1 00:00:16,040 --> 00:00:18,640 ఇంతవరకూ జరిగిన కథ... 2 00:00:18,720 --> 00:00:19,640 ఢమేల్! 3 00:00:25,080 --> 00:00:26,440 మా దగ్గర పని చేస్తారా? 4 00:00:29,560 --> 00:00:32,760 రమాకాంత్ పండిత్ కొడుకులు ఒక గుండా కోసం పని చేస్తారా? 5 00:00:33,840 --> 00:00:35,840 నాకు మీర్జాపూర్ కావాలి, శరద్. 6 00:00:36,360 --> 00:00:39,960 మనం కలిసిపోయి మీర్జాపూర్‌ను ఏలేద్దాం. 7 00:00:52,280 --> 00:00:53,560 నేను కడుపుతో ఉన్నా. 8 00:00:57,360 --> 00:00:58,840 కేవలం చంపడం కోసమే వెళ్ళను. 9 00:00:58,920 --> 00:01:03,000 వారి నుండి లాక్కోవాలని అనుకుంటున్నా. వారి అధికారాన్ని, మీర్జాపూర్‌ని. 10 00:01:03,720 --> 00:01:06,440 అవసరం నాది మాత్రమే కాదు, అవసరం మీకూ ఏర్పడుతుంది. 11 00:01:06,520 --> 00:01:09,080 పూర్వాంచల్‌లో మీ వ్యాపారం నిలిచిపోయింది కదా? 12 00:01:09,160 --> 00:01:10,520 నేనక్కడ మీకు సాయపడవచ్చు. 13 00:01:10,560 --> 00:01:14,960 గుడ్డూ ఇంత ధైర్యంగా సందేశం పంపాడంటే, లాలాతో చేతులు కలిపాడనే. 14 00:01:15,360 --> 00:01:16,520 నువ్వు, నేను... 15 00:01:16,560 --> 00:01:18,200 భోకల్ 16 00:01:18,280 --> 00:01:19,560 ...వాడిని కలిసి లేపేద్దాం. 17 00:01:24,520 --> 00:01:27,080 ఎన్నికల ప్రచారపు రెండవ దశ ఈరోజు నుండి మొదలవుతోంది. 18 00:01:27,520 --> 00:01:28,840 వెళ్ళి, ర్యాలీలను చూసుకో. 19 00:01:30,280 --> 00:01:33,720 నీకు తెల్లచీర నప్పటం లేదు. విప్పేయ్. 20 00:01:35,000 --> 00:01:38,080 మున్నా, నీలాంటి వాడిని నేను ఇంతకు ముందెప్పుడూ కలవలేదు. 21 00:01:40,280 --> 00:01:44,120 కేవలం త్రిపాఠీల బీజం మాత్రమే నీలో పడాలి. 22 00:01:47,960 --> 00:01:50,080 అంటే, నేనంత బలహీనుడినేమీ కాదన్న మాట. 23 00:01:51,200 --> 00:01:54,480 నీ కడుపున ఉన్నది త్రిపాఠీ వంశపు వారసుడు. 24 00:01:54,560 --> 00:01:57,360 నేను ప్రాణాలతో బయటపడతాను, నువ్వు కూడా. 25 00:01:58,080 --> 00:02:00,560 కాలీన్ భయ్యా కుటుంబం ఇప్పుడు బలహీనంగా ఉంది. 26 00:02:01,840 --> 00:02:03,360 నేను నా మాట నిలబెట్టుకుంటా, 27 00:02:03,880 --> 00:02:05,440 మీరు మీ మాట నిలబెట్టుకోండి. 28 00:02:09,240 --> 00:02:10,600 గుడ్డూనే ఇదంతా చేశాడు! 29 00:02:10,680 --> 00:02:14,560 లేదు. మన అయినవాళ్ళలోనే ఎవరో మనల్ని బలహీనపరచాలని అనుకుంటున్నారు. 30 00:02:14,600 --> 00:02:16,600 మనం కొత్త పొత్తులు చేసుకోవాలి. 31 00:02:19,360 --> 00:02:20,760 నేను స్వతంత్రంగా, 32 00:02:21,560 --> 00:02:24,440 అఖండానంద్ త్రిపాఠీని మంత్రివర్గంలోకి నియమిస్తున్నాను. 33 00:02:25,040 --> 00:02:28,600 గసగసాల భూ కేటాయింపుని చూస్తున్నది నువ్వే కదా? త్రిపాఠీకి కేటాయించు. 34 00:02:28,680 --> 00:02:31,320 మీ నాన్నకు మీర్జాపూర్ దక్కేలా చేస్తానని మాటిచ్చా. 35 00:02:31,400 --> 00:02:32,880 ఆ మాట నాకూ ఇవ్వండి. 36 00:02:33,400 --> 00:02:36,280 అందుకు బదులు, మీకు ఏ సాయం అవసరమైనా, చెబితే చాలు. 37 00:02:40,000 --> 00:02:42,160 మీ నాన్న పోయారు, బంగారం. 38 00:02:44,440 --> 00:02:46,880 సర్, ఇతని ట్రక్‌లో ఓ కాగితం, తుపాకీ దొరికాయి. 39 00:02:46,960 --> 00:02:48,000 జౌన్‌పూర్. 40 00:02:49,080 --> 00:02:50,280 దీన్ని చూడండి. 41 00:02:52,280 --> 00:02:54,800 మన లక్ష్యం ఒక్కటే, కానీ దారులు వేరే. 42 00:02:56,680 --> 00:02:58,800 పదవి ఎవరికీ శాశ్వతం కాదు. 43 00:02:58,880 --> 00:03:01,160 నాన్న పోయాక బాబాయి వచ్చారు. 44 00:03:01,240 --> 00:03:03,520 బాబాయి పోతేనే కదా, ఎవరో ఒకరు వచ్చేది. 45 00:03:07,400 --> 00:03:09,920 నన్ను వేధించారు. లైంగికంగా వేధించారు. 46 00:03:10,400 --> 00:03:13,240 పార్టీ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. 47 00:03:13,320 --> 00:03:15,520 అందుకే, జేపీ యాదవ్ స్వచ్ఛందంగా 48 00:03:15,600 --> 00:03:18,760 పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 49 00:03:18,840 --> 00:03:23,520 నేను ప్రతిపాదించబోయే పేరు. మాధురి యాదవ్ త్రిపాఠీ. 50 00:03:25,480 --> 00:03:27,400 ఆడదాని కోసం బలహీనపడిపోయే మగాడివి 51 00:03:28,760 --> 00:03:30,360 ప్రపంచంలో నువ్వు ఒక్కడివే కాదు. 52 00:03:32,280 --> 00:03:34,160 దద్దా, నేను నల్లమందు వ్యాపారం చేయాలి. 53 00:03:35,440 --> 00:03:38,160 నేను డ్రగ్స్‌తో వ్యాపారం చేయను. 54 00:03:39,360 --> 00:03:41,560 మీకు ఏ మాత్రం సందేహం ఉన్నా, ఇది చేయకండి. 55 00:03:43,480 --> 00:03:46,040 నల్లమందు విషయం దద్దాకు, అన్నకు తెలిసిపోయింది. 56 00:03:46,520 --> 00:03:49,680 వచ్చి నువ్వు క్షమాపణ చెప్తే, విషయం అంతటితో ముగిసిపోతుంది. 57 00:03:49,760 --> 00:03:50,760 నీ మీద నాకు ప్రేమ. 58 00:03:51,160 --> 00:03:53,760 నీకేమైనా పిచ్చి పట్టిందా? అది ప్రేమ కాదు, అవసరం. 59 00:03:53,840 --> 00:03:55,720 నిన్ను వెర్రోడిని చేసింది. 60 00:03:57,240 --> 00:03:58,320 చిన్నోడా! 61 00:04:03,320 --> 00:04:06,000 పెద్దోడా, నువ్వు బాగున్నావు కదా? 62 00:04:06,520 --> 00:04:07,600 చిన్నోడా! 63 00:04:07,680 --> 00:04:10,680 నా పేరు రాబిన్. పెట్టుబడులు, డబ్బుల విషయాల్లో డీల్ చేస్తాను. 64 00:04:11,680 --> 00:04:13,800 నాకు గుడ్డూకి చెందిన మొత్తం సమాచారం కావాలి. 65 00:04:13,880 --> 00:04:15,720 అతని లావాదేవీలు, వ్యాపారాలు, అన్నీ. 66 00:04:16,320 --> 00:04:19,560 ఇప్పుడు ఇతను నా అల్లుడు కాదు, నా కొడుకు అవుతాడు. 67 00:04:20,520 --> 00:04:23,080 సర్, లాలా పని పట్టడానికి మాకు మీ అనుమతి కావాలి. 68 00:04:23,120 --> 00:04:25,720 గుడ్డూ పండిత్‌ను అరెస్ట్ చేస్తాం, నల్లమందు కేసు. 69 00:04:27,080 --> 00:04:28,000 మనం ఏం చేయాలి? 70 00:04:28,080 --> 00:04:29,680 ఎన్‌కౌంటర్. గుడ్డూ పండిత్. 71 00:04:30,840 --> 00:04:33,760 అందరూ శాంతియుతంగా మాకు లొంగిపోవాలి! 72 00:04:35,440 --> 00:04:37,360 పండిత్ గారు, మీరు ఈ బండ్లో రండి. 73 00:04:40,600 --> 00:04:41,600 పరిగెత్తు. 74 00:04:42,080 --> 00:04:45,880 మౌర్య గారు, వారికి శిక్ష వేయించడమే మన పని, మనమే శిక్ష వేయడం కాదు! 75 00:04:51,080 --> 00:04:53,200 ఇప్పుడు మీకూ, నాకూ ఏ తేడా లేదు. 76 00:04:53,240 --> 00:04:55,080 చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తాను. 77 00:04:57,360 --> 00:04:59,720 త్రిపాఠీలు పోసిన ప్రాణాన్ని 78 00:05:00,240 --> 00:05:02,600 వాళ్ళే వాపసు తీసుకున్నారని అనుకో. 79 00:05:05,640 --> 00:05:07,240 మామగారిని నువ్వు చంపకు, మక్బూల్. 80 00:05:08,040 --> 00:05:09,360 నేను చంపుతాను. 81 00:05:09,440 --> 00:05:10,640 దీంతో. 82 00:05:12,560 --> 00:05:14,480 సమయం ఆసన్నమైంది. కుటుంబం బలహీనంగా ఉంది. 83 00:05:15,000 --> 00:05:16,120 మీర్జాపూర్ రాజు 84 00:05:16,200 --> 00:05:17,760 నీకు మీర్జాపూర్ ఇచ్చేస్తున్నా. 85 00:05:17,800 --> 00:05:21,360 మున్నా త్రిపాఠీ, మీర్జాపూర్ రాజు. 86 00:05:40,480 --> 00:05:41,480 గుడ్డూ! 87 00:05:57,000 --> 00:05:59,840 3వ సీజన్ 88 00:06:02,040 --> 00:06:03,640 నారాయణుడికి నమస్సులు 89 00:06:03,720 --> 00:06:05,400 విష్ణుదేవుడికి నమస్సులు 90 00:06:05,880 --> 00:06:09,320 ప్రార్థిస్తున్నాను ముక్కంటి శివుడిని 91 00:06:09,400 --> 00:06:11,000 నన్ను పోషించినవాడికి 92 00:06:11,080 --> 00:06:13,200 జననమరణాల బంధం నుండి విముక్తి చేసినవాడికి 93 00:06:13,280 --> 00:06:16,880 శాంతి వర్ధిల్లు గాక 94 00:06:16,960 --> 00:06:19,280 సరే, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. 95 00:06:19,360 --> 00:06:20,800 మీరు దాన్ని తీసుకోండి. 96 00:06:26,000 --> 00:06:27,000 జాగ్రత్త. 97 00:06:35,840 --> 00:06:37,440 ఆ. అక్కడ పెట్టేయండి. 98 00:06:41,680 --> 00:06:43,240 కుటుంబం నుండి ఎవరైనా ఉన్నారా? 99 00:06:43,320 --> 00:06:45,480 తండ్రి, సోదరుడు లేదా ఇంకెవరైనా మగవాళ్ళు? 100 00:06:51,880 --> 00:06:53,280 కానీ, అమ్మగారు, అది... 101 00:07:31,520 --> 00:07:35,680 మేడమ్, మీ భర్త దారుణ హత్యకు గురయ్యారని అంతా అనుకుంటున్నారు. 102 00:07:35,760 --> 00:07:37,560 దీని గురించి మీరేమంటారు? 103 00:07:37,640 --> 00:07:40,400 మాకున్న ఆధారాల ప్రకారం, అఖండానంద్ త్రిపాఠీ కనపడటం లేదు. 104 00:07:40,480 --> 00:07:41,480 అది నిజమేనా? 105 00:07:41,560 --> 00:07:44,600 నిజం కాకపోతే, అతను కొడుకు అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదు? 106 00:07:44,680 --> 00:07:46,680 మాధురి గారు, ఇది ముఠాల పోరానా? 107 00:07:46,760 --> 00:07:50,280 మేడమ్, ఇలా మీకే జరిగితే, మాలాంటి సామాన్యుల సంగతేంటి? 108 00:07:50,360 --> 00:07:52,000 ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? 109 00:07:59,800 --> 00:08:01,360 నేను ఈ రాష్ట్రపు కూతురుని. 110 00:08:02,920 --> 00:08:04,720 ఈ పదవి నాకు కట్టబెట్టింది మీరే. 111 00:08:06,440 --> 00:08:08,560 ఇవాళ విధవరాలు అయ్యింది నేను కాదు. 112 00:08:10,480 --> 00:08:12,480 ఇవాళ మీ ఇంటి బిడ్డ విధవరాలు అయ్యింది. 113 00:08:15,520 --> 00:08:19,000 తండ్రిని కోల్పోయింది నేనొక్కదాన్నే కాదు, 114 00:08:19,680 --> 00:08:21,640 మీరంతా కూడా కోల్పోయారు. 115 00:08:22,160 --> 00:08:26,080 మీ ప్రశ్నల్లోని కోపం, నిరాశలను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. 116 00:08:26,680 --> 00:08:28,080 మీకు మాటిస్తున్నాను, 117 00:08:30,800 --> 00:08:32,400 ఈ బాధను నేను భరిస్తాను, 118 00:08:33,000 --> 00:08:34,760 ఓ కవచంలా బలంగా ఉంటాను. 119 00:08:35,680 --> 00:08:40,400 దాంతో మన కుటుంబానికి, అంటే మీ అందరికీ, ఏ హాని జరగనివ్వను. 120 00:08:40,960 --> 00:08:42,640 ఈ రాష్ట్రాన్ని కడిగి పారేస్తాం. 121 00:08:42,720 --> 00:08:45,600 చట్ట పరిధిలోనే ఈ రాష్ట్రాన్ని కడిగి పారేస్తాం. 122 00:08:46,360 --> 00:08:48,320 జై హింద్! జై రాష్ట్రం! 123 00:08:48,400 --> 00:08:49,760 తెలియదు మాకు భయమంటే! 124 00:08:49,880 --> 00:08:51,640 మాధురి మా వెన్నుంటే! 125 00:08:51,720 --> 00:08:53,520 తెలియదు మాకు భయమంటే! 126 00:08:53,640 --> 00:08:55,360 మాధురి మా వెన్నుంటే! 127 00:08:55,440 --> 00:08:57,120 తెలియదు మాకు భయమంటే! 128 00:08:57,200 --> 00:08:59,160 మాధురి మా వెన్నుంటే! 129 00:08:59,240 --> 00:09:01,120 లోక్ స్వరాజ్ పార్టీ... 130 00:09:01,200 --> 00:09:02,960 ఐజీ దూబే మీ ఆదేశాలకై చూస్తున్నారు 131 00:09:03,440 --> 00:09:05,280 గుడ్డూ పండిత్‌పై చర్య తీసుకోవడానికి. 132 00:09:05,880 --> 00:09:07,520 గుడ్డూ పండిత్ మాత్రమే కాదు, 133 00:09:07,600 --> 00:09:10,600 మున్నా మృతికి కారణం మీర్జాపూర్ గద్దె కూడా. 134 00:09:11,160 --> 00:09:13,400 ఇప్పుడు నా లక్ష్యం ఆ గద్దెను నాశనం చేయడమే. 135 00:09:28,360 --> 00:09:30,760 మీర్జాపూర్ 136 00:10:09,880 --> 00:10:11,880 పూర్వాంచల్ 137 00:10:26,520 --> 00:10:28,600 అది తెల్లవారుఝాము, జడ్జి గారు. 138 00:10:30,280 --> 00:10:31,840 నేను బాత్రూమ్‌కు వెళ్ళి రాగానే, 139 00:10:33,160 --> 00:10:35,520 బల్ల దగ్గర వకీలు గారు కూర్చుని ఉన్నారు. 140 00:10:37,320 --> 00:10:40,440 ఆయనకు ఏమైనా నిద్రలో నడిచే జబ్బుందా అనుకున్నాను. 141 00:10:41,320 --> 00:10:44,480 కానీ "నేను ఫిర్యాదు చేయాలి" అని ఆయన అన్నారు. 142 00:10:45,200 --> 00:10:47,160 "ఎవరికి వ్యతిరేకంగా?" అని అడిగాను. 143 00:10:48,040 --> 00:10:49,480 "నాకు వ్యతిరేకంగా" అన్నారు. 144 00:10:50,760 --> 00:10:52,720 "ఓరి నాయనో. 145 00:10:53,480 --> 00:10:57,480 "వకీలు గారు, ఇంత ఉదయాన్నే నా ఉద్యోగానికి ఎసరు పెడతారా? 146 00:10:58,280 --> 00:11:00,080 "ఇవాళ మీరు ఫిర్యాదు చేస్తారు 147 00:11:00,560 --> 00:11:02,360 "ఇక రేపు, కేసు వేస్తారు" అన్నాను. 148 00:11:02,440 --> 00:11:04,080 పాఠక్ గారు, విషయానికి రండి. 149 00:11:04,480 --> 00:11:06,160 విషయమేంటంటే, జడ్జి గారు, అది... 150 00:11:06,240 --> 00:11:08,280 ఏంటది? అదే మిమ్మల్ని అడుగుతున్నాను. 151 00:11:08,360 --> 00:11:12,560 అంటే వకీలు గారు స్టేషన్‌కు వచ్చి స్వయంగా లొంగిపోయారు. 152 00:11:14,240 --> 00:11:15,240 మీరు వెళ్ళవచ్చు. 153 00:11:17,840 --> 00:11:20,240 ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, రమాకాంత్ పండిత్? 154 00:11:22,160 --> 00:11:23,160 నాన్నా. 155 00:11:31,880 --> 00:11:33,680 నేను ఎస్‌ఎస్‌పీ మౌర్యను చంపాను. 156 00:11:34,720 --> 00:11:36,240 అందుకు నాకు తగిన శిక్ష పడాలి. 157 00:11:43,240 --> 00:11:46,600 నమ్మండి, జడ్జి గారు, ఇదొక నాటకం. 158 00:11:47,440 --> 00:11:48,440 వివరించండి. 159 00:11:49,000 --> 00:11:50,120 ఏంటంటే, జడ్జి గారు, 160 00:11:51,200 --> 00:11:53,040 ఈ వకీలు గారు చాలా నక్కతెలివి మనిషి. 161 00:11:53,840 --> 00:11:57,760 ఈయన కోర్టుకు లొంగిపోయి సానుభూతి పొందాలనుకుంటున్నాడు. 162 00:11:57,840 --> 00:12:01,640 దాంతో గౌరవనీయ కోర్టు ఈయనకు శిక్ష వేసేటప్పుడు, 163 00:12:02,440 --> 00:12:04,840 గొంతులో బంతి అడ్డుపడకుండా తప్పించుకునే౦దుకు. 164 00:12:04,920 --> 00:12:07,800 మాట శుద్ధంగా రానివ్వండి, వకీలు గారు. 165 00:12:07,880 --> 00:12:09,040 క్షమించండి, మై లార్డ్. 166 00:12:10,440 --> 00:12:11,800 ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 167 00:12:12,640 --> 00:12:17,480 ఇది హత్య కిందకు రాని నిందాపూర్వక ప్రాణనష్టపు కేసు కాదు. 168 00:12:17,560 --> 00:12:21,120 విధి నిర్వహణలో ఉన్న అధికారిపై కర్కశంగా, పథకం ప్రకారం చేసిన హత్య. 169 00:12:21,200 --> 00:12:24,280 -అతను ఏమంటున్నాడు? -పథకం ప్రకారం జరిగిందని అంటున్నాడు. 170 00:12:24,360 --> 00:12:28,920 ఇతనిపై సెక్షన్ 302, 353 కింద దోషనిర్ధారణ చేసి 171 00:12:29,760 --> 00:12:31,680 మరణించే దాకా ఉరిశిక్ష వేయాలి. 172 00:12:35,400 --> 00:12:36,960 కానీ హత్య వెనుక ఉద్దేశ్యం ఏంటి? 173 00:12:37,040 --> 00:12:41,280 అతని కొడుకు వ్యాపార ప్రయోజనాలు. క్షమించాలి. 174 00:12:42,880 --> 00:12:45,800 నేర కార్యకలాపాలను రక్షించడం. 175 00:12:45,880 --> 00:12:49,480 ఒకవేళ అది నిజం కాకపోతే, అతను సాక్ష్యం సమర్పించవచ్చు. 176 00:13:00,320 --> 00:13:04,360 నిందితుడిని తదుపరి విచారణ వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపడమైనది. 177 00:13:18,280 --> 00:13:24,280 కాశీ టీ స్టాల్ 178 00:13:24,360 --> 00:13:25,360 నమస్కారం, సర్. 179 00:13:26,120 --> 00:13:29,320 సీ. జే. ఎం. కోర్టు 180 00:14:37,840 --> 00:14:40,520 యూపీ పోలీసు పోలీసు 181 00:14:40,600 --> 00:14:43,480 మీరు లొంగిపోవాల్సిన అవసరం లేదు. 182 00:14:46,440 --> 00:14:48,800 నేరం తమపై వేసుకునేలా ఎవరినైనా అడిగేవాడిని. 183 00:14:52,920 --> 00:14:54,240 జైలులో సజీవంగా ఉండలేరు. 184 00:14:57,400 --> 00:15:00,560 నాతో రండి, ఇంటి దగ్గర వదిలిపెడతాను. 185 00:15:04,960 --> 00:15:08,080 దిగులు పడకండి, మీకు బదులుగా ఒక నేరస్తుడే జైలుకు వెళతాడు. 186 00:15:16,920 --> 00:15:18,120 మీరు ఒక వకీలు, 187 00:15:19,560 --> 00:15:20,800 కనీసం కేసైనా పోరాడండి. 188 00:15:22,320 --> 00:15:24,760 మీ న్యాయపరిభాషలో దాన్ని ఏమంటారు? 189 00:15:26,440 --> 00:15:28,680 "నేరం రుజువు కాకపోతే, నిరూపణ లేనట్లే." 190 00:15:28,760 --> 00:15:31,040 "నేరం రుజువు కానంత వరకూ నిర్దోషే." 191 00:15:31,120 --> 00:15:32,120 ఇదే. 192 00:15:33,080 --> 00:15:35,320 అయితే, పోరాడండి. మీకోసం కాకపోయినా, 193 00:15:36,560 --> 00:15:39,360 అమ్మ, డింపీల కోసమైనా పోరాడండి. 194 00:15:40,520 --> 00:15:42,200 ఎందుకు ఈ దారి ఎంచుకున్నారు? 195 00:15:51,560 --> 00:15:52,720 నీలాగే... 196 00:15:55,360 --> 00:15:57,320 నేనూ నా దారి ఎంచుకున్నాను. 197 00:15:59,720 --> 00:16:01,880 నా దారి ఉరికంబానికి దారి తీయదు. 198 00:16:03,880 --> 00:16:05,400 "దారి ఎంచుకున్నా..." 199 00:16:06,480 --> 00:16:07,880 మరి నీ దారి ఎక్కడికెళుతుంది? 200 00:16:13,720 --> 00:16:14,720 నియంత్రణ. 201 00:16:16,240 --> 00:16:17,240 అధికారం. 202 00:16:18,360 --> 00:16:19,360 గౌరవం. 203 00:16:27,040 --> 00:16:29,200 నీకు మంచి జరగాలి. ఇక వెళ్ళు. 204 00:16:37,600 --> 00:16:38,600 విను, 205 00:16:39,480 --> 00:16:41,760 నా స్కూటర్ పోలీస్ స్టేషన్‌లో ఉంది. 206 00:16:42,960 --> 00:16:44,280 ఇంటికి తీసుకెళ్ళు. 207 00:16:46,360 --> 00:16:47,360 కానిస్టేబుల్ గారు. 208 00:16:50,400 --> 00:16:52,720 వెళ్ళనివ్వండి! 209 00:16:52,800 --> 00:16:58,760 మీర్జాపూర్ రాజు 210 00:17:12,840 --> 00:17:14,280 మీ సమయానికి ధన్యవాదాలు. 211 00:17:15,320 --> 00:17:16,320 కూర్చోండి. 212 00:17:27,320 --> 00:17:31,040 అంత్యక్రియలకు రాలేకపోయినందుకు క్షమించండి. 213 00:17:31,680 --> 00:17:33,560 రాలేకపోయారా లేదా రావాలని అనుకోలేదా? 214 00:17:36,400 --> 00:17:39,000 నాకు, మున్నాకు మధ్యనున్న వ్యాపార సంబంధాలు 215 00:17:39,720 --> 00:17:42,080 గౌరవనీయ ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగకరం కావచ్చు. 216 00:17:43,640 --> 00:17:45,560 ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళుతుంది. 217 00:17:46,200 --> 00:17:47,480 అందుకే రాలేదు. 218 00:17:50,400 --> 00:17:51,480 ఎందుకు వచ్చారు? 219 00:17:51,960 --> 00:17:54,080 ఒప్పందం చేసుకోవడానికి రాలేదు, మాధురి గారు. 220 00:17:55,960 --> 00:17:57,800 మీకు నా పూర్తి మద్దతు ఉంటుందని 221 00:17:59,720 --> 00:18:01,400 చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. 222 00:18:10,320 --> 00:18:12,440 మద్దతు అవసరం ఉన్నది మీకా నాకా? 223 00:18:13,080 --> 00:18:14,560 బహుశా ఇద్దరికీ ఉందేమో. 224 00:18:19,760 --> 00:18:21,800 నేను కూడా మీలాగా ఒంటరినయ్యాను, 225 00:18:22,680 --> 00:18:24,080 మా నాన్న మరణం తర్వాత. 226 00:18:26,280 --> 00:18:27,280 నాకంటూ ఎవరూ లేరు. 227 00:18:29,320 --> 00:18:31,520 ఆ సమయంలో మున్నా నాకు తోడుగా ఉన్నాడు. 228 00:18:34,160 --> 00:18:36,920 అందుకే, ఇక్కడ విషయం మద్దతు ఇవ్వడమో, తీసుకోవడమో కాదు. 229 00:18:38,040 --> 00:18:43,080 మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనకంటూ ఎవరో ఉన్నారన్న ధైర్యం చాలు. 230 00:18:43,920 --> 00:18:47,240 ఆ విశ్వాసాన్ని ధైర్యాన్ని అందించి, నేనున్నాను అని చెప్పడానికే 231 00:18:48,320 --> 00:18:49,480 ఇక్కడికి వచ్చాను. 232 00:18:52,880 --> 00:18:54,800 మీరు ఏం అంటున్నారో అర్థమవుతోంది. 233 00:19:00,000 --> 00:19:01,200 కానీ ఇది గుర్తుంచుకోండి, 234 00:19:03,640 --> 00:19:06,440 నేరరహిత యూపీలో మీరు కూడా భాగమేనని. 235 00:19:09,160 --> 00:19:11,080 మీ పట్ల ఎలాంటి కనికరము చూపించను. 236 00:19:11,720 --> 00:19:12,720 సరేనండి. 237 00:19:14,280 --> 00:19:15,280 ధన్యవాదాలు. 238 00:19:18,880 --> 00:19:19,960 పెదనాన్న సంగతేంటి? 239 00:19:21,400 --> 00:19:22,400 ఎవరు? 240 00:19:24,800 --> 00:19:25,960 కాలీన్ భయ్యా. 241 00:19:28,080 --> 00:19:29,080 ఇంకా లేదు. 242 00:19:35,280 --> 00:19:37,200 ఉంటాను, ముఖ్యమంత్రి గారు. 243 00:19:38,480 --> 00:19:39,640 అలాగే. 244 00:19:40,320 --> 00:19:42,760 మాధురి యాదవ్ 245 00:19:51,280 --> 00:19:56,080 ఆజమ్‌ఘడ్ 246 00:20:02,920 --> 00:20:04,480 -ఓయ్, ఖిలావన్. -ఏంటి? 247 00:20:04,560 --> 00:20:07,480 ఆహా అనిపించే ఆ 26వ నెంబర్ పాన్ ఒకటివ్వు. 248 00:20:08,000 --> 00:20:09,320 సిద్ధం చేసుంచా. ఇదిగో. 249 00:20:12,040 --> 00:20:13,720 నీ ఖాతాలో రాస్తున్నా. 250 00:20:13,800 --> 00:20:16,800 మనల్ని ఆ చోటుకు తీసుకెళ్ళేది ఈ అబ్బాయే. 251 00:20:16,920 --> 00:20:20,400 కానీ ఇది చాలా సున్నితమైన ప్రదేశం, అక్కా. 252 00:20:21,480 --> 00:20:24,040 గుడ్డూ భయ్యా కోసం ఎదురు చూడటం బాగుంటుంది. 253 00:21:27,800 --> 00:21:32,720 స్టేషనరీ 254 00:23:56,840 --> 00:23:58,080 నమస్కారం, బాబాయి. 255 00:24:02,040 --> 00:24:03,040 సంతోషంగా ఉండు, రాజు. 256 00:24:03,120 --> 00:24:04,640 ఆ, సంతోషంగానే ఉన్నా. 257 00:24:06,240 --> 00:24:07,240 అబ్బాయి... 258 00:24:14,480 --> 00:24:16,800 ఏంటిది, బాబాయి? రక్షణా? 259 00:24:18,240 --> 00:24:19,360 మీరు ఎవరు? 260 00:24:20,320 --> 00:24:22,400 ఆయన మా బాబాయి. బాబాయి. 261 00:24:23,400 --> 00:24:25,560 వీడొక పెద్ద దొంగ నా కొడుకు. 262 00:24:26,160 --> 00:24:28,240 బాబాయి అంటూ నన్ను కుంటివాడిని చేశాడు. 263 00:24:29,360 --> 00:24:32,440 వీడిని చంపేయండి. మీరు ఎంత అడిగితే అంత డబ్బు ఇస్తా. 264 00:24:34,400 --> 00:24:38,000 నిజంగానా? వీడొక బికారిగాడు. మీకు ఇవ్వడానికి ఏమీ లేదు. 265 00:24:38,080 --> 00:24:41,000 మీరు ఇతన్ని చంపితే, మీకు మూడెకరాల భూమి రాసిస్తాను. 266 00:24:41,080 --> 00:24:44,720 మూడెకరాలను మిఠాయిలా పంచుతావా రా, నా కొడకా. మీ నాన్న ఇచ్చి వెళ్ళాడా? 267 00:24:45,200 --> 00:24:47,520 మా నాన్న జీవితాంతం సైన్యంలో పని చేశారు, 268 00:24:47,600 --> 00:24:49,320 సుమారు 9 ఎకరాల భూమి కొన్నారు. 269 00:24:49,400 --> 00:24:51,600 ఆయన పోగానే ఈ నా కొడుకు ఆ భూమి కొట్టేశాడు! 270 00:24:51,680 --> 00:24:55,280 వినరా, మీ నాన్న ఆతు అంత భూమిని కూడా కొనలేదు. 271 00:24:55,360 --> 00:24:58,080 డబ్బులంతా లంజలపై తగలెట్టాడు. 272 00:24:58,160 --> 00:25:01,040 మరైతే నువ్వు కొన్నావా ఏంటి? సారా మత్తులో? 273 00:25:01,120 --> 00:25:02,600 అది పూర్వీకుల భూమి. 274 00:25:02,680 --> 00:25:04,960 మీ తాత నా పేరు మీద రాసి వెళ్ళాడు. 275 00:25:05,040 --> 00:25:06,280 నా అన్న ఎందుకు చచ్చాడు? 276 00:25:06,360 --> 00:25:08,200 నా బావమరిదిని ఎందుకు కాల్చారు? 277 00:25:08,280 --> 00:25:09,320 మరి మా అమ్మ అవమానం? 278 00:25:09,400 --> 00:25:11,360 నా మరదలిని వేధించింది ఎవర్రా, నా కొడకా? 279 00:25:11,440 --> 00:25:13,560 నీ మరదలు ఓ లంజ రా, చెత్త నా కొడకా! 280 00:25:13,640 --> 00:25:15,680 -నోర్ముయ్ రా, కొడకా! -నిన్ను లేపేస్తా! 281 00:25:15,760 --> 00:25:16,640 ఏయ్, నా కొడకా! 282 00:25:16,720 --> 00:25:18,000 -లంజాకొడకా! -నా కొడకా! 283 00:25:22,000 --> 00:25:23,320 మీకు బుర్ర దొబ్బిందా? 284 00:25:23,800 --> 00:25:25,760 ప్రాణాలే పోయాక భూమి ఉండి లాభమేంటి? 285 00:25:27,720 --> 00:25:30,720 మీరు ఆపరేషన్ చేయండి. ఇక నువ్వు. నువ్వే. 286 00:25:35,880 --> 00:25:38,320 భూమి సగం సగం పంచుకోండి, కాగితాలతో సహా. 287 00:25:38,960 --> 00:25:40,600 మా వాళ్ళు ఓ కన్నేసి ఉంచుతారు. 288 00:25:42,480 --> 00:25:44,120 నాకు ఎలాంటి రక్తపాతం జరగకూడదు. 289 00:25:44,600 --> 00:25:45,720 మీకు అర్థం కావటం లేదు. 290 00:25:47,040 --> 00:25:48,280 మా బాబాయి ఒప్పుకోడు. 291 00:25:48,840 --> 00:25:50,360 వాడొక పెద్ద లఫూట్‌గాడు. 292 00:25:51,280 --> 00:25:54,240 ఒప్పుకోకపోతే, వాడి రెండు కాళ్ళను నేను నరుకుతా. 293 00:25:59,520 --> 00:26:02,240 ఈ కుటుంబ గొడవల్లో మీరు తలదూర్చకండి. 294 00:26:19,200 --> 00:26:20,480 ఒకరిని వెతుకుతున్నాను. 295 00:26:21,440 --> 00:26:23,000 నా శత్రుత్వం మీతో కాదు. 296 00:26:29,000 --> 00:26:30,840 నేను మీర్జాపూర్ బాహుబలి. 297 00:26:31,800 --> 00:26:33,400 గుడ్డూ పండిత్ నన్ను పంపాడు. 298 00:26:33,480 --> 00:26:35,760 ఇది మీర్జాపూర్ కాదు. 299 00:26:37,520 --> 00:26:39,560 ఇక్కడ బాహుబలి నేనే. 300 00:26:44,160 --> 00:26:46,000 పూర్వాంచల్ మొత్తం మాకు నివేదిస్తుంది. 301 00:26:47,080 --> 00:26:49,800 నన్ను ధిక్కరిస్తే, గద్దెను ధిక్కరించినట్లే. 302 00:27:00,400 --> 00:27:02,400 అన్నా... అన్నా, నేను కాదు! 303 00:27:03,080 --> 00:27:06,480 అన్నా, నేను... అన్నా... 304 00:27:06,560 --> 00:27:08,320 అన్నా, నేను కాదు! 305 00:27:08,400 --> 00:27:10,480 అన్నా, నేను కాదు! అన్నా! 306 00:27:25,000 --> 00:27:29,000 గుడ్డూ పండిత్ పూర్వాంచల్ ఏలుతాడా లేదా అన్నది ఇంకా నిర్ణయం కాలేదు. 307 00:27:30,120 --> 00:27:33,520 బాహుబలులు అందరూ సమర్థించాకే అది నిర్ణయమవుతుంది. 308 00:27:36,160 --> 00:27:38,320 ఆడదానివి కనుక నిన్ను వదిలేస్తున్నాను. 309 00:27:39,520 --> 00:27:41,520 కానీ మరోసారి ఇంత దయ చూపను. 310 00:28:04,520 --> 00:28:05,960 పోలీస్ స్టేషన్ మీర్జాపూర్ 311 00:28:09,520 --> 00:28:11,120 హేయ్, ఆపు... ఆపు! 312 00:28:34,960 --> 00:28:35,960 కనపడిందన్నా. 313 00:28:40,360 --> 00:28:41,360 ఆగు. 314 00:28:42,200 --> 00:28:43,880 -స్టార్ట్ అవటం లేదన్నా. -జరుగు. 315 00:28:44,640 --> 00:28:46,160 ఇది నాన్నది కదా. 316 00:28:56,440 --> 00:28:57,440 దీనెమ్మా. 317 00:29:31,320 --> 00:29:34,400 శ్రీ అఖండానంద్ త్రిపాఠీ 318 00:30:21,800 --> 00:30:24,760 నాన్నతో మాట్లాడి చూశాను, కానీ ఆయన వినలేదు. 319 00:30:33,840 --> 00:30:35,120 అమ్మా, నువ్వూ డింపీ 320 00:30:36,280 --> 00:30:38,200 నాతోనే ఉండాలని నేను నిర్ణయించాను. 321 00:30:40,040 --> 00:30:41,360 ఇక్కడ ఉండటం మంచిది కాదు. 322 00:30:47,200 --> 00:30:48,520 నీ మాట నిజమే, గుడ్డూ. 323 00:30:49,760 --> 00:30:51,560 కుటుంబం కలిసే ఉండాలి. 324 00:30:52,760 --> 00:30:53,760 ఒకే ఇంట్లో. 325 00:30:55,480 --> 00:30:56,800 కానీ నా ఇల్లు ఇదే. 326 00:30:58,560 --> 00:30:59,760 మీకు అర్థం కావడం లేదు. 327 00:31:01,600 --> 00:31:02,720 నాన్న ఇక్కడ లేరు. 328 00:31:03,280 --> 00:31:05,280 మీ బాధ్యత, డింపీ బాధ్యత ఇప్పుడు నావే. 329 00:31:06,920 --> 00:31:08,080 నేను ఎక్కడికీ రాను. 330 00:31:10,160 --> 00:31:13,400 ఎందుకంత మొండితనం? 331 00:31:13,480 --> 00:31:17,240 నేను మొండిగా లేకపోతే, ఈ కుటుంబంలో ఉండలేనుగా, గుడ్డూ. 332 00:31:21,000 --> 00:31:25,160 మొండి అమ్మా, ఇది ప్రమాదకరం. 333 00:31:25,240 --> 00:31:27,840 అర్థం చేసుకో. నాతో ఉంటే సురక్షితంగా ఉంటావు. 334 00:31:30,480 --> 00:31:33,360 నేను మీర్జాపూర్‌లోని అతి పెద్ద బాహుబలికి అమ్మను. 335 00:31:34,720 --> 00:31:36,960 ఈ ఊర్లో నాకన్నా సురక్షితంగా ఇంకెవరు ఉంటారు? 336 00:31:39,000 --> 00:31:40,520 నువ్వు బాహుబలివి కదా. 337 00:31:44,720 --> 00:31:46,760 చూడండి మేడమ్, గుడ్డూ ఓ ముఠా నాయకుడు. 338 00:31:47,720 --> 00:31:50,960 అతనికి ఎంతో మంది శత్రువులను తయారు చేయవచ్చు. 339 00:31:51,480 --> 00:31:55,880 మా అధికారుల్లో కొంత మంది ఇందులో నిపుణులు. వాళ్ళు చూసుకుంటారు. 340 00:31:56,800 --> 00:31:58,000 దీనికి ఎంత ఖర్చవుతుంది? 341 00:32:03,560 --> 00:32:04,960 ఏదైనా స్వేచ్ఛగా చేయండి. 342 00:32:09,640 --> 00:32:12,600 మా అత్తగారు, ఆమె కొడుకు సురక్షితంగా ఉండాలి, అంతే. 343 00:32:13,360 --> 00:32:15,160 గుడ్డూ వారిని నిర్బంధించాడు. 344 00:32:15,920 --> 00:32:19,080 -తప్పకుండా. -ఇక విషయం నా వరకూ రాకూడదు. 345 00:32:20,000 --> 00:32:21,000 అలాగే, మేడమ్. 346 00:32:25,320 --> 00:32:26,720 త్రిపాఠీ గారి కబురేంటి? 347 00:32:27,280 --> 00:32:29,000 ఏం కబురండి. 348 00:32:29,080 --> 00:32:31,520 అలాగే మేడమ్, ఇలాంటి నేరగాళ్ళు 349 00:32:31,600 --> 00:32:34,720 చాలా పెద్ద నేరం చేశాక తరచూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. 350 00:32:34,800 --> 00:32:35,960 అది వాళ్ళకి మామూలే. 351 00:32:40,400 --> 00:32:41,400 ఈ విషయం మరవకండి 352 00:32:43,120 --> 00:32:44,880 ఆయన ప్రభుత్వంలో మంత్రి కూడా. 353 00:32:47,120 --> 00:32:48,120 అలాగే, మేడమ్. 354 00:32:55,960 --> 00:32:58,720 ఆహా, కన్నయ్య, కన్నయ్య... 355 00:32:58,800 --> 00:33:01,040 బంగారం, ఏమైంది? 356 00:33:02,720 --> 00:33:05,720 నువ్వు నా బంగారానివి... 357 00:33:09,680 --> 00:33:11,680 కన్నా, నా కన్నా... 358 00:33:12,400 --> 00:33:14,280 సరే, బాబు. ఏం కాదులే. 359 00:33:14,760 --> 00:33:16,840 రాధియా, టీవీ పెట్టావంటే నిన్ను కొడతా. 360 00:33:17,800 --> 00:33:20,400 ఏంటి, వదినగారు. మీరూ మూఢవిశ్వాసులుగా ఉండకండి. 361 00:33:21,000 --> 00:33:22,800 బాబు రెండు క్షణాల్లో ఊరుకుంటాడు. 362 00:33:22,880 --> 00:33:26,960 తోడేలు బిడ్డను జింక పెంచినా లేదా తోడేలు పెంచినా, 363 00:33:27,040 --> 00:33:28,640 అది తోడేలుగానే ఉంటుంది. 364 00:33:29,360 --> 00:33:32,880 ఈ విషయం ఆ బిడ్డకూ తెలుసు. 365 00:33:34,400 --> 00:33:38,120 అడవిలో ఉండే గడ్డి, ఆకులు ఈ బిడ్డకు అనవసరం. 366 00:33:38,200 --> 00:33:40,720 దానికి మాంసం కావాలి. 367 00:33:40,800 --> 00:33:42,640 -అందుకే ఈ జాతి ప్రాణులు... -చూడండి. 368 00:33:42,720 --> 00:33:44,880 ...చిన్న సమూహాల్లో సంచరిస్తాయి... 369 00:33:44,960 --> 00:33:46,760 గోలు దీదీ వచ్చింది. 370 00:33:48,680 --> 00:33:51,560 తొలి రోజుల్లో, బిడ్డలు తల్లికి దగ్గరగా ఉంటాయి. 371 00:33:51,640 --> 00:33:54,080 గోలు దీదీ, నేను మీ కోసం బార్లీ గంజి చేశాను. 372 00:33:55,680 --> 00:33:56,880 తర్వాత తీసుకుంటాను. 373 00:33:59,640 --> 00:34:00,640 సరే. 374 00:34:11,120 --> 00:34:13,520 ఎప్పటి దాకా చీకట్లో బాణాలు వేస్తూ ఉంటాం? 375 00:34:15,040 --> 00:34:17,240 కొంత సమయం తీసుకుని మరో పథకం ఆలోచించు. 376 00:34:18,160 --> 00:34:19,960 కానీ మన దగ్గర సమయం లేదు, వదినా. 377 00:34:20,720 --> 00:34:21,720 ఎందుకు లేదు? 378 00:34:23,080 --> 00:34:24,400 వచ్చే వారం భేటీ జరగనుంది. 379 00:34:26,440 --> 00:34:27,520 ఎవరు ఏర్పాటు చేశారు? 380 00:34:28,200 --> 00:34:30,280 పశ్చిమ యూపీ నుండి మధ్యవర్తి వచ్చాడు. 381 00:34:30,360 --> 00:34:32,520 అబ్బాస్ అలీ మీర్ తన మనిషిని పంపాడు, 382 00:34:33,120 --> 00:34:34,920 పూర్వాంచల్ నాయకుడి ఎన్నిక కోసం. 383 00:34:37,880 --> 00:34:39,640 పశ్చిమం ఎందుకు జోక్యం చేసుకుంటోంది? 384 00:34:40,920 --> 00:34:42,000 అదే సాంప్రదాయం. 385 00:34:43,320 --> 00:34:47,920 ఇలాంటి పరిస్థితిలో, వారి నాయకుడిని ఎన్నుకోవడానికి జనాలు ఇక్కడి నుండి వెళతారు. 386 00:34:49,560 --> 00:34:50,640 మధ్యవర్తిలా. 387 00:34:52,680 --> 00:34:54,800 మా నానమ్మ వాళ్ళది ఆజమ్‌ఘడ్. 388 00:34:55,920 --> 00:34:57,160 సరే, సరేలే. 389 00:34:59,160 --> 00:35:00,440 నాకు ఇది తెలియదు. 390 00:35:01,000 --> 00:35:02,520 కాలీన్ భయ్యా శవం లేకుండా, 391 00:35:03,360 --> 00:35:05,600 గద్దెపై హక్కును కోరడం కష్టమవుతుంది. 392 00:35:06,800 --> 00:35:08,320 ఒకవేళ శవం దొరక్కపోతే? 393 00:35:10,640 --> 00:35:14,160 భేటీలో మన హక్కును బలపరచుకోవడానికి మనం మరో మార్గం కనుక్కోవాలి. 394 00:35:16,640 --> 00:35:19,080 కానీ నన్ను ప్రాణాలతో వదలటమనే కాలీన్ భయ్యా చేసిన 395 00:35:20,000 --> 00:35:21,120 తప్పును నేను చేయను. 396 00:35:22,560 --> 00:35:25,080 తన శవాన్ని చూడాలన్న కోరిక నాకు ఉన్నంత ఎవరికీ లేదు. 397 00:35:27,360 --> 00:35:29,480 కానీ అతను అదృశ్యమైన పరిస్థితులను చూస్తే, 398 00:35:30,600 --> 00:35:31,680 ఒక లోపలి మనిషే అతన్ని 399 00:35:34,120 --> 00:35:35,320 దాచిపెడుతూ ఉంటారు. 400 00:35:40,160 --> 00:35:42,840 గోలు, నువ్వు ఏకాగ్రతతో పగ తీర్చుకోవడం చూశాను. 401 00:35:44,360 --> 00:35:46,840 కానీ, నేను ఇంతకాలం ప్రాణాలతో ఉండేదాన్ని కాదు, 402 00:35:47,480 --> 00:35:49,160 ఒకే పథకానికి కట్టుబడి ఉంటే. 403 00:35:53,280 --> 00:35:54,920 త్వరగా బయటకు తీసుకెళ్ళండి. 404 00:36:02,520 --> 00:36:04,360 ఈ పశ్చిమం వారి హడావుడి ఏంటి? 405 00:36:05,400 --> 00:36:07,760 ఇది తూర్పుకు చెందిన విషయం. తూర్పు చూసుకుంటుంది. 406 00:36:09,680 --> 00:36:11,200 దిగులుపడకు, నేను చూసుకుంటాను. 407 00:36:12,640 --> 00:36:16,040 ఏ బాహుబలికి మీకు ఎదురు నిలిచేంత దమ్ము లేదని నాకు తెలుసు. 408 00:36:17,320 --> 00:36:19,160 కానీ అంతదాకా తెచ్చుకోవడం ఎందుకు? 409 00:36:21,760 --> 00:36:23,000 వదిన అన్నది నిజమే. 410 00:36:24,480 --> 00:36:27,360 మనం ఇతర జిల్లాల బాహుబలులతో సంప్రదించి 411 00:36:27,440 --> 00:36:29,400 మన పట్టును బలపరచుకుందాం. 412 00:36:29,480 --> 00:36:32,600 అవును, మొత్తం పూర్వాంచల్ మీ శక్తిని అనుభూతి చెందాలి. 413 00:36:32,640 --> 00:36:33,880 నేను ఎక్కడికీ వెళ్ళను. 414 00:36:36,800 --> 00:36:38,920 బాహుబలులకు అందరికీ సందేశం పంపండి, 415 00:36:39,640 --> 00:36:42,520 మీర్జాపూర్ వచ్చి, తమ విధేయతను నిరూపించుకోమనండి. 416 00:36:44,680 --> 00:36:47,120 రాకపోతే, వారిని శత్రువులుగా పరిగణిస్తాను. 417 00:36:53,080 --> 00:36:54,480 జౌన్‌పూర్ 418 00:36:54,560 --> 00:36:56,960 గుడ్డూ పండిత్ ఓ చదువుకున్న మూర్ఖుడు. 419 00:36:59,480 --> 00:37:01,160 భేటీకి రాకపోవడమే కాకుండా, 420 00:37:01,640 --> 00:37:04,280 మనందరూ విధేయత నిరూపించుకోవాలని కోరుకుంటున్నాడు. 421 00:37:07,160 --> 00:37:08,480 గుడ్డూ భోళా మనిషి. 422 00:37:08,960 --> 00:37:10,800 ఏది మనసుకు అనిపిస్తే అది వాగుతాడు. 423 00:37:12,560 --> 00:37:16,760 గద్దె తనదే అన్న భావన వల్ల అందరినీ బెదిరిస్తున్నాడు. చేయనివ్వండి. 424 00:37:18,080 --> 00:37:21,000 మీరు ఈ పరిస్థితిని మీ లాభం కోసం వాడుకోండి. 425 00:37:22,080 --> 00:37:23,080 వెంటనే బయలుదేరండి. 426 00:37:23,760 --> 00:37:27,000 భేటీకి ముందే మిగతా బాహుబలులను కలిసి 427 00:37:27,080 --> 00:37:28,480 వారిని మీ వైపు తిప్పుకోండి. 428 00:37:28,560 --> 00:37:29,840 సరే. 429 00:37:29,920 --> 00:37:33,800 జనాల్లో కాలీన్ భయ్యాపై సానుభూతి పెరగాలి, అంతే. 430 00:37:35,640 --> 00:37:38,440 ఇక గుడ్డూ ఏ చేష్టలు చేసుకుంటాడో చేసుకోనివ్వండి. 431 00:37:40,800 --> 00:37:42,200 -సరే, అలాగే. -అలాగే. 432 00:37:42,320 --> 00:37:43,400 -నమస్కారం. -నమస్కారం. 433 00:37:44,400 --> 00:37:45,400 నమస్కారం. 434 00:37:48,320 --> 00:37:49,520 మనం కలిసి వెళదాం. 435 00:37:56,200 --> 00:38:00,320 ఈ పావులపై నమ్మకంతో నీ హక్కును బలపరుచుకుంటున్నావా? 436 00:38:02,320 --> 00:38:05,360 ఇలాంటి స్థితిలో రాజు కూడా ఒక్కోసారి బరిలోకి దిగుతాడు... 437 00:38:07,400 --> 00:38:09,680 అతని ఉనికిని చాటుకోవడానికి. 438 00:38:14,040 --> 00:38:16,200 పశ్చిమానికి చెందిన మధ్యవర్తిని నేరుగా కలువు. 439 00:38:18,640 --> 00:38:21,800 జౌన్‌పూర్ 440 00:38:23,160 --> 00:38:25,400 పశ్చిమం 441 00:38:26,280 --> 00:38:28,960 మీరట్ 442 00:38:29,640 --> 00:38:34,200 మీరట్ 443 00:38:50,280 --> 00:38:53,080 సందర్శకులు ఎప్పుడూ అతిథులు కారు. 444 00:38:53,160 --> 00:38:55,480 కూర్చోండి. మున్నవర్ భయ్యా భోంచేస్తున్నారు. 445 00:38:55,560 --> 00:38:57,080 వాళ్ళు కస్టమర్లు కూడా కావచ్చు. 446 00:38:59,640 --> 00:39:01,600 ఇక కస్టమర్లు, అతిథులు... 447 00:39:06,280 --> 00:39:09,160 -బాగా చెప్పారు. -ధన్యవాదాలు. 448 00:39:11,480 --> 00:39:13,480 రండి. అన్న మిమ్మల్ని పిలుస్తున్నారు. 449 00:39:19,640 --> 00:39:21,920 రండి, రండి, శుక్లా గారు. కూర్చోండి. 450 00:39:22,520 --> 00:39:23,680 ధన్యవాదాలు. 451 00:39:23,800 --> 00:39:25,600 శుక్లా గారికి కూడా పళ్ళెం పెట్టండి. 452 00:39:26,360 --> 00:39:29,320 వద్దు, ధన్యవాదాలు. నేను భోంచేసి వచ్చాను. 453 00:39:29,400 --> 00:39:30,560 అయితే ఏంటి? 454 00:39:31,760 --> 00:39:33,960 మాతో పాటు ఓ ముద్ద తినండి. 455 00:39:34,640 --> 00:39:36,640 ఇవ్వు, శుక్లా గారికి కూడా వడ్డించు. 456 00:39:41,600 --> 00:39:45,160 శుక్లా గారు, నేను ఇప్పుడే వీళ్ళందరినీ అడిగాను, 457 00:39:46,680 --> 00:39:50,800 లజీజ్ గోస్త్ మాంసపు రుచి ఘనత ఎవరిదని. 458 00:39:52,320 --> 00:39:55,640 వంటకానిదా? లేదా వండిన వంటవాడిదా? 459 00:40:02,000 --> 00:40:03,400 ఎవ్వరిదీ కాదు. 460 00:40:05,560 --> 00:40:09,760 మాంసపు రుచి దాన్ని ఎంత కచ్చితంగా ఎంత సన్నగా కోశారన్నదానిపై 461 00:40:10,280 --> 00:40:11,920 ఆధారపడి ఉంటుంది. 462 00:40:15,160 --> 00:40:18,080 అందుకే, మాంసపు రుచి కసాయి కొట్టులో నిర్ణయించబడుతుంది. 463 00:40:23,120 --> 00:40:25,080 నేను మీ గురించి సరిగ్గానే విన్నాను. 464 00:40:26,680 --> 00:40:30,480 మీరు చాలా తెలివి కలవారు, ఓపిక కలవారు. 465 00:40:32,600 --> 00:40:36,000 కానీ ఎప్పుడూ ఓపికనే పట్టుకుని వేలాడుతూ ఉంటే, 466 00:40:37,160 --> 00:40:38,680 మీరు వెనుకబడిపోతారు. 467 00:40:39,320 --> 00:40:42,160 పూర్వాంచల్ గద్దెకు నాయకుడు అవసరం. 468 00:40:47,040 --> 00:40:48,320 ఆ నాయకుడు మీరేనా? 469 00:40:57,800 --> 00:40:59,440 నేరుగా పెట్టి అలాగే ఉండండి. 470 00:41:00,040 --> 00:41:01,920 బలం ఇంకా మెరుగైంది, గుడ్డూ భయ్యా. 471 00:41:02,000 --> 00:41:05,760 వంచండి. అంతే. ఇప్పుడు వదులు చేయండి. 472 00:41:09,480 --> 00:41:11,040 శరీరం బలహీనంగా ఉంది, డాక్టర్. 473 00:41:12,440 --> 00:41:15,200 -జిమ్ మొదలుపెట్టనా? -తప్పకుండా. బేషుగ్గా చేయండి. 474 00:41:21,520 --> 00:41:22,800 నమస్కారం, గుడ్డూ భయ్యా. 475 00:41:25,320 --> 00:41:27,160 నాకు చెబుతున్నది ఈయనకు చెప్పండి. 476 00:41:28,800 --> 00:41:30,640 శరద్ జోరుగా పావులు కదుపుతున్నాడు. 477 00:41:31,480 --> 00:41:34,120 అతని మనుషులు బాహుబలులు అందరినీ కలుస్తున్నారు. 478 00:41:34,160 --> 00:41:36,200 అందరినీ మీకు విరోధుల్ని చేస్తున్నాడు. 479 00:41:36,760 --> 00:41:37,920 దిగులుపడకండి. 480 00:41:38,880 --> 00:41:42,440 భేటీకి ఎవరు వెళ్ళినా సరే, అలహాబాద్‌‌లో మూల్యం చెల్లించాల్సిందే. 481 00:41:43,320 --> 00:41:45,680 విధేయత లేదంటే తూటా. 482 00:41:46,160 --> 00:41:49,160 ఇది హింసకు సమయం కాదు, కానీ ఏకీకరణకు సమయం. 483 00:41:51,960 --> 00:41:53,600 హింసే నా ప్రత్యేకత. 484 00:41:59,360 --> 00:42:01,040 హింస సరైన సందేశం అందిస్తుంది. 485 00:42:01,600 --> 00:42:04,600 కాలీన్ భయ్యాపై దాడి చేయడంకన్నా పెద్ద సందేశం ఏముంటుంది? 486 00:42:06,680 --> 00:42:08,560 ఫలితాలు ఇంకా మనకు అనుకూలంగా లేవు. 487 00:42:14,960 --> 00:42:17,080 గద్దెను సవాలు చేయట్లేదు, పోటీపడుతున్నాం. 488 00:42:22,160 --> 00:42:24,600 పశ్చిమం వారి జోక్యం వల్ల మీకు సమస్యగా ఉంది. 489 00:42:25,080 --> 00:42:26,800 కానీ వారిది పూర్తిగా తప్పేం కాదు. 490 00:42:27,280 --> 00:42:29,280 ఒకే రాష్ట్రం, ఒకే పోలీసు శాఖ, ఒకే చట్టం. 491 00:42:30,000 --> 00:42:31,360 రెండూ ముడిపడి ఉన్నాయి. 492 00:42:31,920 --> 00:42:33,560 స్థిరత్వం ఉండాలని చూస్తున్నారు. 493 00:42:35,040 --> 00:42:38,680 మనం కొత్తవాళ్ళం. సాంప్రదాయంతో ఆటలాడటం వివేకమైన పని కాదు. 494 00:42:39,440 --> 00:42:41,600 మనం హాజరు కాకపోతే తప్పుడు సందేశం వెళుతుంది. 495 00:42:44,440 --> 00:42:46,920 ఎవరు ఏవైపు ఉన్నారో మనకు తెలిసిపోతుంది. 496 00:42:49,200 --> 00:42:50,200 మనం వెళ్ళాలి. 497 00:42:51,640 --> 00:42:52,760 కానీ... 498 00:42:53,920 --> 00:42:58,560 ఒక గద్దె నుండి ఒక పోటీదారుడినే అనుమతిస్తారు. కనుక... 499 00:43:01,600 --> 00:43:02,600 అయితే... 500 00:43:10,920 --> 00:43:12,160 నేను బయట వేచి ఉంటాను. 501 00:43:14,200 --> 00:43:15,640 నా కాలు ఇప్పుడు బాగుంది. 502 00:43:16,520 --> 00:43:17,640 నేను వెళ్ళను. 503 00:43:56,880 --> 00:44:00,200 గోలు, ఈ చర్చలు, భేటీలు నాకు సరిపడే విషయాలు కావు. 504 00:44:00,760 --> 00:44:03,160 నన్ను అక్కడికి పంపకు, విషయం గందరగోళం అవుతుంది. 505 00:44:04,000 --> 00:44:06,640 మీ బలహీనత మిమ్మల్ని నియంత్రించేలా చేస్తున్నారు. 506 00:44:13,120 --> 00:44:16,600 మిమ్మల్ని ఎదిరించే దమ్ము శరద్‌కు కాకుండా ఇంకెవరికీ లేదు. 507 00:44:16,680 --> 00:44:21,680 మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తాడు. మీరు నియంత్రణలో ఉండాలి. 508 00:44:21,760 --> 00:44:23,280 అది నాకు తెలియని విషయం. 509 00:44:25,920 --> 00:44:30,120 మనం ఇక్కడి దాకా పయనించిన మార్గానికి, అంతిమ లక్ష్యం మీర్జాపూర్ గద్దె. 510 00:44:31,480 --> 00:44:34,000 ఇప్పుడు ఆట మారింది, ప్రరిణమాలు భారీగా ఉన్నాయి. 511 00:44:37,120 --> 00:44:40,520 దాన్ని గెలవాలంటే, మీకు రెండూ కావాలి, 512 00:44:40,600 --> 00:44:41,880 కండబలం, బుద్ధిబలం. 513 00:44:44,200 --> 00:44:45,920 నువ్వే నా బుద్ధిబలానివి. 514 00:44:51,120 --> 00:44:52,880 దాన్ని మీరు వాడటం లేదు. 515 00:44:58,640 --> 00:44:59,760 వదులు. 516 00:45:01,800 --> 00:45:03,400 వదులు, గోలు. 517 00:45:04,480 --> 00:45:05,480 వదులు. 518 00:45:26,280 --> 00:45:29,560 మహరాజ్‌గంజ్ - కుషీనగర్ - గోరఖ్‌పూర్ 519 00:45:29,640 --> 00:45:32,400 దియోరా - బస్తీ - బలియా - మౌ - ఆజమ్‌ఘడ్ 520 00:45:32,480 --> 00:45:36,840 ఘాజీపూర్ - జౌన్‌పూర్ 521 00:45:36,920 --> 00:45:40,680 వారణాసి - మీర్జాపూర్ - ప్రయాగ్‌రాజ్ 522 00:45:40,760 --> 00:45:44,440 ప్రయాగ్‌రాజ్ 523 00:45:59,440 --> 00:46:01,480 -నమస్కారం. -నమస్కారం. 524 00:46:01,560 --> 00:46:03,360 -కూర్చోనా? -దయచేసి. 525 00:46:06,520 --> 00:46:07,520 రండి. 526 00:46:18,360 --> 00:46:19,360 నమస్కారం. 527 00:46:41,520 --> 00:46:43,880 -అంతా వచ్చారా? -మీర్జాపూర్ కోసం చూస్తున్నాం. 528 00:46:44,840 --> 00:46:46,960 -ఏదైనా ధృవీకరణ వచ్చిందా? -లేదు. 529 00:46:53,880 --> 00:46:54,880 అయితే మొదలుపెడదాం. 530 00:46:59,520 --> 00:47:01,040 మీ అందరికీ తెలుసుగా, 531 00:47:02,200 --> 00:47:03,560 మున్నవర్ నియాజీ అనే నేను, 532 00:47:04,400 --> 00:47:05,960 సాంప్రదాయాన్ని అనుసరించి, 533 00:47:06,680 --> 00:47:10,560 పశ్చిమ ప్రాంత నాయకుడైన మిర్జా అబ్బాస్ అలీ మీర్ తరపున 534 00:47:11,560 --> 00:47:15,440 మీ అందరి మధ్యా ఒప్పందం కుదర్చడానికి మధ్యవర్తిగా వచ్చాను. 535 00:47:15,520 --> 00:47:16,640 ప్రశ్న ఏంటంటే, 536 00:47:17,200 --> 00:47:21,200 ఇవాళ పూర్వాంచల్ ఉన్న పరిస్థితిలో దానికి నాయకుడు ఎవరు? 537 00:47:21,280 --> 00:47:22,880 అంటే సాంప్రదాయం ప్రకారం, 538 00:47:23,720 --> 00:47:26,280 మీర్జాపూర్ నాయకుడే పూర్వాంచల్ నాయకుడు. 539 00:47:27,800 --> 00:47:29,360 మున్నాను చంపాక, 540 00:47:29,840 --> 00:47:32,160 గుడ్డూ పండిత్ బలమైన పోటీదారుడిగా నిలబడ్డాడు. 541 00:47:32,240 --> 00:47:34,400 కానీ గద్దెపై కాలీన్ భయ్యా ఉన్నాడుగా, 542 00:47:35,120 --> 00:47:36,120 మున్నా కాదు. 543 00:47:36,200 --> 00:47:37,800 -అది నిజమే. -కచ్చితంగా. 544 00:47:41,040 --> 00:47:44,560 ఒక బాహుబలి ప్రతిష్ట అతని సంస్కృతి, వినయంతో ముడిపడి ఉంటుంది. 545 00:47:46,560 --> 00:47:50,280 ఈ భేటీ అనే సాంప్రదాయాన్ని కూడా గౌరవించలేని వ్యక్తి, గద్దెపై కూర్చోవడానికో 546 00:47:51,120 --> 00:47:53,800 లేదా అందుకు పోటీదారుడిగానో పనికి రాడు. 547 00:47:54,280 --> 00:47:57,400 ఎవరికైతే బుద్ధి బలం, కండబలం మధ్యన సంతులనం ఉంటుందో 548 00:47:58,200 --> 00:48:00,360 వారికే గద్దె దొరుకుతుంది. 549 00:48:01,880 --> 00:48:03,240 నీ అభిప్రాయం ఏంటి? 550 00:48:05,360 --> 00:48:07,120 జౌన్‌పూర్‌కు నాయకత్వం ఇవ్వండి. 551 00:48:22,720 --> 00:48:26,440 మొత్తం పూర్వాంచల్ ఊగిపోతోంది, 552 00:48:27,920 --> 00:48:32,680 శరద్ శుక్లా, శరద్ శుక్లా అంటున్నారు. 553 00:48:37,960 --> 00:48:39,640 జౌన్‌పూర్ భిక్షగా దొరికింది. 554 00:48:41,680 --> 00:48:43,480 గద్దె కూడా భిక్షగా కావాలంటున్నాడు. 555 00:48:47,160 --> 00:48:49,920 అయితే, గద్దెకు సంబంధించిన చర్చ ముగిసినట్టే. 556 00:48:51,000 --> 00:48:54,720 గద్దె ఇదిగో, దానిపై గుడ్డూ పండిత్ ఉన్నాడు. 557 00:48:59,480 --> 00:49:01,440 బస్తీ ఓటు నీకే, శరద్. 558 00:49:02,440 --> 00:49:03,760 శుభాకాంక్షలు. 559 00:49:03,840 --> 00:49:05,520 -అది మంచి మాట. -కచ్చితంగా. 560 00:49:05,600 --> 00:49:07,360 -మేము మీతో ఉన్నాం. -ఒప్పుకుంటాను. 561 00:49:08,600 --> 00:49:09,600 చూడు, 562 00:49:10,680 --> 00:49:12,640 మరీ అతి తెలివి చూపించకు. 563 00:49:13,640 --> 00:49:15,120 వీడికి ఇంకా అవమానం జరగనుంది. 564 00:49:18,480 --> 00:49:19,480 మున్నవర్ గారు, 565 00:49:21,360 --> 00:49:23,880 నేను పోటీదారుడిని కాదు, పూర్వాంచల్‌‌ నా హక్కు. 566 00:49:23,960 --> 00:49:26,240 యజమానిపై హక్కు ఉందని కుక్క కూడా అనుకుంటుంది. 567 00:49:27,080 --> 00:49:28,840 నువ్వు కాలీన్ భయ్యాకు అదే కదా. 568 00:49:33,320 --> 00:49:36,560 సింహం ఎంత శాంతంగా ఉన్నా, అడవికి రాజు అదే అవుతుంది. 569 00:49:37,920 --> 00:49:42,520 కుక్కకు ఎంత విధేయత ఉన్నా సరే, దానికి పిచ్చెక్కితే పాతి పెడతారు. 570 00:49:44,280 --> 00:49:45,760 మీరు భలే ఉన్నారే. 571 00:49:47,520 --> 00:49:50,560 తండ్రి ఉపాధ్యాయుడు. క ఖ గలు నేర్పించేవారు. 572 00:49:52,360 --> 00:49:54,520 కొడుకేమో పూర్వాంచల్ జూ అనుకుంటున్నాడు. 573 00:49:56,000 --> 00:49:57,880 సన్న పిన్ చార్జర్ మీ దగ్గరుందా? 574 00:49:59,720 --> 00:50:00,720 ఇతనికి తగిలించండి. 575 00:50:02,800 --> 00:50:07,360 బలియాలో కుక్కలా దెబ్బలు తిన్నది ఎవరు? గుర్తు చేయనా? 576 00:50:09,280 --> 00:50:12,520 అయితే, బలియాలో బలవంతుడని నిరూపించుకున్నాక కూడా, 577 00:50:12,600 --> 00:50:15,680 నా ముందు పోటీదారుడని అర్జీ పెట్టుకోవడానికి వచ్చావా? 578 00:50:21,320 --> 00:50:24,160 నేను ముందు నుండి దాడి చేస్తా, వెనుక నుండి కాదు. 579 00:50:24,240 --> 00:50:25,240 అలాగా. 580 00:50:26,000 --> 00:50:28,880 త్రిపాఠీల పేర్లు, పుట్టగతులు లేకుండా వాళ్ళని 581 00:50:29,440 --> 00:50:31,360 మీర్జాపూర్ చరిత్ర నుండి చెరిపేశాను. 582 00:50:35,160 --> 00:50:36,920 కాలీన్ భయ్యా శవం దొరికిందా? 583 00:50:37,000 --> 00:50:38,760 -ఇంకా లేదు. -లేదు. 584 00:50:38,840 --> 00:50:40,080 -లేదు కదా? -లేదు. 585 00:50:44,320 --> 00:50:45,320 అలాగా? 586 00:50:46,360 --> 00:50:49,960 ఇవాళ ఇక్కడ బాహుబలుల భేటీ జరుగుతుందని విన్నాను. 587 00:50:52,640 --> 00:50:55,200 కానీ మీరు శ్మశానానికి కాపలా కాస్తున్నట్టు ఉంది. 588 00:50:59,600 --> 00:51:01,000 శవాలను ఎంచుతున్నామా ఏంటి? 589 00:51:01,080 --> 00:51:03,080 శవాలను ఎంచడం ముఖ్యమే, పండిత్. 590 00:51:04,520 --> 00:51:06,720 ఇతరులవి కాదు, మనవాళ్ళవి. 591 00:51:09,000 --> 00:51:11,680 ఈ గుండాయిజం వల్లే ముగ్గురు ఆప్తులను పోగొట్టుకున్నాడు. 592 00:51:13,040 --> 00:51:15,520 అది గుర్తుందా లేదా నీకు చార్జర్ తగిలించనా? 593 00:51:18,760 --> 00:51:21,240 వారిలో ఒకరు పాపం ఈ భూమిపై కూడా పడలేదు. 594 00:51:24,440 --> 00:51:26,360 గుడ్డూ, వదిలేయ్! 595 00:51:26,440 --> 00:51:27,440 శరద్! 596 00:51:29,960 --> 00:51:31,640 వద్దు, శరద్! 597 00:51:31,720 --> 00:51:33,200 -హేయ్, వద్దు, వద్దు! -ఆపండి. 598 00:51:35,120 --> 00:51:37,000 -శాంతించండి. -గుడ్డూ... 599 00:51:38,960 --> 00:51:39,960 సరే సరే. 600 00:51:40,760 --> 00:51:44,480 నేరరహిత రాష్ట్రం, మీ ఇద్దరి దయవల్లే సాధ్యమైంది. 601 00:51:46,120 --> 00:51:48,280 ఈ సమావేశపు మనోస్థితి బట్టి తెలిసేది ఏంటంటే, 602 00:51:49,400 --> 00:51:51,400 గద్దెకు కేవలం ఇద్దరే పోటీదారులు, 603 00:51:51,480 --> 00:51:54,960 గుడ్డూ పండిత్, శరద్ శుక్లా. 604 00:51:55,920 --> 00:51:59,840 మీ ఇద్దరికీ దసరా వరకూ సమయముంది. 605 00:52:01,080 --> 00:52:02,320 మీరు నిరూపించుకోండి, 606 00:52:04,160 --> 00:52:07,080 పూర్వాంచల్‌పై మీకున్న పట్టును బలపరుచుకోండి. 607 00:52:08,160 --> 00:52:09,760 గద్దె మీర్జాపూర్‌ది. 608 00:52:14,560 --> 00:52:17,080 హకీమ్ సాబ్ ప్రత్యేకంగా ఆదేశించారు, 609 00:52:18,240 --> 00:52:21,400 దసరా వరకూ ఎలాంటి రక్తపాతం జరగకూడదని. 610 00:52:21,920 --> 00:52:24,360 అలా జరగకపోతే, మా సహకారం, 611 00:52:25,520 --> 00:52:27,800 జోక్యంగా మారుతుంది. 612 00:52:33,000 --> 00:52:35,080 ఈ భేటీ దసరా వరకూ వాయిదా వేయబడింది. 613 00:52:52,240 --> 00:52:55,040 మడమలపై నిలబడినంత మాత్రాన ఎత్తు పెరగదు, శరద్. 614 00:53:00,920 --> 00:53:05,040 మరీ ఎత్తు ఉన్నా కూడా, నడిచేటప్పుడు తల దించి నడవాలి, పండిత్. 615 00:53:06,640 --> 00:53:09,160 చూస్తూనే ఉండు, త్వరలోనే పూర్వాంచల్ ఊగుతుంది, 616 00:53:10,240 --> 00:53:12,480 శరద్ శుక్లా, శరద్ శుక్లా అంటారు. 617 00:53:15,400 --> 00:53:17,280 ఎవడి అండ చూసుకుని ఇంత ఎగురుతున్నావు? 618 00:53:33,640 --> 00:53:34,920 కాలీన్ భయ్యా. 619 00:53:43,200 --> 00:53:45,400 కానీ మనం వాడి ప్రాంతాలన్నిటిని గాలించామే. 620 00:53:45,880 --> 00:53:49,120 గుంటనక్కకు దాక్కునే ప్రదేశాలు ఎక్కువే తెలుసు. 621 00:54:05,400 --> 00:54:08,720 సివాన్ 19 కి. మీ. 622 00:54:08,800 --> 00:54:13,400 సివాన్ 623 00:54:18,920 --> 00:54:19,920 నమస్తే, అన్నా. 624 00:54:51,280 --> 00:54:53,160 విషపూరిత తాకిడి జరిగే రిస్క్ ఉంది. 625 00:54:53,760 --> 00:54:55,320 మనం కోమాలోకి తీసుకెళ్ళాలి. 626 00:54:56,240 --> 00:54:59,560 రిస్క్ తీసుకోండి, ప్రాణాలు నిలబెట్టండి. 627 00:55:02,160 --> 00:55:03,840 కోమాలో ఉంటే దేనికీ పనికిరాడు. 628 00:55:15,720 --> 00:55:18,400 మీర్జాపూర్ 629 00:57:11,320 --> 00:57:13,320 ఉపశీర్షికలు అనువదించినది Pradeep Kumar Maheshwarla 630 00:57:13,400 --> 00:57:15,400 క్రియేటివ్ సూపర్వైసర్ నిశా౦తి ఈవని