక్ పని మాత్రం ఎంచుకోవద్దు," అని అన్నాను. 343 00:35:38,722 --> 00:35:41,391 నీకోసం తను అందరినీ అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. 344 00:35:44,603 --> 00:35:45,687 నీ వెర్రి అనుచరులులా; 345 00:35:46,605 --> 00:35:51,276 నీ కూతురిని నేను ఒకసారే కలిశాను, కానీ ఆమె ఏం చెప్పినా నమ్మేస్తుందనే రకంగా అనిపించలేదు. 346 00:35:52,194 --> 00:35:53,320 కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా, 347 00:35:53,403 --> 00:35:56,406 -తను బతికే ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. -కాంస్టన్ట్ చాలా మంచి అమ్మాయి! 348 00:35:57,950 --> 00:35:59,368 నిన్ను నమ్మింది. 349 00:36:03,121 --> 00:36:05,249 అలా నమ్మితే తనకి మరణశిక్ష విధిస్తారని తెలిసి కూడా. 350 00:36:06,583 --> 00:36:08,585 నువ్వు చరిత్రకు విలువ ఇస్తావు, 351 00:36:09,545 --> 00:36:12,089 కానీ అందులోని జనాలకు నువ్వు విలువ ఇవ్వవు. 352 00:36:13,507 --> 00:36:15,551 నేను వ్యక్తుల చర్యలను ప్రభావితం చేయలేను… 353 00:36:17,386 --> 00:36:19,346 వారి తలరాతను కూడా ఊహించి చెప్పలేను. 354 00:36:20,013 --> 00:36:23,392 కానీ నేను వారిని చూస్తాను. నిజంగానే చూస్తా. 355 00:36:25,894 --> 00:36:27,229 చాలా బాగా చూస్తాను. 356 00:36:29,022 --> 00:36:31,900 వారి జ్ఞాపకాలు, వారి ఎంపికలు, 357 00:36:32,693 --> 00:36:33,902 వారి గాథలోనే, 358 00:36:34,528 --> 00:36:36,029 సైకోహిస్టరీ రూపొందింది. 359 00:36:36,738 --> 00:36:38,991 ఇప్పటిదాకా ఎంతమందైతే జీవించారో వారందరి జీవితం ఆధారంగా తీసుకొనే అది రూపొందింది. 360 00:36:39,783 --> 00:36:41,952 కోట్లాది నిర్ణయాలు. 361 00:36:42,619 --> 00:36:43,829 లెక్కలేనన్ని అన్నమాట. 362 00:36:44,663 --> 00:36:46,665 కాబట్టి, అవన్నీ ముఖ్యమని గ్రహించు. 363 00:36:48,542 --> 00:36:51,753 తను బతికే ఉందని నువ్వు చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను. 364 00:36:53,505 --> 00:36:55,841 నేను చెప్పేదే జరుగుతుందంటే, నువ్వు కూడా నా భక్తుడివే అయ్యుండేవాడివి. 365 00:36:58,719 --> 00:37:00,053 మరి ఇప్పుడు మనమేం చేద్దాం, డాక్టర్? 366 00:37:01,471 --> 00:37:03,265 అత్యంత కష్టమైన పని చేద్దాం. 367 00:37:06,602 --> 00:37:07,603 వేచి చూద్దాం. 368 00:37:28,457 --> 00:37:30,542 నిన్ను స్పేసర్స్ వద్దకు పంపారని మహారాజు అన్నాడు, నిజమేనా? 369 00:37:31,376 --> 00:37:34,505 హా, స్పేసర్స్ మన వైపు మళ్లేలా వాళ్లని నేను ఒప్పించగలనని సెల్డన్ అనేసుకున్నాడు. 370 00:37:36,215 --> 00:37:39,801 నన్ను కత్తిలా వాడదామనుకున్నాడు. కానీ నేను తుప్పు పట్టిన కత్తి అని ఆయన గ్రహించలేదు అనుకుంటా. 371 00:37:43,138 --> 00:37:44,223 బెకీ విషయంలో జరిగినదానికి బాధగా ఉంది. 372 00:37:45,390 --> 00:37:47,017 పోలీని కాపాడలేకపోయినందుకు… 373 00:37:48,602 --> 00:37:49,728 చాలా బాధగా ఉంది. 374 00:37:54,024 --> 00:37:55,984 చర్చిలో నేను చేరడానికి కారణం అతనే. 375 00:37:57,569 --> 00:38:00,155 సెల్డన్ విజన్ అంత మందిని చేరుకోవడానికి కారణం అతనే. 376 00:38:02,366 --> 00:38:05,244 వందేళ్లకు పైగా ఆ నమ్మకం నిలబడేలా అతను చూసుకున్నాడు. 377 00:38:08,038 --> 00:38:09,456 కానీ ఆ తర్వాత అతను తత్తరపడ్డాడు. 378 00:38:10,916 --> 00:38:12,459 దాన్ని నేను గమనించాను, కానీ… 379 00:38:15,546 --> 00:38:16,755 అతనికి సాయపడలేకపోయా. 380 00:38:20,884 --> 00:38:23,554 చర్చిలో నేను ఒక చెత్త విద్యార్థిని. 381 00:38:25,097 --> 00:38:27,391 నాకు ఒక బోధన గుర్తుంది. సూక్తి లాంటిది. 382 00:38:28,308 --> 00:38:32,479 దాని ప్రకారం జీవితమనేది వజ్రాలతో నిండి ఉన్న సంచి. 383 00:38:33,939 --> 00:38:36,650 చివరికి వచ్చేసరికి, 384 00:38:36,733 --> 00:38:40,070 ఆ సంచి వజ్రాలతో నిండుగా ఉండకూడదు, ఖాళీగా ఉండాలి, ఎందుకంటే… 385 00:38:42,489 --> 00:38:43,490 వాటన్నింటినీ నువ్వు పంచేయాలి. 386 00:38:44,741 --> 00:38:45,742 హా. 387 00:38:48,328 --> 00:38:49,496 ఆయన వాటన్నింటినీ నాకు ఇచ్చాడు. 388 00:38:55,169 --> 00:38:57,045 రూబికాన్ ని సమీపిస్తున్నాం. 389 00:38:57,629 --> 00:39:01,091 క్లెరిక్, నీ మిషన్ విషయంలో ఇప్పుడు నీకేం అనిపిస్తోంది? 390 00:39:04,386 --> 00:39:07,264 మహారాజు తదేకంగా చూస్తూ ఉన్నప్పుడు 391 00:39:07,347 --> 00:39:08,807 అది ఇబ్బందికరంగానే ఉంటుందేమో. 392 00:39:10,309 --> 00:39:12,060 నేను హారి సెల్డన్ ని కలిశాను. 393 00:39:13,353 --> 00:39:14,730 పేరు ప్రఖ్యాతలు నాకు కొత్త కావు. 394 00:39:14,813 --> 00:39:16,190 సెల్డన్. 395 00:39:17,191 --> 00:39:19,443 అతనిలో మనకి తెలీని ఆకట్టుకునే గుణం ఏదో ఉండుంటుంది. 396 00:39:20,110 --> 00:39:26,158 గెలాక్టిక్ స్పిరిట్ చర్చి యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే, ఆ గెలాక్టిక్ స్పిరిట్ పని చేస్తుంది అనే నమ్మకం. 397 00:39:26,241 --> 00:39:27,659 మేము కాస్త మసాలా జోడిస్తాం, 398 00:39:28,785 --> 00:39:31,830 కానీ అది ప్రధానంగా సైన్సే. 399 00:39:31,914 --> 00:39:32,915 అవును. 400 00:39:33,999 --> 00:39:35,292 ఆసక్తిని కలిగించేదిగా ఉంది. 401 00:39:36,293 --> 00:39:39,046 పిల్లల్లో అతను భలేగా ఆసక్తిని కలిగిస్తాడు కదా. 402 00:39:41,131 --> 00:39:42,508 మేము కాస్త మసాలా జోడిస్తామని చెప్పా కదా. 403 00:39:43,008 --> 00:39:44,343 అతను రణం జరుగుతుందన్నాడు. 404 00:39:44,426 --> 00:39:45,844 ఫౌండేషన్ కి, సామ్రాజ్యానికి మధ్య. 405 00:39:47,471 --> 00:39:51,475 ఇది యుద్ధ నౌక. కాబట్టి అతని జోస్యం సరైనదే అనుకుంటా. 406 00:39:51,558 --> 00:39:54,645 ఇది అతను ఊహించిన రెండవ విపత్తు. 407 00:39:56,271 --> 00:39:58,982 నాకు తెలిసినంత వరకు, రెండు విపత్తులనూ చూసిన ఏకైక వ్యక్తిని నేనే. 408 00:40:00,275 --> 00:40:02,027 సెల్డన్ కాకుండా అనుకోండి, అతని మార్గంలో అతను చూశాడు. 409 00:40:02,528 --> 00:40:03,529 నేను కూడా… 410 00:40:05,322 --> 00:40:06,323 నా మార్గంలో చూశా. 411 00:40:12,204 --> 00:40:17,835 సామ్రాజ్యాన్ని అన్ని విధాలా ఓడిస్తానని సెల్డన్ అంటున్నాడు. 412 00:40:19,127 --> 00:40:22,548 చందమామ కథల్లో గిన్నెని పగలగొట్టగలిగే రాతి గుడ్డులా. 413 00:40:23,966 --> 00:40:27,386 కానీ అతని జోస్యాలకి మన అమాయకత్వమే మూలం కదా? 414 00:40:28,679 --> 00:40:32,599 అలా జోస్యం చెప్పబడినవాటిని జరగకుండా చేయవచ్చు అని మనిద్దరికీ తెలుసు కదా? 415 00:40:33,267 --> 00:40:35,811 నాకు ఫౌండేషన్ మీద నమ్మకం ఉంది. 416 00:40:36,895 --> 00:40:39,606 విద్యపై ఆసక్తి మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది అప్పుడు. 417 00:40:41,775 --> 00:40:42,860 చూడు, పోలీ… 418 00:40:44,319 --> 00:40:47,197 నువ్వు మతంలోకి పూర్తిగా లీనమైపోతున్నావు, 419 00:40:48,365 --> 00:40:50,909 అలా నువ్వు మోకాళ్ల మీద కూర్చొవడం, ప్రార్థించడం వంటివి చేయడం మొదలుపెట్టాక, 420 00:40:51,660 --> 00:40:54,037 నీలోని వివేకం, ఆలోచనా గుణం సన్నగిల్లిపోతాయి. 421 00:40:57,332 --> 00:41:00,127 క్లెరిక్, వాస్తవ ప్రపంచంలో ఒక పద్ధతి అంటూ ఉంటుంది. 422 00:41:00,210 --> 00:41:04,464 అణు బాంబు ధాటికి ఏ గుడ్డూ నిలవలేదు. 423 00:41:06,550 --> 00:41:09,136 వార్డెన్లు ఒక మాట అనుకుంటూ ఉండేవారు, 424 00:41:09,720 --> 00:41:14,349 "చేతకాని వాళ్ళే హింసకు పాల్పడతారు" అని. 425 00:41:15,350 --> 00:41:16,852 అబ్బో, చాలా గొప్ప మాటే అది. 426 00:41:19,771 --> 00:41:21,481 నిజమే ఏమోలే. 427 00:41:24,818 --> 00:41:26,069 ఇప్పుడు నేను ఒక జైలులో ఉన్నా… 428 00:41:26,153 --> 00:41:30,199 నాకు ఈ మెంటాలిక్స్ గురించి, అతీతశక్తులున్న వారి గురించి తెలీకూడదు. నాకు ఇవేమీ తెలీకూడదు. 429 00:41:30,282 --> 00:41:33,744 కానీ నువ్వు వింటున్నావు కదా, సాయం అయితే చేస్తావు కదా. 430 00:41:34,411 --> 00:41:38,916 వారు గాల్ ని ఏదో చేయబోతున్నారు, నేను ఏమీ చేయలేకపోతున్నాను. 431 00:41:39,499 --> 00:41:42,169 ఈ డిషులు నాకు అడ్డు పడుతున్నాయి. 432 00:41:42,669 --> 00:41:46,632 వాటిని ఆపడం ఎలాగో మీరు చెప్పగలరని ఆశిస్తున్నా. 433 00:41:47,633 --> 00:41:48,634 డిషులు. 434 00:41:49,468 --> 00:41:50,928 అవెలా ఉంటాయో చెప్పు. 435 00:41:51,011 --> 00:41:54,181 చెప్పవద్దు, చూపించు, ఇంకా బాగుంటుంది. 436 00:41:57,059 --> 00:42:00,103 నువ్వు నా దగ్గరికి వచ్చావంటే, నేను కూడా నీ దగ్గరికి రాగలనుగా. 437 00:42:10,739 --> 00:42:11,865 వారెవ్వా. 438 00:42:13,450 --> 00:42:16,328 హా. అవే నాకు యముడై కూర్చున్నాయి. 439 00:42:17,746 --> 00:42:19,081 అవి నీ మనస్సును చదువుతున్నాయి. 440 00:42:19,164 --> 00:42:20,832 మనస్సును చదివే సెన్సార్లు. 441 00:42:21,416 --> 00:42:24,837 నీ మెదడు తరంగాలకు విరుద్ధంగా ఉండే తరంగాలను అవి ఉత్పత్తి చేస్తాయి. 442 00:42:25,462 --> 00:42:28,924 దానితో ఆ రెండు తరంగాలు గుద్దుకొని నిర్వీర్యమైపోతాయి. 443 00:42:29,508 --> 00:42:31,009 వాటిని ఆఫ్ చేయగలవా? 444 00:42:34,263 --> 00:42:35,722 అంతకు మించిన పని చేయగలను. 445 00:42:36,223 --> 00:42:37,349 నీకు ఆ శబ్దం… 446 00:42:39,601 --> 00:42:40,519 వినిపిస్తోందా? 447 00:42:41,895 --> 00:42:44,356 అవి నీ దృష్టిని మరల్చడానికి ఉత్పన్నమవుతున్న పిచ్చి శబ్దాలు. 448 00:42:44,439 --> 00:42:50,237 వాటి ఫ్రీక్వెన్సీని మార్చి, ఆ బండరాళ్లు పడేలా మనం చేయవచ్చు. 449 00:42:53,115 --> 00:42:54,116 సరే. 450 00:42:56,034 --> 00:43:00,163 -థ్యాంక్యూ, డాక్టర్ సెల్డన్. -మరేం పర్వాలేదు, శాల్వార్ హార్డిన్. 451 00:43:02,416 --> 00:43:05,169 ఆగండి! రెండవ విపత్తు మొదలైందా? 452 00:43:06,253 --> 00:43:07,588 వార్డెన్ అనిపించుకున్నావుగా. 453 00:43:09,673 --> 00:43:11,925 ప్రస్తుతానికి పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయి. 454 00:43:13,343 --> 00:43:15,137 కానీ టర్మినస్ కి ఏ ప్రమాదమూ లేదు కదా? 455 00:43:22,644 --> 00:43:23,812 హోబర్ మాలో. 456 00:43:25,272 --> 00:43:26,648 హోబర్ మాలో. 457 00:43:28,358 --> 00:43:33,322 గాల్ చెప్పినదాని ప్రకారం, అతను సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాడు. 458 00:43:33,906 --> 00:43:35,407 ఆ విషయం నువ్వు నాకు చెప్పకూడదు. 459 00:43:36,074 --> 00:43:37,576 చెప్పాను అంతే, ఆ సమాచారాన్ని వాడుకోమని చెప్పలేను కదా. 460 00:43:39,286 --> 00:43:41,830 నేను కనుక దాన్ని వాడితే, మొత్తం మారిపోయే అవకాశముంది. 461 00:43:42,331 --> 00:43:43,373 అన్నిటికీ అతీతంగా ఉండాలి. 462 00:43:45,334 --> 00:43:49,213 సరైన పని చేయడానికి, ఆ పని నేను చేయవచ్చా అని కిందా మీదా పడాల్సిన అవసరం లేదు. 463 00:43:50,422 --> 00:43:51,423 గుడ్ లక్, వార్డెన్. 464 00:44:02,518 --> 00:44:05,771 ఒకవేళ పనులలో ఎడమ చేయికి ప్రమేయం లేదంటే… 465 00:44:08,023 --> 00:44:09,942 ఇక ఆ చేయి ఉండి ఏం లాభం? 466 00:44:20,494 --> 00:44:22,037 హోబర్ 467 00:44:22,621 --> 00:44:23,997 హోబర్ మాలో! 468 00:44:24,706 --> 00:44:27,209 హోబర్ మాలోని తీసుకురండి 469 00:44:33,006 --> 00:44:34,842 హోబర్ మాలో 470 00:44:42,474 --> 00:44:46,144 లొక్రీస్ వై కోసం చూస్తున్నాను. పోలీకి నివాళులర్పించడానికి అది మంచి మార్గం కదా. 471 00:44:47,604 --> 00:44:50,148 "ఆరోగ్యం శ్రేష్టంగా ఉంటే, ఆలోచనలు కూడా శ్రేష్టంగానే ఉంటాయి." 472 00:44:51,733 --> 00:44:53,902 పోలీ, తన ఆరోగ్యంపై శ్రద్ద వహించలేదు. 473 00:44:53,986 --> 00:44:55,737 అయితే లొక్రీస్ వైన్ వద్దంటావా? 474 00:44:56,321 --> 00:44:57,531 మనం ఇప్పుడు ప్రమాదం ముంగిట ఉన్నాం. 475 00:44:57,614 --> 00:45:00,200 మనం జంప్ చేస్తే, శత్రు బలగాలకు మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోతుంది. 476 00:45:01,076 --> 00:45:02,661 మనం ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటా. 477 00:45:04,663 --> 00:45:06,039 ఆస్వాదించాలంటే నీ ఉద్దేశం… 478 00:45:07,165 --> 00:45:08,417 పడక పంచుకుందాం. 479 00:45:10,169 --> 00:45:12,379 -నీకు పడక పంచుకోవడం అంటే నచ్చదా? -అలా ఏం లేదు. 480 00:45:12,462 --> 00:45:14,923 -ఈ పరిస్థితి వల్ల మా నాన్న చనిపోవచ్చని భయంగా ఉందా? -సెర్మాక్? 481 00:45:16,425 --> 00:45:18,594 లేదు, లేదు. చెప్పాలంటే అది నాకు సంతోషమే. 482 00:45:19,511 --> 00:45:20,721 అయితే బట్టలు విప్పేయ్. 483 00:45:21,221 --> 00:45:22,639 సరే. 484 00:45:44,995 --> 00:45:47,456 ముందు ముద్దు పెట్టుకోవాలా లేదా బట్టలు విప్పాలా అనేది తేల్చుకోలేకపోయాను. 485 00:45:47,539 --> 00:45:50,834 కానీ బట్టలు విప్పేయడమే మంచిదనిపించింది. 486 00:45:51,627 --> 00:45:53,462 హా. అది నిజమే. 487 00:45:58,634 --> 00:45:59,593 నీకు కంగారుగా ఉంది. 488 00:46:00,344 --> 00:46:01,345 లేదు. 489 00:46:04,973 --> 00:46:06,558 -నీ శరీరం విషయంలో మొహమాటంగా ఉందా? -లేదు. 490 00:46:07,601 --> 00:46:11,063 ఏదైనా సరిగ్గా పని చేయట్లేదా? 491 00:46:12,314 --> 00:46:13,148 అదేం లేదు. 492 00:46:50,060 --> 00:46:52,145 మనస్సు మార్చుకోవడం న్యాయమైనదే కదా, ఏమంటావు? 493 00:46:53,605 --> 00:46:55,691 పగటి రాజు ఇక్కడ లేడు. 494 00:46:55,774 --> 00:47:00,821 మన విచారణని కొనసాగించడానికి ఇంతకన్నా మంచి అవకాశం మనకి రాదనుకుంటా. 495 00:47:03,490 --> 00:47:04,491 మరి? 496 00:47:06,577 --> 00:47:08,620 లొక్రీస్ వైన్ ని ఇప్పుడు తాగవచ్చా? 497 00:47:11,415 --> 00:47:12,791 నువ్వు నా పేరేంటో చెప్పలేదుగా. 498 00:47:14,042 --> 00:47:15,294 అయినా పర్లేదు, తాగుదాం. 499 00:47:16,211 --> 00:47:20,591 మనిద్దరం ఒకరి మరణ శిక్షకు మరొకరం తప్పకుండా వద్దాం. 500 00:47:21,800 --> 00:47:24,845 నీ మరణ శిక్ష సమయంలో మనం మొదటిసారి కలుసుకున్నాం. 501 00:47:25,345 --> 00:47:27,264 రెండవసారి నా మరణ శిక్ష సమయంలో. 502 00:47:27,347 --> 00:47:28,807 సరే. అలాగే. 503 00:47:29,641 --> 00:47:30,976 ఇక వైన్ తాగుదాం. 504 00:47:47,910 --> 00:47:50,204 స్పిరిట్ రైజింగ్, లొంగిపోవాలి. 505 00:47:50,287 --> 00:47:52,289 మహారాజు కార్యంలో భాగంగా మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం. 506 00:47:53,290 --> 00:47:55,501 -మనం అతనికి కనిపిస్తున్నామా? -హా, మన మాటలు వినిపిస్తున్నాయి కూడా. 507 00:47:56,001 --> 00:47:57,377 హోబర్, నీ మణికట్టు. 508 00:47:58,378 --> 00:48:00,172 మిస్టర్ మాలో, గురూ. 509 00:48:00,839 --> 00:48:03,091 జంప్ చేయాలని చూడవద్దు. మీ డ్రైవ్స్ ఆఫ్ లైనులో ఉన్నాయి. 510 00:48:03,175 --> 00:48:06,887 మేము డాక్ చేస్తున్నాం, మీకు ఏ ఇబ్బందీ కలిగించకుండా ఎక్కించుకుంటామని మాటిస్తున్నా. 511 00:48:13,060 --> 00:48:17,189 నీకు సమాధానాలు కావాలి కదా. అవి ఇక్కడ దొరకవచ్చు అనుకుంటా. 512 00:48:17,689 --> 00:48:21,485 ఆ వింతగా ఉన్నదానిలోఎవరో ఒక సందేశాన్ని దాచి ఉంచారు. 513 00:48:22,194 --> 00:48:26,448 కానీ కొత్త క్రోమా పాత క్రోమాని క్రియాశీలకం చేయగలదు, 514 00:48:26,532 --> 00:48:29,368 దాన్ని మంచి అనుభవమున్న వ్యక్తే గుర్తించగలడు. 515 00:48:31,745 --> 00:48:35,916 వయస్సు పెరిగే కొద్దీ, మనం తక్కువ అనే భావన వస్తుందని కొందరు అంటుంటారు. 516 00:48:37,584 --> 00:48:44,091 కానీ జీవితకాలపు అనుభవం ఉండటంలో కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. 517 00:49:21,753 --> 00:49:22,796 మనం ఎక్కడ ఉన్నాం? 518 00:49:30,179 --> 00:49:32,222 -వచ్చావే. -రాకుండా ఎలా ఉంటా! 519 00:49:32,723 --> 00:49:35,225 సింహాసనం ఉన్న గదిలో, పగటి రాజుకు మద్ధతుగా నేను చెప్పినదంతా 520 00:49:35,309 --> 00:49:36,727 నా నటనలో భాగమే. 521 00:49:36,810 --> 00:49:38,061 అది నీకు తెలుసు కదా? 522 00:49:38,145 --> 00:49:40,522 -నేను అతని సొంతమే అని అతను అనుకోవడం ముఖ్యం. -కానీ అతను అలా అనుకోవట్లేదు. 523 00:49:41,398 --> 00:49:43,150 నువ్వు ప్రతిపాదించిన దాని గురించి నేను చాలా ఆలోచించాను. 524 00:49:43,233 --> 00:49:44,860 అది తప్ప నాకు ఇంకో ఆలోచనే లేకుండా పోయింది. 525 00:50:08,175 --> 00:50:11,094 ఈ చిన్న వస్తువు. 526 00:50:12,054 --> 00:50:13,847 దీన్ని అతను మన నుండి దూరం చేయలేడు. 527 00:50:21,230 --> 00:50:22,231 నీకు ఓకేనా? 528 00:50:40,999 --> 00:50:45,170 ఈ మెట్లను నేను చూడటం ఇదే మొదటిసారి. 529 00:50:46,213 --> 00:50:47,589 పగటి రాజు కూడా చూసి ఉండదు. 530 00:50:48,757 --> 00:50:50,926 మాలో ఎవరూ చూసి ఉండరు. 531 00:50:58,392 --> 00:50:59,560 వింతగా ఉంది. 532 00:51:00,185 --> 00:51:01,478 ఏంటి? 533 00:51:01,562 --> 00:51:04,064 నా ఇంట్లో నాకే కొత్తగా అనిపించడం. 534 00:52:41,453 --> 00:52:42,663 బాగానే ఉన్నావా, గాల్? 535 00:52:44,331 --> 00:52:45,916 బాగానే ఉన్నావనుకుంటాలే. 536 00:52:46,500 --> 00:52:48,210 నీకు తాళ్లు కడతా ఆగు. 537 00:52:49,336 --> 00:52:53,090 నా చిన్నప్పుడు నన్ను దేవత అనుకున్నారని నీకు చెప్పా, 538 00:52:53,173 --> 00:52:54,925 గుర్తుందా? 539 00:52:55,008 --> 00:52:59,054 మా వాళ్లు నాకు ఎంత రక్షణగా ఉన్నారంటే, నేను ఒక ఖైదీలా అనిపించింది. 540 00:52:59,680 --> 00:53:04,810 ఎక్కువ సేపు, ఒక పొడువైన పవిత్ర చెట్టు నీడలో ఒక క్రిస్టల్ ఉపరితలం మీద కూర్చుని ఉండేదాన్ని, 541 00:53:04,893 --> 00:53:06,186 ఒంటరిగా అన్నమాట. 542 00:53:08,230 --> 00:53:10,274 కొన్ని రోజులైతే యుగాల్లా అనిపించేవి. 543 00:53:12,025 --> 00:53:13,360 నా చర్మం నున్నగా అయి, 544 00:53:13,443 --> 00:53:18,323 దానికి మడతలు వచ్చాయని నేను గ్రహించిన మరుక్షణం షాక్ అయిపోయాను. 545 00:53:19,032 --> 00:53:20,117 నేను ముసలిదాన్ని అయ్యా. 546 00:53:21,952 --> 00:53:23,704 నా జీవితం ముగింపు దశకు వస్తోందని, 547 00:53:24,746 --> 00:53:28,083 అసలు జీవించే అవకాశమే నాకు దక్కలేదని, అది అస్సలు న్యాయం కాదని నాకు అనిపించింది. 548 00:53:35,883 --> 00:53:38,010 అప్పుడే నాకొక చిన్నారి తారసపడింది. 549 00:53:38,093 --> 00:53:40,137 ఆ చిన్నారిని నేను కావచ్చని అనుకున్నాను. 550 00:53:40,721 --> 00:53:45,309 నా ఆత్మని తనలోకి బదిలీ చేయడానికి నా శక్తినంతా ఉపయోగించాల్సిన పరిస్థితి. 551 00:53:45,392 --> 00:53:48,145 కానీ నా ఆత్మ ఇద్దరి దేహాలలోకి వెళ్ళలేదేమో, 552 00:53:48,228 --> 00:53:52,065 రెండు దేహాల మధ్యనే ఉండిపోతుందేమో అని భయమేసింది. 553 00:53:52,649 --> 00:53:54,151 ఒక ఏడాది పాటు సాధన చేశాను. 554 00:53:55,277 --> 00:53:58,197 చాలా భయంకరంగా ఉండింది, అయినా కానీ చిత్తశుద్ధితో సాధన చేశా. 555 00:53:59,323 --> 00:54:02,826 మనస్సులో ఏమీ లేని ఆ పాపలోకి ప్రవేశించాను. 556 00:54:04,828 --> 00:54:07,080 తను నా రెండవ అవతారం. 557 00:54:07,581 --> 00:54:09,583 ఎవరు? నువ్వు మాకు చూపిన చిన్నారా? 558 00:54:11,126 --> 00:54:13,003 తన తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిపోయారు. 559 00:54:13,629 --> 00:54:17,799 ఆ అద్భుతమైన ఘట్టంతో మా మతానికి ఒక కొత్త రక్తం వచ్చినట్టయింది. 560 00:54:18,425 --> 00:54:21,345 ప్రతి 60-70 సంవత్సరాలకి, 561 00:54:21,428 --> 00:54:24,223 నా ప్రస్తుత దేహం ముసలిది అయిపోతున్నట్టు అనిపించినప్పుడు, 562 00:54:24,306 --> 00:54:26,016 నేను వేరొక చిన్నారిని ఎంచుకుంటాను. 563 00:54:27,017 --> 00:54:32,481 అలా కొత్త అవతారమెత్తిన ప్రతిసారి నా శక్తులు మరింత పెరిగేవి. 564 00:54:32,564 --> 00:54:36,109 అనతి కాలంలోనే, నా చుట్టూ ఉన్న వాళ్లందరి మనస్సులో ఏముందో తెలుసుకోగలిగే స్థాయికి చేరుకున్నాను. 565 00:54:36,610 --> 00:54:39,029 వారి ఆలోచనలను చదవగలిగాను. వారిని అదుపులోకి తెచ్చుకోగలిగాను. 566 00:54:39,863 --> 00:54:45,160 ఒకరోజైతే, వేరే ప్రపంచాల నుండి కూడా నాకు స్వరాలు వినిపించడం మొదలయ్యాయి. 567 00:54:47,287 --> 00:54:48,997 అలా నీ స్వరం కూడా నాకు వినిపించింది, గాల్. 568 00:54:49,081 --> 00:54:52,459 ఒక శతాబ్దానికి ముందే, సినాక్స్ నుండి నీ పిలుపు వినిపించింది. 569 00:54:52,543 --> 00:54:56,255 నీలో అనంతమైన మేధస్సు ఉండింది, అది కనుమరుగైపోకూడదని నీ తాపత్రయం. 570 00:54:58,173 --> 00:55:00,175 నువ్వు ఆ గ్రహం నుండి వేరే గ్రహానికి వెళ్లాలనే ఆలోచన 571 00:55:00,259 --> 00:55:01,510 -నీ మనస్సులో నాటింది నేనే. -ఏంటి? 572 00:55:02,094 --> 00:55:04,304 అది స్వయంగా నాకు వచ్చిన ఆలోచనే. 573 00:55:04,847 --> 00:55:07,474 -నేను అబ్రాక్సాస్ ని పరిష్కరించాను, నేను… -ఇప్పుడదంతా ఎందుకులే! 574 00:55:07,558 --> 00:55:10,018 చివరికి మనం చేరవలసిన చోటుకే చేరుకుంటాం. 575 00:55:11,019 --> 00:55:13,355 తను ఏం చేస్తోమంది మీ అందరికీ? 576 00:55:13,438 --> 00:55:16,275 -కాపాడండి. -నేను ఈ పని వాళ్ల కోసమే చేస్తున్నాను. 577 00:55:16,859 --> 00:55:21,780 నీ శక్తి నాకు వచ్చాక, మా వాళ్లకు ఏం కాకుండా నేను చూసుకోగలను. 578 00:55:23,365 --> 00:55:24,741 నా పరిస్థితి ఏంటి? 579 00:55:25,242 --> 00:55:27,035 కొంత కాలం నువ్వు నాతోనే ఉంటావు. 580 00:55:27,119 --> 00:55:29,580 ఆ చిన్న పాప స్వరం కొన్నేళ్ల పాటు నాకు వినిపిస్తూనే ఉండింది, 581 00:55:29,663 --> 00:55:31,999 బావి అడుగు నుండి వచ్చే స్వరంలాగా, 582 00:55:32,082 --> 00:55:35,460 రోజురోజుకూ సన్నగిల్లుతూ, ఒకరోజు పూర్తిగా ఆగిపోయింది. 583 00:55:37,004 --> 00:55:39,006 అయినా కానీ, నేను తన స్వరం కోసం వింటూనే ఉంటా, 584 00:55:40,424 --> 00:55:42,885 నీ కోసం ఎలా అయితే వింటానో. 585 00:55:48,056 --> 00:55:51,018 మా దగ్గర ఒక వాయిద్యం ఉండేది, చాలా పాతది అన్నమాట. 586 00:55:51,101 --> 00:55:54,021 అది మనుషుల మెదడు తరంగాలతో ఆడుకుంటుంది. 587 00:55:54,104 --> 00:55:55,898 స్పష్టంగా చెప్పాలంటే, వారి మనస్సునే మార్చేసేది. 588 00:55:56,773 --> 00:55:59,735 ఈ ఈలలు ఆ వాయిద్యంలోని భాగాలే. 589 00:55:59,818 --> 00:56:01,236 విడి విడిగా వాటి వల్ల ఏ ప్రమాదమూ ఉండదు. 590 00:56:01,320 --> 00:56:04,489 మూగ సంభాషణ ఎలా చేయాలో పిల్లలకి నేర్పడానికి వీటిని ఉపయోగిస్తున్నాం. 591 00:56:05,073 --> 00:56:06,742 కానీ వాటిని ఒకేసారి వాయించామనుకో. 592 00:56:07,743 --> 00:56:09,369 అప్పుడు నువ్వేం చేయలేవు, గాల్. 593 00:56:09,453 --> 00:56:11,914 ట్యూనింగ్ ప్లేట్స్ మనిద్దరి మధ్యా వారధి ఏర్పరుస్తున్నాయి. 594 00:56:13,457 --> 00:56:14,583 కాపాడండి! 595 00:56:17,252 --> 00:56:18,754 తను ఇంత దారుణం చేస్తుంటే మీరేం చేస్తున్నారు… 596 00:56:24,384 --> 00:56:27,012 మనం ఇక్కడ ఉండకూడదు, వేకువ రాజా. 597 00:56:28,514 --> 00:56:30,724 మన సంతానాన్ని పగటి రాజు పెంచడం నాకు ఇష్టం లేదు. 598 00:56:32,935 --> 00:56:34,186 ముందు పర్వాలేదనే అనుకున్నాను, కానీ… 599 00:56:35,687 --> 00:56:38,774 ఒకవేళ పగటి రాజు చనిపోతే? నిన్ను ఇన్ ఛార్జీగా పెట్టి వెళ్లాడు కదా. 600 00:56:39,900 --> 00:56:42,569 -ఇంకో పగటి రాజును క్లోన్ చేస్తారంతే. -అప్పుడు ఎక్స్ పొనెంట్స్ ని నాశనం చేద్దాం. 601 00:56:43,779 --> 00:56:46,073 అతని స్థానంలో రావడానికి ఒక్క క్లోన్ కూడా మిగలకపోతే… 602 00:56:47,908 --> 00:56:48,909 మనం స్వేచ్ఛగా ఉండగలం. 603 00:56:50,369 --> 00:56:51,662 కాదు. వాళ్లు… 604 00:56:53,330 --> 00:56:55,541 వాళ్లు కేవలం మాంసపు ముద్దలు మాత్రమే కాదు, వాళ్లు… 605 00:56:55,624 --> 00:56:57,376 వాళ్లు నాకు సోదరులే. 606 00:56:58,919 --> 00:57:00,254 నేను అంత సాహసం చేద్దామనుకున్నా కానీ, 607 00:57:00,337 --> 00:57:01,588 డెమెర్జల్ అడ్డుకుంటుంది. 608 00:57:03,131 --> 00:57:05,634 జన్యు ఆధారిత వంశాన్ని కాపాడిన బాధ్యత తనదే. 609 00:57:06,760 --> 00:57:07,970 అది తన ప్రోగ్రామింగ్ లోనే ఉంది. 610 00:57:08,720 --> 00:57:10,764 కానీ తనని అలా ప్రోగ్రామ్ చేసింది ఎవరు? 611 00:57:18,605 --> 00:57:19,815 టర్మినస్ వేచి ఉంది. 612 00:57:29,491 --> 00:57:31,994 ఇది నేను చేయాల్సిన కార్యం, డెమెర్జల్. 613 00:57:34,913 --> 00:57:35,998 అసలేంటి ఈ చోటు? 614 00:57:37,165 --> 00:57:38,584 దీని ఉద్దేశం ఏదైనా కానీ, 615 00:57:39,084 --> 00:57:41,795 దీన్ని రహస్యంగా ఉంచడానికి డెమెర్జల్ చాలా కష్టపడింది. 616 00:57:43,797 --> 00:57:45,841 మేము స్వతంత్రులమని, మొదటి క్లియాన్ కి స్వచ్ఛమైన క్లోన్లమని, 617 00:57:45,924 --> 00:57:49,094 డెమెర్జల్ మాకు సేవలందిస్తోందని నేను నమ్ముతూ వచ్చాను. 618 00:57:49,970 --> 00:57:52,890 కానీ నిజానికి, డెమెర్జల్ సేవలన్నీ అతనికేనేమో. 619 00:57:56,018 --> 00:57:57,311 రాత్రి రాజు నిజమే చెప్పాడు. 620 00:57:59,855 --> 00:58:01,857 మనం ఒకేసారి చాలా విషయాల్లో దూరేస్తున్నాం. 621 00:58:02,858 --> 00:58:04,193 అది సురక్షితం కాదనుకుంటా. 622 00:58:05,110 --> 00:58:06,278 అతనికి కానీ, నాకు కానీ. 623 00:58:06,361 --> 00:58:08,197 పగటి రాజుకు కూడా సురక్షితం కాదనే అనుకుంటా. 624 00:58:08,280 --> 00:58:11,491 మీరందరూ తోలుబొమ్మలు మాత్రమే. అది మాత్రం స్పష్టంగా తెలిసిపోతోంది. 625 00:58:13,660 --> 00:58:18,081 డెమెర్జల్ పుట్టు పూర్వోత్తరాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. 626 00:58:20,375 --> 00:58:23,337 ఈ చోటును అనేక రకాలుగా ఉపయోగించాలని భావించారు, 627 00:58:24,254 --> 00:58:27,257 కానీ నిజానికి ఇది ఒక జైలు. 628 00:58:29,092 --> 00:58:32,638 స్వాగతం, పదహారవ క్లియాన్. 629 00:58:36,642 --> 00:58:40,103 మేమందరమూ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఏమేం చూస్తూ ఉంటావా అని చాలాసార్లు ఆలోచించాను. 630 00:58:42,564 --> 00:58:43,982 మేమందరమూ వాటిని మిస్ అవుతాం కదా. 631 00:58:46,109 --> 00:58:47,819 ఏ ఆలోచనలు నిన్ను నీడలా వెంటాడుతుంటాయా అని. 632 00:58:49,821 --> 00:58:50,948 ఎవరికి జైలు? 633 00:58:54,326 --> 00:58:57,788 అసలైన అధికారం మీ ముగ్గురి దగ్గరా లేదు. 634 00:58:59,748 --> 00:59:02,000 డెమెర్జలే క్లియాన్ కి ఏకైక వారసురాలు. 635 00:59:07,172 --> 00:59:08,632 అతని శాశ్వత మహారాణి. 636 01:00:09,401 --> 01:00:11,403 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్