1 00:00:08,675 --> 00:00:11,427 మాథ్యూ మెక్ కోనహే, వూడీ హారెల్సన్. మీరు చూశారు, కదా? లేదా… 2 00:00:11,428 --> 00:00:13,012 ఒక వాస్తవ వదంతి ఆధారంగా రూపొందించినది 3 00:00:13,013 --> 00:00:14,473 ఆ పిడిగుద్దును అందరూ చూశారా? 4 00:00:16,265 --> 00:00:17,350 ఓహ్, దేవుడా. 5 00:00:17,351 --> 00:00:18,601 జో రోగన్ ఎక్స్ పీరియెన్స్ 6 00:00:18,602 --> 00:00:20,144 మొహం మీద పడిన ఒక పాతకాలపు గట్టి దెబ్బ. 7 00:00:20,145 --> 00:00:21,646 మెక్ కోనహే నవ్వులాటకి కొట్టలేదు. 8 00:00:21,647 --> 00:00:23,439 {\an8}ఇక్కడ మనం ఏం చూస్తున్నామో ఒకసారి వివరించండి. 9 00:00:23,440 --> 00:00:24,815 {\an8}"పిడిగుద్దు"పై బాడీ లాంగ్వేజ్ నిపుణుడు 10 00:00:24,816 --> 00:00:26,317 {\an8}ఆవేశపు ఛాయలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. 11 00:00:26,318 --> 00:00:27,527 గుడ్ మార్నింగ్, ఆస్ట్రేలియా. 12 00:00:27,528 --> 00:00:30,196 బ్రేక్ ఫాస్ట్ షోలో హాలీవుడ్ పిడిగుద్దుల గురించి మాట్లాడుకుందామా? 13 00:00:30,197 --> 00:00:33,991 అమెరికా నటుడు మాథ్యూ మెక్ కోనహే నేరుగా ఎడ్ హారిస్ ముఖం మీద పిడిగుద్దు గుద్దాడు. 14 00:00:33,992 --> 00:00:35,701 ఒక సినిమా స్టార్ 15 00:00:35,702 --> 00:00:39,622 తన స్నేహితుడు, సోదరుడు, తోటి నటుడిని డాక్స్ షెపర్డ్ ముందే కొట్టడం కంటే 16 00:00:39,623 --> 00:00:41,374 - ఇంకా విచిత్రమైన విషయం ఉందంటే నమ్ముతారా? - వావ్. 17 00:00:41,375 --> 00:00:43,627 ఆ సంఘటన జరిగిన నాటి నుండి మెక్ కోనహే గురించి ఎవరికీ సమాచారం లేదు. 18 00:00:44,294 --> 00:00:47,296 {\an8}అతను తెల్ల జాతీయుడు. ఆస్కార్ విజేత, 6 అడుగుల పొడవు… 19 00:00:47,297 --> 00:00:49,340 {\an8}అయితే, అతని వైబ్స్ ఇంకా ఎనర్జీ వల్ల 20 00:00:49,341 --> 00:00:51,717 {\an8}నేరుగా చూసినప్పుడు అతను ఇంకా చాలా పొడవుగా కనిపిస్తాడు. 21 00:00:51,718 --> 00:00:52,927 {\an8}బ్రేకింగ్ న్యూస్ 22 00:00:52,928 --> 00:00:56,098 {\an8}అతను వెస్ట్రన్ లుక్ లో ఉన్నప్పుడు ఇలా కనిపిస్తాడు. 23 00:00:56,974 --> 00:01:00,853 {\an8}ఇంకా ఒక ప్రశాంతమైన ఆదివారం మధ్యాహ్నం పూట అతను ఇలా కనిపిస్తాడు. 24 00:01:01,395 --> 00:01:03,688 {\an8}ఇంకా, హా, అవును, సరే, 25 00:01:03,689 --> 00:01:06,692 {\an8}ఇప్పుడు అతను కొంచెం ఇలా కనిపించే అవకాశం కూడా ఉంది. 26 00:01:07,568 --> 00:01:10,863 {\an8}నాన్నా, నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేయ్. 27 00:01:19,538 --> 00:01:21,414 {\an8}వాల్ సమాధానం ఇవ్వడానికి స్లైడ్ చేయండి 28 00:01:21,415 --> 00:01:22,915 {\an8}వాయిస్ మెయిల్ - వాల్ వేచి ఉంది… 29 00:01:22,916 --> 00:01:24,168 {\an8}వాల్ - మిస్డ్ కాల్ వైట్ - గ్వెన్ - క్లారా - మెసేజులు 30 00:02:18,764 --> 00:02:20,348 ఫోన్ ఆన్సర్ చేయి. 31 00:02:20,349 --> 00:02:21,766 వాయిస్ మెయిల్ ఇన్ బాక్స్… 32 00:02:21,767 --> 00:02:22,892 తను ఇంకా ఫోన్ తీయడం లేదు. 33 00:02:22,893 --> 00:02:24,519 నేను తన ఏజెంట్ కి కాల్ చేశాను. తన మేనేజర్ కి కాల్ చేశాను. 34 00:02:24,520 --> 00:02:26,312 తనని త్వరగా వెతికి పట్టుకోకపోతే, ఆ ర్యాలీని మిస్ అవుతాడు. 35 00:02:26,313 --> 00:02:27,606 ఏం జరుగుతోంది? 36 00:02:28,607 --> 00:02:30,816 - బేబీ, నీ కన్ను ఘోరంగా ఉంది. - అందరూ కాస్త ఫోకస్ పెడతారా? 37 00:02:30,817 --> 00:02:32,109 నేను ఈ గుద్దులాటని వేరేలా మార్చగలను. 38 00:02:32,110 --> 00:02:34,820 ఇక్కడ ఉన్న ఈ మేనరికం కజిన్స్ విషయాన్ని కూడా నేను కవర్ చేయగలను. 39 00:02:34,821 --> 00:02:36,781 - మేము కజిన్స్ కాదు. - నన్ను దత్తత తీసుకున్నారు. 40 00:02:36,782 --> 00:02:40,368 కానీ ఒక అభ్యర్థి తన స్వంత ఎన్నికల ర్యాలీకే రాకుండా మాయమవడాన్ని నేను మేనేజ్ చేయలేను. 41 00:02:40,369 --> 00:02:44,038 ఈ ప్రచారం ప్రారంభం కాకముందే ముక్కలైపోకుండా కాపాడటమే నా ప్రధాన లక్ష్యం. 42 00:02:44,039 --> 00:02:45,498 ఈ రోజు మధ్యాహ్నం ఒక ర్యాలీ ఉంది. 43 00:02:45,499 --> 00:02:49,252 మాథ్యూ కచ్చితంగా ఆ స్టేజ్ మీద ఉండేలా చూసుకోవడంపైనే మనమందరం ఇప్పుడు దృష్టి పెట్టాలి. 44 00:02:49,253 --> 00:02:50,795 ముఖ్యంగా నువ్వు. 45 00:02:50,796 --> 00:02:55,716 మురికిగా ఉన్న నీ చిన్న హాబిట్ పాదాలకు చెప్పులు వేసుకుని, 46 00:02:55,717 --> 00:02:58,469 వెళ్లి మాథ్యూని వెతికి పట్టుకుని అతనికి క్షమాపణ చెప్పాలి, 47 00:02:58,470 --> 00:03:02,558 ఇంకా అతన్ని తిరిగి ఇక్కడికి నా ముందుకు తీసుకురావాలి. 48 00:03:04,768 --> 00:03:05,852 అది నీ వల్ల అవుతుందా? 49 00:03:05,853 --> 00:03:08,563 తను నన్ను అకస్మాత్తుగా గుద్దితే నేను క్షమాపణ చెప్పాలా? 50 00:03:08,564 --> 00:03:09,647 అది జరిగే పని కాదు. 51 00:03:09,648 --> 00:03:12,358 వారాలుగా నేను అతని భావాలను గౌరవిస్తూ వస్తున్నాను, 52 00:03:12,359 --> 00:03:15,361 మా మొత్తం స్నేహంలో చేసినట్టే అతన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. 53 00:03:15,362 --> 00:03:19,657 ఇక్కడ ఎవరైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే, అది ఆమె మాత్రమే. 54 00:03:19,658 --> 00:03:23,035 ఆమె ఈ రహస్యాన్ని 50 ఏళ్లుగా దాచిపెట్టింది. 55 00:03:23,036 --> 00:03:24,203 మా మాక్, ఇలా చూడు. 56 00:03:24,204 --> 00:03:25,913 ఈ విషయం గురించి నువ్వు ఏదైనా మాట్లాడాలి. 57 00:03:25,914 --> 00:03:28,124 లేదు. నేను కొంచెం చిల్లీ వండుకుంటున్నాను. 58 00:03:28,125 --> 00:03:30,168 ఇదంతా చాలా వ్యక్తిగతమైన విషయం అని నాకు తెలుసు, 59 00:03:30,169 --> 00:03:32,378 కానీ నీ మనసులోని మాటను పంచుకుంటే కొంచెం ఉపశమనంగా ఉంటుంది. 60 00:03:32,379 --> 00:03:33,547 నేను చెప్పాను కదా… 61 00:03:34,798 --> 00:03:36,550 నేను చిల్లీ వండుకోబోతున్నాను అని. 62 00:03:37,176 --> 00:03:38,259 - సరే. - హేయ్! 63 00:03:38,260 --> 00:03:39,802 మీడియా దుర్మార్గులు. 64 00:03:39,803 --> 00:03:40,804 నువ్వు ఒక పరాన్నజీవివి! 65 00:03:43,307 --> 00:03:44,765 నీ అంతు చూస్తాను, బాబు. 66 00:03:44,766 --> 00:03:46,559 నేను బతకడానికి పెద్దగా ఆశలేమీ మిగలలేదు. 67 00:03:46,560 --> 00:03:48,728 నేను దీన్ని పెద్దది చేయాలనుకోవడం లేదు, కానీ తప్పకపోతే చేస్తాను. 68 00:03:48,729 --> 00:03:50,730 - ఇక్కడ ఒక కుటుంబం నివసిస్తోంది. - జిమ్మీ? 69 00:03:50,731 --> 00:03:51,898 - హేయ్. - నువ్వు బాగానే ఉన్నావా? 70 00:03:51,899 --> 00:03:53,691 అవును. ఈ జంతువులను లోపలికి రాకుండా ఆపుతున్నాను. 71 00:03:53,692 --> 00:03:55,152 ఓరి దేవుడా! నీకేం అయింది? 72 00:03:56,278 --> 00:03:59,113 - నా కంటికి నేనే దెబ్బ తగిలించుకున్నాను. - జిమ్మీ, అలా ఎందుకు చేశావు? 73 00:03:59,114 --> 00:04:00,281 మీ నాన్నకు నా మద్దతు తెలపడానికి. 74 00:04:00,282 --> 00:04:02,241 బేబీ, చేయక తప్పలేదు. నా మొహంతో ఒక టెంట్ స్తంభాన్ని ఢీ కొట్టాను. 75 00:04:02,242 --> 00:04:04,493 చాలా గట్టిగా. నేను అనుకున్నదానికంటే బాగా గట్టిగా తగిలింది. 76 00:04:04,494 --> 00:04:05,578 చూపు కొంచెం మసకబారింది. 77 00:04:05,579 --> 00:04:07,955 ఒక నిమిషం పాటు ప్రాణం పోయినంత పనైంది, కానీ ఇప్పుడు బాగానే ఉంది. 78 00:04:07,956 --> 00:04:09,582 - మనం మళ్లీ కలిశాం, కాబట్టి… - జిమ్మీ, వద్దు… 79 00:04:09,583 --> 00:04:12,835 అంటే, నువ్వు ఇప్పటికే చేసేశావు అనుకో, కానీ దయచేసి ఇకపై ఇలాంటి పనులు చేయకు. 80 00:04:12,836 --> 00:04:14,587 ఆలివ్, మీ కుటుంబమే నాకు సర్వస్వం. 81 00:04:14,588 --> 00:04:16,130 నా ప్రపంచం. ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి. 82 00:04:18,007 --> 00:04:19,090 అవును, నాకు తెలుసు. 83 00:04:19,091 --> 00:04:20,176 మంచిది. 84 00:04:20,177 --> 00:04:23,971 హేయ్. నీకు వీలైతే, మన పరిస్థితి గురించి ఆలోచించడానికి కొంచెం టైమ్ దొరికిందా? 85 00:04:23,972 --> 00:04:25,765 ఎందుకంటే కనీసం నా విషయానికి వస్తే, 86 00:04:25,766 --> 00:04:27,808 బ్రయాన్ విలియమ్స్ అన్ని విషయాల గురించి ఎంత లోతుగా మాట్లాడారో అని ఆలోచిస్తున్నాను. 87 00:04:27,809 --> 00:04:29,186 అవి నన్ను బాగా కదిలించాయి. 88 00:04:30,646 --> 00:04:32,356 సరే. చూడు, 89 00:04:33,023 --> 00:04:36,025 ప్రస్తుతం మాథ్యూ ఇంకా మా నాన్నకీ మధ్య ఇక్కడ చాలా గందరగోళం జరుగుతోంది, 90 00:04:36,026 --> 00:04:40,863 ఇప్పుడు మాథ్యూ కూడా కనిపించకుండా పోయాడు కాబట్టి, నేను వెళ్లి అతన్ని వెతకడంలో సహాయం చేయడం మంచిది. 91 00:04:40,864 --> 00:04:41,907 కానీ… 92 00:04:42,491 --> 00:04:45,952 నీ కంటికి కచ్చితంగా ఐస్ పెట్టాలి, ఎందుకంటే దానికి కొంచెం ఇన్ఫెక్షన్ సోకినట్లుంది. 93 00:04:45,953 --> 00:04:49,330 బంగారం, ఇదంతా తప్పించుకుని తిరిగే ఒక రకమైన మనస్తత్వం. 94 00:04:49,331 --> 00:04:51,249 మనం దీని గురించి కూర్చుని మాట్లాడుకోవాలని బ్రయాన్ కోరుకుంటారు. 95 00:04:51,250 --> 00:04:52,834 అతనికి పీబాడీ అవార్డు ఇచ్చారు తెలుసా, బంగారం. 96 00:04:52,835 --> 00:04:54,294 ఆ అవార్డు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. 97 00:04:57,464 --> 00:04:59,675 నువ్వు వినేలా లేవు, ఇక లాభం లేదు. నేను నిన్ను ముందే హెచ్చరించాను. 98 00:05:00,300 --> 00:05:02,343 చెత్త మాథ్యూ, చెత్త మా మాక్. 99 00:05:02,344 --> 00:05:03,345 ఏంటి ఇదంతా? 100 00:05:08,016 --> 00:05:09,100 హేయ్. 101 00:05:09,101 --> 00:05:10,811 నాకు కాస్త సాయం చేస్తావా? 102 00:05:11,937 --> 00:05:13,188 అది వాళ్లది. 103 00:05:14,106 --> 00:05:15,315 ఏదైనా ఇది పనికిరానిది. 104 00:05:16,149 --> 00:05:17,985 చూడు, వూడీ, 105 00:05:18,944 --> 00:05:21,153 నిన్ను ఇలా చూడటం నాకు అస్సలు నచ్చదు. 106 00:05:21,154 --> 00:05:24,323 ఆ బాధ అంతా నీ మనసులోనే దాచుకోవడం నీకు ఎంత కష్టంగా ఉంటుందో, 107 00:05:24,324 --> 00:05:26,492 ఆ సమయంలో నేను నీ పక్కనే ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. 108 00:05:26,493 --> 00:05:28,202 నేను నీకు చెప్పాలని ప్రయత్నించాను, హనీ. 109 00:05:28,203 --> 00:05:29,204 నాకు తెలుసు. 110 00:05:31,039 --> 00:05:33,416 కానీ నా పరంగా చూస్తే, నీ నోటి నుండి ఎప్పుడూ ఏవో పిచ్చి మాటలు వస్తుంటాయి. 111 00:05:33,417 --> 00:05:39,380 ఈ రహస్యాన్ని దాచడానికి నా బుర్ర ఎంత పాడైపోయిందో నీకు తెలుసా, 112 00:05:39,381 --> 00:05:41,090 మాథ్యూ బాధపడకూడదని నేను దాన్ని దిగమింగాను. 113 00:05:41,091 --> 00:05:43,634 కానీ అతను దాని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించాడా? 114 00:05:43,635 --> 00:05:45,761 లేదు. అతను తన గురించే ఆలోచించుకున్నాడు. 115 00:05:45,762 --> 00:05:46,763 ఎప్పటిలాగే. 116 00:05:47,389 --> 00:05:51,601 కాబట్టి అతను నాతో మాట్లాడకుండా ఎక్కడికో పారిపోవాలనుకుంటే, 117 00:05:51,602 --> 00:05:54,521 నేను కూడా ఇక్కడే ఉండి అతని కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. 118 00:05:55,230 --> 00:05:57,441 ఇక మా మాక్ గురించి అయితే నన్ను అస్సలు మాట్లాడించకు. 119 00:06:00,485 --> 00:06:01,819 ఇలా చూడు, వూడీ, 120 00:06:01,820 --> 00:06:06,115 ఆ రహస్యాన్ని కేవలం కొన్ని వారాల పాటు దాచడానికే నువ్వు ఎంత కష్టపడ్డావో ఆలోచించు. 121 00:06:06,116 --> 00:06:07,742 నువ్వు తెలివితక్కువ వాడివి కాబట్టి ఆ పని చేయలేదు, 122 00:06:07,743 --> 00:06:10,078 మాథ్యూని కాపాడటానికి మాత్రమే నువ్వు అలా చేశావు. 123 00:06:10,746 --> 00:06:13,582 కానీ మా మాక్ ఆ రహస్యాన్ని కొన్ని దశాబ్దాల పాటు దాచిపెట్టింది. 124 00:06:14,625 --> 00:06:16,460 బహుశా ఆమె కూడా ఇదే కారణం వల్ల దాచి ఉండవచ్చు. 125 00:06:24,927 --> 00:06:26,802 పిల్లల్ని తీసుకురా. మనం వెళ్లిపోతున్నాం. 126 00:06:26,803 --> 00:06:27,888 నీకో విషయం తెలుసా? 127 00:06:28,847 --> 00:06:30,265 నేను ఈ కుర్చీని తీసుకుంటున్నాను. 128 00:06:32,184 --> 00:06:33,268 సరే. 129 00:06:38,273 --> 00:06:39,565 ఏంటి సంగతి? 130 00:06:39,566 --> 00:06:41,401 లేదు, నేను… నేను ఏమీ అనలేదు. 131 00:06:46,323 --> 00:06:47,782 - అయితే నువ్వు ఏదైనా మాట్లాడాలా… - అవును. 132 00:06:47,783 --> 00:06:49,909 "మనం కజిన్స్ అయి ఉండి డేటింగ్ చేసుకుంటున్నాం" అనే విషయం గురించి మాట్లాడాలి. 133 00:06:49,910 --> 00:06:52,036 అవును, ఖచ్చితంగా, వినడానికి సరదాగా ఉంది. 134 00:06:52,037 --> 00:06:53,372 దాని గురించి నిత్యం మాట్లాడుకుందాం. 135 00:06:54,289 --> 00:06:56,916 నా ఉద్దేశం, మనం టెక్నికల్ గా, అంటే… 136 00:06:56,917 --> 00:06:59,544 అవును. లేదు, నిజమే. ఖచ్చితంగా. 137 00:06:59,545 --> 00:07:01,379 - అవును. - అవును. సరే, సరే. 138 00:07:01,380 --> 00:07:03,589 నా ఉద్దేశం, నాకు అది గొప్పగా అనిపిస్తోంది. నేను దాని గురించి కనీసం ఆలోచించడం లేదు. 139 00:07:03,590 --> 00:07:06,092 - మేనరికం ఏంటి? - నువ్వు ఆ మేనరికం అనే పదం వాడక్కర లేదు. నేను… 140 00:07:06,093 --> 00:07:08,094 - ఆలీవ్! ఖాయ్! - నేను బహుశా ఇంక… 141 00:07:08,095 --> 00:07:09,929 - ఇంక వెళ్లాలి అనుకుంటా… సరే. - సరే, వెళ్లు. 142 00:07:09,930 --> 00:07:11,932 - సరే, మనం దాని గురించి మాట్లాడుకోవడం సంతోషం. - అవును. నిజంగా. 143 00:07:12,975 --> 00:07:15,017 హారెల్సన్స్! ఇంక బయలుదేరదాం! 144 00:07:15,018 --> 00:07:16,103 వెళదాం రండి. 145 00:07:17,521 --> 00:07:19,189 నిన్ను తరువాత కలుస్తాను. 146 00:07:21,733 --> 00:07:23,192 హేయ్, నేను నీకు ఏమైనా సాయం చేయనా… 147 00:07:23,193 --> 00:07:24,694 - నేను చేసుకోగలను. - నా కారు ఇక్కడే ఉంది. 148 00:07:24,695 --> 00:07:27,154 కాబట్టి మనం కలిసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లచ్చు అనుకున్నాను. 149 00:07:27,155 --> 00:07:28,739 మనిద్దరం ఒకే చోటుకి వెళ్తున్నాం. 150 00:07:28,740 --> 00:07:31,242 నువ్వు నా నుంచి పారిపోవాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది… 151 00:07:31,243 --> 00:07:32,660 - ఏంటి? లేదు. - …నన్ను ఒంటరిగా 152 00:07:32,661 --> 00:07:33,995 మాథ్యూ మెక్ కోనహే ఇంట్లో వదిలి వెళ్తున్నావు అనిపిస్తోంది. 153 00:07:33,996 --> 00:07:35,913 మామూలు పరిస్థితుల్లో అది గొప్పగా అనిపించి ఉండేది. 154 00:07:35,914 --> 00:07:38,750 లేదు, మా కుటుంబం ఇప్పుడు మా నాన్నతో ఉండాల్సిన అవసరం ఉంది. 155 00:07:39,710 --> 00:07:40,711 సరే, అయితే, మరి… 156 00:07:41,795 --> 00:07:43,046 మనం త్వరలోనే మాట్లాడుకుందాం. 157 00:07:43,672 --> 00:07:44,882 - సరే. - సరే. 158 00:07:50,137 --> 00:07:51,972 హారెల్సన్స్ కుటుంబం వెళ్ళిపోయిందంటే నమ్మలేకపోతున్నాను. 159 00:07:54,808 --> 00:07:55,893 నిజంగానా, మా మాక్? 160 00:07:57,060 --> 00:07:58,728 ఈ చిల్లీ వంటకం చేయడానికి ఇదే తగిన సమయమా? 161 00:07:58,729 --> 00:08:00,062 మనుషులు తినాలి కదా. 162 00:08:00,063 --> 00:08:03,650 సారీ. నువ్వు ఇప్పుడు ఏ విషయంలో అయినా బాధపడుతున్నావా? 163 00:08:07,905 --> 00:08:10,990 చూడు, నన్ను ఏదో మూలన పడి ఉన్న ఒక పాత వస్తువులా చూడటం 164 00:08:10,991 --> 00:08:13,826 ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక అలవాటు అయిపోయింది. 165 00:08:13,827 --> 00:08:16,329 "ఆమె ఎందుకు ఇలా చేసింది? ఆమె ఎందుకు అలా చేయలేదు?" అంటున్నారు. 166 00:08:16,330 --> 00:08:20,542 నా స్థానంలో మీరు ఉంటే ఏం చేసేవాళ్ళో మీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. 167 00:08:21,418 --> 00:08:24,420 నీ కొడుకు గురించి నువ్వు ఎందుకు ఆందోళన పడటం లేదో నాకు అస్సలు అర్థం కావడం లేదు. 168 00:08:24,421 --> 00:08:28,841 మాథ్యూ ఎదిగిన వాడు, తనేంటో తన ఫీలింగ్స్ ఏమిటో తనకి తెలుసు. 169 00:08:28,842 --> 00:08:31,428 వాడేమీ చిన్న పిల్లవాడు కాదు. 170 00:08:33,179 --> 00:08:34,722 వాడు ఎక్కడికి వెళ్లినా కూడా… 171 00:08:36,015 --> 00:08:37,851 ఏదో కారణం ఉంటేనే వెళతాడు. 172 00:08:55,661 --> 00:08:58,205 - అతను మాథ్యూ మెక్ కోనహే కదా? - నోరు మూయ్, జోష్. 173 00:08:59,581 --> 00:09:00,790 తను ఇక్కడ ఎందుకు ఉన్నాడు? 174 00:09:00,791 --> 00:09:02,751 నోరు మూసుకోమని చెప్పాను కదా, జోష్. 175 00:09:05,087 --> 00:09:06,462 నేను వెళ్లి అతనితో మాట్లాడనా? 176 00:09:06,463 --> 00:09:09,007 ఇప్పుడు నువ్వు ఏమైనా చెడగొట్టావో, జోష్, నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా… 177 00:09:10,592 --> 00:09:11,926 {\an8}స్టార్ కౌంటీ నర్సింగ్ అండ్ ట్రాన్సిషనల్ కేర్ 178 00:09:11,927 --> 00:09:13,594 {\an8}మొదట నీ తండ్రి గురించి తెలుసుకున్నావు, 179 00:09:13,595 --> 00:09:17,056 ఆ తర్వాత నువ్వు ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ వూడీ హారెల్సన్, 180 00:09:17,057 --> 00:09:18,432 ఒకే తండ్రికి జన్మించారని తెలుసుకున్నావు. 181 00:09:18,433 --> 00:09:19,725 మెక్ కోనహే/హారెల్సన్ డిఎన్ఏ డ్రామా 182 00:09:19,726 --> 00:09:22,770 - అది మైండ్ బ్లోయింగ్ విషయం, కదా? - ఓరి దేవుడా. 183 00:09:22,771 --> 00:09:26,107 మాథ్యూ మెక్ కోనహే ఇంకా వూడీ హారెల్సన్ ఇద్దరూ అన్నదమ్ములు. 184 00:09:26,108 --> 00:09:27,191 {\an8}గవర్నర్ మాథ్యూ మెక్ కోనహే? 185 00:09:27,192 --> 00:09:29,777 {\an8}ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ మధ్యాహ్నం జరగబోయే 186 00:09:29,778 --> 00:09:31,404 {\an8}మెక్ కోనహే ర్యాలీపై ఆసక్తి పెరుగుతోంది ఎందుకంటే 187 00:09:31,405 --> 00:09:34,782 {\an8}ఈ నటుడు తన గవర్నర్ ఎన్నికల పోటీని అక్కడ అధికారికంగా ప్రకటించబోతున్నారు. 188 00:09:34,783 --> 00:09:37,493 {\an8}నిన్ను ఆ ర్యాలీలో కలుస్తాం, చెత్తవెధవ. 189 00:09:37,494 --> 00:09:38,996 అవును. 190 00:09:41,290 --> 00:09:43,709 మళ్లీ ప్రయాణించడం చాలా బాగుంది, కదా? 191 00:09:45,002 --> 00:09:46,127 అవును. 192 00:09:46,128 --> 00:09:48,462 - అవును. చాలా బాగుంది. - చాలా బాగుంది. 193 00:09:48,463 --> 00:09:49,755 ఏదైనా మ్యూజిక్ పెట్టుకుందామా? 194 00:09:49,756 --> 00:09:51,299 - వద్దు. - వద్దు. 195 00:09:51,300 --> 00:09:53,384 ఆడియో బుక్? పాడ్ కాస్ట్? 196 00:09:53,385 --> 00:09:54,510 ఉపన్యాసాలు? 197 00:09:54,511 --> 00:09:55,762 - వద్దు. - వద్దా? 198 00:09:59,016 --> 00:10:00,099 సరే. వద్దు. మీకో విషయం తెలుసా? 199 00:10:00,100 --> 00:10:01,601 చాల్లే ఆపండి. బస్ ఆపండి. 200 00:10:01,602 --> 00:10:02,727 - ఏంటి? - అమ్మా. 201 00:10:02,728 --> 00:10:04,563 - వూడీ, బస్సు ఆపు! - ఏంటి? ఆగు! 202 00:10:07,816 --> 00:10:09,568 సరే. మంచిది. 203 00:10:10,652 --> 00:10:12,528 మీరు స్వార్థపరులు. 204 00:10:12,529 --> 00:10:13,905 ఈ ప్రయాణం నా కోసం పెట్టుకుంది కాదు. 205 00:10:13,906 --> 00:10:16,073 నేను ఇంట్లోనే హాయిగా ప్రశాంతంగా ఉండేదాన్ని, 206 00:10:16,074 --> 00:10:17,909 కర్ట్నీ కాక్స్-ఆర్కెట్ ఇంకా జేక్ గిలెన్హాల్ తో కలిిసి 207 00:10:17,910 --> 00:10:18,993 పికిల్ బాల్ ఆడుకుంటూ గడిపేదాన్ని. 208 00:10:18,994 --> 00:10:21,704 నువ్వు ఎప్పుడైనా ఆ మనిషిని షార్ట్స్ లో చూశావా? దేవుడిచ్చిన వరంలా ఉంటాడు. 209 00:10:21,705 --> 00:10:23,664 - రిలాక్స్. - సరే. ఒక విషయం తెలుసా? వద్దు, ఇంక ఆపు. 210 00:10:23,665 --> 00:10:26,125 ఇదంతా నువ్వు నీ ప్రేమ బంధాన్ని తెంచుకోవడంతో మొదలైంది. 211 00:10:26,126 --> 00:10:28,085 ఇంకా నువ్వు ఆడవాళ్ల గొడవల నుండి పారిపోయావు. 212 00:10:28,086 --> 00:10:30,838 కానీ నేను కేవలం మీకు తోడుగా ఉండటానికి మీతో పాటు వస్తున్నాను 213 00:10:30,839 --> 00:10:32,381 ఎందుకంటే అది నా తలరాత కాబట్టి. 214 00:10:32,382 --> 00:10:35,384 కానీ ఈసారి ఇక్కడ నిజంగానే ఒక అద్భుతం జరిగింది, సరేనా. 215 00:10:35,385 --> 00:10:37,970 ఆలీవ్, నువ్వు నీ పంతాన్ని పక్కన పెట్టావు. 216 00:10:37,971 --> 00:10:40,973 నువ్వు జిమ్మీ ఇంకా మీ నాన్న ఎదుట నీ అసలు మనసును బయటపెట్టావు. 217 00:10:40,974 --> 00:10:44,268 ఖాయ్, నువ్వు ఎప్పుడూ దేనికీ భయపడని దానివి. 218 00:10:44,269 --> 00:10:47,813 ఇప్పుడు నిన్ను చూడు, నీ కజిన్ కాని వాడిప్రేమ నుండి నువ్వు పారిపోతున్నావు. 219 00:10:47,814 --> 00:10:49,482 - ఏంటి? సారీ… అమ్మా, అది కాదు… - వద్దు. సరేనా. 220 00:10:49,483 --> 00:10:51,484 వూడీ, నువ్వు స్వార్థం లేనివాడివి. 221 00:10:51,485 --> 00:10:53,653 నీ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా నీ బ్రదర్ ని కాపాడటం కోసం 222 00:10:53,654 --> 00:10:54,779 నువ్వు శాయశక్తులా ప్రయత్నించావు. 223 00:10:54,780 --> 00:11:00,910 నేను చెప్పేదేంటంటే, మెక్ కోనహే కుటుంబంతో కలిసి మనం ఒక వింతైన, అద్భుతమైన కుటుంబంగా మారాం. 224 00:11:00,911 --> 00:11:04,163 అది మనందరిలో ఏదో కొత్త మార్పును తెచ్చింది, నేను దాని కోసమే ఎదురుచూస్తున్నాను, 225 00:11:04,164 --> 00:11:05,998 కాబట్టి, దయచేసి, 226 00:11:05,999 --> 00:11:09,794 మనం బస్సులో నివసించే కుటుంబంలా ఉందాం, కానీ అది మన స్వేచ్ఛ కోసం కదా? 227 00:11:09,795 --> 00:11:11,880 దేని నుంచో తప్పించుకుని పారిపోవడానికి కాదు. 228 00:11:12,381 --> 00:11:14,091 ముఖ్యంగా మనం ప్రేమించే వ్యక్తుల నుండి అసలు పారిపోము. 229 00:11:17,761 --> 00:11:18,887 అయ్యబాబోయ్, అమ్మా. 230 00:11:19,680 --> 00:11:21,056 అవును, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. 231 00:11:26,436 --> 00:11:29,940 పిల్లలు గనుక ఇక్కడ లేకపోయి ఉంటే, నిన్ను ఇప్పుడే ఇక్కడి నుండి తీసుకువెళ్లేవాడిని. 232 00:11:32,776 --> 00:11:33,777 నిజంగానా? 233 00:11:35,612 --> 00:11:36,613 ఇదిగో మళ్లీ మొదలుపెట్టారు. 234 00:11:48,417 --> 00:11:50,626 - జిమ్మీ? - ఏం అయింది? నీకు బస్సు ప్రయాణం పడలేదా? 235 00:11:50,627 --> 00:11:52,128 నా టెంట్ లో అల్లం సోడా ఉంది. 236 00:11:52,129 --> 00:11:54,422 - అది వేడిగా ఉంది, కానీ… హేయ్. హేయ్. - హాయ్. 237 00:11:54,423 --> 00:11:56,215 - చాలా సారీ. - సరే. 238 00:11:56,216 --> 00:11:58,301 - మనం ఫ్యామిలీ మొదలుపెడదాం. - వద్దు. 239 00:11:58,302 --> 00:11:59,594 మనం దత్తత తీసుకోవచ్చు. 240 00:11:59,595 --> 00:12:00,596 - నోరు మూయ్. - సరే. 241 00:12:02,764 --> 00:12:04,724 - సరే, మంచిది. నువ్వు ఇక్కడే ఉన్నావు. - నేను ఉండేది ఇక్కడే. 242 00:12:04,725 --> 00:12:06,517 నేను అలా భయపడి వెళ్లిపోయినందుకు నన్ను క్షమించు, 243 00:12:06,518 --> 00:12:08,394 కానీ దాని అర్థం నాకు నీతో కలిసి బతకడం ఇష్టం లేదని కాదు 244 00:12:08,395 --> 00:12:09,478 ఎందుకంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం. 245 00:12:09,479 --> 00:12:11,648 ఇప్పుడు, ఒక విజయవంతమైన బంధానికి పునాది ఏంటంటే… 246 00:12:15,152 --> 00:12:17,153 అవును, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. 247 00:12:17,154 --> 00:12:18,613 దేవుడా, ఏదైనా గదిలోకి వెళ్లండి. 248 00:12:18,614 --> 00:12:19,615 - సారీ. అలాగే. - అలాగే. 249 00:12:21,742 --> 00:12:24,494 అవును, నా ముందే ముద్దులు పెట్టుకోకండి. 250 00:12:25,662 --> 00:12:29,457 మా మాక్, ఇదంతా ఇలా జరిగినందుకు నన్ను క్షమించు. 251 00:12:29,458 --> 00:12:33,461 నేనే స్వయంగా మాథ్యూతో మాట్లాడి ఉండాల్సింది, ఇలా దొంగతనంగా చేయడం తప్పు, 252 00:12:33,462 --> 00:12:36,006 ఇంకా ఆ డీఎన్ఏ పరీక్షల గొడవ చేసి ఉండాల్సింది కాదు. నేను కేవలం… 253 00:12:36,673 --> 00:12:38,591 నువ్వు నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను. 254 00:12:38,592 --> 00:12:40,801 నా ముందు ఇలా ఏడవడం మొదలుపెట్టకు. 255 00:12:40,802 --> 00:12:43,721 నీ పిచ్చి బస్సు మళ్లీ వెనక్కి రావడం చూసిన క్షణమే 256 00:12:43,722 --> 00:12:45,723 నేను నిన్ను క్షమించేశాను. 257 00:12:45,724 --> 00:12:48,851 నువ్వు కిచెన్లో కూర్చుని మాథ్యూ గురించి ఆందోళన పడుతూ 258 00:12:48,852 --> 00:12:51,854 నీ బాధను మర్చిపోవడానికి వంట చేస్తున్నావని అనుకుంటేనే నాకు బాధగా ఉంది. 259 00:12:51,855 --> 00:12:54,649 అసలు మీ అందరూ నా చిల్లీ వంట మీద పడతారెందుకు? 260 00:12:54,650 --> 00:12:57,068 నేనేమీ నా బాధను మర్చిపోవడానికి వంట చేయడం లేదు. 261 00:12:57,069 --> 00:13:00,071 ఒక కొడుకుకి కొన్నిసార్లు కావాల్సింది ఏంటంటే 262 00:13:00,072 --> 00:13:02,698 తన తల్లి ఇంకా తనకు ఇష్టమైన వంటకం. అందుకే వండుతున్నాను. 263 00:13:02,699 --> 00:13:05,618 కాబట్టి, నువ్వు ఇక ఆ ర్యాలీకి బయలుదేరు 264 00:13:05,619 --> 00:13:09,540 నేను వెళ్లి నా కొడుకును తీసుకువచ్చేలోపు అక్కడ కాస్త సమయాన్ని మేనేజ్ చేయి. 265 00:13:33,021 --> 00:13:34,272 ఒక్క పాట పాడటానికే డబ్బులు ఇచ్చావు. 266 00:13:34,273 --> 00:13:35,983 అయితే, ఆ పాటనే మళ్లీ పాడు. 267 00:13:39,736 --> 00:13:41,697 ఇప్పుడు మళ్లీ "టెక్సాస్ సన్" పాట పాడుతున్నా. 268 00:13:49,288 --> 00:13:52,874 - హాయ్. - నేను మాథ్యూ మెక్ కోనహే తల్లిని. 269 00:13:52,875 --> 00:13:57,420 మేమందరం ఒకప్పుడు ఇక్కడే నివసించేవాళ్లం, తను ఇక్కడే ఉండి ఉంటాడని అనుకుంటున్నాను. 270 00:13:57,421 --> 00:13:59,213 లేదు, ఇక్కడ లేడు. 271 00:13:59,214 --> 00:14:00,381 అవును, ఇక్కడే ఉన్నాడు. 272 00:14:00,382 --> 00:14:02,008 సరే, మంచిది. ఇక్కడే ఉన్నాడు. 273 00:14:02,009 --> 00:14:04,136 కానీ దయచేసి ఆయనని తీసుకువెళ్లిపోకండి. 274 00:14:12,269 --> 00:14:16,190 నీకు ఆకలిగా ఉంటుందేమో అనుకున్నాను. 275 00:14:20,277 --> 00:14:21,278 బాబూ. 276 00:14:26,909 --> 00:14:28,535 నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? 277 00:14:29,620 --> 00:14:30,621 నేను నీ తల్లిని. 278 00:14:31,580 --> 00:14:35,626 మనం ఇక్కడకి ఇల్లు మారినప్పుడు నువ్వు, బిగ్ మాక్ కలిసి ఈ ట్రీ హౌస్ కట్టారు. 279 00:14:36,627 --> 00:14:39,587 నీకు ఒంటరిగా ఉండాలి అనిపించినప్పుడల్లా ఇక్కడికి రావడానికి ఇష్టపడేవాడివి. 280 00:14:39,588 --> 00:14:41,172 అదే కారణంతో నేను ఇక్కడికి వచ్చాను, 281 00:14:41,173 --> 00:14:43,674 నా మీద కోప్పడటానికి నీకు అన్ని హక్కులూ ఉన్నాయి. 282 00:14:43,675 --> 00:14:44,759 నీకు అలా అనిపిస్తోందా? 283 00:14:44,760 --> 00:14:47,387 నా జీవితమంతా నేను వేరే ఎవరో అని అనుకుంటూ బతికాను, 284 00:14:48,472 --> 00:14:52,391 ఎందుకంటే నువ్వు నీ పాడు రహస్యాన్ని దాచిపెట్టాల్సి వచ్చింది కాబట్టి. 285 00:14:52,392 --> 00:14:53,644 నేను ఆ మాటలకు అర్హురాలినే. 286 00:14:54,311 --> 00:14:58,565 నువ్వు చిన్న పిల్లవాడి నుండి పెద్దవాడివయ్యాక, నేను నీకు చెప్పాలనుకున్నాను. 287 00:15:01,109 --> 00:15:02,444 ఆయనకి ఈ విషయం తెలుసా? 288 00:15:06,990 --> 00:15:08,992 హా, ఆయనకి తెలుసు. 289 00:15:10,202 --> 00:15:14,706 మేము విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రతిసారీ, 290 00:15:15,249 --> 00:15:19,211 బిగ్ మాక్ ఎప్పుడూ మేము విడిపోయాక ఏం జరిగిందో ఒక్కసారి కూడా అడిగేవాడు కాదు. 291 00:15:20,087 --> 00:15:21,922 మా మధ్య రహస్యాలు ఏమీ ఉండేవి కావు. 292 00:15:23,465 --> 00:15:24,466 కాబట్టి… 293 00:15:25,801 --> 00:15:29,262 నేను క్లైవ్ ఇంకా నా గురించి ఆయనకి చెప్పాను. 294 00:15:29,263 --> 00:15:30,848 కానీ, బాబూ, అతను అలా… 295 00:15:32,558 --> 00:15:34,475 కోపంగా వడివడిగా బయటకి వెళ్లిపోయాడు. 296 00:15:34,476 --> 00:15:38,313 అప్పుడు, "దేవుడా, ఆ మనిషిని నేను మళ్లీ జన్మలో చూడలేను" అనుకున్నాను. 297 00:15:39,398 --> 00:15:43,151 కానీ ఒక వారం రోజుల తరువాత తను తిరిగి వచ్చాడు. 298 00:15:43,735 --> 00:15:45,236 ఎందుకో తెలుసా? 299 00:15:45,237 --> 00:15:48,282 ఆయన ప్రేమని ఎంచుకున్నాడు. 300 00:15:50,868 --> 00:15:52,452 వాస్తవానికి ఆయన నిన్ను ఎంచుకున్నాడు. 301 00:15:54,288 --> 00:15:57,207 తన కొడుకుని ఆయన ఎంచుకున్నాడు. 302 00:15:58,375 --> 00:16:00,544 క్లైవ్ నీకు కన్నతండ్రి కావచ్చు, 303 00:16:01,211 --> 00:16:04,590 కానీ నీ తండ్రి బిగ్ మాక్ మాత్రమే. 304 00:16:07,885 --> 00:16:09,136 నా జీవితం అంతా… 305 00:16:12,264 --> 00:16:15,142 నేను ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాను, తెలుసా. 306 00:16:17,394 --> 00:16:20,022 ఆ అడుగుజాడల్లోనే నీ నడక కొనసాగించచ్చు కదా? 307 00:16:23,108 --> 00:16:24,776 అవి నీకు బాగా సరిపోతాయి. 308 00:16:40,459 --> 00:16:42,627 ఇందులో జాక్ డేనియల్స్ కలిపావా? 309 00:16:42,628 --> 00:16:45,339 ఆ ఒక్క రహస్యాన్ని నేను ఎవ్వరికీ చెప్పను. 310 00:16:48,217 --> 00:16:51,010 సరే, మాథ్యూ నా వెనుకాలే వస్తున్నాడు, ఒట్టు. 311 00:16:51,011 --> 00:16:53,012 మనకి మరికొద్ది నిమిషాల సమయం కావాలి. 312 00:16:53,013 --> 00:16:55,515 ఆ ట్రాఫిక్ రద్దీలో… 313 00:16:55,516 --> 00:16:57,016 ఓహ్, బాగుంది. సాయం చేసేవాడు వచ్చాడు. 314 00:16:57,017 --> 00:16:59,435 చూడు, నిన్ను చిరాకు పెడుతున్నందుకు సారీ. నేను… 315 00:16:59,436 --> 00:17:02,063 లేదు, లేదు, లేదు. అప్పుడప్పుడు నన్ను చిరాకుపెట్టడాన్ని నేను ఆస్వాదిస్తాను. 316 00:17:02,064 --> 00:17:03,606 ఎందుకంటే నేను ఒక ఆధునిక మహిళను 317 00:17:03,607 --> 00:17:05,900 ఇంకా కొన్నిసార్లు నా బాయ్ ఫ్రెండ్ కూడా అలాంటి పనులే చేస్తుంటాడు. 318 00:17:05,901 --> 00:17:07,985 నువ్వు నాకు కేవలం ఒక చిన్న సమస్య మాత్రమే కాదు. 319 00:17:07,986 --> 00:17:09,694 నువ్వు ఒక పరాన్నజీవివి. 320 00:17:09,695 --> 00:17:10,947 నువ్వు ఒక వింత మనిషివి. 321 00:17:10,948 --> 00:17:12,574 నువ్వు ఒక క్యాన్సర్ లాంటివాడివి. దద్దుర్లు లాంటి వాడివి. 322 00:17:13,157 --> 00:17:14,159 నువ్వు బాగానే ఉన్నావా? 323 00:17:14,742 --> 00:17:16,410 నేను ఇక్కడ సహాయం చేయడానికి వచ్చాను. 324 00:17:16,411 --> 00:17:20,248 వేదిక మీద మరికాసేపు సమయాన్ని మేనేజ్ చేయగలమా అని అడుగుతున్నాను. 325 00:17:20,249 --> 00:17:23,584 నువ్వు కాసేపు మేనేజ్ చేయగలవా? నేను వెళ్లి నా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అప్ డేట్ చేసుకుని వస్తాను. 326 00:17:23,585 --> 00:17:24,752 కదులు! 327 00:17:33,929 --> 00:17:35,931 ఇది చాలా సరదాగా సాగింది, కానీ ఇంక నేను ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా. 328 00:17:39,643 --> 00:17:41,352 సరిగ్గా సమయానికి వచ్చావు. 329 00:17:41,353 --> 00:17:43,564 ఇతనే లియోన్ బ్రిడ్జెస్. 330 00:17:48,902 --> 00:17:50,903 అతను రోజంతా ఇక్కడే కష్టపడ్డాడు. హే, అందరికీ హాయ్. 331 00:17:50,904 --> 00:17:51,988 అందరూ ఎలా ఉన్నారు? 332 00:17:51,989 --> 00:17:53,740 మేము ఇంతవరకూ బాగానే ఉన్నాం. 333 00:17:54,616 --> 00:17:55,825 మాథ్యూ ఎక్కడ? 334 00:17:55,826 --> 00:18:00,913 సరే, అంటే, అందరూ వినండి, మాథ్యూ వస్తున్నాడు. 335 00:18:00,914 --> 00:18:02,290 కానీ అతను స్టేజ్ మీదకు వచ్చే ముందు, 336 00:18:02,291 --> 00:18:06,335 మన కళ్ళ ముందు ఉన్న అసలు నిజం గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. 337 00:18:06,336 --> 00:18:08,880 - నీ గురించి వద్దు. - మీరందరూ ఆ గుద్దులాటను చూశారని నాకు తెలుసు 338 00:18:08,881 --> 00:18:12,008 ఇంకా దాని గురించి మీ మనసులో ఎన్నో ఆలోచనలు కూడా వచ్చి ఉంటాయి. 339 00:18:12,009 --> 00:18:16,888 బూ! ఈ హిప్పీని స్టేజ్ మీద నుండి ముందు దించండి. 340 00:18:16,889 --> 00:18:19,223 కానీ నేనేమీ సమర్థించుకోవడానికి ప్రయత్నించడం లేదు. 341 00:18:19,224 --> 00:18:21,142 కానీ నేను… నేను ఆ విషయాన్ని అతనికి ముందే చెప్పాల్సింది. 342 00:18:21,143 --> 00:18:26,023 కానీ మాథ్యూ మెక్ కోనహే చాలా ఎమోషనల్ మనిషి. 343 00:18:27,816 --> 00:18:33,946 అతను కుటుంబం, స్నేహం, గౌరవం, 344 00:18:33,947 --> 00:18:37,116 - ఇంకా నిజాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. - హేయ్. 345 00:18:37,117 --> 00:18:43,415 అందుకే, అతను నా ఈ అసహజమైన అందమైన మొహం మీద గుద్దడం మీరు టీవీలో చూసినప్పుడు, 346 00:18:44,124 --> 00:18:50,671 మా కుటుంబం గురించి చాలా క్లిష్టమైన, గందరగోళమైన విషయాలు మాకు అప్పుడే తెలిశాయి. 347 00:18:50,672 --> 00:18:53,717 ఇంకా నేను నా స్నేహితుడితో అంత నిజాయితీగా ఉండలేకపోయాను. 348 00:18:55,052 --> 00:18:56,303 నా సోదరుడు. 349 00:19:00,349 --> 00:19:04,269 సరే, ఇక మన ముందుకు వస్తున్నాడు ఆ గొప్ప వ్యక్తి, ఒక లెజెండ్. 350 00:19:06,396 --> 00:19:07,648 మాథ్యూ మెక్ కోనహే. 351 00:19:12,861 --> 00:19:15,363 - నువ్వు నా లైట్ హౌస్ వి. - నేను నీ లైట్ హౌస్ ని. 352 00:19:15,364 --> 00:19:16,864 ఐ లవ్ యూ, బ్రదర్. 353 00:19:16,865 --> 00:19:19,200 ఇంకా రికార్డు కోసం, మీరందరూ ఒక విషయం తెలుసుకోవాలి 354 00:19:19,201 --> 00:19:22,078 ఈ బక్కపలచని దేహం గల వాడిని, 355 00:19:22,079 --> 00:19:24,247 ఛాతీ తప్ప కాళ్ళలో బలం లేనివాడిని, 356 00:19:24,248 --> 00:19:27,750 త్వరలో టెక్సాస్ గవర్నర్ కాబోతున్న వీడిని నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు చితకబాదగలను. 357 00:19:27,751 --> 00:19:31,296 నువ్వు నన్ను కొట్టేలోపే నేను ఆ రైట్ హుక్ గుద్దును నీ మొహం మీద వేయగలగడం నా అదృష్టం. 358 00:19:32,005 --> 00:19:33,090 థాంక్యూ, వూడీ. 359 00:19:33,841 --> 00:19:34,924 సరే. 360 00:19:34,925 --> 00:19:36,008 అవును! 361 00:19:36,009 --> 00:19:38,177 మీకు తెలుసా, నేను వూడీతో ఒక మాట చెప్పినప్పుడు, నేను అన్నాను, 362 00:19:38,178 --> 00:19:40,972 "నేను గవర్నర్ గా పోటీ చేయబోతున్నా" అని, దానికి వూడీ, "నీకేమైనా పిచ్చెక్కిందా?" అని అడిగాడు. 363 00:19:40,973 --> 00:19:42,765 నేను, "లేదు సార్, నాకు పిచ్చి పట్టలేదు" అని చెప్పాను. 364 00:19:42,766 --> 00:19:45,101 "అయితే, నువ్వు కొంచెం మత్తులోకి వెళ్లడం మంచిది" అన్నాడు. 365 00:19:45,102 --> 00:19:46,185 నువ్వు ఏమన్నావ్? 366 00:19:46,186 --> 00:19:49,021 "నువ్వు చేయబోతున్న పనులన్నింటిలోనూ ఇది అత్యంత తెలివితక్కువ పని." 367 00:19:49,022 --> 00:19:50,523 కానీ ఏదిఏమైనా, నేను ఇక్కడ ఉన్నాను. 368 00:19:50,524 --> 00:19:51,774 మీకు తెలుసా, గత కొన్ని నెలలుగా 369 00:19:51,775 --> 00:19:55,278 నేను కుటుంబం గురించి, దాని పరమార్థం గురించి చాలా ఆలోచిస్తున్నాను. 370 00:19:55,279 --> 00:19:58,948 కుటుంబం అంటే కేవలం రక్తసంబంధంతో ముడిపడి ఉన్నవాళ్లు మాత్రమే కాదు. 371 00:19:58,949 --> 00:20:01,618 - నిజమే, నిజమే. - కొన్నిసార్లు కుటుంబం అంటే 372 00:20:02,411 --> 00:20:04,413 మనకు మన ఇంట్లో ఉన్న భావనను కలిగించే వ్యక్తులు. 373 00:20:04,997 --> 00:20:06,789 మనం సాగిస్తున్న ఈ జీవితం అనే చిన్న ప్రయాణంలో 374 00:20:06,790 --> 00:20:09,667 ఎప్పుడూ మనతో పాటు నిలిచే వ్యక్తులు. 375 00:20:09,668 --> 00:20:11,378 నేను కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు… 376 00:20:14,798 --> 00:20:15,924 నేను టెక్సాస్ గురించి మాట్లాడుతున్నాను. 377 00:20:17,134 --> 00:20:21,805 మనం మనల్ని జాగ్రత్తగా చూసుకుంటూనే, ఇతరులకు సహాయం హస్తం అందించే విధానం. 378 00:20:22,472 --> 00:20:25,391 కాబట్టి మీరందరూ దీన్ని నమ్మితే, నేను చాలా వినమ్రంగా స్వీకరిస్తాను, 379 00:20:25,392 --> 00:20:27,310 నేను గౌరవంగా భావిస్తాను, ఇంకా 380 00:20:27,311 --> 00:20:32,649 మీ తదుపరి గవర్నర్ గా ఈ టెక్సాస్ కుటుంబానికి ప్రాతినిధ్యం వహించడానికి ఇంకా చాలా ఉత్సాహంగా ఉన్నాను. 381 00:20:37,487 --> 00:20:38,488 సరే. 382 00:20:39,281 --> 00:20:42,117 - ఇక మొదలుపెడదాం. - మెక్ కోనహే! 383 00:20:45,537 --> 00:20:48,332 - మెక్ కోనహే! - మెక్ కోనహే! 384 00:20:50,792 --> 00:20:52,127 థాంక్యూ. 385 00:20:58,800 --> 00:21:00,801 దొరికావురా, చెత్తవెధవ. 386 00:21:00,802 --> 00:21:03,304 కానీ నువ్వు సరిగ్గా ఆలోచించలేదు, కదా? 387 00:21:03,305 --> 00:21:06,475 చుట్టూ ఇంతమంది జనం ఉన్నప్పుడు నువ్వేమీ అంత మొనగాడివి కావు, అవునా? 388 00:21:09,394 --> 00:21:10,604 హేయ్. 389 00:21:16,777 --> 00:21:19,613 ఆరు నెలల తరువాత 390 00:21:21,031 --> 00:21:24,158 {\an8}హా, బాబు. మనం ఇది సాధించాం, డాన్. 391 00:21:24,159 --> 00:21:26,702 అవును. మీరంతా ఉత్సాహంగా ఉన్నారా? 392 00:21:26,703 --> 00:21:28,913 వర్జీనియా. బ్యూటిఫుల్. 393 00:21:28,914 --> 00:21:30,457 ఇది నిజంగానే జరుగుతోంది, అందరూ వినండి. 394 00:21:30,958 --> 00:21:32,876 పదండి. ఇక మొదలుపెడదాం. 395 00:21:33,961 --> 00:21:35,503 థాంక్యూ. థాంక్యూ. 396 00:21:35,504 --> 00:21:36,672 సరే, థాంక్స్, అబ్బాయిలూ. 397 00:21:37,714 --> 00:21:39,049 ఎలా నడుస్తోంది, మిత్రమా? 398 00:21:40,133 --> 00:21:41,551 హా? గెలిచేలా ఉన్నామా? 399 00:21:41,552 --> 00:21:43,094 {\an8}- అవును, ఉన్నాం. - అయితే మీరు చూడచ్చు, 400 00:21:43,095 --> 00:21:45,555 {\an8}చివరిగా మిగిలిన ప్రతి ఒక్క ఓటు కూడా మెక్ కోనహే కే పడినా కూడా… 401 00:21:45,556 --> 00:21:46,764 {\an8}టెక్సాస్ గవర్నర్ 10 శాతం మెక్ కోనహే 402 00:21:46,765 --> 00:21:49,851 {\an8}…లెక్కల ప్రకారం అతను గెలవడం దాదాపు అసాధ్యం 403 00:21:49,852 --> 00:21:51,519 {\an8}- అతను పరాజయం నుంచి బయటపడలేడు. - వావ్. 404 00:21:51,520 --> 00:21:52,603 {\an8}లైవ్ - ద రాచెల్ మాడోవ్ షో ఎమ్ ఎస్ నౌ 405 00:21:52,604 --> 00:21:54,730 {\an8}ఆయన పతనం ఆయన మొదటి ఎన్నికల ర్యాలీలోనే మొదలైంది 406 00:21:54,731 --> 00:21:56,358 {\an8}ఆయన ఆ వృద్ధుడిపై దాడి చేసినప్పుడే అది జరిగింది. 407 00:21:59,862 --> 00:22:01,696 టీవీలో వాళ్లు చాలా ముసలివాళ్లలా కనిపిస్తున్నారు. 408 00:22:01,697 --> 00:22:02,780 {\an8}మత్తులో పరాజయం పాలయ్యాడు 409 00:22:02,781 --> 00:22:04,490 {\an8}ఈ ప్రచారంలో మొదటి రోజు నుంచే కోపతాపాలు, గొడవలు ప్రదర్శించారు. 410 00:22:04,491 --> 00:22:05,658 {\an8}సరి కాదు, సరికాదు, సరికాదు 411 00:22:05,659 --> 00:22:08,786 {\an8}ఇంకా పోలీసులతో అతనికి జరిగిన గొడవలను కూడా మనం మర్చిపోకూడదు, 412 00:22:08,787 --> 00:22:12,498 {\an8}అగౌరవంగా ప్రవర్తించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలు, అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరగడం, 413 00:22:12,499 --> 00:22:14,333 - అవన్నీ జరిగాయి. - హేయ్, ఇప్పుడే చెప్పలేం. 414 00:22:14,334 --> 00:22:15,960 ఇది చివరికి ఎలా ముగుస్తుందో మనకు తెలియదు. 415 00:22:15,961 --> 00:22:17,170 ఇంక సమయం ఏమీ లేదు. 416 00:22:17,171 --> 00:22:19,547 తొంభై మూడు శాతం ప్రాంతాల ఫలితాలు వచ్చేశాయి. 417 00:22:19,548 --> 00:22:21,257 ఆ ఫలితాలు నిజం కావు. 418 00:22:21,258 --> 00:22:23,509 అది ఏఐ సృష్టించింది అని నాకు చూడగానే అర్థమవుతోంది. 419 00:22:23,510 --> 00:22:27,305 నువ్వు అద్భుతాలను నమ్మకపోతే, అద్భుతాలు నిన్ను నమ్మవు. 420 00:22:27,306 --> 00:22:28,514 దీని గురించి నాకు మంచి నమ్మకమే ఉంది. 421 00:22:28,515 --> 00:22:31,726 {\an8}అయినప్పటికీ మెక్ కోనహే ఈ రాత్రి గెలిచే అవకాశం ఎంత ఉందంటే 422 00:22:31,727 --> 00:22:34,520 {\an8}నాకు వంట చేయడం రాకపోయినా నేను 'ద గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో' గెలిచినంత అన్నమాట. 423 00:22:34,521 --> 00:22:38,149 {\an8}ఉదయం 6:30 గంటల వరకు మనకు పూర్తి ఫలితాలు వచ్చేలా లేవు. 424 00:22:38,150 --> 00:22:40,985 అప్పటివరకు మనం ఇక్కడే ఉంటాం ఎందుకంటే మనం ఎక్కడికీ వెళ్లడం లేదు. 425 00:22:40,986 --> 00:22:42,904 - మనం వెళ్లడం లేదా? - అవును, వెళ్లడం లేదు. 426 00:22:42,905 --> 00:22:44,488 కానీ నేను వెళ్తున్నాను. నా పని అయిపోయింది. 427 00:22:44,489 --> 00:22:46,616 మీతో పని చేయడం సంతోషంగా ఉందని చెప్పాలనుంది, కానీ అస్సలు లేదు. 428 00:22:46,617 --> 00:22:49,911 మీతో ప్రయాణం మొత్తం నిరంతరం మీ అహంకారపూరితమైన 429 00:22:49,912 --> 00:22:52,496 మీ ఇద్దరి మానసిక వైకల్య ప్రవర్తనల సమాహారంగా సాగింది. 430 00:22:52,497 --> 00:22:56,125 కాబట్టి నేను ఇక్కడి నుండి వెంటనే బాలిలోని ఒక ఆధ్యాత్మిక రిట్రీట్ కి వెళ్తున్నాను, 431 00:22:56,126 --> 00:22:57,668 దాని ఖర్చుల బిల్లును నేను మీకే పంపిస్తాను. 432 00:22:57,669 --> 00:22:59,420 అక్కడ నాకు ఆయువాస్కా మత్తు పానీయం ఇస్తారని ఆశిస్తున్నాను 433 00:22:59,421 --> 00:23:02,715 దానివల్ల నా కడుపులో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చేలా నేను గట్టిగా వాంతి చేసుకోవచ్చు 434 00:23:02,716 --> 00:23:05,343 ఇంకా నేను ఒక పెద్ద రక్తపు ముద్దగా, మురికిగా మారిపోవచ్చు. 435 00:23:05,344 --> 00:23:09,805 అప్పుడు నా మనసులో ఎంత అసహ్యంగా ఉందో, బయట కూడా అంతే అసహ్యంగా కనిపిస్తాను. 436 00:23:09,806 --> 00:23:12,558 - అందువల్లనే… - సరే, ఇక చాలు, ఆపు. 437 00:23:12,559 --> 00:23:14,685 నేను దీన్ని చాలా కాలంగా ఉపేక్షిస్తూ వస్తున్నాను. 438 00:23:14,686 --> 00:23:19,524 నువ్వు ఇలా అమర్యాదగా మాట్లాడినప్పుడు, బుద్ధిమంతులైన వ్యక్తులను చిన్నచూపు చూసినట్టు అనిపిస్తుంది. 439 00:23:19,525 --> 00:23:21,442 మాథ్యూతో ఆ విధంగా మాట్లాడకు. 440 00:23:21,443 --> 00:23:24,154 నీకో విషయం తెలుసా? అసలు వూడీతో కూడా ఆ విధంగా మాట్లాడకు. 441 00:23:24,947 --> 00:23:26,615 మర్యాదగా మా విజయోత్సవ పార్టీ నుండి బయటకు నడువు. 442 00:23:28,825 --> 00:23:30,117 - ఏం చేస్తున్నావు? - నన్ను క్షమించు. 443 00:23:30,118 --> 00:23:33,455 నువ్వు గందరగోళమైన సంకేతాలు ఇస్తున్నావు. 444 00:23:37,042 --> 00:23:38,376 అది అద్భుతంగా ఉంది. 445 00:23:38,377 --> 00:23:41,212 - థాంక్స్, వూడీ. - నేను కూడా ఆమెకు బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నాను. 446 00:23:41,213 --> 00:23:42,964 మనలో ఒకరు ఆ పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 447 00:23:42,965 --> 00:23:45,132 ఇక ఇప్పుడు, పదండి, పిల్లలు. 448 00:23:45,133 --> 00:23:47,009 వాళ్లు అలసిపోయారు. నేను వాళ్లను ఇంటికి తీసుకువెళ్తాను. 449 00:23:47,010 --> 00:23:48,094 నాకు తెలుసు. 450 00:23:48,095 --> 00:23:51,348 ఇంకా ఈ శతాబ్దపు గొప్ప పునరాగమనాన్ని చూసే ఛాన్స్ మిస్ అవుతావా? 451 00:23:52,182 --> 00:23:53,683 - లవ్ యూ. - లవ్ యూ. 452 00:23:53,684 --> 00:23:56,937 సరే, అందరూ వినండి, నా రూమ్ లో ఆఫ్టర్ పార్టీ ఉంటుంది! 453 00:23:57,563 --> 00:23:59,147 అందరూ రండి! 706 కి! 454 00:24:00,065 --> 00:24:01,900 ఏడు సున్నా ఆరు! 455 00:24:04,403 --> 00:24:05,570 పద, బాబు. 456 00:24:05,571 --> 00:24:09,073 రాబర్ట్ డౌనీ జూనియర్ తర్వాత రాబోయే అత్యంత అద్భుతమైన కమ్ బ్యాక్ కోసం సిద్ధంగా ఉండు. 457 00:24:09,074 --> 00:24:10,075 సరే. 458 00:24:15,998 --> 00:24:17,582 సరే, మనకు రీకౌంటింగ్ అవసరం లేదనుకుంటా. 459 00:24:17,583 --> 00:24:20,626 నువ్వు కనీసం బాండెరా కౌంటీలోనైనా గెలుస్తావని నేను అనుకున్నాను. 460 00:24:20,627 --> 00:24:22,880 అసలు ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. 461 00:24:24,131 --> 00:24:25,298 హేయ్. 462 00:24:25,299 --> 00:24:28,343 నువ్వు ఇప్పుడు ఈ సాకుతో తాగచ్చు అనుకుంటా. 463 00:24:30,846 --> 00:24:32,222 అవును, తాగవచ్చు. 464 00:24:40,147 --> 00:24:41,355 అదీ సంగతి. 465 00:24:41,356 --> 00:24:43,399 నేను దీన్ని చూసి చాలా కాలమైంది. 466 00:24:43,400 --> 00:24:46,068 మన చేతుల్లో కాస్త సమయం ఉన్నట్టుంది, బ్రదర్ వుడ్. 467 00:24:46,069 --> 00:24:47,945 మనం ఫ్రాన్స్ దక్షిణాది ప్రాంతానికి వెళ్తే ఎలా ఉంటుంది? 468 00:24:47,946 --> 00:24:49,155 కొద్దిగా వైన్ తాగుతూ తిరగచ్చు కదా? 469 00:24:49,156 --> 00:24:51,157 వైన్, చక్కటి ఎండ ఇంకా మంచి పాటలు. 470 00:24:51,158 --> 00:24:52,533 నాకు ఆ ఆలోచన చాలా నచ్చింది, 471 00:24:52,534 --> 00:24:56,663 కానీ మనం ఇద్దరం కలిసి ఒక రోడ్ ట్రిప్ వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. 472 00:24:57,748 --> 00:24:58,998 బహుశా కొలరాడో వెళ్లచ్చు. 473 00:24:58,999 --> 00:25:00,082 సరే, కొలరాడోలో ఏముంది? 474 00:25:00,083 --> 00:25:01,959 - బి.ఎస్.పి. - బి.ఎస్.పి. ఏంటి? 475 00:25:01,960 --> 00:25:04,253 బౌల్డర్ స్టేట్ జైలు. 476 00:25:04,254 --> 00:25:06,923 నేను నా జీవితాన్ని నడిపిన విధానాన్ని, నా కుటుంబాన్ని చూశాను, 477 00:25:06,924 --> 00:25:10,259 ఇప్పుడు ఆ మూలం నుండే కొన్ని సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. 478 00:25:10,260 --> 00:25:15,140 నాకు, నీకు ఈ జన్మ ఇవ్వడానికి కారకుడైన ఆ వ్యక్తి, 479 00:25:15,849 --> 00:25:17,059 చెప్పాలంటే మన కన్నతండ్రి. 480 00:25:20,270 --> 00:25:21,395 నువ్వు వెళ్ళి చూడాలనుకుంటున్నది… 481 00:25:21,396 --> 00:25:22,564 మన నాన్నని. 482 00:25:29,655 --> 00:25:30,989 డీల్. 483 00:25:34,493 --> 00:25:36,453 దీన్ని కాస్త తగ్గిస్తే నీకేమైనా ఇబ్బందా? 484 00:25:37,287 --> 00:25:39,664 అవును, కొంచెం ఇబ్బందే. మనం దీని గురించి ఇప్పటికే మాట్లాడుకున్నాం కదా. 485 00:25:39,665 --> 00:25:41,457 నీకు నీ కిటికీ ఉంది. నాకు నా ఏసీ గాలి ఉంది. 486 00:25:41,458 --> 00:25:43,209 నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు. 487 00:25:43,210 --> 00:25:45,378 బాబూ, నువ్వు తల ఊపావు కదా. 488 00:25:45,379 --> 00:25:47,338 - నేను తల ఊపలేదు. నేను… - హా, నువ్వు తల ఊపావు. 489 00:25:47,339 --> 00:25:49,090 నిజానికి నేను నా భుజాలు ఎగరేసాను అంతే. 490 00:25:49,091 --> 00:25:50,424 హే, నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. 491 00:25:50,425 --> 00:25:53,553 గుర్తుందా, గతంలో నీకు ఇలాంటి అద్భుతమైన ఆలోచన వచ్చినప్పుడే నన్ను ఒక ఎద్దు కింద పడేసింది. 492 00:25:53,554 --> 00:25:54,763 - అది మర్చిపో. - వుడ్రోవ్. 493 00:25:55,389 --> 00:25:58,558 మా నాన్న మీ అమ్మతో పడుకున్నాడు. సరే, కచ్చితంగా ఇంకా వేరే వాళ్లు కూడా ఉండి ఉంటారు. 494 00:25:58,559 --> 00:26:01,143 - అంటే నీ ఉద్దేశం… - మనకు ఇంకా తోబుట్టువులు ఉన్నారేమో. 495 00:26:01,144 --> 00:26:05,274 మిత్రమా, ఇప్పుడు అంత పెద్ద కుటుంబాన్ని తట్టుకునే ఓపిక నాకు ఉందో లేదో తెలియడం లేదు. 496 00:27:33,362 --> 00:27:35,364 తెలుగు అనువాదకర్త: హరీష్