1 00:00:03,091 --> 00:00:04,676 ఇప్పుడొక మాట అనుకుందాం. 2 00:00:04,760 --> 00:00:06,428 నేనెప్పుడూ నీతో అబద్ధమాడను. 3 00:00:06,512 --> 00:00:08,180 నువ్వు నాకెప్పుడూ అబద్ధం చెప్పకూడదు. 4 00:00:08,263 --> 00:00:09,598 సరే. 5 00:00:09,681 --> 00:00:13,143 హార్లన్ ప్రభువా, మీ తమ్ముడి తల నరకడాన్ని మేము రహస్యంగా ఏమీ ఉంచలేదు. 6 00:00:13,227 --> 00:00:15,479 అతని తలను మీకు గౌరవసూచకంగా పంపాం కూడా. 7 00:00:19,983 --> 00:00:22,319 -రాయబారి, నేను క్షమాపణ కోరుతున్నాను. -ఈ సమావేశం వల్ల ఏ లాభమూ లేదు. 8 00:00:22,402 --> 00:00:23,946 ఇక్కడితో ఇది ముగిసినట్టే. 9 00:00:28,492 --> 00:00:29,993 కాపాడండి! మనల్ని మోసం చేశారు. 10 00:00:33,330 --> 00:00:34,540 దీనికి కారణం నువ్వే. 11 00:00:34,623 --> 00:00:37,167 రెన్. కాదు. 12 00:00:37,251 --> 00:00:39,002 నువ్వు నన్ను వాడుకున్నావు. 13 00:00:39,086 --> 00:00:40,963 ఈ హంతకుని మీద పయాన్ గుర్తులున్నాయి. 14 00:00:41,630 --> 00:00:42,673 సిబెత్. 15 00:00:42,756 --> 00:00:46,426 ఈ సమావేశాన్ని, తను యుద్ధం అనివార్యం చేయడానికి వాడుకుంది. 16 00:00:47,219 --> 00:00:48,720 ఆ దాడి... 17 00:00:48,804 --> 00:00:50,389 బాబా వాస్ నాయకత్వంలో జరిగిందనుకుంటా. 18 00:00:51,682 --> 00:00:56,019 కేన్ మహారాణికి కావలసింది యుద్ధమే కదా? నాకు ఆశ్చర్యంగా ఏం అనిపించడం లేదు. 19 00:00:56,812 --> 00:00:58,313 అతి త్వరలోనే... 20 00:00:58,397 --> 00:00:59,356 మీ పర్యటన ఎలా సాగిందేంటి? 21 00:01:01,525 --> 00:01:03,527 ...మా అక్క సింహాసనాన్ని కోల్పోతుంది. 22 00:01:13,161 --> 00:01:17,498 శాంతి చర్చలు ఇప్పుడు ముగిసిన అధ్యాయం. 23 00:01:20,168 --> 00:01:23,129 శాంతి సమావేశంలో బృందం, శాంతి ఒప్పందాన్ని కుదర్చలేకపోయినందున, 24 00:01:23,213 --> 00:01:26,174 మన ముందు ఇప్పుడు ఒకటే మార్గముంది. 25 00:01:27,300 --> 00:01:28,301 యుద్ధం. 26 00:01:30,345 --> 00:01:32,639 ఈ క్షణాన్ని గుర్తుంచుకోండి. 27 00:01:32,722 --> 00:01:35,683 పయాన్ సామ్రాజ్యాన్ని స్వర్ణ యుగంలోకి నడిపించడంలో మహారాణికి అండగా 28 00:01:35,767 --> 00:01:39,062 ఉన్న వ్యక్తులుగా మీ పేర్లు చరిత్రలో 29 00:01:39,145 --> 00:01:42,982 సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. 30 00:01:43,066 --> 00:01:45,902 ఆమె అబద్ధమాడుతోంది. ఎవరోకరు ఆమెని ఆపాలి. 31 00:01:47,237 --> 00:01:48,238 ఇది సరైన సమయం కాదు. 32 00:01:48,321 --> 00:01:51,241 హార్లన్ ప్రభువా, ప్రతినిధులందరూ సంతకం చేసేశారా? 33 00:01:54,619 --> 00:01:55,620 చేశారు. 34 00:01:56,287 --> 00:01:59,249 ప్రతినిధులందరి ముళ్లూ జత చేయబడ్డాయి. 35 00:02:00,166 --> 00:02:03,253 అయితే, దొరసానులారా, ప్రభువులారా, 36 00:02:03,336 --> 00:02:05,380 మనమిప్పుడు యుద్ధం ముంగిట ఉన్నాం. 37 00:02:05,880 --> 00:02:08,007 వెంటనే మీ కెప్టెన్లను నా మాంత్రికాంతకుల జనరల్ కి రిపోర్ట్ చేయమని అడగండి, 38 00:02:08,091 --> 00:02:09,217 ఆయన వాళ్ళకి కార్యచరణను తెలుపుతారు. 39 00:02:09,300 --> 00:02:12,428 ఈ కౌన్సిల్ దృష్టికి తీసుకురావలసిన విషయం మరొకటి ఉంది. 40 00:02:13,805 --> 00:02:17,976 యువరాణి మాగ్రా, ఎప్పుడూ మీరు ఏదోకటి చెప్తూనే ఉంటారు కదా? ఇప్పుడు ఏంటి? 41 00:02:18,059 --> 00:02:19,519 ఇది మాంత్రికాంతకులకు సంబంధించినది. 42 00:02:20,812 --> 00:02:21,980 ఏంటో చెప్పండి. 43 00:02:23,022 --> 00:02:24,941 వాళ్లు మీ పక్షాన పోరాడరు. 44 00:02:27,443 --> 00:02:31,489 నా మాంత్రికాంతకులు, నా ఏలుబడి అంతటా నా మాట విన్నారు, ఇప్పుడు కూడా వింటారు. 45 00:02:31,573 --> 00:02:33,533 వాళ్లు నా సైనికులు. 46 00:02:33,616 --> 00:02:34,742 కాదు. 47 00:02:44,294 --> 00:02:46,754 వాళ్లు నా సైనికులు. 48 00:02:48,339 --> 00:02:49,549 టమాక్టీ జూన్? 49 00:02:50,133 --> 00:02:52,635 మీరు నన్ను ఇంకా మర్చిపోనందుకు నాకు ఆనందంగా ఉంది. 50 00:02:52,719 --> 00:02:56,014 మీరు బతికే ఉన్నారు! హమ్మయ్య. 51 00:02:56,097 --> 00:02:58,141 నేనెన్ని అనుభవించానో మీకు తెలీనే తెలీదు. 52 00:02:59,017 --> 00:03:03,521 మీరు అబద్ధాలాడాలనుకుంటే, నిజాలు తెలిసిన వారిని సమాధి చేశారని నిర్ధారించుకోవాలి. 53 00:03:03,605 --> 00:03:08,151 -అబద్ధాలా? -కంజువాని మీరే ధ్వంసం చేశారు. 54 00:03:10,570 --> 00:03:11,696 అతను అబద్ధమాడుతున్నాడు! 55 00:03:12,780 --> 00:03:14,072 అతడిని బందించండి. 56 00:03:15,825 --> 00:03:17,827 అతడిని బంధించమని అన్నాను! 57 00:03:17,911 --> 00:03:20,872 ఇప్పుడు వాళ్ళు మీకు కట్టుబడి లేరు. 58 00:03:22,165 --> 00:03:24,250 -అటెన్షన్! -అటెన్షన్! అటెన్షన్! 59 00:03:24,334 --> 00:03:26,127 అటెన్షన్! అటెన్షన్! అటెన్షన్! అటెన్షన్! 60 00:03:26,211 --> 00:03:30,506 అటెన్షన్! అటెన్షన్! అటెన్షన్! అటెన్షన్! 61 00:03:30,590 --> 00:03:35,178 మీ ప్రజలను మీరే చంపారు... 62 00:03:36,804 --> 00:03:39,098 వారి కుటుంబాలను ఊచకోత కోశారు. 63 00:03:41,309 --> 00:03:43,519 నా కుటుంబాన్ని కూడా. 64 00:03:48,983 --> 00:03:54,572 మీరు నన్ను కూడా హత్య చేయాలని చూశారు. 65 00:03:57,283 --> 00:03:59,786 ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు, జనరల్. 66 00:03:59,869 --> 00:04:02,497 ఇవి ఆరోపణలు కాదు. నిజాలు. 67 00:04:04,040 --> 00:04:05,708 కెప్టెన్ గోసెట్, నేను కూడా మీలాగే, 68 00:04:06,543 --> 00:04:09,254 సింహాసనానికే నా జీవితాన్ని అంకితం చేశాను. 69 00:04:10,129 --> 00:04:11,339 కానీ ఈ మహారాణి... 70 00:04:12,715 --> 00:04:13,883 ఈ మహిళ... 71 00:04:15,134 --> 00:04:17,679 ఈమె, 72 00:04:17,762 --> 00:04:19,222 మహా పాపిష్ఠిది. 73 00:04:19,305 --> 00:04:20,890 అతను చెప్పేవన్నీ అబద్దాలే! 74 00:04:20,974 --> 00:04:23,434 మాగ్రా, అతను అబద్దాలు చెప్తున్నాడని అందరికీ చెప్పు. 75 00:04:24,310 --> 00:04:25,728 ఆయన చెప్పేది నిజమే. 76 00:04:26,896 --> 00:04:29,190 మీ ప్రజలను మీరు మోసం చేశారు, ఇకపై అలా చేయలేరు. 77 00:04:30,567 --> 00:04:33,403 ఈ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవాలి. 78 00:04:34,487 --> 00:04:36,906 ఇప్పుడు యుద్ధం తప్పదు. 79 00:04:38,408 --> 00:04:42,328 కానీ మనం ఈ అబద్ధాలాడే హంతకురాలి సారథ్యంలో ముందుకు సాగాలా... 80 00:04:43,454 --> 00:04:49,168 లేదా నిజమైన మహారాణి... 81 00:04:50,169 --> 00:04:51,588 మాగ్రా సారథ్యంలో ముందుకు సాగాలా? 82 00:04:54,716 --> 00:04:57,302 ఇది తిరుగుబాటా? 83 00:04:57,844 --> 00:04:59,262 నాకు ఇప్పుడు అర్థమైంది. 84 00:05:00,096 --> 00:05:02,223 మన రాజ్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, 85 00:05:02,307 --> 00:05:06,853 నా చెల్లి నయవంచనతో, అబద్ధాలతో సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. 86 00:05:06,936 --> 00:05:12,942 కానీ ఈ కొద్ది మంది మాంత్రికాంతకుల కన్నా నా సైన్యం చాలా పెద్దదని తను మర్చిపోయింది. 87 00:05:13,776 --> 00:05:17,071 కెప్టెన్ గోసెట్, ఈ రాజద్రోహులను బంధించండి. 88 00:05:18,072 --> 00:05:19,282 సరే... 89 00:05:20,783 --> 00:05:21,784 లేదు. 90 00:05:23,702 --> 00:05:27,498 పెన్సా సైన్యం, మహారాణి మాగ్రా పక్షాన నిలుస్తోంది. 91 00:05:27,582 --> 00:05:30,460 మీ మహారాణి తను కాదు! 92 00:05:30,543 --> 00:05:32,712 ఆ విషయంలో మన అభిప్రాయ భేదాలను పక్కకు పెడదామా? 93 00:05:33,880 --> 00:05:37,258 టమాక్టీ జూన్ చేసిన ఆరోపణలు నిజమని నేను నిరూపించగలను. 94 00:05:37,342 --> 00:05:39,844 కంజువా విధ్వంసకాండ ఆమె పనేనని సాక్ష్యం చెప్పగల వ్యక్తులు 95 00:05:39,928 --> 00:05:42,972 నా దగ్గర ఉన్నారు. 96 00:05:44,891 --> 00:05:46,434 మహారాణి కానీ ఇంకెవరైనా కానీ, 97 00:05:46,517 --> 00:05:49,687 రాజద్రోహం, ఇంకా హత్య మరణ శిక్షార్హమైనవి. 98 00:05:49,771 --> 00:05:53,775 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నా తరఫున విచారణ జరగాల్సిన అవసరముంది. 99 00:05:54,359 --> 00:05:58,988 మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న యుద్ధాన్ని ఇప్పుడే మీరు ప్రకటించారు. 100 00:06:00,573 --> 00:06:05,161 మరి యుద్ధ ప్రకటన మీద సంతకం చేయడం ద్వారా, 101 00:06:06,246 --> 00:06:10,041 మీరు అధికారాన్ని న్యాయస్థానల నుండి... 102 00:06:12,001 --> 00:06:13,253 జనరల్స్ కి బదిలి అయ్యేలా చేశారు. 103 00:06:16,965 --> 00:06:18,466 నువ్వు పరిణామాల గురించి జాగ్రత్తగా ఆలోచించావన్నమాట. 104 00:06:20,009 --> 00:06:21,427 అందుకు తగినంత సమయం నాకు ఉండిందిలెండి. 105 00:06:24,556 --> 00:06:26,808 మీ సేవకి ధన్యవాదాలు. 106 00:06:29,060 --> 00:06:30,186 ఆగండి! 107 00:06:31,104 --> 00:06:32,730 ఆమె గర్భవతి. 108 00:06:36,484 --> 00:06:41,030 మేము పెన్సాకి వచ్చిన కొన్నాళ్ళకే సిబెత్ తన బిడ్డని కోల్పోయింది. 109 00:06:41,656 --> 00:06:43,032 ఇది కొత్తగా ఏర్పడినది. 110 00:06:43,992 --> 00:06:45,451 ఇప్పుడిప్పుడే అండం ఏర్పడుతోంది. 111 00:06:46,536 --> 00:06:48,913 నాకు ఆ బిడ్డ ఉనికి బాగా తెలుస్తోంది. 112 00:06:49,789 --> 00:06:53,585 తల్లి చేసిన తప్పులకు ఆ బిడ్డని చంపడం న్యాయం కాదు. 113 00:06:55,670 --> 00:06:57,714 ఆమెని బిడ్డ పుట్టాక చంపవచ్చు. టోడ్. 114 00:06:57,797 --> 00:07:00,258 నువ్వు నన్ను చంపడంలో విఫలమవ్వడం ఇది రెండవసారి, టమాక్టీ జూన్. 115 00:07:00,341 --> 00:07:02,760 -ఈమెని ఇక్కడి నుండి తీసుకెళ్లిపోండి. -జోస్యాన్ని తప్పించుకోలేరు! 116 00:07:02,844 --> 00:07:05,305 ఇప్పటికీ దైవ జ్వాల నా పక్షానే ఉంది. 117 00:07:05,388 --> 00:07:08,558 నా బిడ్డ, తన తల్లిని కాపాడటానికి సరైన సమయానికి కడుపులో పడ్డాడు. 118 00:07:09,142 --> 00:07:12,103 జనులారా, సింహాసనానికి విధేయులుగా ఉండండి! 119 00:07:12,186 --> 00:07:15,315 మీ మహారాణి మళ్లీ సింహాసనం ఎక్కేదాకా ఊరుకోకండి. 120 00:07:15,398 --> 00:07:17,859 మిగిలిన రాజద్రోహులారా, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. 121 00:07:17,942 --> 00:07:20,069 ఆమెని తన గదిలో బంధించి, కాపలాను కట్టుదిట్టం చేయండి. 122 00:07:21,154 --> 00:07:23,281 ఆమెని అంతఃపురంలోనే ఉంచడం తెలివైన పని కాదు. 123 00:07:23,364 --> 00:07:26,117 పెన్సాలో ఈ చోటుకన్నా సురక్షితమైన చోటు ఇంకేదీ లేదు. 124 00:07:28,870 --> 00:07:29,871 నిశ్శబ్దంగా ఉండండి. 125 00:07:32,790 --> 00:07:34,000 ఆ శబ్దం మీకు వినబడిందా? 126 00:07:39,964 --> 00:07:41,507 వుడ్వేల్ శత్రువుల వశమైంది. 127 00:07:49,349 --> 00:07:53,061 మనం ఎటువంటి నష్టం లేకుండానే వుడ్వేల్ ని వశం చేసుకున్నాం. 128 00:07:54,312 --> 00:07:57,482 నీ చూపు పుణ్యమా అని, వాళ్లు అంచనా వేసిన దాని కన్నా చాలా ముందే మనం రాగలిగాం. 129 00:07:57,565 --> 00:08:00,318 అయినా కానీ వాళ్ళు హెచ్చరికను పంపగలిగారు. 130 00:08:00,401 --> 00:08:02,529 మనం వస్తున్నామని పెన్సాకు తెలుసు. 131 00:08:02,612 --> 00:08:05,365 అది తెలిసినా కానీ, మన అశేష సైనిక బలాన్ని ఎదుర్కొనేంత శక్తి వాళ్ళకి లేదు. 132 00:08:06,866 --> 00:08:09,077 మనం ఎంత వేగంగా గెలిచామో అని కౌన్సిల్ కి తెలియగానే... 133 00:08:10,245 --> 00:08:12,330 వాళ్లు నా వ్యూహానికి ఆమోదం తెలుపుతారు. 134 00:08:13,414 --> 00:08:16,084 అంటే, చూపు గల సైనికులను ఉపయోగించాలనే వ్యూహమా? 135 00:08:21,047 --> 00:08:25,969 జనరల్, దయచేసి, నా గురించి కౌన్సిల్ కి చెప్పకండి. 136 00:08:27,428 --> 00:08:29,556 నీకు సురక్షితమని నాకు అనిపించేదాకా నేను నీ గురించి చెప్పను. 137 00:08:30,473 --> 00:08:33,768 రెన్, నువ్వు నాకు కూతురు లాంటిదానివి, 138 00:08:34,686 --> 00:08:37,063 నేను నిన్ను కాపాడతాను. నీకు మాట ఇస్తున్నాను. 139 00:10:07,195 --> 00:10:09,781 త్రివాంటియన్లు, మనం ఊహించినదాని కన్నా ముందే వుడ్వేల్ కి చేరుకున్నారు. 140 00:10:09,864 --> 00:10:14,118 ఇదే వేగంతో వస్తే, వాళ్ళు అయిదు, ఆరు రోజుల్లో పెన్సాకి వచ్చేస్తారు. 141 00:10:14,202 --> 00:10:16,913 వాళ్ళ సైన్యం ఇంత వేగంగా ఎలా కదలగలుగుతోంది? 142 00:10:16,996 --> 00:10:19,332 వాళ్ల సైన్యాలకు చూపున్న సైనికులు మార్గాన్ని చూపుతున్నారు. 143 00:10:19,415 --> 00:10:22,502 త్రివాంటియన్లు, చూపు ఉన్నవారిని అస్సలు ఉపేక్షించరు. 144 00:10:22,585 --> 00:10:26,047 కమాండర్ జనరల్ వారిని రహస్యంగా చేర్చుకొని శిక్షణ ఇప్పిస్తున్నాడు. 145 00:10:26,130 --> 00:10:28,758 త్రివాంటియన్లు పెన్సాకి చేరుకోగలిగారంటే, మనల్ని ఎవరూ రక్షించలేరు. 146 00:10:28,841 --> 00:10:34,055 అవును. గ్రీన్ హిల్ గ్యాప్. ఆ కోట ఇంకా క్రియాశీలకంగా ఉందా? 147 00:10:34,138 --> 00:10:36,057 క్రియాశీలకంగానే ఉంది. 20 మందితో భద్రతాపరంగా బాగా కట్టుదిట్టంగా ఉంది. 148 00:10:36,140 --> 00:10:37,475 మన సైనిక బలగాలను మనం అక్కడ మోహరిద్దాం. 149 00:10:37,559 --> 00:10:40,979 లేదు. గ్రీన్ హిల్ గ్యాప్, పెన్సాకి కూతవేటు దూరంలోనే ఉంది. చాలా దగ్గర్లో ఉంది. 150 00:10:41,062 --> 00:10:43,648 పైచేయి సాధించడానికి మనకు అనుకూలమైన చోటు అది తప్ప ఇంకోటి లేదు. 151 00:10:43,731 --> 00:10:45,275 అది మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. 152 00:10:45,358 --> 00:10:47,485 త్రివాంటియన్ల సైన్యం ఎంత పెద్దదో ఏమైనా తెలిసిందా? 153 00:10:47,569 --> 00:10:49,654 వాళ్ళ సైన్యం ఎక్కువగా పశ్చిమాన మోహరించబడి ఉంది. 154 00:10:49,737 --> 00:10:53,992 వాళ్లు 250 మంది ఉండవచ్చని గుఢచారుల అంచనా. వారి మొత్తం సైన్యంతో పోలిస్తే అది తక్కువే. 155 00:10:54,075 --> 00:10:55,201 అలా అయినా, మన కంటే ఎక్కువే. 156 00:10:55,952 --> 00:10:58,788 అందుబాటులో ఉన్న ప్రతీ సైనికుడు, ఇంకా సైనిక సామగ్రి అంతా 157 00:10:58,872 --> 00:11:01,457 రెండ్రోజులలో గ్రీన్ హిల్ గ్యాప్ లో ఉండాలి. 158 00:11:02,125 --> 00:11:03,668 కెప్టెన్ గోసెట్, మీ సైనికులను సిద్ధం చేయండి. 159 00:11:03,751 --> 00:11:05,920 మనం రేపు సూర్యోదయం అవ్వగానే బయలుదేరుతున్నాం. 160 00:11:06,004 --> 00:11:08,047 లేదు. ఆలోచించు, మాగ్రా. 161 00:11:08,131 --> 00:11:11,175 వాళ్ల వద్ద నిజంగానే చూపుగల సైనికులు ఉంటే, అది మనకి మరింత ప్రమాదకరం కాగలదు. 162 00:11:11,259 --> 00:11:13,136 మీ దగ్గర కూడా చూపుగల సైనికులు ఉంటారు. 163 00:11:14,053 --> 00:11:15,513 -లేదు. -మేము కూడా బయలుదేరుతాం. 164 00:11:16,514 --> 00:11:17,891 మీరు సైనికులు కాదు. 165 00:11:18,516 --> 00:11:21,227 లేదు, మేము మహారాణి పిల్లలం. ఈ పోరులో మేము కూడా భాగస్వాములం. 166 00:11:21,311 --> 00:11:24,355 మీ నాన్న చెప్పింది నిజమే. నీకూ, నీ సోదరికీ శిక్షణ లేదు. 167 00:11:24,439 --> 00:11:27,233 చూపున్నంత మాత్రాన మీరు యుద్ధం చేయలేరు. 168 00:11:28,026 --> 00:11:31,279 -నాకు కుటుంబ వ్యవహారాల్లో దూరాలని లేదు... -అయితే, దూరవద్దు. 169 00:11:31,362 --> 00:11:35,950 కానీ మనం ఎదుర్కోబోయేది చాలా పెద్ద సైన్యమని నువ్వే చాలాసార్లు అన్నావు కదా. 170 00:11:38,119 --> 00:11:40,914 ఈ యుద్ధంలో మనకి పనికి వచ్చేది ఏదైనా కానీ, దాన్ని మనం వదులుకోకూడదు. 171 00:11:40,997 --> 00:11:43,499 రణరంగంలో చూపు ఉండటం వలన పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. 172 00:11:44,042 --> 00:11:45,752 ఆ విషయాన్ని నా పిల్లల విషయంలో నేను స్వయంగా గమనించాను, 173 00:11:45,835 --> 00:11:47,754 సాధారణంగా చూస్తే, వారి చూపు వారిని తప్పుదోవ పట్టిస్తుంది. 174 00:11:47,837 --> 00:11:52,634 ఈ చూపున్న సైనికుల వల్ల ఇడో సైన్యానికి ఒక తప్పుడు విశ్వాసం ఏర్పడుతుంది. 175 00:11:52,717 --> 00:11:54,302 అదే తప్పుడు విశ్వాసాన్ని మనం మన సైనికులకు ఇవ్వనక్కర్లేదు. 176 00:11:54,385 --> 00:11:57,013 వారిని ఉపయోగించడానికి ఇడో ఒక వ్యవస్థని రూపొందించాడు. 177 00:11:57,096 --> 00:11:58,765 దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. 178 00:12:00,016 --> 00:12:01,809 నాన్నా, నువ్వు గొప్ప యోధుడివే కావచ్చు... 179 00:12:03,269 --> 00:12:06,064 కానీ నిజమేమిటంటే, మేము చేయగల కొన్ని పనులను, నువ్వు చేయలేవు. 180 00:12:06,147 --> 00:12:10,026 అదే విషయం జెర్లామరెల్ నాకు, వాడి కళ్లను పీకేసే ముందు చెప్పాడు. 181 00:12:11,236 --> 00:12:13,238 ఈ పోరు నుండి మీరు మమ్మల్ని రక్షించలేరు. 182 00:12:13,321 --> 00:12:14,614 ఇది పోరు కాదు. 183 00:12:14,697 --> 00:12:17,575 ఇది ఊచకోత, అందులో నా పిల్లలను నేను భాగం కానివ్వను! 184 00:12:17,659 --> 00:12:19,327 -నేను భాగం అవుతాను. -నేను కూడా. 185 00:12:21,162 --> 00:12:22,163 మాగ్రా. 186 00:12:24,666 --> 00:12:27,919 -మన పిల్లలను మన యుద్ధానికి పంపకూడదు. -వాళ్లని నేను ఆపలేను. 187 00:12:28,002 --> 00:12:30,588 వాళ్ల క్షేమం కోసం నువ్వు రాణివయ్యావని చెప్పావు. ఇప్పుడు ఇలా ఎలా చేస్తావు? 188 00:12:30,672 --> 00:12:33,216 వారిని యుద్ధానికి పంపడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా? 189 00:12:33,299 --> 00:12:36,052 నా మాట నమ్ము, నాకు వారిని బంధించాలనే ఉంది. 190 00:12:36,135 --> 00:12:39,222 అయితే ఆ పనే చేయ్. వారిని బలవంతంగా ఇక్కడే ఉంచుదాం. 191 00:12:39,305 --> 00:12:42,100 హనీవా, కొఫూన్లు ఇప్పుడు చిన్న పిల్లలు కాదు. 192 00:12:42,183 --> 00:12:45,853 వాళ్ళు ఎదిగారు, ఇప్పుడు వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలూ, ఆలోచనలూ ఉంటాయి. 193 00:12:51,359 --> 00:12:53,111 ఒకానొక సమయంలో, అంటే అది చాలా కాలం క్రితం కూడా కాదు, 194 00:12:53,194 --> 00:12:57,615 మన నలుగురమే మన ప్రపంచంగా జీవించాం. 195 00:12:57,699 --> 00:12:59,742 మనకి వీటన్నింటి అవసరం ఎప్పుడూ ఏర్పడలేదు. 196 00:13:00,618 --> 00:13:02,245 మనందరం విడిపోయాక, 197 00:13:03,037 --> 00:13:05,248 మళ్లీ నీ కుటుంబాన్ని నువ్వు చూడలేవేమో అనే ఆలోచన నీకు వచ్చుండవచ్చు. 198 00:13:05,999 --> 00:13:07,417 ఇప్పుడు నీ కుటుంబం నీ కనుల ముందే ఉండింది. 199 00:13:09,127 --> 00:13:10,795 మనం మన పిల్లలను తీసుకెళ్లిపోదాం. 200 00:13:10,879 --> 00:13:13,590 మళ్లీ ఒక కుటుంబంగా కలిసి జీవిద్దాం. ఇది మనకు సంబంధించిన యుద్ధం కాదు. 201 00:13:13,673 --> 00:13:15,842 దయచేసి అలా అనడం ఆపు. 202 00:13:15,925 --> 00:13:17,886 ఇది మీ అక్క మొదలుపెట్టిన యుద్ధం! 203 00:13:17,969 --> 00:13:20,555 లేదు. మనందరం ఎంచుకొన్న ఎంపికలు ఈ రోజు మనల్ని ఈ స్థితికి తీసుకువచ్చాయి. 204 00:13:20,638 --> 00:13:24,058 ఇప్పుడు మన ముంగిట యుద్ధం ఉంది, దాన్ని మనం ఎదుర్కోక తప్పదు. 205 00:13:28,563 --> 00:13:31,816 నువ్వు యుద్ధంలో ఇంతకు ముందు పాల్గొన్నట్టుగా తేలిగ్గా మాట్లాడుతున్నావు. 206 00:13:31,900 --> 00:13:34,986 నీ పిల్లలను నువ్వు ఎంతటి నరకంలోకి పంపుతున్నావో నీకు అస్సలు తెలీనే తెలీదు. 207 00:13:35,069 --> 00:13:37,906 -నేనేమీ వారిని నరకంలోకి... -వాళ్ళ మరణాలకి నువ్వే కారణం అవుతావు. 208 00:13:58,218 --> 00:14:03,014 ఈ యుద్ధాన్ని ఆపడానికి, నేను చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. 209 00:14:04,849 --> 00:14:08,102 కానీ ఇప్పుడు ఈ యుద్ధం గెలవడం తప్ప నాకు మరో దారి లేదు. 210 00:14:32,126 --> 00:14:33,336 నువ్వు గెలవలేవు. 211 00:14:40,385 --> 00:14:41,594 ఎక్కడికి వెళ్తున్నావు? 212 00:14:46,808 --> 00:14:50,436 నీ మిగతా కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా యుద్ధానికి వెళ్తున్నాను. 213 00:15:00,572 --> 00:15:01,614 ఎంత ఉందో లెక్క పెట్టుకుంటావా? 214 00:15:02,240 --> 00:15:03,992 ఇంతకు ముందు ఎప్పుడూ నువ్వు తక్కువ ఇవ్వలేదు. 215 00:15:05,285 --> 00:15:07,287 నువ్వు కూడా ఎప్పుడూ అప్పగించిన పనిలో విఫలమవ్వలేదు. 216 00:15:09,205 --> 00:15:12,041 చెల్లింపు నా చేతికి అందాక, ఒప్పందం ఖాయమైనట్టే. 217 00:15:12,125 --> 00:15:13,376 నీ అంగీకారాన్ని తెలుపు. 218 00:15:14,335 --> 00:15:16,546 ప్రతీసారి ఇది మనం అనుకోవాలంటావా? 219 00:15:17,255 --> 00:15:18,673 నీ అంగీకారాన్ని తెలుపు. 220 00:15:18,756 --> 00:15:20,174 నేను అంగీకరిస్తున్నాను. 221 00:15:20,258 --> 00:15:24,053 ఈ ఒప్పందం ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాబోదు. నీ అంగీకారాన్ని తెలుపు. 222 00:15:25,555 --> 00:15:27,098 నేను అంగీకరిస్తున్నాను. 223 00:15:27,181 --> 00:15:28,808 ఇక పని పూర్తి చేయ్. 224 00:15:38,318 --> 00:15:40,570 అటూ ఇటూ తిరగకపోతే, నా దగ్గరకు రావచ్చు కదా? 225 00:15:44,782 --> 00:15:48,828 ఇప్పుడే ఒకతను వెళ్లాడు కదా, అతను ఎవరు? 226 00:15:51,706 --> 00:15:53,499 అతని గురించి తెలియకపోవడమే నీకు మంచిది. 227 00:16:33,873 --> 00:16:34,916 బాబా? 228 00:17:37,312 --> 00:17:38,897 నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. 229 00:17:41,107 --> 00:17:46,029 మనిద్దరమూ ఒక్కటయ్యాము, కొఫూన్. నిద్రలో కూడా నీ వాసనని నేను గుర్తించగలను. 230 00:17:49,157 --> 00:17:50,783 ఎందుకంత ఆనందంగా ఉన్నారు? 231 00:17:51,701 --> 00:17:53,244 ఎందుకు ఆనందంగా ఉండదు? 232 00:17:54,370 --> 00:17:57,165 నాలో విశ్వాసం మళ్లీ చిగురించింది. 233 00:17:57,248 --> 00:17:59,417 జోస్యం నిజమవుతుంది. 234 00:18:00,501 --> 00:18:03,671 నీకు అర్థమవుతోందా? దైవ జ్వాల లీలలో నీకు కూడా పవిత్రమైన భాగముంది. 235 00:18:07,926 --> 00:18:08,927 బిడ్డ... 236 00:18:11,053 --> 00:18:12,263 దానికి తండ్రి నేనేనా? 237 00:18:16,976 --> 00:18:18,101 ప్రతీ తండ్రికీ ఎలా అయితే తెలుస్తుందో... 238 00:18:23,566 --> 00:18:26,277 -నీకు కూడా అలాగే తెలిసింది. -లేదు. మీరు నన్ను వాడుకున్నారు. 239 00:18:26,985 --> 00:18:29,364 నువ్వేమీ ఇబ్బంది పడుతున్నట్టు నాకనిపించలేదే. 240 00:18:30,822 --> 00:18:32,700 వద్దు. ఆపండి! 241 00:18:50,343 --> 00:18:51,469 ఏం చేస్తున్నారు? 242 00:18:53,846 --> 00:18:54,889 ఏంటిది? 243 00:19:00,144 --> 00:19:01,396 వెంటనే దీనికి ముగింపు పలుకు. 244 00:19:02,814 --> 00:19:03,982 నీకు కావలసింది అదే అయితే. 245 00:19:09,195 --> 00:19:10,780 నీ పీడకలను నీ చేతులతోనే నువ్వు అంతమొందించవచ్చు. 246 00:20:00,622 --> 00:20:02,749 నీతో అబద్ధమాడనని నేను నీకు మాట ఇచ్చాను, కొఫూన్. 247 00:20:03,708 --> 00:20:05,210 కాబట్టి నీకు నిజం చెప్తున్నాను. 248 00:20:07,795 --> 00:20:10,340 నువ్వింకా చిన్న పిల్లాడివే అని నువ్వు అనుకుంటున్నావు... 249 00:20:12,008 --> 00:20:13,843 ఆ ఆలోచన నిన్ను బలహీనుడిని చేస్తుంది. 250 00:20:16,095 --> 00:20:17,931 నువ్వు స్థైర్యాన్ని కూడదీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. 251 00:20:19,474 --> 00:20:22,936 నా కడుపులో పెరుగుతోంది నీ బిడ్డే, అది నువ్వు అమోదించాలి కూడా. 252 00:20:24,604 --> 00:20:27,899 అది నీకెంత సిగ్గుచేటుగా అనిపించినా నువ్వు ఆమోదించక తప్పదు, 253 00:20:27,982 --> 00:20:30,777 ఎందుకంటే, అది కేవలం నీ బిడ్డ మాత్రమే కాదు, నా బిడ్డ కూడా. 254 00:20:33,321 --> 00:20:37,367 ఈ బిడ్డ, పయా భవిష్యత్తుకు చాలా ముఖ్యం. 255 00:20:37,450 --> 00:20:40,203 -మీరేం మాట్లాడుతున్నారు? -జెర్లామరెల్ కి అర్థమయ్యేలా చెప్పి చూశా, 256 00:20:40,286 --> 00:20:43,665 కానీ తనకి చూపు ఉంది కనుక తనకి ఎవరూ అక్కర్లేదని అనుకున్నాడు. 257 00:20:43,748 --> 00:20:46,501 అతను దూరంగా వెళ్లిపోయి, ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించగలడనుకున్నాడు. 258 00:20:48,586 --> 00:20:51,005 ఈ ప్రపంచం ఇంకా చూపులేని వారి ఆధీనంలోనే ఉంది. 259 00:20:52,882 --> 00:20:57,470 కేవలం దైవం చేత నియమించబడిన మహారాణి అయిన నేనే, ఈ అంధకారానికి తెర దించి, 260 00:20:57,554 --> 00:20:59,806 వెలుతురు నిండిన సరికొత్త భవిష్యత్తుకు నాంది పలికేలా చేయగలను. 261 00:20:59,889 --> 00:21:01,140 మీరు ఇప్పుడు మహారాణి కాదు. 262 00:21:02,016 --> 00:21:03,601 నేను మహారాణినే. 263 00:21:03,685 --> 00:21:06,145 అంతా సర్దుకుంటుందిలే. అది దైవాభీష్టం. 264 00:21:06,729 --> 00:21:09,524 కంజువా ప్రజలను చంపమని కూడా మీకు దేవుడే చెప్పాడా? 265 00:21:10,108 --> 00:21:12,652 కంజువాని నాశనం చేయడం వల్లనే నేను ఇక్కడికి రాగలిగాను. 266 00:21:12,735 --> 00:21:14,696 నువ్వు పరిచయం అయ్యావు. మనకి బిడ్డ పుట్టబోతోంది. 267 00:21:17,073 --> 00:21:19,784 బిడ్డ పుట్టిన మరుక్షణం మిమ్మల్ని చంపేస్తారు. 268 00:21:20,952 --> 00:21:23,204 మీ బిడ్డ అనాథ అయిపోతుంది. 269 00:21:24,455 --> 00:21:27,292 లేదు. అతను రాకుమారుని కొడుకు. 270 00:21:29,335 --> 00:21:30,795 నేను తండ్రిని కాదు. 271 00:21:34,048 --> 00:21:36,885 వాడిని నువ్వు వదిలేస్తే, నీకూ జెర్లామరెల్ కి తేడా ఏమీ ఉండదు. 272 00:21:38,636 --> 00:21:40,388 నిజం చెప్పేయ్, కొఫూన్. 273 00:21:41,347 --> 00:21:42,557 వాడిది నీ రక్తమే. 274 00:21:43,683 --> 00:21:46,269 యుద్ధంలో నువ్వు చనిపోతే, నీతో పాటే నిజం కూడా చచ్చిపోతుంది. 275 00:21:47,604 --> 00:21:48,605 వాళ్ళకి చెప్పేయ్! 276 00:21:49,731 --> 00:21:52,108 ఒక మగాడిలా ప్రవర్తించు! 277 00:21:53,234 --> 00:21:54,694 మహారాణి. 278 00:21:56,196 --> 00:21:59,908 స్వయంగా మహారాణే కదనరంగంలోకి అడుగు పెడుతుందనే పుకార్లను నేను విన్నాను. 279 00:22:00,867 --> 00:22:02,785 నువ్వు నన్ను ఆపాలనుకుంటున్నావా? 280 00:22:02,869 --> 00:22:04,954 నేను మీ గురించి అస్సలు ఆలోచించడం లేదు. 281 00:22:05,038 --> 00:22:08,124 మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చనిపోయే సైనికుల గురించి నేను ఆలోచిస్తున్నాను. 282 00:22:08,791 --> 00:22:10,501 నన్నెవరూ కాపాడాల్సిన అవసరం లేదు. 283 00:22:10,585 --> 00:22:14,005 మహారాణి, తాను వస్తుందని ప్రకటించకపోతే అప్పుడు పెద్ద ప్రయోజనం ఉండదు. 284 00:22:14,088 --> 00:22:17,300 ఒకవేళ ప్రకటించినట్లయితే, ఆమె సైన్యమంతా యుద్ధం గెలవడం మీద కన్నా 285 00:22:17,383 --> 00:22:19,052 ఆమె భద్రత మీదనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. 286 00:22:19,135 --> 00:22:20,720 ఆమె రావడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. 287 00:22:21,930 --> 00:22:23,806 నువ్వు నన్ను ఏం కోరుతున్నావో నీకు తెలుస్తోందా? 288 00:22:23,890 --> 00:22:25,350 నేనేమీ కోరడం లేదు. 289 00:22:26,643 --> 00:22:28,436 నేను మా అక్కలాంటిదాన్ని కాదు. 290 00:22:28,519 --> 00:22:31,189 నేను నా మనుషులను, నా కుటుంబాన్ని యుద్ధానికి పంపి, 291 00:22:31,272 --> 00:22:34,025 ఇంట్లో నిశ్చింతగా కూర్చొనుండలేను. 292 00:22:34,108 --> 00:22:37,111 అలా ఒక తల్లి ప్రవర్తిస్తుంది, మహారాణి కాదు. 293 00:22:38,029 --> 00:22:41,157 భావోద్వేగభరితమైన చర్య, ఆచరణాత్మక చర్య కాదు. 294 00:22:43,993 --> 00:22:46,204 నా కర్తవ్యం, ఈ యుద్ధాన్ని గెలిపించడం. 295 00:22:46,287 --> 00:22:49,082 నా యుద్ధ ప్రణాళిక విషయంలో నేను రాజీ పడలేను. 296 00:22:49,165 --> 00:22:50,583 అలా మీరు చేసినా నేను అంగీకరించలేను. 297 00:22:51,501 --> 00:22:52,710 భావోద్వేగభరితమైనదా? 298 00:22:54,462 --> 00:22:56,548 అయితే నన్నేం చేయమంటావు? 299 00:22:58,091 --> 00:22:59,300 మీరు... 300 00:23:00,426 --> 00:23:02,470 ఒక మంచి నాయకురాలు ఏదైతే చేస్తుందో, అదే మీరు కూడా చేయాలి. 301 00:23:04,472 --> 00:23:07,225 మీ సైనికులను దీవించండి, వారిలో స్ఫూర్తిని నింపండి. 302 00:23:08,518 --> 00:23:11,229 మేము విచార వదనాలతో తిరిగి రావలసి వస్తే, మీరు మాకు ఊరట ఇవ్వండి. 303 00:23:13,147 --> 00:23:14,274 నువ్వు నిజంగానే అంటున్నావు. 304 00:23:15,358 --> 00:23:17,360 ఎప్పుడైనా నేను తమాషాగా మాట్లాడానంటారా? 305 00:24:19,464 --> 00:24:21,883 నువ్వు మాతో యుద్ధంలో పాల్గొంటున్నావని అర్థమైంది. 306 00:24:34,270 --> 00:24:38,274 ఇది మామూలు దైవెముకలా అనిపించడం లేదే. నేను చూడవచ్చా? 307 00:24:44,531 --> 00:24:45,532 బరువుగా ఉంది. 308 00:24:46,449 --> 00:24:47,700 ఉపయోగించడానికి అనువుగా లేదు. 309 00:24:49,577 --> 00:24:51,246 అవును, చిన్న చేతులున్న వారికి కష్టమే. 310 00:24:56,292 --> 00:24:58,002 మిత్ర పక్షాలూ, శత్రు పక్షాలూ భలే గమ్మత్తుగా ఉన్నాయి కదా. 311 00:24:59,087 --> 00:25:03,550 నువ్వు నీ మునుపటి శత్రువుతో, నీ మునుపటి రాజ్యంపై యుద్ధం చేస్తున్నావు. 312 00:25:04,342 --> 00:25:07,095 నేను నా కుటుంబం కోసం యుద్ధం చేస్తున్నాను, సింహాసనం కోసం కాదు. 313 00:25:07,178 --> 00:25:10,723 సింహాసనమంటే నీ భార్యే కదా. కాబట్టి రెంటికీ తేడా ఏముంది? 314 00:25:13,977 --> 00:25:15,186 నేను అర్థం చేసుకోగలను. 315 00:25:17,647 --> 00:25:21,192 నాకు కూడా ఒకప్పుడు భార్య ఉండేది. 316 00:25:22,151 --> 00:25:23,278 పిల్లలు కూడా ఉండేవారు. 317 00:25:27,657 --> 00:25:28,658 కంజువా. 318 00:25:29,659 --> 00:25:32,078 అవును. కంజువా. 319 00:25:38,209 --> 00:25:39,627 నీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నాను. 320 00:25:41,296 --> 00:25:44,757 నువ్వు నీ కుటుంబం కోసం ఎన్నో ఏళ్లు పోరాడుతూ గడిపావు. 321 00:25:46,593 --> 00:25:49,721 నేను పోరాడుతూ గడిపి నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను. 322 00:25:53,182 --> 00:25:55,393 ఈ విషయంలో, నీకైనా అదృష్టం వరించాలని కోరుకుంటున్నాను. 323 00:26:00,356 --> 00:26:03,234 మనకీ, విజయానికీ నడుమ నా సొంత తమ్ముడు ఉన్నాడు. 324 00:26:04,861 --> 00:26:07,739 ఫలితం ఏదైనా కానీ, నాకు గెలుపు లేదు. 325 00:26:09,866 --> 00:26:12,285 నష్టమంటూ జరగని యుద్ధాన్ని... 326 00:26:13,828 --> 00:26:15,538 నేను ఇప్పటిదాకా చూడలేదు. 327 00:26:16,581 --> 00:26:17,916 మనం గెలవలేమని నీకు తెలుసు. 328 00:26:19,417 --> 00:26:22,295 వాళ్ళు మెరుగైన శిక్షణ పొందినవారు. వాళ్ళ వద్ద మెరుగైన ఆయుధాలు ఉన్నాయి. 329 00:26:25,131 --> 00:26:26,966 మన సైనికులు ఎలాగూ తక్కువ మందే కదా. 330 00:26:34,933 --> 00:26:36,726 నువ్వూ, నేనూ సైనికులం. 331 00:26:37,852 --> 00:26:40,396 ఓటమి తప్పదని తెలిసినా కూడా మనం పోరాటాన్ని ఆపం. 332 00:26:42,774 --> 00:26:44,859 మనకీ, ఇతరులకీ ఉన్న తేడా అదే. 333 00:26:44,943 --> 00:26:46,152 నేను సైనికుడిని కాదు. 334 00:26:48,029 --> 00:26:49,239 నేను బరిలోకి గెలవాలనే దిగతాను. 335 00:27:14,472 --> 00:27:16,140 -మహారాణి -కెప్టెన్. 336 00:27:16,224 --> 00:27:17,892 మీ సందేశాల కోసం దూతలు సిద్ధంగా ఉన్నారు. 337 00:27:17,976 --> 00:27:19,143 ధన్యవాదాలు. 338 00:27:21,980 --> 00:27:24,315 నేను మొదలుపెట్టని యుద్ధానికి నా సైనికులను నేనెలా పంపగలను? 339 00:27:25,984 --> 00:27:28,486 -నువ్వు నా సలహా ఆడుగుతున్నావా? -అవును. 340 00:27:28,570 --> 00:27:29,988 అద్భుతం. 341 00:27:30,071 --> 00:27:32,198 నా దగ్గర ఇవ్వడానికేమీ లేదు, కానీ నన్ను అడిగినందుకు ధన్యవాదాలు. 342 00:27:36,035 --> 00:27:37,453 ఇలా చూడు. 343 00:27:38,913 --> 00:27:40,999 నువ్వు ఏలడానికే పుట్టావు. 344 00:27:42,667 --> 00:27:45,169 నీకు సరైన మాటలు వాటంతట అవే వచ్చేస్తాయి, అందులో నాకు సందేహం లేదు. 345 00:27:47,589 --> 00:27:49,299 -హార్లన్. -మహారాణి సిద్ధంగా ఉంది. 346 00:27:50,174 --> 00:27:51,384 అలాగే, సర్. 347 00:28:04,939 --> 00:28:06,482 మహారాణి గారు విచ్చేస్తున్నారు. 348 00:28:17,076 --> 00:28:18,077 చార్లెట్. 349 00:28:19,787 --> 00:28:22,040 మళ్లీ నిన్ను ఇలా దొంగచాటుగా వెళ్లనిస్తాను అనుకున్నావా? 350 00:28:22,123 --> 00:28:24,584 కంపాస్ వాళ్ళు, యుద్ధాలకి, రాజకీయాలకు దూరంగా ఉంటారనుకున్నానే. 351 00:28:24,667 --> 00:28:25,710 అది నిజమే. 352 00:28:25,793 --> 00:28:28,087 నిన్ను ప్రాణాలతో క్షేమంగా తీసుకురావడమే నా కర్తవ్యం. 353 00:28:28,171 --> 00:28:31,174 దానికి త్రివాంటియన్ సైనికులను ఊచకోత కోయాల్సి వస్తే, దానికి నేనేం చేయలేను. 354 00:28:31,257 --> 00:28:32,800 -హేయ్, కొఫూన్. -హనీవా. 355 00:29:09,379 --> 00:29:11,047 పయాన్ పౌరులారా. 356 00:29:17,679 --> 00:29:21,140 మా అక్క, మన రాజ్యాన్ని పెను ప్రమాదంలోకి నెట్టింది. 357 00:29:23,017 --> 00:29:25,979 తన వంచన వల్ల, అబద్ధాల వల్ల 358 00:29:26,688 --> 00:29:30,984 ఇప్పుడు మనం త్రివాంటియన్ సైన్యంతో తలపడాల్సి వస్తుంది. 359 00:29:32,902 --> 00:29:34,404 దీన్ని నేనేమీ కాదనను. 360 00:29:35,405 --> 00:29:36,906 ఇక మీకు నేనేమీ అబద్ధాలు చెప్పలేను. 361 00:29:38,408 --> 00:29:41,119 ఈ మహారాణి నుండి, మీకు కేవలం నిజమే తెలపబడుతుంది. 362 00:29:44,998 --> 00:29:46,457 ఆ నిజమేమిటంటే... 363 00:29:48,167 --> 00:29:51,170 మనం మన కన్నా చాలా బలమైన శత్రువును ఎదుర్కొంటున్నాం. 364 00:29:52,380 --> 00:29:53,798 వాళ్ళ దగ్గర సైనికులు ఎక్కువ మంది ఉన్నారు. 365 00:29:54,549 --> 00:29:57,051 వాళ్ళ దగ్గర మంచి ఆయుధాలున్నాయి, వాళ్లు మెరుగైన శిక్షణను పొందినవారు. 366 00:29:58,469 --> 00:30:00,221 కాబట్టి మీకు భయంగా ఉంటే... 367 00:30:01,681 --> 00:30:03,474 ఆ భయం మీకు మాత్రమే ఉందని, నాకు లేదని అనుకోకండి. 368 00:30:06,686 --> 00:30:09,772 నాకు పిల్లలు, భర్త ఉన్నారు, మా అక్కకు ఇవేమీ లేవు. 369 00:30:11,649 --> 00:30:13,276 నాకు కూడా చాలా భయంగా ఉంది. 370 00:30:15,653 --> 00:30:19,324 చాలా ఏళ్ళ పాటు, నేను కొండలలో ఆల్కెన్నీ తెగ వాళ్ళ మధ్య జీవించాను, 371 00:30:19,407 --> 00:30:23,912 అక్కడ కుటుంబం, మా తెగ తప్ప ఇంకేదీ మాకు ఎక్కువ కాదు, 372 00:30:23,995 --> 00:30:26,497 ప్రతీ ప్రాణీ మాకు విలువైనదే. 373 00:30:28,208 --> 00:30:31,085 ఇప్పుడు నేను ఈ వాక్కులను ఒక మహారాణిగా చెప్పడం లేదు, 374 00:30:31,669 --> 00:30:35,048 ఒక తల్లిగా, ఒక భార్యగా చెప్తున్నాను. 375 00:30:36,341 --> 00:30:39,344 మిమ్మల్ని కూడా ఇప్పుడు నేను యోధుల్లా చూడటం లేదు, 376 00:30:39,427 --> 00:30:43,723 భర్తలుగా, భార్యలుగా, కోడుకులుగా, కూతుళ్లుగా చూస్తున్నాను. 377 00:30:43,806 --> 00:30:45,600 మనందరమూ భయపడుతున్నాం. 378 00:30:46,267 --> 00:30:48,603 ఇది విఫలమైతే మనం చాలా నష్టపోతాం. 379 00:30:50,355 --> 00:30:52,023 కాబట్టి ఈ క్షణాన... 380 00:30:53,441 --> 00:30:55,276 ఓ సానుకూల విషయం చెప్పి మీకు ఊరట కలిగిస్తాను. 381 00:30:57,487 --> 00:31:00,657 త్రివాంటియన్ దురాక్రమణలను మనం తరతరాల నుండి 382 00:31:00,740 --> 00:31:02,700 ఎదుర్కొంటూనే ఉన్నా కానీ... 383 00:31:04,369 --> 00:31:06,329 ఒక్కసారి కూడా వాళ్ళు మనల్ని ఏమీ చేయలేకపోయారు. 384 00:31:06,871 --> 00:31:12,293 త్రివాంటియన్ మనుషులు మన నేలపై కాలు మోపలేకపోయారు, ఇకపై మోపలేరు కూడా! 385 00:31:16,339 --> 00:31:20,426 ఎన్ని ఆయుధాలను అయినా వాడనివ్వండి, ఎన్నింటిని అయినా తగులబెట్టనివ్వండి, 386 00:31:20,510 --> 00:31:22,679 ఏం చేసినా కానీ, మన కుటుంబాల నేల, మన పూర్వీకుల నేల అయిన 387 00:31:22,762 --> 00:31:26,975 ఈ నేల నుండి మనల్ని వాళ్లు వేరు చేయలేరు. 388 00:31:33,106 --> 00:31:37,402 మన భవిష్యత్తు, మన గతం కన్నా బాగుండాలని కోరుకుంటున్నాను. 389 00:31:37,485 --> 00:31:41,406 విద్వేషాలకు, దురాచారాలకు దూరంగా ఉండే, అలాగే 390 00:31:41,489 --> 00:31:45,660 దురాక్రమణలకు పాల్పడే రాజ్యాల నుండి సురక్షితంగా ఉండే నేలపై 391 00:31:45,743 --> 00:31:48,413 మనం, అలాగే మన కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్థిల్లగలగాలి. 392 00:31:48,496 --> 00:31:52,125 అదే భవిష్యత్తు కోసం ఇవాళ మనం పోరాడుతున్నాం. 393 00:31:54,168 --> 00:31:55,837 కాబట్టి నా తోటి పయాన్లారా... 394 00:31:57,171 --> 00:32:01,134 పయా రాజ్యపు ధైర్యవంతమైన పౌరులారా... 395 00:32:02,886 --> 00:32:04,137 మెరుపు వేగంతో దూసుకుపోండి. 396 00:32:05,346 --> 00:32:06,848 ధైర్యంగా పోరాడండి. 397 00:32:07,807 --> 00:32:09,475 ఒక్క విషయం మాత్రం శత్రువులకు స్పష్టంగా తెలియజేయండి, 398 00:32:09,559 --> 00:32:12,979 వాళ్ళ రక్తం మన నేల మీద చిందవచ్చుగాక, 399 00:32:13,062 --> 00:32:17,317 కానీ ఈ నేల ఇప్పటికైనా, ఇంకెప్పటికైనా 400 00:32:17,400 --> 00:32:20,111 కేవలం పయాన్ నేల మాత్రమే! 401 00:32:40,673 --> 00:32:42,675 -అటెన్షన్! -అటెన్షన్! 402 00:32:48,514 --> 00:32:49,515 ప్యారిస్. 403 00:32:49,599 --> 00:32:52,602 ఇక్కడున్నా, బాబా వాస్, నీ పక్కనే ఉన్నా. 404 00:32:54,604 --> 00:32:56,773 నువ్వు మళ్లీ ఇడోతో తలపడాల్సి వస్తుంది. 405 00:32:58,733 --> 00:33:00,443 నా తమ్ముడిని నేను చంపలేను. 406 00:33:00,526 --> 00:33:02,820 అయితే, వాడు నిన్ను చంపేస్తాడు. 407 00:33:02,904 --> 00:33:04,405 కావచ్చు. 408 00:33:04,489 --> 00:33:06,407 దానితో నీకు విముక్తి లభిస్తుందని అనుకుంటున్నావా? 409 00:33:07,075 --> 00:33:08,993 బుర్ర వాడురా, బండోడా. 410 00:33:10,119 --> 00:33:13,498 నీ పిల్లల గురించి ఆలోచించు. వాడి బారి నుండి వాళ్ళనెవరు కాపాడతారు? 411 00:33:14,749 --> 00:33:17,252 -నువ్వు కాపాడతావు. -పిచ్చోడిలా మాట్లాడకు, బాబా. 412 00:33:19,420 --> 00:33:21,005 ఇప్పటిదాకా నీ ఋణాన్ని సరిగ్గా తీర్చుకోలేకపోయాను. 413 00:33:21,089 --> 00:33:22,090 దేనికి ఋణపడ్డావు? 414 00:33:23,883 --> 00:33:25,385 అన్నింటికీ. 415 00:33:25,885 --> 00:33:26,886 మొత్తానికి. 416 00:33:27,929 --> 00:33:31,432 నీ పిల్లలకు ఏం కాకుండా తీసుకురా, అలా చేసి ఋణం తీర్చుకో. 417 00:33:33,726 --> 00:33:34,727 సరే. 418 00:33:37,188 --> 00:33:39,065 కానీ నువ్వు నాకొక పని చేసి పెట్టాలి. 419 00:33:51,703 --> 00:33:52,787 అమ్మా. 420 00:33:54,622 --> 00:33:55,623 నా బంగారు కొండలారా. 421 00:33:59,586 --> 00:34:02,046 మిమ్మల్ని కూడా నాతో ఇక్కడే ఉండమని మీకు నచ్చజెప్పగలిగేంత శక్తి నాకుంటే బాగుండు. 422 00:34:03,006 --> 00:34:06,509 యుద్ధానికి భయపడి దాక్కుంటే అసలు మేము యువరాణి, యువరాజులం అవుతామా? 423 00:34:07,427 --> 00:34:09,178 ఈ మార్గాన్ని ఎంచుకుంది నేను, మీరు కాదు. 424 00:34:09,262 --> 00:34:10,471 మేము ఇప్పుడు ఎంచుకుంటున్నాం. 425 00:34:20,315 --> 00:34:21,774 ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి. 426 00:34:23,318 --> 00:34:24,611 -తప్పకుండా. -తప్పకుండా. 427 00:34:24,694 --> 00:34:25,862 మాటిస్తున్నాం. 428 00:34:26,905 --> 00:34:27,906 ఇక బయలుదేరండి. 429 00:34:32,493 --> 00:34:33,494 మాగ్రా. 430 00:34:36,039 --> 00:34:37,123 బాబా. 431 00:34:40,043 --> 00:34:41,419 మళ్లీ తిరిగి రా. 432 00:34:42,503 --> 00:34:43,796 మన కుటుంబంతో పాటు. 433 00:34:49,636 --> 00:34:50,678 తప్పకుండా. 434 00:35:37,392 --> 00:35:38,642 టోడ్! 435 00:35:38,726 --> 00:35:39,936 ఇక్కడున్నా, ప్యారిస్. 436 00:35:43,606 --> 00:35:45,191 నీకు ఇక్కడి రక్షణ బాధ్యతను అప్పగించారని విన్నాను. 437 00:35:46,859 --> 00:35:49,946 ఇంత హోదా, నేర్పు ఉండి కంచెలు ఏర్పాటు చేస్తున్నాను. 438 00:35:50,028 --> 00:35:51,488 నేను కదనరంగంలో ఉండాల్సిన వాడిని. 439 00:35:51,573 --> 00:35:53,783 నువ్వింత బాధపడతావని తెలిసి ఉంటే, 440 00:35:53,867 --> 00:35:56,494 ఈ పనిని నీకు అప్పగించమని రాణిని అడిగి ఉండేదాన్ని కాదు. 441 00:35:58,912 --> 00:36:00,164 ఏమంటున్నావు నువ్వు? 442 00:36:00,248 --> 00:36:03,751 నేను ఒక చోటికి వెళ్లాలి. నువ్వు కూడా నాతో వస్తావని అనుకున్నాను. 443 00:36:05,461 --> 00:36:06,546 ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామేంటి? 444 00:36:06,629 --> 00:36:08,548 దార్లో చెప్తానులే. 445 00:36:08,631 --> 00:36:10,341 నా కోసం ఒక గుర్రాన్ని సిద్ధం చేయ్. 446 00:36:10,425 --> 00:36:12,302 ఒక మంచి గుర్రాన్ని. నీ గుర్రాన్ని! 447 00:36:12,969 --> 00:36:14,262 మనం వెంటనే బయలుదేరాలి. 448 00:36:39,078 --> 00:36:40,288 అది విమానం. 449 00:36:41,581 --> 00:36:42,582 అవును. 450 00:36:44,584 --> 00:36:48,213 అలాంటి లోహపు గొట్టాంలో ఆకాశం నుండి కిందికి పడిపోవడం ఎంత భయాన్ని కలిగించి ఉంటుందో. 451 00:36:49,923 --> 00:36:53,009 అసలు వాళ్ళు ఆకాశంలోకి వెళ్ళాల్సిన అవసరమే లేదేమో. 452 00:37:09,943 --> 00:37:12,695 ఈ జీను గట్టిగా ఉంది. 453 00:37:13,196 --> 00:37:14,989 ఎప్పుడైనా జీనుకు చమురు పెట్టావా అసలు? 454 00:37:16,366 --> 00:37:20,203 అప్పుడప్పుడూ "ధన్యవాదాలు" చెప్తే సరిపోతుంది. 455 00:37:22,205 --> 00:37:23,748 చికాకుగా ఉన్నట్టున్నావే. 456 00:37:24,916 --> 00:37:28,044 మామూలుగా నేను యుద్ధం వైపుకు వెళ్ళేవాడిని, ఇప్పుడు వ్యతిరేక దిశలో వెళ్తున్నాను. 457 00:37:29,045 --> 00:37:33,216 ఈ యుద్ధం, కేవలం ఈ యుద్ధానికే పరిమతమయ్యేది కాదు. 458 00:37:33,299 --> 00:37:34,801 మనం ఈ యుద్ధంలో ఓడిపోతే ఇక మరో యుద్ధానికి అవకాశమెక్కడిది. 459 00:37:35,426 --> 00:37:37,804 ఇది త్రివాంటెస్, పయాలకు సంబంధించిన యుద్ధం కాదు. 460 00:37:39,681 --> 00:37:42,225 ప్రపంచం మారబోతోంది, టోడ్. 461 00:37:42,308 --> 00:37:43,893 చూపు తిరిగి వస్తుంది. 462 00:37:45,019 --> 00:37:46,646 ఈ యుద్ధం అందుకు జరుగుతోంది, 463 00:37:47,689 --> 00:37:50,316 ఆ విషయం యుద్ధం చేసేవాళ్లకి కూడా తెలీదు. 464 00:37:51,025 --> 00:37:53,361 నాకు అర్థమైందల్లా, మన కొత్త మహారాణి, 465 00:37:53,444 --> 00:37:56,072 మన నమ్మకాలని మర్చిపొమ్మనడమే కాదు, వాటిపై యుద్ధం చేయమని 466 00:37:56,948 --> 00:37:58,575 మనకి చెప్తోంది. 467 00:37:58,658 --> 00:38:01,119 మాగ్రా, కేవలం కేన్ వంశస్థురాలు మాత్రమే కాదు. 468 00:38:01,870 --> 00:38:06,875 తను హనీవా, కొఫూన్లకు అమ్మ. మన భవిష్యత్తు వాళ్ల చేతుల్లోనే ఉంది. 469 00:38:07,959 --> 00:38:09,794 ఆ భవిష్యత్తును నువ్వు కల కన్నావా? 470 00:38:10,712 --> 00:38:12,422 నేను అనేక భవిష్యత్తులను కల కన్నాను. 471 00:38:16,718 --> 00:38:18,428 మరి అవి దేని మీద ఆధారపడున్నాయి? 472 00:38:19,470 --> 00:38:24,142 మనిద్దరం ఈ ప్రయాణాన్ని క్షేమంగా చేయడం వంటి చిన్నచిన్న విషయాల మీద. 473 00:38:27,645 --> 00:38:29,355 ఇదంతా అస్సలు అర్థవంతంగానే లేదు. 474 00:38:30,940 --> 00:38:32,191 మరైతే నువ్వు ఎందుకు వచ్చావు? 475 00:38:35,486 --> 00:38:36,779 నువ్వు రమన్నావు కాబట్టి వచ్చాను. 476 00:38:40,408 --> 00:38:42,035 మనం రాత్రికి ఇక్కడే బస చేయాలి. 477 00:38:43,036 --> 00:38:45,205 ఇంకా వెలుతురు బాగానే ఉంది. మనం ఇంకాస్త ప్రయాణం చేయాలి. 478 00:38:45,288 --> 00:38:47,207 లేదు. నాకు నా కారణాలు ఉన్నాయి. 479 00:38:48,041 --> 00:38:49,667 ఇక్కడే బస చేయాలి. 480 00:39:11,522 --> 00:39:13,274 నువ్వు నా పక్కన పడుకోవాలి. 481 00:39:24,786 --> 00:39:26,079 ఏమన్నావు? 482 00:39:29,499 --> 00:39:31,709 మనం కలిసి పడుకుంటే, ఇద్దరికీ వెచ్చగా ఉంటుంది. 483 00:39:41,511 --> 00:39:43,304 నీ వాదనతో ఏకీభవిస్తున్నాను, సైనిక మహాశయా. 484 00:39:51,145 --> 00:39:52,814 నేను హూందాగా వ్యవహరిస్తాను. 485 00:39:56,401 --> 00:40:00,989 అదే నిజమని నాకు అనిపించుంటే, ఇక్కడికి రావాలనుకొని ఉండేదాన్ని కాదు. 486 00:40:14,252 --> 00:40:15,628 ఇక్కడికి ఎవరో వచ్చారు. 487 00:40:33,313 --> 00:40:34,939 ఏదో విషయం నిన్ను కలవరపెడుతోంది. ఏంటది, కొఫూన్? 488 00:40:37,692 --> 00:40:41,279 ఈ ఖండంలోని అత్యంత శక్తివంతమైన సైనిక రాజ్యంతో యుద్ధానికి పోవడం కాకుండానా? 489 00:40:41,821 --> 00:40:43,323 అవును, అది కాకుండా. 490 00:40:46,367 --> 00:40:47,493 ఏం లేదులే. నన్నేదీ కలవరపెట్టడం లేదు. 491 00:40:47,577 --> 00:40:51,623 అబ్బా. నేను శాంతి చర్చల నుండి వచ్చిన తర్వాత, నువ్వు సరిగ్గా మాట్లాడనే లేదు. 492 00:40:54,167 --> 00:40:55,793 అంతా బాగా హడావిడిగా ఉంది కదా. 493 00:40:56,961 --> 00:40:58,463 మన అమ్మ మహారాణి. 494 00:40:59,297 --> 00:41:02,342 నువ్వు యువరాజువి. నేను యువరాణిని... 495 00:41:04,052 --> 00:41:06,471 మనం యుద్ధానికి వెళ్తున్నాం, ఇన్ని జరుగుతున్నా నువ్వు ఏం మాట్లాడటం లేదే? 496 00:41:10,808 --> 00:41:11,976 నువ్వు ఏం చదువుతున్నావు? 497 00:41:15,104 --> 00:41:17,815 ఇది కవితల పుస్తకం. ఇది నాకు త్రివాంటెస్ లో దొరికింది. 498 00:41:19,150 --> 00:41:20,652 త్రివాంటెస్ లో కూడా పుస్తకాలు ఉన్నాయా? 499 00:41:21,319 --> 00:41:23,404 త్రివాంటెస్ లో ఆశ్చర్యపరిచే విషయాలు చాలా ఉన్నాయి. 500 00:41:26,991 --> 00:41:28,743 నాకు ఒక కవిత చదివి వినిపిస్తావా? 501 00:41:28,826 --> 00:41:30,036 నువ్వే చదువుకో. 502 00:41:31,287 --> 00:41:32,413 దయచేసి చదివి వినిపించవా? 503 00:41:38,962 --> 00:41:45,593 "ప్రధాన విలువలకు దూరమవతుండటం వలన మానవునికి, దేవునికి దూరం పెరగసాగింది; 504 00:41:47,720 --> 00:41:52,225 పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారవ్వసాగాయి; విలువలకు పట్టు పోయింది; 505 00:41:54,143 --> 00:41:57,021 ప్రపంచంలో అరాచకం రాజ్యమేలసాగింది, 506 00:41:58,940 --> 00:42:01,693 ఎక్కడ చూసినా... 507 00:42:03,653 --> 00:42:04,988 మితిమీరిన హింసే కనబడుతోంది 508 00:42:05,071 --> 00:42:07,824 సత్ప్రవర్తన అడుగింటిపోయింది; 509 00:42:10,243 --> 00:42:14,122 మంచివారికి నమ్మకం పోయింది, అదే సమయంలో చెడువారు 510 00:42:14,205 --> 00:42:16,833 పేట్రేగిపోతున్నారు. 511 00:42:20,253 --> 00:42:23,006 త్వరలో దైవ సందేశం ఒకటి తప్పక అందనుంది; 512 00:42:23,923 --> 00:42:26,968 రెండవ రాకడకు ముహూర్తం ఖరారు కానుంది. 513 00:42:27,802 --> 00:42:29,137 రెండవ రాకడ! 514 00:42:31,514 --> 00:42:33,349 ఆ పదాలు అలా బయటకు వచ్చాయో లేదో 515 00:42:33,433 --> 00:42:37,604 ఈ జనుల తీరు నుండి పుట్టుకొచ్చిన ఒక రాకాసి నా కనులకు కనబడింది: 516 00:42:39,272 --> 00:42:41,941 ఎడారిలోని ఇసుక దిబ్బలలో 517 00:42:42,025 --> 00:42:45,320 సింహం దేహం మరియు మానవ శిరస్సు గల ఆకారం, 518 00:42:46,196 --> 00:42:49,699 కరుణ ఏ మాత్రం లేని కరుకైన చూపుతో, 519 00:42:49,782 --> 00:42:53,369 మెల్లగా ముందుకు కదల సాగింది, 520 00:42:53,453 --> 00:42:56,080 అప్పుడు ఆకాశంలో చక్కర్లు కొడుతున్న రాబందుల నిడలు కనబడసాగాయి. 521 00:42:57,874 --> 00:43:01,294 మళ్లీ అంధకారం అలుముకుంది; కానీ ఈ సారి 522 00:43:01,377 --> 00:43:04,547 రెండు వేల సంవత్సరాల గాఢ నిద్ర 523 00:43:04,631 --> 00:43:08,551 ఒక కుదుపున పీడకలలా మారింది, 524 00:43:11,930 --> 00:43:14,265 ఒక భయానకమైన ప్రాణి, 525 00:43:14,349 --> 00:43:16,267 అది ఏ తరుణం కోసమైతే వేచి ఉందో, అది వచ్చిన వేళ 526 00:43:16,893 --> 00:43:20,563 మరల జన్మ ఎత్తడానికి బెత్లెహెమ్ వైపు అడుగులు వేయసాగింది." 527 00:45:03,958 --> 00:45:05,460 -మాగ్రా, పారిపో! -హార్లన్! 528 00:45:09,672 --> 00:45:10,673 హార్లన్! 529 00:45:17,972 --> 00:45:19,515 త్రివాంటియన్ దరిద్రుల్లారా! 530 00:46:05,770 --> 00:46:07,146 హార్లన్? 531 00:46:07,230 --> 00:46:08,314 మాగ్రా. 532 00:46:10,483 --> 00:46:12,735 నిన్ను కాపాడటానికి ఇక్కడే ఉండినందుకు నాకు సంతృప్తిగా ఉంది. 533 00:46:12,819 --> 00:46:14,362 నీకు గాయం ఎక్కడ తగిలింది? 534 00:46:14,445 --> 00:46:16,239 ఒళ్ళంతా. 535 00:46:16,322 --> 00:46:18,616 -వీళ్ళేనా, ఇంకొందరు కూడా ఉన్నారా? -వీళ్ళే అనుకుంటా. 536 00:46:18,700 --> 00:46:19,784 కాపలాదారులారా! 537 00:46:20,869 --> 00:46:22,412 వద్దు, నువ్వు నాతోనే ఉండు. 538 00:46:24,372 --> 00:46:25,874 నువ్వు అసలు ఆ మాట ఎప్పటికీ అనవేమో అనుకున్నా. 539 00:46:47,520 --> 00:46:51,065 త్రివాంటియన్ల కంటే మనం ముందే వచ్చేశాం. స్థావరం ఏర్పాటు చేయండి! 540 00:46:51,649 --> 00:46:57,780 గ్రీన్ హిల్ గ్యాప్ 541 00:47:01,367 --> 00:47:03,620 ఇప్పుడు మన వద్ద 160 మంది సైనికులు ఉన్నారు. 542 00:47:03,703 --> 00:47:06,456 దార్లో వచ్చేటప్పుడు వివిధ ఊరుల నుండి మరో పది మందిని చేర్చుకున్నాం. 543 00:47:08,124 --> 00:47:10,919 ఒకవేళ త్రివాంటియన్లు బలగంలో నిజంగానే 250 మంది ఉంటే మనకి కష్టం. 544 00:47:11,794 --> 00:47:14,964 ఈ స్థావరంలో ఎంత ఎక్కువ మంది ఉన్నా పెద్ద ప్రయోజనం ఉండదు. 545 00:47:15,048 --> 00:47:18,343 ఈ సన్నని గాడుల్లో త్రివాంటియన్లు ఒకేసారి ఎక్కువ మంది పట్టరు, 546 00:47:18,426 --> 00:47:20,011 దానితో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా, వాళ్లకి పైచేయి ఉండదు. 547 00:47:21,262 --> 00:47:23,014 ఇంతకు ముందు మీరు ఇక్కడ యుద్ధం చేశారా? 548 00:47:24,557 --> 00:47:25,558 లేదు. 549 00:47:43,785 --> 00:47:44,869 వాళ్ళు ఇక్కడే ఉన్నారు. 550 00:47:45,870 --> 00:47:47,038 నాన్నా. 551 00:48:30,164 --> 00:48:31,583 వాళ్లు చాలా మంది ఉన్నారు. 552 00:48:32,625 --> 00:48:33,835 అయూరా. 553 00:48:41,009 --> 00:48:43,511 సుమారుగా 350 మంది ఉన్నారు, సర్. 554 00:48:47,807 --> 00:48:50,226 గోసెట్ గూఢచారులు పొరబడ్డారు. 555 00:49:13,041 --> 00:49:14,125 వాళ్ళు వచ్చేశారు. 556 00:49:15,627 --> 00:49:17,253 మనం ఊహించినదాని కన్నా ముందుగానే వచ్చారు. 557 00:49:17,921 --> 00:49:20,673 దాని వల్ల పెద్ద ఉపయోగం లేదు. నీకెవరు కనబడుతున్నారు? 558 00:49:22,300 --> 00:49:24,219 ద్వారం ముందు దగ్గర దగ్గరగా వంద మంది ఉన్నారు. 559 00:49:24,302 --> 00:49:26,095 స్థావరం లోపల ఇంకా ఎక్కువ మంది ఉంటారు. 560 00:49:26,179 --> 00:49:27,180 కెప్టెన్... 561 00:49:28,348 --> 00:49:30,099 నీకేం కనబడుతుందో నేను అడగలేదు. 562 00:49:30,183 --> 00:49:33,436 ఎవరు కనబడుతున్నారు అని అడిగాను. 563 00:49:39,359 --> 00:49:40,735 బాబా వాస్ కనబడుతున్నాడు. 564 00:49:41,694 --> 00:49:42,695 మంచిది. 565 00:49:44,155 --> 00:49:45,740 మనం వీళ్ళతో గాడుల్లో పోరాడుతాం. 566 00:49:45,823 --> 00:49:47,242 అక్కడే మనకి పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. 567 00:49:47,325 --> 00:49:48,660 డ్రమ్మర్లారా! 568 00:49:50,453 --> 00:49:51,746 కానీ దాని వలన మనకి విజయం దక్కుతుందా? 569 00:49:51,829 --> 00:49:52,872 లేదు. 570 00:49:52,956 --> 00:49:56,084 కానీ మనం చనిపోయే ముందు, కనీసం వాళ్లని ఎక్కువ మందినైనా చంపవచ్చు. 571 00:49:59,295 --> 00:50:01,130 -లేదు. -ఏం చేస్తున్నావు? 572 00:50:01,214 --> 00:50:02,423 చార్లెట్. 573 00:50:02,507 --> 00:50:03,675 దీన్ని ఎవరోకరు ఆపాలి. 574 00:50:04,300 --> 00:50:07,512 -నువ్వేం అంటున్నావు? -వాళ్ల వైపున నా మిత్రురాలు ఉంది. 575 00:50:07,595 --> 00:50:10,056 వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఇప్పుడు మహారాణిని గద్దె దించేశారని నేను చెప్పగలిగితే... 576 00:50:10,139 --> 00:50:13,059 -హనీవా, వాళ్లు నిన్ను చంపేస్తారు. -నువ్వు నన్ను నమ్మాలి. 577 00:50:18,398 --> 00:50:19,399 నాన్నా. 578 00:50:26,114 --> 00:50:27,240 తనని వెళ్లనివ్వు. 579 00:50:27,323 --> 00:50:28,366 ఏంటి? 580 00:50:29,659 --> 00:50:31,286 మనకి మరో దారి లేదు, బాబూ. 581 00:50:32,745 --> 00:50:33,830 తనని ప్రయత్నించనివ్వు. 582 00:51:02,317 --> 00:51:04,903 -నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. -ఇక్కడికి ఎవరూ వచ్చి ఉండకూడదు. 583 00:51:07,989 --> 00:51:10,658 మీరు శాంతి సమావేశంలో చేసింది... 584 00:51:10,742 --> 00:51:12,660 మీ వాళ్ల మీద దాడి చేయించింది కేన్ మహారాణి. 585 00:51:13,244 --> 00:51:17,665 తన పవిత్ర యుద్ధం కోసం తను ఏమైనా చేస్తుంది. ఆ పని మాది కాదని మీకు తెలియాలి. 586 00:51:18,958 --> 00:51:21,711 రెన్, నీతో తలపడటం కన్నా చావడం మేలు అనుకొనేదాన్ని నేను. నువ్వు అది నమ్మాలి. 587 00:51:27,300 --> 00:51:28,676 నేను నిన్ను నమ్ముతున్నాను. 588 00:51:31,596 --> 00:51:33,681 ఆ మహారాణికి ఇప్పుడు అధికారం లేదు. 589 00:51:33,765 --> 00:51:35,767 మేము అక్కడికి చేరుకొన్న వెంటనే మా అమ్మ సింహాసనాన్ని హస్తగతం చేసుకుంది. 590 00:51:36,601 --> 00:51:37,727 ఇప్పుడు మహారాణి మాగ్రానా? 591 00:51:37,810 --> 00:51:40,271 అవును, ఆమెకి ఈ యుద్ధం ఇష్టం లేదు. 592 00:51:40,355 --> 00:51:42,065 నువ్వు ఇడోకి నచ్చజెప్పగలవు కదా. 593 00:51:44,108 --> 00:51:45,610 లేదు, ఇప్పుడు ఆయన నా మాట వినడు. 594 00:51:45,693 --> 00:51:47,362 కనీసం నువ్వు ప్రయత్నమైనా చేయాలి. 595 00:51:48,947 --> 00:51:51,616 మనం దీన్ని ఈ క్షణమే ఆపకపోతే, ఒక అబద్ధం కారణంగా, వందలాది మంది 596 00:51:51,699 --> 00:51:54,118 పయాన్లు, త్రివాంటియన్లు చనిపోతారు. 597 00:51:57,080 --> 00:51:59,874 ఇప్పటికే ఆలస్యమైపోయింది. నువ్వు వెనక్కి వెళ్లిపోవాలి. 598 00:51:59,958 --> 00:52:01,042 ఏంటి? 599 00:52:04,128 --> 00:52:06,005 -రెన్. -ధనుర్దారులారా! 600 00:52:08,174 --> 00:52:09,175 వెళ్లిపో. 601 00:52:09,926 --> 00:52:11,344 బాణాలు ఎక్కు పెట్టండి! 602 00:52:12,762 --> 00:52:13,930 వదలండి! 603 00:53:24,042 --> 00:53:26,044 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య