1 00:00:01,084 --> 00:00:04,880 ఇది యధార్థ సంఘటనల ఆధారంగా నిర్మితమైన కథ. కొన్ని ఉదంతాలు కల్పించి జోడించబడ్డాయి. 2 00:01:10,821 --> 00:01:14,074 చిరుత 3 00:01:14,867 --> 00:01:19,580 ఒక యధార్థ కథ ఆధారంగా రూపొందించబడింది 4 00:01:47,149 --> 00:01:48,150 పెపిత... 5 00:01:48,859 --> 00:01:50,360 నీకు బట్టలని మడతపెట్టమని చెప్పాను. 6 00:01:50,444 --> 00:01:51,445 నేను మడతపెడుతూనే ఉన్నాను. 7 00:01:51,528 --> 00:01:53,405 లేదు, అడ్డదిడ్డంగా చేస్తున్నావు నువ్వు. 8 00:01:54,031 --> 00:01:58,035 ఇంత డబ్బుండి కూడా ఇంట్లో ఇలాంటిది పెట్టుకోవడం అంటే, ఎంత గమ్మతైన విషయమో కదా? 9 00:01:58,285 --> 00:01:59,453 ఏమో... 10 00:01:59,745 --> 00:02:01,079 నేను కళాకారిణి అవ్వాలేమో. 11 00:02:01,163 --> 00:02:02,289 నీ మాటలు తనకి వినబడతాయి. 12 00:02:02,372 --> 00:02:03,373 ఏంటి? 13 00:02:04,041 --> 00:02:05,918 ఆమెకి మన భాష అర్థం కాదు. 14 00:02:06,168 --> 00:02:07,878 ఉతకాల్సిన బట్టలను తీసుకురా. 15 00:02:14,968 --> 00:02:16,845 మా అమ్మకి మీ కళ అంటే ప్రాణం. 16 00:02:18,388 --> 00:02:20,641 తనకి ధన్యవాదాలు తెలియజేయి. గ్రాసియాస్. 17 00:02:21,600 --> 00:02:22,935 గ్రాసియాస్, గ్లోరియా. 18 00:02:48,794 --> 00:02:50,504 ఓయ్, చాతో. లేయ్. 19 00:02:51,797 --> 00:02:53,048 నేను ఇక్కడ వ్యాక్యూమ్ ని పెట్టాలి. 20 00:02:53,131 --> 00:02:55,592 నన్ను వదిలేయ్. నేను ఇవాళ దాదాపు 15 గంటలు పని చేశాను. 21 00:02:55,676 --> 00:02:57,761 ఇదిగో. ఇది నీ ప్రేయసి అనుకో. 22 00:03:00,430 --> 00:03:01,974 ఓయ్, మాకు కాస్త ఏకాంతం ఇవ్వు. 23 00:03:18,949 --> 00:03:22,119 మారిసోల్ 24 00:03:38,927 --> 00:03:42,139 గ్యారీ యొక్క అద్భుతమైన పాటలు 25 00:04:05,871 --> 00:04:07,372 2009 ప్రవర్తనా పట్టిక 26 00:04:07,456 --> 00:04:09,541 ఉపాధ్యాయునికి ఎదురు చెప్పడం తోటి విద్యార్థులని గేలి చేయడం 27 00:04:09,625 --> 00:04:10,667 శ్రద్ధ వహించలేదు 28 00:04:10,751 --> 00:04:12,252 తల్లిదండ్రుల సంతకం అవసరం 29 00:04:26,975 --> 00:04:28,310 -బై, నానీ. -బై, అమ్మా. 30 00:05:11,603 --> 00:05:14,106 పిచ్చిదానా, ఇది గుడ్ విల్ వారు ఇచ్చిందైనా నాకది అనవసరం. 31 00:05:14,189 --> 00:05:16,942 నువ్వు ఇందులోని పాటలన్నింటినీ తీసేసి, కొత్త పాటలను ఎక్కించాలి. 32 00:05:17,025 --> 00:05:19,653 ఏమో. గ్యారీ పాటల మీద నాకు మోజు మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉంది. 33 00:05:28,996 --> 00:05:30,205 ఓయ్, డియీగో. 34 00:05:30,289 --> 00:05:31,623 నన్ను ఎంచుకో, నన్ను ఎంచుకో. 35 00:05:31,707 --> 00:05:33,542 మూడు డాలర్లు ఇస్తే, నీకు ఫాల్స్ సీలింగ్ చేసిస్తాను. 36 00:05:35,043 --> 00:05:36,545 అసలు నేను ఫాల్స్ సీలింగ్ అనేదే చేయను. 37 00:05:54,897 --> 00:05:55,898 హేయ్. 38 00:05:56,315 --> 00:05:58,525 నీకు "నీకు ఇది వద్దు" అనే ఆట ఆడాలనుందా? సరే, ముందు నేను ఆడతాను. 39 00:06:01,778 --> 00:06:03,906 -నీకు ఇది వద్దు. -రొసాడో! 40 00:06:04,698 --> 00:06:05,824 నేను చూశాను. 41 00:06:10,787 --> 00:06:12,372 సరే. ప్రవర్తనా పట్టికని ఇవ్వు. 42 00:06:22,841 --> 00:06:24,259 ఇది మీ అమ్మ సంతకమా? 43 00:06:24,718 --> 00:06:26,386 చూస్తుంటే నీ చేతివ్రాతలాగానే ఉంది. 44 00:06:26,470 --> 00:06:28,096 అవును, ఎందుకంటే మాది రక్తసంబంధం కాబట్టి. 45 00:06:28,180 --> 00:06:29,890 మనం ఇదే విషయం మీద ఎన్ని సార్లు చర్చించుకోవలసి వస్తుందో, ఇంకా 46 00:06:29,973 --> 00:06:32,059 నీ భవిష్యత్తు గురించి నువ్వు పట్టించుకోవాలంటే ఏం చేయాలో తెలియడం లేదు. 47 00:06:32,142 --> 00:06:33,602 భగవంతుడా. మళ్లీ అదే సోదా? 48 00:06:33,685 --> 00:06:35,646 అవును. నువ్వు కొన్ని కళాశాలలకి... 49 00:06:35,729 --> 00:06:36,772 నవ్వకు. 50 00:06:37,814 --> 00:06:39,775 నువ్వు కొన్ని ఉపకారవేతనాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. 51 00:06:41,401 --> 00:06:44,154 ఏంటి? మీరు మీ సోషల్ సెక్యూరిటీ నంబరును ఇస్తారా ఏంటి? 52 00:06:47,115 --> 00:06:50,327 నువ్వు దీన్ని మీ అమ్మ చేత సంతకం చేయించాలి, లేదా నేను నిన్ను సస్పెండ్ చేయాల్సుంటుంది. 53 00:07:05,467 --> 00:07:07,469 ఉచిత బూట్లు! ఉచిత రాకెట్! 54 00:07:07,553 --> 00:07:09,888 అందరూ ఆహ్వానితులే! అర్బన్ స్క్వాష్ లీగ్ లో నేడే చేరండి! 55 00:07:20,357 --> 00:07:22,943 ఈ నీళ్ళది భలే గమ్మత్తుగా ఉందే. 56 00:07:23,443 --> 00:07:24,945 హేయ్, మీకు నేనేమైనా సహాయపడగలనా? 57 00:07:25,028 --> 00:07:26,029 హేయ్. తప్పకుండా. 58 00:07:26,113 --> 00:07:29,575 మేము ఆ స్క్వాష్ లీగ్ కోసమని వచ్చాం. 59 00:07:31,785 --> 00:07:32,786 అలాగే, బాగుంది. 60 00:07:34,663 --> 00:07:37,291 బాబోయ్. ఇక్కడ ఎటు చూసినా డబ్బులే కనబడుతున్నాయే. 61 00:07:37,374 --> 00:07:39,251 పక్కదారి పట్టకు. ఉచిత బూట్లు, గుర్తుందా? 62 00:07:51,054 --> 00:07:54,016 అమ్మాయిలు, ఆగండి. మీరు ఇప్పుడు బంతులతో ఆడుతూ ఉండాలి. 63 00:07:55,976 --> 00:07:58,854 విన్నావా, మారిసోల్? బంతులతో ఆట. 64 00:07:58,937 --> 00:08:00,564 నువ్వే బంతుల రారాణివి. 65 00:08:00,647 --> 00:08:02,774 నేను ఈ మాటలను చాలా సార్లు విన్నాను. 66 00:08:02,858 --> 00:08:04,234 మీ జోకులు కూడా నాకు కొత్తేం కాదు. 67 00:08:04,693 --> 00:08:06,737 -నువ్వు, నాతో రా. -ఎందుకు? 68 00:08:07,154 --> 00:08:08,864 ఎందుకూ పనికిరానివాళ్ళే ముందు ఆడాలి. 69 00:08:09,656 --> 00:08:13,118 సరేమరి. అందరూ అద్దానికి అవతల వైపుకు వెళ్ళండి. వెళ్ళండి. 70 00:08:14,077 --> 00:08:15,495 తలుపు వేసుకొని వెళ్ళండి. 71 00:08:20,876 --> 00:08:21,877 ధన్యవాదాలు. 72 00:08:24,171 --> 00:08:26,507 స్క్వాష్ చాలా తేలికైనది. బంతిని కొడితే చాలు. 73 00:08:26,924 --> 00:08:29,968 నేనేమీ ప్రతిభ కోసం చూడటం లేదు, ఎందుకంటే మీకది లేదు కాబట్టి. 74 00:08:30,928 --> 00:08:32,429 ప్రత్యేకించి నీకు. 75 00:08:32,513 --> 00:08:34,472 నాకు మీ ప్రవృత్తి కావాలి. 76 00:08:35,390 --> 00:08:36,390 సిద్ధమేనా? 77 00:08:36,475 --> 00:08:37,476 ఇక మొదలుపెడదాం. 78 00:08:41,395 --> 00:08:44,650 మొదట్లో, గెలుపుల కన్నా ఓటములే ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఏడుపొచ్చినా పర్వాలేదు. 79 00:08:45,359 --> 00:08:46,944 -నేను ఏడవను. -ఏడవవా? 80 00:08:48,153 --> 00:08:49,154 మళ్లీ. 81 00:08:54,284 --> 00:08:55,285 మరొక్కసారి. 82 00:08:59,206 --> 00:09:00,541 తదుపరి వారు. 83 00:09:00,624 --> 00:09:01,625 ఇంకొక్కసారి. 84 00:09:16,098 --> 00:09:17,641 బాబోయ్. 85 00:09:18,183 --> 00:09:19,476 బాగా ఆడావు. చాలా బాగా ఆడావు. 86 00:09:20,519 --> 00:09:22,604 -నిజంగానా? -లేదులే, చెత్తగా ఆడావు. 87 00:09:23,480 --> 00:09:26,024 కానీ నీ లోలోపల, ఒక చిరుత ఉంది. 88 00:09:28,402 --> 00:09:29,653 సరే. 89 00:09:29,736 --> 00:09:33,615 గొప్ప బాస్కెట్ బాల్ ఆటగాడైన, కెవిన్ గార్నెట్ అలియాస్ కేజీ, 90 00:09:33,699 --> 00:09:35,033 అన్నట్టుగా, 91 00:09:35,784 --> 00:09:37,870 "దమ్ము నేర్పితే వచ్చేది కాదు. 92 00:09:38,412 --> 00:09:40,914 ఉంటే నీలో ఉండుంటుంది, లేకపోతే లేదు. 93 00:09:42,165 --> 00:09:45,627 ఓ అంగడికి వెళ్ళేసి గంపెడు దమ్మును కొనుక్కోలేము." 94 00:09:47,838 --> 00:09:49,089 తదుపరి వారు. 95 00:09:49,173 --> 00:09:50,716 నాకు ఆకలిగా ఉంది. 96 00:09:50,799 --> 00:09:52,801 -పర్వాలేదుగా? -సరే. అయితే పిజ్జా తిందామా? 97 00:09:52,885 --> 00:09:54,428 -సరే, మాల్ కి వెళ్దాం. ఇప్పుడే. -అలాగే. 98 00:09:54,845 --> 00:09:55,846 హేయ్, హేయ్. 99 00:09:57,681 --> 00:09:59,308 వాటిని మీరు ఇంటికి తీసుకెళ్ళకూడదు. 100 00:09:59,391 --> 00:10:00,851 -ఏంటి? -బూట్లను. 101 00:10:00,934 --> 00:10:02,603 వాటిని మీరు తీసుకెళ్ళలేరు. 102 00:10:02,686 --> 00:10:03,687 నిజంగానా? 103 00:10:03,770 --> 00:10:05,439 మీకు అవి కావాలంటే మీరు మళ్లీ ఇక్కడికి రావాలి. 104 00:10:05,522 --> 00:10:06,857 అది చాలా దారుణం. 105 00:10:07,566 --> 00:10:10,319 నా కజిన్ ఒకడు న్యాయశాస్త్రం చదువుతున్నాడు. మేము నీ మీద కేసు వేయకపోవడం నీ అదృష్టం. 106 00:10:10,402 --> 00:10:13,071 వెళ్లిపోదాం పద, మారిసోల్. వీళ్ళకి మనమిక్కడ ఉండటం ఇష్టం లేదు. 107 00:10:17,951 --> 00:10:19,703 మంగళవారం, సాయంత్రం మూడు గంటలకు. 108 00:10:20,454 --> 00:10:21,580 మళ్లీ వస్తావా? 109 00:10:24,333 --> 00:10:26,376 నీకెన్ని సార్లు చెప్పాలి? 110 00:10:26,460 --> 00:10:28,337 నా గ్యారేజ్, నా ఇష్టం. 111 00:10:28,420 --> 00:10:31,590 కాబట్టి, నీ వస్తువులను నీ ఫ్రిడ్జ్ లోనే నువ్వు పెట్టుకోవాలి. 112 00:10:31,673 --> 00:10:33,509 మా ఫ్రిడ్జ్ లో అన్నీ పట్టవు. 113 00:10:33,592 --> 00:10:34,927 అది నా సమస్య కాదు. 114 00:10:35,552 --> 00:10:38,931 ఈ ఫ్రిడ్జ్ లోకి "ప్రవేశం లేదు. సంజయ్." 115 00:10:39,890 --> 00:10:40,891 నా మాంసం. 116 00:10:41,350 --> 00:10:42,392 నా సొత్తు. 117 00:10:44,019 --> 00:10:46,688 వచ్చేశావా! చాలా ఆలస్యమైంది! 118 00:10:48,357 --> 00:10:49,691 అతగాడిని సింక్ గురించి అడుగు. 119 00:10:50,108 --> 00:10:52,528 హేయ్. ఆ సింక్ ని ఎప్పుడు బాగు చేయిస్తావు? 120 00:10:53,195 --> 00:10:55,739 చెప్పా కదా, మా కజిన్ నుంచి జవాబు కోసం వేచి చూస్తున్నానని. 121 00:10:55,822 --> 00:10:58,825 రెండు నెలలయింది. ఆ శబ్దం నాకు పిచ్చెక్కిస్తోంది. 122 00:10:58,909 --> 00:10:59,910 అయితే? 123 00:11:00,410 --> 00:11:01,578 పోలీసులకి కాల్ చేసుకో. 124 00:11:07,167 --> 00:11:08,585 వాడి మాంసం మీద రెట్ట వేసేస్తాను. 125 00:11:09,878 --> 00:11:11,004 నోరూరుతోంది. 126 00:11:11,088 --> 00:11:12,089 నీకో విషయం చెప్పనా? 127 00:11:12,798 --> 00:11:16,093 మీ పాఠశాల నుండి ఒకావిడ కాల్ చేసింది. నాకు చూపించాల్సిందేదో నీ వద్ద ఒకటి ఉందట. 128 00:11:16,176 --> 00:11:17,719 నీ ప్రవర్తనా పట్టికనా? 129 00:11:17,803 --> 00:11:18,804 అదేమంత ముఖ్యమైనది కాదులే. 130 00:11:18,887 --> 00:11:21,390 సరే, అలాగే, కానీ చూపించు. త్వరగా. 131 00:11:31,775 --> 00:11:33,235 నాకిది అర్థం కావడం లేదు. బాబూ. 132 00:11:33,944 --> 00:11:35,362 ఇటు రా. 133 00:11:45,539 --> 00:11:46,748 ఏమంత ప్రత్యేకమైనది కాదులే... 134 00:11:47,207 --> 00:11:49,042 తను బాగా రాణిస్తోందట, అంతే. 135 00:11:49,126 --> 00:11:50,752 సోది చెప్పకు. 136 00:11:55,007 --> 00:11:56,008 అలాగే. 137 00:11:56,466 --> 00:11:59,511 సోమవారం నాడు, క్లాసు నడుస్తూ ఉండగా మారిసోల్ మధ్యలో నిలబడి... 138 00:11:59,595 --> 00:12:02,472 "చరిత్ర అంతా బూటకం," అని అరిచింది. 139 00:12:03,849 --> 00:12:06,560 మంగళవారం నాడు, మారిసోల్ క్లాస్ కి ఆలస్యంగా వచ్చి... 140 00:12:06,643 --> 00:12:11,023 ఉపాధ్యాయుడు బోధిస్తూ ఉండగా, పైకప్పు మీదికి పెన్సిల్ విసిరింది. 141 00:12:11,690 --> 00:12:13,108 కానీ బుధవారం అయితే... 142 00:12:13,692 --> 00:12:14,693 అయ్యయ్యో. 143 00:12:14,776 --> 00:12:18,947 బుధవారం నాడు, ఉపాధ్యాయుల మార్కుల పట్టీని మారిసోల్ చెత్తబుట్టలో పడేసింది. 144 00:12:25,495 --> 00:12:27,539 అమ్మా. అమ్మా, అదేమంత పెద్ద విషయం కాదులే. 145 00:12:27,623 --> 00:12:29,541 "అదేమంత పెద్ద విషయం కాదులే. అదేమంత పెద్ద విషయం కాదులే." 146 00:12:29,958 --> 00:12:31,710 ప్రతీదానికీ అదే చెప్తావు. 147 00:12:32,294 --> 00:12:36,882 నీ చదువు కొనసాగాలని, మీ అన్నయ్య బడి మానేసి ఓ ఉద్యోగంలో చేరాడు. 148 00:12:37,299 --> 00:12:40,427 "అదేమంత పెద్ద విషయం" కాకపోతే, నువ్వు కూడా బడికి వెళ్ళడం ఆపేసేయి. 149 00:12:54,942 --> 00:12:56,693 చిరుత తిరిగి వచ్చింది. 150 00:12:57,736 --> 00:12:58,904 నీ మిత్రురాలు ఎక్కడ? 151 00:12:58,987 --> 00:13:00,155 తను మానేసింది. 152 00:13:00,239 --> 00:13:01,573 నువ్వో సన్నాసివని అనుకుంది. 153 00:13:01,657 --> 00:13:03,742 అది నిజమే. మరి నువ్వెందుకు వచ్చావు? 154 00:13:04,451 --> 00:13:06,703 తెలీదు. బూట్లు కావాలంటే మళ్లీ రావాలి అన్నావు కదా. 155 00:13:06,787 --> 00:13:08,121 ఏదో అబద్ధమాడానులే. 156 00:13:09,414 --> 00:13:10,916 కావాలంటే బూట్లు తీసుకొని వెళ్లిపో. 157 00:13:13,502 --> 00:13:15,087 కానీ నీకు స్క్వాష్ అంటే ఇష్టమని నాకనిపిస్తోంది. 158 00:13:15,796 --> 00:13:17,381 -లేదు, నాకు ఇష్టం లేదు. -నువ్వు అబద్ధమాడుతున్నావు. 159 00:13:17,714 --> 00:13:20,092 ఎవ్వరూ కూడా పిచ్చివాళ్ళలాగా అలా బంతి కోసం దూకరు. 160 00:13:20,175 --> 00:13:22,970 డొమింగజ్ మరియు రొసాడో. మీరిద్దరూ ఆడండి. 161 00:13:23,053 --> 00:13:24,680 మిగతావాళ్ళందరూ, బయటకు వెళ్ళండి. పదండి. 162 00:13:30,978 --> 00:13:31,979 ఇక ఆడండి. 163 00:13:36,316 --> 00:13:39,236 ఆగండి. రొసాడో, ఏం చేస్తున్నావు నువ్వు? 164 00:13:39,319 --> 00:13:41,363 పిచ్చిపట్టినట్టు ఊగిపోతున్నావు. 165 00:13:41,446 --> 00:13:43,615 గట్టిగా కొట్టినంత మాత్రాన గెలవలేవు. 166 00:13:43,699 --> 00:13:45,701 ఎలా ఆడాలో నాకు తెలీదు, బాబూ. ఏం చేయాలో చెప్పు మరి. 167 00:13:45,784 --> 00:13:47,369 ఒక నిర్ణయం తీసుకో, "బాబూ." 168 00:13:47,953 --> 00:13:49,913 ఒక్కటి తీసుకో చాలు. నీ ముందు ఉన్నదాని మీద దృష్టి పెట్టు. 169 00:13:49,997 --> 00:13:52,082 మంచి నిర్ణయాల సంగమమే గెలుపు. 170 00:13:54,001 --> 00:13:55,252 ఒకవేళ నేను తీసుకున్నది చెడు నిర్ణయమైతే? 171 00:13:58,130 --> 00:14:00,174 బంతి అనేది ఎల్లప్పుడూ వెనక్కి వస్తూనే ఉంటుంది. 172 00:14:00,591 --> 00:14:03,719 మరి అది వెనక్కి వచ్చినప్పుడు, ఈసారి నిర్ణయాన్ని మార్చుకో. 173 00:14:04,136 --> 00:14:05,137 నువ్వు సర్వ్ చేయి. 174 00:14:24,406 --> 00:14:25,574 అదెలా ఉంది? 175 00:14:27,034 --> 00:14:28,160 చిరుతలా ఉంది. 176 00:15:05,822 --> 00:15:07,074 నోర్మూసుకోవే, పిచ్చిదానా! 177 00:15:57,332 --> 00:15:58,584 గ్యారీ యొక్క ఐపాడ్ 178 00:15:59,376 --> 00:16:00,669 మారిసోల్ యొక్క ఐపాడ్ 179 00:17:11,365 --> 00:17:15,077 నువ్వెక్కడ ఆడినా కానీ, కోర్టు గురించిన పూర్తి అవగాహన నీకు ఉండాలి. 180 00:17:15,577 --> 00:17:18,579 ప్రతీ కోణం, ప్రతీ గొడ. 181 00:17:19,829 --> 00:17:22,791 ఇక్కడ ఉన్న గుర్తులన్నీ వేర్వేరు నిర్ణయాలకు చిహ్నాలు. 182 00:17:22,876 --> 00:17:25,587 వీటిని జాగ్రత్తగా గమనిస్తే, ఆ నిర్ణయాల నేపథ్యం అర్థమవుతుంది. 183 00:17:26,213 --> 00:17:29,842 నువ్వు టోర్మమెంట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నావని నాకనిపిస్తోంది. 184 00:17:30,801 --> 00:17:31,885 అలా అని నాకనిపించడం లేదులే. 185 00:17:31,969 --> 00:17:33,595 ఇప్పటికే ఆలస్యమైపోయింది. నీ పేరున నేను దరఖాస్తు చేసేశాను. 186 00:17:33,679 --> 00:17:37,140 25 డాలర్ల ప్రవేశ రుసుమును నేను కట్టాను, కాబట్టి నువ్వు తప్పక ఆడాలి. 187 00:17:37,975 --> 00:17:40,143 కమాన్, నువ్వు ఎనిమిది నెలల నుండి శిక్షణ తీసుకుంటున్నావు. 188 00:17:42,855 --> 00:17:43,856 అయితే, 189 00:17:44,398 --> 00:17:47,359 నాకా 25 డాలర్లను వృధా చేయడం ఇష్టం లేదు. 190 00:17:47,442 --> 00:17:49,611 ముందు నీతో మేము స్థానిక టోర్నమెంటులను ఆడిస్తాము, 191 00:17:49,695 --> 00:17:50,946 అ తర్వాత జాతీయస్థాయివి, 192 00:17:51,655 --> 00:17:54,741 ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి ఆటలు ఆడవచ్చు. 193 00:17:54,825 --> 00:17:56,410 ప్రపంచమంతటా తిరగవచ్చు. 194 00:17:58,078 --> 00:18:00,205 -నా వల్ల కాదు. -నీ వల్ల అవుతుంది. నువ్వు చిరుతవి. 195 00:18:00,289 --> 00:18:01,790 నువ్వా మాటని అనడం ఆపుతావా? 196 00:18:01,874 --> 00:18:04,168 నువ్వు కెప్టన్ వి అవుతావు. టీమ్ యూ.ఎస్.ఏ. 197 00:18:04,251 --> 00:18:07,087 -నువ్వు కలలు కంటున్నావు. -మనం ఒలింపిక్ కమిటీ మీద దండెత్తబోతున్నాం. 198 00:18:08,005 --> 00:18:10,215 -నా దగ్గర పాస్ పోర్ట్ లేదు. -అయితే ఒకటి తెచ్చుకో. 199 00:18:12,593 --> 00:18:13,594 నేను తెచ్చుకోలేను. 200 00:18:19,683 --> 00:18:20,851 అలాగే. 201 00:18:20,934 --> 00:18:23,770 అయితే ఇక్కడ జరిగే స్థానిక టోర్నమెంటు మీద దృష్టి పెడదాం. 202 00:18:25,355 --> 00:18:29,359 పక్క గదిలో ఎల్లప్పుడూ సాధన చేస్తూనే ఉండే ఆ అమ్మాయి నీకు తెలుసా? 203 00:18:29,443 --> 00:18:32,696 బుగ్గల్లో ఎముకలుండే స్కాండినేవియన్ అమ్మాయి. 204 00:18:32,779 --> 00:18:33,822 ఏమంటారు దాన్ని? 205 00:18:34,573 --> 00:18:36,074 -చీక్ బోన్స్? -అవును. 206 00:18:36,867 --> 00:18:38,202 ఆమె మాటలాడుతున్నప్పుడు ఎప్పుడైనా విన్నావా? 207 00:18:38,785 --> 00:18:40,621 కార్టూన్ పోనీ లాగా ఉంటాయి ఆమె మాటలు. 208 00:18:42,122 --> 00:18:43,123 సరే. ఆమె గురించి ఎందుకు చెప్తున్నావు? 209 00:18:43,207 --> 00:18:45,250 తన పేరు షార్లే ఏన్స్లీ. 210 00:18:45,334 --> 00:18:47,836 రాష్ట్ర జూనియర్ స్కాష్ క్రీడలో అగ్రపీఠం తనదే. 211 00:18:48,337 --> 00:18:49,880 అవును. తను చాలా బాగా ఆడుతుంది. 212 00:18:49,963 --> 00:18:50,964 అవును. 213 00:18:52,966 --> 00:18:55,552 తనని ఎలా ఓడించాలో నేను నీకు నేర్పించగలను. 214 00:18:56,595 --> 00:18:57,763 నీకు ఇష్టమేనా? 215 00:19:01,099 --> 00:19:02,184 మంచిది. 216 00:19:03,977 --> 00:19:07,022 ఇప్పుడు నీ తొలి టోర్నమెంటుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. 217 00:19:09,399 --> 00:19:12,736 అతను క్యూబా దేశస్థుడు. చాలా మంచి వాడు. 218 00:19:13,362 --> 00:19:15,656 హూందాగా ఉంటాడు. 219 00:19:15,989 --> 00:19:17,407 చూడటానికి బాగుంటాడా? 220 00:19:18,242 --> 00:19:20,536 మరీ అతి చేయకు. 221 00:19:21,078 --> 00:19:22,079 ఓ విషయం చెప్పనా? 222 00:19:22,162 --> 00:19:23,789 నేనిక పిల్లలను కనే ప్రసక్తే లేదు. 223 00:19:23,872 --> 00:19:25,165 అది కూడా, నీ తర్వాత, ఆ ఆలోచనే వద్దు. 224 00:19:27,417 --> 00:19:29,086 వీటిని చూడు. 225 00:19:29,545 --> 00:19:31,713 మిస్టర్ గిల్బర్ట్ యొక్క స్వెట్ ప్యాంట్లు. 226 00:19:31,797 --> 00:19:33,841 కొత్తగా ఉన్నాయి. స్క్వాష్ ఆడటానికి బాగుంటాయి, కదా? 227 00:19:34,341 --> 00:19:36,927 వాటిని నేను వేసుకోను! అక్కడ జనాలు అలాంటి బట్టలు వేసుకోరు. 228 00:19:38,136 --> 00:19:40,514 కానీ ఆడుతున్నప్పుడు చెమట పడుతూ ఉంటుంది కదా? 229 00:19:40,597 --> 00:19:44,017 అవును, అమ్మా, నీకు అర్థం కాదులే. అది కాస్త సంక్లిష్టమైన అంశం. 230 00:19:44,434 --> 00:19:47,187 మిసెస్ గిల్బర్ట్ వదిలిపారేసిన బట్టలను వేసుకొని వెళ్ళాలని నాకు లేదు. 231 00:19:48,856 --> 00:19:49,857 సరేమరి. 232 00:19:52,359 --> 00:19:53,527 అమ్మా. 233 00:19:53,610 --> 00:19:54,653 పర్వాలేదులే. 234 00:20:13,130 --> 00:20:15,340 రొసాడోకి పది. వైన్బర్గ్ కి ఎనిమిది. 235 00:20:15,424 --> 00:20:16,842 రొసాడోకి మ్యాచ్ పాయింట్. 236 00:20:40,574 --> 00:20:41,700 -బాగా ఆడావు. -చాలా చాలా ధన్యవాదాలు. 237 00:20:41,783 --> 00:20:43,827 నీ స్పేసింగ్ లో క్రమశిక్షణ లోపించింది. 238 00:20:43,911 --> 00:20:45,829 నువ్వు బంతిని కొట్టాలని చూస్తున్నావా లేక దాన్ని హత్తుకోవాలని చూసున్నావా? 239 00:20:45,913 --> 00:20:47,497 నాకైతే అర్థంకాలేదు. 240 00:20:48,123 --> 00:20:49,917 ఫైనల్స్ రేపే. 241 00:20:50,000 --> 00:20:54,171 కార్టూన్ పోనీ తో కూడా ఇలాగే ఆడావంటే, నువ్వు ఓడిపోవడం ఖాయం. 242 00:20:55,214 --> 00:20:56,507 నేను ఇప్పుడే గెలిచాను, బాబూ. 243 00:20:56,590 --> 00:20:58,383 కాస్త మంచి మాటలు ఏమైనా చెప్పవచ్చు కదా? 244 00:21:00,886 --> 00:21:02,262 నాకు మా బామ్మ అంటే ఇష్టం. 245 00:21:02,763 --> 00:21:04,056 -ఏంటి? -ఏంటి? 246 00:21:04,139 --> 00:21:05,933 మా బామ్మ చాలా మంచి ఆవిడ. 247 00:21:07,059 --> 00:21:08,769 ఆ చికాకును ముఖం నుండి తీసేయి. 248 00:21:08,852 --> 00:21:10,437 మనకి రాత్రి పార్టీ ఉంది. 249 00:21:11,188 --> 00:21:12,189 అవును. 250 00:21:14,608 --> 00:21:17,611 నాకు అర్థంకావడం లేదు. డ్రస్ వేసుకుంటే మరీ సాంప్రదాయబద్ధంగా ఉంటుందా? 251 00:21:17,694 --> 00:21:18,820 దానికి నేను జవాబు చెప్పను. 252 00:21:18,904 --> 00:21:21,198 స్క్వాష్ ఆడేవాళ్ళు ఏం వేసుకుంటారో నీకే మహబాగా తెలుసు. 253 00:21:21,698 --> 00:21:22,783 అమ్మా. 254 00:21:23,367 --> 00:21:25,452 ఛాంపియన్షిప్ కి చేరుకొన్న... 255 00:21:26,370 --> 00:21:28,413 ఆటగాళ్ళ కోసం ఒక పెద్ద సొగసైన భవనంలో జరుగుతున్న పార్టీ. 256 00:21:28,830 --> 00:21:30,666 నువ్వు ఫైనల్స్ కి చేరుకుంటావని నాకు తెలుసు. 257 00:21:31,458 --> 00:21:34,503 ఇది వింతగా ఉందే, ఇంతకముందు నేను చేరుకోలేని అని అన్నావే. 258 00:21:35,170 --> 00:21:36,547 రివర్స్ సైకాలజీ అనమాట. 259 00:21:38,632 --> 00:21:39,925 నువ్వు రేపు వస్తున్నావు కదా? 260 00:21:40,008 --> 00:21:44,429 రావాలనే నాకూ ఉంది, కానీ నేను క్లయింట్లని పక్కనపెడితే వాళ్ళు ఇంకొకరిని చూసుకుంటారు. 261 00:21:45,305 --> 00:21:46,723 కానీ ఇది ముఖ్యమైనది. 262 00:21:46,807 --> 00:21:49,893 మనం 200 డాలర్లు అద్దె గల నాలుగు పడకల గదిలో ఉంటున్నాం. 263 00:21:54,314 --> 00:21:55,482 నేను తయారవ్వాలి. 264 00:22:37,399 --> 00:22:38,525 నువ్వు ఆలస్యంగా వచ్చావు. 265 00:22:38,609 --> 00:22:39,735 చివాట్లు పెట్టడం ఆపుతావా? 266 00:22:40,569 --> 00:22:41,570 ఇదిగో. 267 00:22:41,653 --> 00:22:44,656 సోడా. ఇది విషంతో సమానమైనది, కానీ ఈ రేయి ప్రత్యేకమైనది. 268 00:22:45,574 --> 00:22:49,203 అర్బన్ స్క్వాష్ లీగ్ యొక్క ప్రధాన దాతలలో వీళ్ళు కొందరు. 269 00:22:49,745 --> 00:22:51,955 నువ్వు ఏదైనా చేయకూడనిది చేస్తే, నువ్వు నాకు 50,000 డాలర్లు ఇవ్వాల్సి ఉంటుంది. 270 00:22:55,167 --> 00:22:56,460 అయితే, నేను ఇప్పుడు ఏం చేయాలి? 271 00:22:56,543 --> 00:22:58,253 కలిసిపో, మాటలు కలుపు, 272 00:22:58,337 --> 00:23:00,422 నోరూరించే రుచికరమైన చేపల పులుసు తిను. 273 00:23:02,174 --> 00:23:03,300 నేను ఏమైనా తెలివితక్కువ మాట అంటే? 274 00:23:03,383 --> 00:23:05,427 అలాంటిదేదైనా అంటే, మళ్లీ అదే అనకు. 275 00:23:06,553 --> 00:23:08,138 నువ్వు వాళ్ళకేం తక్కువ కాదు. 276 00:23:09,973 --> 00:23:11,558 ఒక్క క్షణం, నా మాజీ ప్రేయసి కనిపించింది. 277 00:23:22,694 --> 00:23:23,695 ఆయిస్టర్ షూటర్? 278 00:23:24,321 --> 00:23:26,156 అలాగే, తప్పకుండా. ధన్యవాదాలు. 279 00:23:32,037 --> 00:23:33,038 మారిసోల్. 280 00:23:33,872 --> 00:23:36,458 మేము నీ ఆటని ఇవాళ చూశాం. నీలో చాలా నైపుణ్యం ఉంది. 281 00:23:36,917 --> 00:23:37,918 ధన్యవాదాలు. 282 00:23:38,877 --> 00:23:40,546 -మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. -నిన్ను ఇబ్బంది పెట్టడం నా అభిమతం కాదు, 283 00:23:40,629 --> 00:23:43,340 కానీ నిన్ను నా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చూడగలను అనుకుంటా. 284 00:23:43,674 --> 00:23:45,384 హార్వర్డ్ అని అనవచ్చు కదా? 285 00:23:46,009 --> 00:23:47,469 అలా హార్వర్డ్ లో పనిచేసే వాళ్ళే చేస్తూ ఉంటారు. 286 00:23:47,553 --> 00:23:49,471 బహుశా నీకు స్టాన్ఫర్డ్ కి వెళ్ళాలనుందేమో. 287 00:23:49,763 --> 00:23:52,599 నువ్వు ఆడటం మొదలుపెట్టి చాలా తక్కువ కాలమే అయినా, అదరగొట్టేస్తున్నావు. 288 00:23:52,683 --> 00:23:54,935 నువ్వెక్కడికైనా వెళ్ళవచ్చు. డ్యూక్ కి, క్యాల్ కి. 289 00:23:56,520 --> 00:23:57,729 అన్నింటికీ వెళ్తానేమో. 290 00:23:58,897 --> 00:24:00,148 మారిసోల్? 291 00:24:01,066 --> 00:24:02,734 నువ్వే అనుకున్నా. 292 00:24:03,151 --> 00:24:04,152 హాయ్. 293 00:24:04,236 --> 00:24:06,029 నీకు స్క్వాష్ ఆడటం వచ్చని నాకస్సలు తెలీనే తెలీదు. 294 00:24:07,614 --> 00:24:09,199 మీ ఇద్దరూ ఒకరికొకరు ఎలా తెలుసు? 295 00:24:13,912 --> 00:24:15,998 మా అమ్మ ఈవిడ ఇల్లు శుభ్రపరుస్తుంది. 296 00:24:17,499 --> 00:24:18,625 ఆవిడ చాలా మంచిది. 297 00:24:19,084 --> 00:24:20,460 చాలా కష్టపడి పనిచేస్తుంది. 298 00:24:25,215 --> 00:24:27,968 మా పని మనిషి అంటే మాకు కూడా ఇష్టమే. తన పేరు రినాటా. 299 00:24:33,098 --> 00:24:35,184 చూశావా? చాలా బాగా జరిగింది. కళ్ళనీళ్ళే రాలేదు. 300 00:24:36,059 --> 00:24:37,561 నీకు ఇదివరకే చెప్పాను. నేను ఏడవను అని. 301 00:24:37,978 --> 00:24:39,354 నేను మాట్లాడేది నీ గురించి కాదు. 302 00:24:44,151 --> 00:24:46,486 ఇదేనా? ఇల్లు చాలా బాగుంది. 303 00:24:49,531 --> 00:24:50,657 దింపినందుకు ధన్యవాదాలు. 304 00:24:53,035 --> 00:24:54,077 ఓహ్, ఇంకా... 305 00:24:55,120 --> 00:24:56,496 ఆ ఇంట్లో నేను ఉండటం లేదు. 306 00:25:11,887 --> 00:25:13,889 పార్టీ ఎలా జరిగింది, బంగారం? 307 00:25:14,681 --> 00:25:15,849 సరదాగా గడిచింది. 308 00:26:16,577 --> 00:26:19,538 2009 ఐవీ స్క్వాష్ క్లాసిక్ 309 00:26:37,848 --> 00:26:39,141 హాయ్, పెపిత! 310 00:26:40,893 --> 00:26:43,395 ఊపులు. నీ భుజాలను క్రీయాశీలకం చేస్తాయి. 311 00:26:43,478 --> 00:26:44,771 సరే. మా అమ్మ వచ్చింది, అందుకని... 312 00:26:44,855 --> 00:26:46,982 ఆట ముగిశాక కూడా ఆవిడ ఇక్కడే ఉంటుంది. 313 00:26:47,524 --> 00:26:49,651 నీకు తనని ఒక విజేతగా పలకరించాలనుందా, 314 00:26:50,319 --> 00:26:53,697 లేక భుజాలను క్రియాశీలకం చేసుకోవడం మరిచిన ఒక ఓడిపోయిన వ్యక్తిగా పలకరించాలనుందా? 315 00:26:54,239 --> 00:26:55,282 నువ్వే తేల్చుకో. 316 00:27:05,792 --> 00:27:07,002 కంగారుగా ఉన్నట్టున్నావు. 317 00:27:07,085 --> 00:27:10,422 ఇప్పుడే కదా నాలుగు మంచి మాటలు చెప్పావు, కంగారుగా కాకుండా ఇంక ఎలా ఉంటాను? 318 00:27:11,715 --> 00:27:14,676 వ్యక్తిగతంగా నేను అభిమానించే, 319 00:27:15,177 --> 00:27:16,512 రిజ్జా అలియాస్ బాబీ డిజిటల్, 320 00:27:17,387 --> 00:27:20,766 యొక్క మాటల్లో చెప్పాలంటే, 321 00:27:20,849 --> 00:27:24,353 "నేను అంధకారాన్ని చీల్చుకొని వస్తే కాంతి సాక్షాత్కారమవుతుంది. 322 00:27:24,978 --> 00:27:29,399 ఈ భయం అనే దశని నువ్వు దాటుకొని ముందుకు పోవాలి." 323 00:27:39,868 --> 00:27:40,911 రొసాడోకి పాయింట్లు వచ్చాయి. 324 00:27:41,703 --> 00:27:43,747 ఆడేది నా చెల్లెలే! 325 00:27:43,830 --> 00:27:47,835 మారిసోల్! మారిసోల్! మారిసోల్! 326 00:28:07,312 --> 00:28:08,564 -నీకేమీ కాలేదు కదా? -ఆ, ఏమీ కాలేదు. 327 00:28:08,647 --> 00:28:09,982 రెఫరీ, నాకు లెట్ అవకాశం ఇస్తారా? 328 00:28:10,524 --> 00:28:13,068 అలాగే, లెట్. ఆ పాయింట్ ని మళ్లీ ఆడండి. రొసాడో సర్వ్ చేయాలి. 329 00:28:13,151 --> 00:28:15,946 ఏమైంది, అది అనుకోకుండా జరిగింది. ఆ పాయింట్ నాది. నీకు కళ్ళు కనబడటం లేదా? 330 00:28:16,405 --> 00:28:18,156 మిస్ రొసాడోకి దుష్ప్రవర్తనా హెచ్చరిక. 331 00:28:18,532 --> 00:28:20,367 అది దుష్ప్రవర్తనా హెచ్చరిక ఎలా అవుతుంది? 332 00:28:20,450 --> 00:28:21,702 నువ్వు గమనించలేకపోయావు? 333 00:28:21,785 --> 00:28:25,247 దుర్భాషలను ఆపనందుకు మిస్ రొసాడోకి దుష్ప్రవర్తనా పెనాల్టీ పాయింట్. 334 00:28:25,330 --> 00:28:26,748 నేను నిన్నేమీ దుర్భాషలాడలేదు, బాబూ! 335 00:28:26,832 --> 00:28:28,417 -ఏన్స్లీ సర్వ్ చేయాలి. -అది దారుణం! 336 00:28:28,500 --> 00:28:29,626 దయచేసి, నాకు టైమ్-అవుట్ ఇస్తారా? 337 00:28:29,710 --> 00:28:31,170 -దయచేసి టైమ్-అవుట్ ని ఇవ్వండి. -టైమ్-అవుట్ ఇవ్వబడింది. 338 00:28:31,670 --> 00:28:32,671 మూడు నిమిషాలు. 339 00:28:32,754 --> 00:28:34,214 టైమ్-అవుట్, రొసాడో. 340 00:28:35,048 --> 00:28:37,342 -ఏం చేస్తున్నావు నువ్వు? -నేనేం చేస్తే ఎవరికేంటి? 341 00:28:37,426 --> 00:28:39,094 ఎలాగూ వాళ్ళు నన్ను గెలవనివ్వరు. 342 00:28:39,178 --> 00:28:41,722 "వాళ్ళు" అంటే ఎవరు? ఇక్కడ నువ్వు దృష్టి పెట్టుకోవలసింది కేవలం నీ మీదనే. 343 00:28:41,805 --> 00:28:43,682 అతను ఓ నిర్ణయం తీసుకున్నాడు. దానికి నువ్వు గోల చేస్తున్నావు. 344 00:28:43,765 --> 00:28:46,518 -నువ్వు వెళ్లి దృష్టి మరల్చకుండా ఆడాలి. -లేదు. నేను ఆడటానికి వెళ్ళను. 345 00:28:46,602 --> 00:28:48,145 -అయితే, మంచిది, ఇంటికెళ్లి ఏడుస్తావా? -ఏమో ఏడుస్తానేమో! 346 00:28:48,228 --> 00:28:49,229 హేయ్. హేయ్! 347 00:28:49,980 --> 00:28:54,234 ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే, దాన్ని సరి చేసే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పాను. 348 00:28:54,318 --> 00:28:55,944 బంతి ఎల్లప్పుడూ వెనక్కే వస్తుంది. 349 00:28:56,028 --> 00:28:58,572 కానీ అది స్క్వాష్ లో. ఇది నీ జీవితం. 350 00:28:59,406 --> 00:29:01,200 మనకి మళ్లీ ఇంకో అవకాశం రాదు. 351 00:29:05,954 --> 00:29:07,372 మారిసోల్, 352 00:29:07,956 --> 00:29:09,541 మారిసోల్... 353 00:29:15,297 --> 00:29:16,465 వెళ్ళు. వెళ్లి ఆడు. 354 00:29:18,717 --> 00:29:20,344 ఏన్స్లీ, సర్వ్ చేయి. 355 00:30:30,747 --> 00:30:31,999 బాగా ఆడావు. 356 00:30:32,082 --> 00:30:33,250 అవును, నువ్వు కూడా బాగా ఆడావు. 357 00:30:33,750 --> 00:30:36,545 నిజంగా చాలా బాగా ఆడుతున్నావు. అన్నట్టు, నా పేరు షార్లే. 358 00:30:37,546 --> 00:30:39,715 నాకు తెలుసు. నా పేరు మారిసోల్. 359 00:30:40,257 --> 00:30:42,176 అవును, మీ అన్నయ్య నీ పేరును జపం చేస్తుండటం విన్నాను. 360 00:30:44,761 --> 00:30:45,929 త్వరలోనే నిన్ను కలుస్తానులే. 361 00:30:47,014 --> 00:30:48,015 తర్వాత కలుస్తాను. 362 00:30:51,685 --> 00:30:53,103 దేవుడా! మారిసోల్! 363 00:30:53,187 --> 00:30:56,982 నా స్క్వాష్ యోధురాలా! అద్భుతంగా ఆడావు! బాగా ఆడింది కదా? 364 00:30:57,065 --> 00:30:58,066 అందులో సందేహమే లేదు! 365 00:30:58,150 --> 00:31:00,235 నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. 366 00:31:01,320 --> 00:31:04,239 నన్ను చూసి గర్వపడటానికి ఏముంది? నేను ఓడిపోయాను. 367 00:31:04,823 --> 00:31:06,366 ఓడిపోయాను అంటావేంటి? 368 00:31:06,450 --> 00:31:08,202 నీకు రెండవ స్థానం వచ్చింది. 369 00:31:09,411 --> 00:31:10,871 దాదాపు విజేతవి కాబోయావు! 370 00:31:13,582 --> 00:31:15,209 ఓహ్, పెపిత. 371 00:31:15,292 --> 00:31:16,710 దగ్గరకి రా, బంగారం. 372 00:31:19,046 --> 00:31:20,130 నా బంగారం. 373 00:31:26,887 --> 00:31:27,930 సరేమరి. 374 00:31:28,305 --> 00:31:29,556 అమ్మా. 375 00:31:29,640 --> 00:31:31,141 -ధన్యవాదాలు, అమ్మా. -అలాగే, పెపిత. 376 00:31:43,862 --> 00:31:45,072 ఇది నువ్వే! 377 00:32:16,687 --> 00:32:19,314 మారిసోల్ యు.ఎస్ జాతీయ స్క్వాష్ జట్టులో చోటు సంపాదించి అనేక ఆటలు ఆడింది, 378 00:32:19,398 --> 00:32:22,025 అమెరికాలోని అత్యుత్తమ 15 ఆటగాళ్ళలో స్థానం సంపాదించింది. 379 00:32:34,538 --> 00:32:37,249 ఇప్పుడు ఆమె అర్బన్ స్క్వాష్ లీగ్ యొక్క బోర్డులో సభ్యురాలిగా ఉండి 380 00:32:37,332 --> 00:32:39,793 యువ చిరుతలకు బోధనలు చేస్తోంది. 381 00:33:36,934 --> 00:33:37,851 'లిటిల్ అమెరికా' అనే ఒక గొప్ప సంచికల సంపుటి ఆధారంగా రూపొందించబడింది 382 00:33:36,934 --> 00:33:37,851 'లిటిల్ అమెరికా' అనే ఒక గొప్ప సంచికల సంపుటి ఆధారంగా రూపొందించబడింది 383 00:33:37,935 --> 00:33:39,937 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య