1 00:00:49,758 --> 00:00:51,385 ద్వారం ఇక్కడ లేదు. 2 00:00:51,385 --> 00:00:53,929 మ్యాప్ అయినా తప్పు చూపిస్తుండాలి, లేదా ఈ చోటైనా తప్పుగా ఉండాలి. 3 00:00:53,929 --> 00:00:55,180 నీ అంచనాయే తప్పేమో. 4 00:00:55,180 --> 00:00:56,640 హా, అది కూడా అయ్యుండవచ్చు. 5 00:00:56,640 --> 00:00:58,767 ఇక్కడి నుండి నేను ఇంటికి వెళ్లుండవచ్చు అని అంటున్నావా? 6 00:00:58,767 --> 00:01:01,103 అవును, కానీ అందుకు నేను ద్వారాన్ని కనుగొనాలి. 7 00:01:01,854 --> 00:01:04,147 బహుశా ఈ లోపల ఏమైనా రాసుందేమో చూస్తా. 8 00:01:05,315 --> 00:01:09,027 అయ్యయ్యో. అది... లేదు. 9 00:01:10,529 --> 00:01:13,448 లేదు. నాకు ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. 10 00:01:13,448 --> 00:01:15,576 సరే మరి. ద్వారం కనిపించే దాకా ఇక్కడ వేచి ఉందాం. 11 00:01:15,576 --> 00:01:17,160 ఇక్కడే బయట ఉంటే చలికి మనకి చావు తప్పదు. 12 00:01:17,160 --> 00:01:19,538 - ముందు మనకి చలి పుట్టాలి కదా. - హా. నాకు ఇప్పుడు చలిగానే ఉంది. 13 00:01:19,538 --> 00:01:20,998 అక్కడికి వెళ్లాక ఏం చేయాలి? 14 00:01:20,998 --> 00:01:24,918 మీరు మీ పాత అవతారాలను కలవకూడదు, అది చాలా ముఖ్యం. 15 00:01:24,918 --> 00:01:27,045 ఇద్దరం మాయమైపోతామా? 16 00:01:27,045 --> 00:01:29,882 లేదా పేలిపోతామా? ఆటమ్స్ లా? 17 00:01:29,882 --> 00:01:31,967 లేదు, మీ గురించి మీకున్న అభిప్రాయంపై అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. 18 00:01:31,967 --> 00:01:35,179 అవును, ఒకసారి నా పాత అవతారాన్ని నేను చూశాను. చాలా విచిత్రంగా అనిపించింది. 19 00:01:35,179 --> 00:01:37,681 ఇప్పుడు ఈ గుర్తులు దేన్ని సూచిస్తున్నాయో నాకు తెలీట్లేదు. 20 00:01:37,681 --> 00:01:39,975 బహుశా దానికి సమాధానం ఈ ఫ్లాప్ వెనుక ఉందేమో... 21 00:01:40,475 --> 00:01:43,395 - ఈ ద్వారం నాకెక్కడా కనిపించట్లేదు. - అక్కడ ఉంది! 22 00:01:44,271 --> 00:01:45,314 అక్కడుంది. 23 00:01:45,314 --> 00:01:48,275 మరి, మా అమ్మానాన్నలను కాపాడుకోవడానికి మాకు ఎంత సమయం ఉంటుంది? 24 00:01:48,275 --> 00:01:51,695 - ప్రియమైన కెవిన్, "సారాన్" లారా. - నా పేరు శాఫ్రాన్. 25 00:01:51,695 --> 00:01:53,113 మనకి 30 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. 26 00:01:53,113 --> 00:01:54,239 ముప్పై నిమిషాలా? 27 00:01:54,239 --> 00:01:56,950 అవును, నిన్ను ఏ రాత్రి అయితే మేము కలిశామో, ఆ రాత్రి సమయానికే మనం వెళ్తున్నాం. 28 00:01:56,950 --> 00:01:58,118 కాస్త ముందు వెళ్తామంతే. 29 00:01:58,118 --> 00:02:01,747 ఏంటి? ఆ సంఘటన జరిగిన రాత్రేనా? వేరే సమయానికి వెళ్లలేమా? 30 00:02:01,747 --> 00:02:04,917 లేదు! ఆ రాత్రి ఫియానా, సుప్రీమ్ బీయింగ్ ఇద్దరూ వస్తారు! 31 00:02:04,917 --> 00:02:07,544 అవును. రిస్కులు అయితే ఉన్నాయి. 32 00:02:08,544 --> 00:02:11,381 - బాబోయ్, ఆగు. - వద్దు, ఆగు! అది చాలా ప్రమాదకరం! 33 00:02:11,381 --> 00:02:13,634 అది నా సమస్య కాదు, సారీ! 34 00:02:13,634 --> 00:02:15,636 ఓరి దేవుడా. తనకి బాగా... 35 00:02:15,636 --> 00:02:17,888 - అవును, కానీ తను నా చెల్లెలు. - అవును. 36 00:02:17,888 --> 00:02:20,098 - కెవిన్! - వద్దు, కెవిన్, అది ప్రమాదకరం! 37 00:02:20,098 --> 00:02:23,435 గతాన్ని మనం మార్చగలమో లేదో కూడా మనకి ఖచ్చితంగా తెలీదు! 38 00:02:25,729 --> 00:02:26,563 నాకు తెలుసు. 39 00:02:40,410 --> 00:02:41,495 ఇది మన ఇల్లు కాదు. 40 00:02:41,495 --> 00:02:43,205 ఫ్రిడ్జిలో పిల్లలు ఉన్నారు. 41 00:02:43,205 --> 00:02:45,541 పిల్లలూ, మీరు నా ఫ్రిడ్జిలో ఆటలు ఆడకూడదు. 42 00:02:45,541 --> 00:02:47,125 సరే. 43 00:02:47,835 --> 00:02:49,044 మనం ఎక్కడ ఉన్నాం? 44 00:02:50,087 --> 00:02:51,630 ఏదైనా పురాతన కాలానికి వచ్చామా? 45 00:02:51,630 --> 00:02:53,632 - ఇక్కడ పార్టీ జరుగుతోంది. - అది నీకెలా తెలుసు? 46 00:02:53,632 --> 00:02:55,175 నువ్వు ఎప్పుడూ పార్టీకి వెళ్లనే లేదు కదా. 47 00:02:55,175 --> 00:02:57,094 - ఒక పార్టీకి వెళ్లాను. - వెళ్లలేదు. 48 00:02:57,094 --> 00:02:58,846 వెళ్లాను, 1920ల కాలంలో వెళ్లాను. 49 00:02:58,846 --> 00:03:00,264 - లేదు, నువ్వు వెళ్లలేదు. - వెళ్లా. 50 00:03:00,264 --> 00:03:01,181 - వెళ్లలేదు. - వెళ్లా! 51 00:03:01,181 --> 00:03:02,140 - లేదు, వెళ్లలేదు! - వెళ్లా! 52 00:03:02,140 --> 00:03:04,476 - మనకి అరగంటే సమయముంది, కెవిన్! - అయితే వాదులాడటం ఆపు! 53 00:03:04,476 --> 00:03:05,435 హా! 54 00:03:06,270 --> 00:03:07,312 ఇది బింగ్లీనా? 55 00:03:07,312 --> 00:03:09,064 దురదృష్టవశాత్తూ, అవును. 56 00:03:09,064 --> 00:03:11,441 చీస్లీ క్లోస్ కి ఎటు వెళ్లాలి? 57 00:03:11,441 --> 00:03:13,193 అదేంటో కూడా నాకు తెలీదు. 58 00:03:13,193 --> 00:03:14,570 మీ ఫోనులో వెతికి చెప్పగలరా? 59 00:03:15,737 --> 00:03:16,572 చెప్పలేను. 60 00:03:17,656 --> 00:03:19,867 మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలంటే, మనకి ఒక ల్యాండ్ మార్క్ అవసరమవుతుంది. 61 00:03:19,867 --> 00:03:22,119 మంచు ప్రాంతంలో మేము దారిని అలాగే కనుగొనేవాళ్లం. 62 00:03:22,119 --> 00:03:23,996 షాపింగ్ సెంటర్ కి ఎటు వెళ్లాలి? 63 00:03:24,621 --> 00:03:27,165 అటు వెళ్లాలి. మీరు షాపింగ్ కి వెళ్తున్నారా? 64 00:03:27,165 --> 00:03:29,751 ఒక రాకాసి మా అమ్మానాన్నలను బొగ్గు ముద్దల్లా మార్చబోతోంది, మేము దాన్ని అడ్డుకోబోతున్నాం. 65 00:03:29,751 --> 00:03:31,336 మరీ శృతి మించి మాట్లాడుతున్నారు. 66 00:03:31,336 --> 00:03:33,839 - ఇది పగలే. - మనం రాత్రి కదా రావాల్సింది. 67 00:03:33,839 --> 00:03:35,841 బహుశా మనకి ఇంకా ఎక్కువ సమయం ఉందేమో. 68 00:03:36,341 --> 00:03:37,176 ఈ పని మనం చేయలేం. 69 00:03:37,176 --> 00:03:39,678 - మొదటిసారే తృటిలో తప్పించుకున్నాం. - కానీ మనం వెళ్లాలి. వాళ్లు పిల్లలు. 70 00:03:39,678 --> 00:03:41,555 ఈ విషయంలో నేను పునరాలోచనలో పడుతున్నాను. 71 00:03:41,555 --> 00:03:44,725 ఎందుకంటే, నా మాజీ లవర్ చేతిలో బూడిదైపోవాలని నాకు లేదు. 72 00:03:44,725 --> 00:03:47,060 ఎవరి ద్వారా బూడిద అవ్వాలని లేదనుకోండి. కానీ తన ద్వారా అయితే అస్సలు కాకూడదు. 73 00:03:47,060 --> 00:03:49,396 - మనం దీని గురించి ఇంకా చర్చించుకోవాలి. - అవును. 74 00:03:49,396 --> 00:03:52,691 ఆపండి! చర్చలు ఆపి, వెంటనే వెళ్లండి! 75 00:03:52,691 --> 00:03:53,734 ఓరి దేవుడా! 76 00:03:53,734 --> 00:03:55,944 మన భవిష్యత్తు అవతారాలా వాళ్లు? అది నేనే. 77 00:03:55,944 --> 00:03:57,362 ఎందుకు మనకి చెమటలు కారిపోతున్నాయి? 78 00:03:57,362 --> 00:03:58,822 అది చాలా పెద్ద కథ, ఇప్పుడు సమయం లేదు. 79 00:03:58,822 --> 00:03:59,781 నేను కనబడట్లేదే? 80 00:03:59,781 --> 00:04:01,658 ఆ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. 81 00:04:01,658 --> 00:04:03,452 - అయ్య బాబోయ్. - అయ్య బాబోయే. 82 00:04:03,452 --> 00:04:04,745 నాకు చాలా భయంగా ఉంది. 83 00:04:04,745 --> 00:04:08,415 లేదు, నువ్వు చాలా ధైర్యవంతుడివి! నీ వ్యక్తిగత సహకారం చాలా ముఖ్యమైనది! 84 00:04:08,415 --> 00:04:10,626 - వావ్, నిజంగానా? - అవును! అబ్బా! 85 00:04:10,626 --> 00:04:13,003 మీతో నేనెందుకు లేను? 86 00:04:13,754 --> 00:04:16,589 - నేను చనిపోయానా? - అది మాకు ఖచ్చితంగా తెలీదు. 87 00:04:16,589 --> 00:04:18,216 ఖచ్చితంగా తెలీదంటే? 88 00:04:19,009 --> 00:04:22,346 మీరు మాతో మాట్లాడుతున్న ద్వారాన్ని నేనెలా తెరిచాను? 89 00:04:22,346 --> 00:04:26,058 మ్యాప్ ఎలా పని చేస్తుందనే దానిపై నీకు ఎంత అవగాహన ఉందో నీకే తెలీదు. 90 00:04:26,058 --> 00:04:29,102 - అవునా? - అవును! కాలం ముడుచుకుంటుంది! 91 00:04:30,229 --> 00:04:31,355 అర్థమైందా? 92 00:04:33,607 --> 00:04:34,983 లేదు, నాకు అర్థం కావట్లేదు. 93 00:04:36,401 --> 00:04:38,487 - మాకు ఏమైంది? - ఖచ్చితంగా తెలీదంటే? 94 00:04:38,487 --> 00:04:41,782 ఇక చాలు! ప్రశ్నలు అడగకండి ఇక. మీరు తక్షణమే బయలుదేరాలి. పదండి! 95 00:04:41,782 --> 00:04:44,576 - హేయ్, ఏం... ఆగండి! - సరే, సరే. అరుస్తావెందుకు! 96 00:04:45,577 --> 00:04:46,828 ఏంటి ఆ అరుపు? 97 00:04:46,828 --> 00:04:48,247 నేనెందుకు అలా గదమాయిస్తున్నా? 98 00:04:48,247 --> 00:04:51,375 - నాకేం అవుతుంది? - నేనేం చెప్తున్నాను? 99 00:04:58,882 --> 00:05:01,134 మనం వచ్చిన దారిలోనే తిరిగి వెళ్తే మంచిది అనిపిస్తోంది. 100 00:05:01,134 --> 00:05:03,387 ఈ చోటు, సాధారణంగా ఉండే దాని కన్నా మబ్బుగా ఉంది. 101 00:05:04,680 --> 00:05:07,140 అందరూ పాత కాలపు డ్రెస్సులు వేసుకొని ఉన్నారు. 102 00:05:08,809 --> 00:05:10,435 అది ఫ్యాషనేమో? 103 00:05:10,435 --> 00:05:12,813 ఈరోజుల్లో నేను ఫ్యాషన్ ని పెద్దగా ఫాలో అవ్వట్లేదు. 104 00:05:12,813 --> 00:05:14,064 హా, ఒకసారి ఎలా ఉన్నావో చూసుకో. 105 00:05:15,566 --> 00:05:17,442 సంగీతం కూడా పాతకాలం నాటిదే. 106 00:05:18,318 --> 00:05:20,195 అమ్మ వినే పాటల్లా ఉన్నాయి ఇవి. 107 00:05:21,572 --> 00:05:22,823 అయ్యయ్యో. 108 00:05:22,823 --> 00:05:25,075 {\an8}ఇది 1996వ సంవత్సరం. 109 00:05:25,993 --> 00:05:28,620 అయ్యయ్యో. పురాతన కాలం. 110 00:05:28,620 --> 00:05:31,373 మనం వచ్చింది మన అమ్మానాన్నలు చావబోయే 30 నిమిషాల ముందు కాదు. 111 00:05:31,373 --> 00:05:33,375 సుమారుగా 30 ఏళ్లు ముందు వచ్చాం. 112 00:05:33,375 --> 00:05:35,127 మ్యాపులోడు అంత పెద్ద తప్పు చేస్తాడంటావా? 113 00:05:35,127 --> 00:05:37,880 చెప్పాలంటే, అనుకున్న కాలానికి దగ్గరగా అతను తీసుకురావడం ఇదే మొదటిసారి. 114 00:05:40,007 --> 00:05:43,760 కెవిన్, ఆ హాలోవీన్ జనాలు ఉన్న ఇల్లు ఏదైతే ఉందో, 115 00:05:44,761 --> 00:05:47,264 అదే మన ఇల్లు, కాకపోతే ఇప్పటికి ఇంకా అది మన ఇల్లు కాలేదు. 116 00:05:48,307 --> 00:05:50,434 దాన్ని కూల్చేసి, ఎస్టేట్ కట్టి ఉంటారు. 117 00:05:51,268 --> 00:05:53,228 ఇంకా మన వీధి రూపుదిద్దుకోలేదు. 118 00:05:53,228 --> 00:05:55,147 ఇప్పుడు మనం అక్కడ నివసించట్లేదు. 119 00:05:55,147 --> 00:05:56,982 అసలు మనం పుడితే కదా! 120 00:06:01,361 --> 00:06:03,071 నేను అమ్మానాన్నలను చూస్తాను అనుకున్నా. 121 00:06:04,156 --> 00:06:05,282 నిజంగా అనుకున్నా. 122 00:06:06,658 --> 00:06:08,076 నేను కూడా. 123 00:06:08,577 --> 00:06:10,120 నాకు వాళ్లని కాపాడాలనుంది. 124 00:06:10,120 --> 00:06:12,414 మరేం పర్వాలేదులే, మనం మళ్లీ ప్రయత్నిద్దాం. 125 00:06:13,207 --> 00:06:15,083 ఇక్కడికి ఇంకో కాలంలో వద్దాం. 126 00:06:18,420 --> 00:06:19,796 మనం వాళ్లని చూడవచ్చు. 127 00:06:19,796 --> 00:06:20,797 ఏంటి? 128 00:06:20,797 --> 00:06:23,258 మనం వాళ్లని చూడవచ్చు. వాళ్లు ఇప్పుడు బతికే ఉన్నారు. 129 00:06:23,258 --> 00:06:25,969 వాళ్లకి మనం ఇంకా పుట్టలేదు, శాఫ్. వాళ్లకి మనమెవరో తెలీదు. 130 00:06:25,969 --> 00:06:27,095 కానీ వాళ్లు మనకి తెలుసు కదా. 131 00:06:27,095 --> 00:06:30,432 అమ్మకి నేనెవరో తెలిసి ఉండదు. కానీ నాకు ఆమెని కౌగిలించుకోవాలనుంది, కెవ్. 132 00:06:30,432 --> 00:06:34,019 కానీ మనమేదైనా తప్పు చేసి, అసలు మన ఉనికే లేకుండా చేసుకుంటే? 133 00:06:34,019 --> 00:06:38,065 మనం ఉనికిలో లేకుండా చేసుకుంటే, అసలు ఈ పని చేయడానికి మనం ఉండము కదా. 134 00:06:38,065 --> 00:06:39,775 అంటే, మనం ఉంటామనే కదా? 135 00:06:39,775 --> 00:06:40,901 ఓసారి ఆలోచించి చూడు. 136 00:06:40,901 --> 00:06:42,152 ఏంటి? 137 00:06:42,152 --> 00:06:44,988 నువ్వు వాళ్లకి పుట్టబోయే కొడుకువని చెప్పకపోతే మంచిది. 138 00:06:44,988 --> 00:06:48,951 నేను పరమ సోదిగాడినని వాళ్లు గ్రహించి, పిల్లలను కనకూడదని నిర్ణయించుకుంటారనా? 139 00:06:49,451 --> 00:06:50,577 ఏం చెప్తావు ఇంతకీ? 140 00:06:50,577 --> 00:06:52,579 "మీరు కనబోయే కొడుకుని నేను, ఓ రాకాసి బారి నుండి కాపాడాలని వచ్చా, 141 00:06:52,579 --> 00:06:55,249 ఆమె మిమ్మల్ని బొగ్గులని చేసేస్తుంది, మిమ్మల్ని నా బ్యాగులోనే వేసుకొని తిరుగుతున్నా. 142 00:06:55,249 --> 00:06:56,792 ఈ బ్యాగులో ఉన్నారు మీరు." 143 00:06:57,835 --> 00:07:00,629 నువ్వు నాన్న ఇంటికి వెళ్లు, నేను అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వెళ్తా. 144 00:07:00,629 --> 00:07:02,464 మనం ఏం మాట్లాడాలో ఆలోచించుకోవాలి. 145 00:07:02,464 --> 00:07:03,882 ఆలోచించడాలేవీ లేవు, పని కానివ్వడాలే. 146 00:07:08,262 --> 00:07:10,097 మనం చాలా ఆలస్యంగా వచ్చాం. అతని అమ్మానాన్నలు ఆత్మలైపోయారు. 147 00:07:11,473 --> 00:07:13,559 కానీ నేనేమీ గదమాయించలేదు కదా? 148 00:07:13,559 --> 00:07:16,562 మనం సరైన చోటుకి రాలేదు. ఇది అంధకారపు కోటనా? 149 00:07:17,312 --> 00:07:19,022 నేను వచ్చా. క్షేమంగా వచ్చా. 150 00:07:19,022 --> 00:07:20,274 మనం సరైన చోటుకే వచ్చాం. 151 00:07:20,274 --> 00:07:22,442 నేను వచ్చా. నేను ఇంకా ఇక్కడే ఉన్నా, పెనెలోపీ. 152 00:07:22,442 --> 00:07:24,111 అవును, మంచిది. 153 00:07:24,111 --> 00:07:27,656 నా భవిష్యత్తు అవతారం "కాలం ముడుచుకుంటుంది" అని అన్నాడు. అంటే ఏంటి? దేనిలోకి ముడుచుకుంటుంది? 154 00:07:27,656 --> 00:07:29,741 దాన్ని నువ్వు కనిపెట్టు. మేము పిల్లలని కాపాడాలి. 155 00:07:29,741 --> 00:07:31,076 పక్కకు జరగండి. జరగండి. 156 00:07:31,076 --> 00:07:33,120 ఎవరి బారి నుండి వాళ్లని కాపాడాలి? అది మనం చెప్పలేదే. 157 00:07:33,120 --> 00:07:36,665 - నేను ధైర్యంగా ఎలా ఉండగలను? - ఏమో. నేనైతే ఊహించుకోలేకపోతున్నా. 158 00:07:36,665 --> 00:07:39,418 - వావ్. ఫియానా! - పక్కకు జరగండి. 159 00:07:41,503 --> 00:07:43,005 మన్నించండి. 160 00:07:43,005 --> 00:07:45,007 - మీరు వేరే వ్యక్తి అనుకొని పొరబడ్డా. - తన మాజీ లవర్ అనుకున్నాడు. 161 00:07:45,007 --> 00:07:46,508 మాకు అంతగా పొసగలేదు. 162 00:07:46,508 --> 00:07:47,759 అంతే అయ్యుంటుంది. 163 00:07:47,759 --> 00:07:49,803 సరే మరి సూపర్, ఇక... 164 00:07:59,897 --> 00:08:00,731 నాన్నా? 165 00:08:04,484 --> 00:08:06,528 ఒక ఫోటో తీసుకో, బాసూ. అది ఎక్కువ కాలం ఉంటుంది. 166 00:08:08,238 --> 00:08:09,573 నాన్నా. 167 00:08:11,325 --> 00:08:12,326 నా పేరు మైకీ. 168 00:08:12,326 --> 00:08:13,744 ఏ మైకీ? 169 00:08:13,744 --> 00:08:15,787 మైకీ హ్యాడాక్. నువ్వు ఎవరు? 170 00:08:15,787 --> 00:08:18,081 నా పేరు కెవిన్... హ్యాడవే. 171 00:08:18,081 --> 00:08:19,458 హ్యాడవే? 172 00:08:19,458 --> 00:08:21,001 మీ అమ్మతో నాకు సంబంధం ఉంది. 173 00:08:22,461 --> 00:08:23,587 హా. 174 00:08:23,587 --> 00:08:24,588 అది జోక్. 175 00:08:25,464 --> 00:08:26,798 బాగుంది. 176 00:08:27,299 --> 00:08:30,260 బయట ఆడుకోవాలని నాన్న అన్నాడు. నా తెలివితో ఆయన్ని బోల్తా కొట్టించేశా. 177 00:08:30,260 --> 00:08:33,972 బయటే ఆడుకుంటున్నా. యాహూ. 178 00:08:38,227 --> 00:08:40,562 ఇది గేమ్ బాయ్. నా సైకిల్ ని అమ్మి ఇది కొన్నా. 179 00:08:40,562 --> 00:08:41,480 తిట్లు తిన్నా. 180 00:08:41,480 --> 00:08:42,981 నేను రెబెల్ ని. 181 00:08:44,316 --> 00:08:45,442 చచ్చానుపో. 182 00:08:45,442 --> 00:08:46,985 పర్వాలేదులే. నాకు ఇంకో లైఫ్ ఉంది. 183 00:08:47,861 --> 00:08:48,987 హా. 184 00:08:50,489 --> 00:08:51,657 కానివ్వు. కత్తిలా ఉంది. 185 00:08:53,659 --> 00:08:57,955 అయ్యో, అయ్యయ్యో. అయ్యయ్యో. 186 00:08:57,955 --> 00:08:59,456 అయ్యో, అయ్యయ్యో. అయ్యో. 187 00:08:59,456 --> 00:09:03,418 అయ్యో, అయ్యయ్యో. అయ్యయ్యో. అయ్యో. 188 00:09:03,418 --> 00:09:04,753 సరే, దాన్నొ నొక్కు. 189 00:09:05,504 --> 00:09:06,755 నేను అతడిని కనిపెట్టేశా. 190 00:09:06,755 --> 00:09:08,632 ఆ ప్రత్యేకమైన పడక గదికి చెందిన పిల్లోడు. 191 00:09:08,632 --> 00:09:10,551 కానీ ఇప్పుడు అతను వేరే కాలంలో ఉన్నాడు. 192 00:09:10,551 --> 00:09:12,010 పైగా, అతనికి తోడుగా వాళ్లు లేరు. 193 00:09:12,010 --> 00:09:13,887 అతని చేతిలో మ్యాప్ ఉంది. 194 00:09:13,887 --> 00:09:15,430 అది మ్యాపే అంటారా, మాస్టర్? 195 00:09:15,430 --> 00:09:17,641 - హా, అయితే, ఇది మ్యాప్ అన్నమాట. - హా, అవును. 196 00:09:17,641 --> 00:09:19,768 అయితే, దీని సాయంతో మనం అనేక చోట్లకు వెళ్లవచ్చు, అంతే కదా? 197 00:09:19,768 --> 00:09:21,645 అయ్యయ్యో. దాచేయ్ దాన్ని, అతను చూస్తాడు. 198 00:09:21,645 --> 00:09:24,189 ఇప్పటికే ఆలస్యమైపోయిది. నేను చూసేశాగా. 199 00:09:25,315 --> 00:09:26,984 మేలుకో ఫియానా. 200 00:09:26,984 --> 00:09:28,819 ఫియానా! 201 00:09:37,744 --> 00:09:38,954 ఫియానా. 202 00:09:41,540 --> 00:09:45,127 నేను బతికి ఉన్నానో లేదో తెలీదు అన్నావు కదా, అంటే ఏంటి? 203 00:09:45,127 --> 00:09:47,754 అది చెప్పింది నేను కాదు, బిటెలిగ్, నా భవిష్యత్తు అవతారం చెప్పాడు. 204 00:09:47,754 --> 00:09:50,549 నా భవిష్యత్తు అవతారానికి తెలియనిది నాకు ఎలా తెలుస్తుంది? 205 00:09:50,549 --> 00:09:52,217 నేనేమన్నా సమయం లేని ప్రాంతంలోకి పడిపోయానా? 206 00:09:52,217 --> 00:09:53,302 నాకు తెలీదు! 207 00:09:53,302 --> 00:09:57,472 - నేను ఏమైనా... సారీ... దొరికిపోయానా? - నాకు తెలీదు! 208 00:09:57,472 --> 00:09:58,807 సరే మరి, సూపర్, ఓసారి వినండి. 209 00:09:58,807 --> 00:10:00,434 - ఏమైనా తెలిసిందా? తెలిసిందా? లేదు. - లేదు. తెలీలేదు. 210 00:10:00,434 --> 00:10:01,977 తేలీలేదు. 211 00:10:01,977 --> 00:10:03,812 నా భవిష్యత్తు అవతారం బాగా గదమాయిస్తోంది. 212 00:10:03,812 --> 00:10:05,898 అలా ఎలా అయ్యానో తలుచుకుంటుంటూనే కడుపులో తిప్పుతోంది. 213 00:10:05,898 --> 00:10:07,649 అసలు నేను అలా ప్రవర్తిస్తానా? 214 00:10:08,817 --> 00:10:09,651 - లేదు. - లేదు. 215 00:10:09,651 --> 00:10:12,279 ఎందుకంటే నేనేమీ గదమాయించను కదా. అవును. 216 00:10:12,279 --> 00:10:14,740 సరే, ఆల్టో, నువ్వు వీళ్లలో కలిసిపోయి, 217 00:10:14,740 --> 00:10:17,075 వీళ్లలో కెవిన్ అమ్మానాన్నలు ఎవరో కనుక్కో. 218 00:10:17,075 --> 00:10:18,577 నేను ధైర్యవంతుడిని ఎందుకు అవుతాను? 219 00:10:18,577 --> 00:10:19,995 - ఒకవేళ దానికి కారణం... - వెళ్లి పని చూడు! 220 00:10:19,995 --> 00:10:21,205 తప్పకుండా. 221 00:10:21,205 --> 00:10:25,209 ఇప్పుడు నేను గదమాయించలేదు కదా? లేదు, గట్టిగా చెప్పానంతే. రెంటికీ తేడా ఉంది. 222 00:10:30,464 --> 00:10:34,801 ఇది మా బామ్మ పెళ్లి డ్రెస్. నలుపు రంగు డై వేశా. కత్తిలా ఉంది కదా? 223 00:10:34,801 --> 00:10:36,053 అవును, అదిరింది. 224 00:10:36,053 --> 00:10:37,346 కత్తిలా ఉంది, అంతే కదా? 225 00:10:38,055 --> 00:10:39,556 ఈ ఇంట్లో ఎవరు ఉంటారో మీకు తెలుసా? 226 00:10:39,556 --> 00:10:41,350 హా, నాకు తెలుసు, బాసూ. 227 00:10:41,350 --> 00:10:42,935 అదిరింది. 228 00:10:44,186 --> 00:10:46,688 నా మిత్రులు కెవిన్, 'శావ్లాన్" తెలుసా? 229 00:10:46,688 --> 00:10:47,773 వాళ్ల ఇల్లు ఇదే. 230 00:10:48,357 --> 00:10:49,691 పిల్లలు వాళ్లు. 231 00:10:49,691 --> 00:10:51,235 మీరు వాళ్ల అమ్మానాన్నలా? 232 00:10:51,235 --> 00:10:52,611 అయ్య బాబోయ్. 233 00:10:52,611 --> 00:10:54,196 - అయ్య బాబోయ్. - లేదు, బాసూ. 234 00:10:54,196 --> 00:10:55,948 సరే, అలాగే. 235 00:10:56,698 --> 00:10:59,159 ఇందాక కొందరు పిల్లలు ఫ్రిడ్జిలో ఆడుకున్నారు. 236 00:10:59,952 --> 00:11:02,496 - వాళ్లు ఎక్కడికి వెళ్లారు, మిత్రమా? - ఏదో పని మీద వెళ్లారు. 237 00:11:02,496 --> 00:11:03,413 అవునా? 238 00:11:03,413 --> 00:11:05,541 షాపింగ్ సెంటర్ లో ఏదో రాకాసి అంటూ వెళ్లారు. 239 00:11:05,541 --> 00:11:08,001 షాపింగ్ సెంటర్. సూపర్. 240 00:11:09,711 --> 00:11:11,088 సీన్ ముగిసింది. 241 00:11:16,927 --> 00:11:19,221 హాయ్, డాన్స్ వేద్దామా? 242 00:11:32,192 --> 00:11:33,193 వావ్. 243 00:12:03,015 --> 00:12:04,057 హలో. 244 00:12:05,475 --> 00:12:06,894 హాయ్. 245 00:12:09,730 --> 00:12:10,898 ఏం కావాలి, పాపా? 246 00:12:12,691 --> 00:12:17,946 నేను ఇటీవలే ఈ ప్రాంతానికి వచ్చిన అమ్మాయిని. 247 00:12:17,946 --> 00:12:22,492 ఇక్కడి వాళ్లని కలుసుకుంటూ ఉన్నాను. 248 00:12:23,410 --> 00:12:24,786 సరే. 249 00:12:24,786 --> 00:12:27,623 ఇప్పుడు మిమ్మల్ని కలిశాను కదా... 250 00:12:32,044 --> 00:12:33,170 ఈమె మీ కూతురా? 251 00:12:33,170 --> 00:12:35,506 అవును, తన పేరు లీసా. 252 00:12:35,506 --> 00:12:37,591 చాలా చిన్నగా ఉంది. 253 00:12:37,591 --> 00:12:39,635 హా, తనకి ఆరేళ్లే. 254 00:12:40,886 --> 00:12:42,346 మీ అమ్మ ఎక్కడ, పాపా? 255 00:12:44,348 --> 00:12:45,641 తను చనిపోయింది. 256 00:12:49,520 --> 00:12:50,729 నా సానుభూతి తెలియజేస్తున్నా. 257 00:12:50,729 --> 00:12:54,483 - ఆమెని మిస్ అవుతూ ఉంటావు. - అవును. చాలా మిస్ అవుతున్నా. 258 00:12:54,483 --> 00:12:56,485 తనతో వాదులాడటాన్ని కూడా మిస్ అవుతున్నా. 259 00:12:56,485 --> 00:12:58,445 అమెని క్షమించమని అడగాలని ఉంది. 260 00:12:58,445 --> 00:13:01,156 మనం మన తల్లులతో ఏవేవో అనేస్తాం, తర్వాత బాధపడతాం, అది మామూలే. 261 00:13:01,156 --> 00:13:04,201 మరేం పర్వాలేదు, ఎందుకంటే, నువ్వు కూడా అమ్మవి అయినప్పుడు, 262 00:13:04,201 --> 00:13:06,578 నువ్వు కూడా ఆ మాటలు అన్నావని గుర్తొస్తుంది. 263 00:13:07,538 --> 00:13:08,747 లోపలికి వస్తావా, పాపా? 264 00:13:08,747 --> 00:13:11,583 టీ తాగి వెళ్దువులే. నీ ముఖంపై ఉండే ఆ మసి కూడా శుభ్రం చేసుకుందువు. 265 00:13:34,106 --> 00:13:35,774 తనని గమనించలేదంటే ఆశ్చర్యంగా ఉంది! 266 00:13:35,774 --> 00:13:38,151 - తను తలుపు తెరుచుకొని నడిచి వెళ్లిందా? - లేదు. పగలగొట్టుకొని వెళ్లింది. 267 00:13:38,151 --> 00:13:40,737 తన కళ్లైతే లావాలా మెరిసిపోతున్నాయి. 268 00:13:40,737 --> 00:13:41,697 ఫియానా. 269 00:13:41,697 --> 00:13:43,824 కంటి చూపుతో చంపేసినా చంపేయగలదు. 270 00:13:43,824 --> 00:13:46,702 ఫియానా కన్నా ముందే మనం కెవిన్ ని, "శాల్మన్"ని కనిపెట్టాలి. 271 00:13:48,912 --> 00:13:49,955 ఆగండి. 272 00:14:04,970 --> 00:14:06,180 మళ్లీ వచ్చావుగా. 273 00:14:06,180 --> 00:14:07,848 మళ్లీ వస్తావని నాకు తెలుసులే. 274 00:14:08,765 --> 00:14:10,976 నాతో డాన్స్ వేస్తే, నువ్వు తలుపు పగలగొట్టిన విషయాన్ని మర్చిపోతాను. 275 00:14:24,323 --> 00:14:25,908 మిమ్మల్ని కలవడం బాగుంది. 276 00:14:25,908 --> 00:14:27,784 మిమ్మల్ని కలిసే అవకాశం నాకు దక్కలేదు. 277 00:14:29,286 --> 00:14:33,081 అంటే, నువ్వు ఈ ప్రాంతానికి ఇప్పుడే కదా వచ్చింది? 278 00:14:34,208 --> 00:14:36,126 ఇప్పుడు నీ ముఖం గౌరవప్రదంగా ఉంది. 279 00:14:37,002 --> 00:14:39,213 నేను నా ప్రతిబింబాన్ని చూసుకొని చాలా ఏళ్ళయింది. 280 00:14:40,339 --> 00:14:41,548 నేను పెద్దదాన్ని అయిపోయా. 281 00:14:45,469 --> 00:14:47,721 పర్వాలేదులే. పుల్లలతో పళ్లు తోముకున్నా ఇన్నాళ్లూ. 282 00:14:48,555 --> 00:14:51,475 కాసేపు మీ ఇద్దరూ ఆడుకుంటూ ఉంటారా? 283 00:14:51,475 --> 00:14:53,227 నేను ఒక ఫోన్ కాల్ చేసి వస్తా. 284 00:14:53,227 --> 00:14:55,145 - సరేనా? - సరే, నాకు ఓకే. 285 00:14:56,939 --> 00:14:57,981 హాయ్, అమ్మా. 286 00:15:00,943 --> 00:15:06,240 భవిష్యత్తు పిచ్చిపిచ్చిగా ఉంటుంది 287 00:15:06,240 --> 00:15:11,286 ఎప్పుడూ మన మధ్య ఉండే ప్రేమే నడిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది 288 00:15:11,286 --> 00:15:16,500 మన కొత్త టెక్నాలజీని అనవసరమైన విధంగా వాడుకుంటాం 289 00:15:16,500 --> 00:15:21,296 అయ్యయ్యో ఇప్పుడు శబ్దం వినబడట్లేదు ఎందుకంటే, మనందరం భూగర్భంలో ఉంటున్నాం కదా? 290 00:15:22,589 --> 00:15:24,383 ఈ పాట సూపర్ గా ఉంటుంది. 291 00:15:24,383 --> 00:15:25,592 కత్తిలా ఉంది. 292 00:15:25,592 --> 00:15:27,511 ఈ కాలంలో ఆ మాటని ఎక్కువగా అంటుంటారా? 293 00:15:27,511 --> 00:15:31,431 హా. భవిష్యత్తు ఎంత వెర్రిగా ఉంటుందో తెలిపే పాట అది. మామూలు వెర్రిగా కాదు. 294 00:15:31,431 --> 00:15:33,600 2020ల కాలానికల్లా, ఎగిరే కార్లు వచ్చేస్తాయి. 295 00:15:33,600 --> 00:15:35,185 అది జరగదులే. 296 00:15:35,185 --> 00:15:38,814 ఎగిరే కార్ల కాన్సెప్ట్ అనేది, కార్ల కాన్సెప్ట్ అంత పాతదే. 297 00:15:38,814 --> 00:15:40,691 1800ల ఆఖరి కాలంలోని కాన్సెప్ట్ అది. 298 00:15:40,691 --> 00:15:43,151 వావ్. జ్ఞానం బాగానే ఉంది. ఆకట్టుకొనేశావు. 299 00:15:43,151 --> 00:15:45,404 - నిజంగానా? - శబ్దం చేయకు, మైకీ! 300 00:15:46,238 --> 00:15:47,322 కానీ మేము సరదాగా గడుపుతున్నాం! 301 00:15:47,322 --> 00:15:49,658 ఇప్పుడు శబ్దం వినబడట్లేదు 302 00:15:49,658 --> 00:15:51,785 శబ్దం అనేదే రాకూడదు. దాన్ని ఆపేయ్! 303 00:15:54,288 --> 00:15:55,581 సారీ, తాతయ్య. 304 00:15:56,874 --> 00:15:58,250 ఈ వెధవ ఎవడు? 305 00:15:58,834 --> 00:16:01,128 లేదు, నిజానికి మీరు... నాకు... 306 00:16:02,129 --> 00:16:03,172 ఇతని పేరు కెవిన్ హ్యాడవే. 307 00:16:03,881 --> 00:16:05,174 ఇతనేనా నీ జాన్ జిగిరీ దోస్తు? హా? 308 00:16:07,426 --> 00:16:10,679 - దీన్ని తీసేసుకుంటున్నా. - బై, తాతయ్య. 309 00:16:12,181 --> 00:16:13,265 పరుషంగా మాట్లాడుతున్నావు! 310 00:16:13,265 --> 00:16:15,267 మీ ఇద్దరి మక్కెలు విరగ్గొట్టట్లేదు, అందుకు సంతోషించండి. 311 00:16:16,059 --> 00:16:18,437 సారీ, తాతయ్య. 312 00:16:19,688 --> 00:16:22,357 నాకు 32 ఏళ్లే, ఇంకా దృఢంగా ఉన్నాను. 313 00:16:28,572 --> 00:16:31,658 వావ్. జ్ఞానం ఉంది, తిరగబడే గుణమూ ఉంది. 314 00:16:32,659 --> 00:16:34,119 నువ్వు సూపర్, కెవిన్. 315 00:16:34,119 --> 00:16:36,747 నీ నోట ఆ మాట వినాలని ఎప్పట్నుంచో ఉంది నాకు. 316 00:16:36,747 --> 00:16:37,956 హా? 317 00:16:37,956 --> 00:16:41,084 నా ఉద్దేశం, ఎవరి నోట నుండి అయినా అన్నమాట. 318 00:16:41,084 --> 00:16:42,461 కానీ నువ్వు అనడం చాలా బాగుంది. 319 00:16:43,879 --> 00:16:45,380 మీ నాన్న ఎలా ఉండేవాడు, కెవ్ స్టర్? 320 00:16:49,301 --> 00:16:53,013 తనతో వాళ్ల నాన్న ఉన్న దాని కంటే, నాతో చాలా రెట్లు బాగా ఉండేవాడు. 321 00:16:53,013 --> 00:16:55,974 అతనికి ఆ విషయం తెలిస్తే మంచిది అనుకుంటా. 322 00:16:57,142 --> 00:16:58,310 నాకు ఆయనంటే చాలా ఇష్టం. 323 00:17:20,499 --> 00:17:22,376 ఎప్పుడూ మాటకు మాట సమాధానం చెప్పినందుకు క్షమించు. 324 00:17:23,460 --> 00:17:25,546 నువ్వు సమాధానం కోరినప్పుడు, నిన్ను పట్టించుకోనందుకు క్షమించు. 325 00:17:26,505 --> 00:17:28,590 ఇంటర్నెట్ లో ఏవేవో కొనడానికి నీ ఫోనును ఉపయోగించినందుకు క్షమించు. 326 00:17:28,590 --> 00:17:29,967 ఏంటి? 327 00:17:29,967 --> 00:17:32,678 కెవిన్ నిద్రపోతున్నప్పుడు, అతని జుట్టును కత్తిరించినందుకు క్షమించు. 328 00:17:34,054 --> 00:17:35,889 నిన్ను గౌరవించనందుకు క్షమించు. 329 00:17:36,431 --> 00:17:38,392 మేము "తల్లీకూతుళ్ల" ఆట ఆడుతున్నాం. 330 00:17:38,392 --> 00:17:39,768 నేను అమ్మ పాత్ర పోషిస్తున్నాను. 331 00:17:46,275 --> 00:17:47,609 ఇన్ని షాపులు ఉన్నాయేంటి! 332 00:17:47,609 --> 00:17:49,528 బాబోయ్, వాళ్లు ఏ షాపుకి వెళ్లుంటారు? 333 00:17:49,528 --> 00:17:50,737 కెవిన్! 334 00:17:50,737 --> 00:17:51,697 - కెవిన్! - కెవిన్! 335 00:17:51,697 --> 00:17:53,532 - కెవిన్! - అయ్యో, అది... 336 00:17:54,116 --> 00:17:55,117 కాదు. 337 00:17:55,784 --> 00:17:58,245 సరే మరి, ఆల్టో, వీళ్లలో కలిసిపో. 338 00:17:58,245 --> 00:17:59,746 వాళ్లని ఎవరైనా చూశారేమో వాకబు చేయ్. 339 00:17:59,746 --> 00:18:01,290 ఇంకో విషయం, ఫియానా మీద ఓ కన్నేసి ఉంచు. 340 00:18:01,290 --> 00:18:02,416 - నేనా? - అవును. 341 00:18:02,416 --> 00:18:04,001 నేనే ఎందుకు? నా వల్ల... 342 00:18:04,001 --> 00:18:07,379 భవిష్యత్తులో మనకి అతను కనిపించలేదు. నువ్వు కనిపించావు. నీకేమీ కాలేదని అర్థమైపోతోంది కదా. 343 00:18:08,172 --> 00:18:09,131 అయితే నాకేమైనా అయిందా? 344 00:18:09,131 --> 00:18:10,591 - అంతేనా? - అలా అనే కాదు. 345 00:18:10,591 --> 00:18:14,136 ధైర్యవంతంగా వ్యవహరించానని నాకు నేను చెప్పుకొన్న క్షణం ఇదే అయ్యుంటుంది. 346 00:18:15,971 --> 00:18:18,140 - సమయం ఎంత అయింది, బాసూ? - హా, చెప్తా. 347 00:18:20,726 --> 00:18:22,186 వెక్కిరింత అన్నమాట. 348 00:18:22,186 --> 00:18:23,979 పోనీలే. 349 00:18:23,979 --> 00:18:26,815 ఫియానా కన్నా ముందే మనం కెవిన్ ని, "కార్డమమ్"ని కనుగొనాలి. 350 00:18:26,815 --> 00:18:27,733 అవును. 351 00:18:27,733 --> 00:18:29,693 ఫియానాకి మ్యాప్ కావాలి. 352 00:18:29,693 --> 00:18:31,570 కొంపదీసి తను ఇంకా నా వెంట పడట్లేదు కదా. 353 00:18:32,237 --> 00:18:35,032 ఎంత పిచ్చోడినబ్బా నేను. తనకి కావాల్సిన రెండూ నా దగ్గరే ఉన్నాయి. 354 00:18:35,032 --> 00:18:36,658 పెనెలోపీ. 355 00:18:36,658 --> 00:18:38,327 నేను ఇప్పుడు చనిపోలేను. 356 00:18:38,327 --> 00:18:39,786 సరే. 357 00:18:39,786 --> 00:18:41,705 మొక్కలని చేయడం, కొన్ని కూజాలను దొంగిలించడం తప్ప, 358 00:18:41,705 --> 00:18:46,043 నా జీవితంలో అర్థవంతమైన పనేదీ నేను చేయలేదు. 359 00:18:46,919 --> 00:18:51,590 జీవితంలో ముఖ్యమైన పని అంటూ ఏదీ నేను చేయలేదు. 360 00:18:54,593 --> 00:18:56,887 బిటెలిగ్, దీని గురించి నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు, 361 00:18:56,887 --> 00:19:00,682 అది నీ ఏకాగ్రతకు భంగం కలిగించి, నిన్ను ప్రమాదం బారిన పడేసే అవకాశం ఉంది. 362 00:19:01,350 --> 00:19:04,269 నిన్ను నేను దూరం చేసుకోలేను. 363 00:19:07,314 --> 00:19:08,148 నిజంగా? 364 00:19:08,148 --> 00:19:09,608 అవును. 365 00:19:10,609 --> 00:19:12,277 అయితే, గదమాయించకుండా మామూలుగా చెప్పా ఇప్పుడు. 366 00:19:12,277 --> 00:19:14,321 సున్నితంగా మంచి సలహా ఇచ్చా. 367 00:19:14,321 --> 00:19:15,656 అవును. 368 00:19:16,156 --> 00:19:17,241 వెళ్లి పిల్లలు ఎక్కడున్నారో చూడు. 369 00:19:19,117 --> 00:19:21,745 - ఇప్పుడే. వెళ్లు. - అలాగే. థ్యాంక్యూ. 370 00:19:21,745 --> 00:19:23,497 జాగ్రత్త. 371 00:19:23,497 --> 00:19:26,667 మీ ఇద్దరూ మురికిగా ఉండే ఇద్దరు పిల్లలని ఏమైనా చూశారా? 372 00:19:26,667 --> 00:19:27,668 మురికిగా ఉండే పిల్లలనా? 373 00:19:27,668 --> 00:19:29,962 - ఇక్కడా? - అవును, ఇక్కడే. 374 00:19:29,962 --> 00:19:31,588 మురికిగా ఉండే పిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. 375 00:19:32,464 --> 00:19:35,050 అవును. వాళ్లని సరిగ్గా పెంచలేదు, గాలికి వదిలేశారంతే. 376 00:19:35,050 --> 00:19:36,426 అయ్యో, అది మంచి విషయం కాదు. 377 00:19:44,518 --> 00:19:46,019 మైఖెల్ జోర్డన్ ని నేను. 378 00:19:48,897 --> 00:19:50,023 ఎడమ చేత్తో వేస్తా. 379 00:19:51,400 --> 00:19:53,694 ఈ రోజు చాలా బాగుంది. ముఖ్యంగా ఈ క్షణం. 380 00:19:53,694 --> 00:19:55,696 ఈ క్షణం నాకు చాలా బాగా నచ్చింది. 381 00:19:55,696 --> 00:19:57,406 హా, కత్తిలాంటి క్షణం కదా. 382 00:20:04,913 --> 00:20:06,748 అయ్యయ్యో. నన్ను వెతుక్కుంటూ తను ఇక్కడికి వచ్చిందా. 383 00:20:09,668 --> 00:20:12,421 చాలా చాలా థ్యాంక్స్, నా... మైకీ. 384 00:20:12,921 --> 00:20:15,382 నా జీవితంలో ఇది ఎన్నడూ మర్చిపోలేని రోజు. చాలా చాలా థ్యాంక్స్. 385 00:20:15,382 --> 00:20:17,885 అలాగే, బాసూ. శాంతించు. మళ్లీ కలుస్తాం కదా. 386 00:20:17,885 --> 00:20:21,013 కలుస్తాం, కానీ అంత ఎక్కువగా కలవము, కలిస్తే నువ్వు పక్కదారి పడతావు. 387 00:20:21,013 --> 00:20:22,431 అంత ఎక్కువగా ఎందుకని కలవం? 388 00:20:22,431 --> 00:20:24,224 పని బాధ్యతలు. 389 00:20:24,224 --> 00:20:25,475 పని బాధ్యతలా? 390 00:20:25,475 --> 00:20:27,561 ఇక నేను బయలుదేరాలి. ఐ లవ్ యూ. 391 00:20:29,229 --> 00:20:30,731 ఎవరది? 392 00:20:30,731 --> 00:20:33,650 - అది ఒక రాకాసి. లోపలికి వెళ్లు. - తొక్కలే. 393 00:20:34,568 --> 00:20:37,613 తను నా వెంట, నా మిత్రుల వెంట పడుతోంది. తనని గుర్తించుకో. 394 00:20:37,613 --> 00:20:39,031 నాకు మ్యాప్ ఇవ్వు! 395 00:20:39,031 --> 00:20:40,532 వొంగో! 396 00:20:45,204 --> 00:20:47,414 - ఓరి దేవుడా! - తనని గుర్తు పెట్టుకో! 397 00:20:47,414 --> 00:20:50,792 భయపడు! గుర్తు పెట్టుకో! 398 00:20:50,792 --> 00:20:51,752 నాన్నా! 399 00:20:58,967 --> 00:21:00,719 తర్వాత మే ఏమంది? 400 00:21:00,719 --> 00:21:02,262 సరే అంది. 401 00:21:02,262 --> 00:21:05,307 - అయ్య బాబోయ్. - తను సరే అనే అంది. నిజంగా. 402 00:21:07,851 --> 00:21:09,102 బాగానే ఉన్నావా? 403 00:21:12,272 --> 00:21:14,650 - ముఖం మాడిపోయింది. - అవును కదా? 404 00:21:16,276 --> 00:21:18,904 - ఏమైంది? ఏంటి? - ఎల్సీ, సిడ్. ఇక నేను బయలుదేరాలి. 405 00:21:23,951 --> 00:21:25,077 తను ఇక్కడికి వచ్చేసింది. 406 00:21:26,495 --> 00:21:29,540 విన్నీకి ఉన్న మూలశంక వ్యాధి గురించి విని నవ్వుకుంటావు అనుకున్నానే. 407 00:21:50,435 --> 00:21:51,436 అయ్యయ్యో. 408 00:21:52,771 --> 00:21:54,523 నేను చచ్చేది ఇప్పుడేనా? 409 00:21:54,523 --> 00:21:56,066 హా, అవును అనుకుంటా. 410 00:21:57,484 --> 00:22:00,696 బాత్రూమ్ గోడపై, అలాగే ముందు గది గోడపై పిచ్చి పిచ్చి గీతలు గీసినందుకు క్షమించు. 411 00:22:00,696 --> 00:22:04,241 మిసెస్ ఫిట్జరాయ్ ని బజారుదానా అని తిట్టి, దాన్ని నీ నుండే నేర్చుకున్నానని చెప్పినందుకు క్షమించు. 412 00:22:04,241 --> 00:22:05,868 కానీ ఆ పదాన్ని నేను నీ నుండే నేర్చుకున్నా. 413 00:22:09,663 --> 00:22:11,081 - హాయ్. - హలో. 414 00:22:11,081 --> 00:22:14,042 మేము సామాజిక సేవల శాఖ నుండి వస్తున్నాం. ఒక చిన్నారి ఆపదలో ఉందని మీరు కాల్ చేశారు. 415 00:22:14,042 --> 00:22:17,588 అవును. తను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మురికిగా, అయోమయంలో ఉండింది. 416 00:22:17,588 --> 00:22:20,507 మీరు మాకు కాల్ చేసి మంచి పని చేశారు. తనని మేము చూసుకుంటాం. 417 00:22:20,507 --> 00:22:22,426 హా. అంటే, తను పుల్లలతో పళ్లు తోముకుంటోందట. 418 00:22:22,426 --> 00:22:23,343 పుల్లలతోనా? 419 00:22:23,343 --> 00:22:26,763 పాపా, నీకు సాయపడటానికి కొందరిని పిలిచా. 420 00:22:29,516 --> 00:22:30,976 శాఫ్, ఏం చేస్తున్నావు నువ్వు? 421 00:22:31,768 --> 00:22:32,603 తను మన అమ్మ. 422 00:22:32,603 --> 00:22:35,022 - తనని మనతో తీసుకెళ్దాం. - అలా చేయకూడదు. 423 00:22:35,022 --> 00:22:38,025 తన జీవితం తను జీవించాలి, లేదంటే మనం పుట్టకపోవచ్చు. 424 00:22:38,025 --> 00:22:39,943 తనని కాపాడాలనుకుంటున్నా, కెవిన్. 425 00:22:39,943 --> 00:22:42,237 అబ్బా. అబ్బబ్బా. 426 00:22:42,237 --> 00:22:43,864 అబ్బా. 427 00:22:45,032 --> 00:22:48,202 లీసాని వదిలేయ్. మాతో వచ్చేయ్, బంగారం. 428 00:22:48,202 --> 00:22:50,746 హా. నీకు మీ అమ్మ దూరమైందని మాకు తెలిసింది. 429 00:22:50,746 --> 00:22:53,749 అలా అని లీసాకి కూడా తన అమ్మని దూరం చేయడం న్యాయం కాదు, కదా? 430 00:23:01,256 --> 00:23:02,758 నిన్ను ఒకసారి హత్తుకోవచ్చా? 431 00:23:05,802 --> 00:23:07,429 నువ్వంటే నాకు ప్రాణం. 432 00:23:08,096 --> 00:23:10,140 సరే, దయచేసి తనని వదిలేయ్. 433 00:23:11,600 --> 00:23:14,311 శాఫ్, మనమిక బయలుదేరాలి. లవ్ యూ, అమ్మా. 434 00:23:14,311 --> 00:23:16,605 నిన్ను కలవడం బాగుంది. నేను పుట్టినప్పుడు నిన్ను మళ్లీ కలుస్తా. 435 00:23:16,605 --> 00:23:17,606 ఈ పిల్లలకి సాయం అవసరం. 436 00:23:17,606 --> 00:23:19,525 - ఇటు రండి! - అమ్మమ్మ మంచిదిలా అనిపిస్తోంది. 437 00:23:19,525 --> 00:23:21,026 తను చాడీలు చెప్పే రకం! 438 00:23:25,739 --> 00:23:26,782 ఓయ్, రాకాసి! 439 00:23:27,324 --> 00:23:28,909 - శాఫ్! - నన్ను గుర్తుపట్టావా? 440 00:23:30,536 --> 00:23:31,870 దమ్ముంటే నాతో పెట్టుకో చూద్దాం! 441 00:23:31,870 --> 00:23:33,080 శాఫ్! వద్దు. 442 00:23:33,580 --> 00:23:34,581 పరుగెత్తు! 443 00:23:38,710 --> 00:23:39,711 పనికిమాలినదానా! 444 00:24:02,234 --> 00:24:03,402 విడ్జిట్! 445 00:24:03,402 --> 00:24:04,486 ఫియానా! 446 00:24:04,486 --> 00:24:06,613 నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది. 447 00:24:06,613 --> 00:24:09,032 నీకు చెప్పా కదా. మన మధ్య ఇప్పుడు ఏం లేదని. 448 00:24:09,658 --> 00:24:11,618 నేను నిన్ను మొదటిసారి కలిసినప్పటికీ, ఇప్పటికీ మారిపోయాను. 449 00:24:11,618 --> 00:24:12,619 నాకు కావాల్సింది, మ్యాప్. 450 00:24:12,619 --> 00:24:15,539 మ్యాప్... సరే, కానీ అది నీకు ఇవ్వలేను. 451 00:24:17,040 --> 00:24:20,002 - మెల్లగా పరుగెత్తుదామా? లేదంటే కడుపు నొప్పి వస్తుంది. - పరుగెత్తు, కెవిన్! 452 00:24:25,340 --> 00:24:28,594 నన్ను మన్నించండి. చూసుకోకుండా గుద్దబోయాను, తప్పు నాదే. 453 00:24:34,183 --> 00:24:35,184 అయ్య బాబోయ్! 454 00:24:35,684 --> 00:24:39,021 కెవిన్! నిన్ను కనిపెట్టేశాం, నిన్ను కూడా, "పాప్రికా." 455 00:24:39,021 --> 00:24:40,731 - నా పేరు శాఫ్రాన్. - ఏదోకటిలే. 456 00:24:40,731 --> 00:24:42,399 ధైర్యంగా వ్యవహరించాను. 457 00:24:42,399 --> 00:24:45,194 చాలా ధైర్యంగా వ్యవహరించాను. కానీ దాన్ని పెద్ద విషయంలా చేయకుండా ఉండాలి. 458 00:24:46,069 --> 00:24:48,530 నేను చాలా ధైర్యవంతమైన పని చేశా. కానీ దాన్ని పెద్ద విషయంలా చేయాలనుకోట్లేదు. కానీ ఆ పని చేశా. 459 00:24:49,364 --> 00:24:50,365 ఫియానా! 460 00:24:52,618 --> 00:24:54,745 ఫియానాలు. ఇద్దరున్నారే... 461 00:24:56,872 --> 00:24:58,040 మనం తక్షణమే ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 462 00:24:58,040 --> 00:25:00,083 ఇక్కడ దాక్కొని మనం తప్పు చేశామేమో. 463 00:25:00,083 --> 00:25:02,127 - ఎందుకంటే, మనం ఇక్కడ ఇరుక్కుపోయినట్టున్నాం. - ఏంటి? 464 00:25:02,127 --> 00:25:03,504 వెనుక నుండి ఓ దారి ఉంది! 465 00:25:04,004 --> 00:25:07,424 హేయ్, నువ్వు పారిపో, నువ్వు కూడా, నువ్వు కూడా పారిపో! తనతో నేను పోరాడుతా! 466 00:25:07,424 --> 00:25:10,427 - వద్దు! - బిటెలిగ్, వద్దు! నేనేమీ గదమాయించి చెప్పట్లేదు. 467 00:25:10,427 --> 00:25:11,970 కానీ వద్దు, బిటెలిగ్! 468 00:25:11,970 --> 00:25:14,515 లేదు! నేను ఏదోక ముఖ్యమైన పని చేయాలనుకుంటున్నా. 469 00:25:14,515 --> 00:25:17,100 బహుశా ఆ తరుణం ఇదేనేమో! రా! 470 00:25:20,521 --> 00:25:21,396 జాగ్రత్త! 471 00:25:21,396 --> 00:25:23,357 - మీరు వెళ్లండి! - పదండి, పదండి. 472 00:25:25,234 --> 00:25:26,860 - ఎవరు నువ్వు? - నువ్వు ఎవరో చెప్పు! 473 00:25:26,860 --> 00:25:29,238 కానివ్వండి, మీ సత్తా ఏంటో చూపండి! కానివ్వండి! 474 00:25:29,238 --> 00:25:30,781 ఇంతేనా మీ సత్తా? అబ్బా! అబ్బా! 475 00:25:31,698 --> 00:25:34,326 పరుగెత్తండి! 476 00:25:34,326 --> 00:25:36,745 - అతనికి ఏమీ కాదు కదా? - అతనికి మ్యాప్ ఇద్దామా? 477 00:25:36,745 --> 00:25:38,038 - వద్దు, వద్దు! - వద్దనే వద్దు! 478 00:25:38,038 --> 00:25:40,082 - మ్యాప్ క్రూరాతి క్రూరుని చేతిలో పడకూడదు! - అవును. 479 00:25:41,917 --> 00:25:43,335 మనం తనని వదిలేసి వెళ్లిపోవాలి. 480 00:25:48,173 --> 00:25:51,260 సరే, వాళ్లని కాపాడారా? మన ప్లాన్ ఫలించిందా? ఎక్కడ వాళ్లు? 481 00:25:51,260 --> 00:25:53,303 మా అమ్మానాన్నలు ఇప్పుడు పిల్లలుగా ఉన్నారు. 482 00:25:55,264 --> 00:25:57,558 నువ్వు మమ్మల్ని వేరే కాలానికి తీసుకొచ్చావు, మహానుభావా? 483 00:25:57,558 --> 00:26:01,103 మనం ఈ కాలం నుండి వెళ్లిపోవాలి, లేదంటే ఫియానాలు వచ్చి మనల్ని వేసేస్తారు. 484 00:26:01,103 --> 00:26:02,479 మరి బిటెలిగ్ సంగతేంటి? 485 00:26:03,522 --> 00:26:04,648 ఫియానా! 486 00:26:07,192 --> 00:26:09,403 కాదు, మన్నించాలి, అతను కేవలం కోపంతో ఉన్న కుర్రాడు, అంతే. 487 00:26:10,112 --> 00:26:13,115 ఫియానా బారి నుండి పిల్లలని కాపాడటానికి మనం మనల్ని హెచ్చరించాలి. 488 00:26:13,115 --> 00:26:14,533 అదెలా చేయాలో నీకు తెలుసా? 489 00:26:14,533 --> 00:26:17,995 మ్యాప్ పై నాకు ఎంత అవగాహన ఉందో నాకే తెలీదని నాకు నేను చెప్పుకున్నా కదా. 490 00:26:17,995 --> 00:26:18,954 నిజంగా నీకు అంత ఉందా? 491 00:26:18,954 --> 00:26:20,289 లేదు. 492 00:26:21,456 --> 00:26:23,166 సమయం ముడుచుకుంటుంది. సమయం... 493 00:26:24,001 --> 00:26:26,295 సమయం ముడుచుకుంటుంది. 494 00:26:26,795 --> 00:26:28,672 సమయం ముడుచుకుంటుంది, అందులో రెండు అర్థాలున్నాయి. 495 00:26:29,590 --> 00:26:30,841 ఒక కాలం, వేరే కాలంలోకి ప్రవేశించగలదు, 496 00:26:30,841 --> 00:26:33,468 ఈ నిర్దిష్ట ద్వారాలు, మ్యాప్ ని మడతపెడితే తెరుచుకుంటాయి! 497 00:26:34,219 --> 00:26:37,514 నేను ఈ గడియారపు చిహ్నాన్ని మంచు యుగం నాటి కాలానికి తిప్పి, 498 00:26:37,514 --> 00:26:39,391 మ్యాప్ పై ఉండే మడతని తెరిస్తే, 499 00:26:39,892 --> 00:26:42,019 ఒక కాలం వేరే కాలంలోకి ప్రవేశించగలదు. 500 00:26:43,228 --> 00:26:44,605 దేవుడా! 501 00:26:44,605 --> 00:26:47,566 సరే మరి, ఒకటి గుర్తుంచుకోండి, ఈ ద్వారం కొంత సమయం పాటే తెరుచుకొని ఉంటుంది. కాబట్టి... 502 00:26:47,566 --> 00:26:49,818 - సరే, అర్థమైంది. - మనం దీని గురించి ఇంకా చర్చించుకోవాలి. 503 00:26:49,818 --> 00:26:52,863 ఆపండి! చర్చలు ఆపి, వెంటనే వెళ్లండి! 504 00:26:52,863 --> 00:26:55,240 - ఓరి దేవుడా! - మన భవిష్యత్తు అవతారాలా వాళ్లు? 505 00:26:55,240 --> 00:26:57,576 - అది నేనే. - ఎందుకు మనకి చెమటలు కారిపోతున్నాయి? 506 00:26:57,576 --> 00:26:59,244 అది చాలా పెద్ద కథ, ఇప్పుడు సమయం లేదు. 507 00:26:59,244 --> 00:27:02,080 - నేను కనబడట్లేదే? - ఆ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. 508 00:27:02,080 --> 00:27:03,874 - అయ్య బాబోయ్. - అయ్య బాబోయే. 509 00:27:03,874 --> 00:27:05,083 నాకు చాలా భయంగా ఉంది. 510 00:27:05,083 --> 00:27:07,044 లేదు, నువ్వు చాలా ధైర్యవంతుడివి! 511 00:27:07,044 --> 00:27:09,379 నీ వ్యక్తిగత సహకారం చాలా ముఖ్యమైనది! 512 00:27:09,379 --> 00:27:11,548 - వావ్, నిజంగానా? - అవును! అబ్బా! 513 00:27:11,548 --> 00:27:13,425 మీతో నేనెందుకు లేను? 514 00:27:14,176 --> 00:27:17,012 - నేను చనిపోయానా? - అది మాకు ఖచ్చితంగా తెలీదు. 515 00:27:17,012 --> 00:27:18,639 ఖచ్చితంగా తెలీదంటే? 516 00:27:19,431 --> 00:27:22,768 మీరు మాతో మాట్లాడుతున్న ద్వారాన్ని నేనెలా తెరిచాను? 517 00:27:22,768 --> 00:27:26,480 మ్యాప్ ఎలా పని చేస్తుందనే దానిపై నీకు ఎంత అవగాహన ఉందో నీకే తెలీదు. 518 00:27:26,480 --> 00:27:31,777 - అవునా? - అవును! కాలం ముడుచుకుంటుంది! అర్థమైందా? 519 00:27:34,029 --> 00:27:35,405 లేదు, నాకు అర్థం కావట్లేదు. 520 00:27:36,823 --> 00:27:38,909 - మాకు ఏమైంది? - ఖచ్చితంగా తెలీదంటే? 521 00:27:38,909 --> 00:27:42,204 ఇక చాలు! ప్రశ్నలు అడగకండి ఇక. మీరు తక్షణమే బయలుదేరాలి. పదండి! 522 00:27:42,204 --> 00:27:44,998 - సరే, సరే. అరుస్తావెందుకు! - హేయ్. ఆగండి! 523 00:27:49,211 --> 00:27:50,712 ఎందుకు ప్రతి ఒక్కరూ ఆ పని చేస్తున్నారు? 524 00:27:50,712 --> 00:27:52,381 నువ్వు నా మాజీ లవరులా ఉన్నావు! 525 00:27:52,381 --> 00:27:54,049 అదృష్టవంతుడు. 526 00:27:54,800 --> 00:27:58,470 అబ్బా, నేను ధైర్యంగా వ్యవహరించానని నాకు నేను చెప్పుకోవడం అవసరమా? పెద్ద బడాయి! 527 00:27:58,470 --> 00:28:00,472 నేను కూడా "సమయం ముడుచుకుంటుంది" అని అన్నాను. 528 00:28:00,472 --> 00:28:02,391 మనం అవే మాటలను అచ్చుగుద్దినట్టు దింపేశాం. 529 00:28:02,391 --> 00:28:04,685 లేదు, ఇందాకటిలా నేనేమీ గదమాయించలేదు. 530 00:28:04,685 --> 00:28:05,769 హేయ్, మిత్రులారా. 531 00:28:06,478 --> 00:28:07,813 నువ్వు బతికే ఉన్నావు! 532 00:28:07,813 --> 00:28:09,648 - అవును మరి. - నువ్వు చనిపోయావేమో అనుకున్నా. 533 00:28:09,648 --> 00:28:10,858 నువ్వు ఇద్దరు ఫియానాలతో తలపడ్డావు. 534 00:28:10,858 --> 00:28:13,443 అవును. నేను కూడా వాళ్లిద్దరే గెలుస్తారని అనుకున్నా. 535 00:28:13,443 --> 00:28:17,281 అన్నట్టు, నీ మాజీ లవరైన, ఫియానా గొప్ప యోధురాలే. 536 00:28:17,281 --> 00:28:19,867 ఇంతలో వాళ్లిద్దరూ గొడవపడటం మొదలుపెట్టారు, తెలుసా? 537 00:28:19,867 --> 00:28:22,911 ఇక నేను... నా గురించి మీకు తెలిసిందే కదా. మెల్లగా జారుకొని వచ్చేశాను. 538 00:28:22,911 --> 00:28:25,789 - ఆ తర్వాత షాపింగ్ సెంటరుకు వెళ్లాను... - ఆగు, ఇక్కడి నుండి మనం వెళ్లిపోవాలి. 539 00:28:25,789 --> 00:28:28,250 చూడండి, నాకు టూనికార్న్ కి మందు దొరికింది. 540 00:28:28,250 --> 00:28:31,545 అంతే కాకుండా, గాయాలకు ఎలా చికిత్స చేయాలనే పుస్తకాన్ని కూడా తెచ్చా. 541 00:28:31,545 --> 00:28:33,797 నా జీవితంలో నేను చేయబోయే ముఖ్యమైన పని ఇదే. 542 00:28:34,756 --> 00:28:40,095 నేనేం అంటున్నానంటే, ఈ కాలంలో నువ్వు ఉన్న చోటికే నేను కూడా వచ్చినప్పుడు, ఇదంతా జరగలేదు. 543 00:28:40,095 --> 00:28:42,431 - ఎందుకు? ఏదైనా మారిందా? - అవును. 544 00:28:42,431 --> 00:28:43,807 ఆల్టో, పద! 545 00:28:44,641 --> 00:28:46,143 ఫియానా! 546 00:29:02,451 --> 00:29:06,038 సరే, ఇప్పుడు నీ కాలిని సరి చేసేస్తాం. దాని గురించి 30వ పేజీలో ఉంది. 547 00:29:12,002 --> 00:29:14,004 నేను మళ్లీ విఫలమయ్యాను. 548 00:29:16,006 --> 00:29:21,303 కెవిన్, ఈ విశ్వం గురించి మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. 549 00:29:21,303 --> 00:29:24,765 జరిగిపోయిన పెద్ద పెద్ద సంఘటనలను జరగకుండా ఆపడం సాధ్యమో, కాదో మనకి తెలీదు. 550 00:29:24,765 --> 00:29:27,935 అంటే మరణం లాంటివి. మేము ఇప్పటికే ప్రయత్నించి చూశాం. 551 00:29:27,935 --> 00:29:29,394 సూసన్ ని కాపాడాలని చూశాం. 552 00:29:29,394 --> 00:29:31,355 - అవును. - తనకి ఏమైంది? 553 00:29:31,355 --> 00:29:34,691 తను కొండ అంచు నుండి కిందకి పడిపోయింది, ఆ తర్వాత ఒక పెద్ద బండరాయి తన మీద పడింది. 554 00:29:34,691 --> 00:29:36,151 తను చనిపోయిందని తెలిసిపోయింది మాకు. 555 00:29:36,151 --> 00:29:38,278 కొండే చాలా ఎత్తుగా ఉంది. అది చాలదన్నట్టు బండరాయి పడింది. 556 00:29:39,154 --> 00:29:41,949 ఆ సంఘటన జరగక ముందే వెళ్లాలని మేము ఎన్నిసార్లు ప్రయత్నించినా, 557 00:29:41,949 --> 00:29:45,452 ప్రతిసారి కూడా, ఆ సంఘటన జరిగాకే వెళ్లాం. 558 00:29:45,452 --> 00:29:46,662 కానీ మేము పట్టు విడవలేదు. 559 00:29:46,662 --> 00:29:47,829 అయితే, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారా? 560 00:29:47,829 --> 00:29:49,456 లేదు. చివరికి, మేము వదిలేశాం. 561 00:29:50,165 --> 00:29:53,544 జీవితంలో ఒక్కోసారి, దీర్ఘంగా శ్వాస తీసుకొని, ముందుకు కొనసాగిపోవాలి మనం. 562 00:29:59,049 --> 00:30:02,094 ఆగు. వాళ్లు ఇక్కడ లేరు. 563 00:30:02,094 --> 00:30:03,011 ఏంటి? 564 00:30:03,011 --> 00:30:04,638 చూడండి, ఇప్పుడు బొగ్గు ముద్దలు లేవు. 565 00:30:05,514 --> 00:30:07,558 ఒక్క నిమిషం, అంటే మనం... 566 00:30:08,767 --> 00:30:09,768 చరిత్రను మార్చామా? 567 00:30:12,938 --> 00:30:14,189 అది నా కోసమే వచ్చింది! 568 00:30:17,109 --> 00:30:18,443 హలో? 569 00:30:19,069 --> 00:30:20,529 హలో, నా మాటలు వినిపిస్తున్నాయా? 570 00:30:20,529 --> 00:30:22,406 నా మాటలు వినిపిస్తున్నాయా? నా గొంతు వినిపిస్తోందా? 571 00:30:22,406 --> 00:30:23,490 ఏంటిది? 572 00:30:23,490 --> 00:30:25,909 నేనే, క్రూరాతి క్రూరుడిని. 573 00:30:25,909 --> 00:30:27,661 మిమ్మల్ని ట్రాక్ చేసేశాను. 574 00:30:27,661 --> 00:30:32,583 టైమ్ ట్రావెల్ బందిపోటులారా, ఇంకా మీ సారథి అయిన... 575 00:30:32,583 --> 00:30:34,209 - పెనెలోపీ. - కెవిన్. 576 00:30:34,793 --> 00:30:37,421 నిజానికి, అదేం లేదు. చెప్పాలంటే మాకు నాయకులంటూ ఎవరూ లేరు. 577 00:30:37,421 --> 00:30:38,922 కానీ నిజానికి, నేను... 578 00:30:38,922 --> 00:30:40,549 మీ దగ్గర నాకు కావాల్సింది ఒకటి ఉంది. 579 00:30:40,549 --> 00:30:43,844 ఈ అనంత విశ్వానికి, కాలానికి సంబంధించిన బ్లూప్రింట్. 580 00:30:43,844 --> 00:30:45,179 - లేదు, మా దగ్గర అది అస్సలు... - లేదు! 581 00:30:45,179 --> 00:30:46,638 లేదు, మా దగ్గర అది లేదు. 582 00:30:46,638 --> 00:30:48,390 - మా వద్ద అది లేదు. - అది మా దగ్గర లేదు. 583 00:30:48,390 --> 00:30:49,474 దాన్ని మీరు మ్యాప్ అంటుంటారు. 584 00:30:49,474 --> 00:30:51,226 - అది ఉంది. - అది విడ్జిట్ దగ్గర ఉంది. 585 00:30:51,226 --> 00:30:52,895 - ఓయ్. - కానీ అది నీకు ఇవ్వము. 586 00:30:52,895 --> 00:30:55,981 మీరలా అంటారని నాకు తెలుసు. కానీ మీకు కావాల్సింది ఒకటి నా దగ్గర ఉంది. 587 00:30:55,981 --> 00:30:58,108 నేను ఇచ్చిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. 588 00:30:58,108 --> 00:31:00,652 నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజు జూమ్ ఉందా అని అడిగాను, 589 00:31:00,652 --> 00:31:02,404 దానికి నువ్వు నా కాలికి నిప్పు అంటించావు. 590 00:31:02,404 --> 00:31:04,489 అది జూమ్ కాదు, దుష్ట మాయ. 591 00:31:04,489 --> 00:31:06,491 ఇక్కడ మెష్ సిస్టమ్ ఏర్పాటు చేయగలను. సిగ్నల్ మెరుగవుతుంది. 592 00:31:06,491 --> 00:31:07,451 వాళ్లు అమ్మానాన్నలా? 593 00:31:07,451 --> 00:31:10,412 - వాళ్లే అనుకుంటా. అమ్మా? నాన్నా? - నువ్వు అన్నది నిజమే. 594 00:31:10,412 --> 00:31:12,539 కెవిన్! శాఫ్రాన్! 595 00:31:12,539 --> 00:31:14,249 మీరు ఎవరితో ఉన్నారు? 596 00:31:14,249 --> 00:31:15,209 అమ్మా. 597 00:31:15,209 --> 00:31:17,294 నేను కెవిన్ తో, ఇంకా అతని వింత మిత్రులతో ఉన్నాను. 598 00:31:17,294 --> 00:31:20,047 - సరే. బాబోయ్. - ఓయ్. నేనేమీ నీ నేస్తాన్ని కాదు. 599 00:31:20,547 --> 00:31:24,927 అమ్మా, నాన్నా, మీరు చనిపోయారేమో అనుకున్నాం. మీరు నిజంగానే చనిపోయారు. 600 00:31:24,927 --> 00:31:26,345 - చావలేదు. - చావలేదు. 601 00:31:26,345 --> 00:31:30,265 శాఫ్రాన్, మనం సాధించాం. వాళ్లని కాపాడాం. 602 00:31:30,265 --> 00:31:33,101 లేదు, కెవిన్. మమ్మల్ని మేమే కాపాడుకున్నాం. అవును కదా, లీసా? 603 00:31:33,101 --> 00:31:34,144 అవును, మైక్. 604 00:31:34,144 --> 00:31:35,896 నువ్వు ఏడ్చావు, కాస్త బతిమాలావు కూడా... 605 00:31:35,896 --> 00:31:37,814 నేనే చొరవ తీసుకున్నా, అంతే. 606 00:31:37,814 --> 00:31:40,359 చిన్నప్పటి నుండి ఆ రాకాసి రోజూ నా కలలోకి వచ్చేది. 607 00:31:40,359 --> 00:31:44,071 మీకు తెలుసు కదా, బందీ అయినప్పుడు ఎలా ఉండాలి అని నేను శిక్షణ తీసుకున్నానని, 608 00:31:44,071 --> 00:31:48,534 ఎందుకంటే, నా చిన్నతనంలో, ఒక పిచ్చి అనాథ పాప నన్ను కిడ్నాప్ చేయబోయింది. 609 00:31:48,534 --> 00:31:50,410 కాబట్టి, మేము సిద్ధంగా ఉన్నాం. 610 00:31:54,998 --> 00:31:57,042 తనే. ఆ రాకాసి వచ్చింది. 611 00:31:57,042 --> 00:31:58,669 దయచేసి మమ్మల్ని ఏమీ చేయవద్దు. 612 00:31:58,669 --> 00:32:00,712 నీకు ఏవైనా డిమాండ్లు ఉంటే, వాటన్నింటినీ నెరవేర్చుతాం. 613 00:32:00,712 --> 00:32:03,757 నీ ఆదేశాలను, సూచనలను తుచ తప్పకుండా పాటిస్తాం. 614 00:32:09,471 --> 00:32:11,682 సరే మరి, కుటుంబ సభ్యులందరి పలకరింపులు అయ్యాయిగా. 615 00:32:11,682 --> 00:32:14,351 మళ్లీ మీ అమ్మానాన్నలను ప్రాణాలతో చూడాలంటే, 616 00:32:14,351 --> 00:32:18,021 మ్యాప్ ని గాఢాంధకారపు కోటకి తీసుకురండి. 617 00:32:18,021 --> 00:32:20,023 నేను ఎదురు చూస్తుంటా. 618 00:32:21,149 --> 00:32:22,734 మీరిద్దరూ జాగ్రత్త. 619 00:32:22,734 --> 00:32:24,403 బై. 620 00:32:34,913 --> 00:32:37,583 మనం సాధించాం. అమ్మానాన్నలు ప్రాణాలతోనే ఉన్నారు. 621 00:32:37,583 --> 00:32:39,251 లేదు, ఇది అంతకన్నా దారుణమైనది. 622 00:32:40,002 --> 00:32:41,044 చావు కన్నానా? 623 00:32:41,044 --> 00:32:42,921 అవును. చావు కన్నా కొంచెం దారుణమైనదే. 624 00:32:42,921 --> 00:32:46,550 అయితే, మనం ఈ అంధకారపు కోటని కనుగొని, 625 00:32:46,550 --> 00:32:47,968 మా అమ్మానాన్నలని కాపాడాలి. 626 00:32:47,968 --> 00:32:49,678 కానీ అది లెజెండ్స్ కాలంలో ఉంది. 627 00:32:49,678 --> 00:32:51,430 మనం అక్కడికి వెళ్లలేం. 628 00:32:51,430 --> 00:32:53,557 - ఎందుకు? - అక్కడే క్రూరాతి క్రూరుడు ఉంటాడు. 629 00:32:53,557 --> 00:32:55,267 - అయితే? - అతను క్రూరుడు. 630 00:32:55,267 --> 00:32:56,393 క్రూరాతి క్రూరుడు. 631 00:32:57,603 --> 00:33:00,564 - అయితే? - పైగా, మీ అమ్మానాన్నలు అంత గొప్పోళ్లేం కాదు. 632 00:33:02,649 --> 00:33:06,111 మీరు చనిపోయారని అతను ఎందుకు అన్నాడు? 633 00:33:06,111 --> 00:33:08,572 - తెలీదు. - నాకు అది ఎదురుకాలేదు. 634 00:33:08,572 --> 00:33:09,823 - చావలేదు. - నేను కూడా. 635 00:33:09,823 --> 00:33:12,117 బహుశా, వాళ్లు టైమ్ ట్రావెల్ చేసినదాని వల్ల ఏమైనా మారిందేమో, 636 00:33:12,117 --> 00:33:15,370 మీరు ఏదైతే చేశారో, దాని గతి కూడా మారిందేమో? 637 00:33:15,370 --> 00:33:18,373 నోర్మూసుకో, జాన్. అది అసంభవం. 638 00:33:25,130 --> 00:33:27,257 అయ్యయ్యో. నిజానికి, అలా జరిగే అవకాశం ఉంది. 639 00:33:28,467 --> 00:33:30,177 ఆ అవకాశం చాలానే ఉంది. 640 00:33:35,474 --> 00:33:38,435 కాలికి కట్టిన ఈ కట్టును ఆరు వారాల తర్వాత తీసేయండి, 641 00:33:38,435 --> 00:33:42,523 టూనికార్న్ కి నొప్పిగా ఉంటే, దానికి వీటిని మూడు ఇవ్వండి. 642 00:33:42,523 --> 00:33:44,066 ఒకటి! రెండు! మూడు! 643 00:33:44,066 --> 00:33:45,025 ఇప్పుడు తినమా? 644 00:33:45,025 --> 00:33:46,485 - ఇప్పుడు తిందాం! - తినడమా? 645 00:33:46,485 --> 00:33:48,487 లేదు, వీటిని తినవద్దు. 646 00:33:48,487 --> 00:33:50,030 - మూడు. - మూడింటిని ఇప్పుడు తినాలా? సరే. 647 00:33:50,030 --> 00:33:51,323 లేదు, దీన్ని తినవద్దు. 648 00:33:51,323 --> 00:33:52,449 - ఇది టూనికార్న్ కోసం. - "పెన్నెపీ." 649 00:33:52,449 --> 00:33:53,534 చెప్పు. 650 00:33:53,534 --> 00:33:55,661 నేను, కాగా పెళ్లి చేసుకున్నాం. 651 00:33:55,661 --> 00:33:57,079 - అవును. - సారీ. 652 00:33:57,829 --> 00:34:00,791 సరే. అది అర్థవంతంగానే ఉంది. మంచిది. 653 00:34:00,791 --> 00:34:02,000 నీకు కుళ్లుగా ఉందా? 654 00:34:02,000 --> 00:34:03,418 లేదు. 655 00:34:03,418 --> 00:34:05,754 హా, నీకు చాలా కుళ్లుగా ఉంది. 656 00:34:06,630 --> 00:34:09,132 - తనకి చాలా కుళ్లుగా ఉంది కదా? - నాకేమీ కుళ్లు లేదు. 657 00:34:09,132 --> 00:34:10,676 నువ్వు నన్ను వాడుకుంటున్నావా? 658 00:34:11,260 --> 00:34:13,846 - లేదు. నేనేమీ వాడుకోవట్లేదు. - అవును, నువ్వు నన్ను వాడుకుంటున్నావు. 659 00:34:13,846 --> 00:34:16,889 - లేదు! లేదు! నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. - కాదు. లేదు. 660 00:34:16,889 --> 00:34:19,810 - నాకేమీ అనుమానం లేదు! లేనే లేదు! - అది అనుమానమే. చాలా అనుమానం ఉంది నీకు. 661 00:34:21,728 --> 00:34:24,815 - నువ్వు వెళ్లిపోతున్నావా, శాఫ్? - అవును. 662 00:34:26,108 --> 00:34:28,527 మళ్లీ నా ఇంకో కుటుంబాన్ని కాపాడుకోవాలి. 663 00:34:29,402 --> 00:34:31,572 ఇంత కాలం నన్ను బాగా చూసుకున్నందుకు థ్యాంక్యూ. 664 00:34:31,572 --> 00:34:32,614 మరేం పర్వాలేదు, శాఫ్. 665 00:34:34,074 --> 00:34:34,908 మళ్లీ కలుద్దాం. 666 00:34:37,034 --> 00:34:38,203 బై! 667 00:34:38,203 --> 00:34:39,746 హా, బై. 668 00:34:39,746 --> 00:34:41,498 - బై, చెల్లీ. - బై, చెల్లీ. 669 00:34:41,498 --> 00:34:42,583 - బై. - బై, శాఫ్. 670 00:34:42,583 --> 00:34:44,042 - బై. - సెలవు మరి. 671 00:34:48,964 --> 00:34:50,632 బై, గ్రంట్. 672 00:34:55,262 --> 00:34:57,514 నవ్వకు, కెవిన్! 673 00:34:58,599 --> 00:35:03,437 సరే మరి, మ్యాపులోడా, ఈ అంధకారపు కోటకి ఎలా వెళ్లాలో మాకు దారి చూపించు. 674 00:35:03,437 --> 00:35:05,063 అది చాలా ప్రమాదకరమైనది. అక్కడికి వెళ్లకపోవడమే మంచిది. 675 00:35:05,063 --> 00:35:06,565 - కానీ మేము వెళ్లాలి. - మన్నించండి. 676 00:35:06,565 --> 00:35:09,568 నా ఉద్దేశం ఏంటంటే, అది చాలా ప్రమాదకరం, నాకు అక్కడికి వెళ్లాలని లేదు అని. 677 00:35:09,568 --> 00:35:11,320 అక్కడికి ఎలా వెళ్లాలి, విడ్జిట్? 678 00:35:11,320 --> 00:35:13,864 దానికి దారి ఇక్కడే ఉంది. 679 00:35:16,575 --> 00:35:18,410 అయ్యయ్యో. ఇది చిరిగిపోయింది. 680 00:35:18,410 --> 00:35:19,536 ఏంటి? 681 00:35:19,536 --> 00:35:21,079 అవును, ఇది చిరిగిపోయింది. 682 00:35:21,079 --> 00:35:22,956 లెజెండ్ల కాలం, ఆ చిరిగిపోయిన మ్యాపులో ఉంది. 683 00:35:24,708 --> 00:35:26,627 అయితే, మనం ఆ చిరిగిన మ్యాప్ ని కనుగొనాలి. 684 00:35:29,379 --> 00:35:30,506 చిరిగిన మ్యాప్ ని కనుగొనాలా? 685 00:35:30,506 --> 00:35:32,257 పదండి, దద్దమ్మలారా. 686 00:35:32,257 --> 00:35:35,219 - బై, శాఫ్! - మళ్లీ కలుద్దాం! 687 00:35:41,975 --> 00:35:42,893 టెర్రీ గిలియమ్, మైఖెల్ పాలిన్ 688 00:35:42,893 --> 00:35:43,894 రూపొందించిన పాత్రల ఆధారితమైనది 689 00:35:49,983 --> 00:35:51,401 'TIME BANDITS' సినిమా ఆధారంగా తెరకెక్కించబడింది 690 00:36:54,965 --> 00:36:56,967 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్