1 00:02:32,361 --> 00:02:33,362 ఓరి దేవుడా... 2 00:02:51,797 --> 00:02:55,217 ప్రధాన స్వరూపం 3 00:02:59,179 --> 00:03:03,559 {\an8}స్వర్గం నుండి పాతాళానికి 4 00:03:14,736 --> 00:03:16,947 లూసిఫర్ 5 00:03:32,212 --> 00:03:33,755 - హలో? - ఎరిక్, 6 00:03:33,755 --> 00:03:37,217 నువ్వు ఒక అమ్మాయి ఇంటి పేరు చూసి చెప్పాలి. క్లిప్ అందిందా? 7 00:03:37,801 --> 00:03:39,761 అందింది. క్లిప్ లో ఎవరు? 8 00:03:40,345 --> 00:03:44,766 వీడియోలో సుమారుగా 30 సెకన్ల సమయం వద్ద ఒక అమ్మాయి వస్తుంది, 9 00:03:44,766 --> 00:03:46,226 తనని మనం ఇంటర్వ్యూ చేశాం. 10 00:03:46,226 --> 00:03:48,353 ఆమె రిలీజ్ ఫారాన్ని సైన్ చేసి ఉంటుంది కదా? 11 00:03:50,314 --> 00:03:51,481 హా. పేరు చెప్పవా? 12 00:03:51,481 --> 00:03:54,276 హా. లియన్ గ్రేసన్. 13 00:03:55,152 --> 00:03:57,196 ఆ సమయంలో తనకి ఎనిమిది, తొమ్మిది ఏళ్లు ఉంటాయి. 14 00:03:57,196 --> 00:03:58,363 సరే. లైనులో ఉండు. 15 00:03:58,864 --> 00:03:59,907 సరే. 16 00:04:00,490 --> 00:04:01,575 {\an8}నేటి బాలలే రేపటి పౌరులు 17 00:04:01,575 --> 00:04:03,660 {\an8}ఈ పోటీలో పాల్గొనేవారు. 18 00:04:03,660 --> 00:04:07,247 {\an8}- నా పేరు డొరోతి టర్నర్, 8న్యూస్. - మొత్తం నాశనం చేసేలా ఉన్నావే. లేయ్. 19 00:04:08,790 --> 00:04:10,792 - డొరోతీ? - హా, ఉన్నాను. 20 00:04:11,585 --> 00:04:12,753 సారీ, డొరోతీ, 21 00:04:13,253 --> 00:04:16,089 తను ఫారాన్ని సైన్ చేసినట్లేదు, లేదా వేరే పేరుతో సైన్ చేసిందేమో. 22 00:04:19,301 --> 00:04:20,677 బాగా చూశావా? 23 00:04:20,677 --> 00:04:21,845 హా, బాగా చూశా. 24 00:04:37,736 --> 00:04:38,904 నిద్ర బాగా పట్టిందా? 25 00:04:40,572 --> 00:04:41,907 శుభ్రంగా నిద్రపోయా. 26 00:04:44,868 --> 00:04:46,578 ఆ సంగీతం తప్ప ఇంకేదీ వినవా? 27 00:04:48,622 --> 00:04:49,790 రా డాన్స్ వేద్దాం. 28 00:04:50,457 --> 00:04:53,126 లేదులే. తాగిన మత్తులో లేనప్పుడు నాకు డాన్స్ రాదు. 29 00:04:53,126 --> 00:04:54,211 రావోయ్. 30 00:04:55,254 --> 00:04:56,380 నేను చూపిస్తాలే ఎలా వేయాలో. 31 00:04:58,507 --> 00:05:01,093 పార్టీలో జరిగినదాని గురించి మనం మాట్లాడుకోవాలి. 32 00:05:01,093 --> 00:05:02,177 అక్కర్లేదు. 33 00:05:02,928 --> 00:05:05,180 ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా, వాళ్లకి ఏదోకటి జరుగుతోంది. 34 00:05:05,180 --> 00:05:06,265 శాంతించు. 35 00:05:07,558 --> 00:05:09,059 నాతో ఉంటే నీకేమీ కాదు. 36 00:05:10,185 --> 00:05:11,478 అంటే ఏంటి? 37 00:05:12,145 --> 00:05:14,773 నీకు కూడా ఇది తెలుస్తోంది కదా. 38 00:05:15,315 --> 00:05:18,068 పరిస్థితులు బాగా దిగజారాయని నీకూ తెలుస్తోంది కదా. 39 00:05:18,068 --> 00:05:20,946 జూలియన్, నోర్మూసుకో. 40 00:05:23,198 --> 00:05:24,199 బాబోయ్. 41 00:05:25,742 --> 00:05:26,910 కొరికావు. 42 00:05:28,328 --> 00:05:29,371 మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. 43 00:05:33,834 --> 00:05:35,627 {\an8}ఇంకాసేపు ఉంటే ఉడుకుతుంది... 44 00:05:35,627 --> 00:05:37,671 {\an8}- నేనేం అంటున్నానో వినబడుతోందా? - వినబడుతోంది, చెఫ్. 45 00:05:37,671 --> 00:05:39,339 {\an8}ఇదుగోండి మీ తొక్కలో వంటకం. 46 00:05:41,216 --> 00:05:42,509 అయిదే నిమిషాలు! 47 00:05:43,844 --> 00:05:45,846 {\an8}ఇది ఇంకా కాలేదని సాకు చెప్తున్నారా? 48 00:05:46,430 --> 00:05:50,350 {\an8}- నా కిచెన్ లో ఏడుస్తున్నారా? - లేదు, చెఫ్. 49 00:05:50,350 --> 00:05:52,769 {\an8}ఈ వంటకంలో ఉన్న ఉప్పు కన్నా, మీ కన్నీళ్లలో ఉన్న ఉప్పే ఎక్కువ ఉంటుంది. 50 00:05:52,769 --> 00:05:54,021 {\an8}చెఫ్, నేను మర్చిపోయాను... 51 00:05:54,021 --> 00:05:56,940 ఇక సాకులు చాలు, డొమినిక్. నా కిచెన్ నుండి వెళ్లిపోండి. 52 00:05:56,940 --> 00:05:59,318 వెళ్లిపో! షాన్! షాన్! షాన్! 53 00:05:59,318 --> 00:06:00,777 చూశావా! 54 00:06:03,447 --> 00:06:05,240 హా. అవును. 55 00:06:06,700 --> 00:06:08,911 - మీ నాన్నకి మంచి పేరు వస్తోంది. - వెళ్లిపోండి. 56 00:06:12,164 --> 00:06:13,832 - ఏంటిది? - ఏంటో నీకు తెలుసు. 57 00:06:13,832 --> 00:06:16,460 నువ్వు పడుకొనే ముందు చదువుకొనేది ఇది. ఏమైనా పరిశోధన చేస్తున్నావా? 58 00:06:18,337 --> 00:06:22,090 మనం దీని గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ కాదు. 59 00:06:25,969 --> 00:06:28,597 లియన్. అన్నింట్లో తన పాత్ర ఉంది. 60 00:06:29,932 --> 00:06:31,183 తనకి కోపం వస్తే, వినాశనం జరుగుతుంది. 61 00:06:31,183 --> 00:06:33,852 తనకి ఆనందం వస్తే, అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. 62 00:06:33,852 --> 00:06:36,897 మనం తనతో మంచిగా ఉన్నప్పుడు అంతా చక్కగా ఉంటుంది. 63 00:06:38,106 --> 00:06:42,653 ఈ పురుగుల గోల, ఇంటికి పగుళ్లు, డొరోతీకి జరిగిన ప్రమాదం, జెరికో. 64 00:06:44,071 --> 00:06:46,657 {\an8}నేను దాని మీద పరిశోధన చేశా, దీనికి పేరు కూడా ఉంది. 65 00:06:48,784 --> 00:06:49,910 సైతానుతో ఒప్పందం. 66 00:06:51,411 --> 00:06:53,247 ఏడ్చినట్టుంది. పిల్లోళ్లలా మాట్లాడుకుంటున్నాం మనం. 67 00:06:53,747 --> 00:06:55,874 లియన్ సమాధి కనబడిందని నువ్వు అనుకున్నావు కదా? 68 00:06:57,125 --> 00:07:00,045 లియన్ మనతో పరాచకాలు ఆడుతోంది అనుకున్నాం కదా, కానీ మన ఆలోచన తప్పైతే? 69 00:07:01,755 --> 00:07:02,756 తను చనిపోయి ఉంటే? 70 00:07:04,424 --> 00:07:06,093 మరణం తర్వాత తను మనిషిలా కాకుండా మరో రూపంలో వచ్చుంటే? 71 00:07:08,929 --> 00:07:10,639 మూఢ మఠస్తులు, తాము దైవ సేవకులని చెప్పుకుంటుంటారు. 72 00:07:12,766 --> 00:07:13,934 అవును. 73 00:07:13,934 --> 00:07:15,727 వారిని వదిలేసినప్పుడు లియన్ వారి పద్ధతులను వదిలేసింది. 74 00:07:18,981 --> 00:07:21,024 నేలరాలిన దైవదూత. 75 00:07:27,489 --> 00:07:28,532 ఏమైంది? 76 00:07:31,702 --> 00:07:32,703 ఏం... 77 00:07:34,246 --> 00:07:35,497 మాట్లాడలేకపోతున్నావా? 78 00:07:40,836 --> 00:07:43,255 ఇది లియన్ పనా? 79 00:07:44,923 --> 00:07:46,049 కిందికి వస్తున్నావెందుకు? 80 00:07:46,967 --> 00:07:48,802 గదిలో చిరాకు వచ్చి, ఇలా వచ్చాను. 81 00:07:48,802 --> 00:07:50,220 నాకు కాల్ చేసి ఉండవచ్చు కదా. 82 00:07:58,103 --> 00:07:59,563 జెరికోని అలా బయటకు తీసుకెళ్తున్నావా? 83 00:08:00,272 --> 00:08:01,273 అవును. 84 00:08:02,191 --> 00:08:05,194 - నాకు కూడా రావాలనుంది. - త్వరలోనే వస్తావులే. 85 00:08:07,863 --> 00:08:09,156 ఇక్కడ జాగ్రత్తగా ఉండగలవా? 86 00:08:09,156 --> 00:08:12,451 హా. నేను ఒక ఆర్టికల్ పై పని చేస్తున్నా. 87 00:08:15,120 --> 00:08:16,163 నేనేమైనా సాయపడనా? 88 00:08:18,665 --> 00:08:19,791 వద్దు. 89 00:08:21,251 --> 00:08:22,461 ఇంకా ఆధారాలేవీ దొరకలేదు. 90 00:08:24,004 --> 00:08:25,881 అది కొండను తవ్వి ఎలుకని పట్టడంలా ఉంటుంది అన్నమాట. 91 00:08:27,633 --> 00:08:29,051 ఆ వాక్యం భలేగా ఉంది. 92 00:08:30,177 --> 00:08:32,136 నీకు అంత కష్టమైన పని కాబోదులే. 93 00:08:35,557 --> 00:08:36,600 నువ్వు ఇట్టే చేసేయగలవు. 94 00:08:38,477 --> 00:08:39,727 డొరోతి టర్నరా మజాకా! 95 00:08:41,897 --> 00:08:42,898 సరే. 96 00:08:43,899 --> 00:08:47,194 వెండి బుల్లెట్ల వల్ల తనకి నష్టం కలుగుతుందంటావా? అలా అయినా పని జరుగుతుందా అని. 97 00:08:52,533 --> 00:08:54,076 "నరతోడేలు." అదే. 98 00:08:56,119 --> 00:08:57,120 వెల్లుల్లి? 99 00:08:59,456 --> 00:09:00,457 లేదు. 100 00:09:01,583 --> 00:09:03,836 {\an8}తనకి వెల్లులి ఉన్న వంటకాలంటే ఇష్టం. 101 00:09:03,836 --> 00:09:05,254 {\an8}వ్యాంపైర్లు 102 00:09:05,254 --> 00:09:06,338 {\an8}హా. 103 00:09:09,049 --> 00:09:12,094 బహుశా తనకి నీళ్లు పడవేమో. తను స్నానం చేయడం నేను చూడలేదు. నువ్వు చూశావా? 104 00:09:15,681 --> 00:09:16,682 సరే. 105 00:09:18,392 --> 00:09:19,434 చీర్స్, బాసూ. 106 00:09:23,272 --> 00:09:24,273 హేయ్. 107 00:09:26,775 --> 00:09:28,068 హేయ్. 108 00:09:28,068 --> 00:09:31,196 రాస్కో, బాబోయ్! ఎంత సేపటి నుండి అక్కడ నిలబడి ఉన్నావు? 109 00:09:36,869 --> 00:09:38,537 ఇలా చెప్పాపెట్టకుండా వచ్చినందుకు మన్నించాలి. 110 00:09:39,121 --> 00:09:40,247 ఏంటి బాసూ? 111 00:09:40,247 --> 00:09:42,040 మిమ్మల్ని కలవాలని ఒకరు వచ్చారు. 112 00:09:42,624 --> 00:09:44,585 మీ సందేహాలన్నింటికీ ఆయన నివృత్తి చేయగలడు. 113 00:09:53,802 --> 00:09:54,928 జార్జ్. 114 00:09:57,514 --> 00:09:59,766 {\an8}వీడు, వీడి బట్టలు 115 00:10:02,603 --> 00:10:03,645 హలో, షాన్. 116 00:10:05,272 --> 00:10:06,273 హలో, జూలియన్. 117 00:10:06,857 --> 00:10:08,442 నన్ను బయటే వేచి ఉండమన్నాడు, 118 00:10:09,568 --> 00:10:10,569 గుడ్ లక్. 119 00:10:14,823 --> 00:10:17,618 లోపలికి ఎలా వచ్చావు? తలుపులకి తాళాలు వేసి ఉంచానే. 120 00:10:17,618 --> 00:10:20,329 మనం ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడకుంటే మంచిది. 121 00:10:20,913 --> 00:10:23,415 ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. 122 00:10:24,458 --> 00:10:26,460 ఇవాళ నేను నిజం చెప్పేస్తున్నా. 123 00:10:28,462 --> 00:10:31,381 లియన్ గ్రేసన్ గురించి మీకు నిజం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. 124 00:10:32,758 --> 00:10:36,094 "విస్కాన్సిన్ లోని ఒనైడాలో ముగ్గురు కుటుంబ సభ్యులు అగ్నికి ఆహుతి అయ్యారు." 125 00:10:36,845 --> 00:10:38,055 "లియన్ గ్రేసన్ అనే అమ్మాయి శవం 126 00:10:38,055 --> 00:10:41,808 అక్కడ లభించలేదు. మరణించి ఉంటుందని భావిస్తున్నారు." 127 00:10:42,434 --> 00:10:45,187 సోది రామాయణం. ఆ సమయంలో తనకి ఎనిమిదేళ్లు. 128 00:10:47,314 --> 00:10:49,650 - మంటలకు కారణమేంటో తెలుసా? - లేదు. 129 00:10:52,611 --> 00:10:55,072 మీ కుటుంబానికి నేను క్షమాపణలు చెప్పాలి. 130 00:10:55,614 --> 00:10:57,741 లేదు, మేమే నీకు క్షమాపణలు చెప్పాలి. 131 00:10:57,741 --> 00:11:01,078 తను ఎలాంటిదో మాకు చెప్పాలని చాలా ప్రయత్నించావు, కానీ నీ మాటలను మేం పట్టించుకోలేదు. 132 00:11:02,704 --> 00:11:07,543 చర్చ్ అఫ్ ది లెస్సర్ సెయింట్స్ నుండి ఇటీవలే బయటకి వచ్చేశాను. 133 00:11:09,419 --> 00:11:11,129 తప్పులని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. 134 00:11:13,549 --> 00:11:17,469 మీ కుటుంబానికి మేము చాలా పెద్ద హాని తలపెట్టాం. 135 00:11:19,763 --> 00:11:21,431 మీకు అబద్ధాలు చెప్పారు. 136 00:11:22,933 --> 00:11:24,017 మోసం చేశారు. 137 00:11:24,810 --> 00:11:25,936 మాకు చేసినట్టే. 138 00:11:28,772 --> 00:11:33,610 చాలా కాలం క్రితం నేను ఉరేసుకొని చావడానికి ప్రయత్నించాను. 139 00:11:35,279 --> 00:11:36,864 అప్పుడు నేను చాలా బాధలో ఉండేవాడిని. 140 00:11:39,032 --> 00:11:43,537 తీరా చూస్తే నేను ఆసుపత్రిలో ఉన్నాను, నా ఎదురుగా ఒక మహిళ నన్నే తదేకంగా చూస్తూ ఉండింది. 141 00:11:45,956 --> 00:11:47,624 తన పేరు మే మార్కం. 142 00:11:49,293 --> 00:11:53,714 నేను చనిపోయానని, 143 00:11:54,548 --> 00:11:57,759 దైవ సేవకునిగా మళ్లీ పుట్టానని తను చెప్పింది. 144 00:12:01,430 --> 00:12:06,185 తనకి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కాబట్టి ఆ మార్గాన్నే అనుసరిద్దామని నిర్ణయించుకున్నా. 145 00:12:07,895 --> 00:12:11,398 అప్పటి నుండి, ఆంటీ, అంకుల్ గా మా ప్రస్థానం మొదలైంది, 146 00:12:11,398 --> 00:12:13,066 ఇతరులని కూడా మా పథంలోకి చేర్పించుకుంటూ వచ్చాం. 147 00:12:13,066 --> 00:12:14,359 మా ప్రస్థానం చాలా అద్భుతంగా సాగింది. 148 00:12:19,031 --> 00:12:24,453 లియన్ చిన్నతనంలోనే తన కుటుంబమంతా అగ్నికి ఆహుతైంది. 149 00:12:25,996 --> 00:12:29,416 తన అమ్మ తనతో క్రూరంగా ప్రవర్తించేది. 150 00:12:31,793 --> 00:12:36,590 కాబట్టి, ఆమె చనిపోవడానికి తనే ప్రధాన కారణమని అనుకుంది. 151 00:12:38,926 --> 00:12:40,761 తనలాంటి వాళ్లనే సులభంగా మా దారికి రప్పించుకోవచ్చు. 152 00:12:42,262 --> 00:12:44,932 నాకు ఒకప్పుడు ఏం చెప్పారో, తనకి కూడా నేను అదే చెప్పాను. 153 00:12:45,474 --> 00:12:50,896 తను అగ్నిప్రమాదంలో చనిపోయిందని, దైవ సేవకునిగా మళ్లీ పుట్టిందని చెప్పా. 154 00:12:53,023 --> 00:12:56,235 కానీ మానసికంగా చాలా కృంగిపోయి ఉంది, ఆ విషయాన్ని మేం గ్రహించలేకపోయాం. 155 00:12:58,612 --> 00:13:03,534 ఈ అసాధారణమైన విషయాలపై వేగంగానే తనకు చాలా నమ్మకం కలిగేసింది. 156 00:13:05,202 --> 00:13:07,579 తను మమ్మల్ని వదిలేసి బయటకు వచ్చేశాక, 157 00:13:07,579 --> 00:13:12,042 తను అతీతశక్తులున్న వ్యక్తి అని లియన్ బలంగా నమ్మసాగింది. 158 00:13:25,347 --> 00:13:26,974 {\an8}మరో సైతాను 159 00:13:27,683 --> 00:13:29,017 కానీ అది నిజం కాదు. 160 00:13:31,186 --> 00:13:35,774 ఏంటంటే, చర్చి భావాల ప్రచారంలో లేనిది ఉన్నట్టుగా చూపెట్టడం లాంటివి ఉంటాయి. 161 00:13:37,192 --> 00:13:42,865 లియన్ గందరగోళంతో పాటు కాస్త పిచ్చి ఉన్న ఒక సాధారణ అమ్మాయి. 162 00:13:42,865 --> 00:13:45,158 - ఏంటి? - తనకేం శక్తులు లేవు. 163 00:13:45,158 --> 00:13:48,537 అది అబద్ధం. మేము చాలా చూశాం. 164 00:13:48,537 --> 00:13:51,915 నిన్న జెరికో పుట్టినరోజు నాడు, జంతువులన్నీ పిచ్చిగా ప్రవర్తించాయి. 165 00:13:52,583 --> 00:13:53,876 ఒక మహిళ చావబోయింది. 166 00:13:53,876 --> 00:13:56,378 తన ముఖాన్ని చూసి నా నోట మాట రాలేదు. 167 00:13:56,378 --> 00:13:57,588 దాన్నేం అంటారు? 168 00:13:58,172 --> 00:14:02,593 నా దిద్దుబాటు చర్యల్లో భాగంగా, ఆసుపత్రిలో ఉన్న బెవర్లీ ఆల్కాట్ ని కలిశాను. 169 00:14:03,302 --> 00:14:06,972 తనని ఒక పాము కాటేసింది, ఇంకొన్ని రోజుల్లో తను పూర్తిగా కోలుకుంటుంది. 170 00:14:06,972 --> 00:14:08,056 ఏంటి? 171 00:14:08,056 --> 00:14:11,852 పెరూవియన్ రకానికి చెందిన రక్తపింజరి కాటేస్తే, వెంటనే ఒళ్ళంతా ఉబ్బిపోతుంది, 172 00:14:12,519 --> 00:14:14,479 ముఖం, ఒళ్లు రంగు మారిపోతుంది. 173 00:14:21,028 --> 00:14:24,031 ఎక్కువ శాతం సందర్భాల్లో, తేలికైన పరిష్కారమే సరైన పరిష్కారం అవుతుంది. 174 00:14:24,615 --> 00:14:25,949 తన తల్లి గురించి ఏమైనా తెలిసిందా? 175 00:14:25,949 --> 00:14:27,284 పాత ఫార్మ్ హౌసులో చెలరేగిన మంటలతో అగ్నిమాపకసిబ్బంది యుద్ధం 176 00:14:27,784 --> 00:14:28,785 లారా గ్రేసన్. 177 00:14:29,286 --> 00:14:33,540 తను తాగుబోతులా అనిపిస్తోంది. 2005లో తాగి వాహనం నడిపినట్టు తనపై కేసు ఉంది, 178 00:14:34,166 --> 00:14:35,167 పెద్ద యాక్సిడెంటే. 179 00:14:35,918 --> 00:14:36,919 సరే. 180 00:14:38,170 --> 00:14:39,254 అలాంటి వాటి ద్వారా ఏమైనా తెలుస్తుందేమో. 181 00:14:39,254 --> 00:14:42,758 పుట్టిన రోజు, కేసు వేసిన రోజు, 182 00:14:42,758 --> 00:14:44,092 చనిపోయిన రోజు, ఇవేమైనా తెలుసా? 183 00:14:45,886 --> 00:14:47,638 తన అమ్మ ద్వారా మనకు ఏమైనా తెలియవచ్చు. 184 00:14:48,889 --> 00:14:50,057 లియన్ వచ్చిన ప్రారంభంలో, 185 00:14:50,057 --> 00:14:53,977 తనకి నాపై కోపం వచ్చినప్పుడు, నాకు స్పర్శ, రుచి తెలీలేదు. 186 00:14:53,977 --> 00:14:57,940 జలుబు చేసినా, కొన్ని రకాల మందులు తీసుకున్నా 187 00:14:58,899 --> 00:15:01,193 అలా జరగవచ్చు. 188 00:15:01,693 --> 00:15:04,571 నువ్వు శిక్ష అనుభవిస్తున్నావని నమ్మించడానికి 189 00:15:05,072 --> 00:15:07,241 తను నీ ఆహారంలో ఏదైనా కలుపుతూ ఉండిందేమో. 190 00:15:07,241 --> 00:15:10,327 ఇంటిలో అన్ని చోట్లా నాకు పేడ్లు కనిపించేవి. ఇల్లు నా మీద దాడి చేస్తుందేమో అనిపించేది. 191 00:15:10,327 --> 00:15:12,996 అది లియన్ కి చాలా ఇష్టమైన పని. 192 00:15:13,705 --> 00:15:16,625 తన చిన్నప్పుడు తనని నేను మందలించినప్పుడు, తర్వాతి రోజు నా కుర్చీ మీద 193 00:15:16,625 --> 00:15:20,254 చెక్క ముక్కో, లేదా గాజు ముక్కో కనిపించేది, 194 00:15:20,254 --> 00:15:22,089 అది చాలా సాధారణం అన్నమాట. 195 00:15:34,351 --> 00:15:35,477 {\an8}బొమ్మ? 196 00:15:35,477 --> 00:15:38,814 {\an8}లియన్ ఇంటి నుండి వెళ్లిపోయినప్పుడల్లా జెరికో మళ్లీ బొమ్మ అయిపోతాడు. 197 00:15:38,814 --> 00:15:40,524 ఈ ఇంట్లోని అణువణువునూ మేము వెతికాం. 198 00:15:40,524 --> 00:15:43,485 తను వాడిని దాచడానికి ఏ చోటూ లేదు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. 199 00:15:44,069 --> 00:15:47,614 ఈ పాత ఇళ్లలో చాలా రహస్యాలు ఉంటాయి. 200 00:15:48,699 --> 00:15:50,325 మీ ఇంటికి ఇంకా ఎక్కువ ఉన్నాయి. 201 00:15:51,451 --> 00:15:55,539 బేబీ! బేబీ! 202 00:15:57,916 --> 00:16:01,587 బేబీ! లేయ్, బేబీ! 203 00:16:25,819 --> 00:16:28,363 ఈ కాలనీ కింద చాలా సొరంగ మార్గాలు ఉన్నాయి. 204 00:16:28,989 --> 00:16:32,534 వాటిని సంపన్న కుటుంబాలు పందొమ్మిదవ శతాబ్దంలో నిర్మించాయి, 205 00:16:32,534 --> 00:16:35,370 మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న తమ బంధువులను చికిత్స కోసం తీసుకెళ్లడానికి. 206 00:16:36,246 --> 00:16:40,792 తోటి సంపన్న వర్గానికి తమ సమస్యలను తెలియకుండా ఉండటానికి అన్నమాట. 207 00:16:41,919 --> 00:16:46,965 ఈ సొరంగాల గురించి లియన్ కి ముందు నుండే తెలుసు. 208 00:16:48,717 --> 00:16:53,680 మేము ఏ చోటికైనా వెళ్లే ముందు దాని రహస్యాలన్నీ తెలుసుకుంటాం. 209 00:16:55,724 --> 00:17:00,437 ఈ విధంగా, మీ జీవితంలోకి లియన్ ఒక పసికందుని తీసుకువచ్చింది. 210 00:17:02,064 --> 00:17:05,651 తనకి నచ్చినప్పుడు ఆ పసికందును మాయం చేసింది, మళ్లీ ప్రత్యక్షమయ్యేలా చేసింది. 211 00:17:07,694 --> 00:17:08,737 ఒక భ్రమ ద్వారా. 212 00:17:12,406 --> 00:17:14,576 డొరోతీ, నువ్వు మామూలు మేధావివి కాదు. 213 00:17:15,117 --> 00:17:17,871 లియన్ అమ్మ అయిన లారా అగ్నిప్రమాదం జరిగిన రెండు రోజులకు చనిపోయింది. 214 00:17:18,372 --> 00:17:20,958 ఆ తేదీ, ఏప్రిల్ 17, 2011. 215 00:17:21,875 --> 00:17:24,086 తర్వాతి ఏడు ఏప్రిల్ 17వ రోజున చూడు. 216 00:17:29,258 --> 00:17:31,844 నువ్వు ట్యాగ్ లైన్ చెప్పినప్పుడు ఆఖరున కనిపించే ప్రతిబింబాన్ని జాగ్రత్తగా చూడు. 217 00:17:32,594 --> 00:17:33,595 ఏం కనిపించింది? 218 00:17:33,595 --> 00:17:36,098 "తినేంత ముద్దొస్తున్నావు" అనే వాక్యాన్ని ఎప్పుడైనా విన్నారా? 219 00:17:36,098 --> 00:17:39,810 {\an8}'ఫిల్లీస్ బేక్ షాప్ ఆన్ 20త్' ఒక విప్లవాత్మకమైన ఆలోచనని అమలు చేసింది. 220 00:17:40,310 --> 00:17:41,395 {\an8}ముఖాలతో ఉండే కేకులు. 221 00:17:41,395 --> 00:17:42,688 {\an8}8న్యూస్ నవ్వుతూ ఉండే కేకులు 222 00:17:42,688 --> 00:17:45,732 {\an8}ఈ అదిరిపోయే ఐడియా మీకు ఎలా వచ్చింది? 223 00:17:46,567 --> 00:17:49,444 {\an8}ఇది వ్యాలంటైన్ డే స్పెషల్ గా పరిచయం చేశాం, 224 00:17:49,444 --> 00:17:53,782 {\an8}కానీ బాగా విజయవంతమైంది. జనాలకి జనాలని తినడమంటే ఇష్టం అనుకుంటా. 225 00:17:54,658 --> 00:17:56,243 మరీ ముఖ్యంగా వాళ్లకి గిట్టని వాళ్లని. 226 00:17:57,244 --> 00:17:59,288 {\an8}ఈమె నా మూడవ క్లాస్ టీచర్. 227 00:18:01,874 --> 00:18:02,875 {\an8}తనని తినేశా. 228 00:18:03,959 --> 00:18:06,712 {\an8}'బేక్ షాప్ ఆన్ 20థ్' షాపులో ఉండే 229 00:18:06,712 --> 00:18:10,215 {\an8}ప్రసిద్ది చెందిన కుకీలు, కేకులు, పైలకు ఇది ఇంకో అద్భుతమైన జోడింపు అని చెప్పవచ్చు. 230 00:18:10,799 --> 00:18:14,386 జనాలైతే లాగించేస్తున్నారు ఇక్కడ. నా పేరు డొరోతి టర్నర్, 8న్యూస్. 231 00:18:16,763 --> 00:18:17,890 వాళ్లు కనిపించారా? 232 00:18:17,890 --> 00:18:18,974 ఓరి దేవుడా. 233 00:18:18,974 --> 00:18:21,727 ఇప్పుడు అదే రోజుకు సంబంధించి తర్వాతి ఏడాది టేపును చూడు, 234 00:18:22,853 --> 00:18:26,440 లేదు. తను చావు బతుకలను అటుఇటు చేయడం నేను చూశాను. 235 00:18:26,440 --> 00:18:28,108 ఉదాహరణకు, ఒక కుక్క... 236 00:18:28,108 --> 00:18:30,694 {\an8}ఇంకా ప్రత్యక్ష ప్రసారంలో డొరోతీ సహోద్యోగి మరణం. 237 00:18:30,694 --> 00:18:32,237 {\an8}మరీనో కుటుంబం? 238 00:18:32,237 --> 00:18:35,991 {\an8}ప్రతికూల విషయాల్లో మనం ఒక అర్థం కోసం వెతుకుతుంటాం. 239 00:18:39,244 --> 00:18:40,245 మరి నా బిడ్డ సంగతేంటి? 240 00:18:42,122 --> 00:18:46,168 వాడు చనిపోయాడని నాకు బాగా తెలుసు. కానీ ఈ ఇంట్లో ఉన్న బిడ్డ నా కొడుకులానే ఉన్నాడు. 241 00:18:47,294 --> 00:18:53,175 తప్పిపోయిన వ్యక్తుల కేసులలో కూడా వెతికాం. ఏమీ దొరకలేదు. వాడు నా బిడ్డే అని నాకు తెలుసు. 242 00:18:56,428 --> 00:19:03,060 సెప్టెంబరు 2019న "ఫిలడెల్ఫియా ఇంక్వైరర్" ఒక మరణ వార్తని ప్రచురించింది. 243 00:19:05,521 --> 00:19:08,482 ఫిట్లర్ స్క్వేర్ పార్క్ దగ్గర ఒక మహిళ డ్రగ్స్ మోతాదు ఎక్కువ తీసుకోవడం వల్ల విగత జీవి అయి పడి ఉంది. 244 00:19:09,608 --> 00:19:10,609 డ్రగ్స్ కి బానిస ఆమె. 245 00:19:11,777 --> 00:19:14,279 కొందరి కథనం ప్రకారం తనతో ఒక పసికందు కూడా ఉండింది. 246 00:19:15,739 --> 00:19:18,867 నీలి కళ్ల మగ బిడ్డ. 247 00:19:21,328 --> 00:19:23,830 అతను కనిపించట్లేదని కేసు వేయనప్పుడు, ఆ విషయం నీకెలా తెలిసింది? 248 00:19:24,456 --> 00:19:27,376 ఇలాంటి వాటిని ఆలకిస్తూ ఉండే మనుషుల నెట్వర్క్ మాకు ఉంది. 249 00:19:36,635 --> 00:19:39,137 ...ఈ ప్రాంతమంతా గ్రహాంతరవాసులని కోడై కూస్తోంది. 250 00:19:39,137 --> 00:19:40,556 {\an8}హఠాత్తుగా ఈ ఉదయం, 251 00:19:40,556 --> 00:19:45,727 {\an8}డిస్క్ ఆకారంలో ఉన్న ఒకదాన్ని ఎగురుతూ ఉండగా చూశామని ముగ్గురు చెప్తున్నారు. 252 00:19:45,727 --> 00:19:48,313 {\an8}ఏలియన్స్ నిజంగా ఉండరని విమర్శకుల వాదన, 253 00:19:48,313 --> 00:19:51,942 ఈ ఉదయం హడావిడి అంతా భ్రమ వల్ల జరిగిందే అని, లేదా అది ఆకతాయిల పని అని వారి వాదన. 254 00:19:51,942 --> 00:19:53,318 {\an8}నేను ఏం అంటానంటే, 255 00:19:53,318 --> 00:19:57,197 {\an8}నిజంగా ఏలియన్స్ ఉంటే, నేను వాళ్లతో మాట్లాడటానికి సిద్ధం. 256 00:19:57,197 --> 00:19:58,907 {\an8}UFOనా లేదా ఇది కేవలం పిచ్చివాళ్ల వాదననా 257 00:20:02,703 --> 00:20:04,413 ...ఏం అంటానంటే, నిజంగా... 258 00:20:05,414 --> 00:20:08,792 ఈ అమ్మాయి, తన తల్లి చనిపోయిన రోజు ప్రతి సంవత్సరం నిన్ను చూడటానికి వచ్చేది. 259 00:20:09,751 --> 00:20:11,044 అది మామూలు భయంకరమైన విషయం కాదు. 260 00:20:12,963 --> 00:20:14,590 మా పట్ల ఎందుకలా చేస్తోంది తను? 261 00:20:15,591 --> 00:20:17,384 డొరోతీకి ఎందుకిలా చేస్తోంది? 262 00:20:17,384 --> 00:20:21,471 లియన్ తన చిన్నతనంలో డొరోతీని ఒకసారి చూసింది. 263 00:20:23,599 --> 00:20:26,393 తన తల్లి చనిపోయిన తర్వాత డొరోతీ అంటే తనకి పిచ్చిలా అయిపోయింది. 264 00:20:29,521 --> 00:20:32,941 ప్రతీ ఏడూ ఒక రోజున డొరోతీ పని చేస్తున్న చోటికి వెళ్లి తనకి చూపించేదాన్ని, 265 00:20:34,443 --> 00:20:36,403 అలా అయినా తనకి బాధ దూరమవుతుందనే ఆశతో. 266 00:20:37,446 --> 00:20:38,447 8న్యూస్ - ఏప్రిల్ 17 267 00:20:38,447 --> 00:20:41,408 తన డ్రెస్సులని చాలా రోజుల ముందే ఎంచుకొనేది. 268 00:20:43,785 --> 00:20:47,331 కానీ కేవలం దూరం నుండి చూడటం తనకి సంతృప్తినివ్వలేదు. 269 00:20:48,040 --> 00:20:50,876 డొరోతీ జీవితంలో భాగం కావాలనుకుంది. 270 00:21:03,805 --> 00:21:07,142 డొరోతీని చాలా రోజుల పాటు గమనించింది. 271 00:21:24,493 --> 00:21:27,579 నీ కొడుకు మరణం ఒక కీలకమైన ఘట్టం అనవచ్చు. 272 00:21:40,968 --> 00:21:42,094 తనకి అది అవకాశంలా మారింది. 273 00:21:49,977 --> 00:21:53,146 అనాథగా ఉన్న ఆ పసికందు 274 00:21:53,146 --> 00:21:58,151 తనకు దేవుడు ఇచ్చిన వరంలా భావించింది. తాను కోరుకున్న తల్లికి దగ్గరయ్యే అవకాశంలా దాన్ని చూసింది. 275 00:22:01,113 --> 00:22:02,739 అలా పసికందును తీసుకుంది. 276 00:22:07,035 --> 00:22:08,078 హలో, జెరికో. 277 00:22:11,748 --> 00:22:15,127 ఇదంతా నేను మీకు అయిష్టంగానే చెప్తున్నాను. 278 00:22:16,670 --> 00:22:17,963 క్షమించండి. 279 00:22:19,339 --> 00:22:21,216 ఇంకా నా సానుభూతి కూడా తెలియజేస్తున్నా. 280 00:22:24,094 --> 00:22:26,555 నిజం చెప్పడం ద్వారానే విముక్తి లభిస్తుంది. 281 00:22:28,432 --> 00:22:30,267 ఇప్పుడు మీరు మొదలుపెట్టగలరని ఆశిస్తున్నా. 282 00:22:31,435 --> 00:22:35,898 నేను మిమ్మల్ని ఇప్పుడు కోరేది చిన్నదేమీ కాదు... 283 00:22:38,233 --> 00:22:41,320 కానీ నా మార్పుకు ఇది చాలా కీలకమైనది. 284 00:22:43,363 --> 00:22:46,825 లియన్ ని మళ్లీ నా దగ్గరికి వచ్చేయాలి, అందుకు మీ సాయం నాకు కావాలి. 285 00:22:52,831 --> 00:22:56,084 మాకు కావాల్సింది కూడా అదే, జార్జ్. అది, ఇంకా మా బిడ్డ. 286 00:23:04,426 --> 00:23:06,345 నాకు నువ్వు చెప్పినదంతా అబద్ధమేనా? 287 00:23:11,725 --> 00:23:14,311 నీపై నమ్మకంతో నా కుటుంబాన్ని కూడా నేను దూరం చేసుకున్నా. 288 00:23:15,604 --> 00:23:17,397 నీ పాత్రని నువ్వు చక్కగా పోషించావు. 289 00:23:18,857 --> 00:23:20,859 ఇక నీ కుటుంబంతో మళ్లీ ఎకమైపో. 290 00:23:22,611 --> 00:23:24,363 ఇక్కడి కథ ముగింపుకు వచ్చేసింది. 291 00:23:57,187 --> 00:23:58,605 ఇదంతా నువ్వే వండావా? 292 00:24:02,484 --> 00:24:05,320 డైనింగ్ టేబుల్ పై అన్నీ సర్దుతావా? డిన్నర్ సిద్ధంగా ఉంది. 293 00:24:08,323 --> 00:24:09,741 మీ ఇద్దరూ ఏమైపోయారు? 294 00:24:09,741 --> 00:24:10,951 సోదర బంధాన్ని బలపరుచుకుంటున్నాం. 295 00:24:11,910 --> 00:24:12,911 నీ గొంతు. 296 00:24:13,996 --> 00:24:15,247 ఇప్పుడు చాలా మేలు. 297 00:24:16,248 --> 00:24:17,499 దీన్ని తీసుకెళ్తావా? 298 00:24:33,182 --> 00:24:34,391 ఇవాళ ఏం చేశావు, లియన్? 299 00:24:35,267 --> 00:24:37,311 జెరికోతో మార్కెట్ కి వెళ్లా. 300 00:24:38,478 --> 00:24:40,439 జూలియన్, నీ గొంతుకు ఏమైంది? 301 00:24:41,023 --> 00:24:42,316 అలెర్జీలే. 302 00:24:44,401 --> 00:24:46,403 - అంతే అంటావా? - డాటీ, ఉప్పు ఇలా ఇవ్వవా? 303 00:24:46,403 --> 00:24:47,654 దీనికి ఉప్పు అక్కర్లేదు. 304 00:24:47,654 --> 00:24:49,823 అమ్మ అచ్చం ఇలాగే చేసేది. 305 00:24:50,324 --> 00:24:53,118 డిన్నర్ కి తను మనకి అదిరిపోయే వంటకాలు వండేది కదా 306 00:24:53,827 --> 00:24:55,829 మనమంటే తనకి ప్రాణం. 307 00:24:55,829 --> 00:24:57,164 షాన్, ఇవాళ ఎలా గడిచింది? 308 00:24:58,498 --> 00:24:59,499 ఇవాళ నా వీడియో వైరల్ అయిపోయింది. 309 00:24:59,499 --> 00:25:01,210 అవునా? సూపర్. 310 00:25:02,252 --> 00:25:03,420 నీలో కృతజ్ఞతా భావం పొంగిపోతూ ఉంటుంది. 311 00:25:04,004 --> 00:25:06,465 చాలా మందికి జరుగుతూ ఉంటుందిలే ఇలా. పెద్ద ప్రత్యేకమైనదేమీ కాదు. 312 00:25:08,133 --> 00:25:09,301 అది నిజం కాదు. 313 00:25:09,927 --> 00:25:12,137 నిజానికి, నా కాంట్రాక్టును రద్దు చేసుకొనే ఆలోచనలో నేను ఉన్నాను. 314 00:25:12,137 --> 00:25:14,306 - అలా చేయకు. - అతను తనకి నచ్చింది చేసుకుంటాడు. 315 00:25:15,516 --> 00:25:16,517 ఏంటి? 316 00:25:22,773 --> 00:25:24,024 మీరందరూ జాగ్రత్తగా ఉండండి. 317 00:25:36,912 --> 00:25:37,955 ఇది బాగుంది కదా? 318 00:25:39,748 --> 00:25:41,792 మళ్లీ అందరం కలిసి భోజనం చేయడం? 319 00:25:50,884 --> 00:25:54,721 విశ్వాసబద్ధుడైన నీ సేవకుడు చేసిన పాపాన్ని క్షమించు. 320 00:25:57,182 --> 00:25:59,476 అబద్ధాలు చెప్పి పాపం చేశాను. 321 00:26:06,942 --> 00:26:08,110 వంచన చేసి, 322 00:26:09,653 --> 00:26:12,698 ఈ కుటుంబాన్ని పెద్ద ప్రమాదంలోకి నెట్టాను. 323 00:26:19,705 --> 00:26:24,585 కానీ మేమందరమూ ప్రమాదంలో ఉన్నాం. అదే మా ఆఖరి ఆశాకిరణం. 324 00:26:25,711 --> 00:26:29,006 దయచేసి, 325 00:26:29,798 --> 00:26:35,262 ఆ పక్కదోవ పట్టిన లియన్ ని తిరిగి మాకు అప్పగించే శక్తిని వారికి ప్రసాదించు. 326 00:26:41,226 --> 00:26:42,603 నన్ను క్షమించు. 327 00:26:44,605 --> 00:26:48,901 క్షమించు. 328 00:27:19,681 --> 00:27:21,683 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్