1 00:00:12,679 --> 00:00:15,516 ఈ ఘటనపై పోలీసులు ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉంది, 2 00:00:15,516 --> 00:00:17,809 {\an8}కానీ వివరాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. 3 00:00:17,809 --> 00:00:21,730 {\an8}సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు తరచుగా వెళ్లే రెస్టారెంట్ అయిన ఆనా లివియా ముందు, 4 00:00:21,730 --> 00:00:25,025 ఒక బండిలో వచ్చి శవాన్ని పడేసినట్టు తెలుస్తోంది. 5 00:00:25,025 --> 00:00:26,360 హోమ్ సెక్రెటరీ పీటర్ జే... 6 00:00:28,529 --> 00:00:29,530 కూర్చో. 7 00:00:30,656 --> 00:00:33,659 నేను త్వరగా వెళ్లిపోవాలి, కాబట్టి నిలబడి చెప్పాల్సింది చెప్పేస్తా. 8 00:00:34,660 --> 00:00:36,370 నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. 9 00:00:36,370 --> 00:00:38,038 అదేంటో చెప్పరాదూ! 10 00:00:38,038 --> 00:00:40,624 నా శక్తికి మించిన పని చేశాను నేను. 11 00:00:40,624 --> 00:00:43,460 నాకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టాను. 12 00:00:43,460 --> 00:00:46,088 నా సామర్థ్యానికి మించిన పని చేశాను. అంతే కదా? 13 00:00:47,172 --> 00:00:48,173 అంతే. 14 00:00:49,216 --> 00:00:52,344 మా రక్షణా వ్యవస్థలు ఎలా ఉన్నాయో పరీక్షించడానికి మా మీదకి నువ్వు ఒక బృందాన్ని పంపావు. 15 00:00:52,344 --> 00:00:54,805 - ఇప్పుడు ఆ బృందం అదుపు తప్పి ప్రవర్తిస్తోంది. - అంత కన్నా ఎక్కువే చేస్తోందది. 16 00:00:54,805 --> 00:00:57,641 నాకు ఇష్టమైన రెస్టారెంట్ బయట, ఒక శవాన్ని పడేసి వెళ్లిపోయారు వాళ్లు. 17 00:00:57,641 --> 00:01:00,227 దాని వల్ల ఆ రెస్టారెంటుకు వచ్చే వాళ్ల సంఖ్య భారీగా తగ్గిపోవచ్చు. 18 00:01:00,227 --> 00:01:02,896 - నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ విషయమా? - ఆ రెస్టారెంట్ యజమాని నాకు తెలుసు. 19 00:01:03,772 --> 00:01:06,149 ఆ రెస్టారెంటులో నాకు కూడా కాస్త వాటా ఉంది. కానీ ఇక్కడ అది కాదు ముఖ్యమైనది. 20 00:01:06,149 --> 00:01:08,235 - అవును. - ఇది జనాలకు తెలీకూడదు, అదే ముఖ్యం. 21 00:01:08,235 --> 00:01:09,403 నేను రాజీనామా చేయాలి. 22 00:01:10,153 --> 00:01:13,156 దీని వల్ల చీఫ్టన్ తో వ్యవహారాలు జరిపే అవకాశాలు బాగా సన్నగిల్లుతాయి. 23 00:01:13,866 --> 00:01:15,951 దానిలో కూడా నీకు ఆర్థికపరమైన వాటా ఉంది. 24 00:01:16,743 --> 00:01:18,412 నా పరిస్థితి నీకు అర్థమైందిగా. 25 00:01:22,666 --> 00:01:25,085 నేను నీ కర్మకి నిన్ను వదిలేయవచ్చు. 26 00:01:26,295 --> 00:01:28,589 కానీ ఈ పిచ్చి పనితో ఎంఐ5 పేరుకు మచ్చ తెచ్చావు నువ్వు. 27 00:01:29,506 --> 00:01:32,342 కాబట్టి, దీన్నంతటి సంగతిని నేను చూసుకుంటాను. 28 00:01:33,010 --> 00:01:34,386 ఎలా? వాళ్ల డిమాండ్లకు మనం తలొగ్గకూడదు. 29 00:01:35,512 --> 00:01:39,099 ఇలాంటి వాటిల్లో నేను ప్రొఫెషనల్ ని, నాకు వదిలేయ్. 30 00:01:44,521 --> 00:01:45,522 ఇంగ్రిడ్. 31 00:01:45,522 --> 00:01:48,817 గ్రే బుక్స్ ని చూడటానికి, నేను టైగర్ టీమ్ ని అవి ఉన్న చోటుకు పంపిస్తాను. 32 00:01:49,651 --> 00:01:52,613 నిజంగానా? ఆ పని చేయాల్సిన అవసరం లేదేమో. 33 00:01:52,613 --> 00:01:54,865 నువ్వు వాళ్లని అడ్డుకోవచ్చు, ట్రాక్ చేయవచ్చు. 34 00:01:55,365 --> 00:01:58,827 ఇలా చేయడం ద్వారా, హోమ్ సెక్రెటరీకి చెందిన టైగర్ టీమ్ ఎంఐ5కి చెందిన చోటులోకి చొరబడినట్టే ఉంటుంది, 35 00:01:58,827 --> 00:02:00,829 కానీ మనకేమీ హాని ఉండదు, అతనికే ఉంటుంది. 36 00:02:00,829 --> 00:02:03,290 ఆ చోట పనికొచ్చేది ఏదీ లేదు. 37 00:02:03,290 --> 00:02:07,794 లేదు, కానీ ఆ చోటుకు నేను కదా ఇన్ ఛార్జీని. ఇది తిరిగి నా మీదకి వస్తుందేమో కదా? 38 00:02:08,336 --> 00:02:10,506 రాదు, డయానా. మాటిస్తున్నా కదా. 39 00:02:24,311 --> 00:02:25,354 దెయ్యాల దాడి!!! 40 00:02:30,692 --> 00:02:32,069 కార్ట్ రైట్? 41 00:02:32,069 --> 00:02:33,487 పైనున్నాడు. 42 00:02:34,112 --> 00:02:36,573 స్టాండిష్ ని డోనొవన్ ఎక్కడ బంధీగా ఉంచాడో కనుకున్నాను. 43 00:02:36,573 --> 00:02:37,866 నువ్వు కనుక్కోలేదు. 44 00:02:37,866 --> 00:02:39,034 అక్షరాలా కనుక్కోలేదులెండి, 45 00:02:39,034 --> 00:02:42,204 కానీ చీఫ్టన్ రికార్డుల్లో ఉన్న ప్రదేశాల జాబితాని సంపాదించాను. 46 00:02:42,204 --> 00:02:43,914 వాటి ఆధారంగా, ఈ నాలుగు ప్రదేశాలని షార్ట్ లిస్ట్ చేశాను. 47 00:02:43,914 --> 00:02:46,208 సమయాన్ని బట్టి చూస్తే, ఆమె లండన్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. 48 00:02:47,000 --> 00:02:50,087 కానీ చీఫ్టన్ ప్రాంతాలలో డోనొవన్ ఆమెని బంధించి ఉంచడుగా. 49 00:02:50,087 --> 00:02:51,296 ఎందుకు? 50 00:02:51,296 --> 00:02:54,216 అప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో వాళ్లకి తెలిసిపోతుంది కదరా, నాయనా! 51 00:02:57,010 --> 00:02:58,387 - ఆ పని నేను చేస్తా. - సరే. 52 00:02:58,387 --> 00:03:01,139 స్టాండిష్ తలపైకి వాళ్లు తుపాకీ ఎక్కుపెట్టి ఒక ఫోటో పంపారు కదా, అది చూపించు. 53 00:03:02,266 --> 00:03:04,977 సరే. ఒక కొత్త విషయం తెలిసింది. 54 00:03:04,977 --> 00:03:06,895 స్పైడర్, చీఫ్టన్ లో పని చేస్తున్నాడు. 55 00:03:06,895 --> 00:03:08,522 - అబ్బో. - అబ్బొబ్బో. 56 00:03:09,648 --> 00:03:11,692 హా. వాళ్లు స్టాండిష్ ని వదిలేలా లేరు, 57 00:03:11,692 --> 00:03:13,277 కాబట్టి నేనే వెళ్లి విడిపించుకొని వస్తాను. 58 00:03:13,277 --> 00:03:16,488 ఇది తీసుకో. దీన్ని నీ ల్యాప్ టాపులోకి బదిలీ చేసి, పెద్దగా జూమ్ చేసి చూపించు. 59 00:03:16,989 --> 00:03:17,990 కాబట్టి ఓసారి ఆలోచిద్దాం. 60 00:03:19,366 --> 00:03:22,828 వాళ్లు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు బ్యాక్ గ్రౌండులో ఏమైనా శబ్దాలు వినిపించాయా? 61 00:03:23,829 --> 00:03:24,830 లేదు. అవేమీ వినిపించలేదు. 62 00:03:26,456 --> 00:03:29,710 - కానీ తను ఇందాక అన్నది విన్నారా? - టైగర్ టీముతో పాటు స్పైడరుకు కూడా అందులో భాగముంది. 63 00:03:29,710 --> 00:03:31,461 సరే. ఫోనులో వాళ్లు ఏం చెప్పారు? 64 00:03:31,461 --> 00:03:34,756 ఏం చెప్పారంటే, "ఎవరికీ చెప్పవద్దు. 65 00:03:34,756 --> 00:03:37,259 బార్బికన్ బ్రిడ్జ్ దగ్గరకి రావాలి, లేదంటే క్యాథరిన్ స్టాండిష్ ని చంపేస్తాం." 66 00:03:37,259 --> 00:03:39,553 - అక్కడికి స్పైడర్ కూడా వచ్చాడు. వాడి పాత్ర కూడా ఉంది. - హా. 67 00:03:39,553 --> 00:03:41,638 ఆ స్పైడర్ గాడి గురించి మర్చిపోండి. 68 00:03:42,973 --> 00:03:44,183 అతను చనిపోయాడు. 69 00:03:46,351 --> 00:03:47,352 ఏంటి? 70 00:03:49,855 --> 00:03:52,191 ఒక్క నిమిషం... ఇందాకే మేము అతనితో మాట్లాడాం. 71 00:03:52,816 --> 00:03:53,984 హా, కానీ ఆ తర్వాత కొద్ది సేపటికే, 72 00:03:53,984 --> 00:03:56,361 జడ్, మోంటీత్ కలిసి లంచ్ చేస్తున్న రెస్టారెంట్ ముందు 73 00:03:56,361 --> 00:03:58,280 అతని శవాన్ని ఒక బండిలో నుండి విసిరేసి వెళ్లిపోయారు. 74 00:03:58,280 --> 00:03:59,615 ఒక్క నిమిషం. అతడిని చంపింది ఎవరు? 75 00:04:00,699 --> 00:04:02,075 డోనొవనే చంపినట్టున్నాడు. 76 00:04:02,075 --> 00:04:04,745 ఎవరూ అతడిని గమనించడం లేదని ఫీల్ అయినట్టున్నాడు. 77 00:04:04,745 --> 00:04:08,207 - గ్రే బుక్స్ కోసం చంపేస్తారా? - హా, అలానే అనిపించవచ్చు. 78 00:04:08,207 --> 00:04:10,542 అబ్బా. 79 00:04:10,542 --> 00:04:12,044 తనని ఒక ఇంట్లో బంధించినట్టున్నారు. 80 00:04:12,628 --> 00:04:14,171 వావ్, భలే విలువైన విషయాన్ని చెప్పావే. 81 00:04:14,171 --> 00:04:15,589 అత్యుత్తమమైన ఉద్యోగివి నువ్వే. 82 00:04:17,216 --> 00:04:18,382 తను ఊరికే కదులుతోంది. 83 00:04:18,382 --> 00:04:20,052 తల పైకి తుపాకీ పెడ్తే, కదలక ఇంకేం చేస్తారు! 84 00:04:20,844 --> 00:04:21,678 కాదులే. 85 00:04:21,678 --> 00:04:23,972 తను మనకి ఏదో చూపాలనుకుంటోంది. 86 00:04:23,972 --> 00:04:27,351 గోడ మీద ఉన్నవి కనిపించేలా జూమ్ చేయ్. 87 00:04:28,393 --> 00:04:29,895 ఆలిసన్ - సారా - ఫిబ్రవరి 3 1994 - బెన్ 88 00:04:29,895 --> 00:04:32,731 ఇదీ విలువైన సమాచారం అంటే. తెలివైన అమ్మాయే తను. 89 00:04:33,524 --> 00:04:35,943 ఆ ముగ్గురు పిల్లలూ ఏ ఇంట్లో పెరిగారో కనుక్కో. 90 00:04:37,861 --> 00:04:40,989 ఏమైంది! సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. వాడు పెద్ద వెధవ. 91 00:04:42,074 --> 00:04:43,075 ఎక్కడికి వెళ్తున్నారు? 92 00:04:44,117 --> 00:04:45,118 చర్చికి. 93 00:05:20,112 --> 00:05:22,281 {\an8}మిక్ హెర్రన్ రచించిన "రియల్ టైగర్స్" పుస్తకం ఆధారితమైనది 94 00:05:54,897 --> 00:05:58,442 సరే, త్వరగా చెప్పాల్సింది చెప్పేయ్. నా కింది ఏజెంట్ల పని పట్టాల్సిన పనుంది నాకు. నేను చాలా బిజీ. 95 00:05:58,442 --> 00:06:00,402 స్లౌ హౌసులో ఉన్న వాళ్లు బిజీగా అస్సలు ఉండరు. 96 00:06:01,028 --> 00:06:02,070 త్వరగా చెప్పేయ్. సమయం వృథా చేయకు. 97 00:06:02,738 --> 00:06:05,199 టైగర్ టీమ్ ఒకరిని చంపారు, వాళ్ల దగ్గర ఇద్దరు బంధీలు ఉన్నారు. 98 00:06:05,824 --> 00:06:07,784 గ్రే బుక్సులో వాళ్లు ఏ సమాచారం కోసం వెతుకుతున్నారో నాకు తెలీదు, 99 00:06:07,784 --> 00:06:09,077 కానీ వాళ్లకి పనికొచ్చేది మాత్రం ఏమీ ఉండదు. 100 00:06:09,077 --> 00:06:13,373 కాబట్టి, వాళ్లకి కావాల్సింది వాళ్లకి ఇచ్చేద్దామనుకుంటున్నా, అప్పుడు బంధీలను త్వరగా వదిలేస్తారుగా, 101 00:06:13,373 --> 00:06:15,542 - వదిలేశాక వాళ్ల సంగతి ఏంటో చూద్దాం. - అలాగే. 102 00:06:15,542 --> 00:06:18,587 వాళ్లు గ్రే బుక్స్ ఉండే చోటులోకి వెళ్లి, బయటకు వచ్చేదాకా మీ మనుషులు ఉంటే బాగుంటుందనిపిస్తోంది. 103 00:06:19,922 --> 00:06:21,089 నీకు బాగానే ఉంటుందిలే. 104 00:06:21,089 --> 00:06:22,549 దాని వల్ల అందరికీ లాభమే. నన్ను నమ్ము. 105 00:06:22,549 --> 00:06:26,053 నిన్ను నమ్మాలా? చచ్చినా ఆ పని మాత్రం చేయను. 106 00:06:26,803 --> 00:06:28,138 దీని వల్ల స్టాండిష్ త్వరగా విడుదలవుతుంది. 107 00:06:28,722 --> 00:06:31,391 అంతే కాకుండా, ఏ సమయంలోనైనా నాకు కాల్ చేసి, నా సాయం తీసుకొనే వీలు నీకు లభిస్తుంది. 108 00:06:34,144 --> 00:06:35,145 వద్దులే. 109 00:06:35,729 --> 00:06:36,813 నాకేం అక్కర్లేదు. 110 00:06:37,940 --> 00:06:40,234 ఇలాంటి పరిస్థితే నాకు కొత్త కాదు. 111 00:06:40,234 --> 00:06:42,694 "సారీ, జాక్సన్. మా వల్ల తప్పు జరిగిపోయింది. మాకు సాయం చేసిపెట్టు. 112 00:06:42,694 --> 00:06:44,905 ఆ తలుపు గుండా లోపలికి వెళ్లు, అంతా సర్దుకుంటుంది," అని అన్నారు. 113 00:06:44,905 --> 00:06:46,240 పోయిన సారి మిమ్మల్ని నమ్మి ఆ పని చేస్తే, 114 00:06:46,240 --> 00:06:48,992 లోపలికి వెళ్లి చూశాక, బల్ల మీద నరికివేయబడిన తల ఉండింది. 115 00:06:48,992 --> 00:06:50,619 మీ తప్పులని మీరే సరి చేసుకోండి. 116 00:06:50,619 --> 00:06:53,080 - ఇది నా తప్పు కాదు. - నీది కాదు, జడ్ ది. 117 00:06:53,872 --> 00:06:56,458 వాడిని అనుభవించేలా చేయడానికి నీకు నా సాయం కావాలి. 118 00:07:01,380 --> 00:07:03,924 - నీ భార్యకి ఏమని చెప్తావు? - దేని గురించి? 119 00:07:04,842 --> 00:07:06,176 ఉద్యోగం పోవడం గురించి. 120 00:07:06,760 --> 00:07:08,387 నేను తనకి ఏమీ చెప్పాలనుకోవట్లేదు. 121 00:07:08,387 --> 00:07:11,682 ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నీ ఉద్యోగం పోయినా, ఉన్నా నా భార్య పెద్దగా పట్టించుకోదులే. 122 00:07:11,682 --> 00:07:13,767 అసలు నువ్వెవరో కూడా తనకి తెలీదమ్మా. 123 00:07:14,351 --> 00:07:15,352 నా ఉద్యోగమే కాదు, నీది కూడా పోయింది. 124 00:07:16,228 --> 00:07:18,897 నా ఉద్యోగం ఎందుకు పోతుంది? గంజాయితో పట్టుబడింది నేను కాదు కదా. 125 00:07:20,065 --> 00:07:21,149 "ఇక ఆఫీసుకు రావద్దు. 126 00:07:21,149 --> 00:07:24,403 పందులకు పని చెప్తే, అవి వంద రెట్లు మంచిగా పని చేస్తాయి." 127 00:07:24,403 --> 00:07:26,405 - అది సందేశం. - ఆ సందేశం నాకు కూడా తెలుసు. 128 00:07:26,405 --> 00:07:27,531 కానీ అతను చెప్తోంది నీ గురించే. 129 00:07:27,531 --> 00:07:29,908 స్లౌ హౌసుకు వెళ్లాక, ఎలాగూ నీకు అర్థమవుతుంది అనుకో. 130 00:07:29,908 --> 00:07:31,201 ఆయన పందులు అని ఇద్దరినీ అన్నాడు. 131 00:07:31,201 --> 00:07:33,871 - నన్నే అయితే పంది అని అనేవాడు కదా. - ఫ్లోలో అనేశాడు, అంతే. 132 00:07:33,871 --> 00:07:35,539 పందివి కదా, నీకు అర్థమవుతుందిలే. 133 00:07:37,499 --> 00:07:38,500 నా ఉద్యోగం ఎందుకు పీకేస్తాడు? 134 00:07:38,500 --> 00:07:41,044 ఎందుకంటే, నువ్వు భయంకరంగా జూదం ఆడుతుంటావు కాబట్టి. 135 00:07:41,044 --> 00:07:44,131 జూదంలో రోలే చక్రాన్ని తిప్పీ తిప్పీ నీకు రెండు చేతులూ ఊరికే పట్టేస్తాయి. 136 00:07:44,131 --> 00:07:47,551 లేదు, రోలే చక్రాన్ని తిప్పేది ఆడేవాళ్లు కాదు. 137 00:07:48,051 --> 00:07:50,596 పైగా, నా ఈ చిన్న వ్యాపకం వల్ల నా పని ఎప్పుడూ ప్రభావితం కాలేదు, నీ డ్రగ్స్ అలవాటులా కాదు. 138 00:07:51,972 --> 00:07:53,515 నేను మత్తులో ఉన్నానని ఎవరూ చెప్పలేరు. 139 00:07:55,142 --> 00:07:56,935 అది మంచి విషయం కాదని నీకూ అర్థమవుతోంది కదా? 140 00:08:00,063 --> 00:08:01,690 మనిద్దరి ఉద్యోగాలు పోయాయని వంద పౌండ్లు పందెం. 141 00:08:03,775 --> 00:08:04,776 అయిదు వందలు పందెం. 142 00:08:05,277 --> 00:08:07,029 - నిజంగానా? - ఏదైతే అది అయింది. వెయ్యి పౌండ్లు పందెం. 143 00:08:07,654 --> 00:08:08,488 నాకు ఓకే. 144 00:08:08,488 --> 00:08:09,698 నాకు కూడా ఓకే. 145 00:08:12,159 --> 00:08:13,160 పాలు లేవు. 146 00:08:15,370 --> 00:08:17,039 పాలును ఎప్పుడూ క్యాథరినే కదా కొని తెచ్చేది. 147 00:08:17,539 --> 00:08:20,501 ఇంటి ఆచూకీని హో కనిపెట్టాక ల్యాంబ్ ఏం చేస్తాడు అంటావు? 148 00:08:22,753 --> 00:08:25,714 మనం ఆ ఇంటిపై దాడి చేసి, తనని విడిపిస్తాం. 149 00:08:28,258 --> 00:08:30,093 స్పైడర్ విషయంలో నీకు బాధగా ఉందా? 150 00:08:34,389 --> 00:08:38,769 నాకు వాడంటే అసహ్యం, పరమ అసహ్యం, కానీ... 151 00:08:41,270 --> 00:08:44,691 మేమిద్దరం ఒకానొకప్పుడు స్నేహితులమే. 152 00:08:46,568 --> 00:08:47,653 నిజంగానా? 153 00:08:51,156 --> 00:08:52,241 అవును. 154 00:08:53,492 --> 00:08:55,369 అతను నిన్ను బాగా వాడుకున్నాడు అనుకుంటా. 155 00:08:57,246 --> 00:08:59,957 నువ్వే కనుక చనిపోయి ఉంటే, అతను అసలు పట్టించుకొనే వాడే కాదు. 156 00:09:09,424 --> 00:09:11,426 - చెప్పండి. - రివర్ కార్ట్ రైట్? 157 00:09:11,426 --> 00:09:12,344 అవును. 158 00:09:12,344 --> 00:09:15,222 ఒకప్పుడు మీ తాతయ్య గారు సభ్యునిగా ఉన్న సెయింట్ జోషువా క్లబ్ నుండి కాల్ చేస్తున్నాను, 159 00:09:15,222 --> 00:09:16,306 ఇప్పుడు కూడా సభ్యుడినే. 160 00:09:16,890 --> 00:09:19,268 ఆయన సభ్యత్వం విషయంలో కాస్త గొడవ చేస్తున్నారు... 161 00:09:19,268 --> 00:09:22,104 నా మనవడికి ఎందుకు కాల్ చేస్తున్నారు? నేను చెప్పేది మీరు నమ్మడం లేదా? 162 00:09:22,104 --> 00:09:24,273 సరే. అది దేని గురించో నాకు తెలుసు. 163 00:09:24,273 --> 00:09:26,233 ఆయనతో మీరు మాట్లాడతారా? 164 00:09:27,192 --> 00:09:28,694 పర్వాలేదులెండి. నేను... 165 00:09:30,571 --> 00:09:33,240 - నేనే అక్కడికి వస్తా. దగ్గరే అది నాకు. - అలాగేనండీ. 166 00:09:33,240 --> 00:09:34,366 సరే. థ్యాంక్స్. 167 00:09:40,497 --> 00:09:41,915 నేను వెళ్లి మా తాతయ్యకి సాయం చేసి వస్తా. 168 00:09:42,583 --> 00:09:44,042 ఏంటి? ఇప్పుడా? 169 00:09:44,042 --> 00:09:45,294 హా, ఇప్పుడే. 170 00:09:47,629 --> 00:09:48,839 టీ తెచ్చినందుకు థ్యాంక్స్. 171 00:09:49,840 --> 00:09:51,758 నేను పాలు లేకుండానే తాగుతాను, కాబట్టి... 172 00:10:02,144 --> 00:10:04,021 - ఇప్పుడు మన మీద హత్య కేసు కూడా వేస్తారు. - నా మీదే. 173 00:10:04,605 --> 00:10:05,981 చచ్చినా మళ్లీ నిన్ను ఒక్కడినే పంపించను. 174 00:10:05,981 --> 00:10:08,358 - అంతా ఓకేనేలే. - నువ్వు ఒకరిని చంపావు. 175 00:10:09,359 --> 00:10:10,861 ఇప్పుడు మనకి కావాల్సింది మనకి దక్కుతుంది. 176 00:10:10,861 --> 00:10:12,321 - అది పక్కానా? - వాళ్లు కాల్ చేస్తారు. 177 00:10:12,821 --> 00:10:15,199 - ఆ తర్వాత, నీకేం జరుగుతుందని... - అది ఇప్పుడు అంత ముఖ్యం కాదు! 178 00:10:16,658 --> 00:10:18,452 ముందు, ఆలిసన్ కి మనం న్యాయం దక్కేలా చేయాలి. 179 00:10:19,328 --> 00:10:20,329 ఆ తర్వాత, 180 00:10:20,329 --> 00:10:22,456 నేను చేసిన హత్యకు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తాను. 181 00:10:26,460 --> 00:10:29,296 కొత్తగా బంధించిన వ్యక్తిని ఏం చేయబోతున్నావు? 182 00:10:29,296 --> 00:10:30,214 ఏం చేయను. 183 00:10:30,214 --> 00:10:33,300 అతను నీ బాసా? ఇప్పుడు నీ బంధీ అయ్యాడా? అతను నన్ను వదిలేయబోయాడు. 184 00:10:33,300 --> 00:10:35,636 మిమ్మల్ని ఇంకొంత సమయం ఉంచాల్సి వస్తోంది. 185 00:10:36,345 --> 00:10:37,763 మీతో ఒక పని ఉంది, అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాం. 186 00:10:41,642 --> 00:10:43,352 ఇదా? ఇది కొత్త స్టోరేజ్ కేంద్రం. 187 00:10:43,352 --> 00:10:44,978 దాని గురించి మీకు బాగా తెలుసు. 188 00:10:45,479 --> 00:10:47,731 ఏ ఫైల్ ఏ పెట్టెలో ఉందో, ఏ గదిలో ఉందో మీకు తెలుసు. 189 00:10:47,731 --> 00:10:50,734 ఇవన్నీ ప్రస్తుతం ఉపయోగంలో లేని పాత పత్రాలు. వీటి వల్ల ఏ ఉపయోగమూ... 190 00:10:50,734 --> 00:10:52,444 వీటి వల్ల నాకు ఉపయోగం ఉంది. 191 00:10:52,444 --> 00:10:56,198 నిజానికి, నాశనం చేయాల్సిందిగా సిఫార్సు చేసిన పత్రాలలో ఇది కూడా ఒకటి. 192 00:10:56,198 --> 00:10:58,617 అలాంటప్పుడు, అది ఎక్కడ ఉందో చెప్పడం వల్ల మీకు పోయేదేమీ లేదు కదా. 193 00:10:58,617 --> 00:11:00,410 మన్నించాలి, ఆ పని నేను చేయలేను. 194 00:11:00,410 --> 00:11:02,579 చెప్తే, నా బతుకు బస్టాండ్ అయిపోతుంది. 195 00:11:05,707 --> 00:11:08,210 మీ పరిస్థితి ఇప్పుడు అలానే ఉందిగా. 196 00:11:11,547 --> 00:11:13,257 నువ్వేం చేయగలవో నాకు తెలుసు. 197 00:11:13,257 --> 00:11:15,592 కానీ నా తలకు నువ్వు తుపాకీ ఎక్కుపెట్టింది కేవలం బెదిరించడానికే అని నాకు తెలుసు. 198 00:11:15,592 --> 00:11:18,095 కాబట్టి, నువ్వు నన్నేం చేయవు. 199 00:11:21,056 --> 00:11:22,057 సరే. 200 00:11:29,940 --> 00:11:32,025 కెఫేలో నేను మీకు చెప్పిందంతా నిజమే. 201 00:11:33,151 --> 00:11:34,194 నీ పేరు తప్ప. 202 00:11:36,738 --> 00:11:38,532 నా పేరు షాన్ డోనొవన్. 203 00:11:40,701 --> 00:11:41,869 నేను తాగుబోతుని. 204 00:11:45,664 --> 00:11:46,999 నిజంగానే, నా ఆత్మీయులు ఒకరు చనిపోయారు. 205 00:11:49,835 --> 00:11:51,003 తను కూడా ఎంఐ5 ఏజెంటే. 206 00:11:56,925 --> 00:12:00,804 తన పేరు ఆలిసన్ డన్. 207 00:12:06,894 --> 00:12:07,936 తనంటే నాకు ప్రాణం. 208 00:12:19,323 --> 00:12:20,449 తను చనిపోయాక... 209 00:12:23,702 --> 00:12:25,162 నా జీవితం ఛిన్నాభిన్నమైపోయింది. 210 00:12:27,581 --> 00:12:31,168 కింద ఉన్న సారా, ఇంకా కొద్దో గొప్పో బెన్ కూడా, 211 00:12:31,168 --> 00:12:35,339 నా దగ్గరికి వచ్చి, కష్ట సమయంలో అండగా నిలిచారు. 212 00:12:38,133 --> 00:12:40,177 జీవితాంతం నేను అలా అపరాధ భావంతో బతకాలని ఆలిసన్ కోరుకోదని చెప్పారు. 213 00:12:42,346 --> 00:12:45,098 తను సరైన పనే చేయాలని చూసిందని, నేను కూడా సరైన పనే చేయడం తనకి ఇష్టమని చెప్పారు. 214 00:12:47,226 --> 00:12:49,353 ఇస్తాంబుల్ లో తనతో పాటు నేను కూడా ఎంబసీలో పని చేశాను. 215 00:12:50,896 --> 00:12:53,190 అత్యంత రహస్యమైన ఫైలును తను లీక్ చేయబోయింది. 216 00:12:54,107 --> 00:12:57,611 అందుకని మీరు తనని చంపేశారు. ఆత్మహత్యలా చిత్రీకరించారు. 217 00:12:59,238 --> 00:13:03,617 ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నప్పుడు మనల్ని మనం నిందించుకోవడం సహజమే. 218 00:13:03,617 --> 00:13:05,494 మరీ ముఖ్యంగా మనకి బాగా కావాల్సినవారు ఆ పని చేసినప్పుడు. 219 00:13:05,494 --> 00:13:09,206 తను చనిపోయిన రాత్రి ముందు రోజు రాత్రి నేను తన దగ్గరే ఉన్నాను. తను ఆత్మహత్య చేసుకోలేదు, ఎంఐ5 చంపింది. 220 00:13:09,206 --> 00:13:12,376 లేదు. మేము హత్యలు చేయము. 221 00:13:12,376 --> 00:13:14,545 మేము ప్రశ్నార్థకమైన పనులు చాలానే చేస్తాం, కానీ హత్యలు మాత్రం చేయం. 222 00:13:14,545 --> 00:13:15,879 అది పక్కాగా మీకెలా తెలుసు? 223 00:13:15,879 --> 00:13:19,216 స్లౌ హౌసులో పని చేయక ముందు, నేను ఎంఐ5 హెడ్ కింద పని చేశాను. 224 00:13:19,967 --> 00:13:21,385 - టియర్నీ కిందనా? - కాదు. 225 00:13:22,386 --> 00:13:24,638 చార్ల్స్ పార్టనర్. ఎంఐ5 హెడ్స్ లో అతనే టాప్. 226 00:13:25,681 --> 00:13:26,682 అలాంటి వ్యక్తి, 227 00:13:26,682 --> 00:13:28,809 తన సొంత ఏజెంట్లనే చంపమని హంతకులని పంపడా? 228 00:13:28,809 --> 00:13:32,354 పంపడు. ఆమె దేశద్రోహి అయితే తప్ప. 229 00:13:32,354 --> 00:13:33,772 తను దేశద్రోహి కాదు. 230 00:13:34,857 --> 00:13:35,858 ఇంతకీ ఆ ఫైలులో ఏముంది? 231 00:13:38,026 --> 00:13:39,319 నాకు తెలీదు. 232 00:13:40,237 --> 00:13:43,282 కానీ దాని వల్ల, తను పని చేసే సంస్థకే తను ఎదురు తిరిగింది. 233 00:13:43,866 --> 00:13:46,326 అది ఎక్కడ ఉందో మాకు తెలియాలి. 234 00:13:47,244 --> 00:13:48,579 దయచేసి సహకరించండి, క్యాథరిన్. 235 00:13:48,579 --> 00:13:50,747 ఆ పని చేస్తే, నేను ఎంఐ5కి ద్రోహం చేసినదాన్ని అవుతాను. 236 00:13:50,747 --> 00:13:53,083 - ఆ పని నేను చేయలేను. - ఆ పని మీరొక్కరే చేస్తున్నారని అనుకోవద్దు. 237 00:13:53,083 --> 00:13:57,045 ఇది మీ కేంద్రంలో ఉందని మాకు ఎలా తెలుసనుకుంటున్నారు? పార్కులో పని చేసే ఒకరు చెప్పారు మాకు. 238 00:13:57,045 --> 00:13:59,923 అక్కడ జరిగే ప్రశ్నార్థకమైన పనులంటే గిట్టని వాళ్లు. 239 00:14:00,799 --> 00:14:02,801 నా జీవితమంతా నేను ఎంఐ5 వద్దనే పని చేశాను. 240 00:14:02,801 --> 00:14:03,969 ఆలిసన్ కూడా అంతే. 241 00:14:05,053 --> 00:14:06,180 కానీ వాళ్లు తనని మోసం చేశారు. 242 00:14:07,222 --> 00:14:09,600 అసలు వీళ్లని కాపాడటం అవసరమని మీకు అనిపిస్తోందా? 243 00:14:12,978 --> 00:14:15,856 - బెన్! బెన్! - సారా? సారా! 244 00:14:19,276 --> 00:14:20,986 - నువ్వు బాగానే ఉన్నావా? - హా. 245 00:14:22,112 --> 00:14:23,530 స్టర్జస్ ని చూసొద్దామని వెళ్లింది. 246 00:14:23,530 --> 00:14:25,365 నీళ్లు కావాలని అడిగాడు. 247 00:14:26,116 --> 00:14:29,745 ఇంట్లోకి వెళ్లి స్టాండిష్ ని గమనిస్తూ ఉండు. నువ్వు నాతో రా. మనం అతడిని పట్టుకోవాలి. 248 00:14:33,957 --> 00:14:36,293 నువ్వు అటు వెళ్లు. పెద్ద ద్వారం దగ్గర కలుసుకుందాం. వెళ్లు! 249 00:14:36,293 --> 00:14:37,252 సరే. 250 00:15:04,488 --> 00:15:05,656 దేవుడా. 251 00:15:06,156 --> 00:15:07,074 బెన్! 252 00:15:40,524 --> 00:15:41,942 అతడిని వదిలేయ్. 253 00:15:57,082 --> 00:15:58,083 ఆగు! 254 00:16:10,262 --> 00:16:13,557 నమస్తే. నాకు లిఫ్ట్ ఇస్తారా? అబ్బా. 255 00:16:14,808 --> 00:16:17,644 "పదండి"కి ఫ్రెంచిలో ఏమనాలబ్బా? పదండి! పదండి! 256 00:16:46,256 --> 00:16:47,174 బాగానే ఉన్నావా? 257 00:16:47,674 --> 00:16:48,550 వచ్చావా! 258 00:16:49,468 --> 00:16:50,594 నీ ముఖానికి ఏమైంది? 259 00:16:53,263 --> 00:16:54,806 ఫైల్స్ సర్దేటప్పుడు ప్రమాదవశాత్తూ తగిలిందిలే. 260 00:16:56,683 --> 00:16:58,602 అతను పొరబడుతున్నాడని చెప్పు. 261 00:16:59,728 --> 00:17:01,855 హా, కానీ పొరబడేది అతను కాదు, కదా? 262 00:17:01,855 --> 00:17:03,482 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 263 00:17:04,608 --> 00:17:06,818 ఇక్కడ 50 ఏళ్లగా నేను సభ్యునిగా ఉన్నాను. 264 00:17:06,818 --> 00:17:09,695 అవును, కానీ గత కొన్నేళ్లుగా నువ్వు ఇక్కడికి పెద్దగా రాలేదనే చెప్పాలి. 265 00:17:09,695 --> 00:17:12,824 నేను రాకపోవడానికి, దీనికి ఏంటి సంబంధం? నేను కట్టాల్సింది సమయానికి కడుతున్నాగా. 266 00:17:14,201 --> 00:17:15,202 లేదు. 267 00:17:16,787 --> 00:17:18,454 దీని గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? 268 00:17:19,122 --> 00:17:22,626 నువ్వు క్లబ్బుకు రావడం లేదు కాబట్టి, సభ్యత్వాన్ని నిలిపివేద్దామని నిర్ణయించుకున్నావు. 269 00:17:23,544 --> 00:17:27,631 అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు గుర్తుండదా ఏంటి? 270 00:17:27,631 --> 00:17:30,342 మనం హాలులో ఫైర్ ప్లేస్ పక్కనే ఉన్నాం అప్పుడు. 271 00:17:31,593 --> 00:17:33,470 కూర్చున్నదానికి, ఈ నిర్ణయానికి సంబంధం ఏంటి? 272 00:17:34,054 --> 00:17:37,850 యాభై ఏళ్ల సభ్యత్వం చాలు అని అన్నావు. 273 00:17:38,559 --> 00:17:39,393 నేను అనలేదు. 274 00:17:40,686 --> 00:17:44,022 ఆ సభ్యత్వ కార్డును నువ్వు రెండు ముక్కలు చేసి, మంటలో పడేశావు. 275 00:17:51,321 --> 00:17:54,533 - ఇక్కడ ఫోన్స్ మాట్లాడకూడదు అండి. - హా. అది నాకు తెలుసు. 276 00:18:11,758 --> 00:18:13,719 - చెప్పండి. - నేను ఇంగ్రిడ్ టియర్నీని. 277 00:18:14,511 --> 00:18:15,971 ఇవాళ ఉదయం జరిగింది చాలా దారుణమైన సంఘటన. 278 00:18:19,349 --> 00:18:20,350 లైనులో ఉన్నావా? 279 00:18:21,435 --> 00:18:24,813 దారుణమైనదే. ఒప్పుకుంటున్నాను. 280 00:18:25,606 --> 00:18:28,233 నీ తప్పులని కడిగేసుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. 281 00:18:29,818 --> 00:18:30,944 సరే. 282 00:18:30,944 --> 00:18:32,946 టైగర్ టీమ్, గ్రే బుక్స్ చూడాలనుకుంటోంది. 283 00:18:33,447 --> 00:18:36,158 అవి ఉండే చోటుకు నువ్వే వాళ్లని తీసుకెళ్ళాలి, మళ్లీ బయటకు తీసుకురావాలి. 284 00:18:37,743 --> 00:18:38,785 అంతేనా? 285 00:18:38,785 --> 00:18:41,955 అంతే. అక్కడికి వెళ్లి, వాళ్ల కోసం వేచి ఉండు. 286 00:18:47,336 --> 00:18:49,463 స్లో హౌసుకు ఇందులో భాగం కల్పించాలని పక్కాగా అనుకుంటున్నారా? 287 00:18:50,088 --> 00:18:52,424 కార్ట్ రైట్ కి, స్టాండిష్ కి ఇప్పటికే ఇందులో భాగం ఉంది. 288 00:18:53,258 --> 00:18:55,886 ఏ తప్పు జరిగినా, అది వాళ్ల మీదకి, జడ్ మీదకే వెళ్తుంది. 289 00:18:56,553 --> 00:18:57,554 మరి నేనెప్పుడు రంగప్రవేశం చేయాలి? 290 00:18:58,555 --> 00:19:00,891 ఆ చోటు నుండి టైగర్ టీమ్ బయటకు వచ్చినప్పుడు, వాళ్లని ఫాలో అవ్వు. 291 00:19:02,142 --> 00:19:04,102 స్టాండిష్ ని విడుదల చేసిన తర్వాత, వాళ్ల పని పట్టు. 292 00:19:05,395 --> 00:19:06,480 చీఫ్టన్ ని ఉపయోగించుకో. 293 00:19:07,231 --> 00:19:09,608 దీన్ని ప్రారంభించింది వాళ్లే, ముగింపు కూడా పలకాల్సింది వాళ్లే. 294 00:19:12,528 --> 00:19:15,405 ఈ విషయమై నిన్ను ఇక్కడిదాకా రప్పించినందుకు క్షమించు రా. 295 00:19:15,405 --> 00:19:18,075 పర్వాలేదులే. ఈ తప్పు ఎవరైనా చేస్తారు. 296 00:19:18,075 --> 00:19:20,744 తప్పు కాదు. నాకు మతిమరుపు వస్తోంది. 297 00:19:21,912 --> 00:19:23,705 - ఆగు. - థ్యాంక్యూ. 298 00:19:24,289 --> 00:19:25,332 నీకు మతిమరుపు ఏమీ రావట్లేదు. 299 00:19:25,332 --> 00:19:26,416 వస్తోంది. 300 00:19:27,584 --> 00:19:30,254 పేర్లని, ముఖాలని, ప్రాంతాలని మర్చిపోతున్నా. 301 00:19:31,046 --> 00:19:33,173 ఒకప్పుడు ఇట్టే గుర్తొచ్చేసేవి, కానీ ఇప్పుడు కష్టపడాల్సి వస్తోంది. 302 00:19:33,173 --> 00:19:34,258 నా తాళం చెవులు ఎక్కడ? 303 00:19:35,509 --> 00:19:37,344 పర్వాలేదులే. ఇది ఒక చిన్న దశ మాత్రమేలే. 304 00:19:37,845 --> 00:19:41,223 హా. ముందు ట్యాక్సీ చూద్దాం పద, అందులో స్టేషన్ దాకా వెళ్లుదువు కానీ. 305 00:19:41,223 --> 00:19:42,307 సరే. 306 00:19:44,059 --> 00:19:48,146 ఇప్పుడే ఒక సాయం చేసి పెట్టమని ఫస్ట్ డెస్క్ నుండి కాల్ వచ్చింది. 307 00:19:48,730 --> 00:19:49,982 సాయం అంటే? 308 00:19:50,691 --> 00:19:53,193 ఓ సురక్షితమైన చోటుకు ఒకరిని తీసుకెళ్లడం, మళ్లీ వాళ్లని బయటకు తీసుకురావడం. 309 00:19:54,444 --> 00:19:55,362 ఆ తర్వాత? 310 00:19:55,988 --> 00:19:57,239 ఒకరికి విముక్తి లభిస్తుంది. 311 00:19:58,866 --> 00:20:00,033 మరి ఎందుకు సంశయిస్తున్నావు? 312 00:20:01,493 --> 00:20:04,079 ఎందుకంటే, ఆ పనిలో నిగూఢంగా ఇంకేదో ఆట ఉంటుంది. 313 00:20:04,079 --> 00:20:06,248 దాని వల్ల నా పరిస్థితి ఇంకా దారుణంగా తయారవ్వవచ్చు. 314 00:20:06,248 --> 00:20:10,043 ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటో నేను ఊహించలేకపోతున్నా, అంతే. 315 00:20:11,587 --> 00:20:12,629 నువ్వేం అంటావు? 316 00:20:13,797 --> 00:20:17,426 తను ఫస్ట్ డెస్క్. నువ్వు కూడా ఆ పనికి ఒప్పుకున్నావు. 317 00:20:18,677 --> 00:20:20,929 నాకు మంచిగా అనిపించాలనే నువ్వు నన్ను అడుగుతున్నావు. 318 00:20:22,264 --> 00:20:25,142 చూశావా? ఇంకా నీ మేధస్సు అలానే ఉంది. 319 00:20:26,143 --> 00:20:27,060 ఏడిచావులే. 320 00:20:38,447 --> 00:20:41,867 నన్ను క్షమించు, సరేనా? నేనేమీ సైనికురాలిని కాదు. 321 00:20:41,867 --> 00:20:45,120 - ఎప్పుడూ నీ తప్పేమీ లేదనే అంటావు. - తప్పుల్లో మనిద్దరికీ భాగం ఉందని అనుకోవచ్చు కదా? 322 00:20:45,120 --> 00:20:49,041 ఎందుకంటే, నువ్వే ముందు తప్పు చేశావు, ఎప్పటిలాగానే, అది దారుణమైనది కూడా. 323 00:20:49,708 --> 00:20:52,169 - ఇదంతా ఎందుకు, మనస్సులోని మాట చెప్పేయవచ్చుగా? - మనస్సులో మాట ఏంటి? 324 00:20:52,169 --> 00:20:54,296 ఆలిసన్ ఇంకా బతికి ఉంటే, ఇదేదీ జరిగేది కాదు అని. 325 00:20:54,296 --> 00:20:56,006 ఆలిసన్ బతికి ఉంటే, నిజంగానే ఇదంతా జరిగేది కాదు. 326 00:20:56,006 --> 00:20:59,176 - తనని హత్య చేశారు కాబట్టే, మనం ఈ పని చేస్తున్నాం. - చిన్నప్పట్నుంచీ నాకన్నా నీకు తనంటే ఇష్టం. 327 00:20:59,176 --> 00:21:01,762 కానీ, ఇంకా నేను బతికి ఉన్న పాపానికి నేను దద్దమ్మని అని గుర్తు చేయాల్సిన పని లేదు. 328 00:21:01,762 --> 00:21:04,181 - నా ఉద్దేశం అది కాదు. - నీ ఉద్దేశం అదే. 329 00:21:04,181 --> 00:21:05,933 ఏ లోపమూ లేని, అన్నింట్లో ముందుండే అక్కయ్య, 330 00:21:05,933 --> 00:21:08,101 ఎప్పుడూ కలిసి ఉండే అక్కయ్య, హత్యకు గురైంది. 331 00:21:08,101 --> 00:21:10,604 నీకు వేరే గత్యంతరం లేక ఎందుకూ పనికి రాని నాతో ఉంటున్నావు. 332 00:21:10,604 --> 00:21:14,274 - సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. - నేను దద్దమ్మని అయినందుకు సారీ. 333 00:21:16,902 --> 00:21:18,153 షాన్ మానసికంగా కృంగిపోయి ఉన్నాడనుకున్నా. 334 00:21:19,279 --> 00:21:20,280 నువ్వు అతని దగ్గరికి వెళ్లావు. 335 00:21:20,280 --> 00:21:22,658 అతను తాగుడుకు బానిస కాకుండా నువ్వు ఆపావు. అది చాలా గొప్ప పని. 336 00:21:23,450 --> 00:21:26,119 తనే కనుక హత్యకు గురి అయ్యుంటే, ఆ త్యాగానికి మనం ఊరికే పోనివ్వకూడదు అని 337 00:21:26,119 --> 00:21:28,997 నువ్వు అన్నావు. తన త్యాగం ఊరికే పోకూడదని మనం ఏదైనా చేయాలని నువ్వు అన్నావు. 338 00:21:31,500 --> 00:21:33,669 హా, కానీ ఇప్పుడు ఏం జరుగుతోందో చూడు, బెన్! 339 00:21:33,669 --> 00:21:36,129 నా వల్ల ఒక బంధీ తప్పించుకున్నాడు, ఇప్పుడు షాన్ ఏమయ్యాడో కూడా తెలీట్లేదు. 340 00:21:37,673 --> 00:21:38,799 షాన్ వచ్చేస్తాడు. 341 00:21:38,799 --> 00:21:41,093 ఒకవేళ అతనికి ఏదైనా అయ్యుంటే, లేదా అతను దొరికిపోయి ఉంటే? 342 00:21:59,903 --> 00:22:00,904 ఏంటి? 343 00:22:02,739 --> 00:22:06,118 నేను మీకు గది నంబరు మాత్రమే ఇవ్వగలను. మీకు కొంచెం పని అయినా తగ్గుతుంది. 344 00:22:07,035 --> 00:22:08,036 థ్యాంక్యూ. 345 00:22:33,770 --> 00:22:35,480 ఎక్కడికి వెళ్లావు? 346 00:22:41,862 --> 00:22:43,113 తాతయ్య దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. 347 00:22:43,113 --> 00:22:46,491 ఆ ముసలి పీనిగుకు నా శాపనార్థాలు పెట్టకపోయావా? 348 00:22:46,491 --> 00:22:49,703 ఆ పేర్లు గల పిల్లలు పెరిగినవి, నాకు ఏడు ఇళ్లు దొరికాయి. 349 00:22:49,703 --> 00:22:53,498 లాభం లేదు. ఇంటింటికీ పంపడానికి నా దగ్గర ఏడుగురు మంచి ఏజెంట్లు లేరుగా. 350 00:22:53,498 --> 00:22:54,791 కనీసం ఒక్క మంచి ఏజెంట్ కూడా లేరు. 351 00:22:56,335 --> 00:22:59,338 ఆ ఏడింట్లో నాలుగే లండన్ కి దగ్గరగా, టైగర్ టీమ్ ఆపరేషన్ కి సరిపోయేలా ఉన్నాయి. 352 00:22:59,838 --> 00:23:01,590 దీని వల్ల ప్రయోజనం ఉంది అంటే మంచిదే, 353 00:23:01,590 --> 00:23:05,010 కానీ నాకు అనవసరమైన వివరాలేవీ అక్కర్లేదు. 354 00:23:05,010 --> 00:23:07,554 వాటిలో ఒకటి మాత్రమే వేరుగా, 355 00:23:07,554 --> 00:23:09,431 బంధీలను ఉంచడానికి వీలుగా ఉంది. 356 00:23:09,431 --> 00:23:11,391 గమ్మత్తైన విషయం ఒకటి చెప్పనా! 357 00:23:11,391 --> 00:23:12,643 ఏంటి? 358 00:23:12,643 --> 00:23:14,603 ఆ ఇల్లు డన్ కుటుంబానికి చెందినది, వాళ్లు పెళ్లిళ్లకు 359 00:23:14,603 --> 00:23:15,812 ఒక బస్సును అద్దెకి ఇస్తుంటారు. 360 00:23:15,812 --> 00:23:16,772 ఫంక్షన్లకు డన్ వారి అద్దె బస్సు 361 00:23:17,481 --> 00:23:18,398 అయితే ఏంటి? 362 00:23:18,398 --> 00:23:20,943 ఆ బస్సు ఇప్పుడు ఇక్కడ ఉంది. 363 00:23:31,078 --> 00:23:31,912 సరే. 364 00:23:33,705 --> 00:23:36,834 మనం నీ కారులో వెళ్దాం. దారిలో నేను కునుకు తీస్తా. 365 00:23:37,417 --> 00:23:39,211 కత్తి లాంటి కారును తోలే కత్తి లాంటి కుర్రాడు. 366 00:23:39,211 --> 00:23:42,548 నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా నడపాలి. 367 00:23:44,424 --> 00:23:47,010 ఒక్క విషయం చెప్పాలి, డోనొవన్ డిమాండుకు పార్క్ ఓకే అంది. 368 00:23:47,010 --> 00:23:48,428 గ్రే బుక్స్. 369 00:23:48,428 --> 00:23:51,098 ఒకరి పర్యవేక్షణలో వాళ్లని అవి ఉండే చోటుకు పంపిస్తున్నారు. 370 00:23:51,098 --> 00:23:54,601 కాబట్టి, తనని వెళ్లి విడిపించాల్సినంత పని లేదు. తనని త్వరలోనే విడుదల చేస్తారు. 371 00:23:54,601 --> 00:23:56,436 టియర్నీ కాల్ చేసిందా నీకు? 372 00:23:58,063 --> 00:24:01,859 స్టాండిష్ ని విడుదల చేయడం, చేయకపోవడం నీ చేతుల్లో ఉందా? 373 00:24:01,859 --> 00:24:04,778 కాబట్టి, నువ్వు ఏమీ అనుకోకపోతే, నేనే స్వయంగా వెళ్లి తనని విడిపించుకుంటాలే. 374 00:24:04,778 --> 00:24:06,613 కానీ నేను వెళ్లడం మీకు పర్వాలేదా? 375 00:24:07,197 --> 00:24:08,991 హా. నీకు వెళ్లాలనుంటే, వెళ్లు. 376 00:24:08,991 --> 00:24:11,451 తను నన్ను కూడా అడిగింది. తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్పా. 377 00:24:12,160 --> 00:24:13,245 ఓయ్, నువ్వు రా. 378 00:24:19,084 --> 00:24:20,752 అయ్య బాబోయ్. ఏమంటాడో ఏమో. 379 00:24:22,004 --> 00:24:23,964 మీ డెస్కుల దగ్గర మీకు సంబంధించిన వస్తువులని తీసుకెళ్లడానికి వచ్చారా? 380 00:24:23,964 --> 00:24:26,175 - చూశావా? మీ అట. - ఆగండి, ఏమంటున్నారు మీరు? 381 00:24:26,175 --> 00:24:27,551 నా ఉద్యోగం కూడా తీసేస్తున్నారా? 382 00:24:28,135 --> 00:24:31,763 బాబోయ్. వీళ్లకన్నీ విడమరిచి చెప్పాల్సి వచ్చేలా ఉందే. 383 00:24:31,763 --> 00:24:34,641 మీరు మమ్మల్సి మందలిస్తున్నారు, అంతే కదా? 384 00:24:34,641 --> 00:24:37,311 నేను వచ్చేసరికి మీ డెస్కుల దగ్గర మీకు సంబంధించిన వస్తువులు ఉంటే, 385 00:24:37,311 --> 00:24:39,980 వాటిని, ఇంకా మిమ్మల్ని కూడా తగలబెట్టేస్తాను. 386 00:24:39,980 --> 00:24:40,939 నేనేం చేశాను? 387 00:24:40,939 --> 00:24:43,275 చిన్న సూచనలను కూడా పాటించలేకపోయారు మీరు. 388 00:24:43,275 --> 00:24:46,653 ఇప్పటికీ తను తీసుకొన్న గంజాయి మత్తు ఇంకా దిగలేదు తనకి. 389 00:24:46,653 --> 00:24:48,405 - ఏ సూచనలు? - గంజాయిని ఇంకా పూర్తిగా తీసుకోలేదు నేను. 390 00:24:48,405 --> 00:24:50,490 ఆదేశాన్ని ధిక్కరించారు మీరు. 391 00:24:51,158 --> 00:24:55,245 ఆ ఇంటి గురించి స్లౌ హౌసులో ఉన్నవాళ్లకి తప్ప ఇంకెవరికీ తెలియనివ్వవద్దు అని చెప్పాను. 392 00:24:55,245 --> 00:24:58,582 కానీ అయిదు నిమిషాల్లో, మీ ప్రతిభ పుణ్యమా అని పోలీసులు అక్కడికి వచ్చి, ఆధారాలని నాశనం చేసేశారు. 393 00:24:58,582 --> 00:24:59,666 కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే, 394 00:24:59,666 --> 00:25:02,753 మీ వల్ల నా మూడ్ ఇంకా ఖరాబ్ అయ్యేలోపే, నేను బయలుదేరుతాను. 395 00:25:16,016 --> 00:25:18,227 అయ్య బాబోయ్. 396 00:25:18,227 --> 00:25:20,270 {\an8}భలేగా ఉంది కద. అమ్మాయిలు ఇట్టే పడిపోతారు. 397 00:25:20,270 --> 00:25:21,355 {\an8}పోటుగాడు 398 00:25:26,985 --> 00:25:30,239 ఇలా బయట పనికి కూడా నన్ను ఎంపిక చేసుకున్నందుకు 399 00:25:30,239 --> 00:25:32,366 చాలా ఆనందంగా ఉంది నాకు. 400 00:25:32,950 --> 00:25:34,451 నోరు మూసుకుంటావా! 401 00:25:34,451 --> 00:25:38,956 సరే. సీట్ బెల్ట్ పెట్టుకోండి. నా కారు వేగాన్ని తట్టుకోవడం చాలా కష్టం. 402 00:25:38,956 --> 00:25:43,794 లేదు, నిజంగానే చెప్తున్నా, మూసుకో. లేదంటే చచ్చేదాకా నిన్ను గుద్దుతా. 403 00:25:48,799 --> 00:25:49,800 ఇక దూసుకెళ్దాం. 404 00:25:51,760 --> 00:25:52,970 అయ్య బాబోయ్. 405 00:25:52,970 --> 00:25:54,054 క్షమించాలి. 406 00:25:54,805 --> 00:25:56,640 నా బండితో కాస్త సున్నితంగా వ్యవహరించాలి. 407 00:26:06,191 --> 00:26:09,361 అతను తప్పించేసుకున్నాడు. ఒక కారు ఆపి, దానిలో చెక్కేశాడు. 408 00:26:11,154 --> 00:26:12,364 ఇప్పుడు మనకి పెద్దగా సమయం లేదు. 409 00:26:15,284 --> 00:26:17,828 నాకు ఎంఐ5 వాళ్లు కాల్ చేశారు. నేను గ్రే బుక్స్ ఉండే చోటుకు వెళ్లాలి. 410 00:26:18,328 --> 00:26:20,289 కాబట్టి, స్టాండిష్ మనకి కావాల్సిన సమాచారం ఇవ్వాలి. 411 00:26:22,165 --> 00:26:23,208 ఆమె ఇచ్చేసింది. 412 00:26:29,715 --> 00:26:31,091 దీన్ని తన నుండి ఎలా సంపాదించారు? 413 00:26:31,091 --> 00:26:34,678 తనకి పరిస్థితి అర్థమయ్యేలా చేయగలిగాం. తనే ఇచ్చేసింది. 414 00:26:36,722 --> 00:26:39,099 సరే. బాగా చేశారు. 415 00:26:39,808 --> 00:26:40,809 అయితే ఆమెని వదిలేద్దామా? 416 00:26:40,809 --> 00:26:43,729 లేదు, పని అయ్యేదాకా మనం తనని వదిలేయమని వాళ్లకి అనిపించాలి. 417 00:26:49,776 --> 00:26:51,153 ఒకవేళ ఆమె వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే. 418 00:26:51,153 --> 00:26:52,237 దాని అవసరం నాకు లేదులే. 419 00:26:53,488 --> 00:26:54,698 దాన్ని నేను తీసుకెళ్లలేను. 420 00:26:58,202 --> 00:27:01,538 - ఇక్కడ ఉండటం కన్నా, నేను నీతో వస్తేనే మేలు. - వద్దు, వద్దు. 421 00:27:01,538 --> 00:27:03,707 నేను లోపలికి వెళ్తాను, మళ్లీ బయటకు వచ్చేస్తాను. 422 00:27:05,125 --> 00:27:07,961 పోయినసారి కూడా అలాగే చెప్పావు, కానీ రోడ్డు మీద ఒక శవాన్ని విసిరేయాల్సిన పరిస్థితి వచ్చింది. 423 00:27:10,172 --> 00:27:11,507 ఈసారి పని సక్రమంగా పూర్తయ్యేలా నేను చూసుకోవాలి. 424 00:27:14,092 --> 00:27:15,135 అలాగే. 425 00:27:31,652 --> 00:27:32,778 - హేయ్. - హాయ్. 426 00:27:35,239 --> 00:27:36,823 మీ తాతగారు ఎలా ఉన్నారు? 427 00:27:38,700 --> 00:27:40,536 హా. బాగానే ఉన్నారు. 428 00:27:42,829 --> 00:27:43,872 ఏంటి సంగతి? 429 00:27:45,707 --> 00:27:48,293 నాకు ఒక పని అప్పగించారు. 430 00:27:48,293 --> 00:27:50,754 గ్రే బుక్స్ ని చూడటానికి డోనొవన్ వస్తాడు, అతడిని లోనికి తీసుకెళ్లి, బయటకు తీసుకురావాలి. 431 00:27:51,296 --> 00:27:52,756 సరే, ఆ పని నీకు ఎవరు అప్పగించారు? 432 00:27:54,007 --> 00:27:55,008 టియర్నీ. 433 00:27:55,968 --> 00:27:57,177 సరే, పద మరి. 434 00:27:59,054 --> 00:28:00,222 ఆ పని అప్పగించింది నాకు. 435 00:28:00,764 --> 00:28:02,307 ఆ పని నువ్వు ఒక్కడివే చేయలేవు, రివర్. 436 00:28:02,307 --> 00:28:04,142 తను నన్ను ఒక్కడినే అడిగింది. 437 00:28:04,768 --> 00:28:06,979 నువ్వు ఒక్కడివే హీరో అయిపోదాం అనుకుంటున్నావా? 438 00:28:07,646 --> 00:28:10,732 హీరో అవ్వడం గురించి కాదు. నాకు చెప్పిన పని నేను చేస్తున్నాను, అంతే. 439 00:28:11,316 --> 00:28:12,609 అది పెద్ద విషయం కాదని నువ్వు చెప్పవచ్చు, 440 00:28:12,609 --> 00:28:15,320 ఫస్ట్ డెస్క్ నీకు ఒక్కడికే ఒక పని అప్పగించిందని నువ్వు ఆనందంగా ఉన్నావు, 441 00:28:15,320 --> 00:28:17,072 కానీ ఏదైనా అటూఇటూ కావచ్చని నీకు అనిపించనే లేదు. 442 00:28:18,365 --> 00:28:19,908 ఏదైనా అటూఇటూ కావచ్చని నీకు ఎందుకు అనిపిస్తోంది? 443 00:28:19,908 --> 00:28:21,326 నీ ట్రాక్ రికార్డ్ అలాంటిది. 444 00:28:21,326 --> 00:28:22,327 అవును. 445 00:28:22,828 --> 00:28:24,496 చూడు, నేను సాయంగా వద్దామనుకుంటున్నా, అంతే. 446 00:28:24,496 --> 00:28:27,207 సరే, అందుకు థ్యాంక్స్, కానీ నాకు నీ సాయం అక్కర్లేదు. 447 00:28:28,250 --> 00:28:30,502 నాకు జ్ఞానబోధ అక్కర్లేదులే. 448 00:28:30,502 --> 00:28:32,754 బాబోయ్, నీ అహంకారమే నీకు పెద్ద లోపం. 449 00:28:32,754 --> 00:28:35,007 ఓయబ్బో. లోపాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? 450 00:28:35,007 --> 00:28:37,217 లేదు, నా లోపాల గురించి నాకు బాగా తెలుసు. 451 00:28:37,217 --> 00:28:40,804 కామెడీ ఏంటంటే, నువ్వు అలా చెప్పడం వలన నీకు ఏమీ తెలీదన్న విషయం తెలిసిపోతోంది. 452 00:28:40,804 --> 00:28:42,806 డోనొవన్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. 453 00:28:43,390 --> 00:28:46,018 అతను స్పైడర్ ని చంపేశాడు. కాబట్టి నీకు సాయం అవసరం. అంతే. 454 00:28:46,685 --> 00:28:49,271 బాబోయ్, ఆఫీసులో తుపాకీ ఎప్పట్నుంచీ పెడుతున్నావు? 455 00:28:50,439 --> 00:28:52,441 ఇక్కడికి నేను తుపాకీని తీసుకువస్తున్నానని సులభంగానే కనిపెట్టేయవచ్చు. 456 00:28:54,735 --> 00:28:58,739 సరే. నువ్వు కూడా రావచ్చు, కానీ నేనే నాయకత్వం వహిస్తాను. తుపాకీ కూడా నా దగ్గరే ఉండాలి. 457 00:28:59,239 --> 00:29:01,783 లేదు. తుపాకీ నా దగ్గరే ఉంటుంది. 458 00:29:02,659 --> 00:29:04,828 నువ్వు పిస్తాలా కనిపించాలనుకుంటే, పిస్తా అనే బ్యాడ్జ్ చేయించుకొని, 459 00:29:04,828 --> 00:29:06,288 దాన్ని తగిలించుకొని పద. 460 00:29:24,014 --> 00:29:26,225 - హలో. మీకు అపాయింట్మెంట్ ఉందా? - ఉందమ్మా. 461 00:29:26,225 --> 00:29:29,144 - పేరు చెప్పండి. - మిక్కీ మౌస్ ని కలవడానికి వచ్చిన జేమ్స్ బాండ్. 462 00:29:32,689 --> 00:29:33,941 వద్దు, థ్యాంక్స్. 463 00:29:37,778 --> 00:29:41,657 పనిలేని దదమ్మల్లారా, చెప్పేది వినండి. అందరూ సిద్ధం అవ్వండి. 464 00:29:41,657 --> 00:29:45,536 మీరు కన్న కలలన్నీ ఇప్పుడు నిజం అవ్వనున్నాయి. 465 00:29:45,536 --> 00:29:47,079 ఏంటి ఇదంతా? 466 00:29:47,079 --> 00:29:51,500 జనరల్ మోంటీత్, మీ బుడ్డ టీమ్ కాస్త అతి చేస్తున్నట్టుందిగా. ఏమంటారు? 467 00:29:52,960 --> 00:29:53,961 ఇంతకీ ఎవరు నువ్వు? 468 00:29:54,461 --> 00:29:55,712 నిక్ డఫీ. 469 00:29:56,213 --> 00:29:59,508 ఇంగ్రిడ్ టియర్నీ గారు నన్ను పంపారు. పార్క్ నుండి వచ్చాను. 470 00:30:00,717 --> 00:30:02,135 ఇప్పుడు ఓడలు బళ్లూ, బళ్లు ఓడలయ్యాయి, 471 00:30:03,136 --> 00:30:08,016 అంటే ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం నుండి నేర్చుకుంటుంది అన్నమాట. 472 00:30:08,016 --> 00:30:09,101 అవునా? 473 00:30:09,643 --> 00:30:13,105 మా మనిషి తప్పించుకొని వచ్చాడు, కాబట్టి స్టాండిష్ ని ఎక్కడ బంధించి ఉంచారో మాకు తెలిసిపోయింది. 474 00:30:13,105 --> 00:30:14,273 అంటే, మీరు నియమించుకొన్న బృందం జాడ 475 00:30:14,273 --> 00:30:18,277 ఇప్పటికి తెలిసింది అన్నమాట. మీరు చెప్పేది అదేనా? 476 00:30:18,277 --> 00:30:19,987 మీరు సూపర్, జనరల్. 477 00:30:20,696 --> 00:30:22,322 ఇప్పుడు వాళ్లని అదుపులోకి తీసుకోవడానికే వెళ్తున్నాం. 478 00:30:22,322 --> 00:30:24,449 లేదు. మీరు ఎక్కడికీ వెళ్లడం లేదు. 479 00:30:25,659 --> 00:30:30,873 ముందుగా, మీకంత సీన్ లేదు. అంతే కదా? మీరందరూ టుమ్రీగాళ్లు. 480 00:30:30,873 --> 00:30:32,624 నేను కూడా పని చేశాను. 481 00:30:33,792 --> 00:30:36,044 ఎక్కడ? మెక్ డొనాల్డ్స్ లోనా? 482 00:30:37,129 --> 00:30:40,382 అదీగాక, వాళ్లు ఇక్కడికి రానున్నారు. 483 00:30:40,382 --> 00:30:44,303 వాళ్లలో కొందరు ఎంఐ5, పత్రాలు స్టోర్ చేసే కేంద్రానికి వెళ్తున్నారు. 484 00:30:44,303 --> 00:30:49,933 స్టాండిష్ విడుదలకు వాళ్లు ఓకే అన్నాక మనమందరమూ వెళ్లి వాళ్ల సంగతి చూడాలి. 485 00:30:50,559 --> 00:30:52,019 మేమెందుకు ఈ పని చేయాలి? 486 00:30:52,853 --> 00:30:56,190 మీరే కదా ఈ పెంట పని చేసింది! మీ బుడ్డ సంస్థ పిచ్చిది. 487 00:30:56,773 --> 00:31:00,319 దానికి పిచ్చి పేరు పోయి మంచి పేరు వచ్చే అవకాశాన్ని మేము ఇస్తున్నాం. ఒప్పుకోండి. 488 00:31:01,320 --> 00:31:04,990 కాబట్టి మీరందరూ సంసిద్ధం కండి. మీరెవరైనా కానీ సిద్దం అవ్వండి. 489 00:31:04,990 --> 00:31:08,619 ఇక మీరు టైగర్ టీమ్ గురించి అన్ని వివరాలనూ కక్కేయండి, 490 00:31:08,619 --> 00:31:11,914 ఎందుకంటే, వాళ్ళ పుంగి భజాయించడానికి వాళ్ల వివరాలన్నీ నాకు కావాలి. 491 00:31:23,884 --> 00:31:26,094 మేడమ్, మేము స్టోరేజ్ కేంద్రానికి బయలుదేరుతున్నాం. 492 00:31:26,094 --> 00:31:28,388 మంచిది. మోంటీత్ ని బెంబేలెత్తించారనే ఆశిస్తున్నా. 493 00:31:28,388 --> 00:31:31,266 హా. మనోడు బెదిరిపోయాడు. 494 00:31:31,266 --> 00:31:34,269 ఇవాళ నువ్వు చాలా మంచి పని చేశావు, నిక్. థ్యాంక్యూ. 495 00:31:34,269 --> 00:31:36,021 నా పని నేను చేస్తున్నా, మేడమ్. 496 00:31:36,021 --> 00:31:39,358 ఇలాగే నా కోసం ఇంకా చేస్తావని ఆశిస్తున్నా. 497 00:31:41,610 --> 00:31:43,612 అయితే, మా కమాండ్ టావెర్నర్ కి అప్పగించకుండా మీరే కొనసాగించబోతున్నారా? 498 00:31:44,154 --> 00:31:46,114 హా, ఆ పనే చేస్తాననుకుంటా. 499 00:31:46,865 --> 00:31:48,408 ఇప్పటికే తనకి చాలా పనులున్నాయి. 500 00:31:48,408 --> 00:31:49,785 అది నీకు ఓకే అనే అనుకుంటున్నా. 501 00:31:50,285 --> 00:31:51,370 అవును, మేడమ్. 502 00:31:52,371 --> 00:31:53,372 మంచిది. 503 00:31:53,872 --> 00:31:56,667 టైగర్ టీమ్ గురించి కొన్ని వివరాలు సంపాదించాను. వాళ్లు మొత్తం ముగ్గురు. 504 00:31:56,667 --> 00:31:58,752 బృంద నాయకుని పేరు షాన్ డోనొవన్. 505 00:31:58,752 --> 00:32:00,254 అతను గతంలో ఎంబసీ సెక్యూరిటీలో పని చేశాడు. 506 00:32:00,879 --> 00:32:02,673 చివరిసారిగా ఇస్తాంబుల్ లో పని చేశాడు. 507 00:32:05,425 --> 00:32:06,635 ఇస్తాంబుల్? 508 00:32:06,635 --> 00:32:09,638 అవును. కాబట్టి అతను ప్రొఫెషనల్, మిగతా ఇద్దరు ప్రొఫెషనల్స్ కాదు. 509 00:32:09,638 --> 00:32:10,806 వాళ్లు అన్నాచెలెళ్లు అన్నమాట. 510 00:32:11,515 --> 00:32:14,393 వాళ్లిద్దరిలో ఒకరికి సైన్యంలో పని చేసిన అనుభవం ఉంది, అది కూడా చాలా తక్కువ. 511 00:32:14,393 --> 00:32:15,602 అతను వాళ్లని ఎందుకు పెట్టుకున్నాడు? 512 00:32:15,602 --> 00:32:17,187 ఎంబసీలో ఉండగా, 513 00:32:17,187 --> 00:32:20,649 అతను వాళ్ల అక్కతో పని చేసేవాడట. 514 00:32:21,525 --> 00:32:23,151 ఆ అక్క పేరేంటి? 515 00:32:23,151 --> 00:32:25,737 ఆలిసన్ డన్. మన ఏజెంటే ఆమె కూడా. 516 00:32:25,737 --> 00:32:28,448 కిందటి ఏడాది చనిపోయింది. ఆత్మహత్య చేసుకుంది. 517 00:32:29,867 --> 00:32:32,703 హా, ఆ పేరు విన్నాను. 518 00:32:33,745 --> 00:32:35,956 థ్యాంక్యూ, నిక్. తర్వాత ఫోన్ చేస్తా. 519 00:32:38,500 --> 00:32:40,669 అత్యంత రహస్యం - డన్, ఆలిసన్ హెలెన్ వ్యక్తిగత డేటా - సర్వీస్ రికార్డ్ 520 00:32:40,669 --> 00:32:42,421 {\an8}ఏ. డన్ ఆత్యహత్యకు సంబంధించిన నివేదిక 521 00:32:48,677 --> 00:32:49,928 ఫస్ట్ డెస్క్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది పాస్వర్డ్ 522 00:32:49,928 --> 00:32:51,889 ఏ. డన్ హత్యకు అనుమతికి సంబంధించిన నివేదిక 523 00:32:51,889 --> 00:32:53,432 వర్గీకరణ, హత్య 524 00:33:13,702 --> 00:33:14,912 ఇంగ్రిడ్ గారు. 525 00:33:16,914 --> 00:33:18,957 నాకు తెలిసి, మీరు ఇక్కడికి ఎప్పుడూ రాలేదు కదా. 526 00:33:19,708 --> 00:33:23,045 ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. ఎలా ఉన్నావు, మోలీ? 527 00:33:23,045 --> 00:33:24,254 అందరూ బాగానే చూసుకుంటున్నారా? 528 00:33:24,254 --> 00:33:26,757 లేదు. కానీ నాకు ఇలానే ఇష్టం. 529 00:33:28,217 --> 00:33:31,637 ఇరవై ఏడవ అర ఖాళీగా ఉందే. 530 00:33:31,637 --> 00:33:35,933 అవన్నీ అస్సలు పనికిరాని ఫైళ్లు. వాటిలో సగం ఫైళ్లకి కోడ్స్ ఉన్నాయి, ఆ కోడ్లకు సైఫర్ కూడా పోయింది. 531 00:33:36,517 --> 00:33:39,269 కాబట్టి, కోరినట్టుగానే వాటిని నాశనం చేసేశామా? 532 00:33:40,395 --> 00:33:43,565 నిజానికి, ఆఖరి నిమిషంలో నాశనం చేయవద్దని చెప్పారు. 533 00:33:44,191 --> 00:33:45,943 వాటిని స్టోరేజ్ కేంద్రానికి తరలించడం జరిగింది. 534 00:33:45,943 --> 00:33:47,110 ఎందుకు నాశనం చేయవద్దన్నారు? 535 00:33:47,110 --> 00:33:51,615 తెలీదు. ఫారంలో వేరే పెట్టెని టిక్ చేసి ఉంది, అంతే. 536 00:33:53,158 --> 00:33:54,243 ఏమైనా సమస్యనా? 537 00:33:54,993 --> 00:33:55,994 సమస్య కాదనే ఆశిస్తున్నా. 538 00:33:56,745 --> 00:33:58,747 దానికి కారణమైన వ్యక్తి పేరు కావాలంటే, 539 00:33:58,747 --> 00:34:01,458 ఆ వ్యక్తి ఎవరో మీకు డయానా టావెర్నర్ చెప్పగలరు. 540 00:34:01,458 --> 00:34:04,378 స్టోరేజ్ కేంద్రానికి తరలించే ఫైళ్ల గురించి ఆమెకి తెలుసు. 541 00:34:06,088 --> 00:34:09,466 సరే, తననే కనుక్కుంటాను. థ్యాంక్యూ, మోలీ. 542 00:34:38,996 --> 00:34:41,039 ల్యాంబ్ ఇంతకు ముందు ఒకటి అన్నాడు కదా? 543 00:34:44,126 --> 00:34:44,960 అదే... 544 00:34:47,588 --> 00:34:53,302 మొదటిది, నువ్వు సుమారుగా 15 హెచ్ఆర్ నియమాలను అయినా 545 00:34:53,302 --> 00:34:54,386 అతిక్రమించి ఉంటావని అన్నాడు కదా. 546 00:34:55,469 --> 00:34:56,889 నేను ఇష్టం వచ్చినట్టు శృంగారంలో పాల్గొంటున్నాననా? 547 00:34:57,639 --> 00:34:58,640 అవును. 548 00:34:59,808 --> 00:35:02,269 స్టేషనరీ కప్ బోర్డులో అతను నాతో శృంగారం జరిపాడని అనుకుంటున్నావా? 549 00:35:03,604 --> 00:35:06,899 లేదు. నేను అలా... లేదు. 550 00:35:09,443 --> 00:35:13,989 నేను మరేం పర్వాలేదు అని చెప్పబోతున్నా. 551 00:35:15,324 --> 00:35:16,658 అది అతనికి సంబంధించిన విషయం కాదు. 552 00:35:17,326 --> 00:35:21,788 ఎందుకంటే, బాధ నుండి బయటపడటానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. 553 00:35:23,498 --> 00:35:26,460 ఏంటి... నాకు అర్థం కావట్లేదు. మరేం పర్వాలేదు అని దేని గురించి అన్నావు? 554 00:35:27,544 --> 00:35:28,545 అదే. 555 00:35:30,923 --> 00:35:33,383 నువ్వు బాధని ఎలా ఎదుర్కొంటున్నావు అనే దాని గురించి. 556 00:35:33,884 --> 00:35:35,636 బాబోయ్. కార్ట్ రైట్, నువ్వు మాట్లాడటం ఆపు. 557 00:35:35,636 --> 00:35:38,555 సారీ. నువ్వు సైకాలజిస్టును సంప్రదిస్తే బాగుంటుందని అని చెప్పుండాల్సింది. 558 00:35:38,555 --> 00:35:39,640 నా శృంగార జీవితం గురించా? 559 00:35:40,849 --> 00:35:42,059 కాదు, మిన్ గురించి. 560 00:35:42,768 --> 00:35:44,311 సరే. నా... 561 00:35:45,062 --> 00:35:47,314 జనాలు అలా అన్నప్పుడు మండుతుంది నాకు. 562 00:35:47,314 --> 00:35:48,815 - ఏంటి... - అది చాలా తేలికైన... 563 00:35:48,815 --> 00:35:50,192 ఇంతకీ నేను ఏం చెప్పాలి? 564 00:35:51,193 --> 00:35:52,653 - నువ్వేం చెప్పాలో నాకు తెలీదు. - అదే కదా. 565 00:35:52,653 --> 00:35:55,739 ఏం చెప్పినా, ఇప్పుడు ఒరిగేదేమైనా ఉందా? 566 00:35:56,490 --> 00:35:57,574 ఏమీ లేదు కదా. 567 00:35:58,659 --> 00:36:01,495 అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. మనం వాటిని అధిగమించి, ముందుకు సాగిపోవాలి. 568 00:36:01,495 --> 00:36:06,208 అదే జీవితం అంటే. ముందుకు సాగిపోవాలి. అది తప్ప మనమేం చేయలేం. 569 00:36:06,208 --> 00:36:08,502 చచ్చే దాకా మనం ముందుకు సాగుతూ ఉండాలి. 570 00:36:13,423 --> 00:36:15,634 హా, నువ్వు అన్నది నిజమే. అది ముమ్మాటికీ నిజమే. 571 00:36:15,634 --> 00:36:18,637 - నీ పరిస్థితి చాలా బాగుందన్నట్టు మాట్లాడుతున్నావు. - అవునా? మరి నీ పరిస్థితి? 572 00:36:19,346 --> 00:36:21,557 - మధ్యలో... నా పరిస్థితి... - నువ్వు పిస్తావని నిరూపించుకోవాలని 573 00:36:21,557 --> 00:36:23,725 నీకు ఎప్పుడూ ఉంటుంది, ఆ విషయమై నువ్వు సైకాలజిస్టును కలవవచ్చు కదా? 574 00:36:24,434 --> 00:36:26,311 మీ నాన్న ఎవరో నీకు తెలీదని, మీ అమ్మ కూడా నిన్ను వదిలేసిందని, 575 00:36:26,311 --> 00:36:28,897 అందుకే నీలో ఏదో లోపం ఉందని నీకు అనిపిస్తూ ఉంటుందని వాళ్లు చెప్తారు. 576 00:36:28,897 --> 00:36:31,149 అదీగాక, మీ తాతయ్య అంత గొప్పవాడిగా అవ్వాలని ప్రయత్నించినప్పుడల్లా 577 00:36:31,149 --> 00:36:32,609 నీ చేతకానితం మరింతగా బయటపడుతూ ఉంటుంది. 578 00:36:36,196 --> 00:36:38,198 బాబోయ్. నీకు బాధ దూరం చేద్దామని నాలుగు మంచి మాటలు చెప్పాను. 579 00:36:38,198 --> 00:36:41,034 కానీ నా బాధ దూరం చేయమని నేను అడిగానా, రివర్? నాకు ఏ సాయమూ అక్కర్లేదు. 580 00:36:41,034 --> 00:36:44,204 అవునులే. నువ్వు అడగలేదు. అస్సలు అడగలేదు. సరే. 581 00:36:44,204 --> 00:36:46,164 అసలు నీకు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? 582 00:36:57,759 --> 00:36:59,094 ఏం చేస్తున్నావు? 583 00:36:59,094 --> 00:37:01,263 ఏమో. 584 00:37:03,140 --> 00:37:06,268 ఇక చాలు, నాకు కాస్త అసౌకర్యంగా, ఇంకా ఎబ్బెట్టుగా ఉంది... సరే. 585 00:37:08,103 --> 00:37:10,856 - కానీ కాస్త బాగా అనిపిస్తోంది కదా? - హా, అవును. 586 00:37:11,690 --> 00:37:12,774 దేవుడా. 587 00:37:18,864 --> 00:37:19,865 అతడిని మిస్ అవుతున్నా. 588 00:37:23,952 --> 00:37:25,162 చాలా మిస్ అవుతున్నా. 589 00:37:29,291 --> 00:37:30,417 హా, తెలుసు. 590 00:37:35,297 --> 00:37:36,965 ఒక్క నిమిషం. నువ్వు ఎవరిని కోల్పోయావు? 591 00:37:40,135 --> 00:37:42,846 కోల్పోలేదు. కోల్పోతూ ఉన్నా. 592 00:37:44,681 --> 00:37:46,141 ఇప్పుడు ఒకరిని కోల్పోతూ ఉన్నాను. 593 00:37:47,309 --> 00:37:48,352 నిజంగానా? ఎవరిని? 594 00:37:50,979 --> 00:37:51,980 డోనొవన్. 595 00:37:51,980 --> 00:37:53,232 ఏంటి? 596 00:37:54,149 --> 00:37:55,234 అది కాదు. డోనొవన్. 597 00:38:15,546 --> 00:38:17,339 నా పేరు రివర్ కార్ట్ రైట్. తను లుయీసా గై. 598 00:38:17,339 --> 00:38:21,301 మీకు కావాల్సింది మీరు చూశాక, క్యాథరిన్ స్టాండిష్ ని వదిలేయాలి. 599 00:38:21,301 --> 00:38:22,469 అర్థమైందా? 600 00:38:23,679 --> 00:38:24,805 ఇంతకీ తను ఎలా ఉంది? 601 00:38:25,472 --> 00:38:27,391 - ఏమీ కాలేదు కదా తనకి? - ఏమీ కాలేదు. 602 00:38:30,394 --> 00:38:32,896 ఉదయం మీరు పార్కులోకి చాలా బాగా, చాకచక్యంగా ప్రవేశించారు. 603 00:38:33,772 --> 00:38:35,941 దాని వల్ల మీకు సమస్యలు ఎదురయ్యుంటే, సారీ. 604 00:38:37,109 --> 00:38:38,110 పర్వాలేదులే. 605 00:38:39,862 --> 00:38:41,321 మనం వెళ్లాల్సిన ప్రదేశం ఇదేనా? 606 00:38:42,197 --> 00:38:44,408 ఓరి నీ వేషాలో! 607 00:38:45,200 --> 00:38:46,201 చేతులు చాచండి. 608 00:38:52,457 --> 00:38:53,542 ఎవరైనా వచ్చి చూస్తారా? 609 00:38:54,084 --> 00:38:56,128 - నేను చేయను. నువ్వే. - నేను... నువ్వు... 610 00:38:57,754 --> 00:38:58,755 సరే. 611 00:39:32,873 --> 00:39:35,792 దయచేసి మీ సర్వీస్ ఐడీలను స్కానర్ ముందు పెట్టండి. 612 00:39:41,256 --> 00:39:45,052 {\an8}మీ సర్వీస్ ఫోటోలో ఉన్న హెయిర్ స్టయిల్ వేరుగా ఉంది. 613 00:39:46,845 --> 00:39:47,846 నేను డై చేసుకున్నాలే. 614 00:39:47,846 --> 00:39:49,306 మామూలుగా ఉంటేనే బాగుంది. 615 00:39:50,182 --> 00:39:51,225 తలుపు తెరవండి. 616 00:39:51,225 --> 00:39:52,559 జాబితాలో మీ పేరు లేదు. 617 00:39:52,559 --> 00:39:54,686 తొక్కలే. మూసుకొని తలుపు తెరవండి! 618 00:39:54,686 --> 00:39:57,147 - సరే మరి. నేను ప్రయత్నిస్తాను. - దేవుడా. 619 00:40:02,402 --> 00:40:03,487 కార్ట్ రైట్. 620 00:40:03,987 --> 00:40:06,114 - మన్నించాలి. మనకి పరిచయం ఉందా? - లేదు, లేదు. 621 00:40:06,114 --> 00:40:07,574 కానీ మీ పనితనం నాకు తెలుసులెండి. 622 00:40:07,574 --> 00:40:13,205 మీరు ఫైళ్లను సర్దే విధానం ఉందే, ఇలా ఫ్రెంచిలో అంటున్నందుకు మన్నించండి, "అబ్సొలుమెంట్ మెర్డ్". 623 00:40:13,205 --> 00:40:16,291 అంటే తెలుగులో "పరమ చెత్తగా ఉంది" అని అర్థం. 624 00:40:16,291 --> 00:40:19,086 హా, సరే, చూడండి. వీళ్లు గ్రే బుక్స్ చూడాలి, 625 00:40:19,086 --> 00:40:20,420 వీళ్లకి తోడుగా మేము రావాలి. 626 00:40:20,420 --> 00:40:22,756 - కానీ మీరు వస్తున్నట్టు నాకు తెలీదే. - ఇంగ్రిడ్ టియర్నీ మమ్మల్ని పంపింది. 627 00:40:22,756 --> 00:40:25,759 ఆమె ఎవరో తెలుసా? ఎంఐ5 హెడ్. ఆమెకి కాల్ చేసి కనుక్కుంటారా? 628 00:40:25,759 --> 00:40:26,885 అక్కర్లేదు. 629 00:40:26,885 --> 00:40:29,763 మీరు వస్తున్నట్టు నాకు తెలీదు అన్నాను, కానీ మిమ్మల్ని రానివ్వను అనలేదే. రండి. 630 00:40:37,020 --> 00:40:38,605 డగ్లస్ సామ్రాజ్యంలోకి స్వాగతం. 631 00:40:48,949 --> 00:40:51,869 సరే. మీకు అంతా చూపమంటారా? 632 00:40:51,869 --> 00:40:52,870 వద్దు. 633 00:40:53,996 --> 00:40:55,706 - ముఖ్యమైన ప్రదేశాలను అయినా చూపనా? - వద్దు. 634 00:40:55,706 --> 00:40:58,250 గ్రే బుక్స్ ఎక్కడ ఉంటాయో చూపండి చాలు. 635 00:40:59,293 --> 00:41:01,336 నా అభిప్రాయంలో, అవి కూడా చాలా ముఖ్యమైనవే. 636 00:41:01,336 --> 00:41:02,629 భలే ఆసక్తికరంగా ఉంటాయి. 637 00:41:03,547 --> 00:41:06,925 దయచేసి నాతో పాటు ముఖ్యమైన ప్రాంతానికి రండి, అక్కడి నుండి మీరు వెళ్లవచ్చు. 638 00:41:08,927 --> 00:41:11,471 హేయ్, మీ జుట్టు రంగు కూడా చాలా మారింది. 639 00:41:11,471 --> 00:41:13,807 తెలుసు. నేనే దగ్గర ఉండి మార్పించుకున్నాను. 640 00:41:14,725 --> 00:41:17,311 ఆ గది ఉండే చోటును ఇక్కడ గుర్తు పెడుతున్నాను. 641 00:41:18,228 --> 00:41:23,108 ఆ గదిలోకి వెళ్లాక, నేను రాస్తున్న షెల్ఫ్, ఇంకా వరుస నంబర్ వద్దకు వెళ్లి చూడండి. 642 00:41:24,276 --> 00:41:25,277 పండగ చేసుకోండి. 643 00:41:26,778 --> 00:41:27,863 తప్పకుండా. 644 00:41:54,765 --> 00:41:57,226 మీరెవరు? 645 00:42:02,314 --> 00:42:05,943 హా, అది ఇక్కడ ఉండాలి. హా, ఇటే. 646 00:42:07,027 --> 00:42:11,114 ఇదే. డగ్లస్ చెప్పినట్టుగా, షెల్ఫ్ నంబర్లు... 647 00:42:11,114 --> 00:42:12,199 అయ్య బాబోయ్! 648 00:42:12,699 --> 00:42:13,825 ఏం చేస్తున్నారు మీరు? 649 00:42:13,825 --> 00:42:15,911 - డోనొవన్. ఏం చేస్తున్నారు మీరు? - ఆగండి. 650 00:42:16,495 --> 00:42:18,038 - ఆగమన్నానా! - ఓయ్... 651 00:42:19,540 --> 00:42:21,166 ఓరి దేవుడా. చాలా పెద్ద శబ్దం వచ్చింది. 652 00:42:21,166 --> 00:42:22,209 మోకాళ్ల మీద కూర్చోండి. 653 00:42:24,211 --> 00:42:25,671 మేము ఇక్కడికి ఒకదాని కోసం వచ్చాం. 654 00:42:25,671 --> 00:42:26,755 గ్రే బుక్స్ కోసమే కదా. 655 00:42:26,755 --> 00:42:28,048 దాని తీసుకోవడానికని వెళ్తున్నాం. 656 00:42:28,048 --> 00:42:31,134 - అవి ఇక్కడ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? - మీరు నన్ను కాల్చవచ్చు. 657 00:42:31,134 --> 00:42:34,221 కానీ తూటా నా వీపులో దిగుతుంది, పైగా నా దగ్గర ఆయుధమేమీ లేదు, 658 00:42:34,221 --> 00:42:35,722 అది మీకే మంచిది కాదు. 659 00:42:36,723 --> 00:42:39,268 ఎలాగూ, హత్యలను కప్పిపుచ్చడంలో మీరు నేర్పరులే అనుకోండి. 660 00:42:39,268 --> 00:42:40,894 ఇప్పుడు మేము వెనక్కి తిరుగుతున్నాం. 661 00:42:40,894 --> 00:42:42,896 మాకు కావాల్సింది దొరికేదాకా మేము నడుస్తూనే ఉంటాం. 662 00:42:42,896 --> 00:42:43,981 అది జరగని పని. 663 00:42:44,481 --> 00:42:45,774 - వాళ్లు వెళ్తున్నారు. - నేను... 664 00:42:47,234 --> 00:42:49,444 నువ్వు ఊరికే బెదిరిస్తున్నావని అన్నారు, నువ్వు చేసింది కూడా అదే. 665 00:42:49,945 --> 00:42:51,697 నువ్వు కూడా నీ బాధ్యత బాగానే నిర్వర్తిస్తున్నావు, థ్యాంక్స్. 666 00:42:57,202 --> 00:42:58,704 - మేడమ్. - వాళ్లు బయటకు వచ్చారా? 667 00:42:58,704 --> 00:42:59,830 ఇంకా రాలేదు. 668 00:43:00,330 --> 00:43:01,915 డోనొవన్ కి కావాల్సింది గ్రే బుక్స్ కాదు. 669 00:43:01,915 --> 00:43:05,669 ఎవరో అతని కోసం అక్కడ ఏదో దాచి ఉంచారు, దాని కోసమే అతను వచ్చాడు. కానీ, అది బయటపడకూడదు. 670 00:43:06,545 --> 00:43:08,380 - అర్థమైంది. - అతను కూడా. 671 00:43:09,256 --> 00:43:10,966 అతని పక్కన ఉన్న వాళ్లందరూ కూడా. 672 00:43:10,966 --> 00:43:12,509 అతను వాళ్లకి ఏం చెప్పుంటాడో ఏమో. 673 00:43:12,509 --> 00:43:15,888 ఇదంతా సర్వీస్ మంచి కోసమే. అర్థమైందా? 674 00:43:17,472 --> 00:43:19,057 "అందరినీ లేపేయాలి" అని అంటున్నారా? 675 00:43:20,601 --> 00:43:21,602 అవును. 676 00:43:22,936 --> 00:43:24,062 అందరినీ లేపేయాలి. 677 00:43:33,197 --> 00:43:34,198 ప్లాన్ మారింది. 678 00:43:35,032 --> 00:43:37,117 అందరూ దిగండి. ఆయుధాలతో సిద్ధంగా ఉండండి. 679 00:43:38,952 --> 00:43:41,538 - కానివ్వండి. త్వరగా దిగండి. ఒకవేళ... - మీరు అదృష్టవంతులు. 680 00:43:41,538 --> 00:43:43,957 శవాలు లేపడానికి ఇప్పుడు మీకు అవకాశం దక్కింది. 681 00:43:43,957 --> 00:43:47,544 దేవుడా. మీరు పైన పటారం, లోన లొటారంలా ఉన్నారు. 682 00:43:47,544 --> 00:43:50,130 ఆయుధాలతో సిద్ధంగా ఉండండి. నిజంగా కాల్చాల్సి ఉంటుంది. 683 00:43:50,130 --> 00:43:53,509 అదుపులోకి తీసుకోవాలి అన్న ఆలోచనే వద్దు. చంపాలన్న ఉద్దేశంతోనే కాల్చండి. 684 00:43:54,134 --> 00:43:58,680 ఆ కేంద్రం లోపల ఉన్న వాళ్లందరికీ నేటితో ఈ భూమ్మీద నూకలు చెల్లిపోవాలి. 685 00:45:13,755 --> 00:45:15,757 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్