1 00:02:13,425 --> 00:02:17,513 [జపనీస్ భాష] 2 00:02:17,555 --> 00:02:21,600 [జపనీస్ భాష] 3 00:02:21,642 --> 00:02:27,898 [జపనీస్ భాష] 4 00:02:27,940 --> 00:02:31,151 [జపనీస్ భాష] 5 00:02:31,193 --> 00:02:34,363 [జపనీస్ భాష] 6 00:02:34,405 --> 00:02:40,703 [జపనీస్ భాష] 7 00:02:40,744 --> 00:02:46,709 [జపనీస్ భాష] 8 00:02:46,750 --> 00:02:51,130 [జపనీస్ భాష] 9 00:02:57,428 --> 00:03:02,725 [జపనీస్ భాష] 10 00:03:02,766 --> 00:03:08,272 [జపనీస్ భాష] 11 00:03:09,690 --> 00:03:14,904 [జపనీస్ భాష] 12 00:03:14,945 --> 00:03:18,115 [జపనీస్ భాష] 13 00:03:18,157 --> 00:03:21,410 చెస్టర్, మనం భవిష్యత్తుని ఊహించలేం. 14 00:03:21,452 --> 00:03:23,662 అది అనేకమంది చేత వ్రాయబడింది. 15 00:03:31,086 --> 00:03:34,298 శ్రీమతి ఫురుయా, మీరు ఇది చేయవలసిన అవసరం లేదు. 16 00:03:36,550 --> 00:03:38,969 నీకొక వారంలో అది ఇస్తాను. 17 00:03:39,011 --> 00:03:41,430 అప్పుడు అంతా సర్దుకుంటుంది. 18 00:03:58,614 --> 00:04:03,494 టెర్మినల్ ఐలాండ్ శాన్ పెడ్రో, కాలిఫోర్నియా 1941 19 00:04:23,806 --> 00:04:26,600 ఫురుయా గారు, మీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నాం. 20 00:04:28,644 --> 00:04:30,020 నవ్వు, బాబూ. 21 00:04:31,814 --> 00:04:33,107 మీ అమ్మ నిన్ను చూస్తోంది. 22 00:04:38,278 --> 00:04:40,239 అమ్మా, నాన్నా. 23 00:04:40,280 --> 00:04:42,533 ఒక ఫోటో తీస్తాను. 24 00:04:42,574 --> 00:04:45,869 ఫురుయా గారు, మీ ఆవిడ ఫోటోతో ప్లీజ్. 25 00:05:01,969 --> 00:05:03,137 నువ్వు ఇది మర్చిపోయావు. 26 00:05:08,684 --> 00:05:10,436 పిరికిపంద. 27 00:05:27,745 --> 00:05:28,579 [జపనీస్ సంభాషణ] 28 00:05:29,997 --> 00:05:32,583 [జపనీస్ సంభాషణ] 29 00:05:32,624 --> 00:05:35,502 [జపనీస్ సంభాషణ] 30 00:05:46,972 --> 00:05:49,058 సముద్రం నుండి వచ్చిన అపశకునం. 31 00:05:49,099 --> 00:05:51,143 పిచ్చి పిచ్చిగా వాగకు. 32 00:05:51,185 --> 00:05:53,103 దాన్ని ఎవరైనా చూడొచ్చు! 33 00:05:53,145 --> 00:05:54,897 చనిపోయినవారు కూడా ప్రశాంతంగా ఉండలేరు. 34 00:05:54,938 --> 00:05:56,982 మనం ఇప్పుడు జపాన్ లో లేము. 35 00:05:57,024 --> 00:05:58,776 నేను అదే అంటున్నా! 36 00:05:58,817 --> 00:06:02,029 పాత ఆత్మలు మనల్ని పిలిచినప్పుడు మనం మరచిపోతాం. 37 00:06:02,071 --> 00:06:03,405 ఆత్మా? 38 00:06:04,698 --> 00:06:06,700 ఇన్నేళ్ళ తర్వాతా? 39 00:06:06,742 --> 00:06:08,368 ఇన్ని మైళ్ళ దూరంలో? 40 00:06:45,155 --> 00:06:47,199 ది టెర్రర్ ఇన్ఫేమీ 41 00:06:53,288 --> 00:06:58,752 టారో 42 00:07:02,798 --> 00:07:05,425 నాన్న, పట్టుకున్న చేపల్ని ఒకసారి చూస్తావా? 43 00:07:20,566 --> 00:07:22,568 షోగో. 44 00:07:22,609 --> 00:07:24,111 ఒరేయ్ బండోడా! 45 00:07:25,195 --> 00:07:27,781 చేపల్ని పట్టడంలో ఆరితేరితే, నువ్వే రాజువి. 46 00:07:28,699 --> 00:07:35,497 వారు నన్ను శాన్ పెడ్రో టూనా బాక్సింగ్ ఛాంపియన్ గా చేసినప్పుడు, నా బరువు 110 పౌండ్లు 47 00:07:35,539 --> 00:07:37,958 మీరు టూనాతో బాక్సింగ్ చేసారా? 48 00:07:38,000 --> 00:07:40,836 1915. 49 00:07:40,878 --> 00:07:43,338 నేను అప్పుడే శాన్ ఫ్రాన్సిస్కో నుండి వచ్చాను. 50 00:07:43,380 --> 00:07:47,551 నేనొక తేయాకు వ్యాపారిని. అంతకుముందు ఎప్పుడూ చేపలు పట్టలేదు. 51 00:07:47,593 --> 00:07:53,182 కానీ, న్యూ పోర్ట్ బే లో 200 పౌండ్ల బ్లూ ఫిన్ చేపని పట్టాను. 52 00:07:53,223 --> 00:07:58,562 అలా గాలంతో పైకి లాగాక, ఆ చేప డెక్ మీద ఇలా పడుకుంది. 53 00:07:58,604 --> 00:08:00,063 దాని ముఖం పైన పిడి గుద్దు గుద్దాను. 54 00:08:00,105 --> 00:08:02,357 అది స్పృహ కోల్పోయి చనిపోయింది. 55 00:08:02,399 --> 00:08:04,318 ఒకే గుద్దు. 56 00:08:04,359 --> 00:08:09,156 ఆ తర్వాత నన్ను శాన్ పెడ్రో టూనా బాక్సింగ్ ఛాంపియన్ అని పిలవడం మొదలుబెట్టారు. 57 00:08:11,491 --> 00:08:14,244 నాన్న, మనం ఇప్పుడు కాలక్షేపం కోసం చేపల్ని పడుతున్నామా? 58 00:08:14,286 --> 00:08:18,290 మనకి ఏడు చేపలు, నాలుగు సముద్రంలోకి. 59 00:08:20,417 --> 00:08:21,460 అదృష్టం కోసం. 60 00:08:23,003 --> 00:08:24,671 శ్రీమతి ఫురుయా కోసం. 61 00:08:24,713 --> 00:08:27,549 అంత్యక్రియలప్పుడు బకేమోనో వచ్చింది. 62 00:08:28,425 --> 00:08:31,011 బకేమోనో తెలుసా? 63 00:08:31,053 --> 00:08:34,181 ఎలాంటి బకేమోనో, యమటో గారు? 64 00:08:34,223 --> 00:08:36,767 మీరు చూడగలిగిందా లేక కేవలం అనుభూతి పొందారా? 65 00:08:36,808 --> 00:08:37,643 కమాన్. 66 00:08:37,684 --> 00:08:40,729 ఆ పాత చింతకాయ పచ్చడి అంతా అక్కడే వదిలేసాం అనుకున్నానే. 67 00:08:40,771 --> 00:08:42,147 ఒకవేళ అలాంటివి ఉన్నా, 68 00:08:42,189 --> 00:08:44,316 ఇంత దూరం ఎందుకు వస్తాయి? 69 00:08:44,358 --> 00:08:46,109 ఎందుకు రావు? మనం వచ్చాం. 70 00:08:48,487 --> 00:08:51,657 చెస్టర్, కాస్త సాయపడు. 71 00:08:51,698 --> 00:08:54,701 మిస్టర్ గ్రిచక్, మీకోసం బ్రహ్మాండమైన చేపలు పట్టాము! 72 00:08:54,743 --> 00:08:57,162 ఇవాళ నీరు చాలా చల్లగా ఉంది. 73 00:08:57,204 --> 00:08:58,413 వంజర చేపలకి మంచిది. 74 00:08:59,873 --> 00:09:03,835 హెన్రీ గారు, మీరు వంజర చేపలకి అన్నీ మంచివే చెప్తారు. 75 00:09:03,877 --> 00:09:05,796 అవును. 76 00:09:05,837 --> 00:09:07,631 జీసస్. 77 00:09:09,091 --> 00:09:11,718 ఏంటిది? 78 00:09:11,760 --> 00:09:14,263 మా అమ్మాయిలకి గుండె ఆగినంత పని చేసేలా ఉన్నారు. 79 00:09:18,267 --> 00:09:20,269 చేపలు కాకుండా వేరేవి ఇన్ని పట్టారా. 80 00:09:20,310 --> 00:09:23,021 పది మంది అమ్మాయిలు కలిసి అన్నీ వేరు చేయాల్సి వస్తుంది. 81 00:09:23,063 --> 00:09:24,564 టన్నుకి ఇరవై డాలర్లు. 82 00:09:24,606 --> 00:09:27,943 - మిస్టర్ గ్రిచక్, కానీ ధర నలభై డాలర్లు. - ఇరవై. 83 00:09:27,985 --> 00:09:30,904 కొంతమంది అయితే మీ దగ్గర అసలు కొనకూడదని అంటున్నారు. 84 00:09:30,946 --> 00:09:32,656 ఈ కాలంలో వారు ఎలా మాట్లాడతారో తెలిసిందే కదా. 85 00:09:32,698 --> 00:09:35,158 బాగా చలిగా ఉందనుకుంటా. 86 00:09:35,200 --> 00:09:37,661 - అడుగున ఉన్న చేపలు పైకి వచ్చాయి. - మిస్టర్ గ్రిచక్. 87 00:09:37,703 --> 00:09:41,623 మా నాన్న ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుండి, మంచి చేపలని అందిస్తున్నారు. 88 00:09:41,665 --> 00:09:42,958 ఆయనకి నలభై డాలర్లు సమంజసమే. 89 00:09:43,000 --> 00:09:46,795 నలభై డాలర్లు కేవలం వంజర చేపలకే బాబు. 90 00:09:46,837 --> 00:09:51,633 పేరు గట్రా లేని చేపలతో కలిసి వున్న వంజర చేపలకు కాదు. 91 00:09:51,675 --> 00:09:52,926 మేమే అంతా వేరు వేరుగా చేస్తాం. 92 00:09:54,594 --> 00:09:55,929 పనికిరాని చేపలని వేరు చేస్తాం. 93 00:09:55,971 --> 00:09:57,597 నిజానికి, అవి కూడా తినగలిగేవే. 94 00:09:58,849 --> 00:10:00,517 మీ వంజర చేపలు మీకు అందుతాయి. 95 00:10:00,559 --> 00:10:01,768 కానీ నలభై డాలర్లు టన్నుకి. 96 00:10:12,487 --> 00:10:13,780 నువ్వు కెప్టెన్ అవుదాం అనుకుంటున్నావా? 97 00:10:13,822 --> 00:10:15,574 చేపలు పట్టడం నేర్చుకో. 98 00:10:18,702 --> 00:10:21,204 19 కాలిఫోర్నియా 41 16డబ్ల్యు220 99 00:10:31,548 --> 00:10:32,799 - [జపనీస్ సంభాషణ] - హెన్రీ గారు! 100 00:10:32,841 --> 00:10:34,760 చెస్టర్! 101 00:10:39,723 --> 00:10:41,391 హే, చెట్. 102 00:10:41,433 --> 00:10:43,643 ఏంటి సంగతి, తమ్ముడూ? 103 00:10:43,685 --> 00:10:44,936 ఎంత పాత డొక్కు కారో. 104 00:10:44,978 --> 00:10:46,605 పాకర్డ్. 105 00:10:46,646 --> 00:10:49,691 ఈ దీవిలో కేవలం ఆరుగురు జపనీయుల దగ్గరే కార్లున్నాయ్. 106 00:10:49,733 --> 00:10:51,651 నాన్నా, నీకు చెప్తున్న మార్లన్, ఇతనే. 107 00:10:51,693 --> 00:10:53,028 నేవల్ స్టేషన్ అతనా? 108 00:10:53,070 --> 00:10:57,532 ఓహ్, నువ్వేనా ఆ విదేశీయుడివి, ఊరికే ఎల్.ఏ వెళ్తుంటావు. 109 00:10:57,574 --> 00:11:01,078 ఆయన మాటలు పట్టించుకోకు, నేను ఎప్పటికీ ఈ దీవిలో ఉండిపోతానని అనుకుంటూ ఉంటారు. 110 00:11:01,119 --> 00:11:03,163 హే, రేపటికి టికెట్లు తెచ్చా మనకి. 111 00:11:05,165 --> 00:11:07,376 మేము వాల్ట్ యోషిదాని సినిమాకి తీసుకు వెళ్తున్నాం, 112 00:11:07,417 --> 00:11:09,419 మెక్సికో వే, ఆర్ఫియం దగ్గర. 113 00:11:09,461 --> 00:11:10,754 జీన్ ఆట్రీ. 114 00:11:10,796 --> 00:11:12,255 నీ పని ఎప్పుడు అవుతుంది? 115 00:11:12,297 --> 00:11:14,299 ఇంకో ఎనిమిది గంటల తర్వాతే. 116 00:11:14,341 --> 00:11:15,884 తీరం మొత్తం అప్రమత్తంగా ఉంది. 117 00:11:15,926 --> 00:11:19,513 గూఢచారులకోసం నేను వెతుకుతూ ఉండాలి, ముఖ్యంగా జపనీయులు. 118 00:11:19,554 --> 00:11:20,806 హే, మార్లన్. 119 00:11:22,182 --> 00:11:25,685 మా అబ్బాయిని నేవల్ స్టేషన్ నుండి దూరంగా ఉంచు, సరేనా? 120 00:11:25,727 --> 00:11:28,480 వీడిని చూసారంటే, కాల్చేసినా కాల్చేస్తారు. 121 00:11:45,831 --> 00:11:48,458 నీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. 122 00:11:52,295 --> 00:11:55,006 నీకు అనుభవం ఉందని చెప్పావని అనుకున్నా. 123 00:11:55,048 --> 00:11:57,134 అది కాదు. 124 00:11:57,175 --> 00:11:59,052 మీ నాన్న కిందే ఉన్నాడుగా, అదే భయం. 125 00:12:01,388 --> 00:12:02,764 నాకు గుర్తు చేయకు. 126 00:12:02,806 --> 00:12:04,474 సరే. 127 00:12:04,516 --> 00:12:07,227 గుర్తుతెచ్చుకోవద్దులే. 128 00:12:07,269 --> 00:12:09,062 లేదా... 129 00:12:09,104 --> 00:12:10,188 మనం... 130 00:12:11,481 --> 00:12:13,859 ఏమీ మాట్లాడద్దు. 131 00:12:13,900 --> 00:12:14,943 అవును. 132 00:12:16,278 --> 00:12:17,779 ఇది ఇంకా బాగుంది. 133 00:12:22,117 --> 00:12:22,993 హే. 134 00:12:25,287 --> 00:12:26,163 నువ్వు అది తెచ్చావా? 135 00:12:37,007 --> 00:12:40,010 ముదురురంగులో ఉన్నది మొదట తీస్కో. గయో అంటారు. 136 00:12:40,051 --> 00:12:43,972 రెండో రోజు, పలచగా ఉన్నది కలుపు, టోకి అంటారు. 137 00:12:44,014 --> 00:12:46,433 ఒకసారి రక్తస్రావం మొదలయ్యాక... 138 00:12:46,475 --> 00:12:47,726 నువ్వు ఆపేయవచ్చు. 139 00:12:50,312 --> 00:12:51,897 ఇది పాపం. 140 00:12:54,232 --> 00:12:56,234 మా నాన్నని చంపేస్తుంది, ఒకవేళ ఆయనకి తెలిస్తే. 141 00:12:59,821 --> 00:13:00,739 మనల్ని కూడా చంపినట్టే. 142 00:13:03,200 --> 00:13:05,869 దీని తర్వాత మనం ఏం చేయాలి? 143 00:13:05,911 --> 00:13:07,871 నేను అంత దూరం ఆలోచించలేదు. 144 00:13:10,415 --> 00:13:13,418 నా కళ్ళ ముందు కేవలం శ్రీమతి ఫురుయానే కనపడుతున్నారు, 145 00:13:13,460 --> 00:13:14,920 అలా పడుకొని ఉండి, 146 00:13:14,961 --> 00:13:18,089 - దైవత్వంతో, చివరిమజిలీకి తయారయి. - ఆపు. 147 00:13:18,131 --> 00:13:19,341 జరిగినదానికి నిన్నునువ్వు నిందించుకోవడం బాగాలేదు. 148 00:13:19,382 --> 00:13:21,259 మనం దీనికోసం అడిగిన తర్వాతే ఆమె ఆత్మహత్య చేసుకుంది. 149 00:13:21,301 --> 00:13:23,261 అది తప్పు అని అనుకొని ఉంటే, ఆమె అసలు తయారుచేసేదే కాదు. 150 00:13:23,303 --> 00:13:26,473 ఆమె చేయాలనుకోలేదు, నేను కాబట్టి చేస్తున్నానని అంది. 151 00:13:27,891 --> 00:13:31,353 మనం చేసిన తప్పుకు మనకి సాయం చేయాలని అనుకుంది, కానీ ఇప్పుడు... 152 00:13:41,112 --> 00:13:42,155 మరి... 153 00:13:45,450 --> 00:13:46,493 తర్వాత ఏం చేద్దాం? 154 00:13:49,371 --> 00:13:52,791 ఇదంతా అయ్యాకా, మీ నాన్నకి నువ్వు బాగానే ఉన్నావని చెప్పు. 155 00:13:54,084 --> 00:13:56,836 విషాహారం తినడం వల్ల జరిగింది, డాక్టర్ ని కలవాలి అని చెప్పు. 156 00:13:57,963 --> 00:14:00,840 తరువాత, క్రిస్మస్ సమయానికి అంతా సర్దుకుంటుంది. 157 00:14:02,133 --> 00:14:03,218 మొత్తం. 158 00:14:03,260 --> 00:14:05,053 నువ్వు నర్సింగ్ స్కూల్ కి వెళ్ళు. 159 00:14:06,012 --> 00:14:09,641 నేను మా ఊరు వెళ్తాను. ఇంక ఎలాంటి ఇబ్బంది ఉండదు. 160 00:14:13,687 --> 00:14:14,813 నీకో విషయం తెలుసా... 161 00:14:16,815 --> 00:14:19,067 మా నాన్న నేనెప్పుడూ ఒక సన్యాసిని అవ్వాలని అనుకొనే వారు. 162 00:14:21,611 --> 00:14:24,406 మా అమ్మ గుర్తుగా అనుకుంటా. 163 00:14:24,447 --> 00:14:25,740 నేను కూడా చేద్దామనే అనుకున్నా. 164 00:14:29,244 --> 00:14:31,079 సిస్టర్ ఇల్ల్యుమినటా. 165 00:14:32,080 --> 00:14:36,501 ఒక రోజు నాకు అనిపించింది, ఇది వినడానికి బాగుందని మాత్రమేనని గ్రహించాను. 166 00:14:39,546 --> 00:14:40,797 సన్యాసినిని అవ్వాలని కాదు. 167 00:14:44,759 --> 00:14:49,514 ఎప్పుడూ నీకు చెబుదామని అనుకున్నాను, కానీ కుదరలేదు. 168 00:14:51,600 --> 00:14:54,477 నిన్ను మా నాన్న పడవ మీదకి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. 169 00:14:55,270 --> 00:14:59,232 అది కారు నలుపు. చాలా బాగుంటుంది. 170 00:14:59,274 --> 00:15:01,651 ఆయన చేసేది, ఆ చిన్న దీవి చుట్టూ తిరగడమే. 171 00:15:03,987 --> 00:15:06,573 వాళ్ళు ఒక దీవి నుండి, ఇంకా చిన్న దీవికి వచ్చారు. 172 00:15:08,700 --> 00:15:09,951 అదే వారి ప్రపంచం. 173 00:15:13,413 --> 00:15:14,497 నేను అలా చేయలేను. 174 00:15:22,714 --> 00:15:23,923 దీనికి థాంక్స్. 175 00:15:30,013 --> 00:15:31,514 నువ్వు మొదట వెళ్తే బాగుంటుంది. 176 00:15:56,998 --> 00:16:02,128 పట్టిన చేపల నాణ్యత సరిగ్గా లేకపోతే, దానికి తగ్గట్టు మార్పుచేసుకోవాలి. 177 00:16:02,170 --> 00:16:05,215 సారీ, మిస్టర్ గ్రిచక్, కానీ ఇవి మేలు రకం చేపలే. 178 00:16:05,256 --> 00:16:07,467 మీరు అదే అంటారు, కానీ ఇలా చూడండి. 179 00:16:08,968 --> 00:16:13,348 ఇవి ఎనిమిది నుండి పది ఔన్సుల వంజర చేపలు. 180 00:16:13,390 --> 00:16:18,061 మా అమ్మాయిలు ఇక్కడ వాటిని చేతులతో వేరు చేయాల్సి వస్తుంది. 181 00:16:18,103 --> 00:16:21,690 వీటికి 40 డాలర్లు ఇవ్వలేనని మీరు అర్థం చేసుకోవాలి. 182 00:16:21,731 --> 00:16:24,943 సరే, ఎంతిస్తారు? 183 00:16:24,984 --> 00:16:30,573 ఏమో? 20 డాలర్లు? 15 డాలర్లు? దీని విలువ ఎంతుంటుంది? 184 00:16:30,615 --> 00:16:31,908 ఛా. 185 00:16:41,876 --> 00:16:46,256 దేవుడా! కాపాడండి! కాపాడండి! 186 00:16:47,173 --> 00:16:49,426 కాపాడండి! కాపాడండి! 187 00:17:48,777 --> 00:17:50,779 చెస్టర్! భోజనానికి రా! 188 00:17:57,535 --> 00:17:58,620 హాయ్. 189 00:18:00,580 --> 00:18:03,166 ఎదురుచూసినందుకు ధన్యవాదాలు. 190 00:18:03,208 --> 00:18:05,043 రుచికరంగా కనిపిస్తోంది. 191 00:18:05,084 --> 00:18:08,671 - వాల్ట్ కోసం ఎదురు చూడక్కరలేదా? - అతను ఇంట్లో ఉన్నాడు. 192 00:18:08,713 --> 00:18:10,924 బెట్టీ టోక్యో నుండి వస్తోంది. 193 00:18:10,965 --> 00:18:12,842 వాల్ట్ ఆమెని ఒక సంవత్సరం పాటుగా చూడలేదు. 194 00:18:12,884 --> 00:18:16,638 ఆమెకి నెలలు నిండబోతున్నాయి. కానీ కుదిరినప్పుడే వెళ్తే మంచిది. 195 00:18:16,679 --> 00:18:18,306 పెళ్లి మార్చిలో ఉంటుంది... 196 00:18:19,390 --> 00:18:22,185 ఇంకా వెంటనే ఒక మనవడు కూడా. 197 00:18:22,227 --> 00:18:25,980 జీవితానికి ఇంత కన్నా మంచి కాలం రాదు, వారసుడు వచ్చే సమయం కన్నా. 198 00:18:26,022 --> 00:18:27,023 అవును నిజమే. 199 00:18:33,029 --> 00:18:35,198 నేను మెయిన్ ల్యాండ్ కి వెళ్తున్నాని ఎవరూ చెప్పలేదా? 200 00:18:35,240 --> 00:18:37,992 మ్యాగజీన్లు అన్నీ పాశ్చాత్య ఫోటోగ్రాఫర్ల కోసం చూస్తున్నాయి. 201 00:18:38,034 --> 00:18:39,202 చూద్దాం. 202 00:18:40,495 --> 00:18:42,664 ఏంటి? జీవితం మొత్తం చేపలు పడుతూ ఉండాలా? 203 00:18:43,873 --> 00:18:46,501 చెస్టర్, ఇక్కడ సురక్షితంగా ఉంటాము. 204 00:18:46,543 --> 00:18:47,669 ఇక్కడ మంచి జీవితం ఉంది. 205 00:18:49,087 --> 00:18:50,547 ప్రపంచం మొత్తం యుద్ద వాతావరణం ఉంది. 206 00:18:51,714 --> 00:18:53,341 చాలా మంది చనిపోతున్నారు. 207 00:18:53,383 --> 00:18:55,760 నాకు బాగా గుర్తు, ఇరవై మూడేళ్ళ క్రితం, 208 00:18:55,802 --> 00:18:58,680 నేను ఈయన ఫోటో పెట్టుకుని పడవలో మూడువారాల పాటు తిరిగేదాన్ని. 209 00:19:00,098 --> 00:19:03,268 నాకు చాలా ఉపశమనంగా ఉండేది. ఈయన తన ఫోటోలాగే ఉండేవారు. 210 00:19:07,814 --> 00:19:10,108 జీవితం కష్టమైనది, చెస్టర్. 211 00:19:10,149 --> 00:19:11,985 కుటుంబం లేకుండా గడపడం కష్టం. 212 00:19:15,446 --> 00:19:16,781 ఒకసారి శ్రీమతి ఫురుయాని అడిగి చూడు. 213 00:19:26,332 --> 00:19:28,918 - ఇంక తిందాం. - ఇంక తిందాం. 214 00:19:30,211 --> 00:19:31,671 దాని గురించి నన్ను క్షమించు. 215 00:19:31,713 --> 00:19:34,173 నిజానికి, నేను సంతోషిస్తున్నాను. 216 00:19:34,215 --> 00:19:36,968 నేనొక విదేశీయునితో నేవల్ స్టేషన్ నుండి వస్తున్నాను అన్న విషయం వల్ల, 217 00:19:37,010 --> 00:19:39,387 మా వాళ్ళకి తెలియదనే అనుకుంటున్నాను. 218 00:19:40,346 --> 00:19:44,142 నిజంగానా?వాళ్ళకి తెలియకపోవడమే మంచిదిలే. 219 00:19:44,183 --> 00:19:46,227 వాళ్ళు చస్తారు, లేదా నేనైనా చస్తాను. 220 00:19:46,269 --> 00:19:47,937 నువ్వు వాల్ట్ కి చెప్పలేదు కదా? 221 00:19:47,979 --> 00:19:49,606 నా తమ్ముడి జపాన్ విధానాలు వంటబట్టినవాడు. 222 00:19:49,647 --> 00:19:51,357 ఇలా అవుతుందని ఊహించనుకూడా లేడు. 223 00:19:55,153 --> 00:19:56,905 భయంకరమైన విషయమేంటో చెప్పనా? 224 00:19:58,448 --> 00:20:01,743 హిడియో ఫురుయా బాగా తాగి, 225 00:20:01,784 --> 00:20:05,830 వాళ్ళ ఆవిడని కొట్టి, పొద్దున్న లేచేటప్పటికి ఏమీ గుర్తుండక, ఆవిడ మీద దెబ్బలు చూసి, 226 00:20:05,872 --> 00:20:10,543 మళ్ళీ కొట్టేవాడు, ఆమె ఇతన్ని మోసం చేస్తోందని భావించి. 227 00:20:14,047 --> 00:20:15,214 కర్కోటకుడు. 228 00:20:19,552 --> 00:20:21,262 ఇదే చోటా? 229 00:20:21,304 --> 00:20:23,598 శ్రీమతి ఫురుయా దూకింది? 230 00:20:23,640 --> 00:20:25,183 పోలీసులు ఆ చోటును చిందరవందర చేశారు. 231 00:20:26,184 --> 00:20:30,021 ఒక వారం తర్వాత, ఇక్కడేమీ జరగనట్టే ఉంటుంది. 232 00:20:30,063 --> 00:20:31,272 ఎందుకో తెలుసా? 233 00:20:35,860 --> 00:20:37,028 నేను... 234 00:20:38,363 --> 00:20:40,573 ఆమెని చూసి చాలా రోజులైంది. 235 00:20:40,615 --> 00:20:41,574 ఎవరికి తెలుసు? 236 00:20:43,034 --> 00:20:46,788 అన్ని దార్లుండగా... 237 00:20:46,829 --> 00:20:51,125 ఆమె ఎలా ఉందో అలాగే మనం గుర్తుపెట్టుకోవాలని అనుకుందేమో. 238 00:21:25,827 --> 00:21:27,996 ఇంత రాత్రివేళ వచ్చినందుకు సారీ. 239 00:21:28,037 --> 00:21:29,956 మీకు కాఫీ కావాలా మిస్టర్ గ్రిచక్? 240 00:21:30,873 --> 00:21:32,917 మీరు బాగాలేనట్టు ఉన్నారు. 241 00:21:32,959 --> 00:21:34,544 ఎక్కువ సేపు పట్టదులే. 242 00:21:35,878 --> 00:21:37,839 మీకే మొదటగా చెప్పాలి అనుకున్నాను. 243 00:21:39,424 --> 00:21:42,760 - నన్ను ఉద్యోగం నుండి తీసేశారు. - ఏంటి. 244 00:21:42,802 --> 00:21:45,013 ఎందుకు? ఏమైంది? 245 00:21:45,054 --> 00:21:47,932 వాళ్ళ యంత్రాలు పనిచేయవు. 246 00:21:47,974 --> 00:21:52,729 - ఎవరో ఒకరిమీద నింద మోపాలి కదా. - మీరు చాలా మంచివారు. 247 00:21:52,770 --> 00:21:56,024 పదమూడు ఏళ్లగా వాళ్ళకి చాకిరీ చేసాను. 248 00:21:56,065 --> 00:21:58,151 ఇప్పుడు చూడండి? 249 00:21:58,192 --> 00:21:59,444 నాకు బదులుగా ఏమిచ్చారో? 250 00:22:01,404 --> 00:22:04,157 మీకు మీ జీవితం ఉంది. 251 00:22:04,198 --> 00:22:05,867 నాకు నా జీవితం ఉంది... 252 00:22:07,493 --> 00:22:09,370 కానీ జీవనోపాధి లేదు. 253 00:22:10,913 --> 00:22:14,167 నన్ను అది సమస్యల్లోకి నెట్టేస్తుంది నకాయమా. 254 00:22:16,210 --> 00:22:18,921 నువ్వు నాకు సరైన చేపలు తెచ్చుంటే ఇలా జరిగేది కాదు. 255 00:22:20,798 --> 00:22:22,091 అదొక ప్రమాదం. 256 00:22:23,176 --> 00:22:27,055 - ఎవరి తప్పు లేదు. - నిన్ను ఎప్పుడూ మంచిగానే చూసేవాడిని. 257 00:22:27,096 --> 00:22:30,600 నువ్వు తక్కువ చేపలు తెచ్చావు, నేను పట్టించుకోలేదు, 258 00:22:31,726 --> 00:22:34,729 నువ్వు నన్ను ఈ నరకంలోకి నెట్టేసావు. 259 00:22:40,234 --> 00:22:42,820 నాకు ప్రతిఫలం కావాలి. 260 00:22:42,862 --> 00:22:46,699 మిస్టర్ గ్రిచక్, మీరే యజమాని. 261 00:22:46,741 --> 00:22:47,950 నేనొక మామూలు చేపలు పట్టేవాడిని. 262 00:22:47,992 --> 00:22:49,786 ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. 263 00:22:53,081 --> 00:22:58,044 కిందటి ఏడాది గుర్తుందా? గూఢచర్య నిరోధక చట్టం అమలయినప్పుడు? 264 00:22:59,837 --> 00:23:04,050 నువ్వు ఇంకా ఇతర జపనీయులు తమ పడవలని రిజిస్టర్ చేయించారు. 265 00:23:04,801 --> 00:23:06,135 అది ఒక సంప్రదాయంగా చేసింది... 266 00:23:10,723 --> 00:23:16,145 - కానీ నువ్వు చేయలేదు. - నేను మీకోసం మెక్సికోలో చేపలు పడ్తున్నాను. 267 00:23:16,187 --> 00:23:19,398 ఆ అదనపు గ్యాస్ ట్యాంకులన్నీ, మీ చక్రవర్తి సబ్ మరైన్ల కోసం అయ్యుంటే? 268 00:23:19,440 --> 00:23:21,275 నేను గూఢచారిని కాదు. 269 00:23:21,317 --> 00:23:26,197 మీ వాళ్ళకి సాయం చేయడం కోసం చేసుండొచ్చు, అది సహజమే కానీ... 270 00:23:26,239 --> 00:23:29,158 "ఒకవేళ నువ్వు గనక ప్రశ్నిస్తే, రిపోర్టు చేయాల్సిందే." 271 00:23:29,200 --> 00:23:31,244 నాకు ఈ దేశమంటే ప్రాణమని మీకు తెలుసు. 272 00:23:32,161 --> 00:23:33,663 నేను గూఢచారిని కాను. 273 00:23:36,582 --> 00:23:38,126 కాకపోయి ఉండొచ్చు... 274 00:23:39,836 --> 00:23:43,464 కానీ నన్ను ఇలాంటివి రిపోర్టు చేసే దుర్మార్గుడిని చేయకు... 275 00:23:48,010 --> 00:23:49,679 మీ మనసులో ఏముందో చెప్పండి? 276 00:23:55,560 --> 00:23:59,147 ఇంతవరకు చెప్పలేదు... 277 00:24:00,898 --> 00:24:02,942 ఈరోజు నా ప్రాణాలు కాపాడినందుకు థాంక్స్. 278 00:24:04,068 --> 00:24:05,528 నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. 279 00:24:35,933 --> 00:24:38,102 నేను ఏమీ తో ఉన్నానని మీకు తెలుసు నాకోసం ఎందుకు ఆగలేదు? 280 00:24:38,144 --> 00:24:39,020 ఏమీ చేయలేం. 281 00:24:39,061 --> 00:24:40,229 అలా అనడం ఆపండి. 282 00:24:45,735 --> 00:24:47,486 జనాలు ఇంక అలా అనుకోటం లేదు. 283 00:24:48,613 --> 00:24:50,907 మనం ఏదో ఒకటి చేయగలం. 284 00:24:50,948 --> 00:24:54,076 గ్రిచక్ మిమ్మల్ని అలా ఆడించనివ్వకూడదు. అది మీ కారు. 285 00:24:54,118 --> 00:24:55,286 అది మీ స్వంత కారు. 286 00:24:56,370 --> 00:24:57,371 ధైర్యంగా ఉండండి. 287 00:25:02,835 --> 00:25:03,794 జపాన్లో... 288 00:25:06,505 --> 00:25:09,175 మా నాన్నకి తన సొంత ఎద్దు కూడా లేదు. 289 00:25:10,509 --> 00:25:12,428 బండిని నేనే లాగే వాణ్ని. 290 00:25:14,972 --> 00:25:21,312 నేనిక్కడకి వచ్చాకా, నన్ను లాగే బండి కావాలి అనుకున్నాను. 291 00:25:24,148 --> 00:25:26,943 దానికి 20 ఏళ్ళు పట్టింది, కానీ అది సంపాదించాను. 292 00:25:29,862 --> 00:25:31,948 అలాంటప్పుడు అది తీసుకుపోతే ఏంటి? 293 00:25:33,616 --> 00:25:39,205 నేను ఇంతకుముందు లాగానే ఉన్నాను, తన స్వంత పాకర్డ్ ని సంపాదించిన వాడిలాగా. 294 00:25:40,706 --> 00:25:43,084 ధైర్యంగా, మగాడిలా ఉండాలని నువ్వు నాకు చెప్పక్కర్లేదు... 295 00:25:45,336 --> 00:25:46,170 బాబూ. 296 00:26:15,992 --> 00:26:17,535 భోజనం తెచ్చాను, ఫురుయా గారు. 297 00:26:19,245 --> 00:26:20,663 మీ అబ్బాయి తిన్నాడా? 298 00:26:34,176 --> 00:26:35,094 చాలా బాగుంది. 299 00:26:55,948 --> 00:26:56,782 నువ్వు ఏం చేస్తున్నావు? 300 00:27:00,411 --> 00:27:02,955 ఇంటికి శాంతి చేస్తున్నాను. 301 00:27:02,997 --> 00:27:04,457 ఇంటిని ఏమీ పీడించడం లేదు. 302 00:27:04,498 --> 00:27:05,833 ఇక్కడ పాత ఆత్మలున్నాయి, ఫురుయా గారు. 303 00:27:05,875 --> 00:27:10,171 నాకు ఇంతకముందు రక్షణలేదు, ఇప్పుడూ అవసరం లేదు. 304 00:27:10,212 --> 00:27:11,255 బయటకి వెళ్ళండి! 305 00:27:28,230 --> 00:27:29,648 వచ్చే క్రిస్మస్ కి... 306 00:27:30,941 --> 00:27:32,068 మీ దగ్గర క్యాడలాక్ కారు ఉంటుంది. 307 00:27:34,403 --> 00:27:36,030 మనం అంతవరకు ఉంటే. 308 00:27:46,540 --> 00:27:47,375 ఫురుయా గారు... 309 00:27:48,709 --> 00:27:51,295 అసాకో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. 310 00:27:52,088 --> 00:27:54,131 భార్యలు ఎలా ఉంటారో తెలుసు కదా. 311 00:27:55,674 --> 00:27:56,967 మీకు మీ భార్య బతికన్నా ఉంది. 312 00:28:05,267 --> 00:28:06,435 నేను టాయిలెట్ కి వెళ్లి వస్తాను. 313 00:29:16,714 --> 00:29:18,299 ఫురుయా గారు! ఫురుయా గారు! 314 00:29:40,529 --> 00:29:44,366 ఓ, ఆగు, ఆగు. అది జీన్ ఆట్రీనా? లేక రాయ్ రోజర్స్ ఆ? 315 00:29:44,408 --> 00:29:45,409 ఆట్రీ. 316 00:29:46,160 --> 00:29:49,455 ఆట్రీ, డౌన్ మెక్సికో వే, మనం ఇవాళ చూసింది అదే. 317 00:29:49,497 --> 00:29:50,664 ఎవరైనా అది చూసారా? 318 00:29:50,706 --> 00:29:53,792 ఒకవేళ సినిమా ఎలా ఉందని మనింట్లో ఎవరైనా అడిగితే. 319 00:29:53,834 --> 00:29:56,629 జీన్ ఇంకా స్మైలీ పాటలు పాడతారు, కొంతమంది రౌడీలని కొడతారు, 320 00:29:56,670 --> 00:29:59,632 ఆ తర్వాత సుఖాంతం అనుకుంటా. 321 00:29:59,673 --> 00:30:01,175 ఉండు, ఉండు. ముసలివారి గురించి మాట్లాడుతూ, 322 00:30:01,217 --> 00:30:03,844 ముసలాయన ఫురుయాకి ఛీర్స్. 323 00:30:03,886 --> 00:30:06,055 - ఆ అమాయక వెధవ ఇంకెప్పటికీ చూడలేడు. - ఫురుయా. 324 00:30:06,096 --> 00:30:07,932 దుష్ట ఆత్మ మళ్ళీ విరుచుకుపడింది. 325 00:30:07,973 --> 00:30:10,434 ఆత్మ కానీ కాకపోనీ, ఎవరికైనా ఆ అర్హత ఉందంటే, అది ఆ ఎస్.ఓ.బి నే. 326 00:30:10,476 --> 00:30:14,188 అతని భార్య చనిపోయిన అదే రాత్రి అతను అంధుడయ్యాడు. అది మీకు భయం కలిగించడం లేదా? 327 00:30:14,230 --> 00:30:17,358 ఓ, కమాన్, చెట్. కళ్ళు తెరువు. 328 00:30:17,399 --> 00:30:19,360 ఇది వాల్ట్ యొక్క వీడ్కోలు. 329 00:30:19,401 --> 00:30:20,819 ఒక భాగం పొందడానికి చివరి అవకాశం, వాల్ట్. 330 00:30:20,861 --> 00:30:23,280 చివరి అవకాశమా? మొదటి అవకాశం! 331 00:30:25,032 --> 00:30:26,158 ఆమె వస్తోంది. 332 00:30:27,660 --> 00:30:30,079 మీకు శ్వేతజాతీయుల డిస్కౌంట్ ఇప్పించాను, కనుక నన్ను అవమానపరచవద్దు. 333 00:30:33,249 --> 00:30:35,543 - ఎన్సైన్ హారిస్. - మిస్ ఆంటోయినెట్టే. 334 00:30:36,252 --> 00:30:40,256 అబ్బాయిలు, యజమానిని కలవండి. ఆమె మన గురించి చూసుకుంటుంది. 335 00:30:40,297 --> 00:30:42,800 మీ కోసం ఈ రాత్రి నా వద్ద ఉన్న అత్యుత్తమ అమ్మాయిలను సిద్ధం చేశాను. 336 00:30:42,841 --> 00:30:45,427 అమ్మాయిలు, జెంటిల్మెన్లు పిలుస్తున్నారు. 337 00:30:49,223 --> 00:30:51,475 మీలో వరుడు ఎవరు? 338 00:30:51,517 --> 00:30:54,228 - అది వాల్ట్. - నువ్వు అదృష్టవంతుడివి. 339 00:30:54,270 --> 00:30:55,437 నీకు మొదట ఎంపిక చేసుకునే అవకాశం వస్తుంది. 340 00:30:55,479 --> 00:30:57,439 - పైకి వెళ్ళు. - కానివ్వు. 341 00:30:58,107 --> 00:31:00,359 - వెళ్దాం పద. - చివరి అవకాశం, మ్యాన్. 342 00:31:00,401 --> 00:31:01,235 పైకి వెళ్ళు. 343 00:31:01,277 --> 00:31:04,029 అందరూ, బేరసారాలు అన్నీ గదిలోనే. 344 00:31:06,240 --> 00:31:07,283 రా. 345 00:31:07,324 --> 00:31:08,325 నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావా? 346 00:31:09,118 --> 00:31:10,911 హే, వాల్ట్ కొరకు ఎవరైనా చెల్లించాలి. 347 00:31:10,953 --> 00:31:13,163 లవర్ బాయ్ కి మంచి అమ్మాయి లభించింది. 348 00:31:13,831 --> 00:31:19,878 మెక్సికాలి రోజ్ స్టాప్ క్రయింగ్... 349 00:32:17,603 --> 00:32:19,313 మీరు జపనీయులా? 350 00:32:20,189 --> 00:32:21,065 అవును. 351 00:32:22,274 --> 00:32:27,780 ఇక్కడున్న జెంటిల్మెన్ కి టీ ఇమ్మని మిస్ ఆంటోయినెట్టే చెప్పింది. 352 00:32:28,530 --> 00:32:29,365 దయచేసి రండి. 353 00:32:52,763 --> 00:32:54,390 మీ పేరేంటి? 354 00:32:55,683 --> 00:32:58,102 యూకో. 355 00:32:59,186 --> 00:33:02,356 మిగిలిన వారితో మీరు పైకి ఎందుకు వెళ్ళలేదు? 356 00:33:06,318 --> 00:33:08,404 నా మనస్సు ఇతర సమస్యలతో నిండిపోయింది. 357 00:33:09,321 --> 00:33:13,450 నీ హృదయం చాలా భారంగా ఉంది. 358 00:33:15,786 --> 00:33:17,788 ఒక అమ్మాయి ఉంది. 359 00:33:19,373 --> 00:33:20,874 సంఘటనలు జరిగాయి. 360 00:33:22,501 --> 00:33:25,379 మేము ఒక తప్పు చేశాం. 361 00:33:25,421 --> 00:33:27,965 నువ్వు తేయాకులను నమ్ముతావా? 362 00:33:32,803 --> 00:33:35,472 నా గదిలో కొన్ని ఉన్నాయి. 363 00:33:37,349 --> 00:33:39,643 మనం ఒక సమాధానం కనిపెట్టవచ్చు. 364 00:34:04,209 --> 00:34:05,043 దయచేసి కూర్చోండి. 365 00:34:33,739 --> 00:34:35,908 రక్తం ఆత్మలను ఆకర్షిస్తుంది. 366 00:34:37,534 --> 00:34:39,536 మంచివి మరియు చెడ్డవి. 367 00:34:39,578 --> 00:34:41,830 అవి మనకు భవిష్యత్తు చెప్పగలవు. 368 00:35:29,336 --> 00:35:31,630 మీరు ఇద్దరని అవి చెప్తున్నాయి. 369 00:35:32,422 --> 00:35:34,049 వెలుతురు మరియు చీకటి. 370 00:35:35,634 --> 00:35:36,844 జీవం మరియు మరణం. 371 00:35:38,220 --> 00:35:40,681 మీరు రెండు ప్రపంచాల్లో నివసిస్తున్నారు... 372 00:35:42,724 --> 00:35:45,018 కానీ ఎందులో కూడా సంత్రిప్తిగా లేరు. 373 00:35:50,899 --> 00:35:53,735 నువ్వు స్వాలో పక్షి గూడులో ఉన్న పిచ్చుకవి. 374 00:35:56,029 --> 00:36:00,534 నువ్వు సురక్షితంగా ఉన్నావని భావించిన క్షణమే స్వాలోలు నిన్ను పీక్కుతింటాయి. 375 00:36:01,743 --> 00:36:03,912 నేను ఒకసారి సురక్షితంగా భావించాను. 376 00:36:03,954 --> 00:36:05,789 ఇంక అలా భావించడం లేదు. 377 00:36:05,831 --> 00:36:09,835 మనందరం నష్టపరిహారం కోసం ఆశపడతాం. మన వలన పోయిన ఒక ప్రాణం కోసం దుఃఖిస్తాం. 378 00:36:11,211 --> 00:36:17,801 మనకు ఒకప్పుడు పరిపూర్ణమైన ప్రపంచం ఉంది. 379 00:36:17,843 --> 00:36:22,639 నేను ఎప్పుడూ పరిపూర్ణమైన ప్రపంచంలో జీవించలేదు. 380 00:36:24,182 --> 00:36:26,602 అప్పుడు నీకు అది మున్ముందు ఉంటుంది. 381 00:36:27,978 --> 00:36:31,481 నీలో చూడు. 382 00:36:32,774 --> 00:36:34,276 నీకు ఏమి కనిపిస్తోంది? 383 00:36:43,035 --> 00:36:44,119 ఒక విశాలమైన... 384 00:36:46,288 --> 00:36:48,206 కంచెతో కూడిన పొలం... 385 00:36:49,875 --> 00:36:51,084 చెక్కతో నిర్మించిన ఇల్లు... 386 00:36:53,295 --> 00:36:54,171 ఒక శిశువు. 387 00:36:56,298 --> 00:36:57,674 అది నువ్వు కోల్పోలేదు. 388 00:37:01,803 --> 00:37:08,018 ఆ ఇల్లు, శిశువు, ఇప్పటికీ నీది కావచ్చు. 389 00:37:10,437 --> 00:37:11,647 నీ పథాన్ని పునర్నిర్మించు. 390 00:37:13,065 --> 00:37:16,652 లేదంటే నువ్వు ఎప్పటికీ దాన్ని కోల్పోతావు. 391 00:38:14,918 --> 00:38:16,670 వెధవ జారుకున్నాడు. 392 00:38:27,848 --> 00:38:29,307 లజ్! ఇది నేను! 393 00:38:38,066 --> 00:38:39,192 చెస్టర్, ఏంటి...? 394 00:38:42,738 --> 00:38:44,531 - నువ్వు అది తీసుకున్నావా? - చెస్టర్, నువ్వు తాగి ఉన్నావు. 395 00:38:44,573 --> 00:38:45,657 దానితో సంబంధం లేదు. 396 00:38:45,699 --> 00:38:47,617 ఆ గయో, టోకి, 397 00:38:47,659 --> 00:38:49,036 నువ్వు అది తీసుకున్నావా? 398 00:38:49,077 --> 00:38:50,579 అది నీకు సంబంధించిన విషయం కాదు. 399 00:38:50,620 --> 00:38:52,205 నువ్వు అది తీసుకున్నావా లేదా చెప్పు. 400 00:38:54,291 --> 00:38:57,044 లేదు. ఇంకా తీసుకోలేదు. 401 00:38:57,085 --> 00:38:59,254 ఓ, హమ్మయ్య. 402 00:38:59,296 --> 00:39:01,298 - ఎందుకు? - నేను ఎక్కువసేపు ఉండను. 403 00:39:06,136 --> 00:39:08,430 నేను ఈ రాత్రి ఒకటి గ్రహించాను. 404 00:39:08,472 --> 00:39:10,182 జరిగినది అంతా, 405 00:39:10,223 --> 00:39:13,393 నా దీవిలో, నీకు నాకు మధ్య, 406 00:39:13,435 --> 00:39:14,352 అది ఒక సంకేతం. 407 00:39:15,520 --> 00:39:16,354 ఒక అపశకునం లాగానా? 408 00:39:16,396 --> 00:39:19,566 నాకు తెలియదు, కానీ నా దగ్గర కారు ఉంది. 409 00:39:19,608 --> 00:39:21,276 - వెళ్దాం పద. - ఎక్కడకు వెళ్దాం? 410 00:39:21,318 --> 00:39:22,694 నువ్వు కోరుకున్న చోటుకు. 411 00:39:22,736 --> 00:39:23,779 ఎక్కడ మంచిది అనిపిస్తుందో అక్కడకు. 412 00:39:25,030 --> 00:39:26,073 మన సొంత పొలం... 413 00:39:28,533 --> 00:39:32,746 నువ్వు, నేను మరియు శిశువు మాత్రమే. 414 00:39:32,788 --> 00:39:34,331 నా గురించి నీకు ఎంత బాగా తెలుసు? 415 00:39:36,249 --> 00:39:37,459 లేచిపోవడానికి తగినంత తెలుసా? 416 00:39:39,002 --> 00:39:40,587 ఒక శిశువును పెంచడానికి తగినంతా? 417 00:39:42,214 --> 00:39:44,674 మనం కాలిఫోర్నియాలో ఉంటే భవిష్యత్తు లేదు, 418 00:39:44,716 --> 00:39:45,717 చట్టం మారితే తప్ప. 419 00:39:45,759 --> 00:39:47,094 పెళ్లి గురించి మర్చిపో. 420 00:39:48,553 --> 00:39:50,013 మన దగ్గర ఎంత డబ్బు ఉంది? 421 00:39:51,098 --> 00:39:52,140 మనకు ఎవరు తెలుసు? 422 00:39:53,391 --> 00:39:54,935 మనం ఎలా పని సంపాదిస్తాం? 423 00:39:56,144 --> 00:39:58,146 మనం రాష్ట్ర సరిహద్దులు దాటే సమయంలో ఆపబడితే? 424 00:39:58,188 --> 00:39:59,773 మనం అప్పుడు చూసుకుందాం. 425 00:39:59,815 --> 00:40:00,774 చెస్టర్... 426 00:40:07,114 --> 00:40:09,032 ఉదయం మనం తెలుసుకోలేమని నువ్వు గ్రహిస్తావు. 427 00:40:13,829 --> 00:40:15,372 మనకు ఎక్కడా... 428 00:40:17,833 --> 00:40:18,750 భవిష్యత్తు లేదు. 429 00:40:24,798 --> 00:40:25,632 సరే. 430 00:40:27,092 --> 00:40:28,426 అవును, బహుశా నువ్వు సరిగ్గా చెప్తున్నావు. 431 00:40:50,407 --> 00:40:52,117 నువ్వు అది తీసుకుంటావా? 432 00:40:52,159 --> 00:40:53,410 ఆ మూలికలు? 433 00:40:54,494 --> 00:40:55,620 నాకు తెలియదు... 434 00:40:57,873 --> 00:40:59,166 ఎందుకంటే నాకు భయంగా ఉంది. 435 00:41:02,627 --> 00:41:04,129 నన్ను భయపడనివ్వు. 436 00:42:54,614 --> 00:42:55,907 ఏంటి... 437 00:43:17,304 --> 00:43:19,806 నాన్న, నువ్వు బయటకు వెళ్తున్నావని నాకు ఎందుకు చెప్పలేదు? 438 00:43:19,848 --> 00:43:22,142 నువ్వు ఎక్కడకు వెళ్ళావో నాకు చెప్తావా? 439 00:43:22,183 --> 00:43:24,352 నిన్న రాత్రి ఎవరో కిరోసిన్ క్యాను పడేశారు. 440 00:43:24,394 --> 00:43:25,437 ఇక్కడ చిందరవందరగా ఉంది. 441 00:43:25,478 --> 00:43:29,691 హెన్రీ, ఎవరో నీ వలతో కూడా ఆటలాడుతున్నారు. 442 00:43:35,113 --> 00:43:36,364 దయచేసి సహాయం చేయండి... 443 00:43:36,406 --> 00:43:37,365 అది ఇరుక్కుపోయింది. 444 00:43:57,177 --> 00:43:58,678 నేను మార్లన్ ని నమ్ముతాను. 445 00:43:58,720 --> 00:44:00,680 తీరప్రాంత గస్తీ వారికి తెలుసు. మనం ఏ తప్పూ చేయలేదు. 446 00:44:00,722 --> 00:44:02,015 మనం దేని గురించి కలవరపడాల్సిన అవసరం లేదు. 447 00:44:02,057 --> 00:44:03,600 అక్కడ ఏదో దుష్ట శక్తి ఉంది. 448 00:44:04,809 --> 00:44:05,894 నేను అది అనుభూతి చెందుతున్నాను. 449 00:44:07,979 --> 00:44:10,565 కానీ ఒక ఆత్మ గ్రిచక్ వెంట ఎందుకు పడుతుంది? 450 00:44:11,608 --> 00:44:13,610 - అతను జపనీస్ వ్యక్తి కాదు. - మనం జపనీస్. 451 00:44:14,694 --> 00:44:17,280 అది గ్రిచక్ ని మనవద్దకు తెచ్చింది. ఇప్పుడు చూడు. 452 00:44:19,449 --> 00:44:21,409 అతను ఎలాంటి తాగుబోతో మనం వారికి చెప్దాం. 453 00:44:21,451 --> 00:44:23,411 అతను డాక్ నుండి పడ్డాడు, అది ప్రమాదం. 454 00:44:23,453 --> 00:44:24,621 ప్రమాదం కాదు. 455 00:44:25,872 --> 00:44:26,998 మనకు ఆ శాస్తి జరగాల్సిందే. 456 00:44:28,375 --> 00:44:32,003 మనం సముద్రంలో అంత దూరం నుండి వచ్చాం, కానీ మనం సురక్షితంగా లేము. 457 00:44:32,045 --> 00:44:33,546 ఫురుయా తన భార్యను కొట్టాడు. 458 00:44:33,588 --> 00:44:34,672 అతను దానికి మూల్యం చెల్లించాడు. 459 00:44:40,470 --> 00:44:42,389 నా సొంత కొడుకు నాకు అప్రతిష్ట తెచ్చాడు... 460 00:44:44,349 --> 00:44:45,558 నేను దానికి మూల్యం చెల్లిస్తాను. 461 00:44:50,146 --> 00:44:52,565 గయో, టోకి... 462 00:44:53,691 --> 00:44:57,237 నేను హుడ్లియాని చూడటానికి వెళ్లాను. నువ్వు ఏమి చేశావో ఆమె చెప్పింది. 463 00:44:57,278 --> 00:45:00,115 - నాన్న, ఇప్పుడు సమయం కాదు. - ఆమె ఎవరు? 464 00:45:03,368 --> 00:45:04,994 ఆమె ఎవరు? 465 00:45:06,746 --> 00:45:08,206 నీకు చెప్పబోయేవాడిని... 466 00:45:09,374 --> 00:45:11,793 కాలేజీలోని అమ్మాయి. అదొక పొరపాటు. 467 00:45:14,254 --> 00:45:15,422 పొరపాటు. 468 00:45:17,465 --> 00:45:21,594 నా కొడుకును ఎల్.ఏ ని వెళ్లనిచ్చినందుకు, పొరపాటు నాది. 469 00:45:22,679 --> 00:45:24,472 నిగ్రహం పాటించడానికి చాలా బలహీనుడివి. 470 00:45:24,514 --> 00:45:25,598 బలహీనుడినా? 471 00:45:27,350 --> 00:45:29,227 నేను నా మార్గం మలుచుకుంటున్నాను, నాన్న. 472 00:45:31,980 --> 00:45:33,106 నీ సంగతి ఏంటి? 473 00:45:34,107 --> 00:45:36,776 ఈ దేశంలో, నీ జీవితంలో సగం గడపడాన్ని నువ్వు ఏమని పిలుస్తావు 474 00:45:36,818 --> 00:45:38,695 నీ చిన్న దీవిని ఎప్పుడూ వదిలిపెట్టకుండా? 475 00:45:39,696 --> 00:45:41,948 ఈడ్చుకుంటూ తిరగడం, 476 00:45:41,990 --> 00:45:44,701 ఒక తాగుబోతు వెధవ నుండి చిల్లర కోసం అర్ధించడం? 477 00:45:46,035 --> 00:45:48,705 అలాంటి పనులే వారి ముందు మనల్ని చిన్నబోయేలా చేస్తాయి. 478 00:45:50,331 --> 00:45:52,208 నేను అలాంటి మనిషిగా ఎప్పటికీ ఉండను... 479 00:45:57,005 --> 00:45:58,506 దానిని వారు ఏమని పిలుస్తారో నీకు తెలుసా? 480 00:45:59,883 --> 00:46:02,594 వెళ్ళండి, వెళ్ళండి! 481 00:46:02,635 --> 00:46:03,928 కదలండి! వెళ్ళండి! 482 00:46:09,309 --> 00:46:11,060 మార్లన్! మార్లన్! 483 00:46:11,102 --> 00:46:13,438 ఏమి జరుగుతోంది? 484 00:46:13,480 --> 00:46:17,859 వెళ్ళు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపో. వెంటనే. 485 00:46:17,901 --> 00:46:19,652 రండి, వెళ్దాం. 486 00:46:19,694 --> 00:46:21,154 రండి, వెళ్దాం! 487 00:46:36,294 --> 00:46:39,547 [జపనీస్ భాష] 488 00:46:40,965 --> 00:46:44,719 ఈ ఉదయం సుమారు 7:48 గంటలు హోనోలులు సమయంలో, 489 00:46:44,761 --> 00:46:49,390 పెర్ల్ హర్బర్ లోని నేవీ ఇన్స్టలేషన్ వద్ద 300 నుండి 400 యుద్ధవిమానాలు విధ్వంసం చేశాయి... 490 00:46:49,432 --> 00:46:53,144 బాంబులు వేసి విస్తృతమైన నష్టానికి, మరణాలకు కారణమయ్యాయి. 491 00:46:53,186 --> 00:46:56,981 ప్రస్తుతం ఆ సంఖ్య తెలియడం లేదు. 492 00:46:57,023 --> 00:47:01,236 అదే విధంగా, ఈ యుద్ధవిమానాల యొక్క మూలం ఏంటో తెలియడం లేదు, 493 00:47:01,277 --> 00:47:05,406 కానీ కొట్టిపారేయలేనిది ఏంటంటే, ఈ యుద్ధవిమానాలు జపానుకి చెందినవి, 494 00:47:05,448 --> 00:47:09,118 ఇంకా ఈ దౌర్జన్యం చాలా వేగంగా జరిగింది, ఇంకా అత్యంత దుర్బుద్ధితో జరిగింది. 495 00:47:09,160 --> 00:47:12,830 ఎలాంటి హెచ్చరిక లేదు, సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి ప్రయత్నం లేదు... 496 00:48:13,266 --> 00:48:14,601 ఆందోళన చెందకండి. 497 00:48:16,394 --> 00:48:17,353 ఇక్కడే ఉండండి. 498 00:48:22,150 --> 00:48:24,569 చెస్టర్! చెస్టర్! ఇక్కడున్నాను! 499 00:48:24,611 --> 00:48:25,612 హే! 500 00:48:29,657 --> 00:48:31,951 వాళ్ళు ఎవరు? 501 00:48:31,993 --> 00:48:33,453 ఎందుకో వాళ్ళని అడుగు! 502 00:48:33,494 --> 00:48:35,121 నువ్వు ఏమీ చేయలేదు! 503 00:48:35,163 --> 00:48:37,415 ఎఫ్.బి.ఐ. ఇది పర్వాలేదు. 504 00:48:38,625 --> 00:48:39,792 భద్రత కొరకు. 505 00:48:42,378 --> 00:48:43,796 నువ్వు ఒక పౌరుడివి, అబ్బాయ్. 506 00:48:43,838 --> 00:48:45,923 - నువ్వు ఇక్కడ పుట్టావు. - వెళ్తూ ఉండండి. 507 00:48:47,300 --> 00:48:49,886 నువ్వు దేశభక్తుడివి అని చూపించు. 508 00:48:49,927 --> 00:48:51,429 టో-చాన్, నువ్వు బాగానే ఉంటావు కదా? 509 00:48:51,471 --> 00:48:53,389 - నీ దేశం కోసం పోరాడు. - టో-చాన్!