1 00:00:01,084 --> 00:00:04,213 ఖచ్చితంగా విస్కాన్సిన్ లో అందరూ నువ్వు క్షేమంగా చేరావని తెలుసుకోవాలనుకుంటారు. 2 00:00:04,296 --> 00:00:06,048 నువ్వు ఆమె గురించి ఎంత బాగా పరిశోధించావు? 3 00:00:06,131 --> 00:00:07,716 అసలైన లియన్ గ్రేసన్ ఎవరు? 4 00:00:07,799 --> 00:00:08,800 నా గురించి చెప్పడానికి పెద్ద ఆసక్తికరంగా ఏమీ లేదు. 5 00:00:09,426 --> 00:00:10,928 అది నిజం కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. 6 00:00:11,011 --> 00:00:13,764 ఆమె సూప్ తాగుతుంది, ఆమె ప్రార్ధన చేసుకుంటుంది, నిద్ర పోతుంది. 7 00:00:13,847 --> 00:00:16,934 ఇంట్లో ఉంటున్న మనిషి గురించి ఇంకాస్త తెలుసుకోవడం మంచిది అనుకున్నాను అంతే. 8 00:00:17,017 --> 00:00:18,977 పబ్లిక్ రికార్డుల ప్రకారం విస్కాన్సిన్ లో ఆమె జననం నమోదయ్యి ఉంది. 9 00:00:19,061 --> 00:00:22,314 బహుశా ఆమె నిజంగా పెద్ద నగరంలో తిరుగుతున్న ఒక పల్లెటూరు అమ్మాయి అయ్యుండొచ్చు. 10 00:00:22,397 --> 00:00:24,483 పైన ఉన్న ఆ మంచి, అమాయకపు పిల్ల, 11 00:00:24,566 --> 00:00:26,193 ఆమె ఒక చనిపోయిన పాప స్థానంలో ఇక్కడికి వచ్చింది. 12 00:00:26,276 --> 00:00:28,320 -మీ సొంత ఊరు ఏంటి, లియన్? -విస్కాన్సిన్. 13 00:00:28,403 --> 00:00:29,947 -పెద్ద కుటుంబమా? -నేనొక్కదాన్నే. 14 00:01:44,438 --> 00:01:46,023 మీరు బయట బాగా తడిచిపోతున్నట్టున్నారు. 15 00:01:46,106 --> 00:01:47,107 అవును. 16 00:01:49,943 --> 00:01:51,403 ఇదిగోండి. 17 00:01:51,820 --> 00:01:53,655 -సరే. -ఇదిగో తీసుకోండి. 18 00:01:56,533 --> 00:01:58,493 -ధన్యవాదాలు. -హే, బుజ్జి. 19 00:01:58,911 --> 00:02:01,413 బాబు కొత్త వాళ్ళను చూస్తే ఏడుస్తాడు. సరే. 20 00:02:04,041 --> 00:02:07,628 నువ్వు ఈ వాతావరణంలో విమానంలో వెళ్ళగలవా? పెద్ద వర్షం పడుతుంది. 21 00:02:09,213 --> 00:02:12,549 అది ఒక ప్రైవేట్ విమానం. భద్రత గురించి వాళ్ళు ఆలోచిస్తారని నాకు అనిపించట్లేదు. 22 00:02:13,675 --> 00:02:16,762 హే, నా స్యూమాక్ తినేస్తున్నావా? నా దగ్గర ఖచ్చితంగా ఇంతకన్నా ఎక్కువే ఉండాలి. 23 00:02:16,845 --> 00:02:18,931 అవును, బంగారం. నేను సరిగ్గా అదే చేస్తున్నాను. 24 00:02:19,014 --> 00:02:22,559 నేను రాత్రి చాటుగా కిందకి వచ్చి నీ అమూల్యమైన మసాలా దినుసులు తినేస్తున్నాను. 25 00:02:24,478 --> 00:02:28,857 నేను వెళ్ళకుండా ఆగిపోనా? అంటే, వాళ్ళు ఈరోజు రాత్రికల్లా ఇంకెవరినైనా చూసుకుంటారు. 26 00:02:29,858 --> 00:02:33,278 నువ్వు విమానంలో వెళ్ళే ప్రతిసారి ఇలాగే చేస్తావు. బహుశా నీకు భయం అనుకుంటా. 27 00:02:33,695 --> 00:02:35,447 నాకేం భయం లేదు. 28 00:02:35,530 --> 00:02:37,783 నాకు నచ్చే విషయాలు ఉన్నాయి ఇంకా నచ్చని చెత్త విషయాలు కూడా ఉన్నాయి. 29 00:02:37,866 --> 00:02:40,535 కాకపొతే రెండవ జాబితా నిండుగా ఉంది అంతే. 30 00:02:42,579 --> 00:02:44,081 ఇది ఆమె మొదటి ఉత్తరం. 31 00:02:44,706 --> 00:02:46,959 ఆమె గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆలోచించడం మొదలుపెట్టాను. 32 00:02:47,376 --> 00:02:48,669 అది ఎవరి దగ్గర నుంచి? 33 00:02:48,752 --> 00:02:50,295 -నాకెలా తెలుస్తుంది? -దాన్ని తెరువు. 34 00:02:50,796 --> 00:02:52,923 అలాంటి పనులు చేయకు. 35 00:02:54,633 --> 00:02:55,759 లియన్ గ్రేసన్ 36 00:02:55,842 --> 00:02:56,843 లియన్? 37 00:03:00,222 --> 00:03:02,808 నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర దించాలంటే, మనం ఇప్పుడు బయలుదేరాలి. 38 00:03:04,142 --> 00:03:05,727 మీరు ఎక్కడికైనా ప్రయాణమై వెళ్తున్నారా, మిస్టర్ టర్నర్? 39 00:03:05,811 --> 00:03:08,230 షాన్ ఇవాళ రాత్రి ఫిలడెల్ఫియా ఈగల్స్ తో ప్రయాణం చేస్తున్నాడు. 40 00:03:08,313 --> 00:03:10,524 వాళ్ళకోసం వండి పెట్టమని ఈయన్ని బ్రతిమిలాడారు. అది చాలా పెద్ద గౌరవం. 41 00:03:10,607 --> 00:03:11,692 నేను రేపు తెల్లవారుజామునే వచ్చేస్తాను. 42 00:03:11,775 --> 00:03:13,777 ఇంకా నీకోసం కౌంటర్ మీద ఒకటి ఉంది. 43 00:03:14,528 --> 00:03:15,988 నేను రాత్రికి కలుస్తాను. 44 00:03:20,951 --> 00:03:21,952 షాన్. 45 00:03:41,722 --> 00:03:45,142 నిన్ను కనిపెట్టేసాను! 46 00:03:47,644 --> 00:03:51,189 వానా వానా వల్లప్ప 47 00:03:53,191 --> 00:03:55,819 వాకిలి తిరుగు చెల్లప్ప 48 00:03:57,654 --> 00:04:02,034 వానా వానా వల్లప్ప 49 00:04:03,118 --> 00:04:06,371 వాకిలి తిరుగు చెల్లప్ప 50 00:04:20,260 --> 00:04:21,845 హలో, చిట్టి తల్లి. 51 00:04:41,198 --> 00:04:42,449 వాళ్ళు ఇంట్లో ఉన్నారా? 52 00:04:43,534 --> 00:04:44,535 పనికి వెళ్ళారు. 53 00:04:45,827 --> 00:04:48,705 సరే, వాడిని సరిగ్గా చూద్దాం పద. 54 00:04:49,664 --> 00:04:50,791 బూట్లు. 55 00:04:55,170 --> 00:04:56,964 డోరోతి ఇంట్లోకి బూట్లు వేసుకొని రానివ్వదు. 56 00:05:44,261 --> 00:05:48,348 సెంటర్ సిటీలోని మురుగునీటి పైపులు వందేళ్ళ క్రితం నాటివి 57 00:05:48,432 --> 00:05:52,477 ఇంకా "అవి ఇక చాలు" అని వాళ్ళు చివరికి ఈరోజు తీర్మానించుకున్నారు. 58 00:05:52,561 --> 00:05:53,562 పెరిగిన నీటి స్థాయిలు 59 00:06:36,772 --> 00:06:40,192 లియన్? అంతా బాగానే... 60 00:06:41,735 --> 00:06:42,903 డోరోతి టర్నర్. 61 00:06:45,280 --> 00:06:46,448 మీరు నాకు తెలుసా? 62 00:06:47,574 --> 00:06:49,493 లేదు. కానీ నాకు నువ్వు తెలుసు. 63 00:06:50,160 --> 00:06:52,454 ఈయన మా అంకుల్ జార్జ్, డోరోతి. 64 00:06:57,125 --> 00:06:58,210 కుటుంబం. 65 00:06:59,419 --> 00:07:01,755 నన్ను క్షమించండి. మాకు మీరు వస్తున్నట్టు తెలియదు. 66 00:07:01,838 --> 00:07:04,383 నేను ఈరోజు టౌన్ లో చిన్న పనిమీద వచ్చాను. 67 00:07:04,466 --> 00:07:05,884 ఆమెని ఆశ్చర్యపరుద్దాం అనుకున్నాను. 68 00:07:06,677 --> 00:07:08,595 ఆమె సరిగ్గా ఉంటుందో లేదో చూద్దాం అనుకున్నాను. 69 00:07:10,055 --> 00:07:13,016 అయితే, ఆమె మమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టట్లేదు. కదా, లియన్? 70 00:07:19,314 --> 00:07:20,524 బాబు కోసం. 71 00:07:22,568 --> 00:07:24,236 ఎంత ఉదారత. 72 00:07:35,539 --> 00:07:39,960 అది ఎల్మ్ చెక్క. మా పొలాల్లో పెరిగే చాలా ప్రత్యేకమైన చెట్టు నుండి తీసింది. 73 00:07:41,545 --> 00:07:42,838 -ఇది... -నీ భర్త. 74 00:07:45,173 --> 00:07:48,385 అవును. ఇది ఒక చెఫ్ బొమ్మ. 75 00:07:49,177 --> 00:07:50,596 ఇది చాలా బాగుంది. 76 00:07:56,643 --> 00:07:58,520 సరే, నేను ఇప్పుడే భోజనం సిద్ధం చేయబోతున్నాను. 77 00:07:59,813 --> 00:08:01,523 మీరు కూడా మాతో కలిసి తింటారా, జార్జ్? 78 00:08:15,245 --> 00:08:16,788 -హే. -హే. 79 00:08:16,872 --> 00:08:17,915 ప్రయాణం ఎలా జరిగింది? 80 00:08:18,540 --> 00:08:21,168 బాగా ఊపేసింది. ఎక్కువసేపు మాట్లాడలేను. నేను ఒక్క నిమిషంలో వడ్డించడం మొదలెట్టాలి. 81 00:08:21,877 --> 00:08:23,337 అంతా బాగానే ఉంది. 82 00:08:23,921 --> 00:08:25,297 ఇంకా వర్షం పడుతూనే ఉంది. 83 00:08:26,632 --> 00:08:27,716 ఇవి అయిపోయాయా? 84 00:08:30,510 --> 00:08:32,846 కొంచెం మంట తగ్గించి చర్మం వైపు కిందికి తిప్పి పెట్టు. 85 00:08:32,930 --> 00:08:34,306 అదంతా నీకేనా? 86 00:08:34,389 --> 00:08:38,560 లేదు, మనకొక అతిధి వచ్చారు. లియన్ వాళ్ళ అంకుల్ టౌన్ కి వచ్చారు. 87 00:08:39,394 --> 00:08:41,813 -లియన్ వాళ్ళ ఎవరు? -వాళ్ళ అంకుల్ జార్జ్. 88 00:08:42,231 --> 00:08:44,316 ఆయన రక్తసంబంధికుడో లేక వాళ్లకి తెలిసిన వ్యక్తో నాకు తెలియదు. 89 00:08:44,399 --> 00:08:45,859 ఈరోజుల్లో ఆ పదం అన్నిటికీ వాడేస్తున్నారు. 90 00:08:45,943 --> 00:08:48,946 -డోరోతి, మన ఇంట్లో ఎవరు ఉన్నారు? -నేను నీకు ముందే చెప్పాను. 91 00:08:49,613 --> 00:08:51,114 డోరోతి, నువ్వు అతన్ని వెళ్ళిపోమని అడగాలి. 92 00:08:51,198 --> 00:08:54,117 అంటే, నేనలా చేయలేను. నేనిప్పుడే అతన్ని భోజనం చేయమని ఆహ్వానించాను. 93 00:08:54,201 --> 00:08:55,869 అతను ఎవరో మనకి అసలేమీ తెలియదు. 94 00:08:56,370 --> 00:08:57,579 అతను లియన్ అంకులే అని తను హామీ ఇచ్చింది. 95 00:08:57,663 --> 00:08:59,206 అసలు లియన్ మంచిదని ఎవరు హామీ ఇచ్చి చచ్చారు? 96 00:08:59,289 --> 00:09:01,917 అతిగా కంగారుపడటం ఆపు. అతనొక ముసలి వ్యక్తి. 97 00:09:04,043 --> 00:09:05,546 ఇది ఎండిపోతుందని అనిపిస్తుంది. 98 00:09:06,004 --> 00:09:07,089 డోరోతి! 99 00:09:07,881 --> 00:09:10,591 పడుకునేటప్పుడు ఫోన్ చేయి ఇంకా ఎక్కువ కంగారు పడటం ఆపు. 100 00:09:13,595 --> 00:09:15,097 ఇదిగో అన్నీ సిద్ధం. 101 00:09:16,014 --> 00:09:17,558 బోన్ యపెటీట్. 102 00:09:18,267 --> 00:09:19,893 అని ప్యారిస్ లో అంటారు. 103 00:09:51,925 --> 00:09:52,926 మంచిది. 104 00:09:56,263 --> 00:09:57,556 అది బాగుంది. 105 00:09:58,765 --> 00:10:00,309 ఇది షాన్ వంటకం. 106 00:10:00,392 --> 00:10:02,728 కానీ నేను మాత్రం ఎప్పుడూ వెల్లుల్లి వేయకుండా వదిలేస్తాను. 107 00:10:03,145 --> 00:10:05,606 కానీ మీరు ఆయన్ని కలవకపోవడం చాలా బాధాకరం. 108 00:10:06,023 --> 00:10:07,190 కానీ పనంటే పనే. 109 00:10:16,074 --> 00:10:19,786 అతను మాలిక్యులర్ గ్యాస్ట్రానమీలో నిపుణుడు. 110 00:10:20,454 --> 00:10:23,207 షాన్ లాగా ఒక వృత్తిపరమైన వంటగదిలో తప్పులు ఎవరూ ఎత్తి చూపించలేరు. 111 00:10:23,624 --> 00:10:25,125 అతను చెడ్డ వ్యక్తేమీ కాదు. 112 00:10:25,209 --> 00:10:29,171 కొన్నిసార్లు ప్రజలు వాళ్ళ స్థానాన్ని అర్ధం చేసుకోవడానికి గట్టి క్రమశిక్షణ అవసరం. 113 00:10:29,588 --> 00:10:32,424 అవును. షాన్ సరిగ్గా అదే అంటాడు. 114 00:10:32,507 --> 00:10:35,719 ఇంతకీ, మీరేం చేస్తుంటారు, జార్జ్? 115 00:10:39,014 --> 00:10:40,307 రక్షిస్తాను. 116 00:10:42,267 --> 00:10:43,268 నౌకలనా? 117 00:10:44,102 --> 00:10:45,395 కొన్నిసార్లు. 118 00:10:46,688 --> 00:10:48,190 ఇది చాలా బాగుంది, డోరోతి. 119 00:10:48,732 --> 00:10:50,609 ఎంత ముచ్చటైన మర్యాద. 120 00:10:50,692 --> 00:10:52,402 ఆమె ఎప్పుడూ మంచిగానే ప్రవర్తించేది. 121 00:10:53,320 --> 00:10:55,239 మీరు ఇప్పటిదాకా చూసిన వాళ్ళలోకల్లా అత్యంత అందమైన పిల్ల. 122 00:10:56,615 --> 00:10:58,659 కానీ తన గురించి తాను చూసుకోవడం ఇప్పుడు తనకి తెలియదు. 123 00:11:23,642 --> 00:11:25,060 ఇంకా కొద్ది రోజులే అయ్యాయని నాకు తెలుసు, 124 00:11:25,143 --> 00:11:27,479 కానీ లియన్ ఇక్కడ ఎప్పటినుంచో ఉన్నట్టుగా అనిపిస్తోంది. 125 00:11:28,146 --> 00:11:29,940 తను అలాగే ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాము. 126 00:11:30,774 --> 00:11:33,235 కానీ అనుకోకుండా ఇంటి దగ్గర కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. 127 00:11:33,735 --> 00:11:35,445 అక్కడ లియన్ అవసరం ఉంది. 128 00:11:37,739 --> 00:11:40,242 మేము అనుకున్న దానికి అది సరిపోదనుకుంటా. 129 00:11:40,325 --> 00:11:41,493 మీకు కాంట్రాక్టు ఉందా? 130 00:11:42,870 --> 00:11:44,371 మాకు మాటిచ్చింది. 131 00:11:44,454 --> 00:11:45,581 ఒక నెల రోజులు చూస్తానని. 132 00:11:45,664 --> 00:11:47,624 అవును, అది నిజమే, కానీ మేము దాన్ని చేర్చింది ఊరికే... 133 00:11:47,708 --> 00:11:49,668 ఆమెని ఒకవేళ తీసేయాలనుకుంటే. 134 00:11:54,882 --> 00:11:55,883 ఇప్పుడే వస్తాను. 135 00:12:00,637 --> 00:12:04,641 -జూలియన్? -దేవుడా! బయట వర్షం ఘోరంగా పడుతుంది. 136 00:12:05,475 --> 00:12:07,102 నువ్వు ఫోన్ ఎందుకు చేయలేదు? 137 00:12:07,853 --> 00:12:09,897 ఒకవేళ నువ్వు తాగడానికి వచ్చి ఉంటే, ఇక్కడ షాన్ లేడు. 138 00:12:09,980 --> 00:12:12,566 నాకు తెలుసు. తను బోస్టన్ లోని ఒక వంటగది నుంచి నాకు ఫోన్ చేసాడు. 139 00:12:13,984 --> 00:12:15,986 ఇతను నా తమ్ముడు, జూలియన్. 140 00:12:16,069 --> 00:12:18,947 జూలియన్, ఈయన లియన్ వాళ్ళ అంకుల్, జార్జ్. 141 00:12:20,949 --> 00:12:21,950 మిమ్మల్ని కలవడం సంతోషం. 142 00:12:27,289 --> 00:12:28,582 నువ్వు తినేసావా? 143 00:12:30,125 --> 00:12:31,543 మీరు తినగా మిగిలింది తింటాను. 144 00:12:34,963 --> 00:12:36,757 మీది పెద్ద కుటుంబమా, లియన్? 145 00:12:37,341 --> 00:12:39,051 లేక ఈయన ఒక్కరేనా? 146 00:12:41,887 --> 00:12:44,389 నువ్వు ఏ సమయాల్లో పని చేస్తావు, పిల్లా? 147 00:12:48,810 --> 00:12:50,646 తనకి బహుశా పాలు కావాలేమో. 148 00:12:51,313 --> 00:12:52,481 అందరికంటే తల్లికి బాగా తెలుసు. 149 00:13:00,697 --> 00:13:01,698 అయితే... 150 00:13:02,991 --> 00:13:04,535 నువ్వు దీన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నావు? 151 00:13:05,661 --> 00:13:07,454 మన అతిధేయి కోసం టేబుల్ సిద్ధం చేయి. 152 00:13:13,418 --> 00:13:14,586 లేదు. 153 00:13:16,922 --> 00:13:21,927 నువ్వు నిజంగా ఎవరివో చెప్పి మొదలు పెట్టొచ్చు కదా? 154 00:13:23,011 --> 00:13:24,930 నేను కూడా నీలాగే, జూలియన్. 155 00:13:25,764 --> 00:13:26,765 అలా అని నువ్వు అనుకుంటున్నావా? 156 00:13:26,848 --> 00:13:28,308 అంకుళ్ళు. 157 00:13:28,392 --> 00:13:31,186 ప్రజలు అర్ధం చేసుకునే దానికన్నా ఇది పెద్ద బాధ్యత. 158 00:13:32,062 --> 00:13:35,732 ఏదైనా అనర్ధం జరిగినప్పుడు, అప్పుడే మనం అండగా ఉంటాం. 159 00:13:35,816 --> 00:13:39,987 మనం మంచివాళ్లమైతే, పిల్లలని మన సంరక్షణలోకి తీసుకుంటాం. 160 00:13:41,405 --> 00:13:44,533 మనిద్దరం మంచివాళ్ళం. కదా, జూలియన్? 161 00:13:48,912 --> 00:13:51,498 పాత్రలు కడగాలా? సింక్ లోనా? 162 00:13:51,957 --> 00:13:52,958 అవును. 163 00:13:54,918 --> 00:13:56,628 మీరు కడగండి, నేను ఆరబెడతాను. 164 00:14:00,924 --> 00:14:02,009 నీ వెనుక తలుపు మూసేయి. 165 00:14:06,513 --> 00:14:07,931 మనకి ఒక సమస్య వచ్చింది. 166 00:14:08,640 --> 00:14:09,975 తెలుసు. 167 00:14:10,058 --> 00:14:11,935 అతను మన నుంచి లియన్ ని తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు. 168 00:14:12,603 --> 00:14:13,770 మంచిది. తీసుకెళ్ళనివ్వు. 169 00:14:14,187 --> 00:14:17,357 అసలు అతను ఆ పిల్లకి ఈ ఇల్లు మంచది కాదని ఎలా అనగలడు? 170 00:14:17,441 --> 00:14:19,985 నిజంగా, జూలియన్, నాకు ఇప్పుడు చాలా కోపంగా ఉంది. 171 00:14:21,612 --> 00:14:23,405 అసలు అతను నీతో ఏమన్నాడు? 172 00:14:23,822 --> 00:14:27,075 ఒకవేళ అతను ఆ అమ్మాయిని వెనక్కి తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం, 173 00:14:27,159 --> 00:14:29,828 అది నేను చచ్చాకే. 174 00:14:29,912 --> 00:14:31,496 ఇదిగో, వీడికి తేపు తెప్పించు. 175 00:14:38,670 --> 00:14:41,340 అయ్యో. మీరు కడిగారా, కడాగాల్సిన అవసరం లేదు. 176 00:14:41,423 --> 00:14:42,549 మాకు మెషిన్ ఉంది. 177 00:14:42,633 --> 00:14:43,884 మనం వెళ్ళాలి. 178 00:14:44,551 --> 00:14:46,011 ఉదయాన్నే ట్రైన్ బయలుదేరుతుంది. 179 00:14:46,470 --> 00:14:48,639 మనం ఈరాత్రికి స్టేషన్ దగ్గరలో ఎక్కడైనా ఉందాం. 180 00:14:49,056 --> 00:14:50,849 నేను దానికి అస్సలు ఒపుకోను. 181 00:14:50,933 --> 00:14:52,851 లేదు, బయట వాతావరణం భయంకరంగా ఉంది. 182 00:14:52,935 --> 00:14:54,895 మీరు ఇక్కడే మాతోనే ఉండండి. ఇక్కడ కావలసినంత చోటు ఉంది. 183 00:14:59,858 --> 00:15:02,402 -నేను మీకు ఇబ్బంది కావాలనుకోవట్లేదు. -ప్లీజ్, అంకుల్? 184 00:15:07,491 --> 00:15:09,826 -అతను రాత్రి ఇక్కడే ఉంటున్నాడు. -అస్సలు వీల్లేదు. 185 00:15:09,910 --> 00:15:11,828 నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, జూలియన్. 186 00:15:18,335 --> 00:15:19,545 అతను ఇక్కడే ఉంటున్నాడు. 187 00:15:19,628 --> 00:15:20,837 లేదు, అస్సలు కుదరదు. 188 00:15:20,921 --> 00:15:22,548 డోరోతి పట్టుబట్టింది. 189 00:15:22,631 --> 00:15:24,591 సరేనా? కంగారు పడకు, నేను సోఫాలోనే పడుకుంటాను. 190 00:15:24,675 --> 00:15:27,844 అతనికి ఏం తెలుసు? మన గురించి? బిడ్డ గురించి? 191 00:15:30,973 --> 00:15:32,474 ఈ మొత్తం వ్యవహారం వెనుక వాడే ఉన్నాడు. 192 00:15:33,225 --> 00:15:34,643 నాకది ఖచ్చితంగా తెలుసు. 193 00:15:41,441 --> 00:15:44,069 మేము అదనంగా ఉన్న గదిని పిల్లోడి గదిగా మార్చాము. 194 00:15:44,152 --> 00:15:46,363 కానీ షాన్ ఈ సోఫా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అంటాడు. 195 00:15:48,073 --> 00:15:50,367 ఆమె మీతోనే హాయిగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. 196 00:15:50,450 --> 00:15:52,411 ఆమె చాలా మంచి పిల్ల. 197 00:15:52,494 --> 00:15:53,954 మీ కుటుంబానికి మంచి పేరు తెస్తుంది. 198 00:15:54,288 --> 00:15:55,914 లియన్ కి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంది 199 00:15:55,998 --> 00:16:00,419 ఇంకా నేను, షాన్ తను కన్న కలలు నిజం చేయడానికి మేము చేయగలిగిందంతా చేస్తాము. 200 00:16:00,502 --> 00:16:04,840 నన్ను పాత కాలం వాడు అనుకో, డోరోతి, కానీ ఒక బిడ్డ స్థానం వారి కుటుంబంతోనే. 201 00:16:04,923 --> 00:16:06,758 అవును, నేను దానికి పూర్తిగా ఒప్పుకుంటాను. 202 00:16:07,676 --> 00:16:11,763 కానీ లియన్ ఇంకా చిన్న పిల్ల కాదు. 203 00:16:18,020 --> 00:16:19,438 తను మా అమ్మ. 204 00:16:21,899 --> 00:16:24,109 ఆమె చనిపోయినప్పుడు నీకు ఎన్నేళ్ళు, డోతి? 205 00:16:29,156 --> 00:16:32,784 ఆమె నన్ను అలాగే పిలిచేది. "డోతి." 206 00:16:37,331 --> 00:16:40,542 షాన్ కి రాత్రులు వేసుకునే బట్టలు మీకు సరిపోయేవి ఉండుంటాయి. ఏమున్నాయో చూస్తాను. 207 00:16:55,807 --> 00:16:57,559 నేను ఒక్క నిమిషం లోపలికి రావచ్చా? 208 00:17:07,527 --> 00:17:10,030 పడుకునే ముందు కొంచెం సేపు నీతో మాట్లాడాలి అనుకున్నాను. 209 00:17:12,824 --> 00:17:16,662 మీ అంకుల్ నీ గురించి కంగారు పడుతున్నారని నాకు తెలుసు, ఇంకా తనకి ఆ హక్కుంది. 210 00:17:16,745 --> 00:17:20,082 మేము ఇప్పటికే నిన్ను చట్టబద్ధంగా నియమించుకోవాల్సింది. 211 00:17:20,165 --> 00:17:22,125 కానీ నేను, షాన్ ఎంత తీరిక లేకుండా ఉంటామో నీకు తెలుసు కదా 212 00:17:22,209 --> 00:17:24,169 కాబట్టి మేము దాని సంగతి మరచిపోయాం. 213 00:17:34,054 --> 00:17:37,307 నువ్వు రెండవ పేజీలో చూడొచ్చు, నేను కొంచెం జీతం కూడా పెంచి రాసాను. 214 00:17:37,390 --> 00:17:40,561 ఇది ఖరీదైన నగరం ఇంకా నేను నువ్విక్కడ సౌకర్యవంతంగా ఉండాలనుకుంటున్నాను. 215 00:17:44,022 --> 00:17:48,193 ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే జెరికో బాగా డీలా పడిపోతాడు. 216 00:17:48,944 --> 00:17:51,154 వాడు నీకు బాగా అలవాటు అయిపోయాడు. 217 00:17:51,572 --> 00:17:52,947 ఇంకా నేను కూడా బాబుకి బాగా అలవాటైపోయాను. 218 00:17:54,116 --> 00:17:58,245 మేమంతా గడిచిన కొద్ది వారాలుగా నీకు బాగా దగ్గరైపోయాం, లియన్. 219 00:17:58,871 --> 00:18:01,582 షాన్ తో సహా, పైగా తను అందరినీ ఎంత ద్వేషిస్తాడో నీకు తెలుసు. 220 00:18:01,665 --> 00:18:04,960 నిజంగా, ఇప్పుడు నువ్వు మా కుటుంబంలో మనిషిలా అనిపిస్తున్నావు. 221 00:18:06,879 --> 00:18:08,505 వేరే ఏదైనా కారణం ఉంటే తప్ప. 222 00:18:09,506 --> 00:18:11,341 నువ్వు ఇక్కడ మాతో సంతోషంగా లేకపోతే తప్ప. 223 00:18:11,425 --> 00:18:14,052 లేదు, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను, డోరోతి. 224 00:18:14,136 --> 00:18:16,513 అయితే బహుశా నువ్వు మీ అంకుల్ కి ఆ విషయం చెప్పాలనుకుంటా. 225 00:18:16,930 --> 00:18:19,516 అప్పుడు ఆయన నీకేం కావాలో అర్ధం చేసుకుంటాడు. 226 00:18:21,560 --> 00:18:23,020 దానివల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. 227 00:18:24,688 --> 00:18:26,565 ఒకవేళ ఆయన నన్ను రావాల్సిందే అంటే, అప్పుడు... 228 00:18:26,648 --> 00:18:29,192 అప్పుడు నువ్వు ఇక్కడే ఉండేలా మనం ఆయన్ని ఒప్పించాలి. 229 00:18:31,194 --> 00:18:32,571 మనిద్దరం కలిసి. 230 00:18:35,198 --> 00:18:36,200 అవును. 231 00:19:10,108 --> 00:19:13,862 మాకు ఇక్కడ అంతా బాగానే ఉంది. ఆ కంపుకొట్టే మనిషి వచ్చి దాన్ని పాడు చేయనివ్వను. 232 00:19:14,613 --> 00:19:16,573 బంగారం, నువ్వు ఒక బ్యాగ్ లో కావలసినవి సర్దుకొని 233 00:19:16,657 --> 00:19:18,784 పొద్దున నేను వచ్చేదాకా, మారియట్ హోటల్ కి వెళ్ళు. 234 00:19:18,867 --> 00:19:21,286 నా ఇంట్లో నుంచి నేను బలవంతంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. 235 00:19:21,370 --> 00:19:23,664 ఇంకా నువ్వు కంగారు పడటం ఆపొచ్చు. జూలియన్ ఇక్కడే ఉన్నాడు. 236 00:19:24,289 --> 00:19:27,334 జూలియన్ 72 కేజీలుంటాడు. అందులో కూడా దాదాపు మొత్తం కొకెయినే. 237 00:19:27,417 --> 00:19:29,836 ఒకవేళ ఈ అంకుల్ లియన్ ని తిరిగి ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే, తీసుకెళ్లనివ్వు. 238 00:19:29,920 --> 00:19:33,090 మనం మరొక ఆయాని వెతుక్కుందాం. మంచి ఆయాని. అత్యుత్తమ ఆయాని. 239 00:19:34,466 --> 00:19:37,594 నేను ఇవాళ రాత్రి తన కళ్ళలో ఏం చూసానో నీకు తెలియదు, షాన్. 240 00:19:38,470 --> 00:19:42,057 తనని తాను ప్రేమించుకునే దానికంటే, ఆమె మనల్నే ఎక్కువ ప్రేమిస్తుంది... 241 00:19:43,141 --> 00:19:45,269 దేవుడా, నాకది చెప్పాలని లేదు. 242 00:19:45,352 --> 00:19:49,690 చూడు, లియన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ అది మంచి ప్రాంతమైతే కాదు. 243 00:19:51,275 --> 00:19:53,277 అది మనకి అనవసరం. 244 00:20:57,382 --> 00:20:58,592 నేనేలే! 245 00:20:59,092 --> 00:21:02,095 -నువ్వు ఏం చేసి చస్తున్నావు? -అతను వెళ్ళిపోయాడు. అంకుల్ జార్జ్. 246 00:21:03,222 --> 00:21:04,223 ఏంటి? 247 00:21:04,306 --> 00:21:06,141 అతను తన పరుపు మీద లేడు. నేను ప్రతి గది వెతికాను. 248 00:21:07,559 --> 00:21:10,812 అతను... అతను వెళ్ళిపోయాడా? 249 00:21:10,896 --> 00:21:12,439 నువ్వు అలారం కోడ్ ఇచ్చుండకపోతే తప్ప వెళ్ళే ఉంటాడు. 250 00:21:12,522 --> 00:21:13,857 నేనేం అతనికి అలారం కోడ్ ఇవ్వలేదు. 251 00:21:13,941 --> 00:21:16,401 అయితే, అతను ఈ ఇంట్లోనే ఎక్కడో ఒకచోట ఉండి ఉంటాడు! 252 00:21:16,485 --> 00:21:20,489 డోరోతి, బహుశా నువ్వు, నేను ఇక్కడనుంచి బయట పడాలనుకుంటా. 253 00:21:21,698 --> 00:21:24,076 ఎవరో అనామకుడు నన్ను నా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి నేను ఒప్పుకోను. 254 00:21:24,159 --> 00:21:26,370 -ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? -అతన్ని వెదకడానికి. 255 00:21:26,870 --> 00:21:28,455 నేను అంతా చూసాను! 256 00:21:29,623 --> 00:21:30,916 ఆమె గదిలో తప్ప. 257 00:21:33,126 --> 00:21:35,837 -అతను ఆమె గదిలో ఎందుకు ఉంటాడు? -అతను ఆమెకి రక్తసంబంధికుడే కదా? 258 00:21:36,421 --> 00:21:39,007 లేక ఊరికే నిన్ను నమ్మించడానికి "అంకుల్" పేరుతో వచ్చాడా. 259 00:22:09,746 --> 00:22:12,040 నువ్వు నేల మీద ఏం చేస్తున్నావు? 260 00:22:15,627 --> 00:22:17,045 నువ్వు బాగానే ఉన్నావా? 261 00:22:27,097 --> 00:22:28,682 ఇంక చాలు. ఇతన్ని బయటకు పంపించేద్దాం. 262 00:22:28,765 --> 00:22:30,475 వద్దు! అతన్ని అక్కడే వదిలేయి. 263 00:22:30,559 --> 00:22:32,269 ఏంటి? వాడు ఉయ్యాలలో ఉన్నాడు. 264 00:22:32,352 --> 00:22:34,062 అది నాకు కనిపిస్తుంది. 265 00:22:36,315 --> 00:22:39,735 చూడు, మనం అతన్ని వీధిలోకి గెంటేస్తే మనకి లియన్ కూడా ఉండదు. 266 00:22:41,653 --> 00:22:43,488 మరి వాడ్ని ఏం చేద్దాం అంటావు? 267 00:22:44,865 --> 00:22:46,742 అంటే, జెరికోని నాతో పాటు లోపలికి తీసుకెళ్తాను. 268 00:22:46,825 --> 00:22:48,911 నేను తలుపు గడి పెట్టుకుంటాను. నువ్వు కాపలా కూర్చో. 269 00:22:48,994 --> 00:22:50,621 అతను అక్కడే ఉండేలా చూసుకో. 270 00:22:50,704 --> 00:22:52,372 నేను అతని సంగతి ఉదయం చూస్తాను. 271 00:22:53,123 --> 00:22:54,416 ఇది మరీ అతిగా ఉంది. 272 00:22:55,083 --> 00:22:57,544 జూలియన్, అన్ని కుటుంబాలు మనలాగా సాధారణంగా ఉండవు. 273 00:22:58,629 --> 00:23:00,714 అతన్ని మాత్రం గమనిస్తూనే ఉండు. 274 00:23:43,257 --> 00:23:44,967 శుభోదయం, నిద్ర మొహమా. 275 00:23:50,013 --> 00:23:51,473 నిద్ర ఎలా పట్టింది? 276 00:23:51,974 --> 00:23:53,392 చిన్న పిల్లాడిలా పడుకున్నాను. 277 00:24:11,827 --> 00:24:12,870 జూలియన్. 278 00:24:50,699 --> 00:24:53,535 సరే. వర్షం తగ్గింది. 279 00:24:54,912 --> 00:24:59,041 దేవుడు మనల్ని ఇవాళ కరుణించాడు. 280 00:25:14,139 --> 00:25:17,100 మీ కాలు సైజు పదా? షాన్ ది కూడా. 281 00:25:17,184 --> 00:25:18,977 ఆయన దగ్గర అవి 2012 నుంచి ఉన్నాయి. 282 00:25:19,061 --> 00:25:21,146 మంచి లెదర్, కానీ ఆయన వాటిని ఎప్పుడూ వేసుకొని నడవనే లేదు. 283 00:25:21,230 --> 00:25:23,607 ఖచ్చితంగా ఆయన వీటిని ఒక మంచి ఇంటికి పంపాలి అనుకుంటాడు. 284 00:25:32,658 --> 00:25:33,867 నా తరఫున అతనికి ధన్యవాదాలు చెప్పు. 285 00:25:35,494 --> 00:25:36,703 లియన్? 286 00:25:42,334 --> 00:25:43,710 వీడ్కోలు చెప్పు. 287 00:25:45,254 --> 00:25:48,632 -ఆమెకి రావాలని లేదు... -నేను నీతో మాట్లాడట్లేదు, అమ్మాయ్. 288 00:25:50,425 --> 00:25:53,387 జూలియన్, ఇది నే... నేను చూసుకుంటాను. 289 00:25:55,847 --> 00:25:56,974 లియన్. 290 00:25:58,183 --> 00:26:00,894 నువ్వు మీ అంకుల్ కి చెప్పాల్సింది ఏమన్నా ఉందా? 291 00:26:03,647 --> 00:26:04,815 నాకు ఇక్కడే ఉండాలని ఉంది. 292 00:26:09,570 --> 00:26:12,447 మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? నీ సహాయం అవసరమైన వాళ్ళు. 293 00:26:12,531 --> 00:26:15,075 నువ్వు ఈ బిడ్డకోసం వాళ్ళని వదిలేస్తావా? ఆమె కోసం? 294 00:26:17,661 --> 00:26:19,162 సరే అయితే మంచిది. 295 00:26:20,664 --> 00:26:22,624 నేను ఈసారి మీ ఆంటీ మే ని తీసుకొస్తాను. 296 00:26:24,251 --> 00:26:26,670 నువ్వు ఆమె మాట కాదనలేవు. 297 00:26:39,558 --> 00:26:41,602 ఈ దేవుడు లేని ఇల్లు. 298 00:27:01,663 --> 00:27:03,248 భలే ధైర్యంగా చెప్పావు. 299 00:27:04,583 --> 00:27:06,001 నేను బాబుకి బట్టలు మారుస్తాను. 300 00:27:14,760 --> 00:27:16,428 అలా అనడంలో అతని ఉద్దేశం ఏంటి? 301 00:27:17,554 --> 00:27:19,014 ఉత్తుత్తి మాటలు. 302 00:27:20,182 --> 00:27:21,558 ఎవడికి తెలుసు? 303 00:27:38,075 --> 00:27:39,076 డోరోతి? 304 00:27:40,536 --> 00:27:43,664 అయితే అది తొమ్మిదవ తారీఖు, వారాంతం. నేను దాన్ని రాతపూర్వకంగా ధృవీకరిస్తాను 305 00:27:44,331 --> 00:27:47,543 అది మాకు సరిగ్గా సరిపోతుంది. ఇంత చక్కగా సహకరించినందుకు ధన్యవాదాలు. 306 00:27:49,419 --> 00:27:50,837 మీతో కూడా. 307 00:27:52,089 --> 00:27:53,423 అంతా బాగానే ఉందా? 308 00:27:53,507 --> 00:27:55,175 నిజంగా, నువ్వు ఒక్క రాత్రి లేకపోతే 309 00:27:55,259 --> 00:27:58,011 ప్రపంచమంతా కుప్పకూలిపోతుందని అనుకుంటావు. 310 00:27:58,095 --> 00:27:59,763 అంతా సర్దుకుంది. 311 00:28:01,265 --> 00:28:03,016 ఆదివారం నుంచి మూడు వారాలు. తీరిక ఉంచుకో. 312 00:28:03,100 --> 00:28:04,101 ఎందుకు? 313 00:28:04,685 --> 00:28:07,229 ఎందుకంటే నేను ఇప్పుడే సాన్సం లో ఒక చర్చి బుక్ చేసాను. 314 00:28:07,646 --> 00:28:09,314 మన బాబు బాప్టిసం తీసుకోబోతున్నాడు. 315 00:28:09,398 --> 00:28:11,400 నువ్వు నన్ను ఈ విషయంలో కాదనకూడదు. 316 00:28:11,483 --> 00:28:14,570 అందరూ వాడ్ని కలిసి వాడు ఎంత చక్కగా ఉన్నాడో చూడటానికి 317 00:28:14,653 --> 00:28:16,405 ఇదే సరైన అవకాశం. 318 00:28:19,157 --> 00:28:21,869 వాడ్ని 23 నిమిషాల్లో లేపు లేకపోతే రోజంతా ఏడుస్తూనే ఉంటాడు. 319 00:28:29,751 --> 00:28:32,921 సరే. సరే. సరే. 320 00:28:33,547 --> 00:28:35,507 బాగా లేచావు. అవును. 321 00:28:35,591 --> 00:28:39,136 బాగా లేచావు. బాగా లేచావు. బాగా లేచావు. 322 00:29:41,907 --> 00:29:43,909 అనువదించిన వారు - రాజీవ్