1 00:00:58,267 --> 00:01:01,061 నక్షత్రాలు కాలిపోతున్నాయి, ఎడ్. 2 00:01:01,562 --> 00:01:04,607 విశ్వం చల్లబడిపోయింది. 3 00:01:04,899 --> 00:01:08,444 వేడి లేదు, బలము లేదు. 4 00:01:09,069 --> 00:01:10,780 అన్ని క్షీణించిపోతాయి. 5 00:01:11,655 --> 00:01:14,033 అన్ని నశించిపోతాయి. 6 00:01:15,993 --> 00:01:18,913 కాని రెండు చాలు, ఎడ్. 7 00:01:19,330 --> 00:01:21,290 కేవలం రెండు. 8 00:01:21,874 --> 00:01:25,669 ఎంతో దగ్గరగా పెనవేసుకుపోయి ఒకే కణంలా కనిపించే... 9 00:01:25,836 --> 00:01:28,589 ...రెండు కణాలు మాత్రం చాలు. 10 00:01:29,173 --> 00:01:31,383 అప్పుడు క్షీణించడం ఉండదు. 11 00:01:32,760 --> 00:01:34,720 నశించడం ఉండదు. 12 00:01:35,429 --> 00:01:37,389 మరణం ఉండదు. 13 00:01:39,850 --> 00:01:42,561 నేను మాత్రమే ఉన్నాను, ఎడ్. 14 00:01:44,146 --> 00:01:46,899 కాని నా దగ్గర సమయం లేదు. 15 00:02:44,582 --> 00:02:46,166 నేను ఇంటికి వచ్చేశాను. 16 00:02:46,959 --> 00:02:48,669 స్వీట్హార్ట్? 17 00:02:48,878 --> 00:02:51,338 హే. ఎంజాయి చేశావా? 18 00:02:51,505 --> 00:02:53,924 డెక్లు దాదాపు పూర్తి చేసేశాను. 19 00:02:55,134 --> 00:02:56,635 నేను చాలా అదృష్టవంతుడిని. 20 00:02:58,929 --> 00:03:01,682 - మన ఇంటికి ఒక అతిథి వచ్చింది. - అవునా? 21 00:03:01,849 --> 00:03:05,769 జీవిత భీమా గురించి మాట్లాడ్డానికి వచ్చింది. రెండింతల నష్టపరిహారం. 22 00:03:05,936 --> 00:03:08,147 ఇతను నా భర్త, ఎడ్. 23 00:03:08,939 --> 00:03:10,649 ఈమె జిల్. 24 00:03:10,858 --> 00:03:13,152 హల్లో, మిస్టర్ మార్రిస్. 25 00:03:15,863 --> 00:03:17,907 ఏడు రోజుల క్రితం... 26 00:03:18,073 --> 00:03:20,618 ప్రమాదకరమైన వరదలు ఇంకా తీవ్రమైన వాతావరణ పరిస్థితువల్ల... 27 00:03:20,784 --> 00:03:23,662 ...వందలాది మంది తమ ఇళ్ళను ఖాళీ చేయాల్సి వచ్చింది. 28 00:03:23,871 --> 00:03:28,042 వాతావరణ ఏజెన్సీ సమచారం ప్రకారం రాబోయే 100 సంవత్సరాలలో... 29 00:03:28,250 --> 00:03:33,047 ...సముద్ర తీరాలు ఒరుసుకుపోవడంవల్ల 7,000 ఇళ్ళు మాయమైపోతాయి. 30 00:03:33,213 --> 00:03:36,717 ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వాళ్ళు, భవిష్యత్తులో తమ ఇళ్ళను వదిలి... 31 00:03:36,884 --> 00:03:40,888 ...సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. 32 00:03:41,263 --> 00:03:44,642 హనీ? నీకు తెలుసా, సైడ్-స్ట్రాండ్లో ఉన్న సాల్టర్ కుటుంబం ఇల్లు... 33 00:03:44,808 --> 00:03:46,477 ...సముద్రంలోకి పడిపోయింది. 34 00:03:46,685 --> 00:03:49,188 - అవునా? - అలా జరుగుతుందని వాళ్ళకి తెలుసు. 35 00:03:50,022 --> 00:03:54,276 - ఏదోక రోజు మన ఇంటికి కూడా అలా జరిగవచ్చు. - అప్పటి దాకా మనం ఇక్కడ ఉండము. 36 00:03:54,944 --> 00:03:57,905 ఏడు సముద్రాలు దాటుకొని అల్టిమా టూలేకి ప్రయాణిస్తూ ఉంటాము. 37 00:03:58,113 --> 00:04:00,449 ఎల్ డొరాడో. 38 00:04:00,616 --> 00:04:02,201 ఎలీషియన్ ఫీల్డ్స్... 39 00:04:04,870 --> 00:04:06,664 సారీ. నువ్వు ఏమన్నావు? 40 00:04:06,830 --> 00:04:09,416 మనం ల్యాండ్ ఆఫ్ కాకేయిన్ కి వెళదాము. నువ్వు నేను. 41 00:04:09,583 --> 00:04:12,962 ఎడ్. అది మంచి ఉపాయమే. 42 00:04:13,712 --> 00:04:16,048 నేను ఒక యాడ్ చూశాను: "రోజుని పిండండి." 43 00:04:16,507 --> 00:04:20,928 - మనందరం "రోజుని పిండుదాము." - అంటే దానర్ధం, "రోజుని సద్వినియోగం చేసుకోండి." 44 00:04:21,095 --> 00:04:22,930 అది ఒక జోక్. 45 00:04:23,097 --> 00:04:25,265 మన దగ్గర ఎక్కువ సమయం లేదు, ఆ తలంపు... 46 00:04:25,432 --> 00:04:27,601 ...మనల్ని విశాదంలో ముంచెత్తుతుంది, కాబట్టి... 47 00:04:27,768 --> 00:04:29,853 ఓ, ఎడ్, గుడ్లు... 48 00:04:30,813 --> 00:04:32,856 ...అప్పుడే ఎక్స్పైర్ అయిపోయాయి. 49 00:04:33,899 --> 00:04:35,651 ఒకసారి వీటిని చూడు. 50 00:04:35,818 --> 00:04:38,487 ఇవి రెండు రోజుల క్రితంవి. 51 00:04:46,578 --> 00:04:48,330 మీ నుండి ఇది ఆశించలేదు. 52 00:04:49,790 --> 00:04:51,375 ఆహారం ఎక్స్పైర్ అయ్యే తేదీలను చూసుకోండి. 53 00:04:51,583 --> 00:04:53,794 క్షమించు. అది నా తప్పు. 54 00:04:54,294 --> 00:04:56,338 ఈ రోజుని పూర్తిగా జీవించు, ఎడ్. 55 00:04:57,840 --> 00:04:59,925 తప్పకుండా జీవిస్తాను. 56 00:05:08,684 --> 00:05:11,520 కైమేరా ఫార్మ్ 57 00:05:12,021 --> 00:05:15,941 - గుడ్ మార్నింగ్, సూ. - గుడ్ మార్నింగ్, మేడమ్. 58 00:05:22,031 --> 00:05:23,824 ద స్పిరిట్ మిల్ లో, వెచ్చని... 59 00:05:23,991 --> 00:05:26,577 ...మరింత స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తాము. 60 00:05:27,077 --> 00:05:32,249 కాబట్టి కన్ను-గుర్తింపు లేదు. పాత కాలంలోలా చెయ్యి ముద్ర మాత్రమే వాడతాము. 61 00:05:32,583 --> 00:05:34,334 ఇంకా, సహేతుకమైన స్వర శ్రేణి కూడా. 62 00:05:36,086 --> 00:05:39,298 ఈ రోజుల్లో మనం కాగ్నిటివ్ కైమేరాలను చాలా అలుసుగా తీసుకుంటాము. 63 00:05:39,715 --> 00:05:43,594 జాక్స్, జిల్స్ ఇంకా ఇతర తెలివైన ఫ్యూషన్లు చాలా ఉన్నారు. 64 00:05:43,927 --> 00:05:49,308 పని దగ్గర, వినోదం దగ్గర. బహుశా మన మధ్య కూడా కొందరు ఉన్నారు. 65 00:05:49,475 --> 00:05:51,143 మీకు ఎలా తెలుస్తుంది? 66 00:05:51,351 --> 00:05:55,397 క్వాంటమ్ కాన్షియస్నెస్, లేదా క్యూసీని సర్జికల్ గా ఇంప్లాంట్ చేయడం అనేది... 67 00:05:55,564 --> 00:05:57,941 ...వాళ్ళకు మనకి ఉన్న సంబంధాలను పూర్తిగా మార్చివేసింది. 68 00:05:58,150 --> 00:06:01,653 అంటే వాళ్ళు మనలా మారిపోయారు. 69 00:06:01,987 --> 00:06:05,157 నిజానికి, నేను ఒక నిజం చెబుతాను. 70 00:06:05,324 --> 00:06:07,868 నేను కూడా జ్యాక్ నే. 71 00:06:08,660 --> 00:06:10,746 నా డ్రైవింగ్ ఎలా ఉంది? 72 00:06:12,206 --> 00:06:15,542 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతా తిరిగి చూడవచ్చు. 73 00:06:29,473 --> 00:06:31,850 చాలా అందంగా ఉన్నాయి. 74 00:06:33,519 --> 00:06:37,481 క్యూసీ అంటే మానవ జన్యుశాస్త్రం ఇంకా పోర్సిన్ జన్యుశాస్త్రం యొక్క... 75 00:06:37,648 --> 00:06:41,318 ...ప్రాథమిక కలయిక. కాబట్టి అందంగా ఎందుకు ఉండదు? 76 00:06:42,528 --> 00:06:44,571 అవి ఆలోచించగలవా? 77 00:06:46,657 --> 00:06:47,658 అవి కలలు కనగలవా? 78 00:06:51,370 --> 00:06:53,580 వాటికి అనుభవం లేదు. 79 00:06:53,747 --> 00:06:56,708 అవకాశం ఉంది, సంభావ్యత ఉంది. 80 00:06:56,875 --> 00:07:00,629 ప్రజలు యానిమస్ లేదా ఆత్మ అని పిలిచే వాళ్ళు... 81 00:07:00,796 --> 00:07:03,590 ...ఈ క్యూసీలు శరీరాన్ని సజీవంగా చేస్తాయి. 82 00:07:03,757 --> 00:07:07,136 - నువ్వు క్షేత్రంలో పని చేస్తావా? - నేనా? లేదు. 83 00:07:07,302 --> 00:07:09,805 జీవిత భీమాలో పని చేస్తాను. 84 00:07:13,767 --> 00:07:15,769 ఇక్కడ కనిపిస్తున్నవి... 85 00:07:15,978 --> 00:07:20,649 ...కేవలం వాటి అంచనాలు మాత్రమే, నిజానికి అవి చాలా చిన్నగా ఉంటాయి. 86 00:07:21,525 --> 00:07:23,402 నేను చూడవచ్చా? 87 00:07:24,820 --> 00:07:26,572 తప్పకుండా. 88 00:07:29,408 --> 00:07:31,994 సరే, మేము వీటిని బెర్రీస్ అంటాము. 89 00:07:32,202 --> 00:07:33,954 ఇంకా... 90 00:07:35,372 --> 00:07:38,167 ప్రతీ బెర్రీలో... 91 00:07:38,333 --> 00:07:39,710 ..ఒక క్యూసీ ఉంటుంది. 92 00:07:39,918 --> 00:07:42,504 ఇది పూర్తిగా స్వయంపోషకమైనది. 93 00:07:42,671 --> 00:07:45,257 జీవించడానికి కావాల్సినవి అన్ని దానిలో ఉన్నాయి. 94 00:07:45,424 --> 00:07:47,176 ఒక గుడ్డులాగ. 95 00:07:50,429 --> 00:07:53,098 ఒక దానిని విడుదల చేస్తే...? 96 00:07:54,892 --> 00:07:56,894 క్యూసీ మాయమైపోతుంది. 97 00:07:58,353 --> 00:08:00,063 ఆ తర్వాత? 98 00:08:03,525 --> 00:08:06,069 తర్వాత, ఏమీ లేదు. 99 00:08:06,778 --> 00:08:08,864 క్యూసీ లేదు, జీవితం లేదు. 100 00:08:14,953 --> 00:08:16,330 థ్యాంక్ యూ. 101 00:08:16,538 --> 00:08:17,998 నావి మొద్దుబారిన వేళ్ళు. 102 00:08:25,422 --> 00:08:27,549 - ఎడ్వర్డ్. - మిస్టర్ డైరెక్టర్, సర్. 103 00:08:28,550 --> 00:08:30,761 మన్నించండి, మిస్. 104 00:08:34,890 --> 00:08:36,099 గుడ్ మార్నింగ్. 105 00:08:36,266 --> 00:08:38,101 - గుడ్ మార్నింగ్. - గుడ్ మార్నింగ్. 106 00:08:39,561 --> 00:08:41,688 ఇద్దరు జ్యాక్స్. 107 00:08:41,855 --> 00:08:45,150 ఇద్దరు జిల్స్. క్స్యూసీలు లేకుండా, వీళ్ళు ఖాళీ గుల్లలు మాత్రమే. 108 00:08:45,317 --> 00:08:49,154 వీళ్ళలో సామర్థ్యాలు, భావోద్రేకాలు, ఇంకా జ్ఞానం ఉన్నప్పటికీ... 109 00:08:49,321 --> 00:08:51,365 ...వీళ్ళకి స్వీయ-అవగాహన లేదు. 110 00:08:51,531 --> 00:08:56,119 నిప్పు లేదు. సానుభూతి లేదు. 111 00:09:15,847 --> 00:09:17,099 ఎలా అనిపిస్తోంది? 112 00:09:17,266 --> 00:09:19,142 బాగా... 113 00:09:19,309 --> 00:09:20,686 ...అనిపిస్తోంది. 114 00:09:21,895 --> 00:09:23,730 చక్కగా అనిపిస్తోంది. 115 00:09:24,314 --> 00:09:25,774 హల్లో. 116 00:09:27,734 --> 00:09:32,072 ఈ క్షణం ఏమి ఆలోచిస్తున్నావో నాకు చెప్పు. 117 00:09:33,073 --> 00:09:35,117 ఆలోచిస్తున్నాను... 118 00:09:35,534 --> 00:09:37,577 ఆలోచిస్తున్నాను... 119 00:09:39,037 --> 00:09:41,707 ఆలోచించడం గురించి ఆలోచిస్తున్నాను. 120 00:09:43,917 --> 00:09:46,128 మెటాకోగ్నిషన్. 121 00:09:48,880 --> 00:09:51,341 భావోద్రేకాలతో నింపేస్తుంది, కదా? 122 00:10:12,821 --> 00:10:15,449 - బానే ఉన్నావా? - బానే ఉంటాను. 123 00:10:16,783 --> 00:10:18,618 నేను ఏమైనా సహాయం చేయనా? 124 00:10:18,785 --> 00:10:21,872 బస్సు మిస్ అయ్యిందా? కావాలంటే లిఫ్ట్ ఇస్తాను. 125 00:10:22,372 --> 00:10:24,041 థ్యాంక్ యూ. 126 00:10:32,215 --> 00:10:35,427 నా పేరు ఎడ్, ఎడ్ మార్రిస్. 127 00:10:35,594 --> 00:10:37,262 జిల్. 128 00:10:38,722 --> 00:10:40,515 నేను ఒక జిల్ ని. 129 00:10:40,682 --> 00:10:42,225 నేను ఊహించాను. 130 00:10:42,392 --> 00:10:44,311 మా కంపెనీ కాదా? 131 00:10:45,520 --> 00:10:48,357 నేను సిటీ స్పిరిట్ మిల్ నుండి వచ్చాను. 132 00:10:51,151 --> 00:10:53,653 అయినా నాకు సహాయం చేస్తావు, కదా? 133 00:10:54,071 --> 00:10:55,697 తప్పకుండా. 134 00:10:56,448 --> 00:10:57,949 ప్లీజ్. 135 00:11:07,167 --> 00:11:10,837 - నెల్సన్స్ బ్లడ్. - ఏంటీ? ఏంటి అది? 136 00:11:11,338 --> 00:11:14,007 - అతనికి తెలుసు. - నెల్సన్స్ ఇక్కడే కనుగొనబడింది. 137 00:11:15,050 --> 00:11:16,635 రెండు. 138 00:11:17,344 --> 00:11:18,845 అది తాగడం మంచిదేనా? 139 00:11:19,012 --> 00:11:20,889 అది ఏంటో తెలీదు గాని. 140 00:11:21,223 --> 00:11:23,558 చాలా మంచిది. 141 00:11:31,316 --> 00:11:33,151 నువ్వు చనిపోతున్నావు, కదా? 142 00:11:33,318 --> 00:11:34,945 అవును. 143 00:11:35,362 --> 00:11:37,280 ఎంత కాలం మిగిలివుంది? 144 00:11:39,908 --> 00:11:41,952 మనుష్యులు. 145 00:11:42,577 --> 00:11:44,371 నా మాజీ బాయిఫ్రెండ్ కూడా నార్మల్ మనిషే. 146 00:11:44,579 --> 00:11:47,707 మీరు మీ భార్యలతో అనలేని మాటలు మా దగ్గర అనవచ్చు అనుకుంటారు. 147 00:11:47,874 --> 00:11:49,042 సారీ. 148 00:11:49,251 --> 00:11:51,670 నేను బాధపెట్టాలని అనలేదు. 149 00:11:52,170 --> 00:11:56,091 నిజానికి, నేను న్యూరల్ నెట్వర్క్ సమానత్వాన్ని నమ్ముతాను. 150 00:11:56,967 --> 00:11:59,052 సరే, చాలా థ్యాంక్స్, ఎడ్. 151 00:12:03,515 --> 00:12:05,225 సరే, మిస్టర్ నార్మల్ గురించి చెప్పు. 152 00:12:06,935 --> 00:12:10,647 నేను స్పిరిట్ మిల్ లో పని చేస్తాను. క్లిఫ్ పార్క్ ఎస్టేట్ లో ఉంటున్నాను. 153 00:12:10,856 --> 00:12:15,235 - భార్యా? పిల్లలు? - భార్య, ఉంది. పిల్లలు, లేరు. 154 00:12:16,153 --> 00:12:17,487 ప్రయత్నించాము. 155 00:12:17,654 --> 00:12:20,657 - ప్రయత్నించారా? - టెస్ట్ ట్యూబ్ శిశువు. 156 00:12:20,866 --> 00:12:23,827 - ఆ ప్రక్రియ. - నీ ఎస్టేట్ లో ఇంకెంత కాలం ఉంది? 157 00:12:26,204 --> 00:12:30,709 సముద్ర తీరాలు ఒరుసుకుపోవడం చూస్తుంటే, మహా అయితే ఒక ఏడాది. 158 00:12:32,169 --> 00:12:34,045 ఆ తర్వాత? 159 00:12:34,713 --> 00:12:39,259 నువ్వు ఇంకా మిసెస్ ఎడ్, మీ టర్మ్ అంతమయ్యే వరకూ పని చేసి, రిటైర్ అయ్యి... 160 00:12:39,468 --> 00:12:42,012 ...కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న మరో ఎస్టేట్ కి వెళ్ళి ఉంటారా? 161 00:12:42,179 --> 00:12:43,555 లేదు. 162 00:12:43,722 --> 00:12:45,849 నేను, స్యాలీ అలా చేయము. 163 00:12:49,811 --> 00:12:53,648 మేము యాత్రకి వెళ్తాము. ప్రయాణం. 164 00:12:55,150 --> 00:12:57,110 ప్రయాణమా? 165 00:12:57,986 --> 00:12:59,279 ఎక్కడికి? 166 00:13:00,697 --> 00:13:02,240 ఇక్కడి నుండి బయటకి. 167 00:13:02,407 --> 00:13:04,242 ఎక్కడికో అక్కడికి. 168 00:13:04,784 --> 00:13:08,121 అలలతో నిండిన సముద్రం. ఎల్ డొరాడో. 169 00:13:11,166 --> 00:13:13,668 ప్రమాదకరమైన ప్లాను అనిపిస్తోంది, ఎడ్. 170 00:13:15,128 --> 00:13:16,755 అవును. 171 00:13:17,005 --> 00:13:18,632 అదే. 172 00:13:20,717 --> 00:13:22,511 అదే. 173 00:13:39,402 --> 00:13:41,071 లేదు. 174 00:13:58,672 --> 00:14:00,215 హే. 175 00:14:03,009 --> 00:14:05,095 ఎక్కడికైనా వెళ్తున్నావా? 176 00:14:06,388 --> 00:14:11,434 ఎగిసిపడే అలలతో ప్రయాణించి. వాగు దాటుకొని వెళ్ళి. కొనని దాటుకొని వెళ్ళి. 177 00:14:11,643 --> 00:14:14,437 బలమైన గాలుల మధ్య అలల ప్రవాహంలో ప్రయాణిద్దాము. 178 00:14:15,021 --> 00:14:19,734 ఎడ్, అక్కడ ఏమీ లేదు. 179 00:14:20,986 --> 00:14:23,989 - అయినా, వాళ్ళు నిన్ను వెళ్ళనివ్వరు. - కాని వెళ్ళడానికి ఏదోక పథకం వేస్తే? 180 00:14:24,197 --> 00:14:29,411 ఎడ్, మోసపూరితమైన జీవితాలు బాధతో నిండివుంటాయి. 181 00:14:29,995 --> 00:14:32,330 నీ ఉద్యోగం, మన ఇంటి సంగతి ఏమిటి? 182 00:14:32,956 --> 00:14:34,791 - నా సంగతి ఏమిటి? - నువ్వు నాతో వస్తున్నావు. 183 00:14:35,000 --> 00:14:38,086 దేవుడా. ఇది ఒక మూర్ఖమైన కల్పన, ఎడ్. 184 00:14:39,546 --> 00:14:43,508 సాల్టర్ కుటుంబం తమ ఇల్లు మార్చేశారు, మరింత సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళారు. 185 00:14:43,675 --> 00:14:46,720 అక్కడ చాలా అందంగా ఉందని ఏమీ చెప్పింది. 186 00:14:51,933 --> 00:14:55,520 ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు పాడైపోయాయి. 187 00:14:55,687 --> 00:14:58,064 కాని వాటిని ఈరోజే తెప్పించాను కదా. 188 00:15:00,358 --> 00:15:03,320 నీ ఎక్స్పైరేషన్ తేదీలు రోజురోజుకీ తగ్గుతున్నాయి. 189 00:15:03,486 --> 00:15:05,614 ఏదీ కలకాలం నిలువదు. 190 00:15:06,615 --> 00:15:08,992 కాని తేదీలు మరీ ఇంత తక్కువగా ఉండక్కర్లేదు. 191 00:15:09,159 --> 00:15:11,703 నేను కేవలం నా ఉద్యోగం చేస్తున్నాను, మిస్టర్ మార్రిస్. 192 00:15:16,499 --> 00:15:19,836 - మార్నింగ్, మేడమ్. - గుడ్ మార్నింగ్, సూ. 193 00:15:20,337 --> 00:15:22,339 - సూ? - ఏంటి, మేడమ్? 194 00:15:22,505 --> 00:15:25,550 నీ భర్త ఏదో సమస్యలో ఉన్నాడు అని నీకు అనిపిస్తే... 195 00:15:25,717 --> 00:15:29,137 నాకు భర్త లేడు. మాకు పెళ్ళి చేసుకోడానికి అనుమతి లేదు, అది మీకు తెలుసు కదా. 196 00:15:29,304 --> 00:15:33,933 తన భర్త ఏదో తప్పు చేయబోతున్నాడు అని నీ స్నేహితురాలికి అనిపిస్తే... 197 00:15:34,100 --> 00:15:36,436 ...అంటే, ఏదో నేరం చేయబోతున్నాడు అనిపిస్తే... 198 00:15:36,645 --> 00:15:38,438 ఆమె అతన్ని ఆ పని చేయనివ్వకూడదు. 199 00:15:38,605 --> 00:15:42,442 నేరం నేరమే అవుతుంది కదా. దానికి శిక్ష కూడా పడుతుంది. 200 00:15:43,276 --> 00:15:46,279 - మనందరం తప్పులు చేస్తాము. - వ్యక్తిగతంగా అయితే... 201 00:15:46,863 --> 00:15:49,991 ...మనస్సాక్షి విషయానికి వస్తే మాత్రం, కొన్ని మినహాయింపులు చేయాలని నా అభిప్రాయం. 202 00:15:50,158 --> 00:15:53,453 - తప్పకుండా. - మీ స్నేహితురాలికి తన భర్తపై నమ్మకం ఉందా? 203 00:15:55,664 --> 00:15:57,499 ఉందనే అనుకుంటున్నాను. 204 00:15:57,666 --> 00:16:00,502 - ఉందనే ఆశిస్తున్నాను. - ఆమె గుండెలో, అని నా అర్ధం. 205 00:16:00,669 --> 00:16:02,545 - ఆమె గుండెలో? 206 00:16:02,754 --> 00:16:05,090 నేను మాట్లాడుతున్నది వివిధ భాగాలు కండరాలు గల అవయవం కాదు-- 207 00:16:05,256 --> 00:16:07,676 - నాకు-- నాకు తెలుసు, సూ. - సందేహం ఉండకూడదు అని. 208 00:16:07,884 --> 00:16:10,970 ఈ మధ్య చాలా మంది నార్మల్స్ కి పోర్సిన్ గుండెలు ఉన్నాయి. 209 00:16:12,180 --> 00:16:14,307 ఇది చాలా ఉత్తేజకరమైన సమయం. 210 00:16:15,308 --> 00:16:16,685 మనల్ని నార్మల్ గా చేసేది ఏమిటి? 211 00:16:16,851 --> 00:16:19,270 దాని జవాబు ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. 212 00:16:20,563 --> 00:16:22,899 మమ్మల్ని నార్మల్ గా చేసేది ఏమిటి? 213 00:16:23,692 --> 00:16:25,860 నేను 40 శాతం నార్మల్ ని. 214 00:16:27,362 --> 00:16:29,781 చాలా సారీ. 215 00:16:29,989 --> 00:16:33,368 ఇలాంటివి పట్టించుకోకూడదని నాకు నేర్పించబడింది. మీరు అద్భుతమైన రోజుని ఎంజాయి చేయండి. 216 00:16:33,576 --> 00:16:35,870 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, సూ. 217 00:16:37,706 --> 00:16:41,876 నా కన్నీళ్ళు, ప్రవహించండి 218 00:16:42,043 --> 00:16:47,048 మీ చేరువుల నుండి పారండి 219 00:17:12,907 --> 00:17:15,118 దేని గురించి కలలు కంటున్నావు? 220 00:17:30,759 --> 00:17:32,927 నేను ఎందుకిలా చేశానో తెలియట్లేదు. 221 00:17:33,094 --> 00:17:37,390 - మనం వాటిని పడేయవచ్చు. - వద్దు. అందంగా ఉన్నాయి. 222 00:17:37,557 --> 00:17:39,809 నీకు నిజంగా అలా అనిపిస్తోందా? 223 00:17:39,976 --> 00:17:42,437 అద్భుతంగా ఉన్నాయి, స్యాల్. 224 00:17:51,154 --> 00:17:53,198 నేను వీటిని దాచిపెట్టాను. 225 00:17:58,536 --> 00:18:03,166 - పక్కింటివాళ్ళ సంగతి ఏమి చేద్దాము, ఎడ్? - పక్కింటివాళ్ళ గురించి పట్టించుకోకు. 226 00:18:21,935 --> 00:18:28,024 బహుశా ఎస్టేట్ లో ఇలా చేశారేమో ఆస్తి నష్టాన్ని నివారించడానికి. 227 00:18:43,998 --> 00:18:47,043 - ప్రతీ చోటా ఇలానే ఉంది. - సరే... 228 00:18:47,252 --> 00:18:50,713 సమయం కంటే ముందే బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకొని తీరానికి దూరంగా వెళ్ళవచ్చు. 229 00:18:50,880 --> 00:18:52,090 ఎంతో అందమైన చోటికా? 230 00:18:53,842 --> 00:18:55,552 ఎడ్. 231 00:18:56,052 --> 00:18:57,637 ఎడ్. 232 00:18:58,137 --> 00:19:00,640 నేను భరించలేను, స్యాల్. 233 00:19:03,685 --> 00:19:06,312 అంతా సర్దుకుంటుంది. 234 00:19:07,605 --> 00:19:09,274 నిజంగా? 235 00:19:23,621 --> 00:19:25,498 ఏడు సముద్రాలు. 236 00:19:25,665 --> 00:19:27,542 ఎల్ డొరాడో. 237 00:19:28,710 --> 00:19:30,545 మన ఓడ క్యాప్టెన్. 238 00:19:31,963 --> 00:19:34,257 నన్ను ఇష్మాయిల్ అని పిలవండి. 239 00:19:41,055 --> 00:19:43,349 ఇది కేవలం ఒక మంచి కల మాత్రమే. 240 00:19:43,516 --> 00:19:45,643 అలా ఉండాల్సిన అవసరం లేదు, ఎడ్. 241 00:19:47,979 --> 00:19:50,523 అది కల్పనగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. 242 00:20:04,329 --> 00:20:08,666 ఒక క్యూసీని బ్లాక్ మార్కెట్లో అమ్మితే ఎంత డబ్బు వస్తుందో తెలుసా? 243 00:20:09,208 --> 00:20:12,545 ఆ డబ్బుతో ఒక నార్మల్ కి కొత్త జీవనశైలి వస్తుంది. 244 00:20:12,754 --> 00:20:16,215 ఒక చనిపోయే జిల్ కి కొత్త జీవితం వస్తుంది. 245 00:20:16,382 --> 00:20:18,509 ఒక కొనుగోలుదారుడు ఉన్నాడు. 246 00:20:18,801 --> 00:20:20,261 నీకు పిచ్చి పట్టిందా? 247 00:20:23,932 --> 00:20:25,808 ఇంకా లేదు. 248 00:20:27,268 --> 00:20:29,103 నేను వెళ్ళాలి. 249 00:20:30,271 --> 00:20:34,025 నువ్వు వెళ్ళాలి, కాని వెళ్ళవు. 250 00:20:50,625 --> 00:20:52,961 నీకు చెమటలు పడుతున్నాయా? 251 00:20:58,216 --> 00:21:00,718 ఆస్మాసిస్ కి సహాయపడుతుంది. 252 00:21:29,914 --> 00:21:34,043 నా కన్నీళ్ళు, ప్రవహించండి 253 00:21:34,252 --> 00:21:38,297 నా కన్నీళ్ళు, ప్రవహించండి 254 00:21:38,464 --> 00:21:41,718 మీ చేరువుల నుండి పారండి 255 00:21:41,884 --> 00:21:45,513 మీ చేరువుల నుండి పారండి 256 00:21:46,180 --> 00:21:52,186 శాశ్వతంగా బహిష్కరించబడి నన్ను బాధపడనివ్వండి 257 00:21:52,937 --> 00:21:57,483 రాత్రికి చెందిన నల్ల పక్షి 258 00:21:57,650 --> 00:22:02,864 తన బాధాకరమైన పాట పాడితే 259 00:22:03,072 --> 00:22:06,951 అక్కడ నన్ను ఉండనివ్వండి 260 00:22:07,118 --> 00:22:08,327 అనుమతి ఇవ్వబడింది 261 00:22:08,494 --> 00:22:10,580 ఫోర్లాన్ 262 00:22:23,134 --> 00:22:24,927 త్వరగా రా. 263 00:22:29,348 --> 00:22:30,349 ఎడ్. 264 00:22:39,817 --> 00:22:41,486 ఎవరో చొరబడ్డారు 265 00:22:42,737 --> 00:22:46,032 నేను చాలా మూర్ఖమైన పని చేశాను అనిపిస్తోంది. 266 00:23:10,890 --> 00:23:12,433 క్యాష్ ఇస్తానని ఒప్పుకున్నారు, కదా? 267 00:23:16,479 --> 00:23:18,356 తను మాట్లాడగలదు. 268 00:23:20,483 --> 00:23:22,527 - ఒక సజీవమైన బొమ్మ. - సరే. దీని గురించి మర్చిపోండి. 269 00:23:22,735 --> 00:23:23,820 ఆగు, బొమ్మ. 270 00:23:27,240 --> 00:23:29,617 నీ దగ్గర ఉన్న ఆత్మలను చూపించు. 271 00:23:53,808 --> 00:23:57,311 తొమ్మిది ఉన్నాయి. క్యాష్. 272 00:24:00,982 --> 00:24:04,318 - అతనితో 10 కి ఒప్పందం జరిగింది. - తొమ్మిది. 273 00:24:05,361 --> 00:24:09,073 ఓ, నాకు అర్ధమయ్యింది. 274 00:24:10,241 --> 00:24:12,827 అది నీ కోసం పెట్టుకున్నావా, స్వీట్హార్ట్? 275 00:24:12,994 --> 00:24:16,330 నీలోని నిప్పు ఆరిపోతోంది, అవునా? 276 00:24:18,374 --> 00:24:20,084 నీ దగ్గరున్న ఆ ప్రాణాన్ని చూపించు. 277 00:24:20,293 --> 00:24:22,211 నీ తడాఖా చూపించు, జెస్స్. 278 00:24:23,129 --> 00:24:25,298 ఆమెని వదిలెయ్యి. ఆమె నాది. 279 00:24:49,530 --> 00:24:51,574 - ఏమి జరుగుతోంది? - నాకు తెలీదు. నువ్వే చెప్పు. 280 00:24:51,741 --> 00:24:55,203 ఎడ్, నువ్వు హీరోవి. అవును. 281 00:24:57,371 --> 00:24:59,290 అవును. 282 00:25:03,461 --> 00:25:05,588 నువ్వు చేసింది నాకు తెలుసు, ఎడ్వర్డ్. 283 00:25:06,297 --> 00:25:07,840 తెలుసా? 284 00:25:08,007 --> 00:25:10,593 అలార్మ్ మోగించావు. 285 00:25:11,052 --> 00:25:13,304 - అవును, నేనే మోగించాను. - నువ్వు సరైన పని చేశావు. 286 00:25:13,512 --> 00:25:16,849 ఒక డైరెక్టర్ గా, నీ నిజాయితీని విశ్వసనీయతని గుర్తించి... 287 00:25:17,016 --> 00:25:19,810 ...దానికి బహుమతిగా నీ జీతం పెంచే అధికారం నాకు ఉంది. 288 00:25:19,977 --> 00:25:23,564 - అలా చేయాల్సిన అవసరం లేదు. - తీసుకో, ఎడ్వర్డ్. 289 00:25:24,690 --> 00:25:26,609 దానికి నువ్వు అర్హుడివి. 290 00:25:37,453 --> 00:25:39,205 అది ఎవరు...? 291 00:25:39,372 --> 00:25:44,418 - అది ఎవరు చేశారో తెలిసిందా? - ఎవరో జిల్ చేసిందంట. తప్పించుకొని పారిపోయింది. 292 00:25:44,585 --> 00:25:46,087 నీకు ఏమైనా సమాచారం తెలిసిందా? 293 00:25:46,254 --> 00:25:48,673 - నాకు ఎందుకు తెలుస్తుంది? - కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. 294 00:25:48,839 --> 00:25:52,260 ఎవరో లోపలి వ్యక్తి చేసివుంటాడు అని. బహుశా నీ సహోద్యోగులలో ఒకరేమో. 295 00:25:52,426 --> 00:25:53,719 విచిత్రంగా ఉంది, కదా? 296 00:25:54,804 --> 00:25:58,391 నేను అది నమ్మలేను. ఇక్కడి వాళ్ళంతా విశ్వసనీయులు, సర్. 297 00:25:58,599 --> 00:26:01,310 నాకు తెలుసు, ఎడ్వర్డ్. నాకు తెలుసు. 298 00:26:01,477 --> 00:26:03,604 కాని కొందరు నిరాశ చెందుతారు. 299 00:26:07,900 --> 00:26:09,777 అతను నేరం చేశాడని అనిపించట్లేదు. 300 00:26:10,486 --> 00:26:14,156 నేరం చేయడానికి ఉసికొల్పబడ్డాడు, కాని అది చట్టానికి వ్యతిరేకం కాదు. 301 00:26:14,323 --> 00:26:17,201 అంటే, అతను-- అతను నిజాయితీగల వ్యక్తి. 302 00:26:17,368 --> 00:26:19,203 తన భార్యతో నిజాయితీగా ఉంటాడా? 303 00:26:20,496 --> 00:26:22,498 ఉంటాడనే అనిపిస్తోంది. 304 00:26:22,915 --> 00:26:25,626 ఒక పురుషుడు ఎంత నిజాయితీగా ఉండగలడో అంత. 305 00:26:25,793 --> 00:26:28,212 అయితే, ఆమె అతనికి మద్దతివ్వాలని నేను సలహా ఇస్తాను. 306 00:26:28,379 --> 00:26:30,715 ఎందుకంటే సత్యం మనకి విముక్తి కలిగిస్తుంది. 307 00:26:32,008 --> 00:26:33,301 నేను అంగీకరిస్తాను. 308 00:26:34,093 --> 00:26:37,388 దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు గాక, మేడమ్. మీరు ఒక మంచి స్త్రీ అని నాకు తెలుసు. 309 00:26:38,389 --> 00:26:42,560 నా-- నా పేరు స్యాలీ. 310 00:26:42,727 --> 00:26:44,186 చెప్పినందుకు చాలా సంతోషం. 311 00:26:44,729 --> 00:26:47,356 ఆడవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. 312 00:26:47,565 --> 00:26:49,859 సరిగ్గా చెప్పారు. 313 00:26:50,693 --> 00:26:51,902 స్యాలీ. 314 00:27:09,003 --> 00:27:10,755 మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు సారీ. 315 00:27:12,298 --> 00:27:14,467 ఈ ఇళ్ళు లోపలి నుండి బాగున్నాయి, అవును కదా? 316 00:27:14,633 --> 00:27:17,386 - సరే. మాకు వద్దు, థ్యాంక్ యూ. - మీరు చక్కగా అలంకరించారు. 317 00:27:32,902 --> 00:27:34,278 - బానే ఉన్నావా? - బానే ఉన్నాను. 318 00:27:34,987 --> 00:27:36,906 చాలా సారీ. 319 00:27:37,073 --> 00:27:38,699 ఫర్వాలేదు. 320 00:27:38,866 --> 00:27:40,409 సారీ. 321 00:27:40,576 --> 00:27:43,371 - ఫర్వాలేదు. లోపలికి రా. - థ్యాంక్ యూ. 322 00:27:46,415 --> 00:27:48,167 థ్యాంక్స్. 323 00:27:59,303 --> 00:28:03,015 - ఇది ఒక దుష్ప్రభావం. - ఒక దుష్ప్రభావమా? 324 00:28:03,182 --> 00:28:04,725 నేను మందులు తీసుకుంటున్నాను. 325 00:28:05,434 --> 00:28:07,686 సారీ, వ్యక్తిగత విషయాలు అడగకుండా ఉండాల్సింది. 326 00:28:08,187 --> 00:28:11,232 టెస్ట్ ట్యూబ్ ప్రక్రియ. ఐవీఎఫ్. 327 00:28:12,775 --> 00:28:14,485 అది చాలా నొప్పిగా ఉంటుంది. 328 00:28:14,860 --> 00:28:19,490 - బద్ధకం, వికారం-- - తలనొప్పి, తిమ్మిరి. 329 00:28:21,033 --> 00:28:22,868 మీరు కూడా అనుభవించారా? 330 00:28:25,663 --> 00:28:27,164 చాలా కాలం క్రితం. 331 00:28:28,082 --> 00:28:29,625 సఫలమయ్యిందా? 332 00:28:30,000 --> 00:28:31,752 నీ సంగతి ఏమిటి? 333 00:28:31,919 --> 00:28:34,630 - ఎంతకాలంగా ప్రయత్నిస్తున్నావు? - చాలాకాలంగా. 334 00:28:35,881 --> 00:28:39,343 పైగా భాగస్వాముల్లో ఒకరు మాత్రం దానిని రెండవ వ్యక్తి కంటే ఎక్కివగా కోరుకుంటారు, అవునా? 335 00:28:41,011 --> 00:28:43,222 చాలా క్లిష్టమైన పరిస్థితి. 336 00:28:44,014 --> 00:28:47,685 నేను... మీకు సఫలమవ్వాలని నేను ఆశిస్తున్నాను. 337 00:28:47,852 --> 00:28:49,937 మన మాటలు వినండి. మనం కలిసి కొద్ది క్షణాలే అవుతోంది. 338 00:28:51,313 --> 00:28:56,068 ఇంతకుముందు కటువుగా ఉన్నందుకు సారీ. నిజానికి, మా ఇంటికి చాలామంది సేల్స్ వాళ్ళు వస్తారు. 339 00:28:56,235 --> 00:28:58,821 - నేను ఊహించుకోగలను. - ఒకసారైతే నేను ఇలా కల కన్నాను... 340 00:28:58,988 --> 00:29:03,784 ...ఫాస్రాడ్ సేల్స్ వ్యక్తి మా ఇంటికి వచ్చు, ఎంత వద్దని చెప్పినా వినిపించుకోకుండా విసిగించాడు. 341 00:29:03,993 --> 00:29:06,662 నిజంగా, ఫాస్రాడ్ సేల్స్ వ్యక్తా? 342 00:29:06,829 --> 00:29:09,457 - వింటే నవ్వొస్తోంది. - కాని నాకు అలా అనిపించలేదు. 343 00:29:09,623 --> 00:29:12,251 నేను చాలా భయపడ్డాను. 344 00:29:12,418 --> 00:29:14,128 అతను చాలా... 345 00:29:14,295 --> 00:29:18,466 ...అతని కళ్ళలో ఒకలాంటి చూపు ఉంది, నేను చెప్పేది మీకు అర్ధమయ్యే ఉంటుంది. 346 00:29:20,634 --> 00:29:23,137 మన కోరికలకు వ్యతిరేకమైన కలలే చూస్తాము అంటారు, కదా? 347 00:29:23,762 --> 00:29:26,265 అవును అలానే అంటారు. 348 00:29:27,641 --> 00:29:30,561 కాని, నేను కలల్లో విశ్వసించను. 349 00:29:32,104 --> 00:29:34,565 నేను ప్రతీ క్షణాన్ని పూర్తిగా జీవించడానికి ప్రయత్నిస్తాను. 350 00:29:36,692 --> 00:29:37,902 నువ్వు ఏమి అమ్ముతున్నావు? 351 00:29:38,944 --> 00:29:40,905 జీవిత భీమా. 352 00:30:05,179 --> 00:30:06,931 క్లీఫ్ పార్క్ ఎస్టేట్ 353 00:30:11,727 --> 00:30:14,146 నేను ఇంటికి వచ్చేశాను. స్వీట్హార్ట్? 354 00:30:14,355 --> 00:30:18,275 - ఎంజాయి చేశావా? - డెక్లు దాదాపు పూర్తి చేసేశాను. 355 00:30:18,567 --> 00:30:21,070 - మన ఇంటికి ఒక అతిథి వచ్చింది. - అవునా? 356 00:30:21,487 --> 00:30:25,324 జీవిత భీమా గురించి మాట్లాడ్డానికి వచ్చింది. రెండింతల నష్టపరిహారం. 357 00:30:25,491 --> 00:30:27,159 ఇతను నా భర్త, ఎడ్. 358 00:30:28,410 --> 00:30:29,954 హల్లో, మిస్టర్ మార్రిస్. 359 00:30:32,957 --> 00:30:36,335 రెండింతల నష్టపరిహారం అంటే యాక్సిడెంటువల్ల మరణిస్తే... 360 00:30:36,502 --> 00:30:42,383 ...బెనిఫిష్యరీకి మా ఇన్షూరెన్స్ కంపెనీ నిర్ణీత మొత్తం కంటే రెండింతలు ఎక్కువ కడుతుంది. 361 00:30:44,552 --> 00:30:48,597 నాకు మా ఇద్దరిలో ఎవరి మరణం గురించైనా ఆలోచించడం ఇష్టం లేదు, కాని... 362 00:30:48,764 --> 00:30:52,351 లేదు, చెడు సంఘటనలు జరుగుతాయి, స్యాలీ. 363 00:30:52,518 --> 00:30:56,021 అలా జరిగినప్పుడు, మనం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉండము. 364 00:30:56,188 --> 00:30:59,942 - మనకి అవసరం లేదనిపిస్తోంది. - ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుసు... 365 00:31:00,109 --> 00:31:03,487 ...కాని, దురదృష్టవశాత్తు, నీకు ఏమైనా జరిగితే, అప్పుడు... 366 00:31:03,654 --> 00:31:06,240 ...స్యాలీ బ్రతుకు సాఫీగా సాగుతుంది. 367 00:31:09,410 --> 00:31:11,579 దీని గురించి ఆలోచించి చూస్తే మంచిది. 368 00:31:11,996 --> 00:31:15,124 నేను ఈ పేపర్లు ఇక్కడే వదిలి వెళతాను, సరేనా? 369 00:31:19,753 --> 00:31:21,755 అయ్యో. 370 00:31:24,633 --> 00:31:26,343 నువ్వు బానే...? 371 00:31:27,177 --> 00:31:31,557 - ఎడ్? - మేము మీ భర్తకు ఫోనా చేయాలా? 372 00:31:31,765 --> 00:31:33,767 వద్దు, దయచేసి చేయవద్దు. 373 00:31:33,934 --> 00:31:36,687 అతను పని మీద బయటకు వెళ్ళాడు. అతన్ని కంగారు పెట్టడం ఇష్టం లేదు. 374 00:31:37,646 --> 00:31:39,773 ఆమె తన సామాన్లు తీసుకొని వచ్చింది. ఆ విషయం గమనించావా? 375 00:31:39,982 --> 00:31:43,777 ఆమె ఐ.వీ.ఎఫ్ చేస్తోంది, ఎడ్. అది ఎంత కష్టంగా ఉంటుందో నీక్కూడా తెలుసు. 376 00:31:43,944 --> 00:31:46,864 - ఆమె అబద్ధం చెబుతోంది. - అలా ఎందుకు అంటున్నావు? 377 00:31:47,031 --> 00:31:48,782 ఆమెకి పని మీద బయటకు వెళ్ళిన భర్త లేడు. 378 00:31:48,949 --> 00:31:53,912 ఐ.వీ.ఎఫ్ చేయించుకోడానికి భర్త అవసరం లేదు. ఆమెకి ఒక బిడ్డను కనాలని ఉంది. అది సహజమే. 379 00:31:54,079 --> 00:31:56,915 ఆమె నార్మల్ కాదు. ఆమె ఒక జిల్. 380 00:31:57,082 --> 00:31:58,584 నాకు తెలుసు. 381 00:31:58,751 --> 00:32:02,630 - నీకు తెలుసా? - ఆమెకి మన సహాయం అవసరం. 382 00:32:10,179 --> 00:32:11,764 పాప్! 383 00:32:40,376 --> 00:32:41,543 స్యాలీ. 384 00:32:55,557 --> 00:32:58,936 - నువ్వు ఏమి చేస్తున్నావో తెలుసా? - నా ఆరోగ్యం గురించి చింతిస్తున్నావా, ఎడ్? 385 00:32:59,103 --> 00:33:02,731 - నీకు ఏమి కావాలి? - నాకు ఏమి కావాలా? 386 00:33:02,898 --> 00:33:04,983 నాకు బ్రతకాలని ఉంది. 387 00:33:06,110 --> 00:33:08,362 ఆ కౌబాయిస్ అన్నీ లాక్కున్నారు. 388 00:33:08,570 --> 00:33:12,116 మనం వాళ్ళని వెతికి పట్టుకొని, క్యూసీలను వెనక్కి తీసుకోవాలి. 389 00:33:12,282 --> 00:33:14,618 నేను నీకు సాయం చేయలేను. సారీ. 390 00:33:16,328 --> 00:33:19,289 నువ్వు ఈ పని నా కోసం చేయలేదని చెప్పు. 391 00:33:20,916 --> 00:33:23,335 కాస్తైనా ప్రేమ లేదా? 392 00:33:24,336 --> 00:33:26,714 నేను తప్పు చేశాను. 393 00:33:26,880 --> 00:33:29,383 నేను నీతో కలిసి పని చేయను. 394 00:33:35,097 --> 00:33:37,850 నువ్వు నాతో కలిసి పని చేశావు, ఎడ్. 395 00:33:38,434 --> 00:33:40,644 నీ చెయ్యి ముద్ర. 396 00:33:41,311 --> 00:33:43,313 నీ చెమట. 397 00:33:44,106 --> 00:33:46,275 నీ ఫెరోమోన్లు. 398 00:33:54,032 --> 00:33:56,410 అయితే, ఇప్పుడు ఏంటి? 399 00:33:58,370 --> 00:33:59,997 నువ్వు నన్ను పట్టించవచ్చు. 400 00:34:00,164 --> 00:34:03,125 నువ్వు తప్పు వ్యక్తిని ఎంచుకున్నావు. 401 00:34:03,292 --> 00:34:05,002 నేను ఇలాంటి వ్యక్తిని కాదు. 402 00:34:05,169 --> 00:34:08,255 నేను-- నేను నా ఉద్యోగం చేసుకొని నా జీవితం జీవిస్తాను. 403 00:34:08,422 --> 00:34:12,551 - అంతే. - లేదు, నువ్వు సముద్రాల్లో ప్రయాణిస్తావు. 404 00:34:12,718 --> 00:34:15,763 - ఎవ్వరూ వెళ్ళని చోటికి నువ్వు వెళతావు. - నా ఊహల్లో. 405 00:34:15,971 --> 00:34:18,015 నీ హృదయంలో, ఎడ్. 406 00:34:22,478 --> 00:34:25,147 నువ్వు లేకుండా ఈ పని చేయలేను. 407 00:34:27,107 --> 00:34:30,652 నాకు ఏ జ్యాక్ అవసరం లేదు. 408 00:34:31,779 --> 00:34:33,781 నాకు నువ్వు కావాలి. 409 00:35:18,325 --> 00:35:19,952 నువ్వు ఆలస్యంగా వచ్చావు. 410 00:35:20,118 --> 00:35:21,912 నువ్వు కాల్ చేయలేదు. 411 00:35:22,329 --> 00:35:26,542 - నేను కొందరు స్నేహితులను కలిశాను. - నీకు స్నేహితులు ఎవ్వరూ లేరు. 412 00:35:26,708 --> 00:35:28,752 ఇప్పుడు ఉన్నారు. 413 00:35:31,839 --> 00:35:34,842 మనం ఆ ఇన్షూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనిపిస్తోంది. 414 00:35:35,008 --> 00:35:37,177 ఏ ఇన్షూరెన్స్ పాలసీ? 415 00:35:37,636 --> 00:35:41,890 రెండింతల నష్టపరిహారం. జిల్ అమ్మే పాలసీ. ఆమె నన్ను ఒప్పించింది. 416 00:35:42,057 --> 00:35:45,310 - నువ్వు ఆమెని కలిశావా? - మేము కాఫీ తాగాము. 417 00:35:45,477 --> 00:35:46,603 ఎప్పుడు? 418 00:35:46,770 --> 00:35:51,191 నువ్వు ఆమెతో కటువుగా ప్రవర్తించావు, కాబట్టి నేను ఆమెతో స్నేహపూర్వకంగా మాట్లాడాను. 419 00:35:52,651 --> 00:35:58,824 - ఆమె ఏమంది? - మామూలు విషయాలు. పాలసీ గురించి. తన గురించి. 420 00:35:59,157 --> 00:36:00,993 నాకు ఆమె నచ్చింది. 421 00:36:02,119 --> 00:36:05,789 ఆమె కేవలం ఒక జిల్, ఇన్షూరెన్స్ అమ్ముకునే వ్యక్తి. 422 00:36:06,832 --> 00:36:09,751 ఓ, ఆమె అంతకంటే ఎక్కువే, ఎడ్. 423 00:36:10,085 --> 00:36:11,795 నీకు అలా అనిపించట్లేదా? 424 00:36:14,006 --> 00:36:15,883 జీవిత భీమా పాలసీ పాలసీ దస్తావేజులు 425 00:36:18,886 --> 00:36:22,890 ఓ, ఎడ్, నువ్వు చాలా మంచివాడివి. 426 00:36:25,726 --> 00:36:27,811 నువ్వంటే నాకు చాలా ప్రేమ. 427 00:36:29,104 --> 00:36:31,273 ఆఖరి హెచ్చరిక, మిస్టర్ మార్రిస్. 428 00:36:31,481 --> 00:36:35,068 - దేనికి? - అందరూ తమ స్వంత పంటలు పండించుకుంటే. 429 00:36:35,277 --> 00:36:37,237 మన ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకి ఏమవుతుందో తెలుసా? 430 00:36:37,446 --> 00:36:41,742 మీరు ఒక ద్వీపం కాదు, మిస్టర్ మార్రిస్. ఎవ్వరూ కాదు. అది అసాధ్యం. 431 00:36:41,909 --> 00:36:43,660 అది అక్రమమైన పని కూడా. 432 00:37:00,677 --> 00:37:02,763 మనకి కావాల్సినవన్ని ఉన్నాయి. 433 00:37:06,058 --> 00:37:07,476 బహుశా నేను ఈ పని చేయలేను. 434 00:37:11,188 --> 00:37:13,815 ఏమయ్యింది? విషయం ఏమిటి? 435 00:37:20,197 --> 00:37:22,157 నేను చనిపోతున్నాను. 436 00:37:23,825 --> 00:37:25,702 నావైపు చూడు. 437 00:37:26,328 --> 00:37:28,622 - నేను చనిపోతున్నాను. - అది నాకు అనవసరం. 438 00:37:29,831 --> 00:37:34,211 మనం ఈ దోపిడీ చేస్తే, మనిద్దరికి కొత్త ప్రారంభం లభిస్తుంది, అవునా? 439 00:37:36,630 --> 00:37:39,383 నేను ఇక్కడే ఉన్నాను. నీతో ఉన్నాను. 440 00:37:55,107 --> 00:37:59,945 - దేవుడా. అది ఎక్కడ దొరికింది? - దాన్ని ఎలా వాడాలో తెలుసా? 441 00:38:01,405 --> 00:38:06,076 --ఆత్మ పారిపోయింది మట్టితో ప్రేమలో పడి 442 00:38:06,243 --> 00:38:08,912 ఎంతో తాజాయైన అరుదైన 443 00:38:09,079 --> 00:38:14,251 నాకు పడుకోవాలని ఉంది 444 00:38:22,592 --> 00:38:25,637 నిన్ను గుర్తుపట్టలేదు, అమ్మాయి. 445 00:38:29,266 --> 00:38:31,601 నోవా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. 446 00:38:53,165 --> 00:38:56,626 మిస్టర్ బ్యార్రెట్. ఆ మనిషి. 447 00:38:57,461 --> 00:39:00,338 నీకు ఆత్మల్లో ఆసక్తి ఎందకు ఉంది, సిడ్? 448 00:39:01,423 --> 00:39:04,384 నేను జ్యాక్స్ ఇంకా జిల్స్ తో వ్యాపారం చేస్తాను. 449 00:39:04,551 --> 00:39:07,345 వాడేసినవి కాదు. మొదటి తరంవి. నాణ్యత గలవి. 450 00:39:07,554 --> 00:39:09,598 ఆ పది ప్రాణాలు, సురక్షితంగా ఉన్నాయి. 451 00:39:10,432 --> 00:39:12,267 అవి సరైన వాతావరణంలో ఉన్నాయా? 452 00:39:12,851 --> 00:39:16,646 రోజురోజుకీ ఎండిపోతున్నాయి, కాని బానే ఉంటాయి, వాటిని త్వరగా తీసుకెళ్ళాలంటే వెళ్ళండి. 453 00:39:16,855 --> 00:39:18,398 అవును, త్వరగా తీసుకెళ్ళాలి. 454 00:39:21,610 --> 00:39:24,321 నువ్వు అస్సలు ఆగలేవు, కదా, పిల్లా? 455 00:39:25,906 --> 00:39:28,241 నువ్వు చనిపోతున్నావు, అమ్మాయి. 456 00:39:29,951 --> 00:39:33,371 - హే, ముట్టుకోవద్దు. - ముసలిదానివి అవుతున్నావు. 457 00:39:33,538 --> 00:39:35,665 నేను వాటిని పరీక్షించి చూడాలి. 458 00:39:35,916 --> 00:39:37,334 నువ్వు నీ పరికరాల సంచి తెచ్చావా. 459 00:39:38,126 --> 00:39:41,338 కాని, ఇది శుభ్రమైన స్థలం కాదు. 460 00:39:41,797 --> 00:39:43,340 మా దగ్గర ఒక శుభ్రమైన స్థలం ఉంది. 461 00:39:44,132 --> 00:39:49,054 మేము పిండాల మార్పిడి, గర్భధారణ వంటి పనులు ఇక్కడే చేస్తాము. 462 00:39:49,679 --> 00:39:52,099 ఇంత శుభ్రమైన స్థలం చాలా, సిడ్? 463 00:40:00,774 --> 00:40:03,443 - ఎండిపోతున్న తొలి సూచనలు. - బానే ఉన్నాయి. 464 00:40:03,610 --> 00:40:07,030 - అన్ని బానే ఉన్నాయి. - నేను పరీక్షించి చూడాలి. 465 00:40:07,197 --> 00:40:08,573 ఆమె మీదా? 466 00:40:08,740 --> 00:40:12,911 - సరిగ్గా పని చేస్తే, కొంటాము. - వాడితే, కొనాలి. 467 00:40:13,078 --> 00:40:15,330 నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. 468 00:40:25,090 --> 00:40:27,759 నువ్వు ఈ పని ముందు చేశావు, కదా, సిడ్? 469 00:40:43,024 --> 00:40:46,444 - ముందు పాతదాన్ని బయటకు తియ్యి. - అలా చేయకూడదు. 470 00:40:47,362 --> 00:40:48,780 సిద్ధంగా ఉన్నావా? 471 00:41:10,135 --> 00:41:11,887 బానే ఉన్నావా? 472 00:41:17,767 --> 00:41:19,603 ఎలా ఉంది నీకు? 473 00:41:23,648 --> 00:41:25,192 జిల్? 474 00:41:31,823 --> 00:41:33,074 జల్? 475 00:41:41,583 --> 00:41:45,962 - ఆ క్యూసీ కలుషితం కాలేదని చెప్పు. - ఆమె బానే ఉంది. బానే ఉంది. 476 00:41:46,129 --> 00:41:47,172 నాకు బానే ఉంది. 477 00:41:49,049 --> 00:41:51,009 ఎడ్, క్యూసీలు తీసుకో. 478 00:42:04,314 --> 00:42:09,486 ఊపిరి పీల్చుకునేదాన్ని ఈ పాట పాడేదాన్ని 479 00:42:09,653 --> 00:42:14,699 ఒక శవంతో పోల్చలేము 480 00:42:21,581 --> 00:42:22,791 థ్యాంక్ యూ, ఎడ్వర్డ్. 481 00:42:25,168 --> 00:42:26,378 అందంగా ఉంది, కదా? 482 00:42:27,504 --> 00:42:29,339 మన పద్ధతులన్ని నేర్చుకుంది. 483 00:42:29,506 --> 00:42:32,342 అబద్ధం చెప్పడం, మోసం చేయడం. 484 00:42:33,301 --> 00:42:35,553 ఒక్కదానివే వెళదాము అనుకున్నావా, జిల్లి? 485 00:42:35,720 --> 00:42:37,347 నన్ను తప్పించుకోగలను అనుకున్నావా? 486 00:42:37,931 --> 00:42:39,474 అతని మాటలు వినకు, ఎడ్. 487 00:42:39,641 --> 00:42:42,602 అవి నావి. 488 00:42:43,436 --> 00:42:44,854 అంటే కంపెనీవి, కదా? 489 00:42:45,397 --> 00:42:47,691 - ఇవి ద మిల్ కి చెందినవి. - వాటిని నాకు ఇవ్వు, ఎడ్వర్డ్. 490 00:42:52,862 --> 00:42:54,447 సరే. 491 00:42:55,532 --> 00:42:56,992 సరే. 492 00:42:59,828 --> 00:43:01,579 ఇవ్వు, ఎడ్. 493 00:43:14,759 --> 00:43:16,219 తొమ్మిది. 494 00:43:17,095 --> 00:43:18,847 ఒకటి లేదు. 495 00:43:19,597 --> 00:43:21,474 నిన్ను చంపి తీసుకోవాలా? 496 00:43:21,641 --> 00:43:23,893 ఆగు, ఆగు, ఆగు. ఆగు. ఆగు. 497 00:43:24,102 --> 00:43:25,312 వద్దు. 498 00:43:26,229 --> 00:43:28,940 - నేను తెస్తాను. - వద్దు, ఎడ్, వద్దు. ప్లీజ్. 499 00:43:29,149 --> 00:43:31,151 కానివ్వు, ఎడ్వర్డ్. దాన్ని ఈమె నుండి... 500 00:43:31,359 --> 00:43:33,695 - ...బయటకు తియ్యి. - వద్దు, ఎడ్. ప్లీజ్. 501 00:43:34,237 --> 00:43:36,364 ఈమె ఒక జిల్. 502 00:43:36,573 --> 00:43:39,868 ఈమె ఒక జిల్. ఈమెని వెనక్కి పిలిపించారు. 503 00:43:40,035 --> 00:43:41,953 నువ్వు నేను. 504 00:43:42,162 --> 00:43:43,496 ఇద్దరం కలిసి. 505 00:43:43,663 --> 00:43:45,790 దీనికి పరిహారం చెల్లిస్తావా, ఎడ్వర్డ్? 506 00:43:45,999 --> 00:43:48,335 నువ్వు జైలుకి వెళతావా? 507 00:43:51,212 --> 00:43:53,631 ఏడు సముద్రాలు... 508 00:43:54,758 --> 00:43:58,845 ...ఎల్ డొరాడో, ద ల్యాండ్ ఆ కాకేయిన్. 509 00:43:59,012 --> 00:44:00,096 నువ్వు నేను, ఎడ్. 510 00:44:05,226 --> 00:44:08,438 - సారీ. - కానివ్వు, ఎడ్వర్డ్. కానివ్వు. 511 00:44:16,488 --> 00:44:18,573 నువ్వంటే నాకు ప్రేమ, ఎడ్. 512 00:44:23,745 --> 00:44:26,831 అది నాకు ఇవ్వు. 513 00:44:30,210 --> 00:44:31,836 నువ్వంటే నాకు ప్రేమ. 514 00:44:53,608 --> 00:44:56,194 నువ్వు నన్ను నిరాశపర్చావు, ఎడ్. 515 00:44:57,404 --> 00:45:00,115 స్యాలీని నిరాశపర్చినట్లే నిరాశపర్చావు. 516 00:45:13,211 --> 00:45:15,088 హల్లో, స్యాలీ. 517 00:45:16,172 --> 00:45:18,216 మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. 518 00:45:29,185 --> 00:45:31,146 స్యాలీ? 519 00:45:31,729 --> 00:45:33,481 స్యాలీ? 520 00:45:37,861 --> 00:45:41,448 ప్రియమైన ఎడ్, నార్మల్ గా ఉండడం అంటే ఏమిటి? 521 00:45:41,614 --> 00:45:42,824 నాకు తెలుసుకోవాలని ఉంది. 522 00:45:42,991 --> 00:45:44,576 "రోజుని పిండాలి" అని నువ్వు చెప్పావు. 523 00:45:44,742 --> 00:45:46,661 కాబట్టి అదే చేస్తున్నాను. 524 00:46:06,806 --> 00:46:08,850 పద. 525 00:46:22,614 --> 00:46:24,991 జాన్ డీ 526 00:46:47,555 --> 00:46:49,098 స్యాలీ. 527 00:46:50,808 --> 00:46:52,810 స్యాలీ. హమ్మయ్య. 528 00:46:54,896 --> 00:46:58,525 - చాలా సారీ. - మేము కూడా సారీ, ఎడ్. 529 00:47:00,818 --> 00:47:03,446 నా ఉత్తరం దొరికిందా, ఎడ్? 530 00:47:03,613 --> 00:47:05,156 మా ఇద్దరికి మెరుగైన జీవితాలు జీవించే హక్కు ఉంది. 531 00:47:06,574 --> 00:47:08,117 నేను అలా చేయాలనుకోలేదు... 532 00:47:09,661 --> 00:47:10,995 నేను అలా చేసేవాడిని కాదు... 533 00:50:14,637 --> 00:50:16,639 సబ్ టైటిల్స్ అనువాదకర్త: శ్రీలతా కుంతి