1 00:00:06,000 --> 00:00:09,000 నా సోదరుడు సౌరోన్‌ను వెంటాడుతూ ప్రాణాలు వదిలాడు. 2 00:00:09,083 --> 00:00:10,833 అతని పని ఇప్పుడు నేను చేయాలి. 3 00:00:12,250 --> 00:00:13,791 దళపతి గాలాడ్రియెల్. 4 00:00:13,916 --> 00:00:17,375 ఈ దళం మిమ్మల్ని ప్రపంచ అంచుల వరకూ అనుసరించింది. 5 00:00:17,500 --> 00:00:20,000 చివరి ఓర్క్ కనిపించి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. 6 00:00:21,125 --> 00:00:24,458 ఈ చిహ్నం ఉనికి సౌరోన్ తప్పించుకున్నాడని రుజువు చేస్తుంది. 7 00:00:24,833 --> 00:00:26,208 ప్రశ్న ఏంటంటే, ఎక్కడున్నాడు? 8 00:00:27,250 --> 00:00:29,708 అయితే అది ఇక్కడ నుండి ఎందుకు పోవడం లేదు? 9 00:00:29,791 --> 00:00:35,166 ఈ వీరులకు శాశ్వత నివాసానికి సముద్రం మీదుగా మార్గం మంజూరు చేస్తున్నాం. 10 00:00:35,291 --> 00:00:37,416 చాలా కాలం పోరాడావు, గాలాడ్రియెల్. 11 00:00:38,625 --> 00:00:39,625 కత్తి అవతల పెట్టు. 12 00:00:39,916 --> 00:00:41,416 అది లేకుండా, నేను ఏంటి? 13 00:00:45,125 --> 00:00:48,833 నీకు సెలెబ్రింబోర్ ప్రభువు పనితనం తెలుసా? 14 00:00:48,916 --> 00:00:51,250 తెలుసు, గొప్ప ఎల్వెన్ స్వర్ణకారులలో ఒకరు. 15 00:00:52,791 --> 00:00:54,291 ఇక్కడేం చేస్తున్నారు? 16 00:00:56,041 --> 00:00:58,041 దానికి ఏదో జబ్బుగా ఉంది. 17 00:00:58,166 --> 00:01:01,458 -అది గడ్డి ఎక్కడ మేస్తుంది? -ఈమధ్య తూర్పు ప్రాంతంలో తిరిగింది. 18 00:01:01,541 --> 00:01:02,375 తూర్పు ఎంత దూరం? 19 00:01:02,666 --> 00:01:03,500 హోర్దెర్న్... 20 00:01:08,000 --> 00:01:10,791 నీకు ఎప్పుడూ ఇలా అనిపించలేదా అక్కడ ఇంకేం ఉందో? అని. 21 00:01:10,916 --> 00:01:12,166 మనం తిరిగే చోటుకు ఆవల. 22 00:01:12,250 --> 00:01:14,833 ఎవరూ దారి తప్పరు, ఎవరూ ఒంటరిగా నడవరు. 23 00:01:15,791 --> 00:01:18,458 ఆకాశం విచిత్రంగా ఉంది. 24 00:02:38,208 --> 00:02:44,041 ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ 25 00:03:56,208 --> 00:03:58,458 -నోరి! -పాపీ! 26 00:03:58,541 --> 00:04:01,791 నీ బండి చక్రాలు ఊడిపోయాయా? అక్కడినుండి వెళ్ళిపో! 27 00:04:02,541 --> 00:04:04,666 జనాన్ని అలా రహస్యంగా చూడకూడదు. 28 00:04:04,750 --> 00:04:06,000 నువ్వు ఇక్కడికి రాకూడదు. 29 00:04:11,958 --> 00:04:13,125 అది వేడిగా లేదు. 30 00:04:13,208 --> 00:04:14,583 మంచిది. అది వేడిగా లేదు. 31 00:04:14,666 --> 00:04:17,875 దాంతో అక్కడ భారీకాయుడు ఉన్నాడన్న వాస్తవం మారిపోదు. 32 00:04:18,250 --> 00:04:21,708 మళ్ళీ ఆ ముఖం పెట్టింది. ముఖం అలా పెట్టకు, నోరి... 33 00:04:23,625 --> 00:04:24,458 నోరి! 34 00:04:25,958 --> 00:04:26,791 నోరి, వద్దు! 35 00:04:43,458 --> 00:04:46,458 నోరి, వద్దు! అతను చనిపోయాడు! వచ్చేయ్! 36 00:04:49,583 --> 00:04:52,791 అయ్యో! వద్దు! వద్దు! 37 00:05:06,583 --> 00:05:07,708 అయ్యో! 38 00:05:26,083 --> 00:05:27,083 ఏంటి... 39 00:05:37,125 --> 00:05:38,458 మీ అమ్మ చంపేస్తుంది. 40 00:05:40,375 --> 00:05:44,541 నువ్వు ఆమెకు చెప్పకు. నేనూ చెప్పను. త్వరగాా. 41 00:05:44,625 --> 00:05:47,041 మనం అతన్ని వదిలేయలేం, తోడేళ్ళు తినేస్తాయి. 42 00:05:47,125 --> 00:05:48,916 -అయితే? -అంటే, మనం అలా ఉండము. 43 00:05:49,000 --> 00:05:50,291 నువ్వు అలా ఉండవు. 44 00:05:50,375 --> 00:05:53,625 ఒంటరిగా అతన్ని మోసుకురాలేను. నువ్వు నాకు సాయం చేస్తావా, లేదా? 45 00:05:53,708 --> 00:05:54,958 -లేదు. -పాపీ! 46 00:05:55,708 --> 00:05:58,333 మనం అసలు ఒక భారీకాయుడిని ఎలా మోసుకెళ్ళగలం? 47 00:05:59,916 --> 00:06:01,666 బహుశా తోకచుక్క అయి ఉంటుంది. 48 00:06:03,958 --> 00:06:05,666 పెద్దది. 49 00:06:05,750 --> 00:06:08,166 నీకు ఎన్ని శకునాలు కావాలి? 50 00:06:09,083 --> 00:06:12,250 నన్ను అడిగితే, మనం ఈ క్షణమే గుడారాలు ఎత్తేయాలి. 51 00:06:12,333 --> 00:06:13,541 మరి పండుగ సంగతి ఏంటి? 52 00:06:13,625 --> 00:06:15,833 మనం ఇప్పుడు దూకుడుగా ఏదీ చేయకూడదు. 53 00:06:15,916 --> 00:06:18,916 అంతేకాకుండా మనం గుడారాలలో ఉంటేనే సురక్షితంగా ఉంటాము. 54 00:06:19,541 --> 00:06:21,541 కానీ పహరా కాయండి, మీరిద్దరూ కూడా. 55 00:06:21,625 --> 00:06:23,333 -మాల్వా చెప్పింది సబబే. -అవును. 56 00:06:23,416 --> 00:06:26,125 ఇది మంచి సంకేతం కాదు. 57 00:06:26,208 --> 00:06:28,041 ఇక, వెళ్ళండి. కొనసాగండి. 58 00:06:29,333 --> 00:06:32,333 -సరే... -వెళ్ళండి. త్వరగా. 59 00:06:52,458 --> 00:06:54,458 అతన్ని చూడు. బాగా రక్తం కారుతోంది. 60 00:06:54,541 --> 00:06:56,833 -అతను... -అతను ట్రోల్ కాదు! 61 00:06:56,916 --> 00:06:59,333 సరే, తెలివైన హర్ఫూట్. మరి అతను ఏంటి? 62 00:07:00,291 --> 00:07:02,166 అతను భారీ మనిషేమో. 63 00:07:02,250 --> 00:07:03,666 మనిషా? 64 00:07:03,750 --> 00:07:05,666 కానేకాదు. అతను నలిగిపోయేవాడు. 65 00:07:05,750 --> 00:07:07,000 ఎల్ఫ్, అయి ఉంటాడా? 66 00:07:07,500 --> 00:07:10,208 చెవులు అలా లేవు. అందంగా కూడా లేడు. 67 00:07:11,166 --> 00:07:12,916 ఎల్వ్స్ ఆకాశం నుండి పడరు. 68 00:07:13,000 --> 00:07:14,791 ఎవరూ పడరు. నాకు తెలిసినంతవరకు. 69 00:07:14,875 --> 00:07:15,875 అతను పడ్డాడు. 70 00:07:15,958 --> 00:07:18,708 -అసలు నువ్వు లాగుతున్నావా? -హా, లాగుతున్నాను! 71 00:07:18,791 --> 00:07:20,291 అయితే, ఇంకా బలంగా లాగు! 72 00:07:21,916 --> 00:07:24,458 పిచ్చితనం. అతను ఎప్పటికీ ఆ పాత బండిలో సరిపోడు. 73 00:07:24,541 --> 00:07:25,958 అది ఈ ఒక్క రాత్రికే. 74 00:07:26,041 --> 00:07:29,916 ఉదయాన్నే, అతనికి కొంచెం ఆహారం మూటకట్టిచ్చి తన దారిలో తనను పంపుదాం. 75 00:07:30,000 --> 00:07:32,375 -ఏ దారిలో? -అది రేపటి సమస్య. 76 00:07:32,458 --> 00:07:35,166 -అదేమీ సాహసం కాదు. -అంటే ఏంటి? 77 00:07:35,250 --> 00:07:37,958 -ఇదేమీ నేనూహించినది కాదు. -నువ్వు వదిలి రావడం లేదు. 78 00:07:38,041 --> 00:07:40,541 -ఎందుకంటే నేను రాలేను. -ఎందుకంటే నువ్వు రావు. 79 00:07:40,625 --> 00:07:43,458 ఈ అపరిచితుడు మనిషి కాదు, ఎల్ఫ్ కాదు, 80 00:07:43,541 --> 00:07:45,500 ఏదో రెక్క విరిగిన డేగ పిల్లా కాదు. 81 00:07:45,583 --> 00:07:48,083 -అది ఒకప్పుడు. -అతను ఇంకేదో. 82 00:07:51,125 --> 00:07:52,791 ఎవరైనా ప్రమాదకరమైన వాడేమో. 83 00:07:52,875 --> 00:07:55,083 మాల్వా, ఆమె సోదరీమణుల్లా అంటున్నావు. 84 00:07:55,166 --> 00:07:56,291 అది వాళ్ళు కాదు. 85 00:07:56,375 --> 00:07:58,833 మనం ముక్కూమొహం తెలియని వాడికి సాయం చేశామంటే, 86 00:07:58,916 --> 00:08:01,708 రాబోయే మూడు కాలల్లో ఏ చెడు జరిగినా, 87 00:08:01,791 --> 00:08:03,083 మన తప్పే అంటారు. 88 00:08:03,166 --> 00:08:06,458 ఒకవేళ మంచు ఎక్కువ కాలం ఉన్నా, బురదలో చక్రం ఇరుక్కున్నా సరే. 89 00:08:07,291 --> 00:08:09,750 -అబ్బా! -వేగంగా, ఇది విరిగిపోకముందే పద! 90 00:08:09,833 --> 00:08:11,375 ఇప్పుడు తన గురుంచి ఆలోచనలా. 91 00:08:11,458 --> 00:08:13,958 లేదు! ఈ తోపుడుబండి నాది కాదు! 92 00:09:01,208 --> 00:09:02,708 ఎందుకిది చేస్తున్నావు, నోరి? 93 00:09:03,958 --> 00:09:05,750 అతను నా బాధ్యత అనుకుంటాను. 94 00:09:05,833 --> 00:09:08,250 -నీకు అందరికీ ఉందని అనిపిస్తుందా. -లేదు. 95 00:09:09,125 --> 00:09:10,625 ఇది భిన్నమైనది. 96 00:09:15,916 --> 00:09:18,750 అతను ఎక్కడైనా పడవచ్చు, కానీ ఇక్కడ పడ్డాడు. 97 00:09:21,041 --> 00:09:25,875 ఇది విచిత్రంగా అనిపించవచ్చు, కానీ అతను ఎందుకో ముఖ్యమైనవాడుగా అనిపిస్తున్నాడు. 98 00:09:27,333 --> 00:09:29,833 ఇలా జరగడానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. 99 00:09:29,916 --> 00:09:32,625 నేను అతన్ని కనుగొనడం. నేను. 100 00:09:34,125 --> 00:09:37,625 అతను సురక్షితంగా ఉన్నాడని తెలిసేవరకు నేను అలా వదిలేసి రాలేను. 101 00:09:40,541 --> 00:09:41,583 నువ్వు రాగలవా? 102 00:09:44,666 --> 00:09:46,250 సరే. నేను ఎవరికీ చెప్పనులే. 103 00:09:48,625 --> 00:09:49,875 ధన్యవాదాలు. 104 00:09:53,333 --> 00:09:55,750 అన్నట్లు, ఒక భారీకాయుడు ఏం తింటాడు? 105 00:09:55,833 --> 00:09:57,791 ఇది హర్ఫూట్స్ కాదనుకుంటా. 106 00:09:57,875 --> 00:10:00,375 రహస్యాన్ని దాచలేని వాళ్ళు అంతే. 107 00:10:29,000 --> 00:10:33,166 భూమి పాయలుగా విడిపోయింది. భూకంపం వచ్చినట్టు. 108 00:10:35,416 --> 00:10:36,500 ఎవరూ లేరు. 109 00:10:39,208 --> 00:10:40,583 గాయపడినవారు లేరు. 110 00:10:40,666 --> 00:10:42,083 వాళ్ళంతా పారిపోయారేమో. 111 00:10:43,083 --> 00:10:44,250 అయి ఉండవచ్చు. 112 00:10:59,375 --> 00:11:00,791 ఇది కియరన్ ఇల్లు. 113 00:11:01,458 --> 00:11:05,500 ఇంకా... హానా. అతని భార్య హానా. 114 00:11:08,958 --> 00:11:12,291 ఇది భూకంపం కాదు. ఎవరో దారి తవ్వారు. 115 00:11:12,375 --> 00:11:13,541 ఏదో. 116 00:11:14,333 --> 00:11:15,750 మనుషులు ఇలాంటిది చేయరు. 117 00:11:15,833 --> 00:11:18,208 వెళ్ళు. మీ వాళ్ళను హెచ్చరించు. 118 00:11:18,625 --> 00:11:20,166 నువ్వు మాతో రావడం లేదు. 119 00:11:20,250 --> 00:11:21,916 నేను దారిని అనుసరించి వెళ్ళాలి. 120 00:11:22,000 --> 00:11:25,833 -అక్కడ ఏం ఉందో నీకు తెలియదు. -అందుకే నేను వెళ్ళాలి. 121 00:11:55,625 --> 00:11:59,208 ఎరెజియోన్ ఎల్వెన్ స్మిత్‌ల రాజ్యం 122 00:12:05,625 --> 00:12:06,958 ఫియనోర్ సుత్తి. 123 00:12:08,833 --> 00:12:11,666 సిల్మారిల్స్‌ని మలచిన ఆయుధం. 124 00:12:13,583 --> 00:12:16,500 వాలినోర్ యొక్క కాంతిని కలిగిన ఆభరణాలు. 125 00:12:17,333 --> 00:12:18,666 విచిత్రం, కదా? 126 00:12:19,500 --> 00:12:23,333 ఒక్క వస్తువుతో ఎలా సృష్టించగలరు ఇంత అందాన్ని... 127 00:12:24,416 --> 00:12:25,666 ఇంకా ఇంత బాధను. 128 00:12:26,250 --> 00:12:29,375 నిజమైన సృష్టికి త్యాగం అవసరం. 129 00:12:31,333 --> 00:12:35,750 మోర్గోత్‌కి సిల్మారిల్స్ చాలా అందంగా అనిపించాయి, 130 00:12:37,083 --> 00:12:39,083 వాటిని వారు దొంగిలించిన కొన్ని వారాలకు, 131 00:12:39,166 --> 00:12:41,875 వాటి లోతుల్లోకి చూడడం తప్ప అతను ఏమీ చేయలేకపోయాడు. 132 00:12:43,125 --> 00:12:46,333 ఈ రత్నాలపై అతని కన్నీటి బొట్టు ఒకటి పడ్డాకనే, 133 00:12:46,416 --> 00:12:49,291 తన ప్రతిబింబంలో దుష్టశక్తిని ఎదుర్కొన్నాడు, 134 00:12:49,375 --> 00:12:51,541 తుదకు అతని కల చెదిరింది. 135 00:12:53,000 --> 00:12:55,166 ఆ క్షణం నుంచి, అతను... 136 00:12:55,250 --> 00:12:57,416 అతను ఆపై వాళ్ళ కాంతిని చూడలేదు. 137 00:13:00,500 --> 00:13:04,666 ఫియనోర్ పని స్వయంగా గ్రేట్ ఫో మనసు దాదాపుగా మార్చింది. 138 00:13:06,791 --> 00:13:08,708 నావాళ్ళు ఇంతవరకు ఏం సాధించారు? 139 00:13:09,625 --> 00:13:12,125 అది నా మనుసును మార్చింది, ప్రభూ. 140 00:13:12,208 --> 00:13:13,791 ఎన్నో ఎల్ఫ్ హృదయాలు. 141 00:13:15,000 --> 00:13:17,791 కానీ నేను దానికంటే ఎక్కువ చేయాలని అశిస్తున్నాను. 142 00:13:18,666 --> 00:13:21,250 ఓ యుగం క్రితం, మా జాతి ఈ తీరాలకు యుద్ధం తెచ్చింది. 143 00:13:21,333 --> 00:13:22,958 నాకు వాటిని అందంతో నింపాలనుంది. 144 00:13:23,041 --> 00:13:27,708 అభరణాల తయారీలో చిన్న పనులకు మించి ఎదిగి, అసలైన శక్తివంతమైనది ఏదైనా చేయాలి. 145 00:13:28,333 --> 00:13:30,250 నువ్వు చేయాలని అనుకున్నది ఏంటి? 146 00:13:30,333 --> 00:13:33,750 "ఏంటి" అనేది సుదూర దిగంతంలో క్షణకాంతి. 147 00:13:33,833 --> 00:13:39,250 నువ్వు ఎరెజియోన్ వచ్చింది నాకు "ఎలా" సాధించాలనే దానిలో సాయం చేయడానికి. 148 00:13:40,333 --> 00:13:41,500 కోట అంటావా? 149 00:13:42,250 --> 00:13:47,416 ఇప్పటివరకూ నిర్మించనంత శక్తివంతమైన కొలిమిని ఏర్పాటు చేయగలిగినది. 150 00:13:47,500 --> 00:13:50,583 ఒక డ్రాగన్ నాలుకంత వేడిగల మంటను, నక్షత్రకాంతి అంత 151 00:13:50,666 --> 00:13:52,166 స్వచ్ఛమైనది పుట్టించగలది. 152 00:13:52,250 --> 00:13:56,083 మిడిల్ ఎర్త్‌ను మార్చగలది సృష్టించడంలో సాయపడగల వస్తువులు. 153 00:13:56,166 --> 00:13:57,958 అది కష్టతరంగా ఏం కనిపిస్తుంది? 154 00:13:58,916 --> 00:14:00,916 అది వసంతంలోపు పూర్తి కావాలి. 155 00:14:02,250 --> 00:14:04,250 ప్రభూ, దానికి కావాలి... 156 00:14:04,333 --> 00:14:06,625 ఏనాడు సమీకరించనంత శ్రామికశక్తి. 157 00:14:06,708 --> 00:14:09,500 అవును. హై కింగ్ అది ఏర్పాటు చేయలేకపోయారు. 158 00:14:09,583 --> 00:14:12,000 అందుకని బదులుగా అతను నిన్ను నా దగ్గరకు పంపాడు. 159 00:14:15,625 --> 00:14:19,958 మన జాతి పరిమితుల వెలుపల భాగస్వాములను వెతకాలని అలోచించావా? 160 00:14:20,666 --> 00:14:22,166 బయట ఎంత దూరంలోని వారు? 161 00:14:22,250 --> 00:14:24,166 ఎరెజియోన్ ఎల్వెన్ స్మిత్‌ల రాజ్యం 162 00:14:26,833 --> 00:14:30,166 ఖజాద్- దుమ్ డ్వార్వ్స్ రాజ్యం 163 00:14:44,250 --> 00:14:48,500 డ్వార్వ్స్‌తో పొత్తు యుగంలోనే దౌత్యపరమైన విజయం అవుతుంది. 164 00:14:48,583 --> 00:14:51,583 వాళ్ళ యువరాజు, డ్యూరిన్, పాత, సన్నిహిత మిత్రుడు. 165 00:14:51,666 --> 00:14:53,166 నా సోదరుడు లాంటి వాడు. 166 00:14:53,250 --> 00:14:57,333 ఈమధ్య డ్వార్వ్స్ తమ కూటలములను బాగా విస్తరింప చేశారని విన్నాను. 167 00:14:57,666 --> 00:15:01,208 వాళ్ళు... ఒక రాతిని 168 00:15:01,291 --> 00:15:05,333 వృద్ధ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిపై గౌరవంతో చెక్కారు. 169 00:15:05,416 --> 00:15:08,083 వాళ్ళు పని చేస్తే చూడాలని ఎంతో కాలంగా ఉంది. 170 00:15:08,166 --> 00:15:10,083 వాళ్ళనంతగా అభిమానిస్తావని తెలియదు. 171 00:15:10,166 --> 00:15:12,791 నేను అభిమానించేది రహస్య విషయాలను గ్రహించగలిగి, 172 00:15:12,875 --> 00:15:15,541 వాటిలో స్వచ్ఛత నుండి దైవత్వాన్ని, 173 00:15:15,625 --> 00:15:17,416 అది ఉండాల్సినంత అందమైనదిగా... 174 00:15:18,583 --> 00:15:22,000 మీ స్నేహితుడు వారి కర్మాగారాలకు వెళ్ళేందుకు అనుమతి ఇస్తాడా? 175 00:15:22,083 --> 00:15:24,625 నాకు డ్యూరిన్ తెలిసుంటే, దానికి మించి చేస్తాడు. 176 00:15:25,375 --> 00:15:27,375 అతను హృదయపూర్వకంగా, 177 00:15:27,458 --> 00:15:29,291 బాజాబంజత్రీలతో, 178 00:15:29,416 --> 00:15:31,250 బల్లల నిండా ఊరేసిన పందిమాంసంతో, 179 00:15:31,333 --> 00:15:34,000 ఆండ్యుయిన్ నింపగలిగేంత మాల్ట్ బీర్‌తో ఆహ్వానిస్తాడు. 180 00:15:34,083 --> 00:15:35,291 నీకు ఏం కావాలి? 181 00:15:36,500 --> 00:15:38,208 అది లిండన్ నుండి ఎల్రోండ్‌తోపాటు, 182 00:15:38,291 --> 00:15:40,875 ఎరెజియోన్ ప్రభువు, సెలెబ్రింబోర్. 183 00:15:41,625 --> 00:15:43,583 మనకు యువరాజు డ్యూరిన్‌తో సమావేశం ఉంది. 184 00:15:44,958 --> 00:15:45,833 లేదు. 185 00:15:51,791 --> 00:15:52,958 నన్ను క్షమించాలి. 186 00:15:54,166 --> 00:15:57,041 డ్యూరిన్ ప్రభువుకు అతని మిత్రుడు, ఎల్రోండ్... 187 00:15:57,125 --> 00:15:59,708 అతని అభిప్రాయం ఇప్పటికే తెలియజేశారు, ఎల్ఫ్. 188 00:16:03,500 --> 00:16:04,791 దుప్పుల కొమ్ములా? 189 00:16:19,041 --> 00:16:20,500 సరే, అయితే, నా మిత్రమా. 190 00:16:27,583 --> 00:16:30,625 సిగిన్-ట్యారాగ్ మతవిధికోసం ఆమంత్రిస్తున్నాను. 191 00:16:30,708 --> 00:16:32,250 ఏంటీ ఈ మతవిధి... 192 00:16:39,208 --> 00:16:40,583 ఎరెజియోన్‌లో కలుస్తాను. 193 00:16:40,666 --> 00:16:44,458 -నువ్వు చేసేది ఖచ్చితంగా తెలుసుగా? -సెలెబ్రింబోర్ ప్రభు, నమ్మండి. 194 00:16:44,541 --> 00:16:47,333 నువ్వ నీ కళలో నిపుణుడివి, నా మిత్రమా. 195 00:16:47,416 --> 00:16:50,166 కొన్ని రోజులు నా నైపుణ్యం పనిచేయనీవు 196 00:17:19,750 --> 00:17:21,625 ఎల్మెండియా... 197 00:18:30,666 --> 00:18:34,458 -ఖజాద్! -దుమ్! 198 00:18:37,833 --> 00:18:39,541 నా మనసుకు నిను చూడాలని ఉబలాటం... 199 00:18:39,625 --> 00:18:44,833 ఎల్ఫ్ ఎల్రోండ్ సిగిన్-ట్యారాగ్ మతవిధికోసం ఆమంత్రించారు. 200 00:18:46,791 --> 00:18:49,583 డ్వార్ఫ్‌ల సహనానికి పరీక్ష, 201 00:18:49,666 --> 00:18:52,250 అవులే స్వయంగా తయారు చేసినది. 202 00:18:54,375 --> 00:18:57,125 ఒకసారి మనం మన సుత్తులను ఎత్తాక, 203 00:18:58,291 --> 00:19:02,333 మనలో ఒకరు ఇక పగలగొట్టలేరు అనేంత వరకు ఈ పెద్ద రాళ్ళను పగలగొడతాము. 204 00:19:05,208 --> 00:19:07,291 ఎల్ఫ్ వదిలేస్తే, 205 00:19:08,041 --> 00:19:11,291 అతను అన్ని డ్వార్ఫ్‌ల నేలల నుండి వెలివేయబడతాడు. 206 00:19:12,958 --> 00:19:14,125 శాశ్వతంగా! 207 00:19:19,500 --> 00:19:21,916 ఎల్ఫ్‌లకు అర్థమయిందా? 208 00:19:24,166 --> 00:19:25,333 ఎల్ఫ్‌లకు అర్థమయింది. 209 00:19:26,291 --> 00:19:29,541 అనుకోకుండా ఎల్ఫ్ గెలిస్తే... 210 00:19:32,625 --> 00:19:36,208 మనం ఒక వరం ప్రసాదిస్తాము. కానీ అతను ఓడిపోతే... 211 00:19:36,291 --> 00:19:39,166 బహిష్కరించబడతాడు. సరే. అర్థమయింది. 212 00:19:44,208 --> 00:19:45,458 మొదలుపెట్టండి. 213 00:19:49,541 --> 00:19:55,250 డ్యూరిన్! డ్యూరిన్! డ్యూరిన్! 214 00:20:21,208 --> 00:20:22,791 ఇదిగో మొదలుపెడతాను, ఎల్ఫ్. 215 00:21:02,833 --> 00:21:03,833 హలో? 216 00:21:06,750 --> 00:21:09,375 ఆగు! ఆగు, నేనే! 217 00:21:09,833 --> 00:21:11,208 నేనే! ఆగు! 218 00:21:13,458 --> 00:21:15,250 ఆగు! 219 00:21:15,750 --> 00:21:18,750 నిన్న రాత్రి నీకు సాయం చేశాను. నేను గుర్తున్నాను, కదా? 220 00:21:21,083 --> 00:21:22,166 గుర్తున్నానుగా? 221 00:21:32,291 --> 00:21:33,416 సరే. 222 00:21:36,500 --> 00:21:37,833 ఇదయితే ఎలా ఉంటుంది... 223 00:21:38,375 --> 00:21:39,958 నేను నీకు హాని చేయను. 224 00:21:41,291 --> 00:21:43,916 నువ్వు నాకు హాని చేయకు. సరేనా? 225 00:21:51,708 --> 00:21:53,875 సరే, అది అయితే మొదలు, అవునా? 226 00:21:53,958 --> 00:21:56,250 ఇక, మొదట సరైన విషయాలు. నాన్న ఇలా అంటారు, 227 00:21:56,333 --> 00:22:00,750 "మర్యాద లేని హార్ఫూట్ విజయపథం చతురస్రాకార చక్రంతో ప్రయాణం లాంటిది" అని. అందుకని... 228 00:22:01,833 --> 00:22:03,250 నా పేరు నోరి. 229 00:22:08,250 --> 00:22:09,458 నా పేరు నోరి. 230 00:22:10,916 --> 00:22:13,333 నేను 231 00:22:14,416 --> 00:22:15,583 కాదు, నా పేరు నోరి. 232 00:22:15,666 --> 00:22:17,416 కాదు, నా పేరు నోరి. 233 00:22:17,500 --> 00:22:20,041 నీ పేరేంటి? నీది? 234 00:22:23,458 --> 00:22:25,083 నీకు గుర్తులేదు, కదా? 235 00:22:26,875 --> 00:22:28,666 నువ్వు చాలా ఎత్తునుండి పడ్డావు. 236 00:22:28,750 --> 00:22:30,958 ఎవరికైనా గజిబిజిగానే ఉంటుందిలే. 237 00:22:31,041 --> 00:22:32,375 ఓసారి చెట్టునుండి పడ్డాను. 238 00:22:32,500 --> 00:22:35,375 వారం మొత్తం, స్ట్రాబెర్రీలను "పందిబెర్రీలు" అన్నాను. 239 00:22:35,458 --> 00:22:37,541 ఊహించగలవా? పందిబెర్రీ? 240 00:22:40,708 --> 00:22:41,833 అది ఆహారం. 241 00:22:43,500 --> 00:22:46,041 నువ్వు వచ్చిన చోట తింటారు, కదా? 242 00:22:46,125 --> 00:22:48,625 ఖచ్చితంగా తింటారు, నోరి, అది పిచ్చి ప్రశ్న. 243 00:23:23,833 --> 00:23:25,583 లేదు... అది అలా కాదు... 244 00:23:33,125 --> 00:23:35,916 లార్గో! 245 00:23:36,666 --> 00:23:38,666 అతనిని వదులు, మాల్వా. సాయం చేయవచ్చుగా? 246 00:23:38,750 --> 00:23:41,333 అతనిని సాయపడమని చెప్పి సాయం చేస్తున్నాను. 247 00:23:42,083 --> 00:23:44,625 నీ గాలి తిరుగుళ్ళు ఆపి ఒక చెయ్యి ఇటెయ్యి. 248 00:23:44,708 --> 00:23:48,166 సరే, దానికి నోరి సహాయం చేయాలని చూస్తుందనుకుంటా. 249 00:23:48,250 --> 00:23:50,916 నోరి? 250 00:23:55,625 --> 00:23:57,583 అన్నట్లు, నువ్వెక్కడి నుండి వచ్చావు? 251 00:23:57,666 --> 00:24:00,125 నీది ఏ ఊరు? మిగిలిన వారు ఏరి? 252 00:24:00,208 --> 00:24:02,041 అంటే, మీ జాతి వారు? నీలాంటి వారు? 253 00:24:04,750 --> 00:24:06,166 ఇంకా ఉన్నారా? 254 00:24:22,333 --> 00:24:25,375 ఆమె పైకి వెళుతుంది... 255 00:24:26,041 --> 00:24:27,166 రా, పెద్దోడా. 256 00:24:30,250 --> 00:24:31,916 మీ శ్రమ అంతా పెట్టండి, పిల్లలు! 257 00:24:39,541 --> 00:24:40,541 అది ఏంటి? 258 00:24:41,625 --> 00:24:42,708 మానా... 259 00:24:43,500 --> 00:24:44,916 అది ఏదైనా చిత్రపటం లాంటిదా? 260 00:24:45,250 --> 00:24:46,375 కానీయండి, పిల్లలు! 261 00:24:49,125 --> 00:24:50,500 అందులో చోటుంది. 262 00:24:51,708 --> 00:24:52,875 మానా ... 263 00:24:55,333 --> 00:24:56,166 ఉరే... 264 00:25:09,041 --> 00:25:11,916 మానా ... 265 00:25:12,000 --> 00:25:15,125 ఉరే... 266 00:25:18,541 --> 00:25:20,750 అది కొన్ని చుక్కలు కలిపినట్టుగా ఉంది. 267 00:25:21,666 --> 00:25:23,000 నాకు అర్థంకావడంలేదు. 268 00:25:23,083 --> 00:25:23,916 మానా ... 269 00:25:24,041 --> 00:25:26,333 నేను నీకు సాయం చేస్తున్నాను, కానీ నేను... 270 00:25:26,458 --> 00:25:27,916 ఉరే... 271 00:25:28,125 --> 00:25:29,541 నేనొక హార్ఫూట్‌ని మాత్రమే! 272 00:25:32,500 --> 00:25:33,541 నోరి! 273 00:25:38,041 --> 00:25:39,666 నేస్తాన్ని! 274 00:25:40,666 --> 00:25:43,333 నేస్తాన్ని. నేస్తాన్ని మాత్రమే. 275 00:25:43,916 --> 00:25:45,000 నోరి. 276 00:25:46,291 --> 00:25:47,708 ఆయన మీ తండ్రి. 277 00:25:52,208 --> 00:25:53,833 అసలైన నేరేడుపండు. 278 00:25:57,416 --> 00:25:59,291 నోరి, నేను బాగానే ఉన్నాను. 279 00:25:59,375 --> 00:26:01,958 తడి గడ్డి మీద కాలు జారాను. బెణికింది అంతే. 280 00:26:02,041 --> 00:26:04,333 కంగారుపడాల్సింది ఏం లేదు... 281 00:26:04,416 --> 00:26:05,958 -అమ్మా... -ఏం పరవాలేదు. 282 00:26:06,041 --> 00:26:07,208 నేను ఇక్కడ ఉండాల్సింది. 283 00:26:07,291 --> 00:26:08,750 ఇప్పుడు ఇక్కడున్నావు, సరేనా? 284 00:26:08,833 --> 00:26:11,833 ఇక, వెళ్ళు, నాకు కొంచెం చల్లటి నీళ్ళు, ఉప్పు తీసుకురా. 285 00:26:24,250 --> 00:26:27,250 అది ఎంత తీవ్రంగా ఉంది? అతను కదలగలడా? 286 00:26:30,250 --> 00:26:31,083 అంటే... 287 00:26:32,666 --> 00:26:33,708 నువ్వతన్ని చూశావు. 288 00:26:33,791 --> 00:26:36,166 ఆ కాలి మీద ఆకు బరువే మోయలేకపోతున్నాడు. 289 00:26:36,250 --> 00:26:39,250 -బండిని అస్సలు లాగలేడు. -నీ పని నువ్వు చూసుకో, మాల్వా. 290 00:27:39,250 --> 00:27:40,291 ఇటు వైపు! 291 00:27:46,125 --> 00:27:48,250 రా. దగ్గరకు రా. 292 00:27:48,333 --> 00:27:51,625 -నువ్వు ఏం చేస్తున్నావు? -నేను ఆమెను అసహాయంగా వదిలేయను. 293 00:27:51,708 --> 00:27:53,958 నువ్వు నీ ఆహారం ఇస్తావా? 294 00:27:54,041 --> 00:27:55,958 అనుకోనివి జరగబోతున్నాయి. 295 00:27:56,041 --> 00:27:57,041 ఇంకెవరూ ఇవ్వకపోతే. 296 00:27:57,125 --> 00:27:59,375 నువ్వు మెరుగవ్వవచ్చు లేదా కాకపోవచ్చు. 297 00:27:59,458 --> 00:28:02,666 తనను ఎక్కించుకోకపోతే, ఆమె చావుకు మనం కారణం అవుతాము. 298 00:28:02,750 --> 00:28:05,791 డొబల్ చావుపైన మాట్లాడేటప్పుడు నీకు ఇంత చింత లేదు. 299 00:28:05,875 --> 00:28:08,291 క్రూరత్వంతో మనకు విముక్తి కలగదు. 300 00:28:09,000 --> 00:28:10,083 ఆమెను ఎక్కించుకోకు. 301 00:28:10,791 --> 00:28:11,625 ఆమెని పైకి లాగు. 302 00:28:21,416 --> 00:28:22,250 వద్దు. 303 00:28:23,708 --> 00:28:25,000 మొదట సమాధానాలు. 304 00:28:29,791 --> 00:28:31,041 ఎందుకు ఇక్కడున్నావు? 305 00:28:33,041 --> 00:28:34,875 నేను నా ఓడు నుండి విడిపోయాను. 306 00:28:34,958 --> 00:28:36,166 దాడి జరిగిందా? 307 00:28:38,833 --> 00:28:40,250 అయితే నువ్వు అది చూడలేదా? 308 00:28:40,666 --> 00:28:41,916 ఏం చూడలేదు? 309 00:28:46,916 --> 00:28:48,083 ఆ పురుగు జీవిని. 310 00:28:51,166 --> 00:28:53,166 రెండు వారాల క్రితం నావలో బయలుదేరాము... 311 00:28:53,250 --> 00:28:55,708 -మనం ఆమెకు అన్నీ చెప్పాలా? -ఎందుకు కాదు? 312 00:28:55,875 --> 00:28:57,500 నీకామె ప్రమాదకరంగా కనిపిస్తుందా? 313 00:28:57,583 --> 00:28:59,000 చూపులు మోసం చేయవచ్చు. 314 00:29:03,708 --> 00:29:04,875 ఒక ఎల్ఫ్. 315 00:29:04,958 --> 00:29:06,791 నా మీద నుండి చెయ్ తియ్యి. 316 00:29:07,583 --> 00:29:08,958 అబద్దాలకోరు. 317 00:29:09,041 --> 00:29:11,458 -మనం రక్షించబడ్డాము. చూడు! -త్వరగా! 318 00:29:11,541 --> 00:29:13,250 చూడండి! ఇటు వైపు! 319 00:29:13,333 --> 00:29:14,500 మాకు సహాయం చేయండి. 320 00:29:14,583 --> 00:29:17,208 త్వరగా, నాకు దివిటీకోసం సాయం చెయ్! 321 00:29:17,291 --> 00:29:19,250 ఆగు! మనకు ఓడ తెరచాపల కనిపించేంత వరకు. 322 00:29:19,333 --> 00:29:22,458 నీటిలో సముద్ర దొంగలు పొంచి ఉన్నారు. నీ చర్మం వలచాలా? 323 00:29:27,833 --> 00:29:29,666 ఎక్కడా సముద్ర దొంగల నావ లేదు. 324 00:29:29,750 --> 00:29:32,041 అది మన నావ. 325 00:29:38,208 --> 00:29:39,208 పురుగు జీవి! 326 00:29:43,458 --> 00:29:44,583 కదలకండి. 327 00:30:04,916 --> 00:30:06,333 ఎల్ఫ్ దాన్ని మనపైకి పంపింది. 328 00:30:26,750 --> 00:30:27,583 అది వస్తుంది! 329 00:30:34,083 --> 00:30:35,083 సహాయం చేయండి! 330 00:32:01,125 --> 00:32:02,125 నీ పేరేంటి? 331 00:32:10,166 --> 00:32:11,250 గాలాడ్రియెల్. 332 00:32:13,166 --> 00:32:14,333 నా పేరు హాల్‌బ్రాండ్. 333 00:32:15,250 --> 00:32:16,458 మన ప్రణాళిక ఏంటి? 334 00:33:31,375 --> 00:33:32,583 అదీ! 335 00:33:45,416 --> 00:33:47,208 కుక్క చంద్రుడిని చూసి మొరగగలదు. 336 00:33:49,083 --> 00:33:50,875 కానీ దాన్ని కిందకు తీసుకురాలేదు. 337 00:33:52,416 --> 00:33:53,750 నువ్వు ఇక వెళ్ళవచ్చు. 338 00:33:56,000 --> 00:33:59,666 బహుశా ప్రభువు నన్ను బయటకు సాగనంపుతారా? 339 00:34:01,958 --> 00:34:03,125 సంతోషంగా. 340 00:34:15,083 --> 00:34:18,958 అసాధారణమైనది. నేను ఏనాడూ మీ నగరం ఇంత మారుతుందని కలగనలేదు. 341 00:34:20,250 --> 00:34:22,041 ఇప్పుడు, 20 ఏళ్ళలో అది జరిగింది. 342 00:34:22,125 --> 00:34:23,625 కేవలం 20 ఏళ్ళేనా అయ్యింది? 343 00:34:26,208 --> 00:34:28,458 నీ రహస్యం నాకు చెప్పాలి. 344 00:34:30,791 --> 00:34:32,375 మా రహస్యాలు మా సొంతం. 345 00:34:33,041 --> 00:34:34,125 నిన్ను బాధపెట్టానా? 346 00:34:34,208 --> 00:34:36,250 దాని సమాధానానికై మనం ఇంకా మెరుగవ్వాలి. 347 00:34:36,333 --> 00:34:39,125 వివరించకుండా నన్ను పంపేయడం, అది నీ ఎంపిక. 348 00:34:39,208 --> 00:34:41,041 నీ ఈకల చొక్కాలు పందెం కాయి. 349 00:34:41,125 --> 00:34:43,333 ఈ తరంలో ఏ మరుగుజ్జు యువరాజుకైనా ఉన్న 350 00:34:43,416 --> 00:34:45,500 అవకాశాన్ని పాడు చేసేముందు, 351 00:34:45,583 --> 00:34:47,833 కనీసం మా ప్రతిపాదన వినాలి. 352 00:34:47,916 --> 00:34:48,875 అదిగో బయటపెట్టావు. 353 00:34:48,958 --> 00:34:51,541 నీ రాకకు అసలైన కారణం. నువ్వు ఏదో ఆశించావు. 354 00:34:51,625 --> 00:34:53,750 కలవలేక పోయిన నేస్తాన్ని చూడాలని వచ్చాను. 355 00:34:53,833 --> 00:34:56,916 కలవలేదా? నువ్వు రాలేదు, నా వివాహానికి. 356 00:34:57,000 --> 00:34:59,375 నా పిల్లలు పుట్టినప్పుడు, ఇద్దరు పుట్టారు! 357 00:35:01,250 --> 00:35:05,583 నువ్వు నా కొండలోకి చొరబడి, చేతులు చాచి నీకు స్వాగతం పలకాలని కోరలేవు. 358 00:35:06,083 --> 00:35:08,916 నువ్వు విస్మరించిన దానిని కావాలని కోరుకోలేవు. 359 00:35:09,000 --> 00:35:10,291 విస్మరించానా? డ్యూరిన్... 360 00:35:10,375 --> 00:35:13,458 ఒక ఎల్ఫ్‌కి ఇరవై ఏళ్ళు రెప్పపాటు కావచ్చు. 361 00:35:14,333 --> 00:35:16,833 కానీ నేను ఆ సమయంలో నా పూర్తి జీవితం జీవించాను. 362 00:35:18,875 --> 00:35:20,375 నువ్వు కోల్పోయిన జీవితం. 363 00:35:33,208 --> 00:35:35,458 అయితే, దానికి నువ్వు ఏమంటావు... 364 00:35:37,500 --> 00:35:38,625 "నేస్తమా?" 365 00:35:44,208 --> 00:35:45,416 శుభాకాంక్షలు. 366 00:35:47,541 --> 00:35:50,333 భార్యని, పిల్లలను పొందినందుకు. 367 00:35:52,666 --> 00:35:54,666 నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను. 368 00:35:57,041 --> 00:36:01,083 నేను నీ కుటుంబానికి కూడా క్షమాపణలు తెలుపుతున్నాను. 369 00:36:06,458 --> 00:36:08,583 డీసాకు క్షమాపణలు చెబితే, సరిపోతుంది. 370 00:36:08,666 --> 00:36:10,666 మంచి పరిచయం లేకపోయినా. 371 00:36:10,750 --> 00:36:15,458 గతాన్ని గుర్తు చేసుకోకపోయినా. ఇంకా ఖచ్చితంగా భోజనానికి ఉండకపోయినా. 372 00:36:15,541 --> 00:36:17,000 అర్థమైంది. 373 00:36:17,083 --> 00:36:19,500 అవుల్ గడ్డం! వద్దు! 374 00:36:19,583 --> 00:36:21,375 అది ఎల్రోండ్ కాదు, కదా? 375 00:36:21,458 --> 00:36:24,708 అలానే అనుకుంటున్నాను, శ్వేత మహిళ. 376 00:36:31,333 --> 00:36:33,583 డ్యూరిన్ నువ్వు వస్తున్నట్టు చెప్పలేదు. 377 00:36:33,666 --> 00:36:34,958 డ్యూరిన్‌కి తెలియదు. 378 00:36:35,041 --> 00:36:38,291 త్వరగా రావడంలో అశ్రద్ధ చేశాను. 379 00:36:38,375 --> 00:36:41,666 పొరపాటే, దానికే క్షమాపణలు కోరాలని ఇక్కడికి వచ్చాను. 380 00:36:41,750 --> 00:36:44,041 -రాత్రి భోజనానికి ఉండు. -అతను వెళుతున్నాడు. 381 00:36:44,125 --> 00:36:45,708 -ఉంటాడు. -వెళ్ళిపోతాడు! 382 00:36:45,791 --> 00:36:46,708 అతను ఉంటాడు. 383 00:36:49,333 --> 00:36:53,500 హే! మీ ఇద్దరినీ నా రాతి విగ్రహాలకు దూరంగా ఉండమన్నాను! 384 00:36:53,583 --> 00:36:57,125 చిన్న రాకాసులను మంచంలో ఉండనివ్వమని నీకు చెప్పాను. 385 00:36:57,250 --> 00:36:58,291 రండి 386 00:36:58,375 --> 00:37:01,458 గెర్డా! గామ్లీ! రండి, వారిని త్వరపెట్టండి. 387 00:37:02,500 --> 00:37:04,791 దయచేసి, నువ్వు సౌకర్యంగా ఉండు. 388 00:37:05,541 --> 00:37:07,000 కానీ ఎక్కువ సౌకర్యంగా కాదు. 389 00:37:08,041 --> 00:37:09,208 గామ్లీ, దయచేసి! 390 00:37:09,291 --> 00:37:12,083 మీ ఇద్దరికీ ఉప్పు గనులుకు పంపే శిక్ష! 391 00:37:12,166 --> 00:37:15,166 కేవ్ ట్రోల్‌లు ఇంకా భారీ సాలీళ్ళు ఎక్కువ! 392 00:37:25,333 --> 00:37:27,666 మీ ఇద్దరికీ ఎలా పరిచయం అయింది? 393 00:37:28,166 --> 00:37:31,250 నేను కొత్తగా తెరిచిన గనులో అనునాదం చెందాను, 394 00:37:31,333 --> 00:37:34,625 చాలా నమ్మకంగా గణనీయమైన వెండి నిక్షేపాలను... 395 00:37:34,708 --> 00:37:37,208 "అనునాదం?" నేను అనునాదం గురించి వినలేదు. 396 00:37:37,291 --> 00:37:39,291 మనం రాతికి పాడినప్పుడు వస్తుంది. 397 00:37:39,375 --> 00:37:41,708 అంటే, పర్వతం లాంటి మనిషి. 398 00:37:41,791 --> 00:37:46,208 సుదీర్ఘమైన మరియు నిరంతరంగా మారే లెక్కలేనన్ని చిన్న భాగాల కథ. 399 00:37:46,291 --> 00:37:48,958 భూమి, ఖనిజం, గాలి మరియు నీరు. 400 00:37:49,041 --> 00:37:53,750 వాటికి సరిగా పాడితే, వాటి ప్రతి భాగం మీ పాటకు తిరిగి ప్రతిబింబిస్తాయి, 401 00:37:53,833 --> 00:37:57,166 వాటి కథ మనకు చెబుతూ, ఏం దాగుందో, 402 00:37:57,250 --> 00:37:59,708 ఎక్కడ తవ్వాలో, ఎక్కడ సొరంగం ఉందో, ఇంకా... 403 00:37:59,791 --> 00:38:02,333 ఎక్కడ పర్వతాన్ని తాకకుండా వదిలేయాలో చూపుతుంది. 404 00:38:02,416 --> 00:38:04,250 అది చక్కని సంప్రదాయం. 405 00:38:07,916 --> 00:38:12,375 మేము మా పరికరాలను తీస్తున్నాము, నా బృందం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. 406 00:38:12,458 --> 00:38:14,750 తరువాత, నాకు మా యువరాజు కనిపించాడు. 407 00:38:14,833 --> 00:38:16,666 అతను మమ్మల్ని చూడటానికి వచ్చాడు. 408 00:38:16,750 --> 00:38:18,791 అతని స్థాయికి చాలా తగ్గి, గుర్తుంచుకో. 409 00:38:19,250 --> 00:38:21,083 మొదట, అది ఆసక్తి అనుకున్నాను. 410 00:38:21,500 --> 00:38:24,916 అది, మా తరువాతి అధ్యయనానికి వచ్చినప్పటి వరకు. 411 00:38:25,000 --> 00:38:29,458 ఆ తరువాత ఒకటి. ఆ తరువాత ఒకటి. 412 00:38:29,541 --> 00:38:31,500 ప్రచ్ఛన్నంగా ఉండేందుకు ప్రతిభ ఉంది. 413 00:38:31,583 --> 00:38:34,875 నన్ను ప్రేమించే ధైర్యం చేసేందుకు తనకు రెండు వారాలు పట్టింది. 414 00:38:34,958 --> 00:38:36,833 ఎక్కువగా రెండు వారాలు. 415 00:38:36,916 --> 00:38:39,041 -అది ఐదు. -అబద్ధం చెబుతున్నావు. 416 00:38:39,125 --> 00:38:40,333 ఆమె అబద్ధం చెబుతుంది. 417 00:38:40,416 --> 00:38:42,625 ఇప్పుడు తను సమాధానాలు ఇవ్వకపోవచ్చు, 418 00:38:42,708 --> 00:38:46,583 కానీ తను మేము కలిసిన క్షణం ప్రేమలో మైమరిచిపోయింది. 419 00:38:50,500 --> 00:38:52,583 చాలా ఆనందంగా ఉన్న జంట, నిజానికి. 420 00:38:52,666 --> 00:38:54,458 వివాహానికి రావాల్సింది. 421 00:38:55,000 --> 00:38:56,166 చాలు. 422 00:38:57,625 --> 00:38:59,250 మీ మిత్రుడు ఇప్పుడు వచ్చాడు. 423 00:39:00,041 --> 00:39:02,041 మనం ఆనందం తీసుకోకుండా ఉందామా? 424 00:39:02,125 --> 00:39:03,541 అతను మనకోసం రాలేదు. 425 00:39:03,625 --> 00:39:06,125 వాళ్ళ రాజు మనది తీసుకోడానికి అతనిని పంపాడు. 426 00:39:06,208 --> 00:39:09,041 అలా కాదు, ఖజాద్-దుమ్‌కు రావడం నా ఆలోచన. 427 00:39:09,125 --> 00:39:11,250 నన్ను వినమనడం తప్ప, నేను ఏమీ అడగలేదు. 428 00:39:11,333 --> 00:39:13,166 అవును, అది అలానే మొదలవుతుంది. 429 00:39:13,250 --> 00:39:16,250 ఆ తరువాత వెంటనే, మా కళ్ళను మేమే పొడుచుకుంటాము. 430 00:39:16,333 --> 00:39:19,166 -ఎల్వ్స్‌కు ఎల్ప్స్, కదా? -మన మధ్య ఎప్పుడైనా అలా ఉందా? 431 00:39:19,250 --> 00:39:21,875 -నాకు తెలియదు! అలా ఉందా? -అవుల్స్ గడ్డం! 432 00:39:24,333 --> 00:39:26,458 ఇది సరి చేసే మార్గం కనుగొనలేవా? 433 00:39:33,875 --> 00:39:35,708 నువ్వు మొక్క నాటడం చూశాను. 434 00:39:36,625 --> 00:39:39,083 మొక్క నాటాను. పెంచాను. 435 00:39:39,625 --> 00:39:42,416 మీ మూడో బిడ్డలాగా సాకాను. 436 00:39:43,250 --> 00:39:45,250 అసలు, అది ఏ మొక్క? 437 00:39:46,041 --> 00:39:49,500 లిండెన్లో మన గొప్ప చెట్టు మొలక . 438 00:39:50,000 --> 00:39:52,875 మన ప్రజల బలం మరియు శక్తికి చిహ్నం. 439 00:39:53,208 --> 00:39:54,916 ఇంత చీకటిలోనూ అది పెరుగుతుందని 440 00:39:55,583 --> 00:39:58,583 నమ్మిన అతనిని కొందరు మూర్ఖుడు అన్నారు. 441 00:39:58,666 --> 00:40:01,000 ప్రేమ ఉన్న చోట, ఎప్పటికీ చీకటి ఉండదు. 442 00:40:02,041 --> 00:40:05,000 మీలాంటి ఇంటిలో అది పెరగకుండా ఎలా ఉంటుంది? 443 00:40:14,166 --> 00:40:15,916 అప్పుడే వెళ్ళిపోతున్నావా? 444 00:40:16,000 --> 00:40:18,500 నా ఆహ్వానానికి మించిన సమయం ఉన్నాను. 445 00:40:18,583 --> 00:40:21,208 ధన్యవాదాలు, డీసా, మీ ఆతిథ్యానికి. 446 00:40:23,125 --> 00:40:24,375 డ్యూరిన్. 447 00:40:32,000 --> 00:40:33,458 ఛ, కూర్చో. 448 00:40:34,625 --> 00:40:37,416 -వద్దు. నాకు చొరబడాలని లేదు. -కూర్చోమన్నాను. 449 00:40:37,500 --> 00:40:38,583 ఖచ్చితమేనా? 450 00:40:38,666 --> 00:40:42,416 లేదు. నాకు ఇంకా కోపంగా ఉంది. మీ రాజు ప్రతిపాదన గురించి చెప్పు, 451 00:40:42,500 --> 00:40:45,291 అది నాన్నకు ప్రస్తుతించాలో లేదా 452 00:40:45,375 --> 00:40:47,708 తుంగలో తొక్కాలో నిర్ణయించుకుంటాను. 453 00:41:12,625 --> 00:41:14,250 నువ్వు దూరంగా ఉండనవసరం లేదు. 454 00:41:17,083 --> 00:41:20,333 ఎలాంటి వాడు అంత వెంటనే తన సహచరులను 455 00:41:20,416 --> 00:41:23,708 చావుకు వదిలేస్తాడు అని ఆలోచిస్తున్నాను. 456 00:41:23,791 --> 00:41:25,875 ఎలా బ్రతకాలో తెలిసిన వాడు. 457 00:41:26,625 --> 00:41:28,583 అతిపెద్ద లక్ష్యంలో భాగం కావచ్చుగా? 458 00:41:28,666 --> 00:41:30,166 నువ్వు ఇంకా లక్ష్యమే. 459 00:41:31,500 --> 00:41:34,500 మనం నేలమీదకు చేరేవరకూ సురక్షితంగా ఉంటామంటే నమ్మకం లేదు. 460 00:41:34,583 --> 00:41:37,000 సురక్షితంగా ఉండడం అంత సులభంగా లేదు. 461 00:41:37,416 --> 00:41:39,291 కనీసం నీకు అయితే కాదు. 462 00:41:40,458 --> 00:41:42,375 మీ నావ నుండి "విడిపోవడం." 463 00:41:43,791 --> 00:41:44,833 నిజంగానా? 464 00:41:46,166 --> 00:41:48,708 -నిన్ను వదిలేశారు. -అలా కనిపిస్తున్నానా? 465 00:41:48,791 --> 00:41:52,791 నీకు అనుకోకుండా ఏదో జరిగి ఉండవచ్చు అన్నట్టు లేవు. 466 00:41:53,208 --> 00:41:55,083 అంటే నువ్వు పారిపోతున్నావు. 467 00:41:55,166 --> 00:41:58,458 దేనికోసమైనా లేదా దేని నుండైనా అయిఉండాలి. అది నాకు తెలియదు. 468 00:41:58,541 --> 00:42:00,875 బాధ్యత నన్ను మిడిల్ ఎర్త్‌కు రమ్మనింది. 469 00:42:02,083 --> 00:42:04,375 నువ్వు తెలుసుకోవాల్సింది అంతే. 470 00:42:04,458 --> 00:42:08,250 -ముఖ్యమైన ఎల్ఫ్ వ్యవహారం, సందేహమే లేదు. -ఎల్ఫ్స్ నీకు ఏం చేశారు? 471 00:42:08,333 --> 00:42:10,583 మేము ఇక్కడ ప్రామాణికంగా ఉండడం తప్పంటావా? 472 00:42:10,666 --> 00:42:13,875 నా జన్మభూమి నుండి నన్ను వెంబడించినది ఎల్వ్స్ కాదు. 473 00:42:15,375 --> 00:42:16,541 వాళ్ళు ఓర్క్స్. 474 00:42:25,458 --> 00:42:28,500 మీ ఇల్లా. అది ఎక్కడ ఉండి? 475 00:42:30,208 --> 00:42:31,708 తెలుసుకుని ఏం చేస్తావు? 476 00:42:32,791 --> 00:42:33,833 అది బూడిదయిపోయింది. 477 00:42:37,208 --> 00:42:39,541 నువ్వు అనుభవిస్తున్న బాధ కొంత నాకూ తెలుసు. 478 00:42:41,208 --> 00:42:42,291 నీ పట్ల బాధగా ఉంది. 479 00:42:47,125 --> 00:42:48,541 నువ్వు కోల్పోయిన వారిపట్ల. 480 00:42:55,125 --> 00:42:56,500 నీ గొంతు చుట్టూ. 481 00:42:58,250 --> 00:43:00,250 ఆ మచ్చ మీ ప్రజల రాజుదా? 482 00:43:00,333 --> 00:43:01,500 మా ప్రజలకు రాజు లేడు. 483 00:43:01,625 --> 00:43:05,000 --ఒకవేళ ఉన్నా, ఆ రాజ్యం ఎక్కడ ఉంటుంది? -ఏ అంచులో ఉంది? 484 00:43:05,083 --> 00:43:08,083 మేము అది తిరిగి పొందగలమేమో అంటే? 485 00:43:08,458 --> 00:43:10,083 మీకు సరిపడ సైన్యం లేదు. 486 00:43:10,166 --> 00:43:11,750 నా ప్రశ్నను ఏమారుస్తున్నావా? 487 00:43:11,833 --> 00:43:13,208 సముద్రంలో చిక్కావెందుకు? 488 00:43:13,291 --> 00:43:15,666 వైభవంతో బతుకే బదులు, బాధకు బాధ్యులైన 489 00:43:15,750 --> 00:43:18,125 మీ శత్రువును వెతకడం మేలు. 490 00:43:18,208 --> 00:43:21,583 చూడు, ఎల్ఫ్. నువ్వు నాకు బాధ కలిగించలేదు, అది సరి చేయలేవు. 491 00:43:21,666 --> 00:43:25,083 నీ సంకల్పం లేదా నీ అత్మ గౌరవం ఎంత బలమైనది అయినా. 492 00:43:26,791 --> 00:43:28,166 ఏమీ చేయకు. 493 00:43:28,625 --> 00:43:32,833 ఈ శత్రువును రక్తవర్ణ ఆకాశంలో మొదటి సూర్యోదయానికి ముందునుండి వెంటాడుతున్నాను. 494 00:43:33,416 --> 00:43:36,083 నేను అంతమొందించిన వారి పేర్లు చెప్పాలంటే 495 00:43:36,166 --> 00:43:39,500 దానికి నీ జీవితకాలం సరిపోదు. 496 00:43:40,166 --> 00:43:43,416 అది అలా వదిలేసే ఎంపిక లేదు. 497 00:43:46,125 --> 00:43:49,791 చివరకు, కొంచెం నిజాయితీ. 498 00:43:49,875 --> 00:43:53,125 ఓర్క్స్‌ను చంపాలనుకుంటే, నీ పగ చల్లార్చుకో, అదే చేయాలి. 499 00:43:53,208 --> 00:43:54,875 దాన్ని వీరోచితంగా పేర్కొనకు. 500 00:43:54,958 --> 00:43:57,291 శత్రువు ఎక్కడ ఉన్నాడో చెబుతావా, లేదా? 501 00:43:57,375 --> 00:43:58,541 సౌత్‌ల్యాండ్స్. 502 00:44:02,041 --> 00:44:04,208 శత్రువులు ఎంతమందో, వారు ఎవరి ఆదేశాలతో 503 00:44:04,291 --> 00:44:06,000 నడుస్తున్నారో నాకు తెలియాలి, 504 00:44:06,083 --> 00:44:09,875 ఇంకా వారి చివరి స్థావరం చోటుకు నువ్వు నన్ను తీసుకెళతావు. 505 00:44:10,916 --> 00:44:12,541 నా ప్రణాళికలు నావి, ఎల్ఫ్. 506 00:44:22,375 --> 00:44:23,458 నువ్వు సిద్ధం అవ్వు. 507 00:44:45,500 --> 00:44:47,791 -చూసుకో! -శాంతించు, ప్రియ. 508 00:44:51,583 --> 00:44:53,375 "ఎవరూ లేరు" అంటే ఏంటి? 509 00:44:53,458 --> 00:44:55,375 అంటే ఊరు మొత్తం ఖాళీగా ఉంది. 510 00:44:55,458 --> 00:44:59,000 అది ఎలా ఉందంటే నేల హోర్డన్ ప్రజలను ఈగల్లా మింగేసినట్టు ఉంది. 511 00:44:59,083 --> 00:45:01,458 ఇక్కడి నేల ఆగ్రహంతో ఉంది. ఎప్పుడూ అలానే ఉంది. 512 00:45:01,541 --> 00:45:04,833 క్రూక్‌ఫింగర్ సరస్సు ఎప్పుడూ ఆవిర్లు కక్కుతుంది. 513 00:45:04,916 --> 00:45:06,000 ఒక సొరంగం చూశాను. 514 00:45:06,083 --> 00:45:07,541 లోతుగా, జాగ్రత్తగా తవ్వారు. 515 00:45:07,625 --> 00:45:10,791 దేనితోనో చెప్పలేను, కానీ అది మనవైపుకు తవ్వుతున్నారు. 516 00:45:10,875 --> 00:45:13,250 చెబుతున్నాను, మనం ఇక్కడ ప్రమాదకరంగా ఉంటాము. 517 00:45:13,333 --> 00:45:14,750 మనం సమాచారం చేరవేయాలి. 518 00:45:14,833 --> 00:45:17,500 వద్దు! నేను ఈ గాలిమాటను నమ్మను, బ్రోన్విన్. 519 00:45:17,583 --> 00:45:20,958 ఒక ఎముక లేని నాలుక కంటే, భూపాతం తక్కువ ప్రమాదకరం, 520 00:45:21,041 --> 00:45:24,625 అలానే ఆధారం లేని విషయం కూడా అంతే. 521 00:45:24,708 --> 00:45:27,125 వాల్డ్‌రెగ్, మనం ఒంటరిగా ఉన్నాము. 522 00:45:27,208 --> 00:45:29,750 ఆస్ట్రిత్ ఖాళీగా ఉంది. కావలికోటలో ఎవరూ లేరు. 523 00:45:29,833 --> 00:45:31,791 నాకు తెలుసు, ఏదో అగాధాన్ని చూసి 524 00:45:31,875 --> 00:45:33,708 ఎల్వ్స్‌ను పిలవను. 525 00:45:33,791 --> 00:45:37,791 వాళ్ళు వెళ్ళిపోవడం ఊరటగా ఉంది. అంటే, ఏదేమైనా, మనలో చాలామందికి. 526 00:46:00,791 --> 00:46:02,041 చెత్త ఎలుకలు. 527 00:46:06,708 --> 00:46:09,833 చెత్త, దరిద్రపు ఎలుకలు! 528 00:49:16,208 --> 00:49:17,291 థియో? 529 00:49:19,875 --> 00:49:21,083 థియో? 530 00:49:35,541 --> 00:49:37,541 థియో, ఏం జరిగింది? ఏమయింది? 531 00:49:37,625 --> 00:49:39,250 సహాయం అడుగు. వెళ్ళు. 532 00:51:29,541 --> 00:51:31,416 పరిగెత్తు! థియో, పరిగెత్తు! 533 00:51:35,583 --> 00:51:36,666 హేయ్! 534 00:51:44,416 --> 00:51:45,333 ఆగు! 535 00:52:26,958 --> 00:52:29,625 ఇక్కడ మీలో ఎవరైనా ప్రాణాలతో ఉండాలనుకుంటే, 536 00:52:29,708 --> 00:52:32,208 మనం ఎల్వెన్ కోటకు తెల్లవారు జామునే వెళ్ళాలి. 537 00:52:50,166 --> 00:52:53,375 మనం పడవను కట్టాలి! అది విడిపోతుంది! 538 00:52:53,458 --> 00:52:54,708 గాలి చాలా ఉధృతంగా ఉంది. 539 00:52:54,791 --> 00:52:56,125 తాళ్ళను పట్టుకో! 540 00:53:19,708 --> 00:53:22,416 రా! నీ చేయి అందించు! 541 00:53:24,958 --> 00:53:26,625 నన్ను గట్టిగా పట్టుకో! 542 00:53:26,708 --> 00:53:28,750 రా! నీ చేయి అందించు! 543 00:55:27,041 --> 00:55:29,958 హలో? నేనే. నేను నోరిని. 544 00:55:40,500 --> 00:55:45,041 చూడు, మా తరువాతి ప్రవాసం కొన్ని రోజుల్లోనే ఉంది, ఇంతలోనే అంతా పోయింది... 545 00:55:45,833 --> 00:55:47,500 అంతా చేయిజారిపోయింది. 546 00:55:50,541 --> 00:55:52,125 నీకు సాయం చేయాలనుకున్నాను. 547 00:55:53,875 --> 00:55:55,875 చేయగలనని అనుకున్నాను, కానీ క్షమించు. 548 00:56:08,958 --> 00:56:11,958 అది లాంతరు. మేము మిణుగురు పురుగులను ఉపయోగిస్తాము. 549 00:56:59,666 --> 00:57:01,333 అతను వాళ్ళకు ఏం చెబుతున్నాడు? 550 00:57:03,625 --> 00:57:05,333 నాకు మిణుగురుపురుగుల భాష రాదు. 551 00:57:35,458 --> 00:57:37,125 అవి నక్షత్రాలు. 552 00:57:38,166 --> 00:57:41,125 ఒక నక్షత్రరాశి లాంటిది. 553 00:57:42,041 --> 00:57:45,583 సరేనా? అవి నక్షత్రాలా? అంటే ఏంటి? 554 00:57:45,666 --> 00:57:47,083 అతనికి ఇలానే సాయం చేస్తాం. 555 00:57:47,166 --> 00:57:50,041 అతను ఆ నక్షత్రాలను కనుగొనడంలోనే మన సాయం కావాలి. 556 00:57:51,875 --> 00:57:53,291 అంతే, కదా? 557 00:57:54,208 --> 00:57:55,416 కదా? 558 00:58:05,791 --> 00:58:07,583 నేను ఇదివరకు ఆ నక్షత్రాలు చూడలేదు. 559 00:58:09,333 --> 00:58:12,333 కానీ వాటిని ఎక్కడ కనుగొనాలో బాగా తెలుసు. 560 00:58:25,458 --> 00:58:26,625 నోరి? 561 00:58:41,958 --> 00:58:44,875 నాకు అది ఖచ్చితంగా తెలుసు. అతనికి తెలియదు. 562 00:58:49,666 --> 00:58:50,833 అయి ఉండవచ్చు. 563 00:58:52,666 --> 00:58:53,833 కాకపోయిఉండచ్చు. 564 00:58:57,416 --> 00:58:59,625 ఎల్వ్స్ విషయంలో 565 00:58:59,708 --> 00:59:01,708 నీ భావోద్వేగాలు బలహీనమైనవి. 566 00:59:01,791 --> 00:59:04,125 చెప్పు, నీ గుమ్మం ముందు ఒక ఎల్ఫ్ 567 00:59:04,208 --> 00:59:07,375 అడుగుపెట్టడం యాదృచ్ఛికమా? ఇప్పుడు? 568 00:59:07,458 --> 00:59:10,375 నాకు ఎల్రోండ్ అర్ద శతాబ్దంగా తెలుసు, నాన్నా. 569 00:59:10,458 --> 00:59:12,750 అతను ఏదైనా దాస్తుంటే నాకు తెలుస్తుంది. 570 00:59:12,875 --> 00:59:16,500 బహుశా ఏదో దాస్తున్నది నువ్వే అని అతను పసిగట్టాడేమో. 571 00:59:16,583 --> 00:59:18,875 వాళ్ళ గురించి ఎక్కువగా ఊహిస్తావు. 572 00:59:18,958 --> 00:59:22,166 ఇక్కడ అనుకూల పరిస్థితి ఉన్నది మనకే. 573 00:59:22,250 --> 00:59:24,541 అవును. ప్రస్తుతానికి. 574 00:59:28,791 --> 00:59:30,750 ఎల్రోండ్ మిత్రుడు. అతనిపై నమ్మకం ఉంది. 575 00:59:30,833 --> 00:59:33,500 సుత్తికి, రాతికి మధ్య నమ్మకం ఉండదు. 576 00:59:34,166 --> 00:59:38,041 ఎందుకంటే చివరకు ఖచ్చితంగా ఒకదానిని ఒకటి పగలగొడతాయి. 577 01:00:54,125 --> 01:00:55,083 థియో! 578 01:00:59,500 --> 01:01:00,500 నువ్వు సిద్ధమేనా? 579 01:01:00,916 --> 01:01:03,250 అవునమ్మా. నేను సిద్ధమే. 580 01:04:01,750 --> 01:04:03,750 ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత 581 01:04:03,833 --> 01:04:05,833 క్రియేటివ్ సూపర్‌వైజర్ భుషన్ కళ్యాన్