1 00:01:06,608 --> 00:01:11,446 జీవ ఛాయలు 2 00:01:26,253 --> 00:01:28,255 సేయింట్ లిక్కీస్ కేర్ సెంటర్ 3 00:01:33,051 --> 00:01:35,095 ఇదిగో బ్లాక్ కాఫీ, రెండు స్ప్లెండాలు వేశాను. 4 00:01:35,179 --> 00:01:36,722 నువ్వు దేవుడివి! 5 00:01:38,098 --> 00:01:39,224 వార్డును తనిఖీ చేశావా? 6 00:01:39,308 --> 00:01:41,310 కూరగాయల తోటలో నడిచినట్టుగా ఆగి ఆగి తనిఖీ చేశాను. 7 00:02:31,068 --> 00:02:32,194 హేయ్. 8 00:02:37,866 --> 00:02:42,246 బంగారం? బంగారం? నువ్వు చాలా కాలం నుండి కోమాలో ఉన్నావు. 9 00:02:42,329 --> 00:02:44,122 కానీ నీకు ఏమీ కాదు. 10 00:02:44,206 --> 00:02:47,167 నా మాటలని విను. నువ్వు ఒక భయంకరమైన ప్రమాదానికి గురయ్యావు. 11 00:02:47,626 --> 00:02:49,253 -పదండి. -ఏమీ పర్వాలేదు, సారా. 12 00:02:49,336 --> 00:02:51,171 ఆరేళ్ళంటే చాలా కాలం కింద లెక్క. 13 00:02:51,630 --> 00:02:54,299 మేము నిన్ను న్యూరోసైన్స్ విభాగానికి బదిలీ చేస్తున్నాం. 14 00:03:05,519 --> 00:03:06,937 ఏంటది? 15 00:03:10,649 --> 00:03:11,900 ధన్యవాదాలు. 16 00:03:12,442 --> 00:03:13,819 ధన్యవాదాలు. 17 00:03:18,323 --> 00:03:19,491 బ్లూబర్డ్ సిస్టమ్స్ 18 00:03:19,575 --> 00:03:20,576 నెట్వర్క్ విఫలమైంది 19 00:03:22,786 --> 00:03:25,080 మీరు నాకు తెలిసినట్టు అనిపించింది. 20 00:03:26,582 --> 00:03:28,417 -బాబోయ్. -ఊరికే అలా లోపలికి వచ్చేయలేం కదా. 21 00:03:28,500 --> 00:03:29,710 చివరిసారి నేను అతనితో మాట్లాడినప్పుడు... 22 00:03:29,793 --> 00:03:30,794 హేయ్, మిత్రులారా. 23 00:03:30,878 --> 00:03:34,006 మన్నించండి, విద్యుత్ అంతరాయం వల్ల యంత్రం చెడిపోయింది. కనుక నగదు మాత్రమే తీసుకోగలం. 24 00:03:34,089 --> 00:03:35,465 నగదు అంటే ఏమిటి? 25 00:03:37,134 --> 00:03:39,136 పీచ్ ట్రీ దగ్గర సందు చివరనున్న మద్యం దుకాణం వద్ద ఏటీయం ఉంది. 26 00:03:39,219 --> 00:03:40,762 అబ్బే, పర్వాలేదులే. నిజంగానే. 27 00:03:40,846 --> 00:03:45,142 మేము బ్యాంక్ లోకి వెళ్లి... పర్వాలేదు, నిజంగానే, అదేమీ పెద్ద సమస్య కాదు. 28 00:03:45,225 --> 00:03:47,102 లేదు, లేదు. ఎవరో ఒకరు ఇక్కడే ఉండాలి. 29 00:03:47,186 --> 00:03:49,313 -పరిగెత్తండి! -అయ్యయ్యో! 30 00:03:50,564 --> 00:03:51,565 బాగుంది. 31 00:03:52,441 --> 00:03:53,442 ...మా వెనకాలే. 32 00:03:53,525 --> 00:03:55,068 -ప్రయత్నిస్తున్నాను. నాకు హీల్స్ ఉన్నాయి. -రండి. త్వరగా. 33 00:03:55,152 --> 00:03:56,653 ఏదో మరిచిపోయినట్టున్నారే? 34 00:03:59,031 --> 00:04:01,325 -తమాషాలా? నాకు ఇవ్వు... -అబ్బా. 35 00:04:01,408 --> 00:04:03,368 డబ్బులు కట్టు, లేదా ఏదైనా చెత్త బ్యాగ్ కొనుక్కో. 36 00:04:03,452 --> 00:04:05,287 లేదా నువ్వే ఆ బ్యాగును దొంగలించావని మీ మేనేజరుకు నేను చెప్తే? 37 00:04:06,413 --> 00:04:07,831 శాంతం. శాంతం. 38 00:04:09,041 --> 00:04:10,792 ఏంటి సంగతి, లైలా మజ్ఞూలారా? 39 00:04:10,876 --> 00:04:13,462 -హేయ్, నువ్వు మధ్యలో తలదూర్చకు, గురూ. -లేదులే కానీ, ఆమెకి డబ్బులు కట్టేయండి. 40 00:04:13,545 --> 00:04:14,963 కోడీ, నువ్వు నన్ను కాపాడవలసిన అవసరం లేదు. 41 00:04:15,047 --> 00:04:16,923 అయ్యయ్యో, నేను కాపాడేది నిన్ను కాదు. వాళ్ళని. 42 00:04:17,382 --> 00:04:19,426 అవును, అది నిజమే. మీకే నేను ఉపకారం చేస్తున్నాను. 43 00:04:19,510 --> 00:04:21,303 ఎందుకంటే ఈ అలియా, కాపాడమని మీరు మీ అమ్మానాన్నలను పిలిచేలోపే 44 00:04:21,386 --> 00:04:23,347 మీ అందరి మక్కెలు విరగ్గొట్టేస్తుంది. 45 00:04:23,430 --> 00:04:26,058 కాబట్టి, తనకి కాస్త డబ్బులిచ్చేస్తే మంచిదని మీకు సలహా ఇస్తున్నాను, ఏమంటారు? 46 00:04:42,658 --> 00:04:44,785 క్యాష్ రిజిస్టరుకు, ఇంకా నీకు. 47 00:04:46,662 --> 00:04:48,288 ఇప్పుడైనా, కళాశాలలో జరిగే పార్టీకి నువ్వు నాతో వస్తావా? 48 00:04:49,873 --> 00:04:52,793 ఈ సమస్యని నేను చూసుకోగలిగేదాన్నే. నీ సహాయం అవసరం లేదు. 49 00:04:53,126 --> 00:04:56,338 చూసుకోగలిగేదానివే ఏమో. అలవాటులో పొరపాటు ఏమోలే. 50 00:04:56,421 --> 00:04:59,174 కానీ అది భలేగా ఉండింది. బహుశా వాళ్ళ నుండి మనం ఇంకా ఎక్కువ రాబట్టుండవచ్చు. 51 00:04:59,800 --> 00:05:01,635 వాళ్ళు నా ఉద్యోగం ఊడిపోయేలా చేయనందుకు నాకు ఆనందంగా ఉంది. 52 00:05:01,718 --> 00:05:04,596 అలా చేసినా కానీ ఏమైంది? ఎలాగూ ఎక్కువ కాలం నువ్విక్కడ పనిచేయనక్కర్లేదు. 53 00:05:05,430 --> 00:05:08,392 -నిజంగానా? -అవును. నిజంగానే. దీన్ని చూడు. 54 00:05:09,560 --> 00:05:10,727 ఇప్పుడు చూడు. 55 00:05:11,103 --> 00:05:14,398 గస్ స్నేహితుడు స్టీవీ, ఈ అదిరిపోయేదాన్ని కేవలం 1,700 డాలర్లకే అమ్మేస్తున్నాడు. 56 00:05:14,481 --> 00:05:16,650 లాస్ ఏంజలస్ కి వెళ్ళాలంటే మనం కూడా అలాగే కనబడాలి. 57 00:05:16,733 --> 00:05:18,819 అవును, దానితో పాటు 3,200 డాలర్లు కూడా కావాలి, 58 00:05:18,902 --> 00:05:21,697 కానీ మన దగ్గర 2,673 డాలర్లే ఉన్నాయి. 59 00:05:21,780 --> 00:05:23,615 మరి, ఎలా కాదన్నా, 60 00:05:23,699 --> 00:05:26,076 మనం వెళ్ళడానికి... ఏమో పది వారాలు పడుతుందేమో? 61 00:05:26,159 --> 00:05:27,619 ఆలోపు దీన్ని వేరేవాళ్ళు కొనేస్తారు. 62 00:05:27,703 --> 00:05:29,413 అయితే, వేరేదాని కోసం ఆగుదాం. 63 00:05:29,496 --> 00:05:31,915 -దేవుడా. -మనకి సరైన ప్రణాళిక అవసరం. 64 00:05:32,583 --> 00:05:34,209 ఎందుకు ఎప్పుడు చూసినా ఆగుదాం అంటావు? 65 00:05:35,919 --> 00:05:37,713 నేను సరైన సందర్భం కోసం చూస్తున్నాను, అంతే. 66 00:05:39,256 --> 00:05:41,216 సరైన సందర్భమంటూ ఏదీ ఉండదు. 67 00:05:41,633 --> 00:05:43,594 కానీ ఇది ఆరంభం అవుతుంది. 68 00:05:53,520 --> 00:05:54,521 హలో? 69 00:06:01,945 --> 00:06:03,906 పురోగతి బాగా ఉంది. 70 00:06:04,698 --> 00:06:06,825 -ఇప్పుడు పిడికిలి బిగించు. -అమ్మా. 71 00:06:12,581 --> 00:06:13,665 అమ్మా. 72 00:06:14,208 --> 00:06:15,459 నేను. 73 00:06:17,419 --> 00:06:18,420 అలియా? 74 00:06:19,213 --> 00:06:20,214 అలియా? 75 00:06:23,050 --> 00:06:24,760 -తనకి ఏమైంది? -తను గుర్తుపట్టలేదు... 76 00:06:24,843 --> 00:06:27,513 -తను నన్ను కూడా గుర్తుపట్టడం లేదు. -హేయ్, ఇటు రా. నేను నీతో మాట్లాడతాను. 77 00:06:27,596 --> 00:06:30,182 ఈ అయోమయ స్థితి, ఈ జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఇదంతా సహజమే. 78 00:06:30,766 --> 00:06:33,185 కానీ తను మాట్లాడగలుగుతుంది. అది మంచి సంకేతం క్రింద తీసుకోవాలి. 79 00:06:33,936 --> 00:06:35,938 నిజం చెప్పాలంటే అది గొప్ప విషయమనే చెప్పవచ్చు. 80 00:06:36,480 --> 00:06:37,481 గొప్ప విషయం. 81 00:07:04,842 --> 00:07:06,760 ఆరేళ్ళ క్రిందట, మీ అమ్మని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు, 82 00:07:06,844 --> 00:07:09,221 ఇక్కడ కనబడినట్టుగా, ఈ గాయం నయంచేయలేనిదిగా ఉండింది. 83 00:07:09,721 --> 00:07:13,767 కానీ ఇక్కడ, నీకు కనబడుతుంది కదా... ఆ గాయం కొంతవరకూ నయమయింది. 84 00:07:14,309 --> 00:07:16,061 ఆమె మళ్లీ మామూలు స్థితికి వస్తుందని అంటున్నారా? 85 00:07:16,144 --> 00:07:19,523 నా ఉద్దేశం, ఇలాంటి దాన్ని ఇదివరకు నేనెన్నడూ చూడలేదు, కానీ... 86 00:07:19,606 --> 00:07:22,651 నాతో నిజాయితీగా చెప్పేయండి. కోలుకోవడం ఎంత మేరకు ఉండవచ్చు? దానికి ఎంత కాలం పడుతుంది? 87 00:07:22,734 --> 00:07:24,862 అలియా, విను. మెదడు అనేది, 88 00:07:24,945 --> 00:07:28,782 అప్పుడప్పుడూ దానికదే బాగా అయిపోతుంది. 89 00:07:28,866 --> 00:07:31,201 -ఇప్పుడే కాల్ చేయండి. -కానీ ఎన్నో నెలలు పట్టవచ్చు, మనం ఓ... 90 00:07:31,285 --> 00:07:32,911 నేను ఓ కాల్ చేసుకోవాలి. 91 00:07:36,540 --> 00:07:39,126 అలాగే, సారా. ఎవరికి? 92 00:07:39,209 --> 00:07:40,961 నేను ఓ కాల్ చేసుకోవాలి. 93 00:07:41,044 --> 00:07:42,713 నువ్వు ఎవరికి కాల్ చేయాలి? 94 00:07:42,796 --> 00:07:43,797 ఫోన్ నంబరు ఏమైనా ఉందా? 95 00:07:44,840 --> 00:07:50,762 404-555-0169. 96 00:07:55,559 --> 00:07:56,643 హలో? 97 00:08:01,690 --> 00:08:03,400 ఎవరికి కాల్ చేయాలనుకున్నావు? 98 00:08:04,776 --> 00:08:06,403 -అమ్మా? -అలియా... 99 00:08:07,946 --> 00:08:11,783 జ్ఞాపకశక్తి అనేది చాలా సంక్లిష్టమైనది. కాస్త నిదానంగా ముందుకు వెళ్దాం. 100 00:08:12,576 --> 00:08:16,747 ఇవాళ మంచి రోజు. ఈరోజు నుండి ప్రారంభిద్దాం. మీ అమ్మ కోలుకుంటోంది. 101 00:09:11,009 --> 00:09:15,722 హో, హో, హో, హో! క్రిస్మక్వాంజకా శుభాకాంక్షలు! 102 00:09:15,806 --> 00:09:19,059 దేవుడా! కొత్త బొమ్మలా? ధన్యవాదాలు, అమ్మా! 103 00:09:19,142 --> 00:09:24,064 తప్పకుండా, బంగారం. నా కూతురు ఇంత చదువుల పురుగు అని ఎవరికి తెలుసు? 104 00:09:34,658 --> 00:09:36,827 హేయ్. నేను పంపిన వీడియోలు నీకు వచ్చాయి అనమాట. 105 00:09:37,286 --> 00:09:39,997 -హాయ్. అవును. -వావ్. వావ్. 106 00:09:41,248 --> 00:09:42,916 అవి పనికి వచ్చాయి. ధన్యవాదాలు. 107 00:09:46,086 --> 00:09:48,672 మరి, ఇప్పుడు నీ పరీక్షా సమయం. 108 00:09:49,256 --> 00:09:51,091 మరి తయారవుదాం. సరేనా, బంగారం? 109 00:09:52,217 --> 00:09:54,511 నేను బూట్లను ఎక్కడ పెట్టానబ్బా? 110 00:09:54,970 --> 00:09:57,806 వాటిని కిటికీ పక్కనున్న కుర్చీ కింద వదిలావు. 111 00:09:57,890 --> 00:09:58,891 నీకు అవి కనిపిస్తున్నాయా? 112 00:10:00,058 --> 00:10:01,560 నువ్వు స్పానిష్ మాట్లాడగలవా? 113 00:10:01,643 --> 00:10:02,978 నువ్వు స్పానిష్ మాట్లాడగలవా? 114 00:10:04,104 --> 00:10:05,314 మాట్లాడగలను అనుకుంటా. 115 00:10:13,780 --> 00:10:16,617 అద్భుతం, సారా. ఇప్పుడు కాస్తంత వేగం పెంచుతాను, సరేనా? 116 00:10:24,291 --> 00:10:25,501 ఆకుపచ్చ. 117 00:10:26,084 --> 00:10:27,419 కోపం. 118 00:10:28,587 --> 00:10:29,630 ఇరవై ఏడు. 119 00:10:31,381 --> 00:10:32,758 పురుషుడు, మహిళ, అబ్బాయి, అమ్మాయి. 120 00:10:32,841 --> 00:10:36,136 అది సరైనదే. కానీ వాళ్ళ మధ్యనున్న సంబంధం ఏమిటి? 121 00:10:38,680 --> 00:10:40,390 తండ్రీ, తల్లీ... 122 00:10:40,474 --> 00:10:45,103 జే.ఎఫ్.కే కోమా రికవరీ స్కేలులో, అలాగే గ్లాస్గోలోనూ నాకు మంచి మార్కులు వచ్చాయి. 123 00:10:45,187 --> 00:10:47,147 నన్ను అవుట్ పేషెంట్ కేర్ కి విడుదల చేయడానికి అది చాలు కదా. 124 00:10:47,231 --> 00:10:49,566 సారా, నువ్వు కోలుకోవడం నిజంగా అద్భుతమైన విషయమే. 125 00:10:50,067 --> 00:10:51,652 నీకు చాలా విషయాలు గుర్తుకు వస్తున్నా, 126 00:10:51,735 --> 00:10:56,490 ఇంకా అక్కడక్కడ ఖాళీలు ఎందుకున్నాయా అని... తెలుసుకోవడానికే మా ప్రయత్నం అంతా. 127 00:11:05,123 --> 00:11:06,792 కుటుంబానికి దగ్గరగా ఉంటే, 128 00:11:06,875 --> 00:11:10,921 సుదీర్ఘ కాలపు జ్ఞాపకాలకి బాధ్యులైన నరాలు పునరుత్తేజితమవుతాయని మీరే అన్నారు కదా. 129 00:11:11,421 --> 00:11:15,843 నన్ను ఇంటికి పంపించేయండి... నా కూతురితో. 130 00:11:16,969 --> 00:11:20,097 బహుశా అప్పుడు... నాకు గుర్తుకురావడం మొదలవుతుందేమో. 131 00:11:25,519 --> 00:11:29,189 అది మన పాత ఇల్లు లాగా ఉండదు, కానీ అద్దెకి నేనో రకంగా టిప్స్ మీద ఆధారపడతాను, తెలుసా? 132 00:11:30,315 --> 00:11:31,608 నీకు తండ్రి ఉన్నాడా? 133 00:11:32,693 --> 00:11:34,736 పిల్లలు పుట్టాలంటే తండ్రి ఉండాలి కదా. 134 00:11:36,238 --> 00:11:38,282 పిల్లలు ఎలా పుడతారో నాకు తెలుసు, అలియా. 135 00:11:38,365 --> 00:11:39,825 నన్ను క్షమించు. అవునులే. 136 00:11:41,118 --> 00:11:43,745 అంటే... ఆయనని ఇంతవరకూ నేను చూడనేలేదు. 137 00:11:44,830 --> 00:11:48,208 ఎప్పుడూ మనిద్దరమే ఉండేవాళ్ళం. అలాగే మనకి బాగుండింది. 138 00:11:50,460 --> 00:11:51,461 నేను నీకు కలత తెప్పించాను. 139 00:11:52,212 --> 00:11:53,213 అదేంలేదులే. 140 00:11:53,672 --> 00:11:55,382 అయితే, నువ్వు ఆసుపత్రి నుండి విడుదల అవ్వడానికి సిద్ధంగానే ఉన్నావా? 141 00:11:55,465 --> 00:11:57,426 నా ఉద్దేశం, నీకు సాయపడాలనే డా. కోహ్ చూస్తున్నారు. 142 00:12:01,138 --> 00:12:03,056 తాను చేయగలిగినంత తను చేసింది. 143 00:12:03,140 --> 00:12:06,602 నీకు మెరుగవ్వడమే నాకు కావలసింది. నిజంగానే, అంత తొందర దేనికి? 144 00:12:06,685 --> 00:12:09,021 నేను ఇక్కడ ఇక ఉండలేను. ఈత కొట్టడానికి వెళ్తున్నాను. 145 00:12:11,481 --> 00:12:13,692 తను మా అమ్మ కాదు. ఓ పక్క అమ్మాలాగే ఉంటుంది, మరో పక్క ఎవరో అయిపోతుంది. 146 00:12:13,775 --> 00:12:16,111 మా అమ్మకి అన్ని విషయాలు పూస గుచ్చినట్టు చెప్పాల్సివస్తుందేమోనని అనుకున్నాను. 147 00:12:16,195 --> 00:12:17,738 అదీగాక ఇంతకముందు, తను స్పానిష్ లో మాట్లాడింది. 148 00:12:17,821 --> 00:12:18,822 తను స్పానిష్ మాట్లాడిందా? 149 00:12:18,906 --> 00:12:20,949 అవును, అంతకన్నా విచిత్రమైన విషయమేమిటంటే, ఆవిడ నన్ను "అలియా" అని పిలవడం. 150 00:12:21,033 --> 00:12:23,410 -నాకు... -తను ఎప్పుడూ నన్ను పేరు పెట్టి పిలవలేదు. 151 00:12:23,493 --> 00:12:24,912 ఎప్పుడూ ఏదోక కొత్త ముద్దు పేరు పెట్టి పిలిచేది. 152 00:12:24,995 --> 00:12:26,705 ప్రమాదం జరగడానికి ముందు, నన్ను "సిసింద్రి" అని పిలిచేది. 153 00:12:26,788 --> 00:12:28,207 అలియా, నేను ఓ విషయం చెప్పవచ్చా? 154 00:12:29,374 --> 00:12:30,876 వీటన్నింటికీ తన జ్ఞాపకాలు సమాధానం కాదు. 155 00:12:31,293 --> 00:12:32,294 అవి కాదా? 156 00:12:32,377 --> 00:12:35,756 అవన్నీ ఇవాళ తిరిగివచ్చేసినా కానీ, మీరు ఒకరికొకరికి కొత్తవారిగానే ఉంటారు. 157 00:12:35,839 --> 00:12:37,132 ఓసారి ఆలోచించు. 158 00:12:37,216 --> 00:12:40,469 ఇప్పటి నీకూ, ఆరేళ్ళ క్రితం నీకూ చాలా తేడా ఉంది కదా? 159 00:12:40,969 --> 00:12:43,096 నీకేదైతే అనిపిస్తోందో, అది వైద్యపరమైన సమస్య కాదు. 160 00:12:43,180 --> 00:12:45,807 అది ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఒకరికొకరు మళ్లీ తెలుసుకోవడం గురించి. 161 00:13:10,123 --> 00:13:13,210 నీకు పనికి వస్తున్నాయి కదా? నీళ్ళు. 162 00:13:15,254 --> 00:13:16,839 నువ్వు అనుభవించిన దాన్ని బట్టి చూస్తే, 163 00:13:16,922 --> 00:13:19,383 ఆ చచ్చుబడిన కీళ్ళకి అది అనుకోని వరమనే చెప్పాలి, ఏమంటావు? 164 00:13:25,639 --> 00:13:27,683 కేఫటేరియాలో చూసింది నిన్నేనని అనుకున్నాను. 165 00:13:28,183 --> 00:13:29,560 అవును, నాకు నీ కాల్ వచ్చింది. 166 00:13:30,602 --> 00:13:32,396 మరి ఎందుకు ఇంత ఆలస్యమయింది? 167 00:13:40,195 --> 00:13:42,573 స్టోన్ గురించి వెతకకుండా ఎలా ఉంటాను. నేను చేసిన మొదటి పని అదే. 168 00:13:42,656 --> 00:13:44,992 వాళ్ళ వద్ద ఆ పేరుకు సంబంధించింది ఏదైనా ఉండుంటే, నేను చెప్పకుండా ఉండేవాడినా? 169 00:13:48,120 --> 00:13:49,413 హేయ్, అమ్మా. 170 00:13:49,913 --> 00:13:52,791 నీ విడుదల పత్రాలు రేపు ఉదయానికి సిద్దంగా ఉంటాయని డా. కోహ్ చెప్పింది. 171 00:13:52,875 --> 00:13:54,251 అయితే అప్పుడు వచ్చి తీసుకెళ్తాను మరి. 172 00:13:57,462 --> 00:14:00,340 అలియా, ఇతను వేయిన్. ఈయన... 173 00:14:00,799 --> 00:14:02,092 మీ అమ్మ యొక్క పాత స్నేహితుడిని. 174 00:14:02,634 --> 00:14:04,178 మీరు కూడా డాన్స్ సంస్థలోని వారా? 175 00:14:04,261 --> 00:14:07,097 లేదు. లేదు, మా ఇద్దరి ఊరు ఒకటే. 176 00:14:07,181 --> 00:14:09,683 చికాగోనా? మీ యాస అలా లేదు. 177 00:14:09,766 --> 00:14:12,728 ధన్యవాదాలు, తల్లీ. ఎంతో కష్టపడితే కానీ ఆ యాస పోలేదు. 178 00:14:13,228 --> 00:14:16,565 మీరు చూడటానికి రావడం బాగుంది. ఈ ఊరిలో ఎప్పటిదాకా ఉంటారు? 179 00:14:16,648 --> 00:14:17,941 అది పని మీద ఆధారపడి ఉంటుంది. 180 00:14:18,025 --> 00:14:20,611 మీరు వెళ్లిపోయేలోపు బహుశా మనమందరం ఓసారి కలవవచ్చేమో? 181 00:14:21,153 --> 00:14:23,947 మా అమ్మకి కూడా నా వయసే ఉన్నప్పుడు, తను ఎలా ఉండేదో తెలుసుకోవాలని నాకు చాలా ఉంది. 182 00:14:24,031 --> 00:14:27,326 అలా అయితే, మీ అమ్మని ఇబ్బంది పెట్టే కథలతో పూర్తిగా సంసిద్ధమై వస్తానులే. 183 00:14:29,036 --> 00:14:30,454 రేపు ఉదయం తొమ్మిది గంటలకి నిన్ను కలుస్తాను, సరేనా? 184 00:14:40,964 --> 00:14:42,674 ఈ అమ్మాయి భలే చురుకుగా ఉంది. 185 00:14:44,009 --> 00:14:45,928 తన వల్ల ఏదైనా సమస్య వస్తుందంటావా? 186 00:14:46,011 --> 00:14:47,513 నేను చూసుకోలేని సమస్య అంటూ ఏదీ లేదు. 187 00:15:04,821 --> 00:15:07,741 మరి, చాలా దరిద్రంగా ఉంటుంది, కానీ ఇది తాత్కాలికమేలే. 188 00:15:08,325 --> 00:15:10,369 నా ప్రణాళిక ప్రకారమే అనుకో. 189 00:15:26,426 --> 00:15:29,263 క్షమించు, ఇది... చాలా... 190 00:15:30,305 --> 00:15:31,306 పర్వాలేదులే. 191 00:15:37,729 --> 00:15:40,566 కేవలం... నువ్వు కళాశాలకి ఏమైనా వెళ్తున్నావా? 192 00:15:41,483 --> 00:15:44,069 లేదు, నేను పట్టా తీసేసుకున్నాను. 193 00:15:44,820 --> 00:15:47,614 నీకు ఆకలిగా ఉందా? నేను కొన్ని పిమెంటో చీస్ శ్యాండ్విచ్ లని చేశాను. 194 00:15:48,824 --> 00:15:53,537 నువ్వు తరచుగా చేసేదే. నిజానికి, నీకు ఇది చేయడమే తెలుసు. నీకు వంట చేయడం అంతగా రాదు. 195 00:15:55,080 --> 00:15:56,081 కూర్చో. 196 00:16:12,764 --> 00:16:17,769 -బహుశా నాకు కూడా వంట చేయడం సరిగ్గా రాదేమో? -అదేం లేదు, ఇది చాలా... ఘాటుగా ఉంది. 197 00:16:18,478 --> 00:16:21,481 -నీ ఉద్దేశం... కారంగా ఉందనా? -అవును. కారంగా ఉంది. 198 00:16:21,565 --> 00:16:24,067 మన్నించు. నువ్వు మామూలుగా దేనిలోనైనా చిల్లీ సాస్ ఎక్కువగా వేస్తూ ఉంటావు. 199 00:16:25,068 --> 00:16:28,238 -నీకు ఇంకేదైనా చేసి పెడతాను. -పర్వాలేదులే. నాకు ఆకలిగా ఏమీ లేదు. 200 00:16:30,532 --> 00:16:31,950 కానీ కాసేపు కునుకు తీస్తాను. 201 00:16:36,038 --> 00:16:37,456 నీకోసం పడకగదిని సిద్దం చేశాను. 202 00:16:38,207 --> 00:16:41,543 తరువాత మనం ఏం చేయాలో నిర్ణయించేదాకా నేను సోఫా మీద పడుకుంటానులే. 203 00:17:32,052 --> 00:17:34,471 సైన్స్ ఫేయిర్ తొలి స్థానం 204 00:18:02,332 --> 00:18:04,418 వేయిన్ - ఈ పనిని నేనెంతో కాలం పాటు చేయలేననుకుంటాను. 205 00:18:04,501 --> 00:18:05,919 నేను ఇక్కడి నుండి వెంటనే బయటపడిపోవాలి. 206 00:18:09,381 --> 00:18:12,301 కంగారుపడకు. ఎక్కువ కాలమేమీ పట్టదు. 207 00:18:32,613 --> 00:18:36,617 యూ-235ని ఒకటి నుండి మూడు శాతం వరకూ శుద్ధిచేసి... 208 00:18:37,826 --> 00:18:41,038 అణువిచ్ఛేదన ప్రక్రియలో వినియోగిస్తారు. 209 00:18:42,331 --> 00:18:43,999 ఆ ప్రక్రియలో... 210 00:18:46,084 --> 00:18:51,965 విచ్చేదన ప్రక్రియని అదుపు చేసేందుకుగాను, అణు ఇంధన మోపులలో, 211 00:18:52,049 --> 00:18:54,676 రెండు నుంచి మూడు శాతం వరకూ శుద్ధి చేసిన యూ-235ని వినియోగిస్తారు. 212 00:18:54,760 --> 00:19:00,599 నిదానంగా కదిలే న్యూట్రాన్, యూ-235 అణువును ఢీ కొట్టి, అణువు విచ్చేదనకి కారణమవుతుంది. 213 00:19:00,682 --> 00:19:03,727 తను ఒక నర్తకి, ఒక పిచ్చి అణు శాస్త్రవేత్త కాదు. 214 00:19:03,810 --> 00:19:05,437 అంటే, తను దాని గురించి ఓ చిట్టా చెప్పింది. 215 00:19:05,521 --> 00:19:08,148 తెలివైనదాన్ని నేను. తను సరదా మనిషి. అలా అని తనే ఊరికే అనేది. 216 00:19:08,232 --> 00:19:10,400 నేను చెప్పేది జాగ్రత్తగా విను. తను కారు ప్రమాదానికి గురైనప్పుడు, 217 00:19:10,484 --> 00:19:12,236 తను ఎక్కడికి వెళ్తోందో, ఏం చేస్తోందో ఏమైనా నీకు తెలుసా? 218 00:19:12,611 --> 00:19:13,695 తినడానికని ఏమైనా తీసుకురావడానికి వెళ్లింది. 219 00:19:13,779 --> 00:19:14,988 అది తను చెప్పిన విషయం. 220 00:19:15,489 --> 00:19:16,865 కోడీ, ఆపుతావా. 221 00:19:16,949 --> 00:19:19,535 నేను చెప్పేదేంటంటే, పెద్దలు పిల్లల వద్ద కొన్ని విషయాలను దాచిపెడతారు. 222 00:19:19,618 --> 00:19:22,538 మా నాన్న చేసినట్టుగానే. ఆయన దృష్టిలో "వ్యాపార పర్యటన" అంటే 223 00:19:22,621 --> 00:19:25,040 "నాకు వేరే కుటుంబం ఉంది. నీ కన్నా నాకు వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం," అని అర్థం. 224 00:19:25,123 --> 00:19:26,416 ఆ తర్వాత వాళ్ళతో ఆయన దారి ఆయన చూసేసుకున్నాడులే. 225 00:19:26,500 --> 00:19:27,793 మా అమ్మ అలాంటిది కాదు. 226 00:19:27,876 --> 00:19:29,211 చూడు, నిన్ను కాపాడాలనే నా ప్రయత్నం అంతా. 227 00:19:29,294 --> 00:19:31,547 చివరిసారి నువ్వు తనతో ఉన్నప్పుడు, నీ వయసు ఒక 12 ఏళ్ళు ఉంటాయా? 228 00:19:31,630 --> 00:19:33,006 అప్పుడు నీకు మాత్రం ఏం తెలుసు? 229 00:19:33,090 --> 00:19:35,801 బహుశా తను కారు ప్రమాదానికి గురైనప్పుడు, ఆహారమే తెస్తుండిందేమో. 230 00:19:36,969 --> 00:19:38,595 లేదా ఇంకేదైనా చేస్తూ ఉండిందేమో. 231 00:19:38,679 --> 00:19:43,350 నీ మొహం. తన బుర్ర అలసిపోయింది. నేను చేయవలసిందల్లా తనకి గుర్తుతెప్పించడమే. 232 00:19:52,025 --> 00:19:53,110 ఏంటిదంతా? 233 00:19:53,485 --> 00:19:54,862 రుచికరమైన వంటకాలు. 234 00:19:56,154 --> 00:19:57,155 కూర్చో. 235 00:19:58,240 --> 00:20:00,284 నేను విషయాలను సరైన కోణంలో చూడటం లేదు. 236 00:20:01,201 --> 00:20:04,997 నీ గతాన్ని బలవంతంగా గుర్తుతెప్పించాలని చూడటం వల్ల నీ మీద అనవసరమైన భారం పడుతుంది. 237 00:20:05,080 --> 00:20:06,957 ఓ సూర్యకాంతం లాగా ప్రవర్తించానేమోనని అనిపిస్తోంది. నన్ను మన్నించు. 238 00:20:07,040 --> 00:20:08,041 సూర్యకాంతమా? 239 00:20:08,542 --> 00:20:09,960 పాత సినిమాలలో గయ్యాళి పాత్రలను... 240 00:20:10,961 --> 00:20:15,924 చూడు, పాత జ్ఞాపకాలను తవ్వే పని మీద కాకుండా కొత్త జ్ఞాపకాలని సృష్టించే పని మీద ఉందాం. 241 00:20:16,508 --> 00:20:18,510 తద్వారా మన ప్రస్తుత స్థితి గురించి ఒకరికొకరం తెలుసుకోవచ్చు. 242 00:20:22,556 --> 00:20:25,184 హాయ్. నేను అలియా జోర్డన్ ని. 243 00:20:27,978 --> 00:20:32,107 నాకు పద్దెనిమిదేళ్ళు. కన్య రాశి, ఐ.ఎన్.టీ.జే. రావెన్క్లా. 244 00:20:33,108 --> 00:20:34,526 ఏవైనా ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం నా అభిరుచి. 245 00:20:34,610 --> 00:20:36,945 నాకు తూనీగలు, గృహాలంకరణ కార్యక్రమాలంటే ఇష్టం. 246 00:20:37,362 --> 00:20:38,780 డ్రెక్ కి వీరాభిమానిని. 247 00:20:44,411 --> 00:20:45,787 సారా. 248 00:20:46,496 --> 00:20:48,123 నాకేం నచ్చుతాయో నాకు తెలీదు. 249 00:20:48,207 --> 00:20:51,335 అయితే, ఇక తినడం మొదలుపెట్టు. ఇక్కడ ప్రాథమిక ఆహార పదార్థాలు ఉన్నాయి. 250 00:20:51,418 --> 00:20:56,798 ఇక్కడ స్పగెట్టీ, పిజ్జా, పీబీ అండ్ జే, పాన్ కేకులు, కుకీలు, హాట్ డాగులు ఉన్నాయి. 251 00:20:57,758 --> 00:20:58,759 ఆలుగడ్డ వేంపుడు. 252 00:21:08,018 --> 00:21:11,146 -ఇది బాగుంది. -లేదు. నేను నమ్మను. 253 00:21:13,440 --> 00:21:14,525 దీన్ని తిని చూడు. 254 00:21:22,991 --> 00:21:25,035 ఆగు. నీకది నచ్చింది. 255 00:21:25,118 --> 00:21:27,162 -లేదు. -ఇంకో ముక్క తిని చూడు. 256 00:21:37,506 --> 00:21:39,466 బాగుంది. ఇది చాలా బాగుంది. 257 00:21:40,133 --> 00:21:42,928 అది ప్రాథమిక మాంసం. పంది మాంసం బాగుండదని ఎవ్వరూ అనలేరు. 258 00:21:43,011 --> 00:21:46,598 అదీగాక, దాన్ని పాన్ కేకులతో తిన్నా బాగానే ఉంటుంది, ఒకవేళ నీకు కలుపుకొని తినాలనుంటే. 259 00:21:46,682 --> 00:21:52,062 చూడు, ఇవి చాలా బాగున్నాయి, కానీ నేను నా కోమా ఆసరా బృందం సదస్సుకు హాజరు కావాలి. 260 00:21:54,439 --> 00:21:56,942 నువ్వు... ఆసరా బృందంలో చేరావా? 261 00:21:57,025 --> 00:21:58,026 అవును. 262 00:21:59,194 --> 00:22:00,487 చేరితే మంచిదని అనిపించింది. 263 00:22:00,988 --> 00:22:04,908 అవును. అది... అది మంచి పని. 264 00:22:05,576 --> 00:22:08,537 సరేమరి, ఇక వీటిని ఫ్రిడ్జిలో పెట్టేసి, ఇక నేను పనికి తయారవ్వుతానులే. 265 00:22:09,538 --> 00:22:11,164 నీ స్నేహితుడు వేయిన్ తో మనం డిన్నర్ చేయవచ్చేమో. 266 00:22:11,248 --> 00:22:12,541 హోటల్ లో నాకు ఆహారం ఉచితం. 267 00:22:12,624 --> 00:22:15,711 అతను నాకు కాల్ చేశాడు. పని మీద తొందరగా ఊరిని విడిచి వెళ్లిపోతున్నాని చెప్పాడు. 268 00:22:17,171 --> 00:22:18,839 అయ్యయో. అలాగేలే. 269 00:22:18,922 --> 00:22:22,593 -ఒక్కదానివే నీకేమీ ఇబ్బంది లేదు కదా? -లేదులే. నా దగ్గర రైళ్ళ షెడ్యూల్ ఉందిలే. 270 00:22:24,094 --> 00:22:27,139 ఇవన్నీ చేసినందుకు ధన్యవాదాలు, అలియా. నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. 271 00:22:27,973 --> 00:22:29,183 పర్వాలేదులే. 272 00:22:30,893 --> 00:22:32,853 నీ పాత డాన్స్ సంస్థని ఓ సారి చూసొద్దాం, ఏమంటావు? 273 00:22:33,270 --> 00:22:34,521 ఏంటి? 274 00:22:34,605 --> 00:22:38,275 వాళ్ళు ఒక కొత్త ప్రదర్శనకి రిహార్సల్ చేస్తున్నారు, మనం వెళ్లి చూసేవాళ్ళం కదా. 275 00:22:38,734 --> 00:22:40,402 ఇప్పుడు కూడా మనల్ని ఖచ్చితంగా రానిస్తారు. 276 00:22:40,485 --> 00:22:43,405 అదీగాక, మనిద్దరం కలిసి బయటకెళ్తే బాగుంటుందేమో. 277 00:22:44,156 --> 00:22:45,240 ఏమంటావు? 278 00:23:01,757 --> 00:23:03,550 మనకి ఒక ఆధారం దొరికింది, వెళ్లి ఓసారి పరిశీలిద్దాం. 279 00:23:11,892 --> 00:23:13,727 ఇదేనా ఆ ప్రదేశం? 280 00:23:13,810 --> 00:23:14,853 అవును. 281 00:23:14,937 --> 00:23:16,522 అనధికార వ్యక్తులకు ప్రవేశం లేదు 282 00:23:16,605 --> 00:23:19,066 ఇదంత తేలికైన వ్యవహారం కాదు. 283 00:23:19,149 --> 00:23:20,984 అందుకే కదా నేను నీ సాయం కోరింది. 284 00:23:22,903 --> 00:23:24,905 ఇప్పుడు ప్రదర్శితమవుతోంది రిటర్న్ టు ఏ స్ట్రేంజ్ ల్యాండ్ 285 00:23:29,618 --> 00:23:31,161 కోడీ 286 00:23:40,963 --> 00:23:41,964 హేయ్! 287 00:23:48,178 --> 00:23:49,596 నువ్వు వచ్చావు. 288 00:23:51,515 --> 00:23:53,141 మళ్లీ మనం ఇక్కడికి వస్తామని నేనస్సలు అనుకోలేదు. 289 00:23:54,101 --> 00:23:55,102 నీకేమీ అభ్యంతరం లేదు కదా? 290 00:24:02,109 --> 00:24:03,193 నాకు చాలా ఆతృతగా ఉంది. 291 00:25:21,855 --> 00:25:25,943 ఆ నాట్యమాడేవాళ్ళు, వేర్వేరుగా నాట్యమాడుతున్నా కూడా లయ తప్పడం లేదు. 292 00:25:26,818 --> 00:25:29,780 మన దేహాలు అలా చేయగలవని నాకు తెలీనే తెలీదు. నాకు నా దేహం ఒక పంజరంలాగా అనిపిస్తుంది. 293 00:25:30,405 --> 00:25:34,701 ఒకప్పుడు నీ దేహం కూడా అలా నాట్యామాడేదే. బహుశా ఏదోకరోజు మళ్లీ వేయగలదు కూడా. 294 00:25:36,245 --> 00:25:38,163 నీ సంగతేంటి? నువ్వు నాట్యమాడగలవా? 295 00:25:38,247 --> 00:25:42,209 లేదు, లేదు. నేను నాట్యమాడితే దరిద్రంగా ఉంటుంది. అస్సలు చూడలేవు. 296 00:25:43,210 --> 00:25:44,503 అక్కడికి మనం వెళ్లినందుకు నాకు ఆనందంగా ఉంది. 297 00:25:45,629 --> 00:25:49,049 నేను కోమా నుండి బయటపడ్డాక, మనం చేసిన అతి అద్భుతమైన పని ఇదే. 298 00:25:52,344 --> 00:25:53,345 ఏమైంది? 299 00:25:55,180 --> 00:25:57,015 లోపల ఎవరో ఉన్నారు. వాళ్ళ అలికిడిని నేను వినగలను. 300 00:25:57,558 --> 00:25:59,560 -నీకెలా తెలుసు? -నా వెనకే నిలబడు. 301 00:26:10,237 --> 00:26:11,238 తాళంచెవి ఇవ్వు. 302 00:26:29,423 --> 00:26:32,426 దేవుడా, కోడీ. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అసలేం జరిగింది? 303 00:26:32,509 --> 00:26:35,012 ఫోన్ ఎత్తుంటే నీకు తెలిసుండేది. ఎక్కడికి వెళ్ళావు? 304 00:26:36,013 --> 00:26:39,141 కోడీ, ఈవిడ సారా... మా అమ్మ. 305 00:26:40,642 --> 00:26:42,019 ఇతను కోడీ. 306 00:26:43,020 --> 00:26:45,189 హాయ్. ఎట్టకేలకు మిమ్మల్ని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది, మేడమ్. 307 00:26:46,523 --> 00:26:48,358 ఇప్పుడైనా చెప్తావా అసలేం జరిగిందో? 308 00:26:52,905 --> 00:26:54,323 నేను మీ ఇద్దరినీ ఒంటరిగా వదిలేస్తాను. 309 00:27:07,461 --> 00:27:09,963 హేయ్, చూడు, మనం ఊరిని విడిచి వెళ్లిపోవాలి. 310 00:27:10,047 --> 00:27:13,050 ఏంటి? ఏం చేశావేంటి? అసలేం జరిగింది? 311 00:27:13,133 --> 00:27:15,511 కారు కొనడానికి కాసిన్ని డబ్బులు తెద్దామనే ప్రయత్నం మాత్రమే చేశాను, సరేనా? 312 00:27:16,011 --> 00:27:17,471 ఇంతకీ ఏం చేశావు? 313 00:27:18,013 --> 00:27:20,682 ఒకడికి గంజాయి అమ్ముతున్నాను, అదేం పెద్ద విషయం కాదు. 314 00:27:21,099 --> 00:27:23,101 ఇప్పుడది పెద్ద విషయమే అయ్యిందిగా. మరి నీ మీద దాడి చేసింది ఎవరు? 315 00:27:23,185 --> 00:27:25,521 నాకు తెలీదు, మొత్తం దోచేసుకున్నారు, అది చాలా పెద్ద మొత్తం. 316 00:27:26,104 --> 00:27:28,732 అలియా, నేను తిరిగి అతనికి ఎన్నటికీ కట్టలేను. మనం వెళ్లిపోవాలి. 317 00:27:29,107 --> 00:27:31,735 ఈ జాస్పర్ అనే వ్యక్తి, అతని డబ్బును కానీ నేను అతనికి ఇవ్వకపోతే, 318 00:27:31,818 --> 00:27:33,195 అతనేం చేస్తాడో కూడా నేను చెప్పలేను. 319 00:27:37,574 --> 00:27:39,535 -ఇది సరిపోతుందా? -సరిపోదు. 320 00:27:40,077 --> 00:27:44,122 నేను నీ నుంచి తీసుకోను కూడా. మనకి దీని అవసరం ఉంది. ఎల్.ఏ, ఇంక మనం ఆగకూడదు. 321 00:27:44,206 --> 00:27:46,875 కోడీ, నేను అమ్మని వదిలిరాలేను. 322 00:27:47,376 --> 00:27:49,169 -నీ ఉద్దేశం జేసన్ బోర్న్ నా? -ఇక ఆపు. 323 00:27:49,253 --> 00:27:50,963 నన్ను క్షమించు, కానీ ఆవిడ ప్రవర్తన ఏదో తేడాగా ఉంది. 324 00:27:51,755 --> 00:27:53,799 నీకు నేను ఎల్లప్పుడూ అండగానే ఉన్నాను. 325 00:27:53,882 --> 00:27:55,843 ఇప్పుడు నువ్వు నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. 326 00:27:55,926 --> 00:27:58,136 కోడీ, దయచేసి. 327 00:27:59,555 --> 00:28:01,890 ఇప్పుడు నన్ను ఏదోకటి తేల్చుకోమని అడుగుతున్నావా? 328 00:28:03,559 --> 00:28:05,227 నీకు తెలుసు, నేను ఆ పనిని చేయలేనని. 329 00:28:07,354 --> 00:28:09,022 అయితే, నేనే నీకది కష్టం కాకుండా చేస్తాను. 330 00:28:26,039 --> 00:28:27,791 ఎందుకు నా వంక అలా చూస్తున్నావు? 331 00:28:28,834 --> 00:28:32,754 అవును, నాకు మధ్యం తాగేంత వయసు లేకున్నా నేను తాగుతున్నాను. నేనింతే. 332 00:28:34,089 --> 00:28:35,507 నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. 333 00:28:37,843 --> 00:28:39,052 నువ్వు అతడిని పట్టించుకుంటావు, 334 00:28:39,136 --> 00:28:41,930 కానీ నేను లేకపోయినా, నువ్వు అతనితో వెళ్లిపోవడం లేదు. 335 00:28:42,014 --> 00:28:43,223 నువ్వు మా మాటలు విన్నావా? 336 00:28:44,433 --> 00:28:46,852 చూడు, నేనెన్ని కష్టాలు అనుభవించానో నీకు తెలీను కూడా తెలీదు. 337 00:28:48,562 --> 00:28:52,983 కోడీ, నా గురించి వాడికి తెలుసు. నన్ను అర్థం చేసుకుంటాడు. 338 00:29:04,369 --> 00:29:06,121 చాటుగా విన్నందుకు నన్ను మన్నించు. 339 00:29:06,997 --> 00:29:08,415 పర్వాలేదులే. కానీ... 340 00:29:09,166 --> 00:29:12,377 ఇప్పుడు నేను నువ్వనుకుంటున్న మనిషిని కాదు. అస్సలు కాదు. 341 00:29:15,380 --> 00:29:16,757 నేనేమీ అనుకోవడం లేదు. 342 00:29:17,925 --> 00:29:20,260 నేనిప్పుడు ఆ వీడియోలలో ఉన్నట్టుగా ఎన్నో ఆలోచనలతో ఉన్న అమ్మాయినేం కాదు. 343 00:29:25,307 --> 00:29:27,059 నేను పట్టా పొందానని చెప్పింది అబద్ధం. 344 00:29:29,311 --> 00:29:31,897 సేయింట్ ఆల్బన్స్ లో ఉపకార వేతనంతో చదువు సాగించాను. 345 00:29:32,564 --> 00:29:36,109 అది రాష్ట్రంలోనే గొప్ప కళాశాల. 346 00:29:37,736 --> 00:29:39,238 కానీ నన్ను బయటకు పంపించేశారు. 347 00:29:40,280 --> 00:29:41,281 ఎందుకు? 348 00:29:42,824 --> 00:29:44,368 ఎందుకంటే నేను ఒంటరిగా ఉండేదాన్ని, కోపంగా ఉండేదాన్ని, 349 00:29:44,451 --> 00:29:47,871 అదీగాక, తమ బడాయిలను చూపించుకొనే ధనవంతుల పిల్లలు ఆ కళాశాలలో చాలా మందే చదివేవారు. 350 00:29:49,540 --> 00:29:50,624 ఇక కోడీ... 351 00:29:52,417 --> 00:29:53,794 నేను చేసిన పనికి నిందని తన మీద వేసుకున్నాడు. 352 00:29:56,213 --> 00:29:59,758 మంచి భవిష్యత్తు ఉండేది నాకే అని చెప్పాడు. కానీ నేను చేసే పనులను ఆపలేకపోయాను. 353 00:30:04,471 --> 00:30:07,558 నీ తెలివైన కూతురు కళాశాలకి వెళ్లి చదువుకోవాలని, నీ జీవితాన్నే త్యాగం చేశావు, 354 00:30:07,641 --> 00:30:09,726 ఇలా జరుగుతుందని నువ్వు ఊహించి ఉండకపోవచ్చు. 355 00:30:12,062 --> 00:30:14,231 నువ్వు అనుభవించిన కష్టాలు నేను ఊహించలేనని నువ్వు అనుకుంటున్నావని నాకు తెలుసు, 356 00:30:14,314 --> 00:30:15,816 నిజంగానే, నేను ఊహించలేను... 357 00:30:21,363 --> 00:30:23,156 ఒంటరితనం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. 358 00:30:27,703 --> 00:30:29,913 ఒంటరితనం మనలో ఎంతటి మార్పును తెస్తుందో కూడా నాకు తెలుసు. 359 00:30:36,545 --> 00:30:40,340 కోమాలో ఉన్నప్పుడు అలా అనిపించిందా? 360 00:30:42,718 --> 00:30:45,679 లేక... నువ్వు అంతకుముందు విషయం గురించి మాట్లాడుతున్నావా? 361 00:30:47,514 --> 00:30:49,266 నువ్వు నాకు ఇదివరకు చెప్పనిదేదైనా? 362 00:30:52,352 --> 00:30:53,770 నువ్వు నా జీవితంలోకి రాకముందు... 363 00:30:55,105 --> 00:30:58,483 నేను ఒంటరితనం అనుభవించానని మాత్రం చెప్తాను. 364 00:31:01,612 --> 00:31:05,199 కానీ నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి, చెడు వ్యక్తితో జతకట్టడమనేది సరైనది కాదు. 365 00:31:08,452 --> 00:31:10,621 అయితే, కోడీ నాకు తగినవాడు కాదని నీకు తెలుసా? 366 00:31:11,580 --> 00:31:14,708 నా ఉద్దేశం, అతను ఎన్నో ఆలోచనలున్న పిల్లని పక్కదోవ పట్టిస్తే అతనిది తప్పే అవుతుంది. 367 00:31:15,334 --> 00:31:19,838 ఆ ఆలోచన అంతా ఒట్టిదే. నేనేమీ ఒక తెలివైన మెకానికల్ ఇంజనీర్ ని కావడం లేదు. 368 00:31:20,547 --> 00:31:24,635 ఆ విషయం నాకు తెలియదు. నువ్వు తెలివైనదానివని నాకు చెప్పింది నువ్వే. 369 00:31:24,718 --> 00:31:28,597 నువ్వే తెలుసుకుంటావు, అదేమీ నీ విధిరాత కాదు. 370 00:31:29,681 --> 00:31:30,974 నియంత్రణ అనేది నీ చేతిలో ఉండాలి. 371 00:31:31,058 --> 00:31:32,518 కోడీ చేతిలో కాదు... 372 00:31:34,353 --> 00:31:35,854 ఇంకెవ్వరి చేతిలో కూడా కాదు. 373 00:31:38,190 --> 00:31:39,608 ధన్యవాదాలు, అమ్మా. 374 00:32:13,392 --> 00:32:14,393 ద కలైడర్ట్రాన్ 375 00:32:14,476 --> 00:32:17,271 ఈ ఎపిసోడ్ ని మీకు ప్రవేశపెట్టినవారు, క్లౌడ్ స్పన్. 376 00:32:17,354 --> 00:32:20,148 క్లౌడ్ స్పన్ ని ఒకే ఒక విషయం దృష్టిలో ఉంచుకొని సృష్టించారు; 377 00:32:20,232 --> 00:32:23,902 అతి సరసమైన ధరకే అద్భుతమైన నిద్రని కలుగజేయడం. 378 00:32:34,705 --> 00:32:35,914 ఏ. స్టోన్ 379 00:32:40,586 --> 00:32:42,671 టీ: నాకు తెలీదు. కానీ ఇప్పుడు ఆమెకి బాగా మత్తుమందు ఇచ్చి ఉంచుతున్నారు. 380 00:32:42,754 --> 00:32:45,174 జీ1: ప్రతీరోజు రాత్రీ ప్రశాంతంగానే ఉంటుంది, బాసూ. ఈ ప్రాంతంలో ఏమీ జరగదు. 381 00:32:45,257 --> 00:32:47,092 జీ2: నాకు తెలుసు. ఇక్కడ దేనికి కాపలా ఉండాలో కూడా నాకు తెలియడం లేదు. 382 00:32:49,178 --> 00:32:51,889 జీ1: "ఏ. స్టోన్" అని తరచుగా వింటుంటాను. కానీ అదేంటో నాకస్సలు తెలీదు. 383 00:32:59,104 --> 00:33:01,106 సరేమరి. ఎక్కడికి వెళ్తున్నావు? 384 00:33:06,612 --> 00:33:07,613 వేయిన్? 385 00:33:28,342 --> 00:33:30,260 ఫోన్ నంబరు దొరికింది: 386 00:33:30,344 --> 00:33:32,804 వేయిన్ విల్క్స్ 4728 కొల్లిన్స్ అవెన్యూ - ఆనిస్టన్, ఆలబామ 387 00:34:09,800 --> 00:34:12,010 -చెప్పండి? -ఇక్కడ వేయిన్ విల్క్స్ అని ఎవరైనా ఉంటారా? 388 00:34:14,137 --> 00:34:15,848 మీరు వేయిన్ కోసం అడుగుతున్నారా? 389 00:34:17,516 --> 00:34:20,518 మా అమ్మ స్నేహితుడని చెప్పాడు. చికాగోలో ఉన్నప్పటి నుండి. 390 00:34:21,395 --> 00:34:23,146 చికాగోనా? 391 00:34:23,230 --> 00:34:25,440 అతను ఇక్కడ ఆనిస్టన్ లోనే తన జీవితమంతా గడిపాడు. 392 00:34:25,983 --> 00:34:27,025 అది మీకు ఖచ్చితంగా తెలుసా? 393 00:34:27,109 --> 00:34:30,404 మేమిద్దరమూ కలిసే పెరిగాం. 1995లో ప్రామ్ రాజు, రాణీ కిరీటం మాకు దక్కింది. 394 00:34:31,237 --> 00:34:32,822 నాకు అతని గురించి తెలియని విషయమంటూ ఏదీ లేదు. 395 00:34:34,074 --> 00:34:36,201 అతను పైకప్పును బాగుచేయడానికని నిచ్చెన ఎక్కుతూ పడిపోయేంత వరకూ. 396 00:34:37,536 --> 00:34:40,496 తలకి బలమైన గాయం తగిలింది, పుర్రె దాదాపుగా రెండు ముక్కలైపోయినంత పనైంది. 397 00:34:42,040 --> 00:34:43,500 వెంటనే కోమాలోకి వెళ్లిపోయాడు. 398 00:34:45,418 --> 00:34:47,629 ఒక్క నిమిషం, అతను కోమాలో ఉన్నాడా? 399 00:34:47,713 --> 00:34:51,091 అవును. అతని మెదడు నిర్జీవమైపోయిందని, ప్రాణమున్న శవమైపోయాడని చెప్పారు. 400 00:34:51,175 --> 00:34:52,926 అయినా కానీ ప్రతీరోజు వెళ్లి అతడిని చూసొచ్చేదాన్ని. 401 00:34:53,886 --> 00:34:57,931 ఆ తర్వాత, అయిదు నెలల తరువాత, హఠాత్తుగా, డబుక్కున మేల్కొన్నాడు. 402 00:34:59,224 --> 00:35:03,145 అదో మాయలా జరిగిపోయింది. ఒక్క విషయం తప్ప. 403 00:35:04,521 --> 00:35:08,942 -ఏంటది? -తను మేల్కొన్నాక... వేరేవ్యక్తి అయిపోయాడు. 404 00:35:10,944 --> 00:35:12,404 వేరేవ్యక్తిగానా? అంటే ఎలా? 405 00:35:12,487 --> 00:35:13,822 అతను అతనిలా ఉండేవాడు కాదు. 406 00:35:14,531 --> 00:35:15,824 నిద్రలో మాట్లాడుతూ ఉండేవాడు, 407 00:35:15,908 --> 00:35:19,912 అతను ఎప్పుడూ పట్టించుకోని గణిత సమీకరాణాల గురించి ఏదేదో వాగేవాడు. 408 00:35:20,787 --> 00:35:22,247 అతను వేయిన్ మాత్రం కాదు. 409 00:35:23,290 --> 00:35:25,542 నా వేయిన్ కి నేనంటే ప్రాణం. 410 00:35:27,044 --> 00:35:28,045 మరి ఈ వేయిన్... 411 00:35:28,504 --> 00:35:29,505 ఈ వేయిన్ కి ఏమైంది? 412 00:35:29,588 --> 00:35:33,509 ఇంటికి వచ్చి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే బార్ లో కలిసిన ఓ వగలాడితో వెళ్లిపోయాడు. 413 00:35:33,592 --> 00:35:36,094 లెక్సా. లెక్సీ. తన పేరు సరిగ్గా గుర్తులేదు. 414 00:35:36,178 --> 00:35:41,308 చూడండి, ఆ మహిళ, లెక్సానో, లెక్సీయో? తన గురించి ఇంకేమైనా మీకు తెలుసా? 415 00:35:41,391 --> 00:35:43,393 లేదు. తెలీదు. 416 00:35:50,275 --> 00:35:52,569 స్టోన్ గురించి వెతకకుండా ఎలా ఉంటాను. నేను చేసిన మొదటి పని అదే. 417 00:35:58,825 --> 00:36:00,285 అలెగ్జాండ్రా. 418 00:36:00,369 --> 00:36:02,412 అలెగ్జాండ్రా. అలెగ్జాండ్రా స్టోన్. 419 00:36:04,748 --> 00:36:06,750 అలెగ్జాండ్రా స్టోన్ 420 00:36:06,834 --> 00:36:11,338 బే ప్రాంతపు మహిళ మూడేళ్ళ కోమా నుండి ఏదో అద్భుతం జరిగినట్టు కోలుకుంది 421 00:36:21,181 --> 00:36:22,182 నీకేమైనా తెలిసిందా? 422 00:36:40,909 --> 00:36:42,411 తనని వేరే చోటికి మారుస్తున్నారు. 423 00:36:45,664 --> 00:36:46,874 ఈరాత్రికే. 424 00:36:46,957 --> 00:36:48,876 అయితే, ఇక అంతే. ఇదే మన అవకాశం. 425 00:36:51,211 --> 00:36:52,713 మన పని చేయవలసిన సమయం వచ్చింది. 426 00:36:56,967 --> 00:36:59,261 తనని అదుపులోకి తీసుకున్నప్పుడు సీడీసీ వద్ద నువ్వేం చేస్తూ ఉన్నావు? 427 00:37:00,012 --> 00:37:01,847 ఎప్పటిలాగానే సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాను. 428 00:37:02,723 --> 00:37:05,851 ఇప్పుడు అది ముగిసిన కథలే. మన పథకం బయటకు పొక్కింది. 429 00:37:06,643 --> 00:37:09,438 తనని విడిపించుకొని వెళ్లిపోదాం, అంతే. ఈరాత్రికే తనని మారుస్తున్నారు. 430 00:37:10,480 --> 00:37:14,318 అది చాలా తొందర అవుతుంది. నేను మొత్తాన్ని చూడలేకపోతున్నా. అంత శక్తి ఇంకా నాకు లేదు. 431 00:37:18,572 --> 00:37:21,992 లేదు, అది కాదు. అసలు కారణం ఆ అమ్మాయే కదా. 432 00:37:25,329 --> 00:37:27,623 చూడు, నాకర్థమైంది. నాకు కూడా భార్య ఉండింది. 433 00:37:29,374 --> 00:37:32,085 మనం చేసేది... సంక్లిష్టమైన పని అని నాకు తెలుసు. 434 00:37:33,170 --> 00:37:36,340 ఈ భావనలకు తలుపులు మూసేయడం సాధ్యం కాని పని, కానీ... 435 00:37:37,216 --> 00:37:38,217 మనకి అది తప్పదు. 436 00:38:07,829 --> 00:38:08,830 ఎక్కడికి వెళ్ళావు నువ్వు? 437 00:38:09,998 --> 00:38:10,999 ఆసరా బృందం దగ్గరికి. 438 00:38:13,544 --> 00:38:14,545 ఆ తర్వాత... 439 00:38:15,295 --> 00:38:18,423 లెగసీ మూచువల్ కార్యాలయానికి వెళ్లి అక్కడ కాసేపు ఉన్నాను. 440 00:38:20,801 --> 00:38:21,802 ఇదిగో. 441 00:38:26,473 --> 00:38:28,851 నువ్వు జీవిత భీమా పాలసీని తీసుకున్నావా? ఎందుకు? 442 00:38:28,934 --> 00:38:32,229 అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, అలియా, నీకేం కాకూడదని నా అభిమతం... 443 00:38:33,397 --> 00:38:35,315 ఒకవేళ నాకేదైనా జరగరానిది జరిగితే. 444 00:38:35,399 --> 00:38:38,193 అంటే, హఠాత్తుగా నువ్వు మాయమైపోవడం లాంటిదేదైనా జరగడంలాగానా? 445 00:38:39,987 --> 00:38:41,405 నాకు వేయిన్ గురించి తెలుసు. 446 00:38:42,531 --> 00:38:44,533 అతనేమీ ఊరు విడిచి వెళ్లిపోలేదు. అతని బండిలో నువ్వు ఎక్కడం నేను చూశాను. 447 00:38:44,616 --> 00:38:45,617 అలియా. 448 00:38:45,701 --> 00:38:47,661 ఇన్నాళ్ళూ నువ్వు నాకు అబద్దం చెప్పావు. 449 00:38:47,744 --> 00:38:51,123 నీకు తెలియకూడని విషయాలు తెలుసు. నిద్రలో ఓ రేడియోలాగా లొడాలొడా వాగుతూనే ఉంటావు. 450 00:38:51,206 --> 00:38:53,000 ఏమైంది? ఏంటి సంగతి, అమ్మా? 451 00:38:53,083 --> 00:38:54,710 -ఏంటో చెప్పు. -నా మాట విను, అలియా. 452 00:38:54,793 --> 00:38:58,088 మళ్లీ నీ జీవితంలోకి ప్రవేశిస్తుందని నువ్వు ఆశిస్తున్న ఆ మహిళ, తను ఇక రాదు. 453 00:38:59,006 --> 00:39:02,843 కోమా పరిస్థితులను మార్చేసింది. చెప్పడానికి బాధగానే ఉన్నా, అది నిజంగానే మార్చేసింది. 454 00:39:02,926 --> 00:39:04,761 ఇక తను రాదు కూడా. అర్థమైందా? 455 00:39:04,845 --> 00:39:06,471 నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. 456 00:39:08,140 --> 00:39:12,436 అయితే నేనేమీ చేయలేను. కానీ ఆ విషయాన్ని నువ్వు మనసులోకి ఎక్కించుకొని సాగిపోవాలి. 457 00:39:12,519 --> 00:39:13,729 సాగిపోవాలా? 458 00:39:14,229 --> 00:39:18,066 నువ్వు ఎదిగిన పిల్లవి. ఇప్పుడు నీకు ఒక తల్లి యొక్క అవసరం లేదు కదా. 459 00:39:22,654 --> 00:39:23,989 నువ్వన్నది నిజమే. 460 00:39:24,823 --> 00:39:26,408 నాకు అవసరం లేదు. 461 00:39:27,117 --> 00:39:31,121 నన్ను నేను చూసుకోగలను. ఎప్పట్నుంచో చూసుకుంటున్నాను కదా. 462 00:39:40,422 --> 00:39:42,007 అలియా? ఏంటి సంగతి? 463 00:39:42,090 --> 00:39:45,135 ఇప్పుడే చేసేద్దాం. వెళ్లిపోదాం పద. మనం ఆ కారును కొనే అవకాశం ఇంకా ఏమైనా ఉందా? 464 00:39:45,219 --> 00:39:48,430 కాస్త శాంతించు. ఏంటి? మరి మీ అమ్మ సంగతేంటి? 465 00:39:48,514 --> 00:39:50,390 మీ అమ్మ ఏం చేసినా తనే నీకు సర్వస్వం అనుకున్నానే. 466 00:39:50,474 --> 00:39:53,977 నువ్వన్నది నిజమే. తను అబద్దమాడింది. 467 00:39:54,937 --> 00:39:58,065 నేను ఓ పెద్ద దద్దమ్మని, పరిస్థితులు మునుపటిలాగా మారిపోతాయని ఆశించాను. 468 00:39:59,816 --> 00:40:01,026 అసలేం జరిగిందో చెప్తావా? 469 00:40:01,109 --> 00:40:05,572 ఇప్పుడదంతా పట్టించుకొని లాభం లేదు. అస్సలు లేదు. నేను ఇంతకముందే బాగున్నాను. 470 00:40:08,534 --> 00:40:12,120 హేయ్, చూడు, జరిగినదానికి చింతిస్తున్నాను. ఏమీ కాలేదులే. పర్వాలేదులే. 471 00:40:13,205 --> 00:40:14,623 నా మాట విన్నావా? అన్నీ సర్దుకుంటాయి. 472 00:40:17,251 --> 00:40:19,878 ముందు ఆ కారును తెచ్చుకుందాం. ఇక మనం దేని కోసం ఆగకూడదు. 473 00:40:38,021 --> 00:40:39,481 అంత దగ్గర కావడం మంచిది కాదని నీకు ముందే చెప్పాను కదా. 474 00:40:44,319 --> 00:40:45,821 శత్రువులెవ్వరూ లేరు. 475 00:40:46,321 --> 00:40:47,739 ఆవిడ భద్రంగానే ఉంది. 476 00:40:48,198 --> 00:40:51,493 చేరుకోవలసిన గమ్యస్థానానికి ప్రస్తుత మార్గంలోనే సాగండి. 477 00:40:51,577 --> 00:40:52,744 జాగ్రత్త వహించండి. 478 00:40:52,828 --> 00:40:53,829 తప్పకుండా. 479 00:40:53,912 --> 00:40:57,040 ఆవిడని మార్చాక మీకు కబురు అందిస్తాం. 480 00:40:58,041 --> 00:41:00,794 వాళ్ళు దారిలో ఉన్నారు. మంచి విషయం. ఇక పని కానిద్దాం. 481 00:41:58,644 --> 00:41:59,770 పదండి! కదలండి, కదలండి! 482 00:42:00,395 --> 00:42:03,023 ఉన్నచోటి నుండి కదలకండి! చేతులను తలపైకి పెట్టండి! 483 00:42:50,320 --> 00:42:53,323 కొన్ని నిమిషాలలోనే వెళ్లిపోతాములే. 9 గంటల వార్తల యొక్క సిగ్నల్స్ సాయంతో వెళ్లిపోతాం. 484 00:43:04,918 --> 00:43:05,919 నువ్వు బాగానే ఉన్నావు కదా? 485 00:43:06,003 --> 00:43:08,922 వాళ్ళు నాకేదో ఇచ్చారు. దానికి ఈ దేహం సరిగ్గా తట్టుకోలేకపోతుంది. 486 00:43:15,137 --> 00:43:18,348 ప్రత్యక్ష ప్రసారం మొదలవుతోంది. ఇదే తరుణం. 487 00:43:19,141 --> 00:43:22,853 మనకి కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది, అది ముగిస్తే, ఇక మనం ఇక్కడ ఇరుక్కుపోయినట్టే. 488 00:43:24,479 --> 00:43:25,898 మరి, ఆడవాళ్ళు ముందు. 489 00:43:33,572 --> 00:43:34,990 ఎవ్వరితో దగ్గర కావడం మంచిది కాదని నువ్వు నాకు చెప్పింది అంతా అబద్దమేనా? 490 00:43:35,073 --> 00:43:37,075 నా ఉద్దేశం ఈ లోకంలోని వాళ్ళతో అని నీకు తెలుసు కదా. 491 00:43:37,534 --> 00:43:38,744 ఎవరితో అయితే ఏముంది, దాని అర్థం మారదు కదా. 492 00:43:43,582 --> 00:43:45,000 మిమ్మల్ని మన ప్రపంచంలో కలుసుకుంటాను. 493 00:43:50,047 --> 00:43:52,257 త్వరగా. ఈ వాతావరణంలో నువ్వెక్కువ సేపు మనలేవు. 494 00:44:19,826 --> 00:44:21,328 తను శ్వాస తీసుకోవడం లేదు. 495 00:44:22,621 --> 00:44:25,582 ఇలా ఎప్పటికైనా జరగాల్సిందే. ఈ విషయం నీకు కూడా తెలుసు. 496 00:44:26,583 --> 00:44:30,170 కానీ ఈ దేహం, నేనిక్కడికి వచ్చినప్పుడు ఇది సజీవంగానే ఉండింది. 497 00:44:30,254 --> 00:44:31,255 ఏదో ఉందంటే ఉంది, అంతే. 498 00:44:31,880 --> 00:44:34,716 ఈ దేహాలలో జీవం అంటూ పెద్దగా ఏమీ లేదు, 499 00:44:34,800 --> 00:44:36,927 వీళ్ళని విడిచి ఉండలేని వాళ్ళు, వీళ్ళ ప్రాణం పోకుండా ఉంచుతున్నారు, అంతే. 500 00:44:37,010 --> 00:44:38,220 అందుకే కదా మనం వీళ్ళని ఎంచుకుంది. 501 00:44:40,138 --> 00:44:42,266 ఇక పద. మనం మన లోకానికి వెళ్లిపోదాం. 502 00:44:46,270 --> 00:44:47,271 కుదరదు. 503 00:44:48,605 --> 00:44:49,606 ఏం చేస్తున్నావు నువ్వు? 504 00:44:50,399 --> 00:44:52,985 మనవాళ్ళ వద్దకి మనం చేరే అవకాశం మహా అయితే మరో రెండు నిమిషాలే ఉంటుంది. 505 00:44:53,569 --> 00:44:55,153 నేనేమీ నిన్ను ఆపడం లేదే. 506 00:44:56,822 --> 00:45:00,284 నువ్వు సారావి కావు, తల్లివి కూడా కావు. 507 00:45:04,037 --> 00:45:07,958 ఆ విషయం ఆ అమ్మాయికి ఎప్పటికైనా తెలిసిపోతుంది. కనుక నటించడం ఆపి ఇంటికి పద. 508 00:45:09,209 --> 00:45:11,295 బహుశా నేనిప్పుడు చేసేది ఇకపై చేయనేమో. 509 00:45:15,591 --> 00:45:18,385 ఏ ఒక్క ఆధారం కూడా మనం వదలలేమని నీకు తెలుసు. అది నిబంధనలకు విరుద్ధం. 510 00:45:18,468 --> 00:45:19,970 అందుకే కదా వాళ్ళు నిన్ను పంపింది. 511 00:45:20,053 --> 00:45:22,264 నేను... ఇక్కడే ఉంటున్నాను. 512 00:45:30,063 --> 00:45:33,233 మనకి కొట్టుకునేంత సమయం లేదు. మనం వెళ్లిపోవాలి. 513 00:45:33,317 --> 00:45:34,443 లేదు. 514 00:45:35,819 --> 00:45:37,905 వాళ్ళు నిన్ను ఒంటరిగా అస్సలు వదిలిపెట్టరు. అది నీకు కూడా తెలుసు కదా? 515 00:45:38,405 --> 00:45:40,782 నువ్విక్కడే ఉంటే, వాళ్ళు నిన్ను వదిలిపెట్టరూ, ఆ అమ్మాయినీ వదిలిపెట్టరు. 516 00:45:41,200 --> 00:45:43,410 అయితే నాతో యుద్ధం చేయవలసి వస్తుందని వాళ్ళకి చెప్పు. 517 00:45:45,329 --> 00:45:46,955 సారా, మనకి సమయం మించిపోతోంది! 518 00:45:49,082 --> 00:45:50,542 పిచ్చిదానా. 519 00:46:18,403 --> 00:46:20,113 నీకు దీన్ని తెరవగల అంకెలు తెలుసనుకున్నానే. 520 00:46:20,197 --> 00:46:22,741 తెలుసు. కాస్త ఆగు. 521 00:46:35,379 --> 00:46:36,380 మనం వెళ్లిపోవాలి. త్వరగా కానివ్వు. 522 00:46:43,762 --> 00:46:44,763 హేయ్! 523 00:46:46,014 --> 00:46:47,224 తను నీ ప్రియురాలా, గురూ? 524 00:46:48,976 --> 00:46:50,978 అవును. ఇంతకీ నువ్వెవరు? 525 00:46:51,520 --> 00:46:54,690 నీ ప్రియుడు ఒకడికి అప్పు ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని నేనే. 526 00:46:56,567 --> 00:46:58,068 అదేంటి, బాసూ. ఏం చేస్తున్నావు? 527 00:46:58,151 --> 00:47:01,572 ఆ సంచిని ఇక్కడికి తీసుకురా. వెంటనే! 528 00:47:05,826 --> 00:47:07,035 నువ్వు తన జోలికి వెళ్ళకు. 529 00:47:11,832 --> 00:47:12,833 ఏం జరుగుతోంది? 530 00:47:25,721 --> 00:47:28,056 నువ్వు మా అమ్మవి కాదు కదా? 531 00:47:29,558 --> 00:47:30,767 అలియా... 532 00:47:38,734 --> 00:47:42,571 అమ్మా. అమ్మా, నిబ్బరంగా ఉండు. దయచేసి, నిబ్బరంగా ఉండు. దయచేసి, నిబ్బరంగా ఉండు. 533 00:47:42,654 --> 00:47:44,740 నన్ను మన్నించు, అలియా. 534 00:47:44,823 --> 00:47:47,826 వద్దు. దయచేసి నన్ను వదిలివెళ్లిపోకు. నన్ను వదిలివెళ్లిపోకు. వెళ్లిపోకు. 535 00:47:47,910 --> 00:47:52,831 వదిలివెళ్లిపోకు. లోపల, ప్యాడిల్స్ ఉన్నాయి. అద్దంలో ఉన్నాయి. వెళ్లి తీసుకురా. 536 00:47:55,709 --> 00:47:56,919 అలియా. 537 00:47:57,002 --> 00:47:58,212 వద్దు. 538 00:48:00,255 --> 00:48:01,798 వద్దు. వద్దు. 539 00:48:07,846 --> 00:48:08,972 ఇవిగో. 540 00:48:10,724 --> 00:48:12,559 సరే. సరేమరి. 541 00:48:14,102 --> 00:48:15,437 కమాన్. 542 00:48:21,443 --> 00:48:23,654 -దాని వల్ల లాభం ఉంటుందని నాకనిపించడం లేదు. -ఆపు! 543 00:49:21,336 --> 00:49:22,546 సిసింద్రి? 544 00:49:23,338 --> 00:49:24,339 అమ్మా. 545 00:49:26,425 --> 00:49:27,634 ఏం జరుగుతోంది? 546 00:49:28,969 --> 00:49:29,970 అమ్మా. 547 00:49:30,888 --> 00:49:32,264 అమ్మా. 548 00:49:59,583 --> 00:50:00,667 అమ్మా. 549 00:50:24,816 --> 00:50:29,029 ప్యాట్రియట్స్, ఈగల్స్. ప్యాట్రియట్స్, బ్రోంకోస్. ప్యాట్రియట్స్, సీ హాక్స్. 550 00:50:32,407 --> 00:50:33,617 రాన్ మరియు హర్మాయినీ. 551 00:50:34,368 --> 00:50:36,161 అది ప్రమాదం జరగడానికి చాలా ముందుదిలే. 552 00:50:36,245 --> 00:50:40,123 సరేలే. దాన్ని బట్టి ఓ అంచనాకు వచ్చేయకు. ఇంకా నేను నాలుగవ పుస్తకాన్నే చదువుతున్నా. 553 00:50:44,211 --> 00:50:45,337 దీని మీద సంతకం చేస్తావా? 554 00:50:46,171 --> 00:50:48,882 పబ్లిక్ స్కూల్ లో నా సీనియర్ ఇయర్ ని మళ్లీ చదవడానికి ఇది నా దరఖాస్తు. 555 00:50:49,424 --> 00:50:51,468 -ఇది సేయింట్ ఆల్బన్స్ కాదు, కానీ... -హేయ్. 556 00:50:52,135 --> 00:50:55,556 నేను ఊహించినదానికన్నా ఇవాళ నువ్వు మంచి స్థానంలోనే ఉన్నావు. 557 00:50:56,890 --> 00:50:57,891 ధన్యవాదాలు, అమ్మా. 558 00:51:08,151 --> 00:51:09,361 ఇది ఎప్పుడు తీసుకున్నాం? 559 00:51:11,280 --> 00:51:13,323 రిహాస్ర్సల్ వద్ద. కొన్ని వారాల క్రిందటలే. 560 00:51:15,868 --> 00:51:18,996 ఏం ప్రదర్శిస్తూ ఉన్నారేంటి? నాకది నచ్చిందా? 561 00:51:20,664 --> 00:51:26,670 "రిటర్న్ టు ఏ స్ట్రేంజ్ ల్యాండ్"ని ప్రదర్శించారు. అవును, నీకు బాగా నచ్చింది. 562 00:53:26,164 --> 00:53:28,166 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య