1 00:00:10,093 --> 00:00:12,054 హరికేన్ కత్రినా న్యూ ఆర్లీన్స్ ని తాకిన మరుసటి రోజు, 2 00:00:12,137 --> 00:00:13,931 అందరం తాము చాలా అదృష్టవంతులమని, 3 00:00:14,014 --> 00:00:15,557 అంతా మామూలు అయిపోతుందని భావించారు. 4 00:00:16,140 --> 00:00:17,351 మామూలుగానే అయింది కూడా. 5 00:00:17,434 --> 00:00:20,562 సూర్యుడు వచ్చాడు, నీటి ఎత్తు కూడా తగ్గింది. 6 00:00:23,690 --> 00:00:25,526 ఆ తర్వాత కట్టలు తెగిపోయాయన్న విషయం మాకు తెలిసింది. 7 00:00:28,445 --> 00:00:31,448 ఆ నీరంతా నగరంలోకి ప్రవేశించడం మొదలైంది, 8 00:00:32,741 --> 00:00:34,409 దాన్ని ఆపే మార్గం కూడా లేకపోయింది. 9 00:00:36,828 --> 00:00:40,040 మెమోరియల్ లో పరిస్థితులు బాగా దారుణంగా దిగజారుతాయని మీకేమైనా అనిపించిందా? 10 00:00:41,750 --> 00:00:42,793 అలా అని ఎవరికీ అనిపించలేదు. 11 00:00:46,171 --> 00:00:47,214 ఎవరికీ అనిపించలేదు. 12 00:00:48,465 --> 00:00:50,968 మీరు ఒకసారి జరిగిన దాని గురించి తలుచుకున్నప్పుడు, 13 00:00:51,051 --> 00:00:52,886 మీకు ఏది ప్రముఖమైన విషయంగా అనిపిస్తోంది? 14 00:00:54,388 --> 00:00:55,472 ప్రముఖమైనదేంటి అని అడుగుతున్నారా? 15 00:01:05,440 --> 00:01:08,235 నాకు ప్రముఖంగా అనిపించింది ఏంటంటే, కేవలం అయిదు రోజుల్లోనే ఇదంతా జరిగిందని. 16 00:01:11,822 --> 00:01:14,408 కేవలం అయిదంటే అయిదే రోజుల్లో మొత్తం ఛిన్నాభిన్నం అయిపోయింది. 17 00:01:15,868 --> 00:01:18,078 ఈ అయిదు రోజుల్లో డాక్టర్ పౌ ఎలా ఉన్నారు? 18 00:01:18,704 --> 00:01:20,581 -ఎలా అంటే… -అంటే… 19 00:01:20,664 --> 00:01:23,709 ఆ అయిదు రోజుల్లో ఆమె ప్రవర్తన మీకు ఎలా అనిపించింది? 20 00:01:25,043 --> 00:01:26,336 అందరిలానే అనిపించింది. 21 00:01:27,629 --> 00:01:30,090 పరిస్థితులను బట్టి మన అసలైన వ్యక్తిత్వం బయట పడుతుంది. 22 00:01:34,636 --> 00:01:38,724 నీటిలో ముందుకు సాగండి 23 00:01:41,518 --> 00:01:46,273 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 24 00:01:47,357 --> 00:01:52,154 నీటిలో ముందుకు సాగండి 25 00:01:52,237 --> 00:01:57,451 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 26 00:01:57,534 --> 00:02:02,122 నీటిలో ముందుకు సాగండి 27 00:02:02,206 --> 00:02:07,503 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 28 00:02:07,586 --> 00:02:11,590 పురుషులు నది వద్దకు వెళ్లారు 29 00:02:12,549 --> 00:02:17,471 పురుషులు నది వద్దకు వెళ్లారు, ప్రభువా 30 00:02:17,554 --> 00:02:21,725 పురుషులు నది వద్దకు వెళ్లారు 31 00:02:22,559 --> 00:02:26,230 అక్కడికి ప్రార్థించడానికి వెళ్లారు 32 00:02:27,856 --> 00:02:31,693 నీటిలో ముందుకు సాగండి 33 00:02:32,945 --> 00:02:37,783 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 34 00:02:37,866 --> 00:02:39,284 షెరీ ఫింక్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 35 00:02:39,368 --> 00:02:41,745 నీటిలో ముందుకు సాగండి 36 00:02:42,454 --> 00:02:47,459 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 37 00:02:52,589 --> 00:02:58,595 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 38 00:03:02,766 --> 00:03:06,186 మూడవ రోజు 39 00:03:08,939 --> 00:03:11,316 మనల్ని ఇక్కడి నుండి ఎప్పుడు పంపించేస్తారు? 40 00:03:21,285 --> 00:03:23,036 అంతే. అది… 41 00:03:24,413 --> 00:03:27,040 సరే. ఇప్పుడు కాస్తంత గాలి తగులుతుందిలే. 42 00:03:27,124 --> 00:03:29,543 ఇక్కడ గాలి సరిగ్గా ఆడటం లేదని, బాగా వేడిగా ఉందని నాకు తెలుసు. 43 00:03:29,626 --> 00:03:32,045 కానీ, ఇప్పుడు నేను చెప్పేది అందరూ ఏకాగ్రతగా వినండి. 44 00:03:32,129 --> 00:03:33,422 మీరేం విన్నా కానీ, 45 00:03:33,505 --> 00:03:36,175 ఏ పుకార్లు షికార్లు చేస్తున్నా కానీ, నేను మీకు ఒకటి సూటిగా చెప్తున్నాను. 46 00:03:36,258 --> 00:03:40,512 పదిహేడవ వీధిలో ఉన్న చెరువు కట్ట తెగింది. 47 00:03:41,680 --> 00:03:44,683 ఇంకొన్ని చోట్ల కూడా కట్టలు తెగి ఉండవచ్చు. నగరంలోని పంపులు కూడా పని చేయట్లేదు. 48 00:03:44,766 --> 00:03:47,853 నీరు వస్తోంది, ఇక వస్తూనే ఉంటుంది. 49 00:03:47,936 --> 00:03:52,441 ఆసుపత్రిలో రెండంతస్థుల వరకు వరద నీరు చేరవచ్చు. 50 00:03:52,524 --> 00:03:56,653 మనం ఖాళీ చేయించాలి, అది కూడా వెంటనే ప్రారంభించాలి. 51 00:03:56,737 --> 00:03:58,155 ఎక్కడికి ఖాళీ చేయించాలి? 52 00:03:58,238 --> 00:03:59,865 బయట దోపిడీలు జరుగుతున్నాయి. 53 00:03:59,948 --> 00:04:02,117 ఒక్క నిమిషం. బయట ఏం జరుగుతోందో నాకు తెలీదు, 54 00:04:02,201 --> 00:04:04,369 కానీ 15 అడుగుల వరద నీరు ఇక్కడికి వస్తుందని మాత్రం నాకు తెలుసు. 55 00:04:04,453 --> 00:04:06,997 మనం ఇరుక్కుపోతాం, కరెంట్ ఉండదు. 56 00:04:07,080 --> 00:04:10,584 బేస్మెంటులోకి నీరు వస్తే, మన మిగిలిన ఆహారాన్ని, సరఫరాలని కూడా మనం కోల్పోతాం. 57 00:04:10,667 --> 00:04:13,212 -ఇప్పటికే మందులు ఇక్కడ తక్కువ ఉన్నాయి. -నేషనల్ గార్డ్ ఉండగా 58 00:04:13,295 --> 00:04:15,005 మనం ఖాళీ చేయించడం ఎందుకు? 59 00:04:15,088 --> 00:04:17,007 వాళ్లు ఎంత కాలం ఉంటారో నాకు తెలీదు. 60 00:04:17,089 --> 00:04:18,675 వాళ్లని నగరంలో అన్ని చోట్లకీ పంపిస్తున్నారు. 61 00:04:18,759 --> 00:04:20,177 అదీగాక, ఈ భవనంలో 62 00:04:20,260 --> 00:04:22,721 మిగిలిన కరెంట్ కూడా పోక ముందే మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 63 00:04:22,804 --> 00:04:23,805 జనరేటర్లు ఉన్నాయి కదా. 64 00:04:23,889 --> 00:04:27,267 నీటి స్థాయి నాలుగు అడుగులకు చేరుకుంటే, అప్పుడు ఎలక్ట్రికల్ స్విచ్చులు మునిగిపోతాయి, 65 00:04:27,351 --> 00:04:28,685 అప్పుడు జనరేటర్లు ఆగిపోతాయి. 66 00:04:28,769 --> 00:04:31,188 ఒక్కో గంటకు ఒక్కో అడుగు చొప్పున నీటి మట్టం పెరుగుతోంది. 67 00:04:31,271 --> 00:04:33,440 కాబట్టి, మహా అయితే, మనకు నాలుగు గంటల సమయం ఉంటుంది. 68 00:04:33,524 --> 00:04:35,609 -సూపర్. -ఆ లోపు నీళ్లు నిండకుంటే, అదృష్టమనే చెప్పాలి. 69 00:04:36,568 --> 00:04:38,612 రోగులను తరలించడం ఎలా? 70 00:04:38,695 --> 00:04:42,282 కొన్ని వాహనాలను పంపించమని నేషనల్ గార్డుతో మాట్లాడాం. 71 00:04:42,366 --> 00:04:45,661 కొన్ని ఆంబులెన్సులను ఇక్కడికి పంపమని మన కాంట్రాక్టర్లతో మాట్లాడాం. 72 00:04:45,744 --> 00:04:47,871 శాండ్రా, టెనెట్ కి ఈమెయిళ్లను పంపుతోంది, 73 00:04:47,955 --> 00:04:52,459 వాళ్లేమైనా ప్రైవేట్ హెలికాప్టర్లను ఏర్పాటు చేయగలరేమో చూడాలని, లేకపోతే కోస్ట్ గార్డ్ ఏమైనా… 74 00:04:52,543 --> 00:04:55,671 అసలు హెలికాప్టర్లు ఇక్కడ ల్యాండ్ అవ్వగలవా? 75 00:04:55,754 --> 00:04:58,715 చివరిసారిగా హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్ పై ఎప్పుడు దిగింది? 76 00:04:59,383 --> 00:05:01,218 ఇక్కడికి పోప్ వచ్చినప్పుడు. 77 00:05:01,301 --> 00:05:02,636 అది 1991 నాటి మాట. 78 00:05:02,719 --> 00:05:04,638 పోప్ ఇక్కడికి 1987లో వచ్చారు. 79 00:05:04,721 --> 00:05:05,681 అవును. 80 00:05:06,265 --> 00:05:07,641 పద్దెనిమిది ఏళ్లా? 81 00:05:07,724 --> 00:05:09,184 అస్సలు నమ్మలేకున్నాను. 82 00:05:09,268 --> 00:05:11,144 ల్యాండింగ్ ప్యాడ్ మీద హెలికాప్టర్ ల్యాండ్ అయి 18 ఏళ్లు అయిందా? 83 00:05:11,228 --> 00:05:13,355 ప్యాడ్ మీద ల్యాండ్ అయినా కూడా, 84 00:05:13,438 --> 00:05:16,692 గ్యారేజ్ లిఫ్టులు, జనరేటర్ కి కనెక్ట్ చేసి లేవు. 85 00:05:17,484 --> 00:05:18,485 అవి పని చేయడం లేదు. 86 00:05:18,569 --> 00:05:22,239 నేరుగా ఆసుపత్రి నుండి హెలిప్యాడ్ దగ్గరకి రోగులను చేర్చడం అసాధ్యం. 87 00:05:22,322 --> 00:05:24,575 మీలో ఎవరైనా ఇంజినీరింగ్ చదివినవాళ్లు ఉన్నారా? 88 00:05:24,658 --> 00:05:25,784 ఏ ఇంజినీరింగ్ అయినా పర్లేదు. 89 00:05:25,868 --> 00:05:27,286 -ఎవరైనా ఉన్నారా? -నేను ఉన్నాను. 90 00:05:27,995 --> 00:05:31,248 ఎరిక్ తో వెళ్లి, హెలిప్యాడ్ ని పరిశీలించు. 91 00:05:31,331 --> 00:05:34,209 అది స్థిరంగా ఉందో లేదో నిర్ణయించి నాకు చెప్పు. 92 00:05:34,293 --> 00:05:36,503 నిర్ణయించడమంటే ఎలా? 93 00:05:37,129 --> 00:05:38,463 నిర్ణయించాలి, అంతే. 94 00:05:41,008 --> 00:05:42,843 -సరే మరి. పద. -అలాగే. 95 00:05:43,969 --> 00:05:47,097 రోగులను హెలిప్యాడ్ దాకా తీసుకువెళ్లడానికి ఏదోక మార్గం కనుగొందాం. 96 00:05:47,181 --> 00:05:48,974 ఏదోకటి తేలుద్దాం. 97 00:05:49,057 --> 00:05:52,561 ఇప్పుడు మీరు మీ బృందాలతో మాట్లాడాలి. 98 00:05:52,644 --> 00:05:54,605 మున్సిపల్ నీళ్లు పాడైపోయాయి. 99 00:05:54,688 --> 00:05:58,108 వాటిని వాడవద్దు, కుళాయిల నుండి వచ్చే నీటిని తాగకండి. 100 00:05:58,192 --> 00:06:01,904 ఇంకా నీటి బాటిళ్లను, మనం 2,000 మందికి సరిపోయేలా ప్లాన్ చేయాలి… 101 00:06:17,586 --> 00:06:20,672 హేయ్, నేను విన్స్ ని. ఆనా, నేనూ ఫోన్ కి అందుబాటులో లేము. 102 00:06:23,050 --> 00:06:24,968 విన్స్, నేనే. 103 00:06:25,052 --> 00:06:26,803 వీలైనంత తొందరగా కాల్ చేయ్, సరేనా? 104 00:06:26,887 --> 00:06:28,931 నేను బాగానే ఉన్నాను, నువ్వు అయితే కాల్ చేయ్. 105 00:06:31,558 --> 00:06:34,269 -అందరూ ఇక్కడికి రండి. -సమావేశంలో ఏం చెప్పారు? 106 00:06:34,353 --> 00:06:36,188 అందరూ దయచేసి ఇక్కడికి రండి. 107 00:06:38,815 --> 00:06:41,944 మీరు అందరూ నేను చెప్పేది ప్రశాంతంగా వినాలి. ఉండగలరు కదా? 108 00:06:42,027 --> 00:06:45,197 డయేన్? డయేన్. వాళ్లు ఆసుపత్రిని ఖాళీ చేస్తున్నారు. 109 00:06:45,280 --> 00:06:46,281 ఎవరు? 110 00:06:46,365 --> 00:06:48,450 మెమోరియల్ వాళ్లు. అందరినీ బయటకు పంపించేస్తున్నారట. 111 00:06:48,534 --> 00:06:50,744 -మనం ఖాళీ చేయాల్సి ఉంటుంది. -ఈ అంతస్థునా? 112 00:06:50,827 --> 00:06:53,205 -మొత్తం ఆసుపత్రిని. -ఎప్పుడు? 113 00:06:53,288 --> 00:06:55,290 ఇప్పుడే. ఇప్పటికిప్పుడే. 114 00:06:55,958 --> 00:06:59,169 వాళ్లు మనల్ని కూడా తీసుకెళ్తున్నారా? మన రోగులను ఎలా తరలించాలి? 115 00:06:59,670 --> 00:07:01,088 ఇన్ ఛార్జ్ ఎవరు? 116 00:07:03,507 --> 00:07:05,050 -డయేన్? -మీ అమ్మగారితో ఉండండి. 117 00:07:05,133 --> 00:07:07,511 -ఏం జరుగుతోంది? -మీ అమ్మగారితో ఉండండి, సరేనా? 118 00:07:26,488 --> 00:07:32,035 ప్రభూవా, నన్ను శిలువ చెంతనే ఉంచు 119 00:07:40,544 --> 00:07:43,463 పవిత్రమైన ఫౌంటెయిన్ 120 00:07:48,260 --> 00:07:53,140 ఆ వైద్య గుణాల నీటిని అందరూ వాడుకోవచ్చు 121 00:07:55,809 --> 00:08:00,981 కల్వరీ పర్వతాల నుండి ప్రవహించే నీరు అది 122 00:08:02,900 --> 00:08:08,071 శిలువ దగ్గర, నేను ఓ కన్నేసి వేచి ఉంటాను 123 00:08:08,822 --> 00:08:14,828 నది అవతల ఉన్న 124 00:08:16,872 --> 00:08:22,586 బంగారు నావను చేరుకొనే దాకా 125 00:08:22,669 --> 00:08:23,670 ఆంబులెన్స్ ఎమర్జెన్సీ 126 00:08:23,754 --> 00:08:29,968 నమ్మకంతో, తరగని విశ్వాసంతో ఉంటాను 127 00:08:31,678 --> 00:08:33,179 నీరు చేరుకుంటోంది. 128 00:08:34,014 --> 00:08:36,099 పార్కింగ్ ప్రదేశం అంతా మునిగిపోతోంది. 129 00:08:36,183 --> 00:08:39,770 అక్కడే ఉండు. అమ్మతో అక్కడే ఉండు, సరేనా? 130 00:08:40,854 --> 00:08:42,606 హా, నేను ఇక్కడే ఉంటున్నాను. 131 00:08:43,649 --> 00:08:46,109 నగరమంతా అక్కడక్కడా చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసి ఉండవచ్చు, 132 00:08:46,193 --> 00:08:48,403 జనాలను బయటకు పంపిస్తుంటారు కానీ లోనికి పంపిస్తూ ఉండకపోవచ్చు. 133 00:08:49,238 --> 00:08:53,867 మనం ఆపరేషన్స్ శిబిరాన్ని కానీ, లేదా మార్షలింగ్ పాయింట్ ని కానీ కనుగొనగలిగితే, 134 00:08:54,701 --> 00:08:57,162 అలాగే వాలంటీరుగా నమోదు చేసుకోగలిగితే, 135 00:08:57,246 --> 00:09:00,374 మనం ఊరిలోకి ప్రవేశించి, ఆసుపత్రిని చేరుకోవచ్చు. 136 00:09:00,457 --> 00:09:04,211 అది సరే, కానీ మనం ఇదంతా చేసి, అక్కడికి చేరుకున్నాక, వాళ్లు అప్పటికే మీ అమ్మగారిని బయటకి పంపుంటే, అప్పుడు… 137 00:09:04,294 --> 00:09:06,255 ఒకవేళ పంపి ఉండకపోతే? 138 00:09:07,381 --> 00:09:08,924 అంటే, వాళ్లు తరలించలేకపోతే? 139 00:09:09,007 --> 00:09:12,261 అంటే, కరెంట్ లేదు, అదే సమయంలో నీటి స్థాయి పెరుగుతోంది. 140 00:09:12,344 --> 00:09:14,054 కానీ అది ఆసుపత్రి కదా. 141 00:09:14,137 --> 00:09:17,140 కరెంట్ లేకపోతే, ఆసుపత్రికి, భవనానికి ఏ తేడా ఉండదు. 142 00:09:17,975 --> 00:09:19,977 చూడు, ఇక్కడ కూర్చొని రాని ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చోడం కంటే 143 00:09:20,060 --> 00:09:22,688 ఎలాగోలా అక్కడికి చేరుకోవడం మంచిది. 144 00:09:24,439 --> 00:09:28,151 ఆమె నా కన్న తల్లి. నేను తనని వదిలేయలేను. 145 00:09:33,365 --> 00:09:35,534 మనం అగ్నిమాపక ఆఫీసు ఎక్కడ ఉందో కనుగొనాలి. 146 00:09:36,159 --> 00:09:38,829 నగర పాలక వర్గం, ఎమర్జెనీ సిబ్బంది సహాయాన్ని కోరుతుంది, 147 00:09:38,912 --> 00:09:42,291 అదే జరిగితే, మనం వారితో చేరి, నగరంలోకి వెళ్లే అవకాశం ఉంది. 148 00:09:43,792 --> 00:09:44,793 మీ అమ్మ దగ్గరికి వెళ్తాం. 149 00:09:46,044 --> 00:09:48,172 ఎలాగైనా సరే, మనం ఆమె దగ్గరికి వెళ్తాం. 150 00:10:01,018 --> 00:10:02,019 సూసన్? 151 00:10:02,978 --> 00:10:05,022 -లైఫ్ కేర్ నుండి డయేన్ రోబిషోని మాట్లాడుతున్నా. -హాయ్. 152 00:10:05,105 --> 00:10:06,732 మీరు ఆసుపత్రిని ఖాళీ చేస్తున్నారా? 153 00:10:06,815 --> 00:10:07,816 అవును. 154 00:10:08,358 --> 00:10:10,444 మరి ఆ విషయం నాకు ఎప్పుడో తెలియాలి కదా? 155 00:10:10,527 --> 00:10:12,779 మా రోగులను మేము ఎలా తరలించాలి? 156 00:10:12,863 --> 00:10:15,157 మీది ప్రైవేట్ ఆసుపత్రి కదా. మీకు మీ సొంత ప్లాన్ లేదా? 157 00:10:15,240 --> 00:10:18,493 మేము ఎవరినీ సంప్రదించలేకపోతున్నాం. కనీసం మా దగ్గర మా డాక్టర్లు కూడా ఎవరూ లేరు. 158 00:10:18,577 --> 00:10:20,537 మీ కార్పొరేట్ ఆఫీసులను మీరు సంప్రదించలేకపోతున్నారా? 159 00:10:20,621 --> 00:10:22,080 హా, ఎప్పుడో ఒకసారి లైన్ కలుస్తుందంతే. 160 00:10:22,164 --> 00:10:25,751 కోస్ట్ గార్డ్ ని గానీ ప్రైవేట్ విమానయాన సంస్థను గానీ వాళ్లు సంప్రదించగలరేమో చూడండి, 161 00:10:25,834 --> 00:10:28,420 మా హెలిప్యాడ్ పని చేస్తుంటే, నేను మీకు తెలియజేస్తాను, 162 00:10:28,504 --> 00:10:30,422 మీ వద్ద ఉన్న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల జాబితా ఇవ్వండి. 163 00:10:30,506 --> 00:10:31,632 చాలా మంది అలాంటి వాళ్లే ఉన్నారు. 164 00:10:31,715 --> 00:10:33,467 అయితే ఆ లిస్ట్ ఇవ్వండి, మేము ఏం చేయగలమో చూస్తాం. 165 00:10:33,550 --> 00:10:35,802 కానీ ఇప్పుడైతే, మా వాళ్లతోనే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. 166 00:10:36,595 --> 00:10:37,679 ఏమైనా దొరికిందా? 167 00:10:37,763 --> 00:10:40,265 ఒక ఎయిర్ నేషనల్ గార్డ్ ఆఫీసర్ ఫోన్ నంబరును సంపాదించాను. 168 00:10:41,350 --> 00:10:42,601 ఇది బేటన్ రూజ్ ఊరి నంబర్. 169 00:10:42,684 --> 00:10:43,894 -అతను సహకరిస్తూ… -నువ్వు కాల్ చేశావా? 170 00:10:43,977 --> 00:10:45,479 -ఫోన్ కలవడం లేదు. -మరి టెనెట్ వాళ్లేం చేస్తున్నారు? 171 00:10:45,562 --> 00:10:48,065 -నేను ఈమెయిల్స్ చేస్తునే ఉన్నా, కానీ… -మళ్లీ ఇంకో మెయిల్ పంపు, 172 00:10:48,148 --> 00:10:50,150 -సమయం మించిపోతోందని చెప్పు. -నేను అదే చెప్పాను కూడా. 173 00:10:50,234 --> 00:10:52,778 వాళ్లు మన మాతృ సంస్థ కదా. 174 00:10:52,861 --> 00:10:54,905 నాలుగు గంటల్లో ఇక్కడ కరెంట్ పోతుందని, అప్పుడు మాకు సాయం కావాలని 175 00:10:54,988 --> 00:10:56,573 వాళ్లకి చెప్పు. 176 00:10:56,657 --> 00:10:57,658 నేను గట్టిగా ప్రయత్నిస్తూనే ఉన్నా. 177 00:10:59,076 --> 00:11:01,453 తెలుసు. నాకు తెలుసు. 178 00:11:01,537 --> 00:11:04,873 ఏదైనా సమాచారం అందినప్పుడు నాకు చెప్పు, సరేనా? 179 00:11:05,457 --> 00:11:06,291 సరే. 180 00:11:08,544 --> 00:11:10,462 ఇవాళ ఎక్కడ చూసినా ఇదే దృశ్యం కనిపిస్తోంది. 181 00:11:10,546 --> 00:11:13,674 హెలికాప్టర్లు, సహాయక బృందాలు, ఒక్కొక్కొళ్ళన్నీ పైకి లాగుతున్నాయి, 182 00:11:13,757 --> 00:11:15,509 ఇంటి పైకప్పుల నుండి అలా వందలాది మందిని రక్షిసున్నాయి. 183 00:11:15,592 --> 00:11:16,593 డల్లాస్ 184 00:11:16,677 --> 00:11:18,637 తాము ఊపిరి పీల్చుకున్నామని న్యూ ఆర్లీన్స్ ప్రజలు భావించారు, 185 00:11:18,720 --> 00:11:22,641 కానీ రెండు ప్రధాన కట్టలు తెగిపోవడంతో నగరమంతా జలమయమైపోయింది. 186 00:11:22,724 --> 00:11:25,060 కెనాల్ వీధి ఇప్పుడు నీటితో నిండిన కెనాల్ అయిపోయింది. 187 00:11:25,143 --> 00:11:28,772 చాలా రోజుల దాకా ఈ నగరం నివాసయోగ్యమైనది కాకపోవచ్చు. 188 00:11:28,856 --> 00:11:32,234 సీ లెవెల్ కి దిగువ ఉండే నగరం ఇప్పుడు నీటి కింద ఉంది. 189 00:11:32,317 --> 00:11:35,821 న్యూ ఆర్లీన్స్ కి రక్షగా ఉండే కట్టలో నిన్న రాత్రి రెండు గండ్లు పడ్డాయి. 190 00:11:35,904 --> 00:11:37,072 రెండు వందల్లో ఒకటి… 191 00:11:37,155 --> 00:11:39,449 హేయ్, న్యూ ఆర్లీన్స్ లోని మెమోరియల్ నుండి మనకు ఇంకో ఈమెయిల్ వచ్చింది… 192 00:11:39,533 --> 00:11:41,201 -ఏంటి? -న్యూ ఆర్లీన్స్ లోని మెమోరియల్ నుండి మెయిల్ వచ్చింది. 193 00:11:41,910 --> 00:11:43,453 వాళ్లు రోగులను ఖాళీ చేయించాలట. 194 00:11:43,537 --> 00:11:45,706 మొత్తం నీట మునిగిపోయింది. 195 00:11:46,206 --> 00:11:47,833 చాలా భయాందోళనలకు గురి చేసే విషయంలా ఉంది కదా? 196 00:11:49,126 --> 00:11:51,461 -మనం ఏం చేయగలం? -మనమా? అంటే… 197 00:11:51,545 --> 00:11:54,381 అంటే, ఎమర్జెన్సీ విధానం లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే… 198 00:11:54,464 --> 00:11:56,133 ఆ ఈమెయిల్ ని ఎవరికైనా ఫార్వర్డ్ చేయ్. 199 00:11:56,216 --> 00:11:58,051 ఈమెయిళ్లు చాలా మందికి వెళ్తున్నాయి, కానీ ఎవరూ ప్రతిస్పందించట్లేదు. 200 00:11:58,135 --> 00:11:59,803 నీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. 201 00:12:04,349 --> 00:12:08,187 మైఖెల్. దక్షిణ కెరోలినా పత్రాలు. వీటిని ఆమోదించగలవా? 202 00:12:08,270 --> 00:12:09,313 అలాగే. 203 00:12:10,939 --> 00:12:12,232 ఇప్పుడే చేయాలా? 204 00:12:12,316 --> 00:12:13,901 రేపటికల్లా పంపేయాలనుకుంటున్నా. 205 00:12:16,403 --> 00:12:17,613 ఈ పని కాసేపయ్యాక చేద్దామా? 206 00:12:17,696 --> 00:12:20,157 -అంటే, వీటిని ప్రింటింగ్ కి ఇవ్వాలి కదా. -ఇప్పుడే వస్తా, ఆగు. 207 00:12:34,922 --> 00:12:36,673 -స్టీవ్? -హాయ్. 208 00:12:37,549 --> 00:12:38,592 మనకి ఈమెయిల్స్ వస్తున్నాయి. 209 00:12:38,675 --> 00:12:41,220 మన ఆసుపత్రుల్లో ఒకదాని నుండి వస్తున్నాయి, తుఫాను వెళ్లిపోయాక, వరద నీరు చేరుకుంటోందట, 210 00:12:41,303 --> 00:12:43,222 -ఆసుపత్రిని ఖాళీ చేయాలట. -సరే. 211 00:12:43,764 --> 00:12:44,973 వాళ్లు సాయం కోసం అడుగుతున్నారు. 212 00:12:45,557 --> 00:12:47,976 -అంటే, మన దగ్గర ఏమైనా… -మన దగ్గర ఏమైనా ఉన్నాయంటావా? 213 00:12:48,060 --> 00:12:51,772 మన సంస్థకి, వైద్య రవాణా సంస్థలతో ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా, 214 00:12:51,855 --> 00:12:54,107 లేకపోతే ఖాళీ చేయడానికి ప్లాన్ ఏమైనా ఉందా? సాయం చేయగల వారు ఎవరైనా ఉన్నారా… 215 00:12:54,191 --> 00:12:56,360 ఎమర్జెన్సీ ప్లాన్స్ గురించి నాకు తెలీదు. 216 00:12:56,443 --> 00:12:58,445 లూసియానాలో ఎవరైనా ఉన్నారా? 217 00:12:58,529 --> 00:13:00,614 అంటే, మనది వ్యాపారాభివృద్ధి శాఖ కదా. 218 00:13:01,740 --> 00:13:02,741 అవును. 219 00:13:03,700 --> 00:13:05,244 వాళ్లు సాయం కోసం ఆత్రంగా చూస్తున్నట్టున్నారు. 220 00:13:05,327 --> 00:13:07,788 -ఏమో, నాకు అర్థం కావట్లేదు. -చూడు… 221 00:13:11,083 --> 00:13:13,752 హేయ్, మైఖెల్. ఆగు. 222 00:13:15,087 --> 00:13:19,049 ఇంతకు ముందు నేషనల్ గార్డులో పని చేసిన వైస్ ప్రెసిడెంట్ ఒకాయన ఉండాలి, ఆయన ఎవరు? 223 00:13:19,132 --> 00:13:21,760 -ఎవరు? -పోర్టిస్ అనుకుంటా. 224 00:13:22,427 --> 00:13:24,721 -అతని నంబరును డైరెక్టరిలో వెతుకు. -సూపర్. 225 00:13:24,805 --> 00:13:27,224 -సరే. నాకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండు. -హా, తప్పకుండా. 226 00:13:47,286 --> 00:13:48,996 ఆలన్ పోర్టిస్ ఆఫీస్, చెప్పండి. 227 00:13:49,079 --> 00:13:51,790 హాయ్. డల్లాస్ లోని టెనెట్ నుండి మైఖెల్ ఆర్విన్ ని కాల్ చేస్తున్నాను. నేను… 228 00:13:51,874 --> 00:13:53,500 మన్నించాలి. మీరు పేరు ఏమని అన్నారు? 229 00:13:53,584 --> 00:13:57,087 మైఖెల్ ఆర్విన్. టెనెట్ గల్ఫ్ కోస్టుకు నేను బిజినెస్ డెవలప్మంట్ డైరెక్టరుని. 230 00:13:57,171 --> 00:13:59,131 న్యూ ఆర్లీన్స్ లో ఒక అత్యవసర పరిస్థితి తలెత్తింది. 231 00:13:59,214 --> 00:14:03,260 మన ఆసుపత్రుల్లో, కనీసం ఒకదానికి అత్యవసర సహాయం కావాలట, దానికి నేను… 232 00:14:03,343 --> 00:14:06,513 మిస్టర్ పోర్టిస్ సెలవులపై వెళ్లారు. మీరు చెప్పాలనుకున్నది నేను ఆయనకి చేరవేయగలను. 233 00:14:06,597 --> 00:14:09,224 -మీరు అతనితో కాల్ చేసి మాట్లాడగలరా? -ఆయన సెలవులపై వెళ్లారు. 234 00:14:09,308 --> 00:14:14,104 ఒక ఆసుపత్రి… మన సంస్థకు చెందిన ఆసుపత్రిలోకి వరద నీరు చేరుతోంది, మనం సాయం చేయాలి. 235 00:14:14,188 --> 00:14:16,106 ఈ పరిస్థితుల్లో నేను మిస్టర్ పోర్టిస్ తో మాట్లాడటం చాలా ముఖ్యం. 236 00:14:18,275 --> 00:14:22,029 -హలో? -లైన్ లో ఉండండి. 237 00:14:25,782 --> 00:14:27,993 హేయ్, టీవీ సౌండ్ ని కాస్త పెంచవా? 238 00:14:28,493 --> 00:14:31,580 ఇక్కడున్న నీరు ఒక అడుగు లోతు ఉంటుంది. ఇక్కడైతే అది మరీ ఎక్కువ ఉంటుంది. 239 00:14:31,663 --> 00:14:35,751 పన్నెండు గంటల క్రితం మేము ఇవే వీధుల్లో తిరిగాం, అప్పుడు కనీసం ఒక్క నీటి చుక్క కూడా లేదు. 240 00:14:35,834 --> 00:14:37,044 మిస్టర్ ఆర్విన్? 241 00:14:37,127 --> 00:14:38,170 హా, నేను లైన్లోనే ఉన్నాను. 242 00:14:39,046 --> 00:14:41,215 -మిస్టర్ పోర్టిస్ లైన్లో ఉన్నారు. -హలో. 243 00:14:41,298 --> 00:14:42,508 మిస్టర్ పోర్టిస్. నా పేరు మైఖెల్ ఆర్విన్. 244 00:14:42,591 --> 00:14:45,260 టెనెట్ గోల్ఫ్ కోస్టుకు నేను బిజినెస్ డెవల్మెంట్ డైరెక్టరుని. 245 00:14:45,344 --> 00:14:46,512 చెప్పండి? 246 00:14:46,595 --> 00:14:49,223 న్యూ ఆర్లీన్స్ లో ఒక అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది. మన ఆసుపత్రిలో ఒకటి 247 00:14:49,306 --> 00:14:52,142 అత్యవసర సహాయం కావాలని మెయిళ్లు పెడుతోంది, 248 00:14:52,226 --> 00:14:54,394 మీరు నేషనల్ గార్డులో పని చేశారని నేను విన్నాను. 249 00:14:54,478 --> 00:14:55,479 అవును. 250 00:14:56,605 --> 00:14:58,774 నేషనల్ గార్డులో మీకు ఇంకా తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అని కనుక్కుందామని చేశా. 251 00:14:58,857 --> 00:15:01,735 -వాళ్ల నంబరు ఇవ్వగలిగితే, నేనే వాళ్లకి… -నాకు ఎవరూ తెలీదు. 252 00:15:02,569 --> 00:15:06,281 కనీసం వాళ్లని సంప్రదించగల వాళ్లు ఎవరైనా ఉన్నారా… 253 00:15:06,365 --> 00:15:07,824 నేను ఇప్పుడు ఆఫీసులో లేను. 254 00:15:07,908 --> 00:15:10,536 ఈ ఈమెయిళ్లు చాలా అత్యవసరమైనవిలా అనిపిస్తున్నాయి. దీనికి సమయం మించిపోతోంది. 255 00:15:10,619 --> 00:15:13,247 నేషనల్ గార్డుకు కాల్ చేయండి. వాళ్లు సహాయసహకారాలు అందిస్తూ ఉండవచ్చు. 256 00:15:24,967 --> 00:15:26,552 గ్రహీత: శాండ్రా కోర్డ్ రే నేషనల్ గార్డుకు కాల్ చేసి చూశారా? 257 00:15:26,635 --> 00:15:29,221 మీరు ఆసుపత్రిని ఖాళీ చేయాలని చూస్తుంటే, నేషనల్ గార్డు సహాయపడుతున్నారని, 258 00:15:30,764 --> 00:15:32,307 వాళ్లు సహాయపడగలరని భావిస్తున్నాము. గుడ్ లక్. 259 00:15:48,907 --> 00:15:49,908 గ్రహీత: మైఖెల్ ఆర్విన్ 260 00:15:49,992 --> 00:15:53,203 అన్నీ మేమే చేసుకోవాలి, మీరేమీ చేయలేరని అంటున్నారా? 261 00:16:05,215 --> 00:16:07,467 లేదు. నేను ఉన్నాను, సాయపడతాను. 262 00:16:14,766 --> 00:16:16,393 అవును. కోస్ట్ గార్డుది గానీ, 263 00:16:16,476 --> 00:16:19,271 లూసియానా నేషనల్ గార్డుది గానీ నంబర్ కోసం ప్రయత్నిస్తున్నాను, 264 00:16:20,647 --> 00:16:21,940 అలాగే, లైన్లో ఉంటాను. 265 00:16:22,024 --> 00:16:24,318 …సరిపడా లేవు. సంసిద్ధమయ్యే సమయం లేదు, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 266 00:16:26,653 --> 00:16:28,530 …ఎగువ ప్రాంతాలకు వెళ్తున్నారు. 267 00:16:39,291 --> 00:16:41,668 కానివ్వండి. కానివ్వండి. తెస్తూనే ఉండండి. 268 00:16:42,252 --> 00:16:46,757 ఇంకా కావాలి. చాలా చాలా కావాలి. అంతే. కానివ్వండి. 269 00:17:01,813 --> 00:17:04,066 ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ, ఎక్కడున్నావు? 270 00:17:25,087 --> 00:17:28,674 ఈ విధంగా మనం 200 మంది రోగులను పైకి ఎలా తరలించగలం? 271 00:17:28,757 --> 00:17:29,758 చూద్దాం. 272 00:18:30,652 --> 00:18:31,695 హేయ్, రండి. 273 00:18:32,196 --> 00:18:34,198 -మనం ఈ నిర్మాణం పటిష్టంగా ఉందో లేదో చూడాలి, సరేనా? -సరే. 274 00:18:56,803 --> 00:18:57,804 దేవుడా. 275 00:19:10,359 --> 00:19:11,568 ఏమైనా తెలుస్తోందా? 276 00:19:11,652 --> 00:19:14,863 తుప్పు పట్టిపోయింది. ఈ లోహం అంతా తుప్పుపట్టి ఉంది. 277 00:19:15,572 --> 00:19:16,573 ఎంత దారుణంగా పట్టింది? 278 00:19:16,657 --> 00:19:19,326 అది చెప్పలేను. ఇక్కడ కనిపిస్తున్నది చెప్తున్నానంతే. 279 00:19:20,118 --> 00:19:22,371 ఎముకలను కట్ చేసే రంపాన్ని ఇక్కడ కూడా వాడి 280 00:19:22,454 --> 00:19:25,791 ఈ లోహంలో కొంత భాగాన్ని కోసి తుప్పు ఏ మేర పట్టిందో చూడవచ్చు. 281 00:19:25,874 --> 00:19:28,794 ఇక్కడ హెలికాప్టర్లను దింపే ముందు, 282 00:19:28,877 --> 00:19:31,171 ముందు అసలు ఇది ఆ బరువును మోయగలదో లేదో చూద్దాం. 283 00:19:35,551 --> 00:19:36,593 సరే. 284 00:19:37,928 --> 00:19:39,638 -ఫ్రెడ్డీ. -చెప్పు. 285 00:19:40,138 --> 00:19:44,351 నేను కిందికి వస్తున్నా. నాకు ఒక రంపం కావాలి. స్టీలుని కోయగలిగేది కావాలి. 286 00:19:44,977 --> 00:19:47,646 -స్టీలుని కోయగలిగేదా? -హా, అది చాలా అర్జంట్. 287 00:20:02,327 --> 00:20:03,453 వద్దు. 288 00:20:06,039 --> 00:20:07,165 వద్దు! 289 00:20:08,208 --> 00:20:09,376 వద్దు! 290 00:20:10,085 --> 00:20:11,378 వద్దు! 291 00:20:28,687 --> 00:20:30,981 హేయ్! హేయ్, ఇలా రండి. 292 00:20:31,064 --> 00:20:32,774 -నన్నా? -అవును! ఇలా రండి! 293 00:20:36,987 --> 00:20:38,280 మీకు సాయం ఏమైనా కావాలా? 294 00:20:38,363 --> 00:20:39,364 అవును. 295 00:20:40,449 --> 00:20:41,867 గార్డ్ 5-8-5, నేను… 296 00:20:42,659 --> 00:20:45,621 -నేను ఎక్కడ ఉన్నాను? -బ్యాప్టిస్ట్ మెమోరియల్ హాస్పిటల్. 297 00:20:45,704 --> 00:20:48,999 బ్యాప్టిస్ట్ మెమోరియల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. వైద్య సిబ్బంది తరలించమని కోరుతున్నారు. 298 00:20:50,959 --> 00:20:52,336 అలాగే. 299 00:20:52,419 --> 00:20:53,921 నేను ఒకరిని తీసుకెళ్లగలను. 300 00:20:54,004 --> 00:20:55,214 -ఒకరినా? -అవును. త్వరపడండి. 301 00:20:56,131 --> 00:20:58,800 మనం దాదాపుగా 200 మంది రోగులను ఇక్కడి నుండి తరలించాలి. 302 00:20:58,884 --> 00:21:02,262 ఎవరిని మొదట పంపాలి, ఎవరిని చివరన పంపాలి అనేది మనం చర్చించుకోవాలి. 303 00:21:02,846 --> 00:21:05,682 నన్ను అడిగితే, రోగం తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్లు, 304 00:21:05,766 --> 00:21:08,852 అంటే, లైఫ్ సపోర్ట్ లేదా మెకానికల్ ఎయిడ్ అవసరం అత్యంత ఎక్కువ ఉన్న వాళ్లు, 305 00:21:08,936 --> 00:21:10,103 ముందు వెళ్లాలని చెప్తాను. 306 00:21:10,187 --> 00:21:12,814 అయితే, అలాంటి వాళ్లు ఐసీయూలో సుమారుగా 24 మంది ఉన్నారు. 307 00:21:12,898 --> 00:21:15,817 కరెంటు కనుక పోతే, వాళ్ల పరిస్థితి మన చేయి దాటి పోతుంది. 308 00:21:15,901 --> 00:21:18,362 వెంటిలేటర్లపై ఆధారపడి ఉన్న నెల తక్కువ శిశువుల పరిస్థితి కూడా అంతే. 309 00:21:18,445 --> 00:21:19,905 కరెంట్ లేకపోతే వాళ్లు చనిపోతారు. 310 00:21:19,988 --> 00:21:24,785 అధిక రిస్క్ గల గర్భవతులు అనేక మంది ఉన్నారు, ఆరుగురు డయాలసిస్ రోగులు ఉన్నారు, 311 00:21:24,868 --> 00:21:27,454 ఇద్దరు బోన్ మేరో ట్రాన్స్ ప్లాంట్ రోగులు ఉన్నారు. 312 00:21:27,538 --> 00:21:31,083 అందరికీ వీలైనంత వేగంగా మనం చికిత్సను అందించాల్సి ఉంటుంది, 313 00:21:31,166 --> 00:21:34,711 వాళ్లని తరలించాక, మనం మరింత స్థిరమైన రోగులను తరలిద్దాం, 314 00:21:34,795 --> 00:21:38,841 ఆ తర్వాత పౌరులను, కుటుంబాలను, సిబ్బందిని తరలిద్దాం, చివరగా డాక్టర్లు వెళ్తారు. 315 00:21:38,924 --> 00:21:40,092 సారీ. 316 00:21:40,175 --> 00:21:41,718 అది అందరికీ సమ్మతమే కదా? 317 00:21:45,764 --> 00:21:46,765 సమ్మతమే. 318 00:21:49,393 --> 00:21:52,563 సరే మరి. నేషనల్ గార్డు వాళ్లు ముప్పై అయిదు మంది సర్జికల్ రోగులను 319 00:21:52,646 --> 00:21:56,608 ట్రక్కు ద్వారా తీసుకువెళ్తామని ఖచ్చితంగా చెప్పారు. 320 00:21:56,692 --> 00:21:58,360 ముప్పై అయిదా? అంతేనా? 321 00:21:59,027 --> 00:22:00,279 వాళ్లు అదే చెప్పారు. వాళ్లు… 322 00:22:00,362 --> 00:22:03,365 ఒక హెలికాప్టర్ దిగి ఉంది. హెలిప్యాడ్ మీద ఒక హెలికాప్టర్ ఉంది. 323 00:22:03,448 --> 00:22:04,741 అసలు ఆ హెలికాప్టర్ పైలట్ ఏమనుకొని… 324 00:22:04,825 --> 00:22:07,703 నేను అక్కడ నిలబడి ఊపుతుంటే, నేను అతన్ని పిలుస్తున్నానని అనుకొని దింపాడు. 325 00:22:07,786 --> 00:22:08,871 -ఏమంటాడంటే… -టెనెట్ నుండి వచ్చాడా? 326 00:22:08,954 --> 00:22:10,914 -ఎంత మందిని పంపుతున్నారట? -కాస్త నేను చెప్పేది వినండి. 327 00:22:10,998 --> 00:22:12,875 ప్రస్తుతానికి ఒక్క రోగినే తీసుకెళ్లగలడట, కానీ మనం త్వరపడాలి. 328 00:22:12,958 --> 00:22:14,626 -ఒక్కరినేనా? -అవును. 329 00:22:15,669 --> 00:22:18,297 -ఒక నెల తక్కువ శిశువును తీసుకుపో. -సరే. సరే. 330 00:22:35,647 --> 00:22:37,524 శాండ్రా, హెలిప్యాడ్ పని చేస్తోంది. 331 00:22:37,608 --> 00:22:40,194 -ఇక్కడికి హెలికాప్టర్లు రావచ్చని టెనెట్ కి కబురు పంపించు. -అలాగే. 332 00:22:40,277 --> 00:22:43,363 కేరన్, హెలిప్యాడ్ పని చేస్తోంది. నీ రోగులను తరలింపుకు సిద్ధంగా ఉంచు. 333 00:22:43,447 --> 00:22:46,533 ముందుగా, నెల తక్కువ శిశువులను, ఐసీయూలో ఉన్న వాళ్ళని పంపిస్తున్నాం. 334 00:22:46,617 --> 00:22:47,618 అలాగే. 335 00:22:49,203 --> 00:22:52,164 మనం రోగులను తరలించే పనిని మొదలుపెడుతున్నాం, సరేనా? కానివ్వండి. 336 00:22:58,754 --> 00:23:00,339 సరే మరి. ఒక హెలికాప్టర్ వచ్చి ఉంది. 337 00:23:00,422 --> 00:23:03,383 అస్సలు బాగాలేని శిశువును ఇవ్వండి. మిగతా శిశువులను కూడా సిద్దంగా ఉంచండి. 338 00:23:03,467 --> 00:23:05,052 -ఎడ్మండ్స్ ని తీసుకువెళ్లు. -సరే. 339 00:23:17,981 --> 00:23:19,983 కానివ్వండి. ఆ తలుపుకు అడ్డుగా పెట్టండి. 340 00:23:21,610 --> 00:23:22,653 ఇక్కడ. 341 00:23:23,654 --> 00:23:25,906 స్టీవ్. ఇప్పుడే నాకు మొమోరియల్ వాళ్ల నుండి… 342 00:23:25,989 --> 00:23:27,032 ఒక్క నిమిషం ఆగండి. 343 00:23:27,115 --> 00:23:29,785 మెమోరియల్ వాళ్లు ఇప్పుడే ఒక విషయం చెప్పారు. హెలికాప్టర్లు అక్కడికి పంపవచ్చట. 344 00:23:29,868 --> 00:23:32,329 బేటన్ రూజ్ లో ఒక ఆసుపత్రి ఉంది, వాళ్లు రోగులను అడ్మిట్ చేసుకుంటారట. 345 00:23:32,412 --> 00:23:34,706 నేను కొన్ని ప్రైవేట్ హెలికాప్టర్ సంస్థలకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, 346 00:23:34,790 --> 00:23:36,667 అట్లాంటాలో కొన్ని ఆసుపత్రులు తరలింపుకు సాయం చేస్తామంటున్నాయి. 347 00:23:36,750 --> 00:23:37,751 లేదు. లేదు ఆకాశం అంటే… 348 00:23:38,335 --> 00:23:41,088 కోస్ట్ గార్డ్ గానీ, నేషనల్ గార్డ్ గానీ చూసుకుంటారని సంస్థ అంటోంది. 349 00:23:41,171 --> 00:23:43,131 నేను వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నా. వాళ్లకి పరిస్థితి తెలుసు. 350 00:23:43,215 --> 00:23:44,341 అట్లాంటా వాళ్లు సాయం చేస్తామంటున్నారు. 351 00:23:44,424 --> 00:23:47,344 మైక్, ఇదేదో కారు యాక్సిడెంటులో సహాయం చేయడం కాదు. 352 00:23:47,427 --> 00:23:50,055 ఇది వరద సహాయం. సరేనా? 353 00:23:50,138 --> 00:23:53,642 ఇది సైనికుల పని. వాళ్ల పనే అది. వాళ్లనే చేయనిద్దాం, సరేనా? 354 00:23:55,394 --> 00:23:56,395 సరేనా? 355 00:23:56,478 --> 00:23:57,479 సరే. 356 00:23:59,690 --> 00:24:01,108 హా, లైన్లో ఉన్నాను. 357 00:24:01,191 --> 00:24:06,321 మెమోరియల్ హెలిప్యాడ్ పని చేస్తోంది, కానీ మేము కోస్ట్ గార్డ్ సహాయం కోసం ప్రయత్నిస్తాం. 358 00:24:08,240 --> 00:24:09,533 హా, మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటా. 359 00:24:11,618 --> 00:24:14,037 …పరిస్థితి చావా రేవా అన్నట్టు ఉంది. 360 00:24:14,121 --> 00:24:16,665 నీటి మట్టం చాలా వేగంగా పెరుగుతోంది, 361 00:24:16,748 --> 00:24:19,418 మేయర్ రే నేగిన్ మాటల్లో చెప్పాలంటే, ఆర్మీకి చెందిన ఇంజినీర్ల శాఖ, 362 00:24:19,501 --> 00:24:23,130 నేటి రాత్రికల్లా ఆ కట్టకు పడిన గండిని కనుక పూడ్చలేకపోతే, 363 00:24:23,213 --> 00:24:27,009 న్యూ ఆర్లీన్స్ లోని లోతట్టు ప్రాంతాలతో పాటు, ఎగువ ఉన్న ప్రాంతాలు కూడా 364 00:24:27,092 --> 00:24:28,802 పూర్తిగా జలమయం అయిపోతాయి. 365 00:24:36,643 --> 00:24:37,728 జాగ్రత్త. 366 00:24:38,312 --> 00:24:40,397 చూసుకోండి. తిప్పండి. సరే మరి. 367 00:24:40,480 --> 00:24:42,274 -కాస్త… -సరే. మూడు లెక్కపెడతా. 368 00:24:42,357 --> 00:24:45,027 -సిద్దమా? పదండి. -ఒకటి, రెండు, మూడు. 369 00:24:46,278 --> 00:24:47,279 సరే. 370 00:24:48,906 --> 00:24:50,365 హా. ఒరగకూడదు. 371 00:24:51,241 --> 00:24:52,868 -నిదానం. -అడుగు జాగ్రత్త. 372 00:24:56,622 --> 00:24:59,291 -నిదానం. -తిప్పాలి, తిప్పాలి. 373 00:25:01,210 --> 00:25:03,253 సిద్ధమా? అడుగులు జాగ్రత్త. 374 00:25:10,177 --> 00:25:11,220 సరే, జాగ్రత్త. 375 00:25:14,348 --> 00:25:16,350 -నేను ఇక ఎత్తలేను. -సరే. 376 00:25:17,476 --> 00:25:19,520 కాస్తంత నెమ్మదిగా వెళ్దాం. దేవుడా. 377 00:25:20,729 --> 00:25:21,730 -హేయ్. కానివ్వు. -సరే. 378 00:25:22,314 --> 00:25:23,649 నాకేం పర్వాలేదు. 379 00:25:25,859 --> 00:25:28,320 హేయ్, ఆగండి. పాపకి ఆక్సీజన్ ఇవ్వాలి. 380 00:25:29,321 --> 00:25:31,031 -ఒక్క క్షణం ఆగండి. -పాప బాగానే ఉంది కదా? 381 00:25:31,532 --> 00:25:33,534 పాప బాగానే ఉంది కదా? కానివ్వండి పోదాం. 382 00:25:33,617 --> 00:25:36,537 సరే మరి, సిద్దమా? 383 00:25:37,454 --> 00:25:39,289 వచ్చేశాం. వచ్చేశాం. 384 00:25:43,877 --> 00:25:46,338 హేయ్, ఏం చేస్తున్నారు మీరంతా? ఇంత సేపా? 385 00:25:46,421 --> 00:25:48,882 -లిఫ్ట్ పని చేయడం లేదు. -మరి ఏదోకటి చూసుకోండి. 386 00:25:48,966 --> 00:25:50,801 జనాలకు సాయం అవసరం ఉంది, ఇక్కడే సమయం వృథా చేసుకోలేం కదా. 387 00:25:50,884 --> 00:25:53,303 పాపని ఎక్కించండి. త్వరగా కానివ్వండి. 388 00:25:53,387 --> 00:25:55,597 -మేము బయలుదేరాలి. -కానివ్వండి. కానివ్వండి. 389 00:25:56,223 --> 00:25:57,516 దూరం జరగండి! 390 00:25:58,225 --> 00:26:01,478 -త్వరగా దూరం జరగండి. జరగండి! -తను వెనక్కి రావట్లేదు. 391 00:26:05,774 --> 00:26:06,775 సరే మరి! 392 00:26:08,068 --> 00:26:09,486 అంతా సిద్ధంగా ఉంది, ఇక వెళ్దాం! 393 00:26:43,020 --> 00:26:45,647 నెల తక్కువ శిశువులను హెలికాప్టర్ల ద్వారా తరలించి, 394 00:26:45,731 --> 00:26:48,233 నేషనల్ గార్డ్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా ముప్పై అయిదు మంది రోగులను తరలిస్తే, 395 00:26:48,317 --> 00:26:50,402 అప్పుడు ఇంకా ఎంత మంది ఉంటారు? 396 00:26:50,485 --> 00:26:54,615 నూట యాభై మంది రోగులు, డాక్టర్లు, సిబ్బంది, ఇంకా పౌరులు. 397 00:26:54,698 --> 00:26:57,576 మనం రోగుల విషయంలో ప్రాధాన్యతలను పరిశీలిస్తున్నాం కనుక, 398 00:26:58,619 --> 00:27:00,579 డీఎన్ఆర్ రోగులు ఆఖరున వెళ్లాలని నా అభిప్రాయం. 399 00:27:00,662 --> 00:27:01,496 ఎందుకు? 400 00:27:02,247 --> 00:27:05,083 ఎందుకంటే, తమలో ఏ చలనం లేకపోతే అలాగే వదిలేయమని వాళ్లు సంతకం చేశారు కనుక. 401 00:27:05,167 --> 00:27:07,377 వాళ్లని కాపాడాల్సిన అవసరం లేదని వాళ్లే సూచించారు. 402 00:27:07,461 --> 00:27:08,462 దానర్థం అది కాదు… 403 00:27:09,171 --> 00:27:11,590 దానర్థం వాళ్లని కాపాడకూడదు అని కాదు. 404 00:27:11,673 --> 00:27:14,676 దానర్థం ఏంటంటే, ఏ చలనమూ లేనప్పుడు మాత్రమే వాళ్లని అలాగే వదిలేయాలి. 405 00:27:14,760 --> 00:27:17,429 ఏ రోగైనా డిఎన్ఆర్ మీద సంతకం చేయాలంటే, వాళ్ల రోగం ప్రాణాంతకం అయినది అయ్యి… 406 00:27:17,513 --> 00:27:19,181 లేదు, లేదు, అది… 407 00:27:19,681 --> 00:27:22,184 -నువ్వు డిఎన్ఆర్ ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు… -లేదు, రిచర్డ్. రిచర్డ్. 408 00:27:22,267 --> 00:27:25,020 డిఎన్ఆర్ రోగుల సంగతి ఇప్పుడు ఎందుకు? 409 00:27:25,103 --> 00:27:29,608 చూడండి, డిఎన్ఆర్ రోగులు ఐసీయూలో నలుగురే ఉన్నారు. నలుగురే. 410 00:27:29,691 --> 00:27:32,486 మనకి ఏ దారీ లేని పరిస్థితిలో ఇలా చేద్దామని నేను అంటున్నానంతే. 411 00:27:33,237 --> 00:27:36,782 నలుగురు ప్రాణాంతక వ్యాధులున్న వారిని కాపాడటం కన్నా నలుగురు ఆరోగ్యకరమైన రోగులను తరలించడం మేలని… 412 00:27:38,200 --> 00:27:41,161 ఈ విషయాన్ని మనం సూసన్ తో కూడా చర్చిస్తే మేలని నా ఉద్దేశం. 413 00:27:44,081 --> 00:27:47,209 తనే కదా ఇన్ ఛార్జ్. ఏమంటారు? 414 00:27:57,553 --> 00:27:58,554 ఆగండి. 415 00:28:03,767 --> 00:28:05,853 వెళ్లండి. 416 00:28:27,082 --> 00:28:28,542 హా, బయలుదేరండి. 417 00:28:51,690 --> 00:28:53,150 సరే. అంతే. 418 00:29:01,783 --> 00:29:03,827 నిదానంగా పోయి. నీళ్లు పొదుపుగా వాడు, సరేనా? 419 00:29:05,954 --> 00:29:07,414 హా. నీకు కూడా ఉంచుకో, 420 00:29:07,497 --> 00:29:09,583 నీ శరీరంలో నీటి శాతం తక్కువైతే, నువ్వు ఎవరికీ సాయపడలేవు. 421 00:29:18,217 --> 00:29:19,301 జేన్? 422 00:29:21,386 --> 00:29:22,471 జేన్? 423 00:29:23,096 --> 00:29:25,098 ఏం జరుగుతోంది ఇక్కడ? ఆమె హార్ట్ మానిటర్ కనెక్షన్ ని ఎందుకు తీసేశారు? 424 00:29:25,182 --> 00:29:27,226 మనం రోగులను ఖాళీ చేయిస్తున్నాం కనుక ముఖ్యమైనవి కాని సంరక్షణా పనులను 425 00:29:27,309 --> 00:29:31,230 -సస్పెండ్ చేయమని మాకు చెప్పారు. -చెప్పారా? ఎవరు? 426 00:29:31,313 --> 00:29:33,357 -డాక్టర్ కుక్ ఏమన్నారంటే… -అతనేమన్నాడో నాకు అనవసరం. 427 00:29:33,440 --> 00:29:35,192 తను నా రోగి. మానిటర్ ని మళ్లీ కనెక్ట్ చేయండి. 428 00:29:36,026 --> 00:29:37,569 నేను డాక్టర్ కుక్ ని అడిగి పెడతాను. 429 00:29:38,654 --> 00:29:39,738 ఏంటి? 430 00:29:40,280 --> 00:29:41,281 డాక్టర్ కుక్ ని అడిగి… 431 00:29:41,365 --> 00:29:44,743 నువ్వు ఎవరినీ అడగాల్సిన పని లేదు. ఆమె మానిటర్ ని కనెక్ట్ చేయ్. 432 00:29:46,078 --> 00:29:50,082 బాబోయ్! వదిలేయ్. వదిలేయ్ తల్లీ! 433 00:29:58,257 --> 00:30:00,634 నర్సు, ముఖ్యమైనవి కాని పనులన్నింటినీ సస్పెండ్ చేయమని చెప్పా కదా. 434 00:30:00,717 --> 00:30:03,720 ఈమె వైటల్స్ ని నిరంతరంగా గమనిస్తూ ఉండాలి, ఈమెకి అందించే సంరక్షణ ముఖ్యమైనదే. 435 00:30:03,804 --> 00:30:05,472 -నేను… -ఆ హార్ట్ మానిటర్ కనెక్షన్ ని తీసేయ్. 436 00:30:06,223 --> 00:30:09,184 -మీరేమైనా చెప్పాలనుకుంటే నేరుగా నాతోనే చెప్పండి… -నేను చెప్పేంత వరకు దాన్ని కనెక్ట్ చేయవద్దు. 437 00:30:09,268 --> 00:30:12,521 -తను నా రోగి. తను నా రోగి! -ఈ పనికి రాని చర్చకు మనకి సమయం లేదు. 438 00:30:12,604 --> 00:30:15,649 ఈ విభాగానికి నేను ఇన్ ఛార్జిని, ఏం చేయాలో నీకు నేను చెప్పాను. 439 00:30:17,317 --> 00:30:20,654 నిన్న గాక మొన్న వచ్చిన ఒక జూనియర్ డాక్టర్ చెప్పినట్టు నేను చేయలేను. 440 00:30:22,155 --> 00:30:23,699 నీకు అర్థమైందా? 441 00:30:36,378 --> 00:30:37,921 అయ్య బాబోయ్… 442 00:31:02,029 --> 00:31:04,489 జెఫర్సన్ పరిష్ స్టేషన్ 443 00:31:04,573 --> 00:31:06,491 హేయ్, ఇక్కడ ఎవరు ఇన్ ఛార్జ్? 444 00:31:07,868 --> 00:31:08,911 అక్కడున్న వ్యక్తి. 445 00:31:09,786 --> 00:31:10,787 థ్యాంక్యూ. 446 00:31:13,165 --> 00:31:15,876 మీరు ఇక్కడ ఉంటే, మీ సమయమే వృథా అవుతుంది. 447 00:31:17,127 --> 00:31:19,254 సర్, మీరు ఇన్ ఛార్జా? 448 00:31:19,922 --> 00:31:20,964 మీరు ఎవరు? 449 00:31:21,048 --> 00:31:22,633 ఏమైనా సాయం చేద్దామని వచ్చాం. 450 00:31:23,300 --> 00:31:26,178 మీరు న్యూ ఆర్లీన్స్ కి వెళ్తుంటే కనుక, మాకు చేతనైనంత సాయం చేయాలని వచ్చాం. 451 00:31:26,261 --> 00:31:27,971 -మేం మామూలు పౌరులను తీసుకోవట్లేదు. -మేం అదేం కాదు. 452 00:31:28,055 --> 00:31:29,223 నేను పారామెడిక్ ని. 453 00:31:30,432 --> 00:31:34,520 చూడండి, చల్మేట్ లోని నూనెజ్ కమ్యూనిటీ కాలేజీలోని ఈఎంటీ ప్రోగ్రామ్ ని నేనే చూసుకొనే దాన్ని. 454 00:31:34,603 --> 00:31:37,731 కావాలంటే మీరు ఆరా తీయవచ్చు, నా పేరు శాండ్రా లెబ్లాంక్. 455 00:31:38,398 --> 00:31:40,859 నాకు ఆ పని తెలుసు, నేను సాయపడదాం అనుకుంటున్నా. 456 00:31:43,570 --> 00:31:45,864 జిమ్మీ! ఫారమ్స్ తీసుకురా! 457 00:31:47,407 --> 00:31:48,909 మీరు నమోదు చేయండి. 458 00:31:48,992 --> 00:31:51,954 మీ పేర్లు, ఏమైన శిక్షణ పొంది ఉంటే ఆ వివరాలు, ఇంకా మీ వారసుల వివరాలు నాకు కావాలి. 459 00:31:53,413 --> 00:31:57,209 సాయం చేయడానికి వచ్చిన వాళ్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎప్పుడు వెళ్తున్నారు మరి? 460 00:31:58,001 --> 00:32:00,003 -నాకు తెలీదు. -ఎందుకు ఆగి ఉన్నారు? 461 00:32:01,046 --> 00:32:03,298 మేము ఏం చేయాలో ఎవరోకరు మాకు చెప్పాలి కదా. 462 00:32:11,765 --> 00:32:13,475 నేషనల్ గార్డ్ ట్రక్ వచ్చేసింది. 463 00:32:24,778 --> 00:32:26,405 ఇతనికి ఆక్సీజన్ బాగానే అందుతోంది. 464 00:32:26,488 --> 00:32:28,490 -తను బాగానే ఉంది. ఆక్సీజన్ బాగానే అందుతోంది. -పర్వాలేదు. 465 00:32:29,992 --> 00:32:30,993 ఎత్తు తొమ్మిది అడుగులు 466 00:32:31,076 --> 00:32:33,078 ఆహా. పద పద. చూసుకోండి. 467 00:32:42,880 --> 00:32:44,423 మీరు బాగానే ఉన్నారు కదా? ఏం పర్వాలేదు కదా? 468 00:32:44,506 --> 00:32:46,175 -మీ వెనకే ఉన్నాను. -నేను బాగానే ఉన్నాను. 469 00:32:46,258 --> 00:32:47,259 ఆమెకి అంతా బాగానే ఉంది. 470 00:32:54,141 --> 00:32:55,392 జాగ్రత్త. 471 00:32:55,475 --> 00:32:57,436 అంతే. ఇంత మందిని మాత్రమే తీసుకొని వెళ్లగలం. 472 00:33:00,230 --> 00:33:01,982 -సరే మరి, వస్తున్నావా? -జాగ్రత్త. 473 00:33:02,649 --> 00:33:03,984 ఏం పర్వాలేదు తల్లీ. మేమున్నాం కదా. 474 00:33:07,613 --> 00:33:09,323 -వీళ్లని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? -టెక్సస్ కి. 475 00:33:09,406 --> 00:33:10,741 దగ్గర్లో ఇంకే ఆసుపత్రులూ లేవా? 476 00:33:10,824 --> 00:33:12,826 అక్కడికే తీసుకెళ్లమని మాకు చెప్పారు, కాబట్టి అక్కడికే వెళ్తున్నాం. 477 00:33:15,412 --> 00:33:17,039 నిన్ను ఎక్కించుకున్నారుగా. 478 00:33:18,207 --> 00:33:19,708 ఎక్కడికి తీసుకెళ్తున్నారట? 479 00:33:23,545 --> 00:33:25,380 బయటకు వెళ్లేదాకా తలలు వంచుకోండి. 480 00:33:25,464 --> 00:33:26,924 సరే మరి, అంతే, చక్కగా ఎక్కారు. 481 00:33:27,007 --> 00:33:28,050 సరే మరి, అంతే. 482 00:33:28,133 --> 00:33:30,761 ఇరవై రోగులే ఎక్కారు. 35 మందిని తీసుకెళ్తారని అన్నారు కదా. 483 00:33:30,844 --> 00:33:32,304 అంత కంటే ఎక్కువ జాగా లేదు. 484 00:33:33,555 --> 00:33:36,683 -సరే, తర్వాతి ట్రక్ ఎప్పుడు వస్తుంది? -వీలైనంత త్వరగా. మీరు వస్తున్నారా? 485 00:33:38,727 --> 00:33:39,728 నువ్వే వెళ్లాలి. 486 00:33:41,271 --> 00:33:42,439 లేదు, నువ్వు వెళ్లు. 487 00:33:43,815 --> 00:33:47,194 పర్వాలేదులే. టెక్సస్ లో నేనేం చేయను? 488 00:33:51,615 --> 00:33:53,158 పర్వాలేదులే. ఏం పర్వాలేదు. 489 00:33:53,242 --> 00:33:54,868 మేమేం చేయాలి? 490 00:34:01,416 --> 00:34:04,127 మరేం పర్వాలేదు, ఇంకో ట్రక్ వస్తోంది. 491 00:34:04,211 --> 00:34:05,504 ఇంకో ట్రక్ వస్తుందిలెండి. 492 00:34:10,342 --> 00:34:12,511 అంతే. ఇక పోవచ్చు. 493 00:34:14,096 --> 00:34:15,097 చలో. 494 00:34:25,065 --> 00:34:26,817 ఇది చాలా దారుణం. 495 00:34:32,656 --> 00:34:34,449 హెలికాప్టర్స్ ఏవి? 496 00:34:34,533 --> 00:34:35,909 అయ్యయ్యో. 497 00:34:35,993 --> 00:34:37,953 హెలికాప్టర్స్ ఏవిరా నాయనా! 498 00:34:40,539 --> 00:34:42,123 హెలికాప్టర్స్ లేవని ఎవరికైనా చెప్పు. 499 00:35:03,562 --> 00:35:04,813 అయ్య బాబోయ్. 500 00:35:05,647 --> 00:35:07,232 హేయ్. వెనక్కి రండి! 501 00:35:07,983 --> 00:35:09,693 హేయ్! వెనక్కి రండి! వెన్నకి రండి! 502 00:35:18,952 --> 00:35:22,539 సూసన్, మేము ఇక నీటిని ఆపలేం. మన ప్యానెల్స్ అన్నీ మునిగిపోతాయి. 503 00:35:23,540 --> 00:35:25,083 మన జనరేటర్స్ ఇక పని చేయవు. 504 00:35:25,167 --> 00:35:26,668 నాలుగు గంటల సమయం ఉందని అన్నావు కదా. 505 00:35:26,752 --> 00:35:29,755 నేను మహా అయితే మా నాలుగు గంటలు అని అన్నాను. ఇప్పుడు మనకి కొన్ని నిమిషాల సమయమే ఉంది. 506 00:35:30,506 --> 00:35:33,258 సూసన్. హెలికాప్టర్స్ ఏవీ లేవు. 507 00:35:33,884 --> 00:35:37,596 నెల తక్కువ శిశువులు హెలిప్యాడ్ మీద ఉన్నారు, అక్కడ ఒక్క హెలికాప్టర్ కూడా లేదు. 508 00:35:37,679 --> 00:35:42,184 శాండ్రా? శాండ్రా, హెలికాప్టర్లు ఏమైపోయాయి? 509 00:35:42,267 --> 00:35:43,852 ప్యాడ్ మీద పసిపిల్లలు ఉన్నారు. 510 00:35:44,686 --> 00:35:47,898 నాకు తెలీదు. హెలికాప్టర్లను పంపుతామనే వారు అన్నారు. 511 00:35:48,607 --> 00:35:51,485 మనకి తక్షణమే హెలికాప్టర్లు కావాలి. 512 00:36:06,542 --> 00:36:07,960 హెలికాప్టర్ల సంగతి ఏమైంది? 513 00:36:08,043 --> 00:36:10,963 పసిపిల్లను తరలించాల్సి ఉంది. దయచేసి సాయపడండి. 514 00:36:11,046 --> 00:36:15,384 తుఫాను వెళ్లిపోయాక ఇన్ని రోజుల తర్వాత కూడా, జనాలు ఇంకా జల వలయంలో చిక్కుకొనే ఉన్నారు, 515 00:36:15,467 --> 00:36:18,762 అటుగా ఏదైనా హెలికాప్టర్ వచ్చి, తమను సురక్షిత తీరాలకు చేరుస్తుందని ఆశిస్తున్నారు. 516 00:36:19,429 --> 00:36:21,849 ప్రభుత్వ సహాయం మందకొడిగా సాగుతుండటంతో 517 00:36:21,932 --> 00:36:23,350 ప్రజల్లో అసహనం తారాస్థాయికి చేరుకుంది. 518 00:36:23,433 --> 00:36:26,937 ఇవాళైతే, న్యూ ఆర్లీన్స్ మేయర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 519 00:36:27,020 --> 00:36:29,273 ఇక కుంభకర్ణుడి నిద్ర నుండి బయటకు వచ్చి ఏదోకటి చేసి చావండి. 520 00:36:29,356 --> 00:36:33,735 ఈ దేశం ఎదుర్కొన్న అతి పెద్ద విపత్తు నుండి తేరుకొనే పని చేద్దాం. 521 00:36:33,819 --> 00:36:36,697 మాకు తక్షణ సాయం కావాలి. 522 00:36:46,373 --> 00:36:48,959 -సరే మరి. -ఈ ప్యానెల్స్ ని మనం కాపాడలేం. 523 00:36:49,459 --> 00:36:53,213 హా, ఇక్కడి నుండి వెళ్లిపోదాం పదండి. ఇక్కడ ఉండటం చాలా ప్రమాదకరం. పదండి. 524 00:36:53,297 --> 00:36:54,298 పదండి. 525 00:37:03,599 --> 00:37:05,475 నర్స్, ఏమీ పర్వాలేదు కదా? 526 00:37:14,401 --> 00:37:16,653 కరెంట్ లేకుంటే వెంటిలేటర్లు పని చేయవు. 527 00:37:25,204 --> 00:37:29,291 గాలింపు, ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి, ఈ విపత్తును ఇప్పుడు 528 00:37:29,374 --> 00:37:33,545 అమెరికాని తాకిన భయంకరమైన ప్రళయంగా ఫెమా అభివర్ణిస్తోంది. 529 00:37:33,629 --> 00:37:35,422 …ఈ సమస్య ఇంకా బాగా దిగజారవచ్చు, 530 00:37:35,506 --> 00:37:38,675 ఎందుకంటే, క్రెసెంట్ సీటీ ప్రాంతమంతా నీట మునిగిపోయింది. 531 00:37:38,759 --> 00:37:40,886 ఈరాత్రికి అంధకారం అలముకుంది. 532 00:37:40,969 --> 00:37:43,347 ఆదుకోమంటూ జనాలు చేసే ఆర్తనాదాలను మీరు వినవచ్చు. 533 00:37:43,430 --> 00:37:46,433 కుక్కలు మూలుగుతూ ఉండటాన్ని మీరు వినవచ్చు. 534 00:37:46,517 --> 00:37:50,062 అందరూ ఇరుక్కుపోయారు. ఎవరోకరు వచ్చి ఆదుకుంటారని వారందరిలో ఆశ ఉంది. 535 00:37:50,145 --> 00:37:52,981 కానీ ఈరాత్రికి, వారు సహాయక చర్యలను నిలిపివేయాల్సిన పరిస్థితి. 536 00:37:53,065 --> 00:37:55,734 నగరంలోకి వరద వెల్లువ ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిస్థితి దిగజారుతోంది. 537 00:37:55,817 --> 00:37:57,903 వేలాది సంఖ్యల్లో కాకపోయినా, కనీసం వందలాది మంది అయినా, 538 00:37:57,986 --> 00:38:02,241 తమ ఇంటి పైకప్పులలోనో, అటకలలోనో ఉండి సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. 539 00:38:02,324 --> 00:38:05,869 వరద నీరుకు తోడు అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. 540 00:38:05,953 --> 00:38:09,581 హింస, దోపిడీ, స్నైపర్లు. చాలా భయంకరమైన వాతావరణం నెలకొని ఉంది. 541 00:38:09,665 --> 00:38:11,959 న్యూ ఆర్లీన్స్ లోని వారు 542 00:38:12,042 --> 00:38:14,920 అక్కడ ఉండే రెండు ఆసుపత్రులను ఖాళీ చేయడం గురించి మాట్లాడుతున్నారు. 543 00:38:15,003 --> 00:38:19,550 కానీ, ఆ ప్లాన్స్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టు ఇప్పుడే మాకు సమాచారం అందింది. 544 00:38:19,633 --> 00:38:22,052 నగరం చుట్టూరా అనేక కట్టలు తెగిపోయినట్టు 545 00:38:22,135 --> 00:38:23,887 కథనాలు వినిపిస్తున్నాయి. 546 00:38:23,971 --> 00:38:28,433 నీటి మట్టం పెరుగుతోంది, గందరగోళం నెలకొని ఉంది, నగరం విపత్తు ముంగిట ఉంది. 547 00:38:28,517 --> 00:38:32,855 ఇక్కడ అసలు ఏం జరుగుతోందో జనాలకు ఎలా తెలియజెప్పాలో అర్థం కావట్లేదు. 548 00:38:32,938 --> 00:38:34,898 జనాలకు ఇక్కడ జరుగుతున్న దాని గురించి… 549 00:38:34,982 --> 00:38:37,985 ఒక ప్రాంతం తర్వాత మరొకటి, ఒక్కొక్కటిగా నీట మునిగిపోతూ ఉన్నాయి, 550 00:38:38,068 --> 00:38:43,073 ఎందరు ఇరుక్కుపోయారో, ఎందరు తప్పిపోయారో, ఎందరు చనిపోయారో తెలియని పరిస్థితి. 551 00:39:04,845 --> 00:39:07,222 నీళ్లు కావాలా? 552 00:39:13,437 --> 00:39:15,647 -బాగానే ఉన్నావా? -సూసన్. మీరందరూ ఎలా ఉన్నారు? 553 00:39:15,731 --> 00:39:19,818 హేయ్. అమ్మకు కాస్తంత విశ్రాంతి ఇస్తున్నా. 554 00:39:20,611 --> 00:39:24,781 మీరందరూ రోజంతా ఇక్కడే ఉన్నారు. కొందరికి విశ్రాంతి ఇద్దామని ఇలా వచ్చా. 555 00:39:27,868 --> 00:39:30,120 ఇప్పుడు నేషనల్ గార్డ్ ట్రక్కులు ఏవీ రావట్లేదని 556 00:39:30,204 --> 00:39:32,623 మీ యూనిట్ లో ఉన్న వాళ్లందరికీ చెప్పు. 557 00:39:33,790 --> 00:39:35,626 నీటి స్థాయి ఇప్పటికే చాలా ఎత్తులో ఉంది, 558 00:39:37,461 --> 00:39:39,838 వాళ్లు తమ మనుషులని ఇప్పుడు పంపట్లేదు. 559 00:39:40,797 --> 00:39:42,382 మరి మన వాళ్ల సంగతి ఏంటి? 560 00:39:46,303 --> 00:39:48,931 కార్పొరేట్ వాళ్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. 561 00:40:00,817 --> 00:40:03,278 ఆసుపత్రుల్లో నీరు లేదు, కరెంట్ కూడా లేదు. 562 00:40:03,362 --> 00:40:04,655 మరి, అవి ఎంత సేపు సేవలు కొనసాగించగలవు? 563 00:40:04,738 --> 00:40:07,199 తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారిని అవి నగరం బయటకు ఎలా తరలించగలవు? 564 00:40:07,282 --> 00:40:10,035 మా దగ్గర ఆహారం, నీరు చాలా తక్కువ ఉండింది. 565 00:40:10,118 --> 00:40:11,245 అందరూ పొదుపు చేసుకుంటున్నారు. 566 00:40:11,328 --> 00:40:14,081 వాళ్లు… మేము ఏ విషయంలో భయపడుతున్నామంటే, 567 00:40:14,164 --> 00:40:16,834 వెంటిలేటర్లు చాలా వరకు బ్యాటరీల ద్వారా పని చేస్తాయి, 568 00:40:16,917 --> 00:40:18,669 కానీ మా దగ్గర బ్యాటరీలు లేవు. 569 00:40:18,752 --> 00:40:21,129 దురదృష్టకరమైన విషయం ఏంటంటే, బ్యాటరీలు అయిపోతే వాళ్లందరూ చనిపోతారు. 570 00:40:21,213 --> 00:40:24,883 కొన్ని క్షణాల క్రిందటే, న్యూ ఆర్లీన్స్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. 571 00:40:24,967 --> 00:40:29,054 నగరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొని ఉన్నాయి, చూస్తుంటే అరాచకత్వం రాజ్యమేలే పరిస్థితులు… 572 00:40:29,721 --> 00:40:31,723 ఎవరూ ఏమీ చెప్పలేదా? సహాయక చర్యలు చేయమని ఆదేశాలేవీ రాలేదా? 573 00:40:31,807 --> 00:40:32,933 లేదు. 574 00:40:33,600 --> 00:40:34,601 ఓరి దేవుడా. 575 00:40:35,727 --> 00:40:37,312 సరే మరి. తొక్కలే. 576 00:40:37,396 --> 00:40:40,107 అతి దగ్గర్లోని సహాయక చర్యల బేస్ ఎక్కడుందో నాకు చెప్పు. మనం ఇక చూస్తూ కూర్చోలేం. 577 00:40:40,190 --> 00:40:41,191 అలాగే. 578 00:40:42,067 --> 00:40:44,278 సరే మరి, అందరూ సిద్ధం కండి. మనం బయలుదేరుతున్నాం. 579 00:40:44,361 --> 00:40:46,697 కానివ్వండి. అందరూ ఏదోక బండి ఎక్కండి. 580 00:40:46,780 --> 00:40:48,574 అందరూ కాస్త నీరు తాగి, దాన్ని మీతో తీసుకెళ్లండి. 581 00:40:48,657 --> 00:40:49,992 -ఇక వెళ్దాం. -పద. 582 00:40:50,075 --> 00:40:52,703 -మనం ఎక్కడికి వెళ్తున్నాం? -ఏమో, కానీ ఎక్కడికో వెళ్తున్నాం. 583 00:40:53,871 --> 00:40:56,665 టార్చీలను తెచ్చుకోండి. మనం పని మొదలుపెట్టబోతున్నాం. 584 00:40:56,748 --> 00:41:00,085 సరే మరి. కొన్ని ఎక్స్ ట్రా బ్యాటరీలను కూడా తెచ్చుకోండి. 585 00:41:01,545 --> 00:41:02,754 పదండి. 586 00:41:04,840 --> 00:41:06,175 రిగ్గుని లోడ్ చేయండి. 587 00:41:55,599 --> 00:41:58,143 జీవితం కన్నా ముఖ్యమైనది ఇంకేదీ లేదు. 588 00:41:58,936 --> 00:42:00,646 ఏదీ ముఖ్యం కాదు. 589 00:42:01,355 --> 00:42:04,608 నాకు తెలుసు. నాకు చాలా బాగా తెలుసు. 590 00:42:06,360 --> 00:42:08,153 కానీ గుర్తు చేసినందుకు థ్యాంక్యూ. 591 00:42:08,946 --> 00:42:09,947 పాపా, బాబా? 592 00:42:10,697 --> 00:42:12,449 అది మాత్రం నాకు తెలీదు. 593 00:42:12,533 --> 00:42:14,868 నిజంగా? తమాషా కానీ చేస్తున్నారా ఏంటి! 594 00:42:18,622 --> 00:42:21,291 జీవితంలో సర్ప్రైజులు ఉండటమే చాలా తక్కువ ఉంటాయి. 595 00:42:21,375 --> 00:42:24,962 సర్పైజులు అంటే నిజమైన, అలాగే అందమైన సర్ప్రైజులు అన్నమాట. 596 00:42:26,046 --> 00:42:29,508 దేవుడు నా కోసం ఒకటి సిద్ధంగా ఉంచాడు, కాబట్టి అది బయట పడే దాకా నేను వేచి ఉంటాను. 597 00:42:33,929 --> 00:42:36,557 ఇప్పుడు బాధపడకండి. 598 00:42:37,641 --> 00:42:40,644 మీరు బాధపడతారు, నాకు కూడా బాధగా అనిపిస్తుంది. 599 00:42:42,813 --> 00:42:45,148 మనిద్దరికీ ఇంకా చాలా జీవితం మిగిలి ఉంది. 600 00:42:45,983 --> 00:42:47,401 కాబట్టి ఆ బాధని వదిలేయండి. 601 00:42:51,780 --> 00:42:52,781 సరే. 602 00:42:55,117 --> 00:42:57,411 డయేన్. 603 00:43:02,791 --> 00:43:04,376 డయేన్, ఒక రోగిలో ఏ చలనమూ లేదు. 604 00:43:10,007 --> 00:43:11,133 ఏం జరిగింది? 605 00:43:11,216 --> 00:43:13,510 ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకొని ఆగిపోయింది. శ్వాస కూడా ఆగిపోయింది. 606 00:43:13,594 --> 00:43:15,637 అతనిలో ఏ చలనమూ లేదు, డిఎన్ఆర్ ఆర్డర్ కూడా లేదు. 607 00:43:15,721 --> 00:43:18,515 మెమోరియల్ కి వెళ్లి, ఒక రోగిలో ఏ చలనమూ లేదని, ఒక డాక్టర్ అవసరమని వాళ్లకి చెప్పు. 608 00:43:18,599 --> 00:43:19,892 నేను ఎమర్జెన్సీ సామాగ్రిని తీసుకొస్తా. 609 00:43:22,477 --> 00:43:23,562 హేయ్, నాకు ఒక డాక్టర్ కావాలి. 610 00:43:23,645 --> 00:43:26,106 -లైఫ్ కేర్, ఏడవ అంతస్థు. కోడ్ బ్లూ. -దాన్ని చూసుకోగలిగే వారు పైన ఎవరూ లేరా? 611 00:43:26,190 --> 00:43:28,483 పైన డాక్టర్లు ఎవరూ లేరు. మాకు ఇప్పుడు ఒక డాక్టర్ కావాలి. 612 00:43:29,067 --> 00:43:31,528 డాక్టర్ పౌ, ఏడవ అంతస్థులో కోడ్ బ్లూ. 613 00:43:31,612 --> 00:43:33,280 నేను వెళ్తాను. ఒక ఎమర్జెన్సీ డాక్టరును తీసుకురా. 614 00:43:37,367 --> 00:43:38,577 -ఎక్కడ? -ఇటు వైపు. 615 00:43:46,043 --> 00:43:47,336 ఛార్జింగ్ చేస్తున్నా. 616 00:43:48,295 --> 00:43:50,380 -అందరూ దూరం జరగండి. -ఓకేనా? 617 00:43:50,464 --> 00:43:51,840 ఓకే. 618 00:43:51,924 --> 00:43:54,551 -షాక్ ఇచ్చా. ఓకేనా? -ఓకే. 619 00:43:55,969 --> 00:43:57,346 -ఇక ఒత్తండి. -ఏం జరుగుతోంది? 620 00:43:57,429 --> 00:44:00,307 డెబ్బై మూడేళ్ల పురుషుడు, కుడి వైపు నెమ్ము ఉంది, సీఓపీడీ ఉంది, 621 00:44:00,390 --> 00:44:02,559 కొలైటిస్, మధుమేహాలు ఉన్నాయి, ఇంకా ఒక్కోసారి హృదయం సరిగ్గా కొట్టుకోదు. 622 00:44:03,227 --> 00:44:05,229 -చలనం ఎంత సేపటి నుండి లేదు? -పది నిమిషాలు. 623 00:44:05,312 --> 00:44:06,355 అయ్యయ్యో. 624 00:44:06,438 --> 00:44:08,565 -ఎపినెఫ్రీన్ రెండవ డోసు ఇచ్చా. -మళ్లీ ప్రయత్నిద్దాం. 625 00:44:08,649 --> 00:44:10,108 గుండె కోట్టుకోవడం లేదు. 626 00:44:10,192 --> 00:44:11,443 సరే, కానివ్వండి. 627 00:44:11,527 --> 00:44:15,030 ఇక ఇంటుబేషన్ చేద్దాం. ఒత్తడం ఆపేయండి. 628 00:44:19,868 --> 00:44:21,078 వీలైనంత త్వరగా చేయండి. 629 00:44:21,995 --> 00:44:23,455 రోగి చనిపోతున్నాడు. 630 00:44:23,539 --> 00:44:24,623 ఏ ప్రయోజనమూ లేదు. 631 00:44:25,457 --> 00:44:26,917 ఒత్తండి. 632 00:44:28,544 --> 00:44:29,962 ఏ ప్రయోజనమూ లేదు. 633 00:44:32,339 --> 00:44:33,340 ఏ స్పందనా లేదు. 634 00:44:35,300 --> 00:44:37,052 ఇంటుబేషన్ చేస్తున్నాం. గాలిని పంపుతున్నాం. 635 00:44:38,929 --> 00:44:42,099 సరే. రక్త పోటు లేదు. ఒత్తడం కొనసాగించండి. 636 00:44:42,182 --> 00:44:43,475 ఏమైనా తెలుస్తోందా? 637 00:44:43,559 --> 00:44:46,311 ఇంకా వైటల్స్ ఏవీ లేవు. సరే, కొనసాగించండి. 638 00:44:46,395 --> 00:44:47,771 గుండె కొట్టుకుంటుందా? 639 00:44:48,897 --> 00:44:50,148 లేదు. 640 00:44:54,194 --> 00:44:55,195 భగవంతుడా. 641 00:44:55,279 --> 00:44:57,072 ఒత్తడం ఆపివేయండి. 642 00:44:57,865 --> 00:45:00,242 మరణించిన సమయం, 10:15. 643 00:45:02,035 --> 00:45:03,912 అక్కడి నుండి మొదలైంది అంతా. 644 00:45:03,996 --> 00:45:07,666 చీకట్లో ఉన్నాం. ఇరుక్కుపోయాం. కరెంట్ లేదు. 645 00:45:08,709 --> 00:45:13,380 చూడండి, మీరు చేతనైనంత ప్రయత్నం చేశారు. 646 00:45:15,299 --> 00:45:17,384 మీరందరూ కూడా శాయశక్తులా ప్రయత్నించారు. 647 00:45:20,596 --> 00:45:21,513 థ్యాంక్యూ. 648 00:45:21,597 --> 00:45:23,807 అవును. అప్పుడు మా పరిస్థితి ఏంటో మీరు అర్థం కూడా చేసుకోలేరు. 649 00:45:26,685 --> 00:45:29,229 మాకు అయినా కానీ, డాక్టర్లకు అయినా కానీ, చావు అనేది… 650 00:45:31,148 --> 00:45:32,316 సుపరిచితమైనదేమీ కాదు. 651 00:45:32,816 --> 00:45:36,111 మేము కాపాడేవాళ్లం, ప్రాణాలను కాపాడేవాళ్లం. 652 00:45:38,488 --> 00:45:41,033 కానీ ప్రాణాలను కాపాడగలిగే స్థితి నుండి మేము… 653 00:45:47,497 --> 00:45:50,000 పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. 654 00:45:51,543 --> 00:45:53,629 ఇక ఆ తర్వాత జరిగిన దాన్ని, మేము అడ్డుకోలేకపోయాం. 655 00:46:03,138 --> 00:46:04,181 నేను అడ్డుకోలేకపోయాను. 656 00:46:07,434 --> 00:46:09,853 మీరు దేన్ని ఆపలేకపోయారు, డాక్టర్? 657 00:46:11,146 --> 00:46:12,981 ప్రజలను మరణించకుండా ఆపలేకపోయారా? 658 00:46:14,441 --> 00:46:16,652 లేకపోతే వారి ప్రాణాలు తీసేయడాన్ని ఆపలేకపోయారా? 659 00:47:11,623 --> 00:47:13,625 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్