1 00:00:11,720 --> 00:00:14,556 యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది 2 00:00:15,891 --> 00:00:17,851 ఈరాత్రి వార్తలను హరికేన్ కత్రినాతో మొదలుపెడుతున్నాం, ఇది ఈ దేశం… 3 00:00:17,935 --> 00:00:18,936 న్యూ ఆర్లీన్స్ అయిదవ కేటగిరీ 4 00:00:19,019 --> 00:00:20,437 …ఎదుర్కోబోయే భారీ తుఫానుల్లో ఒకటి కావచ్చు. 5 00:00:20,521 --> 00:00:23,106 ఈ భారీ తుఫాను గల్ఫ్ తీరం వైపుగా దూసుకు వెళ్తోంది. 6 00:00:23,190 --> 00:00:26,193 మనం చూస్తున్నది అయిదవ కేటగిరీ తుఫాను, హరికేన్ కత్రినా. 7 00:00:26,276 --> 00:00:28,904 ఇప్పుడు హరికేన్ కత్రినా అయిదవ కేటగిరీలోకి ప్రవేశించింది. 8 00:00:28,987 --> 00:00:32,241 ఇప్పుడు నగరాన్ని వదిలి వెళ్లిపోవడమే మేలని సిఫార్సు చేస్తున్నాం. 9 00:00:32,323 --> 00:00:35,160 హరికేన్ కత్రినా ఇప్పుడు అయిదవ కేటగిరీ తుఫానుగా మారింది. 10 00:00:35,244 --> 00:00:37,079 తీర ప్రాంతాలకు ఈ తుఫాను 11 00:00:37,162 --> 00:00:38,163 చాలా ప్రమాదకరం కాగలదు. 12 00:00:38,247 --> 00:00:40,123 ఇది కేవలం ఆరంభం మాత్రమే. 13 00:00:40,207 --> 00:00:42,000 న్యూ ఆర్లీన్స్ నగరం… 14 00:00:42,084 --> 00:00:44,086 …రేపు ఇదే సమయానికి, ఇక్కడి నుండి వెళ్లిన ప్రజలకు 15 00:00:44,169 --> 00:00:46,296 తిరిగి వచ్చాక తమ ఇళ్లు ఉండకపోవచ్చు. 16 00:00:46,380 --> 00:00:47,756 …నీట మునిగిన న్యూ ఆర్లీన్స్. 17 00:00:47,840 --> 00:00:48,966 హరికేన్ కత్రినా… 18 00:00:49,049 --> 00:00:50,300 హరికేన్ కత్రినా… 19 00:00:50,384 --> 00:00:53,178 ఇలాంటి తుఫాను తప్పదని కొందరు చాలా కాలం నుండి ఆందోళన వ్యక్తం చేశారు. 20 00:00:54,847 --> 00:00:58,058 సెప్టెంబర్ 11 21 00:00:58,141 --> 00:01:00,269 న్యూ ఆర్లీన్స్ 22 00:01:01,395 --> 00:01:04,272 హరికేన్ కత్రినా శాంతించిన 13 రోజుల అనంతరం 23 00:01:39,892 --> 00:01:42,311 దేవుడా, మమ్మల్ని ఆదుకో 24 00:02:12,508 --> 00:02:15,219 మెమోరియల్ 25 00:02:49,002 --> 00:02:51,839 వైద్య సిబ్బంది మాత్రమే 26 00:03:26,123 --> 00:03:28,333 ప్రవేశించరాదు 27 00:03:38,594 --> 00:03:41,680 బాబోయ్, జిమ్, మేము ప్రార్థనా స్థలంలో ఉన్నాం. 28 00:03:42,472 --> 00:03:46,059 సారా, నువ్వు వెంటనే ఈ దృశ్యాన్ని చూడాలి. రెండవ అంతస్థులోని వాక్ వేకి వెంటనే రా. 29 00:04:11,710 --> 00:04:13,629 అయితే, డాక్టర్ బాల్జ్, 30 00:04:13,712 --> 00:04:17,298 హరికేన్ కత్రినా శాంతించాక మెమోరియల్ మెడికల్ సెంటరులో 31 00:04:17,382 --> 00:04:19,091 నలభై అయిదు మృతదేహాలు కనిపించాయి. 32 00:04:19,176 --> 00:04:20,385 నలభై అయిదు. 33 00:04:21,803 --> 00:04:23,055 అవును. 34 00:04:23,138 --> 00:04:28,685 తుఫాను తాకాక అయిదు రోజులు అందరమూ అక్కడే ఉన్నాం. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. 35 00:04:28,769 --> 00:04:30,729 కానీ మీ ఆసుపత్రిలో 45 మంది చనిపోయారు. 36 00:04:30,812 --> 00:04:33,982 ఏదో కావాలని చేశామన్నట్టుగా మీరు అంటున్నారు. మీరు… 37 00:04:34,066 --> 00:04:35,984 అది కావాలని చేసిన పనేనా, డాక్టర్? 38 00:04:36,068 --> 00:04:41,114 కాస్త ఆలోచించండి. మీరు పరిస్థితులని అర్థం చేసుకోవాలి. 39 00:04:41,198 --> 00:04:43,492 మాకు మొదట్నుంచీ చెప్పండి, డాక్టర్. 40 00:04:43,575 --> 00:04:45,994 ఆ భవనంలో రెండు ఆసుపత్రులు ఉన్నాయి కదా, డాక్టర్? 41 00:04:46,078 --> 00:04:49,248 అవును, నిజమే. రెండు ఆసుపత్రులు ఉన్నాయి. 42 00:04:49,331 --> 00:04:53,126 ఒకటి నేను పని చేసిన మెమోరియల్ హాస్పిటల్, ఇంకోటి లైఫ్ కేర్, 43 00:04:53,210 --> 00:04:56,880 అది ఏడవ అంతస్థులో ఉన్న లాంగ్-టర్మ్ కేర్ క్లినిక్. 44 00:04:56,964 --> 00:04:59,800 దాని సిబ్బంది, రోగులు వేరు అన్నమాట. 45 00:05:00,759 --> 00:05:04,388 కానీ సరిగ్గా తుఫాను తాకే ముందు, 46 00:05:04,471 --> 00:05:08,892 మేము అదనంగా 1,200 మందికి ఆశ్రయం ఇచ్చాం. 47 00:05:08,976 --> 00:05:14,606 తుఫానుల సమయంలో మేము ఎల్లప్పుడూ జనాలకు ఆశ్రయం ఇస్తూనే ఉన్నాం. 48 00:05:14,690 --> 00:05:16,608 అది అసాధారణమైనదేమీ కాదు. 49 00:05:16,692 --> 00:05:18,735 మరి ఇదేదీ అసాధారణమైనది కానప్పుడు… 50 00:05:18,819 --> 00:05:21,655 అయిదు రోజులలో అంత మంది రోగులు ఎలా చనిపోయారు? 51 00:05:24,783 --> 00:05:28,453 డాక్టర్, ఈ 45 మంది ఎలా చనిపోయారు? 52 00:05:34,877 --> 00:05:39,590 నీటిలో ముందుకు సాగండి 53 00:05:41,758 --> 00:05:46,513 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 54 00:05:47,598 --> 00:05:52,394 నీటిలో ముందుకు సాగండి 55 00:05:52,477 --> 00:05:57,691 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 56 00:05:57,774 --> 00:06:02,362 నీటిలో ముందుకు సాగండి 57 00:06:02,446 --> 00:06:07,743 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 58 00:06:07,826 --> 00:06:11,830 పురుషులు నది వద్దకు వెళ్లారు 59 00:06:12,789 --> 00:06:17,711 పురుషులు నది వద్దకు వెళ్లారు, ప్రభువా 60 00:06:17,794 --> 00:06:21,965 పురుషులు నది వద్దకు వెళ్లారు 61 00:06:22,799 --> 00:06:26,470 అక్కడికి ప్రార్థించడానికి వెళ్లారు 62 00:06:28,096 --> 00:06:31,934 నీటిలో ముందుకు సాగండి 63 00:06:33,185 --> 00:06:38,023 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 64 00:06:38,106 --> 00:06:39,525 షెరీ ఫింక్ రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 65 00:06:39,608 --> 00:06:41,985 నీటిలో ముందుకు సాగండి 66 00:06:42,694 --> 00:06:47,699 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 67 00:06:52,829 --> 00:06:58,836 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 68 00:07:03,507 --> 00:07:06,385 మొదటి రోజు 69 00:07:06,927 --> 00:07:10,305 నేషనల్ గార్డ్ వాళ్లు… హరికేన్ కత్రినా ఇప్పుడు 70 00:07:10,389 --> 00:07:12,015 అయిదవ కేటగిరీ తుఫానుగా మారిందని అంటున్నారు. 71 00:07:12,099 --> 00:07:13,392 ఆగస్ట్ 29, 2005 అర్ధరాత్రి 12:20 72 00:07:13,475 --> 00:07:14,560 తీరాన్ని తాకే ఆరు గంటల ముందు 73 00:07:14,643 --> 00:07:17,145 జనాలకు ఏం చేయాలో చెప్పి, 74 00:07:17,229 --> 00:07:18,689 సరైన విధంగా మార్గనిర్దేశం చేస్తే సరిపోతుంది. 75 00:07:18,772 --> 00:07:20,816 -వాళ్లు తప్పకుండా సహకరిస్తారు. -నియమాలను ఊరికే పెట్టలేదు కదా. 76 00:07:20,899 --> 00:07:22,025 నియమాలను ఊరికే పెట్టలేదు. 77 00:07:22,109 --> 00:07:26,363 ఇవైంగ్, జనాలకు ఆసుపత్రి చాలా సార్లు ఆశ్రయం ఇచ్చింది, ఇదేమీ మొదటిసారి కాదు. 78 00:07:26,446 --> 00:07:27,573 అది నీకూ తెలుసు. 79 00:07:28,448 --> 00:07:30,993 ఇది ఎమర్జెన్సీ గది. జూ కాదు. 80 00:07:31,076 --> 00:07:33,871 అలా అంటావేంటి! వీళ్లందరూ మన ఇరుగుపొరుగున ఉండేవాళ్లు. 81 00:07:33,954 --> 00:07:35,122 -మనం ఈ మాత్రమైనా సాయం చేయాలి. -మంచిది. 82 00:07:35,205 --> 00:07:37,040 -సరే. -మనం వాళ్లని బాగానే చూసుకుందాం, 83 00:07:37,124 --> 00:07:40,169 కానీ పెంపుడు జంతువులను బేస్మెంటులో పెట్టి వాటిని కూడా తగిన విధంగా చూసుకుందాం… 84 00:07:40,252 --> 00:07:42,379 -అంటే… -…నియమాల్లో కూడా అదే రాసుంది. 85 00:07:42,462 --> 00:07:43,505 హరికేన్ కత్రినా 86 00:07:43,589 --> 00:07:45,257 గల్ఫ్ ప్రాంతంలో ఇప్పుడు చాలా వేడిగా ఉంది. 87 00:07:45,340 --> 00:07:47,634 కొన్ని ప్రాంతాలలో 30 డిగ్రీల నుండి 33 డిగ్రీల ఉష్టోగ్రత ఉంది. 88 00:07:47,718 --> 00:07:49,553 సరేనా? మనం వాళ్లని చూసుకోవాలి. 89 00:07:49,636 --> 00:07:52,973 మనం ఈ జనాల బాగోగులు చూసుకోవాలి. మన మిషన్ కూడా అదే. 90 00:07:53,640 --> 00:07:57,144 -ఈ జంతువులకు… -చూడు, ఇంకో అర గంటలో సిబ్బంది సమావేశం ఉంది. 91 00:07:57,227 --> 00:07:58,437 ఆనా. 92 00:07:58,520 --> 00:07:59,521 ఆనా. 93 00:07:59,605 --> 00:08:01,899 హోరెస్, వీళ్లని చూసుకోవడానికి ఇన్ ఛార్జీని ఎవరినైనా పెట్టారా? 94 00:08:01,982 --> 00:08:04,318 వాళ్లకు అక్కర్లేదులే, వాళ్లు బాగానే ఉన్నారు. 95 00:08:04,401 --> 00:08:06,653 నేను ఈ పని డజను సార్లు చేసుంటా, నాకు కొత్తేం కాదు. 96 00:08:06,737 --> 00:08:11,158 మంచు తుఫాను సమయాల్లో విమానాశ్రయాల్లో జనం ఎలా అయితే ఉంటారో, ఇక్కడ కూడా అలాగే అనుకో. 97 00:08:11,241 --> 00:08:15,120 నువ్వు ఆసుపత్రికి రావాల్సిన పని లేదే. చాలా మంది సిబ్బంది ఉన్నారు కదా. 98 00:08:15,204 --> 00:08:17,581 అది కాదు, సర్జరీ అయిన రోగులను చెక్ చేద్దామని వచ్చా. 99 00:08:17,664 --> 00:08:20,167 ఇంటిని విన్స్ చూసుకోగలడులే. నాకు ఇక్కడికి రావాలనిపించింది. 100 00:08:20,250 --> 00:08:22,794 -ఇక్కడ ఉండాలనే నాకు అనిపిస్తుంటుంది. -అర్థమైంది. 101 00:08:23,879 --> 00:08:26,798 అరగంటలో సీనియర్ సిబ్బంది సమావేశం ఉందని సూసన్ అంది, సరేనా? 102 00:08:26,882 --> 00:08:28,133 -సరే. థ్యాంక్యూ. -పర్వాలేదు. 103 00:08:42,606 --> 00:08:44,691 మెమోరియల్ 104 00:09:17,516 --> 00:09:19,184 అందరికీ గుడ్ మార్నింగ్. 105 00:09:19,268 --> 00:09:20,435 గుడ్ మార్నింగ్. 106 00:09:21,436 --> 00:09:23,814 ఇతర డాక్టర్లలాగా మీరు మీ ఆఫీసులో ఉండట్లేదా? 107 00:09:23,897 --> 00:09:25,023 ఏదైనా కలిసే ఎదుర్కోవాలి కదా? 108 00:09:25,107 --> 00:09:26,525 క్యాంపింగ్ లాగా అన్నమాట. 109 00:09:26,608 --> 00:09:29,987 మనం మంట వేసుకుంటే బాగుంటుందేమో. ఏసీని తగ్గిస్తే నేను అస్సలు భరించలేను. 110 00:09:30,696 --> 00:09:32,197 ఏంటది? 111 00:09:34,074 --> 00:09:35,200 క్యాన్ ఓపెనర్. 112 00:09:35,284 --> 00:09:40,205 అంతే తెచ్చుకున్నారా? కొన్ని స్నాక్స్, టూనా చేప, ఇంకా క్యాన్ ఓపెనర్. 113 00:09:42,916 --> 00:09:46,128 ఎంత దారుణమైనా, మహా అంటే మనం ఇక్కడ మూడు రోజులు ఉంటాం, అంతేగా? 114 00:09:46,211 --> 00:09:47,880 ఈ ఆసుపత్రిలో మీకు ఇది తొలి తుఫానా? 115 00:09:47,963 --> 00:09:49,256 అవును. 116 00:09:52,176 --> 00:09:53,760 ఏమైంది? ఏమైనా సమస్యనా? 117 00:09:53,844 --> 00:09:55,220 లేదు, అంటే… 118 00:09:55,304 --> 00:09:57,639 మీరు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు, అది బాగుంది. అంతే. 119 00:09:58,515 --> 00:10:00,893 ఆ పాజిటివ్ ఆలోచనా దృక్పథం మరీ అతిగా ఉందా, లేదా మరీ తక్కువగా ఉందా అని బయటపడేలా 120 00:10:00,976 --> 00:10:02,895 మరీ అంత క్లిష్టమైన పరిస్థితి రాకూడదని కోరుకుందాం. 121 00:10:03,854 --> 00:10:04,855 అవును. 122 00:10:05,606 --> 00:10:06,607 తప్పకుండా. 123 00:10:10,903 --> 00:10:13,155 నేను రౌండ్స్ కి వెళ్తున్నాను. మిమ్మల్ని అక్కడ కలుస్తా మరి. 124 00:10:35,594 --> 00:10:37,429 హా. అది చాలు. వెళ్దాం పదండి. 125 00:10:41,808 --> 00:10:45,646 అందరూ లోపలికి రండి. సర్దుకోండి. 126 00:10:45,729 --> 00:10:48,023 -అలాగే, మేడమ్. -అర్థమైంది. హా. 127 00:10:48,106 --> 00:10:51,109 అందరూ దగ్గరగా ఉండండి. ఇంత చలిలో వెచ్చగా ఉంటే బాగా ఉంటుంది కదా. 128 00:10:52,986 --> 00:10:54,279 అందరికీ నా గొంతు వినిపిస్తోందా? 129 00:10:54,363 --> 00:10:55,447 హా, వినిపిస్తోంది. 130 00:10:55,531 --> 00:10:59,243 సరే మరి. నేనెవరో తెలీని వారికి చెప్తున్నాను, నా పేరు సూసన్ మల్డేరిక్, 131 00:10:59,326 --> 00:11:01,286 ఈ తుఫానుకు నేనే విపత్తు కమాండర్ ని, 132 00:11:01,370 --> 00:11:05,541 నాకు మీకంతా ఇప్పటికే పీకల్లోతు పని ఉందని తెలుసు, 133 00:11:05,624 --> 00:11:09,795 మీ కుటుంబ సభ్యుల గురించి, మీ ఆత్మీయుల గురించి మీకు ఆందోళనగా ఉందని కూడా తెలుసు. 134 00:11:09,878 --> 00:11:11,213 మనందరిదీ అదే పరిస్థితి. 135 00:11:11,296 --> 00:11:15,843 కానీ లోపలా, బయట ఏం జరుగుతోందనేది పక్కకు పెడితే, 136 00:11:15,926 --> 00:11:18,095 ఈ ఆసుపత్రి ఇంకా ఆపరేషన్ లో ఉంది. 137 00:11:18,804 --> 00:11:22,599 ఈ తుఫాను వెళ్లిపోయేదాకా, మనం కొన్ని ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ని అనుసరించాల్సి ఉంటుంది. 138 00:11:22,683 --> 00:11:25,269 -నా సహాయకులు ఎక్కడ ఉన్నారు? -ఇక్కడే ఉన్నా. 139 00:11:25,352 --> 00:11:26,812 మీ అందరి దగ్గరా వాకీ టాకీలు ఉన్నాయి కదా? 140 00:11:26,895 --> 00:11:28,522 -అందరి దగ్గరా ఉన్నాయి కదా? -ఉంది, మేడమ్. 141 00:11:28,605 --> 00:11:29,690 -హా. -సరే. 142 00:11:29,773 --> 00:11:35,279 స్పష్టంగా చెప్పాలంటే, ఈ సహాయకులు పేషెంట్ యూనిట్స్ కి ఇన్ ఛార్జీలు అన్నమాట, 143 00:11:35,362 --> 00:11:39,950 ఫలానా యూనిట్ లో ఏ అత్యవసర పరిస్థితి తలెత్తినా వాళ్లు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. 144 00:11:40,033 --> 00:11:44,788 ఆసుపత్రిపరంగా ఏం చేయాలన్నా, అందుకు నేను కానీ రెనే కానీ అనుమతించాలి. 145 00:11:44,872 --> 00:11:46,665 -నేను కూడా. -రిచర్డ్ కూడా. 146 00:11:46,748 --> 00:11:47,791 మర్చిపోయా క్షమించు. 147 00:11:47,875 --> 00:11:52,713 రిచర్డ్… రిచర్డ్ తాత్కాలికంగా రూబెన్ స్థానంలో ఉంటాడు, ఎందుకంటే రూబెన్ సెలవులపై ఎక్కడికో వెళ్లాడు. 148 00:11:53,505 --> 00:11:55,257 -బూ! -ఇక ఆపండి. 149 00:11:55,340 --> 00:11:58,385 మీ స్టాఫ్ ప్రెసిడెంట్ విషయంలో మీరు అలా అంటున్నందుకు మీరందరూ సిగ్గు పడాలి. 150 00:11:59,761 --> 00:12:01,221 ఈ సమయంలో సెలవులు పెట్టి పండగ చేసుకుంటున్నాడు. 151 00:12:04,099 --> 00:12:05,559 ఏవైనా సందేహాలు ఉన్నాయా? 152 00:12:06,935 --> 00:12:09,313 ఎయిర్ కండిషనింగ్ గురించి అందరూ అడుగుతున్నారు. 153 00:12:09,396 --> 00:12:13,358 కావాలనే ఉష్ణోగ్రతను బాగా తగ్గించామని చెప్పండి. 154 00:12:13,442 --> 00:12:14,860 నగరంలో కరెంట్ పోతే, 155 00:12:14,943 --> 00:12:17,696 మన బ్యాకప్ జనరేటర్స్ వల్ల ఏసీలు నడవవు, 156 00:12:17,779 --> 00:12:20,574 మరి ఇక్కడేమో ఊరికే వేడెక్కిపోతుంది. 157 00:12:20,657 --> 00:12:24,995 కాబట్టి, చల్లగా ఉన్నంత వరకూ, అంతా బాగానే ఉందని వాళ్లకి అర్థమవుతుంది. 158 00:12:25,078 --> 00:12:26,163 ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? 159 00:12:26,246 --> 00:12:31,210 హా. సూసన్, మనం లైఫ్ కేర్ వాళ్లతో ఏమైనా మాట్లాడామా? 160 00:12:31,293 --> 00:12:35,422 అంటే, వాళ్ల కార్యకలాపాలు స్వతంత్రంగా జరుగుతాయని నాకు తెలుసు, కానీ అది కూడా మనమున్న భవనంలోనే ఉంది కదా. 161 00:12:36,089 --> 00:12:39,676 వాళ్లే సొంతంగా ఏదోక అత్యవసర ప్లాన్ ని సెట్ చేసుకోవాలి, ఇంకా అది… 162 00:12:39,760 --> 00:12:42,054 అది ఖరీదైన ఆసుపత్రి కదా, కాబట్టి ఏదైనా అవసరమైతే, 163 00:12:42,137 --> 00:12:44,097 మనమే వాళ్ల దగ్గరికి వెళ్లాల్సి వస్తుందేమో. 164 00:12:45,390 --> 00:12:48,310 ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? 165 00:12:48,393 --> 00:12:51,104 సరే మరి. నేను ఈ మెమోరియల్ ఆసుపత్రిలో చాలా కాలం నుండి పని చేస్తున్నాను, 166 00:12:51,188 --> 00:12:52,523 -కాబట్టి ఈ… -బ్యాప్టిస్ట్. 167 00:12:52,606 --> 00:12:58,111 నేను ఈ ఆసుపత్రిలో చాలా కాలం నుండి పని చేస్తున్నాను, కాబట్టి ఇలాంటి తుఫానులన్నీ పెద్ద ప్రభావం చూపకుండానే 168 00:12:58,195 --> 00:12:59,404 వెళ్లిపోతాయని నాకు తెలుసు. 169 00:12:59,488 --> 00:13:03,575 అలా అని మనం ఏ అత్యవసర పరిస్థితి తలెత్తినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. 170 00:13:03,659 --> 00:13:05,994 కాబట్టి, మన పనిని మనం సక్రమంగా చేద్దాం. 171 00:13:07,287 --> 00:13:09,665 అంతే. ఇక అందరూ పనులకు వెళ్లండి! 172 00:13:10,832 --> 00:13:12,584 సరే మరి. సూపర్. థ్యాంక్స్. థ్యాంక్స్. 173 00:13:14,002 --> 00:13:16,964 న్యూ ఆర్లీన్స్ నగరంలో పరిస్థితి దయనీయంగా ఉంది. 174 00:13:17,047 --> 00:13:18,048 లైఫ్ కేర్ 175 00:13:18,131 --> 00:13:19,675 మీరు చల్మేట్ శాఖ నుండి వస్తున్నారా? 176 00:13:19,758 --> 00:13:21,385 -అవును. -నా పేరు డయేన్ రోబిషో. 177 00:13:21,468 --> 00:13:24,221 -నా పేరు జీనా ఇస్బెల్. -ఎంత మంది రోగులను తీసుకువచ్చారు? 178 00:13:24,304 --> 00:13:26,056 -పందొమ్మిది మందిని. -దేవుడా. 179 00:13:26,139 --> 00:13:30,185 హా. అంటే కార్పొరేట్ వాళ్లు, తుఫాను ప్రభావం చల్మేట్ లో చాలా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. 180 00:13:30,269 --> 00:13:33,438 అక్కడి నుండి ఈ లైఫ్ కేర్, బ్యాప్టిస్ట్ లోకే తరలించడమే మేలని అనుకుంటున్నారు. 181 00:13:33,522 --> 00:13:34,648 ఇప్పుడు ఆసుపత్రి పేరు "మెమోరియల్." 182 00:13:34,731 --> 00:13:36,984 "బ్యాప్టిస్ట్" అని పిలిస్తే, మిమ్మల్ని ముసలోళ్ల కింద లెక్కేసేస్తారు. 183 00:13:37,067 --> 00:13:40,028 కార్పొరేషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. 184 00:13:40,112 --> 00:13:43,240 వాళ్లకి నచ్చిన పేరు పెట్టుకోనివ్వండి. నాకు మాత్రం, దీని పేరు బ్యాప్టిస్టే. 185 00:13:45,284 --> 00:13:46,994 అందరూ బాగా సర్దుకుపోయారా? 186 00:13:47,077 --> 00:13:49,746 -హా. నా బెస్ట్ టీమ్ ని తెచ్చాను. -వావ్. మంచిది. 187 00:13:49,830 --> 00:13:55,085 కానీ ఒక రోగిని మాత్రం కాస్త కనిపెట్టుకొని ఉండాలి. ఎమ్మెట్ ఎవరెట్. పక్షవాతం ఉంది, మధుమేహం కూడా ఉంది. 188 00:13:55,169 --> 00:13:58,213 అతడిని ఒక బెడ్ లో వేశాను, కానీ అతనిపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. 189 00:13:58,297 --> 00:14:01,091 -సరే. మీకు ఏం కావాలన్నా, మాకు చెప్పండి. -సరే. థ్యాంక్స్, హనీ. 190 00:14:01,175 --> 00:14:05,304 తుఫాను అయిదవ కేటగిరీలోకి ప్రవేశించి భీకర అవతారమెత్తింది. గంటకు 160మైళ్ల వేగంతో గాలులు… 191 00:14:05,387 --> 00:14:06,680 గుడ్ మార్నింగ్, ఏంజెలా. 192 00:14:07,431 --> 00:14:08,473 గుడ్ మార్నింగ్, డయేన్. 193 00:14:09,558 --> 00:14:10,559 వీల్డా. 194 00:14:12,060 --> 00:14:13,103 వీల్డా. 195 00:14:14,188 --> 00:14:15,355 మీ అమ్మ ఎలా ఉంది? 196 00:14:15,981 --> 00:14:19,484 అమ్మా, నీకు ఎలా ఉందో డయేన్ కి చెప్పు. 197 00:14:20,194 --> 00:14:21,361 చాలా బాగున్నాను. 198 00:14:21,445 --> 00:14:24,406 -హా? బాగున్నారా? -బాగున్నా. 199 00:14:24,489 --> 00:14:25,699 సరే. 200 00:14:25,782 --> 00:14:26,992 ఈమె శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గింది. 201 00:14:27,075 --> 00:14:30,704 అది చాలా మంచి విషయం. తను ఇన్ఫెక్షన్ ని పోరాడుతోంది. 202 00:14:31,371 --> 00:14:33,332 తుఫాను సమయంలో మీ అమ్మతో మీరు ఇక్కడే ఉంటారా? 203 00:14:33,415 --> 00:14:34,541 -అవును. -సరే. 204 00:14:34,625 --> 00:14:38,587 కిచెన్ లో ఆహారం చేస్తున్నారు అనుకుంటా. మీకేమైనా అవసరమైతే తెచ్చుకోండి. 205 00:14:38,670 --> 00:14:39,671 -థ్యాంక్యూ. -పర్వాలేదు. 206 00:14:40,547 --> 00:14:43,967 కానీ మీ అమ్మగారు బాగానే కోలుకుంటున్నట్టున్నారు. 207 00:14:46,303 --> 00:14:48,805 ఇక్కడి పరిస్థితి నేను ఊహించుకున్న దానికి భిన్నంగా ఉంది. 208 00:14:48,889 --> 00:14:52,476 అసుపత్రి జనాలతో నిండిపోయి ఉంది. వాళ్లతో పెంపుడు జంతువులను కూడా తెచ్చుకున్నారు. 209 00:14:53,060 --> 00:14:56,897 అంతా గందరగోళంగా ఉంది. 210 00:14:57,856 --> 00:15:00,234 -హా. -కానీ అందరూ మామూలుగానే ఉన్నారు. 211 00:15:00,984 --> 00:15:02,444 మామూలుగానే ఉందేమో, ఏమంటావు? 212 00:15:02,528 --> 00:15:05,447 ఈ పరిస్థితిని ఇంతకు ముందు అనుభవించిన వారికి ఇది మామూలే ఏమో. 213 00:15:06,657 --> 00:15:08,033 హా. 214 00:15:08,116 --> 00:15:09,284 నన్ను చూసి నవ్వారు. 215 00:15:09,368 --> 00:15:11,078 ఏంటి? ఎందుకు? 216 00:15:11,161 --> 00:15:13,580 ఎందుకంటే, నేను ఆరు వాటర్ బాటిల్స్ ని, ఇంకా కొన్ని టూనా చేపలనే తెచ్చుకున్నా కాబట్టి. 217 00:15:13,664 --> 00:15:16,542 అబ్బా. ఎంతన్నా నువ్వు అక్కడ కొన్ని రోజులే ఉంటావు కదా. 218 00:15:17,251 --> 00:15:18,585 నేను కూడా అదే అన్నాను. 219 00:15:19,378 --> 00:15:20,587 నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుంది. 220 00:15:22,548 --> 00:15:25,175 నేనేదో నాకు అనిపించేది మాత్రమే చెప్పట్లేదు. నిజంగానే నువ్వు ఇక్కడ ఉండాలని అడుగుతున్నా. 221 00:15:25,259 --> 00:15:26,426 నువ్వు రావాలని కోరుకుంటున్నా. 222 00:15:26,510 --> 00:15:30,472 తెలుసు. నాకు తెలుసు, బంగారం, కానీ నేను ఇంటిని చూసుకోవాలి కదా? 223 00:15:30,556 --> 00:15:33,559 ఇంటికి ఏమీ కాదులే. 224 00:15:33,642 --> 00:15:36,854 ఎందుకంటే, పరిస్థితులు దారుణంగా తయారైనప్పుడు, ఒకవేళ అలా తయారైతే, 225 00:15:36,937 --> 00:15:38,188 నేను నీకు కాల్ చేయాల్సిన పని ఉండకూడదు. 226 00:15:38,272 --> 00:15:40,440 నువ్వు ఇక్కడే నా చెంతనే ఉండాలి. 227 00:15:43,151 --> 00:15:45,571 సరే, చూడు, ఒక్కరోజులో అక్కడికి వచ్చేస్తా, సరేనా? 228 00:15:45,654 --> 00:15:47,531 సరే. మాటివ్వు. 229 00:15:47,614 --> 00:15:48,866 మాటిస్తున్నా. 230 00:15:51,702 --> 00:15:53,537 మా కోసం ప్రార్థన ఏమైనా చేస్తావా? 231 00:15:53,620 --> 00:15:56,039 నువ్వే చేయ్. రోజంతా నేను చేస్తూనే ఉన్నా. 232 00:15:58,500 --> 00:15:59,501 సరే. 233 00:16:01,086 --> 00:16:03,297 సరే. దేవుడు మన చెంతనే ఉన్నాడు. 234 00:16:05,299 --> 00:16:07,092 అతని చెంత నువ్వు సురక్షితంగా ఉన్నావు. 235 00:16:09,178 --> 00:16:10,971 అతని కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. 236 00:16:14,016 --> 00:16:15,100 తథాస్తు. 237 00:16:17,811 --> 00:16:20,647 నువ్వు జాగ్రత్తగా ఉండు. నాకు ఆ పని చేసి పెట్టు చాలు. సరేనా? 238 00:16:21,690 --> 00:16:22,691 హా. సరే. 239 00:16:22,774 --> 00:16:24,443 -ఐ లవ్ యూ. -ఐ లవ్ యూ టూ. 240 00:16:59,228 --> 00:17:03,065 హేయ్! హేయ్, దాన్ని తాకవద్దు! 241 00:17:03,815 --> 00:17:05,150 మీరు పక్క నుండి వెళ్లాలి! 242 00:17:07,109 --> 00:17:09,988 ఆ తీగలో కరెంట్ ఉంది! పక్కకు తిరిగి వెళ్లండి! 243 00:17:19,164 --> 00:17:20,207 ఛ. 244 00:17:56,743 --> 00:17:59,162 -కరెంట్ ఇంకా ఉందా? -ఉంది. 245 00:18:00,330 --> 00:18:02,165 ఇప్పటికే కొన్ని చోట్ల ఫోన్స్ పని చేయట్లేదు, కరెంట్ లేదు. 246 00:18:04,334 --> 00:18:11,008 ఆ కారణంగా, మేము జనాలందరినీ తప్పనిసరిగా తరలించనున్నామని 247 00:18:12,009 --> 00:18:14,636 ఈ ఉదయం ప్రకటిస్తున్నాను, ఇప్పుడు దాన్నే చదివి… 248 00:18:14,720 --> 00:18:17,055 మేయర్: న్యూ ఆర్లీన్స్ లో తప్పనిసరి తరలింపును ప్రకటిస్తున్నారు 249 00:18:17,139 --> 00:18:19,016 మార్క్, మీ అమ్మ అక్కడే ఉంది. 250 00:18:20,225 --> 00:18:23,687 వాళ్లు ఆసుపత్రులను కూడా ఖాళీ చేస్తున్నారా? తనకి ఏమీ కాదంటావా? 251 00:18:28,108 --> 00:18:29,109 మార్క్. 252 00:18:31,528 --> 00:18:32,696 ఇప్పుడు మనం ఏం చేద్దాం? 253 00:18:50,923 --> 00:18:53,884 -మిస్టర్ ఎవరెట్. -ఎమ్మెట్ అని పిలవండి చాలు. 254 00:18:53,967 --> 00:18:55,677 ఎమ్మెట్, నా పేరు డయేన్ రోబిషో, 255 00:18:55,761 --> 00:18:57,930 ఈ ఆసుపత్రిలో నేను అడ్మినిస్ట్రేటరుని. 256 00:18:58,013 --> 00:18:59,389 ఎలా ఉన్నారు? 257 00:18:59,473 --> 00:19:02,142 -నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? -నేను కూడా బాగానే ఉన్నాను. 258 00:19:02,226 --> 00:19:04,144 చల్మేట్ నుండి మీ ప్రయాణం బాగానే జరిగిందా? 259 00:19:04,228 --> 00:19:05,354 హా, బాగానే జరిగింది. 260 00:19:05,437 --> 00:19:09,149 ఖచ్చితంగా చెప్తున్నారా? ఎందుకంటే, మీ రక్తంలో చక్కెర స్థాయి అటూఇటుగా ఉందని విన్నాను. 261 00:19:09,233 --> 00:19:11,985 హా, అది అటూఇటుగానే ఉంది, కానీ నేను బాగానే ఉన్నాను. 262 00:19:12,069 --> 00:19:13,987 మీరేమీ తీపి పదార్థాలను దొంగచాటుగా తెచ్చుకోలేదు కదా? 263 00:19:14,071 --> 00:19:17,324 -లేదులే. అంత పిచ్చి పని నేనెందుకు చేస్తాను. -ఊరికే అడుగుతున్నానంతే. 264 00:19:18,450 --> 00:19:21,495 తుఫాను వచ్చాక పరిస్థితులు కాస్తంత భయంకరంగా మారిపోతాయి. 265 00:19:22,037 --> 00:19:25,123 -మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? -నా భార్య ఉంది. 266 00:19:25,207 --> 00:19:26,667 -ఆమె పేరేంటి? -కేరీ. 267 00:19:26,750 --> 00:19:29,127 సరే, ఆమెకి ఎలా ఉందో కనుక్కోమంటారా? 268 00:19:29,753 --> 00:19:30,838 నా దగ్గర ఫోన్ ఉందిలెండి. 269 00:19:30,921 --> 00:19:33,757 సరే. మీ ఫోన్ కనెక్ట్ కాకపోతే, ఎవరికైనా చెప్పండి. 270 00:19:33,841 --> 00:19:35,884 -థ్యాంక్యూ. -మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. 271 00:19:35,968 --> 00:19:38,512 ఈ తుఫాను పోయిన వెంటనే మిమ్మల్ని తిరిగి చల్మేట్ కి చేరుస్తాం. 272 00:19:38,595 --> 00:19:39,638 సరే. 273 00:20:11,295 --> 00:20:12,337 రోల్ఫీ! 274 00:20:13,380 --> 00:20:15,507 ఎలా ఉన్నావే? 275 00:20:16,633 --> 00:20:18,594 పెంపుడు జంతువులను కింద ఉంచాలనుకున్నానే? 276 00:20:18,677 --> 00:20:20,053 ఇతరులందరూ అదే పని చేస్తున్నారు. 277 00:20:20,137 --> 00:20:22,931 -మరి ఇది మంచి పని కాదేమో. -దాన్ని కిందికి తీసుకెళ్లిపోమంటావా? 278 00:20:23,015 --> 00:20:24,725 అంటే, నువ్వు న్యాయంగా ఉంటే బాగుండు అంటున్నా, అంతే. 279 00:20:24,808 --> 00:20:27,686 నేను డాక్టరుని, కాబట్టి నా ఆసుపత్రిలోనే కొన్ని నియమాలను నేను అతిక్రమించవచ్చు. 280 00:20:27,769 --> 00:20:29,479 డాక్టర్లంటే ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. 281 00:20:29,563 --> 00:20:30,898 సరే. 282 00:20:32,399 --> 00:20:35,485 దాన్ని కిందికి తీసుకెళ్లిపోవాలి అంతే కదా? ఆ పనే చేస్తా. 283 00:20:35,569 --> 00:20:37,112 -ఇవైంగ్. -పద, రోల్ఫీ. 284 00:20:37,196 --> 00:20:38,280 అమ్మకి నువ్వు ఇక్కడ ఉండకూడదట. 285 00:20:38,363 --> 00:20:41,867 ఇది అట్లాంటాలోని హోటల్ లో జరిగిన సంఘటనను గుర్తుకు తెప్పిస్తోంది. 286 00:20:41,950 --> 00:20:44,786 వాళ్లు రోల్ఫీతో మనల్ని గూడ్స్ ని తరలించే లిఫ్టులో వెళ్లమన్నారు,7 287 00:20:44,870 --> 00:20:47,372 కానీ నువ్వేమో జనాలు వెళ్లే లిఫ్టులోనే వెళ్తానని పట్టు బట్టావు. 288 00:20:47,456 --> 00:20:48,957 పాపం ఆ మహిళ, తను దాదాపుగా… 289 00:20:49,041 --> 00:20:52,002 లిఫ్ట్ తలుపు తెరుచుకొన్నప్పటి నుండే తను హడలిపోయింది. 290 00:20:52,085 --> 00:20:53,712 రోల్ఫీ అక్కడ నిలబడి… 291 00:20:53,795 --> 00:20:56,507 ఇవైంగ్! వాళ్లు మనల్ని తరిమేసినంత పని చేశారు… 292 00:21:00,719 --> 00:21:02,596 హా, హలో. 293 00:21:03,514 --> 00:21:04,515 అదీ… 294 00:21:04,598 --> 00:21:07,935 ఈ హరికేన్ కత్రినా తుఫాను పెను భీభత్సాన్ని సృష్టించే అవకాశం ఉంది. 295 00:21:08,018 --> 00:21:10,729 యుఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ వాళ్లు, గ్రాండ్ ఐల్ తూర్పు ప్రాంతంలో 296 00:21:10,812 --> 00:21:12,940 ఇందాకే కత్రినా తీరం తాకిందని అన్నారు. 297 00:21:13,023 --> 00:21:16,193 అది న్యూ ఆర్లీన్స్ కి సుమారుగా 97 కిలోమీటర్ల దూరంలో ఉంది. 298 00:21:27,704 --> 00:21:28,705 హరికేన్ కత్రినా 299 00:21:28,789 --> 00:21:31,291 వీధులన్నీ జలమయమైపోయాయి, 300 00:21:31,375 --> 00:21:34,336 ఈ నీరంతా డ్రైనేజీ వ్యవస్థలోకి, పంపు వ్యవస్థలోకి 301 00:21:34,419 --> 00:21:37,005 పూర్తిగా ఇంకడం లేదు… 302 00:21:45,556 --> 00:21:49,309 నేను బాగానే ఉన్నాను. కాకపోతే కాస్త చల్లగా ఉంది, అంతే. 303 00:21:49,393 --> 00:21:51,687 వెంటనే వెచ్చగా ఉండేలా ఏమైనా చేసుకో. అక్కడ నర్సులు ఎవరైనా ఉన్నారా? 304 00:21:51,770 --> 00:21:55,107 ఉన్నారులే. నర్సులు ఎప్పటిలాగానే వస్తూ పోతూ ఉన్నారు. అదన్నమాట. 305 00:21:55,190 --> 00:21:57,693 -జిల్ అక్కడే ఉందా? -హా, ఉంది. 306 00:21:57,776 --> 00:21:59,862 జిల్ ఇక్కడే ఉంది. 307 00:21:59,945 --> 00:22:03,657 మంచిది. నువ్వు జిల్ దగ్గరే ఉండు. సరేనా, అమ్మా? 308 00:22:03,740 --> 00:22:05,158 చూడు, మార్క్. 309 00:22:05,242 --> 00:22:09,329 ఇప్పుడు నాకు నీ మీద, శాండ్రా మీదనే కాస్త బెంగగా ఉంది. ఇప్పుడు… 310 00:22:09,413 --> 00:22:10,998 మీరు ఎలా ఉన్నారు? 311 00:22:11,081 --> 00:22:12,708 మాకేమీ కాదులే. 312 00:22:12,791 --> 00:22:15,711 జాగ్రత్తగా విను, ఏమైనా జరిగితే, డాక్టర్లు ఏం చెప్తే అది చేయ్… 313 00:22:16,795 --> 00:22:17,921 జాగ్రత్తగా ఉండు… 314 00:22:18,005 --> 00:22:20,382 హలో. నీ మాటలు నాకు వినబడట్లేదు. 315 00:22:20,465 --> 00:22:24,428 -నీ మాటలు వినబడట్లేదు. ఏంటి? -అమ్మా? సరే… వాళ్లు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు… 316 00:22:24,511 --> 00:22:27,389 ఏమన్నావు? నాకు వినబడట్లేదు. 317 00:22:27,472 --> 00:22:28,473 -అమ్మా? -మార్క్? 318 00:22:29,558 --> 00:22:30,559 అమ్మా? 319 00:22:31,143 --> 00:22:32,394 మార్క్? 320 00:22:33,061 --> 00:22:34,062 అమ్మా! 321 00:22:35,439 --> 00:22:36,815 అమ్మా, లైన్ లో ఉన్నావా? 322 00:22:38,984 --> 00:22:40,068 మార్క్? 323 00:22:41,987 --> 00:22:42,988 అబ్బా. 324 00:22:49,912 --> 00:22:51,246 మీ అమ్మకి బాగానే ఉందా? 325 00:22:53,665 --> 00:22:54,875 లైన్ కట్ అయిపోయింది. 326 00:23:11,725 --> 00:23:12,809 అమ్మా. 327 00:23:19,149 --> 00:23:22,152 హేయ్. నిన్ను లేపాలనుకోలేదు. 328 00:23:23,070 --> 00:23:24,238 అంతా బాగానే ఉందా? 329 00:23:25,030 --> 00:23:26,573 ఈ పరిస్థితుల్లో ఇంత కన్నా ఏమీ ఆశించలేం. 330 00:23:32,663 --> 00:23:34,414 నేను నర్సింగ్ డైరెక్టరుని. 331 00:23:35,374 --> 00:23:37,793 దీనికి నేను ఇన్ ఛార్జీగా ఉండాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. 332 00:23:38,418 --> 00:23:39,545 అలసటగా ఉందా? 333 00:23:40,629 --> 00:23:41,755 నాకేమీ పర్వాలేదులే. 334 00:23:56,144 --> 00:23:57,813 చాలా బాగుంది, అమ్మా. 335 00:24:21,670 --> 00:24:24,089 డయేన్. ఒక సమస్య వచ్చి పడింది. 336 00:24:36,685 --> 00:24:39,271 -మల్డేరిక్ ని మాట్లాడుతున్నా. -నేను డయేన్ రోబిషోని. 337 00:24:39,897 --> 00:24:43,150 -మన్నించాలి. ఎవరు? -లైఫ్ కేర్ లో పని చేసే డయేన్ రోబిషోని. 338 00:24:43,233 --> 00:24:46,361 ఇక్కడ నీళ్లు… సీలింగ్ నుండి నీళ్లు కారుతున్నాయి. 339 00:24:46,445 --> 00:24:47,779 ఎక్కడి నుండి కారుతున్నాయో తెలుసా? 340 00:24:47,863 --> 00:24:50,199 తెలీదు, కానీ నీళ్లు కారుతున్నాయి. 341 00:24:50,282 --> 00:24:51,783 అంతా బాగానే ఉందా? 342 00:24:51,867 --> 00:24:54,328 పైన ఏం జరుగుతోందో నేను చెప్పలేను కదా. 343 00:24:54,411 --> 00:24:56,747 ఆసుపత్రికి విపత్తు కమాండర్ మీరే కదా? 344 00:24:56,830 --> 00:24:59,625 -అవును. -అందుకే అడుగుతున్నా అంతా బాగానే ఉందా అని. 345 00:25:05,839 --> 00:25:08,926 -ఎరిక్. ఎరిక్. -హా. 346 00:25:09,009 --> 00:25:11,178 లైఫ్ కేర్ నుండి ఒకరు కాల్ చేశారు. 347 00:25:11,261 --> 00:25:13,222 సీలింగ్ నుండి నీళ్లు కారుతున్నాయట. 348 00:25:13,305 --> 00:25:15,390 -నీళ్లా? -సీలింగ్ నుండి కారుతున్నాయట. 349 00:25:15,474 --> 00:25:16,850 లైఫ్ కేర్ అంటే ఏడవ అంతస్థులో ఉంది కదా. 350 00:25:16,934 --> 00:25:18,769 వర్షపు నీళ్లు భవనంలోకి వచ్చుంటాయి, అంతే. 351 00:25:18,852 --> 00:25:20,854 నేను కూడా అదే అనుకున్నా. ఇక మిగతాది అంతా బాగానే ఉంది కదా? 352 00:25:20,938 --> 00:25:24,233 అది గాక ఇంకేం సమస్యలు లేవు కదా? ఈ భవనం ఈ గాలులను తట్టుకోగలదు. 353 00:25:24,316 --> 00:25:26,026 ఎనభై ఏళ్ల చరిత్ర ఈ భవనానిది. ఈ గాలులను తట్టుకోగలదు. 354 00:25:26,109 --> 00:25:29,071 కంగారు పడాల్సిన విషయం ఏదైనా ఉందంటే, అది వరద. 355 00:25:29,821 --> 00:25:31,365 భారీ వరద అన్నమాట. 356 00:25:31,448 --> 00:25:33,784 సరే. ఒకవేళ వరద తీవ్రంగా వస్తే… 357 00:25:33,867 --> 00:25:36,036 -అప్పుడు మనం ఏం చేయాలి? -మనం ఖాళీ చేయించాలి. 358 00:25:36,828 --> 00:25:38,330 ఖాళీ చేయించాలా? 359 00:25:39,623 --> 00:25:40,916 అదెలా? 360 00:25:40,999 --> 00:25:42,626 ఏమో మరి. 361 00:25:42,709 --> 00:25:45,003 అంటే, విపత్తు కమాండర్ మీరే కదా. 362 00:25:48,799 --> 00:25:53,136 అత్యవసర స్థితుల నిర్వహణ పాలసీలు & పద్ధతులు 363 00:26:08,318 --> 00:26:09,653 కంప్యూటర్లు పని చేయనప్పుడు ప్లాన్ గ్యాస్/వాక్యూమ్ పని చేయనప్పుడు ప్లాన్ 364 00:26:11,154 --> 00:26:12,072 పెద్దవారు కిడ్నాపింగ్ నివారణ ప్లాన్ కమ్యూనికేషన్ వైఫల్యమైనప్పుడు ప్లాన్ 365 00:26:12,155 --> 00:26:13,115 నిరసనల సమయంలో ప్లాన్ అగ్నిమాపక ప్లాన్ 366 00:26:13,198 --> 00:26:14,908 బయోటెర్రరిజమ్ ప్లాన్ ఎమర్జెన్సీ రేడియోయాక్టివ్ పాలసీ 367 00:26:14,992 --> 00:26:16,076 ప్రమాదకరమైన రసాయానాలు, పదార్థాల నిర్మూలన 368 00:26:16,159 --> 00:26:17,786 నష్ట నివారణ ప్లాన్ తుఫాను సంసిద్దత ప్లాన్ 369 00:26:19,454 --> 00:26:21,123 అత్యవసర పరిస్థితుల సంసిద్ధతకు చెక్ లిస్ట్ మెడికల్ సెంటర్ సిబ్బంది ప్రతిస్పందిస్తారు 370 00:26:25,878 --> 00:26:27,504 రోజువారీ పనులను పక్కకు పెట్టేసి బాహ్య ప్రాంతాన్ని సురక్షితం చేయాలి 371 00:26:31,466 --> 00:26:34,094 ఈ పరిస్థితంతా నాకు గుబులు పుట్టిస్తోంది. 372 00:26:34,803 --> 00:26:37,890 వరద ప్రమాదం వస్తే ఆసుపత్రికి ఏం అవుతుందా అని కంగారుగా ఉంది. 373 00:26:37,973 --> 00:26:41,101 టీవీలో చెప్తున్నట్టు ఇది అయిదవ కేటగిరీకి చెందిన తుఫాను అయితే, 374 00:26:41,185 --> 00:26:42,436 నాల్గవ కేటగిరీది అయినా కానీ, 375 00:26:42,519 --> 00:26:45,022 అది చెరువును, నదిని సులభంగా పొంగించగలదు… 376 00:26:45,105 --> 00:26:46,815 ఆసుపత్రి సీ లెవెల్ కి మూడు అడుగుల దిగువ ఉంది. 377 00:26:46,899 --> 00:26:49,568 కాబట్టి బేస్మెంట్ లోకి వరద నీరు రావడానికి పెద్ద వరద అక్కర్లేదు. మొదటి అంతస్థు పరిస్థితీ అంతే. 378 00:26:49,651 --> 00:26:52,362 అంటే, ఇప్పుడు రోగులను రెండవ, మూడవ అంతస్థులకు తరలించాలంటే… 379 00:26:52,446 --> 00:26:54,406 -ఎమర్జెన్సీ గదిలోని రోగులను తరలించలేం కదా. -అదొక్కటే సమస్య కాదు. 380 00:26:54,489 --> 00:26:55,699 బ్యాకప్ జనరేటర్ల సమస్య కూడా ఉంది. 381 00:26:55,782 --> 00:26:59,494 ఎమర్జెన్సీ పవర్ సిస్టమ్ లోని కొన్ని భాగాలు గ్రౌండ్ లెవెల్ లో ఉన్నాయి. అంత కన్నా దిగువే అనవచ్చు. 382 00:26:59,578 --> 00:27:02,080 వరద నీరు అక్కడికి చేరుకుంటే, నగరంలో కరెంట్ పోతే… 383 00:27:02,164 --> 00:27:05,209 -వరద నీరు చేరితే కదా. కరెంట్ పోతే కదా. -బ్యాకప్ జనరేటర్లు కూడా పని చేయవు, 384 00:27:05,292 --> 00:27:07,377 అప్పుడు ఆసుపత్రిలో కరెంట్ ఉండదు. 385 00:27:07,461 --> 00:27:10,589 అస్సలు కరెంట్ ఉండదు. అంటే, మానిటర్లు, వెంటిలేటర్లు, పంపులు ఏవీ పని చేయవు… 386 00:27:10,672 --> 00:27:11,840 అర్థమైంది. అస్సలు అంటే అస్సలుండదు. 387 00:27:11,924 --> 00:27:14,843 వరద నీళ్లంటే, ఎంత లోతు నీళ్ళు అని నీ ఉద్దేశం? 388 00:27:14,927 --> 00:27:15,969 ఎనిమిది అడుగులా, పది అడుగులా? 389 00:27:16,053 --> 00:27:18,055 నాలుగు అడుగులు చాలు, మన ఆసుపత్రి మూతపడటానికి. 390 00:27:18,138 --> 00:27:21,183 ఇప్పటికే వరద నీళ్లు ఒక అడుగు ఎత్తుకు చేరాయి… ఒక అడుగు కంటే ఎక్కువే ఉంటాయి. 391 00:27:25,270 --> 00:27:29,066 అయ్య బాబోయ్… ఇదంతా ఇప్పుడు చెప్తే ఎలా! 392 00:27:29,149 --> 00:27:31,777 చివరి తుఫాను వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితి వస్తుందని మిమ్మల్నందరినీ హెచ్చరిస్తూ 393 00:27:31,860 --> 00:27:34,363 నేనొక మెమొరాండమును కూడా రాసి, అడ్మినిస్ట్రేటర్లు అందరి ముందూ ఉంచాను. 394 00:27:34,446 --> 00:27:36,740 -ఇప్పుడు ఆత్మరక్షణా ధోరణిలో మాట్లాడటం వల్ల లాభం లేదు. -నేనేం అలా లేను. 395 00:27:36,823 --> 00:27:39,368 ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి కాదు అనే నేను మీ అందరికీ చెప్తున్నాను. 396 00:27:39,451 --> 00:27:42,162 సరే. మరి మన ముందున్న దారులు ఏంటి? 397 00:27:42,246 --> 00:27:46,333 దారులేవీ లేవు. కరెంట్ పోతే, ఆసుపత్రిని ఖాళీ చేయించాల్సిందే. 398 00:27:46,416 --> 00:27:47,918 -సరే. -సరే అంటే సరే కాదు. 399 00:27:48,001 --> 00:27:51,421 ఆసుపత్రిలోకి వరద నీరు వస్తే, ఏం చేయాలనే దానికి ప్లాన్ అస్సలు లేదు. 400 00:27:51,505 --> 00:27:53,090 ఎమర్జెన్సీ మాన్యువల్ లో ఏముంది? 401 00:27:53,173 --> 00:27:56,301 ఆసుపత్రిలోకి వరద నీరు వస్తే, ఏం చేయాలనే దానికి సంబంధించి అందులో ఏమీ లేదు. 402 00:27:56,385 --> 00:28:00,347 ఒకేసారి చాలా మంది చనిపోతే ఏం చేయాలో, నిరసన సమయాల్లో ఏం చేయాలో, 403 00:28:00,430 --> 00:28:03,767 బాంబు బెదిరింపు వచ్చినప్పుడు ఏం చేయాలో, తుపాకీతో ఏవరైనా బెదిరించినప్పుడు ఏం చేయాలో ఉన్నాయి. 404 00:28:03,851 --> 00:28:05,561 బయో టెర్రర్ దాడి జరిగినప్పుడు ఏం చేయాలో తెలుపుతూ 405 00:28:05,644 --> 00:28:08,021 అందులో వందల కొద్దీ పేజీలు ఉన్నాయి. 406 00:28:08,105 --> 00:28:12,818 కానీ ఆసుపత్రిలోకి వరద నీరు వస్తే ఏం చేయాలనే దానికి మాత్రం అస్సలు ప్లానే లేదు. 407 00:28:14,736 --> 00:28:18,448 నిజమే చెప్తున్నా, నేను ఇప్పుడే చదివాను. కరెంట్ పోయి, 200 మంది రోగులతో సహా 408 00:28:18,532 --> 00:28:23,412 మొత్తం 2,000 మంది ఆసుపత్రిలో ఇరుక్కుపోయినప్పుడు ఏం చేయాలని అందులో లేనే లేదు. 409 00:28:24,162 --> 00:28:25,330 బేస్మెంట్ లోకి వరద నీరు వస్తే, 410 00:28:25,414 --> 00:28:29,376 మనం ఆహారాన్ని, తాగు నీటిని, సరఫరాలన్నింటినీ కోల్పోతాం. 411 00:28:29,459 --> 00:28:33,422 నీరు నాలుగు అడుగులు చేరుకుంటే, మనకి సమస్యలు తప్పవు. 412 00:28:35,215 --> 00:28:36,925 సమస్యలు కాదు విపత్తు అని అనవచ్చు. 413 00:28:38,260 --> 00:28:39,845 నువ్వే కదా విపత్తు కమాండర్ వి. 414 00:28:39,928 --> 00:28:41,930 అబ్బా. అలా అనడం ఇక ఆపుతారా? 415 00:28:42,014 --> 00:28:44,975 మనం ఏమన్నా చేయాలంటే, ఆ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది మరి. 416 00:29:05,746 --> 00:29:06,747 అమ్మా. 417 00:29:07,497 --> 00:29:08,498 అమ్మా. 418 00:29:11,084 --> 00:29:15,589 నేను అలా బయటకు వెళ్లి వస్తా. వెంటనే వచ్చేస్తా. ప్రమాణపూర్తిగా చెప్తున్నా. 419 00:30:13,105 --> 00:30:14,273 ఎక్స్ ప్రెస్ ప్రింట్ 60 420 00:31:09,369 --> 00:31:10,579 సూపర్. 421 00:31:18,795 --> 00:31:21,757 గంటకు సుమారు 185 మైళ్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. 422 00:31:21,840 --> 00:31:24,510 గాలులు గంటకు సుమారుగా 150 మైళ్ల వేగంతో వీస్తున్నాయి. 423 00:31:24,593 --> 00:31:28,639 ఇప్పటికీ దీని విధ్వంసం గణనీయమైన స్థాయిలోనే ఉంటుందని అంచనా. 424 00:31:28,722 --> 00:31:32,643 ఈ సమయంలో తుఫాను హెచ్చరికలు జారీ చేయబడిన ప్రాంతాలు, లూసియానా, మిసిసిపి, 425 00:31:32,726 --> 00:31:34,561 అలబామా, ఫ్లోరిడా… 426 00:31:43,320 --> 00:31:44,571 తుఫాను తీవ్రతకు 427 00:31:44,655 --> 00:31:47,574 గంటకు 100 మైళ్ళకు పైగా వేగంతో గాలులు వీస్తున్నాయి. 428 00:31:47,658 --> 00:31:50,077 ఇది తీరం నుండి ఆరు కిలోమీటర్ల వరకు ఉన్న పరిస్థితి. 429 00:31:50,160 --> 00:31:52,496 ఇక సముద్ర తీరం వెంబడి అయితే, పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 430 00:31:52,579 --> 00:31:55,999 అంతర్రాష్ట్ర రహదారి 90 మీదకి అనేక పడవలు కొట్టుకొచ్చినట్లు ఇప్పటికే అనేక రిపోర్టులు అందుతున్నాయి, 431 00:31:56,083 --> 00:31:58,627 ఆ రహదారి తీరానికి 75 అడుగుల దూరంలో ఉందన్నది గమనించవలసిన విషయం. 432 00:31:58,710 --> 00:32:00,420 ఈ తుఫాను సృష్టిస్తున్న విధ్వంసాన్ని మీరు చూడవచ్చు. 433 00:32:00,504 --> 00:32:02,297 లైట్లు ఏవీ వెలగడం లేదు. 434 00:32:02,381 --> 00:32:05,259 గత… గత రెండేళ్లలో నిర్మించబడిన కొత్త థియేటర్లు, కొత్త రెస్టారెంట్లు, 435 00:32:05,342 --> 00:32:08,637 కొత్త హోటళ్లు అన్నీ కూడా నేలమట్టమయ్యాయి. 436 00:32:21,525 --> 00:32:24,194 పేషెంట్ లాంజ్ నిశ్శబ్దం పాటించవలెను 437 00:33:01,648 --> 00:33:02,649 మీరు బాగానే ఉన్నారా? 438 00:33:04,318 --> 00:33:05,444 బాగానే ఉన్నారా? 439 00:33:11,325 --> 00:33:12,576 మిస్టర్ హిల్. 440 00:33:13,869 --> 00:33:15,871 మీ గదికి వెళ్దాం పదండి, సరేనా? 441 00:33:16,455 --> 00:33:18,999 -సరే. -అలాగే, పదండి. 442 00:33:32,179 --> 00:33:34,431 సరే. వాల్చమంటారా? 443 00:33:34,515 --> 00:33:35,516 హా. 444 00:33:38,727 --> 00:33:40,729 అంతే. అయిపోయింది. 445 00:34:39,246 --> 00:34:41,498 -ఏం జరుగుతోంది? -నేను ఒక రోగి దగ్గర ఉన్నాను. ఏం జరుగుతోంది? 446 00:34:41,581 --> 00:34:42,583 ఆనా. 447 00:34:42,666 --> 00:34:44,333 క్లారా స్ట్రీట్ బ్రిడ్జికి దారి 448 00:34:57,806 --> 00:34:58,891 సూసన్. 449 00:34:58,974 --> 00:35:00,893 -సూసన్, మీకు రక్తం వస్తోంది. -నాకు… ఏమీ పర్వాలేదులే. 450 00:35:00,976 --> 00:35:02,019 ఆనా, నేను మల్డేరిక్ ని. 451 00:35:02,102 --> 00:35:05,147 వాక్ వే దారుణంగా ఊగుతోంది. అది ఎక్కువ సేపు నిలవదు అనుకుంటా. 452 00:35:05,230 --> 00:35:06,315 మీరు అక్కడి నుండి వచ్చేయండి. 453 00:35:06,398 --> 00:35:08,775 మీరు అక్కడి నుండి వచ్చేయాలి, లేదంటే మీరు అక్కడే ఇరుక్కుపోతారు. 454 00:35:08,859 --> 00:35:10,777 అర్థమైంది. అందరూ అటు వైపుకు వెళ్లండి. 455 00:35:10,861 --> 00:35:12,613 ఈ యూనిట్ నుండి అందరినీ అటు వైపుకు తరలించండి. 456 00:35:13,572 --> 00:35:15,616 మనందరం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. అందరినీ తీసుకొని వెళ్లిపోండి. 457 00:35:15,699 --> 00:35:17,701 -సరే. పదండి! పదండి! -ఆ వాక్ వే గుండా వెళ్లండి. 458 00:35:17,784 --> 00:35:19,912 అందరూ వాక్ వే గుండా వెళ్లండి! 459 00:35:19,995 --> 00:35:22,247 వద్దు, వద్దు. మీ వస్తువులు ఇక్కడే వదిలేయండి. వాటిని వదిలేసి వెళ్లండి. 460 00:35:23,790 --> 00:35:27,294 ఎరిక్, తుఫాను తీవ్రతరమవుతోంది. నీరు మూడు అడుగుల ఎత్తుకు చేరుకుంది. 461 00:35:27,377 --> 00:35:29,004 సరే. నీరు చాలా వేగంగా చేరుకుంటోంది. 462 00:35:29,087 --> 00:35:32,299 కానివ్వండి! త్వరపడండి! 463 00:35:33,300 --> 00:35:34,384 నువ్వు వెళ్లు. నేను వస్తాలే. 464 00:35:34,468 --> 00:35:37,387 సరే, వీలైనంత ఎక్కువ మందిని ఇక్కడి నుండి తరలించేయండి. త్వరగా పదండి! 465 00:35:38,222 --> 00:35:40,766 -మీరు కూడా వచ్చేయాలి. -ఒక్క నిమిషం. తూర్పు భాగం నుండి అందరినీ తరలించేశారా? 466 00:35:40,849 --> 00:35:41,808 ఏమో, నాకు తెలీదు. 467 00:35:41,892 --> 00:35:43,810 -తనని తీసుకువెళ్లండి. నేను వెనకే వచ్చేస్తా. -పదండి. 468 00:35:47,064 --> 00:35:49,316 సూసన్. మల్డేరిక్, మీరు లైన్లో ఉన్నారా? 469 00:35:49,900 --> 00:35:52,110 -ఉన్నాను. -నేను కేరన్ ని. ఐసీయూలో ఉన్నాను. 470 00:35:52,194 --> 00:35:54,571 కిటికీలు పగిలిపోతున్నాయి, ఫ్లోర్స్ అంతా నీళ్లు నిండిపోయాయి. 471 00:35:54,655 --> 00:35:56,698 అక్కడి నుండి వీలైనంత ఎక్కువ మందిని తరలించండి. 472 00:35:56,782 --> 00:35:59,451 సరే, ఆ పనే చేస్తున్నాం. కానీ… ఇక్కడ రోగులు ఉన్నారు. వాళ్లని తరలించలేం. 473 00:35:59,535 --> 00:36:01,828 -చేయగలిగినంత చేయండి, కానీ ఇలాంటి పరిస్థితుల్లో తప్పదు. -సూసన్! 474 00:36:01,912 --> 00:36:03,205 -సూసన్! -ఇలాంటప్పుడే మనం నిబ్బరంగా ఉండాలి. 475 00:36:03,288 --> 00:36:05,457 -బేస్మెంటులోకి నీరు చేరుకుంటోంది. -ఎంత నీరు? 476 00:36:05,541 --> 00:36:07,042 భవనం బయట మూడ అడుగుల ఎత్తులో నీరుంది. 477 00:36:07,125 --> 00:36:08,585 బేస్మెంట్ నుండి మనం అన్నీ బయటకు తరలించేయాలి. 478 00:36:08,669 --> 00:36:10,170 -ఆహారాన్ని, అంతటినీ. -దానికి చాలా గంటలు పడుతుంది. 479 00:36:10,254 --> 00:36:13,006 డాక్టర్లు, సిబ్బంది కలిపి 200 మంది ఉన్నారు కదా. అందరూ కలిసి పని చేయండి. 480 00:36:13,090 --> 00:36:14,383 -ఆహారం, నీరు తొలి ప్రాధాన్యత. -పదండి. 481 00:36:14,466 --> 00:36:15,467 బేస్మెంటుకు పదండి. 482 00:36:15,551 --> 00:36:17,553 హోరెస్… నేను సూసన్ ని. 483 00:36:17,636 --> 00:36:19,638 -ఉన్నాను. -హోరెస్, బేస్మెంటులోకి వరద నీరు చేరుకుంటోంది. 484 00:36:19,721 --> 00:36:21,390 మొదటి అంతస్థులోకి కూడా నీరు చేరుకోవచ్చు. 485 00:36:21,473 --> 00:36:24,601 కాబట్టి, అడ్మిషన్ ఏరియా నుండి అందరినీ రెండవ అంతస్థుకి తరలించండి, 486 00:36:24,685 --> 00:36:26,144 జనాలు భయపడకూడదు, నిశ్శబ్దంగా జరిగిపోవాలి. 487 00:36:26,228 --> 00:36:27,396 అలాగే. 488 00:36:31,191 --> 00:36:32,734 బ్రయాన్ట్. బ్రయాన్ట్. 489 00:36:34,152 --> 00:36:39,449 మనం వీళ్లందరినీ పైకి తరలించాలి, అది త్వరగా, కానీ నిశ్శబ్దంగా జరగాలి. 490 00:36:39,533 --> 00:36:40,909 -అర్థమైందా? -హా. 491 00:36:40,993 --> 00:36:42,911 హలో. అందరూ ఒకసారి వింటారా? 492 00:36:42,995 --> 00:36:45,497 కొందరు కొత్త పేషెంట్స్ వచ్చి అడ్మిట్ అయ్యే అవకాశముంది. 493 00:36:45,581 --> 00:36:48,458 ఎమర్జెన్సీ పేషెంట్స్ అన్నమాట. కాబట్టి మేము మిమ్మల్నందరినీ పైకి తరలిస్తున్నాము. 494 00:36:48,542 --> 00:36:51,086 మీ వస్తువులన్నీ తీసుకొని పైకి వెళ్లండి. కేవలం పై అంతస్థుకు మాత్రమే. 495 00:36:51,170 --> 00:36:52,421 సరే. 496 00:36:54,840 --> 00:36:56,049 పంపిస్తున్నాము. 497 00:36:59,678 --> 00:37:01,597 ప్రశాంతంగా కానిద్ధాం. పని ఎక్కడా ఆగకూడదు. 498 00:37:16,153 --> 00:37:17,863 ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 499 00:37:19,198 --> 00:37:20,490 ఎవరైనా ఉన్నారా? 500 00:37:22,326 --> 00:37:24,244 ఇంకా ఎవరైనా ఉన్నారా? 501 00:37:45,641 --> 00:37:47,017 రా. 502 00:37:49,770 --> 00:37:50,979 నాతో రా. 503 00:37:55,025 --> 00:37:56,193 అయ్యయ్యో. 504 00:37:57,736 --> 00:38:01,573 రా. రా. కళ్లు మూసుకో. కళ్లు మూసేసుకో. 505 00:38:01,657 --> 00:38:02,991 ఏమీ కాదు. 506 00:38:04,284 --> 00:38:05,577 ఏమీ కాదు. 507 00:38:07,079 --> 00:38:09,373 ప్రియమైన ప్రభువా, నీవు మాకు ఎల్లవేళలా రక్షగా ఉన్నందుకు ధన్యవాదాలు. 508 00:38:09,456 --> 00:38:11,208 మాకు ఇప్పుడు మీ రక్షణ అవసరం. 509 00:38:11,291 --> 00:38:14,169 నీ కృప చూపి, అందరికీ… అందరికీ రక్షగా నిలువు, ప్రభువా. 510 00:38:14,253 --> 00:38:16,463 ధన్యవాదాలు. నీ కరుణకు ధన్యవాదాలు. 511 00:38:17,005 --> 00:38:20,300 లీసా నిద్రపోయే ప్రతిసారీ తనకి ఏం కాకుండా చూసుకో. ధన్యవాదాలు. 512 00:38:20,384 --> 00:38:24,847 నీ కృప చూపి, అందరికీ… అందరికీ రక్షగా నిలువు, ప్రభువా. ధన్యవాదాలు. 513 00:38:29,768 --> 00:38:31,103 దేవుడా, మమ్మల్ని ఆదుకో. 514 00:39:22,321 --> 00:39:24,323 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్