1 00:01:03,063 --> 00:01:04,940 అయ్యయ్యో. 2 00:01:06,942 --> 00:01:09,403 ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. 3 00:01:13,156 --> 00:01:15,659 వద్దు! 4 00:01:18,662 --> 00:01:20,622 చూశావా? కంగారుపడాల్సిందేమీ లేదు. 5 00:01:20,706 --> 00:01:23,083 నిజానికి, ఇది కంగారుపడాల్సిన విషయమే. 6 00:01:23,166 --> 00:01:26,211 మీ ప్లసెంటా కిందికి ఉండి, మీ సర్విక్స్ కి అడ్డుగా ఉంది. 7 00:01:27,129 --> 00:01:28,255 ప్లసెంటా ప్రీవియా అన్నమాట. 8 00:01:28,338 --> 00:01:32,134 అది చాలా తక్కువగానే ఉంది, కానీ కదిలినా, లేదా ఏ పనైనా చేసినా అది పెరగవచ్చు, 9 00:01:32,217 --> 00:01:34,178 దాని కారణంగా నెలలు నిండకుండానే బిడ్డ పుట్టవచ్చు. 10 00:01:34,261 --> 00:01:35,554 ఆసుపత్రులు వద్దు. 11 00:01:36,388 --> 00:01:39,099 -షాన్, ఆ మాట ఆమెకు చెప్పు. -అవును, మేం చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగాం. 12 00:01:41,435 --> 00:01:45,981 బిడ్డకి ఏది మంచిదో అదే కదా మనకి కూడా కావలసింది? 13 00:01:47,316 --> 00:01:50,402 అంటే, వచ్చే నెల అంతా మీరు మీ కాళ్లను కింద పెట్టకూడదు. 14 00:01:50,903 --> 00:01:52,821 నేను ఈ పడక మీదనే ఉంటాను. 15 00:01:53,363 --> 00:01:54,448 అంతే కదా, షాన్? 16 00:01:55,782 --> 00:02:00,662 ఆ కాళ్ళు నేలను తాకితే, మీరు ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది. 17 00:02:02,998 --> 00:02:04,291 ఒక నెలపాటు పడక మీదనేనా? 18 00:02:07,127 --> 00:02:08,377 ఇది చాలా తేలిక. 19 00:02:21,558 --> 00:02:23,310 లెస్సర్ సెయింట్లకు యుగాంతం 20 00:02:23,393 --> 00:02:24,686 కనబడుట లేదు 21 00:02:24,770 --> 00:02:27,397 అధిపతి 'ఆంటీ మే' అని వినికిడి 22 00:02:41,411 --> 00:02:42,412 ఏమైనా తెలిసిందా? 23 00:02:42,496 --> 00:02:46,583 రాక్స్ బరోలో చూసిన అతను, పెట్ స్మార్ట్ లో పనిచేస్తాడు, అతను మత్తుపదార్థాలకు బానిస. 24 00:02:46,667 --> 00:02:50,587 అతని సహోద్యోగులు కొన్ని నెలలుగా అతడిని వేధిస్తున్నారట. 25 00:02:52,005 --> 00:02:57,803 దీనితో పోలిస్తే చెస్ట్నట్ హిల్ మేలు, కానీ... తను మాత్రం కాదు. 26 00:03:05,310 --> 00:03:07,479 చూడు, జనాలని సాయం అడిగితే ఇదే సమస్య. 27 00:03:07,563 --> 00:03:09,648 జనాల మీద ఎప్పుడూ నమ్మకం ఉంచలేం. 28 00:03:12,359 --> 00:03:15,237 ఓల్డ్ సిటీలో ఏమీ దొరకలేదు, కనుక నేను జూలియన్ ని వెస్ట్ చెస్టర్ కి పంపాను. 29 00:03:15,320 --> 00:03:16,738 ఒకసారి అతడిని నేను కనుక్కోవాలి. 30 00:03:18,365 --> 00:03:20,117 ఈ జాబితాలో లియన్ ఉంది. 31 00:03:21,034 --> 00:03:22,202 అది నాకు తెలుస్తోంది. 32 00:03:33,005 --> 00:03:34,006 షాన్. 33 00:03:35,966 --> 00:03:37,342 ఇంట్లో ఎవ్వరూ లేరు. 34 00:03:37,426 --> 00:03:39,803 తలుపును గట్టిగా కొట్టి చూశావా? 35 00:03:39,887 --> 00:03:42,931 ఆ అవకాశం లేదు. ఇంటి బెల్ కొట్టాను, కానీ ఏ ప్రతిస్పందనా లేదు. 36 00:03:45,809 --> 00:03:47,519 ఇప్పుడు నన్నేం చేయమంటావు? 37 00:03:48,562 --> 00:03:50,731 ఒక్క నిమిషం ఆగు. అక్కడ ఎవరు ఉంటారో కనుక్కుంటాను. 38 00:03:52,649 --> 00:03:53,901 దీని వల్ల అస్సలు లాభమే లేదు. 39 00:03:54,526 --> 00:03:56,320 అవును, కానీ తనని చూస్తే తను పాతది అయిపోయినట్టుంది. 40 00:03:56,403 --> 00:03:58,363 ఇది తెలివైన పనే. దీని వల్ల మనకేమైనా తెలిసే అవకాశముంది. 41 00:03:58,447 --> 00:03:59,656 ఆ తర్వాత ఏంటి? 42 00:03:59,740 --> 00:04:01,658 ఆ ఇంటిని ఒకసారి నాకు మళ్లీ చూపించు. 43 00:04:06,288 --> 00:04:08,165 అది చాలా పెద్దగా ఉంది. అక్కడ ఒక్కటే ఇల్లు ఉందా? 44 00:04:08,248 --> 00:04:09,958 అవును. శ్యాటిలైట్ వ్యూలో చూశాను. 45 00:04:10,542 --> 00:04:13,128 అది చిరాకుతెప్పించేంత పెద్దదిగా ఉంది. ఇలాంటిది నాకూ ఒకటి కావాలి. 46 00:04:13,212 --> 00:04:16,005 సరే, ఆ ఇల్లు మరీనో కుటుంబానికి చెందినది. 47 00:04:16,089 --> 00:04:19,551 వాళ్లది ఏదో ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన వ్యాపారం. చర్చికి బాగా వెళ్తుంటారు. 48 00:04:21,428 --> 00:04:23,680 ఇంత సెక్యూరిటీ ఎవరికి అవసరం అవుతుంది? 49 00:04:23,764 --> 00:04:24,890 ధనవంతులకి. 50 00:04:25,390 --> 00:04:26,725 దాక్కొని బతికే వాళ్లకి. 51 00:04:27,851 --> 00:04:28,852 ఎవరో వస్తున్నారు. 52 00:04:39,613 --> 00:04:42,658 -ఏంటది? ఏదైనా సందేశమా? -ఆగండి. 53 00:04:57,756 --> 00:04:59,633 ఇది ఒక పార్సెల్ మెనూ. 54 00:05:00,175 --> 00:05:02,678 ఇక నా వల్ల కాదు. రాత్రంతా నడుపుతూనే ఉన్నా, ఇక అక్కడికి వచ్చేస్తున్నా, 55 00:05:02,761 --> 00:05:05,389 నాకు బేకన్ తో టిఫిన్ చేసి ఉంచండి. 56 00:05:05,472 --> 00:05:08,100 ఉప్పూ కారం లేకుండా చేయవద్దు. 57 00:05:09,476 --> 00:05:12,688 సామాజిక మాధ్యమాలలో నాలుగు రోజులుగా పోస్ట్ లు లేవు. సాధారణంగా అలా తను చేయదు. 58 00:05:12,771 --> 00:05:15,357 తను ఎప్పుడూ తన ఇద్దరి కొడుకుల పోటోలను పెడుతూనే ఉంటుంది. 59 00:05:15,899 --> 00:05:17,860 బహుశా విహారయాత్రకు ఏమైనా వెళ్ళారేమో, లేదా బిజీగా ఉన్నారేమో. 60 00:05:21,071 --> 00:05:24,449 వారి ఇంట్లోనే మే మార్కం, ఆ కుటుంబ సభ్యుడిని బంధీగా ఉంచిందేమో. 61 00:05:24,533 --> 00:05:28,328 లేకపోతే ఇంకా దారుణమైంది, వారి పిచ్చి నమ్మకాలను వాళ్ల మీద రుద్దుతున్నారేమో. 62 00:05:28,412 --> 00:05:31,582 లియాన్ ను చూసి ఉండే అవకాశం. డజనులో ఒకటి. 63 00:05:31,665 --> 00:05:33,375 ఇతరులతో ఏమయిందో చూశావు కదా. 64 00:05:33,876 --> 00:05:35,460 ఎందుకు అంత ప్రతికూలంగా మాట్లాడతావు? 65 00:05:36,170 --> 00:05:39,381 ఈ వారంలో, మన కొడుకు జాడని కనుగొనే విషయంలో ఇంతకు మించిన ఆధారం మనకు దొరకనే లేదు. 66 00:05:39,464 --> 00:05:42,676 వాడు ఆ ఇంట్లోనే ఉండవచ్చు, ఇక్కడ నువ్వేమో కస్సుబుస్సులాడుతున్నావు! 67 00:05:43,552 --> 00:05:44,636 నువ్వన్నదే నిజం అనుకుందాం. 68 00:05:46,471 --> 00:05:49,099 మనం అక్కడికి వెళ్ళాక, నువ్వు అరుస్తావు, గోలగోల చేస్తావు. 69 00:05:50,392 --> 00:05:51,476 అప్పుడు వాడికి ఏమవుతుంది? 70 00:05:58,859 --> 00:06:00,027 అలా ఏమీ చేయనులే. 71 00:06:02,404 --> 00:06:03,405 నువ్వన్నదే నిజం. 72 00:06:04,573 --> 00:06:07,159 రేపు నేను అక్కడికి వెళ్లి, వాకబు చేస్తాను. 73 00:06:08,785 --> 00:06:10,829 కానీ ప్రస్తుతానికి, మనం ఎక్కడికీ వెళ్లకూడదు. 74 00:06:22,508 --> 00:06:23,717 ఇది మామూలు ఇల్లులానే ఉంది. 75 00:06:23,800 --> 00:06:26,678 తొమ్మిది పడక గదులున్నాయి. అది ఇల్లు కాదు. అదొక సేనాశిబిరం. 76 00:06:26,762 --> 00:06:28,889 సైన్యాన్ని నిర్మించి, శిక్షణ ఇవ్వడానికి అది సరిగ్గా సరిపోతుంది. 77 00:06:28,972 --> 00:06:30,933 పొరుగువాడు, వాళ్లు వేరే ఊరికి వెళ్లారేమో అని అంటున్నాడు. 78 00:06:31,016 --> 00:06:32,184 పొరిగువాడా? 79 00:06:32,267 --> 00:06:35,604 పొరుగువాళ్లని ఎప్పుడూ నమ్మకూడదు, ఎందుకంటే వాళ్లు శవాలగుట్టగా ఉన్న బేస్మెంట్ ని చూసిన 80 00:06:35,687 --> 00:06:37,981 ప్రతీసారీ "పొరుగువాళ్లకి ఏ అనుమానం రాలేదు," అనేదే జరుగుతుంది. 81 00:06:38,065 --> 00:06:39,358 ఒక్క నిమిషం. ఏదో కదలిక కనబడుతోంది. 82 00:06:47,157 --> 00:06:49,326 ఏంటది? సరుకులా? 83 00:06:49,826 --> 00:06:51,995 అవును, ఏదో డెలివరీ. 84 00:06:54,289 --> 00:06:57,167 అంటే వాళ్లు ఇంట్లోనే ఉన్నారని, ఆకలితో ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారని అర్థం. 85 00:06:58,460 --> 00:07:00,045 ఇప్పుడు నన్నేం చేయమంటావు? 86 00:07:04,716 --> 00:07:05,717 ఇంటికి వచ్చేయి. 87 00:07:06,343 --> 00:07:07,344 బర్గర్లు. 88 00:07:07,427 --> 00:07:10,764 బర్గర్లు అంత దూరం పాడయిపోతాయి. సుషీ. ఒక గంటలో నోరూరించే చేపలను తెప్పించవచ్చు. 89 00:07:10,848 --> 00:07:13,475 బాబులూ, ఇంత హంగామా అవసరం లేదు, పిజ్జాని ఎంచుకుందాం. 90 00:07:13,559 --> 00:07:15,352 మరీనో, ఆ పేరు చెప్తోంది, వాళ్లు ఇటలీ వాళ్లని. 91 00:07:15,435 --> 00:07:17,062 నాకు పిజ్జా పార్లర్ తెరవాలని లేదు. 92 00:07:17,145 --> 00:07:18,355 నువ్వు దేన్నీ తెరవడం లేదు. 93 00:07:18,438 --> 00:07:21,191 నువ్వు కేవలం ఒక మెనూను సిద్ధపరుస్తున్నావు, తద్వారా మనం ద్వారం లోపలికి వెళ్లవచ్చని. 94 00:07:21,275 --> 00:07:24,862 చీజస్ క్రస్ట్. సరేనా? 95 00:07:25,821 --> 00:07:28,615 -ఏంటి? మతం పేరు మీద ఉంటే అమ్ముడవ్వవా? -నువ్వు టైప్ చేయకుండా ఉన్నావేంటి? 96 00:07:29,241 --> 00:07:30,868 "ఫిలడెల్ఫియాలో అసలైన పిజ్జాల మజా." 97 00:07:30,951 --> 00:07:32,578 "ప్రభువు వంట గదిలో తయారయినవి." 98 00:07:32,661 --> 00:07:34,288 -అభ్యర్థనల మేరకు గ్లూటెన్ ఫ్రీ ఇవ్వబడతాయి. -కాస్త ఆగు. 99 00:07:34,371 --> 00:07:35,539 పక్కకు జరుగు. నేనే టైప్ చేస్తాను. 100 00:07:58,812 --> 00:08:01,148 నిదానంగా, నిదానంగా. బాగా వచ్చేలా చేయి. 101 00:08:01,982 --> 00:08:03,442 అంతే. అంతే. 102 00:08:04,610 --> 00:08:05,986 బాగుంది. 103 00:08:12,784 --> 00:08:16,455 చీజస్ క్రస్ట్ ఫిలడెల్ఫియాలో అసలైన పిజ్జాల మజా 104 00:08:25,047 --> 00:08:28,592 అభినందనలు. ఇప్పుడు మనం అధికారికంగా ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి అడుగుపెట్టాం. 105 00:08:29,218 --> 00:08:30,552 ఇది పని చేస్తే బాగుంటుంది. 106 00:08:30,636 --> 00:08:32,386 సరసమైన ధరలలోనే దొరికే మంచి పిజ్జాలు అవి. 107 00:08:32,471 --> 00:08:34,597 వాళ్లు లోపల ఉంటే, తప్పకుండా ఆర్డర్ చేస్తారు. 108 00:08:34,681 --> 00:08:37,267 వచ్చే ముందు, పక్కనున్న ఇళ్ల దగ్గర కూడా మెనూలను పెట్టేసి రా. 109 00:08:37,351 --> 00:08:38,393 ఎందుకు? 110 00:08:38,477 --> 00:08:40,270 అనుమానాస్పదంగా ఉండకూడదు కదా, అందుకు. 111 00:08:43,315 --> 00:08:44,525 ఇప్పుడు ఏం చేయాలి? 112 00:08:44,608 --> 00:08:46,485 ఏంలేదు. వేచి చూద్దాం. 113 00:08:51,365 --> 00:08:53,075 మీరు క్రమం తప్పకుండా చూసేవారు అయ్యుంటే, 114 00:08:53,158 --> 00:08:56,995 మా డొరోతి టర్నర్ రెండు వారాలుగా తెర మీద కనబడకపోవడాన్ని 115 00:08:57,079 --> 00:08:58,664 మీరు గమనించే ఉండవచ్చు. 116 00:08:58,747 --> 00:09:03,377 దానికి కారణం, వైద్యపరమైన అత్యవసరస్థితి వలన డాక్టర్ సూచనల మేరకు తను విశ్రమించాలి. 117 00:09:03,460 --> 00:09:08,465 కానీ ఇప్పుడు మనతో లైవ్ లో మన డొరోతి టర్నర్ మాట్లాబోతున్నారు. 118 00:09:08,549 --> 00:09:09,550 డొరోతీ, గుడ్ ఈవినింగ్. 119 00:09:10,217 --> 00:09:11,218 గుడ్ ఈవినింగ్, వాకర్. 120 00:09:11,301 --> 00:09:12,761 మరి, మీకు ఇప్పుడు ఎలా ఉంది, డొరోతీ? 121 00:09:13,637 --> 00:09:16,515 చాలా భయభ్రాంతులకు గురయ్యాను అని మాత్రం చెప్పగలను. 122 00:09:16,598 --> 00:09:19,726 కానీ వైద్య సిబ్బంది చాలా మంచి వారు, 123 00:09:19,810 --> 00:09:23,814 బిడ్డకు జన్మనివ్వబోయే ముందు నేను వారి తెలివైన సలహాను పాటిస్తూ విశ్రమిస్తున్నాను. 124 00:09:24,273 --> 00:09:26,775 ఎప్పుడూ చలాకీగా ఉండే మీకు అది కష్టమైన పనే. 125 00:09:26,859 --> 00:09:32,072 అవును, జీవితంలో అప్పుడప్పుడూ మనం మన పాదాలను పైకి పెట్టి, 126 00:09:32,155 --> 00:09:34,533 ప్రకృతికి అన్నీ తెలుసు అనే విషయాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది. 127 00:09:34,616 --> 00:09:37,327 వినండి, మీరు చాలా త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం, డొరోతీ. 128 00:09:37,411 --> 00:09:38,787 ధన్యవాదాలు, వాకర్. 129 00:09:38,871 --> 00:09:43,792 అలాగే, కార్డులను, పూలగుత్తులను పంపిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. 130 00:09:43,876 --> 00:09:49,131 నాకూ, నా భర్తకూ చాలా ఆనందంగా అనిపించింది. దేవుడు మిమ్మల్నందరినీ చల్లగా చూస్తాడు. 131 00:10:04,062 --> 00:10:06,231 నేను ఇక్కడే ఉన్నాను కదా. పేరు పెట్టి పిలిస్తే సరిపోతుంది. 132 00:10:07,274 --> 00:10:08,859 -దాన్ని రికార్డ్ చేశావా? -చేశాను. 133 00:10:09,651 --> 00:10:12,112 -దాన్ని నాకు చూడాలని ఉంది. -ఆగాగు. నువ్వెక్కడికీ వెళ్లకూడదు. 134 00:10:13,488 --> 00:10:15,449 ఇప్పటికి రెండు వారాలయింది. నాకు బాగానే అనిపిస్తోంది. 135 00:10:15,532 --> 00:10:18,744 నువ్వు మధ్యలో చేతులెత్తేయడానికి కాదు నేను నీ ముడ్డిని వంద సార్లు కడిగింది. 136 00:10:19,536 --> 00:10:21,205 నువ్వు నన్ను కింది దాకా ఎత్తుకెళ్లవచ్చు. 137 00:10:21,288 --> 00:10:24,416 డాక్టర్ ఏం చెప్పిందో విన్నావు కదా. నా కాళ్ళు నేలను తాకనంత వరకూ ఫర్వాలేదు. 138 00:10:25,083 --> 00:10:28,128 నేనసలే బక్కపీనుగును తెలుసా? ఇలా ఉండగలను అని నువ్వే అన్నావు కదా. 139 00:10:28,212 --> 00:10:31,048 కానీ నువ్వు కావాలనుకుంటే, నేను ఆసుపత్రికి కాల్ చేయగలను. అక్కడ పడక సిద్ధంగా ఉంది. 140 00:10:32,633 --> 00:10:33,634 నువ్వు బాగా బెదిరిస్తున్నావు. 141 00:10:38,222 --> 00:10:39,640 కలమారి అయిపోయింది. 142 00:10:39,723 --> 00:10:41,391 రేపు ఇంకాస్త చేసి పెడతాను. 143 00:10:41,475 --> 00:10:43,227 నాకు ఇప్పుడే కావాలి. 144 00:10:43,310 --> 00:10:45,312 దాన్ని చేయడానికి కావలసిన పిండి చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? 145 00:10:45,395 --> 00:10:47,147 పిండి ఆంస్టర్డ్యామ్ నుండి రావాలి. 146 00:10:50,317 --> 00:10:53,111 నువ్వు ఒక సాధారణ మనిషిలా ప్రవర్తించి ఏమీ చేయకుండా ఉండవచ్చు కదా? 147 00:11:11,380 --> 00:11:12,548 షాన్? 148 00:11:15,801 --> 00:11:17,594 క్రైస్ట్ పిజ్జా, నేను మీ ఆర్డర్ ని తీసుకోవచ్చా? 149 00:11:23,475 --> 00:11:25,477 దయచేసి మీ చిరునామా చెప్పగలరా? 150 00:11:27,563 --> 00:11:29,481 1406 హయాసింత్. 151 00:11:30,816 --> 00:11:33,068 సరే, ఒక గంటలో మేము అక్కడ ఉంటాం. ధన్యవాదాలు. 152 00:11:37,990 --> 00:11:39,324 నువ్వు మరీ ఎక్కువ వసూలు చేస్తున్నావు. 153 00:11:39,408 --> 00:11:43,537 ఒక 13 డాలర్ల పిజ్జాని చేయడానికి మనకు 30 డాలర్లు ఖర్చవుతుంది. 154 00:11:43,620 --> 00:11:45,455 అయితే వాళ్లింకా ఎందుకు ఆర్డర్ చేయడం లేదు? 155 00:11:45,539 --> 00:11:47,708 నాకు తెలీదు! కానీ ఆ పొరుగు వాళ్లందరికీ ఇది బాగా నచ్చింది. 156 00:11:49,668 --> 00:11:54,423 ఫంగో ఈ టర్టోఫా. పుట్రగొడుగు, ట్రఫుల్ ఆయిల్, బుర్రాటా ఎక్కువ వేయాలి. 157 00:11:54,506 --> 00:11:55,507 అలాగే, చెఫ్. 158 00:11:56,842 --> 00:11:57,843 -హేయ్, చెఫ్? -చెప్పు? 159 00:11:58,343 --> 00:12:00,053 మనం ఎందుకు పార్సెల్ వ్యాపారాన్ని పెట్టాం? 160 00:12:00,137 --> 00:12:01,221 నాకు సవాలును స్వీకరించాలనుంది. 161 00:12:01,305 --> 00:12:02,973 అవును, కానీ పిజ్జానా? 162 00:12:03,974 --> 00:12:05,642 నీకు నచ్చినవాళ్లతో ఎప్పుడైనా నువ్వు పిజ్జా తిన్నావా? 163 00:12:05,976 --> 00:12:07,519 నేను వెళ్లిన చాలా డేట్లను పిజ్జా తినే ముగించాం. 164 00:12:08,020 --> 00:12:10,355 అవును. పిజ్జా అనేది పంచుకొని తింటేనే బాగుంటుంది. 165 00:12:10,439 --> 00:12:14,401 తెలుసా, ఆ రోజుల్లో, ఆహారాన్ని అందరూ కలిసే తినేవారు. 166 00:12:15,569 --> 00:12:16,737 అందరూ కలిసి ఒకేసారి తినేవాళ్ళం. 167 00:12:23,535 --> 00:12:24,536 షాన్? 168 00:12:33,045 --> 00:12:35,172 అవును, చీజస్ క్రైస్ట్... క్రస్ట్. 169 00:12:39,343 --> 00:12:40,385 మీ చిరునామా చెప్పండి. 170 00:12:44,806 --> 00:12:46,266 మనం సాధించాం. 171 00:12:52,481 --> 00:12:55,776 తయారైందా? వాళ్ళు పెయింట్ చేసిన బైక్ లేన్ లో అక్రమంగా పార్క్ చేసి ఉంచాను. 172 00:12:55,859 --> 00:12:58,487 అతను తులసి ఆకులతో 20 నిమిషాల నుండి ఉత్తినే సమయం వృథా చేస్తున్నాడు. 173 00:12:58,570 --> 00:13:02,115 వాళ్ళు కనుక ఆర్డర్ ని రద్దు చేస్తే, అతడిని చంపిపారేస్తాను. నీ వేషం ఏంటి ఇలా ఉంది? 174 00:13:02,199 --> 00:13:04,034 నేను ఒపెరాలో ఉన్నాను. నాకు కూడా ఓ జీవితం ఉంది. 175 00:13:04,117 --> 00:13:06,787 -నటాలీకి ఒపెరాలు నచ్చవు కదా. -తనకి మంచిదేలే. 176 00:13:06,870 --> 00:13:08,872 సూట్ వేసుకొని పిజ్జాని డెలివరీ చేస్తే బాగోదు. 177 00:13:08,956 --> 00:13:09,998 షాన్! 178 00:13:10,582 --> 00:13:12,251 ఆర్డర్ చేసింది వారేనని నీకు ఖచ్చితంగా తెలుసా? 179 00:13:12,334 --> 00:13:15,379 ఇరవై చీజ్ పిజ్జాలు. ఆ ఇంట్లో అందరూ ఆకలి చావులు చస్తున్నట్టున్నారు. 180 00:13:15,462 --> 00:13:17,381 కానీ ఒక్కరిలో కూడా స్వతంత్ర భావాలు లేవు. 181 00:13:17,464 --> 00:13:19,842 ఇంకా ఆరు తయారు అవుతూ ఉన్నాయి. మన దగ్గర ఓవెన్ ఒక్కటే ఉంది. 182 00:13:20,175 --> 00:13:21,885 నీ వేషం ఏంటి అలా ఉంది? 183 00:13:22,386 --> 00:13:24,805 ఇతగాడు ఆహరాన్ని డెలివరీ చేస్తున్నాడంటే వాళ్లు చచ్చినా నమ్మరు. 184 00:13:25,472 --> 00:13:26,640 మనం టోబీని పంపించాలి. 185 00:13:27,140 --> 00:13:28,183 -టోబీ? -గింపీ? 186 00:13:33,772 --> 00:13:35,816 ఇదొక సాధారణ డెలివరీయే. 187 00:13:35,899 --> 00:13:38,193 ఈ రెట్టించిన ఉత్సాహంతో మేము త్వరలోనే నిన్ను కలుసుకుంటాం. 188 00:13:38,277 --> 00:13:40,863 ఈ పని నా ఉద్యోగ హక్కుల ఉల్లంఘనే అనడంలో సందేహమే లేదు. 189 00:13:40,946 --> 00:13:43,657 ఒక రెండు నిమిషాలు నీ ఏడుపును పక్కన పెట్టి ఈ డబ్బు ఉంచు. 190 00:13:52,416 --> 00:13:54,418 వాళ్లే అయితే మనం ఏం చేయాలి? 191 00:13:55,252 --> 00:13:57,421 ఏది ఏమైనా కానీ, మనం డొరోతీని ఇక్కడే ఉంచాలి. 192 00:14:10,100 --> 00:14:11,351 షాన్! 193 00:14:14,021 --> 00:14:15,022 బంగారం? 194 00:14:32,414 --> 00:14:34,583 ఇది 9780 స్ప్రూస్ స్ట్రీట్. 195 00:14:38,545 --> 00:14:39,671 అది నా వల్ల కాదు. 196 00:14:40,881 --> 00:14:42,466 నేను పడక నుండి దిగలేను. 197 00:15:13,455 --> 00:15:14,456 అతను చేరుకున్నాడా? 198 00:15:14,540 --> 00:15:15,832 ఇంకాసేపట్లో వెళ్లిపోతాడు. 199 00:15:36,478 --> 00:15:38,939 ఎందుకు అంత సమయం పడుతోంది? వాళ్ళు ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు? 200 00:15:41,984 --> 00:15:43,861 -చెప్పండి? -పిజ్జా. 201 00:15:51,493 --> 00:15:52,703 తలుపు తెరుచుకుంటోంది. 202 00:15:58,876 --> 00:16:00,169 ఇది పాడయిందా? 203 00:16:01,044 --> 00:16:02,045 నేను రుచి చూడలేను. 204 00:16:02,129 --> 00:16:04,173 కనీసం దీన్ని మార్చనయినా మార్చవచ్చు కదా. 205 00:16:04,256 --> 00:16:06,758 -నువ్వే మార్చుకో. -సరే. 206 00:16:47,299 --> 00:16:48,717 నేను లేనప్పుడు ఏమైనా జరిగిందా? 207 00:17:09,070 --> 00:17:10,071 హలో. 208 00:17:16,537 --> 00:17:19,330 -హేయ్. -ధన్యవాదాలు 209 00:17:19,915 --> 00:17:21,916 కారులో ఇంకా పిజ్జాలు ఉన్నాయి. 210 00:17:25,087 --> 00:17:26,128 హేయ్. 211 00:17:28,757 --> 00:17:30,509 అందరూ పిల్లలేనా? 212 00:17:34,596 --> 00:17:36,265 హేయ్, నాకు డబ్బులు ఇవ్వాలి. 213 00:17:37,099 --> 00:17:38,725 వాళ్లు పైనున్నారు. 214 00:17:39,810 --> 00:17:41,311 అది కేవలం ఒక పార్టీయేనా? 215 00:17:42,312 --> 00:17:44,064 -అది కేవలం ఒక పిల్లల పార్టీ. -అతను ఎక్కడికి వెళ్తున్నాడు? 216 00:17:44,147 --> 00:17:45,858 నేను అతనికి కాల్ చేసి, ఇంటికి వచ్చేయమని చెప్తాను. 217 00:17:45,941 --> 00:17:47,025 ఆగు. 218 00:18:11,842 --> 00:18:12,885 లియన్? 219 00:18:15,679 --> 00:18:17,431 నువ్వు నాకు దొరికేశావు. 220 00:18:19,391 --> 00:18:21,101 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 221 00:18:21,185 --> 00:18:23,562 మీరు పిజ్జాలను ఆర్డర్ చేశారు. 222 00:18:23,645 --> 00:18:24,646 ఇక్కడికి రండి. 223 00:18:30,319 --> 00:18:34,865 లేదు, లేదు, లేదు. నువ్వు తన వెంట వెళ్లు. నువ్వు లియన్ వెంట వెళ్లు. 224 00:18:50,672 --> 00:18:53,425 నన్ను మన్నించాలి. వాళ్లు డబ్బు కోసం నన్ను ఇక్కడికి పంపారు. 225 00:18:59,806 --> 00:19:00,807 ఇదిగోండి. 226 00:19:02,684 --> 00:19:05,103 సరే. మన్నించండి. 227 00:19:15,739 --> 00:19:17,866 నా భర్త నాకు చదివి వినిపిస్తూ ఉన్నాడు. 228 00:19:19,701 --> 00:19:21,161 తను అలసిపోయాడు. 229 00:19:24,248 --> 00:19:25,457 మనం సమయాన్ని వృథా చేస్తున్నాం. 230 00:19:26,708 --> 00:19:28,001 -తనని ఆపు! -కేవలం... 231 00:19:28,085 --> 00:19:30,379 -డొరోతీ, ఆగు. ఆగాగు. -ఆగను. 232 00:19:30,462 --> 00:19:33,298 -డొరోతీ, ఆగు. కాస్త ఆగు. -పక్కకి తప్పుకో! 233 00:19:33,382 --> 00:19:35,634 నువ్వు ఇంత ఆవేశంతో అక్కడికి వెళ్లకూడదు. 234 00:19:35,717 --> 00:19:36,885 తన దగ్గర జెరికో ఉండే అవకాశం ఉంది! 235 00:19:36,969 --> 00:19:38,428 కానీ తన దగ్గర లేడు! 236 00:19:38,512 --> 00:19:41,306 లియన్, ఒక విచిత్రమైన కుటుంబం దగ్గర పని చేస్తోంది. 237 00:19:41,390 --> 00:19:44,393 ఆ మహిళ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, వాళ్లు అక్కడ బిడ్డను ఉంచుకుంటారు అనుకుంటున్నావా? 238 00:19:44,476 --> 00:19:47,646 నాకు తెలీదు. తెలీదు. కానీ నేను... 239 00:19:49,147 --> 00:19:51,817 ఇక్కడ చేతులు ముడుచుకొని కూర్చోమని మాత్రం చెప్పకు. 240 00:19:51,900 --> 00:19:53,902 నువ్వు లియన్ ఆచూకీని కనిపెట్టావు. 241 00:19:54,903 --> 00:19:57,197 ఇప్పుడు మనం వ్యూహం ఆలోచించాలి. 242 00:19:57,281 --> 00:19:59,241 మనం జాగ్రత్త వహించాలి. 243 00:20:00,284 --> 00:20:04,955 తను మన వద్దకి జెరికోని తీసుకురావడమే కదా మనకి కావలసింది, ఏమంటావు? 244 00:20:10,627 --> 00:20:12,880 పాపం ఆవిడ. ఆమెకి క్యాన్సర్ ఉందంటావా? 245 00:20:14,047 --> 00:20:15,799 నేను నీకు డాక్టర్ లాగా కనబడుతున్నానా? 246 00:20:15,883 --> 00:20:17,718 లియన్ ఇక్కడ ఉందని నాకు మీరు ఎందుకు చెప్పలేదు? 247 00:20:17,801 --> 00:20:20,304 ఇప్పటిదాకా మాకు అది ఖచ్చితంగా తెలీదు. 248 00:20:20,387 --> 00:20:22,055 మీరు నన్ను తన మీద నిఘా కోసమే పంపారు కదా? 249 00:20:22,139 --> 00:20:24,683 అనుకొన్న పని సాధించాం. చెత్త సిఐఏకి స్వాగతం. 250 00:20:24,766 --> 00:20:25,767 హేయ్. 251 00:20:39,656 --> 00:20:40,866 చీజస్ క్రస్ట్ ఆన్లైన్ ఆర్డరింగ్ 252 00:20:40,949 --> 00:20:43,493 కొత్త ఆర్డర్ -కస్టమర్: లియన్ ఒక మార్గరీటా పిజ్జా -వెస్ట్ చెస్టర్, పీఏ 253 00:20:43,577 --> 00:20:45,245 ఇప్పుడే వాళ్లు మరో పిజ్జాని ఆర్డర్ చేశారు. 254 00:20:51,001 --> 00:20:52,294 ఒక మార్గరీటా. 255 00:20:56,590 --> 00:20:58,091 లియన్ కంగారుపడిపోతోంది. 256 00:20:58,175 --> 00:21:00,928 టోబీ ఇక్కడికి వచ్చి అతను అక్కడ ఆమెని చూశాడని మనతో చెప్పడం తనకి ఇష్టం లేదు. 257 00:21:02,387 --> 00:21:03,680 అయితే నేను డెలివర్ చేయనా? 258 00:21:04,264 --> 00:21:06,767 -తనతో మాట్లాడనా? -ఇప్పుడు, మనకి ఏం తెలుసో అది తనకి తెలీదు. 259 00:21:06,850 --> 00:21:09,061 కాబట్టి, మన దగ్గర ఒక ప్లాన్ లాంటిది ఏదైనా ఉండే వరకు, 260 00:21:09,144 --> 00:21:11,647 మనం... ఎలా ఉందో అలానే ఉండనిద్దాం. 261 00:21:13,190 --> 00:21:14,733 నువ్వు బాగానే ఉన్నావా? చూడటానికి దారుణంగా ఉన్నావు. 262 00:21:15,484 --> 00:21:18,070 -నేను చాలా బాగున్నాను. -నటాలీ ఎలా ఉంది? 263 00:21:18,153 --> 00:21:22,282 బాబోయ్. నటాలీ, నాటాలీ, నటాలీ. అందరూ నటాలీ అని తెగ నస పెట్టేస్తున్నారు. 264 00:21:23,075 --> 00:21:25,118 నేను నటాలీ ఊసు ఇప్పటి దాకా అస్సలు ఎత్తనే లేదు. 265 00:21:25,202 --> 00:21:27,037 తను ఎలా ఉందో నాకు అస్సలు తెలీదు. 266 00:21:32,251 --> 00:21:33,752 తను బాగానే ఉంది అంటావా? 267 00:21:34,419 --> 00:21:36,839 అక్కడికి వెళ్లి, ఆ పిజ్జాని నువ్వు చేస్తేనే మంచిది అనుకుంటున్నావు కదా? 268 00:21:37,589 --> 00:21:41,176 తనకు కూడా భాగం కావాలనుంది. తను కూడా ఏదో చేస్తోంది అని తనకి అనిపించాలి. కాబట్టి... 269 00:22:10,789 --> 00:22:11,790 లోపలికి రా. 270 00:22:22,676 --> 00:22:23,719 నువ్వు కూడా నాతో కలిసి తింటావా? 271 00:22:31,935 --> 00:22:33,687 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, లియన్? 272 00:22:37,274 --> 00:22:38,734 నీకు చెప్పే వెళ్లిపోదామనుకున్నాను. 273 00:22:40,485 --> 00:22:43,071 కానీ నువ్వు నన్ను వెళ్లిపోకుండా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తావనిపించింది. 274 00:22:45,365 --> 00:22:47,284 నువ్వు నా మాట వినుండేదానివా? 275 00:22:51,788 --> 00:22:52,789 వినుండేదాన్నే ఏమో. 276 00:22:55,167 --> 00:22:56,251 కానీ నేను బయటపడిపోవాలి. 277 00:22:57,836 --> 00:22:59,254 నాకు మరో దారి లేదు. 278 00:22:59,338 --> 00:23:02,549 టర్నర్ లతో నీకేమైనా సమస్య ఎదురయిందా? 279 00:23:06,428 --> 00:23:07,638 దానికి కారణం డొరోతీ. 280 00:23:10,224 --> 00:23:12,351 తన దగ్గర ఇంకో రోజు ఉండలేకపోయాను. 281 00:23:12,434 --> 00:23:14,019 ఇక దీన్ని నేను వినలేను. 282 00:23:14,102 --> 00:23:15,103 వదిలేయి. 283 00:23:15,771 --> 00:23:17,940 తను టీవీలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా ఉంటుంది. 284 00:23:18,607 --> 00:23:21,193 తను స్వార్థపరురాలు, తనది చాలా క్రూర స్వభావం. 285 00:23:22,528 --> 00:23:23,654 తను నీచంగా చూస్తుంది. 286 00:23:25,822 --> 00:23:28,158 -డొరోతీ. -నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తానులే. 287 00:23:29,117 --> 00:23:30,827 ఏదైనా జరిగితే నన్ను పిలవండి. 288 00:25:10,302 --> 00:25:13,805 నువ్వు కింది దాకా వచ్చావా? కాల్ చేస్తే సరిపోయేది కదా? 289 00:25:18,185 --> 00:25:19,728 కంగారు పడవద్దు. నేను చూసుకున్నానులే. 290 00:25:25,984 --> 00:25:27,069 తను అది అనాలని లేదు. 291 00:25:27,569 --> 00:25:28,820 ఆ మాటలు నాకు కొత్తేం కాదులే. 292 00:25:28,904 --> 00:25:31,657 జనాలు నాతో స్నేహం చేయాలనుకుంటారు, కానీ నాకు అంత సమయం ఉండదు. 293 00:25:31,740 --> 00:25:34,117 వాళ్లకి అసూయ మొదలవుతుంది, చిన్నబుచ్చుకుంటారు. అది కొత్తేం కాదులే. 294 00:25:36,078 --> 00:25:37,079 నేను సాయపడతాను, ఆగు. 295 00:25:41,166 --> 00:25:42,584 నేనే చేసుకోగలను. 296 00:25:51,051 --> 00:25:52,761 ఇంకెంత సమయం పడుతుంది అనుకుంటున్నావు? 297 00:25:52,845 --> 00:25:53,887 తొంభై సెకన్లు. 298 00:25:55,305 --> 00:25:56,515 మంచిది. 299 00:25:57,224 --> 00:25:59,351 కాస్త ఈ పని చేసిపెట్టి, అయిపోయాక తీసుకురా. 300 00:26:15,701 --> 00:26:18,412 నీకు మళ్లీ వారి వద్ద పనిచేయాలనుంటే, వాళ్లు తప్పకుండా నిన్ను స్వాగతిస్తారు. 301 00:26:21,665 --> 00:26:23,792 ఇక్కడ మిసెస్ మరీనో నన్ను బాగా చూసుకుంటోంది. 302 00:26:25,752 --> 00:26:28,505 మరి జెరికో సంగతేంటి? అతను నిన్ను మిస్ అవుతున్నాడు. 303 00:26:32,050 --> 00:26:33,886 నేను ఇక్కడ ఉన్నట్టు నువ్వు వాళ్లకి చెప్పకూడదు. 304 00:26:35,888 --> 00:26:37,055 నాకు మాట ఇవ్వు. 305 00:26:41,101 --> 00:26:42,102 టోబీ? 306 00:26:43,103 --> 00:26:46,190 చూడు, వాళ్లు నీ గురించి కంగారు పడుతూ ఉన్నారు. 307 00:26:55,073 --> 00:26:56,658 నువ్వు ఏం చేశావు? 308 00:27:02,372 --> 00:27:03,457 హేయ్. నేను... నేను... 309 00:27:05,959 --> 00:27:07,002 ఏమైంది? 310 00:27:08,086 --> 00:27:09,630 చాలా వేగంగా పైకి లేచాను. 311 00:27:09,713 --> 00:27:10,714 లియన్? 312 00:27:10,797 --> 00:27:13,008 లియన్? లియన్? 313 00:27:14,176 --> 00:27:15,469 లియన్? 314 00:27:16,345 --> 00:27:18,263 -లియన్! -నన్ను మ్యూట్ నుండి తీసేయి. 315 00:27:21,683 --> 00:27:25,020 -ఏమీ కాలేదు... -టోబీ. నా మాటలు వినబడుతున్నాయా? 316 00:27:25,604 --> 00:27:29,942 వినబడుతున్నాయి. తను కుప్పకూలిపోయింది, మిస్ టర్నర్. నేను 911కి కాల్ చేయాలి. 317 00:27:30,025 --> 00:27:31,735 ఆ పని చేయాల్సిందిగా నేను సూచించను. 318 00:27:32,319 --> 00:27:36,281 నువ్వు ఒకరి వ్యక్తిగత నివాసంలోకి వెళ్లి, ఒక యువతికి పిజ్జా ద్వారా మత్తు ఇచ్చావు. 319 00:27:38,033 --> 00:27:39,034 ఏంటి? 320 00:27:41,119 --> 00:27:42,913 నువ్వు ఇప్పుడు నేను చెప్పేది చేయాలి. 321 00:27:43,956 --> 00:27:47,376 తనని నేల మీద నుండి పైకి లేపి, నీ కారు వెనుక సీటులో పెట్టి, 322 00:27:48,252 --> 00:27:49,461 ఇక్కడికి తీసుకురావాలి. 323 00:27:50,879 --> 00:27:54,424 నువ్వు ఆ పని కనుక చేయకపోతే, 911కి నేనే కాల్ చేస్తాను. 324 00:27:54,508 --> 00:27:55,551 కానీ... 325 00:28:01,932 --> 00:28:04,434 కంగారు పడవద్దు. నేను చూసుకున్నానులే. 326 00:28:17,406 --> 00:28:18,407 ఓ ముక్క తీసుకోండి. 327 00:28:54,109 --> 00:28:56,111 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య