1 00:00:10,219 --> 00:00:13,388 ఏదో అపార్టుమెంట్ దగ్గర ఉండే కారు పార్కింగ్ దగ్గరికి వెళ్లమని నాకు ఒక కాల్ వచ్చింది. 2 00:00:13,472 --> 00:00:15,140 -ఎడ్డ్వేర్ రోడ్డు దగ్గర ఉండేదే కదా? -అవును. 3 00:00:22,731 --> 00:00:24,983 అతడిని చంపింది కారు కాదని చెప్పావే. 4 00:00:26,527 --> 00:00:27,819 మరి అతను ఎలా చనిపోయాడు? 5 00:00:31,240 --> 00:00:32,824 రెబెక్కా, అతను ఎలా చనిపోయాడో చెప్పు. 6 00:00:32,908 --> 00:00:35,285 నేను అక్కడికి చేరుకొనేసరికి, అతను అక్కడే ఉన్నాడు, 7 00:00:35,369 --> 00:00:37,079 మేము అదేం చేయలేదు. 8 00:00:37,162 --> 00:00:39,665 అవును. నా వోడ్కాలో చాలా వోడ్కా కలిపేశారు. 9 00:00:39,748 --> 00:00:41,500 -అంతే. -జాగ్రత్తగా వెళ్లు, సరేనా? 10 00:00:41,583 --> 00:00:43,377 మలుపుల దగ్గర చూసుకొని మలుపు తీసుకో. 11 00:00:43,961 --> 00:00:46,338 వారిలో ఒకరు అతని సైకిల్ ని పట్టుకొని ఉన్నారు. 12 00:00:46,421 --> 00:00:48,257 సైకిల్ తొక్కడం మొదలుపెట్టాక, మామూలు అయిపోతానులే. 13 00:00:48,340 --> 00:00:53,387 అతను బాగానే ఉన్నాడు. తాగి ఉన్నాడు లేదా ఏదైనా డ్రగ్ తీసుకొని ఉండవచ్చు. 14 00:00:53,470 --> 00:00:55,764 అప్పుడు, ఇంకొకడు… 15 00:00:55,848 --> 00:00:57,266 అతని గొంతు నులమడం మొదలుపెట్టాడు. 16 00:00:57,349 --> 00:00:59,434 ఈ మూడవ వ్యక్తి నా కారెక్కి, అతడిని గుద్దేశాడు. 17 00:01:04,480 --> 00:01:06,650 ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. అతను వెళ్లిపోయాడు. 18 00:01:07,484 --> 00:01:08,777 అతనెవరో స్పష్టంగా కనిపించాడా? 19 00:01:15,075 --> 00:01:16,076 ఆ తర్వాత ఏం జరిగింది? 20 00:01:19,955 --> 00:01:22,040 అతను ఇంకా బతికే ఉన్నాడు, కానీ పరిస్థితి ఏమంతా బాగాలేదు. 21 00:01:22,124 --> 00:01:26,044 అప్పుడు అతని గొంతు నులిపిన ఆ మూడవ వ్యక్తి… 22 00:01:28,630 --> 00:01:29,882 అతడిని చంపేశాడు. 23 00:01:33,177 --> 00:01:34,178 ఎలా? 24 00:01:37,848 --> 00:01:39,141 చూడటానికి అతను ఎలా ఉన్నాడు? 25 00:01:39,224 --> 00:01:41,476 భారీగా ఉన్నాడు, వయస్సు యాభైలలో ఉంటుంది, బట్ట తల. 26 00:01:41,560 --> 00:01:43,020 చూడటానికి భయంకరంగా ఉన్నాడు. 27 00:01:48,650 --> 00:01:51,778 ఆ తర్వాత, అతడిని, సైకిలును, వ్యాన్ వెనుక వైపు పెట్టారు. 28 00:01:52,362 --> 00:01:53,822 అతడిని యాక్సిడెంట్ స్థలానికి తీసుకొని వెళ్లారు. 29 00:01:56,575 --> 00:01:58,452 ఆ తర్వాత, ఆంబులెన్స్ కి కాల్ చేసి, 30 00:01:58,535 --> 00:02:00,996 నా కారు ముందుకి మీ మిత్రుడు సైకిల్ లో వచ్చి పడ్డాడని చెప్పమని నాకు చెప్పారు. 31 00:02:13,509 --> 00:02:15,677 -వీళ్లేనా అతడిని గుద్దింది? -అవును. 32 00:02:15,761 --> 00:02:16,762 పియోట్ వొలోడిన్ కిరియల్ ఆసిమోవ్ 33 00:02:16,845 --> 00:02:18,764 -వీళ్లని ఇంతకు ముందు ఎప్పుడైనా చూశావా? -హా. 34 00:02:18,847 --> 00:02:20,641 ఒకసారి అతని కోసం ఓ కొరియర్ పంపాను. 35 00:02:22,184 --> 00:02:23,644 ఏం కొరియర్ చేశానని అడగవద్దు. నేను చూడలేదు. 36 00:02:24,269 --> 00:02:28,899 -సరే. అక్కడ తిరుగుతూ ఉండిన వ్యక్తి ఇతనేనా? -అయ్యుండవచ్చు. నాకు సరిగ్గా తెలీదు. 37 00:02:28,982 --> 00:02:29,983 ఆర్కేడీ పాష్కిన్ 38 00:02:30,067 --> 00:02:31,151 నాకు తెలీదు. 39 00:02:31,235 --> 00:02:33,237 -అతను స్పష్టంగా కనబడలేదు. -సరే. 40 00:02:33,320 --> 00:02:34,154 ఆండ్రే చెర్నిట్స్కీ 41 00:02:34,238 --> 00:02:37,533 -చంపింది ఇతనేనా? -అవును, ఇతనే. 42 00:02:45,457 --> 00:02:48,210 నువ్వు ఒక భాషా స్కూల్ దగ్గర డబ్బు తీసుకున్నావు కదా, 43 00:02:48,293 --> 00:02:50,546 అక్కడ ఎప్పుడూ తీసుకుంటూ ఉంటావా? 44 00:02:50,629 --> 00:02:51,922 లేదు, అది కొత్త ప్రదేశం. 45 00:02:52,005 --> 00:02:53,757 నువ్వు డబ్బు తీసుకున్నప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా? 46 00:02:53,841 --> 00:02:54,842 లేదు, వాళ్లు ఒక తాళం చెవి ఇచ్చి, 47 00:02:54,925 --> 00:02:57,135 తర్వాత దాన్ని ఒక పోస్ట్ డబ్బాలో వేయమని చెప్పారు. 48 00:03:02,516 --> 00:03:05,644 సరే. థ్యాంక్యూ, రెబెక్కా. 49 00:03:10,315 --> 00:03:12,484 మొత్తం చెప్తే, నన్ను సురక్షితంగా ఉంచుతానని మీరు అన్నారు కదా. 50 00:03:15,279 --> 00:03:17,030 సరే. ఒక్క నిమిషం. 51 00:03:21,201 --> 00:03:25,497 నేను ఒక సర్వీసుకు సంబంధించిన నంబరు ఇస్తాను. 52 00:03:25,581 --> 00:03:26,999 అది సురక్షిత ఆవాసమా? 53 00:03:28,250 --> 00:03:30,043 కొత్త గుర్తింపు ఇస్తారా? నాకు డబ్బు కావాలని మీకు తెలుసు కదా. 54 00:03:30,127 --> 00:03:33,589 వాళ్లు ప్రతి నెలా మారిపోయే కోడ్ పేరును చెప్తేనే సమాధానం ఇస్తారు, 55 00:03:33,672 --> 00:03:36,633 వాళ్లకి "జాక్సన్ ల్యాంబ్" అనే పేరు చెప్పు చాలు. 56 00:03:36,717 --> 00:03:40,345 నీకు ఏం కావాలి అని వారు అడిగినప్పుడు నంబరు ఏడు అని చెప్పు. 57 00:03:40,429 --> 00:03:41,471 నంబర్ ఏడు. 58 00:03:41,555 --> 00:03:45,934 అంతే. అరగంటలో నీ దగ్గరికి వచ్చేస్తారు. 59 00:03:48,478 --> 00:03:49,313 సరే. 60 00:03:57,487 --> 00:03:58,405 హలో? 61 00:03:58,488 --> 00:04:02,034 హాయ్, జాక్సన్ ల్యాంబ్ ఈ నంబరుకు కాల్ చేయమని చెప్పారు. 62 00:04:02,117 --> 00:04:04,828 -ఏడవ నంబరును చెప్పమన్నాడు. -లైన్లో ఉండగలరా? 63 00:04:04,912 --> 00:04:06,163 హా, ఉంటాను. 64 00:04:11,168 --> 00:04:13,670 -మీకు అతనికి ఇష్టమైనది కావాలా? -ఏమన్నారు? 65 00:04:13,754 --> 00:04:15,088 ఏడవ నంబరు. 66 00:04:16,798 --> 00:04:17,882 నాకు అర్థం కాలేదు. 67 00:04:18,509 --> 00:04:22,221 ఏడవ నంబరు మిస్టర్ ల్యాంబ్ కి ఇష్టమైన వంటకం వంటకమైన డబుల్ నూడుల్స్. 68 00:04:23,388 --> 00:04:24,598 దానితో పాటు అతను తీసుకొనే సైడ్ డిష్ కావాలా? 69 00:05:06,223 --> 00:05:08,225 మిక్ హెర్రన్ రచించిన డెడ్ లయన్స పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 70 00:05:19,862 --> 00:05:21,613 బయట ఏమీ లేవు కదా? 71 00:05:21,697 --> 00:05:23,115 వర్షం ఖచ్చితంగా పడేలా ఉంది. 72 00:05:24,116 --> 00:05:25,951 -ఎవరూ తినరా ఏంటి? -లేదు… 73 00:05:26,034 --> 00:05:27,411 అందరూ నన్నే చూస్తుంటే, 74 00:05:27,995 --> 00:05:29,705 నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. 75 00:05:30,539 --> 00:05:32,833 అయితే, మీరు దూరం నుండి వస్తున్నారా, లియో? 76 00:05:32,916 --> 00:05:36,336 ఆలెక్స్ వంటలు తినడానికి సప్త సముద్రాలను దాటి అయినా రావచ్చు. 77 00:05:36,420 --> 00:05:38,172 వూర్సెస్టర్ లో చిన్న పని ఉండింది. 78 00:05:38,255 --> 00:05:40,465 లండన్ కి వెళ్తూ, ఇలా వచ్చాను. 79 00:05:40,549 --> 00:05:42,176 ఇతను ఎప్పుడూ ఇంతే, ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలీదు. 80 00:05:42,259 --> 00:05:44,011 -అవును. -అవకాశం దొరికినప్పుడు చేజిక్కించుకోవాలి. 81 00:05:45,262 --> 00:05:48,056 మీ సంగతేంటి, మిస్టర్ వాకర్? మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారా? 82 00:05:48,140 --> 00:05:50,142 లేదు. నేను జర్నలిస్టుని. 83 00:05:50,767 --> 00:05:54,479 గ్రామ జీవనంపై ఒక చిన్న ఆర్టికల్ రాసే పని మీద ఇక్కడికి వచ్చాను. 84 00:05:55,731 --> 00:05:58,567 కెల్లీ మంచిగా ఈ ప్రాంతాన్నంతా చూపిస్తోంది. 85 00:05:58,650 --> 00:05:59,735 హా, అవును. 86 00:06:00,611 --> 00:06:02,070 అయితే, నువ్వు అండర్ కవరా? 87 00:06:03,280 --> 00:06:05,824 లేదు, నేను అండర్ కవర్ కాదు. 88 00:06:05,908 --> 00:06:08,076 అలాంటివి చేసేంత ధైర్యం నాకు లేదు. 89 00:06:08,660 --> 00:06:12,247 ఇక్కడ నీకు అంత పెద్ద కథనం ఏం దొరుకుతుంది? ఇది చాలా నిశ్శబ్దమైన పల్లెటూరు. 90 00:06:12,331 --> 00:06:14,499 తెర వెనుక భాగోతాలు చాలానే ఉంటాయి. 91 00:06:14,583 --> 00:06:15,709 అవును. 92 00:06:15,792 --> 00:06:18,170 అతనికి నువ్వే ఆ రహస్యాలన్నింటినీ చెప్తూ ఉంటావు. 93 00:06:18,253 --> 00:06:19,463 తను అన్నింట్లో వేలు పెట్టేస్తుంది. 94 00:06:19,546 --> 00:06:21,298 -ఏంటి! -అది నిజమే. 95 00:06:21,381 --> 00:06:22,758 లేదు. మంచిగానేలే. 96 00:06:23,258 --> 00:06:24,968 ఇప్పటిదాకా ఏం కనిపెట్టావేంటి? 97 00:06:26,345 --> 00:06:29,181 విమానాల్లో ప్రయాణం అనేది నాకు పడే విషయం కాదని. 98 00:06:29,264 --> 00:06:31,975 అదైనా అయ్యుండాలి, లేదా కెల్లీ, తాను అనుకుంటున్నంత మంచి పైలట్ అయినా కాకుండా ఉండాలి. 99 00:06:32,059 --> 00:06:33,560 నువ్వు చెప్పిన మొదటిదే నిజం అనుకుంటా. 100 00:06:34,728 --> 00:06:36,855 కానీ ఏం లేదు, నాకు ఇక్కడ పుకార్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. 101 00:06:37,731 --> 00:06:40,150 ఇంకా జంతువులను అక్రమంగా వేటాడే వ్యక్తి గురించి తెలిసింది. 102 00:06:40,234 --> 00:06:41,944 ఆ పని చాలా ప్రమాదకరమైనది. 103 00:06:42,027 --> 00:06:42,861 అవును. 104 00:06:42,945 --> 00:06:47,366 అతను ఉపయోగిస్తున్నది ఉచ్చులనా, తుపాకులనా? లేదా విషాన్నా? 105 00:06:47,449 --> 00:06:49,076 అది జంతువుని బట్టి ఉంటుంది. 106 00:06:49,159 --> 00:06:51,411 ఈ సంభాషణ భయంకరంగా మారిపోయింది. 107 00:06:52,246 --> 00:06:54,206 -ఎవరికైనా కాఫీ కావాలా? -నాకు కావాలి. 108 00:06:54,289 --> 00:06:55,290 -సరే. -నేను కూడా… 109 00:06:55,374 --> 00:06:57,167 లేదు. నువ్వు అతిథివి. కూర్చో. 110 00:06:57,251 --> 00:06:59,795 సరే, కెల్లీ, ఆ స్ట్రాబెర్రీలని బయటకు తీసుకురావా? 111 00:07:01,630 --> 00:07:03,048 -సరే మరి. -కాస్త తప్పుకో. 112 00:07:11,139 --> 00:07:12,850 ఒక హెచ్చరిక, బాసూ. 113 00:07:19,481 --> 00:07:22,985 ఆలెక్స్ చేతి కాఫీ చండాలంగా ఉంటుంది. 114 00:08:36,015 --> 00:08:40,020 హలో. నాకు వోడ్కా టానిక్ ఇస్తారా? 115 00:08:40,102 --> 00:08:41,480 -తప్పకుండా. -థ్యాంక్యూ. 116 00:08:46,693 --> 00:08:47,694 హలో. 117 00:08:49,071 --> 00:08:50,364 హాయ్. 118 00:09:07,965 --> 00:09:09,466 -మన్నించండి. -మరేం పర్వాలేదు. 119 00:09:28,902 --> 00:09:31,154 వెస్ట్ బ్రూక్ అకాడమీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 120 00:10:12,946 --> 00:10:16,116 మీరు వెస్ట్ బ్రూక్ అకాడమీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి కాల్ చేశారు. 121 00:10:16,200 --> 00:10:17,743 మీ పేరు, ఇంకా నంబరు చెప్పండి, 122 00:10:17,826 --> 00:10:20,245 మేము త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాం. థ్యాంక్యూ. 123 00:10:21,079 --> 00:10:22,623 ఫోన్ ఎత్తు, మిస్టర్ ల్యాంబ్. 124 00:10:28,253 --> 00:10:31,215 ఈ చెత్త ప్రదేశంలో నీ వాయిస్ మెయిల్ ఒక్కటే 125 00:10:31,298 --> 00:10:32,341 ప్రొఫెషనల్ గా ఉంది. 126 00:10:33,509 --> 00:10:36,428 జోక్ చేస్తూ భంగపాటును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నావా? 127 00:10:37,012 --> 00:10:39,348 నువ్వు అక్కడ ఉన్నట్టు నాకు ఎలా తెలుసో అడగడానికి అహం అడ్డు వస్తోందా? 128 00:10:42,518 --> 00:10:45,562 నువ్వు నన్ను గమనిస్తున్నావేమో. 129 00:10:46,188 --> 00:10:49,358 కానీ నువ్వు ప్రస్తుతమున్న పరిస్థితిని బట్టి చూస్తే, 130 00:10:49,441 --> 00:10:52,069 నీకు ఉన్న కాస్తంత సమయంలో నువ్వు పనికి వచ్చే పని చేస్తే మంచిదేమో. 131 00:10:52,152 --> 00:10:53,153 అంటే? 132 00:10:54,196 --> 00:10:58,909 మొదటిది, నిజమైన వైద్య చికిత్స. గూగుల్ లో వెతికితే లివర్ కి సంబంధించినదని చెప్తోంది. 133 00:10:58,992 --> 00:11:01,578 ఏడు నెలల క్రితం, డాక్టర్లు ఆరు నెలలకు మించి బతకనని చెప్పారు. 134 00:11:01,662 --> 00:11:02,996 బోనస్ ఆయుష్షుతో జీవిస్తున్నావన్నమాట. 135 00:11:03,080 --> 00:11:05,332 కానీ ప్రశ్న ఏంటంటే నిక్కీ, 136 00:11:06,375 --> 00:11:09,545 నువ్వు ఎలాంటి హానిని తలపెట్టాలని చూస్తున్నావు అని. 137 00:11:09,628 --> 00:11:11,755 నేను ఇక్కడికి వచ్చేశాక, 138 00:11:11,839 --> 00:11:14,174 నా మాజీ బాసులు 139 00:11:14,883 --> 00:11:17,511 ప్రతీకార చర్య ఉండదని చాలా స్పష్టంగా చెప్పారు. 140 00:11:17,594 --> 00:11:23,809 కాకపోతే, అవసరం వచ్చినప్పుడు, వారు అడిగిన దానికి సాయపడాలి, అంతే. ఇప్పుడు వాళ్లు అడిగారు. 141 00:11:25,435 --> 00:11:27,563 ఏమని అడిగారు? 142 00:11:28,438 --> 00:11:30,941 నేను కేవలం ఒక చక్రాన్ని మాత్రమే, మిస్టర్ ల్యాంబ్. 143 00:11:31,024 --> 00:11:35,904 నీ విచారణని ఒక చోటే ఫోకస్ అయ్యి ఉండేలా చూడమన్నారు, 144 00:11:35,988 --> 00:11:39,491 ఆ లోపు వారు వేరే చోట అసలైన పని కానిచ్చేస్తారు. 145 00:12:00,721 --> 00:12:01,722 ఛ. 146 00:12:12,524 --> 00:12:13,650 గడియారాన్ని హ్యాక్ చేసేశావా? 147 00:12:13,734 --> 00:12:16,069 అంత అక్కర్లేదు, ఫిట్ నెస్ యాప్ ని తెరిస్తే సరిపోతుంది. 148 00:12:16,153 --> 00:12:17,696 వెంటనే పైకి రా! 149 00:12:19,489 --> 00:12:22,826 నువ్వు ఎందుకో కాస్త కంగారుగా ఉన్నట్టున్నావు. 150 00:12:24,036 --> 00:12:25,787 నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావా అని ఆలోచిస్తున్నా, అంతే. 151 00:12:27,039 --> 00:12:29,333 -ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోతున్నావు. -ఇప్పుడు అలా ఉండాలంటావా? 152 00:12:30,000 --> 00:12:32,419 అంటే, నేను ఎంఐ5 ఏజెంటుని కదా. 153 00:12:34,213 --> 00:12:35,380 అది నీకు ముందే తెలుసు కదా. 154 00:12:37,424 --> 00:12:39,301 అయితే, ఇప్పుడు మన రహస్యాలన్నింటినీ బహిర్గతం చేసేయాలన్నమాట. 155 00:12:40,135 --> 00:12:41,470 నావి బహిర్గతంగానే ఉన్నాయి. మరి నీవి? 156 00:12:45,349 --> 00:12:47,351 నేనేం చెప్పాలని నువ్వు ఆశిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. 157 00:12:52,314 --> 00:12:54,191 హీత్రో సీసీటీవీ. 158 00:12:54,274 --> 00:12:56,985 చెర్నిట్స్కీ అసలు దేశాన్ని విడిచి ఎక్కడికీ వెళ్లలేదు. 159 00:12:59,571 --> 00:13:02,074 నా మాటలు వినిపించాయా? 160 00:13:02,866 --> 00:13:05,786 చెర్నిట్స్కీ దేశాన్ని విడిచిపెట్టి పోలేదు. నాకు తెలుసు. 161 00:13:06,995 --> 00:13:08,121 ఎలా? 162 00:13:09,373 --> 00:13:11,416 హార్పర్ ని చంపింది అతనే కాబట్టి. 163 00:13:12,626 --> 00:13:15,337 యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవర్, రెబెక్కా మిచెల్ తో నేను మాట్లాడాను. 164 00:13:15,420 --> 00:13:16,880 కాకపోతే కారును నడిపింది తను కాదు. 165 00:13:17,589 --> 00:13:20,509 పాష్కిన్ సెక్యూరిటీ వాళ్లు హార్పర్ ని కారుతో గుద్దించారు, 166 00:13:20,592 --> 00:13:22,928 ఆ తర్వాత చెర్నిట్స్కీ ప్రాణం తీసేశాడు. 167 00:13:23,011 --> 00:13:24,304 పాష్కిన్? 168 00:13:25,597 --> 00:13:28,517 అతను డిక్కీని ఉచ్చులోకి లాగినట్టే, అతడిని కూడా ఉచ్చులోకి లాగాడు. 169 00:13:28,600 --> 00:13:32,020 అతను ఏదో విషాన్ని ఉపయోగించి చంపేస్తున్నాడు. 170 00:13:32,104 --> 00:13:35,732 ఈ విషయం పార్కులోని వాళ్లకి తెలిస్తే, విచారణని ఆపించేస్తారు. అప్పుడు వాళ్లని మనం పట్టుకోలేం. 171 00:13:35,816 --> 00:13:37,651 అందుకే నేను వాళ్లకి చెప్పట్లేదు. 172 00:13:38,569 --> 00:13:39,653 ఈ తతంగాన్ని అంతా కప్పిపుచ్చేసి 173 00:13:39,736 --> 00:13:42,447 టావెర్నర్ తన పరువును కాపాడుకుంటుంది. 174 00:13:42,531 --> 00:13:44,700 ఆ దరిద్రులను వాళ్ల దేశానికి పంపించేస్తారు, ఇక్కడి నుండి యాకుత్స్క్ కి వెళ్లే 175 00:13:44,783 --> 00:13:48,328 ఏ విమానంలో కూడా వాళ్ల పేర్లు ఉండవు. 176 00:13:48,871 --> 00:13:52,124 వాళ్లు నా ఏజెంట్లెను ఇద్దరిని చంపారు. నేను అలా జరగనిచ్చే ప్రసక్తే లేదు. 177 00:13:52,916 --> 00:13:54,626 ఈ విషయాన్ని లుయీసాకి చెప్దామా? 178 00:13:54,710 --> 00:13:57,379 ముందు తను ఫోన్ ఎత్తితే కదా చెప్పడానికి. 179 00:13:58,714 --> 00:14:02,467 -నెవ్స్కీ దగ్గర ఎంత కాలం పని చేస్తున్నావు? -అయిదేళ్లు కావస్తోంది. 180 00:14:03,594 --> 00:14:06,221 అంతకు ముందు? నేను చెప్పనా? ఇంకా కాలేజీలో చదువుతూ ఉంటావు? 181 00:14:07,931 --> 00:14:10,434 నా చిన్నప్పుడే నెవ్స్కీకి నాలో ఏదో కనబడింది. 182 00:14:10,976 --> 00:14:12,561 -ఏంటది? -ఆకలి. 183 00:14:13,854 --> 00:14:15,939 అతని చుట్టూ ఉన్న వాళ్లందరూ సోమరులు. 184 00:14:17,024 --> 00:14:19,693 అయితే, నువ్వు అప్పటికప్పుడు చేరేసి వాళ్ళని అక్కడ లేకుండా చేసేశావా? 185 00:14:20,235 --> 00:14:21,570 వాళ్లే వెళ్లిపోయారు. 186 00:14:21,653 --> 00:14:25,782 విజయవంతమైన వ్యక్తులు ప్రవేశిస్తే జరిగేది అదే కదా? 187 00:14:25,866 --> 00:14:26,950 నాకు తెలీదులే. 188 00:14:27,034 --> 00:14:31,538 అదేంటి! నువ్వు ఎంఐ5 ఏజెంట్ కదా? అంటే, నువ్వు విజయవంతమైనట్టే కదా, 189 00:14:31,622 --> 00:14:34,249 నేను నువ్వు అనుకొనే ఎంఐ5 ఏజెంటుని కాదు. 190 00:14:34,333 --> 00:14:37,503 నన్ను అంతర్గతంగా ఒక శాఖకు 191 00:14:37,586 --> 00:14:40,172 వెలి వేశారని చెప్పవచ్చు, అక్కడ పనికిరాని వాళ్ళని ఉంచుతారు. 192 00:14:41,006 --> 00:14:42,549 అది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. 193 00:14:43,175 --> 00:14:47,179 భలే చెప్పారు, కానీ వాళ్ళ దృష్టిలో నేను పనికిరానిదాన్నే. 194 00:14:47,804 --> 00:14:48,805 ఎందుకు? 195 00:14:50,098 --> 00:14:52,267 ఆ క్షణాన్ని తలచుకోవడం నాకు ఇష్టం లేదు. 196 00:14:52,351 --> 00:14:54,269 మరి మానేయవచ్చు కదా? 197 00:14:57,064 --> 00:14:59,816 ఎందుకంటే, అక్కడితో నా కథకి ముగింపు కార్డ్ పడాలని నాకు లేదు. 198 00:15:00,651 --> 00:15:04,196 నా బాస్ లాగా స్లౌ హౌస్ లోనే జీవితాంతం మగ్గిపోవాలని నాకు లేదు. 199 00:15:06,114 --> 00:15:07,199 అలాగే, అవకాశం దక్కగానే బయటపడిపోవాలని 200 00:15:07,282 --> 00:15:09,493 నాకు ఉంది, మిన్ లాగా చనిపోవాలని నాకు లేదు. 201 00:15:10,494 --> 00:15:11,495 మిన్? 202 00:15:13,038 --> 00:15:15,582 మిన్ హార్పర్. చనిపోయిన నా సహోద్యోగి. 203 00:15:16,500 --> 00:15:18,627 అవును. అందుకు నేను చింతిస్తున్నాను. 204 00:15:19,545 --> 00:15:20,754 హా, థ్యాంక్స్. నేను కూడా. 205 00:15:22,548 --> 00:15:24,883 యాక్సిడెంట్ జరిగిపోయింది. తాగి సైకిల్ నడిపాడు. 206 00:15:26,051 --> 00:15:28,554 నమ్మడానికి కష్టంగా ఉంది. అతను అలా చేయడు. 207 00:15:30,013 --> 00:15:32,724 మన్నించాలి. అతను నేరుగా కారుకు ముందు వెళ్లి పడ్డాడని విన్నాను. 208 00:15:32,808 --> 00:15:34,852 పాపం ఆ మహిళ ఆ హఠాత్పరిణామానికి షాక్ అయింది. 209 00:15:36,645 --> 00:15:37,563 అవును. 210 00:15:38,814 --> 00:15:39,898 నువ్వు నమ్మట్లేదా? 211 00:15:40,899 --> 00:15:43,610 ఒక ఏజెంట్ చనిపోయినప్పుడు, అన్ని కోణాలలోనూ విచారణ చేయాలి. 212 00:15:47,948 --> 00:15:51,034 కానీ, ఈ సందర్భంలో మాత్రం, అది ఒక పిచ్చి యాక్సిడెంట్, అంతే. 213 00:15:57,624 --> 00:15:59,334 ఇంతకీ మిన్ ని ఎందుకు చంపారు? 214 00:16:00,502 --> 00:16:01,753 అది కనిపెట్టాల్సి ఉంది. 215 00:16:02,337 --> 00:16:03,380 మహారాజుగారికి ఈ సేవకుని ప్రణామములు. 216 00:16:03,463 --> 00:16:05,924 హార్పర్ హత్యలో తన పాత్రకి, ఆ అందాల రెబెక్కా మిచెల్, 217 00:16:06,008 --> 00:16:10,220 కటిన్స్కీకి చెందిన భాష స్కూల్ నుండి డబ్బు తీసుకుంది. 218 00:16:10,304 --> 00:16:12,139 దీనికి, కటిన్స్కీకి సంబంధం ఉందా? 219 00:16:13,974 --> 00:16:18,228 నా దృష్టంతా అతని స్కూల్ మీదనే ఉంచాలనుకున్నాడట, ఈ లోపు వేరే చోట అసలైన పని జరుగుతూ ఉన్నదట. 220 00:16:18,312 --> 00:16:19,146 ఏంటి? 221 00:16:19,229 --> 00:16:20,731 ఆ విషయంలో ఈ సన్నాసే సహాయపడగలడని ఆశిస్తున్నా. 222 00:16:20,814 --> 00:16:21,815 గడియారంలో ఏముంది? 223 00:16:22,733 --> 00:16:25,736 స్పిన్ డాక్టర్స్ వారి సంగీతాన్ని వినే ఏకైక వ్యక్తి మినే ఏమో. 224 00:16:25,819 --> 00:16:26,987 అతను ఆఖరిగా తిరిగిన ప్రదేశాలలో 225 00:16:27,070 --> 00:16:30,365 ఏదైనా అసాధారణంగా అనిపించింది ఉంటే చెప్పు ముందు, లేదంటే మెడ విరగ్గొట్టి పారేస్తా. 226 00:16:31,658 --> 00:16:34,828 ఉదయం అతను గోర్డన్ స్క్వేర్ నుండి ఎడ్గ్వేర్ రోడ్డు దాకా సైకిల్ లో వెళ్లాడు. 227 00:16:34,912 --> 00:16:38,373 దార్లో, యూస్టన్ రోడ్డు వెనుక ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఆగాడు. 228 00:16:38,457 --> 00:16:40,209 సాయంత్రం మళ్లీ ఎడ్జ్వేర్ రోడ్డుకు వెళ్లాడు, 229 00:16:40,292 --> 00:16:42,711 ఆ తర్వాత సెయిట్ పాంక్రస్ లో ఆ కారును గుద్దాడు. 230 00:16:42,794 --> 00:16:46,298 సరే. అతను ఏయే చోట్ల అయితే ఒక సెకను కంటే ఎక్కువ సేపు ఆగాడో 231 00:16:46,381 --> 00:16:48,717 ఆ చోట్ల చిరునామాలన్నీ నాకు కావాలి. 232 00:16:48,800 --> 00:16:50,719 కావాలంటే, అతని ఫోన్ ని హ్యాక్ చేయగలను. 233 00:16:50,802 --> 00:16:53,597 దానిలో ఉండే అశ్లీల ఫోటోల తప్ప మిగతా సమాచారాన్ని అంతటినీ మీకు అందించగలను. 234 00:16:53,680 --> 00:16:54,723 నీకు అయిదే సెకన్ల సమయం ఇస్తున్నా, 235 00:16:54,806 --> 00:16:57,643 ఈలోపే వెళ్లిపో, లేదంటే ఎత్తి కిందికి విసిరేస్తా నిన్ను. 236 00:16:58,227 --> 00:16:59,895 నువ్వు వెళ్లిపోయాక నేనేం చేయాలి? 237 00:17:01,730 --> 00:17:02,731 ఏమో మరి. 238 00:17:04,148 --> 00:17:06,693 నేను లేనప్పుడు ఏం చేస్తావో, అదే చేయ్ మరి. 239 00:17:08,237 --> 00:17:11,281 నీకు అమరవీరుల్లో కలిసిపోవాలని ఉంటే, ముందు దాన్ని సీసాలో వేసేసి, ఆ పనికి పూనుకో. 240 00:17:28,089 --> 00:17:30,926 నేను నా గదికి వెళ్లి, నెవ్స్కీని కలవాలి. 241 00:17:32,678 --> 00:17:35,180 కావాలంటే, 20 నిమిషాల తర్వాత మీరు నా దగ్గరికి రావచ్చు. 242 00:17:35,264 --> 00:17:37,808 మనం టెర్రస్ పై డ్రింక్ తాగవచ్చు. 243 00:17:39,184 --> 00:17:41,144 -డ్రింక్స్ కి థ్యాంక్యూ. -పర్వాలేదులెండి. 244 00:17:46,900 --> 00:17:49,361 దురదృష్టవశాత్తూ మిత్రులారా, నాకు పనుంది. కాబట్టి నేను బయలుదేరాలి. 245 00:17:49,444 --> 00:17:51,780 -అబ్బా. రాత్రికి ఉండవచ్చు కదా. -ఉండు. ఇంకోటి తీసుకో. 246 00:17:51,864 --> 00:17:55,492 లేదు. నన్ను మన్నించాలి. నేను వెళ్లాల్సిందే. ఉదయం నాకు పనుంది. 247 00:17:56,159 --> 00:17:57,160 లియో. 248 00:17:57,786 --> 00:17:58,787 థ్యాంక్యూ. 249 00:18:00,247 --> 00:18:03,375 నిజంగానే నిన్ను ఎక్కడో చూసినట్టు నాకు అనిపిస్తోంది. 250 00:18:04,042 --> 00:18:06,712 లేదు. లేదు. అదే నిజమైతే, నేను ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపట్టుండేవాడిని. 251 00:18:07,212 --> 00:18:08,881 బహుశా ఎటైనా వెళ్తూ నిన్ను చూశానేమో. 252 00:18:08,964 --> 00:18:11,925 కానీ, నేను ఒక్కసారి చూస్తే చాలు, ఇట్టే ముఖాలను గుర్తుపట్టేయగలను. 253 00:18:12,509 --> 00:18:16,471 నేను రైలులో లేదా బస్సులో ఉన్నప్పుడు ఒకరిని అలానే గమనిస్తూ ఉంటాను. 254 00:18:17,472 --> 00:18:18,932 వారి జీవితాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటా. 255 00:18:19,016 --> 00:18:20,976 నువ్వు చివరిసారిగా బస్సు ఎప్పుడు ఎకావేంటి? 256 00:18:21,059 --> 00:18:22,227 -పోయిన వారమే. -అవునా? 257 00:18:22,311 --> 00:18:25,606 అవును, ఎందుకంటే మీ పనికిమాలిన బ్రిటిష్ రైళ్లకి రిపేర్ వచ్చి ఆగిపోయాయి మరి. 258 00:18:25,689 --> 00:18:27,399 -హా, అందులో కొత్త ఏముంది! -అవునులే. 259 00:18:27,482 --> 00:18:31,320 నిన్ను మళ్లీ కలుస్తానేమో చూద్దాం. లండన్ లో అయినా, లేదా ఇక్కడైనా. 260 00:18:31,403 --> 00:18:33,447 -చూద్దాం. మిమ్మల్ని కలవడం బాగుంది. -హా. 261 00:18:34,406 --> 00:18:37,117 ఇక బయలుదేరతా మరి. 262 00:18:37,201 --> 00:18:40,621 సరే. ఇది దారుణం. పద బయటదాకా దింపుతాం. 263 00:18:41,997 --> 00:18:42,998 ఏంటి సంగతి? 264 00:18:44,374 --> 00:18:45,751 ఏమీ లేదే. ఎందుకలా అంటున్నావు? 265 00:18:47,377 --> 00:18:48,921 లియోకి నువ్వెవరో తెలిసినట్టుగా అనిపిస్తోంది. 266 00:18:49,838 --> 00:18:52,883 అదేం లేదులే. నాకు తెలిసి, అతను ఎవరినో చూసి, నన్ను అనుకుంటున్నట్టున్నాడు. 267 00:18:52,966 --> 00:18:54,468 -జాగ్రత్త. -కెల్లీ, వచ్చి బాయ్ చెప్పు. 268 00:18:54,551 --> 00:18:57,346 సరే. మరి అండర్ కవర్ అని ఏదో అన్నాడే? 269 00:18:57,429 --> 00:18:59,848 -బాయ్, లియో. నిన్ను కలవడం బాగుంది, గురూ. -థ్యాంక్యూ. బై. 270 00:18:59,932 --> 00:19:01,308 -హా, -కెల్లీ! 271 00:19:01,391 --> 00:19:02,392 వస్తున్నా. 272 00:19:03,310 --> 00:19:04,478 ఇక్కడే ఉండు. 273 00:19:04,561 --> 00:19:07,397 -సరే, జాగ్రత్త డార్లింగ్. -హా! ఈసారి వచ్చినప్పుడు ఎక్కువ సేపు ఉంటాలే. 274 00:19:07,481 --> 00:19:08,690 -తప్పకుండా. -సరే. 275 00:19:08,774 --> 00:19:09,775 జాగ్రత్తగా వెళ్లు. 276 00:19:09,858 --> 00:19:10,859 బై, లియో. 277 00:19:11,818 --> 00:19:13,946 హా, తర్వాతి సారి నువ్వు వచ్చేటప్పుడు చెప్పి రా. 278 00:19:14,029 --> 00:19:15,113 ఇక చాల్లే. 279 00:19:17,282 --> 00:19:18,325 బై, లియో. 280 00:19:18,408 --> 00:19:19,701 -జాగ్రత్త. -జాగ్రత్తగా వెళ్లు. 281 00:19:19,785 --> 00:19:20,744 -బై. -బై. 282 00:19:21,828 --> 00:19:23,080 ఓరి నాయనోయ్! 283 00:19:28,001 --> 00:19:29,253 బై. 284 00:20:04,037 --> 00:20:07,249 ఇల్యా నెవ్స్కీ 285 00:20:09,751 --> 00:20:11,545 విక్టర్ అస్కెల్ క్రైమోవ్ వ్యక్తిగత డేటా 286 00:20:28,395 --> 00:20:31,398 కుజ్నెత్సొవ్ ఇంపోర్ట్ & ఎక్స్ పోర్ట్ 287 00:20:50,834 --> 00:20:52,669 బెలారస్ ఉక్రెయిన్ రష్యా ఎస్టోనియా 288 00:20:52,753 --> 00:20:55,589 -మోడల్ చాలా బాగుంది. -అవును. 289 00:20:56,548 --> 00:20:57,633 వెయ్యి వాటిల్లో ఒకటి అన్నమాట. 290 00:20:58,425 --> 00:20:59,426 ఏమన్నారు? 291 00:20:59,510 --> 00:21:03,639 కంటెయినర్ల గురించి అంటున్నాను. వెయ్యి వాటిల్లో ఒకదాన్లో అక్రమ వస్తువులు వెళ్తాయి. 292 00:21:04,431 --> 00:21:07,851 -ప్రపంచమంతా తిరుగుతాయి. నియంత్రణలేమీ లేకుండా. -సరే. 293 00:21:07,935 --> 00:21:10,270 తుపాకులు, డ్రగ్స్, 294 00:21:10,979 --> 00:21:16,193 నమ్ముతావో లేదో కానీ, మనుషుల అక్రమ రవాణా కూడా జరుగుతుంది. 295 00:21:16,276 --> 00:21:17,945 డబ్బు సంపాదించడానికి ఆ సన్నాసులు ఎంతకైనా దిగజారుతారు. 296 00:21:19,363 --> 00:21:25,536 కానీ అలాంటి నెట్ వర్క్ ఉండాలంటే, అడుగడుగునా అన్ని చోట్లా తెలిసిన వాళ్లు ఉండాలి. 297 00:21:26,119 --> 00:21:30,874 కాస్తంత డబ్బు తీసుకొని చూసీ చూడకుండా ఉండేవాళ్లు. 298 00:21:33,502 --> 00:21:34,920 మీరేమంటునారో నాకు అర్థం కావట్లేదు… 299 00:21:35,003 --> 00:21:40,467 నిన్న ఇద్దరు రష్యన్లు వచ్చి ఒక ప్యాకేజీని తీసుకెళ్లారు. 300 00:21:40,551 --> 00:21:44,137 -అందులో ఏముందో నాకు తెలియాలి. -అప్పుడు నేను ఇక్కడ లేను. 301 00:21:44,221 --> 00:21:45,931 నువ్వు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? 302 00:21:46,014 --> 00:21:47,808 ఏం జరిగిందో ఏమో కానీ, దానితో నాకైతే ఏ సంబంధమూ లేదు. 303 00:21:48,308 --> 00:21:51,144 నా ముందు ఉన్నది నువ్వే కాబట్టి నీకు సంబంధం ఉన్నట్టే లెక్క. 304 00:21:52,563 --> 00:21:53,647 మీరు పోలీసా? 305 00:21:55,190 --> 00:21:56,900 అది తెలుసుకోవాల్సింది నువ్వే. 306 00:21:56,984 --> 00:21:59,736 చూడు, ఎలాగైనా… 307 00:22:01,989 --> 00:22:03,532 నేను ఒక్క కాల్ చేశానంటే… 308 00:22:06,910 --> 00:22:08,537 నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. 309 00:22:11,164 --> 00:22:13,208 గత కొన్ని రోజుల్లో, ఏయే ప్యాకేజీలు వచ్చాయో నేను చెక్ చేసి చెప్తాను. 310 00:22:13,292 --> 00:22:14,543 హా, సూపర్ ఐడియా. 311 00:22:17,129 --> 00:22:20,841 గురువారం ఉదయం 11:03 సమయం అప్పుడు చెక్ చేయ్. 312 00:22:30,017 --> 00:22:33,478 ఒక ప్యాకేజీని తీసుకెళ్లారు. చిన్న ప్యాకేజీయే. ఒక్క నిమిషం. 313 00:22:33,562 --> 00:22:34,938 వివరాలేవీ లేవు. 314 00:22:36,148 --> 00:22:39,109 అదేంటో చెప్పలేను. వివరాలన్నీ తొలగించబడ్డాయి. 315 00:22:40,110 --> 00:22:41,570 నన్ను నెవ్స్కీ ఇంటి దగ్గర కలుసుకుందువు రా. 316 00:22:43,155 --> 00:22:44,531 ఎప్పుడు అంటే? 317 00:22:44,615 --> 00:22:48,285 ఇప్పటికిప్పుడే వెళ్దాం పద. 318 00:22:55,459 --> 00:22:58,420 మీరు టెలీమార్కెటింగ్ వాళ్లు అయ్యుంటే, నా చేతిలో మీరు అయిపోయారు. 319 00:22:58,504 --> 00:23:00,214 నువ్వు నా సర్వీస్ ఫోనును ట్రాక్ చేయాలి. 320 00:23:01,215 --> 00:23:03,383 -రివర్? -నా సర్వీస్ ఫోనుని. 321 00:23:03,467 --> 00:23:06,011 దాన్ని చెర్నిట్స్కీ జేబులో ఉంచాను. దానికి ట్రాకింగ్ ఎనేబుల్ చేసి ఉంది. 322 00:23:06,094 --> 00:23:07,513 అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు. త్వరగా కానివ్వు. 323 00:23:09,389 --> 00:23:12,684 -త్వరగా, రాడీ. త్వరగా కానివ్వు. -ఒక్క సెకను ఆగు, లోడ్ అవుతోంది. 324 00:23:13,268 --> 00:23:14,436 హా, అదీ… 325 00:23:14,520 --> 00:23:16,271 నువ్వు కాస్తంత త్వరగా చెప్తే, రాడీ, 326 00:23:16,355 --> 00:23:18,065 వచ్చి నీ కాళ్లకి ఓ దండం పెడ్తాను. 327 00:23:21,652 --> 00:23:24,780 -సరే, ఫోన్ రిడ్జ్ వే డ్రైవ్ లో ఉంది. -అది ఎక్కడ స్వామీ? 328 00:23:24,863 --> 00:23:27,533 -నువ్వు ఎక్కడ ఉన్నావు? -డౌన్సైడ్ మ్యాన్ పబ్ దగ్గర. 329 00:23:28,450 --> 00:23:31,119 బీ192 వాయువ్య దిశ వైపు వెళ్తోంది. 330 00:23:31,203 --> 00:23:33,622 బార్న్ లేన్ అనే చిన్న రోడ్డు దగ్గర ఆగింది. 331 00:23:34,998 --> 00:23:37,918 -నువ్వు ఎడమ వైపు తిరిగి… -హా, అతను ఎక్కడికి వెళ్తున్నాడో అర్థమైంది. 332 00:23:40,546 --> 00:23:41,588 హా, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. 333 00:23:53,851 --> 00:23:54,977 జాన్! 334 00:24:22,129 --> 00:24:23,130 సంతకం చేసిన వ్యక్తి: విక్టర్ క్రైమోవ్ తేదీ 19/11/05 335 00:24:23,213 --> 00:24:25,465 హలో. మీరు విక్టర్ క్రైమోవ్ యేనా? 336 00:24:26,717 --> 00:24:29,595 గుడ్ ఈవినింగ్. నా పేరు క్యాథరిన్ స్టాండిష్, 337 00:24:29,678 --> 00:24:33,724 మీరు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన జేమ్స్ వెబ్ తో నిర్వహించిన కన్సల్టేషన్ పని గురించి 338 00:24:33,807 --> 00:24:35,392 మీకు కాల్ చేస్తున్నాను. 339 00:24:36,810 --> 00:24:37,936 అవును, చెప్పండి. 340 00:24:38,645 --> 00:24:41,106 నేనెందుకు కాల్ చేస్తున్నానంటే, 341 00:24:41,190 --> 00:24:43,609 మా దగ్గర ఉన్న రికార్డులలో ఒకటి మిస్ అయింది. 342 00:24:44,318 --> 00:24:49,656 అధికారిక సీక్రెట్స్ యాక్ట్ పత్రంపై మీ సంతకం మిస్ అయ్యుంది. 343 00:24:50,365 --> 00:24:53,202 అలాంటిదేమీ లేదు. లేదు, లేదు, నేను అక్కడికే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా. 344 00:24:54,870 --> 00:24:56,288 సరే, థ్యాంక్యూ. బై. 345 00:25:10,093 --> 00:25:12,179 పాష్కిన్ బాస్ ఇక్కడ ఉంటాడా? 346 00:25:12,846 --> 00:25:15,474 అవును. నెవ్స్కీ. ఇదేదో చిన్న సైజు సెంట్రల్ జైలులా ఉంది. 347 00:25:15,557 --> 00:25:17,768 ఎప్పటికైనా, పై అధికారులకీ, నెవ్స్కీకి పొత్తు కుదర్చాలని 348 00:25:17,851 --> 00:25:19,353 ఆ గుంట నక్క గాడు ప్రయత్నిస్తున్నాడు. 349 00:25:19,436 --> 00:25:20,729 అదే అతని ప్లాన్. 350 00:25:20,812 --> 00:25:23,565 కానీ ఆ ప్రయత్నం వల్ల వాడికి పీకల్లోతు కష్టాలు తప్పవు. 351 00:25:32,741 --> 00:25:34,826 మనం ఇక్కడేం చేస్తున్నామో మిమ్మల్ని అడగవచ్చా? 352 00:25:34,910 --> 00:25:36,662 నెవ్స్కీ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్నాం. 353 00:25:38,163 --> 00:25:42,417 ముప్పై ఎళ్ల నుండీ మన నిఘాలో ఉన్న ఒక రష్యా వాడు 354 00:25:43,252 --> 00:25:46,672 నన్ను ఒక చోటుకే పరిమితం చేసేసి, ఇంకేదో చోటికి అతని కామ్రేడ్లను పంపించి, 355 00:25:46,755 --> 00:25:49,758 పని చేయించడానికి చాలా సాహసం చేశాడు. 356 00:25:56,723 --> 00:25:58,225 చండాలంగా ఉంది. 357 00:26:03,856 --> 00:26:06,650 రోడ్డు వైపుకు మూడు కెమెరాలు ఉన్నాయి. 358 00:26:09,611 --> 00:26:12,239 ఈపాటికి ఇద్దరు రష్యన్లు అయినా వచ్చి 359 00:26:12,322 --> 00:26:15,617 మన పుంగి భజాయించి ఉండాలి. 360 00:26:20,122 --> 00:26:22,082 హా, చూస్తుంటే తలుపు తెరిచే ఉన్నట్టుంది. 361 00:26:22,749 --> 00:26:25,002 వెళ్లి లోపల చెక్ చేస్తావా? 362 00:26:25,544 --> 00:26:26,753 పర్వాలేదులే, థ్యాంక్స్. 363 00:26:28,297 --> 00:26:30,883 సరే. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నా. ఇక వెళ్లిపో. 364 00:26:30,966 --> 00:26:32,926 అలా ఇంట్లోకి చొరబడితే కదా నన్ను ఉద్యోగంలోంచి తీసేయాల్సింది? 365 00:26:33,427 --> 00:26:35,470 ఒకవేళ ఆపాటికే నన్ను వాడి గార్డులు లేపేయకపోతే. 366 00:26:35,554 --> 00:26:39,808 నా ఏజెంట్లలో నీకే ధైర్యం ఎక్కువ అని అనుకున్నాను, 367 00:26:39,892 --> 00:26:42,352 అందుకే ఈ పనికి నిన్ను రమన్నాను. కానీ, నేను పప్పులో కాలేశాను. 368 00:26:42,436 --> 00:26:43,437 మీరేమీ పప్పులో కాలేయలేదు. 369 00:26:44,354 --> 00:26:46,440 కానీ మీరు అన్న మాటలు నన్ను బాధించాయి. 370 00:26:58,118 --> 00:26:59,620 గోల్డ్ స్టోన్ హౌస్ 371 00:27:30,943 --> 00:27:32,152 ఇలా రా. 372 00:27:43,205 --> 00:27:44,248 ఓరి నాయనోయ్. 373 00:29:09,416 --> 00:29:10,709 -అతను నెవ్స్కీ. -దగ్గరికి వెళ్లకు! 374 00:29:10,792 --> 00:29:13,128 అటు వెళ్లకు. 375 00:29:14,505 --> 00:29:17,716 అతను టానింగ్ బెడ్ వల్ల అలా చనిపోయాడు అనుకుంటున్నావా? 376 00:29:19,176 --> 00:29:20,260 అతనిలో రేడియోయాక్టివ్ పదార్థాలు ఉన్నాయా? 377 00:29:21,386 --> 00:29:24,306 అవును. అందుకే వాళ్లు గైగర్ కౌంటర్ పరికరాన్ని ఇక్కడే పెట్టేసి వెళ్లారు. 378 00:29:24,932 --> 00:29:28,602 అతని ఒంట్లోకి ఎక్కించింది బీ12 విటమిన్ కాదని ఇతనికి తెలియజేయడానికి. 379 00:29:29,603 --> 00:29:31,605 తేలిగ్గా తుపాకీతో కాల్చేసి ఉండవచ్చు కదా? 380 00:29:31,688 --> 00:29:35,984 ఇతను కాల్చుకొనే ఉంటాడులే. నాలుగు రోజుల పాటు నరకం చూడటం కన్నా ఇదే మేలు అనుకొని ఉంటాడు. 381 00:29:38,570 --> 00:29:39,571 బొటన వేలు ఏది? 382 00:29:42,824 --> 00:29:43,825 ఏమో మరి. 383 00:29:45,327 --> 00:29:47,579 వెళ్లేటప్పుడు లిఫ్ట్ అడగడం కోసం దాన్ని తీసుకున్నారేమో. 384 00:29:48,539 --> 00:29:50,123 ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పద, 385 00:29:50,207 --> 00:29:52,960 ఇంకాసేపు ఉంటే మనకి రక్తపు వాంతులు అవుతాయి. 386 00:29:55,254 --> 00:29:56,755 దాన్ని ఇలా ఇవ్వు. 387 00:30:01,510 --> 00:30:02,803 ఇది ఎవరి పని? 388 00:30:02,886 --> 00:30:04,137 పాష్కిన్ మనుషులు. 389 00:30:04,221 --> 00:30:06,348 పాష్కిన్ అంటే నెవ్స్కీ దగ్గర పని చేసే వాడే కదా? 390 00:30:06,431 --> 00:30:08,684 అతను ఎవరి దగ్గర పని చేస్తున్నాడో ఏమోలే. 391 00:30:08,767 --> 00:30:11,436 మన కళ్లు గప్పి వాళ్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. 392 00:30:11,520 --> 00:30:12,729 ఈ విషయం పార్క్ లోని వాళ్లకి ఎలా తెలీలేదు? 393 00:30:13,313 --> 00:30:16,650 ఆ గూండాలు తీసుకొని వెళ్లిన ప్యాకేజీ అనేక పోర్టులలో తిరుగుతూ ఇక్కడికి వచ్చింది. 394 00:30:16,733 --> 00:30:18,652 పోర్టులలో తనిఖీలు చేయరా ఏంటి? 395 00:30:18,735 --> 00:30:19,945 తనిఖీ చేయగలిగినన్ని చేస్తారు, 396 00:30:20,028 --> 00:30:23,657 కానీ 95% కంటైనర్లు తనిఖీ జరగకుండానే వచ్చేస్తాయి. 397 00:30:24,825 --> 00:30:28,036 కనీసం ఒక్కటైనా తనిఖీని తప్పించుకొని వెళ్తుందని వాళ్లు అనేక ప్యాకేజీలను పంపించారు. 398 00:30:30,497 --> 00:30:31,582 మీకేమీ కంగారుగా లేదా? 399 00:30:33,041 --> 00:30:34,042 దేని గురించి? 400 00:30:34,126 --> 00:30:36,003 మనం లోపల చాలా సేపు ఉన్నాం కదా. 401 00:30:36,086 --> 00:30:38,172 హా, ఉచ్చ కారిపోతోంది ఇక్కడ. 402 00:31:30,015 --> 00:31:34,019 మన దేశంలో అయితే, బిషప్ వంటి పవిత్రమైన పాన్ పట్ల ఇలా వ్యవహరిస్తే, 403 00:31:34,102 --> 00:31:36,522 నిన్ను చర్చి సంఘం నుండి బహిష్కరించి ఉండేవాళ్లు. 404 00:31:39,483 --> 00:31:42,986 రాజు పట్ల అలా వ్యవహరిస్తే, నిన్ను కాల్చి పారేసి ఉండేవాళ్లు. 405 00:31:43,946 --> 00:31:46,073 విక్టర్ క్రైమోవ్? నా పేరు క్యాథరిన్ స్టాండిష్. 406 00:31:47,241 --> 00:31:49,701 మిస్ స్టాండిష్, కూర్చోండి. 407 00:31:50,202 --> 00:31:52,079 నేనేమీ అంతరాయం కలిగించట్లేదు కదా. 408 00:31:52,162 --> 00:31:53,539 అదేం లేదు. 409 00:31:54,039 --> 00:31:56,500 ఒక ఉన్నత స్థాయిలోని అధికారి ప్రాణాన్ని కాపాడారు మీరు. 410 00:31:57,167 --> 00:31:59,461 దీనికి వేడుక చేసుకోవాల్సిందే. 411 00:32:02,506 --> 00:32:06,468 మీరు మామూలుగా ఇలానే చేస్తుంటారా? 412 00:32:06,552 --> 00:32:07,886 లేదు, ఇంటికి వెళ్లే దార్లో ఉంది కదా అని వచ్చాను. 413 00:32:08,387 --> 00:32:09,596 అవునా? 414 00:32:10,264 --> 00:32:12,224 మీరు దీనిపై సంతకం చేశాక, మీరు ఇచ్చిన కొన్ని స్టేట్ మెంట్స్ పై 415 00:32:12,307 --> 00:32:15,727 నాకు కొన్ని సందేహాలను మీరు తీర్చాల్సి ఉంటుంది. 416 00:32:16,854 --> 00:32:19,439 మీరు ఎక్కడ పని చేస్తున్నారన్నారు? 417 00:32:19,523 --> 00:32:20,732 సర్వీసులో. 418 00:32:21,233 --> 00:32:22,317 సరే. 419 00:32:23,443 --> 00:32:27,948 నేను దీనిపై ఆనందంగా సంతకం చేస్తాను. ఒకనాడు వెబ్ ముందు కూడా నేను ఇలాగే సంతకం చేశాను. 420 00:32:28,031 --> 00:32:30,701 మీ కోసం మళ్లీ సంతకం చేస్తాను. 421 00:32:33,954 --> 00:32:35,163 థ్యాంక్స్. మరి… 422 00:32:37,165 --> 00:32:40,210 మీరు ఆర్కేడీ పాష్కిన్, ఇంకా జేమ్స్ వెబ్ మధ్య సమావేశాన్ని కుదర్చడానికి మధ్యవర్తిత్వం వహించినప్పుడు, 423 00:32:40,294 --> 00:32:43,839 మీరు పాష్కిన్ మంచివాడని గట్టిగా చెప్పగలనని చెప్పారు కదా. 424 00:32:43,922 --> 00:32:45,090 అసలు మీకు అతను ఎలా తెలుసు? 425 00:32:49,219 --> 00:32:51,930 మీరు సాధారణంగా ఆఫీసులోనే పని చేస్తారు కదా? 426 00:32:52,014 --> 00:32:54,600 ఆఫీసులో కూర్చొని చాలా సంగతులు కూడా తెలుసుకోవచ్చు. 427 00:32:54,683 --> 00:32:58,687 మరి, నా గురించి మీరేం తెలుసుకున్నారు? 428 00:32:58,770 --> 00:33:00,355 మీరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారని. 429 00:33:00,439 --> 00:33:04,818 అంతే, సరిగ్గా చెప్పారు. మీరు కూడా ఏమైనా ఇచ్చిపుచ్చుకుంటారా? 430 00:33:05,569 --> 00:33:07,196 పాష్కిన్ గురించి నా దగ్గర ఒక కథ ఉంది. 431 00:33:07,279 --> 00:33:10,199 మీ దగ్గర కూడా మీ గురించి ఓ కథ ఉండే ఉంటుంది కదా, 432 00:33:10,282 --> 00:33:13,785 లేదా నాకు ఆసక్తి కలిగించగల, మీతో పని చేసే ఇంకెవరి కథ అయినా. 433 00:33:15,495 --> 00:33:16,538 డ్రింక్ తీసుకుంటారా? 434 00:33:16,622 --> 00:33:18,373 లేదు, థ్యాంక్యూ. నేను తాగను. 435 00:33:20,000 --> 00:33:22,544 బయటవారిని కలిసినప్పుడు తాగితే, అవతలి వ్యక్తి మీకు కావలసిన విషయాన్ని 436 00:33:22,628 --> 00:33:25,088 మరింత బాహాటంగా చెప్పేస్తారని ప్రాథమిక ఫీల్డ్ ట్రైనింగ్ లో చెప్తారు. 437 00:33:25,172 --> 00:33:27,132 లేదు, నిజంగానే నేను తాగలేను, మన్నించండి. 438 00:33:27,216 --> 00:33:28,967 -పర్వాలేదు, తాగండి. -వద్దులెండి. 439 00:33:29,051 --> 00:33:30,135 తాగండి పర్వాలేదు. 440 00:33:30,219 --> 00:33:32,346 నేను ఒకప్పుడు తాగుడుకు బానిస అయ్యా, ఇప్పుడు దూరంగా ఉంటున్నా. 441 00:33:36,266 --> 00:33:39,770 చూస్తుంటే, మీ వద్ద ఒక కథ ఉన్నట్టే ఉంది. 442 00:33:41,355 --> 00:33:42,439 ఇప్పుడు చక్కగా ఇచ్చిపుచ్చుకోవచ్చు. 443 00:33:43,148 --> 00:33:45,234 నా కథతో మీరేం చేసుకుంటారు? 444 00:33:45,317 --> 00:33:47,361 ఎందుకంటే, బ్రిటిష్ సీక్రెట్ సర్వీసులో పని చేసే 445 00:33:47,444 --> 00:33:49,780 ఏ వ్యక్తి గురించి అయినా నాకు ఏదైనా తెలిస్తే, 446 00:33:49,863 --> 00:33:51,490 అది నాకు తర్వాత ఉపయోగపడవచ్చు. 447 00:33:53,158 --> 00:33:56,203 సర్వీసుకు వ్యతిరేకంగా ఉపయోగించగల సమాచారాన్ని ఇవ్వమని పరోక్షంగా అడుగుతున్నారా? 448 00:33:56,286 --> 00:33:59,456 సరే, అది పనికి రానిది కూడా కావచ్చు. కానీ అది మీరు తేల్చుకోవాల్సిన విషయం. 449 00:34:03,252 --> 00:34:06,171 కానీ, మీకు సమాచారం కావాలంటే, ఆ పని చేయక తప్పదు. 450 00:34:08,715 --> 00:34:10,509 సరే, ఇక బయలుదేరండి. 451 00:34:11,467 --> 00:34:13,887 సంతకం చేయబడిన మీ పత్రాన్ని తీసుకొని వెళ్లిపోండి, నేను ఇక్కడ చెస్ ఆడుకుంటూ, 452 00:34:13,971 --> 00:34:16,639 తాగుతూ, రేపు ఉదయం టిఫిన్ చేసేదాకా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉంటా. 453 00:34:24,147 --> 00:34:25,148 ఇది… 454 00:34:26,650 --> 00:34:29,987 ఇది నాకు లేని ఆత్మ విశ్వాసాన్ని నాకు అందించింది. నేనెలా ఉండాలనుకున్నానో, అలా ఉండేలా చేసింది. 455 00:34:30,070 --> 00:34:33,866 నేను ఎంజాయ్ చేశా. చాలా ఎంజాయ్ చేశా. జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నానని అనుకున్నా. 456 00:34:34,992 --> 00:34:37,786 ఉదయం కార్న్ ఫ్లేక్సులోకి పాలకు బదులుగా వోడ్కాకు పోసే స్థితికి చేరుకున్నాక, 457 00:34:37,870 --> 00:34:39,663 నా జీవితం నుండి సరదా దూరమైపోయిందని అర్థమైంది. 458 00:34:39,746 --> 00:34:42,373 దాని స్థానంలోకి గందరగోళం ప్రవేశించింది. నేను కొత్త వ్యక్తిగా మారిపోయాను. 459 00:34:43,625 --> 00:34:48,130 నేను గెలుపే ఎరుగని ఆటలో ఇరుక్కుపోయాను, నా పరిస్థితిలో ముందంజ అనేదే లేకుండా పోయింది. 460 00:34:49,590 --> 00:34:52,134 దాన్ని నేను బాగానే కప్పిపుచ్చగలుగుతున్నానని అనుకున్నాను, 461 00:34:52,217 --> 00:34:54,719 కానీ అది నా పనిపై కూడా ప్రభావం చూపసాగింది. 462 00:34:56,388 --> 00:35:00,642 నన్ను పనిలోంచి తీసేయకుండా, నాకు ఆసరా అందించడానికి మా బాస్ తన సొంత డబ్బులు ఇచ్చారు. 463 00:35:00,726 --> 00:35:04,146 అప్పటిదాకా ఎవరూ నాపై అంత మంచితనం కురిపించలేదు. 464 00:35:04,229 --> 00:35:06,398 రవి తేజంతో వెలిగిపోయే ధీరుడు. 465 00:35:07,191 --> 00:35:09,067 -మీరు అలా కూడా చెప్పవచ్చు. -మీ యువరాజు. 466 00:35:09,151 --> 00:35:10,694 లేదు. లేదు. 467 00:35:12,571 --> 00:35:16,283 కానీ, నేను నా జీవితం జీవించడం మొదలుపెట్టాను, అతనికి నా పద్ధతిలో రుణం తీర్చుకుంటూ వచ్చాను. 468 00:35:16,366 --> 00:35:18,368 నేను అతనికి భోజనం తెచ్చేదాన్ని, 469 00:35:18,452 --> 00:35:21,246 అతని టేబుల్ పై పూలను చక్కగా అమర్చేదాన్ని, అతని జీవితాన్ని చూసుకొనేదాన్ని. 470 00:35:22,956 --> 00:35:24,583 కానీ ఒకరోజు… 471 00:35:24,666 --> 00:35:31,006 అందరిలానే అతను కూడా మిమ్మల్ని నిరాశపరచాడు. మీ యోధుడు నయవంచకుడు అయ్యాడు. 472 00:35:37,137 --> 00:35:39,389 లేదు, అతను వేరే చోటికి వెళ్లిపోయాడు. 473 00:35:42,017 --> 00:35:46,063 అతను కోరుకున్నట్టుగా జీవించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ… 474 00:35:47,022 --> 00:35:48,273 అతను లేకుండా కష్టంగా ఉంది. 475 00:35:48,357 --> 00:35:51,443 అయితే, మీరు ఒక దెయ్యానికి బానిస అయిపోయారు అన్నమాట. 476 00:35:56,198 --> 00:36:00,202 అతను కూడా సర్వీసులోనే పని చేసేవాడా? 477 00:36:01,620 --> 00:36:02,621 ఇప్పుడు మీరు చెప్పాలి. 478 00:36:03,413 --> 00:36:06,041 మీకు, ఆర్కేడీ పాష్కిన్ కి సంబంధించిన వివరాలు చెప్పండి. 479 00:36:06,124 --> 00:36:07,292 సరే. 480 00:36:07,793 --> 00:36:11,213 నేను, పాష్కిన్ ఒకే రకమైన పనులు చేస్తుంటాం, కాబట్టే అతను నాకు తెలుసు. 481 00:36:11,296 --> 00:36:14,174 అతను ఇల్యా నెవ్స్కీ కోసం అటుఇటూ తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తుంటాడు. 482 00:36:14,258 --> 00:36:16,677 ఎంఐ5తో నేను లావాదేవీలు జరిపిన విషయం అతనికి తెలుసు, 483 00:36:16,760 --> 00:36:18,846 కాబట్టి పరిచయం చేయమని నన్ను అడిగాడు. 484 00:36:19,930 --> 00:36:21,807 కానీ దేనికో నాకు తెలీదు. 485 00:36:23,725 --> 00:36:25,477 మీరు జేమ్స్ వెబ్ కి చెప్పింది కూడా ఇదే. 486 00:36:27,145 --> 00:36:29,940 వ్యాపారం అన్న తర్వాత ఇచ్చిపుచ్చుకోవడం సమానంగా ఉండాలి. 487 00:36:30,023 --> 00:36:32,651 మీరు గోరంత సమాచారం ఇచ్చి, కొండంత సమాచారం కావాలనుకుంటే ఎలా! 488 00:36:32,734 --> 00:36:35,529 నా నుంచి కొండంత సమాచారం కావాలంటే, మీరు ఆ కొండను మింగేసే సముద్రమంత 489 00:36:35,612 --> 00:36:37,072 సమాచారం నాకు ఇవ్వాలి. 490 00:36:38,615 --> 00:36:40,909 -మీరు న్యాయంగా వ్యవహరించట్లేదు. -అవును. 491 00:36:42,494 --> 00:36:44,413 ఇక మీ డెస్క్ దగ్గరికి వెళ్లి మీ పని చూసుకోండి. 492 00:36:45,706 --> 00:36:47,666 ఈ పనులు చేయడంలో మీకు అనుభవం లేదు. 493 00:36:49,668 --> 00:36:53,172 -వెళ్లండి, నేను వేరే ఆట ఆడాలి. -అలాగే. 494 00:37:53,190 --> 00:37:54,149 ఏంటి? 495 00:37:54,233 --> 00:37:57,110 ఇప్పుడే పాష్కిన్ కి వెబ్ ని పరిచయం చేసిన వ్యక్తితో మాట్లాడాను. 496 00:37:57,945 --> 00:37:59,488 విక్టర్ క్రైమోవ్ తోనా? 497 00:37:59,571 --> 00:38:01,490 అతన్ని కలవడానికి వెళ్లి ఎందుకు సమయం వృథా చేసుకుంటున్నావు? 498 00:38:01,573 --> 00:38:03,700 -ఏంటి, నీకు అతను తెలుసా? -హా, తెలుసు. 499 00:38:04,201 --> 00:38:08,080 అతని నోటి నుండి నిజాలు వస్తాయనుకోవడం మన మూర్ఖత్వం. 500 00:38:08,163 --> 00:38:12,084 పాష్కిన్ అతనికి చాలా ఏళ్లుగా తెలుసు అంటున్నాడు కానీ వివరాలేవీ చెప్పడం లేదు. 501 00:38:12,167 --> 00:38:14,461 నిన్ను సులభంగానే బోల్తా కొట్టించి ఉంటాడు. 502 00:38:14,545 --> 00:38:17,005 అతను చెప్పిందంతా అబద్ధం. 503 00:38:17,089 --> 00:38:20,008 పాష్కిన్, నెవ్స్కీ దగ్గర పని చేస్తుంటాడనే అబద్ధం చెప్పమని ఎవరైనా అతనికి డబ్బులు ఇచ్చుంటారు. 504 00:38:20,092 --> 00:38:21,677 అది అబద్ధమని నీకెందుకు అనిపిస్తోంది? 505 00:38:21,760 --> 00:38:26,139 ఎందుకంటే, నెవ్స్కీ హత్యకు గురయ్యాడు, పాష్కిన్ గూండాలే చంపి ఉండవచ్చు. 506 00:38:26,223 --> 00:38:27,224 ఏంటి? 507 00:38:28,308 --> 00:38:31,478 క్రైమోవ్ కి ఇంకా చాలా విషయాలే తెలిసి ఉంటాయి, కానీ అతని సంగతి మనం తర్వాత చూద్దాం. 508 00:38:32,938 --> 00:38:35,899 అసలు కటిన్స్కీకి ఏం కావాలా అని తెలుసుకొనే పనిలోనే ఉన్నాను నేను ఇంకా. 509 00:38:35,983 --> 00:38:37,734 మళ్లీ ప్రయత్నించి చూడమంటావా? 510 00:38:38,610 --> 00:38:42,906 లేదు, ఇంటికి వెళ్లి పడుకో. గూఢాచారిలా ఫీల్ అయిపోకు. 511 00:39:22,029 --> 00:39:23,989 నేనే. మార్కస్ ని. మార్కస్ ని. 512 00:39:24,072 --> 00:39:26,992 -నీ బ్యాగుని తెరువు. నీ బ్యాగుని తెరువు. -ఏం చేస్తున్నావు నువ్వు? 513 00:39:27,075 --> 00:39:30,037 -నన్ను ఫాలో అవుతున్నావా? -అవును, అలా చేసినందుకు సంతోషించు. 514 00:39:34,917 --> 00:39:36,960 -పాష్కిన్ ని చంపాలనుకుంటున్నావా? -లేదు, ముందు చిత్రహింసలు పెట్టి, 515 00:39:37,044 --> 00:39:38,962 -ఆ తర్వాత చంపేదాన్ని. -నీకేమైనా పిచ్చి పట్టిందా? 516 00:39:39,046 --> 00:39:40,589 మిన్ వాళ్లని ఫాలో చేశాడు… 517 00:39:40,672 --> 00:39:42,966 చివరికి చనిపోయాడు. అతడిని పాష్కినే చంపాడు. 518 00:39:43,050 --> 00:39:44,718 దానిపై విచారణ జరిగింది. అది యాక్సిడెంట్. 519 00:39:44,801 --> 00:39:46,178 నన్ను… మన్నించు, విచారణపై నాకు నమ్మకం లేదు. 520 00:39:46,261 --> 00:39:47,638 -ఎందుకంటే, నువ్వు… -అబ్బా, ఇక ఆపు. 521 00:39:47,721 --> 00:39:50,641 నేను షాకులో ఉన్నానని చెత్త మాటలు చెప్పకు. 522 00:39:50,724 --> 00:39:52,935 అబ్బో. ఇప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు మరి. 523 00:39:53,018 --> 00:39:54,520 అతను ఏదో దాస్తున్నాడు, మార్కస్. 524 00:39:55,312 --> 00:39:56,688 అందుకే నాతో కూర్చొని డ్రింక్ తాగాడు. 525 00:39:56,772 --> 00:39:58,649 -అతనిపై నాకు అనుమానం ఉందేమో తెలుసుకోవాలనుకున్నాడు. -నీ మొహం! 526 00:39:58,732 --> 00:40:01,443 -అతని… గడియారం టిక్కుటుక్కుమంటోంది. -గడియారం అంటే అలాగే ఉంటుంది కదా. 527 00:40:01,527 --> 00:40:03,403 -అతను మోసగాడు. -ఏంటి? 528 00:40:03,487 --> 00:40:04,488 అతని గడియారం టిక్కుటిక్కుమంటోంది. 529 00:40:04,571 --> 00:40:07,074 అలాంటి వాటిలో ముల్లు టిక్కుమనదు, నిశ్శబ్దంగా తిరుగుతుంది. అందుకే జనాలు కొంటారు. 530 00:40:07,157 --> 00:40:08,992 నకిలీ గడియారం పెట్టుకున్నాడని అతడిని చంపాలనుకుంటున్నావా? 531 00:40:20,504 --> 00:40:21,964 -ఏంటి? -హా, లుయీసా దగ్గరే ఉన్నాను. 532 00:40:22,047 --> 00:40:23,924 చూడండి, తను పాష్కిన్ కి డ్రగ్స్ ఇచ్చి, చంపబోయింది… 533 00:40:24,007 --> 00:40:26,093 హేయ్, ఫోన్ ఇలా ఇవ్వు. హాయ్. 534 00:40:26,176 --> 00:40:29,888 పాష్కిన్ మోసగాడు. వాడి ప్లాన్ ఏంటో నాకు తెలీదు కానీ, వాడు మాత్రం కంత్రీగాడు. 535 00:40:29,972 --> 00:40:31,181 మిన్ ని చంపింది వాడే. 536 00:40:31,265 --> 00:40:35,519 లేదు, లేదు. మిన్ ని చంపింది అతను కాదు, కానీ ఆ పని చేయించింది మాత్రం అతనే. 537 00:40:36,186 --> 00:40:39,773 అతను అక్కడే ఉండుంటాడు. నెవ్స్కీని కూడా చంపించాడు. 538 00:40:39,857 --> 00:40:41,483 -నెవ్స్కీ చనిపోయాడా? -ఏంటి? 539 00:40:41,567 --> 00:40:44,152 అవును, ఈరాత్రికి తేలిన శవాలు చాలు. 540 00:40:44,236 --> 00:40:46,363 అందుకే, లాంగ్రిడ్జ్ కి నిన్ను ఫాలో చేయమని చెప్పాను. 541 00:40:46,446 --> 00:40:48,740 ఇప్పుడు అతడిని మట్టికరిపించి, అతడిని విచారించగలను. 542 00:40:48,824 --> 00:40:50,576 అతనే నిన్ను మట్టికరిపించవచ్చు కూడా. 543 00:40:51,159 --> 00:40:55,831 నువ్వు పిస్తావని ఎంత ఫీల్ అయిపోయినా కానీ 544 00:40:55,914 --> 00:40:58,000 అతను రష్యా వాడు, అంత తేలిగ్గా నిజాలు చెప్పడు. 545 00:40:58,083 --> 00:41:00,836 కాబట్టి, నీ ప్లాన్ ని నువ్వు పక్కకు పెట్టేసి, 546 00:41:00,919 --> 00:41:04,631 ఏమీ ఎరగనట్టు రేపు సమావేశానికి వెళ్లు. 547 00:41:06,383 --> 00:41:10,345 ఏమన్నారు, మిన్ ని చంపించిన వాడితో, అలాగే దగ్గరుండి చంపిన వాళ్లతో సమావేశానికి 548 00:41:10,429 --> 00:41:11,930 వెళ్లమంటున్నారా, ఏమీ చేయకుండా ఉండమంటున్నారా? 549 00:41:12,014 --> 00:41:16,852 చూడు, నాకు నచ్చని డిక్కీ బో హత్యకే ప్రతీకారం తీర్చుకోవడానికి 550 00:41:16,935 --> 00:41:18,937 ఎప్పటిలా కాకుండా, నేనే స్వయంగా రంగంలోకి దిగాను. 551 00:41:19,021 --> 00:41:22,941 కాబట్టి, నేను కనీసం సహించిన మిన్ హార్పర్ ని చంపిన వాడిని నేనేం చేస్తానో 552 00:41:23,025 --> 00:41:26,028 నీ ఊహకే వదిలేస్తున్నాను. 553 00:41:26,111 --> 00:41:27,154 మరి, మీరేం చేయబోతున్నారు? 554 00:41:27,237 --> 00:41:29,114 నేను వెళ్లి నా బద్ధ శత్రువుతో మాట్లాడబోతున్నాను. 555 00:41:29,698 --> 00:41:31,450 -రష్యన్లతోనా? -కాదు. 556 00:41:31,533 --> 00:41:32,701 పార్క్ వాళ్లతో. 557 00:41:33,785 --> 00:41:38,123 నన్ను మోసం చేసింది రష్యాకు చెందిన కంత్రీగాడా, లేక ఇంకెవరైనా అనేది 558 00:41:38,207 --> 00:41:39,291 నాకు తెలియాలి. 559 00:41:39,374 --> 00:41:41,919 అందుకని ప్రస్తుతానికి మీరు నా పనికి అడ్డు తగలకుండా ఉండండి. 560 00:41:42,002 --> 00:41:45,672 కాబట్టి నీ ప్లాన్ ని పక్కన పెట్టేయ్, ఇది నా ఆదేశం. 561 00:42:34,638 --> 00:42:36,890 నమస్తే, మిత్రులారా. ఇప్పుడు మెల్లగా, చక్కగా ఇటు తిరగండి. 562 00:42:38,684 --> 00:42:41,770 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, కటిన్స్కీ? 563 00:42:41,854 --> 00:42:43,772 -నీకేమైనా పిచ్చా? -నోర్మూసుకో. 564 00:42:43,856 --> 00:42:46,400 ఎక్కడైనా బాంబులు పెడుతున్నారా, మిత్రులారా? 565 00:42:46,483 --> 00:42:47,401 అదేనా మీ ప్లాన్? 566 00:42:48,527 --> 00:42:50,487 డంకన్ ని దాని కోసమే వాడుకోవాలనుకున్నారా? 567 00:42:50,571 --> 00:42:52,739 -జాన్? -ఆలెక్స్. 568 00:42:52,823 --> 00:42:55,701 మీరు ఇక్కడేం చేస్తున్నారు? డంకన్ ఎక్కడ? ఆలెక్స్? 569 00:42:55,784 --> 00:42:56,952 తుపాకీని ఎందుకు పట్టుకొని ఉన్నావు? 570 00:42:58,287 --> 00:42:59,830 -పోలీసులకి కాల్ చేయండి. -లేద. ఎందుకు… 571 00:42:59,913 --> 00:43:00,956 తుపాకీతో నీకేం పని? 572 00:43:01,039 --> 00:43:04,126 పోలీసులకి కాల్ చేయండి. నేను ఎంఐ5 ఆఫీసరుని. తర్వాత అన్నీ మీకు వివరంగా చెప్తాను. పోలీసులకి కాల్ చేయండి. 573 00:43:04,209 --> 00:43:05,919 -లియో, ఏం జరుగుతోంది? -నాకు తెలీదు. 574 00:43:06,003 --> 00:43:07,713 నువ్వు లండన్ కి వెళ్తున్నావని చెప్పావు కదా. 575 00:43:07,796 --> 00:43:10,799 డంకన్ 60వ పుట్టినరోజుకు సర్ప్రైజ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. 576 00:43:10,883 --> 00:43:13,594 అదేనా నీకు తట్టిన మంచి ఐడియా? అంత కంటే మంచి ఐడియా తట్టలేదా? 577 00:43:13,677 --> 00:43:16,013 మేము చదువుకొనేటప్పటి నుండి నిక్కీ మాకు తెలుసు. 578 00:43:16,096 --> 00:43:17,973 హా, అవును, ఆలెక్స్, కానీ దురదృష్టవశాత్తూ, 579 00:43:18,056 --> 00:43:20,225 అతను మాజీ కేజీబీ ఆఫీసర్. అది నిజమే కదా? 580 00:43:20,309 --> 00:43:21,685 లియో కూడా అంతే. 581 00:43:21,768 --> 00:43:24,938 -అతను మీ భర్త హ్యాండ్లర్. -హ్యాండ్లర్? 582 00:43:25,772 --> 00:43:28,150 -డంకన్ రష్యాకు చెందిన స్లీపర్ ఏజెంట్. -ఏంటి? 583 00:43:28,233 --> 00:43:30,402 -నేను వివరంగా చెప్తాను. -కదలకు. చేతులని తలపైకి పెట్టు. 584 00:43:30,485 --> 00:43:33,864 సర్ప్రైజ్ ని ప్లాన్ చేద్దామని వచ్చిన పాత మిత్రులు వీళ్లు. నేను కుడా ఇక్కడికి అందుకే వచ్చాను. 585 00:43:33,947 --> 00:43:37,326 లియో, నేను డంకన్ కి తెలీకుండా, నిక్కీని కలవడానికి ఇక్కడికి వచ్చాం. ఇదంతా ప్లానులో భాగమే. 586 00:43:37,409 --> 00:43:40,245 వారి వెనుకనున్న ఆ ఫర్టిలైజరుని, ఇంధనాన్ని చూడండి. 587 00:43:40,329 --> 00:43:42,039 వాళ్లేమీ కేకుని తయారు చేయట్లేదు, బాంబును తయారు చేస్తున్నారు. 588 00:43:42,122 --> 00:43:44,166 లేదు, ఇది… నువ్వు పొరబడ్డావు. అది అర్థం లేని వాదన. 589 00:43:44,249 --> 00:43:46,126 నా భర్య రష్యన్ ఏజెంట్ కాదు. 590 00:43:46,210 --> 00:43:47,711 చూడండి ఆలెక్స్, నన్ను నమ్మండి… 591 00:43:54,551 --> 00:43:56,053 ఇప్పుడేం చేద్దాం? 592 00:43:56,637 --> 00:43:58,472 విమానాన్ని సిద్ధం చేద్దాం. 593 00:43:58,555 --> 00:43:59,806 అతడిని చంపేద్దాం. 594 00:44:00,432 --> 00:44:01,433 అంతే. 595 00:45:15,340 --> 00:45:17,342 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్