1 00:00:25,150 --> 00:00:26,360 సిద్ధంగా ఉన్నావా? 2 00:00:27,819 --> 00:00:31,031 దీన్ని వాళ్ల కోసం వదిలిపెట్టి వెళ్తున్నా. వాళ్లు చూసే చోటే పెట్టు. 3 00:00:33,242 --> 00:00:37,329 లండన్ వాతావరణం అనుకూలంగా ఉంది. నీకు లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. 4 00:00:50,717 --> 00:00:52,553 నగరంలోకి బాంబు వదులుతున్నారు కదా. 5 00:00:53,929 --> 00:00:55,138 అదేనా మీరు చేసే పని? 6 00:00:57,057 --> 00:01:01,436 ఇవాళ నిరసన జరుగుతోంది. లక్షల మంది చనిపోతారు. 7 00:01:01,520 --> 00:01:05,315 వాళ్లు చనిపోతే, అందుకు కారణం మీరు మమ్మల్ని ఆపలేకపోవడమే. 8 00:01:05,399 --> 00:01:06,817 వాళ్లకి హాని తలపెట్టాలని నాకు లేదు. 9 00:01:06,900 --> 00:01:10,445 పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేక పోరాటంలో వాళ్లు నాకు తోబుట్టువుల్లాంటి వాళ్లు. 10 00:01:10,529 --> 00:01:14,366 నిరసనకారులు వెళ్లే దారిలో ఉంటుంది మా లక్ష్యం. 11 00:01:15,033 --> 00:01:16,743 వాళ్లు దేనికి వ్యతిరేకంగా అయితే నిరసన తెలుపుతున్నారో, అదే. 12 00:01:18,245 --> 00:01:21,248 అది బీదవారికి జరుగుతున్న అన్యాయానికి గుర్తు. 13 00:01:22,291 --> 00:01:23,500 గ్లాస్ హౌస్. 14 00:01:23,584 --> 00:01:25,169 నేను దాన్ని ధ్వంసం చేయబోతున్నా. 15 00:01:52,529 --> 00:01:53,822 అబ్బా. 16 00:02:05,542 --> 00:02:06,710 అయ్యయ్యో. 17 00:02:07,586 --> 00:02:08,586 ఓరి దేవుడా. 18 00:02:15,219 --> 00:02:16,386 అయ్యయ్యో. 19 00:02:22,142 --> 00:02:23,227 దేవుడా. 20 00:02:26,271 --> 00:02:28,357 అయ్యో. అయ్యయ్యో. 21 00:03:03,141 --> 00:03:05,060 మిక్ హెర్రన్ రచించిన డెడ్ లయన్స్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 22 00:03:23,871 --> 00:03:25,706 జడ్ రాకాసి - జడ్ అహాన్ని అణిచివేద్దాం 23 00:03:31,503 --> 00:03:32,713 అతను ల్యాంబా? 24 00:03:33,547 --> 00:03:34,756 అతనికేం కావాలి? 25 00:03:54,067 --> 00:03:57,696 రెండు గంటల్లో, పెట్టుబడిదారి విధానానికి జరుగుతున్న వ్యతిరేక ప్రదర్శన గుండా జడ్ ని డ్రైవ్ చేయాలి, 26 00:03:57,779 --> 00:04:01,366 ఆయన కొందరు బ్యాంకర్లకు ప్రసంగం ఇస్తున్నాడు. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. 27 00:04:01,450 --> 00:04:03,577 కాబట్టి, కెమెరా ముందు నీ వెకిలి చేష్టల వల్ల నాకు సమయం వృథా అవుతుంది. 28 00:04:03,660 --> 00:04:06,413 నన్ను లోపలికి తీసుకుపో. పాస్ ని ఎక్కడో మర్చిపోయా. 29 00:04:06,496 --> 00:04:09,249 -చెల్లుబాటయ్యే పాస్ నీకు ఇచ్చి చాలా ఏళ్లు అయిపోయింది కదా. -హా, నీది కూడా పని చేయడం ఆగిపోతుందిలే, 30 00:04:09,333 --> 00:04:13,212 ఎందుకంటే, హార్పర్ మరణం విషయంలో నువ్వు చెత్త దర్యాప్తు చేశావని డయానా మహారాణికి చెప్పేస్తాగా. 31 00:04:13,295 --> 00:04:16,089 నీ మొహం. సైకిల్ తోక్కుకుంటూ నేరుగా వెళ్లి కారుకు గుద్దుకున్నాడు. చాలా తేలికైన కేసు అది. 32 00:04:16,173 --> 00:04:18,591 హా. నువ్వు ఇంకాస్త లోతుగా విచారణ జరిపి ఉంటే, 33 00:04:18,675 --> 00:04:22,304 కారును తోలిన వ్యక్తికి, ఇద్దరు రష్యన్ గూండాలకు సంబంధం ఉన్నట్టు తేలిపోయేది, 34 00:04:22,387 --> 00:04:23,764 ఆ ఇద్దరూ కూడా సినిమాలో విలన్స్ లా 35 00:04:23,847 --> 00:04:28,143 ముఖంపై గాట్లతో, బుగ్గలపై పెద్ద పెద్ద పుట్టుమచ్చలతో ఉంటారు. 36 00:04:30,979 --> 00:04:31,980 ఎక్కు. 37 00:04:35,776 --> 00:04:37,611 నాకు నా పని ఎలా చేయాలో తెలీదు అనుకుంటున్నావు కదా. 38 00:04:39,947 --> 00:04:42,366 నీకు తెలీదు అని నాకు బాగా తెలుసులే. 39 00:04:43,700 --> 00:04:46,495 నీకు తెలుసో లేదో అన్న విషయం డయానా టావెర్నర్ నే తేల్చుకోమందామా? 40 00:04:47,287 --> 00:04:50,207 నీ దగ్గర ఆమె ఫోన్ నంబర్ లేదు కదా. 41 00:04:50,832 --> 00:04:54,920 మేము రోజంతా సరసాల మెసేజ్లు పంపుకుంటాం. భలే రంజుగా ఉంటాయిలే అవి. 42 00:05:02,386 --> 00:05:03,929 లోపలికి ఎక్కడికి తీసుకెళ్లాలి? 43 00:05:04,972 --> 00:05:06,765 బతకాలనే ఆశ చనిపోయే చోటికి. 44 00:05:06,849 --> 00:05:08,308 విచారణ గదులకా? 45 00:05:09,184 --> 00:05:10,185 రికార్డుల విభాగానికి. 46 00:05:11,270 --> 00:05:12,271 తప్పకుండా. 47 00:05:14,231 --> 00:05:15,899 ఫోన్ ఎత్తాను చూడు, అదీ నేను చేసిన తప్పు. 48 00:05:15,983 --> 00:05:21,488 కాదు. నీ తప్పు మిన్ హార్పర్ నా ఏజెంట్ అని మర్చిపోవడం. 49 00:05:46,013 --> 00:05:48,599 పీటర్ జడ్ కి మానం, మర్యాద లేవు లాభం కాదు, జనాన్ని చూడండి 50 00:05:48,682 --> 00:05:50,100 చెత్త జడ్ - జోకర్ జడ్ జడ్ ఒక వెధవ! 51 00:05:50,184 --> 00:05:51,560 వెర్రి జడ్ బోర్డు చేతపట్టుకిని ఉన్న కోపోద్రిక్త మనిషి 52 00:05:56,607 --> 00:05:58,358 వర్గాల మధ్య మాత్రమే యుద్దం జరుగుతోంది 53 00:05:58,442 --> 00:06:00,777 తక్షణ సామాజిక న్యాయమే తక్షణ మానవీయ పని 54 00:06:00,861 --> 00:06:04,656 జనాలు ముఖ్యం, లాభం కాదు! జనాలు ముఖ్యం, లాభం కాదు! 55 00:06:14,208 --> 00:06:15,792 మోలీ డోరన్. 56 00:06:18,921 --> 00:06:20,714 జాక్సన్ ల్యాంబ్. 57 00:06:21,423 --> 00:06:24,051 నీకు ముసలితనం బాగాలేదు. 58 00:06:24,801 --> 00:06:27,804 నీకు కూడా. ఇంకా నీ కాళ్లు పెరగలేదే. 59 00:06:27,888 --> 00:06:31,725 దాని వల్ల నాకు దక్కిన ఏకైక ప్రయోజనం ఏంటంటే, ఇంకెప్పటికీ నీతో డాన్స్ చేసే అవకాశం ఉండకపోవడం. 60 00:06:31,808 --> 00:06:34,686 బాబోయ్. నీ నోటి కంపు ఇక్కడికి కొడుతోంది. 61 00:06:34,770 --> 00:06:38,732 నిజంగా? నెలకి రెండు సార్లు పళ్లు తోముకుంటున్నానే. 62 00:06:39,775 --> 00:06:41,443 ఇక నువ్వు వెళ్లిపోవచ్చు. 63 00:06:41,527 --> 00:06:45,739 హా. వెళ్లిపో. నా విభాగంలో డాగ్స్ స్క్వాడ్ ఉండకూడదు. 64 00:06:49,368 --> 00:06:51,578 ఇక్కడికి ఏం పని మీద వచ్చావు, జాక్సన్? 65 00:06:53,288 --> 00:06:55,999 నికొలాయ్ కటిన్స్కీ. 66 00:06:56,625 --> 00:07:00,295 మాస్కోలో సైఫర్ క్లర్కుగా పని చేసేవాడు. అతను 90ల ప్రారంభంలో వచ్చాడు. 67 00:07:01,046 --> 00:07:05,676 కొత్తగా ఎఫ్.ఎస్.బీ ఏర్పాటయ్యాక అధికారం కోసం కుమ్ములాట మొదలయింది, పాత కేజీబీని నాశనం చేసేయాలనుకున్నారు. 68 00:07:05,759 --> 00:07:09,847 నాకు అతని ఫైల్ కావాలి, పూర్తిగా పరిశీలిస్తాను. 69 00:07:18,689 --> 00:07:19,940 -గుడ్ మార్నింగ్. -గుడ్ మార్నింగ్. 70 00:07:20,023 --> 00:07:22,651 వీళ్ల ప్లాన్ ఏంటో నాకు తెలీదు, కానీ నీ మీద ఈగ వాలకుండా నేను చూసుకుంటా. 71 00:07:23,443 --> 00:07:24,278 సరే, థ్యాంక్స్. 72 00:07:24,361 --> 00:07:26,572 వాళ్ల ప్లాన్ ఏంటో ఇప్పటికైనా తెలిసిందా? 73 00:07:26,655 --> 00:07:27,948 మనకి ఇప్పుడు తెలిసిపోతుందిలే. 74 00:07:29,741 --> 00:07:30,909 చీర్స్. 75 00:07:37,374 --> 00:07:38,417 గుడ్ మార్నింగ్. 76 00:07:38,500 --> 00:07:39,835 -శుభోదయం. -శుభోదయం. రాత్రి బాగా నిద్రపట్టిందా? 77 00:07:39,918 --> 00:07:41,503 నా బెడ్ కాస్త చల్లగా ఉండింది. 78 00:07:41,587 --> 00:07:43,255 డిస్కౌంట్ కోసం అడగండి. 79 00:07:44,631 --> 00:07:46,925 -ఇక వెళ్దామా? -లేదు. ముందు సెక్యూరిటీ చెకప్ చేయాలి. 80 00:07:50,554 --> 00:07:51,555 మీ ఇష్టం. 81 00:07:53,182 --> 00:07:55,642 మీ ఇద్దరినీ కూడా. తుపాకుల విషయం మీరు మర్చిపోయారేమో, అందుకని. 82 00:08:02,941 --> 00:08:03,942 థ్యాంక్యూ. 83 00:08:04,610 --> 00:08:05,736 లేదు. నేను దాన్ని కూడా తనిఖీ చేయాలి. 84 00:08:06,862 --> 00:08:08,405 ఇందులో చాలా గోప్యమైన పత్రాలు ఉన్నాయి. 85 00:08:08,488 --> 00:08:11,575 వాటి గోప్యతకు నేను ఏమీ కానివ్వను. తెరవండి. 86 00:08:24,838 --> 00:08:27,591 -మీ క్షమాపణని మన్నిస్తున్నాను. -సరే. ఇక మనం వెళ్లవచ్చు. 87 00:09:14,638 --> 00:09:15,681 ఇంకా రాకుండా ఏం చేస్తున్నాడు? 88 00:09:15,764 --> 00:09:17,850 ఫ్రంట్ డెస్క్, ఇంకా అతని అసిస్టెంట్ వచ్చారని ఆయనకి చెప్పాను. 89 00:09:17,933 --> 00:09:19,810 -మళ్లీ చెప్పనా? -చెప్పు. 90 00:09:34,992 --> 00:09:36,285 హలో, నేను పీటర్ జడ్ ని. 91 00:09:36,785 --> 00:09:38,579 దయచేసి సందేశం ఏంటో చెప్పండి, నేను మళ్లీ మిమ్మల్ని సంప్రదిస్తాను. 92 00:09:45,836 --> 00:09:47,462 ఆయన వస్తున్నాడు, సర్. 93 00:09:48,714 --> 00:09:49,548 మినిస్టర్. 94 00:09:52,926 --> 00:09:54,178 థ్యాంక్యూ. 95 00:09:57,389 --> 00:09:59,224 రోయల్ ఎక్స్ఛేంజ్ వద్ద ఆ బూట్లతో 96 00:09:59,308 --> 00:10:00,976 నువ్వు మెట్లు ఎక్కగలవా? 97 00:10:01,059 --> 00:10:03,020 ముందు ఫోన్ చెక్ చేసుకోనివ్వు, ఆ తర్వాత నీ మాటలు తీరిగ్గా వింటా. 98 00:10:04,021 --> 00:10:06,440 -ఎందుకు? నువ్వేమైనా చేయి అందించి సాయపడతావా? -లేదు. 99 00:10:07,024 --> 00:10:07,941 ఇక పోనివ్వు. 100 00:10:08,025 --> 00:10:09,776 దీని వల్ల నాకు ఆసక్తి తగ్గిందనే చెప్పవచ్చు. 101 00:10:10,611 --> 00:10:13,530 నీ విశాలమైన భవనంలోని హాట్ టబ్ నుండి బయటకు వస్తుండగా జారిపడ్డావని విన్నాను. 102 00:10:15,115 --> 00:10:17,951 నువ్వు చేసిన కాల్ ని ఎత్తలేకపోయానే. నీవి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయే. 103 00:10:18,702 --> 00:10:19,703 మెసేజ్ కూడా ఉంది. 104 00:10:19,786 --> 00:10:21,163 దాన్ని నువ్వు విననక్కర్లేదు. 105 00:10:21,246 --> 00:10:23,457 పీటర్. నేను డయానా టావెర్నర్ ని. 106 00:10:24,166 --> 00:10:26,043 నీ టిఫిన్ ఇంకా కాలేదా? 107 00:10:26,126 --> 00:10:27,127 భలే ఆపుకున్నావే. 108 00:10:27,211 --> 00:10:30,130 ఎంఐ5కి సెకండ్ డెస్క్, తనని ట్యాక్సీ డ్రైవరుగా చూసినందుకు వచ్చిన కోపాన్ని 109 00:10:30,214 --> 00:10:32,799 -బాగా అణుచుకోవాలని ప్రయత్నించింది పాపం. -నాకేమీ కోపంగా లేదు, పీటర్. 110 00:10:32,883 --> 00:10:34,468 హోమ్ సెక్రెటరీ అని పిలువు. 111 00:10:34,551 --> 00:10:38,222 నీ ప్రసంగానికి ఆలస్యం కాకుండా సమయానికి వెళ్లేలా నేను చూసుకోవాలనుకుంటున్నా, అంతే. 112 00:10:39,097 --> 00:10:41,016 మనం సెక్యూరిటీ షెఢ్యూల్ ని పాటించాల్సి ఉంటుంది. 113 00:10:41,099 --> 00:10:45,479 తెలుసు. నిన్ను ఎదురుచూసేలా చేసినందుకు క్షమించు, నిన్ను కావాలని ఎదురుచూసేలా చేసే పనిలో బిజీగా ఉన్నా. 114 00:10:45,562 --> 00:10:48,065 నువ్వు అలా రాక్షసానందం పొందుతున్నావు అన్నమాట, 115 00:10:48,148 --> 00:10:50,609 నాకు అది అధికార దుర్వినియోగంలా అనిపిస్తోంది. 116 00:10:52,444 --> 00:10:55,405 నా ఇంటికి వచ్చి, తప్పుడు కిడ్నాపింగ్ విషయంలో నీ ప్రమేయం లేదని చెప్పించడానికి 117 00:10:55,489 --> 00:10:59,243 నన్ను బ్లాక్ మెయిల్ చేశావు కదా, అది నాకు నచ్చలేదు. 118 00:10:59,952 --> 00:11:01,286 అది నాకు అస్సలు నచ్చలేదు. 119 00:11:01,370 --> 00:11:02,412 అవునులే, ఆ సమయంలో 120 00:11:02,496 --> 00:11:05,666 నేను కేవలం పార్లమెంట్ సభ్యుడిని అంతే, నీ దృష్టిలో అనామకుడిని. 121 00:11:05,749 --> 00:11:09,294 కానీ ఇప్పుడు నేను ఈ దేశానికి చెందిన అత్యంత పెద్ద హోదాలో ఒకదాన్ని అలంకరించి ఉన్నా, 122 00:11:10,087 --> 00:11:12,005 అదనంగా నీకు బాసుని కూడా. 123 00:11:12,089 --> 00:11:14,633 నేను మునిగి ఉన్నా, నువ్వు కూడా మునిగి ఉన్నావు. 124 00:11:15,467 --> 00:11:17,636 మనిద్దరిలో ఎవరు మునిగినా, అవతలి వాళ్లని కూడా ముంచేస్తాం, 125 00:11:17,719 --> 00:11:19,346 ఇదెంత దూరం పోతుందో ఏమో. 126 00:11:19,972 --> 00:11:22,182 నా విషయంలో అయితే, ఇది 10 డౌనింగ్ స్ట్రీట్ కి దారి తీస్తుంది. 127 00:11:30,983 --> 00:11:33,986 ఈ ఉదయం, లండన్ లో భారీ ఎత్తున నిరసనలు చోటు చేసుకుంటున్నాయి, 128 00:11:34,069 --> 00:11:36,697 నిరసనకారుల మూడ్ చాలా వరకు శాంతియుతంగా ఉంది, 129 00:11:36,780 --> 00:11:41,660 అయితే, ప్రభుత్వంలో పారదర్శకత కొరవడిందని జనాలు భావిస్తున్నారని మాత్రం స్పష్టంగా అనిపిస్తోంది. 130 00:11:41,743 --> 00:11:44,037 పన్ను ఎగవేతను, పన్ను తప్పించుకోవడాన్ని నిరోధించడానికి 131 00:11:44,121 --> 00:11:46,707 ప్రస్తుత ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకుంటోందని మీకు అనిపిస్తోందా? 132 00:11:47,624 --> 00:11:51,170 అంతర్జాతీయ పన్ను వ్యవస్థను మార్చాలనే ఉద్యమంలో 133 00:11:51,253 --> 00:11:55,632 యూకే ప్రధాన పాత్ర పోషిస్తోందని జడ్ అంటున్నారు. కానీ నాకేమీ అలా అనిపించట్లేదు… 134 00:11:59,720 --> 00:12:00,721 రివర్ ఏమైనా కాల్ చేశాడా? 135 00:12:01,555 --> 00:12:03,473 చెర్నిట్స్కీ జేబులో తన ఫోనును వదిలేసిన తర్వాత ఇప్పటి దాకా చేయలేదు. 136 00:12:04,641 --> 00:12:09,354 బాబోయ్. అతనికేమీ కాలేదనే అనుకుంటున్నా, ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 137 00:12:10,022 --> 00:12:13,483 నెవ్స్కీ చనిపోయాడు. అతని శరీరంలోకి రేడియేషన్ ని ఎక్కించారు. ఇక అతను తుపాకీతో కాల్చేసుకున్నాడు. 138 00:12:13,567 --> 00:12:14,860 బాబోయ్, చాలా దారుణంగా ఉండింది. 139 00:12:15,903 --> 00:12:17,571 ఏమైనా ఫోటోలు తీశావా? 140 00:12:18,530 --> 00:12:20,365 లేదు. 141 00:12:20,449 --> 00:12:22,284 తర్వాతిసారి, కొన్ని ఫోటోలు తీయ్. 142 00:12:23,869 --> 00:12:25,746 చెర్నిట్స్కీ ఎందుకు లండన్ కి వస్తున్నాడు? 143 00:12:25,829 --> 00:12:28,665 మన నగరంలో ఫేమస్ అయిన వాటిని చూడటానికి వస్తున్నాడేమో. 144 00:12:28,749 --> 00:12:30,667 టుస్సాడ్స్ మ్యూజియమ్. హార్డ్ రాక్ కెఫే. 145 00:12:30,751 --> 00:12:33,462 అబ్బా, హో. అతను హంతకుడు, లండన్ కి వస్తున్నాడు. 146 00:12:33,545 --> 00:12:36,215 నాకు తెలుసు. మనం వాటిని కళ్ళారా చూడవచ్చు. 147 00:12:43,388 --> 00:12:44,389 కానివ్వు. 148 00:12:46,350 --> 00:12:47,518 కానివ్వు. కానివ్వు… 149 00:12:59,905 --> 00:13:00,906 తన ఫోన్. 150 00:13:25,889 --> 00:13:26,890 హా. 151 00:13:31,353 --> 00:13:34,773 -ఆలెక్స్ -హా, నేనే. నేనే. జాన్ ని. 152 00:13:34,857 --> 00:13:37,317 -జానీ? -నేను ఫ్లయింగ్ క్లబ్బులో ఉన్నా. వెంటనే ఇక్కడికి రండి. 153 00:13:37,401 --> 00:13:39,027 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 154 00:13:39,111 --> 00:13:40,654 -అమ్మ ఎక్కడ? -తను విమానంలో వెళ్తోంది. 155 00:13:40,737 --> 00:13:42,948 వెంటనే నా దగ్గరకి రండి, లేకపోతే ఆమె ఇక మీకు దక్కదు. 156 00:13:44,074 --> 00:13:45,075 మీరు… 157 00:13:48,662 --> 00:13:50,914 అబ్బా. కానివ్వు. 158 00:14:03,093 --> 00:14:07,055 ఆ కాలంలో, కటిన్స్కీలాగా దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి చాలా మంది వచ్చేవారు. 159 00:14:07,139 --> 00:14:10,267 సిఫార్సు చేసేంత పిస్తా ఏమీ కాదు అతను. ఒక అనామకుడు అతను. 160 00:14:10,350 --> 00:14:13,520 కానీ ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. 161 00:14:13,604 --> 00:14:16,565 నేను సికాడాల గురించి చర్చని విన్నా. 162 00:14:17,232 --> 00:14:18,984 ఈ వీడియోలో వీడు ఎలా ఉన్నాడో, 163 00:14:19,067 --> 00:14:22,237 మొన్న బారులో కలిసినప్పుడు కూడా అలాగే పనికిరానివాడిగా ఉన్నాడు, 164 00:14:22,321 --> 00:14:26,283 కానీ ఈరాత్రి ఫోనులో మాట్లాడినప్పుడు మాత్రం చాలా వేరుగా అనిపించాడు. 165 00:14:27,034 --> 00:14:28,285 ఎందుకలా? 166 00:14:29,119 --> 00:14:30,495 నాకన్నా తెలివిగా వ్యవహరించాడు. 167 00:14:30,579 --> 00:14:33,832 అయితే, నీ పని ఇక అయిపోయినట్టే అన్నమాట. 168 00:14:33,916 --> 00:14:37,711 చనిపోయే దశలో ఉన్న అనామకుని చేతిలో దెబ్బ తినేంత అయిపోలేదులే. 169 00:14:37,794 --> 00:14:39,838 ఇంటర్వ్యూను పాజ్ చేస్తున్నాం... 170 00:14:39,922 --> 00:14:43,592 కాబట్టి, నాకు ఒక అనుమానం కలుగుతోంది. వీడు అనామకుడు కాదేమో అని. 171 00:14:46,178 --> 00:14:47,804 ఒకవేళ వీడే అసలైనోడు అయ్యుంటే? 172 00:14:48,430 --> 00:14:53,435 అతని ఫిరాయింపు ఫారమ్ ఉందా? అతడిని ఎవరు ఆమోదించారో నాకు తెలియాలి. 173 00:15:47,364 --> 00:15:49,116 గ్లాస్ హౌస్ 174 00:15:52,828 --> 00:15:54,746 నలభై ఏడవ అంతస్థు. 175 00:15:57,833 --> 00:15:59,251 కామ్రేడ్ పాష్కిన్. 176 00:16:00,586 --> 00:16:02,171 -ఆర్కేడీ. -జిమ్ వెబ్. 177 00:16:03,130 --> 00:16:04,381 మన అద్భుతమైన సమావేశానికి ఇదెలా ఉంది? 178 00:16:05,716 --> 00:16:06,758 అద్భుతమైన సమావేశమా? 179 00:16:06,842 --> 00:16:11,013 మనం తొలిసారిగా కలుస్తున్నా కానీ, 180 00:16:11,096 --> 00:16:14,391 మన సమావేశం చాలా అద్భుతంగా ఉండబోతోందని నాకు అర్థమైపోయింది, 181 00:16:14,474 --> 00:16:15,726 అందుకే అలా అన్నాను. 182 00:16:19,229 --> 00:16:23,650 ఏదేమైనా, ఇది ఒక అందమైన మార్గానికి పునాది కావాలని ఆశిస్తున్నా. 183 00:16:23,734 --> 00:16:24,943 ఇక వెళ్దామా? 184 00:16:34,661 --> 00:16:35,662 పోలీసు 185 00:16:35,746 --> 00:16:37,331 జనాలు సంతోషంగా లేరు! జనాలు సంతోషంగా లేరు… 186 00:16:51,345 --> 00:16:53,764 -నువ్వు నిన్న కూడా అవే బట్టలు వేసుకొని వచ్చావే. -రాత్రంతా ఇక్కడే ఉన్నా. 187 00:16:53,847 --> 00:16:56,475 చెర్నిట్స్కీ అప్ షాట్ కి వచ్చాడు. రివర్, తన ఫోనును అతని జేబులో వేశాడు. 188 00:16:56,558 --> 00:17:00,312 -అతను లండన్ కి వెళ్తుంటే, ట్రాక్ చేస్తున్నాం. -రివర్ ఎక్కడ? అతనికి ఏమీ కాలేదు కదా? 189 00:17:00,395 --> 00:17:01,438 అతని గురించి తెలీట్లేదు. 190 00:17:03,482 --> 00:17:06,568 -చెర్నిట్స్కీ నగరంలో ఒకచోట ఆగాడు. -ఇంకొకడిని చంపాలనుకుంటున్నాడేమో. 191 00:17:06,652 --> 00:17:08,529 ఎలా చంపుతాడో ఊహిద్దామా? 192 00:17:08,612 --> 00:17:12,699 ఇప్పటిదాకా విషం ఇచ్చి చంపాడు, కారు గుద్ది చంపాడు, రేడియేషన్ ఎక్కించి చంపాడు. 193 00:17:12,782 --> 00:17:15,993 తర్వాత ఎలా చంపుతాడు అనుకుంటున్నారు? ఖడ్గంతో చంపుతాడా? బొటన వేళ్లతో గుడ్లు పీకేసి చంపుతాడా? 194 00:17:16,078 --> 00:17:17,204 రాడీ, ఇది కామెడీ కాదు. 195 00:17:17,287 --> 00:17:19,665 మనం ఏదోకటి చేయకపోతే, ఒకరు చనిపోతారు. 196 00:17:19,748 --> 00:17:21,708 నువ్వు అతడిని కనిపెట్టి, ఆ ప్రయత్నాన్ని ఆపాలి. 197 00:17:21,791 --> 00:17:24,086 వాడు నరహంతకుడు. ఆ పని నువ్వే చేయ్. 198 00:17:24,169 --> 00:17:26,797 -నాకు వేరే పని ఉంది. -అది అబద్ధం. 199 00:17:27,506 --> 00:17:28,882 రాడీ, నిజంగానే నాకు పనుంది. 200 00:17:28,966 --> 00:17:31,927 రష్యన్లకు వెబ్ ని పరిచయం చేసిన ఒక వ్యక్తిని నిన్న రాత్రి నేను కలిశాను. 201 00:17:32,010 --> 00:17:34,596 అతనికేదో తెలుసు, నాకు చెప్పకుండా దాస్తూ అతను తెగ ఆనందపడిపోతున్నాడు, కాబట్టి… 202 00:17:35,180 --> 00:17:37,808 వాడి చెత్త ముఖంపై నవ్వు లేకుండా చేసి వస్తాను. 203 00:17:37,891 --> 00:17:40,936 -హా, అలాగే. -నువ్వు ఈ పని చేశావని ల్యాంబ్ కి తెలుసా? 204 00:17:41,770 --> 00:17:43,605 తెలుసు. తెలీదులే. 205 00:17:43,689 --> 00:17:44,982 ఏమన్నాడు? 206 00:17:45,065 --> 00:17:46,775 నువ్వేం చెప్పబోతున్నావో, అదే. "ఆ ప్రయత్నం చేయకు," అని. 207 00:17:46,859 --> 00:17:50,362 కానీ, దీని వలన నీకు దక్కే ప్రయోజనం ఏంటి? ల్యాంబ్ చేత చివాట్లు పడటం కాకుండా. 208 00:17:50,445 --> 00:17:54,950 నాకు తెలీదు, కానీ పాష్కిన్ కి, కటిన్స్కీకి మధ్య సంబంధం ఏంటో అతనికి తెలుసు అనుకుంటా. 209 00:17:55,033 --> 00:17:56,326 వాళ్ళందరికీ ఇందులో పాత్ర ఉంది. 210 00:17:56,410 --> 00:17:59,121 అదీగాక స్లౌ హౌస్ ని ఇందులోకి ఎందుకు లాగారు? మనం అనామకులం కదా. 211 00:17:59,204 --> 00:18:01,748 అదీ మీరు. నేను అనామకుడిని కాదు. 212 00:18:01,832 --> 00:18:04,126 అయితే, ఆ కుర్చీ మీద నుండి లేచి, ఏదోక పని చేసి తగలడు. 213 00:18:10,883 --> 00:18:12,092 పద, నాయకుడా. 214 00:18:13,635 --> 00:18:16,096 ఇక నీ జూలు విడిచి, ముష్కరుల పని పట్టవలసిన సమయం ఆసన్నమైంది. 215 00:18:16,847 --> 00:18:17,848 ఎట్టకేలకు. 216 00:18:19,016 --> 00:18:20,684 నాతో నువ్వు గౌరవంగా మాట్లాడావు. 217 00:18:34,489 --> 00:18:36,325 పాష్కిన్ గురించి నువ్వు అబద్ధమాడుతున్నావని నాకు తెలుసు. 218 00:18:37,618 --> 00:18:39,786 వెబ్ ని ఇక్కడే కలవమని చెప్పావా? 219 00:18:40,454 --> 00:18:43,957 అది అతనికి నచ్చి ఉండదు. ఇలాంటివి అతనికి గిట్టవు. 220 00:18:44,583 --> 00:18:47,211 స్లౌ హౌస్ ఏజెంట్లను వాడమనేది కూడా అతని ఐడియా అయ్యుండదు. 221 00:18:47,294 --> 00:18:49,046 ఎవరో అతడిని అడిగి ఉండాలి. 222 00:18:49,129 --> 00:18:51,673 అది ఎవరు? నువ్వా? 223 00:18:52,674 --> 00:18:56,011 లేదు, నీకు డబ్బులిస్తే కానీ నోరు తెరవవు, అయితే పాష్కినేనా? 224 00:18:58,138 --> 00:19:01,433 కొన్ని బయటపెడితే ప్రాణాలు పోతాయని నీకు కూడా తెలుసు కదా. 225 00:19:01,934 --> 00:19:04,520 అంటే, నువ్వు నాకు చెప్పబోయే దాని విషయంలో ఇరికించడానికి 226 00:19:04,603 --> 00:19:07,147 ఎవరోకర బకరాని నువ్వు కనిపెట్టగలవులే. 227 00:19:07,856 --> 00:19:12,778 అంటే, నీకు అదేం కొత్త కాదు. 1993లో ప్రాగ్ ఉదంతంలో చేశావు. 2001లో జాగ్రెబ్ ఉదంతంలో కూడా చేశావు. 228 00:19:12,861 --> 00:19:15,405 నీ తప్పులకు ఎప్పుడూ ఎవరోకరిని ఇరికించేస్తావు నువ్వు. 229 00:19:18,367 --> 00:19:20,035 నీకు చదరంగం వచ్చని నాకు తెలీదే. 230 00:19:21,286 --> 00:19:24,581 నేను గెలిస్తే, పాష్కిన్ గురించి నువ్వు నిజం చెప్పాలి. 231 00:19:24,665 --> 00:19:26,625 అలాగే, కానీ నేను గెలిస్తే, 232 00:19:26,708 --> 00:19:29,962 నువ్వు తాగి, నా విజయానికి జేజేలు పలకాలి. 233 00:19:35,926 --> 00:19:38,637 నేను సభ్యత తెలిసినవాడిని. ముందు నువ్వే మొదలుపెట్టు. 234 00:19:45,853 --> 00:19:48,230 ప్రధాన మంత్రి తర్వాతి ఎన్నికల్లో గెలవలేడని అందరికీ తెలుసు. 235 00:19:48,313 --> 00:19:51,149 అతని రాజకీయ ప్రస్థానం ముగిసి, ఇక సామాన్యుడు అయిపోవడానికి 236 00:19:51,233 --> 00:19:53,986 ఇంకా ఎంతో సమయం లేదు. 237 00:19:54,069 --> 00:19:56,530 అప్పుడు నువ్వు ఆ పదవి బరిలో దిగుతావు కదూ. 238 00:19:56,613 --> 00:19:59,575 లేదు. నా చేత బలవంతంగా పోటీ చేయిస్తారు. 239 00:19:59,658 --> 00:20:02,703 ప్రధాన మంత్రి, నేనూ ఒక స్కూలులో చదువుకున్నాం, గుర్తుందా? అతను నా చిరకాల మిత్రుడు. 240 00:20:03,453 --> 00:20:05,831 మిత్రులకు నేను ఎప్పుడూ నమ్మకద్రోహం చేయను. 241 00:20:09,543 --> 00:20:14,673 మన కొత్త స్నేహాన్ని నిరూపించుకొనేందుకు నేనేం చేయాలంటావు? 242 00:20:14,756 --> 00:20:19,428 పార్టీ సభ్యులకి సెక్యూరిటీ, రక్షణ లాంటివి అంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా? 243 00:20:19,511 --> 00:20:22,264 నువ్వు అనధికారంగా ఒక పుకారును సృష్టించాలి, 244 00:20:22,347 --> 00:20:26,476 దేశాన్ని భద్రంగా ఉంచగల ఏకైక వ్యక్తిని నేనే అని. 245 00:20:28,437 --> 00:20:31,023 ఇప్పుడు నువ్వు "మరి నాకేంటి?" అని అనాలి. 246 00:20:31,899 --> 00:20:33,650 ఈ విషయాన్ని నువ్వు టియర్నీతో ఎందుకు చర్చించలేదు? 247 00:20:34,318 --> 00:20:37,196 దురదృష్టవశాత్తూ, దేశాన్ని నడిపించడానికి 248 00:20:37,279 --> 00:20:40,240 కావలసిన లక్షణాలు నాకు సరిపడా లేవని 249 00:20:40,324 --> 00:20:41,408 ఫస్ట్ డెస్క్ అభిప్రాయపడింది. 250 00:20:41,491 --> 00:20:44,620 కానీ, ఎంఐ5కి నాయకత్వం వహించడానికి కావలసిన లక్షణాలు తనకి కూడా సరిపడా లేవని నాకు అనిపిస్తోంది. 251 00:20:44,703 --> 00:20:46,955 -నాకు ఉన్నాయంటావా? -ముమ్మాటికీ. 252 00:20:47,039 --> 00:20:49,583 అయితే, మన మధ్య అంగీకారం కుదిరింటావా? 253 00:20:51,084 --> 00:20:52,794 ఇప్పుడు నన్ను ఎదురు చూసేలా చేస్తున్నావు. 254 00:20:52,878 --> 00:20:56,507 బాగుంది. కానీ నువ్వు అవును అంటావని నాకు తెలుసు. 255 00:20:57,758 --> 00:20:58,842 అయ్య బాబోయ్. 256 00:20:59,426 --> 00:21:03,680 నీ ఉంపుడుగత్తెలతో అదే డైలాగ్ కొడతావు కదా. 257 00:21:17,319 --> 00:21:19,196 హేయ్! లోపల ఉన్నా. 258 00:21:20,155 --> 00:21:21,156 దేవుడా. 259 00:21:21,240 --> 00:21:22,908 -ఏం జరుగుతోంది? -బాబోయ్. 260 00:21:22,991 --> 00:21:25,494 హమ్మయ్య. వచ్చి నా కట్లు విప్పండి. 261 00:21:25,577 --> 00:21:26,912 అమ్మ ఎక్కడ? 262 00:21:26,995 --> 00:21:29,373 -తను ఓ విమానం తీసుకెళ్లిపోయిందని చెప్పా కదా. -తనకి విమానం నడపడం రాదు. 263 00:21:29,456 --> 00:21:31,124 మీ రన్ వేలో ఒక సెస్నా విమానం ఉండదు చూడండి మరి. 264 00:21:31,208 --> 00:21:32,376 దాన్ని తీసుకొనే ఆమె వెళ్లిపోయింది. 265 00:21:32,459 --> 00:21:35,087 లేదు. ఆగండి, ఆగండి. ముందు నా కట్లు విప్పండి. రండి. రండి. 266 00:21:35,170 --> 00:21:36,505 విమానాన్నిఎవరు ఎత్తుకెళ్లారు? 267 00:21:36,588 --> 00:21:37,756 మీ భార్యే అని చెప్తున్నా కదా. 268 00:21:37,840 --> 00:21:39,591 -నిన్ను ఎవరు కట్టేశారు? -తనే. 269 00:21:39,675 --> 00:21:42,010 -అది అబద్ధం. -ఏంటి? మరి నన్ను నేనే కట్టేసుకున్నానా? 270 00:21:42,094 --> 00:21:43,178 ఎలా కట్టుకున్నానో కాస్త చెప్పగలరా? 271 00:21:43,887 --> 00:21:46,139 -వచ్చి కట్లు విప్పండి. -లియో ఎక్కడ? 272 00:21:46,223 --> 00:21:47,516 చూడండి, అది చాలా పెద్ద కథ. 273 00:21:47,599 --> 00:21:49,726 నేను అతడిని వెంబడిస్తూ ఇక్కడికి వచ్చా, అప్పుడే మీ అమ్మ ఇక్కడికి వచ్చింది, 274 00:21:49,810 --> 00:21:51,270 నా మెడపై టేజర్ పెట్టింది. 275 00:21:51,770 --> 00:21:54,022 -టేజరా? -హా. నొప్పితో చచ్చా నేను. 276 00:21:54,106 --> 00:21:55,274 తనకి టేజర్ తో ఏం పని? 277 00:21:55,941 --> 00:21:57,693 ఎందుకంటే, ఆమె రష్యన్ స్లీపర్ ఏజెంట్. 278 00:21:58,610 --> 00:22:00,153 అది పచ్చి అబద్ధం! 279 00:22:00,237 --> 00:22:01,238 నీకు మా అమ్మ ఎవరో తెలుసా? 280 00:22:01,321 --> 00:22:03,782 తను నిజంగానే స్లీపర్ ఏజెంట్. మొదట, మీరే ఆ స్లీప్లర్ ఏజెంట అనుకున్నా, డంకన్. 281 00:22:03,866 --> 00:22:05,492 కానీ నేను పొరబడ్డాను. తనే అని తేలింది. 282 00:22:05,576 --> 00:22:07,452 అసలు… నేను రష్యన్ ఏజెంట్ అని ఎందుకు అనుకున్నావు నువ్వు? 283 00:22:07,536 --> 00:22:09,079 ఆగు, తను ఏజెంట్ అని ఎందుకు అనుకుంటున్నావు? 284 00:22:09,162 --> 00:22:12,374 చూడండి, మీరు అనుమానాస్పదంగా, చాలా అనుమానాస్పదంగా వ్యవహరించారు. 285 00:22:12,457 --> 00:22:13,625 కానీ, మీ అమ్మ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి 286 00:22:13,709 --> 00:22:15,669 మెడపై టేజర్ పెట్టిందో, అప్పుడే తను స్లీపర్ ఏజెంట్ అని తేలిపోయింది. 287 00:22:15,752 --> 00:22:18,255 చూడండి, మీరు నన్ను నమ్మాల, సరేనా? నేను జర్నలిస్టును కాదు. 288 00:22:19,089 --> 00:22:20,090 ఎంఐ5 ఏజెంటుని. 289 00:22:20,716 --> 00:22:21,717 అబ్బో, సరే. 290 00:22:21,800 --> 00:22:24,553 నేను ఎంఐ5 ఏజెంటుని. నా పేరు రివర్ కార్ట్ రైట్. 291 00:22:24,636 --> 00:22:27,347 ఆ పేరు జానీ వాకర్ కంటే దరిద్రంగా ఉంది! 292 00:22:27,431 --> 00:22:30,809 ఓరి దేవుడా. చూడండి, డంకన్, మీరు నన్ను అనుమానంగా చుశారు, 293 00:22:30,893 --> 00:22:32,895 ఎందుకంటే, నేను రావడానికి ముందు నుండే ఆమె విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. 294 00:22:32,978 --> 00:22:34,062 అది నిజమే కదా? 295 00:22:34,146 --> 00:22:35,898 చాలాసార్లు కనిపించకుండా ఎటో వెళ్లిపోయేది కదా? 296 00:22:35,981 --> 00:22:37,900 అర్ధరాత్రి ఫోన్లు వచ్చేవి కదా? 297 00:22:37,983 --> 00:22:40,152 అంటే, కాస్తంత విచిత్రంగా ప్రవర్తించేది కదా? 298 00:22:41,653 --> 00:22:44,448 -తను రష్యన్ ఏజెంట్ కానే కాదు. -తను రష్యన్ ఏజెంటే. 299 00:22:44,531 --> 00:22:46,617 తను మళ్లీ యాక్టివేట్ అయింది, వాళ్లు తనని విమానంలోకి ఎక్కించారు. 300 00:22:46,700 --> 00:22:48,827 -ఆమె ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? -దాన్ని తనే ఇక్కడే పెట్టేసి వెళ్లింది. 301 00:22:48,911 --> 00:22:51,496 -ఫోన్ ఎందుకు వదిలేసి వెళ్లిపోయింది? -తను ఇక తిరిగి ఇక్కడికి రాదు కాబట్టి. 302 00:22:51,580 --> 00:22:53,707 -అన్నీ అబద్ధాలే! -అబ్బా! ముందు నా కట్లు విప్పండి! 303 00:22:53,790 --> 00:22:55,209 పెళ్లిలో నేను తొడిగిన ఉంగరమిది. 304 00:22:57,252 --> 00:22:58,462 అది ఇక్కడ ఎందుకు ఉంది? 305 00:22:59,087 --> 00:23:00,714 తను ఇక ఇక్కడికి రాదు కాబట్టి ఉంది. 306 00:23:02,674 --> 00:23:04,343 వచ్చి ముందు నా కట్లు విప్పండి. 307 00:23:06,220 --> 00:23:07,804 -నాకు ఇది అర్థం కావట్లేదు. -ఏంటి? 308 00:23:09,223 --> 00:23:14,311 "డంకన్, నన్ను క్షమించు. ఐ లవ్ యూ. ఆలెక్స్." 309 00:23:16,480 --> 00:23:22,611 సరే, సరే. నువ్వు చెప్పేది నమ్ముతున్నా. తను విమానాన్ని ఎందుకు తీసుకెళ్లింది? 310 00:23:25,489 --> 00:23:27,115 తను గ్లాస్ హౌస్ పై బాంబు దాడి చేయబోతోంది. 311 00:23:27,199 --> 00:23:29,451 -హా. అంతే కదా. ఓరి నాయనో. -వరుసపెట్టి అబద్ధాలు చెప్తూనే ఉన్నావే! 312 00:23:29,535 --> 00:23:32,371 మన్నించాలి. కానీ ఇప్పటికిప్పుడు ఇది అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. 313 00:23:32,454 --> 00:23:35,457 ఇది… ఇది దిగమింగుకోవడం కష్టంగానే ఉంటుంది. కానీ మీరు నమ్మాలి, 314 00:23:35,541 --> 00:23:37,751 ఎందుకంటే లక్షలాది మంది చనిపోతారు, 315 00:23:37,835 --> 00:23:40,796 వాళ్లు చావకూడదంటే, వెంటనే మీరు నా కట్లు విప్పేయాలి. 316 00:23:43,882 --> 00:23:45,551 చూడండి, ఒకవేళ నేను చెప్పేది నిజమై, మీరు పొరబడుంటే అప్పుడు? 317 00:23:47,761 --> 00:23:49,638 అసలు నన్ను నేను ఇలా ఎలా కట్టుకోగలను? 318 00:23:59,481 --> 00:24:04,486 జనాలు ముఖ్యం, లాభం కాదు! జనాలు ముఖ్యం, లాభం కాదు! 319 00:24:05,487 --> 00:24:07,698 జనాల మాటలను వినండి అవినీతికి ఇక చెల్లుచీటి పలకండి 320 00:24:07,781 --> 00:24:08,991 నావి పగటికలలని మీరనవచ్చు కానీ నాలా చాలా మంది ఉన్నారు 321 00:24:09,074 --> 00:24:10,617 లండన్ ని మళ్లీ పావనం చేయండి! 322 00:24:27,342 --> 00:24:29,970 మా గొంతులని అణిచివేయలేరు 323 00:24:39,354 --> 00:24:41,565 ఇక్కడి నుండి వ్యూ బాగానే ఉంది కదా? ఇది చాల్లే. 324 00:24:42,232 --> 00:24:43,275 అవును. 325 00:24:43,358 --> 00:24:47,196 ఇది మన సురక్షిత ప్రాంతం, నేస్తమా. మన ఉచ్చ స్థానం. 326 00:24:47,905 --> 00:24:49,823 ఏమంటారు? ఉచ్చ స్థానంలో ఉన్నట్టుగా మీకు అనిపించట్లేదా? 327 00:24:57,497 --> 00:24:58,749 సర్లే కానీ, ఇక మొదలుపెడదామా? 328 00:24:58,832 --> 00:24:59,917 ఏమి మొదలుపెట్టాలి? 329 00:25:03,420 --> 00:25:05,255 మీ బాసుకు రష్యాలో అధికార పీఠం ఎలా ఎక్కించాలి అనేదానిపై చర్చ. 330 00:25:08,467 --> 00:25:09,760 కూర్చోండి, మిస్టర్ వెబ్. 331 00:25:19,019 --> 00:25:21,396 మరి ప్రారంభించే ముందు, 332 00:25:21,480 --> 00:25:26,818 బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించి అధికారికంగా ఈ సమావేశం ఏంటో మీకు చెప్పాలి. 333 00:25:27,486 --> 00:25:30,739 ముందు, మనం నెవ్స్కీ భద్రత గురించి చర్చించాలనుకుంటా. 334 00:25:31,406 --> 00:25:35,118 డయానా టావెర్నర్ తో ఆయన సమావేశవ్వబోతున్నాడు కదా, ఇది కేవలం దానికి రిహార్సల్ మాత్రమే. 335 00:25:35,619 --> 00:25:37,913 సమావేశానికి రావడమంటే ఆయన పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్టే. 336 00:25:37,996 --> 00:25:41,375 రిహార్సల్? మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు, ఆర్కేడీ. 337 00:25:42,167 --> 00:25:45,504 మనిద్దరం తెరచాటు ఉన్నా, అసలైన అధికారం మన చేతుల్లోనే ఉంది. 338 00:25:45,587 --> 00:25:48,841 మన బాసుల సమావేశం అనేది, అది పేరుకి జరుగుతుందంతే. 339 00:25:48,924 --> 00:25:51,718 ప్రపంచాన్ని మార్చేది మనం. వాళ్లు కేవలం దానిపై సంతకం చేస్తారంతే. 340 00:25:51,802 --> 00:25:55,347 మిస్టర్ వెబ్, మీరు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలంటే, ముందు మీరు వేసుకొనే సూట్ కూడా అంతే మెరుగ్గా ఉండాలి. 341 00:25:58,517 --> 00:25:59,810 జోక్ బాగుంది. నన్ను బోల్తా కొట్టించేశారు. 342 00:25:59,893 --> 00:26:03,397 జోక్ బాగుంది. ఇది క్యూచినెలి బ్రాండ్ సూట్, అది మీకు తెలిసే ఉంటుంది. 343 00:26:03,480 --> 00:26:07,234 తెలుసు. మీకు అసలైన టైలర్ చిరునామా కూడా ఇస్తాను. 344 00:26:07,901 --> 00:26:10,654 మంచిది. ఖచ్చితంగా ఇవ్వండి. 345 00:26:24,126 --> 00:26:27,671 హా. అంతే. ఆ కింద ఉన్న దాన్ని లాగితే, 346 00:26:27,754 --> 00:26:30,757 మిగతాదంతా దాన్నంతట అదే వచ్చేస్తుంది. అంతే. అబ్బా. 347 00:26:36,221 --> 00:26:38,765 -చెప్పండి. -కార్ట్ రైట్, ఏజెంట్ అయిదు, రెండు, ఆరు, మూడు. 348 00:26:38,849 --> 00:26:41,018 యాక్సెస్ కోడ్ వచ్చేసి డెల్టా, బ్రావో, ఎనిమిది, రెండు, ఏడు. 349 00:26:41,101 --> 00:26:42,352 ఏం రిపోర్ట్ చేస్తున్నారు? 350 00:26:43,645 --> 00:26:44,938 కోడ్ సెప్టెంబర్. 351 00:26:45,689 --> 00:26:47,024 అధికారిక అనుమతి తీసుకోబోతున్నాను. 352 00:26:47,608 --> 00:26:48,942 అర్థమైంది. లైన్లో ఉంటాను. 353 00:26:49,985 --> 00:26:52,279 ఆలెక్స్, దయచేసి ప్రతిస్పందించు. 354 00:26:52,362 --> 00:26:54,781 నువ్వు చేస్తున్నావని నేను అనుకొనే పనిని దయచేసి నువ్వు చేయవద్దు. 355 00:26:56,033 --> 00:26:58,202 ఐ లవ్ యూ. దయచేసి నా మాట విను. 356 00:27:00,954 --> 00:27:01,955 నేను మాట్లాడి చూస్తాను ఆగు. 357 00:27:05,834 --> 00:27:06,835 అమ్మా. 358 00:27:07,920 --> 00:27:09,254 అమ్మా, నేనే. 359 00:27:10,339 --> 00:27:13,717 నువ్వెవరో, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. కేవలం… 360 00:27:15,761 --> 00:27:16,762 నువ్వు మా అమ్మవి, అంతే. 361 00:27:18,222 --> 00:27:19,223 అదే నిజం. 362 00:27:21,183 --> 00:27:23,101 ఐ లవ్ యూ. దయచేసి మా మాట విను. 363 00:27:24,102 --> 00:27:26,980 ఈ పని చేయకు. వద్దు, అమ్మా. 364 00:27:29,233 --> 00:27:32,778 తను ఆఫ్ చేసిందా? ఛ. 365 00:27:41,620 --> 00:27:45,040 జనాలు ముఖ్యం, లాభం కాదు! 366 00:27:45,123 --> 00:27:46,124 చెప్పండి. 367 00:27:49,711 --> 00:27:51,129 సైనికపరమైన అంచనా ఏంటి? 368 00:27:53,382 --> 00:27:54,508 రిపోర్ట్ చేసింది ఎవరు? 369 00:27:55,425 --> 00:27:56,426 అతనికి కనెక్ట్ చేయ్. 370 00:27:57,302 --> 00:27:58,303 మేడమ్. 371 00:27:59,054 --> 00:28:01,431 -నువ్వు కోడ్ సెప్టెంబర్ రిపోర్ట్ చేశావా? -అవును, మేడమ్. 372 00:28:01,515 --> 00:28:04,685 విమాన ట్రాఫిక్ కంట్రోల్ వాళ్లు, వాణిజ్య విమానాలు, అలాగే సైనిక విమానాలేవీ 373 00:28:04,768 --> 00:28:07,229 సరికాని దిశలో వెళ్లడం లేదని నిర్ధారించాయి. 374 00:28:07,312 --> 00:28:09,898 అది చిన్న విమానం, మేడమ్. కానీ దాని నిండా బాంబులని అమర్చారు, 375 00:28:09,982 --> 00:28:11,692 అది నేరుగా గ్లాస్ హౌస్ మీదకే వస్తోంది. 376 00:28:12,276 --> 00:28:13,902 నీకు ఖచ్చితంగా తెలుసా? 377 00:28:13,986 --> 00:28:16,029 నేను దీన్ని ఆపానంటే, ఇది మళ్లీ జరగడం అసాధ్యం. 378 00:28:16,113 --> 00:28:18,282 -పక్కాగా చెప్తున్నా, మేడమ్. -నువ్వు చెప్పింది నిజం కాకపోతే అయిపోతావు. 379 00:28:25,664 --> 00:28:29,042 నేను సెకండ్ డెస్క్ ని. నాకు 30 సెకన్ల సమయం ఇవ్వు, ఆ తర్వాత కోడ్ సెప్టెంబర్ ని అమలుపరచు. 380 00:28:35,048 --> 00:28:36,758 "అభివృద్ధికి విప్లవాత్మక పరిష్కారాలను అందించడం" 381 00:28:37,593 --> 00:28:38,594 మనం తక్షణమే బయలుదేరాలి. 382 00:28:38,677 --> 00:28:40,012 ఆ జనం వల్లనా? 383 00:28:40,095 --> 00:28:44,308 ఆ పని నేను చేయను గాక చేయను. ఈ పిచ్చోళ్ళను చూసి నేను భయపడేదే లేదు. 384 00:28:44,391 --> 00:28:45,934 ఒక హెచ్చరిక అందింది. 385 00:28:46,727 --> 00:28:49,563 ఆ పిచ్చోళ్లలో ఎవరైనా కిటికీ పైకి ఇటుక రాయిని విసిరేశారా ఏంటి? 386 00:28:49,646 --> 00:28:52,649 కోడ్ సెప్టెంబర్ అమల్లో ఉంది. మనం వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలి. 387 00:28:52,733 --> 00:28:53,859 అంటే సెప్టెంబర్ 11వ తేదీనా? 388 00:28:54,902 --> 00:28:59,489 జడ్ డౌన్ డౌన్! జడ్ డౌన్ డౌన్! 389 00:29:00,657 --> 00:29:03,702 అంటే, ఒక చెత్తగాడు ఈ భవనాలను విమానంతో గుద్దించాలని చూస్తున్నాడా? 390 00:29:03,785 --> 00:29:06,747 ఏ భవనాన్నో కాదు. గ్లాస్ హౌస్ ని. 391 00:29:06,830 --> 00:29:08,290 అది మన నెత్తి మీదనే ఉంది కదా! 392 00:29:24,556 --> 00:29:26,099 ఇంకా ఏం చూస్తున్నావు? పోనివ్వు. 393 00:29:28,227 --> 00:29:29,311 థ్యాంక్యూ, లీ. 394 00:29:50,082 --> 00:29:51,667 "కోడ్ సెప్టెంబర్." 395 00:29:52,251 --> 00:29:54,795 "ప్రధాన లక్ష్యం, గ్లాస్ హౌస్ భవనం." 396 00:29:54,878 --> 00:29:58,048 "పేలుడు పదార్థాలతో దాడి అట. సెస్నా…" 397 00:29:58,924 --> 00:30:03,470 కాట్స్ వాల్డ్స్ నుండి పేలుడు పదార్థాలతో ఒక సెస్నా విమానం 398 00:30:03,554 --> 00:30:07,349 గ్లాస్ హౌస్ మీదికి దూసుకు వస్తోంది. 399 00:30:07,432 --> 00:30:10,102 ఆ రెండు ప్రదేశాల్లో నీ ఏజెంట్లు లేరా? 400 00:30:10,185 --> 00:30:13,438 ఉన్నారు. బాబోయ్. 401 00:30:16,608 --> 00:30:19,027 అంత పేపర్ వర్క్ అంటే చచ్చిపోవాల్సిందే. 402 00:30:28,579 --> 00:30:32,416 చెక్. ఓడిపోయి తాగడానికి సిద్ధంగా ఉండు. 403 00:30:40,215 --> 00:30:41,758 దయచేసి ప్రశాంతంగా ఉండండి. నడవండి. 404 00:30:51,059 --> 00:30:52,936 నేను మార్కస్ ని. సందేశం ఏంటో చెప్పండి. 405 00:30:55,981 --> 00:30:58,609 లుయీసా ఇప్పుడు ఫోన్ ఎత్తలేని పరిస్థితిలో ఉంది. 406 00:30:58,692 --> 00:31:00,277 టోన్ తర్వాత సందేశం ఏంటో చెప్పండి. 407 00:31:00,360 --> 00:31:02,529 ఎవరికి ఫోన్ చేసినా వాయిస్ మెయిల్ కి వెళ్తోంది. 408 00:31:07,117 --> 00:31:08,702 నువ్వు గెలవలేవు. 409 00:31:16,251 --> 00:31:19,463 గ్లాస్ హౌస్ భవనం చుట్టూ ఉన్న వీధుల నుండి నిరసనకారులని 410 00:31:19,546 --> 00:31:21,590 పోలీసులు తరలించేస్తున్నారు. 411 00:31:21,673 --> 00:31:26,220 కానీ ఏం జరుగుతోందో తెలీకపోవడంతో, భయాందోళనలు, ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. 412 00:31:26,303 --> 00:31:30,265 లండన్ రవాణా వ్యవస్థ అంతా ఇప్పుడు బంద్ అయిపోయింది. 413 00:31:30,349 --> 00:31:31,350 తాజా వార్త నగరం మూసివేత 414 00:31:31,433 --> 00:31:34,019 ఈ ఖాళీ చేయించడం ఆలస్యం అవుతుంది. 415 00:31:37,898 --> 00:31:39,274 కాల్ చేశావా? 416 00:31:39,942 --> 00:31:42,778 హా. చేశాను. థ్యాంక్యూ. 417 00:31:46,198 --> 00:31:47,199 అతను బాగానే ఉన్నాడా? 418 00:31:47,866 --> 00:31:49,284 -లేదు. -అవునులే. 419 00:31:51,328 --> 00:31:52,788 తర్వాత ఏం జరుగుతుంది? 420 00:31:53,747 --> 00:31:56,708 వాళ్లు భవనాలన్నింటినీ ఖాళీ చేయిస్తారు, రవాణా వ్యవస్థని స్తంభింపజేస్తారు… 421 00:31:56,792 --> 00:31:58,168 అది కాదు. నేను మా అమ్మ గురించి అడుగుతున్నా. 422 00:31:59,044 --> 00:32:00,212 అవునులే. అంటే, వాళ్లు… 423 00:32:01,046 --> 00:32:03,090 ఫైటర్ విమానాలను పంపి, ఆమెకి నచ్చజెప్పి ఆపే ప్రయత్నం చేస్తారు. 424 00:32:04,591 --> 00:32:07,261 అవును. ఒకవేళ ఆమె మాట వినకుంటే? 425 00:32:14,768 --> 00:32:15,769 దేవుడా. 426 00:32:25,737 --> 00:32:27,447 కోడ్ సెప్టెంబర్, వామ్మోయ్! 427 00:32:27,531 --> 00:32:29,324 ఏదేమైనా మనం చెర్నిట్స్కీని కనిపెట్టి తీరాల్సిందే. 428 00:32:29,408 --> 00:32:32,369 -అయిదు నిమిషాల నుండి కదలకుండా ఉన్నచోటే ఉన్నాడే. -ఎక్కడ? 429 00:32:35,831 --> 00:32:36,832 ఆ కారే. 430 00:32:46,425 --> 00:32:48,760 ఇది భద్రతాపరమైన ప్రకటన. 431 00:32:48,844 --> 00:32:50,637 దయచేసి స్టేషన్ నుండి బయటకు వెళ్లిపోండి. 432 00:32:50,721 --> 00:32:52,222 ఫోన్ ఆ కోటులోనే ఉండుంటుంది. 433 00:32:52,723 --> 00:32:54,057 మనం ప్రయత్నించాం కదా. 434 00:32:54,850 --> 00:32:57,853 -అతను రైలు ఎక్కబోతున్నాడు. -మనం నగరం నుండి బయటకు వెళ్లిపోవాలి! 435 00:32:57,936 --> 00:32:59,354 మనం వాడి ఆచూకీని కనిపెట్టాలి! 436 00:33:15,162 --> 00:33:16,288 చెక్. 437 00:33:19,249 --> 00:33:20,834 మంత్రిని అర్పించినందుకు థ్యాంక్స్. 438 00:33:24,463 --> 00:33:26,590 నీతో ఆడుతుంటే, మా నాన్నతో ఆడుతున్నట్టే ఉంది. 439 00:33:26,673 --> 00:33:27,799 ఆయన కూడా ఎప్పుడూ నిన్ను ఓడించేవాడా? 440 00:33:28,300 --> 00:33:31,011 ఆయనకి ఓడిపోవడమంటే గిట్టదు, అందుకని నేనెప్పుడూ రెండు ఆటలు ఆడేదాన్ని. 441 00:33:31,094 --> 00:33:34,848 ఒకటి చదరంగం బోర్డుపై, అది ఆయనే గెలిచేవాడు. ఇంకోటి నా బుర్రలో, అక్కడ నేను గెలిచేదాన్ని. 442 00:33:35,974 --> 00:33:38,477 నా ఆట విషయంలో కూడా ఆయన బాహాటంగా అభిప్రాయాలు చెప్పేసేవాడు. 443 00:33:38,560 --> 00:33:41,522 ఎక్కడ తప్పుగా ఆడుతున్నానో, ఎలా ముఖ్యమైన పావులన్నింటినీ కోల్పోతున్నానో, 444 00:33:41,605 --> 00:33:43,565 ఆటని ఓడిపోతున్నాని చెప్పేవాడు. 445 00:33:44,191 --> 00:33:45,442 అచ్చం నీలాగే. 446 00:33:46,151 --> 00:33:49,112 నీలాగే, అతనికి కూడా రహస్యంగా నేనే గెలుస్తానని అర్థం అయ్యేది కాదు. 447 00:33:50,197 --> 00:33:51,490 చెక్. 448 00:33:52,824 --> 00:33:54,409 చరిత్రలో నిలిచిపోయిన ఆట. 449 00:33:54,493 --> 00:33:58,997 జూన్ 21, 1851లో అడోల్ఫ్ ఆండర్సన్, ఇంకా లయొనెల్ కీసరిట్జ్కీ మధ్య జరిగిన ఆట. 450 00:33:59,706 --> 00:34:00,916 ఇక్కడే లండనులో. 451 00:34:00,999 --> 00:34:03,752 ఆండర్సన్, రెండు ఏనుగులని, ఒంటెని, ఇంకా మంత్రిని త్యాగం చేసేసి, 452 00:34:03,836 --> 00:34:07,339 మూడు సిపాయిలతో కీసరిట్జ్కీకి చెక్ పెట్టాడు. 453 00:34:09,842 --> 00:34:11,260 దాన్ని ప్రయత్నించి చూడాలని నాకు ఎపట్నుంచో ఉండేది. 454 00:34:11,342 --> 00:34:12,969 ఇప్పుడు ఆ అవకాశం దక్కిందిగా. 455 00:34:14,221 --> 00:34:16,223 ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వు చెప్తావు. 456 00:34:18,266 --> 00:34:19,351 నేను చెప్పను. 457 00:34:20,268 --> 00:34:21,436 చెప్తావు. 458 00:34:23,938 --> 00:34:27,359 -నువ్వు నాకు మరో దారిని ఇవ్వట్లేదు. -లేకపోతే ఏం చేస్తావేంటి? 459 00:34:30,237 --> 00:34:31,237 నా దగ్గర నీ ఫైల్ ఉంది. 460 00:34:32,114 --> 00:34:34,658 నువ్వు వంచన చేయడం వలన అనవసరంగా తన్నులు తినిన, 461 00:34:34,741 --> 00:34:35,868 లేదా అరెస్ట్ అయిన వాళ్ళకి 462 00:34:35,951 --> 00:34:38,745 ఆ గతి పట్టడానికి నువ్వు ఎలా కారణమో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారేమో. 463 00:34:38,829 --> 00:34:42,708 నువ్వు ఆ పని చేయవు. నీలో అంత తెగువ లేదు. 464 00:34:42,791 --> 00:34:45,043 అది నీకు పక్కాగా తెలీదు కదా? 465 00:34:52,301 --> 00:34:53,217 ఏంటి? 466 00:34:53,302 --> 00:34:55,721 క్రైమోవ్, కటిన్స్కీని కలిశాడు, పాష్కిన్ ని కాదు. 467 00:34:55,804 --> 00:34:57,931 ఇప్పటిదాకా అతనే ఇదంతా నడిపించాడు. 468 00:34:58,015 --> 00:35:00,350 స్లౌ హౌస్ ని కూడా ఇందులో భాగం చేసింది అతనే. 469 00:35:00,434 --> 00:35:01,977 ఏంటి… ఎందుకు? 470 00:35:02,060 --> 00:35:04,313 అతనికి స్లౌ హౌస్ లో ఉన్న ఒక వ్యక్తి కావాలట, 471 00:35:04,938 --> 00:35:07,357 ఆ వ్యక్తివి నువ్వే. 472 00:35:08,483 --> 00:35:09,943 అది అస్సలు అర్థవంతంగానే లేదు. 473 00:35:10,027 --> 00:35:11,528 నువ్వు తాగున్నావా ఏంటి? 474 00:35:11,612 --> 00:35:14,364 చూడు, పనికొచ్చే పని ఏదైనా చేయాలనుంటే, 475 00:35:14,448 --> 00:35:18,160 ఆ భవనం నుండి బయటకు వచ్చేయమని మార్కస్ కి, లుయీసాకి చెప్పు. 476 00:35:24,041 --> 00:35:25,584 కటిన్స్కీ ఆమోద ఫారమ్. 477 00:35:28,086 --> 00:35:29,630 అతడిని ఎవరు ఆమోదించారు? 478 00:35:29,713 --> 00:35:31,089 నువ్వనే అందులో ఉంది. 479 00:35:35,511 --> 00:35:36,887 అబ్బా. ఏమి కంపురా నాయనా. 480 00:35:36,970 --> 00:35:39,848 హా, అవును. అది ఇక్కడే ఉండిపోయింది. 481 00:35:40,724 --> 00:35:42,267 సంతకం పెట్టినవారు: నికొలాయ్ కటిన్స్కీ సాక్షి: జాక్సన్ ల్యాంబ్ 482 00:35:42,351 --> 00:35:43,352 జాక్సన్ ల్యాంబ్ సమక్షంలో సంతకం చేశారు 483 00:35:44,102 --> 00:35:45,854 దీనిపై సంతకం చేసింది నేను కాదు. 484 00:35:45,938 --> 00:35:48,941 నీకు ఖచ్చితంగా తెలుసా? ఆ కాలంలో కూడా నువ్వు బాగా తాగేవాడివి. 485 00:35:49,816 --> 00:35:51,068 నేను తాగనిది ఎప్పుడులే! 486 00:35:51,985 --> 00:35:54,863 హా, అదీగాక… దీనిపై సంతకం చేసినప్పుడు నేను ప్రాగ్ లో ఉన్నాను. 487 00:35:54,947 --> 00:35:56,281 దాన్ని నిరూపించగలవా? 488 00:35:57,741 --> 00:36:00,077 నిరూపించలేను. నేను అనధికారికంగా వెళ్లాను. 489 00:36:00,953 --> 00:36:03,789 ఫిరాయింపుదార్లపై తొలి హక్కు తమదే అని అమెరికన్లు భావించారు. 490 00:36:03,872 --> 00:36:07,334 విదేశీ కార్యాలయం మమ్మల్ని వెళ్లవద్దని ఆజ్ఞాపించింది, కానీ నేను మాత్రం వెళ్లాను. 491 00:36:07,918 --> 00:36:09,169 అది ఎవరికి తెలుసు? 492 00:36:09,253 --> 00:36:12,089 అతి తక్కువ మందికి తెలుసు. 493 00:36:14,591 --> 00:36:18,595 కానీ, ఒకడు అయ్యుండవచ్చని అనిపిస్తోంది. 494 00:36:21,223 --> 00:36:24,852 అప్పుడు మన ఏజెన్సీలో ఒక ద్రోహి ఉండేవాడు, మోలీ. చాలా సీనియర్ అన్నమాట అతను. 495 00:36:26,186 --> 00:36:28,146 అతనే కటిన్స్కీకి ఆమోదం తెలిపి ఉంటాడు. 496 00:36:28,230 --> 00:36:30,023 ఈ ద్రోహే కటిన్స్కీని అదుపులో ఉంచుకొని… 497 00:36:30,107 --> 00:36:34,945 లేదు, లేదు. కటిన్స్కీయే మన ద్రోహిని అదుపులోకి తెచ్చేసుకున్నాడు. 498 00:36:36,405 --> 00:36:40,075 కటిన్స్కీ కావాలనే తన విచారణలో సికాడాల ప్రస్తావన తెచ్చాడు, 499 00:36:40,158 --> 00:36:43,537 అతను అనామకుడు అని మనం అనుకుంటామని. 500 00:36:43,620 --> 00:36:47,291 ఒకరకంగా చెప్పాలంటే, అతను అనామకుని కంటే తక్కువే అని చెప్పవచ్చు. 501 00:36:48,208 --> 00:36:50,085 అతను ఒక ఘోస్ట్. 502 00:36:50,169 --> 00:36:55,215 సికాడాలు కల్పన అని భావించాం, వాళ్లని ఒక ఆరితేరిన గూఢాచారి కల్పించాడు. 503 00:36:55,299 --> 00:36:59,344 నికొలాయ్ కటిన్స్కీయే ఆ ఆరితేరిన గూఢాచారి. 504 00:37:00,387 --> 00:37:01,805 నా దుంపదెగ. 505 00:37:03,473 --> 00:37:07,144 ఇంకా అతను చావబోతున్నాడు. పూర్తి చేయాల్సిన పనులేవో ఉన్నట్టున్నాయి. 506 00:37:08,937 --> 00:37:10,772 బాబోయ్, స్టాండిష్ చెప్పింది నిజమే. 507 00:37:10,856 --> 00:37:12,107 ఇంతకీ తనేం చెప్పింది? 508 00:37:14,193 --> 00:37:17,779 అతనికేం కావాలో తనకి తెలుసని చెప్పింది. 509 00:37:20,908 --> 00:37:21,909 అది నేనే. 510 00:37:23,076 --> 00:37:25,120 ఈ తతంగంలో మూడు అంశాలు ఉన్నాయి, 511 00:37:25,204 --> 00:37:27,831 ఆన్ లైన్, అంతర్హాతీయం, ఇంకా వ్యక్తిగతం. 512 00:37:27,915 --> 00:37:29,666 సోషల్ మీడియాలో బాట్లను, ఇన్ఫ్లుయెన్సర్లను మీరు చూసుకోండి. 513 00:37:29,750 --> 00:37:32,669 మా మిత్రపక్షాలను ఒప్పించే పని మాది, ఆ తర్వాత నెవ్స్కీ రష్యాకు వచ్చేస్తాడు, 514 00:37:32,753 --> 00:37:34,379 అక్కడి నుండి ప్రచారం చేసుకుంటాడు. అద్గదీ సంగతి! 515 00:37:35,255 --> 00:37:36,590 ఆయన అఖండ విజయం సాధించాక, 516 00:37:36,673 --> 00:37:39,343 రాజు సింహాసనాన్ని అలంకరిస్తుండగా, మనిద్దరం శిరస్సు వంచుతాం… అబ్బా, కానివ్వండి. 517 00:37:39,426 --> 00:37:41,595 భద్రతా హెచ్చరిక. దగ్గర్లోని ఎగ్జిట్ వద్దకు వెళ్ళండి. 518 00:37:41,678 --> 00:37:43,889 అది టెస్ట్ అయ్యుంటుంది. 519 00:37:43,972 --> 00:37:46,183 అది టెస్ట్ కాదు. టెస్ట్ అయ్యుంటే మనకి తెలిసుండేది. 520 00:37:46,266 --> 00:37:50,229 అది ఖాళీ చేయమని మోగే అలారం. మనం వెళ్లిపోవాలి, వెబ్. ఇప్పుడే. 521 00:37:51,688 --> 00:37:53,357 అబ్బా. ఇది జోకా, ఏంటి? 522 00:37:53,440 --> 00:37:55,609 మన్నించాలి. త్వరలోనే ఇంకో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నా. 523 00:37:55,692 --> 00:37:57,528 వేరే చోట, దీని కన్నా మంచి చోట. 524 00:37:57,611 --> 00:37:59,238 సెక్యూరిటీ టీమ్ ని కూడా మార్చేస్తాం. 525 00:37:59,321 --> 00:38:01,490 కాస్త ఆ చెత్త అలారం 526 00:38:01,573 --> 00:38:03,784 -ఎందుకు మోగుతోందో కాస్త కనుక్కొంటారా… -మాట్లాడటం ఇక ఆపు. 527 00:38:04,451 --> 00:38:06,036 మీ ఇద్దరూ కూర్చోండి. 528 00:38:07,204 --> 00:38:08,789 -ఏం చేస్తున్నావు… -కూర్చోండి. 529 00:38:08,872 --> 00:38:10,958 -ఆర్కేడీ. ఎందుకు ఇలా చేస్తునావు? -చేతులు టేబుల్ పై పెట్టండి. 530 00:38:11,041 --> 00:38:15,003 -వీడొక మోసగాడు. ఎఫ్.ఎస్.బీ మనిషి అయ్యుండవచ్చు. -నెవ్స్కీ కింద కదా పని చేసేది? 531 00:38:16,213 --> 00:38:17,214 నెవ్స్కీ చనిపోయాడు. 532 00:38:18,382 --> 00:38:19,925 నెవ్స్కీ చనిపోయాడంటావేంటి? 533 00:38:20,509 --> 00:38:22,177 వీళ్లే అతడిని చంపేశారు. 534 00:38:22,803 --> 00:38:24,888 దగ్గర్లోని ఎగ్జిట్ వద్దకు వెళ్ళండి. 535 00:38:28,225 --> 00:38:29,268 పియోట్. 536 00:38:31,937 --> 00:38:33,939 ఇది అస్సలు అర్థవంతంగానే లేదు. 537 00:38:34,022 --> 00:38:35,065 చేతులు టేబుల్ పై పెట్టు. 538 00:38:38,652 --> 00:38:41,738 భద్రతా హెచ్చరిక. దగ్గర్లోని ఎగ్జిట్ వద్దకు వెళ్ళండి. 539 00:38:42,239 --> 00:38:43,824 సరే, నన్ను మన్నించు. కాస్త ఆ తుపాకీని పక్కకు పెడతావా… 540 00:38:43,907 --> 00:38:46,076 -అరవకు. మూసకొని కూర్చో. -అసలేం జరుగుతోంది? 541 00:38:46,159 --> 00:38:47,536 లేదా తలలోకి తూటా దింపుతా. 542 00:38:52,082 --> 00:38:53,083 కూర్చో. 543 00:39:18,358 --> 00:39:19,902 లేదు, లేదు. ఇక చాలు. ఇక చాలు. 544 00:39:19,985 --> 00:39:23,697 -మీరు ఈ పని చేయలేరు. -కూర్చోరా, సన్నాసీ. 545 00:39:23,780 --> 00:39:25,449 నేను మహారాణి ప్రభుత్వ ప్రతినిధిని. 546 00:39:25,532 --> 00:39:28,577 కాబట్టి… ఆ బొమ్మ తుపాకీని పక్కన పెట్టేయ్, లేదంటే నేను… 547 00:39:45,385 --> 00:39:46,553 ఛ. 548 00:41:13,140 --> 00:41:15,142 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్