1 00:00:20,771 --> 00:00:22,689 ఇవాళ మీరేమైనా సెంట్ కొట్టుకున్నారా? 2 00:00:23,398 --> 00:00:24,942 మీ హెయిర్ స్టయిల్ మార్చడం లాంటివేమైనా చేశారా? 3 00:00:25,025 --> 00:00:27,653 -అతను ముఖం ఇంకా సన్నగా ఉంటుంది. -అలాగే గీస్తా. అలాగే గీస్తానులెండి. 4 00:00:28,320 --> 00:00:31,448 మీరు మీ ఇంటికి వెళ్తున్నారు కదా. ఎప్పుడూ వెళ్లే మార్గంలోనే వెళ్ళారా? 5 00:00:31,532 --> 00:00:33,700 చూడండి. అతని గడ్డం ఇలా ఉంటుంది. 6 00:00:33,784 --> 00:00:36,745 -చూశారా? -దీన్ని త్వరగా చేసేయాలని అనుకుంటున్నారని అర్థమైంది. 7 00:00:37,371 --> 00:00:39,665 చిత్రం సరిగ్గా రావాలన్నదే నా తాపత్రయం. 8 00:00:41,959 --> 00:00:42,960 చూడండి. 9 00:00:43,460 --> 00:00:46,380 -అతని కళ్ల మధ్య ఇంత దూరం ఉంది. -ఓ విషయం చెప్పనా? 10 00:00:46,463 --> 00:00:48,173 -ఒకసారి కేటలాగ్ ని చూడండి. -అవి లోపలికి ఉన్నాయి. 11 00:00:48,257 --> 00:00:49,883 -ఒక్క నిమిషం... -మీరు నా మాట విని 12 00:00:49,967 --> 00:00:51,468 నేనే ఎలా చెప్తానో అలా గీయవచ్చు కదా? 13 00:00:57,266 --> 00:00:58,475 అతని కళ్ళు ఏ రంగులో ఉంటాయి? 14 00:00:58,559 --> 00:01:00,811 -నీలం రంగు. -రెండు వైపులా తెల్లగా ఉన్నాయా? 15 00:01:00,894 --> 00:01:01,895 అవును. 16 00:01:04,605 --> 00:01:05,649 మరి అతని ముక్కు సంగతేంటి? 17 00:01:05,732 --> 00:01:07,234 కళ్లు ఇంకా సరిగ్గా రాలేదు. 18 00:01:07,317 --> 00:01:09,403 -అవి దగ్గరగానే ఉన్నాయా? -ఉన్నాయి, కానీ నేను ఇంకా... 19 00:01:09,486 --> 00:01:12,739 మాకు కావలసింది అదే. ఈ చిత్రాలనేవి అచ్చం ఫోటోలలా రావు. 20 00:01:12,823 --> 00:01:14,992 వీధిలో వీటిని అతికించినంత మాత్రాన, ఇతన్ని అందరూ గుర్తుపట్టేయలేరు. 21 00:01:15,075 --> 00:01:17,494 -అలా ఎప్పుడూ జరగదు. -మరి నేను ఇక్కడికి వచ్చి ఏం లాభం? 22 00:01:17,578 --> 00:01:20,289 అతని గురించి తెలిసినవాళ్ల నుండి మాకు సరిపడా వివరాలు కావాలంతే, 23 00:01:20,372 --> 00:01:22,457 తద్వారా వారు చిత్రాన్ని గుర్తుపట్టగలగాలి. 24 00:01:23,041 --> 00:01:24,209 దీని వల్ల లాభం ఉండదు. 25 00:01:25,669 --> 00:01:26,837 అతని గురించి ఎవరికీ తెలీదు. 26 00:01:46,273 --> 00:01:47,316 హలో? 27 00:01:51,320 --> 00:01:52,362 హలో? 28 00:01:55,782 --> 00:01:56,825 ఎవరైనా ఉన్నారా? 29 00:02:00,537 --> 00:02:01,830 ఎవరైనా నాకు సాయపడగలరా? 30 00:02:01,914 --> 00:02:03,540 నువ్వు అరవడం ఆపాలి, గురూ. 31 00:02:04,124 --> 00:02:05,375 ఎవరూ రారు. 32 00:02:08,544 --> 00:02:10,923 నువ్వు ఇక్కడికి రాగలవా? నాకు సాయం చేయగలవా? 33 00:02:12,299 --> 00:02:13,884 నన్ను మంచానికి కట్టేశారు. 34 00:02:24,561 --> 00:02:26,647 ఎవరో నీ చేతిని బాగా కోశారు. 35 00:02:28,190 --> 00:02:29,900 ఎవరో నీపై బాగా దాడి చేసినట్టున్నారే? 36 00:02:31,860 --> 00:02:33,445 -బాగా గట్టిగా కట్టేశారా? -అవును. 37 00:02:33,529 --> 00:02:35,656 వీటిని వెంటనే తీసేయ్. 38 00:02:35,739 --> 00:02:37,783 -నీ పేరేమీ లేదే. -త్వరగా. 39 00:02:37,866 --> 00:02:39,451 గుర్తింపు డాక్యుమెంట్ కూడా లేదే. 40 00:02:39,535 --> 00:02:41,286 దయచేసి వీటిని తీసేయ్. 41 00:02:41,370 --> 00:02:44,039 రెసీన్ లో స్పృహ తప్పి పడి ఉన్నావు నువ్వు. 42 00:02:44,122 --> 00:02:48,335 లోపల జేబులో డబ్బు ఉంది. తీసేసుకో. కానీ వీటిని తీసేయ్. 43 00:02:49,253 --> 00:02:51,338 నీ డబ్బును ఎవరో ఎప్పుడో కాజేశారు. 44 00:02:51,839 --> 00:02:54,424 ఆ పారామెడిక్స్ దొంగ వెధవలు. 45 00:02:54,508 --> 00:02:56,218 హేయ్, వీటిని తీసేయ్... 46 00:02:58,136 --> 00:03:00,305 హేయ్, బాగానే ఉన్నావా? ఏం జరుగుతోంది? 47 00:03:00,806 --> 00:03:02,015 నేను ఇక్కడ ఎంత సేపటి నుండి ఉన్నాను? 48 00:03:02,099 --> 00:03:04,810 నిన్న రాత్రి వచ్చావు. ఎక్కువ సేపు ఉంటే సాధారణంగా వాళ్ళని పైకి తరలిస్తారు. 49 00:03:04,893 --> 00:03:07,062 ఎప్పుడు తీసుకువచ్చారు? ఎంత సేపటి నుండి ఉన్నాను? ఎన్ని గంటలు అయింది? 50 00:03:07,145 --> 00:03:09,189 చూస్తుంటే, ఆంబులెన్స్ నిన్ను అర్ధరాత్రి ఎప్పుడో తీసుకువచ్చినట్టుంది. 51 00:03:09,273 --> 00:03:12,109 అబ్బా. నేను వెళ్లాలి. నేను వెళ్లాలి. వెళ్లిపోవాలి. 52 00:03:12,192 --> 00:03:13,944 నువ్వు వీటిని తీసేయాలి. నేను వెళ్లాలి. 53 00:03:14,027 --> 00:03:15,612 ఇంటి నుండి నేను ఇంత సేపు బయట ఉండకూడదు. 54 00:03:15,696 --> 00:03:17,739 -ఇంట్లో ఎవరైనా ఉన్నారా? -నేను ఇంటికి వెళ్లాలి, 55 00:03:17,823 --> 00:03:19,491 లేదంటే నా బతుకు కూడా లియోలా అయిపోతుంది. 56 00:03:19,575 --> 00:03:21,285 నేను వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి. వెంటనే! 57 00:03:21,368 --> 00:03:24,329 చూడు, నర్సులు నిన్ను కట్టేసి ఉంచారంటే బలమైన కారణమే ఉండుంటుంది. 58 00:03:25,122 --> 00:03:27,207 నువ్వు ఇప్పుడు నాకు సాయం చేస్తే, నేను చుప్ చాప్ గా వెళ్లిపోతా, 59 00:03:28,333 --> 00:03:30,085 కానీ నువ్వు కాకుండా వేరేవాళ్ల వలన నేను బయటకు వెళ్లాల్సి వస్తే, 60 00:03:31,545 --> 00:03:33,422 వెళ్లిపోయేటప్పుడు నీ బెడ్ దగ్గరకి వస్తా. 61 00:03:35,591 --> 00:03:36,884 కాబట్టి వెంటనే వీటిని విప్పేయ్. 62 00:03:40,721 --> 00:03:43,515 సరే. నన్ను మాత్రం ఏం చేయకు. 63 00:03:44,975 --> 00:03:47,769 ఈరోజు ఇప్పటికే నాకు చుక్కలు కనిపించాయి. 64 00:03:55,444 --> 00:03:56,778 వద్దు. మనకి వద్దు. 65 00:04:50,916 --> 00:04:52,918 లారెన్ బ్యూక్స్ రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది 66 00:06:14,458 --> 00:06:16,919 నేను తనతో మాట్లాడవచ్చా? తను ఎలా ఉందో చూడవచ్చా? 67 00:06:17,002 --> 00:06:19,129 తను తన సామాను తెచ్చుకుంటోంది. త్వరలోనే వచ్చేస్తుంది. 68 00:06:20,839 --> 00:06:22,549 ఇప్పుడు తనపై దాడి చేసింది వాడే. 69 00:06:22,633 --> 00:06:23,926 తను కూడా అదే చెప్పింది. 70 00:06:27,387 --> 00:06:28,555 మీరు తను చెప్పేది అబద్దమని అనుకుంటున్నారు. 71 00:06:31,892 --> 00:06:35,145 మిగతావాళ్ళందరూ ఏమైపోయారు? ఈ కేసుపై మీరు ఒక్కరే పని చేస్తున్నారా ఏంటి? 72 00:06:35,229 --> 00:06:39,274 స్కెచ్ గీయడానికి కిర్బీ సాయం తీసుకుంటున్నాం. బార్ వద్ద ఇంకా పెట్రోల్ ఆఫీసర్లను ఉంచాం. 73 00:06:39,358 --> 00:06:41,693 గాయాలు కూడా కలగని దాడిలో నేను ఇంకేం చేయాలి? 74 00:06:41,777 --> 00:06:43,570 ఇది కేవలం ఒక దాడికి సంబంధించింది మాత్రమే కాదు. 75 00:06:44,196 --> 00:06:47,157 దశాబ్దాలుగా అనేక మంది ఇతగాడి చేత హత్యకు గురయ్యారు. 76 00:06:47,241 --> 00:06:50,118 డిటెక్టివ్స్ కి తమ పాత నోట్స్ ని ఓసారి పరిశీలించమని చెప్పాను, 77 00:06:50,202 --> 00:06:52,913 పరిష్కృతం కాని కేసులని పరిశీలించమని చెప్పాను, కానీ ఎవరికీ... 78 00:06:54,373 --> 00:06:55,374 ఏంటి? 79 00:06:56,083 --> 00:06:57,084 ఏమైంది? 80 00:07:02,548 --> 00:07:04,091 నిన్న రాత్రి దాడి చేసింది ఇతనేనా? 81 00:07:05,259 --> 00:07:06,635 కిర్బీ చూసింది ఇతడినేనా? 82 00:07:07,219 --> 00:07:08,470 ఏమైంది? అతను నీకెలా తెలుసు? 83 00:07:08,554 --> 00:07:12,808 ఇతడిని జూలియా మాద్రిగల్ ఇంటి బయట చూశాను. తన పొరుగువాడినని చెప్పాడు. 84 00:07:12,891 --> 00:07:15,477 -నీతో మాట్లాడాడా? -అంత్యక్రియలు ముగుస్తున్నప్పుడు మాట్లాడుకున్నాం. 85 00:07:15,561 --> 00:07:16,895 కిర్బీ గురించి అడిగాడా? 86 00:07:17,479 --> 00:07:19,398 జూలియా గురించి అడిగాడు. 87 00:07:22,693 --> 00:07:24,319 తప్పుగా అనుకోకు, నువ్వు అప్పుడు మత్తులో ఉన్నావా? 88 00:07:25,779 --> 00:07:26,780 అంతకు ముందే తాగాను. 89 00:07:28,407 --> 00:07:30,492 కానీ నేను ఇతనితో రెండు నిమిషాలైనా మాట్లాడి ఉంటా, 90 00:07:30,576 --> 00:07:32,536 ఇది అతనే. 91 00:07:35,706 --> 00:07:39,168 జూలియా ఇంటికి కిర్బీని తీసుకెళ్లావా? 92 00:07:42,045 --> 00:07:43,255 అవును, తను కూడా వచ్చింది. 93 00:07:44,381 --> 00:07:45,632 అక్కడే అతను ఆమెని చూసి ఉండవచ్చు. 94 00:08:00,856 --> 00:08:03,192 హేయ్. ఎలా ఉన్నావు? 95 00:08:03,275 --> 00:08:04,735 -నువ్వు ఇక్కడికి కారులో వచ్చావా? -అవును. 96 00:08:04,818 --> 00:08:06,153 మనం బారుకు వెళ్లాలి. 97 00:08:06,236 --> 00:08:08,363 నిన్న రాత్రి దాడి జరిగిన బారుకా? అక్కడ పోలీసులు ఉన్నారులే. 98 00:08:11,533 --> 00:08:12,618 మనం కావలసింది ఇతనే. 99 00:08:12,701 --> 00:08:16,413 ఇతనికి టాటూ ఉందా? ఇది నీకు ఎక్కడిది? లిన్స్కీ నాకు ఒక కాపీ ఇవ్వరా అంటే ఏడ్చాడు. 100 00:08:16,496 --> 00:08:17,831 నేను అడక్కుండా తెచ్చేశా. 101 00:08:19,458 --> 00:08:21,627 హేయ్, కిర్బీ. ఆగు. 102 00:08:23,337 --> 00:08:27,257 హేయ్, నిదానం. నువ్వు ఇవాళ విశ్రాంతి తీసుకో. మార్కస్, ఇంకా మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తున్నారు. 103 00:08:27,341 --> 00:08:29,009 నీ కారు పార్కింగ్ ప్రదేశంలో ఉంటే, మనం ఇటు వెళ్లవచ్చు. 104 00:08:29,092 --> 00:08:30,219 లేదు, ఆగు. ఒక్క నిమిషం. 105 00:08:30,761 --> 00:08:33,722 నువ్వు వెళ్లి, నువ్వు బాగానే ఉన్నావని వాళ్ళకి చెప్పాలి. 106 00:08:34,722 --> 00:08:35,724 నువ్వు బాగానే ఉన్నావా? 107 00:08:37,476 --> 00:08:39,520 మనం ఆఫీసుకు వెళ్లినప్పుడు మార్కస్ తో మాట్లాడతానులే. 108 00:08:41,230 --> 00:08:42,773 బీ హ్యాపీ బార్ కాక్టెయిల్స్ 109 00:08:42,856 --> 00:08:44,525 మనం ఇక్కడికి రావలసిన పని లేదు. 110 00:08:45,651 --> 00:08:47,319 ఎవరైనా అతడిని చూసే అవకాశం ఉంది కదా. 111 00:08:47,402 --> 00:08:49,571 సాక్ష్యుల కోసం పోలీసులు ఇప్పటికే ఇక్కడున్నవారిని ప్రశ్నించారు. 112 00:08:53,909 --> 00:08:55,202 అతను నిన్నెలా కనుగొన్నాడో నాకు తెలిసింది. 113 00:08:57,788 --> 00:08:59,581 నేను అతడిని మాద్రిగల్ ఇంటి దగ్గర చూశాను. 114 00:09:00,499 --> 00:09:03,126 -అతను నీతో మాట్లాడాడా? -హా. జూలియా గురించి అడిగాడు. 115 00:09:03,210 --> 00:09:05,546 నేనేం రాస్తున్నానో తెలుసుకోవాలనుకున్నాడు. 116 00:09:06,255 --> 00:09:08,423 చూడు, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్లి ఉందకూడదు. 117 00:09:09,258 --> 00:09:10,676 మనిద్దరం కలిసి ఉండగా చూసుంటాడు. 118 00:09:10,759 --> 00:09:13,387 లేదు, అంతకు చాలా కాలం ముందు నుంచే అతను నన్ను గమనిస్తూ ఉన్నాడు. 119 00:09:14,555 --> 00:09:16,265 నా చిన్నతనం నుండే. 120 00:09:16,348 --> 00:09:18,308 అంటే... అంటే మీరిద్దరూ కలిసి ఎదిగారా? 121 00:09:18,392 --> 00:09:19,810 లేదు, అతను ఎప్పట్నుంచో అలాగే ఉన్నాడు. 122 00:09:19,893 --> 00:09:21,186 నేను, రేచల్ కలిసి 123 00:09:21,270 --> 00:09:24,982 రేచల్ బాయ్ ఫ్రెండ్ వాళ్ల ఇంట్లో ఉండేవాళ్లం, అప్పుడు అతడిని నేను చూశాను. 124 00:09:25,065 --> 00:09:26,942 అతను నా దగ్గరకి వచ్చాడు, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. 125 00:09:27,442 --> 00:09:30,237 అతను మాత్రం నిన్న రాత్రి ఎలా ఉన్నాడో, అప్పుడు కూడా అలానే ఉన్నాడు, 126 00:09:30,737 --> 00:09:32,823 అచ్చు గుద్దినట్టు. 127 00:09:32,906 --> 00:09:34,199 సరే, చూడు. 128 00:09:34,700 --> 00:09:37,160 బహుశా మనం దీని గురించి తర్వాత ఇంకెప్పుడైనా మాట్లాడుకుంటుంటే మంచిదేమో. 129 00:09:37,244 --> 00:09:38,662 అతని విషయం మాత్రమే కాదు. 130 00:09:40,664 --> 00:09:41,665 సరేనా? 131 00:09:46,712 --> 00:09:49,631 నా విషయంలో అన్నీ మారిపోతాయి... 132 00:09:51,508 --> 00:09:53,468 ఒక క్షణం ఒకలా ఉంటే, మరుక్షణం అవి మారిపోతాయి. 133 00:09:54,761 --> 00:09:56,680 -అవి వేరు అయిపోతాయి. -ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. 134 00:09:57,181 --> 00:09:59,600 అలా తొలిసారిగా నాపై దాడి జరిగినప్పుడు జరిగింది. 135 00:10:00,851 --> 00:10:03,645 నేను ఆసుపత్రి నుండి డిశ్చార్చ్ అయ్యి ఒక ఏడాది అయ్యుంటుందేమో. 136 00:10:04,730 --> 00:10:06,607 ఆ సమయంలో నేను ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లాను. 137 00:10:07,649 --> 00:10:10,986 ఒకరోజు ఎప్పటిలాగానే నేను "ట్రిబ్యూన్" ఆఫీసుకు వెళ్లా. 138 00:10:11,069 --> 00:10:14,656 నేను ఆఫీసుకు వచ్చి చాలా నెలలయిందని సెక్యూరిటీ వాళ్లు అన్నారు. 139 00:10:15,490 --> 00:10:18,452 ఆ సమయంలో వాళ్లు నన్ను చూడలేదట. నాతో ఎవరూ మాట్లాడలేదట. 140 00:10:19,953 --> 00:10:22,080 నా డెస్క్ వద్ద ఇంకెవరో కూర్చొని ఉన్నారు. 141 00:10:22,748 --> 00:10:27,586 ఇక ఇంటికి వెళ్లి చూస్తే, అక్కడ అమ్మ ఉండింది, నాతోనే ఉంటున్నాను అంది. 142 00:10:27,669 --> 00:10:29,838 తనతో నేను చిన్నప్పుడు తప్ప ఇంకెప్పుడూ కలిసి ఉండలేదు. 143 00:10:30,464 --> 00:10:32,841 నేనేం మాట్లాడుతున్నానో తనకి అర్థమే కాలేదు. 144 00:10:35,010 --> 00:10:36,136 అసలు ఎవరికీ అర్థం కాలేదు. 145 00:10:38,222 --> 00:10:41,391 నా విషయంలో పరిస్థితులు యిట్టె మారిపోతాయి. 146 00:10:41,475 --> 00:10:43,352 కానీ అందరికీ మాత్రం ఆ మార్పు కనబడదు. 147 00:10:44,645 --> 00:10:47,898 అలా మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటుంది. 148 00:10:48,482 --> 00:10:50,943 -దీని గురించి మార్కస్ తో మాట్లాడావా? -అదే కదా నేను నీకు చెప్పేది! 149 00:10:53,904 --> 00:10:55,197 నేను అతడిని అసలు పెళ్లే చేసుకోలేదు. 150 00:10:57,199 --> 00:10:59,326 ఒకరోజు ఇంటికి వచ్చి చూస్తే, ఆతను ఇంట్లోనే ఉన్నాడు. 151 00:11:03,121 --> 00:11:04,498 ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. 152 00:11:05,207 --> 00:11:07,668 సరే మరి. నిన్న రాత్రి నేను ఇక్కడికి వచ్చా, నాకు ఇవి కనిపించాయి. 153 00:11:07,751 --> 00:11:09,670 నీకు ఇదేంటో గుర్తుంది కదా? నీకు దీని గురించి చెప్పాను. 154 00:11:09,753 --> 00:11:14,007 ఈ బారుకు చెందిన అగ్గిపెట్టె ఆరేళ్ల క్రితమే అతని దగ్గర ఎలా ఉండింది? 155 00:11:15,551 --> 00:11:17,970 ఎందుకంటే, ఈ బార్ చాలా ఏళ్ల నుండి నడుస్తుందేమో. 156 00:11:18,053 --> 00:11:20,681 పోయిన వారం ఇక్కడ లాండ్రీ షాప్ ఉండింది. మనిద్దరం కలిసే వచ్చాం. 157 00:11:20,764 --> 00:11:23,725 అవును, వచ్చాం, కానీ ఇప్పుడు ఎలా ఉందో, అప్పుడు కూడా అలాగే ఉంది. 158 00:11:25,477 --> 00:11:27,020 ఒకేలా ఉంది. 159 00:11:31,900 --> 00:11:32,901 సరే. 160 00:11:37,072 --> 00:11:38,073 సరే. 161 00:11:44,621 --> 00:11:46,707 ఒకే ఒక్క మహిళ మృత్యువు నుండి బయటపడింది 162 00:11:46,790 --> 00:11:48,083 ముప్పై అయిదేళ్ల షారొన్ లీడ్స్ దాడిలో ప్రాణాల నుండి బయటపడింది 163 00:11:55,716 --> 00:11:58,218 చికాగో హంతకుడు చంపిన, అందరూ మర్చిపోయిన మహిళలు 164 00:12:11,690 --> 00:12:14,276 -హేయ్, జిన్నీ. -హేయ్, షీలా. నాకు ఒక సాయం కావాలి. 165 00:12:15,777 --> 00:12:17,446 నా తాళం చెవులు పోయాయని నేను ఎప్పుడు చెప్పాను? 166 00:12:18,197 --> 00:12:20,032 ఆ సమాచారమంతా లాగ్స్ లో ఉంటుంది. 167 00:12:20,741 --> 00:12:22,159 మీకు కొత్తది అందిందా? 168 00:12:25,704 --> 00:12:27,789 ఇది ఒక వారం క్రితం యాక్టివేట్ అయింది. 169 00:12:28,790 --> 00:12:30,584 కానీ పాతది కూడా ఇక్కడ చూపుతోందే. 170 00:12:30,667 --> 00:12:32,878 ఎవరో దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. 171 00:12:32,961 --> 00:12:33,962 ఎవరు? 172 00:12:36,089 --> 00:12:37,508 నువ్వే ఏమో. 173 00:12:37,591 --> 00:12:39,760 కొత్త తాళంచెవిని ఉపయోగించిన రోజుల్లోనే పాత తాళంచెవి కూడా ఉపయోగించబడుతోంది. 174 00:12:39,843 --> 00:12:40,928 ఎంట్రీ లాగ్ 175 00:12:41,011 --> 00:12:42,387 లేదు. సమయాలు సరిగ్గా లేవు. 176 00:12:43,096 --> 00:12:45,641 నా పాత కీ 8:25 కి ఉపయోగించబడింది. 177 00:12:45,724 --> 00:12:47,476 కానీ నేను ఎప్పుడూ ఎనిమిదింటికల్లా పైకి వెళ్లిపోతాను. 178 00:12:47,559 --> 00:12:50,062 నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? 179 00:12:50,145 --> 00:12:53,273 ఏదేమైనా, ఆ ఫాలో అవ్వడం కొన్ని రోజుక క్రితం ఆగిపోయింది. 180 00:12:53,774 --> 00:12:56,652 అది ఎవరైనా కానీ, తమ తప్పును తెలుసుకొని ఉంటారు. ఏమంటారు? 181 00:12:58,195 --> 00:12:59,238 థ్యాంక్స్. 182 00:13:11,959 --> 00:13:13,252 ఆర్టికల్ ప్రచురించాక వచ్చిన ప్రతిస్పందననా? 183 00:13:19,508 --> 00:13:21,051 -నేను ఏబీ దగ్గరకి వెళ్తా. -సరే. 184 00:13:28,100 --> 00:13:29,726 నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. 185 00:13:29,810 --> 00:13:31,478 -హేయ్. -సరే. సరే. 186 00:13:32,271 --> 00:13:35,524 -ఈ ఉదయం నుండి ఇన్ని వచ్చాయా? -అవును. ఫోన్స్ సంగతి చూడమని అందరికీ ఏబీ చెప్పింది. 187 00:13:35,607 --> 00:13:37,484 -చాలా హడావిడిగా ఉంది. -నీకేం జరిగిందో మాకు ఇప్పుడే తెలిసింది. 188 00:13:37,568 --> 00:13:39,945 నువ్వు బాగానే ఉన్నావా? ఇవాళ నువ్వు రాకుండా ఉండాల్సింది. 189 00:13:40,028 --> 00:13:41,989 ఇంకెక్కడికి వెళ్లగలను? ఏబీ ఫాలో అప్ న్యూస్ గురించి ఏమైనా చెప్పిందా? 190 00:13:42,072 --> 00:13:44,575 -ఇంకాసేపట్లో అదే చర్చించబోతున్నాం. -మంచిది. అయితే అక్కడ కలుద్దాం. 191 00:13:46,535 --> 00:13:48,662 ఈ కథనం అలజడి సృష్టిస్తోందని అందరికీ అర్థమయ్యుంటుంది. 192 00:13:48,745 --> 00:13:51,498 హోమ్ ఎడిషన్ కాపీలన్నీ అమ్ముడుపోయాయి. పాఠకులు ఎనలేని ఆసక్తి చూపుతున్నారు. 193 00:13:51,582 --> 00:13:53,542 క్లర్క్స్ అందరూ ఆధారాల సేకరణ పనిలో ఉన్నారు. 194 00:13:53,625 --> 00:13:55,502 చాలా వరకు పనికి రానివే, కానీ కొన్ని అయినా పనికి వచ్చేవి ఉండవచ్చు. 195 00:13:55,586 --> 00:13:58,881 అవును, ఒక సీరియల్ రేపిస్ట్ విడుదలైన రోజుకు ఆ తారీఖులు సరిపోలుతున్నాయి, 196 00:13:58,964 --> 00:14:01,008 ఇంకా ఒక యువతి తన తండ్రి గురించి కాల్ చేసింది. 197 00:14:01,091 --> 00:14:02,759 శవాలు ఎక్కడైతే కనిపించాయో, అదే మార్గంలో అతను వెళ్తుంటాడు. 198 00:14:02,843 --> 00:14:05,095 పోలీసులకు ఇచ్చేంత విశ్వసనీయ సమాచారం ఏమైనా దొరికిందా? 199 00:14:05,179 --> 00:14:06,889 డాన్, ఫాలో అప్ ఆర్టికల్ గురించి నీ ప్లాన్ ఏంటి? 200 00:14:06,972 --> 00:14:09,141 సమ్మర్ ఫ్రాన్సిస్ ప్రొఫైల్ నా దగ్గర సిద్ధంగా ఉంది, 201 00:14:09,224 --> 00:14:12,644 కానీ ముందు నేను మాద్రిగల్ హత్య విషయంలో అనుమానితుడి గురించి డీఏతో మాట్లాడాలి, ఎందుకంటే... 202 00:14:12,728 --> 00:14:15,397 మనం నిన్న రాత్రి నాపై జరిగిన దాడి గురించి వేయాలి. 203 00:14:15,480 --> 00:14:18,483 బాగా ఆలోచించి అంటున్నావా? దానికి ఒకరోజు ఆగినా పర్వాలేదు. 204 00:14:18,567 --> 00:14:20,027 లేదు, మనం వెంటనే దాని గురించి రాయాలి. 205 00:14:20,819 --> 00:14:22,905 పోలీసుల స్కెచ్ కూడా నా దగ్గర ఉంది. 206 00:14:22,988 --> 00:14:25,490 వద్దు. దీన్ని విడుదల చేయడం వాళ్లకి ఇష్టం లేదు. 207 00:14:25,574 --> 00:14:27,826 మనం ఆగకూడదు. జనాలకు వీడు ఎలా ఉంటాడో తెలియాలి. 208 00:14:27,910 --> 00:14:29,036 ఈ గందరగోళ పరిస్థితిని ఒకసారి చూడు. 209 00:14:29,119 --> 00:14:31,914 దీన్ని మనం అచ్చు వేస్తే, పోలీసుల పరిస్థితి దీనికన్నా వెయ్యి రెట్లు ఘోరంగా ఉంటుంది. 210 00:14:31,997 --> 00:14:33,665 వాడిని వెతికే సమయం వాళ్లకి దొరకదు. 211 00:14:33,749 --> 00:14:35,667 -మరి నేనేం చేయను... -ఇవాళ్టికి దాన్ని పక్కకు పెట్టేద్దామా? 212 00:14:35,751 --> 00:14:38,337 మనం ముందు సమ్మర్ ఫ్రాన్సిస్ ప్రొఫైల్ గురించి వేద్దాం. 213 00:14:38,420 --> 00:14:39,880 కొత్త కమిషనర్ సంగతి ఏంటి? 214 00:14:39,963 --> 00:14:41,465 విల్బీ నియామకాన్ని నిర్ధారించడానికి 215 00:14:41,548 --> 00:14:44,218 -నగర పాలక కౌన్సిల్ ఇంకా సమావేశం కాలేదు. -సరే. మనం ఇంకేం... 216 00:14:44,301 --> 00:14:46,345 కాలునెట్ డాక్స్ యూనియన్ ర్యాలీ గురించి నా దగ్గర ఒక కథనం ఉంది. 217 00:14:46,428 --> 00:14:48,347 అయినా కానీ మనకి చాలినంత స్పేస్ దక్కదు. 218 00:14:53,393 --> 00:14:54,394 హేయ్. 219 00:14:55,854 --> 00:14:56,980 అంతా బాగానే ఉందా? 220 00:14:58,065 --> 00:15:00,692 అతను నా ఆఫీసుకు వస్తూ ఉన్నాడు. కానీ నాకు తెలీనే లేదు. 221 00:15:01,318 --> 00:15:04,238 -ఇతడిని గుర్తుపట్టగలవా? -తెలియట్లేదు. 222 00:15:04,321 --> 00:15:07,199 వారానికి డజన్ టూర్స్ ఇస్తుంటాను. వందలాది మందిని చూస్తుంటాను. 223 00:15:08,575 --> 00:15:12,329 నీ తాళం చెవులు పోయినప్పటి నుండి ఏదైనా తేడాగా జరుగుతోందా? 224 00:15:12,412 --> 00:15:14,706 అంటే, పరిస్థితులు ఒకలా ఉండి, మారిపోవడం, 225 00:15:14,790 --> 00:15:17,417 కానీ అవి నీకు తప్ప ఇంకెవరికీ తెలీకపోవడం వంటివి. 226 00:15:19,336 --> 00:15:21,713 అలా నాకు ఎప్పుడూ జరగలేదు. 227 00:15:21,797 --> 00:15:22,798 నీకు జరిగిందా? 228 00:15:24,007 --> 00:15:26,343 నిన్న రాత్రి బారులో అది అతను కూడా గమనించాడు. 229 00:15:28,846 --> 00:15:31,682 జరుగుతున్నది ఏదో మాకు తప్ప ఇంకెవరికీ తెలియట్లేదు, ఎందుకు? 230 00:15:33,058 --> 00:15:34,268 నాకు అర్థం కావట్లేదు. 231 00:15:36,937 --> 00:15:39,106 మా మధ్య లింక్ ఏంటో ఎవరికీ తెలీదు. 232 00:15:40,148 --> 00:15:41,608 రెండు పదార్థాలను తీసుకో. 233 00:15:41,692 --> 00:15:44,194 వాటి మధ్య ఏదో కనిపించని దారం ఉన్నట్టు 234 00:15:44,778 --> 00:15:47,656 వాటి మధ్య సంబంధం ఉండే అవకాశం ఉంది. 235 00:15:47,739 --> 00:15:50,200 అవి ఒకదానికొకటి స్వతంత్రంగా ఏమీ చేయలేవు, 236 00:15:50,284 --> 00:15:53,704 కాబట్టి మనకి ఒకదాన్ని ఏమైనా చేస్తే, ఇంకోటి కూడా అలానే ప్రతిస్పందిస్తుంది. 237 00:15:53,787 --> 00:15:56,456 వాటి చర్యలు ముడిపడి ఉండటాయి. 238 00:15:57,124 --> 00:16:00,711 అనంత విశ్వంలో వాటి మద్య ఎంత దూరం ఉన్నా కానీ ఒకటి మరొకదాని మీద ప్రభావం చూపుతుంది. 239 00:16:05,632 --> 00:16:07,301 పరిస్థితులు ఇక్కడ మారుతున్నట్టు నువ్వెప్పుడైనా గమనించావా? 240 00:16:08,719 --> 00:16:10,304 అంటే, ఇంట్లో మారుతున్నట్టు. 241 00:16:11,430 --> 00:16:15,934 ఎవరైనా చక్రాల కూర్చీలో ఒకరిని బయటకు తీసుకెళ్లినప్పుడు మాత్రమే ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది. 242 00:16:17,728 --> 00:16:19,938 అది కాదు. నేను సీరియస్ గా అడుగుతున్నా, లియో. 243 00:16:21,273 --> 00:16:22,566 నీకేం కావాలి? 244 00:16:24,818 --> 00:16:30,949 నాకు ఈ లైట్లు తప్ప ఇంకేమీ కనబడవు, దానితో నాకు ఏది కూడా సరిగ్గా గుర్తుండదు. 245 00:16:31,450 --> 00:16:33,035 -నేను కూడా నీతో... -అదీ... 246 00:16:33,118 --> 00:16:34,244 ...ఇంటికి వచ్చేయాలేమో. 247 00:16:35,454 --> 00:16:37,581 ...మనం అనుకొన్న మాట అది కాదు కదా? 248 00:16:39,291 --> 00:16:41,168 అది జరగని పనిలే. 249 00:16:42,294 --> 00:16:43,587 పద. నేను నీ గది దాకా వస్తా. 250 00:16:52,387 --> 00:16:54,139 ఇంటి బయట నేను మార్పును గమనించాను. 251 00:16:55,307 --> 00:16:58,393 లైట్ల లాంటిది కాదంటావా? 252 00:16:58,477 --> 00:17:00,854 -నువ్వు కూడా స్థిమితం కోల్పోతున్నావేమో. -లేదు. అదేం లేదు. 253 00:17:02,105 --> 00:17:05,192 -వేరొకరు కూడా ఆ మార్పును గమనించారు. -అయితే మరి నన్నెందుకు అడుగుతున్నావు? 254 00:17:05,275 --> 00:17:06,944 ఎందుకంటే, ఆమెని నేనెప్పుడూ ఇంట్లోకి తీసుకువెళ్లలేదు. 255 00:17:07,027 --> 00:17:09,029 -ఆమెకి అర్థమయ్యే విషయం కాదు... -ఆగు, ఆమెనా? 256 00:17:09,112 --> 00:17:10,739 తనని ఎక్కడ కలిశావు? 257 00:17:10,821 --> 00:17:12,031 అంటే... 258 00:17:13,992 --> 00:17:15,452 బయటే. 259 00:17:15,953 --> 00:17:17,954 నీకు కనిపించినదే తనకి కూడా కనిపించింది అంటావా? 260 00:17:18,664 --> 00:17:20,165 విషయాలు మారడం తను చూసిందా? 261 00:17:20,249 --> 00:17:22,041 అవును. ఇంకో విషయం చెప్పనా? 262 00:17:22,125 --> 00:17:23,836 తను మారడం చూడటం అది మొదటిసారి కాదని మాత్రం చెప్పగలను. 263 00:17:25,963 --> 00:17:28,507 బహుశా ఆ మారడం అనేది తన వల్లే జరుగుతుందేమో? 264 00:17:29,758 --> 00:17:31,593 బహుశా నీకు తెలీనిదేదో తనకి తెలుసేమో. 265 00:17:34,096 --> 00:17:35,097 లేదు. 266 00:17:39,476 --> 00:17:40,477 పందొమ్మిది. 267 00:17:41,520 --> 00:17:42,646 చివరిది. 268 00:17:56,743 --> 00:17:59,997 నా పేరు కిర్బీ మాజ్రాచీ. మీరు పోగొట్టుకొన్న కీ చెయిన్ గురించి అడిగిన మనిషిని. 269 00:18:00,080 --> 00:18:02,749 సరే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? 270 00:18:02,833 --> 00:18:06,336 మీ తాళం చెవి హత్యకు గురైన మహిళ వద్ద దొరికింది. 271 00:18:07,171 --> 00:18:09,631 నేను మీకు చూపిన ఫోటో క్రైమ్ సీన్ లోది. 272 00:18:09,715 --> 00:18:11,049 లోపలికి రండి. 273 00:18:31,820 --> 00:18:34,364 -హేయ్. నన్ను లోపలికి రానిచ్చినందుకు థ్యాంక్స్. -రండి. 274 00:18:50,214 --> 00:18:53,842 నన్ను చాలా ఏళ్లుగా గమనిస్తూనే ఉన్నాడు. నాకు తెలీను కూడా తెలీలేదు. 275 00:18:55,093 --> 00:18:56,303 కానీ నేను మీలాంటి దాన్ని కాదు కదా. 276 00:18:57,012 --> 00:19:01,099 అయితే, మీ తాళం చెవి ఒక చనిపోయిన మహిళ శరీరం లోపల ఎందుకు ఉందంటారు? 277 00:19:02,809 --> 00:19:05,395 కానీ ఈ ఫోటో 20 ఏళ్ల కిందటిది అన్నారు కదా. 278 00:19:06,772 --> 00:19:08,398 వీటిని పోయిన ఏడాదే చేశారంటారా? 279 00:19:08,982 --> 00:19:10,776 అవును. హబుల్ జ్యూపిటర్ మొదటి ఫోటోని పంపింది అప్పుడే. 280 00:19:10,859 --> 00:19:12,486 మేము ఆ ఫోటోలన్నింటినీ ప్రదర్శించాం. 281 00:19:12,986 --> 00:19:14,154 ఏంటి ఆ శబ్దం? 282 00:19:15,280 --> 00:19:19,368 వర్షం శబ్దం అనుకుంటా. రాత్రంతా పడే అవకాశముంది. 283 00:19:21,161 --> 00:19:23,830 నేను ఆఫీసుకు వెళ్లాలి. నేను మిడ్ నైట్ షోని కవర్ చేస్తున్నా. 284 00:20:00,826 --> 00:20:02,494 ఈ హ్యాండిల్ ఎప్పుడూ సరిగ్గా పడదు. 285 00:20:04,955 --> 00:20:07,207 మీకు కర్టెన్స్ లేవే. ఎవరైనా చూస్తారని మీకు ఇబ్బందిగా ఉండదా? 286 00:20:08,208 --> 00:20:10,878 చూడనివ్వండి. కావాలంటే వాళ్ళ కోసం లైట్ కూడా వేసే ఉంచుతాను. 287 00:21:10,437 --> 00:21:11,522 డాన్ ఎక్కడ? 288 00:21:11,605 --> 00:21:13,023 కాన్ఫరెన్స్ గదిలో ఉన్నాడు. 289 00:21:14,650 --> 00:21:16,068 సరే, నాకు ఏ విషయమో... 290 00:21:16,151 --> 00:21:18,862 మేము పంపించినావాటిని నిర్ధారించగలరా, డిటెక్టివ్? 291 00:21:18,946 --> 00:21:21,657 మీరు మాకు పంపిన మహిళకు సంబంధించిన ఫైల్స్ ని పునఃపరిశిలించే ప్రయత్నం చేశాను. 292 00:21:21,740 --> 00:21:23,992 -లైన్లో ఎవరు? -లిన్స్కీ. 293 00:21:24,618 --> 00:21:26,119 -మీరేదో అంటున్నారు? -చూస్తుంటే, 294 00:21:26,203 --> 00:21:28,539 మా ప్రాపర్టీ వేర్ హౌస్ నుండే మీ బ్యాక్ గ్రౌండ్ సమాచారాన్నంతా మీరు సేకరించినట్టున్నారు. 295 00:21:28,622 --> 00:21:30,791 మొదట్లో అంతే, కానీ మేము కనుగొన్నవాటి నుండి చాలా సమాచారాన్ని ఫాలో అప్ చేశాం. 296 00:21:30,874 --> 00:21:33,627 మాద్రిగల్ ఇంటికి వెళ్లారా? వాళ్లు అతడిని గుర్తుపట్టారా? 297 00:21:33,710 --> 00:21:34,878 ఇప్పుడు మాట్లాడింది కిర్బీయేనా? 298 00:21:34,962 --> 00:21:37,130 లేదు, ఇంకా మేము ఆ చిత్రాన్ని పంపిణీ చేయలేదు. 299 00:21:37,214 --> 00:21:40,467 చూడండి, మీ ఇద్దరిలో ఎవరైనా సీల్ చేసి ఉన్న ఆధారాన్ని తెరిచారా? 300 00:21:41,635 --> 00:21:44,388 కిర్బీ, నీ ఆధారం కవర మీద ఉన్న సీల్ తెరిచి ఉంది. 301 00:21:45,055 --> 00:21:47,516 డిటెక్టివ్, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. 302 00:21:48,684 --> 00:21:50,644 సరే, అది అతను మరీ ఎక్కువ చేసి చెప్తున్నాడు. 303 00:21:52,229 --> 00:21:55,065 ప్రాపర్టీ వేర్ హౌస్ కి వెళ్లడమే చండాలం. 304 00:21:55,148 --> 00:21:57,109 ఇంకా ఆధారాలను గెలకడం అంటే చట్ట విరుద్ధం కూడా. 305 00:21:57,192 --> 00:21:59,695 అది నాది, ఏబీ. 306 00:22:00,988 --> 00:22:03,448 వాళ్లు ఏమీ చేయట్లేదు. కేసును గాలికి వదిలేశారు. 307 00:22:03,532 --> 00:22:04,533 దాన్ని అక్కడ పడేశారంతే. 308 00:22:05,450 --> 00:22:08,370 నువ్వు దేన్నైనా తీసుకువచ్చ్చావా? లేదా ఏదైనా పెట్టావా? 309 00:22:08,453 --> 00:22:11,248 లేదు. అస్సలు లేదు. 310 00:22:11,331 --> 00:22:12,374 డాన్? 311 00:22:16,503 --> 00:22:18,881 ఏమో మరి. నేను మొత్తం తనతోనే లేను. 312 00:22:27,347 --> 00:22:29,683 నేను ఒక వస్తువును ఆధారాల కవర్ లో పెట్టానని నిజంగానే అనుకుంటున్నావా? 313 00:22:30,976 --> 00:22:33,187 అక్కడ అగ్గిపెట్టె ఉండటానికి అదే కారణమేమో. 314 00:22:59,713 --> 00:23:00,797 కిర్బీ? 315 00:23:07,804 --> 00:23:10,682 హేయ్, హేయ్. ఏమీ కాలేదు. ఏమీ కాలేదు. 316 00:23:10,766 --> 00:23:11,975 -సరే. -హా. 317 00:23:13,769 --> 00:23:14,770 హేయ్, వెళ్దాం పద. 318 00:23:31,495 --> 00:23:33,247 మీ అమ్మ తర్వాత కాల్ చేస్తానని చెప్పింది. 319 00:23:37,584 --> 00:23:40,754 నువ్వు తనతో ఎందుకు మాట్లాడటం లేదో రేచల్ కి అర్థం కావట్లేదు. 320 00:23:42,631 --> 00:23:43,799 ఆ విషయంలో తను బాగా కలత చెంది ఉంది. 321 00:23:43,882 --> 00:23:47,553 తను నీ గురించి సవా లక్ష ప్రశ్నలు అడిగింది, వాటిలో చాలా వాటికి నా దగ్గర సమాధానాలు లేవు. 322 00:23:47,636 --> 00:23:48,637 ఎలాంటి ప్రశ్నలు? 323 00:23:48,720 --> 00:23:51,306 మనం ఆ బారుకు ఎప్పుడూ వెళ్లలేదు. నువ్వు ఎందుకు వెళ్లావని. 324 00:23:52,432 --> 00:23:53,433 అది దర్యాప్తులో దొరికిన పనికిరాని ఆధారం. 325 00:23:53,517 --> 00:23:54,977 అతను నిన్ను అలా ఫాలో చేస్తూ లోపలికి వచ్చేశాడా? 326 00:23:55,060 --> 00:24:00,107 చూడు, ఇవాళంతా నాకు ఈ సోదితోనే సరిపోయింది, కాబట్టి మనం దీన్ని పక్కన పెట్టేసి తిందామా? 327 00:24:00,190 --> 00:24:03,485 తప్పకుండా. ఇదుగో, తిను. 328 00:24:04,069 --> 00:24:05,070 థ్యాంక్స్. 329 00:24:05,821 --> 00:24:07,990 ఇది... ఏంటిది? 330 00:24:08,699 --> 00:24:11,159 నీ వంటకం గురించి నీకే తెలీనట్టు మాట్లాడకు. 331 00:24:12,286 --> 00:24:13,954 ఇది పోర్క్... ఇంకా పీనట్ బటర్ ఆ? 332 00:24:14,037 --> 00:24:15,914 గ్రేప్ జెల్లీ కూడా వేశా. అదంటే నీకు చాలా ఇష్టం. 333 00:24:16,707 --> 00:24:17,958 ఇప్పటిదాకా నేను దీన్ని తిననేలేదు. 334 00:24:18,458 --> 00:24:20,669 ఏమంటున్నావు? ఈ వంటకాన్ని సృష్టించింది నేనే అని మాత్రం అనకు. 335 00:24:20,752 --> 00:24:22,713 నేను నిజంగానే అంటున్నా. అసలు ఇదేంటో నాకు తెలీదు. 336 00:24:22,796 --> 00:24:25,132 నువ్వు ఇలా అర్థంపర్థం లేకుండా మాట్లాడినప్పుడు, నాకు ఏం చేయాలో అర్థమే కాదు. 337 00:24:25,215 --> 00:24:26,675 ఇదేమీ పరీక్ష కాదు. నేను నిజంగానే చెప్తున్నా. 338 00:24:26,758 --> 00:24:28,218 సరే, ఈ శాండ్విచ్ తినకులే. 339 00:24:28,302 --> 00:24:30,304 బహుశా ఇదంటే నాకు ఇష్టమేమో! ఏమో మరి! 340 00:24:30,387 --> 00:24:31,513 నాతో పరాచకాలు ఆడుతున్నావా? 341 00:24:31,597 --> 00:24:33,849 ఎందుకంటే, నీ బుర్రలో ఏం జరుగుతోందో నేను ఊహిస్తూ ఉండలేను. 342 00:24:33,932 --> 00:24:35,100 ఊహించమని నేను అడగలేదు కదా. 343 00:24:37,686 --> 00:24:38,687 ఏంటి? 344 00:24:38,770 --> 00:24:42,983 ఏమో, కిర్బీ. నిజంగానే నాకు తెలియట్లేదు. నేను కూడా అలసిపోయాను. చాలా అలసిపోయాను. 345 00:24:59,791 --> 00:25:00,876 ఇది బాగుంది. 346 00:25:03,378 --> 00:25:04,379 సంతోషం. 347 00:25:13,514 --> 00:25:16,266 మీరు సమయానికి రాలేదు. సర్వీస్ అయిపోయింది. 348 00:25:17,226 --> 00:25:18,227 నేను ఏమైనా సహాయపడగలనా? 349 00:25:21,647 --> 00:25:23,148 మీరు రేచల్, కదా? 350 00:25:23,941 --> 00:25:26,276 నా పేరు డాన్ వెలాజ్కెజ్. నేను "సన్-టైమ్స్"లో పని చేస్తాను. 351 00:25:28,403 --> 00:25:31,281 మిమ్మల్ని షారొన్ పంపిందా? తను ఫోన్ తీసి పక్కన పెట్టేసింది. 352 00:25:32,074 --> 00:25:33,659 లేదు, నేను ఇక్కడికి వచ్చినట్టు తనకి తెలీదు. 353 00:25:33,742 --> 00:25:36,495 అయితే, మీ కాల్స్ ని కూడా తను ఎత్తట్లేదా? 354 00:25:37,496 --> 00:25:38,580 తనకి మీ మీద ఎందకు కోపం వచ్చిందో? 355 00:25:38,664 --> 00:25:40,165 ఏదో చేసే ఉంటానులెండి. 356 00:25:42,042 --> 00:25:46,421 మరి మీ సంగతేంటి? చివరిసారిగా మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారు? 357 00:25:48,924 --> 00:25:50,634 ఎందుకు? తను మీకేం చెప్పింది? 358 00:25:51,301 --> 00:25:52,594 పెద్దగా ఏం చెప్పలేదు. 359 00:25:52,678 --> 00:25:57,224 నా కూతురు మీకు ఏమైనా చెప్పాలనుకుంటే, తనే మీకు చెప్తుంది. 360 00:25:57,307 --> 00:25:59,852 అవును, ఇప్పటిదాకా తనతో నా అనుభవం కూడా అదే చెప్తోంది. 361 00:26:01,770 --> 00:26:02,980 తను ఎందుకు ఎప్పుడూ అలానే ఉంటుంది? 362 00:26:03,063 --> 00:26:05,274 చూడండి, నేను ఇలా అన్నానని మీ పత్రికలో రావడం నాకు ఇష్టం లేదు, సరేనా? 363 00:26:05,357 --> 00:26:07,401 మీరు షారొన్ ని ఎలా ఏమార్చారో తెలీదు కానీ, చూడండి తనకు ఇప్పుడు ఏమైందో. 364 00:26:07,484 --> 00:26:08,986 అలా అనడం న్యాయం కాదు. 365 00:26:09,069 --> 00:26:11,822 నిన్న రాత్రి ఇంకొంచెం ఉంటే తన ప్రాణాలు పోయుండేవి. కాస్తయినా బాధ్యత తీసుకోండి. 366 00:26:15,659 --> 00:26:17,911 తను ఇలా ఎప్పుడైనా లెక్కలేనట్టుగా ప్రవర్తించిందా? 367 00:26:21,248 --> 00:26:22,791 మీకు తన గురించి అసలు ఏమీ తెలీదు కదా? 368 00:26:22,875 --> 00:26:25,794 ఆసుపత్రిలో ఉన్నప్పుడు అలానే ఏమైనా ప్రవర్తించిందా? అంటే, తను అక్కడ చాలా కాలం ఉండింది కదా. 369 00:26:25,878 --> 00:26:29,214 -తన మానసిక స్థితి సరిగ్గా ఉండుండకపోవచ్చు. -అవును, తన మానసిక స్థితి బాగాలేదు. అయితే? 370 00:26:29,298 --> 00:26:32,509 అయితే, తన ప్రవర్తన ఎప్పుడైనా తేడాగా, అస్థిరంగా అనిపించిందా? 371 00:26:32,593 --> 00:26:33,594 ఏ విషయంలో? 372 00:26:33,677 --> 00:26:35,929 తనకి జరిగినదాని గురించి ఎప్పుడైనా మీతో అబద్ధం ఆడిందా? 373 00:26:36,013 --> 00:26:40,100 తను అబద్ధాలు చెప్పే రకం కాదు, పిచ్చిది కూడా కాదు. 374 00:26:41,768 --> 00:26:46,148 అది నా పని. అంటే, ఒకరైనా పద్ధతిగా, చక్కగా ఉండాలి అదా. 375 00:26:53,280 --> 00:26:55,908 దాన్ని వదిలేయ్. మోంట్రియల్ ఆల్బమ్ చూద్దాం. 376 00:26:57,993 --> 00:26:59,203 ఎందుకు, ఏంటి ఇది? 377 00:27:00,662 --> 00:27:02,206 సాయిగాన్ లో అమెరికా సైన్యం. 378 00:27:03,916 --> 00:27:05,209 అందరూ చాలా చిన్నగా ఉన్నారు. 379 00:27:05,876 --> 00:27:06,877 అవును. 380 00:27:09,421 --> 00:27:10,422 ఎవరది? 381 00:27:11,340 --> 00:27:14,218 అతను గజ్మన్. అతను భూగర్భంలోకి వెళ్లి శత్రువుల పని పట్టేవాడు. 382 00:27:14,927 --> 00:27:17,346 మంచి పనిలా ఉందే. 383 00:27:17,429 --> 00:27:21,308 బాబోయ్. వీసీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అండర్ గ్రౌండ్ బంకర్స్ ని తవ్వేశారు. 384 00:27:21,808 --> 00:27:25,604 వాటిలో బాంబులను, పాములను, దేన్ని పడితే దాన్ని పెట్టేవారు. 385 00:27:26,396 --> 00:27:27,856 అవి మా కంట కనబడితే, వాటిని క్లియర్ చేసేయాలి. 386 00:27:27,940 --> 00:27:30,901 అదే గజ్మన్ పని. మా దళంలో అతనే చాలా పొట్టివాడు. 387 00:27:33,946 --> 00:27:35,364 అతనితో ఇంకా టచ్ లోనే ఉన్నావా? 388 00:27:36,782 --> 00:27:37,783 లేదు, లేదు. 389 00:27:38,283 --> 00:27:39,451 అతను ఆ యుద్ధంలో చనిపోయాడు. 390 00:27:43,330 --> 00:27:47,000 మేము కూ చీ డిస్ట్రిక్ట్ లో తనిఖీలు చేస్తుండగా ఒక బంకర్ కనిపించింది. 391 00:27:47,084 --> 00:27:50,379 గజ్మన్ బద్ధకం ప్రదర్శించాడు, అందుకని అతని స్థానంలో నేను వెళ్లాను. 392 00:27:50,462 --> 00:27:54,883 అతని టార్చీని, ఇంకా తుపాకీని తీసుకొని బంకరులోకి దిగాను. 393 00:27:57,135 --> 00:27:59,972 లోపల అంతా ఖాళీగానే ఉంది. దాన్ని అంతా ఎవరో అప్పటికే క్లియర్ చేసేశారు. 394 00:28:01,306 --> 00:28:02,850 ఇదేంటబ్బా అని నేను ఆలోచిస్తుంటే, 395 00:28:04,810 --> 00:28:07,354 పైనున్న మా మనుషులపై శత్రువులు మెరుపుదాడి చేశారు. 396 00:28:11,275 --> 00:28:14,194 నేను పైకి ఎక్కి చూసేసరికి, మా దళంలో సగం మంది చనిపోయారు. 397 00:28:18,782 --> 00:28:19,783 కాబట్టి... 398 00:28:25,038 --> 00:28:27,040 నువ్వు కూడా అప్పుడు చనిపోయుంటే బాగుండేదని ఎప్పుడైనా నీకు అనిపించిందా? 399 00:28:27,749 --> 00:28:31,420 లేదు. అసలు ఎవరూ చనిపోయి ఉండకూడదు అని అనిపిస్తూ ఉంటుంది. 400 00:28:33,172 --> 00:28:34,631 కానీ అది మన చేతిలో ఉండదు కదా. 401 00:28:44,016 --> 00:28:45,017 ఇదేంటి? 402 00:28:46,518 --> 00:28:47,811 అతను ఎవరో నాకు గుర్తు లేదు. 403 00:28:48,604 --> 00:28:49,605 అది కాదు. 404 00:28:51,565 --> 00:28:52,941 అతని టాటూ. 405 00:28:53,567 --> 00:28:55,110 అది ఎక్కడిది? 406 00:28:55,194 --> 00:28:58,488 అతని దళానికి చెందినది అయ్యుంటుంది. వాళ్లలో చాలా మందికి అది ఉంది. 407 00:29:09,583 --> 00:29:10,918 అతనికి కూడా ఇదే టాటూ ఉంది. 408 00:29:12,127 --> 00:29:14,421 -నిన్న రాత్రి నీపై దాడి చేసిన వ్యక్తికా? -హా. 409 00:29:15,339 --> 00:29:16,924 అయితే, అగను కూడా సైనికుడు అయ్యుంటాడు. 410 00:29:59,842 --> 00:30:02,052 జిన్నీ, లియో నీ కోసం వెతుకుతున్నాడు. 411 00:30:02,135 --> 00:30:05,222 నువ్వు ఇచ్చే టూర్ కి గ్రేంజర్ థియేటర్ రేపటి దాకా ఫ్రీగా ఉండదట. 412 00:30:06,056 --> 00:30:09,601 పర్వాలేదులే. పిల్లలు ఎక్కడ? 413 00:30:10,143 --> 00:30:12,229 అన్నీ గెలులకుతున్నారు. కిందికి పంపించేశా. 414 00:30:36,587 --> 00:30:40,674 గెలాక్సీలు ఢీకొట్టుకోవడాలు 415 00:30:54,521 --> 00:31:00,068 అవి బోలోమీటర్ రీడింగ్లు. ఒక నక్షత్రం ఎంత బాగా మెరుస్తుందో చెప్తాయి. 416 00:31:01,403 --> 00:31:08,076 నక్షత్రాలు మనకి ఎంత దూరంలో ఉన్నాయో లెక్కించడంలో ఆ రీడింగ్లు సహాయపడతాయి 417 00:31:09,870 --> 00:31:11,914 ఇక, ఆమె జిన్నీ. 418 00:31:11,997 --> 00:31:15,000 తనకి చార్టులన్నా, పిల్లలన్నా చాలా ఇష్టం. 419 00:31:15,792 --> 00:31:17,753 మరి, జిన్నీ, నువ్వేమైనా 420 00:31:17,836 --> 00:31:20,422 అరెసీబో టెలిస్కోపును చూడటానికి వెళ్లావు కదా, దాని గురించి వీళ్లకు చెప్తావా? 421 00:31:22,591 --> 00:31:27,179 మన దగ్గర ఉన్న టెలిస్కోపులు చూస్తే వాళ్లకి ఇంకా మజా వస్తుందేమో. అవి పైన ఉన్నాయి. 422 00:31:28,222 --> 00:31:30,807 శాస్త్రవేత్తకి థ్యాంక్స్ చెప్పండి. పదండి, పిల్లలు. వెళ్దాం 423 00:31:30,891 --> 00:31:32,184 -థ్యాంక్యూ! -పర్వాలేదు. 424 00:31:32,267 --> 00:31:34,102 -ఏం పర్వాలేదు. -మరేం పర్వాలేదు. బై. 425 00:31:34,186 --> 00:31:35,270 బై, పిల్లలూ. సరదాగా గడపండి. 426 00:31:37,981 --> 00:31:40,150 ఈ వర్షంలో వాళ్లకి ఏమీ కనిపించదు. 427 00:31:40,776 --> 00:31:43,487 పర్లేదులే. ఆడుకోనివ్వు. ఆసక్తి కలగవచ్చేమో. 428 00:31:44,821 --> 00:31:48,033 ఎందుకో తెలీదు కానీ, ఆ పిల్లలో ఒక్క మేధావి కూడా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. 429 00:31:48,742 --> 00:31:51,662 లైవ్ ఫీడ్ లో ఆగ్డెన్ కూడా జాయిన్ అయ్యేలా సెట్ చేశావా? 430 00:31:51,745 --> 00:31:54,081 నేను మాట్లాడేటప్పుడు ల్యాగ్ ఉండకూడదు. 431 00:31:59,545 --> 00:32:01,380 ఇవి స్వర్గం నుండి సందేశాలను తీసుకువస్తాయి. 432 00:32:04,132 --> 00:32:05,133 అంటే... 433 00:32:05,217 --> 00:32:07,886 ప్రాచీన ఈజిప్ట్ వాసులు, తుమ్మెదల గురించి అలానే అనుకొనేవళ్లు. 434 00:32:10,055 --> 00:32:11,890 దీనికి రెక్కలు లేవు. 435 00:32:42,421 --> 00:32:43,797 బర్టీతో మాట్లాడాను. 436 00:32:44,882 --> 00:32:47,134 జూలియా క్లయింట్స్ కి సంబంధించి నా నోట్స్ అడిగావట. 437 00:32:48,302 --> 00:32:49,386 అది కూడా విశ్రాంత సైనికులవి? 438 00:32:50,387 --> 00:32:52,055 నా కథనాన్ని నేనే ఫాలో అప్ చేయకూడదా? 439 00:32:55,642 --> 00:32:57,436 జూలియా క్లయింట్ రెండవ అంతస్థులో ఉంటాడు. 440 00:33:07,196 --> 00:33:08,906 ఏవండి. మీరు సంతకం పెట్టాల్సి ఉంటుంది. 441 00:33:09,448 --> 00:33:12,534 పేరు, సమయం, మీరు చూడటానికి వచ్చిన వ్యక్తి పేరు. 442 00:33:14,620 --> 00:33:16,455 బాబోయ్. ఇది మీరే కదా? 443 00:33:18,081 --> 00:33:19,166 -అవును. -నిజం చెప్తున్నా కదా, 444 00:33:19,249 --> 00:33:20,709 ఇక్కడ మరీ దారుణంగా ఉన్నారు మీరు. 445 00:33:21,877 --> 00:33:24,379 చనిపోయినప్పుడు, అందమైన ఫోటోలనే ముద్రిస్తారు, కాబట్టి... 446 00:33:25,797 --> 00:33:27,382 మీకు జరిగింది విని చింతిస్తున్నాను. 447 00:33:29,593 --> 00:33:31,220 మీకు జూలియా మాద్రిగల్ తెలుసా? 448 00:33:31,303 --> 00:33:32,763 నేను ఎక్కువగా నైట్ షిఫ్టులలో పని చేస్తాను. 449 00:33:32,846 --> 00:33:34,890 అయినా, తన అంటే ఇక్కడున్న చాలా మందికి ఇష్టం. 450 00:33:34,973 --> 00:33:37,434 గార్డీ 203వ గదిలో ఉంటాడు, అది పైన ఉంది. 451 00:33:37,518 --> 00:33:39,269 నేను దీన్ని ఇక్కడ అంటిస్తే, పర్వాలేదా? 452 00:33:46,777 --> 00:33:47,778 అతనేనా? 453 00:33:49,196 --> 00:33:50,197 అవును. 454 00:33:51,448 --> 00:33:52,616 అతనెవరో మీకు తెలుసా? 455 00:33:53,242 --> 00:33:55,327 హా, ఇక్కడికి కొన్నిసార్లు వచ్చాడు. 456 00:33:55,410 --> 00:33:56,703 అతనికి జూలియా తెలుసా? 457 00:33:56,787 --> 00:33:59,373 లేదు, అతను తన కోసం వచ్చేవాడు కాదు. 458 00:34:24,188 --> 00:34:25,815 గదులన్నీ వేర్వేరుగా ఉన్నాయేంటి? 459 00:34:26,440 --> 00:34:28,652 ఈ అంతస్థులో ఉన్నవాళ్లందరికీ జ్ఞాపకాల సమస్య ఉంది. 460 00:34:29,570 --> 00:34:33,364 ఏవీ సరిగ్గా గుర్తుండవు. కానీ ఇక్కడ ఉన్నారంటే, వీళ్ళ సమస్య చాలా తీవ్రమైనదని అర్థం, 461 00:34:38,745 --> 00:34:41,831 ఇంత మంది ఉన్నారు కనుక, వీళ్లందరినీ ప్రశాంతంగా, 462 00:34:41,915 --> 00:34:43,041 సురక్షితంగా మాత్రమే మేము ఉంచగలం. 463 00:34:44,208 --> 00:34:46,085 వాళ్ల గదుల్లో ఉండే సామాను, అదేనా వాళ్లకి గుర్తుండేది? 464 00:34:46,170 --> 00:34:49,715 అవును, వాళ్లకి సుపరిచితమైనది అది. క్రిందటి ఏడాది నుండే అలా చేయడం మొదలుపెట్టాం. 465 00:34:49,797 --> 00:34:50,841 ఉపయోగకరంగానే ఉంది. 466 00:34:56,471 --> 00:34:58,849 లియో మీకు ఎంత చెప్పగలడో ఏమో. 467 00:34:58,932 --> 00:35:00,934 మంచి రోజులతో పాటు చెడు రోజులు కూడా చూశాడు. 468 00:35:04,354 --> 00:35:05,898 జ్ఞాపకాల సమస్య ఉండేంత పెద్ద వయస్సులా అనిపించట్లేదే. 469 00:35:05,981 --> 00:35:08,442 అల్జీమర్స్ వ్యాధి చిన్న వయస్సులోనే వచ్చేసిందా? 470 00:35:08,525 --> 00:35:09,818 తన స్కాన్స్ లని పరిశీలిస్తే, 471 00:35:09,902 --> 00:35:11,695 అతనిలో లోపం ఉన్న ఆనవాళ్లే లేవు. 472 00:35:12,279 --> 00:35:13,488 మానసిక సమస్య అయ్యుంటుంది. 473 00:35:17,951 --> 00:35:19,036 ఏంటి ఇవ్వన్నీ? 474 00:35:19,119 --> 00:35:22,039 హేయ్, లియో, ఈ పతకాలన్నీ ఎక్కడ గెలుచుకున్నావు? 475 00:35:22,122 --> 00:35:24,333 అవి నీ దగ్గర మూడు, నాలుగు ఉన్నాయా? 476 00:35:26,752 --> 00:35:29,713 గల్లిపోలీ? ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి చెందినది. 477 00:35:30,214 --> 00:35:32,925 అవున. ఇతను పారిపోవడానికి చాలా సార్లు ప్రయత్నించాడు, 478 00:35:33,008 --> 00:35:35,677 చివరికి "పాత్స్ ఆఫ్ గ్లోరీ" అనే సినిమాను చూడటానికి కిందికి వెళ్లేవాడని కనిపెట్టాను. 479 00:35:35,761 --> 00:35:37,971 ఈ వస్తువులన్నీ ఇక్కడ పెట్టాక, ఎక్కడికీ కదలకుండా ఇక్కడే ఉన్నాడు. 480 00:35:38,055 --> 00:35:39,848 ...దయచేసి రిసెప్షన్ కౌంటర్ వద్దకు రండి. 481 00:35:39,932 --> 00:35:42,309 -ఒక్క నిమిషం. -...దయచేసి రిసెప్షన్ కౌంటర్ వద్దకు రండి. 482 00:35:54,112 --> 00:35:55,113 హేయ్, లియో. 483 00:35:57,824 --> 00:35:59,451 మీ స్నేహితుడు ఎవరో మాకు తెలుసు. 484 00:36:01,870 --> 00:36:05,082 అతని గురించి మాకు ఏమైనా చెప్తావా? నిన్ను చూడటానికి ఇక్కడికి వచ్చాడా? 485 00:36:12,881 --> 00:36:16,176 ఫైల్ లో ఎవరైనా సన్నిహితుని పేరు కానీ, కుటుంబస్థుల వివరాలు కానీ ఉండవచ్చు. 486 00:36:17,427 --> 00:36:18,428 నేను ఉంటానులే. 487 00:36:33,402 --> 00:36:34,736 నువ్వు కూడా సైన్యంలో పని చేశావా? 488 00:36:37,656 --> 00:36:38,657 వీళ్లలా? 489 00:36:42,786 --> 00:36:44,538 ఇవి తప్ప ఇంకే ఫోటోలు ఇక్కడ లేవు. 490 00:36:47,291 --> 00:36:48,375 కుటుంబ సభ్యులు ఎవరూ లేరా? 491 00:37:01,471 --> 00:37:05,767 నిన్ను కలవడానికి వచ్చే అతని పేరేంటి? 492 00:37:19,948 --> 00:37:23,577 నువ్వు ఇక్కడికి వచ్చావని అతనికి చెప్పవద్దు, సరేనా? 493 00:37:25,871 --> 00:37:26,872 ఎవరికి చెప్పవద్దు? 494 00:37:32,878 --> 00:37:34,004 ఇతనికేనా? 495 00:37:36,048 --> 00:37:38,300 చెప్తే, నన్ను రానివ్వడు. 496 00:37:39,343 --> 00:37:40,344 మీ ఇంటికా? 497 00:37:40,844 --> 00:37:41,970 ఇంటికి. 498 00:37:43,889 --> 00:37:46,350 అది ఎక్కడ ఉంది? అక్కడికి మనిద్దరం వెళ్లవచ్చు. 499 00:37:46,433 --> 00:37:49,811 వద్దు, నువ్వు దూరంగా ఉండు. అతని దరిదాపుల్లోకి వెళ్లకు. 500 00:37:50,521 --> 00:37:51,522 సరే. 501 00:37:52,940 --> 00:37:53,941 సరే. 502 00:38:08,080 --> 00:38:09,915 నువ్వు చెప్పావని అతనికి చెప్పేస్తాలే. 503 00:38:11,667 --> 00:38:13,085 నేనేం అన్నాను? 504 00:38:14,044 --> 00:38:16,255 అతను ఎక్కడ ఉంటాడో చెప్పావుగా. 505 00:38:17,965 --> 00:38:22,219 చెప్పానా? ఎప్పుడు? 506 00:38:24,596 --> 00:38:25,597 ఇప్పుడే. 507 00:38:27,724 --> 00:38:30,644 నేను... నేను దాన్ని తీసుకున్నానని అతనికి తెలుసా? 508 00:38:32,646 --> 00:38:33,647 తెలుసు. 509 00:38:36,692 --> 00:38:37,943 అందుకే ఇక్కడికి వచ్చా. 510 00:38:38,026 --> 00:38:43,782 దాన్ని తీసుకొని, అతడికి ఇచ్చేయాలి. 511 00:38:44,700 --> 00:38:47,995 కానీ అతని గురించి నీకు తెలీదు. ఆ అవకాశం లేదు. 512 00:38:50,247 --> 00:38:51,373 నాకు అతను తెలుసు. 513 00:38:57,004 --> 00:38:58,714 అతను ఎక్కడ ఉంటాడో కూడా నువ్వు చెప్పావు. 514 00:38:59,381 --> 00:39:02,301 లేదు. నేనేం చెప్పలేదు. 515 00:39:03,802 --> 00:39:05,387 కానీ అతనికి ఆ విషయం తెలీదులే. 516 00:39:07,139 --> 00:39:09,641 కానీ నేను అతడిని కనుగొని, చెప్పింది నువ్వే అని చెప్పేస్తా. 517 00:39:47,846 --> 00:39:49,056 దాన్ని అతనికి ఇచ్చేయ్. 518 00:39:52,392 --> 00:39:54,895 కానీ అది తీసుకున్నది నేనని మాత్రం చెప్పకు. 519 00:39:57,397 --> 00:39:58,815 సరే మరి, సిద్ధంగా ఉన్నావా? 520 00:39:59,775 --> 00:40:00,776 చూద్దాం మరి. 521 00:40:02,528 --> 00:40:03,654 సరే, ఇక మొదలుపెట్టు. 522 00:40:07,741 --> 00:40:09,243 అలా కాదు. 523 00:40:10,369 --> 00:40:14,039 టీనీస్ లా. నువ్వు ఎలా చెప్తావో అలా చెప్పు. ఫ్రెంచ్ వద్దు. 524 00:40:15,749 --> 00:40:18,502 -ఎందుకు? నీకు అది ప్యారిస్ గుర్తుకు తెప్పిస్తుందా? -అవును, అదే కావచ్చు. 525 00:40:18,585 --> 00:40:20,462 అతనే. అది అతని గొంతే. 526 00:40:20,546 --> 00:40:22,172 నువ్వు అక్కడికి వెళ్లలేదని నాకు తెలుసు. 527 00:40:22,256 --> 00:40:24,007 -లియో చెప్పేశాడు. -వాడికి తెలీదు. 528 00:40:24,091 --> 00:40:25,425 కెమెరా ఆన్ లో ఉంది. నువ్వు మొదలుపెడతావా? 529 00:40:25,509 --> 00:40:26,802 ఆమెకి అతను తెలుసు. 530 00:40:26,885 --> 00:40:28,679 నేను మొదలుపెట్టను. 531 00:40:32,683 --> 00:40:33,767 ఆపేయ్. 532 00:41:17,394 --> 00:41:18,520 హేయ్, జిమ్మీ. 533 00:41:30,866 --> 00:41:32,075 షారొన్ ఎవరో నీకు ఎలా తెలుసు? 534 00:41:35,412 --> 00:41:36,705 మీ ఇద్దరినీ కలిసి ఉండగా చూశాను. 535 00:41:41,960 --> 00:41:43,337 నీ ఉద్దేశం కిర్బీయా? 536 00:41:46,423 --> 00:41:47,591 అది తన పేరు కాదు. 537 00:41:51,803 --> 00:41:53,597 నా తరఫున నువ్వు తనతో మాట్లాడాలి. 538 00:41:57,351 --> 00:42:00,562 అలాగే. ఏం చెప్పమంటావు? 539 00:42:00,646 --> 00:42:02,064 నువ్వు ఇప్పుడు చెప్పేస్తున్నావుగా. 540 00:42:05,192 --> 00:42:09,780 అవును. చూడు, నేను... 541 00:42:13,575 --> 00:42:15,285 నాకేమైనా అనిపిస్తే, అది అతనికి తెలుస్తుంది. 542 00:42:18,455 --> 00:42:20,374 రికార్డులలో నీకేమైనా కాంటాక్ట్స్ దొరికాయా? 543 00:42:20,457 --> 00:42:23,418 లియో ప్రభుత్వ సంరక్షణలో ఉన్నాడు. నేను వెటరన్స్ అఫెయిర్స్ శాఖని సంప్రదించి చూస్తాను. 544 00:42:25,087 --> 00:42:28,131 ఏంటి? ఏమైంది? 545 00:42:30,425 --> 00:42:31,552 ఇది నీ కారు కాదే. 546 00:42:38,350 --> 00:42:40,185 తనకి తెలుస్తుంది... 547 00:42:42,521 --> 00:42:43,522 అవును. 548 00:42:47,651 --> 00:42:50,571 హేయ్, హేయ్. చెప్పా కదా. 549 00:42:53,031 --> 00:42:54,032 ఇవాళ కాదు. 550 00:44:01,517 --> 00:44:02,768 నేను రైల్లో వెళ్తాను. 551 00:44:06,063 --> 00:44:07,773 నేను ఇక్కడికి దేనిలో వచ్చానని అనుకున్నావు? 552 00:44:15,113 --> 00:44:17,324 సెలికా కారు. గోధుమ రంగుది. 553 00:44:18,158 --> 00:44:20,410 డ్రైవర్ పక్క సీట్లో ఉండే సీటు బెల్ట్ విరిగిపోయింది. 554 00:44:20,911 --> 00:44:24,039 అక్కడ కూర్చొన్నవారు బాగా దమ్ము కొట్టి ఉంటారు. కిటికీ దగ్గర కాల్చినట్టు గుర్తులు ఉంటాయి. 555 00:44:25,290 --> 00:44:26,291 నువ్వు అన్నది నిజమే. 556 00:44:26,375 --> 00:44:29,294 నా మాజీ భార్య ఆ కారు గురించి అస్సలు పట్టించుకోలేదు. 557 00:44:29,378 --> 00:44:31,296 -నీకు అది గుర్తుందా? -హా. 558 00:44:31,380 --> 00:44:34,591 రెండేళ్ల క్రితమే అమ్మేశాను, దానిలో ఇక్కడికి నేను రానే లేదు. 559 00:44:36,176 --> 00:44:39,388 నీ చుట్టూ ఉన్నవి మారినప్పుడు, దాన్ని నువ్వు గుర్తుపట్టగలవా? 560 00:44:40,430 --> 00:44:41,431 అప్పుడప్పుడూ గుర్తుపట్టగలను. 561 00:44:42,599 --> 00:44:44,434 మిగతా సార్లనీ, ఏవి పడితే అవి మారిపోతుంటాయి. 562 00:44:45,018 --> 00:44:46,436 బహుశా అవి భవిష్యత్తును సూచిస్తాయేమో. 563 00:46:12,147 --> 00:46:14,149 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య