1 00:00:51,431 --> 00:00:52,432 పారాహుషార్! 2 00:00:59,523 --> 00:01:00,607 పారాహుషార్! 3 00:01:58,207 --> 00:02:00,334 అగ్రజుడైన డోరియన్ ఒకానొకసారి అన్నాడు... 4 00:02:01,501 --> 00:02:05,297 ప్రకృతి రోదిస్తూ బ్రతిమాలు తరుణంలో మానవునికి ఎదురవ్వు 5 00:02:06,173 --> 00:02:08,508 అత్యంత ఇబ్బందికర అనుభవం, నిశబ్దం." 6 00:02:09,218 --> 00:02:15,807 జనన సమయమున నిశబ్దం, హృదయ వేదన సమయమున నిశబ్దం. 7 00:02:15,891 --> 00:02:20,479 భరించలేని బాధను కలిగించు సమయమున నిశబ్దం. 8 00:02:28,570 --> 00:02:30,155 నిన్ను చూసి నువ్వే గర్వపడాలి. 9 00:02:31,782 --> 00:02:33,992 నీ పంతం శక్తివంతమైనది. 10 00:02:35,744 --> 00:02:39,081 నా స్థాయిలోని కొందరు దీని ప్రభావానికి లోనయ్యే అవకాశముంది... 11 00:02:40,332 --> 00:02:45,295 ఉన్నట్టుండి జాలితో సతమతవ్వడం, వారి సంకల్పం సన్నగిల్లడం... 12 00:02:46,922 --> 00:02:48,507 ఇంకా, ఇంకా. 13 00:02:49,341 --> 00:02:52,344 స్పష్టంగా చెప్పాలంటే, అలాంటి వాళ్ళు పిరికిపందలు. 14 00:02:54,429 --> 00:02:57,349 నేను ఈ స్థాయిలో ఉండటానికి, వాళ్ళు లేకపోవడానికి ఓ కారణం ఉంది. 15 00:02:58,976 --> 00:03:00,978 ఇక మిగిలున్న ఎనిమిది వేళ్ళతో మొదలుపెడదాం... 16 00:03:02,145 --> 00:03:04,857 కాలి వేళ్ళతో మొదలుపెడదాం. 17 00:03:09,403 --> 00:03:14,533 మా మహారాణి ఎక్కడుందో చెప్పేవరకూ రోజుల తరబడి ఇలా చేస్తూనే ఉంటాను. 18 00:03:35,971 --> 00:03:39,433 మహారాణి ఎక్కడుందో నాకు తెలిసింది. 19 00:03:39,892 --> 00:03:41,685 వాళ్ళు మన రాకను ఊహిస్తూ ఉండరు. 20 00:03:41,768 --> 00:03:43,812 వేగంగా వెళ్తే, కొన్ని రోజులలో వెళ్లిపోవచ్చు. 21 00:03:44,229 --> 00:03:46,565 దళం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. 22 00:03:47,024 --> 00:03:50,027 కానీ అంతకుముందు కొన్ని విషయాలను మనం మాట్లాడి పరిష్కరించుకోవాలి. 23 00:03:50,110 --> 00:03:51,111 "మాట్లాడి పరిష్కరించుకోవాలా"? 24 00:03:51,195 --> 00:03:53,989 ముందుగా, ఈ కుర్రాడి గురించి. 25 00:03:55,324 --> 00:03:58,911 ఇద్దరు ఛాయలను పట్టుకోవడంలో అతను చేసిన సహాయానికి నేను కృతజ్ఞుడిని. 26 00:04:00,454 --> 00:04:01,580 కానీ ఇప్పుడు... 27 00:04:03,498 --> 00:04:06,752 అతను అదెలా చేశాడో నాకు తెలియాలి. 28 00:04:09,379 --> 00:04:11,215 అతను నీ కొడుకు కాదు. 29 00:04:11,298 --> 00:04:14,510 అతడిని నీ ముందుకు తెచ్చినప్పుడే నాకా విషయం తెలిసిపోయింది. 30 00:04:16,303 --> 00:04:19,640 కానీ అతడికి చూపు ఉంది కదా? 31 00:04:22,643 --> 00:04:23,644 అవును. 32 00:04:26,063 --> 00:04:28,482 జెర్లామరెల్ యొక్క మరో బిడ్డ... 33 00:04:32,194 --> 00:04:33,654 మరో మహిళతో. 34 00:04:37,282 --> 00:04:39,284 నీకు సరైన న్యాయం జరగలేదు. 35 00:04:39,701 --> 00:04:43,038 అందులో అస్సలు ఆ కుర్రాడి తప్పే లేదు, అతనే లేకుంటే, పురోగతే ఉండేది కాదు. 36 00:04:43,121 --> 00:04:46,959 నేను మాంత్రికాంతకుడిని, మాగ్రా, ఇప్పుడు నా గుడారంలో ఒక మాంత్రికుడు కూర్చొనున్నాడు! 37 00:04:47,042 --> 00:04:50,045 ఇది తప్పొప్పుల ప్రశ్న కాదు. అతనెవరో తెలిసి కూడా నేను ఊరుకొని ఉండలేను. 38 00:04:50,128 --> 00:04:51,463 ఉండగలవు! 39 00:04:52,756 --> 00:04:54,007 అతను నా మనిషి. 40 00:04:54,591 --> 00:04:58,095 నా రక్షణలో ఉన్నాడు. మరి నేను మహారాజు కుమార్తెను. 41 00:04:59,638 --> 00:05:01,348 ఇంకా నువ్వు దేన్ని పరిష్కరించుకోవాలి అనుకుంటున్నావు? 42 00:05:03,058 --> 00:05:04,852 అతను మనతో వస్తాడా అన్న విషయం. 43 00:05:05,352 --> 00:05:06,728 "మనతో వస్తాడా"? 44 00:05:06,812 --> 00:05:09,231 నేను సైన్యాన్ని కదిలిస్తున్నాను. నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. 45 00:05:09,314 --> 00:05:12,442 కుదరదు. నా కుటుంబం యొక్క ఆచూకీ తెలిసేదాకా నేనెక్కడికీ వెళ్ళేది లేదు. 46 00:05:12,526 --> 00:05:14,611 ఇప్పటికి చాలా రోజులు గడిచాయి, కానీ మా వేగువాళ్ళకి వారి జాడ తెలియడం లేదు. 47 00:05:14,695 --> 00:05:17,114 -నువ్వు నాకు మాటిచ్చావు! -వెతుకుతానని మాటిచ్చాను. 48 00:05:17,197 --> 00:05:19,157 నాకు తెలిసినంతవరకూ, నా మాటని నేను నిలబెట్టుకున్నాను. 49 00:05:19,241 --> 00:05:21,493 అయితే నీ వాళ్ళని కొంతమందిని వదిలి వెళ్ళు. అన్వేషణని నేను కొనసాగిస్తాను. 50 00:05:21,577 --> 00:05:24,371 ఈ విషయంలో నాకు మరో దారి లేదు, నీకు కూడా లేదు. 51 00:05:26,290 --> 00:05:27,374 పిల్లాడా... 52 00:05:30,961 --> 00:05:35,674 చంపడంలో నాకు ఎంత అనుభవం ఉందో నువ్వసలు ఊహించను కూడా లేవు. 53 00:05:36,592 --> 00:05:41,138 నీకు కంటి చూపు ఉంది కనుక, మనమిద్దరం సమఉజ్జీలని నువ్వు భావిస్తూ ఉంటే... 54 00:05:42,931 --> 00:05:44,141 నువ్వు పునరాలోచించుకోవాలి. 55 00:05:50,480 --> 00:05:51,690 పర్వాలేదు. 56 00:05:55,819 --> 00:05:59,031 ఇక్కడ ఎవ్వరూ నివసించడం లేదు. ఇది అంత ప్రమాదకరమైన చోటు కాదు. 57 00:05:59,114 --> 00:06:01,158 నా భద్రతకి కొద్ది మందే సరిపోతారు. 58 00:06:01,491 --> 00:06:05,787 మాగ్రా, మహారాణి ప్రమాదంలో ఉంది. 59 00:06:05,871 --> 00:06:09,124 ఇప్పుడు తను వికలాంగురాలు అయ్యుండవచ్చు. చనిపోయి కూడా ఉండవచ్చు. 60 00:06:09,541 --> 00:06:11,585 రాజ్యాన్ని ఇప్పుడు ఎవరు పరిరక్షిస్తున్నారో కూడా మనకి తెలీదు. 61 00:06:11,668 --> 00:06:14,379 అసలు ఎవరైనా పరిరక్షిస్తున్నారా అన్న విషయం కూడా తెలియదు. 62 00:06:14,963 --> 00:06:18,550 మీ కుటుంబ పాలనకు ముందు ఉన్న ఆ గందరగోళ పరిస్థితులు భయానకంగా ఉండేవి. 63 00:06:19,593 --> 00:06:22,721 లెక్కలేనన్ని వైరాలు, వేదనలు మరియు ప్రతీకారాలు. 64 00:06:22,804 --> 00:06:26,642 సింహాసనం మీద కేన్ వంశస్థులు లేకపోతే, మరలా ఆ పరిస్థితులే పునరావృత్తమవుతాయి. 65 00:06:26,725 --> 00:06:31,021 మరి తదుపరి అసలైన కేన్ వారసురాలివి నీవే. 66 00:06:34,358 --> 00:06:37,986 నీ కుటుంబాన్ని గాలించడానికని ఒక దళాన్ని ఉంచి వెళ్తాను. 67 00:06:39,696 --> 00:06:41,448 కానీ నువ్వు ఇక్కడే ఉండే విషయానికి వస్తే... 68 00:06:43,575 --> 00:06:46,078 మనిద్దరికీ మరో దారి లేదు. 69 00:07:01,510 --> 00:07:03,428 ఇక్కడే ఉండే వాళ్ళకి అధిపతివి నువ్వేనా? 70 00:07:03,512 --> 00:07:05,597 అవును, మహారాణి. నా క్రింద నలుగురు ఉన్నారు. 71 00:07:06,473 --> 00:07:07,808 ఎనిమిది అయితే బాగుంటుంది. 72 00:07:08,725 --> 00:07:09,768 అలాగే కానివ్వు. 73 00:07:12,229 --> 00:07:14,857 ఇక్కడ నీకు అప్పగించిన పని ఎంత ముఖ్యమైనదో నీకు తెలుసు కదా? 74 00:07:14,940 --> 00:07:16,441 బాగా తెలుసు, మేడమ్. 75 00:07:17,901 --> 00:07:19,069 వాళ్ళే నా జీవితం. 76 00:07:19,486 --> 00:07:20,654 అలాగే, మేడమ్. 77 00:08:19,046 --> 00:08:21,507 నువ్వు నీ తండ్రితో మాట్లాడాలి. 78 00:08:21,590 --> 00:08:24,176 నా మాటలని ఆయన అస్సలు వినాలనుకోవడం లేదు. 79 00:08:24,259 --> 00:08:26,345 అందుకే నువ్వు అతనితో మాట్లాడాలి. 80 00:08:29,556 --> 00:08:30,682 నేనే ఎందుకని? 81 00:08:30,766 --> 00:08:35,187 హనీవా, ముందు ఎవరు మాట్లాడారన్నది ముఖ్యం కాదు. 82 00:08:35,270 --> 00:08:37,105 మాటలతోనే ముందుకెళ్ళడం సాధ్యమవుతుంది. 83 00:08:39,942 --> 00:08:41,485 అది తేలిక అని అనుకుంటున్నావు. 84 00:08:42,486 --> 00:08:43,612 అది తేలికే. 85 00:08:44,488 --> 00:08:46,615 అవకాశం దొరినప్పుడే నిశబ్దాన్ని చేధించాలి. 86 00:08:55,332 --> 00:08:56,792 ఎందుకు ఆగుతున్నాం? 87 00:08:57,793 --> 00:09:02,297 రాత్రికి ఇక్కడే ఉంటాం. చుట్టుపక్కల వేగు చూడటానికని మీ తండ్రి వెళ్ళాడు. 88 00:09:07,219 --> 00:09:08,595 అది ఎంత దూరంలో ఉంది? 89 00:09:09,346 --> 00:09:10,722 ఏది ఎంత దూరంలో ఉండేది? 90 00:09:12,808 --> 00:09:13,976 ఓహ్, వావ్. 91 00:09:25,279 --> 00:09:29,032 ఇది చూసి ఆనందపడాలో లేక ఇది అసలు కనబడదు అని ఆశించినందుకు బాధపడాలో అర్థంకావడం లేదు. 92 00:09:34,121 --> 00:09:35,497 వెళ్లి ఇతరులకు చెప్పి వస్తాను. 93 00:09:46,508 --> 00:09:47,676 నివాసం. 94 00:10:01,481 --> 00:10:04,193 ఇదివరకు ఎప్పుడూ కోట బయట అడుగుపెట్టని ఒక మహారాణి 95 00:10:04,693 --> 00:10:08,447 కేవలం తన చెలికత్తె మరియు ఒక డ్రైవర్ తో రోడ్డు మీదకి అసలు ఎలా వచ్చింది? 96 00:10:09,323 --> 00:10:11,658 ఎవరైనా తన మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేసారంటావా? 97 00:10:13,702 --> 00:10:15,787 నేను చాలానే అనుకోగలను. 98 00:10:17,414 --> 00:10:18,832 అనుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. 99 00:10:20,167 --> 00:10:21,501 తనకి శత్రువులు ఉన్నారు. 100 00:10:22,127 --> 00:10:23,545 సింహాసనం అన్నాక శత్రువులు ఉంటారు. 101 00:10:24,796 --> 00:10:26,089 కొందరి కన్నా ఇంకొందరికి ఎక్కువగా ఉంటారు. 102 00:10:28,091 --> 00:10:30,093 తను నా తల్లి. ఆ విషయం నీకు తెలుసు కదా? 103 00:10:32,429 --> 00:10:36,683 వారి ముఖాలు, వారి స్వరాలు, వారు ఊపిరి తీసుకునే విధానం కూడా. 104 00:10:39,686 --> 00:10:42,731 మా అమ్మ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది, అయినా కానీ నాకది తెలుసు. 105 00:10:44,608 --> 00:10:46,401 వారిద్దరూ సరిగ్గా ఒకేలా ఉంటారు. 106 00:10:49,154 --> 00:10:50,572 కాబట్టి అమ్మ చనిపోయినప్పుడు, 107 00:10:50,656 --> 00:10:56,036 మా అక్క నా దగ్గర ఉన్న ప్రతీసారి నాకేదో ఒకరమైన గగుర్పాటు భావన కలిగేది... 108 00:10:57,204 --> 00:11:01,625 తన మాటలను వినడం, తన వాసనని చూడటం, తనని తాకడం... 109 00:11:04,503 --> 00:11:07,214 ఉన్నట్టుండి, మా అమ్మ గుర్తొచ్చి మళ్లీ ఏడుస్తూ కూర్చొనేదాన్ని. 110 00:11:10,300 --> 00:11:12,469 మా నాన్నకి కూడా అలాగే అనిపించందనుకుంటా. 111 00:11:12,553 --> 00:11:16,849 అందుకే ఆమెకి అన్నింటికన్నా ఎక్కువ నచ్చిన విషయానికి వచ్చినప్పుడు, 112 00:11:16,932 --> 00:11:19,560 తనకి తాను చెప్పలేకపోయాడని నా అభిప్రాయం. 113 00:11:24,523 --> 00:11:26,066 తన జన్నహక్కు విషయంలో. 114 00:11:52,926 --> 00:11:55,220 మీరడిగినట్టే, ఆవిడకి ఆహారం తెచ్చాను. 115 00:11:56,054 --> 00:12:01,560 నువ్వు ఆవిడకి ఏ పేరైనా పెట్టి పిలవచ్చు. కానీ ఆ పేరుకి ఇక్కడ ప్రాధాన్యతే ఉండదు. 116 00:12:02,436 --> 00:12:05,647 మీరడిగినట్టే మహారాణికి ఆహారం తెచ్చాను. 117 00:12:05,731 --> 00:12:06,773 మంచిది. 118 00:12:19,244 --> 00:12:21,997 ఇంకా నీకు తగినట్టు లేదా? 119 00:12:24,208 --> 00:12:29,338 నీ మొండితనం గురించి, అలాగే నీ స్వీయవినాశక వైఖరి గురించి చాలా కథలు విన్నాను. 120 00:12:30,672 --> 00:12:34,384 నేను మొదటిసారి విన్నప్పుడు, అవి చాలా అతిగా అనిపించాయి, నమ్మశక్యంగా అనిపించలేదు. 121 00:12:34,468 --> 00:12:35,636 కానీ ఇప్పుడు చూస్తుంటే... 122 00:12:37,262 --> 00:12:42,059 బహుశా వాటిలో కొన్నింటిని నువ్వు రూఢీ చేయవచ్చు, లేదా తిరస్కరించవచ్చు. 123 00:12:42,768 --> 00:12:46,813 నిద్రలో గురకపెడుతున్నారని నీ ప్రేమికులనే చంపావని విన్నాను. 124 00:12:46,897 --> 00:12:50,359 తమ శరీర వాసన నచ్చలేదని పనివారిని చంపావని విన్నాను. 125 00:12:51,443 --> 00:12:54,029 తగినంత త్వరగా నిన్ను మెప్పించలేకపోయారని 126 00:12:54,363 --> 00:12:59,493 యువ చెలికత్తెల నాలుకలను వండి పెట్టావని విన్నాను. 127 00:12:59,910 --> 00:13:05,916 వీటిలో ఏవైనా అబద్ధాలని తిరస్కరించేటివి, బహుశా వాస్తవాలు అని ఒప్పుకొనేటివి ఉన్నాయా? 128 00:13:20,180 --> 00:13:21,890 నియమాలు నీకు తెలుసు. 129 00:13:23,100 --> 00:13:26,436 గంట మ్రోగితేనే కదా, నువ్వు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావని మాకు తెలిసేది? 130 00:13:27,646 --> 00:13:29,565 గంట మ్రోగితే, మేము స్పందించాలి. 131 00:13:29,648 --> 00:13:33,735 గంట మ్రోగితే, నువ్వు దానికి మూల్యాన్ని చెల్లించాలి. 132 00:13:35,571 --> 00:13:37,614 నిన్ను విడిపించడానికి అవసరమైన డబ్బులు అందేవరకూ, 133 00:13:38,198 --> 00:13:41,952 నిన్ను అతి జాగ్రత్తగా చూసుకుంటాను. 134 00:13:45,747 --> 00:13:48,625 అందుకని కాస్త శాంతంగా ఉండవచ్చు కదా? 135 00:13:50,377 --> 00:13:53,213 తిరిగి మనం మన సంభాషణని కొనసాగిద్దామా? 136 00:13:55,048 --> 00:14:00,804 దయచేసి తెలుసుకో, నాకు ఆ కథలన్నీ బాగా వినోదాన్ని అందించినా... 137 00:14:02,389 --> 00:14:07,394 నాకు బాగా ఆసక్తికరమైన కథ మాత్రం ఒక ప్రేమికుని గురించి... 138 00:14:08,770 --> 00:14:11,773 అదే నీ మనసును విరిచేసి, నిన్ను వదిలేసినవాడు. 139 00:16:12,769 --> 00:16:13,937 హనీవా. 140 00:16:15,856 --> 00:16:17,357 నేనింతక ముందు అన్నదంతా... 141 00:16:17,441 --> 00:16:18,734 నాకు తెలుసు. 142 00:16:18,817 --> 00:16:20,861 -అది ఎందుకంటే... -పర్వాలేదులే. 143 00:16:21,361 --> 00:16:23,280 -గుహలో... -నేను అర్థం చేసుకోగలను. 144 00:16:24,740 --> 00:16:25,741 ఖచ్చితంగానా? 145 00:16:42,966 --> 00:16:43,967 అవును. 146 00:16:55,521 --> 00:16:57,523 మనం ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నావు? 147 00:17:01,151 --> 00:17:04,613 నిజాయితిగా చెప్పాలంటే, నీ ఆశలని నువ్వు అదుపులో ఉంచుకోవాలి. 148 00:17:06,239 --> 00:17:09,368 అతని గురించి మనకి తెలిసినదాన్ని పక్కన పెడదాం, సరేనా? 149 00:17:09,450 --> 00:17:11,786 తన కొడుకుని వదిలేసి అతడిని ఒక నరరూప రాక్షసుడిగా మార్చిన విషయాన్ని 150 00:17:11,870 --> 00:17:13,037 పక్కన పెట్టేద్దాం. 151 00:17:13,121 --> 00:17:15,873 -అసలేం జరిగిందో మనకి తెలీదు... -అమ్మకి ఇది ఇష్టం లేదు. 152 00:17:19,419 --> 00:17:22,881 బాధపడకుండా అమ్మ ఎప్పుడూ తన గురించి మాట్లాడటాన్ని నేను వినలేదు. 153 00:17:23,882 --> 00:17:27,844 మనల్ని హెచ్చరించకుండా ఆవిడ ఈ విషయం గురించి మాట్లాడినట్లు నాకు గుర్తే లేదు. 154 00:17:30,722 --> 00:17:33,642 అంటే, దీనికంతటికీ ఒక కారణం ఉండుండాలి, హనీవా. 155 00:17:38,647 --> 00:17:45,112 తను ఆ కారణం మనకి ఎప్పుడూ చెప్పకపోవడం నీకు వింతగా అనిపించలేదా? 156 00:17:50,284 --> 00:17:51,493 అమ్మ మనసులో... 157 00:17:52,661 --> 00:17:55,998 ఏముందో... నాకు తెలీదు. 158 00:17:56,832 --> 00:18:02,629 కానీ తను అతడిని ప్రేమించిందని మాత్రం నాకు తెలుసు. 159 00:18:05,632 --> 00:18:07,801 దానికి ఒక కారణం ఉండుండాలి. 160 00:18:30,032 --> 00:18:31,783 అది నీ నిద్రలో విన్నావు. 161 00:18:34,036 --> 00:18:35,245 అది గుడ్లగూబనా? 162 00:18:36,538 --> 00:18:40,250 గుడ్లగూబ కాదు. మనిషిది. 163 00:18:41,627 --> 00:18:45,172 మనం దుష్టనేలలో ఉన్నాం, బాబా. నియమాల్లేని నేలలో ఉన్నాం. 164 00:18:45,797 --> 00:18:48,050 నీకు ఆరోగ్యం బాగా లేదు కూడా. 165 00:18:49,301 --> 00:18:50,427 నాకు బాగానే ఉంది. 166 00:18:51,303 --> 00:18:52,930 పిల్లలకి తెలుసా? 167 00:18:53,972 --> 00:18:55,557 వారికి తెలియాల్సిన అవసరం లేదు. 168 00:18:56,975 --> 00:18:59,102 నువ్వు అనుకున్నదాని కన్నా ఎక్కువే తెలుసు వాళ్ళకి. 169 00:19:07,611 --> 00:19:09,029 నీతో హనీవా ఏమైనా మాట్లాడిందా? 170 00:19:09,905 --> 00:19:10,989 ఎందుకు? 171 00:19:12,199 --> 00:19:13,951 తనేదో అట్టిపెట్టుకొని ఉంటుంది... 172 00:19:14,910 --> 00:19:17,287 అదేంటో చెప్పలేకపోతుంది... 173 00:19:18,038 --> 00:19:19,665 దానికి తను భయపడుతోంది. 174 00:19:22,125 --> 00:19:23,126 తను బాధలో ఉంది. 175 00:19:23,210 --> 00:19:25,254 కొఫూన్ కూడా బాధలో ఉన్నాడు. 176 00:19:25,796 --> 00:19:29,466 కానీ అదే దుష్ట ప్రభావానికి అతను లోనుకాలేదు. 177 00:19:31,510 --> 00:19:35,889 వారిద్దరి మనస్తత్వాలు భిన్నమైనవి. ఈ క్షణాన కూడా వారికి భిన్నమైనవి కావాలి. 178 00:19:36,306 --> 00:19:39,434 ఆమెకి ఇప్పుడు ఏం అవసరమో, అది అందరికన్నా నీకే తెలుసనుకుంటాను. 179 00:19:39,518 --> 00:19:40,727 ఏం అంటున్నావు నువ్వు? 180 00:19:45,232 --> 00:19:47,067 మొట్టమొదటిసారి నేను నీ దగ్గరికి వచ్చినప్పటి సంగతి నీకు గుర్తుందా? 181 00:19:48,360 --> 00:19:51,321 ఎంత క్రోధంతో, ఎంత ప్రళయభీకరంగా ఉన్నానో? 182 00:19:53,115 --> 00:19:54,533 ఎందుకంటే నేనప్పుడు భయకంపితుడినై ఉన్నాను. 183 00:19:56,159 --> 00:19:57,578 నిన్ను నమ్మాలంటే భయం... 184 00:19:58,704 --> 00:20:02,541 నేను నిజంగా తప్పించుకున్నానని, అది నిజమేనని నమ్మాలంటే భయం. 185 00:20:03,542 --> 00:20:06,253 నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? 186 00:20:07,421 --> 00:20:11,008 ఇంకా నా వస్తువులను ఏమన్నా నువ్వు పగలగొట్టావంటే, 187 00:20:11,091 --> 00:20:13,093 నిన్ను నిద్రలోనే చంపేస్తాను. 188 00:20:13,719 --> 00:20:15,304 అవును. కానీ ఆ తర్వాత... 189 00:20:16,680 --> 00:20:18,557 నువ్వేం చేశావో నీకు గుర్తుందా? 190 00:20:21,226 --> 00:20:26,648 నేను మళ్లీ ఊపిరి తీసుకునేంత వరకూ నువ్వు కూర్చోని అలానే వేచి చూశావు. 191 00:20:28,901 --> 00:20:32,613 నేను ఒంటరిగా లేనని నాకు తెలియడానికి నువ్వు అలానే వేచి ఉన్నావు. 192 00:20:36,033 --> 00:20:37,451 హనీవా మనసు విరిగిపోయుంది. 193 00:20:38,952 --> 00:20:41,205 తన ముందు ఒక అగమ్యగోచర భవిష్యత్తు ఉంది... 194 00:20:42,331 --> 00:20:45,751 తల్లిని కోల్పోయింది, ఓ కొత్త తండ్రిని కలవబోతుంది. 195 00:20:49,338 --> 00:20:51,215 కానీ తనకు కావలసిన ఏకాంతాన్ని తనకి నేను ఇస్తాను. 196 00:20:51,298 --> 00:20:54,426 ఇంకా నువ్వు చేసినట్లుగానే, తను కూడా ఒంటరి కాదని తనకి తెలిసేలా చేస్తాను. 197 00:21:17,741 --> 00:21:19,451 ప్యారిస్, ఏమైంది? 198 00:21:24,498 --> 00:21:26,124 లావెండర్ వాసన తెలియడం లేదు. 199 00:21:27,876 --> 00:21:29,419 మరణ వాసన తెలుస్తోంది. 200 00:21:44,643 --> 00:21:47,479 చనిపోయి కొన్ని రోజులు అయ్యుండవచ్చు, వారాలు కూడా అయ్యుండవచ్చు. 201 00:21:49,731 --> 00:21:51,066 అది మనిషిదే కదా? 202 00:22:26,435 --> 00:22:28,896 "ఓ కొత్త ప్రపంచం ముందు ఉన్నది. 203 00:22:30,981 --> 00:22:34,401 అందులో ఓ కొత్త దేవుడు నివాసముంటున్నాడు. 204 00:22:40,407 --> 00:22:42,117 ప్రవేశించారంటే, చూడబడతారు. 205 00:22:43,410 --> 00:22:45,204 ప్రవేశించారంటే, గుణగణాలు లెక్కించబడతారు. 206 00:22:47,372 --> 00:22:49,208 ప్రవేశించారంటే, మరణం సంభవిస్తుంది. 207 00:22:51,627 --> 00:22:53,128 ప్రవేశించారంటే, చూడబడతారు." 208 00:22:55,339 --> 00:22:56,340 జెర్లామరెల్. 209 00:22:58,133 --> 00:23:00,385 అతనికి మతి తప్పింది. 210 00:23:00,802 --> 00:23:02,054 కాకపోవచ్చేమో. 211 00:23:02,888 --> 00:23:05,307 బహుశా... బహుశా నువ్వు చేసే కార్యం ముఖ్యమైనది, 212 00:23:05,390 --> 00:23:09,019 ఇంకా నీకు ఇతరుల జోక్యం వద్దు అని అనుకున్నప్పుడు ఇలాంటిదే జరుగుతుందేమో. 213 00:23:09,102 --> 00:23:10,270 ప్యారిస్, నాకు తెలీదు. 214 00:23:10,354 --> 00:23:15,734 ఈ లోకంలో చూపు ఉండటం ఎంత ప్రమాదకరమైనదో మీరు తెలుసుకోవాలి. 215 00:23:15,817 --> 00:23:19,780 దాని వల్ల ఏ హానీ జరగకుండా ఉండేందుకు ఎంతెంత పనులు చేస్తారో మీరు తెలుసుకోవాలి. 216 00:23:19,863 --> 00:23:21,448 నేను ప్యారిస్ తో ఏకీభవిస్తున్నాను. 217 00:23:25,035 --> 00:23:28,580 కేవలం ఇలాంటిది ఒకటి ఎదురైంది కదా అని వెనుదిరగడానికి మనమింత దూరం రాలేదు. 218 00:23:29,206 --> 00:23:32,459 మనం ఏమి తెలుసుకోవడానికి మన పయనం మొదలుపెట్టామో అది మీ ఇద్దరూ తెలుసుకోవాలి. 219 00:23:32,543 --> 00:23:35,212 మనమంతా ఇంత త్యాగం దేని కోసం చేశామో నాకు తెలియాలి. 220 00:23:38,048 --> 00:23:40,300 నా భార్యని త్యాగం దేని కోసం నేను చేశానో నాకు తెలియాలి. 221 00:23:41,927 --> 00:23:43,303 నేను తెలుసుకొని తీరాలి. 222 00:23:46,473 --> 00:23:47,474 పదండి. 223 00:23:49,393 --> 00:23:51,436 కనీసం మనం సరైన దిశలోనే వెళ్తున్నామనైనా తెలిసింది. 224 00:23:54,940 --> 00:23:56,149 కొఫూన్. 225 00:24:01,738 --> 00:24:03,073 మనం ముందుకు సాగుతున్నాం. 226 00:24:51,663 --> 00:24:53,373 నేను నలుగురు కాపలాదారులని చూశాను. 227 00:24:53,999 --> 00:24:57,586 ప్రవేశద్వారం వద్ద ఒకరున్నారు. 228 00:24:58,420 --> 00:24:59,546 ఇద్దరు... 229 00:25:00,797 --> 00:25:03,091 పట్టు కార్మికుల వరుసల మధ్య పహారా కాస్తూ ఉన్నారు. 230 00:25:03,675 --> 00:25:05,594 మరొకరు రెండవ కిటికీ వద్ద ఉన్నారు. 231 00:25:05,677 --> 00:25:09,890 అయితే కార్మికులందరూ ఉన్న స్థానంలోనే ఉన్నారా? కేవలం కాపలాదారులే తిరుగుతున్నారా? 232 00:25:09,973 --> 00:25:13,560 అవును. వారి ఉనికికి సూచికగా తమ దుడ్డు కర్రలను తడుతూ ఉంటారు. 233 00:25:14,186 --> 00:25:16,271 కాపలాదారులు ఎలాంటి బూట్లు ధరించి ఉన్నారు? 234 00:25:17,731 --> 00:25:20,484 ఎలాంటి బూట్లు? తోలు వా? కలప వా? 235 00:25:20,567 --> 00:25:22,444 తోలు వి, అనుకుంటాను. 236 00:25:23,487 --> 00:25:25,656 మరి మహారాణి సంగతేంటి? ఆవిడ ఎక్కడుందో నీకు తెలుసా? 237 00:25:26,949 --> 00:25:29,618 మహారాణి ఎలాగుంటుందో నాకు తెలియదు. 238 00:25:30,118 --> 00:25:33,747 వెనుక పక్క, రక్తపుమడుగులో ఉన్న ఒక మహిళ ఉంది. 239 00:25:33,830 --> 00:25:35,666 రక్తపుమడుగులోనా? ఆవిడ బ్రతికే ఉందా? 240 00:25:35,749 --> 00:25:36,750 తెలీదు. 241 00:25:37,834 --> 00:25:41,296 అయితే, నువ్వు ఖచ్చితమే కదా? నలుగురు కాపలాదారులూ, ఇంకా వారి మధ్య ఉన్న ఎడము? 242 00:25:41,380 --> 00:25:42,631 నేను చూసింది అదే. 243 00:25:43,131 --> 00:25:44,633 నువ్వు చూసింది అదేనా? 244 00:25:44,716 --> 00:25:46,802 ఏదో చూపు నీకు నిక్కచ్చిగా చూపేటట్టు చెబుతున్నావు నువ్వు. 245 00:25:46,885 --> 00:25:48,887 వారిని ఓడించడానికి చాలినంత మనుషులు మీ దగ్గర ఉన్నారు కదా? 246 00:25:48,971 --> 00:25:52,266 వారు మన అలికిడి విన్న మరుక్షణం, మనల్ని పసిగట్టిన మరుక్షణం, 247 00:25:52,349 --> 00:25:54,518 మిగతావారిని హెచ్చరించిన మరుక్షణం, ఇదంతా వృధా అయిపోతుంది. 248 00:25:54,601 --> 00:25:55,978 ఆవిడని చేరుకొనే ఏకైక దారి ఏంటంటే, 249 00:25:56,061 --> 00:25:58,438 కాపలాదారులకి మనం ఇక్కడ ఉన్నామని తెలియకముందే వారిని లేపేయడం. 250 00:25:58,522 --> 00:26:00,566 ఒక్కొక్కొడి పని పడుతూ, ఆ పనిని ఒక్కడే చేయాలి. 251 00:26:00,649 --> 00:26:03,318 ఆ పని నేను చేయగలను. వాళ్ళందరి పనిని నేను పట్టగలను. 252 00:26:03,402 --> 00:26:06,697 నీ కళ్ళ సాయమే అడిగాను, మాంత్రికుడా, నీ అభిప్రాయాన్ని అడగలేదు. 253 00:26:07,114 --> 00:26:09,700 రాజ్య భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. 254 00:26:09,783 --> 00:26:12,202 నాకు నచ్చినంత వరకే నీ సహకారం తీసుకున్నాను. 255 00:26:12,286 --> 00:26:14,788 ఒకవేళ మాగ్రా, నీకు అతడి మీద నమ్మకముంటే తప్ప. 256 00:26:17,332 --> 00:26:18,792 అడిగిన్నందుకు మన్నించు. 257 00:26:19,376 --> 00:26:23,297 సేనాముఖమును ఏర్పాటు చేయండి. సంకేతాలే, మాటలు ఉండకూడదు. 258 00:26:23,797 --> 00:26:27,134 నేను మిమ్మల్ని లోపలికి రమ్మనేదాకా ఇంకెవ్వరూ నోరు తెరవకూడదు. 259 00:26:27,217 --> 00:26:28,385 ఒకవేళ మీరు ఏ సంకేతాన్ని ఇవ్వకుంటే? 260 00:26:28,468 --> 00:26:30,137 అప్పుడు నేను విఫలమయ్యానని, మహారాణి చనిపోయిందని అర్థం. 261 00:26:30,220 --> 00:26:31,555 అప్పుడు ఈ చోటినంతా తగలబెట్టేయండి, 262 00:26:31,638 --> 00:26:34,558 యువరాణిని కంజువాకి తీసుకెళ్లి, పట్టాభిషేకం అయ్యేలా చూడండి. 263 00:26:34,641 --> 00:26:36,435 నేను ఇంకా దానికి సమ్మతించలేదు. 264 00:26:36,518 --> 00:26:38,937 అంతవరకూ వస్తే, నీ సమ్మతితో అవసరం ఉండదు. 265 00:26:39,021 --> 00:26:40,856 అంతవరకూ వస్తుందంటావా? 266 00:26:40,939 --> 00:26:41,940 రాదు. 267 00:27:39,164 --> 00:27:41,333 కోయువాడా! కోయువాడా! ఇక్కడికి రా! 268 00:27:41,416 --> 00:27:42,417 కాపలాదారులారా. 269 00:27:42,501 --> 00:27:45,420 ఎవరో ఆగంతకుడు ప్రవేశించాడు! ఇక్కడికి ఎవరో వచ్చారు! 270 00:27:46,296 --> 00:27:47,506 పైకి లేయ్, పనికిమాలినదానా. 271 00:27:55,931 --> 00:27:57,683 నా కత్తి. నా కత్తి. 272 00:28:06,483 --> 00:28:10,988 ఒక పథకమంటూ లేకుండా ఆమెకి నేనెవరో ఊరికే చెప్పేస్తాననుకున్నావా? ఆ? 273 00:28:29,006 --> 00:28:30,215 మహారాణీ? 274 00:28:30,299 --> 00:28:31,675 మహారాణి ఇక్కడ ఉంది. 275 00:28:35,095 --> 00:28:36,680 ఈమె ఎందుకు మాట్లాడటం లేదు? 276 00:28:37,723 --> 00:28:39,641 నేను చచ్చేంత అలసిపోయాను కనుక. 277 00:28:41,101 --> 00:28:44,605 ఏమీ పర్వాలేదు. మీరు ఇప్పుడు సురక్షితంగానే ఉన్నారు. 278 00:28:58,118 --> 00:28:59,453 అసలు ఇదెలా జరిగింది? 279 00:29:01,163 --> 00:29:02,497 అసలు వీళ్ళు మిమ్మల్ని ఎలా పట్టుకోగలిగారు? 280 00:29:04,208 --> 00:29:05,500 నేను వదిలిపెట్టి రావలసి వచ్చింది. 281 00:29:07,044 --> 00:29:09,129 మీకు వ్యతిరేకంగా ఎవరో తిరుగుబాటు చేశారు? ఎవరది? 282 00:29:11,006 --> 00:29:12,132 చాలా మంది చేశారు. 283 00:29:13,842 --> 00:29:18,472 మీరు త్వరగానే కోలుకుంటారు, తిరిగి మనం కంజువాకి చేరుకుంటాము. 284 00:29:19,806 --> 00:29:22,476 కానీ అంతకు ముందు, ఒక వైద్యులు వచ్చి మిమ్మల్ని చూస్తారు. 285 00:29:36,406 --> 00:29:37,533 ఆవిడ వచ్చింది. 286 00:30:11,441 --> 00:30:13,402 -జాగ్రత్త. -తప్పకుండా. 287 00:30:36,341 --> 00:30:37,426 మనం ఇంతకుముందు కలిశామా? 288 00:31:01,366 --> 00:31:03,035 మీకు జరిగినదానికి నేను చింతిస్తున్నాను. 289 00:31:07,206 --> 00:31:09,833 నువ్వు వెళ్లిపోకూడదు, మాగ్రా. 290 00:31:16,173 --> 00:31:18,050 కనీసం నేను చెప్పే సమాచారం వినేదాకా వెళ్ళకు. 291 00:31:20,928 --> 00:31:23,347 ఏ సమాచారం, మహారాణీ? 292 00:31:25,807 --> 00:31:27,434 అందరూ నా మీద తిరుగుబాటు చేశారు. 293 00:31:30,270 --> 00:31:32,272 దేవతలు వారి పక్కనే ఉన్నారని ప్రకటించారు. 294 00:31:33,232 --> 00:31:37,569 మరి వాళ్ళు విఫలమయ్యాక, నా ముందు ఒకే దారి మిగిలి ఉండింది: 295 00:31:40,239 --> 00:31:42,199 ఆ పాపాన్ని అలాగే వదిలేయడం... 296 00:31:43,825 --> 00:31:45,994 ఇంకోటి నా పాపంతోనే సమాధానమివ్వడం. 297 00:31:47,538 --> 00:31:49,206 దానర్థం ఏమిటి? 298 00:31:49,623 --> 00:31:51,625 నన్ను తిరిగి కంజువాకి తీసుకెళ్దామనుకుంటున్నావు కదా? 299 00:31:54,002 --> 00:31:55,045 అసలు కంజువా అనేదే లేదు. 300 00:31:57,381 --> 00:32:02,678 ఎన్నో ఏళ్ళుగా, మన దిగువన ఉన్న యంత్రాల పనితీరు మీద ఆధారపడి మన పాలన సాగింది. 301 00:32:03,679 --> 00:32:07,349 అవి పనిచేసినప్పుడు, మనల్ని ఆరాధించేవారు. 302 00:32:09,142 --> 00:32:10,769 అవి పనిచేయనప్పుడు, మనల్ని ఆరాధించేవాళ్ళు కాదు. 303 00:32:13,564 --> 00:32:17,442 యంత్రాల పని మీద ఆధారితమైన మహారాణి పదవి నాకు అక్కర్లేదు. 304 00:32:20,445 --> 00:32:23,365 నేను మహారాణిని కాబట్టి మహారాణిని కావాలనుకున్నాను. 305 00:32:26,535 --> 00:32:29,663 ఇక ఇప్పట్నుండీ కథ ఇలా ఉండబోతుంది: 306 00:32:33,375 --> 00:32:36,295 దేవుళ్ళు ఆనకట్టని తీసేసుకున్నారు. 307 00:32:38,463 --> 00:32:41,258 క్రోధంతో దాన్ని ధ్వంసం చేసేసి, 308 00:32:42,050 --> 00:32:45,554 దానితో పాటు అసలైన పాపులను తీసుకెళ్లిపోయారు. 309 00:32:46,805 --> 00:32:50,350 బలహీనులు, స్వార్థపరులు, వెనుకబడ్డవారిని. 310 00:32:53,604 --> 00:32:55,105 కానీ నన్నే వదిలేశారు. 311 00:32:56,940 --> 00:32:58,150 కేవలం నన్నే. 312 00:33:01,320 --> 00:33:04,406 మీరు దాన్ని ధ్వంసం చేసేశారు. 313 00:33:09,411 --> 00:33:12,331 బయట ఉన్న సిపాయిలు... 314 00:33:14,208 --> 00:33:20,214 ఇరవై ఏళ్ళుగా, ఏదోక రోజున, వారి ఇళ్ళకు, వారి కుటుంబాల చెంతకు 315 00:33:20,297 --> 00:33:24,092 చేరుతారనే హామీతో, మీరు చెప్పినదల్లా చేశారు. 316 00:33:25,928 --> 00:33:27,930 ఎనలేని యుద్ధాలు చేసినా... 317 00:33:29,014 --> 00:33:32,476 దురవస్థలూ, భయానక సంఘటనలూ ఎదురైనా, 318 00:33:33,310 --> 00:33:35,979 ఆ ఆశే వాళ్ళని నడిపించింది. 319 00:33:36,063 --> 00:33:38,482 మరి మీరు ఆ ఆశనంతటినీ తుంచేశారే. 320 00:33:40,067 --> 00:33:41,902 నేను ఏది చేయాలో అదే చేశాను. 321 00:33:43,111 --> 00:33:44,863 మా వంశాన్ని కాపాడాను. 322 00:33:46,615 --> 00:33:49,117 నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్లి, 323 00:33:49,201 --> 00:33:54,998 మీ వంశాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను చంపేశారని చెప్తాననుకున్నారా, 324 00:33:55,082 --> 00:33:58,377 అలా చెప్పాక, నా మాటని వాళ్ళు వింటారని అనుకుంటున్నారా? 325 00:33:59,545 --> 00:34:00,796 నీ వాళ్ళా? 326 00:34:02,089 --> 00:34:03,382 నా వాళ్ళు. 327 00:34:11,222 --> 00:34:14,601 అంతేగాక నేను చెప్పినట్టే వాళ్ళు చేస్తారు... 328 00:34:15,602 --> 00:34:17,521 ఎందుకంటే నేను వారి మహారాణిని కాబట్టి. 329 00:34:22,733 --> 00:34:27,155 నా ఉద్దేశంలో, చాలా కాలం తర్వాత తొలిసారిగా... 330 00:34:28,824 --> 00:34:31,076 మనం ఓ విషయం మీద పునరాలోచించాలనుకుంటా. 331 00:34:53,182 --> 00:34:54,641 ఆగండి, ఆగండి. 332 00:34:54,724 --> 00:34:55,726 ఏమైంది? 333 00:34:56,226 --> 00:34:57,394 ఎందుకు ఆగుతున్నాం? 334 00:34:57,895 --> 00:34:59,605 ఏదో తేడాగా ఉంది. 335 00:35:00,814 --> 00:35:03,483 -ముందుపక్క ఏముంది? -పర్వతాల నడుమ దారి ఉంది. 336 00:35:04,234 --> 00:35:07,321 -ముందుకు వెళ్ళడానికి వేరే దారి ఏమైనా ఉందా? -లేదు, ఉన్నట్టు నాకేమీ కనబడటం లేదు. 337 00:35:08,280 --> 00:35:09,531 ప్యారిస్. 338 00:35:09,615 --> 00:35:11,658 నాకు పరస్పరవిరుద్ధమైన విషయాలు తెలుస్తున్నాయి. 339 00:35:12,409 --> 00:35:13,702 ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. 340 00:35:14,453 --> 00:35:16,663 కానీ, అది సరిగ్గా ఎక్కడో తెలియడం లేదు. 341 00:35:16,747 --> 00:35:18,707 బహుశా అసలు ప్రమాదమే లేకపోవడం వల్ల కావచ్చు. 342 00:35:18,790 --> 00:35:20,375 చుట్టూ మరో దారి గుండా వెళ్దాం. 343 00:35:20,959 --> 00:35:21,960 అలా అయితే ప్రయాణంలో చాలా రోజులు పోతాయి. 344 00:35:22,044 --> 00:35:24,379 -మరో దారి గుండా వెళ్దామని అన్నాను. -ఇక్కడేమీ లేదు. 345 00:35:24,463 --> 00:35:26,298 కొఫూన్, ఇక్కడేమీ లేదని అతనికి చెప్పు. 346 00:35:26,381 --> 00:35:28,050 నాన్నా, నాకేమీ కనబడటం లేదు. 347 00:35:30,761 --> 00:35:32,387 -నేను వెళ్తాను. -హేయ్. 348 00:35:33,597 --> 00:35:35,933 కొఫూన్, దైవ జ్వాల అకాశంలో ఎక్కడుంది? 349 00:35:36,016 --> 00:35:37,476 ఎప్పుడో పర్వతం వెనుకపక్కకి వెళ్లిపోయింది. 350 00:35:37,559 --> 00:35:39,144 సూర్యుడికీ దీనికీ సంబంధమేమిటి? 351 00:35:39,228 --> 00:35:41,647 సంబంధం లేదు. చీకటి ఎంత త్వరగా పడుతుందో 352 00:35:41,730 --> 00:35:44,650 అని అంచనా వేస్తున్నాను అంతే, అప్పుడు మీ వల్ల లాభం ఉండదు. 353 00:35:44,733 --> 00:35:45,776 బాబా. 354 00:36:25,566 --> 00:36:26,859 శబ్ద ఆధారిత ఉచ్చులు. 355 00:36:33,991 --> 00:36:35,242 వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. 356 00:37:03,770 --> 00:37:04,771 సరేమరి. 357 00:37:05,522 --> 00:37:06,565 దూసుకుపో. 358 00:37:29,838 --> 00:37:31,465 కదలవద్దు. 359 00:37:33,425 --> 00:37:36,220 అక్కడ ధనస్సు మరియు బాణం ఉన్నాయి. వాటి అవసరం మనకు ఉంది. 360 00:37:42,518 --> 00:37:44,061 నువ్వేం చేస్తున్నావు? 361 00:37:48,398 --> 00:37:51,109 శబ్దం చేయకుండా నేను వెళ్ళగలను. నువ్వు వెళ్ళలేవు. 362 00:39:05,976 --> 00:39:08,187 -హనీవా, వద్దు! -శరసంధానం ఆపండి! 363 00:39:12,232 --> 00:39:13,358 నువ్వు హనీవానా? 364 00:39:13,901 --> 00:39:14,902 అవును. 365 00:39:17,446 --> 00:39:19,114 మరి అరిచిన వ్యక్తి... 366 00:39:20,866 --> 00:39:21,909 నీ పేరేంటి? 367 00:39:23,410 --> 00:39:24,411 కొఫూన్. 368 00:39:24,953 --> 00:39:26,371 జెర్లామరెల్ పిల్లలారా, 369 00:39:27,039 --> 00:39:29,750 వృక్షాలు దాటగానే ఒక వంతెన ఉంటుంది. 370 00:39:31,043 --> 00:39:34,087 ఆ వంతెన గుండా మీరు జ్ఞానోదయ నివాసానికి చేరుకోవచ్చు. 371 00:39:34,963 --> 00:39:38,592 ఆ జ్ఞానోదయ నివాసంలో ఎవరైనా వైద్యులు ఉన్నారా? 372 00:39:38,675 --> 00:39:40,344 మీరు వెళ్ళలేరు. 373 00:39:40,427 --> 00:39:42,554 మేము వెళ్ళవచ్చని ఇప్పుడే అన్నావే. 374 00:39:42,638 --> 00:39:46,600 జ్ఞానోదయ నివాసానికి, కేవలం జెర్లామరెల్ పిల్లలే వెళ్ళగలరు. 375 00:39:47,392 --> 00:39:49,937 నిబంధన ఒకటే ఉంది, ఇక అంతే. 376 00:39:50,354 --> 00:39:54,066 మేమిక్కడికి వచ్చామని జెర్లామరెల్ కి చెప్పు. అతను అర్థం చేసుకుంటాడు. 377 00:39:55,275 --> 00:39:57,569 కేవలం కొఫూన్, హనీవాలే దాటి వెళ్ళగలరు. 378 00:39:57,653 --> 00:39:58,654 చెప్పేది విను... 379 00:39:58,737 --> 00:40:00,030 బాబూ. 380 00:40:01,281 --> 00:40:04,451 నిబంధన ఒకటే ఉంది, ఇక అంతే. 381 00:40:05,786 --> 00:40:08,789 అతని కొడుకూ, కూతురూ ఇంత దూరం వచ్చింది, తిరిగి వెనక్కి వెళ్లిపోవడానికే అని 382 00:40:08,872 --> 00:40:10,082 జెర్లామరెల్ తో వెళ్లి చెప్పు! 383 00:40:10,165 --> 00:40:11,667 మనం వెనక్కి వెళ్ళడం లేదు. 384 00:40:13,085 --> 00:40:14,836 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం వెనక్కి వెళ్లిపోవాలి. 385 00:40:14,920 --> 00:40:17,422 -ఆమెకి వైద్యుల అవసరం ఉంది. -లేదు. తనకి నాన్న, ప్యారిస్ లు ఉన్నారు. 386 00:40:17,506 --> 00:40:19,007 ఆమెని అతను వేరే తెగ వద్దకి తీసుకెళ్ళగలడు. 387 00:40:19,091 --> 00:40:20,551 నువ్వేం మాట్లాడుతున్నావు? మనం తనని ఇక్కడ వదిలి వెళ్ళలేం, హనీవా. 388 00:40:20,634 --> 00:40:22,427 తనకి మనమంతా ఉండవలసిన అవసరం లేదు. 389 00:40:22,511 --> 00:40:23,846 -మనమంతా కలిసే ఉండాలి. -కొఫూన్. 390 00:40:23,929 --> 00:40:25,013 -ఇక చాలు. -ఇది పిచ్చి పని. 391 00:40:25,097 --> 00:40:26,098 ఇక చాలు. 392 00:40:26,181 --> 00:40:28,183 నేను చెప్పేది వినండి. నా మాట వినండి. 393 00:40:30,811 --> 00:40:32,354 హనీవా, కొఫూన్, 394 00:40:32,771 --> 00:40:37,025 మనం చాలా దూరం వచ్చాం, చాలా కోల్పోయాం, కాబట్టి ఇప్పుడు వెనుదిరగడం తగని పని. 395 00:40:38,819 --> 00:40:41,196 నేను దీని గురించి చాలా కాలం పాటు ఆలోచించాను. 396 00:40:41,780 --> 00:40:45,200 దీన్ని అసలు నమ్మాలని నాకు లేదు, కానీ ప్యారిస్ అన్నది నిజమే. 397 00:40:46,618 --> 00:40:51,582 ఏదోక రోజు ప్రతీ పిల్లాడి జీవితంలోకి ఒక వంతెన వస్తుంది, దాన్ని అతనొక్కడే దాటాలి. 398 00:40:51,665 --> 00:40:53,542 నువ్వేం మాట్లాడుతున్నావు? 399 00:40:55,043 --> 00:40:58,589 మీరు జన్మించిన రోజున, మిమ్మల్ని కాపాడటానికి ఒక గోడ మీద నిల్చొని పోరాడాను, 400 00:40:58,672 --> 00:41:00,674 ఆనాటి నుండీ ప్రతీరోజూ పోరాడుతూనే ఉన్నాను. 401 00:41:01,967 --> 00:41:04,428 తన పిల్లలని కాపాడుకోవటానికి ఒక తండ్రి చేసేది అదే. 402 00:41:05,971 --> 00:41:09,892 కానీ తమ స్వంత మార్గాన్ని అనుసరించడానికి వీలుగా, తన పిల్లలని ఎప్పుడు వదిలేయాలో కూడా 403 00:41:09,975 --> 00:41:11,977 ఒక తండ్రికి తెలిసుండాలి. 404 00:41:15,022 --> 00:41:17,232 -ఆ క్షణం ఇప్పుడు రానే వచ్చింది; -లేదు, అది నిజం కాదు. 405 00:41:18,233 --> 00:41:21,236 అది నిజం కాదు. హనీవా, అది నిజం కాదని అతనికి చెప్పు. 406 00:41:21,320 --> 00:41:22,779 అదే నిజం, కొఫూన్. 407 00:41:23,447 --> 00:41:26,241 మనిద్దరి ప్రపంచం వేరు, అతని ప్రపంచం వేరు. 408 00:41:26,825 --> 00:41:28,285 ఎప్పట్నుంచో అవి వేర్వేరు ప్రపంచాలే. 409 00:41:29,536 --> 00:41:31,955 నిజంగా మనం ఒకరికొకరం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. 410 00:41:32,456 --> 00:41:34,208 అది అతనికి తెలిసే ఇక్కడిదాకా మనల్ని తీసుకొచ్చాడు. 411 00:41:34,291 --> 00:41:36,251 నువ్వు ఎందుకలా చేశావు? 412 00:41:41,006 --> 00:41:42,674 ఎందుకంటే నేను మీ తండ్రిని కనుక. 413 00:41:42,758 --> 00:41:44,092 ఓహ్, నాన్నా. 414 00:41:44,676 --> 00:41:46,011 నా చిట్టి తల్లీ. 415 00:41:47,429 --> 00:41:48,639 నువ్వు పొరబడ్డావు. 416 00:41:50,849 --> 00:41:52,476 మన ప్రపంచాలు వేర్వేరు కాదు. 417 00:41:53,602 --> 00:41:55,187 మీరు పుట్టిననాటి నుండీ, 418 00:41:55,270 --> 00:41:58,357 నా ప్రపంచమంతా నువ్వూ, నీ సోదరుడే. 419 00:42:00,067 --> 00:42:03,237 పిల్లలారా, అందరిలాగా నేను గుడ్డివాడినే. 420 00:42:05,280 --> 00:42:06,740 కానీ నేను మీ ఇద్దరినీ చూడగలను. 421 00:42:08,158 --> 00:42:10,035 అంతేగాక మీ ఇద్దరినీ చూడటం నేను ఆపను. 422 00:42:11,245 --> 00:42:12,704 కానీ నేను చెప్పింది నిజం. 423 00:42:14,206 --> 00:42:17,000 ఈ రోజు రానే వచ్చింది, ఇక మీరు మీ తండ్రిని కలవాలి. 424 00:42:17,084 --> 00:42:18,835 నాన్నా, నువ్వే నా తండ్రివి. 425 00:42:26,426 --> 00:42:27,636 నువ్వంటే నాకు ప్రాణం, బాబూ. 426 00:42:34,268 --> 00:42:35,894 మేము మళ్లీ నిన్ను కలుస్తామా? 427 00:42:40,107 --> 00:42:41,149 తప్పకుండా. 428 00:42:44,444 --> 00:42:45,445 బో లయన్. 429 00:42:50,409 --> 00:42:52,870 నీకు ఇది చక్కిలిగింత లాగా అనిపిస్తుంది అంతే. 430 00:42:54,329 --> 00:42:55,330 అయిపోయింది. 431 00:42:57,374 --> 00:42:58,375 అంతే. 432 00:43:08,552 --> 00:43:09,887 మీ అమ్మని ఎప్పటికీ మరిచిపోవద్దు. 433 00:43:10,929 --> 00:43:12,848 ఎట్టి పరిస్థితిల్లోనూ ఒకరికొకరు రక్షణగా ఉండండి. 434 00:43:15,517 --> 00:43:18,103 -నాన్నా. -కొఫూన్, వద్దు. ఆగు. 435 00:43:18,645 --> 00:43:19,938 అతను ఒంటరివాడై పోతాడు. 436 00:43:21,481 --> 00:43:24,693 అతనితో మాగ్రా ఎల్లప్పుడూ ఉంటుంది. 437 00:43:27,154 --> 00:43:30,365 ఇక ఇప్పటి నుండి, మీ ఇద్దరూ కూడా అతనితో ఉంటారు. 438 00:43:32,784 --> 00:43:34,244 నేను అతనితోనే ఉంటాను. 439 00:43:37,956 --> 00:43:39,374 నీ సోదరిని చూడు. 440 00:43:40,626 --> 00:43:41,960 అది తనకి తెలుసు. 441 00:43:45,547 --> 00:43:46,548 ఇప్పుడు... 442 00:43:48,008 --> 00:43:51,011 ఇద్దరూ, జాగ్రత్తగా వినండి. 443 00:43:52,262 --> 00:43:55,974 చూపు అనే వరం, మిమ్మల్ని గుడ్డివాళ్ళని చేయగలదు. 444 00:43:58,352 --> 00:44:02,606 జెర్లామరెల్... మీ తండ్రి, 445 00:44:03,649 --> 00:44:05,359 అతనికి చూపు ఉంది. 446 00:44:06,360 --> 00:44:10,030 కానీ అతను దేవుడేం కాదు, మీరిద్దరూ కూడా కాదు. 447 00:44:12,199 --> 00:44:14,368 మీరు ప్రపంచాన్ని నిర్మించదలిస్తే... 448 00:44:16,662 --> 00:44:18,163 మీ అమ్మని గుర్తుతెచ్చుకోండి. 449 00:44:19,248 --> 00:44:23,418 ఇంకా మీకన్నీ నేర్పిన, బాబా వాస్ ని గుర్తుతెచ్చుకోండి. 450 00:44:23,502 --> 00:44:28,924 మీరు ఈ కొత్త ప్రపంచాన్ని, చూపున్న వారికీ, అలాగే చూపులేనివారికి కూడా నిర్మించాలి. 451 00:44:29,800 --> 00:44:32,719 ఏ దేవుళ్ళూ లేకుండా! అర్థమైందా? 452 00:44:33,720 --> 00:44:36,181 -నేను చెప్పింది అర్థమైందా? -అర్థమైంది. 453 00:44:36,265 --> 00:44:37,558 -అర్థమైంది. -సరేమరి. 454 00:44:38,100 --> 00:44:39,351 ఓహ్, నా పిల్లలారా. 455 00:44:42,145 --> 00:44:44,982 నా కోసం పుస్తకాలను చదవండి. నా కోసం పుస్తకాలను చదవండి. 456 00:44:50,195 --> 00:44:51,947 కుర్రాడా. 457 00:44:55,450 --> 00:44:56,577 నా కర్ర. 458 00:45:00,414 --> 00:45:02,457 సరేమరి, వెళ్ళండి. ఇక వెళ్ళండి. 459 00:45:02,541 --> 00:45:06,253 చీకటి పడి మీకు కనబడక ముందే ఇప్పుడే బయలుదేరండి. 460 00:45:13,844 --> 00:45:15,888 అతను మనల్ని వదిలేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. 461 00:45:17,472 --> 00:45:19,474 నిజానికి వదిలేసింది మనమే. 462 00:45:28,942 --> 00:45:29,943 సరేమరి. 463 00:45:31,403 --> 00:45:33,488 మేము వస్తున్నాం, ఇద్దరమూ కూడా. 464 00:45:34,198 --> 00:45:35,866 హనీవా మరియు కొఫూన్. 465 00:45:48,795 --> 00:45:50,839 నువ్వూ నేనూ కలిసి, తమ్ముడూ. 466 00:45:54,343 --> 00:45:56,303 ఎప్పటికీ, చెల్లెలా. 467 00:45:58,222 --> 00:45:59,348 నువ్వు సిద్దమేనా? 468 00:46:00,641 --> 00:46:01,683 లేదు. 469 00:46:01,767 --> 00:46:03,018 నేను కూడా. 470 00:46:08,440 --> 00:46:09,525 వెళ్దాం పద. 471 00:46:23,664 --> 00:46:25,290 వారిని ఒంటరిగా పంపేశావు. 472 00:46:27,751 --> 00:46:30,337 ఒక్కోసారి, నీ పిల్లలను పరిరక్షించడానికి గల అత్యుత్తమ మార్గం ఏంటంటే, 473 00:46:30,420 --> 00:46:32,631 నువ్వు విరమించావని వాళ్ళకి తెలియజేయడమే. 474 00:46:34,007 --> 00:46:35,717 అది నీకు మాగ్రా చెప్పిందా? 475 00:46:37,219 --> 00:46:38,428 అవును, తనే చెప్పింది. 476 00:46:40,931 --> 00:46:42,975 నాకు ఉన్న ఏకైక నివాసమంటే, ఆ పిల్లలే. 477 00:46:44,393 --> 00:46:45,853 ఇంకెక్కడా నేను ఉండలేను. 478 00:46:47,020 --> 00:46:48,105 మరి నువ్వు? 479 00:46:50,816 --> 00:46:52,234 అయితే మనం దగ్గరగానే ఉంటామా? 480 00:46:52,901 --> 00:46:53,986 అవునుగా. 481 00:46:55,153 --> 00:46:56,822 మనం దగ్గరగానే ఉంటాం. 482 00:47:39,281 --> 00:47:40,407 ఇప్పుడు ఏంటి? 483 00:47:41,909 --> 00:47:42,993 నాకు తెలీదు. 484 00:47:43,911 --> 00:47:45,454 నాకేమీ కనబడటం లేదు. 485 00:48:54,231 --> 00:48:56,233 ఉపశీర్షికలనుఅనువదించినది: అలేఖ్య