1 00:00:07,382 --> 00:00:11,386 నాసా వారు అపోలో 11 సమయంలో చంద్రుడి పై 2 00:00:11,470 --> 00:00:13,680 పెట్టాలనుకున్న ఫలకం ఒకటి ఉంది. 3 00:00:13,764 --> 00:00:16,099 శనిగ్రహ చందమామ మీద జీవం కొరకు అన్వేషణ మొదలవుతుంది 4 00:00:16,183 --> 00:00:19,186 మా నాన్న చనిపోయే వరకు దాన్ని ఆయన దగ్గరే పెట్టుకున్నారు. 5 00:00:20,854 --> 00:00:26,026 దాని మీద, "మేము మానవ జాతి కోసం శాంతితో వస్తున్నాం" అని వ్రాసి ఉంటుంది. 6 00:00:27,945 --> 00:00:33,200 ఇప్పుడు మరొక చంద్రుడిపై అడుగు పెట్టిన క్షణంలో ఆ మాటల్ని ఇక్కడికి నాతో తీసుకొచ్చాను. 7 00:00:34,493 --> 00:00:37,538 మా నాన్న లాంటి వారి కారణంగా మేము చేరుకున్న ఈ ప్రదేశానికి. 8 00:00:38,622 --> 00:00:42,292 మా షిప్ ని మళ్ళీ నిర్మించి, వాడుకోదగ్గ విధంగా చేసిన మార్స్ పై ఉన్న 9 00:00:42,376 --> 00:00:45,420 ఎందరో మేధావులైన ఇంజనీర్లు ఇంకా శాస్త్రవేత్తల కారణంగా. 10 00:00:46,588 --> 00:00:50,008 అలాగే కాస్మోస్-1 షిప్ పై ప్రాణాలు కోల్పోయిన శాస్త్రవేత్తల లాంటి వారి కారణంగా. 11 00:00:50,509 --> 00:00:52,553 నేడు మేము విశ్వంలో 12 00:00:53,762 --> 00:00:57,891 జీవం ఆచూకీ కనుగొనేందుకు వారి జ్ఞాపకాలతో ఇక్కడ అడుగులేస్తున్నాం. 13 00:00:58,767 --> 00:01:02,521 ఆమె టైటన్ ఉపరితలం నుండి మాట్లాడుతున్న వ్యోమగామి కెల్లీ బాల్విన్. 14 00:01:08,193 --> 00:01:09,403 అద్భుతం, బాబు. 15 00:01:09,486 --> 00:01:10,779 థాంక్స్. 16 00:01:10,863 --> 00:01:11,947 నిజంగా అదిరిపోయింది, మిత్రమా. 17 00:01:12,030 --> 00:01:13,323 నువ్వు ఇది నమ్మగలవా? 18 00:01:13,407 --> 00:01:16,034 చూస్తుంటే అందరిలో కొంచెం ఉత్సాహం వచ్చినట్టు ఉంది. 19 00:01:16,118 --> 00:01:18,704 అలాగే వెనక్కి పంపేయమని అడుగుతున్న రిక్వెస్ట్ లు కూడా సగానికి పైగా తగ్గాయి. 20 00:01:18,787 --> 00:01:20,038 మనకు ప్రాణం లేచి వచ్చింది. 21 00:01:20,122 --> 00:01:21,248 అంతా నీ వల్లే, సోదరా. 22 00:01:21,331 --> 00:01:24,668 - లేదు, ఇది నా పని కాదు. ఇది అందరి కష్టం. - కాదు, కాదు, కాదు. ఇది నీ పనే, మైల్స్. 23 00:01:24,751 --> 00:01:27,713 ఇంతకు ముందు 2003లో లాగే, నువ్వు ఎప్పుడూ మాకు అండగా నిలబడుతున్నావు. 24 00:01:31,508 --> 00:01:32,968 నిన్ను ఎక్కడికైనా ఫాలో అవుతాను. 25 00:01:33,051 --> 00:01:34,052 మేము అందరం నీ వెంటే ఉంటాం. 26 00:01:34,136 --> 00:01:35,470 థాంక్స్, సోదరా. 27 00:01:35,554 --> 00:01:37,014 నిన్ను తర్వాత కలుస్తా. 28 00:01:37,639 --> 00:01:38,849 మిలోష్. 29 00:01:40,225 --> 00:01:41,643 ఇలియా, ఏంటి సంగతి? 30 00:01:42,269 --> 00:01:43,937 నీతో ఒకరు మాట్లాడాలి అనుకుంటున్నారు. 31 00:01:44,438 --> 00:01:47,649 నీకు వాళ్లతో మాట్లాడాలని ఉండదు, కానీ నువ్వు వినాలి. 32 00:01:47,733 --> 00:01:49,902 మా అందరి కోసం, మిలోష్. 33 00:01:49,985 --> 00:01:52,362 వాళ్ళు చెప్పేది నువ్వు ఖచ్చితంగా వినాలి. 34 00:01:53,363 --> 00:01:55,824 దయచేసి ఆ పని చేస్తావా, ప్లీజ్? 35 00:01:57,075 --> 00:01:58,994 సరే. ఎవరు మాట్లాడాలి అనుకుంటున్నారు? 36 00:02:01,121 --> 00:02:05,125 ప్రెసిడెంట్ కొర్షేంకో పదవి దిగిన తర్వాత, ఎం-6 కూటమి విడిపోతుంది. 37 00:02:06,210 --> 00:02:10,672 అప్పుడు స్వతంత్ర మార్స్ తో సోవియెట్ ప్రభుత్వం మరింత సానుకూలమైన 38 00:02:10,756 --> 00:02:15,636 డీల్ కుదుర్చుకోగలదు, కానీ అది జరగాలంటే మీరు ఇంకొన్ని వారాలు నిలబడాలి. 39 00:02:17,095 --> 00:02:18,847 ఈ విషయం మీకెలా తెలిసింది? 40 00:02:18,931 --> 00:02:21,225 జైలులో మన దగ్గర ఉండే కరెన్సీ సమాచారం మాత్రమే. 41 00:02:21,934 --> 00:02:25,354 ఆ విధంగా చూస్తే, ఇప్పుడు నేను చాలా ధనవంతురాలిని. 42 00:02:26,897 --> 00:02:29,274 కొర్షేంకోని గద్దె దించడానికి ముందే నువ్వు గనుక లొంగిపోయావు అంటే 43 00:02:29,358 --> 00:02:34,321 అతని పొజిషన్ మళ్ళీ బలపడుతుంది, అప్పుడు మీరు పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది. 44 00:02:35,989 --> 00:02:36,990 మేము లొంగిపోవడం లేదు. 45 00:02:38,325 --> 00:02:39,993 నా ముందు అమాయకత్వం ప్రదర్శించకు. 46 00:02:40,619 --> 00:02:43,997 నువ్వు టైటన్ ల్యాండింగ్ ని చూపించడం మంచి విషయమే, ఒప్పుకుంటాను, 47 00:02:44,081 --> 00:02:46,500 కానీ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని మనం మార్చలేం. 48 00:02:49,378 --> 00:02:53,924 ఆహారం లేకపోవడం వల్ల నువ్వు భూమి నుండి షిప్ పంపించి రక్షించమని అడగాల్సిందే, 49 00:02:54,007 --> 00:02:59,054 కానీ నువ్వు లొంగిపోతే మాత్రమే వాళ్ళు ఏమైనా పంపుతారు. పూర్తిగా లొంగిపోతేనే. 50 00:02:59,137 --> 00:03:01,056 ఎలాంటి షరతులు లేకుండా. 51 00:03:01,139 --> 00:03:03,475 దానర్థం నువ్వు జైలుకు వెళ్తావు. మీరంతా. 52 00:03:03,559 --> 00:03:04,935 అలాగే మేము కూడా. 53 00:03:06,353 --> 00:03:08,313 అంటే, అదెలా? మీరు వాళ్ళ వైపు ఉన్నోళ్లు కదా. 54 00:03:08,397 --> 00:03:11,358 చూడు, మమ్మల్ని నువ్వు అనుమానించడంలో తప్పు లేదు. 55 00:03:11,441 --> 00:03:12,442 ముఖ్యంగా నన్ను. 56 00:03:13,068 --> 00:03:14,570 అసలు ఇదంతా నీ వల్లే కదా మొదలైంది. 57 00:03:14,653 --> 00:03:17,739 మమ్మల్ని ఇన్నాళ్ళుగా ఆడించినట్టు నువ్వు ఇప్పుడు కూడా నన్ను ఆడించడం లేదని గ్యారెంటీ ఏంటి? 58 00:03:17,823 --> 00:03:19,199 అదే నిజమైతే బాగుండని నాక్కూడా ఉంది. 59 00:03:27,124 --> 00:03:29,543 నా కుటుంబం, మిస్టర్ డేల్… 60 00:03:30,377 --> 00:03:33,172 నా భార్య, నా కొడుకు… 61 00:03:34,715 --> 00:03:37,467 యుఎస్ఎస్ఆర్ లో ప్రస్తుతం వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. 62 00:03:39,595 --> 00:03:44,183 నా భార్యతో బలవంతంగా అందరి ముందు నన్ను ఖండించేలా చేయించారు. 63 00:03:45,601 --> 00:03:48,979 నా కొడుకు విషయానికి వస్తే, వాడితో నేను మాట్లాడి నెల అవుతోంది. 64 00:03:51,732 --> 00:03:56,236 కాబట్టి నిజమే, నేను మీ ఆదర్శాల కోసం ఇలా చేస్తుండకపోవచ్చు, 65 00:03:57,112 --> 00:03:59,907 కానీ నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను నాకు వీలైంది అంతా చేయాలి. 66 00:03:59,990 --> 00:04:02,451 దానర్థం నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడటమైనా సరే. 67 00:04:11,001 --> 00:04:12,544 మీరు నాకు ఏదో చెప్పడం లేదు కదా? 68 00:04:16,464 --> 00:04:21,220 మీరు యుఎస్ ఇంకా సోవియెట్లను నిషేధించడం కారణంగా ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూలిపోతున్నాయి. 69 00:04:21,303 --> 00:04:25,182 బ్రాగ్, కొర్షేంకో, వాళ్ళు తమ పదవులు కాపాడుకోవడానికి 70 00:04:25,265 --> 00:04:28,352 తమ పౌరులకు వాళ్ళు చేతకానోళ్లు కాదని నిరూపించుకోవాలి. 71 00:04:28,435 --> 00:04:31,730 ఎం-6కి చెందిన అనేక దేశాల మిలటరీతో కూడిన సైన్యం 72 00:04:31,813 --> 00:04:34,816 ఇప్పుడు మార్స్ కి వస్తోందని మాకు తెలిసింది. 73 00:04:36,193 --> 00:04:39,696 కుజ్నెట్సోవ్ స్టేషన్ ని మళ్ళీ సొంతం చేసుకుని 74 00:04:39,780 --> 00:04:42,199 బలవంతంగా గోల్డిలాక్స్ ని చేజిక్కించుకోవడం వాళ్ళ లక్ష్యం. 75 00:04:43,575 --> 00:04:45,619 గాడిదగుడ్డు. అదే నిజమైతే ఈపాటికి వారిని కనిపెట్టేవాళ్ళం. 76 00:04:47,162 --> 00:04:48,580 నేను చాలా ఏళ్ల క్రితం ఒక విషయం తెలుసుకున్నాను, 77 00:04:48,664 --> 00:04:51,542 కొన్ని విషయాలను పరిస్థితి చెయ్ దాటేవరకు మనం చూడలేం. 78 00:04:57,214 --> 00:04:59,758 మనం చేయాల్సిన విషయంలో జరిగిన మార్పులు నోట్ చేసుకోండి. 79 00:05:00,384 --> 00:05:05,347 గ్రహశకలం 2003 ఎల్.సిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 80 00:05:06,181 --> 00:05:08,433 మెయిన్ సబ్ స్టేషన్ ని ఆక్రమించుకోవడం కీలకం. 81 00:05:09,601 --> 00:05:13,730 విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దారిలో వెళితే మనం అనుకున్నది సాధించడానికి అవకాశం ఎక్కువ. 82 00:05:14,606 --> 00:05:18,402 మూడు అలాగే నాలుగవ టీమ్స్ సబ్ స్టేషన్ గుండా దాడి చేస్తూ ముందుకు వెళ్లి 83 00:05:19,027 --> 00:05:22,281 ప్రాణాంతకం కాని విధానంలో మనకు వ్యతిరేకత లేకుండా చేయాలి. 84 00:05:22,364 --> 00:05:25,784 మళ్ళీ చెప్తున్నాను, ఫ్లాష్ బ్యాంగ్స్ ఇంకా రబ్బర్ బుల్లెట్స్ మాత్రమే వాడాలి. 85 00:05:25,868 --> 00:05:27,786 అక్కడ గోడలకు ఎట్టి పరిస్థితుల్లో కన్నం పడకూడదు. 86 00:05:27,870 --> 00:05:30,205 - అర్థమైందా? - అర్థమైంది, సర్. 87 00:05:30,289 --> 00:05:31,456 ఇక వెళ్ళండి. 88 00:06:21,924 --> 00:06:24,676 ధైర్యవంతమైన కొత్త ప్రపంచం 89 00:07:33,328 --> 00:07:36,748 మీరందరూ ఇక్కడ నిలబడి ఒక ప్రమాణం చేస్తున్నారు. 90 00:07:37,499 --> 00:07:41,295 ఈ బేస్ లోని ప్రజల్ని మీరు రక్షిస్తారని, కాపాడతారని చేస్తున్నారు. 91 00:07:42,045 --> 00:07:47,801 హ్యాపీ వ్యాలీ కార్ప్స్ ఆఫీసర్లుగా మీకు ఇక్కడ అధికారం ఉన్నా సరే 92 00:07:47,885 --> 00:07:52,139 మీరు దాన్ని దుర్వినియోగం చేయకూడదు అనేది చాలా ముఖ్యం. 93 00:07:52,222 --> 00:07:56,059 ఆ ప్రమాణానికి వ్యతిరేకంగా మీరు ఏం పని చేసినా 94 00:07:56,143 --> 00:07:59,813 వెంటనే మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది. 95 00:08:00,355 --> 00:08:01,356 అర్థమైందా? 96 00:08:01,440 --> 00:08:02,941 అయింది, మేడం. 97 00:08:05,402 --> 00:08:09,281 ఇక్కడ ఒక కొత్త విధానాన్ని స్థాపించడానికి మనకు ఇదొక అవకాశం. 98 00:08:09,990 --> 00:08:11,074 మరొక బాటలో అడుగులు వేయడానికి. 99 00:08:12,367 --> 00:08:14,995 కాబట్టి మనం చేసే పనులన్నీ కొత్తగానే ఉంటాయి. 100 00:08:15,662 --> 00:08:17,706 మనం మంచితనంతో అందరినీ నడిపించాలి. 101 00:08:18,290 --> 00:08:20,584 అవసరంలో ఉన్నవారు ఎవరికి విధేయత చూపించినా, 102 00:08:21,251 --> 00:08:25,130 వారిది ఏ దేశమైనా మనం వారికి సాయం చేయాలి… 103 00:08:25,214 --> 00:08:27,216 వారి లీగల్ స్టేటస్ ఏమైనా సరే. 104 00:08:27,716 --> 00:08:30,928 మన లక్ష్యంతో చెయ్ కలపడానికి ముందుకు వచ్చేవారిని ఎవరినైనా మనం స్వాగతించాలి. 105 00:08:33,138 --> 00:08:37,768 తెలుసా, ఒక ఏడాది క్రితం, మార్సి అనే పదానికి అర్థం ఏంటో కూడా నాకు తెలీదు. 106 00:08:39,520 --> 00:08:44,525 కానీ ఇప్పుడు మీ అందరినీ చూసినప్పుడు, నన్ను నేను అలా పిలుచుకోవడానికి గర్వపడుతున్నాను. 107 00:08:47,444 --> 00:08:49,655 సరే. మీకు అత్యుత్సాహం పెరగడానికి ముందు, 108 00:08:49,738 --> 00:08:52,115 మనం శారీరక పరీక్ష మొదలెట్టి 109 00:08:52,199 --> 00:08:54,493 ఆ తర్వాత ఆయుధాల ట్రైనింగ్ కి వెళదాం. 110 00:08:56,119 --> 00:08:57,246 చెప్పు, బాల్విన్. 111 00:08:59,581 --> 00:09:01,500 నేను మెడికల్ విభాగంలో చేరడానికి వచ్చాను. 112 00:09:01,583 --> 00:09:04,294 అయినా సరే నేను ఆయుధాలు ఇంకా ట్రైనింగ్ లాంటివి చేయాలా? 113 00:09:04,378 --> 00:09:06,797 అవును, హెచ్.వీ.సీలో ఉండే ప్రతీ వారికి 114 00:09:06,880 --> 00:09:11,009 ఆయుధాలు "లాంటి" వాటి గురించి కనీసం తెలిసి ఉండాలి. 115 00:09:13,470 --> 00:09:14,513 ఇక వెళ్ళండి. 116 00:09:15,347 --> 00:09:17,975 నేను మైనర్స్ కళ్ళలో చూసాను. 117 00:09:19,226 --> 00:09:23,105 పైన ఎడతెరిపి లేకుండా తిరుగుతున్న గ్రహశకలం నుండి తిరిగి వచ్చేవారి కళ్ళలో చూసాను. 118 00:09:23,605 --> 00:09:28,485 ప్రమాదకరమైన ఆకాశం క్రింద బయటకు వెళ్లలేక ఇరుక్కుపోయిన నా తోటి యువత కళ్ళలో చూసాను. 119 00:09:28,986 --> 00:09:33,115 భూమి, నీ బిడ్డల వేదన నీకు వినిపించడం లేదా? 120 00:09:34,950 --> 00:09:40,122 ఆస్టరాయిడ్, మోన్ అమోర్ 121 00:09:40,205 --> 00:09:44,168 ఒక థీసిస్ ఫిల్మ్ గుల్సొర అఖిల్మాటోవ నుండి 122 00:09:58,932 --> 00:10:00,017 హేయ్. 123 00:10:01,101 --> 00:10:02,561 నువ్వు… నువ్వు బానే ఉన్నావా? 124 00:10:05,647 --> 00:10:09,067 తను… తన ఫిల్మ్ ని పూర్తి చేయలేకపోయింది. 125 00:10:09,651 --> 00:10:11,320 ఇప్పుడిప్పుడే మొదలెడుతోంది. 126 00:10:15,157 --> 00:10:17,284 నా వల్ల కాకపోయి ఉంటే తను ఇంకా ఇక్కడే… 127 00:10:19,036 --> 00:10:22,039 నీ చెత్త పుట్టినరోజు కోసం తనని ఆ పిచ్చి పని చేయమని అడగకపోయి ఉంటే ఇంకా ప్రాణాలతోనే ఉండేది. 128 00:10:22,748 --> 00:10:24,708 హేయ్, లిల్. అది… 129 00:10:25,667 --> 00:10:28,086 హేయ్, అది నీ పొరపాటు కాదు, సరేనా? 130 00:10:29,213 --> 00:10:32,716 అది నిజం అని నీకు కూడా తెలుసు. నా గురించి కాకపోయి ఉంటే తను ఇంకా ప్రాణాలతోనే ఉండేది. 131 00:10:32,799 --> 00:10:35,594 దేవుడా. ఇలా రా, ఇలా రా. 132 00:10:41,642 --> 00:10:42,643 నాకు చాలా బాధగా ఉంది. 133 00:10:42,726 --> 00:10:44,144 ఇది నీకు చాలా కష్టంగా ఉందని నాకు తెలుసు. 134 00:10:51,610 --> 00:10:55,239 కాబట్టి ప్రస్తుతం నువ్వు కొన్ని రోజులు ఇక్కడి నుండి… 135 00:10:57,699 --> 00:10:59,826 అంటే, వెళితే… దూరంగా వెళితే మంచిదేమో అనిపిస్తోంది. 136 00:11:01,453 --> 00:11:03,330 సరేనా? అంటే, ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 137 00:11:03,413 --> 00:11:04,414 ఏం మాట్లాడుతున్నావు? 138 00:11:05,374 --> 00:11:06,875 అంటే, నా ఉద్దేశం, మరి… 139 00:11:06,959 --> 00:11:09,503 కొన్ని రోజుల్లో ఇక్కడి నుండి భూమికి వెళ్లే రవాణా షిప్ ఒకటి ఉంది. 140 00:11:09,586 --> 00:11:10,921 - నేను… - ఏంటిది, అలెక్స్? 141 00:11:11,004 --> 00:11:12,673 లేదు, కోపపడకు, లిల్లీ. 142 00:11:12,756 --> 00:11:13,841 ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? 143 00:11:13,924 --> 00:11:15,050 ఎందుకు? 144 00:11:15,133 --> 00:11:16,426 నన్ను వెళ్లిపొమ్మంటావా? నీకు… 145 00:11:16,510 --> 00:11:18,303 నీకు నేను దూరంగా వెళ్ళిపోతే బాగుండు అని ఉందా? 146 00:11:18,387 --> 00:11:19,805 లేదు, అస్సలు లేదు. 147 00:11:19,888 --> 00:11:21,223 లిల్లీ, నాకు నువ్వు వెళ్లాలని లేదు. 148 00:11:21,306 --> 00:11:23,934 మా అమ్మ నాన్న ఇలా అంటే నేను అర్థం చేసుకోగలను, 149 00:11:24,017 --> 00:11:26,144 ఇలా నా అక్క అన్నా వేరు, కానీ నువ్వు… 150 00:11:26,228 --> 00:11:27,437 ఇలా అంటావు అనుకోలేదు. 151 00:11:28,230 --> 00:11:29,982 ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? 152 00:11:30,482 --> 00:11:32,693 నాకు నిన్ను చూసి కంగారుగా ఉంది. 153 00:11:34,987 --> 00:11:38,907 సరే, కానీ… నా క్షేమం నేను చూసుకోగలను. 154 00:11:38,991 --> 00:11:41,493 - నాకు తెలుసు. - సరే, అయితే మరి… 155 00:11:41,577 --> 00:11:43,954 నువ్వు ఆ పిచ్చి పెక్కర్ యూనిఫామ్ వేసుకున్నావని… 156 00:11:44,037 --> 00:11:46,373 - అది హ్యాపీ వ్యాలీ కార్ప్స్. - సరే, ఏదోకటి. నేను… 157 00:11:47,499 --> 00:11:49,293 దానర్థం నేను ఏది చేస్తే మంచిదో నీకు తెలుసు అని కాదు. 158 00:11:49,376 --> 00:11:51,670 నేను అలా అస్సలు అనలేదు. నేను అలా అనడం లేదు. 159 00:11:52,379 --> 00:11:54,089 నీ క్షేమం నువ్వు చూసుకోగలవని నాకు తెలుసు. 160 00:11:54,173 --> 00:11:59,052 నాకు తెలుసు. నన్ను నమ్ము, నాకు నిన్ను చూస్తేనే భయంగా ఉంటుంది, సరేనా? 161 00:12:05,934 --> 00:12:10,981 సరే, కానీ ఇంకెప్పుడూ వెనక్కి వెళ్ళమని నాతో అనొద్దు. 162 00:12:11,064 --> 00:12:12,482 సరే. 163 00:12:14,234 --> 00:12:17,029 నాకు ఆ చోటు అంటేనే ఇష్టం లేదు. వాళ్ళు తన గురించి ఏమంటున్నారో తెలుసా? 164 00:12:17,112 --> 00:12:18,322 లేదు. 165 00:12:19,990 --> 00:12:21,992 ఓహ్, దేవుడా. "తిరుగుబాటుదారా"? 166 00:12:22,826 --> 00:12:24,828 మార్స్ పై జరిగిన సంఘటనలో తిరుగుబాటుదారు మరణం 167 00:12:24,912 --> 00:12:26,830 ఇది చాలా దారుణం. తను డాన్స్ వేస్తోంది. 168 00:12:26,914 --> 00:12:28,582 ఎంత దారుణం. 169 00:12:33,420 --> 00:12:36,256 వాళ్ళు మనల్ని చూసే విధానం ఇదే. మనల్ని తీవ్రవాదుల్లా… 170 00:12:37,382 --> 00:12:39,134 లేదా ఉగ్రవాదుల్లా చూస్తున్నారు. 171 00:12:40,302 --> 00:12:43,388 కానీ మనం అలాంటోళ్ళం కాదు. ఆ విషయం మనం వాళ్ళకి చూపించాలి. 172 00:12:44,097 --> 00:12:46,099 ఇక్కడ బ్రతుకు ఎలా ఉంటుందో వాళ్లకు తెలిసేలా చేయాలి. 173 00:12:47,643 --> 00:12:50,103 అంటే, ఇక్కడి వారికి సాయం చేయడానికి నువ్వు ఏదోకటి చేస్తున్నావు, అవునా? 174 00:12:52,481 --> 00:12:53,649 నేను కూడా ఏమైనా చేయగలనేమో. 175 00:13:02,991 --> 00:13:04,326 నువ్వు ఏం… నువ్వు ఏం చేస్తున్నావు? 176 00:13:05,077 --> 00:13:06,119 పద. 177 00:13:07,120 --> 00:13:08,247 నువ్వు ఏం చేస్తు… 178 00:13:12,709 --> 00:13:13,961 సరే. 179 00:13:22,344 --> 00:13:25,514 దూళి తుఫాను వల్ల డాప్లర్ షిఫ్ట్ రీడింగ్స్ సరిగ్గా రావడం లేదేమో. 180 00:13:26,139 --> 00:13:27,808 నీకు అక్కడ ఏమైనా కనిపిస్తుందా? 181 00:13:27,891 --> 00:13:31,061 లేదు. మన రాడార్ రేంజ్ లో ఏదీ వస్తున్నట్టు కనిపించడం లేదు. 182 00:13:32,980 --> 00:13:34,398 సమాచారమా, ఆహ్? 183 00:13:34,481 --> 00:13:35,482 ఎక్కడి నుండి? 184 00:13:36,316 --> 00:13:37,526 ఇరినా మారోజోవ? 185 00:13:38,861 --> 00:13:40,571 ఇప్పుడు నువ్వు ఇరినాకి బెస్ట్ ఫ్రెండువా? 186 00:13:40,654 --> 00:13:41,989 తర్వాత ఎవరితో స్నేహం చేస్తావు, నార్త్ కొరియా? 187 00:13:42,072 --> 00:13:43,907 నువ్వు ఎవరి పక్షాన లేవు అన్నావు కదా? 188 00:13:43,991 --> 00:13:48,537 నువ్వు అమాయకంగా ఉన్నావని చెప్పడం కామన్ సెన్స్ పాలిటిక్స్ కాదు. 189 00:13:48,620 --> 00:13:50,330 ఇక్కడ కూడా ఏమీ లేదు, చీఫ్. 190 00:13:51,748 --> 00:13:53,834 చూస్తుంటే ఇరినా నీకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టి ఉంది. 191 00:13:54,376 --> 00:13:56,753 నిజంగా అనుకుంటున్నావా? ఆమె దాన్ని కనిపెట్టడం కష్టం కావొచ్చు అంది. 192 00:13:56,837 --> 00:14:00,591 అంటే, చాలా మిలటరీల దగ్గర గుర్తించడానికి కష్టమైన టెక్నాలజీలు ఉంటాయి, కానీ… 193 00:14:04,845 --> 00:14:07,723 షిరీన్, ఈ లాంగ్-రేంజ్ రేడార్ ని బ్రూట్ ఫోర్స్ మార్గంలోకి 194 00:14:07,806 --> 00:14:10,642 మార్చగలవేమో చూడు ఇక్కడ. 195 00:14:10,726 --> 00:14:12,519 అప్పుడు మన అరేయ్స్ కంటే ఎక్కువ సిగ్నల్ దొరకొచ్చు. 196 00:14:12,603 --> 00:14:15,272 అలాగే, ఆర్బిటర్ ని కూడా డాప్లర్ ని ట్రాక్ చేసే విధంగా మార్చు. 197 00:14:20,444 --> 00:14:23,322 నేను తిరిగి భూమికి వెళ్లాలని సంతకాలు చేసిన పిటీషన్ లో 198 00:14:23,405 --> 00:14:25,657 ఇప్పుడు నీ సంతకం కనిపించడం లేదు. 199 00:14:27,367 --> 00:14:28,994 టైటన్ కారణంగా ఉంటున్నా. 200 00:14:29,536 --> 00:14:31,705 వాళ్ళు ఇక్కడికి తిరిగి సురక్షితంగా వచ్చే వరకు నేను ఎక్కడికీ వెళ్లను. 201 00:14:32,414 --> 00:14:33,999 ఆ సంకల్పాన్ని నేను మెచ్చుకుంటాను. 202 00:14:34,082 --> 00:14:35,083 మేమంతా మెచ్చుకుంటున్నాం. 203 00:14:35,876 --> 00:14:37,878 ఆ మిషన్, ఇక్కడ ఉన్నోళ్లు చాలా మంది దానిపై ఆశలు పెట్టుకున్నారు. 204 00:14:37,961 --> 00:14:39,004 అంటే ఇప్పుడు నన్ను మీ కౌన్సిల్ లో 205 00:14:39,087 --> 00:14:40,380 చేరమని అడుగుతావు కదా? 206 00:14:41,048 --> 00:14:42,466 ఆగండి. 207 00:14:42,549 --> 00:14:44,593 చూస్తుంటే రేడార్ లో ఏదో కనిపిస్తున్నట్టు ఉంది. 208 00:14:48,472 --> 00:14:52,267 అంటే, ఇది లో ఆర్సిఎస్ షిప్ లాగా కనిపిస్తోంది. 209 00:14:52,351 --> 00:14:55,562 డాప్లర్ షిఫ్ట్ ప్రకారం అది మార్స్ కే వస్తున్నట్టు ఉంది. 210 00:14:55,646 --> 00:14:57,981 దాదాపు మూడు రోజుల్లో ఇక్కడ ఉంటుందని చెప్పొచ్చు. 211 00:14:58,065 --> 00:14:59,691 ఛ, వాళ్ళు చెప్పినట్టే జరుగుతోంది. 212 00:14:59,775 --> 00:15:02,110 గుర్తుతెలియని టార్గెట్ ట్రాన్స్ పాండర్ కనుగొనబడలేదు 213 00:15:02,194 --> 00:15:03,862 వాళ్ళు మన కోసమే వస్తున్నారు. 214 00:15:07,157 --> 00:15:10,077 మనపై దండయాత్రకు వచ్చే వాళ్ళను తిప్పికొట్టే శక్తి మనకు లేదు. 215 00:15:10,160 --> 00:15:12,788 వాళ్ళు గనుక ఆ గ్రహశకలాన్ని స్వాధీనం చేసుకుంటే మన పని అయిపోయినట్టే. 216 00:15:12,871 --> 00:15:14,957 ఎలాగైనా మన పని అయిపోయినట్టే. 217 00:15:15,040 --> 00:15:16,667 మనకు రెండు వారాలకు సరిపడే ఆహారం మాత్రమే ఉంది. 218 00:15:17,584 --> 00:15:19,044 మీరు చెప్పేది నిజమే. 219 00:15:19,127 --> 00:15:23,382 మనం గనుక ఇంకొన్ని వారాలు తట్టుకోగలిగితే, మనం సోవియట్లతో డీల్ కుదుర్చుకోగలం. 220 00:15:23,465 --> 00:15:25,759 అప్పుడు నిజంగా స్వతంత్రం పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. 221 00:15:25,843 --> 00:15:27,719 వాళ్ళు చెప్పేది నిజంగా నమ్ముతున్నావా, మైల్స్? 222 00:15:28,303 --> 00:15:29,721 నేను లెన్యను నమ్మను. 223 00:15:29,805 --> 00:15:31,640 అతను ఎప్పుడూ తన స్వార్థమే చూసుకునే రకం. 224 00:15:31,723 --> 00:15:33,350 వాళ్ళు చెప్పింది నిజమే అని తెలిసింది. 225 00:15:33,433 --> 00:15:36,144 ప్రస్తుతం భూమి పై అతని కుటుంబం ప్రమాదంలో ఉండటం వల్ల అతనికి అబద్ధం చెప్పాల్సిన పని లేదు. 226 00:15:36,228 --> 00:15:38,313 చూడండి, మనం ఏదోకటి చేయాలి, 227 00:15:38,897 --> 00:15:41,942 లేదంటే మనం ఆశలన్నీ వదులుకోవాల్సిందే, అప్పుడు బేస్ లో ఉన్న అందరూ 228 00:15:42,025 --> 00:15:44,903 భూమికి సంకెళ్లతో వెళ్లి జీవితాంతం జైల్లో గడపాల్సి రావొచ్చు. 229 00:15:45,779 --> 00:15:47,197 అప్పుడు మనం ఇన్నాళ్లు చేసిన పోరాటం, 230 00:15:47,281 --> 00:15:49,449 హ్యాపీ వ్యాలీ జనం పడిన కష్టం మొత్తం, 231 00:15:49,533 --> 00:15:50,993 అంతా వృధా అవుతుంది. 232 00:15:54,997 --> 00:15:58,417 అయితే, మనం ఏం చేయాలి? 233 00:16:06,300 --> 00:16:07,718 ఘర్షణ జరుగుతుంది అన్నప్పుడు… 234 00:16:08,677 --> 00:16:12,222 మనం చేయగల ఉత్తమమైన పని శత్రువు మన ఎదుటికి రాకుండా చేయాలి… 235 00:16:13,223 --> 00:16:14,892 అంటే మార్గాన్ని తగలబెట్టాలి. 236 00:16:16,768 --> 00:16:18,353 మార్గమా? ఈయన ఏం మాట్లాడుతున్నాడు… 237 00:16:18,437 --> 00:16:21,064 నీ ఉద్దేశం కుజ్నెట్సోవ్ మీద ఉన్న డాకింగ్ ప్లాట్ఫామా? 238 00:16:22,232 --> 00:16:25,319 అంటే నీ సలహా మనం దాన్ని… ఏంటి, పేల్చేద్దామా? 239 00:16:26,069 --> 00:16:27,279 మనం దాన్ని పేల్చేస్తే, 240 00:16:27,362 --> 00:16:30,657 వాళ్ళు కావాలనుకున్నా గోల్డిలాక్స్ నుండి ఇరీడియంని తీసుకెళ్ళలేరు. 241 00:16:30,741 --> 00:16:33,076 అంటే, ఈ మొత్తం ఆపరేషన్ కి అదే కీలకమైన విషయం. 242 00:16:33,660 --> 00:16:35,913 అంటే, అప్పుడు వాళ్లకు ఆ గ్రహశకలం దేనికీ పనికిరాదు. 243 00:16:41,710 --> 00:16:45,797 అంత పెద్దదాన్ని పేల్చాలి అంటే నీకు చాలా ఎక్కువ మందుగొండు సామాగ్రి కావాలి. 244 00:16:45,881 --> 00:16:48,008 మన ఆర్మరిలోగాని లేక బేస్ లో ఎక్కడా 245 00:16:48,634 --> 00:16:50,594 అంత బలమైంది మన దగ్గర ఏదీ లేదు. 246 00:16:50,677 --> 00:16:53,555 మన దగ్గర ఉన్న ఆఖరి మందుగొండు సామాగ్రిని పామర్ దొంగిలించాడు. 247 00:16:53,639 --> 00:16:55,849 దాన్ని వాడి మన ఆహారాన్ని నాశనం చేసాడు. 248 00:16:59,144 --> 00:17:02,606 మనం ద్రవ మీథేన్ ని తయారు చేయగలం, కానీ రెండు రోజుల్లో చేయలేము. 249 00:17:02,689 --> 00:17:04,273 అయితే, మనం ఉన్న వాటితోనే ఏదోకటి చేయొచ్చు. 250 00:17:06,527 --> 00:17:10,739 మన దగ్గర ఉన్న ఎరువులతో అమ్మోనియం నైట్రేట్ చేసి దాన్ని హైడ్రజైన్ తో కలుపుదాం. 251 00:17:11,615 --> 00:17:13,575 దాన్ని వాడితే సరిపడేంత పేలుడు సంభవిస్తుందా? 252 00:17:15,410 --> 00:17:18,914 అది దాన్ని మనం ప్యాక్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే, అది దాదాపుగా టీ.ఎన్.టీ అంత శక్తివంతమైనది. నేను… 253 00:17:18,997 --> 00:17:21,750 అది ఎలా పని చేస్తుంది అంటే, మనం ఒక బ్లాస్ట్ క్యాప్ కి కరెంట్ పెట్టాలి, 254 00:17:21,834 --> 00:17:23,919 ఒక టపాకాయికి పెట్టినట్టు దాన్ని ఇంధనంలో పెట్టాలి. 255 00:17:24,545 --> 00:17:27,714 ఆ తర్వాత దాన్ని ఆన్ చేసి, కలిపిన పదార్థానికి ద్రవాన్ని కలిపి… 256 00:17:29,007 --> 00:17:30,217 హైడ్రజైన్ ని వేడి చేయాలి. 257 00:17:37,432 --> 00:17:38,433 నాకు నమ్మకం కుదరడం లేదు. 258 00:17:38,517 --> 00:17:43,522 అది చాలా రిస్క్ తో కూడుకున్న పని, కానీ మనకు వేరే దారి లేదు. 259 00:18:41,997 --> 00:18:44,041 స్టీవర్ట్ నిన్న రాత్రి నీ డబ్బు అంతా గెలిచాడని చెప్పాడు. 260 00:18:45,209 --> 00:18:48,337 బహుశా నీకు పోకర్ ఆడటం రాదేమో అని ఎప్పుడైనా అనిపించిందా? 261 00:18:49,338 --> 00:18:52,007 లేదా నేను కావాలనే అలా నటిస్తున్నాను ఏమో, ఆహ్? 262 00:18:53,175 --> 00:18:56,553 వాడిని దెబ్బ తీయడానికి ముందు నాకు ఆట రాదన్నట్టు నటిస్తున్నా. 263 00:19:01,517 --> 00:19:03,060 సరే, బహుశా నాకు పోకర్ ఆడటం రాదేమో. 264 00:19:04,311 --> 00:19:07,064 అంటే, ఇక్కడ కాలక్షేపం చేయడానికి నేను ఇంకేం చేయాలి చెప్పు? 265 00:19:07,564 --> 00:19:08,732 ఇక్కడ చాలా బోర్ కొడుతోంది. 266 00:19:09,233 --> 00:19:10,567 నిజంగా. 267 00:19:10,651 --> 00:19:12,236 ఎదురుచూపు కష్టం కదా? 268 00:19:14,446 --> 00:19:15,447 అవును. 269 00:19:17,908 --> 00:19:18,909 నువ్వు బానే ఉన్నావా? 270 00:19:24,206 --> 00:19:28,710 నేను ఇంతకు ముందు ఏమీ అనలేదు, కానీ ఆ చనిపోయిన అమ్మాయి గురించి విన్నాక బాధ వేసింది. 271 00:19:29,545 --> 00:19:31,171 ఆమె నీ ఫ్రెండ్ కదా? 272 00:19:34,842 --> 00:19:35,884 అవును, గల్లీ. 273 00:19:38,846 --> 00:19:41,098 గుల్సొర అఖిల్మాటోవ. 274 00:19:42,558 --> 00:19:47,145 మేము నలుగురం. ఆమె, నేను, లిల్లీ, అలెక్స్… 275 00:19:48,188 --> 00:19:49,898 ప్రతీ క్షణం కలిసి గడిపేవాళ్ళం. 276 00:19:53,235 --> 00:19:54,403 నాకు చాలా బాధగా ఉంది. 277 00:19:58,031 --> 00:19:59,032 హేయ్, ఇద్దరూ వినండి. 278 00:20:01,827 --> 00:20:03,662 గ్రహశకలంపై ఆక్రమణకు ముందు అక్కడికి వెళ్లి 279 00:20:03,745 --> 00:20:06,290 గాలించే పనిని ఎల్.టి మన బృందానికి అప్పగించాడు. 280 00:20:07,749 --> 00:20:09,042 హెస్కల్, నువ్వు నాతో రావాలి. 281 00:20:09,126 --> 00:20:11,753 పై అధికారులు నీకు ఆ గ్రహశకలం గురించి ఏం తెలుసో కనుక్కోవాలి అనుకుంటున్నారు. 282 00:20:12,462 --> 00:20:13,463 పదా. 283 00:20:14,214 --> 00:20:15,340 అలాగే, సార్జెంట్. 284 00:20:20,846 --> 00:20:21,847 మార్సి. 285 00:20:24,808 --> 00:20:26,894 నువ్వు ఎవరి వైపు ఉన్నావో గుర్తుంచుకో. 286 00:20:27,519 --> 00:20:28,896 దొబ్బెయ్, ఓర్కి. 287 00:20:45,412 --> 00:20:46,955 గ్రహశకలం మీద ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? 288 00:20:47,039 --> 00:20:49,708 లేదు, సర్. నాకు తెలిసి ఏమీ లేవు. నేను అక్కడికి మా నాన్నతో వెళ్ళా. 289 00:20:49,791 --> 00:20:52,294 అక్కడ సెక్యూరిటీ లాంటిది ఏమీ లేదు. 290 00:20:52,377 --> 00:20:53,545 మైనింగ్ బృందంలో ఎంత మంది ఉంటారు? 291 00:20:54,505 --> 00:20:56,423 దాదాపుగా 80 మంది ఉండొచ్చు. 292 00:20:56,507 --> 00:20:57,508 ఎనభై? 293 00:20:57,591 --> 00:20:59,676 అవును, అంటే… ఇప్పుడు ఆ సంఖ్య మారి ఉండొచ్చు. 294 00:20:59,760 --> 00:21:01,261 వాడు రెండూ కరెక్టుగానే చెప్పాడు. 295 00:21:01,345 --> 00:21:03,388 కుజ్నెట్సోవ్ లో 2003 నుండి 296 00:21:03,472 --> 00:21:05,891 కేవలం ఎంపీకే లకు మాత్రమే ఆయుధాలు ఉంచుకునే అనుమతి ఉంది. 297 00:21:06,475 --> 00:21:09,811 కాకపోతే, నిషేధం తర్వాత అక్కడ ఒక చిన్న బృందం గస్తీ కాస్తోంది. 298 00:21:09,895 --> 00:21:11,146 ఎన్క్రిప్టు చేయబడిన కమ్యూనికేషన్ 299 00:21:12,731 --> 00:21:14,316 థాంక్స్, లాన్స్ కార్పోరెల్. 300 00:21:14,399 --> 00:21:16,818 - ఇక వెళ్ళు. - అయ్, సర్. 301 00:21:18,612 --> 00:21:22,366 సార్జెంట్ రూయిజ్, నీ బృందం కుజ్నెట్సోవ్ స్టేషన్ లోకి చొరబడి 302 00:21:22,449 --> 00:21:25,744 ఆధీనంలోకి తీసుకోబోయే బృందం సిద్ధపడేందుకు వీలుగా ఈ సమాచారాన్ని ధృవీకరించుకుని 303 00:21:25,827 --> 00:21:28,914 అక్కడ ఎవరైనా మైనర్లు ఉంటే వారిని ఆధీనంలోకి తీసుకోవాలి. 304 00:21:29,498 --> 00:21:30,666 అయ్, అయ్, సర్. 305 00:21:32,042 --> 00:21:34,002 ఏదైనా సమాచారం అందుతుందేమో గమనిస్తూ ఉండు, జేమ్స్. 306 00:21:34,086 --> 00:21:35,087 అలాగే, సర్. 307 00:21:35,754 --> 00:21:36,922 సరే, మనం ఇక్కడ గమనించాలి. 308 00:21:40,509 --> 00:21:43,345 మనకు ఇక్కడ జీవం ఉందని అసంపూర్తి డేటా పంపిన సీకర్ 309 00:21:43,428 --> 00:21:47,975 ఇక్కడ ఉన్న ఫర్సేటి క్రేటర్ లో ఉంది, 310 00:21:48,058 --> 00:21:51,728 అలాగే మనం ఇక్కడ ఉన్న ఈ వరద ఏర్పడిన మైదానంలో ల్యాండ్ అవ్వాల్సిన వాళ్ళం, సరేనా? 311 00:21:51,812 --> 00:21:57,651 సరే, కానీ మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం, 20 కిలోమీటర్ల దూరంలో, 312 00:21:57,734 --> 00:22:01,405 మనం సురక్షితమైన ఇవిఎ రేంజ్ కి బయట ఉన్నాం, బగ్గీలో వెళ్లినా సరే. 313 00:22:03,866 --> 00:22:06,201 మనం ఇక్కడికి వచ్చిన కారణమే ఆ సీకర్. 314 00:22:06,285 --> 00:22:07,786 జీవం ఉంది అని ఆధారం కనిపెట్టడానికి. 315 00:22:08,287 --> 00:22:11,373 కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి మన దగ్గర కావాల్సిన ఆక్సిజన్ నిలువలు లేవా? 316 00:22:16,378 --> 00:22:17,379 ఒకవేళ… 317 00:22:19,506 --> 00:22:23,844 మనం నలుగురిని బగ్గీలో ఇరికించడానికి బదులు, ముగ్గురు వెళితే? 318 00:22:24,553 --> 00:22:28,515 అప్పుడు మనం వాడే ఆక్సిజన్ 33% పెరుగుతుంది. 319 00:22:28,599 --> 00:22:31,685 నేను లెక్కలు వేయగలను, కానీ అది రిస్క్ తో కూడుకున్న పని. 320 00:22:31,768 --> 00:22:35,480 చూడండి, మనం జీవాన్ని కనిపెట్టడానికి 90 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాము. 321 00:22:35,981 --> 00:22:37,524 ఆఖరి 20 కిలోమీటర్ల కారణంగా ఆగిపోతామా? 322 00:22:37,608 --> 00:22:42,404 చూడండి, మనం ఎంతైనా వాదించుకోవచ్చు, కానీ ఇది కమాండర్ నిర్ణయం. 323 00:22:46,658 --> 00:22:48,660 అతను చాలా గంటలుగా లోపలే ఉన్నాడు. 324 00:22:48,744 --> 00:22:50,287 అతనితో నేను మాట్లాడతాను. 325 00:22:50,954 --> 00:22:52,122 గుడ్ లక్. 326 00:23:03,217 --> 00:23:04,426 వాల్ట్. 327 00:23:04,510 --> 00:23:05,802 హేయ్, కెల్లీ. 328 00:23:08,972 --> 00:23:10,682 వాల్ట్, ఒక చిన్న సమస్య వచ్చింది. 329 00:23:11,183 --> 00:23:15,354 మన సీకర్ మిషన్ భద్రత పరిమితుల బయట ఉంది, కానీ… 330 00:23:17,439 --> 00:23:20,901 మనం గనుక కొన్ని లెక్కలు వేసి మార్పులు చేస్తే పని పూర్తి చేయగలం అనుకుంటున్నాం. 331 00:23:20,984 --> 00:23:24,154 ఈ లెక్కలు టీ-మైనస్ 4 నిమిషాల 35 సెకన్లకు సరైన 332 00:23:24,238 --> 00:23:27,157 డెల్టా వి-బర్న్ ని లోడ్ చేసినట్టే చూపుతున్నాయి. కానీ నాకు… 333 00:23:28,116 --> 00:23:30,202 నాకు కోడ్ లో ఎలాంటి సమస్య ఉన్నట్టు కనిపించడం లేదు. 334 00:23:32,287 --> 00:23:33,288 వాల్ట్? 335 00:23:34,706 --> 00:23:36,416 వాల్ట్, మనం చేరిపోయాం. 336 00:23:37,501 --> 00:23:38,877 మనం ల్యాండ్ అయ్యాము. 337 00:23:39,503 --> 00:23:41,922 ఇప్పుడు ఇలా షిప్ లోనే ఉండిపోకూడదు. 338 00:23:42,589 --> 00:23:44,883 మనం జీవాన్ని కనిపెట్టడానికి వచ్చాము. నీకు ఆ పని చేయాలని లేదా? 339 00:23:44,967 --> 00:23:47,052 అవును, ఉంది. 340 00:23:47,135 --> 00:23:49,179 కానీ ముందు, నేను… నేను జరిగిన… 341 00:23:49,263 --> 00:23:53,267 నేను జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా ఉండటానికి ఇది ఎలా జరిగిందో కనిపెట్టాలి. 342 00:23:55,811 --> 00:23:56,812 చూడు. 343 00:23:57,312 --> 00:23:58,313 హేయ్. 344 00:23:59,356 --> 00:24:01,650 వాళ్లకు నీ నాయకత్వం కావాలి. 345 00:24:03,402 --> 00:24:05,946 నాకు నీ నాయకత్వం కావాలి. 346 00:24:15,914 --> 00:24:16,957 నువ్వు చెప్పింది నిజమే. 347 00:24:18,917 --> 00:24:20,043 నువ్వు చెప్పేది నిజమని నాకు తెలుసు. 348 00:24:21,128 --> 00:24:22,129 నన్ను… 349 00:24:23,422 --> 00:24:24,548 నన్ను క్షమించు. 350 00:24:25,966 --> 00:24:28,218 లేదు, లేదు, అదేం పర్లేదు. 351 00:24:29,928 --> 00:24:30,929 అదేం పర్లేదు. 352 00:24:31,013 --> 00:24:32,097 అలా కాదు. 353 00:24:34,141 --> 00:24:35,184 ఇది కరెక్టు కాదు. 354 00:24:36,059 --> 00:24:38,312 నా వల్ల అందరూ చనిపోయి ఉండొచ్చు, కెల్లీ. 355 00:24:40,230 --> 00:24:41,732 - నీకు అర్థం కావడం లేదా? - లేదు. 356 00:24:41,815 --> 00:24:44,026 - నీ కారణంగా కాకపోయి ఉంటే… - లేదు, అది నీ తప్పు కాదు. 357 00:24:44,109 --> 00:24:46,862 అవును. నేను… 358 00:24:46,945 --> 00:24:48,030 నేను నా పని సరిగ్గా చేయలేకపోయా. 359 00:24:48,113 --> 00:24:49,907 లేదు. ఛ. 360 00:24:49,990 --> 00:24:51,450 నేను… అంతా నేనే పాడు చేశా. 361 00:24:51,533 --> 00:24:53,285 - వాల్ట్. - నేను… 362 00:24:53,368 --> 00:24:56,538 - నేను… - వాల్ట్, మాట్లాడటం ఆపి నేను చెప్పేది విను. 363 00:24:57,623 --> 00:24:58,707 సరే, ఒక… 364 00:24:59,583 --> 00:25:01,210 నేను నీకు ఒక విషయం చెప్పాలి. 365 00:25:04,880 --> 00:25:06,340 ఇది నీ పొరపాటు కాదు. నేను… 366 00:25:06,423 --> 00:25:08,634 నా పొరపాట్ల వల్ల ఎదురైన ప్రమాదం నుండి ఈ బృందాన్ని కాపాడావు. 367 00:25:08,717 --> 00:25:10,135 కాదు, అది నిజం కాదు. 368 00:25:10,219 --> 00:25:11,470 నేను… ప్రస్తుతం నన్ను నేను నమ్మలేను. 369 00:25:11,553 --> 00:25:12,679 - వాల్ట్. - నా వల్ల… 370 00:25:12,763 --> 00:25:15,849 నేను సరిగ్గా ఆలోచించడం లేదు, నువ్వు నాయకత్వం తీసుకుంటే మంచిది. 371 00:25:20,145 --> 00:25:25,776 కనీసం… కనీసం ఏం తప్పు జరిగిందో నేను తెలుసుకునేంతవరకు నువ్వు నడిపిస్తే బాగుంటుంది, సరేనా? 372 00:25:26,944 --> 00:25:30,197 ఆగు, నన్ను కమాండ్ చేయమంటున్నావా? 373 00:25:30,906 --> 00:25:32,199 తాత్కాలికంగా, అవును. 374 00:25:32,824 --> 00:25:34,326 నువ్వు సీరియస్ గా ఇలా అనడం లేదు. 375 00:25:35,327 --> 00:25:36,328 ప్లీజ్. 376 00:25:44,044 --> 00:25:45,963 ఆగు, ఒక్క క్షణం ఆగు. 377 00:25:46,547 --> 00:25:48,757 మీరు దాన్ని నాశనం చేయబోతున్నారా? 378 00:25:49,842 --> 00:25:51,176 ఆ గ్రహశకలాన్ని. 379 00:25:52,010 --> 00:25:54,805 కాదు, వాళ్ళు షిప్ ని డాక్ చేసే ప్లాట్ఫామ్ ని మాత్రమే. 380 00:25:54,888 --> 00:25:55,973 ఎలా? 381 00:25:56,056 --> 00:25:58,141 అంటే, ప్లాట్ఫామ్ కి బాంబులు తగిలించి వైరింగ్ చేయడానికి మన దగ్గర టైమ్ లేదు, 382 00:25:58,225 --> 00:26:01,436 కాబట్టి మేము ఒక హాపర్ లో మందుగొండు సామాగ్రి తీసుకుని అక్కడికి వెళ్ళబోతున్నాం. 383 00:26:01,520 --> 00:26:02,855 ఒక్క నిమిషం. 384 00:26:02,938 --> 00:26:05,482 అది చాలా చెత్త ప్లాన్. 385 00:26:05,566 --> 00:26:06,817 మహా దారుణంగా ఉంది. 386 00:26:06,900 --> 00:26:09,236 భలే, మీరిద్దరూ ఒక విషయంపై ఏకీభవించడం చూస్తుంటే బాగుంది. 387 00:26:09,778 --> 00:26:13,156 చూడండి, మనం ప్లాట్ఫామ్ ని పేల్చడం వేరు, 388 00:26:13,240 --> 00:26:15,409 కానీ అక్కడికి సురక్షితంగా ఎలా వెళతారు అనేది అసలు ప్రశ్న. 389 00:26:15,492 --> 00:26:17,327 మీరు బయట చూశారా, ఆహ్? 390 00:26:18,120 --> 00:26:19,997 బయట దారుణమైన దూళి తుఫాను రేగుతోంది. 391 00:26:20,080 --> 00:26:22,958 క్షణ క్షణానికి పెద్దది అవుతోంది, అలాంటిది మీరు హాపర్ లో 392 00:26:23,041 --> 00:26:26,128 బాంబులు పెట్టి, ఆ తుఫాను గుండా ఎగురుకుంటూ వెళతారా? 393 00:26:26,211 --> 00:26:27,379 సర్లే, లేదు, లేదు. 394 00:26:28,046 --> 00:26:29,298 అది నిజంగా చాలా గొప్ప ఐడియా. 395 00:26:30,174 --> 00:26:34,845 మరి ఎం-6 వాళ్ళు వచ్చి ఆ ప్లాట్ఫామ్ ని సొంతం చేసుకోవడానికి ముందు దాన్ని పేల్చాలంటే, వెంటనే వెళ్ళాలి. 396 00:26:34,928 --> 00:26:37,514 మేము అక్కడ ఉన్న బృందాన్ని ఖాళీ చేయించి ఫీనిక్స్ కి పంపాం కూడా. 397 00:26:38,307 --> 00:26:40,601 దీన్ని ఎగరేసేంత పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు? 398 00:26:41,226 --> 00:26:44,855 ఫ్రాంక్ హాలోరన్ ముందుకొచ్చాడు, అలాగే మ్యాక్స్ హావర్డ్ అతని కోపైలట్ గా వెళ్తాడు. 399 00:26:44,938 --> 00:26:46,148 నిజానికి, ఆ పని నేను చేయబోతున్నా. 400 00:26:46,231 --> 00:26:47,524 ఏంటి? 401 00:26:47,608 --> 00:26:51,445 అవును, ఈ పని కోసం తమ ప్రాణాలు త్యాగం చేయమని నేను ఇంకొకరిని అడగలేను. 402 00:26:51,528 --> 00:26:53,030 ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని. 403 00:26:53,113 --> 00:26:55,991 అవును, అందుకే నీలాంటోళ్ళు వెళ్ళకూడదు. మాకు ఇక్కడ నీ సాయం కావాలి. 404 00:26:56,074 --> 00:26:57,284 చూడు, ఫ్రాంక్ కి ఒక కుటుంబం ఉంది. 405 00:26:57,367 --> 00:26:59,494 వాళ్లందరికీ వాళ్ళ ఇళ్లలో తమ కోసం ఎదురుచూసే కుటుంబాలు ఉన్నాయి. 406 00:26:59,578 --> 00:27:02,998 నాకు ఎవరూ లేరు. నేను వెళ్తాను. ఇక వాదన వొద్దు. 407 00:27:14,635 --> 00:27:16,720 మిస్ బాయ్డ్ తో కలిసి నేను వెళ్తాను. 408 00:27:20,933 --> 00:27:22,976 ఇది కోపైలట్ తో కలిసి చేయాల్సిన ప్రమాదకరమైన మిషన్. 409 00:27:23,060 --> 00:27:24,978 నీకు పిచ్చా? ఇది సూసైడ్ తో సమానం. 410 00:27:25,062 --> 00:27:26,939 ఈ ప్లాన్ పని చేయాలంటే అదొక్కటే దారి. 411 00:27:28,941 --> 00:27:30,984 నువ్వు ముందుకు రావడం సంతోషం, 412 00:27:31,068 --> 00:27:32,986 కానీ నువ్వు వ్యోమగామిగా పని చేసి చాలా కాలం అవుతోంది. 413 00:27:33,070 --> 00:27:35,656 నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు, మిస్టర్ డేల్. 414 00:27:37,658 --> 00:27:41,245 నా భార్య, నా కొడుకు… 415 00:27:43,413 --> 00:27:45,749 ఈ విషయం మీలాగే నాకు కూడా ముఖ్యం. 416 00:27:46,583 --> 00:27:48,085 చెప్పాలంటే మీకంటే ముఖ్యం. 417 00:27:50,295 --> 00:27:51,797 ఈ ప్లాన్ పని చేయాలి. 418 00:27:56,969 --> 00:27:57,970 సరే. 419 00:27:59,304 --> 00:28:03,517 ఇన్నాళ్లూ డెస్క్ వెనుక కూర్చుని పని చేయడం వల్ల నీ నైపుణ్యం తగ్గిపోలేదని ఆశిస్తున్నా. 420 00:28:06,478 --> 00:28:08,313 పదా, నీకు ఏమేమి మారాయో చూపిస్తా. 421 00:29:03,160 --> 00:29:04,369 సార్జెంట్. 422 00:29:04,453 --> 00:29:05,454 అవును, ఏంటి? 423 00:29:07,497 --> 00:29:08,498 నేను… 424 00:29:09,333 --> 00:29:11,502 రేపు మీతో టోల్ఫ్సన్ ని తీసుకెళితే మంచిది అనిపిస్తోంది. 425 00:29:11,585 --> 00:29:13,754 సున్నా గ్రావిటీలో ఆమె నాకంటే బాగా పని చేయగలదు. 426 00:29:14,254 --> 00:29:15,672 ఏం మాట్లాడుతున్నావు? 427 00:29:16,173 --> 00:29:17,508 నిఘా మిషన్ కోసం, సర్. 428 00:29:18,091 --> 00:29:19,676 నేను తరువాతి మిషన్ కి రెడీగా ఉంటాను. 429 00:29:21,261 --> 00:29:22,471 ఏంటి, జోకులు వేస్తున్నావా, జారేట్? 430 00:29:22,554 --> 00:29:23,764 లేదు, సర్. 431 00:29:29,895 --> 00:29:32,189 ఇదేమి నీకు ఇచ్చిన ఆహ్వానం కాదు. ఇది ఆర్డర్. 432 00:29:33,065 --> 00:29:35,817 నీకు అంతా వివరించాం, పైగా నీకు ప్లానులు తెలుసు. వెళ్లి నీ సామాగ్రి రెడీ చేసుకో. 433 00:29:37,277 --> 00:29:38,278 నేను… 434 00:29:39,446 --> 00:29:40,614 నేను ఈ పని చేయగలనో లేదో తెలీడం లేదు. 435 00:29:40,697 --> 00:29:41,907 ఎందుకు చేయలేవు? 436 00:29:50,332 --> 00:29:51,625 మీ నాన్న వల్ల ఇలా అంటున్నావా? 437 00:29:55,295 --> 00:29:56,296 నేను నీ ఫైల్ చదివాను. 438 00:29:57,548 --> 00:30:00,092 హేయ్, దాదాపుగా ప్రతీ కుటుంబంలో సమస్యలు ఉంటాయి. 439 00:30:00,592 --> 00:30:02,177 లేదంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. 440 00:30:05,556 --> 00:30:06,890 అవును. 441 00:30:07,641 --> 00:30:09,184 అంటే మా నాన్న, ఆయనకి… 442 00:30:09,893 --> 00:30:11,019 ఆయనకి మానసిక సమస్యలు ఉండేవి. 443 00:30:12,312 --> 00:30:15,357 మా తాతయ్యకి కూడా, కాబట్టి నాకు కూడా అవే సమస్యలు ఉండి ఉంటే, నాకు… 444 00:30:17,860 --> 00:30:19,361 నాకు టీమ్ ని నీరసపెట్టాలని లేదు. 445 00:30:24,700 --> 00:30:25,993 ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? 446 00:30:30,789 --> 00:30:32,124 నేను ఈ విషయాన్ని దాచగలను అనుకున్నా… 447 00:30:34,209 --> 00:30:35,294 కానీ వెళ్ళడానికి సమయం దగ్గరపడుతుంటే… 448 00:30:38,922 --> 00:30:40,299 ఇది నా వల్ల అవుతుంది అనిపించడం లేదు. 449 00:30:51,310 --> 00:30:52,936 మా నాన్న పెద్ద తాగుబోతు. 450 00:30:55,063 --> 00:30:57,566 బాగా తాగినప్పుడు ఆయన కోపం ఊరికే రగులుకునేది. 451 00:30:59,443 --> 00:31:03,155 పాడ్రెస్ జట్టు ఓడిన ప్రతీసారి ఆయన నన్ను చితక్కొట్టేవాడు, 452 00:31:04,364 --> 00:31:06,325 అలాగే నన్ను నమ్ము, పాడ్రెస్ జట్టు అస్తమాను ఓడిపోయేది. 453 00:31:10,954 --> 00:31:12,164 నాకు చాలా బాధగా ఉంది. 454 00:31:12,247 --> 00:31:13,332 బాధ పడకు. 455 00:31:15,083 --> 00:31:16,210 మనం ఇది వాళ్ళ కోసం చేయడం లేదు. 456 00:31:21,507 --> 00:31:22,966 మనం వాళ్ళకంటే బెటర్, 457 00:31:23,592 --> 00:31:24,885 అది మనం ఇలాగే నిరూపించాలి. 458 00:31:26,136 --> 00:31:28,764 ఇక ఇక్కడి నుండి వెళ్లి విశ్రాంతి తీసుకో. 459 00:31:30,390 --> 00:31:31,892 మనం పొద్దున్న ఆరుకి బయలుదేరాలి. 460 00:31:40,484 --> 00:31:42,486 - బాగానే ఉన్నావా? - అవును, సార్జెంట్. 461 00:31:52,704 --> 00:31:55,207 ఇవిఎ సప్లై చెక్ లిస్ట్ ని చూద్దాం. 462 00:31:56,041 --> 00:31:57,793 ఇరవై బాటిల్స్ ఆక్సిజన్. 463 00:31:59,837 --> 00:32:04,633 లాంబ్డా ఫేజ్ జీనోమ్ డిఎన్ఏ. 3.6 కేబీ ఎనోలెస్ 2 ఆర్ఎన్ఏ 25. 464 00:32:04,716 --> 00:32:06,385 ఓరి నాయనో. 465 00:32:09,137 --> 00:32:10,430 ఇది… 466 00:32:10,514 --> 00:32:12,057 ఇది ఎందుకు… 467 00:32:12,683 --> 00:32:14,268 ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. 468 00:32:14,351 --> 00:32:16,019 నాకు ఒక నిమిషం ఇవ్వండి. మీరు చూసుకోండి. 469 00:32:25,654 --> 00:32:26,905 వాల్ట్. 470 00:32:26,989 --> 00:32:28,115 హేయ్, కెల్లీ. 471 00:32:28,198 --> 00:32:30,826 నాకు కారణం ఏంటో తెలిసేలా ఉంది అనుకుంటున్నా. 472 00:32:30,909 --> 00:32:33,495 ఇది… సిగ్నల్ వెళ్ళిన మార్గం కరెక్టుగానే ఉంది, 473 00:32:33,996 --> 00:32:38,333 కానీ సీపీయు ఇంకా గైడెన్స్ సిస్టమ్స్ మధ్య ట్రాన్స్మిషన్ సమస్యలు వచ్చి ఉండొచ్చు. 474 00:32:38,417 --> 00:32:40,377 - బాగానే కనిపెట్టావు. - అవును. 475 00:32:41,128 --> 00:32:42,379 అయితే, మరి మీరు… 476 00:32:44,047 --> 00:32:45,883 మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? 477 00:32:47,384 --> 00:32:48,510 ఇంకా లేము. 478 00:32:49,595 --> 00:32:51,305 రోవర్ తో ఏమైనా సమస్యా? 479 00:32:51,930 --> 00:32:53,599 కాదు, టీమ్ తో. 480 00:32:54,725 --> 00:32:56,059 ఏమైంది? 481 00:32:56,143 --> 00:32:58,478 వాళ్ళందరూ అద్భుతమైన క్వాలిఫికేషన్ ఉన్నోళ్లే. 482 00:32:58,562 --> 00:33:01,356 నువ్వు మిషన్ కి అత్యుత్తమమైన వాళ్ళని ఎన్నుకున్నావు. 483 00:33:01,440 --> 00:33:03,650 - థాంక్స్. - అదే సమయంలో టైటన్ పై 484 00:33:03,734 --> 00:33:07,237 అందరికంటే పెద్ద నిపుణుడు, అలాగే నేను కలిసిన 485 00:33:07,321 --> 00:33:12,159 అతిగొప్ప ఎక్సో బయాలజిస్టు కూడా మన జట్టులో ఉన్నాడు. 486 00:33:12,242 --> 00:33:14,578 కానీ ఈ మిషన్ కి తాత్కాలిక కమాండర్ గా 487 00:33:15,078 --> 00:33:17,998 అతన్ని మిషన్ కి దూరం పెడితే నేను నిర్లక్ష్యం చేసినదాన్ని అవుతాను. 488 00:33:18,665 --> 00:33:21,293 - కెల్లీ, చెప్పాను కదా, నేను… - నువ్వే నన్ను కమాండ్ లో పెట్టావు, 489 00:33:21,376 --> 00:33:23,837 కాబట్టి ఇవిఎ బృందంలో ఎవరుండాలనేది నా ఇష్టం. 490 00:33:25,005 --> 00:33:26,173 నువ్వు మాతో రావాలి. 491 00:33:26,924 --> 00:33:28,967 మనం 30 నిమిషాలలో బయలుదేరాలి. సూట్ వేసుకో. 492 00:33:29,051 --> 00:33:33,222 - కెల్లీ, నేను… నాకు… - ఇది ఆర్డర్, గ్రిబల్. 493 00:33:40,854 --> 00:33:45,025 రికార్డింగ్ 494 00:33:45,108 --> 00:33:47,611 ఒక కొత్త జీవితం ఉంటుందన్నారు 495 00:33:49,238 --> 00:33:51,323 కాంతి సంవత్సరాల దూరంలో 496 00:33:53,325 --> 00:33:59,206 పాత ప్రపంచాన్ని నాశనం చేశామని పాడు చేయడానికి క్రొత్తదాన్ని కనిపెట్టాం 497 00:34:01,208 --> 00:34:07,381 మీరు, "హేయ్, అందరూ స్పేస్ కి రండి 498 00:34:09,174 --> 00:34:15,013 మన కలిసి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని నిర్మించబోతున్నాము" అన్నారు 499 00:34:16,806 --> 00:34:20,768 కానీ అన్నీ మీ అబద్ధాలే ఇప్పటి వరకు అవే చెప్పారు 500 00:34:20,853 --> 00:34:24,231 ఈ మిషన్ ని చూస్తుంటే బంగారం కోసం వెర్రోడి వెతుకులాటలా ఉంది 501 00:34:24,313 --> 00:34:28,402 ఇప్పుడు చెప్పిన మాట విని ఎక్కువ మాట్లాడొద్దు అంటున్నారు 502 00:34:31,154 --> 00:34:34,324 అవును, ఒక మిషన్ కంట్రోల్ లాగా 503 00:34:39,161 --> 00:34:41,998 ఇక్కడ రియాక్టర్ దగ్గర ఒక్కోసారి ఒంటరిగా అనిపిస్తుంది. 504 00:34:43,125 --> 00:34:44,458 మ్యూజిక్ వల్ల కొంచెం కాలక్షేపం అవుతుంది. 505 00:34:45,418 --> 00:34:48,672 కానీ ఈ మధ్య జరుగుతున్న విషయాల వల్ల, 506 00:34:49,547 --> 00:34:52,092 నాకు పరిస్థితుల గురించి వ్రాయాలని అనిపిస్తోంది, సరేనా? 507 00:34:53,302 --> 00:34:56,597 అంటే ఇక్కడ ఏం చేయాలనే విషయం మీద మన అభిప్రాయం కూడా పరిగణించాలని. 508 00:34:57,973 --> 00:35:00,934 మనం లెక్కలేని వారిమి అన్నట్టు వాళ్ళు మనకు ఏం చేయాలో చెప్పడం మనకు నచ్చడం లేదని. 509 00:35:02,227 --> 00:35:03,228 బ్యాటరీ తక్కువ ఉంది 510 00:35:03,312 --> 00:35:05,272 - కొన్నిసార్లు నేను… - ఓహ్, ఛ. 511 00:35:06,815 --> 00:35:08,817 బ్యాటరీ దాదాపుగా అయిపోయింది. నేను దీన్ని మార్చాలి అనుకుంట. 512 00:35:09,401 --> 00:35:10,527 పర్లేదా? 513 00:35:10,611 --> 00:35:12,154 ఓహ్, దేవుడా, అది చాలా బాగుంది. 514 00:35:13,197 --> 00:35:14,573 నువ్వు ఇది ఎప్పుడు వ్రాసావు, ఆలీ? 515 00:35:15,574 --> 00:35:16,909 చాలా వారాలుగా దాని మీదే పని చేస్తున్నా. 516 00:35:17,868 --> 00:35:19,077 ఈ విషయాన్ని మాతో పంచుకున్నందుకు థాంక్స్. 517 00:35:23,332 --> 00:35:26,084 నిజానికి, లిల్స్, ఇక మనం వెనక్కి వెళితే మంచిది. 518 00:35:26,168 --> 00:35:27,503 ఆ దూళి తుఫాను బలపడుతోంది. 519 00:35:27,586 --> 00:35:29,755 నిజంగా? నేను హల్దీర్ ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా. 520 00:35:29,838 --> 00:35:33,842 సరే. కానీ నిర్ణయం తీసుకోవడానికి ముందు బయట ఎలా ఉందో చెక్ చేసుకుందాం. 521 00:35:33,926 --> 00:35:36,303 - సరే. - సరే. అలాగే. 522 00:35:48,482 --> 00:35:49,483 హైడ్రజైన్ పేలుడు పదార్థం 523 00:35:49,566 --> 00:35:52,194 మెల్లిగా తీసుకురా. నెమ్మదిగా. 524 00:35:57,574 --> 00:35:58,575 జాగ్రత్త. 525 00:36:01,078 --> 00:36:03,872 మనం ఇక్కడ ఉన్న మీసోస్పియర్ లోకి వెళ్లి దూళి తుఫాను పైకి చేరుకునే వరకు 526 00:36:03,956 --> 00:36:07,292 ఇక్కడ ఉన్న ఈ ముళ్ళు గ్రీన్ లేదా ఎల్లో రంగులో ఉండేలా జాగ్రత్తపడాలి. 527 00:36:08,168 --> 00:36:10,128 అంటే పైకి 40 కిలోమీటర్లు. 528 00:36:11,755 --> 00:36:13,590 చాలా ఈజీ, ఆహ్? 529 00:36:13,674 --> 00:36:15,259 అవును, చాలా ఈజీ. 530 00:36:19,555 --> 00:36:21,014 మాక్సి, హాపర్ 1. 531 00:36:21,098 --> 00:36:22,599 తుఫాను రీతి ఎలా ఉంది? 532 00:36:22,683 --> 00:36:23,684 హాపర్ 1. 533 00:36:23,767 --> 00:36:25,686 తగ్గడానికి ముందు ఇంకా దారుణంగా మారుతుంది. 534 00:36:25,769 --> 00:36:28,188 ఎగువ వాతావరణంలో మెరుపులు కనిపిస్తున్నాయి. 535 00:36:28,772 --> 00:36:31,567 గాలి రెండు-ఏడు-సున్నా డిగ్రీలలో అయిదు-సున్నా వేగంతో వీస్తోంది. 536 00:36:32,150 --> 00:36:33,151 సరే. అయితే, 537 00:36:34,152 --> 00:36:36,989 మీరు దాన్ని ఆన్ చేయడానికి ముందు చాలా పటిష్టంగా కట్టాలి. 538 00:36:38,323 --> 00:36:39,491 గుడ్ లక్. 539 00:37:01,722 --> 00:37:04,600 మాక్సి, హాపర్ 1. లాంచ్ కి రెడీ. 540 00:37:07,227 --> 00:37:09,521 హాపర్ 1, మీరు లాంచ్ చేయొచ్చు. 541 00:37:14,067 --> 00:37:16,486 హీలియం ఒత్తిడి తక్కువగా ఉంది. 542 00:37:16,570 --> 00:37:18,155 ప్రైమరీ ఇంధన వాల్వులు తెరుచుకున్నాయి. 543 00:37:18,238 --> 00:37:19,364 అంతా గ్రీన్ లో ఉంది. 544 00:37:20,449 --> 00:37:21,617 ఇక మొదలెట్టొచ్చు. 545 00:37:24,244 --> 00:37:25,913 జ్వలనం ఆన్ చేసాం. 546 00:37:27,080 --> 00:37:28,457 అంతా బానే ఉంది. 547 00:37:29,875 --> 00:37:31,001 రెడీగా ఉన్నావా? 548 00:37:39,218 --> 00:37:40,552 జ్వలనం. 549 00:37:51,688 --> 00:37:54,650 సైస్మోమీటర్ 550 00:37:56,235 --> 00:37:58,487 హాపర్ 1, మీ వైబ్రేషన్ లెవెల్ వార్నింగ్ 551 00:37:58,570 --> 00:38:00,697 జోన్ లో ఉంది, కానీ స్థిరంగా ఉంది. 552 00:38:14,002 --> 00:38:15,045 వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? 553 00:38:16,088 --> 00:38:19,591 తుఫాను పైకి వెళ్ళడానికి మూడు నిమిషాలు పడుతుంది, కానీ ఎగరేయడం కొంచెం కష్టం అవుతుంది. 554 00:38:19,675 --> 00:38:22,553 గాలి వేగం పెరుగుతోంది. ఇప్పుడు ఆరు-అయిదు వద్ద రెండు-మూడు-సున్నా ఉంది. 555 00:38:23,178 --> 00:38:25,472 వాళ్ళు తుఫాను బలంగా ఉన్న ప్రదేశానికి చేరుకుంటున్నారు. 556 00:38:25,556 --> 00:38:28,058 ఇప్పుడు కుదుపులు ఇంకా ఎక్కువ అవుతాయి. 557 00:38:46,577 --> 00:38:49,329 - ఓహ్, ఛ. - అదేంటి? 558 00:38:54,626 --> 00:38:55,878 మనం ఊగిపోతున్నాం. 559 00:38:55,961 --> 00:38:57,921 మాక్సి, మాపై పిడుగు పడినట్టు ఉంది. 560 00:38:58,505 --> 00:39:01,466 థ్రస్టర్ల స్పందన నెమ్మదించింది, మేము కదలడం మొదలైంది. 561 00:39:06,430 --> 00:39:09,808 వైబ్రేషన్ లు బలపడుతున్నాయి. గట్టిగా పట్టుకో. 562 00:39:15,397 --> 00:39:16,648 ఆపరేషన్ రిఫరెన్స్ గైడ్ హాపర్ 563 00:39:20,986 --> 00:39:24,948 పిడుగు వల్ల వాళ్ళ ఎలెక్ట్రికల్ ఆల్టిట్యుడ్ కంట్రోల్ అదుపు తప్పినట్టు ఉంది. 564 00:39:25,032 --> 00:39:26,950 వాళ్ళు ఫీడ్ బ్యాక్ లూప్ లో పడేలా ఉన్నారు. 565 00:39:27,868 --> 00:39:31,580 హాపర్ 1, థ్రస్టర్ బస్ ని ఆక్స్ కి మార్చి చూడండి. 566 00:39:31,663 --> 00:39:33,957 అప్పుడు స్టాటిక్ కరెంట్ పోవచ్చు. 567 00:39:34,041 --> 00:39:38,295 తుఫాను మధ్యలో మా ఇంజిన్లను ఆఫ్ చేసి ఆన్ చేయమంటారా? 568 00:39:38,378 --> 00:39:39,463 అవును. 569 00:39:42,591 --> 00:39:45,260 అలాగే. థ్రస్టర్ లను ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాం. 570 00:39:51,892 --> 00:39:54,937 కానివ్వు, నువ్వు ఇది చేయగలవు, కానివ్వు, లెన్య. 571 00:39:55,521 --> 00:39:56,939 - వేగం తగ్గుతోంది. - కానివ్వు. 572 00:39:58,190 --> 00:40:01,610 మెయిన్ ఇంజిన్లను రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. 573 00:40:05,697 --> 00:40:07,157 ఈ ప్లాన్ పని చేస్తే బాగుంటుంది. 574 00:40:08,325 --> 00:40:09,493 పని చెయ్. 575 00:40:12,454 --> 00:40:16,625 మాక్సి, మేము క్రిందకి పడుతున్నాం. కుదుపులు ఇంకా ఎక్కువవుతున్నాయి. 576 00:40:24,716 --> 00:40:27,594 పని చెయ్. 577 00:40:36,937 --> 00:40:38,814 థ్రస్టర్లు స్పందిస్తున్నాయి. 578 00:40:40,732 --> 00:40:42,442 కుదుపులు తగ్గుతున్నాయి. 579 00:40:42,526 --> 00:40:43,861 మనం దాదాపుగా చేరిపోయాం. 580 00:40:43,944 --> 00:40:45,863 హాపర్ 581 00:40:58,876 --> 00:41:01,587 భలే రైడ్ కదా, ఆహ్? 582 00:41:02,838 --> 00:41:04,798 వ్యోమగామివి కావడానికి రెడీగా ఉన్నావా? 583 00:41:04,882 --> 00:41:08,844 మాక్సి, హాపర్ 1 మళ్ళీ ఆన్లైన్ కి వచ్చింది. 584 00:41:08,927 --> 00:41:11,346 ఆర్బిట్ లోకి వెళ్లే దారిలో ఉన్నాం. 585 00:41:14,057 --> 00:41:18,228 కుజ్నెట్సోవ్ స్టేషన్ ని కలుసుకునే మార్గ నిర్దేశం జరుగుతోంది. 586 00:41:19,563 --> 00:41:22,691 మేము ల్యాండింగ్ స్పాట్ కి చేరుకునేవరకు రేడియో ఆపుతున్నాను. 587 00:41:22,774 --> 00:41:24,067 అలాగే. 588 00:41:24,151 --> 00:41:25,611 హాపర్ 1 అవుట్. 589 00:42:20,123 --> 00:42:22,209 కొండోర్, మెరైన్ 1, స్టేటస్. 590 00:42:23,126 --> 00:42:25,629 మెరైన్ 1, కొండోర్ కి ఏదీ అడ్డు లేదు. 591 00:42:25,712 --> 00:42:27,548 ఎక్స్ ఫిల్ పాయింట్ ఆల్ఫా దగ్గర లైట్స్ ఆపుతున్నాం. 592 00:42:27,631 --> 00:42:29,716 అలాగే. హాల్వే రెండు-బ్రావోలో ఏమీ లేదు 593 00:42:29,800 --> 00:42:31,969 ఇప్పుడు స్టేషన్ లో గాలింపు మొదలెడుతున్నాం. 594 00:43:09,381 --> 00:43:12,050 హెస్కల్, నువ్వు ఇంకా ఫ్లెమింగ్ తరువాతి కారిడార్ లో చూడండి. 595 00:43:12,134 --> 00:43:13,886 నేను ఇంకా టాబాస్కో ఈ రూట్ లో వెళతాం. 596 00:43:14,428 --> 00:43:15,846 మిమ్మల్ని ర్యాలీ పాయింట్ లో కలుస్తాము. 597 00:43:15,929 --> 00:43:18,098 అలాగే. మిమ్మల్ని అవతలివైపు కలుస్తాము. 598 00:43:19,474 --> 00:43:22,686 ఏజే, పాయింట్ తీసుకో. కుడివైపు ఉన్న కాంప్లెక్స్ ని కంట్రోల్ చెయ్. 599 00:43:22,769 --> 00:43:23,854 అలాగే, సార్జ్. 600 00:43:40,996 --> 00:43:44,666 మాక్సి, హాపర్ 1 చివరి చేరికలో ఉంది. 601 00:43:46,835 --> 00:43:50,047 అలాగే. మీరు ఈవాక్ హాపర్ కి చేరుకున్నాక చెప్పండి. 602 00:43:50,797 --> 00:43:51,882 రెండు మీటర్లు. 603 00:43:54,092 --> 00:43:55,302 చేరుకున్నాం. 604 00:43:56,428 --> 00:43:58,013 ట్రాన్స్ఫర్ టన్నెల్ ముందుకు వస్తోంది. 605 00:43:58,889 --> 00:44:00,182 హార్డ్ డాక్ జరిగింది. 606 00:44:00,265 --> 00:44:04,353 నేను చూడటానికి వీలుగా మా లైట్స్ డిమ్ చేస్తాను. 607 00:44:04,978 --> 00:44:07,272 సరే. ఇక నువ్వు ఊపిరి తీసుకోవచ్చు. 608 00:44:07,356 --> 00:44:09,733 ఈ బాంబులు మనతో ఉండగా నా వల్ల కాదు. 609 00:44:09,816 --> 00:44:13,278 సరే, ఇక ఇక్కడి నుండి వెళ్లి ఇవాక్ హాపర్ లోకి వెళదాం. 610 00:44:15,739 --> 00:44:17,157 టైమర్ సెట్. 611 00:44:38,136 --> 00:44:39,137 క్లియర్. 612 00:44:42,891 --> 00:44:44,184 ఏంటిది? 613 00:44:45,352 --> 00:44:47,479 సార్జ్, ఇక్కడ ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ డాక్ చేయబడి ఉంది. 614 00:44:49,648 --> 00:44:50,941 మనం వస్తున్న దారిలో అది లేదు. 615 00:44:51,650 --> 00:44:53,110 ఛ, వేరేవాళ్లు వచ్చినట్టు ఉన్నారు. 616 00:44:54,570 --> 00:44:56,280 హెస్కల్, రూయిజ్. 617 00:44:56,363 --> 00:44:58,740 ప్లాట్ఫామ్ మీద ఒక మార్సి హాపర్ డాక్ చేయబడి ఉంది. 618 00:44:58,824 --> 00:45:00,200 మీ లొకేషన్ ఎక్కడ? 619 00:45:00,284 --> 00:45:02,494 రూయిజ్, హెస్కల్. తూర్పు కారిడార్, ఎవరూ లేరు. 620 00:45:02,578 --> 00:45:05,122 కాపీ. జారేట్ ఇంకా నేను వెళ్లి విషయం ఏంటో తెలుసుకుంటాం. 621 00:45:07,291 --> 00:45:08,876 - రెడీనా? - అవును, సార్జెంట్. 622 00:46:10,646 --> 00:46:11,897 క్లియర్. 623 00:46:19,238 --> 00:46:21,073 ఛ. రూయిజ్. 624 00:46:26,703 --> 00:46:28,330 మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళాలి. 625 00:46:28,413 --> 00:46:29,581 కదులు. వెళ్ళు. 626 00:46:30,749 --> 00:46:32,167 మెరైన్స్, నేను రూయిజ్ ని. 627 00:46:32,251 --> 00:46:34,503 అందరూ ఎక్స్ ఫిల్ పాయింట్ ఆల్ఫాకి రండి. 628 00:46:35,087 --> 00:46:37,673 కొండోర్, మనం ఇంకొక మూడు నిమిషాల్లో ఈ ప్లాట్ ఫామ్ నుండి వెళ్ళిపోవాలి 629 00:46:37,756 --> 00:46:39,341 లేదంటే అందరం పోతాం. ఒక బాంబు ఉంది. 630 00:46:39,424 --> 00:46:40,801 మళ్ళీ చెప్తున్నా, ఒక బాంబు ఉంది. 631 00:46:48,851 --> 00:46:50,894 డాకింగ్ క్లాంప్లు తీసాం. 632 00:46:50,978 --> 00:46:53,564 - అదేంటి? - ఏంటి? 633 00:46:55,649 --> 00:46:56,650 ఓహ్, లేదు. 634 00:46:57,442 --> 00:46:59,319 మాక్సి, ప్లాట్ఫామ్ మీద సైనికులు ఉన్నారు. 635 00:46:59,403 --> 00:47:00,404 పేలుడుకి సమయం 636 00:47:04,867 --> 00:47:06,326 బాయ్డ్, మళ్ళీ చెప్పు. 637 00:47:06,410 --> 00:47:08,328 చూస్తుంటే సైట్ దగ్గర సైనికులు ఉన్నట్టు తెలుస్తోంది. 638 00:47:08,412 --> 00:47:09,955 వాళ్ళు రావడానికి ఇంకా రెండు గంటలు పడుతుంది అన్నారు. 639 00:47:10,789 --> 00:47:11,790 తను చెప్పింది నిజమే. 640 00:47:11,874 --> 00:47:16,003 కుజ్నెట్సోవ్ నుండి ఎం-6 వారి చెదిరిపోయి ఉన్న రేడియో ట్రాఫిక్ పికప్ చేస్తున్నాం. 641 00:47:16,712 --> 00:47:19,256 ఆపండి… పేలుడిని ఆపండి. 642 00:47:19,798 --> 00:47:21,216 మేము ఆపలేం. 643 00:47:21,300 --> 00:47:23,969 ఆ డామ్ హాపర్ పైన ఉంది. మేము సమయానికి అక్కడికి చేరుకోలేం. 644 00:47:32,352 --> 00:47:34,938 దూరం నుండి డిటొనేటర్ ని ఆపడానికి దారి ఉందా? 645 00:47:41,862 --> 00:47:45,991 పేలుడికి సమయం హాపర్ - 2003ఎల్.సి 646 00:47:49,745 --> 00:47:50,787 ఎమర్జెన్సీ రేడియో ఆన్ - ఆఫ్ 647 00:47:50,871 --> 00:47:53,999 కుజ్నెట్సోవ్ కి దగ్గరలో ఉన్న ఎం-6 యూనిట్స్ ఏమైనా ఉంటే వినండి, 648 00:47:54,082 --> 00:47:56,919 ప్లాట్ఫామ్ పేలబోతోంది. వెంటనే వెళ్లిపోండి. 649 00:47:57,002 --> 00:47:58,795 మళ్ళీ చెప్తున్నాం, వెంటనే వెళ్లిపోండి. 650 00:48:00,506 --> 00:48:02,591 - ఏం చేస్తున్నావు? - మనం వాళ్ళని హెచ్చరించాలి. 651 00:48:03,258 --> 00:48:06,553 సీలియా, నువ్వు మనల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లడానికి 30 సెకన్లు ఉన్నాయ్, లేదంటే మనం చచ్చినట్టే. 652 00:48:26,281 --> 00:48:27,282 వెళ్ళు. 653 00:48:29,326 --> 00:48:30,410 త్వరగా కదులు. 654 00:48:54,142 --> 00:48:55,727 మాక్సి, ఈవాక్ హాపర్ 1. 655 00:48:56,603 --> 00:48:57,729 ప్లాట్ ఫామ్ పేలిపోయింది. 656 00:48:57,813 --> 00:48:58,814 హాపర్ పేలింది 657 00:48:58,897 --> 00:49:00,524 ఎవరూ బ్రతికి బయటపడినట్టు లేరు. 658 00:51:54,948 --> 00:51:56,950 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్