1 00:00:01,005 --> 00:00:03,091 త్రివాంటియన్లకి రాజు గానీ రాణీ గానీ ఉండరు. 2 00:00:03,175 --> 00:00:04,927 నేను తుచ్చమైన రాజకీయ నాయకులతో మంతనాలు జరపలేను. 3 00:00:05,010 --> 00:00:06,345 నువ్వు అక్కర్లేదులే. 4 00:00:06,428 --> 00:00:08,180 నీ దూతగా నేను వెళ్తాను. 5 00:00:08,263 --> 00:00:10,599 నేను నా కుటుంబాన్ని కాపాడుకొనే విధంగా ఉండాలి. 6 00:00:10,682 --> 00:00:13,185 యువరాణి, నీ కోసం ఒక మంచి శిక్షకుడిని నియమించగలరులే. 7 00:00:13,268 --> 00:00:14,436 నిన్నే నియమించమని ఆమెని అడుగుతాను. 8 00:00:14,520 --> 00:00:16,270 నేను హార్లన్ ని, పెన్సాకి ప్రభువుని, 9 00:00:16,355 --> 00:00:19,525 ఇది కాస్త వింతగానే ఉంటుంది, ఏంటంటే నాకు నీ భార్యతో పెళ్లయింది. 10 00:00:20,859 --> 00:00:23,320 ట్రయాంగిల్, శాంతి కోసం పయాన్లను దౌత్యసమావేశం నిర్వహించాలని కోరారు. 11 00:00:23,403 --> 00:00:26,448 శాంతి చర్చలు విఫలమవుతాయి, అవి విఫలమయ్యేలా మనం చూసుకోవాలి. 12 00:00:26,532 --> 00:00:29,117 ఏదైనా పొరపాటు జరిగితే, వాళ్లు మీ మీదకే తోసేస్తారు. 13 00:00:29,201 --> 00:00:31,245 అందుకే నా బదులు నువ్వు వెళ్ళాలి. 14 00:00:31,328 --> 00:00:33,288 బహుశా దైవం నీ పక్షాన ఉందంటే, 15 00:00:33,372 --> 00:00:36,416 యుద్ధం చేయకుండానే విజయం సాధించడమని అర్థమేమో. 16 00:00:36,500 --> 00:00:39,920 సింహాసనంపై మీ అక్క ఉన్నంత వరకూ, శాంతికి అవకాశమే లేదు. 17 00:00:40,003 --> 00:00:42,339 తను తన ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది. మహారాణుల కర్తవ్యం అదే కదా? 18 00:00:42,422 --> 00:00:44,967 మన జీవితాంతం మనల్ని వేటాడిన మనిషికి ఎందుకు వత్తాసు పలుకుతున్నావు? 19 00:00:45,050 --> 00:00:47,052 ఇది రహస్యంగా ఉండాలి, కొఫూన్. 20 00:00:47,135 --> 00:00:48,136 ఈ విషయం మన మధ్యనే ఉండాలి. 21 00:00:48,220 --> 00:00:51,348 జీని మీద ఈ సంచి ఉంది, అందులో మీకో సందేశం ఉంది. 22 00:01:10,324 --> 00:01:12,326 -ప్యారిస్. -కాపాడండి! మనల్ని మోసం చేశారు! 23 00:01:12,410 --> 00:01:14,287 -ప్యారిస్. -ఆగంతకులు! లేవండి! 24 00:01:14,370 --> 00:01:15,371 ప్యారిస్! 25 00:01:15,872 --> 00:01:17,915 హనీవా. హనీవా. 26 00:01:19,333 --> 00:01:22,170 మీ అమ్మ, బాబా. వీళ్ళు వెళ్ళకూడదు. 27 00:01:22,253 --> 00:01:24,130 వాళ్లు బయలుదేరిపోయారు. ఏమైంది? 28 00:01:25,131 --> 00:01:26,632 ఏదో మోసం జరిగినట్టు నాకు కల వచ్చింది. 29 00:01:29,051 --> 00:01:32,930 రక్తం. రక్తం, మోసం, హనీవా. 30 00:01:36,684 --> 00:01:39,103 సరే. నువ్వు ఇక్కడే ఉండు. 31 00:01:44,025 --> 00:01:45,526 నువ్వు ఇంకెవరినైనా పంపవచ్చు కదా? 32 00:01:45,610 --> 00:01:48,571 ఎవరిని పంపమంటావు? నేను మాంత్రికాంతకులని ఎలా నమ్మను? 33 00:01:48,654 --> 00:01:50,198 నీకు అసలు గుర్రం తోలడం వచ్చా? 34 00:01:50,281 --> 00:01:51,866 కొఫూన్ కి వచ్చంటే అదేమంత కష్టం అయ్యుండదులే. 35 00:01:51,949 --> 00:01:54,619 -సర్లే. నేను కూడా వస్తున్నాను. -నీ వల్ల నాకు ఆలస్యం అవుతుంది. 36 00:01:54,702 --> 00:01:56,621 -నాకో గుర్రం పట్టుకురా చాలు! -చార్లెట్! 37 00:01:57,580 --> 00:01:58,873 మనకు అంత సమయం లేదు. 38 00:02:02,376 --> 00:02:05,463 -జాగ్రత్తగా ఉంటావని మాటివ్వు. -చూస్తాలే. 39 00:02:07,298 --> 00:02:08,299 మాటిస్తున్నాను. 40 00:03:52,195 --> 00:03:53,571 నీ పాటికి నువ్వు ఉండు. 41 00:03:54,489 --> 00:03:56,324 ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా విను. 42 00:03:58,242 --> 00:04:00,620 ఒప్పందం ఎలా కుదురుతుందో నాకు అర్థం కావడం లేదు... 43 00:04:01,662 --> 00:04:05,500 కానీ మన బృందం బలహీనపడుతోందని అనిపిస్తే, వాళ్ళకి విషయం వివరంగా చెప్పు. 44 00:04:06,876 --> 00:04:07,877 అలాగే, సర్. 45 00:04:12,131 --> 00:04:13,132 నీ మనస్సులో ఏదో సంశయమున్నట్టుంది. 46 00:04:15,968 --> 00:04:18,221 మహారాణి యుద్దాన్నే కోరుకుంటోందని అర్థమైంది, 47 00:04:19,055 --> 00:04:21,933 కానీ శాంతి కోసం ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కదా. 48 00:04:22,016 --> 00:04:25,520 మనం దాడి చేయడం ఎంత ఆలస్యం చేస్తే, ఆమె బలగాల సంఖ్య అంత అధికమవుతుంది. 49 00:04:26,395 --> 00:04:28,231 ఇప్పటికే ఈ సంవత్సరంలో మన సైనికులు చాలా మంది చనిపోయారు. 50 00:04:29,232 --> 00:04:31,025 సమావేశంలో నువ్వు నా ప్రతినిధిగా వ్యవహరిస్తావు. 51 00:04:32,276 --> 00:04:35,738 ఇతర ప్రతినిధులకు నువ్వూ ఉంటావని తెలుసు, నీ మాటని వాళ్ళు వింటారు కూడా. 52 00:04:36,239 --> 00:04:37,907 లెఫ్టినెంట్ మాటని ఎవరూ వినరు. 53 00:04:41,828 --> 00:04:45,289 అందుకే నేను నిన్ను కెప్టెన్ చేస్తున్నా. 54 00:04:54,340 --> 00:04:56,509 పయాన్లు మన వాళ్లని చంపారు. 55 00:04:56,592 --> 00:04:58,469 వాళ్ళ చావులకు ప్రతీకారం తీర్చుకోవడాన్ని పక్కన పెట్టి, 56 00:04:58,553 --> 00:05:01,556 ట్రయాంగిల్ వాళ్ళు శత్రువులను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారు. 57 00:05:03,224 --> 00:05:04,225 రెన్. 58 00:05:04,976 --> 00:05:08,813 ఒక్కోసారి రిపబ్లిక్ బాగు కోసం, 59 00:05:08,896 --> 00:05:10,565 మనం దాని ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా పని చేయాల్సి ఉంటుంది. 60 00:05:11,607 --> 00:05:14,569 శాంతి చర్చలు విఫలమవ్వాలి. అర్థమైందా? 61 00:05:15,319 --> 00:05:16,320 అర్థమైంది, సర్. 62 00:05:18,865 --> 00:05:21,033 బృందం బయలుదేరుతోంది. ఇదుగో. 63 00:05:22,326 --> 00:05:23,578 నీకు ఆకలేస్తే తినడానికి ఉంటుంది. 64 00:06:25,598 --> 00:06:26,724 నువ్వు బాగానే ఉన్నావా? 65 00:06:27,725 --> 00:06:30,937 కెర్రిగన్ చేసే పనులకు ఎప్పుడోకప్పుడు చనిపోయేవాడే. 66 00:06:33,606 --> 00:06:38,194 కాకపోతే, ఆ చెత్త స్మగ్లింగ్ చేస్తూ హీనమైన చావు చావడం కన్నా... 67 00:06:39,946 --> 00:06:43,491 నా భార్య అయిన యువరాణి కార్యం చేస్తూ చనిపోయినందుకు ఆనందంగా ఉంది. 68 00:06:48,788 --> 00:06:50,123 నాకు మరో డ్రింక్ కావాలి. 69 00:06:51,207 --> 00:06:54,460 త్రివాంటియన్ బృందానికి గౌరవసూచకంగా తాగేటప్పుడు తాగుదాములే. 70 00:06:54,544 --> 00:06:57,338 ఆ దరిద్రులకు గౌరవసూచకంగా నువ్వే తాగు. నేను నా తమ్ముడి కోసం తాగుతున్నా. 71 00:06:57,421 --> 00:06:58,589 -హార్లన్. -మన్నించు. 72 00:06:59,799 --> 00:07:01,968 నువ్వు మన్నించమని అడగాల్సిన అవసరం లేదు. 73 00:07:02,677 --> 00:07:05,805 కానీ దీని మీద చాలా ఆధారపడున్నాయి, నువ్వు ఇందులో సరిగ్గా పాల్గొనలేకపోతే... 74 00:07:05,888 --> 00:07:09,058 -ఇదెంత ముఖ్యమో తెలుసు. ఇది నా నగరం. -...నువ్వు నాకు ముందే చెప్పు. 75 00:07:12,687 --> 00:07:13,688 నాకేం పర్వాలేదు. 76 00:07:15,648 --> 00:07:20,319 మనం విఫలమైతే, సిబెత్ కోరుకున్నట్టుగా యుద్ధం జరుగుతుంది, మనం చావుదెబ్బ తింటాం. 77 00:07:22,238 --> 00:07:25,491 ఇప్పుడే నేను నా కుటుంబానికి దగ్గరయ్యాను. మళ్లీ వాళ్ళకి ఏ అపకారమూ జరగనివ్వను. 78 00:07:26,993 --> 00:07:27,994 నేను కూడా. 79 00:07:34,083 --> 00:07:36,419 నిజానికి, ఇప్పుడు నా కుటుంబంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. 80 00:07:39,046 --> 00:07:40,715 అది చాలా విషాదకరమైన విషయం కదా? 81 00:08:18,753 --> 00:08:20,630 దీనితో కలిపి నిన్ను పన్నెండు సార్లు మట్టికరిపించాను. 82 00:08:20,713 --> 00:08:22,131 వాటిలో రెండు సార్లు నేను అడ్డుకున్నా. 83 00:08:23,174 --> 00:08:26,427 ఆ గొప్ప విజయానికు గుర్తుగా నీ సమాధి మీద దాన్ని సువర్ణక్షరాలతో రాయిస్తాములే. 84 00:08:30,097 --> 00:08:31,557 అసలు నువ్వెలా చేయగలగుతున్నావు? 85 00:08:31,641 --> 00:08:34,227 నా తర్వాతి కదలిక ఏంటో నాకంటే నీకే ముందు తెలుసనట్టుగా అనిపిస్తోంది. 86 00:08:34,310 --> 00:08:35,686 కదలిక అనేది ఓ భాష లాంటింది. 87 00:08:37,271 --> 00:08:39,398 చిందులు, యుద్ధం, సంభోగం. 88 00:08:39,899 --> 00:08:42,318 వాటిలో దేహాలు ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటాయి. 89 00:08:42,985 --> 00:08:45,488 వాటిని వినడమెలా అనే నేను నీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను, 90 00:08:45,988 --> 00:08:48,074 కానీ నువ్వు నా ఖడ్గాన్ని అడ్డుకోవాలని మాత్రమే చూస్తున్నావు. 91 00:08:51,536 --> 00:08:52,537 కళ్ళకు గంతలు కట్టుకో. 92 00:08:55,373 --> 00:08:56,791 ఇలా అయితే, నేను అస్సలు చేయలేననుకుంటా. 93 00:08:56,874 --> 00:08:58,251 అది నిజమేలే. 94 00:08:59,127 --> 00:09:01,003 కానీ ఈ విషయంలో చూపు వల్ల నీకు ఏ లాభమూ ఉన్నట్టుగా అనిపంచట్లేదు. 95 00:09:01,754 --> 00:09:04,549 అది నీకు అడ్డుగా అన్నా ఉండుండాలి, లేదా నువ్వు పనికిరానివాడివైనా అయ్యుండాలి. 96 00:09:05,341 --> 00:09:07,093 ఆ రెండింట్లో కారణం ఏదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. 97 00:09:07,176 --> 00:09:08,219 కానివ్వు. 98 00:09:20,481 --> 00:09:21,482 సరే మరి. 99 00:09:31,409 --> 00:09:32,410 నా ఖడ్గం పడిపోయింది... 100 00:09:32,493 --> 00:09:33,536 ఆగు! 101 00:09:33,618 --> 00:09:34,619 ఏంటి... 102 00:09:48,050 --> 00:09:49,051 శుభ వార్త. 103 00:09:49,927 --> 00:09:51,220 నువ్వు పనికిరానివాడివి కాదులే. 104 00:09:52,388 --> 00:09:54,640 -కానీ ఇవాళ్టికి శిక్షణ ముగిసింది. -లేదు, నాకు మళ్లీ ప్రయత్నించాలనుంది. 105 00:09:54,724 --> 00:09:56,934 అయితే, నీతో పోరాడటానికి ఇంకెవరినైనా వెతుక్కో. 106 00:10:19,999 --> 00:10:21,501 అది పయాన్ జెండా. 107 00:11:25,815 --> 00:11:27,066 త్రివాంటియన్ రాజ్యానికి చెందిన 108 00:11:27,150 --> 00:11:29,152 కమాండర్ వాట్స్ ని. 109 00:11:32,488 --> 00:11:34,699 పయాన్ రాజ్యానికి చెందిన కెప్టెన్ గోసెట్ ని. 110 00:11:36,033 --> 00:11:38,494 మన ఇద్దరి రాజ్యాల మధ్య ఉన్న ఆచారం ప్రకారం, 111 00:11:38,578 --> 00:11:41,789 సైనికులు శిబిరం బయట ఉంటారు. 112 00:11:42,415 --> 00:11:45,251 లోపలకు వచ్చేవాళ్ళు నిరాయుధులై ఉండాలి. 113 00:11:45,334 --> 00:11:46,335 అలాగే. 114 00:11:46,961 --> 00:11:50,131 మా సైనికులు మీ బృందాన్ని, మీ సైనికులు మా బృందాన్ని తనిఖీ చేస్తారు. 115 00:11:51,174 --> 00:11:52,175 అలాగే. 116 00:11:53,301 --> 00:11:54,844 అయితే మొదలుపెడదాం మరి. 117 00:12:03,686 --> 00:12:04,771 ముందుకు వెళ్లవచ్చు. 118 00:12:07,106 --> 00:12:09,400 -వెళ్లవచ్చు. -వెళ్లవచ్చు. 119 00:12:16,491 --> 00:12:17,492 ముందుకు వెళ్లవచ్చు. 120 00:12:22,246 --> 00:12:23,331 ముందుకు వెళ్లవచ్చు. 121 00:12:31,589 --> 00:12:32,590 ముందుకు వెళ్లవచ్చు. 122 00:12:41,098 --> 00:12:42,433 ముందుకు వెళ్లవచ్చు. 123 00:12:55,113 --> 00:12:56,114 ముందుకు వెళ్లవచ్చు. 124 00:12:58,533 --> 00:12:59,534 ముందుకు వెళ్లవచ్చు. 125 00:12:59,617 --> 00:13:00,618 మీరు ముందుకు వెళ్లవచ్చు. 126 00:13:00,701 --> 00:13:03,371 -చేతులు పైకెత్తండి. ఎత్తండి. -చేతులు పైకెత్తండి. 127 00:13:06,958 --> 00:13:09,001 -ఏంటిది? -వెళ్లండి. 128 00:13:15,007 --> 00:13:16,008 పారాహుషార్. 129 00:13:20,304 --> 00:13:22,974 హనీవా? ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? 130 00:13:23,057 --> 00:13:24,725 ప్యారిస్ ఓ విషయం చెప్పమని పంపింది. 131 00:13:25,852 --> 00:13:26,936 ఇటు రా. 132 00:13:27,019 --> 00:13:29,856 -గుర్రం నడపడం ఎప్పుడు నేర్చుకున్నావు? -నేను నేర్చుకోలేదు. 133 00:13:30,565 --> 00:13:32,692 -చాలా కష్టపడాల్సి వచ్చింది. -ప్యారిస్ ఏమంటోంది? 134 00:13:32,775 --> 00:13:36,028 మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పింది. మనం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 135 00:13:36,112 --> 00:13:38,614 చర్చలను వదిలేసి వెళ్తే, యుద్ధం తథ్యం. 136 00:13:38,698 --> 00:13:39,991 తనకి అది కలలో వచ్చింది, అమ్మా. 137 00:13:40,074 --> 00:13:41,325 తను చాలా ఖచ్చితంగా చెప్పింది. 138 00:13:41,409 --> 00:13:43,119 ప్యారిస్ జోస్యం నిజమే అవ్వవచ్చు, 139 00:13:43,202 --> 00:13:46,038 కానీ మనం మధ్యలో వెళ్లిపోతే, వేలాది మంది చనిపోతారు. 140 00:13:46,122 --> 00:13:47,248 అది మాత్రం నిజం. 141 00:13:49,167 --> 00:13:50,168 నాన్నా. 142 00:13:52,462 --> 00:13:54,422 మన సంగతి మీ అమ్మ చూసుకుంటుంది. 143 00:13:54,505 --> 00:13:57,550 ఈ వంచన జరిగేదే అయితే, మనమందరమూ దగ్గరే ఉండాలి. 144 00:13:59,177 --> 00:14:00,178 ధన్యవాదాలు. 145 00:14:04,140 --> 00:14:05,391 తను ఓసారి పొరబడింది. 146 00:14:05,892 --> 00:14:07,351 ప్యారిస్ ఆ, అమ్మనా? 147 00:14:08,311 --> 00:14:09,312 ఇద్దరూ. 148 00:14:10,480 --> 00:14:12,023 నువ్వు వచ్చి మంచి పనైంది. 149 00:14:12,106 --> 00:14:13,691 ఒక అనువైన ప్రదేశం చూసుకో, అక్కడి నుండి గమనిస్తూ ఉండు. 150 00:14:13,775 --> 00:14:14,776 సరే. 151 00:14:41,427 --> 00:14:43,805 నువ్వు క్రమం తప్పకుండా స్వారీ చేస్తున్నావని నా గార్డులు చెప్పారు. 152 00:14:45,264 --> 00:14:46,933 అది విని నాకు చాలా ఆనందం కలిగింది. 153 00:14:48,184 --> 00:14:49,393 నీకు చూపు ఉంది కనుక... 154 00:14:51,479 --> 00:14:53,856 నువ్వు చాలా వేగంగా స్వారీ చేయగలవు. 155 00:14:55,650 --> 00:14:56,859 ఎంత గొప్ప విషయం. 156 00:14:57,985 --> 00:14:58,986 మరి నువ్వు, 157 00:14:59,821 --> 00:15:01,239 నన్ను ఎక్కించుకొని అలా తీసుకెళ్ళగలవా? 158 00:15:15,670 --> 00:15:17,255 అది నాకు చాలా గొప్ప విషయం అవుతుంది. 159 00:15:22,426 --> 00:15:23,427 మీరు బాగానే ఉన్నారా? 160 00:15:26,764 --> 00:15:28,224 చాలా బాగుంది. 161 00:16:02,675 --> 00:16:05,553 నాకు ఇలా స్వేచ్ఛగా అనిపించి చాలా కాలామైంది. 162 00:16:07,096 --> 00:16:10,057 నిజంగానా? మీరు మహారాణి కదా. 163 00:16:12,226 --> 00:16:13,978 అధికారమంటే స్వేచ్ఛ అని పొరబడవద్దు. 164 00:16:17,607 --> 00:16:19,233 నా హోదా, ప్రజలకు నేను కట్టుబడి ఉండేలా చేస్తుంది, 165 00:16:19,317 --> 00:16:22,320 కానీ అదే హోదా నన్ను అందరికీ శాశ్వతంగా దూరంగా కూడా ఉంచుతుంది. 166 00:16:26,032 --> 00:16:27,200 అంటే మీకు బాగా ఒంటరితనంగా అనిపిస్తుంటుంది. 167 00:16:29,118 --> 00:16:31,245 అందరూ నా ఆదేశాలను పాటిస్తారు... 168 00:16:32,872 --> 00:16:35,082 కానీ నాతో కలిసి ఎవరూ సరదాగా గడపరు... 169 00:16:37,460 --> 00:16:38,878 నేనెలా ఉన్నానో పట్టించుకోరు. 170 00:16:38,961 --> 00:16:40,505 ఆనందంగా ఉన్నానా? బాధలో ఉన్నానా? 171 00:16:41,255 --> 00:16:44,008 నేను... నేను మహారాణిని. 172 00:16:46,135 --> 00:16:51,140 ఇలా నాపై ఒకరు మామూలు ప్రేమ చూపించి చాలా కాలమైంది. 173 00:17:02,235 --> 00:17:03,236 ధన్యవాదాలు. 174 00:17:10,493 --> 00:17:11,661 మళ్లీ వెళ్దామా? 175 00:17:28,052 --> 00:17:31,681 ఎన్నో ఏళ్ల నుండి, మన రాజ్యాల మధ్య తీరని శత్రుత్వం ఉంది. 176 00:17:31,764 --> 00:17:34,517 కానీ చాలా కాలంగా, శాంతి కొనసాగింది. 177 00:17:34,600 --> 00:17:37,520 కానీ ఇప్పుడు, మీ రాణి యుద్ధ వ్యవహరాల కౌన్సిల్ ని ఏర్పాటు చేసిందని విన్నాము. 178 00:17:38,855 --> 00:17:39,981 కానీ ఓ విషయం తెలుసుకోండి, 179 00:17:40,940 --> 00:17:44,777 ఈ చర్యను మేము యుద్ధం దాకా తీసుకెళితే, పయాన్ రాజ్యానికి తీరని నష్టం కలుగుతుంది. 180 00:17:45,820 --> 00:17:48,781 కానీ యుద్ధం చేయాలనే ఆశ మాకు లేదు. 181 00:17:48,865 --> 00:17:51,200 బహుశా మీరు ఒకసారి మహారాణి ఎందుకలా చేసిందో చెప్పగలిగితే, 182 00:17:51,284 --> 00:17:53,703 మనం రక్తపాతం దాకా వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. 183 00:17:53,786 --> 00:17:57,165 మహారాణి త్రివాంటియన్ల దూకుడు వైఖరికి స్పందించింది. 184 00:17:57,748 --> 00:18:00,168 మీ సైనికులు మా భూభాగంలోకి ప్రవేశిస్తున్నారు, 185 00:18:00,251 --> 00:18:03,463 మా సరిహద్దు పట్టణాలను ఆక్రమిస్తూ, మా వారిని బానిసలుగా చేసుకుంటున్నారు. 186 00:18:03,963 --> 00:18:05,923 మీ ఆరోపణలే నిజమైతే, 187 00:18:06,006 --> 00:18:08,301 వాటిని పరిష్కరించే దిశగా మనం చర్చలు కొనసాగించవచ్చు. 188 00:18:08,384 --> 00:18:13,014 త్రివాంటియన్ చట్టం ప్రకారం, బానిస వర్తక సంస్థలు తూర్పు హద్దును దాటడానికి వీల్లేదు. 189 00:18:13,848 --> 00:18:16,142 అదీగాక, మీ సైనిక దుశ్చర్యలకు, 190 00:18:16,642 --> 00:18:20,187 మా సరిహద్దుల్లో మీరు చేసే స్మగ్లింగ్ చర్యలకు 191 00:18:20,271 --> 00:18:22,063 ప్రతిస్పందనగానే మేము పయాన్ పట్టణాలను ఆక్రమించాం. 192 00:18:22,148 --> 00:18:23,649 పయాన్ భూభాగాన్ని మీ భూభాగంగా పేర్కొంటూ 193 00:18:23,733 --> 00:18:28,237 మీ ప్రభుత్వం పదే పదే మ్యాపులను మార్చుతూ ఉంటే, 194 00:18:28,321 --> 00:18:30,698 సరిహద్దుల గురించి మాట్లాడటం కష్టం అవుతుంది. 195 00:18:30,782 --> 00:18:34,118 అంటే, మీరు ఆ విషయంలో అధికారికంగా ఆరోపిస్తున్నారా? 196 00:18:34,202 --> 00:18:35,578 అది నిజం. 197 00:18:36,162 --> 00:18:37,330 నేను ఆ గొంతు ఎప్పుడో విన్నాను. 198 00:18:38,664 --> 00:18:40,082 అది రెన్. 199 00:18:40,166 --> 00:18:42,043 మనల్ని త్రివాంటెస్ లో కాపాడిన వ్యక్తి. 200 00:18:45,546 --> 00:18:47,298 తను ఇక్కడికి వచ్చినందుకు నీకు ఆనందంగా ఉన్నట్టుందే. 201 00:18:49,759 --> 00:18:50,760 అవును. 202 00:18:57,391 --> 00:18:59,101 నీతో ఏ పనీ తేలిగ్గా ఉండదు. 203 00:19:06,150 --> 00:19:07,985 ఇది ఒక మామూలు సరిహద్దు వివాదమైతే, 204 00:19:08,069 --> 00:19:11,989 మీరు మ్యాపులని సమీక్షించి, మన హద్దులను పరిశీలించి ఆంగీకరిస్తే సరిపోతుందేమో. 205 00:19:12,073 --> 00:19:13,658 అవును, కానీ... 206 00:19:15,910 --> 00:19:18,704 శాంతికి, కంజువా మీద చేసిన దాడికి గాను, 207 00:19:18,788 --> 00:19:20,289 అధికారికంగా క్షమాపణ తెలపాల్సి ఉంటుంది. 208 00:19:20,790 --> 00:19:23,376 క్షమాపణా? కామెడీ చేస్తున్నారా. 209 00:19:23,459 --> 00:19:26,087 చేయని పనికి మేము క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. 210 00:19:26,170 --> 00:19:29,173 మీరు ఆనకట్టని ధ్వంసం చేసి, మా రాణిని చంపాలని చూశారు. 211 00:19:29,257 --> 00:19:30,591 మేము అలాంటి పని చేయనే లేదు! 212 00:19:30,675 --> 00:19:33,094 కానివ్వండి. మేము ఒక క్షమాపణ చెప్పమనే కదా అడుగుతున్నాం. 213 00:19:33,177 --> 00:19:36,514 ఈ ఖండంలో సైనిక శక్తిలో మమ్మల్ని మించిన రాజ్యమే లేదు. 214 00:19:36,597 --> 00:19:39,267 మీ మహారాణి చావునే మేము కోరుకొనుంటే, ఆమె ఈపాటికే చనిపోయి ఉండేది. 215 00:19:39,350 --> 00:19:41,769 మీ రాజ్యానికి అంత సైనిక బలగం ఉంది కనుకే, 216 00:19:41,853 --> 00:19:44,021 కంజువా మీద దాడి చేసేంత సత్తా కూడా మీకే ఉంది. 217 00:19:44,105 --> 00:19:46,691 మీ మహారాణి అంటే తన సొంత వాళ్లకే చాలా మందికి పడదు. 218 00:19:47,525 --> 00:19:49,902 మీరనే ఈ దాడిని తన సొంత మనుషులే చేసి ఉన్నా, 219 00:19:49,986 --> 00:19:51,946 పెద్ద ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. 220 00:19:52,029 --> 00:19:56,200 ఏదేమైనా, చేయని పనికి మేము మాటపడలేము, 221 00:19:56,284 --> 00:20:00,079 అదే విధంగా, మా రాజ్య భద్రత కోసం మేము ఎమైనా చేయడానికి కూడా వెనుకాడము. 222 00:20:00,997 --> 00:20:03,416 ఉదాహరణకు, హార్లన్ ప్రభువా, 223 00:20:03,958 --> 00:20:06,085 మీ తమ్ముడు మా నగరంలో స్మగ్లింగ్ కి పాల్పడుతుండగా పట్టుబడినప్పుడు, 224 00:20:06,169 --> 00:20:08,838 అతని తలని నరికేశాము, దాన్ని మేము రహస్యంగా ఏమీ ఉంచలేదు. 225 00:20:09,839 --> 00:20:11,507 నిజం చెప్పాలంటే, 226 00:20:11,591 --> 00:20:13,968 అతని తలను మీకు గౌరవసూచకంగా మేము పంపాం కూడా. 227 00:20:14,969 --> 00:20:17,972 మేము త్వరగా కానిచ్చేద్దామనుకున్నాం, కానీ మీ తమ్ముడు సహకరించలేదు. 228 00:20:21,184 --> 00:20:23,352 -కెప్టెన్ గోసెట్! -నేను నిన్ను నరికేస్తాను! 229 00:20:23,853 --> 00:20:24,937 చంపేస్తా! 230 00:20:27,106 --> 00:20:28,733 సరే. ఇక చాలు. 231 00:20:28,816 --> 00:20:29,984 మీకేమైనా పిచ్చి పట్టిందా? 232 00:20:30,067 --> 00:20:31,986 -చచ్చావుపో! -అతడిని వెంటనే అరెస్ట్ చేయండి! 233 00:20:32,069 --> 00:20:35,156 ఇది ఇరురాజ్యాల మధ్య సాగే శాంతి సమావేశం. అరెస్టులేవీ ఉండవు! 234 00:20:35,239 --> 00:20:37,116 -ఏడిచావులే పోరా! -నేను క్షమాపణ కోరుతున్నాను. 235 00:20:37,200 --> 00:20:38,618 వాళ్ళకి క్షమాపణ చెప్పవద్దు. 236 00:20:38,701 --> 00:20:40,995 ఈ సమావేశం వల్ల ఏ లాభమూ లేదు. ఇక్కడితో ఇది ముగిసినట్టే. 237 00:20:41,078 --> 00:20:43,122 వెళ్లిపోతున్నారా? అయ్యయ్యో. 238 00:20:43,998 --> 00:20:45,458 ఇక బయలుదేరండి. గుడ్ నైట్. 239 00:20:45,541 --> 00:20:48,461 హాయిగా నిద్రపోండి, సన్నాసుల్లారా. 240 00:21:15,279 --> 00:21:19,200 -ప్యారిస్. -సాధారణంగా అందరూ కట్టెలు బయట కొడతారు. 241 00:21:21,285 --> 00:21:22,745 నేను కత్తిసాము సాధన చేస్తున్నాను. 242 00:21:24,080 --> 00:21:28,501 మనం... ఒకేలాగా తిప్పుతూ ఉండాలన్నమాట, మనకి అది అలవాటుగా అయ్యేదాకా. 243 00:21:29,377 --> 00:21:32,130 యుద్ధంలో ఆలోచించే సమయం ఉండదు. 244 00:21:33,923 --> 00:21:36,050 ఆ విషయం నీకు టోడ్ చెప్పాడా? 245 00:21:36,134 --> 00:21:38,052 లేదు, అది పోరులోని ప్రాథమిక నియమం. 246 00:21:44,183 --> 00:21:45,184 ఓ విషయం గుర్తుంచుకో... 247 00:21:46,853 --> 00:21:50,189 కత్తుల కన్నా పదునైన ఆయుధాలు చాలా ఉన్నాయి. 248 00:21:51,441 --> 00:21:54,402 సానుభూతి, ప్రేమ... 249 00:21:54,485 --> 00:21:56,279 ప్రేమ మన వాళ్లని కాపాడలేకపోయింది. 250 00:22:01,159 --> 00:22:03,119 నువ్వు మారిపోయినట్టున్నావు, కొఫూన్. 251 00:22:05,455 --> 00:22:07,165 నీలో చాలా కోపం ఉంది. 252 00:22:07,832 --> 00:22:09,750 అవును, తప్పకుండా కోపం ఉంటుంది. 253 00:22:10,626 --> 00:22:12,545 నా జీవితమంతా నన్ను ఓ అబద్ధంతో మోసగించారు. 254 00:22:20,428 --> 00:22:21,929 నువ్వు మహారాణితో కొంత సమయం గడిపావు. 255 00:22:23,973 --> 00:22:27,894 జాగ్రత్త గా ఉండు. చాలా జాగ్రత్తగా ఉండు, బంగారం. 256 00:22:28,853 --> 00:22:30,021 ఈ మహారాణికి... 257 00:22:32,857 --> 00:22:34,650 ధ్యాస అంతా ఒకే విషయం మీద ఉంటుంది. 258 00:22:36,903 --> 00:22:37,904 తన స్వార్థం మీదనే. 259 00:22:38,571 --> 00:22:41,115 లేదా, తను ఎవరినీ అంత తేలిగ్గా నమ్మదేమో. 260 00:22:47,163 --> 00:22:49,832 కనీసం, తను తన నిజస్వరూపాన్ని అయితే దాచడం లేదు కదా. 261 00:22:52,376 --> 00:22:53,377 నాకు పనుంది, ప్యారిస్. 262 00:23:04,597 --> 00:23:06,682 మీ ఇద్దరూ కాస్త శాంతించాలి. 263 00:23:07,183 --> 00:23:08,684 ఏ హానీ జరగలేదు. 264 00:23:09,310 --> 00:23:10,311 ఏ హానీ జరగలేదా? 265 00:23:11,229 --> 00:23:13,189 నీ వల్ల అక్కడే యుద్ధం జరిగి ఉండేది. 266 00:23:13,272 --> 00:23:15,733 నేను ఆవేశపడ్డాను, ఒప్పుకుంటున్నా... 267 00:23:15,817 --> 00:23:18,611 నీ ఆవేశం వల్ల శాంతి కోసం చర్చించే అవకాశం కూడా పోయింది. 268 00:23:18,694 --> 00:23:21,739 అదే నిజమైతే, ఇంకా త్రివాంటియన్లు ఇక్కడే ఎందుకు ఉన్నట్టు? 269 00:23:25,034 --> 00:23:28,162 మాగ్రా, నీకు ఇదంతా కొత్త. 270 00:23:29,247 --> 00:23:30,581 ఇంకా, బూబూ, 271 00:23:30,665 --> 00:23:34,043 నువ్వు యుద్ధాన్ని చర్చల ద్వారా ఆపే రకంలాగా నాకు అనిపించడం లేదు. 272 00:23:34,127 --> 00:23:36,587 కాబట్టి, మనకి చాలా విలువైన సమాచారం లభించింది అనే 273 00:23:36,671 --> 00:23:38,506 నా మాటను మీరు నమ్మాలి. 274 00:23:38,589 --> 00:23:39,590 ఏంటా విలువైన సమాచారం? 275 00:23:39,674 --> 00:23:42,802 త్రివాంటియన్లకు నిజంగానే శాంతి అవసరమైనట్టుగా అనిపిస్తోంది. 276 00:23:42,885 --> 00:23:44,679 వాళ్ళు చర్చల గదికి ఎట్టి పరిస్థితుల్లోనూ రారు. 277 00:23:44,762 --> 00:23:46,889 తప్పకుండా వస్తారు. 278 00:23:46,973 --> 00:23:48,808 కానీ గది ముఖ్యం కాదు. 279 00:23:49,767 --> 00:23:53,688 ఆ గదికి వెళ్లబోయే ముందు మనం చేసుకొనే ఒప్పందం ముఖ్యమైనది. 280 00:23:55,106 --> 00:23:56,441 నువ్వేం మాట్లాడుతున్నావు? 281 00:23:58,651 --> 00:24:00,945 నా సమ్మతి లేకుండా ఏం చేశావు? 282 00:24:01,028 --> 00:24:02,905 నీ తరఫునే, 283 00:24:02,989 --> 00:24:06,200 నీ మంచి కోసమే నేను ఓ పని చేశాను, యువరాణి. 284 00:24:06,284 --> 00:24:08,786 మనం ఈరాత్రి రాయబారి స్కోపస్ ని కలవబోతున్నాం. 285 00:24:08,870 --> 00:24:09,954 అది రహస్య సమావేశం, 286 00:24:10,037 --> 00:24:14,876 అందులో తిట్లకి, బెదిరింపులకి, ఇంకా టోరెన్స్ నిఘాకి ఆస్కారం ఉండదు. 287 00:24:16,752 --> 00:24:18,421 మనం ఈరాత్రి శాంతి చర్చలు చేయబోతున్నాం, 288 00:24:19,630 --> 00:24:23,593 రేపు గదిలో మళ్లీ చర్చిస్తున్నట్టుగా నటిస్తామంతే. 289 00:24:26,012 --> 00:24:27,722 ఈ సమావేశానికి నువ్వు వెళ్లకూడదు. 290 00:24:27,805 --> 00:24:29,056 ఏమన్నావు? 291 00:24:29,640 --> 00:24:32,143 నేను నా కోసం ఏర్పరచుకున్న సమావేశానికి నేనే వెళ్లకూడదా? 292 00:24:32,226 --> 00:24:33,478 నేను తప్పకుండా వెళ్తాను. 293 00:24:33,561 --> 00:24:36,314 లేదు. మళ్లీ నువ్వు ఆవేశపడితే, 294 00:24:36,397 --> 00:24:38,608 నిన్నూ, మాగ్రాని అక్కడికక్కడే చంపేస్తారు. 295 00:24:38,691 --> 00:24:39,692 తనతో నేను వెళ్తాను. 296 00:24:39,776 --> 00:24:40,943 అబ్బా. 297 00:24:41,027 --> 00:24:44,822 నువ్వు వాళ్ల దృష్టిలో హత్య చేసిన రాజద్రోహివి. వెళ్తే ఇంకేమైనా ఉందా? 298 00:24:44,906 --> 00:24:47,492 ఇక మీ ఇద్దరూ ఆపండి. 299 00:24:52,705 --> 00:24:55,249 హార్లన్ ప్రభువా, నా స్పష్టమైన సమ్మతి లేకుండా 300 00:24:55,333 --> 00:24:58,711 నా తరఫున నువ్వు ఇకపై ఏ చర్చ కూడా చేయకూడదు. 301 00:24:58,795 --> 00:24:59,921 అర్థమైందా? 302 00:25:01,881 --> 00:25:03,674 -అర్థమైందా? -అయింది. 303 00:25:05,718 --> 00:25:07,011 ఇప్పుడు. 304 00:25:09,055 --> 00:25:10,515 మనం అనుసరించాల్సిన ప్లాన్ చెప్తాను, వినండి. 305 00:25:12,016 --> 00:25:15,019 హార్లన్, నువ్వు నాతో సమావేశానికి వస్తున్నావు, బాబా వాస్ కూడా వస్తాడు. 306 00:25:15,103 --> 00:25:16,896 హద్దు మీరి నీ నోటి నుండి ఒక్క మాట బయటకు వచ్చినా, 307 00:25:16,979 --> 00:25:20,024 అతను తనకి నచ్చిన పద్ధతిలో నీ ప్రాణం తీసేస్తాడు. 308 00:25:25,363 --> 00:25:27,615 అన్నట్టు, నువ్వు సమావేశం ఏర్పాటు ఎక్కడ చేశావు? 309 00:26:32,180 --> 00:26:34,682 నీది పయాన్ రాజ వంశమని నాకు చెప్పలేదే. 310 00:26:38,019 --> 00:26:41,147 నాకు తెలిసి ఉంటే... చెప్పేదాన్నే. 311 00:26:42,398 --> 00:26:43,399 అప్పుడు నీకు తెలీదా? 312 00:26:44,942 --> 00:26:46,360 అది చాలా పెద్ద కథలే. 313 00:26:48,321 --> 00:26:50,448 నువ్వు ఎప్పటికైనా నాకు చెప్పాల్సిందే కదా. 314 00:26:56,496 --> 00:27:01,083 నేను పారిపోయిన నాటి నుండి, మళ్లీ నిన్ను ఎప్పుడు కలుస్తానా అని ఎదురుచూస్తున్నా. 315 00:27:03,085 --> 00:27:04,378 ఇది కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు. 316 00:27:07,173 --> 00:27:08,841 మన రాజ్యాలు యుద్ధం చేసుకోబోతున్నాయి. 317 00:27:08,925 --> 00:27:10,927 ఈ సమావేశం విజయవంతమైతే ఆ పరిస్థితి తలెత్తదు కదా. 318 00:27:13,888 --> 00:27:14,889 సమావేశం విజయవంతం కాదు. 319 00:27:15,389 --> 00:27:16,599 అలా అని నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు. 320 00:27:18,810 --> 00:27:19,811 నీకు ముందే తెలుసా? 321 00:27:20,812 --> 00:27:24,649 మన వాళ్లు యుద్ధానికే ముగ్గు చూపితే... 322 00:27:26,984 --> 00:27:30,029 నువ్వు నీ రాజ్యం కోసం, నేను నా రాజ్యం కోసం పోరాడాల్సి వస్తుంది. 323 00:27:30,113 --> 00:27:32,240 మనం అలా జరగనివ్వకూడదు, రెన్. 324 00:27:34,826 --> 00:27:36,577 మా అమ్మ యుద్ధం కోరుకోవడం లేదని నాకు తెలుసు. 325 00:27:38,079 --> 00:27:41,499 మన రాజ్యాల మధ్య... 326 00:27:43,334 --> 00:27:44,585 శాంతి కుదిరే అవకాశముందని నాకనిపించడం లేదు. 327 00:27:50,174 --> 00:27:53,719 నాకు నీతో తలపడాలని అస్సలు లేదు. 328 00:27:55,263 --> 00:27:56,264 రెన్. 329 00:28:09,110 --> 00:28:10,695 నేను నీతో ఎప్పుడూ కూడా తలపడను. 330 00:28:34,760 --> 00:28:35,761 స్కోపస్? 331 00:28:37,180 --> 00:28:38,181 నువ్వు ఇక్కడే ఉన్నావా? 332 00:28:40,349 --> 00:28:41,934 ఇంకెక్కడ ఉంటాను? 333 00:28:45,813 --> 00:28:48,733 హార్లన్. నీతో ఇంకా ఎవరు వచ్చారు? 334 00:28:48,816 --> 00:28:50,651 మాటిచ్చిన విధంగానే, యువరాణిని కూడా తెచ్చాను. 335 00:28:50,735 --> 00:28:52,862 -యువరాణి. -రాయబారి. 336 00:28:52,945 --> 00:28:55,698 హార్లన్ ప్రభువు యొక్క ఆవేశపూరితమైన ప్రవర్తనకు 337 00:28:55,782 --> 00:28:58,159 నేను సవినయంగా క్షమాపణలు చెప్తున్నాను. 338 00:28:58,242 --> 00:29:01,996 హార్లన్, నువ్వొక పిల్లవాడిలా ప్రవర్తించి, నిజంగానే పిచ్చోడివి అయ్యావు. 339 00:29:02,079 --> 00:29:03,998 నిజంగానే నీ వల్ల వాట్స్ కి ఏమైనా జరిగుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకో. 340 00:29:04,081 --> 00:29:06,459 ఏమంటున్నావు. సమావేశమంటే ఎవరోకరికి ఏమైనా జరగాల్సిందే కదా. 341 00:29:08,044 --> 00:29:10,713 మరి... ఇక మనం చర్చ మొదలుపెడదామా? 342 00:29:10,797 --> 00:29:11,923 ఎక్కడి నుండి మొదలుపెట్టాలి? 343 00:29:12,757 --> 00:29:14,467 కంజువాపై దాడి చేసింది మీరు కాదని నాకు తెలుసు. 344 00:29:14,550 --> 00:29:16,260 యువరాణి, మీరు మనసు విప్పి మాట్లాడడం సంతోషం. 345 00:29:16,344 --> 00:29:18,513 ఇవాళ ఉదయంతో పోల్చితే బాణి మారింది, 346 00:29:18,596 --> 00:29:21,516 కానీ ఈ తెలిసిన విషయం కోసం నేను ఇక్కడికి సైగ్గా రావాల్సిన పని లేదు. 347 00:29:21,599 --> 00:29:23,559 అయితే, మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. 348 00:29:24,227 --> 00:29:27,897 అతి త్వరలోనే మా అక్క సింహాసనాన్ని కోల్పోతుంది. 349 00:29:30,233 --> 00:29:31,317 చెప్పండి. 350 00:29:31,818 --> 00:29:34,737 కంజువా పతనం తర్వాత, మా అక్క చాలా మారిపోయింది. 351 00:29:34,821 --> 00:29:38,991 తను చాలా కష్టాలను అనుభవించింది, ఇంకా తన నిర్ణయాలు సరిగ్గా ఉండటం లేదు. 352 00:29:39,075 --> 00:29:40,535 మీ నిర్ణయాలు బాగున్నాయంటారా? 353 00:29:40,618 --> 00:29:42,703 మన రాజ్యాల మధ్య పోరు జరిగితే ఎవరూ గెలవలేరు. 354 00:29:42,787 --> 00:29:44,789 ఖచ్చితంగా గెలుపు ఓటములు ఉంటాయి. 355 00:29:44,872 --> 00:29:47,917 మేము చేయని నేరానికి మీరు మా ప్రభుత్వం నుండి క్షమాపణ కోరుతున్నారు. 356 00:29:48,000 --> 00:29:50,294 నేను మహారాణిని అయ్యాక, ఆ క్షమాపణని రద్దు చేసి, 357 00:29:50,378 --> 00:29:51,712 నిజం బయటపెడ్తాను. 358 00:29:51,796 --> 00:29:53,589 దీనికి నేనెందుకు ఒప్పుకోవాలి? 359 00:29:53,673 --> 00:29:55,842 ఇక్కడికి ఎందుకు వచ్చారో, అందుకే. 360 00:29:55,925 --> 00:29:59,512 ట్రయాంగిల్ కి మరో యుద్ధం మీద ఆసక్తి లేదని మనందరికీ తెలిసిందే. 361 00:29:59,595 --> 00:30:00,888 మీరు గానైట్ల నుండి దృష్టి మరల్చితే, 362 00:30:00,972 --> 00:30:03,015 వాళ్ళు కొన్ని వారాల్లోనే మీ హద్దులను బద్దలుకొట్టేస్తారు. 363 00:30:03,099 --> 00:30:04,684 గానైట్లు బొద్దింకల్లాంటి వారు, 364 00:30:04,767 --> 00:30:07,228 మేము వారిని రోజూ మా కాళ్ళతో తొక్కేస్తుంటాం. 365 00:30:07,311 --> 00:30:09,856 ఆ కాళ్లను పశ్చిమం వైపుకు తరలించాల్సి ఉంటుంది. 366 00:30:11,107 --> 00:30:14,026 మా సత్తాని తక్కువ అంచనా వేస్తే, అది పెద్ద తప్పే అవుతుంది. 367 00:30:14,110 --> 00:30:15,361 ఆ విషయం నాకు తెలుసు. 368 00:30:17,196 --> 00:30:19,907 కానీ మా రాణి ఆ తప్పులను చేయగలదని నీకూ తెలుసు. 369 00:30:21,951 --> 00:30:23,244 అయితే, మన మధ్య అంగీకారం కుదిరినట్టేనా? 370 00:30:25,580 --> 00:30:28,708 అయితే, హార్లన్, నువ్వు కాబోయే మహారాణిని పెళ్ళాడావన్నమాట. 371 00:30:29,292 --> 00:30:31,377 అది నీ విషయంలో అయినా, పెద్ద ఎత్తుగడే. 372 00:30:32,086 --> 00:30:36,549 అంటే, ఎంతటి వాడైనా ప్రేమకి బానిసే కదా. 373 00:30:45,892 --> 00:30:47,477 నాతో భోజనం చేస్తున్నందుకు ధన్యవాదాలు. 374 00:30:48,144 --> 00:30:50,354 ఎవరూ లేనప్పుడు, ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. 375 00:30:58,821 --> 00:31:02,658 ఉదయం నన్ను గుర్రం మీద ఎక్కించుకొని తిప్పినందుకు ధన్యవాదాలు. 376 00:31:04,118 --> 00:31:05,161 అదేం లేదులే. 377 00:31:05,661 --> 00:31:06,829 అదేం లేదంటే ఎలా. 378 00:31:08,956 --> 00:31:10,291 నేను ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నా. 379 00:31:10,374 --> 00:31:12,251 -హార్మొనీ? -మహారాణి గారు? 380 00:31:12,752 --> 00:31:13,920 అది ఉంది కదా? 381 00:31:14,420 --> 00:31:16,672 ఉంది, మీ ఇద్దరికి తలా ఒక్కటి. 382 00:31:27,433 --> 00:31:29,769 నీ సేవ దక్కడం నా భాగ్యం. 383 00:31:29,852 --> 00:31:30,937 ధన్యవాదాలు, మహారాణి గారు. 384 00:31:34,941 --> 00:31:36,859 ఇంతకు ముందు ఎన్నడైనా గంజాయి తీసుకున్నావా? 385 00:31:37,693 --> 00:31:39,070 మత్తు పదార్థమా? 386 00:31:39,654 --> 00:31:40,863 అది నిషేధిత పదార్థం కదా. 387 00:31:40,947 --> 00:31:42,281 మనం ఎవరికీ చెప్పం కదా. 388 00:31:46,369 --> 00:31:48,079 ఇప్పటిదాకా నేను గంజాయి ఎప్పుడూ కొట్టలేదు. 389 00:31:49,580 --> 00:31:51,958 నువ్వు తొలిసారిగా కొట్టేటప్పుడు నీకు ఆనందంగా కంపెనీ ఇస్తానులే. 390 00:31:55,419 --> 00:31:56,796 అది తీసుకుంటే ఎలా ఉంటుంది? 391 00:31:57,755 --> 00:32:02,844 చూపు గురించి నువ్వు చెప్తే నాకెలా అర్థం కాదో, ఇది కూడా నీకు చెప్తే అర్థం కాదు. 392 00:32:05,513 --> 00:32:07,265 నేనెంత తీసుకుంటానో నీకు కూడా అంతే ఇస్తాను. 393 00:32:07,348 --> 00:32:09,642 నీ అంతోడు, ఖచ్చితంగా తట్టుకోగలడులే. 394 00:32:18,484 --> 00:32:19,652 ఇప్పుడు నాకు. 395 00:32:45,011 --> 00:32:46,387 ఇప్పుడు కాసేపు ఆగాలి. 396 00:33:18,544 --> 00:33:19,712 నాకేమీ అనిపించడం లేదు. 397 00:33:25,218 --> 00:33:27,595 అనిపించాలంటే, తాకాల్సి ఉంటుంది. 398 00:33:29,472 --> 00:33:30,640 తాకాలా? 399 00:33:43,861 --> 00:33:45,738 అవును, నాకనిపిస్తోంది... 400 00:33:46,322 --> 00:33:47,406 నాకు... 401 00:33:47,490 --> 00:33:49,242 అలా కాదు, కొఫూన్. 402 00:34:16,310 --> 00:34:18,187 నీకు తెలుస్తోందా? 403 00:34:19,313 --> 00:34:20,481 తెలుస్తోంది. 404 00:34:39,667 --> 00:34:40,960 నాకు బాగా తెలుస్తోంది. 405 00:34:56,476 --> 00:34:57,643 సిబెత్. 406 00:34:59,812 --> 00:35:01,063 సిబెత్. 407 00:35:05,067 --> 00:35:06,736 ఆపమంటావా? 408 00:35:11,699 --> 00:35:12,699 వద్దు. 409 00:36:37,368 --> 00:36:38,786 మరి, నీకేమనిపిస్తోంది? 410 00:36:39,829 --> 00:36:41,831 స్కోపస్ ఒప్పిస్తాడు. నా మాట నమ్ము. 411 00:36:41,914 --> 00:36:44,333 -నేను నిన్ను నమ్మను, అతడినీ నమ్మను. -హేయ్, బాబా. 412 00:36:44,417 --> 00:36:48,379 ఒక పైస్థాయి త్రివాంటియన్ రాయబారి మాటలు నీ భర్తకు ఎలా అర్థమవుతాయో అడుగు. 413 00:36:48,463 --> 00:36:51,007 అతను అన్నదాంట్లో నిజముంది, హార్లన్. అది అనుమానాస్పదంగానే ఉంది. 414 00:36:51,090 --> 00:36:52,383 నేనేమి గుఢచారిని కాదు. 415 00:36:53,092 --> 00:36:54,218 అయితే, ఇంకేంటి? 416 00:36:56,512 --> 00:36:59,515 మహారాణి పన్ను. అది చాలా ఎక్కువ, అలాగే అది అర్థంలేనిది కూడా. 417 00:37:00,349 --> 00:37:04,520 కనుక, నగరం సురక్షితంగా ఉండాలని, కరువు సమయాల్లో నా పౌరులకు అన్నీ సమకూరాలని, 418 00:37:04,604 --> 00:37:08,316 ఒక్కోసారి నేను మహారాణి సమ్మతి లేకుండానే కొన్ని వింత ఒప్పందాలు చేసుకోవలసి వస్తుంది. 419 00:37:09,150 --> 00:37:10,777 గంజాయి, బొగ్గు లాంటి విషయాల్లో అన్నమాట. 420 00:37:11,360 --> 00:37:12,612 అయితే, చట్టాన్ని ఉల్లంఘించావా? 421 00:37:13,154 --> 00:37:16,574 అంతే. నా ప్రజల కోసం చట్టాన్ని ఉల్లంఘించాను. 422 00:37:18,618 --> 00:37:20,912 నీ శ్రమకు తగ్గ మంచి ప్రతిఫలమే పొందుతున్నావుగా. 423 00:37:20,995 --> 00:37:23,706 అది న్యాయమైనదే. రిస్క్ అంతా నాదే కదా. 424 00:37:25,208 --> 00:37:28,377 చూడండి, మనందరమూ ఏదోక సమయంలో ఏదోక చెడ్డ పని చేసే ఉంటాము, ఏమంటారు? 425 00:37:28,878 --> 00:37:30,630 నేను చేసిన పనికి మీరు సంతోషపడాలి, 426 00:37:30,713 --> 00:37:33,549 ఎందుకంటే, అదే నేను చేసుండకపోతే, ఈపాటికి మనం యుద్ధసన్నాహాల్లో ఉండేవాళ్ళం. 427 00:37:34,050 --> 00:37:39,388 కనుక, బాబా వాస్, ఇప్పుడు నీకు నన్ను నరికేస్తా, చంపేస్తా అనే ఆలోనలు లేకపోతే, 428 00:37:39,472 --> 00:37:40,765 నేను వెళ్లి పడుకుంటాను. 429 00:37:41,599 --> 00:37:44,602 రేపు ఉదయం అసలే మనం శాంతి చర్చల్లో పాల్గొంటున్నట్టు నటించాలి. 430 00:37:46,062 --> 00:37:48,397 ఇవాళ మనకి తీరికే లేకుండా గడిచింది. మనందరమూ పడుకోవాలి. 431 00:37:50,149 --> 00:37:51,818 రేపు ఉదయం మనం ఇంకా బాగా కొట్టుకోవచ్చు. 432 00:37:53,152 --> 00:37:54,237 కాస్త ఆగు. 433 00:37:56,114 --> 00:37:57,406 పక్కకు తప్పుకో. 434 00:37:58,032 --> 00:37:59,033 లేదు. 435 00:38:00,368 --> 00:38:02,161 మనం అంతర్గతంగా ఎలా పడుకుంటామనేది వేరే విషయం, 436 00:38:02,245 --> 00:38:04,622 కానీ మాగ్రా మహారాణి అవుతుందని, 437 00:38:04,705 --> 00:38:07,750 నేను తన భర్తగా రాజు అవుతానని స్కోపస్ ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాడు. 438 00:38:08,417 --> 00:38:10,586 ఆ విషయంలో వాళ్లకి అనుమానం వచ్చేలా మనం ప్రవర్తించకూడదు కదా? 439 00:38:20,555 --> 00:38:21,764 నువ్వు తన మీద చేయి వేస్తే... 440 00:38:25,560 --> 00:38:28,229 త్వరలోనే ఏదోకరోజు, నీ చేత ఆ వాక్యం పూర్తిగా అనిపిస్తాను. 441 00:38:29,313 --> 00:38:30,731 నేను కూడా బయట నీతో పాటే పడుకుంటాను. 442 00:38:33,818 --> 00:38:34,819 ఏంటి? 443 00:38:41,492 --> 00:38:43,286 అతను వెధవే కావచ్చు, కానీ అతను చెప్పింది నిజమే. 444 00:38:45,830 --> 00:38:48,082 నీ వైఫల్యానికి నేను కారణం కాకూడదు. 445 00:38:51,419 --> 00:38:53,337 అదీగాక, ఇక్కడ నీకు బాగా చల్లగా ఉంటుంది. 446 00:38:54,630 --> 00:38:55,631 లోపలికి వెళ్లు. 447 00:38:57,967 --> 00:38:59,051 నిజంగానే అంటున్నావా? 448 00:39:00,595 --> 00:39:01,637 అవును. 449 00:40:05,827 --> 00:40:08,454 కంజువాపై దాడి చేసింది త్రివాంటెస్ కాదని మనందరికీ తెలుసు. 450 00:40:09,413 --> 00:40:13,835 కానీ, మీ మహారాణి పిచ్చిగా యుద్ధం కోసం పాకులాడుతోందని కూడా మనకి తెలుసు. 451 00:40:14,752 --> 00:40:19,132 కాబట్టి, ఆమె ప్రవర్తనని ఒక చంటి బిడ్డ చేసే అల్లరిగా మేము భావిస్తున్నాము. 452 00:40:19,966 --> 00:40:21,759 శాంతిని దృష్టిలో ఉంచుకొని, 453 00:40:22,385 --> 00:40:24,470 ఆమె కోరుకుంటున్న క్షమాపణని మేము ఆమెకి ఇస్తున్నాము. 454 00:40:25,471 --> 00:40:27,181 ధన్యవాదాలు, రాయబారి. 455 00:40:27,265 --> 00:40:29,642 ఈ అబద్ధానికి బదులుగా, 456 00:40:29,725 --> 00:40:33,229 మా మ్యాపులలో పేర్కొన్న సరిహద్దులను మీరు అంగీకరించాల్సి ఉంటుంది. 457 00:40:33,729 --> 00:40:34,730 మీకు అంగీకారమేనా? 458 00:40:35,398 --> 00:40:38,651 మీ ప్రతిపాదనకి మేం సమ్మతిస్తున్నాం, పయాన్ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు. 459 00:40:39,152 --> 00:40:40,153 మంచిది. 460 00:40:40,736 --> 00:40:42,905 మా క్లర్కులు ఈ రోజు మ్యాపులను తయారు చేస్తారు, 461 00:40:42,989 --> 00:40:45,116 రేపు మనం బయలుదేరేముందు, వాటిని పరిశీలిద్దాం. 462 00:40:46,868 --> 00:40:48,786 మనం బయలుదేరే ముందు ఇంకో విషయం. 463 00:40:49,287 --> 00:40:52,457 మీ మహారాణి చూపు వెంట పడుతున్నారు, 464 00:40:53,833 --> 00:40:55,585 అది ముగియాలి. 465 00:40:56,878 --> 00:41:00,131 మీ భూభాగంలో చూపున్నవారికి ఆదరణ దక్కి, వారి సంఖ్య పెరిగితే, 466 00:41:00,214 --> 00:41:03,885 సరిహద్దు విషయంలో మీరెంత రాజీ పడినా, మీ వినాశనం తప్పదు. 467 00:41:30,703 --> 00:41:31,913 హలో, ప్యారిస్. 468 00:41:35,500 --> 00:41:36,501 హలో. 469 00:41:46,135 --> 00:41:48,471 నాతో పాటు తినవలసిందిగా రమ్మని నిన్ను నేను పిలవలేదే. 470 00:41:49,180 --> 00:41:50,973 నువ్వొక్కదానివే తింటే బాగుండదని వచ్చాను. 471 00:41:52,099 --> 00:41:54,268 బహుశా నాకు ఒంటరిగా తినడమే ఇష్టమేమో. 472 00:41:54,352 --> 00:41:56,270 ఒంటరిగా తినాలని ఎవ్వరికీ ఉండదు. 473 00:41:59,774 --> 00:42:05,446 కొఫూన్ ని జాగ్రత్తగా చూసుకో అన్నప్పుడు నా ఉద్దేశం వాడిని సైనికుడిగా మార్చమని కాదు. 474 00:42:06,989 --> 00:42:08,991 నేను చెప్తున్నా కదా, అందులో ఏ ప్రమాదమూ లేదు. 475 00:42:09,075 --> 00:42:12,370 నేను నిజంగానే అంటున్నాను. వాడిని నువ్వు చూసుకోవాలి. 476 00:42:12,870 --> 00:42:16,249 వాడికి మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత నీదే. 477 00:42:16,332 --> 00:42:18,417 నేనొక కుర్రాడికి ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో నేర్పుతున్నాను, 478 00:42:18,501 --> 00:42:19,919 -అంతే. -టోడ్. 479 00:42:20,002 --> 00:42:22,380 నా జీవితంలో మాంత్రికులను చంపడం గురించే నాకు నేర్పారు. 480 00:42:22,463 --> 00:42:24,507 ఇప్పుడు నువ్వేమో వాళ్లని రక్షించమని అడుగుతున్నావు. 481 00:42:27,468 --> 00:42:28,845 కాబట్టి, నేను నిన్ను ఎందుకు నమ్మాలి? 482 00:42:28,928 --> 00:42:30,847 నువ్వు నమ్మాల్సింది నన్ను కాదు, నిన్నే. 483 00:42:33,141 --> 00:42:36,978 నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి పూర్తి బాధ్యత నీదే అవుతుంది. 484 00:42:37,061 --> 00:42:38,312 నేను సరికాని నిర్ణయం తీసుకుంటే? 485 00:42:39,480 --> 00:42:40,690 అలా నువ్వు చేయవు. 486 00:42:40,773 --> 00:42:41,858 అది నీకెలా తెలుసు? 487 00:42:46,571 --> 00:42:47,572 ఎలా అంటే... 488 00:42:49,615 --> 00:42:53,619 నువ్వు మంచి వాడివి అని నాకు తెలుసు... 489 00:42:57,290 --> 00:42:58,791 కానీ నీ పేరు మాత్రమే దరిద్రంగా ఉంది. 490 00:43:05,631 --> 00:43:06,632 మంచి వాడిని. 491 00:43:22,774 --> 00:43:23,775 శుభోదయం. 492 00:43:25,526 --> 00:43:26,527 హాయ్. 493 00:43:48,508 --> 00:43:50,134 నిన్న రాత్రి జరిగిన దానికి బాధపడుతున్నావా? 494 00:43:53,805 --> 00:43:57,183 ఆ పనిని నేను చేయడం ఇదే మొదటిసారి. 495 00:44:03,606 --> 00:44:05,399 కొత్తదేదైనా కానీ, దాని వల్ల భయం కలుగుతుంది... 496 00:44:06,943 --> 00:44:08,111 కానీ అదే ఉల్లాసంగా కూడా ఉంటుంది. 497 00:44:13,366 --> 00:44:16,786 నీకు అసౌకర్యంగా అనిపించేదేదీ నేను చేయాలనుకోవడం లేదు. 498 00:44:20,665 --> 00:44:22,834 ఈ మధ్య, నాకన్నీ అసౌకర్యంగానే అనిపిస్తున్నాయి. 499 00:44:27,505 --> 00:44:28,756 నువ్వు కష్టాలు పడ్డావు. 500 00:44:32,009 --> 00:44:33,427 నీకు ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. 501 00:44:38,724 --> 00:44:40,560 అయితే, ఇప్పుడొక మాట అనుకుందాం. 502 00:44:40,643 --> 00:44:42,353 నేనెప్పుడూ నీతో అబద్ధమాడను. 503 00:44:45,148 --> 00:44:46,482 నువ్వు కూడా నాకెప్పుడూ అబద్ధం చెప్పకూడదు. 504 00:44:47,692 --> 00:44:51,696 మనం చెప్పే నిజాలు మన మనస్సుకు బాధ కలిగించేవి అయినా సరే. 505 00:44:54,323 --> 00:44:55,324 సరేనా? 506 00:44:57,827 --> 00:44:58,828 సరే. 507 00:45:06,669 --> 00:45:07,962 ఈ శాంతి... 508 00:45:09,714 --> 00:45:12,049 చాలా అబద్ధాల మీద నిర్మితమైంది. 509 00:45:15,678 --> 00:45:17,013 అది ఎంతో కాలం నిలవదు. 510 00:45:18,556 --> 00:45:21,142 బహుశా ఈ అబద్ధాల వెనుక ఏదైనా ఒక గొప్ప నిజం దాగుందేమే. 511 00:45:25,688 --> 00:45:26,939 ఏంటా నిజం? 512 00:45:29,233 --> 00:45:30,693 ఎవరికీ యుద్ధం ఇష్టం లేదనే నిజం. 513 00:45:35,907 --> 00:45:37,950 నేను కూడా నీ అంత ఆశావాదినైతే బాగుండు. 514 00:45:39,577 --> 00:45:40,578 అంటే... 515 00:45:42,747 --> 00:45:45,458 నా చెంతనే ఉంటే, బహుశా నీకు కూడా నా ఆశావాదం అంటుకుంటుందేమో. 516 00:49:45,782 --> 00:49:47,992 చొరబాటుదార్లు! లేవండి! 517 00:49:49,535 --> 00:49:50,578 ఏం జరుగుతోంది? 518 00:50:24,278 --> 00:50:25,363 కమాండర్ వాట్స్? 519 00:50:27,281 --> 00:50:28,407 ఎవరక్కడ? 520 00:50:35,998 --> 00:50:37,041 ఎవరు... 521 00:50:50,555 --> 00:50:54,308 కాపాడండి! కాపాడండి! గార్డులారా! 522 00:50:54,392 --> 00:50:55,685 మనల్ని మోసం చేశారు! 523 00:51:13,119 --> 00:51:14,120 స్కోపస్. 524 00:51:16,622 --> 00:51:17,623 నన్ను మన్నించు. 525 00:51:17,707 --> 00:51:19,709 -అయ్యో. -రెన్. 526 00:51:24,213 --> 00:51:25,548 నాన్నా, అక్కడే ఉండు! 527 00:51:28,843 --> 00:51:31,429 నువ్వే. దీనికి కారణం నువ్వే. 528 00:51:31,512 --> 00:51:34,056 రెన్. కాదు. 529 00:51:34,140 --> 00:51:35,683 మొదట్నుంచీ నీ పన్నాగం ఇదే. 530 00:51:35,766 --> 00:51:37,435 కాదు, ఇది మా పని కాదు. 531 00:51:37,518 --> 00:51:40,146 దీన్ని అడ్డుకోగలిగేది నేను మాత్రమే అని నీకు తెలుసు. 532 00:51:40,229 --> 00:51:42,440 -రెన్. -అందుకే నన్ను నీ వద్ద ఉంచుకున్నావు. 533 00:51:44,567 --> 00:51:46,068 నువ్వు నన్ను వాడుకున్నావు. 534 00:51:46,152 --> 00:51:48,613 లేదు. లేదు. 535 00:51:52,533 --> 00:51:53,534 రెన్, ఆగు! 536 00:52:19,435 --> 00:52:21,437 ఈ హంతకుని మీద పయాన్ గుర్తులున్నాయి. 537 00:52:25,191 --> 00:52:26,192 సిబెత్. 538 00:52:31,614 --> 00:52:32,615 అయ్యయ్యో. 539 00:52:34,450 --> 00:52:36,160 తనకి అసలు శాంతి ఒప్పందమే ఇష్టం లేదు. 540 00:52:36,244 --> 00:52:39,997 ఈ సమావేశాన్ని, తను యుద్ధం అనివార్యం చేయడానికి వాడుకుంది. 541 00:52:44,043 --> 00:52:45,586 తను మనందరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందనే 542 00:52:46,838 --> 00:52:49,423 విషయాన్ని పక్కన పెడితే, తన వ్యూహానికి జోహార్లు చెప్పాల్సిందే. 543 00:52:49,507 --> 00:52:50,591 మనం ఇక్కడ ఉండకూడదు. 544 00:52:51,300 --> 00:52:54,053 సూర్యోదయానికి ముందే ఇక్కడికి త్రివాంటియన్లు వచ్చేస్తారు. 545 00:53:18,077 --> 00:53:19,078 కొఫూన్? 546 00:53:22,248 --> 00:53:23,249 కొఫూన్? 547 00:53:26,961 --> 00:53:27,962 సిబెత్. 548 00:53:32,008 --> 00:53:33,468 నిన్ను లేపినందుకు మన్నించు. 549 00:53:34,093 --> 00:53:35,470 పర్వాలేదు, ఏమైంది? 550 00:53:35,553 --> 00:53:37,722 ఏదో జరుగుతోంది. ఇక్కడ ఉండటం నాకు క్షేమం కాదు. 551 00:53:38,848 --> 00:53:41,392 ఏం... ఏమైంది? ఏం జరుగుతోంది? 552 00:53:41,476 --> 00:53:44,937 ఇంకా ఏం జరగలేదు, కానీ ఏదొకటి జరిగే తీరుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు. 553 00:53:47,648 --> 00:53:49,400 నాకు నీ మీద తప్ప ఇంకెవరి మీదా నమ్మకం లేదు. 554 00:53:57,366 --> 00:53:58,451 మీరు నా దగ్గర పడుకోవచ్చు. 555 00:54:00,787 --> 00:54:01,788 ధన్యవాదాలు. 556 00:55:28,708 --> 00:55:30,042 మీ పర్యటన ఎలా సాగిందేంటి? 557 00:55:49,395 --> 00:55:50,855 మీకు ఆశ్వర్యం కలిగినట్టుగా అనిపించడం లేదు. 558 00:55:51,939 --> 00:55:55,860 కేన్ రాణికి కావలసింది యుద్ధమే కదా? నాకు ఆశ్చర్యంగా ఏం అనిపించడం లేదు. 559 00:55:57,028 --> 00:55:58,529 నేను ట్రయాంగిల్ ని హెచ్చరించే ప్రయత్నం చేశా. 560 00:56:01,282 --> 00:56:03,034 ఆ సైనికుల ప్రాణాలు అనసవరంగా పోయాయి. 561 00:56:03,910 --> 00:56:06,412 మీకు ఇంకో విషయం చెప్పాలి. 562 00:56:09,415 --> 00:56:10,708 ఆ దాడి... 563 00:56:11,709 --> 00:56:13,711 బాబా వాస్ నాయకత్వంలో జరిగిందనుకుంటా. 564 00:56:15,254 --> 00:56:17,715 అయితే, బాబా, అతని పిల్లలు ఇప్పుడు మహారాణి తరఫున పోరాడుతున్నారన్నమాట. 565 00:56:19,675 --> 00:56:23,137 అతను ఇక్కడికి రావడానికి, ఇక్కడి నుండి పారిపోవడానికి నేనే కారణం. 566 00:56:24,847 --> 00:56:27,642 ఈ విషయం బయట పడితే, ట్రయాంగిల్ నాకు మరణ శిక్ష విధిస్తుంది. 567 00:56:27,725 --> 00:56:29,310 వాళ్లకి నా ద్వారా మాత్రం చచ్చినా తెలీదు. 568 00:56:32,939 --> 00:56:37,068 నువ్వొకదానివే బతికావు. ట్రయాంగిల్ వాళ్లు చాలా ప్రశ్నలు అడుగుతారు. 569 00:56:39,737 --> 00:56:41,864 వాటిలో మొదటి ప్రశ్న: 570 00:56:43,908 --> 00:56:48,121 ఆ దాడిలో నా కెప్టెన్ తప్ప ఇంకెవరూ బతకలేదు, ఎందుకలా? 571 00:56:50,748 --> 00:56:51,999 నేను రాజద్రోహిని అనుకుంటున్నారా? 572 00:56:53,251 --> 00:56:55,503 లేదు. అస్సలు లేదు. 573 00:56:56,838 --> 00:56:58,756 నువ్వు చిన్నప్పటి నుండే నాకు తెలుసు. 574 00:57:01,384 --> 00:57:04,387 అయినా ఇటీవలి పరిస్థితులన్నీ చూస్తుంటే, మన మీద అనుమానం రాక మానదు. 575 00:57:04,887 --> 00:57:08,141 కాబట్టి, ఈ ప్రశ్నకు నువ్వు నాకు సమాధానం చెప్పాలి, కెప్టెన్. 576 00:57:11,936 --> 00:57:14,856 కేవలం నువ్వు మాత్రమే ఎలా బతికావు? 577 00:57:16,399 --> 00:57:19,110 -మీరు సంబరపడిపోతారనుకున్నా... -సమాధానం చెప్పు. 578 00:58:06,908 --> 00:58:08,201 ఎందుకంటే నేను చూడగలను. 579 00:59:10,930 --> 00:59:12,932 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య