1 00:00:19,061 --> 00:00:24,149 నా పళ్ళు తోముకుంటాను, జుట్టు దువ్వుకుంటాను 2 00:00:24,233 --> 00:00:28,612 అలా చల్లగాలిలోకి వెళ్ళనివ్వండి 3 00:00:28,695 --> 00:00:32,448 నా పనులన్నీ చేసేశా, కాబట్టి అమ్మా… 4 00:00:32,533 --> 00:00:33,742 అమ్మా, కాస్త అర్థం చేసుకో. 5 00:00:33,825 --> 00:00:39,581 ఇది శనివారం మధ్యాహ్నం 6 00:00:40,707 --> 00:00:43,377 అంటే సాహసాలు చేసే సమయం 7 00:00:44,461 --> 00:00:48,090 చెట్లన్నీ ఎక్కేయాలి, నా ప్రాణస్నేహితుడితో 8 00:00:48,799 --> 00:00:51,218 ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండు 9 00:00:51,301 --> 00:00:54,388 ఏ బాదరబందీలూ లేవు, బాల్ ఆటే లోకం 10 00:00:54,471 --> 00:00:58,308 దమ్ముంటే నన్ను పట్టుకోండి 11 00:00:58,392 --> 00:01:01,562 నా జోరు మీ ఊహకి కూడా అందనిది 12 00:01:01,645 --> 00:01:05,816 శనివారం అంటేనే నా రోజు! 13 00:01:05,899 --> 00:01:07,484 అవును, అవునవును! 14 00:01:07,568 --> 00:01:11,196 రాయి మీద పాకుతున్నది, ఏమిటది? గుచ్చి చూద్దామా? 15 00:01:11,280 --> 00:01:14,616 సాహసాల కోసం వెతుకులాట, నన్ను ఆప తరమా? 16 00:01:14,700 --> 00:01:17,953 తిండి, నీరు అక్కరలేదుగా? 17 00:01:18,912 --> 00:01:24,042 నాకు స్వేచ్ఛ కావాలంతే! ఊహ్! 18 00:01:32,634 --> 00:01:33,844 నిజానికి చాలా దాహంగా ఉంది. 19 00:01:35,637 --> 00:01:39,516 సాహసం కోసం దాహమే 20 00:01:39,600 --> 00:01:43,729 పార్క్ లోని నాకు నచ్చినట్టే ప్రతి చెట్టూ ఎక్కేయాలి 21 00:01:43,812 --> 00:01:46,315 ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండు 22 00:01:46,857 --> 00:01:50,068 ఏ బాదరబందీలూ లేవు, బాల్ ఆటే లోకం 23 00:01:50,152 --> 00:01:53,363 నాకిష్టమైన రోజిది, పరుగులే, ఆటలే 24 00:01:53,447 --> 00:01:56,992 ప్రపంచంతో పని లేదు, ఉడుతలా ఉరుకులే 25 00:01:57,075 --> 00:01:59,745 ఇదెప్పుడూ నా రోజే 26 00:01:59,828 --> 00:02:03,707 శనివారమే! 27 00:02:03,790 --> 00:02:06,418 అవునవును 28 00:02:07,586 --> 00:02:09,838 ఎప్పుడూ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండు 29 00:02:09,922 --> 00:02:13,091 ఏ బాదరబందీలూ లేవు, బాల్ ఆటే లోకం 30 00:02:13,675 --> 00:02:14,676 -వద్దు! -ఏంటి? 31 00:02:14,760 --> 00:02:15,802 అది నా వైపుకి పెట్టకు. 32 00:02:15,886 --> 00:02:19,306 ఇదా? ఇది వట్టి కట్టె ముక్కేనండీ. 33 00:02:19,389 --> 00:02:20,974 నాకు దూరంగా ఉంచు దాన్ని. 34 00:02:21,058 --> 00:02:22,518 ఇదొక బొమ్మ, అంతే. 35 00:02:22,601 --> 00:02:23,685 నేను తీసి ఇస్తాను. 36 00:02:23,769 --> 00:02:24,895 దూరంగా ఉండమన్నానా? 37 00:02:24,978 --> 00:02:27,731 సరే. మీరు బాగానే ఉన్నారు కదా? 38 00:02:27,814 --> 00:02:28,982 బాబూ, కోల్. 39 00:02:29,066 --> 00:02:32,152 నీది బొమ్మే కానీ, కాస్త ఆవిడకి దూరంగా ఉంచరాదూ? 40 00:02:32,236 --> 00:02:33,737 -హాయ్ నాన్నా. -హాయ్ బాబూ. 41 00:02:33,820 --> 00:02:35,697 దాన్ని బొమ్మ అని ఎలా అనమంటారు, 42 00:02:35,781 --> 00:02:38,242 దానితో పొదల్లోంచి బయటకి వచ్చి ముఖం మీదే ఊపుతుంటే? 43 00:02:38,325 --> 00:02:40,410 ఏదో ఆటలాడుతున్నాడు అంతే. వీడి వల్ల మీకేం హాని కలగదు. 44 00:02:40,494 --> 00:02:42,371 -హాని కలగదా? నాలుక కోసేస్తా. -కోల్. 45 00:02:42,454 --> 00:02:46,625 -సగౌరవంగా చెప్తున్నా, మీ ముఖం మీద ఊపలేదు వాడు. -బయటకి ఉరికాడు, నా మీదకు దూకాడు… 46 00:02:46,708 --> 00:02:47,709 మీదకి దూకలేదు, 47 00:02:47,793 --> 00:02:49,545 మీ బ్యాగ్ తీసి ఇద్దామని ముందుకి వంగాడు. 48 00:02:49,628 --> 00:02:50,921 నా బ్యాగ్ గురించి మీకు చింత వద్దు. 49 00:02:51,004 --> 00:02:52,923 అతన్ని అదుపులో ఉంచుకోవటం గురించి చింతించండి. 50 00:02:53,006 --> 00:02:54,007 "అదుపులో ఉంచటమా"? 51 00:02:54,091 --> 00:02:56,718 ఏమండీ, ఏమీ భయంకరంగా జరగలేదని తేలిపోయింది కదా? 52 00:02:56,802 --> 00:02:59,388 కానీ నాకు భయం కలిగింది. అది సరైన విషయం కాదు. 53 00:02:59,471 --> 00:03:00,472 ఏది సరైన విషయం కాదో చెప్పనా? 54 00:03:00,556 --> 00:03:03,642 పదకొండేళ్ళ పిల్లాడు బొమ్మని పట్టుకుంటే చూసి మీరు భయపడిపోవటం. 55 00:03:03,725 --> 00:03:05,769 ఎందుకలా? ఎందుకో నాకు తెలుసు. 56 00:03:05,853 --> 00:03:08,272 లేదు. ఇప్పుడు మీరు దీన్ని… 57 00:03:08,355 --> 00:03:10,232 -దీన్ని పట్టుకొని పెడార్థం తీయవద్దు… -ఏమి పెడార్థం? 58 00:03:10,315 --> 00:03:12,442 ఏమండీ, ఇప్పుడు ఇరు వర్గాలకూ ఇబ్బంది లేకుండా 59 00:03:12,526 --> 00:03:15,112 ఉండాలంటే, మీ దారిన మీరు టక్కున వెళ్లిపోతే నయం. 60 00:03:15,195 --> 00:03:18,574 ఇక మేము కూడా అతి ముఖ్యమైన మా సెంట్రల్ పార్క్ వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటాం. 61 00:03:18,949 --> 00:03:19,950 చాలా చాలా థ్యాంక్స్. 62 00:03:20,033 --> 00:03:21,618 కులాసాగా గడపండి. పండగ చేస్కోండి. 63 00:03:21,702 --> 00:03:23,328 ఏమిటి ఆవిడ సమస్య? 64 00:03:23,412 --> 00:03:25,831 బహుశా ఆమెకి ఉడుతలు పడవేమో. 65 00:03:25,914 --> 00:03:28,542 ముఖ్యంగా నా పార్క్ లో తచ్చాడే ఉడుత రౌడీలంటే పడదేమో. 66 00:03:28,625 --> 00:03:31,378 వాళ్ళనే "ఉడౌడీలు" అంటాను నేను. నువ్వు అదే. 67 00:03:31,461 --> 00:03:34,298 నేనేం తచ్చాడట్లేదు. సరదాగా తిరుగుతున్నాను. 68 00:03:34,381 --> 00:03:35,465 సరే, అలాగే కానివ్వు. 69 00:03:35,549 --> 00:03:37,050 లవ్ యూ, నాన్నా, ఇంట్లో కలుద్దాం! 70 00:03:37,134 --> 00:03:39,219 సరే, హాయిగా ఆడుకో, కోల్! 71 00:03:40,220 --> 00:03:43,891 -ఇదే మొదటిసారా? -అవునవును, ఇదే. 72 00:03:43,974 --> 00:03:46,977 -అయితే నువ్వు బహుశా… -అవును, అంతే. 73 00:03:54,610 --> 00:03:56,653 సాధారణంగా ఇప్పుడు నేను మాట కలుపుతూ ఉంటాను 74 00:03:56,737 --> 00:03:59,448 ఏం జరిగిందో సోదాహరణంగా వివరించటానికి. 75 00:03:59,531 --> 00:04:03,785 కానీ ఈసారి, ఆ పని ఓవెన్ చూసుకుంటాడులే. అవును. 76 00:04:15,214 --> 00:04:18,216 అంతగా ఎందుకు భయపడాలి ఆమె? ఏమనుకుంది? 77 00:04:18,300 --> 00:04:21,345 నగరంలో ఉంటూ, ఈపాటికి ఆయుధాలకి అలవాటు పడి ఉండాలి 78 00:04:21,428 --> 00:04:24,473 కత్తులకి, కటారులకి అలవాటు పడి ఉండాలి 79 00:04:24,556 --> 00:04:27,434 అదొక సాధారణ గొడ్డలి, దానికేమయ్యింది? 80 00:04:28,185 --> 00:04:30,646 నేను ఖచ్చితంగా చెప్పగలను 81 00:04:30,729 --> 00:04:33,565 వాడే తెల్ల పిల్లాడు అయ్యుంటే వేరేగా ప్రవర్తించేది ఆవిడ 82 00:04:33,649 --> 00:04:36,818 వాడు నల్ల పిల్లాడు, భయపడటం అందుకే 83 00:04:36,902 --> 00:04:39,863 వాడి పేరు టైలర్ అయ్యుంటే, వాడి ఛాయ తెలుపు అయ్యుంటే 84 00:04:39,947 --> 00:04:43,116 చిన్న పిల్లాడిని చూసి బెదురు ఎందుకు 85 00:04:43,200 --> 00:04:46,203 ఈ అనుమానం శుద్ధ అసంబద్ధం 86 00:04:46,286 --> 00:04:47,746 అది దారుణం 87 00:04:47,829 --> 00:04:50,874 ఇది ఇంకా కొనసాగటం 88 00:04:50,958 --> 00:04:54,044 వడదెబ్బ తగిలితే ఇంకా పెద్ద గాయం అవుతుంది మీకు 89 00:04:54,127 --> 00:04:55,629 మా అబ్బాయి కత్తి తగలటం కంటే 90 00:04:55,712 --> 00:04:58,632 అయినా వాడిది తప్పు అయ్యింది, ఏం? ఎందుకని? 91 00:04:58,715 --> 00:05:01,718 అంతా కూలంకషంగా మాట్లాడితే నయం 92 00:05:02,719 --> 00:05:05,514 వాడి సంతోషం చూడటం కంటే 93 00:05:05,597 --> 00:05:08,016 మళ్లీ మళ్లీ అదే తలచుకుంటున్నాను నేను 94 00:05:08,100 --> 00:05:11,270 ఛ! మళ్లీ మళ్లీ అదే జరుగుతోంది 95 00:05:11,353 --> 00:05:14,064 ఛ! వాడికిలా ఎందుకు జరిగింది? 96 00:05:18,110 --> 00:05:21,363 మళ్లీ మళ్లీ అదే మనసులో ఆడుతోంది 97 00:05:21,446 --> 00:05:23,824 మళ్లీ మళ్లీ అదే జరుగుతోంది 98 00:05:23,907 --> 00:05:26,535 వాడికి ఇలా ఎదురవుతుందని నాకు ముందే తెలుసు 99 00:05:27,661 --> 00:05:29,746 నా బుజ్జివాడి ఆనందాన్ని అందరూ హరించేస్తున్నారు 100 00:05:29,830 --> 00:05:34,751 మన నడక, నడత మీద ఎదుటివారి అభిప్రాయాలు ఉంటాయని మాట్లాడుకోవాలి ఇప్పుడు 101 00:05:34,835 --> 00:05:36,253 మనం మనలా ఉండకూడదు 102 00:05:36,336 --> 00:05:39,381 ఎందుకంటే మన చర్మం ఛాయ అలా ఉంది కనుక 103 00:05:39,464 --> 00:05:40,465 జనాన్ని భయపెట్టేలా 104 00:05:40,549 --> 00:05:43,886 ఎందుకంటే అవతలి వ్యక్తి పోలీసుల్ని పిలవవచ్చు 105 00:05:43,969 --> 00:05:47,139 వాళ్ళు చేతులు పైకెత్తమనచ్చు బెదిరిస్తూ కాల్పులు జరపచ్చు 106 00:05:47,222 --> 00:05:51,685 వాడి పసితనం అప్పుడే పోకూడదని అనుకున్నాము 107 00:05:52,853 --> 00:05:55,147 నాకిదంతా చూస్తే ఒళ్ళు మండుతోంది 108 00:05:55,230 --> 00:05:57,900 ఇలాంటప్పుడే అనిపిస్తుంది 109 00:05:57,983 --> 00:06:00,986 నా పిల్లల్ని కోటలో పెంచాలని 110 00:06:01,069 --> 00:06:04,239 అప్పుడు వాళ్ళు కావలసిన వేషాలు వేయవచ్చు ఆటలు ఆడుకోవచ్చు 111 00:06:04,323 --> 00:06:07,117 ఏ అడ్డంకులు లేకుండా బోలెడన్ని మాయలు చేసుకోవచ్చు 112 00:06:08,827 --> 00:06:10,746 ఈ పార్క్ అందరిదీ 113 00:06:10,829 --> 00:06:13,207 నల్లగా ఉన్నవాళ్ళకి వేరే నియమాలు ఉండరాదు 114 00:06:13,290 --> 00:06:16,460 ఒకరినొకరు మనసు చూడాలి 115 00:06:16,543 --> 00:06:20,088 అందరూ నటిస్తే తప్ప నిజానికి ఎవ్వరికీ స్వేచ్ఛ లేదు 116 00:06:20,172 --> 00:06:22,841 అది బొమ్మ కత్తి పట్టుకుంటే పట్టుకోనివ్వాలి 117 00:06:22,925 --> 00:06:25,761 చెడుగా మాట్లాడాలని నాకేం లేదు 118 00:06:25,844 --> 00:06:28,805 మాట్లాడను, ఆ అవసరమే రాకూడదు 119 00:06:30,390 --> 00:06:32,518 ఆ బుజ్జివాడి ఆనందం పోయింది 120 00:06:33,185 --> 00:06:36,104 మళ్లీ మళ్లీ అదే గుర్తొస్తోంది 121 00:06:36,188 --> 00:06:38,607 మళ్లీ మళ్లీ అదే జరుగుతోంది 122 00:06:38,690 --> 00:06:41,527 ఛ! వాడికిలా ఎందుకు జరగాలి? 123 00:06:45,531 --> 00:06:48,033 మళ్లీ మళ్లీ అదే గుర్తొస్తోంది 124 00:06:51,119 --> 00:06:54,456 -ఇదిగో మీ పుదీనా డ్రింక్. -శభాష్, ఇక నేను పళ్ళు తోముకోవక్కరలేదు. 125 00:06:54,873 --> 00:06:57,417 ఇక ఈరోజుకి నా పని ముగిసింది అనుకుంటున్నాను. 126 00:06:57,501 --> 00:06:58,961 -ఏమిటి, ఉద్యోగం మానేస్తున్నావా? -లేదు. 127 00:06:59,044 --> 00:07:02,130 మీరు ఎలాగూ నేను రాకూడని వేడుకకు వెళ్తున్నారు, కాబట్టి, నేను… 128 00:07:02,714 --> 00:07:04,383 ఓహో, పనివాళ్ళకు సాయం చేయండి అనే సంస్థ. 129 00:07:04,466 --> 00:07:07,010 ఎగ్జిక్యూటివ్స్ కు పని చేసే దేశీయ పని వాళ్ళ కోసం డబ్బు సేకరిస్తుంటారు. 130 00:07:07,094 --> 00:07:09,763 ఒకొక్క సీట్ కి పది వేల డాలర్లు. నీకంత స్తోమత లేదు. 131 00:07:09,847 --> 00:07:11,014 అవును, నా గురించి ఆలోచించారు, థాంక్స్. 132 00:07:11,098 --> 00:07:13,642 మంచిది. ఆ మాట చెప్పటానికి అంత కష్టపడ్డావేం? 133 00:07:13,725 --> 00:07:15,936 -సరే, మళ్లీ కలుద్దాం. బయల్దేరుతున్నా. -వెళ్లి ఏం చేయాలట? 134 00:07:16,019 --> 00:07:19,022 మీకు చెప్పక తప్పదంటే, బోలెడంత అక్కుం బక్కుం చేస్తాను. 135 00:07:19,106 --> 00:07:21,191 ఏమిటది? స్కాండినేవియన్ క్రైమ్ డ్రామానా? 136 00:07:21,275 --> 00:07:25,279 కాదు. నేనేం చేస్తే మీకెందుకు అంటున్నా. సారీ. కనీసం ఈ అయిదు గంటలకైనా. ఉంటాను! 137 00:07:40,752 --> 00:07:44,214 తను లిప్ స్టిక్ వేసుకుందా? స్కార్ఫ్ కూడానా? ఎక్కడకి వెళ్తోంది? 138 00:07:44,298 --> 00:07:46,425 ఓ విషయం చెప్పనా? ఈ పనివాళ్ళకు సాయం చేయండి పార్టీని పక్కకి పడేద్దాం. 139 00:07:46,508 --> 00:07:50,345 నేను వాక్ కి వెళ్ళాలి. హెలెన్! ఓహో, నేను వెంబడించాల్సింది తననే కదూ? 140 00:07:50,929 --> 00:07:52,222 అదీ విషయం. 141 00:07:52,306 --> 00:07:54,099 ఆ తర్వాత ఏమీ జరగనట్టు వెళ్లిపోయింది, 142 00:07:54,183 --> 00:07:56,351 ఆమెకు పిల్లల పట్ల వర్ణ వివక్ష చూపించటం అలవాటు అనుకుంటా. 143 00:07:56,435 --> 00:07:57,561 "చూడటానికేముంది!" అన్నట్టు. 144 00:07:57,644 --> 00:08:00,606 దేవుడా. ఓవెన్, నేను నమ్మలేకపోతున్నాను… అంటే నమ్ముతున్నాను అనుకో. 145 00:08:00,689 --> 00:08:02,065 -ఇలా అవుతుందని ముందే ఊహించాము. -అవునులే. 146 00:08:02,149 --> 00:08:05,944 కానీ ఇంత త్వరగానా? మీ అమ్మగారు ముందే హెచ్చరించారు. అయినా కానీ సిద్ధంగా ఉండలేము కదా? 147 00:08:06,028 --> 00:08:08,572 నిజం చెప్పొద్దూ? నేను కూడా అవాక్కయ్యాను. వాడు చంటి పిల్లాడు. 148 00:08:08,655 --> 00:08:09,823 -ఎవరు చంటి? -దేవుడా! 149 00:08:09,907 --> 00:08:10,908 ఏంటి? ఓడలో భూమిని చుట్టి వచ్చిన 150 00:08:10,991 --> 00:08:12,701 ఆ 12 ఏళ్ళ పిల్ల గురించి మాట్లాడుకుంటున్నారా? 151 00:08:12,784 --> 00:08:15,037 ఆమె దగ్గర దిక్సూచి ఉంది. కనుక అది లెక్కలోకి రాదు. 152 00:08:15,120 --> 00:08:17,873 లేదు, అమ్మ, నేను తల్లిదండ్రుల కబుర్లు ఏవో చెప్పుకుంటున్నాం. 153 00:08:17,956 --> 00:08:20,375 -అప్పులు, బకాయిలు, తగ్గింపులు, ఆదాయం… -టాక్సులు, వడ్డీలు… 154 00:08:20,459 --> 00:08:22,377 సరే, మీరు ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు. 155 00:08:22,461 --> 00:08:23,837 తనకి చెప్పేస్తే నయం. 156 00:08:23,921 --> 00:08:26,673 మోలీ, పార్క్ లో ఇందాక ఒకామె కోల్ పట్ల వర్ణ వివక్ష చూపించింది. 157 00:08:26,757 --> 00:08:27,758 నిజమా? 158 00:08:27,841 --> 00:08:29,635 అస్సలు ఈ విషయం కాదు గానీ, నాన్నా, ఒకరిని కొట్టటానికో, 159 00:08:29,718 --> 00:08:31,553 గుచ్చటానికో నేనొక గోల్ఫ్ కార్ట్ తీసుకువెళ్ళవచ్చా? 160 00:08:31,637 --> 00:08:33,722 నీ ఉత్సాహం బాగుంది కానీ, ఈ విషయంలో సరైన మార్గంలో నడుచుకుందాం. 161 00:08:33,804 --> 00:08:36,183 అయ్యో, అసలు వాడు ఎలా స్పందించాడు? భయపడిపోయాడా? 162 00:08:36,265 --> 00:08:39,019 నిజం చెప్పాలంటే, ఆమె వర్ణ వివక్ష చూపుతోందని కూడా వాడికి అర్థమైనట్టు లేదు. 163 00:08:39,102 --> 00:08:41,145 -అయితే, నువ్వు… -ఏంటి? 164 00:08:41,230 --> 00:08:43,774 వాడితో మాట్లాడతావా? అంటే ఈ విషయంలో నువ్వెలా చెప్తే అలాగే. 165 00:08:43,857 --> 00:08:46,652 అవును. అవునవును. మాట్లాడాలనే అనుకుంటున్నాను… 166 00:08:46,735 --> 00:08:49,821 -హే! బుజ్జీ! -కోల్! హాయ్! 167 00:08:49,905 --> 00:08:50,948 హాయ్ బంగారం. 168 00:08:51,323 --> 00:08:53,700 దా నాన్నా, అమ్మని వచ్చి హత్తుకో. ఐ లవ్ యూ. 169 00:08:53,784 --> 00:08:55,786 సమయం లేదు, మిత్రమా! ఏర్పాట్లు చేయాలి! 170 00:08:55,869 --> 00:08:57,871 మరచిపోయారా? ఈరోజు కౌముదీ సమావేశం ఉంది. 171 00:08:57,955 --> 00:09:00,040 అవును. కౌముదీ సమావేశం ఈ రాత్రే. 172 00:09:00,123 --> 00:09:03,293 కనుక, మనం ఆ విషయం మీద ధ్యాస పెడదాం, 173 00:09:03,377 --> 00:09:06,255 రేపు మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. 174 00:09:06,338 --> 00:09:07,714 కౌముదీ సమావేశం అంటే ఏమిటి? 175 00:09:07,798 --> 00:09:09,174 అవును, ఏమిటది? 176 00:09:09,258 --> 00:09:10,551 నిశ్శబ్దం, మహిళామణులారా. 177 00:09:10,634 --> 00:09:12,636 కోల్, మహిళామణులతో మాట్లాడే విధానం అది కాదు… 178 00:09:12,719 --> 00:09:14,555 నా ఉద్దేశం, మహిళలతో. అయ్యో, నేనూ అదే చేస్తున్నా. 179 00:09:14,638 --> 00:09:16,181 సరే, ఇది నేను వివరించగలను. 180 00:09:16,265 --> 00:09:19,184 ఉడుతా మజాకా ప్రపంచంలో జరిగే ఒక కార్యక్రమమే కౌముదీ సమావేశం. 181 00:09:19,268 --> 00:09:20,644 ఉడుతా మజాకా పుల్లలు, రెమ్మల సింహాసనం 182 00:09:20,727 --> 00:09:22,437 మూడేళ్ళకి ఒకసారి పౌర్ణమి నాడు జరిగే సమావేశం ఇది. 183 00:09:22,521 --> 00:09:23,981 దీనికి పెద్దవారు మాత్రమే హాజరవ్వాలి. 184 00:09:24,064 --> 00:09:26,358 ప్రకటనలు జరుగుతాయి, ప్రతీకారాలు తీర్చుకోబడతాయి, 185 00:09:26,441 --> 00:09:29,069 శత్రువులు మిత్రులవుతారు, మిత్రువులు శత్రువులవుతారు. 186 00:09:29,152 --> 00:09:32,197 కోల్ కి చాలా ఉత్సాహంగా ఉంది, ఎందుకంటే తను ఇష్టంగా పోషించే పాత్ర 187 00:09:32,281 --> 00:09:34,741 చిల్లర దొంగ మొసాయస్ ఇప్పుడు దొంగల ముఠాలో ముఖ్యుడు. 188 00:09:34,825 --> 00:09:35,826 లెవెల్ అప్ 189 00:09:35,909 --> 00:09:38,787 కనుక పార్క్ లో ఈ రాత్రి జరిగే వేడుకలో పాల్గొనే అవకాశం మొత్తానికి తనకి వచ్చింది. 190 00:09:38,871 --> 00:09:41,123 గుర్తుందా నాన్నా? నాకు పెద్దమనిషి తరహాగా ఉండే కొత్త కాస్ట్యూమ్ 191 00:09:41,206 --> 00:09:42,416 కొనటానికి తీసుకువెళ్తానని మాటిచ్చావు. 192 00:09:42,499 --> 00:09:45,294 ఒక్క నిమిషం, నీకు కాస్ట్యూమ్ ఉంది కదా? ఆయుధం కూడా ఉంది కదా? 193 00:09:45,377 --> 00:09:46,545 ఇది కత్తి. 194 00:09:46,628 --> 00:09:49,631 మొసాయస్ కి నిజమైన ఖడ్గం ఉండాలి తన స్థాయికి తగ్గట్టు. 195 00:09:49,715 --> 00:09:52,551 శత్రువుల వెన్నులో వణుకు పుట్టించగల వేషధారణ కూడా ఉండాలి. 196 00:09:52,634 --> 00:09:55,053 ఉతికిన అండర్వేర్ వేసుకొని వస్తాను. కొత్త కాస్ట్యూమ్స్ వేసుకొని చూడాలంటే అదే మంచిది. 197 00:09:55,137 --> 00:09:57,598 అబ్బో, అయితే ఇంకా భయంకరమైన కాస్ట్యూమ్ వస్తోందా వాడికి? 198 00:09:57,681 --> 00:10:00,601 -దానితో పాటే నిజమైనది అనిపించే పెద్ద ఖడ్గం కూడానా? -అవునవును. 199 00:10:00,684 --> 00:10:02,728 వాటితో పార్క్ లో రాత్రి పూట తిరగటానికి వీలుగా? 200 00:10:02,811 --> 00:10:04,813 నిజం చెప్పాలంటే ఖడ్గం పరిమాణం ఎంతో వాడు ప్రస్తావించనేలేదు. 201 00:10:04,897 --> 00:10:06,565 రూపం ఎలా ఉండాలో చెప్పాడు, అంతే. 202 00:10:06,648 --> 00:10:09,276 ఏమో, కొన్ని వారాలుగా రకరకాల ఖడ్గాల బొమ్మలు గీయటం చూస్తున్నాను. 203 00:10:09,359 --> 00:10:10,777 పెద్ద ఖడ్గమే అడిగేలా ఉన్నాడు, నాన్నా. 204 00:10:10,861 --> 00:10:13,447 మనం వాడితో మాట్లాడాలి, ఓవెన్. ఇందాక అన్నట్టు నీ మాటే నా మాట అనుకో. 205 00:10:13,530 --> 00:10:14,698 మాట్లాడతాను. 206 00:10:14,781 --> 00:10:17,576 కాస్ట్యూమ్ షాప్ కి వెళ్తూ వెళ్తూ తండ్రీ కొడుకులం చక్కగా మాట్లాడుకుంటాం. 207 00:10:17,659 --> 00:10:20,454 ఇంకా సమయం ఉంటే వేరే పెద్దవాళ్ళ విషయాలు కూడా చర్చిస్తాను. 208 00:10:20,537 --> 00:10:21,705 అంత తొందరపడకు, బంగారం. 209 00:10:24,625 --> 00:10:26,376 హాయ్, మీకు రిజర్వేషన్ ఉందా? 210 00:10:26,460 --> 00:10:28,921 లేదు, కానీ ఆ టేబుల్ కనిపిస్తూ ఉండేలా ఒక టేబుల్ కావాలి. 211 00:10:29,004 --> 00:10:31,048 కానీ నా టేబుల్ వాళ్ళకి కనపడకూడదు. అర్థమయ్యిందిగా? 212 00:10:31,590 --> 00:10:33,300 సారీ. అసలు ఖాళీలు లేవు, మేడమ్. 213 00:10:33,383 --> 00:10:36,220 -థ్యాంక్యూ. -అబ్బా, నాకు ఆ సుత్తి కబుర్లు చెప్పకు. 214 00:10:36,303 --> 00:10:38,263 మేడమ్ అని కూడా అనవద్దు. మనం ఒకే వయసు వాళ్ళం. 215 00:10:38,347 --> 00:10:42,476 మా దగ్గర నిజంగానే ఖాళీ లేదు, మేడమ్… అమ్మ… మిస్. 216 00:10:42,559 --> 00:10:44,520 ఇప్పుడిక ఏమని పిలవాలో తెలియట్లేదు. 217 00:10:45,020 --> 00:10:46,104 ఇది చూడు. 218 00:10:46,188 --> 00:10:47,940 నాకు ఏదైనా టికెట్ ఇస్తున్నారా? ఏమిటది? 219 00:10:48,023 --> 00:10:49,483 -ఇది చెక్ బుక్. -ఏమిటది? 220 00:10:49,566 --> 00:10:52,069 డబ్బు! డబ్బు ఇస్తున్నాను. దేవుడా. ఇదిగో. 221 00:10:52,819 --> 00:10:55,906 ఓహో! ఓ విషయం చెప్పనా? ఇప్పుడే ఒక టేబుల్ ఖాళీ అయినట్టుంది. 222 00:10:55,989 --> 00:10:57,157 ఇలా రండి, వ్యక్తీ. 223 00:11:02,287 --> 00:11:04,289 -ఇదిగోండి మెనూ. -సోది తగ్గించి, బయల్దేరు. 224 00:11:04,373 --> 00:11:09,795 హెలెన్, హెలెన్, హెలెన్. నీతో ఉన్నందుకే నా మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది. 225 00:11:09,878 --> 00:11:13,090 -స్పెన్సర్, నిన్ను మళ్లీ చూడటం బాగుంది. -నీకు కనబడటం బాగుంది. 226 00:11:13,173 --> 00:11:16,176 నీకేం కావాలంటే అది చెప్పు, బంగారం. కానీ నాకు రొయ్యలు పడవు. 227 00:11:16,260 --> 00:11:17,594 అలాగని గొప్పగా చెప్తున్నావా? 228 00:11:17,678 --> 00:11:19,847 నీ మనసులో మాటను ఎప్పటికి బయటపెడతావు? 229 00:11:19,930 --> 00:11:23,183 స్టార్టర్స్ ఆర్డర్ చేశాక పెట్టచ్చేమో? అబ్బా, రొయ్యలు చూస్తే నోరూరుతోందే. 230 00:11:23,267 --> 00:11:26,019 పర్లేదు, పర్లేదు. మన ప్రేమ కోసం భరిస్తాను. 231 00:11:26,103 --> 00:11:29,231 ప్రేమా? అబ్బా. ప్రేమా? ప్రేమా? 232 00:11:30,607 --> 00:11:31,817 హేయ్, ఒకటి అడగనా? 233 00:11:31,900 --> 00:11:34,319 -నీ ఆముదీ సమావేశం గురించేనా? -చాల్లే వెటకారం. 234 00:11:34,403 --> 00:11:36,530 లేదు గానీ, అమ్మ, నాన్న "ఉమ" విషయంలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని 235 00:11:36,613 --> 00:11:39,157 నువ్వు గమనించావా అని. 236 00:11:39,241 --> 00:11:42,703 "ఉమ"నా? ఓహో, ఉడుతా మజాకానా? దాన్ని అలా ఎప్పటి నుంచి అంటున్నారు? 237 00:11:43,287 --> 00:11:44,872 వాళ్ళకి నీ గురించి చింత ఉంది అనుకుంటా. 238 00:11:45,747 --> 00:11:47,207 సరే, అర్థమయ్యింది. 239 00:11:47,291 --> 00:11:49,376 అవునా? ఏం అర్థమయ్యింది? 240 00:11:49,459 --> 00:11:51,753 ఉడుతా మజాకా చూసే వయసు దాటేశానని అమ్మ, నాన్న ఉద్దేశం. 241 00:11:51,837 --> 00:11:53,714 కోల్, నీకు వర్ణ వివక్ష గురించి తెలుసు కదా? 242 00:11:53,797 --> 00:11:56,133 తెలుసు, నేనేం చిన్న బాబుని కాను. ఇక నా సమస్య మీద దృష్టి పెడదామా? 243 00:11:56,216 --> 00:11:58,635 అలాగే. అవును. నీ సమస్య. 244 00:11:58,719 --> 00:12:00,762 ఎలర్బీ భూతాల కోన దాటటానికి మొసాయస్ 245 00:12:00,846 --> 00:12:03,223 ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాడో తెలిస్తే అమ్మానాన్నలు 246 00:12:03,307 --> 00:12:05,392 -తమ మనస్సులను మార్చుకుంటారు అనుకుంటా. -ఆహా. అవును. 247 00:12:06,143 --> 00:12:08,437 ఇదిగో చూడు, నాన్నా! నేను ఆ కొమ్మని తాకతాను. 248 00:12:08,854 --> 00:12:11,982 అందలేదు! మళ్లీ. అయ్యో, మళ్లీ తప్పింది. 249 00:12:12,065 --> 00:12:16,403 కోల్, నాన్నా. నువ్వంటే నాకిష్టం. ఒక నల్లవాడిగా, ఒక తండ్రిగా, నేను… 250 00:12:16,486 --> 00:12:19,740 ఏమన్నావు, నాన్నా? మామూలుగా కంటే ఎక్కువ ఎత్తు ఎగురుతున్నానా? చూడు! 251 00:12:19,823 --> 00:12:20,949 అవును, భలే ఎగిరావు. 252 00:12:21,033 --> 00:12:23,243 మామూలుగా కంటే ఎక్కువ ఎత్తో కాదో చెప్పలేను కానీ, 253 00:12:23,327 --> 00:12:25,579 కొద్దిగా నెమ్మదిస్తావా? 254 00:12:25,662 --> 00:12:27,414 నీతో ఒక విషయం మాట్లాడాలి. 255 00:12:27,497 --> 00:12:29,124 మొసాయస్ విషయంలో నాకు చాలా ఉత్సాహంగా ఉంది. 256 00:12:29,208 --> 00:12:31,335 తను బహిష్కరించబడినప్పటి నుంచి ఈ రాత్రి కోసమే ఎదురుచూస్తున్నాడు. 257 00:12:31,418 --> 00:12:32,419 మొసాయస్ ని బహిష్కరించారా? 258 00:12:32,503 --> 00:12:34,421 అవును, ఎందుకంటే అతనిపై మంత్ర ముద్ర ఉంది కనుక. 259 00:12:35,005 --> 00:12:37,049 అంటే అతనికి పుట్టుకతో వచ్చినది తప్ప వేరే ఏ కారణం లేకుండా 260 00:12:37,132 --> 00:12:38,300 అతన్ని బహిష్కరించారా? 261 00:12:38,383 --> 00:12:40,093 -ఈ ప్రస్తావన బాగా కుదిరింది. -కాదు. 262 00:12:40,177 --> 00:12:41,220 మాయాజాల ప్రపంచంలో 263 00:12:41,303 --> 00:12:43,263 ఆడిన మాట తప్పినవారికి మంత్ర ముద్ర వస్తుంది. 264 00:12:43,347 --> 00:12:45,724 -నేను ముందు విషయం కూడా చెప్పాలి. -వద్దు, వద్దు. 265 00:12:45,807 --> 00:12:47,935 ముందు భాగాలన్నీ చదవకపోతే నీకిది ఏమీ అర్థం కాదు. 266 00:12:48,018 --> 00:12:51,021 ఘన హిమ కాలానికి ముందు, మొట్టమొదట విధివిధానాలు రాసిన రోజుల్లో… 267 00:12:51,104 --> 00:12:53,482 కోల్! ముందు నన్ను… ముందు ఒక మాట మాట్లాడనివ్వు కన్నా. 268 00:12:53,565 --> 00:12:55,567 మొసాయస్ ఎలా సవాళ్ళను ఎదుర్కొన్నాడో నీకు తెలుసు కదా? 269 00:12:56,568 --> 00:12:58,862 ఒకోసారి అలాగే నిజ జీవితంలోనూ సవాళ్ళు ఎదురవుతాయి. 270 00:12:58,946 --> 00:13:02,032 ముఖ్యంగా కొన్ని వర్గాల ప్రజలకి. 271 00:13:02,115 --> 00:13:03,242 "ఉమ"లో అలాగే, 272 00:13:03,325 --> 00:13:05,536 చుంచులు తక్కువ జాతిలో పుట్టటం వల్ల పై కులాలను అందుకోవటం చాలా కష్టం. 273 00:13:05,619 --> 00:13:08,789 నేను మాట్లాడుతున్న విషయం ఉడుతా మజాకా కాదు. 274 00:13:09,206 --> 00:13:10,249 వచ్చేశాం! 275 00:13:10,332 --> 00:13:11,750 హేయ్! కోల్! లోపలకి వెళ్ళే ముందు… 276 00:13:11,834 --> 00:13:13,627 సారీ నాన్నా. ఈ హుషారులో నాకు నీ మాట కూడా వినిపించట్లేదు. 277 00:13:13,710 --> 00:13:14,795 కాస్ట్యూమ్ దుకాణం 278 00:13:14,878 --> 00:13:18,382 వావ్! అన్ని ప్రసిద్ధ పుస్తకాలు, పౌరాణిక నాటకాల్లోని పాత్రల కాస్ట్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ. 279 00:13:18,465 --> 00:13:22,135 ప్లాస్మా క్రానికిల్స్, పొగమంచు పర్వత మేకబాలలు, పిట్ట పోరాటాలు. 280 00:13:22,719 --> 00:13:25,889 ఇదిగో. ఉమ విభాగం దొరికేసింది. టకటకా ఇవి వేసుకొని చూస్తాను. 281 00:13:25,973 --> 00:13:27,432 హేయ్, కోల్, ఆగు! 282 00:13:27,516 --> 00:13:29,226 ఇది చూడు, బాగుంది. 283 00:13:29,309 --> 00:13:31,270 అదిరిపోయింది. 284 00:13:31,353 --> 00:13:33,689 ఆయుధాలు కూడా లేవు. లేదులే. ఇప్పుడే ధర చూశాను. 285 00:13:33,772 --> 00:13:35,941 మామూలుగా అయితే భయంకరంగా ఉన్నది కావాలనుకున్నాను. 286 00:13:36,024 --> 00:13:38,986 కానీ ఇందులో ఉన్న సునిశిత క్రూరత్వం నన్ను ఆకట్టుకుంది. ఇలా చూడు. 287 00:13:40,153 --> 00:13:42,990 వావ్. భయంకరంగా ఉంది, అచ్చం నిజమైనదిలానే ఉంది. 288 00:13:43,073 --> 00:13:44,074 థ్యాంక్స్, నాన్నా. 289 00:13:44,157 --> 00:13:46,410 ఆ బటన్లన్నీ బుల్లి బుల్లి కత్తులా? 290 00:13:46,493 --> 00:13:47,911 గమనించావన్నమాట! ఇప్పుడే వేసుకొని వెళ్ళవచ్చా? 291 00:13:47,995 --> 00:13:49,663 అలాగే, అలాగే. 292 00:13:50,747 --> 00:13:53,500 నేను ఊహించిన దానికంటే ఇంకా భయంకరంగా ఉంది. 293 00:13:53,584 --> 00:13:54,710 ఈ కాస్ట్యూమ్ ని కొనే ముందు 294 00:13:54,793 --> 00:13:56,461 మీరిద్దరూ మాట్లాడుకున్నారా? 295 00:13:56,545 --> 00:14:00,340 మాకు ఆ అవకాశం రాలేదు. 296 00:14:00,424 --> 00:14:03,135 అదే, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళారు కదా అని… 297 00:14:03,218 --> 00:14:04,928 -వేరే విషయాల గురించి మాట్లాడుకున్నాం. -అర్థమయ్యింది. 298 00:14:05,012 --> 00:14:06,096 ఇక ఇది విప్పేస్తాను. 299 00:14:06,180 --> 00:14:07,931 లేకపోతే రాత్రి లోగా చెమట పట్టేస్తుంది. 300 00:14:08,640 --> 00:14:10,267 ఏమీ అనవద్దు! ఎవ్వరూ కూడా. 301 00:14:10,350 --> 00:14:13,353 వాడు చాలా హుషారుగా ఉన్నాడు. దానిపై నీళ్ళు చల్లటం నాకిష్టం లేకపోయింది. 302 00:14:13,437 --> 00:14:16,940 నేను వాడి తండ్రిని. వాడి ఊరేగింపులో ముందు బాజాలు వాయించాల్సినవాడిని. 303 00:14:17,024 --> 00:14:19,943 లేకపోతే ఆఖరున డప్పులు… నాకు ఈ పోలిక పెద్దగా నచ్చలేదు, 304 00:14:20,027 --> 00:14:21,570 -కానీ మీకు విషయం అర్థమయ్యింది కదా? -హా, నాన్నా. 305 00:14:21,653 --> 00:14:24,031 కన్నా, ఊరేగింపు వెళ్ళే దారిలో బురదగుంట ఒకటుంది. 306 00:14:24,114 --> 00:14:25,657 దాని గురించి వాడిని హెచ్చరించక తప్పదు. 307 00:14:26,283 --> 00:14:27,659 నా పోలికతో నన్నే తిప్పికొట్టావా? 308 00:14:27,743 --> 00:14:29,745 -నాకది వెన్నతో పెట్టిన విద్య. -నేను వాడితో మాట్లాడతాను. 309 00:14:29,828 --> 00:14:32,289 హెలెన్ ప్రియుడు ఎంత నిబ్బరంగా మాట్లాడుతున్నాడంటే, 310 00:14:32,372 --> 00:14:34,374 హెలెన్ తనని వదిలేసి వెళ్తుందేమో అని బిట్సీకి భయం మొదలయ్యింది. 311 00:14:34,458 --> 00:14:37,252 కనుక వాళ్ళ డేట్ ని పాడుచేయటానికి విశ్వప్రయత్నం మొదలుపెట్టింది. 312 00:14:37,336 --> 00:14:39,171 పాడుచేయటం అంటే, పగలే తప్పతాగుతూ, 313 00:14:39,254 --> 00:14:41,089 మెనూ వెనుక నుంచి కళ్ళతోనే బాకులు విసరటం. 314 00:14:41,173 --> 00:14:44,176 హెలెన్, ఆ ఒక్క మాట చెప్పు, నేను నిన్ను అన్నిటి నుంచి దూరంగా తీసుకుపోతాను. 315 00:14:44,259 --> 00:14:47,763 ముందు తినేస్తే బాగుంటుందేమో? నేనింకా స్వీట్ తినాలి. 316 00:14:47,846 --> 00:14:50,015 ఓహ్, ఓహ్, ఓహ్ 317 00:14:50,098 --> 00:14:52,476 ఏం చేస్తున్నావు… వద్దు. ఆపు. 318 00:14:52,559 --> 00:14:55,062 -ఆపు. ఆపేసేయ్. -ఓహ్, ఓహ్, ఓహ్ 319 00:14:55,145 --> 00:14:57,231 ఏంటి? ఏం జరుగుతోంది? నువ్వేం… 320 00:14:57,314 --> 00:14:59,399 ఏ పిల్లా. ఏంటి విషయం? ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? 321 00:14:59,483 --> 00:15:01,610 నీకేం కావాలో చెప్పేయ్ ఎక్కడ ఉండాలనుకుంటున్నావో చెప్పు 322 00:15:01,693 --> 00:15:03,946 హాయిగా కూర్చొని నాతో వచ్చేయ్ 323 00:15:04,029 --> 00:15:06,031 నిన్ను మేఘాల్లో తేలుస్తాను 324 00:15:06,114 --> 00:15:08,075 ఓహో, ఒక్క నిముషం అలా ఆగు 325 00:15:08,158 --> 00:15:10,327 నాకు నీ సాయం అక్కరలేదు 326 00:15:10,410 --> 00:15:13,914 నీతో గడపాలి, స్వీట్ ఆస్వాదించాలి, అదే చాలు 327 00:15:14,164 --> 00:15:15,165 అది. రుచి అదిరింది. 328 00:15:15,249 --> 00:15:19,670 నిన్ను నా కోటకి రాణిని చేయాలి పిల్లా 329 00:15:19,753 --> 00:15:21,839 నీతో ఊసులు చెప్పాలి పిల్లా 330 00:15:21,922 --> 00:15:25,425 నన్ను తప్పించుకుంటూ నీ బాసుని తిట్టుకుంటూ ఉంటావెందుకు 331 00:15:25,509 --> 00:15:28,887 నిజమే పిల్లా, నీకు విముక్తిని ప్రసాదించాలి 332 00:15:28,971 --> 00:15:32,516 నాకన్నీ ఉన్నాయి, నువ్వు తప్ప, పిల్లా నాతోనే ఉండు… 333 00:15:32,599 --> 00:15:34,560 నువ్వనేది బాగుంది గానీ, ఈ తిండి పాడవుతుంది 334 00:15:34,643 --> 00:15:35,686 కాబట్టి ముందు దీన్ని లాగిద్దాం. 335 00:15:35,769 --> 00:15:37,396 ఇక కుక్కను నడిపించడాలు సేవలు చేయడాలన్నీ బంద్ 336 00:15:37,479 --> 00:15:39,481 నేను వచ్చినందుకు ఆనందంగా లేదా? 337 00:15:39,565 --> 00:15:41,733 బిట్సీ పడిపోయి లేవలేకపోవటం 338 00:15:41,817 --> 00:15:43,902 నువ్వు తనను చూడాల్సిరావటం… అబ్బో 339 00:15:43,986 --> 00:15:47,698 నిన్ను నా కోటకి రాణిని చేయాలి 340 00:15:47,781 --> 00:15:50,242 నీతో ఊసులు చెప్పాలే పిల్లా 341 00:15:50,325 --> 00:15:52,369 నువ్వు నన్ను తప్పించుకుంటూ 342 00:15:52,452 --> 00:15:54,955 నీ బాసుని తిట్టుకుంటూ ఉంటావెందుకు 343 00:15:55,038 --> 00:15:56,999 నా న నా న నా నా 344 00:15:57,082 --> 00:15:59,168 మేడమ్, మా వద్ద ఉన్న స్వీట్లు చూస్తారా? 345 00:15:59,251 --> 00:16:02,087 వద్దు! నాకేమీ… ఇక్కడ నుండి… పూతరేకులు. 346 00:16:02,171 --> 00:16:04,423 వద్దు, వద్దు. వదిలేయ్. ఇక వాళ్ళని చూడలేను కూడా. 347 00:16:04,506 --> 00:16:08,302 బిట్సీ పోయాక నాకు పెద్ద పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి 348 00:16:08,385 --> 00:16:09,469 అంటే బక్కెట్ తన్నేస్తే. 349 00:16:09,553 --> 00:16:11,013 నాకు, ఆ కుక్కకి మాత్రమే తెలుసు 350 00:16:11,096 --> 00:16:14,099 మాలో ఒకరం డబ్బులో పడి దొర్లుతాం 351 00:16:14,683 --> 00:16:20,564 చాలా చాలా చాలా డబ్బుగల దాన్ని అవుతాను 352 00:16:20,647 --> 00:16:22,941 ఈ స్వీట్ లాగే. భలే ఉందిలే. 353 00:16:23,025 --> 00:16:27,154 కానీ నాకు నువ్వు కావాలి, పిల్లా నువ్వు తప్ప అన్నీ ఉన్నాయి, పిల్లా 354 00:16:27,237 --> 00:16:28,822 బెంట్లీ అనే కుక్క ఉంది 355 00:16:28,906 --> 00:16:30,032 ఉపయోగం లేదు. 356 00:16:30,115 --> 00:16:31,867 చక్కటి ఇరుగు పొరుగు ఉన్నారు 357 00:16:31,950 --> 00:16:34,661 -న్యూయార్క్ సిటీలో అది అరుదు. -కదా? మరి రా. 358 00:16:34,745 --> 00:16:37,206 నాకు కావలసింది నువ్వే పిల్లా 359 00:16:37,998 --> 00:16:40,626 అయితే ఏమంటావు? కలిసుందామా? చివరి వరకు? 360 00:16:42,711 --> 00:16:44,963 సరే. సరే. 361 00:16:45,047 --> 00:16:48,884 -సరే. -నాన్నా, బానే ఉన్నావా? 362 00:16:48,967 --> 00:16:50,802 గత అయిదు నిముషాలుగా సరే, సరే అంటూనే ఉన్నావు. 363 00:16:50,886 --> 00:16:51,720 ఏంటి విషయం? 364 00:16:51,803 --> 00:16:54,431 సారీ, నానీ. ఇది… ఇది చాలా ముఖ్యమైన క్షణం. 365 00:16:54,515 --> 00:16:55,766 దీన్ని చక్కగా చెప్పాలనే కిందా మీదా పడుతున్నా. 366 00:16:55,849 --> 00:16:58,602 ఈరోజు ఉదయం ఆవిడతో నీకు ఎదురైన సంఘటన గుర్తుంది కదా? 367 00:16:58,685 --> 00:17:00,354 అవును, చాలా ఆవేశపడింది ఆవిడ. 368 00:17:00,437 --> 00:17:01,939 కళ్ళకి గంతలు కడితే ఆవిడకి భయమంటావా? 369 00:17:02,981 --> 00:17:06,359 నేను అనుకుంటున్నది ఆవిడకి నల్లవాళ్ళంటే భయమేమో అని. 370 00:17:07,569 --> 00:17:10,531 కానీ ఆవిడకి నేనంటే భయమెందుకు? నేను చిన్నపిల్లాడినే కదా? 371 00:17:10,614 --> 00:17:11,949 ఇది క్లిష్టమైన విషయం నాన్నా. 372 00:17:12,031 --> 00:17:14,660 ఒకసారి అపోహల గురించి మాట్లాడాను, గుర్తుందా? 373 00:17:14,742 --> 00:17:16,662 -నల్లవాళ్ళ గురించి ఎలా భావిస్తారో చెప్పాను కదా? -అవును. 374 00:17:16,744 --> 00:17:19,414 దాని నేపథ్యం, కథా కమామిషు… 375 00:17:19,498 --> 00:17:22,209 ఇంకా చాలానే ఉంది నీకు చెప్పటానికి. 376 00:17:22,291 --> 00:17:24,752 -సరే. -సమయం గడిచేకొద్దీ, ఈ అపోహలు 377 00:17:24,837 --> 00:17:28,257 బానిసల యజమానులు, క్లాన్ సభ్యుల చేత సృష్టించబడినప్పటికీ 378 00:17:28,339 --> 00:17:29,925 వాటిని వాస్తవాలుగానే భావించారు, 379 00:17:30,008 --> 00:17:32,344 అధికారిక పోలీస్ సిద్ధాంతాలను కూడా ప్రభావితం చేసేలా. 380 00:17:32,427 --> 00:17:35,180 మనకంతగా బాధ కలగదని, చేతులతో పీక పిసికినా కూడా 381 00:17:35,264 --> 00:17:36,932 మనకి నొప్పి ఉండదని వాదిస్తారు కూడా. 382 00:17:37,015 --> 00:17:38,976 -చూశావా ఎంత దారుణమో? -చాలా దారుణం. 383 00:17:39,059 --> 00:17:41,687 అమ్మ తెల్ల ఆమె అయినా నీ కంటే బోలెడు బలవంతురాలు తను. 384 00:17:41,770 --> 00:17:42,771 అవును! 385 00:17:42,855 --> 00:17:45,065 నల్లవాళ్ళపై ఉన్న అపోహలపై నల్లవాళ్ళు సవాలు చేయటానికి 386 00:17:45,148 --> 00:17:49,403 ఒక శతాబ్ద సమయం పట్టింది, అది కూడా డాక్టర్ కింగ్, మాల్కమ్ ఎక్స్, 387 00:17:49,486 --> 00:17:52,990 మొహమ్మద్ అలీ, జేమ్స్ బ్రౌన్ వంటి వారి సంయుక్త ప్రయత్నం వల్ల. 388 00:17:53,073 --> 00:17:54,324 నాకు వాళ్ళంతా తెలుసు. 389 00:17:54,408 --> 00:17:58,495 డాక్టర్ కింగ్ శాంతిని ప్రబోధించారు. మాల్కమ్ ఎక్స్ అవసరమైతేనే హింస అన్నారు. మొహమ్మద్ అలీ బాక్సింగ్. 390 00:17:58,579 --> 00:18:00,080 ఇది పరీక్ష కాదనుకో, కానీ శభాష్. 391 00:18:00,163 --> 00:18:02,833 ఇక రాడ్నీ కింగ్ వీడియో వచ్చాక, 392 00:18:02,916 --> 00:18:04,334 ఇదంతా నల్లవాళ్ళు కల్పిస్తున్నారు అని 393 00:18:04,418 --> 00:18:06,837 కొట్టిపారేయటం అసంభవం అయ్యింది. 394 00:18:06,920 --> 00:18:07,921 రాడ్నీ కింగ్. 395 00:18:08,005 --> 00:18:11,175 నాకు అతనెవరో తెలిసి ఉండాల్సింది, కానీ తెలియదు. 396 00:18:11,258 --> 00:18:13,802 పర్వాలేదు. ఒకేసారి నీకు బోలెడన్ని విషయాలు చెప్పేస్తున్నా. 397 00:18:13,886 --> 00:18:18,265 ఇంత జరిగినా, ఇంకా కొందరు మనల్ని ప్రమాదకరం అనుకుంటారు. 398 00:18:18,348 --> 00:18:19,349 నిన్ను కూడానా? 399 00:18:19,433 --> 00:18:21,727 కోల్, ఎన్నోసార్లు నన్ను ఒక భయంకరమైన నల్లవాడినని అనుకున్నారు. 400 00:18:21,810 --> 00:18:23,770 మొక్కల పెంపకానికి పనిముట్లను కొనడానికి నేను వెళ్లడం మానేయాల్సి వచ్చింది. 401 00:18:23,854 --> 00:18:26,064 నిజానికి మీ అమ్మ కుటుంబాన్ని మొట్టమొదటిసారి కలిసినప్పుడు… 402 00:18:26,148 --> 00:18:27,566 ఏమిటి, అమ్మమ్మ అలా అందా? 403 00:18:28,233 --> 00:18:30,819 అవును. నిజానికి అనుకోకుండా అలా నోరు జారింది. 404 00:18:30,903 --> 00:18:31,945 కానీ ఎంత పశ్చాత్తాపపడింది అంటే, 405 00:18:32,029 --> 00:18:34,656 తర్వాతి రెండేళ్ళూ నేను ఎక్కడ కనిపించినా క్షమించమని అంటూనే ఉంది. 406 00:18:34,740 --> 00:18:36,575 నీకు ఈ కథ చెప్పానని అమ్మకి చెప్పకు, సరేనా? 407 00:18:36,658 --> 00:18:39,578 అయితే, అదన్నమాట. 408 00:18:39,661 --> 00:18:42,706 అంతే కాదనుకో, అది 90ల వరకు సంగతి. 409 00:18:42,789 --> 00:18:44,875 మిగతా… విషయాలన్నీ మరోసారి చెప్తానులే. 410 00:18:44,958 --> 00:18:47,002 వావ్. వర్ణ వివక్ష చూపేవాళ్ళు ఉంటారని తెలుసు, నాన్నా. 411 00:18:47,085 --> 00:18:50,047 కానీ నాపై చూపిస్తారని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. 412 00:18:50,130 --> 00:18:51,882 సారీ, కోల్. 413 00:18:51,965 --> 00:18:55,594 ఇదంతా మళ్లీ జరుగుతుందనే నాకు చెప్తున్నావా? 414 00:18:55,677 --> 00:18:56,970 జరగకూడదనే ఆశిస్తున్నా. 415 00:18:57,054 --> 00:19:00,682 కానీ, ఒకవేళ ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు ఈ పరిస్థితి వస్తే… 416 00:19:00,766 --> 00:19:02,726 సరే, సరే. ఇలా మళ్లీ ఖచ్చితంగా జరుగుతుంది. 417 00:19:02,809 --> 00:19:05,187 నువ్వు సిద్ధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. 418 00:19:06,271 --> 00:19:07,439 అయితే నేను రాత్రి పూట రెండు ఖడ్గాలతో 419 00:19:07,523 --> 00:19:08,899 పరుగులు పెట్టకుండా ఉంటే నయం. 420 00:19:08,982 --> 00:19:10,484 అది! శభాష్! 421 00:19:10,567 --> 00:19:13,529 అందుకే మాట్లాడాలి అనేది. కానీ ఏదోలా కూడా ఉంది. 422 00:19:13,612 --> 00:19:15,781 ఎవరినీ భయపెట్టటం నా ఉద్దేశమే కాదు. అందులో సరదా కూడా లేదు. 423 00:19:15,864 --> 00:19:18,575 నన్ను నేను ప్రమాదంలో కూడా పెట్టుకోకూడదు. అదీ సరదా కాదు. 424 00:19:18,659 --> 00:19:20,786 పార్కులో ఎంతో మంది తెల్లవాళ్ళు ఉంటారు. 425 00:19:20,869 --> 00:19:23,413 కన్నా, జీవితంలో చాలా మంది తెల్లవాళ్ళు ఉంటారు. 426 00:19:23,497 --> 00:19:26,124 నాన్నా, కౌముదీ సమావేశానికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. 427 00:19:26,208 --> 00:19:28,919 రాడ్నీ కింగ్ పాటలు వింటూ ఇంట్లోనే ఉంటాను పోనీ. 428 00:19:29,002 --> 00:19:31,839 -జేమ్స్ బ్రౌన్. -జేమ్స్ బ్రౌన్. అవును. అన్ని పేర్లుంటేనూ. 429 00:19:31,922 --> 00:19:34,925 నాకు అర్థమైంది. మరేం పర్వాలేదు. కోల్, నువ్వు దీన్ని మిస్ చేసుకోకూడదు. 430 00:19:35,008 --> 00:19:36,468 దీని గురించి ఎంతగానో ఎదురుచూశావు నువ్వు. 431 00:19:36,552 --> 00:19:39,179 అంత భయంకరంగా ఉండకుండానే, నీకు నచ్చేలా పై స్థాయిలో ఉన్న 432 00:19:39,263 --> 00:19:41,807 కాస్ట్యూమ్ ని వెతుక్కుంటే ఎలా ఉంటుంది? స్ఠయిల్ ప్రకారం చెప్తున్నా. 433 00:19:41,890 --> 00:19:43,767 -ఇది పై స్థాయిలో ఉంది కదా? -బాగా. 434 00:19:43,851 --> 00:19:46,353 సరే. కానీ పిచ్చిపిచ్చిగా ఉన్నవి నాకు వద్దంటే వద్దు. 435 00:19:46,436 --> 00:19:48,856 తెలుసు. చాలా నిక్కచ్చిగా ఇవన్నీ చెప్పావు. 436 00:19:48,939 --> 00:19:51,275 కానీ నా మనసులోని మాట వేరేది అయితే ఏమంటావు? 437 00:19:51,900 --> 00:19:54,862 ఇంత గొప్ప కాస్ట్యూమ్ వేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. 438 00:19:54,945 --> 00:19:57,990 కానీ ఇంత విలువైన దాన్ని ఇస్తున్నందుకు పరిణామాలు తీవ్రంగా ఉండగలవు. 439 00:19:58,073 --> 00:20:00,409 సర్, బద్ధకస్తులు, పనిదొంగలతో నిండిన మహాసముద్రంలో 440 00:20:00,492 --> 00:20:01,869 సాహసోపేతమైన ఒక ధైర్యస్తుడికి సాయం చేయటం 441 00:20:01,952 --> 00:20:04,121 చాలా గౌరవాన్ని ఇచ్చే పని. 442 00:20:04,204 --> 00:20:06,456 -ధర సంగతి అనవసరం. -అయితే ఆట మొదలే. 443 00:20:08,625 --> 00:20:11,170 -అబ్బా, నాకు చిటికె వేయటం ఇంకా రావట్లేదు. -వచ్చేస్తుందిలే. 444 00:20:15,716 --> 00:20:16,717 ఓయ్, లవర్ బోయ్. 445 00:20:16,800 --> 00:20:19,553 ఏయ్, హాయ్. ఆ కర్బూజాతో ఏం చేస్తున్నారు? 446 00:20:19,636 --> 00:20:21,805 దాక్కున్నాను. ఇంకేమనుకున్నావు? 447 00:20:21,889 --> 00:20:23,390 -ఎవరు మీరు? -అది ముఖ్యం కాదు. 448 00:20:23,473 --> 00:20:26,226 నిజానికి చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు ముఖ్యం కాదు. 449 00:20:26,310 --> 00:20:29,271 మీరు బిట్సీ అయ్యుండాలి. హెలెన్ మీ గురించి ఎంతో చెప్పింది. 450 00:20:29,354 --> 00:20:31,899 అయితే నాకు హెలెన్ బాగోగుల మీద ఎంత శ్రద్ధ ఉందో నీకు తెలిసే ఉంటుంది. 451 00:20:31,982 --> 00:20:34,484 -అంటే… -హెలెన్ మంచి కోసం, నా మంచి కోసం, 452 00:20:34,568 --> 00:20:36,862 నువ్వు తనకి శాశ్వతంగా దూరంగా ఉంటే మంచిది. 453 00:20:36,945 --> 00:20:39,198 అది మీకు సంబంధించిన విషయం కాదు. 454 00:20:39,281 --> 00:20:40,699 విషయం చెప్తాను విను. 455 00:20:40,782 --> 00:20:42,492 నీకు డబ్బిస్తాను, నువ్వు ఆటలో ముందుకి వెళ్ళరాదు, 456 00:20:42,576 --> 00:20:44,703 ప్రయత్నించరాదు, హెలెన్ ని గెలుచుకోరాదు. 457 00:20:44,786 --> 00:20:45,913 ఇక్కడి నుండి ఉడాయించాలంతే. 458 00:20:45,996 --> 00:20:47,998 హెలెన్ ని మళ్లీ చూడకుండా ఉండటం కోసం నాకు డబ్బిస్తారా? 459 00:20:48,081 --> 00:20:51,210 అవును, సుందరాంగా. ఇక సెలవు. ఇక వెళ్లిరా. బయల్దేరు. 460 00:20:51,293 --> 00:20:53,295 -కానీహెలెన్, నేను… -ఈ ఆఫర్ ఎంతోసేపు ఉండదు. 461 00:20:53,378 --> 00:20:55,047 -మూడు అంకెలు లెక్కపెట్టే వరకే ఇది… -ఉండండి! 462 00:20:55,130 --> 00:20:56,131 -రెండు… -ఉండండి! 463 00:20:56,215 --> 00:20:57,466 -ఒకటి. -నాకు డబ్బు ఇవ్వండి! 464 00:20:57,549 --> 00:20:59,801 అంతే. అది అంత కష్టమా? ఇక వంగు. 465 00:20:59,885 --> 00:21:01,386 -ఏమిటి? -నీ వీపు మీద చెక్ రాయాలి! 466 00:21:01,470 --> 00:21:02,471 కదలకు. 467 00:21:02,554 --> 00:21:07,100 మహిళలారా! భూతాల పనిపట్టే మొసాయస్ ను పరిచయం చేస్తున్నాం. 468 00:21:07,684 --> 00:21:09,770 అబ్బో. సూపర్. నాకు భలే నచ్చేసింది! 469 00:21:09,853 --> 00:21:12,064 ఆ జెమ్స్ నీ జుట్టులోకి చొప్పించబడ్డాయా? 470 00:21:12,147 --> 00:21:14,024 -అవి పిన్నులే. -అయినా కానీ సూపర్ గా ఉంది. 471 00:21:14,107 --> 00:21:16,985 బాగా మెరుస్తున్నాయి. బాగా కనిపిస్తాయి. 472 00:21:17,069 --> 00:21:18,737 అవునవును. నాకు నచ్చింది అదే. 473 00:21:18,820 --> 00:21:20,864 కంగారు పడద్దు. అది ఉత్తుత్తి జుట్టే. 474 00:21:20,948 --> 00:21:22,950 అయితే, ఖడ్గం లేదా? 475 00:21:23,033 --> 00:21:26,370 అమ్మా, తగాదాలను పరిష్కరించుకోవటానికి ఆయుధాలు వాడటాన్ని మొసాయస్ మానేశాడు. 476 00:21:26,453 --> 00:21:27,788 అతను మెరుపు కళలలో ఆరితేరాడు. 477 00:21:27,871 --> 00:21:29,248 ఓవెన్, కాస్త అనువదిస్తావా? 478 00:21:29,331 --> 00:21:31,333 మాయలు చేస్తున్నాడిప్పుడు. ఆయుధాలు లేకుండా. ఆ జేబు చూడు. 479 00:21:31,416 --> 00:21:33,585 అందులో రత్నాలో, రాళ్ళో ఏవో ఉన్నాయి. 480 00:21:33,669 --> 00:21:36,171 అర్థమయ్యింది. కోల్, ఈ రాత్రి పండగ చేస్కో. 481 00:21:38,507 --> 00:21:40,300 హలో. రోజు ఎలా గడిచింది? 482 00:21:40,384 --> 00:21:42,261 నన్ను ఆ ప్రశ్న ఇప్పటి దాకా ఎప్పుడూ అడగలేదు మీరు. 483 00:21:42,344 --> 00:21:43,345 ఇప్పుడు అడిగానుగా? 484 00:21:44,304 --> 00:21:46,849 మీకు చెప్పాల్సిందే అంటే, ఒక నేస్తంతో భోజనానికి వెళ్ళాను. 485 00:21:46,932 --> 00:21:48,767 -ఆడ నేస్తమా? -కాదు, మగ నేస్తం. 486 00:21:48,851 --> 00:21:50,352 ప్రేమాయణం మొదలయ్యిందా? 487 00:21:50,435 --> 00:21:52,604 లేదు, అతనొక పాత స్నేహితుడు. అంతే. 488 00:21:52,688 --> 00:21:54,481 అతను మాత్రం ఏవేవో ఊహించుకున్నాడులెండి. 489 00:21:54,565 --> 00:21:56,108 మంచివాడే. మరీ ఎక్కువ మంచివాడు. 490 00:21:56,191 --> 00:21:58,569 అంత ఇష్టం చూపిస్తుంటే నాకు ఇష్టమే. ఇదంతా మీకెందుకు చెప్తున్నాను? 491 00:21:58,652 --> 00:21:59,862 ఏమైనా, ఈరోజు అదంతా ముగిసిపోయింది. 492 00:21:59,945 --> 00:22:02,322 అయ్యో, పాపం. బాధాకరం. 493 00:22:02,406 --> 00:22:04,449 అవును, నేను వద్దని అన్నందుకు చాలా బాధపడ్డాడు. 494 00:22:05,617 --> 00:22:07,160 నమ్మకం కలగట్లేదా? 495 00:22:07,244 --> 00:22:09,746 కొన్ని విషయాలు అయోమయంగా అనిపించాయి. 496 00:22:09,830 --> 00:22:12,249 -ఎవరు ఎవరిని కాదన్నారు? -అంత ముఖ్యమా అది? 497 00:22:12,332 --> 00:22:13,667 నాకు తెలియాలి. 498 00:22:14,251 --> 00:22:17,254 మేము స్వీట్ తినగానే, ఇక విడిపోదామని నేనే అతనితో అన్నాను. 499 00:22:17,337 --> 00:22:20,841 ఏమైతేనేం? ఇక ఈ విషయం చాలు. పనిలో పడతాను. 500 00:22:20,924 --> 00:22:22,426 అతని చిరునామా తెలుసా నీకు? 501 00:22:22,509 --> 00:22:25,470 -అతనితో ఒకవేళ నాకేమైనా పని పడితే. -నేను వెళ్తున్నా! 502 00:22:26,889 --> 00:22:28,682 పుదీనా రసం అయిపోయింది! హెలెన్! 503 00:22:28,765 --> 00:22:30,267 హా, వస్తున్నా. 504 00:22:30,350 --> 00:22:31,643 నేనే ఈమెను ఎంచుకున్నాను. 505 00:22:31,727 --> 00:22:33,187 కౌముదీ సమావేశం 506 00:22:33,270 --> 00:22:35,063 ఒక చిన్న నల్లజాతి పిల్లాడి పట్ల ప్రపంచం 507 00:22:35,147 --> 00:22:36,815 ఎంత దారుణమైనదో పాపం. దానివల్ల వాడు పెద్ద ఖడ్గంతో 508 00:22:36,899 --> 00:22:38,942 తనకిష్టమైన ఉడుత దొంగగా నటించలేకపోతున్నాడు. 509 00:22:39,026 --> 00:22:43,405 పనిపట్టే ఉడుత. పర్లేదు, నాన్నా. నా కాస్ట్యూమ్ నాకు నచ్చింది. భలే మెత్తగా ఉంది. 510 00:22:43,488 --> 00:22:45,824 మంచిది, కన్నా. పద, వెళ్దాం. 511 00:22:45,908 --> 00:22:49,203 జాగ్రత్త జనులారా. నల్లజాతి మహానటుడు వస్తున్నాడు. 512 00:22:49,286 --> 00:22:50,621 బెదిరిపోకండి. 513 00:22:50,704 --> 00:22:52,956 ఆపు, నాన్నా. అడుగో ఎన్రికే. 514 00:22:53,040 --> 00:22:55,125 -కోల్. సరదాగా గడుపు. -అలాగే. 515 00:22:55,209 --> 00:22:57,211 -ఐ లవ్ యూ కన్నా. -ఐ లవ్ యూ నాన్నా. 516 00:22:58,879 --> 00:23:00,255 ఎన్రికే, ఆగు! 517 00:23:01,423 --> 00:23:03,967 అయ్య బాబోయ్… అబ్బా, భయపెట్టి చంపేశావు పిల్లోడా! 518 00:23:04,051 --> 00:23:07,429 -సారీ అండీ! -పర్వాలేదు. సరదాగా గడుపు. 519 00:23:42,548 --> 00:23:44,550 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్