1 00:00:01,127 --> 00:00:02,921 ఈ కథ నిజ జీవిత సన్నివేశాల ఆధారంగా రూపొందించబడింది. 2 00:00:03,004 --> 00:00:04,965 కొన్ని అంశాలు కల్పించబడ్డాయి. 3 00:01:19,831 --> 00:01:21,833 ప్రసారమవుతున్నది "మిస్టర్ సాంగ్" 4 00:01:23,460 --> 00:01:27,589 ఒక యధార్థ కథ ఆధారంగా రూపొందించబడింది 5 00:01:33,261 --> 00:01:34,471 కచ్చితంగా. 6 00:01:34,554 --> 00:01:37,557 ఇప్పుడు ప్లే చేసింది, రెవేరెండ్ తిమోతీ రైట్ పాట, "ఐ విల్ బి ఏ విట్నెస్". 7 00:01:37,641 --> 00:01:42,229 తర్వాత రాబోతున్నది, మైటీ ఇండియానా ట్రావెలర్స్ పాట "ఐ విల్ బి శాటిస్ఫైడ్". 8 00:01:42,312 --> 00:01:47,192 ఈ ప్రపంచంలోని మహిళలకు గౌరవం దక్కడం మొదలైతే నేను సంతృప్తి చెందుతాను. 9 00:01:47,275 --> 00:01:50,987 నేను డబ్ల్యూక్యూహెచ్జి రేడియో నుండి మార్తా జీన్ ద క్వీన్ ని. 10 00:01:51,571 --> 00:01:55,075 నువ్వు మళ్ళీ మొహాలు గీస్తున్నావా? అలా చేయొద్దని చెప్పాను కదా. అంతా శుభ్రం చెయ్. 11 00:01:55,158 --> 00:01:56,993 ఏంటి? నాకేం వినిపించడం లేదు. 12 00:01:57,452 --> 00:01:58,453 రేడియో ఆపు! 13 00:02:00,622 --> 00:02:02,749 నేను కిటికీ అద్దాలు కడగమని చెప్పాను. 14 00:02:02,832 --> 00:02:03,959 శుభ్రం చేశాను! 15 00:02:04,459 --> 00:02:05,669 నాకు అలా కనిపించడం లేదు. 16 00:02:07,087 --> 00:02:09,421 నువ్వు నాకు మరింత పని పెడుతున్నావు. అన్నీ శుభ్రం చెయ్! 17 00:02:12,884 --> 00:02:15,679 లూక్ 18 00:02:17,097 --> 00:02:18,515 గుండ్రంగా తుడవాలి! 19 00:02:19,891 --> 00:02:21,268 పైకి కిందకి కాదు! 20 00:02:26,523 --> 00:02:28,608 దీనికి, నీలం రంగు వేయాలా… 21 00:02:29,484 --> 00:02:32,112 లేదా పచ్చదా? 22 00:02:33,029 --> 00:02:33,863 నీలం. 23 00:02:35,657 --> 00:02:36,658 బాగా చెప్పావు. 24 00:02:39,077 --> 00:02:40,287 ఇప్పుడిక బయటకు వెళ్లి ప్లే చెయ్! 25 00:02:40,870 --> 00:02:42,372 -కనీసం ఒక గంట వాయించాలి! -సరే. 26 00:02:53,425 --> 00:02:56,803 అరేయ్ కుర్రాడా. నువ్వు "ఐ విల్ బి ఏ విట్నెస్" వాయిస్తున్నావా? 27 00:02:56,887 --> 00:02:57,929 అవును, మేడం. 28 00:02:58,972 --> 00:03:00,849 నేను ఇవాళ ఉదయమే దీనిని నా రేడియో కార్యక్రమంలో ప్లే చేశాను. 29 00:03:00,932 --> 00:03:01,933 ఆగండి… 30 00:03:02,017 --> 00:03:03,518 మీరు మార్తా జీన్ ద క్వీనా? 31 00:03:04,102 --> 00:03:06,187 -అవును. -మీరు చాలా ఫేమస్. 32 00:03:06,688 --> 00:03:09,691 మా అమ్మ రోజూ రేడియో కట్టేసే వరకు నేను మీ పాటలు వింటుంటాను. 33 00:03:09,774 --> 00:03:12,193 ఇక్కడి వారికీ నేను బాగానే తెలుసు అన్నమాట. నీ పేరు ఏంటి? 34 00:03:12,777 --> 00:03:16,740 లూక్ సాంగ్, జిన్-హో-సాంగ్ గారి కొడుకును, మిస్టర్ సాంగ్స్ వ్యాపార ఓనర్. 35 00:03:16,823 --> 00:03:19,659 మీ టోపీలు, వాటి యాక్ససరీస్ అవసరాలను తీర్చగల వన్-స్టాప్ షాప్. 36 00:03:20,285 --> 00:03:23,204 మీరు ఒకసారి లోనికి వచ్చి మేము అమ్మే నాణ్యమైన వస్తువులను చూస్తే మంచిది. 37 00:03:23,705 --> 00:03:26,917 సరే, మిస్టర్ లూక్ సాంగ్, నువ్వు అంత మర్యాదగా అడుగుతుంటే నేను కాదనలేను కదా? 38 00:03:29,502 --> 00:03:31,338 నేను దీనిని ఇప్పుడే పూర్తి చేశాను. 39 00:03:31,421 --> 00:03:33,256 ఇది మీకు సరిగ్గా సరిపోతుంది అనుకుంటున్నాను. 40 00:03:34,549 --> 00:03:39,804 సరే, ఇది నా భుజాలకంటే వెడల్పుగా ఏమీ లేదు. అది మంచి విషయమే. కానీ కొన్ని ప్రమాణాలు ఉండాలి కదా. 41 00:03:39,888 --> 00:03:41,097 సరే. 42 00:03:41,181 --> 00:03:44,684 ఇది ఎలా ఉంది? 43 00:03:44,768 --> 00:03:48,855 మీ ముఖానికి సరిపోదు. మీ మొహం గుండ్రంగా ఉంది. 44 00:03:49,814 --> 00:03:51,524 పెద్ద చందమామలాగ. 45 00:03:51,608 --> 00:03:55,862 -ఏమన్నారు? "చందమామా"? -ఆమె ఇంకా ఇంగ్లీషు నేర్చుకుంటుంది. 46 00:03:55,946 --> 00:03:57,405 లేదు, ఆమె ఇంగ్లీషు బాగానే ఉంది. 47 00:03:57,489 --> 00:03:59,908 నాతో నిర్మొహమాటంగా మాట్లాడే సేల్స్ వ్యక్తులంటే నాకు ఇష్టం. 48 00:04:01,451 --> 00:04:06,331 నా మొహం నిజంగానే చందమామలాగ ఉంది. నా పెద్ద మెదడు పట్టడానికని తల కూడా పెద్దగా ఉంది. 49 00:04:09,709 --> 00:04:10,794 ఇది ఎలా ఉంది? 50 00:04:11,503 --> 00:04:12,963 భలే, దీని షేప్ ఇంకా బాగుంది. 51 00:04:13,588 --> 00:04:15,257 చూద్దాం. 52 00:04:15,340 --> 00:04:16,341 దీనిలో ఏదో లోపిస్తోంది. 53 00:04:16,423 --> 00:04:19,469 -అవును, ఏదో లోపిస్తోంది. -అవును. మీరు మార్పులు చేయగలరా? 54 00:04:19,553 --> 00:04:22,472 -అవును. -అది మంచి విషయం. 55 00:04:22,556 --> 00:04:24,683 ఎవరికీ ఇంకొకరి దగ్గర ఉన్నది వేసుకొని బయటకు వెళ్లాలని ఉండదు కదా. 56 00:04:25,600 --> 00:04:27,727 ఆగండి. ఐడియా వచ్చింది. 57 00:04:27,811 --> 00:04:28,812 అవునా? 58 00:04:29,312 --> 00:04:31,147 నువ్వు ఎప్పుడైనా నల్లవారి చర్చికి వెళ్ళావా, లూక్? 59 00:04:31,773 --> 00:04:33,149 కొరియన్ మెథడిస్ట్ చర్చికి మాత్రమే వెళ్ళా. 60 00:04:34,025 --> 00:04:35,569 అక్కడ చాలా బోర్ కొడుతుంది. 61 00:04:36,611 --> 00:04:37,946 మీ నల్లవారి చర్చిలో కూడా బోర్ కొడుతుందా? 62 00:04:38,029 --> 00:04:39,030 లేదు. 63 00:04:40,740 --> 00:04:42,158 అవును. 64 00:04:42,909 --> 00:04:45,245 ఆమె ఈకలు పెట్టి తెచ్చింది. 65 00:04:45,328 --> 00:04:47,372 -అవును. -మీరు డిట్రాయిట్ కి ఎక్కడి నుండి వచ్చారు? 66 00:04:48,123 --> 00:04:49,624 సియోల్, సౌత్ కొరియా. 67 00:04:49,708 --> 00:04:50,709 చాలా మంచి విషయం. 68 00:04:50,792 --> 00:04:53,169 దేశం వదిలి పోవడం కంటే, దేశానికి ఒకరు వచ్చారని వినడం ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటుంది. 69 00:04:54,004 --> 00:04:56,214 కానీ మా వ్యాపారం అంత బాగా సాగడం లేదు. 70 00:04:56,298 --> 00:04:58,592 అంటే, కొంచెం టైమ్ పడుతుంది. కస్టమర్లు మెల్లిగా వస్తారు. 71 00:04:59,301 --> 00:05:01,386 ఈ ఊరును అందరూ వలసల ఊరు అని అంటుంటే విని విసుగుపుట్టేసింది. 72 00:05:01,469 --> 00:05:02,846 ఇక్కడ కూడా డబ్బున్న వారు ఉన్నారు. 73 00:05:04,431 --> 00:05:06,600 చూడండి, నచ్చిందా? 74 00:05:13,440 --> 00:05:15,650 కొరియన్ భాషలో "టోపీ" అని ఎలా అంటారు? 75 00:05:15,734 --> 00:05:16,943 మోజా. 76 00:05:17,027 --> 00:05:18,194 మోజా? అంతేనా? 77 00:05:18,278 --> 00:05:22,032 -అవును. -అవును. దానికి రెండు అర్థాలు ఉన్నాయి. 78 00:05:22,115 --> 00:05:26,786 ఒక అర్థం "టోపీ" అని, అలాగే ఆ మాటకు "తల్లి కొడుకు" అని కూడా అర్థం వస్తుంది. 79 00:05:31,166 --> 00:05:32,417 సరే. 80 00:05:32,500 --> 00:05:35,003 మోజా… అలాగే మోజా. 81 00:05:36,004 --> 00:05:39,299 ఓహ్, అబ్బా. ఇది భలే ఉంది, కదా? 82 00:05:39,925 --> 00:05:41,885 సరే, నాలుగవ చాప్టర్ మొదటి నుండి మొదలుపెట్టు. 83 00:05:41,968 --> 00:05:46,056 శాస్త్రీయమైన పద్ధతులు అంటే ఏంటి? శాస్త్రవేత్తలు సహజ ప్రపంచాన్ని గమనించినప్పుడు, 84 00:05:46,139 --> 00:05:48,558 వారు సహజంగా ఒక ప్రశ్న లేదా సమస్య ఉందన్న కోణం నుండి ఆలోచిస్తారు. 85 00:05:48,642 --> 00:05:50,644 కానీ శాస్త్రవేత్తలు వాటికి సమాధానాలను ఊహించి చెప్పరు. 86 00:05:50,727 --> 00:05:53,438 వారు శాస్త్రీయమైన పద్ధతులు వాడి, ఒక విధానంలో అడుగులేసి కనుగొంటారు. 87 00:05:53,521 --> 00:05:55,440 అత్యంత ప్రాధమిక పద్దతులను రెండవ ఫిగర్ లో చూపించారు. 88 00:05:56,608 --> 00:05:57,609 సన్నాసి. 89 00:05:58,902 --> 00:06:00,779 హేయ్! ఈ సన్నాసి మెడికల్ స్కూల్ కి వెళ్తాడు, 90 00:06:00,862 --> 00:06:02,781 వాడు డాక్టర్ అయిన తర్వాత మీ అందరి కోసం ఖర్చు చేస్తాడు! 91 00:06:02,864 --> 00:06:08,161 ఇలా ఎవరూ చేయరు, అమ్మా! వాళ్ళు టెక్స్ట్ బుక్ చదువుతారు. దానిని బట్టీ పట్టరు. 92 00:06:08,453 --> 00:06:09,287 ఫిర్యాదులు చేయొద్దు! 93 00:06:09,621 --> 00:06:12,582 కొరియాలో ఉండి ఉంటే, నువ్వు ప్రతీరోజు రాత్రి పది వరకు స్కూల్ లోనే ఉండేదానివి. 94 00:06:13,250 --> 00:06:15,460 కొరియా అంత గొప్పదైతే మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 95 00:06:16,211 --> 00:06:18,129 ఎందుకంటే మీ నాన్న బిజినెస్ భాగస్వాములు ఇక్కడ ఉన్నారు కాబట్టి. 96 00:06:18,213 --> 00:06:19,714 కానీ నాన్న ఎక్కువగా కొరియాలోని ఉంటారు కదా! 97 00:06:19,798 --> 00:06:23,051 సియోల్ తర్వాత న్యూయార్క్ లో. నేను రెండు వారాలు మాత్రమే వెళ్తుంటాను. 98 00:06:23,134 --> 00:06:25,053 మరి నా సెల్లో ప్రాక్టీసు సంగతి ఏంటి? 99 00:06:25,136 --> 00:06:26,930 ఓరి, నాయనో! 100 00:06:27,013 --> 00:06:32,519 నువ్వు ప్రశ్నలు అడుగుతూ తినడం మర్చిపోతున్నావు, అందుకే ఇంత సన్నగా, చిన్నగా ఉండిపోతున్నావు! 101 00:06:33,395 --> 00:06:36,565 నవ్వకు! నువ్వు కూడా తిను. 102 00:06:37,440 --> 00:06:39,276 మీరందరూ సన్నగానే ఉన్నారు. 103 00:06:40,443 --> 00:06:41,444 సన్నాసులు. 104 00:06:56,126 --> 00:06:58,044 నాన్నా? 105 00:07:01,089 --> 00:07:02,257 నాన్నా! 106 00:07:07,470 --> 00:07:11,016 నేను నీతో పాటు న్యూయార్క్ కి రావొచ్చా? 107 00:07:11,433 --> 00:07:13,268 నేను పని మీద వెళ్తుంటాను. 108 00:07:38,376 --> 00:07:40,170 -అవును. -అవును. 109 00:07:40,253 --> 00:07:42,380 నేను మార్తా జీన్ ద క్వీన్ ని. 110 00:07:42,464 --> 00:07:45,592 మీరందరూ నేను ఇలా ఈ ఉదయం మీతో రేడియో ద్వారా కాకుండా 111 00:07:45,675 --> 00:07:48,303 టీవీలో మాట్లాడుతుండాలని కోరుకోండి, 112 00:07:48,386 --> 00:07:52,140 ఎందుకంటే నేను ఇవాళ చాలా అందంగా రెడీ అయి వచ్చాను. 113 00:07:52,224 --> 00:07:57,187 ఎందుకు అంటారా? నేను మిస్టర్ సాంగ్స్ నుండి ఒక టోపీ కొనుక్కున్నాను. 114 00:07:57,270 --> 00:08:00,315 అమ్మా! అమ్మా! 115 00:08:00,982 --> 00:08:02,442 ఏమైంది? 116 00:08:02,859 --> 00:08:05,070 -ఇలా వచ్చి విను! వచ్చి విను! -డౌన్టౌన్ లో ఉండే వారంతా వినండి 117 00:08:05,153 --> 00:08:11,243 మీరు మిస్టర్ సాంగ్స్ అనబడే ప్రదేశం గురించి తెలుసుకోవాలి. ప్రపంచ స్థాయి సర్వీసుతో అత్యద్భుతమైన టోపీలు అమ్ముతారు. 118 00:08:12,077 --> 00:08:14,496 వచ్చే వారాంతం మళ్ళీ అక్కడికి వెళదాం అని అనుకుంటున్నాను. 119 00:08:14,913 --> 00:08:16,414 మనం ఫేమస్ అయిపోయాం! 120 00:08:20,085 --> 00:08:21,086 తెరిచి ఉంది లోనికి రండి 121 00:08:27,509 --> 00:08:31,304 నేను మరీ ఫొజు కొట్టాలి అనుకోవడం లేదు. ఈ వయసులో అది నాకు తగదు. 122 00:08:31,388 --> 00:08:36,183 కాకపోతే దేవుని దృష్టిలో పడి ఆయన నా మొర ఆలకించేలా ఒకటి కావాలి, సరేనా? 123 00:08:36,268 --> 00:08:37,851 ఆయనకు చాలా పనులు ఉంటాయి. 124 00:08:37,936 --> 00:08:41,188 ఈమెను దేవుడు గమనించాలి అంట. 125 00:08:41,856 --> 00:08:44,526 -ఇది ఆమె మొహాన్ని ఫ్రేమ్ చేస్తుందని చెప్పు. -ఏమండీ. 126 00:08:45,318 --> 00:08:46,903 మీ దగ్గర ఫాసినేటర్లు ఉన్నాయా? 127 00:08:46,987 --> 00:08:48,113 అవును, ఉన్నాయి. 128 00:08:48,655 --> 00:08:52,450 అమ్మా, మనం ఫాసినేటర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. 129 00:08:52,784 --> 00:08:54,828 శ్రీమతి ఎల్లిస్ గారిని పిలువు. 130 00:08:55,620 --> 00:08:57,622 ఇవాళ ఆటో కంపెనీలు బోనస్ ఇవ్వబోతున్నాయి. 131 00:08:57,706 --> 00:09:01,001 -దాని శబ్దం పెంచు, బుజ్జి. -అవును, నిజమే, బోనస్ రోజు. 132 00:09:01,084 --> 00:09:04,546 మీరందరూ మీ భర్తల దగ్గరకు వెళ్లి ఆ బోనస్ తీసుకోవడం మర్చిపోకండి. 133 00:09:04,629 --> 00:09:08,425 ఆష్లి, విన్నావా? మార్తా జీన్ ఇవాళ బోనస్ రోజు అంది. 134 00:09:08,508 --> 00:09:10,176 నువ్వు వెంటనే ప్లాంట్ దగ్గరకు వెళ్లడం మంచిది. 135 00:09:10,260 --> 00:09:12,137 నన్ను నమ్మండి, ఆ పనిలోనే ఉన్నాను. 136 00:09:12,804 --> 00:09:14,097 నేను ఎంత ఇవ్వాలి? 137 00:09:14,180 --> 00:09:15,599 అమ్మా, అది ఎంత? 138 00:09:15,932 --> 00:09:17,183 ట్యాగ్ మీద చూడు. 139 00:09:18,476 --> 00:09:19,936 25 డాలర్లు అండి. 140 00:09:22,606 --> 00:09:24,649 -యొమ్మ. -థాంక్స్. 141 00:09:54,596 --> 00:09:55,597 హలో? 142 00:09:56,097 --> 00:09:57,098 మార్తా జీన్! 143 00:09:58,016 --> 00:09:59,601 బాబు, ఆమెను లోనికి రానివ్వు. 144 00:09:59,684 --> 00:10:00,685 సరే. 145 00:10:03,605 --> 00:10:05,357 హలో. మీ అమ్మగారు ఉన్నారా? 146 00:10:05,440 --> 00:10:07,150 -నాతో వెనక్కి రండి. -థాంక్స్. 147 00:10:07,234 --> 00:10:09,236 లోనికి రండి. ఆమెకు ఒక కుర్చీ ఇవ్వు. 148 00:10:10,946 --> 00:10:12,656 -కూర్చోండి. అవును. -థాంక్స్. 149 00:10:12,739 --> 00:10:14,032 అంతా బాగానే ఉందా? 150 00:10:14,115 --> 00:10:16,701 మీరు స్టేషన్ కి ఫోన్ చేసారని చెప్పారు, అందుకని ఒకసారి కలుద్దామని వచ్చాను. 151 00:10:17,494 --> 00:10:19,371 -అంతా బాగానే ఉంది. -సరే. 152 00:10:19,454 --> 00:10:20,830 అవును. 153 00:10:22,832 --> 00:10:24,501 నువ్వు భలే ఆర్టిస్టువే. నేను చూడొచ్చా? 154 00:10:24,960 --> 00:10:26,419 తప్పకుండా. చూడండి. 155 00:10:28,129 --> 00:10:32,592 చెప్పాలంటే, ఇది చాలా అందంగా ఉంది. చాలా బాగా గీసావు. 156 00:10:33,385 --> 00:10:35,095 మేము మీకు ఎంత ఇవ్వాలి? 157 00:10:36,012 --> 00:10:37,013 నాకు ఇవ్వడమా? 158 00:10:38,098 --> 00:10:41,476 ఆమెకు చెప్పు. ఆమె రేడియో కార్యక్రమంలో మన గురించి చెప్పినందుకు. 159 00:10:42,060 --> 00:10:44,771 మా అమ్మ మీ ప్రకటనకు డబ్బులు ఇవ్వాలనుకుంటోంది. 160 00:10:45,981 --> 00:10:48,692 నేను వాణిజ్య ప్రకటనలు ఇవ్వను. నాకు నా టోపీ నచ్చింది కాబట్టే అక్కడ చెప్పాను. 161 00:10:49,568 --> 00:10:51,444 మంచి విషయం గురించి అందరికీ తెలియాలి కదా. 162 00:10:51,945 --> 00:10:53,822 ఆమెకు డబ్బులు వద్దు అంట. 163 00:10:57,534 --> 00:10:58,535 థాంక్స్. 164 00:10:58,618 --> 00:11:00,620 నేను 30 సంవత్సరాలుగా రేడియోలో పని చేస్తున్నాను, 165 00:11:00,704 --> 00:11:02,747 అలాగే ఇక్కడ ఏదైనా ఒకరి ద్వారా ఒకరికి తెలియడమే మాములు, కాబట్టి… 166 00:11:02,831 --> 00:11:08,587 సియోల్ లో కూడా అలాగే ఉండేది. కానీ ఇక్కడ మాకు ఎవరూ తెలీదు. 167 00:11:09,212 --> 00:11:10,672 పోనీలెండి, ఇప్పుడు నేను తెలుసు కదా. 168 00:11:14,342 --> 00:11:16,678 మీకు కృతజ్ఞతగా ఒక టోపీ ఇవ్వాలి అనుకుంటున్నాను. 169 00:11:17,178 --> 00:11:19,222 మా మిత్రురాలికి ఒక బహుమతి. 170 00:11:19,848 --> 00:11:22,559 మీ పెద్ద చందమామ లాంటి మొహానికి. 171 00:11:27,063 --> 00:11:29,399 సరే, థాంక్స్, కానీ మీ టోపీలు కొనడమే నాకు ఇష్టం. 172 00:11:29,941 --> 00:11:33,403 అలాగే లూక్, నీకు ఇష్టమైతే ఒక డ్రాయింగ్ ని కూడా కొనాలి అనుకుంటున్నాను. 173 00:11:33,904 --> 00:11:36,323 కొనడమా? నిజంగా? ఏది? 174 00:11:37,365 --> 00:11:38,783 -ఇది. -సరే. 175 00:11:39,701 --> 00:11:41,661 కానీ నువ్వు దాని మీద నీ సంతకం చేసి ఇవ్వాలి. 176 00:11:41,745 --> 00:11:42,954 సరే. 177 00:11:43,538 --> 00:11:45,081 ఏదోకరోజు దాని విలువ చాలా ఎక్కువ పలుకుతుంది. 178 00:11:45,165 --> 00:11:48,460 లేదు, ఇది నాకు హాబీ మాత్రమే. నేను డాక్టర్ ని అవుతాను. 179 00:11:50,837 --> 00:11:54,049 ఒక అణువు ధ్రువ సహితమైనదా, ధ్రువ రహితమైనదా అని తెలుసుకోవడానికి, 180 00:11:54,132 --> 00:11:57,427 మనం వాటిలో ఉండే లూయిస్ నిర్మాణాలను చూస్తుండడం మంచి పని. 181 00:11:58,011 --> 00:12:00,096 ధ్రువ రహితమైనవాటి సమ్మేళనం సౌష్టవంగా ఉంటుంది. 182 00:12:00,180 --> 00:12:03,683 కేంద్ర అణువు చుట్టూ ఉండే పక్కలు ఒకేలా ఉంటాయి. 183 00:12:04,601 --> 00:12:08,104 మనం మీథేన్ ని చూస్తే, మధ్యలో ఒక కేంద్ర కార్బన్ అణువు ఉంటుంది, 184 00:12:08,188 --> 00:12:11,524 దాని చుట్టూ అన్ని హైడ్రోజెన్ అణువులు ఉంటాయి. 185 00:12:11,608 --> 00:12:13,777 ధ్రువ సమ్మేళనాలు అన్నీ సౌష్టవంగా ఉంటాయి. 186 00:12:21,785 --> 00:12:23,286 ఇవాళ్టికి ఇంతే. 187 00:12:24,329 --> 00:12:28,583 మీ పరీక్షా పేపర్లు తెచ్చాను. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. 188 00:12:31,419 --> 00:12:32,462 థాంక్స్. 189 00:12:36,299 --> 00:12:37,592 -ఆలన్. ఏం పర్లేదు. -థాంక్స్. 190 00:12:40,720 --> 00:12:43,390 -లీ, నేను ఇంకా బాగా రాస్తావు అనుకున్నాను. -థాంక్స్, ప్రొఫెసర్. 191 00:12:43,473 --> 00:12:44,849 -ఆర్థర్. -చాలా సంతోషం. 192 00:12:47,477 --> 00:12:48,728 మిస్టర్ సాంగ్? 193 00:12:51,606 --> 00:12:52,607 క్షమించాలి. 194 00:12:56,361 --> 00:12:58,446 ఎప్పటిలాగే రాసావు. చాలా బాగుంది. 195 00:12:59,030 --> 00:13:00,782 నువ్వు ఈ రంగంలో మంచి విజయం సాధిస్తావు. 196 00:13:13,211 --> 00:13:14,921 వచ్చేశాడు! 197 00:13:15,005 --> 00:13:18,341 నా డాక్టర్ కొడుకు వచ్చాడు! 198 00:13:19,968 --> 00:13:23,722 -మరీ చిక్కిపోయావు. సరిగ్గా తింటున్నావా? -అవును. 199 00:13:24,139 --> 00:13:25,932 కస్టమర్లతో నాకు నీ సహాయం కావాలి. 200 00:13:26,016 --> 00:13:27,225 పాస్టర్ల భార్యలు ఇప్పుడే వచ్చారు. 201 00:13:28,643 --> 00:13:30,770 మార్తా జీన్! లూక్ వచ్చాడు! 202 00:13:32,022 --> 00:13:34,691 లూక్, హాయ్. 203 00:13:35,275 --> 00:13:37,402 -హాయ్. -ఇంటికి సెలవుల మీద వచ్చావా? వచ్చి కూర్చో. 204 00:13:37,485 --> 00:13:39,696 నేను ఈ టోపీని ఇంటికి రహస్యంగా తీసుకెళ్లాలి. 205 00:13:39,779 --> 00:13:42,949 నా భర్త "నేను కావాలా టోపీలు కావాలా" అన్నాడు. 206 00:13:43,033 --> 00:13:45,118 మీ ఎంపిక ఏమై ఉంటుందో మనిద్దరికీ తెలుసు. 207 00:13:47,287 --> 00:13:50,165 శనివారాలు మిస్టర్ సాంగ్స్ షాపుకు రావడం భలే ఉంటుంది. 208 00:13:51,416 --> 00:13:53,335 ఇది చాలా అందంగా ఉంది. 209 00:13:53,418 --> 00:13:54,836 చర్చిలో ఉండే ఆ మహిళలు ఎవరో నీకు తెలుసా? 210 00:13:55,337 --> 00:13:58,215 దాదాపు అందరూ తెలుసు. వాళ్లందరికీ నేను కూడా తెలుసు. 211 00:13:59,341 --> 00:14:02,052 నేను రేడియోలో పని చేస్తాను కాబట్టి కొంతమంది చర్చి సభ్యులు నాకు చెంచాగిరి చేస్తుంటారు. 212 00:14:02,135 --> 00:14:04,346 కానీ నా వెనుక ఎలా ఉంటారనేది ఇంకొక విషయం అనుకో. 213 00:14:04,846 --> 00:14:05,847 అవునా? 214 00:14:06,640 --> 00:14:08,475 ప్రవక్తలకు మహిళలు బోధించడం నచ్చదు. 215 00:14:09,059 --> 00:14:12,062 స్వీయ సాధికారత ఎక్కువై, దేవుని మీద భయం తగ్గుతుంది. 216 00:14:13,230 --> 00:14:16,107 ఏమో, నాకైతే ఆ స్వీయ సాధికారత కొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 217 00:14:16,983 --> 00:14:19,319 ఊరుకో. నువ్వు త్వరలో పెద్ద, పేరుగాంచిన డాక్టర్ వి అవుతావు. 218 00:14:21,154 --> 00:14:22,155 నేను కాకపోతే? 219 00:14:24,199 --> 00:14:25,325 నాకైతే ఆశ్చర్యం వేయదు. 220 00:14:26,243 --> 00:14:27,452 అవునా? 221 00:14:28,328 --> 00:14:29,579 నా కారు వరకు నాతో రా. 222 00:14:31,122 --> 00:14:32,707 డాక్టర్ వృత్తి నీకు సరిపోతుందని నాకు ఎప్పడూ అనిపించలేదు. 223 00:14:33,541 --> 00:14:35,794 నువ్వు పేరుగాంచిన ఆర్టిస్ట్ వి అవుతావు అనుకున్నాను. 224 00:14:35,877 --> 00:14:37,420 ఆ నమ్మకంతోనే నీ బొమ్మలు కొన్నాను. గుర్తుందా? 225 00:14:37,504 --> 00:14:39,589 మీరు చేసిన ఆ ఖర్చు వృధా అని నాకు అనిపిస్తోంది. 226 00:14:40,715 --> 00:14:42,467 మనం చివరికి ఏం అవుతామో ఎప్పటికీ తెలీదు. 227 00:14:43,885 --> 00:14:45,637 నేను నర్సు చదువు చదివాను. 228 00:14:47,347 --> 00:14:48,473 కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడు. 229 00:14:49,516 --> 00:14:50,976 మీరు మార్తా జీన్ ద క్వీన్. 230 00:14:51,851 --> 00:14:54,396 నీకు ఏం కావాలో నీకు మాత్రమే తెలుస్తుంది, మిస్టర్ సాంగ్. 231 00:14:59,943 --> 00:15:00,944 లూక్ సాంగ్ 232 00:15:27,637 --> 00:15:32,183 కాంస్టాంస్ తనకు యుసి డేవిస్ లా స్కూల్ లో సీటు వచ్చింది అని నీకు చెప్పిందా? 233 00:15:33,226 --> 00:15:35,395 లేదు. అది గొప్ప విషయం. 234 00:15:36,771 --> 00:15:42,777 నేను నాకు ఒక డాక్టర్ కొడుకు అలాగే లాయర్ కూతురు ఉన్నారని ఆంటీకి చెప్పాను. 235 00:15:42,861 --> 00:15:44,821 ఆమెను తలచుకుంటే నాకు బాధగా ఉంది. 236 00:15:46,114 --> 00:15:49,868 ఆమె కొడుకు, బ్యోన్గ్-హోం, తన తరగతిలో 28వ స్థానంలో ఉన్నాడు. 237 00:15:49,951 --> 00:15:51,912 వాడు మొదటి నుండి మొద్దోడే. 238 00:16:00,670 --> 00:16:02,130 నేను చదువు మానేస్తున్నాను. 239 00:16:05,342 --> 00:16:06,343 ఏంటి? 240 00:16:07,510 --> 00:16:08,803 నేను స్కూల్ కి వెళ్లడం లేదు. 241 00:16:11,598 --> 00:16:12,933 పిచ్చిగా మాట్లాడకు. 242 00:16:13,683 --> 00:16:14,851 సీరియస్ గా అంటున్నాను. నిర్ణయం ఇక మార్చుకోను. 243 00:16:16,019 --> 00:16:17,854 నీ చదువు దాదాపు ముగిసింది. 244 00:16:18,939 --> 00:16:20,357 ఇంకొక్క సెమిస్టరు మాత్రమే ఉంది. 245 00:16:20,440 --> 00:16:22,567 నేను ఈ వేసవి నా పోర్టిఫోలియో మీద పని చేసి 246 00:16:22,776 --> 00:16:24,486 తర్వాత ఆర్ట్ స్కూల్ కి అప్లై చేస్తాను. 247 00:16:27,489 --> 00:16:30,450 ఆర్ట్ స్కూల్! అది వెర్రితనం. 248 00:16:32,577 --> 00:16:33,787 నేను ఒక కళాకారుడిని అవుతాను. 249 00:16:36,915 --> 00:16:38,083 మేము… 250 00:16:39,251 --> 00:16:41,503 నీకోసం సర్వస్వం వదులుకున్నాం. 251 00:16:43,880 --> 00:16:45,840 నీకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. 252 00:16:46,883 --> 00:16:50,428 నువ్వు దానిని కాలరాస్తున్నావు. 253 00:16:52,681 --> 00:16:54,015 నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఉందా? 254 00:16:55,725 --> 00:16:56,851 ఆహ్? 255 00:17:06,902 --> 00:17:07,904 యోమ్మ. 256 00:17:09,030 --> 00:17:10,657 నాకు ఇదే కావాలని ఉంది. 257 00:17:10,739 --> 00:17:11,908 అయితే ఏంటి? 258 00:17:13,200 --> 00:17:16,912 మీ నాన్న ఓపెరా సింగర్ కావాలని అనుకున్నారు. 259 00:17:17,289 --> 00:17:21,501 కానీ ఆయన సోదరులు యుద్ధంలో చనిపోయిన తర్వాత ఆ పిచ్చి కోరికను వదులుకున్నారు. 260 00:17:21,584 --> 00:17:22,710 అవును! 261 00:17:23,587 --> 00:17:26,339 ఇప్పుడు అందుకు రోజూ బాధపడుతున్నారు! 262 00:17:27,340 --> 00:17:29,509 అందరికంటే ముందు నా బాధను ఆయనే అర్థం చేసుకోవాలి! 263 00:17:29,593 --> 00:17:31,803 ఆయనకు తన బాధ్యతలు ఏంటో తెలుసు! 264 00:17:32,095 --> 00:17:33,597 ఆయన తన కుటుంబం కోసం ఆలోచించారు. 265 00:17:33,889 --> 00:17:35,348 నేను కూడా ఆలోచిస్తాను! 266 00:17:36,141 --> 00:17:38,810 -అందుకని నేను బాధపడాలంటే… -బాధపడడమా? 267 00:17:39,144 --> 00:17:40,854 బాధపడడం అంటే ఎలా ఉంటుందో నీకు తెలీదు. 268 00:17:40,937 --> 00:17:42,689 మార్తా జీన్ నాకు ప్రతిభ ఉంది అన్నారు. 269 00:17:43,648 --> 00:17:44,608 ఏంటి? 270 00:17:45,066 --> 00:17:47,360 నా ఉద్దేశం సరైనదే అని మార్తా జీన్ అనుకుంటుంది! 271 00:17:48,737 --> 00:17:50,488 మన ఇప్పుడు మార్తా జీన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? 272 00:17:52,782 --> 00:17:54,117 మార్తా జీన్ నీ తల్లా? 273 00:17:57,787 --> 00:17:59,539 పిచ్చి వాగుడు. 274 00:18:03,752 --> 00:18:05,754 నేను వాడికి చదువు మానమని అస్సలు చెప్పలేదు. 275 00:18:05,837 --> 00:18:07,589 మీరు వాడికి ఆలోచన ఇచ్చారు. 276 00:18:07,672 --> 00:18:09,174 వాడిని ప్రోత్సహించడానికి చూసాను. 277 00:18:09,257 --> 00:18:11,593 వాడు సంతోషంగా లేడు. ఆ కుర్రాడికి మొదటి నుండి సృజనాత్మకత ఎక్కువ. 278 00:18:11,676 --> 00:18:12,928 వాడికి ఇంకొక్క సెమిస్టరు మాత్రమే మిగిలి ఉంది! 279 00:18:13,011 --> 00:18:15,889 పూర్తి చేసి, అందమైన, సురక్షితమైన జీవితాన్ని పొందడానికి దగ్గరగా వెళ్ళాడు. 280 00:18:15,972 --> 00:18:17,390 ఇప్పుడు అదంతా వృధా అయిపోతుంది. 281 00:18:17,933 --> 00:18:22,395 నేను అనుభవించిన కష్టాలు నా పిల్లలు ఎప్పటికీ అనుభవించకూడదు అనుకున్నాను. 282 00:18:22,979 --> 00:18:25,982 ఒక యుద్దాన్ని చూసాను. మీరు ఎప్పుడైనా ఒక యుద్ధం ఎలా ఉంటుందో చూసారా? 283 00:18:26,066 --> 00:18:29,319 నేను 1967లో డెట్రాయిట్ లో నల్లజాతి మహిళగా నివసించాను. 284 00:18:29,402 --> 00:18:30,654 వాడు నా కొడుకు. 285 00:18:31,196 --> 00:18:35,325 మీరు రేడియోలో ఉన్నంత మాత్రాన మేము ఏం చేయాలో మాకు చెప్పగలను అనుకుంటున్నారా? 286 00:18:35,909 --> 00:18:37,369 మీరు కేవలం ఒక కస్టమర్. 287 00:18:39,537 --> 00:18:40,705 మీరన్నది నిజమే. 288 00:18:41,331 --> 00:18:44,167 మీరు వాడి అమ్మ. నేను కేవలం ఒక కస్టమర్ ని. 289 00:18:45,502 --> 00:18:48,880 కానీ మీరు ఇలాగే ఉంటే, త్వరలోనే వాడిని పోగొట్టుకుంటారు. 290 00:19:26,793 --> 00:19:28,211 నాన్నా… 291 00:19:34,259 --> 00:19:38,388 నాకు పార్సన్స్ స్కూల్ లో డిజైన్ లో స్కాలర్ షిప్ తో సీటు వచ్చింది. 292 00:19:39,556 --> 00:19:41,600 నేను మిమ్మల్ని ఏమీ అడగడం లేదు. 293 00:19:47,689 --> 00:19:49,858 ఈ ఓపెరా దేని గురించో నీకు తెలుసా? 294 00:19:51,318 --> 00:19:55,780 ఒక కుర్రాడు ఒకే రోజులో తన జీవితాన్ని నాశనం చేయగల 295 00:19:56,615 --> 00:19:58,074 నిర్ణయం తీసుకోవడం గురించి. 296 00:20:11,004 --> 00:20:14,466 మీ జీవితంలో మీరు కోరుకున్నది మీకు దక్కనందుకు నాకు బాధగా ఉంది. 297 00:20:17,219 --> 00:20:21,514 నేను ఎనిమిది ఆర్ట్ స్కూల్స్ కి అప్లై చేశాను, అన్నిటిలో నాకు సీటు వచ్చింది. 298 00:20:24,559 --> 00:20:26,353 ఇందులో నాకు చాలా నైపుణ్యం ఉంది. 299 00:20:38,073 --> 00:20:43,245 పార్సన్స్ 300 00:21:11,106 --> 00:21:16,653 సరే, మనం ఆర్ట్ గురించి మాట్లాడితే, దేనినైనా చూసే విధానాల గురించి మాట్లాడాలి, సరేనా? 301 00:21:17,237 --> 00:21:19,489 గుర్తించుకోండి, ఈ క్లాసులో మీరు విమర్శ చేయడం నేర్చుకుంటున్నారు, 302 00:21:19,573 --> 00:21:23,910 కాబట్టి మీ ప్రేక్షకుల ముందు చెప్పబోయే విషయాన్ని ఆలోచించుకొని ఉండండి. 303 00:21:31,585 --> 00:21:32,752 కదలిక లేనిది ఎందుకు గీశావు? 304 00:21:33,962 --> 00:21:36,423 నాకు డచ్ మాస్టర్లు గీసినట్టు గీయడం చాలా ఇష్టం. 305 00:21:37,090 --> 00:21:38,383 నాకు ఆ టెక్నీక్ చాలా ఇష్టం. 306 00:21:40,677 --> 00:21:42,846 నీకు పెర్సిమ్మోన్స్ తో వ్యక్తిగత సంబంధం ఏమైనా ఉందా? 307 00:21:44,431 --> 00:21:47,893 లేదు. నాకు ఆ రూపాలు, రంగులు ఇష్టం అంతే. 308 00:21:49,144 --> 00:21:51,062 అది ఇక్కడ ఎందుకు ప్రాముఖ్యం అనుకుంటున్నావు? 309 00:21:54,566 --> 00:21:57,402 నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంతే. 310 00:21:57,485 --> 00:21:58,486 ఇది అందంగా ఉంది. 311 00:22:00,697 --> 00:22:01,948 అంతే. అదే నా ఉద్దేశం. 312 00:22:04,284 --> 00:22:05,285 సరే. 313 00:22:06,202 --> 00:22:07,203 తర్వాతది చూద్దాం. 314 00:22:08,038 --> 00:22:10,749 గావిన్, ఇక్కడ నీ సందేశం ఏంటి? 315 00:22:11,875 --> 00:22:13,919 పరిస్ధితివాదమే అని చెప్పాల్సిన పని లేదు. 316 00:22:14,502 --> 00:22:17,964 నేను గై డెబోర్డ్ రాసిన "ది సొసైటీ ఆఫ్ ది స్పెక్టకెల్" స్పూర్తితో ఇది గీశాను. 317 00:22:18,048 --> 00:22:21,301 అది పెట్టుబడిదారీ విధానంపై చేసిన వ్యాఖ్యానం. 318 00:22:22,010 --> 00:22:24,930 1960ల నాటి చిత్రాన్ని ఎంచుకోవడం వెనుక ఏమైనా కారణం ఉందా? 319 00:22:52,165 --> 00:22:55,502 గత ఏడాదిగా మనం ఇదే మాట్లాడుకుంటున్నాం. 320 00:22:56,044 --> 00:22:58,129 దీని వెనుక నీకు ఒక బలమైన ఉద్దేశం ఉండాలి. 321 00:22:58,213 --> 00:23:01,007 అంటే, నీ నిర్ణయాలను ఒకసారి చూసుకో. 322 00:23:01,091 --> 00:23:04,135 లూక్, నువ్వు గీసిన కళను నువ్వు వివరించగలగాలి. 323 00:23:04,219 --> 00:23:06,513 నాకు ఏమీ వివరించాలని లేదు, సరేనా? 324 00:23:06,596 --> 00:23:09,015 నాకు జనం నా కళతో నిండి ఉన్న గ్యాలరీలోకి వచ్చి 325 00:23:09,099 --> 00:23:11,476 అక్కడి దృశ్యాలను చూసి సంబరపడడం మాత్రమే కావాలి. 326 00:23:11,560 --> 00:23:13,603 లేదు. కేవలం కనిపించేదాని గురించి మాత్రమే కాదు. 327 00:23:13,687 --> 00:23:16,064 ఆర్టిస్ట్ మరియు వీక్షకుల మధ్య ఒక సంభాషణ… 328 00:23:16,147 --> 00:23:18,233 ఎందుకు? అది సోమరిపోతుల పని, సరేనా? 329 00:23:18,316 --> 00:23:21,987 సంభావిత ఆర్ట్ ఒక దరిద్రం. నైపుణ్యం లేని వారు కనిపెట్టిన ఒక సాకు. 330 00:23:24,030 --> 00:23:29,369 లూక్, నేను… లూక్, ఈ ఏడాది మొత్తం నేను నీ నుండి ఆశించింది నువ్వు కొంచెం అలోచించి మాట్లాడాలనే. 331 00:23:30,537 --> 00:23:33,540 అంతే. అంటే, ఎంతైనా ఇదొక స్కూల్ కదా. 332 00:23:35,625 --> 00:23:37,294 మీ దగ్గర ఎలాంటి సిలబస్ కూడా లేదు. 333 00:23:51,766 --> 00:23:53,435 ఇదేమి సత్రం కాదు. 334 00:23:54,936 --> 00:23:58,023 నువ్వు ఇంట్లో ఉండాలి అంటే, నువ్వు పని చేయాలి. నువ్వు స్టోర్ లో సహాయం చేయాలి. 335 00:23:58,440 --> 00:23:59,482 వారానికి ఆరు రోజులు. 336 00:24:00,775 --> 00:24:02,277 ఇక సంతోషపడు. 337 00:24:03,486 --> 00:24:05,071 నాకు సంతోషపడాలని లేదు. 338 00:24:10,410 --> 00:24:11,786 నాకు ఇంకా కోపంగానే ఉంది. 339 00:24:20,837 --> 00:24:22,130 ప్లే అవుతున్నది 340 00:24:22,214 --> 00:24:24,132 మీకు కచ్చితంగా సాధించాలని ఉంటే, 341 00:24:24,216 --> 00:24:27,427 ఈ ప్రపంచంలో జరిగేవాటిని ఎక్కువగా పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి. 342 00:24:27,510 --> 00:24:29,012 డబ్ల్యూఓహెచ్జి ఎఫ్ఎం 87.4 343 00:24:29,095 --> 00:24:33,141 మీరు డబ్ల్యూఓహెచ్జి లో మార్తా జీన్ ద క్వీన్ మాటలు వింటున్నారు. 344 00:24:42,984 --> 00:24:44,152 -హెయ్. -హాయ్. 345 00:24:45,237 --> 00:24:46,571 ఈ పాట ప్లే అయ్యే వ్యవధిలో మనం మాట్లాడుకోవచ్చు. 346 00:24:46,655 --> 00:24:48,823 మూడు నిమిషాల్లో నాకు అంతా చెప్పు. న్యూయార్క్ ఎలా ఉంది? 347 00:24:51,409 --> 00:24:52,410 అంత బాగా లేదు. 348 00:24:53,745 --> 00:24:55,330 -ఒక కుర్చీ తెచ్చుకో. -సరే. 349 00:25:00,752 --> 00:25:03,838 అంటే, నేను ఇప్పటికి రెండు సార్లు చదువు మానేశాను. 350 00:25:05,215 --> 00:25:08,718 అది నా వల్ల కాలేదు. నాకు ఆ సత్తా లేదు అనుకుంట. 351 00:25:09,594 --> 00:25:14,140 అంటే, న్యూయార్క్ లో నిలదొక్కుకోవడం కష్టం. కానీ డిట్రాయిట్ లో కళను అభినందించేవారు బాగానే ఉన్నారు. 352 00:25:14,224 --> 00:25:16,142 డిట్రాయిట్ నుండి అనేకమంది గొప్ప కళాకారులు పుట్టుకొచ్చారు. 353 00:25:16,226 --> 00:25:17,727 నేను ఆర్టిస్ట్ ని అని నాకు అనిపించడం లేదు. 354 00:25:17,811 --> 00:25:20,021 -నువ్వు కచ్చితంగా ఆర్టిస్టువే. -లేదు, అలా అనొద్దు. 355 00:25:20,772 --> 00:25:23,858 సరేనా, మీరు ఇంతకు ముందు అలాగే అన్నారు, అప్పుడు మీ మాట వినకుండా ఉండాల్సింది. 356 00:25:23,942 --> 00:25:27,028 -నేనా? ఇందులో నేనేం చేశాను? -నాకు ఇది చేయమని చెప్పింది మీరే. 357 00:25:27,112 --> 00:25:31,199 అంటే, నేనేం అన్నీ కరెక్టుగా చెప్పలేను. నా పిల్లల్లాగే నువ్వు కూడా నా మాట వినకుండా ఉండు. 358 00:25:32,534 --> 00:25:34,202 ఓహ్, లేదు. ఆహ్-హా. 359 00:25:34,286 --> 00:25:38,373 అలా అనడానికి నేను ఒప్పుకోను నేనేం నీ బాస్ ని కాను. 360 00:25:38,456 --> 00:25:40,875 నువ్వు కోరుకున్నవి అన్నీ నీకు దక్కకపోవచ్చు. 361 00:25:41,459 --> 00:25:46,840 కానీ ఇలా నీ గురించి నువ్వే బాధపడుతూ కూర్చుంటే, నువ్వు ఏమీ సాధించలేవు. 362 00:25:46,923 --> 00:25:49,175 నువ్వు నీ అమ్మగాడి కొడుకువి. 363 00:25:51,219 --> 00:25:54,848 ఆమెకు నా మీద ఇంకా కోపంగా ఉంది, తెలుసా? నేను ఆ షాప్ లో ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. 364 00:25:56,391 --> 00:25:59,603 మీ కుటుంబం వారు చాలా డ్రామా చేస్తారు. 365 00:26:01,438 --> 00:26:02,731 బయటకు పో. 366 00:26:06,943 --> 00:26:08,361 లూక్ 367 00:26:08,945 --> 00:26:10,488 మీ దగ్గర అది నిజంగానే ఉందా? 368 00:26:11,072 --> 00:26:12,741 అవును. కానీ ఇప్పుడు దానికి ఎలాంటి విలువ లేదు అని అన్నావు 369 00:26:12,824 --> 00:26:15,243 కాబట్టి నేను దాన్ని విసిరేయబోతున్నాను. 370 00:26:15,785 --> 00:26:17,370 దానిని అమ్మితే వచ్చే డబ్బుతో రిటైర్ అవుదాం అనుకున్నా. 371 00:26:19,247 --> 00:26:20,415 బయటకు పో. 372 00:26:46,858 --> 00:26:47,859 మార్తా జీన్. 373 00:26:49,945 --> 00:26:51,029 మిమ్మల్ని చూడడం సంతోషం. 374 00:26:52,989 --> 00:26:53,990 మీకు కొత్త టోపీ కావాలా? 375 00:26:56,243 --> 00:26:58,286 ఇంకా స్టైల్ గా ఉండాలి. అందరి కళ్ళలో పడాలి. 376 00:26:58,370 --> 00:27:01,998 పొడుగ్గా. బాగా పొడుగ్గా. నెఫ్రెటిటి టోపీలా. వేసుకుంటే నిజమైన రాణిలా ఉండాలి. 377 00:27:03,124 --> 00:27:04,668 -ఆరు ఇంచులా? -పన్నెండు ఇంచులు. 378 00:27:04,751 --> 00:27:06,044 -సరే. -అది ఫ్యాషన్ కాదు. 379 00:27:06,127 --> 00:27:07,379 నేను వేసుకుంటే అవుతుందిలే. 380 00:27:07,921 --> 00:27:11,591 బాగా పొడువు ఎక్కువైంది. నిలబడదు. ఐసు కరిగినట్టు పడిపోతుంది. 381 00:27:11,675 --> 00:27:13,927 -ఇలాగ అంటారా? -బొమ్మ గీస్తే నిజమైపోదు. 382 00:27:14,010 --> 00:27:16,596 లూక్ సరిగ్గా గీశాడు. అవును, అది నచ్చింది! 383 00:27:16,680 --> 00:27:18,682 ఎత్తు ఎక్కువైంది, చేయలేము. 384 00:27:18,765 --> 00:27:20,976 -మనం దాన్ని పెద్దగా చేయగలం. -దాని నిర్మాణానికి ఏం వాడతాం మరి? 385 00:27:21,059 --> 00:27:23,395 -వైర్లు. -వైర్లు నిలబడవు. 386 00:27:23,478 --> 00:27:26,064 -స్టేపుల్ చేయొచ్చు. -అది అర్థంలేని వాగుడు. అలా చేయలేము. 387 00:27:26,147 --> 00:27:28,692 మీరిద్దరూ మాట్లాడుకుంటే పని పూర్తి అవుతుందని నా ఉద్దేశం. 388 00:27:28,775 --> 00:27:30,068 లేదు, ఇక్కడ చూడు. 389 00:27:30,151 --> 00:27:31,570 -అవ్వదు. -ఒకసారి ఇక్కడ చూడు. 390 00:27:31,987 --> 00:27:33,822 లేదు. వెళ్లి మార్తా జీన్ తో కలిసి నువ్వే చెయ్. 391 00:27:33,905 --> 00:27:35,699 ఇలా బాగుంది అనిపిస్తుంది. 392 00:27:37,367 --> 00:27:38,785 మేము ఇది చేయగలం. 393 00:28:35,342 --> 00:28:36,843 ఒకదానిపై ఇంకొకటి అచ్చులు పెట్టు. 394 00:28:37,886 --> 00:28:39,221 ఎత్తుకోసం. 395 00:28:40,180 --> 00:28:41,765 అది మడతపడిపోకుండా 396 00:28:42,307 --> 00:28:43,808 బొనింగ్ ని పెట్టాలి. 397 00:28:45,143 --> 00:28:46,144 సరే. 398 00:28:47,312 --> 00:28:49,105 చుట్టూ ఇలా పెట్టాలి. 399 00:29:18,718 --> 00:29:21,012 -చెప్పాను కదా, చూడు? అంతే. -సరే. 400 00:29:34,150 --> 00:29:36,027 టోపీ పూర్తి అయింది. 401 00:29:37,779 --> 00:29:39,281 నెఫెర్టిటి కోసమే చేసినట్టు ఉంది. 402 00:29:40,448 --> 00:29:42,367 ఈసారి మీ పనితనంతో నా మతి పోగొట్టారు. 403 00:29:42,450 --> 00:29:43,493 థాంక్స్. 404 00:29:43,994 --> 00:29:45,120 నేను చూసుకోవచ్చా? 405 00:29:48,248 --> 00:29:51,585 అద్భుతం. నేను చస్తే ఈ టోపీ పెట్టుకునే చస్తాను. 406 00:29:51,668 --> 00:29:53,044 ఇక్కడ చావు గురించి మాట్లాడకండి. 407 00:29:53,753 --> 00:29:55,171 పొగిడినప్పుడు అలా మాట్లాడొద్దు. 408 00:29:56,214 --> 00:29:58,341 ఇప్పుడు మీరిద్దరూ చర్చికి వచ్చి, మీ టోపీ అక్కడ సృష్టించబోయే అలజడిని చూడాలి. 409 00:29:58,425 --> 00:30:00,051 ఓహ్, లేదు. మేము అన్యులం. 410 00:30:00,135 --> 00:30:02,137 -మేము అన్యులను చేర్చుకుంటాం. -నేను తీసుకొస్తా. 411 00:30:02,679 --> 00:30:05,599 చివరికి మిస్టర్ సాంగ్స్ లో మిస్టర్ సాంగ్ పని చేస్తున్నాడు. 412 00:30:14,691 --> 00:30:16,776 సరే, ఈ కింది భాగాన్ని ఎలా చేసావో చూడనీ. దానిని ఇలా ఇవ్వు. 413 00:30:22,449 --> 00:30:23,533 సరే. 414 00:30:28,246 --> 00:30:29,122 వావ్… 415 00:30:29,873 --> 00:30:34,252 ఈ ఆకారం ఒకరి తలపై నిలబడుతుంది అన్న ఆలోచన కూడా నాకు వచ్చి ఉండేది కాదు. 416 00:30:35,378 --> 00:30:38,506 చూశావా, నేను చదివిన అనాటమీ ఊరకనే పోలేదు. 417 00:30:43,178 --> 00:30:45,639 నేను దీనిని "పక్షి గూడు" అని పిలుస్తాను. 418 00:30:49,976 --> 00:30:52,854 నేను వీటిని నీ వల్లే మాత్రమే చేస్తానని నీకు తెలుసు కదా? 419 00:30:53,730 --> 00:30:56,608 నా చిన్నప్పుడు నేను నిన్ను చూసేవాడిని. 420 00:30:57,108 --> 00:31:00,654 నీకు ఒక ఐడియా వస్తే, దానిని నువ్వు చేసేసేదానివి. 421 00:31:01,905 --> 00:31:03,406 నేను కుట్టేదాన్ని అంతే. 422 00:31:05,533 --> 00:31:06,910 నువ్వు ఒక ఆర్టిస్టువి, అమ్మా. 423 00:31:07,410 --> 00:31:08,411 లేదు. 424 00:31:09,621 --> 00:31:12,332 అవును, నువ్వు ఒక ఆర్టిస్టువి. 425 00:31:16,086 --> 00:31:20,048 ఇన్ని రోజులు నేను ఏం కావాలా అని ఆలోచించుకుంటూ ఉన్నాను… 426 00:31:22,384 --> 00:31:23,385 యోమ్మ… 427 00:31:24,511 --> 00:31:26,721 నాకు నీలా కావాలని ఉందేమో. 428 00:31:37,941 --> 00:31:39,776 నా చుట్టూ నేను చూస్తుంటే, 429 00:31:39,859 --> 00:31:42,696 మీలో కొందరికి ఇవాళ ఇక్కడికి రావడం ఇష్టం లేదు అని తెలుస్తోంది. 430 00:31:43,738 --> 00:31:48,451 ఇవాళ ఉదయం నిరాశతో నిద్ర లేచినవారు ఒకరు ఇక్కడ ఉన్నారు. 431 00:31:49,369 --> 00:31:54,541 నిరాశ, నిస్పృహతో. అవి ఉన్నా కూడా, మీరు వచ్చారు. 432 00:31:55,750 --> 00:31:58,628 మీరు దేవుని మందిరంలో ఉన్నారు. ప్రాణాలతో ఉన్నారు. 433 00:31:58,712 --> 00:32:02,215 ఊపిరి తీసుకుంటున్నారు. చాలా అందంగా ఉన్నారు. ఆమెన్? 434 00:32:02,299 --> 00:32:04,009 ఆమెన్. 435 00:32:04,092 --> 00:32:07,345 "నేను నడిచే క్రమంలో ఎవరికైనా సహాయం చేయగలిగితే… 436 00:32:08,555 --> 00:32:11,933 నా మాట లేదా పాటతో ఎవరికైనా స్ఫూర్తిని నింపితే, 437 00:32:13,018 --> 00:32:16,813 ఎవరికైనా వారు ఎంచుకున్న మార్గం తప్పని చెప్పగలిగితే, 438 00:32:17,480 --> 00:32:20,400 అప్పుడు నా జీవితం వృధా కాలేదని తెలుసుకోగలను." 439 00:32:20,483 --> 00:32:21,776 -ఆమెన్. -ఆమెన్. 440 00:32:21,860 --> 00:32:25,906 నేను, నా జీవితం వృధా కాలేదని తెలుసుకోగలను అన్నాను. ఆమెన్? 441 00:32:26,531 --> 00:32:28,742 ప్రభువా, మీకు కృతఙ్ఞతలు. మేము మీ ఇంట ఉన్నాం… 442 00:32:29,910 --> 00:32:31,369 -ఆమెన్! -ఓహ్, అవును. 443 00:32:31,453 --> 00:32:35,582 ఓహ్, నా శ్రమలో 444 00:32:35,665 --> 00:32:36,958 దేవుడు నాకు కిరీటం ఇస్తాడు 445 00:32:37,042 --> 00:32:39,461 ఓహ్, నా శ్రమలో 446 00:32:39,544 --> 00:32:41,963 ఓహ్, దేవుడు నాకు కిరీటం ఇస్తాడు 447 00:32:42,047 --> 00:32:44,966 ఓహ్, నా శ్రమలో 448 00:32:45,050 --> 00:32:46,635 దేవుడు నాకు కిరీటం ఇస్తాడు 449 00:32:46,718 --> 00:32:47,719 ఆయన నాకు చెప్పాడు 450 00:32:47,802 --> 00:32:51,473 ద్రాక్ష తోటలో పని చెయ్ దేవుడు నాకు కిరీటం ఇస్తాడు 451 00:32:51,556 --> 00:32:54,517 దేవుడు చెప్పలేదా… 452 00:32:56,353 --> 00:33:00,232 దేవుడు చెప్పలేదా 453 00:33:00,982 --> 00:33:03,818 దేవుడు చెప్పలేదా 454 00:33:05,278 --> 00:33:08,823 ఇక నేను పని చేయాల్సి ఉంది అవును చేయాలి 455 00:33:09,574 --> 00:33:14,454 ఆయన నాకు కిరీటం ఇస్తాడు ఆయన నాకు కిరీటం ఇస్తాడు 456 00:33:14,537 --> 00:33:19,167 ఆయన నీకు ఒకటి ఇస్తాడు ఆయన నీకు కూడా ఒకటి ఇస్తాడు 457 00:33:19,251 --> 00:33:24,130 ఆయన నీకు ఇస్తాడు ఆయన మాట ఇచ్చాడు కాబట్టి నేను నమ్ముతున్నాను 458 00:33:24,214 --> 00:33:26,258 అమ్మో 459 00:33:26,341 --> 00:33:28,885 దేవుడు నాకు కిరీటం ఇస్తాడు 460 00:33:28,969 --> 00:33:31,179 ఆయన నాకు కిరీటం ఇస్తాడు 461 00:33:35,809 --> 00:33:38,812 మిస్టర్ సాంగ్స్ వారి షాపు డెట్రాయిట్ లోనే ఫేమస్ షాప్ అయింది 462 00:33:39,563 --> 00:33:42,357 లూక్ అరెత ఫ్రాంక్లిన్ గారి ఫేమస్ బో హ్యాట్ ని చేశారు 463 00:33:42,440 --> 00:33:44,276 ఒబామా ప్రమాణస్వీకారానికి. 464 00:33:45,026 --> 00:33:47,904 ఆమె శేషజీవితం అంతా మార్తా జీన్ మరియు లూక్ 465 00:33:47,988 --> 00:33:49,781 మిత్రులుగా కొనసాగారు. 466 00:33:50,615 --> 00:33:53,910 ఆమెను ఆమె నెఫెర్టిటి టోపీతోనే ఖననం చేశారు. 467 00:33:53,994 --> 00:33:58,665 దేవుడు నాకు కిరీటం ఇస్తాడు 468 00:34:08,967 --> 00:34:12,887 ఆయన నీకు ఒకటి ఇస్తాడు నువ్వు చేయాల్సింది కేవలం 469 00:34:12,971 --> 00:34:17,767 మంచి బ్రతుకు బ్రతికి నీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలి 470 00:34:17,851 --> 00:34:22,396 ఆయన్ని కలుసుకునేవరకు ఆయన్ని నువ్వు కలుసుకునేవరకు 471 00:34:22,480 --> 00:34:24,983 నా బహుమతిని పొందేవరకు నేను ఆగలేను 472 00:34:25,066 --> 00:34:29,945 అది నీ వద్దకు కూడా వస్తుంది 473 00:34:42,208 --> 00:34:43,960 ఆయన నీకు కిరీటం ఇస్తాడు 474 00:34:44,044 --> 00:34:46,421 ఆయన నాకు కిరీటం ఇస్తాడు 475 00:34:46,503 --> 00:34:48,923 ఓహ్, మనం పైకి వెళ్తున్నాం 476 00:34:49,007 --> 00:34:50,258 పైకి వెళ్లెవరకు నేను ఆగలేను 477 00:34:50,342 --> 00:34:51,927 "లిటిల్ అమెరికా" అనబడే ఎపిక్ మ్యాగజిన్ సిరీస్ ఆధారంగా రూపొందించబడింది 478 00:34:52,010 --> 00:34:54,012 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్