1 00:00:01,005 --> 00:00:02,674 వారిని వెతికేంత సమయం మనకి లేదు. 2 00:00:02,758 --> 00:00:05,636 మనం ముందుగా యువరాణి మాగ్రా కోసం వెతకాలి. 3 00:00:05,719 --> 00:00:06,845 అతనేం అంటున్నాడు? 4 00:00:06,929 --> 00:00:09,932 అతను చెప్పే మాటలే నిజమైతే, మీ అమ్మ, మహారాణికి చెల్లెలు అవుతుంది. 5 00:00:10,015 --> 00:00:11,975 కంజువా కొట్టుకుపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. 6 00:00:12,059 --> 00:00:14,561 కానీ విషయమేమిటంటే, అస్సలు దాడి అంటూ ఏమీ జరగలేదు. 7 00:00:14,645 --> 00:00:18,190 మరి దానికి కారణం త్రివాంటియన్లు కాకపోతే, ఇంకెవరు అయ్యుంటారు? 8 00:00:18,273 --> 00:00:19,775 మహారాణే అయ్యుంటుంది. 9 00:00:19,858 --> 00:00:22,152 కంజువా విషయంలో మీరు చెప్పింది నిజం కాదని ప్రజలకు అనుమానం కలిగితే, 10 00:00:22,236 --> 00:00:24,279 మీరు చెప్పిన చూపు గల బిడ్డ విషయాన్ని, అలాగే దేవుడు మిమ్మల్ని ఆదేశించారని 11 00:00:24,363 --> 00:00:25,781 మీరు చెప్పిన విషయాన్ని కూడా వాళ్ళు అనుమానిస్తారు. 12 00:00:26,365 --> 00:00:28,575 -మొత్తాన్ని అనుమానిస్తారు. -అలా జరగకుండా మీరు చూసుకుంటారు. 13 00:00:28,659 --> 00:00:32,328 రాజ్యద్రోహులు ఎవరైనా ఉంటే, నేను తప్పక వారిని కనిపెడతాను. 14 00:00:33,288 --> 00:00:36,083 నువ్వు ఇడోని రక్షించినట్లయితే, ఎందుకు అతనికి నీ పట్ల అంత ద్వేషం? 15 00:00:36,166 --> 00:00:39,878 కుటుంబాలలో సంక్లిష్టమైన విషయాలు అనేకం ఉండవచ్చు. 16 00:00:39,962 --> 00:00:44,383 హార్లన్ హోదాలో ఉండే వ్యక్తి, అతని అవసరాన్ని బట్టి, 17 00:00:44,466 --> 00:00:46,260 నిప్పులు కురిపించగలడు, లేదా పూలు కూడా కురిపించగలడు. 18 00:00:46,343 --> 00:00:50,180 ఇప్పుడు అతనికి కావాల్సింది నువ్వు. 19 00:01:01,332 --> 00:01:05,169 ఎట్టకేలకు దైవ జ్వాల ఉదయించి, మనకి వెచ్చదనాన్ని ప్రసాదించింది, యువరాణి. 20 00:01:12,468 --> 00:01:14,220 శుభోదయం, మహారాణి. 21 00:01:15,763 --> 00:01:17,765 ఇది మంచి రోజు, మాగ్రా. 22 00:01:17,848 --> 00:01:20,142 ఈ ఊరంతా నీతో కలిసి ఆనందోత్సాహంలో మునిగితేలబోతోంది. 23 00:01:20,685 --> 00:01:25,064 నీ పెళ్లిని నాన్న దగ్గర ఉండి చూసి ఆనందించలేకపోవడం దురదృష్టకరం. 24 00:01:31,445 --> 00:01:34,073 పసుపు, గంధం. తేనె. 25 00:01:35,449 --> 00:01:37,451 పెళ్లి కూతురి వేషంలో ధగధగలాడిపోతావు. 26 00:01:38,995 --> 00:01:39,996 దాన్ని వదిలేయ్. 27 00:01:40,705 --> 00:01:43,541 వివాహ మహోత్సవానికి మీ ఒంటి మీద అలంకారాలేవీ ఉండకూడదు, యువరాణి. 28 00:01:43,624 --> 00:01:46,669 -లేదు. దీన్ని నేను తీసే ప్రసక్తే లేదు. -ఇది ఇక్కడి చట్టం అండి. 29 00:01:46,752 --> 00:01:49,130 చెలికత్తె, నీ పేరేంటి? 30 00:01:50,423 --> 00:01:51,966 హార్మొనీ, మహారాణి. 31 00:01:52,049 --> 00:01:54,760 హార్మొనీ? పేరు చాలా బాగుంది. 32 00:01:56,220 --> 00:01:57,595 నీ చేతిని ఇలా ఇవ్వు, హార్మొనీ. 33 00:02:03,602 --> 00:02:05,104 హార్మొనీ, 34 00:02:05,771 --> 00:02:09,275 యువరాణులకు ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పే అలవాటు నీకు ఉందా? 35 00:02:09,358 --> 00:02:12,737 అవే మహరాణికి కూడా చెప్తావా? 36 00:02:12,820 --> 00:02:14,363 లేదు, మహారాణి. 37 00:02:14,447 --> 00:02:16,115 అయితే తన మానాన తనని వదిలేసి వెళ్లిపో. 38 00:02:22,246 --> 00:02:25,666 మహారాణి పూర్తిగా పూసుకుంది. నువ్వు ఇక బయలుదేరవచ్చు, హార్మొనీ. 39 00:02:25,750 --> 00:02:26,792 అలాగే, మహారాణి. 40 00:02:37,261 --> 00:02:40,848 పెన్సన్ ప్రజలకు, అంటే ప్రతీ ఒక్కరికీ, 41 00:02:40,931 --> 00:02:45,978 అల్పులైన సేవకులకి కూడా, ఇది మనస్పూర్తిగా జరిగే పెళ్లనే అనిపించాలి. 42 00:02:46,062 --> 00:02:48,397 కంగారుపడకు. నా పాత్ర నేను బాగానే పోషిస్తాను. 43 00:02:48,481 --> 00:02:50,191 ఈ విషయంలో నేను కూడా నీకు తోడుగా ఉన్నాను. 44 00:02:50,274 --> 00:02:53,903 లేదు, నువ్వేమీ నాలాగా కట్టుకున్నవాడిని మోసం చేయట్లేదు కదా. 45 00:02:57,948 --> 00:03:00,618 ఈ పెళ్లి మనకందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. 46 00:03:01,201 --> 00:03:04,121 నీ పిల్లల ఆచూకీని కనిపెట్టి, నీ దగ్గరకి తీసుకొచ్చాక, 47 00:03:04,205 --> 00:03:06,749 ఈ అంగీకారం వల్లే వారు సురక్షితంగా ఉండగలరు. 48 00:03:12,213 --> 00:03:15,383 తమ సొంత చెల్లే ఇలా పట్టించుకోకుండా ఉంటే, కొందరు నొచ్చుకోగలరు. 49 00:03:15,466 --> 00:03:17,885 సిబెత్, నీ మాటలను ఆపడం ఎవరి తరమూ కాదు. 50 00:03:17,968 --> 00:03:19,512 ఆపాలని నేనెంతలా ప్రయత్నించానో ఆ దేవుడికే తెలుసు. 51 00:03:28,104 --> 00:03:29,105 చూడు. 52 00:03:31,649 --> 00:03:36,028 నీ చిన్నప్పుడు నీ జుట్టును నేను కడిగేదాన్ని, గుర్తుందా? 53 00:03:58,551 --> 00:03:59,802 ఆపవద్దు. 54 00:04:04,223 --> 00:04:05,224 ప్లీజ్. 55 00:06:01,007 --> 00:06:04,093 నువ్వు కాస్త... కాస్త దూరంగా ఉంటావా? 56 00:06:04,176 --> 00:06:06,804 ఈ దారిలో నన్నెవ్వరూ చంపరని నీకు ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. 57 00:06:06,887 --> 00:06:08,889 నేను ఉండగా, నిన్నెవరు చంపగలరులే. 58 00:06:08,973 --> 00:06:12,184 హనీవా. హనీవా, ఆగు. 59 00:06:14,937 --> 00:06:20,901 చూడు, నీ క్షేమం చూసుకొనే ఓ యోధురాలు నీ పక్కనే ఉంటే వచ్చే నష్టమేమీ లేదు. 60 00:06:20,985 --> 00:06:23,195 నీ వల్ల, నీ బాణాల వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డానని నాకు తెలుసు. 61 00:06:25,990 --> 00:06:27,450 నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నావు. 62 00:06:31,620 --> 00:06:34,373 నిన్నటిదాకా, అమ్మ లేదని బాధపడుతూ గడిపాను. 63 00:06:35,291 --> 00:06:37,335 నేడు, తను బతికి ఉందని తెలిసింది, అదీగాక తనొక యువరాణి, 64 00:06:38,002 --> 00:06:41,672 దానితో నేను నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, 65 00:06:42,465 --> 00:06:45,259 ఏది నిజమో, ఏది అబద్దమో అని బేరీజు వేసుకుంటున్నాను. 66 00:06:47,595 --> 00:06:49,347 త్వరలోనే అన్నీ తెలుస్తాయి, బంగారం. 67 00:06:50,389 --> 00:06:51,766 అవి అంత త్వరగా తెలిసేవి కాదులే. 68 00:06:57,813 --> 00:07:00,733 నేను మీకు ఆపద తలపెట్టే రకం కాదు. 69 00:07:03,361 --> 00:07:05,863 నా ఏహ్యభావాన్ని నువ్వు భయమనుకొని పొరబడుతున్నావు. 70 00:07:08,824 --> 00:07:13,621 ఒకటి చెప్పు, మాంత్రికాంతకుల జనరల్, నువ్వెంత మంది ప్రాణాలను తీసి ఉంటావు? 71 00:07:14,872 --> 00:07:18,125 నా ఆత్మ ఎప్పటికీ నరకంలోనే మగ్గిపోయేంత మందిని. 72 00:07:20,044 --> 00:07:23,339 అయినా, నువ్వు ఏ రాణిని అయితే సేవించేవో, ఆమెనే చంపబోతున్నావు. 73 00:07:24,882 --> 00:07:27,176 దానికి ఎంత శిక్ష అయినా తక్కువే అవుతుంది. 74 00:07:28,302 --> 00:07:31,347 అవును, తక్కువే అవుతుంది. 75 00:07:39,605 --> 00:07:42,441 -నీకు బాగానే ఉందా? -బాగానే ఉంది. 76 00:07:43,609 --> 00:07:47,279 -మనం ఇంకో రాత్రి ఆగి ఉండాల్సింది. -ఇదేమీ లేదులే. 77 00:07:48,364 --> 00:07:51,409 నీ కాళ్లు పోయినా కూడా, పాక్కుంటూ పెన్సాకి వెళ్లిపోతావు కదా. 78 00:07:52,368 --> 00:07:54,495 లేదు, అప్పుడు నువ్వే నన్ను ఎత్తుకెళ్లాల్సి ఉంటుంది. 79 00:07:56,122 --> 00:07:57,123 అబ్బా. 80 00:07:59,458 --> 00:08:01,210 త్రివాంటెస్ నుండి నరహంతకుడు అయిన బాబా వాస్ ని పారిపోకుండా 81 00:08:01,293 --> 00:08:05,881 అడ్డుకొనే క్రమంలో ఈ ధీర సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. 82 00:08:06,549 --> 00:08:09,510 వీళ్ళు వీరమరణం పొందారు, అందుకు తగిన ప్రతీకారం తీర్చుకోవాల్సిందే 83 00:08:11,012 --> 00:08:13,639 రిపబ్లిక్ యొక్క పరాక్రమవంతుడైన యోధుడు చిరస్థాయిగా మన మదిలో ఉండిపోతాడు. 84 00:08:14,932 --> 00:08:18,561 త్రివాంటెస్ ముద్దు బిడ్డ, ఇప్పుడు మనలో ఏకమైపోయాడు. 85 00:08:26,986 --> 00:08:29,488 రెండయో. బాబూ. 86 00:08:36,037 --> 00:08:37,163 మేడమ్ ఆరీ. 87 00:08:38,914 --> 00:08:41,292 రెండయో గొప్ప రాజభక్తి గలవాడు, ఒక వీరుడు. 88 00:08:42,752 --> 00:08:46,630 అతనిపై నాకున్న అభిమానాన్ని నేను మాటల్లో చెప్పలేను. 89 00:08:49,133 --> 00:08:53,387 అతని చావుకు కారణమైనవారికి చావు తప్పదు. ఒట్టేసి చెప్తున్నాను. 90 00:09:26,796 --> 00:09:28,339 ఏమైనా విషయం చెప్పాలా? 91 00:09:28,422 --> 00:09:32,218 అవును, జనరల్ వాస్. ఒక మాంత్రికాంతకుడు శరణు కోరుతున్నాడు. 92 00:09:32,301 --> 00:09:33,469 ఒక మాంత్రికాంతకుడు. 93 00:09:33,552 --> 00:09:35,388 అదే నిజమైతే, టమాక్టీ జూన్ సైనికుల్లో 94 00:09:35,470 --> 00:09:37,515 ఒకరు తమ విధులను వదిలేయడం ఇదే తొలిసారి అవుతుంది. 95 00:09:39,892 --> 00:09:41,102 అందుకు బదులుగా మనకి అతనేం ఇస్తాడు? 96 00:09:41,185 --> 00:09:44,021 కేవలం మీతోనే మాట్లాడతాడట. 97 00:09:45,773 --> 00:09:47,775 అందుకు బాధపడతాడులే. 98 00:09:48,275 --> 00:09:49,276 అతడిని తీసుకురా. 99 00:09:50,444 --> 00:09:51,445 పద. 100 00:10:00,121 --> 00:10:05,543 నేను కమాండర్ జనరల్ ఇడో వాస్ ని, నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావట. 101 00:10:05,626 --> 00:10:06,627 అవును, సర్. 102 00:10:06,711 --> 00:10:09,547 నా ముందు ఉండి ఇంకా నా కత్తి వేటుకు బలికాని 103 00:10:09,630 --> 00:10:13,467 మీ రాణి మాంత్రికాంతకుల్లో నువ్వే మొదటి వాడివి. 104 00:10:14,093 --> 00:10:16,012 మీకు కావలసిన ముఖ్యమైన సమాచారం నా దగ్గర ఉంది, సర్. 105 00:10:17,555 --> 00:10:22,727 తన సొంత రాజ్యాన్నే మోసం చేసిన సైనికుడిని నేనెందుకు నమ్మాలి? 106 00:10:22,810 --> 00:10:25,938 ఒకప్పుడు నేను రక్షిస్తానని శపథం చేసిన రాజ్యం వేరు, ఇప్పుడున్న రాజ్యం వేరు. 107 00:10:26,439 --> 00:10:27,565 అదెలా? 108 00:10:28,149 --> 00:10:29,984 మాంత్రికుల ఆకృత్యాల నుండి 109 00:10:30,067 --> 00:10:32,153 పయాన్ రాజ్యాన్ని కాపాడతానని నేను శపథం చేశాను, కాబట్టి... 110 00:10:32,236 --> 00:10:35,531 మాంత్రికాంతకుల కర్తవ్యం ఏంటో నాకు తెలుసు. 111 00:10:35,614 --> 00:10:38,659 చూపు ఉన్నవాళ్ల నుండి, అలాగే వారి రాకను కోరుకొనేవారి నుండి కాపాడాలి. 112 00:10:39,535 --> 00:10:42,413 ఇప్పుడు, మీ మహారాణి చూపు గలవారు 113 00:10:42,496 --> 00:10:44,332 మాంత్రికులు కాదని ప్రకటించింది. 114 00:10:46,083 --> 00:10:47,960 అవును, సర్. 115 00:10:48,044 --> 00:10:53,299 అంతేకాక, తన కడుపులో ఒక చూపున్న బిడ్డ పెరుగుతోందని కూడా ప్రకటించింది. 116 00:10:54,425 --> 00:10:55,426 అవును, సర్. 117 00:10:55,509 --> 00:11:01,807 నా గుఢాచారులు నాకు ఎప్పుడో చెప్పిన విషయాలను చెప్పడానికే 118 00:11:01,891 --> 00:11:06,437 నువ్వు నీ సొంత సైన్యాన్ని వదిలేసి చావును వెతుక్కుంటూ ఇక్కడిదాకా వచ్చావా? 119 00:11:08,773 --> 00:11:12,193 -వీడిని బానిస వర్తకులకు అమ్మేయండి. -వద్దు, వద్దు. 120 00:11:12,276 --> 00:11:13,611 -పద. -సర్. 121 00:11:14,403 --> 00:11:17,073 -కమాండర్ వాస్, ఇతరులు కూడా ఉన్నారు. -ఆగండి! 122 00:11:28,292 --> 00:11:29,293 ఇతరులా? 123 00:11:30,336 --> 00:11:34,131 పయాన్ రాజ వంశంలో ఆమెకి పుట్టబోయే బిడ్డే తొలి చూపుగల బిడ్డ కాదు. 124 00:11:34,674 --> 00:11:36,676 ఇద్దరు ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. 125 00:11:40,805 --> 00:11:42,765 ఈ ఎదిగిన పిల్లల్లో, 126 00:11:44,767 --> 00:11:48,896 ఒక అమ్మాయి పేరు హనీవానా? 127 00:11:50,439 --> 00:11:51,440 అవును. 128 00:12:25,182 --> 00:12:26,559 ఇదేనా పెన్సా? 129 00:12:29,311 --> 00:12:30,312 అవును. 130 00:12:39,697 --> 00:12:41,032 ఎప్పుడూ ఇలాగే నిశ్శబ్దంగా ఉంటుందా? 131 00:12:43,993 --> 00:12:46,203 లేదు. ఇలా ఎప్పుడూ ఉండదు. 132 00:12:49,707 --> 00:12:50,791 ఏదో తేడాగా ఉంది. 133 00:13:00,843 --> 00:13:02,303 ముందర కొందరు సైనికులు ఉన్నారు. 134 00:13:05,890 --> 00:13:07,641 ఇక్కడే నిశ్శబ్దంగా ఉండు. 135 00:13:08,642 --> 00:13:11,604 -మనకేమైనా సమస్య అంటావా? -మనకి కాదు, నీకు. 136 00:13:36,212 --> 00:13:38,964 -ఇది సంక్లిష్టమైన విషయమే. -ఎందుకు? మా అమ్మ ఇక్కడ లేదా? 137 00:13:39,048 --> 00:13:41,467 -ఉంది. -అయితే సమస్య ఏంటి? 138 00:13:42,468 --> 00:13:43,761 విషయమేంటంటే, 139 00:13:44,470 --> 00:13:46,389 ఆమెకి ఇవాళ పెళ్లట. 140 00:14:03,322 --> 00:14:04,490 బాబా, నా బంగారం... 141 00:14:06,409 --> 00:14:07,451 నన్ను క్షమించు. 142 00:14:09,495 --> 00:14:10,496 అమ్మా? 143 00:14:12,915 --> 00:14:13,749 అమ్మా! 144 00:14:14,583 --> 00:14:15,584 కొఫూన్? 145 00:14:16,544 --> 00:14:18,838 అమ్మా! అమ్మా! అమ్మా! 146 00:14:24,677 --> 00:14:25,886 హమ్మయ్య. నువ్వు బతికే ఉన్నావు. 147 00:14:25,970 --> 00:14:27,221 నా బంగారం. 148 00:14:28,931 --> 00:14:33,561 మనం విడిపోయిన నాటి నుండి నేను ప్రతీరోజు మీకోసం వెతుకుతూనే ఉన్నాను. 149 00:14:34,437 --> 00:14:36,022 గాలింపును నేను ఒక్కరోజు కూడా ఆపలేదు. 150 00:14:37,857 --> 00:14:40,860 అమ్మ, నీకు ఇవాళ పెళ్లి అని అంటున్నారే. 151 00:14:40,943 --> 00:14:42,403 అది నిజం కాదు, కదా? 152 00:14:43,571 --> 00:14:45,031 నేను అంతా వివరంగా చెప్తాను. 153 00:14:47,074 --> 00:14:49,368 నాన్న ఎక్కడ? హనీవా ఎక్కడ? 154 00:14:50,703 --> 00:14:52,872 హనీవాని విడిపించడానికి త్రివాంటెస్ కి వెళ్ళాడు. 155 00:14:52,955 --> 00:14:53,956 త్రివాంటెస్? 156 00:14:54,790 --> 00:14:56,125 యువరాణి మాగ్రా, సమయమైంది. 157 00:14:56,208 --> 00:14:59,754 ఒక్క నిమిషం. ఎందుకు... త్రివాంటెస్ కి ఎందుకు వెళ్ళాడు? 158 00:14:59,837 --> 00:15:02,423 -జెర్లామరెల్ కోసమని వెళ్లిన పని ఏమైంది? -నువ్వెలా పెళ్లి చేసుకోగలుగుతున్నావు? 159 00:15:02,506 --> 00:15:04,508 హార్లన్ గారు వేచి చూస్తున్నారు, రాణి అసహనానికి గురవుతున్నారు. 160 00:15:04,592 --> 00:15:06,344 -వస్తున్నాను. -ఈ హార్లన్ ప్రభువు ఎవరు? 161 00:15:06,969 --> 00:15:08,888 నేను తర్వాత నీకు అంతా వివరంగా చెప్తాను. నేను వెళ్ళాలి, కొఫూన్. 162 00:15:08,971 --> 00:15:12,516 -నువ్వు నా మీద నమ్మకం ఉంచాలి. -అమ్మా? నువ్విలా చేయకూడదు. 163 00:15:12,600 --> 00:15:15,102 నేను... నేను దీన్ని ఆపలేను. 164 00:15:15,728 --> 00:15:16,729 మీ నాన్న అయితే అర్థం చేసుకుంటాడు. 165 00:15:16,812 --> 00:15:20,149 లేదు, చనిపోయిన తన భార్య మళ్లీ ఎందుకు పెళ్లాడుతుందో ఆయన అర్థం చేసుకోలేడు. 166 00:15:20,232 --> 00:15:21,567 -కొఫూన్... -నా పేరును పలకడం ఆపేసి, 167 00:15:21,650 --> 00:15:23,152 దీని నుండి బయటపడటానికి ఏదోకటి చేయ్! 168 00:15:23,235 --> 00:15:26,530 నాకేం జరుగుతోందో తెలీదు అమ్మా, కానీ నువ్వు ఈ పని చేయకూడదు. 169 00:15:26,614 --> 00:15:27,782 ఇక ఆపు! 170 00:15:28,616 --> 00:15:32,620 నేనింకా మీ అమ్మనే, నేనేమీ మారలేదు, ఇంకా నువ్వు కూడా నా కొడుకువే. 171 00:15:33,579 --> 00:15:35,373 కానీ పరిస్థితులు మారిపోయాయి. 172 00:15:36,916 --> 00:15:39,960 ఇప్పుడు ఈ పని నేను నీ కోసమే చేస్తున్నా, మనందరి కోసం చేస్తున్నా. 173 00:15:41,170 --> 00:15:44,298 కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. నా గదిలో ఇక్కడే ఉండు, 174 00:15:44,965 --> 00:15:46,425 ఎవరితో మాట్లాడకు, 175 00:15:47,677 --> 00:15:51,263 ఇదంతా అయిపోయాక నేను నీకు వివరంగా చెప్తాను. నిజంగానే చెప్తాను. 176 00:15:53,516 --> 00:15:56,435 -మాట ఇస్తున్నాను. -ఈ పని చేయకు. 177 00:15:58,312 --> 00:15:59,814 -ఈ పని చేయకు. -నాకు వేరే దారి లేదు. 178 00:16:10,366 --> 00:16:13,452 నేను నిన్ను చాలా ప్రశ్నలు అడగాలి. 179 00:16:22,962 --> 00:16:24,046 ఇక చాలు. 180 00:16:24,130 --> 00:16:26,549 -ఒక క్షణం ఆగితే సరిపోతుంది. -ప్యారిస్? 181 00:16:31,971 --> 00:16:32,972 పట్టుకోకు. 182 00:16:33,931 --> 00:16:36,350 నీ గుడ్డలను పట్టుకుంటేనే తెలిసిపోతుంది, నీకు బాగా జ్వరంగా ఉందని. 183 00:16:37,184 --> 00:16:40,021 -దాని వల్ల నేనేమీ చావనులే. -నీకు వైద్యుడు కావాలి. 184 00:16:40,521 --> 00:16:41,939 పెన్సాలో చూపించుకుంటాలే. 185 00:16:42,023 --> 00:16:44,650 బాబా. అక్కడికి చేరుకొనేలోపు నువ్వు చస్తావు. 186 00:16:46,360 --> 00:16:49,280 మనం ఇప్పుడు సరస్సుల పల్లెలో ఉన్నాం, వాలియర్ తెగవాళ్లు దగ్గర్లోనే ఉంటారు. 187 00:16:49,363 --> 00:16:51,699 వాళ్లు మనకి నీడని ఇచ్చి, వైద్య సహాయం కూడా చేస్తారు. 188 00:16:52,575 --> 00:16:53,576 నాన్నా? 189 00:16:56,829 --> 00:16:57,663 దయచేసి మాట విను. 190 00:16:59,665 --> 00:17:00,958 సరే, బంగారం. 191 00:17:01,834 --> 00:17:04,837 వాలియర్ భూభాగంలోకి నేను మీతో రాలేను. 192 00:17:05,379 --> 00:17:07,256 మేము అక్కడికే వెళ్తున్నాం మరి. 193 00:17:07,340 --> 00:17:10,301 రహస్య తెగలు నాకు రహస్యం కాదు అనే విషయాన్ని గమనించండి. 194 00:17:11,177 --> 00:17:13,846 వాలియర్ వాళ్ళు నా కారణంగా చాలా నష్టపోయారు. 195 00:17:22,521 --> 00:17:26,859 దగ్గర్లోనే చడీచప్పుడు చేయకుండా ఉండు, బయలుదేరేటప్పుడు అందరం కలుసుకుంటాం. 196 00:17:31,280 --> 00:17:32,365 లేదా నువ్వు లేకుండానే వెళ్లిపోతామేమో. 197 00:18:20,663 --> 00:18:24,041 ఓ దేవుడా, నీ దయ చూపి... 198 00:18:26,127 --> 00:18:28,754 ఈ పవిత్ర వివాహ పర్వదినాన 199 00:18:28,838 --> 00:18:31,215 నీ దీవెనలను కురిపించు. 200 00:18:33,217 --> 00:18:36,679 మార్గనిర్దేశాన్ని ఇవ్వు, మార్గాన్ని చూపు, 201 00:18:36,762 --> 00:18:43,060 మమ్మల్ని వ్యత్రిరేకించేవారిని నీ జ్వాలలో దహనము చేసేయి. 202 00:18:44,311 --> 00:18:50,484 ఎందుకంటే, అంధకారం, అధికారం, ఇంకా కీర్తి అంతా నీవే. 203 00:18:52,111 --> 00:18:54,030 ఎన్నాళ్ళకైనా, ఎప్పటికైనా. 204 00:19:16,886 --> 00:19:21,182 యువరాణి మాగ్రా మరియు హార్లన్ ప్రభువు... 205 00:19:25,811 --> 00:19:28,981 మీరిద్దరూ ఈ దైవ ముహూర్తాన ఒక్కటి కానున్నారు. 206 00:19:49,126 --> 00:19:51,962 దైవ సమక్షంలో, మీ మనస్సులు, తనువులు ఏకం చేయడం ద్వారా 207 00:19:52,046 --> 00:19:55,174 మీరు ఒకరికొకరు విధేయతతో కట్టుబడి ఉంటారని శపథం చేశారు. 208 00:19:56,884 --> 00:20:03,849 కనుక, దైవం నాకు అనుగ్రహించిన శక్తి చేత, మీ బంధాన్ని ఖాయం చేస్తున్నాను. 209 00:21:38,027 --> 00:21:39,028 ధన్యవాదాలు, మీకు కూడా. 210 00:21:44,575 --> 00:21:46,535 యువరాణి మాగ్రా. 211 00:21:48,287 --> 00:21:53,000 -హార్లన్ భార్య నాకు సోదరితో సమానం, -మాగ్రా, నీకు నా తమ్ముడు గుర్తున్నాడుగా. 212 00:21:53,709 --> 00:21:58,089 -ధన్యవాదాలు. -కెర్రిగన్. నేను నీ డయాపర్లు మార్చాను. 213 00:21:58,673 --> 00:22:01,509 ఇప్పుడు ఆ అవసరం లేదులే, ఆ పని కోసం వేరేవాళ్ళు ఉన్నారు. 214 00:22:05,888 --> 00:22:06,931 ధన్యవాదాలు. 215 00:22:08,724 --> 00:22:09,892 చాలా చాలా ధన్యవాదాలు. 216 00:22:10,976 --> 00:22:12,186 నన్ను మన్నించండి. క్షమించండి. 217 00:22:14,021 --> 00:22:16,190 చాలు. ఇక వెళ్లు. లేయి. వెళ్లు. 218 00:22:29,996 --> 00:22:32,373 -దగ్గరికి వచ్చేశామా? -అవును. 219 00:22:32,456 --> 00:22:34,667 ఎందుకంటే, ఆ బండ బాబు, ఇంకా దూరం నడవవలేడనుకుంటా, 220 00:22:34,750 --> 00:22:36,377 అతడిని నేను మోయను కూడా లేను. 221 00:22:39,797 --> 00:22:40,798 ఎవరక్కడ? 222 00:22:41,632 --> 00:22:42,675 ఎవరో చెప్పండి. 223 00:22:42,758 --> 00:22:45,970 మీరెవరో చెప్పకుండా వాలియర్ భూభాగంలోకి ఎలా రాగలరు? 224 00:22:46,595 --> 00:22:50,808 సోదరా! మా వల్ల మీకే హానీ జరగదు. నేను ప్యారిస్ ని. 225 00:22:50,891 --> 00:22:52,852 ఆల్కెన్నీ తెగకు చెందిన ఆఖరివాళ్ళం. 226 00:22:52,935 --> 00:22:56,230 కాదు. ఆల్కెన్నీ తెగకి చెందిన ఆఖరి దాన్నంటే నేనే. 227 00:22:57,565 --> 00:22:59,942 -పారాహుషార్. -పారాహుషార్. 228 00:23:00,026 --> 00:23:01,777 బో! 229 00:23:02,278 --> 00:23:03,362 లయన్. 230 00:23:04,447 --> 00:23:05,531 బో లయన్. 231 00:23:08,576 --> 00:23:09,869 ప్యారిస్. 232 00:23:37,563 --> 00:23:38,564 కొఫూన్? 233 00:23:40,149 --> 00:23:41,150 లోపల ఉన్నది నువ్వేనా? 234 00:23:43,527 --> 00:23:44,695 పర్వాలేదులే. నీకేమీ కాదు. 235 00:23:45,821 --> 00:23:46,864 నేను మీ పెద్దమ్మ సిబెత్ ని, 236 00:23:50,159 --> 00:23:53,579 నువ్వు ఇక్కడికి చేరుకున్నావని తెలిసి చాలా సంబరపడిపోయాను. 237 00:23:53,663 --> 00:23:56,374 నీ కోసం మేము చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాం. 238 00:24:05,716 --> 00:24:06,926 వచ్చి నన్ను హత్తుకుంటావా? 239 00:24:29,824 --> 00:24:31,575 నువ్వు మీ అమ్మానాన్నల కన్నా ఎత్తుగా ఉన్నావు. 240 00:24:34,578 --> 00:24:38,082 నీకు ఏమైనా కావాలా? తాగడానికి ఏమైనా? నేను తెప్పించగలను. 241 00:24:38,165 --> 00:24:40,710 వద్దు. పర్వాలేదు. 242 00:24:42,253 --> 00:24:45,464 మనం ఇప్పుడే తొలిసారి కలవడమనేది చాలా బాధాకరమైన విషయం. 243 00:24:47,633 --> 00:24:49,468 మా చిన్ననాటి నుంచి నువ్వు మమ్మల్ని వేటాడుతూనే ఉన్నావు. 244 00:24:53,556 --> 00:24:55,933 మాగ్రా, తను బతికే ఉందన్న సమాచారం ఇదివరకే నాకు ఇచ్చుంటే, 245 00:24:56,017 --> 00:24:59,186 నేను తనని, మిమ్మల్ని కాపాడేదానిని. 246 00:25:00,271 --> 00:25:01,480 ఆ విషయం తనకి తెలుసు. 247 00:25:02,690 --> 00:25:05,735 మా లక్ష్యం జెర్లామరెల్, అతని సంతానం. 248 00:25:05,818 --> 00:25:07,486 అందులో మాగ్రా సంతానం కూడా ఉంటుందని నాకు తెలీదు. 249 00:25:08,195 --> 00:25:11,949 జెర్లామరెల్ నా చెల్లిని చంపేశాడు అనే నాకు చెప్పారు, 250 00:25:12,033 --> 00:25:13,326 అతనొక క్రూరుడు. 251 00:25:13,409 --> 00:25:16,579 అది నిజం కాదని నీకు తెలుసు. మా అమ్మ రహస్యంగా ఎందుకు బతికింది? 252 00:25:18,080 --> 00:25:19,623 తను ఏ తప్పులు చేసి ఉన్నా కానీ, 253 00:25:20,750 --> 00:25:24,170 అవి నిన్నూ, నీ సోదరినీ సురక్షితంగా ఉంచడానికే చేసి ఉంటుంది, 254 00:25:24,795 --> 00:25:26,464 ఇప్పుడు నా ప్రయత్నం కూడా అదే. 255 00:25:26,547 --> 00:25:29,008 నువ్వు ప్రకటించినా కానీ, 256 00:25:29,091 --> 00:25:31,594 పయాన్ ప్రజలు, మాంత్రికుడు అంటే తగలబెట్టేయాలనే అనుకుంటారు. 257 00:25:31,677 --> 00:25:33,804 మనస్సులను నేను మార్చగలని నాకు పేరు ఉంది. 258 00:25:34,805 --> 00:25:36,682 కాస్త సమయం పట్టవచ్చు, 259 00:25:36,766 --> 00:25:42,104 చూపున్నవాళ్లు వరంలాంటి వారు అని 260 00:25:43,898 --> 00:25:47,276 నేను ఎలా అయితే తెలుసుకున్నానో, అలాగే పయాన్ ప్రజలు కూడా తెలుసుకుంటారు. 261 00:25:52,782 --> 00:25:54,367 ఇంత దూరం వచ్చి, 262 00:25:55,868 --> 00:25:59,580 మీ అమ్మ పెళ్లి చూడటం నీకు చాలా బాధని కలిగించి ఉంటుంది. 263 00:26:00,206 --> 00:26:01,832 ప్రపంచం తలకిందులు అయిపోనట్టుగా అనిపించి ఉంటుంది. 264 00:26:04,001 --> 00:26:05,544 కానీ ఓ విషయం తెలుసుకో, 265 00:26:06,337 --> 00:26:10,508 నువ్వు నా రాజ్యంలో ఉన్నంత వరకూ, నిన్ను ఎవరూ ఏమీ చేయరు. 266 00:26:11,759 --> 00:26:13,302 నువ్వు నన్ను నమ్ముతావా? 267 00:26:17,431 --> 00:26:18,432 నాకు తెలీదు. 268 00:26:19,975 --> 00:26:21,018 నాకు నమ్మాలనే ఉంది. 269 00:26:22,978 --> 00:26:24,105 అర్థం చేసుకోగలను. 270 00:26:25,272 --> 00:26:28,734 అత్యధిక శాతం మంచి విషయాలన్నీ... కోరికతోనే మొదలవుతాయి. 271 00:26:37,118 --> 00:26:40,329 నీకోసం నేనొక గదిని ఏర్పాటు చేశాను. త్వరలోనే మళ్లీ కలుద్దాం, ఏమంటావు? 272 00:26:58,431 --> 00:27:01,100 కేన్ మహారాణి యుద్ధ వ్యవహారాల కౌన్సిల్ సైన్యాన్ని మోహరిస్తోంది. 273 00:27:01,600 --> 00:27:04,895 పయాన్ ఫిరాయింపుదారు నుండి మాకో విషయం తెలిసింది, 274 00:27:04,979 --> 00:27:07,106 అదేంటంటే, యువరాణి మాగ్రా తిరిగి రావడమే కాకుండా, 275 00:27:07,732 --> 00:27:10,609 తన ఎదిగిన పిల్లలైన హనీవా మరియు కొఫూన్ తో వచ్చింది. 276 00:27:11,902 --> 00:27:13,112 ఇద్దరికీ చూపు ఉంది. 277 00:27:13,195 --> 00:27:16,282 పయాన్ మూర్ఖులు వాళ్లని దహనం చేసేస్తారు. 278 00:27:17,241 --> 00:27:19,035 తమ రాణి ఎలా చెప్తే వాళ్లు అలా చేస్తారు. 279 00:27:19,118 --> 00:27:22,079 ఇప్పుడు ఆ రాజవంశంలో ఇద్దరు ఎదిగిన చూపున్న వారు ఉన్నారు, 280 00:27:22,788 --> 00:27:24,457 ఇప్పుడు వాళ్ళతో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. 281 00:27:24,540 --> 00:27:26,709 వాళ్ల ఉద్దేశాలు మనకి తెలియవు కదా. 282 00:27:26,792 --> 00:27:27,877 వాళ్ళ మాంత్రికాంతకుల జనరల్ ని 283 00:27:27,960 --> 00:27:30,379 చెరసాల నుండి విడిపించడానికి పెద్ద సాహసమే చేశారని మనకి తెలుసు కదా. 284 00:27:31,172 --> 00:27:33,632 ఆ ఉద్దేశం చాలు. మనం తక్షణమే దాడి చేయాలి. 285 00:27:33,716 --> 00:27:37,595 పయాన్లు మన మీద దాడి చేయడమంటే, తమ గోతిని తాము తవ్వుకున్నట్టే. 286 00:27:38,846 --> 00:27:42,141 ఆ రాణి పిచ్చిది అయ్యుండవచ్చు, కానీ తను దద్దమ్మ మాత్రం కాదు. 287 00:27:42,224 --> 00:27:45,186 అయినా కానీ, ఇవన్నీ మనకి ఇబ్బందికరమైన అంశాలే. 288 00:27:46,270 --> 00:27:47,563 నేను చిటికెలో మన సైన్యాన్ని మోహరించి... 289 00:27:47,646 --> 00:27:48,939 వద్దు, ఆవేశపడకు, ఇడో. 290 00:27:49,857 --> 00:27:53,361 ఇప్పటికీ పశ్చిమం వైపు గానైట్లు మనకి చుక్కలు చూపిస్తున్నారు. 291 00:27:53,444 --> 00:27:56,447 తూర్పు ప్రాంతం మీద దాడిపై కౌన్సిల్ ఏం అన్నదో 292 00:27:56,530 --> 00:27:58,074 నువ్వే స్వయంగా ఇక్కడే ఉండి విన్నావు కదా. 293 00:27:58,157 --> 00:28:01,494 -నువ్వు వాళ్ళని ఎప్పటికీ ఒప్పించలేవు. -నేను కాదు. ఆ పని నువ్వు చేయాలి. 294 00:28:01,577 --> 00:28:03,788 నువ్వు నా పలుకుబడి గురించి మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. 295 00:28:03,871 --> 00:28:06,165 ట్రయాంగిల్ లోని మూడు భాగాల్లో నేను కేవలం ఒక్క భాగాన్ని మాత్రమే. 296 00:28:08,042 --> 00:28:09,043 అయినప్పటికీ, 297 00:28:09,752 --> 00:28:14,215 పయాన్లతో దౌత్య సమావేశాన్ని ఏర్పాటు చేయమని నేను కౌన్సిల్ ని ఒప్పిస్తాను. 298 00:28:14,298 --> 00:28:17,802 -త్రివాంటియన్లు శాంతి కోసం దేహీ అనరు. -మేమేం చేయాలో అదే చేస్తాం. 299 00:28:18,594 --> 00:28:21,430 ఇక నువ్వు నీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలి. అర్థమైందా? 300 00:28:24,725 --> 00:28:25,851 అర్థమైంది, సర్. 301 00:28:25,935 --> 00:28:29,897 ఒకవేళ అవసరం వస్తే, దీని వల్ల మనకి ఒకట్రెండు దళాలాను 302 00:28:29,980 --> 00:28:32,358 తూర్పు ప్రాంతానికి తరలించే సమయమైనా దక్కుతుంది. 303 00:28:33,025 --> 00:28:34,318 అర్థమైంది. 304 00:28:37,738 --> 00:28:41,200 కౌన్సిల్ నిర్ణయమేంటో నేను నీకు తెలియజేస్తాను. 305 00:28:56,632 --> 00:29:00,803 నిదానంగా, సుదీర్ఘంగా శ్వాస ఆడించు, బాబా, ఆ తర్వాత దీన్ని తాగు. 306 00:29:04,598 --> 00:29:05,808 ఇది నీకు శక్తిని ఇస్తుంది. 307 00:29:13,691 --> 00:29:15,443 నువ్వు వైద్యురాలివి ఎప్పుడయ్యావు? 308 00:29:16,736 --> 00:29:20,573 ఇంకా కాలేదు, ఇక్కడున్న వైద్యుల నుండి నేర్చుకుంటూ ఉన్నాను. 309 00:29:23,367 --> 00:29:26,704 ఆ వేర్లు సంక్రమణలను పీల్చుకుంటాయి, దానితో నీ జ్వరం తగ్గుతుంది. 310 00:29:27,955 --> 00:29:31,667 మా వల్ల నువ్వు చాలా కోల్పోయావు. 311 00:29:33,711 --> 00:29:35,046 అయినా, నువ్వు మమ్మల్ని చేరదీశావు. 312 00:29:39,508 --> 00:29:41,052 మనమంతా ఒక తెగవారమే, గుర్తుందా? 313 00:29:45,723 --> 00:29:46,974 అవును, గుర్తుంది. 314 00:30:33,562 --> 00:30:34,563 కొఫూన్? 315 00:30:35,523 --> 00:30:37,358 కాదు, నేను కొఫూన్ ని కాదు. 316 00:30:39,610 --> 00:30:41,153 ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 317 00:30:41,821 --> 00:30:45,282 మాగ్రా, ఇది మన తొలిరాత్రి, నేను ఇంకెక్కడ ఉంటాను? 318 00:30:48,703 --> 00:30:51,372 ఇది పెళ్లి కాదు. ఇదొక ఒప్పందం మాత్రమే. 319 00:30:51,872 --> 00:30:55,042 అవును, కానీ... ఇది ఆ రెండూ కావచ్చు కదా. 320 00:30:59,964 --> 00:31:02,425 ప్యాంటు వేసుకో, హార్లన్. నాకు నీ సాయం కావాలి. 321 00:31:04,260 --> 00:31:05,469 -వెంటనే. -అలాగే. 322 00:31:30,036 --> 00:31:32,413 నీకు కోడి కూరని, సారాయిని దొంగచాటుగా ఇమ్మని నన్ను పంపారు. 323 00:31:33,122 --> 00:31:35,875 కంగారుపడకు. ఇందులో విషం కలిపానేమో అని నువ్వనుకుంటుంటే, అలాంటిదేమీ లేదు. 324 00:31:38,085 --> 00:31:39,420 నేను అలా ఆలోచించనే లేదు. 325 00:31:40,129 --> 00:31:41,964 నా దగ్గర విషం లేకుండా పోయింది. 326 00:31:46,427 --> 00:31:48,721 మా ప్రియమైన ఆల్కెన్నీ సోదరసోదరీమణులారా, 327 00:31:48,804 --> 00:31:51,557 పోయినసారి మీరు మా ఆశ్రయం కోరి వచ్చినప్పుడు, మేము తిరస్కరించాం. 328 00:31:52,099 --> 00:31:55,811 మీరు మా బో లయన్ కి వైద్యం అందించారు. అంత కన్నా మాకు కావలసిందేముంది. 329 00:31:55,895 --> 00:31:59,565 మీరు మళ్లీ తిరిగి వచ్చి, మాలో ఆశలను నింపారు. 330 00:32:00,024 --> 00:32:02,485 మీ వల్ల మాంత్రికాంతకులు మా వద్దకు వస్తారేమో అని మేము భయపడ్డాం, 331 00:32:02,568 --> 00:32:06,906 ఎందుకంటే, వాళ్ళంతకుముందు వచ్చినప్పుడు, చూపున్నవారు ఆల్కెన్నీలో ఉన్నారనన్నారు. 332 00:32:08,574 --> 00:32:12,495 వాళ్ళు మగవారిని, ఆడవారిని, పిల్లలను అందరినీ ఊచకోత కోశారు. 333 00:32:13,746 --> 00:32:15,539 వాళ్ళ కత్తులు ఎవరినీ వదిలిపెట్టలేదు, 334 00:32:16,582 --> 00:32:19,877 మాంత్రికుల ఆచూకీ గురించి మాకు తెలుసని మాంత్రికాంతకులు నమ్మి ఆ పని చేశారు. 335 00:32:20,878 --> 00:32:23,923 ఇతరులకు కూడా భయం తెలిసివస్తుందని మాలో కొందరిని చంపకుండా వదిలేశారు. 336 00:32:26,425 --> 00:32:30,429 కానీ మేము మళ్లీ పునర్నిర్మితమవుతాం. ఇప్పటికే కొత్త సంతతి చేరుతోంది కూడా. 337 00:32:31,263 --> 00:32:36,143 చనిపోయిన మా వాళ్లకి నివాళిగా, మళ్లీ మేము మా తెగకు పూర్వవైభవం తీసుకువస్తాం. 338 00:32:39,188 --> 00:32:40,272 ఆపండి! 339 00:32:42,942 --> 00:32:47,321 ఇకపై రాణి, మాంత్రికాంతకులను పంపబోదనే విషయం ఇప్పుడు తెలిసింది, 340 00:32:47,405 --> 00:32:49,532 ఆమె ఇప్పుడు మాంత్రికుల కోసం వెతికే పని ఆపివేసిందట. 341 00:32:51,826 --> 00:32:53,869 మహారాణి తన మనస్సును మళ్లీ మార్చుకున్నా మార్చుకోవచ్చు, 342 00:32:53,953 --> 00:33:00,042 కానీ ఈరాత్రి, త్రివాంటెస్ నుండి మీరు తప్పించుకోవడాన్ని, అలాగే రాణి నుండి... 343 00:33:00,126 --> 00:33:01,752 [సంకేతాలను ఇస్తోంది] ఇక్కడికి టమాక్టీ జూన్ వచ్చాడు. 344 00:33:01,836 --> 00:33:05,089 ...ఆమె మాంత్రికుల నుండి మనకి దక్కిన ప్రస్తుత స్వేచ్ఛని వేడుక చేసుకుందాం. 345 00:33:06,549 --> 00:33:08,884 ఇవి అస్థిరమైన సమయాలు, 346 00:33:08,968 --> 00:33:10,970 కానీ గతం కన్నా మన భవిష్యత్తు 347 00:33:11,053 --> 00:33:14,140 మరింత శాంతివంతంగా ఉంటుందనే ఆశతో మనం వాటిని ఎదుర్కొందాం. 348 00:33:18,728 --> 00:33:20,271 నీకేమైనా పిచ్చి పట్టిందా? 349 00:33:21,605 --> 00:33:25,317 వాలియర్లు ప్రతీకారం తీర్చుకోవాలి. నేను వాళ్లకి ఎంతో చేటు చేశాను. 350 00:33:25,401 --> 00:33:26,986 లేదు, నువ్వు నాకు ఋణపడి ఉన్నావు, మాంత్రికాంతకా. 351 00:33:27,069 --> 00:33:30,698 నీ గొంతు విన్న ప్రతీసారి నాకు నిన్ను నరికేయాలని అనిపించదనుకుంటున్నావా? 352 00:33:32,575 --> 00:33:34,285 నువ్వు మావాళ్ళని కూడా చంపేశావు. 353 00:33:36,037 --> 00:33:37,621 కానీ నువ్వు చావకూడదు. 354 00:33:38,622 --> 00:33:41,334 నువ్వు చేసిన పాపాలను తలుచుకుంటూ జీవించడమే నీ శిక్ష. 355 00:33:45,254 --> 00:33:49,050 జీవించడానికి లాగానే చావుకు కూడా అర్హత సంపాదించాలి, మాంత్రికాంతకా. 356 00:34:12,907 --> 00:34:14,492 అతనికి ఇష్టమైన ప్రదేశం ఇది. 357 00:34:16,202 --> 00:34:19,872 ఇది... ఇది అతని ఇష్టమైన కుర్చీ. 358 00:34:21,165 --> 00:34:22,917 కెర్రిగన్. లేయ్. 359 00:34:23,000 --> 00:34:24,335 లేయ్. లేయ్. త్వరగా లేయ్. 360 00:34:27,296 --> 00:34:28,297 యువరాణి. 361 00:34:30,049 --> 00:34:32,093 మీ నుండి ఇంకా నాకు మల్లెపూల వాసన వస్తోంది. 362 00:34:33,052 --> 00:34:36,722 మీరిద్దరూ ఇప్పుడు ఇంట్లో శోభనం చేసుకుంటూ ఉండాలి కదా. 363 00:34:36,806 --> 00:34:37,973 నాకు నీ సాయం కావాలి. 364 00:34:38,057 --> 00:34:42,561 -అన్నయ్య, నీ వల్ల కాలేదా? -నువ్వు సరిహద్దును దాటీ వెళ్లాలి. 365 00:34:45,147 --> 00:34:46,565 ఏం తీసుకురావాలి? 366 00:34:47,149 --> 00:34:48,651 తన కూతురు హనీవాని తీసుకురావాలి. 367 00:34:50,152 --> 00:34:52,113 త్రివాంటియన్ సైన్యం తనని బందించి ఉంది. 368 00:34:54,031 --> 00:34:54,865 అవును. 369 00:34:55,574 --> 00:34:56,784 తూర్పు తిరిగి దండం పెట్టు. 370 00:34:57,451 --> 00:34:58,452 దయచేసి, ఈ పని చేసి పెట్టు. 371 00:34:58,536 --> 00:35:02,498 యువరాణి, సాధారణంగా నా వ్యవహారాల్లో, 372 00:35:02,581 --> 00:35:05,584 నేను సైన్యానికి దూరంగా ఉంటాను, వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళను. 373 00:35:05,668 --> 00:35:06,919 కెర్రిగన్. 374 00:35:14,050 --> 00:35:18,055 తను నిజంగానే సైనిక చెరసాలలో ఉంటే, తనని నేను బయటకు తీసుకురాలేను. 375 00:35:18,139 --> 00:35:22,351 అలా అనకు. అందరిలాగానే జైలు గార్డులను కూడా కొనేయవచ్చు. 376 00:35:22,434 --> 00:35:23,728 కావచ్చు. 377 00:35:23,811 --> 00:35:26,354 కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. 378 00:35:26,439 --> 00:35:27,731 నీకా, ఆ జైలు గార్డులకా? 379 00:35:29,108 --> 00:35:31,818 -అలా అని నన్ను బాధపెట్టారు, మహారాణి. -వీడికి అంత లేదులే. 380 00:35:33,362 --> 00:35:37,325 నేనేమీ బాధపడలేదులే. అయినా, అదంత చిన్న విషయం కాదు. 381 00:35:37,825 --> 00:35:41,245 తనని కనిపెట్టాక, సురక్షితంగా తనని త్రివాంటెస్ బయటకు ఎలా తీసుకురాగలవు? 382 00:35:42,246 --> 00:35:44,248 నగరం నుండి బయటపడటం చాలా తేలిక. 383 00:35:44,332 --> 00:35:49,045 గానైట్ గంజాయిని త్రివాంటెస్ నుండి పెన్సాకి ఎన్నో ఏళ్లుగా దొంగచాటుగా తరలిస్తున్నాను. 384 00:35:51,756 --> 00:35:57,970 ఆ నగరం లోపలికి వెళ్లడానికి, అలాగే బయటకు రావడానికి ప్రతీదారి నాకు తెలుసు. 385 00:35:59,555 --> 00:36:00,556 అయితే ఆ పని నువ్వు చేస్తావా? 386 00:36:05,394 --> 00:36:09,523 ఇది మీ ఇద్దరికీ నేను ఇచ్చే పెళ్లి కానుక అనుకో. 387 00:36:12,526 --> 00:36:15,154 దైవ జ్వాల ఉదయించగానే నేను బయలుదేరుతాను. 388 00:36:16,072 --> 00:36:17,156 నువ్వు ఇప్పుడే బయలుదేరాలి. 389 00:36:18,324 --> 00:36:20,159 సరే. ఇక పైకి లేయ్. 390 00:36:57,238 --> 00:36:59,532 వద్దు. ఇది సరైన సమయం కాదు. 391 00:37:02,159 --> 00:37:04,662 ప్యారిస్? వీడిని మీరు ఇక్కడికి ఎలా తీసుకురాగలిగారు? 392 00:37:04,745 --> 00:37:07,206 అసలు వీడిని పక్కనే ఉంచుకొని మీరు ఎలా ఉండగలుగుతున్నారు? 393 00:37:07,289 --> 00:37:09,959 మనకి అతని అవసరం ఉంది. ఇప్పుడు అతని లక్ష్యం వేరు. 394 00:37:10,042 --> 00:37:13,254 లేదు. వీడు ఈ రాత్రి నా చేతుల్లో చావాల్సిందే. 395 00:37:15,589 --> 00:37:16,716 వీడు మా అమ్మను చంపాడు. 396 00:37:16,799 --> 00:37:19,969 అవును. సమయం వచ్చినప్పుడు అతను ఖచ్చితంగా దానికి అనుభవిస్తాడు. 397 00:37:20,845 --> 00:37:22,471 నువ్వు ఇలా మారిపోయావంటే నేను నమ్మలేకపోతున్నాను. 398 00:37:24,223 --> 00:37:25,307 నువ్వు దేశద్రోహివి. 399 00:37:25,850 --> 00:37:28,436 మాగ్రాని చేరుకోవాలంటే మాకున్న ఏకైక ఆశాకిరణం అతడే. 400 00:37:28,519 --> 00:37:30,938 మాంత్రికాంతకులు వాలియర్లను ఊచకోత కోశారు. 401 00:37:32,565 --> 00:37:34,233 వీడు ఇక్కడే ఉన్నాడని వాళ్లకు తెలియాల్సిన అవసరం ఉంది. 402 00:37:34,316 --> 00:37:38,195 దయచేసి వాళ్లకి చెప్పకు. చెప్పకూడదు. 403 00:37:40,364 --> 00:37:43,492 -నేను నిన్ను నమ్మాను. -బో లయన్. బో లయన్. 404 00:37:45,077 --> 00:37:46,078 నా గురించి నీకు బాగా తెలుసు. 405 00:37:47,580 --> 00:37:49,832 నా స్వభావం ఏంటో నీకు బాగా తెలుసు. 406 00:37:52,501 --> 00:37:53,336 పాపా. 407 00:37:57,548 --> 00:37:59,300 తెల్లవారకముందే వెళ్లిపోండి. 408 00:38:02,053 --> 00:38:04,347 అంతకు మించి ఈ విషయాన్ని నేను దాచి ఉంచలేను. 409 00:38:31,332 --> 00:38:32,333 కొఫూన్? 410 00:38:39,715 --> 00:38:41,258 హమ్మయ్య. 411 00:38:43,219 --> 00:38:45,638 -నా గదిలోనే ఉండమని చెప్పా కదా. -నాకు తెలుసు. 412 00:38:46,597 --> 00:38:47,598 నేను ఇక్కడే ఉన్నాను. 413 00:38:51,727 --> 00:38:52,895 నన్ను మన్నించు. 414 00:38:54,980 --> 00:38:59,318 నీకు ఇది వింతగా, బాధగా అనిపిస్తుందని నాకు తెలుసు, 415 00:38:59,402 --> 00:39:01,946 నీకు అంతా వివరంగా చెప్తానని మాట ఇస్తున్నాను, 416 00:39:02,530 --> 00:39:05,324 కానీ ఇంకోసారి ఇలా నా మాటను జవదాటకు. 417 00:39:05,408 --> 00:39:06,784 నీకు ఇక్కడ సురక్షితం కాదు. 418 00:39:07,910 --> 00:39:09,870 -మా అక్క ఒక... -సిబెత్. 419 00:39:11,831 --> 00:39:13,541 కంగారు పడకు. మేము ఇందాకే కలిశాం. 420 00:39:15,167 --> 00:39:17,253 మీ పెళ్ళయ్యాక తను నన్ను కలవడానికి వచ్చింది. 421 00:39:21,132 --> 00:39:22,174 కొఫూన్. 422 00:39:25,052 --> 00:39:27,263 -నువ్వు ఆమెని నమ్మకూడదు. -ఎందుకని? 423 00:39:28,431 --> 00:39:30,850 నా జీవితమే ఒక అబద్ధపు జీవితం కావడానికి కారణం ఆమె కాదు కదా. 424 00:39:33,936 --> 00:39:35,438 అది నువ్వనుకున్నంత తేలిక కాదు. 425 00:39:36,939 --> 00:39:38,691 ఈ రాత్రి నువ్వు నీ భర్తని మోసం చేశావు. 426 00:39:39,984 --> 00:39:42,945 నువ్వు మమ్మల్నందరినీ మోసం చేశావు, కానీ ఇదే తొలిసారి కాదు. 427 00:39:44,363 --> 00:39:48,200 మా చిన్నప్పుడే నువ్వు మాంత్రికాంతకులకు నువ్వెవరో చెప్పి ఉండవచ్చు. 428 00:39:48,743 --> 00:39:50,953 నువ్వు ఆల్కెన్నీని కాపాడి ఉండవచ్చు. 429 00:39:51,037 --> 00:39:52,747 మనం జీవితమంతా దాక్కుంటూ పారిపోతూ బతకాల్సిన అవసరమే ఉండేది కాదు. 430 00:39:52,830 --> 00:39:56,959 మా అక్క, తన సంతానమైతే తప్ప, ఇతర చూపున్న సంతానాన్ని స్వీకరించదు. 431 00:39:58,586 --> 00:40:00,880 తను మనల్నందరినీ చంపించి ఉండేది. 432 00:40:00,963 --> 00:40:03,466 నేను నాకు తెలిసిన ఉత్తమమైన మార్గంలో మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేశాను. 433 00:40:03,549 --> 00:40:05,718 -మాతో అబద్ధమాడటం ద్వారా. -అవును, మీతో అబద్ధమాడటం ద్వారానే. 434 00:40:05,801 --> 00:40:07,511 నిజం చెప్పుంటే, మిమ్మల్ని కాల్చి బూడిదచేసి ఉండేవారు. 435 00:40:07,595 --> 00:40:08,596 లేదు. 436 00:40:09,597 --> 00:40:14,935 నీకు మేమంటే అసహ్యం. మా చూపు అంటే అసహ్యం. మేం పుట్టిననాటి నుంచీ అంతే. 437 00:40:15,936 --> 00:40:18,981 అందుకే, మేం చదవడం నేర్చుకున్నప్పుడు నీకు చాలా కోపం వచ్చింది. 438 00:40:20,316 --> 00:40:21,317 అవును కదా? 439 00:40:22,985 --> 00:40:27,114 నువ్వు మాతో మాట్లాడటం ఆపేశావు. మేము పోల్చుకోలేనివారం అవుతామని చెప్పావు. 440 00:40:27,865 --> 00:40:30,326 నిన్ను నువ్వు పోల్చుకోగలుగుతున్నావా, అమ్మా? 441 00:40:32,620 --> 00:40:33,788 ఎందుకంటే నేను నిన్ను పోల్చుకోలేకపోతున్నా. 442 00:40:35,206 --> 00:40:39,669 నీది, హనీవాది ఓ కొత్త లోకం, ఆ లోకం ఏంటో అని కూడా నాకు సరిగ్గా తెలీదు. 443 00:40:41,379 --> 00:40:44,757 ఏదోకరోజు ఆ లోకం మిమ్మల్ని నా నుండి దూరం చేస్తుందని నాకు భయంగా ఉండేది. 444 00:40:49,095 --> 00:40:50,388 దూరం చేసినట్టే ఉంది మరి. 445 00:40:56,185 --> 00:40:57,937 హనీవా మరియు నాన్న ఆచూకీని ఎలా కనిపెట్టబోతున్నావు? 446 00:41:01,107 --> 00:41:03,484 వాళ్ళ ఆచూకీని కనిపెట్టే పని మీద ఇప్పటికే హార్లన్ ప్రభువు ఒకరిని పంపించారు. 447 00:41:10,282 --> 00:41:13,619 అవును, నీ కొత్త మొగుడు, నీ మాజీ మొగుడిని భలే కనిపెడతాడులే. 448 00:41:47,361 --> 00:41:51,699 నేనెంత మందిని చంపానో గుర్తు ఉందా అని నువ్వు నన్ను అడిగావు కదా. 449 00:41:55,453 --> 00:41:58,873 ఈరోజు ఎన్నిసార్లు శ్వాస ఆడించావని నేను నిన్నడిగితే ఏం చెప్తావో అదే నా సమాధానం. 450 00:42:14,597 --> 00:42:18,559 మహారాణి నా చావుకు నన్ను వదిలేసి వెళ్లిపోయినప్పుడు... 451 00:42:21,228 --> 00:42:23,022 నేనొక స్థితిలో ఉండిపోయాను. 452 00:42:25,024 --> 00:42:29,111 చావలేదు... కానీ అలా అని నాలో ప్రాణం కూడా లేదు. 453 00:42:33,407 --> 00:42:34,867 కానీ అప్పుడే... 454 00:42:36,744 --> 00:42:37,953 హఠాత్తుగా... 455 00:42:40,748 --> 00:42:42,083 నాకు జ్ఞానోదయం కలిగింది. 456 00:42:46,504 --> 00:42:47,838 నేనేం చూశానో నీకు తెలుసా? 457 00:42:54,345 --> 00:42:55,763 నాకు ముఖాలు కనబడ్డాయి. 458 00:42:58,265 --> 00:43:01,560 నాకు ముఖాలు కనిపించాయి... 459 00:43:02,186 --> 00:43:07,900 నేను చిత్రహింసలు పెట్టిన, చంపిన ప్రతీ వ్యక్తి తాలూకు ముఖాలు కనిపించాయి. 460 00:43:11,904 --> 00:43:13,447 వాళ్ల ఆర్తనాదాలు వినిపించాయి. 461 00:43:16,158 --> 00:43:17,910 వాళ్ళ బాధ నాకు తెలిసింది. 462 00:43:23,457 --> 00:43:26,168 కానీ ఆ ముఖాలన్నింటిలో... 463 00:43:28,796 --> 00:43:34,468 నాకు నా భార్య, నా పిల్లల ముఖాలు కనిపించలేదు. 464 00:43:39,390 --> 00:43:45,604 వారు నిద్రిస్తుండగానే మహారాణి వారిని నీట ముంచి చంపినప్పుడు అక్కడ నేను లేను. 465 00:43:52,778 --> 00:43:54,030 కానీ ఆ సమయంలో... 466 00:43:56,949 --> 00:44:01,537 నేను ఆ ముఖాలను చంపుతూ ఉన్నాను. 467 00:44:04,332 --> 00:44:09,211 ఎన్నో ఏళ్లు, నువ్వు చీకటి పక్షాన పోరాడావు. 468 00:44:12,506 --> 00:44:15,343 ఇప్పుడు నువ్వు మంచి కోసం పోరాడాలి. 469 00:44:19,930 --> 00:44:22,350 నువ్వు ఆ అమ్మాయిని ఆపి ఉండాల్సింది కాదు. 470 00:44:29,940 --> 00:44:34,028 సరే మరి. ఇక మనం ఎక్కడా ఆగేది లేదు. పెన్సాకి చేరుకొనేదాకా మనం ఎక్కడా ఆగం. 471 00:44:34,987 --> 00:44:35,988 భయపడకు. 472 00:44:37,823 --> 00:44:41,619 నీకు చావడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. 473 00:44:43,412 --> 00:44:44,622 మనందరికీ లభిస్తాయి. 474 00:44:47,124 --> 00:44:51,545 నాకు చూపు ఉండటం, మీకు చూపు లేకపోవడం, దీని వల్లనే 475 00:44:52,338 --> 00:44:54,173 మన మధ్య దూరం వచ్చిందని అనుకొనేదాన్ని. 476 00:44:55,841 --> 00:44:58,052 మన మధ్య చాలా దూరం పెరిగిపోయిందని అనుకున్నాను. 477 00:44:58,678 --> 00:45:02,765 కానీ నాకు నిజంగా సాయం అవసరమైనప్పుడు, అది జ్నానోదయ నివాసంలో ఉన్నప్పుడైనా, 478 00:45:03,974 --> 00:45:09,188 లేదా త్రివాంటెస్ లో ఉన్నప్పుడైనా, నువ్వు ఎప్పుడూ అక్కడ ప్రత్యక్షమయ్యేవాడివి. 479 00:45:12,650 --> 00:45:17,363 నువ్వు నా పాపవి, కొఫూన్ నా బుడ్డోడు, మాగ్రా నా భార్య. 480 00:45:18,239 --> 00:45:22,785 నేను బతికున్నంతవరకూ మనల్ని ఏదీ విడదీయలేదు. నిజమే చెప్తున్నా. 481 00:45:26,914 --> 00:45:28,499 నా వల్ల ఎప్పుడూ అలాంటి పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. 482 00:45:31,419 --> 00:45:32,628 అవును, అది నిజమే. 483 00:45:34,338 --> 00:45:36,215 ఇక్కడి నుండి, పెన్సాకి వెళ్లడానికి రెండు రోజులు పడుతుంది. 484 00:45:38,884 --> 00:45:41,387 పెన్సా ఎలా ఉంటుంది అంటావు? 485 00:45:43,222 --> 00:45:44,223 జనాలతో కోలాహలంగా ఉంటుందేమో. 486 00:45:46,475 --> 00:45:48,185 మరి తను ఎలా ఉంటుందంటావు? 487 00:45:50,146 --> 00:45:51,981 -తను మాగ్రాలానే ఉంటుంది. -అవును. 488 00:45:53,899 --> 00:45:55,818 అసలు మాగ్రా అంటే ఎవరో కూడా మనకి సరిగ్గా తెలీదు కదా? 489 00:47:03,177 --> 00:47:05,179 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య