1 00:00:01,084 --> 00:00:04,171 స్కేటింగ్ చాలా చక్కని రోజు, మరీ ఎండగా లేదు, మరీ చల్లగా లేదు. 2 00:00:04,254 --> 00:00:07,966 బజ్జీలు, వేడి వేడి కాఫీకి స్నాక్స్ స్టాండ్ కి వెళ్లడం మర్చిపోకండి. 3 00:00:08,050 --> 00:00:11,261 ఇంకో విషయం, ఇది ఈ స్కేటింగ్ సీజన్లోని ఆఖరి వీకెండ్, 4 00:00:11,345 --> 00:00:15,724 కాబట్టి కపుల్స్ స్కేటింగ్ ఉంటుంది కనుక మీ మనస్సును దోచుకొన్న వ్యక్తితో కలిసి పాల్గొనండి. 5 00:00:15,807 --> 00:00:17,142 వీడు ఇలా చేశాడంటే నమ్మకలేకపోతున్నా. 6 00:00:17,226 --> 00:00:19,728 ఏమైపోయాడు? నిజంగానే చెక్కేశాడా? 7 00:00:20,270 --> 00:00:21,355 వావ్, చాలా గంభీరంగా ఉంది కదా? 8 00:00:21,438 --> 00:00:24,525 ఏదో పెద్ద విషయమే జరిగింది. ఈ క్షణానికి దారితీసిన సంఘటనలను ఓసారి చూద్దాం. 9 00:00:24,608 --> 00:00:26,109 అది మూడు గంటల క్రితం ప్రారంభమైంది... 10 00:00:26,193 --> 00:00:27,194 మూడు గంటల క్రితం 11 00:00:27,277 --> 00:00:29,988 నేను చెప్తున్నా కదా, మళ్లీ స్క్రీన్ మీద వేయడం ఎందుకు! వ్యాఖ్యాతగా విషయం చెప్పడం నా విధి. 12 00:00:30,072 --> 00:00:32,115 కాబట్టి దీన్ని అవతలకి పీకి పారేస్తున్నా. 13 00:00:32,908 --> 00:00:34,451 ఏదేమైనా, మూడు గంటల క్రితం ఏం జరిగిందో చూద్దాం. 14 00:00:35,035 --> 00:00:36,411 ఆనందంతో ఇద్దరూ వెలిగిపోతున్నారు కదా. 15 00:00:38,497 --> 00:00:41,500 పసిడి పతకం మాదేలే 16 00:00:41,583 --> 00:00:44,545 మేమిద్దరం గొప్ప స్కేటర్స్ కాబట్టి అదేమంత పెద్ద విషయం కాదులే 17 00:00:45,045 --> 00:00:48,757 ఇంత గొప్పోళ్ళం కావడం మరీ అంత మంచిది కాదేమో 18 00:00:48,841 --> 00:00:50,509 నువ్వు ఐసులో నైసుగా స్కేట్ చేస్తావు 19 00:00:50,592 --> 00:00:52,678 నువ్వు స్కేటింగ్ కోసమే పుట్టావు 20 00:00:52,761 --> 00:00:57,224 బ్రాండన్హామ్ ఇదివరకు కనీవిని ఎరుగని విన్యాసాన్ని చేస్తున్నాడు చూడండి 21 00:00:57,307 --> 00:00:58,809 అదరగొట్టేస్తున్నాడు 22 00:00:58,892 --> 00:01:00,477 ఎగిరాడు 23 00:01:00,561 --> 00:01:02,396 -బాగానే దిగాడా? -దుమ్ము దులిపేశా! 24 00:01:02,479 --> 00:01:05,858 నీ అమోఘమైన అరివీర భయంకరమైన స్టంటుకు 25 00:01:05,941 --> 00:01:08,318 జడ్జిలు అధికారికంగా పదికి పది పాయింట్లు ఇచ్చారు! 26 00:01:08,402 --> 00:01:10,279 పదికి పది వావ్ 27 00:01:10,362 --> 00:01:13,615 మళ్లీ మళ్లీ చెప్తాను పదికి పది 28 00:01:13,699 --> 00:01:15,492 నీకు పదికి పది పాయింట్లు ఇస్తాను 29 00:01:15,576 --> 00:01:16,577 పదికి పది 30 00:01:17,077 --> 00:01:19,538 ఇదుగో టిల్లర్మన్ దూసుకు వస్తుంది 31 00:01:19,621 --> 00:01:21,415 బొంగరంలా గిరగిరా తిరగాలని చూస్తోంది 32 00:01:21,498 --> 00:01:23,125 తను చేసి చూపెడుతుందా? 33 00:01:23,208 --> 00:01:24,334 తిరిగింది, వావ్ 34 00:01:24,418 --> 00:01:25,544 తిరిగింది 35 00:01:25,627 --> 00:01:26,628 మనతో మామూలుగా ఉండదు మరి! 36 00:01:26,712 --> 00:01:29,548 నీ భంభోళ జంభోళ గింగరాల గిరాగిరా తిరుగుడు 37 00:01:29,631 --> 00:01:33,177 జడ్జిలు అధికారికంగా పదికి పది పాయింట్లు ఇచ్చారు! 38 00:01:33,260 --> 00:01:34,511 పదికి పది 39 00:01:34,595 --> 00:01:35,804 పదికి పది 40 00:01:36,388 --> 00:01:39,933 నీకు పదికి పది అని కాగితం మీద రాసి ఇస్తాను 41 00:01:40,017 --> 00:01:41,226 జింగిరి జాంగిరి స్టంట్ 42 00:01:41,310 --> 00:01:42,269 పదికి పది 43 00:01:42,352 --> 00:01:44,271 -ఓరి దేవుడా. -కోతీ కొమ్మచి స్టంట్ 44 00:01:44,354 --> 00:01:45,731 పదికి పది 45 00:01:45,814 --> 00:01:47,191 -ఎంగుళ్ళు దూకుళ్ళు స్టంట్ -పది 46 00:01:47,274 --> 00:01:48,901 -జారుడే జారుడు స్టంట్ -పది 47 00:01:50,527 --> 00:01:52,654 పది, పది 48 00:01:52,738 --> 00:01:55,574 పదికి పది పదికి పది 49 00:01:55,657 --> 00:01:59,494 మళ్లీ మళ్లీ మనకి పదికి పది ఇస్తాను 50 00:01:59,578 --> 00:02:02,706 అవునులే మనకి పదికి పది ఇస్తాను 51 00:02:03,874 --> 00:02:05,792 మనకి పదికి పది ఇస్తాను 52 00:02:08,086 --> 00:02:10,214 చలి చంపేస్తోంది. నీ జేబులో చేతులు పెట్టనా? 53 00:02:10,297 --> 00:02:12,799 ఆగాగు! ఆగు! సారీ. 54 00:02:12,883 --> 00:02:17,137 నా చేతి వేళ్లు గడ్డకట్టుకుపోయేలా ఉన్నాయి, నీ జేబుల్లో పెడితే వెచ్చగా ఉంటుందని. 55 00:02:17,221 --> 00:02:19,473 అవును. అది నాకు తెలుసు, కానీ, 56 00:02:19,556 --> 00:02:22,518 నీ వేళ్లని నీ జేబుల్లోనే పెట్టుకుంటే మంచిదేమో? 57 00:02:23,101 --> 00:02:26,396 హా. తప్పకుండా. ఏదో నా చేతులతో సరదా పనులు చేద్దామనిపించింది, అంతే. 58 00:02:27,105 --> 00:02:29,775 హేయ్, ఇంతకీ నీ ఆర్ట్ హోమ్ వర్క్ ఎందాకా వచ్చింది? 59 00:02:30,317 --> 00:02:31,610 -దాని గురించి ఎందుకులే. -అంత దరిద్రంగా సాగుతోందా? 60 00:02:31,693 --> 00:02:33,820 అవును. ఓ విషయం చెప్పనా? దాని గురించి పక్కకు పెట్టేసి, 61 00:02:33,904 --> 00:02:37,324 కపుల్స్ స్కేటింగ్ గురించి మాట్లాడుకుందాం. 62 00:02:37,407 --> 00:02:39,785 అది ఇవాళే కదా? ఏమంటావు? ఓకేనా, కాదా? 63 00:02:40,786 --> 00:02:44,456 అంటే, అది అధికారికంగా మన మొదటి పీడీఎస్ఏ అవుతుంది కదా. 64 00:02:44,540 --> 00:02:45,374 స్కేటింగ్ చేస్తూ పబ్లిక్ గా... 65 00:02:45,457 --> 00:02:46,625 స్కేటింగ్ చేస్తూ పబ్లిక్ గా ప్రేమ చూపడం 66 00:02:46,708 --> 00:02:47,709 మధ్యలో నువ్వేంటి! 67 00:02:47,793 --> 00:02:49,503 నాకు ఓకే. 68 00:02:49,586 --> 00:02:51,380 -నాకు కూడా. అయితే మనం కుమ్మేద్దాం! -సరే! 69 00:02:51,463 --> 00:02:54,091 కానీ ముందు, నేను ఈ అద్దెకు తెచ్చుకొన్న బూట్లను ఇచ్చేసి, ఇంకాస్త పెద్దవి తెచ్చుకోవాలి. 70 00:02:54,174 --> 00:02:56,677 -ఇవి మరీ చిన్నవిగా ఉన్నాయి. -బూట్ల గురించి ఎందుకులే. 71 00:02:56,760 --> 00:02:57,761 నీ బూట్లు కూడా బిగుతుగా ఉన్నాయా? 72 00:02:57,845 --> 00:02:59,596 లేదు. నా కాళ్లు బాగానే ఉన్నాయి. 73 00:02:59,680 --> 00:03:01,056 నువ్వు అన్నావని నేనూ అన్నానంతే. 74 00:03:01,640 --> 00:03:03,308 బాబోయ్, ఐస్ మీద కుదురుగా నిలబడటం కష్టమే. 75 00:03:03,392 --> 00:03:06,228 మోలీ, బ్రెండన్లు క్యూలో ఉంటారు, అదంతా మీరు చూడాల్సిన అవసరం లేదు. 76 00:03:06,311 --> 00:03:08,063 ఇక్కడ ఏమైనా జరిగితే నేను చెప్తాలే. 77 00:03:08,939 --> 00:03:10,440 బాబోయ్! నాకేమీ కాలేదు! ఇక బ్రాండన్హామ్ కి వెళ్లండి. 78 00:03:11,483 --> 00:03:13,861 -ఇవాళ మీకు తీరికే ఉండదు. -"మధ్యాహ్నం రెండు గంటలకు టిఫిన్." 79 00:03:13,944 --> 00:03:15,529 -ఇదిగోండి. -ఖతమ్. 80 00:03:15,612 --> 00:03:17,155 -"రెండుంపావుకు భోజనం." -భోజనం. 81 00:03:17,656 --> 00:03:18,657 చూడు, ఫాస్టుగా ముగించేస్తున్నా. 82 00:03:18,740 --> 00:03:22,035 "మూడున్నర గంటలకి, తాత్కాలిక మేయరుతో పలకరింపు కార్యక్రమం." అంతా సిద్ధంగానే ఉందా? 83 00:03:22,119 --> 00:03:24,705 విషయమేమిటంటే, బిట్సీ తాత్కాలిక మేయరును మచ్చిక చేసుకోవాలని చూస్తోంది, 84 00:03:24,788 --> 00:03:27,291 ఎందుకంటే, ఈ పార్క్ విషయంలో తనకి పెద్ద పెద్ద ప్లాన్సే ఉన్నాయి. 85 00:03:27,374 --> 00:03:28,458 అవి తను అన్న మాటలే. 86 00:03:28,542 --> 00:03:31,044 కాబట్టి, అతని మనస్సును గెలుచుకోవడానికి తను, హెలెన్ కలిసి భలే ప్లాన్ వేశారు. 87 00:03:31,128 --> 00:03:32,129 ఓరి దేవుడా! 88 00:03:32,212 --> 00:03:34,882 అంతా సిద్ధం. నటనలో నవరస నట సార్వభౌముల్లాంటి ఇద్దరు ఉద్యోగులను ఎంచుకున్నాను. 89 00:03:34,965 --> 00:03:37,759 ఈ భూమ్మీద నా అంత మంచి బాస్ లేరు అన్నట్టు వాళ్లు నటిస్తే చాలు. 90 00:03:37,843 --> 00:03:39,720 -అదేమంత కష్టం కాదులే. -హా, మీది మామూలు దయాహృదయం కాదు కదా. 91 00:03:39,803 --> 00:03:42,723 తర్వాతిది ఏంటి? సూపర్. మొత్తానికి ఒక మంచి కార్యక్రమమైనా ఉందిలే. 92 00:03:42,806 --> 00:03:44,766 "నాలుగు గంటలకి, రిసెప్షన్ లో ఉండే సోన్యాని ఉద్యోగం నుండి తీసేయాలి." 93 00:03:44,850 --> 00:03:46,393 తనని ఎందుకు తీసేస్తున్నారో మరోసారి చెప్పగలరా? 94 00:03:46,476 --> 00:03:48,979 -కొందరు అతిథులకు ఉచితంగా మంచి గది ఇచ్చింది. -దారుణాతి దారుణం అది. 95 00:03:49,062 --> 00:03:51,899 నేను ఉడుతల పేచీకి సంబంధించి కొత్త పుస్తకాన్ని రాసేటప్పుడు, 96 00:03:51,982 --> 00:03:53,901 నాకు ఎటు చూసినా స్ఫూర్తి కలిగేది. 97 00:03:53,984 --> 00:03:55,861 గింజలు, వాల్నట్లు... 98 00:03:57,362 --> 00:03:58,488 -ఏబీ వచ్చింది. -మళ్లీనా? 99 00:03:58,572 --> 00:04:00,115 తన బట్టలు వేయడానికే మనం వాషింగ్ మెషిన్ కొన్నట్టు ఉంది! 100 00:04:00,199 --> 00:04:02,242 -హేయ్, ఏబ్స్. -నా జీవితంలో ముందడుగు పడింది బాబోయ్! 101 00:04:02,326 --> 00:04:04,077 -ముందడుగు ఏంటి? -నా తొలి ఆడిషన్ ఖరారైంది. 102 00:04:04,161 --> 00:04:07,289 న్యూజెర్సీలోని పాపా మైలోస్ హోటల్ కి సంబంధించిన వాణిజ్య ప్రకటన అది, ఈ మధ్యాహ్నమే జరుగుతుంది. 103 00:04:08,040 --> 00:04:10,792 ఏబీ పిన్నీ! ఇక నుంచి నీ జీవితం వేరే లెవెల్లో ఉండబోతుందిపో! 104 00:04:10,876 --> 00:04:12,294 నాకు పాపా మైలోస్ తెలుసు. 105 00:04:12,377 --> 00:04:15,088 వాళ్ల సైన్ బోర్డుల్లో "మా దగ్గర అల్లాటప్పా వంటకాలు ఉంటాయి అనుకుంటున్నారా?" అని రాసి ఉంటుంది. 106 00:04:15,172 --> 00:04:17,591 -ఏ పాత్ర కోసం ఆడిషన్ కి వెళ్తున్నావు? -రెండవ కస్టమర్! 107 00:04:17,673 --> 00:04:20,886 మేము సాయపడగలం. హెయిర్ స్టయిలింగ్, మేకప్, వాయిస్ సెటప్, ఏదైనా పర్వాలేదు. 108 00:04:20,969 --> 00:04:22,679 ఉ లా లా ల ల ల లే లో 109 00:04:23,555 --> 00:04:25,599 అలాగే సాయపడుదువులే. 110 00:04:25,682 --> 00:04:27,309 ఉ లా ల లో లే లో 111 00:04:27,392 --> 00:04:30,103 -ఎలాగూ వచ్చా కాబట్టి దీన్ని ఉతుక్కోనా? -సరే, కానీ ఆ విషయంలో నన్ను సాయం అడగకు. 112 00:04:30,896 --> 00:04:33,232 హలో, మిత్రులారా. బ్రెండన్, మోలీలు క్యూ నుండి బయటకు వచ్చేశారు. 113 00:04:33,315 --> 00:04:35,567 మోలీ ఇప్పుడు పెద్ద స్కేటింగ్ షూస్ వేసుకొని ఉంది. ఇక మొదలవ్వబోతోంది. 114 00:04:35,651 --> 00:04:37,027 ఏమైనా తింటావా? 115 00:04:37,110 --> 00:04:39,238 నిస్సంకోచంగా. నా స్కేటింగ్ షూస్ నుండి వింత వాసన ఏమైనా వస్తుందా? 116 00:04:39,321 --> 00:04:41,406 మామూలుగా రావట్లేదు. 117 00:04:41,490 --> 00:04:43,283 హేయ్, అమ్మాయిల పాదాల నుండి కూడా వాసన వస్తుంది. 118 00:04:43,367 --> 00:04:44,660 అవును, మా అమ్మ కాళ్ళైతే ఒకటే కంపు. 119 00:04:44,743 --> 00:04:46,203 హేయ్, మోలీ? హలో, బ్రెండన్? 120 00:04:46,286 --> 00:04:47,412 -హేయ్, మోల్స్. -హేయ్, మిత్రులారా. 121 00:04:47,496 --> 00:04:49,498 హేయ్, హేజల్. హేయ్, షానా. ఇతరులకు కూడా నమస్తే. 122 00:04:49,581 --> 00:04:51,041 వచ్చేటప్పుడు హెన్రీ, ఇంకా జేకబ్ ను కలిశాం. 123 00:04:51,124 --> 00:04:54,127 -నిజానికి, స్కేటింగ్ చేస్తూ వాళ్లని గుద్దాం. దెబ్బలు తగిలాయి. -ఇది గమనించారా! 124 00:04:54,211 --> 00:04:56,588 ఆర్ట్ హోమ్ వర్క్ అంటూ కంగారు పడటం నుండి కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్టున్నావే. 125 00:04:56,672 --> 00:04:59,216 అవును. బ్లెండింగ్ కుదరట్లేదు, అందుకే నాకు కాస్త బ్రేక్ అవసరమైంది. 126 00:04:59,299 --> 00:05:00,884 పేజీ అంతా రంగుల మరకలు అయిపోతున్నాయి. 127 00:05:02,469 --> 00:05:04,054 నీ మొహంలా ఉంది నువ్వు గీసిన పెయింటింగ్! 128 00:05:04,930 --> 00:05:06,515 టోర్టిలాన్ ని ఎప్పుడైనా ఉపయోగించి చూశావా? 129 00:05:06,598 --> 00:05:08,141 కావాలంటే, మా ఇంట్లో ఒకటి అదనంగా ఉంది. 130 00:05:08,225 --> 00:05:10,310 ఏంటి? అది సూపర్ విషయం! థ్యాంక్యూ! 131 00:05:10,811 --> 00:05:12,479 టోర్టిల్లా రొట్టెలను కుడా ఆర్ట్ కోసం ఉపయోగిస్తారని నాకు తెలీదే. 132 00:05:12,563 --> 00:05:14,273 టోర్టిల్లా కాదు, టోర్టిలాన్. 133 00:05:14,982 --> 00:05:16,316 అది బ్లెండింగ్ కోసం ఉపయోగించే ఒక ఆర్ట్ టూల్. 134 00:05:16,400 --> 00:05:19,152 కానీ, బ్లెండింగ్ కోసం టోర్టిల్లా రొట్టెను కూడా ఉపయోగించవచ్చు అనుకుంటా. 135 00:05:19,236 --> 00:05:22,406 -కంకి పొత్తులతో కాకుండా పిండితో చేసేది అయితే. -సరే, కంకి పొత్తులతో చేసిందైతే ఏమవుతుంది? 136 00:05:22,489 --> 00:05:24,491 -మీకేమైనా ఇవ్వనా? -ఒక్క నిమిషం. 137 00:05:24,575 --> 00:05:27,995 నాకు, ఈ మహారాణికి పాప్ కార్న్ ఇంకా వేడి వేడి కాఫీ ఇవ్వండి. 138 00:05:28,078 --> 00:05:29,121 థ్యాంక్యూ, మహారాజా. 139 00:05:29,204 --> 00:05:31,206 ఈసారైనా కాఫీ కాస్త చల్లారే దాకా ఆగు, మోలీ, 140 00:05:31,290 --> 00:05:33,500 లేదంటే మళ్లీ "ఆ" అంటూ కేకలు పెడతావు. 141 00:05:34,084 --> 00:05:36,670 ఆపుతావా! నేనేమీ మొహం అలా పెట్టలేదు. 142 00:05:36,753 --> 00:05:40,465 మొహం ఏంటి? నేను చూడలేదు. మళ్లీ చేయవా? హా, అది చాలా బాగుంది. 143 00:05:40,549 --> 00:05:42,926 -నేనింకా ఏ మొహమూ పెట్టలేదు. -హా, అవును. నాకు తెలుసు. 144 00:05:43,010 --> 00:05:44,219 ఇప్పుడు పెడుతున్నావా? 145 00:05:44,303 --> 00:05:46,638 -ఇంకా లేదు. -సరే, సరే. 146 00:05:46,722 --> 00:05:50,184 మేయర్ లీడ్స్, మన మధ్య పరిచయం పెంచుకోవడానికి ఎట్టకేలకు మిమ్మల్ని ఇలా కలవడం చాలా బాగుంది. 147 00:05:50,267 --> 00:05:52,144 నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. ఇక్కడి నుండి భలే వ్యూ కనిపిస్తోందే. 148 00:05:52,227 --> 00:05:55,397 ఓరి దేవుడా! మీకు కూడా వ్యూస్ నచ్చుతాయా? మనిద్దరి ఇష్టాలు ఒక్కటే. 149 00:05:55,480 --> 00:05:58,859 మిస్ బ్రాండన్హామ్, మీ విశాల హృదయం గురించి తెలియంది కాదు. కానీ నేను వీటిని స్వీకరించలేను. 150 00:05:58,942 --> 00:06:01,695 ఆలివ్, మిస్ బ్రాండన్హామ్ ఇప్పుడు చాలా ముఖ్యమైన... 151 00:06:01,778 --> 00:06:04,740 ఏమంటున్నావు! పేదవారు ఎప్పుడు వచ్చినా ఆదరిస్తాను. 152 00:06:04,823 --> 00:06:07,492 ఈ పళ్ల వల్ల మా కుటుంబానికి ఒక నెల పాటు తిండికి ఏ లోటూ ఉండదు. థ్యాంక్యూ. 153 00:06:07,576 --> 00:06:09,953 అది చాలా మంచి విషయం, కానీ ఆవిడ పళ్ళనే కాకుండా మిగతావి కూడా తినాలి కదా, ఏమంటారు? 154 00:06:10,037 --> 00:06:11,288 మిస్ బ్రాండన్హామ్, మీకు టీ తెచ్చాను. 155 00:06:11,371 --> 00:06:14,291 నా భార్య కోసం ఆసుపత్రి ఖర్చులను భరించినందుకు ధన్యవాదాలు. 156 00:06:14,374 --> 00:06:15,959 డెలివరీ బాగా జరిగిందా? 157 00:06:16,043 --> 00:06:19,546 మాకు ముగ్గురు కవలలు పుట్టారు. వాళ్ళకి బిట్సీ, బ్రాండెన్ ఇంకా హామ్ అని మీ పేరే పెడుతున్నాం. 158 00:06:20,047 --> 00:06:22,925 నాకు పిల్లలంటే ప్రాణం, వాళ్లని చూస్తేనే నాలో ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. 159 00:06:23,008 --> 00:06:24,009 మనం ఏం మాట్లాడుకుంటున్నాం? 160 00:06:24,092 --> 00:06:26,220 మనం తర్వాత మాట్లాడుకుంటే మంచిదేమో. మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. 161 00:06:26,303 --> 00:06:28,013 అదేం లేదు. బీజీయా పాడా! 162 00:06:28,096 --> 00:06:30,349 మిస్ బ్రాండన్హామ్, మీరు దానంగా ఇవ్వాలనుకుంటున్న టవళ్లు ఇవిగోండి... 163 00:06:30,432 --> 00:06:32,059 -ఇక్కడి నుండి వెళ్లిపో! -సారీ, మిస్ బ్రాండన్హామ్. 164 00:06:32,893 --> 00:06:34,770 వావ్, చాలా... చాలా టవల్స్ ఉన్నాయే. 165 00:06:34,853 --> 00:06:37,564 అదే కదా? ఇదేమైనా పబ్లిక్ స్విమ్మింగ్ పూలా ఏంటి? 166 00:06:37,648 --> 00:06:39,691 అంటే, మీరు ఇన్ని ఉతుకున్నారంటే అది మామూలు విషయం కాదు. 167 00:06:39,775 --> 00:06:40,901 మీరు ఉతకడానికి రీసైకిల్డ్ నీటిని వాడతారా? 168 00:06:40,984 --> 00:06:43,654 మేము ఇంకా కుళాయి నీటినే వాడుతున్నాం అనుకుంటా. 169 00:06:43,737 --> 00:06:45,322 ఏమనుకోకండి, నాకు లాండ్రీ అంటే పిచ్చి. 170 00:06:45,405 --> 00:06:47,407 చిన్నప్పుడు నేను క్వీన్స్ లో ఉండగా, మాకు ఒక లాండ్రీ షాప్ ఉండేది. 171 00:06:48,367 --> 00:06:49,368 చాలా ఆసక్తికరమైన విషయం. 172 00:06:49,451 --> 00:06:51,662 హేయ్, కుదిరితే మీ లాండ్రీ గదిని నాకు చూపించగలరా? 173 00:06:51,745 --> 00:06:52,746 దాన్ని చూడాలని చాలా ఆత్రంగా ఉంది. 174 00:06:52,829 --> 00:06:54,831 -మీరు... నిజంగానే అంటున్నారా? -నిజంగానే అంటున్నాడు. 175 00:06:54,915 --> 00:06:58,210 అది నా భాగ్యం. నాకు లాండీ గురించి మొత్తం తెలుసు. 176 00:06:58,293 --> 00:07:00,254 -మీరు "లాండీ" అన్నారా? -నాకు "లాండీ" అనే అనిపించింది. 177 00:07:00,337 --> 00:07:01,713 నా పాత్ర చేసే పని ఇదే. 178 00:07:01,797 --> 00:07:03,298 "రెండవ కస్టమర్, చీజీ పన్నీర్ శాండ్విచ్ ని 179 00:07:03,382 --> 00:07:06,510 తింటుంది, అదే సమయంలో ఆమె ముఖంపై చిరునవ్వు పూస్తుంది" 180 00:07:06,593 --> 00:07:08,971 నువ్వు కొరకడం, నవ్వడం ఒకేసారి చేయాలా? 181 00:07:09,054 --> 00:07:10,138 ఏబీకి ఇది వెన్నెతో పెట్టిన విద్య. 182 00:07:10,222 --> 00:07:13,100 మన ఆహారాన్ని తింటున్నప్పుడు తన ముఖంపై ఆనందం కొట్టొచ్చినట్టు కనబడుతుంది, అది నాకేం పర్లేదనుకో. 183 00:07:13,183 --> 00:07:15,352 అబ్బా, ఏమో మరి. ఒకేసారి కొరకడమూ, నవ్వడమా? 184 00:07:15,435 --> 00:07:18,689 అది నటనకు ఒక పెద్ద సవాలులా అనిపిస్తోంది, అంటే మల్ల యుద్ధంలా, 185 00:07:18,772 --> 00:07:20,816 ముప్పై ఒకటి ఏళ్లొచ్చినా టీనేజర్ లా నటించడంలా. 186 00:07:20,899 --> 00:07:23,318 చూద్దాం మరి. టీనేజర్ గా కాకుండా కొరికి నములు. 187 00:07:23,402 --> 00:07:24,403 సరే, సిద్దమేనా? 188 00:07:26,947 --> 00:07:28,949 -సరే. -అంటే బాగా చేశానని "సరే"నా? 189 00:07:29,032 --> 00:07:30,868 -మళ్లీ ప్రయత్నించి చూడు. -కానీ ఇంకాస్త బాగా చేయ్. 190 00:07:32,119 --> 00:07:33,954 అది వింతగా అనిపించింది. చాలా వింతగా అనిపించింది. 191 00:07:34,037 --> 00:07:36,206 ఒకటి చెప్పనా? నీ దగ్గర నిజమైన శాండ్విచ్ లేదు కనుక నీకు అలా అనిపిస్తోంది. 192 00:07:36,290 --> 00:07:40,210 -నేను కొన్ని శాండ్విచులని ఆర్డర్ చేస్తా మరి. -శాండ్విచులు, నటనా? ఇవాళ నక్క తోక తొక్కా. 193 00:07:40,294 --> 00:07:43,797 బ్రెండన్ బ్రాండన్హామ్, ఇప్పటిదాకా ఎవరూ చేయని ఒక ట్రిక్కును ఇప్పుడు చేయబోతున్నాడు. 194 00:07:43,881 --> 00:07:46,383 అత్యంత అరుదైన అక్కుం బక్కుం ట్రిక్. 195 00:07:47,134 --> 00:07:48,260 అదరగొట్టేశాడు! 196 00:07:48,343 --> 00:07:49,720 పదికి పది పాయింట్లు పడ్డట్టే! 197 00:07:49,803 --> 00:07:51,597 ఒక్క నిమిషం, ఇప్పుడు బరిలోకి మోలీ టిల్లర్మన్ వచ్చింది. 198 00:07:51,680 --> 00:07:53,765 తను నేననుకుంటున్న ట్రిక్కే చేయబోతుందా? 199 00:07:53,849 --> 00:07:58,020 టిక్కుం టిక్కుం ట్రియ్యుం ట్రియ్యుం ట్రిక్. 200 00:07:58,770 --> 00:07:59,980 ఇరగదీసేసింది! 201 00:08:00,063 --> 00:08:03,483 జడ్జిలు వాళ్ల స్కోరును నిర్ణయించారు, ఇక తనకి వచ్చిన స్కోర్ ఎంతంటే... 202 00:08:03,567 --> 00:08:05,402 -ఎనిమిది. -థ్యాంక్యూ, థ్యాంక్యూ... 203 00:08:05,485 --> 00:08:06,778 ఒక్క నిమిషం, నువ్వు ఎనిమిది అన్నావా? 204 00:08:06,862 --> 00:08:08,530 అవును. నీకు ఎనిమిది పాయింట్లు. అది మంచి స్కోరే. 205 00:08:08,614 --> 00:08:10,866 అవునా? అంటే, మనిద్దరం ఎప్పుడూ పదికి పదికి ఇచ్చుకుంటాం కదా. 206 00:08:10,949 --> 00:08:14,244 అవును, కానీ చివర్లో కాస్తంత షేక్ అయ్యావు... అందుకే ఎనిమిది అని అన్నాను. 207 00:08:14,328 --> 00:08:15,787 ఎనిమిది అనడం ఆపు. షేక్ అయ్యానని నాకు తెలుసు. 208 00:08:15,871 --> 00:08:17,915 నువ్వు షేక్ అవ్వవా ఏంటి! ఏదో సరదాగా ఆడుకుంటున్నాం అనుకున్నా. 209 00:08:17,998 --> 00:08:19,333 సరే, సరదాగానే ఆడుకుందాం మరి. 210 00:08:19,416 --> 00:08:20,792 -సరే. ఇంకో విన్యాసం చేస్తా చూడు. -అలాగే. 211 00:08:20,876 --> 00:08:23,462 దీని పేరు గుంజిళ్ల పేదరాశి పెద్దమ్మ. 212 00:08:23,545 --> 00:08:24,838 -ఏడు పాయింట్లు. -కామెడీ చేస్తున్నావా? 213 00:08:24,922 --> 00:08:26,632 -ఏంటి? -ఏడేంటి? ఎందుకు తేడాగా ప్రవర్తిస్తున్నావు? 214 00:08:26,715 --> 00:08:29,009 నేనేం తేడాగా ప్రవర్తించట్లేదు, సరదాగా, నిజాయితీగా ఉన్నానంతే. 215 00:08:29,092 --> 00:08:31,386 నీ విన్యాసంలో రిథమ్ లేదు, అంతే. 216 00:08:31,470 --> 00:08:33,179 "రిథమా?" ఓరి నాయనోయ్. 217 00:08:33,263 --> 00:08:36,058 సరే, ఇప్పుడు మనం నిజాయితీగా ఉంటున్నాం కాబట్టి, నువ్వు నాకేం కావాలో అడగకుండా 218 00:08:36,140 --> 00:08:38,268 వేడి వేడి కాఫీ ఆర్డర్ ఇచ్చావు కదా, అది నాకు నచ్చలేదు. 219 00:08:38,352 --> 00:08:40,145 -మరి నువ్వు ఏం కావాలనుకున్నావు? -నాకు వేడి వేడి కాఫీయే కావాలి, 220 00:08:40,229 --> 00:08:41,438 కానీ నాకు పాప్ కార్న్ తినాలని లేదు. 221 00:08:41,522 --> 00:08:42,940 -ఎందుకు? -ఎందుకంటే అవి దరిద్రంగా ఉంటాయి. 222 00:08:43,649 --> 00:08:44,900 సరే, నీ మాటలు నన్ను బాధపెడుతున్నాయి. 223 00:08:44,983 --> 00:08:47,986 ఎవరిని? పాప్ కార్న్ నా? మరి నువ్వు నాలో రిథమ్ లేదన్నావుగా. 224 00:08:48,070 --> 00:08:50,906 -అరుస్తున్నావా? -లేదు, నా అభిప్రాయాలను గట్టిగా చెప్తున్నా. 225 00:08:50,989 --> 00:08:53,075 నాకు బ్రేక్ కావాలి. నేను వెళ్లి వేడి వేడి కాఫీ తెచ్చుకుంటా. 226 00:08:53,158 --> 00:08:55,452 -ఇప్పుడే ఒకటి తాగావు కదా! -ఇంకోటి తాగుతా. 227 00:08:55,536 --> 00:08:56,703 పాప్ కార్న్ తో. 228 00:08:57,496 --> 00:09:01,416 ఇదే మా టవళ్లు, దుప్పట్లను మేము ఉతికే చోటు. 229 00:09:02,000 --> 00:09:04,628 ఇది నేను ఊహించినదాని కన్నా చాలా బాగుంది. కలో నిజోమో అర్థం కావట్లేదు. 230 00:09:04,711 --> 00:09:08,757 నేను అదృష్టవంతురాలిని. ఓ విధంగా చెప్పాలంటే, నేను ఇక్కడే ఉంటా. వీళ్లందరూ నా కుటుంబ సభ్యులు. 231 00:09:08,841 --> 00:09:11,468 -హలో, మిస్ బ్రాండన్హామ్. -హలో... మనిషి. 232 00:09:11,552 --> 00:09:13,846 -నమస్తే, మిస్ బ్రాండన్హామ్. -నీకు కూడా నమస్తే. 233 00:09:14,388 --> 00:09:16,515 -డేబ్. -అవును, డబ్బా. చాలా చండాలమైన పేరు. 234 00:09:16,598 --> 00:09:19,017 నీళ్లు, బట్టలు, బుడగలు కలిసి పాడుతున్నట్టుగా ఉంది. 235 00:09:19,101 --> 00:09:21,186 ఇది మీకు చెప్పాల్సిన పని లేదనుకోండి. మీకు లాండ్రీ అంటే చాలా ఇష్టం కదా. 236 00:09:21,270 --> 00:09:22,855 అవునవును. కానీ మీరు చెప్పండి. 237 00:09:22,938 --> 00:09:25,148 అంటే, ఈ ప్రక్రియ గురించి నాకు చాలా బాగా తెలుసు, 238 00:09:25,232 --> 00:09:27,442 కానీ ఇక్కడున్న చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. 239 00:09:29,027 --> 00:09:30,028 అది... 240 00:09:30,112 --> 00:09:32,948 -ఉతకడం ఆరపెట్టడం -ఈ చోటు చాలా బాగుంది. 241 00:09:33,031 --> 00:09:36,201 -మరకలకు సబ్బు మందు, ఆ తర్వాత ఇస్త్రీ -ఇదొక మాయా ప్రదేశం. 242 00:09:36,285 --> 00:09:38,912 -పని అయ్యాక వాటిని పంపించేస్తాం -ఇదంతా ఎలా పని చేస్తుంది? 243 00:09:38,996 --> 00:09:41,248 -ఆ తర్వాత ఇంకా చాలా వస్తాయి -అతనికి చెప్పు, హెలెన్. 244 00:09:41,331 --> 00:09:44,084 బకెట్ నుండి దుప్పట్లను తీసి గట్టిగా విదిలించి, మెషిన్ లో పెడతాం 245 00:09:44,585 --> 00:09:46,253 పౌడర్ వేసి, బటన్ నొక్కేస్తాం 246 00:09:46,336 --> 00:09:48,005 -ఆ తర్వాత అవి గిరగిరా తిరుగుతాయి -సరే. 247 00:09:48,088 --> 00:09:50,507 ఆ తర్వాత వాటిని బయటకు తీసి హీటర్ లో పెడతాం 248 00:09:50,591 --> 00:09:53,594 అది ఒక భారీ మెకానికల్ ఆటోమేటిక్ మెషిన్ 249 00:09:53,677 --> 00:09:56,388 అవన్నీ ఇక్కడికి ఎలా వస్తాయో చూద్దాం 250 00:09:56,471 --> 00:09:59,725 పై అంతస్థు నుండి ఈ కింద ఉన్న చోటికి వస్తాయి 251 00:09:59,808 --> 00:10:02,603 ఈ వ్యక్తులు అంతా సక్రమంగా జరిగేలా చూసుకుంటారు 252 00:10:02,686 --> 00:10:05,355 టవల్స్ ని మడత పెట్టి పేర్చి ఈ గుట్టలను శుభ్రమైన గుట్టలుగా మార్చేస్తారు 253 00:10:05,439 --> 00:10:11,361 ఉతకడం ఆరపెట్టడం మరకలకు సబ్బు మందు, ఆ తర్వాత ఇస్త్రీ 254 00:10:11,445 --> 00:10:17,492 పని అయ్యాక వాటిని పంపించేస్తాం ఆ తర్వాత ఇంకా చాలా వస్తాయి 255 00:10:17,576 --> 00:10:20,204 డ్రయ్యర్ నుండి ఇప్పుడే తీశాం ఇక ఇస్త్రీ చేయడమే తరువాయి 256 00:10:20,287 --> 00:10:22,122 -చాలా ఆసక్తికరంగా ఉంది. -ఆ తర్వాత వాటన్నింటినీ 257 00:10:22,206 --> 00:10:24,041 -ఈ తిరిగే యంత్రంలో పెట్టేస్తారు -భలే సరదాగా ఉంది. 258 00:10:24,124 --> 00:10:26,585 అవి అవతలి వైపు నుండి వచ్చాక వాటిని మడత పెట్టేస్తారు 259 00:10:26,668 --> 00:10:29,630 -ఇక బారుకు వెళ్లి ఓ డ్రింక్ తాగుదామా? -ఎంత అందమైన చోటు ఇది 260 00:10:29,713 --> 00:10:32,549 అవి ఇక్కడకు రావడం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది 261 00:10:32,633 --> 00:10:35,511 పై అంతస్థు నుండి ఈ కింద ఉన్న చోటికి వస్తాయి 262 00:10:35,594 --> 00:10:38,514 ఈ వ్యక్తులు అంతా సక్రమంగా జరిగేలా చూసుకుంటారు 263 00:10:38,597 --> 00:10:39,973 టవల్స్ ని మడత పెట్టి పేర్చుతారు 264 00:10:40,057 --> 00:10:41,266 ఒక్క నిమిషం, ఏంటది? 265 00:10:41,350 --> 00:10:44,728 అది మరకల సెక్షన్ అది మరకల కోసం ప్రత్యేకమైన స్టేషన్ 266 00:10:44,811 --> 00:10:47,397 దుప్పట్లో మరకలు ఏవైనా ఉంటే వాటన్నింటినీ తుడిచేస్తారు 267 00:10:47,481 --> 00:10:50,567 దిండు మీద కెచప్ కర్టెన్ల మీద లిప్ స్టిక్ 268 00:10:50,651 --> 00:10:53,403 మరకలన్నీ పోయేదాకా రుద్దుడే రుద్దుడు 269 00:10:53,487 --> 00:10:54,488 అది మరకల సెక్షన్ 270 00:10:54,571 --> 00:10:56,698 -అది మరకల కోసం ప్రత్యేకమైన స్టేషన్ -ఏం జరుగుతోంది? 271 00:10:56,782 --> 00:10:59,451 దుప్పట్లో మరకలు ఏవైనా ఉంటే వాటన్నింటినీ తుడిచేస్తారు 272 00:10:59,535 --> 00:11:02,746 దిండు మీద కెచప్ కర్టెన్ల మీద లిప్ స్టిక్ 273 00:11:02,829 --> 00:11:06,041 మరకలన్నీ పోయేదాకా రుద్దుడే రుద్దుడు 274 00:11:06,124 --> 00:11:07,292 నాకు ఈ చోటు చాలా బాగా నచ్చింది! 275 00:11:07,376 --> 00:11:08,794 వీడు భలే తేడాగా ఉన్నాడు. 276 00:11:08,877 --> 00:11:14,341 ఉతకడం ఆరపెట్టడం మరకలకు సబ్బు మందు, ఆ తర్వాత ఇస్త్రీ 277 00:11:14,424 --> 00:11:20,347 పని అయ్యాక వాటిని పంపించేస్తాం ఆ తర్వాత ఇంకా చాలా వస్తాయి 278 00:11:21,723 --> 00:11:22,975 అబ్బా, రోజంతా ఇక్కడే ఉండాలని నాకు చాలా ఇదిగా ఉంది. 279 00:11:23,058 --> 00:11:24,768 మీరు ఎంత సేపు కావాలంటే, అంత సేపు ఉండవచ్చు. 280 00:11:24,852 --> 00:11:27,855 నిజానికి, నేను మీతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాల గురించి మాట్లాడుకుందామనుకుంటున్నా, దానికి... 281 00:11:27,938 --> 00:11:29,857 -ఈ చోటు అయితే బాగుంటుంది కదా? -నేను బార్ అనబోతున్నా, కానీ... 282 00:11:29,940 --> 00:11:31,650 చేతులు మడిచి, బట్టలను ఉతికి పారేద్దాం. 283 00:11:31,733 --> 00:11:32,734 -లేదు. -సరే అని అనండి. 284 00:11:32,818 --> 00:11:34,027 అంటే స... లేదు. 285 00:11:34,111 --> 00:11:35,112 సరే అని అనండి. 286 00:11:35,195 --> 00:11:36,363 స... లేదు. 287 00:11:36,446 --> 00:11:37,739 తను ఓకే అంటోంది. అది చాలా మంచి విషయం. 288 00:11:37,823 --> 00:11:39,491 ఇక మీ ఇద్దరికీ కొన్ని మురికిపట్టిన దుప్పట్లు తెచ్చిస్తాను. 289 00:11:39,575 --> 00:11:40,576 అయితే, ఈ లోపు... 290 00:11:40,659 --> 00:11:42,160 ఈలోపు, రింక్ లో... 291 00:11:42,244 --> 00:11:44,538 ఇక్కడ నీకేం పని? వెళ్లిపో! దొబ్బేయ్! 292 00:11:45,163 --> 00:11:46,331 హమ్మయ్య, ఇది బాగుంది. అబ్బా. 293 00:11:46,415 --> 00:11:48,000 మోల్స్, నువ్వు డేట్ కి వచ్చావనుకున్నానే? 294 00:11:48,083 --> 00:11:49,960 బ్రెండన్ కి, నాకు మధ్య గొడవ అయింది. మా మొదటి గొడవ. 295 00:11:50,627 --> 00:11:51,962 సూపర్! అదే, సారీ అని అంటున్నా. 296 00:11:52,045 --> 00:11:53,964 -ఏం జరిగింది? -అదే కదా నాకు కూడా అర్థం కాని విషయం. 297 00:11:54,047 --> 00:11:56,800 బాగా సరదాగా ఆడుకుంటున్నామా, ఇంతలో ఏమైందో కానీ ఒకరి మీద ఒకరం అరుచుకున్నాం. 298 00:11:57,509 --> 00:11:59,469 మీ మధ్య గొడవలు దూరం చేయడంలో మేం సాయపడతాం. 299 00:11:59,553 --> 00:12:02,723 నీ లవ్ డిటెక్టివ్స్ లా అనుకో. ఈ సంగతి మాకు వదిలేయ్. 300 00:12:02,806 --> 00:12:05,392 పోనీ, బ్రెండన్ కి ఒక్కటి ఇవ్వనా, నా మిత్రురాలైన నీకు కష్టం కలిగించినందుకు. 301 00:12:05,475 --> 00:12:06,476 థ్యాంక్స్, మిత్రులారా. 302 00:12:06,560 --> 00:12:08,562 ఏబీ, నీకు సీన్ కి కావలసిన అసలైన శాండ్విచ్ వచ్చేసింది, ఇది చికెన్ శాండ్విచ్. 303 00:12:09,146 --> 00:12:10,355 ఉత్తినే అన్నా, ఇది పన్నీర్ శాండ్విచ్. 304 00:12:10,439 --> 00:12:13,317 సరే, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు మనం అసలైన నటనని చూడబోతున్నాం. 305 00:12:13,817 --> 00:12:15,152 శాండ్విచ్ తో పాటు కెచప్స్ ఏమైనా ఇచ్చారా? 306 00:12:15,235 --> 00:12:16,486 -హా, ఇచ్చారు. -కానివ్వు, ఏబ్స్. 307 00:12:16,570 --> 00:12:17,738 కొరికి, నవ్వి నీ నటనా ప్రావిణ్యం చూపెట్టు. 308 00:12:17,821 --> 00:12:18,822 మొదలుపెడుతున్నా, 309 00:12:20,073 --> 00:12:22,159 తను నవ్వుతోందా? తను నవ్వాలి కదా. 310 00:12:22,242 --> 00:12:24,161 నవ్వుతున్నా. నేను నవ్వుతున్నాగా. 311 00:12:24,244 --> 00:12:25,245 ఇంకోసారి కొరికి ప్రయత్నించు. 312 00:12:25,329 --> 00:12:27,623 పిన్నీ, నేను ఇలా చెప్తున్నా కానీ, నిన్ను నొప్పించాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు. 313 00:12:27,706 --> 00:12:29,750 బట్టెలేవీ లేకుండా ముళ్లపంది మీద కూర్చున్నట్టు ఉంది నీ మొహం. 314 00:12:29,833 --> 00:12:32,377 కరుకైన పోలికే. కానీ, అంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు. 315 00:12:32,461 --> 00:12:33,545 పర్వాలేదులే. ఏమున్నా చెప్పేయండి. 316 00:12:33,629 --> 00:12:34,630 నువ్వలా అన్నందుకు సంతోషం, 317 00:12:34,713 --> 00:12:36,840 ఎందుకంటే, నీ మెడని నువ్వు కొంగలాగా వింతగా పెడుతున్నావు. 318 00:12:36,924 --> 00:12:39,009 -అవును. -అది కాస్త తగ్గిస్తే సరిపోతుంది. 319 00:12:39,092 --> 00:12:40,219 సరే, సరే, అలా పెట్టనులే. 320 00:12:40,302 --> 00:12:42,888 దీన్ని పరిష్కరించడానికి ఒక చిన్న నాటిక వేద్దాం. 321 00:12:42,971 --> 00:12:45,766 -నేను బ్రెండన్ గా ఉంటా. షానా, నువ్వు మోలీగా ఉండు. -నేనే మోలీగా ఉంటా కదా. 322 00:12:45,849 --> 00:12:46,850 సరే, నువ్వే మోలీగా ఉండు. 323 00:12:46,934 --> 00:12:48,727 హలో, బేబీ. థ్యాంక్స్ గివింగ్ కి మా కుటుంబానికి చెందిన 324 00:12:48,810 --> 00:12:50,312 -ప్రైవేట్ ఐల్యాండ్ కి వస్తావా? -ఏంటి? 325 00:12:50,395 --> 00:12:52,814 వస్తావో, లేదో త్వరగా చెప్పేయ్, బేబీ. మా అమ్మ వడ్డించడం త్వరగా మొదలుపెట్టేస్తుంది. 326 00:12:52,898 --> 00:12:54,691 -ఐల్యాండ్ లో కంచాలు దొరకడం కష్టం. -హేజల్. 327 00:12:54,775 --> 00:12:57,694 సారీ, నాకు డబ్బున బాయ్ ఫ్రెండ్ ఉంటే తెలిసేదేమో. ఆ మాటకొస్తే, అసలు నాకు బాయ్ ఫ్రెండే లేడు. 328 00:12:57,778 --> 00:13:01,156 -నేను ప్రయత్నిస్తాను. హేయ్, మోల్స్. -సరే. హేయ్, బ్రెండన్. 329 00:13:01,240 --> 00:13:03,408 నేను అంత కటువుగా ప్రవర్తించినందుకు సారీ. 330 00:13:03,492 --> 00:13:05,202 పర్వాలేదులే కానీ, ఎందుకలా తేడాగా ప్రవర్తించావు? 331 00:13:05,953 --> 00:13:09,248 ఎందుకంటే, నేను సరైన పురుషులను ఆదర్శంగా తీసుకోలేదు, అదీగాక నా ప్రాయం కూడా అలాంటిదే. 332 00:13:09,331 --> 00:13:10,457 సరే, ఇక ఈ నటనను పక్కకు పెట్టేద్దాం. 333 00:13:10,541 --> 00:13:12,167 సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పు. 334 00:13:12,251 --> 00:13:14,753 ఏదైనా వింతగా జరిగిందా? తనకి కోపం కలిగించేది ఏదైనా? 335 00:13:14,837 --> 00:13:16,421 నిజానికి, అంతా బాగానే సాగుతూ ఉండింది. 336 00:13:16,505 --> 00:13:18,131 నా స్కేటింగ్ షూస్ ని మార్చుకుందామనుకున్నా, 337 00:13:18,215 --> 00:13:20,092 కనుక వాటిని అద్దెకిచ్చే క్యూలో మేము రెండు సార్లు నిలబడాల్సి వచ్చింది. 338 00:13:20,175 --> 00:13:22,094 -అదేమైనా అతనికి చిరాకు తెప్పించి ఉంటుందా? -లేదు. 339 00:13:22,177 --> 00:13:24,972 ఇంకా, నా చేతులను వెచ్చగా ఉంచుకుందామని అతని జేబుల్లో చేతులు పెట్టబోయినప్పుడు అదోలా ప్రవర్తించాడు. 340 00:13:25,055 --> 00:13:26,515 అదేమైనా అతనికి ఎబ్బెట్టుగా అనిపించి ఉంటుందా? 341 00:13:26,598 --> 00:13:28,225 వాడితో ప్రేమగా ఉండకపోతే ఇంకెవరితో ఉంటావు! 342 00:13:28,308 --> 00:13:30,185 లేదా మీరు ఇక్కడికి రావడం అతనికి నచ్చలేదేమో, 343 00:13:30,269 --> 00:13:31,937 ఎందుకంటే, ఇవాళ మేమిద్దరం మాత్రమే సరదాగా గడపాలనుకున్నాం. 344 00:13:32,020 --> 00:13:33,981 -లేదు, అది అయ్యుండదు. -అవును, మేము చాలా మంచి వాళ్లం. 345 00:13:34,773 --> 00:13:35,816 నాకు అస్సలు అర్థమవ్వట్లేదు. 346 00:13:35,899 --> 00:13:38,527 అతని సమస్య ఏంటో అర్థమే అవ్వట్లేదు, ఇంకా కపుల్ స్కేటింగ్ కి ఎంతో సమయం లేదు. 347 00:13:38,610 --> 00:13:41,405 మేము పనికిరాని లవ్ డిటెక్టివ్స్ అయినందుకు సారీ, కానీ నువ్వేం చేయాలో నాకు బాగా తెలుసు. 348 00:13:41,488 --> 00:13:42,489 బ్రెండన్ తో తెగతెంపులు చేసుకోవాలా? 349 00:13:42,573 --> 00:13:44,741 నీకు మేము ఉన్నాం, పాపా. నీకు వాడిని తలదన్నేవాడు దక్కుతాడు. 350 00:13:44,825 --> 00:13:48,537 లేదు, తను స్కేటింగ్ చేసి దాన్ని మర్చిపోవాలి. మనం స్కేటింగ్ రింక్ లోనే ఉన్నాం కదా. పదండి పోదాం. 351 00:13:48,620 --> 00:13:50,831 నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. బ్రెండన్ కంటే తోపు ఎవడూ లేడు. 352 00:13:50,914 --> 00:13:53,166 సరే, ఏమీ ఆలోచించకు. కొరికి, నవ్వేయ్, అంతే. 353 00:13:53,250 --> 00:13:55,210 ఇది అనుకున్న విధంగా వచ్చేదాకా మనం ఎక్కడికీ వెళ్లేది లేదు. 354 00:13:55,294 --> 00:13:56,461 చాలా తక్కువ కొరికినట్టు అనిపించింది. 355 00:13:56,545 --> 00:13:57,379 చాలా పెద్దది కొరికావు. 356 00:13:57,462 --> 00:13:58,463 ఏడుస్తున్నట్టు ఉంది. 357 00:13:58,547 --> 00:14:00,507 -కంగారుగా ఉన్నట్టుంది. -కడుపులో తేడాగా ఉన్నట్టుంది. 358 00:14:00,591 --> 00:14:01,842 నిజంగానే తేడాగా ఉందా? 359 00:14:01,925 --> 00:14:04,178 -పన్నీర్ లా ఉండు. -నీ వేలును కొరుక్కున్నావా ఏంటి! 360 00:14:04,261 --> 00:14:05,554 అవును. అయ్యో. 361 00:14:05,637 --> 00:14:06,972 -ఏడుస్తున్నావా? -కొద్దిగ. 362 00:14:07,723 --> 00:14:09,099 ఇలా ఎన్టీఆర్ కూడా చేయలేడు. 363 00:14:09,183 --> 00:14:10,184 -ఒప్పుకోను. -ఆయన ఏదైనా చేయగలడు. 364 00:14:10,267 --> 00:14:11,894 -మాటలు చూసుకో. -నిజమే. నేనేదో పిచ్చిగా వాగేశాను. 365 00:14:11,977 --> 00:14:15,314 -ఈ రోజు నాకు చాలా బాగా నచ్చేసింది. -అవును. ఆనందమనాందమాయే. 366 00:14:15,397 --> 00:14:17,232 బిట్సీ, నాలుగు గంటలకు జరగాల్సిన సమావేశానికి సోన్యా వచ్చేసింది. 367 00:14:17,816 --> 00:14:19,693 -తనకి చెప్పు, నేను మళ్లీ... -హలో, బిట్సీ. 368 00:14:19,776 --> 00:14:21,445 మీరు నన్ను కలవమన్నారట. 369 00:14:21,528 --> 00:14:23,614 -మేయర్ ఎక్కడ ఉన్నాడు? -గదికి ఆ చివరన ఉన్నాడు. 370 00:14:23,697 --> 00:14:24,865 -మీ మాటలు వినబడవులే. -మంచిది. 371 00:14:24,948 --> 00:14:26,950 -నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నా. -ఏంటి? కానీ ఎందుకు? 372 00:14:27,034 --> 00:14:30,454 గత వీకెండ్, నువ్వు ఒక జంటకి ఉచితంగా మంచి గది ఇచ్చావని నాకు ఓ పక్షి చెప్పింది. 373 00:14:30,537 --> 00:14:32,873 అది నిజమేనా? గుర్తుంచుకో, అది నిజమే అని నాకు తెలుసు. 374 00:14:32,956 --> 00:14:35,167 బిట్సీ, నేనెంత పని చేశానో చూడండి. ఈ టవళ్ళని బాగా ఆరబెట్టాను, చూడండి. 375 00:14:35,250 --> 00:14:36,960 వీటి వాసన చూడండి. ముఖాన్ని దగ్గరగా పెట్టి చూడండి. 376 00:14:37,044 --> 00:14:38,754 హా. టవల్ అంటే ఇలా ఉండాలి. 377 00:14:38,837 --> 00:14:40,506 మాకు ఒక్క నిమిషం ఇస్తారా, మేయర్ లీడ్స్, 378 00:14:40,589 --> 00:14:42,674 నా ఉద్యోగినితో ఓ ముక్క చెప్పే పనుంది. 379 00:14:42,758 --> 00:14:44,885 మిస్ బ్రాండన్హామ్, ఆ రిటైర్డ్ సైనికాధికారి, ఇంకా అతని భార్య కలిసి 380 00:14:44,968 --> 00:14:46,845 తమ యాభై ఏళ్ల వైవాహిక జీవితాన్ని వేడుక చేసుకుంటున్నారు, 381 00:14:46,929 --> 00:14:48,764 అందుకనే వారికి ఉచితంగా మంచి గది ఇచ్చాను. 382 00:14:48,847 --> 00:14:51,058 అది చాలా గొప్ప పని. పెద్దవారిని గౌరవించాలి. 383 00:14:51,141 --> 00:14:53,101 అలాగే, టోల్ ప్లాజాలో పని చేసేవాళ్లని కూడా. వాళ్లది మామూలు డిప్రెషన్ కాదు. 384 00:14:53,185 --> 00:14:55,771 కుదిరినప్పుడల్లా వాళ్లకి టిప్ ఇస్తుంటాను. ఒకవేళ చిల్లర లేకపోతే, బిస్కెట్ ఆయినా ఇస్తుంటా. 385 00:14:55,854 --> 00:14:57,064 అవును, అంతే. 386 00:14:57,147 --> 00:15:01,026 అందుకే నేను కూడా ఈ సోన్యాకి... ప్రమోషన్ ఇస్తున్నాను, 387 00:15:01,109 --> 00:15:02,819 తన... మంచి మనస్సుకు. 388 00:15:02,903 --> 00:15:05,322 -నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు అని చెప్పారే. -లేదు, లేదు. నువ్వు సరిగ్గా వినలేదు. 389 00:15:05,405 --> 00:15:09,159 "షేక్ హ్యాండ్ ఇచ్చుకో, నీకు ప్రమోషన్ ఇస్తున్నా," అని చెప్పాను నేను. 390 00:15:09,243 --> 00:15:11,537 ఒక్క నిమిషం. అది సాస్ మరకనా? దాని సంగతేంటో చూడాలి. 391 00:15:11,620 --> 00:15:12,621 హెలెన్! 392 00:15:12,704 --> 00:15:14,540 హా, అర్థమైంది. నేను వెళ్లి తనని ఉద్యోగంలోంచి తీసేయాలి. 393 00:15:15,123 --> 00:15:17,000 ఇంకా బ్రెండన్ గురించే ఆలోచిస్తున్నావా? లేకపోతే, 394 00:15:17,084 --> 00:15:18,961 మిత్రులతో ఉన్నందుకు ఆనందంగా ఉంది అని సూచించే హావభావమా? 395 00:15:19,461 --> 00:15:20,462 సారీ. అవును. 396 00:15:20,546 --> 00:15:24,925 చెరువులో ఇంకా వేరే చేపలు కూడా ఉంటాయి. బొచ్చ, కొరమీను, మట్ట గిడిసె ఇలా చాలా ఉంటాయి. 397 00:15:25,676 --> 00:15:27,135 జేకబ్ ని చూడు. చాలా అందంగా ఉంటాడు. 398 00:15:27,219 --> 00:15:30,138 అవును, అతని గర్ల్ ఫ్రెండ్ యోంకర్స్ కి వెళ్లిపోయింది, దానితో వాళ్ళ కథ కంచికి వెళ్లిపోయింది. 399 00:15:30,222 --> 00:15:31,765 ఒక్క నిమిషం, నాకు అర్థమైంది. జేకబ్ వల్లనే ఇదంతా. 400 00:15:31,849 --> 00:15:34,726 ఇంతకు ముందు జేకబ్ నన్ను నవ్వించాడు, దానితో బ్రెండన్ కి అతనిపై మండుంటుంది. 401 00:15:34,810 --> 00:15:36,061 స్నాక్స్ అమ్మే చోట 402 00:15:36,144 --> 00:15:38,146 మేము నవ్వుతుండటం చూసి, అతనికి కోపం వచ్చుంటుంది. 403 00:15:38,897 --> 00:15:40,941 వాడిని వదిలేస్తావా? సారీలే. 404 00:15:41,024 --> 00:15:44,611 లేదు, లేదు, నాకు జేకబ్ అంటే ఇష్టం లేదు. విషయం నాకు అర్థమైందని వెళ్లి బ్రెండన్ కి చెప్తాను. 405 00:15:44,695 --> 00:15:47,239 హా, వాడొక జిడ్డుగాడు, ఎందుకంటే వాడు కుళ్లుగాడు కదా. వాడి దగ్గరికే వెళ్లు. 406 00:15:47,322 --> 00:15:49,366 ఇంకొకడితో సరదాగా ఉంటే నీకు మండుతుందా? 407 00:15:49,449 --> 00:15:51,159 -ఏంటి? -నాకు ఎవరు నచ్చితే 408 00:15:51,243 --> 00:15:52,995 వాళ్లతో మాట్లాడతాను, నవ్వుతాను, ఎందుకంటే నేను పెద్దదాన్ని. 409 00:15:53,078 --> 00:15:55,831 అది చిన్నపిల్లల వాదనలా ఉంది, కానీ నేను మంచి పాయింట్ చెప్తున్నా. 410 00:15:55,914 --> 00:15:58,375 -నువ్వేం మాట్లాడుతున్నావు? -నేనేం మాట్లాడుతున్నానో నీకు బాగా తెలుసు. 411 00:15:58,458 --> 00:16:02,004 నీకు జేకబ్ అంటే కుళ్లు. అందుకే పాప్ కార్న్ నీకు పడదు అని తెలిసినా కూడా 412 00:16:02,087 --> 00:16:03,422 వాటిని తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నావు. 413 00:16:03,505 --> 00:16:05,424 నాకు ఇవంటే పడదని ఎవరు చెప్పారు! చూడు. 414 00:16:07,801 --> 00:16:09,553 -నా కడుపు. -సరే, నీకు వాంతి వచ్చేస్తుంది. 415 00:16:09,636 --> 00:16:11,471 ఒక్క నిమిషం, అది నాకు కానుకనా? 416 00:16:11,555 --> 00:16:12,556 మోలీకి బ్రెండన్ 417 00:16:12,639 --> 00:16:14,016 ఇది నాకోసం తెచ్చావా? బ్రెండన్, నేను... 418 00:16:14,099 --> 00:16:16,143 ఇది ఈ స్కేటింగ్ సీజన్లోని ఆఖరి వీకెండ్, 419 00:16:16,226 --> 00:16:20,647 కాబట్టి కపుల్స్ స్కేటింగ్ ఉంటుంది కనుక మీ మనస్సును దోచుకొన్న వ్యక్తితో కలిసి పాల్గొనండి. 420 00:16:20,731 --> 00:16:21,940 వీడు ఇలా చేశాడంటే నమ్మకలేకపోతున్నా. 421 00:16:22,024 --> 00:16:24,484 ఏమైపోయాడు? నిజంగానే చెక్కేశాడా? 422 00:16:24,985 --> 00:16:27,487 మీ ఆతిథ్యానికి, ఈ ఎలాస్టిక్ దుప్పటికి మీకు థ్యాంక్స్. 423 00:16:27,571 --> 00:16:30,365 ఈ హోటల్ చాలా అద్భుతంగా ఉంది. ఆ షాండిలియర్ ఎంత బాగా ఉందో చూడండి. 424 00:16:30,449 --> 00:16:32,784 అవును. దాన్ని నేనే స్వయంగా కొన్నాను. 425 00:16:32,868 --> 00:16:34,244 అది 150 ఏళ్ల క్రిందటిది. 426 00:16:34,328 --> 00:16:36,413 నువ్వే 150 ఏళ్ల ముసలమ్మవి. మూసుకొని ఉండు. 427 00:16:36,496 --> 00:16:39,583 ఏదేమైనా, మన ఈ స్నేహాన్ని కొనసాగించగలమని నేను ఆశిస్తున్నాను. 428 00:16:39,666 --> 00:16:41,543 మన పార్క్ విషయంలో బిట్సీకి పెద్ద పెద్ద ప్లాన్సే ఉన్నాయని 429 00:16:41,627 --> 00:16:42,878 మీకు మొదట్లో చెప్పాను కదా? 430 00:16:42,961 --> 00:16:44,129 మళ్లీ చెప్తున్నా, అవి తను అన్న మాటలే. 431 00:16:44,213 --> 00:16:45,464 ఆ ప్లాన్స్ తను బయటపెట్టబోతోంది చూడండి. 432 00:16:45,547 --> 00:16:47,883 -నాకు మీరు నచ్చారు, లీడ్స్. -నాకు కూడా మీరు నచ్చారు. 433 00:16:47,966 --> 00:16:51,011 కానీ మీరు కేవలం తాత్కాలిక మేయర్ గా మాత్రమే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. 434 00:16:51,094 --> 00:16:52,763 నాకు పెళ్లయి పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నాను. 435 00:16:52,846 --> 00:16:55,182 ఓరి నాయనోయ్. మీకంత సీన్ లేదులే. నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నా. 436 00:16:55,265 --> 00:16:59,269 నేను మిమ్మల్ని తొక్కలో తాత్కాలిక మేయర్ గా కాకుండా నిజమైన మేయర్ లా చూడాలనుకుంటున్నా. 437 00:16:59,353 --> 00:17:00,938 నేను మీ శ్రేయోభిలాషిగా ఉండాలనుకుంటున్నా. 438 00:17:01,480 --> 00:17:03,273 ప్రయోజనాలను అందించే శ్రేయోభిలాషిగా. 439 00:17:03,357 --> 00:17:05,025 నేను మీకు మంచిగా డబ్బులు ఇస్తా, 440 00:17:05,108 --> 00:17:08,362 మీరు నాకు నచ్చిన వాటి విషయంలో నాకు కాస్త సాయం చేయాలి. 441 00:17:08,444 --> 00:17:10,989 -అంటే ఎలాంటి వాటి విషయంలో? -సెంట్రల్ పార్క్, ఇంకేముంటుంది! 442 00:17:11,073 --> 00:17:12,574 నాకు అది అంటే చాలా ఇష్టం. 443 00:17:12,657 --> 00:17:16,453 పురుగులు, గడ్డీ, స్ప్రింక్లర్స్. అబ్బా, ఎంతా బాగుంటుందో! 444 00:17:16,537 --> 00:17:18,829 మీరు సమయానికి భలే మాట చెప్పారు. ఒక కొత్త ప్రచారం విషయంలో 445 00:17:18,914 --> 00:17:20,374 పార్క్ మేనేజర్, ఓవెన్ టిల్లర్మన్ తో కలిసి పని చేస్తున్నా. 446 00:17:20,457 --> 00:17:22,542 బాగా వినండి, దాని పేరు "ఐ లవ్ పార్క్." 447 00:17:22,626 --> 00:17:25,170 అంటే "ఐ లవ్ న్యూయార్క్" లాంటిదే, కాకపోతే ఇది పార్క్. అది సూపర్ ప్రచారం. 448 00:17:26,505 --> 00:17:27,506 అర్థమైంది. 449 00:17:27,589 --> 00:17:30,592 ప్రచారం విషయంలో మీ అంత అభిరుచి, సంపన్న వ్యక్తి అతనికి చాలా చక్కగా ఉపయోగపడగలరు. 450 00:17:30,676 --> 00:17:33,470 అవును, అవును. నాకు ఆ ఐడియా బాగా నచ్చేసింది. 451 00:17:33,554 --> 00:17:35,973 ఆ మేనేజరును ఎలాగైనా ఒప్పించేలా చేయగలిగితే, నాకు అదే చాలు. 452 00:17:36,056 --> 00:17:37,432 అదే... ప్రచారం విషయంలో. 453 00:17:37,516 --> 00:17:40,519 అలాగే, మేము ఏదోకటి ఏర్పాటు చేస్తాములే. ఇది ఇచ్చినందుకు ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నా. 454 00:17:41,854 --> 00:17:43,146 టాటా. 455 00:17:43,230 --> 00:17:45,440 హెలెన్, ఆ దుప్పటి కోసం సిటీ ఆఫీసుకు బిల్ పంపు. 456 00:17:46,650 --> 00:17:50,195 ఎక్కడున్నావురా చిరాకు తెప్పించే తెలివైన రొమాంటిక్ చచ్చినోడా? 457 00:17:52,030 --> 00:17:53,365 మైక్రోఫోన్ ఉందిగా. 458 00:17:53,866 --> 00:17:57,286 హేయ్. హాయ్. నాకు ఒక్క క్షణం ఈ మైక్రోఫోన్ ఇస్తారా? 459 00:17:57,369 --> 00:17:59,496 తమ పిల్లలు తప్పిపోయినప్పుడే మేము ఎవరికైనా మైక్రోఫోన్ ఇస్తాం. 460 00:17:59,580 --> 00:18:01,582 నా పిల్లాడు తప్పిపోయాడు. 461 00:18:01,665 --> 00:18:03,083 అలాగే. గుడ్ లక్. 462 00:18:04,084 --> 00:18:05,169 బ్రెండన్ బ్రాండన్హామ్? 463 00:18:05,252 --> 00:18:07,754 నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావనుకుంటున్నా, నీతో నేను కొంచెం మాట్లాడాలి. 464 00:18:07,838 --> 00:18:12,009 నేను మోలీని. అదే, అమ్మని. అమ్మని, స్వీటీ. 465 00:18:12,092 --> 00:18:14,261 బ్రెండన్. అక్కడ ఉన్నావా! మళ్లీ వచ్చావా? 466 00:18:14,344 --> 00:18:16,930 అక్కడేమైనా దారి ఉందా... లేదా చెట్ల సందుల్లో నుండి వచ్చేశావా? సర్లే. 467 00:18:17,014 --> 00:18:18,473 ఎక్కి వచ్చేయ్. నేను నీతో మాట్లాడాలి. 468 00:18:18,557 --> 00:18:20,142 వెళ్లు. మీ అబ్బాయి దగ్గరికి వెళ్లు. 469 00:18:22,019 --> 00:18:24,062 చాలా మంది నటీనటులు నిజంగా తినరని, ఊరికే అలా కొరికేసి 470 00:18:24,146 --> 00:18:26,815 ఒక బకెట్ లోకి ఉమ్మేస్తారని ఇక్కడ రాసి ఉంది. 471 00:18:26,899 --> 00:18:29,526 ఈ ముక్క రెండు గంటల క్రితమే చెప్పుండవచ్చు కదా, ఇంటర్నెట్? 472 00:18:29,610 --> 00:18:30,736 ఇంకొకటి తిను. నువ్వు చేయగలవు. 473 00:18:30,819 --> 00:18:32,988 నాకు అనుమానమే. మానవ శరీరం ఇంత ఆహారాన్ని తట్టుకోలేదు. 474 00:18:33,739 --> 00:18:35,991 నాకు వేరే దారి లేదు. దీని మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. 475 00:18:39,077 --> 00:18:40,162 -శభాష్. -అదరగొట్టేశావు. 476 00:18:40,245 --> 00:18:41,288 అంతే. సరిగ్గా చేశావు. 477 00:18:42,039 --> 00:18:43,040 నా ఏజెంట్ చేస్తున్నాడు. 478 00:18:43,123 --> 00:18:44,291 హేయ్, హాయ్. 479 00:18:45,459 --> 00:18:46,710 సరే. 480 00:18:47,211 --> 00:18:48,837 పర్వాలేదు. అస్సలు పర్వాలేదు. 481 00:18:49,505 --> 00:18:50,881 సరే, మంచిది. 482 00:18:50,964 --> 00:18:52,299 సరే. బై. 483 00:18:52,382 --> 00:18:53,383 ఆడిషన్ జరగడం లేదు. 484 00:18:53,467 --> 00:18:56,178 రెండవ కస్టమర్ గా చిలకల బాబు అయిన హర్మన్ ని పెట్టుకోవాలని మైలో వాళ్లు నిర్ణయించుకున్నారు. 485 00:18:56,261 --> 00:18:57,971 అయ్యయ్యో, ఏబీ. 486 00:18:58,055 --> 00:18:59,848 మైలో వాళ్లు ఏం కోల్పోతున్నారో వాళ్లకి తెలీదు. 487 00:18:59,932 --> 00:19:02,684 చాలా బాధగా ఉంది, పిన్నీ. ఒక కొంగ శాండ్విచ్ తినడం చూడటం ఇదే మొదటిసారి. 488 00:19:02,768 --> 00:19:04,686 నాకు బాధగా ఏమీ లేదు. 489 00:19:04,770 --> 00:19:06,939 హర్మన్ చాలా గొప్ప నటుడని ఏజెంట్ అంటున్నాడు, 490 00:19:07,022 --> 00:19:09,525 అంటే, హర్మన్ కి సమానమైన పాత్రలే నాకు కూడా ఇవ్వాలనుకుంటున్నారంటే, 491 00:19:09,608 --> 00:19:11,109 నా పురోగతి సరిగ్గానే ఉన్నట్టు కదా. 492 00:19:11,193 --> 00:19:13,111 నువ్వు పాజిటివ్ గా తీసుకున్నందుకు ఆనందంగా ఉంది. 493 00:19:13,195 --> 00:19:14,696 ఇంతకీ డిన్నర్ కి ఏంటి? చికెన్ బిర్యానీ తిందామా? 494 00:19:14,780 --> 00:19:16,406 -బిర్యానీ తెప్పించుకుందాం. -ఇప్పుడే కదా ఇంత తిన్నావు! 495 00:19:19,034 --> 00:19:20,410 -హేయ్. -హేయ్. 496 00:19:20,494 --> 00:19:22,871 నీ జేబులో నా చేతిని ఎందుకు పెట్టవద్దు అన్నావో ఇప్పుడు నాకు తెలిసిపోయింది, 497 00:19:22,955 --> 00:19:24,373 ఎందుకంటే అప్పుడు నీ జేబులో ఈ గిఫ్ట్ ఉండింది. 498 00:19:24,456 --> 00:19:26,583 అంటే, నీ మార్కర్ పెన్లన్నీ టేబుల్ మీద నుండి ఊరికే పడిపోతుంటాయి అన్నావు కదా, 499 00:19:26,667 --> 00:19:28,836 అందుకని ఈ స్క్వేర్ మార్కర్స్ అయితే పడవు కదా అని తీసుకువచ్చాను. 500 00:19:28,919 --> 00:19:30,087 ఇది నిజంగా చాలా బాగుంది. 501 00:19:30,170 --> 00:19:32,422 మోలీ, నాకు ఆ జేకబ్ మీద కుళ్ళు ఏమీ కలగలేదు. 502 00:19:32,506 --> 00:19:34,675 అవునా? మరి ఎందుకు అలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించావు, 503 00:19:34,758 --> 00:19:36,468 మరీ కటువుగా అనిపించి ఉంటే ఫీల్ అవ్వకు. 504 00:19:36,552 --> 00:19:39,346 ఎందుకంటే, నాకు టోర్టిలాన్ అంటే ఏంటో తెలీదు. 505 00:19:39,429 --> 00:19:41,557 ఓరి నాయనోయ్, అందుకని ముఖం మాడ్చుకున్నావా? 506 00:19:41,640 --> 00:19:43,892 అంటే, ఈ వారమంతా పెయింటింగ్ విషయంలో నువ్వు ఆపసోపాలు పడుతున్నావు కదా, 507 00:19:43,976 --> 00:19:45,894 అందుకని నిన్ను కాస్త సంతోషపెడదామనుకున్నా. 508 00:19:45,978 --> 00:19:47,104 అందుకే, నిన్ను ఐస్ స్కేటింగ్ కి తెచ్చా. 509 00:19:47,187 --> 00:19:49,940 కానీ నీకు కావలసినది టోర్టిలాన్, 510 00:19:50,023 --> 00:19:51,900 అది నాకు అస్సలు తట్టనే లేదు. 511 00:19:51,984 --> 00:19:55,195 కాబట్టి, నీకు నేను తగినవాడిని కాదేమో అని ఓ కంగారు మొదలైంది. 512 00:19:55,279 --> 00:19:58,240 -బ్రెండన్ -నాకు కళ అంటే ఏంటో అస్సలు తెలీదు. 513 00:19:58,323 --> 00:20:01,451 అస్సలంటే అస్సలు తెలీదు. నీకు అవన్నీ తెలిసినవాడే దక్కాలి. 514 00:20:01,535 --> 00:20:04,162 నేనేమో ఈ పనికిరాని స్క్వేర్ మార్కర్స్ తెచ్చాను. 515 00:20:04,246 --> 00:20:06,540 -నిజానికి ఇవి చిన్నపిల్లలవి. -ఓరి దేవుడా. 516 00:20:06,623 --> 00:20:08,959 మరేం పర్వాలేదులే. నాకు చాలా నచ్చాయి. 517 00:20:09,042 --> 00:20:10,711 బ్రెండన్, నీకు నిజం చెప్పనా? 518 00:20:10,794 --> 00:20:12,963 తప్పకుండా. కొత్తగా పోయేదేముందిలే. 519 00:20:13,046 --> 00:20:15,382 నీ గాలిపటాల విషయంలో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. 520 00:20:15,465 --> 00:20:17,426 నిజంగా? గాలిపటాలు అందంగా చాలా బాగుంటాయి కదా. 521 00:20:17,509 --> 00:20:18,594 కానీ అది పర్వాలేదు అనుకుంటా. 522 00:20:18,677 --> 00:20:21,930 చివరికి ఎంతైనా, ప్రతీది నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉండదు కదా. 523 00:20:22,014 --> 00:20:24,516 ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం దాని గురించి మాట్లాడుకోవాలి. 524 00:20:24,600 --> 00:20:26,935 మనం తగువులాడుకున్నా, అది మంచికేనేమో. 525 00:20:27,019 --> 00:20:29,688 మన మధ్య ఉండే బంధం చాలా దృఢమైనదని, దాని కోసం ఎంతైనా పోరాడవచ్చని అనడానికి అది సంకేతం. 526 00:20:30,522 --> 00:20:33,901 వాళ్లు మళ్లీ కలిసిపోయారు. ఇప్పుడు సరైన పాట పడాలి. 527 00:20:33,984 --> 00:20:35,444 జరగండి. పక్కకు తప్పుకోండి. 528 00:20:35,527 --> 00:20:38,572 మిత్రులారా, ఇప్పుడు వెనక్కి స్కేటింగ్ చేయాలి. 529 00:20:38,655 --> 00:20:41,491 హేయ్, మీ ఐస్ స్కేటింగ్ డీజే బాస్ అక్కడ ఉంది. 530 00:20:41,575 --> 00:20:43,076 నీతో ఏదో మాట్లాడాలనుకుంటోంది. 531 00:20:43,160 --> 00:20:45,370 నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని నేను చెప్పట్లేదు, ఒట్టేసి చెప్తున్నా. 532 00:20:45,454 --> 00:20:46,788 ఒట్టేస్తే ఓకే. 533 00:20:47,664 --> 00:20:49,708 చెక్, చెక్. మైక్ చెక్. ఒకటి, రెండు. 534 00:20:49,791 --> 00:20:52,544 ఆగు, నువ్వు నేను వెళ్లిపోవాలనే అలా చెప్పావు అనుకుంటా. 535 00:20:52,628 --> 00:20:54,087 యా! 536 00:20:59,426 --> 00:21:05,974 ఇది తేలికైన యవ్వారమని ఎవ్వరూ చెప్పలేదు కానీ పోరాడితే మనం దక్కించుకోగలం 537 00:21:07,434 --> 00:21:14,233 బలహీనంగా, నీరసంగా ఉన్నా కానీ రాత్రి ఆనందంగా గడిపేయగలములే 538 00:21:15,442 --> 00:21:18,737 కింద పడినా పైకి లేవగలం 539 00:21:18,820 --> 00:21:22,574 నీ కనుల్లోని శక్తి నాకు తెలుస్తోంది 540 00:21:22,658 --> 00:21:26,495 మనది అమర ప్రేమ 541 00:21:27,579 --> 00:21:30,874 బేబీ, బేబీ, కంగారు పడకు 542 00:21:30,958 --> 00:21:35,379 మనది అమర ప్రేమ 543 00:21:35,462 --> 00:21:39,132 బేబీ, బేబీ, నిబ్బరంగా ఉండు 544 00:21:39,216 --> 00:21:42,803 మనం కలకాలం కలిసి ఉండాలంటే 545 00:21:42,886 --> 00:21:46,932 ఇంకాస్త బాధని అనుభవించాల్సి ఉంటుంది 546 00:21:47,015 --> 00:21:51,937 మనది అమర ప్రేమ 547 00:21:54,565 --> 00:21:55,941 యా! 548 00:22:01,405 --> 00:22:04,950 చెట్ల సందుల్లో నుండి గాలి వీస్తోంది 549 00:22:05,534 --> 00:22:09,329 చీకట్లను చీల్చుకొని సూర్య కిరణాలు వస్తున్నాయి 550 00:22:09,413 --> 00:22:12,708 స్వర్గానికి నక్షత్రాలు దారి చూపుతున్నాయి 551 00:22:12,791 --> 00:22:16,503 ఈ మాటలకు నేనేం చెప్తున్నానంటే 552 00:22:17,254 --> 00:22:21,175 మన బంధం నిలవాలంటే మనం తగిన ప్రయత్నం చేయాలి 553 00:22:21,258 --> 00:22:24,803 ఎప్పుడూ ఆటపాటలే ఉండవు 554 00:22:24,887 --> 00:22:28,807 మనది అమర ప్రేమ 555 00:22:29,641 --> 00:22:32,728 బేబీ, బేబీ, కంగారు పడకు 556 00:22:32,811 --> 00:22:37,399 మనది అమర ప్రేమ 557 00:22:37,482 --> 00:22:40,736 బేబీ, బేబీ, నిబ్బరంగా ఉండు 558 00:22:41,236 --> 00:22:44,531 మనం కలకాలం కలిసి ఉండాలంటే 559 00:22:45,115 --> 00:22:48,952 ఇంకాస్త బాధని అనుభవించాల్సి ఉంటుంది 560 00:22:49,036 --> 00:22:54,958 మనది అమర ప్రేమ వావ్, ఓహ్ 561 00:22:55,459 --> 00:22:57,586 ఒక్క నిమిషం. మీ ఐస్ స్ఖేటింగ్ డీజే బాస్ ని కలవలేదా? 562 00:22:57,669 --> 00:22:59,671 వాళ్లు కోపంతో ఊగిపోతున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లాలి. 563 00:23:06,887 --> 00:23:10,474 మనది అమర ప్రేమ 564 00:23:14,353 --> 00:23:15,479 అదీ! 565 00:23:15,562 --> 00:23:18,774 మనది అమర ప్రేమ 566 00:23:19,650 --> 00:23:23,070 బేబీ, బేబీ, కంగారు పడకు 567 00:23:23,153 --> 00:23:26,865 కలకాలం కలిసి ఉండాలంటే 568 00:23:26,949 --> 00:23:30,536 ఇంకాస్త బాధని అనుభవించాల్సి ఉంటుంది 569 00:23:31,036 --> 00:23:37,334 మనది అమర ప్రేమ 570 00:23:37,417 --> 00:23:39,336 కథ సుఖాంతమైంది. 571 00:23:39,419 --> 00:23:40,838 నీ గొంతు చాలా బాగుంది 572 00:23:40,921 --> 00:23:42,798 నీ మీద కోపం దూరమైపోయింది. 573 00:23:54,226 --> 00:23:58,313 ఉతకడం ఆరపెట్టడం మరకలకు సబ్బు మందు, ఆ తర్వాత ఇస్త్రీ 574 00:23:58,397 --> 00:24:02,651 పని అయ్యాక వాటిని పంపించేస్తాం ఆ తర్వాత ఇంకా చాలా వస్తాయి 575 00:24:03,485 --> 00:24:04,695 ఏం జరుగుతోంది? 576 00:24:04,778 --> 00:24:07,281 అది ఒక భారీ మెకానికల్ ఆటోమేటిక్ మెషిన్ 577 00:24:07,781 --> 00:24:10,242 అది మరకల కోసం ప్రత్యేకమైన స్టేషన్ మరకలన్నింటినీ రుద్దేస్తున్నారు 578 00:24:10,325 --> 00:24:12,661 ఎందుకంటే దుప్పట్లంతా మరకలే దిండు మీద కెచప్ 579 00:24:12,744 --> 00:24:13,912 కర్టెన్ల మీద లిప్ స్టిక్ 580 00:24:13,996 --> 00:24:16,748 మరకలన్నీ పోయేదాకా రుద్దుడే రుద్దుడు 581 00:24:18,250 --> 00:24:22,254 ఉతకడం ఆరపెట్టడం మరకలకు సబ్బు మందు, ఆ తర్వాత ఇస్త్రీ 582 00:24:22,337 --> 00:24:24,840 పని అయ్యాక వాటిని పంపించేస్తాం... 583 00:24:24,923 --> 00:24:26,925 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్