1 00:00:12,262 --> 00:00:15,015 ఈరోజు, నగరంలో చిక్కుకుపోయిన వారి దీన స్థితి గురించి 2 00:00:15,098 --> 00:00:17,768 -కథనాన్ని చెప్పబోతున్నాము. -కత్రినా వెళ్లిపోయిన మూడు రోజుల తర్వాత, 3 00:00:17,851 --> 00:00:19,937 న్యూ ఆర్లీన్స్ స్థితి ఇలా ఎలా మారింది? 4 00:00:20,562 --> 00:00:22,606 ప్రకృతి వదిలేసిన వాటిపై లూటీదారులు పడ్డారు. 5 00:00:22,689 --> 00:00:25,317 నీట మునిగిన వీధుల్లో, మూకుమ్మడి దోపిడీలు, అల్లర్లు రాజ్యమేలుతున్నాయి. 6 00:00:25,400 --> 00:00:26,568 -ఆగు! -…జనాలు 7 00:00:26,652 --> 00:00:28,862 -తేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. -ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. 8 00:00:28,946 --> 00:00:30,322 …ఇలాంటివన్నీ మంచివి కావు. 9 00:00:30,405 --> 00:00:31,782 …ఎంత అల్లకల్లోలంగా ఉందంటే, 10 00:00:31,865 --> 00:00:33,951 వాళ్లని అదుపు చేయడానికి న్యూ ఆర్లీన్స్ పోలీసులు వద్ద తగినంత మంది లేరు… 11 00:00:34,034 --> 00:00:35,953 ప్రభుత్వం మాకు ఏమీ పంపలేదు. 12 00:00:36,036 --> 00:00:38,747 లూటీదార్లు వేటినైతే దోచుకోలేదో వాటినే పోలీసులు తింటున్నారని తెలుస్తోంది. 13 00:00:38,830 --> 00:00:40,916 మాకు ఆహారం సరఫరా చేస్తున్నారని వాళ్లు చెప్పేదంతా పచ్చి అబద్ధం. 14 00:00:40,999 --> 00:00:43,669 నాకు చికాకుగా ఉందా? నిజమే. నాకేంటి, అందరిదీ అదే స్థితి. 15 00:00:43,752 --> 00:00:45,712 సాయం చేయండి! సాయం చేయండి! సాయం చేయండి! 16 00:00:45,796 --> 00:00:48,048 జనాలు తమకు సాయం తక్షణమే అందాలని కోరుకుంటున్నారు, అది అర్థం చేసుకోదగినదే. 17 00:00:48,131 --> 00:00:49,091 ఈ కీలకమైన కార్యాన్ని 18 00:00:49,174 --> 00:00:52,469 సక్రమంగా నిర్వహించనప్పుడు మేము ఊరికే చూస్తూ కూర్చోలేం. 19 00:00:52,553 --> 00:00:53,971 ప్రభుత్వం ఏం చేస్తోందో, ఆ దేవుడికే తెలియాలి. 20 00:00:54,054 --> 00:00:57,641 ఇక్కడ జనాలకు నీ అవసరం ఉంది, వారి దుస్థితికి నువ్వే కారణం, రే నేగిన్. 21 00:00:57,724 --> 00:01:01,103 కేంద్ర, రాష్ట్ర, ఇంకా స్థానిక ప్రభుత్వాలు 22 00:01:01,186 --> 00:01:04,897 సాయం ఎక్కువగా అవసరమున్న వరద బాధితులను ఆదుకోవడంలో ఏ మేరకు విఫలమయ్యాయో చూపడానికి 23 00:01:04,982 --> 00:01:06,191 ఈ సంఘటన చాలా చక్కని ఉదాహరణ… 24 00:01:06,275 --> 00:01:07,818 కన్వెన్షన్ సెంటరులో జనాలున్నట్టు, 25 00:01:07,901 --> 00:01:09,736 ఇవాళ్టి వరకు, కేంద్ర ప్రభుత్వానికి తెలీను కూడా తెలీదు. 26 00:01:09,820 --> 00:01:13,657 ఇక్కడ ఒక పసి కూన ఉంది, ఆ కూనకి నీళ్లు లేవు, పాలు లేవు, అసలేమీ లేవు. 27 00:01:13,740 --> 00:01:15,450 ఫెమా ఏం చేస్తోంది? ప్రభుత్వం ఏం చేస్తోంది? 28 00:01:16,994 --> 00:01:19,162 ఇక్కడ ఎవరు ఇన్ ఛార్జ్? 29 00:01:19,246 --> 00:01:20,914 మీరే. 30 00:01:20,998 --> 00:01:21,832 యూ.ఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ 31 00:01:23,584 --> 00:01:25,961 ఇప్పుడు మెమోరియల్ లోని నాల్గవ రోజు విషయానికి వద్దాం. 32 00:01:26,044 --> 00:01:26,879 మెమోరియల్ మెడికల్ సెంటర్ 33 00:01:26,962 --> 00:01:29,339 నాల్గవ రోజుకు చేరుకొనే సరికి, 34 00:01:29,423 --> 00:01:32,926 వరద నీరు, ఆసుపత్రి ముందు ఉన్న ఎమర్జెన్సీ ర్యాంప్ స్థాయికి చేరుకున్నాయి. 35 00:01:33,010 --> 00:01:38,390 భవనంలో కరెంట్ పోయింది. మా దగ్గరున్న పరికరాలు పని చేయడం ఆగిపోయాయి. 36 00:01:38,473 --> 00:01:40,434 రోగులకు సాయపడటానికి అవసరమైనవన్నీ పని చేయడం ఆగిపోయాయి. 37 00:01:41,768 --> 00:01:42,936 రోగుల మరణాలు మొదలయ్యాయి, 38 00:01:43,020 --> 00:01:48,650 వాళ్లని కాపాడటానికి మేమేం చేయలేకపోయాం. 39 00:01:51,486 --> 00:01:53,947 అయితే, మరి ఎప్పటికి జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి? 40 00:01:55,073 --> 00:01:56,283 మేమేం భయాందోళనలకు గురి కాలేదు. 41 00:01:57,451 --> 00:01:59,328 మీరు భయపడలేదా? 42 00:02:05,959 --> 00:02:11,131 కట్టలు తెగిపోయాక, ఒక రోజు… ఒక రోజంతా పట్టింది, 43 00:02:11,757 --> 00:02:14,968 నగర స్థాయి, లేదా రాష్ట్ర స్థాయికి చెందిన ఒక వ్యక్తి 44 00:02:15,052 --> 00:02:17,679 ఎమర్జెన్సీని ప్రకటించడానికి. 45 00:02:17,763 --> 00:02:21,016 మా చుట్టూ నీళ్లు ఉన్నాయి, మాకు ఎవరూ చెప్పలేదు. 46 00:02:23,727 --> 00:02:25,103 అవును, మేము భయపడి ఉండాల్సింది. 47 00:02:25,187 --> 00:02:29,149 రోగులను కాపాడటానికి ఏవోక ప్రయత్నాలు మేము చేసి ఉండాల్సింది. కానీ మేమేం చేయలేదు. 48 00:02:29,233 --> 00:02:30,609 మాకు భయాందోళనలు కలగక కాదు, 49 00:02:30,692 --> 00:02:33,111 భయాందోళనలు కలగాల్సినంత సమాచారం మాకు తెలియక. 50 00:02:33,820 --> 00:02:36,281 ఆసుపత్రిలో 45 మంది శవాలు దొరికాయి. 51 00:02:37,282 --> 00:02:38,951 వాళ్లలో ఎవరినైనా కావాలని చంపేశారా? 52 00:02:42,621 --> 00:02:44,998 మీరు ఆసుపత్రిలోని ఎథిక్స్ కమిటీకి అధ్యక్షులు. 53 00:02:45,082 --> 00:02:47,125 -రోగులలో కొందరిని కావాలని హత్య చేశారా… -మీరు అడిగేది… 54 00:02:47,209 --> 00:02:49,962 …లేదా అనేది మీరు తప్ప ఇంకెవరు చెప్పగలరు! 55 00:02:58,053 --> 00:02:59,596 ఎథిక్స్ అంటే… 56 00:03:04,184 --> 00:03:05,519 నేనేం చెప్పగలనంటే… 57 00:03:05,602 --> 00:03:08,355 మీకు నేనేం చెప్పగలనంటే 58 00:03:09,648 --> 00:03:12,901 రోగులను యాతన నుండి కాపాడటానికి 59 00:03:14,236 --> 00:03:19,700 అందరూ కలిసి ప్రయత్నం చేయడం జరిగింది. 60 00:03:21,827 --> 00:03:24,913 మెమోరియల్ లో గడిపిన ఆ చివరి రోజులలో అయితే… 61 00:03:28,959 --> 00:03:30,586 యాతన తప్ప ఇంకేమీ లేదు. 62 00:03:34,173 --> 00:03:38,886 నీటిలో ముందుకు సాగండి 63 00:03:41,054 --> 00:03:45,809 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 64 00:03:46,894 --> 00:03:51,690 నీటిలో ముందుకు సాగండి 65 00:03:51,773 --> 00:03:56,987 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 66 00:03:57,070 --> 00:04:01,658 నీటిలో ముందుకు సాగండి 67 00:04:01,742 --> 00:04:07,039 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 68 00:04:07,122 --> 00:04:11,126 పురుషులు నది వద్దకు వెళ్లారు 69 00:04:12,085 --> 00:04:17,007 పురుషులు నది వద్దకు వెళ్లారు, ప్రభువా 70 00:04:17,089 --> 00:04:21,261 పురుషులు నది వద్దకు వెళ్లారు 71 00:04:22,095 --> 00:04:25,766 అక్కడికి ప్రార్థించడానికి వెళ్లారు 72 00:04:27,392 --> 00:04:31,230 నీటిలో ముందుకు సాగండి 73 00:04:32,481 --> 00:04:37,319 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 74 00:04:37,402 --> 00:04:38,820 షెరీ ఫింక్ రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 75 00:04:38,904 --> 00:04:41,281 నీటిలో ముందుకు సాగండి 76 00:04:41,990 --> 00:04:46,995 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 77 00:04:52,125 --> 00:04:58,131 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 78 00:05:01,969 --> 00:05:04,429 నాల్గవ రోజు 79 00:05:20,612 --> 00:05:22,906 రిచర్డ్? హెలికాప్టర్లు వస్తున్నాయా? 80 00:05:22,990 --> 00:05:25,450 లేదు. ఒక్క హెలికాప్టర్ కూడా ఇక్కడ దిగట్లేదు. 81 00:05:25,534 --> 00:05:28,704 సరే. ఏదైనా దిగితే, నాకు చెప్పు. 82 00:05:29,663 --> 00:05:30,664 అలాగే. 83 00:05:45,721 --> 00:05:47,848 -నీకు అవి ఎక్కడివి? -బ్యాగును ముట్టుకోకు. 84 00:05:47,931 --> 00:05:49,892 -నేను తీసుకెళ్తున్నా. -ఎవరైనా చెప్పారా? 85 00:05:50,976 --> 00:05:52,102 సమాధానం చెప్పు. 86 00:05:52,186 --> 00:05:54,313 -నాకు ఇవి కావాలి. -ఆ అనుమతి ఎవరు ఇచ్చారు? 87 00:05:54,396 --> 00:05:56,106 నాకు మీ అనుమతి అక్కర్లేదు. 88 00:05:56,190 --> 00:05:58,775 -వీటిని రోగులకు ఇవ్వడానికి తీసుకెళ్తున్నా. నాకు ఇవి కావాలి. -మేమేమీ… 89 00:05:58,859 --> 00:06:01,069 -ఏం జరుగుతోంది? -ఇతను నీటిని దొంగిలిస్తున్నాడు. 90 00:06:01,153 --> 00:06:03,822 -నేనేమీ దొంగతనం చేయట్లేదు… -ఏంటదంతా? 91 00:06:03,906 --> 00:06:05,449 ఇది ఆసుపత్రి సామాగ్రి. మీకు చెందినదేమీ కాదు. 92 00:06:05,532 --> 00:06:07,075 నిన్ను ఈ యూనిట్ కి కేటాయించారా? 93 00:06:08,660 --> 00:06:10,370 -లేదు. -అయితే ఇక్కడి నుండి వెళ్లిపో! 94 00:06:12,080 --> 00:06:13,081 పో! 95 00:06:19,004 --> 00:06:20,297 సరే మరి, రండి… 96 00:06:22,758 --> 00:06:24,760 వీటిని నేల మీద నుండి తీద్దాం. 97 00:06:24,843 --> 00:06:27,930 -సరే. -ఒక్కో రోగికి ఒక్కొక్కటి ఇద్దాం. 98 00:06:44,571 --> 00:06:48,325 ఒక హెలికాప్టర్ వస్తోంది! కానివ్వండి! 99 00:06:51,161 --> 00:06:54,748 సూసన్! ఒక హెలికాప్టర్ వస్తోంది. రోగులను పైకి పంపండి. 100 00:06:54,831 --> 00:06:55,958 హమ్మయ్య. 101 00:06:56,041 --> 00:06:58,252 తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాళ్లని పంపడం మొదలుపెడతాం. 102 00:06:58,335 --> 00:07:01,004 -కేరన్, ఉన్నావా? -సూసన్? 103 00:07:01,088 --> 00:07:04,466 ఒక హెలికాప్టర్ వస్తోంది. నువ్వు వెంటనే రోగులను పంపించడం మొదలుపెట్టాలి. 104 00:07:04,550 --> 00:07:06,301 సరే. నేను పంపుతాను. 105 00:07:06,385 --> 00:07:09,221 సరే, అందరూ వినండి. మనం రోగులను పంపాలి. 106 00:07:09,304 --> 00:07:12,099 మనం రోగులను హెలిప్యాడ్ దగ్గరికి తీసుకెళ్లాలి. కానివ్వండి. 107 00:07:12,182 --> 00:07:14,476 కేరన్. కేరన్, లిఫ్టులు పని చేయట్లేదు. 108 00:07:15,185 --> 00:07:16,353 అబ్బా. 109 00:07:18,230 --> 00:07:19,231 సరే. 110 00:07:25,571 --> 00:07:27,573 సరే, ఒక టార్చీని తీసుకురా. 111 00:07:27,656 --> 00:07:31,535 ఎవరైతే ఫిట్ గా ఉన్నారో, వాళ్లందరూ ఇక్కడికి రండి. 112 00:07:31,618 --> 00:07:34,538 సరే. ఇలా రండి. సరే మరి. 113 00:07:35,914 --> 00:07:37,332 -అందరూ చూడండి. -సరే. 114 00:07:37,416 --> 00:07:40,752 దుప్పట్టి పక్కలను ఇలా పట్టుకోండి. గట్టిగా పట్టుకోవాలి. 115 00:07:40,836 --> 00:07:43,755 వణకడాలు, జారడాలు ఉండకూడదు. నేను చెప్పేదాకా కదలవద్దు. 116 00:07:43,839 --> 00:07:45,215 మనం రోగులను ఇలాగే 117 00:07:45,299 --> 00:07:48,468 హెలిప్యాడ్ దాకా తీసుకెళ్లాలి. అర్థమైందా? 118 00:07:49,052 --> 00:07:53,473 సరే మరి. అందరూ జాగ్రత్తగా చూసుకొని నడవండి. జాగ్రత్తగా నడవండి. చూసుకోండి. 119 00:07:53,557 --> 00:07:56,435 -ఇక్కడ ఇంకా వేడిగా ఉందే. -అడుగులు జాగ్రత్త. 120 00:07:56,518 --> 00:07:57,728 తనని ఇంకాస్త పైకెత్తి పట్టుకోండి. 121 00:07:57,811 --> 00:07:59,354 సరే. నిదానం. నిదానం. 122 00:07:59,438 --> 00:08:01,398 వెనుక కూడా చూసుకోండి. సరే. 123 00:08:03,192 --> 00:08:04,443 ఇప్పుడు తిరుగుదాం. 124 00:08:05,694 --> 00:08:06,904 విశ్రాంతి కావాలి అనిపించినప్పుడు, చెప్పండి. 125 00:08:06,987 --> 00:08:09,573 -సరే, జాగ్రత్త. ఇంకో మలుపు. -నిదానం. నిదానం. 126 00:08:09,656 --> 00:08:10,490 సరే. 127 00:08:10,574 --> 00:08:12,826 వైటల్స్ అన్నీ బాగున్నాయి. ఈయన్ని తీసుకెళ్లవచ్చు. 128 00:08:12,910 --> 00:08:15,871 దేవుడా, హేయ్, హేయ్! ఆగండి, ఆగండి! ఇటు వైపు, ఇటు వైపు. 129 00:08:15,954 --> 00:08:17,247 ముందు తీవ్ర అనారోగ్యం గల వారిని, 130 00:08:17,331 --> 00:08:19,166 -హెలిప్యాడ్ దాకా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాం. -సరే. 131 00:08:19,249 --> 00:08:21,376 ఈ అంతస్థుకు అవతలి వైపున ఉండే ఇంకో వరండాకి వెళ్లాలి, 132 00:08:21,460 --> 00:08:22,794 అక్కడి నుండి పార్కింగ్ ప్రదేశానికి, 133 00:08:22,878 --> 00:08:25,339 -ఆపై ర్యాంప్ నుండి హెలిప్యాడ్ కి వెళ్లాలి. -ఒక్క నిమిషం, దానికి ఎంత సేపు పడుతుంది? 134 00:08:26,006 --> 00:08:28,300 -సుమారుగా 40 నిమిషాలా? -అంత సేపా? 135 00:08:28,383 --> 00:08:30,385 -ప్రతీ రోగినా? అందులోనూ ఇంత వేడిలో? -హా. 136 00:08:30,469 --> 00:08:32,261 పార్కింగ్ ప్రదేశంలోని లిఫ్టులు పని చేయట్లేదు. 137 00:08:32,346 --> 00:08:34,056 పైకి వెళ్లడానికి అంతకన్నా వేరే మార్గం లేదు. సరేనా? 138 00:08:34,139 --> 00:08:35,599 -సరే మరి. -సరే. 139 00:08:35,682 --> 00:08:37,726 సరే. హేయ్, కానివ్వండి! తనని ఇక్కడికి తీసుకురండి. 140 00:08:37,808 --> 00:08:40,270 -లోరీ, రోగులను తీసుకొస్తూ ఉండేలా చూడు. -అలాగే. 141 00:08:40,354 --> 00:08:42,606 సరే, కానివ్వండి. పదండి. 142 00:08:43,315 --> 00:08:44,483 పదండి. 143 00:08:44,566 --> 00:08:45,984 -కానివ్వండి. -పదండి. 144 00:08:55,702 --> 00:08:56,703 యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ 145 00:09:08,632 --> 00:09:10,008 ఏమైంది? 146 00:09:10,092 --> 00:09:13,011 తను అస్సలు మాట్లాడట్లేదు. నీరు కూడా తీసుకోవట్లేదు. 147 00:09:17,391 --> 00:09:19,601 -హా, వడదెబ్బ తగిలింది. -తను బాధతో విలవిలలాడిపోతోంది. 148 00:09:19,685 --> 00:09:22,020 -తనకి ఇవ్వడానికి ఏమైనా మందు ఉందా? -కానీ అంత సమయం లేదు. 149 00:09:22,104 --> 00:09:23,313 -సమయం లేదా? -అవును. 150 00:09:23,397 --> 00:09:25,440 -నేను రోగులను తరలించే పని చూసుకోవాలి. -ఈమె బాధలో ఉంది. 151 00:09:26,900 --> 00:09:28,068 ఈమెకి ఒక తడి టవలును తీసుకురండి. 152 00:09:28,151 --> 00:09:29,903 -ఈమెని చల్లగా… -ఆమె బాధని తగ్గించడానికి ఏమీ చేయవా? 153 00:09:30,612 --> 00:09:31,655 ఆనా. 154 00:09:52,009 --> 00:09:55,596 కెన్, ఒక రోగికి చాలా బాధగా ఉంది, నాకు ఏదోక మందు కావాలి. 155 00:09:55,679 --> 00:09:58,348 -బాధ అంటే? -నొప్పి. నొప్పి! 156 00:09:58,432 --> 00:09:59,641 మోర్ఫీన్ ఉంది. 157 00:10:00,184 --> 00:10:01,351 నాకు అయిదు మిల్లీగ్రాములు కావాలి. 158 00:10:01,435 --> 00:10:03,187 మీరు మందుల చీటీలో రాసి ఇవ్వాల్సి ఉంటుంది. 159 00:10:03,687 --> 00:10:05,022 కామెడీనా? 160 00:10:05,105 --> 00:10:08,150 మేము ప్రతీది రికార్డులో ఉంచుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి పరిస్థితుల్లో కూడా 161 00:10:08,233 --> 00:10:10,485 మేము ప్రోటోకాలును కొనసాగించాల్సి ఉంటుంది. 162 00:10:21,830 --> 00:10:23,165 కాస్త త్వరగా ఇవ్వవా? 163 00:10:30,797 --> 00:10:32,299 త్వరగా ఇవ్వవా? 164 00:11:06,166 --> 00:11:07,960 -ఆనా. -తను నొప్పితో విలవిలలాడుతుంటే నేను చూస్తూ కూర్చోలేను. 165 00:11:18,011 --> 00:11:21,682 సరే, ఈమెని తరలించే దాక బాధ లేకుండా చేశాను. 166 00:11:23,517 --> 00:11:24,518 ఆనా. 167 00:11:26,061 --> 00:11:28,772 కొందరు సిబ్బంది, తమ కార్లలో వెళ్లి కూర్చుంటున్నారు. 168 00:11:28,856 --> 00:11:32,276 ఏసీలను ఆన్ చేసుకొని, సంగీతం వింటున్నారు. 169 00:11:32,359 --> 00:11:36,697 హోరెస్. నాకేమీ పర్వాలేదు. 170 00:11:40,367 --> 00:11:43,287 రోగులను హెలిప్యాడ్ దగ్గరికి వేగంగా చేర్చడానికి ఏమైనా మార్గం ఉందో లేదో చూడాలి. 171 00:11:43,370 --> 00:11:45,539 -అలా ఏదైనా మార్గం ఉందేమో చూడు. -అలాగే. అర్థమైంది. నేను చూసుకుంటా. 172 00:11:46,456 --> 00:11:47,374 ఏంటిది? 173 00:11:47,457 --> 00:11:49,126 మా లైఫ్ కేర్ రోగుల జాబితాను అడిగారు కదా. 174 00:11:49,209 --> 00:11:51,086 -అవును. థ్యాంక్యూ. -ఆసుపత్రికి చెందిన రోగులతో పాటు 175 00:11:51,170 --> 00:11:53,297 వేరే బ్రాంచీ నుండి ఇక్కడికి బదిలీ అయిన రోగులు కూడా ఉన్నారు, 176 00:11:53,380 --> 00:11:55,632 -మొత్తం 53 మంది. ఇద్దరు చనిపోయారు. -సరే. 177 00:11:55,716 --> 00:11:57,593 -సూసన్. మన్నించాలి. -మరో ఏడుగురు అత్యంత… 178 00:11:57,676 --> 00:12:00,971 -మన్నించాలి. ఒక్క నిమిషం ఆగండి. -మనం ఇంట్రావీనస్ కేర్ ని తాత్కాలింగా నిలిపేయాలి. 179 00:12:01,054 --> 00:12:04,391 ఏంటంటే, ఏవైనా శరీర ద్రవాలు లీక్ అయ్యే ప్రమాదం ఉంది… 180 00:12:04,474 --> 00:12:05,851 ఒక్క నిమిషం అండి. 181 00:12:06,810 --> 00:12:07,811 జాబితా సంగతేంటి? 182 00:12:07,895 --> 00:12:09,146 దాని సంగతి శాండ్రా చూసుకుంటోంది. 183 00:12:09,229 --> 00:12:11,106 ఆమె ఏం… ఏవండి… ఒక్క నిమిషం. 184 00:12:11,815 --> 00:12:13,859 -ఆ జాబితాతో మీరు ఏం చేస్తారు? -నేను… 185 00:12:13,942 --> 00:12:16,570 మేము మా వీలైనంత ప్రయత్నం చేస్తాం, 186 00:12:16,653 --> 00:12:18,572 ఏదైనా దారి కనబడితే, మీకు చెప్తాం. 187 00:12:18,655 --> 00:12:20,199 ఇంకేం దారి కావాలి? 188 00:12:21,074 --> 00:12:25,579 మా దగ్గర తరలించాల్సిన రోగులు 54… యాభై మూడు మంది ఉన్నారు. 189 00:12:25,662 --> 00:12:29,208 నేషనల్ గార్డ్ ట్రక్కులు వస్తాయన్నారు, కానీ ఇంకా రాలేదు, వాటి కోసం ఎదురు చూస్తున్నాం. 190 00:12:30,042 --> 00:12:34,588 ఇంకా రాని హెలికాప్టర్ల కోసం ఎదురు చూస్తున్నాం. మీ జాబితా ఇచ్చారుగా. 191 00:12:34,671 --> 00:12:39,510 మీ రోగులను కూడా మా వారితో పాటు పంపించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. 192 00:12:39,593 --> 00:12:43,347 ఇప్పుడు మీరు మీ ఆసుపత్రికి వెళ్లి మీ రోగులకు అండగా ఉండండి. 193 00:12:43,972 --> 00:12:47,684 నువ్వు యూనిట్ మేనేజర్లతో మాట్లాడు. 194 00:12:47,768 --> 00:12:50,229 మనం నీటిని, ఆహారాన్ని పొదుపు చేసే పనిని మొదలుపెట్టాలి. 195 00:12:50,896 --> 00:12:52,648 మనం వీలైనంత తక్కువగా తీసుకోవాలి. 196 00:12:52,731 --> 00:12:53,982 ఆరోగ్యంగా ఉండే రోగులు… 197 00:13:01,823 --> 00:13:02,824 యూ.ఎస్. కోస్ట్ గార్డ్ 198 00:13:09,206 --> 00:13:11,250 కాపాడండి! మమ్మల్ని కాపాడండి! 199 00:13:12,376 --> 00:13:15,212 వద్దు, ప్లీజ్. మాకు సాయపడండి! 200 00:13:17,130 --> 00:13:19,591 మాకు సాయం కావాలి. సరేనా? అర్థం చేసుకోండి. 201 00:13:20,425 --> 00:13:22,135 సాయపడండి. మాకు మరో దారి లేదు. 202 00:13:22,219 --> 00:13:25,889 రండి. నేను ఉన్నాను. రండి. 203 00:13:25,973 --> 00:13:26,807 థ్యాంక్యూ. 204 00:13:26,890 --> 00:13:28,517 -రండి. రండి. -నిబ్బరంగా ఉండు, అమ్మా. 205 00:13:28,600 --> 00:13:31,270 మన భవనంపై నుండి హెలికాప్టర్లు వెళ్తూ ఉండటాన్ని జనాలు గమనించారు. 206 00:13:32,062 --> 00:13:33,772 వాళ్లని సురక్షిత ప్రాంతానికి మనం తరలించగలమని భావిస్తున్నారు. 207 00:13:35,566 --> 00:13:37,693 దిక్కులేని వాళ్లకి మన ఆసుపత్రి దేవాలయంలా కనిపిస్తోంది. 208 00:13:38,902 --> 00:13:40,529 వాళ్లు ఇక్కడికి వస్తున్నారు. 209 00:13:42,030 --> 00:13:43,323 ఎంత మంది? 210 00:13:43,407 --> 00:13:44,867 ఇప్పటి దాకా పది మంది వచ్చారు. 211 00:13:46,076 --> 00:13:49,413 -ఇంకా ఎక్కువ మంది వస్తే మనకి కష్టం అవుతుంది. -ఇది ఆసుపత్రి. 212 00:13:49,496 --> 00:13:52,833 మనం ఖాళీ చేసే పనిలో ఉన్నాం. ఉన్న వాళ్లనే చూసుకోలేక కిందా మీదా పడుతున్నాం. 213 00:13:52,916 --> 00:13:54,585 ఇక బయటి వారిని ఎలా చూసుకోగలం? 214 00:13:54,668 --> 00:13:58,297 కానీ జనాలను రాకుండా ఎలా ఆపగలం? పోలీసులకు కాల్ చేయలేం కదా? 215 00:13:59,715 --> 00:14:03,677 ఒకవేళ కాల్ చేసినా, పోలీసులు మన గురించి పట్టించుకోను కూడా పట్టించుకోరు. 216 00:14:04,803 --> 00:14:06,638 మరి మనమేం చేయాలి? 217 00:14:08,348 --> 00:14:12,144 జనాలని పిట్టల్లా కాల్చాలా? అంతే అంటారా? 218 00:14:20,527 --> 00:14:23,322 ఏం చేయాలో అదే చేయాలని అంటున్నాం. 219 00:14:37,419 --> 00:14:40,255 సుమారుగా 20,000 మంది తుఫాను బాధితులు తలదాచుకుంటున్న సూపర్ డోమ్ ని 220 00:14:40,339 --> 00:14:41,924 వరద నీరు చుట్టుముట్టేసింది. 221 00:14:42,007 --> 00:14:44,885 లోపల, టాయిలెట్లు బాగా లేవు, ఏసీ పని చేయడం లేదు. 222 00:14:44,968 --> 00:14:49,640 ఇవాళ సాధ్యమైనన్ని వనరులన్నింటినీ అందించమని అధ్యక్షుడిని కోరాను. 223 00:14:49,723 --> 00:14:50,641 మైఖెల్. 224 00:14:51,225 --> 00:14:53,310 ఇప్పుడే నాకొక విషయం చెప్పారు, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు 225 00:14:53,393 --> 00:14:56,647 ఆ మరో ఆసుపత్రి అయిన లైఫ్ కేర్ లోని రోగులను తరలించరట. 226 00:14:56,730 --> 00:14:57,564 ఏంటి? 227 00:14:57,648 --> 00:15:01,109 లైఫ్ కేర్ రోగులు జాబితాలో లేరని నాకు చెప్పారు. 228 00:15:01,193 --> 00:15:04,821 వాళ్లు మనకి పేర్లను పంపారు కదా. మొత్తం 53 మంది ఉన్నారు. 229 00:15:04,905 --> 00:15:08,325 టెనెట్, కోస్ట్ గార్డుకు పంపిన జాబితాలో ఆ రోగులు లేరు. 230 00:15:08,408 --> 00:15:09,993 నేను కోస్ట్ గార్డుతో టచ్ లోనే ఉన్నా. నేరుగా మనమే వాళ్లకి… 231 00:15:10,077 --> 00:15:12,204 -మైఖెల్. -మొత్తం 53 మంది ఉన్నారు. 232 00:15:12,287 --> 00:15:16,083 నాకు తెలిసిందల్లా, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు మెమోరియల్ రోగులను మాత్రమే తరలిస్తాయట. 233 00:15:24,383 --> 00:15:25,717 వాళ్లు నీకేం చెప్పారు? 234 00:15:25,801 --> 00:15:28,804 ఏంటంటే… వాళ్లు కోస్ట్ గార్డ్ ని రేడియో ద్వారా సంప్రదించారు. 235 00:15:28,887 --> 00:15:30,764 మన రోగులను తరలించలేరట. 236 00:15:31,723 --> 00:15:36,353 "పది నీటి సీసాల బాక్సులు. పోర్టబుల్ ఆక్సిజన్ ట్యాంకులు. 20డీలు. 12ఈలు. అరవై…" 237 00:15:36,436 --> 00:15:39,523 సూసన్. మీరు మా వాళ్లతో ఏం చెప్తున్నారు? 238 00:15:40,774 --> 00:15:43,277 నాకు అందిన సమాచారాన్నే ఆమెతో చెప్పాను. 239 00:15:43,360 --> 00:15:45,153 మా రోగులను మీరు తరలించడం లేదనా? 240 00:15:46,363 --> 00:15:48,949 మా కార్పొరేషన్, మా రోగులకు ఒక సురక్షితమైన రవాణా ఏర్పాట్లను… 241 00:15:49,032 --> 00:15:51,410 కానీ అవి కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు కదా. 242 00:15:51,493 --> 00:15:53,704 కోస్ట్ గార్డ్ మీ కార్పొరేషన్ ది కాదు కదా. 243 00:15:54,413 --> 00:15:56,874 నేను మీకు పేర్లను ఇచ్చాను. 244 00:15:56,957 --> 00:15:58,876 మిగతా వారితో పాటు వాళ్లని ఎందుకు… 245 00:15:58,959 --> 00:16:02,838 నాకు ఏదైనా సమాధానం లభిస్తే మీకు ఇవ్వగలను. కానీ ఆ పరిస్థితి లేదే. 246 00:16:08,218 --> 00:16:09,761 మీరేమో మీ వాళ్లని తరలించేసుకుంటున్నారు… 247 00:16:11,763 --> 00:16:12,764 కానీ… 248 00:16:15,100 --> 00:16:16,935 మా వాళ్లని మాత్రం గాలికి వదిలేశారు. 249 00:16:39,082 --> 00:16:44,880 "అరవై అయిదు ఇన్సులిన్ డోసులు. డి50వి పద్నాలుగు బ్యాగులు." 250 00:16:45,881 --> 00:16:50,677 నొప్పి మందులు, యాంటిబయాటిక్స్, వికారాన్ని, మూర్ఛని తగ్గించే మందులు తక్కువ ఉన్నాయి. 251 00:17:06,276 --> 00:17:08,153 వాళ్లు అతడిని కాల్చేశారు. వాళ్లు… 252 00:17:08,737 --> 00:17:12,491 -అతను దొంగతనం చేస్తున్నాడా? -అతను డైపర్లను తీసుకుంటున్నాడంతే. 253 00:17:12,574 --> 00:17:13,951 పోలీసులు వచ్చి అతడిని కాల్చేశారు. 254 00:17:14,492 --> 00:17:16,411 వెనుక వైపు నుండి కాల్చేసి, అతడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. 255 00:17:17,287 --> 00:17:19,957 ఇక్కడ వరదలో చిక్కుకొని ఉండేది మేమే, పైగా మమ్మల్నే కాల్చేస్తున్నారా? 256 00:17:20,665 --> 00:17:23,001 అంటే, మేము… 257 00:17:23,544 --> 00:17:25,921 అసలు మనుషుల్లా కూడా మమ్మల్ని చూడట్లేదు. 258 00:17:26,880 --> 00:17:27,923 మాకు సాయం అవసరం ఉంది కదా. 259 00:17:28,924 --> 00:17:31,260 సాయం కోసం చూస్తున్నాం, కానీ మమ్మల్ని చంపేస్తున్నారు. 260 00:17:31,885 --> 00:17:34,513 పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చిపారేస్తున్నారు. 261 00:17:35,347 --> 00:17:39,184 వాళ్ల దృష్టిలో మా స్థానం అదే. మేము మనుషులం కాము, మాకు బతికే అర్హత లేదు. 262 00:17:40,102 --> 00:17:41,770 వాళ్ల దృష్టిలో మేము కేవలం పిచ్చి కుక్కలమే. 263 00:17:42,604 --> 00:17:45,107 మేము కుక్కలం, మమ్మల్ని చంపేస్తున్నారు. 264 00:17:49,027 --> 00:17:51,572 సారీ, సర్. ఇంత కన్నా ఎక్కించుకోలేం. 265 00:17:51,655 --> 00:17:55,325 చెప్తున్నాను కదా, అంతే. ఇంత కంటే మేము ఎక్కించుకోలేం. 266 00:17:55,409 --> 00:17:57,452 మీరు ఎక్కించుకోకపోతే జనాలు చస్తారు. 267 00:17:57,536 --> 00:17:59,913 హెలికాప్టర్ ఇంత కన్నా బరువు తీసుకోలేదు! 268 00:18:01,498 --> 00:18:03,041 హెలికాప్టర్ ఇంత కన్నా బరువు తీసుకోలేదు! 269 00:18:03,125 --> 00:18:06,378 -ఇంకా 200 మందిని తరలించాలి! -హేయ్. హేయ్! 270 00:18:10,257 --> 00:18:12,467 వాళ్లతో వాదించకండి, సరేనా? వాళ్ల హెలికాప్టర్ల గురించి వాళ్లకి బాగా తెలుసు. 271 00:18:12,551 --> 00:18:15,554 మీరు వారిని ఆలస్యమయ్యేలా చేస్తున్నారు. వీళ్లంతా ఎవరు? 272 00:18:16,430 --> 00:18:18,849 -వాళ్లు రోగులను పైకి తీసుకొచ్చారు. -మరి ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? 273 00:18:18,932 --> 00:18:21,977 -ఇది చాలా ప్రమాదకరమైనది. మీరు వాళ్లని… -హేయ్! ఇన్ ఛార్జీని నేను. 274 00:18:22,060 --> 00:18:25,230 అవునా? నేను ఎయిర్ ఫోర్సులో కెప్టెన్ గా పని చేశాను. 275 00:18:26,023 --> 00:18:27,608 విమాన ట్రాఫిక్ ని నియంత్రించడంలో శిక్షణ పొందాను. మరి మీరు? 276 00:18:31,904 --> 00:18:34,656 -ఏం చేయమంటావు చెప్పు! -వీళ్లందరినీ కిందికి పంపించేయండి, 277 00:18:34,740 --> 00:18:35,991 రోగులను ఎక్కించడానికి సిద్ధంగా ఉంచండి. 278 00:18:36,617 --> 00:18:39,536 సరే మరి. రోగుల దగ్గర ఉండాల్సిన అవసరం లేని వాళ్లు. ఇంకా… 279 00:18:39,620 --> 00:18:40,913 ఇక్కడ ఉండాల్సిన అవసరం లేని వాళ్లు, 280 00:18:40,996 --> 00:18:43,707 మీరందరూ, ఈ ప్యాడ్ నుండి వెళ్లిపోండి. 281 00:18:49,588 --> 00:18:52,424 ఇదేమంత పెద్దది కాదు, సుమారుగా మూడు-బై-మూడున్నర అడుగులు ఉంటుంది, 282 00:18:52,508 --> 00:18:54,718 కానీ దీని ద్వారా భవనం నుండి నేరుగా పార్కింగ్ ప్రదేశానికి వెళ్లవచ్చు. 283 00:18:54,801 --> 00:18:57,304 -మనం రోగులను దాని ద్వారా తరలించగలమా? -తరలించగలమనే అనుకుంటున్నా. 284 00:18:57,387 --> 00:19:01,642 తరలించగలిగితే, హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళే సమయం 15-20 నిమిషాలు తగ్గవచ్చు. 285 00:19:01,725 --> 00:19:03,268 కేరన్ ఎక్కడుందో వెతికి, తనకి ఈ విషయం చెప్పు. 286 00:19:03,352 --> 00:19:04,561 సరే. అలాగే. 287 00:19:07,314 --> 00:19:11,193 మేము మీకు సాయపడలేం! ఇది… ప్రైవేట్ ప్రాపర్టీ. 288 00:19:11,276 --> 00:19:12,569 పక్కకు జరగరా! ముందుకు వెళ్తున్నా. 289 00:19:12,653 --> 00:19:15,072 ఇది ప్రైవేట్ ప్రాపర్టీ! ఇంకెక్కడికైనా వెళ్లండి! 290 00:19:15,155 --> 00:19:16,740 ఏం చేస్తున్నావు? ఎందుకు వాళ్లకి సాయపడట్లేదు? 291 00:19:16,823 --> 00:19:18,867 -మాకు సాయపడండి! మాకు మరో దారి లేదు! -ముందుకు రాకండి! 292 00:19:18,951 --> 00:19:20,285 కనీసం పిల్లలనైనా తీసుకోండి! 293 00:19:20,369 --> 00:19:21,453 పిల్లలని తీసుకోండి. 294 00:19:21,537 --> 00:19:22,579 -ప్లీజ్. -అతని దగ్గర పిల్లలున్నారు! 295 00:19:22,663 --> 00:19:24,915 సోదరా, చెప్తున్నా కదా. ముందుకు రావద్దు! 296 00:19:24,998 --> 00:19:26,875 -దయచేసి వినిపించుకోండి! -మనం కాల్పులు కూడా జరపాలా? 297 00:19:26,959 --> 00:19:28,418 -సోదరా. -సాయపడండి. 298 00:19:28,502 --> 00:19:30,170 చార్ల్స్. ఓసారి ఆలోచించు. కానివ్వు! 299 00:19:30,254 --> 00:19:31,505 -మనం కాల్పులు కూడా జరపాలా? -ఆదుకోండి. 300 00:19:31,588 --> 00:19:33,340 -చెప్తున్నా కదా, ముందుకు రాకండి. -ప్లీజ్! 301 00:19:33,423 --> 00:19:34,424 వెళ్లిపోండి! 302 00:19:56,947 --> 00:19:59,992 వీళ్లు మనల్ని ఆదుకోరు. పదండి వెళ్లిపోదాం. 303 00:20:17,593 --> 00:20:18,594 ఆగు. 304 00:20:19,595 --> 00:20:23,182 చార్ల్స్. చార్ల్స్, ఆగు. హేయ్. ఏం చేస్తున్నావు నువ్వు? 305 00:20:23,265 --> 00:20:25,100 అతడిని, పిల్లల్ని కాల్చేస్తావా? 306 00:20:25,184 --> 00:20:26,602 నీకేమైనా పిచ్చి ఎక్కిందా? 307 00:20:28,854 --> 00:20:30,063 నాకు చెప్పిందే చేస్తున్నాను. 308 00:21:01,303 --> 00:21:04,264 మొబైల్ కాల్వన్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 309 00:21:04,348 --> 00:21:07,726 గందరగోళంగా ఉంది, నువ్వు బాగానే ఉన్నావా? ఏమో, అర్థం కావట్లేదు 310 00:21:34,169 --> 00:21:35,254 ఏమైంది? 311 00:21:40,551 --> 00:21:42,344 ఎక్కడికి వెళ్లిపోతున్నాయి ఇవన్నీ? 312 00:21:57,901 --> 00:21:59,236 అబ్బా. 313 00:22:02,197 --> 00:22:05,242 మీరు ఎయిర్ ఫోర్స్ వన్ కి సంబంధించిన లైవ్ ఫీడ్ ని చూస్తున్నారు, 314 00:22:05,325 --> 00:22:09,037 అధ్యక్షుడు బుష్, న్యూ ఆర్లీన్స్ నగరంపై 315 00:22:09,121 --> 00:22:11,748 కేవలం గగన వీక్షణ చేస్తున్నారంతే. 316 00:22:12,374 --> 00:22:15,544 అధ్యక్షుడు బుష్ టెక్సస్ నుండి వాషింగ్టన్ డీసీకి బయలుదేరుతున్నారు, 317 00:22:15,627 --> 00:22:17,087 కానీ, వరద బాధిత ప్రాంతాలను, 318 00:22:17,171 --> 00:22:19,423 అక్కడి ప్రజలను ఆదుకోవడంలో నగర పాలక వర్గం విఫలమవుతున్నా కానీ, 319 00:22:19,506 --> 00:22:21,550 ఆయన సందర్శిస్తారా లేదా అని శ్వేత సౌధం నుండి ఎలాంటి నిర్ధారణా రాలేదు. 320 00:22:21,633 --> 00:22:23,051 ఆయన దిగరా? 321 00:22:26,013 --> 00:22:27,639 ఏమీ చేయరా? 322 00:22:56,502 --> 00:22:57,669 ఎక్కించండి. నిదానంగా. 323 00:22:59,296 --> 00:23:00,464 సరే, అంతే. 324 00:23:00,547 --> 00:23:01,548 రోగి సామాగ్రి 325 00:23:03,300 --> 00:23:05,594 సరే, అంతా ఓకే. ఇక బయలుదేరండి. 326 00:23:18,482 --> 00:23:19,483 ఇక్కడికి తీసుకురండి. 327 00:23:26,365 --> 00:23:27,616 నా దగ్గర ఒకరు ఉన్నారు. 328 00:23:27,699 --> 00:23:31,078 మిస్టర్ స్కాట్, నా పేరు సూసన్ మల్డేరిక్. మీరు ఎలా ఉన్నారు? 329 00:23:31,703 --> 00:23:32,871 చాలా వేడిగా ఉంది ఇక్కడ. 330 00:23:32,955 --> 00:23:37,084 హా, అందరి పరిస్థితీ అలాగే ఉంది. ఉన్న వనరులతో ఏం చేయగలమో అది చేస్తున్నాం. 331 00:23:37,167 --> 00:23:40,879 అందరినీ ఆసుపత్రి నుండి తరలిస్తున్నామని కేరన్ మీకు చెప్పింది కదా? 332 00:23:40,963 --> 00:23:42,130 అవును, మేడమ్. 333 00:23:42,214 --> 00:23:44,675 వీలైనంత త్వరగా మిమ్మల్ని మేము తరలిస్తున్నాం. 334 00:23:45,467 --> 00:23:49,346 మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే, మాకు చెప్పండి. సరేనా? 335 00:23:49,429 --> 00:23:51,473 నాకేమీ కాదు. అందులో సందేహమే లేదు. 336 00:23:51,974 --> 00:23:52,975 సరే. 337 00:23:56,687 --> 00:23:59,231 పార్కింగ్ ప్రదేశంలోని ఆ కలుగులో ఆయన పడతాడా? 338 00:23:59,314 --> 00:24:03,277 ఏమో మరి. పట్టడనే అనుకుంటున్నా. 339 00:24:04,444 --> 00:24:06,697 కానీ ప్రయత్నించి మిగతా వాటిని ఆలస్యం చేయలేం కదా. 340 00:24:07,281 --> 00:24:10,951 లైఫ్ కేర్ లో కూడా ఇలాంటి రోగే ఒకరు ఉన్నారు. ఆయన కూడా బాగా లావుగా ఉంటారు. 341 00:24:11,034 --> 00:24:12,786 బరువు సుమారుగా 136 కిలోగ్రాములు ఉండవచ్చు. 342 00:24:13,287 --> 00:24:15,789 వాళ్లిద్దరినీ చివరన తరలించాలి. 343 00:24:16,582 --> 00:24:19,209 కానీ తరలించడం మాత్రం చేస్తాం కదా? సూసన్? 344 00:24:20,919 --> 00:24:23,255 నేను బయటపడతానా లేదా అనేదే నాకు తెలీదు. 345 00:24:33,056 --> 00:24:35,767 హేయ్, నేను విన్స్ ని. ఆనా, నేనూ ఫోన్ కి అందుబాటులో లేము. 346 00:24:35,851 --> 00:24:36,852 మెసేజ్ ఏదైనా పెట్టండి. 347 00:24:37,895 --> 00:24:41,440 విన్స్, నీకు ఈ మెసేజ్ లు అందుతున్నాయో లేదో నాకు తెలీట్లేదు, 348 00:24:41,523 --> 00:24:44,026 కానీ నేను క్షేమంగానే ఉన్నాను. 349 00:24:48,238 --> 00:24:51,241 ఇంకా కరెంట్ రాలేదు. 350 00:24:53,076 --> 00:24:56,163 మాకు సాయమేమీ అందడం లేదు. ఎవరూ… 351 00:24:56,663 --> 00:24:59,708 ఇన్ ఛార్జి అంటూ ఎవరూ లేరన్నట్టు ఉంది. నేను చెప్పేది ఆసుపత్రి గురించి కాదు. 352 00:24:59,791 --> 00:25:02,044 నగరం, ఇంకా రాష్ట్రం గురించి చెప్తున్నా. 353 00:25:03,837 --> 00:25:07,382 ఇంకా జనాలు చనిపోతున్నారు. 354 00:25:08,258 --> 00:25:10,260 ఇప్పుడే నా కళ్ల ముందే ఒక రోగి కన్ను మూశారు. 355 00:25:13,597 --> 00:25:17,017 ఆయన చాలా వేదన పడ్డాడు, మేము ఏమీ చేయలేకపోయాం. 356 00:25:34,743 --> 00:25:39,164 విన్స్, నా ఫోన్ బ్యాటరీ అయిపోవస్తోంది. నేను… కాబట్టి నేను ఫోన్ ని ఆఫ్ చేస్తున్నా. 357 00:25:42,960 --> 00:25:45,212 నీకు ఈ మెసేజ్ అందగానే నాకు ఒక మెసేజ్ పెట్టవా? 358 00:25:47,005 --> 00:25:48,215 సరే మరి, లవ్ యూ. 359 00:26:31,175 --> 00:26:32,176 హా. 360 00:26:33,343 --> 00:26:35,137 సరే… నేరుగా పోనివ్వు. 361 00:26:37,139 --> 00:26:39,057 ఆరోగ్యం, ఆసుపత్రుల శాఖ 362 00:26:39,766 --> 00:26:41,018 సూసన్. 363 00:26:42,019 --> 00:26:43,478 నువ్వు ఈ వ్యక్తితో మాట్లాడాలి. 364 00:26:45,647 --> 00:26:49,151 హాయ్, నా పేరు మైక్ బౌల్స్. నేను ఆరోగ్యం, ఆసుపత్రుల శాఖలో పని చేస్తున్నా. 365 00:26:49,776 --> 00:26:51,528 ఇక్కడి నుండి మీ అందరినీ మేము తరలిస్తాం. 366 00:26:51,612 --> 00:26:56,200 మా రోగుల సంఖ్య 187 నుండి 130కి తగ్గింది. 367 00:26:56,283 --> 00:27:00,120 సిబ్బంది విషయానికి వస్తే మొత్తం 460 మంది ఉన్నారు, 368 00:27:00,204 --> 00:27:05,459 కుటుంబ సభ్యులు, మేము ఆశ్రయం ఇస్తున్న వారు మొత్తం కలిపి 447 మంది ఉన్నారు. 369 00:27:05,542 --> 00:27:12,257 ఇంకా 53 మంది లైఫ్ కేర్ సిబ్బంది, అంతే మంది లైఫ్ కేర్ రోగులు కూడా ఉన్నారు. 370 00:27:12,341 --> 00:27:13,550 వాళ్లు మా రోగులు కాదు. 371 00:27:15,928 --> 00:27:18,430 సాంకేతికపరంగా వాళ్లు మన రోగులు కాదని నేను చెప్తున్నాను అంతే. 372 00:27:18,514 --> 00:27:19,723 ఆహారం అయిపోవస్తోంది. 373 00:27:19,806 --> 00:27:22,392 రేపటికల్లా తాగు నీరు కూడా అయిపోతుంది. 374 00:27:22,476 --> 00:27:24,394 సరే, మీరు అవలంబిస్తున్న ప్లాన్ ని బట్టి చూస్తే, 375 00:27:24,478 --> 00:27:26,438 అందరినీ తరలించడం సాధ్యమయ్యే పని కాదు. 376 00:27:26,522 --> 00:27:28,982 మీరు ఖాళీ చేసే పద్ధతిని మార్చాల్సి ఉంటుంది. 377 00:27:29,942 --> 00:27:31,527 ఎలా మార్చాలి అంటారు? 378 00:27:31,610 --> 00:27:34,112 ప్రస్తుతానికి, మీరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్లని ముందుగా తరలిస్తున్నారు కదా. 379 00:27:34,196 --> 00:27:35,280 వాళ్లకే కదా ఎక్కువ సాయం కావాలి. 380 00:27:35,364 --> 00:27:38,242 వాళ్లని తరలించాలంటే ఎక్కువ ప్రయాస పడాలి. అందుకే ఎక్కువ సేపు పడుతుంది. 381 00:27:38,325 --> 00:27:41,078 బయటకు వెళ్లగల రోగులను, బయటకు వెళ్లగలిగే సామర్థ్యమున్న రోగులను, 382 00:27:41,161 --> 00:27:43,038 మీరు ముందుగా తరలించాలి. 383 00:27:43,121 --> 00:27:44,915 మీ దగ్గర అత్యవసర పరిస్థితిని సూచించే ఆర్మ్ బ్యాండ్స్ ఉన్నాయా? 384 00:27:47,334 --> 00:27:48,418 ఎక్కడో ఉండాలి. 385 00:27:48,502 --> 00:27:50,963 ఈ పరిస్థితుల్లో అదే సాధారణంగా ఉండాలి. పచ్చవి, పసుపువి, ఎర్రవి, నల్లవి. 386 00:27:51,713 --> 00:27:54,466 డాక్టర్ల చేత ఆ బ్యాండ్లను పంపిణీ చేయించండి. 387 00:27:54,550 --> 00:27:58,303 తమంతట తాముగా నడవగల రోగులకు పచ్చని బ్యాండ్లు ఇవ్వమని చెప్పండి. 388 00:27:58,387 --> 00:28:00,305 సహాయం అవసరం ఉన్న వారికి, పసుపు బ్యాండ్లు ఇవ్వాలి. 389 00:28:00,389 --> 00:28:03,475 సంపూర్ణ సంరక్షణ అవసరం ఉన్న వాళ్లకి ఎర్ర బ్యాండ్లు. 390 00:28:04,810 --> 00:28:06,228 మరి నల్ల బ్యాండ్లు ఎవరికి? 391 00:28:07,271 --> 00:28:09,189 మీరు కాపాడటం కష్టం అని అనుకుంటున్న వాళ్లకి. 392 00:28:10,774 --> 00:28:13,861 ఇంకో ఆసుపత్రి ఉంది కదా, లైఫ్ కేర్. 393 00:28:13,944 --> 00:28:16,238 ఖాళీ చేసే విషయంలో మీ ఆసుపత్రులు రెండూ కలిసి పని చేస్తుంటే కనుక, 394 00:28:16,321 --> 00:28:18,198 మీరు ఇరువురూ ఒకే పద్ధతిని అనుసరించాలి. 395 00:28:18,282 --> 00:28:21,827 కాపాడటం కష్టం అని వాళ్లు భావించే వాళ్లకి, నల్ల బ్యాండ్లు ఇవ్వాలి. 396 00:28:25,497 --> 00:28:29,376 రికవరీ యత్నాలు చేయవద్దు అనే పత్రాలపై సంతకం చేసిన రోగులను 397 00:28:29,459 --> 00:28:31,587 చివరగా వెళ్లే గ్రూపులో ఉంచాలని మేము అనుకున్నాం. 398 00:28:32,379 --> 00:28:35,757 అదే కనుక మీ నిర్ణయం అయితే, వాళ్లందరికీ నల్ల బ్యాండ్లు ఇవ్వండి. 399 00:28:36,717 --> 00:28:40,053 అయితే, ఎవరు బతకాలి, ఎవరు చావాలి అనేది మీరు అలాగే నిర్ణయిస్తారా? 400 00:28:40,137 --> 00:28:41,722 రంగురంగుల ఆర్మ్ బ్యాండ్ల ద్వారానా? 401 00:28:41,805 --> 00:28:45,309 రోగులందరినీ మీరు కాపాడాలనుకుంటే, ఇక్కడి నుండి బయటపడే అవకాశం ఉన్న 402 00:28:45,392 --> 00:28:46,560 కొందరు రోగులు కూడా చనిపోవచ్చు. 403 00:28:48,854 --> 00:28:50,272 మీరు ఎక్కడ పని చేస్తున్నారు? 404 00:28:50,355 --> 00:28:52,149 -ఎవరు… -ఆరోగ్య, ఆసుపత్రుల శాఖ. 405 00:28:52,232 --> 00:28:54,318 లేదు, మేము ఇప్పుడు ఈ పద్ధతిని అనుసరించాలని 406 00:28:54,401 --> 00:28:56,069 మీకు ఎవరు చెప్తున్నారు? 407 00:28:56,153 --> 00:28:58,363 జనాలు ఏవేవో అంటున్నారు, ఇతను ఏవేవో అంటున్నాడు, 408 00:28:58,447 --> 00:29:00,949 నేషనల్ గార్డ్ వాళ్లు ఏవేవో చెప్తున్నారు, కానీ అసలు ఇన్ ఛార్జీ ఎవరు? 409 00:29:01,033 --> 00:29:04,119 ఇన్ ఛార్జీ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎవరూ లేరు. 410 00:29:09,291 --> 00:29:12,211 ఇక్కడున్న వాళ్లందరినీ ఎలా కాపాడతారని మీరు నిర్ణయం తీసుకోవాలి. 411 00:29:13,670 --> 00:29:16,590 మేము వీలైనంత త్వరగా ఇక్కడికి పడవలను తీసుకురావడం ప్రారంభిస్తాం. 412 00:29:17,299 --> 00:29:19,134 తెల్లవారాకే మేము పడవలను తీసుకురాగలం. 413 00:29:20,010 --> 00:29:22,346 నడవగలిగే వాళ్లని, తరలించడానికి సిద్ధంగా ఉంచండి. 414 00:29:37,819 --> 00:29:39,488 అయ్య బాబోయ్. ఓరి దేవుడా. 415 00:29:42,199 --> 00:29:43,992 ఏమైంది? ఎవరికీ ఏమీ కాలేదు కదా? 416 00:29:44,076 --> 00:29:46,912 ముందు ఏముందో కనబడలేదు. ఇంకాస్త ఉంటే కింద పడిపోయి ఉండేవాడిని. 417 00:29:46,995 --> 00:29:48,413 బాగానే ఉన్నావా? 418 00:29:48,497 --> 00:29:49,498 హా. 419 00:29:50,958 --> 00:29:52,918 సరే. నీకు ఏమీ కాలేదు. 420 00:29:55,003 --> 00:29:56,672 జనాలు అలిసిపోతున్నారు. 421 00:29:57,339 --> 00:29:58,757 అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 422 00:30:00,175 --> 00:30:01,510 వారికి విశ్రాంతి అవసరం. 423 00:30:03,345 --> 00:30:06,765 ఈ రాత్రికి మనం ఖాళీ చేయించే పనులను కాసేపు నిలిపివేయాలని నాకు అనిపిస్తోంది. 424 00:30:09,685 --> 00:30:11,228 నిలిపేయాలని అంటున్నావా? 425 00:30:11,311 --> 00:30:13,021 ఈ రాత్రికి ఏం జరుగుతుంది చెప్పు? 426 00:30:13,105 --> 00:30:15,649 దేవుడు వచ్చి అందరినీ ఇక్కడి నుండి రక్షిస్తాడేమో. 427 00:30:16,400 --> 00:30:18,068 ట్రక్కులేవీ రావట్లేదు. 428 00:30:18,569 --> 00:30:20,112 ఆరోగ్య శాఖ నుండి వచ్చిన వ్యక్తి, 429 00:30:20,195 --> 00:30:22,990 తెల్లవారే దాకా పడవలు రావని చెప్పాడు. 430 00:30:23,073 --> 00:30:24,783 రాని హెలికాప్టర్ల కోసం వేచి చూస్తూ 431 00:30:24,867 --> 00:30:27,369 ఒకడు హెలిప్యాడ్ నుండి దాదాపు కింద పడబోయాడు. 432 00:30:28,829 --> 00:30:30,998 మనం విరామం ఇవ్వకుంటే, ఎవరైనా చనిపోవచ్చు. 433 00:30:31,081 --> 00:30:33,959 ఇప్పటికే రోగులు చనిపోతున్నారు కదా. 434 00:30:34,042 --> 00:30:37,588 అలసిపోయిన సిబ్బందితో ఈ పనిని రాత్రంతా కొనసాగిస్తే… 435 00:30:37,671 --> 00:30:39,339 దాని వల్ల వారికి లాభమా లేదా నష్టమా? 436 00:30:41,633 --> 00:30:45,804 చూడండి, నేను కొన్ని గంటలు మాత్రమే, అంటే సూర్యోదయం అయ్యేదాకా మాత్రమే ఆపమని అంటున్నా. 437 00:30:51,393 --> 00:30:55,814 మీరు అందరూ మొదట్నుంచీ పని చేస్తున్నారు, అలుపన్నదే లేకుండా పని చేస్తున్నారు, 438 00:30:56,356 --> 00:30:58,525 కానీ మనం ఇప్పుడు దాన్ని కొనసాగించలేం. 439 00:30:59,484 --> 00:31:05,365 చీకట్లో హెలిప్యాడ్ మీదకి రోగులని తరలించడం చాలా ప్రమాదకరం. 440 00:31:05,449 --> 00:31:09,119 కాబట్టి ఈ పనిని ఈ రాత్రికి నిలిపివేస్తున్నాం. 441 00:31:09,203 --> 00:31:10,537 అబ్బా. అదేమీ వద్దు. 442 00:31:10,621 --> 00:31:14,041 మీరందరూ మీ వాళ్లకి చెప్పండి వీలైనంత విశ్రాంతి తీసుకొమ్మని… 443 00:31:14,124 --> 00:31:16,960 సూసన్, కోస్ట్ గార్డ్ వాళ్లు రాత్రి కూడా హెలికాప్టర్లను పంపిస్తారు కదా? 444 00:31:17,044 --> 00:31:20,881 హా, పంపిస్తారు. కానీ అది మనకే చాలా ప్రమాదకరం. 445 00:31:20,964 --> 00:31:23,926 తప్పులు జరుగుతున్నాయి, ఇంకా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. 446 00:31:24,009 --> 00:31:25,886 కాబట్టి, మనం కొనసాగించలేం. 447 00:31:25,969 --> 00:31:27,804 -మీరందరూ… -అందరం ఇక్కడే ఇరుక్కుపోతాం. 448 00:31:27,888 --> 00:31:30,098 -సూర్యోదయం అవ్వగానే… -నాకు ఒక కుటుంబం ఉంది. 449 00:31:30,182 --> 00:31:31,975 …మనం ఈ పనిని తిరిగి కొనసాగిద్దాం. 450 00:31:32,059 --> 00:31:34,561 -ఉదయం అవ్వగానే… -చూడండి, అందరూ ఇక్కడే ఉండిపోతారు. 451 00:31:34,645 --> 00:31:36,355 …పడవలను పంపుతామని మాటిచ్చారు. 452 00:31:36,438 --> 00:31:37,814 మూడు రోజుల నుండి ఇక్కడే ఉన్నాం. 453 00:31:37,898 --> 00:31:43,695 కాబట్టి సూర్యోదయం అవ్వగానే, మనం మళ్లీ కొనసాగిద్దాం. సరేనా? 454 00:31:43,779 --> 00:31:46,240 కార్సన్, కార్సన్, అంతా సర్దుకుంటుంది. 455 00:31:46,323 --> 00:31:49,576 -కాబట్టి అందరూ విశ్రాంతి తీసుకోండి, ఇంకా… -అందరమూ ఇక్కడి నుండి బయటపడతాం. పద. 456 00:31:50,911 --> 00:31:53,038 తెల్లవారాక అందరూ ఇక్కడికి వచ్చేయండి. 457 00:32:01,755 --> 00:32:03,257 వెళ్లి కాస్త విశ్రమించండి. 458 00:32:24,027 --> 00:32:25,112 అమ్మా. 459 00:32:26,572 --> 00:32:27,573 అమ్మా. 460 00:32:28,490 --> 00:32:30,784 ఉదయం పడవలు వస్తున్నాయి. 461 00:32:31,368 --> 00:32:32,995 వాటిలో నిన్ను ఎక్కిస్తాను. 462 00:32:33,078 --> 00:32:36,456 -మనం వెళ్లిపోతున్నామా? -నిన్ను ఒక పడవలో ఎక్కిస్తా. 463 00:32:36,540 --> 00:32:38,458 లేదు, నేను వెళ్లను! 464 00:32:38,959 --> 00:32:41,795 -నువ్వు లేకుండా నేను వెళ్లను. -ఈ విషయంలో మరో మాట లేదు. 465 00:32:41,879 --> 00:32:45,340 నువ్వు ఎంత గొడవ చేసినా, నిన్ను పడవ ఎక్కించడమనేది ఖాయం. 466 00:32:45,424 --> 00:32:46,717 నువ్వు వెళ్తున్నావు, అంతే. 467 00:33:09,948 --> 00:33:13,452 పడవలు వచ్చేశాయి. అందరూ వెంటనే కిందికి రండి! 468 00:33:14,411 --> 00:33:15,662 పడవలు వచ్చేశాయి! 469 00:33:15,746 --> 00:33:18,957 అందరూ కిందికి రండి! 470 00:33:19,458 --> 00:33:24,713 అందరూ లేవండి! కిందికి రండి! కిందికి వచ్చేయండి! 471 00:33:24,796 --> 00:33:27,508 లేవండి! అందరూ లేవండి! పడవలు వచ్చేశాయి! 472 00:33:28,509 --> 00:33:34,556 వెంటనే కిందికి వచ్చేయ్! ఒక్క బ్యాగే తెచ్చుకోండి! జంతువులను తేవద్దు! వెంటనే కిందికి రండి! 473 00:33:34,640 --> 00:33:36,850 ఒక్క బ్యాగే తెచ్చుకోండి. జంతువులను తేవద్దు! 474 00:33:36,934 --> 00:33:38,227 మనం బయలుదేరాలి. 475 00:33:38,727 --> 00:33:40,979 -మరి రోల్ఫీని ఏం చేయాలి? -ఒక్క బ్యాగే తేవాలట. 476 00:33:41,063 --> 00:33:43,148 ఒక్క బ్యాగే. అంతే. 477 00:33:47,569 --> 00:33:48,946 మనం వెళ్లాలి. 478 00:33:58,288 --> 00:34:00,499 ఒక్క బ్యాగే తెచ్చుకోండి. జంతువులను తేవద్దు! 479 00:34:02,501 --> 00:34:03,794 అందరూ లేవండి! 480 00:34:21,687 --> 00:34:23,522 అంతే అనుకుంటా. కానీ నాకు తెలీదు. 481 00:34:24,523 --> 00:34:26,817 -నగరం కుళ్లిపోతోంది… -హోరెస్. 482 00:34:27,484 --> 00:34:29,235 -హా. -హోరెస్, ఏం జరుగుతోంది? 483 00:34:29,735 --> 00:34:30,737 నాకు కూడా తెలీదు. 484 00:34:30,821 --> 00:34:33,447 -పడవలు ఏవి? -నాకు తెలీదు. 485 00:35:10,652 --> 00:35:12,696 మేడమ్, మీరు లోపలికి వెళ్లిపోతే మంచిది. 486 00:35:15,032 --> 00:35:16,033 మేడమ్! 487 00:35:39,014 --> 00:35:40,516 ఆనా, ఏం జరుగుతోంది? 488 00:35:40,599 --> 00:35:41,934 పడవలు లేవు. 489 00:35:42,017 --> 00:35:44,144 -పడవలను పంపుతారని వాళ్లు చెప్పారు కదా… -పడవలు లేవు. 490 00:35:47,606 --> 00:35:49,149 అందరూ వినండి. 491 00:35:49,233 --> 00:35:50,234 నిశ్శబ్దం! 492 00:35:50,943 --> 00:35:53,278 -పడవలు రాలేదు. -ఏంటి? 493 00:35:53,362 --> 00:35:54,863 పడవలేవీ రాలేదు. 494 00:35:54,947 --> 00:35:58,700 అయ్య బాబోయ్! దేవుడా. ఇది… 495 00:36:31,358 --> 00:36:33,026 దీన్ని ఇక్కడే వదిలి పోయేవాళ్ళమే! 496 00:36:39,658 --> 00:36:42,327 ఇవైంగ్. మీ వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి కదా? 497 00:36:43,161 --> 00:36:45,205 -ఏంటి? -మీ వస్తువులు. అన్నీ ఉన్నాయా? 498 00:36:49,126 --> 00:36:50,252 మిన్నీ? 499 00:36:50,335 --> 00:36:52,045 -ఉన్నాయనే అనుకుంటా. -హా, ఉన్నాయి. 500 00:36:52,921 --> 00:36:56,258 కొంత మంది సిబ్బంది వస్తువులు పోయాయి. ఎవరో దొంగిలించేశారు. 501 00:36:57,176 --> 00:36:58,468 ఎప్పుడు? 502 00:36:58,552 --> 00:37:02,306 మనం కిందికి వెళ్లి, లేని పడవల కోసం ఎదురు చూస్తున్నప్పుడు. 503 00:37:07,561 --> 00:37:09,479 దేవుడా. ఇవి పని చేస్తాయా? 504 00:37:10,272 --> 00:37:13,692 ఇవి చాలా అరుదుగా లభించేవి. వీటిని ఇంటి దగ్గర ఎలా ఉంచను! 505 00:37:14,985 --> 00:37:16,987 ఇవి పని చేస్తాయి. అదే ఇప్పుడు ముఖ్యం. 506 00:37:17,070 --> 00:37:19,031 చూడు, మనకి ఇవి అవసరమా? సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా. 507 00:37:19,114 --> 00:37:23,493 కానీ వాళ్లు తమ పనిని సక్రమంగా చేస్తే కదా! ఇక్కడ మన రోగులున్నారు, మన కుటుంబాలు ఉన్నాయి. 508 00:37:23,577 --> 00:37:24,912 వాళ్లని మనం కాపాడుకోవాలి. 509 00:37:31,168 --> 00:37:36,215 ఇక్కడ చాలా వేడిగా ఉంది. అస్సలు తగ్గడమే లేదు. 510 00:37:36,965 --> 00:37:39,468 ఎంత వేడిగా ఉందో అస్సలు ఊహించలేవు. 511 00:37:40,677 --> 00:37:45,766 నీరు, ఆహారం అడుగింటిపోతున్నాయి. మందులు కూడా లేవు. 512 00:37:47,601 --> 00:37:49,895 రోగులు మూలుగుతున్నారు, ఏడుస్తున్నారు. 513 00:37:50,687 --> 00:37:53,607 ఎక్కడ చూసినా వేదనే కనిపిస్తోంది. 514 00:37:54,900 --> 00:37:57,319 టాయిలెట్లు కూడా పని చేయట్లేదు. 515 00:37:57,402 --> 00:38:02,491 డ్రైనేజీ నీరు బయటకు వచ్చేసింది. చెత్త, మలం వాసన భరించేలనంతగా ఉంది. 516 00:38:02,574 --> 00:38:06,245 జనాలు ఊపిరి బిగపట్టుకొని తిరుగుతున్నారు. చనిపోతున్నారు. 517 00:38:07,579 --> 00:38:09,456 మరణాలు మొదలయ్యాయి. 518 00:38:11,959 --> 00:38:13,961 ఇంకా ఎంతో సేపు ఇక్కడ ఉండలేం. 519 00:38:15,003 --> 00:38:19,508 మాకు సాయం కావాలి. మార్క్, మీ అమ్మకి సాయం కావాలి. 520 00:38:21,093 --> 00:38:22,719 మీరు మమ్మల్ని కాపాడాలి. 521 00:38:23,679 --> 00:38:28,642 ఏదోకటి చేయ్. దయచేసి, ఏదోకటి చేయ్. 522 00:38:32,479 --> 00:38:34,898 ఆమె మాటలు విన్నారా? వారు అక్కడ ఆపదలో ఉన్నారు. 523 00:38:34,982 --> 00:38:39,236 మెమోరియల్ హాస్పిటల్ లో ఉండే వాళ్లకి సాయం కావాలి, అది కూడా వెంటనే కావాలి. 524 00:38:40,737 --> 00:38:41,947 లైన్లో ఉన్నారా? 525 00:38:42,030 --> 00:38:44,616 ఈ సమయంలో, సహాయక చర్యల విషయానికి వస్తే, 526 00:38:44,700 --> 00:38:47,703 -మెమోరియల్ ఆసుపత్రికి తొలి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. -తను ఏమందో విన్నారా? 527 00:38:47,786 --> 00:38:49,329 జనాలు చనిపోతున్నారు. 528 00:38:49,413 --> 00:38:53,125 మెమోరియల్ హాస్పిటల్ కి ప్రస్తుతానికి తొలి ప్రాధాన్యత కేటాయించబడలేదు. 529 00:38:53,208 --> 00:38:55,878 జనాలు ఇక్కడ ఊరికే నిలబడి ఉన్నారు. 530 00:38:55,961 --> 00:38:58,881 ఒక్కరు కూడా ఏమీ చేయట్లేదు, సాయం చేసే అవకాశం కూడా మీరు ఇవ్వట్లేదు. 531 00:38:59,756 --> 00:39:04,303 ఏదోకటి చేయండి! ఏదోకటి చేయండి! 532 00:39:04,386 --> 00:39:07,139 మీరు వెంటనే ఫోన్ పెట్టేయండి, వెంటనే ఫోన్ పెట్టేయండి. 533 00:39:18,734 --> 00:39:22,863 మీలో ఒక్కరు కూడా ఏమీ చేయరా? కనీసం ప్రయత్నం కూడా చేయరా? 534 00:39:26,158 --> 00:39:29,786 మార్క్. మార్క్! 535 00:39:31,538 --> 00:39:32,539 మార్క్. 536 00:39:32,623 --> 00:39:34,458 ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్లడానికి ప్రయత్నిద్దాం. 537 00:39:34,541 --> 00:39:37,252 కానీ నీటి ఎత్తు చాలా ఎక్కువ ఉంది. ఈదుకుంటే వెళ్తే లేని పోని రోగాలు వస్తాయి. 538 00:39:37,336 --> 00:39:39,338 ఆసుపత్రికి వీలైనంత దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిద్దాం, అప్పుడు చూద్దాం… 539 00:39:39,421 --> 00:39:44,426 హేయ్, హేయ్. మీకు ఆసుపత్రికి వెళ్లాలనుందా? మిమ్మల్ని మేము తీసుకెళ్తాం. 540 00:39:46,011 --> 00:39:47,763 -ఎలా? -మా దగ్గర పడవలు ఉన్నాయి. 541 00:39:48,263 --> 00:39:51,225 మేము ఇక్కడికి జనాలకి సాయం చేద్దామని వచ్చాం. కానీ వాళ్లు మమ్మల్ని ఇక్కడ ఊరికే కూర్చోబెట్టారు. 542 00:39:51,934 --> 00:39:54,603 పడవలో బయలుదేరవలసిన చోటు వస్తే, ఆసుపత్రికి ఎలా వెళ్లాలో నువ్వు చెప్పగలవా? 543 00:39:55,229 --> 00:39:56,563 ఆసుపత్రికి ఎలా వెళ్లాలో నాకు బాగా తెలుసు. 544 00:39:56,647 --> 00:39:59,483 -నేను పుట్టిందే అక్కడ కదా. -తెల్లవారగానే, బయలుదేరదాం. 545 00:39:59,566 --> 00:40:01,693 లేదు, మనం ఇప్పుడే వెళ్లవచ్చు. ల్యాండ్ మార్క్స్ ఆధారంగా మార్క్ దారి చెప్పగలడు. 546 00:40:01,777 --> 00:40:04,738 లేదు. ఊరు నిండా స్నైపర్లు ఉన్నారు, ఏదైనా చిటుక్కుమన్నా, కాల్చేస్తున్నారు. 547 00:40:05,364 --> 00:40:08,408 మాకు కూడా సాయపడాలనే ఉంది, కానీ, అలా అని ప్రాణాలు వదులుకోలేం కదా. 548 00:40:08,492 --> 00:40:12,538 -అవును. -తెల్లవారగానే బయలుదేరదాం. సరేనా? 549 00:40:14,498 --> 00:40:15,624 సరే. 550 00:40:28,720 --> 00:40:32,683 ఇదుగోండి. ఏం పర్వాలేదు. ఇంకాస్త తీసుకువస్తాం. 551 00:40:35,602 --> 00:40:38,438 సరే, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. సరేనా? 552 00:41:30,657 --> 00:41:32,326 -హేయ్. -హేయ్. 553 00:41:33,869 --> 00:41:36,413 -ఎలా ఉందో చూద్దాం. -దేవుడా. చాలా వేడిగా ఉంది. 554 00:41:36,496 --> 00:41:37,706 అందరికీ అలాగే ఉంది. 555 00:41:37,789 --> 00:41:39,166 ఉష్ణోగ్రత ఇక్కడ 40 డిగ్రీలు ఉంటుంది. 556 00:41:50,052 --> 00:41:51,720 మీ ఆయనతో మాట్లాడగలిగావా? 557 00:41:57,392 --> 00:41:58,519 మీ కుటుంబం ఎలా ఉంది? 558 00:41:59,102 --> 00:42:03,857 వాళ్లు బాగానే ఉన్నారు. నా కూతురికి సాహసం చేయాలనుందట, కాబట్టి… 559 00:42:09,112 --> 00:42:10,822 నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవాలి. 560 00:42:10,906 --> 00:42:12,366 నీకు కూడా విశ్రాంతి కావాలి కదా. 561 00:42:13,450 --> 00:42:15,536 ఆనా, నిజంగానే నువ్వు కాస్త విశ్రమించాలి. 562 00:42:20,457 --> 00:42:21,583 ఒకసారి ఇక్కడి పరిస్థితి చూడు. 563 00:42:24,503 --> 00:42:25,712 అసలు ఇదెలా… 564 00:42:28,924 --> 00:42:33,136 ఇలా ఏదైనా పేద దేశంలో జరుగుతుంది, మన లాంటి ధనిక దేశంలో కాదు. 565 00:42:33,887 --> 00:42:36,056 అసలు ఇలా అయ్యేదాకా జనాలు ఏం చేస్తున్నారు? 566 00:42:49,194 --> 00:42:52,322 -ఏమైనా జరిగిందా? -ఏదో పెద్ద విషయమే జరిగినట్టుంది. 567 00:42:58,328 --> 00:43:00,247 ఏం జరుగుతోందో చూశావా? వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా? 568 00:43:01,039 --> 00:43:02,291 నేను రోగులను చూసుకొనే పనిలో ఉన్నానంతే. 569 00:43:02,374 --> 00:43:06,044 హేయ్, ఆగు, కేరన్, ఇక్కడికి సాయం కోసం కుటుంబాలు, వ్యక్తులు, ఇంకా అందరూ వస్తున్నారు, 570 00:43:06,128 --> 00:43:08,088 కానీ వాళ్లు మాత్రం జనాలను రానివ్వడం లేదు. 571 00:43:08,589 --> 00:43:09,756 దానికి కారణం కూడా నీకు తెలుసు. 572 00:43:12,217 --> 00:43:15,512 వారు భయపడుతున్నారు. వారు తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు, మనమంటే భయపడుతున్నారు. 573 00:43:16,388 --> 00:43:17,806 ఇందులో మనం అనే కోణాన్ని తీసుకురాకు. 574 00:43:17,890 --> 00:43:20,392 అబ్బా… అసలు నువ్వు వార్తలు వింటున్నావా? 575 00:43:21,143 --> 00:43:23,896 వాళ్లు మనల్ని కాలుస్తున్నారు, కేరన్. మనల్ని వెనుక నుండి కాల్చేస్తున్నారు. 576 00:43:23,979 --> 00:43:27,232 ఇక్కడి జనాలే చస్తుంటే, నువ్వు ఇంకొంత మందిని తీసుకురావాలనుకుంటున్నావా? 577 00:43:28,108 --> 00:43:29,109 నీకు మనందరిపై అంత పట్టింపే ఉంటే, 578 00:43:29,193 --> 00:43:31,278 ఇక్కడికి ఇంకెవరినీ రానివ్వాలని కోరుకోవు. 579 00:43:31,361 --> 00:43:32,654 ఒక్కరిని కూడా. 580 00:44:04,186 --> 00:44:05,854 ఇప్పుడు నేను ఆగాలి. 581 00:44:06,647 --> 00:44:08,148 నా వల్ల కాదు. 582 00:44:13,445 --> 00:44:14,988 ఇది మీకు కాస్త చల్లదనాన్ని ఇస్తుంది. 583 00:45:23,891 --> 00:45:26,768 …తుఫాను బాధిత ప్రాంతాలలో చాలా వరకు కరెంట్ లేనే లేదు, 584 00:45:26,852 --> 00:45:29,313 ఈ పరిస్థితి కొన్ని వారాలు కొనసాగవచ్చు… 585 00:45:29,396 --> 00:45:32,065 …నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. 586 00:45:32,566 --> 00:45:33,817 చాలా నష్టం వాటిల్లింది. 587 00:45:34,610 --> 00:45:37,112 -…సైనిక పహారా నడుస్తోంది. -…చాలా నష్టం. 588 00:45:37,196 --> 00:45:40,032 సూపర్ డోమ్ పైకప్పు అంతా కొట్టుకుపోయింది. 589 00:45:40,115 --> 00:45:42,451 పరిస్థితి చూస్తుంటే ఏదో సైనిక పాలన జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. 590 00:45:42,534 --> 00:45:44,161 అలాగే అనిపిస్తోంది… 591 00:46:24,368 --> 00:46:29,164 ఇక్కడ జరిగేది ఏదీ మంచిది కాదు. చెడ్డ వాళ్లు. 592 00:46:29,248 --> 00:46:32,459 దుష్ట శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 593 00:47:43,071 --> 00:47:45,073 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్