1 00:00:10,260 --> 00:00:12,262 త్రివాంటియన్/గానైట్ సరిహద్దు 2 00:00:12,346 --> 00:00:16,015 గ్రీన్ హిల్ గ్యాప్ యుద్ధం జరిగిన 256 రోజుల తర్వాత 3 00:00:17,768 --> 00:00:19,353 కవచాలు ఎత్తండి! 4 00:00:44,419 --> 00:00:45,921 మీ స్థానాలలో నిలబడండి! 5 00:00:46,004 --> 00:00:47,005 నిలబడండి! 6 00:00:57,349 --> 00:00:58,976 కవచాలు ఎత్తి మీ స్థానాలకు రండి! 7 00:01:02,855 --> 00:01:05,399 వెనక్కి తగ్గకండి! వెనక్కి… 8 00:01:17,202 --> 00:01:19,580 నిలబడండి! వారిని రానివ్వకండి! 9 00:01:25,419 --> 00:01:27,045 వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 00:01:28,088 --> 00:01:29,423 వెనక్కి పదండి! 11 00:01:29,506 --> 00:01:31,383 పదండి! పదండి! 12 00:01:58,535 --> 00:01:59,703 వెళదాం పదండి! 13 00:03:38,093 --> 00:03:39,303 గేట్ వేయండి. 14 00:03:54,568 --> 00:03:57,654 ప్రసవవేదన ఎంత బాగుందో, మాగ్రా. 15 00:03:57,738 --> 00:03:59,156 నాకు దీని గురించి నువ్వు చెప్పనేలేదు. 16 00:04:00,240 --> 00:04:01,575 నువ్వు అన్నీ చాలా త్వరగా మర్చిపోతుంటావు. 17 00:04:02,492 --> 00:04:03,535 అబద్దాలు చెప్పకు. 18 00:04:04,745 --> 00:04:06,997 -రాణి. -ఏంటి? 19 00:04:07,080 --> 00:04:08,081 రాణి. 20 00:04:08,707 --> 00:04:09,833 ఏమైంది? 21 00:04:10,834 --> 00:04:14,755 ఇంకా ఉమ్మునీరు రావడం లేదు, రక్తం మాత్రమే వస్తుంది. చాలా రక్తం పోతుంది. 22 00:04:23,013 --> 00:04:24,973 -నెమ్మదించడానికి ప్రయత్నించు… -నువ్వు నెమ్మదించు. 23 00:04:27,226 --> 00:04:30,562 నా అంతరంగాలను బయటకు తోడుతున్నట్టు ఉంది. 24 00:04:31,063 --> 00:04:33,732 -తనను కాళ్లపై నిలబెట్టు. -వద్దు. 25 00:04:33,815 --> 00:04:34,983 -అవును. -వద్దు. 26 00:04:35,067 --> 00:04:36,109 నిలబడాలి, సిబెత్. 27 00:04:37,778 --> 00:04:38,779 లెగు. 28 00:04:41,198 --> 00:04:43,700 అంతే. అంతే. 29 00:04:44,868 --> 00:04:47,746 తాడు పట్టుకో. వంగో. 30 00:04:50,624 --> 00:04:51,625 అంతే. 31 00:04:53,293 --> 00:04:54,419 ఇంకొక దాన్ని కూడా పట్టుకో. 32 00:04:55,712 --> 00:04:56,713 అంతే. 33 00:05:03,011 --> 00:05:06,431 సిబెత్, నువ్వు బిడ్డని తోయడం ఆపాలి. 34 00:05:06,515 --> 00:05:07,558 నా వల్ల కాదు! 35 00:05:07,641 --> 00:05:10,561 తప్పదు. బిడ్డ ఇంకా ఉమ్మునీటి సంచిలోనే ఉంది. 36 00:05:10,644 --> 00:05:13,856 అది ఉమ్మునీటి సంచిలోనే పుట్టాలి లేదా ప్రాణం పోతుంది. 37 00:05:13,939 --> 00:05:16,942 అయితే సంచితోనే దాన్ని బయటకు తీయి! 38 00:05:17,526 --> 00:05:18,569 ఆగు. 39 00:05:22,239 --> 00:05:26,368 నేను దాన్ని పట్టుకున్నాను. ఇప్పుడు తొయ్యి. 40 00:05:27,828 --> 00:05:28,829 తొయ్యి! 41 00:05:34,168 --> 00:05:35,169 అంతే. 42 00:05:54,354 --> 00:05:55,355 హార్మొనీ. 43 00:05:56,732 --> 00:06:00,194 నాకు ఏడుపు వినిపించడం లేదు ఎందుకు? నా బిడ్డను ఏడ్పించు. 44 00:06:00,277 --> 00:06:01,403 మేము ప్రయత్నిస్తున్నాం. 45 00:06:30,474 --> 00:06:31,683 మగ బిడ్డ పుట్టాడు. 46 00:06:37,648 --> 00:06:40,817 ఉమ్మినీటి సంచితో పుట్టడం అంటే మంచి సూచిక, నీటి ద్వారా పవిత్రపరచబడ్డాడని అర్ధం. 47 00:06:44,029 --> 00:06:47,366 దైవ జ్వాల చూపు కలిగిన ఒక ప్రవక్తను నాకు ప్రసాదించింది. 48 00:06:49,868 --> 00:06:54,414 వీడిని వుల్ఫ్ అని పిలుద్దాం, మన తండ్రి పేరు. 49 00:07:01,672 --> 00:07:03,090 వాడికి ఆకలిగా ఉంది. 50 00:07:03,674 --> 00:07:05,509 మాగ్రా, వాడికి పాలు ఇవ్వనివ్వు. 51 00:07:07,219 --> 00:07:09,054 అందుకోసం ఇంకొక మనిషి సిద్ధంగా ఉంది. 52 00:07:14,977 --> 00:07:17,145 కన్న బిడ్డకు తన తల్లి పాలు త్రాగే భాగ్యాన్ని నిరాకరిస్తావా? 53 00:07:18,105 --> 00:07:19,606 వాదన వద్దు, సిబెత్. 54 00:07:28,448 --> 00:07:31,326 పురుడుపోయగల ఒక రాణివి. 55 00:07:32,661 --> 00:07:35,455 నువ్వు ఒకప్పుడు ఆల్కెన్నీలో సామాన్య స్త్రీవని మర్చిపోయా. 56 00:07:36,373 --> 00:07:38,000 నాకు ఇది ప్యారిస్ నేర్పించింది. 57 00:07:39,084 --> 00:07:42,421 అలాగే నువ్వు కరుణ చూపించమని అడిగినప్పుడు, ఆమె పేరు తలచుకుని అప్పుడు మాట్లాడితే నీకే మంచిది. 58 00:07:43,172 --> 00:07:45,966 ఆ అడవి మనిషి నా బిడ్డను తీసేసుకోవడానికి ప్రయత్నించింది. 59 00:07:46,049 --> 00:07:48,010 మరి ఇప్పుడు నేను నీ బిడ్డను తీసేసుకుంటున్నా. 60 00:07:48,635 --> 00:07:50,262 నన్ను కూడా చంపేస్తావా? 61 00:07:53,849 --> 00:07:55,058 కచ్చితంగా చెప్పలేను. 62 00:07:55,142 --> 00:07:56,935 -నా రాణి. -అప్పుడేనా? 63 00:07:57,019 --> 00:07:59,688 -మనకు ఎక్కువ సమయం లేదు. -అతను త్వరపడుతున్నాడని చెప్పాను. 64 00:07:59,771 --> 00:08:02,191 -ఇదే సరైన సమయం అన్నారు. -వెటకారంగా అన్నాను. 65 00:08:02,900 --> 00:08:07,029 మాగ్రా, ఇది భావోద్వేకపూరిత సందర్భం అని నాకు తెలుసు. 66 00:08:07,112 --> 00:08:08,113 అలాగే ఇప్పుడు… 67 00:08:08,197 --> 00:08:11,033 త్రివాంటియన్లకు త్వరలోనే బిడ్డ గురించి తెలుస్తుంది. 68 00:08:11,116 --> 00:08:12,492 రాయబారి ట్రొవేర్ వచ్చేసరికి, 69 00:08:12,576 --> 00:08:14,786 సిబెత్ ని తిరిగి త్రివాంటెస్ కు ఒక కానుకగా తీసుకెళ్లడానికి 70 00:08:14,870 --> 00:08:17,331 ఆమెను అప్పజెప్పుతామని ఎదురుచూస్తూ ఉంటుంది. 71 00:08:17,414 --> 00:08:18,749 నువ్వు ఈ నిబంధనలకు అంగీకరించావు. 72 00:08:18,832 --> 00:08:20,209 ఒకసారి గనుక అతనికి విషయం తెలిస్తే ఆపడం… 73 00:08:20,292 --> 00:08:23,921 -హార్లన్! -కానీ అతను చెప్పినదానిలో నిజం ఉంది. 74 00:08:25,506 --> 00:08:28,550 మాగ్రా, ఒకసారి ప్రసవించిన తర్వాత నువ్వు నీ అక్కని అప్పజెప్పుతానని త్రివాంటియన్లకు మాట ఇచ్చావు. 75 00:08:28,634 --> 00:08:30,761 మీలో ఎవరైనా బిడ్డను సాకుతారా? 76 00:08:32,429 --> 00:08:33,429 చేయలేరా? 77 00:08:34,347 --> 00:08:36,265 సరే, అయితే ప్రస్తుతం మీ ఇద్దరితో నాకు ఎలాంటి ఉపయోగం లేదు. 78 00:08:40,562 --> 00:08:42,231 ట్రొవేర్ తో ఏమని చెప్తావు? 79 00:08:43,524 --> 00:08:47,069 అడిగినందుకు చాలా సంతోషం. నాకు తెలీదు. 80 00:08:57,788 --> 00:09:01,083 ధన్యవాదాలు, మాగ్రా. ధన్యవాదాలు. 81 00:09:02,000 --> 00:09:04,044 పాలిచ్చే ఆవిడ వచ్చేవరకు మాత్రమే. 82 00:09:04,837 --> 00:09:06,338 తీసుకో, నాయనా. 83 00:09:09,758 --> 00:09:10,884 చిన్నారి వుల్ఫ్. 84 00:09:20,352 --> 00:09:21,562 నువ్వు నన్ను చూడగలుగుతున్నావా? 85 00:09:24,815 --> 00:09:26,066 మీ అమ్మను చూడగలుగుతున్నావా? 86 00:09:35,200 --> 00:09:40,581 దైవ జ్వాల నాకు ప్రసాదించిన వాగ్దాన పుత్రుడవు నువ్వు. 87 00:09:56,805 --> 00:10:00,475 నువ్వేం చింతించకు. వాళ్ళను నా నుండి నిన్ను తీసుకోనివ్వను. 88 00:11:29,273 --> 00:11:32,484 మూడు రోజులలో మన దళాలు మూడు సార్లు ఓడి పారిపోయి వచ్చారు. 89 00:11:33,068 --> 00:11:34,444 అసలు అక్కడ ఏం జరుగుతుంది? 90 00:11:34,945 --> 00:11:39,157 వాళ్ళు క్రూరులు. మనం త్రివాంటియన్ సైనికులం. 91 00:11:39,241 --> 00:11:41,869 గాలిని ఆసరాగా చేసుకొని కదులుతుంటారు. కాబట్టి మనకు ఏమీ వినిపించదు. 92 00:11:42,369 --> 00:11:44,204 ఇప్పుడు వాళ్లకు మన క్యాంపు ఎక్కడ ఉందో తెలుసు. 93 00:11:47,541 --> 00:11:49,459 వాళ్ళు లోనికి చొరబడటానికి ఏదొక మార్గాన్ని కనిపెడతారు. 94 00:11:50,419 --> 00:11:52,880 వారి సైనికుల సంఖ్య మన వారిని మించుతుంది. మనం ఇక్కడ ఎంతోసేపు నిలబడలేం. 95 00:11:54,006 --> 00:11:56,091 కెప్టెన్ రెన్, నువ్వు చెప్పేది నువ్వైనా వింటున్నావా? 96 00:11:57,134 --> 00:11:59,761 ఒక చిన్న తిరుగుబాటును అణచివేయడానికి మనల్ని ఇక్కడికి పంపారు, 97 00:11:59,845 --> 00:12:02,598 కానీ బదులుగా ఇది ఒక యుద్ధంగా మారుతుంది. 98 00:12:02,681 --> 00:12:05,309 -మీరు ఓడిపోతున్న యుద్ధం. -ఎవరది? 99 00:12:06,143 --> 00:12:09,146 మూడవ బేస్ యొక్క లెఫ్టీనెంట్ కమాండర్ టోర్మాడా, 100 00:12:09,730 --> 00:12:13,567 కాలం చేసిన జనరల్ ఇడో వాస్ క్రింద ఉండేవాడిని. 101 00:12:13,650 --> 00:12:18,113 టోర్మాడా, నేను నీ గురించి విన్నాను. ఇడో యొక్క ప్రధాన శాస్త్రవేత్తవి. 102 00:12:18,197 --> 00:12:20,657 జనరల్ కన్నుమూసిన తర్వాత కూడా 103 00:12:20,741 --> 00:12:22,159 మూడవ బేస్ పని చేస్తుందని నేను అనుకోలేదు. 104 00:12:22,701 --> 00:12:24,995 రెన్, నువ్వు మూడవ బేస్ లో ఉండేదానివి, అవునా? 105 00:12:25,078 --> 00:12:26,830 -అవును, సర్. -కెప్టెన్ రెన్. 106 00:12:29,708 --> 00:12:31,293 ఇడో నీ గురించి చాలా గొప్పగా చెప్పేవాడు. 107 00:12:36,048 --> 00:12:37,174 ధన్యవాదాలు, సర్. 108 00:12:37,883 --> 00:12:40,093 నువ్వు గ్రీన్ హిల్ గ్యాప్ యుద్ధంలో ప్రాణాలతో బయటపడ్డావు. 109 00:12:42,596 --> 00:12:45,682 ఆ ఓటమికి బాధ్యత వహించడానికి ఇడో లేకపోవడంతో, 110 00:12:45,766 --> 00:12:49,102 మీ అందరిపై భరించలేనంత నింద మోపబడిందని నేను ఊహించగలను. 111 00:12:49,937 --> 00:12:53,649 అందుకే మిమ్మల్ని ఇక్కడికి బహిష్కరించారని అనుకుంటున్నా. 112 00:12:53,732 --> 00:12:56,860 క్షమించండి, లెఫ్టినెంట్ కమాండర్, 113 00:12:56,944 --> 00:13:00,822 కానీ సైన్యాధిపతులు ఒక శాస్త్రవేత్తని రణభూమికి ఎందుకు పంపినట్టు? 114 00:13:00,906 --> 00:13:03,784 ఎందుకంటే సైన్స్ మిమ్మల్ని కాపాడబోతుంది, కల్నల్. 115 00:13:04,826 --> 00:13:07,329 సైన్స్ ఈ యుద్ధంలో మీకు విజయాన్ని ఇవ్వనుంది. 116 00:13:07,412 --> 00:13:08,622 రెన్ సరిగ్గానే చెప్పింది. 117 00:13:08,705 --> 00:13:11,375 గానైట్లు ఉదయానికి లేదా అంతకు ముందే ఇక్కడికి వస్తారు. 118 00:13:11,458 --> 00:13:12,501 అయితే, నా మిత్రులారా, 119 00:13:12,584 --> 00:13:15,337 మీరు ఉదయం నాటికి ఈ యుద్దాన్ని గెలిచి ఉంటారు. 120 00:13:15,420 --> 00:13:17,381 ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి లెఫ్టినెంట్ కమాండర్, 121 00:13:17,464 --> 00:13:19,716 కానీ మనం ఎవరితో పోరాడుతున్నామో మీకు అస్సలు తెలీదు. 122 00:13:19,800 --> 00:13:21,760 నేను కూడా ఇలా అంటున్నా అని ఏమీ అనుకోవద్దు, 123 00:13:23,136 --> 00:13:26,139 కానీ నేను నాతో ఏం తెచ్చానో మీకు అస్సలు తెలీదు. 124 00:13:28,600 --> 00:13:32,271 హుష్, బుజ్జి కొండ ఏమీ మాట్లాడకు 125 00:13:32,980 --> 00:13:36,733 అమ్మ నీకు ఒక కోయిలను తెచ్చివ్వనుంది 126 00:13:37,276 --> 00:13:41,363 ఆ కోయిల గనుక నీకు పాట పాడకపోతే 127 00:13:41,864 --> 00:13:45,576 అమ్మ నీకు ఆడుకోవడానికి ఒక బెల్ కొని ఇస్తుంది 128 00:13:46,368 --> 00:13:50,247 ఒకవేళ ఆ బెల్ పాడైపోతే 129 00:13:50,747 --> 00:13:54,251 అమ్మ నీకొక మేక పిల్లని కొని ఇస్తుంది 130 00:13:54,751 --> 00:13:58,422 ఆ మేక పిల్ల నీతో ఆడకపోతే 131 00:13:58,922 --> 00:14:02,634 అమ్మ నీకోసం చందమామని తీసుకొస్తుంది 132 00:14:06,430 --> 00:14:07,431 కొఫూన్… 133 00:14:10,809 --> 00:14:11,894 ఇలా రా. 134 00:14:14,021 --> 00:14:15,147 నీ కొడుకుని ఎత్తుకో. 135 00:14:18,817 --> 00:14:20,027 ఎలా ఎత్తుకోవాలో నాకు తెలీడం లేదు. 136 00:14:22,571 --> 00:14:25,866 ప్రతీ తండ్రికి తన బిడ్డని ఎలా ఎత్తుకోవాలో తెలుస్తుంది. 137 00:14:32,164 --> 00:14:33,665 వాడు నా కొడుకు కాదు. 138 00:15:03,278 --> 00:15:04,279 కొఫూన్? 139 00:15:07,074 --> 00:15:08,075 ఇక్కడ ఉన్నాను. 140 00:15:10,285 --> 00:15:11,578 నేను ఎక్కడ ఉన్నానో నీకెలా తెలిసింది? 141 00:15:12,162 --> 00:15:14,414 మీ అమ్మ రాణి అయ్యుండొచ్చు, కానీ ఈ నగరం ఇంకా నాదే. 142 00:15:15,207 --> 00:15:19,670 రాడి. నాకు ఒకటి, అలాగే నా యువ మిత్రునికి ఇంకొకటి ఇవ్వు, ప్లీజ్. 143 00:15:26,134 --> 00:15:27,928 -చాలా థాంక్స్. -థాంక్స్. 144 00:15:34,893 --> 00:15:37,646 ఒకటి చెప్పనా, బాబా వాస్ గనుక ఇక్కడ ఉంటే… 145 00:15:37,729 --> 00:15:38,856 ఇక్కడ లేడు. 146 00:15:39,773 --> 00:15:42,025 అవును, నాకు తెలుసు. థాంక్స్, నేను ఏమంటున్నాను అంటే… 147 00:15:42,109 --> 00:15:43,151 ఏమీ అనొద్దు. 148 00:15:44,528 --> 00:15:45,654 నువ్వు అతని భార్యని పెళ్లి చేసుకొని ఉండొచ్చు, 149 00:15:45,737 --> 00:15:47,614 అయినంత మాత్రానా నువ్వు నాకు తండ్రివి కావు. 150 00:15:48,198 --> 00:15:49,825 నాకు ఇప్పటికే అలాంటివారు ఎక్కువైపోయారు. 151 00:15:51,577 --> 00:15:53,328 నాకు ఎన్నటికీ, ఎవరికీ తండ్రి కావాలనే ఉద్దేశం లేదని 152 00:15:53,412 --> 00:15:56,874 ఈపాటికే నా గురించి అర్ధం చేసుకొని ఉంటావు అనుకుంటున్నా. 153 00:15:56,957 --> 00:15:57,958 సరేలే. 154 00:16:01,545 --> 00:16:04,214 మా నాన్న మీ తాత క్రింద పని చేసాడు. 155 00:16:06,049 --> 00:16:07,217 ఆయన మంచి వ్యక్తి. 156 00:16:08,719 --> 00:16:13,640 చాలా దయకలిగిన, న్యాయవంతుడు, మృదుస్వభావి. 157 00:16:13,724 --> 00:16:15,184 ఆయన నవ్వు చాలా గట్టిగా ఉండేది. 158 00:16:18,395 --> 00:16:20,272 మా అమ్మ విషయం వేరే అనుకో. 159 00:16:21,481 --> 00:16:26,737 ఆమె తెలివైన, కఠినమైన, జిత్తులమారి మహిళ. 160 00:16:28,197 --> 00:16:31,575 నా చిన్నప్పుడు ఆమె నన్ను ఎత్తుకొని ఉంటుందని నేను అనుకోను. 161 00:16:32,326 --> 00:16:35,370 సహజంగానే, మా నాన్న ఒక బలహీనుడనే ఆలోచనతో ఆయనను ఆమె ఛీదరించుకునేది. 162 00:16:36,538 --> 00:16:39,875 కొన్నిసార్లు నేను కూడా ఆయన్ని అలాగే చూసేవాడిని. 163 00:16:42,336 --> 00:16:48,133 కానీ వయసు పెరిగేకొద్దీ, ఆయన బలహీనుడు కాదని నాకు అర్ధం అయింది. 164 00:16:49,635 --> 00:16:55,015 ఆయన మెత్తని కత్తి లాంటి వాడు. 165 00:16:55,933 --> 00:16:56,975 అంతే. 166 00:16:58,644 --> 00:17:02,147 అంటే, ఆయనలా అంత కాలం మా అమ్మని భరించడం మాములు విషయం కాదు. అమ్మబాబోయ్. చెస్. 167 00:17:04,775 --> 00:17:10,614 ఏదైతేనేం, కానీ నా ఉద్దేశంలో అయితే నాకు మా అమ్మ పోలికల కంటే 168 00:17:10,696 --> 00:17:12,782 నాన్న పోలికలే ఎక్కువగా అబ్బాయి అనుకుంటున్నాను. 169 00:17:14,242 --> 00:17:15,743 నువ్వు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు? 170 00:17:17,037 --> 00:17:21,250 ఎందుకంటే, నాకంటూ సొంత బిడ్డ లేనివాడిగా, నూతనంగా తండ్రి అయిన వాడికి నేను ఎలాంటి సలహా ఇవ్వలేను. 171 00:17:21,750 --> 00:17:27,339 కానీ మదనపడుతున్న ఒక కొడుకుకి మాత్రం, సలహా ఇవ్వడంలో నేనొక నిపుణుడిని. 172 00:17:27,422 --> 00:17:29,925 అయితే, సలహా వినడానికి సిద్ధంగా ఉన్నావా? 173 00:17:32,678 --> 00:17:36,098 నువ్వు ఒక దిక్కుమాలిన హంతకురాలితో బిడ్డను కన్నావు. 174 00:17:36,181 --> 00:17:38,600 -ఓహ్, ఛ. హార్లన్. -ఆ విషయం నీకు తెలుసు. ఆమె ఒక వెర్రిది. 175 00:17:38,684 --> 00:17:42,938 కానీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, తండ్రి అవసరం ఉన్న కొడుకు ఎవరైనా ఉన్నారంటే, 176 00:17:44,106 --> 00:17:45,691 అది నువ్వు కాదు, సన్నాసి వెధవ. 177 00:17:47,067 --> 00:17:49,862 అది వాడు. నీకు పుట్టిన కొడుకు. అర్థమైందా? 178 00:17:51,446 --> 00:17:52,447 నీ కొడుకు. 179 00:17:59,580 --> 00:18:01,540 ఆ మందు ఏమాత్రం నిషా ఎక్కలేదు, కదా? 180 00:18:03,375 --> 00:18:05,586 లేదు. ఏం ఎక్కలేదు. 181 00:18:05,669 --> 00:18:07,171 సరే, ఇక ఏదీ పని చేయకపోతే, 182 00:18:07,254 --> 00:18:10,090 ఈ చెత్త సరుకు వదిలి, కాస్త మంచి వైన్ ఏమైనా త్రాగుదాం. 183 00:18:11,049 --> 00:18:13,760 అంతటి నాణ్యత ఉన్నది ఇక్కడ దొరుకుతుందని నేను అనుకోను. 184 00:18:13,844 --> 00:18:17,890 నోరు మూసుకో. రాడి, మంచి సరుకు పోయి, ప్లీజ్. 185 00:18:17,973 --> 00:18:19,141 అలాగే, హార్లన్. 186 00:18:21,435 --> 00:18:25,063 -ఏంటి? -చెప్పా కదా. ఇది ఇంకా నా నగరమే. 187 00:19:36,176 --> 00:19:37,261 నడుస్తూనే ఉండు. 188 00:19:52,776 --> 00:19:54,278 అయూరా, విషయం చెప్పు. 189 00:20:01,201 --> 00:20:02,619 రెండు వందల మంది, 190 00:20:02,703 --> 00:20:04,705 ఉత్తరం మరియు దక్షిణం నుండి వస్తున్నారు. 191 00:20:04,788 --> 00:20:06,164 అద్భుతం. 192 00:20:06,248 --> 00:20:07,749 దాడికి సిద్ధం అవ్వండి. 193 00:20:09,710 --> 00:20:11,461 ఆ అవసరం ఉండదు. 194 00:20:14,631 --> 00:20:15,674 ఓలొమన్. 195 00:20:16,550 --> 00:20:17,593 ముప్పై గుండె చప్పుళ్ళు. 196 00:20:25,434 --> 00:20:26,727 వాళ్ళు దాదాపుగా మన పైకి వచ్చేసారు. 197 00:20:26,810 --> 00:20:28,520 ఎవరూ కదలకండి! 198 00:20:33,901 --> 00:20:35,485 దాడికి సిద్ధంగా ఉండండి! 199 00:20:35,569 --> 00:20:38,530 -వద్దు! ఎక్కడి వారు అక్కడే ఉండండి! -ఏంటి? 200 00:20:45,537 --> 00:20:48,498 మనం పోరాడకపోతే చనిపోతాం! 201 00:20:48,582 --> 00:20:50,083 మీ చావు ఇవాళ కాదు. 202 00:20:52,711 --> 00:20:54,004 పది గుండె చప్పుళ్ళు. 203 00:20:54,087 --> 00:20:57,299 మిత్రులారా, సిద్ధంకండి. 204 00:20:57,382 --> 00:20:58,926 దేనికి? 205 00:21:45,681 --> 00:21:47,766 ఇది మనం అనుకునేంత అసాధారణమైన విషయం కాదు. 206 00:21:47,850 --> 00:21:50,269 -చాలా థాంక్స్. -నేను క్లీవ్స్ పర్వతాల దిగువన పెరిగాను, 207 00:21:50,352 --> 00:21:55,899 అక్కడ చాలా మంది బామ్మలు వారి మనవళ్లకు పిన్నులు కూడా. 208 00:21:55,983 --> 00:22:02,739 ఈ విషయంలో అయితే, అమ్మే వాడికి అత్త కూడా, ఇది కొంచెం క్లిష్టమైన బంధమే. 209 00:22:03,407 --> 00:22:07,286 ఎందుకంటే తండ్రి తల్లికి మేనల్లుడి వరుస, 210 00:22:07,369 --> 00:22:12,040 కాబట్టి కొఫూన్ ఇంకా వాడి కొడుకు ఇద్దరూ ఒకరికి ఒకరు కజిన్స్ అవుతారు. 211 00:22:12,124 --> 00:22:15,669 కాదు, ఆగు. అనుకుంటా. లేదు, అదే కరెక్టు. 212 00:22:15,752 --> 00:22:19,882 దాన్ని బట్టి నువ్వు ఆ బిడ్డకు పెద్దమ్మవి అలాగే వదినవి కూడా అవుతావు. 213 00:22:21,717 --> 00:22:22,926 మనం చర్చించుకోవడానికే ఇది ఇంత కష్టంగా ఉందనుకుంటే, 214 00:22:23,010 --> 00:22:25,470 ఇదే విషయాన్ని ఆ బిడ్డకు వివరించడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించు. 215 00:22:26,847 --> 00:22:28,807 ఆ పిల్లాడు నన్ను ఏమని పిలుస్తాడా అని అనిపిస్తుంది. 216 00:22:28,891 --> 00:22:31,685 చార్లెట్ అత్త. అనడానికి బాగుంది. 217 00:22:31,768 --> 00:22:33,937 -చార్-చార్ అత్త. -ఇవి ఎప్పుడు వచ్చాయి? 218 00:22:34,021 --> 00:22:35,105 ఇవాళ ఉదయమే. 219 00:23:07,638 --> 00:23:10,682 చూపుకు ఉన్న శక్తిని, అలాగే అది తీసుకురాగల 220 00:23:11,350 --> 00:23:13,936 అద్భుతమైన టెక్నాలజీని ఇడో అర్ధం చేసుకున్నాడు. 221 00:23:15,771 --> 00:23:19,566 దురదృష్టవశాత్తు అతను పయాపై దాడికి వెళ్ళడానికి ముందే 222 00:23:19,650 --> 00:23:21,318 మేము ఈ మందుగొండు సామాగ్రిని తయారుచేయలేకపోయాం. 223 00:23:23,111 --> 00:23:26,657 అదే గనుక జరిగి ఉంటే, నా స్నేహితుడు ఇంకా బ్రతికే ఉండేవాడు. 224 00:23:28,534 --> 00:23:32,996 నేను తనను నిరాశపరిచాను, ఆ బాధ నన్ను రోజూ వెంటాడుతుంది. 225 00:23:35,332 --> 00:23:39,294 కాబట్టి, అతను నాకోసం ఏర్పరిచిన పనిని నేను పూర్తి చేసి తీరుతాను. 226 00:23:41,088 --> 00:23:44,258 చూపు విషయమై ఇడో ఆలోచనను ట్రయాంగిల్ వారు ససేమిరా ఒప్పుకోలేదు. 227 00:23:44,925 --> 00:23:48,011 ఆ ట్రయాంగిల్. వాళ్లకు సుఖాలు ఎక్కువైపోయాయి. 228 00:23:48,762 --> 00:23:51,014 గ్రీన్ హిల్ గ్యాప్ లో వారి వైఫల్యాన్ని బట్టి 229 00:23:51,098 --> 00:23:53,725 వారిని అనుసరిస్తే మనం ఎంతటి ప్రమాదంలో పడనున్నామో చెప్పవచ్చు. 230 00:23:55,018 --> 00:24:01,191 ఇడో పదే పదే తన గోడును వెళ్లగక్కినా వాళ్ళు బేఖాతరు చేసారు. 231 00:24:01,900 --> 00:24:04,194 అలాంటిది నీ మాట వారు వింటారని అనుకుంటున్నావా? 232 00:24:05,696 --> 00:24:11,952 అంటే, ఇప్పుడు మన గోడును మరింత గట్టిగా వినిపించగలం కదా. 233 00:24:15,372 --> 00:24:18,125 నువ్వు ఇడోకి ఎంతో విశ్వాసంగా పనిచేసావు. 234 00:24:22,171 --> 00:24:27,634 అలాగే అతను కూడా నిన్ను కాపాడాడు. నిన్ను అలాగే నీకున్న వరాన్ని. 235 00:24:29,761 --> 00:24:30,762 అవును. 236 00:24:32,181 --> 00:24:33,849 ఇడో నా నుండి ఏమీ దాచలేదు. 237 00:24:35,017 --> 00:24:36,685 కాబట్టి నువ్వు కూడా ఏమీ దాచవనే నమ్ముతున్నాను. 238 00:24:38,520 --> 00:24:41,690 మనం కలిస్తే ఇడో ప్రారంభించిన పనిని పూర్తి చేయగలం. 239 00:24:42,941 --> 00:24:45,736 నేను నిన్ను ఆ విషయంలో నమ్మవచ్చా, రెన్? 240 00:24:49,114 --> 00:24:50,282 తప్పకుండా, సర్. 241 00:24:52,409 --> 00:24:57,289 కానీ నాకు… నాకు మీరు ఏం చేయమంటున్నారో తెలియడం లేదు. 242 00:24:57,789 --> 00:25:01,418 నేను నిన్ను ఏమీ అడగడం లేదు. ఆదేశిస్తున్నాను. 243 00:25:03,045 --> 00:25:05,964 ఇక ఈ గానైట్లతో మన యుద్ధం ముగిసినట్టే. 244 00:25:06,048 --> 00:25:08,258 ఇప్పుడిక మనం మన దృష్టిని తూర్పు వైపు మళ్లించాలి. 245 00:25:09,927 --> 00:25:10,928 పయా. 246 00:25:11,637 --> 00:25:15,140 సారవంతమైన భూములు, అంతులేని బొగ్గు, 247 00:25:15,224 --> 00:25:20,145 అలాగే చెప్పాల్సిన పనే లేదు, మనం ప్రేమించిన ఇడోని చంపిన వాడు కూడా అక్కడే ఉన్నాడు. 248 00:25:21,605 --> 00:25:24,942 నా గూఢచారులు బాబా వాస్ ని అనుసరిస్తున్నారని చెప్తే నువ్వు తప్పక సంతోషిస్తావు. 249 00:25:25,901 --> 00:25:29,738 అతిత్వరలోనే ఇడో కొరకు మనం ప్రతీకారం తీర్చుకోనున్నాం. 250 00:25:30,239 --> 00:25:35,536 అయితే బాబా వాస్ ని చంపి, పయాని జయించిన తర్వాత ఈ ఘర్షణ ముగుస్తుందా? 251 00:25:36,453 --> 00:25:39,039 లేదు. అప్పుడే అసలు ఘర్షణ మొదలవుతుంది. 252 00:25:40,666 --> 00:25:45,587 పయా తర్వాత ఏముంది? ఆ తర్వాత ఏం వస్తుంది? 253 00:25:47,381 --> 00:25:52,052 ప్రతీ వైపున జయించడానికి అనేక నగరాలు ఉన్నాయని సమాచారం అందింది. 254 00:25:52,678 --> 00:25:55,389 ఇప్పుడిక మనల్ని తిరుగేలేని శక్తిగా నిలబెట్టగలది చేజిక్కింది. 255 00:25:55,472 --> 00:25:59,810 ఈ ప్రపంచంలోనే మునుపెన్నడూ లేని ఒక మహా సామ్రాజ్యాన్ని మనం నిర్మిస్తాం. 256 00:26:05,858 --> 00:26:06,859 మాడక్స్. 257 00:26:08,694 --> 00:26:11,154 దురదృష్టవశాత్తు, నేనిక వెళ్ళాలి. 258 00:26:12,281 --> 00:26:15,742 ఇతను లెఫ్టినెంట్ మాడక్స్, నా నమ్మిన బంటు. 259 00:26:17,244 --> 00:26:20,706 పెద్దగా మాట్లాడడు, అతనికున్న మంచి గుణాలలో అది ఒకటి. 260 00:26:21,623 --> 00:26:26,253 ఇక్కడ నీ పనిని పూర్తి చేయడానికి నీకు సహాయం చేసి నిన్ను తిరిగి త్రివాంటెస్ కి నడిపిస్తాడు. 261 00:26:28,547 --> 00:26:30,465 నేను నా దళంతో ఉండాలి. 262 00:26:30,549 --> 00:26:34,428 నువ్వు అంతకంటే చాలా విలువైన దానివని మనిద్దరికీ తెలుసు. 263 00:26:36,180 --> 00:26:39,683 సరే, నేను చాలా దూరం ప్రయాణించాలి. 264 00:26:54,072 --> 00:26:56,491 చెప్తున్నా కదా, నేను ఏం చూశానో నాకు తెలుసు. 265 00:26:57,159 --> 00:27:01,413 బహుశా చుసావేమో. లేక అది నిజం కావాలని నువ్వు అనుకొని ఉంటావు. 266 00:27:02,289 --> 00:27:04,041 ఎంతో కాలంగా చూపు ఉన్న ఒక్క వ్యక్తిని కూడా కనుగొనలేకపోయాము, 267 00:27:04,124 --> 00:27:06,293 ఇప్పుడు ఒకేసారి ఎక్కడపడితే అక్కడ ఉంటారని అనుకోలేం. 268 00:27:06,376 --> 00:27:08,462 బహుశా మనం అనుకున్నదానికంటే చాలా మంది ఉన్నారేమో. 269 00:27:09,046 --> 00:27:11,006 మంత్రసానుల్లా సజీవదహనం కాకూడదని భయటపడలేదేమో. 270 00:27:11,089 --> 00:27:12,341 ఇంకా అదే భయంతో దాక్కుంటున్నారేమో. 271 00:27:13,091 --> 00:27:16,970 సిబెత్ లాగ చిన్న ఆదేశంతో జనం మనసుని మార్చగలం అని ఆశించకూడదు. 272 00:27:17,054 --> 00:27:20,724 చూపు లేని వారు చూపు ఉన్న వారిని అంగీకరించడానికి ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది. 273 00:27:22,476 --> 00:27:25,437 గ్రీన్ హిల్ గ్యాప్ లో పయాన్ రాజ్యం గెలవడానికి చూపే సహాయం చేసింది. 274 00:27:25,521 --> 00:27:28,065 -దాగి ఉన్న తెగల ప్రజలు అసలు కారణం. -సహాయం చేసింది అన్నాను. 275 00:27:28,148 --> 00:27:32,402 ఇలా చూడు, ఈ రో వనో ఎవడైనా కానీ, నువ్వు వాడిని పట్టించుకోకూడదు. 276 00:27:33,278 --> 00:27:36,573 తనకున్న చూపును ఎవరికీ తెలియకుండా ఉంచాలనుకుంటే, అలాగే ఉండనివ్వు. ఆ అవకాశం నాకుంటే ఎంతో బాగుండేది. 277 00:27:37,241 --> 00:27:38,867 నీ గుర్తింపును నువ్వు ఎలా కాదనుకోగలవు? 278 00:27:38,951 --> 00:27:41,119 ఎందుకంటే చూపు మాత్రమే నా జీవితాన్ని నిర్వచించలేదు. 279 00:27:41,203 --> 00:27:42,704 నిర్వచించగలదు. 280 00:27:42,788 --> 00:27:44,498 నువ్వు జెర్లామరెల్ లాగ మాట్లాడుతున్నావు. 281 00:27:44,581 --> 00:27:47,251 -అలాగే నువ్వు ఒక వెధవలాగ మాట్లాడుతున్నావు. -హనీవా, ఇక చాలు. 282 00:27:47,334 --> 00:27:50,003 మనలాంటి ప్రజలు ధైర్యంగా నివసించడానికి ఒక ప్రపంచాన్ని రూపించే 283 00:27:50,087 --> 00:27:52,464 శక్తి మనకు చివరికి లభించింది. 284 00:27:55,175 --> 00:27:56,385 నీకది వద్దా? 285 00:27:58,846 --> 00:28:00,222 నీకోసం కాకపోతే, కనీసం నీ కొడుకు కోసం? 286 00:28:17,906 --> 00:28:19,533 వాడు తన కొడుకుని అసలు చూడనైనా చూసాడా? 287 00:28:20,409 --> 00:28:21,827 మనిద్దరికీ బాగా తెలుసు కదా, 288 00:28:21,910 --> 00:28:24,162 వాడు ఈ విధంగా తండ్రి కావాలని అనుకొని ఉండడు. 289 00:28:24,746 --> 00:28:26,331 తనకు ఇంకాస్త సమయం కావాలి. 290 00:28:31,336 --> 00:28:33,005 నాన్న అయితే వాడి కొడుకు విషయంలో వాడు బాధ్యత తీసుకొనేలా 291 00:28:33,088 --> 00:28:34,089 చేసేవారు. 292 00:28:34,173 --> 00:28:36,175 కానీ ఆయన ఇక్కడ లేరు కదా? 293 00:28:36,258 --> 00:28:37,384 నాకు తెలిసినంత వరకు, 294 00:28:37,467 --> 00:28:39,344 తండ్రిగా ఎలా ఉండాలని చెప్పే స్థితిలో బాబా లేడు. 295 00:28:39,428 --> 00:28:43,640 -తను త్వరలోనే తిరిగి వస్తాడు. వస్తాడని నీకు తెలుసు. -నాకు తెలిసి ఆయన మనల్ని వదిలేసి పోయాడు. 296 00:28:44,808 --> 00:28:45,809 నన్ను వదిలేసి పోయాడు. 297 00:28:47,269 --> 00:28:48,729 ముందు ఆయన్ని వదిలింది నువ్వు. 298 00:28:51,940 --> 00:28:55,027 నువ్వు ఆయనకు, మా అందరికీ అబద్దం చెప్పావు. 299 00:28:55,110 --> 00:28:59,364 అయినా ఉన్నట్టుండి అన్నిటినీ ఆయన అంగీకరించాలని అనుకుంటున్నావా? నీ కొత్త భవనాన్ని? 300 00:29:02,117 --> 00:29:03,118 నీ కొత్త భర్తను? 301 00:29:03,202 --> 00:29:05,329 నేను ఏం చేసినా, మీకోసమే చేశా. 302 00:29:06,872 --> 00:29:07,873 అయ్యుండొచ్చు. 303 00:29:10,918 --> 00:29:15,422 కానీ నువ్వు చేసిన పని ఆయన్ని కృంగదీసింది. వదిలి వెళ్లినందుకు ఆయన్ని నేను నిందించను. 304 00:29:21,053 --> 00:29:22,054 హనీవా! 305 00:30:55,480 --> 00:30:56,815 ఏమైంది, బుజ్జి? 306 00:30:58,192 --> 00:30:59,526 నువ్వొక తోడేలువా? 307 00:31:04,198 --> 00:31:06,992 సరే. నేను నీకు సహాయం చేస్తాను. 308 00:31:09,745 --> 00:31:11,330 దయచేసి నన్ను కరవకు. 309 00:31:12,206 --> 00:31:14,166 నిన్ను చంపాలని నేను అనుకోవడం లేదు. 310 00:31:21,089 --> 00:31:24,635 మంచి కుక్క. ఓహ్, అవును. మంచి కుక్క. 311 00:31:25,844 --> 00:31:27,513 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 312 00:31:30,766 --> 00:31:31,767 ఏంటది? 313 00:31:32,851 --> 00:31:36,104 ఓహ్, అవును. ఏంటిది? 314 00:31:37,648 --> 00:31:38,774 ఏం పర్లేదు. 315 00:31:38,857 --> 00:31:40,901 సరే. నేను దీన్ని తీసేస్తాను. 316 00:31:41,693 --> 00:31:43,570 ఏం పర్లేదు. ఏం పర్లేదు. 317 00:31:44,071 --> 00:31:45,113 అవును, మంచి కుక్క. 318 00:31:46,698 --> 00:31:49,243 అవును. సరే. 319 00:31:52,412 --> 00:31:55,457 నా దగ్గర కొంచెం ఆహరం ఉంది. 320 00:31:55,541 --> 00:31:57,626 సరే. అలాగే. 321 00:31:59,002 --> 00:32:00,379 చాలా రుచిగా ఉంది. 322 00:32:01,004 --> 00:32:02,589 అవును, వాసన చూడు. 323 00:32:03,590 --> 00:32:05,801 అవును, ఇక్కడే ఉంది. ఇంకా ఉంది. 324 00:32:06,802 --> 00:32:08,929 ఇదుగో! లేదు. సరే. సరే, సరే. 325 00:32:09,012 --> 00:32:12,057 నేను ఇప్పుడు నిన్ను పోనిస్తా. దయచేసి నా మీదకు రాకు, లేదా నిన్ను చంపేయాల్సి వస్తుంది. 326 00:32:12,558 --> 00:32:13,559 వెళ్ళు. 327 00:33:30,594 --> 00:33:31,762 దొబ్బెయ్! 328 00:33:33,472 --> 00:33:34,848 సహాయం చేస్తావా లేదా? 329 00:33:38,352 --> 00:33:40,103 నిన్ను ఎవరూ ఎప్పటికీ వెనుక నుండి దెబ్బతీయలేరు. 330 00:33:40,771 --> 00:33:42,439 నీలా అంత శబ్దం చేస్తే అంతే. 331 00:33:43,857 --> 00:33:45,651 ఏదొక రోజు ఆశ్చర్యకరంగా దెబ్బ తీస్తా. 332 00:33:46,235 --> 00:33:47,611 అప్పుడు నిజంగానే ఆశ్చర్యపోతా. 333 00:33:48,529 --> 00:33:49,947 కదలకు. 334 00:33:50,030 --> 00:33:51,907 కానివ్వు, వెంటనే కానివ్వు. పని పూర్తి చెయ్. 335 00:33:51,990 --> 00:33:56,119 సిద్ధంగా ఉన్నావా? సంప్రదాయం సంప్రదాయమే, మిత్రమా. 336 00:33:56,870 --> 00:33:59,540 నువ్వు ఓడిపోయావు. 337 00:34:04,044 --> 00:34:07,923 -వాసన కొడుతోంది! -ఈపాటికి నీకు అలవాటు అయ్యుంటుందని అనుకున్నా. 338 00:34:11,009 --> 00:34:13,387 నీకు కూడా స్వస్తి జరిగే టైమ్ వస్తుంది, బాబా. 339 00:34:15,848 --> 00:34:17,933 -పూర్తయిందా? -ప్రస్తుతానికి అయింది. 340 00:34:18,766 --> 00:34:21,061 మంచిది. ఇక పైకి వెళదాం పదా. 341 00:34:21,562 --> 00:34:23,146 నీ వల్ల మన వేట పారిపోయింది. 342 00:34:23,230 --> 00:34:24,940 ఇప్పుడు ఇంకొక జింకని వెతికి పట్టుకోవాలి. 343 00:34:26,525 --> 00:34:27,860 మన దగ్గర కావాల్సినంత మాంసం ఉంది. 344 00:34:28,652 --> 00:34:31,737 నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి మనం తినగలదానికంటే 345 00:34:31,822 --> 00:34:33,407 ఎన్నో జింకలను చంపేసావు. 346 00:34:33,489 --> 00:34:35,492 అసలు నువ్వు దేనికోసం వేటాడుతున్నావో తెలియడం లేదు. 347 00:34:38,620 --> 00:34:41,039 పదా. నీ కోపపు ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి. 348 00:34:43,000 --> 00:34:44,333 పైకి వెళదాం పదా. 349 00:34:45,210 --> 00:34:49,380 నీ బుర్రలో ఉన్న చెత్త ఆలోచనలను వదులుకో. నా ముఖం మీద ఉన్న చెత్తని కూడా శుభ్రం చేసుకోవాలి. 350 00:34:53,135 --> 00:34:55,429 వాంతి చేసేసుకో. అంతే. 351 00:35:15,449 --> 00:35:16,450 నీకు ఇంకా కావాలా? 352 00:35:20,412 --> 00:35:21,538 లేదు, వద్దు. 353 00:35:23,415 --> 00:35:25,209 పెద్ద ప్రశ్నలు ఏమైనా ఉంటే సమాధానం దొరుకుతుంది. 354 00:35:26,710 --> 00:35:27,711 ఎలాంటి ప్రశ్నలు? 355 00:35:30,088 --> 00:35:31,632 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నటువంటివి. 356 00:35:35,093 --> 00:35:36,762 ఎందుకంటే నాకంటూ ఒక ప్రదేశం లేదు కాబట్టి. 357 00:35:36,845 --> 00:35:37,971 ఆ విషయం నీకు తెలుసు. 358 00:35:41,350 --> 00:35:44,353 నువ్వు నీ జీవితమంతా ఇతరులకు సేవలు చేస్తూ పరిగెత్తుతూ, దూకుతూ, కోస్తూ, 359 00:35:44,436 --> 00:35:48,357 జనాన్ని చంపుతూనే గడిపావు. 360 00:35:51,443 --> 00:35:53,028 ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి అయిపోయావు, సోదరా. 361 00:35:53,612 --> 00:35:55,739 ఇక ఇతరుల సేవలో జీవితాన్ని గడిపే సమయం వచ్చింది. 362 00:36:09,211 --> 00:36:14,883 నేను నా జీవితం అంతా నా కుటుంబాన్ని కాపాడుకుంటూ గడిపాను… 363 00:36:16,885 --> 00:36:19,263 కానీ నేను అన్ని సమయాల్లో వారిని మరింత ప్రమాదం వైపే నడిపించా. 364 00:36:20,806 --> 00:36:26,645 నేను ప్రేమించిన అందరిపై చావు 365 00:36:26,728 --> 00:36:30,941 యుద్ధం పడేలా శాపాన్ని అంటించానేమో అనిపిస్తుంది. 366 00:36:33,151 --> 00:36:35,237 ఇడో విషయంలో కూడా నిన్ను నువ్వే నిందించుకుంటున్నావు. 367 00:36:38,866 --> 00:36:40,325 నేను తన గురించి చెప్పలేదే. 368 00:36:40,409 --> 00:36:41,702 చాలా సార్లు చెప్పావు, 369 00:36:43,036 --> 00:36:44,288 అడపాదడపా మాట వదులుతూనే ఉంటావు. 370 00:36:44,371 --> 00:36:46,540 -మనం ఈ విషయం ముందే మాట్లాడుకున్నాం. -అవును, 371 00:36:46,623 --> 00:36:51,587 ఆ విషయం నీపై ఇంకెలాంటి ప్రభావం చూపనంత వరకు మనం ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం. 372 00:36:56,258 --> 00:36:58,010 బాబా, నాకు మీ నాన్న గుర్తున్నాడు. 373 00:37:00,345 --> 00:37:02,806 మహా క్రూరమైన దుష్టుడు. 374 00:37:03,932 --> 00:37:07,394 నువ్వు ఇలా తయ్యారయ్యావు, అలాగే ఇడో కూడా అలా తయారయ్యాడు. 375 00:37:09,730 --> 00:37:14,109 కానీ ఒక సమయం వచ్చేసరికి, అది మీ నాన్న తప్పు అని మనం అనలేం, 376 00:37:14,902 --> 00:37:16,528 అలాగని అది మీ తప్పు కూడా కాదు. 377 00:37:19,531 --> 00:37:22,159 మనం ఏమవుతాం అనే విషయం మనపైనే ఆధారపడి ఉంటుంది. 378 00:37:24,870 --> 00:37:26,788 కొండలు ఎక్కడం నీకు ఏం నేర్పినా నేర్పకపోయినా, 379 00:37:26,872 --> 00:37:29,333 మనం ఎంత అల్పులం అనే విషయాన్ని తప్పక నేర్పుతుంది. 380 00:37:30,375 --> 00:37:32,753 నీతో సహా, బాబా వాస్, 381 00:37:32,836 --> 00:37:36,548 ఈ మహా ప్రపంచంలో, దేనికీ లెక్కకురాని ఒక పురుగుతో సమానం. 382 00:37:40,219 --> 00:37:41,512 నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. 383 00:37:42,387 --> 00:37:43,764 గంజాయి వల్ల అనుకుంట. 384 00:38:12,793 --> 00:38:14,419 లేదు! వెళ్ళిపో! 385 00:38:15,754 --> 00:38:17,798 షూ! పో! నన్ను వదిలేయ్. 386 00:38:17,881 --> 00:38:20,342 -నీ కుక్కకి ఆకలిగా ఉంది. -అది నా కుక్క కాదు. 387 00:38:20,425 --> 00:38:21,677 ఆ విషయం దానికి చెప్పు. 388 00:38:21,760 --> 00:38:22,761 లేదు! 389 00:38:23,804 --> 00:38:24,847 దాని పేరు ఏంటి? 390 00:38:25,931 --> 00:38:27,391 నాకు తెలిసి దాని పేరు "నో" అనుకుంటా. 391 00:38:27,474 --> 00:38:29,810 "నో"? అది పేరు కాదు. 392 00:38:29,893 --> 00:38:31,895 అలా అంటేనే అది మాట వింటుంది, కదా? 393 00:38:31,979 --> 00:38:33,063 వెళ్ళిపో! 394 00:38:33,856 --> 00:38:35,482 పాపం కుక్క చాలా తికమకపడనుంది. 395 00:38:36,733 --> 00:38:38,318 దానికి కనీసం మంచి పేరు పెడితే బాగుంటుంది. 396 00:38:39,611 --> 00:38:40,737 నువ్వే పేరు పెట్టు. 397 00:38:40,821 --> 00:38:41,989 అది నా కుక్క కాదు. 398 00:38:42,489 --> 00:38:43,657 నా బంగారం! 399 00:38:44,908 --> 00:38:47,077 -రేంజర్! -బాబా ఒక కుక్కని తెచ్చుకున్నాడు. 400 00:38:47,619 --> 00:38:48,871 నాకు కుక్క ఏమీ లేదు! 401 00:38:53,917 --> 00:38:56,044 రేంజర్, నువ్వు మాంసం తెస్తాను అన్నావు. 402 00:38:56,128 --> 00:38:57,504 వాడికి చేపలు కావాలి అన్నాడు. 403 00:38:57,588 --> 00:38:59,715 అవును, అది నీ మెదడుకు మంచిది. 404 00:38:59,798 --> 00:39:02,384 నువ్వు తాగే ఆ గంజాయి వల్ల నీకున్న కాస్త బుర్ర కూడా పోయింది. 405 00:39:02,968 --> 00:39:04,386 బుర్రలో ఉన్న చెడు మాత్రమే పోయింది. 406 00:39:05,262 --> 00:39:06,889 బాబా నాకు తెలివి పెరిగిందని అనుకుంటున్నాడు, కదా, బాబా? 407 00:39:07,472 --> 00:39:08,974 నువ్వు నోరు మూసుకుంటే మంచిది. 408 00:39:09,558 --> 00:39:11,435 -నువ్వు ఇక వెళ్తే మంచిది. -లు. 409 00:39:11,518 --> 00:39:12,853 నన్ను "లు" అనకు! 410 00:39:12,936 --> 00:39:15,856 ఇతను కొన్ని రోజులు మాత్రమే ఉంటాడు అన్నావు, కానీ ఇప్పటికి నెలలు అవుతుంది. 411 00:39:15,939 --> 00:39:16,940 మొదలైంది. 412 00:39:17,024 --> 00:39:20,569 ఇతను ఎందరో ఆల్కెన్నీ ప్రజలను పొట్టనపెట్టుకున్నాడు, నా ప్రజలను. 413 00:39:21,445 --> 00:39:24,615 అది చేసింది మాంత్రికాంతకులు, బాబా కాదు. 414 00:39:24,698 --> 00:39:27,451 కానీ అతని మాట వినమని నువ్వు రోజూ నాకు చెప్తూనే ఉన్నావు. 415 00:39:31,872 --> 00:39:33,165 నేను నీకేం చెప్పడం లేదు. 416 00:39:46,303 --> 00:39:50,557 నీకు అసలు ఆల్కెన్నీ వారు గుర్తున్నారా, బాబా వాస్? 417 00:39:57,731 --> 00:39:58,857 రోజూ గుర్తుచేసుకుంటా. 418 00:40:21,421 --> 00:40:22,422 పారాహుషార్! 419 00:40:22,506 --> 00:40:23,924 లయన్. 420 00:40:27,469 --> 00:40:30,681 నువ్వు ఒంటరిగా ఇక్కడ ప్రయాణం చేయకూడదు. ఇక్కడ తోడేళ్ళు తిరుగుతుంటాయి. 421 00:40:31,181 --> 00:40:32,683 నువ్వు కూడా ఇక్కడ ఉండకూడదు. 422 00:40:33,308 --> 00:40:35,394 తోడేళ్ళు తప్ప ఇంకెవరూ ఇక్కడ ఉండకూడదు. 423 00:40:35,477 --> 00:40:36,770 ఇది మా ఇల్లు. 424 00:40:36,854 --> 00:40:38,438 అతిథి అన్నాకా కాస్త గౌరవం చూపించాలి, 425 00:40:38,522 --> 00:40:41,525 ముఖ్యంగా నీకులాగా ఆహ్వానం లేకుండా వచ్చినవారు. 426 00:40:41,608 --> 00:40:43,402 ఈ విచారకరమైన దాగుచోట ఉండడం నీకు ఎంత ఇష్టం లేదో 427 00:40:43,485 --> 00:40:45,195 -నాకు కూడా అంతే ఇష్టం లేదు. -బో లయన్… 428 00:40:45,279 --> 00:40:46,280 మనం దాక్కోవడం లేదు. 429 00:40:46,864 --> 00:40:49,825 ఒకప్పటిలా మాది పలానా పౌరసత్వం అని చూపించుకోవడం ఇష్టం లేక ఇలా ఉంటున్నాం. 430 00:40:51,493 --> 00:40:54,705 దేశాలు, రాజ్యాలు, తెగలు, ఇవన్నీ ఒక్కటే. 431 00:40:55,372 --> 00:40:59,251 నీ ఆత్మలో ఒక భాగాన్ని శాశ్వతంగా వారికి అమ్ముకోకుండా నువ్వు వాటిలో 432 00:40:59,334 --> 00:41:00,502 పాలిభాగస్తుడవు కాలేవు. 433 00:41:00,586 --> 00:41:03,213 నువ్వు ఇదంతా అస్సలు నమ్మవు, అవునా, బాబా? 434 00:41:04,631 --> 00:41:06,508 నువ్వు చాలా గొప్ప నాయకుడివి. 435 00:41:08,802 --> 00:41:11,930 ఒక తెగను మట్టికరిపించడానికి జనాన్ని నడిపించగల గొప్ప నాయకుడిని. 436 00:41:12,014 --> 00:41:13,140 అది నీ తప్పు కాదు. 437 00:41:13,223 --> 00:41:16,226 కాదా? మరి ఎవరిది? 438 00:41:21,773 --> 00:41:22,774 బాబా? 439 00:41:24,943 --> 00:41:26,320 ఇంటికి పో, బో లయన్. 440 00:41:28,280 --> 00:41:29,281 ప్లీజ్. 441 00:41:33,452 --> 00:41:36,205 అలాగే. నువ్వు వెళ్ళినప్పుడు వెళ్తా. 442 00:41:41,502 --> 00:41:44,296 నువ్వు అతన్ని అనుసరించడం మానేస్తా అని మీ అమ్మకు మాట ఇచ్చావు అనుకున్నాను. 443 00:41:44,379 --> 00:41:46,924 ఆమె వెళ్లొద్దు అంది. నేను మాట ఇవ్వలేదు. 444 00:41:47,674 --> 00:41:50,219 ఇప్పుడు మీ అమ్మే రాణి అయి, నువ్వు ఆమె మాట వినకపోతే, 445 00:41:50,302 --> 00:41:51,929 రాజద్రోహం క్రింద నిన్ను ఉరి తీయగలరా? 446 00:41:52,721 --> 00:41:54,223 ఆమెకు తెలియకపోతే సాధ్యం కాదు. 447 00:41:54,306 --> 00:41:56,058 రాజద్రోహం అయినా కాకున్నా, ఇది చేయడం మంచిది కాదు. 448 00:41:56,141 --> 00:41:58,602 మీ అందరిలాగే, నేను కూడా దైవ జ్వాల పేరున 449 00:41:58,685 --> 00:42:00,437 రాచరికానికి ఊడిగం చేశాను. 450 00:42:02,022 --> 00:42:03,273 వారికోసం పోరాడాను. 451 00:42:04,816 --> 00:42:06,109 నా రక్తం కార్చాను. 452 00:42:06,944 --> 00:42:08,612 కానీ వాళ్ళు నాకు ద్రోహం చేసారు. 453 00:42:10,656 --> 00:42:12,449 మనల్నందరినీ మోసం చేసారు. 454 00:42:15,118 --> 00:42:17,246 కేన్ మహారాణి మనల్ని ముంచింది. 455 00:42:20,249 --> 00:42:23,627 టమాక్టీ జూన్ మనల్ని మోసం చేసాడు, 456 00:42:24,878 --> 00:42:28,382 ఇప్పడు రాణిగా చలామణి అవుతున్న మాగ్రా కూడా, దేవుని మాటలను తన స్వలాభానికి 457 00:42:28,882 --> 00:42:32,302 వక్రీకరించి మోసం చేస్తుంది. 458 00:42:34,221 --> 00:42:35,848 రాణి దిగిపోవాలి. 459 00:42:36,974 --> 00:42:38,600 కాబట్టి ఇప్పుడు బాధ్యత మనపై పడింది, 460 00:42:39,768 --> 00:42:41,228 పయాన్ ప్రజలుగా, 461 00:42:42,896 --> 00:42:45,232 దేవుని నిజమైన వాక్యాన్ని పాటిస్తూ, 462 00:42:46,483 --> 00:42:49,069 మన అధికారులకు బుద్ధి వచ్చేవరకు, 463 00:42:50,696 --> 00:42:53,198 మన ముందు ఉన్న దుష్టత్వాన్ని పారద్రోలాలి. 464 00:42:55,284 --> 00:42:56,410 షైలో, 465 00:42:57,786 --> 00:42:59,037 ఆ మంత్రగాడిని తీసుకురండి. 466 00:42:59,621 --> 00:43:02,165 వద్దు, దయచేసి నన్ను వెళ్లనివ్వండి! మీరు తప్పు చేస్తున్నారు. 467 00:43:02,249 --> 00:43:04,585 నేను మాంత్రికుడిని కాను! నాకు చూపు లేదు! 468 00:43:04,668 --> 00:43:06,086 -అబద్దీకుడు! -కానివ్వండి. 469 00:43:06,170 --> 00:43:08,755 నువ్వు చూడగలవని మాకు తెలుసు. నువ్వు చేతబడులు చేస్తుంటావు. 470 00:43:08,839 --> 00:43:11,800 నేను చూడలేను. ఒట్టేసి చెప్తున్నాను. నేను మాంత్రికుడిని కాదు! 471 00:43:16,221 --> 00:43:18,265 -వాళ్ళు ఇలా చేయకూడదు. -వాళ్ళు చాలా మంది ఉన్నారు. 472 00:43:18,348 --> 00:43:21,059 -నువ్వు చూపున్న వారిని కాపాడతానని ప్రమాణం చేసావు. -ఇప్పుడు అదే చేస్తున్నాను. పదా వెళ్దాం. 473 00:43:21,143 --> 00:43:22,811 -మరి అతని సంగతి ఏంటి? -మనం వెంటనే వెళ్ళాలి! 474 00:43:22,895 --> 00:43:25,606 ఆపండి! ఆపండి! 475 00:43:28,025 --> 00:43:29,484 అతను అమాయకుడు. 476 00:43:30,652 --> 00:43:32,321 అలా అని నీ దగ్గర ఏం ఆధారం ఉంది? 477 00:43:36,617 --> 00:43:38,285 ఎందుకంటే నేను అతని కళ్ళను చూడగలను. 478 00:43:38,869 --> 00:43:40,078 అయ్యో, ఛ. 479 00:43:40,162 --> 00:43:42,915 నేను యువరాణి హనీవాని, మహారాణి మాగ్రా కూతురిని, 480 00:43:42,998 --> 00:43:45,584 ఆమె పేరున అతన్ని వదిలేయమని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. 481 00:43:48,170 --> 00:43:49,796 మహారాణి మాగ్రాకి పుట్టిన మంత్రగత్తె కూతురు. 482 00:43:51,089 --> 00:43:54,051 మేము ఇక్కడ మంత్రగత్తెలను కాల్చడానికే కానీ, 483 00:43:54,134 --> 00:43:55,844 వారి ఆజ్ఞలు పాటించడానికి నిలబడలేదని అర్ధం కావడం లేదా. 484 00:43:56,970 --> 00:43:57,971 ఆమెను పట్టుకోండి! 485 00:43:58,055 --> 00:43:59,306 నేను పట్టుకున్నాను! 486 00:43:59,389 --> 00:44:00,432 ప్లీజ్, ప్లీజ్. 487 00:44:01,683 --> 00:44:03,227 కళ్ళు! ఆమె కళ్ళను తీసేయ్! 488 00:44:03,310 --> 00:44:06,396 పవిత్ర దైవ జ్వాల పేరున, మరియు పరిశుద్ధమైన అన్నిటి పేరునా, 489 00:44:06,480 --> 00:44:08,607 నీ అనైతిక ఆత్మను మేము 490 00:44:08,690 --> 00:44:10,442 తిరిగి సైతానుకే అప్పజెప్పుతున్నాం! 491 00:44:25,582 --> 00:44:27,167 వెనక్కి ఉండు! హనీవా! 492 00:44:28,502 --> 00:44:29,586 నేను ఇక్కడే ఉన్నాను. 493 00:44:31,129 --> 00:44:32,256 నేను మిమ్మల్ని చూస్తున్నాను! 494 00:44:32,923 --> 00:44:34,258 మీ అందరినీ చూస్తున్నాను! 495 00:44:35,551 --> 00:44:36,885 ఇందుకు మీరు అనుభవిస్తారు! 496 00:44:38,345 --> 00:44:42,099 సరిహద్దు నుండి రిపోర్టులు వస్తున్నాయి. నేను సైన్యాన్ని అప్రమత్తం చేస్తాను. 497 00:44:42,182 --> 00:44:44,977 మా ఆందోళనలకు కారణం ఉంది, కెప్టెన్ గోసెట్. 498 00:44:45,561 --> 00:44:48,021 త్రివాంటియన్లకు సిబెత్ తలను ఇచ్చినంత మాత్రానా 499 00:44:48,105 --> 00:44:49,231 శాంతి నెలకొంటుందని ఎలా చెప్పడం? 500 00:44:49,314 --> 00:44:52,067 మనం త్రివాంటెస్ గురించి మాట్లాడుతున్నాం. 501 00:44:52,150 --> 00:44:53,277 వాళ్ళు తమ మాట మీరరు అని చెప్పడానికి 502 00:44:53,360 --> 00:44:55,279 మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు. 503 00:44:55,362 --> 00:44:56,947 కచ్చితంగా మాట మీరతారని చెప్పలేరు కదా. 504 00:44:57,030 --> 00:45:00,284 లేను, కానీ మనం ఇప్పుడు కాదంటే ఏమవుతుందో నాకు బాగా తెలుసు. 505 00:45:00,367 --> 00:45:03,537 నేను గత కొన్ని నెలలుగా రాయబారి ట్రొవేర్ తో బేరసారాలు జరిపాను, 506 00:45:03,620 --> 00:45:05,289 ఆమె నిజం చెప్తుందని నా నమ్మకం. 507 00:45:05,372 --> 00:45:06,456 ఒకవేళ మీరు అనుకున్నది తప్పు అయితే? 508 00:45:06,540 --> 00:45:09,334 మేము హార్లన్ ప్రభువు ఆజ్ఞ ప్రకారం ప్రజల సంఖ్యను పెంచాం. 509 00:45:09,418 --> 00:45:11,920 ఒకవేళ ఒప్పందం విఫలం అయితే, యుద్దానికి సిద్ధం కాగలం. 510 00:45:12,838 --> 00:45:16,133 రాయబారి ట్రొవేర్ త్వరలోనే వస్తుందని నాకు సమాచారం అందింది. 511 00:45:16,633 --> 00:45:17,801 ఎంత త్వరలో? 512 00:45:17,885 --> 00:45:20,596 ఆమె బృందం రేపు దైవ జ్వాల వెలిసే సమయానికి మన నగర ప్రధాన ద్వారం వద్ద ఉంటుంది. 513 00:45:20,679 --> 00:45:22,472 -ఏంటి? -వాళ్ళు చాలా త్వరగా కదులుతున్నారు. 514 00:45:23,015 --> 00:45:24,183 బహుశా ఇది మంచి సంకేతమే ఏమో. 515 00:45:24,266 --> 00:45:26,935 మనకు త్రివాంటియన్ల నుండి మాత్రమే ప్రమాదం పొంచి లేదు. 516 00:45:27,019 --> 00:45:29,771 ఇప్పుడు రోజూ మన నగరాల్లో మతఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. 517 00:45:31,523 --> 00:45:33,942 చూపు ఉన్నవారిపై గత రాణి చేసిన వ్యాఖ్యలకు మహారాణి గారు మద్దతు పలకడం కారణంగా 518 00:45:34,026 --> 00:45:35,277 మన ప్రజలలో విభజన ఏర్పడింది. 519 00:45:35,360 --> 00:45:38,864 ఈ సామాన్యుడు చెప్తున్నది మనం ఎందుకు వింటున్నాం? వాడు అసలు ఇక్కడ ఉండనేకూడదు. 520 00:45:38,947 --> 00:45:42,492 వాడు కూడా, మీలాగే, మహారాణిగారికే బద్ధుడై ఉన్నాడు. 521 00:45:42,576 --> 00:45:45,537 అలాగయితే త్రివాంటియన్లను కూడా కౌన్సిల్ లో చేర్చవచ్చు కదా? 522 00:45:45,621 --> 00:45:49,124 పెడితే కొందరు మదమెక్కిన పయాన్ల కంటే వాళ్ళు బాగానే పని చేస్తారు. 523 00:45:49,208 --> 00:45:50,209 హార్లన్ ప్రభువా… 524 00:45:50,292 --> 00:45:51,460 మర్చిపోకండి, 525 00:45:51,960 --> 00:45:55,964 ఎలాంటి అవకాశం లేదనుకున్న సమయంలో మహారాణి మాగ్రా ఒక్కత్తే వెళ్లి ఈ శాంతి ఒప్పందాన్ని కుదిర్చింది. 526 00:45:56,048 --> 00:46:00,385 అలాగే, తొమ్మిది నెలల క్రితం జరిగింది నేను మీకు మళ్ళీ గుర్తుచేయాల్సిన పని లేదు, 527 00:46:00,469 --> 00:46:04,348 లేడి బెనిక్, మన ప్రజలు యుద్ధభూమిలో ప్రాణాలు విడుస్తుండగా, 528 00:46:04,431 --> 00:46:07,601 కేవలం మహారాణి సమయస్ఫూర్తి మరియు చాకచక్యం కారణంగా 529 00:46:07,684 --> 00:46:09,978 మనం నేడు బానిసత్వంలోకి పోకుండా బయటపడ్డాం. 530 00:46:10,729 --> 00:46:14,399 మనకు త్రివాంటియన్లతో సమస్య ఉంది. రాజ్య ప్రజలతో కూడా సమస్య ఉంది. 531 00:46:14,942 --> 00:46:17,778 సిబెత్ చావు మొదటి సమస్యను పరిష్కరిస్తుంది. 532 00:46:18,612 --> 00:46:20,113 రెండవ సమస్యను నేను పరిష్కరిస్తా. 533 00:46:20,197 --> 00:46:23,116 సిబెత్ ని చంపడం మీరు అనుకున్నదానికన్నా ప్రమాదకరం. 534 00:46:23,909 --> 00:46:26,453 కొందరు ప్రజలు ఇంకా ఆమె ప్రవచనాన్ని నమ్ముతున్నారు. 535 00:46:26,537 --> 00:46:28,872 ఆమె చావు తనని అమరవీరురాలిగా చూపి జనం తిరుగుబాటు చేసేలా చేయగలదు. 536 00:46:29,373 --> 00:46:31,959 మహారాణి మాగ్రా, మీ అభిప్రాయం ఏమిటి? 537 00:46:32,584 --> 00:46:35,546 చర్చ ప్రారంభమైనప్పటి నుండి మీరు ఏమీ మాట్లాడలేదు. 538 00:46:40,551 --> 00:46:42,135 నా సొంత అక్కని ఎలా చంపితే మంచిదని 539 00:46:42,219 --> 00:46:44,763 ఆలోచించడానికి సమయం పడుతున్నందుకు క్షమించండి. 540 00:46:45,931 --> 00:46:48,934 మనం బిడ్డ పుడుతున్నప్పుడు ఎదురైన సమస్య కారణంగా సిబెత్ చనిపోయిందని 541 00:46:49,017 --> 00:46:50,227 జనాన్ని నమ్మిస్తే చాలు. 542 00:46:50,310 --> 00:46:54,231 కానీ ప్రసవం తరువాత ఆమె బ్రతికి ఉందని కొందరికి తెలుసు. నిజం ఎలాగైనా బయటకు వస్తుంది. 543 00:46:54,314 --> 00:46:56,191 ప్రభత్వం యొక్క మెదటి నియమం తెలుసుకో, టోరెన్స్. 544 00:46:56,275 --> 00:46:59,319 ఒక అబద్దాన్ని పదే పదే చెపితే, జనానికి అదే నిజం అవుతుంది. 545 00:47:00,737 --> 00:47:04,950 త్రివాంటెస్ వారితో మనం శాంతిని ఏర్పరచుకోకపోతే, జనం ఏమనుకున్నా ప్రయోజనం లేదు. 546 00:47:05,033 --> 00:47:06,243 అందరూ చావాల్సిందే. 547 00:47:08,829 --> 00:47:10,956 ఈ యుద్ధం నా అక్క వల్లే మొదలైంది. 548 00:47:11,832 --> 00:47:15,961 ఆమె చావే దానికి ముగింపు పలకగలదు అంటే, అప్పుడు ఆలోచించక తప్పదు. 549 00:47:16,044 --> 00:47:18,297 -మహారాణి… -నేను ఆలోచిస్తాను అన్నాను. 550 00:47:18,380 --> 00:47:19,882 ఇక ఈ సమావేశం ముగిసినట్టే. 551 00:47:44,323 --> 00:47:45,949 నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. 552 00:47:48,744 --> 00:47:51,246 త్రివాంటియన్లు బహిరంగ తీర్పు కావాలి అంటున్నారు. 553 00:47:52,956 --> 00:47:56,710 ఎందుకో తెలీదు. ట్రయాంగిల్ వారు ఒక విధమైన విజయాన్ని ప్రకటించాలని అనుకుంటున్నారు. 554 00:47:58,795 --> 00:48:00,130 వాళ్లకు ఆమె ప్రాణాలతో కావాలా? 555 00:48:02,132 --> 00:48:03,133 అవును. 556 00:48:04,593 --> 00:48:06,678 వాళ్ళు ఆమెను ఏళ్ల పాటు చిత్ర హింసలు పెడతారు. 557 00:48:07,846 --> 00:48:09,056 కావచ్చు. 558 00:48:11,558 --> 00:48:14,728 ప్రత్యామ్న్యాయ ఉపాయాన్ని పరిశీలించు. అది తప్ప మనకు వేరే దారి ఉండకపోవచ్చు. 559 00:48:22,736 --> 00:48:24,071 నిన్ను చూస్తుంటే 560 00:48:24,988 --> 00:48:28,408 నిర్ణయ భారాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఏదైనా అద్భుతం జరిగితే బాగుండని ఎదురుచూస్తున్నట్టు ఉంది. 561 00:48:30,536 --> 00:48:35,832 బహుశా నిన్ను ఈ పరిస్థితిలో పెట్టిందే ఆ అద్బుతమేమో. 562 00:48:41,171 --> 00:48:43,841 ఈ విషయమై యుద్దానికి వెళ్లడం చాలా పెద్ద తప్పు అవుతుంది. 563 00:48:46,009 --> 00:48:48,387 ఏం చేయాలో నీ మనసుకు తెలుసని నేను అనుకుంటున్నాను. 564 00:48:50,180 --> 00:48:51,181 అవును. 565 00:48:54,518 --> 00:48:56,562 నువ్వు ఇందులో నేరుగా తలదూర్చాల్సిన పని లేదు. 566 00:48:56,645 --> 00:48:58,814 ట్రొవేర్ ని, అలాగే అప్పగింపుని నేను చూసుకుంటా. 567 00:49:00,524 --> 00:49:02,109 పని పూర్తి అయిన తర్వాత నీకు చెప్తాను. 568 00:49:04,862 --> 00:49:07,447 నేను ఆమెలా ఉండకూడదని ఎంతో కష్టపడ్డా. 569 00:49:17,666 --> 00:49:19,126 నువ్వు ఆమెలాంటి వ్యక్తివి కాదు. 570 00:50:06,340 --> 00:50:08,675 రాయబారి ట్రొవేర్, తిరిగి స్వాగతం. 571 00:50:09,176 --> 00:50:10,302 హార్లన్ ప్రభువు. 572 00:50:11,053 --> 00:50:14,056 మీ జనానికి ఎక్కడ మీ క్యాంప్ ని ఏర్పరచాలో ఈ పాటికి తెలిసే ఉంటుంది. 573 00:50:14,139 --> 00:50:16,683 కాస్త శుభ్రపడి, విశ్రాంతి తీసుకోండి. 574 00:50:16,767 --> 00:50:19,645 మహారాణి ఎక్కడ? ఆమె వచ్చి నన్ను పలకరించదా? 575 00:50:19,728 --> 00:50:24,107 ఈ విషయం యొక్క బాధ్యతలను మహారాణి గారు నాకు అప్పగించారు. 576 00:50:25,484 --> 00:50:26,568 అలాగా? 577 00:50:28,570 --> 00:50:29,696 అవును, అలాగే. 578 00:50:30,572 --> 00:50:31,615 ఎంత ఆసక్తిగా ఉంది. 579 00:50:32,783 --> 00:50:34,201 సమస్య పరిష్కరించబడిందా? 580 00:50:35,327 --> 00:50:36,995 రాత్రి భోజనం సమయానికి పరిష్కరించబడుతుంది. 581 00:50:37,079 --> 00:50:41,375 సరే, అయితే, మన భోజనం కొరకు ఎదురుచూస్తూ ఉంటా. 582 00:50:43,418 --> 00:50:44,545 నేను కూడా. 583 00:50:49,007 --> 00:50:50,175 క్యాంప్ సెట్ చేయండి! 584 00:50:52,886 --> 00:50:53,887 పదండి! 585 00:51:17,661 --> 00:51:20,038 -సిద్ధంగా ఉన్నావా? -వెర్రి ప్రశ్న. 586 00:51:20,122 --> 00:51:22,040 సరే. అయితే పదా. 587 00:51:23,750 --> 00:51:25,460 అక్కడే ఆగు, టమాక్టీ జూన్. 588 00:51:25,544 --> 00:51:28,589 అవును, టమాక్టీ జూన్. వెనక్కి తగ్గు. 589 00:51:29,464 --> 00:51:31,258 ఆ ఛండాలపు మనిషి గురించి చింతించకు. 590 00:51:31,341 --> 00:51:35,512 అతను భయం పుట్టించేలా మాట్లాడొచ్చు, కానీ అంతరంగంలో ఏమీ లేని వాడు. బలహీనమైన మనిషి. 591 00:51:35,596 --> 00:51:37,014 నోరు మూసుకుంటే మంచిది, సిబెత్. 592 00:51:37,097 --> 00:51:39,349 మాగ్రా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 593 00:51:39,433 --> 00:51:42,728 ఏమో నాకు కూడా తెలీదు, కానీ ఇవాళ మనం ఆమెను అప్పజెప్పడం లేదు. 594 00:51:43,437 --> 00:51:45,689 నీ రాజ్యం క్షేమం కంటే ఆమెను కాపాడటమే నీకు ముఖ్యమా? 595 00:51:45,772 --> 00:51:46,773 ఇది తన రాజ్యం కాదు. 596 00:51:46,857 --> 00:51:49,359 శాంతి కోసం తన సొంత అక్కని అప్పజెప్పుకునే రాణి 597 00:51:49,443 --> 00:51:51,653 బలహీనురాలిగా కనిపిస్తుంది. 598 00:51:51,737 --> 00:51:53,363 అది ఇలాంటి అక్క కాదు. 599 00:51:54,156 --> 00:51:55,782 పాపం టమాక్టీ జూన్. 600 00:51:56,408 --> 00:51:59,286 అతను తన ప్రతీకారాన్ని మరొక రోజుకు వాయిదా వేయాల్సి వస్తుంది. 601 00:52:01,955 --> 00:52:03,248 ఆమెను తీసుకెళ్లనివ్వు. 602 00:52:04,708 --> 00:52:05,709 ప్లీజ్. 603 00:52:07,544 --> 00:52:08,587 నన్ను క్షమించు. 604 00:52:12,216 --> 00:52:14,843 మాగ్రా, నీ జనరల్ బాధపడుతున్నాడేమో అనిపిస్తుంది. 605 00:52:24,353 --> 00:52:25,938 నేను తప్పు చేస్తున్నానని అనుకుంటున్నావా? 606 00:52:26,438 --> 00:52:27,564 నీకు నా గురించి తెలుసు. 607 00:52:28,065 --> 00:52:31,151 చివరి నిమిషాలలో జరిగే ఇలాంటి భారీ మార్పులు నాకు కొత్తేమి కాదు. 608 00:52:32,903 --> 00:52:33,904 చాలా థాంక్స్. 609 00:52:35,113 --> 00:52:36,281 అయినప్పటికీ, 610 00:52:37,324 --> 00:52:40,494 ఇప్పుడు మనకు ఒక సంకటమైన స్థితి ఎదురైందని చెప్పగలను. 611 00:52:43,163 --> 00:52:47,543 ఆ రాయబారికి నువ్వు అంటే కొంచెం ఎక్కువే ఇష్టం అని నాకు తెలుసు. 612 00:52:54,675 --> 00:52:56,426 అవును, చూస్తుంటే… 613 00:52:57,553 --> 00:53:00,097 నా అందచందాలతో నేను ఆమెను కొంచెం ఆకర్షించినట్టు ఉన్నాను. 614 00:53:03,183 --> 00:53:06,228 సరే, అయితే నువ్వు ఇప్పుడు ఆమెను మరింత బలంగా ఆకర్షించాలి. 615 00:54:01,200 --> 00:54:03,493 నువ్వు ఇక్కడికి వచ్చి రెండు రోజులు అవుతుంది. నువ్వు వెళ్ళడానికి వేరొక చోటే లేదా? 616 00:54:03,577 --> 00:54:04,661 నీకు లేదా? 617 00:54:07,331 --> 00:54:09,124 ఇప్పుడు నా అవసరం ఎవరికీ లేదు. 618 00:54:09,750 --> 00:54:11,585 నీ కుటుంబానికి నీ అవసరం నిరంతరం ఉంటుంది, బాబా. 619 00:54:12,252 --> 00:54:13,712 ఆ విషయం మనం మాట్లాడుకోకూడదు, లయన్. 620 00:54:13,795 --> 00:54:15,672 అయితే వేరొక విషయం మాట్లాడుకుందాం. 621 00:54:15,756 --> 00:54:18,842 గ్రీన్ హిల్ గ్యాప్ లో సహాయం కోసం నువ్వు అడిగినప్పుడు తెగల ప్రజలు సహాయం చేసారు. 622 00:54:18,926 --> 00:54:21,011 ఇప్పుడు వేటాడటం, వెంటాడటం ఎలాగో నేర్పడానికి 623 00:54:21,094 --> 00:54:22,930 తల్లితండ్రులు లేక వారి పిల్లలు ఎందరో మిగిలిపోయారు. 624 00:54:23,013 --> 00:54:24,014 వారిని నడిపించగలవారు ఎవరూ లేరు. 625 00:54:25,474 --> 00:54:28,352 ఇంకొకరి పిల్లలను పెంచుతూ నేను ఇప్పటికే చాలా ఏళ్ళు గడిపాను. 626 00:54:29,019 --> 00:54:30,145 బాబా? 627 00:54:30,771 --> 00:54:32,773 బో లయన్, ఇంటికి పో! 628 00:54:38,862 --> 00:54:39,988 ఏంటది? 629 00:54:45,744 --> 00:54:46,828 మనం ఒంటరిగా లేము. 630 00:54:46,912 --> 00:54:48,372 బాబా? 631 00:54:49,998 --> 00:54:51,166 బాబా వాస్? 632 00:54:53,001 --> 00:54:54,169 నీకు అతను తెలుసా? 633 00:54:55,712 --> 00:54:57,214 బాబా వాస్! 634 00:54:58,799 --> 00:54:59,800 హలో? 635 00:55:01,218 --> 00:55:02,469 నువ్వు ఉన్నావా? 636 00:55:02,970 --> 00:55:04,847 నిజానికి నేను నిన్ను అడగడం లేదు అనుకో. 637 00:55:06,640 --> 00:55:08,058 నువ్వు ఉన్నావని నాకు తెలుసు. 638 00:55:08,767 --> 00:55:11,687 మా అనుచరులు నిన్ను ఆ తెగల ప్రజల దగ్గర నుండి అనుసరిస్తూనే ఉన్నారు. 639 00:55:12,229 --> 00:55:13,230 ఏంటి? 640 00:55:13,897 --> 00:55:14,898 బాబా… 641 00:55:15,816 --> 00:55:20,320 ఇడోను హత్య చేసిన వాడిని శిక్షించకుండా పోనిస్తాం అని నువ్వు నిజంగానే అనుకున్నావా? 642 00:55:20,404 --> 00:55:23,282 నాకు నా కత్తిని ఇవ్వు. నువ్వు కూడా నీ కర్ర తీసుకో. మనం పోరాడాలి. 643 00:55:23,365 --> 00:55:24,867 అతను నా సోదరుడు కాదు, 644 00:55:26,118 --> 00:55:27,828 కానీ అతన్ని నా సోదరుడిలాగే ప్రేమించా. 645 00:55:27,911 --> 00:55:30,956 ఇప్పుడు ఆ ప్రేమ కారణంగానే నేను ఇక్కడికి వచ్చా, 646 00:55:31,540 --> 00:55:33,208 అతన్ని చంపిన సోదరుడిని వెతుక్కుంటూ, 647 00:55:33,834 --> 00:55:37,379 నీ ప్రాణాలు తీసి అతని ఆత్మకు శాంతిని ఇవ్వాలని. 648 00:55:38,422 --> 00:55:41,300 నీ మాటలు వినిపించడం లేదు. నువ్వు దగ్గరకు వస్తే బాగుంటుంది. 649 00:55:43,343 --> 00:55:45,429 నేను నువ్వు అనుకునేదానికన్నా దగ్గరగానే ఉన్నా, బాబా. 650 00:55:45,929 --> 00:55:49,224 అలాగే నువ్వు, ఇప్పటికే చచ్చిన వాడితో సమానం. 651 00:55:50,225 --> 00:55:52,728 నువ్వు ఇంకా పడిపోయి ఉండాలన్న విషయాన్ని గ్రహించలేదు. 652 00:55:52,811 --> 00:55:56,899 నువ్వు నీ తండ్రిని చంపావు, ఇప్పుడు నీ సోదరుని చంపావు. 653 00:55:57,524 --> 00:56:01,695 ఒకటి చెప్పు, నువ్వు నీ కుటుంబంలో చంపని వారు ఎవరైనా ఉన్నారా? 654 00:56:02,779 --> 00:56:03,822 నీ భార్య? 655 00:56:05,115 --> 00:56:06,533 నీ బిడ్డలు? 656 00:56:07,951 --> 00:56:12,998 నువ్వు నీ దయనీయమైన చావుకు దగ్గరగా ఉన్నావు కాబట్టి చెప్తున్నా… 657 00:56:15,334 --> 00:56:16,335 ఇదే నా ప్రమాణం. 658 00:56:16,418 --> 00:56:21,048 నేను వాళ్ళను నీ తరపున వెతికి పట్టుకొని, స్వయంగా వారి గొంతులు కోస్తా. 659 00:56:23,717 --> 00:56:25,260 లయన్! 660 00:57:53,307 --> 00:57:55,309 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్