1 00:00:12,846 --> 00:00:16,099 డాక్టర్ బాల్జ్, మాతో మళ్లీ సమావేశమైనందుకు థ్యాంక్యూ, 2 00:00:16,767 --> 00:00:20,729 అయిదవ రోజైన సెప్టెంబర్ ఒకటవ తేదీన ఏం జరిగిందో మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. 3 00:00:20,729 --> 00:00:21,855 మనందరం చనిపోతాం. 4 00:00:21,939 --> 00:00:24,024 పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. 5 00:00:24,024 --> 00:00:28,070 ఏం జరుగుతోందో ఎవరికీ తెలీదు. ఎవరూ ఇన్ ఛార్జీగా లేరు. 6 00:00:28,070 --> 00:00:32,073 తీసుకోకుండా ఉండాల్సిన నిర్ణయాలు తీసుకోబడ్డాయి. 7 00:00:32,573 --> 00:00:35,244 మనం జనాల సంఖ్యను చాలా తగ్గించుకోవలసిన అవసరం ఉంది, 8 00:00:35,244 --> 00:00:38,956 తర్వాత వెళ్లబోయే బృందంతో నువ్వు కూడా వెళ్లిపో. 9 00:00:38,956 --> 00:00:40,040 వెళ్లిపోవాలా? 10 00:00:41,250 --> 00:00:43,961 సూసన్, నేనెలా వెళ్లిపోగలను! నేను డాక్టరుని. 11 00:00:43,961 --> 00:00:45,504 డాక్టర్లు అంటే రోగులను చూసుకోవాలి. 12 00:00:45,504 --> 00:00:49,675 హోరెస్, ఈ పరిస్థితిలో మనం చేయగలిగింది ఏమీ లేదు. 13 00:00:49,675 --> 00:00:52,386 అప్పటికప్పుడే నన్ను వెళ్లిపొమ్మని చెప్పారు. 14 00:00:53,470 --> 00:00:59,017 సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చిన పడవలో నన్ను వెళ్లిపొమ్మన్నారు. 15 00:01:14,908 --> 00:01:17,077 ఆ విషయంలో, నన్ను అపరాధభావం కమ్మేసింది. 16 00:01:18,954 --> 00:01:21,623 చివరి దాకా ఉండనందుకు. 17 00:01:27,004 --> 00:01:33,969 అసలైన వీరత్వం అనేది, పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా కానీ, 18 00:01:33,969 --> 00:01:37,598 మేము డాక్టర్లము అని గుర్తుంచుకోవడంలో, అలాగే "ఎట్టి పరిస్థితుల్లో హాని తలపెట్టకూడదు," అని 19 00:01:37,598 --> 00:01:41,602 ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండటంలోనే ఉంది. 20 00:01:45,898 --> 00:01:51,028 కానీ ఆ గందరగోళ పరిస్థితుల్లో, జనాలు తాము ఎవరం అనే దాన్ని మర్చిపోయారు. 21 00:01:51,612 --> 00:01:55,407 ఈ అంధత్వం సర్వత్రా వ్యాపించి, అంతటినీ ఆవహించేసింది. 22 00:01:59,786 --> 00:02:01,997 అంతటినీ ఆవహించేసింది అన్నమాట. 23 00:02:05,918 --> 00:02:10,005 నీటిలో ముందుకు సాగండి 24 00:02:12,799 --> 00:02:17,554 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 25 00:02:18,639 --> 00:02:23,435 నీటిలో ముందుకు సాగండి 26 00:02:23,519 --> 00:02:28,732 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 27 00:02:28,732 --> 00:02:33,403 నీటిలో ముందుకు సాగండి 28 00:02:33,487 --> 00:02:38,784 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 29 00:02:38,784 --> 00:02:42,871 పురుషులు నది వద్దకు వెళ్లారు 30 00:02:43,830 --> 00:02:48,752 పురుషులు నది వద్దకు వెళ్లారు, ప్రభువా 31 00:02:48,836 --> 00:02:53,006 పురుషులు నది వద్దకు వెళ్లారు 32 00:02:53,841 --> 00:02:57,511 అక్కడికి ప్రార్థించడానికి వెళ్లారు 33 00:02:59,137 --> 00:03:02,975 నీటిలో ముందుకు సాగండి 34 00:03:04,226 --> 00:03:09,064 నీటిలో ముందుకు సాగండి, చిన్నారులారా 35 00:03:09,064 --> 00:03:10,566 షెరీ ఫింక్ రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 36 00:03:10,566 --> 00:03:13,026 నీటిలో ముందుకు సాగండి 37 00:03:13,735 --> 00:03:18,740 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 38 00:03:23,871 --> 00:03:29,877 దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు 39 00:03:34,381 --> 00:03:37,342 తుది తీర్పు 40 00:03:39,720 --> 00:03:42,848 బేటన్ రూజ్ 41 00:03:44,433 --> 00:03:46,393 హరికేన్ కత్రినా వెళ్లిపోయిన 11 నెలల తర్వాత 42 00:03:46,393 --> 00:03:47,394 జూలై 18, 2006 43 00:03:47,394 --> 00:03:49,062 అందరికీ గుడ్ ఆఫ్టర్ నూన్. 44 00:03:49,855 --> 00:03:53,525 మెమోరియల్ హాస్పిటల్ అనేది న్యూ ఆర్లీన్స్ లో ఉన్న ఆసుపత్రి. 45 00:03:53,609 --> 00:03:56,528 అది చాలా పెద్ద ఆసుపత్రి, ఎప్పట్నుంచో అక్కడ ఉందది. 46 00:03:56,612 --> 00:04:00,324 ఆ ఆసుపత్రిలో, లేక్ సైడ్ అనే ఇంకో చిన్న ఆసుపత్రి ఉంది. 47 00:04:00,324 --> 00:04:01,408 లైఫ్ కేర్. 48 00:04:02,367 --> 00:04:05,329 లైఫ్ కేర్. లైఫ్ కేర్ లో తీవ్ర అస్వస్థతో కూడిన రోగులకు చికిత్స ఇస్తుంటారు, 49 00:04:05,329 --> 00:04:08,874 వాళ్లలో కొందరికి, ప్రాణాంతక మోతాదులో ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారనే ఆరోపణ ఉంది. 50 00:04:08,874 --> 00:04:12,878 డాక్టర్ ఆనా పౌ, అలాగే ఇద్దరు నర్సులైన చేరీ లాండ్రీ, లోరీ బూడోలను, 51 00:04:12,878 --> 00:04:17,089 ఒక పథకం ప్రకారం ప్రాణాలు తీశారనే ఆరోపణతో అరెస్ట్ చేయడం జరిగింది. 52 00:04:17,173 --> 00:04:22,596 నలుగురు రోగులకు మార్ఫీన్, ఇంకా "మాజ్డొలోమ్"ల ఇంజెక్షన్ ఇచ్చారు. 53 00:04:23,597 --> 00:04:24,640 మిడాజొలామ్. 54 00:04:24,640 --> 00:04:27,726 మిడాజొలామ్, దీన్నే వెర్సేడ్ అని కూడా అంటారు. 55 00:04:28,727 --> 00:04:30,479 ఈ రెండింటిలో ఏదైనా ప్రాణాలను హరించివేయగలదు, 56 00:04:30,479 --> 00:04:33,232 కానీ ఆ రెంటినీ కలిపి ఇస్తే, ఇక హరిహరాదులు సైతం ఏమీ చేయలేరు. 57 00:04:34,107 --> 00:04:37,152 వైద్య వృత్తిలో ఉన్నవారు, తమని తాము దేవుళ్లుగా భావించినట్టు ఉన్నారు. 58 00:04:37,236 --> 00:04:42,699 వైద్య సాయం అవసరమైన వారికి ఏమీ కాకుండా చూసుకొనే బాధ్యత వారిపై ఉంది. 59 00:04:42,783 --> 00:04:48,497 ఇవి కారుణ్య మరణాలు కాదు. ఇవి పక్కా ప్లాన్ తో చేసిన హత్యలు. 60 00:04:49,122 --> 00:04:50,332 ఈ కేసు ఇప్పుడు 61 00:04:50,332 --> 00:04:54,127 ఆర్లీన్ పరీష్ డిస్ట్రిక్ట్ అటార్నీ, ఎడ్డీ జార్డన్ ఆఫీసుకి అప్పగించబడుతుంది, 62 00:04:54,211 --> 00:04:57,589 హత్య నేరాన్ని నిరూపించడానికి, గ్రాండ్ జ్యూరీ అవసరమా లేదా అని ఆయన నిర్ణయిస్తారు. 63 00:04:58,423 --> 00:04:59,424 థ్యాంక్యూ. 64 00:05:00,551 --> 00:05:02,845 మంగళవారం, హరికేన్ కత్రినా తాలూకు మరో దెబ్బ... 65 00:05:02,845 --> 00:05:03,762 ఆసుపత్రి మరణాలు 66 00:05:03,846 --> 00:05:06,557 ఒక డాక్టర్, ఇద్దరు నర్సులను అరెస్ట్ చేశారు. 67 00:05:06,557 --> 00:05:09,351 ...న్యూ ఆర్లీన్స్ లోని మెమోరియల్ హాస్పిటల్ లో నలుగురు రోగులను హత్య చేశారనే 68 00:05:09,351 --> 00:05:11,103 ఆరోపణ వారిపై ఉంది. 69 00:05:11,103 --> 00:05:12,396 రిచర్డ్ టీ. సిమ్మన్స్ జూనియర్ న్యాయవాది 70 00:05:12,396 --> 00:05:14,398 అంతటి విపత్తులో కూడా ఆసుపత్రిలోనే ఉండి సకల సేవలనూ అందించిన 71 00:05:14,398 --> 00:05:16,483 డాక్టర్లు, నర్సులను బుద్ది ఉన్న పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేస్తారా? 72 00:05:17,067 --> 00:05:20,571 అటార్నీ జనరల్ ఒక మీడియా సమావేశం పెట్టి తనను తాను గొప్పగా చూపుకోవడం కోసమని 73 00:05:20,571 --> 00:05:23,991 ముగ్గురు స్థైర్యవంతులైన వైద్య సిబ్బందిని ఆ అటార్నీ జనరల్ ఆఫీసు వాళ్లు అరెస్ట్ చేశారు. 74 00:05:23,991 --> 00:05:25,993 మీ క్లయింట్, డాక్టర్ పౌ అమాయకురాలా? 75 00:05:25,993 --> 00:05:28,412 అవును. అందులో ఏ సందేహమూ లేదు. 76 00:05:28,412 --> 00:05:30,706 వాళ్లేమీ నేరపూరితంగా వ్యవహరించలేదు. 77 00:05:31,331 --> 00:05:33,083 ఇదుగోండి, ఈ అఫీడవిట్ ని చూశారా? 78 00:05:34,376 --> 00:05:36,420 ఇది ఆరోపణలతో ఉన్న ఒక కాగితం మాత్రమే, 79 00:05:36,420 --> 00:05:39,298 ప్రతీ కాగితానికీ ఉన్నట్టే, దీనికి కూడా రెండు వైపులు ఉన్నాయి. 80 00:05:41,258 --> 00:05:44,887 వాళ్లేమీ కావాలని చేయలేదు, ఇవి హత్యలు కూడా కాదు. 81 00:05:47,097 --> 00:05:48,599 ఇప్పుడు నేనేం చేయాలి, విన్స్? 82 00:05:49,183 --> 00:05:51,643 నేను బయటకు ఎలా వెళ్లగలను? అంటే, జనాలు నా గురించి ఏం అనుకుంటారు? 83 00:05:51,727 --> 00:05:53,145 వాళ్లు నన్ను ఏం అనుకుంటారు... 84 00:05:53,145 --> 00:05:56,982 నిన్ను అన్యాయంగా వేధింపులకు గురి చేస్తున్నారనే వాళ్లు అనుకుంటారు, అది నిజమే కూడా. 85 00:05:59,443 --> 00:06:00,485 హా, హలో? 86 00:06:01,778 --> 00:06:03,155 లేదు, తను ఇప్పుడు మాట్లాడలేదు. 87 00:06:03,906 --> 00:06:04,907 ఏంటి? 88 00:06:06,116 --> 00:06:08,202 నేనెవరు అయితే మీకు ఎందుకు? సరేనా? 89 00:06:09,203 --> 00:06:10,204 అది జరగని పని. 90 00:06:11,830 --> 00:06:14,208 ఓ విషయం చెప్పనా? ఈ వైరును ఊడబెరికేస్తే సరి. 91 00:06:16,585 --> 00:06:19,671 బయట ఇంకా ఆరు, ఏడు మంది తిరుగుతూనే ఉన్నారు. 92 00:06:19,755 --> 00:06:21,423 వీళ్లేం అనుకుంటున్నారు అసలు? -చాలా ఆశ్చర్యంగా ఉంది. 93 00:06:22,966 --> 00:06:25,260 నేను నా పాస్ పోర్టును ఇవ్వాల్సి వచ్చింది. 94 00:06:25,344 --> 00:06:27,721 గురవారంకల్లా బెయిల్ కోసం పూచీకత్తు కింద లక్ష డాలర్లు ఇవ్వాలి, 95 00:06:27,721 --> 00:06:29,473 లేదంటే నన్ను మళ్లీ జైల్లో వేస్తారు. 96 00:06:30,140 --> 00:06:32,100 ఇదంతా జరుగుతుందంటే, నేను అస్సలు నమ్మలేకపోతున్నా. 97 00:06:36,438 --> 00:06:38,607 నాది ఆఫ్ చేసి ఉంది. నీ నంబర్ కనిపెట్టేశారా? 98 00:06:42,402 --> 00:06:45,405 హలో. -విన్స్, నేను డాన్ నస్ ని. ఎలా ఉన్నారు? 99 00:06:45,489 --> 00:06:50,661 హేయ్, డాన్. నిజం చెప్పాలంటే, మేము మాకు చేతనైనంత ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం. 100 00:06:50,661 --> 00:06:52,496 చూడండి, నేను ఆనాతో మాట్లాడాలని ఇందాకటి నుండి కాల్ చేస్తూ ఉన్నా. 101 00:06:52,496 --> 00:06:55,165 సరే. ఒక్క నిమిషం లైనులో ఉండండి. 102 00:06:56,834 --> 00:06:58,126 హాయ్, డాన్. 103 00:06:58,210 --> 00:06:59,044 డాన్ నస్, ఎండీ, ఎఫ్ఏసీఎస్ 104 00:06:59,044 --> 00:07:00,587 ఆనా, నీకు జరుగుతున్న దానికి చాలా చింతిస్తున్నా. 105 00:07:00,671 --> 00:07:05,259 జరుగుతున్న పరిణామాలు, నిన్ను వాళ్లు పెడుతున్న ఇబ్బందులు, నాకు చాలా కోపం తెప్పిస్తున్నాయి. 106 00:07:05,259 --> 00:07:08,762 అందరూ నీ పక్షానే ఉన్నారు, నీ కోసం ఏం చేయగలం అని అడుగుతూ ఉన్నారు. 107 00:07:08,846 --> 00:07:10,180 మీ మాటలు నాకు ఊరటనిస్తున్నాయి. 108 00:07:10,264 --> 00:07:14,101 నేను ఒకటి ప్రతిపాదిస్తున్నాను. నీ కోసం ఒక లీగల్ డిఫెన్స్ ఫండును ఏర్పాటు చేస్తున్నాను. 109 00:07:14,685 --> 00:07:16,103 డాన్, ఆ అవసరం లేదులే. 110 00:07:16,103 --> 00:07:19,439 ఆ అవసరం ఉంది. కాస్త వాస్తవికంగా మాట్లాడుకుందాం. నీకు డబ్బు అవసరం అవుతుంది. 111 00:07:19,523 --> 00:07:21,650 అందరూ నీకు సాయపడాలనుకుంటున్నారు. 112 00:07:21,650 --> 00:07:23,694 అది చాలా మంచి ఆలోచన. 113 00:07:24,444 --> 00:07:25,445 దానిదేముందిలే. 114 00:07:25,988 --> 00:07:29,324 కొందరు అసంతృప్తి గల వ్యక్తులు ఏవేవో ఆరోపణలు చేశారు. 115 00:07:29,408 --> 00:07:30,784 హఠాత్తుగా, ఈ తతంగమంతా 116 00:07:30,868 --> 00:07:34,872 ఒక అర్థంపర్థం లేని సంచలనాత్మకమైన జాతీయ వార్తల కథాంశంగా మారిపోయిందే? 117 00:07:34,872 --> 00:07:36,874 ముందే చెప్పా కదా, ఇదంతా నాకు చాలా కోపం తెప్పిస్తుంది. 118 00:07:36,874 --> 00:07:41,211 ఈ కాల్ చేసినందుకు, ఇంకా నువ్వు అండగా ఉంటాను అన్నందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. 119 00:07:41,879 --> 00:07:45,048 భలేదానివే. మేమందరమూ నీకు అండగా ఉంటాం. 120 00:07:45,966 --> 00:07:46,967 యుద్ధం మొదలైంది. 121 00:07:46,967 --> 00:07:49,636 మనం ఇంత కష్టపడ్డాం, కానీ ఫోటీ పేర్లు కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. 122 00:07:49,720 --> 00:07:52,931 హా. చివరికి, న్యూ ఆర్లీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఏం చేస్తాడో అదే అందరూ చూస్తారు. 123 00:07:53,015 --> 00:07:54,349 నీకు అతని గురించి ఏం తెలుసు? 124 00:07:54,433 --> 00:07:56,935 ఎడ్డీ జార్డన్ కి, ఈ కేసు విషయంలో ఏం అభిప్రాయం ఉందో ఏమో. 125 00:07:57,019 --> 00:07:58,020 సూపర్. 126 00:08:00,647 --> 00:08:03,692 మనం అతనికి ఈ కేసు ఎంత బలమైనదో చూపించాలి. 127 00:08:03,692 --> 00:08:07,696 ఏ డీఏ అయినా మొట్టమొదటగా చేసే పని, ఈ మరణాలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోవడం. 128 00:08:08,572 --> 00:08:11,867 కాబట్టి మనం దాని మీదనే, అంటే ఫోరెన్సిక్ ఆధారంపై దృష్టి పెట్టాలి. 129 00:08:14,912 --> 00:08:15,746 వైద్యపరిశీలకుని ఆఫీసు 130 00:08:15,746 --> 00:08:17,956 అభిప్రాయాలు చెప్పడానికి వస్తే రాత్రంతా పార్టీలు ఏర్పాటు చేస్తానని మాటిచ్చా. 131 00:08:18,040 --> 00:08:20,000 కాబట్టి గాలటోయార్స్ రెస్టారెంటులో అందరికీ ఒక టేబుల్ బుక్ చేశాను. 132 00:08:20,792 --> 00:08:22,878 ఆ తర్వాత ఎలాంటి రచ్చ చేయవచ్చో చూద్దాం. 133 00:08:22,878 --> 00:08:25,088 ఊరిలోని బార్ల మీద పడిన పాథాలజిస్టులు. 134 00:08:25,839 --> 00:08:27,382 అంత కన్నా సూపర్ పని ఇంకేం ఉంటుంది! 135 00:08:28,175 --> 00:08:31,136 బచ్, ఈ సమావేశానికి డీఏ వస్తున్నారా, లేదా? 136 00:08:31,220 --> 00:08:33,304 ఎడ్డీ జార్డన్ కి ఈ సమావేశం గురించి తెలుసు. 137 00:08:33,388 --> 00:08:35,849 అయితే ప్రారంభిద్దాం. ఆయన వచ్చాక అప్పటి దాకా జరిగింది ఆయనకి చెప్పవచ్చు. 138 00:08:35,933 --> 00:08:37,768 రాబర్ట్, ముందు మీరు ప్రారంభిస్తారా? 139 00:08:37,768 --> 00:08:42,523 అలాగే. మా ల్యాబ్ 41 శవాల నుండి టిష్యూ శాంపిల్స్ ని తీసుకుంది. 140 00:08:42,523 --> 00:08:46,818 వాటిలో 23 శవాలలో మార్ఫీన్ లేదా మిడాజొలామ్, లేదా రెండూ ఉన్నట్టు గుర్తించాం. 141 00:08:46,902 --> 00:08:49,363 సరే, అవి ఎంతెంత స్థాయిలో ఉన్నాయని మీ విశ్లేషణలో తేలింది? 142 00:08:49,363 --> 00:08:51,949 ఈ మందుల అవశేషాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. 143 00:08:51,949 --> 00:08:53,700 ఆ విషయం చూడగానే తెలిసిపోతోంది. 144 00:08:53,784 --> 00:08:58,205 శవాలు ఉన్న స్థితి దృష్ట్యా, మీ ఫలితాలు చెల్లుబాటు అయినవే అంటారా? 145 00:08:58,205 --> 00:09:00,624 అవి సరైనవే. అందులో సందేహమే అక్కర్లేదు. 146 00:09:01,542 --> 00:09:04,378 సరే మరి. ఇక ఒక్కో రోగి గురించిన సమాచారం చూద్దాం. 147 00:09:05,087 --> 00:09:09,550 ఆలీస్ హజ్లర్, 90 ఏళ్ల లైఫ్ కేర్ రోగి, న్యుమోనియా కోసం ఆమె చికిత్స పొందుతున్నారు. 148 00:09:09,550 --> 00:09:13,220 బుధవారం రాత్రి, ఆమెకి నొప్పి గానీ లేదా ఇంకే విధమైన ఫిర్యాదు గానీ ఉన్నట్టు రికార్డ్ కాలేదు, 149 00:09:13,220 --> 00:09:14,805 అంటే ఈ మందులు ఆమెకి ఇవ్వాల్సిన అవసరం లేదు. 150 00:09:14,805 --> 00:09:17,349 అయినా కానీ, గురువారం మధ్యాహ్నం ఆమె చనిపోయింది. 151 00:09:17,349 --> 00:09:20,769 ఆమె కాలేయం, మెదడు, ఇంకా కండరాల టిష్యూలో మార్ఫీన్, ఇంకా మిడాజొలామ్ అవశేషాలు ఉన్నాయి. 152 00:09:20,853 --> 00:09:24,106 అవేవీ కూడా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయలేదు. -ఈ ఫలితాలన్నింటినీ గమనించాక, 153 00:09:24,106 --> 00:09:27,985 నాకు ఇది హత్య అనే అనిపిస్తోంది. మీరు కూడా ఏకీభవిస్తారో లేదో చెప్పండి, మైఖెల్. 154 00:09:28,569 --> 00:09:29,820 నేను ఏకీభవిస్తున్నాను. 155 00:09:30,779 --> 00:09:31,905 రోస్ శవ్వా. 156 00:09:31,989 --> 00:09:34,992 ఆ రెండు మందులూ ఉన్నాయి, కానీ వాటి అవసరం ఉందని ఎక్కడా పేర్కొనలేదు. హత్య. 157 00:09:34,992 --> 00:09:36,910 నేను కూడా అంగీకరిస్తున్నా. -వీల్డా మెక్ మేనస్. 158 00:09:37,494 --> 00:09:38,620 హత్య. 159 00:09:40,205 --> 00:09:41,790 ఎమ్మెట్ ఎవరెట్. 160 00:09:44,084 --> 00:09:48,297 ఈ రోగి స్పృహలోనే ఉన్నాడట, చుట్టూ జరిగేవి అతనికి తెలుస్తూ ఉన్నాయట. 161 00:09:49,464 --> 00:09:51,466 ఆ రెండూ ఇతనికి అవసరమని పేర్కొనలేదు. 162 00:09:52,050 --> 00:09:54,011 హత్య. -నేను కూడా అంగీకరిస్తున్నా, 163 00:09:54,011 --> 00:09:54,928 హత్య 164 00:09:59,433 --> 00:10:00,434 ఆలస్యమైనందుకు మన్నించండి. 165 00:10:03,353 --> 00:10:05,189 మీరు ఎవరు? -నేను అసిస్టెంట్ డిస్ట్రిక్ అటార్నీని. 166 00:10:05,189 --> 00:10:06,315 నా పేరు మైఖెల్ మొరాలెస్. మీరు ఎవరు? 167 00:10:06,315 --> 00:10:10,152 నా పేరు బచ్ షేఫర్. ఈవిడ వర్జీనియా రైడర్. మేము అటార్నీ జనరల్ ఆఫీసులో పని చేస్తున్నాం. 168 00:10:10,652 --> 00:10:13,030 ఎడ్డీ జార్డన్ రాలేదా? -ఆయన తరఫున నేను వస్తున్నాను. 169 00:10:13,030 --> 00:10:16,283 ఈ కేసులో ఇరవై మంది దాకా హత్యకు గురై ఉండవచ్చు, డీఏకి ఇంత కన్నా ముఖ్యమైన పని ఇంకోటి ఉందా? 170 00:10:16,283 --> 00:10:18,577 ఈ కేసులో నేనే ప్రధాన ప్రాసిక్యూటర్ ని. 171 00:10:18,577 --> 00:10:20,287 మీరు ఏమన్నా పంచుకోవాలనుకుంటే, చెప్పండి. 172 00:10:20,871 --> 00:10:23,248 మిస్టర్ మొరాలెస్, మనం కాసేపు ఏకాంతంగా మాట్లాడుకుందామా? 173 00:10:25,667 --> 00:10:27,503 మిస్టర్ మొరాలెస్, ఈ కేసులో 174 00:10:27,503 --> 00:10:30,464 టాక్సికాలజీ రిపోర్టులు చాలా ముఖ్యమైనవని మీరు కూడా ఒప్పుకుంటారనే అనుకుంటున్నా. 175 00:10:30,464 --> 00:10:31,715 అందులో సందేహం అక్కర్లేదు. 176 00:10:31,715 --> 00:10:35,260 లోపల ఈ నగర వైద్య పరిశీలకుడు, ఇంకా ఇద్దరు బయటి ఫోరెన్సిక్ పాథాలజీ నిఫుణులు ఉన్నారు, 177 00:10:35,344 --> 00:10:37,179 ఇంకా దేశంలోని టాప్ ల్యాబ్స్ లలో ఒకదానికి చెందిన డైరెక్టర్ ఉన్నారు, 178 00:10:37,179 --> 00:10:40,057 వీళ్లందరూ ఆధారాలని పరీక్షించడానికి ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చారు. 179 00:10:40,724 --> 00:10:42,351 ఎడ్డీ జార్డన్ కూడా ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది. 180 00:10:42,351 --> 00:10:45,687 ఈ కేసును వాదించబోయేది మేమే అని అటార్నీ జనరల్ కి తెలుసు, 181 00:10:45,771 --> 00:10:47,439 కానీ ఆయన మమ్మల్ని భాగం చేయడానికి పెద్ధగా ఆసక్తి చూపలేదు. 182 00:10:47,523 --> 00:10:48,982 కానీ ఇది మా కేసు, 183 00:10:49,066 --> 00:10:50,859 కాబట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మేము చూసుకుంటాం. 184 00:10:50,943 --> 00:10:53,320 అయితే, ఈ కేసు డీఏ దృష్టిలో పడేంత తీవ్రమైనది కాదంటారా? 185 00:10:53,320 --> 00:10:55,405 ఈ నగరంలో ఏ మరణం జరిగినా దానిపై మా సంపూర్ణ దృష్టి ఉంటుంది. 186 00:10:55,489 --> 00:10:57,908 కానీ నేను వీటిని సాధారణ హత్యలని అనలేను. 187 00:10:57,908 --> 00:11:03,080 చూడండి, నేను కూడా మీలాగే ప్రాసిక్యూటరుగా ఇరవై ఏడేళ్లు పని చేశాను. 188 00:11:03,622 --> 00:11:07,501 మేము ఒక బలమైన కేసును నిర్మించామని నేను బల్ల గుద్ది మరీ చెప్పగలను. చాలా బలమైన కేసు. 189 00:11:07,501 --> 00:11:10,754 కానీ అది నిజమో కాదో నిర్ణయించాల్సింది నేను. 190 00:11:10,838 --> 00:11:11,797 ఇక లోపలికి వెళ్దామా? 191 00:11:20,597 --> 00:11:24,977 అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ మొరాలెస్ కి ఈ కేసుపై పెద్దగా ఆసక్తి లేదని నాకు అనిపిస్తోంది. 192 00:11:25,477 --> 00:11:26,478 అనిపిస్తోందా? 193 00:11:32,776 --> 00:11:35,237 ఆ విచారణాధికారులతో ఇంకా ఎవరైనా మాట్లాడుతున్నారా? 194 00:11:35,904 --> 00:11:38,490 సమన్లు లేదా టెనెట్ లాయర్ లేకుండా ఎవరూ మాట్లాడట్లేదు. 195 00:11:38,574 --> 00:11:41,076 వాళ్లకి ఎవరూ ఏమీ చెప్పకూడదనే ఆశిస్తున్నా. 196 00:11:41,076 --> 00:11:43,287 నేను ఒక విషయం అడిగితే పర్లేదు కదా, 197 00:11:43,287 --> 00:11:47,499 విచారణాధికారులతో సిబ్బంది మాట్లాడితే తప్పేముంది? 198 00:11:48,166 --> 00:11:51,086 వాళ్లేమీ తప్పు చేయనప్పుడు, కంగారు పడాల్సిన అవసరం ఏముంది? 199 00:11:51,628 --> 00:11:53,130 నువ్వు మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నావు, హోరెస్. 200 00:11:53,130 --> 00:11:54,548 తప్పులు జరిగాయని ఒప్పుకోవడానికి 201 00:11:54,548 --> 00:11:57,759 అందరూ ఎందుకంత తటపటాయిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. 202 00:11:58,427 --> 00:12:00,679 నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా, హోరెస్? -తప్పకుండా. 203 00:12:01,346 --> 00:12:04,892 రోగికి ఏ నొప్పీ తెలియకుండా వారు త్వరగా చనిపోయేలా చేయడం, 204 00:12:04,892 --> 00:12:06,602 లేదా రోగులను వదిలేసి వెళ్లిపోయి 205 00:12:06,602 --> 00:12:10,606 వాళ్లు నిదానంగా వేదనతో కన్నుమూసేలా చేయడం, నీ ముందు ఈ రెండు మార్గాలే ఉన్నప్పుడు 206 00:12:11,481 --> 00:12:12,941 నువ్వు దేన్ని ఎంచుకుంటావు? 207 00:12:13,025 --> 00:12:15,402 అసలు వాటిని మార్గాలుగా నేను భావించను. 208 00:12:15,402 --> 00:12:17,404 జనాలను చంపకుండానే వారికి బాధను దూరం చేయవచ్చు. 209 00:12:17,404 --> 00:12:19,156 వాళ్లని ఎవరూ వదిలి వెళ్లాల్సిన పని లేదు. 210 00:12:19,156 --> 00:12:23,076 విషయం ఏంటంటే, ఎవరికి సేవలు అందించాలి, ఎవరికి సేవలు అందించకూడదు అని 211 00:12:23,160 --> 00:12:25,829 డాక్టర్లను ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి నెట్టేసినప్పుడు, 212 00:12:25,913 --> 00:12:28,290 సరైన మార్గాలనేవే ఉండవు, హోరెస్. 213 00:12:29,082 --> 00:12:30,459 భయంకరమైన మార్గాలే ఉంటాయి. 214 00:12:30,459 --> 00:12:32,794 కానీ జరిగింది అది కాదు. 215 00:12:32,878 --> 00:12:37,674 అది కాదా? మరి చెక్ లిస్ట్ ఏది? ఎమర్జెన్సీ ప్రొటోకాల్స్ ఏవి? 216 00:12:37,758 --> 00:12:42,095 మనం ఎలా పని చేయాలి అని ఎవరైనా నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించారా? 217 00:12:43,347 --> 00:12:49,269 ఇవైంగ్, నాకు కావలసిందల్లా ఏంటంటే, మనందరం కూర్చొని, 218 00:12:49,353 --> 00:12:55,526 ఎక్కడ తప్పు జరిగిందో చూడాలి, తద్వారా భవిష్యత్తులో ఇది మళ్లీ జరగకుండా చూసుకోవచ్చు. 219 00:12:58,737 --> 00:13:00,697 నేను వెళ్లి ఫిష్ ఫ్రై తెచ్చుకుంటా. 220 00:13:01,240 --> 00:13:03,325 నేను కూడా. 221 00:13:05,536 --> 00:13:07,037 హరికేన్ కత్రినా తర్వాత, 222 00:13:07,037 --> 00:13:10,082 సూపర్ డోమ్ ని దేశంలో అందరూ నష్టానికి గుర్తుగా చూడటం మొదలుపెట్టారు. 223 00:13:10,082 --> 00:13:12,501 కానీ ఇప్పుడు దాన్నే ఆశకి, పునరుద్ధరణకి గుర్తుగా చూస్తున్నారు. 224 00:13:13,085 --> 00:13:14,837 భారీగా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి, 225 00:13:14,837 --> 00:13:18,966 కార్మికులు ప్రతీ రోజు పని చేస్తూ కట్టడానికి మరమ్మత్తులు చేస్తున్నారు. 226 00:13:19,800 --> 00:13:22,386 హరికేన్ కత్రినా వెళ్లిపోయిన 12 నెలల తర్వాత 227 00:13:22,386 --> 00:13:25,430 ఆగస్ట్ 14, 2006 228 00:13:41,530 --> 00:13:44,241 మనల్ని దర్యాప్తును ఆపివేయమని అడిగారు. 229 00:13:44,241 --> 00:13:47,536 ఏంటి? నిజంగా అంటున్నావా? 230 00:13:49,079 --> 00:13:54,251 మొరాలెస్, ఎడ్డీ జార్డన్ నుండి అటార్నీ జనరల్ కి ఒక లేఖ తయారు చేసి పంపాడు, 231 00:13:54,251 --> 00:13:55,961 వాళ్లకి ఇకపై మన సాయం అవసరం లేదని, 232 00:13:55,961 --> 00:13:58,422 మనం ఇంకా పని చేయడం వలన పెద్దగా లాభం లేదని అందులో రాసి పంపారు. 233 00:13:58,422 --> 00:14:00,174 "పెద్దగా లాభం లేదా?" 234 00:14:00,174 --> 00:14:02,718 మన దగ్గర పత్రాల రూపంలో ఆధారం 50,000 పేజీలు ఉంది. 235 00:14:02,718 --> 00:14:04,386 సారాంశం కావాలట. 236 00:14:05,012 --> 00:14:08,015 యాభై వేల పేజీల ఆధారానికి సారాంశం కావాలా? 237 00:14:09,474 --> 00:14:11,059 సరే, మనం ఎలా ప్రతిస్పందిద్దాం మరి? 238 00:14:12,477 --> 00:14:14,438 ఒక సారాంశాం రాద్దాం... 239 00:14:17,065 --> 00:14:20,027 ఆ తర్వాత ఆ 50,000 పేజీలను కూడా ఆయన మొహాన్నే కొట్టేద్దాం. 240 00:14:28,076 --> 00:14:29,077 ఛ. 241 00:14:30,787 --> 00:14:32,247 మేము కేరీ ఎవరెట్ తో మాట్లాడినప్పుడు, 242 00:14:32,331 --> 00:14:34,917 ఆమె పక్కాగా చెప్పిన మొదటి విషయం ఏంటంటే, న్యూ ఆర్లీన్స్ ని హరికేన్ కత్రినా తాకినప్పుడు 243 00:14:34,917 --> 00:14:38,128 తన భర్త ఎమ్మెట్ మరణించే స్థితిలో లేరట. 244 00:14:38,212 --> 00:14:40,047 మిసెస్ ఎవరెట్, తుఫాను తాకినప్పుడు, 245 00:14:40,047 --> 00:14:41,798 మీ భర్త చావుబతుకుల మధ్య ఉన్నారా? -లేదు. 246 00:14:41,882 --> 00:14:43,467 వాళ్లు ఆయన్ని తరలించడానికి సుముఖత చూపలేదంటారా? 247 00:14:43,467 --> 00:14:46,345 నిజాయితీగా మాట్లాడుకుందాం. ఆయన ఏడవ అంతస్థులో ఉన్నాడు. 248 00:14:46,345 --> 00:14:51,308 ఆయన బరువు 172.4 కేజీలు. అంత బరువు ఉన్నప్పుడు ఏడవ అంతస్థు నుండి కిందికి మోసుకురావాలని, 249 00:14:51,308 --> 00:14:53,936 ఆ క్రమంలో దెబ్బలు తగిలించుకోవాలని ఎవరికైనా ఉంటుందా? 250 00:14:53,936 --> 00:14:57,022 ఆయన చావడానికి బరువే కారణమని మీకు అనిపిస్తోందా? 251 00:14:57,022 --> 00:14:59,191 అవును, నాకు అదే కారణమని అనిపిస్తోంది. 252 00:14:59,191 --> 00:15:00,984 తుఫాను వలన... -ఇది మంచిదే. 253 00:15:01,068 --> 00:15:03,570 టెనెట్, మెమోరియల్ పైన కేసులకు పబ్లిసిటీ కూడా లభిస్తోంది. 254 00:15:04,279 --> 00:15:05,572 మరి ఇప్పటిదాకా ఎంత మంది కేసులు వేశారు? 255 00:15:05,656 --> 00:15:09,034 ఆ విషయం నాకు తెలుసుగా, ఎమ్మెట్ ఎవరెట్, ఆలీస్ హజ్లర్, రోస్ శవ్వా, 256 00:15:09,034 --> 00:15:12,746 ఇంకా హాలిస్ ఆల్ఫర్డ్ కుటుంబాలు. -మీరు దాన్ని హత్యగా భావిస్తున్నారా? 257 00:15:12,746 --> 00:15:15,374 అవును. అది ముమ్మాటికీ హత్యే. 258 00:15:15,374 --> 00:15:16,750 న్యూ ఆర్లీన్స్ నుండి రిపోర్టింగ్... 259 00:15:16,834 --> 00:15:20,045 కుటుంబ సభ్యులు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, కేసులు వేస్తున్నారు. 260 00:15:20,045 --> 00:15:24,049 అది మనకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకువస్తోంది. 261 00:15:24,716 --> 00:15:26,844 కానీ వాళ్లు చేప్పేది సత్యం కాదు. 262 00:15:26,844 --> 00:15:30,097 హా, నాకు తెలుసు, కానీ కుటుంబ సభ్యులు అంటే అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు. 263 00:15:30,097 --> 00:15:31,849 దాన్ని ఎదిరించడానికి మనమొక మార్గం కనిపెట్టాలి. 264 00:15:32,850 --> 00:15:33,851 మార్గం అంటే? 265 00:15:36,144 --> 00:15:37,563 మీరు "60 మినిట్స్"షోలో పాల్గొనాలి. 266 00:15:38,605 --> 00:15:39,731 వాళ్లు ఆసక్తిగా ఉన్నారు. 267 00:15:40,232 --> 00:15:43,193 మీ కథనాన్ని స్వయంగా మీరే చెప్పడానికి మీకు ఇది ఒక అవకాశం. 268 00:15:45,195 --> 00:15:46,613 "60 మినిట్స్"? 269 00:15:46,697 --> 00:15:48,574 మీరు అందులో ధీటుగా వ్యవహరించగలరని నాకు తెలుసు. 270 00:15:48,574 --> 00:15:50,367 వాళ్లు నా వృత్తి జీవితానికి ముగింపు పలికేస్తారేమో. 271 00:15:53,829 --> 00:15:57,207 మీ ఉద్దేశం నాకు ఎలా అయితే అర్థమైందో, అలాగే ప్రపంచానికి అంతటికీ అర్థం కావడానికి ఇది మార్గం కావచ్చు. 272 00:16:01,128 --> 00:16:02,129 ఒకసారి ఆలోచించండి. 273 00:16:19,646 --> 00:16:22,733 నేను వాళ్లతో మాట్లాడితే, నా మాటలను వారు వక్రీకరించవచ్చు. 274 00:16:23,817 --> 00:16:25,319 నువ్వు నిర్దోషివి, ఆనా. 275 00:16:25,903 --> 00:16:28,280 నీ వ్యక్తిత్వం ఏంటో వాళ్లకి తెలియాలి. 276 00:16:29,781 --> 00:16:31,283 నీ గురించి వాళ్లకి తెలియాలి. 277 00:16:31,992 --> 00:16:37,497 నువ్వు అందరినీ ప్రేమగా చూసుకుంటావని. ఏ తప్పూ చేయలేదని వాళ్లకి తెలియాలి. 278 00:16:57,559 --> 00:16:59,353 సరే మరి, మిత్రులారా. 279 00:17:19,790 --> 00:17:23,085 ఈ వేసవిలో, లూసియానా అటార్నీ జనరల్, మెమోరియల్ ఆసుపత్రిలో చనిపోయిన వారిలో 280 00:17:23,167 --> 00:17:25,963 నలుగురు రోగులు చనిపోయింది అనారోగ్యం వల్లనో, లేకపోతే భయంకరమైన పరిస్థితుల వల్లనో కాదని 281 00:17:25,963 --> 00:17:30,092 ఆరోపణలు చేసి నగరంలోని యావత్ ప్రజానీకాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. 282 00:17:30,092 --> 00:17:33,345 ఈ రాత్రి మొట్టమొదటిసారిగా, ఆరోపణలను ఎదుర్కొంటున్న వారేమంటారో మనం వినబోతున్నాం. 283 00:17:34,972 --> 00:17:39,393 నేను ఇక్కడ కూర్చొని, నేషనల్ టీవీలో దీని గురించి మాట్లాడుతున్నానంటే 284 00:17:39,393 --> 00:17:43,647 నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 285 00:17:44,982 --> 00:17:49,444 నేనేమీ హంతకురాలిని కాదని అందరికీ తెలియజేస్తున్నాను. 286 00:17:50,028 --> 00:17:53,031 మిమ్మల్ని అందరూ ఒక గొప్ప డాక్టరుగా చూస్తారు, అలాంటిది ఇప్పుడు 287 00:17:53,115 --> 00:17:57,244 చట్టం దృష్టిలో నేరస్థులుగా ఉన్నారు. అది మీపై ఎలాంటి ప్రభావం చూపింది? 288 00:17:58,203 --> 00:18:02,624 అది నన్ను ఎంతగానో కృంగదీసింది, 289 00:18:03,125 --> 00:18:08,338 ఎందుకంటే, నా జీవితాంతం నేను మంచి చేయడానికే ప్రయత్నించాను. 290 00:18:08,922 --> 00:18:11,175 నేను ఎదిగాక, జీవితమంతా... -తన మాటలు కదిలించేస్తున్నాయి. 291 00:18:11,175 --> 00:18:13,260 నా శక్తినంతా... -అవును. 292 00:18:13,260 --> 00:18:16,180 ...నా రోగులను చూసుకోవడానికే నేను ధారపోస్తూ వచ్చాను. 293 00:18:16,180 --> 00:18:17,389 జనాలు చనిపోతూ ఉన్నారా? 294 00:18:18,140 --> 00:18:19,600 అవును, జనాలు చనిపోతూ ఉన్నారు. 295 00:18:19,600 --> 00:18:22,561 వారి అనారోగ్యం వల్లనా లేకపోతే వారు ఉన్న పరిస్థితుల వల్లనా? 296 00:18:22,561 --> 00:18:27,441 ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాళ్లు ఉన్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 297 00:18:27,441 --> 00:18:29,359 పైగా చాలా వేడిగా కూడా ఉంది, 298 00:18:29,443 --> 00:18:32,404 దానికి తోడు, మేము సాధారణంగా ఉపయోగించే పరికరాలన్నీ మాకు అందుబాటులో లేకుండా పోయాయి. 299 00:18:32,404 --> 00:18:35,824 కాబట్టి, జనాలు ఆ భయంకరమైన పరిస్థితుల కారణంగానే చనిపోతూ ఉన్నారు, 300 00:18:35,908 --> 00:18:38,368 ఎందుకంటే, వాటిని తట్టుకొనేంత సామర్థ్యం వారిలో లేదు. 301 00:18:38,452 --> 00:18:40,662 దేవుడా. -శవాలు పేరుకుపోతూనే ఉన్నాయి. 302 00:18:40,746 --> 00:18:42,789 ప్రార్థనా మందిరం కాస్తా శ్మశానంగా మారిపోయింది. 303 00:18:42,873 --> 00:18:47,002 తుపాకీ కాల్పుల శబ్దాలు వినబడసాగాయి. దోపిడీ దొంగలు ఎక్కడ చొరబడతారో అని భయాందోళనలు ఉన్నాయి. 304 00:18:47,002 --> 00:18:50,631 ఇక మీరు ఏమీ చేయలేరు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? 305 00:18:52,466 --> 00:18:57,387 మీకు నా గురించి తెలీదు కాబట్టి, నేనెంత పట్టుదల గల దాన్నో మీకు తెలీదు. 306 00:18:59,181 --> 00:19:00,933 నాకు తెలిసి ఒక్కరు కూడా ఆశ వదులుకోలేదు. 307 00:19:00,933 --> 00:19:04,019 నేను ఆశ వదులుకోలేదని మీకు పక్కాగా చెప్పగలను ఎందుకంటే, 308 00:19:04,019 --> 00:19:08,941 ఒక క్యాన్సర్ స్పెషలిస్టుగా నేనే రోగులకు ఆశని ఇస్తుంటాను. 309 00:19:10,025 --> 00:19:11,026 నేనే ఆ ఆశను. 310 00:19:11,610 --> 00:19:16,198 కారుణ్య మరణాలకు పాల్పడేంత కఠిన గుండె తనకు లేదని కూడా ఆమె చెప్పారు. 311 00:19:16,198 --> 00:19:18,825 మందులను ఎక్కువ మోతాదులో ఇచ్చి చంపే పద్ధతిని నేను నమ్మను. 312 00:19:18,909 --> 00:19:25,332 రోగి ఎప్పుడు చనిపోవాలో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని నా అభిప్రాయం. 313 00:19:25,874 --> 00:19:30,254 కానీ, నేను బాధను దూరం చేసే సేవను నమ్ముతాను. 314 00:19:30,254 --> 00:19:35,384 అంటే, వారు వేదనకు గురికాకుండా మేము చూసుకుంటాం. 315 00:19:35,384 --> 00:19:40,055 నేను ముందే చెప్పినట్టుగా, వారికి బాధ తెలీకుండా చేయడం నా విధి. 316 00:19:40,681 --> 00:19:42,766 డాక్టర్ పౌ ఇంకా, నర్సుల విషయానికి వస్తే, 317 00:19:42,850 --> 00:19:46,520 వారికి యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది, 318 00:19:46,520 --> 00:19:50,566 అలాగే ఇక జీవితంలో వైద్య వృత్తి వైపు కన్నెత్తి చూసే అవకాశం వారికి లభించకపోవచ్చు. 319 00:19:50,566 --> 00:19:52,025 ఆ విషయమే 320 00:19:53,735 --> 00:20:00,701 నన్ను తీవ్రంగా బాధిస్తూ ఉంది. 321 00:20:02,244 --> 00:20:04,913 నాకు నిబద్ధత చాలా ఎక్కువ, నా పని అంటే నాకు చాలా ఇష్టం. 322 00:20:04,997 --> 00:20:09,251 అంటే, నాకు నా పనంటే నిజంగా చాలా ఇష్టం. అది నా జీవితంలో నాకు దక్కిన వరమని చెప్పవచ్చు. 323 00:20:10,919 --> 00:20:12,379 నాకు అత్యంత ఇష్టమైన విషయం 324 00:20:13,630 --> 00:20:18,093 ఇక నా నుండి దూరం అయిపోతుందేమో అనే విషయం, 325 00:20:18,177 --> 00:20:20,262 దాని ద్వారా ఎంతో మంచి చేసే అవకాశం నాకు దూరమైపోతుందేమో అనే విషయం, 326 00:20:21,013 --> 00:20:24,766 నన్ను చాలా అంటే చాలా బాధించింది. 327 00:20:29,104 --> 00:20:31,982 ఓ విషయం తెలుసా? తుది పాథాలజీ రిపోర్టులు వచ్చేశాయి. 328 00:20:32,566 --> 00:20:34,651 అబ్బా. ముందు ఒక కప్పు కాఫీ తాగే అవకాశం ఇక నాకు దక్కనట్టేనా? 329 00:20:34,735 --> 00:20:36,069 దక్కనట్టే. -సరే. 330 00:20:36,153 --> 00:20:37,821 బేడెన్, ఇంకా వెక్ట్, వాళ్లు మిన్యార్డ్ ఆఫీసులో 331 00:20:37,905 --> 00:20:39,656 ఏదైతే అన్నారో, అదే లిఖితపూర్వకంగా నిర్దారించారు. 332 00:20:39,740 --> 00:20:43,035 బేడెన్ విశ్లేషణ ప్రకారం, "లైఫ్ కేర్ లో సంభవించిన తొమ్మిది మరణాలకు కారణం మందులు ఎక్కువగా ఎక్కించడం." 333 00:20:43,035 --> 00:20:44,953 వెక్ట్ 29 మరణాలను విశ్లేషించాడు, 334 00:20:45,037 --> 00:20:47,623 ఆ మరణాలన్నీ మందులు ఎక్కువగా ఎక్కించడం ద్వారానే సంభవించాయని ఆయన తేల్చారు. 335 00:20:47,623 --> 00:20:49,625 ఇంకా, డాక్టర్ ఫ్రాంక్ బర్షియా నుండి మనకి ఇంకొన్ని రిపోర్టులు వచ్చాయి. 336 00:20:49,625 --> 00:20:50,959 "తొమ్మిది కేసులలో హత్యలు జరిగాయి." 337 00:20:51,043 --> 00:20:52,252 ఇంకా అమెరికన్ అకాడమ్ ఆఫ్ ఫొరెన్సిక్ సైన్సెస్ కి 338 00:20:52,336 --> 00:20:55,214 ప్రెసిడెంట్ అయిన డాక్టర్ జేమ్స్ యంగ్ ఈ అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. 339 00:20:55,214 --> 00:20:57,966 "ఈ రోగులందరూ అంతకు ముందు రోజుల్లో ఉండిన తీవ్రమైన పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచారు, 340 00:20:58,050 --> 00:20:59,635 అలాంటప్పుడు, మూడున్నర గంటల వ్యవధిలో 341 00:20:59,635 --> 00:21:02,721 మందులు ఎక్కువగా ఇవ్వడం వలన ఆ అంతస్థులో ఉన్న రోగులందరూ చనిపోవడం కాకతాళీయం కానే కాదు." 342 00:21:03,305 --> 00:21:04,306 ఇది ఎవరూ ప్రశ్నించలేనిది. 343 00:21:05,182 --> 00:21:08,894 అలా ఏమీ లేదు. ప్రశ్నించలేనిదంటూ ఏమీ ఉండదు. 344 00:21:08,894 --> 00:21:11,522 శవాల స్థితి గురించి, అలాగే మందులు ప్రాణాంతక స్థాయిలో ఇచ్చారన్న 345 00:21:11,522 --> 00:21:13,440 ఫోటీ వాదనలను వారు సవాలు చేస్తారు... 346 00:21:13,524 --> 00:21:16,818 కానీ, వైద్య వృత్తిలోని అగ్ర నిపుణుల్లో నలుగురు, ఇవి హత్యలే అని చెప్తున్నారు. 347 00:21:17,736 --> 00:21:18,904 అవును. 348 00:21:20,322 --> 00:21:21,949 నీకు ఇంకా ఏం కావాలి, బచ్? 349 00:21:22,699 --> 00:21:23,700 ఇది నా గురించి కాదు. 350 00:21:25,410 --> 00:21:27,496 ఏంటి? వీళ్ళు హత్యకు గురయ్యారు అన్నది నా అభిప్రాయం అంటావా? 351 00:21:27,496 --> 00:21:29,164 అవును, అందులో మరో మాట కూడా లేదు. 352 00:21:29,665 --> 00:21:31,333 కానీ నేనేం చెప్తున్నానంటే, 353 00:21:31,333 --> 00:21:33,085 ఇక్కడ ఆధారాలు ఉంటేనే పని జరిగిపోతుందనుకుంటే అది పొరపాటే. 354 00:21:33,085 --> 00:21:34,670 ఎందుకు? పౌ "60 నిమిషాల" షోలో పాల్గొంది కదా, అందుకా? 355 00:21:34,670 --> 00:21:36,672 అవును, పైగా తాను బాగా మాట్లాడింది కూడా. 356 00:21:36,672 --> 00:21:39,258 ఒక టీవీ షో దీనిపై ప్రభావం ఎలా చూపుతుంది? -అది ప్రభావం చూపదు అనుకుంటున్నావా? 357 00:21:39,258 --> 00:21:40,801 లేదు. -సరే. 358 00:21:40,801 --> 00:21:42,511 ఈ నగరంలోని జనాలు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారు, 359 00:21:42,511 --> 00:21:46,390 "ఒక గొప్ప డాక్టర్ అయిన ఆనా పౌ జైలుకు ఎందుకు వెళ్లాలి? 360 00:21:47,224 --> 00:21:51,603 ఎన్నో తప్పులు జరిగాయి, కానీ ఆమె ఒక్కరే ఎందుకు బలి అవ్వాలి?" 361 00:21:53,272 --> 00:21:54,398 ఎవరు అరెస్ట్ అవ్వలేదో చెప్పనా? 362 00:21:54,398 --> 00:21:56,024 కార్పొరేట్ సంస్థలోని ఒక్కరు కూడా అరెస్ట్ కాలేదు. 363 00:21:56,775 --> 00:21:59,319 టెనెట్ నుండి గానీ, లైఫ్ కేర్ నుండి గానీ ఒక్కరు కూడా అరెస్ట్ కాలేదు. 364 00:22:00,487 --> 00:22:01,947 మరి ప్రభుత్వ అధికారుల విషయమేంటి? 365 00:22:01,947 --> 00:22:04,491 గవర్నర్ బ్లాంకో ఎందుకు అరెస్ట్ కాలేదు? మేయర్ నేగిన్ ఎందుకు అరెస్ట్ కాలేదు? 366 00:22:04,575 --> 00:22:07,369 వాళ్లే కదా నాయకులు. వాళ్లే కదా ఇన్ ఛార్జులు! 367 00:22:09,788 --> 00:22:11,832 మనం ఈ ప్రశ్నలన్నింటినీ అధిగమించాల్సి ఉంటుంది. 368 00:22:19,298 --> 00:22:21,925 చూడు, నన్ను క్షమించు... నేను... 369 00:22:22,009 --> 00:22:23,719 నేను ప్రాక్టికల్ గా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాను, 370 00:22:23,719 --> 00:22:25,804 అప్పుడే మనం దీన్ని ఎలా అధిగమించగలమో ఆలోచించగలం. 371 00:22:26,930 --> 00:22:28,182 సరే, మరి నువ్వు ఏం చేయాలంటావు మరి? 372 00:22:28,182 --> 00:22:31,518 ముందు ఆ ఫోరెన్సిక్ ఆధారాన్ని అంతటినీ మొరాలెస్ కి పంపించేద్దాం, 373 00:22:31,602 --> 00:22:33,896 దానికి ఒక పెద్ద గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేయించి పంపించు. 374 00:22:34,938 --> 00:22:36,106 అలాగే. 375 00:22:42,112 --> 00:22:47,367 అభినందనలు, ఆనా. మీరు చాలా బాగా మాట్లాడారు. అది చాలా ప్రయోజనకరం అయింది, 376 00:22:47,910 --> 00:22:49,578 మీరు అన్నది నిజమైతే బాగుండు. -అది నిజమే. 377 00:22:49,578 --> 00:22:51,413 నేను అనేక మెడికల్ గ్రూపులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నా. 378 00:22:51,955 --> 00:22:54,333 మద్దతు ఇస్తామంటూ ప్రకటనలు వెల్లువై వస్తున్నాయి. 379 00:22:54,333 --> 00:22:55,417 సరే, ఇది వినండి. 380 00:22:55,501 --> 00:22:57,836 లూసియానా స్టేట్ మెడికల్ సొసైటీ నుండి ఇప్పుడే ఇది వచ్చింది. 381 00:22:57,920 --> 00:23:01,715 "అత్యంత భయంకరమైన, ఇంకా దారుణమైన పరిస్థితుల్లో డాక్టర్ పౌ ఎంతో స్థైర్యంతో పని చేసిందని, 382 00:23:01,715 --> 00:23:04,009 అలాగే రోగులకు ఏది మంచిదో, అది దృష్టిలో ఉంచుకొనే నిర్ణయాలు తీసుకుందని 383 00:23:04,009 --> 00:23:07,930 మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం." 384 00:23:07,930 --> 00:23:10,474 మెడికల్ సమాజం నీ పక్షాన నిలబడుతోంది. 385 00:23:11,058 --> 00:23:12,267 అది చాలా ఊరటను కలిగిస్తోంది. 386 00:23:12,351 --> 00:23:14,853 పరీష్ వైద్య పరిశీలకుడు, ఫ్రాంక్ మిన్యార్డ్ నుండి ఇప్పుడే నాకు కాల్ వచ్చింది. 387 00:23:14,937 --> 00:23:17,940 అతను, మీ ఇంటర్వ్యూ చూశాడు. మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. 388 00:23:18,565 --> 00:23:20,400 నేనెందుకు మాట్లాడాలి? 389 00:23:20,484 --> 00:23:22,819 ఇది చాలా మంచి విషయం. నా మాట నమ్మండి. 390 00:23:26,365 --> 00:23:27,199 పవిత్రమైన బైబిల్ 391 00:23:27,199 --> 00:23:29,076 మనం ఇప్పటి దాకా కలుసుకోలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 392 00:23:29,660 --> 00:23:32,955 మీ నాన్న నాకు బాగా తెలుసు. నిజానికి, మీ ఇంటికి నేను చాలా సార్లు వచ్చాను. 393 00:23:33,872 --> 00:23:35,290 అంటే, నేను 11 మంది పిల్లల్లో ఒక దాన్ని. 394 00:23:35,374 --> 00:23:38,919 కాబట్టి, మీ పక్క నుండే వెళ్లి ఉండవచ్చు, లేదా మీపై వాంతి చేసుకొని ఉండవచ్చు. 395 00:23:39,586 --> 00:23:40,754 అది కూడా జరిగి ఉండవచ్చు. 396 00:23:41,797 --> 00:23:43,382 మీ నాన్న చాలా గొప్ప వ్యక్తి. 397 00:23:43,382 --> 00:23:45,259 చాలా మంచి డాక్టర్ కూడా. -అవును. 398 00:23:45,259 --> 00:23:46,260 ఫ్రాంక్ మిన్యార్డ్, ఎం.డీ. వైద్య పరిశీలకులు 399 00:23:46,260 --> 00:23:48,679 నేను గైనకాలాజీ ప్రాక్టీసును మొదలుపెట్టినప్పుడు ఆయన మంచితనంతో 400 00:23:48,679 --> 00:23:51,598 నాకు చూపించుకోమని రోగులకు చెప్పేవాడు. 401 00:23:52,558 --> 00:23:55,269 నేను ఆయన్ని ఆదర్శంగా తీసుకొనే డాక్టరుని అయ్యా. 402 00:23:59,314 --> 00:24:00,774 మరి, దీన్నంతటినీ ఎలా ఎదుర్కొంటున్నావు? 403 00:24:02,192 --> 00:24:05,445 నిజం చెప్పాలంటే, నేను చాలా కష్టపడ్డాను. 404 00:24:05,529 --> 00:24:07,614 అవునులే. 405 00:24:11,201 --> 00:24:14,246 నువ్వు ఎంత కష్టం అనుభవించి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. 406 00:24:15,080 --> 00:24:17,749 తుఫాను సమయంలో, ఊరి నడి మధ్యలో ఉన్న నా ఆఫీసుకు 407 00:24:17,833 --> 00:24:21,420 నీళ్లలో నడిచి, ఈది, ఆ తర్వాత పడవలో లిఫ్టులు అడుగుకుంటూ వెళ్లేవాడిని. 408 00:24:21,420 --> 00:24:22,504 అయ్య బాబోయ్. 409 00:24:22,588 --> 00:24:24,173 నాలుగు రోజులు అక్కడే ఇరుక్కుపోయాను. 410 00:24:25,465 --> 00:24:29,845 ఆ సమయంలో ఆహారం, నీటి విలువ మనకు తెలిసొచ్చింది. -అవును. 411 00:24:29,845 --> 00:24:32,306 రాత్రి అయితే, తుపాకీ కాల్పుల శబ్దాలకు నాకు నిద్ర పట్టేది కాదు. 412 00:24:32,306 --> 00:24:33,724 మాకు కూడా ఆ శబ్దాలు వినిపించాయి. 413 00:24:33,724 --> 00:24:37,436 ఇక్కడ లేని జనాలకు అవేమీ అర్థం కావు. 414 00:24:37,436 --> 00:24:39,897 అవును, వాళ్లకి అస్సలు అర్థం కావు. -హా. 415 00:24:41,106 --> 00:24:45,777 నా దృష్టిలో నా పని కేవలం శవాలను పరీక్షించడం మాత్రమే కాదు. అది ఎవరైనా చేయగలరు. 416 00:24:46,737 --> 00:24:49,948 దేని కారణంగా చనిపోయారో నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. 417 00:24:52,492 --> 00:24:56,872 అందులో భాగమైన వ్యక్తులను అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాను, వీలైతే నేరుగా వాళ్లని కలుస్తాను. 418 00:25:01,376 --> 00:25:04,046 మన నగరాన్ని ఇప్పుడు అందరూ చాలా దారుణంగా చూస్తున్నారు. 419 00:25:04,046 --> 00:25:05,339 నాకు కూడా అదే అనిపిస్తోంది. 420 00:25:05,339 --> 00:25:08,634 కత్రినా కారణంగా నేను 650కు పైగా శవాలను పరీక్షించాను. 421 00:25:10,135 --> 00:25:13,263 ఆరు వందల యాభై. అది కూడా ఒక్క న్యూ ఆర్లీన్స్ లో మాత్రమే. 422 00:25:13,347 --> 00:25:14,598 అది అసలు ఊహకు కూడా అందని విషయం. 423 00:25:15,641 --> 00:25:18,060 ఆ అసుపత్రిలో నేను లేనందుకు, 424 00:25:19,311 --> 00:25:21,772 ఆ నిర్ణయాలు తీసుకొనే అవసరం నాకు రానందుకు దేవుడికి దండం పెట్టుకున్నాను. 425 00:25:24,024 --> 00:25:25,817 నువ్వు చేసిన పనులన్నింటికీ నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు. 426 00:25:31,323 --> 00:25:34,243 థ్యాంక్యూ. థ్యాంక్యూ. 427 00:25:56,640 --> 00:25:59,351 అద్భుతమైన రాక్ సంగీతానికి నెలవు అయిన, డబ్ల్యూ.వీ.ఎక్స్.టీ బేటన్ రూజ్ లో 428 00:25:59,351 --> 00:26:00,727 ఇప్పుడు మీరు విన్నది గ్రీన్ డే బ్యాండ్ పాట. 429 00:26:00,811 --> 00:26:02,855 ఇప్పుడు స్థానిక వార్తల ముఖ్యాంశాలను చూద్దాం. 430 00:26:03,397 --> 00:26:06,441 గతేడాది, తుఫాను సమయంలో మెమోరియల్ మెడికల్ సెంటరులో సంభవించిన 431 00:26:06,525 --> 00:26:09,111 నలభై అయిదు మరణాల విషయంలో 432 00:26:09,111 --> 00:26:11,738 అవి హత్యలు అని చెప్పడానికి ఏ ఆధారమూ లభించలేదని 433 00:26:11,822 --> 00:26:14,700 న్యూ ఆర్లీన్స్ వైద్య పరిశీలకులు, ఫ్రాంక్ మిన్యార్డ్ ఈ ఉదయం ఒక ప్రకటనను విడుదల చేశారు... 434 00:26:14,700 --> 00:26:16,368 హలో? 435 00:26:16,368 --> 00:26:18,120 మిన్యార్డ్ ఇప్పుడు ఏం ప్రకటించాడో విన్నావా? 436 00:26:18,120 --> 00:26:19,496 ఇప్పుడే విన్నాను. 437 00:26:19,580 --> 00:26:20,956 ఆధారాలేవీ లేవని ఎలా అంటాడు? 438 00:26:20,956 --> 00:26:23,584 నీకు ముందే చెప్పా కదా, అతను తనకి అనిపించిందే ప్రకటిస్తాడు అని. 439 00:26:23,584 --> 00:26:26,170 అది దారుణం! -హేయ్, ఎక్కడున్నావు? 440 00:26:26,753 --> 00:26:28,046 న్యూ ఆర్లీన్స్ కి వెళ్తున్నాను. 441 00:26:28,130 --> 00:26:30,174 వద్దు... వర్జీనియా, వద్దు, వద్దు... 442 00:26:31,008 --> 00:26:32,050 ఛ! 443 00:26:36,096 --> 00:26:38,849 ఆగండి! హేయ్! మీరు లోపలికి అలా వెళ్లిపోలేరు. 444 00:26:41,018 --> 00:26:41,935 హత్యలు జరిగాయి అన్నదానికి ఆధారాలు లేవు 445 00:26:42,019 --> 00:26:44,062 ఇలా మీరు ఎలా చేయగలరు? ఈ మాటలను ఎలా అనగలరు? 446 00:26:44,146 --> 00:26:47,149 ఈ సమయంలో డాక్టర్ పౌకు చాలా మద్ధతు ఉంది. 447 00:26:47,149 --> 00:26:51,778 ఇప్పుడు హత్య అని అందరి ముందూ ప్రకటించడం వలన సమస్యలకు తోడు ఇంకా చాలా దుష్పరిణామాలు జరగవచ్చు. 448 00:26:52,529 --> 00:26:54,573 అది మా నగరానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. 449 00:26:54,573 --> 00:26:57,701 మీరు నిజాన్ని కప్పి పెట్టారని జనాలకు తెలిస్తే అప్పుడు నగరంలో పరిస్థితి ఎలా ఉంటుందంటారు? 450 00:26:57,701 --> 00:26:59,620 ఒక విషయం చెప్పండి, మిస్ రైడర్. 451 00:26:59,620 --> 00:27:03,790 తర్వాతి సారి తుఫాను వచ్చినా, లేదా ఆ తర్వాతిసారి వచ్చినా అప్పుడు ఏం జరుగుతుందో చెప్పగలరా? 452 00:27:04,917 --> 00:27:06,668 ఎందుకంటే, అలాంటివి తప్పకుండా వస్తాయి. 453 00:27:06,752 --> 00:27:10,380 అప్పుడు మా ఆసుపత్రుల్లో పని చేయడానికి వైద్య సిబ్బంది ఎవరూ లేకపోతే ఏం జరుగుతుందో చెప్పగలరా? 454 00:27:10,464 --> 00:27:12,674 డాక్టర్లు కానీ, నర్సులు కానీ లేకపోతే. 455 00:27:12,758 --> 00:27:15,719 ఎందుకంటే, ఎమర్జెన్సీ సమయాల్లో ఏదైనా తప్పు జరిగితే వాళ్లని నేరస్థులు లాగా చూస్తారని 456 00:27:15,719 --> 00:27:17,304 వాళ్లు భయపడి రాకపోవచ్చు. 457 00:27:17,304 --> 00:27:18,639 అప్పుడు మా నగరం పరిస్థితి ఏంటి? 458 00:27:18,639 --> 00:27:21,683 ఈ నగరాన్ని డాక్టర్లు బెదిరిస్తారని అంటున్నారా? 459 00:27:22,309 --> 00:27:23,602 పని చేయడానికి నిరాకరిస్తారు అంటున్నారా? 460 00:27:23,602 --> 00:27:25,187 ఏదేమైనా, అది మీ పని కాదు కదా. 461 00:27:25,187 --> 00:27:26,647 నేను సగౌరవంగా మీ వాదనతో ఏకీభవించను. 462 00:27:26,647 --> 00:27:31,318 ముప్పై ఒక్క ఏళ్ల పాటు, నా వృత్తి జీవితమంతా ఈ నగరానికి ఏది మంచిదో అదే చేయడానికి అంకితం చేశాను. 463 00:27:31,318 --> 00:27:34,238 లేదు, మీ పని, మీ అసలైన పని, 464 00:27:34,238 --> 00:27:37,866 శాస్త్రీయపరమైన వాస్తవాల ఆధారంగా, సాక్ష్యాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. 465 00:27:38,534 --> 00:27:40,410 కాబట్టి మీ పని మీరు చేయండి. 466 00:27:41,870 --> 00:27:42,871 మీ బాధ్యతను నిర్వర్తించండి. 467 00:27:52,923 --> 00:27:55,926 దూరం నుండి చూస్తే, అది కూడా ఒక మామూలు అమెరికన్ నగరంలానే కనిపిస్తుంది, 468 00:27:55,926 --> 00:28:00,013 కానీ న్యూ ఆర్లీన్స్ ని ఇప్పుడు మళ్లీ సందర్శిస్తే, ఎంత మోసం జరిగిందో మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. 469 00:28:02,850 --> 00:28:05,978 చరిత్రలోనే కనీవిని ఎరుగని స్థాయిలో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడతామని అధ్యక్షుడు మాటిచ్చారు, 470 00:28:05,978 --> 00:28:08,230 కానీ ఈ అత్యంత బీద వాడలకు వచ్చి చూస్తే, 471 00:28:08,230 --> 00:28:11,275 ప్రభుత్వ సాయం మచ్చుకైనా లభించినట్టు మనకు ఎక్కడా కనిపించనే కనిపించదు. 472 00:28:11,275 --> 00:28:14,862 ఈ నగరంలోని ఇతర బీద వాడలు, నల్లజాతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల లాగానే తొమ్మిదవ వార్డును కూడా 473 00:28:14,862 --> 00:28:16,822 ఏమాత్రం పట్టించుకోకుండా అలా గాలికి వదిలేశారు. 474 00:28:17,406 --> 00:28:19,199 గమ్మత్తైన విషయం ఏంటంటే, 475 00:28:19,283 --> 00:28:22,619 భవిష్యత్తు గురించి ప్రశ్నించడానికి ఇక్కడ చాలా తక్కువ మంది మాత్రమే మిగిలి ఉన్నారు. 476 00:28:23,161 --> 00:28:26,415 తొమ్మిదవ వార్డు దిగువ ప్రాంతంలో పది వేల మందికి పైగా వ్యక్తులు తరలి వెళ్లిపోయారు, 477 00:28:26,415 --> 00:28:29,877 తుఫాను ముందుతో పోల్చితే, ఇప్పుడు కేవలం ఏడు శాతం జనాభా మాత్రమే మిగిలి ఉంది. 478 00:28:29,877 --> 00:28:33,422 అది చాలా అన్యాయం. అన్యాయమనే నాకు అనిపిస్తోంది. 479 00:28:33,422 --> 00:28:37,467 ఇంకెంత కాలం నేను ఇలా నెట్టుకురాగలనో నాకు తెలీదు. నేను కూడా అన్నీ సర్దేసుకొని ఇక్కడి నుండి వెళ్లిపోవాలేమో. 480 00:28:54,234 --> 00:28:57,279 సూపర్. నాకు మొదటి రౌండుకు స్పాన్సర్ చేస్తున్నావే. ఏం... 481 00:28:57,279 --> 00:28:58,488 నన్ను కలవడానికి వచ్చినందుకు థ్యాంక్స్. 482 00:28:59,364 --> 00:29:00,407 హేయ్, నువ్వు బాగానే ఉన్నావా? 483 00:29:03,076 --> 00:29:04,077 బచ్... 484 00:29:06,246 --> 00:29:07,915 ఇక ఈ కేసులో నేను కొనసాగలేను. 485 00:29:10,334 --> 00:29:12,544 ఇక్కడ రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమైంది. నేనేమీ వెర్రి దాన్ని కాదు. 486 00:29:12,628 --> 00:29:16,715 కానీ జనాలు వాస్తవాలను పట్టించుకోకుండా ఎలా ఉండగలరు అనేదే నాకు అర్థం కావట్లేదు. 487 00:29:16,715 --> 00:29:22,137 ఇక నేను... నేను ఇదంతా భరించలేకపోతున్నాను. 488 00:29:24,306 --> 00:29:27,935 చూడు, నేను అతిగా స్పందించాను. మన కేసు ఇప్పుడు చాలా బలంగా ఉంది. 489 00:29:27,935 --> 00:29:31,271 లేదు. నువ్వు ఇంతకు ముందు చెప్పింది నిజమే. 490 00:29:31,355 --> 00:29:34,316 ఇక్కడ నిజానిజాల కన్నా తెర వెనుక చాలా తతంగం నడుస్తుంది, 491 00:29:34,316 --> 00:29:35,901 దాన్ని నేను గ్రహించాలి. 492 00:29:37,819 --> 00:29:39,404 నీ మాటను నేను విని ఉండాల్సింది, కానీ... 493 00:29:41,448 --> 00:29:43,825 ఇప్పుడు నాకు ఇది ఎలా ముగుస్తుందో అర్థమైంది కాబట్టి, నేను విరమించుకోవడమే మేలు, 494 00:29:43,909 --> 00:29:45,536 లేకపోతే నాకు పిచ్చి ఎక్కిపోతుంది. -లేదు, వర్జీనియా. 495 00:29:45,536 --> 00:29:46,703 లేదు, నేను నీలా ఉండలేను. 496 00:29:49,081 --> 00:29:50,082 నేను... 497 00:29:53,377 --> 00:29:56,046 దీన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండలేకపోతున్నాను. 498 00:29:57,297 --> 00:29:58,757 అది నన్ను చిత్రవధ చేసేస్తోంది. 499 00:30:04,429 --> 00:30:06,765 నీతో కలిసి పని చేసిన ప్రతీ క్షణం నాకు గుర్తు ఉండిపోతుంది, బచ్. 500 00:30:10,435 --> 00:30:11,645 కానీ ఇక నా వల్ల కాదు. 501 00:30:16,650 --> 00:30:20,445 ఈ విషయంలో నీతో వాదించి ఒప్పించనా? -వద్దు, అలా చేయకు. 502 00:30:20,529 --> 00:30:21,822 ఇప్పటికే నేను చాలా ఎమోషనల్ గా ఉన్నాను. 503 00:30:24,908 --> 00:30:26,410 మనిద్దరి జట్టు చాలా బాగుంటుంది. 504 00:30:42,843 --> 00:30:44,761 హరికేన్ కత్రినా వెళ్లిపోయిన 18 నెలల తర్వాత 505 00:30:44,845 --> 00:30:46,847 ఫిబ్రవరి 20, 2007 506 00:30:58,358 --> 00:30:59,568 వైద్య పరిశీలకుడు ఫ్రాంక్ మిన్యార్డ్ 507 00:31:04,948 --> 00:31:07,784 సర్, మీ కోసం దాదాపుగా అందరూ సిద్ధంగా ఉన్నారు. 508 00:31:18,253 --> 00:31:19,171 థ్యాంక్యూ. 509 00:31:23,550 --> 00:31:25,636 ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. 510 00:31:26,678 --> 00:31:29,014 గతంలో నేను చేసిన ప్రకటనపై మరింత స్పష్టతను ఇవ్వాలనుకుంటున్నాను. 511 00:31:29,806 --> 00:31:32,768 మెమోరియల్ హాస్పిటల్ లో సంభవించిన మరణాలపై అప్పటిదాకా జరిగిన విచారణలో భాగంగా 512 00:31:33,352 --> 00:31:36,063 హత్యలు జరిగాయని ఆధారాలేవీ లేవని నేను అన్నప్పుడు, 513 00:31:36,063 --> 00:31:38,607 మెమోరియల్ లో రోగులు చనిపోయిన విధానాన్ని 514 00:31:38,607 --> 00:31:41,276 హత్యలుగా పరిగణించలేము అని చెప్పడం నా ఉద్దేశం కాదు. 515 00:31:42,027 --> 00:31:46,406 దాన్ని ఇంకా నిర్ధారించవలసి ఉంది, దానిపై మరింత దర్యాప్తు జరగనుంది, 516 00:31:46,907 --> 00:31:50,953 అలాగే దానిపై నేను ప్రత్యేకమైన గ్రాండ్ జ్యూరికీ ప్రెజెంటేషన్ ని కుడా ఇవ్వనున్నాను. 517 00:31:50,953 --> 00:31:52,037 థ్యాంక్యూ. 518 00:31:53,664 --> 00:31:55,415 ప్రత్యక్ష ప్రసారం: వైద్య పరిశీలకులు, మిన్యార్డ్ మీడియా సమావేశం 519 00:31:55,499 --> 00:31:58,961 ఆయన అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట ఎలా చెప్పగలడు? 520 00:31:59,711 --> 00:32:00,712 ఏమో మరి. 521 00:32:00,796 --> 00:32:03,423 ...హత్యలు జరగలేదని చెప్పలేమని ఇప్పుడు అంటున్నారు. 522 00:32:03,507 --> 00:32:04,591 నేను పని చేయడానికి వెళ్తాను. 523 00:32:05,384 --> 00:32:08,846 బంగారం, నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉంటే మంచిదేమో. 524 00:32:08,846 --> 00:32:12,474 మరేం చేయమంటావు? ఊరికే కూర్చొని, నా చేతిలో లేని దాని గురించి భయపడుతూ ఉండమంటావా? 525 00:32:12,558 --> 00:32:15,686 లేదు, పోనీ ఓ పని చేద్దామా? ఇద్దరం ఎక్కడికైనా వెళ్దామా? 526 00:32:16,186 --> 00:32:18,480 ఏమంటావు? కేవలం మనిద్దరమే. ఫ్లోరిడాకి వెళ్దాం. 527 00:32:18,564 --> 00:32:21,900 బీచ్ లో సరదాగా గడుపుతున్నప్పుడు నా ఫోటో ఎవరైనా తీస్తే, ఇక అంతే నా పని. 528 00:32:23,360 --> 00:32:25,946 విన్స్, నువ్వు నా మంచి కోసమే ఇలా అంటున్నావని నాకు తెలుసు, కానీ నేను అలా ఉండలేను. 529 00:32:25,946 --> 00:32:27,656 నా... నా గురించి నీకు తెలుసు. 530 00:32:27,656 --> 00:32:30,659 నేను ఏదోక పని చేస్తూ ఉండాలి. లేకపోతే పిచ్చి ఎక్కిపోతుంది. 531 00:32:39,585 --> 00:32:40,627 అందరూ కూర్చోండి. 532 00:32:45,299 --> 00:32:47,301 గుడ్ మార్నింగ్. -గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 533 00:32:47,301 --> 00:32:49,136 సోదరసోదరీమణులారా, న్యూ ఆర్లీన్స్ పరీష్ కి 534 00:32:49,136 --> 00:32:52,723 ప్రత్యేకమైన గ్రాండ్ జ్యూరీ సభ్యులుగా మీరు ఎంచుకోబడ్డారు. 535 00:32:53,765 --> 00:32:55,392 ఇప్పుడు, మీకు ఆధారాలను చదివి వినిపిస్తారు, 536 00:32:55,392 --> 00:32:57,436 అలాగే డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసు వాళ్లు మీకు అందించే సమచారం ఆధారంగా 537 00:32:57,436 --> 00:32:59,438 మీరు నిర్ణయం తీసుకోవాలి. 538 00:33:00,856 --> 00:33:02,649 ఇక్కడ విచారణ జరగడం లేదు. 539 00:33:03,317 --> 00:33:06,528 ఇరు పక్షాల నుండి ఉద్రేకంతో కూడిన వాదనలు ఇక్కడ ఉండవు. 540 00:33:07,029 --> 00:33:10,115 అలా కాకుండా, ఈ కేసు విషయంలో డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసు వాళ్లు 541 00:33:10,199 --> 00:33:13,619 ఏ సమాచారాన్ని అయితే సేకరించారో, దాన్ని మీకు అందిస్తారు. 542 00:33:14,119 --> 00:33:19,416 వాళ్లు, ఇంకా నేను మీకు సూచనలు ఇస్తాము, మిమ్మల్ని కోరినప్పుడు మీరు నిర్ణయం చెప్పాలి. 543 00:33:20,542 --> 00:33:24,796 ఇక్కడ జరిగేదంతా మీరు రహస్యంగా ఉంచాలి. అర్థమైందా? 544 00:33:24,880 --> 00:33:26,548 అర్థమైంది, యువర్ హానర్. 545 00:33:27,049 --> 00:33:29,635 అయితే, ఇప్పటి నుండి మీ సర్వీస్ మొదలైంది. 546 00:33:32,638 --> 00:33:35,098 వాళ్లు నిర్ణయం తీసుకొనే దాకా మనకి ఏమీ తెలీదు. 547 00:33:35,766 --> 00:33:41,730 ఆ నాలుగు గోడల మధ్య వాళ్లు చేసేదంతా రహస్యంగా ఉంటుంది. మొత్తం. 548 00:33:44,024 --> 00:33:49,446 ఈ ప్రపంచంలో అత్యంత నరకప్రాయమైనది ఏదైనా ఉందని మీరు అడిగితే, 549 00:33:51,323 --> 00:33:52,616 నేను ఇదే అని చెప్తాను. 550 00:33:54,117 --> 00:33:55,118 హా. 551 00:33:56,495 --> 00:34:01,124 తీర్పు ఏదైనా కానీ, విచారణ జరిగితే నా జీవితం నాశనం అయిపోతుంది, రిక్. 552 00:34:03,585 --> 00:34:05,087 నేనేం చేయాలి? 553 00:34:10,092 --> 00:34:11,342 అందరూ వినండి. 554 00:34:12,386 --> 00:34:13,428 ఈమె పేరు మాయా. 555 00:34:13,512 --> 00:34:17,391 ఈమెకి 49 ఏళ్లు, త్రోట్ క్యాన్సర్ ఈమెకి రావడం ఇది మొదటిసారి కాదు. 556 00:34:17,975 --> 00:34:20,686 ఈ ఆపరేషన్ కి మనకి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది, 557 00:34:20,768 --> 00:34:24,231 కాబట్టి అందరూ ఏకాగ్రతగా ఉండాలి. 558 00:34:24,313 --> 00:34:25,482 సరే. 559 00:34:25,482 --> 00:34:29,402 దేవుని సహాయంతో, మనం మన వంతు కృషి చేద్దాం. 560 00:34:29,402 --> 00:34:30,821 ఆమెన్. 561 00:34:42,583 --> 00:34:46,753 డాక్టర్ పౌ, ఇవాళ మీరు ఆపరేషన్ చాలా చక్కగా చేశారు. 562 00:34:49,005 --> 00:34:51,175 నేనొక్క దాన్నే కాదు, అందరం బాగా చేశాం. 563 00:34:52,634 --> 00:34:56,929 డాక్టర్, మీ డిఫెన్స్ ఫండుకు నేను కూడా నా వంతు సహకారం అందించాను. 564 00:34:59,224 --> 00:35:02,811 మోనికా. థ్యాంక్యూ. 565 00:35:03,395 --> 00:35:05,522 మీలా కావాలన్నదే నా ఆశయం కూడా. 566 00:35:07,107 --> 00:35:08,650 మీకు అంతా మంచే జరగాలని ప్రార్థిస్తున్నాను. 567 00:35:11,862 --> 00:35:15,949 థ్యాంక్యూ. నేను కూడా అదే ప్రార్థించుకుంటున్నాను. 568 00:35:20,996 --> 00:35:23,957 హరికేన్ కత్రినా వెళ్లిపోయిన 23 నెలల తర్వాత 569 00:35:24,041 --> 00:35:27,753 జూలై 24, 2007 570 00:35:37,304 --> 00:35:40,224 జ్యూరీ సభ్యులారా, పునఃస్వాగతం. 571 00:35:40,224 --> 00:35:41,975 దైవ చట్టానికి లోబడి మానవ చట్టాలు పని చేస్తాయి. 572 00:35:42,059 --> 00:35:44,686 లూసియానా రాష్ట్రం తరఫున మైఖెల్ మొరాలెస్ ని అయిన నేను హాజరు అయ్యాను. 573 00:35:44,770 --> 00:35:47,272 ఈ విషయంలో గ్రాండ్ జ్యూరీ సభ్యులు వ్యాఖ్య చేయాలనుకుంటున్నారు, యువర్ హానర్. 574 00:35:47,356 --> 00:35:49,316 ఆనా పౌ కేసులో, 575 00:35:49,316 --> 00:35:52,236 ఆమె పది కౌంట్ల నేరానికి పాల్పడ్డారా లేదా అనే విషయాన్ని పరిగణించమని మిమ్మల్ని కోరడం జరిగింది. 576 00:35:52,819 --> 00:35:54,488 ఒక కౌంట్ హత్యా నేరం, 577 00:35:54,488 --> 00:35:58,116 తొమ్మిది కౌంట్లు, హత్య చేయాలని కుట్రపూరితంగా వ్యవహరించారనే నేరం. 578 00:35:58,784 --> 00:35:59,910 మీ మీ నిర్ణయం ఏంటి? 579 00:36:21,014 --> 00:36:25,561 ఈ పది కౌంట్లలోనూ "నేరాలకు పాల్పడినట్లుగా అనిపించడం లేదు," అని రాశారు. 580 00:36:25,561 --> 00:36:26,812 అంతేనా? 581 00:36:27,396 --> 00:36:28,689 అవును, యువర్ హానర్. 582 00:36:29,189 --> 00:36:33,735 సరే మరి. ఇంతటితో ఈ విషయం, అలాగే మీ సర్వీస్ కూడా ముగుస్తుంది. 583 00:36:34,820 --> 00:36:37,239 వివాదాస్పద క్రిమినల్ కేసుకు సంబంధించి ఇప్పుడే అందిన తాజా వార్త. 584 00:36:37,239 --> 00:36:39,116 తీవ్ర అస్వస్థతో ఉన్న రోగులను చంపారనే ఆరోపణలను 585 00:36:39,116 --> 00:36:42,411 ఎదుర్కొంటున్న డాక్టర్ నిర్దోషి అని న్యూ ఆర్లీన్స్ లోని గ్రాండ్ జ్యూరీ అభిప్రాయపడింది. 586 00:36:42,411 --> 00:36:46,456 ఆమె మీద క్రిమినల్ ఛార్జీలు మోపరాదని గ్రాండ్ జ్యూరీ నిర్ణయాన్ని వెల్లడించింది. 587 00:36:46,540 --> 00:36:47,541 ఆనా. 588 00:36:49,042 --> 00:36:50,043 మీరు నిర్దోషి అని ప్రకటించారు. 589 00:36:50,127 --> 00:36:51,712 ఒక్క ఛార్జీ కూడా మీపై వేయలేదు. -ఓరి దేవుడా. 590 00:36:51,712 --> 00:36:55,174 హమ్మయ్య. దేవుడా, నీకు ధన్యవాదాలు. -ఏంటి? ఒక్క ఛార్జీ కూడా వేయట్లేదా? 591 00:36:55,174 --> 00:36:57,092 దేవుడా, నీకు రుణపడి ఉంటా. 592 00:36:57,176 --> 00:36:58,177 ఒక్క ఛార్జీ కూడా వేయట్లేదా? 593 00:36:59,052 --> 00:37:00,179 లేదు. 594 00:37:08,395 --> 00:37:10,355 డిస్ట్రిక్ట్ అటార్నీ జోర్డన్. 595 00:37:10,439 --> 00:37:11,982 గ్రాండ్ జ్యూరీ నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? 596 00:37:11,982 --> 00:37:15,027 జ్యూరీ నిర్ణయంతో నేను ఏకీభవిస్తున్నాను. థ్యాంక్యూ. 597 00:37:15,027 --> 00:37:16,778 మిస్టర్ మొరాలెస్, మీ అభిప్రాయం చెప్పగలరా? 598 00:37:16,862 --> 00:37:18,238 దయచేసి అందరూ ఒక కాపీ తీసుకోండి. 599 00:37:18,322 --> 00:37:21,867 దేశంలోని అన్ని ప్రాంతాలకూ చెందిన ఫోరెన్సిక్ నిపుణులు, 600 00:37:21,867 --> 00:37:25,954 మెమోరియల్ మెడికల్ సెంటరులో సంభవించిన సదరు మరణాలను, హత్యలుగానే నిర్ణయించిన విషయాన్ని 601 00:37:26,038 --> 00:37:27,748 మీరు చూడవచ్చు. 602 00:37:28,707 --> 00:37:32,127 అదే నిజమైతే, సర్, మరి గ్రాండ్ జ్యూరీ ఎందుకు ఆమెని నిర్దోషి అని అభిప్రాయపడినట్టు? 603 00:37:32,211 --> 00:37:35,839 ఎందుకంటే, ఈ ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయాలను వారు నేరుగా వినలేదు కాబట్టి. 604 00:37:35,923 --> 00:37:39,218 దానికి కారణం? -దాన్ని మీరు ఆ డిస్ట్రిక్ట్ అటార్నీని అడగాలి. 605 00:37:39,218 --> 00:37:42,346 చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి, డాక్టర్ పౌ తీసుకొన్న నిర్ణయాల విషయంలో 606 00:37:42,346 --> 00:37:45,182 తప్పొప్పులను చూడటం సబబే అంటారా? 607 00:37:45,182 --> 00:37:47,100 పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా కానీ, 608 00:37:47,184 --> 00:37:49,686 మనిషి ప్రాణాన్ని తీయడం అనేది సమంజసమైన పని కానే కాదు. 609 00:37:50,437 --> 00:37:53,357 మనిషి ప్రాణం అంటే విలువ లేదా? 610 00:37:54,399 --> 00:37:57,653 ఎలాంటి పరిస్థితులైనా కానీ మనిషి ప్రాణాలను తీయడం సరైన పనేనా? 611 00:37:57,653 --> 00:38:00,030 ఈ కేసు ద్వారా ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. 612 00:38:00,030 --> 00:38:04,785 కాబట్టి, గ్రాండ్ జ్యూరీ తీసుకున్నది సరైన నిర్ణయమే అని 613 00:38:04,785 --> 00:38:07,496 నాకు ఏ కోశానా అనిపించడం లేదు. 614 00:38:14,962 --> 00:38:15,963 బచ్? 615 00:38:17,965 --> 00:38:19,132 నువ్వు బాగానే ఉన్నావా? 616 00:38:19,216 --> 00:38:20,717 హా, నేను బాగానే ఉన్నాను. 617 00:38:26,056 --> 00:38:28,267 బంగారం, నీ కేసుల గురించి చర్చించడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, 618 00:38:28,267 --> 00:38:33,105 కానీ... ఇది నువ్వు అనుకున్నట్టుగా జరగనందుకు బాధగా ఉంది. 619 00:38:35,315 --> 00:38:39,778 ఆ ఆసుపత్రి, అదేమీ హోరాహోరీ పోరు జరుగుతున్న 620 00:38:39,862 --> 00:38:42,573 యుద్ధభూమి కాదు. అదొక ఆశ్రయం. 621 00:38:42,573 --> 00:38:46,076 వాళ్ల దగ్గర నీరు, ఆహారం ఉన్నాయి. సహాయక పడవలు కూడా వచ్చాయి. 622 00:38:47,578 --> 00:38:51,582 అసలు ప్రయత్నించకుండా ఉండటం కన్నా, ఎంత కష్టమైనా కిందికి మోసుకురావడం, 623 00:38:51,582 --> 00:38:54,918 లేదా కనీసం కిటికీ నుండి అయినా కిందికి దింపవచ్చు కదా? 624 00:38:55,002 --> 00:38:56,712 అతడిని బయటకు తీసుకురావడానికి అసలు ప్రయత్నమైనా చేయలేదేం? 625 00:38:57,796 --> 00:39:01,383 డాక్టర్ అయినంత మాత్రాన, ఎవరు బతకాలో, ఎవరు చావాలో నిర్ణయించేసే హక్కు ఉంటుందా? 626 00:39:01,383 --> 00:39:02,926 మీ రోగులకు మార్ఫిన్, ఇంకా వెర్సేడ్ ని 627 00:39:03,010 --> 00:39:05,137 కలిపి ఇవ్వాలని మీకు అనిపిస్తే, 628 00:39:05,137 --> 00:39:06,221 ముందూ వెనకా ఆలోచించకుండా ఇచ్చేస్తారా? 629 00:39:10,350 --> 00:39:12,060 ఇతరులు జనాలను బయటకు తరలిస్తున్నప్పుడు, 630 00:39:12,144 --> 00:39:15,314 నువ్వేమో "బాధను దూరం చేస్తూ ఉన్నావు", 631 00:39:15,314 --> 00:39:18,066 ఆ విషయాన్ని ఎలా మర్చిపోవాలి? 632 00:39:25,949 --> 00:39:27,201 పాపం వాళ్లు. 633 00:39:30,078 --> 00:39:33,207 వాళ్లను ఏం చేస్తున్నారో కూడా వాళ్లకి తెలీదు. 634 00:39:36,960 --> 00:39:38,962 పాపం వాళ్లకి తమను తాము కాపాడుకొనే అవకాశం కూడా లేదు. 635 00:39:42,883 --> 00:39:48,305 ఇది నిజంగా చాలా బాధిస్తోంది, లిన్. నిజంగా చాలా బాధిస్తోంది. 636 00:39:49,389 --> 00:39:50,432 నాకు తెలుసు. 637 00:40:03,403 --> 00:40:05,405 మీకు ఇది ఇద్దామని వచ్చాను. 638 00:40:11,453 --> 00:40:13,372 మేము ఇంకా మెరుగ్గా పని చేసి ఉండాల్సింది. 639 00:40:14,248 --> 00:40:15,707 అందులో మీ తప్పేమీ లేదు. 640 00:40:16,375 --> 00:40:20,712 డాక్టర్ పౌ, ఇంకా అధికారం, హోదా ఉన్న వాళ్లందరూ, ఆమెకి అండగా నిలిచారు. 641 00:40:22,631 --> 00:40:29,555 ఎమ్మెట్. మా ఇద్దరి ప్రేమ హై స్కూలులో మొదలైంది. 642 00:40:31,640 --> 00:40:35,018 కాలేజీలో రెండవ ఏడాది పార్టీకి నాకు ఒక తోడు అవసరమైనప్పుడు, మేమిద్దరం కలిశాం. 643 00:40:36,520 --> 00:40:40,440 అతను నా స్నేహితురాలి అన్నయ్య, అతను ఇంటి వరండాలో కూర్చొని ఉండగా చూశాను. 644 00:40:41,525 --> 00:40:43,110 ఇక నా స్నేహితురాలితో అన్నాను, 645 00:40:43,110 --> 00:40:45,696 "నన్ను పార్టీకి తీసుకువెళ్తాడో లేదో మీ అన్నయ్యని అడుగు," అని. 646 00:40:47,739 --> 00:40:48,782 అతను నన్ను తీసుకెళ్లాడు కూడా. 647 00:40:50,868 --> 00:40:51,869 ఎమ్మెట్. 648 00:40:52,870 --> 00:40:55,539 "పాపా, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను," అనేవాడు. 649 00:40:56,540 --> 00:41:01,420 "నిన్ను చచ్చినా పెళ్లి చేసుకోను," అని నేను అనేదాన్ని. 650 00:41:02,379 --> 00:41:03,714 ఊరికే అతడిని ఏడిపిద్దామని. 651 00:41:06,383 --> 00:41:10,679 నాకు తెలిసిన వాళ్లలో, అతనంత మంచి వాడు, దయగల వాడు ఇంకెవరూ లేరు. 652 00:41:12,055 --> 00:41:13,473 అతడిని కలిసే అదృష్టం నాకూ దక్కి ఉంటే బాగుండు. 653 00:41:17,144 --> 00:41:20,189 హత్య విషయంలో ఇంత వ్యవధిలోపే కేసు వేయాలనే నియమేమీ లేదు. 654 00:41:21,773 --> 00:41:27,696 న్యాయం కోసం చాలా కాలంగా వేచి చూస్తూ ఉన్నాను. ఇంకొంత కాలం పాటు వేచి చూడలేనా? 655 00:41:42,252 --> 00:41:43,712 న్యాయశాఖ 656 00:41:43,712 --> 00:41:47,257 హేయ్, ఎన్నెళ్లకెన్నాళ్లకు దర్శన భాగ్యం కలిగింది మాకు! 657 00:41:47,841 --> 00:41:49,760 హా. నిన్ను అప్పుడే వదిలేస్తాను అనుకున్నావా! 658 00:41:50,636 --> 00:41:52,554 నా వస్తువులు కొన్ని ఉంటే, తీసుకువెళ్లడానికి వచ్చా. 659 00:41:53,472 --> 00:41:55,349 ముందు పక్క నువ్వు ఒక్కడివే కూర్చోని ఉన్నావే. 660 00:41:56,308 --> 00:41:58,560 హా, ప్రశాంతంగా ఒక్కడినే అయిదు నిమిషాలు విరామం తీసుకుందామని వచ్చా. 661 00:42:01,230 --> 00:42:03,649 నువ్వు ముందే వైదొలగి మంచి పని చేశావు అనుకుంటా, ఏమంటావు? 662 00:42:05,400 --> 00:42:07,444 ఏదేమైనా, దిగమింగుకోవడం కష్టంగానే ఉంది. 663 00:42:11,573 --> 00:42:14,034 లోపల ఏం జరిగి ఏడ్చింది? కటువుగా మాట్లాడి ఉంటే క్షమించు. 664 00:42:16,245 --> 00:42:19,873 చాలా జరిగాయి, కనీసం వాళ్లు క్రిస్టీ జాన్సన్ ని పిలవను కూడా పిలవలేదు. 665 00:42:21,250 --> 00:42:22,251 ఏంటి? 666 00:42:23,043 --> 00:42:25,295 హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిని పిలవకపోతే ఎలా? 667 00:42:25,379 --> 00:42:26,713 చూస్తుంటే, బయటి ఫోరెన్సిక్ నిపుణులు కూడా 668 00:42:26,797 --> 00:42:29,633 తమ వాంగ్మూలాలని సమర్పించినట్లు అనిపించట్లేదు. 669 00:42:29,633 --> 00:42:30,926 ఎందుకలా చేశారు? 670 00:42:31,635 --> 00:42:34,054 అది ఆ దేవునికే తెలియాలి. 671 00:42:36,306 --> 00:42:41,353 కానీ స్పెషల్ గ్రాండ్ జ్యూరీ రికార్డులను శాశ్వతంగా సీల్ వేసేశారు, 672 00:42:41,353 --> 00:42:42,646 కాబట్టి మనకి ఎప్పటికీ తెలీను కూడా తెలీదు. 673 00:42:44,857 --> 00:42:47,734 పౌకి వ్యతిరేకంగా వెళ్లి మనం పప్పులో కాలు వేశామేమో. 674 00:42:49,486 --> 00:42:56,034 ఆధారాలన్నీ అటే వెళ్లాయి, మనం కూడా అదే అనుసరించాం. 675 00:42:57,369 --> 00:42:58,745 మనల్ని పౌ దగ్గరికి తీసుకెళ్లి వదిలాయి. 676 00:42:59,246 --> 00:43:03,625 హా, అన్ని విధాలా ఆదర్శమూర్తి అయిన ఒక డాక్టర్ వైపు మళ్లీంచాయి. కానీ తను ఆదర్శమూర్తి కానే కాదు. 677 00:43:09,256 --> 00:43:10,299 మర్చిపోయి ముందుకు సాగిపోవాలి. 678 00:43:13,802 --> 00:43:15,512 నీతో కలిసి పని చేసినందుకు చాలా ఆనందంగా ఉంది, బచ్. 679 00:43:16,096 --> 00:43:17,097 నాకు కూడా. 680 00:43:19,391 --> 00:43:21,143 జాగ్రత్త, వర్జీనియా. 681 00:43:22,895 --> 00:43:23,896 బై. 682 00:43:53,008 --> 00:43:57,638 ఒక సంవత్సరం తర్వాత 683 00:43:58,263 --> 00:43:59,556 సోదరసోదరీమణులారా... 684 00:44:00,265 --> 00:44:02,226 లాంచ్ ఈవెంట్ ఆరోగ్య రంగంలో విపత్తు నిరోధ చర్యలకు సన్నద్ధమవ్వడం 685 00:44:02,226 --> 00:44:03,519 ...ఇవాళ మన ముఖ్య అతిథి, 686 00:44:03,519 --> 00:44:08,315 డాక్టర్ ఆనా పౌని వేదిక మీదికి ఆహ్వానించే భాగ్యం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 687 00:44:08,315 --> 00:44:11,443 వావ్! సూపర్! 688 00:44:15,447 --> 00:44:18,408 థ్యాంక్యూ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. 689 00:44:19,576 --> 00:44:24,915 థ్యాంక్యూ. నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. 690 00:44:26,625 --> 00:44:28,085 కత్రినా తుఫాను సమయంలో జరిగిన దాన్ని 691 00:44:28,085 --> 00:44:31,713 ఈ గదిలో ఉన్న వాళ్ళెవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. 692 00:44:31,797 --> 00:44:33,674 ఒక్కొక్కొళ్ల దగ్గర ఒక్కో గాథ ఉంటుంది. 693 00:44:34,758 --> 00:44:38,971 మెమోరియల్ హాస్పిటల్ లో నాకు జరిగింది వివరించడం... 694 00:44:41,723 --> 00:44:43,141 చాలా చాలా కష్టం. 695 00:44:44,226 --> 00:44:48,856 వేడి, దుర్వాసన, కరెంట్ లేకపోవడం, 696 00:44:49,481 --> 00:44:52,609 రోగులను తరలించేటప్పుడు నెలకొని ఉన్న గందరగోళ పరిస్థితులు. 697 00:44:53,360 --> 00:44:58,949 ఆ తర్వాత బుధవారం నాడు, తరలించే పని ఆగిపోయింది. ఆగిపోయిందంతే. 698 00:44:58,949 --> 00:45:01,410 ఎందుకో మాకు తెలీదు. ఎవరూ మాకు చెప్పలేదు కూడా. 699 00:45:02,244 --> 00:45:03,745 ఆ తర్వాత గురువారం నాడు, 700 00:45:03,829 --> 00:45:08,625 ఆ రోజుకల్లా ఆసుపత్రిలో ఎవరూ ఉండకూడదని, అందరూ బయటకు వచ్చేయాలని మాకు చెప్పారు. 701 00:45:08,709 --> 00:45:12,212 అయిదు రోజులు, రాత్రనకా, పగలనకా నిద్రలేకుండా గడిపాక, ఫెమా కాల్ చేసి, 702 00:45:12,796 --> 00:45:14,506 "మధ్యాహ్నంకల్లా పడవలన్నింటినీ తీసుకెళ్లిపోతాం, 703 00:45:14,590 --> 00:45:18,427 కాబట్టి మీరు ఆ సమయానికల్లా, ఆసుపత్రిలో నుండి మీరు ఎవరినైతే బయటకు తీసుకురాగలరో, వాళ్లని తీసుకురండి, 704 00:45:18,427 --> 00:45:20,888 ఎందుకంటే, వాళ్లు ఎక్కువ సేపు ఆసుపత్రిలో ఉండలేరు కాబట్టి." 705 00:45:21,847 --> 00:45:23,765 కోస్ట్ గార్డ్ వాళ్లు హెలికాప్టర్లను పంపారు, 706 00:45:23,849 --> 00:45:27,394 కానీ అవి గురువారం మధ్యాహ్నానికి కానీ రాలేదు. 707 00:45:29,479 --> 00:45:31,940 నాకు తెలియని ఒక విషయాన్ని నేను అప్పుడు నోట్ చేసుకొని ఉండాల్సింది. 708 00:45:32,774 --> 00:45:35,360 కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు రాత్రి పూట ఎగరలేవు. 709 00:45:38,447 --> 00:45:44,912 రోగులను తరలించడానికి కావలసిన అండ మాకు దక్కలేదు. 710 00:45:45,412 --> 00:45:46,413 రవ్వంత కూడా దక్కలేదు. 711 00:45:46,413 --> 00:45:48,916 స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 712 00:45:48,916 --> 00:45:55,339 మమ్మల్ని గాలికి వదిలేశాయి, మాకు ద్రోహం చేశాయి. 713 00:45:55,339 --> 00:45:57,049 మేము ఏకాకులం అయిపోయాం. 714 00:45:59,927 --> 00:46:02,638 మేము ఏకాకులం అయిపోయాం. 715 00:46:05,432 --> 00:46:07,226 కానీ, నేను కేవలం ఒక సాదాసీదా డాక్టరును. 716 00:46:10,187 --> 00:46:16,735 రోగిని చూసుకోవడం అంటే వినడానికి సులభంగా, అద్భుతంగా ఉంటుంది. 717 00:46:17,277 --> 00:46:21,240 కానీ వాస్తవానికి, అది చాలా కష్టమైన పని. 718 00:46:23,951 --> 00:46:29,164 ఆ ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరూ రోగులకు సౌకర్యాలను, సేవలను అందించడానికి 719 00:46:29,873 --> 00:46:33,836 తమ శాయశక్తులా కృషి చేశారని నేను గుండె మీద చేయి వేసుకొని చెప్పగలను. 720 00:46:33,836 --> 00:46:38,215 ఎవరినీ గాలికి వదిలేయలేదు. ఎవరినీ అలక్ష్యపెట్టలేదు. 721 00:46:39,424 --> 00:46:42,344 అందరినీ గౌరవప్రదంగా చూసుకున్నాం. 722 00:46:43,303 --> 00:46:49,977 నేను అరెస్ట్ అయిన రోజు, జూలై 17, 2006 నాడు నా జీవితం సంపూర్ణంగా మారిపోయినా, 723 00:46:49,977 --> 00:46:54,022 నాకు జరిగిన వాటికి నేనేమీ కలత చెందట్లేదు, 724 00:46:54,898 --> 00:46:58,527 ఎందుకంటే, దేవుని చల్లని చూపు నా మీద ఉంది కనుక. 725 00:46:59,194 --> 00:47:05,325 నాకు తోడుగా ఉండటానికి ఆయన చాలా మందిని పంపాడు. నేను నిజమే చెప్తున్నా. 726 00:47:05,409 --> 00:47:07,536 నా మిత్రులని... 727 00:47:10,247 --> 00:47:13,750 నా కుటుంబాన్ని, నా రోగులను, 728 00:47:14,334 --> 00:47:17,880 నర్సులను, నా తోటి డాక్టర్లను పంపాడు. 729 00:47:17,880 --> 00:47:21,091 వాళ్లలో చాలా మంది ఈ గదిలోనే కూర్చొని ఉండటం నేను గమనిస్తున్నాను. 730 00:47:22,926 --> 00:47:25,304 మీరందరూ లేకపోయుంటే, నేను ఇక్కడ ఉండగలిగే దాన్నే కాదు. 731 00:47:25,888 --> 00:47:28,891 మీరు నాకు ఇచ్చిన ధైర్యం, స్థైర్యం 732 00:47:28,891 --> 00:47:30,517 దేవుడు ప్రసాదించిన వరమని చెప్పవచ్చు. 733 00:47:31,935 --> 00:47:34,855 కాబట్టి మీ ప్రేమ, ఇంకా దేవుని కృపే 734 00:47:34,855 --> 00:47:37,232 నన్ను రోజూ నడిపిస్తున్నాయి. 735 00:47:37,774 --> 00:47:41,028 మీరు నా పక్షాన నిలబడినందుకు ఈ ప్రపంచంలో నా కన్నా అదృష్టవంతులు 736 00:47:41,028 --> 00:47:44,114 ఇక ఎవ్వరూ లేరు అనుకుంటున్నా. అందుకు, మీకు అందరికీ థ్యాంక్యూ. 737 00:47:44,198 --> 00:47:45,199 హా! 738 00:47:46,033 --> 00:47:50,787 మీకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్యూ. 739 00:47:53,498 --> 00:47:55,209 థ్యాంక్యూ. 740 00:48:00,797 --> 00:48:03,383 థ్యాంక్యూ. థ్యాంక్యూ. 741 00:48:39,294 --> 00:48:40,629 హలో, ఆనా. -హోరెస్. 742 00:48:41,588 --> 00:48:42,923 నువ్వు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 743 00:48:43,465 --> 00:48:44,591 విన్స్ ఎలా ఉన్నాడు? 744 00:48:45,175 --> 00:48:46,301 బాగున్నాడు. ఏమైపోయాడబ్బా? 745 00:48:47,135 --> 00:48:50,180 అక్కడ చిందులేస్తున్నాడు. -హా. 746 00:48:52,224 --> 00:48:54,309 గతేడాది అంత జరిగిన తర్వాత, ఇప్పుడు కాస్త అలా ఫ్రీగా చిందులేస్తున్నాడు. 747 00:48:55,519 --> 00:48:56,770 నేను ఊహించుకోగలనులే. 748 00:48:56,854 --> 00:48:59,273 జరిగింది అస్సలు నమ్మలేకున్నా, హోరెస్. 749 00:48:59,273 --> 00:49:00,691 అస్సలు నమ్మలేకున్నా. 750 00:49:00,691 --> 00:49:03,068 అంత కన్నా నాకు... నాకు దాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. 751 00:49:07,781 --> 00:49:13,078 ఆనా, పడవలను ఫెమా తీసుకెళ్లిపోలేదు. 752 00:49:13,745 --> 00:49:16,081 వాటిని నడిపింది వాలంటీర్లు. 753 00:49:17,875 --> 00:49:23,422 మన ఫోన్లు పని చేయడం లేదు కాబట్టి వాళ్లు మనకి కాల్ చేసి ఉండకపోవచ్చు. 754 00:49:25,215 --> 00:49:31,513 అదీగాక, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు రాత్రి పూట తిరిగాయన్న విషయం నీకు కూడా తెలుసు. 755 00:49:32,014 --> 00:49:34,183 వాళ్లు నైట్ విజన్ గాగుల్స్ ని ఉపయోగించారు. 756 00:49:35,392 --> 00:49:36,977 రోజంతా వాళ్లు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. 757 00:49:36,977 --> 00:49:40,814 కోస్ట్ గార్డ్ వాళ్లు రోగులను కాపాడే ప్రయత్నం చేయలేదని మనం అనలేం. 758 00:49:40,898 --> 00:49:44,151 హోరెస్. అవి రాత్రి పూట రాలేదు. 759 00:49:47,613 --> 00:49:49,072 విన్స్ ని అడుగు. అతను పైలట్. 760 00:49:49,156 --> 00:49:52,117 ఆనా, నేను కూడా మెమోరియల్ లోనే ఉన్నాను. 761 00:49:53,577 --> 00:49:58,415 నీకు అవన్నీ ఒక విధంగానే గుర్తున్నాయి, అంత మాత్రాన అవే నిజమైపోవు. 762 00:50:07,049 --> 00:50:08,133 దేవుడా. 763 00:50:12,846 --> 00:50:14,097 నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. 764 00:51:15,409 --> 00:51:17,494 మెమోరియల్ మెడికల్ సెంటర్ టెనెట్ లూసియానా ఆరోగ్య వ్యవస్థ 765 00:51:17,578 --> 00:51:20,038 మెమోరియల్ 766 00:51:20,622 --> 00:51:23,750 గ్రేటర్ న్యూ ఆర్లీన్స్ ప్రాంతంలో ఆనా పౌ ఇంకా వైద్య వృత్తిలోనే 767 00:51:23,834 --> 00:51:27,129 కొనసాగుతూ ఉన్నారు. 768 00:51:28,630 --> 00:51:30,883 డాక్టర్ పౌ, ఇంకా ఆమె న్యాయవాది కలిసి మూడు బిల్లులను రాయడంలో సహాయపడ్డారు, 769 00:51:30,883 --> 00:51:32,593 విపత్తు సమయాల్లో వైద్య సిబ్బందిని చట్టపరమైన చర్యల నుండి 770 00:51:32,593 --> 00:51:33,677 కాపాడటమే వీటి ఉద్దేశం. 771 00:51:33,677 --> 00:51:36,722 అవి ఏకగ్రీవంగా పాస్ అయిపోయాయి. 772 00:51:38,724 --> 00:51:40,767 డాక్టర్ పౌకి, ఇంకా ఇతరులకి వ్యతిరేకంగా ఎవరెట్ కుటుంబంతో పాటు 773 00:51:40,851 --> 00:51:43,270 ఇంకో మూడు కుటుంబాలు వేసిన సివిల్ కేసులు సెటిల్ చేయబడ్డాయి. 774 00:51:43,270 --> 00:51:45,898 ఆ సెటిల్మెంట్ తాలూకు నియమాల గురించి 775 00:51:45,898 --> 00:51:48,192 మూడవ కంటికి తెలియకుండా ఉంచడానికి ఆ కుటుంబాలు అంగీకరించాయి. 776 00:51:49,943 --> 00:51:52,321 హరికేన్ కత్రినా తదనంతర సంఘటనల విషయంలో 777 00:51:52,321 --> 00:51:55,324 మెమోరియల్ లో పని చేసిన ఎవరూ ఇప్పటిదాకా దోషిగా నిలవలేదు. 778 00:52:01,079 --> 00:52:03,790 2006లో డిజైన్, ఇంకా నిర్మాణంలో లోపాల వల్లనే 779 00:52:03,874 --> 00:52:06,877 కత్రినా తర్వాత, అధిక శాతం వరద నీరు చేరుకుందని 780 00:52:06,877 --> 00:52:10,631 ఆర్మీలోని ఇంజినీరింగ్ విభాగం అంగీకరించింది. 781 00:52:11,256 --> 00:52:14,676 2018లో, న్యూ ఆర్లీన్స్ చుట్టూ పద్నాలుగు బిలియన్ డాలర్ల ఖర్చుతో 782 00:52:14,760 --> 00:52:17,971 కట్టల, ఇంకా వరద ముంపు నుండి కాపాడటానికి గోడల సిస్టమ్ ని 783 00:52:18,055 --> 00:52:19,473 ఆర్మీలోని ఇంజనీరింగ్ విభాగం పూర్తి చేసింది. 784 00:52:20,057 --> 00:52:25,896 పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు, ఇంకా బలహీనమైన నేల దృష్ట్యా, 785 00:52:25,896 --> 00:52:30,859 ఆ సిస్టమ్ ని 2023లోనే మళ్లీ పునరుద్దరించాల్సి రావచ్చు. 786 00:52:31,485 --> 00:52:36,281 ఎమర్జెన్సీ సమయాల్లో వైద్య సేవలను ఏ ప్రాధాన్య క్రమంలో అందించాలి అనేది 787 00:52:36,365 --> 00:52:39,660 ఇంకా తేలని అంశంగా మిగిలిపోయింది. 788 00:52:41,995 --> 00:52:43,789 హరికేన్ కత్రినా కారణంగా, ఇంకా తదనంతర పరిణామాల కారణంగా 789 00:52:43,789 --> 00:52:46,083 వేదనకు గురైన వాళ్లకి, ఇంకా నష్టపోయిన వాళ్లకి ఈ షో అంకితం. 790 00:52:46,083 --> 00:52:50,629 అలాగే చెరిగిపోని న్యూ ఆర్లీన్స్ స్ఫూర్తికి కూడా ఈ షో అంకితం. 791 00:53:41,930 --> 00:53:43,932 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్