1 00:00:13,514 --> 00:00:16,058 -పచ్చపచ్చని ఊతప్పాలు ఎవరికి కావాలి? -నాకు కావాలి. 2 00:00:16,140 --> 00:00:17,976 -ఇదుగో. -ఏం పర్లేదు, నేను తినేస్తా. 3 00:00:18,060 --> 00:00:19,811 ఓవెన్, పిల్లలకి ఆహారాన్ని విసిరేయకు. 4 00:00:19,895 --> 00:00:21,980 సారీ. సారీ, ఈ ఉదయం నుండి ఉత్సాహంతో ఉరకలేస్తున్నా. 5 00:00:22,064 --> 00:00:24,525 -నీకు ఉన్న సమావేశం వల్లనా? -అది ఆషామాషీ సమావేశం కాదు. 6 00:00:24,608 --> 00:00:27,361 అది వార్షిక న్యూయార్క్ నగర పార్క్ మేనేజర్ల సమావేశం. 7 00:00:27,444 --> 00:00:29,988 న్యూయార్క్ నగరంలో 1,700కు పైగా పార్కులు ఉన్నాయి. 8 00:00:30,072 --> 00:00:31,073 ఏడాదికి ఒకసారి, 9 00:00:31,156 --> 00:00:33,742 పార్క్ మేనేజర్లు అందరూ ఒక మధ్యస్థ స్థాయి హోటల్ లో సమావేశమవుతారు. 10 00:00:33,825 --> 00:00:38,330 ప్రసంగాలు, స్నేహం, నివాస ప్రాంతాల నుండి పావురాలను దూరంగా ఉంచడం వంటి కథనాలతో ఆ రోజు చక్కగా సాగిపోతుంది. 11 00:00:38,413 --> 00:00:40,165 నీ పాత స్నేహితులను కలుసుకోబోతున్నందుకు ఆనందంగా ఉందా? 12 00:00:40,249 --> 00:00:41,667 అవును! గేనన్, నెడ్, ఇంకా అలాంజో. 13 00:00:41,750 --> 00:00:43,836 మేమందరం చాలా బిజీగా ఉన్నందున ఇన్ని రోజులూ అస్సలు మాట్లాడుకోలేకపోయాం. 14 00:00:43,919 --> 00:00:46,672 కానీ, ఎట్టకేలకు ఈరోజు మేమందరమూ కలుసుకోబోతున్నాం. 15 00:00:46,755 --> 00:00:49,675 గతంలో, గేనన్, నెడ్, అలాంజో, ఇంకా ఓవెన్ 16 00:00:49,758 --> 00:00:52,553 క్వీన్స్ లోని ఫ్లషింగ్ మెడోస్ పార్కులో పని చేశారు, 17 00:00:52,636 --> 00:00:55,264 వాళ్లందరికీ పార్క్ అంటే అప్పటికి కొత్తే. 18 00:00:57,057 --> 00:01:00,352 వాళ్లు "వేగంగా ఊడవడం", "జంతువుల అరుపులు" వంటి ఆటలను సృష్టించుకొని ఆడుకొనేవాళ్లు 19 00:01:01,895 --> 00:01:04,188 జంతువుల అరుపులను కనిపెట్టడంలో ఓవెన్ దిట్ట 20 00:01:04,272 --> 00:01:07,025 ఫలానా అరుపు ఎలుకది అని గబ్బిలానిది కాదని పక్కాగా చెప్పేయగలిగేవాడు 21 00:01:07,109 --> 00:01:08,652 వాళ్లందరూ ఒక పిల్లిని కూడా పెంచుకొనేవాళ్లు 22 00:01:08,735 --> 00:01:10,362 దాన్ని ఓవెన్ సోమ, మంగళవారాలు చూసుకొనేవాడు 23 00:01:10,445 --> 00:01:12,573 అలాంజో బుధ, గురువారాలు చూసుకొనేవాడు 24 00:01:12,656 --> 00:01:14,950 గేనన్ శుక్ర, శనివారాలు చూసుకొనేవాడు 25 00:01:15,033 --> 00:01:16,493 నెడ్ ఆదివారాలు చూసుకొనేవాడు 26 00:01:17,244 --> 00:01:21,206 ఒకసారి, వాళ్లు డ్రైనేజీలో ఉండే ఎలుకకి పురుడు పోశారు దానితో స్కేబీస్ వ్యాధి వాళ్లకి అంటుకుంది 27 00:01:21,290 --> 00:01:22,291 దానిదేముందిలే 28 00:01:22,374 --> 00:01:26,044 ఇప్పుడు ఏ ఎలుకను చూసినా తమ వల్ల పుట్టినవేనా అవి అని ఆలోచించేవాళ్లు 29 00:01:26,128 --> 00:01:27,129 కావచ్చు 30 00:01:27,212 --> 00:01:30,716 ఒకానొక సమయంలో, అందరూ ఏడ్రియన్ అనే పేరుతో ఉన్న వేర్వేరు అమ్మాయలతో డేటింగ్ చేశారు 31 00:01:31,884 --> 00:01:35,554 కానీ గేనన్ మాత్రమే తను డేటింగ్ కి వెళ్లిన ఏడ్రియన్ ని పెళ్లి చేసుకున్నాడు 32 00:01:35,637 --> 00:01:37,306 తను మేనేజ్ చేసే పార్కులోనే తన వివాహం జరిగింది 33 00:01:37,389 --> 00:01:38,891 మిగిలిన మిత్రులందరూ తోడు పెళ్లికొడుకులు అయ్యారు 34 00:01:38,974 --> 00:01:41,977 నలుగురూ కలిసి ఒకేసారి పాడారు 35 00:01:42,060 --> 00:01:44,229 నలుగురూ కలిసి ఒకేసారి 36 00:01:44,313 --> 00:01:47,316 నలుగురూ కలిసి ఒకేసారి పాడారు 37 00:01:47,399 --> 00:01:49,818 నలుగురూ కలిసి ఒకేసారి 38 00:01:49,902 --> 00:01:51,778 చాలా సేపు పని చేసేవారు వాళ్ళ మధ్య స్నేహం బాగా బలపడింది 39 00:01:51,862 --> 00:01:54,281 ప్రతీరోజూ రాత్రి జాగింగ్ చేసేవారు 40 00:01:54,990 --> 00:01:57,201 ప్రాణ స్నేహితులకి ప్రతిరూపం వీళ్లు 41 00:01:57,284 --> 00:01:59,661 నాకూ, ఓవెన్ కి మధ్య ఉన్న స్నేహం కూడా వారి స్నేహానికి సాటి రాదు 42 00:01:59,745 --> 00:02:04,416 అందరూ కలిసి ఒకే టాటూను వేయించుకోవాలనుకున్నారు 43 00:02:04,499 --> 00:02:07,127 తమ పిర్రలపై పార్క్ రేంజర్ బ్యాడ్జ్ టాటూని 44 00:02:07,211 --> 00:02:09,755 కానీ నెడ్ ముందు వెళ్ళాడు నొప్పి భరించలేకపోయాడు 45 00:02:09,838 --> 00:02:14,843 సూది తాకీతాకంగానే ఆపేయమన్నాడు 46 00:02:14,927 --> 00:02:16,803 ఒక చుక్క మాత్రమే పడింది 47 00:02:17,513 --> 00:02:23,352 కాబట్టి అందరూ కూడా చుక్కనే టాటూగా వేయించుకున్నారు 48 00:02:25,062 --> 00:02:30,025 కాలం గడిచే కొద్దీ, అందరికీ ప్రమోషన్స్ వచ్చాయి అందరూ పార్క్ మేనేజర్లు అయ్యారు 49 00:02:30,108 --> 00:02:33,278 ఇక ఇన్నేళ్ల తర్వాత అందరూ కలుసుకోబోతున్నారు 50 00:02:33,362 --> 00:02:35,906 వాళ్లని చూస్తే, దూరంగా ఉన్న వాళ్లలా అనిపించదు 51 00:02:36,907 --> 00:02:40,160 నలుగురూ కలిసి ఒకేసారి పాడారు 52 00:02:40,244 --> 00:02:42,287 నలుగురూ కలిసి ఒకేసారి 53 00:02:42,371 --> 00:02:45,207 నలుగురూ కలిసి ఒకేసారి పాడారు 54 00:02:45,290 --> 00:02:47,918 నలుగురూ కలిసి ఒకేసారి 55 00:02:48,001 --> 00:02:53,257 నలుగురూ కలిసి ఒకేసారి 56 00:02:53,340 --> 00:02:56,760 నలుగురూ కలిసి ఒకేసారి 57 00:02:56,844 --> 00:03:00,430 -నలుగురూ కలిసి -ఒకేసారి పాడారు 58 00:03:00,514 --> 00:03:04,226 -నలుగురూ కలిసి ఒకేసారి పాడారు -సమయం అసలు గడవనే లేదు అన్నట్టుగా 59 00:03:04,309 --> 00:03:07,104 నలుగురూ కలిసి ఒకేసారి పాడారు నలుగురూ కలిసి ఒకేసారి పాడారు 60 00:03:07,187 --> 00:03:10,649 -ఒకేసారి -నలుగురూ కలిసి ఒకేసారి పాడారు 61 00:03:10,732 --> 00:03:13,318 -నలుగురూ కలిసి ఒకేసారి పాడారు -పార్క్ మేనేజర్లుగా అత్యుత్తమ స్థానంలో ఉండి పాడారు 62 00:03:13,402 --> 00:03:15,696 నలుగురూ కలిసి ఒకేసారి పాడారు 63 00:03:15,779 --> 00:03:17,364 నలుగురూ కలిసి ఒకేసారి పాడారు! 64 00:03:17,447 --> 00:03:18,782 స్నేహం. 65 00:03:18,866 --> 00:03:21,118 ఇప్పుడు, వాళ్లు వేర్వేరు పార్కులకు మేనేజర్లు మాత్రమే కాదు, 66 00:03:21,201 --> 00:03:23,996 వాళ్ళు అందరూ పార్క్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా ఉన్నారు, 67 00:03:24,079 --> 00:03:26,665 అది పార్క్ మేనేజర్లకు సుప్రీమ్ కోర్టులాంటిది, 68 00:03:26,748 --> 00:03:28,584 కాకపోతే ఎవరికీ పొడవాటి రింగురింగుల విగ్గులు ఉండవనుకోండి. 69 00:03:28,667 --> 00:03:31,503 ఇంకా మీ అమ్మ అదృష్టం పండింది. ఈ ఏడాది నాతో తను కూడా వస్తోంది. 70 00:03:31,587 --> 00:03:34,798 పెళ్లి, యాహూ! ఇక పిల్లలూ, మీరు ఇవాళ మీ ఏబీ పిన్నితో గడుపుతారు అన్నమాట. 71 00:03:34,882 --> 00:03:36,550 పాన్ కేకులు, ఏబీ పిన్ని? 72 00:03:36,633 --> 00:03:37,634 ఇది కదా సూపర్ రోజు అంటే! 73 00:03:37,718 --> 00:03:40,179 నువ్వు రావడం నీ అదృష్టం. నా ప్రాంక్ ని చూసే భాగ్యం నీకు దక్కుతుంది. 74 00:03:40,262 --> 00:03:44,266 పోయిన ఏడాది వాళ్లు నన్ను చాలా బాగా ఆటపట్టించారు, కాబట్టి ఈ ఏడాది నేను వాళ్లకి గట్టిగానే జవాబు ఇవ్వబోతున్నా. 75 00:03:44,349 --> 00:03:45,559 వాళ్లు ఏం చేశారేంటి? ఏదైనా పక్షిని తిట్టారా? 76 00:03:45,642 --> 00:03:48,729 పోయిన ఏడాది సమావేశం మధ్య నుండి చల్లగా జారుకొని బీర్ తెచ్చుకోవాలని అందరం అనుకున్నాం, 77 00:03:48,812 --> 00:03:51,732 కానీ వాళ్లు నాకు బేకరీ అడ్రస్ ఇచ్చారు. 78 00:03:51,815 --> 00:03:53,734 అందులో నవ్వొచ్చేది ఏముందో తెలుసుకోవడానికైనా నేను పెద్దవాడిని అయిపోతాను. 79 00:03:53,817 --> 00:03:56,737 కాబట్టి, ఈ ఏడాది, ఒక వారం క్రితం చేసిన కేకులను ఒక బాక్సులో తీసుకొని వెళ్లి వాళ్లకిస్తాను. 80 00:03:56,820 --> 00:03:58,614 వాటిని వాళ్లు తింటుంటే చూడాలని చాలా ఆతృతగా ఉంది. 81 00:03:58,697 --> 00:04:00,449 అబ్బో, భలే సరదా మనుషుల్లానే ఉన్నారే మీరు, హా? 82 00:04:00,532 --> 00:04:03,160 ఏంటి, ఆ కేకులు ఒక వారం నుండి మన ఇంట్లోనే ఉన్నాయా? 83 00:04:03,243 --> 00:04:05,329 అవును. బాగా పాడైపోయాయి. 84 00:04:05,412 --> 00:04:06,496 నీకు మనస్సే లేదు! 85 00:04:06,997 --> 00:04:09,416 ఒక్క నిమిషం. ఓరి దేవుడా. మేయర్ కాల్ చేస్తున్నాడు. హలో? 86 00:04:09,499 --> 00:04:12,127 ఓవెన్, నీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చా? నేను మేయర్ ని మాట్లాడుతున్నాను. 87 00:04:12,211 --> 00:04:15,172 నీ "ఐ లవ్ పార్క్" ప్రోగ్రామ్ గురించి నేను పార్క్ కమిషనర్ తో మాట్లాడాను, 88 00:04:15,255 --> 00:04:17,216 -తను చాలా ఆసక్తిని చూపింది. -సూపర్! 89 00:04:17,298 --> 00:04:18,800 వావ్, ఒక్కసారిగా హుషారు వచ్చేసినట్టుందే! 90 00:04:18,884 --> 00:04:21,136 కానీ, ముందు పార్క్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి 91 00:04:21,220 --> 00:04:22,971 దానికి ఆమోదం తెచ్చుకోమని ఆమే సూచించింది. 92 00:04:23,055 --> 00:04:24,640 అదేం పెద్ద సమస్య కాదు. 93 00:04:24,723 --> 00:04:28,268 నేను కూడా ఆ కమిటీలో ఉన్నాను, మిగతా వాళ్లు కూడా నాకు చాలా బాగా తెలుసు. 94 00:04:28,352 --> 00:04:30,604 -నిజానికి, నేను వాళ్లని ఇవాళే కలుసుకోబోతున్నాను. -అయ్యో… ఛ. 95 00:04:30,687 --> 00:04:32,189 నాకు అర్జంటుగా ఒక టేప్ కావాలి. నేను ఉంటాను. 96 00:04:33,815 --> 00:04:34,900 హెలెన్, నీకేం కనిపిస్తోంది? 97 00:04:34,983 --> 00:04:38,153 చుండ్రు, పాడైపోయిన జుట్టు, కాస్తంత పాప్ కార్న్… 98 00:04:38,237 --> 00:04:39,488 నా జుట్టును కాదు, నేలని చూసి చెప్పు. 99 00:04:39,571 --> 00:04:41,031 నాకు నేలే కనిపిస్తోంది. 100 00:04:41,114 --> 00:04:44,284 అదే కదా. చివరిసారిగా ఫ్లోర్స్ ని చక్కగా ఎప్పుడు పాలిష్ చేయించావు? 101 00:04:44,368 --> 00:04:47,120 మన టాయిలెట్ ని వాడుకున్నందుకు ఫ్లోర్స్ ని తుడిచే వ్యక్తిని మీరు పీకేసినప్పుడు అనుకుంటా. 102 00:04:47,204 --> 00:04:48,288 ఇప్పుడు మళ్లీ వాడిని పనిలో చేరమను. 103 00:04:48,372 --> 00:04:51,041 నా కాలి చిటికెన వేలుకు ఒక కాయ కాచింది, దాన్ని తీయించుకోవడానికి నేను హోటల్ స్పాకి వెళ్తున్నా. 104 00:04:51,124 --> 00:04:52,584 నేను తిరిగి వచ్చేసరికి 105 00:04:52,668 --> 00:04:53,669 ఫ్లోర్స్ అన్నీ తళతళా మెరిసిపోవాలి. 106 00:04:54,586 --> 00:04:57,214 పిల్లలూ, నాకు న్యూయార్క్ గురించి అస్సలు తెలీదు అనుకొని, 107 00:04:57,297 --> 00:04:58,882 ఇవాళ ఏం చేయాలనుకుంటున్నారో నాకు చెప్పండి. 108 00:04:58,966 --> 00:05:01,468 ఆ యూట్యూబ్ వ్యక్తి రెస్టారెంట్ లో వడ్డించే పదివేల రూపాయల బిర్యానీని మనం తినవచ్చు. 109 00:05:01,552 --> 00:05:02,761 హెలికాప్టర్ టూర్ కి వెళ్దామా? 110 00:05:02,845 --> 00:05:05,055 సరే, ఏదైనా పర్వాలేదనే విధంగా నేను మీకు చెప్పి ఉండాల్సింది కాదు, 111 00:05:05,138 --> 00:05:08,308 ఎందుకంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు కాస్త తక్కువగా ఉన్నాయి. 112 00:05:08,392 --> 00:05:11,186 కానీ నాకు ఉద్యోగం వచ్చాక, మీకు కావలసిన పనులన్నీ చేద్దాం, ఒట్టు. 113 00:05:11,270 --> 00:05:13,897 నేను ఒక రోజు ఏ పనీ పెట్టుకోకుండా, నగరంలోని అన్ని చోట్లా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నా. 114 00:05:13,981 --> 00:05:16,108 -ఆ పని ఇవాళే చేయవచ్చు కదా? -మీరు కూడా నాతో వస్తారా? 115 00:05:16,191 --> 00:05:18,360 తప్పకుండా! ప్రతీ సందులో "మనుషులు కావలెను" అని బోర్డులు తగిలించి ఉంటాయి. 116 00:05:18,443 --> 00:05:21,655 -నిన్ను పని అమ్మాయిలా మార్చేస్తాం. -నీకు దాని అర్థం తెలీదనుకుంటా, కానీ థ్యాంక్స్. 117 00:05:21,738 --> 00:05:22,573 న్యూయార్క్ పార్క్ మేనేజర్లు 118 00:05:22,656 --> 00:05:23,991 ఈ రోజులోని మొదటి భాగమంతా ప్రసంగాలే. 119 00:05:24,074 --> 00:05:26,326 ఈ ఏడాది టాపిక్స్, "మురుగు నీరు అనే అద్భుతమైన ప్రపంచం," 120 00:05:26,410 --> 00:05:28,704 "ఎరువా, నీకు వందనం", ఇంకా "ప్రేమను పంచే పురుగులు." 121 00:05:28,787 --> 00:05:30,205 లంచ్ లో బార్బిక్యూ ఉంది. 122 00:05:30,289 --> 00:05:33,000 గేనన్, నెడ్, అలాంజో! నా కేకుల పని మొదలుపెట్టే సమయం అయింది! 123 00:05:33,083 --> 00:05:35,711 సరే, నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్లి టిఫిన్ కి ఏమున్నాయో చూసి వస్తా, 124 00:05:35,794 --> 00:05:38,130 అంటే లోపల నిద్రపోవడానికి… అదే, అదిరిపోయే ప్రసంగాలకి బాగా సన్నద్ధమవ్వాలి కదా. 125 00:05:38,213 --> 00:05:39,339 వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 126 00:05:39,423 --> 00:05:42,843 హేయ్, ఇక్కడ చూడండి. కేకులమ్మా కేకులు. నాకు ఈ సమావేశమంటే ప్రాణం అబ్బా! 127 00:05:42,926 --> 00:05:46,221 ఇంకా మన బంగారు బుల్లోడు రాలేదే. మనం ఆనందంగా ఆరగించేయవచ్చు. 128 00:05:46,305 --> 00:05:48,015 బంగారు బుల్లోడంటే, బంగారు ఓవెనేగా. 129 00:05:48,098 --> 00:05:50,893 తన గారాల సెంట్రల్ పార్కును వదిలి రాలేకపోతున్నాడేమో, ఎందుకంటే, అతనికి అది చాలా ముఖ్యమైనది కదా. 130 00:05:50,976 --> 00:05:53,353 అసలైన పార్కును మేనేజ్ చేయడం అంటే ఏంటో వాడికి తెలీదు. 131 00:05:53,437 --> 00:05:56,648 అవును. పోయిన వారం, నా పార్కుకు వచ్చే సందర్శకుల కన్నా అక్కడ పారేసిన పాత సోఫాలే ఎక్కువ ఉన్నాయి. 132 00:05:56,732 --> 00:05:58,984 ఇది చాలా దారుణమైన విషయం, ఎందుకంటే, ఒకప్పుడు వాడు చాలా సరదాగా ఉండేవాడు. 133 00:05:59,067 --> 00:06:01,111 మనకు అతను కనిపిస్తే, పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం. 134 00:06:01,195 --> 00:06:03,864 సరే, వాడి గురించి ఇక చాల్లే. ముందు ఈ కేకు సంగతి చూస్తాను. 135 00:06:04,948 --> 00:06:06,200 అబ్బా, చాలా చండాలంగా ఉంది. 136 00:06:07,868 --> 00:06:09,828 చూద్దాం. ఉద్యోగం, ఉద్యోగం. మా పిన్నికి ఉద్యోగం. 137 00:06:09,912 --> 00:06:10,913 లేసిక్ వేసుకొనే దాకా మీ జీవితం జీవితం కాదు 138 00:06:10,996 --> 00:06:14,291 -నీకు లేసిక్ వేయడం ఎలాగో తెలుసా? -లేదు. లేసర్ షూటింగ్ ఎలా ఆడాలో తెలుసు. 139 00:06:14,374 --> 00:06:15,584 ఓ కుటుంబం నడిపించే అంత్యక్రియల సర్విస్. 140 00:06:15,667 --> 00:06:16,877 ఫ్యూనిసెల్లీస్ ఫ్యూనెరల్ హోమ్ అండ్ బఫే 141 00:06:16,960 --> 00:06:17,961 ఏదీ దొరకనప్పుడు దాన్ని చూద్దాంలే. 142 00:06:18,045 --> 00:06:20,631 ఒకసారి మనం వెతకాల్సినవి కుదిద్దాం. నీకు దేనిలో అనుభవం ఉంది? 143 00:06:20,714 --> 00:06:24,092 చాలా వాటిల్లో అనుభవం ఉంది! క్యూటీ 21 అనే బట్టల దుకాణంలో పని చేశాను, 144 00:06:24,176 --> 00:06:26,553 కాలేజీలో చదువుతున్నప్పుడు డెలీషియోస్ రెస్టారెంట్ లో అటెండర్ గా పని చేశాను, 145 00:06:26,637 --> 00:06:30,224 ఒక వేసవిలో మాక్సీన్ జాక్సన్స్ వ్యాక్సింగ్ వేగన్ లో రిసెప్షనిస్టుగా కూడా పని చేశాను. 146 00:06:30,307 --> 00:06:31,558 గుర్తుంచుకో, ఇది న్యూయార్క్. 147 00:06:31,642 --> 00:06:34,436 నువ్వు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు, నీలో ఆ కసి ఉందో లేదో వారు చూస్తారు. 148 00:06:34,520 --> 00:06:36,355 నీ ముఖంలో కసిని చూపు. 149 00:06:36,438 --> 00:06:37,523 అదుగో. 150 00:06:38,106 --> 00:06:41,443 మంచి విషయం ఏంటంటే, జీడి పప్పు ఉప్మాలో నాకు ఒక జీడి పప్పు కనిపించింది. 151 00:06:41,527 --> 00:06:44,947 చెడు విషయం ఏంటంటే, ఒకావిడ నన్ను డ్రమ్గూల్ ప్లాజాకి మేనేజర్ అని అనుకుంది. 152 00:06:45,030 --> 00:06:47,658 నన్ను బెవ్ అని పిలుస్తోంది. ఇప్పుడు నేను బెవ్ ఏమో. 153 00:06:48,242 --> 00:06:49,368 ఓయ్, ఏమైంది? 154 00:06:49,451 --> 00:06:51,578 మనస్సు బాగాలేదు. నా మిత్రులని ఆటపట్టిద్దామని దాక్కొని ఉన్నప్పుడు, 155 00:06:51,662 --> 00:06:54,206 వాళ్లు నా వెనక నన్ను "బంగారు ఓవెన్" అని అనడం విన్నాను. 156 00:06:54,289 --> 00:06:57,835 నేను మరీ అంత కష్టపడనక్కర్లేదు అని, నన్ను నేను గొప్పగా ఊహించుకుంటున్నాని అనుకుంటున్నారు. 157 00:06:57,918 --> 00:07:00,337 లేదు, ఓవెన్. వాళ్ల ఉద్దేశం ఖచ్చితంగా అది అయ్యుండదు. 158 00:07:00,420 --> 00:07:01,421 వాళ్ల ఉద్దేశం అదే, పేయిజ్. 159 00:07:01,505 --> 00:07:03,006 ఏం జరిగిందో నాకు అర్థమే కాలేదు. 160 00:07:03,090 --> 00:07:06,635 మేము కలిసి గడిపి చాలా కాలమైంది నిజమే, కానీ ఎప్పుడూ ఈమెయిళ్లు పంపుకుంటూనే ఉన్నాం. 161 00:07:06,718 --> 00:07:09,805 -సరే. ఆ ఈమెయిళ్లను నాకు చూపుతావా? -ఇవిగో. 162 00:07:11,974 --> 00:07:13,934 -హా, ఇవి అంత బాగా లేవు. -బాగా లేవంటే? 163 00:07:14,017 --> 00:07:17,604 నువ్వు పంపిన ఈమెయిళ్లలో, సెంట్రల్ పార్క్ గురించి తప్ప ఇంకేమీ లేదు. 164 00:07:17,688 --> 00:07:18,689 అది నిజం కాదే. 165 00:07:18,772 --> 00:07:23,402 "సెంట్రల్ పార్కులో రికార్డ్ స్థాయిలో రీసైక్లింగ్ జరిగింది. అజ్ఞాత దాత 20,000 డాలర్లు ఇచ్చారు. బాబోయ్!" 166 00:07:23,485 --> 00:07:26,530 పార్కులో జరిగిన రీసైక్లింగ్, ఒకరోజు జరిగిన రీసైక్లింగ్ లో రికార్డ్ సృష్టించిందని, 167 00:07:26,613 --> 00:07:28,824 ఎవరో అజ్ఞాతంగా 20,000 డాలర్లు ఇచ్చారని పంపిన ఈమెయిళ్లు అవి, మరి… 168 00:07:28,907 --> 00:07:29,908 హ, నాకు అర్థమైంది. 169 00:07:29,992 --> 00:07:33,453 కానీ చూస్తుంటే ఎవరూ రిప్లై ఇచ్చినట్టు లేదు, అప్పుడు నువ్వు మళ్లీ ఇంకో ఈమెయిల్ పంపావు, 170 00:07:33,537 --> 00:07:35,289 "నా ఈమెయిళ్లు మీకు వస్తున్నాయని నిర్ధారించుకోవాలనుకుంటున్నా," 171 00:07:35,372 --> 00:07:37,708 దానికి అలాంజో "వస్తున్నాయి" అని ఒక్క ముక్కలో రిప్లై ఇచ్చేశాడు. 172 00:07:37,791 --> 00:07:38,792 అలాంజో అంతేలే. 173 00:07:38,876 --> 00:07:41,336 ఓవెన్, వీళ్లు నీకు ఎప్పట్నుంచో స్నేహితులని నాకు తెలుసు, 174 00:07:41,420 --> 00:07:43,505 కానీ నువ్వు స్నేహితులుగా వాళ్లను చూస్తున్నట్టు, వాళ్లు నిన్ను చూడట్లేదేమో. 175 00:07:43,589 --> 00:07:46,383 వాళ్లు అలా ఆలోచిస్తున్నారని నాకు అస్సలు తెలీదు. అయ్యో. 176 00:07:46,466 --> 00:07:49,636 వాళ్లని "ఐ లవ్ పార్క్" క్యాంపెయిన్ కోసం ఇవాళ సంతకాలు అడగాలని ఇప్పుడే గుర్తొచ్చింది. 177 00:07:49,720 --> 00:07:52,097 వాళ్లు నా దరిదాపుల్లో ఉండటానికి కూడా ఇష్టపడకపోతే ఆ పని నేను ఎలా చేయగలను? 178 00:07:52,181 --> 00:07:55,100 నువ్వు ఎప్పుడూ సెంట్రల్ పార్క్ గురించి సోది కొడతావు కాబట్టే, వాళ్లు దూరంగా ఉండాలనుకుంటున్నారు. 179 00:07:55,184 --> 00:07:56,727 కాబట్టి, వేరే ఏదైనా మాట్లాడి చూడరాదూ? 180 00:07:56,810 --> 00:07:58,937 సరే. అయితే, వాళ్ల పార్కుల గురించి మాట్లాడనా? 181 00:07:59,021 --> 00:08:01,023 మాటల్లో పార్కుల ప్రస్తావన లేకపోతే మంచిది. 182 00:08:01,106 --> 00:08:03,025 బంగారం. వాళ్ల దృష్టిలో నువ్వు బంగారు ఓవెన్ వి. 183 00:08:03,108 --> 00:08:04,359 మరి దేని గురించి మాట్లాడాలి? 184 00:08:04,443 --> 00:08:06,111 వాళ్లు ఎలా ఉన్నారని. కాలక్షేపంగా ఏం చేస్తున్నారని. 185 00:08:06,195 --> 00:08:08,363 వాళ్లకి ఏవైనా హాబీలు ఉన్నాయా? ఈ మధ్య ఏం చేస్తున్నారు? 186 00:08:08,864 --> 00:08:09,907 బీర్ గురించి? 187 00:08:09,990 --> 00:08:13,202 ఇంకా, గేనన్ కి క్రీడాకారులంటే చాలా ఇష్టం. 188 00:08:13,285 --> 00:08:14,328 ఆహా. వాళ్ల గురించి మాట్లాడు. 189 00:08:14,411 --> 00:08:17,706 అలాంజో ఒకసారి రెండు చేతులూ విరగ్గొట్టుకున్నాడు. కానీ అది హాబీ కాదనుకో. 190 00:08:17,789 --> 00:08:19,291 సరే, నీకు కాస్త సాయం అవసరం. 191 00:08:19,374 --> 00:08:22,377 పర్వాలేదా? ఇది నీ తొలి సమావేశం. నువ్వు దాన్ని మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. 192 00:08:22,461 --> 00:08:24,922 పర్వాలేదులే. నాకు అదిరిపోయే స్లయిడ్ షోలు చూడాలనే ఉన్నా, 193 00:08:25,005 --> 00:08:26,590 నీకు సాయపడటమే ప్రస్తుతానికి ముఖ్యమైన పని. 194 00:08:26,673 --> 00:08:29,426 నేను రిపోర్టర్ ని. మీ స్నేహితుల గురించి ఆరా తీసి, నీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. 195 00:08:29,510 --> 00:08:31,929 దాని వల్ల లాభం ఉండవచ్చు. నీ బుర్ర మామూలు బుర్ర కాదు. 196 00:08:32,513 --> 00:08:33,597 పని అయిపోయింది. 197 00:08:33,679 --> 00:08:36,308 ఫ్లోర్స్ అన్నీ అద్దంలా తళతళా మెరిసిపోతున్నాయి. 198 00:08:36,390 --> 00:08:38,018 -నేలపై నీ ముఖం కనబడుతోందా? -చాలా స్పష్టంగా. 199 00:08:38,101 --> 00:08:39,852 పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. 200 00:08:39,937 --> 00:08:41,897 -కోపం లాంటివేవీ లేనందుకు నాకు ఆనందంగా ఉంది. -అస్సలు లేనే లేవు. 201 00:08:41,980 --> 00:08:43,065 ఏంటి… అస్సలు లేవా? 202 00:08:43,148 --> 00:08:45,484 బిట్సీ బ్రాండన్హామ్ పనిలో నుండి తీసివేయని వాళ్లు ఎవరైనా ఉన్నారా? 203 00:08:45,567 --> 00:08:47,152 నిజంగానే, నాకు కోపము లేదు. 204 00:08:47,236 --> 00:08:48,237 నువ్వు సూపర్, మారీసియో. 205 00:08:50,948 --> 00:08:51,990 వావ్. మెరిసిపోతోంది. 206 00:08:52,074 --> 00:08:53,408 వామ్మోయ్, ఏం జరుగుతోంది? 207 00:08:56,620 --> 00:08:58,872 మారీసియో అబద్ధం చెప్పాడు. అతనికి పీకల దాకా కోపం ఉంది. 208 00:09:01,208 --> 00:09:02,626 బాబోయ్, నెమ్మది! 209 00:09:03,460 --> 00:09:04,586 అయ్యో. 210 00:09:06,046 --> 00:09:09,049 ప్రతీకారం తీర్చుకున్నావు, మారీసియో. బాగా తీర్చుకున్నావు. 211 00:09:09,132 --> 00:09:11,468 అదుగో వాళ్లు అక్కడ ఉన్నారు. నేనేం మాట్లాడాలి? 212 00:09:11,552 --> 00:09:12,970 సరే. ఇప్పటి దాకా నాకు తెలిసింది ఏంటంటే, 213 00:09:13,053 --> 00:09:15,973 అలాంజో, రాష్ట్రంలోని ఉత్తర భాగాన ఉన్న, తనకి వారసత్వంగా వచ్చిన ఫార్మ్ ఫోటోలను, 214 00:09:16,056 --> 00:09:18,350 అలాగే పసికందు అయిన తన మేనల్లుడు, వాల్టర్ ఫోటోలను బాగా పోస్ట్ చేస్తుంటాడు. 215 00:09:18,433 --> 00:09:20,978 గేనన్ కి తన ఉప్పునీటి ఆక్వేరియం అంటే చాలా ఇష్టం. 216 00:09:21,061 --> 00:09:22,980 ఆక్వేరియాలు, వారసత్వంగా వచ్చిన ఫార్మ్ లా? 217 00:09:23,063 --> 00:09:25,274 ఆ రెండింటి గురించి నాకు ఒక్క ముక్క కూడా తెలీదే. 218 00:09:25,357 --> 00:09:27,442 మరేం పర్వాలేదు. నేను నీ పక్కనే కూర్చొని నీ చెవిలో ఊదుతుంటాలే. 219 00:09:27,526 --> 00:09:28,527 అది పని చేయదు. 220 00:09:28,610 --> 00:09:31,071 పని చేస్తుంది. హైస్కూల్ లో ఉన్నప్పుడు ఇలాగే ఒక ఏడాది పాటు నేను ఒకడితో డేటింగ్ చేశాను. 221 00:09:31,154 --> 00:09:32,990 హై స్కూల్ లో నువ్వు ఒక ఏడాది పాటు ఒకడితో డేటింగ్ చేశావా? 222 00:09:33,073 --> 00:09:35,909 అవును. భలే అందగాడులే. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు పద! 223 00:09:35,993 --> 00:09:36,994 -ఓవెన్! -టిల్లర్టౌన్! 224 00:09:37,077 --> 00:09:38,745 -ఒంగోలు గిత్త! -హేయ్, మిత్రులారా! 225 00:09:38,829 --> 00:09:40,664 -ఈ ఏడాది పేయిజ్ ని కూడా తీసుకువచ్చా. -హాయ్! 226 00:09:40,747 --> 00:09:42,666 -తను అబద్ధం కాదని చెప్పా కదా. -ఇప్పటికైనా మిమ్మల్ని కలవడం బాగుంది. 227 00:09:42,749 --> 00:09:46,128 పేయిజ్! పేపరులో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కాకపోతే పేపరులోలా బ్లాక్ అండ్ వైట్ లో లేరంతే. 228 00:09:46,211 --> 00:09:47,504 నా భార్య అయితే రానంటే రానంది. 229 00:09:47,588 --> 00:09:50,716 మీరు కూడా మాతో కూర్చోవాలి. అందరూ కబుర్లు చెప్పుకోవచ్చు. కూర్చోండి! కూర్చోండి. 230 00:09:50,799 --> 00:09:52,843 అంత కన్నా మాకు కావలసిందేముంది. అలాగే. 231 00:09:52,926 --> 00:09:55,846 అయితే, ఓవెన్, నీ సెంట్రల్ పార్క్ ఎలా ఉందేంటి? 232 00:09:55,929 --> 00:09:58,724 పని ఎలా పోతే ఏముందిలే! పక్కకు నెట్టేయడమే! 233 00:09:59,391 --> 00:10:02,644 నిజానికి, నేను వేరే విషయాల మీద దృష్టి పెట్టాను. 234 00:10:02,728 --> 00:10:05,981 -వేరే విషయాలంటే? -అదే… అంటే… 235 00:10:06,064 --> 00:10:07,691 -ఆక్వేరియం. -అవును. 236 00:10:07,774 --> 00:10:11,570 నేను పార్కుపైన్ పఫర్ చేపని తెచ్చుకుందామనుకుంటున్నా. 237 00:10:12,154 --> 00:10:13,822 ఆ చేప నా దగ్గర ఉంది. 238 00:10:13,906 --> 00:10:17,117 హా. సూదులతో భలే ముద్దొస్తుంటాయి కదా. 239 00:10:17,201 --> 00:10:18,785 నీకు చేపలంటే అంత ఇష్టమని నాకు తెలీదే. 240 00:10:18,869 --> 00:10:21,788 ఇంకా అంత ఇష్టం లేదనుకో. ఏదోక రోజు ఇష్టం పెరుగుతుందనే ఆశిస్తున్నా. 241 00:10:21,872 --> 00:10:24,625 ఎప్పుడు మొదలుపెట్టాలనుకుంటున్నావో చెప్పు. 242 00:10:24,708 --> 00:10:26,752 నేను నీకు అన్ని విధాలుగా సలహాలు ఇవ్వగలను. 243 00:10:27,336 --> 00:10:28,629 మొదలవుతోంది! 244 00:10:28,712 --> 00:10:34,051 ఇప్పుడు రాష్ట్రంలో పురుగుల నిపుణులు, థెరీసా చిన్ కి అందరూ స్వాగతం పలకండి! 245 00:10:34,134 --> 00:10:35,135 పురుగుల పురోగతి 246 00:10:35,219 --> 00:10:37,471 సరే మరి, నేను మీకు పూసగుచ్చినట్టు చెప్తాను. 247 00:10:38,055 --> 00:10:39,806 "సహాయం కావాలా?" "సహాయం" వచ్చేసింది. 248 00:10:39,890 --> 00:10:40,891 స్కూప్స్, ఐ డిడ్ ఇట్ అగేయిన్ 249 00:10:40,974 --> 00:10:43,644 -వెళ్లి ఉద్యోగం సంపాదిద్దాం పద, పిన్నీ. -నాకు ఐస్ క్రీమ్ కూడా! 250 00:10:43,727 --> 00:10:45,145 ఇవేం ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ రా బాబూ? 251 00:10:45,229 --> 00:10:48,607 చీస్ పెప్పర్ ఐస్ క్రీమ్? హాట్ సాస్ పాప్ కార్న్ ఐస్ క్రీమ్? వామ్మో ఇదేం ఐస్ క్రీమ్ షాపురా బాబూ! 252 00:10:48,690 --> 00:10:50,692 హలో. నాకు జాబ్ కోసం అప్లికేషన్ ఇస్తారా? 253 00:10:50,776 --> 00:10:52,986 ఇది నా షాప్. నేనే అప్లికేషన్ ని. 254 00:10:53,070 --> 00:10:56,365 మంచిది. నాకు కస్టమర్ సర్వీస్ లో చాలా అనుభవం ఉంది… 255 00:10:56,448 --> 00:10:58,075 ఐస్ క్రీమ్ షాపులో పని చేసిన అనుభవం ఉందా? 256 00:10:58,158 --> 00:10:59,826 లేదనే చెప్పాలి, కానీ… 257 00:10:59,910 --> 00:11:02,412 మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ ఏంటి? టాప్ మూడు చెప్పండి! 258 00:11:02,496 --> 00:11:05,290 అలాగే. బట్టర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, పిస్తా… 259 00:11:05,374 --> 00:11:07,626 -ఆహా. అవన్నీ తప్పు. -తప్పా? తప్పని ఎలా అంటారు… 260 00:11:07,709 --> 00:11:10,337 మీకు తెలీకపోతే, ఈ షాపులో మీరు పని చేయలేరు. 261 00:11:10,420 --> 00:11:13,090 సరే మరి. మీ విశాల మనస్తత్వానికి దండాలు. 262 00:11:13,173 --> 00:11:14,174 రండి, పిల్లలు. 263 00:11:14,258 --> 00:11:18,428 ఓ విషయం, బట్టర్ చికెన్ అనేది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అస్సలు కానే కాదు. 264 00:11:19,429 --> 00:11:21,223 సరే మరి. చేతులని, కాళ్లని ఆడిస్తే ప్రయోజనం ఉంటుందేమో. 265 00:11:23,100 --> 00:11:24,518 అబ్బా. లిఫ్ట్. 266 00:11:24,601 --> 00:11:27,145 అయ్య బాబోయ్. బిట్సీ వచ్చింది. బిట్సీ, ఇక్కడికి రాకండి! 267 00:11:27,229 --> 00:11:31,233 ఏంటి? నేనేం చేయాలో చెప్పేంత దానివా నువ్వు! నేనే నీకు… హెలెన్! 268 00:11:31,316 --> 00:11:32,985 అయ్య బాబోయ్! 269 00:11:34,069 --> 00:11:37,447 అలా శవంలా కూలబడకు. ఇక్కడి నుండి నన్ను బయటపడేయ్! 270 00:11:37,531 --> 00:11:40,325 నా వల్ల కాదు. పనివాళ్లు ఫర్నిచర్ ని తెచ్చేటప్పుడు మనల్ని చూడాల్సిందే. 271 00:11:40,409 --> 00:11:42,494 నీకేమైనా పిచ్చా? రాత్రంతా ఇక్కడే నేను ఉండలేను! 272 00:11:42,578 --> 00:11:44,830 -కావాలనుకుంటే వెళ్లిపోవచ్చు. -ఛ! 273 00:11:45,581 --> 00:11:48,292 అయితే, ఓవెన్ గారు, ఈమధ్య సెంట్రల్ పార్కులో రికార్డులను ఏమైనా బద్దలు కొట్టారా ఏంటి? 274 00:11:48,375 --> 00:11:51,044 ఎవరు పట్టించుకుంటున్నారు? కాస్తంత బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది కదా. 275 00:11:51,128 --> 00:11:53,338 అంతే కదా? నీకు ఆ ఫార్మ్ ఉంది కదా, నీకు బాగానే ఉండుంటుంది. 276 00:11:53,422 --> 00:11:55,841 అరెరె. నా ఫార్మ్ గురించి నీకు నేనెప్పుడూ చెప్పలేదే. 277 00:11:55,924 --> 00:12:00,220 లేదు, నువ్వే స్వయంగా నీ నోటితో… నీ మెసేజ్ లో చెప్పావు. అది వారసత్వంగా దక్కింది కదా? 278 00:12:00,304 --> 00:12:01,889 అవును. అక్కడికి నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. 279 00:12:01,972 --> 00:12:04,850 అక్కడే ఆహార మొక్కలను పెంచుకుంటున్నా, ఈ కల్తీ ఆహారం రుచి కన్నా అది వెయి రెట్లు మేలు. 280 00:12:04,933 --> 00:12:06,977 -నీకు నేను బోర్ కొట్టిస్తున్నానేమో. -అబ్బే, అస్సలు లేదు! 281 00:12:07,060 --> 00:12:10,022 నాకు వారసత్వంగా వచ్చినవాటి గురించి మాట్లాడటమంటే చాలా ఇష్టం. 282 00:12:10,105 --> 00:12:12,274 వాటిలో నాకు ఎక్కువగా నచ్చిందేంటో తెలుసా? 283 00:12:12,357 --> 00:12:14,067 అబ్బా, ఇప్పుడే వస్తాను. ఫోన్ సిగ్నల్ చాలా తక్కువ ఉంది. 284 00:12:14,151 --> 00:12:17,529 -హేయ్, బెవ్! ఇక్కడున్నావా. -నేను బెవ్ ని కాదు. నిజంగా… 285 00:12:17,613 --> 00:12:18,614 భలే కామెడీ చేస్తున్నావు. 286 00:12:18,697 --> 00:12:20,991 ఆ డెసర్ట్ టేబుల్ మీద ఉన్న బ్రౌనీలు తిన్నావా? 287 00:12:21,074 --> 00:12:24,077 -తినలేదు. పర్వాలేదులే. తర్వాత తెచ్చుకొని తింటా. -పద మరి, చాలా ఫాస్టుగా అయిపోతున్నాయి! 288 00:12:24,161 --> 00:12:26,079 -అబ్బా, సారీ! -నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోకు. 289 00:12:26,163 --> 00:12:27,039 ఓవెన్, నువ్వు బాగానే ఉన్నావా? 290 00:12:27,122 --> 00:12:29,541 నువ్వేదో అంటున్నావు కదా, వారసత్వంగా దక్కిన ఫార్మ్ లో నీకు బాగా నచ్చింది… 291 00:12:29,625 --> 00:12:33,337 అదేంటంటే… ఎద్దులు. నాకు వారసత్వంగా దక్కే ఎద్దులంటే ఇష్టం. 292 00:12:33,420 --> 00:12:35,422 -వాటిలో నీకు ఏం ఇష్టం? -వాటి మీద స్వారీ చేయడం. 293 00:12:35,506 --> 00:12:38,342 -వావ్. -ఎద్దులపై స్వారీ చేయడమా? నువ్వు ఎద్దుల స్వారీ చేస్తావా? 294 00:12:38,425 --> 00:12:43,388 అవును. నేను ఎగిరి వాటి మీద కూర్చుని స్వారీ చేస్తాను. చల్ చల్! 295 00:12:43,472 --> 00:12:44,640 సహాయం కావాలి షర్ట్ 296 00:12:44,723 --> 00:12:47,392 హాయ్. ఉద్యోగం ఇంకా ఖాళీగానే ఉందా అండి? 297 00:12:47,476 --> 00:12:48,977 మీకు బట్టల షాపులో పని చేసిన అనుభవం ఉందా? 298 00:12:49,061 --> 00:12:50,812 ఉంది. నిజంగానే ఉంది. 299 00:12:50,896 --> 00:12:53,524 నేను విస్కాన్సిన్ లోని ఆష్కాష్ లో క్యూటీ 21 అనే షాపులో పని చేశాను, 300 00:12:53,607 --> 00:12:56,068 అక్కడ కూడా ఇలాంటి బట్టలే ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఉన్నంత ట్రెండీగా ఉండవు. 301 00:12:56,151 --> 00:12:58,695 మీ దగ్గర ప్రత్యేకమైన నైపుణ్యాలు ఏమైనా ఉన్నాయా? 302 00:12:58,779 --> 00:13:00,948 ఉంది, అడగండి. కానీ, మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. 303 00:13:01,031 --> 00:13:02,241 ప్రత్యేకమైన నైపుణ్యాలు. 304 00:13:02,324 --> 00:13:04,576 ఉదాహరణకు చెప్పాలంటే, డాల్టన్ వచ్చేసి బ్యాలే డాన్సర్, 305 00:13:04,660 --> 00:13:08,622 ఇంకా అక్కడ ఉన్న మరియానా, "మనీయానా" అని సొంతంగా ఒక క్తిప్టోకరెన్సీని సృష్టించుకుంది. 306 00:13:08,705 --> 00:13:12,334 రెన్ఫ్రో అయిదు డాక్యుమెంటరీలను తీసింది, రెండు డాక్యుమెంటరీలను తన మీదే తీశారు. 307 00:13:12,417 --> 00:13:15,629 ఇంకా జమాల్ అయితే వేరే దేశంలో చాలా ఫేమస్, ఏ దేశమో నాకు సరిగ్గా తెలీదు. 308 00:13:15,712 --> 00:13:19,258 సరే. నేను అలాంటివేవీ చేయలేదు, 309 00:13:19,341 --> 00:13:22,052 కానీ నా దగ్గర ఇతర నైపుణ్యాలు చాలా ఉన్నాయి. 310 00:13:22,135 --> 00:13:26,390 మీరు కనులు మూసి తెరిచే లోగా షోకేసులోని బొమ్మలకు డ్రెస్ వేసేయగలను 311 00:13:26,473 --> 00:13:30,519 బ్లౌజులు ఎంత మడతలుగా ఉన్నా ఇస్త్రీ వేసిన వాటిలా మడత వేసేయగలను 312 00:13:30,602 --> 00:13:34,565 ఈ కమ్మలను ఏ హుక్కుకైనా వేలాడదీయగలను 313 00:13:34,648 --> 00:13:38,318 ఒక్క స్నేహపూర్వక చూపుతో కస్టమర్ పెదవులపై చిరునవ్వు చిందించగలను 314 00:13:38,402 --> 00:13:39,403 చూశారా? 315 00:13:39,486 --> 00:13:43,574 మనిషిని చూడగానే వాళ్ల సైజ్ ఏంటో చెప్పేసి మీరు అవాక్కయేలా చేయగలను 316 00:13:43,657 --> 00:13:47,619 ప్యాంట్లను పద్ధతి ప్రకారం సర్దడంలో నేను నేర్పరిని 317 00:13:47,703 --> 00:13:51,415 ఈ బట్టల షాపును ప్యాలెస్ గా మార్చేయగల సత్తా నాకు ఉంది 318 00:13:51,498 --> 00:13:55,460 నా నైపుణ్యాలతో అంతే లేని నా నైపుణ్యాలతో 319 00:13:56,086 --> 00:13:58,672 -తనేమీ గొప్పలు చెప్పుకోవడం లేదు. -అవును. 320 00:13:59,256 --> 00:14:01,216 తను చేతిని వెనక్కి తిప్పగలదు 321 00:14:01,300 --> 00:14:03,302 మీ చెవిలో ఒక నాణేన్ని దాచగలదు 322 00:14:03,385 --> 00:14:05,345 ఒక చక్రపు సైకిల్ పై డాన్స్ వేయగలదు 323 00:14:05,429 --> 00:14:07,389 తోలు బొమ్మలను కూడా అద్భుతంగా ఆడించగలదు 324 00:14:07,472 --> 00:14:11,518 తను కథలను చాలా బాగా చెప్తుంది తన కథల కోసం జనాలు క్యూలో నిలబడతారు 325 00:14:11,602 --> 00:14:13,604 తనకి ప్రతీ కుక్క పేరు తెలుసు 326 00:14:13,687 --> 00:14:15,647 అందుకే తను తోపు 327 00:14:15,731 --> 00:14:20,485 కాబట్టి, నా కస్టమర్ సర్వీస్ తో మిమ్మల్ని పడేస్తాను ఆగండి 328 00:14:20,569 --> 00:14:24,323 నేనెప్పుడూ దొంగతనం చేయలేదు కాబట్టి మీకు ఆ కంగారు అక్కర్లేదు 329 00:14:24,823 --> 00:14:28,202 ఏదైనా సమస్య వస్తే దాన్ని సవాలుగా తీసుకొని, అధిగమిస్తాను 330 00:14:28,285 --> 00:14:32,706 నా నైపుణ్యాలతో అంతే లేని నా నైపుణ్యాలతో 331 00:14:32,789 --> 00:14:34,917 "వాపసు ఇవ్వాలంటే, మీరు తీసుకొన్న వస్తువును వాడి ఉండకూడదు, 332 00:14:35,000 --> 00:14:36,251 అలాగే అది మీరు కొన్నప్పుడు ఉన్నట్టే ఉండాలి. 333 00:14:36,335 --> 00:14:38,837 యాభై రోజుల తర్వాత, వాపసు చేయబడిన వస్తువుకు మేము మీకు స్టోర్ పాయింట్స్ మాత్రమే ఇవ్వగలం, 334 00:14:38,921 --> 00:14:41,006 దానికి రశీదు కావాలి." కులాసాగా గడపండి. 335 00:14:41,089 --> 00:14:45,177 నా జ్ఞాపక శక్తితో మిమ్మల్ని భలే షాక్ కి గురి చేశాను కదా 336 00:14:45,260 --> 00:14:49,223 నేను సిక్ లీవ్ పెట్టను సెలవులపై వెళ్లను 337 00:14:49,306 --> 00:14:52,851 లెక్కల్లో పక్కాగా ఉండాలని ఒక అకౌంటింగ్ పుస్తకాన్ని కూడా తిరగేశాను 338 00:14:52,935 --> 00:14:55,103 నాకు ఉన్న అంతే లేని నా నైపుణ్యాలతో 339 00:14:55,979 --> 00:14:59,191 అయ్యయ్యో. మీరు నాకు ఉద్యోగం ఇస్తే నేను దానికి మీకు డబ్బులిచ్చేయగలను. 340 00:14:59,274 --> 00:15:01,652 నాకు ఉన్న అంతే లేని నా నైపుణ్యాలతో 341 00:15:02,569 --> 00:15:03,570 మనకి చుక్కెదురైందిగా. 342 00:15:04,530 --> 00:15:08,450 సర్లే. మరి నీ సంగతేంటి, నెడ్? నీ జీవితంలోని వస్తువుల విషయమేంటి? 343 00:15:08,534 --> 00:15:10,702 -జీవితంలోని వస్తువులు ఏంటి? -హా, నీ జీవితంలోని వస్తువుల విషయమేంటి? 344 00:15:10,786 --> 00:15:12,120 సారీ, ఒక్క నిమిషం. 345 00:15:12,204 --> 00:15:13,330 ఓవెన్. ఓవెన్. 346 00:15:13,413 --> 00:15:16,208 జీవితంలోని వస్తువులంటే, అదే… 347 00:15:16,291 --> 00:15:19,086 నీ కొండల విషయం ఎలా ఉంది? 348 00:15:19,169 --> 00:15:20,087 ఏంటి? 349 00:15:20,170 --> 00:15:22,089 కొండలు కాదు కుండలు. నా ఉద్దేశం కుండలు. 350 00:15:22,172 --> 00:15:24,883 ఇంకా కుండలు చేస్తున్నా, కానీ వీకెండ్స్ లో మాత్రమే. 351 00:15:24,967 --> 00:15:27,845 -అప్పుడే నాకు కాస్త సేద దొరుకుతుంది. -సూపర్. నాకు అది భలే నచ్చింది. 352 00:15:27,928 --> 00:15:30,013 -ఇంకా చెప్పవా! -ఇప్పుడే చెప్పా కదా. 353 00:15:30,097 --> 00:15:32,683 కానీ ఓవెన్, ఇవాళ నీలో ఏంటి ఇంత హుషారు? 354 00:15:32,766 --> 00:15:35,102 మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలని అన్నమాట. ఎప్పుడూ పని గురించే మాట్లాడుకుంటాం కదా, 355 00:15:35,185 --> 00:15:37,312 అలా కాకుండా మన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకుందామని. 356 00:15:37,396 --> 00:15:39,064 ఆహా. సరే. 357 00:15:39,147 --> 00:15:42,609 ఎప్పటిలా కాకుండా ఇవాళ నీతో నిష్కపటంగా మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది, ఓవెన్. 358 00:15:42,693 --> 00:15:43,777 సరే. 359 00:15:43,861 --> 00:15:45,988 నేను, అంటే… నేను ఉన్న విషయం చెప్పేస్తా. 360 00:15:46,071 --> 00:15:48,866 ఒక్కోసారి మాకు ఏం అనిపిస్తుంటుందంటే, నీకు సెంట్రల్ పార్క్ లో చాలా పెద్ద ఉద్యోగం దొరికిందని, 361 00:15:48,949 --> 00:15:50,409 ఎప్పుడూ దాని గురించే మాట్లాడుతుంటావు అని. 362 00:15:50,492 --> 00:15:52,744 కానీ అలా అని మేము నీతో ప్రవర్తించిన తీరును సమర్థించుకోలేము. 363 00:15:52,828 --> 00:15:55,581 నీ వెనుక కామెడీగా మాట్లాడటం. ఇంకా చాలా అన్నమాట. 364 00:15:55,664 --> 00:15:59,042 అంటే, ఏం చేసినా, ఎంతైనా చివరికి నువ్వు మా స్నేహితుడివే కదా, ఓవెన్. 365 00:15:59,126 --> 00:16:01,962 మన స్నేహం ఈనాటిది కాదు, అదీగాక నువ్వు ఒక పఫర్ చేపని కొనబోతున్నావు. 366 00:16:02,045 --> 00:16:05,048 నిజమేంటంటే, మాకు నీపై కాస్తంత అసూయగా ఉండేది, 367 00:16:05,132 --> 00:16:07,301 అది న్యాయం కాదు. దానికి మమ్మల్ని క్షమించు. 368 00:16:07,384 --> 00:16:11,513 వావ్, మాటలతో పడేశావు. కానీ నిజానికి మీకు క్షమాపణలు చెప్పాల్సింది నేనే ఏమో. 369 00:16:11,597 --> 00:16:13,765 మేము చేసిన వాటిని సరిదిద్దుకోవడానికి నీకు మందు పార్టీ ఇస్తాం, ఏమంటావు? 370 00:16:13,849 --> 00:16:16,185 హేయ్, అలాంజోకి ఇష్టమైన బార్ ఈ సందు చివర్లోనే ఉంది. 371 00:16:16,268 --> 00:16:18,103 -అది చాలా మంచి ఐడియా. -నాకు ఓకే. 372 00:16:18,187 --> 00:16:21,398 కొంపదీసి అది వేళాకోళపు బార్ అండ్ కప్ కేక్ బేకరి కాదు కదా? 373 00:16:21,481 --> 00:16:23,192 ఎందుకంటే, మళ్లీ నేను మీ బుట్టలో పడిపోను. 374 00:16:23,275 --> 00:16:25,777 -హా. అది మనస్సులో పెట్టుకోకు. -కానీ ఇప్పుడు నిజంగానే చెప్తున్నా, ఓవెన్. 375 00:16:25,861 --> 00:16:28,947 ఈసారి ఆటపట్టించడాల్లాంటివి లేవులే, పాత రోజుల్లా కలిసి సరదాగా గడుపుదాం. 376 00:16:29,031 --> 00:16:30,324 సరే, వెళ్లి పండగ చేసుకుందాం. 377 00:16:30,407 --> 00:16:32,576 ముందు పేయిజ్ ఎక్కడుందో చూడాలి. అక్కడుంది. 378 00:16:32,659 --> 00:16:34,578 ఆ బ్రౌనీలు తనకి చాలా బాగా నచ్చినట్టున్నాయి. 379 00:16:34,661 --> 00:16:37,456 చెప్పా కదా, బెవ్. అస్సలు పురుగులతో చేసిన ప్రొటీన్ పిండితో చేసిన దానిలా అనిపించట్లేదు అని. 380 00:16:37,539 --> 00:16:38,916 బాబోయ్, ఏంటి? 381 00:16:38,999 --> 00:16:40,584 స్టిక్కీ బూట్ సెలూన్ 382 00:16:40,667 --> 00:16:43,837 చూశావా, ఇది కప్ కేక్స్ షాప్ కాదు. వాళ్లకి నేనంటే చాలా ఇష్టం. 383 00:16:43,921 --> 00:16:46,006 మళ్లీ నువ్వు మీ మిత్రులతో సరదాగా గడపగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. 384 00:16:46,089 --> 00:16:49,092 చూస్తుంటే, నీ "ఐ లవ్ పార్క్" ప్రోగ్రామ్ కి వాళ్ల సంతకాలు చేయించుకొనేలా ఉన్నావే, 385 00:16:49,176 --> 00:16:53,222 -అదుగో ఎద్దులను స్వారీ చేసే మన హీరో. -మేము నీ పేరు ఇచ్చాం, కౌబాయ్. 386 00:16:53,305 --> 00:16:55,766 -అయ్యో. -నువ్వు ఎప్పుడెప్పుడు దాన్ని ఎక్కుతావా అని చూస్తున్నా. 387 00:16:55,849 --> 00:16:58,435 అహా. అవును, అది చాలా సరదాగా ఉంటుంది. 388 00:16:58,519 --> 00:16:59,770 మా అమ్మ చెప్పింది నిజమే. 389 00:16:59,853 --> 00:17:03,065 నేను ఎందుకూ పనికిరాని ఒక పీనుగు పక్కన ఇలా వెల్లకిల్లా నేల మీద పడి చస్తానని. 390 00:17:03,148 --> 00:17:05,025 ఒక్క నిమిషం. నాకు ఒక ఐడియా వచ్చింది. 391 00:17:05,108 --> 00:17:07,528 ఎవరైనా వచ్చి సాయపడేదాకా నన్ను ప్రాణాలతో ఉంచాలని 392 00:17:07,611 --> 00:17:09,320 నిన్ను ముక్కలుముక్కులుగా కోసుకొని తినమని చెప్తావా? 393 00:17:09,404 --> 00:17:11,906 ఏంటి? లేదు. వీహాకిన్ లో ఉన్నప్పుడు నేను హసుల్ పూల్ ఆట ఆడేదాన్ని. 394 00:17:11,990 --> 00:17:14,992 నేను మిమ్మల్ని సరిగ్గా తోస్తే, ఆ గోడలకు తగులుకుంటూ 395 00:17:15,077 --> 00:17:16,578 హాలు గుండా మీరు నా బాత్రూమ్ లోకి వెళ్లి పడగలరు. 396 00:17:16,662 --> 00:17:19,289 -నీ బాత్రూమ్ లోకా? యాక్. -మనకి అది తప్ప మరో దారి లేదు. 397 00:17:19,373 --> 00:17:22,542 అబ్బా, సరే. కానీ నా ముఖానికి ఏం కాకుండా చూడు. నా ముఖం చూసే మనకి ఇన్ని డబ్బులు వస్తున్నాయి. 398 00:17:23,167 --> 00:17:24,837 ఈ విషయంలో నాకు మంచి పట్టు ఉంది. 399 00:17:26,088 --> 00:17:30,884 గోడకు గుద్దుకున్నారు. హాలు గుండా వెళ్తున్నారు. ఇక బాత్రూమ్ లోకి. 400 00:17:30,968 --> 00:17:31,969 -సూపర్. -నేను బాత్రూమ్ లోకి వచ్చేశా. 401 00:17:32,052 --> 00:17:33,804 అక్కడ ఉన్న ఫోన్ ద్వారా ఎవరినైనా వచ్చి సాయపడమని అడగండి. 402 00:17:33,887 --> 00:17:37,057 లేదు. ముందు ఈ నేలను పాలిష్ చేసిన వాడికి ఫోన్ చేసి, మళ్లీ పనిలో నుండి తీసేస్తాను. 403 00:17:37,140 --> 00:17:39,726 చచ్చానురా బాబూ. మీ పనయ్యే దాకా నేను ఇక్కడే పడుంటానులే. 404 00:17:43,397 --> 00:17:45,566 నా కాలు విరిగిపోయింది. అయ్యయ్యో. 405 00:17:45,649 --> 00:17:48,360 సరే మరి, కౌబాయ్ ఓవెన్. తర్వాత నువ్వే. 406 00:17:48,443 --> 00:17:51,446 మిత్రులారా, ఇవాళ నేను మీతో కొన్ని అబద్ధాలు చెప్పాను. 407 00:17:51,530 --> 00:17:53,323 ఇంతకు ముందు, మీరు నన్ను "బంగారు ఓవెన్" అనడం విన్నాను, 408 00:17:53,407 --> 00:17:55,993 మీరు నా గురించి ఏమనుకుంటున్నారో అప్పుడే నాకు తెలిసొచ్చింది. 409 00:17:56,076 --> 00:17:57,953 ఆ తర్వాత ఆక్వారియం, కుండల తయారీ, 410 00:17:58,036 --> 00:18:00,831 ఇంకా వారసత్వ వస్తువులలో నాకు లేని ఆసక్తిని ఉన్నట్టుగా చెప్పాను, 411 00:18:00,914 --> 00:18:03,083 ఎందుకంటే, మన మధ్య స్నేహబందాన్ని బాగుచేయాలని నేను తపించిపోయాను. 412 00:18:03,792 --> 00:18:06,503 ఓవెన్. వావ్. అది చిన్న విషయం కాదు, గురూ. 413 00:18:06,587 --> 00:18:10,090 కానీ, మీతో నాకు వేరే పని కూడా ఉంది, 414 00:18:10,174 --> 00:18:13,051 నా సెంట్రల్ పార్క్ "ఐ లవ్ పార్క్" క్యాంపెయిన్ కి మీ చేత సంతకాలు కూడా ఇవాళ చేయించుకుందామనుకున్నా. 415 00:18:13,135 --> 00:18:17,097 ఒక్క విషయం అర్థమయ్యేలా చెప్పు. నీ తొక్కలో పార్క్ కోసం ఇదంతా చేశావా? అస్సలు నమ్మలేకపోతున్నా. 416 00:18:17,181 --> 00:18:20,017 లేదు, మిత్రులుగా మీరంటే నాకు చాలా అభిమానం ఉంది. కానీ ఒక మంచి కార్యం కోసం… 417 00:18:20,100 --> 00:18:23,061 ఓవెన్, మా పనితో పోల్చితే నీ పని చాలా తేలిక అని నీకు అర్థం కావట్లేదా? 418 00:18:23,145 --> 00:18:25,480 కానీ నా పని తేలిక కాదు. అస్సలు కాదు. 419 00:18:25,564 --> 00:18:29,359 నా పార్కులో 18,000 చెట్లు ఉన్నాయి అంటే 18,000 ఆకుల కుప్పలు ఉన్నాయి 420 00:18:29,443 --> 00:18:32,696 వేసవి వచ్చిందంటే నా ఒళ్లంతా చెమటే 421 00:18:33,363 --> 00:18:36,158 అయిదు కోట్ల మంది పార్కును చూడటానికి వస్తారు 422 00:18:36,241 --> 00:18:40,621 మహానగర వాసుల ఆయువు పట్టు ఇది ఎందరో నా మీద ఆధారపడి ఉన్నారు 423 00:18:41,121 --> 00:18:45,250 నా బూట్లపై ఉన్న ఈ దుమ్ము నిజాన్ని తవ్వి తీయడం వల్ల వచ్చినది 424 00:18:45,334 --> 00:18:48,670 -నా పార్కులో చాలా జంతువులున్నాయి, జూ అని అనవచ్చు -నా పార్కులో చాలా జంతువులున్నాయి, జూ అని అనవచ్చు 425 00:18:49,546 --> 00:18:53,634 బాబూ, నేనేమీ అమరుడిని కాదు స్వయం ప్రేరేపిత కార్య సాధకుడిని 426 00:18:53,717 --> 00:18:56,637 నేనూ మీలాగే చాలా కష్టపడి పని చేస్తున్నాను 427 00:18:57,763 --> 00:19:00,307 చాలా చాలా చాలా కష్టపడి పని చేస్తున్నాను 428 00:19:00,807 --> 00:19:04,394 -సెంట్రల్ పార్కుకు మేనేజర్ గా ఉండటమంటే -సెంట్రల్ పార్క్ 429 00:19:05,562 --> 00:19:08,774 -పని, పని, పని -పని పని పని ఆలోచనతో చేయాలి 430 00:19:08,857 --> 00:19:12,194 ఇంటికి వచ్చేసరికి రాత్రి అవుతుందని పెళ్లాం బిడ్డలకి చెప్పాల్సి వస్తుంది 431 00:19:12,277 --> 00:19:18,242 -మేము చాలా కష్టపడి పని చేస్తున్నాం -చాలా చాలా చాలా కష్టపడి పని చేస్తున్నారు 432 00:19:19,868 --> 00:19:21,495 నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను 433 00:19:22,746 --> 00:19:26,500 నీ బూట్లపై దుమ్ము ఏది? అవి ఇచ్చేసి వేరే బూట్లు తెచ్చుకో 434 00:19:26,583 --> 00:19:29,878 పనిలో ఎక్కువ ఒత్తిడి ఎవరు పడతారు అని పోటీ పెడితే కప్పులన్నీ నీకేలే 435 00:19:30,921 --> 00:19:34,675 తెగ కష్టపడిపోతున్నావని చెప్తున్నావే అల్పాకా ఒంటెల బొచ్చును గొరిగేవాడిలా 436 00:19:34,758 --> 00:19:37,511 నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే మేలు 437 00:19:38,303 --> 00:19:41,557 మనోడు చాలా కష్టపడిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు 438 00:19:42,683 --> 00:19:45,561 సెంట్రల్ పార్కుకు మేనేజర్ గా ఉన్నాడు 439 00:19:46,228 --> 00:19:49,314 చాలా ఆలోచనతో పని చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు 440 00:19:49,898 --> 00:19:53,443 చీకటి పడ్డాక ఇంటికి వస్తానని పెళ్లాం బిడ్డలతో చెప్తాడట 441 00:19:53,527 --> 00:19:59,533 -అవును, మేము చాలా కష్టపడి పని చేస్తున్నాం -చాలా కష్టపడి పని చేస్తున్నాం 442 00:20:00,742 --> 00:20:02,786 ఓవెన్ టిల్లర్మన్, దయచేసి ఎద్దు దగ్గరకు రండి. 443 00:20:02,870 --> 00:20:05,539 ఓ విషయం చెప్పనా, నేను దీనికి రెడీ. నేను ఓవెన్ టిల్లర్మన్ ని. 444 00:20:05,622 --> 00:20:08,333 ఎద్దు స్వారీకి కష్టం స్థాయి ఎంత పెట్టమంటారు? 445 00:20:08,417 --> 00:20:10,335 అత్యంత కష్టమైన స్థాయి. 446 00:20:10,419 --> 00:20:11,962 కానీ మీరు ఒక పనికి ఒప్పుకోవాలి. 447 00:20:12,045 --> 00:20:14,173 నేను ఎనిమిది సెకన్లు ఆ ఎద్దు మీద ఉన్నానంటే, 448 00:20:14,256 --> 00:20:16,341 మీరు నా క్యాంపెయిన్ కోసం సంతకం చేయాలి. 449 00:20:16,425 --> 00:20:17,593 అలాగే, బాసూ. 450 00:20:18,427 --> 00:20:23,849 నా నిక్కర్ చినిగిపోయున్నా ఎద్దుపై ఎక్కాను నా ధైర్యాన్నంతా కూడదీసుకున్నాను 451 00:20:23,932 --> 00:20:26,185 ఎద్దు కొమ్ములను పట్టుకున్నాను 452 00:20:26,268 --> 00:20:28,896 -చాలా చాలా చాలా కష్టపడి పని చేస్తున్నాను -చాలా కష్టపడుతున్నాడు 453 00:20:29,396 --> 00:20:32,774 సెంట్రల్ పార్కుకు మేనేజర్ గా ఉండటమంటే 454 00:20:33,483 --> 00:20:34,860 అబ్బా! నా వీపు, నా పిర్రలు అయిపోయాయిరా నాయనోయ్! 455 00:20:34,943 --> 00:20:37,863 అయ్యో, పిర్రలే కదా నీకు అందం. కానీ నేను… ఇంతకీ, నువ్వు బాగానే ఉన్నావా? 456 00:20:37,946 --> 00:20:40,866 హా, హా. నాకేమీ కాదులే. ఇక ఇంటికి వెళ్దాం పద. 457 00:20:40,949 --> 00:20:42,826 -ఇదుగో. -ఏంటి, మీరు సంతకం చేశారా? 458 00:20:42,910 --> 00:20:45,454 విషయమేంటంటే, ఓవెన్, మేము నీ గురించి చాలా తప్పుగా ఆలోచించాం. 459 00:20:45,537 --> 00:20:47,456 అది భలే ఆకట్టుకుంది, అదే సమయంలో భలే పిచ్చి పని కూడా. 460 00:20:47,539 --> 00:20:50,000 నిన్ను నువ్వు చూసుకొని ఉంటే పడి పడి నవ్వేవాడివి. 461 00:20:50,083 --> 00:20:53,462 -నువ్వు ఓ ఎద్దుపై స్వారీ చేయాలనుకున్నావు. -మేము నిన్ను మిస్ అయ్యాం, ఓవెన్. నిజంగానే. 462 00:20:53,545 --> 00:20:57,716 ఒకప్పుడు నీలో ఉండిన బాదరబందీ లేని అవతారాన్ని చూడటం, అది ఇంకా జోష్ గా, హుషారుగా ఉందని చూడటం చాలా బాగుంది. 463 00:20:57,799 --> 00:20:59,301 ప్రతీ ఏడాది ఈ సమావేశం జరిగినప్పుడే కాకుండా 464 00:20:59,384 --> 00:21:01,512 మనం మరింత తరచుగా కలుసుకుంటూ ఉండాలి. 465 00:21:01,595 --> 00:21:03,138 -నాకు ఓకే. -నేను వచ్చినందుకు, 466 00:21:03,222 --> 00:21:05,015 అలాగే మీరందరూ మళ్లీ కలిసిపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 467 00:21:05,098 --> 00:21:06,683 ఇది నిజంగా చాలా బాగా గడిచింది. 468 00:21:06,767 --> 00:21:07,768 అవును, చాలా బాగా గడిచింది. 469 00:21:07,851 --> 00:21:10,521 చూడు, నాకు అసలైన బెవ్ కనిపించింది. 470 00:21:10,604 --> 00:21:12,523 -నువ్వు నాతో అబద్ధమాడావు. -నేనెప్పుడు అబద్దమాడాను తల్లీ! 471 00:21:12,606 --> 00:21:14,983 ఏంటి, నన్ను చూసి ఆమె అని అనుకున్నావా? అసలు ఆమెకి, నాకు పోలికలేవైనా ఉన్నాయా? 472 00:21:15,067 --> 00:21:16,443 -ఉన్నట్టున్నాయి. -నాకు కూడా కనిపించాయి. 473 00:21:16,527 --> 00:21:17,819 మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. 474 00:21:17,903 --> 00:21:20,239 నీకు ఉద్యోగం రానందుకు బాధగా ఉంది. నేనైతే నిన్ను వెంటనే పనిలోకి తీసుకొని ఉండేవాడిని. 475 00:21:20,322 --> 00:21:22,866 నీకు షో పీసులతో డాన్స్ వేయడం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? 476 00:21:22,950 --> 00:21:26,745 ఈ నగరం, అస్సలు ఆష్కాష్ లాగా లేదు. నేను ఇక్కడ సరిపోను అనుకుంటా. 477 00:21:26,828 --> 00:21:29,957 ఇక్కడ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి. నీకు తగినదే నీకు దక్కుతుందిలే. 478 00:21:30,040 --> 00:21:31,166 థ్యాంక్స్. 479 00:21:31,250 --> 00:21:33,043 ఓ విషయం చెప్పనా? ఈ విశాలవంతమైన హోటల్ కి వెళ్దాం. 480 00:21:33,126 --> 00:21:33,961 బ్రాండన్హామ్ 481 00:21:34,044 --> 00:21:35,879 మీరు నాతో ఇంత తిరిగినందుకు మీకు కాక్టెయిల్స్ ఇప్పిస్తాను. 482 00:21:35,963 --> 00:21:37,589 -కాక్టెయిల్స్ కోసం ఎక్కడికైనా వస్తా. -హాయ్, రికీ. 483 00:21:37,673 --> 00:21:38,674 గుడ్ ఆఫ్టర్ నూన్, కోల్. 484 00:21:38,757 --> 00:21:41,051 -ఒక్క నిమిషం, వీళ్లకి మీ పేర్లు కూడా తెలుసా? -అది చాలా పెద్ద కథలే. 485 00:21:41,552 --> 00:21:43,053 భవనాల నిర్మాణానికి ఉపయోగించే క్రేన్స్ ని 486 00:21:43,136 --> 00:21:45,097 ఆపరేట్ చేయడం కష్టమంటారా? 487 00:21:45,180 --> 00:21:47,307 లయోనెల్, చాలా నెలల కిందే నా సెలవులను ఆమోదించారు కదా. 488 00:21:47,391 --> 00:21:50,143 మన్నించాలి, ఎందుకంటే శాపర్స్టీన్ వారి వివాహం, గత్రీ వారి పెద్ద మనిషి ఫంక్షన్, 489 00:21:50,227 --> 00:21:53,355 ఇంకా వాలంకోర్ట్ వారి శ్రీమంతం ఫంక్షన్ ఉన్నాయి, నువ్వు సెలవులపై వెళ్తే పని ఎవరు చేస్తారు. 490 00:21:53,438 --> 00:21:55,566 కానీ నేను మాత్రం వాటికి ఉండలేను, 491 00:21:55,649 --> 00:21:58,986 ఎందుకంటే, జమైకాకు వెళ్లాలని నాకెప్పటి నుంచో ఉంది కనుక, నేను అక్కడికి వెళ్లి తీరతాను. 492 00:21:59,069 --> 00:22:01,572 -అబ్బా. -మీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టున్నారు. 493 00:22:01,655 --> 00:22:04,324 మా బెస్ట్ సర్వర్ అతనే, ఇప్పుడు అతను మానేశాడు, పైగా ఆర్డర్ బుక్ కూడా తీసుకెళ్లిపోయాడు, 494 00:22:04,408 --> 00:22:06,326 ఇప్పుడు ఈ డ్రింక్స్ ఎవరికి ఇవ్వాలో ఏమో. 495 00:22:06,410 --> 00:22:09,538 అక్కడ ఉన్న వాళ్లకి మార్టీనీలు, మూడవ టేబుల్ వాళ్లకి ఎక్స్ ట్రా ఆలివ్స్. 496 00:22:09,621 --> 00:22:11,123 ఆ బూత్ లో ఉన్న వ్యక్తికి రా స్కాచ్ ఇవ్వాలి, 497 00:22:11,206 --> 00:22:12,708 ఆ మూలన ఉన్న బూత్ లో ఉండేవాళ్లకి రెండు లార్జులు, 498 00:22:12,791 --> 00:22:15,085 -ఇంకా రెండు నిమ్మ దబ్బల గిమ్లెట్ డ్రింక్ ఇవ్వాలి. -వావ్. నువ్వు సూపర్. 499 00:22:15,169 --> 00:22:17,212 ఒకసారి వెయిట్రెస్ అయ్యాక ఇవన్నీ మర్చిపోలేం కదా. 500 00:22:17,296 --> 00:22:20,841 ఈ పక్కనున్న వ్యక్తికి మీరు బిల్ ఇవ్వకపోతే అతను కట్టకుండానే వెళ్లిపోతాడు. 501 00:22:20,924 --> 00:22:23,760 ఇంకా ఈ కస్టమరుకు ఉద్యోగం కావాలి. 502 00:22:23,844 --> 00:22:25,971 -అయితే సర్వ్ చేసి చూపించు. -ఏంటి, నిజంగా? ఇప్పుడా? 503 00:22:26,054 --> 00:22:27,431 అయ్య బాబోయ్. అలాగే. మంచిది. 504 00:22:27,514 --> 00:22:31,185 -సారీ, అది జాస్పర్ కంపు కొడుతూ ఉంటుంది. -టూనా చేప, ఇంకా కొలోన్ సెంట్? 505 00:22:31,268 --> 00:22:33,729 -అదరగొట్టేయ్, పిన్నీ. -బై బర్తే, టాలెంటే ఉంది నీకు. 506 00:22:33,812 --> 00:22:38,317 ఏంటి? బ్రాండన్హామ్ లో ఏబీకి ఉద్యోగం వస్తుందా? ఎవరికి తెలుసు? 507 00:22:38,400 --> 00:22:41,028 తర్వాతి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అబ్బా, మీకు తెలిసిపోయే ఉంటుంది కదా! తనకి ఉద్యోగం వచ్చేసింది. 508 00:22:42,321 --> 00:22:45,699 నా పార్కులో 18,000 చెట్లు ఉన్నాయి అంటే 18,000 ఆకుల కుప్పలు ఉన్నాయి 509 00:22:45,782 --> 00:22:48,535 వేసవి వచ్చిందంటే నా ఒళ్లంతా చెమటే 510 00:22:49,494 --> 00:22:53,582 అయిదు కోట్ల మంది పార్కును చూడటానికి వస్తారు మహానగర వాసుల ఆయువు పట్టు ఇది 511 00:22:53,665 --> 00:22:56,752 -ఎందరో నా మీద ఆధారపడి ఉన్నారు -ఎందరో నా మీద ఆధారపడి ఉన్నారు 512 00:22:57,294 --> 00:23:00,255 -చాలా చాలా చాలా కష్టపడి పని చేస్తున్నాను -చాలా కష్టపడి పని చేస్తున్నాడు 513 00:23:00,339 --> 00:23:04,426 సెంట్రల్ పార్కుకు మేనేజర్ గా ఉండటమంటే 514 00:23:04,510 --> 00:23:07,221 -పని పని పని ఆలోచనతో చేయాలి -చాలా ఆలోచనతో చేయాలి 515 00:23:07,304 --> 00:23:09,223 ఇంటికి వచ్చేసరికి రాత్రి అవుతుందని పెళ్లాం బిడ్డలకి చెప్పాల్సి వస్తుంది 516 00:23:11,767 --> 00:23:14,061 -అవును, మేము చాలా -చాలా 517 00:23:14,895 --> 00:23:17,064 -చాలా కష్టపడి పని చేస్తున్నాం -చాలా చాలా కష్టపడి పని చేస్తున్నాడు 518 00:23:17,147 --> 00:23:21,068 -చాలా చాలా చాలా కష్టపడి పని చేస్తున్నాను -చాలా చాలా కష్టపడి పని చేస్తున్నాడు 519 00:23:23,153 --> 00:23:25,155 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్