1
00:00:16,640 --> 00:00:17,680
బూతులు మాట్లాడరాదు
2
00:00:17,760 --> 00:00:20,280
రండి. ముందుకు రండి.
మీ సంచిలో ఏముందో చూపించండి.
3
00:00:23,920 --> 00:00:24,920
ఇదిగో తీసుకోండి.
4
00:00:26,560 --> 00:00:29,160
అది మీ కోసమే అయ్యుంటుంది, గ్యానేష్ గారు.
5
00:00:40,400 --> 00:00:42,080
గుడ్డూ భయ్యా వచ్చాడనుకున్నారా?
6
00:00:43,560 --> 00:00:45,800
మీ అబ్బాయి వచ్చాడని అన్నారు.
7
00:00:46,800 --> 00:00:47,960
నేనూ మీ అబ్బాయినే.
8
00:00:51,200 --> 00:00:53,920
నేను మీ కోసం కొన్ని పుస్తకాలు తెచ్చాను.
9
00:00:54,000 --> 00:00:56,440
మీకు చదవటమంటే ఇష్టమని డింపీ అంటూ ఉంటుంది.
10
00:00:56,880 --> 00:00:58,080
నువ్వు వినవు కదా?
11
00:00:58,160 --> 00:00:59,480
మీరూ ఏం వింటున్నారని.
12
00:01:03,800 --> 00:01:05,000
ఇంట్లో అంతా ఎలా ఉన్నారు?
13
00:01:07,440 --> 00:01:09,000
పైకప్పు లేని ఇల్లు ఎలా ఉంటుంది?
14
00:01:15,120 --> 00:01:17,680
నాన్న గారు, మీరు... అంకుల్ గారు,
15
00:01:18,680 --> 00:01:21,720
మీరు మా మాట వినండి.
దయచేసి మీరు మీ కేసు పోరాడండి.
16
00:01:22,720 --> 00:01:25,360
ప్రభుత్వ న్యాయవాది
చేస్తున్న మోసం చూస్తున్నారుగా.
17
00:01:28,440 --> 00:01:29,680
మన దగ్గర సాక్ష్యం ఉంది.
18
00:01:30,800 --> 00:01:34,240
నేను మీకోసం కోర్టులో నిలబడతాను.
సాక్ష్యం ఇస్తాను, మాటిస్తున్నా.
19
00:01:39,560 --> 00:01:40,720
నువ్వు నిలబడాలనుకుంటే,
20
00:01:41,800 --> 00:01:44,080
డింపీ, వసుధలకు అండగా నిలబడు.
21
00:01:44,920 --> 00:01:47,320
-ఏంటి?
-కుటుంబాన్ని చూసుకో.
22
00:01:49,600 --> 00:01:53,040
నువ్వు వాళ్ళని
బాగా చూసుకుంటావని నాకు తెలుసు.
23
00:01:55,000 --> 00:01:56,480
నాకు మరో వినతి ఉంది.
24
00:01:57,240 --> 00:02:02,000
ఈ కేసును గుడ్డూతో లేదా
సాక్ష్యంతో ముడిపెట్టాలని నాకు లేదు.
25
00:02:03,880 --> 00:02:04,880
అంకుల్ గారు, మీరు...
26
00:02:06,840 --> 00:02:09,120
మీరు నన్ను ధర్మసంకటంలో పడేశారు.
27
00:02:11,880 --> 00:02:14,600
నేను ప్రపంచాన్నే మోసం చేస్తాను,
మీరు నన్నే మోసం చేశారు.
28
00:02:17,320 --> 00:02:18,480
ఇదీ బానే ఉంది.
29
00:02:21,120 --> 00:02:24,440
కలుస్తాను. జాగ్రత్తగా ఉండండి.
30
00:02:25,760 --> 00:02:26,760
నమస్కారం.
31
00:02:35,080 --> 00:02:36,760
నా వద్ద రెండే దారులున్నాయి.
32
00:02:37,880 --> 00:02:39,160
గుడ్డూను చంపడం లేదా
33
00:02:40,600 --> 00:02:41,600
మిమ్మల్ని కాపాడటం.
34
00:02:43,440 --> 00:02:44,560
ఆ.
35
00:02:49,760 --> 00:02:50,800
మున్నా?
36
00:03:42,680 --> 00:03:43,760
నన్నె౦దుకు కాపాడావు?
37
00:03:45,920 --> 00:03:48,640
నేను నా తండ్రిని ఒకసారి కోల్పోయాను.
38
00:03:50,200 --> 00:03:52,080
మరోసారి అలా జరగనివ్వాలని అనుకోలేదు.
39
00:04:05,760 --> 00:04:07,400
మీ కుటుంబం, మీర్జాపూర్,
40
00:04:08,640 --> 00:04:10,000
ఈ రెండింటికీ మీ అవసరం ఉంది.
41
00:04:13,880 --> 00:04:15,480
మీర్జాపూర్‌లో త్రిపాఠీల వైభవం...
42
00:04:16,560 --> 00:04:19,800
ముగిసింది.
43
00:04:20,360 --> 00:04:21,680
అంతా ముగిసింది.
44
00:04:28,360 --> 00:04:31,080
అన్నీ ముగిసినప్పుడు,
ఒకే ఒక దారి మిగిలి ఉంటుంది.
45
00:04:32,880 --> 00:04:33,880
పునరుత్థానం.
46
00:04:37,080 --> 00:04:39,520
గుడ్డూను మీ ముఠాలో చేర్చుకున్నది మీరే.
47
00:04:41,800 --> 00:04:45,160
మున్నా అతన్ని ద్వేషిస్తాడని తెలిసినా
అతనికి స్వేచ్ఛనిచ్చారు.
48
00:04:47,120 --> 00:04:49,040
ఆ గూండాను రాక్షసుడిగా మార్చింది మీరే.
49
00:04:50,640 --> 00:04:53,880
అందుకు ప్రతిగా,
అతను మీ కొడుకును, మా నాన్నను చంపాడు.
50
00:04:59,200 --> 00:05:00,240
మీరు తప్పు చేశారు.
51
00:05:10,360 --> 00:05:12,040
కానీ రేపటి తరాలు గుడ్డూ పతనాన్ని,
52
00:05:13,360 --> 00:05:16,760
త్రిపాఠీల వారసత్వాన్ని
ఎలా గుర్తుపెట్టుకుంటారు అన్నది
53
00:05:18,080 --> 00:05:19,600
మీ మీద ఆధారపడి ఉంది,
54
00:05:22,240 --> 00:05:23,440
కాలీన్ భయ్యా.
55
00:05:40,920 --> 00:05:43,120
మీర్జాపూర్
56
00:06:22,440 --> 00:06:24,440
పూర్వాంచల్
57
00:06:39,040 --> 00:06:41,720
శుక్లా భవనం
58
00:06:46,840 --> 00:06:52,640
రేపో మాపో, కాలీన్ భయ్యా బతికే ఉన్నాడని
పూర్వాంచల్‌కు తెలియాలి.
59
00:06:54,600 --> 00:06:56,400
అదీ నీవల్ల బతికున్నాడని తెలియాలి.
60
00:07:05,120 --> 00:07:06,920
అతని గాయాలు ఇంకా మానలేదు.
61
00:07:09,040 --> 00:07:12,480
శరద్, నువ్వు మున్నా స్థానాన్ని తీసుకుంటేనే
అతని గాయాలు మానుతాయి.
62
00:07:26,080 --> 00:07:28,640
మీరు, మున్నా భయ్యా ఒకే కళాశాల కదా?
63
00:07:32,440 --> 00:07:34,200
నేను కూడా టెన్త్ పాసయ్యాను.
64
00:07:35,720 --> 00:07:38,360
ఇంటర్ చదవుతోంటే
ఇంట్లో వాళ్ళు ఇక్కడికి పంపారు.
65
00:07:39,800 --> 00:07:41,720
నాకు కవితలు చదవటమంటే ఇష్టం.
66
00:07:43,760 --> 00:07:45,000
గతంలో బాగా చదివేదాన్ని.
67
00:07:45,640 --> 00:07:48,120
స్కూలు పోటీలలో పాల్గొనేదాన్ని కూడా.
68
00:07:52,760 --> 00:07:53,760
ఇది చదివి చూడు.
69
00:08:03,240 --> 00:08:04,240
హలో?
70
00:08:06,520 --> 00:08:07,520
ఎవరు?
71
00:08:08,160 --> 00:08:09,920
హలో. ఆ, గోలు.
72
00:08:11,720 --> 00:08:13,240
భరత్ త్యాగీ మాట్లాడుతున్నాను.
73
00:08:29,320 --> 00:08:30,400
జరిగినది,
74
00:08:31,960 --> 00:08:34,040
మీ కుటుంబపు అంతర్గత విషయం.
75
00:08:37,600 --> 00:08:38,880
నిన్ను కలవడానికి ముందు,
76
00:08:40,680 --> 00:08:42,920
చిన్నోడు ఎప్పుడూ
గొంతు ఎత్తి మాట్లాడలేదు.
77
00:08:47,960 --> 00:08:50,640
చిన్నోడు నాతో ప్రేమలో పడ్డాడు.
అందులో నా తప్పు లేదు.
78
00:08:52,640 --> 00:08:56,760
చిన్నోడికి ప్రేమకు, అవసరానికి మధ్య
వ్యత్యాసం తెలియదు.
79
00:08:56,840 --> 00:09:00,160
కానీ మీకు తెలుసు.
మరైతే అతన్ని ఎందుకు శిక్షించారు?
80
00:09:02,880 --> 00:09:04,080
నీకూ శిక్ష పడుతుంది.
81
00:09:05,880 --> 00:09:07,640
మీర్జాపూర్‌కు దారి తెలుసు కదా.
82
00:09:08,880 --> 00:09:12,880
రండి.
కానీ తిరిగి వెళతారనే గ్యారంటీ ఇవ్వలేను.
83
00:09:23,240 --> 00:09:25,080
భూమైనా, ఆకాశమైనా...
84
00:09:25,160 --> 00:09:27,080
గుడ్డూ భయ్యా అద్భుతం!
85
00:09:27,160 --> 00:09:29,040
భూమైనా, ఆకాశమైనా...
86
00:09:29,120 --> 00:09:31,080
గుడ్డూ భయ్యా అద్భుతం!
87
00:09:31,640 --> 00:09:32,760
టోకెన్ సంఖ్య 11!
88
00:09:40,960 --> 00:09:42,320
నమస్కారం, గుడ్డూ భయ్యా.
89
00:09:42,760 --> 00:09:47,040
చాలా నెలల నుండి, పోలీసులు
మరీ ఎక్కువ డబ్బులు గుంజుతున్నారు.
90
00:09:47,120 --> 00:09:48,120
అలాగా.
91
00:09:48,200 --> 00:09:49,760
మీ సాయం కోసం వచ్చాము.
92
00:09:49,840 --> 00:09:51,840
-ఇలా రా!
-ఇది తీసుకో.
93
00:09:51,880 --> 00:09:54,080
-ఆగు!
-ఇది సమస్య తీరుస్తుందా?
94
00:09:54,160 --> 00:09:56,520
-రా. పద.
-నేను ఏం తప్పు చేశానో చెప్పండి.
95
00:09:56,600 --> 00:09:58,840
-ఏమీ చేయలేదు.
-అది నీకు భయ్యా చెబుతాడు.
96
00:09:59,120 --> 00:10:00,600
బలవంతాన ఎందుకు తెస్తున్నారు?
97
00:10:00,640 --> 00:10:03,240
అరె. ఎందుకు అతన్ని తోస్తున్నారు?
98
00:10:06,200 --> 00:10:08,120
ఏం తప్పు చేశాను?
ఎందుకు తీసుకొచ్చారు?
99
00:10:08,200 --> 00:10:10,360
నువ్వే చెప్తావు. ఇలా రా.
100
00:10:12,760 --> 00:10:14,400
ఇలా రా. దగ్గరికి రా.
101
00:10:14,480 --> 00:10:16,240
చెంపదెబ్బ కొట్టేలోపే రా.
102
00:10:16,880 --> 00:10:18,240
పిలిచా కదా?
103
00:10:18,320 --> 00:10:19,520
చూడు, రోమియో...
104
00:10:23,200 --> 00:10:25,120
రెండు పడవలపై ప్రయాణం అంటే,
105
00:10:26,080 --> 00:10:28,000
గుద్ద చీలి చావడమే.
106
00:10:29,080 --> 00:10:31,200
ఇక్కడ చూడు. అర్థమైందా?
107
00:10:32,400 --> 00:10:33,400
అర్థం కాలేదు.
108
00:10:41,840 --> 00:10:44,120
ఇప్పుడు చెప్పు ఏం తప్పు చేశావో.
109
00:10:44,200 --> 00:10:47,600
భయ్యా గారు, నేను ఏ తప్పూ చేయలేదు.
భయ్యా, భయ్యా...
110
00:10:47,640 --> 00:10:50,120
నత్తి ఆపు. బిగ్గరగా మాట్లాడు.
111
00:10:50,200 --> 00:10:52,720
-బిగ్గరగా!
-భయ్యా గారు, పెళ్ళి మాట ఇచ్చాను.
112
00:10:52,760 --> 00:10:54,360
అద్దీ. పేరేంటి? రమేష్?
113
00:10:54,440 --> 00:10:55,440
అవును.
114
00:10:57,240 --> 00:10:58,720
కానీ రాహుల్ అని చెప్పావు.
115
00:11:00,240 --> 00:11:02,600
మాట కాదు,
చెవిలో పువ్వు పెట్టావు రా నా కొడకా.
116
00:11:02,680 --> 00:11:04,000
నేను తప్పు చేశాను.
117
00:11:04,080 --> 00:11:06,440
భయ్యా గారు, పూజారి గారు ఇక్కడే ఉన్నారు.
118
00:11:07,640 --> 00:11:09,400
మంచిది. తీసుకెళ్ళండి.
119
00:11:11,960 --> 00:11:15,480
భయ్యా గారు, ఇలా చేయకండి.
నాకు మరో చోట పెళ్ళి కుదిరింది.
120
00:11:15,560 --> 00:11:17,920
-నా బతుకు పాడవుతుంది.
-ఏంటి? కాస్త ఆగండి.
121
00:11:19,480 --> 00:11:20,480
నాకు పెళ్ళి...
122
00:11:23,840 --> 00:11:25,800
-బాబూ రమేష్.
-ఆ?
123
00:11:25,880 --> 00:11:28,680
నువ్వు తికమకపడుతున్నావు.
124
00:11:30,400 --> 00:11:33,560
నువ్వు ఇక్కడ చూస్తున్న పూజారి గారు,
మా కుటుంబ వైద్యుడు.
125
00:11:34,640 --> 00:11:36,480
నీకు పెళ్ళి చేయడం లేదు.
126
00:11:36,560 --> 00:11:38,320
నీ బుడ్డ కత్తిరిస్తాం.
127
00:11:38,400 --> 00:11:39,960
-భయ్యా గారు...
-అర్థమైందా?
128
00:11:40,040 --> 00:11:41,640
భయ్యా గారు, అలా చేయకండి.
129
00:11:41,720 --> 00:11:43,480
భయ్యా, నా బతుకు నాశనమైపోతుంది.
130
00:11:43,560 --> 00:11:45,800
-వదులు.
-భయ్యా గారు, అలా చేయకండి.
131
00:11:45,880 --> 00:11:47,680
-నాశనమైపోతాను.
-పోరా, నా కొడకా.
132
00:11:47,760 --> 00:11:49,120
నేను నాశనమైపోతాను!
133
00:11:49,600 --> 00:11:51,360
భూమైనా, ఆకాశమైనా...
134
00:11:51,440 --> 00:11:53,600
గుడ్డూ భయ్యా అద్భుతం!
135
00:11:56,200 --> 00:11:58,400
-గోలు అక్క వేచి చూస్తున్నారు.
-అలాగా.
136
00:12:08,240 --> 00:12:11,000
నాణ్యత బాగానే ఉంది,
కానీ ధర ఎక్కువగా ఉంది.
137
00:12:11,800 --> 00:12:15,000
కానీ రిస్కు కూడా ఎక్కువ ఉంది.
నాలుగు సరిహద్దులు దాటాలి.
138
00:12:15,480 --> 00:12:16,720
అది ఏరకంగా మా సమస్య?
139
00:12:16,800 --> 00:12:19,840
నల్లమందు మీకు కావాలి కదా,
కనుక సమస్య మీది కూడా.
140
00:12:21,160 --> 00:12:24,680
అన్నట్టు, సరఫరాదారు
మా కాల్ కోసం వేచిచూస్తున్నాడు.
141
00:12:24,760 --> 00:12:26,480
సరఫరాదారు ఎందుకు వేచిచూస్తున్నాడు?
142
00:12:27,080 --> 00:12:28,200
ఇక్కడికి రాలేదే?
143
00:12:28,280 --> 00:12:29,360
మేము వచ్చాం కదా.
144
00:12:34,240 --> 00:12:35,320
అది కనపడుతూనే ఉంది.
145
00:12:37,200 --> 00:12:40,560
నేను దళారులతో వ్యవహరించనని
సరఫరాదారుతో చెప్పు.
146
00:12:41,560 --> 00:12:42,920
భయ్యా గారు, మా మాట వినండి.
147
00:12:44,840 --> 00:12:46,320
కోపం చేసుకున్నారు.
148
00:12:49,080 --> 00:12:50,960
అక్కా, మీరు చెప్పి చూడండి.
149
00:13:00,280 --> 00:13:03,040
మీ సరుకు తీసుకుంటాం,
కానీ మేము చెప్పిన ధరకు.
150
00:13:03,960 --> 00:13:05,800
రిస్క్‌కు రుసుము మేము చెల్లించం.
151
00:13:08,520 --> 00:13:09,600
అలాగేనండి.
152
00:13:13,160 --> 00:13:15,040
-పదండి, రింకు.
-వెళదాం, రింకు.
153
00:13:18,760 --> 00:13:20,040
అక్కా, ఫోన్.
154
00:13:24,360 --> 00:13:26,000
-హలో?
-ఆ.
155
00:13:27,080 --> 00:13:28,920
జేపీతో నీ సమావేశం ఏర్పాటు చేస్తాను.
156
00:13:30,560 --> 00:13:32,160
కానీ కొన్ని నిధులు ఖర్చవుతాయి.
157
00:13:34,080 --> 00:13:37,240
సరే. నేను డబ్బు సిద్ధం చేసుకుని
మిమ్మల్ని సంప్రదిస్తాను.
158
00:13:38,280 --> 00:13:39,960
ఎక్కువ సమయం వేచి చూసేలా చేయకండి.
159
00:13:40,840 --> 00:13:43,160
మా రాజకీయ నాయకులకు అంత ఓపిక ఉండదు.
160
00:13:45,840 --> 00:13:51,800
కర్నాల్ హరీష్ సోలంకీ
హోమ్ మంత్రి, యూపీ ప్రభుత్వం
161
00:14:01,520 --> 00:14:06,280
"నిరోధ్ ప్రజలకు జరిగిన
ప్రాణ నష్టం, ఆస్తి నష్టాల పట్ల..."
162
00:14:06,360 --> 00:14:08,440
"నిరోధ్" కాదు, మామ, "నిర్దోషులైన."
163
00:14:09,440 --> 00:14:11,120
-ఏంటి?
-"నిర్దోషులైన."
164
00:14:12,080 --> 00:14:13,440
నిరోధ్ అంటే కాండమ్ కదా.
165
00:14:13,520 --> 00:14:15,560
ఓరీ నీ!
166
00:14:17,160 --> 00:14:21,840
"నిర్దోషులైన ప్రజలకు జరిగిన ప్రాణ నష్టం,
ఆస్తి నష్టాల పట్ల,
167
00:14:21,920 --> 00:14:26,240
"నా హృదయం కరోనాతో నిండిపోయింది."
168
00:14:27,200 --> 00:14:30,040
"కరోనా" కాదు, మామ గారు, "కరుణ."
169
00:14:30,120 --> 00:14:33,480
పోరా నా కొడకా!
ఏంటి ఈ చెత్త? ఇలా ఎవరు మాట్లాడుతారు?
170
00:14:33,560 --> 00:14:36,200
అయితే మీడియా ముందు
ఈ బూతులు మాట్లాడుతారా ఏంటి?
171
00:14:42,920 --> 00:14:43,920
నమస్కారం, సర్.
172
00:14:44,960 --> 00:14:46,480
రండి, దూబే గారు. కూర్చోండి.
173
00:14:52,680 --> 00:14:55,240
ఏం తీసుకుంటారు? వేడిగానా, చల్లగానా?
174
00:14:56,040 --> 00:14:58,120
లేదా నేరుగా
సాహసానికి మెడల్ తీసుకుంటారా?
175
00:15:00,680 --> 00:15:04,400
సర్, నేను ప్రభుత్వ సేవకుడిని.
పైన ఉన్నవారు ఏది ఇస్తే అది తీసుకుంటాం.
176
00:15:04,480 --> 00:15:05,480
నా కొడకా.
177
00:15:09,000 --> 00:15:10,800
మామ గారు, ఏం జరుగుతోందో చూడండి.
178
00:15:10,880 --> 00:15:12,960
మరణించిన ప్రతీ ఒక్కరికీ 10 లక్షలు,
179
00:15:13,040 --> 00:15:16,520
గాయపడినవారికి 5 లక్షలు పరిహారం
ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటిస్తోంది.
180
00:15:16,600 --> 00:15:20,360
అలాగే యూపీ ఎస్‌టీఎఫ్‌ను
రద్దు చేయాలని నిర్ణయించింది.
181
00:15:21,600 --> 00:15:25,640
ఐజీ విశ్వదానంద్ దూబే గారిని
తక్షణమే సెలవుపై పంపుతున్నాం.
182
00:15:27,560 --> 00:15:31,040
ఈ విషయాన్ని విచారించడానికి
ఓ పై స్థాయి కమిటీని నియమిస్తున్నాం,
183
00:15:31,560 --> 00:15:35,960
దీని గురించి హోమ్ మంత్రి
కర్నాల్ సోలంకీ గారు మరిన్ని వివరాలిస్తారు.
184
00:15:37,120 --> 00:15:38,120
జై హింద్.
185
00:15:43,360 --> 00:15:45,120
అనుభవించక తప్పదు, కర్మకు ఫలితం.
186
00:15:45,960 --> 00:15:47,520
అంత భయమేస్తే, అరిచి ఏం లాభం?
187
00:15:49,840 --> 00:15:51,880
మేడమ్ కొంగు చాటున
సురక్షితం అనుకున్నావా?
188
00:15:53,240 --> 00:15:55,000
అయినా గుద్ద దెంగించికున్నావుగా.
189
00:15:58,840 --> 00:16:01,120
సర్, అది రహస్య ఆపరేషన్.
మీకు తెలుసు కదా.
190
00:16:01,200 --> 00:16:02,880
ఒక విషయం తెలుసుకో, దూబే.
191
00:16:03,760 --> 00:16:05,760
మేడమ్ నిన్ను సెలవుపై పంపుతోంది.
192
00:16:06,400 --> 00:16:09,320
కానీ తిరిగి రావడం,
నా సంతకంతోనే జరుగుతుంది.
193
00:16:12,200 --> 00:16:13,200
అలాగే, సర్.
194
00:16:13,280 --> 00:16:19,040
ప్రభాత్ సమాచార్
నేరరహిత రాష్ట్రమా, నేరపూరిత రాష్ట్రమా?
195
00:16:26,920 --> 00:16:28,040
దూబేని అదుపు చేశాం.
196
00:16:29,240 --> 00:16:32,080
కానీ మీడియాను అదుపు చేయాలి.
197
00:16:33,720 --> 00:16:35,200
మనం పతాకశీర్షికలు మార్చాలి.
198
00:16:36,160 --> 00:16:40,080
అందుకోసం ఆమ్ బాగ్ ప్రాజెక్ట్
మళ్ళీ మొదలుపెట్టాలని నాకనిపిస్తోంది.
199
00:16:42,000 --> 00:16:44,880
ఆమ్ బాగ్‌పై డబ్బు ఖర్చు పెట్టడం
వృధా అనిపిస్తోంది.
200
00:16:47,320 --> 00:16:49,840
యూపీని నేరరహితం చేయడానికి
డబ్బు ఖర్చు పెట్టాలి.
201
00:16:57,800 --> 00:16:59,520
ఇప్పుడు ఆమ్ బాగ్ శిలాఫలకంపై,
202
00:17:00,920 --> 00:17:03,320
"గౌరవ ముఖ్యమంత్రి
శ్రీ ఎస్‌పీ యాదవ్" అని ఉంది.
203
00:17:05,280 --> 00:17:06,840
మీరు దాన్ని ప్రారంభిస్తే,
204
00:17:07,640 --> 00:17:12,440
అక్కడ, "మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ
శ్రీ ఎస్‌పీ యాదవ్" అని రాయబడుతుంది.
205
00:17:15,000 --> 00:17:16,400
మీకు సానుభూతి దక్కుతుంది.
206
00:17:16,880 --> 00:17:19,800
ప్రజల నుండి అలాగే మీడియా నుండి.
207
00:17:21,680 --> 00:17:23,760
కానీ ఆమ్ బాగ్‌కు నిధులు ఎలా వస్తాయి?
208
00:17:25,880 --> 00:17:27,680
మీ నాన్నగారి హయాంలో, నిధులను...
209
00:17:28,960 --> 00:17:30,640
జేపీ యాదవ్ సమీకరించేవాడు.
210
00:17:33,160 --> 00:17:35,400
నిధులు ఇచ్చే పెద్ద కాంటాక్ట్స్ అతనివే.
211
00:17:36,880 --> 00:17:38,800
బాబాయి ఎక్కడుంటే అక్కడే మంచిది.
212
00:17:42,480 --> 00:17:45,800
అయితే, మేడమ్,
మీరు కొత్త పొత్తులు చేసుకోవాలి.
213
00:18:14,560 --> 00:18:16,440
కూర్చోండి. మేడమ్ వస్తున్నారు.
214
00:18:37,400 --> 00:18:38,720
లేటయిన౦దుకు క్షమించండి.
215
00:18:39,800 --> 00:18:40,800
ఏం ఫరవాలేదు.
216
00:18:42,320 --> 00:18:45,080
నన్ను ఎదురు చూసేలా చేశారు,
మీరూ సమయం తీసుకున్నారు.
217
00:18:45,960 --> 00:18:47,040
ఈ సమావేశం కోసం.
218
00:18:49,000 --> 00:18:50,920
మీరు సీఎం, మీకు ప్రతీ హక్కు ఉంది.
219
00:18:53,400 --> 00:18:54,400
నేను సీఎంను,
220
00:18:55,080 --> 00:18:57,320
అందుకే మొత్తం రాష్ట్రంలో
221
00:18:58,000 --> 00:18:59,920
అందరూ ఫిర్యాదు చేయవచ్చు,
నేను తప్ప.
222
00:19:03,720 --> 00:19:06,320
ఫిర్యాదులు చేయడానికి ప్రజా దర్బారు ఉంది.
223
00:19:07,040 --> 00:19:09,800
ఇక్కడ ప్రజలు లేరు, దర్బారు లేదు.
224
00:19:10,960 --> 00:19:12,800
ఎలాగూ నాకు ఏ ఫిర్యాదులు లేవు.
225
00:19:12,920 --> 00:19:13,920
అవును.
226
00:19:15,080 --> 00:19:16,080
అయితే, చెప్పండి,
227
00:19:16,200 --> 00:19:17,720
మీ ప్రతిపాదన ఏంటి?
228
00:19:33,320 --> 00:19:37,040
చూడండి, మున్నా
నా దగ్గర ఏ రహస్యాలు దాచేవాడు కాదు.
229
00:19:42,800 --> 00:19:45,240
ఈరోజు ఇది ఇంట్లో కనిపిస్తే తీసుకొచ్చాను.
230
00:19:52,160 --> 00:19:53,280
సంకోచపడకండి.
231
00:20:12,080 --> 00:20:15,200
మీరు నాపై నమ్మకం ఉంచుంటే,
మీ చేతులకు మట్టి అంటేది కాదు.
232
00:20:16,440 --> 00:20:18,280
రిస్క్ తీసుకుంటే బెడిసికొట్టింది.
233
00:20:21,160 --> 00:20:24,760
కొంతకాలం పాటు
గుడ్డూపై నేరుగా దాడి చేయలేం.
234
00:20:27,800 --> 00:20:30,280
మాధురి గారు, బాహుబలులను చంపరు,
235
00:20:31,400 --> 00:20:34,280
వాళ్ళను వేటాడుతారు, చుట్టుముట్టి.
236
00:20:39,560 --> 00:20:40,880
పథకం ఏంటి?
237
00:20:40,960 --> 00:20:41,960
రౌఫ్ లాలా.
238
00:20:42,680 --> 00:20:44,160
కానీ గుడ్డూకు లాలా మిత్రుడు.
239
00:20:44,240 --> 00:20:45,800
అతను కేవలం లాభానికే మిత్రుడు.
240
00:20:46,480 --> 00:20:48,080
లాభం ఎక్కడుంటే లాలా అక్కడ.
241
00:20:48,800 --> 00:20:50,760
జైల్లో ఉండి ఏ లాభం సంపాదించట్లేదు.
242
00:20:53,520 --> 00:20:56,040
అంటే మనకు కీలకమైనది నల్లమందు, లాలా కాదు.
243
00:20:56,920 --> 00:20:58,160
మీకు ఇప్పుడు అర్థమైంది.
244
00:21:00,480 --> 00:21:04,080
వ్యాపారాన్ని చూసుకోలేని బాహుబలిని
ఎవరూ బాహుబలిగా పరిగణించరు.
245
00:21:11,240 --> 00:21:14,400
గుడ్డూ అంతంతో
నేరరహిత యూపీ ఆరంభమవుతుంది.
246
00:21:19,160 --> 00:21:21,000
కానీ నేను లాలాకు బెయిల్ ఇప్పించను.
247
00:21:29,680 --> 00:21:31,400
నా దగ్గర మరో మార్గం ఉంది.
248
00:21:52,520 --> 00:21:54,240
నేను సరైన పద్ధతి నేర్చుకోవాలి.
249
00:22:05,400 --> 00:22:06,440
ఆ, మీరు వెళ్ళండి.
250
00:22:09,480 --> 00:22:11,280
ఇందులో తేదీ, సమయం వేయండి.
251
00:22:14,240 --> 00:22:16,200
-ఏం జరిగింది?
-27వ తేదీ,
252
00:22:18,200 --> 00:22:19,320
నాల్గవ నెల.
253
00:22:23,720 --> 00:22:25,440
ఇక్కడ జైల్లో,
254
00:22:26,800 --> 00:22:28,440
రోజు, తేదీ, సమయం,
255
00:22:30,480 --> 00:22:32,360
వీటి గురించి ఎరుకే ఉండదు.
256
00:22:36,400 --> 00:22:38,520
మరచిపోండి. కానిస్టేబుల్ పూర్తి చేస్తాడు.
257
00:22:39,000 --> 00:22:40,920
-కానిస్టేబుల్.
-నేను నింపుతానండి.
258
00:22:44,720 --> 00:22:48,200
అన్నట్టు, ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా,
259
00:22:48,800 --> 00:22:52,000
నిర్మొహమాటంగా
నన్ను వచ్చి సంప్రదించండి.
260
00:22:52,920 --> 00:22:56,720
ఈరోజు నా అవసరాలను తీరుస్తారు,
261
00:22:58,040 --> 00:23:00,120
రేపు, బదులుగా మీకోసం ఏదో అడుగుతారు.
262
00:23:02,960 --> 00:23:04,720
ఇక్కడ లావాదేవీలు చేయడానికి రాలేదు.
263
00:23:04,800 --> 00:23:09,360
ఆహా. అదే వైఖరి, అదే పొగరు,
264
00:23:10,600 --> 00:23:12,160
అదే గర్వం.
265
00:23:13,560 --> 00:23:14,960
ఇది మీ కుటుంబంలోనే ఉంది.
266
00:23:15,680 --> 00:23:17,680
ఇది నా గర్వం కాదు, నా విలువలు.
267
00:23:18,320 --> 00:23:19,320
విలువలా?
268
00:23:22,720 --> 00:23:24,280
ఇవి మీ విలువలైతే,
269
00:23:24,880 --> 00:23:27,760
మరి మనం జైల్లో ఎందుకున్నాం?
270
00:23:28,360 --> 00:23:30,360
గుడ్డూ ఎందుకు లేడు? చెప్పండి.
271
00:23:32,720 --> 00:23:34,440
మీరు, నేను నేరస్తులం కనుక.
272
00:23:35,360 --> 00:23:38,240
ప్రతీ నేరస్తుడు ఏదో ఒక రోజున
ఇక్కడికి రావాల్సిందే.
273
00:23:38,320 --> 00:23:39,680
నేను వ్యాపారిని.
274
00:23:41,880 --> 00:23:44,400
ఇప్పుడు, మీరు కేవలం తేదీ మరచిపోయారు.
275
00:23:46,080 --> 00:23:50,480
కానీ కాలం గడిచే కొద్దీ,
మీరు విలువలు కూడా మరచిపోతారు.
276
00:24:10,760 --> 00:24:11,760
త్వరగా రండి, బాబులు.
277
00:24:17,040 --> 00:24:18,160
త్వరగా రండి.
278
00:24:20,160 --> 00:24:23,080
అయితే, ఫ్యాక్టరీ పని ఎవరు చేస్తారు?
279
00:24:27,200 --> 00:24:28,200
నేను చేస్తాను.
280
00:24:30,360 --> 00:24:33,080
పండిత్ గారు, ఏం మాట్లాడుతున్నారు?
281
00:24:33,760 --> 00:24:35,040
అది మీకు సరిపోదు.
282
00:24:35,120 --> 00:24:37,480
నేను పరికరాలతో చాలా పని చేశాను.
283
00:24:40,000 --> 00:24:42,320
ఫ్యాక్టరీ అంటే మరుగుదొడ్డి అని అర్థం.
284
00:24:45,680 --> 00:24:48,040
పండిత్ గారు, మీరు వంటగదిలో పని చేయండి.
285
00:24:50,520 --> 00:24:53,080
గేరువాను లోపల పనిలో పెట్టు.
డబ్బులు వచ్చాయి.
286
00:24:54,880 --> 00:24:57,560
ఈ రోజు వంటగది పని చేసేది
రమాకాంత్ గారు, గేరువా.
287
00:24:58,440 --> 00:24:59,840
పండిత్ గారి కథ ముగిసినట్టే.
288
00:25:01,000 --> 00:25:02,920
పండిత్ గారు, త్వరగా వద్దని చెప్పండి.
289
00:25:03,600 --> 00:25:07,400
ఎందుకు? వంటగదిలో వంట చేయాలి, అంతేగా?
లేదంటే దానికీ మరో అర్థం ఉందా?
290
00:25:07,480 --> 00:25:10,040
మీకు తెలియదు.
గేరువాతో చాలా ప్రమాదకరం.
291
00:25:10,520 --> 00:25:11,480
గేరువా?
292
00:25:11,560 --> 00:25:12,960
-ఇక చెక్కపని?
-నేను చేస్తా.
293
00:25:13,040 --> 00:25:15,040
ఆ మూల నిలబడిన గడ్డమున్న వ్యక్తి.
294
00:25:16,520 --> 00:25:18,680
తనే గేరువా.
ప్రమాదకరం. వద్దని చెప్పండి.
295
00:25:18,760 --> 00:25:20,440
గత వారం కోటానే పూర్తి చేయలేదు.
296
00:25:20,520 --> 00:25:21,680
నాకేంటి ప్రమాదం?
297
00:25:22,240 --> 00:25:24,520
మిమ్మల్ని నలిపెస్తాడు.
"నాకేంటి ప్రమాదమట?"
298
00:25:24,600 --> 00:25:26,880
గేరువా నరభక్షుకుడిలాంటోడు.
299
00:25:26,960 --> 00:25:28,520
వకీళ్ళను సజీవంగా తింటాడు.
300
00:25:28,600 --> 00:25:31,360
-వాళ్ళు దారుణమైన వాళ్ళు.
-నేను ఎక్కడికి వెళ్ళాలి?
301
00:25:31,440 --> 00:25:33,000
నేను ఎవరికీ భయపడను.
302
00:25:34,000 --> 00:25:35,800
గోయల్ గారు కూడా ఇలానే అనేవారు.
303
00:25:36,800 --> 00:25:37,880
ఆయన ఎవరు?
304
00:25:37,960 --> 00:25:41,000
ఆయన కూడా న్యాయవాదే. ఇప్పుడు లేరు.
305
00:25:59,560 --> 00:26:01,240
నాన్నా, సరిగ్గానే చేస్తున్నానా?
306
00:26:02,960 --> 00:26:04,120
ఆ, సరిగ్గానే ఉంది.
307
00:26:04,200 --> 00:26:05,560
ఏమైనా అంటావు, నాన్నా.
308
00:26:09,200 --> 00:26:10,800
ఇదంతా వదులు, గిన్నీ.
309
00:26:11,720 --> 00:26:13,520
వీటిలో పెద్ద వేలు ఏది.
310
00:26:15,320 --> 00:26:16,480
ఇది చిన్నది.
311
00:26:17,240 --> 00:26:18,440
ఇప్పుడు మీ వంతు.
312
00:26:23,720 --> 00:26:26,400
పద, గిన్నీ, నువ్వు, అమ్మ పడుకోండి.
నేను వెళతాను.
313
00:26:27,160 --> 00:26:28,640
-నాన్నా!
-నేను వెళ్ళాలి.
314
00:26:28,720 --> 00:26:29,920
నానమ్మా.
315
00:26:31,760 --> 00:26:34,920
-పెద్దోడా. పెద్దోడా!
-ఆ?
316
00:26:35,520 --> 00:26:38,360
సరుకు దద్దా చూసుకుంటాడు.
వెళ్ళి విశ్రాంతి తీసుకో.
317
00:26:38,440 --> 00:26:40,600
కానీ నేను వెళ్ళాలి. పనుంది.
318
00:26:41,880 --> 00:26:44,080
పడుకుందాం రా. పద.
319
00:26:44,160 --> 00:26:47,720
అమ్మా, నేను నాన్నతో ఆడుకోవాలి.
320
00:26:47,800 --> 00:26:51,320
కుటుంబం కూడా ముఖ్యమే కదా.
ఈ రాత్రి ఇక్కడే ఉండు.
321
00:28:02,800 --> 00:28:04,120
మీకు జ్వరంగా ఉంది.
322
00:28:04,960 --> 00:28:07,800
-మీకు ఆరోగ్యం బాగోలేదా?
-అలా ఏం లేదు, బానే ఉంది.
323
00:28:11,480 --> 00:28:14,760
అయితే, గిన్నీని
దాని గదిలో పడుకోబెట్టమంటారా?
324
00:28:16,000 --> 00:28:19,400
-ఎందుకు?
-అంటే, ఈ రాత్రి మీరు వెళ్ళలేదు కదా.
325
00:28:20,000 --> 00:28:24,040
దాంతో నేను ఏమనుకున్నానంటే,
మీరు మనసుపడతారని...
326
00:28:29,920 --> 00:28:31,280
నాకు జ్వరంగా ఉంది.
327
00:28:34,840 --> 00:28:36,520
అస్తాబల్
328
00:28:38,720 --> 00:28:39,840
అశ్వశాలా?
329
00:28:42,800 --> 00:28:44,520
-హలో?
-భయ్యా గారు, నమస్కారం.
330
00:28:45,400 --> 00:28:47,200
మీరు వచ్చి ఎన్నో రోజులైంది.
331
00:28:47,680 --> 00:28:51,400
సవారీ చేయించుకోవడానికి
మీ గుర్రాలు అల్లాడిపోతున్నాయి.
332
00:28:51,920 --> 00:28:53,200
మీరు ఎప్పుడు వస్తున్నారు?
333
00:28:55,920 --> 00:28:58,400
చూడండి, బిజీగా ఉన్నా.
కనుక, మీరు కాల్ చేయకండి.
334
00:28:58,480 --> 00:29:00,040
నేను వచ్చే ముందు ఫోన్ చేస్తా.
335
00:29:06,240 --> 00:29:10,240
మీకు ఇంట్లో మనసు లేకపోతే,
ఎప్పుడూ వెళ్ళే చోటుకే వెళ్ళిపోండి.
336
00:29:14,640 --> 00:29:15,960
అలా ఏం లేదు.
337
00:29:17,720 --> 00:29:20,080
గిన్నీని రేపు స్కూల్లో వదిలిపెట్టాలిగా.
338
00:29:21,440 --> 00:29:24,000
చిన్నోడు వదిలేవాడు,
ఇప్పుడు నేను వదులుతాను.
339
00:29:24,920 --> 00:29:26,840
నువ్వు బిజీగా ఉంటావు, అలసిపోతావు.
340
00:29:30,800 --> 00:29:32,360
గిన్నీ ఏమంటోందో తెలుసా?
341
00:29:34,960 --> 00:29:37,360
నాన్న బాబాయికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు.
342
00:29:41,120 --> 00:29:43,920
మీలాగే తను కూడా
చిన్నోడిని మిస్సవుతోంది.
343
00:30:07,000 --> 00:30:08,400
త్రిపాఠీ
344
00:30:11,600 --> 00:30:15,600
చూడు, నేను బుజ్జాడి కోసం
ఎంత అందంగా తయారు చేశానో.
345
00:30:16,760 --> 00:30:17,960
చూస్తావా?
346
00:30:18,640 --> 00:30:19,640
చూస్తా...
347
00:30:24,400 --> 00:30:25,560
రా, బాబు.
348
00:30:26,440 --> 00:30:27,560
ఏం జరిగింది, వదినా?
349
00:30:34,320 --> 00:30:36,480
పిల్లి ఎక్కడి నుండి వచ్చింది?
350
00:30:54,320 --> 00:30:56,240
సర్, మేము ఎప్పటికప్పుడు చూస్తున్నాం.
351
00:30:56,320 --> 00:30:58,320
కానీ ఉపశమన మాత్రలు కూడా తినడం లేదు.
352
00:31:02,880 --> 00:31:05,720
మీరు చావునే ఓడించారు, త్రిపాఠీ గారు.
353
00:31:06,800 --> 00:31:09,320
ఇప్పుడు జీవితంతో మీకు శత్రుత్వం ఎందుకు?
354
00:31:11,440 --> 00:31:13,720
నేనూ వయసులో ఉన్న కొడుకును కోల్పోయాను.
355
00:31:16,240 --> 00:31:19,960
మీది, నాదీ ఒకే బాధ.
356
00:31:23,080 --> 00:31:24,600
కొంచెం ఆలస్యమైనా,
357
00:31:26,680 --> 00:31:28,800
మున్నాను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను.
358
00:31:31,120 --> 00:31:32,440
వాడంటే గర్వించేవాడిని.
359
00:31:36,400 --> 00:31:37,600
బాధా లేదు,
360
00:31:39,120 --> 00:31:40,600
అలాగని కోపమూ లేదు.
361
00:31:42,240 --> 00:31:43,760
కానీ నా జీవితంలో
362
00:31:45,200 --> 00:31:47,120
ఎంతో దుఃఖం ఉంది, త్రిపాఠీ గారు.
363
00:31:49,680 --> 00:31:51,280
భలే జల్సాల కొడుకును కన్నాను.
364
00:31:54,440 --> 00:31:57,560
జీవితాంతం బాధను కలిగించాడు.
365
00:31:59,880 --> 00:32:03,920
ఇక మరణం తర్వాత కూడా,
నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వటం లేదు.
366
00:32:11,720 --> 00:32:15,800
విషయం చాలా సులువైనది, త్రిపాఠీ గారు.
367
00:32:17,840 --> 00:32:19,840
ఎవరైతే యోగ్యులు కారో, వాళ్ళు చస్తారు.
368
00:32:22,240 --> 00:32:25,280
గద్దెను ఏలడానికి, యోగ్యుడు కావడం,
369
00:32:26,480 --> 00:32:27,560
సజీవంగా ఉండటం,
370
00:32:28,920 --> 00:32:29,920
ఈ రెండూ అవసరమే.
371
00:32:30,640 --> 00:32:32,000
ఇది ప్రకృతి నియమం.
372
00:32:32,760 --> 00:32:37,760
ఎవరైతే యోగ్యులే
వాళ్ళే తమ ప్రతీకారం తీర్చుకుంటారు.
373
00:32:39,440 --> 00:32:41,720
-అంతే కదా, పెద్దోడా?
-అవును, దద్దా.
374
00:32:50,960 --> 00:32:53,840
యూపీ - బీహార్ సరిహద్దు
375
00:33:13,800 --> 00:33:16,880
చూస్తుంటే శుక్లా
లిట్టీ ఛోకా రుచి మరిగినట్టు ఉన్నాడు.
376
00:33:16,960 --> 00:33:17,960
ఎందుకలా అంటున్నావు?
377
00:33:18,840 --> 00:33:21,960
వారంలో ఒకటి రెండు సార్లు
శరద్ శుక్లా బీహార్‌కు వస్తున్నాడు.
378
00:33:27,360 --> 00:33:29,560
బీహార్‌లో ఎక్కడో కనుక్కో.
379
00:33:30,040 --> 00:33:31,200
అలాగేనండి.
380
00:34:11,400 --> 00:34:14,520
పార్క్ దక్షిణ మూలలో
కాస్తంత పని మిగిలి ఉంది.
381
00:34:14,600 --> 00:34:16,840
అది అవ్వగానే, రిబ్బన్ కత్తిరించవచ్చు.
382
00:34:16,920 --> 00:34:19,400
దాని తర్వాత బాధ్యత మాది.
383
00:34:19,480 --> 00:34:23,320
ప్రతీ వార్తాపత్రిక మొదటి పేజీలో
కేవలం ఆమ్ బాగ్ ఉంటుంది, మేడమ్.
384
00:34:24,480 --> 00:34:27,640
మేడమ్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి,
కేవలం నిధుల కోసం చూస్తున్నాం.
385
00:34:28,160 --> 00:34:30,880
వేచి చూడాల్సిన అవసరం లేదు.
పని మొదలుపెట్టండి.
386
00:34:30,960 --> 00:34:31,960
అలాగేనండి.
387
00:34:37,440 --> 00:34:38,520
ఆ, మేడమ్.
388
00:34:42,920 --> 00:34:43,920
హలో?
389
00:34:44,000 --> 00:34:46,000
మున్నాకు చెందినది నా దగ్గరా ఒకటుంది.
390
00:34:46,640 --> 00:34:48,080
మీకది పనికొస్తుందేమో.
391
00:34:48,160 --> 00:34:50,000
నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు.
392
00:34:51,400 --> 00:34:54,120
మిగిలిన వివరాలు మీకు ఆనంద్ ఇస్తారు.
ధన్యవాదాలు.
393
00:35:01,400 --> 00:35:04,080
పార్టీ నిధికి
ఐదు కోట్ల విరాళాన్ని ఆశిస్తున్నాం.
394
00:35:08,160 --> 00:35:09,360
ఇంకా పొలంలోనే ఉంది.
395
00:35:10,360 --> 00:35:12,000
మొదట కోత, తర్వాత అమ్మకం.
396
00:35:12,960 --> 00:35:14,160
అప్పుడు డబ్బులు వస్తాయి.
397
00:35:15,640 --> 00:35:17,320
మాకు నిధులు ముందస్తుగా కావాలి.
398
00:35:29,640 --> 00:35:32,160
-హేయ్, కానివ్వండి.
-వస్తున్నా.
399
00:35:35,800 --> 00:35:37,120
-మసాలా?
-అయిపోవచ్చింది.
400
00:35:42,160 --> 00:35:44,040
రుబ్బాక నాకు బీన్స్ కడిగి ఇవ్వు.
401
00:35:47,680 --> 00:35:50,160
హేయ్, త్వరగా.
సమయం ఎందుకు వృధా చేస్తున్నావు?
402
00:35:57,480 --> 00:35:58,520
ఇలా అందివ్వు.
403
00:36:15,800 --> 00:36:17,480
ఇంకెవరైనా ఉన్నారా?
404
00:36:35,920 --> 00:36:36,960
నమస్తే, అన్నా.
405
00:36:39,040 --> 00:36:40,080
ఓరి దేవుడా!
406
00:36:43,400 --> 00:36:44,760
అయ్యో. గేరువా.
407
00:36:46,760 --> 00:36:48,320
ఆ, వెళుతున్నా.
408
00:36:51,600 --> 00:36:52,600
తొందరలో ఉన్నారా?
409
00:36:53,880 --> 00:36:56,440
నా పని ముగిసింది.
తిరిగి సెల్‌కు వెళుతున్నా.
410
00:36:58,160 --> 00:36:59,560
మీరు వకీలు కదా?
411
00:37:03,800 --> 00:37:04,800
చూడు,
412
00:37:06,280 --> 00:37:07,640
నీ విషయంలో ఏం జరిగిందో ఏమో,
413
00:37:08,960 --> 00:37:10,920
వకీళ్ళందరూ ఒకలాంటి వారు కాదు.
414
00:37:14,200 --> 00:37:16,320
అందరు వకీళ్ళు ఒకలాంటివారే.
415
00:37:21,400 --> 00:37:22,800
మీరు తప్ప.
416
00:37:24,080 --> 00:37:26,880
రమాకాంత్ పండిత్,
మీరు నాకొక పని చేస్తారా?
417
00:37:29,080 --> 00:37:31,640
నేను మీలాంటి వారికి పని చేయను.
418
00:37:31,760 --> 00:37:33,200
నా గురించి మీకు తెలుసా?
419
00:37:35,160 --> 00:37:37,320
మీరు ఒక హంతకుడు.
420
00:37:37,800 --> 00:37:39,280
మీకు కారణం తెలుసా?
421
00:37:39,360 --> 00:37:41,000
కారణం వల్ల తేడా ఏముంది?
422
00:37:42,120 --> 00:37:44,120
మీరు కొడవలితో ఐదు మందిని చంపారు.
423
00:37:45,480 --> 00:37:46,920
ఆత్మరక్షణలో అయితే చేసుండరు.
424
00:37:50,760 --> 00:37:53,640
నాకొక చిన్న పాప ఉండేది.
425
00:37:56,440 --> 00:37:58,120
కేవలం తొమ్మిదేళ్ళు.
426
00:37:58,160 --> 00:38:01,160
పండిత్ గారు, ఆ రెండు పిలకజడలు వేసుకుంటే,
427
00:38:01,640 --> 00:38:03,600
చాలా ముద్దొచ్చేది.
428
00:38:04,640 --> 00:38:05,840
కానీ ఇప్పుడు అనిపించదు.
429
00:38:13,840 --> 00:38:16,640
అతను నాకు యజమాని. బడకా బాబు.
430
00:38:17,640 --> 00:38:21,760
ఒకరోజు, అతని కొడుకు
మా పిల్లను పొలంలో పట్టుకున్నాడు.
431
00:38:23,960 --> 00:38:27,640
పండిత్ గారు,
నేను అతన్ని కొంచెం కొట్టానంతే.
432
00:38:29,160 --> 00:38:31,000
మరుసటి రోజు, అతని మనుషులు వచ్చి,
433
00:38:31,560 --> 00:38:35,120
మా గునియాను సజీవంగా దహించేశారు.
434
00:38:41,680 --> 00:38:43,560
నేను ఏం చేయాలి?
435
00:38:48,160 --> 00:38:49,360
ఎఫ్‌ఐఆర్ వేసుండవచ్చు.
436
00:38:49,440 --> 00:38:50,920
ఎఫ్ఐఆర్ వేశాను.
437
00:38:52,160 --> 00:38:54,160
అందుకే ఆ వకీలు...
438
00:38:55,760 --> 00:38:57,760
అతనూ బడకా బాబు మనిషే.
439
00:38:58,360 --> 00:39:01,120
ఇప్పటికీ వాళ్ళు
నన్ను చంపాలనుకుంటున్నారు.
440
00:39:04,080 --> 00:39:05,600
ఈ ఉదయం, వంటగదిలో,
441
00:39:06,480 --> 00:39:08,160
అతను నన్ను చంపడానికి వచ్చాడు.
442
00:39:11,640 --> 00:39:12,960
నేను నీకోసం ఏం చేయను?
443
00:39:15,960 --> 00:39:18,760
నా తరపున క్షమాభిక్ష అప్పీల్ వేయండి.
444
00:39:20,760 --> 00:39:23,160
ఈ ఊర్లో వకీళ్ళు కరువయ్యారా?
445
00:39:26,160 --> 00:39:28,760
ఈ ఊర్లో మనుషులే కరువయ్యారు,
పండిత్ గారు.
446
00:39:31,520 --> 00:39:33,400
నేను ఇక్కడి నుండి బయట పడకపోతే,
447
00:39:34,400 --> 00:39:37,480
మొత్తం నా కుటుంబాన్నే చంపేస్తారు.
448
00:40:11,400 --> 00:40:12,480
నాకు అనిపించింది,
449
00:40:13,560 --> 00:40:16,040
మీరు నీ మాట మరచిపోయారని.
450
00:40:16,840 --> 00:40:19,600
ఇచ్చిన మాట గుర్తుంది, లాలా.
కాస్త సమయం పడుతోందంతే.
451
00:40:20,520 --> 00:40:22,920
ఈ సమయమే
452
00:40:23,600 --> 00:40:25,160
ఖైదీకి అతిపెద్ద శత్రువు.
453
00:40:26,400 --> 00:40:29,480
సమస్య ఏంటంటే,
మీకు సమయంకన్నా పెద్ద శత్రువులు ఉన్నారు.
454
00:40:39,280 --> 00:40:40,920
తప్పు చేసింది గుడ్డూ,
455
00:40:42,480 --> 00:40:44,480
కానీ అతను యధేచ్ఛగా తిరుగుతున్నాడు.
456
00:40:45,960 --> 00:40:48,440
కానీ నేను ఇక్కడ బందీగా ఉన్నాను.
457
00:40:50,480 --> 00:40:51,480
ఎంతకాలం పాటు?
458
00:40:53,640 --> 00:40:55,640
గుడ్డూ చచ్చి గుంతలో పడే దాకా.
459
00:40:59,560 --> 00:41:01,680
ప్రస్తుతానికి, నా వద్ద మీకొక ఆఫర్ ఉంది.
460
00:41:05,080 --> 00:41:07,280
నల్లమందు నాది, నెట్వర్క్ మీది.
461
00:41:10,680 --> 00:41:13,320
మీకు బెయిల్ ఇప్పించకపోయినా
వ్యాపారం చూపిస్తున్నా.
462
00:41:14,080 --> 00:41:15,400
మీరు నల్లమందును
463
00:41:15,560 --> 00:41:17,920
ఇంకెవరికీ అమ్మకూడదన్నదే షరతు.
464
00:41:23,520 --> 00:41:27,120
కానీ వ్యాపారంలో నా వాటా ఎంత?
465
00:41:27,160 --> 00:41:28,680
మనం లాభాలు సగం సగం పంచుకుందాం.
466
00:41:29,160 --> 00:41:30,960
మీరు వ్యాపారి, దళారి కాదు.
467
00:41:38,200 --> 00:41:40,560
-సరే.
-ధన్యవాదాలు.
468
00:41:49,840 --> 00:41:52,440
నాన్న వీళ్ళందరి
క్షమాభిక్ష అప్పీల్ ఫైల్ చేయమన్నారు.
469
00:41:52,520 --> 00:41:53,520
బెయిల్ పిటీషన్
470
00:41:53,600 --> 00:41:54,640
గేరువా కుమార్.
471
00:41:55,440 --> 00:41:57,800
అనిల్ ప్రజాపతి. హత్య.
472
00:41:58,640 --> 00:41:59,640
దోపిడీ.
473
00:41:59,760 --> 00:42:00,760
ఈ చోద్యం చూడు.
474
00:42:01,280 --> 00:42:03,600
జైల్లో కూర్చున్నా కానీ విశ్రాంతి లేదు.
475
00:42:04,880 --> 00:42:08,160
కోర్టును అంతగా మిస్సవుతోంటే,
తన కేసే ఎందుకు వాదించుకోడు?
476
00:42:12,440 --> 00:42:14,560
అమ్మా, మీరు కూర్చోండి. నేను చూసుకుంటాను.
477
00:42:14,640 --> 00:42:15,960
పప్పు సంగతి చూసుకుంటావా?
478
00:42:16,960 --> 00:42:21,000
పోపు వేయాలంతే కదా.
నేను బాగానే వేస్తాను. చూసుకుంటాను.
479
00:42:21,760 --> 00:42:24,160
ఇంట్లో కూడా,
మా అమ్మ నా చేతి వంటే తింటుంది.
480
00:42:24,200 --> 00:42:25,640
కూర్చోమ్మా. తను చూసుకుంటాడు.
481
00:42:27,560 --> 00:42:28,880
కాసింత బెల్లం వెయ్.
482
00:42:29,800 --> 00:42:32,160
నాకు నచ్చిన రుచిని అమ్మ కూడా రుచి చూడనీ.
483
00:42:32,840 --> 00:42:34,520
సరే, బెల్లం. వేస్తున్నా.
484
00:42:36,000 --> 00:42:37,640
నువ్వు అదృష్టవంతురాలివి, డింపీ.
485
00:42:38,760 --> 00:42:41,520
మీ నాన్న ఇంతదాకా గరిటె కూడా తిప్పలేదు.
486
00:42:47,080 --> 00:42:48,080
మంచిదే.
487
00:42:48,160 --> 00:42:51,680
సెంట్రల్ జైలు పూర్వాంచల్
488
00:43:05,600 --> 00:43:06,600
సరే.
489
00:43:24,920 --> 00:43:25,920
నేను...
490
00:43:26,600 --> 00:43:29,080
నా జీవితంలో ఎన్నోసార్లు దారి తప్పాను.
491
00:43:32,200 --> 00:43:33,960
కానీ మీరు ఎప్పుడూ తప్పలేదు.
492
00:43:35,880 --> 00:43:37,000
అయితే ఎందుకు...
493
00:43:37,560 --> 00:43:38,560
వసుధ...
494
00:43:42,640 --> 00:43:44,520
జీవితంలో రెండు అ౦శాలు ఉంటాయి.
495
00:43:45,880 --> 00:43:47,520
ఒకటి మన నియంత్రణలో ఉంటుంది,
496
00:43:48,520 --> 00:43:51,480
రెండోది మన నియంత్రణలో ఉండదు.
497
00:43:53,960 --> 00:43:57,200
నా నియంత్రణలో లేని విషయం
నా జీవితాన్ని కుంగదీసింది.
498
00:43:58,480 --> 00:43:59,560
మరి మీ నియంత్రణలో...
499
00:44:00,880 --> 00:44:02,320
ఉన్న పని ఎందుకు చేయరు?
500
00:44:02,400 --> 00:44:04,200
ఎందుకు చావాలనుకుంటున్నారు?
501
00:44:04,280 --> 00:44:08,280
నేను ఎల్లప్పుడూ తప్పు చేసినవారికి
శిక్షపడేలా చేస్తూ వచ్చాను.
502
00:44:10,080 --> 00:44:13,360
నా వంతు రాగానే తప్పించుకోవడానికి చూడాలా?
503
00:44:15,120 --> 00:44:17,520
-నేను ఇలా కపటత్వంతో ఉండలేను.
-ఎందుకు?
504
00:44:20,400 --> 00:44:21,600
మీరు వకీలు మాత్రమేనా?
505
00:44:23,320 --> 00:44:24,600
మీరు నా భర్త కాదా?
506
00:44:26,760 --> 00:44:28,240
మీరు డింపీ తండ్రి కాదా?
507
00:44:30,160 --> 00:44:34,320
మీ కుటుంబాన్ని ఇలా వదిలేయటం
మీ దృష్టిలో కపటత్వం కాదా?
508
00:44:36,560 --> 00:44:40,040
ఈ శిక్షలు ఇవ్వడం అన్నది
న్యాయమూర్తుల పని, మీది కాదు.
509
00:44:42,120 --> 00:44:43,440
మీరు ఏం చేస్తున్నారు?
510
00:44:44,320 --> 00:44:47,080
ఇదేంటి? మీపై మీరు జాలి చూపడం ఆపండి.
511
00:44:49,280 --> 00:44:52,800
మీకు భార్యగా ఉండే హక్కును
మీరు నా నుండి తీసేసుకోలేరు.
512
00:44:53,760 --> 00:44:56,120
ఈ నిర్ణయం కేవలం మీ ఒక్కరిదే కాదు.
513
00:45:09,160 --> 00:45:12,560
రమాకాంత్ పండిత్ వర్సెస్ ప్రభుత్వం కేసు
విచారణ జరుగుతోంది!
514
00:45:13,640 --> 00:45:15,320
ప్రభుత్వ న్యాయవాది వాదన ఏంటంటే
515
00:45:16,640 --> 00:45:19,360
ప్రతివాది రమాకాంత్ పండిత్‌కు,
516
00:45:20,160 --> 00:45:23,160
సెక్షన్ 302 కింద కఠిన కారాగారశిక్ష పడాలి.
517
00:45:24,280 --> 00:45:26,320
డిఫెన్స్ వారి వద్ద ఏదైనా వాదన ఉందా?
518
00:45:43,760 --> 00:45:44,760
జడ్జి గారు,
519
00:45:46,720 --> 00:45:48,880
నా సమర్థనలో నేను చెప్పేది ఏంటంటే,
520
00:45:50,400 --> 00:45:52,080
నేను ఎస్ఎస్‌పీ మౌర్యను కాల్చింది,
521
00:45:52,800 --> 00:45:55,880
మా అబ్బాయి
గుడ్డూ పండిత్ ప్రాణాల్ని కాపాడటానికే.
522
00:45:57,840 --> 00:45:58,960
అందుకే నాపై
523
00:45:59,840 --> 00:46:03,040
సెక్షన్ 302 విచారణ జరపకూడదు.
524
00:46:09,760 --> 00:46:12,320
తన వాదనను నిరూపించుకోవడానికి,
525
00:46:12,880 --> 00:46:14,680
అతని దగ్గర ఏ సాక్షి లేడు,
526
00:46:15,120 --> 00:46:16,240
లేదా సాక్ష్యం లేదు.
527
00:46:17,120 --> 00:46:18,400
పండిత్ గారు ఆలోచన ఏంటంటే
528
00:46:19,160 --> 00:46:21,640
ఆయన ఒక మంత్రం చెప్పి ఈ కేసును
529
00:46:21,720 --> 00:46:23,240
గెలవచ్చని అనుకుంటున్నారు.
530
00:46:24,160 --> 00:46:25,880
కోర్టు మీ సలహాను అడగలేదు.
531
00:46:28,080 --> 00:46:30,960
కేసును వాదించుకోవడానికి
ప్రతివాదికి పూర్తి హక్కు ఉంది.
532
00:46:31,040 --> 00:46:32,360
ఇదేంటి?
533
00:46:34,320 --> 00:46:38,120
మీ సాక్షులను ముందుంచటానికి
కోర్టు మీకు రెండు వారాల గడువు ఇస్తోంది.
534
00:46:44,440 --> 00:46:46,600
మరో వాయిదా ఉండదని మీరన్నారు.
535
00:46:46,680 --> 00:46:48,720
మేడమ్, ఇది కోర్టు వ్యవహారం.
536
00:46:48,800 --> 00:46:50,680
మనం ప్రక్రియను అనుసరించాలి.
537
00:46:52,680 --> 00:46:54,880
ఏ సాక్షి, సాక్ష్యం లేకుండా
సమర్థించుకుంటాడట.
538
00:46:54,960 --> 00:46:56,480
సర్, లక్నోకు ఫోన్ చేయనా?
539
00:47:03,200 --> 00:47:05,280
మీరు యూనిఫాంలోనే బాగున్నారు, దూబే గారు.
540
00:47:08,400 --> 00:47:09,640
ఒప్పుకుంటాను, మేడమ్.
541
00:47:15,400 --> 00:47:18,120
నేను మీ ఆదేశాలు పాటించానంతే.
542
00:47:19,480 --> 00:47:21,880
ప్రస్తుతం ప్రజల్లో ఎంతో కోపం ఉంది.
543
00:47:23,400 --> 00:47:27,360
నష్ట నివారణ కోసం, నేను ఒక అడుగు వేస్తాను,
మీరూ ఒక అడుగు వేయండి.
544
00:47:31,080 --> 00:47:32,680
మీరు త్వరలోనే యూనిఫాంలో ఉంటారు.
545
00:47:34,840 --> 00:47:36,520
మీరు చెప్పింది చేస్తాను.
546
00:47:38,160 --> 00:47:39,920
భగవద్గీతపై చెయ్యేసి అబద్ధమాడుతారా?
547
00:47:45,960 --> 00:47:48,520
ఆలోచించుకోండి.
యూనిఫామ్ మీది, నిర్ణయం మీది.
548
00:47:56,760 --> 00:47:59,440
మీర్జాపూర్
549
00:49:52,360 --> 00:49:54,360
ఉపశీర్షికలు అనువదించినది
Pradeep Kumar Maheshwarla
550
00:49:54,440 --> 00:49:56,440
క్రియేటివ్ సూపర్‌వైజర్
నిశా౦తి ఈవని