1 00:00:05,005 --> 00:00:06,381 అన్నీ ఎక్కించండి! వెంటనే! 2 00:00:30,989 --> 00:00:33,992 మహారాణి, ఈ వ్యక్తి అడవిలో గుర్రం మీద వెళుతుండగా మాకు దొరికాడు. 3 00:00:39,122 --> 00:00:40,123 సిబెత్? 4 00:00:43,126 --> 00:00:44,127 కొఫూన్? 5 00:00:46,171 --> 00:00:47,506 ఇది నిజంగానే నువ్వా? 6 00:00:48,549 --> 00:00:51,426 నువ్వు ఇక్కడ… నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటిది? 7 00:00:51,510 --> 00:00:53,095 నీ మహారాణి ముందు సాగిలపడు, మాంత్రికుడా. 8 00:00:53,178 --> 00:00:54,638 ఈవిడ నా రాణి కాదు. 9 00:00:57,933 --> 00:01:01,520 పాపం కొఫూన్. ఎప్పుడూ ఒక అడుగు వెనుకే ఉంటాడు. 10 00:01:02,271 --> 00:01:06,859 కానీ నిజం చెప్పాలంటే, నా చెల్లి దగ్గర నుండి నన్ను విడిపించినందుకు నీకు థాంక్స్ చెప్పాలి. 11 00:01:07,734 --> 00:01:09,528 నువ్వు త్రివాంటెస్ వాళ్ళతో పని చేస్తున్నావు. 12 00:01:10,988 --> 00:01:13,073 నీకు మతి పోయింది. వాళ్ళు పెన్సాని నాశనం చేసేస్తారు. 13 00:01:13,866 --> 00:01:17,077 లేదు, నేనే పెన్సాని నాశనం చేయబోతున్నాను. 14 00:01:23,959 --> 00:01:25,419 కొఫూన్, నీమీద నాకున్న 15 00:01:25,502 --> 00:01:28,964 మంచి అభిప్రాయం తప్పు ఏమో అన్న ఆలోచన నాకు రానివ్వకు. 16 00:01:30,966 --> 00:01:32,259 నువ్వు వేల మంది ప్రాణాలు తీయబోతున్నావు. 17 00:01:32,926 --> 00:01:35,637 ఆ విషయం మాగ్రా నామీద తిరుగుబాటు చేయకముందే ఆలోచించుకొని ఉండాల్సింది. 18 00:01:38,348 --> 00:01:40,184 టోర్మాడా, అంతా సిద్ధమా? 19 00:01:40,934 --> 00:01:42,186 సిద్ధం, మహారాణి. 20 00:01:42,686 --> 00:01:45,772 సిబెత్, దయచేసి ఈ పని చేయకు. 21 00:01:46,356 --> 00:01:47,524 వేయండి. 22 00:01:48,692 --> 00:01:49,818 నేను చెప్పిన వెంటనే వేయండి! 23 00:01:50,652 --> 00:01:52,905 ఆగు, కొఫూన్. నువ్వు ఇది చూస్తే మంచిది. 24 00:01:54,072 --> 00:01:55,073 వాడిని కదల్చండి. 25 00:02:33,987 --> 00:02:37,032 ఈ ద్రోహుల సమాధుల వద్ద నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? 26 00:02:37,991 --> 00:02:40,786 వాళ్ళ తరఫున చివరి ప్రార్ధన ప్రార్ధించడానికి ఇంకెవరూ లేరు. 27 00:02:55,884 --> 00:02:56,885 వీళ్లకు శిక్షణ ఇచ్చింది నేను. 28 00:03:00,848 --> 00:03:02,099 వీళ్ళతో కలిసి పోరాడాను. 29 00:03:08,605 --> 00:03:12,150 ఇలా జరుగుతుందని నేను ఏరోజూ ఊహించలేదు. 30 00:03:14,987 --> 00:03:16,238 వాళ్ళు మనల్ని చంపడానికి ప్రయత్నించారు. 31 00:03:19,700 --> 00:03:24,413 వాళ్ళు నమ్మింది నిజం అన్న భావనతోనే అది చేసారు. 32 00:03:29,042 --> 00:03:34,798 ఒక నమ్మకానికి కట్టుబడి వాళ్ళ జీవితం అంతా బ్రతికారు. 33 00:03:37,009 --> 00:03:40,137 ఆ నియమాలను మార్చింది మనం. 34 00:04:01,909 --> 00:04:02,910 పదండి. 35 00:04:05,746 --> 00:04:07,414 మీ సన్నాహాలు ఎలా జరుగుతున్నాయి? 36 00:04:07,497 --> 00:04:11,376 మనకు అంతు చిక్కని ఆయుధంతో వచ్చే తెలియని శత్రువును ఎదుర్కోవడానికి 37 00:04:11,460 --> 00:04:13,295 సన్నాహాలు చేయడం అంటే కొంచెం కష్టమే. 38 00:04:13,378 --> 00:04:14,922 కానీ సైన్యం సిద్ధంగా ఉంది. 39 00:04:16,298 --> 00:04:18,257 సిబెత్ త్రివాంటియన్లతో కలిసి పని చేస్తుందని 40 00:04:18,341 --> 00:04:20,969 షైలో చెప్పిన విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? 41 00:04:21,053 --> 00:04:24,681 మాంత్రికాంతకులు అబద్దం చెప్పరు. నీ అక్క ఎంతకైనా తెగిస్తుందని నా ఉద్దేశం. 42 00:04:25,766 --> 00:04:29,478 త్రివాంటియన్లకు సిబెత్ తో లేదా మాంత్రికాంతకులతో ఏం పని ఉంటుంది? 43 00:04:30,020 --> 00:04:34,066 టోర్మాడా మనం అనుకున్నట్టే త్రివాంటియన్ల తిరుగుబాటుదారు సైన్యాన్ని నడిపిస్తున్నట్టు అయితే 44 00:04:34,691 --> 00:04:37,277 మనం అనుకునేంత సైన్యం వాడి దగ్గర ఉండి ఉండదు. 45 00:04:37,361 --> 00:04:40,948 అందుకే వాడు ఆమెతో కలిసి పని చేయడానికి ఒప్పుకొని ఉంటాడు. 46 00:04:41,031 --> 00:04:44,451 బాబా చెప్పినట్టు ఆ బాంబులు గనుక పని చేసేటట్టు అయితే వాడికి మనుషులతో పనే లేదు. 47 00:05:06,974 --> 00:05:08,183 బాంబులు వేయడానికి సిద్ధం చేయబడ్డాయి, సర్. 48 00:05:10,143 --> 00:05:14,147 మనం కోటకు వెళ్లిన వెంటనే, దళాలను పంపిస్తాను. 49 00:05:14,231 --> 00:05:16,275 ఆ ఆయుధాలు మన సిటీలోకి రాకుండా చూసుకోవాలి. 50 00:05:31,373 --> 00:05:32,457 కాల్చండి! 51 00:05:34,918 --> 00:05:36,420 కాల్చండి! 52 00:06:00,694 --> 00:06:01,695 ఏంటది? 53 00:06:11,538 --> 00:06:13,123 -మనం ఆలస్యం అయ్యాం. -లేదు. 54 00:06:20,130 --> 00:06:21,131 అమ్మో. 55 00:06:30,807 --> 00:06:31,808 మాగ్రా! 56 00:06:33,852 --> 00:06:34,895 మాగ్రా! 57 00:06:36,396 --> 00:06:37,397 టమాక్టీ. 58 00:06:38,732 --> 00:06:40,943 వాళ్ళు గోడ దాటి వచ్చారు. పదా. 59 00:06:41,902 --> 00:06:43,862 లేదు, వాళ్ళు గోడ దాటి రాలేదు. 60 00:06:44,571 --> 00:06:48,033 ఆ బాంబులు గోడ పై నుండి వచ్చాయి. అవి ఎగిరి రావడం నేను విన్నాను. 61 00:06:49,159 --> 00:06:50,160 వుల్ఫ్. 62 00:06:52,454 --> 00:06:53,622 మళ్ళీ! 63 00:07:21,775 --> 00:07:24,611 హనీవా! హనీవా! 64 00:07:30,576 --> 00:07:32,327 వెళ్తూనే ఉండండి! పదండి! 65 00:07:47,593 --> 00:07:48,594 మాగ్రా! 66 00:07:49,595 --> 00:07:51,430 -మాగ్రా. -నాన్నా! అమ్మ కనిపించడం లేదు. 67 00:07:51,513 --> 00:07:53,307 -వెళ్తూనే ఉండండి. సరేనా? -సరే. 68 00:08:05,611 --> 00:08:06,987 -వుల్ఫ్! -ఇక్కడ! 69 00:08:11,200 --> 00:08:12,326 మనం వెళ్ళాలి. 70 00:08:12,409 --> 00:08:14,119 -ఇక్కడైతే సురక్షితంగా ఉంటాం. -లేదు. పదా. 71 00:08:16,538 --> 00:08:17,539 కాల్చండి! 72 00:08:36,350 --> 00:08:39,227 లేదు! లేదు! లేదు! 73 00:10:31,798 --> 00:10:34,426 హలో? ఎవరది? 74 00:10:36,970 --> 00:10:38,805 శాంతించు. నువ్వు సురక్షితంగానే ఉన్నావు. 75 00:10:40,098 --> 00:10:41,099 నేను ఎక్కడ ఉన్నాను? 76 00:10:41,975 --> 00:10:43,393 నువ్వు ఆల్కెన్నీ ప్రజల ప్రదేశంలో ఉన్నావు. 77 00:10:44,311 --> 00:10:48,857 ఆల్కెన్నీ? మర్మం… మర్మంగా తిరిగే తెగ ప్రజలేనా? 78 00:10:50,526 --> 00:10:53,195 అలా అంటుంటే నువ్వు ఈ తెగ మనిషివి కాదు అని తెలుస్తుంది. 79 00:10:56,281 --> 00:10:57,282 లేదు. 80 00:10:58,450 --> 00:10:59,451 మరి ఎక్కడి దానివి? 81 00:11:01,411 --> 00:11:03,038 ఉత్తర పర్వతాలు ఉండే ప్రదేశం దాన్ని. 82 00:11:04,831 --> 00:11:06,083 నువ్వు చాలా దూరం వచ్చావు. 83 00:11:08,961 --> 00:11:10,212 నేను ఇక్కడికి ఎలా వచ్చాను? 84 00:11:12,005 --> 00:11:13,131 నీకు గుర్తులేదా? 85 00:11:16,176 --> 00:11:17,803 ఒక మనిషి… తీసుకొచ్చింది. 86 00:11:20,305 --> 00:11:21,849 అవును. ప్యారిస్. 87 00:11:22,975 --> 00:11:26,311 ఆమె నువ్వు మంచులో తిరుగులాడటం చూసింది. ఆమె నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. 88 00:11:27,855 --> 00:11:29,731 నువ్వు ఎవరి నుండో పారిపోతున్నావు అని చెప్పింది. 89 00:11:31,233 --> 00:11:34,945 బహుశా అవసరమైనంత దూరం పారిపోలేదు ఏమో అంది. 90 00:11:43,662 --> 00:11:45,163 హనీవా, ఏంటి? 91 00:11:46,498 --> 00:11:49,543 కోట నాశనం అయిపోయింది. నాన్నా. 92 00:11:51,670 --> 00:11:53,088 నీకు ఏం వినిపిస్తోంది? 93 00:11:53,172 --> 00:11:55,007 లేదు. నో! 94 00:12:01,930 --> 00:12:02,931 నో. 95 00:12:07,186 --> 00:12:08,187 మాగ్రా! 96 00:12:11,523 --> 00:12:13,483 ఇలా రా, బేబీ. నాన్న. 97 00:12:13,567 --> 00:12:14,902 మాగ్రా. 98 00:12:17,487 --> 00:12:18,530 రేంజర్, నాకు సహాయం చెయ్! 99 00:12:24,661 --> 00:12:25,996 బాబా వాస్. 100 00:12:26,079 --> 00:12:28,290 టమాక్టీ జూన్. రేంజర్, ఇతనికి సహాయం చెయ్. 101 00:12:35,255 --> 00:12:38,091 తనకు ఇంకా ఊపిరి ఆడుతోంది. తనకు ఊపిరి ఆడుతోంది. మాగ్రా. 102 00:12:38,175 --> 00:12:41,178 టోర్మాడా, నీ బాంబులు ఆశించినట్టే పనిచేశాయో లేదో చెప్పు. 103 00:12:42,221 --> 00:12:45,432 నా అయూరా దళం వారు అన్నీ నేరుగా తగిలాయి అంటున్నారు, మహారాణి. 104 00:12:49,811 --> 00:12:54,233 కొఫూన్. నీకు ఏం కనిపించింది? ఆహ్? 105 00:12:56,443 --> 00:12:58,278 నువ్వు నీ సొంత బిడ్డపై బాంబు వేశావు. 106 00:12:59,112 --> 00:13:02,241 వాడికి అపాయం వాటిల్లింది అంటే, అందుకు కారణం మీ అమ్మ వాడిని అక్కడ ఉంచడమే, 107 00:13:02,324 --> 00:13:04,117 నిన్ను ఇక్కడికి పంపినట్టు. 108 00:13:06,119 --> 00:13:07,120 చావు. 109 00:13:07,788 --> 00:13:09,331 వీడిని నా టెంటు లోపల బంధించండి. 110 00:13:16,964 --> 00:13:18,590 -ఇంకా బాంబులు పెట్టండి! -ఆగు, ఆగు. 111 00:13:20,133 --> 00:13:23,262 నా చెల్లికి తన పరిస్థితి అర్థం కావడానికి కొంచెం సమయం ఇద్దాం. 112 00:13:24,221 --> 00:13:25,973 తన వల్ల ఎంత చావు ఎదురైందో తెలుసుకోవాలి. 113 00:13:26,723 --> 00:13:27,975 కచ్చితంగా అంటున్నావా? 114 00:13:28,058 --> 00:13:30,394 మనం సిటీని మ్యాప్ చేసాం, కీలక ప్రదేశాలకు ఎక్కుపెట్టి ఉంచాం. 115 00:13:31,144 --> 00:13:32,145 ఏం పర్లేదు. 116 00:13:32,855 --> 00:13:36,358 నాకు నా చెల్లి గురించి తెలుసు, మనం త్వరలోనే ఇంకా వేయాలి. 117 00:14:05,220 --> 00:14:06,221 నీ కట్లను విడిపించుకోవడానికి… 118 00:14:10,184 --> 00:14:12,144 నువ్వు సతమతం అవ్వడం నాకు వినిపిస్తోంది. 119 00:14:14,688 --> 00:14:16,732 నేను నిన్ను కలసిన నాటి నుండి 120 00:14:18,025 --> 00:14:20,861 నువ్వు ఇలా నీకు ఉన్న ఎన్నో బంధకాల నుండి విడిపించుకోవడానికి 121 00:14:22,196 --> 00:14:25,657 ప్రయత్నించడం తలచుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. 122 00:14:27,618 --> 00:14:30,787 నువ్వు విడిపించుకోలేవని నీకు తెలుసు, కానీ ప్రయత్నం విరమించుకోవు. 123 00:14:32,289 --> 00:14:34,499 నాకు నీలో బాగా నచ్చే విషయం అదే. 124 00:14:35,792 --> 00:14:39,338 నీకు నేను నచ్చను. నీకు ప్రేమ గురించి ఒక్క విషయం కూడా తెలీదు. 125 00:14:40,047 --> 00:14:41,340 తప్పుగా అన్నావు. 126 00:14:41,423 --> 00:14:44,718 అసలు చెప్పాలంటే, నేను అందరికంటే గాఢంగా, ఎక్కువగా ప్రేమిస్తాను. 127 00:14:46,470 --> 00:14:50,599 అందుకే మాగ్రా నన్ను మళ్ళీ మోసం చేయదు అని తనను నేను నమ్మాను. 128 00:14:52,809 --> 00:14:54,436 నువ్వు నన్ను ప్రేమిస్తే, నన్ను చంపవు. 129 00:15:00,150 --> 00:15:03,278 నాకు ప్రేమ గురించి ఏమీ తెలీదా? 130 00:15:18,210 --> 00:15:19,294 పాపం కొఫూన్. 131 00:15:23,090 --> 00:15:27,344 ఒక ఏడాది క్రితం నువ్వు ఒక ఆల్కెన్నీ కుర్రాడివి. కొండపై నివసించే మామూలు కుర్రాడివి. 132 00:15:28,136 --> 00:15:33,600 కానీ ఇప్పుడు నువ్వు రాజ్యాలు ఏర్పడటం, నాశనం కావడం చూస్తున్నావు. 133 00:15:35,185 --> 00:15:37,813 నీకు అర్థం కానిది చాలా ఉంది. 134 00:15:38,522 --> 00:15:41,525 నువ్వు ఒక హంతకురాలివి, అలాగే ద్రోహివి అని నాకు అర్థం అవుతుంది. 135 00:15:47,406 --> 00:15:50,993 మీ అమ్మతో పోల్చితే నేను ఏ విధంగా చెడ్డదాన్ని? 136 00:15:55,998 --> 00:15:59,960 ఆమె రాణికి వ్యతిరేకంగా ఎదురు తిరిగింది. ఆమె ద్రోహి కాదా? 137 00:16:01,003 --> 00:16:03,547 నేను చివరిగా పెన్సాలో ఉన్నప్పుడు, మనుషులను ఉరి తీయించింది. 138 00:16:03,630 --> 00:16:05,174 ఆమె హంతకురాలు కాదా? 139 00:16:07,050 --> 00:16:09,178 "ద్రోహి," "హంతకురాలు," ఇవన్నీ పదాలు మాత్రమే. 140 00:16:10,596 --> 00:16:14,558 నువ్వు ఎవరి తరఫున నిలబడతావో వారిని బట్టి అవి నిజమా కాదా అన్నది నిర్ణయించబడుతుంది. 141 00:16:14,641 --> 00:16:17,186 -నువ్వు త్రివాంటియన్ల వైపు ఉన్నావు. -లేదు. 142 00:16:17,269 --> 00:16:20,063 నేను దేవుని వైపు ఉన్నాను. 143 00:16:21,899 --> 00:16:25,569 నాకు వేసిన మరణశిక్ష, అలాగే నా సింహాసనాన్ని తీసుకోవాలని పన్నిన పన్నాగం 144 00:16:25,652 --> 00:16:27,779 తర్వాత కూడా నేను ప్రాణాలతో ఉండడాన్ని ఇంకెలా వివరిస్తావు? 145 00:16:29,072 --> 00:16:32,784 చూపు లేని నీ కొడుకును ఆ దేవుడే నేను పారిపోవడానికి 146 00:16:32,868 --> 00:16:36,163 అవసరమైనంత సమయం ఇవ్వడానికి నాకు ప్రసాదించాడు. 147 00:16:36,246 --> 00:16:38,999 వాడు నీ కొడుకు కుడా, నువ్వు ఎంత కాదన్నా అది నిజం కాకుండా పోదు. 148 00:16:41,126 --> 00:16:45,047 వాడి కర్తవ్యాన్ని వాడు నిర్వర్తించాడు, అందుకుగాను వాడిని స్మరించుకుంటాలే. 149 00:16:47,382 --> 00:16:48,592 నువ్వు రాక్షసివి. 150 00:16:52,930 --> 00:16:54,056 అలాగే నువ్వొక మాంత్రికుడివి. 151 00:16:56,016 --> 00:16:58,727 మీ అమ్మ కొన్నాళ్ళు సింహాసనం మీద కూర్చోవడంతో 152 00:16:58,810 --> 00:17:00,479 నువ్వు తప్పుగా అనుకుంటున్నావేమో. 153 00:17:02,564 --> 00:17:06,108 ప్రస్తుతం నీ స్థాయి ఏమిటో నీకు గుర్తు చేయడానికి సంతోషంగా నిన్ను తగలబెట్టడానికి 154 00:17:06,193 --> 00:17:10,696 బయట వందమంది మాంత్రికాంతకులు కాచుకొని ఉన్నారు. 155 00:17:11,823 --> 00:17:14,034 నువ్వు ఏమిటో నీకు గుర్తుచేస్తున్నాను అంతే. 156 00:17:15,618 --> 00:17:16,828 నేను ఏమిటి? 157 00:17:18,329 --> 00:17:19,623 నువ్వు వుల్ఫ్ అమ్మవి. 158 00:17:22,960 --> 00:17:24,377 వాడికి నువ్వు కావాలి. 159 00:17:26,839 --> 00:17:30,384 వాడు నిన్ను కాపాడటానికి పంపబడ్డాడు అని నువ్వే అన్నావు. బహుశా వాడు నిన్ను ఇంకా కాపాడలేదేమో. 160 00:17:32,886 --> 00:17:34,304 వాడు నీ కొడుకు. 161 00:17:37,933 --> 00:17:39,268 వాడు నీ కొడుకు, సిబెత్. 162 00:17:47,150 --> 00:17:48,277 వాడు నీ కొడుకు. 163 00:17:59,288 --> 00:18:00,289 దయచేసి లెగు. 164 00:18:01,665 --> 00:18:02,666 మాగ్రా. 165 00:18:07,296 --> 00:18:09,298 ఓహ్, దయచేసి లెగు, లెగు. 166 00:18:09,840 --> 00:18:11,008 నీ పేరు ఏంటి? 167 00:18:14,761 --> 00:18:16,054 నీ పేరు కూడా చెప్పవా? 168 00:18:18,056 --> 00:18:19,433 నీకు అబద్దం చెప్పడం నాకు ఇష్టం లేదు. 169 00:18:23,228 --> 00:18:24,771 నువ్వు ఆల్కెన్నీ ప్రజల నాయకుడివా? 170 00:18:26,064 --> 00:18:27,065 అవును. 171 00:18:29,109 --> 00:18:30,277 కానీ నువ్వు ఇక్కడి వాడివి కాదు. 172 00:18:32,237 --> 00:18:34,823 నీ యాస ఎక్కడిదో నాకు తెలీదు, కానీ అది ఈ కొండ ప్రజల యాస కాదు. 173 00:18:34,907 --> 00:18:37,117 -నిన్ను ఎవరైనా తరుముతున్నారా? -లేదు. 174 00:18:38,035 --> 00:18:39,411 నువ్వు అబద్దం చెప్పాలనుకోవడం లేదు అన్నావు. 175 00:18:43,582 --> 00:18:46,460 నా వెంట ఇంతకు ముందు కొందరు పడ్డారు, కానీ నేను చాలా రోజులుగా ప్రయాణిస్తూనే ఉన్నాను, 176 00:18:46,543 --> 00:18:47,753 నా జాడ తెలీకుండా జాగ్రత్తపడ్డాను. 177 00:18:48,754 --> 00:18:49,755 అలా అని కచ్చితంగా చెప్పలేం. 178 00:18:50,839 --> 00:18:52,090 అవును, నిజమే. 179 00:18:54,760 --> 00:18:57,137 విశ్రాంతి తీసుకో. నువ్వు నడవగలిగిన తర్వాత బయలుదేరాలి. 180 00:18:58,138 --> 00:19:00,098 అందుకు నువ్వు అనుకునేదానికన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు. 181 00:19:01,433 --> 00:19:02,434 ఎందుకు? 182 00:19:03,560 --> 00:19:04,686 నేను బిడ్డతో ఉన్నాను. 183 00:19:08,774 --> 00:19:10,025 తను లేస్తోంది. 184 00:19:11,026 --> 00:19:12,819 మాగ్రా. మాగ్రా. 185 00:19:15,113 --> 00:19:16,114 బాబా. 186 00:19:18,575 --> 00:19:20,160 నేను హనీవాతో వచ్చాను. 187 00:19:22,996 --> 00:19:24,540 నువ్వు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. 188 00:19:24,623 --> 00:19:25,916 నేను చాలా కంగారు పడ్డాను. 189 00:19:27,251 --> 00:19:29,962 ఈ ఇల్లు… ఉన్నట్టుండి పేలిపోయింది. 190 00:19:30,921 --> 00:19:34,383 నాకు తెలుసు. ఇది దైవ గర్జన. ఆ బాంబుల పని. 191 00:19:35,342 --> 00:19:36,844 మీరు వాళ్ళను ఆపలేకపోయారా? 192 00:19:37,845 --> 00:19:38,846 లేదు. 193 00:19:40,097 --> 00:19:41,098 వుల్ఫ్! 194 00:19:41,181 --> 00:19:44,017 ఏం పర్లేదు. ఏమీ కాదు. వాడు సురక్షితంగా ఉన్నాడు. నువ్వు వాడిని కాపాడావు. 195 00:19:47,354 --> 00:19:49,940 కొఫూన్ ఎక్కడ? వాడు ఇక్కడ లేడు ఎందుకు? 196 00:19:51,108 --> 00:19:52,484 మేము ముందే నిన్ను వారించమని వాడిని పంపించాం. 197 00:19:53,068 --> 00:19:54,278 లేదు, వాడు ఇక్కడికి రాలేదు. 198 00:19:54,361 --> 00:19:56,989 -వాడు ఎక్కడ? వాడు గాయపడి ఉండొచ్చు. -వాడిని వెతుకుదాం. 199 00:19:57,573 --> 00:19:59,074 ఇదంతా నా తప్పే. 200 00:20:01,910 --> 00:20:04,788 అమ్మా. పిచ్చిగా మాట్లాడకు. 201 00:20:04,872 --> 00:20:07,708 లేదు, నువ్వు త్రివాంటెస్ వాళ్లతో సంధి చేయడానికి శాయశక్తులా ప్రయత్నించావు. 202 00:20:09,585 --> 00:20:13,046 లేదు, ఇది త్రివాంటెస్ పని కాదు. సిబెత్ పని. 203 00:20:14,381 --> 00:20:15,757 అదెలా సాధ్యం? 204 00:20:15,841 --> 00:20:17,759 సిబెత్ ఇప్పుడు 205 00:20:17,843 --> 00:20:20,679 తిరగబడిన మాంత్రికాంతకులు అలాగే టోర్మాడా సైన్యంతో సంధి చేసుకుంది. 206 00:20:21,180 --> 00:20:23,473 నేను ఆమెను మరణ శిక్ష నుండి కాపాడాను. 207 00:20:24,600 --> 00:20:26,435 మాంత్రికాంతకులను ప్రాణాలతో వదిలేసాను. 208 00:20:27,978 --> 00:20:30,647 ఇప్పుడు మనల్ని నాశనం చేయబోతున్న సైన్యాన్ని సృష్టించింది నేనే. 209 00:20:33,775 --> 00:20:34,943 నేను బయటకు వెళ్ళాలి. 210 00:20:37,988 --> 00:20:41,366 ఆగు, ఆగు, అమ్మా. అమ్మా. 211 00:20:42,117 --> 00:20:43,911 హనీవా, నీకు ఏం కనిపిస్తోంది? 212 00:20:44,411 --> 00:20:49,208 గుడిసెలు కాలుతున్నాయి. ఎక్కడ చూసినా శవాలు, క్షతగాత్రులే. 213 00:20:51,502 --> 00:20:56,632 జనం భయంతో ఎటు వెళ్లాలో తోచక… 214 00:20:59,134 --> 00:21:00,636 అటు ఇటు తిరుగుతున్నారు. 215 00:21:01,220 --> 00:21:05,891 భయపడటం సహజమే. ఆకాశం నుండి అగ్ని వర్షంలా పడుతుంది కదా. 216 00:21:06,683 --> 00:21:08,894 ఇప్పుడు ఆకాశం నుండి అగ్ని పడటం లేదు. 217 00:21:08,977 --> 00:21:09,978 ప్రస్తుతానికి ఆగింది. 218 00:21:11,772 --> 00:21:13,899 అంతా తన ఆధీనంలో ఉందని చెప్పడానికే సిబెత్ దాడిని ఆపింది. 219 00:21:15,150 --> 00:21:19,029 టమాక్టీ, మంటలు ఆర్పడానికి రోయల్ గార్డ్ సైన్యాన్ని ఏర్పాటు చెయ్, 220 00:21:19,112 --> 00:21:20,948 అలాగే క్షతగాత్రులను ఒకచోట చేర్చి గాయాలు కట్టండి. 221 00:21:21,031 --> 00:21:24,493 కదలగల వారిని ఆల్టూనాకి తరలించండి 222 00:21:24,576 --> 00:21:27,955 అక్కడ మనం మళ్ళీ కలుసుకొని పోరాటానికి సిద్ధపడదాం. 223 00:21:31,750 --> 00:21:33,752 మనం మీ అన్నని కనిపెట్టాలి. 224 00:21:33,836 --> 00:21:37,881 మనం అమ్మని, వుల్ఫ్ ని కనుగొన్నాం. కొఫూన్ ని కూడా కనిపెడతాం. 225 00:21:40,050 --> 00:21:41,051 పదా, అమ్మా. 226 00:21:51,395 --> 00:21:56,859 కొఫూన్! మనం సరిగా పరిచయం చేసుకోలేదు, నన్ను క్షమించు. 227 00:21:58,902 --> 00:22:02,447 నీకు తెలుసు కదా, మేము బాగా బిజీగా ఉన్నాం. 228 00:22:04,324 --> 00:22:05,534 నువ్వు ఎవరివో నాకు తెలుసు. 229 00:22:06,910 --> 00:22:08,871 అవును, ఆ విషయం నాకు తెలుసు. 230 00:22:11,790 --> 00:22:13,041 నీకు ఒకటి చెప్పాలి, 231 00:22:14,042 --> 00:22:19,381 పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కూడా, నీకు బయటపడటానికి ఒక దారి ఉంది. 232 00:22:20,841 --> 00:22:21,925 దారా? 233 00:22:23,343 --> 00:22:27,264 నీకు ఉన్న ఈ వరాన్ని ఎవరూ సరిగ్గా నేటి వరకు గుర్తించలేదు. కదా? 234 00:22:30,184 --> 00:22:33,896 అంటే… పయాన్లు నువ్వొక మాంత్రికుడివి అనుకుంటున్నారు. 235 00:22:34,730 --> 00:22:38,442 త్రివాంటియన్లు ఏమో నువ్వు వాళ్ళ రాజ్యానికి ప్రమాదకరం అనుకుంటున్నారు, కానీ… నేను ఏమో… 236 00:22:40,694 --> 00:22:41,945 నాకు నువ్వు చాలా ఇష్టం. 237 00:22:43,363 --> 00:22:45,032 నీలో ఉన్న సామర్ధ్యాన్ని నేను అర్థం చేసుకోగలను. 238 00:22:47,409 --> 00:22:48,619 నువ్వు గనుక నాతో చేయి కలిపితే… 239 00:22:48,702 --> 00:22:50,245 నువ్వు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించావు. 240 00:22:50,329 --> 00:22:54,082 అవును, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. 241 00:22:54,666 --> 00:22:58,921 నేను కేన్ మహారాణితో ఇలా చేయి కలుపుతానని అస్సలు అనుకోలేదు. 242 00:23:00,881 --> 00:23:02,758 నీతో పని పూర్తి అయిన తర్వాత, ఆమె నిన్ను కూడా చంపేస్తుంది. 243 00:23:02,841 --> 00:23:04,009 అవును. 244 00:23:04,593 --> 00:23:08,180 లేదా నేనే ఆమెను చంపుతానేమో. లేదా ఎవరూ ఎవరినీ చంపరేమో. 245 00:23:10,224 --> 00:23:14,770 ప్రతీరోజు ఒక నూతన దినం, కొఫూన్. ఇవాళ నీ జీవితంలో నూతన దినం కావచ్చు. 246 00:23:14,853 --> 00:23:15,938 పోయి చావు. 247 00:23:16,021 --> 00:23:17,731 అవును, అలాగే. 248 00:23:19,191 --> 00:23:22,402 నీ వయసులో ఉన్న కుర్రాళ్లు తమకు అన్నీ తెలుసు అనుకుంటారు, 249 00:23:22,486 --> 00:23:25,656 కానీ వాళ్లకు ఏమీ తెలీదు అని తెలుసుకునేంత మతి కూడా ఉండదు. 250 00:23:25,739 --> 00:23:27,324 మా నాన్న నిన్ను చంపుతాడని మాత్రం నాకు తెలుసు. 251 00:23:27,991 --> 00:23:31,703 నేను అన్నాను కదా. వెర్రి మాటలు. నీకు బోధ చేయడానికి మాకు చాలా సమయం ఉందిలే. 252 00:23:31,787 --> 00:23:32,788 ఏంటది? 253 00:23:33,789 --> 00:23:35,707 రాణి వాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. 254 00:23:36,458 --> 00:23:37,459 దేనికి? 255 00:23:39,545 --> 00:23:41,046 ఆవిడను మీరే అడగండి. 256 00:24:18,208 --> 00:24:20,460 వాళ్ళ క్యాంప్ తూర్పు వైపు వంద గుండె చప్పుళ్ల దూరంలో ఉంది. 257 00:24:21,670 --> 00:24:22,838 ఎంతమంది సైనికులు ఉన్నారు? 258 00:24:25,716 --> 00:24:27,759 నేను దాదాపు 50 మందిని చూస్తున్నాను. 259 00:24:31,013 --> 00:24:32,264 మిగతా వాళ్ళు ఎక్కడ? 260 00:24:38,937 --> 00:24:40,022 హుష్. 261 00:24:42,107 --> 00:24:44,109 నగరం దాటి వెళ్ళడానికి దారి లేదు. 262 00:24:44,193 --> 00:24:45,694 వాళ్ళు దండయాత్ర చేయబోతున్నారా? 263 00:24:45,777 --> 00:24:46,778 నాకు అలా అనిపించడం లేదు. 264 00:24:47,821 --> 00:24:51,617 బాంబులు విసరగలిగినప్పుడు సైనికుల ప్రాణాలు ప్రమాదంలో ఎందుకు పెడతారు? 265 00:24:52,284 --> 00:24:55,871 సిబెత్ కి తన నగరం కావాలి. మరి దానిని ఎందుకు నాశనం చేసుకుంటుంది? 266 00:24:56,371 --> 00:24:58,415 ఆమె కావాలనుకుంటే ఇంకా చాలా బాంబులు వేసి ఉండొచ్చు, 267 00:24:59,249 --> 00:25:02,920 కానీ మనం ఇంకా ఇలా నిలబడుతున్నాం అంటే ఆమెకు ఈ నగరం పాడు కాకుండా కావాలని అర్థం అవుతోంది. 268 00:25:04,588 --> 00:25:06,757 అది చేయాలంటే ఆమె తన సైన్యాన్ని పంపాలి. 269 00:25:09,718 --> 00:25:12,679 హార్లన్ ఇంకా ట్రొవేర్ త్రివాంటెస్ లో మన తరపున మాట్లాడి సాయం తీసుకురాగలిగితే, 270 00:25:12,763 --> 00:25:15,349 వాళ్ళు సైన్యంతో తిరిగి వస్తుంటారు. 271 00:25:15,933 --> 00:25:18,852 అమ్మా. హార్లన్ చనిపోయాడు. 272 00:25:25,067 --> 00:25:26,318 నన్ను కాపాడుతూ చనిపోయాడు. 273 00:25:34,409 --> 00:25:35,410 అమ్మా… 274 00:25:36,578 --> 00:25:40,749 అతను, నీకు ఒకటి ఇమ్మని చెప్పాడు. 275 00:25:47,631 --> 00:25:48,632 తాళమా? 276 00:25:50,634 --> 00:25:51,635 దేనికి? 277 00:25:52,344 --> 00:25:55,180 నాకు తెలీదు. ఇది నీకు పనికిరావచ్చు అన్నాడు. 278 00:26:10,821 --> 00:26:12,155 హనీవా? 279 00:26:12,948 --> 00:26:14,283 కొఫూన్. 280 00:26:14,366 --> 00:26:15,367 కొఫూన్? 281 00:26:16,410 --> 00:26:18,287 -నువ్వు బాగానే ఉన్నావా? -బానే ఉన్నావా? 282 00:26:18,370 --> 00:26:20,163 అవును. నాన్న. 283 00:26:21,623 --> 00:26:23,041 నువ్వు ఎక్కడికి పోయావు? 284 00:26:23,125 --> 00:26:26,086 సిబెత్. ఆమె నగరం బయట నన్ను పట్టుకుంది. 285 00:26:30,883 --> 00:26:32,259 మీకు ఒక సందేశం పంపింది. 286 00:26:32,342 --> 00:26:33,760 సందేశమా? 287 00:26:33,844 --> 00:26:35,053 అవును, ఆమె రాసి పంపింది. 288 00:26:39,141 --> 00:26:42,186 నిన్ను నీ పదవిని వదిలి, పూర్తిగా లొంగిపోవాలి అని అడుగుతుంది. 289 00:26:44,563 --> 00:26:46,440 నువ్వు ఆమె క్యాంప్ లోనికి ఒంటరిగా వెళ్లి, 290 00:26:47,107 --> 00:26:50,903 నీ కిరీటాన్ని, రాజ్యాన్ని ఆమె చేతికి అప్పజెప్పాలి అంటుంది. 291 00:26:52,654 --> 00:26:54,281 నువ్వు గనుక వెంటనే వెళ్లకపోతే, 292 00:26:54,364 --> 00:26:58,994 ఆమె పెన్సాని, అలాగే ఇక్కడ ఉన్న అందరినీ బూడిద చేసేస్తాను అంటుంది. 293 00:27:11,757 --> 00:27:16,345 ఆమెకు తన రాజ్యం కైవసం చేసుకోవాలని మాత్రమే లేదు. నన్ను శిక్షించాలని చూస్తుంది. 294 00:27:17,471 --> 00:27:20,182 -నువ్వు వెళ్ళకూడదు. -ఇప్పుడు వాదించుకోవడానికి సమయం కాదు, హనీవా. 295 00:27:20,265 --> 00:27:21,850 -నేను వెళ్లి తీరాలి. -ఆమె నిన్ను చంపేస్తుంది. 296 00:27:21,934 --> 00:27:25,229 నేను వెళ్లకపోతే ఆమె మన అందరినీ, అలాగే ఇంకా అనేకమందిని చంపుతుంది. 297 00:27:27,564 --> 00:27:31,276 తను నా అక్క, నేను ఆమెను ఎంతగా చీదరించుకున్నా, 298 00:27:32,277 --> 00:27:34,780 తన చావుకు ఘడియలు దగ్గరయిన తర్వాత, నేను ఆమెను చంపలేకపోయా. 299 00:27:34,863 --> 00:27:37,449 బహుశా ఆమె కూడా నా విషయంలో అలాగే సంకోచిస్తుందేమో. 300 00:27:37,533 --> 00:27:39,034 నీకు ఆ నమ్మకం లేదు. 301 00:27:39,117 --> 00:27:42,538 అది… అదంతా అనవసరం. నేను వెళ్ళాలి. ఆమెను ఇలా… 302 00:27:43,664 --> 00:27:45,165 -మాగ్రా! -అమ్మా! 303 00:27:50,629 --> 00:27:52,256 ప్యారిస్ నువ్వు తినడం లేదు అని చెప్పింది. 304 00:27:52,965 --> 00:27:56,718 నన్ను ఈ గుహ వదిలి ఎందుకు వెళ్లనివ్వడం లేదు? నేను నీ బంధీనా? 305 00:27:58,262 --> 00:28:01,348 గ్రామస్తులు… వాళ్లకు బయటి వారిపై అనుమానం ఎక్కువ. 306 00:28:02,266 --> 00:28:04,434 నువ్వు బయట తిరగడం మంచిది కాదు. 307 00:28:04,518 --> 00:28:06,770 సరే, నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే, నేను వెళ్ళిపోతాను. 308 00:28:07,396 --> 00:28:08,772 ఎక్కడికి వెళ్తావు? 309 00:28:13,068 --> 00:28:15,529 నువ్వు కనీసం నీ పేరు, లేదా నువ్వు ఎక్కడి నుండి వచ్చావన్నది కూడా చెప్పలేదు. 310 00:28:17,030 --> 00:28:20,117 మేము నిన్ను నమ్మాలి అంటే, ముందు నువ్వు మమ్మల్ని నమ్మాలి. 311 00:28:21,743 --> 00:28:22,870 నువ్వు నన్ను నమ్మవచ్చు. 312 00:28:24,746 --> 00:28:26,081 నేను నిన్ను ఎందుకు నమ్మాలి? 313 00:28:26,957 --> 00:28:28,917 అంటే, ఇన్ని రోజులుగా నిన్ను కాపాడుతూ వచ్చింది నేనే కాబట్టి. 314 00:28:32,212 --> 00:28:33,213 నా పేరు మాగ్రా. 315 00:28:34,715 --> 00:28:37,718 -ఏంటి? -నా పేరు మాగ్రా? 316 00:28:38,886 --> 00:28:42,014 మాగ్రా? అదేం పేరు, మాగ్రా? 317 00:28:43,015 --> 00:28:45,392 బాబా అనేది ఎలాంటి పేరు ఏంటి? 318 00:28:46,977 --> 00:28:48,228 అది మంచి పాయింటే, మాగ్రా. 319 00:28:52,900 --> 00:28:54,610 నువ్వు నన్ను ఎందుకు కాపాడుతున్నావు? 320 00:28:56,778 --> 00:28:59,281 ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా నువ్వు ఉన్న పరిస్థితిలో ఉండి వచ్చాను. 321 00:29:00,365 --> 00:29:02,492 గ్రామస్తులు నిన్ను నమ్మేలా ఎలా చేసావు? 322 00:29:03,952 --> 00:29:05,537 నేను వాళ్ళ అత్యంత బలమైన యోధుడిని ఓడించాను. 323 00:29:07,456 --> 00:29:09,208 అంటే, ఇప్పుడు నేను నిన్ను ఓడించాలేమో. 324 00:29:12,252 --> 00:29:13,253 అవును. 325 00:29:22,804 --> 00:29:23,805 అమ్మా? 326 00:29:27,392 --> 00:29:28,393 నీకు బాగానే ఉందా? 327 00:29:29,645 --> 00:29:30,896 మాగ్రా. 328 00:29:33,023 --> 00:29:34,358 అవును, నాకు బాగానే ఉంది. 329 00:29:35,442 --> 00:29:36,652 మేము అందరం ఇక్కడే ఉన్నాం. 330 00:29:45,911 --> 00:29:47,913 నేను… నేను వెళ్ళాలి. 331 00:29:47,996 --> 00:29:50,874 లేదు, లేదు. నిన్ను ఇలా మేము వెళ్లనివ్వలేము. 332 00:29:53,544 --> 00:29:57,089 ఆమె నిన్ను చూసిన వెంటనే నిన్ను చంపేస్తుంది, నువ్వు వెళ్లి ఏం ప్రయోజనం ఉండదు. 333 00:29:58,966 --> 00:30:00,384 మరి పెన్సా సంగతి ఏంటి? 334 00:30:00,968 --> 00:30:03,470 నా మీద కోపంతో ఆమె మొత్తం నగరాన్ని తగలబెడుతుంది. 335 00:30:03,554 --> 00:30:04,763 నేను అలా జరగనివ్వలేను. 336 00:30:04,847 --> 00:30:08,225 ఆమె పెన్సాని నాశనం చేసేటట్టు అయితే, నువ్వు బ్రతికి ఉన్నా లేకున్నా నాశనం చేస్తుంది. 337 00:30:08,308 --> 00:30:09,935 నగరం వదిలి వెళ్ళడానికి వేరే మార్గమే లేదా? 338 00:30:10,018 --> 00:30:13,021 -మన గేట్ల దగ్గర వాళ్ళ సైనికులు మోహరించారు. -అయితే వాళ్లతో పోరాడి వెళదాం. 339 00:30:13,105 --> 00:30:15,649 వాళ్ళు మనం ప్రతిఘటిస్తున్నాం అని తెలుసుకున్న వెంటనే బాంబులు వేస్తారు. 340 00:30:16,316 --> 00:30:17,985 ప్రతిఘటించకపోయినా బాంబులు వేస్తారు, 341 00:30:18,652 --> 00:30:20,988 కానీ వాళ్ళు బాంబులు వేసేసరికి ఈ కుటుంబం ఇక్కడ ఉండదు. 342 00:30:22,406 --> 00:30:23,407 హార్లన్. 343 00:30:24,741 --> 00:30:25,868 ఏంటది? 344 00:30:29,079 --> 00:30:31,456 అతను మిగతా వారికన్నా ఎప్పుడూ మూడు అడుగులు ముందే ఉంటాడు. 345 00:30:32,708 --> 00:30:35,002 అతనితో నాకు చాలా చిరాకు పుట్టేది. 346 00:30:36,587 --> 00:30:40,966 అతన్ని నమ్మడానికి నాకు ఒక్క కారణం కూడా చూపలేదు. అయినా నేను అతన్ని నమ్మాను. 347 00:30:41,592 --> 00:30:45,554 అతను తన ప్రాణాలు కాపాడుకోగలిగి ఉండేవాడు, కానీ నా కోసం వెనక్కి వచ్చాడు. 348 00:30:52,936 --> 00:30:53,937 ఇక్కడ ఉందేమో? 349 00:31:01,361 --> 00:31:02,988 -లేదా? -లేదు. 350 00:31:09,244 --> 00:31:10,537 అతని నిన్ను ప్రేమించాడు. 351 00:31:24,301 --> 00:31:25,302 నేను అతన్ని వాడుకున్నాను. 352 00:31:28,055 --> 00:31:29,097 ఇప్పుడు అతను లేకుండా పోయాడు. 353 00:31:33,101 --> 00:31:37,105 హార్లన్ కు ఇష్టం లేకుండా తనని ఎవరూ వాడుకోనిచ్చే మనిషిలా అతను నాకు కనిపించలేదు. 354 00:31:50,369 --> 00:31:51,453 ఏంటది? 355 00:31:54,665 --> 00:31:56,291 -అమ్మా. -దాన్ని ఇలా తీసుకొస్తావా? 356 00:32:05,926 --> 00:32:07,052 శబ్దం చేసే లోహమా? 357 00:32:08,595 --> 00:32:09,805 పెట్టెలో ఇంకేం ఉంది? 358 00:32:12,599 --> 00:32:13,684 ఒక పాత మ్యాప్ అంతే. 359 00:32:23,235 --> 00:32:24,486 చూస్తుంటే పెన్సాలా ఉంది. 360 00:32:25,404 --> 00:32:27,823 ఇది పెన్సానే, కానీ… 361 00:32:29,950 --> 00:32:31,410 ఇంకేదో ఇక్కడ ఉంది. 362 00:32:33,203 --> 00:32:34,705 ఓహ్, హార్లన్. 363 00:32:35,789 --> 00:32:38,166 ఓహ్, జిత్తులమారి నక్కా. 364 00:32:38,792 --> 00:32:39,793 ఏంటది? 365 00:32:40,711 --> 00:32:44,131 సొరంగాలు. స్మగ్లర్లు వాడే సొరంగాలు. 366 00:32:45,132 --> 00:32:46,508 అవి ఎక్కడికి వెళ్తున్నాయి? 367 00:32:47,801 --> 00:32:50,345 నగరం బయటకు. పదండి. 368 00:33:04,109 --> 00:33:05,569 నా రాణి. 369 00:33:06,528 --> 00:33:08,614 టోర్మాడా. ఇలా వచ్చి నాతో కూర్చో. 370 00:33:21,668 --> 00:33:24,838 మీ ప్లానులు ఎలా సాగుతున్నాయి? 371 00:33:26,757 --> 00:33:29,843 ఈపాటికి మన సందేశం వాళ్లకు చేరి ఉంటుంది. 372 00:33:32,179 --> 00:33:33,722 నా చెల్లి త్వరలోనే వచ్చి లొంగిపోతుందని 373 00:33:33,805 --> 00:33:36,433 నాకు పూర్తి నమ్మకం ఉంది. 374 00:33:37,601 --> 00:33:41,939 ఆమె లొంగినప్పుడు, మొత్తం పయా మనది అవుతుంది. 375 00:33:42,022 --> 00:33:45,526 పెన్సాను సమూలంగా నాశనం చేస్తే ఇంకా గట్టి సందేశం ఇవ్వొచ్చని నా ఉద్దేశం. 376 00:33:46,652 --> 00:33:50,697 నేను ఇంత బాధ సహించింది శిధిలాలను, శవాలను ఏలడానికి కాదు. 377 00:33:52,157 --> 00:33:54,952 ఒకసారి మాగ్రా లొంగితే, పయా కూడా లొంగుతుంది. 378 00:33:55,744 --> 00:33:57,913 నేను పయా గురించి మాట్లాడటం లేదు. 379 00:33:59,957 --> 00:34:00,958 త్రివాంటెస్. 380 00:34:01,625 --> 00:34:03,418 వాళ్ళ బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. 381 00:34:04,169 --> 00:34:05,671 మన బలాన్ని కూడా తక్కువగా అంచనా వేయకు. 382 00:34:07,506 --> 00:34:08,882 నన్ను నమ్మండి, నేను అలా అనుకోవడం లేదు. 383 00:34:10,300 --> 00:34:11,885 నాది ఒక విన్నపం. 384 00:34:13,804 --> 00:34:16,139 -మీ మేనల్లుడు. -కొఫూన్? 385 00:34:17,306 --> 00:34:19,893 వాడిని వదిలే ముందు నాకు ఒక మాట చెప్పాల్సింది. 386 00:34:21,311 --> 00:34:23,397 జెర్లామరెల్ పిల్లల్ని కూడా కోల్పోవడంతో, 387 00:34:23,480 --> 00:34:27,025 వాడు నాకు చాలా పనికొచ్చేవాడు. 388 00:34:31,154 --> 00:34:34,241 మాంత్రికాంతకులతో మనం చేసిన ఒప్పందం ప్రకారం, 389 00:34:34,324 --> 00:34:37,327 చూపు ఉన్న అలాంటి మంత్రగాళ్లను దహించాల్సిందే 390 00:34:37,411 --> 00:34:38,786 అని నీకు గుర్తుంది కదా? 391 00:34:38,871 --> 00:34:40,414 నాకు వాళ్లతో ఎక్కువకాలం అవసరం లేదు. 392 00:34:41,581 --> 00:34:47,254 చూపుతో పని లేకుండానే పని చేసే విధానాన్ని నేను కనిపెట్టే దిశలో పని చేస్తున్నా. 393 00:34:50,047 --> 00:34:51,466 కానీ అప్పటి వరకు, 394 00:34:51,550 --> 00:34:55,387 మాంత్రికాంతకులు కొన్ని విషయాలలో ఓర్పుతో ఉండాల్సి ఉంటుంది. 395 00:34:56,804 --> 00:34:59,057 -మాంత్రికాంతకులతో చాలా ప్రమాదకరం. -నాతో కూడా. 396 00:35:00,809 --> 00:35:03,103 వాళ్ళ వైపు దేవుడు ఉన్నాడు. 397 00:35:04,021 --> 00:35:08,775 మీరు ఏమీ అనుకోను అంటే చెప్తాను, నేను నిజానికి దేవుడిని నమ్మను. 398 00:35:09,860 --> 00:35:10,861 నమ్మవా? 399 00:35:20,412 --> 00:35:22,998 బహుశా నువ్వు సరైన దేవుడిని కలుసుకున్నట్టు లేవు. 400 00:35:33,342 --> 00:35:36,178 -నువ్వు సరిగ్గానే ఫాలో అవుతున్నావా? -అవును. 401 00:35:36,261 --> 00:35:38,013 ఆనవాళ్ళన్నీ సరిగ్గానే ఉన్నాయి. 402 00:35:38,597 --> 00:35:39,598 ఒకసారి నన్ను చూడనివ్వు. 403 00:35:47,356 --> 00:35:48,357 ఇలా. 404 00:36:45,205 --> 00:36:47,541 అంటే, మ్యాప్ ప్రకారం దారి ఇక్కడే ఉండాలి. 405 00:36:54,047 --> 00:36:55,048 నాకు ఏమీ కనిపించడం లేదు. 406 00:36:56,717 --> 00:36:58,010 బహుశా మ్యాప్ లో తప్పుగా ఉందేమో. 407 00:36:59,386 --> 00:37:00,804 నీకు హార్లన్ గురించి తెలీదు. 408 00:37:02,806 --> 00:37:04,349 మ్యాప్ లో తప్పు ఏమీ లేదు. 409 00:37:10,230 --> 00:37:11,607 హలో? 410 00:37:18,530 --> 00:37:19,656 ఇక్కడ ఏమీ లేదు. 411 00:37:57,236 --> 00:37:58,237 నేను ఇప్పుడే వస్తాను. 412 00:38:36,358 --> 00:38:37,943 మేము సొరంగం చివరి వరకు వెళ్ళాం. 413 00:38:38,777 --> 00:38:41,238 అది పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న గుహ వరకు వెళ్తుంది. 414 00:38:41,321 --> 00:38:42,531 పెన్సా పశ్చిమ వైపుకు. 415 00:38:43,156 --> 00:38:46,702 మనం ఇప్పుడే బయలుదేరితే, మనం లేమని వాళ్లకు తెలిసే సరికి ఆల్టూనాకు సగం దూరం వెళ్ళగలం. 416 00:38:46,785 --> 00:38:49,121 అప్పుడు ఆల్టూనా పై బాంబులతో విరుచుకుపడితే? 417 00:38:49,204 --> 00:38:51,290 సిబెత్ సైన్యం చిన్నది. 418 00:38:51,373 --> 00:38:54,626 మనం ఆల్టూనాలో సన్నాహాలు చేసుకోవచ్చు. సైనికులను పోగేయవచ్చు. 419 00:38:54,710 --> 00:38:57,838 వాళ్ళు ఇక్కడ చేసినట్టు… ఏర్పాట్లు చేసుకోనే లోపు 420 00:38:57,921 --> 00:38:58,922 సిద్ధంగా ఉండగలం. 421 00:39:00,340 --> 00:39:01,675 మనకు ఎక్కువ సమయం లేదు. 422 00:39:02,801 --> 00:39:07,431 కెప్టెన్ గోసెట్, మీ మనుషులతో మన ప్రజలను వెంటనే పోగేయించండి. 423 00:39:08,473 --> 00:39:10,267 వారు మోయగల వాటికంటే ఎవరూ ఎక్కువ తీసుకురాకుండా చూడండి. 424 00:39:10,767 --> 00:39:14,730 హనీవా, నువ్వు ఇంకా రెన్ కలిసి కెప్టెన్ ని మీకు కనిపించిన సొరంగం దగ్గరకు తీసుకెళ్లండి. 425 00:39:20,736 --> 00:39:24,323 కొఫూన్, టమాక్టీ, రేంజర్. 426 00:39:25,866 --> 00:39:27,242 మాకు కొంచెం సమయం ఇవ్వండి. 427 00:39:40,005 --> 00:39:41,006 బాబా. 428 00:39:44,468 --> 00:39:45,761 నువ్వు ఏం మాట్లాడలేదు. 429 00:39:47,930 --> 00:39:52,100 నువ్వు రాణివి. నీ ప్రజలకు ఏది మంచిదో నీకు తెలుసు. 430 00:39:54,728 --> 00:39:57,022 అవును, నేను నా రాజ్య క్షేమం చూసుకోవాలి. 431 00:39:57,105 --> 00:40:01,652 కానీ నువ్వు నా భర్తవు. హనీవా ఇంకా కొఫూన్ లకు తండ్రివి. 432 00:40:03,320 --> 00:40:05,656 కాబట్టి మాకు ఏది మంచిదో నిర్ణయించే బాధ్యత నీది. 433 00:40:09,243 --> 00:40:10,369 నాకు అర్థం కావడం లేదు. 434 00:40:11,995 --> 00:40:14,581 నా అక్క మమ్మల్ని 17 ఏళ్ళు వెంటాడింది. 435 00:40:16,208 --> 00:40:19,294 అప్పుడు విరమించుకోలేదు, ఇప్పుడు కూడా విరమించుకోదు. 436 00:40:20,712 --> 00:40:22,548 ఈ కుటుంబాన్ని వెంటాడటం ఆమె ఎప్పటికీ ఆపదు. 437 00:40:27,886 --> 00:40:29,263 అయితే నువ్వు చెప్పేది ఏంటి? 438 00:40:31,139 --> 00:40:35,644 నువ్వు ఇన్ని రోజులుగా సరిగ్గానే చెప్పావు అంటున్నాను. 439 00:40:37,938 --> 00:40:40,315 ఒకసారి మనం పెన్సా ప్రజలను బయటకు తీసుకెళ్లాకా, 440 00:40:40,399 --> 00:40:45,404 నువ్వు, నేను, కొఫూన్, వుల్ఫ్ ఇంకా హనీవా కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. 441 00:40:46,071 --> 00:40:48,532 తిరిగి పర్వతాల మధ్యకు, లేదా ఇంకా దూరంగా, 442 00:40:49,074 --> 00:40:51,451 అక్కడ ఒకప్పుడు మనం కలిసి ఉన్నట్టు కుటుంబంగా ఉందాం. 443 00:40:54,162 --> 00:40:55,163 నేను ఇక్కడ లేను అని తెలిసి, 444 00:40:55,247 --> 00:40:58,876 బహుశా నా అక్క పయాన్లపై తన ఆక్రోశాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. 445 00:41:03,088 --> 00:41:04,089 కచ్చితంగా అంటున్నావా? 446 00:41:07,384 --> 00:41:10,679 నేను రాణిగా కంటే, అమ్మగానే ఎక్కువ కాలం గడిపాను. 447 00:41:12,097 --> 00:41:16,059 కాబట్టి నా కుటుంబ క్షేమమే నాకు ముఖ్యం కావడం వల్ల నేను చెడ్డ రాణిని అవుతాను అంటే… 448 00:41:18,520 --> 00:41:22,649 అప్పుడు నేను అసలు… రాణిని అయ్యుండకూడదు అని అర్థం. 449 00:41:25,736 --> 00:41:27,070 నాకు ఏమీ తెలీడం లేదు. 450 00:41:27,988 --> 00:41:30,073 -ఇక్కడ. -ఇక్కడ తాకాలా? 451 00:41:31,200 --> 00:41:32,242 ఓహ్, ఇప్పుడు తెలిసింది. 452 00:41:34,828 --> 00:41:36,872 -ఇదుగో. నీకు తెలుస్తుందా? -ఎక్కడ? ఓహ్, ఇక్కడ. 453 00:41:36,955 --> 00:41:39,625 లేదు. ఇంకా తెలీడం లేదా? 454 00:41:41,335 --> 00:41:44,880 నువ్వు నన్ను ముట్టుకోవడానికి కావాలనే దీన్ని వంకగా చూపుతున్నావు అనుకుంట. 455 00:41:44,963 --> 00:41:48,759 -బహుశా నేను నిన్ను ముట్టుకోవడం నీకు నచ్చినట్టు ఉంది. -అంటే, అది నిజమే కావచ్చు. 456 00:41:54,806 --> 00:41:56,058 నీకు ఇంకా ఏమీ తెలీడం లేదా? 457 00:41:58,393 --> 00:41:59,561 బహుశా బిడ్డకు నేను అంటే భయం ఏమో. 458 00:42:01,855 --> 00:42:04,191 బహుశా భయం వేసేది బిడ్డకు కాదేమో. 459 00:42:05,651 --> 00:42:08,529 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకు ఎందుకు భయం వేస్తుంది? 460 00:42:10,155 --> 00:42:11,865 ఎందుకంటే నువ్వు ముందెప్పుడూ తండ్రివి కాలేదు కదా. 461 00:42:15,369 --> 00:42:17,913 మరి ఈ బిడ్డ, ఇది నాది అవుతుందా? 462 00:42:24,837 --> 00:42:26,338 ఈ బిడ్డ నీ బిడ్డ కావాలని ఉందా? 463 00:42:30,259 --> 00:42:31,635 నువ్వు ఎంతగా కావాలని ఉందో అంతగా. 464 00:42:34,638 --> 00:42:36,473 అయితే మేము నీ వారమే. 465 00:42:43,939 --> 00:42:44,982 ఐ లవ్ యు. 466 00:42:49,987 --> 00:42:53,198 ఐ లవ్ యు, బాబా వాస్. 467 00:42:55,617 --> 00:42:57,119 ఐ లవ్ యు, మాగ్రా వాస్. 468 00:43:01,206 --> 00:43:03,083 మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం అనుకుంటున్నావా? 469 00:43:04,668 --> 00:43:05,878 ఇలా ఉండదు అని భయంగా ఉందా? 470 00:43:07,129 --> 00:43:08,380 నా భయం అంతా నా బిడ్డ గురించే. 471 00:43:14,136 --> 00:43:15,846 నీకు గాని, మన బిడ్డకు కానీ ఏమైనా అవుతుందంటే 472 00:43:15,929 --> 00:43:18,348 అందుకు ముందు మిమ్మల్ని కాపాడుతూ నేనే ప్రాణాలు విడుస్తాను. 473 00:43:20,601 --> 00:43:22,060 అలాగే మేము కూడా నిన్ను కాపాడతాం. 474 00:43:22,978 --> 00:43:23,979 అవును. 475 00:43:25,147 --> 00:43:27,566 -అవును, మీరు నన్ను కాపాడండి. నాకు అది కావాలి. -అవును. 476 00:43:27,649 --> 00:43:29,193 -ఓహ్, ఆగు. -ఏంటి? 477 00:43:29,276 --> 00:43:30,736 నీకు తెలుస్తుందా? 478 00:43:30,819 --> 00:43:32,362 -అవును. -అవునా? 479 00:43:32,446 --> 00:43:34,823 -బిడ్డ తన్నుతుంది. మళ్ళీ మళ్ళీ. -అవును. 480 00:43:35,824 --> 00:43:38,827 -ఓహ్, ఈ బిడ్డకు కోపం ఎక్కువ. -ఓహ్, వావ్. 481 00:43:38,911 --> 00:43:40,579 వాళ్ళ అమ్మలాగే కోపం ఎక్కువ. 482 00:43:41,288 --> 00:43:44,208 కోపమా? నాకు కోపం లేదు. ఏం మాట్లాడుతున్నావు? 483 00:43:44,291 --> 00:43:47,336 -లేదు, నీకు కోపం లేదు. -నాకు కోపం లేదు. ఏం మాట్లాడుతున్నావు? 484 00:43:48,212 --> 00:43:49,630 అలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. 485 00:43:49,713 --> 00:43:52,841 -చూడు. బిడ్డకు సోకు ఎక్కువ. -సోకు… 486 00:43:52,925 --> 00:43:55,135 మీ అమ్మలాగే సోకు, కోపం ఎక్కువ. 487 00:44:12,236 --> 00:44:13,987 నీ కుక్క కంపు కొడుతోంది. 488 00:44:14,571 --> 00:44:16,031 లెగు. 489 00:44:17,533 --> 00:44:18,909 లేదు, ఆ వాసన నా నుండి. 490 00:44:18,992 --> 00:44:20,118 లెగు, బాబు. 491 00:44:21,620 --> 00:44:23,163 నువ్వు ఇక ఇంటికి వెళ్ళాలి, మిత్రమా. 492 00:44:24,581 --> 00:44:27,793 నీ పుణ్యమా నా ఇల్లు పేలిపోయింది. 493 00:44:28,669 --> 00:44:31,547 -నేను అనేది ఏంటో నీకు తెలుసు. -నువ్వు అనేది నాకు తెలుసు. 494 00:44:36,718 --> 00:44:40,264 నేను దాదాపు 20 ఏళ్లుగా మనుషులకు దూరంగా ఉన్నాను. 495 00:44:42,683 --> 00:44:44,226 ఈ విపత్తులో నుండి బయట పడితే, 496 00:44:44,309 --> 00:44:47,354 అప్పుడు నేను ఇంకొక 20 ఏళ్ళు మనుషులకు దూరంగా బ్రతికే రోజు కూడా వస్తుంది. 497 00:44:48,772 --> 00:44:50,148 కానీ ఆ రోజు ఇవాళ కాదు. 498 00:44:51,650 --> 00:44:52,651 అలా మాట్లాడకు, రేంజర్. 499 00:44:53,569 --> 00:44:54,945 నీకు ఏమైనా జరిగితే, 500 00:44:55,028 --> 00:44:57,406 లు నన్ను వెంటాడి, వేటాడి మరీ నిద్రలో ఉండగా చంపుతుంది. 501 00:44:58,240 --> 00:45:02,828 లేదు. ఆమె ముందు నిన్ను నిద్రలేపి నువ్వు చస్తున్నావని తెలిసేలా చేసి చంపుతుంది. 502 00:45:06,248 --> 00:45:08,876 నేను పర్వతాలను వదిలేయాలని నిర్ణయించుకున్నాను. 503 00:45:09,668 --> 00:45:12,296 ఆ నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద పొరపాటు అయ్యుండొచ్చు, 504 00:45:13,088 --> 00:45:16,675 కానీ, ఈ ప్రస్తుతం అయితే, నా కత్తి ఇంకా పదునుగా ఉంది. 505 00:45:16,758 --> 00:45:19,928 నా గంజాయి కూడా మంచి కిక్కు ఇస్తుంది, సూర్యుని వెచ్చదనం నా మొఖం మీద హాయిగా అనిపిస్తోంది. 506 00:45:20,012 --> 00:45:23,056 కాబట్టి, పరిస్థితుల దృష్ట్యా, 507 00:45:24,308 --> 00:45:27,227 ఇక్కడ మన కథ ఎలా ముగుస్తోందో తెలుసుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. 508 00:45:29,897 --> 00:45:30,939 ఏమంటావు? 509 00:45:32,858 --> 00:45:34,902 ఆ గంజాయి మరీ ఎక్కువగా కాల్చుతున్నావు అనుకుంటున్నా. 510 00:45:36,403 --> 00:45:38,488 -అవును, అయ్యుండొచ్చు. -చాలా ఎక్కువ. 511 00:45:41,241 --> 00:45:43,118 లేదా నువ్వే సరిపడంత కాల్చడం లేదు అనుకుంట. 512 00:46:23,534 --> 00:46:25,619 ప్రజలందరినీ పోగేసాం. 513 00:46:25,702 --> 00:46:27,621 ఇక్కడ లేని మిగతా వారు వస్తున్నారు. 514 00:46:28,372 --> 00:46:29,665 నీ స్వరంలో నాకు తేడా తెలుస్తోంది. 515 00:46:33,126 --> 00:46:37,673 మనం దుప్పిని, దున్నని తింటాం కానీ, ఎలుగుబంటిని తినము, ఎందుకో తెలుసా? 516 00:46:39,925 --> 00:46:42,386 దుప్పిని, దున్నని వేటాడినప్పుడు, అవి పారిపోతాయి, 517 00:46:42,469 --> 00:46:44,304 కారణంగా అవి బలహీనపడిపోతాయి. 518 00:46:45,055 --> 00:46:48,433 కానీ ఎలుగుబంటిని వేటాడితే, అదే తిరిగి మనల్ని వేటాడుతుంది. 519 00:46:49,643 --> 00:46:52,771 ప్రకృతి నియమం ప్రకారం, పారిపోయేయే జీవి ముందు బలవుతుంది. 520 00:46:53,438 --> 00:46:56,066 మనం ఆల్టూనాకి వెళితే బ్రతికే అవకాశాలు ఎక్కువ అన్నావు కదా? 521 00:46:56,149 --> 00:47:00,070 అవును, కానీ ముందు మనం ఆల్టూనా వరకు వెళ్ళాలి కదా. 522 00:47:02,614 --> 00:47:04,157 అమ్మా, నన్ను క్షమించు. 523 00:47:04,241 --> 00:47:06,159 -ఇది… ఇదంతా నా తప్పే. -కొఫూన్. కొఫూన్. 524 00:47:06,243 --> 00:47:09,454 -ఇది నా పొరపాటు. నేను ఆమెను విడిపించాను. -నేను ఆమెను బ్రతకానిచ్చాను. 525 00:47:09,538 --> 00:47:12,791 హే, బంగారాలు. ఇలా రండి. 526 00:47:12,875 --> 00:47:14,209 హనీవా. 527 00:47:15,711 --> 00:47:19,756 మీరు కేవలం నాకు కుటుంబం మాత్రమే కాదు. మీరు నాకు అత్యంత అపురూపమైన ఆస్తి. 528 00:47:21,717 --> 00:47:24,636 నేను కూడా ఆల్కెన్నీ ప్రజలకు, ఇడో విషయంలో జరిగిన దానికి, 529 00:47:25,846 --> 00:47:30,642 అలాగే ఇంతకు ముందు జరిగిన వాటిని తలచుకొని బాధపడేవాడిని. 530 00:47:32,895 --> 00:47:36,106 కానీ, అప్పుడప్పుడు బుర్రపనిచేసే నా స్నేహితుడు, రేంజర్ నుండి నేను నేర్చుకున్నది ఏంటంటే, 531 00:47:36,190 --> 00:47:39,526 మనల్ని మనమే నిందించుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. 532 00:47:40,986 --> 00:47:43,614 జీవితంలో ఎప్పుడూ తర్వాత ఏం చేయబోతున్నాం అనే విషయం మీదే దృష్టి పెట్టాలి, గతం మీద కాదు. 533 00:47:45,157 --> 00:47:46,783 -అవును. -నువ్వు అలాగే చేస్తావా? 534 00:47:49,286 --> 00:47:50,954 తెలివైన వాడు ఎవడైనా అదే చేస్తాడు. 535 00:47:59,796 --> 00:48:02,341 పదండి, బంగారాలు. ఇక ఇక్కడి నుండి పోదాం. 536 00:48:07,554 --> 00:48:08,805 అమ్మా. 537 00:48:08,889 --> 00:48:09,890 ఇలా వెళ్ళాలి. 538 00:49:05,737 --> 00:49:08,031 పదా, బుజ్జి. వద్దు, వద్దు. 539 00:49:09,241 --> 00:49:11,618 -మనం ముందుకు వెళుతూనే ఉండాలి. -నాకు ఇంటికి వెళ్లాలని ఉంది. 540 00:49:11,702 --> 00:49:14,371 మనం వెళ్లలేం. మనం ఇలా ముందుకు వెళ్తూనే ఉండాలి. 541 00:49:14,454 --> 00:49:17,416 -లేదు, నాకు రావాలని లేదు. -బెల్లా, ప్లీజ్. 542 00:49:18,292 --> 00:49:22,880 ఒక్క నిమిషం. నీ పేరు బెల్లానా? 543 00:49:22,963 --> 00:49:25,299 -అవును. -ఓహ్, అది భలే అందమైన పేరు. 544 00:49:26,800 --> 00:49:27,968 నా పేరు మాగ్రా. 545 00:49:28,886 --> 00:49:29,887 నా రాణి. 546 00:49:31,013 --> 00:49:33,765 -నీకు భయంగా ఉందా, బెల్లా? -అవును. 547 00:49:33,849 --> 00:49:35,392 నాకు కూడా భయంగా ఉంది. 548 00:49:36,643 --> 00:49:39,313 కానీ ఒకటి చెప్పనా, నాకు సహాయం చేసేది ఒకటి నా దగ్గర ఉంది. 549 00:49:43,358 --> 00:49:44,359 దీన్ని తాకు. 550 00:49:45,861 --> 00:49:47,821 ఇదొక శబ్దం చేసే లోహం. 551 00:49:48,405 --> 00:49:50,908 అలాగే ఇది మాములు శబ్దం చేసే లోహం కాదు. 552 00:49:50,991 --> 00:49:53,619 ఇది రాణిగారి శబ్దం చేసే లోహం. 553 00:49:55,037 --> 00:49:56,038 ఇప్పుడు విను. 554 00:50:01,126 --> 00:50:06,256 దీనిని నా కోసం తీసుకొని, సురక్షితంగా ఉంచేవారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాను. 555 00:50:06,340 --> 00:50:08,550 -దీన్ని జాగ్రత్తగా చూసుకుంటావా? -చూసుకుంటాను. 556 00:50:08,634 --> 00:50:09,927 మంచిది. 557 00:50:11,970 --> 00:50:15,057 నా కోసం దీనిని సొరంగం చివరి వరకు తీసుకొస్తావా? 558 00:50:15,641 --> 00:50:19,144 నీకు భయం వేస్తే, ఇలా గోడకు కొట్టు, 559 00:50:20,354 --> 00:50:21,939 ఆ తర్వాత దాని శబ్దం విను. 560 00:50:22,689 --> 00:50:25,943 అలాగే ఒకటి గుర్తుంచుకో, నువ్వు రాణిగారి మనిషివి. 561 00:50:26,860 --> 00:50:27,861 సరేనా? 562 00:50:29,863 --> 00:50:31,448 ఇక వెళ్ళు, ధైర్యవంతురాలైన పిల్లా. 563 00:50:37,120 --> 00:50:38,413 -మాగ్రా. -చెప్పు. 564 00:50:39,039 --> 00:50:40,040 బంగారం. 565 00:50:43,669 --> 00:50:45,671 నువ్వు నిజంగా గొప్ప రాణివి, బంగారం. 566 00:50:48,966 --> 00:50:52,636 ఈ ప్రజలకు. అలాగే నాకు కూడా. 567 00:50:58,892 --> 00:50:59,893 పదా. 568 00:51:23,000 --> 00:51:26,545 ఇదే వేగంతో వెళితే, మనం ఇంకొక రోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 569 00:51:27,379 --> 00:51:29,715 అందరికంటే నెమ్మదిగా నడిచే వ్యక్తి వేగంతోనే మనం వెళ్ళాలి. 570 00:51:30,883 --> 00:51:33,552 బాబా వాస్, నువ్వు వెనుకవైపు చూసుకుంటావా? 571 00:51:35,762 --> 00:51:36,763 బాబా! 572 00:51:38,056 --> 00:51:39,057 బాబా? 573 00:51:40,267 --> 00:51:42,769 -ఆయన ఎక్కడ? -ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. 574 00:51:44,688 --> 00:51:45,689 ఆగండి! 575 00:51:47,441 --> 00:51:48,442 హనీవా! 576 00:51:52,404 --> 00:51:53,405 బాబా? 577 00:51:54,406 --> 00:51:56,033 -ఆయన ఎక్కడ? -బాబా? 578 00:51:57,034 --> 00:51:58,035 నాకు తెలీదు. 579 00:51:59,578 --> 00:52:00,579 నాన్నా! 580 00:52:00,662 --> 00:52:03,498 బహుశా దారి తప్పిన వారిని తీసుకురావడానికి వెళ్లినట్టు ఉన్నారు. 581 00:52:03,582 --> 00:52:05,542 -ఆయన్ని కనుగొనడానికి నేను కొందరిని పంపుతాను. -వద్దు. 582 00:52:06,793 --> 00:52:08,045 ఆయన అక్కడ ఉండడు. 583 00:52:08,629 --> 00:52:10,547 ఏమంటున్నావు? ఆయన నీకు ఏం చెప్పారు? 584 00:52:10,631 --> 00:52:13,300 తెలిస్తే నేను ఆపుతాను అని ఆయన నాకు ఏమీ చెప్పలేదు. 585 00:52:14,092 --> 00:52:16,887 నాకు నా గురించి కంటే, మీ నాన్న గురించి ఎక్కువ తెలుసు, మీకు కూడా. 586 00:52:17,513 --> 00:52:18,931 ఆయన వెనక్కి వెళ్ళాడు. 587 00:52:19,014 --> 00:52:21,725 -ఏంటి? -అంత పని ఎందుకు చేస్తారు? 588 00:52:21,808 --> 00:52:24,144 ఆయన ఒక సైన్యాన్ని ఒంటరిగా జయించలేరు. 589 00:52:26,855 --> 00:52:28,315 ఆయన నా అక్కని చంపడానికి వెళ్ళాడు. 590 00:53:15,237 --> 00:53:16,864 నువ్వు నిజంగానే చాలా ఎక్కువగా పొగ త్రాగుతున్నావు. 591 00:53:18,574 --> 00:53:19,575 అలాంటిది ఏమీ లేదు. 592 00:53:25,789 --> 00:53:26,790 ఎక్కడికి వెళ్తున్నావు? 593 00:53:29,084 --> 00:53:31,753 నేను ఆ క్రూరురాలైన రాణిని వేటాడి, దాని గుండెను తీసుకోవడానికి వెళ్తున్నాను. 594 00:53:31,837 --> 00:53:34,089 వినడానికి చాలా చెత్త ఐడియాలా ఉంది. 595 00:53:34,173 --> 00:53:35,382 నేను కూడా రావచ్చా? 596 00:53:35,465 --> 00:53:36,466 తప్పకుండా. 597 00:53:37,676 --> 00:53:39,303 తోడేళ్లతో జాగ్రత్త, బాబా వాస్. 598 00:53:40,512 --> 00:53:41,763 మనమే అసలైన తోడేళ్ళము. 599 00:53:42,306 --> 00:53:43,307 నిజమే. 600 00:54:55,128 --> 00:54:57,130 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్