1 00:00:46,088 --> 00:00:47,965 అయ్య బాబోయ్. 2 00:01:16,410 --> 00:01:18,036 కెవిన్, పక్కకు జరుగు! 3 00:01:18,120 --> 00:01:19,329 కెవిన్, జరుగు! 4 00:01:32,885 --> 00:01:34,136 ఏంటది అలా ఉంది? 5 00:01:34,219 --> 00:01:36,263 చాలా చీకటిగా ఉండింది. గాలి లేదు, పాడు లేదు. 6 00:01:36,346 --> 00:01:37,514 నరకంలా అనిపించింది. 7 00:01:37,598 --> 00:01:39,183 చుక్కలు కనిపించాయి. 8 00:01:39,266 --> 00:01:41,685 విడ్జిట్, అది నీ మాజీ లవర్ పనా? 9 00:01:41,768 --> 00:01:45,105 లేదు, ఫియానా, గాలి లేని శూన్యాన్ని సృష్టించలేదు. అక్షరాలా తనకి అది సాధ్యం కాదు. 10 00:01:45,189 --> 00:01:48,609 కానీ సంబంధంలో ఉన్నప్పుడు, తను అసలు గాలి ఆడనివ్వదు. 11 00:01:49,985 --> 00:01:51,069 సరే, అందరూ బాగానే ఉన్నారుగా? 12 00:01:51,153 --> 00:01:52,696 - హా, నేను బాగానే ఉన్నా. - మంచిది. 13 00:01:52,779 --> 00:01:53,947 జూడీ ఎక్కడ? 14 00:01:54,531 --> 00:01:56,283 - ఏంటి? - ఎక్కడ తను? 15 00:01:56,366 --> 00:01:57,284 జూడీ! 16 00:01:57,367 --> 00:01:58,327 జూడీ! 17 00:01:58,410 --> 00:01:59,244 - జూడీ! - జూడీ! 18 00:01:59,828 --> 00:02:01,121 - జూడీ! - జూడీ! 19 00:02:01,205 --> 00:02:02,247 ఎక్కడుంది తను? 20 00:02:02,331 --> 00:02:05,417 - జూడీ! - అయ్యయ్యో, అది మూసుకుపోయింది. 21 00:02:05,501 --> 00:02:09,795 తనని నేను చూశా, కానీ మళ్లీ తను కనిపించలేదు. పెనెలోపీ, ఇప్పుడు నేనేం చేయాలి? 22 00:02:09,880 --> 00:02:11,590 - సరే. పర్వాలేదు, అంతా ఓకేలే. - నేను చెప్పా తనకి… 23 00:02:11,673 --> 00:02:14,134 బిటెలిగ్, తనని శూన్యం లాగేసుకొని ఉండవచ్చు… 24 00:02:14,218 --> 00:02:15,052 ఏంటి? 25 00:02:15,135 --> 00:02:17,304 …లేదా తను ఇక్కడే ఎక్కడైనా ఉండుండవచ్చు. 26 00:02:17,387 --> 00:02:19,014 హా. సరే. 27 00:02:21,558 --> 00:02:23,352 తను ఇక్కడ లేదనుకుంటా. 28 00:02:24,102 --> 00:02:25,103 అయితే మరి… 29 00:02:25,854 --> 00:02:28,357 ఏంటి? నేను ఇన్ ఛార్జీగా ఉన్నప్పుడు తను తప్పిపోయిందా? 30 00:02:28,440 --> 00:02:30,067 మళ్లీ వెనక్కి వెళ్లి తనని తీసుకురాగలమా? 31 00:02:30,150 --> 00:02:31,777 అదేంటో నాకు తెలీదు. 32 00:02:31,860 --> 00:02:34,696 ఇప్పటిదాకా దాన్ని నేను చూడనే లేదు. మ్యాప్ లో కూడా అది లేదు. 33 00:02:34,780 --> 00:02:37,574 అలా జరిగేది ఒకటి ఉంటుందని ఇప్పటిదాకా నేను వినలేదు కూడా. 34 00:02:37,658 --> 00:02:38,659 అవును. 35 00:02:46,583 --> 00:02:47,960 సరే మరి, ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం? 36 00:02:48,043 --> 00:02:52,130 నా లెక్కలు సరైనవే అయితే, మనం 1897లో సెంట్రల్ వియాన్నాలో ఉన్నాం. 37 00:02:54,299 --> 00:02:56,134 - లేదు, నీ లెక్కలు తప్పు. - అవును, అది నిజం కాదు. 38 00:02:56,218 --> 00:02:57,135 మనం ఎడారిలో ఉన్నాం. 39 00:02:57,219 --> 00:03:03,141 అవును. మనం ఎడారిలో ఉన్నాం, కాబట్టి మనం ఇక్కడే ఉంటే, చస్తాం. 40 00:03:03,225 --> 00:03:06,687 కానీ జూడీ మనల్ని కనుగొంటుందని నాకు నమ్మకంగా ఉంది. 41 00:03:07,563 --> 00:03:08,689 మనం బయలుదేరాలి. 42 00:03:09,648 --> 00:03:10,649 అంతే. 43 00:03:21,869 --> 00:03:24,496 - కెవిన్. - హా, వస్తున్నా. 44 00:03:25,998 --> 00:03:27,165 ఎడారి. 45 00:03:27,249 --> 00:03:29,334 సహనాన్ని పరీక్షిస్తుంది, జాలి అనేదే చూపించదు. 46 00:03:30,085 --> 00:03:32,004 చుట్టూరా చాలా దూరం వరకు ఒక్కరు కూడా ఉండరు. 47 00:03:32,087 --> 00:03:33,505 అక్కడ ఎవరో ఉన్నారుగా? 48 00:03:35,799 --> 00:03:36,884 వాళ్లు తప్పించి. 49 00:03:39,553 --> 00:03:40,554 పదండి వెళ్దాం. 50 00:03:43,640 --> 00:03:48,604 ఉత్తర ఆఫ్రికా క్రీస్తు శకం 1324వ సంవత్సరం 51 00:03:48,687 --> 00:03:50,147 హా, ఇది నాకు సరైన విషయంలానే అనిపిస్తోంది. 52 00:03:51,857 --> 00:03:52,858 ఈ వెచ్చదనాన్ని ఆస్వాదించండి. 53 00:03:52,941 --> 00:03:56,570 రండి. అందరూ కదలండి. ఇక్కడ చాలా బాగుంది. రండి. 54 00:04:08,540 --> 00:04:09,541 జూడీ… 55 00:04:10,459 --> 00:04:15,255 బిటెలిగ్, వీళ్లెవరో, ఇక్కడ ఏం చేస్తున్నారో మొదలైన వాటిని కనుక్కో. 56 00:04:15,839 --> 00:04:18,300 జనులారా, మీరు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు మొదలైనవి చెప్పండి. 57 00:04:18,382 --> 00:04:20,761 జనులారా, మీరు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు మొదలైనవి చెప్పండి. 58 00:04:21,928 --> 00:04:25,390 జనులారా, మీరు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు మొదలైనవి చెప్పండి. 59 00:04:25,933 --> 00:04:27,601 ఇది మాన్సా మూసా చేపట్టిన హజ్. 60 00:04:31,813 --> 00:04:34,107 ఇది మాన్సా మూసా చేపట్టిన హజ్. 61 00:04:34,191 --> 00:04:36,401 మంచిది. కానీ దానర్థం ఏంటి, ఎవరు వారు? 62 00:04:36,485 --> 00:04:38,070 నాకు తెలీదు. 63 00:04:38,153 --> 00:04:39,279 మాన్సా మూసా? 64 00:04:39,863 --> 00:04:40,781 తన గురించి నా పుస్తకంలో ఉంది. 65 00:04:40,864 --> 00:04:43,659 అతను మధ్య యుగంలో మాలికి మహారాజు. 66 00:04:43,742 --> 00:04:47,746 "మాలియన్ సామ్రాజ్యం, 14వ శతాబ్దంలో మాన్సా మూసా ఏలుబడిలో 67 00:04:47,829 --> 00:04:50,457 సువిశాలమైన సామ్రాజ్యంగా విరాజిల్లింది. 68 00:04:50,541 --> 00:04:53,710 మక్కాకు అతను చేపట్టిన హజ్ యాత్రలో 60,000 మంది పాల్గొనారు, 69 00:04:53,794 --> 00:04:57,297 అందులో అతనికి చెందిన అనేక భార్యలతో పాటు, లెక్కలేనంత బంగారం కూడా ఉంది. 70 00:04:57,381 --> 00:05:00,509 అతనికి ఉన్న సంపదను అంచనా వేస్తే, చరిత్రలో అతనే అత్యంత సంపన్నుడు అవుతాడు." 71 00:05:00,592 --> 00:05:01,510 చరిత్రలో మహోన్నత వ్యక్తుల హ్యాండ్ బుక్ 72 00:05:02,094 --> 00:05:05,681 సరే, మనం ఎదురు చూస్తూ ఉన్న క్షణం రానే వచ్చింది. 73 00:05:05,764 --> 00:05:08,433 చరిత్రలో అత్యంత సంపన్నుడు, చరిత్రలో అత్యంత గొప్ప దొంగను కలుసుకోబోతున్నాడు. 74 00:05:08,517 --> 00:05:10,227 వాళ్లు ఇక్కడ ఉన్నారా? వాళ్లని మనం చిట్కాలు అడిగితే మేలేమో. 75 00:05:10,310 --> 00:05:11,186 నేను నా గురించి చెప్తున్నా. 76 00:05:11,270 --> 00:05:12,104 అవును. 77 00:05:12,187 --> 00:05:16,775 మనం ఇప్పుడు ఎవరూ కనీవినీ ఎరుగనంత గొప్ప దోపిడీకి శ్రీకారం చుట్టబోతున్నాం. 78 00:05:16,859 --> 00:05:17,693 హా. 79 00:05:17,776 --> 00:05:19,403 నా దగ్గర కత్తిలాంటి ప్లాన్ ఉంది. 80 00:05:19,486 --> 00:05:20,904 సరే, అందరూ వినండి. 81 00:05:21,405 --> 00:05:23,740 విడ్జిట్, మనం తప్పించుకోవడానికి అతి సమీపంలో ఉన్న ద్వారానికి 82 00:05:23,824 --> 00:05:25,993 అత్యంత సమర్థవంతమైన దారిని లెక్కిస్తాడు… 83 00:05:33,000 --> 00:05:35,627 బిటెలిగ్, మాన్సా నిధి ఉన్న గుడారం పక్కన దాక్కొని, 84 00:05:35,711 --> 00:05:38,714 పరిస్థితిని గమనిస్తూ, రిస్కులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తుంటాడు. 85 00:05:52,477 --> 00:05:56,231 అతను సంకేతం ఇచ్చినప్పుడు, మన మారువేషాల వీరుడైన ఆల్టో… 86 00:05:56,315 --> 00:05:58,275 - ఒంటె వేషంలో వస్తాడు. - కాదు, కాదు. 87 00:05:58,358 --> 00:06:01,737 అది కాస్త కష్టంగానే ఉంటుంది, కానీ సరైన ఆకారం ఉంటే, దాన్ని విజయవంతంగా పోషించగలను. 88 00:06:01,820 --> 00:06:03,238 కాదు, ఆల్టో. అది కాదు. 89 00:06:03,322 --> 00:06:06,533 నువ్వు మాన్సా గార్డుల వేషం ధరించాలి. 90 00:06:06,617 --> 00:06:09,703 ఒక గార్డ్ దగ్గరికి వెళ్లి, ఇక షిఫ్ట్ ముగించమని, ఆ డ్యూటీ నువ్వు కొనసాగిస్తావని అతనికి చెప్పాలి. 91 00:06:09,786 --> 00:06:11,455 అప్పుడు అతను నేను పోషించిన ఒంటె వేషంపై ఎక్కి వెళ్లిపోతాడు. 92 00:06:11,538 --> 00:06:12,873 కాదు, కాదు. 93 00:06:12,956 --> 00:06:15,000 గార్డ్ వెళ్లిపోతాడు కనుక, 94 00:06:15,083 --> 00:06:17,961 ఇక మనం మాన్సా మూసా నిద్రపోయేలా చేయాలి. 95 00:06:18,045 --> 00:06:20,631 ఆ బాధ్యత కెవిన్ ది. 96 00:06:21,423 --> 00:06:23,175 నేను బోరింగ్ మనిషిని అనే కదా. 97 00:06:23,258 --> 00:06:24,218 అవును. 98 00:06:29,598 --> 00:06:30,599 చరిత్ర. 99 00:06:31,517 --> 00:06:32,351 వాస్తవాలు. 100 00:06:34,144 --> 00:06:35,479 స్టోన్ హెంజ్. 101 00:06:36,647 --> 00:06:37,898 ప్రాచీన ఈజిప్ట్. 102 00:06:38,607 --> 00:06:43,028 ఇక ఆఖరి దశ ఏంటంటే, మాన్సా పక్క నుండే నేను పసిడిని దొంగిలించడం. 103 00:07:02,089 --> 00:07:03,549 - ఒక్క నిమిషం. - ఏంటి? 104 00:07:03,632 --> 00:07:05,801 ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్తారని అన్నారు కదా మీరు. 105 00:07:05,884 --> 00:07:09,471 కానీ, మనం చరిత్రలోనే అత్యంత సంపన్నుడి దగ్గరికి అనుకోకుండా వచ్చాం. 106 00:07:09,555 --> 00:07:11,515 - అది కాకతాళీయంగా జరిగింది. - హా. 107 00:07:11,598 --> 00:07:12,850 కాకతాళీయంగా జరిగింది అది. హా. 108 00:07:12,933 --> 00:07:14,351 నాకు చాలా అనుమానంగా ఉంది. 109 00:07:15,310 --> 00:07:18,021 మ్యాప్ ని ఎలా ఉపయోగించాలో విడ్జిట్ కి తెలుసు అనుకుంటా. 110 00:07:18,105 --> 00:07:21,191 ఎంత ధైర్యం నీకు? నేను దాన్ని ఖండిస్తున్నా. నన్ను ఎలా అలా… 111 00:07:22,359 --> 00:07:24,278 సారీ, "నాకు తెలుసు…" అన్నావా! 112 00:07:24,361 --> 00:07:26,071 అందరూ నాకు తెలీదనే అంటారు, నువ్వూ అదే అన్నావనుకున్నా. 113 00:07:26,154 --> 00:07:27,573 హా, ఎందుకంటే నీకు దారులని కనుక్కోవడం రాదు. 114 00:07:27,656 --> 00:07:29,241 అవును, అది నిజమే. 115 00:07:29,324 --> 00:07:30,200 - ఏంటి? - ఇంకా మెరుగవ్వాలి. 116 00:07:30,284 --> 00:07:32,160 అమ్మానాన్నలని నేను చూసినట్టే ఇక. 117 00:07:32,244 --> 00:07:37,082 కెవిన్, మేము బందిపోటులం. ఆ కర్తవ్యాన్ని మేము నిర్వర్తించాల్సిందే కదా. మా బాధ్యత అది. 118 00:07:37,165 --> 00:07:38,917 సరే, మిత్రులారా, మన గడియారాల్లో ఒకే సమయాన్ని సెట్ చేసుకుందాం. 119 00:07:39,001 --> 00:07:40,043 మన వద్ద గడియారాలు లేవు. 120 00:07:40,127 --> 00:07:43,881 అవును. ఇది మనకి పనికివచ్చే విషయమే. గడియారాలున్న కాలానికి వెళ్లి, వాటిని దొంగిలిద్దాం. 121 00:07:45,841 --> 00:07:47,384 ముందు బంగారం సంగతి చూద్దాం. 122 00:07:48,468 --> 00:07:50,512 నా దగ్గర అందరికీ సరిపడా గడియారాలు ఉన్నట్టున్నాయి. 123 00:07:51,471 --> 00:07:54,600 సరే మరి. సమీపంలో ఉన్న ద్వారాన్ని కనుగొనాలి. అది నాకు వెన్నతో పెట్టిన విద్య. 124 00:07:55,350 --> 00:07:56,643 సమీపంలో ఉన్న ద్వారాన్ని కనుగొనాలి. 125 00:07:57,144 --> 00:07:58,020 దగ్గరి దారి. 126 00:07:58,854 --> 00:08:01,481 నాకు దారులు కనుక్కోవడం తెలీకపోతే, దగ్గరి దారిని కనుక్కోగలిగే వాడినా? 127 00:08:06,069 --> 00:08:09,698 బాగా ఆస్వాదిస్తున్నావా, నా ప్రియాతి ప్రియతమా? 128 00:08:10,908 --> 00:08:13,202 "హజ్ కి వెళ్దాం పద, ఇనారీ. 129 00:08:13,285 --> 00:08:15,746 అది చాలా సరదాగా ఉంటుంది, ఇనారీ. 130 00:08:15,829 --> 00:08:17,456 మనిద్దరమే వెళ్దాం, ఇనారీ." 131 00:08:18,415 --> 00:08:20,501 కానీ ఇక్కడ నీ ఉంపుడుగత్తెలతో పాటు అరవై వేల మంది భార్యలు ఉన్నారు. 132 00:08:21,668 --> 00:08:23,921 నా ఒళ్లంతా దుమ్ము ఉంది. నేను స్నానం చేయాలి. 133 00:08:24,004 --> 00:08:27,216 సరే, ఎడారిలో స్నానానికి నీళ్లెక్కడి నుండి దొరుకుతాయి. హా? 134 00:08:27,299 --> 00:08:29,676 నా ప్రియాతి ప్రియమైన భార్యవి నువ్వు. 135 00:08:29,760 --> 00:08:30,761 నీకు 91వ భార్యని నేను. 136 00:08:30,844 --> 00:08:31,970 నా దృష్టిలో నువ్వే ఏకైక భార్యవి. 137 00:08:34,306 --> 00:08:36,600 ఓయ్. హలో. నువ్వు బాగా దిట్టంగా, దృఢంగా ఉన్నావు. 138 00:08:36,683 --> 00:08:39,311 నన్నా? నేను నీకు కనిపిస్తున్నానా? 139 00:08:39,394 --> 00:08:42,188 కనిపిస్తున్నావు స్పష్టంగా. ఈ ఏడారిలో ఇంత భారీగా, తెల్ల జుట్టు వేసుకొని ఉంది నువ్వేగా. 140 00:08:44,107 --> 00:08:45,526 - నీకొక పని అప్పగిస్తున్నా. - అది నేను చేయలేను. 141 00:08:46,109 --> 00:08:47,152 నాకు దొంగిలించాల్సిన పని ఉంది. 142 00:08:47,236 --> 00:08:49,154 - ఏంటి? - ఏమీ లేదు. 143 00:08:49,238 --> 00:08:50,322 నాతో రా. 144 00:08:52,157 --> 00:08:53,200 త్వరగా రా. 145 00:08:55,702 --> 00:08:56,745 నమస్కారం. 146 00:09:01,041 --> 00:09:03,126 ఇక నీ షిఫ్ట్ ముగిసింది, మిత్రమా. 147 00:09:03,752 --> 00:09:04,837 కానీ నేను వచ్చింది ఇప్పుడే కదా. 148 00:09:04,920 --> 00:09:08,090 లేదు, లేదు. నువ్వు వచ్చి చాలా సేపైంది, పాత నేస్తమా. 149 00:09:08,173 --> 00:09:10,425 మనం ముసలాళ్లం అయిపోతున్నాం కదా? అన్నీ మర్చిపోతున్నాం. 150 00:09:10,509 --> 00:09:12,719 నిజంగానే ముసలివాడిని అవుతున్నానేమో, ఎందుకంటే, నువ్వెవరో నాకు గుర్తు లేదు. 151 00:09:12,803 --> 00:09:13,804 ఎవరు నువ్వు? 152 00:09:13,887 --> 00:09:15,430 నీ చిరకాల నేస్తాన్ని నేను. 153 00:09:15,514 --> 00:09:18,642 నీకు బదులుగా నేను పని చేయడానికి వచ్చా. నేను వేసుకొన్న యూనిఫాం చూడు. 154 00:09:18,725 --> 00:09:22,187 లేదు. లేదు. ఎవరు నువ్వు? 155 00:09:22,729 --> 00:09:23,814 నేనా, నేను… 156 00:09:25,399 --> 00:09:26,400 నేను… 157 00:09:29,194 --> 00:09:30,195 ఒంటెని. 158 00:09:39,621 --> 00:09:41,999 బిటెలిగ్, సంకేతం ఏదీ ఇవ్వట్లేదు. 159 00:09:42,082 --> 00:09:43,959 ఈ పనిని మీరు విజయవంతంగా చేయలేరేమో అనిపిస్తోంది. 160 00:09:44,042 --> 00:09:44,918 అవునా? 161 00:09:45,002 --> 00:09:47,462 చడీచప్పుడు కాకుండా అద్భుతంగా నేను దొంగిలిస్తాను, అది చూసి ఆశ్చర్యపడిపోతావు. 162 00:09:47,546 --> 00:09:49,590 ఇక చూసుకో. అగ్గి పిడుగా, కదనరంగంలోకి ప్రవేశించు. 163 00:09:51,884 --> 00:09:52,885 మాయ ఫల్టీలు. 164 00:09:55,262 --> 00:09:58,473 హా, నేను… నువ్వు ఆల్టో కాదు. 165 00:09:59,224 --> 00:10:00,309 అవును. 166 00:10:02,311 --> 00:10:03,395 సరే. 167 00:10:04,479 --> 00:10:07,357 హా. విడ్జిట్? విడ్జిట్ ఎక్కడ? 168 00:10:09,193 --> 00:10:11,486 నాకు దారులు కనుక్కోవడం తెలీదా? నాలా ఎవరూ దారులు కనుక్కోలేరు. 169 00:10:12,196 --> 00:10:15,115 అట్లాంటి ఇట్లాంటి వాడిని కాదు. తోపును. ఈ విశ్వంలోనే నన్ను మించినోడు ఎవరూ ఉండరు. 170 00:10:16,283 --> 00:10:17,284 ఇంతకీ ఎక్కడ ఉన్నాను నేను? 171 00:10:24,541 --> 00:10:25,542 పెనెలోపీ? 172 00:10:27,544 --> 00:10:28,712 బిటెలిగ్! 173 00:10:28,795 --> 00:10:31,798 ఆల్టో! కెనిన్. కెర్మిట్. 174 00:10:31,882 --> 00:10:33,008 కెవిన్. 175 00:10:33,091 --> 00:10:34,092 జూడీ! 176 00:10:35,928 --> 00:10:37,554 అరవై వేల మంది నుండి ఎలా తప్పిపోయి వచ్చాను? 177 00:10:39,056 --> 00:10:41,558 ఈ పనికి ఇసుకే సరిగ్గా సరిపోతుందా, ఫార్బా? 178 00:10:41,642 --> 00:10:43,477 అవును. తవ్వుతూ ఉండు. 179 00:10:48,440 --> 00:10:51,318 మాన్సా మూసా, మన వాళ్ల మధ్య 180 00:10:51,401 --> 00:10:52,736 ఈ విచిత్రమైన వ్యక్తులు కనిపించారు. 181 00:10:54,530 --> 00:10:56,490 ఇతను ఒంటెని అనుకరిస్తూ ఉన్నాడు. 182 00:10:57,115 --> 00:10:58,242 ఏంటి? 183 00:10:58,909 --> 00:11:00,536 ఈమె మన నుండి దొంగిలించాలని చూసింది. 184 00:11:00,619 --> 00:11:01,662 వీళ్లు బందిపోటులా? 185 00:11:01,745 --> 00:11:03,872 వీళ్లు బందిపోటులా అని మాన్సా అడుగుతున్నారు. 186 00:11:03,956 --> 00:11:06,625 లేదు. వీళ్లు బందిపోటులు కాదు. ఒకసారి వాళ్ల వేషం చూడండి. 187 00:11:06,708 --> 00:11:11,630 అంటే… మా వాళ్లు చెప్పిన పని చేసుంటే, బందిపోటులే అయి ఉండేవాళ్లం. 188 00:11:11,713 --> 00:11:14,591 ఏదేమైనా, ఈమె అత్యవసర ఫైర్ లైటర్స్ బ్యాగ్ ని దొంగిలించాలని చూసింది. 189 00:11:14,675 --> 00:11:15,968 - దేన్ని? - దేన్ని? 190 00:11:16,051 --> 00:11:17,845 ఒంటె పేడ ఉన్న బ్యాగ్ ని. 191 00:11:19,471 --> 00:11:20,556 అయ్య బాబోయ్. 192 00:11:20,639 --> 00:11:24,017 అయితే, వీళ్లు బందిపోటులు కాదు. రాత్రి పూట తమని తాము వెచ్చగా ఉంచుకోవాలనుకుంటున్నారంతే. 193 00:11:24,101 --> 00:11:28,146 వాళ్లు బీదవాళ్లని, వెచ్చదనం కోసమే వాళ్లు ఆ పని చేశారని మాన్సా చెప్తున్నారు. 194 00:11:28,230 --> 00:11:29,648 "పేదవాళ్లు, దీనులు, చలి బారిన పడ్డ దద్దమ్మలు." 195 00:11:29,731 --> 00:11:31,024 బాబోయ్, ఆయన ఆ మాటలు అనలేదు. 196 00:11:31,108 --> 00:11:32,734 కష్టాల నుండి బయటపడటానికి వాళ్లకి ఏమైనా ఇవ్వండి. 197 00:11:32,818 --> 00:11:34,987 - వద్దు, వద్దు. - వాళ్లకి బంగారం ఇవ్వండి. 198 00:11:35,070 --> 00:11:36,488 - ఏంటి? - మీరు తప్పదంటే. 199 00:11:36,572 --> 00:11:37,656 వచ్చి, బంగారం తీసుకోండి. 200 00:11:37,739 --> 00:11:38,907 - ఓరి దేవుడా. - ఓరి దేవుడా. 201 00:11:38,991 --> 00:11:39,825 థ్యాంక్యూ. 202 00:11:39,908 --> 00:11:40,909 - దేవుడా. - వావ్. 203 00:11:40,993 --> 00:11:44,079 అందరూ చెప్తున్నట్టు, మాన్సా మూసా నిజంగానే చాలా తెలివైన వాడు, మంచి వాడు. 204 00:11:44,162 --> 00:11:45,664 మిమ్మల్ని కలవడం మా భాగ్యం. 205 00:11:45,747 --> 00:11:48,792 అత్యంత సంపన్నుడిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 206 00:11:48,876 --> 00:11:51,712 హేయ్. ఏమన్నావు? ఆ పిల్లోడు ఏమన్నాడు? 207 00:11:52,963 --> 00:11:56,675 ఆ పిల్లాడు ఇందాక ఏమన్నాడో, అది అచ్చు గుద్దినట్టు మళ్లీ చెప్పమని మాన్సా అడుగుతున్నారు. 208 00:11:56,758 --> 00:11:58,552 అయ్యో, అదేమంత ఆసక్తికరంగా ఉండదులెండి. 209 00:11:58,635 --> 00:12:01,346 లేదు, లేదు. అత్యంత సంపన్నుడని ఏదో అన్నాడు కదా. 210 00:12:01,430 --> 00:12:05,434 అమెజాన్ కి చెందిన జెఫ్ బేజోస్ కన్నా మీరే సంపన్నులని కొందరు అంటారు. 211 00:12:05,517 --> 00:12:09,021 అమెజాన్ కి చెందిన, సంపన్నుడైన జెఫ్ బేజోస్ కంటే సంపన్నుడిని అట. ఎవరు అతను? 212 00:12:09,104 --> 00:12:13,066 అమెజాన్ కి చెందిన, సంపన్నుడైన జెఫ్ బేజోస్ కంటే సంపన్నుడు మన మాన్సా. 213 00:12:17,821 --> 00:12:19,948 అతను ఎవరో కూడా మాకు తెలీదు. 214 00:12:20,032 --> 00:12:23,202 అయితే, మీరు ఆయన అన్నదే, కాస్త మసాలా వేసి చెప్తారు, అంతేనా? 215 00:12:23,285 --> 00:12:26,413 ఇతను బల్లా కుయాటే, నా కుడి భుజం. 216 00:12:26,496 --> 00:12:27,956 నేను బల్లా కుయాటేని. 217 00:12:28,040 --> 00:12:31,960 వక్తని, టీచరుని, సలహాదారుడిని, మరీ ముఖ్యంగా, చరిత్రకారుడిని. 218 00:12:32,044 --> 00:12:35,881 వావ్. నేను కూడా చరిత్రకారుడినే, కానీ నాకు అది అభిరుచి అంతే. 219 00:12:37,257 --> 00:12:39,134 నీ పేరు, ఊరు వివరాలు చెప్పు, పిల్లోడా? 220 00:12:39,218 --> 00:12:40,594 పేరు, ఊరు చెప్పు. 221 00:12:40,677 --> 00:12:42,221 నా పేరు కెవిన్, నాది ఇంగ్లాండ్ దేశం. 222 00:12:44,223 --> 00:12:46,141 ఇంగ్లాండా? ప్లేగ్ వ్యాధి బాగా ఉన్న దేశం కదా? 223 00:12:46,225 --> 00:12:49,478 అసలు అక్కడ సురక్షితమేనా? మీరు అసలు స్నానం చేయరట. 224 00:12:49,561 --> 00:12:52,564 ఇంగ్లాండ్ బాగానే ఉంటుందని మాన్సా అంటున్నారు. 225 00:12:53,065 --> 00:12:55,067 నేను స్నానం చేస్తా. అమ్మ చేయిస్తుంది. 226 00:12:55,859 --> 00:12:56,693 చేయించింది. 227 00:12:56,777 --> 00:13:00,197 ఇంగ్లండ్ లో మీరు బీఫ్ ని ఉడకపెట్టేసి, 228 00:13:00,280 --> 00:13:02,783 ఉప్పూ, కారం లేకుండా తినేస్తారట. 229 00:13:02,866 --> 00:13:03,742 అవును. 230 00:13:04,326 --> 00:13:06,453 అబ్బే. చాలా వెనుకబడిన ప్రాంతం అది. 231 00:13:06,537 --> 00:13:07,871 చాలా వెనుకబాటుతనం అది. తప్పుగా అనుకోకు. 232 00:13:07,955 --> 00:13:10,457 అంటే… కించపరచాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ, అబ్బే. 233 00:13:10,541 --> 00:13:12,751 - అబ్బే. మాన్సా "అబ్బే" అని అంటున్నారు. - అబ్బే. 234 00:13:12,835 --> 00:13:14,127 అబ్బే. 235 00:13:14,211 --> 00:13:18,632 అరెరె. మరేం పర్వాలేదు, బల్లా. కొత్త వారి ముందే నేను చెప్పింది చెప్తే సరిపోతుంది. 236 00:13:18,715 --> 00:13:20,175 స్నేహితుల ముందు అక్కర్లేదు. 237 00:13:20,968 --> 00:13:22,344 అంటే, నేను స్నేహితుడినా? 238 00:13:22,427 --> 00:13:24,638 అవును, కెల్… కెవిన్. 239 00:13:25,222 --> 00:13:30,269 రేపు, సుల్తాన్ ని కలవడానికి మేము కైరోకి వెళ్తున్నాము, నువ్వు కూడా వస్తావా? 240 00:13:30,853 --> 00:13:31,979 వస్తా! 241 00:13:32,896 --> 00:13:35,858 - వావ్. అతను వస్తా అన్నాడు. వస్తా అన్నాడు. - హా. అవును. 242 00:13:35,941 --> 00:13:38,861 - అతను వస్తా అన్నాడు. వస్తా అన్నాడు. - మంచిది. నాకు ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఉంది. 243 00:13:38,944 --> 00:13:40,028 మనం వెళ్లే ముందు, 244 00:13:40,112 --> 00:13:44,366 నా మనుషులందరికీ నువ్వు మంచి మంచి కథలు చెప్పాలి. 245 00:13:44,867 --> 00:13:47,035 - అది మీకే ప్రమాదం, జాగ్రత్త. - అందరికీ కథలు ఉంటాయి. 246 00:13:47,119 --> 00:13:48,829 లేదు, మీరు… మీరు ఏమీ మాట్లాడకూడదు. 247 00:13:48,912 --> 00:13:50,539 - వాళ్లకి బంగారం ఇచ్చారా? - ఇచ్చాం. 248 00:13:50,622 --> 00:13:51,623 వాళ్లని ఇక్కడి నుండి తీసుకెళ్లిపొండి. 249 00:13:51,707 --> 00:13:53,417 - వాళ్లకి బంగారం ఇచ్చారుగా, తీసుకెళ్లిపోండి. - పదండి. 250 00:13:53,500 --> 00:13:56,670 నీ పేరు చాలా బాగుంది. దాన్ని ఎలా పలకాలి? 251 00:13:56,753 --> 00:13:58,255 - మళ్లీ చెప్పు. - కెవిన్. 252 00:13:58,338 --> 00:13:59,673 కె… కె… 253 00:13:59,756 --> 00:14:02,467 - కెవిన్. - కె-ఫైన్. కె-ఫైన్. 254 00:14:02,551 --> 00:14:04,303 కెవ్-ఇన్ లా. 255 00:14:04,887 --> 00:14:05,888 నాకు తెలిసిపోయింది. 256 00:14:06,972 --> 00:14:07,848 కైల్వైన్. 257 00:14:07,931 --> 00:14:09,725 కెవ్-ఇన్. 258 00:14:09,808 --> 00:14:11,643 మేము నేర్చుకుంటాంలే. ఆందోళన చెందకు. 259 00:14:12,394 --> 00:14:17,983 ఇవాళ రాత్రి, మన వాళ్ల మధ్య షికార్లు కొడుతున్న తాజా పుకార్లను, ఉన్నది ఉన్నట్టుగా వినబోతున్నాం. 260 00:14:18,066 --> 00:14:20,694 ఇబ్రహీమ్, నువ్వేం చేస్తున్నావో మాకు తెలుసు. 261 00:14:21,278 --> 00:14:25,741 కానీ ముందుగా, ఇంగ్లాండ్ లోని బింగ్లీ అనే సుదూర ప్రదేశం నుండి వచ్చిన ప్రత్యేక అతిథిని ఆహ్వానిస్తున్నా. 262 00:14:26,742 --> 00:14:29,745 భయం వద్దు. అతను శుభ్రంగా ఉన్నాడని నేను చెప్తున్నానుగా. మనలాగే అతను కూడా స్నానం చేస్తాడు. 263 00:14:30,329 --> 00:14:32,831 - అవును, అతనే కెవిన్! - అదీ లెక్క! 264 00:14:34,583 --> 00:14:35,709 నేనేనా మొదట? 265 00:14:35,792 --> 00:14:36,793 అవును. నువ్వే. 266 00:14:36,877 --> 00:14:39,671 ఏ విషయంలోనైనా కానీ, అందరికన్నా ముందుగా నన్ను ఎంచుకోవడం ఇదే మొదటిసారి. 267 00:14:45,552 --> 00:14:48,180 ఆచారంలో భాగంగా, నేను ముందుగా ప్రాస రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. 268 00:14:48,263 --> 00:14:49,806 సరే, అలాగే. 269 00:14:51,683 --> 00:14:54,853 రోజంతా ఆయన గొప్పదనాన్ని కీర్తించండి. 270 00:14:54,937 --> 00:14:58,232 డెన్మార్క్ దేశం కన్నా మాన్సా సంపన్నుడని గమనించండి. 271 00:15:02,110 --> 00:15:02,945 విన్నారా, వైకింగ్స్. 272 00:15:03,028 --> 00:15:06,782 సంపన్నుడిగా పేరు ఉండటం మంచి విషయం కాకపోవచ్చు. 273 00:15:06,865 --> 00:15:11,411 మీ దగ్గర బంగారముందన్న విషయం నలుదిశలా పాకి, యూరోపియన్ ఆక్రమణదారులని ఆకర్షిస్తుంది. 274 00:15:13,830 --> 00:15:15,165 - హేయ్, ఆగు. అతను ఏం అన్నాడు? - బాబోయ్. 275 00:15:15,249 --> 00:15:17,751 - ఒక్క… ఒక్క నిమిషం. - ప్రేక్షకులు చప్పట్లు కొట్టట్లేదు. వారికి నచ్చలేదు. 276 00:15:18,293 --> 00:15:20,170 ఆయన డెన్మార్క్ కన్నా సంపన్నుడు. 277 00:15:23,382 --> 00:15:25,384 జనాలను భలే గుప్పెట్లో ఉంచుకుంటున్నాడుగా. 278 00:15:25,467 --> 00:15:26,510 వాడికి మంచిదేలే. 279 00:15:26,593 --> 00:15:28,178 ఏమైంది నీకు, పెనెలోపీ? బంగారం ఇచ్చారుగా. 280 00:15:28,262 --> 00:15:30,097 - ఇచ్చారు, మనం దొంగిలించలేదు కదా. - కానీ బంగారం దక్కింది కదా. 281 00:15:30,180 --> 00:15:31,974 అది కానుకగా ఇచ్చారు, సరేనా? 282 00:15:32,057 --> 00:15:34,226 మంచి బందిపోటులందరూ దూరమైపోయారు నాకు. 283 00:15:35,310 --> 00:15:37,312 నేను అంత గొప్ప దొంగని కూడా కాదు. 284 00:15:41,400 --> 00:15:42,943 - నా బ్యాగును దొంగిలించాలని చూస్తున్నావా? - హా. 285 00:15:43,026 --> 00:15:44,444 - నా బ్యాగ్ ఈ పక్కన ఉంది. - సరే… 286 00:15:44,528 --> 00:15:45,863 చూశావా, ఆ పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నా. 287 00:15:46,446 --> 00:15:47,948 నేను బతికి ఉపయోగం ఏంటి? 288 00:15:50,868 --> 00:15:51,952 జూడీ ఏమైపోయిందో తెలీదు. 289 00:15:53,078 --> 00:15:54,413 సూసన్ చనిపోయింది. 290 00:15:55,831 --> 00:15:56,665 నేను తప్పిపోయాను. 291 00:15:57,499 --> 00:15:58,625 త్వరలోనే నా ప్రాణాలు పోవచ్చు కూడా. 292 00:16:00,335 --> 00:16:02,254 నాకు దారులు కనుక్కోవడం అంత బాగా రాదు. 293 00:16:15,475 --> 00:16:16,518 చుక్కలు. 294 00:16:17,561 --> 00:16:19,313 చుక్కలు, గ్రహాలే కీలకం. 295 00:16:22,316 --> 00:16:24,484 మ్యాప్ లో సగం సమాచారం మాత్రమే ఉంటుంది. 296 00:16:25,068 --> 00:16:27,654 కాలానికి సంబంధించిన దూరాలు, ఆకాశంలో నిక్షిప్తమై ఉంటాయి. 297 00:16:36,079 --> 00:16:38,790 అది ట్రాయ్. అది 19వ శతాబ్దపు చైనా. 298 00:16:38,874 --> 00:16:41,960 అది 20వ శతాబ్దం. అక్కడ ఎనిమిదవ శతాబ్దం ఉంది. 299 00:16:42,044 --> 00:16:44,087 ద్వారాలు స్థిరంగా లేవన్నది పొరపాటు. 300 00:16:44,171 --> 00:16:47,341 విశ్వంలో ఉండే అద్భుతమైన లయను అవి కూడా ప్రతిబింబిస్తున్నాయి. 301 00:16:47,424 --> 00:16:49,468 మ్యాప్ లో అనంతమైన సమాచారం ఉంది. 302 00:16:49,551 --> 00:16:53,013 విశ్వానికి చెందిన అనంతమైన గుణం చేతిలో ఈ సమాచారమంతా నిక్షిప్తమై ఉంది. 303 00:16:53,096 --> 00:16:56,600 అనేక నక్షత్ర మండలాల్లో ఉన్న చుక్కలు, 304 00:16:56,683 --> 00:16:59,019 అనేక కాలాలను లింక్ చేస్తున్నాయి. 305 00:17:00,103 --> 00:17:01,313 నేను మ్యాప్ గుట్టును కనిపెట్టేశా! 306 00:17:01,396 --> 00:17:03,982 ఓరి దేవుడా! ఓరి దేవుడా. 307 00:17:04,066 --> 00:17:05,483 నాకొక పెన్సిల్ కావాలి. 308 00:17:05,567 --> 00:17:07,528 దీన్ని రాయడానికి నాకొక పెన్సిల్ కావాలి. 309 00:17:07,611 --> 00:17:10,571 నాకొక పెన్సిల్ ఇవ్వండి. నాకు పెన్సిల్ కావాలి. 310 00:17:10,656 --> 00:17:13,659 అందుకని, వారిని రాజ్యం నుండి వెలేస్తారు. 311 00:17:13,742 --> 00:17:16,619 యువరాజు కుటుంబం వారిని తిరస్కరిస్తుంది. 312 00:17:17,454 --> 00:17:19,455 కాబట్టి, యువరాజు, యువరాణితో పాటు 313 00:17:19,540 --> 00:17:24,752 ఆమె స్వదేశంలోనే జీవనం కొనసాగించాలని, సప్త సముద్రాలు దాటి చాలా దూరం ప్రయాణిస్తాడు. 314 00:17:26,128 --> 00:17:29,716 ఎంత అందమైన గాథ ఇది, వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు ప్రేమికులు 315 00:17:29,800 --> 00:17:32,052 దగ్గరై జీవించడం. 316 00:17:33,428 --> 00:17:35,138 అది చాలా బాగుంది, కెవిన్. 317 00:17:35,222 --> 00:17:38,308 మేగన్, హ్యారీలు కలకాలం ప్రేమతో జీవిస్తారని ఆశిస్తున్నాను. 318 00:17:39,142 --> 00:17:42,437 ఆ యువరాజుకు చెందిన ఇతర భార్యలు మేగన్ గురించి ఏమనుకుంటున్నారో చెప్పు. 319 00:17:43,188 --> 00:17:45,274 హ్యారీకి భార్య ఒక్కరే, 320 00:17:45,816 --> 00:17:47,693 ఆమెకే ఇద్దరు భర్తలు. 321 00:17:47,776 --> 00:17:49,695 - ఇద్దరా? - వావ్. 322 00:17:49,778 --> 00:17:51,154 ఇది భలే ఆసక్తికరంగా ఉంది కదా? 323 00:17:51,238 --> 00:17:55,409 కెవిన్, నేను కలిసిన వారిలో అత్యంత ఆసక్తికరమైన వ్యక్తివి నువ్వే. 324 00:17:55,492 --> 00:17:56,785 అదేం లేదులే, నిజంగా అంటున్నారా? 325 00:17:56,869 --> 00:17:58,245 అవును. నిజంగానే. 326 00:17:58,829 --> 00:18:03,000 చాలా మంది… నాకు సన్నిహితులైన కొందరు, నేను బోరింగ్ మనిషినని అనుకుంటుంటారు. 327 00:18:03,083 --> 00:18:04,334 - ఏంటి? - ఏంటి? 328 00:18:05,127 --> 00:18:06,587 - అది అసాధ్యం. - అసాధ్యం. 329 00:18:06,670 --> 00:18:09,214 - కెవిన్, నువ్వు చాలా తెలివిమంతుడివి. - తెలివిమంతుడివి. 330 00:18:09,298 --> 00:18:10,382 తెలివిమంతుడివి. 331 00:18:19,600 --> 00:18:21,894 మ్యాప్ ఎక్కడ ఉంది? మ్యాప్ పోయిందా… 332 00:18:23,937 --> 00:18:25,647 అదేం లేదులే. అద్గదీ సంగతి. 333 00:18:29,443 --> 00:18:30,944 అయ్య బాబోయ్, ఇంకా నేను ఇక్కడే ఉన్నా. 334 00:18:32,154 --> 00:18:33,989 అబ్బా. సరే మరి. 335 00:18:38,076 --> 00:18:40,078 నేను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదో ఉండాలే, ఏంటది? 336 00:18:42,289 --> 00:18:43,290 బుర్రా, కాస్త పని చేయ్. 337 00:18:47,419 --> 00:18:48,337 బిటెలిగ్. 338 00:18:49,046 --> 00:18:50,047 చెప్పు, ఫార్బా. 339 00:18:50,839 --> 00:18:51,840 నేను నిన్ను ఒకటి అడగవచ్చా? 340 00:18:52,508 --> 00:18:54,384 ఏదైనా అడుగు, ఫార్బా. 341 00:18:55,594 --> 00:18:58,847 చూడు, నాకు ఒకరంటే చాలా ఇష్టం. 342 00:18:58,931 --> 00:18:59,932 చెప్పు. 343 00:19:00,015 --> 00:19:02,267 మేము కలిసి ప్రయాణిస్తాం, కలిసి తింటాం, 344 00:19:02,351 --> 00:19:07,022 కానీ నా మనస్సులోని భావాలను తనకి చెప్పేంత ధైర్యం మాత్రం నాకు రావట్లేదు. 345 00:19:07,105 --> 00:19:09,191 ఫార్బా, ఈ విషయం నాకు సుపరిచితమే. 346 00:19:09,691 --> 00:19:14,655 నాకొక స్నేహితుడు ఉన్నాడు, అతనికి ఒక స్నేహితురాలు ఉంది, 347 00:19:16,114 --> 00:19:21,703 కానీ ఆ స్నేహితురాలిపై తనకున్న ప్రేమని అతను ఎప్పుడూ చెప్పలేదు. 348 00:19:21,787 --> 00:19:26,708 ఇప్పుడు ఆ స్నేహితుడు, ఆ స్నేహితురాలిని ఇక ఎప్పటికీ కలవకపోవచ్చు. 349 00:19:28,085 --> 00:19:29,628 నువ్వు నాకొక మాట ఇవ్వాలి, ఫార్బా. 350 00:19:30,212 --> 00:19:33,799 నా స్నేహితుడు చేసిన తప్పే నువ్వూ చేయకు, 351 00:19:33,882 --> 00:19:38,762 తన స్నేహితురాలికి తన భావాలను అతను చెప్పలేకపోయాడు. 352 00:19:38,846 --> 00:19:43,225 నువ్వు తనకి నీ మనస్సులో ఏముందో చెప్పాలి, సరేనా? 353 00:19:43,308 --> 00:19:47,521 చెప్పకపోతే, నీ జీవితాంతం నువ్వు బాధపడాల్సి వస్తుంది, ఫార్బా. 354 00:19:50,065 --> 00:19:51,275 నువ్వు అన్నది నిజమే, బిటెలిగ్. 355 00:19:52,150 --> 00:19:53,235 - అయితే, విషయం తేలిపోయిందిగా. - అవునా? 356 00:19:53,318 --> 00:19:56,613 మహారాణి ఇనారీకి, తనని గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పేస్తా. 357 00:19:58,198 --> 00:20:00,534 వావ్. నువ్వు ప్రేమించేది, మహారాణి ఇనారీనా? 358 00:20:00,617 --> 00:20:02,035 - అవును. - మాన్సా మూసా భార్యనా? 359 00:20:02,995 --> 00:20:04,746 ఫార్బా, ఇది మంచిది కాదేమోనని అనిపిస్తోంది. 360 00:20:04,830 --> 00:20:06,290 కానీ నువ్వే అన్నావు కదా, బిటెలిగ్. 361 00:20:06,373 --> 00:20:10,878 తనపై నాకున్న ప్రేమని చెప్పకపోతే, జీవితాంతం బాధపడాల్సి వస్తుందని. 362 00:20:10,961 --> 00:20:16,675 అవును, కానీ నీ తలని నరికేస్తే, నీకు జీవితాంతం అనేదే ఉండదు కదా. 363 00:20:16,758 --> 00:20:18,510 బిటెలిగ్, ఎంత పని చేశావు? 364 00:20:20,137 --> 00:20:22,222 కైరోకి స్వాగతం, కెవిన్. 365 00:20:23,891 --> 00:20:27,311 అన్ని నగరాలనూ తలదన్నే మహానగరానికి స్వాగతం. 366 00:20:27,394 --> 00:20:28,812 వావ్. 367 00:20:33,400 --> 00:20:36,987 ఇది ఖాన్-ఎల్ ఖలీలీ అనే ప్రసిద్ధ మార్కెట్. 368 00:20:37,654 --> 00:20:41,074 ఇక్కడ బేరాలు ఆడాల్సిందే అని మాన్సా అంటున్నారు. 369 00:20:54,588 --> 00:20:57,090 - పైన చూడు, కెవిన్. - పైన చూడమని మాన్సా అంటున్నారు. 370 00:21:02,888 --> 00:21:04,139 ఇప్పుడే దీన్ని దొంగిలించా. 371 00:21:05,599 --> 00:21:07,809 లేదులే, డబ్బులిచ్చి కొన్నా. దొంగతనానికి వెళ్లాలని లేదా నీకు? 372 00:21:08,519 --> 00:21:10,312 - పర్వాలేదులే. - భలేదానివే, నీకు దొంగిలించడం అంటే ఇష్టం కదా. 373 00:21:10,395 --> 00:21:12,147 నాకు ఇప్పుడు దేని మీదా ఇష్టం లేదులే. 374 00:21:12,231 --> 00:21:13,148 అస్సలు లేదు. 375 00:21:13,232 --> 00:21:16,109 మరి ఇతర బందిపోటుల సంగతేంటి? అంటే, బిటెలిగ్ ఏమైపోయాడో మనకి తెలీదు. 376 00:21:16,193 --> 00:21:18,487 అతను కూడా తన జీవిత పరమార్థాన్ని వదిలేసుకున్నాడేమో. 377 00:21:18,570 --> 00:21:21,698 - జూడీ ఎక్కడుందో ఏమో. విడ్జిట్ తప్పిపోయాడు. - అవును, అది నిజమే. 378 00:21:21,782 --> 00:21:24,201 నా ఉద్దేశం, జూడీ కన్నా, బిటెలిగ్ కన్నా విడ్జిట్ ముఖ్యమని కాదు, 379 00:21:24,284 --> 00:21:25,160 కానీ అతని దగ్గర మ్యాప్ ఉంది, 380 00:21:25,244 --> 00:21:27,287 కనుక అతని ఆచూకీ కనిపెట్టకపోతే, మనం శాశ్వతంగా ఇక్కడే ఇరుక్కుపోతాం. 381 00:21:27,871 --> 00:21:29,164 హా, అవును. సర్లే. 382 00:21:29,248 --> 00:21:30,999 - సర్లేనా? - హా. 383 00:21:31,917 --> 00:21:34,920 బీద వాడా. బీద వాడిగానే మిగిలిపోకు. ఈ బంగారం తీసుకో. 384 00:21:35,003 --> 00:21:37,214 సర్, ఈ బంగారం తీసుకోండి. మీ కష్టాలకు ఇది ఉపయోగపడవచ్చు. 385 00:21:37,297 --> 00:21:39,633 థ్యాంక్యూ! థ్యాంక్యూ, సర్. చల్లగా ఉండండి. 386 00:21:39,716 --> 00:21:41,468 ఆ బూట్స్ చూడండి. 387 00:21:47,474 --> 00:21:51,270 రాజాది రాజ, మాలీ రాజ్య పరిపాలకా, మాన్సా మూసాకి జయహో. 388 00:21:51,854 --> 00:21:53,397 ఇప్పటికి మిమ్మల్ని కలిసే అదృష్టం దక్కినందుకు ఆనందం. 389 00:21:53,480 --> 00:21:54,606 హా, హలో. 390 00:21:54,690 --> 00:21:56,900 ఆ అదృష్టం తనదే అని మాన్సా అంటున్నారు. 391 00:21:58,277 --> 00:22:01,780 సుల్తాన్ మీ కోసం కోటలో వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. 392 00:22:01,864 --> 00:22:03,574 థ్యాంక్యూ, కానీ పర్వాలేదులే. 393 00:22:03,657 --> 00:22:06,243 సుల్తాన్ ని కలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉందని మాన్సా అంటున్నారు. 394 00:22:07,160 --> 00:22:08,495 అతని మాటలు నాకు వినిపిస్తున్నాయి, తెలుసా! 395 00:22:09,162 --> 00:22:12,332 - సరే, వెళ్దాం పదండి. - "సరే, వెళ్దాం పదండి," అని మాన్సా అన్నారు. 396 00:22:12,416 --> 00:22:13,333 మంచిది. 397 00:22:15,544 --> 00:22:16,545 అడ్డు జరగండి. 398 00:22:21,216 --> 00:22:22,259 నేను ఇది తీసుకుంటా. 399 00:22:24,469 --> 00:22:25,387 నాకు ఇది చాలా బాగా నచ్చింది. 400 00:22:25,470 --> 00:22:26,430 మహారాణి ఇనారీ. 401 00:22:27,723 --> 00:22:29,725 మీరు కోరినట్టుగా మీరు స్నానం చేయడానికని ఏర్పాట్లన్నీ చేశా. 402 00:22:30,350 --> 00:22:33,228 స్నానానికి ఏర్పాట్లా? ఎంత మంచి వాడివి. ఇంతకీ ఎక్కడ ఎర్పాటు చేశావు? 403 00:22:33,312 --> 00:22:34,730 ఎడారిలో. 404 00:22:34,813 --> 00:22:37,482 నడవడానికి సగం రోజు పడుతుంది, కానీ ఒంటె మీద అయితే, రెండే గంటల్లో వెళ్లిపోవచ్చు. 405 00:22:37,566 --> 00:22:42,237 సరే, సరే. థ్యాంక్యూ, కానీ నేను స్నానం ఇక్కడ కైరోలో చేస్తాను. 406 00:22:42,321 --> 00:22:44,823 - ఎందుకు? - ఇక్కడ చాలా సబ్బులు ఉన్నాయి. 407 00:22:46,742 --> 00:22:47,743 మీరెలా అంటే అలా. 408 00:22:48,452 --> 00:22:50,996 నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను… 409 00:22:52,623 --> 00:22:53,749 నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. 410 00:22:57,044 --> 00:22:58,045 మంచిదే. 411 00:22:58,545 --> 00:23:03,300 కానీ, మన మధ్య… అవన్నీ జరగవులే… కానీ, అది మంచి విషయమే. 412 00:23:11,433 --> 00:23:15,395 నీ తలని నరికేయలేదు కదా, దానికి సంతోషించు, మిత్రమా. 413 00:23:15,479 --> 00:23:16,855 నీ తలకి ఏమీ కాలేదు. 414 00:23:16,939 --> 00:23:19,900 నువ్వు అన్నది నిజమే. ప్రతికూలతలో కూడా సానుకూలతను బాగా వెతుకుతావు. 415 00:23:22,319 --> 00:23:23,153 హేయ్. 416 00:23:23,237 --> 00:23:27,199 నీ స్నేహితుడు ఆమెకి, తన మనస్సులో ఉన్న ప్రేమ గురించి ఎప్పటికైనా చెప్పేస్తాడంటావా? 417 00:23:27,282 --> 00:23:28,158 ఏమో. 418 00:23:28,242 --> 00:23:32,246 అసలు నా మిత్రుడు, మళ్లీ ఆమెని చూడగలడో లేదో. 419 00:23:35,791 --> 00:23:37,417 ఎవరికైనా స్నానం చేయాలనుంటే రండి… 420 00:23:39,336 --> 00:23:40,546 ఆలస్యమైతే నీరు ఆవిరైపోతాయి. 421 00:23:42,297 --> 00:23:44,007 ఒంటె మీదైతే రెండే గంటల్లో వెళ్లిపోవచ్చు. 422 00:23:44,091 --> 00:23:46,593 స్నానం చేయడానికి రెండు గంటలు ఒక లెక్కనా! 423 00:23:46,677 --> 00:23:47,845 నీళ్లు. 424 00:23:48,804 --> 00:23:50,222 నాకు నీళ్లు కావాలి. 425 00:23:53,058 --> 00:23:55,936 బుల్లి బుజ్జి ఎండమావి. 426 00:23:58,522 --> 00:23:59,523 దీనికి నేను పడిపోనుగా. 427 00:24:00,315 --> 00:24:01,525 నీ నీటిని తాగనుగా. 428 00:24:04,152 --> 00:24:05,153 అడుగులు ఉన్నాయి. 429 00:24:20,961 --> 00:24:22,629 వెళ్లి సూల్తాన్ ని కలుద్దాం పదండి. 430 00:24:22,713 --> 00:24:23,839 తప్పకుండా. 431 00:24:23,922 --> 00:24:27,092 ఏవండి! ఏవండి! ఓ రాజాదిరాజ మాన్సా. 432 00:24:27,176 --> 00:24:29,261 కొద్ది సేపటికి నేను కెవిన్ ని తీసుకెళ్లవచ్చా? 433 00:24:30,470 --> 00:24:33,432 అలాగే, కానీ త్వరగా తీసుకువచ్చేయాలి. 434 00:24:33,515 --> 00:24:36,685 మీరు అతడిని తీసుకెళ్లాలని, కానీ వెంటనే తీసుకువచ్చేయాలని మేము అతడిని మిస్ అవుతామని మాన్సా అంటున్నారు. 435 00:24:36,768 --> 00:24:38,312 ఆయనకి మీరు "ధన్యవాదాలు" అని చెప్పండి. 436 00:24:38,395 --> 00:24:39,730 నేనేమీ నీ పనివాడిని కాదు. 437 00:24:43,358 --> 00:24:44,985 కెవిన్, నీకు ఒక విషయం చెప్పాలి. 438 00:24:45,485 --> 00:24:47,738 - ఇక్కడున్నావా! - నన్ను క్షమించు. 439 00:24:47,821 --> 00:24:48,906 ఏం జరుగుతోంది? 440 00:24:48,989 --> 00:24:50,782 పెనెలోపీ దీనంగా ఉంది, ఏం చేయాలో నాకు తెలీట్లేదు. 441 00:24:50,866 --> 00:24:52,117 తన జీవిత పరమార్థాన్ని వదిలేసుకున్నట్టుంది. 442 00:24:52,201 --> 00:24:53,452 జీవిత పరమార్థం అనేది ఉండాలి. 443 00:24:53,535 --> 00:24:55,037 నువ్వు చరిత్రపై సోది కొడుతున్నట్టు పెట్టింది ముఖం. 444 00:24:55,120 --> 00:24:56,079 సారీ, ఆ మాట పరుషంగా వచ్చేసింది. 445 00:24:56,163 --> 00:24:57,289 - సారీ. - అది చాలా పరుషంగా ఉంది. 446 00:24:57,372 --> 00:24:59,833 తను ఆనందంగా ఉంటుందనుకున్నా. తనకి బంగారం దక్కింది కదా. 447 00:24:59,917 --> 00:25:01,376 కానీ తను దొంగిలించి దక్కించుకుంది కాదు, కనుక… 448 00:25:11,303 --> 00:25:12,638 ఏం కావాలి నీకు? 449 00:25:12,721 --> 00:25:15,641 నేను దొంగగా విఫలమయ్యానని వెక్కిరించడానికి వచ్చావా? 450 00:25:15,724 --> 00:25:18,060 లేదు, నువ్వు ఎలా ఉన్నావో చూడటానికి వచ్చా. 451 00:25:18,143 --> 00:25:19,561 నువ్వు బాధపడుతున్నావని బందిపోటులు అన్నారు. 452 00:25:19,645 --> 00:25:20,896 అవును, అది నిజమే. 453 00:25:20,979 --> 00:25:25,150 నిన్ను ఇంటి దగ్గర దింపలేం. మ్యాప్ తో పాటు, నలుగురిని కోల్పోయాం. 454 00:25:27,486 --> 00:25:29,154 ముగ్గురిని. 455 00:25:29,238 --> 00:25:32,366 నాకు బంగారం ఇవ్వడం ఆపండి! 456 00:25:35,577 --> 00:25:37,579 - పరిస్థితి దారుణంగా ఉంది. - చాలా దారుణంగా ఉంది. 457 00:25:37,663 --> 00:25:38,872 ఇప్పుడేం చేద్దాం? 458 00:25:38,956 --> 00:25:41,625 నేను ఏదోకటి ఆలోచిస్తాను. కానీ ముందు, నేను సుల్తాన్ ని కలవాలి. 459 00:25:44,503 --> 00:25:45,879 ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం. 460 00:25:45,963 --> 00:25:47,923 అవును, పైగా అందరిలోకల్లా దద్దమ్మలం మనమే. 461 00:25:48,006 --> 00:25:49,967 అవును, నువ్వు అన్నది నిజమే. 462 00:26:10,112 --> 00:26:10,988 సుస్వాగతం. 463 00:26:11,697 --> 00:26:14,116 ఇక ఆచార వ్యవహారంలో భాగంగా, 464 00:26:14,199 --> 00:26:18,662 గౌరవ సూచకంగా మాన్సా మూసా, సుల్తాన్ ముందు మోకాళ్ల మీద కూర్చుంటారు. 465 00:26:20,122 --> 00:26:21,039 ఆ పని నేను చేయను. 466 00:26:21,123 --> 00:26:22,791 ప్రస్తుతానికి ఆయన ఆ పని చేయరు. 467 00:26:23,458 --> 00:26:25,544 అతని మోకాళ్లకి ఏమైనా అయిందా? 468 00:26:26,378 --> 00:26:30,174 నేను మాన్సా మూసాని, నా మోకాళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. 469 00:26:30,716 --> 00:26:33,677 నేను మోకాళ్ల మీద కూర్చోను. నిజానికి, ఆ పని చేయాల్సింది అతనే. 470 00:26:34,178 --> 00:26:35,179 ముందు నువ్వు కూర్చో. 471 00:26:36,430 --> 00:26:38,849 మోకాళ్ల మీద నేను కూర్చోను. అతనే కూర్చోవాలి. నేనే బాస్ ని. 472 00:26:38,932 --> 00:26:40,434 - అందులో సందేహమే లేదు. - ఇది నా కోట. 473 00:26:40,517 --> 00:26:42,603 - మీరేం చెప్తే అదే చేస్తాను. సరే. - అతనికి చెప్పు. 474 00:26:47,024 --> 00:26:49,568 సుల్తాన్ ముందు మోకాళ్ల మీద కూర్చోవడానికి మాన్సా సిద్ధంగా ఉన్నారా? 475 00:26:49,651 --> 00:26:52,321 ముందు మాన్సా కూర్చుంటే, ఆ తర్వాత సుల్తాన్ మాన్సా ముందు కూర్చుంటారు. 476 00:26:52,404 --> 00:26:55,449 సుల్తాన్ కన్నా ముందు మాన్సా మోకాళ్ల మీద కూర్చోవాలని ఆంటున్నావా? 477 00:26:55,532 --> 00:26:57,159 మాన్సా, సుల్తాన్ ముందు మోకాళ్ల మీద కూర్చోవాలి. 478 00:26:57,659 --> 00:27:00,370 ఆ తర్వాత సుల్తాన్, మాన్సా ముందు మోకాళ్ల మీద కూర్చుంటారు. 479 00:27:00,454 --> 00:27:02,122 మాన్సా, సుల్తాన్ ముందు మోకాళ్ల మీద కూర్చుంటారు, 480 00:27:02,206 --> 00:27:04,291 కానీ ముందు సుల్తాన్, మాన్సా ముందు కూర్చున్నాకే, ఆయన కూర్చుంటారు. 481 00:27:04,374 --> 00:27:06,752 లేదు, లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. 482 00:27:06,835 --> 00:27:09,379 - లేదు, నువ్వే జాగ్రత్తగా నేను చెప్పేది… - ఇది నా ఆస్థానం. 483 00:27:10,380 --> 00:27:12,216 ఇవి నా కెంపులు. 484 00:27:13,884 --> 00:27:15,636 వీళ్లు నా యోధులు. 485 00:27:19,014 --> 00:27:19,848 కాబట్టి? 486 00:27:19,932 --> 00:27:23,393 హ, వాళ్లు నాకు కనిపిస్తున్నారు. హా, కెంపులు చాలా అందంగా ఉన్నాయి. 487 00:27:23,477 --> 00:27:27,731 చాలా కెంపులే ఉన్నాయి, సైనికులు కూడా దృఢంగా, బలంగా ఉన్నారు. 488 00:27:28,732 --> 00:27:33,070 అయినా కానీ, ముందు నేను మోకాళ్ళ మీద కూర్చోను, ఎందుకంటే నేను మాన్సాని, 489 00:27:33,654 --> 00:27:37,658 అంటే మహారాజును, అంటే సుల్తాన్ కన్నా గొప్ప అని. 490 00:27:37,741 --> 00:27:39,284 మొదట ఆయన మోకాళ్ల మీద కూర్చోరు. 491 00:27:39,368 --> 00:27:43,038 రాజ్యం దాటి బయటకు వచ్చాక మాన్సాల అధికార హోదా కాస్త తగ్గుతుంది. 492 00:27:43,121 --> 00:27:44,581 అది నిజం కాదు. 493 00:27:44,665 --> 00:27:46,291 అది నిజమే. 494 00:27:47,292 --> 00:27:48,627 నియమాలను చెక్ చేస్తున్నా. 495 00:27:51,088 --> 00:27:53,048 - అది నిజం కాదు. - అక్కడ ఏమీ లేదు. 496 00:27:53,131 --> 00:27:55,467 అక్కడ ఏమీ లేదని నాకు కూడా తెలుసు, ఎందుకంటే, నియమాలు ఏంటో అందరికీ తెలుసు. 497 00:27:55,551 --> 00:27:58,512 ఇక్కడ నియమాలు చేసేది నేనే, ఏదైనా మారకపోతే, 498 00:27:59,596 --> 00:28:02,850 పరిస్థితులు భయానకంగా మారుతాయి. 499 00:28:26,248 --> 00:28:28,125 ఆయన మోకాళ్ల మీద కూర్చోనే కూర్చోరు! 500 00:28:28,208 --> 00:28:31,128 మీరు ఎంతైనా బెదిరించుకోండి, కానీ అది మాత్రం జరగదు! 501 00:28:31,211 --> 00:28:33,380 - నేను మోకాళ్ళ మీద కూర్చుంటా. - ఆయన కూర్చుంటారు! 502 00:28:36,049 --> 00:28:38,218 దేవుని మీద గౌరవంతో, 503 00:28:39,011 --> 00:28:41,346 నీతో పాటు ఏకకాలంలో కూర్చుంటా. 504 00:28:41,430 --> 00:28:43,515 అతను ఆ పని చేయవచ్చా? ఆ వీలు అతనికి ఉందా? 505 00:28:44,099 --> 00:28:45,851 ఆయన ఒక లొసుగుతో మిమ్మల్ని ఇరికించేశాడు. 506 00:28:46,894 --> 00:28:47,853 మన్నించండి. 507 00:28:51,690 --> 00:28:52,691 సరే. 508 00:28:53,859 --> 00:28:56,111 ఇద్దరం ఏకకాలంలో మోకాళ్ల మీద కూర్చుందాం, 509 00:28:56,945 --> 00:28:59,281 దేవుని మీద గౌరవంతో. 510 00:28:59,364 --> 00:29:01,200 - మంచిది. - ఒకే సమయంలో. 511 00:29:01,283 --> 00:29:03,452 నేను… నేను కూడా అదే అన్నాను. ఏకకాలంలో అంటే ఒకే సమయంలో అని. 512 00:29:03,535 --> 00:29:04,870 - ట్రిక్కులు ఏమీ లేవుగా. - ఏమీ లేవు. 513 00:29:04,953 --> 00:29:06,705 నాకు అంత సమయం లేదు. మూడు లెక్క పెట్టే లోపు కూర్చుందాం. 514 00:29:06,788 --> 00:29:07,664 ఒకటి… 515 00:29:07,748 --> 00:29:08,790 రెండు… 516 00:29:08,874 --> 00:29:10,083 మూడు. 517 00:29:15,005 --> 00:29:15,881 కిందికి వంగుతా. 518 00:29:15,964 --> 00:29:18,008 - నేనింకా కిందికి వంగుతా. - అక్కడే ఉండు. నేను కిందికి వంగుతా. 519 00:29:18,091 --> 00:29:19,635 లేదు, నేను కూడా కిందికి వంగుతా. 520 00:29:19,718 --> 00:29:20,844 నాకన్నా కిందికి వంగలేవు నువ్వు. 521 00:29:20,928 --> 00:29:22,387 నువ్వు నేల కన్నా కిందికి వంగలేవు. 522 00:29:30,229 --> 00:29:34,149 దేవుని మీద గౌరవంతో సుల్తాన్, తనకి వీలైనంత కిందికి వంగారు. 523 00:29:35,484 --> 00:29:37,569 అద్గదీ సంగతి. అందరికీ బంగారం ఇవ్వండి. 524 00:29:37,653 --> 00:29:39,738 మరి కొందరికి కెంపులు ఇవ్వండి. 525 00:29:41,073 --> 00:29:43,492 చాలా చక్కగా వ్యవహరించారు. అసలు మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? 526 00:29:44,243 --> 00:29:46,745 ఏ పరిస్థితిలో అయినా, రాజీకి ఆస్కారం ఉంటుంది, కెవిన్. 527 00:29:46,828 --> 00:29:49,331 కాకపోతే, మనం వివేకవంతంగా ఆలోచించి, దాన్ని కనుగొనాలి, అంతే. 528 00:29:50,374 --> 00:29:52,334 రక్తపాతం కన్నా ఏదీ ఎక్కువ కాదు కదా. 529 00:29:53,836 --> 00:29:57,714 మీరు మా నాన్న అయ్యుండి, మీ 96 భార్యలు మా అమ్మలు అయ్యుంటే బాగుండు. 530 00:30:00,092 --> 00:30:03,720 ఆ మాట విన్నాక, బంగారం ఏదీ లేకున్నా కూడా, సంపన్నుడని అనే ఫీలింగ్ నాకు కలుగుతోంది. 531 00:30:16,400 --> 00:30:20,612 మాన్సా మూసా, నా స్నేహితురాలు, పెనెలోపీ, తన జీవిత పరమార్థాన్ని వదిలేసుకుంది. 532 00:30:20,696 --> 00:30:21,738 అది దారుణమైన విషయం. 533 00:30:22,364 --> 00:30:24,616 తన జీవిత పరమార్థం దొంగగా బతకడమని అనుకుంటోంది. 534 00:30:25,117 --> 00:30:26,201 అయితే అది మంచిదేగా. 535 00:30:26,285 --> 00:30:27,661 తను బాధగా ఉంది, అయోమయంలో ఉంది, 536 00:30:27,744 --> 00:30:30,706 ఒక మంచి దోపిడీ చేయాలని తను ఎప్పటి నుంచో అనుకుంటోంది. 537 00:30:30,789 --> 00:30:33,792 మీ నుండి తను ఏదైనా దోచుకునెలా సెటప్ చేయగలరా? 538 00:30:33,876 --> 00:30:36,712 అప్పుడు తన జీవితానికి పరమార్థం ఉన్నట్టు తనకి అనిపిస్తుంది. 539 00:30:36,795 --> 00:30:38,088 మీరు నా విషయంలో చేసినట్టుగానే. 540 00:30:40,424 --> 00:30:42,342 వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నారు. 541 00:30:42,426 --> 00:30:44,595 మాన్సా మూసా చేతికర్ర చాలా అందంగా ఉంటుంది. 542 00:30:44,678 --> 00:30:47,639 అవును. ఆయన దగ్గర ఉండే వస్తువుల్లో అత్యంత విలువైనది అది. 543 00:30:47,723 --> 00:30:49,808 దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దొంగలకి చిక్కనివ్వడు. 544 00:30:49,892 --> 00:30:51,185 దాన్ని దొంగిలించడం అసాధ్యం. 545 00:30:51,268 --> 00:30:53,562 దాన్ని దొంగిలించాలంటే, ఈ విశ్యంలోని అత్యంత గొప్ప దొంగ దిగిరావాలి. 546 00:30:54,771 --> 00:30:55,772 ఇదేదో ఆసక్తికరంగా ఉందే. 547 00:30:55,856 --> 00:31:00,360 ల్యాటిట్యూడ్ గీత, ఇంకా అతి పెద్దదైన లాంగిట్యూడ్ గీత. 548 00:31:00,444 --> 00:31:02,404 చెప్పాలంటే, అవి… 549 00:31:02,487 --> 00:31:05,282 పెనెలోపీ! నేను వచ్చేశా. 550 00:31:05,365 --> 00:31:06,992 ఇక్కడున్నావా, చచ్చినోడా! 551 00:31:07,075 --> 00:31:09,786 మేము ఇక్కడే, ఈ కాలంలోనే ఇరుక్కుపోయాం అనుకున్నాం. 552 00:31:09,870 --> 00:31:15,792 కొన్ని నక్షత్రాలు లయబద్ధంగా లింక్ అయి ఉన్నాయనే విషయాన్ని గ్రహించాను. 553 00:31:15,876 --> 00:31:17,836 గ్రహాల మధ్య దూరం, ఇంకా… 554 00:31:17,920 --> 00:31:21,173 సరే, విడ్జిట్, నువ్వు తిరిగి వచ్చినందుకు ఆనందంగానే ఉంది, కానీ మేము ఒక పని మధ్యలో ఉన్నాం. 555 00:31:21,256 --> 00:31:22,090 క్షమించాలి. 556 00:31:22,174 --> 00:31:26,136 విడ్జిట్, నీకొక విషయం చెప్పాలనుకున్నా, నీ పట్ల నాకు చాలా అభిమానం ఉంది, 557 00:31:26,220 --> 00:31:29,598 నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివని అనుకుంటున్నా. 558 00:31:30,182 --> 00:31:31,558 నువ్వు ఇక తిరిగిరాలేవేమో అనుకున్నా. 559 00:31:31,642 --> 00:31:34,144 - అది వినడానికి చాలా బాగుంది, కానీ నేను… - మేము బిజీగా ఉన్నాం. 560 00:31:36,021 --> 00:31:39,900 స్పష్టంగా అంతా నటన అని తెలిసిపోయే ఈ ప్లాన్ కి మీ మిత్రులు నిజంగానే పడిపోయి 561 00:31:39,983 --> 00:31:42,194 - నా చేతికర్రని దొంగలించే ప్రయత్నం చేస్తారా? - హా. 562 00:31:42,277 --> 00:31:44,988 అలా చేసి, గజదొంగలం అనేసుకుంటారా? 563 00:31:45,072 --> 00:31:47,282 - అవును. - ఆ తర్వాత, వాళ్లని పట్టుకొని తలలు నరికేద్దాం. 564 00:31:47,366 --> 00:31:49,451 - లేదు. - లేదు, మనం దొంగల తలలను నరుకుదాం. 565 00:31:49,535 --> 00:31:51,662 అది చాలా సమర్థవంతంగా వారు మళ్లీ దొంగతనం చేయకుండా ఆపుతుంది. 566 00:31:51,745 --> 00:31:54,623 వారి తల నరకడం అనే ఆలోచనని కాస్త పక్కకు పెడతారా? 567 00:31:55,541 --> 00:31:57,042 నీకోసం ఏదైనా చేస్తా, కెవిన్. 568 00:32:00,796 --> 00:32:02,089 ఒంటె, ఏనుగును చంపేస్తుంది. 569 00:32:02,172 --> 00:32:03,507 పావును చాలా చక్కగా కదిపావు, కెవిన్. 570 00:32:03,590 --> 00:32:05,217 మా నాన్న నేర్పాడు. 571 00:32:05,300 --> 00:32:08,220 నిజానికి, కంప్యూటర్ ద్వారా నేర్చుకున్నా, కానీ యాప్ ని ఇన్ స్టాల్ చేసింది ఆయనే. 572 00:32:10,389 --> 00:32:12,015 సరే మరి. మిత్రులారా. మిత్రులారా. 573 00:32:12,099 --> 00:32:13,767 కానివ్వండి. మీకు చెప్పిన పని చేయండి. 574 00:32:17,521 --> 00:32:20,732 ఆట చాలా ఆసక్తికరంగా ఉంది, 575 00:32:20,816 --> 00:32:25,988 ఈ సమయంలో, అత్యంత విలువైన నా చేతికర్రను ఎవరైనా దొంగిలించినా కూడా, నాకు తెలీదు. 576 00:32:27,906 --> 00:32:29,992 ఇప్పుడేం చేయను! ఈ పావును ఇక్కడికి కదుపుతా. 577 00:32:33,078 --> 00:32:33,912 ఇప్పుడేం చేయను! 578 00:32:36,206 --> 00:32:38,250 నేను… నేను ఈ పావును కదుపుతా. 579 00:32:38,959 --> 00:32:41,628 రాజాదిరాజ మాన్సా, ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. 580 00:32:41,712 --> 00:32:42,713 సరే. 581 00:32:44,923 --> 00:32:46,633 కెవిన్, నువ్వు కూడా వస్తావా? 582 00:32:52,472 --> 00:32:55,058 కెవిన్, నువ్వు వెళ్లిపోతే, మాకు చాలా బాధగా ఉంటుంది. 583 00:32:56,185 --> 00:33:01,231 కావాలంటే, నువ్వు మా దగ్గరే ఉండి, నీ కథలు చెప్తూ మాకు వినోదాన్ని అందించవచ్చు. 584 00:33:01,815 --> 00:33:05,569 నిజంగానా? ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. 585 00:33:05,652 --> 00:33:10,407 కెవిన్, నీ మిషన్ సంగతేమైంది? అదే, నువ్వు కాపాడాలనుకుంటున్నావు కదా… 586 00:33:11,491 --> 00:33:14,995 కెవిన్, నీకు వేరే మిషన్ ఉందా? 587 00:33:15,078 --> 00:33:18,916 మా అమ్మానాన్నలను కాపాడే పని మీద ఉన్నాను. 588 00:33:18,999 --> 00:33:20,417 మీ అమ్మానాన్నలా? 589 00:33:22,794 --> 00:33:25,631 నువ్వు బీద దేశమైన ఇంగ్లాండ్ కి చెందిన అనాథవి అనుకున్నానే. 590 00:33:25,714 --> 00:33:27,132 ఒక రకంగా చెప్పాలంటే, అనాథనే. 591 00:33:27,216 --> 00:33:29,218 మీ అమ్మానాన్నలు సమస్యలో చిక్కుకున్నారా? 592 00:33:30,302 --> 00:33:33,388 అవును, కానీ వాళ్లని కాపాడగలనో, లేదో కూడా నాకు తెలీదు. 593 00:33:33,472 --> 00:33:35,057 మీరేమో నాపై అభిమానం చూపారు. 594 00:33:35,140 --> 00:33:39,394 అవును. నువ్వు కూడా వాళ్లని అభిమానిస్తున్నావు, అందుకే వాళ్లని కాపాడాలని చూస్తున్నావు. 595 00:33:39,478 --> 00:33:41,313 కెవిన్, నువ్వు వెళ్లాలి. 596 00:33:41,897 --> 00:33:44,525 కానీ మీరు నన్ను చాలా చక్కగా ఆదరించారు. 597 00:33:44,608 --> 00:33:47,152 బహుశా, మీకు కథలు చెప్పడమే నా జీవిత పరమార్థమేమో. 598 00:33:47,236 --> 00:33:50,656 కాదు. కాదు, కెవిన్, కథలు చెప్పడమనేది నువ్వు చేసే పని. 599 00:33:50,739 --> 00:33:53,492 నీ జీవిత పరమార్థం, మీ అమ్మానాన్నలని కాపాడటం. 600 00:33:58,038 --> 00:34:00,791 చరిత్ర గురించి నువ్వు చెప్పే కథలని నేను మిస్ అవుతాను. 601 00:34:02,668 --> 00:34:03,877 కెవిన్. 602 00:34:03,961 --> 00:34:05,462 మాన్సా ఏమంటున్నారంటే… 603 00:34:08,507 --> 00:34:10,801 ఓయ్. మనం వెళ్లిపోవాలి, కానీ నువ్వు ఇంకా దాన్ని దొంగిలించలేదే. 604 00:34:11,592 --> 00:34:13,637 కెవిన్, కెవిన్. దీన్ని తీసుకో. 605 00:34:13,719 --> 00:34:15,472 థ్యాంక్స్. 606 00:34:15,556 --> 00:34:18,809 వావ్. బాబోయ్, ఇవి చాలా బాగున్నాయి. 607 00:34:18,891 --> 00:34:19,851 - థ్యాంక్యూ. - నేను… 608 00:34:19,935 --> 00:34:21,978 దయచేసి నా పావులని తాకవద్దు. ఇవి నీకు సంబంధించినవి కాదు. 609 00:34:24,313 --> 00:34:25,815 ఓయ్, త్వరగా రావాలి! 610 00:34:25,899 --> 00:34:27,025 సరే. మనం వెళ్లాలి, పద. 611 00:34:27,775 --> 00:34:30,904 - దాన్ని తాకవద్దు. నీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. - లేదు, నేను తాకను… 612 00:34:30,987 --> 00:34:32,281 కెవిన్… మనం వెళ్లాలి పద. 613 00:34:36,743 --> 00:34:38,120 రా, కెవిన్. 614 00:34:43,792 --> 00:34:47,963 - అయితే, నువ్వు ఆయన చేతి కర్రని ఎందుకు దొంగిలించలేదు? - ఎందుకంటే నాకు ఆనందంగా అనిపించింది. 615 00:34:48,045 --> 00:34:51,341 కావాలనుకుంటే, దాన్ని దొంగిలించగలిగి ఉండే దానివనా? 616 00:34:51,425 --> 00:34:54,136 కాదు, ఎందుకంటే నా కోసం అదంతా నువ్వే ఏర్పాటు చేశావని నాకు తెలుసు కాబట్టి. 617 00:34:54,219 --> 00:34:56,513 ఏంటి? నేనా? లేదు, లేదు. 618 00:34:57,806 --> 00:35:01,393 లేదు, నాకు విలువ ఉంది అనిపించేలా చేయడానికి, 619 00:35:01,476 --> 00:35:04,938 అలాంటి ఏర్పాటు కూడా చేయగలిగే స్నేహితుడు నాకున్నాడని ఆనందం కలిగింది. 620 00:35:06,273 --> 00:35:10,402 అంతే కాకుండా, నీకు ఇక్కడే ఉండాలని ఉన్నా, మాతో పాటు వస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. 621 00:35:12,738 --> 00:35:16,158 ఇంకా, సుల్తాన్, ముందు ఎవరు మోకాళ్ల మీద కూర్చోవాలి అని తేల్చుకుంటూ ఉన్నప్పుడు, 622 00:35:16,241 --> 00:35:18,869 అతని కెంపులు దొంగిలించేశాం కాబట్టి నాకు ఆనందంగా ఉంది. 623 00:35:18,952 --> 00:35:20,162 ఏంటి? 624 00:35:20,245 --> 00:35:21,455 - నేను కిందికి వంగుతా. - నేనింకా వంగుతా. 625 00:35:21,538 --> 00:35:23,999 - అక్కడే ఉండు. నేను కిందికి వంగుతా. - లేదు, నేను కూడా కిందికి వంగుతా. 626 00:35:24,082 --> 00:35:27,169 దేవుని మీద గౌరవంతో సుల్తాన్, తనకి వీలైనంత కిందికి వంగాడు… 627 00:35:33,050 --> 00:35:34,593 అది చాలా పెద్ద తప్పు. 628 00:35:34,676 --> 00:35:36,345 నేను ఆనందంగా ఉండాలని అనుకున్నావు, ఇప్పుడు అలాగే ఉన్నా. 629 00:35:36,428 --> 00:35:38,680 నా దగ్గర కెంపులు ఉన్నాయి. కదా, బిటెలిగ్? 630 00:35:38,764 --> 00:35:41,141 - లేదు, జూడీ ఇప్పుడు ఇక్కడ లేదు. - జూడీ కాదు. కెంపులు. 631 00:35:41,934 --> 00:35:44,811 సుల్తాన్ నుండి మనం కెంపులని దొంగిలించాం కదా, వాటిని నువ్వు 632 00:35:44,895 --> 00:35:47,105 ఎప్పటికీ నిండుకోని బ్యాగులో వేసుకున్నావు కదా, ఆ కెంపుల గురించి మాట్లాడుతున్నా. 633 00:35:47,189 --> 00:35:49,399 కానీ ఎప్పటికీ నిండుకోని బ్యాగ్ అని ఎందుకు అన్నావు? 634 00:35:50,234 --> 00:35:52,736 సరే, అవి బ్యాగులో ఉన్నాయా, లేదా? 635 00:35:52,819 --> 00:35:57,241 ఎప్పటికీ నిండుకోని బ్యాగ్ అంటే కింద భాగం లేని బ్యాగ్ కదా. 636 00:35:57,324 --> 00:35:58,367 ఏంటి? 637 00:35:58,450 --> 00:36:04,414 ఎప్పుడూ నిండుకోని బ్యాగులోనే అన్నీ పెట్టమంటుంటావు, ఆ విషయం నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. 638 00:36:04,498 --> 00:36:06,583 - మనం వెనక్కి వెళ్లాలి. - లేదు, లేదు. మనం వెళ్లలేం. 639 00:36:06,667 --> 00:36:07,543 మనకి అంత సమయం లేదు. 640 00:36:07,626 --> 00:36:10,128 - మరి ఎంత సమయం ఉంది మనకి? - అసలు సమయమే లేదు. 641 00:36:10,963 --> 00:36:13,131 విషయం ఏంటంటే, ఈ ద్వారం అసాధారణమైనది అన్నమాట. 642 00:36:13,924 --> 00:36:14,925 అంటే? 643 00:36:15,551 --> 00:36:16,802 దీని ద్వారా మనం ఎక్కడికి వెళ్లగలమో నాకు తెలుసు. 644 00:36:18,387 --> 00:36:19,513 మనం అక్కడికే వెళ్తున్నాం. 645 00:36:20,722 --> 00:36:21,682 సుడులు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. 646 00:36:21,765 --> 00:36:24,101 - సరే. - ఓరి దేవుడా. 647 00:36:24,184 --> 00:36:25,853 మిత్రులారా, ఇది వినండి. 648 00:36:25,936 --> 00:36:30,399 "మక్కాకు అతను చేపట్టిన హజ్ యాత్రలో 60,005 మంది పాల్గొనారు." 649 00:36:30,482 --> 00:36:32,860 - హా, ఆ విషయం ఇంతకుముందు చెప్పావులే, కెవిన్. - సోది! 650 00:36:34,820 --> 00:36:37,406 సరే మరి. జూడీ మన చెంతకి రాగలదని ఆశిద్దాం. 651 00:36:38,323 --> 00:36:42,828 లేదు. మక్కాకు వెళ్లే జనాల సంఖ్య మారింది. మనం మార్చాం. 652 00:36:43,745 --> 00:36:45,706 ఆ అయిదుగురు అదనపు వ్యక్తులం, మనమే. 653 00:36:46,248 --> 00:36:49,126 ఇంతకుముందు జరిగిన వాటిని మనం మార్చవచ్చు. 654 00:36:49,209 --> 00:36:50,169 ఏంటి? 655 00:37:14,484 --> 00:37:16,612 "ప్రియమైన దేవుడా, నేను మళ్లీ నడిచేలా చేయవా?" 656 00:37:16,695 --> 00:37:18,530 లేదు, దానికి నేనేం సాయపడాలి… ఆ పని నేనెలా చేయగలను? 657 00:37:18,614 --> 00:37:19,448 ఏమో. 658 00:37:19,531 --> 00:37:21,867 ఈ ప్రార్థనల్లోని కోరికలు మరీ అతిగా ఉన్నాయి, కదా? 659 00:37:22,451 --> 00:37:24,995 "ప్రియమైన దేవుడా, సంవత్సరమంతా మంచి పిల్లాడిలా ఉన్నాను. 660 00:37:25,078 --> 00:37:26,747 నాకొక సైకిల్ ఇప్పించవా?" ఇది నన్నా అడిగేది! 661 00:37:26,830 --> 00:37:28,957 - దీన్ని శాంటా క్లాజ్ కి పంపు. - హా, సరే. 662 00:37:30,167 --> 00:37:34,505 మూడుసార్లు పళ్లు రావాలట. మూడుసార్లా? ఏంటి? రెండుసార్లు వస్తే చాలదా? 663 00:37:34,588 --> 00:37:35,797 - అదే కదా. - మూడుసార్లు అట. 664 00:37:35,881 --> 00:37:37,466 ఏం కావాలేంటి? టీనేజ్ పళ్లా? 665 00:37:38,342 --> 00:37:40,552 టీనేజ్… టీనేజ్ పళ్లు. 666 00:37:42,471 --> 00:37:43,472 - హా. - అదే కదా. 667 00:37:43,555 --> 00:37:44,556 టీనేజ్ పళ్లు. 668 00:37:44,640 --> 00:37:47,434 టీనేజ్ పళ్లు. లేదు, లేదు. 669 00:37:47,518 --> 00:37:48,769 ఒకటి చెప్పనా, సలహాదారుడా? 670 00:37:49,603 --> 00:37:53,023 నేను కూడా ప్రార్థన చేసుకోవచ్చంటే ఏమని ప్రార్థిస్తానంటే, 671 00:37:53,106 --> 00:37:55,734 "ప్రియమైన నాకు, నా మ్యాప్ ని తిరిగి నా దగ్గరికి చేర్చవా? ఆమెన్." 672 00:37:56,985 --> 00:37:58,111 ఓసారి ప్రయత్నించి చూడండి. 673 00:37:58,695 --> 00:37:59,696 సరే. 674 00:38:00,864 --> 00:38:02,991 ప్రియమైన నాకు, నా మ్యాప్ ని తిరిగి నా దగ్గరికి చేర్చవా? 675 00:38:03,075 --> 00:38:03,951 ఆమెన్. 676 00:38:07,287 --> 00:38:08,121 ఆగు. 677 00:38:08,705 --> 00:38:11,083 ఆగు, ఆగాగు. 678 00:38:15,462 --> 00:38:16,588 నాకు వినిపించలేదు అది. 679 00:38:16,672 --> 00:38:18,215 ప్రయత్నిస్తే పోయేది ఏముందిలే! 680 00:38:18,298 --> 00:38:20,676 సర్లే. కనీసం మ్యాప్ ఎటు వెళ్తోందో మనకి తెలుసులే… 681 00:38:22,261 --> 00:38:24,054 ఎందుకంటే, బందిపోటుల్లో ఒకరిని పట్టుకున్నాగా. 682 00:38:50,247 --> 00:38:51,164 టెర్రీ గిలియమ్, మైఖెల్ పాలిన్ 683 00:38:51,248 --> 00:38:52,165 రూపొందించిన పాత్రల ఆధారితమైనది 684 00:38:58,255 --> 00:38:59,673 'TIME BANDITS' సినిమా ఆధారితమైనది 685 00:40:03,237 --> 00:40:05,239 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్