1 00:01:45,065 --> 00:01:49,069 వుహాన్, చైనా 2 00:01:57,285 --> 00:01:59,287 -డేనియల్, లేయ్. -దేవుడా, ఏమైంది? 3 00:01:59,371 --> 00:02:01,915 మనం పది గంటలకల్లా వూహాన్ నుండి వెళ్లిపోవాలి. లాక్ డౌన్ పెడుతున్నారు. 4 00:02:01,998 --> 00:02:04,042 లాక్ డౌన్? ఏంటి? ఎంత కాలం? 5 00:02:05,210 --> 00:02:06,461 ఇప్పటికే రోడ్లను మూసేశారు. 6 00:02:11,841 --> 00:02:14,427 ఈ రైలు మిస్ అయితే, ఇక మన పరిస్థితి అంతే, ఇంకో రైలు లేదు. 7 00:02:14,511 --> 00:02:16,972 -సరే. -ఇక్కడున్న జనాభా ఆలోచన కూడా అదే. 8 00:02:17,055 --> 00:02:19,307 -మనం ఇక్కడి నుండి బయటపడాలి. పదండి. -ఏం జరుగుతోంది? 9 00:02:19,391 --> 00:02:20,392 హేయ్. 10 00:02:25,564 --> 00:02:27,148 -ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తున్నారు. -ఉష్ణోగ్రతనా? 11 00:02:27,232 --> 00:02:29,526 -లక్షణాలున్నాయేమో చూస్తున్నారు. -పదండి. 12 00:02:30,735 --> 00:02:33,071 క్షమించండి. మన్నించండి. 13 00:02:33,154 --> 00:02:35,323 క్షమించండి. మన్నించండి. 14 00:02:38,743 --> 00:02:40,078 మనం ఎక్కకూడదట. 15 00:02:40,161 --> 00:02:41,538 మనమెవరో అతనికి చెప్పు. 16 00:02:57,679 --> 00:03:00,223 ఎక్కండి. ఎక్కండి. 17 00:03:03,894 --> 00:03:06,021 మనం యుబిఎలో పనిచేస్తున్నామని చెప్పావా? 18 00:03:06,104 --> 00:03:08,607 లేదు, బీజింగ్ లో మా అమ్మ చావుబతుకుల్లో ఉందని చెప్పాను. 19 00:03:24,164 --> 00:03:26,833 మేల్కోవలసిన సమయం ఆసన్నమైంది, అమెరికా వాసులారా. 20 00:03:27,667 --> 00:03:29,628 ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. 21 00:03:30,754 --> 00:03:33,590 కొండల నుండి, పచ్చిక బయళ్ల దాకా, 22 00:03:34,341 --> 00:03:39,471 దట్టమైన అడవుల నుండి పచ్చని పొలాల దాకా. 23 00:03:40,138 --> 00:03:43,433 సముద్రం నుండి మహాసముద్రం దాకా. 24 00:03:43,516 --> 00:03:46,853 ఒక ముఖ్యమైన ప్రకటన కోసం సంసిద్ధం కండి. 25 00:03:46,937 --> 00:03:51,149 "ది మార్నింగ్ షో"లో జనవరి 27న, సోమవారం నాడు, 26 00:03:51,233 --> 00:03:55,946 ఈస్టర్న్ స్టాండర్డ్ సమయం, ఉదయం ఎనిమిది గంటలకు ప్రకటించబడుతుంది. 27 00:03:56,029 --> 00:03:59,532 మీ రోజులు కొంగొత్తగా ప్రారంభం కానున్నాయి. 28 00:03:59,616 --> 00:04:02,369 కేవలం యుబిఎలో మాత్రమే. 29 00:04:02,452 --> 00:04:04,496 -ఓరి దేవుడా. -అదిరిపోయింది. 30 00:04:04,579 --> 00:04:08,833 మీరు చాలా కష్టపడి పని చేసినట్టున్నారు. 31 00:04:08,917 --> 00:04:10,544 అందులో చాలా విషయముంది. 32 00:04:10,627 --> 00:04:12,462 -నీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. -అవును. 33 00:04:13,046 --> 00:04:14,047 ఒక్క క్షణం పాటు, 34 00:04:14,130 --> 00:04:16,800 నేను వేరే స్క్రీనింగ్ గదిలోకి వచ్చానా ఏంటి అని అనిపించింది. 35 00:04:16,882 --> 00:04:19,177 అది రెండవ రాకడకి సంబంధించిన ప్రోమోని చూస్తున్నట్టుగా అనిపించింది. 36 00:04:19,261 --> 00:04:21,513 మేము యేసు క్రీస్తు దగ్గర పనిచేసే ప్రకటన మనుషులనే పెట్టుకున్నాంలే. 37 00:04:21,596 --> 00:04:25,392 నేను యేసు నుండి ఏదీ లాక్కోవాలని చూడటం లేదు కానీ ఇది చాలా ముఖ్యమైంది. 38 00:04:25,475 --> 00:04:28,395 -మనకి చాలా ఉత్సాహంగా ఉంది, కదా? -మామూలుగా కాదు. సందేహమే లేదు. 39 00:04:28,478 --> 00:04:29,688 ఈ ప్రకటనలు కేవలం ఆరంభం మాత్రమే. 40 00:04:29,771 --> 00:04:31,565 లారాతో నీ ఇంటర్వ్యూ ఎప్పుడు? 41 00:04:31,648 --> 00:04:34,818 నిజానికి, దానికి షెడ్యూల్ ని ఖరారు చేయడం మాకు కష్టంగా ఉంది. 42 00:04:34,901 --> 00:04:36,027 ఏంటి సమస్య? 43 00:04:36,111 --> 00:04:38,029 -లారాకి రెండు రోజుల సమయం కావాలట. -నేను లారాతో మాట్లాడాను. 44 00:04:38,113 --> 00:04:41,366 నీ ప్రశాంతత జీవితానికి వీడ్కోలు చెప్పి, తిరిగి ఇక్కడికి వస్తున్నావు కదా, 45 00:04:41,449 --> 00:04:42,576 దాన్ని తను కవర్ చేయాలనుకుంటోంది. 46 00:04:42,659 --> 00:04:44,369 ఆ మార్పును తను కవర్ చేయాలనుకుంటోంది. 47 00:04:44,452 --> 00:04:46,580 -అది మంచి విషయంలానే ఉంది. -అందులో చాలా అంశాలు ఉంటాయి. 48 00:04:46,663 --> 00:04:49,416 ఇంకా, తను నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రస్తావించాలనుకుంటోంది. 49 00:04:49,499 --> 00:04:51,001 లారా ఒక ప్రొఫెషనల్. 50 00:04:51,084 --> 00:04:53,712 నా కథను కవర్ చేయడానికి తనకి రెండు రోజులు అక్కర్లేదు. 51 00:04:53,795 --> 00:04:55,630 మా ఇంట్లో ఒక్క మధ్యాహ్నం నాతో కూర్చుంటే తనకి అన్నీ తెలుస్తాయి. 52 00:04:55,714 --> 00:04:58,592 -తను మంచిగా కవర్ చేయాలనుకుంటుంది. -అది అభినందనీయమే. 53 00:04:58,675 --> 00:05:00,385 లారాకి, తనకి కావలసిన ఎమ్మీని నేను గెలిపిస్తాను. 54 00:05:01,469 --> 00:05:03,763 అందరి చూపు, తర్వాతి రోజు జరగబోయే "ది మార్నింగ్ షో"పై ఉంటుంది, 55 00:05:03,847 --> 00:05:06,182 నేను దాన్ని తక్కువ సమయంలోనే ముగించగలను. 56 00:05:06,266 --> 00:05:07,309 -నాకు నచ్చింది. -మంచిది. 57 00:05:07,392 --> 00:05:09,686 స్టెల్లా, లారాకి కాల్ చేసి, ఆ షెడ్యూల్ పనిని నువ్వు చూసుకుంటావా? 58 00:05:09,769 --> 00:05:11,396 -తప్పకుండా. -మంచిది. ధన్యవాదాలు, మిత్రులారా. 59 00:05:11,479 --> 00:05:14,816 ఇంకో విషయం, నేను నా నిర్మాతని ఎంచుకున్నాను. 60 00:05:14,900 --> 00:05:16,192 మంచిది. ఎవరది? 61 00:05:16,276 --> 00:05:17,402 చిప్. 62 00:05:19,654 --> 00:05:20,697 చిప్ బ్లాక్? 63 00:05:20,780 --> 00:05:24,200 అవును. చూడండి, చిప్ ని అలా అమానుషంగా తీసేసి ఉండవలసింది కాదు. 64 00:05:24,284 --> 00:05:27,370 ఫ్రెడ్ ని కాపాడటానికి ఒక నకిలీ దర్యాప్తు చేసి అతడిని బలి చేశారు. 65 00:05:27,454 --> 00:05:31,666 నేను పనిచేసిన నిర్మాతల్లో అతనే చాలా మంచివాడు, అతడినే నేను కావాలనుకుంటున్నా. 66 00:05:33,043 --> 00:05:34,544 స్టెల్లా, ఆ విషయం నువ్వు చూసుకుంటావా? 67 00:05:34,628 --> 00:05:35,921 తప్పకుండా. 68 00:05:36,004 --> 00:05:37,964 సరే మరి. చాలా మంచిది. 69 00:05:38,048 --> 00:05:40,634 మీకు నా నుండి ఇంకే సమాచారమైనా కావాలా? 70 00:05:40,717 --> 00:05:41,843 సరేనా అయితే? 71 00:05:41,927 --> 00:05:44,471 సోమవారం ప్రకటన విషయంలో నాకు చాలా ఉత్సాహంగా ఉంది. 72 00:05:44,554 --> 00:05:46,306 అదరగొట్టేశారు, మిత్రులారా. 73 00:05:49,559 --> 00:05:52,395 నాకు కాస్త సహాయపడు. ఈ వారం మనకున్న ముఖ్యమైన పనులేంటి? 74 00:05:52,479 --> 00:05:54,606 మియా పంపిన మెసేజ్ ని చదివి వినిపిస్తాను. "ఈ వారం కాస్త హడావిడిగా ఉంటుంది. 75 00:05:54,689 --> 00:06:00,195 ఆలెక్స్ తిరిగి వచ్చింది, సర్వేలు, అందరి చూపు. ఈ వారానికి అదే మన పెద్ద కథనం." 76 00:06:00,278 --> 00:06:01,988 -మన పురోగతి ఎలా ఉంది? -గురువారానికి అంతా సిద్ధంగా ఉంది. 77 00:06:02,072 --> 00:06:03,490 సూపర్. అది చాలా మంచి విషయం. 78 00:06:04,950 --> 00:06:08,119 వాటి గురించి చర్చించే ముందు, ఆలెక్స్ చెప్పిన ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తాను. 79 00:06:08,203 --> 00:06:10,872 -ఆమె నిర్మాతగా మళ్లీ చిప్ వస్తున్నాడు. -సూపర్! 80 00:06:10,956 --> 00:06:12,290 అది సరైన విషయమేనా? 81 00:06:12,374 --> 00:06:14,876 -అతడిని అకారణంగా తీసేశారు! -సరే. వినండి. 82 00:06:14,960 --> 00:06:18,338 ఈ నెట్వర్క్ లో చాలా మార్పులు జరుగుతున్నాయి. మంచివే. సరేనా? 83 00:06:18,421 --> 00:06:21,758 నేను చిప్ తో చాలా కాలం పని చేశాను. సరే మరి. 84 00:06:21,841 --> 00:06:25,220 ఈ విషయంలో మనమందరం ఒకే మాట మీద ఉండాలి. సరేనా? 85 00:06:25,303 --> 00:06:26,930 ఇక మీరు మీ పనిని కొనసాగించండి. 86 00:06:27,013 --> 00:06:30,767 -నేను కాసేపట్లో వస్తాను. ధన్యవాదాలు. -హేయ్, డేనియల్ సంగతేంటి? 87 00:06:30,850 --> 00:06:33,937 బీజింగ్ హిల్టన్ లో 14 రోజుల పాటు నెట్వర్క్ అతడిని క్వారంటైన్ లో ఉంచింది. 88 00:06:34,020 --> 00:06:35,021 -మంచిది! -వావ్! 89 00:06:35,105 --> 00:06:37,399 ఇప్పటిదాకా మాకు బాగానే ఉంది, 90 00:06:37,482 --> 00:06:40,986 కానీ ఈ గదిలో మేము ఇంకా అయిదు రోజుల పాటే ఉన్నాం. 91 00:06:41,069 --> 00:06:45,615 ఇంకో తొమ్మిది రాజులు ఉంటే కానీ మా ఆరోగ్య స్థితి గురించి పూర్తిగా తెలీదు. 92 00:06:46,199 --> 00:06:48,994 వావ్. అది ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. 93 00:06:49,077 --> 00:06:52,414 అయితే, చైనా లో అయిదు కోట్లకు పైగా జనాభా క్వారంటైన్ లో ఉంది. 94 00:06:52,497 --> 00:06:54,624 దాని వల్ల వైరస్ వ్యాప్తి ఆగుతుందని వారు భావిస్తున్నారా? 95 00:06:54,708 --> 00:06:57,210 న్యూ యోర్క్ - బీజింగ్ 96 00:06:57,294 --> 00:07:01,381 అలా అనే ఆశిస్తున్నారు. కానీ అది ఎంతమేరకు ప్రభావవంతమో చూడాలి. 97 00:07:01,464 --> 00:07:04,342 ప్రజారోగ్య నిపుణులు, ఇంకా మహమ్మారుల రంగ నిపుణులు, 98 00:07:04,426 --> 00:07:07,596 ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. 99 00:07:07,679 --> 00:07:09,973 చైనీస్ అధికారులు - "వైరస్ ని అంతం చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తున్నాం" 100 00:07:10,056 --> 00:07:11,975 -ఏంటి? "సామాజిక దూరమా"? -ఏంటి? 101 00:07:12,058 --> 00:07:15,896 నేనూ, నా కుటుంబం ఎప్పట్నుందో సామాజిక దూరం పాటిస్తున్నట్టున్నాం. 102 00:07:15,979 --> 00:07:18,773 హేయ్, డేనియల్, వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చేయ్, సరేనా? 103 00:07:18,857 --> 00:07:21,109 మేము మళ్లీ నీతో రేపు మాట్లాడతాం, డేనియల్. జాగ్రత్తగా ఉండు. 104 00:07:21,192 --> 00:07:22,485 నిపుణులు "సామాజిక దూరం" పాటించమని కోరుతున్నారు 105 00:07:22,569 --> 00:07:24,321 -నేను... -అది చాలా అసాధారణమైన విషయం. 106 00:07:24,404 --> 00:07:25,488 అవును. 107 00:07:25,572 --> 00:07:29,618 ఇక అసాధారణమైన విషయానికి వస్తే, ఇప్పుడు సమయం ఎనిమిది అయింది, 108 00:07:29,701 --> 00:07:31,244 మీకు ఓ విషయం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. 109 00:07:31,328 --> 00:07:33,538 అంతే. టై, యాలిసన్, యాంకో. 110 00:07:33,622 --> 00:07:35,707 -ఇక్కడికి రండి. -పదండి. 111 00:07:35,790 --> 00:07:37,334 మాతో వేదికని పంచుకోండి. 112 00:07:38,668 --> 00:07:40,587 మీరు మరీ రాతి యుగంలో జీవిస్తుంటే తప్ప, 113 00:07:40,670 --> 00:07:43,298 మేము ఒక పెద్ద విషయాన్ని ప్రకటించబోతున్నామని మీకు తెలిసే ఉంటుంది. 114 00:07:43,381 --> 00:07:47,010 నేను రెండు వారాల్లో బాధాకరంగా ఈ షో నుండి వెళ్లిపోతున్నాను కాబట్టి, 115 00:07:47,719 --> 00:07:50,555 అందరి మదిలో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, 116 00:07:50,639 --> 00:07:53,767 ఫిబ్రవరి 10న, సోమవారం ఉదయం ఏడు గంటలకు 117 00:07:53,850 --> 00:07:58,355 బ్రాడ్లీ జాక్సన్ కి జోడీగా మీ ముందుకు ఎవరు రాబోతున్నారు అని. 118 00:07:58,438 --> 00:08:01,024 మీరు ఎవరా అని ఊహించుకుంటూ ఉండవచ్చు, కానీ అది మీ ఊహలకు అందనిది. 119 00:08:01,107 --> 00:08:02,609 ఇక జనాలకు విషయం చెప్పేద్దాం. 120 00:08:02,692 --> 00:08:04,945 -చెప్పేద్దాం. -సరే. నన్నే చెప్పమంటావు అయితే. 121 00:08:05,028 --> 00:08:09,616 సోమవారం, ఫిభ్రవరి 10న నా కుడి పక్కన కూర్చోబోయేది, 122 00:08:09,699 --> 00:08:12,827 మరెవరో కాదు, ఏకైక, సాటి లేని... 123 00:08:12,911 --> 00:08:15,497 -అనన్యసామాన్యమైన వ్యక్తి. -అనన్యసామాన్యమైన వ్యక్తి, థ్యాంక్ యూ, టై. 124 00:08:15,580 --> 00:08:17,499 మనం ఇక ఒక్క సెకను కూడా ఈ రహస్యాన్ని దాచి ఉంచకూడదు. 125 00:08:17,582 --> 00:08:19,960 సరే, సరే... ఆలెక్స్ లెవీ. 126 00:08:20,043 --> 00:08:21,044 ఆలెక్స్ మళ్లీ మీ ముందుకు వస్తోంది! 127 00:08:21,127 --> 00:08:22,462 నాకు ఆలెక్స్ లెవీ కావాలి 128 00:08:22,546 --> 00:08:24,589 బ్రాడ్లీ జాక్సన్ కూడా కావాలి 129 00:08:26,883 --> 00:08:28,260 ఇది సూపర్ గా ఉంది! 130 00:08:31,304 --> 00:08:33,347 విరామం తర్వాత, ఆలెక్స్ మీ ముందుకు రాబోయే ముందు, 131 00:08:33,431 --> 00:08:37,811 మేము మీతో, ఈ వారమంతా, యుబిఎలో ఆలెక్స్, బ్రాడ్లీల ప్రస్థానం గురించి 132 00:08:37,894 --> 00:08:40,981 వివరాలను పంచుకుంటాం. 133 00:08:41,481 --> 00:08:44,693 ఇక ఆలెక్స్ లెవీ లాగానే, మేము కూడా మీ ముందుకు చిటికెలో వచ్చేస్తాం. 134 00:08:44,776 --> 00:08:45,986 చాలా సరదాగా ఉంది. 135 00:08:46,069 --> 00:08:47,153 ప్రసారం ముగిసింది. 136 00:08:48,238 --> 00:08:50,240 రెండే నిమిషాలు ఉంది, బాబులూ. దీన్నంతా శుభ్రం చేసేద్దాం. 137 00:08:50,323 --> 00:08:52,576 సరే, మీడియా ప్రకటన విడుదలైంది. 138 00:08:52,659 --> 00:08:55,537 ట్విట్టర్ లో సానుకూల స్పందనే వస్తుంది, మన స్టాక్ విలువలు మూడు శాతం పెరిగాయి. 139 00:08:55,620 --> 00:08:58,707 -కాబట్టి, ధన్యవాదాలు. -నీకు బాగా ఉత్సాహకరంగా ఉన్నట్టుంది. 140 00:08:58,790 --> 00:09:01,251 -అవును మరి. -ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. 141 00:09:02,294 --> 00:09:05,046 హేయ్, అందరూ అదరగొట్టేశారు. అదరగొట్టేశావు. అదరగొట్టేశావు. 142 00:09:06,006 --> 00:09:09,092 నాకు విషయం ముందే తెలిసినా కూడా, నీ ప్రకటనా తీరు నాకు ఉత్సాహం కలిగించింది. 143 00:09:09,175 --> 00:09:11,386 వేగస్ లో జరిగే చర్చకి నేను మధ్యవర్తిగా ఉండాలనుకుంటున్నాను. 144 00:09:11,469 --> 00:09:14,973 ఇది నీ మధ్యవర్తిత్వ విధానాన్ని సూచిస్తుందని అంటున్నావా? 145 00:09:15,724 --> 00:09:16,850 నేనేమీ కామెడీ చేయడం లేదు. 146 00:09:19,477 --> 00:09:22,230 అది అభినందనీయమే, కానీ ఆ విషయాన్ని నేను స్టేల్లాకి అప్పగిస్తాను. 147 00:09:22,314 --> 00:09:25,650 -అయితే ఇప్పుడు స్టెల్లాకి అప్పగిస్తున్నావా? -మనం ఏమైనా మాట్లాడుకోవలసిన విషయముందా? 148 00:09:25,734 --> 00:09:28,820 మనం మాట్లాడుకుంటున్నాం కదా. పెదాలు కదులుతున్నాయి, మాటలు కూడా వస్తున్నాయి. 149 00:09:28,904 --> 00:09:31,197 నువ్వు ఒక పెద్ద పేరున్న మనిషికి ఎక్కువ చెల్లించి ఇక్కడ కూర్చోబెడతావు, 150 00:09:31,281 --> 00:09:34,492 కానీ నా ప్రాముఖ్యతను నేను తగ్గించుకోలేని అని ఆ మాటలు అంటున్నాయి. 151 00:09:34,576 --> 00:09:37,537 -అలా అస్సలు జరగడం లేదు. -లేదులే. నేను జరగనివ్వనులే. 152 00:09:37,621 --> 00:09:39,205 ఇది ప్రసార నెట్వర్క్. 153 00:09:39,289 --> 00:09:42,500 స్వతంత్రంగా ఆలోచించగలరు అని జనాలకు తెలిసిన వ్యక్తి వారికి కావాలి. 154 00:09:43,251 --> 00:09:46,546 "ది మార్నింగ్ షో" అంటే అందరికీ ఆలెక్స్ లెవీయే గుర్తొస్తుంది. 155 00:09:46,630 --> 00:09:50,383 కానీ ఇక ముందు, రాజకీయ వార్తలంటే 156 00:09:50,467 --> 00:09:51,843 జనాలకు నేనే గుర్తురావాలి. 157 00:09:51,927 --> 00:09:55,430 అవును, నువ్వు అయోవా రాజకీయ సమీకరణలను కవర్ చేసేటప్పుడు, 158 00:09:55,513 --> 00:09:57,682 ప్రైమ్ టైమ్ లో లారా పీటర్సన్ నిన్ను ఇంటర్వ్యూ చేయడం అందరూ చూస్తారు కదా. 159 00:09:57,766 --> 00:09:58,808 అది కూడా రాజకీయమే కదా. 160 00:09:59,768 --> 00:10:01,978 ఇవాళ ఆలెక్స్ తో నువ్వు లంచ్ చేస్తున్నావని నాకు తెలిసింది. 161 00:10:02,062 --> 00:10:03,939 ఆ చర్చకి మధ్యవర్తిగా నేనుంటాను. 162 00:10:06,274 --> 00:10:07,984 బ్రాడ్లీ, నీ మైక్రోఫోన్ ఆన్ లో ఉందా? 163 00:10:09,110 --> 00:10:10,987 -లేదు. -మంచిది. 164 00:10:12,364 --> 00:10:14,449 ఎందుకంటే, స్టూడియో నిండా ఉన్న నా ఉద్యోగుల మధ్య 165 00:10:14,532 --> 00:10:16,952 నువ్వు నాతో ఇలా మాట్లాడటం నాకు అస్సలు నచ్చదు. 166 00:10:18,078 --> 00:10:19,704 సరే, మిత్రులారా, ఇక ప్రసారం కోసం సిద్ధం చేయండి. 167 00:10:19,788 --> 00:10:21,289 -పది సెకన్లలోపు సిద్ధం కావాలి. -షో బాగా చేశావు. 168 00:10:21,873 --> 00:10:22,958 తొమ్మిది. 169 00:10:24,125 --> 00:10:25,252 ఎనిమిది. 170 00:10:25,961 --> 00:10:26,962 ఏడు. 171 00:10:28,004 --> 00:10:29,673 -ఆరు. -దీన్ని తీసుకువెళ్లగలవా? ధన్యవాదాలు. 172 00:10:29,756 --> 00:10:32,300 మేం చాలా కాలంగా ఇటలీలోనే గడుపుతున్నాం, 173 00:10:32,384 --> 00:10:33,635 మిలన్ ఫ్యాషన్ వీక్ జరిగేదాకా ఇక్కడే ఉంటాం. 174 00:10:33,718 --> 00:10:36,429 ప్రతీ ఏడాదీ జెనీవా వెళ్తూ ఉంటుంది కదా, ఈసారికి తనతో నేను కూడా వెళ్తున్నాను. 175 00:10:36,513 --> 00:10:38,723 మంచి బ్రాండ్ దుస్తుల్లో మోడళ్లని చూస్తే మూడ్ వస్తుందని, ఆ అందమైన మోడళ్ళను 176 00:10:38,807 --> 00:10:41,393 అందరినీ చూడమని జెనీవా అంటోంది. 177 00:10:41,476 --> 00:10:44,688 చాలీ చాలని బట్టలు వేసుకొన్న 178 00:10:44,771 --> 00:10:47,023 -టీనేజర్లను నేను చూడాలనుకుంటే... -ఇక ఆపేయ్. 179 00:10:47,732 --> 00:10:51,528 నువ్వేం ఏం చేస్తున్నావు? మనమేం చేస్తున్నాం? ఇదేనా నువ్వు మాట్లాడాలన్నది? 180 00:10:52,153 --> 00:10:55,782 -కాదు, మనం మాట్లాడుకొని చాలా కాలమైందని. -అవును, అందుకు కారణం కూడా ఉంది. 181 00:10:55,865 --> 00:10:56,992 మనిద్దరి బతుకు బస్టాండ్ అయింది. 182 00:10:57,075 --> 00:10:59,244 ఇలా ఒకరి మీద ఓకరం కోపంగా ఉండటం వల్ల లాభమేంటి? 183 00:10:59,327 --> 00:11:02,163 విషయం చెప్పు. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేయ్. 184 00:11:02,247 --> 00:11:05,292 వివేకంగా మాట్లాడుకుందాం, మిట్చ్. మనిద్దరం ఒకే పక్షాన ఉన్నాం. ప్రతివాదులం. 185 00:11:05,375 --> 00:11:08,795 -అదే డబ్బులు గుంజుకోవాలనే కేసు. -అవును, లాయర్లు ఉండేది అందుకే కదా. 186 00:11:08,879 --> 00:11:10,839 నీ లాయర్ నీకు ఎంత చెప్తున్నాడో నాకు తెలీదు కానీ, 187 00:11:10,922 --> 00:11:12,632 మనం సెటిల్ చేసుకోవాలని చేసిన ప్రయత్నం హర్షనీయమైనదే. 188 00:11:12,716 --> 00:11:14,759 అవును. నువ్వు చాలా మంచివాడివి. 189 00:11:14,843 --> 00:11:15,844 కాదు, నేను నిజంగానే అంటున్నాను. 190 00:11:15,927 --> 00:11:19,264 ఈ కేసును వాళ్లు గెలవలేరు. మిట్చ్, ఆ అమ్మాయి చావుకు మనం కారణం కాదు. 191 00:11:19,890 --> 00:11:21,141 అలాగే యుబిఎ కూడా కాదు. 192 00:11:21,933 --> 00:11:24,644 వాళ్లు కేసు వేయాల్సింది, ఆమెకి డ్రగ్స్ అమ్మిన వ్యక్తి మీద. 193 00:11:27,355 --> 00:11:28,607 నీకు పశ్చాత్తాపభావనే లేదు. 194 00:11:28,690 --> 00:11:31,526 సానుభూతి అంటావా, ఉంది. పశ్చాత్తాప భావన, ఆ ప్రసక్తే లేదు. 195 00:11:33,778 --> 00:11:35,864 సరే. నిన్ను ఓ విషయం అడుగుతాను. 196 00:11:36,448 --> 00:11:39,117 ఆ అమ్మాయి నీతో పడక పంచుకున్నప్పుడు తన మానసిక స్థితి ఎలా ఉండింది? 197 00:11:39,826 --> 00:11:42,829 నీ సాటిలేని మగతనం వల్లే తను చనిపోయిందని నిజంగా అనుకుంటున్నావా? 198 00:11:42,913 --> 00:11:44,080 ఇది జోక్ కాదు. 199 00:11:44,164 --> 00:11:48,460 తను తెలివైనది, తనలో ప్రతిభ ఉంది. తన మానసిక స్థితి సరిగ్గా లేదని అనిపించనేలేదు. 200 00:11:49,836 --> 00:11:54,341 తను ఒక సమయంలో బాగా కలత చెందింది, 201 00:11:54,424 --> 00:11:56,968 అప్పుడు మనం ఊచకోతలని కవర్ చేస్తూ ఉన్నాం. 202 00:11:57,052 --> 00:11:58,553 నాకు న్యాయంగా అనిపించడం లేదు... 203 00:11:59,554 --> 00:12:02,265 ఓ విషయం చెప్పనా? వదిలేయ్. దాని గురించి నీతో చెప్పాల్సిన పనిలేదులే. 204 00:12:02,349 --> 00:12:05,018 నీకు కుమిలిపోవాలనుంటే, నువ్వెంతైనా కుమిలిపో. 205 00:12:05,101 --> 00:12:07,896 కానీ విషయమేంటంటే, దానికి మనం చట్టపరంగా బాధ్యులం కాలేము. 206 00:12:07,979 --> 00:12:10,440 ఒక అమ్మాయికి వాస్తవ ప్రపంచంలో జీవించేంత స్థైర్యం లేకపోతే, 207 00:12:10,523 --> 00:12:13,610 దానికి నేను కోట్లు కోట్లు ఇవ్వాలి అంటే అంత కన్నా దారుణమైనది ఇంకేది లేదు. 208 00:12:13,693 --> 00:12:14,694 -తనకి పేరు ఉంది. -అవును. 209 00:12:14,778 --> 00:12:18,240 కోర్టులూ, మీడియా వాళ్ళ పుణ్యమా అని ఆ పేరు అప్రతిష్ఠపాలవుతుంది. దేని కోసం? 210 00:12:20,200 --> 00:12:23,870 చూడు, ఆ కేసును కొట్టివేయమని అప్పీలు చేసే ధైర్యం నెట్వర్క్ చేయలేకపోతోంది. 211 00:12:24,871 --> 00:12:28,375 మనం ఏకమై, వాళ్లు అప్పీలు చేయాల్సిందిగా డిమాండ్ చేయాలి. 212 00:12:29,084 --> 00:12:30,418 నన్ను వదిలేయ్. 213 00:12:31,169 --> 00:12:32,212 మిట్చ్... 214 00:12:40,762 --> 00:12:43,848 ఆలెక్స్, మళ్లీ మార్నింగ్ షోకి తిరిగి రావడం మీకు ఎలా అనిపిస్తోంది? 215 00:12:43,932 --> 00:12:45,475 అది నాకు బాగా నచ్చే విషయం కాకపోతే మళ్లీ వెళ్లే దాన్ని కాదు కదా. 216 00:12:45,559 --> 00:12:47,769 -ట్రంప్ కి ఉద్వాసన తప్పదా? -ఉద్వాసనకు గురయ్యాడు కదా. 217 00:12:47,852 --> 00:12:49,396 -లోపల నా స్నేహితురాలు ఎదురుచూస్తోంది. -ఆలెక్స్! 218 00:12:50,814 --> 00:12:52,232 -అమె ఆలెక్స్ లెవీ! -హాయ్. 219 00:12:52,315 --> 00:12:53,525 ఏంటి? ఓరి దేవుడా! 220 00:12:53,608 --> 00:12:55,235 ధన్యవాదాలు, బంగారం. 221 00:12:57,112 --> 00:12:58,405 సరే మరి. 222 00:12:59,823 --> 00:13:01,533 -హలో, హాయ్. -హాయ్. 223 00:13:03,201 --> 00:13:04,452 హాయ్. 224 00:13:05,203 --> 00:13:08,832 హాయ్. ఈ రెస్టారెంట్ నిండా విలేఖరులే ఉన్నారు. 225 00:13:08,915 --> 00:13:12,085 పట్టించుకోకులే. మన మధ్య అక్రమ సంబంధంలాంటిదేమీ లేదు కదా. 226 00:13:13,712 --> 00:13:15,630 కానీ నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నాను. 227 00:13:15,714 --> 00:13:19,551 మొన్న రాత్రి మనం వాదులాడుకోవడం నాకు సరైన విషయంలా అనిపించలేదు. 228 00:13:19,634 --> 00:13:21,052 -నాకు తెలుసు. -తెలుసా? 229 00:13:21,136 --> 00:13:24,472 అవును, మనం వాదులాడుకున్నాం. నేను కూడా ఆ విషయమే ఆలోచిస్తూ ఉన్నాను. 230 00:13:25,432 --> 00:13:26,641 ముందు నేను చెప్పవచ్చా? 231 00:13:27,976 --> 00:13:29,519 -తప్పకుండా. -అలాగే. 232 00:13:29,603 --> 00:13:35,775 గత తొమ్మిది నెలలుగా, నన్ను నేను చాలా పరిశీలించుకుంటూ గడిపాను. 233 00:13:35,859 --> 00:13:38,278 నేను ఇచ్చిపుచ్చుకోవడమనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. 234 00:13:39,696 --> 00:13:44,534 కానీ నా జీవితం ఇతరుల జీవితాల కన్నా చాలా భిన్నంగా మారిపోయింది, ఎంతలా అంటే, 235 00:13:44,618 --> 00:13:47,787 నేను ఇతరుల మనస్సును అర్థం చేసుకోలేకపోతున్నాను. 236 00:13:49,080 --> 00:13:51,750 నేను మనుషులతో ఎలా ప్రవర్తించాలో మర్చిపోయాను. 237 00:13:51,833 --> 00:13:54,044 కానీ నేను ప్రయత్నిస్తున్నాని నీకు తెలియజేస్తున్నాను. 238 00:13:54,878 --> 00:13:56,463 నిజంగానే, బ్రాడ్లీ. 239 00:13:56,546 --> 00:13:59,424 నువ్వు చెప్పిన ప్రతీ అక్షరం నేను విన్నాను. 240 00:14:00,300 --> 00:14:03,637 కనుక, నేను... అసలు నేను మొదలుపెట్టినప్పుడు 241 00:14:03,720 --> 00:14:06,097 నా మనస్సులో ఏముందా అని తెగ ఆలోచించాను. 242 00:14:06,181 --> 00:14:07,974 ఒకవేళ... 243 00:14:08,767 --> 00:14:12,520 ఒకవేళ మిట్చ్ నన్ను వదిలేసి, కనీసం కాల్ అయినా చేయకపోతే... 244 00:14:14,731 --> 00:14:16,107 అది నన్ను చాలా బాధిస్తుంది. 245 00:14:16,900 --> 00:14:19,110 నేను చాలా చింతిస్తున్నానని నీకు తెలియజేయాలనుకుంటున్నాను. 246 00:14:23,406 --> 00:14:25,033 ఆ విషయాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. 247 00:14:25,617 --> 00:14:26,618 సరే. 248 00:14:26,701 --> 00:14:27,911 అది నాకు బాగా నచ్చింది. 249 00:14:28,620 --> 00:14:29,788 నిజంగానే నచ్చింది. 250 00:14:29,871 --> 00:14:31,164 సరే. మంచిది. 251 00:14:32,374 --> 00:14:35,502 కానీ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, నేను తప్పకుండా పోటీ పడతాను. 252 00:14:38,046 --> 00:14:41,258 నేను కూడా. మనిద్దరం ఒకరినొకరం మరింత మెరుగుపరుచుకుంటాం. 253 00:14:41,341 --> 00:14:43,760 -అవును, నాకు అది నచ్చింది. -నాకు కూడా. 254 00:14:43,843 --> 00:14:45,428 కానీ నాకు... 255 00:14:45,512 --> 00:14:47,931 -అయ్యో. అయ్యయ్యో. -ఏంటి? 256 00:14:48,014 --> 00:14:50,100 మన్నించు, మ్యాగీ బ్రెనర్ మనం కూర్చొన్న చోటుకే వస్తోంది. 257 00:14:50,183 --> 00:14:52,519 -అయితే ఏంటి? -నేనే మాట్లాడతాను, సరేనా? 258 00:14:52,602 --> 00:14:55,105 -నా గురించి నేను మాట్లాడుకోగలను, ఆలెక్స్. -మ్యాగీ? 259 00:14:55,188 --> 00:14:56,314 -ఆలెక్స్. -హాయ్. 260 00:14:56,398 --> 00:14:57,691 -బ్రాడ్లీ. -హాయ్. 261 00:14:57,774 --> 00:15:00,235 అద్భుతమైన జోడి అయినా తినక తప్పదు అనుకుంటా. 262 00:15:01,278 --> 00:15:03,280 అవును. నువ్వు మా ప్రకటనని చూసుంటావనే అనుకుంటున్నా. 263 00:15:03,947 --> 00:15:05,323 నా ట్యాక్సీలో వచ్చింది. 264 00:15:05,407 --> 00:15:07,200 అది చాలా ఉత్సాహంగా ఉంది, కదా? 265 00:15:07,993 --> 00:15:10,996 -చాలా. చాలా ఉత్సాహంగా ఉంది. -చాలా ఉత్సాహంగా ఉంది. 266 00:15:12,205 --> 00:15:15,875 మిమ్మల్నిద్దరినీ చూడటం బాగుంది. ఫిబ్రవరీ 10న షోని నేను కూడా చూస్తాను. 267 00:15:19,045 --> 00:15:20,463 దేవుడా, తను నాకు భలే చిరాకు తెప్పిస్తుంది. 268 00:15:21,548 --> 00:15:22,799 తను బాగానే మాట్లాడినట్టుగా అనిపించిందే. 269 00:15:23,550 --> 00:15:26,553 -బ్రాడ్లీ. -అంటే ఏంటి? 270 00:15:26,636 --> 00:15:29,598 ఏం లేదు. అస్సలేం లేదు. ఏదైనా ఆర్డర్ చేద్దాం. ఆర్డర్ చేద్దాం. 271 00:15:30,265 --> 00:15:31,433 సరే. 272 00:15:34,311 --> 00:15:35,437 నువ్వు... 273 00:15:36,229 --> 00:15:38,690 తను పుస్తకం రాస్తుంది కదా, ఆ విషయమై తనతో మాట్లాడావా? 274 00:15:40,275 --> 00:15:41,401 మాట్లాడాను. 275 00:15:41,985 --> 00:15:44,321 -ఎందుకు మాట్లాడకూడదు? -ఊరికే అడుగుతున్నాలే. 276 00:15:45,572 --> 00:15:47,324 నీ గురించి చెడుగా ఏం చెప్పలేదులే. 277 00:15:48,533 --> 00:15:49,618 అలా అనే ఆశిద్దాం. 278 00:15:50,493 --> 00:15:53,955 దేవుడా, నువ్వు పరిచయం అయ్యాకే నాకు జ్ఞానోదయం అయిందని అనుకోవద్దు. 279 00:15:54,039 --> 00:15:55,749 ఈ రంగంలో నేను చాలా ఏళ్ల నుండి ఉన్నాను. 280 00:15:55,832 --> 00:15:59,294 నేను చెప్పాలనుకోని విషయాని, ఒక విలేఖరి ఎంత చెప్పించాలని చూసినా నేను చెప్పను. 281 00:15:59,377 --> 00:16:02,422 నాకు తెలుసు. నువ్వు చాలా కాలం నుండి ఈ రంగంలో ఉన్నావని నాకు తెలుసు. 282 00:16:03,173 --> 00:16:04,466 కానీ మ్యాగీ బ్రెనర్, లారా పీటర్సన్ లాంటి వాళ్లు 283 00:16:04,549 --> 00:16:06,968 నీకు అంతగా పరిచయమై ఉండరు. 284 00:16:07,052 --> 00:16:08,053 దేవుడా, ఆలెక్స్. 285 00:16:08,136 --> 00:16:10,722 లారా పీటర్సన్ తో నాకు ఇంటర్వ్యూ ఉంది, దానికి ముందు 286 00:16:10,805 --> 00:16:12,599 తన గురించి నాకు చెడు విషయాలు చెప్పకు. 287 00:16:12,682 --> 00:16:16,102 నేనేమీ నీకు చెడు విషయాలు చెప్పడంలేదు. బ్రాడ్లీ, ఎందుకలా అతిగా ఊహించుకుంటావు? 288 00:16:17,979 --> 00:16:22,275 దేవుడా. ఇలా చూడు. నా జీవితంలో నాకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. 289 00:16:22,359 --> 00:16:27,948 అందులో లారా పీటర్సన్ తో ఎదురైన అనుభవాలు కూడా ఉన్నాయి, సరేనా? 290 00:16:28,031 --> 00:16:29,950 తనని నేను అంతగా నమ్మను, 291 00:16:30,033 --> 00:16:32,661 తనకి కుడా నేనంటే అంతగా ఇష్టం లేదనుకుంటా. 292 00:16:32,744 --> 00:16:34,371 కాబట్టి నిన్ను కాపాడాలనే నేను ప్రయత్నిస్తున్నాను. 293 00:16:36,289 --> 00:16:39,209 అసలు నన్ను దేని నుండి కాపాడాలనుకుంటున్నావు? 294 00:16:39,292 --> 00:16:40,418 సరే, సరే. 295 00:16:43,171 --> 00:16:46,508 ముందు మనం కొన్ని విషయాలను స్పష్టపరుచుకోవాలి. 296 00:16:46,591 --> 00:16:49,135 నిజమేంటి అనే విషయంలో మనం ఏకాభిప్రాయానికి రావాలి. 297 00:16:49,761 --> 00:16:52,806 -నువ్వేమన్నావో నీకైనా అర్థమైందా? -అర్థమైంది. బాగా అర్థమైంది. 298 00:16:52,889 --> 00:16:55,559 మనిద్దరం ఎలా కలిశామనే విషయంలో 299 00:16:55,642 --> 00:16:57,185 చాలా ఊహాగానాలు, పుకార్లు ఉన్నాయి. 300 00:16:57,269 --> 00:16:59,813 అది కేవలం మనకి సంబంధించినదని, ఇతరులకు అవసరంలేనిదని నా అభిప్రాయం. 301 00:16:59,896 --> 00:17:01,147 అది కాదు, నా ఉద్దేశం... 302 00:17:01,231 --> 00:17:03,525 ఉదాహరణకు, మనం ఏం చెప్పాలి అనే విషయం తీసుకుందాం. 303 00:17:03,608 --> 00:17:06,151 నేను పని చేసిన చివరి రోజు అసలేం జరిగింది? 304 00:17:06,902 --> 00:17:08,655 నాకు తెలియకుండా నువ్వు మిట్చ్ ని ఇంటర్వ్యూ చేసినందుకు 305 00:17:08,737 --> 00:17:11,949 నిన్ను తీసేయాలని నేను చూసినది? 306 00:17:12,700 --> 00:17:13,743 అది చాలా పెద్ద విషయం. 307 00:17:14,452 --> 00:17:18,747 లేదా హానా ఆత్మహత్య చేసుకొన్న రోజున నువ్వు తనని ఇంటర్వ్యూ చేసినది? 308 00:17:22,419 --> 00:17:24,838 ఇంకా, నెట్వర్క్ పై ప్రతీకారంతో ఏమీ ఆలోచించకుండా, అప్పటికప్పుడే 309 00:17:24,920 --> 00:17:29,551 నిన్ను నా సహయాంకర్ గా నేను ప్రకటించానని నలుగురికీ తెలియాలా? 310 00:17:29,634 --> 00:17:31,761 నాకు ఆ విషయం తెలీదు... 311 00:17:31,845 --> 00:17:35,515 అవును. అందుకే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 312 00:17:36,474 --> 00:17:38,894 అదీగాక, నువ్వు నెట్వర్క్ లోకి ఎలా వచ్చావో నేను ఇతరులకి చెప్పాల్సిన పని లేదు, 313 00:17:38,977 --> 00:17:41,730 ఈ పనికి నీకు అర్హత లేదని జనాలు అనుకోవాలని నీకు అనిపిస్తే తప్ప. 314 00:17:41,813 --> 00:17:43,857 సరే. నాకు అర్థమైంది. 315 00:17:44,816 --> 00:17:45,817 సరేనా? 316 00:17:47,360 --> 00:17:48,445 అలాగే. 317 00:17:50,780 --> 00:17:51,948 ఇక ఆర్డర్ చేద్దాం. 318 00:17:53,325 --> 00:17:57,287 అయితే, ఈ కేసును శాశ్వతంగా కొట్టివేయమని ప్రతిదావా వేయాలని నీకు లేదా? 319 00:17:57,954 --> 00:18:02,375 అవును. ఇది మన నియంత్రణలో ఉంటేనే మనకి మంచిదేమో, 320 00:18:02,459 --> 00:18:04,294 తద్వారా మనం తగిన మొత్తం ముట్టజెప్పే ప్రయత్నం చేయవచ్చు. 321 00:18:04,377 --> 00:18:07,505 ఫ్రెడ్ పేరు వింటే, జనాలకు యుబిఎనే గుర్తుకు వస్తుంది. 322 00:18:07,589 --> 00:18:10,342 తన పేరు పేపర్లలో పడితే, మనకి అంత మంచిది కాదేమో. 323 00:18:12,093 --> 00:18:14,888 చెప్పు. మన్నించాలి, నాలుగు గంటలకి కనిపించమని తనకి చెప్పాను. లోపలికి రా. 324 00:18:16,181 --> 00:18:17,390 ఇవాళ మన షేర్లు ఒక శాతం లాభపడ్డాయి. 325 00:18:17,974 --> 00:18:22,687 డౌ మరియు ఎస్&పీ రెండూ 1.6 శాతం తగ్గాయి, అంటే ఒక శాతం అంటే మేలే. 326 00:18:25,440 --> 00:18:26,483 ధన్యవాదాలు. 327 00:18:27,400 --> 00:18:28,610 ఆ ఆశావాదం నాకు బాగా నచ్చింది. 328 00:18:28,693 --> 00:18:30,362 మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. 329 00:18:33,990 --> 00:18:35,825 హేయ్. బయట ఎవరెవరు ఉన్నారు? 330 00:18:36,660 --> 00:18:39,704 కోరీ, మియా, స్టెల్లా, తెరీసా... 331 00:18:39,788 --> 00:18:41,539 -తమ స్వార్థం కోసం పడిగావులు కాస్తున్నారు. -హేయ్. 332 00:18:41,623 --> 00:18:45,210 -హాయ్, ధన్యవాదాలు. -చూశావా? జనాలకు ఉత్సాహంగా ఉంది. 333 00:18:45,293 --> 00:18:49,965 యుబిఎ వార్తల పితామహులు తమకు తెలుసని అందరికీ తెలియాలని చాలా మంది చూస్తున్నారు. 334 00:18:50,465 --> 00:18:51,633 నువ్వు అక్కడికి వెళ్లాలి. 335 00:18:51,716 --> 00:18:52,842 అందరినీ పలకరించాలి. 336 00:18:53,677 --> 00:18:55,637 తప్పకుండా వెళ్తాను. నా మేకప్ అయిందా? నా మేకప్ అయిపోయింది, కదా? 337 00:18:55,720 --> 00:18:57,556 -నువ్వు చాలా బాగున్నావు. -ధన్యవాదాలు. 338 00:18:57,639 --> 00:19:00,392 -అక్కడ లారా కూడా ఉందా? -లేదనుకుంటా. 339 00:19:01,101 --> 00:19:03,853 అయితే, అంత ఆవేశంగా నేనెందుకు వెళ్లడం? 340 00:19:06,022 --> 00:19:07,023 సరే. 341 00:19:17,659 --> 00:19:19,619 -ఆ ప్లాన్ నాకు బాగా తెలుసు. -ఏంటి? 342 00:19:20,829 --> 00:19:24,791 మనం కాస్త... సరైన విధంగా సాగుదామా? 343 00:19:24,874 --> 00:19:28,503 పెద్ద సెలబ్రీవీ అనిపించేలా కాకూండా మామూలుగా... 344 00:19:28,587 --> 00:19:31,715 బంగారం, విను, లారా లోపల కులుకుతూ ఉండగా, నువ్వు వెళ్లి అందరికీ వినోదం 345 00:19:31,798 --> 00:19:34,301 పంచాలకుంటే, ఆనందంగా వెళ్లు. 346 00:19:34,384 --> 00:19:35,635 తను వచ్చాక నన్ను తీసుకుపో. 347 00:19:38,305 --> 00:19:39,598 అదన్నమాట. 348 00:19:40,265 --> 00:19:41,266 సరే. అలాగే. 349 00:19:42,183 --> 00:19:43,810 తన కోసం బయటకు వెళ్లు. 350 00:19:44,311 --> 00:19:47,355 ఇది భలే గమ్మత్తుగా ఉంది, ఎందుకంటే నా ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. 351 00:19:47,439 --> 00:19:50,191 -అబ్బా. దేవుడా. -అసలు నేను ఇక్కడికి వచ్చుండకూడదేమో. 352 00:19:50,275 --> 00:19:52,777 ఎక్కువ సేపు వేచి ఉన్నంత మాత్రాన, పెద్దగా ఒరిగేదేమీ లేదులే. 353 00:19:55,947 --> 00:19:57,991 ఈ విషయంలో మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. 354 00:19:58,074 --> 00:20:01,036 మీరు మాకు ఇచ్చిన సమయం మాకు కూడా ఉపయోగపడుతుందనే ఆశిద్దాం. 355 00:20:01,119 --> 00:20:03,413 ఆలెక్స్ పునరాగమనానికి ఇంకా 13 రోజులే ఉంది కనుక 356 00:20:03,496 --> 00:20:04,998 తన షెడ్యూల్ అంతా బిజీబిజీగా ఉంది. 357 00:20:05,081 --> 00:20:08,293 లారాకి యుబియేలో చాలా ప్రాముఖ్యత ఉంది. 358 00:20:08,376 --> 00:20:10,921 ఈ స్పెషల్ షో చేయడానికి తను రాగలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 359 00:20:11,421 --> 00:20:12,547 ఒక్క నిమిషం. 360 00:20:13,965 --> 00:20:18,345 చార్లీ బ్లాక్. మళ్లీ రంగప్రవేశం చేస్తున్నావు. 361 00:20:18,428 --> 00:20:20,263 చార్లీ బ్లాక్ మళ్లీ రంగప్రవేశం చేశాడు. 362 00:20:20,347 --> 00:20:22,891 భలేవాడివే, నాకు దగ్గరివారు నన్ను చిప్ అనే పిలుస్తారు. 363 00:20:22,974 --> 00:20:25,644 నిజానికి నువ్వు కూడా నన్ను అలాగే పిలిచేవాడివి. 364 00:20:25,727 --> 00:20:28,188 అబ్బా... అలా అనకు. 365 00:20:28,271 --> 00:20:30,398 నేను ఊరికే ఆటపటిస్తున్నానని నీకు తెలుసు కదా. దాదాపుగా అంతే అనుకో. 366 00:20:33,026 --> 00:20:36,446 -చిప్. సమస్యకు నిలువెత్తు రూపం. -మియా! 367 00:20:37,656 --> 00:20:38,698 సరే. 368 00:20:40,033 --> 00:20:42,410 షో చాలా బాగుంది. చాలా బాగుంది. 369 00:20:43,161 --> 00:20:44,746 గోర్డన్, మనం కలిసి చాలా కాలమైంది. 370 00:20:44,829 --> 00:20:47,958 నువ్వు ఏదోక పనిచేస్తూనే ఉన్నావని విన్నా. మళ్లీ వచ్చినందుకు ఆనందంగా ఉంది. 371 00:20:48,041 --> 00:20:51,920 ఈమె నా స్థానంలో వచ్చిన ప్రతిభావంతురాలైన స్టెల్లా బాక్. 372 00:20:52,504 --> 00:20:53,880 స్టెల్లా, మిమ్మల్ని కలవడం సంతోషం. 373 00:20:53,964 --> 00:20:55,882 -మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. -తప్పకుండా. 374 00:20:55,966 --> 00:20:58,218 చాలా చాలా ధన్యవాదాలు. అంతా మంచే జరుగుతుంది. 375 00:21:01,346 --> 00:21:06,434 సరే. నేను వెళ్లి ఆలెక్స్ సిద్ధంగా ఉందో లేదో చూసి వస్తాను. సరే మరి. 376 00:21:06,518 --> 00:21:07,769 -సరే. -అలాగే. 377 00:21:09,229 --> 00:21:10,230 ఒక్క నిమిషం. 378 00:21:13,692 --> 00:21:16,820 మీరు మిస్ లారా పీటర్సన్ అనుకుంటా. 379 00:21:17,946 --> 00:21:22,158 కోరీ ఎల్లిసన్ ప్రభువు గారు. మీరు సీఈఓ పదవికే వన్నె తెచ్చారు. 380 00:21:22,951 --> 00:21:27,247 నువ్వు స్వలింగ సంపర్కుల ఉద్యమానికే వన్నె తెచ్చావులే. 381 00:21:29,165 --> 00:21:31,293 యుబిఎ365 ఇప్పటికీ బాగానే ఉంది. 382 00:21:31,376 --> 00:21:34,296 నువ్వు ఫుల్ టైమ్ గా చేరిపోతే, ఇంకెంత బాగుంటుందో ఓసారి ఊహించుకో. 383 00:21:34,963 --> 00:21:36,756 నేను ఆ షోలో దాదాపుగా ఇరవై ఏళ్లు పని చేశాను. 384 00:21:37,257 --> 00:21:39,050 నేను మార్గనిర్దేశం చేయడానికి సిద్ధమే. 385 00:21:39,634 --> 00:21:41,887 మా అమ్మ కూడా నాకు అదే చేసిందిలే. 386 00:21:43,138 --> 00:21:46,308 ఉండేది నాలుగు గంటలే, అయినా కానీ తను ముందుగా రాలేదు. 387 00:21:46,391 --> 00:21:47,976 ఆలెక్స్ గురించి నీకు తెలిసిందే కదా. 388 00:21:48,059 --> 00:21:51,980 కానీ నువ్వు తెలివైనదానివి, ఆ నాలుగు గంటల్లో నీకు కావలసింది రాబట్టుకోగలవు. 389 00:21:52,063 --> 00:21:54,024 నువ్వు అన్నదే నిజం అవ్వాలని కోరుకుంటున్నా. 390 00:21:54,107 --> 00:21:56,610 కానీ నువ్వు నాకొక సాయం చేయాలి. 391 00:21:56,693 --> 00:21:58,111 ఇంకో సహాయమా? 392 00:21:58,612 --> 00:22:03,366 అదే సహాయంలో ఇది కూడా భాగమనుకో. ఇది కూడా దానికి సంబంధించినదేలే. 393 00:22:04,576 --> 00:22:08,246 అయోవోలో నువ్వు బ్రాడ్లీతో ఒక 36 కానీ నలభై ఎనిమిది గంటలు కానీ గడపాలి. 394 00:22:08,330 --> 00:22:10,582 అవును, అయోవాలో అంత సేపు అంటే అది చాలా ఎక్కువ సమయం. 395 00:22:10,665 --> 00:22:13,793 అవును. అంటే, అది నీకు మరీ ఎక్కువ సమయమనే అనిపించవచ్చు, 396 00:22:13,877 --> 00:22:14,878 కానీ... 397 00:22:16,463 --> 00:22:18,381 తనకి కాస్త శిక్షణ ఇవ్వు. 398 00:22:21,551 --> 00:22:22,594 అంటే... 399 00:22:22,677 --> 00:22:26,598 కోపావేశాలతో తప్పులను ఎత్తిచూపడం అనేది "మార్నింగ్ షో"కి సరిపోయేది కాదా? 400 00:22:26,681 --> 00:22:28,642 నేనలా అనలేదు, నువ్వు కూడా ఆ మాటలను వినలేదు. 401 00:22:28,725 --> 00:22:32,145 నేనలా అనుకున్నట్టు నీకు అనిపించి ఉంటుంది. చూడు, నిజానికి, 402 00:22:32,229 --> 00:22:33,980 సరిగ్గా సన్నద్ధం చేయకుండా తనని ఇందులోకి తోసేయడం జరిగింది. 403 00:22:34,064 --> 00:22:39,653 నీకు చాలా ఏళ్ళు బ్లేయిర్ టాడ్మన్ ని దగ్గరగా చూసే అవకాశం దక్కింది. 404 00:22:39,736 --> 00:22:43,240 తద్వారా యాంకర్ కాక ముందు, ఆ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నువ్వు సంపాదించగలిగావు. 405 00:22:43,323 --> 00:22:46,201 నిన్ను కూడా అలా విసిరేసి ఉంటే, వైడిఏలో నువ్వెలా అయితే రాణించావో, 406 00:22:46,284 --> 00:22:47,577 అలా రాణించగలిగి ఉండేదానివా? 407 00:22:48,411 --> 00:22:51,289 అది నాకు మంచే చేసింది కదా? 408 00:22:51,373 --> 00:22:52,958 అది వేరులే. 409 00:22:53,959 --> 00:22:56,378 నువ్వు ఎలాగూ తనతో అయోవాకి వెళ్తున్నావు కదా. 410 00:22:57,420 --> 00:22:59,673 దయచేసి తనని గమనించు. 411 00:22:59,756 --> 00:23:03,802 ఇంకా కాస్తంత సున్నితంగా, సుత్తిమెత్తగా తనకి మార్గనిర్దేశం చేయ్. 412 00:23:05,637 --> 00:23:07,180 రాణిగారు దయచేశారు. 413 00:23:07,806 --> 00:23:08,848 మనమిక సిద్ధం అవ్వాలి. 414 00:23:12,060 --> 00:23:13,979 -అదుగో తను. -ఇదిగో నేను. 415 00:23:14,062 --> 00:23:15,188 హాయ్, ఆలెక్స్. 416 00:23:15,272 --> 00:23:16,523 హాయ్, బంగారం. 417 00:23:17,148 --> 00:23:19,359 -లిజ్జి ఎలా ఉంది? ఇక్కడికి వచ్చిందా? -తను రాలేదు. 418 00:23:19,442 --> 00:23:22,028 ఇలాంటి వాటికి తను ఇప్పుడు దూరంగా ఉంటోంది. 419 00:23:23,280 --> 00:23:24,948 కోరీ, నువ్వు నాకు కనబడుతున్నావు. 420 00:23:25,031 --> 00:23:27,325 -ఇక్కడికి రా. -అలాగే. 421 00:23:28,034 --> 00:23:30,120 స్టెల్లా, నువ్వు కూడా రా. రా. 422 00:23:33,623 --> 00:23:36,543 సరే, ఇక ఇవన్నీ చాలులే. ఆలెక్స్, నువ్వు సిద్ధంగా ఉంటే, అక్కడ కూర్చో. 423 00:23:36,626 --> 00:23:38,837 నేను నీళ్ళు తాగి వచ్చేస్తా. 424 00:23:43,592 --> 00:23:47,554 -ధన్యవాదాలు. -సరే, బాబులారా, నేను సిద్ధంగా ఉన్నాను. 425 00:23:47,637 --> 00:23:50,557 ఇక్కడ ఉండాల్సిన అవసరం లేనివారు, ఇక్కడ ఉండవద్దు. 426 00:23:50,640 --> 00:23:53,310 ఇది మనం మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల్లో పూర్తి చేయాలి. 427 00:23:53,393 --> 00:23:54,561 అది చాలులే. 428 00:23:54,644 --> 00:23:56,271 -నువ్వు సిద్దమేగా? సరే. -అదరగొట్టేస్తాను. 429 00:24:01,192 --> 00:24:02,193 ఏంటి? 430 00:24:02,277 --> 00:24:04,654 చిప్ ని మళ్లీ తీసుకురావడం మంచి ఆలోచన కాదని నాకనిపిస్తోంది. 431 00:24:04,738 --> 00:24:07,657 ఏం అనుకూడదు అనుకున్నా, కానీ మనం ఆలెక్స్ తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. 432 00:24:07,741 --> 00:24:11,328 సరే, మన పరిస్థితి బాగున్నప్పుడు, నువ్వు నీకు కావలసిన ప్రయోగాలు చేయవచ్చు. 433 00:24:11,411 --> 00:24:13,580 కానీ ఇప్పుడు, ఆలెక్స్ కుదురుకోవడమే మనిద్దరికీ కావాలి. 434 00:24:14,080 --> 00:24:15,707 నేనేమీ ప్రయోగాలు చేయడం లేదు. 435 00:24:17,542 --> 00:24:22,214 ఇంకో విషయం, నాకు ప్రతీ విషయానికి అడ్డు చెప్పాలని ఉంది అనుకోవద్దు. 436 00:24:22,297 --> 00:24:24,299 నిజానికి నేను మన నెట్వర్క్ గురించి పట్టించుకుంటాను. 437 00:24:24,382 --> 00:24:26,760 నాకు విషయాలను ఆమోదించాలని, సరైన వాటిని నిర్మించాలనుంది, 438 00:24:26,843 --> 00:24:29,596 కానీ పునాది చదునుగా లేకపోతే నేను వాటిని నిర్మించలేను. 439 00:24:36,478 --> 00:24:37,562 నాకు అర్థమైంది. 440 00:24:39,272 --> 00:24:40,273 నిజంగానే అర్థమైంది. 441 00:24:41,191 --> 00:24:44,945 అలాంటి మార్పులను చేయగల శక్తిని మనకి ఇవ్వగలిగేది... 442 00:24:46,780 --> 00:24:48,240 విజయం. 443 00:24:49,866 --> 00:24:51,034 ఇప్పుడు, 444 00:24:51,117 --> 00:24:56,748 ఆలెక్స్ విజయవంతమవ్వడానికి మనం తనని సంతోషంగా ఉంచాలి, అంతే కదా? 445 00:25:07,092 --> 00:25:10,679 అయితే, జనాలు మీకు పదే పదే సూక్తులు చెప్తూ ఉండటంతో మీకు విసుగు వచ్చిందా? 446 00:25:10,762 --> 00:25:13,056 "నాకు చిరాగ్గా ఉంది, ఇక భరించడం నా వల్ల కాదు." 447 00:25:13,139 --> 00:25:16,268 అవును, నాకు తెలుసు, అంటే, "హేయ్, ఆలెక్స్!" అని అంటే బాగుండేదేమో. 448 00:25:16,351 --> 00:25:20,689 కానీ, చాలా మందికి అది ముఖ్యమైన విషయం అయినందుకు నాకు ఆనందంగా ఉంది. 449 00:25:20,772 --> 00:25:23,316 ఆ రోజు స్వయంగా మీరే, 450 00:25:23,400 --> 00:25:26,111 సమస్యలో మీకు కూడా భాగముంది అన్నారు. 451 00:25:26,945 --> 00:25:30,824 మరి, నేటి మీరు, 15 ఏళ్ల క్రితం మీతో మాట్లాడగలిగితే, 452 00:25:30,907 --> 00:25:32,367 మీకు మీరు ఏం చెప్పుకుంటారు? 453 00:25:34,452 --> 00:25:37,831 ముందుగా "దేశాధ్యక్షులు ఎవరయ్యారో చెప్తే నువ్వు నమ్మవు," అని చెప్తాను. 454 00:25:40,333 --> 00:25:41,334 దిమ్మదిరిగిపోద్ది. 455 00:25:41,418 --> 00:25:43,128 ఆ తర్వాత, 456 00:25:43,211 --> 00:25:44,963 నేనేం చెప్తానంటే... 457 00:25:46,381 --> 00:25:47,883 "విజయం అనేది ప్రధాన లక్ష్యం కాకూడదు." 458 00:25:49,551 --> 00:25:52,470 అది నిజానికి దానికి లక్ష్యంలో భాగం ఉండకపోయినా పర్వాలేదు. 459 00:25:53,722 --> 00:25:56,600 కానీ మన చుట్టూ జరిగే విషయాలు మన అందరికీ తెలిశాయనుకుంటా... 460 00:25:56,683 --> 00:25:58,310 అంటే, నేను నా గురించి మాత్రమే చెప్పాలి. 461 00:25:59,227 --> 00:26:03,440 నా విజయం గురించి మాత్రమే నేను ఆందోళన చెందినప్పుడు అన్నమాట. 462 00:26:06,276 --> 00:26:09,988 ఆ రోజు తర్వాత నుండి నెట్వర్క్ చాలా మార్పులను చేసింది. 463 00:26:10,947 --> 00:26:14,075 ముఖ్యమైన విషయాలపై ప్రతిస్పందించడం జరిగిందని మీకు అనిపించిందా? 464 00:26:14,743 --> 00:26:16,286 అనిపించింది. నాకు అనిపించింది. 465 00:26:16,369 --> 00:26:22,208 అంటే, మనమందరం ప్రయత్నిస్తున్నాం. అన్నిట్లో ఏవోక లోపాలు ఉంటాయి. 466 00:26:22,876 --> 00:26:25,962 కానీ మనమందరం నెమ్మదిగా ఒక్కొక్కటి దాటుకుంటూ ముందుకు సాగుతున్నాం, 467 00:26:26,046 --> 00:26:30,050 కానీ మునుపటి పరిస్థితులు మాత్రం మళ్లీ నెలకొనవని మాత్రం నేను చెప్పగలను. 468 00:26:31,343 --> 00:26:33,678 కార్యాలయంలో ఉన్నప్పుడు ఎవరికీ అభద్రతాభావం ఉండకూడదు. 469 00:26:35,138 --> 00:26:39,893 మీకు కనువిప్పు కలిగిన రోజు టిఎంఎస్ కి చెందిన ఒక మంచి వ్యక్తి 470 00:26:39,976 --> 00:26:42,103 మరణించారని నాకు తెలుసు. 471 00:26:45,607 --> 00:26:48,151 మన్నించాలి, ఆ విషయం గురించి నేను సౌకర్యవంతంగా మాట్లాడలేను. 472 00:26:48,735 --> 00:26:52,072 ఆమెకు గోప్యంగా ఉండటం ఇష్టం. కనుక, నేను దానికి భంగం కలిగించలేను. 473 00:26:52,155 --> 00:26:55,575 -తప్పకుండా. అస్సలు పర్వాలేదు. -ధన్యవాదాలు. 474 00:26:58,036 --> 00:27:03,083 యుబిఎలో పరిస్థితులు ఎలా ఉండేవి అని చాలా కథనాలు బయటకు వచ్చాయి, 475 00:27:03,166 --> 00:27:05,669 విడుదలవ్వబోతున్న మ్యాగీ బ్రెనర్ పుస్తకంలో కూడా అవి ప్రస్తావించబడ్డాయి. 476 00:27:07,295 --> 00:27:09,923 ఆమె, తన పుస్తకంలోని ఒక చిన్న సంగ్రహాన్ని నాకు అందించింది, అది... 477 00:27:10,006 --> 00:27:15,512 అది ఆరోజుల్లో "ది మార్నింగ్ షో" ఎలా ఉండేదో కొన్ని ఆసక్తికరమైన అంశాలను అందిస్తుంది. 478 00:27:16,221 --> 00:27:19,724 తను లైంగికత, వయస్సు ఆధారంగా పక్షపాత వైఖరి చూపడం వంటివి 479 00:27:19,808 --> 00:27:23,436 షోలో, ఇంకా నెట్వర్క్ లో ఉండేవని చెప్తోంది. 480 00:27:23,520 --> 00:27:25,772 ఎంతటి పాపానికి అయినా తెగబడవచ్చట. 481 00:27:25,855 --> 00:27:31,570 రేటింగ్స్ కోసం ఎంతటి దారుణమైన పని చేసినా అది చెల్లుబాటు అవుతుందట. 482 00:27:33,154 --> 00:27:34,990 మీ అనుభవంలో ఎప్పుడైనా అలాంటిది ఎదురైందా? 483 00:27:37,450 --> 00:27:38,577 ఎదురైందనే చెప్పవచ్చు. 484 00:27:46,835 --> 00:27:51,339 మీట్చ్ కెస్లర్ తో మీకు ఉన్న బంధాన్ని మీరెలా వర్ణించగలరు? 485 00:28:03,894 --> 00:28:05,270 అతను నా ప్రాణ స్నేహితుడు. 486 00:28:06,396 --> 00:28:07,731 అతను నా ప్రాణ స్నేహితుడు. 487 00:28:09,774 --> 00:28:15,697 కానీ చాలా మంది దృష్టిలో మిట్చ్ వేరే మనిషి కావచ్చు, అది స్పష్టంగా తెలిసింది కూడా. 488 00:28:17,365 --> 00:28:20,076 -ఇప్పటికీ మీరు ఆయనతో మాట్లాడుతున్నారా? -లేదు. 489 00:28:22,746 --> 00:28:26,291 వాళ్లు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ని కూడా పెట్టుకుంటారు, 490 00:28:26,374 --> 00:28:29,169 వార్తల్లో, మ్యాగజైన లో భాగంగా కొంత సమాచారం కోసం. 491 00:28:29,252 --> 00:28:31,963 మిమ్మల్ని మీరు డాక్యుమెంటరీలు తీసేవారని అనుకుంటున్నారా? 492 00:28:32,047 --> 00:28:33,506 ప్రధానంగా అవుననే అంటాను. 493 00:28:33,590 --> 00:28:36,134 కానీ నా జీవితంలో నేను ఒక విషయాన్ని స్థిరంగా అనుసరించాలనుకుంటున్నాను. 494 00:28:36,927 --> 00:28:39,054 -మారని గడువులను. -అవును, నేను అర్థం చేసుకోగలను. 495 00:28:39,888 --> 00:28:43,266 మీ పనిలో సహాయంగా ఉండేందుకు నేనెవరినైనా పంపగలనేమో చూస్తాను. 496 00:28:45,018 --> 00:28:46,978 -మీరు అదేంటో చూస్తారా? -లేదులెండి, అది... 497 00:28:47,062 --> 00:28:51,066 ఒక పాత సహోద్యోగి హఠాత్తుగా ప్రత్యక్షమై, ఆపకుండా మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాడు. 498 00:28:51,149 --> 00:28:52,359 అదేమంత ముఖ్యమైన విషయం కాదులే. 499 00:28:53,568 --> 00:28:54,819 బహూశా మీ పిల్లలేమో. 500 00:28:56,696 --> 00:28:57,697 సరే. 501 00:29:01,117 --> 00:29:02,994 వార్తలు - ఆలెక్స్ లెవీ మళ్లీ మార్నింగ్ షోకి తిరిగి వస్తోంది 502 00:29:03,078 --> 00:29:04,537 ఆలెక్స్ లెవీ మరియు బ్రాడ్లీ జాక్సన్ మళ్లీ మార్నింగ్ షో 503 00:29:04,621 --> 00:29:05,622 వేదికను పంచుకోనున్నారు! 504 00:29:09,501 --> 00:29:10,627 -నేను బయలుదేరాలి. -అది... 505 00:29:12,045 --> 00:29:14,381 -ఏంటి? వెళ్లిపోతున్నారా? -అవును. 506 00:29:15,340 --> 00:29:17,592 వద్దు, వద్దు. నా ఫోన్ ని ముట్టుకో... బాగుంది. 507 00:29:17,676 --> 00:29:19,636 -నా ఫోన్ ని ముట్టుకోకండి. -వదలండి. 508 00:29:19,719 --> 00:29:21,596 నేను ఇప్పుడు గట్టిగా అరవాలా ఏంటి? 509 00:29:24,099 --> 00:29:26,935 మన్నించాలి. కానీ మీరు దీన్ని చూసే కలత చెందారా? 510 00:29:27,018 --> 00:29:28,144 అవును. 511 00:29:28,812 --> 00:29:31,147 మీరు ఆమె పట్ల జాలి చూపాలి. 512 00:29:32,148 --> 00:29:34,609 ఆమె గతంలోనే ఉండిపోవాలనుకోవద్దు. 513 00:29:34,693 --> 00:29:36,069 దాన్ని మర్చిపోయి మీరు ముందుకు సాగిపోవచ్చు. 514 00:29:36,152 --> 00:29:37,529 నేను మర్చిపోయాను. 515 00:29:38,280 --> 00:29:40,073 నా జీవితంలో దీనికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. 516 00:29:40,156 --> 00:29:43,368 -అంటే, దీనికి... -అయ్యయ్యో. 517 00:29:43,451 --> 00:29:47,038 మీరు బాధను ఎప్పటికీ దూరం చేసుకోలేరు, కాబట్టి కాస్త ధైర్యంగా ఉండండి. 518 00:29:47,122 --> 00:29:49,040 -సరే. ఆ పనే చేస్తానులెండి. -అవును. 519 00:29:49,124 --> 00:29:51,793 మీ మెదడును ఉపయోగించి, ఏదైనా పనికి వచ్చేది చేయడానికి, ఈ లోకం 520 00:29:51,877 --> 00:29:53,962 మిమ్మల్ని క్షమించాల్సిన అవసరం లేదు. 521 00:29:54,963 --> 00:29:58,216 మీ మెదడు చెడిపోకముందే, దాన్ని ఉపయోగించుకోవాలని మీకు లేదా? 522 00:29:58,300 --> 00:30:02,345 అది కుళ్లిపోయి, కంపు కొట్టే స్థితిలోకి చేరుకోక ముందే? 523 00:30:02,429 --> 00:30:03,889 చాలు, మీరు మరీ దారుణంగా వర్ణిస్తున్నారు. ధన్యవాదాలు 524 00:30:03,972 --> 00:30:05,807 అది దారుణంగా ఉందని నాకు తెలుసు. నిజమంటే దారుణంగానే ఉంటుంది. 525 00:30:05,891 --> 00:30:08,393 ఇది భలే సరదాగా గడిచింది. ఇదంతా బాగా సరదాగా గడిచింది. 526 00:30:08,476 --> 00:30:09,978 -మన పని అదే... -ఈ అద్భుతమైన సమావేశానికి... 527 00:30:10,061 --> 00:30:12,314 -...దారుణమైన సత్యాలను వెల్లడించడం. -...మీకు ధన్యవాదాలు. 528 00:30:12,397 --> 00:30:14,983 కాదు. నేను ఇంతకుముందు అలా చేశాను. 529 00:30:15,066 --> 00:30:16,985 నిజానికి, అలా నేను చేయలేదు. 530 00:30:17,068 --> 00:30:21,364 దారుణమైన సత్యాలను బట్టబయలు చేస్తున్నట్టు నటించానంతే. 531 00:30:21,448 --> 00:30:25,493 చూడండి, మీరు భవిష్యత్తును ఎదుర్కోవడం తప్ప మరేమి చేయలేరు. 532 00:30:26,077 --> 00:30:28,705 గతంలో చేసేసిన దాన్ని మీరు మార్చలేరు. 533 00:30:29,372 --> 00:30:31,166 కానీ మీరు ప్రపంచానికి మంచి పనులు చేయవచ్చు. 534 00:30:31,249 --> 00:30:32,417 మీరు ప్రజలకు సహాయపడవచ్చు. 535 00:30:33,126 --> 00:30:34,336 నేను సహాయపడాలని ఎవరూ కోరుకోరు. 536 00:30:34,419 --> 00:30:36,087 నేను కోరుకుంటాను. 537 00:30:36,838 --> 00:30:38,882 మీరు నాతో డాక్యుమెంటరీ చేయండి. 538 00:30:39,466 --> 00:30:41,676 ఆ డాక్యుమెంటరీ దేని గురించో వింటారా? 539 00:30:42,844 --> 00:30:43,970 నిజంగానే. 540 00:30:44,971 --> 00:30:49,392 ఇటలీలోని ఒక అప్పీళ్ళ కోర్టు రేప్ అభియోగాన్ని కొట్టివేసింది, 541 00:30:49,476 --> 00:30:54,147 -ఎందుకంటే ప్రతివాది, బాధితురాలు... -అవన్నీ చేసే స్థితిలో నేను లేను... 542 00:30:54,231 --> 00:30:57,567 ...చాలా అందవికారంగా ఉందని, తన మీద రేప్ ఎవరు చేస్తారని అన్నాడు. 543 00:30:57,651 --> 00:31:01,863 ఆ విషయంలో మీకు గుడ్ లక్. నిజంగానే. మీరు కొరుకున్నదే జరగాలని కోరుకుంటున్నా. 544 00:31:01,947 --> 00:31:04,241 -లేదు, అది పర్వాలేదు. -డ్రింక్స్ కి నేను కడతాను. 545 00:31:09,496 --> 00:31:10,580 కులాసాగా గడపండి. 546 00:31:10,664 --> 00:31:13,458 -ధన్యవాదాలు! బై. -ధన్యవాదాలు, మీకు కూడా. 547 00:31:22,551 --> 00:31:23,718 అసలు ఏంటది? 548 00:31:24,678 --> 00:31:25,971 "అసలు ఏంటది" అని 549 00:31:26,054 --> 00:31:28,974 నువ్వు దేని గురించి అడుగుతున్నావు? 550 00:31:29,057 --> 00:31:31,309 "మీట్చ్ కెస్లర్ తో మీకు ఉన్న బంధాన్ని మీరెలా వర్ణించగలరు?" 551 00:31:31,393 --> 00:31:33,228 నేను దాని గురించి మాట్లాడుతున్నాను. 552 00:31:33,311 --> 00:31:35,939 -అందులో చాలా అర్థాలు ఉండవచ్చు. -పిచ్చివాడిలా మాట్లాడకు, చిప్. 553 00:31:36,022 --> 00:31:38,441 తన ఉద్దేశమేంటో నీకు బాగా తెలుసు, అది సముచితమైనది కాదు కూడా. 554 00:31:38,525 --> 00:31:40,402 నువ్వు దానికి చక్కగా సమాధానం ఇచ్చావని అనుకున్నానే. 555 00:31:40,485 --> 00:31:44,281 సమాధానం చక్కగానే ఇచ్చాను. కానీ విషయం అది కాదు. 556 00:31:44,364 --> 00:31:46,825 తను ఆరోపించింది. 557 00:31:47,450 --> 00:31:49,119 అది ప్రశ్న కాదు. 558 00:31:49,619 --> 00:31:51,413 నేషనల్ టెలివిజన్ లో ప్రసారమవ్వబోయే ఇంటర్వ్యూలో 559 00:31:51,496 --> 00:31:53,665 అసలు ఆ ప్రశ్న ఉండకూడదు. 560 00:31:54,541 --> 00:31:58,420 -అది కూడా మన నెట్వర్క్ లోని వారి నుండే. -సరే, అది నిజమే. నువ్వన్నది నిజమే. 561 00:31:58,503 --> 00:31:59,504 అవును. 562 00:32:00,297 --> 00:32:02,674 -అసలు ఆ ప్రశ్నను నువ్వెలా ఆమోదించావు? -దాన్ని నేనేమీ ఆమోదించలేదు, సరేనా? 563 00:32:02,757 --> 00:32:06,177 నేను ఆమోదించిన ప్రశ్న "మిట్చ్ తో మీరు ఎలా ఉండేవారు?" ఇలా ఉంటుంది. 564 00:32:06,261 --> 00:32:07,387 "మీకు ఉన్న బంధం" అనేది అందులో లేదు, 565 00:32:07,470 --> 00:32:09,264 ఇంకా మ్యాగీ పుస్తకం గురించి చర్చిస్తారనే ప్రస్తావనే లేదు. 566 00:32:09,347 --> 00:32:10,348 దేవుడా! 567 00:32:10,974 --> 00:32:13,643 -అసలు దాన్ని ఎలా మిస్ అయ్యావు? -నేనేమీ గోల్ కీపర్ ని కాదు! 568 00:32:13,727 --> 00:32:17,105 నన్నేం చేయమంటావు? ఈ విషయమై నేను గోర్డన్ తో తగాదాకి దిగలేను కదా. 569 00:32:17,188 --> 00:32:19,399 అసలు ఏంటిది, సరేనా? 570 00:32:19,482 --> 00:32:22,986 చూడు, ఏదేమైనా, దీన్ని నెట్వర్క్ ప్రసారం చేస్తుందని నాకనిపించడం లేదు. 571 00:32:23,069 --> 00:32:24,571 నాకు ఆ రిస్క్ తీసుకోవాలని లేదు. 572 00:32:26,281 --> 00:32:29,618 చూడు, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమో అని అనిపిస్తోంది... 573 00:32:30,452 --> 00:32:32,203 నా ఉద్దేశం ఏంటంటే, 574 00:32:32,287 --> 00:32:34,873 పదవ తేదీకి ముందు మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. 575 00:32:34,956 --> 00:32:37,667 ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ, మనం మన బుర్రలను పాడు చేసుకోవాల్సిన పనిలేదు. 576 00:32:37,751 --> 00:32:39,085 నిజంగానే చెప్తున్నా, సరేనా? 577 00:32:39,669 --> 00:32:42,756 ఏదేమైనా అదంతా ఉత్తదే, కదా? 578 00:32:45,133 --> 00:32:47,677 లేదు, నేను అడగట్లేదు. నేను అది ఉత్తదే అని చెప్తున్నానంతే, 579 00:32:47,761 --> 00:32:49,137 కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరంలేదు. 580 00:32:51,765 --> 00:32:53,433 హేయ్. సరే. 581 00:32:53,516 --> 00:32:57,103 నేను నిన్ను సరిగ్గా సముదాయించలేకపోతున్నా. ఆందోళన పడకు, సరేనా? 582 00:32:57,687 --> 00:32:59,481 త్వరలో నీ పుస్తకం విడుదలవ్వబోతోంది. 583 00:32:59,564 --> 00:33:00,941 అది గొప్పగా ఉండబోతోంది. 584 00:33:01,024 --> 00:33:04,361 నువ్వు ఈ కథను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నావు, 585 00:33:04,444 --> 00:33:05,737 స్వయంగా దానితో సంబంధం ఉన్న వ్యక్తి నుండే అది వస్తుంది. 586 00:33:05,820 --> 00:33:06,988 స్వయంగా సంబంధం ఉన్న వ్యక్తి నుండి. 587 00:33:07,072 --> 00:33:08,949 ఇంకా మిట్చ్ అధ్యాయం మీద నువ్వు పని చేస్తున్నావని నాకు తెలుసు, 588 00:33:09,032 --> 00:33:10,575 అది కష్టమైనదే, కానీ ఏదోక విధంగా నువ్వు ముగించగలవు. 589 00:33:10,659 --> 00:33:14,371 నీ పుస్తకాన్ని ఎవరైనా చదివితే బాగుంటుందని నీకు అనిపిస్తే, నేనేమీ ఒత్తిడి చేయడంలేదు, 590 00:33:14,454 --> 00:33:16,539 -కానీ నీకు ఒక నేస్తం నుండి సలహా... -నువ్వు చాలా మంచివాడివి. 591 00:33:16,623 --> 00:33:18,458 దానికి సంబంధించి నేను నోట్స్ ని పూర్తి చేసేశాను. 592 00:33:18,541 --> 00:33:24,047 -మొత్తమయ్యాక నువ్వు చదివితే బాగుంటుంది. -సరే. కాసేపు పడుకో. 593 00:33:24,631 --> 00:33:26,967 రేపు ముఖ్యమైన రోజు. ఉదయం ఎనిమిదికి? 594 00:33:27,050 --> 00:33:28,301 సరే, సమయం ఆసన్నమవుతోంది. 595 00:33:28,385 --> 00:33:30,345 మనం కూడా గడియారం ముల్లులా నిర్విరామంగా పని చేయాలి. 596 00:33:30,428 --> 00:33:31,429 ఇవాళ చాలా చక్కగా మాట్లాడావు. 597 00:33:31,513 --> 00:33:32,639 ధన్యవాదాలు. 598 00:33:41,356 --> 00:33:44,693 నేను పెన్సిల్వేనియాలోని పంక్సటానీకి చెందిన పంక్సటానీ ఫిల్ గురించి మాట్లాడుతున్నాను, 599 00:33:44,776 --> 00:33:47,237 ఎందుకంటే, ఇవాళ గ్రౌండ్ హాగ్ డే కాబట్టి. 600 00:33:47,320 --> 00:33:48,613 ఏయ్, చిన్న ప్రశ్న, టై. 601 00:33:48,697 --> 00:33:51,157 ఫిల్, దాని నీడని చూసిందంటే, దానికి అర్థమేంటి? 602 00:33:51,241 --> 00:33:52,742 అంటే, చలికాలం ఇంకో ఆరువారాలు కొనసాగుతుందని. 603 00:33:52,826 --> 00:33:55,245 అయితే, ఫిల్ ఇవాళ దాని నీడని చూసిందా, లేకపోతే మనమందరం 604 00:33:55,328 --> 00:33:59,207 మన చలికోట్లను మడిచి బీరువాలో పెట్టేయవచ్చా అనేది చూద్దాం. 605 00:33:59,291 --> 00:34:00,584 ఫిల్ 606 00:34:00,667 --> 00:34:03,753 సోదరసోదరీమణులారా, పంక్సటానీ ఫిల్. 607 00:34:03,837 --> 00:34:07,340 మరి, అనుచరులారా, నీడ లేదు. 608 00:34:07,424 --> 00:34:08,758 అది దాని నీడని చూడలేదు! 609 00:34:08,842 --> 00:34:11,469 హమ్మయ్య, వసంతం ముందుగానే రానుంది. 610 00:34:11,553 --> 00:34:15,222 చూడండి, మీరు మీకు నచ్చే జంతువులు పులులు, సింహాలని ఏవైనా చెప్పుకోవచ్చు, 611 00:34:15,307 --> 00:34:18,559 కానీ, కనీసం ఇవాళ్టి విషయానికి వస్తే, నాకు నచ్చే జంతువు గ్రౌండ్ హాగ్ అని చెప్తాను. 612 00:34:18,643 --> 00:34:21,855 అలాగే, తమ ఇళ్ల ముందు ఉండే మంచు కుప్పని పారతో తీసి తీసి విసుగెత్తిన వాళ్ళకి కూడా 613 00:34:21,938 --> 00:34:24,608 గ్రౌండ్ హాగ్ తెగ నచ్చుతుందని అనుకుంటున్నాను. 614 00:34:25,317 --> 00:34:26,943 మేము వెంటనే మళ్లీ మీ ముందుకు వస్తాం. 615 00:34:27,027 --> 00:34:28,445 ప్రసారం ముగిసింది. 616 00:34:29,362 --> 00:34:31,780 యుబిఎ365ని తప్పక చూస్తూ ఉండండి, 617 00:34:31,865 --> 00:34:35,660 ఎందుకంటే, ఆలెక్స్ లెవీ, బ్రాడ్లీ జాక్సన్లు మళ్లీ ఏకమై ఉదయాన్నే మిమ్మల్ని 618 00:34:35,744 --> 00:34:38,371 పలకరించడానికి వస్తున్న శుభసందర్భంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూని ప్రసారం చేస్తున్నాం. 619 00:34:38,454 --> 00:34:41,749 దాన్ని ఆదివారం రాత్రి యుబిఎలో లారా పీటర్సన్ హోస్ట్ చేస్తున్నారు. 620 00:34:48,548 --> 00:34:51,134 హేయ్, నేను విమానం ఎక్కబోతున్నాను. ఏంటి సంగతి? 621 00:34:51,218 --> 00:34:52,469 అవును, నాకు తెలుసు. 622 00:34:52,552 --> 00:34:56,139 చూడు, ఆలస్యం కాకముందే నేను నీకొక విషయం చెప్పాలి. 623 00:34:56,640 --> 00:34:58,725 సరే, ఆలెక్స్, నువ్వు ఇలా నాకు హితబోధలు చేయవద్దని చెప్పా కదా. 624 00:34:58,808 --> 00:35:01,603 -నేనేమీ చేయడం లేదమ్మా. -ఏంటి? అంత ముఖ్యమైన పనేంటి? 625 00:35:01,686 --> 00:35:04,147 ఇది నువ్వనుకున్నట్లు జరిగే పొగడ్తల కార్యక్రమం కాదు. సరేనా? 626 00:35:04,231 --> 00:35:07,192 తనకి సొంత ఎజెండా ఉంది, బ్రాడ్లీ. తను నాతో హద్దు మీరి ప్రవర్తించింది. 627 00:35:07,275 --> 00:35:08,443 ఏమంటున్నావు నువ్వు? 628 00:35:08,526 --> 00:35:11,947 తను ఏమడిగిందంటే... అంటే, నాకూ, మిట్చ్ కి లైంగిక సంబంధం అని 629 00:35:12,030 --> 00:35:15,283 సూచించే విధంగా మాట్లాడింది. 630 00:35:16,201 --> 00:35:19,079 ఒక్క నిమిషం, ఏంటి? తను అలా ఎందుకు అడిగింది? 631 00:35:19,746 --> 00:35:21,623 ఎందుకంటే, తను మంచి వ్యక్తి కాదు కనుక. 632 00:35:21,706 --> 00:35:24,709 నాకు వీళ్ళకి అసలు ఏది స్ఫూర్తిని ఇస్తుందో నాకు తెలిదు. అర్థమైందా? 633 00:35:24,793 --> 00:35:28,004 కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరేనా? 634 00:35:29,339 --> 00:35:32,592 ఇంకో విషయం, నేను అజాగ్రత్తగా వ్యవహరించాను. 635 00:35:32,676 --> 00:35:35,220 -నేను అజాగ్రత్తగా ఉన్నాను. -సరే, నేనేమీ అలా అనుకోనులే. 636 00:35:35,303 --> 00:35:37,514 సరే, ధన్యవాదాలు. ఉంటాను. 637 00:35:38,181 --> 00:35:39,182 ఉంటాను. 638 00:35:40,934 --> 00:35:43,603 సమయం అవుతోంది. అందరూ లోపల ఉన్నారు. 639 00:35:44,813 --> 00:35:46,022 సరే, అలాగే. 640 00:35:49,985 --> 00:35:52,487 పూల్ లో ఉన్న వంద మంది న్యూ యోర్క్ వాసులని బయటకు రప్పించడమెలా? 641 00:35:52,571 --> 00:35:53,572 "సన్నాసులారా." 642 00:35:53,655 --> 00:35:56,116 పూల్ లో ఉన్న వంద మంది కెనడా వాసులని బయటకు రప్పించడమెలా? 643 00:35:56,199 --> 00:35:59,369 -అడిగితే సరిపోతుంది. -దేవుడా. ఏంటి... 644 00:35:59,452 --> 00:36:01,580 -ఆ జోకుని వినడం ఇదే తొలిసారి. -చాలా బాగుంది. 645 00:36:04,833 --> 00:36:06,710 బ్రాడ్లీ జాక్సన్ వచ్చేసింది. 646 00:36:06,793 --> 00:36:10,171 అవును, అది నేనే. మీ గురించి నేను చాలా విషయాలు విన్నాను. 647 00:36:11,006 --> 00:36:14,593 -మంచివే వినుంటారని ఆశిస్తున్నాను. -అవును. అన్నీ మంచివే విన్నాను. 648 00:36:15,969 --> 00:36:17,888 సుస్వాగతం మరి. లోపలికి రండి. 649 00:36:18,638 --> 00:36:19,639 హాయ్. 650 00:36:28,064 --> 00:36:30,066 -సరే. ధన్యవాదాలు. -మరి? 651 00:36:30,150 --> 00:36:32,569 ఈ భాగాన్ని ప్రసారం చేయడం నేను మొదలుపెట్టవచ్చో లేదో చెప్పండి. 652 00:36:33,445 --> 00:36:34,654 వద్దట. 653 00:36:34,738 --> 00:36:37,824 ఏంటి? వద్దా? నా షో నుండి నన్నే పక్కకు తోసేస్తున్నారా? 654 00:36:37,908 --> 00:36:41,328 క్షమాపణ చెప్పారు. ఏదో షో ఎక్కువ సమయం తీసుకుంటుందట. కానీ రేపు ప్రయత్నిద్దాం. 655 00:36:41,411 --> 00:36:43,705 ఈలోపు, మనం కొన్ని గంటల్లో జరగబోవు యు.బి.ఎ.ఎన్.సిలో ప్రసారం చేయవచ్చు. 656 00:36:43,788 --> 00:36:46,791 నా షో నుండే నన్ను పక్కకు తప్పించేంత ముఖ్యమైన విషయం ఏమయ్యుంటుంది? 657 00:36:48,043 --> 00:36:50,420 నేను ఇప్పుడు ప్రొఫెసర్ మార్కస్ డెబ్స్ తో ఉన్నాను, 658 00:36:50,503 --> 00:36:54,299 ఈయన అయోవా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ శాఖకు అధ్యక్షులు, 659 00:36:54,382 --> 00:36:56,801 ఇక్కడున్న ఒకానొక సమావేశ ప్రదేశంలో ఈ రాత్రి జరగబోయేదాన్ని 660 00:36:56,885 --> 00:36:59,888 నాకు అర్థమయ్యేలా చెప్పనున్నారు. 661 00:36:59,971 --> 00:37:02,265 ఇప్పటికే వ్యాయామశాలని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు... 662 00:37:02,349 --> 00:37:03,350 ఓరి దేవుడా. 663 00:37:03,433 --> 00:37:05,560 ...గది నిండా ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొని ఉంది. 664 00:37:05,644 --> 00:37:08,772 ప్రొఫెసర్, ఈ రాత్రికి ఎంతమంది వస్తారని మీరు ఊహిస్తున్నారు? 665 00:37:08,855 --> 00:37:10,523 రాజకీయ సమావేశాలను కవర్ చేయడం మీకు ఇదే మొదటి సారా? 666 00:37:11,066 --> 00:37:14,653 వెస్ట్ వర్జీనియా రాష్ట్ర ఎన్నికలను కవర్ చేశాను, ఆదే ఆఖరిది కూడా. 667 00:37:14,736 --> 00:37:15,737 కానీ రాజకీయ సమావేశాన్ని కవర్ చేయడం ఇదే తొలిసారి. 668 00:37:16,571 --> 00:37:20,951 చెప్పాలంటే, ఇది మీకు పెద్ద విషయమనే చెప్పాలి, అంతే కదా? 669 00:37:21,034 --> 00:37:26,248 వెస్ట్ వర్జీనియాలో రిపోర్టర్ స్థాయి నుండి టీవీ చరిత్రలోనే అత్యంత పెద్దదైన 670 00:37:26,331 --> 00:37:29,751 ఉదయపు వార్తల కోసం జాతీయ ఎన్నికలను కవర్ చేసే స్థితికి ఎదగడమంటే అంతే కదా. 671 00:37:30,418 --> 00:37:32,254 అవును, ఇది మీకు పెద్ద ముందడుగులాగానే కనిపిస్తుంది, 672 00:37:32,337 --> 00:37:35,423 కానీ దీని కోసం నేను చాలా కాలం నుండి కష్టపడుతూ వచ్చాను. 673 00:37:35,507 --> 00:37:37,884 ఆ పెద్ద ముందడుగు గురించి చాలా ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. 674 00:37:37,968 --> 00:37:42,347 ఎవరూ ఊహించని విధంగా అసలు అదెలా సాధ్యమైందనే దాని గురించి. 675 00:37:43,014 --> 00:37:45,559 అంటే, ఆ విషయం మీద చాలా కథనాలు ప్రచురితమయ్యాయి. 676 00:37:45,642 --> 00:37:46,643 అవును. 677 00:37:46,726 --> 00:37:51,356 కానీ, అందులో నన్ను అబ్బురపరిచిన విషయం ఒకటుంది, 678 00:37:51,439 --> 00:37:55,402 దాని గురించి ఎవరూ కూడా పూర్తిగా ప్రస్తావించలేదు. 679 00:37:58,947 --> 00:38:00,907 అదెలా అనిపిస్తుంది? 680 00:38:01,825 --> 00:38:06,496 అంటే, మీ జీవితంలోని ఈ సమయంలో కెరీర్ పరంగా ఈ స్థితికి ఎదగగలగడం. 681 00:38:06,580 --> 00:38:07,914 అంటే, మీరే అన్నారు కదా, 682 00:38:07,998 --> 00:38:11,084 దేశమంతటా చిన్నాచితకా స్టేషన్లలో కష్టపడి పని చేశారని. 683 00:38:11,167 --> 00:38:12,168 అవును. అవును. 684 00:38:12,252 --> 00:38:16,256 ఇక దక్కదేమో అని మీకు అనిపించిన 685 00:38:16,339 --> 00:38:19,259 అవకాశం హఠాత్తుగా మీ తలుపు తట్టినప్పుడు, 686 00:38:20,176 --> 00:38:21,636 మీకు ఎలా అనిపించింది? 687 00:38:23,179 --> 00:38:26,558 ఓ విషయం చెప్పనా... నేను ఎదిగేటప్పుడు 688 00:38:26,641 --> 00:38:30,020 నాకు అవకాశాలు అంతగా ఉండవేమో అనుకున్నాను. 689 00:38:30,103 --> 00:38:33,231 కొన్ని విషయాలు నాకు అసలు దక్కవేమో అని అనుకున్నాను. 690 00:38:33,315 --> 00:38:35,525 కానీ నాకు ఏ విషయంలో నైపుణ్యం ఉందో నేను కనుగొన్నాను, 691 00:38:35,609 --> 00:38:40,113 అప్పుడు ఈ పెద్ద కలలను నేను కూడా కనవచ్చు అని అనిపించింది. 692 00:38:40,864 --> 00:38:43,575 ఆ తర్వాత జీవితంలో కొన్ని జరిగాయి. కొన్ని సంఘటనలు జరిగాయి. 693 00:38:43,658 --> 00:38:45,619 ఆ తర్వాత, ఒకానొక సమయంలో 694 00:38:45,702 --> 00:38:50,040 ఇంత విజయం నాకు దక్కే అవకాశం లేదేమో అనే స్థితికి చేరుకున్నాను. 695 00:38:50,123 --> 00:38:51,499 నేను సాధించలేనేమో అనిపించింది. 696 00:38:51,583 --> 00:38:55,378 నిజానికి, నాకు నేను సర్దిచెప్పుకున్నాను... 697 00:38:57,422 --> 00:38:59,507 ఇక నాకు అది అక్కర్లేదని నాకు నేను సర్దిచెప్పుకున్నాననుకుంటా. 698 00:39:01,176 --> 00:39:05,013 ఆ కొన్నేళ్ళనూ నేను కష్టంగా గడిపాను. 699 00:39:05,597 --> 00:39:08,725 అలా చాలా కాలం చేశాను. 700 00:39:09,726 --> 00:39:12,604 సుమారుగా ఒక నెల కిందట ఈ ప్రకటన వచ్చేదాకా నా పరిస్థితి అలానే ఉండింది. 701 00:39:13,230 --> 00:39:16,691 మరి ఏ విధంగా ఈ నెల మీకు సంబంధించిన విషయాల్లో మార్పు తెచ్చింది? 702 00:39:17,400 --> 00:39:18,401 ఈ నెలనా? 703 00:39:20,237 --> 00:39:21,988 ఒకానొక సమయంలో నాకు నా జీవితం మీద, 704 00:39:22,072 --> 00:39:25,033 నా భవిత మీద గానీ నాకు పూర్తి నియంత్రణ ఉన్నట్టు అనిపించింది. 705 00:39:25,116 --> 00:39:29,704 ఆ తర్వాత, నేను గ్రహించాను... నేను భయపడ్డాను... 706 00:39:29,788 --> 00:39:33,041 నాకు... నాకు అస్సలు నియంత్రణ లేదు అన్నట్టుగా అనిపించింది. 707 00:39:34,459 --> 00:39:38,171 అప్పుడు నిర్లక్ష్యంగా, పిచ్చిగా ప్రవర్తించాను. 708 00:39:38,922 --> 00:39:41,258 ఆ తర్వాత ప్రతి రోజూ, 709 00:39:42,092 --> 00:39:44,177 "నేను దీన్ని పోగొట్టుకుంటే ఎలా?" అని నాకు నేను అనుకొనేదాన్ని. 710 00:39:44,678 --> 00:39:48,932 ఇక్కడిదాకా చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. మళ్లీ ఇది నాకు దక్కకపోతే? 711 00:39:49,015 --> 00:39:50,225 అవును. 712 00:39:50,308 --> 00:39:51,601 అప్పుడు నేను గ్రహించాను, అంటే... 713 00:39:52,852 --> 00:39:55,272 నాకు అలా అనిపించగానే, 714 00:39:55,355 --> 00:39:57,941 అప్పుడే నేను గ్రహించాను, ఈ ఉద్యోగం నాకెంత ముఖ్యమో అని. 715 00:40:03,697 --> 00:40:04,781 అయ్యయ్యో. 716 00:40:04,864 --> 00:40:07,951 మీ కాఫీని మీరు అలాగే పడేస్తారా? ఎక్కడ నిలబడుంటే, అక్కడే పడేస్తారా? 717 00:40:08,034 --> 00:40:11,746 -లేదు. అదేం లేదు. నేను తీస్తున్నానంతే. -వద్దు. 718 00:40:11,830 --> 00:40:14,666 -మన్నించండి. నాకు బుద్ది పనిచేయలేదు. -ఎందుకంటే, నేను ఎత్తిచూపాను కాబట్టే. 719 00:40:14,749 --> 00:40:16,501 -నేను మీకు ఒక కొత్త కప్పు తెచ్చిస్తా. -నేను మీకు కొత్త బూట్లు తెచ్చిస్తా. 720 00:40:16,585 --> 00:40:18,503 నాకు కొత్త బూట్లు అవసరం లేదు. నాకు కాఫీ మరకలున్న బూట్లంటే ఇష్టం. 721 00:40:18,587 --> 00:40:20,130 మీ అందమైన బూట్లను కొనిచ్చేంత స్థోమత ఎలాగూ నాకు లేదు. 722 00:40:25,302 --> 00:40:28,471 -అక్కడ సమయం ఎంత? -ఇక్కడ సమయంతో పని ఉండదు. 723 00:40:29,472 --> 00:40:31,349 అర్థరాత్రి 2:36. 724 00:40:31,933 --> 00:40:34,603 మీకు నా సమయం పెద్ద ముఖ్యమైనదిగా అనిపిస్తున్నట్లు లేదు. 725 00:40:34,686 --> 00:40:39,733 మీరు నన్ను కొన్ని వేల కిలోమీటర్లు, మహమ్మారి కేంద్ర భాగానికి పంపారు, 726 00:40:39,816 --> 00:40:45,071 ఇప్పుడు ఈ అల్లాటప్పా హోటల్ లో నేను 14 రోజులు వేచి ఉండాలి. 727 00:40:45,155 --> 00:40:46,948 హిల్టన్ ఏమీ అల్లాటప్పా హోటల్ కాదు. 728 00:40:47,032 --> 00:40:48,700 ఇది అల్లాటప్పాదే. 729 00:40:48,783 --> 00:40:51,786 హేయ్. హేయ్. ఎలా ఉన్నావు? కాస్త నువ్వు ఫోన్ డేనియల్ కి ఇస్తావా? 730 00:40:51,870 --> 00:40:53,204 మీరు నన్ను పక్కకు తప్పించారు. 731 00:40:53,288 --> 00:40:55,624 అమెరికా చరిత్రలోనే ఇప్పుడు మూడవ అభిశంశన జరుగుతోంది. 732 00:40:55,707 --> 00:40:56,708 రాజకీయ సమీకరణల సమావేశాలు ఇవాళే జరుగుతున్నాయి. 733 00:40:56,791 --> 00:41:00,462 కోబీ బ్రయాన్ట్ విషయంలో పొరబడ్డానని షాక్ అంటున్నాడు. ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. 734 00:41:01,379 --> 00:41:04,007 -ఇదీ ముఖ్యమైన విషయమంటే. -నువ్వే అన్నావు కదా. 735 00:41:04,090 --> 00:41:06,176 నువ్వు చాలా దూరంలో ఉన్నావని. మనం అక్కడ ప్రసారాలు కూడా చేయం. 736 00:41:06,259 --> 00:41:08,887 వయోమింగ్ లో టీవీలను ఆఫ్ చేసే శబ్దం నాకు వినిపిస్తోంది కూడా. 737 00:41:08,970 --> 00:41:10,764 రాబోయే విపత్తు గురించి జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. 738 00:41:10,847 --> 00:41:13,516 వార్తలంటే మనకి నచ్చే అంశాలు మాత్రమే కాదు. 739 00:41:13,600 --> 00:41:16,645 చూడు, నువ్వు 13 గంటలు ముందున్నావు, ఇది అక్కడ ప్రముఖ వార్తలు కావచ్చు. 740 00:41:16,728 --> 00:41:19,105 చెప్తున్నా కదా, నేను ఇప్పుడు మిడ్ టౌన్ మాన్హాటన్ లో నడుస్తూ ఉన్నాను. 741 00:41:19,189 --> 00:41:23,985 వీధులలో లక్షలాది మంది తిరుగుతున్నారు. ఇక్కడి జీవితాన్ని అది ప్రభావితం చేయడంలేదు. 742 00:41:24,069 --> 00:41:25,987 ఇంకో విషయం, ఓ వారంలో ఆలెక్స్ తిరిగి వచ్చేస్తోంది, 743 00:41:26,071 --> 00:41:28,031 కాబట్టి నాకు అన్నీ సక్రమంగా జరగడం కావాలి, బాసూ. 744 00:41:28,657 --> 00:41:29,950 నాకు ఎలాగైనా రేటింగ్లు కావాలి, 745 00:41:30,033 --> 00:41:31,534 అర్థమవుతోందా, డేనియల్? 746 00:41:34,329 --> 00:41:35,330 డేనియల్? 747 00:41:38,667 --> 00:41:39,834 నీ ఊపిరి నాకు వినబడుతోంది. 748 00:41:41,419 --> 00:41:43,463 అబ్బా. డేనియల్. 749 00:41:44,798 --> 00:41:47,884 ప్రతిసారీ నీకు నచ్చినవే చేస్తూ కూర్చోలేను. 750 00:41:47,968 --> 00:41:50,387 కనీసం ఒక్కసారైనా నాకోసం ఈ పనిచేసి, ఒక మగాడివి అనిపించుకుంటావా? 751 00:41:52,180 --> 00:41:53,181 చచ్చిపో. 752 00:41:57,477 --> 00:41:58,478 అబ్బా. 753 00:41:58,562 --> 00:41:59,729 యాంకో? 754 00:41:59,813 --> 00:42:03,066 ఫలనా జంతువు నీకు నచ్చిందని అలా చెప్పడం మంచి విషయం కాదని తేలింది. 755 00:42:03,149 --> 00:42:04,859 -అవునా? -దేవుడా, మరొకటా? 756 00:42:05,443 --> 00:42:07,070 నేనేమీ నొచ్చుకొనేలా చెప్పలేదే. 757 00:42:07,153 --> 00:42:09,489 అది చాలా విచిత్రంగా ఉంది. కానీ హెచ్చరించినందుకు థ్యాంక్స్, బుల్లోడా. 758 00:42:12,576 --> 00:42:14,828 -హేయ్. -హేయ్, చిప్. 759 00:42:16,830 --> 00:42:19,416 ఓరి దేవుడా, చిప్! 760 00:42:19,499 --> 00:42:21,877 దేవుడా. నిండు గర్భిణివి అన్నమాట. 761 00:42:22,544 --> 00:42:25,088 నువ్వు అందరి దృష్టిని ఆకర్షించడానికి ఈ నాటకమాడుతున్నావని అన్నారే. 762 00:42:25,171 --> 00:42:28,466 లేదు, బిడ్డ లేకపోతే నా జీవితం అసంపూర్ణమైనదిగా అనిపించింది. 763 00:42:28,550 --> 00:42:30,051 నేనే ఆ బిడ్డని. 764 00:42:30,135 --> 00:42:31,386 అవును. నాకర్థమైందిలే. 765 00:42:33,179 --> 00:42:35,557 -లేలా. హాయ్. -హేయ్, చిప్. 766 00:42:35,640 --> 00:42:37,142 నిన్ను చూడటం బాగుంది. 767 00:42:40,353 --> 00:42:42,355 అది వ్యక్తిగతంగా తీసుకోకు. 768 00:42:43,064 --> 00:42:46,443 అంటే, ఇక్కడ కొందరికి 769 00:42:46,526 --> 00:42:48,737 నువ్వు మళ్లీ ఇక్కడికి రావడం ఇష్టం లేదు. 770 00:42:48,820 --> 00:42:50,447 -అర్థమైంది. -కానీ పోను పోను మర్చిపోతారులే. 771 00:42:50,530 --> 00:42:51,990 కొంత సమయం గడిస్తే వాళ్లే మామూలైపోతారులే. 772 00:42:52,991 --> 00:42:56,494 లేదు, పర్వాలేదులే. నేను అర్థం చేసుకోగలను. మరేం పర్వాలేదు. 773 00:42:56,578 --> 00:42:59,164 నా గురించి నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు, సరేనా? 774 00:42:59,247 --> 00:43:03,877 నేను కేవలం ఓసారి నిన్ను చూసి పలకరించిపోదామని వచ్చానంతే. 775 00:43:03,960 --> 00:43:05,837 నిన్ను చూడటం బాగుంది. నిన్ను కూడా. 776 00:43:05,921 --> 00:43:07,130 నిన్ను కూడా. 777 00:43:07,797 --> 00:43:09,549 -సరే మరి. -సరే. 778 00:43:09,633 --> 00:43:11,885 -నువ్వు చాలా బాగున్నావు. -ధన్యవాదాలు. 779 00:43:14,054 --> 00:43:17,390 మీట్చ్ కెస్లర్ తో మీకు ఉన్న బంధాన్ని మీరెలా వర్ణించగలరు? 780 00:43:26,650 --> 00:43:27,943 అతను నా ప్రాణ స్నేహితుడు. 781 00:43:28,902 --> 00:43:30,487 అతను నా ప్రాణ స్నేహితుడు. 782 00:43:33,114 --> 00:43:35,742 -కానీ... -మన్నించాలి, దాన్ని కాస్త రివైండ్ చేయవా? 783 00:43:35,825 --> 00:43:36,868 మిట్చ్... 784 00:43:41,164 --> 00:43:42,582 ఈ ప్రశ్నను నేను ఆమోదించలేదు. 785 00:43:42,666 --> 00:43:44,960 కాబట్టి దీన్ని కాస్త కుదించడానికి వీలవుతుందేమో చూద్దాం. 786 00:43:45,627 --> 00:43:49,965 మీట్చ్ కెస్లర్ తో మీకు ఉన్న బంధాన్ని మీరెలా వర్ణించగలరు? 787 00:43:50,048 --> 00:43:52,425 అవును, నురీన్. ఇప్పుడు నేను డీ.ఎన్.సీలోని ఒకరితో మాట్లాడాను, 788 00:43:52,509 --> 00:43:55,762 తుది ఫలితాలు ఈ రాత్రికి సిద్ధం కావు అని వారు తెలిపారు. 789 00:43:55,845 --> 00:43:59,432 నువ్వన్నట్టుగా, ప్రైమరీ సీసన్ విషయంలో, డెమోక్రాట్లు ఈ ఆరంభాన్ని 790 00:43:59,516 --> 00:44:02,686 ఊహించలేదు, కానీ రేపు తేలవచ్చేమో చూడాలి. 791 00:44:02,769 --> 00:44:06,356 మరి అప్పటికల్లా పూర్తి కాకపోతే, బహుశా వాళ్ళు దీన్నంతటినీ రద్దు చేసేస్తారేమో. 792 00:44:06,439 --> 00:44:09,568 అది మనకి రేపు తెలుస్తుందనుకుంటా. ధన్యవాదాలు, బ్రాడ్లీ. చక్కగా కవర్ చేశావు. 793 00:44:09,651 --> 00:44:11,111 ధన్యవాదాలు, నురీన్. 794 00:44:11,194 --> 00:44:12,737 విరామం తర్వాత, మనం సెనేటర్ ఎలిజబెత్ వారెన్ 795 00:44:12,821 --> 00:44:15,615 ప్రచార మేనేజర్ అయిన రోజర్ లావుతో మాట్లాడబోతున్నాం. 796 00:44:15,699 --> 00:44:18,118 -సరే. -ప్రచారానికి వచ్చిన స్పందనలను చూద్దాం. 797 00:44:18,702 --> 00:44:19,703 మా ఛానెల్ చూస్తూ ఉండండి. 798 00:44:19,786 --> 00:44:21,830 ఆరవ అధ్యాయం (సవరించబడింది) - మిట్చ్ దరిద్రుడు 799 00:44:30,422 --> 00:44:32,632 లారాతో ఇంటర్వ్యూ ఎలా గడిచింది? 800 00:44:35,093 --> 00:44:36,303 అందరూ పడుకోవడానికి వెళ్తున్నారా? 801 00:44:36,386 --> 00:44:38,555 ఏమో మరి. నిజానికి నాకు నిద్ర రావాలి, కానీ రావడం లేదు. 802 00:44:38,638 --> 00:44:40,891 -అలసటగా ఉంది. కానీ నిద్ర రావట్లేదు. -ధన్యవాదాలు. 803 00:44:40,974 --> 00:44:43,643 నాకు అలసటగా ఉంది, నిద్ర కూడా వస్తోంది, కాబట్టి వెళ్లి పడుకుంటాను. 804 00:44:43,727 --> 00:44:45,729 -సరే. శుభరాత్రి. -శుభరాత్రి! 805 00:44:45,812 --> 00:44:46,813 శుభరాత్రి. 806 00:44:47,314 --> 00:44:48,440 మరి? 807 00:44:48,523 --> 00:44:51,234 ఈ రాజకీయ సమావేశాలు మీరనుకున్నట్టే ఉన్నాయా, లేదా మీ ఊహలకు మించాయా? 808 00:44:51,318 --> 00:44:54,362 అంటే, ఫలితాలు రాలేదు కనుక, 809 00:44:54,446 --> 00:44:55,697 -నేను ఖచ్చితంగా చెప్పలేను. -అవును, అంతే. 810 00:44:55,780 --> 00:44:57,449 -అసలు ఏమైంది? -ఏమో మరి. 811 00:44:57,532 --> 00:45:01,786 సానుకూల అంశమేంటంటే, ఇలాంటివి ఇంకో 49 మాత్రమే ఉన్నాయి. 812 00:45:01,870 --> 00:45:03,079 బాబోయ్. 813 00:45:03,163 --> 00:45:05,665 -అయితే, కోరీ... -చెప్పండి? 814 00:45:05,749 --> 00:45:07,167 ...అతనంటే నాకు చాలా అభిమానం ఉంది అనుకోండి. 815 00:45:07,667 --> 00:45:09,419 కానీ అతను మిమ్మల్ని చూసుకోమని నాకు చెప్పాడు. 816 00:45:11,296 --> 00:45:14,049 సరే. ఒక్క నిమిషం. నాకు మార్గనిర్దేశం ఇవ్వమనా? 817 00:45:14,132 --> 00:45:18,178 కాదు. "మార్గనిర్దేశం" అనే పదం అతను వాడలేదు, కానీ... అంతే. 818 00:45:18,803 --> 00:45:22,766 అంటే, అతను సదుద్దేశంతోనే చెప్పాడు, మీకు నేను చెప్పుండాల్సింది కూడా కాదు. 819 00:45:23,892 --> 00:45:27,812 కానీ మిమ్మల్ని రోజంతా గమనించాక, ఆ అవసరం మీకు లేదనిపిస్తోంది. 820 00:45:27,896 --> 00:45:30,106 నన్ను గమనించక ముందు, ఆ అవసరం ఉందని మీకు అనిపించిందా? 821 00:45:30,190 --> 00:45:31,483 విషయం అది కాదు. 822 00:45:31,566 --> 00:45:35,070 విషయమేంటంటే, మీరు మీ ప్రతిభతో నన్ను బోల్తా కొట్టించారు. 823 00:45:35,153 --> 00:45:39,157 -అవునా? -అవును. మీరు అదరగొట్టేశారు. 824 00:45:40,367 --> 00:45:43,745 అంటే, మీలో ఉన్న ఈ కోణాన్ని నేను టిఎంఎస్ లో ఎప్పుడూ చూడలేదు. 825 00:45:44,371 --> 00:45:47,332 మీరు భలే సరదాగా ఉంటారు. ఆ విషయం మీ వాళ్లకి తెలుసా? 826 00:45:48,041 --> 00:45:51,211 అంటే, ఒకప్పుడు సరదాగానే ఉండేదాన్ని. దాని వల్ల 15వ ఏటనే గర్భవతి అయ్యాను. 827 00:45:51,836 --> 00:45:54,130 అది నాకు మరీ అంత సరదా విషయంగా అనిపించడం లేదు, 828 00:45:54,214 --> 00:45:56,466 అది ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించవచ్చేమో. 829 00:45:56,550 --> 00:46:00,637 విషయమేమిటంటే... వాళ్లు మిమ్మల్ని సరైన విధంగా ఉపయోగించుకోవట్లేదు అనుకుంటా. 830 00:46:01,388 --> 00:46:02,556 నిజంగానా? 831 00:46:02,639 --> 00:46:06,768 జీవితాంతం "ది మార్నింగ్ షో"లోనే ఉండిపోయేవాళ్లు ఎలాంటి వాళ్ళంటే, 832 00:46:06,851 --> 00:46:10,146 వాళ్లు అది తప్ప ఇంకేదీ చేయలేరు. 833 00:46:11,898 --> 00:46:13,358 మీకు అంతకు మించిన ప్రతిభ ఉంది. 834 00:46:17,070 --> 00:46:19,906 -ధన్యవాదాలు. అలా అనడం మీ మంచితనం. -భలేవారే. 835 00:46:22,033 --> 00:46:23,868 వావ్, లారా పీటర్సన్. 836 00:46:29,666 --> 00:46:33,670 నేను కూడా నిజం చెప్పాలి, మీ విషయంలో నేను కూడా ఆశ్చర్యపోయాను. 837 00:46:33,753 --> 00:46:35,881 అయితే ఆలెక్స్ మీ చెవిలో ఏదో ఊదిందన్నమాట. 838 00:46:35,964 --> 00:46:37,591 నేను చెప్పింది నిజమే కదా? 839 00:46:38,174 --> 00:46:40,594 మేము మాట్లాడుకుంటాం. 840 00:46:42,512 --> 00:46:45,515 -మేము భాగస్వాములం కదా? -దానిదేముందిలే. అందులో ఏ తప్పూ లేదు. 841 00:46:45,599 --> 00:46:47,058 మీ ఇద్దరి భాగస్వామ్యం మీకెలా అనిపిస్తోంది? 842 00:46:48,393 --> 00:46:53,940 మీ గొంతు ఏదో తేడాగా ఉందే. మీ గొంతు నిజంగానే తేడాగా ఉన్నట్టు నాకనిపిస్తోంది. 843 00:46:54,024 --> 00:46:55,984 అంటే, ఒకరు మనకి చాలా కాలంగా తెలిసిన వ్యక్తి అయినప్పుడు, 844 00:46:56,067 --> 00:46:57,903 గొంతు అలా ఉండటం సహజమే. 845 00:46:57,986 --> 00:47:02,240 -దేవుడా, ఇక్కడ చలి చంపేస్తోంది. -అవును. లోపలికి వెళ్దాం పదండి. 846 00:47:29,309 --> 00:47:30,310 బ్రాడ్లీ జాక్సన్ 847 00:47:30,393 --> 00:47:31,436 లారాతో ఇంటర్వ్యూ ఎలా జరిగింది? 848 00:47:31,519 --> 00:47:32,771 బాగా జరిగింది. 849 00:47:34,773 --> 00:47:36,066 దేవుడా. 850 00:47:50,914 --> 00:47:53,208 ఆలెక్స్ లెవీ - అయితే తను నీ వ్యక్తిగత విషయాలేవీ అడగలేదా? 851 00:47:53,875 --> 00:47:57,712 అయితే, ఇంటర్వ్యూ కోసం మీరు అడగాలనుకున్న వాటన్నింటినీ అడిగేశారా? 852 00:47:57,796 --> 00:48:01,341 అవును. చాలా తెలుసుకున్నాను. నిన్న మనం లోనికి వెళ్లకముందే నేను వెళ్లిపోయిండవచ్చు, 853 00:48:01,424 --> 00:48:03,093 కానీ నాకు బాగా సరదాగా అనిపించింది. 854 00:48:03,802 --> 00:48:04,803 హేయ్... 855 00:48:06,263 --> 00:48:07,931 -ఇప్పుడు కెమెరాలు లేవు కనుక... -చెప్పండి. 856 00:48:08,014 --> 00:48:10,850 ...మీరు ఎంత చక్కని వ్యక్తో ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి... 857 00:48:12,644 --> 00:48:17,023 మనలో మన మాటగా, నేను మిమ్మల్ని ఒక వ్యక్తిగత విషయం అడగవచ్చా? 858 00:48:19,401 --> 00:48:21,027 తప్పకుండా, మీరు ఏదైనా అడగవచ్చు. 859 00:48:24,239 --> 00:48:27,325 ఈ ఉద్యోగంలో చేరడానికి ముందు, మీ బ్యాక్ గ్రౌండ్ చెక్ ఏమైనా చేశారా? 860 00:48:42,090 --> 00:48:43,466 నన్ను మన్నించాలి. నేను... 861 00:48:58,398 --> 00:49:00,066 దేశ పరిస్థితుల గురించి రాష్ట్రపతి ప్రసంగం 862 00:49:12,245 --> 00:49:14,414 పాలా లాంబ్రస్కీని 863 00:49:19,169 --> 00:49:21,004 మీరు అడిగిన విషయం ఇంకా పరిగణనలోనే ఉంటే, 864 00:49:21,087 --> 00:49:24,132 ఆ డాక్యుమెంటరీ విషయంలో నేను సహాయపడగలను 865 00:49:39,648 --> 00:49:41,983 మేము మిమ్మల్ని మిస్ అవుతాము! 866 00:49:42,067 --> 00:49:44,694 -గుడ్ బై, ఈ! -అవును. 867 00:49:44,778 --> 00:49:48,156 -నీతో పనిచేయడం నా భాగ్యం. -ధన్యవాదాలు. 868 00:49:48,240 --> 00:49:51,451 -అభినందనలు. నిన్ను మేం మిస్ అవుతాము! -ధన్యవాదాలు, బ్రాడ్లీ. 869 00:49:51,534 --> 00:49:53,620 నీకు అంతా మంచే జరగాలి. సరే. 870 00:49:58,708 --> 00:50:01,795 కానీ మన చుట్టూ జరిగే విషయాలు మన అందరికీ తెలిశాయనుకుంటా. 871 00:50:01,878 --> 00:50:03,421 అంటే, నేను నా గురించి మాత్రమే చెప్పాలి. 872 00:50:03,505 --> 00:50:07,300 నా విజయం గురించి మాత్రమే నేను ఆందోళన చెందినప్పుడు అన్నమాట. 873 00:50:07,384 --> 00:50:10,178 మిట్చ్ తో మీరు ఎలా ఉండేవారు? 874 00:50:11,012 --> 00:50:12,430 అతను నా ప్రాణ స్నేహితుడు. 875 00:50:13,765 --> 00:50:14,933 అతను నా ప్రాణ స్నేహితుడు. 876 00:50:16,017 --> 00:50:21,314 కానీ చాలా మంది దృష్టిలో మిట్చ్ వేరే మనిషి కావచ్చు, అది స్పష్టంగా తెలిసింది కూడా. 877 00:50:35,287 --> 00:50:37,497 ఫ్రెడ్ మిక్లెన్ మొబైల్ 878 00:50:44,838 --> 00:50:46,172 యుబిఎ 879 00:50:48,258 --> 00:50:49,634 ఆలెక్స్ లెవీ 880 00:51:06,443 --> 00:51:07,569 మళ్లీ స్వాగతం. 881 00:51:15,285 --> 00:51:16,786 దయచేసి నిశ్శబ్దం పాటించండి! 882 00:51:19,247 --> 00:51:21,416 మళ్లీ స్వాగతం ఆలెక్స్ 883 00:51:21,499 --> 00:51:22,751 మళ్లీ సుస్వాగతం. 884 00:51:34,471 --> 00:51:37,224 సరే మరి, చివరిగా అన్నీ చూసేసుకోండి. ఆరంభిస్తున్నాం! 885 00:51:44,773 --> 00:51:46,107 అంతా సిద్ధం! 886 00:51:46,191 --> 00:51:52,030 ఎనిమిది, ఏడు, ఆరు, అయిదు, నాలుగు, మూడు. 887 00:51:52,113 --> 00:51:54,366 రెండు. మీరు ప్రారంభించి, తనపై ఫోకస్ చేయండి. 888 00:53:02,684 --> 00:53:04,686 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య