1 00:00:14,348 --> 00:00:17,976 ఇవాళ న్యూ ఆర్లీన్స్ ఫోటోలు చూస్తుంటే ఆ నగరంలో తుఫాను సృష్టించిన విధ్వంసకాండ కనబడుతుంది. 2 00:00:18,060 --> 00:00:22,022 హరికేన్ కత్రినా వల్ల న్యూ ఆర్లీన్స్ లో భారీ స్థాయి నష్టం జరిగింది అనడంలో సందేహమే లేదు, 3 00:00:22,105 --> 00:00:23,106 కానీ అది అలా ఉంచితే… 4 00:00:23,190 --> 00:00:26,568 తీరాన్ని దాటక ముందు కత్రినా కాస్తంత తూర్పు వైపుకు కదిలింది, 5 00:00:26,652 --> 00:00:28,153 దానితో న్యూ ఆర్లీన్స్ కాస్తయినా ఊపిరి తీసుకుంటోంది. 6 00:00:28,237 --> 00:00:32,616 చాలా మంది భయపడినట్టు ఇదేమీ పెను విధ్వంసక తుఫాను కాదు. 7 00:00:35,410 --> 00:00:38,455 తొలి రోజు వాతావరణం ఎలా ఉండింది? 8 00:00:38,539 --> 00:00:42,501 వాతావరణమా? అది చాలా బాగుండింది. 9 00:00:42,584 --> 00:00:45,295 తుఫానులో చాలా భాగం, అంటే తుఫాను తాలూకు తీవ్రమైన ప్రభావం నుండి ఊరు తప్పించుకుంది, 10 00:00:45,379 --> 00:00:48,465 ఇంకా మేము కూడా ప్రాణాలతో బయటపడ్డాం. 11 00:00:48,549 --> 00:00:51,718 ఆ సమయంలో ఆసుపత్రిలో గడపడం ఎంత నరకంగా ఉండిందో మీరు ఊహించలేరు. 12 00:00:51,802 --> 00:00:55,222 అర్ధరాత్రి సమయంలో కిటికీలు పగులుతుండటం, దానికి తోడు విద్యుత్ అంతరాయం. 13 00:00:57,140 --> 00:01:00,143 మరుసటి రోజు, జనరేటర్లని ఆన్ చేశారు, 14 00:01:00,227 --> 00:01:01,895 ఆకాశంలో ఉండే మబ్బులన్నీ తొలగిపోయాయి. 15 00:01:01,979 --> 00:01:03,105 సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. 16 00:01:03,188 --> 00:01:04,313 అందరూ… 17 00:01:05,941 --> 00:01:10,696 అందరూ ఆనందంగా ఉన్నారు, ఊపిరి పీల్చుకొని, కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 18 00:01:12,364 --> 00:01:14,324 కాస్తంత సిగ్గుచేటుగా కూడా అనిపించి ఉంటుంది. 19 00:01:14,408 --> 00:01:18,537 -సిగ్గుచేటా? -చాలా మంది అతిగా స్పందించారు. 20 00:01:19,454 --> 00:01:21,081 కత్రినా అనేది నూటికో కోటికో పుట్టే 21 00:01:21,164 --> 00:01:25,043 ఒక విధ్వంసకర తుఫాను అని మాలో కొందరు నమ్మేశారు, 22 00:01:25,127 --> 00:01:26,837 కానీ అలా ఏమీ జరగలేదు. 23 00:01:28,046 --> 00:01:29,256 తుఫాను అంతటి విధ్వంసాన్ని సృష్టించలేదు. 24 00:01:31,341 --> 00:01:33,552 రెండవ రోజు డాక్టర్ పౌ ఎలా ఉన్నారు? 25 00:01:34,636 --> 00:01:36,388 ఆవిడ బాగానే ఉన్నారు. 26 00:01:37,055 --> 00:01:39,892 జనాలు ఎక్కువగా ప్రతిస్పందిస్తున్నారు అనే విషయం గురించి 27 00:01:39,975 --> 00:01:43,395 మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకున్నారా… 28 00:01:43,478 --> 00:01:46,106 -మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. -లేదు. నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానంతే. 29 00:01:46,190 --> 00:01:48,233 ఒకవేళ జనాలు అతిగా స్పందించి ఉంటే, 30 00:01:48,317 --> 00:01:50,569 మరి ఆసుపత్రిలో అప్పటి పరిస్థితుల గురించి 31 00:01:50,652 --> 00:01:53,488 మీరు డాక్టర్ పౌతో ఏం మాట్లాడి ఉండవచ్చు? 32 00:01:53,572 --> 00:01:56,575 మీరు డాక్టర్ పౌతో ఏమైనా మాట్లాడారా? 33 00:02:02,122 --> 00:02:04,249 నేను మీకు ఒక విషయం చెప్తాను ఆగండి. 34 00:02:04,333 --> 00:02:06,543 రెండవ రోజున, పరిస్థితులు కాస్త సద్దుమణిగాక, 35 00:02:06,627 --> 00:02:09,045 డాక్టర్ పౌ కావాలంటే ఆసుపత్రి నుండి వెళ్లిపోయుండవచ్చు. 36 00:02:09,128 --> 00:02:12,966 తను కావాలనే ఉండింది. తన రోగుల కోసం ఉండింది. 37 00:02:15,719 --> 00:02:19,723 తన మానసిక స్థితి, అలాగే మా అందరి మానసిక స్థితి విషయానికి వస్తే, 38 00:02:21,308 --> 00:02:25,521 ఆ తుఫాను ధాటికి మేము తట్టుకొని నిలబడ్డాక, మేము దేన్ని అయినా తట్టుకొని నిలబడగలం అనుకున్నాం. 39 00:02:27,356 --> 00:02:28,524 కానీ మేము పొరబడ్డాం, 40 00:02:29,942 --> 00:02:31,151 దేవుడా, దారుణంగా పొరబడ్డాం. 41 00:02:58,428 --> 00:03:03,600 నీటిలో ముందుకు సాగండి 42 00:03:05,018 --> 00:03:10,065 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 43 00:03:11,149 --> 00:03:15,946 నీటిలో ముందుకు సాగండి 44 00:03:16,029 --> 00:03:21,243 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 45 00:03:21,326 --> 00:03:25,914 నీటిలో ముందుకు సాగండి 46 00:03:25,998 --> 00:03:31,295 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 47 00:03:31,378 --> 00:03:35,382 పురుషులు నది వద్దకు వెళ్లారు 48 00:03:36,341 --> 00:03:41,263 పురుషులు నది వద్దకు వెళ్లారు, ప్రభువా 49 00:03:41,346 --> 00:03:45,517 పురుషులు నది వద్దకు వెళ్లారు 50 00:03:46,351 --> 00:03:50,022 అక్కడికి ప్రార్థించడానికి వెళ్లారు 51 00:03:51,648 --> 00:03:55,485 నీటిలో ముందుకు సాగండి 52 00:03:56,737 --> 00:04:01,575 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 53 00:04:01,658 --> 00:04:03,076 షెరీ ఫింక్ రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 54 00:04:03,160 --> 00:04:05,537 నీటిలో ముందుకు సాగండి 55 00:04:06,246 --> 00:04:11,251 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 56 00:04:16,380 --> 00:04:22,387 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 57 00:04:27,559 --> 00:04:30,020 రెండవ రోజు 58 00:04:37,361 --> 00:04:38,820 బేస్మెంటులో వరద నీరు ఉంది, 59 00:04:38,904 --> 00:04:40,697 కానీ ఆ నీటిని బయటకు పంప్ చేసేస్తున్నాం. 60 00:04:42,866 --> 00:04:48,247 గాలికి కొన్ని కిటికీలు పగిలాయి, ఆ అద్దాలను కాస్త చూసుకోండి. 61 00:04:48,330 --> 00:04:51,083 అవి తప్ప, మన భవనానికి ఏమీ కాలేదు. 62 00:04:51,166 --> 00:04:54,586 మీరందరూ అద్భుతమైన పని చేశారు. 63 00:04:54,670 --> 00:04:56,463 -థ్యాంక్యూ. థ్యాంక్యూ. -చక్కగా పని చేశారు. 64 00:04:58,131 --> 00:05:01,468 సూసన్? బయట ఉన్న వరద నీటి పరిస్థితి ఏంటి? 65 00:05:01,552 --> 00:05:03,887 ఆ నీటి మట్టం పద్దెనిమిది అంగుళాల ఎత్తుకు తగ్గిపోయింది. 66 00:05:03,971 --> 00:05:06,348 కాబట్టి, త్వరగానే వరద నీరు తగ్గిపోతుంది. 67 00:05:06,431 --> 00:05:09,393 ఇంకా, మన ల్యాండ్ లైన్స్ లో కొన్ని ఇంకా పని చేయడం లేదు, 68 00:05:09,476 --> 00:05:11,019 కానీ అది సౌకర్యాలకు సంబంధించిన విషయం. 69 00:05:11,103 --> 00:05:14,398 కాబట్టి, ఫోన్ కంపెనీ వాళ్లు మరమ్మత్తులు చేయడం ప్రారంభించే దాకా… 70 00:05:14,481 --> 00:05:16,024 మరి ఏసీల సంగతేంటి? 71 00:05:16,108 --> 00:05:17,192 అది మన చేతుల్లో లేదు. 72 00:05:17,276 --> 00:05:20,279 ఏసీకి కరెంటు కావాలి, కానీ ఊర్లో కరెంటు లేదు. 73 00:05:20,362 --> 00:05:22,447 ప్రస్తుతానికి కరెంట్, మన బ్యాకప్ జెనరేటర్ల నుండి వస్తోంది, 74 00:05:22,531 --> 00:05:25,367 కానీ కరెంటు వచ్చే దాకా జనరేటర్లు పని చేస్తాయనే అనుకుంటున్నాం. 75 00:05:25,450 --> 00:05:28,954 ఇప్పుడు వేడిగా ఉందని, ఇంకా వేడిగా అవుతుందని నాకు తెలుసు. 76 00:05:29,037 --> 00:05:32,124 కాబట్టి, అందరూ తప్పకుండా నీళ్లు ఎక్కువ తాగండి. 77 00:05:32,207 --> 00:05:35,085 రోగులు, కుటుంబ సభ్యులు, ఇక్కడ ఆశ్రయం పొందే వాళ్లందరూ కూడా ఆ పని చేయాలి. 78 00:05:35,169 --> 00:05:37,963 అందరికీ తగిన నీరు అందేలా చూద్దాం. సరేనా? 79 00:05:38,046 --> 00:05:39,047 అలాగే. 80 00:05:39,631 --> 00:05:41,884 సరే మరి. ఇక అంతే. 81 00:05:41,967 --> 00:05:43,343 మళ్లీ మళ్లీ థ్యాంక్స్ చెప్తున్నా. 82 00:05:43,427 --> 00:05:44,636 థ్యాంక్యూ. 83 00:05:49,725 --> 00:05:52,144 మీలో కొందరు ఈ చుట్టు పక్కలే ఉంటారని నాకు తెలుసు, 84 00:05:52,227 --> 00:05:54,313 కాబట్టి మీరు మీ ఇంటి పరిస్థితిని చూడాలనేమైనా వెళ్లే పనైతే, 85 00:05:54,396 --> 00:05:58,025 ఎక్కడికి వెళ్తున్నారో అడ్మిషన్ సెక్షనులో చెప్పి వెళ్లండి. 86 00:05:58,108 --> 00:06:00,235 ముందు మీ రౌండ్స్ పూర్తి చేసుకొని వెళ్లండి, సరేనా? 87 00:06:03,780 --> 00:06:05,157 బాబోయ్. తలుపును మూయవద్దు. 88 00:06:05,782 --> 00:06:06,783 ఒక్క నిమిషానికేలే. 89 00:06:07,618 --> 00:06:08,744 అందరిలో చాలా బాగా స్ఫూర్తినింపావు. 90 00:06:09,536 --> 00:06:12,456 నేను నిజంగానే అన్నాను. వాళ్లు తుఫానును ధీటుగా ఎదుర్కొన్నారు. 91 00:06:12,539 --> 00:06:15,042 ఒక్క రోగికి కూడా ఏం కాకుండా చూసుకున్నారు. వాళ్లు గర్వపడాల్సిన విషయమది. 92 00:06:15,959 --> 00:06:17,794 ఇప్పుడు తుఫాను తగ్గుముఖం పట్టింది కాబట్టి, 93 00:06:17,878 --> 00:06:21,215 భవనం నుండి మందిని తగ్గించాలనే విషయం చర్చకు ఏమైనా వచ్చిందా? 94 00:06:21,298 --> 00:06:24,510 ఆశ్రయం పొందుతున్న వ్యక్తులను, లేదా వైద్యం అవసరం లేని రోగులను పంపివేయడం గురించి. 95 00:06:25,761 --> 00:06:30,224 కరెంట్ ఇంకా రాకుంటే, వెళ్లడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు! 96 00:06:30,307 --> 00:06:31,767 వాళ్లు మాత్రం ఎక్కడికని వెళ్తారు. 97 00:06:31,850 --> 00:06:34,394 మనకి పెద్దగా నష్టం జరగలేదు కాబట్టి, బయట పరిస్థితి కూడా అలాగే ఉందని మనం అంచనా… 98 00:06:34,478 --> 00:06:36,688 బయట ఏం జరుగుతుందనే దాని గురించి మనకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చేదాకా, 99 00:06:36,772 --> 00:06:42,027 తప్పనిసరిగా పంపించేయడమనే విషయాన్ని ప్రజల చెవిన పడకుండా ఉంచుదాం. 100 00:06:42,736 --> 00:06:44,196 జనాలు ఇప్పటికే హడలిపోయున్నారు. 101 00:06:44,821 --> 00:06:45,948 సరే. 102 00:06:50,536 --> 00:06:51,745 ఇక తలుపును తెరవవచ్చా? 103 00:06:53,789 --> 00:06:55,749 న్యూ ఆర్లీన్స్ లోని జనాభాలో అత్యధిక శాతాన్ని 104 00:06:55,832 --> 00:06:58,961 తుఫాను తాకక ముందే ఎగువ ప్రాంతాలకు తరలించడం జరిగింది. 105 00:06:59,044 --> 00:07:03,257 ఎందుకంటే, నగరంలోని చాలా ప్రాంతాలు లోతట్టున ఉన్నందున, దీనికి వరద ముప్పు ఎక్కువ. 106 00:07:03,340 --> 00:07:04,758 ఇది ఊరికే వరద బారిన పడే అవకాశం ఉంది. 107 00:07:04,842 --> 00:07:06,510 ఇక దానికి బలమైన గాలులు తోడైతే, 108 00:07:06,593 --> 00:07:09,304 నష్టం, అంచనా వేయలేనంత భారీ స్థాయిలో ఉంటుంది. 109 00:07:11,974 --> 00:07:13,225 ఏం చేస్తున్నావు? 110 00:07:15,227 --> 00:07:18,605 నా దాకా ఒక పుకారు వచ్చింది. 111 00:07:21,066 --> 00:07:24,027 అనెస్తెటిస్ట్ అయిన నా మాజీ ప్రియుడు ఇక్కడ పనిలో చేరాడట. 112 00:07:24,778 --> 00:07:26,530 నేను చండాలంగా ఉన్నప్పుడు అతను చూస్తే బాగోదు కదా. 113 00:07:26,613 --> 00:07:29,575 తుఫాను సమయంలో అతను మాత్రం సుందరాంగుడులా ఉంటాడా ఏంటి! 114 00:07:30,450 --> 00:07:31,910 అతను ఎలా ఉంటే నాకేంటి! 115 00:07:31,994 --> 00:07:34,663 నేనెలా కనిపిస్తాననే కదా నా బాధ. కానీ నేను మాత్రం చండాలంగా కనిపించను. 116 00:07:39,209 --> 00:07:42,713 అవాక్కయ్యే విషయం చెప్పనా? మాజీ ప్రియుడు ఇక్కడ పని చేస్తున్నాడని మేకప్ పెట్టుకుంటోంది. 117 00:07:43,547 --> 00:07:45,340 అయినా తనకు ఎందుకబ్బా. 118 00:07:45,924 --> 00:07:49,344 ఒకవేళ నేను అనుకొనే వ్యక్తే ఆమె మాజీ ప్రియుడు అయితే, ఆమె టేస్ట్ చాలా వరస్ట్ అనుకోవచ్చు. 119 00:07:49,428 --> 00:07:51,805 అవునా? మరి ఆమె భర్త ఎలా ఉంటాడో చూడాలనుంది నాకు. 120 00:07:52,264 --> 00:07:54,600 నిన్న రాత్రి అంత జరిగాక, మనం ఈ మాత్రం అయినా నవ్వుకోవాలిలే. 121 00:08:13,452 --> 00:08:16,622 ఇది కేరీ మొబైల్ ఫోన్. వీలైనంత త్వరగా నేను మీకు ఫోన్ చేస్తాను. 122 00:08:18,248 --> 00:08:21,251 ఎమ్మెట్. ఈ ఉదయం ఎలా ఉన్నారు? 123 00:08:23,128 --> 00:08:24,630 బాగానే ఉన్నాను. 124 00:08:26,381 --> 00:08:27,674 బాగానే ఉన్నారంటారా? 125 00:08:27,758 --> 00:08:32,095 హా. కాకపోతే, మా ఆవిడకి ఫోన్ చేస్తూనే ఉన్నా. 126 00:08:32,179 --> 00:08:33,472 కానీ కలవడమే లేదు. 127 00:08:34,264 --> 00:08:36,975 బయట ఇంకా పరిస్థితులు పూర్తిగా కుదురుకోలేదు. 128 00:08:37,058 --> 00:08:38,393 కాబట్టి, అసలు విషయాలు మనకు పూర్తిగా… 129 00:08:38,477 --> 00:08:42,648 మళ్లీ మమ్మల్ని చల్మేట్ లోని ఆసుపత్రికి తీసుకువెళ్లిపోతారు కదా? 130 00:08:43,690 --> 00:08:46,902 హా. ఎంత త్వరగా కుదిరితే, అంత త్వరగా. 131 00:08:46,985 --> 00:08:49,905 ఈ గందరగోళంలో నా భార్య నాకు దూరమవ్వడం నాకు ఇష్టం లేదు. 132 00:08:51,949 --> 00:08:55,494 ఎమ్మెట్, మీ భార్య కోపానికి బలి కావాలని నేను ప్రయత్నించట్లేదు. 133 00:08:57,287 --> 00:09:00,666 మనం ఇక్కడి నుండి బయలుదేరిన మరుక్షణం స్వయంగా నేనే కేరీకి కాల్ చేసి చెప్తాను. 134 00:09:01,708 --> 00:09:02,709 థ్యాంక్యూ. 135 00:09:05,045 --> 00:09:06,046 మీరు ప్రశాంతంగా ఉండండి. 136 00:09:14,638 --> 00:09:15,889 ఎలా ఉన్నారు, బాసూ? 137 00:09:15,973 --> 00:09:17,432 నా ఇంటి నుండి నేను బయటకు వచ్చేయాల్సి వచ్చింది. 138 00:09:17,516 --> 00:09:20,727 నీళ్లు ఆ కట్టను దాటి వస్తాయో లేదో అర్థం కావట్లేదు మరి. 139 00:09:20,811 --> 00:09:22,563 నాకేం… చివరగా నేను విన్నదాన్ని బట్టి, రావట్లేదు. 140 00:09:23,063 --> 00:09:25,065 చివరి… తుఫాను వెళ్లిపోయింది. 141 00:09:25,148 --> 00:09:27,651 -మీ మాటలు వినబడట్లేదు. -తుఫాను తూర్పుకు వెళ్లిపోయింది. 142 00:09:28,652 --> 00:09:30,112 అయితే చెరువు కట్ట తెగి 143 00:09:30,195 --> 00:09:31,738 నీళ్లు వస్తున్నాయో లేదో మీకు తెలీదా? 144 00:09:31,822 --> 00:09:33,407 లేదు. దాని గురించి తెలుసుకుంటా. 145 00:09:33,490 --> 00:09:36,201 ఎందుకంటే, నా రెండంతస్థుల భవనం దగ్గర నీరు చాలా ఎత్తుకు చేరుకుంటోంది, 146 00:09:36,285 --> 00:09:37,286 దిక్కు తోచక బయటకు వచ్చేశాను. 147 00:09:37,369 --> 00:09:39,663 -మీ ఇల్లు ఎక్కడ? -సరిగ్గా… 148 00:09:39,746 --> 00:09:41,373 లైఫ్ కేర్ హాస్పిటల్ 149 00:09:42,499 --> 00:09:46,211 నేల మీద నీళ్లున్నాయి జాగ్రత్త. నీళ్లు ఇంకా కారుతూనే ఉన్నాయి. 150 00:09:47,462 --> 00:09:49,214 వాళ్లు పైకి ఎవరైనా పంపుతున్నారా? 151 00:09:49,298 --> 00:09:50,674 ఎవరు పంపేది? 152 00:09:51,675 --> 00:09:54,386 మెమోరియల్ వాళ్లు. నీటి సమస్యను, ఇంకా మిగతా వాటిని చూసుకోవడానికి. 153 00:09:54,469 --> 00:09:56,346 చల్మేట్ లో ఎలా ఉంటుందో తెలీదు కానీ, 154 00:09:56,430 --> 00:09:59,516 ఇక్కడ మాత్రం ఒకే భవనంలో ఉన్నా మావి వేర్వేరు ఆసుపత్రులు అన్నట్టు. 155 00:09:59,600 --> 00:10:01,560 లైఫ్ కేర్ వాళ్లం, మా ఆపరేషన్ మేమే చూసుకుంటాం. 156 00:10:01,643 --> 00:10:05,189 నిన్న రాత్రి ఏం జరిగిందో చూడటానికి మెమోరియల్ నుండి కనీసం ఒక్కరు కూడా రాలేదు. 157 00:10:08,025 --> 00:10:09,484 అది దారుణం. 158 00:10:09,568 --> 00:10:11,653 మీరు ఎప్పుడైనా చల్మేట్ కి బదిలీ కావాలనుకుంటే, నాకు చెప్పండి. 159 00:10:12,446 --> 00:10:14,281 మీరు మళ్లీ అక్కడికి ఎప్పుడు వెళ్తున్నారనే విషయం తెలిస్తే చెప్తూ ఉండండి. 160 00:10:14,364 --> 00:10:16,074 మీరందరూ మాతో బాగా ఉంటున్నారు, అందుకు ధన్యవాదాలు. 161 00:10:17,034 --> 00:10:19,119 ఇంకోసారి తుఫాను ఏదైనా వస్తే, నేను సెలవు పెట్టేస్తా. 162 00:10:19,203 --> 00:10:20,120 అంతే కదా? 163 00:10:20,621 --> 00:10:22,247 ఏంటి సమాచారం? 164 00:10:23,457 --> 00:10:24,458 -థ్యాంక్యూ. -పర్వాలేదు. 165 00:10:24,541 --> 00:10:28,128 …లూటీ కథనాలు. వెస్ట్ బ్యాంక్ నుండి ఒకరు కాల్ చేసి, 166 00:10:28,212 --> 00:10:32,716 జనాలు షాపుల్లోకి వెళ్లి, తమకు ఏం కావాలో అవి లూటీ చేసి బయటకు పరుగెడుతున్నారట. 167 00:10:32,799 --> 00:10:35,427 ఎవరికైనా చుట్టూ తిరిగి, పరిస్థితిని గమనించే వీలు ఉండుంటే, 168 00:10:35,511 --> 00:10:38,555 మీరు సీబీడీకి వచ్చి చూస్తే కనుక… 169 00:10:38,639 --> 00:10:40,140 ఇది మీకు బీరుట్ లాగా అనిపిస్తుంది. 170 00:10:40,224 --> 00:10:42,684 నీటితో మునిగి ఉన్న బీరుట్ లా అనిపిస్తుంది. 171 00:10:42,768 --> 00:10:45,103 కాబట్టి, సైనికులు, 172 00:10:45,187 --> 00:10:47,814 ఆయుధాలు గట్రా పట్టుకొని ఉండి, 173 00:10:47,898 --> 00:10:49,816 ఆర్మర్ వంటివన్నీ తగిలించుకొని తిరిగే జనాలు తప్ప 174 00:10:49,900 --> 00:10:52,361 మిగతావన్ని అచ్చం అలాగే ఉంటాయి. 175 00:10:52,444 --> 00:10:53,779 త్వరలోనే ఇక్కడికి సైనికులు కూడా చేరుకోవచ్చు. 176 00:10:59,493 --> 00:11:00,661 సరే, పెడుతున్నా. 177 00:11:04,915 --> 00:11:08,252 ఎలా ఉంది? బాగుందా? ఇంకొద్దిగా పెడతాను, సరేనా? 178 00:11:08,877 --> 00:11:10,003 ఇదుగో. 179 00:11:10,838 --> 00:11:13,173 అంతే. అంతే. 180 00:11:15,342 --> 00:11:16,927 ఏంజెలా, మీరిద్దరూ బాగానే ఉన్నారా? 181 00:11:17,886 --> 00:11:21,056 బాగానే ఉన్నాం. ఎయిర్ కండీషనింగ్ పరిస్థితి ఎప్పుడు బాగు అవ్వవచ్చు? 182 00:11:22,182 --> 00:11:23,392 ఊరిలో కరెంట్ లేదు. 183 00:11:24,852 --> 00:11:29,273 మీ అమ్మగారికి అసౌకర్యంగా ఉందని నాకు తెలుసు, కానీ దీన్నంతటినీ తట్టుకొనే శక్తి ఆమెకి ఉంది. 184 00:11:30,065 --> 00:11:31,149 అవును. 185 00:11:32,025 --> 00:11:35,737 ఆమెకి నీరు ఇస్తూ ఉండండి. అవసరమైతే, వాటర్ ప్యాకుతో లేదా గుడ్డతో తడుపుతూ ఉండండి. 186 00:11:35,821 --> 00:11:36,864 అదే చేస్తూ ఉన్నా. 187 00:11:37,614 --> 00:11:39,908 త్వరలోనే ఏసీలు ఆన్ అవుతాయని అనుకుంటున్నా. 188 00:11:39,992 --> 00:11:40,993 సరే. 189 00:11:44,037 --> 00:11:45,539 -థ్యాంక్స్, డయేన్. -హా. 190 00:11:52,129 --> 00:11:55,215 పరిస్థితి అంతా బాగానే ఉందని నిర్ధారించుకోవాలనుకుంటున్నా, అంతే. 191 00:11:55,299 --> 00:11:56,300 అంతా బాగానే ఉంది. 192 00:11:56,383 --> 00:12:00,262 నీ దగ్గర తుపాకీ ఉండటం చూశానని ఒకరు నాతో అన్నారు. 193 00:12:00,345 --> 00:12:02,514 -నా దగ్గర తుపాకీ ఉంది మరి. -అది వారికి ఇబ్బంది కలిగించింది. 194 00:12:02,598 --> 00:12:05,559 తుపాకీకి కావాల్సిన లైసెన్స్ నా దగ్గర ఉంది. దాన్ని తీసుకెళ్లే హక్కు నాకు ఉంది. 195 00:12:05,642 --> 00:12:09,104 నీ ఆత్మ రక్షణ కోసం ఏమైనా చేసే హక్కు నీకు ఉంది, అందులో ఏ సందేహమూ లేదు. 196 00:12:09,188 --> 00:12:12,024 కానీ ఇది జనాలు, రోగులు ఉన్న ఒక ఆసుపత్రి. 197 00:12:12,107 --> 00:12:16,695 కాబట్టి, అందరికీ ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించమని నిన్ను కోరుతున్నాను. 198 00:12:18,614 --> 00:12:19,740 అలాగే. తప్పకుండా. 199 00:12:20,866 --> 00:12:22,075 థ్యాంక్యూ, ఇవైంగ్. 200 00:12:28,373 --> 00:12:29,291 డాక్టర్? 201 00:12:29,374 --> 00:12:31,001 -ఒక్క నిమిషం. -చెప్పండి? 202 00:12:31,084 --> 00:12:33,212 మీరు మమ్మల్ని పంపించేస్తున్నారా? 203 00:12:33,295 --> 00:12:34,463 ఏమన్నారు? 204 00:12:34,546 --> 00:12:36,757 మీరు రోగులను బయటకు పంపించేయడం మొదలుపెట్టబోతున్నారని ఎవరో అన్నారు. 205 00:12:36,840 --> 00:12:38,175 మీరు రోగియా? 206 00:12:38,258 --> 00:12:42,429 మా నాన్న రోగి. మా నాన్న కాలికి తగిలిన గాయానికి చికిత్స కోసం వచ్చాం, మా ఇల్లు కూడా కాస్తంత దెబ్బ తింది. 207 00:12:42,513 --> 00:12:44,181 అలాంటప్పుడు, నేను ఆయన్ని ఇంటికి తీసుకెళ్లలేను. 208 00:12:44,264 --> 00:12:47,518 ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేనప్పుడు మేము ఎవరినీ డిశ్చార్జ్ చేయము. 209 00:12:47,601 --> 00:12:48,602 ఆయనకి ఇంకా నొప్పి… 210 00:12:48,685 --> 00:12:51,980 ఎవరినీ కూడా మేము బలవంతంగా డిశ్చార్జ్ చేయం. 211 00:12:52,064 --> 00:12:53,982 చూడండి, నా పేరు డాక్టర్ హోరెస్ బాల్జ్. 212 00:12:54,066 --> 00:12:57,945 మీకేమైనా సమస్య ఎదురైతే, నన్ను కలవాలని చెప్పండి. సరేనా? 213 00:12:58,737 --> 00:12:59,947 -థ్యాంక్యూ. -సరే. 214 00:13:01,990 --> 00:13:04,076 కత్రినా తుఫాను తూర్పుకు తరలివెళ్లిపోయింది కనుక, 215 00:13:04,159 --> 00:13:06,620 న్యూ ఆర్లీన్స్ కి పెను ప్రమాదం తప్పింది, కానీ నష్టం అయితే బాగానే జరిగిందని చెప్పవచ్చు. 216 00:13:06,703 --> 00:13:07,746 డల్లాస్ 217 00:13:08,956 --> 00:13:11,750 లూసియానా గవర్నర్, కాథ్లీన్ బ్లాంకో చేసిన టెలివిజన్ ప్రకటనలో భాగంగా, 218 00:13:11,834 --> 00:13:14,920 నగరం నుండి ఎవరైతే తరలి వెళ్లిపోయారో, వారు అప్పుడే రావద్దని తెలిపారు. 219 00:13:15,003 --> 00:13:18,632 అన్ని విషయాల మాదిరిగానే ఇక్కడ కూడా ఆర్థికపరమైన అంశం ఉంది. 220 00:13:18,715 --> 00:13:20,968 ఇంకా టెనెట్ హెల్త్ కేర్ అనేది కేవలం ఆసుపత్రుల గ్రూప్ మాత్రమే కాదు. 221 00:13:21,051 --> 00:13:24,888 మాకు సర్జికల్ సెంటర్లు, ఆంబులెన్స్ సర్జికల్ సెంటర్లు, అత్యవసర సంరక్షణా కేంద్రాలు… 222 00:13:24,972 --> 00:13:27,599 -అయితే మీ వద్ద అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట? -అవును. 223 00:13:27,683 --> 00:13:29,434 మేము కార్పొరేట్ అభివృద్ధి వనరులతో 224 00:13:29,518 --> 00:13:32,855 స్థానిక ఆసుపత్రులకు సాయపడతాం, తద్వారా వారి ఆదాయం పెరుగుతుంది, 225 00:13:32,938 --> 00:13:35,649 అలాగే మార్కెట్ లో వాటా కూడా పెరిగి, వైద్యులతో రోగులకు కనెక్షన్ మరింత మెరుగవుతుంది, 226 00:13:35,732 --> 00:13:37,359 గల్ఫ్ తీర ప్రాంతమంతా మా కార్యకలాపాలు ఉన్నాయి. 227 00:13:37,442 --> 00:13:40,487 నమస్కారం, సర్. ఇవిగోండి. 228 00:13:40,571 --> 00:13:43,365 నాకు ఒక సందేహం ఉంది. అది నేను సీరియస్ గానే అడుగుతున్నా. 229 00:13:44,700 --> 00:13:48,620 లూసియానాలో నెలకొన్న కత్రినా లాంటి పరిస్థితి వ్యాపారానికి మంచిదేనా? 230 00:13:48,704 --> 00:13:53,792 మీకు న్యూ ఆర్లీన్స్ అంతటా ఆసుపత్రులు ఉన్నాయి, కానీ ఆ పరిస్థితి మీకు అనుకూలమైనదేనా? 231 00:13:53,876 --> 00:13:55,836 -ఓరి దేవుడా. -అలా అని కాదు, కానీ… 232 00:13:56,295 --> 00:13:57,754 ఆర్థికపరంగా ఆ పరిస్థితి మంచిదే అంటారా? 233 00:13:57,838 --> 00:13:59,131 మొదటి బీరుకే బాగా ఎక్కేసినట్టుంది. 234 00:13:59,840 --> 00:14:03,218 చూడండి, ఇలాంటి సంఘటన జరిగాక, మీ వద్దకు వచ్చే రోగుల సంఖ్య ఇంకా ఎక్కువ అవుతుంది కదా? 235 00:14:04,720 --> 00:14:06,346 బీమా క్లెయిమ్స్, ఇంకా పేపర్ వర్క్ ఎక్కువ అవుతుంది. 236 00:14:10,726 --> 00:14:12,644 అది మీ లాభాలకు గండి కొడుతుంది, కదా? 237 00:14:18,775 --> 00:14:19,943 విపత్తు తర్వాతి వాటి గురించి 238 00:14:20,027 --> 00:14:24,114 చూసుకొనే శాఖ ఏంటో నాకు అంత ఖచ్చితంగా తెలీదు, ప్రాఫిట్ & లాస్ అకౌంటింగ్ శాఖ అనుకుంటా. 239 00:14:25,574 --> 00:14:28,285 నేను కేవలం గల్ఫ్ తీర ప్రాంత వ్యాపారాభివృద్ధిని చూసుకొనే వాడిని. కాబట్టి… 240 00:14:29,912 --> 00:14:31,121 నేను అడుగుతున్నానంతే. 241 00:14:33,790 --> 00:14:34,875 నాకు అంత ఖచ్చితంగా తెలీదు. 242 00:14:36,168 --> 00:14:37,711 మనం ఆర్థిక అంశాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా? 243 00:14:37,794 --> 00:14:39,046 అవును. 244 00:14:39,129 --> 00:14:42,508 టెనెట్ హెల్త్ కేర్ కి, గల్ఫ్ ప్రాంతంపై పూర్తి పట్టు ఉంది. 245 00:15:08,784 --> 00:15:10,702 హేయ్. బయటకు వెళ్తే జాగ్రత్తగా ఉండు. 246 00:15:10,786 --> 00:15:13,539 ఒక నర్సు, తన కుక్కతో బయటకు వెళ్లినప్పుడు, కొందరు కుర్రాళ్లు అదో రకంగా తనని చూశారు. 247 00:15:13,622 --> 00:15:16,959 -నిజంగానా? -అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ జాగ్రత్త. 248 00:15:17,042 --> 00:15:18,627 బయటకు వెళ్తే జాగ్రత్తగా ఉండు. 249 00:15:18,710 --> 00:15:21,088 ఒక నర్సుతో కొందరు కుర్రాళ్లు అసభ్యంగా ప్రవర్తించారట. 250 00:15:21,171 --> 00:15:23,006 -అసభ్యంగానా? -నాతో సెక్యూరిటీ వాళ్లు అదే చెప్పారు. 251 00:15:23,882 --> 00:15:25,217 ఒక నర్సు బయటకు వెళ్లినప్పుడు 252 00:15:25,300 --> 00:15:27,803 తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారట. 253 00:15:28,345 --> 00:15:29,930 -ఆసుపత్రి బయటనా? -అవును. 254 00:15:30,514 --> 00:15:33,141 -ఎంత మంది కుర్రాళ్లు? -దాడి జరిగిందని మాత్రమే నాకు తెలుసు. 255 00:15:33,225 --> 00:15:35,644 నాకు ఏం చెప్పారంటే, ఆమె బయట నడుస్తూ ఉండగా, 256 00:15:35,727 --> 00:15:37,187 తనపై కొందరు కుర్రాళ్లు దాడి చేసి… 257 00:15:37,271 --> 00:15:39,106 -ఏంటి? ఎక్కడ జరిగింది? -…రేప్ చేశారట. 258 00:15:39,189 --> 00:15:40,566 ఆసుపత్రి బయటే. 259 00:15:40,649 --> 00:15:42,484 -ఆ దాడి ఎవరిపై జరిగింది? -ఒక నర్సుపై. 260 00:15:42,568 --> 00:15:44,027 -కానీ ఆమె పేరేంటి? -నాకు తెలీదు. 261 00:15:45,487 --> 00:15:48,073 ఆసుపత్రి బయట ఒక నర్సుపై గ్యాంగ్ రేప్ జరిగి ఉంటే, 262 00:15:48,156 --> 00:15:49,783 మనమే తనకి చికిత్స చేసి ఉండేవాళ్లం కదా. 263 00:15:49,867 --> 00:15:52,786 -ఇంకా నాకు అలాంటి సమాచారం ఏదీ… -అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. 264 00:15:52,870 --> 00:15:53,871 అందరూ అంటే ఎవరు… 265 00:15:53,954 --> 00:15:55,998 మన ఆసుపత్రిలోనే మన వాళ్లకి రక్షణ కరువైతే, 266 00:15:56,081 --> 00:15:58,166 మనం చాలా పెద్ద సమస్యల్లో ఉన్నట్టే. 267 00:15:58,250 --> 00:15:59,918 ఈ విషయంలో మనం ఏం చేయాలి? 268 00:16:00,919 --> 00:16:04,006 -తనపై లాంగిక దాడి జరిగిందా? -కొందరు కుర్రాళ్ల పని అట. 269 00:16:04,089 --> 00:16:05,090 సెక్యూరిటీ 270 00:16:05,174 --> 00:16:06,884 మాకు దాని గురించి ఏమీ తెలీదే. 271 00:16:06,967 --> 00:16:08,760 అయితే అది వ్యాపించింది మీ నుండి కాదన్నమాట. 272 00:16:08,844 --> 00:16:10,679 టౌన్ హాలులో కొన్ని అల్లర్లు జరిగాయని విన్నాం, 273 00:16:10,762 --> 00:16:13,724 కానీ ఆసుపత్రి బయట నర్సుపై దాడి అనేది, అస్సలు జరగనే లేదు. 274 00:16:13,807 --> 00:16:16,685 -సరే. థ్యాంక్యూ. -సరే. 275 00:16:24,735 --> 00:16:27,529 న్యూ ఆర్లీన్స్ లో వరద నీరు పెరుగుతూనే ఉంది, 276 00:16:27,613 --> 00:16:30,866 దానితో మరో దిక్కు లేక జనాలు తమ ఇళ్ల నుండి, తమ ప్రాంతాల నుండి, 277 00:16:30,949 --> 00:16:32,910 తమ కుటుంబాల అండ నుండి బయటకు వచ్చేస్తున్నారు. 278 00:16:33,410 --> 00:16:35,245 మీ ఫ్యామిలీ కిరాణా షాపు 279 00:16:36,830 --> 00:16:38,415 హేయ్, హేయ్. కానివ్వు. 280 00:16:40,751 --> 00:16:42,419 నేను చూసుకుంటాలే. 281 00:16:50,427 --> 00:16:54,264 -అటు చూడు. -బాబోయ్. అప్పుడే మొదలైందా! 282 00:16:54,348 --> 00:16:55,349 అంతేగా. 283 00:16:58,143 --> 00:17:00,521 ఇద్దరు నర్సులపై గ్యాంగ్ రేప్ జరిగిందట. 284 00:17:20,123 --> 00:17:21,834 నేను చాలా మంచివి కొట్టేశా. 285 00:17:24,962 --> 00:17:27,297 -నువ్వు ఏం కొట్టేశావు? -కంగారుపడకు. నీకు కావలసిన చెత్తనే తెచ్చుకున్నావు. 286 00:17:27,381 --> 00:17:29,758 హేయ్. ఇవన్నీ మీకు ఎక్కడివి? 287 00:17:31,677 --> 00:17:34,054 ఎక్కడి నుండో తెచ్చుకున్నాంలే. మీరు వదిలేయండి. 288 00:17:34,763 --> 00:17:35,889 ఇవన్నీ మీకు ఎక్కడివి? 289 00:17:37,057 --> 00:17:39,309 -కిరాణా అంగడి నుండి తెచ్చాం. -అది మూసేసుంది కదా. 290 00:17:40,060 --> 00:17:41,186 మేము తెరిచాంలెండి. 291 00:17:42,771 --> 00:17:44,648 మీ అమ్మ దొంగ అవ్వమని నీకు చెప్పిందా? 292 00:17:44,731 --> 00:17:46,066 మేమేమీ దొంగలం కాదు. 293 00:17:46,149 --> 00:17:47,317 దొంగిలిస్తే దొంగలనే అంటారు. 294 00:17:50,404 --> 00:17:52,197 మా చిట్టి చెల్లె కోసం డైపర్లను, 295 00:17:52,281 --> 00:17:55,367 మా అమ్మల కోసం కొంత ఆహారాన్ని తెచ్చాం, అంతకు మించి మేమేమీ కొట్టుకురాలేదు. 296 00:17:56,243 --> 00:17:57,452 నగరం పరిస్థితి ఏమీ బాగాలేదు. 297 00:17:58,704 --> 00:18:00,247 మీరు మమ్మల్ని బయటకు పంపేయాలని చూస్తున్నారు. 298 00:18:00,330 --> 00:18:01,582 ఎవరు పంపాలనుకుంటున్నారు? 299 00:18:02,708 --> 00:18:05,711 జనం అదే గుసగుసలాడుకుంటున్నారు. మీరు పంపించేస్తారట. 300 00:18:07,129 --> 00:18:09,798 పంపిస్తే, బయటకు మమ్మల్నే ముందుగా పంపించేస్తారు. 301 00:18:09,882 --> 00:18:13,260 మీరు మమ్మల్ని ఫుట్ పాత్ పైకి తోసేస్తే, ఇవన్నీ మేము ఎక్కడి నుండి తేగలం? 302 00:18:14,094 --> 00:18:16,722 మేము మా ప్రాణాలు కాపాడుకోవడానికే ఇలా చేశాం. 303 00:18:17,723 --> 00:18:18,974 బ్రతికి బట్టకట్టడం కోసమే. 304 00:18:23,395 --> 00:18:27,858 భవనం లోపల కానీ, బయట కానీ దెబ్బ తిని ఉంటే, ఫోటోలు తీసి, డాక్యుమెంట్ చేయండి. 305 00:18:27,941 --> 00:18:29,193 -సూసన్. -ఏదైనా… 306 00:18:29,276 --> 00:18:30,652 ఒక్క నిమిషం. 307 00:18:30,736 --> 00:18:32,529 ఏదేమైనా ముఖ్యమైన విషయం అయితే, దాన్ని కార్పొరెట్ కార్యాలయానికి పంపాలి. 308 00:18:32,613 --> 00:18:33,906 సరే, నేను ఆ పని మీదే ఉంటాను. 309 00:18:33,989 --> 00:18:35,073 ఏంటి సంగతి? 310 00:18:35,157 --> 00:18:37,701 ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చి పుకార్లే. 311 00:18:37,784 --> 00:18:41,371 నేను కూడా విన్నాను. మనకు తెలిసినంత వరకు, ఎవరిపైనా మానభంగం జరగలేదని జనాలకు చెప్పు. 312 00:18:41,455 --> 00:18:42,998 ఎవరిపై కూడా లైంగిక దాడి జరగలేదు. 313 00:18:43,081 --> 00:18:44,499 ఒక్క నిమిషం. ఏంటి? 314 00:18:45,083 --> 00:18:46,668 మనకు తెలిసినంత వరకు, మన భవనం బయట 315 00:18:46,752 --> 00:18:49,671 ఒక నర్సుపై దాడి జరిగనే లేదు. 316 00:18:49,755 --> 00:18:52,090 నేను దాని గురించి మాట్లాడటానికి రాలేదు. మనం జనాలను రోడ్డు మీద పడేస్తామట, 317 00:18:52,174 --> 00:18:54,009 ఆ పుకారు గురించి మాట్లాడటానికి వచ్చాను. 318 00:18:54,092 --> 00:18:57,137 మనం ఎవరినీ రోడ్డు మీద పడేయబోము. 319 00:18:57,221 --> 00:19:00,849 కానీ వీలైనంత త్వరగా, రోగులను డిశ్చార్చ్ చేసే పనిని మనం పరిశీలించాలి. 320 00:19:00,933 --> 00:19:04,144 డిశ్చార్చ్ అంటే ఎక్కడికి, సూసన్? వాళ్లు మాత్రం ఎక్కడికి పోగలరు? 321 00:19:04,228 --> 00:19:06,980 ఇక్కడ విద్యుత్ లేదు. మన దగ్గర మందులు అయిపోతున్నాయి. 322 00:19:07,064 --> 00:19:09,983 కాబట్టి, ఆసుపత్రిపై భారాన్ని కాస్త తగ్గించుకుంటే, 323 00:19:10,067 --> 00:19:12,778 -అది అందరికీ మంచిది. -కానీ అందరికీ వెళ్లడానికి ఇళ్లు లేవు. 324 00:19:16,073 --> 00:19:18,367 ఇంకా మనం జనాలను పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పినప్పుడు, 325 00:19:18,450 --> 00:19:21,787 ఈ పరిసరాల్లో ఉండే చాలా మంది, ఆ మాటలను అపార్థం చేసుకుంటారు. 326 00:19:21,870 --> 00:19:23,121 వాళ్లను మనం వదిలేస్తున్నామని అనుకుంటారు. 327 00:19:23,205 --> 00:19:26,041 డాక్టర్ కింగ్, నాకు అన్ని వైపుల నుండి సీన్ సితార కనిపిస్తోంది. 328 00:19:26,124 --> 00:19:28,544 నువ్వు ఆసుపత్రిలో చేరి కొన్ని నెలలే అయింది, 329 00:19:28,627 --> 00:19:31,296 కాబట్టి, ఇంకా నీకు ఇక్కడి తీరుతెన్నులు పూర్తిగా అర్థం కాలేదని అర్థమవుతోంది, 330 00:19:31,380 --> 00:19:34,466 కానీ క్లిష్టమైన నిర్ణయాలను తీసుకొనే బాధ్యత నాపై ఉంది. 331 00:19:34,550 --> 00:19:37,427 జనాలకు వెళ్లడానికి ఏ చోటూ లేకపోతే, మనం ఏదోక పరిష్కారాన్ని కనుగొందాం. 332 00:19:37,511 --> 00:19:40,138 లేదంటే, వరద నీరు తగ్గుముఖం పడుతున్నప్పుడు, 333 00:19:40,222 --> 00:19:42,599 మనం రోగులను డిశ్చార్చ్… 334 00:19:42,683 --> 00:19:44,518 మనం రోగులను డిశ్చార్చ్ చేయడం ప్రారంభించాలి. 335 00:19:44,601 --> 00:19:47,646 ఒక్క విషయం మాత్రం అందరికీ చేరేలా చేస్తావా, అదేంటంటే, జనాలకు ఏదైనా విషయం గురించి తెలీనప్పుడు, 336 00:19:47,729 --> 00:19:49,857 ఏదేదో వాగకుండా నోర్మూసుకొని కూర్చోమని. 337 00:19:54,987 --> 00:19:56,196 హేయ్, నేను విన్స్ ని. 338 00:19:56,280 --> 00:19:58,824 ఆనా, నేనూ ఫోన్ కి అందుబాటులో లేము. మెసేజ్ ఏదైనా పెట్టండి. 339 00:20:01,118 --> 00:20:02,786 మళ్లీ నేనే. ఇంకోసారి ప్రయత్నిస్తున్నానంతే. 340 00:20:06,874 --> 00:20:11,670 ఇక్కడ ఏసీలు ఇంకా పని చేయట్లేదు, అది తప్పితే, ఇక్కడ, అంతా బాగానే ఉంది. 341 00:20:14,590 --> 00:20:15,883 మేమందరం బాగానే ఉన్నాం. 342 00:20:18,260 --> 00:20:22,639 కాబట్టి, నువ్వు ఈ మెసేజ్ ని విన్నప్పుడు, కాల్ చేయ్, సరేనా? 343 00:20:24,391 --> 00:20:25,976 ఇక్కడ సెల్ సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదు, 344 00:20:26,059 --> 00:20:28,103 కాబట్టి నేను ఫోన్ ఎత్తకపోతే, ఒక మెసేజ్ పెట్టేయ్. 345 00:20:28,187 --> 00:20:30,689 నేను తర్వాత కాల్ చేస్తాను. సరే మరి. 346 00:20:33,358 --> 00:20:35,736 నువ్వు కాల్ చేసినప్పుడు మాట్లాడతాను. ఇక ఉంటా. 347 00:20:58,759 --> 00:20:59,927 హేయ్, నేను విన్స్ ని. 348 00:21:00,010 --> 00:21:02,638 ఆనా, నేనూ ఫోన్ కి అందుబాటులో లేము. మెసేజ్ ఏదైనా పెట్టండి. 349 00:21:04,515 --> 00:21:06,350 ఐ లవ్ యూ, సరేనా? 350 00:21:07,684 --> 00:21:09,520 నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ఇంకా ఐ లవ్ యూ. 351 00:21:17,694 --> 00:21:19,613 ఆంబులెన్స్ ఎమర్జెన్సీ 352 00:21:19,696 --> 00:21:20,697 ఫ్రెడ్డీ! 353 00:21:21,615 --> 00:21:22,908 అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 354 00:21:22,991 --> 00:21:24,368 నీళ్లు ఇంకా 18 అంగుళాల వద్దనే ఉన్నాయి. 355 00:21:25,369 --> 00:21:26,578 అస్సలు తగ్గనే లేదా? 356 00:21:27,371 --> 00:21:28,413 లేదు. 357 00:21:29,623 --> 00:21:31,124 సిటీ పంపు ఈ పాటికి పని చేస్తూ ఉండాలే. 358 00:21:32,960 --> 00:21:34,920 -సరే. నువ్వు దాని మీద ఓ కన్నేసి ఉంచు, సరేనా? -సరే. 359 00:21:35,003 --> 00:21:36,004 సరే మరి. 360 00:21:44,263 --> 00:21:47,850 ఇక్కడ అంతా బాగానే ఉంది. మీ అమ్మకు కూడా అంతా బాగానే ఉంది. 361 00:21:48,642 --> 00:21:50,477 కాకపోతే వేడే ఎక్కువగా ఉంది. 362 00:21:50,561 --> 00:21:51,812 ఏం జరుగుతోందో ఎవరైనా చెప్పారా? 363 00:21:53,564 --> 00:21:57,150 వాళ్లు ఒక్కటే మాట చెప్తున్నారు, ఊరిలో పవర్ కట్ అట, 364 00:21:57,234 --> 00:21:58,569 అందుకే గాలి లేదట. 365 00:21:59,111 --> 00:22:02,406 -చల్లగా ఉండటానికి ఏ మార్గమూ లేదా? -ఫ్యాన్ ఏమైనా ఇస్తారేమో అడిగి చూస్తాను. 366 00:22:02,489 --> 00:22:06,326 కానీ నీళ్లు ఉన్నాయి, మీ అమ్మ ఇప్పుడే కాస్త తినింది. నేను కూడా ఉన్నానుగా. 367 00:22:06,410 --> 00:22:09,830 కరెంట్ మళ్లీ ఎప్పుడు వస్తుందో ఎవరైనా ఏమైనా చెప్పారా? 368 00:22:09,913 --> 00:22:12,332 -ఇంకా చెప్పలేదు. -వాళ్లు ఏమీ చెప్పకపోతే, 369 00:22:12,416 --> 00:22:14,209 నువ్వు ఎవరి దగ్గరకైనా వెళ్లి అడుగు, సరేనా? 370 00:22:14,293 --> 00:22:15,502 -సరే. -తెలుసుకున్నాక, మాకు చెప్పు. 371 00:22:15,586 --> 00:22:17,921 -అలాగే. తనకేమీ కాదులే. -సరే. 372 00:22:18,005 --> 00:22:19,798 ఏమైనా విషయం తెలియగానే, నీకు ఫోన్ చేస్తాలే. 373 00:22:19,882 --> 00:22:21,508 సరే. జాగ్రత్త మరి. 374 00:22:21,592 --> 00:22:22,885 -సరే. -సరే. ఉంటా. 375 00:22:33,562 --> 00:22:34,605 హేయ్. 376 00:22:35,564 --> 00:22:36,732 బాగా దారుణంగా ఉందంటావా? 377 00:22:38,108 --> 00:22:39,401 కట్ట విరిగిపోయింది. 378 00:22:39,484 --> 00:22:42,362 చాలా చెట్లు పడిపోయాయి, కానీ ఇంత కన్నా ఎక్కువ నష్టం జరగనందుకు సంతోషం. 379 00:22:43,322 --> 00:22:44,323 మీ అమ్మకు ఎలా ఉంది? 380 00:22:45,073 --> 00:22:47,034 ఆసుపత్రి జనరేటర్స్ మీద నడుస్తోందని జిల్ అంటోంది. 381 00:22:47,618 --> 00:22:48,994 ఏసీలు పని చేయట్లేదట. 382 00:22:49,828 --> 00:22:51,747 తనకి వాళ్లేమీ చెప్పట్లేదట. 383 00:22:51,830 --> 00:22:53,415 కానీ మీ అమ్మకి బాగానే ఉంది కదా? 384 00:22:56,168 --> 00:22:57,544 బాగానే ఉందనుకుంటా. అంటే నాకు… 385 00:22:59,755 --> 00:23:01,173 ఏంటి? 386 00:23:04,384 --> 00:23:07,054 మీ అమ్మకి ఏమీ కాదు. జిల్ తోడుగా ఉంది కదా. 387 00:23:08,013 --> 00:23:10,849 ఇక్కడ ఉండటం కన్నా, ఆమె అక్కడ ఉంటేనే క్షేమంగా ఉంటుంది. 388 00:23:24,154 --> 00:23:25,405 న్యూ ఆర్లీన్స్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ 389 00:23:25,489 --> 00:23:29,618 ఇక్కడి ప్రాంతమంతా మునిగిపోయి ఉంది, అది కూడా తుఫాను తర్వాత జరిగింది. 390 00:23:29,701 --> 00:23:30,702 మేము ఇంటి పైకప్పు మీద కూర్చొని 391 00:23:30,786 --> 00:23:33,163 -నీరు పెరుగుతూ ఉండటాన్ని గమనిస్తున్నాం. -ఎత్తు ఎంత ఉంటుంది? 392 00:23:33,247 --> 00:23:36,124 సుమారుగా నాలుగు అడుగులు ఉండవచ్చు. ఇంత పెద్ద వరదను మేమెన్నడూ చూడనేలేదు. 393 00:23:36,208 --> 00:23:39,795 కార్లన్నీ నీటి అడుగున ఉన్నాయి. సిటీ పంపులు పని చేస్తున్నాయా? 394 00:23:39,878 --> 00:23:42,673 పంపులు ఆన్ చేసే ఉన్నాయి, కానీ ఆ ప్రాంతం, ఆ ప్రాంతంలో… 395 00:23:42,756 --> 00:23:45,342 -మార్కోనీ పంపు పని చేస్తోంది. -అమ్మా, తాగడానికి ఏమైనా కావాలా? 396 00:23:45,926 --> 00:23:48,637 -వరద వస్తుందట, విన్నావా? -వరదనా? 397 00:23:48,720 --> 00:23:50,681 మిగతా చోట్ల నుండి నీరు వచ్చి చేరుతుందట. 398 00:23:52,015 --> 00:23:54,268 రేడియోలో అదే చెప్తున్నారు. 399 00:23:54,351 --> 00:23:56,103 అబ్బా, ఇక ఆపు, అమ్మా. 400 00:23:56,186 --> 00:23:59,439 -నాకు ఏం జరుగుతోందో వినాలనుంది. -ఏం జరుగుతోందో ఎవరికీ తెలీదు. 401 00:23:59,523 --> 00:24:00,607 అదే అసలు సమస్య. 402 00:24:01,525 --> 00:24:03,610 అసలు ఎవరికీ, తాము ఏం మాట్లాడుతున్నారో తెలీదు కూడా. 403 00:24:04,695 --> 00:24:06,864 ఏమీ తెలీని వాళ్లే, ఎక్కువ మాట్లాడుతున్నారు. 404 00:24:18,792 --> 00:24:19,918 అమ్మా, ఇప్పుడు వద్దు. 405 00:24:24,339 --> 00:24:25,883 -అమ్మా. -పర్వాలేదు, మరేం పర్వాలేదులే. 406 00:24:25,966 --> 00:24:27,509 పరిస్థితి అలా లేదు అమ్మా. 407 00:24:37,603 --> 00:24:39,438 అందరూ పుకార్లను వ్యాపింపజేస్తున్నారు. 408 00:24:41,773 --> 00:24:43,317 అసలు లేని, జరగని విషయాలకు భయపడుతున్నారు. 409 00:24:47,571 --> 00:24:51,825 ఆసుపత్రిలో 2,000 మంది ఉన్నారు, వాళ్లందరి బాగోగులను నేను చూసుకోవాలి. 410 00:24:54,411 --> 00:24:55,787 ప్రతీ ఒక్కరినీ నేను చూసుకోవాలి. 411 00:24:59,458 --> 00:25:01,376 నువ్వు వాళ్లందరినీ బాగానే చూసుకున్నావుగా. 412 00:25:02,794 --> 00:25:06,924 తుఫాను బారి నుండి ఆ 2,000 మందిని కాపాడావు. 413 00:25:07,716 --> 00:25:10,260 నీకు కావాల్సింది నిజమే అయితే, అదే నిజం. 414 00:25:10,969 --> 00:25:12,429 నువ్వది చేశావు. 415 00:25:14,848 --> 00:25:16,058 నువ్వు అది సాధించావు. 416 00:25:57,724 --> 00:25:59,643 -నేను వెలిగిస్తానులే. -జాగ్రత్త. 417 00:26:20,330 --> 00:26:21,748 నేను చాలా కంగారుపడిపోయాను. 418 00:26:22,708 --> 00:26:25,002 -అవునా? -అవును మరి. 419 00:26:26,003 --> 00:26:27,171 ఇక్కడ ఎలా ఉండింది? 420 00:26:34,261 --> 00:26:38,473 న్యూ ఆర్లీన్స్ గాత్రమైన డబ్ల్యూడబ్ల్యూవీవీలో, ఇప్పుడు మేము వినిపించిన పాట ఆరొన్ నెవిల్ ది. 421 00:26:38,557 --> 00:26:42,186 అలనాటి ఆణిముత్యాలను మీకు అందించడంలో భాగంగా ఇప్పుడు ఫారీనర్ వారి సంగీతాన్ని వినిపిస్తున్నాం. 422 00:26:44,062 --> 00:26:45,898 ఆహా. ఇది మన పాటే కదా? 423 00:26:47,107 --> 00:26:49,943 -మన పాటనా? -అవును. 424 00:26:50,027 --> 00:26:52,654 -ఇది చాలా సాదాసీదా పాట. -అవును. 425 00:26:52,738 --> 00:26:55,157 కానీ మనం తొలిసారి డేటింగ్ కి వెళ్లినప్పుడు విన్న పాట ఇదే కదా? 426 00:26:55,991 --> 00:26:57,367 ఆ పిగ్ రోస్ట్ దగ్గర విన్నాం. 427 00:26:57,451 --> 00:26:59,119 నేను పిగ్ రోస్ట్ దగ్గరికి ఎప్పుడూ రాలేదు. 428 00:26:59,203 --> 00:27:00,746 -నువ్వు… ఏంటి? -హా. అవును. 429 00:27:00,829 --> 00:27:03,123 ఆ పిగ్ రోస్ట్ దగ్గర నువ్వు నన్ను కన్ను ఆర్పకుండా చూస్తూనే ఉన్నావు. 430 00:27:03,207 --> 00:27:05,334 -నేను పిగ్ రోస్ట్ దగ్గరికి ఎప్పూడూ రాలేదు. -ఒక్క నిమిషం. 431 00:27:05,417 --> 00:27:06,793 నీకు నిజంగానే గుర్తు లేదా? 432 00:27:07,586 --> 00:27:10,088 అంటే, అది తొలిసారి డేటింగ్ కి వెళ్లినప్పుడు జరిగినదే అయ్యుండవచ్చు. 433 00:27:10,172 --> 00:27:11,798 కానీ అది మనం తొలిసారి డేటింగ్ కి వెళ్లినప్పుడు జరిగినది కాదు. 434 00:27:13,467 --> 00:27:15,385 నాకు మాత్రం బాగా గుర్తుంది. 435 00:27:17,596 --> 00:27:19,264 -లేదు. అదేం లేదు. -ఒక్క నిమిషం. ఆగు. 436 00:27:19,348 --> 00:27:24,478 బహుశా నా మనస్సు దోచుకున్నది, భవిష్యత్తులో ఒక గొప్ప డాక్టర్ కాబోయే 437 00:27:24,561 --> 00:27:26,396 యువతి ఏమో. ఆ అవకాశం ఉంది. 438 00:27:26,480 --> 00:27:28,065 -బహుశా నా మనస్సు… -దోచుకున్నదా? 439 00:27:33,111 --> 00:27:35,280 నేను స్నానం చేయాలి. నా దగ్గర కంపు కొడుతోంది. 440 00:27:35,364 --> 00:27:36,657 నీ దగ్గర కంపేమీ లేదులే. 441 00:27:42,746 --> 00:27:44,206 మంచి వాసనే వస్తోంది. 442 00:28:10,065 --> 00:28:12,067 నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. 443 00:28:13,944 --> 00:28:19,449 నేను నీ దగ్గరకి రాగల పరిస్థితే ఉంటే, పరుగెత్తుకొని వచ్చి ఉండే దాన్ని. 444 00:28:23,120 --> 00:28:27,207 కానీ ఆ పరిస్థితి లేదు. నేను ఇప్పుడు అక్కడకు రాలేని పరిస్థితి. 445 00:28:28,458 --> 00:28:30,544 కానీ నా ప్రేమ నీతో అక్కడే ఉంది. 446 00:28:31,712 --> 00:28:35,465 నా ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంటుంది. 447 00:28:37,676 --> 00:28:38,969 ఐ లవ్ యూ టూ. 448 00:28:55,152 --> 00:28:56,361 కేరన్? 449 00:28:58,030 --> 00:28:59,239 కేరన్? 450 00:29:00,407 --> 00:29:01,700 ఉన్నాను. 451 00:29:01,783 --> 00:29:03,076 కోడ్ బ్లూ. ఎమర్జెన్సీ గది. 452 00:29:31,271 --> 00:29:32,356 డాక్టర్ వస్తున్నారు. 453 00:29:32,439 --> 00:29:34,566 దీన్ని సరి చేయవచ్చేమో చూస్తాను. డాక్టర్లు వస్తున్నారు, మేడమ్. 454 00:29:34,650 --> 00:29:36,401 మేడమ్, నా మాటలు వినిపిస్తున్నాయా? 455 00:29:36,485 --> 00:29:37,945 వాళ్లు ఇప్పుడు వచ్చి మీకు సాయం అందిస్తారు. 456 00:29:38,028 --> 00:29:39,821 -శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. -కనీసం రెండు లీటర్లు. 457 00:29:39,905 --> 00:29:41,156 ఊపిరి తీసుకోండి. 458 00:29:42,407 --> 00:29:43,450 సరే. 459 00:29:44,243 --> 00:29:46,453 మీ పేరేంటి? మీ పేరు చెప్పగలరా? 460 00:29:46,537 --> 00:29:47,579 జొలీన్. 461 00:29:47,663 --> 00:29:49,706 -ఏం జరిగింది? -తనని కత్తితో పొడిచారు. 462 00:29:49,790 --> 00:29:51,959 -మీరు అక్కడే ఉన్నారా? ఎన్ని సార్లు పొడిచారు? -హా, అక్కడే ఉన్నా. ఒక్కసారే. 463 00:29:52,042 --> 00:29:55,254 సరే. మిస్ జొలీన్, మిమ్మల్ని కత్తితో పొడిచారని మీ అబ్బాయి అంటున్నాడు… 464 00:29:55,337 --> 00:29:57,047 -నేను మనవడిని. -అది నిజమేనా? 465 00:29:57,130 --> 00:29:58,507 గాయం ఒక్క చోటే అయిందా? 466 00:29:58,590 --> 00:30:00,467 -మీకు ఇంకెక్కడైనా నొప్పిగా అనిపిస్తోందా? -ఏం జరుగుతోంది? 467 00:30:00,551 --> 00:30:02,886 మహిళ. వయస్సు 55 సంవత్సరాల పైనే ఉంటుంది. ఛాతీలోకి కత్తి దిగిన గాయం. 468 00:30:02,970 --> 00:30:05,013 -ఊపిరి కష్టంగా తీసుకుంటోంది. -రేడియల్స్ పల్స్ లేదు. బీపీ తగ్గిపోతోంది. 469 00:30:05,097 --> 00:30:06,849 -బ్లడ్ టెస్ట్ చేసి రక్తం ఎక్కించే పని చూద్దాం. -తనకి బానే ఉందా? 470 00:30:06,932 --> 00:30:08,559 -బ్లడ్ బ్యాంక్ ని తెరిచారా? -నాకు తెలీదు. 471 00:30:08,642 --> 00:30:09,935 -నేను చేస్తా. -ప్రస్తుతానికి ద్రవాలు పోకుండా చూద్దాం. 472 00:30:10,018 --> 00:30:12,896 -హేయ్! ఏం జరుగుతోంది ఇక్కడ? -డాక్టర్ బాల్జ్, మీరు కాస్త… 473 00:30:12,980 --> 00:30:14,565 సరే. ఇలా రా, అబ్బాయి. 474 00:30:14,648 --> 00:30:16,650 -నేను ఈమెతోనే ఉంటాను. -డాక్టరుతో పాటు వెళ్లండి. 475 00:30:16,733 --> 00:30:20,779 పద. ఏం కాదులే. ఏం పర్వాలేదు. ఏం చేయాలో వాళ్లకి తెలుసు. 476 00:30:20,863 --> 00:30:25,075 వాళ్లు ఆమెని బాగా చూసుకుంటారు. నువ్వు నాతో రా, సరేనా? పద. 477 00:30:25,158 --> 00:30:27,286 ఆక్సిజన్ ఎక్కించండి. మీకు ఏం కాకుండా మేము చూసుకుంటాం. 478 00:30:27,369 --> 00:30:28,954 సరే. అక్కడ కూర్చుందాం పద. 479 00:30:32,916 --> 00:30:35,419 ఇప్పుడు చెప్పు, నువ్వు బాగానే ఉన్నావా? 480 00:30:36,086 --> 00:30:37,713 నీకేమైనా అయిందా? 481 00:30:39,131 --> 00:30:40,883 సరే. నీ పేరేంటి? 482 00:30:42,593 --> 00:30:43,635 టేలర్. 483 00:30:44,553 --> 00:30:45,596 టేలర్? 484 00:30:49,016 --> 00:30:51,310 నేను నీకు ఒక విషయం చెప్పాలి. 485 00:30:54,229 --> 00:30:57,441 ఇది చాలా భయంకరంగా జరిగిన దాడి. 486 00:30:58,901 --> 00:31:02,112 దానిపై పోలీసులు రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది. 487 00:31:03,238 --> 00:31:04,448 అది తప్పదు. 488 00:31:05,407 --> 00:31:10,412 చూడు, నీకు ఏదైనా కావాలంటే, నేను సాయపడగలను. సరేనా? 489 00:31:12,706 --> 00:31:13,707 సరే. 490 00:31:14,917 --> 00:31:16,126 అసలు ఏం జరిగింది? 491 00:31:19,254 --> 00:31:22,549 ఈ పని చేసిన వ్యక్తిని కాపాడాలని చూస్తున్నావా? హా? 492 00:31:26,094 --> 00:31:27,262 సరే. 493 00:31:27,346 --> 00:31:29,389 ఏం జరిగిందో చెప్పు. నాకు చెప్పవచ్చు, ఏం కాదు. 494 00:31:30,516 --> 00:31:31,517 చెప్పు. 495 00:31:36,939 --> 00:31:39,733 తుఫాను చాలా భయంకరంగా దాడి చేసింది కదా? 496 00:31:40,817 --> 00:31:42,402 అది వెళ్లిపోయింది, అప్పుడు… 497 00:31:43,529 --> 00:31:46,198 బామ్మ చాలా ఆనందపడిపోయింది, ఎందుకంటే, తను అనుకుంది… 498 00:31:47,574 --> 00:31:50,619 ఈ తుఫాను ఇంకా భీభత్సంగా ఉంటుందని తను అనుకుంది. 499 00:31:51,370 --> 00:31:53,080 కానీ… కరెంట్ లేదు. 500 00:31:54,206 --> 00:31:56,124 ఏం చేయడానికి లేదు, కానీ ఏం కాకుండా బయటపడినందుకు ఏదైనా చేయాలి కదా? 501 00:31:56,208 --> 00:31:59,586 కాబట్టి, బామ్మ అందరినీ ఇంటికి పిలిచింది. 502 00:31:59,670 --> 00:32:02,297 ఇక పార్టీ చేసుకోవడం, బాగా తాగడం జరిగింది. 503 00:32:03,215 --> 00:32:04,633 చాలా తాగేశారు. 504 00:32:06,134 --> 00:32:07,261 హఠాత్తుగా గొడవ మొదలైంది. 505 00:32:09,721 --> 00:32:11,723 తర్వాత, వాళ్లు ఒక కత్తిని అందుకున్నారు. 506 00:32:11,807 --> 00:32:15,978 -ఎవరు అందుకున్నారు? -పరిస్థితులు చేయి దాటిపోయాయి. వాళ్లు ఆమెని పొడిచారు. 507 00:32:16,061 --> 00:32:17,855 ఎవరు పొడిచారు? 508 00:32:20,566 --> 00:32:22,025 -మా అమ్మ. -మీ అమ్మనా? 509 00:32:24,570 --> 00:32:25,654 మీ అమ్మగారా? 510 00:32:31,243 --> 00:32:34,288 మీ అమ్మగారు, ఆవిడ అమ్మగారిని పొడిచారా? 511 00:32:40,711 --> 00:32:41,920 ఈ విషయం మీరు పోలీసులకి చెప్పేస్తారా? 512 00:32:43,922 --> 00:32:45,716 మా అమ్మని జైలుకు పంపించేస్తారా? 513 00:32:50,387 --> 00:32:51,555 కంగారుపడకు, అబ్బాయి. 514 00:32:53,140 --> 00:32:54,349 ఏదోక బయటపడే మార్గం ఆలోచిద్దాం. 515 00:33:00,397 --> 00:33:03,358 ఇది పిచ్చి పని. అర్థంపర్థం లేని పని. 516 00:33:03,442 --> 00:33:04,443 నాకు వినపడింది. 517 00:33:06,320 --> 00:33:08,614 -మరి నువ్వు ఏమీ చెప్పట్లేదు కదా, ఇక… -ఏం చెప్పమంటావు? 518 00:33:08,697 --> 00:33:09,907 నేను రాలేను. 519 00:33:11,617 --> 00:33:14,953 ఆసుపత్రిలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. 520 00:33:15,662 --> 00:33:17,956 నీ రోగుల బాధ్యతను వేరే వాళ్లకి అప్పగించేసి 521 00:33:18,040 --> 00:33:20,042 నువ్వు ఊరి నుండి వెళ్లిపోవచ్చని తుఫాను రాక ముందు మీ బాస్ అన్నాడు కదా. 522 00:33:20,125 --> 00:33:22,503 అవును, కానీ ఇప్పుడు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. 523 00:33:22,586 --> 00:33:25,130 -తుఫాను వెళ్లిపోయింది కదా. -ప్రతీ ఒక్క సిబ్బంది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. 524 00:33:25,214 --> 00:33:28,967 ఇంకా రోగులు వస్తూనే ఉన్నారు. ఊరిలో ఏం జరుగుతోందో ఎవరికీ ఏమీ తెలీదు. 525 00:33:29,051 --> 00:33:30,719 -ఏమీ జరగడం లేదు. -జనాలు అల్లర్లకు పాల్పడుతున్నారని 526 00:33:30,802 --> 00:33:32,012 -వార్తల్లో చదివాను. -వార్తల్లో… అబ్బా. 527 00:33:32,095 --> 00:33:33,263 వార్తల్లో అంతా సోది… 528 00:33:33,972 --> 00:33:37,226 జనాలు అంతా సర్దుకుంటున్నారు. అంతకు మించి ఏమీ లేదు. 529 00:33:37,309 --> 00:33:38,310 మరి నువ్వు ఇక్కడే ఉండవచ్చు కదా. 530 00:33:39,269 --> 00:33:40,395 ఇక్కడ ఉండి నేనేం చేయాలి? 531 00:33:40,479 --> 00:33:42,731 -బయటకు వెళ్లి ఏం చేస్తావు? -ఇంటిని చూసుకోవాలి కదా. 532 00:33:42,814 --> 00:33:44,191 ఇంటికి ఏమీ కాదు. 533 00:33:44,274 --> 00:33:47,778 ఏమీ కాదులే, అయినా కానీ అక్కడ ఎవరోకరు ఉండాలి కదా. 534 00:33:52,658 --> 00:33:53,700 సరే, చూడు. 535 00:33:55,494 --> 00:33:57,246 నేను ఇల్లు ఎలా ఉందో చూస్తాను. 536 00:33:57,329 --> 00:33:59,915 కొంత ఆహారం తీసుకొని, ఇక్కడికి వస్తా. సరేనా? 537 00:34:00,791 --> 00:34:02,459 -సరే. -మనం ఇంకోసారి ఏకాంతంగా గడపవచ్చు. 538 00:34:03,502 --> 00:34:06,004 1980ల నాటి ఉర్రూతలూగించే పాటలను ఇంకొన్ని విందాం. 539 00:34:07,756 --> 00:34:08,882 ఏమంటావు? 540 00:34:09,842 --> 00:34:11,885 -హా. అలాగే. -సరే మరి. 541 00:34:18,934 --> 00:34:22,228 పుకార్ల విషయానికి వస్తే, 542 00:34:23,397 --> 00:34:27,275 నీ మాజీ ప్రియుడు ఒకడు ఇక్కడ కొత్తగా చేరాడనే వార్త నా చెవిన పడింది. 543 00:34:29,069 --> 00:34:30,279 అది నాకు తెలీదే. 544 00:34:34,032 --> 00:34:36,368 -ఐ లవ్ యూ, ఆనా. -ఐ లవ్ యూ టూ. 545 00:34:37,077 --> 00:34:38,328 ఐ లవ్ యూ. 546 00:34:51,925 --> 00:34:56,221 …మెట్రోపాలిటన్ ప్రాంతం గురించి మాట్లాడితే, చాలా ప్రాంతాలలో… 547 00:34:56,304 --> 00:34:57,556 దయచేసి మమ్మల్ని కాపాడండి! 548 00:34:57,639 --> 00:35:01,018 …నీటి స్థాయి పెరగడం లేదు. అదే స్థాయిలో ఉండిపోయింది. 549 00:35:01,602 --> 00:35:05,522 పదిహేడవ వీధిలో ఉండే చెరువుకు గండి పడిన కారణంగా, న్యూ ఆర్లీన్స్ లోని కొన్ని ప్రాంతాల్లో 550 00:35:05,606 --> 00:35:06,899 నీటి స్థాయి పెరుగుతూ ఉండవచ్చు. 551 00:35:06,982 --> 00:35:09,943 ఊరి నడిబొడ్డున కూడా పరిస్థితి అలాగే ఉన్నట్టు అనిపిస్తోంది. 552 00:35:10,027 --> 00:35:12,321 కానీ న్యూ ఆర్లీన్స్ వేగంగా నీట మునిగిపోతుందని 553 00:35:12,404 --> 00:35:15,073 అందరినీ కంగారు పెట్టేయడం నా ఉద్దేశం కాదు. పరిస్థితి అలా లేదు. 554 00:35:15,157 --> 00:35:17,284 ఇప్పటి దాకా లూసియానా సెనేటర్, డేవిట్ విట్టర్ మాట్లాడారు. 555 00:35:17,367 --> 00:35:18,911 ఇప్పుడు లూసియానాలో ఉండకపోవడమే మంచిది. 556 00:35:19,578 --> 00:35:22,039 కొన్ని రోజుల పాటు లూసియానాలో ఉండకపోవడమే ఉత్తమం. 557 00:35:24,750 --> 00:35:26,502 ఇలాంటిది మనకి లాభాలను తెచ్చిపెడుతుందా? 558 00:35:27,252 --> 00:35:28,253 ఏంటి? 559 00:35:28,795 --> 00:35:32,132 ఇలాంటిది లాభాలను తెచ్చిపెట్టగలదా లేదా అని నన్ను ఒక క్లయింట్ అడిగాడు. 560 00:35:33,634 --> 00:35:34,718 నిజంగానా? 561 00:35:35,385 --> 00:35:36,386 అవును. 562 00:35:38,764 --> 00:35:40,307 ఇది మామూలు లాభాలను తెచ్చి పెట్టదు తెలుసా? 563 00:35:42,559 --> 00:35:44,019 కానీ అలా అడగడమే ఏం బాగా లేదు. 564 00:35:44,728 --> 00:35:45,812 అవును, కదా? 565 00:35:50,901 --> 00:35:52,110 ఏం కనిపిస్తోంది? 566 00:35:53,070 --> 00:35:55,072 భవనంలో చాలా వరకు టింటింగ్ పోయింది. 567 00:35:55,155 --> 00:35:56,657 మూడవ అంతస్థులో 568 00:35:56,740 --> 00:35:57,991 -కిటికీ ఊడి పడుంది. -చూశా. అది చూశా. 569 00:35:58,075 --> 00:36:01,495 అయిదవ అంతస్థులో చాలా కిటికీలు లేవు. ఇక్కడ వెంటిలేషన్ వ్యవస్థ పాడయింది. 570 00:36:01,578 --> 00:36:04,039 హేయ్! మీలో ఎవరు ఇన్ ఛార్జ్? 571 00:36:05,958 --> 00:36:07,668 కొన్ని కట్టలు తెగిపోయాయి. 572 00:36:07,751 --> 00:36:10,671 ఇటు వైపు 15 అడుగుల నీరు వస్తోంది, కాబట్టి సిద్ధంగా ఉండండి. 573 00:36:11,547 --> 00:36:13,006 అవునా, సర్లే. 574 00:36:13,090 --> 00:36:14,591 హేయ్. నేను చెప్పేది అర్థం కావడం లేదా? 575 00:36:15,217 --> 00:36:18,428 ఇటు వైపు 15 అడుగుల వరద నీరు వస్తోంది. ఎక్కువ సమయం కూడా లేదు. 576 00:36:19,930 --> 00:36:21,974 నీళ్లు వస్తున్నాయి. చాలా ఎక్కువ నీళ్లు. 577 00:36:22,057 --> 00:36:23,267 చాలా ఎక్కువ అంటే? 578 00:36:23,350 --> 00:36:26,103 తుఫాను తీవ్రత వల్ల 17వ వీధిలో ఉండే చెరువుకు గండి పడి 579 00:36:26,186 --> 00:36:27,688 ఆర్లీన్స్ వైపు పడిపోయింది. 580 00:36:27,771 --> 00:36:30,107 పోంచట్రెయిన్ చెరువు నుండి నగరంలోకి నీళ్లు ప్రవేశిస్తున్నాయి. 581 00:36:30,190 --> 00:36:31,817 -నిన్నటి నుండి ఇది జరుగుతోంది. -నిన్నటి నుండా? 582 00:36:31,900 --> 00:36:33,735 నిన్నటి నుండి నగరంలోకి నీళ్లు ప్రవేశిస్తున్నాయా? 583 00:36:33,819 --> 00:36:35,529 ఈ సమాచారం మీకు ఎక్కడిది? 584 00:36:35,612 --> 00:36:36,613 సూసన్, మనం… 585 00:36:36,697 --> 00:36:39,783 ఆగు. నిన్న రాత్రి నుండి నేను పుకార్లను, మసాలాలు జోడించి చెప్పే విషయాలను వింటూనే ఉన్నాను. 586 00:36:39,867 --> 00:36:41,618 ఇప్పుడేమో ఇతను ఇదేదో చెప్తున్నాడు. ఇది… 587 00:36:41,702 --> 00:36:45,622 -మరి కట్టలు తెగిపోయాయని ఎవరికీ ఎందుకు తెలీదు? -బయట అంతా గందరగోళంగా ఉంది. 588 00:36:45,706 --> 00:36:48,208 ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. ఎవరికీ తామేం చేస్తున్నామో తెలియడం లేదు. 589 00:36:48,292 --> 00:36:50,502 మీరు అధికారిక ఆర్డర్ కోసమే చూస్తున్నట్లయితే, దాని మీద ఆశలు పెట్టుకోకండి. 590 00:36:50,586 --> 00:36:52,379 -మేమేం చేయాలి? -మీ వాళ్లను ఖాళీ చేయించండి. 591 00:36:52,462 --> 00:36:54,298 ఖాళీ చేయించడానికి సంబంధించి మీ ప్లాన్ ని ఆచరణలో పెట్టండి, 592 00:36:56,091 --> 00:36:58,927 వరద సమయాల్లో ఎలా ఖాళీ చేయించాలి అనే దానికి మా దగ్గర ప్లాన్ లేదు. 593 00:37:01,096 --> 00:37:02,306 ఓరి దేవుడా. 594 00:37:03,682 --> 00:37:05,642 మా వాళ్లు ఇక్కడ కొంత మంది ఉన్నారు. 595 00:37:05,726 --> 00:37:09,354 మేము చేయగలిగినంత సాయం చేస్తాం, కానీ మీరు ఖాళీ చేయించడాన్ని ప్రారంభించాలి. 596 00:37:10,731 --> 00:37:11,899 దేవుడా. 597 00:37:11,982 --> 00:37:14,151 ఎంత నీరు వస్తే మనం సమస్యల్లో పడతాం? 598 00:37:15,110 --> 00:37:16,987 నాలుగు అడుగులకు చేరుకుంటే ఎలక్ట్రిక్ స్విచ్చులన్నీ మునిగిపోతాయి. 599 00:37:17,070 --> 00:37:18,780 అప్పుడు, మనకి ఉన్న ఈ కాస్త కరెంట్ కూడా పోతుంది. 600 00:37:18,864 --> 00:37:20,908 -ఆహార సరఫరాలు, ఎమర్జెన్సీ రూమ్… -మనం ఎవరోకరికి కాల్ చేయాలి. 601 00:37:20,991 --> 00:37:22,242 -మనం ఎవరోకరికి కాల్… -కాల్ చేయాలా? 602 00:37:22,326 --> 00:37:25,120 -మనం నగర పాలకవర్గాన్ని సంప్రదించాలి. -సరే, కానీ నువ్వు అతని మాటలు విన్నావా? 603 00:37:25,204 --> 00:37:26,872 నగరంలో ఎవరేం చేస్తున్నారో ఎవరికీ తెలీదట. 604 00:37:26,955 --> 00:37:28,707 మనం రోగులను తరలించే పని ప్రారంభించితే… 605 00:37:29,208 --> 00:37:30,792 ఒకవేళ అతను పొరబడి ఉంటే? అసలు వరద నీరనేదే లేకపోతే? 606 00:37:30,876 --> 00:37:34,630 ఎరిక్, బయట పరిస్థితిని గమనిస్తూ ఉండమని కొందరిని పంపించు. నీరు ఎప్పుడు వస్తుందో నాకు తెలియాలి. 607 00:37:34,713 --> 00:37:36,590 -ఎంత వేగంగా వస్తుందో, ఎంత ఎత్తులో వస్తుందో తెలియాలి. -సరే. 608 00:37:36,673 --> 00:37:39,468 నాకు ఇక్కడ ఎంత మంది ఉన్నారో తెలియాలి. ఎంత మంది రోగులు ఉన్నారు. 609 00:37:39,551 --> 00:37:42,304 ఎంత మంది సిబ్బంది ఉన్నారు. ఎవరు డిశ్చార్చ్ అయ్యారు. ఇంకా ఎవరు ఉన్నారు. 610 00:37:42,387 --> 00:37:44,556 ఈ ఆసుపత్రిలో ఉన్న ప్రతీ వ్యక్తి గురించి నాకు వివరాలు కావాలి. 611 00:37:49,645 --> 00:37:51,104 దేవుడా, నువ్వే నన్ను ఆదుకోవాలి. 612 00:37:54,858 --> 00:37:57,277 డాక్టర్ పౌ, మీ ఆయన ఎక్కడ? 613 00:37:57,361 --> 00:37:59,571 విన్స్ వెళ్లిపోయాడు. ఇల్లు ఎలా ఉందో చూద్దామని వెళ్లాడు. 614 00:37:59,655 --> 00:38:01,782 మీరు ఆయన్ని వెనక్కి పిలవండి. ఓసారి బయట చూడండి. 615 00:38:04,451 --> 00:38:07,246 లేదు, ఒకసారి అది చూశారా? అది ఎంత వేగంగా వస్తుందో చూడండి. 616 00:38:19,383 --> 00:38:23,720 ఎక్కడో కట్టలన్నీ తెగిపోయాయి అట, ఇంకా… 617 00:38:27,850 --> 00:38:28,934 హేయ్, నేను విన్స్ ని. 618 00:38:29,017 --> 00:38:31,520 ఆనా, నేనూ ఫోన్ కి అందుబాటులో లేము. మెసేజ్ ఏదైనా పెట్టండి. 619 00:38:33,397 --> 00:38:35,607 విన్స్, నేను ఆనాని. అందుబాటులో ఉంటే, ఫోన్ ఎత్తు. 620 00:38:39,236 --> 00:38:40,654 విన్స్, ఉన్నావా? 621 00:38:43,365 --> 00:38:46,285 విన్స్? విన్స్, ఫోన్ ఎత్తు. 622 00:38:48,912 --> 00:38:49,913 విన్స్. 623 00:39:40,839 --> 00:39:42,841 సబ్ టైటిళ్లను అనువదించినది: రాం ప్రసాద్