1 00:00:17,309 --> 00:00:19,311 - పదండి, పదండి! - రీలోడ్ చేస్తున్నా. 2 00:00:19,311 --> 00:00:21,563 బాంబు పెట్టేశా. దాక్కోండి. 3 00:00:22,856 --> 00:00:25,317 మీరు ఒక ఎంఐ5 ఏజెంటుని చంపేశారు. 4 00:00:25,317 --> 00:00:28,946 అవునా? మమ్మల్ని పంపించింది కూడా వాళ్లేనే, తిక్కదానా! 5 00:00:31,281 --> 00:00:32,573 నీ స్నేహితుడు ప్రాణాలతోనే ఉన్నాడేమో. 6 00:00:32,573 --> 00:00:34,660 అతనికి సాయం చేయాలనుంటే, నీకు కవర్ కావాలి. 7 00:00:35,494 --> 00:00:37,704 దేవుడా. ఇదంతా ఎందుకు జరుగుతోంది? 8 00:00:38,372 --> 00:00:39,748 రివర్! 9 00:00:39,748 --> 00:00:41,166 నేను అతని దగ్గరికి చేరుకోవడం కష్టం. 10 00:00:42,417 --> 00:00:43,418 నిన్ను నేను కవర్ చేస్తా. 11 00:00:48,048 --> 00:00:49,800 మూడు, రెండు, ఒకటి. 12 00:00:53,262 --> 00:00:57,099 రివర్! రివర్, కళ్లు తెరువు. రివర్, కళ్లు తెరువు, లేయ్. 13 00:00:59,059 --> 00:01:00,644 నా మాటలు వినిపిస్తున్నాయా? రివర్, లేయ్. 14 00:01:00,644 --> 00:01:03,313 రివర్, కళ్లు తెరువు. లేయ్. రివర్. 15 00:01:04,022 --> 00:01:05,274 హమ్మయ్య. లేయ్. 16 00:01:06,108 --> 00:01:08,902 ఇటు చూడు. నన్ను చూడు. లేయ్. 17 00:01:08,902 --> 00:01:11,280 మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. పైకి లేయ్. లేయ్. 18 00:01:16,910 --> 00:01:18,412 ఒకడు లోపలికి వచ్చాడు! 19 00:01:19,663 --> 00:01:22,583 వెనక్కి పదండి. వెనుదిరగండి. 20 00:01:41,685 --> 00:01:43,562 - నిలబడగలవా? - హా. 21 00:01:46,523 --> 00:01:47,357 డఫీ, ప్రతిస్పందించు. 22 00:01:48,942 --> 00:01:51,111 - హలో? - ఇంకొందరిని పంపించగలవా? 23 00:01:51,111 --> 00:01:54,156 - ఏమైంది? - ప్రతిఘటన మనం అనుకున్నదాని కన్నా ఎక్కువగా ఉంది. 24 00:01:54,740 --> 00:01:57,367 అబ్బా, ఫెన్విక్, మీరందరూ ఆరితేరినోళ్లు అనుకున్నానే! 25 00:01:57,367 --> 00:01:58,994 కాస్త మనుషులని పంపిస్తావా? 26 00:02:00,245 --> 00:02:03,373 మీ నలుగురూ కిందికి వెళ్లండి. త్వరగా వెళ్లండి. 27 00:02:07,628 --> 00:02:10,380 - బాబోయ్. తుపాకీ ఏది? - నా దగ్గర ఉంది. 28 00:02:10,380 --> 00:02:11,548 ఇలా ఇవ్వు. 29 00:02:11,548 --> 00:02:12,966 లేదు, నీ వంతు అయిపోయింది. 30 00:02:12,966 --> 00:02:14,176 అబ్బా, ఇలా... 31 00:02:14,176 --> 00:02:15,677 ఓయ్, వెళ్దాం పదండి. 32 00:02:16,220 --> 00:02:18,055 ఒక్క నిమిషం. వాళ్లు ఉన్నారుగా? 33 00:02:18,055 --> 00:02:19,640 ఏం కాదులే. వాళ్లు తోకముడిచేశారు. 34 00:02:30,984 --> 00:02:33,278 సొరంగం చివర ఒక హ్యాచ్ ఉందని డగ్లస్ అన్నాడు. 35 00:02:34,530 --> 00:02:36,907 మీరు వెళ్లండి. వెళ్లండి! 36 00:02:49,294 --> 00:02:50,712 రా. త్వరగా రా! 37 00:02:50,712 --> 00:02:52,798 అసలు వాళ్లు మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? 38 00:02:54,258 --> 00:02:56,134 ఆ ఫైలులో ఏముంది? 39 00:03:38,343 --> 00:03:40,512 {\an8}మిక్ హెర్రన్ రచించిన "రియల్ టైగర్స్" పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 40 00:04:22,846 --> 00:04:24,515 స్నాక్ స్టాక్ 41 00:04:34,024 --> 00:04:38,403 మెట్ల మీద నుండి ఈ చిప్స్ ని ఎవరైనా తొక్కిన శబ్దం నీకు వినిపిస్తే, ఈ తుపాకీతో కాల్చేయ్. 42 00:04:38,403 --> 00:04:39,988 నువ్వు నాతో రా. 43 00:04:39,988 --> 00:04:41,865 నువ్వు పైకి పద. త్వరగా పద. 44 00:04:43,992 --> 00:04:46,036 - ఇలా పద... అటు కాదు, ఇటు. - ఏంటి? 45 00:04:46,036 --> 00:04:49,081 లోపలికి వెళ్లి, దాక్కో. 46 00:04:49,081 --> 00:04:51,542 - బయటే ఉంటే, ఏ విషయంలో అయినా సాయపడతాను కదా. - నీ వల్ల ఏ ఉపయోగమూ లేదు. 47 00:05:15,566 --> 00:05:18,318 - ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాం? - ఏదో తేడాగా ఉంది. 48 00:05:18,318 --> 00:05:19,736 లైట్స్ లేవు, అలికిడి లేదు. 49 00:05:19,736 --> 00:05:22,781 తను బంధీ కదా. అలాంటప్పుడు ఎవరోకరు మేల్కొనే ఉండాలి కదా. 50 00:05:24,533 --> 00:05:27,911 ఓరి నాయనోయ్. ఇక వెళ్లి పని కానించుకొని వద్దాం పద. 51 00:05:27,911 --> 00:05:29,288 నీ యెంకమ్మ. 52 00:05:31,790 --> 00:05:34,293 ఓయ్, పిస్తా బాబూ. కాస్త ఆగు. 53 00:05:35,252 --> 00:05:37,337 - ఎందుకు? - స్టాండిష్, ల్యాంబ్ దగ్గర పని చేస్తుంది. 54 00:05:38,213 --> 00:05:39,214 ల్యాంబ్ అంటే ఎవరు? 55 00:05:39,840 --> 00:05:41,133 జాక్సన్ ల్యాంబ్. 56 00:05:41,133 --> 00:05:42,342 జాక్సన్ ల్యాంబ్ ఎవరు? 57 00:05:42,926 --> 00:05:46,638 వాడో తిక్కలోడు. గతంలో వాడు, నేను కొట్టుకొనే దాకా వెళ్లాం. 58 00:05:48,265 --> 00:05:49,892 కానీ ఇప్పుడు అతను ఇక్కడ లేడు కదా? మరి ఇంకేం... 59 00:05:50,601 --> 00:05:52,269 కాస్త జాగ్రత్తగా ఉండమనే చెప్తున్నా నాయనా. 60 00:05:52,269 --> 00:05:54,396 ఊహించని విధంగా ఝలక్ ఇవ్వడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. 61 00:05:54,980 --> 00:05:56,607 సర్లే. నేను జాగ్రత్తగా ఉంటా. 62 00:06:01,195 --> 00:06:04,740 చూడు, లోపల ఒక మొద్దు పాప, ఒక లైబ్రేరియన్ తప్ప ఇంకెవరూ లేరు. 63 00:06:04,740 --> 00:06:07,492 వాళ్లు ఉన్నప్పుడు, ఇంకో మొద్దు వచ్చి చేరినా లాభం ఏమైనా ఉంటుందంటావా? 64 00:06:07,492 --> 00:06:08,827 కాస్త ఆగు, స్వామీ. 65 00:06:10,537 --> 00:06:11,538 అయ్య బాబోయ్! 66 00:06:11,538 --> 00:06:14,166 దేవుడా! ఆర్పేయ్! త్వరగా ఆర్పేయ్! 67 00:06:16,251 --> 00:06:17,377 అయ్య బాబోయ్! 68 00:06:18,795 --> 00:06:20,547 - ఇప్పుడు సమ్మగా ఉందా? - బాగా! 69 00:06:23,592 --> 00:06:25,093 నీ యెంకమ్మ! 70 00:06:29,598 --> 00:06:30,849 ఇక నేను నడవలేను. 71 00:06:30,849 --> 00:06:33,560 నన్ను కింద కూర్చోపెట్టండి, మిమ్మల్ని కవర్ చేస్తా. 72 00:06:33,560 --> 00:06:35,479 లేదు. ఇంకేం మాట్లాడకు. మేము ఆ పని చేయం. పద. 73 00:06:35,479 --> 00:06:37,314 పద. బయటపడ్డాక నీ అవసరం మాకు ఉంది. 74 00:06:37,314 --> 00:06:40,150 - హా. పద. ఇంకెంతో దూరం లేదు. - నా వల్ల కాదు! ఆగండి, ఆగండి! 75 00:06:40,150 --> 00:06:41,318 సరే, సరే. 76 00:06:45,948 --> 00:06:48,075 - దీన్ని చదవండి. - పద. 77 00:06:51,161 --> 00:06:52,287 దీన్ని బయటపెట్టండి. 78 00:06:56,333 --> 00:06:58,418 ఇలాంటి చెడు పనులు మన శత్రువులు చేస్తుంటారని చెప్పుకుంటుంటాం. 79 00:07:02,089 --> 00:07:05,509 తమ మీద మచ్చ పడకుండా ఉండటానికి ఆలిసన్ ని చంపించేశారు. 80 00:07:06,301 --> 00:07:07,302 బెన్ ని చంపించేశారు. 81 00:07:13,725 --> 00:07:15,310 వాళ్ల చావులను వృథా పోనివ్వకండి. 82 00:07:19,314 --> 00:07:20,357 మీ కాళ్లు పట్టుకుంటాను. 83 00:07:22,693 --> 00:07:23,735 నన్ను... 84 00:07:24,945 --> 00:07:26,238 నన్ను అక్కడ కూర్చోబెట్టండి, చాలు. 85 00:07:27,114 --> 00:07:28,115 సరేనా? 86 00:07:32,578 --> 00:07:34,663 సరే మరి. వచ్చేశాం. 87 00:07:38,292 --> 00:07:39,293 థ్యాంక్యూ. 88 00:07:40,335 --> 00:07:41,879 సరే మరి. 89 00:07:41,879 --> 00:07:43,964 - బయలుదేరండి! - రా. 90 00:07:44,840 --> 00:07:46,049 దాన్ని బయట పెట్టండి. 91 00:07:53,182 --> 00:07:55,225 ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ, ఉద్యోగం తిరిగి సంపాదించాలని నాకు లేదు. 92 00:07:57,686 --> 00:08:00,272 - ఓయ్, నిన్ను ఫాలో అయిపొమ్మని చెప్పావు కదా. - ఏంటి? 93 00:08:00,272 --> 00:08:01,982 ఫాలో అవ్వాలనే చూస్తున్నా. ప్లాన్ ఏంటో చెప్పు. 94 00:08:01,982 --> 00:08:03,775 రివర్ ని, లుయీసాని ఎలా కాపాడాలి? 95 00:08:04,443 --> 00:08:06,236 ఏమో. బాబోయ్. 96 00:08:07,821 --> 00:08:09,406 ఇది నీ ప్లానే కదా, పోటుగాడా! 97 00:08:09,406 --> 00:08:11,992 మనం రెండు తుపాకులు పట్టుకొని వస్తే, తోక ముడుచుకొని వెళ్లిపోతారు అనుకున్నా, సరేనా? 98 00:08:11,992 --> 00:08:13,869 ఏంటి, ఇది నీకు చిన్నపిల్లల ఆటలా ఉందా? 99 00:08:16,205 --> 00:08:17,456 ఏం జరుగుతోంది? 100 00:08:19,333 --> 00:08:21,251 బయట ఏం జరుగుతోంది? చెప్పండి. 101 00:08:23,879 --> 00:08:25,255 నువ్వు గప్ చుప్ గా పైకి వెళ్లాలి, 102 00:08:25,255 --> 00:08:27,799 వాళ్ల వెనకగా వెళ్లి, చంపేయ్ వాళ్లని. నిన్ను నేను కవర్ చేస్తాను. 103 00:08:28,800 --> 00:08:29,801 తొక్కేం కాదు. 104 00:08:29,801 --> 00:08:31,595 నేనే నిన్ను కవర్ చేస్తా, నువ్వే పైకి వెళ్లు... 105 00:08:32,261 --> 00:08:35,015 ఇక్కడ బలయ్యే స్థితిలో ఉన్నది నేను. ఇక్కడే ఉంటే, ఖచ్చితంగా తూటా తగులుతుంది నాకు. 106 00:08:35,015 --> 00:08:37,142 హా, నేను పైకి వెళ్లి ఇద్దరిని చంపాలి. 107 00:08:37,142 --> 00:08:38,644 మరేం చెద్దాం? టాస్ వేసుకుందామా? 108 00:08:38,644 --> 00:08:39,727 సరే. 109 00:08:40,479 --> 00:08:42,940 అబ్బా... నేనేదో చిరాకుతో అన్నా. మనకి అంత సమయం లేదు. 110 00:08:44,149 --> 00:08:45,192 ఏం జరుగుతోంది? 111 00:08:45,192 --> 00:08:50,280 చూడు, మనల్ని చుట్టుముట్టేయడానికి వారు ఎవరినైనా పిలిచినా, లేదా వెనుక నుండి వచ్చినా, ఇద్దరం చస్తాం. 112 00:08:50,280 --> 00:08:51,365 అబ్బా. 113 00:08:52,115 --> 00:08:53,534 - సరే, నేనే వెళ్తా. - మంచిది. 114 00:08:54,451 --> 00:08:56,620 కానీ, దీని నుండి మనం బయటపడితే, నువ్వు నాకొక మాట ఇవ్వాలి. 115 00:08:56,620 --> 00:08:58,288 సరే, డ్రగ్స్ కి దూరం అవ్వడంలో నీకు సాయపడతా. 116 00:08:59,456 --> 00:09:01,500 నువ్వు పురుగులు పట్టి చస్తావురా. 117 00:09:03,669 --> 00:09:04,711 ఇంతకీ ఏం అడగాలనుకున్నావు? 118 00:09:04,711 --> 00:09:06,964 - మూడు లెక్కపెట్టి వెళ్తా. - ఏం చెప్పాలనుకున్నావు? 119 00:09:06,964 --> 00:09:08,298 - రెండు... - ముందు నీకేం కావాలో చెప్పు. 120 00:09:08,298 --> 00:09:10,717 వాళ్లు నన్ను కాల్చకుండా చూడు! 121 00:09:11,635 --> 00:09:12,469 ఒకటి! 122 00:09:24,356 --> 00:09:27,651 మీరిద్దరూ టర్బైన్ హాలుకు వెళ్లండి. పదండి. 123 00:11:34,444 --> 00:11:35,904 అబ్బా. 124 00:11:38,448 --> 00:11:40,576 నీ యెంకమ్మ. 125 00:11:42,035 --> 00:11:42,870 దేవుడా. 126 00:11:48,458 --> 00:11:49,459 హాబ్స్? 127 00:11:55,007 --> 00:11:56,300 నువ్వు బాగానే ఉన్నావా? 128 00:11:57,092 --> 00:11:58,552 సూపర్ గా ఉన్నా. 129 00:11:58,552 --> 00:12:00,304 ఆనందపరవశంలో మునిగిపోతున్నా. 130 00:12:10,397 --> 00:12:11,523 పెట్టేశా. 131 00:12:16,570 --> 00:12:17,571 నొక్కు. 132 00:12:18,655 --> 00:12:19,907 పేలుస్తున్నా! 133 00:12:23,577 --> 00:12:25,078 - అయ్య బాబోయ్, రా. - దేవుడా. 134 00:12:27,247 --> 00:12:28,916 ఇది రాదేంటిరా బాబోయ్! 135 00:12:28,916 --> 00:12:31,502 దాన్ని వదిలేయ్, వదిలేయ్. హ్యాచ్ దగ్గర్లోనే ఉంది! 136 00:12:34,379 --> 00:12:35,380 ఎవరూ లేరు. 137 00:12:36,131 --> 00:12:37,132 పదండి. 138 00:12:39,635 --> 00:12:41,428 చివరనున్న వాడా. పదండి. 139 00:12:53,774 --> 00:12:54,858 సరే మరి. 140 00:12:56,443 --> 00:12:57,444 దేవుడా. 141 00:12:58,987 --> 00:13:00,781 ఇలాంటి సమయంలో, అలెగ్జాండర్ ది గ్రేట్ అయితే ఏం చేసేవాడు? 142 00:13:04,451 --> 00:13:05,786 కదనరంగంలోకి అడుగుపెట్టాల్సిన సమయం వచ్చేసింది. 143 00:13:16,797 --> 00:13:17,881 అదీ లెక్క! 144 00:13:21,510 --> 00:13:24,263 హో బలంగా దూసుకురావడానికి సిద్ధంగా ఉంది. 145 00:13:26,932 --> 00:13:29,268 - ఏమైపోయారు వాళ్లు? - ఇంకా ఆ గోడ వెనకే ఉన్నారు. 146 00:13:32,563 --> 00:13:33,564 తూటాలు వృథా చేయకు. 147 00:13:34,982 --> 00:13:39,778 మనం వెళ్లిపోయామని వాళ్లకి అనిపించనిద్దాం. ఆ తర్వాత వాళ్లని పిట్టలని కాల్చినట్టు కాల్చేద్దాం. 148 00:13:43,365 --> 00:13:44,366 అయ్యయ్యో! 149 00:13:45,200 --> 00:13:47,661 - తన సంగతి నాకు వదిలేయ్! - లాంగ్రిడ్జ్, నీ తుపాకులు అసలు పని చేస్తున్నాయా? 150 00:14:18,734 --> 00:14:20,277 దేవుడా. 151 00:14:44,134 --> 00:14:47,137 ఓరి దేవుడా. 152 00:15:10,035 --> 00:15:10,869 పిస్తా బాబూ? 153 00:15:14,164 --> 00:15:15,666 ఇది నన్ను కాల్చింది. 154 00:15:16,959 --> 00:15:18,168 పిస్తా బాబూ! 155 00:15:18,168 --> 00:15:19,461 హాబ్... హాబ్... 156 00:15:20,921 --> 00:15:22,840 పిస్తా బాబూ, ఆ శబ్దం నీదేనా లేకపోతే... 157 00:16:06,758 --> 00:16:08,760 స్టాండిష్, ఇక బయటకి రావచ్చు నువ్వు. 158 00:16:15,976 --> 00:16:17,769 ఎరగా నన్ను లోపల ఉంచావా? 159 00:16:18,645 --> 00:16:22,691 అయ్య బాబోయ్! చచ్చింది అతనేగా, నువ్వు కాదుగా? 160 00:16:24,526 --> 00:16:26,153 నిన్ను కాల్చనిచ్చి ఉండాల్సింది. 161 00:16:27,696 --> 00:16:29,281 సారా, నీకు ఏమీ కాలేదు కదా? 162 00:16:31,408 --> 00:16:32,242 పర్వాలేదనే అనుకుంటున్నా. 163 00:16:32,951 --> 00:16:34,453 నా చేతుల్లో ఇతను చనిపోయాడు. 164 00:16:50,719 --> 00:16:51,720 వెనక్కి పద! 165 00:17:05,192 --> 00:17:07,109 నీ ప్లాన్ ఏంటి నాయనా? 166 00:17:08,319 --> 00:17:09,780 ముష్కరులని అంతమొందించాలని వచ్చా. 167 00:17:11,198 --> 00:17:12,366 ఎవరినైనా చంపేశానా? 168 00:17:13,992 --> 00:17:14,992 లేదు. 169 00:17:16,161 --> 00:17:17,329 ఆ పని మేము ఎప్పుడో చేసేశాం. 170 00:17:22,209 --> 00:17:23,292 హలో, రాడీ. 171 00:17:40,811 --> 00:17:43,146 నా ఇంటిని నాశనం చేసేశావు నువ్వు! 172 00:17:44,189 --> 00:17:46,149 ఇలా అయినా, మీ ఇంటిని బాగు చేసే అవకాశం వచ్చిందిలే. 173 00:17:47,568 --> 00:17:50,863 ఏంటి? నిజంగానే చెప్తున్నా, బీమా ఉంది కాబట్టి, మీ ఇంటిని ఇంతకు ముందు కన్నా సుందరంగా చేసుకోవచ్చు. 174 00:17:51,989 --> 00:17:54,074 దీనికి బీమా వాళ్లు డబ్బులు ఇవ్వరు అనుకుంటా. 175 00:17:54,741 --> 00:17:59,246 ఒక సన్నాసి బస్సుతో కావాలని గుద్ది ఇలా ధ్వంసం చేశాడు కదా. 176 00:18:04,710 --> 00:18:06,712 నీ రైఫిల్ ఇంకా పని చేయట్లేదని అర్థమైంది. 177 00:18:08,839 --> 00:18:10,591 లేదంటే, ఈ పాటికే నువ్వు నన్ను కాల్చి ఉండేదానివి. 178 00:18:14,803 --> 00:18:16,847 నేను కూడా నిన్ను కాల్చననే అనుకుంటున్నావేమో. 179 00:18:17,973 --> 00:18:19,433 చేతిలో ఆయుధం లేదు... 180 00:18:21,727 --> 00:18:22,728 అందులోనూ ఒక మహిళ. 181 00:18:24,646 --> 00:18:26,440 కానీ నేను ఇరాక్ లో పని చేసిన మాజీ సైనికుడిని. 182 00:18:28,192 --> 00:18:30,235 గురి చూసి కొట్టడానికి ప్రాక్టీస్ కోసం పౌరులని వాడుకున్న రకం నేను. 183 00:18:40,370 --> 00:18:41,580 అయిపోయావు నా చేతిలో. 184 00:18:57,721 --> 00:18:58,931 బై-బై, బంగారం. 185 00:19:31,505 --> 00:19:33,590 ఈపాటికి డఫీ కాల్ చేసి ఉండాలి కదా? 186 00:19:34,341 --> 00:19:36,802 పని అంతా అయిపోయాక కాల్ చేస్తాడులే. 187 00:19:36,802 --> 00:19:40,514 అంటే, భవనంలో ఉండే తోటి ఏజెంట్లను హత్య చేశాక అనే కదా నీ ఉద్దేశం? 188 00:19:41,181 --> 00:19:42,349 వాళ్లు స్లో హార్సులు. 189 00:19:43,183 --> 00:19:46,144 వాళ్ల ప్రాణాలు తీయడమంటే, వాళ్లకి వేదన నుండి విముక్తి కలిగించినట్టే. 190 00:19:46,144 --> 00:19:49,189 స్లో హార్సులైనా వాళ్లు ఎంఐ5 ఏజెంట్లే, ఇంగ్రిడ్. 191 00:19:50,148 --> 00:19:51,608 నువ్వు నీ ఏజెంట్లనే చంపుతున్నావు. 192 00:19:52,943 --> 00:19:56,530 డోనొవన్ ని అక్కడికి పంపి, దీన్నంతటికీ మూలకారణం నువ్వే అయ్యావు. 193 00:19:57,281 --> 00:19:59,575 కాబట్టి, వారి మరణాలకు నువ్వే బాధ్యురాలివి. 194 00:20:00,242 --> 00:20:01,368 కానీ చంపమని ఆదేశించింది నువ్వు కదా. 195 00:20:02,703 --> 00:20:06,748 దాన్ని హోమ్ ఆఫీసుకి, ఈ భవనంలోని ఉద్యోగులకు ఎలా వివరిస్తావు? 196 00:20:07,916 --> 00:20:14,214 ప్రభుత్వ రహస్యాలను దొంగిలించాలని, అసంతృప్తితో రగిలిపోతున్న కొందరు ఎంఐ5 ఏజెంట్లు స్టోరేజ్ కేంద్రంలోకి వెళ్లారు, 197 00:20:14,214 --> 00:20:17,801 వారిని ధీటుగా ఎదుర్కోవడం జరిగింది అని చెప్తాను. 198 00:20:18,427 --> 00:20:20,220 దాన్ని పత్రిక వాళ్లు నమ్మరు. 199 00:20:20,846 --> 00:20:22,097 అది మీడియా వాళ్లకి తెలియనివ్వను కదా. 200 00:20:23,974 --> 00:20:25,893 అది నువ్వనుకున్నంత తేలికైనదే అయితే... 201 00:20:28,312 --> 00:20:30,147 ఈపాటికి నీకు ఇంకా ఫోన్ ఎందుకు రాలేదంటావు? 202 00:20:32,232 --> 00:20:33,775 నా గురించి దిగులు పడిపోకు, డయానా. 203 00:20:34,860 --> 00:20:37,279 నాకేమీ కాదు. 204 00:20:38,655 --> 00:20:41,325 డఫ్, అప్పగించిన పని బాగా చేస్తాడు. 205 00:20:42,993 --> 00:20:44,077 నువ్వు అతనికి బాగానే శిక్షణ ఇచ్చావు. 206 00:20:45,954 --> 00:20:48,332 టర్బైన్ హాల్ లో ఏం జరుగుతోందో చెప్పండి. 207 00:20:55,214 --> 00:20:59,510 అయ్య బాబోయ్. నేర్చుకోండిరా! 208 00:21:01,136 --> 00:21:03,180 ఒకేసారి రెండు, మూడు పనులు చేయడం నేర్చుకోండిరా! 209 00:21:03,764 --> 00:21:06,975 ఆ ఆయుధం నాకు ఇవ్వు. నువ్వు వేరేది తెచ్చుకో! 210 00:21:07,684 --> 00:21:11,021 ఆ హ్యాచ్ ని తెరిచి ఎవరైనా బయటకు వస్తే, వాళ్లని కాల్చి పారేయండి! మర్చిపోవద్దు! 211 00:21:31,500 --> 00:21:32,543 ఇక్కడ ఎవరూ లేరు. 212 00:21:35,212 --> 00:21:37,631 నేను ఉన్నానురా, సన్నాసులారా. 213 00:21:39,216 --> 00:21:40,217 అబ్బా. 214 00:22:01,154 --> 00:22:02,447 ఇప్పుడు ఎవరూ లేరుగా. 215 00:22:55,167 --> 00:22:56,210 ఇక నువ్వు బయటకి రావచ్చు. 216 00:22:57,878 --> 00:22:58,879 దేవుడా. 217 00:22:59,671 --> 00:23:01,715 నువ్వు నాకు ఇచ్చిన తుపాకీ జామ్ అయిపోయింది. 218 00:23:01,715 --> 00:23:03,675 తప్పుగా రీలోడ్ చేసి ఉండుంటావు. 219 00:23:03,675 --> 00:23:06,011 తుపాకీ ఎలా పని చేస్తోందో కూడా నాకు తెలీదా? 220 00:23:06,011 --> 00:23:08,472 నిజానికి, అది తుపాకీ కాదు, రైఫిల్. 221 00:23:09,056 --> 00:23:10,516 వీళ్ళకి ఏ దారీ లేకుండా చేస్తున్నా. 222 00:23:12,434 --> 00:23:15,020 వేరే దారి లేక, వీళ్లు ఆ హ్యాచ్ నుండే బయటకు వస్తారు. 223 00:23:18,065 --> 00:23:20,234 - నీ కారు తాళాలు ఇవ్వు. - ఏంటి? 224 00:23:20,234 --> 00:23:21,401 నీ కారు తాళాలు! 225 00:23:21,401 --> 00:23:22,402 ఎందుకు? 226 00:23:22,402 --> 00:23:24,029 మూసుకొని ఇక్కడికి విసరవయ్యా! 227 00:23:26,532 --> 00:23:27,616 త్వరగా ఇవ్వు! 228 00:23:28,408 --> 00:23:29,535 నాకు సాయం చేయవా? 229 00:23:29,535 --> 00:23:31,995 ఇప్పుడే నలుగురిని చంపి వచ్చా. నువ్వేం పీకావు? 230 00:23:31,995 --> 00:23:34,623 వీడేమీ చేయడు, పాపా. వీడి వల్ల ఏ ఉపయోగమూ లేదు. 231 00:23:35,290 --> 00:23:38,001 డఫీ, నీ తోటి ఏజెంట్లనే చంపుతున్నావు! పిచ్చేమైనా పట్టిందా? 232 00:23:38,001 --> 00:23:40,879 నోర్మూసుకో, నేను అదేశాలను పాటిస్తున్నానంతే, అది నీకు తెలియని విద్య కదా. 233 00:23:42,756 --> 00:23:43,799 త్వరగా తాళాలు ఇవ్వు! 234 00:23:44,383 --> 00:23:45,676 సరే. 235 00:23:50,264 --> 00:23:52,432 పట్టుకో. వెళ్లు. వీడి సంగతి నేను చూసుకుంటా. 236 00:23:53,058 --> 00:23:53,892 నాకు అలా అనిపించట్లేదు. 237 00:23:55,853 --> 00:23:57,271 డఫీ! 238 00:24:18,750 --> 00:24:20,252 - అయ్య బాబోయ్! దిగు, దిగు. - అబ్బా. 239 00:24:20,252 --> 00:24:21,712 - ఇలా వెళ్తే మనం చస్తాం. - ఛ. 240 00:24:21,712 --> 00:24:23,297 మనం ఆ తలుపును మూసివేయాలి! 241 00:24:28,552 --> 00:24:30,345 అయ్యయ్యో. వెనక్కి పద, వెనక్కి పద! 242 00:24:30,345 --> 00:24:32,890 - మళ్లీ నిచ్చెన ఎక్కుదాం పద! - ఇక్కడ చచ్చినా చావను నేను. 243 00:25:02,794 --> 00:25:04,213 ఛ. 244 00:25:07,257 --> 00:25:08,425 చేతులు పైకెత్తు. 245 00:25:09,676 --> 00:25:10,802 తుపాకీ కింద పెట్టు. 246 00:25:13,138 --> 00:25:16,183 తుపాకీ కింద పెట్టు. త్వరగా పెట్టు. 247 00:25:22,940 --> 00:25:26,485 తుపాకీ గుండా ఎన్ని తూటాలు వస్తున్నాయో కూడా 248 00:25:27,611 --> 00:25:31,073 లెక్క పెట్టలేని సన్నాసివి నువ్వు, నిన్ను డాగ్ స్క్వాడ్ లో చేరమని అడిగానా నేను! 249 00:25:31,698 --> 00:25:35,077 నీ లాంటి చెత్తగాడి దగ్గర కన్నా, ల్యాంబ్ దగ్గర పని చేయడమే మేలు, డఫీ. 250 00:25:35,577 --> 00:25:36,870 - అవునా? - అవును. 251 00:25:36,870 --> 00:25:39,206 కానీ అతనికి చావు తప్పదు. ఇప్పుడు నీకు కూడా తప్పదు. 252 00:26:04,064 --> 00:26:05,315 కానివ్వు. 253 00:26:07,442 --> 00:26:08,861 నువ్వు చేతకానివాడివి కాదు. అంతేనా? 254 00:26:45,105 --> 00:26:46,106 దేవుడా. 255 00:26:49,443 --> 00:26:51,528 అయ్య బాబోయ్. నా బొటన వేలిని కాల్చాడు! 256 00:26:53,030 --> 00:26:54,072 త్వరగా బయటకి రండి! 257 00:26:55,282 --> 00:26:56,742 నేను వాళ్లని చంపేస్తా, 258 00:26:57,618 --> 00:27:00,579 ఆ తర్వాత ఇక్కడికి వచ్చి, నీ ఇంకో బొటన వేలిని విరిచేస్తా, ఆడంగి నాయలా. 259 00:27:02,331 --> 00:27:03,415 బై-బై. 260 00:27:06,084 --> 00:27:06,919 దేవుడా. 261 00:27:17,346 --> 00:27:19,056 అయ్య బాబోయ్. 262 00:27:21,058 --> 00:27:26,063 సరే, అందరూ మిమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తున్నారో ఎవరైనా చెప్తారా? 263 00:27:29,942 --> 00:27:31,026 దీని కోసం. 264 00:27:31,026 --> 00:27:33,487 నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోతే మంచిది, ఏమంటావు? 265 00:27:39,159 --> 00:27:40,160 సరే. 266 00:27:41,995 --> 00:27:43,747 - నీకు థ్యాంక్స్. - పర్వాలేదులే. 267 00:27:43,747 --> 00:27:45,040 అదరగొట్టేశావు. 268 00:27:45,040 --> 00:27:46,333 దేవుడా. 269 00:27:47,584 --> 00:27:48,585 అది మార్కస్ బండా? 270 00:27:49,670 --> 00:27:50,838 అవును. 271 00:27:50,838 --> 00:27:52,256 అతను ఎక్కడ? 272 00:28:03,475 --> 00:28:07,521 నేనే నీకన్నా గొప్పోడిని! చెప్పు! నీ నోటితో చెప్తే వినాలనుంది! 273 00:28:08,272 --> 00:28:09,690 అవును. అవును. 274 00:28:10,524 --> 00:28:13,193 నాకన్నా నువ్వే గొప్పోడివి. 275 00:28:13,193 --> 00:28:14,361 నన్ను ఓడించేశావు. 276 00:28:16,029 --> 00:28:17,030 న్యాయంగా, అన్ని విధాలా గెలిచావు. 277 00:28:22,911 --> 00:28:26,415 కానీ నేను న్యాయంగా ఉండనుగా. 278 00:28:36,008 --> 00:28:37,176 దీనితో నీ రుణం తీరిపోయింది అనుకుంటా. 279 00:28:39,803 --> 00:28:40,888 అవును. 280 00:29:14,463 --> 00:29:16,757 తాజా వార్త పోలీసు భారీ ఎన్ కౌంటర్ జరిగిందని చెప్తున్నారు 281 00:29:20,177 --> 00:29:23,180 డఫీ పని పూర్తి చేయలేకపోయినట్టున్నాడు. 282 00:29:24,848 --> 00:29:26,058 ఖేల్ ఖతమ్ అయిపోయింది. 283 00:29:28,227 --> 00:29:29,937 డఫీ. నేను వెంటనే కాల్ చేస్తాను. 284 00:29:32,689 --> 00:29:35,442 ఎంఐ5 వాళ్లు, తమ సొంత ఏజెంట్ల మీదే దాడి చేశారు అనేదానికి నువ్వు సమాధానం చెప్పాలి. 285 00:29:36,443 --> 00:29:38,779 ఇస్తాంబుల్ లో జరిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాలి. 286 00:29:39,780 --> 00:29:45,410 నేనే కనుక వెళ్లిపోవలసి వస్తే, రచ్చ రచ్చ చేసి వెళ్తా. 287 00:29:46,954 --> 00:29:49,998 నువ్వు పరిస్థితులని ఎంత దారుణంగా చేసినా, తుది ఫలితంలో మాత్రం ఏ మార్పూ ఉండదు. 288 00:29:50,499 --> 00:29:52,626 నువ్వు చక్కగా ఎత్తులకు పై ఎత్తులు వేశావు, ఇంగ్రిడ్. 289 00:29:53,877 --> 00:29:55,170 కానీ చివరికి ఓడిపోయావు. 290 00:30:14,648 --> 00:30:15,482 హలో? 291 00:30:15,482 --> 00:30:18,277 - ల్యాంబ్? - కాదు, నేను క్యాథరిన్ ని. అతను బండి నడుపుతున్నాడు. 292 00:30:18,277 --> 00:30:21,780 అయితే వాళ్లు నిన్ను విడిపించారన్నమాట. మేము ఇక్కడ స్టోరేజ్ కేంద్రంలో ఉన్నాం. 293 00:30:21,780 --> 00:30:22,990 అందరూ బాగానే ఉన్నారా? 294 00:30:22,990 --> 00:30:24,783 హా, రివర్, లుయీసా ప్రాణాలతో బయటపడ్డారు. 295 00:30:24,783 --> 00:30:26,201 అతని దగ్గర ఏదో ఫైల్ ఉంది. 296 00:30:27,411 --> 00:30:29,121 మీకు ఏమీ కానందుకు ఆనందంగా ఉంది. 297 00:30:29,121 --> 00:30:30,539 మీకూ ఏమీ కానందుకు ఆనందంగా ఉంది. 298 00:30:30,539 --> 00:30:31,623 రేపు కలుద్దాం మరి. 299 00:30:36,879 --> 00:30:40,174 - తను "రేపు కలుద్దాం" అంది. - తను ల్యాంబ్ కాదు, కదా? 300 00:30:40,799 --> 00:30:44,178 మనల్ని చంపాలని చూసిన వాళ్లు, తమ ఇన్ ఛార్జ్ స్థానాన్ని కోల్పోతారు, కనీసం అదైనా జరుగుతుందిలే. 301 00:30:45,512 --> 00:30:46,555 మళ్లీ నువ్వు ఆఫీసుకు వెళ్తావా? 302 00:30:47,848 --> 00:30:52,436 కారు ఈ స్థితిలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నానంటే క్యాసీ నన్ను చంపేస్తుంది. 303 00:30:53,145 --> 00:30:55,606 జూదం ఎలాగూ ఆడుతున్నావుగా, ఆ డబ్బులతో కొత్త కారు కొనుక్కో. 304 00:31:10,162 --> 00:31:13,165 {\an8}అత్యవసర శాఖ 305 00:31:20,964 --> 00:31:22,466 పద్దెనిమిది మంది దాకా చనిపోయారు. 306 00:31:23,884 --> 00:31:26,470 షాన్ డోనొవన్ ని, బెన్ డన్ ని గుర్తించారు. 307 00:31:30,140 --> 00:31:31,975 వాళ్ల చావు ఊరికే పోదులే. 308 00:31:32,976 --> 00:31:34,603 ఆ ఫైల్ రివర్ దగ్గర ఉందని షర్లీ చెప్పింది. 309 00:31:35,479 --> 00:31:36,605 ఏ ఫైల్? 310 00:31:36,605 --> 00:31:39,191 ఆ ఫైల్ లీక్ కాకుండా ఉండటానికి, షాన్ ప్రేమించిన వ్యక్తిని 311 00:31:39,191 --> 00:31:41,443 టియర్నీ చంపించేసింది. 312 00:31:42,486 --> 00:31:43,737 ఆ విషయం వాళ్లు నీకు చెప్పారా? 313 00:31:43,737 --> 00:31:46,615 నేను అమాయకురాలినని అనుకొనే ముందు, జనాలను చూసి, వాళ్లు ఎలాంటి వాళ్లో చెప్పేయగలనని తెలుసుకో, రాడీ. 314 00:31:46,615 --> 00:31:50,536 నువ్వు జనాలు ఎలాంటి వాళ్లో చెప్పేయగలవా? మరి ఆ ప్రతిభ ఇన్నాళ్లూ దాచుకున్నావా? 315 00:31:50,536 --> 00:31:53,789 వాళ్లు మానసికంగా బాగా కుంగిపోయి ఉన్నారు, కాబట్టే వాళ్లకి సాయపడ్డాను. 316 00:31:53,789 --> 00:31:57,876 హా, ఇప్పుడైతే తూటాల గాయాలతో శారీరకంగా కూడా వాళ్ల పరిస్థితి ఏం బాగాలేదు కదా. 317 00:32:00,420 --> 00:32:05,175 ఆ విషయంలో నాకేమీ బాధ అనిపించదు, ఎందుకంటే చార్ల్స్ అర్థం చేసుకొనేవాడు. 318 00:32:05,175 --> 00:32:07,719 అయ్య బాబోయ్. చార్ల్స్ పార్టనర్. 319 00:32:09,221 --> 00:32:12,975 టియర్నీ, ఎంఐ5ని నడిపే విధానం నాకు నచ్చట్లేదు. 320 00:32:18,397 --> 00:32:20,023 అత్యంత రహస్యమైనది పార్టనర్, చార్ల్స్ 321 00:32:20,023 --> 00:32:21,316 చార్ల్స్... 322 00:32:23,652 --> 00:32:25,195 చాలా దారుణంగా ఉందే. 323 00:32:26,947 --> 00:32:27,948 గందరగోళంగా ఉంది. 324 00:32:33,662 --> 00:32:34,913 అది చూశాక, నీకేం అనిపిస్తోంది? 325 00:32:36,164 --> 00:32:37,249 కథ బాగానే ఉంది. 326 00:32:39,626 --> 00:32:40,627 అది కథ కాదు. 327 00:32:41,712 --> 00:32:44,965 ఒక పరీక్షించని పరికరాన్ని వాడటం వలన ఉత్తర కొరియా ఎంబసీ ఉద్యోగులు 328 00:32:45,757 --> 00:32:48,427 ఆసుపత్రి పాలయ్యారు, అక్కడ ఉన్న కొందరు యాత్రికులు కూడా ఆసుపత్రి పాలయ్యారు, 329 00:32:48,427 --> 00:32:50,179 ఆ తతంగమంతా అందులో ఉంది. 330 00:32:50,179 --> 00:32:52,222 ఆ ఆసుపత్రి పాలైన వారిలో ఒకరు ఇంకా కోమాలోనే ఉన్నారు. 331 00:32:52,222 --> 00:32:55,601 హా, కానీ మొరాకోలో ఏం జరిగిందో ఏమో కానీ... 332 00:32:55,601 --> 00:32:56,685 ఇస్తాంబుల్. 333 00:32:57,728 --> 00:32:58,729 ఏమన్నావు? 334 00:32:59,313 --> 00:33:00,189 మొరాకో కాదు, ఇస్తాంబుల్. 335 00:33:01,064 --> 00:33:02,065 నేను అంది అదే కదా. 336 00:33:02,065 --> 00:33:04,735 నువ్వు అంది అది కాదు. నువ్వు మొరాకో అని... అది జరిగింది ఇస్తాంబుల్ లో. 337 00:33:06,236 --> 00:33:08,780 - చూడు, ఎక్కడ జరిగింది అన్నది ముఖ్యం కాదు, సరేనా? - అది ముఖ్యమే కదా. 338 00:33:09,948 --> 00:33:12,242 వివరాలు చాలా ముఖ్యం, గుర్తుందా? దాన్ని నువ్వు నాలోకి చాలా బలంగా ఎక్కించావు. 339 00:33:12,951 --> 00:33:13,952 సారీ. 340 00:33:14,828 --> 00:33:16,747 నన్ను... నన్ను మన్నించు. క్షమించు. 341 00:33:16,747 --> 00:33:19,833 కొన్ని వివరాలను సరిగ్గా గుర్తుంచుకోలేకపోయినందుకు క్షమించు. 342 00:33:21,376 --> 00:33:22,586 కానీ విషయం ఏంటంటే, 343 00:33:24,463 --> 00:33:28,091 ఇది కనుక బయటపడితే, ఏం జరుగుతుందో నీకు తెలుసా? 344 00:33:28,091 --> 00:33:29,176 హా. 345 00:33:29,885 --> 00:33:33,138 టియర్నీ పేరు దెబ్బ తింటుంది, తను రాజీనామా చేయాల్సి ఉంటుంది. 346 00:33:33,138 --> 00:33:36,808 తన పేరుతో పాటు, సెక్యూరిటీ సర్వీసుల పేరు కూడా దెబ్బ తింటుంది. 347 00:33:38,310 --> 00:33:42,064 దాన్ని లీక్ చేయాలని చూసినందుకు, తను ఆలిసన్ డన్ ని చంపించేసింది. 348 00:33:43,106 --> 00:33:44,107 సారీ, ఏమన్నావు? 349 00:33:45,234 --> 00:33:49,029 లేదు. ఆ విషయం ఇందులో లేదే. 350 00:33:49,905 --> 00:33:51,573 - అది పుకారు అంతే. - పుకారా? 351 00:33:52,407 --> 00:33:54,785 అవును, రుజువు లేదుగా. 352 00:33:56,036 --> 00:33:57,412 ఇవాళ కొందరి ప్రాణాలు పోయాయి. 353 00:33:57,412 --> 00:33:58,789 అది పుకారు కాదు కదా. 354 00:33:58,789 --> 00:34:01,917 నీ వ్యక్తిగత అనుభవాల కారణంగా నువ్వు సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు. 355 00:34:01,917 --> 00:34:03,043 హా, నాపైకి కాల్పులు జరిపారు మరి. 356 00:34:03,043 --> 00:34:06,547 కాబట్టి, నేను దాన్ని వ్యక్తిగతంగానే తీసుకుంటున్నానేమో. ఏమో మరి. 357 00:34:10,342 --> 00:34:13,762 ఒక్కోసారి, నీ ఒక్కరి భద్రత గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోదు, చాలా విషయాలు ముడిపడి ఉంటాయి. 358 00:34:14,888 --> 00:34:18,725 ఒక్కోసారి మనకి పూర్తిగా అన్ని వివరాలూ తెలీవు కూడా. 359 00:34:21,353 --> 00:34:23,938 హా, ఈ విషయంలో నీకన్నా నాకే ఎక్కువ వివరాలు తెలుసేమో. 360 00:34:27,609 --> 00:34:28,652 {\an8}అత్యంత రహస్యమైనది 361 00:34:32,864 --> 00:34:33,907 కోపం తెచ్చుకోకు. 362 00:34:36,076 --> 00:34:39,705 నిన్ను కాపాడటానికే ఈ పని చేశాను. 363 00:34:54,844 --> 00:34:55,679 ఫుల్ ట్యాంక్ పట్టు. 364 00:35:06,690 --> 00:35:11,737 చూడు, ఇవాళ నా ప్రాణాన్ని కాపాడినందుకు థ్యాంక్యూ. 365 00:35:13,655 --> 00:35:15,115 ఎందుకిలా ఉంటున్నావు? 366 00:35:16,200 --> 00:35:18,410 - నేను మామూలుగానే ఉన్నాను. - లేదు. 367 00:35:18,410 --> 00:35:20,954 వచ్చి, నన్ను కాపాడాల్సి వచ్చినందుకు కోపంగా ఉందా? 368 00:35:22,247 --> 00:35:24,458 మమ్మల్ని పట్టించుకోవు అన్నట్టు నటించకు. 369 00:35:24,458 --> 00:35:27,878 దీని గురించి మాట్లాడాలని నాకు అస్సలు లేదు. 370 00:35:27,878 --> 00:35:30,631 - నీకు అస్సలు దేని గురించి కూడా మాట్లాడాలని ఉండదు. - అది మాత్రం సరిగ్గా చెప్పావు. 371 00:35:33,258 --> 00:35:37,012 నువ్వు స్వార్థపరుడిలా బయటకు కనిపిస్తావు, కానీ లోపల చాలా బాధ్యతగా నడుచుకుంటావని చార్ల్స్ చాలాసార్లు చెప్పాడు. 372 00:35:37,012 --> 00:35:39,473 హో, తను మాట్లాడటం ఆపకపోతే, నన్ను కాల్చి పారేయ్. 373 00:35:39,473 --> 00:35:41,725 చూశావా? అతను చెప్పింది నిజమే అని నిరూపిస్తున్నావు. 374 00:35:42,309 --> 00:35:46,146 అది ఏంటంటే, నీలోని మంచి కోణం గురించి ఇతరులకి తెలియకూడదని అనుకుంటావు నువ్వు, 375 00:35:46,146 --> 00:35:48,106 దాని వల్ల నువ్వు బలహీనుడివని వాళ్లకి తెలిసిపోతుంది కాబట్టి. 376 00:35:48,106 --> 00:35:49,816 అబ్బా, కారెక్కి కూర్చో, తల్లీ. 377 00:35:50,400 --> 00:35:52,819 - నువ్వు చార్ల్స్ కంటే పిస్తావని చార్ల్స్ అనుకున్నాడు. - హా, అది నిజమే. 378 00:35:52,819 --> 00:35:55,030 అందరికన్నా నువ్వే గొప్ప అని అనుకున్నాడు. 379 00:35:55,030 --> 00:35:58,242 ఫస్ట్ డెస్క్ అయ్యే సమర్థత నీకు ఉంది అన్నాడు. ఇప్పుడు నిన్ను చూస్తే, ఏమంటాడో! 380 00:35:58,242 --> 00:36:01,787 చార్ల్స్, నా గురించి అప్పుడు ఏమనుకుంటే నాకెందుకు? ఇప్పుడు ఏమనుకుంటే నాకెందుకు? 381 00:36:01,787 --> 00:36:03,622 ఎందుకంటే, అతను చాలా గొప్పవాడు కాబట్టి. 382 00:36:03,622 --> 00:36:05,082 నిజమా? 383 00:36:05,082 --> 00:36:07,626 అప్పుడు నువ్వు అతని సెక్రటరీవి కదా! నీకు మాత్రం ఏం తెలుస్తుందిలే. 384 00:36:08,544 --> 00:36:09,670 నాకు అన్నీ తెలుసు. 385 00:36:10,504 --> 00:36:11,630 నిజం చెప్తున్నా కదా, నీకు అన్నీ తెలీవు. 386 00:36:13,590 --> 00:36:16,927 నీలా కాకుండా, అతను నాకు మర్యాద ఇచ్చేవాడని తెలుసులే. 387 00:36:17,511 --> 00:36:19,638 అతను నాతో స్నేహంగా ఉండేవాడు. నన్ను నమ్మేవాడు, 388 00:36:19,638 --> 00:36:23,392 ఎవరైనా నన్ను గాలికి వదిలేసేవారే, కానీ నన్ను పనిలోనే ఉంచుకున్నాడు. 389 00:36:23,392 --> 00:36:25,477 బాబోయ్, జనాలను చూడగానే వాళ్లు ఎలాంటి వాళ్లో నువ్వు చెప్పేయగలవు కదా? 390 00:36:26,103 --> 00:36:27,437 నీకు నిజం చెప్పనా? 391 00:36:29,314 --> 00:36:34,152 నీ హీరో, చార్ల్స్ పార్టనర్ ఒక దేశద్రోహి. 392 00:36:34,778 --> 00:36:37,698 - ఏం మాట్లాడుతున్నావు నువ్వు? - అలాంటి ఇలాంటి దేశద్రోహి కాదు. 393 00:36:37,698 --> 00:36:39,783 ఆ విషయంలో నేను అతనికి జేజేలు కొడతాను. 394 00:36:40,367 --> 00:36:42,202 అతను బతికిన చివరి పది సంవత్సరాలు 395 00:36:42,202 --> 00:36:44,329 రష్యన్లకు మన రహస్యాలను అమ్ముకుంటూ బతికాడు. 396 00:36:44,329 --> 00:36:47,374 అది నీ హీరో గొప్పతనం, నీ నమ్మకస్థుడైన నేస్తం చేసిన నిర్వాకం అది. 397 00:36:47,374 --> 00:36:49,084 నిన్ను పనిలోనే ఎందుకు ఉంచుకున్నాడో తెలుసా? 398 00:36:49,084 --> 00:36:53,213 అప్పుడు నువ్వు తాగుబోతువి కదా, అందుకే నిన్ను ఉంచుకున్నాడు. 399 00:36:53,213 --> 00:36:56,008 అతను చేసే పనులను గమనించేంత హోష్ ఉన్న వ్యక్తులు 400 00:36:56,008 --> 00:36:57,801 అతని దగ్గర ఉంటే అతనికి మంచిది కాదు కదా. 401 00:36:57,801 --> 00:37:01,930 అతనికి తెలుసు నీ మీద ఆధారపడవచ్చని, 402 00:37:01,930 --> 00:37:04,266 ఎందుకంటే, నువ్వు ఈరోజు జరిగింది రేపు మర్చిపోతావు. 403 00:37:04,266 --> 00:37:06,268 - నేను నిన్ను నమ్మను. - నమ్మాలి. 404 00:37:07,644 --> 00:37:08,854 అసలు మజా తెప్పించే విషయం ఏంటో చెప్పనా? 405 00:37:11,440 --> 00:37:15,068 ఆ దేశద్రోహ పని చేస్తోంది నువ్వు అన్నట్టు అతను ఆధారాలను ఏర్పరచుతూ వచ్చాడు. 406 00:37:15,861 --> 00:37:18,447 అతనేమీ నిన్ను కాపాడలేదు. నిన్ను వాడుకున్నాడు. 407 00:37:20,407 --> 00:37:21,783 అబద్ధం చెప్తున్నావు నువ్వు. 408 00:37:22,659 --> 00:37:24,244 అది అబద్ధంలా అనిపిస్తోందా, 409 00:37:25,662 --> 00:37:27,581 లేదా, అది నిజమే అని మొదట్నుంచీ నీకు తెలిసినా, 410 00:37:27,581 --> 00:37:30,000 దాన్ని స్వీకరించేంత ధైర్యం నీలో లేదా? 411 00:37:32,836 --> 00:37:33,837 చచ్చిపో. 412 00:37:36,173 --> 00:37:37,549 ఏమన్నావు? నాకు వినబడలేదు. 413 00:37:38,467 --> 00:37:43,013 "చచ్చిపో, జాక్సన్ ల్యాంబ్," అని అన్నాను. నిజంగానే చచ్చిపో. నేను ఉద్యోగం మానేస్తున్నా. 414 00:37:44,264 --> 00:37:45,349 నీకు ఎలా అనిపిస్తే, అలా చేయ్. 415 00:38:08,830 --> 00:38:09,831 నువ్వు నడుపు. 416 00:38:18,382 --> 00:38:19,424 మరి స్టాండిష్? 417 00:38:20,717 --> 00:38:21,844 తను నడిచి వెళ్లిపోతోంది. 418 00:38:23,679 --> 00:38:26,557 - దగ్గర దగ్గరగా 50 కిలోమీటర్లు నడవాలి. - నువ్వు కారు తోలవయ్యా. 419 00:38:31,270 --> 00:38:32,271 ఎక్కడికి? 420 00:38:34,273 --> 00:38:35,482 నీకు తెలుసుగా. 421 00:39:27,576 --> 00:39:31,580 అంతర్గత వీక్షణకు మాత్రమే ప్రాజెక్ట్ ఫుట్ ప్రింట్ 422 00:40:02,945 --> 00:40:04,029 అయ్య బాబోయ్. 423 00:40:06,865 --> 00:40:08,033 అయితే, నా ఇంటికి వెళ్దామంటావా? 424 00:40:08,909 --> 00:40:10,410 అంతకన్నా ఈ మురికి నీటిలో స్నానం చేయడం మేలు. 425 00:40:10,410 --> 00:40:14,081 భలేదానివే. కనీసం ఒక ఐస్ క్రీమ్ అన్నా కొనివ్వు. 426 00:40:14,081 --> 00:40:18,752 ఆ ఐస్ క్రీమ్ ఏదో నువ్వే కొనుక్కో. కానీ నా ముందు మాత్రం తినకు. యాక్. 427 00:40:23,257 --> 00:40:27,010 చెప్పాలంటే మాటలు రావట్లేదు, కానీ థ్యాంక్యూ. 428 00:40:29,054 --> 00:40:30,097 దేనికి? 429 00:40:32,182 --> 00:40:35,185 ఫైల్ ని లీక్ చేసినందుకు. టియర్నీ పదవిని ఊడగొట్టినందుకు. 430 00:40:35,185 --> 00:40:37,980 మొదట్నుంచీ నాకు చెందాల్సిన పదవిని, ఇప్పటికైనా నాకు వచ్చేలా చేసినందుకు. 431 00:40:39,147 --> 00:40:41,692 అదంతా చేసింది నేను కాదు, కార్ట్ రైట్. 432 00:40:42,609 --> 00:40:44,361 - నిజంగానా? - అవును. 433 00:40:46,989 --> 00:40:49,408 అయితే గతంలో మనోడు చేసిన భారీ పొరపాట్లన్నింటినీ మన్నించేస్తున్నాలే. 434 00:40:50,617 --> 00:40:51,660 అంటే, అన్నీ కాదనుకో. 435 00:40:54,037 --> 00:40:55,330 స్టాండిష్ మానేసిందని విన్నాను. 436 00:40:57,791 --> 00:40:59,877 తనని చాలా కాలం కాపాడుతూ వచ్చావు. 437 00:41:01,170 --> 00:41:04,047 అవును. ఎందుకంటే, నాకు కొత్తవాళ్లని కలవడం అస్సలు ఇష్టం లేదు కాబట్టి. 438 00:41:04,673 --> 00:41:05,674 వద్దులే. 439 00:41:09,678 --> 00:41:12,347 తర్వాత నేను కొత్త హోమ్ సెక్రెటరీని కలవబోతున్నాను. 440 00:41:13,056 --> 00:41:14,141 అయ్యో, పాపం. 441 00:41:14,766 --> 00:41:19,980 నీకు కావాల్సింది ఇప్పటికి దక్కింది, అయినా నీకు ఆనందంగా ఉన్నట్టు లేదే? 442 00:41:19,980 --> 00:41:22,733 టియర్నీ అంతా చిందరవందర చేసేసి వెళ్లిపోయింది, అదంతా చక్కబెట్టాలి కదా నేను. 443 00:41:22,733 --> 00:41:23,984 ఓయబ్బో. 444 00:41:24,985 --> 00:41:27,487 వాటిలో చాలా వాటికి కారణం నువ్వు కూడా కదా. 445 00:41:27,487 --> 00:41:28,947 నేను చేసిన వాటిల్లో చివరికి మంచే జరిగింది కదా. 446 00:41:28,947 --> 00:41:31,033 కాటి కాపరులకి మంచిదే మరి. 447 00:41:31,950 --> 00:41:35,621 నీకు ఫస్ట్ డెస్క్ పదవి రావడానికి చాలా మంది ప్రాణాలు పోయాయి కదా, వాటి సంగతేంటి? 448 00:41:35,621 --> 00:41:38,248 వాళ్లు చనిపోవడానికి టియర్నీయే కారణం. 449 00:41:40,083 --> 00:41:42,419 ఇప్పుడు టాప్ స్థానంలో ఉంది నువ్వే, డయానా. 450 00:41:42,419 --> 00:41:44,463 అవును కదా? అది నీకు సంతోషమే కదా. 451 00:41:45,589 --> 00:41:47,090 అన్ని బాధ్యతలూ నీవే. 452 00:41:48,008 --> 00:41:50,761 ఏదైనా జరిగితే, నిన్నే నిందిస్తారు, ఎప్పుడూ ఏదోకటి జరుగుతూనే ఉంటుందనుకో. 453 00:41:50,761 --> 00:41:52,596 ఆ సవాలుకు నేను సిద్ధమే. 454 00:41:54,097 --> 00:41:57,684 స్లో హౌసులో ఉన్నావు కదా, నా కన్నా నువ్వే సంతోషంగా ఉన్నావా ఏంటి? 455 00:42:00,896 --> 00:42:03,899 ఏంటి ఈ జీవితం అనుకుంటూనే ఉంటా, కానీ నీతో పోలిస్తే పర్వాలేదులే. 456 00:42:11,615 --> 00:42:13,784 తర్వాతి సీజనులో 457 00:42:13,784 --> 00:42:15,911 ల్యాంబ్ మామూలోడు కాదు. 458 00:42:16,578 --> 00:42:19,748 అతను పనిలోకి దిగాడంటే, ప్రత్యర్థులకి చెమటలే. 459 00:42:19,748 --> 00:42:20,749 అబ్బా. 460 00:42:21,416 --> 00:42:23,293 అయితే, ఈ విఫలమైన వారికి మీరేనా ఇన్ ఛార్జ్? 461 00:42:25,087 --> 00:42:26,922 వాళ్లకి అలా పిలిస్తే అస్సలు నచ్చదు. 462 00:42:27,631 --> 00:42:29,800 - మరి మీరేమని పిలుస్తారు వాళ్లని? - విఫలమైన వాళ్లని. 463 00:42:31,677 --> 00:42:35,305 లండనులో బాంబు పేలిందంటే, అది ఎంఐ5కి మచ్చ తెచ్చే విషయమే. 464 00:42:36,974 --> 00:42:39,560 కొత్త బృందాన్ని ఏర్పాటు చేయండి. బాంబు పేల్చేవాడు ఇంకొకడు ఉన్నాడేమో మనం కనుక్కోవాలి. 465 00:42:41,979 --> 00:42:43,856 ఈ విషయం రవ్వంతైనా బయటకి పొక్కినా, 466 00:42:43,856 --> 00:42:46,984 సెక్యూరిటీ సర్వీసులకి ఉండే కాస్త పేరు కూడా బూడిదలో కలిసిపోతుంది. 467 00:42:46,984 --> 00:42:48,068 తప్పుకో! 468 00:42:49,152 --> 00:42:50,153 అయ్య బాబోయ్... 469 00:42:53,991 --> 00:42:56,451 రివర్, ఎక్కడ ఉన్నావు? 470 00:42:56,451 --> 00:42:57,953 నీ వల్ల ఇప్పుడు ఏ ఉపయోగమూ లేదు. 471 00:42:57,953 --> 00:42:59,079 నువ్వు వచ్చిన పని కానివ్వయ్యా. 472 00:43:00,914 --> 00:43:04,751 నువ్వు నాతో చేతులు కలిపితే బాగుంటుంది. లేదంటే నేను నిన్ను చంపాల్సి ఉంటుంది. 473 00:43:05,544 --> 00:43:06,670 నువ్వు మామూలు పిచ్చోడివి కాదు. 474 00:43:10,674 --> 00:43:11,925 ఇక నేను వెళ్లి పడుకుంటా. 475 00:43:11,925 --> 00:43:14,178 కాస్త స్నానం గురించి కూడా ఆలోచించవచ్చు కదా? 476 00:43:15,053 --> 00:43:16,680 నాకు కూడా నీతో చేయాలనే ఉంది, 477 00:43:16,680 --> 00:43:18,724 కానీ ఈ సమయంలో అది తగిన పని కాదు కదా. 478 00:43:18,724 --> 00:43:21,977 నా బృందంలోని వాళ్లు చనిపోయారు, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చేయను నీతో స్నానం? 479 00:44:35,843 --> 00:44:37,761 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్