1 00:00:19,000 --> 00:00:20,458 ఇదే అది. 2 00:00:20,583 --> 00:00:23,458 ఇదే సరైన అలెహాండ్రో డియాజ్ ఇల్లు అని ఆశిద్దాం. 3 00:00:23,541 --> 00:00:26,375 అవును, నాకు మరో కొత్త మనిషిని కౌగిలించుకోవాలని లేదు. 4 00:00:26,458 --> 00:00:27,500 ఇక తలుపు తడదాం. 5 00:00:33,125 --> 00:00:35,541 -అమ్మా! -నిన్ను కనిపెట్టేశాం! 6 00:00:35,625 --> 00:00:38,500 -ఇక్కడేం చేస్తున్నారు? -కమీలా, పర్వాలేదు. 7 00:00:38,583 --> 00:00:39,416 ఎవరు వచ్చారు? 8 00:00:59,958 --> 00:01:03,250 సుస్వాగతం, చిన్న అలెహాండ్రో. 9 00:01:17,250 --> 00:01:20,916 నిన్ను ఎవరైనా దత్తత తీసుకుంటే, నన్ను కూడా తీసుకోమని చెప్పు. 10 00:01:21,000 --> 00:01:24,125 నేను మంచి అన్నయ్య అవుతాను. ఏమంటావు? 11 00:01:24,958 --> 00:01:26,583 అలెహాండ్రో. ముందుకు కొనసాగాలి. 12 00:01:26,666 --> 00:01:28,458 మరింతమంది పాపాయిలను ఎత్తుకోవాలి. 13 00:01:46,000 --> 00:01:46,958 ఏం చేస్తున్నావు? 14 00:01:47,458 --> 00:01:50,875 ఈ చోటు ఓ పూవుకు మంచి చోటేనా అని చూస్తున్నాను. 15 00:01:52,250 --> 00:01:53,083 అవునా? 16 00:01:53,166 --> 00:01:54,375 నాకలాగే అనిపిస్తోంది. 17 00:01:56,875 --> 00:01:58,875 లోపల ఓ పాపాయి ఉంది. 18 00:01:59,750 --> 00:02:00,916 అది నిజం. 19 00:02:04,208 --> 00:02:06,791 ఇది నీ కోసమే. 20 00:02:07,500 --> 00:02:08,666 దీన్ని జాగ్రత్తగా చూసుకో. 21 00:02:09,916 --> 00:02:10,916 ధన్యవాదాలు! 22 00:02:21,583 --> 00:02:23,583 ఈ ఉద్యోగంపై బాగా ఆలోచించుకున్నావా? 23 00:02:24,333 --> 00:02:26,666 నువ్వు పిల్లలతో బాగా పని చేస్తావనే ఎప్పుడూ అనుకున్నాను. 24 00:02:26,750 --> 00:02:28,500 నువ్వు భలే చక్కనివాడివి. 25 00:02:29,125 --> 00:02:31,416 ఆ జీతం బాగుంది, ఇల్లు కూడా ఇస్తారు. 26 00:02:31,500 --> 00:02:32,958 అలాగే, ఇంకా, 27 00:02:33,041 --> 00:02:37,875 నేను చక్కనివాడినని చమురు క్షేత్రంలో ఇతరులకు చెప్పకు. 28 00:02:40,125 --> 00:02:41,916 సరే. నేను చెప్పను. 29 00:02:49,458 --> 00:02:50,291 నీకు మంచి జరగాలి, అలె. 30 00:02:50,833 --> 00:02:51,833 నువ్వు గుర్తొస్తావు. 31 00:03:08,458 --> 00:03:10,041 కమీలా డియాజ్ ఎనోపోన్సెనో పేరు: అలెహాండ్రో డియాజ్ 32 00:03:35,000 --> 00:03:38,291 కమీలా +1-210-555-0143 33 00:03:51,500 --> 00:03:52,625 హలో? 34 00:03:54,250 --> 00:03:56,583 హలో? ఎవరిది? 35 00:03:56,666 --> 00:03:58,583 నేను... 36 00:03:58,666 --> 00:03:59,916 నా పేరు అలెహాండ్రో. 37 00:04:01,458 --> 00:04:02,833 నేను మీ కొడుకును. 38 00:04:06,833 --> 00:04:10,166 ఇది వింతగా ఉంటే, అర్థం చేసుకోగలను. 39 00:04:10,250 --> 00:04:11,875 నేను వెంటనే ఫోన్ పెట్టేస్తాను. 40 00:04:11,958 --> 00:04:13,083 ఇది వింతగా ఉంటుందని తెలుసు... 41 00:04:13,166 --> 00:04:15,541 వద్దు, ఫోన్ పెట్టకు. 42 00:04:16,958 --> 00:04:21,875 నా సమాచారం, అది దాచి ఉంచానని నేను అనుకున్నాను. 43 00:04:21,958 --> 00:04:24,708 నేనది బయటకు తీశాను. 44 00:04:24,791 --> 00:04:26,500 తప్పయితే మన్నించాలి... 45 00:04:26,583 --> 00:04:27,666 లేదు... 46 00:04:28,750 --> 00:04:31,083 నువ్వు నన్ను కనిపెట్టడం నాకు సంతోషమే. 47 00:04:32,791 --> 00:04:33,791 నీకు సంతోషమా? 48 00:04:35,041 --> 00:04:35,875 అవును. 49 00:04:36,875 --> 00:04:38,291 ఇది ఆశ్చర్యపరిచింది. 50 00:04:39,708 --> 00:04:40,666 నిజం. 51 00:04:46,625 --> 00:04:50,208 నా కుటుంబాన్ని కలవడానికి త్వరలో మెక్సికో వస్తాను. 52 00:04:51,166 --> 00:04:54,166 నిన్ను కలవాలని ఉంది. నీకు ఇష్టమైతే. 53 00:04:55,833 --> 00:04:57,916 నాకది ఇష్టమే. 54 00:05:32,208 --> 00:05:34,166 నిన్ను కలవడం 55 00:05:34,250 --> 00:05:35,250 సంతోషమేగా? 56 00:05:37,000 --> 00:05:38,916 నువ్వు చాలా 57 00:05:40,041 --> 00:05:41,125 ఎదిగిపోయావు. 58 00:05:42,416 --> 00:05:43,250 లోపలకు రా. 59 00:05:47,875 --> 00:05:49,041 నీకు కొన్ని బిస్కెట్లు తెచ్చాను. 60 00:05:49,625 --> 00:05:50,625 ధన్యవాదాలు. 61 00:05:50,958 --> 00:05:51,833 కూర్చో. 62 00:05:56,125 --> 00:05:57,375 నీ గది చాలా బాగుంది. 63 00:05:58,291 --> 00:06:01,541 ఆ ఇబ్బంది కలిగించే గోడలు ఈ చోటును విడగొట్టకుండా ఉండడం బాగుంటుంది. 64 00:06:01,625 --> 00:06:02,916 అవి ఇలానే ఉన్నాయి. 65 00:06:04,500 --> 00:06:07,000 నా కూతురు అల్మా లాగా నీ హాస్యం బాగుంది. 66 00:06:07,750 --> 00:06:09,458 -నాకు చెల్లెలు ఉందా? -ఇద్దరు, నిజానికి. 67 00:06:10,500 --> 00:06:12,041 అల్మా ఇంకా బెక్కా. 68 00:06:12,125 --> 00:06:14,166 నాకు ఓ తమ్ముడు ఉండాలని ఎప్పుడూ కోరుకున్నాను. 69 00:06:17,041 --> 00:06:18,750 అబ్బా, వీళ్లు చాలా అందంగా ఉన్నారు. 70 00:06:19,250 --> 00:06:20,083 పర్వాలేదు అంటే, 71 00:06:20,166 --> 00:06:22,041 ఏదో ఒకరోజున వాళ్లను కలుస్తాను. 72 00:06:23,166 --> 00:06:25,375 ఏదో ఒకరోజున. బహుశా... 73 00:06:27,500 --> 00:06:28,541 నీకు బాగానే ఉందా? 74 00:06:28,625 --> 00:06:31,083 ఆ. అక్కడ చాలా దుమ్ము ఉంటుంది. 75 00:06:31,666 --> 00:06:33,625 ఈ ఉద్యోగం నీకు సురక్షితంగా కనపించడం లేదు. 76 00:06:34,875 --> 00:06:36,916 వేరే దేని గురించైనా అలోచించావా? 77 00:06:37,708 --> 00:06:39,708 కంప్యూటర్లతో జీతం బాగా వస్తుందని విన్నాను. 78 00:06:39,791 --> 00:06:41,500 శిక్షణ కోసం డబ్బులు కడతాను. 79 00:06:41,583 --> 00:06:44,291 ధన్యవాదాలు, కానీ నువ్వు నాకోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 80 00:06:44,375 --> 00:06:45,375 అందుకోసం కాదు... 81 00:06:45,458 --> 00:06:46,416 నాకలా చేయాలని ఉంది. 82 00:06:47,250 --> 00:06:49,125 నేను కనీసం ఇదయినా చేయాలని. 83 00:06:50,333 --> 00:06:51,333 నేనా విషయం ఆలోచిస్తాను. 84 00:06:52,875 --> 00:06:54,875 నీకు కావాలంటే, మొత్తం డబ్బా తీసుకోవచ్చు. 85 00:06:57,041 --> 00:07:00,333 నేను డబ్బా తీసుకుని, బిస్కెట్లు నీకు ఉంచేస్తాను. 86 00:07:00,458 --> 00:07:01,833 ఇంకా ఈసారి వచ్చేటప్పుడు, 87 00:07:01,916 --> 00:07:06,375 ఏదైనా ఇంట్లో తయారుచేసిన వాటితో ఈ డబ్బా నింపి నీకోసం తీసుకుని వస్తాను. 88 00:07:07,125 --> 00:07:08,083 ఇదెలా ఉంది? 89 00:07:08,750 --> 00:07:09,666 అది చాలా బాగుంది. 90 00:07:21,791 --> 00:07:22,791 హలో? 91 00:07:22,875 --> 00:07:23,875 అలెహాండ్రో. 92 00:07:24,916 --> 00:07:25,958 నేనే మాట్లాడుతున్నా. 93 00:07:26,041 --> 00:07:28,125 నువ్వు కాల్ చేయడం సంతోషం. 94 00:07:28,208 --> 00:07:30,375 నీకు నా కొత్త అపార్ట్‌మెంట్‌ను చూపించాలి. 95 00:07:30,458 --> 00:07:31,750 దీనిలో చాలా గోడలు ఉన్నాయి. 96 00:07:31,833 --> 00:07:33,000 నీకిది బాగా నచ్చుతుంది. 97 00:07:33,083 --> 00:07:36,208 నీ కొత్త ఉద్యోగం నీకు బాగుండడం సంతోషకర విషయం. 98 00:07:37,875 --> 00:07:39,208 విను... 99 00:07:40,375 --> 00:07:42,750 నేను ఇకపై మా ఇంటి నుంచి ఫోన్ చేయలేను, 100 00:07:42,833 --> 00:07:46,208 ఇంకా నువ్వూ నాకు ఫోన్ చేయకు. 101 00:07:47,041 --> 00:07:48,583 నీకు అర్థమైందా? 102 00:07:50,041 --> 00:07:51,625 అంతా బాగానే ఉందా? 103 00:07:52,291 --> 00:07:56,375 నీకు చేసే కాల్స్‌పై నా భర్త అడిగాడు, 104 00:07:56,458 --> 00:08:01,458 నేనది ఇప్పుడు ఆయనకు వివరించలేక పోయాను, అందుకే... 105 00:08:01,541 --> 00:08:04,625 సరే, పర్వాలేదు... 106 00:08:04,708 --> 00:08:06,083 నాకు అర్థమైంది. 107 00:08:10,375 --> 00:08:12,250 పుట్టినరోజు శుభాకాంక్షలు, నా బంగారం. 108 00:08:12,333 --> 00:08:15,333 ఈ ఏడాది అద్భుతంగా ఉంటుందని ఆశిస్తాను. 109 00:08:15,416 --> 00:08:16,958 క్రిస్మస్ శుభాకాంక్షలు. 110 00:08:17,041 --> 00:08:19,583 సెలవులు నీలో స్ఫూర్తి నింపాలని ఆశిస్తాను. 111 00:08:19,666 --> 00:08:21,083 పుట్టినరోజు శుభాకాంక్షలు. 112 00:08:21,166 --> 00:08:24,166 నీకు మరో ఏడాది అద్భుతంగా గడవాలని ఆశిస్తాను. 113 00:08:27,208 --> 00:08:29,166 నువ్వు వచ్చావు! లోపలకు రా. 114 00:08:32,916 --> 00:08:35,375 చాలా కాలం పట్టినందుకు బాధగా ఉంది. 115 00:08:35,791 --> 00:08:37,583 నాకు తరచుగా రావాలని ఉంది. 116 00:08:38,333 --> 00:08:39,625 నీకోసం బిస్కెట్లు తయారు చేశాను. 117 00:08:40,125 --> 00:08:41,083 నీకు గుర్తుంది... 118 00:08:41,166 --> 00:08:42,250 అవును. 119 00:08:42,333 --> 00:08:43,291 పుట్టినరోజు శుభాకాంక్షలు. 120 00:08:43,375 --> 00:08:44,291 క్రిస్మస్ శుభాకాంక్షలు. 121 00:08:44,375 --> 00:08:45,416 పుట్టినరోజు శుభాకాంక్షలు. 122 00:08:47,416 --> 00:08:49,000 నీకు గోధుమ బిస్కెట్లు ఇష్టమేనని ఆశిస్తాను. 123 00:08:49,791 --> 00:08:51,666 నువ్వు అవి తయారుచేయడం సంతోషం. 124 00:09:00,500 --> 00:09:02,916 నేను గతంలో పుదీనా అచ్చులు చేయలేదు... 125 00:09:07,500 --> 00:09:09,291 నీ ఒళ్లు వేడిగా ఉంది. 126 00:09:09,375 --> 00:09:11,458 అవును... బ్రాంకైటిస్ కావచ్చని అన్నారు. 127 00:09:11,541 --> 00:09:14,333 ఏళ్ల తరబడి నీకు దగ్గు కొనసాగుతోందని నాకు అనిపిస్తోంది. 128 00:09:15,458 --> 00:09:16,416 నాకు తెలుసు. 129 00:09:16,666 --> 00:09:20,916 మరి నిన్ను జాగ్రత్తగా చూసుకునే భార్యను ఎప్పుడు తెచ్చుకుంటావు? 130 00:09:22,791 --> 00:09:23,791 నాకు తెలియదు. 131 00:09:24,625 --> 00:09:25,708 బహుశా ఎన్నటికీ కుదరదు. 132 00:09:25,791 --> 00:09:27,083 ఎన్నటికీ కుదరదా? 133 00:09:27,166 --> 00:09:28,125 ఎందుకు కుదరదు? 134 00:09:31,000 --> 00:09:34,291 నాకు ఆడవాళ్లపై ఆసక్తి లేదు. 135 00:09:39,750 --> 00:09:41,416 మగవాళ్ల మీదా? 136 00:09:48,416 --> 00:09:50,000 అయితే మరి భర్తను? 137 00:09:51,500 --> 00:09:53,000 నాకు తెలియదు... 138 00:09:53,083 --> 00:09:55,000 సంబంధాల విషయంలో నాకు సిగ్గు ఎక్కువే. 139 00:09:55,083 --> 00:09:56,375 ఎందుకు? 140 00:09:56,458 --> 00:09:57,875 నువ్వు ఎంతో మంచివాడివి. 141 00:09:57,958 --> 00:10:01,666 ఎవరికైనా నిజంగా దగ్గరయితే నేను పరిపూర్ణంగా ఉండాలని నా కోరిక. 142 00:10:02,833 --> 00:10:05,333 నువ్విప్పుడు పరిపూర్ణంగానే ఉన్నావు. 143 00:10:06,833 --> 00:10:07,750 ధన్యవాదాలు. 144 00:10:09,583 --> 00:10:11,416 కానీ నేను నీ కొడుకు అయుంటే... 145 00:10:11,500 --> 00:10:12,708 నువ్వు నా కొడుకువే. 146 00:10:14,083 --> 00:10:17,125 నేను నీ కొడుకునని జనాలకు తెలిస్తే, 147 00:10:17,208 --> 00:10:19,708 వాళ్లు నన్ను అంగీకరించడం తేలికా? 148 00:10:20,291 --> 00:10:21,291 అవును. 149 00:10:21,750 --> 00:10:22,625 కచ్చితంగా. 150 00:10:22,708 --> 00:10:24,750 నేను గర్వపడతాను. 151 00:10:28,083 --> 00:10:30,083 నేను గర్వపడుతున్నాను. 152 00:10:42,750 --> 00:10:44,666 నీకు సందేశాలు, ఈమెయిల్ పంపాను. 153 00:10:44,750 --> 00:10:45,583 నేను ఊళ్లోకి వచ్చాను. 154 00:10:45,666 --> 00:10:48,375 నిజానికి, మీ ఇంటి బయటే ఉన్నాను. 155 00:11:01,458 --> 00:11:07,416 అలెహాండ్రో, మన్నించు, కానీ నువ్విలా మా ఇంటి బయట కనిపించకూడదు. 156 00:11:07,500 --> 00:11:09,958 ఉద్యోగ సమావేశం కోసం ఊళ్లోకి వచ్చాను. 157 00:11:10,041 --> 00:11:11,458 నాకు నిన్ను చూడాలని అనిపించింది. 158 00:11:11,541 --> 00:11:15,083 బెక్కా పెళ్లి పనులతో తీరిక లేకుండా ఉన్నాను. 159 00:11:15,166 --> 00:11:17,375 మొత్తం కుటుంబమంతా ఇక్కడే ఉంది. 160 00:11:17,458 --> 00:11:19,375 నాకు సమయమే ఉండడం లేదు. నన్ను మన్నించు. 161 00:11:20,375 --> 00:11:23,041 ఇది నీకు కష్టమైన విషయమని తెలుసు. 162 00:11:23,125 --> 00:11:25,625 కానీ నాకు నీతో మాట్లాడాలని ఉంది. 163 00:11:26,375 --> 00:11:27,458 ఏమిటది? ఏమయింది? 164 00:11:28,416 --> 00:11:30,541 నా ఊపిరితిత్తులలో మచ్చలు ఉన్నాయట. 165 00:11:31,625 --> 00:11:34,833 నేను చమురు క్షేత్రాలలో పని చేసిన కాలం నాటి సిలికా దుమ్ము కారణంగా. 166 00:11:35,916 --> 00:11:37,791 ఊపిరితిత్తుల కణజాలం తొలగించాలని అన్నారు. 167 00:11:40,500 --> 00:11:43,416 నేను నిన్ను ఆ ఉద్యోగం నుంచి ముందే బయటకు తేవాల్సింది. 168 00:11:44,375 --> 00:11:46,333 నువ్వు వచ్చి నాతో ఉండగలవా? 169 00:11:46,833 --> 00:11:47,875 నాకు సాయం చేయగలవా? 170 00:11:51,541 --> 00:11:54,500 ఇప్పటికిప్పుడు వచ్చేయడం నాకు కష్టమైన విషయం. 171 00:11:56,458 --> 00:11:57,416 అవును. 172 00:11:58,375 --> 00:11:59,250 సరే. 173 00:12:01,791 --> 00:12:03,291 తను నా కూతురు. 174 00:12:03,375 --> 00:12:04,833 దయచేసి, నువ్వు వెళ్లిపో. 175 00:12:04,916 --> 00:12:05,916 నేను తనను కలవవచ్చా? 176 00:12:06,000 --> 00:12:06,958 ఇప్పుడు వద్దు. 177 00:12:07,041 --> 00:12:08,083 తనకు పెళ్లయింది. 178 00:12:08,166 --> 00:12:10,166 నేను తనను ఇలా ఆశ్చర్యపరచలేను. 179 00:12:10,250 --> 00:12:12,625 నన్ను చూసి సిగ్గుపడుతున్నావని ఒప్పుకో. 180 00:12:12,708 --> 00:12:14,291 లేదు! ఇది అలా కాదు... 181 00:12:14,375 --> 00:12:15,875 నేను నా గురించి సిగ్గుపడను. 182 00:12:15,958 --> 00:12:17,375 నేను చేసినదానికి సిగ్గుపడను. 183 00:12:17,750 --> 00:12:20,958 నువ్వు చేసిన ఆ పని, నేనే. 184 00:12:24,291 --> 00:12:26,708 నీ ఆపరేషన్ కోసం డబ్బు పంపుతాను... 185 00:12:26,791 --> 00:12:27,833 నన్ను మన్నించు. 186 00:12:32,541 --> 00:12:35,083 బెక్కా, ఇక్కడేం చేస్తున్నావు? 187 00:12:35,791 --> 00:12:38,083 లేదు, అలెహాండ్రో. నువ్వు వెళ్లాలి. వెంటనే! 188 00:13:04,458 --> 00:13:06,708 నీకు కొన్ని తీసుకొచ్చాను. 189 00:13:07,708 --> 00:13:09,541 ఎందుకు మనసు మార్చుకున్నావు? 190 00:13:09,625 --> 00:13:13,166 నువ్వు నన్ను చాలా కొంచెం అడిగావు, నా కుటుంబం చాలా ఎక్కువ అడుగుతోంది... 191 00:13:13,416 --> 00:13:15,708 నువ్వు ఇదంతా ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు. 192 00:13:17,208 --> 00:13:18,250 నేను భయపడ్డాను. 193 00:13:19,375 --> 00:13:20,958 దయచేసి నన్ను క్షమించు. 194 00:13:24,875 --> 00:13:26,125 సరే. 195 00:13:26,208 --> 00:13:27,541 సరే. 196 00:13:34,791 --> 00:13:36,125 ఇదుగో తీసుకో. 197 00:13:37,625 --> 00:13:39,666 ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు. 198 00:13:39,750 --> 00:13:41,625 నాకిక్కడ ఉండడం సంతోషం. 199 00:13:51,833 --> 00:13:53,208 అమ్మా! 200 00:13:53,333 --> 00:13:54,500 నిన్ను కనిపెట్టేశాం! 201 00:13:54,583 --> 00:13:57,000 -ఇక్కడేం చేస్తున్నారు? -కమీలా, పర్వాలేదు. 202 00:13:57,083 --> 00:13:58,208 ఎవరు వచ్చారు? 203 00:14:17,541 --> 00:14:23,416 అన్‌డన్ 204 00:14:25,583 --> 00:14:26,958 హేయ్. బాగానే ఉన్నావా? 205 00:14:27,041 --> 00:14:29,250 ఏం జరుగుతోంది? ఇక్కడికి ఎందుకు వచ్చారు? 206 00:14:29,333 --> 00:14:31,750 నీకు కాల్ చేయాలని చూశాం. నువ్వు తియ్యలేదు. 207 00:14:31,833 --> 00:14:35,125 పర్వాలేదు. మాకు అన్నీ తెలిశాక ఇప్పుడు అంతా మెరుగవుతుంది. 208 00:14:35,208 --> 00:14:38,625 -ఇది దారుణమైన సమయం. -లేదు, పర్వాలేదు. 209 00:14:38,708 --> 00:14:42,166 హాయ్, నా పేరు అల్మా! నీ చిట్టి చెల్లెలిని. ఎలా ఉన్నావు? 210 00:14:42,250 --> 00:14:45,875 హాయ్, నా పేరు అలెహాండ్రో. నీ ఏకైక అన్నయ్యను, తెలిసినంత వరకు. 211 00:14:47,666 --> 00:14:49,875 -నిన్ను పట్టేశాం, అమ్మా. -లోపలకు రండి. 212 00:14:49,958 --> 00:14:51,291 దయచేసి, లోపలకు రండి. 213 00:14:54,000 --> 00:14:54,916 నేను టీ తెస్తాను. 214 00:14:55,000 --> 00:14:56,416 వద్దు, విశ్రాంతి తీసుకో. 215 00:14:56,875 --> 00:14:57,750 నేను టీ చేస్తాను. 216 00:14:57,833 --> 00:14:59,333 సరే. ధన్యవాదాలు. 217 00:14:59,416 --> 00:15:01,916 అలెహాండ్రో, నిన్ను కలవాలని మాకు ఆరాటంగా ఉంది. 218 00:15:02,000 --> 00:15:04,041 నా దీని గురించి చెప్పాల్సింది. 219 00:15:05,208 --> 00:15:07,416 చెప్పలేనని భావించినందుకు నన్ను క్షమించు. 220 00:15:12,125 --> 00:15:13,958 నేను క్షమాపణ చెప్పడం వినబడిందా? 221 00:15:14,041 --> 00:15:16,041 నేను దీనిపై ఇప్పుడు మాట్లాడలేను. 222 00:15:17,000 --> 00:15:18,625 అది గంజాయి కాదని ఆశిస్తాను. 223 00:15:19,083 --> 00:15:21,166 అది ఊపిరితిత్తులకు మందు. 224 00:15:21,250 --> 00:15:22,625 అయితే అది గంజాయే! 225 00:15:26,666 --> 00:15:29,250 ఓరి దేవుడా! నిన్ను నవ్వించినందుకు క్షమించు. 226 00:15:29,333 --> 00:15:31,458 ఇలా ఉల్లాసంగా ఉండకపోవడం నాకు చాలా కష్టం. 227 00:15:31,541 --> 00:15:33,708 -నీకు నా గురించి తెలుస్తుందిలే. -పర్వాలేదు. 228 00:15:33,791 --> 00:15:35,041 అయితే, అమ్మా... 229 00:15:35,833 --> 00:15:38,333 అలెహాండ్రో గురించి మాకెప్పుడూ చెప్పలేదేంటి? 230 00:15:42,083 --> 00:15:45,541 నేను... నేను చెప్పలేకపోయాను. 231 00:15:48,083 --> 00:15:49,333 నేను చిన్నదాన్ని. 232 00:15:49,916 --> 00:15:53,208 మా అమ్మ అప్పటికే తిరస్కరించింది, నా దగ్గర ఏమీ లేదు. 233 00:15:54,125 --> 00:15:56,041 నేను ఓ బిడ్డను ఎలా చూసుకోగలను? 234 00:15:56,916 --> 00:15:58,125 నిన్ను కోల్పోయినప్పుడు 235 00:15:58,833 --> 00:16:02,333 నన్ను నేనే కోల్పోయానని నాకు అనిపించింది. 236 00:16:04,291 --> 00:16:08,541 నాలో రెండు సగాలను కలపాలని ఒకసారి ప్రయత్నించాను. 237 00:16:08,916 --> 00:16:11,958 అల్మా నా కడుపులో ఉండగా, మరొక బిడ్డ ఉండడం, 238 00:16:12,625 --> 00:16:14,833 నీకు పర్వాలేదని అనుకున్నాను. 239 00:16:16,000 --> 00:16:17,375 నా కొడుకు విషయంలో. 240 00:16:17,875 --> 00:16:20,333 పత్రాల పని కూడా చేశాను. 241 00:16:20,416 --> 00:16:22,666 ఆ రోజున నీకు ఓ మొక్క ఇచ్చాను... 242 00:16:23,541 --> 00:16:26,208 ఇది నీ కోసమే. 243 00:16:26,708 --> 00:16:27,875 దీన్ని జాగ్రత్తగా చూసుకో. 244 00:16:29,000 --> 00:16:30,125 ధన్యవాదాలు! 245 00:16:30,416 --> 00:16:33,916 నీకు ఆ పత్రాలను చూపించి, అన్నీ చెప్పబోయాను. 246 00:16:34,000 --> 00:16:37,291 కానీ నావల్ల కాలేదు 247 00:16:40,666 --> 00:16:41,916 అయితే అది నువ్వే... 248 00:16:45,291 --> 00:16:48,666 నువ్వు వచ్చి కూడా నన్ను తీసుకెళ్లలేదు. 249 00:16:50,541 --> 00:16:52,083 ఎందుకు? 250 00:16:52,875 --> 00:16:56,041 మనం గతం గురించి ఏం చేయగలం? 251 00:16:57,333 --> 00:16:58,875 ఏదేమైనా అది ముఖ్యం కాదు. 252 00:16:58,958 --> 00:17:00,958 అది ముఖ్యం కాదా? 253 00:17:04,500 --> 00:17:06,000 ఇది నా జీవితం. 254 00:17:08,875 --> 00:17:13,333 నువ్వు చేసిన ప్రతి విషయం వేరే, ఇంకా అలా ఎందుకో నాకు చెప్పలేదు. 255 00:17:14,791 --> 00:17:17,666 బాగానే ఉన్నావా? 256 00:17:18,208 --> 00:17:19,041 శాంతించు. 257 00:17:20,125 --> 00:17:21,083 శాంతించు. 258 00:17:22,625 --> 00:17:24,458 ఇక వెళ్లిపోవడం మంచిది. 259 00:17:24,541 --> 00:17:27,625 అలెహాండ్రో మిమ్మల్ని వెళ్లమంటున్నాడు. తనకు విశ్రాంతి కావాలి. 260 00:17:27,708 --> 00:17:28,750 లేదు. 261 00:17:31,083 --> 00:17:32,291 నువ్వు ఇక్కడ ఉండవద్దు. 262 00:17:34,291 --> 00:17:40,125 నువ్వు దాచే విషయాలతో, ఇంకా నీ జీవితంలో 263 00:17:40,208 --> 00:17:44,666 ఏది భాగం కాలేదో అనే విషయాలతో అలసిపోయాను. 264 00:17:44,750 --> 00:17:46,458 లేదు, నాకు ఉండాలని ఉంది. 265 00:17:47,541 --> 00:17:48,666 నీకు టీ తీసుకొస్తాను. 266 00:17:48,750 --> 00:17:49,708 నేను తెచ్చుకుంటాను. 267 00:17:50,625 --> 00:17:51,583 దయచేసి... 268 00:17:54,791 --> 00:17:55,875 నువ్వు వెళ్లిపో. 269 00:18:05,500 --> 00:18:06,583 సరే. 270 00:18:26,958 --> 00:18:30,333 ఇలా ఎలా చేస్తారు? నా గోప్యతలోకి ఇలా ఎలా చొరబడతారు? 271 00:18:30,416 --> 00:18:33,500 అలెహాండ్రోను దత్తత తీసుకోవడంపై మనసు ఎందుకు మార్చుకున్నావు? 272 00:18:33,583 --> 00:18:36,708 -అల్మా, ఆపు. -నాకు మీ జీవితాలు సంక్లిష్టం చేయాలని లేదు. 273 00:18:36,958 --> 00:18:38,833 నా కుటుంబంపై భారం మోపాలని అనుకోలేదు. 274 00:18:39,625 --> 00:18:41,000 ఇలా మీ కోసమే చేశాను. 275 00:18:41,541 --> 00:18:44,416 మీకు మంచి తల్లిగా, మంచి భార్యగా ఉండేందుకు. 276 00:18:44,500 --> 00:18:45,625 ఇది మా తప్పు అంటావా? 277 00:18:45,708 --> 00:18:49,875 కానీ మాకెన్నడూ అవకాశమే ఇవ్వలేదు. దీని గురించి నాతో అసలు మాట్లాడలేదు. 278 00:18:50,708 --> 00:18:52,916 ఇది ఓ తప్పని మీ అమ్మ నాకు చెప్పింది. 279 00:18:57,541 --> 00:19:00,250 నా గతంతో నా కుటుంబంపై భారం మోపకూడదని. 280 00:19:00,625 --> 00:19:03,458 నా ఆ రూపాన్ని నేను గతంలోనే వదిలేయాలి. 281 00:19:19,250 --> 00:19:20,291 మన కుటుంబం కోసం. 282 00:19:20,375 --> 00:19:23,916 బెక్కా, ఆ తలుపు. అదిప్పుడే కనబడింది. దీనికి ఏదో అర్థం ఉంది. 283 00:19:24,125 --> 00:19:27,125 -దీనిపై మా అమ్మతో మాట్లాడావా? -మేము సన్నిహితులం. 284 00:19:27,208 --> 00:19:30,708 నా కన్నతల్లి తిరస్కరించిన సమయంలో, ఆమె నాకు తల్లిగా నిలిచింది. 285 00:19:30,791 --> 00:19:33,375 -ఆమెను నమ్మాను. -కానీ నువ్వు నన్ను నమ్మలేదు. 286 00:19:33,458 --> 00:19:35,666 గెరాల్డిన్‌తో సన్నిహితంగా ఇదెపుడు జరిగింది? 287 00:19:35,750 --> 00:19:37,958 ఆమెను మానసిక వైద్యశాలలో కలిసేదాన్ని. 288 00:19:38,041 --> 00:19:40,416 అలెహాండ్రో దత్తత వద్దని అప్పుడు చెప్పిందా? 289 00:19:40,500 --> 00:19:44,541 తనను దత్తత తీసుకుంటే, వాడికి మంచి జీవితం ఉంటుందని ఆశించాను. 290 00:19:45,250 --> 00:19:47,500 దీని గురించి తప్పు అనుకోవడం తేలిక అనుకుంటావా? 291 00:19:47,583 --> 00:19:49,083 వద్దు, అదంతా ఆపు. 292 00:19:50,375 --> 00:19:54,166 నన్ను క్షమించండి. ఇదంతా ఇలా జరిగినందుకు క్షమించండి. 293 00:19:54,666 --> 00:19:56,875 కమీలా, దయచేసి, వెళ్లిపోకు. 294 00:19:57,791 --> 00:20:01,208 ఏం చేస్తున్నావు? నువ్వెందుకు అమ్మ జ్ఞాపకాలలోకి వెళ్లలేదు? 295 00:20:01,291 --> 00:20:03,958 వెతుకులాట దీని అంతటినీ ఇంకా ఘోరంగా చేస్తోంది. 296 00:20:04,041 --> 00:20:06,125 అలెహాండ్రో గురించి తెలును. అది ఘోరమేంటి? 297 00:20:06,208 --> 00:20:08,208 అతను మనతో ఉండకూడదని కోరుకుంటున్నాడు. 298 00:20:08,291 --> 00:20:10,375 అమ్మతో తన అనుబంధాన్ని పాడు చేసుకున్నాడు. 299 00:20:10,458 --> 00:20:13,375 అమ్మానాన్నలు గొడవ పడుతున్నారు. ఏం జరుగుతోందో కనబడడం లేదా? 300 00:20:13,458 --> 00:20:15,916 గెరాల్డిన్ గురించి అమ్మ చెబుతుంటే, 301 00:20:16,000 --> 00:20:19,291 అలెహాండ్రో ఇంటి బయట తలుపు కనబడింది, ఓ బిడ్డ ఏడుపు విన్నాను. 302 00:20:19,375 --> 00:20:20,750 -ఓ బిడ్డ ఏడుపా? -అవును. 303 00:20:20,833 --> 00:20:24,958 తలుపు వెనుక, ఓ బిడ్డ ఏడుస్తోంది. అది అలెహాండ్రో అని నా నమ్మకం. 304 00:20:25,041 --> 00:20:26,125 ఇది పిచ్చిగా ఉంది. 305 00:20:26,208 --> 00:20:29,333 మనం చేయాల్సినదల్లా అలెహాండ్రోను దత్తత తీసుకోవద్దని 306 00:20:29,416 --> 00:20:32,250 -అమ్మకు చెప్పకుండా గెరాల్డిన్‌ను ఆపడమే. -అదంత తేలిక కాదు. 307 00:20:32,333 --> 00:20:34,250 ప్రయత్నిస్తే మనకు పోయేదేంటి? 308 00:20:34,333 --> 00:20:37,916 నీకు పోయేదేమీ లేదు! ఈ పని చేసి నేను మూర్ఛపోయాను. 309 00:20:38,000 --> 00:20:40,958 ప్రయత్నించి, అక్కడకు వెళదాం. ఇది సరిచేస్తా. గతంలో చేశా. 310 00:20:41,041 --> 00:20:45,416 ఆ విషయానికి వస్తే, నువ్వు, నాన్న కలిసి మార్చిన ఆ మరో జీవితం ఏంటి? 311 00:20:45,500 --> 00:20:48,500 నేను ఆ విషయం చెప్పలేను. చెప్పవద్దని ఆయన అన్నాడు. 312 00:20:48,583 --> 00:20:50,041 నువ్వు నన్ను నమ్మగలవా? 313 00:20:51,416 --> 00:20:54,500 కుటుంబంలో పెద్ద హీరో అయ్యే తపనతో అన్వేషణ చేయాలని ఉందా? 314 00:20:55,625 --> 00:20:56,875 అయితే, మంచిది. 315 00:21:11,666 --> 00:21:15,541 బెక్కా, అమ్మ ఇక్కడ లేకపోయినా సరే అమ్మ జ్ఞాపకాలను పొందగలిగావు. 316 00:21:15,625 --> 00:21:17,083 కానివ్వు. 317 00:21:17,166 --> 00:21:18,458 నేను వెళ్లడం లేదు. 318 00:21:21,625 --> 00:21:23,125 అయితే నాకు నేనే చేస్తాను. 319 00:21:23,583 --> 00:21:25,208 నీకు అదృష్టం కలగాలి. 320 00:21:44,750 --> 00:21:45,916 దేశాన్ని కమ్మేసిన హులా హూప్ వెర్రి! 321 00:21:46,000 --> 00:21:47,250 ఆగు. ఇది... 322 00:21:50,458 --> 00:21:51,583 బెక్కా! 323 00:21:53,416 --> 00:21:57,083 బెక్కా, వెనక్కు రా! నన్ను తప్పు సమయంలోకి పంపావు. 324 00:21:57,166 --> 00:22:00,166 హేయ్! నువ్వు ప్రశాంతంగా ఉండాలి. 325 00:22:02,666 --> 00:22:04,875 సరే... హేయ్, హేయ్. వద్దు, వద్దు! 326 00:22:04,958 --> 00:22:07,750 మీకు అర్థం కాలేదు. నేనిక్కడ ఉండాల్సింది కాదు, సర్. 327 00:22:07,833 --> 00:22:10,375 -తప్పకుండా. అది ఎప్పుడూ వినలేదులే. -లేదు, లేదు! 328 00:22:13,000 --> 00:22:14,791 వద్దు, వద్దు! ఆగండి, ఆగండి! 329 00:22:18,166 --> 00:22:20,833 లేదు! బెక్కా! 330 00:22:21,458 --> 00:22:22,541 అబ్బా ఛ! 331 00:23:10,958 --> 00:23:12,958 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 332 00:23:13,041 --> 00:23:15,041 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్