1 00:01:07,985 --> 00:01:12,739 సెల్లార్ 2 00:01:48,942 --> 00:01:51,945 టేయిలర్ కంస్ట్రక్షన్ 3 00:02:08,461 --> 00:02:09,963 ఇది చాలా బాగుంది. 4 00:02:11,590 --> 00:02:12,633 - శ్యామ్! - చెప్పు. 5 00:02:12,716 --> 00:02:13,717 నువ్వు సిద్ధమేనా? 6 00:02:14,885 --> 00:02:16,303 అయ్యయ్యో. ఇది బాగా దురావస్థలో ఉంది. 7 00:02:17,763 --> 00:02:20,724 కాస్తంత బాగుచేసి, చూసుకుంటే చాలు. రా. 8 00:02:22,392 --> 00:02:24,144 దీనికి కాస్తంత సరిపోదు. 9 00:02:27,397 --> 00:02:28,649 70ల దశకం నాటి రూపకల్పననా? 10 00:02:29,441 --> 00:02:30,526 క్యాండేస్, 23 21 ఫోటోలు 11 00:02:30,609 --> 00:02:32,653 - వీటికి ఆధునిక హంగులు జోడించడం కష్టం. - ఏమైంది? 12 00:02:34,738 --> 00:02:36,657 హార్డ్ వుడ్ నేల అక్కడక్కడా పాడయింది. 13 00:02:38,575 --> 00:02:40,661 దాని మీద తివాచీ వేసి కప్పిపుచ్చితే పనైపోతుందేమో, ఏమంటావు? 14 00:02:41,328 --> 00:02:44,456 మన క్లయింట్ కి దాన్ని పూర్వస్థితికి తీసుకురావాలనుంది. 15 00:02:45,374 --> 00:02:46,667 అలాగే. ఖర్చు అతనిదే కదా. 16 00:02:47,709 --> 00:02:48,919 ముందు దేనితో మొదలుపెట్టాలంటావు? 17 00:02:51,129 --> 00:02:52,130 విద్యుత్తు లేదు. 18 00:02:52,798 --> 00:02:55,050 మెయిన్ స్విచ్ ఎక్కడుందో చూద్దాం. అది సెల్లార్ లో ఉండవచ్చు. 19 00:03:02,307 --> 00:03:04,017 ఓహ్, ఇది భలేగా ఉంది. 20 00:03:04,560 --> 00:03:07,437 ఇదో టైమ్ క్యాప్సూల్ లాగా ఉంది. అన్నీ యధాతథంగా ఉన్నట్టున్నాయి. 21 00:03:09,022 --> 00:03:10,399 - శ్యామ్? - చెప్పు. 22 00:03:11,024 --> 00:03:12,651 అవును, సెల్లార్ చాలా బాగుంది. 23 00:03:14,695 --> 00:03:15,988 దీని సంగతేంటి? 24 00:03:17,739 --> 00:03:18,991 ఏంటి అది? 25 00:03:19,783 --> 00:03:22,244 బ్యారోమీటర్. ఈ శతాబ్దపు తొలినాళ్ళకి చెందినది అయ్యుంటుంది. 26 00:03:25,622 --> 00:03:26,623 ఫ్రాంసెస్కా, 22 15 ఫోటోలు 27 00:03:26,707 --> 00:03:27,916 ఈ రాత్రికి కలుద్దామా? పట్టించుకోకండి - స్పందన తెలియజేయండి 28 00:03:29,418 --> 00:03:30,794 చాలా బాగుంది. 29 00:03:32,588 --> 00:03:35,507 హేయ్, మన పని రాత్రి ఏ సమయానికల్లా అయిపోతుందనుకుంటున్నావు? 30 00:03:45,017 --> 00:03:46,518 - ఇదిగో తీసుకోండి. - ధన్యవాదాలు. 31 00:03:46,977 --> 00:03:49,688 చీర్స్. ఆ ఆనందంతో తాగుదాం. 32 00:03:53,567 --> 00:03:54,735 హాయ్, ఫ్రాంసెస్కా? 33 00:03:56,737 --> 00:03:59,072 - శ్యామ్? - అవును. అవును. 34 00:03:59,156 --> 00:04:02,201 నీ గొంతు వింటుంటే, నేను రావడం ఇంకో పది నిమిషాలు ఆలస్యమయుంటే, 35 00:04:02,284 --> 00:04:05,287 ఇక్కడ ఫ్రాంసెస్కా అని ఎవరైనా వచ్చారా అని బార్టెండర్ ని నేను అడగవలసి వచ్చేదేమో? 36 00:04:05,370 --> 00:04:07,915 - అయిదు నిమిషాలే. అంతకు మంచి కాదు. - సరైనదే. న్యాయమైనదే. 37 00:04:08,290 --> 00:04:11,084 నన్ను మన్నించండి. చూడండి, సాధారణంగా నేను ఆలస్యమయ్యే రకం కాదు. 38 00:04:11,168 --> 00:04:13,504 "ఆలస్యంగా వచ్చిన వాడు." దానికి మా అన్నయ్య కారణం. 39 00:04:14,254 --> 00:04:16,757 అయితే, మీరు "అన్నయ్య మీద నిందలు వేసే తమ్ముడు," రకానికి చెందినవారా? 40 00:04:17,173 --> 00:04:18,341 అవును, అప్పుడప్పుడూ. 41 00:04:18,425 --> 00:04:22,012 మాది ఇళ్ళను పునర్నిర్మించే పని, ఇంకా అతను ఈ మధ్యే ఓ బిడ్డని దత్తత తీసుకున్నాడు. 42 00:04:22,095 --> 00:04:23,847 అప్పట్నుంచీ పని అని ఒకటే చంపేస్తున్నాడు. 43 00:04:23,931 --> 00:04:26,517 అది నిద్రలేకపోవడం వల్ల వచ్చే చికాకు వల్ల అనుకుంటా. అది నిజమైనదే. 44 00:04:28,310 --> 00:04:29,311 బాబా, పాపా? 45 00:04:29,811 --> 00:04:30,938 బిడ్డ గురించి అడుగుతున్నారా? 46 00:04:31,021 --> 00:04:33,106 ఓహ్, పాప. తన ఫోటో చూస్తారా? 47 00:04:33,190 --> 00:04:35,692 - చూస్తాను. - మంచిది. ఇదిగో, చూడండి. 48 00:04:36,527 --> 00:04:38,278 దేవుడా. చాలా ముద్దుగా ఉంది. 49 00:04:38,362 --> 00:04:40,155 అవును. చాలా అందంగా ఉంది కదా? తన పేరు ఆలిస్. 50 00:04:40,239 --> 00:04:42,199 ఇతను మా అన్నయ్య, జేక్. అతను మా అన్నయ్య భర్త, రోజర్. 51 00:04:42,282 --> 00:04:43,283 చాలా ముచ్చటైన కుటుంబం. 52 00:04:43,367 --> 00:04:44,910 - అత్యంత ముచ్చటైన కుటుంబం వారిది. - అవును. 53 00:04:46,328 --> 00:04:47,913 అయితే, మీరు మంచి అంకుల్ ఆ? 54 00:04:48,330 --> 00:04:49,331 అవును, అత్యుత్తమ అంకుల్ ని. 55 00:04:49,665 --> 00:04:52,167 - నిజంగానా? - అవును. నేను అంకుల్ శ్యామ్ ని. 56 00:04:53,627 --> 00:04:54,628 భలే తమాషాగా ఉంది. 57 00:05:05,514 --> 00:05:06,849 - సరేమరి. - మళ్లీ కలుస్తాం అంటావా? 58 00:05:06,932 --> 00:05:07,808 - తప్పకుండా. - అలాగే. 59 00:05:07,891 --> 00:05:08,725 బై. 60 00:05:09,226 --> 00:05:11,353 హేయ్. శుభోదయం. మన్నించు. 61 00:05:13,730 --> 00:05:14,982 చొక్కా తిరగేసి వేసుకున్నావు. 62 00:05:15,065 --> 00:05:16,567 ఏంటి... అసలు దాన్ని ఎలా గమనించావు? 63 00:05:16,650 --> 00:05:19,278 ఒక సాధారణ ఈ తరపు వ్యక్తిగా ఉండాలంటే నీకు బాగా ఇబ్బందిగా ఉందా? 64 00:05:19,361 --> 00:05:21,280 లేదు. నిజానికి నాకు అది చాలా బాగా నచ్చింది. 65 00:05:23,073 --> 00:05:25,659 నా ఆలోచన గురించి ఇంకా లోతుగా ఏమైనా ఆలోచించావా? 66 00:05:27,619 --> 00:05:28,620 - ఏమో. - కమాన్. 67 00:05:29,288 --> 00:05:31,623 "టేయిలర్ బ్రదర్స్ కంస్ట్రక్షన్" అనే పేరు, "టేయిలర్ కంస్ట్రక్షన్" కన్నా 68 00:05:31,707 --> 00:05:33,166 చాలా బాగుంటుంది. 69 00:05:33,250 --> 00:05:34,960 అవును, కానీ నాకు మార్పులు చేయకుండా ఉంటేనే నచ్చుతుంది. 70 00:05:35,419 --> 00:05:37,004 కాబట్టి, దాన్ని ఇక శాశ్వతం చేసుకుందాం. 71 00:05:37,671 --> 00:05:40,632 నాతో చేతులు కలుపు. ఇలా ఎంత కాలం ఇతర ఇళ్ళను బాగు చేస్తూ ఉండాలి? 72 00:05:40,716 --> 00:05:42,676 కాలం గిర్రున తిరగకముందే, ఇలాంటి ఒక ఇంటిని మనం సొంతం చేసుకోవచ్చు. 73 00:05:42,759 --> 00:05:45,429 జేక్, నువ్వంటే నాకు ఇష్టం. నిజంగానే. కానీ అది నీ కల. నాది కాదు. 74 00:05:45,804 --> 00:05:48,015 - మళ్లీ హోనస్ వాగ్నర్ విషయమే కదా. - కాదు, అస్సలు కాదు. 75 00:05:48,098 --> 00:05:48,932 - అవును. - కాదు, అది కాదు. 76 00:05:49,016 --> 00:05:52,060 అవును, అదే. ఇప్పటిదాకా ఎన్ని సామాను అమ్మకాల చోట్లకి నన్ను పంపించావు? ఓ ఇరవై? 77 00:05:52,352 --> 00:05:53,353 ఇరవై ఏమీ కాదు. 78 00:05:55,022 --> 00:05:56,440 ఓ పదిహేను. 79 00:05:56,523 --> 00:05:59,443 అవును, బేస్ బాల్ కార్డులలో అత్యంత అరుదైనది ఏమైనా దోరుకుతుందేమోనని. 80 00:05:59,818 --> 00:06:02,237 ఎవరోకరు దాన్ని మర్చిపోయుంటారు, అది మనము కనిపెట్టేసి, 81 00:06:02,321 --> 00:06:04,323 పది లక్షల రూపాయలకు అమ్ముకోవచ్చనే నీ పిచ్చి నమ్మకంతో. 82 00:06:04,406 --> 00:06:05,616 అవును, అది మంచి ఆలోచనే. 83 00:06:05,991 --> 00:06:07,451 అవును, ఎనిమిదేళ్ళ వయసులో మంచి ఆలోచనే అయ్యుండేది. 84 00:06:08,785 --> 00:06:09,953 నువ్వు వెతకడం ఆపవు. 85 00:06:10,037 --> 00:06:11,663 - అవును, అందులో తప్పేముంది? - ఏమీలేదులే. 86 00:06:12,080 --> 00:06:16,335 కానీ ఈ జీవితం నీకు నచ్చకపోతే, మనిద్దరి జీవితాలను కూడా ఊరికే వృధా చేయకు. 87 00:06:16,418 --> 00:06:17,753 నీకు నచ్చిన జీవితాన్ని వెతుక్కో. 88 00:06:18,629 --> 00:06:20,589 అయినా కానీ, ఇది నాకు చాలా సరదాగా ఉంది. 89 00:06:20,672 --> 00:06:21,924 కమాన్. దీన్ని చూడు. 90 00:06:22,716 --> 00:06:26,386 మన వద్ద 60 వాట్ల బల్బు ఉంది. 90 వాట్ల బల్బు ఉంది. వాడాల్సింది 90 వాట్లనే కదా? 91 00:06:26,470 --> 00:06:27,721 ఎడిసన్ బల్బులు. 92 00:06:28,180 --> 00:06:30,307 పాత ఇల్లు, పాత బల్బులు. 93 00:07:11,765 --> 00:07:13,767 ఫిగ్ న్యూటన్స్ 94 00:07:15,269 --> 00:07:17,271 హేయ్. ఆకలిగా ఉందా? 95 00:07:18,021 --> 00:07:20,148 ఓహ్, దాన్ని చూడు. పూడ్చిపెట్టబడిన నిధి. 96 00:07:23,861 --> 00:07:25,237 ద కాంపౌండ్ 97 00:07:26,905 --> 00:07:27,906 క్యాబేజి 98 00:07:27,990 --> 00:07:30,617 "క్యాబేజి." "నిధి"కి అస్సలు పొంతన లేని నిర్వచనం. 99 00:07:35,330 --> 00:07:36,331 వావ్. 100 00:07:37,040 --> 00:07:39,334 అలాంటి వాటిని ఫోన్ లో స్వైప్ చేసినట్టు స్వైప్ చేయడం కుదరదు. 101 00:07:39,418 --> 00:07:41,003 లేదు, నేను కేవలం... 102 00:07:42,921 --> 00:07:43,922 ఏమో. 103 00:07:45,340 --> 00:07:46,884 ఏమో. ఈమె ఒకరకంగా... 104 00:07:49,386 --> 00:07:50,387 ఆహ్, అయ్యయ్యో. 105 00:07:54,683 --> 00:07:55,809 - సిద్ధమేనా? - సిద్దమే. 106 00:08:01,815 --> 00:08:03,233 - జేక్, తలుపు పక్కకి నెట్టు. - అలాగే. 107 00:08:18,040 --> 00:08:19,541 అబ్బా. మెయిన్ స్విచ్. 108 00:08:20,167 --> 00:08:22,294 నేను చూసుకుంటాలే. నేను చూసుకుంటాలే. కదలకు. 109 00:08:53,534 --> 00:08:55,786 తుఫాను వాన మార్పు ప్రశాంత వాతావరణం 110 00:09:04,962 --> 00:09:08,382 జేక్? హేయ్, జేక్, మెయిన్ స్విచ్ ఆన్ చేసేశాను. 111 00:09:09,925 --> 00:09:15,430 ఊరు అంతా ఒకటే మాట అంట 112 00:09:15,514 --> 00:09:19,685 నాకు కూడా అది నిజమే అనిపిస్తుందంట 113 00:09:21,895 --> 00:09:25,858 మిమ్మల్ని పట్టించుకోనివారిని 114 00:09:26,692 --> 00:09:29,945 ప్రేమించడం కష్టములే 115 00:09:31,780 --> 00:09:35,993 ఒకప్పుడు నాకో చెలికాడు ఉండేవాడు 116 00:09:36,076 --> 00:09:40,372 ఈ పట్టణంలోని మంచివాళ్ళకేమీ తీసిపోడు 117 00:09:41,665 --> 00:09:46,044 కానీ ఇప్పుడు దిగాలుగా, ఒంటరిగా మిగిలిపోయా 118 00:09:47,045 --> 00:09:51,383 అతను నా ప్రేమను తిరస్కరించాడు 119 00:09:52,551 --> 00:09:59,558 ఇక నాకంటే ఎవ్వరూ లేరు 120 00:10:02,394 --> 00:10:08,650 నా గురించి పట్టించుకొనే వారే లేరు... 121 00:10:14,198 --> 00:10:16,283 ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? 122 00:10:16,366 --> 00:10:18,160 - నువ్వు ఆమెనే కదా. - వద్దు... దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయకు. 123 00:10:18,243 --> 00:10:20,287 ఏంటి? లేదు, లేదు. నేను నీకేమీ హానీ తలపెట్టబోవడం లేదు. 124 00:10:20,370 --> 00:10:21,371 - నేను కేవలం... - నువ్వు బ్యాంక్ వాడివా? 125 00:10:21,455 --> 00:10:22,581 లేదు, విను, నేను బ్యాంక్ వాడిని కాదు. 126 00:10:22,664 --> 00:10:25,375 - మా అన్నతో కలిసి ఈ ఇంటిని బాగు చేస్తున్నా. - అబద్ధం. మాకు ఫిభ్రవరీ 5 వరకు గడువు ఉంది. 127 00:10:25,459 --> 00:10:27,169 అసలు ఇక్కడేం జరుగుతోందో నాకేమీ అర్థమవ్వడం లేదు. 128 00:10:27,252 --> 00:10:29,671 నువ్వు చొరబడ్డావు. అదే జరుగుతోంది. ఇక నువ్వు వెంటనే వెళ్లిపోవాలి. 129 00:10:29,755 --> 00:10:30,756 జేక్! 130 00:10:30,839 --> 00:10:33,759 నువ్వు... నువ్వు పైకి వెళ్ళకూడదు! 131 00:10:36,345 --> 00:10:37,346 జేక్! 132 00:10:38,388 --> 00:10:39,681 జేక్! 133 00:10:41,433 --> 00:10:43,101 నీకు అయిదు సెకన్ల సమయం ఇస్తున్నాను, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పడానికి, 134 00:10:43,185 --> 00:10:44,811 లేకపోతే నీ పుర్రెని పుచ్చకాయలా పేల్చిపారేస్తాను. 135 00:10:44,895 --> 00:10:46,522 - అది అస్సలు అవసరం లేదు. చెప్పేది విను. - అయిదు... 136 00:10:46,605 --> 00:10:47,940 - మా అన్నయ్య ఎక్కడ? - నాలుగు... 137 00:10:48,023 --> 00:10:49,733 - దయచేసి నువ్వు లెక్కపెట్టడం ఆపుతావా? - మూడు... 138 00:10:50,108 --> 00:10:51,109 జేక్? 139 00:10:52,611 --> 00:10:53,612 జేక్? 140 00:10:55,322 --> 00:10:57,574 చెప్పేది విను. కొన్ని క్షణాలలో మా అమ్మ ఆ తలుపు గుండా ప్రవేశిస్తుంది, 141 00:10:57,658 --> 00:10:59,284 ఆమెలో విషనాగుకు మించిన విషముంది, 142 00:10:59,368 --> 00:11:01,245 అంతేగాక, బ్యాంక్ వాళ్ళని ఆమె నాకన్నా ఎక్కువగా అసహ్యించుకుంటుంది. 143 00:11:02,162 --> 00:11:03,330 - నిజమే చెప్తున్నా! - దయచేసి, కాస్త... 144 00:11:03,413 --> 00:11:04,915 నీ ప్రాణం మీద నీకు తీపి ఉంటే, ఇక నువ్వు కాళ్ళకి పని చెప్పడం మంచిది. 145 00:11:04,998 --> 00:11:06,625 - నా మాటని కాస్త విను, సరేనా? - వెళ్లిపో! 146 00:11:07,209 --> 00:11:09,503 ఇక్కడి నుంచి వెళ్లిపో! పో! 147 00:11:19,972 --> 00:11:21,181 ఎవిలిన్? 148 00:11:22,474 --> 00:11:24,518 - ఏంటి? - ఇక్కడికి ఎవరైనా వచ్చారా ఏంటి? 149 00:11:25,102 --> 00:11:27,396 ఏంటి? లేదే, రాలేదే. 150 00:11:29,523 --> 00:11:32,234 - ఆ పెట్టెలో ఏముంది? - నీ నిశ్చితార్ధానికి నీ దుస్తులు. 151 00:11:32,317 --> 00:11:34,695 - విలియమ్ కానుకగా పంపాడు. - నాకు దుస్తులు ఉన్నాయి కదా. 152 00:11:34,778 --> 00:11:36,697 నువ్వు ఇది వేసుకోవాలని విలియమ్ కోరిక. 153 00:11:36,780 --> 00:11:38,073 అది పట్టకుంటే? 154 00:11:38,699 --> 00:11:39,700 పట్టేలా చేయి. 155 00:12:00,637 --> 00:12:02,639 రైతు బజారు 156 00:12:08,604 --> 00:12:09,605 మన్నించండి. 157 00:12:09,688 --> 00:12:10,772 హార్డ్ వేర్ 158 00:12:28,832 --> 00:12:31,835 స్టిల్ వాటర్స్ బార్ 159 00:12:38,217 --> 00:12:41,345 1919 జాతీయ మద్యపాన నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా మూసివేయబడినది 160 00:13:17,005 --> 00:13:19,007 ఎవిలిన్, నువ్వు సంగీతం వింటున్నావా? 161 00:13:22,761 --> 00:13:24,388 ఆ ఫోటోలను ఇటిచ్చేయ్. 162 00:13:27,266 --> 00:13:30,102 ఒక మహిళ పద్దతిగా ఉండాలని అందరూ ఆశిస్తారు, ఎవిలిన్. 163 00:13:30,185 --> 00:13:31,478 కానీ ఎమ్మెట్ కి సంగీతమంటే ప్రాణం. 164 00:13:31,562 --> 00:13:33,397 నీ సోదరుడు చనిపోయి, ఇప్పుడు సమాధిలో ఉన్నాడు. 165 00:13:34,398 --> 00:13:36,024 ఇక ఇక్కడ మనమేమో, నయా పైసా ఆస్తి లేకుండా జీవిస్తున్నాము. 166 00:13:36,108 --> 00:13:37,818 అందుకే కదా నువ్వు నన్ను అత్యంత ధనవంతుడికి ఇచ్చి కట్టబెడుతున్నావు. 167 00:13:37,901 --> 00:13:39,069 ఇది మంచి సంబంధమే. 168 00:13:39,152 --> 00:13:42,281 విలియమ్, ఒక మంచి తండ్రి. నెమ్మదస్తుడు, దైవ భక్తి గలవాడు. 169 00:13:42,364 --> 00:13:43,365 అయితే నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా? 170 00:13:43,448 --> 00:13:45,868 ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నాశనం చేయనివ్వను. 171 00:13:45,951 --> 00:13:49,830 సంగీతం పట్ల నీకు ఉన్న ఈ విపరీత ప్రేమని విలియమ్ అర్థంచేసుకోడు, ఎవిలిన్. 172 00:13:49,913 --> 00:13:52,416 కాబట్టి, వాటిని నాకు ఇవ్వమని నిన్ను బ్రతిమాలుతున్నాను. 173 00:13:56,879 --> 00:13:57,880 అలాగే, అమ్మా. 174 00:13:58,839 --> 00:14:00,090 నిజానికి, అవి నావి. 175 00:14:00,174 --> 00:14:02,718 మన్నించండి, తలుపు తట్టాను, కానీ ప్రవేశ ద్వారం వద్ద ఎవ్వరూ లేరు... 176 00:14:02,801 --> 00:14:04,178 నువ్వెవరవు? 177 00:14:04,261 --> 00:14:05,429 శ్యామ్. 178 00:14:06,763 --> 00:14:09,057 శ్యామ్ టేయిలర్. మీ అబ్బాయి స్నేహితుడిని. 179 00:14:10,142 --> 00:14:12,644 అవి నేనే అతనికి ఇచ్చాను. వాటిని తీసుకుందామనే ఇటుగా వచ్చాను. 180 00:14:12,728 --> 00:14:13,979 నువ్వు ఎమ్మెట్ స్నేహితుడివా? 181 00:14:14,730 --> 00:14:16,899 మీరిద్దరూ కలిసి సాధన చేసేవాళ్ళా? 182 00:14:19,484 --> 00:14:20,736 వాళ్లిద్దరూ కలిసి చదువుకొనేవాళ్ళు. 183 00:14:22,571 --> 00:14:23,614 వైద్య కళాశాలలో. 184 00:14:24,948 --> 00:14:25,949 శ్యామ్, ఒక వైద్యుడు. 185 00:14:27,868 --> 00:14:28,869 అయితే... 186 00:14:29,912 --> 00:14:31,872 ఎమ్మెట్ స్నేహితుడిని కలవడమంటే మంచి విషయమే కదా. 187 00:14:31,955 --> 00:14:34,124 - దయచేసి, నీ వస్తువులను తీసేసుకో. - ధన్యవాదాలు. 188 00:14:34,708 --> 00:14:36,084 ఈ రాత్రికి నువ్వు కూడా వస్తున్నావా? 189 00:14:36,460 --> 00:14:37,628 మన్నించండి, ఈ రాత్రియా? 190 00:14:37,711 --> 00:14:39,129 ఎవిలిన్ నిశ్చితార్ధానికి. 191 00:14:40,923 --> 00:14:44,510 ఓహ్, ఆహ్వానించినందుకు ధన్యవాదాలు, కానీ నేను ఇటుగా పోతూ వచ్చాను, అంతే. 192 00:14:44,927 --> 00:14:46,345 ఆలాగా. 193 00:14:46,428 --> 00:14:48,305 అయితే, ఇక నువ్వు బయలుదేరవచ్చు అనుకుంటా. 194 00:14:48,388 --> 00:14:49,598 అలాగే, మేడమ్. ఇక బయలుదేరుతాను. 195 00:14:55,479 --> 00:14:56,480 తీసుకో. 196 00:14:57,022 --> 00:15:00,025 - ఈ విషయంలో నేను నీకు ఋణపడున్నాను. - పర్వాలేదులే. అదేం పెద్ద విషయం కాదులే. 197 00:15:00,817 --> 00:15:02,236 ఏం చేస్తున్నావు నువ్వు? 198 00:15:02,319 --> 00:15:05,405 మన్నించు, ఇక్కడేమైనా... ఒక నేలతలుపు కానీ, 199 00:15:05,489 --> 00:15:07,741 రహస్య తలుపు కానీ, ఇంకేదైనా కానీ ఉందా? 200 00:15:07,824 --> 00:15:09,326 మామూలుగా, జనాలు ముందున్న తలుపు ద్వారా వెళ్లిపోతారు. 201 00:15:09,409 --> 00:15:11,078 హేయ్, చూడు, నిజంగా నేను కూడా నా ఇంటికి వెళ్లిపోవాలనే చూస్తున్నాను. 202 00:15:11,161 --> 00:15:12,579 కానీ... అదెలాగో నాకు తెలియడం లేదు, అంతే. 203 00:15:12,663 --> 00:15:15,040 నీ ఇంటికి నువ్వెందుకు వెళ్ళలేకపోతున్నావు? నీది ఏ ఊరు? 204 00:15:15,374 --> 00:15:17,209 దానికి నేను సమాధానం చెప్పినా నువ్వు నమ్మవు. 205 00:15:18,252 --> 00:15:19,878 - ఓ అవకాశమిచ్చి చూడు. - సరే, అలాగే. 206 00:15:20,337 --> 00:15:22,756 నేను భవిష్యత్తు నుండి వచ్చాను. 2019వ సంవత్సరం నుండి వచ్చాను. 207 00:15:25,300 --> 00:15:26,760 ఓ నా కాలప్రయాణికుడా. 208 00:15:26,844 --> 00:15:29,179 సరే, నీకు ఋజువు కావాలా? ఇదిగో, నా ఫోన్ ని చూపిస్తా, ఆగు. 209 00:15:30,264 --> 00:15:31,849 నీ టెలిఫోన్ నీ జేబులో ఉందా? 210 00:15:31,932 --> 00:15:33,892 లేదు, తెలుసు. నాకు తెలుసు. ఉండింది. ఎక్కడో జారిపడిపోయుంటుంది... 211 00:15:34,810 --> 00:15:38,230 సరే. దీన్ని చూడు. ఇదిగో, చూశావా? దీన్ని చూశావా? 212 00:15:39,106 --> 00:15:40,774 అది నువ్వే, కదా? 213 00:15:40,858 --> 00:15:42,484 నాకు ఇది ఎక్కడ దొరికిందని అనుకుంటున్నావు? 214 00:15:42,568 --> 00:15:44,862 భవిష్యత్తులో ఈ ఇంట్లోనే నాకు ఇది దొరికింది. 215 00:15:45,737 --> 00:15:47,739 అది అసంభవం. ఇప్పటివరకూ నేను నా ఫోటోని తీసుకోలేదు. 216 00:15:47,823 --> 00:15:51,034 ఇంకా లేదులే. కానీ ఖచ్చితంగా తీసుకుంటావు. చూశావా? నువ్వు నమ్మవని నాకు ముందే తెలుసు. 217 00:15:51,618 --> 00:15:53,078 మరి, అయితే ఇక్కడికి ఎలా వచ్చావు? 218 00:15:53,161 --> 00:15:55,247 నిజంగా చెప్తున్నాను, ఆ విషయం కనుక్కొనే ప్రయత్నంలోనే ఇంకా ఉన్నాను. 219 00:15:56,331 --> 00:15:59,710 ఇదెలా పనిచేస్తుందో నాకు తెలీదు. దానికి సంబంధించింది ఈ ఇంట్లోనే ఏదో ఉండుంటుంది. 220 00:15:59,793 --> 00:16:01,587 ఈ ఇంటికి సంబంధించి విచిత్రమైన విషయం ఏదైనా ఉందా? 221 00:16:02,045 --> 00:16:04,423 మా తాతయ్య దీన్ని 40 ఏళ్ళ క్రిందట కట్టించాడు. 222 00:16:04,506 --> 00:16:06,008 తాతయ్యనా? సరే, నేను అతనితో మాట్లాడవచ్చా? 223 00:16:06,091 --> 00:16:08,552 ఇప్పుడు మంచి సమయం కాదు. 224 00:16:08,635 --> 00:16:10,596 ఇప్పుడు మా కుటుంబానికి పనిలో అస్సలు తిరిక లేదు. 225 00:16:10,679 --> 00:16:12,639 అవును, నిశ్చితార్ధం కదా. 226 00:16:14,892 --> 00:16:16,435 ఇప్పుడే నన్ను కూడా ఆహ్వానించారు. 227 00:16:16,518 --> 00:16:17,519 - లేదు. - అవును. 228 00:16:17,895 --> 00:16:18,896 - లేదు. - అవును. 229 00:16:18,979 --> 00:16:20,981 నాకు ఋణపడున్నావని అన్నావు కదా? 230 00:16:21,064 --> 00:16:23,358 చూడు, నేనేమీ... నన్ను నమ్మమని అడగడం లేదు. 231 00:16:23,859 --> 00:16:26,028 సరేనా, నేను... నాకు సహకరించమనే నిన్ను అడుగుతున్నాను. 232 00:16:28,572 --> 00:16:30,532 మరి, నీ వస్త్రధారణ నిశ్చితార్ధానికి తగ్గట్టుగా లేదు. 233 00:16:31,909 --> 00:16:33,911 కానీ నా దగ్గర నీకు సరిపోయేది ఉన్నట్టుంది. 234 00:16:38,582 --> 00:16:41,502 అతనే మా తాతయ్య. రా. నీకు పరిచయం చేస్తాను. 235 00:16:45,255 --> 00:16:46,924 - వచ్చేసిందే. - తాతయ్యా. 236 00:16:47,007 --> 00:16:48,133 హేయ్. 237 00:16:49,551 --> 00:16:50,719 - ఎవిలిన్. - హలో. 238 00:16:51,220 --> 00:16:53,597 ఇతను శ్యామ్, ఎమ్మెట్ యొక్క వైద్య కళాశాల స్నేహితుడు. 239 00:16:55,015 --> 00:16:58,769 ఇతను వారెన్ తాతయ్య. మా ఇంటిని కట్టించింది ఈయనే అని నీకు చెప్పానా? 240 00:16:58,852 --> 00:17:00,103 ఆ ఇల్లు చాలా బాగుంది, సర్. 241 00:17:00,187 --> 00:17:01,480 దానిదేముందిలే, హృదయపూర్వక ధన్యవాదాలు. 242 00:17:01,563 --> 00:17:03,649 నేలమట్టంలో మీరు స్టార్మ్ సెల్లార్ ని ఏర్పాటు చేసి ఉండటాన్ని గమనించాను. 243 00:17:03,732 --> 00:17:06,401 - అది చాలా తెలివైన పని. - ఈ ప్రాంతంలో ఉంటే అది ఖచ్చితంగా ఉండాలి. 244 00:17:06,484 --> 00:17:09,488 అవును. ఆసక్తితో అడుగుతున్నా, ఆ సెల్లార్ కి సంబంధించి ఏదైనా గమ్మత్తైన విషయముందా? 245 00:17:09,946 --> 00:17:12,741 - "గమ్మత్తైన విషయం" అంటే? - నా ఉద్దేశం ఏమిటంటే, 246 00:17:12,824 --> 00:17:16,036 ఒక భారీ తుఫాను సమయంలో అక్కడ నేను ఉండగా, నా చెవులలో ఏదో శబ్దం మార్మోగిపోయింది. 247 00:17:16,118 --> 00:17:17,371 అదేంటా అని ఆశ్చర్యానికి గురయ్యాను. 248 00:17:17,454 --> 00:17:20,082 అది మామూలు విషయమే. భారీ తుఫానులు ఉన్న సందర్భాలలో, 249 00:17:20,165 --> 00:17:22,960 వాయు పీడనం తగ్గిపోవడం వలన చెవులలో ఏదో మోగుతున్నట్టు అనిపిస్తుంది. 250 00:17:23,042 --> 00:17:24,377 నిజంగానా? దాని గురించి నాకు మరింతగా వివరిస్తారా? 251 00:17:27,631 --> 00:17:29,842 అందరికీ గుడ్ ఈవెనింగ్. మీ అందరికీ నా ఇంటికి స్వాగతం పలుకుతున్నాను. 252 00:17:30,592 --> 00:17:33,762 మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, నా పిల్లలు, తమకి ఇష్టమైన తమ తల్లిని... 253 00:17:34,763 --> 00:17:36,431 క్రిందటేడాది ఇన్ ఫ్లూయెంజా కారణంగా కోల్పోయారు. 254 00:17:37,474 --> 00:17:39,518 తన స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిది అయినప్పటికీ, 255 00:17:39,601 --> 00:17:45,148 ఒక సుగుణాల రాశి మా కుటుంబంలో ఒకటి కాబోతుండటం మా అదృష్టం. 256 00:17:45,732 --> 00:17:46,733 ఎవిలిన్ పోర్టర్. 257 00:17:55,242 --> 00:17:57,536 మరి ఇప్పుడు, మిగిలున్న ఏకైక ప్రశ్న ఏంటంటే... 258 00:17:58,579 --> 00:18:00,581 తను టర్కీ ట్రాట్ నాట్యం చేయగలదా అని. 259 00:18:09,798 --> 00:18:11,049 మంచి విషయం, బంగారం. 260 00:18:11,133 --> 00:18:13,385 నేను మన వివాహ ప్రకటన కోసం ఏర్పాట్లు చేశాను, 261 00:18:13,468 --> 00:18:17,014 అందుకని... ఫోటోగ్రాఫర్ ని మాట్లాడాను. 262 00:18:17,723 --> 00:18:19,224 - ఫోటోనా? - అవును. 263 00:18:20,225 --> 00:18:24,897 నువ్వు పెళ్లి దుస్తులలో ఉన్న ఫోటో నాకు ఒకటి కావాలి. 264 00:18:25,606 --> 00:18:27,357 మన రాబోవు తరాల కోసం. 265 00:18:31,320 --> 00:18:33,322 ఆ యువ వైద్యుడు. ఎవరతను? 266 00:18:35,991 --> 00:18:38,118 ఎమ్మెట్ స్నేహితుడు. ఏదో పని మీద వెళ్తూ ఇటు వచ్చాడు. 267 00:18:39,912 --> 00:18:41,205 నాతో నాట్యమాడటానికి నాకొకరు కావాలి. 268 00:18:41,747 --> 00:18:42,956 ఓహ్, అలాగే. 269 00:18:43,040 --> 00:18:46,084 నాకూ చేయాలనే ఉంది, కానీ నాకు... నిజంగా టర్కీ ట్రాట్ నాట్యం ఎలా చేయాలో రాదు. 270 00:18:46,168 --> 00:18:47,169 నేను నేర్పిస్తానులే. 271 00:18:49,338 --> 00:18:53,175 అతనిలో నా ఆడవారితో బాగా కలిసిపోగల నేర్పు ఉన్నట్టుంది. 272 00:19:09,608 --> 00:19:12,236 మిల్డ్రెడ్, ఇక వెళ్లి పడుకో. 273 00:19:12,945 --> 00:19:13,946 నీతో నాట్యమాడటం బాగుంది. 274 00:19:14,905 --> 00:19:17,950 నా కూతురికి వినోదం కలిగించినందుకు ధన్యవాదాలు. 275 00:19:18,408 --> 00:19:19,618 పర్వాలేదులేండి. 276 00:19:27,251 --> 00:19:30,671 నువ్వన్నది నిజమే. ఫోటో. అందులో ఉన్నది నేనే. అది నా ఫోటోనే కాబోతుంది. 277 00:19:30,754 --> 00:19:33,340 ఎలాగో నాకు తెలియడం లేదు. కానీ... అది నాదే కాబోతుంది. 278 00:19:33,423 --> 00:19:35,843 చూడు, మీ తాతయ్యకి మిత్రుడైన ఆ వ్యక్తి, 279 00:19:35,926 --> 00:19:37,761 అదే వాతావరణం గురించి అవగాహన ఉన్న వ్యక్తి. అతను ఎక్కడికి వెళ్ళాడు? 280 00:19:37,845 --> 00:19:39,805 హెన్రీ బ్యారెట్? ఇప్పుడే వెళ్లిపోయాడు. 281 00:19:43,225 --> 00:19:45,435 నాకు కాబోయే భర్త, తన పిల్లలని నిద్రపుచ్చడానికని వెళ్ళాడు. 282 00:19:46,144 --> 00:19:47,771 అలా ఊరికే నడుస్తూ పోదాం, వస్తావా? 283 00:19:49,481 --> 00:19:50,482 అలాగే. 284 00:19:52,484 --> 00:19:55,028 భవిష్యత్తు. అసలు అదెలా ఉంటుందో చెప్పు. 285 00:19:58,657 --> 00:20:01,201 ఏమో. నీకెలా కావాలనుకుంటే అలా ఉంటుంది అనుకుంటా. 286 00:20:02,786 --> 00:20:05,455 వంట చేసుకోకుండా అప్పుడప్పుడూ ఇంటికే ఆహారం తెప్పించుకోవచ్చు. 287 00:20:06,707 --> 00:20:11,044 అంతేకాదు, అదెలాంటి వంటకమైనా కావచ్చు. ఇటాలియన్, చైనీస్, ఇండియన్. 288 00:20:11,128 --> 00:20:13,338 - ఇండియన్ ఆహారం కూడానా? - అవును. అవును. 289 00:20:15,048 --> 00:20:17,885 ఇంకా సంగీతం. సంగీతం విషయానికొస్తే, స్పీకర్లని కొన్ని ఉంటాయి. 290 00:20:18,302 --> 00:20:20,012 వాటిని నువ్వు నీ ఇంట్లోని ప్రతీ గదిలో ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు, 291 00:20:20,095 --> 00:20:22,139 ఇక నీకు ఎక్కడైనా, ఎల్లప్పుడూ సంగీతం వినే వెసులుబాటు ఉంటుంది. 292 00:20:25,350 --> 00:20:26,852 నాకు అదంతా కావాలి. 293 00:20:27,603 --> 00:20:29,354 అవును, అవును, అది చాలా బాగుంటుంది. 294 00:20:31,440 --> 00:20:32,733 బాగుంది. 295 00:20:34,193 --> 00:20:36,862 ఒక్క నిమిషం. ద కాంపౌండ్. నేను దాన్ని ఇంతకుముందు ఓ సారి చూశాను. 296 00:20:38,405 --> 00:20:42,034 దాని దిగువన, అక్రమ మద్య దుకాణం ఉందని నా సోదరుడు ఎమ్మెట్ ఓసారి నాకు చెప్పాడు. 297 00:20:42,117 --> 00:20:45,287 అందరూ మేల్కొనుండి తెల్లవారేదాకా నవ్వుతూ, నవ్వుతూ గడుపుతుంటారు. 298 00:20:47,873 --> 00:20:50,375 దాన్ని ఒక్కసారైనా చూడటానికి నేనేమైనా చేస్తాను. 299 00:20:51,335 --> 00:20:52,336 ఓసారి వెళ్లి చూడాలనుందా? 300 00:20:52,878 --> 00:20:54,755 లోపలికి ప్రవేశించాలంటే పాస్ వర్డ్ ఉండాలి. 301 00:21:03,722 --> 00:21:06,308 ఒక్క నిమిషం, సర్. ఇక్కడ తాగడానికి ఏమైనా దొరుకుతుందా? 302 00:21:06,391 --> 00:21:07,392 తాటి కల్లు ఉంది, తాగుతారా? 303 00:21:07,476 --> 00:21:10,729 అంటే, కాస్తంత క్యాబేజి ఉన్నదేదైనా తాగాలని మేము భావిస్తున్నాము. 304 00:21:13,023 --> 00:21:14,024 ఏమన్నారు? 305 00:21:14,358 --> 00:21:15,859 "క్యాబేజి" అని అన్నాను. 306 00:21:21,240 --> 00:21:22,241 నాతో రండి. 307 00:22:04,491 --> 00:22:06,326 - హలో. - ఏం తీసుకుంటారు? 308 00:22:07,911 --> 00:22:09,037 దయచేసి, మద్యం ఇవ్వండి. 309 00:22:09,621 --> 00:22:12,416 జిన్ అండ్ టానిక్, స్క్వీజ్ ఆఫ్ లైమ్. అవి రెండు ఇవ్వండి. 310 00:22:12,499 --> 00:22:13,417 అలాగే, రెండు బిట్లు అవుతుంది. 311 00:22:13,917 --> 00:22:16,712 రెండు బిట్లు... అలాగే. 312 00:22:20,716 --> 00:22:22,050 తీసుకోండి, ఇది సరిపోతుందా? 313 00:22:24,761 --> 00:22:26,013 ఇదేదో దొంగ నాటు లాగా ఉందే? 314 00:22:26,388 --> 00:22:27,598 నేను కడతానులే. 315 00:22:32,186 --> 00:22:33,103 ధన్యవాదాలు. 316 00:22:33,187 --> 00:22:34,188 ధన్యవాదాలు. 317 00:22:34,938 --> 00:22:37,566 కాస్త చిల్లరైనా లేకుండా, విలియమ్ నన్ను అస్సలు బయటకు పంపడు. 318 00:22:48,869 --> 00:22:49,870 ధన్యవాదాలు. 319 00:22:52,289 --> 00:22:54,124 - భవిష్యత్తుకి. - భవిష్యత్తుకి. 320 00:22:58,086 --> 00:22:59,087 వావ్. 321 00:23:11,517 --> 00:23:13,268 - నాట్యమాడాలనుందా? - అలాగే. 322 00:23:59,481 --> 00:24:02,067 హేయ్, ఓ విషయం చెప్పనా? నువ్వు ఓ పాట పాడాలనుకుంటా. 323 00:24:03,652 --> 00:24:05,779 - నువ్వు గడ్డి తినాలనుకుంటా. - నేను నిజంగానే చెప్తున్నాను. 324 00:24:05,863 --> 00:24:06,780 నేను కూడా. 325 00:24:06,864 --> 00:24:08,866 సరేమరి. ఓ విషయం చెప్పనా. టాస్ వేసి చూద్దాం. 326 00:24:08,949 --> 00:24:11,243 బొమ్మ పడితే, బయటకు వెళ్లి నిజంగా నేను గడ్డి తింటాను. 327 00:24:12,077 --> 00:24:13,996 బొరుసు పడితే, నువ్వు పాట పాడాలి. అంగీకారమేనా? 328 00:24:15,080 --> 00:24:16,081 అంగీకారమే. 329 00:24:19,293 --> 00:24:20,294 అయ్యయ్యో. 330 00:24:23,297 --> 00:24:26,133 ఒక్క నిమిషం, గురూ. ఆమె ఒక పాట పాడితే పర్వాలేదు కదా? 331 00:24:27,259 --> 00:24:29,052 సరే. ధన్యవాదాలు. 332 00:24:30,721 --> 00:24:31,930 సరేమరి, తరువాత నువ్వే. 333 00:24:38,103 --> 00:24:39,188 ధన్యవాదాలు. 334 00:24:41,481 --> 00:24:43,483 - మీకు "ఆఫ్టర్ యూ హ్యావ్ గోన్" పాట తెలుసా? - తెలుసు. 335 00:24:43,984 --> 00:24:45,194 - అదే. - అలాగే. 336 00:24:52,868 --> 00:24:57,831 నిన్ను ఇన్నేళ్ళూ ప్రేమించానని నీకు తెలుసు 337 00:24:57,915 --> 00:25:02,044 రాత్రీ పగలూ తేడా లేకుండా ప్రేమించాను 338 00:25:04,671 --> 00:25:09,510 ఓ, ప్రియా, నీకు నా కన్నీళ్ళు కనబడటం లేదా? 339 00:25:10,260 --> 00:25:14,848 నా మాటలని ఆలకించు 340 00:25:16,517 --> 00:25:21,939 నువ్వు వెడలిపోయి, నాకు కన్నీళ్ళు మిగిల్చాక 341 00:25:22,272 --> 00:25:28,070 నువ్వు వెడలిపోతే, నువ్వు తప్పక గ్రహిస్తావులే 342 00:25:28,153 --> 00:25:33,700 దిగాలు అయిపోతావు, బాధ పడిపోతావు 343 00:25:34,743 --> 00:25:39,831 నీకున్న ఏకైక నేస్తాన్ని మిస్ అవుతావు 344 00:25:40,332 --> 00:25:45,963 నువ్వు పశ్చాత్తాప్పడే సందర్బం వస్తుంది 345 00:25:46,046 --> 00:25:51,760 ఆ సందర్భం తప్పక వస్తుంది, మరవకు 346 00:25:52,261 --> 00:25:58,100 ఓ ప్రియా, ఏం చేస్తున్నావో ఆలోచించు 347 00:25:58,684 --> 00:26:04,231 నీ మీద నాకెంత పిచ్చి ప్రేమ ఉందో నీకు తెలుసు 348 00:26:04,314 --> 00:26:06,400 నువ్వు వెడలిపోయాక 349 00:26:07,234 --> 00:26:11,321 నువ్వు నన్ను వదిలి వెడలిపోయాక 350 00:26:12,114 --> 00:26:16,535 వెడలిపోయాక 351 00:26:23,542 --> 00:26:25,252 నాకు ఇలా ఎప్పుడూ అనిపించలేదు. 352 00:26:25,711 --> 00:26:29,256 నా గుండె... గట్టిగా కొట్టుకుంది. 353 00:26:29,339 --> 00:26:30,966 దేవుడా, నువ్వు అదరగొట్టేశావు! అద్భుతంగా పాడావు! 354 00:26:31,049 --> 00:26:33,218 చూశావా, నీకు చెప్పాను కదా? నువ్వు ఉండాల్సింది వేదిక పైన అని. 355 00:26:33,302 --> 00:26:35,137 - నువ్వు నిజంగా అంటున్నావా? - అవును. అస్సలు తమాషాలాడటం లేదు. 356 00:26:35,220 --> 00:26:37,014 ఆ జనాన్ని చూశావా? వాళ్ళు అవాక్కయిపోయారు. 357 00:26:37,598 --> 00:26:39,349 నేను జనాల వంక చూడలేదు. 358 00:26:40,642 --> 00:26:41,894 ఎవిలిన్! 359 00:26:43,437 --> 00:26:44,813 నువ్వసలు ఏం చేస్తున్నావు? 360 00:26:45,063 --> 00:26:48,150 హేయ్, చూడండి, ఇందులో తన తప్పేమీ లేదు. మందుల షాపు నుండి నాకొకటి కావలసి వచ్చింది. 361 00:26:48,233 --> 00:26:50,235 - తను నాకు కేవలం దారి చూపిస్తోంది... - నన్ను దద్దమ్మ అనుకోవద్దు. 362 00:26:50,527 --> 00:26:53,113 ఈ ప్రదేశం ఏమిటో, ఇక్కడేం జరుగుతుందో నాకు మొత్తం తెలుసు. 363 00:26:53,197 --> 00:26:54,656 ఎమ్మెట్ ఇక్కడికి వస్తున్నప్పుడు నువ్వసలు పట్టించుకోనే లేదు. 364 00:26:54,740 --> 00:26:58,952 ఎమ్మెట్, ఒక వైద్యుడు. నువ్వు యువతివి, అదీగాక నీకు నిశ్చితార్థం కూడా అయింది. 365 00:26:59,036 --> 00:27:02,164 - తనకి అతనంటే ఇష్టం కూడా లేదు. మీరు... - ఇది నీకు అనవసరమైన విషయం! 366 00:27:04,499 --> 00:27:06,335 హేయ్, ఎవిలిన్, నువ్వు ఆవిడతో వెళ్ళవలసిన అవసరం లేదు. 367 00:27:09,671 --> 00:27:10,672 నీకేమీ తెలీదు. 368 00:27:14,176 --> 00:27:15,177 పద, బంగారం. 369 00:27:24,269 --> 00:27:27,231 హెన్రీ? నిశ్చితార్థంలో కలిసిన శ్యామ్ టేయిలర్ ని. 370 00:27:27,314 --> 00:27:29,650 చెవులలో ఏదో మోగినట్టు అనిపించిన కుర్రాడివి కదా. 371 00:27:29,733 --> 00:27:30,734 అవును, అది నిజమే. 372 00:27:31,401 --> 00:27:34,446 వినండి, నిన్న రాత్రి మన సంభాషణని పూర్తి చేసే అవకాశం మనకి దక్కలేదు. 373 00:27:34,530 --> 00:27:36,657 తుఫాను, ఇంకా తగ్గిన వాయు పీడనం గురించి. 374 00:27:36,740 --> 00:27:38,283 ఇంకా మాట్లాడటానికి ఏం మిగిలిందో నాకు తెలీదే. 375 00:27:38,367 --> 00:27:40,077 అంటే, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను అనమాట. 376 00:27:40,160 --> 00:27:42,996 ఉదాహరణకి, మళ్లీ నా చెవులలో మోగేలా వాయుపీడనాన్ని తగ్గించాలనుకున్నాననుకోండి. 377 00:27:43,080 --> 00:27:45,374 వాయు పీడనం తగ్గవలసినంత తగ్గిందని నాకెలా తెలుస్తుంది? 378 00:27:47,501 --> 00:27:48,502 నాతో లోపలికి రా. 379 00:27:51,713 --> 00:27:53,507 ఇది బ్యారోమీటర్. 380 00:27:53,590 --> 00:27:55,676 నీ గోడ మీద వేలాడదీసుకో. 381 00:27:55,759 --> 00:27:59,805 తుఫాను వచ్చినప్పుడు, సూది పడిపోతుంది. 382 00:27:59,888 --> 00:28:00,889 తుఫాను వాన మార్పు 383 00:28:00,973 --> 00:28:02,808 అవును, ఇలాంటిది ఒకదాన్ని నేను ఇదివరకు చూశాను. 384 00:28:02,891 --> 00:28:05,561 పీడనం తగ్గినప్పుడు సూది ఒక్కసారిగా పడిపోయింది. 385 00:28:06,645 --> 00:28:10,148 ఒక్కసారిగా పడిపోయిందా? అయితే అది పెను తుఫాను అయ్యుండాలి. 386 00:28:11,108 --> 00:28:15,028 ఈ మధ్య మనకి ఇక్కడ చాలా తీవ్రమైన తుఫానులు సంభవిస్తున్నాయి కదా? అది పెను తుఫానే. 387 00:28:15,571 --> 00:28:17,573 ఒక వారం నుండి రెండు వారాల దాకా దాని ప్రభావం ఉంటుంది. 388 00:28:18,073 --> 00:28:22,536 తుఫాను వస్తూ, పోతూ ఉంటుంది, హఠాత్తుగా మనం తేరుకొనేలోపు తీవ్రరూపం దాల్చుతుంది. 389 00:28:22,619 --> 00:28:24,079 అయితే అది మరో వారం ఉండే అవకాశముందా? 390 00:28:24,454 --> 00:28:27,124 ఇంచుమించుగా. సరిగ్గా అలాగే ఉండాలనేమీ లేదు. 391 00:28:27,916 --> 00:28:29,960 సరే, మరి ఈ పెను తుఫాను వచ్చినప్పుడు, 392 00:28:30,752 --> 00:28:33,964 ఈ తుఫాను, ఇంతకుముందు చేసినట్టుగానే మళ్లీ అది పీడనాన్ని తగ్గిస్తుందా? ఖచ్చితంగా? 393 00:28:34,590 --> 00:28:36,216 ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది అనుకుంటా. 394 00:28:36,758 --> 00:28:42,055 పోయినసారి వచ్చినది, నా కలపని రెండు ముక్కలు చేసి, నా కొటారం తలుపులను ఊడగొట్టేసింది. 395 00:28:42,514 --> 00:28:43,515 దానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. 396 00:28:45,267 --> 00:28:47,311 వినండి, అది నేను అరువుగా తీసుకోవచ్చా? 397 00:28:48,812 --> 00:28:51,815 అంటే, వస్తువులను ఊరికే ఇచ్చేసే అలవాటు నాకు లేదు. 398 00:28:53,817 --> 00:28:57,905 హేయ్, ఆగండి, ఆగండి. మీ కొఠారం తలుపులు. వాటిని బిగించడంలో మీకు సాయం కావాలా? 399 00:28:59,531 --> 00:29:02,951 మీరు అది ఇవ్వడానికి అంగీకరిస్తే... నా చేతులు ఆ పనిని సులువుగా చేయగలవు. 400 00:29:13,712 --> 00:29:15,047 - వెళ్లిపో. - నువ్వు వెళ్లిపోతున్నావా? 401 00:29:15,130 --> 00:29:18,050 - నిన్నెక్కడికైనా పంపించేస్తున్నారా ఏంటి? - నాకు నేనుగానే వెళ్లిపోతున్నాను. 402 00:29:18,509 --> 00:29:19,510 ఎక్కడికి? 403 00:29:20,886 --> 00:29:22,012 ఇక్కడ నుంచి ఎక్కడికైనా. 404 00:29:22,095 --> 00:29:25,474 సరేమరి, ఆగు, ఆగు. నేను వెళ్లి మీ తాతయ్య మిత్రుడిని కలిశాను. అదే, ఆ హెన్రీని? 405 00:29:26,683 --> 00:29:28,685 మనం మళ్లీ 2019లోకి ఎలా వెళ్లిపోవచ్చో నాకు తెలుసనుకుంటా. 406 00:29:33,649 --> 00:29:34,816 మనమా? 407 00:29:34,900 --> 00:29:37,402 అవును. నువ్వు కూడా రావాలి. 408 00:29:39,863 --> 00:29:43,575 నీకు స్వేచ్ఛ, ఆనందం దక్కాలి. 409 00:29:44,159 --> 00:29:47,704 నువ్వు నీలాగా, నీకు నచ్చినవారితో ఉండటం కోసం. 410 00:29:48,205 --> 00:29:49,373 అది నేనే అయ్యుండనవసరం లేదు. 411 00:29:49,456 --> 00:29:51,834 కానీ నువ్వు నాతో వచ్చేస్తే, నీకు అవన్నీ దక్కే అవకాశముంది. 412 00:29:55,045 --> 00:29:58,257 ఇది నువ్వు ఉండవలసిన చోటు కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. 413 00:30:00,884 --> 00:30:04,930 మనకి కావలసిందల్లా, తుఫాను తీవ్ర రూపం దాల్చి, వాయు పీడనం తగ్గడం, సరేనా? 414 00:30:05,013 --> 00:30:08,642 చూడు. 2019లో దీన్నే నేను సెల్లార్ లో చూశాను. 415 00:30:09,101 --> 00:30:11,103 దానర్థం దీన్ని అక్కడ పెట్టింది నేనే అయ్యుండాలి. 416 00:30:12,354 --> 00:30:16,358 బహుశా ఇదంతా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందేమో. నువ్వు నాతోనే రావాలని రాసిపెట్టుందేమో. 417 00:30:22,406 --> 00:30:24,116 ఇది పిచ్చిగా అనిపిస్తుందని నాకు తెలుసు. నేను... 418 00:30:39,882 --> 00:30:41,550 వివాహం మరో పది రోజుల్లో జరగబోతుంది. 419 00:30:43,177 --> 00:30:45,053 ఆ లోపు తుఫాను రాకపోతే? 420 00:30:45,637 --> 00:30:48,223 తుఫాను వచ్చుంది. మనం... మనం అది తీవ్రమయ్యేదాకా ఆగాలి, అంతే. 421 00:31:46,532 --> 00:31:48,367 త్వరలోనే. త్వరలోనే. 422 00:32:22,317 --> 00:32:23,318 హాయ్. 423 00:32:31,118 --> 00:32:32,327 - హేయ్, కుర్రాడా. - చెప్పండి. 424 00:32:35,205 --> 00:32:36,206 నువ్వు చక్కగా పనిచేస్తున్నావు. 425 00:32:37,082 --> 00:32:38,625 ధన్యవాదాలు. పని అయిపోవస్తోంది. 426 00:32:39,001 --> 00:32:40,002 సరే. 427 00:32:40,085 --> 00:32:41,879 నిన్ను డిన్నర్ కి ఉండమని నా భార్య అడుగుతోంది. 428 00:32:42,379 --> 00:32:45,549 పంది మాంసం వేంపుడు, రుబార్బ్ పై, నువ్వు తింటావు కదా? 429 00:32:47,050 --> 00:32:49,428 రుబార్బ్ అంటే ఏంటో నాకు తెలీదు కానీ, వినడానికి బాగానే ఉన్నట్టుంది. 430 00:32:51,889 --> 00:32:55,017 ఇప్పుడు, అస్సలు కదలకుండా ఉండాలి. ఇది తీయడానికి చాలా సేపు పడుతుంది. 431 00:32:55,100 --> 00:32:56,435 మీ ఫోటో మసకగా రాకూడదు. 432 00:32:58,812 --> 00:33:00,564 ఒక చిరునవ్వు చిందించు, ప్రియా. 433 00:33:01,190 --> 00:33:06,028 నాకు నిన్ను ఎల్లప్పుడూ ఇలాగే నా మదిలో నింపుకోవాలనుంది. అందమైన యువతిగా. 434 00:33:09,656 --> 00:33:10,657 మరి... 435 00:33:14,077 --> 00:33:15,078 అలాగే ఉండండి. 436 00:33:17,289 --> 00:33:20,083 మంచిది. అలాగే, ఇంకాసేపు ఉండండి. 437 00:33:20,542 --> 00:33:22,085 ఇక... 438 00:33:23,462 --> 00:33:26,381 అయ్యయ్యో. చీకటి పడిపోతుంది. మనకి మరొకటి అవసరమవుతుంది. 439 00:33:27,257 --> 00:33:29,843 నాకు కాస్త తల తిరుగుతున్నట్టుగా ఉంది. నన్ను మన్నించండి. 440 00:33:40,854 --> 00:33:42,439 హేయ్, హేయ్. పద! 441 00:33:42,898 --> 00:33:44,316 - ఇదేనా సరైన సమయం? - దాదాపుగా. 442 00:33:48,779 --> 00:33:50,239 కమాన్. కమాన్. 443 00:33:55,911 --> 00:33:58,747 నాకు తెలీదనుకుంటున్నావా? నేను కనిపెట్టలేననుకున్నావా? 444 00:33:59,206 --> 00:34:02,793 - ఒక బజారుదానిలా నిసిగ్గుగా తిరుగుతున్నావు. - నీకు కూడా కావలసింది అదే కదా? 445 00:34:03,418 --> 00:34:07,047 ఈ వివాహం అంతా డబ్బుతోనే ముడిపడుంది. కానీ నేను అలాంటిదాన్ని కాదు! 446 00:34:08,047 --> 00:34:11,051 - హేయ్! తనని తాకవద్దు! తనని తాకవద్దు! - వద్దు! వద్దు! వద్దు... 447 00:34:11,467 --> 00:34:13,136 నిన్ను పెళ్లిచేసుకోమని నన్ను బలవంతపెట్టలేవు! 448 00:34:13,219 --> 00:34:14,888 - అది నేను జరగనివ్వను! - నేను కూడా! 449 00:34:15,639 --> 00:34:17,724 శ్యామ్! శ్యామ్! 450 00:34:33,949 --> 00:34:37,159 ఎవిలిన్! ఎవిలిన్! 451 00:34:40,038 --> 00:34:41,581 - హేయ్! - ఏంటి? బాబోయ్! 452 00:34:41,665 --> 00:34:44,543 - హేయ్! తను ఎక్కడుంది? తను ఎక్కడ ఉంది? - ఓయ్, నువ్వేం చేస్తున్నావు? 453 00:34:46,753 --> 00:34:51,884 ఇది. ఇది. దీన్ని చూశావా? ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటున్నావు? 454 00:34:52,384 --> 00:34:54,052 జేక్, నేను అక్కడికి వెళ్ళానన్నదానికి ఇదే ఋజువు. 455 00:34:54,719 --> 00:34:58,098 ఇది ఋజువు చేసేదల్లా, నీకు ఇంకా మంచి అగ్గిపెట్టె మరొకటి దొరికిందనే. 456 00:34:58,182 --> 00:34:59,975 కాదు, కాదు. నువ్వు నేను చెప్పేది ఆలకించడం లేదు. 457 00:35:00,058 --> 00:35:03,187 ఆలకించాను, నీ తలకి ఏదైనా గాయమయి ఉంటుందని నిజంగా నాకు అనిపిస్తుంది. 458 00:35:04,605 --> 00:35:05,647 కానీ నా తలకి గాయమవ్వలేదే. 459 00:35:07,065 --> 00:35:08,734 గాయమవ్వలేదు. ఏ గాయామూ కాలేదు. జరిగినదంతా నిజం. 460 00:35:09,401 --> 00:35:11,653 తను... తను నిజంగా ఉంది, నేను... 461 00:35:13,614 --> 00:35:14,615 సరే, చెప్పేది విను. 462 00:35:16,491 --> 00:35:19,161 తను గతానికి చెందినది, నీ ఆలోచనల నిండా తనే ఉంది. 463 00:35:19,244 --> 00:35:20,245 కాదు, కాదు. 464 00:35:20,537 --> 00:35:24,208 కానీ తను ఎవరైనా కానీ, తను ఏనాడో చనిపోయుంటుంది. 465 00:35:28,378 --> 00:35:32,758 ఇక సర్దుకొని బయలుదేరుదాం, సరేనా? ఆలిస్ పడుకోకముందే ఇంటికి చేరుకోవాలనుకుంటున్నాను. 466 00:35:44,728 --> 00:35:46,438 పద, గురూ. నీ సామాను తెచ్చుకో. 467 00:35:48,941 --> 00:35:49,983 నేను రాలేను. 468 00:35:51,568 --> 00:35:54,363 నేను ఇక్కడే ఉండాలి. మళ్లీ తనని చేరుకొనే మార్గం ఏమైనా ఉందేమో నేను వెతకాలి. 469 00:35:54,738 --> 00:35:56,573 వెళ్లి బండి ఎక్కు. 470 00:35:56,949 --> 00:35:58,534 రోజర్ నోరూరించే ఎంపనాడాలు చేశాడు. 471 00:35:59,451 --> 00:36:02,538 వెళ్లి తిని, కాస్త గంజాయి కొట్టి, ఇంకాస్త తిందాము. 472 00:36:09,628 --> 00:36:12,297 నాకు నీ ఫోన్, నీ చార్జర్, 473 00:36:12,381 --> 00:36:14,383 నువ్వు బండి వెనకాల పెట్టే ఆ దుప్పట్టి, ఇవన్నీ కావాలి. 474 00:36:15,425 --> 00:36:17,344 నేను ఇక్కడే ఉంటాను, ఈ విషయాన్ని తేల్చే మార్గం చూడాలి. 475 00:36:18,262 --> 00:36:19,513 జేక్, దయచేసి. 476 00:36:22,766 --> 00:36:25,352 1919లో సంభవించిన విధ్వంసకర పెను తుఫాను. 477 00:36:33,527 --> 00:36:34,820 మరణించినవారు లేదా తప్పిపోయినవారు 478 00:36:37,155 --> 00:36:38,156 ఎవిలిన్ పోర్టర్ 479 00:36:38,240 --> 00:36:39,366 అయ్యో, అయ్యయ్యో. 480 00:36:50,460 --> 00:36:54,381 ఇప్పుడున్న పెను తుఫానును మనం "ఉగ్ర పెను తుఫాను" అని పిలవవచ్చు. 481 00:36:55,757 --> 00:37:00,470 ఇది పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది, కానీ, అదృష్టవశాత్తు ఇది చాలా అరుదుగా వస్తుంది. 482 00:37:01,221 --> 00:37:04,558 ఉగ్ర పెను తుఫాను, చివరి సారి సుమారు వంద ఏళ్ళ క్రితం సంభవించింది. 483 00:37:04,933 --> 00:37:05,934 1919. 484 00:37:06,018 --> 00:37:07,603 బాధాకరమైన విషయమేమిటంటే, గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని, 485 00:37:07,686 --> 00:37:10,314 ఈ ఉగ్ర తుఫానుల మధ్యనున్న అంతరాలు అంతకంతకూ తగ్గిపోతూ ఉన్నాయి. 486 00:37:10,397 --> 00:37:13,066 తరువాతి ఉగ్ర తుఫాను రాబోయే పదీ, పదిహేను ఏళ్ళలో సంభవించే అవకాశముంది. 487 00:37:13,150 --> 00:37:14,776 లేదు, లేదు. అంత కాలం వరకూ నేను ఆగలేను. 488 00:37:20,782 --> 00:37:22,409 ఐయోవా చెదురుముదురు మబ్బులు 40 డిగ్రీలు 489 00:37:23,160 --> 00:37:24,161 ఐయోవా వాతావరణం 45 డిగ్రీలు 490 00:37:25,162 --> 00:37:26,663 సెడార్ ర్యాపిడ్స్ వాతావరణం వాన కురిసే అవకాశం 43 డిగ్రీలు 491 00:37:27,080 --> 00:37:28,081 మిడ్ వెస్ట్ స్టార్మ్ వాచ్ 41 డిగ్రీలు 492 00:37:46,850 --> 00:37:47,935 - హేయ్. - హేయ్. 493 00:37:48,435 --> 00:37:52,147 డిన్నర్ కి వస్తావు కదా? ఆలిస్ తన అంకుల్ శ్యామ్ ని మిస్ అవుతోంది. 494 00:37:53,065 --> 00:37:55,734 లేదు, నేను రాలేను. నేను రాలేను. నేనిక్కడే ఉండాలి. 495 00:37:59,029 --> 00:38:00,489 - శ్యామ్. - ఇదే. ఇదే. 496 00:38:01,281 --> 00:38:02,282 శ్యామ్! 497 00:38:07,120 --> 00:38:08,497 త్వరగా. త్వరగా. త్వరగా. 498 00:38:08,580 --> 00:38:09,873 తుఫాను వాన మార్పు ప్రశాంత వాతావరణం 499 00:38:33,522 --> 00:38:37,526 ఊరుకో, చిన్నారీ, ఉలకకు పలకకు 500 00:38:38,610 --> 00:38:40,529 నాన్న నీకో కోయిలని కొనిస్తాడు 501 00:38:40,612 --> 00:38:44,032 లె పాయిసన్ బ్ల్యూ లో ఎవిలిన్ పోర్టర్ లైవ్ మార్చి 18, 2034, న్యూ యోర్క్ న్యూ యోర్క్ 502 00:38:44,116 --> 00:38:50,789 ఆ కోయిలే కనుక పాడకుంటే నాన్న నీకు వజ్రపు ఉంగరాన్ని కొనిస్తాడు 503 00:38:52,457 --> 00:38:55,878 ఆ వజ్రపు ఉంగరం ఇత్తడిది అయ్యుంటే 504 00:38:56,753 --> 00:39:00,215 నాన్న నీకో అద్దం కొనిస్తాడు 505 00:39:01,300 --> 00:39:04,303 శుభరాత్రి, శ్యామ్. జన్మదిన శుభాకాంక్షలు. 506 00:39:15,606 --> 00:39:21,236 ఆ అద్దమే పగిలిపోతే, నాన్న నీకో... 507 00:39:21,862 --> 00:39:23,280 అమ్మా. అక్కడ ఎవరైనా ఉన్నారా? 508 00:39:40,672 --> 00:39:42,007 - శ్యామ్. - జేక్? 509 00:39:42,090 --> 00:39:43,050 ఏంటది? ఏం చేశావు నువ్వు? 510 00:39:43,133 --> 00:39:45,719 దాన్ని వైన్ సెల్లార్ లో ఉంచాము. క్లయింట్ అదే కావాలనుకున్నాడని నీకు తెలుసు కదా. 511 00:39:45,802 --> 00:39:48,514 లేదు, లేదు. నువ్వు మార్చేశావు. నువ్వు మార్చేశావు. మార్చేశావు. 512 00:39:48,597 --> 00:39:50,057 - నువ్విక్కడి వాయు పీడనాన్ని మార్చేశావు. - హేయ్! హేయ్! 513 00:39:50,140 --> 00:39:52,684 - నేను గతానికి కాకుండా భవిష్యత్తుకి వెళ్ళా. - శ్యామ్! ఇక చాలు, శ్యామ్. 514 00:39:52,768 --> 00:39:55,103 - శ్యామ్, శ్యామ్, నువ్వేదేదో వాగుతున్నావు. - దాన్ని అక్కడి నుండి తీయడంలో నాకు సాయపడు. 515 00:39:55,187 --> 00:39:58,440 చూడు, నేను భవిష్యత్తుకు వెళ్ళాను, తనని చూశాను. నేను తనని చూశాను. 516 00:39:58,524 --> 00:40:00,067 మాకు... మాకో పిల్లాడు పుట్టాడు. 517 00:40:01,276 --> 00:40:03,070 మాకో అందమైన చిన్ని బాబు పుట్టాడు. 518 00:40:04,947 --> 00:40:08,033 కానీ నేను గతంలోకి వెళ్లి తనని కాపాడకపోతే, ఇదేదీ జరగదు, సరేనా? 519 00:40:08,116 --> 00:40:10,410 - నీకది అర్థమయిందా? - నీ గురించి నాకు చాలా బెంగగా ఉంది. 520 00:40:10,494 --> 00:40:12,955 అవును, నాకది అర్థమయింది, జేక్. కానీ తక్షణమే నాకు నీ సహాయం కావాలి, సరేనా? 521 00:40:14,331 --> 00:40:17,084 నేను దీన్ని ఇక్కడి నుండి తీస్తే, నువ్వు వెళ్లి వైద్యుడిని సంప్రదిస్తావా? 522 00:40:19,127 --> 00:40:20,963 అలాగే. అలాగే. నేను మాటిస్తున్నాను. 523 00:40:34,685 --> 00:40:36,812 సరే. ఇక పద. 524 00:40:41,441 --> 00:40:42,442 నన్ను క్షమించు, జేక్. 525 00:40:43,235 --> 00:40:46,154 శ్యామ్! ఇలా చేయకు. శ్యామ్, కమాన్! 526 00:40:47,698 --> 00:40:48,699 శ్యామ్! 527 00:41:00,711 --> 00:41:01,712 ఎవిలిన్! 528 00:41:03,630 --> 00:41:04,631 ఎవిలిన్! 529 00:41:23,901 --> 00:41:24,902 శ్యామ్? 530 00:41:26,278 --> 00:41:27,279 మనం బయలుదేరాలి. తక్షణమే! 531 00:41:39,583 --> 00:41:41,043 పద. రా! 532 00:41:42,169 --> 00:41:43,879 - శ్యామ్! - పర్వాలేదులే. మనకి ఏమీ కాదు. మనకేం కాదు. 533 00:41:43,962 --> 00:41:45,797 మాటిస్తున్నాను. కానీ మనం వెంటనే బయలుదేరాలి. 534 00:41:55,140 --> 00:41:56,225 నా కాలు ఇరుక్కుపోయింది. 535 00:42:07,903 --> 00:42:08,904 ఏం చేస్తున్నావు నువ్వు? 536 00:42:09,530 --> 00:42:11,490 సరే. నేను చెప్పేది విను. నువ్వు వెళ్లిపోవాలి. 537 00:42:12,783 --> 00:42:16,245 - లేదు! నువ్వు... నువ్వు లేకుండా వెళ్ళను. - లేదు. హేయ్. హేయ్. విను. విను. 538 00:42:17,496 --> 00:42:19,081 నేను భవిష్యత్తులోకి వెళ్ళాను, సరేనా? 539 00:42:20,290 --> 00:42:21,917 - ఏంటి? - అక్కడ నిన్ను చూశాను. 540 00:42:22,668 --> 00:42:26,296 నీకో కొడుకు ఉన్నాడు. చిన్ని పిల్లాడు ఉన్నాడు. 541 00:42:27,047 --> 00:42:28,340 వాడితో పాట పాడుతూ ఉన్నావు. 542 00:42:31,134 --> 00:42:32,302 నువ్వు క్షేమంగా వెళ్లిపోగలవు. 543 00:42:33,011 --> 00:42:36,014 ఓహ్, మనకి... మనకి బాబు ఉన్నాడా? 544 00:42:36,932 --> 00:42:37,975 కాదు. 545 00:42:40,143 --> 00:42:41,144 నీకు ఉన్నాడు. 546 00:42:43,272 --> 00:42:44,398 నేను అక్కడ లేను. 547 00:42:45,232 --> 00:42:46,316 - లేదు. - అవును. 548 00:42:46,400 --> 00:42:47,401 లేదు. 549 00:42:47,818 --> 00:42:49,987 జరగవలసింది అదే. అవును. 550 00:42:50,070 --> 00:42:51,071 లేదు. 551 00:42:51,154 --> 00:42:54,074 - నా మాట నమ్ము. - లేదు. లేదు. ఆ జీవితం నాకు వద్దు. 552 00:42:57,786 --> 00:43:00,455 - పర్వాలేదు. అంతా సవ్యంగానే ఉంటుంది. - లేదు. 553 00:43:01,748 --> 00:43:02,749 విను, నా మాట విను. 554 00:43:03,417 --> 00:43:04,710 నా అన్నయ్యకి, తనని నేను ప్రేమిస్తున్నానని చెప్పు. 555 00:43:07,963 --> 00:43:09,256 అతను నీకు తోడ్పాటును అందిస్తాడు. 556 00:43:10,465 --> 00:43:12,759 - వెళ్లిపో. - లేదు, లేదు, లేదు! 557 00:43:18,891 --> 00:43:21,226 - ఎవిలిన్. - లేదు! శ్యామ్. శ్యామ్. 558 00:43:21,310 --> 00:43:22,519 - శ్యామ్. - ఎవిలిన్. 559 00:43:22,603 --> 00:43:24,855 - శ్యామ్! - ఎవిలిన్. నువ్వంటే నాకు ప్రాణం. 560 00:43:26,148 --> 00:43:27,482 కానీ నువ్వు నన్ను ఇప్పుడు వదిలి వెళ్లిపోవాలి. 561 00:43:43,373 --> 00:43:46,502 శ్యామ్. నీకేం కాలేదు కదా? అసలేం జరుగుతోంది? 562 00:43:55,886 --> 00:43:57,387 శ్యామ్? 563 00:44:22,829 --> 00:44:23,830 నీకు ఆకలిగా ఉందా? 564 00:44:27,209 --> 00:44:28,210 సరేమరి. 565 00:44:31,046 --> 00:44:34,925 నీకోసమని కొత్త బట్టలు తెచ్చాను. సరైన కొలతలు నాకు తెలీదు. 566 00:44:35,008 --> 00:44:37,427 కాబట్టి, సరిపోతాయనే ఆశిస్తున్నాను. 567 00:44:46,395 --> 00:44:48,272 ప్రతీ గదిలో సంగీతం ఉంటుందని అన్నాడు. 568 00:44:55,320 --> 00:44:56,530 వాడు నిన్ను పిచ్చిగా ప్రేమించాడు. 569 00:44:59,449 --> 00:45:00,659 నీ గురించి మొత్తం చెప్పాడు. 570 00:45:05,873 --> 00:45:06,957 ఏం చెప్పాడు? 571 00:45:07,040 --> 00:45:11,044 అంటే, ఏం చెప్పాడని కాదు, ఎలా చెప్పాడన్నది ముఖ్యం. 572 00:45:13,005 --> 00:45:14,965 వాడు అలా మాట్లాడటాన్ని ఇదివరకూ నేనెన్నడూ చూడలేదు. 573 00:45:17,509 --> 00:45:21,054 నీ పాటల గురించి, నీ రికార్డుల సంగ్రహం గురించి. 574 00:45:21,597 --> 00:45:23,015 అవి నా సోదరునివి. 575 00:45:26,310 --> 00:45:29,521 అవి మా అమ్మ కంట పడకూడదని వాటిని గోడల మాటున దాచుంచాను. 576 00:45:31,148 --> 00:45:33,066 శ్యామ్, మేము తొలిసారి కలిసిన రోజున, అవి నా నుండి పోకుండా కాపాడాడు. 577 00:45:43,827 --> 00:45:46,330 తెలుసా, ఈ గోడలు అప్పటివే. 578 00:45:52,294 --> 00:45:55,297 ఎవిలిన్ కి 579 00:46:06,225 --> 00:46:07,309 శ్యామ్ నుండి. 580 00:46:08,310 --> 00:46:09,311 అతను చావలేదు. 581 00:46:12,523 --> 00:46:13,941 అతను 1919లో ఉన్నాడా? 582 00:46:36,213 --> 00:46:37,297 ప్రియమైన ఎవిలిన్. 583 00:46:37,673 --> 00:46:39,591 నువ్వు ఇది చదివేనాటికి, నేనెప్పుడో చనిపోయి ఉంటాను. 584 00:46:40,259 --> 00:46:42,052 కానీ నేను నీకు తప్పక చెప్పాలి, 585 00:46:42,970 --> 00:46:44,680 ఆనాటి తుఫానులో నేను చావలేదు. 586 00:46:45,389 --> 00:46:46,390 అతను ఇక్కడే కింద ఉన్నాడు. 587 00:46:55,232 --> 00:46:57,025 నీ చెంతకు చేరుకోవాలని శతవిధాలా ప్రయత్నించాను. 588 00:47:03,365 --> 00:47:04,491 ఓ ఏడాడి దాకా ఆగాను, 589 00:47:07,703 --> 00:47:09,371 కానీ తుఫాను జాడే లేదు. 590 00:47:11,206 --> 00:47:13,625 తుఫాను ఉండదని అన్నారు, కానీ నాలో ఆశ చావలేదు. 591 00:47:16,211 --> 00:47:17,629 అప్పుడే ఓ విషయం తెలుసుకున్నాను. 592 00:47:18,547 --> 00:47:20,132 మహిళలకు ఓటు హక్కు 593 00:47:21,550 --> 00:47:23,510 నువ్వు ఖచ్చితంగా భవిష్యత్తులో ఉండాల్సినదానివి... 594 00:47:25,304 --> 00:47:29,433 ...బహుశా... నేను ఉండవలసినది ఇక్కడేనేమో. 595 00:47:32,269 --> 00:47:33,645 నా స్థానాన్ని నేను గ్రహించాను. 596 00:47:35,480 --> 00:47:36,982 దానికి నేను నీకే ధన్యవాదాలు తెలపాలి. 597 00:47:39,776 --> 00:47:41,278 ఎట్టకేలకు, ఆనందమయ జీవనం గడపసాగాను. 598 00:47:43,906 --> 00:47:45,741 తెలుసా, ఇది భలే గమ్మత్తైన విషయం. 599 00:47:46,783 --> 00:47:50,787 నేను అనేక ఎంపికలు ఉన్న కాలాం నుండి వచ్చాను, కానీ నువ్వలా కాదు. 600 00:47:55,459 --> 00:47:58,962 ఇక ఇప్పుడు, మనం సాగిపోవలసిన సమయం వచ్చింది. 601 00:48:00,631 --> 00:48:03,634 మన భవిష్యత్తులు సక్రమంగా జరగాలంటే దానికి అనుగుణంగా అన్నీ అమర్చాలి. 602 00:48:14,269 --> 00:48:15,896 జేక్ కి 603 00:48:21,318 --> 00:48:23,695 నీ సొంత ఇంటిని నిర్మించుకోవలసిన సమయం ఆసన్నమైంది. ప్రేమతో, శ్యామ్ 604 00:48:26,281 --> 00:48:27,282 పిట్స్బర్గ్ 605 00:48:28,075 --> 00:48:29,493 హోనస్ వాగ్నర్. 606 00:48:36,416 --> 00:48:38,460 నీకు ఈ లేఖ దొరుకుతుందని నాకు తెలుసు, ఎవిలిన్. 607 00:48:39,378 --> 00:48:43,215 నేను నీకోసం వెతుకుతున్నట్టే, నువ్వు కూడా నాకోసం వెతుకుతుంటావని నాకు తెలుసు కనుక. 608 00:48:45,092 --> 00:48:48,804 కానీ నువ్వు ఆ వెదకడం ఆపవలసిన సమయం వచ్చింది. ఇక ఇప్పుడు ఇది నీ వంతు. 609 00:48:51,932 --> 00:48:55,894 నీకో జీవితం ఉంది. ప్రపంచంలోకి అడుగుపెట్టి, దాన్ని జీవించు. 610 00:48:58,230 --> 00:49:01,650 నా అమర ప్రేమతో, శ్యామ్. 611 00:49:42,065 --> 00:49:46,612 శ్యామ్ టేయిలర్ కంస్ట్రక్షన్ సెడార్ ర్యాపిడ్స్ 612 00:50:08,926 --> 00:50:10,886 అమ్మా. అక్కడ ఎవరైనా ఉన్నారా? 613 00:50:16,183 --> 00:50:18,685 లేదు. ఎవ్వరూ లేరు, బంగారం. 614 00:50:19,228 --> 00:50:23,398 ఏమీ కాలేదు. ఏం పర్వాలేదు. 615 00:52:21,642 --> 00:52:23,644 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య