1
00:00:17,920 --> 00:00:23,600
బద్లాపూర్
2
00:00:50,560 --> 00:00:52,320
-సరే, పని మొదలుపెట్టండి.
-కానివ్వు.
3
00:00:52,400 --> 00:00:53,720
-తాడు పట్టుకో.
-సరే, అన్నా.
4
00:00:54,240 --> 00:00:56,800
జాగ్రత్తగా. నెమ్మదిగా.
నెమ్మదిగా. నెమ్మదిగా.
5
00:01:05,160 --> 00:01:07,560
-సమయం వృధా చేయకు. త్వరగా.
-సరదాగానే లేదు.
6
00:01:09,640 --> 00:01:11,720
చెప్తున్నాగా,
నాణ్యత బ్రహ్మాండంగా ఉండాలి.
7
00:01:11,840 --> 00:01:13,280
ఇది మాంచి విదేశీ బ్రాండ్.
8
00:01:13,360 --> 00:01:14,880
త్వరగా కానివ్వండి.
9
00:01:18,440 --> 00:01:20,560
-మాంచి సరుకు దించండి.
-అదే పని మీదున్నా.
10
00:01:23,880 --> 00:01:25,000
నాకొక సీసా ఇవ్వరా.
11
00:01:31,480 --> 00:01:34,000
మీర్జాపూర్ వాళ్ళు వచ్చారు,
పారిపోండి!
12
00:01:57,320 --> 00:01:59,880
-గుడ్డూ పండిత్...
-మీర్జాపూర్ రాజు!
13
00:01:59,960 --> 00:02:02,880
-గుడ్డూ పండిత్...
-మీర్జాపూర్ రాజు!
14
00:02:12,240 --> 00:02:13,240
చునార్
15
00:02:13,320 --> 00:02:14,600
జరగరా, నా కొడకా!
16
00:02:30,160 --> 00:02:31,160
అరేయ్ వినరా!
17
00:02:32,760 --> 00:02:36,440
శరద్ శుక్లా పలకరించాడని
గుడ్డూ భయ్యాకు చెప్పు.
18
00:02:40,560 --> 00:02:42,000
ఛత్!
19
00:02:42,560 --> 00:02:44,120
నాకు వేరే కస్టమర్లు ఉన్నారు.
20
00:02:44,200 --> 00:02:46,000
నువ్వొక్కడివే కాదు.
21
00:03:04,240 --> 00:03:07,560
ఇవాళ సంతోషంగా కనపడుతున్నారు.
ఏంటి సంగతి?
22
00:03:12,880 --> 00:03:15,720
-ఆగు. ఉచ్చ పోసి వస్తాను.
-త్వరగా రండి.
23
00:03:33,960 --> 00:03:36,480
కాసింత మృదువుగా.
అతను నాకు ఇష్టమైనవాడు.
24
00:03:53,720 --> 00:03:54,720
రా.
25
00:03:57,080 --> 00:03:58,080
దగ్గరగా కూర్చో.
26
00:04:00,960 --> 00:04:01,960
తాగు.
27
00:04:03,800 --> 00:04:05,440
వెచ్చబడే లోపు తాగు.
28
00:04:19,520 --> 00:04:21,000
కానివ్వు, తాగు.
29
00:04:28,000 --> 00:04:31,360
-ఇప్పుడు?
-భయ్యా గారు, పూర్తయింది.
30
00:04:32,360 --> 00:04:33,360
అది నిజమే.
31
00:05:17,440 --> 00:05:23,360
బస్తీ
32
00:05:23,440 --> 00:05:26,080
గుడ్డూ భయ్యా, నా కుటుంబాన్ని చంపకండి.
33
00:05:27,480 --> 00:05:28,480
కూర్చో.
34
00:05:37,080 --> 00:05:39,360
నన్ను హేళన చేశావు కదా,
35
00:05:39,440 --> 00:05:42,960
ఆ రోజు శరద్ శుక్లాతో కలిసి, ఆ?
36
00:05:45,800 --> 00:05:47,880
కుటుంబాన్ని వదిలేయండి, గుడ్డూ భయ్యా.
37
00:05:49,960 --> 00:05:51,280
నేను ఒకరినే చంపుతాను.
38
00:05:52,200 --> 00:05:55,160
నాన్న. కొడుకు. భార్య.
39
00:05:56,360 --> 00:05:58,760
ఎవరు చావాలో మీరే నిర్ణయించుకోండి.
40
00:06:00,000 --> 00:06:02,320
మిగతావారిని వదిలిపెడతాను.
మాటిస్తున్నాను.
41
00:06:04,280 --> 00:06:05,600
గుడ్డూ భయ్యా, చూడండి...
42
00:06:05,680 --> 00:06:08,400
లెక్క ప్రకారం, మీరే చనిపోవాలి.
43
00:06:08,480 --> 00:06:10,120
ఎందుకంటే అతను మీకే శత్రువు.
44
00:06:10,960 --> 00:06:12,440
నేనో నా బిడ్డో ఎందుకు చావాలి?
45
00:06:13,080 --> 00:06:14,680
ఏం వాగుతున్నావు? నోర్ముయ్!
46
00:06:15,440 --> 00:06:17,760
గుడ్డూ భయ్యా, క్షమించండి.
తప్పు చేశాను.
47
00:06:17,840 --> 00:06:19,400
నేను మీకు విధేయుడిగా ఉంటాను.
48
00:06:34,680 --> 00:06:36,600
మీ నాన్న ఓ పిరికిపంద.
49
00:06:37,680 --> 00:06:38,920
అందుకే అతన్ని చంపాను.
50
00:06:39,800 --> 00:06:40,800
గుర్తుంచుకో,
51
00:06:42,160 --> 00:06:43,400
నేను శత్రువును కాదు.
52
00:06:47,360 --> 00:06:48,360
నీ పేరేంటి?
53
00:06:49,720 --> 00:06:50,720
మున్నా.
54
00:06:57,320 --> 00:06:58,360
బంగారం, మార్చుకో.
55
00:07:13,640 --> 00:07:15,200
గుడ్డూ, కృపాను కూడా చంపాడు.
56
00:07:23,920 --> 00:07:24,920
ఇప్పుడేంటి?
57
00:07:27,200 --> 00:07:28,800
నీ లక్ష్యం ఎవరు?
58
00:07:28,880 --> 00:07:31,000
గుడ్డూతో సంబంధమున్న ప్రతీదాన్ని.
59
00:07:31,760 --> 00:07:33,040
ఇప్పుడు వెనక్కు తగ్గలేను.
60
00:07:35,960 --> 00:07:38,320
భస్మాసురుడి కథ విన్నావా, శరద్?
61
00:07:39,960 --> 00:07:43,120
గుడ్డూ కూడా అలాగే. భస్మాసురుడు.
62
00:07:44,720 --> 00:07:46,400
స్వయంగా నాశనమై పోతాడు.
63
00:07:47,160 --> 00:07:48,600
అలజడి సృష్టించనివ్వు.
64
00:07:50,400 --> 00:07:51,960
అది నీకు అనుకూలమవుతుంది.
65
00:07:57,840 --> 00:07:59,720
-భేటీకి పిలవనా?
-వద్దు.
66
00:08:01,280 --> 00:08:03,760
భేటీకి పిలిస్తే,
నిన్ను తేలికగా తీసుకుంటాడు.
67
00:08:08,120 --> 00:08:10,920
అంటే గుడ్డూ కండబలాన్ని,
బుద్ధిబలాన్ని దెబ్బ తీయకూడదు.
68
00:08:11,000 --> 00:08:12,000
మరి నేను ఏం చేయాలి?
69
00:08:15,040 --> 00:08:18,520
గుడ్డూ దెబ్బకు భయపడి,
మిగిలిన బాహుబలులు భేటీని ఏర్పాటు చేస్తారు.
70
00:08:19,520 --> 00:08:21,360
అప్పుడు నీ శక్తిని చూపించు.
71
00:08:22,440 --> 00:08:23,440
ఎలా?
72
00:08:26,360 --> 00:08:28,680
చూడు, గద్దెకు అర్హత సాధించడానికి
73
00:08:30,000 --> 00:08:33,040
హింసను సృష్టించే సామర్థ్యం అవసరం లేదు.
74
00:08:33,760 --> 00:08:37,600
కానీ ఎవరైతే హింసను ఆపగలడో
వాడే గద్దెకు అర్హుడు.
75
00:08:39,960 --> 00:08:42,360
అప్పుడు నీ ఆధిపత్యం స్థాపితమవుతుంది.
76
00:08:48,120 --> 00:08:51,280
కానీ మీరు ఉండగా
నేను గద్దెను ఎలా చేపట్టగలను?
77
00:08:54,280 --> 00:08:56,160
చాలా కాలం ముందే గద్దెను వదిలిపెట్టా.
78
00:08:58,720 --> 00:09:00,520
గద్దెపై మున్నా కూర్చోవాలనుకున్నా.
79
00:09:03,720 --> 00:09:05,360
ఇప్పుడు నిన్ను కూర్చోబెడతాను.
80
00:09:07,520 --> 00:09:10,240
మీర్జాపూర్ గద్దెకు
అసలైన హక్కుదారుడివి నువ్వే.
81
00:09:22,240 --> 00:09:24,400
మీర్జాపూర్
82
00:10:03,760 --> 00:10:05,760
పూర్వాంచల్
83
00:10:18,640 --> 00:10:20,640
గుడ్డూ గారు, మీరు ఇవన్నీ
84
00:10:21,520 --> 00:10:24,720
గోలు కోసం చేస్తున్నారా
లేదా ఈ రక్తపాతంలో మీకు ఆనందం వస్తోందా?
85
00:10:24,760 --> 00:10:25,760
మున్నవర్
86
00:10:25,880 --> 00:10:27,480
నేను అంతగా ఆలోచించను.
87
00:10:28,120 --> 00:10:32,160
నాకు ఏది సరిగా అనిపిస్తే అది చేస్తా.
సరిగా అనిపించకపోతే, మళ్ళీ చేస్తా.
88
00:10:33,240 --> 00:10:35,320
నా సందేశం స్పష్టం, మున్నవర్ గారు.
89
00:10:35,400 --> 00:10:38,520
నాకు గోలు దొరికేంత వరకూ
నేను అస్సలు ఆగను.
90
00:10:38,640 --> 00:10:40,480
ఇంతదాకా విన్నవించుకున్నా,
91
00:10:40,520 --> 00:10:44,440
కానీ ఇప్పుడు ఆదేశిస్తున్నా. ఆపండి.
92
00:10:46,360 --> 00:10:49,000
విషయం వృత్తిపరమైనది అయినప్పుడు,
మీ మాట విన్నాను.
93
00:10:49,080 --> 00:10:50,760
కానీ ఇది వ్యక్తిగత విషయం.
94
00:10:50,880 --> 00:10:52,320
నన్నే వ్యవహరించనివ్వండి.
95
00:10:52,400 --> 00:10:54,040
అందరూ నష్టపోతున్నారు.
96
00:10:54,760 --> 00:10:58,000
ఈ గొడవ మూలంగా
మొత్తం పూర్వాంచల్ ఇబ్బందిపడుతోంది.
97
00:10:59,080 --> 00:11:00,920
అలాంటప్పుడు వ్యక్తిగతం ఎలా అవుతుంది?
98
00:11:02,280 --> 00:11:04,400
ఇక మీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు
99
00:11:05,400 --> 00:11:06,720
గోలు జౌన్‌పూర్‌లో ఉందని.
100
00:11:08,440 --> 00:11:11,120
గోలు జౌన్‌పూర్‌లో లేదనే సాక్ష్యం
మీ దగ్గరా లేదు.
101
00:11:15,440 --> 00:11:17,600
మీకు సాక్ష్యం దొరకగానే, కాల్ చేయండి.
102
00:11:24,440 --> 00:11:26,320
నల్లమందు రేపు ఉదయం పంపుతారు.
103
00:11:26,920 --> 00:11:28,200
దళారులు అందరికీ చెప్పు.
104
00:11:28,680 --> 00:11:30,240
క్యాష్ ఆన్ డెలివరీనా, భయ్యా?
105
00:11:34,560 --> 00:11:36,160
ఎంబీఏ ఎక్కడి నుండి చేశావు?
106
00:11:36,240 --> 00:11:39,400
ఆ, భయ్యా గారు,
ఈ వెధవ బీఏ పాసయ్యాడు.
107
00:11:39,480 --> 00:11:40,640
అదీ ప్రైవేట్‌గా చేశాడు.
108
00:11:42,240 --> 00:11:43,200
అలాగా.
109
00:11:45,000 --> 00:11:46,440
నువ్వు ఏం చదివావు?
110
00:11:46,520 --> 00:11:49,400
తొమ్మిది చదివాను.
బోర్డ్ పరీక్షలు పాస్ కాలేకపోయాను.
111
00:11:52,200 --> 00:11:53,240
పని నువ్వే చూసుకో.
112
00:11:59,920 --> 00:12:01,960
ఐఎన్ఎన్-386
శుభ యాత్ర
113
00:12:02,040 --> 00:12:07,320
రప్తి నది - నేపాల్
114
00:12:19,800 --> 00:12:20,800
హలో.
115
00:12:22,200 --> 00:12:24,280
అరగంటలో పని అయిపోతుంది.
116
00:12:27,400 --> 00:12:33,360
ఖాట్మాండు - నేపాల్ - గోరఖ్‌పూర్
జౌన్‌పూర్ - బలియా
117
00:12:42,720 --> 00:12:47,680
రప్తి నది - గోరఖ్‌పూర్
118
00:12:53,000 --> 00:12:54,560
బాబూ, సిగరెట్ తీసుకో.
119
00:13:03,640 --> 00:13:06,480
హెచ్చరిక! మీరు ఇప్పుడు
భారతీయ హద్దులో ఉన్నారు.
120
00:13:06,560 --> 00:13:08,200
-పడవను ఆపండి.
-పోలీసులు.
121
00:13:08,280 --> 00:13:11,600
ఇక పడవ సిబ్బంది
తమ గుర్తింపు పత్రాలు సిద్ధంగా పెట్టుకోండి.
122
00:13:12,200 --> 00:13:13,880
-హెచ్చరిస్తున్నా.
-పడవను ఆపండి.
123
00:13:13,960 --> 00:13:18,040
మీ పడవను ఆపండి,
మీ గుర్తింపు చూపడానికి సిద్ధం కండి.
124
00:13:20,920 --> 00:13:21,920
చేతులు ఎత్తండి!
125
00:13:27,400 --> 00:13:29,360
-మోకాళ్ళపై కూర్చోండి!
-అలాగే, సర్.
126
00:13:29,440 --> 00:13:30,280
సరే, సర్.
127
00:13:31,160 --> 00:13:32,040
కూర్చో!
128
00:13:43,920 --> 00:13:45,000
ఆ, అక్కడ చూడు.
129
00:13:46,200 --> 00:13:49,160
బాగా గాలించు.
ప్రతీ మూల వెతుకు.
130
00:13:56,360 --> 00:13:57,600
సర్, కొంచెం తినండి.
131
00:13:58,680 --> 00:14:02,080
సర్, క్షుణ్ణంగా వెతికాం.
ఏమీ దొరకలేదు.
132
00:14:03,200 --> 00:14:04,200
అలాగా?
133
00:14:05,560 --> 00:14:08,720
ఫర్వాలేదు. మనకు వచ్చిన సమాచారమే
తప్పుగా ఉన్నట్టుంది.
134
00:14:09,640 --> 00:14:10,600
సర్.
135
00:14:13,040 --> 00:14:14,040
పదండి, బాబులు.
136
00:14:14,120 --> 00:14:15,120
అద్భుతం.
137
00:14:15,600 --> 00:14:16,800
మీరంతా తిన్నారా?
138
00:14:47,280 --> 00:14:48,560
జోషీ ఎందుకు వచ్చాడు?
139
00:14:51,200 --> 00:14:53,600
గుడ్డూ, నల్లమందు పడవలను
పోలీసులు పట్టుకున్నారు.
140
00:14:54,120 --> 00:14:55,360
మరి బయట ఉన్నదేంటి?
141
00:14:56,400 --> 00:14:59,600
జోషీ వల్లే, నల్లమందు
మరో మార్గంలో ఇక్కడికి చేరుకుంది.
142
00:15:04,880 --> 00:15:05,880
అలాగా.
143
00:15:11,280 --> 00:15:12,640
ఏం గీస్తున్నావు?
144
00:15:14,160 --> 00:15:15,360
నాన్నకు ఏమని చెప్పను?
145
00:15:16,320 --> 00:15:17,520
ఎందుకు? ఏమైంది?
146
00:15:18,960 --> 00:15:20,080
నల్లమందు వచ్చింది.
147
00:15:21,720 --> 00:15:23,560
ఈసారి మరో దారి కనుక్కుందాం.
148
00:15:24,600 --> 00:15:26,560
జరిగినదాన్ని మనం మార్చలేము కదా.
149
00:15:27,680 --> 00:15:30,160
గుడ్డూ, నేను నాన్నకు మాటిచ్చాను,
150
00:15:30,240 --> 00:15:32,480
ప్రతీసారిలా ఈసారి నువ్వు చెడగొట్టవని.
151
00:15:37,960 --> 00:15:38,960
"చెడగొట్టడమా"?
152
00:15:44,920 --> 00:15:46,520
చూడు, మీ నాన్న...
153
00:15:51,080 --> 00:15:52,680
కేవలం లాభాన్నే పట్టించుకుంటాడు.
154
00:15:54,960 --> 00:15:57,160
ఇంకెవరినీ అతను పట్టించుకోడు.
155
00:15:58,200 --> 00:15:59,960
నువ్వు చాలా తెలివైనదానివి.
156
00:16:00,040 --> 00:16:03,360
గుడ్డూకు జవాబుదారీ ఎవరూ తీసుకోలేరని
నీకు తెలిసుండాలి.
157
00:16:06,840 --> 00:16:08,160
నువ్వెందుకు తీసుకున్నావు?
158
00:16:09,000 --> 00:16:11,480
నీకు నేను ముఖ్యమైన మనిషినని అనుకున్నాను.
159
00:16:12,880 --> 00:16:15,920
ఇక నువ్వు ఏం చేశావు?
ప్రతీదీ ముప్పులో పడేశావు.
160
00:16:17,000 --> 00:16:18,240
ఎవరి కోసం?
161
00:16:18,320 --> 00:16:19,720
ఆ గోలు కోసమా?
162
00:16:22,000 --> 00:16:25,680
"ఆ గోలు కోసం",
నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను.
163
00:16:28,760 --> 00:16:33,200
గుడ్డూ, నేను ఎక్కువ మాట్లాడకపోవచ్చు,
కానీ దాని అర్థం నేను దద్దమ్మనని కాదు.
164
00:16:36,560 --> 00:16:39,960
నల్లమందు ఒప్పందం కోసం
నువ్వు నా దగ్గరికి వచ్చావు. కదా?
165
00:16:41,000 --> 00:16:42,480
"గుడ్డూ ఒక మూర్ఖుడు."
166
00:16:43,160 --> 00:16:45,440
అయితే, జౌన్‌పూర్‌కే వెళ్ళుండాల్సి౦ది.
167
00:16:46,520 --> 00:16:48,840
వెళ్ళుండాల్సి౦ది! నేను ఎందుకు...
168
00:16:53,880 --> 00:16:55,640
నేను చెడగొట్టడం లేదు.
169
00:16:56,200 --> 00:16:59,680
నేను చెడగొడుతున్నానని
అనుకునేవారు చెడగొడుతున్నారు.
170
00:17:05,480 --> 00:17:06,800
నల్లమందు తీసుకెళుతున్నా.
171
00:17:07,960 --> 00:17:11,520
డబ్బులు చెల్లించాను.
నీ వాటా నీకు వస్తుంది.
172
00:17:11,560 --> 00:17:13,240
నాకు నీ నుండి ఏదీ అవసరం లేదు.
173
00:17:13,320 --> 00:17:16,880
అలాగే కానివ్వు.
నీ వాటా డబ్బు తగలబెడతాను. సరేనా?
174
00:17:34,240 --> 00:17:40,200
త్రిపాఠీ
175
00:17:53,800 --> 00:17:55,440
కాలీన్ భయ్యా చెప్పేవారు,
176
00:17:55,520 --> 00:17:59,520
నల్లమందు ధరను నియంత్రించడానికి,
దాని సరఫరాను కూడా నియంత్రించాలని.
177
00:18:01,560 --> 00:18:03,920
బాహుబలులకు నల్లమందును
రేగిపళ్ళలా పంచిపెడితే,
178
00:18:05,000 --> 00:18:06,160
ధర పతనం కాదా?
179
00:18:09,240 --> 00:18:11,040
నేపాల్‌కు లాభం చూపించకపోతే,
180
00:18:11,520 --> 00:18:13,560
వాళ్ళు సరఫరా చేయడానికి సంకోచిస్తారు.
181
00:18:23,080 --> 00:18:26,080
ఈసారి కూడా దర్బార్ వద్దన్నావని
రాధియా అంది.
182
00:18:28,880 --> 00:18:30,240
అందుకు తగిన మనసు లేదు.
183
00:18:35,240 --> 00:18:37,440
పనిని, మనసును వేరుగా పెట్టడం నేర్చుకోండి.
184
00:18:42,800 --> 00:18:45,040
మనసును తేలికపరచుకోవచ్చు కూడా.
185
00:18:48,960 --> 00:18:50,760
మీకు ఏం చేయడం ఇష్టమో చెప్పండి?
186
00:18:53,080 --> 00:18:55,480
దర్బార్‌ను పిలిపించండి. చూసుకుంటాను.
187
00:19:11,880 --> 00:19:16,800
మీర్జాపూర్ - వారణాసి - జౌన్‌పూర్
ప్రయాగ్‌రాజ్ - ఆజమ్‌ఘర్
188
00:19:16,920 --> 00:19:22,880
ఘాజీపూర్ - బస్తీ - మౌ
బలియా - దియోరా
189
00:19:22,960 --> 00:19:26,560
గోరఖ్‌పూర్ - ఖుషీనగర్ - మహరాజ్‌గంజ్
190
00:19:38,680 --> 00:19:39,680
భయ్యా గారు...
191
00:19:45,320 --> 00:19:47,440
ఈ నల్లమందు నాణ్యత
మనదాని కన్నా బాగుంది.
192
00:19:51,320 --> 00:19:52,920
ఇది మార్కెట్‌లోకి వచ్చిందంటే,
193
00:19:54,920 --> 00:19:56,640
మన సరుకుకు గిరాకీ తగ్గిపోతుంది.
194
00:19:56,720 --> 00:19:58,280
ఇది అమ్ముడుపోకుండా చూడండి.
195
00:20:00,320 --> 00:20:03,440
పూర్వాంచల్‌లో మీ నెట్వర్క్ చాలా పాతది,
ఛడ్డా గారు.
196
00:20:04,440 --> 00:20:05,680
అది ఉపయోగించుకోండి.
197
00:20:07,480 --> 00:20:09,800
భయ్యా, నేను నా ప్రాంతంలో నియంత్రించగలను.
198
00:20:12,280 --> 00:20:14,560
కానీ మనం మార్కెట్ నుండి
తీసుకున్న డబ్బులకు
199
00:20:15,320 --> 00:20:17,720
మొత్తం పూర్వాంచల్‌ను
నియంత్రణలోకి తీసుకోవాలి.
200
00:20:24,000 --> 00:20:25,320
గుడ్డూను దెబ్బకొట్టాలి.
201
00:20:26,920 --> 00:20:29,160
వాడు కూలిపోయే దాకా వేచి చూడలేం.
202
00:20:33,960 --> 00:20:37,080
"నేనూ పేదింటి బిడ్డనని,
ఏం లంజమాటలు మాట్లాడుతున్నావు?
203
00:20:37,720 --> 00:20:41,160
"అయినప్పటికీ ఓట్లు పడకపోతే,
అప్పుడు ఇలా వ్యవహరిస్తారు.
204
00:20:41,960 --> 00:20:45,320
"మత అల్లర్లలోకి మనల్ని తోసి
వారి మడ్డ గుడిపించుకుంటారు.
205
00:20:46,040 --> 00:20:49,400
"ఇలాంటి అబద్ధాలతో
జీవించే నాయకులను చూసి సిగ్గుపడాలి.
206
00:20:49,480 --> 00:20:52,320
"ఆతు అంత గర్వంతో,
తమని తాము నాయకులని పిలుచుకుంటారు.
207
00:20:58,400 --> 00:20:59,520
నీది ఎలా ఉందంటే,
208
00:21:00,760 --> 00:21:03,080
శైలి తప్పుగా ఉంది,
కానీ విషయం సరిగ్గా ఉంది.
209
00:21:03,560 --> 00:21:05,640
శైలి తప్పుగా ఉంది,
కానీ విషయం సరిగా ఉందా?
210
00:21:06,080 --> 00:21:08,160
ఓ పరాచికం తీసుకునేంత
దమ్ము వారికి లేదా?
211
00:21:08,720 --> 00:21:10,400
ఐపీసీ 294 కింద కేసు పెట్టారు.
212
00:21:10,960 --> 00:21:13,200
అశ్లీల చట్టం. చూడ౦డి.
213
00:21:14,080 --> 00:21:15,560
నీ వకీలు ఏం చేశాడు?
214
00:21:19,560 --> 00:21:21,560
కవితలు వినిపించి
పొట్ట నింపుకునేవాడికి,
215
00:21:21,640 --> 00:21:24,240
వకీలును పెట్టుకునేంత
డబ్బులు వస్తాయంటారా?
216
00:21:26,400 --> 00:21:28,720
చట్టాలను స్వయంగా చదివి
వాదిద్దాం అనుకున్నా.
217
00:21:29,240 --> 00:21:32,440
కానీ చదవడం, వాదించడం
రెండూ భిన్న విషయాలని తర్వాత అర్థమైంది.
218
00:21:33,320 --> 00:21:34,760
నువ్వు వకీలు అవుతావా?
219
00:21:35,680 --> 00:21:37,200
నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నా.
220
00:21:38,320 --> 00:21:40,880
కానీ ప్రస్తుతం వకీలు కాగలిగినా,
పెద్ద విషయమే.
221
00:21:53,720 --> 00:21:56,360
మట్టిని అంత గట్టిగా అదిమితే,
222
00:21:57,000 --> 00:21:58,320
మొక్కకు ఊపిరాడదు.
223
00:21:58,800 --> 00:22:01,240
వాటిని కూడా ఊపిరి పీల్చుకోనివ్వండి.
224
00:22:03,040 --> 00:22:05,040
కాస్త మట్టిని వదులుగా వదిలేయండి.
225
00:22:07,560 --> 00:22:08,640
విను, బాబు.
226
00:22:14,480 --> 00:22:15,480
ఇది...
227
00:22:15,960 --> 00:22:17,360
వెళ్ళి కాస్త టీ తాగి రా...
228
00:22:23,760 --> 00:22:25,520
ఇక్కడే స్థిరపడిపోయారా?
229
00:22:25,600 --> 00:22:29,480
లాలా గారు, మనిషి ఎక్కడున్నా
జీవితానికి ఏదో ఒక అర్థాన్ని వెతుక్కుంటాడు.
230
00:22:31,320 --> 00:22:35,680
మీరు చాలా మంది ఖైదీలకు అప్పీళ్లు
వేస్తున్నారని విన్నాను.
231
00:22:37,200 --> 00:22:38,360
నాకు కూడా వేయండి.
232
00:22:41,360 --> 00:22:44,280
లాలాగారు, వాళ్ళందరికీ అవసరం ఉంది.
233
00:22:45,120 --> 00:22:47,720
ఇక మీరు ఒక నేరస్తుడు,
మీరు కూడా అది ఒప్పుకుంటారు.
234
00:22:48,200 --> 00:22:50,880
నేను వ్యాపారినని
మీకు పలు మార్లు చెప్పుంటాను.
235
00:22:53,280 --> 00:22:56,320
నేను మీ నుండి చట్టవ్యతిరేకమైనది
ఏదీ కోరడం లేదు.
236
00:22:57,640 --> 00:22:59,560
మీకు కూడా బాగా తెలుసు
237
00:23:00,240 --> 00:23:01,720
నాకు బెయిల్‌కు అర్హత ఉందని.
238
00:23:02,240 --> 00:23:03,240
కానీ...
239
00:23:04,160 --> 00:23:06,120
ప్రభుత్వ ఒత్తిడి వల్ల,
240
00:23:06,960 --> 00:23:08,760
దాన్ని మాటిమటికీ అడ్డుకుంటున్నారు.
241
00:23:09,840 --> 00:23:10,840
అన్నట్టు,
242
00:23:12,880 --> 00:23:16,880
మీ చట్టం ముందు
అందరూ సమానమే కదా, పండిత్ గారు?
243
00:23:21,960 --> 00:23:25,800
సరే, నేను మీ అర్జీ రాస్తాను.
244
00:23:27,400 --> 00:23:29,520
కానీ మీరు
మీ ఒప్పుకోలును కూడా రాయండి.
245
00:23:34,200 --> 00:23:37,120
సాక్షిగా మారిపోండి.
మీ శిక్షను తగ్గేలా చూస్తాను.
246
00:23:42,840 --> 00:23:44,520
అవును, అన్నీ తీసుకున్నాను.
247
00:23:45,440 --> 00:23:46,840
ఏం సరి చూస్తావు?
248
00:23:47,720 --> 00:23:50,600
నా మాట నువ్వు నమ్మనే నమ్మవు కదా.
ఆ, చెప్పండి.
249
00:23:51,680 --> 00:23:53,280
అవును, వంకాయ, తీసుకున్నాను.
250
00:23:54,440 --> 00:23:55,680
సీమ మిరప తీసుకున్నా.
251
00:23:57,160 --> 00:23:58,280
క్యారెట్లు తీసుకున్నా.
252
00:24:00,040 --> 00:24:01,920
బజ్జీ మిరప తీసుకున్నా.
253
00:24:02,760 --> 00:24:04,600
అవును. బీన్స్ కూడా తీసుకున్నా.
254
00:24:05,400 --> 00:24:06,400
సొరకాయ...
255
00:24:08,000 --> 00:24:10,040
సొరకాయ తెమ్మని చెప్పావా...
256
00:24:10,720 --> 00:24:12,720
ఆ, ఆ, ఉంది. సొరకాయ ఉంది.
257
00:24:12,800 --> 00:24:14,200
సొరకాయ కూడా ఉంది.
258
00:24:14,280 --> 00:24:16,080
వస్తున్నాను. పెట్టేస్తున్నా.
259
00:24:19,840 --> 00:24:21,000
-ఒక పని చేయి.
-ఆ?
260
00:24:21,600 --> 00:24:24,400
-వెళ్ళి సొరకాయలు తీసుకుని వేగంగా రా.
-అలాగే సర్.
261
00:24:24,920 --> 00:24:28,160
నా భద్రత కోసం,
కొత్తిమీర, పచ్చి మిరప, అల్లం కూడా తీసుకో.
262
00:24:28,240 --> 00:24:29,360
-సరేనా?
-సరేనండి.
263
00:24:29,920 --> 00:24:32,080
రెండు వైపులా నాకు మేడమ్‌లే.
264
00:24:33,600 --> 00:24:35,440
-వెళ్ళు, త్వరగా వచ్చేయ్.
-అలాగే, సర్.
265
00:24:41,680 --> 00:24:44,320
నేరరహిత యూపీకి
అతిపెద్ద శత్రువులు వీరే.
266
00:24:47,400 --> 00:24:50,840
జీతం మీ ప్రభుత్వం నుండి తీసుకుంటారు,
బాహుబలుల కోసం పని చేస్తారు.
267
00:24:52,200 --> 00:24:53,200
ఏం చేయగల౦?
268
00:24:54,160 --> 00:24:57,200
మీలాంటి నిజాయితీ కల అధికారులు
చాలా తక్కువ మంది ఉన్నారు.
269
00:24:58,080 --> 00:24:59,240
అవునండి.
270
00:25:11,120 --> 00:25:12,120
మేడమ్,
271
00:25:12,680 --> 00:25:15,560
ఇది హోమ్ మంత్రి
సమ్మతి లేకుండా సాధ్యం కాదు.
272
00:25:17,200 --> 00:25:19,040
సోలంకీ ఈ విషయం అర్థం చేసుకోవాలి,
273
00:25:20,640 --> 00:25:23,320
శాఖ అతనిది కావచ్చు,
కానీ ప్రభుత్వం నాది.
274
00:25:24,760 --> 00:25:27,200
నిజమే, అయినా మనం ఒకసారి సమ్మతి...
275
00:25:27,280 --> 00:25:29,560
ఆనంద్ గారు,
నేరరహిత రాష్ట్రం కావాలంటే,
276
00:25:29,640 --> 00:25:32,560
బాహుబలులకు, పోలీసులకు మధ్యనున్న
ఈ విషపూరిత బంధం తెంచాలి.
277
00:25:34,160 --> 00:25:36,120
ఈ బదిలీల జాబితా సిద్ధం చేయండి.
278
00:25:36,200 --> 00:25:37,880
-తక్షణమే.
-అలాగేనండి.
279
00:25:52,120 --> 00:25:53,520
అయ్యో, గుప్తా,
280
00:25:54,840 --> 00:25:56,200
మళ్ళీ వచ్చావా?
281
00:25:57,760 --> 00:26:00,080
-సర్, నేను వారం రోజులుగా వస్తున్నాను.
-సర్.
282
00:26:04,000 --> 00:26:05,520
నా కూతురు కనిపించడం లేదు.
283
00:26:06,120 --> 00:26:08,240
మీ స్థానిక వేగులను అడిగి చూడు.
284
00:26:09,240 --> 00:26:12,560
మీ అమ్మాయి,
జనాలను కనిపించకుండా చేసేవారిలో ఒకరు.
285
00:26:13,560 --> 00:26:15,120
ఎక్కడో అజ్ఞాతంలో ఉండుంటుంది.
286
00:26:16,960 --> 00:26:19,960
ఆమె ప్రియుడిని అడిగి చూడు.
287
00:26:22,760 --> 00:26:23,760
తప్పుగా అన్నానా?
288
00:26:24,800 --> 00:26:27,120
సర్, నేను ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాను.
289
00:26:28,360 --> 00:26:31,000
-ఆమె ఫోన్ జాడ కనిపెట్టి చూడండి.
-చూడు, గుప్తా,
290
00:26:32,680 --> 00:26:36,320
నీకు సంకేతాలు ఇచ్చి ఇచ్చీ అలసిపోయాను.
291
00:26:37,080 --> 00:26:38,080
నా మాట విను.
292
00:26:38,880 --> 00:26:41,720
నీ కూతురు ప్రభుత్వానికి శత్రువు.
293
00:26:43,160 --> 00:26:45,280
ఇక నీ వియ్యంకుడు పోలీసు హంతకుడు.
294
00:26:45,840 --> 00:26:49,480
మీరు ఇక్కడ ఎన్నిసార్లు అడిగినా,
మీకు సహాయం దొరకదు.
295
00:26:50,680 --> 00:26:52,720
అర్థమైందా? వెళ్ళిపోండి.
296
00:26:58,400 --> 00:26:59,480
హలో.
297
00:27:02,640 --> 00:27:05,600
ఇంతలో, సీఎం మాధురి
భారీ చర్య చేపట్టారు.
298
00:27:05,680 --> 00:27:09,040
పోలీసు శాఖలో భారీ ఎత్తున బదిలీలు
జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
299
00:27:09,120 --> 00:27:12,200
దాదాపు ప్రతీ జిల్లా ఎస్పీని
బదిలీ చేశారు.
300
00:27:12,280 --> 00:27:16,040
ఇదే కాకుండా, సుమారు 150 మంది
స్టేషన్ ఇంచార్జ్ స్థాయి అధికారులను,
301
00:27:16,120 --> 00:27:18,160
200ల మంది ఎస్ఐ స్థాయి అధికారులను,
302
00:27:18,640 --> 00:27:22,120
అలాగే రిజర్వేషన్ స్థాయి కల
కానిస్టేబుళ్ళు కూడా బదిలీ అయ్యారు.
303
00:27:22,200 --> 00:27:24,400
మంత్రిగారికి తీరిక లేదని చెప్పా కదా.
304
00:27:24,960 --> 00:27:28,600
కొత్త ఆదేశం వస్తుంది. మీకు కాల్ చేస్తాను.
305
00:27:28,680 --> 00:27:29,840
కాస్త ఓపిక పట్టండి.
306
00:27:47,480 --> 00:27:48,800
-నమస్తే, సర్.
-నమస్తే, సర్.
307
00:27:52,920 --> 00:27:54,880
-సర్, భేటీ మొదలైంది.
-అయితే?
308
00:27:54,960 --> 00:27:57,360
ఆలస్యంగా వచ్చేవారికి
అనుమతి లేదని మేడమ్ ఆదేశం.
309
00:28:00,360 --> 00:28:02,040
మేడమ్ ఆదేశాలు నాశనం కాను.
310
00:28:04,640 --> 00:28:08,280
కఠిన చర్యలు లేకుండా,
రాష్ట్రాన్ని నేరరహితం చేయడం అసాధ్యం.
311
00:28:10,480 --> 00:28:13,360
రాష్ట్ర శాంతిభద్రతల వ్యవస్థతో
ఏం ఆటలు ఆడుతున్నారు?
312
00:28:13,840 --> 00:28:16,560
నాతో ఒక మాటైనా చెప్పకుండా
నా శాఖ ఆదేశం ఎలా ఇచ్చారు?
313
00:28:18,480 --> 00:28:21,000
ఇదే మీ కార్యక్రమం అయితే,
ఇక నా అవసరం ఏంటి?
314
00:28:21,640 --> 00:28:23,880
అవసరం లేదు. రాజీనామా చేయండి.
315
00:28:34,160 --> 00:28:38,040
చూడండి మేడమ్, మీరు రాజకీయాల్లోకి
నిన్న కాక మొన్న వచ్చారు.
316
00:28:39,440 --> 00:28:42,760
నేను ఎన్నో ఏళ్ళుగా
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధిగా ఉన్నాను.
317
00:28:43,680 --> 00:28:47,920
నేను రాజీనామా చేస్తే,
ప్రభుత్వం నిమిషాల్లో కుప్పకూలుతుంది.
318
00:28:49,360 --> 00:28:52,880
సోలంకీ గారు, మీరు
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కదా?
319
00:28:53,720 --> 00:28:55,320
అయితే ప్రజల కోసం పని చేయండి.
320
00:28:56,040 --> 00:28:59,200
జేబులు నింపుకునే ప్రభుత్వాన్ని నడపడం
నాకు ఇష్టం లేదు.
321
00:29:02,760 --> 00:29:04,440
మీరు కూర్చోండి లేదా బయటకెళ్లండి.
322
00:29:06,160 --> 00:29:07,160
ఆయనను తీసుకెళ్ళండి.
323
00:29:09,320 --> 00:29:10,320
పదండి.
324
00:29:26,600 --> 00:29:27,840
ఒక మాట అడగనా?
325
00:29:27,920 --> 00:29:28,920
నన్ను భయపెట్టేశావు.
326
00:29:30,120 --> 00:29:32,440
మీరెప్పుడైనా చొక్కా ప్యాంటు వేసుకున్నారా?
327
00:29:34,760 --> 00:29:37,280
గోలును అడగకుండా తన బట్టలు వేసుకున్నావా?
328
00:29:37,360 --> 00:29:38,560
తను తిరిగొస్తేనే కదా.
329
00:29:43,560 --> 00:29:45,440
గుడ్డూ బలియాకు వెళ్ళడం నీకు మంచిది.
330
00:29:46,040 --> 00:29:48,080
లేదంటే నీ మాటకు
పిచ్చ కోపం వచ్చుండేది.
331
00:29:48,160 --> 00:29:49,280
అది వదలండి.
332
00:29:49,760 --> 00:29:51,000
మీరు జవాబు ఇవ్వలేదు.
333
00:29:51,720 --> 00:29:54,840
-ఎప్పుడైనా వేసుకుని...
-బాబు పాలను సిద్ధం చేశావా? వెళ్ళు!
334
00:29:56,360 --> 00:29:57,680
"ప్వాంట్-షర్ట్."
335
00:31:17,000 --> 00:31:19,400
మొత్తం బీహార్‌లో
ఇలాంటి చౌ మిన్ ఎక్కడా దొరకదు.
336
00:31:23,280 --> 00:31:24,280
సరే, తీసుకోండి.
337
00:31:26,560 --> 00:31:28,040
సారీ, ఫోర్క్‌లు దొరకలేదు.
338
00:31:28,800 --> 00:31:30,480
చేతులతో తింటారు కదా.
339
00:31:32,520 --> 00:31:34,040
మీకు బలం అవసరం కదా.
340
00:31:34,120 --> 00:31:35,600
నన్ను ఎందుకు చంపేయలేదు?
341
00:31:39,480 --> 00:31:42,040
నేను మిమ్మల్ని ఎందుకు చంపలేదు?
342
00:33:03,800 --> 00:33:05,160
సరదాగా లేదా?
343
00:33:28,920 --> 00:33:29,920
ఆ, సలోనీ?
344
00:33:30,000 --> 00:33:32,840
ఆ. మీరు తినడానికి వస్తారా రారా
అని అమ్మ అడగమంది.
345
00:33:32,920 --> 00:33:35,160
మీకు తీరిక లేదని చెప్పాను.
సరిగానే చెప్పాగా?
346
00:33:35,240 --> 00:33:37,120
నేను ఇంటికి వస్తున్నా.
347
00:33:37,800 --> 00:33:39,800
అయితే మీకు భోజనం వండాలా వద్దా?
348
00:33:41,000 --> 00:33:42,760
ఆ, భోజనం ఇంట్లోనే చేస్తాను.
349
00:33:42,840 --> 00:33:44,720
అయితే కలిసి తిందాం.
350
00:33:44,800 --> 00:33:46,080
కచ్చితంగా వస్తారు కదా?
351
00:33:46,160 --> 00:33:49,520
వస్తానని చెప్పా కదా.
వచ్చేస్తాను. ఫోన్ పెట్టు.
352
00:33:49,600 --> 00:33:50,920
సరే. అలాగే. ఉంటాను.
353
00:33:51,000 --> 00:33:52,240
అద్భుతంగా ఉంది!
354
00:33:56,000 --> 00:33:57,000
చౌ మిన్.
355
00:33:59,240 --> 00:34:00,240
భలే రుచిగా ఉంది.
356
00:34:02,920 --> 00:34:03,920
నువ్వు కూడా తిను.
357
00:34:06,240 --> 00:34:07,640
లేదా నీకూ నచ్చదా?
358
00:34:08,760 --> 00:34:09,760
చిన్నోడిలాగా?
359
00:34:35,560 --> 00:34:36,560
మేడమ్.
360
00:34:42,160 --> 00:34:47,600
మీ సీఎం అందరికంటే
దగ్గరగా హింసను చూశాడు.
361
00:34:48,320 --> 00:34:49,320
నా ఆడబిడ్డ,
362
00:34:50,880 --> 00:34:51,880
యూపీకే ఆడబిడ్డ,
363
00:34:53,120 --> 00:34:54,160
మాధురి యాదవ్.
364
00:34:55,160 --> 00:34:57,840
ఎలా విధవ అయ్యిందో మీకు గుర్తుందిగా?
365
00:34:59,000 --> 00:35:00,000
మీకు గుర్తుందా
366
00:35:02,800 --> 00:35:06,280
స్వర్గీయ రోషన్ సింగ్ గారు
తుపాకీ తూటాకు బలయ్యారని?
367
00:35:06,360 --> 00:35:08,600
లోక్ స్వరాజ్య పార్టీపై
మోసం చేశారనే ఆరోపణలు
368
00:35:08,640 --> 00:35:11,560
మాధురి యాదవ్ మొదటి భర్త
మృతవీరుడేం కాదు.
369
00:35:12,920 --> 00:35:14,480
-ఏంటి?
-అది ఆత్మహత్య.
370
00:35:15,320 --> 00:35:17,640
ఎలా జరిగింది? వివరాలు చెప్పండి.
371
00:35:19,960 --> 00:35:22,560
అతను తాగుబోతు. పచ్చి తాగుబోతు.
372
00:35:23,080 --> 00:35:24,760
ఇక స్వర్గీయ సీఎం గారు
373
00:35:27,040 --> 00:35:31,480
రాజకీయ స్వలాభం కోసం
అతన్ని మృతవీరుడిగా ప్రకటించారు.
374
00:35:33,160 --> 00:35:35,800
సానుభూతి ఓట్లతో
కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
375
00:35:35,880 --> 00:35:37,800
ఈ క్లిప్‌ను ఇక్కడే ఆపుదాం
376
00:35:37,880 --> 00:35:41,560
ఎందుకంటే మనతో పాటు
ప్రతిపక్ష నేత ఖుష్వాహా గారు ఉన్నారు.
377
00:35:42,560 --> 00:35:46,920
ఖుష్వాహా గారు, ప్రతిపక్ష నేతగా,
మీ తరువాతి అడుగేంటి?
378
00:35:47,000 --> 00:35:48,000
సీబీఐ విచారణ.
379
00:35:48,800 --> 00:35:50,760
విషయాన్ని నిష్పాక్షికంగా విచారించాలి.
380
00:35:50,840 --> 00:35:53,360
ఓ కుటుంబసభ్యుడి మృతితో
శవరాజకీయాలు చేసే
381
00:35:53,440 --> 00:35:56,800
ఇలాంటివారు సాధారణ ప్రజలతో ఏం చేస్తారు?
382
00:35:56,880 --> 00:35:58,200
ఈ ఆలోచనే నాకు భయమేస్తోంది.
383
00:35:58,680 --> 00:36:03,200
మాధురి యాదవ్ గారు, తెల్ల వస్త్రాలు
మీ నల్లటి చరిత్రను కప్పేయవు.
384
00:36:03,680 --> 00:36:05,640
ప్రజలు జవాబు కోరుతున్నారు. ఇవ్వండి.
385
00:36:14,280 --> 00:36:16,120
జరీనా టూర్ ఎలా జరుగుతోంది?
386
00:36:18,080 --> 00:36:21,080
పార్టీ కోసం చాలా కష్టపడుతోంది.
ఆమెపై ఓ కన్నేసి ఉంచాను.
387
00:36:21,680 --> 00:36:24,680
ఆమె విధేయతను సంకోచించేలా
ఇంతవరకూ ఎలాంటి పని చేయలేదు.
388
00:36:27,400 --> 00:36:28,400
మంచిది.
389
00:36:29,760 --> 00:36:32,080
అయితే తనను పిలవండి.
390
00:36:33,040 --> 00:36:34,520
ఆమె పదోన్నతికి సమయమైంది.
391
00:36:36,360 --> 00:36:37,360
సరే.
392
00:36:44,520 --> 00:36:49,360
రాయ్‌బరేలీ
393
00:36:50,160 --> 00:36:54,320
లోక్ స్వరాజ్య పార్టీ ఎప్పుడూ
మహిళల సాధికారతకు ప్రాముఖ్యతను ఇచ్చింది.
394
00:36:55,520 --> 00:36:57,840
మీ అందరికీ నా వినతి ఏంటంటే
395
00:36:58,600 --> 00:37:00,880
ఈ గ్రామంలోని మహిళలందరూ
396
00:37:00,960 --> 00:37:04,760
వారి సమస్యలను తీసుకుని
మా కార్యకర్తల దగ్గరికి రావాలి.
397
00:37:05,480 --> 00:37:08,400
మనం కలసికట్టుగా
ఆ సమస్యలను ఎదుర్కొందాం.
398
00:37:08,480 --> 00:37:09,920
కానీ జరీనా గారు,
399
00:37:10,680 --> 00:37:13,520
నా సమస్యను ఎవరు పరిష్కరిస్తారు?
400
00:37:14,400 --> 00:37:19,480
మీ ప్రదర్శన చూడటానికే
నేను ఈ ఎండలో వచ్చాను.
401
00:37:20,040 --> 00:37:22,440
కాస్త దయ చూపండి.
402
00:37:22,520 --> 00:37:23,920
సరైన మాట చెప్పావు, మామ!
403
00:37:24,680 --> 00:37:26,640
నీ చిందులు చూపించు.
404
00:37:27,880 --> 00:37:30,960
మేడమ్, మనకు మర్యాద దక్కుతుందని అన్నారే?
405
00:37:31,560 --> 00:37:33,120
తప్పుడు వ్యాపారం ఉండదన్నారు.
406
00:37:33,160 --> 00:37:35,760
దీనికన్నా భోజ్‌పురీ పాటలకు
చిందులేయడం నయంగా ఉండేది.
407
00:37:36,200 --> 00:37:39,160
రెండు నెలల ఈ యూపీ యత్రలో తిరిగి తిరిగీ,
నా రంగు...
408
00:37:39,640 --> 00:37:43,120
జరీనా, ఏం చూస్తున్నావు?
నీ చిందులు చూడాలి.
409
00:37:43,160 --> 00:37:46,160
-నీ చిందులు చూపించు.
-ఆపండి!
410
00:37:47,440 --> 00:37:49,640
నేను ఆడిపాడుతాను.
411
00:37:51,640 --> 00:37:52,920
కానీ ఈ గ్రామంలోని
412
00:37:53,640 --> 00:37:58,400
వందమంది మహిళలు
మా పథకంలో చేరితేనే.
413
00:38:00,000 --> 00:38:01,000
అయితే చెప్పండి,
414
00:38:02,120 --> 00:38:03,640
నిర్ణయం మీదే.
415
00:38:04,520 --> 00:38:06,000
మొదట, మాకోసం ఆడి పాడు.
416
00:38:06,640 --> 00:38:08,400
మొదట చిందులు వెయ్.
417
00:38:08,480 --> 00:38:10,800
మీరు భలే వింత షరతు పెట్టారు, జరీనా.
418
00:38:18,040 --> 00:38:20,960
ఆగండి. నా భార్యనే కాదు,
పక్కవారి భార్యలను తీసుకొస్తా.
419
00:38:26,600 --> 00:38:28,640
మాధురి యాదవ్
420
00:38:31,400 --> 00:38:33,200
లో. స్వ. పా.
421
00:38:35,640 --> 00:38:36,920
ఇలా రండి.
422
00:38:38,160 --> 00:38:41,600
త్వరగా ఈ మహిళలను
నమోదు చేసుకోండి. వెళ్ళండి.
423
00:38:41,640 --> 00:38:42,640
అలాగేనండి.
424
00:38:43,200 --> 00:38:45,640
-ఆడవాళ్ళు, ఇలా రండి.
-విను. పాట పెట్టు.
425
00:38:45,680 --> 00:38:47,440
-బండి సిద్ధంగా ఉంచు.
-సరే.
426
00:38:47,520 --> 00:38:49,680
-రెండు చిందులేసి వెళ్ళిపోదాం.
-సరే.
427
00:38:49,800 --> 00:38:50,800
-సరేనా?
-సరే.
428
00:38:54,640 --> 00:38:59,520
మహిళా సాధికారతకు చిరునామా
మాధురి యాదవ్
429
00:39:02,480 --> 00:39:04,280
కైపెక్కించే జరీనా!
430
00:39:05,120 --> 00:39:08,280
నా గుండె దోచుకుంటావా, జరీనా?
431
00:39:09,160 --> 00:39:10,200
అద్భుతం!
432
00:39:10,920 --> 00:39:15,280
ఎందుకంత చిరాకు, దాసు?
చెమటను తుడిచేయ్ బాసు
433
00:39:15,360 --> 00:39:19,000
నువ్వు తిరుగుబోతువని తెలుసు
మనసులో మోటుగాడివని తెలుసు
434
00:39:19,080 --> 00:39:23,400
నా పొగలు కక్కే సొగసు
నీ చూపును లాగేసుకుంది బాసు
435
00:39:23,480 --> 00:39:27,600
ఈ నీ మెత్తటి మనసు
కాకూడదు ముక్కలు
436
00:39:27,680 --> 00:39:28,680
అద్భుతం!
437
00:39:28,800 --> 00:39:32,360
అవి పడతాయి నా ముందూ వెనుక
అవి పడతాయి నా పాదాల కింద
438
00:39:32,440 --> 00:39:35,960
ప్రతీ ప్రేమికుడి ప్రేయసి కానా
439
00:39:36,640 --> 00:39:38,600
జరీనా! జరీనా!
440
00:39:38,640 --> 00:39:40,480
నీ జీవితం కష్టం చేయనా
441
00:39:40,560 --> 00:39:42,600
జరీనా! జరీనా!
442
00:39:42,640 --> 00:39:44,760
మీ మనశ్శాంతి దోచేయనా
443
00:39:44,840 --> 00:39:46,680
జరీనా! జరీనా!
444
00:39:46,800 --> 00:39:48,840
నే చిర్రెత్తించే వేడిని కన్నా
445
00:39:48,920 --> 00:39:51,160
జరీనా! జరీనా!
446
00:39:51,280 --> 00:39:53,440
నే యూపీ రత్నం కన్నా
447
00:39:54,480 --> 00:39:55,480
జరీనా!
448
00:39:57,840 --> 00:40:00,120
-సీఎం కాల్ చేస్తున్నారు.
-పాట ఎందుకు ఆపారు?
449
00:40:00,160 --> 00:40:02,840
-సీఎం కాల్ చేస్తున్నారు.
-ఏంటి? పాటలో కాల్ ఆ?
450
00:40:02,920 --> 00:40:04,640
జరీనా! జరీనా!
451
00:40:04,680 --> 00:40:06,600
-జరీనా! జరీనా!
-చెప్పండి, మేడమ్.
452
00:40:06,640 --> 00:40:07,680
జరీనా!
453
00:40:08,160 --> 00:40:10,400
మేడమ్ గారు, నేను ఏం చేయడానికైనా సిద్ధమే.
454
00:40:10,480 --> 00:40:12,800
-నాకు లక్నోలో చోటివ్వండి చాలు.
-జరీనా!
455
00:40:12,880 --> 00:40:14,040
జరీనా! జరీనా!
456
00:40:25,960 --> 00:40:27,360
మిమ్మల్ని కలవడం భాగ్యం.
457
00:40:29,160 --> 00:40:30,920
నేను మీకు భారీ అభిమానిని.
458
00:40:32,960 --> 00:40:34,640
సిసలైన తార మీరే, జరీనా గారు.
459
00:40:35,920 --> 00:40:37,480
అభిమానులు నాకన్నా మీకే ఎక్కువ.
460
00:40:38,160 --> 00:40:39,400
భలేవారే, మేడమ్.
461
00:40:41,000 --> 00:40:43,040
వారిలో మా బాబాయి కూడా ఒకరు.
462
00:40:48,040 --> 00:40:49,040
ఇప్పటికీ అభిమానేనా?
463
00:40:56,280 --> 00:40:58,680
నిస్సహాయురాలిని.
అంతకన్నా ఏం చేయగలను?
464
00:41:02,840 --> 00:41:05,080
మా నాన్న ఒక మాట చెప్పేవారు.
465
00:41:08,520 --> 00:41:11,080
మనిషి నిస్సహాయంగా అయ్యే దాకా,
466
00:41:13,280 --> 00:41:14,920
వారు బలవంతులుగా తయారు కారు.
467
00:41:17,120 --> 00:41:18,480
మీ నాన్నగారు అన్నది నిజమే.
468
00:41:19,680 --> 00:41:24,040
మీ మద్దతుతో
నేను నిస్సహాయురాలిని కాదు, బలమైనదాన్ని.
469
00:41:27,640 --> 00:41:31,160
ఇప్పుడు నేను
ఆ పనులన్నీ చేయడం లేదు, మేడమ్.
470
00:41:32,040 --> 00:41:33,640
బాబాయి ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు.
471
00:41:34,880 --> 00:41:36,840
ఆయనను బయటకు రప్పించాలి.
472
00:41:41,000 --> 00:41:43,040
మీరు నన్ను ఏదైనా అడగండి,
473
00:41:43,800 --> 00:41:45,280
కానీ నేను ఇది చేయలేను.
474
00:41:46,880 --> 00:41:49,320
ఏం చేయను, జరీనా?
నేను కూడా నిస్సహాయురాలిని.
475
00:42:02,800 --> 00:42:04,840
ఇది నువ్వు నా కోసం చేస్తే,
476
00:42:05,520 --> 00:42:08,160
నీకు లక్నోలో శాశ్వత స్థానం కల్పిస్తాను.
477
00:42:23,800 --> 00:42:28,160
వారణాసి
478
00:43:39,760 --> 00:43:41,880
కూర్చోండి. ఆయన్ను పిలుస్తాను.
479
00:43:51,080 --> 00:43:52,400
అటు వైపు నుండి రండి.
480
00:44:07,040 --> 00:44:08,040
కూర్చోండి.
481
00:44:09,880 --> 00:44:12,200
డీన్ వీడియో సంచలనం సృష్టిస్తోంది.
482
00:44:14,080 --> 00:44:16,880
ఎంఎల్ఏలలో కలకలం మొదలైంది.
483
00:44:17,920 --> 00:44:19,080
మంచి విషయమే.
484
00:44:26,400 --> 00:44:30,240
కానీ ఈ మాట చెప్పండి,
మాదకద్రవ్యాల గగ్గోలు ఏంటి?
485
00:44:30,320 --> 00:44:33,400
ఏం లేదు. నల్లమందు పట్టుబడలేదు,
486
00:44:34,280 --> 00:44:37,480
ఎందుకంటే లోపలి మనిషి
సమాచారం లీక్ చేశాడు.
487
00:44:41,320 --> 00:44:42,320
తీసుకోండి.
488
00:44:44,520 --> 00:44:45,840
మీరు కూడా.
489
00:44:48,640 --> 00:44:52,080
మెజారిటీ ఎంఎల్ఏలు ఒప్పుకున్నారా?
490
00:44:55,480 --> 00:44:57,600
దాని గురించే మాట్లాడటానికి వచ్చాను, సర్.
491
00:44:58,240 --> 00:44:59,520
రంగం సిద్ధం చేశాం,
492
00:45:00,480 --> 00:45:03,400
కానీ గతవారం నుండి,
కొందరు ఎంఎల్ఏలు తటపటాయిస్తున్నారు.
493
00:45:03,480 --> 00:45:05,400
వాళ్ళు మాధురికే మద్దతు ఇస్తారట.
494
00:45:07,800 --> 00:45:09,120
ఎంఏల్ఏల సేకర్త ఎవరు?
495
00:45:10,520 --> 00:45:11,600
ఆనంద్?
496
00:45:12,200 --> 00:45:14,800
కాదు, మీ జరీనా.
497
00:45:25,880 --> 00:45:27,640
ఇతన్ని పరిచయం చేయలేదే?
498
00:45:28,560 --> 00:45:29,560
ఇతనా?
499
00:45:31,560 --> 00:45:32,560
ఇతను గున్‌గున్.
500
00:45:35,200 --> 00:45:36,840
బయటవారికి మృదుల్.
501
00:45:37,680 --> 00:45:39,040
ఏం చేస్తావు, మృదుల్?
502
00:45:41,880 --> 00:45:43,040
కాదనకుండా అన్నీ చేస్తా.
503
00:45:48,520 --> 00:45:50,760
చూడు, ప్రతి ఒక్కరి అర్జీలు రాశాను.
504
00:45:50,840 --> 00:45:54,280
న్యాయస్థానంలో అబద్ధం చెప్పకూడదు,
సత్యం దాయకూడదు.
505
00:45:55,040 --> 00:45:57,960
ఎవరిది... రాకేష్ తివారీది.
506
00:45:58,480 --> 00:46:02,320
అయితే, పిల్లలు, సీమాకు 125 రూపాయలు
పాకెట్ మనీ ఇచ్చారు. సరేనా?
507
00:46:02,400 --> 00:46:04,960
అక్కకు అతనికన్నా
52 రూపాయలు ఎక్కువ ఇచ్చారు.
508
00:46:05,520 --> 00:46:07,880
అయితే అక్కకు
మొత్తంగా ఎన్ని రూపాయలు ఇచ్చారు?
509
00:46:07,960 --> 00:46:09,040
ఎవరు చెప్తారు?
510
00:46:09,760 --> 00:46:11,200
-నిష్టా.
-చెప్పండి మేడమ్?
511
00:46:11,800 --> 00:46:12,800
నిష్టా, 177 రూపాయలు.
512
00:46:14,320 --> 00:46:15,960
175 రూపాయలు, మేడమ్.
513
00:46:17,640 --> 00:46:18,880
కూర్చో.
514
00:46:19,760 --> 00:46:21,760
-నూటా...
-నీ క్లాసు నువ్వే తీసుకో.
515
00:46:21,840 --> 00:46:24,600
-కాదు, ఏమని వివరించానంటే...
-తర్వాతి ప్రశ్న.
516
00:46:47,880 --> 00:46:49,880
"పోయినవారిని మరచిపో..."
517
00:46:50,800 --> 00:46:53,440
ఏంటి? "పోయినవారిని మరచిపో
518
00:46:53,520 --> 00:46:55,360
-"ఇదే జీవిత సారాంశం..."
-అబ్బో!
519
00:46:56,160 --> 00:46:57,960
"అయినా మరచిపోలేకపోతే
520
00:46:58,960 --> 00:47:00,400
"కాసిన్ని కవిత్వాలు రాసుకో"
521
00:47:00,480 --> 00:47:02,720
అబ్బో! భలే ఉంది!
522
00:47:02,800 --> 00:47:04,560
-ఇది నిజమే.
-ఏం కవిత.
523
00:47:05,680 --> 00:47:06,840
ఇప్పుడు మీ వంతు.
524
00:47:07,600 --> 00:47:10,920
కుటుంబం, స్నేహితులు కలిసి
26 మంది వచ్చారు.
525
00:47:11,960 --> 00:47:15,120
తండ్రీకూతుళ్లు సామాజిక కార్యకర్తలే,
ఇప్పుడు నువ్వు కూడా.
526
00:47:15,200 --> 00:47:16,880
దీనిపై ఎంత ఖర్చు పెట్టావు?
527
00:47:16,960 --> 00:47:20,080
-అమ్మా...
-ఏంటి? నేను అడగకూడదా?
528
00:47:20,160 --> 00:47:22,600
కాదమ్మా, దిగులుపడకండి.
మేము చూసుకున్నాం.
529
00:47:22,680 --> 00:47:25,440
బస్ యజమాని పాత పరిచయస్తుడు.
530
00:47:25,520 --> 00:47:26,520
అలాగా.
531
00:47:26,600 --> 00:47:28,040
కనుక, తక్కువ ధరకే వచ్చాడు.
532
00:47:34,440 --> 00:47:35,880
ఒక్క నిమిషం.
533
00:47:35,960 --> 00:47:37,680
-నేను కనుక్కుంటాను.
-సరే.
534
00:47:37,760 --> 00:47:38,840
ఆంటీ గారు.
535
00:47:39,840 --> 00:47:41,560
జైలర్ గారు. ఎలా ఉన్నారు?
536
00:47:41,640 --> 00:47:43,440
రాబిన్ గారు. ఎలా ఉన్నారు?
537
00:47:43,520 --> 00:47:44,800
బాగున్నాను.
538
00:47:45,320 --> 00:47:46,440
ఇంకా ఎంత సేపు?
539
00:47:46,520 --> 00:47:49,160
కాసేపు వేచి చూడాల్సిందే.
540
00:47:49,240 --> 00:47:52,200
ఏవైనా కావాల్సిన పత్రాలు లేవా?
సమర్పిస్తాను.
541
00:47:52,280 --> 00:47:54,440
కాదు, కాదు. అది మీ తప్పు కాదు.
542
00:47:55,280 --> 00:47:58,040
మా మీద అలాంటి ముద్రపడి పోయింది.
543
00:47:59,560 --> 00:48:02,960
నిజానికి, జైలులో ఒక వేడుక జరుగుతోంది.
544
00:48:03,040 --> 00:48:05,320
ఇవాళ చాలా మంది ఖైదీలు విడుదలవుతున్నారు.
545
00:48:05,400 --> 00:48:07,040
కనుక, చిన్న వేడుక జరుగుతోంది.
546
00:48:07,120 --> 00:48:08,120
అలాగా.
547
00:48:08,200 --> 00:48:11,720
మీరు వేచి ఉండండి.
వేడుక పూర్తి కాగానే వాళ్ళు బయటకొస్తారు.
548
00:48:12,680 --> 00:48:14,400
ఇదీ బానే ఉంది.
549
00:48:15,880 --> 00:48:17,120
వేచి చూస్తాను.
550
00:48:17,200 --> 00:48:20,760
అవి పడతాయి నా ముందూ వెనుక
అవి పడతాయి నా పాదాల కింద
551
00:48:20,840 --> 00:48:24,560
ప్రతీ ప్రేమికుడి ప్రేయసి కానా
552
00:48:25,120 --> 00:48:27,160
జరీనా! జరీనా!
553
00:48:27,240 --> 00:48:29,200
నీ జీవితం కష్టం చేయనా
554
00:48:29,280 --> 00:48:31,160
జరీనా! జరీనా!
555
00:48:31,240 --> 00:48:33,440
మీ మనశ్శాంతి దోచేయనా
556
00:48:33,520 --> 00:48:35,440
జరీనా! జరీనా!
557
00:48:35,520 --> 00:48:37,480
నే చిర్రెత్తించే వేడిని కన్నా
558
00:48:37,560 --> 00:48:39,720
జరీనా! జరీనా!
559
00:48:39,800 --> 00:48:41,960
నే యూపీ రత్నం కన్నా
560
00:48:46,120 --> 00:48:47,680
-అబ్బో!
-భలే ఉంది!
561
00:48:47,760 --> 00:48:49,120
చక్కటి ప్రదర్శన.
562
00:48:50,200 --> 00:48:52,280
భలే డాన్స్ చేశావు. అద్భుతం.
563
00:48:57,000 --> 00:48:59,680
మనం సాధిస్తాం
564
00:48:59,760 --> 00:49:04,920
ఏదో ఒకరోజున మనం సాధిస్తాం!
565
00:49:06,160 --> 00:49:09,960
మనసులో ఉంది విశ్వాసం
566
00:49:10,040 --> 00:49:12,880
సంపూర్ణమైన విశ్వాసం
567
00:49:12,960 --> 00:49:17,000
ఏదో ఒకరోజున మనం సాధిస్తాం
568
00:49:35,920 --> 00:49:39,000
శీర్షిక ఏంటంటే,
"చెప్పాలంటే, స్వేచ్ఛాజీవులమే."
569
00:49:40,920 --> 00:49:46,080
"మేము స్వేచ్ఛాజీవులమే అని చెప్పుకునేవారూ
తమ కోరికల బరువుకు ఖైదీలే
570
00:49:47,400 --> 00:49:49,880
"మనం మాత్రమే ఖైదీలుగా ఉన్నాం
అని అనుకుంటే
571
00:49:50,480 --> 00:49:52,840
"నువ్వొక పెద్ద వెధవవని తెలుసుకో
572
00:49:55,120 --> 00:49:56,840
"నువ్వొక పెద్ద వెధవవు
573
00:49:56,920 --> 00:50:01,440
"మనం ఖైదీలుగా ఉన్నా,
కోరికల బరువు లేకుండా స్వేచ్ఛగా ఉన్నాం..."
574
00:50:01,520 --> 00:50:03,760
అద్భుతం!
575
00:50:03,840 --> 00:50:05,720
"కనుక, ఈ రోజు విడుదలవుతున్నవారు
576
00:50:05,800 --> 00:50:10,000
"మీరు ఈ చెరసాల నుండి వెళ్ళిపోవచ్చు,
కానీ గుర్తుంచుకోండి, అక్కడా చెరసాల ఉంది
577
00:50:11,560 --> 00:50:15,320
"ఇక్కడ ఖైదీగా ఉన్నా, స్వేచ్ఛగా ఉన్నావు
ప్రపంచపు మూర్ఖత్వం నుండి
578
00:50:15,400 --> 00:50:19,520
"అక్కడ స్వేచ్ఛగా ఉన్నా
ప్రపంచపు మూర్ఖత్వం ఉండనే ఉంటుంది..."
579
00:50:24,560 --> 00:50:26,160
"ఇది నా ప్రార్థన...
580
00:50:27,640 --> 00:50:29,520
"మనం మళ్ళీ కలవకూడదన్నది
నా ప్రార్థన
581
00:50:30,160 --> 00:50:31,760
"మీరు నన్ను ఇక్కడ కలవకూడదు
582
00:50:32,720 --> 00:50:34,120
"నేను నిన్ను అక్కడ కలవకూడదు"
583
00:50:34,200 --> 00:50:36,080
అద్భుతం!
584
00:50:36,160 --> 00:50:37,840
-అద్భుతం! రహీమ్!
-అద్భుతం!
585
00:50:37,920 --> 00:50:39,440
-అమోఘం!
-ఆహా!
586
00:50:39,520 --> 00:50:41,440
-అద్భుతం, రహీమ్!
-ఆహా! భలే చెప్పావు!
587
00:50:47,080 --> 00:50:49,240
అద్భుతం! ఎంత గొప్పగా ఉంది.
588
00:50:56,720 --> 00:50:57,720
అమోఘం.
589
00:50:59,480 --> 00:51:03,400
ఇలాగే రాస్తూ ఉండండి,
ఏదో ఒక రోజు, ప్రఖ్యాత కవి అవుతారు.
590
00:51:03,880 --> 00:51:04,880
ఫర్వాలేదు.
591
00:51:36,160 --> 00:51:38,120
-మోకాళ్ళపై!
-చేతులు పైకి!
592
00:51:39,800 --> 00:51:41,760
అంబులెన్స్! అంబులెన్స్ పిలవండి!
593
00:51:43,880 --> 00:51:45,920
వస్తూనే ఉంటారు.
వేడుక తర్వాత...
594
00:51:46,000 --> 00:51:48,440
రౌఫ్ లాలాను రహీమ్ చంపాడు.
తలుపు మూసేయ్. త్వరగా!
595
00:51:48,520 --> 00:51:50,480
-తలుపు మూసేయ్!
-ఏంటి...
596
00:51:52,440 --> 00:51:54,600
చూడండి, సర్, ఏం జరిగిందో చూడండి.
597
00:51:55,240 --> 00:51:56,600
వెనక్కు వెళ్ళండి!
598
00:51:56,680 --> 00:51:58,800
ఒక నిమిషం, బాబు. దారి ఇవ్వండి.
599
00:51:58,880 --> 00:52:00,200
ఏవండి, శాంతించండి.
600
00:52:00,280 --> 00:52:01,680
-ఇలా రండి.
-శాంతించండి.
601
00:52:26,720 --> 00:52:29,400
మీర్జాపూర్
602
00:54:22,320 --> 00:54:24,320
సబ్‌టైటిల్ అనువాద కర్త
Pradeep Kumar Maheshwarla
603
00:54:24,400 --> 00:54:26,400
క్రియేటివ్ సూపర్‌వైజర్
నిశా౦తి ఈవని