1 00:00:50,801 --> 00:00:53,220 మేయిన్ టైటిల్ 2 00:01:34,553 --> 00:01:37,139 టీ బ్యాగ్స్ అయిపోయాయి. 3 00:01:41,477 --> 00:01:43,103 ఎక్కడైనా ఆలస్యమైందా? 4 00:01:43,270 --> 00:01:45,147 బేసింగ్స్టోక్ లో చిన్న సమస్య ఎదురైంది. 5 00:01:49,860 --> 00:01:50,903 దరిద్రపు బేసింగ్స్టోక్. 6 00:01:51,362 --> 00:01:52,738 అవును. 7 00:01:52,947 --> 00:01:55,783 టికెట్స్ 8 00:01:58,536 --> 00:01:59,537 ఎపిసోడ్ టైటిల్ 9 00:01:59,703 --> 00:02:04,416 ఇది-- ఇది విమానాశ్రయం కాదు. అదే సమస్య. 10 00:02:04,583 --> 00:02:09,088 అవును, అవును. మనం వోకింగ్ లో ఉన్నాము. మనం--? నాకు అసలు అర్ధం-- 11 00:02:09,255 --> 00:02:12,049 సరే, సరిగ్గా చేశావు, కాని మనం వోకింగ్ లో ఉన్నాము. 12 00:02:17,221 --> 00:02:21,600 - ఇక్కడ లిఫ్టు ఉంటే బాగుంటుంది. - అవును, బాగుంటుంది. 13 00:02:25,271 --> 00:02:26,605 హాయి. 14 00:02:26,772 --> 00:02:29,191 లేదు, నేను ఇంటికి రావడం కుదరదు. 15 00:02:29,358 --> 00:02:30,943 రావడం కుదరదు. 16 00:02:31,110 --> 00:02:32,862 ఎందుకంటే నేను పనిలో ఉన్నాను. 17 00:02:36,407 --> 00:02:38,117 నాకు శ్రద్ధ ఉంది. 18 00:02:38,284 --> 00:02:40,828 లేదు, నాకు శ్రద్ధ ఉంది. 19 00:02:40,995 --> 00:02:43,831 దయచేసి అరవకు. 20 00:02:48,752 --> 00:02:52,923 - టాయిలెట్ సరిగ్గా పని చేయట్లేదు. - అవును, సర్. అవును. 21 00:02:59,346 --> 00:03:00,723 ఐదు రోజుల తర్వాత వెనక్కి వచ్చేట్లు టికెట్ ఇవ్వు. 22 00:03:00,890 --> 00:03:03,475 సరే, తప్పకుండా. 23 00:03:03,934 --> 00:03:05,185 ఎక్కడికి? 24 00:03:05,394 --> 00:03:08,022 నీ పరిస్థితి నా పరిస్థితి కంటే ఘోరంగా ఉన్నట్లు ఉంది. 25 00:03:14,445 --> 00:03:16,572 అలా ఎందుకు చూస్తున్నావు? 26 00:03:17,197 --> 00:03:18,282 నీక్కూడా కావాలా? 27 00:03:19,116 --> 00:03:21,702 వద్దు, థ్యాంక్ యూ. మీకు ఏ ప్రాంతానికి టికెట్ కావాలో చెప్పండి చాలు... 28 00:03:21,869 --> 00:03:24,747 ...ఇంకా, ఆ సిగిరెట్టుని ఆర్పమని చెబుతున్నందుకు మన్నించండి. 29 00:03:25,456 --> 00:03:27,791 చెప్పలేదా? అందుకే దీని అవసరం వచ్చింది. 30 00:03:27,958 --> 00:03:31,211 విపరీతంగా వేడెక్కుతున్న నా బుర్రని ఇది చల్లపరుస్తుంది. 31 00:03:31,378 --> 00:03:32,504 మేకాన్ హైట్స్. 32 00:03:34,006 --> 00:03:35,549 మేకాన్ హైట్స్? 33 00:03:35,716 --> 00:03:37,760 అవును. మేకాన్ హైట్స్. 34 00:03:39,595 --> 00:03:40,804 అలాంటి స్టేషన్ లేదు. 35 00:03:41,639 --> 00:03:43,182 కంప్యూటర్ చెక్ చెయ్యి. 36 00:03:43,349 --> 00:03:46,518 - మేకాన్ హైట్స్ కి టికెట్ కావాలి. - నేను ఇక్కడ 20 ఏళ్ళుగా పని చేస్తున్నాను, మేడమ్. 37 00:03:46,936 --> 00:03:50,898 ఎమ్-ఏ-సీ-ఓ-ఎన్ హైట్స్. 38 00:03:51,273 --> 00:03:54,610 మీరు ఏ రైలు ఎక్కుదామని అనుకున్నారు? 39 00:03:54,985 --> 00:03:56,195 మీకు దాని సమయం తెలుసా? 40 00:03:56,362 --> 00:03:58,948 ఐదు-పంథొమ్మిది. లేకపోతే నేను 1:19 లేదా 9:19 కూడా ఎక్కగలను. 41 00:03:59,323 --> 00:04:02,534 సరే, ఇప్పుడు అర్ధమయ్యింది. అది ఆల్టన్ రైలు. తెలిసిందా? 42 00:04:02,743 --> 00:04:04,745 బ్రుక్వుడ్, యాష్ వేల్... 43 00:04:04,954 --> 00:04:07,373 ..ఆల్డర్షాట్, ఫార్న్హామ్ బెంట్లీ, ఆల్టన్ స్టేషన్లలో ఆగుతుంది. 44 00:04:07,539 --> 00:04:11,293 కాని మేకాన్ హైట్స్ లేదు. 45 00:04:45,786 --> 00:04:47,162 తర్వాత మాయమైపోయిందా? 46 00:04:47,329 --> 00:04:50,207 అవును. ఏదో మాయలా అనిపించింది. చప్పుడు లేకుండా మాయమైపోయింది. 47 00:04:50,374 --> 00:04:52,001 సరే. 48 00:04:52,626 --> 00:04:53,669 వద్దు. వద్దు. 49 00:04:53,836 --> 00:04:57,840 - ఇంకా దూరంగానే ఉంటున్నావా? - సిగిరెట్ల గురించి ఇప్పటికీ కలలు వస్తాయి. 50 00:05:00,050 --> 00:05:02,052 మేకాన్ హైట్స్. 51 00:05:02,219 --> 00:05:05,848 అవును. కాని నేను ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది. 52 00:05:06,015 --> 00:05:07,391 ఎడ్, నా మాట విను. 53 00:05:07,558 --> 00:05:10,853 నాకు పిల్లలు లేరని తెలుసు, అయినా అడుగుతున్నాను... 54 00:05:11,020 --> 00:05:12,730 ...నువ్వు బానే ఉన్నావా? 55 00:05:13,105 --> 00:05:14,690 బానే ఉన్నాను. 56 00:05:15,816 --> 00:05:17,568 రేపు కలుద్దాము. 57 00:05:46,263 --> 00:05:47,848 - వాళ్ళు పోలీసులను పిలిచారా? - తను పిలిచింది. 58 00:05:48,265 --> 00:05:49,266 నేను నీకు ఫోన్ చేసి చెప్పానుగా. 59 00:05:49,433 --> 00:05:52,561 తను పోలీసులను పిలుస్తుందని అనుకోలేదు. 60 00:05:59,193 --> 00:06:01,361 - తను మీపై కేసు వేయట్లేదు. - సరే, మంచిది. 61 00:06:01,570 --> 00:06:02,946 అది-- అది మంచిది. 62 00:06:03,113 --> 00:06:06,575 కాని తను చాలా బాధగా ఉంది. తను కేవలం ఒక 15 ఏళ్ళ పిల్ల, అర్ధమయ్యిందా? 63 00:06:06,784 --> 00:06:09,328 - మేము చాలా చింతిస్తున్నాము. - అంతా తన వల్లే. 64 00:06:09,495 --> 00:06:11,580 - కదా, సామ్? - తను నాపై నవ్వింది. 65 00:06:11,747 --> 00:06:14,500 - ఇది ఇలాగే కొనసాగితే మాత్రం... - లేదు, కొనసాగదు. లేదు. 66 00:06:14,666 --> 00:06:17,961 - మేము కొనసాగనివ్వను. -...మేము అతని తప్పులను క్షమించలేము. 67 00:06:21,340 --> 00:06:23,550 నాకు కోపం వచ్చింది. 68 00:06:24,676 --> 00:06:29,139 - అవును నేను అర్ధం చేసుకోగలను-- - నేను ప్రజలను భయపెట్టకూడదు. 69 00:06:29,807 --> 00:06:32,768 - నేను ప్రజలను భయపెట్టకూడదు. - సామ్, నేను నీతు మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్నాను. 70 00:06:32,935 --> 00:06:34,770 నేను ప్రజలను భయపెట్టకూడదు, కాని భయపెడతాను. 71 00:06:36,146 --> 00:06:38,941 కాని, నేను ప్రజలను భయపెడతాను. 72 00:06:43,445 --> 00:06:46,240 ఆగు, నువ్వు నా సంగీత సేకరణని ముట్టుకున్నావా...? 73 00:06:50,744 --> 00:06:53,205 లూయీ బెల్సన్ ని నిశ్సబ్దంగా వినండి. 74 00:06:55,082 --> 00:06:57,251 నీ చిన్నప్పుడు మనం ఈ సంగీతం తరచుగా వినేవాళ్ళము. 75 00:06:57,417 --> 00:06:59,920 తర్వాతి ఐదు క్షణాల్లో ఎన్ని నోట్లు వాయిస్తాడో లెక్కపెట్టు. 76 00:07:00,087 --> 00:07:02,548 ఆ సాక్స్ సంగీతం విను. లెక్కపెట్టు. లెక్కపెట్టు. 77 00:07:02,714 --> 00:07:04,174 పద, త్వరగా లెక్కపెట్టు. లెక్కపెట్టు. 78 00:07:04,383 --> 00:07:07,136 - లెక్కపెట్టు. కానివ్వు. లెక్కపెట్టు. - లెక్కపెట్టలేవు. 79 00:07:07,344 --> 00:07:10,389 ఎంత ప్రయత్నించనా లెక్కపెట్టలేవు, ఎందుకంటే లెక్కపెట్టడం అసాధ్యం. 80 00:07:10,597 --> 00:07:13,225 లెక్కపెట్టలేనన్ని నోట్లు ఉంటాయి. 81 00:07:18,772 --> 00:07:21,358 అసలు.... నీకు కోపం తెప్పించేలా... 82 00:07:21,525 --> 00:07:23,402 ...ఏమైనా అన్నదా లేదా చేసిందా? 83 00:07:23,569 --> 00:07:25,696 నేను మర్చిపోయాను, కాబట్టి.... 84 00:07:27,573 --> 00:07:29,241 ఓ, సరే.... 85 00:07:38,208 --> 00:07:40,085 సరే, కన్నా. 86 00:07:41,211 --> 00:07:43,046 సరే మరి. 87 00:07:58,020 --> 00:07:59,605 లోపలికి రండి. 88 00:08:00,772 --> 00:08:04,985 ప్లీజ్, మేడమ్. ప్లీజ్ కూర్చోండి. 89 00:08:05,152 --> 00:08:08,322 - దయచేసి కూర్చోండి. - నాకు ఒక టికెట్ కావాలి అంతే. 90 00:08:08,488 --> 00:08:11,200 కాని నన్ను స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నట్లు ఎందుకు అనిపిస్తోంది? 91 00:08:11,366 --> 00:08:14,119 - మీరు ఆల్టన్ రైలులో ప్రయాణిస్తారని ఎడ్ చెప్పాడు. - అవును నిజమే. 92 00:08:14,286 --> 00:08:16,246 ఆల్టన్ కి వెళ్ళే 9:19 రైలు. 93 00:08:16,413 --> 00:08:20,083 9:19, లేదా 13:19 లేదా 17:19 రైలు. 94 00:08:20,250 --> 00:08:21,960 కాని ఎక్కువగా 9:19 రైలులో వెళ్తాను. 95 00:08:22,669 --> 00:08:25,589 ఈ ప్రయాణం ఎంతసేపు ఉంటుంది? చేరుకోడానికి ఎంతసేపు పడుతుంది? 96 00:08:26,173 --> 00:08:28,592 ఖచ్చితంగా చెబితే ఇరవై-ఎనిమిది నిమిషాలు. 97 00:08:28,759 --> 00:08:31,595 అంటే అంత సమయం పట్టాలి, కాని ఈ మధ్య దానికంటే ఎక్కువ సమయమే పడుతుంది. 98 00:08:31,762 --> 00:08:35,057 మేకాన్ హైట్స్ ఎలా ఉంటుంది? అక్కడ ఎంతమంది జీవిస్తారు? 99 00:08:36,600 --> 00:08:38,518 ఐదు వేల మంది. నాకు తెలీదు. 100 00:08:38,685 --> 00:08:40,520 అక్కడ ఏదైనా పెద్ద కంపెనీ ఉందా? 101 00:08:40,687 --> 00:08:43,357 బ్రూవరీ ఉందా? విద్యుత్ స్టేషన్? కాల్ సెంటర్ ఉందా? 102 00:08:43,523 --> 00:08:46,109 లేదు. అలాంటివి ఏవీ లేదు. 103 00:08:46,276 --> 00:08:49,112 నేను బ్రాడ్షా ఇన్షూరెన్స్ లో అకౌంటెంట్ గా పని చేస్తాను. 104 00:08:50,489 --> 00:08:52,032 అసలు సమస్య ఏంటి? 105 00:08:54,243 --> 00:08:56,286 ఇది మా ప్రాంతీయ నెట్వర్క్ మ్యాపు. 106 00:08:56,453 --> 00:09:00,666 నేను మీకు ఫార్న్హామ్ ఇంకా బెంట్లీ స్టేషన్లను చూపిస్తాను. 107 00:09:00,832 --> 00:09:03,835 వాటికి మధ్య మరో స్టేషన్ లేదు అని మీకు కనిపిస్తోందా? 108 00:09:13,053 --> 00:09:15,430 వామ్మో, అలా ఎలా మాయమైంది? 109 00:09:23,438 --> 00:09:26,817 డెస్టినేషన్ ఆల్టన్ ఎక్స్పెక్టెడ్ 0919 110 00:09:37,327 --> 00:09:38,453 మీరు డ్యూటీలో ఉన్నారా? 111 00:09:40,706 --> 00:09:43,417 లేదు. లేదు. 112 00:09:50,882 --> 00:09:53,802 సామ్, మీ అమ్మని గాయపర్చకు! 113 00:09:53,969 --> 00:09:55,762 - ఇంక ఆపు! - జాగ్రత్త తనని గాయపర్చకు. 114 00:09:55,971 --> 00:09:59,182 సామ్, ప్లీజ్. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్, సామ్. 115 00:09:59,975 --> 00:10:03,812 నువ్వు అదుపు తప్పినప్పుడు, అది కోపంలా అనిపిస్తుందా? 116 00:10:05,647 --> 00:10:07,774 అవును. అది... 117 00:10:08,734 --> 00:10:11,862 మామూలుగా వచ్చే కోపానికి దానికి తేడా కనిపిస్తుందా? 118 00:10:13,071 --> 00:10:14,156 అవును. 119 00:10:14,323 --> 00:10:16,325 ఎలాంటి తేడా కనిపిస్తుంది? 120 00:10:16,992 --> 00:10:19,202 బాధగా ఉంటుందా? 121 00:10:21,204 --> 00:10:22,664 అవును. 122 00:10:23,248 --> 00:10:26,710 - సరే. అది ఆసక్తికరం, కదా? - అవునా? 123 00:10:30,464 --> 00:10:32,007 నాన్నా? 124 00:10:35,093 --> 00:10:36,386 సా-- సారీ. 125 00:10:37,346 --> 00:10:38,555 సారీ. సారీ. 126 00:10:38,764 --> 00:10:41,391 సరే. ప్రస్తుతానికి ఇక్కడితో ఆపుదాము, సరేనా? 127 00:10:41,558 --> 00:10:42,934 ఎడ్, మేరీ, మీతో ఒంటరిగా మాట్లాడవచ్చా? 128 00:10:43,101 --> 00:10:44,478 దేని గురించి? 129 00:10:44,644 --> 00:10:46,980 కొన్ని దస్తావేజులపై సంతకాలు కావాలి. 130 00:10:47,147 --> 00:10:49,316 దస్తావేజులను లైనులో పెట్టండి. 131 00:10:49,691 --> 00:10:51,610 లెక్కపెట్టలేనన్ని సంగీత నోట్లు. 132 00:10:53,570 --> 00:10:54,613 సరే. 133 00:10:54,780 --> 00:10:59,076 పిచ్చిపట్టిన ఇతర పిల్లలతో పాటు బయట వేచి ఉంటాను. 134 00:11:06,041 --> 00:11:07,584 నాకు సామ్ గురించి చింతగా ఉంది. 135 00:11:08,794 --> 00:11:12,047 మతి భ్రమించిన ప్రవర్తన మరింత తరచుగా జరుగుతోంది... 136 00:11:12,214 --> 00:11:14,466 ...హింసాత్మక ప్రవర్తన పెరుగుతోంది... 137 00:11:14,674 --> 00:11:18,345 ...కాబట్టి అతని పరిస్థితి రోజురోజుకీ విశమిస్తున్నట్లు ఉంది. 138 00:11:18,804 --> 00:11:22,182 భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను చర్చించడం ప్రారంభించాలి. 139 00:11:33,235 --> 00:11:34,861 తనని చూసి భయపడుతున్నావా? 140 00:11:37,114 --> 00:11:39,699 లేదు, తన కోసం భయంగా ఉంది. 141 00:11:39,866 --> 00:11:42,160 తనని చూస్తే నీకు భయమేస్తుందా? 142 00:11:46,790 --> 00:11:48,834 కొన్నిసార్లు, అవును. 143 00:11:49,000 --> 00:11:50,043 తనని చూస్తే నీకు భయమేస్తుందా? 144 00:11:50,419 --> 00:11:52,170 తను నా కొడుకు. 145 00:11:52,754 --> 00:11:54,714 నా కొడుకుని చూస్తే నాకు ఎలాంటి భయం లేదు. 146 00:11:58,385 --> 00:12:00,303 నీకు గుర్తుందా...? 147 00:12:00,929 --> 00:12:02,973 మనం కలిసిన మొదటిసారి నీకు గుర్తుందా? 148 00:12:03,140 --> 00:12:06,476 మనల్ని పరిచయం చేసింది-- అయ్యో, ఆమె పేరు గుర్తులేదు. 149 00:12:06,643 --> 00:12:08,186 ఒక రైలులో. 150 00:12:08,353 --> 00:12:10,272 ఆమె ఇలా అంది, "ఇతను ఎడ్. ఇతను రైళ్ళలో పని చేస్తాడు. 151 00:12:10,439 --> 00:12:12,315 ఈమె మేరి, ఈమె రైళ్ళలో ప్రయాణిస్తుంది." 152 00:12:12,482 --> 00:12:15,110 అది అంత నవ్వు పుట్టించేదిగా లేకపోయినా తను మాత్రం పగలబడి నవ్వంది. 153 00:12:15,277 --> 00:12:19,823 అవును. నాతో కాఫీ తాగడానికి రమ్మని నిన్ను ఒప్పించడానికి దాదాపు రెండు పట్టింది. 154 00:12:21,074 --> 00:12:22,492 కాని నాకు అప్పటికే తెలుసు. 155 00:12:22,659 --> 00:12:26,496 నేను నీతో కలిసి ఒక బంగారు భవిష్యత్తును నిర్మించుకోగలని నాకు అప్పిటికే తెలుసు-- 156 00:12:26,663 --> 00:12:28,999 తనని చూస్తే నువ్వు గుర్తొస్తావు. 157 00:12:29,666 --> 00:12:31,293 అందుకే తనతో మాట్లాడగలను. 158 00:12:32,919 --> 00:12:34,963 నిజమైన నువ్వు. 159 00:12:35,172 --> 00:12:39,384 ఇలా ముఖంపై నకిలి నవ్వు అంటించుకునే నువ్వు కాదు. 160 00:12:43,221 --> 00:12:44,973 సరే. 161 00:12:47,392 --> 00:12:49,311 నిజం చెప్పాలంటే... 162 00:12:50,353 --> 00:12:54,608 ...తనని చూసినప్పుడు కంటే, ఇలా నకిలి నవ్వు అంటించుకున్న నిన్ను చూస్తే ఎక్కువ భయంగా ఉంటుంది. 163 00:12:58,487 --> 00:13:00,864 సరే. మంచిది. 164 00:13:14,085 --> 00:13:16,880 ఈ రైలు ఇప్పుడు ప్లాట్ఫార్మ్ నంబరు 6 పైకి వస్తోంది. 165 00:13:17,047 --> 00:13:21,635 9:19 రైలు ఆల్టన్ కి వెళ్ళే దారిలో అన్ని స్టేషన్లలో ఆగుతుంది. 166 00:14:04,052 --> 00:14:07,347 లేదు, నేను టికెట్లు చెక్ చేయట్లేదు. లేదు 167 00:14:11,476 --> 00:14:13,520 కేవలం ఒక ప్రయాణికుడిని. 168 00:14:14,354 --> 00:14:17,399 అవును, సర్, ఇక్కడ మేమంతా ప్రయాణికులమే. 169 00:15:18,084 --> 00:15:20,295 ఆగండి. ఆగండి. 170 00:15:20,754 --> 00:15:22,589 మీరు-- మీరు ఇలా-- 171 00:16:45,672 --> 00:16:48,425 ఆగు! ఆగు. 172 00:16:52,595 --> 00:16:54,723 నా కోసం ఆగు! 173 00:17:06,484 --> 00:17:10,447 మేము టేబుల్ సర్వీస్ ఇస్తాము. కూర్చోండి. మీకు ఏమీ కావాలి? 174 00:17:10,613 --> 00:17:13,324 - టీ. - ఎలా తీసుకుంటారు? 175 00:17:13,491 --> 00:17:15,618 పాలు-- పాలు, ఒక క్యూబు చెక్కర. 176 00:17:16,327 --> 00:17:18,329 వెంటనే తెస్తాను. 177 00:17:35,180 --> 00:17:37,098 పాలు, ఇంకా ఒక క్యూబు చెక్కరతో. 178 00:17:37,265 --> 00:17:39,726 నేను చేసిన యాపిల్ కేకు ముక్క కూడా తెచ్చాను. 179 00:17:39,893 --> 00:17:41,978 డబ్బు కట్టక్కర్లేదు. మీరు ఆకలిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. 180 00:17:42,145 --> 00:17:44,856 సరే, మరి. థ్యాంక్స్. 181 00:17:45,190 --> 00:17:47,025 చాలా థ్యాంక్స్. నిజంగా. 182 00:17:52,280 --> 00:17:55,200 నేను చేసినవి తినడానికి ఇంతగా భయపడేవాళ్ళను ముందెప్పుడూ చూడలేదు. 183 00:18:03,333 --> 00:18:05,210 నిజం చెప్పాలంటే, ఇది.... 184 00:18:05,376 --> 00:18:06,419 అద్భుతంగా ఉంది. 185 00:18:06,586 --> 00:18:08,671 - అద్భుతంగానా. - అవును. 186 00:18:08,880 --> 00:18:10,215 నాకు అద్భుతమైనవి ఇష్టం. 187 00:18:10,423 --> 00:18:12,884 చాలా రుచిగా ఉంది. 188 00:18:13,051 --> 00:18:14,844 ఇక్కడికి కొత్తగా వచ్చారా? 189 00:18:15,011 --> 00:18:16,638 అవును. 190 00:18:16,888 --> 00:18:20,600 సరే, నేను ఈ పట్టణం తరఫున మాట్లాడుతున్నాను అనుకోకండి, కాని... 191 00:18:20,767 --> 00:18:24,229 ...ఇక్కడ మీకు చాలా విషయాలు అద్భుతంగా కనిపిస్తాయి. 192 00:18:51,297 --> 00:18:53,925 సారీ, తను నాతో పెళ్ళికి ఒప్పుకుంది. కాబట్టి నాకు చాలా-- 193 00:18:54,092 --> 00:18:55,176 అద్భుతంగా ఉంది. 194 00:18:56,427 --> 00:18:58,221 సరే, కంగ్రాచ్యులేషన్స్. 195 00:18:58,388 --> 00:19:00,807 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 196 00:19:01,015 --> 00:19:03,351 - ఒప్పుకుంది! - మేము పెళ్ళి చేసుకోబోతున్నాము! 197 00:19:11,067 --> 00:19:12,443 హల్లో. 198 00:19:43,641 --> 00:19:47,103 ఒంటరిగా కూర్చొని పిల్లల ఆటలను గమనిస్తున్న వ్యక్తి. 199 00:19:48,146 --> 00:19:50,398 మరో ప్రపంచంలో అయితే నేను భయపడేదాన్ని. 200 00:19:53,151 --> 00:19:54,736 ఆ అబ్బాయిని చూస్తే నా కొడుకు గుర్తొస్తున్నాడు. 201 00:19:55,737 --> 00:19:56,821 ఏ అబ్బాయి? 202 00:19:56,988 --> 00:19:59,198 అక్కడ వెనక నిలబడ్డ అబ్బాయి. 203 00:20:00,825 --> 00:20:03,161 ఆటలో ఆసక్తి లేనట్లు ఉన్నాడు, కదా? 204 00:20:06,956 --> 00:20:08,833 నాకు ఏదైనా వ్యాధి ఉందా? 205 00:20:09,918 --> 00:20:12,837 నువ్వు నా వ్యాధి సూచనల్లో ఒకదానివా? 206 00:20:13,004 --> 00:20:15,089 నీకు తెలుసా, ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తి... 207 00:20:15,256 --> 00:20:17,300 ...ఇచ్చే ప్రతికూల ప్రతిస్పందన అది. 208 00:20:17,467 --> 00:20:20,428 ఇక్కడ నీకు లభించగల అవకాశాల గురించి ఆలోచించొచ్చు కదా? 209 00:20:22,096 --> 00:20:23,890 అసలు ఈ ప్రదేశం ఏమిటి? 210 00:20:24,057 --> 00:20:26,225 మేకాన్ హైట్స్. 211 00:20:26,434 --> 00:20:30,855 కాని మేకాన్ హైట్స్, ఇక్కడ ఉండడానికి వీల్లేదు. 212 00:20:31,314 --> 00:20:34,150 ఆ యాపిల్ కేకు కాల్పనికంగా అనిపించిందా? 213 00:20:34,317 --> 00:20:36,653 ఆ పిల్లలు కాల్పనికంగా ఉన్నారా? 214 00:20:36,819 --> 00:20:40,865 ఈ ప్రదేశం ఉంది, ఎడ్. ఈ నిజాన్ని నువ్వు నమ్మడానికి ఇష్టపడట్లేదు. 215 00:20:41,032 --> 00:20:45,536 ఎందుకంటే అది నీకు సంతోషం కలిగిస్తుంది, కాని నీకు సంతోషంగా ఉండే అలవాటు లేదు. 216 00:20:47,622 --> 00:20:50,291 బహుశా నిజమైన ప్రపంచం ఇలాగే ఉండాలి. 217 00:20:50,750 --> 00:20:55,129 సిగిరెట్టు? బహుశా, నీకు కావాల్సింది ఇదే ప్రపంచమేమో. 218 00:20:59,676 --> 00:21:02,595 మీ ఇంటికి వెళ్ళే రైలు 7:20 కి బయలుదేరుతుంది. 219 00:21:03,346 --> 00:21:06,599 అప్పటి దాకా మేకాన్ హైట్స్ లో సంతోషంగా ఉండు. 220 00:21:40,383 --> 00:21:42,176 అమ్మాయికి సహాయం చెయ్యి. 221 00:22:34,312 --> 00:22:35,855 హాయి. 222 00:22:36,022 --> 00:22:38,232 - హాయి. - రోజు బాగా గడిచిందా? 223 00:22:38,399 --> 00:22:40,526 విచిత్రంగా గడిచింది. 224 00:22:41,903 --> 00:22:43,905 వెళ్ళి విశ్రాంతి తీసుకో. 225 00:22:44,113 --> 00:22:45,990 రాత్రి కోసం చికెన్ పై చేస్తున్నాను. 226 00:22:46,157 --> 00:22:48,701 - ఆనందంగా ఆస్వాదించడానికి. - ఓ, తప్పకుండా. 227 00:23:26,656 --> 00:23:28,533 మనం ఈ గదిని పేయింటు చేసిన సమయం గుర్తుందా? 228 00:23:29,784 --> 00:23:31,744 మనకి కొడుకు పుడతాడని నాకు తెలుసు. 229 00:23:32,870 --> 00:23:35,581 కొన్ని అనుకున్నట్లు జరుగుతాయి. 230 00:23:36,624 --> 00:23:38,292 కొన్ని జరగవు. 231 00:23:42,713 --> 00:23:44,632 నువ్వంటే నాకు చాలా ప్రేమ. 232 00:23:47,802 --> 00:23:49,387 కాని... 233 00:23:49,554 --> 00:23:52,932 ...బిడ్డ కోసం మనం ప్రయత్నించడం ఎంతో ఆనందాన్ని తెచ్చిందని నాకు గుర్తుంది. 234 00:24:13,911 --> 00:24:15,538 థ్యాంక్ యూ. 235 00:24:15,705 --> 00:24:17,582 అందరికి థ్యాంక్ యూ. 236 00:25:00,166 --> 00:25:01,209 మార్టీన్ జెన్కిన్స్ 237 00:25:01,375 --> 00:25:04,212 మేకాన్ హైట్స్ అనే కొత్త పట్టణపు ప్లాన్లు ప్రాంతీయ ప్రభుత్వానికి సబ్మిట్ చేయబడ్డాయి. 238 00:25:04,378 --> 00:25:06,923 అవును. మీ రిపోర్టర్లలో ఒకరిని కలవడానికి ప్రయత్నిస్తున్నాను. 239 00:25:07,089 --> 00:25:10,885 కాని తనని కాంటాక్ట్ చేయడానికి ఈ-మేయిల్ ఇవ్వబడలేదు. 240 00:25:11,510 --> 00:25:15,723 అది నాకు తెలియదు. ఆమె పేరు మార్టీన్ జెన్కిన్స్. 241 00:25:17,141 --> 00:25:19,852 నాకు ఆ ప్రాంతం గురించి సాధ్యమైనన్ని వివరాలు కావాలి. 242 00:25:20,019 --> 00:25:21,020 ఎందుకు? 243 00:25:23,147 --> 00:25:25,775 ఒక ప్రాజెక్ట్ కోసం అవసరం. 244 00:25:26,025 --> 00:25:27,985 నేను ఒక జర్నలిస్టుని అన్న సంగతి గుర్తుంది కదా? 245 00:25:28,194 --> 00:25:30,446 మా జాతి అంతరించిపోతోంది, కాని మేము సాధారణంగా... 246 00:25:30,613 --> 00:25:35,451 ...కాకమ్మ కథలు వినప్పుపుడు వెంటనే పసిగట్టగలుగుతాము. 247 00:25:36,994 --> 00:25:39,664 అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళావు? 248 00:25:42,625 --> 00:25:44,460 - ఒక్కసారి. - ఓ, శభాష్. 249 00:25:44,835 --> 00:25:48,339 సాధారణంగా ప్రజలు ఎనిమిది లేక తొమ్మిది సార్లు వెళ్ళిన తర్వాత మాత్రమే నా గురించి వెతుకుతారు. 250 00:25:48,547 --> 00:25:50,174 అయితే, ఇలా వచ్చిన వ్యక్తిని నేను మొదటివాడిని కాదు. 251 00:26:00,017 --> 00:26:02,061 నా అనుభవంలో... 252 00:26:02,228 --> 00:26:05,022 ...నేను ఎంత తక్కువగా వివరిస్తే... 253 00:26:05,189 --> 00:26:07,858 ...అంత మంచిది. 254 00:26:15,741 --> 00:26:18,244 అంటే ఇది ఇప్పటికీ ఉనికిలో లేని పట్టణమే. 255 00:26:18,452 --> 00:26:22,123 దాదాపు ఉనికిలోకి వచ్చిన పట్టణం. 256 00:26:22,373 --> 00:26:25,251 దానికి దీనికి చాలా తేడా ఉందని నా అభిప్రాయం. 257 00:26:26,168 --> 00:26:28,921 దాని గురించి ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. 258 00:26:29,088 --> 00:26:33,217 కాని విశాదకరంగా, దాని గురించి ఏ వార్తాపత్రికలోనూ పెద్ద వార్త అచ్చు వేయించలేకపోయాను. 259 00:26:33,634 --> 00:26:35,344 మిమ్మల్ని ఎవరు ఆపారు? 260 00:26:35,553 --> 00:26:37,096 ఓ, లేదు, ఎలాంటి కుట్ర జరగలేదు. 261 00:26:37,263 --> 00:26:39,307 అది ఆసక్తికరమైన వార్త అని ఎవ్వరికి అనిపించలేదు అంతే. 262 00:26:39,849 --> 00:26:42,226 ఊహాత్మక వ్యక్తి పెద్ద కలలు కంటాడు. 263 00:26:42,393 --> 00:26:43,686 ఆ కలలు పటాపంచలు అవుతాయి. 264 00:26:43,853 --> 00:26:45,771 అతను మరణిస్తాడు. 265 00:26:46,022 --> 00:26:47,023 అతను మరణించాడా? 266 00:26:47,231 --> 00:26:52,236 వేలంపాట గెలిచాడు, కాని కొన్ని ఆర్థిక లొసుగులు కనిపించాయి. 267 00:26:52,403 --> 00:26:54,447 అవినీతి వల్ల కాదు, అసమర్ధత వల్ల. 268 00:26:57,533 --> 00:27:00,119 నేను వెళ్ళడానికి ప్రయత్నించాను, తెలుసా. 269 00:27:00,286 --> 00:27:02,121 చాలాసార్లు ప్రయత్నించాను. 270 00:27:02,705 --> 00:27:05,249 ఒక ఆదర్శ పట్టణం... 271 00:27:05,791 --> 00:27:08,419 ...ఎప్పటికీ అలానే నిలిచిపోయే పట్టణం... 272 00:27:09,295 --> 00:27:13,758 ...వాస్తవంతో పని లేకుండా వేరుగా ఉండగలిగే పట్టణం. 273 00:27:16,344 --> 00:27:18,387 కాని నాకోసం తలుపు తెరుచుకోలేదు. 274 00:27:20,222 --> 00:27:21,265 ఈమె ఎవరు? 275 00:27:22,558 --> 00:27:24,852 అతని కూతురు, లిండా. 276 00:27:25,019 --> 00:27:27,355 ఆమెకి అతని శవం అడవిలో దొరికింది. 277 00:27:27,521 --> 00:27:29,357 మత్తుమందు ఎక్కువై పోయాడు. 278 00:27:29,523 --> 00:27:32,610 అతని నుండి ఆ ప్రాజెక్టు లాక్కొని తర్వాతి పోటీదారుడికి ఇచ్చాక... 279 00:27:32,777 --> 00:27:35,529 ...రెండు వారాలకు చనిపోయాడు. 280 00:27:46,832 --> 00:27:48,709 నువ్వు నాకు ఏమీ చెప్పవు కదా? 281 00:27:48,876 --> 00:27:49,877 ఏంటీ? 282 00:27:50,086 --> 00:27:51,087 చనిపోయిన వాస్తుశిల్పి కూతురు కనిపించట్లేదు 283 00:27:51,253 --> 00:27:53,714 పని రద్దీ ప్రారంభమయ్యే ముందు వెళ్ళిపోయావు, ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు. 284 00:27:53,881 --> 00:27:55,674 ఎక్కడికి వెళ్ళావు? 285 00:27:56,675 --> 00:27:59,845 - నువ్వు చేయకూడదనిది ఏమైనా చేస్తున్నావా? - లేదు. 286 00:28:00,096 --> 00:28:01,889 ఒకసారి ఒక కుటుంబం విరిగితే... 287 00:28:02,056 --> 00:28:03,516 ...అది మళ్ళీ అతుక్కోదు. 288 00:28:03,682 --> 00:28:05,851 ముగ్గురు తల్లుల ద్వారా కలిగిన ముగ్గురు పిల్లలు, గుర్తులేదా? 289 00:28:06,018 --> 00:28:07,311 ముగ్గురు పిల్లలా? 290 00:28:07,478 --> 00:28:11,148 అవును. నాకు ఎంతమంది పిల్లలో నాకు తెలుసు. 291 00:28:13,943 --> 00:28:15,361 నేను వెళ్ళాలి. 292 00:28:15,528 --> 00:28:18,406 - వార్షిక సెలవుగా తీసుకుంటాను. - ఏంటీ? 293 00:28:18,572 --> 00:28:22,201 ఎడ్! ఎడ్, ఇలా అఖరి నిమిషంలో చెబితే, నేను వేరే వాళ్ళను ఏర్పాటు చేసుకోలేను. 294 00:28:22,368 --> 00:28:24,662 ఇలా అకస్మాత్తుగా వెళ్ళలేవు. 295 00:28:27,456 --> 00:28:29,083 ఎడ్! ఎడ్! 296 00:28:29,959 --> 00:28:31,627 రైలు ఆపండి! 297 00:28:31,836 --> 00:28:33,295 ఎడ్. 298 00:28:42,054 --> 00:28:44,557 ఇది ఒక వ్యసనంగా మారుతుంది, కదా? 299 00:28:46,058 --> 00:28:47,435 ఏంటీ? 300 00:28:47,893 --> 00:28:50,187 ప్రపంచం ఇలా కళ్ళముందు కదిలి వెళ్తుంటే చూడ్డం. 301 00:29:08,664 --> 00:29:10,958 - నువ్వు మళ్ళీ వచ్చావు. - అవును. 302 00:29:11,167 --> 00:29:14,003 నాకు సంతోషం కలిగింది. నేను చేసిన జింజర్ కేకు నీకు చాలా నచ్చుతుంది. 303 00:29:14,170 --> 00:29:17,423 అయితే అది ఒకటి తీసుకుంటాను ఇంకా... 304 00:29:17,590 --> 00:29:20,843 ఒక కప్పు వేడివేడి చాక్లెట్ అందామని అనుకున్నాను. 305 00:29:21,051 --> 00:29:23,637 వేడివేడి చాక్లెట్ ఇంకా జింజర్ కేకు కలిపి తింటే చాలా బాగుంటాయి. 306 00:29:43,407 --> 00:29:45,576 హృదయం తేలికగా అనిపిస్తుంది, కదా? 307 00:29:47,786 --> 00:29:49,163 హెచ్చరిక... 308 00:29:49,330 --> 00:29:51,373 ...ఇది ఒక వ్యసనంగా మారగలదు. 309 00:29:53,667 --> 00:29:55,711 నా జింజర్ కేకు. 310 00:29:57,713 --> 00:29:59,423 థ్యాంక్ యూ. 311 00:30:11,685 --> 00:30:14,313 సారీ, తను నాతో పెళ్ళికి ఒప్పుకుంది. కాబట్టి నాకు చాలా-- 312 00:30:14,480 --> 00:30:15,523 అద్భుతంగా ఉంది. 313 00:30:16,607 --> 00:30:21,320 - నాకు-- నాకు-- నాకు అర్ధం కాలేదు. - థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 314 00:31:19,878 --> 00:31:21,547 నాన్నా. 315 00:31:45,696 --> 00:31:47,489 మేరి. 316 00:31:51,243 --> 00:31:52,620 ఏమయ్యింది? 317 00:31:54,288 --> 00:31:55,873 ఊరికే... 318 00:31:56,665 --> 00:31:58,834 ...మరోలా అయ్యుంటే ఎలా ఉండేది అని ఆలోచిస్తున్నాను. 319 00:31:59,877 --> 00:32:02,796 మరోలా అయ్యుంటే ఎలా ఉండేది అనేది ఉనికిలోనే లేదు. 320 00:32:02,963 --> 00:32:07,009 ఏమి జరిగిందో అదే ఉంది, అది నువ్వు నేను. 321 00:32:09,720 --> 00:32:12,222 అది చాలు నాకు. 322 00:34:18,807 --> 00:34:22,603 కుటుంబం ఆగస్టు '05 సామ్ 4వ పుట్టినరోజు పార్టీ 323 00:34:54,802 --> 00:34:56,261 ఆపు. 324 00:35:37,344 --> 00:35:39,179 నిద్ర పట్టలేదా? 325 00:35:41,849 --> 00:35:43,684 వీటితో ఏమి చేస్తున్నావు? 326 00:35:43,851 --> 00:35:45,894 ఏంటి ఇవన్ని? 327 00:35:48,355 --> 00:35:50,190 మనం కలిసిన మొదటిసారి నీకు గుర్తుందా? 328 00:35:50,399 --> 00:35:52,276 ఒక రైలులో. 329 00:35:52,442 --> 00:35:53,986 ఒక స్త్రీ మనల్ని పరిచయం చేసి ఇలా అంది: 330 00:35:54,152 --> 00:35:57,489 "ఇతను ఎడ్. ఇతను రైళ్ళలో ఉంటాడు. ఈమె మేరి. ఈమె రైళ్ళలో ప్రయాణిస్తుంది." 331 00:35:57,990 --> 00:36:00,284 ఆ తర్వాత ఏమి జరిగింది? 332 00:36:00,701 --> 00:36:04,079 మనం ప్రేమలో పడ్డాము, కదా? ఒక్క మాటలో చెప్పాలంటే అంతే. 333 00:36:04,246 --> 00:36:05,289 ఎడ్? 334 00:36:05,664 --> 00:36:07,457 బానే ఉన్నావా? 335 00:36:08,625 --> 00:36:10,252 ఎడ్? 336 00:36:10,419 --> 00:36:11,587 ఎక్కడికి వెళ్తున్నావు? 337 00:36:12,671 --> 00:36:13,672 ఎడ్. 338 00:36:13,839 --> 00:36:15,757 ఎడ్, బేసింగ్స్టోక్ లో ఒక సమస్య వచ్చి పడింది. 339 00:36:15,924 --> 00:36:16,925 దరిద్రపు బేసింగ్స్టోక్. 340 00:36:17,092 --> 00:36:19,803 అవును, కాని ఆ సమస్యను పరిష్కరించాలి. రైలు ఎన్ని గంటలకు వస్తుందో చెప్పగలవా? 341 00:36:19,970 --> 00:36:21,680 దరిద్రపు బేసింగ్స్టోక్ ని మర్చిపో. 342 00:36:23,557 --> 00:36:25,809 నీకు కోపంగా ఉందా... 343 00:36:26,393 --> 00:36:27,603 ...కలతగా ఉందా... 344 00:36:28,937 --> 00:36:30,689 ...పిచ్చిగా ఉందా... 345 00:36:30,898 --> 00:36:31,940 ...ప్రశాంతంగా ఉందా? 346 00:36:35,861 --> 00:36:37,321 నువ్వు ఎవరు, ఎడ్, ఎవరని అనుకుంటున్నావు? 347 00:36:42,451 --> 00:36:43,785 మన్నించండి. 348 00:36:43,952 --> 00:36:46,496 నేను లిండా కోసం వెతుకుతున్నాను. మీకు లిండా తెలుసా? 349 00:36:46,705 --> 00:36:50,626 లేదు, ఆమె పేరు లిండా కాదు. ఆమె పేరు జేన్. 350 00:36:50,792 --> 00:36:52,461 - ఊపిరితిత్తుల క్యాన్సర్, తెలుసా. - ఏంటీ? 351 00:36:52,961 --> 00:36:54,630 - ఊపిరితిత్తుల క్యాన్సర్. - ఇది చాలా ప్రాముఖ్యం. 352 00:36:54,838 --> 00:36:56,882 నేను లిండా కోసం వెతుకుతున్నాను. మీకు-- 353 00:36:57,090 --> 00:36:58,800 క్షమించండి. నేను మరో వ్యక్తిని అని పొరపడినట్లు ఉన్నారు. 354 00:36:58,967 --> 00:37:01,553 "ఇంటికి వెళ్ళు" అని చెప్పారు. తర్వాత నాకు ఇల్లు దొరికింది. 355 00:37:01,720 --> 00:37:03,347 మీరు సహాయం చేస్తారని చెప్పారు. 356 00:37:03,555 --> 00:37:07,309 మీరు ఇక్కడికి కొత్త అని చెప్పారు. సహాయం చేస్తారని చెప్పారు. ఒక కొత్త సహాయకరమైన వ్యక్తి. 357 00:37:07,476 --> 00:37:09,311 వాళ్ళు ఈ బిడ్డను చనిపోనిస్తారు, అవును కదా? 358 00:37:09,519 --> 00:37:10,979 తనని ఎందుకు చనిపోనిస్తున్నారు? 359 00:37:29,957 --> 00:37:31,875 నువ్వు. హమ్మయ్య. 360 00:37:32,042 --> 00:37:33,543 దయచేసి నాకు సహాయం చెయ్యి. 361 00:37:33,752 --> 00:37:36,630 నేను లిండా కోసం వెతుకుతున్నాను. ఒక పొరపాటు జరిగింది. 362 00:37:36,797 --> 00:37:39,257 నువ్వు ఏదో సమస్యలో ఉన్నట్లు కనిపిస్తున్నావు, అవునా? 363 00:37:39,424 --> 00:37:43,011 నీ కోసం ఒక కేకు ఇంకా నీకిష్టమైన వేడివేడి చాక్లెట్ తెస్తాను. 364 00:37:53,355 --> 00:37:57,901 ప్లీజ్. ప్లీజ్ నాకు సహాయం చెయ్యి. లిండా ఎక్కడుందో నీకు తెలుసా? 365 00:37:58,068 --> 00:37:59,069 లేదు, కన్నా. 366 00:37:59,277 --> 00:38:01,363 నిజం చెప్పాలంటే, నేను ఏమీ వెతికే పరిస్థితిలో లేను. 367 00:38:01,530 --> 00:38:04,491 - ఈ ప్రాంతం ఏమిటి? - మేకాన్ హైట్స్. 368 00:38:04,658 --> 00:38:06,910 కాని దీనికి ఏమయ్యింది? 369 00:38:07,119 --> 00:38:08,662 నువ్వు వచ్చావు. 370 00:38:08,829 --> 00:38:10,288 వాస్తవం వచ్చింది. 371 00:38:11,039 --> 00:38:13,667 ఇది మునుపటిలాగే ఉండాలని మా కోరిక. 372 00:38:13,834 --> 00:38:18,046 నేను లిండా కోసం వెతుకుతున్నాను అంతే. నా కొడుకు నాకు వెనక్కి కావాలి. 373 00:38:25,178 --> 00:38:28,390 అతని దగ్గర కత్తి ఉందని చెప్పాడు. నేను అతనితో రావాలి అని చెప్పాడు. 374 00:38:29,266 --> 00:38:32,602 ఆ వృద్ధుడు నన్ను పక్కదారిలో తీసుకెళ్ళాడు. నాకు 14 ఏళ్ళు. 375 00:38:32,769 --> 00:38:35,063 నేను ఇంటికి నడిచి వెళ్తున్నాను, ఉద్యానవనం గుండా... 376 00:38:35,230 --> 00:38:37,733 ...దాని చుట్టూ ఉన్న కంచెలో ఒక భాగం విరిగిపోయి కనిపించింది... 377 00:38:37,899 --> 00:38:40,736 ...అతను దాని గుండా నన్ను లాగాడు, రైలు పట్టాల గుండా లాక్కు వెళ్ళాడు. 378 00:38:40,902 --> 00:38:43,822 నన్ను మట్టుకోవడం ప్రారంభించాడు. నా ఛాతిని ముట్టుకోవడం ప్రారంభించాడు. 379 00:38:43,989 --> 00:38:45,824 నన్ను అక్కడ ఇంతకుముందు ఎవ్వరూ ముట్టుకోలేదు. 380 00:38:45,991 --> 00:38:47,659 నీకు నా కథ చెప్పాలని ఉంది. 381 00:38:47,826 --> 00:38:50,037 సారీ. వద్దు, నీ కథలు వినాలని లేదు. 382 00:38:50,203 --> 00:38:51,705 నీలో ఒక భాగానికి వినాలని ఉంది. 383 00:38:51,913 --> 00:38:54,541 నీలోని ఒక భాగానికి దీన్ని అర్ధం చేసుకోవడం ప్రాముఖ్యం. 384 00:38:54,708 --> 00:38:56,835 ఈ ప్రాంతం ఏమిటో అర్ధం చేసుకోవడం ప్రాముఖ్యం. 385 00:38:57,878 --> 00:38:59,880 ఆమె నా కొడుకుని తీసుకెళ్ళింది. 386 00:39:00,047 --> 00:39:02,591 నేను తనని వెనక్కి తీసుకురావాలి. 387 00:39:03,258 --> 00:39:05,343 అతనికి నొప్పి కలిగిందా? 388 00:39:05,802 --> 00:39:08,638 ఆమెకి నొప్పిని తగ్గించడం బాగా వచ్చు. 389 00:39:11,058 --> 00:39:14,436 తర్వాత, నేను ప్రేమలో పడినప్పుడు, ప్రయత్నించినప్పుడు.... 390 00:39:15,437 --> 00:39:17,856 అది అస్సలు పని చేయలేదు, కాని ఇది-- 391 00:39:18,023 --> 00:39:19,983 ఇది చాలా మెరుగు. 392 00:39:20,525 --> 00:39:22,069 నీ కొడుకు పేరు ఏమిటి? 393 00:39:23,487 --> 00:39:24,654 సామ్. 394 00:39:24,821 --> 00:39:27,157 సా-- సా-- సామీ. 395 00:39:28,325 --> 00:39:29,951 మంచి పేరు. 396 00:39:30,994 --> 00:39:34,623 నాకు తనని చూస్తే భయమేసేది. 397 00:39:34,831 --> 00:39:36,374 వద్దు. 398 00:39:36,875 --> 00:39:39,086 దాని గురించి మాట్లాడకు. ఇక్కడ కాదు. 399 00:39:48,762 --> 00:39:54,101 కాఫీ ఇంకా వాల్నట్ కేకు, అచ్చం మా అమ్మ చేసినట్లే చేశాను. 400 00:40:00,524 --> 00:40:03,026 ఆమెని ఎక్కడ పట్టుకోవాలో నీకు గుర్తొస్తుంది. 401 00:40:11,451 --> 00:40:13,995 సారీ, తను నాతో పెళ్ళికి ఒప్పుకుంది. కాబట్టి నాకు చాలా-- 402 00:40:14,162 --> 00:40:15,997 అద్భుతంగా ఉంది. 403 00:40:16,164 --> 00:40:18,542 నా దారికి అడ్డం రాకు. 404 00:40:20,043 --> 00:40:23,171 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 405 00:40:23,630 --> 00:40:25,882 - మేము పెళ్ళి చేసుకోబోతున్నాము. - కంగ్రాచ్యులేషన్స్. 406 00:40:26,049 --> 00:40:29,010 - థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. - అద్భుతం. 407 00:40:56,997 --> 00:40:59,499 నేను బ్రాడ్షా ఇన్షూరెన్సులో పని చేస్తానని చాలా మంది మర్చిపోతారు... 408 00:40:59,666 --> 00:41:01,543 ...కాబట్టి గుర్తు పెట్టుకున్నందుకు శభాష్. 409 00:41:02,002 --> 00:41:04,796 నేను అందరికీ ఎప్పుడూ చెబుతాను, కాని అందరూ సాధారణంగా మర్చిపోతారు. 410 00:41:05,547 --> 00:41:06,548 నేను ఏమి సహాయం చేయగలను? 411 00:41:06,756 --> 00:41:09,092 నువ్వు ఒక పొరపాటు చేశావు. 412 00:41:09,634 --> 00:41:11,511 నేను వీళ్ళలో ఒకడిని కాదు. 413 00:41:19,269 --> 00:41:23,106 కాబట్టి పరిస్థితులు అన్ని ముందు ఉన్నట్లుగానే మారిపోవాలని కోరుకుంటున్నాను. 414 00:41:55,931 --> 00:41:58,558 వీళ్ళు నిజమైన వ్యక్తులు కాదని అనుకుంటున్నాను. 415 00:41:59,684 --> 00:42:02,562 - కాదా? - వీధిలో ఇప్పటికి మూడుసార్లు... 416 00:42:02,729 --> 00:42:06,691 ...నన్ను గుద్దిన పెళ్ళి చేసుకోబోయే జంట కూడా నిజమైన వ్యక్తులు కాదు. 417 00:42:07,234 --> 00:42:09,486 అక్కడ వెనుక నిలబడ్డ అబ్బాయిని చూస్తే... 418 00:42:09,819 --> 00:42:12,906 ...నీ కొడుకు గుర్తొస్తున్నాడు అని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా చెప్పలేదు. 419 00:42:13,573 --> 00:42:15,533 నాకు అర్ధమైనంత వరకూ, నీ కొడుకు అందరి కంటే ముందు నిలబడి... 420 00:42:16,284 --> 00:42:18,995 ...ఆ గాలిపటాన్ని ముక్కలుగా చించుతూ ఉంటాడు. 421 00:42:19,537 --> 00:42:21,373 కూర్చో, ఎడ్. 422 00:42:28,546 --> 00:42:30,757 నాకు నా కొడుకు వెనక్కి కావాలి. 423 00:42:30,924 --> 00:42:33,093 అది నిజమని అనిపించట్లేదు. 424 00:42:34,511 --> 00:42:38,431 ప్రజలను అలా అంతం చేయలేము. 425 00:42:38,598 --> 00:42:42,143 నేను ఎప్పుడూ ఇచ్చే కారణాలు మూడు ఉన్నాయి. 426 00:42:42,310 --> 00:42:44,729 మొదటిది, నీకు ఇప్పటి వరకూ జరిగిన హాని. 427 00:42:44,896 --> 00:42:45,939 వద్దు, ఇంక ఆపు-- 428 00:42:46,106 --> 00:42:48,608 రెండవది, వేరేవాళ్ళకు ఇప్పటి వరకూ జరిగిన హాని. 429 00:42:48,775 --> 00:42:51,695 మూడవది, బహుశా అన్నింటికంటే ప్రాముఖ్యమైనది... 430 00:42:51,861 --> 00:42:55,407 ...అతనికి లేక ఆమెకి, అంతే ఆ వ్యక్తికి ఇప్పటి వరకూ జరిగిన హాని. 431 00:42:55,573 --> 00:42:56,574 దుర్మార్గురాలా. 432 00:42:56,741 --> 00:42:59,577 తమ భార్యలు ఆఖరిసారిగా బాధాకరమైన కీమో థెరపీ చేయించుకోవాలి... 433 00:42:59,744 --> 00:43:02,080 ...భర్తలు కోరుకోవడం. 434 00:43:02,622 --> 00:43:06,668 తమ తల్లులు ఎంతో భాధలో ఉన్నా గాని వాళ్ళు బ్రతికే ఉండాలని పిల్లలు కోరుకోవడం. 435 00:43:07,544 --> 00:43:12,424 అంటే, జీవితంలో సమస్యలు వస్తే వాస్తవంలో జీవించడం ఆపేయాలా? 436 00:43:12,841 --> 00:43:17,387 నీ కొడుకు ఎందుకూ పనికి రాని కొడుకు, నువ్వు ఎందుకూ పనికి రాని తండ్రిలా అతన్ని పెంచావు. 437 00:43:18,096 --> 00:43:21,391 - ఆ వాస్తవం అంత గొప్పది కాదు, కదా? - నీకు అర్ధం కావట్లేదు. 438 00:43:21,558 --> 00:43:23,810 మేము ఆనందకరమైన క్షణాలు కూడా అనుభవించాము. 439 00:43:23,977 --> 00:43:27,939 అంతులేని సంతోషం చనిచూసిన క్షణాలు ఉన్నాయి... 440 00:43:28,106 --> 00:43:30,025 ...సామ్ సంతోషంగా ఉన్నప్పుడు. 441 00:43:30,191 --> 00:43:31,568 మేము ఆనందించాము. 442 00:43:31,735 --> 00:43:34,195 నువ్వు మరో జీవితం గురించి కలలు కన్నావని నాకు తెలుసు. 443 00:43:34,362 --> 00:43:37,824 అవును నేను కలలు కన్నాను కాని అవి నిజం కావాలని కోరుకోలేదు. 444 00:43:46,041 --> 00:43:49,711 నా కొడుకు పెద్దయ్యి ఒక పురుషుడిగా మారడం చూడాలని ఉంది. 445 00:43:59,220 --> 00:44:02,390 అతని కథ అంతకంతకూ బాధాకరంగా తయారవుతుందని నేను చెప్పగలను. 446 00:44:02,599 --> 00:44:05,477 అయితే అది నా కథ కూడా కావాలి. 447 00:44:07,937 --> 00:44:09,814 అది నీ గుండెని విరిచేస్తుంది... 448 00:44:10,690 --> 00:44:12,984 ...నీ భార్య గుండెని కూడా. 449 00:44:14,194 --> 00:44:16,154 అతను జైలుకి వెళతాడు. 450 00:44:16,821 --> 00:44:18,990 అతను ఘోరమైన పనులు చేస్తాడు. 451 00:44:19,324 --> 00:44:21,701 నువ్వు ఘోరమైన పనులు చేస్తావు. 452 00:44:21,993 --> 00:44:23,578 నువ్వు ఎప్పుడూ అసంతోషంగా ఉంటావు. 453 00:44:23,787 --> 00:44:25,580 అయితే అలాగే ఉండనివ్వు. 454 00:44:25,747 --> 00:44:29,709 దత్తతు తీసుకో. అనాథలను పెంచుకో. నీ అవసరం ఉన్న మరో బిడ్డను వెతుక్కో. 455 00:44:29,918 --> 00:44:33,171 కొత్త అవకాశాలను తెరిచి చూడు, కొత్త జీవితం ప్రారంభించు. 456 00:44:33,338 --> 00:44:34,589 నువ్వు నీ కథను తిరిగి రాయవచ్చు. 457 00:44:34,798 --> 00:44:37,217 మాకు ఒక కొడుకు ఉన్నాడు. 458 00:44:37,509 --> 00:44:38,843 అతను నాకు కావాలి. 459 00:44:39,219 --> 00:44:40,637 నువ్వు బాధలో అలా అంటున్నావు. 460 00:44:40,804 --> 00:44:42,055 కాదు. 461 00:44:42,263 --> 00:44:44,641 ప్రేమతో అంటున్నాను. 462 00:44:45,308 --> 00:44:47,435 తనకి జన్మనిచ్చింది నేనే. 463 00:44:47,602 --> 00:44:51,064 మేము జన్మనిచ్చాము. అది ప్రేమ. 464 00:44:53,149 --> 00:44:55,026 ఆ మాటలను నమ్ముతున్నట్లు చెబుతున్నావు. 465 00:44:57,153 --> 00:44:58,363 నేను నిన్ను బలవంతపెడతాను. 466 00:44:58,530 --> 00:45:00,073 లేదు, అలా చేయలేవు. 467 00:45:00,240 --> 00:45:03,576 మేకాన్ హైట్స్ కి చేరాలంటే వాళ్ళంతా నా స్టేషనుకి వచ్చి... 468 00:45:03,785 --> 00:45:07,163 ...అక్కడి నుండి ప్రయాణించాలి. వాళ్ళు ఏమి కోల్పోబోతున్నారో నేను వాళ్ళకి చెబుతాను. 469 00:45:07,372 --> 00:45:10,458 - వాస్తవం లేని జీవితం. - అది అందరిని ఆపలేదు. 470 00:45:10,667 --> 00:45:12,419 కాని కొందరిని ఆపుతుంది. 471 00:45:12,585 --> 00:45:14,712 ఎంతమంది అయితే ఎక్కువమంది అవుతారు? 472 00:45:15,171 --> 00:45:18,925 వాళ్ళు సంతోషాన్ని అనుభవించే అవకాశాన్ని లాక్కుంటావా? 473 00:45:19,092 --> 00:45:21,469 ఈ ప్రాంతాన్ని వాళ్ళకి దక్కకుండా చేస్తావా? 474 00:45:21,803 --> 00:45:24,764 ఇది సంతోషం అనుకుంటున్నావా? 475 00:45:27,183 --> 00:45:29,894 కొంతమందికి ఇంతకంటే ఎక్కువ సంతోషం దొరకదని నాకు తెలుసు. 476 00:45:31,521 --> 00:45:33,481 నీకు కూడా. 477 00:45:35,066 --> 00:45:36,818 నాకు కూడా. 478 00:45:40,989 --> 00:45:43,783 నా కొడుకంటే నాకు ప్రాణం. 479 00:45:48,288 --> 00:45:50,707 నువ్వు తప్పు చేస్తున్నావు, ఎడ్. 480 00:45:56,254 --> 00:45:58,715 నిన్ను కాపాడలేకపోయానని బాధగా ఉంది. 481 00:46:37,962 --> 00:46:40,173 నేను ఒకసారి వెళ్ళిపోడానికి ప్రయత్నించాను. 482 00:46:41,466 --> 00:46:43,259 కాని వెళ్ళలేకపోయాను. 483 00:46:45,261 --> 00:46:47,222 నిన్ను చూస్తే జాలిగా ఉంది... 484 00:46:48,223 --> 00:46:50,350 ...అసూయగా కూడా ఉంది. 485 00:46:52,185 --> 00:46:54,437 అయితే, నీ కథ ఏమిటి? 486 00:46:55,355 --> 00:46:57,232 ఈ ప్రాంతం ఏ సమస్యను పరిష్కరించింది? 487 00:46:58,358 --> 00:47:00,777 నేను పిల్లలకు హాని చేశాను. 488 00:47:04,405 --> 00:47:06,950 నన్ను కొట్టాలని అనిపిస్తోందా? 489 00:47:07,951 --> 00:47:10,036 నన్ను నేను కొట్టుకోవాలని అనిపిస్తోంది. 490 00:47:12,914 --> 00:47:15,333 నా కొడుకుని మళ్ళీ చూడాలని ఉంది. 491 00:47:16,668 --> 00:47:18,378 మంచిది. 492 00:47:19,170 --> 00:47:21,005 మనలో కొందరికి... 493 00:47:22,423 --> 00:47:26,219 ...ఈ ప్రాంతానికి రావడం తప్ప మరో మార్గం లేదు. 494 00:48:16,311 --> 00:48:18,187 హాయి. 495 00:48:18,521 --> 00:48:20,523 నేను వచ్చేశాను. 496 00:50:05,169 --> 00:50:07,171 సబ్ టైటిల్స్ అనువాదకర్త: శ్రీలతా కుంతి