1 00:00:42,960 --> 00:00:45,462 కష్ట కాలం, మిత్రులారా. కష్ట కాలం. 2 00:00:45,546 --> 00:00:46,630 అవును. 3 00:00:46,713 --> 00:00:50,133 ఈరాత్రికి మనం పుల్లలని తినాల్సి వస్తున్నందుకు మన్నించాలి, మిత్రులారా. 4 00:00:52,177 --> 00:00:54,888 నా జీవితంలో ఇంతటి దుస్థితికి నేనెప్పుడూ చేరుకోలేదు. 5 00:00:54,972 --> 00:00:58,183 అవును. ఇంతటి దుస్థితికి మనం ఎప్పుడూ చేరుకోలేదు. 6 00:00:58,267 --> 00:00:59,977 ఊరికే కూర్చోవడం, పుల్లలను తినడం. 7 00:01:00,060 --> 00:01:02,229 కానీ, తర్వాత చక్కని ఆహారం తిందాములే. 8 00:01:02,312 --> 00:01:04,522 - ఏంటి ఆ చక్కని ఆహారం? - రెమ్మలు. 9 00:01:05,315 --> 00:01:06,483 రెమ్మలని కూడా ఆహారం అంటారా? 10 00:01:06,567 --> 00:01:09,069 పుల్లలని తిన్న తర్వాత, రెమ్మలని చూస్తే బిర్యానీలా కనిపిస్తాయి. 11 00:01:09,653 --> 00:01:11,613 విడ్జిట్, ఇక్కడి నుండి ఎప్పుడు బయటపడతాం మనం? 12 00:01:11,697 --> 00:01:15,367 లింటెల్ బీమ్లు ఇప్పుడు వినియోగంలో ఉన్నాయి కాబట్టి, 13 00:01:15,450 --> 00:01:17,536 త్వరలోనే, మనం ప్రయాణించడానికి వీలుగా 14 00:01:17,619 --> 00:01:19,913 అనేక ద్వారాలు తెరుచుకుంటాయి. 15 00:01:19,997 --> 00:01:22,833 వీటిలోని కొన్ని ద్వారాలు మనల్ని నీ కాలానికి కానీ, లేదా నీ ఇంటికి కానీ, 16 00:01:22,916 --> 00:01:25,544 లేదా ఆ రెంటిలో ఏదోక దానికి సమీపానికి కానీ తీసుకెళ్ళవచ్చు. 17 00:01:25,627 --> 00:01:28,964 సరే మరి. ఒకవేళ విడ్జిట్ అంచనా నిజమైనదే అయితే, అప్పుడు మనం కెవిన్ ని ఇంట్లో దింపేసి, 18 00:01:29,047 --> 00:01:31,049 అతని తల్లిదండ్రులని కాపాడి, వాళ్ల ఆహారాన్ని దొంగిలించవచ్చు. 19 00:01:31,133 --> 00:01:33,343 దొంగిలించడం ఎందుకు? చక్కగా తినవచ్చు కదా. 20 00:01:33,927 --> 00:01:35,387 లేదు, మేము దొంగిలిస్తాం. 21 00:01:35,888 --> 00:01:37,014 సరే. 22 00:01:37,097 --> 00:01:38,599 ఆ తర్వాత మేము పారిపోతాం. 23 00:01:38,682 --> 00:01:41,018 - ఎప్పుడూ పారిపోతూనే ఉంటాం. - మా పనే అది. 24 00:01:41,101 --> 00:01:43,312 అయితే, మీరు ఎల్లకాలం సుప్రీమ్ బీయింగ్ నుండి పారిపోతూనే ఉంటారా? 25 00:01:43,395 --> 00:01:44,229 ఎప్పటికీ? 26 00:01:44,313 --> 00:01:46,523 మేము అతడిని ఒకటి కన్నా ఎక్కువ సార్లు బురిడీ కొట్టించాంగా. 27 00:01:46,607 --> 00:01:48,025 - రెండు సార్లే. - రెండు సార్లే. 28 00:01:48,108 --> 00:01:49,651 మేము అతడిని బురిడీ కొట్టిస్తూనే ఉంటాం. 29 00:01:49,735 --> 00:01:51,737 ఆయన మమ్మల్ని ఎప్పటికీ పట్టుకోలేడు. 30 00:01:51,820 --> 00:01:55,115 నేను సుప్రీమ్ బీయింగ్ ని. 31 00:01:57,618 --> 00:02:00,787 నా ముందు మోకరిల్లండి! 32 00:02:00,871 --> 00:02:02,706 నన్ను చూసి భయపడండి! 33 00:02:02,789 --> 00:02:04,333 - నా దగ్గర ఒక ప్లాన్ ఉంది! - పరుగెత్తడమా? 34 00:02:04,416 --> 00:02:05,542 - పరుగెత్తడమా? - ఎక్కువ పరుగెత్తడమా? 35 00:02:05,626 --> 00:02:09,463 మనం ఎప్పుడూ పరుగెత్తుతూనే ఉండం కదా, కానీ ఇప్పుడు మనం వేగంగా వెనక్కి తగ్గాలి. 36 00:02:09,545 --> 00:02:11,715 మీరు నన్ను మోసం చేశారు. 37 00:02:11,798 --> 00:02:15,177 నా దాన్ని నాకు ఇచ్చేయండి. 38 00:02:15,260 --> 00:02:17,221 - జూడీ, మనం వెళ్లిపోవాలి… - ఇప్పుడు భయపడండి. 39 00:02:17,304 --> 00:02:19,056 - వద్దు, జూడీ! - భయపడండి. 40 00:02:19,139 --> 00:02:20,015 ఏం జరుగుతోంది? 41 00:02:20,098 --> 00:02:23,810 - నన్ను చూసి భయపడండి! - నువ్వు ఉప్పు అయిపోతావు, జూడీ! 42 00:02:23,894 --> 00:02:26,271 - నా దగ్గరికి రావద్దు. - మిత్రులారా, అది సుప్రీమ్ బీయింగ్ లా అనిపించట్లేదు… 43 00:02:26,355 --> 00:02:28,232 నేను సుప్రీమ్ బీయింగ్ ని. 44 00:02:30,025 --> 00:02:33,487 నా ముందు మోకరిల్లండి. 45 00:02:33,570 --> 00:02:35,197 నేను సుప్రీమ్ బీయింగ్ ని. 46 00:02:36,573 --> 00:02:37,699 నేను సుప్రీమ్ బీయింగ్ ని. 47 00:02:39,159 --> 00:02:40,702 అతను సుప్రీమ్ బీయింగా? 48 00:02:40,786 --> 00:02:44,331 లేదు, అతను సుప్రీమ్ బీయింగ్ కి సహాయంగా ఉండే చెంచాగాడు. 49 00:02:44,414 --> 00:02:45,791 - కాదు, సలహాదారుడిని. - హా… సరే. 50 00:02:45,874 --> 00:02:49,586 సుప్రీమ్ బీయింగ్ కి మ్యాప్ ఇవ్వకండి అతనికి మ్యాప్ ఇవ్వకండి. 51 00:02:50,170 --> 00:02:51,839 జూడీ, ఇది రివర్స్ సైకాలజీయా? 52 00:02:51,922 --> 00:02:52,840 ఏం జరుగుతోంది? 53 00:02:52,923 --> 00:02:53,966 నిజానికి నాకు కూడా తెలీదు. 54 00:02:54,049 --> 00:02:56,093 అతను చాలా చాలా పెద్ద దుష్ట ప్లాన్ వేస్తున్నాడు. 55 00:02:56,176 --> 00:02:57,970 - ఏం అంటున్నావు నువ్వు? - ఏం అంటున్నావు నువ్వు? 56 00:02:58,053 --> 00:02:59,388 అది నేను చెప్పలేను. అది దుష్ట ప్లాన్. అతను… 57 00:02:59,471 --> 00:03:00,305 - ఏంటి? - అతను ఏంటి? 58 00:03:00,389 --> 00:03:03,016 అది నేను చెప్పలేదు. నేను మీకు ఏమీ చెప్పలేదు. 59 00:03:03,100 --> 00:03:04,560 - ఏంటి? - ద్వారం. 60 00:03:04,643 --> 00:03:06,270 అతనికి మ్యాప్ దక్కకుండా చూసుకోండి. 61 00:03:06,353 --> 00:03:07,187 వెళ్లిపోండి ఇక్కడి నుండి. 62 00:03:07,271 --> 00:03:08,939 మ్యాప్ ని తీసుకొని, వెళ్లిపోండి. 63 00:03:11,483 --> 00:03:12,734 అతనికి మ్యాప్ దక్కకుండా చూసుకోండి! 64 00:03:19,408 --> 00:03:21,243 ఆ సలహాదారుడు ఏం చెప్తున్నాడు? 65 00:03:21,326 --> 00:03:22,160 సారీ, అమ్మా. 66 00:03:22,244 --> 00:03:24,037 ఏదో మభ్యపెట్టాలని చూస్తున్నాడు, అంతకు మించీ ఏం లేదు. 67 00:03:24,121 --> 00:03:27,165 - ఏదో విషయంలో వాళ్లు కలత చెందినట్టున్నారు. - అవును, వాళ్లకి నేనంటే భయం. 68 00:03:27,249 --> 00:03:29,126 నిన్ను చూసి వాళ్లకి ఎందుకు భయం? ఎప్పుడూ పారిపోతూనే ఉంటావుగా. 69 00:03:29,209 --> 00:03:30,377 మొదట్నుంచీ నేను పారిపోతూనే ఉన్నానా ఏంటి? 70 00:03:30,460 --> 00:03:32,212 బహుశా బాగా పరుగెత్తడం వల్ల వాళ్ల కాళ్లు మొద్దుబారిపోయాయేమో. 71 00:03:32,296 --> 00:03:33,964 మొదట్నుంచీ నేనేం పారిపోయేదాన్ని కాదు. 72 00:03:34,047 --> 00:03:36,633 నాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలీట్లేదు. 73 00:03:37,801 --> 00:03:40,012 - అదుగో నీ ఇల్లు. - కాదు. మీరు నా ఇంటిని చూశారు. 74 00:03:40,095 --> 00:03:41,346 అది డెడ్ ఎండ్ లో ఉంటుంది. 75 00:03:41,430 --> 00:03:43,432 మీ ఇంటి బయట ఎలా ఉంటుందో నేను చూడలేదు కదా? 76 00:03:43,515 --> 00:03:44,975 ఈ ఇంటికి, మా ఇంటికి అసలు పోలికే లేదు. 77 00:03:45,058 --> 00:03:46,643 మీ అమ్మానాన్నలు మరమ్మత్తులు ఏమైనా చేశారేమో. 78 00:03:46,727 --> 00:03:48,395 లోపల చిన్న పార్టీ ఏదో జరుగుతున్నట్టుంది. 79 00:03:48,478 --> 00:03:49,688 ఇది నా ఇల్లు కాదు. 80 00:03:49,771 --> 00:03:52,191 అవును. మీ ఇంటికి, ఈ చోటుకు మధ్య కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది. 81 00:03:52,274 --> 00:03:53,984 - విడ్జిట్? నాకేం అనిపిస్తోందంటే… - ఏంటి? 82 00:03:54,067 --> 00:03:55,569 కొన్ని శతాబ్దాల వ్యత్యాసం కూడా ఉంది. 83 00:04:00,115 --> 00:04:01,992 మనం జార్జియన్ ఇంగ్లండ్ కాలానికి వచ్చినట్టున్నాం. 84 00:04:02,075 --> 00:04:04,203 సరైన దేశానికే తీసుకొచ్చా కాబట్టి, కాస్తయినా మెచ్చుకోండి. 85 00:04:04,286 --> 00:04:05,913 జార్జియన్ ఇంగ్లండ్ కాలమా? నిజంగానా? 86 00:04:05,996 --> 00:04:06,997 చాలా పెద్ద పెద్ద నాటికలు ఉంటాయి. 87 00:04:07,080 --> 00:04:08,540 వాటిని చూడటానికి జనాలు ఎక్కడెక్కడి నుండో వస్తారు. 88 00:04:08,624 --> 00:04:11,168 - ఇది చాలా గొప్ప విషయం. నాకు ఇది బాగా సెట్ అవుతుంది. - నాకు ఆకలిగా ఉంది. 89 00:04:11,251 --> 00:04:13,170 - నాకు కూడా - హా, నాకు కూడా. 90 00:04:13,253 --> 00:04:15,464 హా. ఇక్కడ పార్టీ జరుగుతోంది. ఆహారం కూడా ఉంటుంది. 91 00:04:15,547 --> 00:04:16,380 హా. 92 00:04:18,716 --> 00:04:22,012 ఆ వేషాలతో ఇక్కడికి రాకూడదు. 93 00:04:29,645 --> 00:04:30,521 కాసనోవా. 94 00:04:31,813 --> 00:04:33,315 అతను కాసనోవా. 95 00:04:59,967 --> 00:05:01,468 మిస్టర్ కాసనోవా. 96 00:05:01,552 --> 00:05:05,973 సరే, మీరు వెనుక వైపు నుండి లోపలికి ఎలా వెళ్లాలో చూడండి, మేము వేసుకోవడానికి బట్టలేవైనా దొంగిలించి తెస్తాం. 97 00:05:06,557 --> 00:05:09,393 అయ్యయ్యో. మీకు బాగా ఉక్క పోస్తున్నట్టుంది… ఇది తీస్తాను ఆగండి. 98 00:05:20,070 --> 00:05:21,405 అది టర్న్ స్పిట్ జాతి కుక్క. 99 00:05:21,488 --> 00:05:23,156 హా, ఆ వింత కుక్కని తినాలని నాకు లేదు. 100 00:05:23,240 --> 00:05:25,409 - ఆ చెత్త కుక్కని నేను తినను. - లేదు, దాన్ని మనం తినం. 101 00:05:25,492 --> 00:05:29,371 అది ఆ హ్యామ్ స్టర్ చక్రాన్ని తిప్పుతుంది, దానితో ఆహారం అంతా సమంగా ఉడుకుతుంది. 102 00:05:29,454 --> 00:05:30,664 కెవిన్, ఈ సోదంతా అక్కర్లేదు. 103 00:05:37,421 --> 00:05:38,589 బాబోయ్. 104 00:05:39,798 --> 00:05:41,216 పదండి. పదండి, పదండి. 105 00:05:44,428 --> 00:05:46,847 మనం పార్టీలోకి తప్పక వెళ్తాం, ఆల్టో. అందుకు నాదీ పూచీ. 106 00:05:46,930 --> 00:05:49,808 నువ్వు బాగానే ఉన్నావా? ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. 107 00:05:50,309 --> 00:05:52,102 బయటకు రా. స్వేచ్ఛగా తిరుగు. 108 00:05:52,936 --> 00:05:55,314 కెవిన్, ఆ విచిత్రమైన కుక్కని ఎవరూ తినరులే. 109 00:05:55,397 --> 00:05:56,231 లోపలికి రా. 110 00:06:07,242 --> 00:06:08,118 అంతే. 111 00:06:09,328 --> 00:06:10,412 ఓకేనా? 112 00:06:23,967 --> 00:06:24,968 నా వాళ్లు. 113 00:06:28,555 --> 00:06:30,307 దేవుడా. మీకు అది కనిపిస్తోందా? 114 00:06:30,390 --> 00:06:32,184 - పద్దెనిమిదవ శతాబ్దమా? - విగ్గులా? 115 00:06:32,267 --> 00:06:34,353 - అణిచిపెట్టుకున్న ఫీలింగ్సా? - నాలా ఎవరూ లేరనే విషయాన్నా? 116 00:06:34,436 --> 00:06:36,855 ఆహారాన్ని. ఇక్కడికి ఎందుకు వచ్చామో మర్చిపోయారా? 117 00:06:36,939 --> 00:06:38,398 - ఆహారం కోసం. - దేవుడా… 118 00:06:47,908 --> 00:06:49,535 ఏం చేస్తున్నావు, పిల్లోడా? 119 00:06:51,495 --> 00:06:53,455 మన్నించండి. నేనేమీ తినట్లేదు. 120 00:06:53,539 --> 00:06:56,166 నువ్వు నా శాండ్విచ్ లని తినాలని అనుకోలేదా? 121 00:06:56,250 --> 00:06:58,418 ఇవన్నీ మీ శాండ్విచ్ లా? 122 00:06:58,502 --> 00:07:00,087 ఇది పైన్ యాపిల్ పార్టీయే, 123 00:07:00,170 --> 00:07:02,381 కానీ అది జనాలను పార్టీకి వచ్చేలా చేస్తుంది అంతే. 124 00:07:02,464 --> 00:07:04,633 ఒకసారి వాళ్లు వచ్చాక, బ్రెడ్ ముక్కల మధ్యలో 125 00:07:04,716 --> 00:07:08,178 మాంసాన్ని పెట్టి ఉండే, నేను కనిపెట్టిన సరికొత్త ఆహారం రుచి చూసి, మాయామోహితులు అయిపోతారు. 126 00:07:08,262 --> 00:07:10,264 - అయితే, మీరేనా ఎర్ల్ ఆఫ్ శాండ్విచ్ అంటే? - నేనెవరో నీకు తెలుసే. 127 00:07:10,347 --> 00:07:13,976 అవును, నేను కనిపెట్టిన ఈ కొత్త ఆహారానికి, నా పేరైన ఎర్ల్ ఆఫ్ శాండ్విచ్ పెట్టాను. 128 00:07:14,059 --> 00:07:16,728 దాని కథ నీకు చెప్తూ ఉంటా, నువ్వు తింటూ ఉండు. 129 00:07:19,815 --> 00:07:20,899 నేను గుర్రపు స్వారీ చేస్తూ ఉన్నా. 130 00:07:22,234 --> 00:07:25,445 గుర్రపు పగ్గాలు నా చేతుల్లో ఉన్నాయి కాబట్టి, నా చేతులు ఖాళీగా లేవు. 131 00:07:25,529 --> 00:07:28,073 అక్కడ నక్క పరుగెడుతోంది. అదుగోండి నక్క! 132 00:07:29,032 --> 00:07:30,659 చల్, బాద్షా. 133 00:07:31,368 --> 00:07:33,453 నా కడుపు ఖాళీగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? 134 00:07:33,537 --> 00:07:34,371 కంగారు అక్కర్లేదు. 135 00:07:34,454 --> 00:07:38,333 "శాండ్విచ్" పుణ్యమా అని నేను గుర్రపు స్వారీ చేస్తూనే, తినవచ్చు. 136 00:07:39,585 --> 00:07:41,879 ఇప్పుడు నేను కార్డ్ ముక్కలాట ఆడుతున్నాను. 137 00:07:42,462 --> 00:07:46,258 నాకు జోకర్ కావాలి, అదే సమయంలో నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. 138 00:07:46,341 --> 00:07:48,969 అంతా ఆ టేబుల్ దగ్గరే సెట్ చేసుకొని, తినవచ్చు కదా? 139 00:07:49,052 --> 00:07:51,555 ఈ చేత్తో, నేను గట్టిగా చరిచి, 140 00:07:51,638 --> 00:07:54,892 "షో" అని గట్టిగా అరిచి, ఆ సన్నాసి నుండి గెలుచుకొన్న డబ్బును తీసుకుంటా. 141 00:07:55,517 --> 00:07:57,060 అదరగొట్టేశా మరి, బంగారం. 142 00:07:57,144 --> 00:07:58,729 నా భార్యను మళ్లీ గెలుచుకున్నా. 143 00:07:59,813 --> 00:08:02,065 అదృష్టవశాత్తూ, నేను ప్యాక్ చేసుకున్నాను… 144 00:08:02,733 --> 00:08:05,068 - శాండ్విచ్ ని. - అవును. ఇప్పటి దాకా ఏమైనా సందేహాలు కలిగాయా? 145 00:08:05,152 --> 00:08:08,113 కొందరు అంటుంటారు, నిజంగా శాండ్విచ్ ని కనిపెట్టింది… 146 00:08:08,197 --> 00:08:09,573 ఎవరు? 147 00:08:11,366 --> 00:08:12,743 - మీరే అని. - అవును. 148 00:08:12,826 --> 00:08:16,705 సాధారణంగా చెప్పాలంటే, ఏ పరిస్థితిలో అయినా ఆరాంగా తినగల ఆహారాన్ని కనిపెట్టాను కదా, అది జనాలకు నచ్చేసింది. 149 00:08:17,289 --> 00:08:19,499 ఏదేమైనా, నాకు పనుంది, నేను వెళ్తా. 150 00:08:20,626 --> 00:08:22,211 పైన్ యాపిల్ ని చూపెట్టాల్సిన సమయం వచ్చేస్తోంది. 151 00:08:25,422 --> 00:08:26,673 ఎవరు అతను? 152 00:08:26,757 --> 00:08:31,011 అతను ఎర్ల్ ఆఫ్ శాండ్విచ్. శాండ్విచ్ ని "కనిపెట్టింది" తానే అని చెప్పుకుంటుంటాడు. 153 00:08:31,595 --> 00:08:33,347 హా, నేను నీటిని కనిపెట్టాను. 154 00:08:33,429 --> 00:08:34,681 అవును. 155 00:08:35,432 --> 00:08:36,308 తనే కనిపెట్టిందా? 156 00:08:49,488 --> 00:08:53,075 నటనలోని రహస్యం ఏంటంటే, మాటల రూపంలో కాకుండా, హావభావాలతో మన అంతరంగాన్ని వ్యక్తపరచడం. 157 00:08:53,158 --> 00:08:54,910 ఉదాహరణకు, బార్డ్ రాసిన "హాం-ఫ్లెట్" నే తీసుకుందాం. 158 00:08:54,993 --> 00:08:57,538 కనుబొమలతోనే "హాం-ఫ్లెట్"ని వ్యక్తపరచవచ్చు. 159 00:08:57,621 --> 00:09:00,123 అది… అది అసలైన నటన అంటే. 160 00:09:00,207 --> 00:09:01,416 మీకు చూపిస్తాను ఆగండి. 161 00:09:07,631 --> 00:09:10,342 "ఏ దారిని ఎంచుకోవాలి: 162 00:09:12,970 --> 00:09:14,888 అనేదే ప్రశ్న. 163 00:09:17,558 --> 00:09:19,768 మనస్సును శాంతపరుచుకొని 164 00:09:20,477 --> 00:09:23,647 ఎనలేని బాణాలు, ఆయుధాల ధాటిని తట్టుకొని… 165 00:09:25,566 --> 00:09:27,901 ధైర్యంగా నిలబడాలా, 166 00:09:28,861 --> 00:09:29,903 లేదా ఆయుధం చేతపట్టి… 167 00:09:32,197 --> 00:09:34,533 ఎనలేని సమస్యలను ఎదిరించాలా? 168 00:09:35,576 --> 00:09:37,494 వాటిని ఎదిరించి, వాటికి ముగింపు పలకాలా? 169 00:09:38,245 --> 00:09:42,124 చావాలా, పడుకోవాలా… పడుకోవాలా? 170 00:09:43,750 --> 00:09:46,128 కల కనే అవకాశం. 171 00:09:46,837 --> 00:09:50,424 అహా, లేచి కనులు రుద్దుకుంటున్నాడు." 172 00:09:53,427 --> 00:09:54,428 శభాష్! 173 00:09:56,680 --> 00:09:59,433 కనుబొమలతో చాలా బాగా నటించావు. 174 00:09:59,516 --> 00:10:00,601 చాలా గొప్ప నటుడివి నువ్వు. 175 00:10:00,684 --> 00:10:02,686 నేను అదే అనుకుంటుంటా. ఇతరుల నుండి ఆ మాటలను ఇప్పటికి వింటున్నా. 176 00:10:02,769 --> 00:10:05,189 నన్ను నేను పరిచయం చేసుకోవాలి. నా పేరు మార్తా. 177 00:10:05,272 --> 00:10:08,525 థియేటర్ రోయల్ డ్రూరీ లేన్ కి నేను మేనేజర్ ని. 178 00:10:08,609 --> 00:10:11,361 ఇక నేరుగా విషయానికి వస్తున్నా: నేను ఒక నాటికని నిర్వహిస్తున్నా. 179 00:10:11,445 --> 00:10:15,073 అందులో నీకు ఒక పాత్ర ఉంది. దానికి నువ్వు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు. 180 00:10:15,157 --> 00:10:16,200 ఆ పాత్రని నువ్వే పోషించాలి. 181 00:10:16,992 --> 00:10:19,244 - ఏంటి ఆ పాత్ర? - అందరికన్నా ముఖ్యమైన పాత్ర. 182 00:10:19,328 --> 00:10:22,789 రేపు ఉదయం రిహార్సల్ జరుగుతుంది, అక్కడ కలుసుకుందాం. 183 00:10:22,873 --> 00:10:24,208 అప్పటి దాకా, నా అభిమాన నాయకా… 184 00:10:24,291 --> 00:10:25,542 - చెప్పు. - ఉంటాను. 185 00:10:25,626 --> 00:10:26,877 - జాగ్రత్త. - బై. 186 00:10:26,960 --> 00:10:28,128 బై. 187 00:10:28,212 --> 00:10:29,880 పక్కకి జరుగు. 188 00:10:45,145 --> 00:10:46,188 హలో. 189 00:10:46,271 --> 00:10:47,356 హలో. 190 00:10:48,398 --> 00:10:50,317 వింతగా ఉంది. మామూలుగా అయితే అదే చాలు. 191 00:10:51,360 --> 00:10:52,903 - "హలో" చెప్పడమా? - అవును. 192 00:10:53,654 --> 00:10:55,405 అయినా కానీ, నువ్వు స్పృహ తప్పలేదు. 193 00:10:57,199 --> 00:10:59,034 అసలు వాడెవడు? 194 00:10:59,117 --> 00:11:00,786 అతను కాసనోవా. 195 00:11:01,370 --> 00:11:02,621 ఏ విషయంలో వాడు గొప్ప? 196 00:11:02,704 --> 00:11:04,456 వేలాది సంఖ్యలో మహిళలని ఆకర్షించడంలో. 197 00:11:05,874 --> 00:11:06,917 స్పృహ కోల్పోయింది. 198 00:11:07,000 --> 00:11:08,585 - ఇంకే విషయంలో గొప్ప? - అంతే. 199 00:11:08,669 --> 00:11:11,046 అతను ఏ విషయంలో గొప్పవాడు అవ్వడం వల్ల అంత మంది ఆకర్షితులు అవుతున్నారు? 200 00:11:11,129 --> 00:11:12,422 వందలాది మహిళను ఆకర్షించడంలో. 201 00:11:12,506 --> 00:11:15,217 కానీ, మొదట ఆ వందలాది మహిళలు అసలు అతడిని చూసి ఎలా ఆకర్షితులయ్యారు? 202 00:11:15,300 --> 00:11:17,511 ఏం చెప్పాలో నాకు తెలీట్లేదు, బిటెలిగ్. 203 00:11:18,262 --> 00:11:21,557 ప్రపంచంలో నన్ను మించిన ప్రేమికుడు ఎవరూ లేరు. 204 00:11:21,640 --> 00:11:23,767 ఆ పేరు నీకు నువ్వే ఇచ్చుకున్నావా, 205 00:11:23,851 --> 00:11:25,060 లేదా ఇంకెవరైనా పెట్టారా? 206 00:11:27,271 --> 00:11:31,191 నన్ను కోరుకునే మహిళలకు నేను ఆకర్షితుడిని అవ్వను. 207 00:11:31,275 --> 00:11:36,905 కానీ నీ వల్ల, ఇప్పటిదాకా నాకు అనిపించని కొత్త ఫీలింగ్ నాకు కలుగుతోంది. 208 00:11:39,491 --> 00:11:41,910 బిటెలిగ్, ఇలా రా. నీకు ఒకటి చూపించాలి. 209 00:11:45,497 --> 00:11:46,623 థ్యాంక్యూ, విడ్జిట్. 210 00:11:49,418 --> 00:11:52,671 ఈ మామూలు, అసాధారణ మ్యాప్ ని చూడండి. 211 00:11:53,839 --> 00:11:55,382 ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా… 212 00:11:57,217 --> 00:11:58,385 ఇప్పుడు మాయమైపోయింది. 213 00:11:59,887 --> 00:12:00,804 విడ్జిట్. 214 00:12:01,513 --> 00:12:04,516 - అదుగో, అక్కడ ఉంది. - అది ఎలా చేయాలో నాకు కూడా నేర్పించండి. 215 00:12:04,600 --> 00:12:07,519 నవ్వావా? నువ్వు నవ్వుతున్నావా, కెవిన్? 216 00:12:08,437 --> 00:12:11,481 ఈ మధ్య బాధగా ఉంటున్నావని గమించాను. 217 00:12:11,565 --> 00:12:13,192 - అవును. - ఎందుకు? 218 00:12:13,692 --> 00:12:14,860 మా అమ్మానాన్నలు చనిపోయారు 219 00:12:15,611 --> 00:12:16,737 అవును. 220 00:12:18,906 --> 00:12:21,909 దాని సంగతి చూడమని నా కత్తిలాంటి మనుషులకి చెప్పాను. 221 00:12:21,992 --> 00:12:23,577 అవునా? మీ కత్తిలాంటి మనుషులా? 222 00:12:24,411 --> 00:12:26,872 - అవును, మేమే. - అవును, అవును. 223 00:12:26,955 --> 00:12:30,375 - ఇదుగో ఒక పైన్ యాపిల్ ముక్క తిను. తీసుకో. - థ్యాంక్స్. 224 00:12:31,126 --> 00:12:34,880 కెవిన్, నాకు ఇష్టమైన స్పూన్ ని నీకు చూపించానా? 225 00:12:35,547 --> 00:12:37,549 అయిదు ఉంటే బాగుంటుందని నీకు అనిపించలేదా? 226 00:12:37,633 --> 00:12:39,343 - సిద్ధమా? - సూపర్. 227 00:12:39,426 --> 00:12:41,595 - వావ్. - వీటిని నేను దొంగిలిస్తున్నా. 228 00:12:43,514 --> 00:12:44,765 - ఇంకా స్పూన్స్ కావాలి. - ఇంకానా? 229 00:12:44,848 --> 00:12:45,849 దొంగిలిద్దాం. 230 00:12:45,933 --> 00:12:47,226 - పద. - పెద్దవి దొంగిలించండి. 231 00:12:47,309 --> 00:12:48,310 - పెద్దవా? - హా. 232 00:12:48,393 --> 00:12:49,228 థ్యాంక్యూ. 233 00:12:54,399 --> 00:12:55,901 అందరూ స్పూన్లను దొంగిలించండి. 234 00:12:55,984 --> 00:13:01,740 స్పూన్స్. టైమ్ ట్రావెల్ చేసే వీలు వాళ్లకి ఉంది, 235 00:13:01,823 --> 00:13:04,284 కానీ వాళ్లు దాన్ని స్పూన్స్ ని దొంగిలించడానికి వాడుతున్నారు. 236 00:13:04,368 --> 00:13:07,663 కత్తులని, ఫోర్కులని దొంగిలించారంటే అర్థం చేసుకోవచ్చు. అవి పదునుగా ఉంటాయి. 237 00:13:09,456 --> 00:13:10,457 అవి కూసుగా ఉంటాయి. 238 00:13:13,001 --> 00:13:14,795 హా, నాకు తెలుసు. స్పూన్స్ కూడా ప్రమాదకరమైనవి కావచ్చు. 239 00:13:14,878 --> 00:13:16,255 హా, ఉదాహరణకి, వాటిని కడిగేటప్పుడు. 240 00:13:16,338 --> 00:13:19,258 నీళ్లు పడాల్సిన యాంగిల్ లో కాకుండా వేరే యాంగిల్ లో పడితే, అవి చుట్టూరా చిందుతాయి. 241 00:13:19,341 --> 00:13:23,512 హా, నాకు స్పూన్స్ భయంకరమైనవి కావచ్చని అనిపిస్తోంది. 242 00:13:28,141 --> 00:13:31,228 క్రూరత్వానికి ప్రతిరూపం నేను. నేను చెప్పిన దాన్ని ఎప్పటికీ సరిదిద్దవద్దు. 243 00:13:31,812 --> 00:13:33,522 నేను మీరు చెప్పినదాన్ని సరిదిద్దలేదు. నేను… 244 00:13:41,530 --> 00:13:44,032 అందరూ, నిశ్శబ్దంగా ఉండండి. 245 00:13:44,116 --> 00:13:45,200 డెరెక్, ప్లీజ్. 246 00:13:45,284 --> 00:13:46,201 మళ్లీ నేనే. 247 00:13:46,285 --> 00:13:48,120 శాండ్విచ్ ని కనిపెట్టిన, ఎర్ల్ ఆఫ్ శాండ్విచ్ ని. 248 00:13:48,912 --> 00:13:54,459 పైన్ యాపిల్ ని… చూసే సమయం వచ్చేసింది. 249 00:13:55,127 --> 00:13:56,295 నా వెంటే రండి. 250 00:13:58,046 --> 00:13:58,881 ఏవండి. 251 00:13:58,964 --> 00:14:02,926 - దీన్ని పైన్ యాపిల్ పార్టీ అని ఎందుకు అంటున్నారు? - ఇక్కడ నిజమైన పైన్ యాపిల్ ఉంది కాబట్టి. 252 00:14:03,010 --> 00:14:04,803 సారీ, ఇలా కాదు వెళ్లాల్సింది. పెద్ద ఇల్లు కదా, దారి తప్పా. 253 00:14:11,560 --> 00:14:13,353 భయంకరం, దారుణం, 254 00:14:13,437 --> 00:14:14,938 ఇది చాలా పెద్ద నేరం. 255 00:14:15,022 --> 00:14:16,565 మేము పైన్ యాపిల్ ని తినకూడదా? 256 00:14:16,648 --> 00:14:19,234 ఆ పండు చాలా అరుదైనది, 257 00:14:19,318 --> 00:14:24,323 చాలా విలువైనది కూడా, అది ప్రదర్శన కోసమే ఉద్దేశించబడింది. 258 00:14:24,406 --> 00:14:27,367 ఇవి ఖరీదైనవని నాకు తెలుసు, కానీ ఇది గట్టిగా ఉండే మామూలు పైన్ యాపిలే కదా. 259 00:14:30,037 --> 00:14:31,163 మామూలు పైన్ యాపిలా? 260 00:14:31,955 --> 00:14:34,166 మామూలు పైన్ యాపిలా? 261 00:14:34,249 --> 00:14:36,251 మేము జీవితమంతా ఆదా చేసుకొన్న సొమ్మును, దానిపై ఖర్చు చేశాం. 262 00:14:36,335 --> 00:14:38,462 ఆ పైన్ యాపిల్ ని మేము అద్దెకి తీసుకున్నాం. 263 00:14:38,545 --> 00:14:41,089 దాన్ని అరువు ఇచ్చిన వాడు జైల్లో పెట్టి, తీవ్రంగా హింసిస్తాడు, అక్కడే నేను చస్తాను, 264 00:14:41,173 --> 00:14:43,967 అందరూ నన్ను మోసగాడు, పనికిమాలినవాడు అని దూషిస్తారు. 265 00:14:45,636 --> 00:14:48,680 ఈ విషయంలో, నాకు ఒకటి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పండి. 266 00:14:48,764 --> 00:14:51,099 అయితే, జార్జియన్ కాలంలో పైన్ యాపిల్స్ చాలా ఖరీదా? 267 00:14:51,183 --> 00:14:53,602 - అవును, దద్దమ్మ. - కానీ దాన్ని మేము తినేశాం. 268 00:14:53,685 --> 00:14:55,938 - అవును. - మేము ఇంకో పైన్ యాపిల్ తీసుకొచ్చి ఇస్తాం. 269 00:14:57,814 --> 00:14:59,399 ఇంకో పైన్ యాపిల్ తీసుకొచ్చి ఇస్తారా? 270 00:15:00,359 --> 00:15:03,153 మీరు బీదరికానికి అంబాసిడర్లలా ఉన్నారు. 271 00:15:03,237 --> 00:15:05,989 మీరు ఒక పైన్ యాపిల్ కొని ఇస్తారంటే ఎలా నమ్మను? 272 00:15:06,073 --> 00:15:08,825 నీల్ గ్రోవ్స్ ఇచ్చిన వేసవి పార్టీలో 273 00:15:08,909 --> 00:15:11,370 అయిదు పైన్ యాపిల్స్ ఉన్నాయట. 274 00:15:11,453 --> 00:15:13,121 నీల్ గ్రోవ్స్, నీల్ గ్రోవ్స్… 275 00:15:13,205 --> 00:15:15,916 నీల్ గ్రోవ్స్ ఇంట్లో అయిదు పైన్ యాపిల్స్ ఉండటం నువ్వు చూశావా? 276 00:15:16,500 --> 00:15:18,168 ఆ పార్టీకి నన్ను ఆహ్వానించలేదు. 277 00:15:18,252 --> 00:15:21,713 అవును. నిన్ను ఇక్కడికి కూడా ఆహ్వానించలేదు కదా. 278 00:15:22,297 --> 00:15:27,010 నేను కనిపెట్టిన అద్భుతమైన శాండ్విచ్ ని ఆస్వాదించడానికి 279 00:15:27,094 --> 00:15:30,305 ఒక అయోమయపు పిల్లాడిని పిలుస్తానా ఏంటి! 280 00:15:30,389 --> 00:15:31,557 అది మీరు కనిపెట్టింది అయితే కదా. 281 00:15:33,267 --> 00:15:34,101 ఏమన్నావు? 282 00:15:34,184 --> 00:15:35,894 మెడిటెరేనియన్ లో పిటా బ్రెడ్, కెనపీలని చూసి, 283 00:15:35,978 --> 00:15:39,398 కాపీ కొట్టి మీరు శాండ్విచ్ చేశారని కొందరి అభిప్రాయం. 284 00:15:39,481 --> 00:15:41,400 ఎవరైనా, నా చొక్కా చేతులని మడవండి. 285 00:15:45,654 --> 00:15:46,655 థ్యాంక్యూ. 286 00:15:47,739 --> 00:15:49,950 నా వంశాన్ని నువ్వు రెండుసార్లు కించపరిచావు. 287 00:15:50,033 --> 00:15:51,618 నన్ను అబద్ధాలకోరు అన్నావు. 288 00:15:51,702 --> 00:15:54,705 ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, నువ్వు నా పైన్ యాపిల్ ని తిన్నావు. 289 00:15:54,788 --> 00:15:58,667 కాబట్టి నాతో ద్వంద్వ యుద్ధం చేయాల్సిందిగా నీకు సవాలు విసురుతున్నాను. 290 00:16:00,335 --> 00:16:03,589 భలేవాడివే, వీడు చిన్న పిల్లాడు, చిన్నపిల్లాడితో ద్వంద్వ యుద్ధమంటే ఎంత అన్యాయం! 291 00:16:03,672 --> 00:16:04,673 వీడికి అది అస్సలు చేతకాదు. 292 00:16:04,756 --> 00:16:08,051 నన్ను అవమానించిన వాడిని, నాతో ద్వంద్వ యుద్ధం చేయాల్సిందిగా సవాలు చేయలేనని అంటున్నావా? 293 00:16:08,135 --> 00:16:11,346 ఇది నాకు అవమానకరం, కాబట్టి ద్వంద్వ యుద్ధం చేయాల్సిందిగా నీకు సవాలు విసురుతున్నాను. 294 00:16:11,430 --> 00:16:13,307 ఒక్క నిమిషం. అతను ద్వంద్వ యుద్ధం చేయగలడేమో. 295 00:16:13,390 --> 00:16:14,892 పిచ్చిదానా. 296 00:16:14,975 --> 00:16:19,313 ద్వంద్వ యుద్ధాలు జరిగే చోట రేపు మధ్యాహ్నం మనం కలుసుకుందాం. 297 00:16:20,314 --> 00:16:21,940 - ఇప్పుడు పారిపోదామా, పెనెలోపీ? - అవును. 298 00:16:22,024 --> 00:16:23,942 హా, అంతే. పారిపో, పిరికిపంద. 299 00:16:28,739 --> 00:16:31,074 నన్ను పిరికిపంద అని అన్నావా! 300 00:16:31,158 --> 00:16:31,992 అనేశా కదా. 301 00:16:32,075 --> 00:16:36,246 అయితే, నీ సవాలును నేను స్వీకరిస్తున్నా, నాతో ద్వంద్వ యుద్ధం చేయమని సవాలు విసురుతున్నా. 302 00:16:38,332 --> 00:16:40,459 ద్వంద్వ యుద్ధానికి నీకు నేను సవాలు చేసేశా. తిరిగి నన్ను సవాలు చేయలేవు. 303 00:16:40,542 --> 00:16:42,085 - వాళ్లు సవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. - అవును. 304 00:16:42,169 --> 00:16:44,796 - నీ అమాయకత్వానికి నాకు నవ్వు వస్తోంది. - సరే, నవ్వుకో. 305 00:17:07,986 --> 00:17:10,989 రేపు ద్వంద్వ యుద్ధంలో కలుద్దాం. 306 00:17:14,367 --> 00:17:15,577 పెనెలోపీ… 307 00:17:17,621 --> 00:17:19,498 ఈ ద్వంద్వ యుద్ధంలో నువ్వు పాల్గొనలేవు. 308 00:17:19,580 --> 00:17:24,169 లేదు, ఈ ద్వంద్వ యుద్ధంలో నేను పాల్గొనాలి. ఇది నా పేరుకు సంబంధించిన వ్యవహారం. 309 00:17:24,252 --> 00:17:29,049 పేరు, పిరికితనం వంటి మానవ కల్పిత అంశాల కోసం చావును కొని తెచ్చుకోవాల్సిన పని లేదని నా అభిప్రాయం. 310 00:17:29,132 --> 00:17:31,426 నువ్వు చనిపోతే, మా అమ్మానాన్నలు కూడా చనిపోతారు, 311 00:17:31,510 --> 00:17:34,054 ఆ… ఆ భారాన్ని నేను మోయలేను. 312 00:17:34,137 --> 00:17:37,182 కానీ ద్వంద్వ యుద్ధం చేయమని నీకు ఎవరైనా సవాలు విసిరితే, ఏం చేస్తావు నువ్వు? 313 00:17:37,766 --> 00:17:40,060 టీచరుకు కానీ, ఇంకో పెద్ద మనిషికి కానీ చెప్తాను. 314 00:17:40,143 --> 00:17:42,604 సరే, చాలా మంచిది. నేను కూడా ఇంకో పెద్ద మనిషికి చెప్తాను. 315 00:17:42,688 --> 00:17:45,482 - హేయ్, విడ్జిట్. నేను ద్వంద్వ యుద్ధంలో పాల్గొంటున్నా. - సరే. 316 00:17:46,692 --> 00:17:50,112 పెనెలోపీ, హింస అనేది సమాధానం కాదు. 317 00:17:50,195 --> 00:17:51,697 మనం వెళ్లిపోవాలని అనుకుంటా. 318 00:17:51,780 --> 00:17:54,616 వెళ్లిపోవాలా? అప్పుడే వెళ్లిపోకూడదు. నాకు ఒక పని దొరికింది. 319 00:17:54,700 --> 00:17:56,994 రేపు మధ్యాహ్నం నేను థియేటర్ రోయల్ కి వెళ్లాలి. 320 00:17:57,077 --> 00:17:58,620 ఇక్కడి జనాలకు నాటక రంగం మీద చాలా అభిమానం ఉంది. 321 00:17:58,704 --> 00:18:01,540 ఇక్కడి నాటికలు ఉదయాన్నే ప్రారంభమై, సాయంత్రం దాకా కొనసాగుతాయి. 322 00:18:02,124 --> 00:18:03,125 మీరందరూ రావాల్సిందే. 323 00:18:03,208 --> 00:18:06,128 హా… ఆల్టో, చాలా పెద్ద నాటికకి రమ్మని మమ్మల్ని పిలుస్తున్నావు, 324 00:18:06,211 --> 00:18:07,754 అంత పెద్ద దానికి మేము వస్తామని అనుకుంటున్నావా? 325 00:18:11,800 --> 00:18:15,012 వావ్. సూపర్. 326 00:18:15,095 --> 00:18:19,600 సరిగ్గా నాకు అండగా ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు, "సారీ, మేము ద్వంద్వ యుద్ధానికి వెళ్లాలి," అంటున్నారే. 327 00:18:20,726 --> 00:18:23,312 మీకు అయిదు సీట్లు రిజర్వ్ చేస్తాను, అందరూ తప్పక రావాల్సిందే 328 00:18:28,192 --> 00:18:30,027 మనోడికి ప్రసంగాలివ్వడమంటే భలే ఇష్టం కదా? 329 00:18:30,110 --> 00:18:33,572 పెనెలోపీ, నువ్వు తోకముడిచినా, ముడవకపోయినా ఎవరూ ఏమీ అనుకోరు. 330 00:18:33,655 --> 00:18:36,450 మనం ఎప్పుడూ పారిపోతూనే ఉంటామని అనుకున్నా. అది మన పనితనం అనుకున్నా. 331 00:18:36,533 --> 00:18:39,244 చూడండి, మీరందరూ ఎందుకంత కంగారుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, సరేనా? 332 00:18:39,328 --> 00:18:42,456 నేను చేయాల్సిందల్లా, అతను నన్ను కాల్చక ముందే, నేను అతడిని కాల్చేయడం. 333 00:18:43,457 --> 00:18:44,291 బాబోయ్! 334 00:19:07,022 --> 00:19:08,982 అయ్య బాబోయ్, చలికి చచ్చేలా ఉన్నా. 335 00:19:10,901 --> 00:19:12,402 కెవిన్! 336 00:19:13,111 --> 00:19:15,113 అయ్య బాబోయ్. ఇది చాలా దారుణం. 337 00:19:18,659 --> 00:19:20,577 ఫియానా, నీకు అప్పజెప్పిన పని ఎందాకా వచ్చింది? 338 00:19:21,078 --> 00:19:23,288 వాళ్లని ఇంకా పట్టుకోలేకపోయాను, కానీ మంచి విషయం ఏంటంటే, 339 00:19:23,372 --> 00:19:25,415 చాలా కొత్త ప్రదేశాలని సందర్శించే అవకాశం నాకు దక్కింది. 340 00:19:25,916 --> 00:19:27,501 అబ్బో, చాలా మంచిది. 341 00:19:27,584 --> 00:19:30,170 కానీ నువ్వు బందిపోటులని పట్టుకోవడానికి దగ్గర్లోనే ఉన్నావు కదా? 342 00:19:30,796 --> 00:19:34,174 హా, దాదాపుగా. నేను వేరే మార్గాన్ని తీసుకున్నా, కాబట్టి… 343 00:19:34,258 --> 00:19:36,677 ఇక వేరే మార్గాల తీసుకోవడం ఆపేస్తే మంచిది, 344 00:19:36,760 --> 00:19:38,971 జాన్ కి జరిగిందే నీకు కూడా జరగాలని నీకు ఉంటే తప్ప. 345 00:19:39,054 --> 00:19:41,098 జాన్ కి జరిగిందే నీకు కూడా జరగాలా? 346 00:19:41,181 --> 00:19:42,474 జరగకూడదు. 347 00:19:42,975 --> 00:19:45,811 జాన్ కి జరిగింది నీకు జరగడం నీకే అంత మంచిది కాదు. 348 00:19:45,894 --> 00:19:47,479 మ్యాప్ తెచ్చి నాకు అప్పగించు. 349 00:19:55,195 --> 00:19:56,071 జూడీ. 350 00:19:58,365 --> 00:20:00,450 నేను, కాసనోవాని. 351 00:20:02,619 --> 00:20:04,830 - నన్ను చూసి ఇప్పుడే ఒక గుర్రం స్పృహ తప్పింది. - సరే. 352 00:20:04,913 --> 00:20:09,668 నీలో ఏదో తేజస్సు ఉంది, చాలా గొప్పదానివి, కాబట్టి నాకు నీపై ఆసక్తి ఉంది. 353 00:20:10,252 --> 00:20:13,297 నన్ను పట్టించుకోవడం లేదు కూడా నువ్వు, అది నన్ను చాలా ఆకర్షిస్తోంది. 354 00:20:13,881 --> 00:20:16,216 మిత్రులారా, దయచేసి చెప్పేది వినండి. నేను నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా. 355 00:20:16,300 --> 00:20:17,843 నా ప్రతిస్పందనలకు నేను కాస్త విశ్రాంతినివ్వాలి, సరేనా? 356 00:20:17,926 --> 00:20:19,469 నా నటనకి కావాల్సిన శక్తిని నేను ఛార్జ్ చేసుకోవాలి. 357 00:20:19,553 --> 00:20:22,264 ఈ కనుబొమలకు చక్కని నిద్ర కావాలి, సరేనా? 358 00:20:22,931 --> 00:20:25,392 కాబట్టి మీకు ముందే థ్యాంక్స్ చెపున్నా. కాస్త మెల్లగా మాట్లాడుకోండి ఇద్దరూ. 359 00:20:27,352 --> 00:20:29,313 జూడీ, నాతో వచ్చేయ్. 360 00:20:30,939 --> 00:20:34,276 నేను పడుకోవాలి. నిజంగానే నేను ఎండు గడ్డి మీద పడుకోవాలి, కాబట్టి… 361 00:20:46,246 --> 00:20:47,164 గావిన్. 362 00:21:05,098 --> 00:21:08,101 - ఇక్కడ టైమ్ స్పేస్ లో లోపం ఉంది. - వాళ్లు ఇక్కడికి వచ్చారనుకుంటున్నారా, మేడమ్? 363 00:21:08,185 --> 00:21:11,563 అవును. టైమ్ ట్రావెల్ బందిపోటులు ఇక్కడికి వచ్చారని, వాళ్ల దగ్గర మ్యాప్ ఉందని అనుకుంటున్నా. 364 00:21:12,064 --> 00:21:13,941 అవును, వాళ్ల దగ్గర మ్యాప్ ఉంది మరి. 365 00:21:14,024 --> 00:21:16,485 వాళ్ల దగ్గర మ్యాప్ ఉంది కాబట్టే, వాళ్లు ఇక్కడికి రాగలిగారు కదా? 366 00:21:16,568 --> 00:21:19,363 వాళ్లు ద్వారాలను అలాగే తెరిచి ఉంచేస్తున్నారు. దాని వల్ల చాలా టైమ్ ట్రావెల్ చేసేస్తున్నాయి. 367 00:21:20,113 --> 00:21:22,407 అది ప్రమాదకరమైనది. చాలా ప్రమాదకరమైనది. 368 00:21:22,491 --> 00:21:25,160 ద్వారాలని తెరిచే ఉంచడం మంచి విషయం కాదు. అది నాకు కూడా తెలుసు. 369 00:21:25,744 --> 00:21:27,746 ఈ విషయాన్ని మనం తక్షణమే సుప్రీమ్ బీయింగ్ కి తెలియజేయాలి. 370 00:21:28,372 --> 00:21:30,290 హా. ఆ పని మనం చేయవచ్చు. 371 00:21:33,460 --> 00:21:34,378 మనకి అప్పగించిన పని, 372 00:21:34,461 --> 00:21:37,381 మనం కనుగొన్న వాటిని ఆయనకి చెప్పడం, ఆప్పుడు ఆయన బందిపోటులని ట్రాక్ చేయగలడు. 373 00:21:37,881 --> 00:21:39,091 మనం ఆయన ఆదేశాలని పాటించాలి. 374 00:21:39,716 --> 00:21:42,719 అతను అప్పగించిన పనిని మనం చేయవచ్చనే నేనూ చెప్తున్నా. 375 00:21:43,303 --> 00:21:44,721 ఆ పని తప్పకుండా మనం చేయవచ్చు. 376 00:21:44,805 --> 00:21:46,306 అదిగాక, ఇంకేం చేయవచ్చని అంటున్నావు? 377 00:21:46,807 --> 00:21:49,101 ముందు మీరు ఇంకొందరితో మాట్లాడాలి. 378 00:21:49,184 --> 00:21:50,310 ఎవరితో? 379 00:21:50,394 --> 00:21:51,979 నా లాంటి వాళ్లతో అన్నమాట. 380 00:21:52,062 --> 00:21:55,482 మనకి ఏది చెప్తే, అది చేసి తీరాలి అనే సోది వినీ వినీ విసిగిపోయిన నాలాంటి వారితో. 381 00:21:56,191 --> 00:21:58,944 కానీ మనం మనకి చెప్పిన పని కాకపోతే, ఇంకేం చేయాలి? 382 00:22:00,320 --> 00:22:01,321 మీరే చూస్తారుగా. 383 00:22:03,240 --> 00:22:06,827 విడ్జిట్, నిన్న రాత్రి పడుకున్నాక, 384 00:22:06,910 --> 00:22:11,331 నేను నింగిని చూశాను, జనాలు ఏవేవో అద్భుతమైన పనులు చేయడం చూశాను, 385 00:22:11,832 --> 00:22:13,542 కానీ నా కళ్లు మూసుకొనే ఉన్నాయి. 386 00:22:14,251 --> 00:22:15,252 నువ్వు కల కన్నావు. 387 00:22:15,335 --> 00:22:17,754 నేను చూడగలుగుతున్నా, కానీ తాకలేకపోతున్నా. 388 00:22:17,838 --> 00:22:19,381 అవును. చెప్పా కదా, నువ్వు కల కన్నావని. 389 00:22:19,464 --> 00:22:20,924 సుప్రీమ్ బీయింగ్ మనల్ని కలలు కననివ్వడు. 390 00:22:21,008 --> 00:22:22,217 వావ్. 391 00:22:22,301 --> 00:22:25,429 కానీ అన్నీ మంచివే కాదు. నాకు చెడు విషయాలు కూడా కనిపిస్తుంటాయి. 392 00:22:25,512 --> 00:22:28,015 హా. దాన్ని పీడకల అంటారు, బిటెలిగ్. 393 00:22:28,098 --> 00:22:31,101 సలహాదారుడు ఉద్దేశం అదే అంటావా? 394 00:22:31,185 --> 00:22:35,189 మనం సుప్రీమ్ బీయింగ్ కి మ్యాప్ ఇస్తే, నాకు వచ్చిన పీడకల నిజం అవుతుందనా? 395 00:22:35,272 --> 00:22:38,817 అతను పీడకల కన్నా దారుణమైనది జరుగుతుందని చెప్పాలనుకున్నాడు అనుకుంటా, 396 00:22:38,901 --> 00:22:41,111 కానీ సలహాదారుడు భయపడినట్లుగా అనిపించలేదు. 397 00:22:41,195 --> 00:22:43,989 విడ్జిట్, ఎవరి ప్రాణాలూ పోకూడదు. 398 00:22:44,740 --> 00:22:46,116 సూసన్ ప్రాణాలు పోయాయి, అది చాలు. 399 00:22:46,617 --> 00:22:49,661 అవును. ఎవరి ప్రాణాలూ పోకూడదు. ఎవరూ చనిపోరులే, బిటెలిగ్. 400 00:22:50,454 --> 00:22:51,705 కానీ పెనెలోపీ సంగతేంటి? 401 00:22:51,788 --> 00:22:54,333 - పెనెలోపీ! పద, పద. - అయ్యయో. 402 00:22:59,004 --> 00:23:02,883 నా అభిమాన నాయకా. నా అభిమాన నాయకా. 403 00:23:03,425 --> 00:23:06,887 నీ కోసం ఒక ప్రత్యేకమైన పాత్రని సిద్ధం చేశాను. దాన్ని పోషించగలవా? 404 00:23:06,970 --> 00:23:09,014 ఆ పాత్ర కోసమే ఈ గడ్డ మీద పుట్టా. 405 00:23:09,097 --> 00:23:10,557 అంటే, టైమ్ ట్రావెల్ చేసి వచ్చా అనవచ్చు. 406 00:23:10,641 --> 00:23:12,434 మనకి అలానే అనిపిస్తుంది, కదా? 407 00:23:12,518 --> 00:23:16,021 దీన్ని చదువు, నేర్చుకో, పాత్రలో లీనమైపో. నాటిక ఒక గంటలో ప్రారంభమవుతుంది. 408 00:23:16,104 --> 00:23:17,105 సరే. 409 00:23:34,581 --> 00:23:36,500 అందరికీ హలో. నిశ్శబ్దంగా ఉండండి. 410 00:23:36,583 --> 00:23:40,045 శాండ్విచ్ ని కనిపెట్టిన, ఎర్ల్ ఆఫ్ శాండ్విచ్ అను నేను, 411 00:23:40,128 --> 00:23:42,381 నన్ను అవమానించిన వారితో తలపడటానికి వచ్చాను. 412 00:23:42,464 --> 00:23:44,925 మీ ఆయుధాన్ని ఎంచుకోండి, సర్. 413 00:23:45,592 --> 00:23:47,052 మీ ఆయుధాన్ని ఎంచుకోండి, సర్. 414 00:23:47,928 --> 00:23:49,221 నేను మాట్లాడి పరిష్కరించుకొనే దారిని ఎంచుకోవచ్చా? 415 00:23:49,304 --> 00:23:54,101 తప్పకుండా, సర్, కానీ ఎర్ల్ ఆఫ్ శాండ్విచ్ తుపాకీనే వాడతారు. 416 00:23:55,727 --> 00:23:58,063 మరి నేను పారిపోతే? 417 00:23:58,146 --> 00:24:00,148 మీరు తప్పకుండా పారిపోవచ్చు. 418 00:24:00,232 --> 00:24:03,694 కానీ, పోయిన సారి పారిపోవాలని చూసిన వ్యక్తి వీపు మీద తుపాకీ తూటా దిగింది, సర్. 419 00:24:03,777 --> 00:24:06,238 - సరే అయితే. - అయితే, తుపాకీని తీసుకుంటారా? 420 00:24:08,282 --> 00:24:09,992 సర్ తుపాకీని ఎంచుకున్నారు. 421 00:24:10,075 --> 00:24:11,702 చాలా మంచి ఆయుధాన్ని ఎంచుకున్నారు, సర్. 422 00:24:11,785 --> 00:24:13,453 నేను మహిళను, కాబట్టి మీరు "సర్" అని పిలవకుండా ఉంటే… 423 00:24:13,537 --> 00:24:14,913 అలాగే, సర్. 424 00:24:14,997 --> 00:24:16,164 ఇక రా, పిరికిపందా. 425 00:24:18,292 --> 00:24:19,793 తేల్చుకుందాం ఇక. 426 00:24:21,295 --> 00:24:23,297 - సరే. - ద్వంద్వ యుద్ధం తాలూకు నియమాలు తెలుసా నీకు? 427 00:24:23,380 --> 00:24:24,590 అంత పక్కాగా తెలీదు. 428 00:24:24,673 --> 00:24:26,675 పది అడుగులు నడవాలి, ఆ తర్వాత కాల్చాలి. 429 00:24:26,758 --> 00:24:28,844 - అంతే. ఇక మొదలుపెడదాం. - సరే. 430 00:24:28,927 --> 00:24:31,263 పది అడుగులు నడిచాక కాల్చాలా, లేకపోతే… 431 00:24:31,346 --> 00:24:35,684 ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, 432 00:24:35,767 --> 00:24:39,062 ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. 433 00:24:44,735 --> 00:24:47,237 ఏంటి… నన్ను నిజంగా కాల్చాలనుకున్నావా? 434 00:24:47,321 --> 00:24:49,239 అవును, ఇది ద్వంద్వ యుద్ధం కదా. 435 00:24:49,323 --> 00:24:50,949 నన్ను చంపాలనుకున్నావా? 436 00:24:51,033 --> 00:24:52,451 నువ్వు పైకి ఎందుకు కాల్చావు? 437 00:24:52,534 --> 00:24:54,703 ఇప్పుడు ద్వంద్వ యుద్ధాలలో కాల్చుకోవడమనేది జరగట్లేదు. 438 00:24:54,786 --> 00:24:56,997 ఆ పని చేస్తే, సభ్య సమాజంలో మనుషులు అనే వారు ఉండరు. 439 00:24:57,080 --> 00:24:58,290 తుపాకీ పక్కకు గురి పెట్టి కాల్చాలి. 440 00:24:58,373 --> 00:25:00,501 సరే. కానీ నాకు అది తెలీదు. నాకు అది ముందు చెప్పలేదు. 441 00:25:00,584 --> 00:25:04,338 మీ సోది ఇక కట్టిపెట్టండి, సర్. మీరు దద్దమ్మ. 442 00:25:04,880 --> 00:25:07,591 నన్ను కాల్చడానికి ప్రయత్నించి అవమానించావు, 443 00:25:07,674 --> 00:25:12,137 కాబట్టి ఇంకో ద్వంద్వ యుద్ధానికి సవాలు విసురుతున్నా. 444 00:25:16,433 --> 00:25:17,267 సరే మరి. 445 00:25:17,351 --> 00:25:19,102 అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. 446 00:25:19,186 --> 00:25:20,729 అయిదు నిమిషాల్లో ప్రారంభమవుతుంది. 447 00:25:29,488 --> 00:25:30,614 స్పష్టంగా ఒక విషయం చెప్పండి… 448 00:25:30,697 --> 00:25:36,286 ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. 449 00:25:36,370 --> 00:25:39,498 ఆగండి. 450 00:25:40,582 --> 00:25:41,959 ఆగండి! 451 00:25:42,042 --> 00:25:44,461 మన్నించాలి, మేము ఇక్కడ ఒక పని మధ్యలో ఉన్నాం. 452 00:25:44,545 --> 00:25:46,046 మేము కూడా ఒక పని మధ్యలో ఉన్నాం. 453 00:25:46,129 --> 00:25:47,965 మేము ఒక వాదులాట మధ్యలో ఉన్నాం, 454 00:25:48,757 --> 00:25:53,262 ఎందుకంటే, నా నేస్తం ప్రాణం కన్నా నా అభిరుచికే ఎక్కువ విలువ ఇచ్చాను. 455 00:25:53,345 --> 00:25:55,806 అందుకు క్షమించమని అడుగుతున్నా. 456 00:25:56,557 --> 00:26:02,479 ఎవరు సరైన వారో నిర్ణయించుకోవడానికి మీరు ఈ పని చేస్తున్నారు, కానీ హింస అనేది ఎప్పుడూ సరైనది కాదు. 457 00:26:03,021 --> 00:26:08,151 క్షమించడం, రాజీపడటం కష్టమే, 458 00:26:08,235 --> 00:26:13,282 కానీ వాటి వల్ల మనకి కావలసిన వారు మన చెంతే ఉంటారు. 459 00:26:15,325 --> 00:26:21,582 ఇవాళ ఒకరు "గెలవవచ్చు," కానీ ఆ గెలుపు వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది. 460 00:26:22,749 --> 00:26:26,837 నాయకురాలు, లేదా నాయకత్వ లక్షణం ఉన్న వ్యక్తి. 461 00:26:27,796 --> 00:26:30,424 శాండ్విచ్ ని కనిపెట్టిన వ్యక్తి! 462 00:26:30,966 --> 00:26:33,427 ఒక మరణం సంభవిస్తుంది, 463 00:26:34,511 --> 00:26:38,974 ఒక ప్రాణం నేలరాలిపోతుంది, ఒక ఊపిరి ఆగిపోతుంది, 464 00:26:39,683 --> 00:26:44,897 ఒకరికి ఆత్మీయులైన వారు స్వర్గస్థులవుతారు. 465 00:26:47,065 --> 00:26:49,651 - శభాష్. - థ్యాంక్యూ. 466 00:26:49,735 --> 00:26:51,278 వావ్, అది… 467 00:26:52,237 --> 00:26:53,238 జూడీ. 468 00:26:55,199 --> 00:26:57,034 నీ వల్ల ఎక్కడి దాకా లెక్కపెట్టానో మర్చిపోయా. 469 00:26:57,117 --> 00:26:58,994 మనం మళ్లీ మొదట్నుంచీ లెక్క పెట్టాలి. చాలా చాలా థ్యాంక్స్. 470 00:26:59,077 --> 00:27:00,245 ఏంటి? 471 00:27:01,121 --> 00:27:02,372 భలేవాడివే. 472 00:27:04,666 --> 00:27:08,045 - సరే. వెనక్కి తిరిగాం. నేను… - ఒకటి, రెండు… 473 00:27:15,219 --> 00:27:19,848 మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది. 474 00:27:19,932 --> 00:27:23,352 - ఫియానా. - పారిపోండి. ఇప్పుడు మనం పారిపోవాలి. 475 00:27:26,480 --> 00:27:30,108 చూశారా? వాళ్లందరూ పిరికిపందలే, పారిపోతున్నారు… 476 00:27:30,192 --> 00:27:33,320 ద్వంద్వ యుద్ధం జరిగే చోటుకు అక్రమంగా రావడానికి నీకెంత ధైర్యం? 477 00:27:33,403 --> 00:27:36,657 - నాతో ద్వంద్వ యుద్ధం చేయమని నీకు సవాలు చేస్తున్నా. - ఏంటి? 478 00:27:36,740 --> 00:27:39,701 ద్వంద్వ యుద్ధం… ఈ లోకంలో గౌరవం అనేదే లేదా? సహయాకుడా? 479 00:27:40,619 --> 00:27:42,788 ఇప్పుడు మనం పది అడుగులు వేసి, వెనక్కి… 480 00:27:52,673 --> 00:27:55,759 ఇది పిరికి చర్య, కానీ మరేం పర్వాలేదు. 481 00:27:56,301 --> 00:27:58,095 తూటా నా గుండె దాకా వెళ్లలేదు, 482 00:27:58,637 --> 00:28:02,140 ఎందుకంటే, నా చొక్కా జేబులో, నేను దాచి ఉంచుకున్నాను… 483 00:28:03,892 --> 00:28:05,227 ఒక శాండ్విచ్ ని. 484 00:28:05,310 --> 00:28:07,855 కానీ, అది తూటాని ఆపినట్టుగా అనిపించట్లేదు, సర్. 485 00:28:08,856 --> 00:28:10,566 అవును. నిజమే. 486 00:28:11,191 --> 00:28:12,526 పొరబడ్డా. 487 00:28:16,280 --> 00:28:17,656 తనని నువ్వు శాంతపరచలేవా? 488 00:28:17,739 --> 00:28:18,991 అదే కదా అసలు సమస్య. 489 00:28:19,074 --> 00:28:20,784 తనని చూస్తేనే ఒళ్లంతా వణుకు పుట్టేస్తోంది. 490 00:28:22,202 --> 00:28:23,579 తన నుండి తప్పించుకేసుకున్నాం అనుకుంటా. 491 00:28:23,662 --> 00:28:26,623 - జూడీ, నేను, కాసనోవాని. - ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? 492 00:28:28,166 --> 00:28:29,543 నువ్వు లేకుండా నేను బతకలేను. 493 00:28:29,626 --> 00:28:32,462 నేను నిన్ను ఎంతగా ఆరాధిస్తానో నీకు తెలిస్తే బాగుండు. 494 00:28:33,547 --> 00:28:35,674 నీ అంత అందగత్తెని నేను చూడలేదనే చెప్పాలి. 495 00:28:35,757 --> 00:28:37,843 - దయచేసి, నాతో ఇక్కడే ఉండిపో. - నేను వెళ్లిపోవాలి. 496 00:28:38,719 --> 00:28:39,887 మేము ఒక రాకాసికి దొరక్కుండా పారిపోతున్నాం! 497 00:28:40,721 --> 00:28:42,556 మనందరమూ అంతే కదా? మనలోని రాకాసులను బయటకు రానివ్వం. 498 00:28:45,142 --> 00:28:47,269 నీ కోసం చచ్చే దాకా ఎదురు చూస్తాను. 499 00:28:47,352 --> 00:28:49,354 నా మనస్సు నీ ఒక్క దానికే సొంతం. 500 00:28:52,232 --> 00:28:53,984 ఎవరు నువ్వు? కత్తిలా ఉన్నావే. 501 00:28:54,067 --> 00:28:58,155 ఎక్కువ శాతం మహిళలను చూసి నేను మనస్సు పారేసుకోను. కానీ నీలో ఏదో ఉంది. 502 00:28:58,655 --> 00:29:00,699 నీ కళ్లు మెరిసిపోతున్నాయి. 503 00:29:21,011 --> 00:29:24,181 మంట పుట్టించండే, చెత్త రాళ్ల మొహాల్లారా. 504 00:29:30,562 --> 00:29:33,148 - తన నుండి తప్పించేసుకున్నాం. - ఏంటి? హమ్మయ్య. 505 00:29:33,232 --> 00:29:37,236 - ఎక్కడ ఉంది ద్వారం? దగ్గర్లోనే ఉండాలి. - విడ్జిట్. 506 00:29:37,945 --> 00:29:39,738 ఇంతకీ ఆల్టో, నాటిక ఎలా చేశావు? 507 00:29:39,821 --> 00:29:40,822 నేను చేయలేదు. 508 00:29:41,698 --> 00:29:43,200 ఇది కాకపోతే ఏముందిలే, చాలా నాటకాలు చేశావుగా. 509 00:29:43,784 --> 00:29:46,203 నిజానికి, నేను ఇప్పటిదాకా నటించనే లేదు. 510 00:29:46,286 --> 00:29:48,497 ఒక పాంఫ్లెట్ చూశా, దాని మీద "హాం-ఫ్లెట్" అని ఉండింది, 511 00:29:48,580 --> 00:29:51,583 "ఏదోక రోజు ఆ నాటిక చేస్తా," అని అనుకున్నా. తప్పకుండా ఏదోక రోజు చేస్తా. 512 00:29:51,667 --> 00:29:53,877 దాన్ని "హాం-ఫ్లెట్" అని అనరు. 513 00:29:54,711 --> 00:29:57,130 అదుగోండి. ద్వారం తెరుచుకుంది. బందిపోటులారా, ప్రవేశించండి. 514 00:30:02,469 --> 00:30:05,430 పెనెలోపీ, మీరు పారిపోయి రావడం నాకు నచ్చింది. 515 00:30:05,514 --> 00:30:09,268 నన్ను నేను కాపాడుకోవడంలో నేను దిట్టని. నేను చేసిన పని అదేనేమో. 516 00:30:09,893 --> 00:30:12,688 ఇదేదో తేడాగా ఉందే! 517 00:30:39,256 --> 00:30:40,257 టెర్రీ గిలియమ్, మైఖెల్ పాలిన్ 518 00:30:40,340 --> 00:30:41,216 రూపొందించిన పాత్రల ఆధారితమైనది 519 00:30:47,264 --> 00:30:48,724 'TIME BANDITS' సినిమా ఆధారంగా తెరకెక్కించబడింది 520 00:31:52,204 --> 00:31:54,206 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్