1 00:00:06,041 --> 00:00:08,833 ద పెరిఫరల్‌‌లో ఇంతకుముందు 2 00:00:10,416 --> 00:00:12,166 నిన్ను, వీటన్నిటిని చూస్తున్నాను. 3 00:00:12,250 --> 00:00:14,500 నా ప్రపంచం కన్నా ఇది చాలా భిన్నమైనది. 4 00:00:15,291 --> 00:00:17,375 నువ్వు కొంత కాలం విరామం తీసుకోవాలి. 5 00:00:17,458 --> 00:00:19,000 తను నా నుండి తప్పించుకున్నాడు. 6 00:00:19,083 --> 00:00:21,583 అవన్నీ సర్దుకుంటాయిలే, నేను చూసుకుంటాలే. 7 00:00:23,125 --> 00:00:25,583 బహుశా నువ్వు, నేను ఒక అవగాహనకు రావచ్చేమో? 8 00:00:25,666 --> 00:00:27,875 అందుకు బదులుగా నేను నీకొకటి ఇస్తాను. 9 00:00:28,875 --> 00:00:31,666 పథకం లేదు. కీలక సమాచారం లేదు. నిఘా లేదు. 10 00:00:31,750 --> 00:00:34,541 ఇన్స్‌పెక్టర్ ఐన్ స్లే లోబీర్, లండన్ నగర పోలీసు. 11 00:01:25,250 --> 00:01:26,458 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 12 00:01:28,375 --> 00:01:30,083 ఏమైనా జరిగిందా, ఫిషర్ గారు? 13 00:01:31,375 --> 00:01:32,791 రీస్, బంగారం. 14 00:01:32,875 --> 00:01:35,791 నువ్వు వైద్యురాలి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాలి. 15 00:01:35,875 --> 00:01:37,791 -బర్టన్‌కు కాల్ చేయమంటారా? -వద్దు. 16 00:01:37,875 --> 00:01:39,416 వాళ్ళకు ఇబ్బంది వద్దులే. 17 00:01:39,500 --> 00:01:42,250 ఫర్వాలేదని అనుకుంటాను. నువ్వు, నేను వెళదాం పద. 18 00:01:43,500 --> 00:01:45,500 ఫర్వాలేదు, బంగారం. ఒట్టు. 19 00:01:45,583 --> 00:01:47,916 మనం తిరిగి రాగానే వాళ్ళతో మాట్లాడుతాను. 20 00:01:48,375 --> 00:01:49,958 నా ట్రక్ డ్రైవ్‌లో ఉంది. 21 00:01:50,458 --> 00:01:52,708 నాకు నీ సాయం కావాలనుకుంటాను, రీస్. 22 00:01:52,791 --> 00:01:53,833 నాకు... 23 00:01:54,750 --> 00:01:55,958 నాకు కనిపించడం లేదు... 24 00:01:58,458 --> 00:01:59,708 నాకు మళ్ళీ చూపు పోయింది. 25 00:03:41,791 --> 00:03:44,791 ద పెరిఫరల్ 26 00:03:59,750 --> 00:04:04,291 బాబోయ్. మీ జీవితం నిర్ణయాత్మకమైన కొన్ని ఊహించని మలుపులు తీసుకుంది, 27 00:04:04,375 --> 00:04:06,083 గత వారం పది రోజులుగా, అమ్మాయి. 28 00:04:06,166 --> 00:04:07,166 అవును, మేడమ్. 29 00:04:07,250 --> 00:04:09,583 ఇక ఇప్పుడేంటి? నీకు ఏదైనా ప్రణాళిక ఉందా? 30 00:04:09,666 --> 00:04:13,041 లేదా వచ్చే సమస్యలకు అప్పటికప్పుడు స్పందిస్తూ, మంచి జరుగుతుందని 31 00:04:13,125 --> 00:04:14,166 ఆశిస్తున్నావా? 32 00:04:16,208 --> 00:04:18,625 నేను ఏం చేయాలో నాకు తెలుసు, బియాట్రిస్. 33 00:04:18,750 --> 00:04:20,750 నా కాళ్ళను కాస్త చాచుకుని, 34 00:04:20,875 --> 00:04:23,208 -తాజా గాలిని పీల్చాలి. -అలాగే, మేడమ్. 35 00:04:23,291 --> 00:04:25,500 దీన్ని తప్పుగా అనుకోకండి, జుబోవ్ గారు, 36 00:04:25,583 --> 00:04:29,541 కానీ ఇక్కడ మరీ దౌర్జన్యమైన అలంకరణ శైలిని ఏర్పరిచారు. 37 00:04:33,333 --> 00:04:37,375 అయితే, ఇన్‌స్పెక్టర్ గారు, మీకు పూదోట నచ్చుతుందా? 38 00:04:37,458 --> 00:04:39,000 ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. 39 00:04:39,083 --> 00:04:41,416 ఈ ముగ్గురు సందర్శకులను నాతో తీసుకువెళతా, 40 00:04:41,500 --> 00:04:44,875 దాంతో మేం మా సంభాషణని తాజా గాలి వీచే బయట ప్రదేశాల్లో చేయవచ్చు. 41 00:04:44,958 --> 00:04:45,875 మనం వెళ్దామా? 42 00:04:46,541 --> 00:04:48,416 ఇది అమర్యాదకరంగా తీసుకోకండి, 43 00:04:48,500 --> 00:04:52,250 కానీ మనతో పాటు విల్ఫ్ కూడా వస్తే నాకు సౌకర్యంగా ఉంటుంది. 44 00:04:52,708 --> 00:04:53,875 ఎంత మధురం! 45 00:04:54,958 --> 00:04:56,708 ఇంతలోనే ఇక్కడ ఒకరితో స్నేహమా! 46 00:04:56,791 --> 00:04:58,791 అయితే ఉదారంగా ఉండండి, నెథర్టన్, 47 00:04:59,208 --> 00:05:00,291 మాతో రండి. 48 00:05:11,833 --> 00:05:14,916 క్లాంటన్ అర్జెంట్‌మెడ్ క్లాంటన్ వాసులకు నాణ్యమైన చికిత్స 49 00:05:16,916 --> 00:05:20,250 అపాయింట్మెంట్ లేకుండా వచ్చినందుకు క్షమించు, డీ డీ. 50 00:05:20,333 --> 00:05:22,750 మిమ్మల్ని కలవడం ఆనందం, ఎల్లా. అనుమతి అనవసరం. 51 00:05:22,833 --> 00:05:25,125 -రీస్, ఆమెకు సాయపడతావా? -తప్పకుండా. ఇలా రండి. 52 00:05:26,250 --> 00:05:27,750 -ఇదిగోండి. -థాంక్యూ. 53 00:05:30,208 --> 00:05:32,625 అయితే, మీ సమస్య ఏంటి? 54 00:05:32,708 --> 00:05:34,208 నేను బయట ఉంటే పరవాలేదా? 55 00:05:34,291 --> 00:05:36,458 -పరవాలేదు, బంగారం. -సరే. 56 00:05:36,541 --> 00:05:39,041 రీస్, భోజన విరామం తీసుకోమని లిజ్‌కు చెప్తావా? 57 00:05:39,125 --> 00:05:40,000 ఆ, తప్పకుండా. 58 00:05:42,708 --> 00:05:45,875 అయితే, మీకు ఎలా ఉంది? 59 00:05:50,541 --> 00:05:53,083 నువ్వు అనారోగ్య సెలవులో ఉండాలి కదా, టామీ? 60 00:05:53,166 --> 00:05:57,041 అవును, కానీ సేకరించిన సాక్ష్యాలపై తదుపరి పని చేయలేదని గ్రహించాను. 61 00:05:57,125 --> 00:05:58,666 వంతెనపై జరిగిన ఆ సంఘటనవి. 62 00:05:58,750 --> 00:06:01,708 అన్నీ సరిగా నమోదయ్యాయని నిర్ధారించుకోవాలనుకున్నాను. 63 00:06:01,791 --> 00:06:03,750 అది ఏ సాక్ష్యం అయ్యుంటుంది? 64 00:06:03,833 --> 00:06:05,583 ఆ మసలాయన వాడిన ఆయుధాలు. 65 00:06:05,666 --> 00:06:07,250 అవి కచ్చితంగా ఏమిటి? 66 00:06:07,333 --> 00:06:09,375 అతని దగ్గర చిన్న పిస్తోలు, 67 00:06:09,750 --> 00:06:13,125 అలాగే చూడటానికి టార్చిలా ఉండే ఓ వింత పరికరం ఉందనుకుంటాను. 68 00:06:13,541 --> 00:06:15,041 వింత పరికరమా, ఆ? 69 00:06:15,125 --> 00:06:17,833 అది విడ్డూరమైన పరికరాన్ని పోలి ఉంటుందా? 70 00:06:19,583 --> 00:06:23,208 ఆ ఎస్‌యువీ నన్ను ఢీకొట్టిన తర్వాత ఇతర సాక్ష్యాలను తీసుకున్నారా? 71 00:06:23,291 --> 00:06:26,208 అంటే కంటికి కనిపించని ఎస్‌యువీ అంటున్నావే, అదేనా? 72 00:06:28,125 --> 00:06:31,375 -ఏం చేస్తున్నారు? -డీ డీకి కాల్ చేస్తున్నా, దాంతో... 73 00:06:36,666 --> 00:06:38,833 నీకు ఒకవైపు బాగా దెబ్బ తగిలింది, టామీ. 74 00:06:39,208 --> 00:06:40,083 గట్టిగా తగిలింది. 75 00:06:40,166 --> 00:06:42,291 నువ్వు ఓ చీకటి గదిలో పడుకోవాలి, 76 00:06:42,375 --> 00:06:45,875 నెత్తిపై ఐసు ముక్కలు పెట్టుకుని, చేతిలో చల్లటి బీరు పట్టుకుని. 77 00:06:45,958 --> 00:06:48,916 నా ప్రశ్నకు జవాబివ్వండి, గ్లాడిస్, అలా వెంటనే చేస్తా. 78 00:06:49,541 --> 00:06:50,375 ఒట్టు. 79 00:06:57,750 --> 00:07:01,208 నుజ్జునుజ్జుయిన నీ వాహనం మినహా మరేదీ సాక్ష్యంగా తీసుకోలేదు. 80 00:07:01,583 --> 00:07:04,166 పిస్తోళ్ళు లేవు. వింత పరికరాలు లేవు. 81 00:07:04,250 --> 00:07:05,791 ఆ మాటకొస్తే, ముసలాయన లేడు. 82 00:07:05,875 --> 00:07:08,458 నువ్వూ నీ నుజ్జయిన కారు, అంతే టామీ. 83 00:07:08,541 --> 00:07:09,916 ఇప్పుడిక ఇంటికెళ్ళు, 84 00:07:10,625 --> 00:07:13,041 నేను షెరిఫ్ జాక్‌మాన్‌కు కాల్ చేసేలోపు, 85 00:07:13,125 --> 00:07:17,208 ఎందుకంటే అతనూ నీకు ఇదే విషయాన్ని చెప్తాడు, కొంచెం తక్కువ ఆప్యాయతతో. 86 00:07:29,458 --> 00:07:30,375 ఇదేంటి? 87 00:07:30,708 --> 00:07:33,916 ఇది నగర పోలీసు శిక్షణా కేంద్రం. మేం దీన్ని జూ అంటాం. 88 00:07:34,000 --> 00:07:34,833 ఎందుకని? 89 00:07:34,916 --> 00:07:36,833 ఇది జంతువుల ఆటస్థలం. 90 00:07:36,916 --> 00:07:40,916 దీనిపై ఎలాంటి ఆర్‌ఐ నిఘా కానీ లేదా వారి ప్రమేయం కానీ ఉండదు. 91 00:07:41,500 --> 00:07:43,250 ఆ మాటకొస్తే, క్లెప్ట్‌కూ లేదు. 92 00:07:44,166 --> 00:07:46,500 మీరిద్దరూ, బియాట్రిస్‌తో సరదా సమయం గడుపుతారు. 93 00:07:46,583 --> 00:07:48,541 మీరు ఎక్కబోతున్నారు... 94 00:07:48,625 --> 00:07:51,625 ఎన్ని అంతస్తులు ఎక్కగలరని అనుకుంటున్నావు, బియాట్రిస్? 95 00:07:51,708 --> 00:07:52,708 8 ప్రయత్నిద్దాం. 96 00:07:52,791 --> 00:07:54,333 మనకు అత్యాశ ఉన్నట్టుంది కదా? 97 00:07:55,208 --> 00:07:56,166 సరే, మరైతే. 98 00:07:57,250 --> 00:07:58,291 ఎనిమిదవ అంతస్తు. 99 00:08:01,625 --> 00:08:04,375 ఫ్లిన్ ఫిషర్‌లా కాకుండా, ఈ శరీరాలు మీకు కొత్తవి. 100 00:08:05,833 --> 00:08:08,541 ఈ విన్యాసం మీకు ఈ శరీరాలను సుపరిచితం చేస్తుంది. 101 00:08:12,666 --> 00:08:13,541 ఏంటీ ఘోరం? 102 00:08:32,166 --> 00:08:34,541 మా శాఖ కోయిడ్స్‌ను పరీక్షించేది ఇక్కడే. 103 00:08:34,625 --> 00:08:38,916 ఇది మొదట్లో నీ చెల్లి ఆడుతున్నానని నమ్మినలాంటిది. 104 00:08:39,000 --> 00:08:41,166 మీరు దాన్ని సిమ్ అంటారనుకుంటా. 105 00:08:41,250 --> 00:08:43,500 బియాట్రిస్‌‌ను అనుసరించండి. అన్నీ వివరిస్తుంది. 106 00:08:48,666 --> 00:08:49,625 నేను కూడా వెళ్ళనా? 107 00:08:49,708 --> 00:08:51,125 ఈసారి వద్దు, బంగారం. 108 00:08:51,208 --> 00:08:53,125 నేను నీకు వేరే పరీక్ష పెడతాను. 109 00:08:55,291 --> 00:08:56,208 మనం కూర్చుందామా? 110 00:09:00,291 --> 00:09:01,958 ఇది సాదాసీదా విషయం. 111 00:09:02,041 --> 00:09:05,125 ఒక్కో అంతస్తూ దాటుకుంటూ వెళతాం, ఎదుటపడేవాటిని చంపుతాం లేక 112 00:09:05,208 --> 00:09:06,750 నాశనం చేస్తాం, పైకప్పు దాకా. 113 00:09:06,833 --> 00:09:08,000 అక్కడేం జరుగుతుంది? 114 00:09:08,083 --> 00:09:09,666 -విస్మయం. -ఎలాంటిది? 115 00:09:09,750 --> 00:09:12,458 విస్మయాన్ని ఒక ఊహించని ఘటనగా నిర్వచిస్తారు. 116 00:09:12,541 --> 00:09:14,416 "ఊహించని" అనే మాట నిర్వచించాలా? 117 00:09:16,416 --> 00:09:20,791 దీన్ని తప్పుగా అనుకోకండి, మేడమ్, కానీ మీరు... మనిషేనా? 118 00:09:20,875 --> 00:09:22,166 ఎందుకు అడిగావు? 119 00:09:22,250 --> 00:09:25,458 మీకు ఇక్కడ జరగబోయే శారీరక హాని గురించి చింతే లేనట్టుంది. 120 00:09:25,541 --> 00:09:28,625 దయతో అలా అడిగినందుకు కృతజ్ఞతలు, సైనికాధికారి గారు. 121 00:09:29,208 --> 00:09:30,916 నేను ప్రత్యేకం అని అనుకోండి. 122 00:09:31,375 --> 00:09:34,750 రాబోయే సాహసంలో మీరు మీ గురించి చింతించుకోండి. 123 00:09:34,833 --> 00:09:36,041 నా కథ నేను చూసుకుంటా. 124 00:09:36,708 --> 00:09:39,791 -మనకు ఆయుధాలుంటాయా? -దారిలో చేజిక్కించుకోగలవి మాత్రమే. 125 00:09:41,000 --> 00:09:41,833 వెళ్దామా? 126 00:09:44,666 --> 00:09:47,125 -రాత్రి దృష్టి ఉంది, బాబు. -ఎలా? 127 00:09:47,208 --> 00:09:49,291 నాలుకతో అంగిలి తాకు, మన హాప్టిక్స్‌లా. 128 00:10:27,500 --> 00:10:29,166 అదంత ఘోరంగా ఏమీ లేదు. 129 00:10:29,250 --> 00:10:31,958 -మీకు లెక్కలు బాగా వచ్చా? -బాగా వచ్చు. 130 00:10:32,041 --> 00:10:34,291 మనం ఎంతమంది ముష్కరుల్ని ఎదుర్కొన్నాం? 131 00:10:35,875 --> 00:10:38,375 -ఆరు మందిని. -పై అంతస్తులో 12 మంది ఉంటారు, 132 00:10:38,458 --> 00:10:41,000 ఆ తరువాతి దానిలో 18 మంది, అలా పెరుగుతారు. 133 00:10:41,083 --> 00:10:43,750 -పై అంతస్తులో 48 మందా? -మీరు అంత దూరం వెళ్ళగలిగితే. 134 00:10:43,833 --> 00:10:44,916 ఇవేంటి? 135 00:10:45,500 --> 00:10:48,125 ప్రాథమిక కోయిడ్స్‌, వరుస క్రమం 24ఏ. 136 00:10:48,541 --> 00:10:50,750 ఈ పని కోసం వీటిని మార్పు చేశాం. 137 00:10:51,125 --> 00:10:52,083 కోయిడ్ అంటే ఏంటి? 138 00:10:52,166 --> 00:10:53,875 ఒక రోబోట్. రెండుపాదాలపై నడిచేది. 139 00:10:54,750 --> 00:10:55,708 కళ్ళు మనిషివి. 140 00:10:55,791 --> 00:10:57,625 మనిషిలా కనిపించడానికే అలా చేశాం. 141 00:11:01,791 --> 00:11:06,625 వేగం, తీవ్రత మరియు హింసాత్మక చర్య. ఇది మీ దళం నినాదం, తప్పు చెప్పట్లేదుగా. 142 00:11:06,708 --> 00:11:07,541 ఇంకా? 143 00:11:07,625 --> 00:11:09,916 ఇంకాస్త వేగం ఉంటే బాగుంటుంది. 144 00:11:10,000 --> 00:11:13,083 చాలా మంది శిక్షార్తులు ఈపాటికి మూడవ అంతస్తును ముగిస్తారు. 145 00:12:00,250 --> 00:12:01,375 అవును, గ్లాడిస్. 146 00:12:02,208 --> 00:12:03,833 ఇదొక చెత్త వింత పరికరమే. 147 00:12:23,208 --> 00:12:25,041 ఇన్ కమింగ్ కాల్ షెరిఫ్ జాక్‌మాన్ 148 00:12:25,125 --> 00:12:26,208 షెరిఫ్? 149 00:12:26,291 --> 00:12:27,583 టామీ, ఎక్కడున్నావు? 150 00:12:28,541 --> 00:12:29,375 నేను... 151 00:12:29,458 --> 00:12:33,333 ఏం చేస్తున్నా సరే, దాన్ని వెంటనే ఆపేసి కార్బెల్ పికెట్ ఇంటికి రా. 152 00:12:33,416 --> 00:12:35,083 సెలవుపై ఉన్నాననుకున్నా, సర్. 153 00:12:35,166 --> 00:12:36,916 ఉన్నావులే. ఇప్పుడే రద్దు చేశా. 154 00:12:37,000 --> 00:12:40,041 మాటలు ఆపి త్వరగా రా. మన చట్టపరిధిలో ఓ నేరం జరిగింది. 155 00:12:40,125 --> 00:12:42,541 -అది సరి చేయడానికి నీ సాయం కావాలి. -అలాగే సర్. 156 00:13:09,833 --> 00:13:12,791 దేవుడా. నాకు తగిలింది. బాగా తగిలింది. 157 00:13:12,875 --> 00:13:13,708 హలో? 158 00:13:14,041 --> 00:13:16,583 నాకు సాయం చేయి. నాకు బాగా తగిలింది. 159 00:13:16,666 --> 00:13:17,625 మీకు బానే ఉందా? 160 00:13:28,791 --> 00:13:29,958 టామీకి కాల్ చేయి. 161 00:13:30,041 --> 00:13:31,958 డీ డీ? ఏం జరుగుతోంది? 162 00:13:51,000 --> 00:13:53,583 -మీ కాల్‌ను స్వీకరించలేను. -టామీ, ఫోన్ ఎత్తు. 163 00:13:53,666 --> 00:13:55,333 సందేశాన్ని ఇవ్వండి, కాల్ చేస్తా. 164 00:14:06,125 --> 00:14:07,458 అంతే. అంతే. 165 00:14:08,583 --> 00:14:09,791 అవును, అంతే. 166 00:14:10,333 --> 00:14:14,750 అంతే. అదిగో. అయిపోయింది. అయిపోయింది. 167 00:14:29,000 --> 00:14:30,208 ఓరి దేవుడా. 168 00:14:32,291 --> 00:14:33,666 వెధవన్నర వెధవ. 169 00:14:37,250 --> 00:14:38,083 రీస్? 170 00:14:40,458 --> 00:14:41,458 ఇంకెవరైనా ఉన్నారా? 171 00:14:42,833 --> 00:14:43,916 ఏం జరుగుతోంది? 172 00:14:44,000 --> 00:14:46,500 ఏం జరుగుతోంది? చెప్పు డీ డీ, ఏం జరుగుతోంది? 173 00:14:46,583 --> 00:14:50,041 నువ్వు ఆమెను శాంతింపచేయి లేదా మీ ఇద్దరినీ కాల్చి పారేస్తా. 174 00:14:50,125 --> 00:14:52,125 ఏం కాలేదు. నేను ఇక్కడే ఉన్నాను. 175 00:14:52,208 --> 00:14:54,583 రీస్ ఎక్కడా? ఎందుకు బదులివ్వడం లేదు? 176 00:14:54,666 --> 00:14:55,583 అతను... 177 00:14:56,666 --> 00:14:57,875 బయటకు వెళ్ళాడంతే. 178 00:14:58,458 --> 00:15:00,541 కూర్చోండి. ఇద్దరూ. 179 00:15:01,041 --> 00:15:02,041 చేతులపై కూర్చోండి. 180 00:15:25,083 --> 00:15:26,208 ఇతను అతనే కదా? 181 00:15:27,291 --> 00:15:30,250 -ఎవరు? -వంతెనపై మనిషి. 182 00:15:30,750 --> 00:15:34,458 నాకు అగౌరవపరచాలని లేదు, మేడమ్, కానీ మీరు మీ నోరు మూసుకోవాలి. 183 00:15:35,625 --> 00:15:36,666 మూసుకునే ఉండాలి. 184 00:15:42,500 --> 00:15:43,750 నువ్వు గమనించావా? 185 00:15:45,000 --> 00:15:46,500 ఆమె మన డీఎన్‌ఏ నమూనాను సేకరించింది. 186 00:15:47,541 --> 00:15:49,833 మనం చెబుతున్న మన గతాలు నిజమేనని ఆమెకు ఎలా తెలుస్తుంది? 187 00:15:52,916 --> 00:15:54,958 మనం కూడా ఆమె డీఎన్‌ఏ నమూనాను సేకరించవచ్చు. 188 00:15:55,041 --> 00:15:57,166 ఆ తర్వాత లొంగిపోవచ్చు. 189 00:15:58,583 --> 00:16:01,666 నేను ఇంతకు ముందెప్పుడూ పోలీసు ఉన్నతాధికారిని కలవలేదు. 190 00:16:01,750 --> 00:16:04,375 ఈమె చాలా అసాధారణమైన వ్యక్తి. 191 00:16:05,041 --> 00:16:06,750 వాళ్ళంతా అలానే ఉంటారు, దురదృష్టవశాత్తూ. 192 00:16:06,833 --> 00:16:08,041 వాళ్ళు... 193 00:16:08,875 --> 00:16:10,000 ఆయనేనా? 194 00:16:14,500 --> 00:16:15,333 చెప్పండి, సర్? 195 00:16:15,416 --> 00:16:17,958 నాకు పెరిఫరల్ దృష్టికోణానికి ప్రవేశం కావాలి. 196 00:16:18,041 --> 00:16:19,791 వాళ్ళ చర్చలు నాకు తెలియాలి. 197 00:16:19,875 --> 00:16:23,625 నేను అలా చేయలేనేమో, జుబోవ్ గారు. లేదా చేయను. 198 00:16:23,708 --> 00:16:24,791 ఏమన్నావు? 199 00:16:24,875 --> 00:16:27,625 మనం అలా చేస్తే ఇన్‌స్పెక్టర్‌కు తెలిసిపోతుంది. 200 00:16:27,708 --> 00:16:31,875 మనం ఈ తప్పుదారి పడుతున్న సంభాషణని చేస్తున్నామని బహుశా ఆమెకు తెలిసినట్లుగానే. 201 00:16:32,958 --> 00:16:34,916 నేను ఇప్పుడు అనుకున్నదే అడిగాడా? 202 00:16:35,708 --> 00:16:37,875 మనకు తెలివుంటే, మనం పెట్టా బేడా సర్దుకోవాలి. 203 00:16:38,375 --> 00:16:39,375 వెళ్ళిపోవాలి. 204 00:16:39,916 --> 00:16:41,750 అలా చేస్తే, మన శ్రమ వృధా అవుతుంది. 205 00:16:42,041 --> 00:16:43,750 స్టబ్‌, ఆ అమ్మాయిలో ఉన్న విషయం, ఇకపై మనకు అందుబాటులో ఉండవు. 206 00:16:43,833 --> 00:16:46,125 అది ప్రాణాలిచ్చేంత విలువైనదని నేను అనుకోను, బంగారం. 207 00:16:46,791 --> 00:16:50,500 దీని నుండి పారిపోయాను అనే భావనతో జీవించగలనని అనుకోను. 208 00:16:51,416 --> 00:16:53,000 నీ సంగతి ఏంటి? 209 00:16:56,291 --> 00:16:58,458 నువ్వు స్థిరంగా ఉన్నావా, ఆసియన్? 210 00:16:59,166 --> 00:17:02,125 అవును, మహా స్థిరంగా ఉన్నాను. 211 00:17:09,875 --> 00:17:10,958 సరే, ఫిషర్ గారు, 212 00:17:11,041 --> 00:17:14,125 ఆంటీస్ చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించాయి. 213 00:17:14,208 --> 00:17:15,250 ఆంటీస్? 214 00:17:15,333 --> 00:17:17,750 పోలీసు శాఖ డేటాను సర్దే అల్గారిథమ్స్ అవి. 215 00:17:18,125 --> 00:17:20,166 తేనెటీగల్లాంటివి, గుయ్యిమంటుంటాయి. 216 00:17:20,250 --> 00:17:23,458 మీ మిత్రుడు పెంస్కే కానర్, నా కాలరేఖలో అంగాలను... 217 00:17:23,541 --> 00:17:25,958 కోల్పోలేదని తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుంది. 218 00:17:26,583 --> 00:17:28,125 కానీ దాని అర్థం ఏంటంటే... 219 00:17:28,208 --> 00:17:30,916 అంటే ఆర్ఐ స్టబ్‌ను ఎప్పుడు తెరచి ఉంటుందంటే, 220 00:17:31,000 --> 00:17:34,083 మీరంతా అనుకుంటున్న కాలం కన్నా కనీసం పదేళ్ళ ముందే. 221 00:17:34,166 --> 00:17:36,583 ప్రస్తుతానికి, మన రెండు కాలరేఖల్లోనూ, 222 00:17:36,666 --> 00:17:38,916 కీలకమైన తేడాలు చోటు చేసుకుంటున్నాయి, 223 00:17:39,000 --> 00:17:41,583 వాటిలో అత్యంత కలవరాన్ని కలిగించేది జాక్‌పాట్. 224 00:17:41,666 --> 00:17:45,250 అది మీ ప్రపంచంలో ఎంతో వేగంగా జరుగుతున్నట్లు అనిపిస్తోంది. 225 00:17:45,333 --> 00:17:48,708 ఆర్‌ఐ కావాలనే ఈ ప్రక్రియను వేగవంతం చేస్తోందనేది నా అంచనా. 226 00:17:48,791 --> 00:17:49,875 ఏ ప్రయోజనాల కోసం? 227 00:17:50,250 --> 00:17:53,083 ఆ ప్రశ్నకు చెరీస్ నులాండ్ మాత్రమే జవాబివ్వగలరు. 228 00:17:53,458 --> 00:17:54,500 టెక్సాస్ యుద్ధం. 229 00:17:54,583 --> 00:17:56,833 అది విడిపడిపోవడం. అది మీ కాలరేఖలో జరిగిందా? 230 00:17:56,916 --> 00:18:00,416 జరిగింది. అందులో పోరాడటానికి కానర్, మీ అన్న ఇద్దరూ వెళ్ళారు. 231 00:18:00,500 --> 00:18:03,083 కానీ వారి శరీరాల్లో అమర్చిన హాప్టిక్ సాంకేతికత 232 00:18:03,166 --> 00:18:05,666 నా కాలరేఖలో ఎన్నో దశాబ్దాల తర్వాత రూపొందింది, 233 00:18:05,750 --> 00:18:08,041 కనుక వాళ్ళు మామూలు సైనికుల్లా పోరాడారు. 234 00:18:08,791 --> 00:18:10,541 కానర్‌కు అందులో ఏం కాలేదా? 235 00:18:10,625 --> 00:18:12,541 యుద్ధం నుండి క్షేమంగా బయటపడ్డాడు. 236 00:18:14,375 --> 00:18:15,916 కానీ మీ అన్న బయటపడలేదు. 237 00:18:17,750 --> 00:18:19,000 ఏంటి, అతనికి గాయమైందా? 238 00:18:20,041 --> 00:18:21,000 చనిపోయాడు. 239 00:18:26,375 --> 00:18:29,333 ఇలాంటి వివరాలను సేకరించడం అసాధ్యం అనుకున్నాను. 240 00:18:29,416 --> 00:18:31,958 అతను చాలా వరకూ నిజమే చెప్పాడు. 241 00:18:32,041 --> 00:18:36,416 కానీ సాధారణ ప్రజలకు అందుబాటులో లేని పాత రికార్డులను ఆంటీస్ సేకరిస్తాయి. 242 00:18:38,750 --> 00:18:39,958 మరి నా సంగతేంటి? 243 00:18:41,833 --> 00:18:43,541 డేటా కొంచెం అస్పష్టమవుతోంది, 244 00:18:43,625 --> 00:18:46,916 జాక్‌పాట్ తర్వాత, కానీ మీకు పెళ్ళయినట్టు, ఇద్దరు పిల్లలు 245 00:18:47,000 --> 00:18:48,125 ఉన్నట్టు డేటా ఉంది. 246 00:18:48,208 --> 00:18:49,208 ఎవరిని పెళ్ళాడాను? 247 00:18:49,291 --> 00:18:51,208 షెరిఫ్ థామస్ కాన్‌స్టంటీన్. 248 00:18:51,625 --> 00:18:53,125 నేను టామీని పెళ్ళాడానా? 249 00:18:53,208 --> 00:18:56,000 కచ్చితంగా. ఇది గౌరవమర్యాదల గురించిన ఆలోచనను 250 00:18:56,083 --> 00:18:57,041 పుట్టిస్తోంది కదా? 251 00:18:57,416 --> 00:18:59,625 నీకు శుభాకాంక్షలు చెప్పాలి కదా మరి. 252 00:18:59,708 --> 00:19:04,333 ఇప్పుడిక ఏ మాత్రం ఉనికిలోనే లేని ఫ్లిన్ ఫిషర్ గురించి ఆంటీస్ నాకు చెప్పాయి. 253 00:19:04,416 --> 00:19:06,625 కానీ నీ గురించి, బంగారం, 254 00:19:07,708 --> 00:19:09,250 నాకు అసలు ఏమీ తెలియదు. 255 00:19:10,250 --> 00:19:11,625 ఇది చాలా హాయిగా ఉంది. 256 00:19:12,166 --> 00:19:14,875 ఉద్యోగాల కోసం ఎక్కువ ఇంటర్వ్యూలు తీసుకోలేదు కదా? 257 00:19:14,958 --> 00:19:16,083 ఫరెవర్ ఫాబ్‌ది మాత్రమే. 258 00:19:16,166 --> 00:19:20,416 కానీ నిజానికి అది ఇంటర్వ్యూ కూడా కాదు, కేవలం డ్రగ్స్ పరీక్షే. 259 00:19:20,500 --> 00:19:21,750 ఇంతకీ నువ్వు పాసయ్యావా? 260 00:19:21,833 --> 00:19:22,708 ముమ్మాటికీ. 261 00:19:23,041 --> 00:19:24,083 అద్భుతం. 262 00:19:24,833 --> 00:19:26,291 ఏ అర్థంలో అంటున్నానంటే, 263 00:19:26,375 --> 00:19:30,208 మనం ఈ భేటీని ఇంటర్వ్యూలాంటి కలయికలా పరిగణిద్దాం అని. 264 00:19:30,291 --> 00:19:32,166 అంటే ఒకరినొకరు తెలుసుకునే సమయంలా. 265 00:19:32,250 --> 00:19:33,791 కొన్ని ప్రశ్నలు అడుగుతాను. 266 00:19:33,875 --> 00:19:37,041 వాటికి వీలైనంత త్వరగా జవాబులు చెప్పు, ఆలోచించకుండానే. 267 00:19:37,416 --> 00:19:38,708 అలా చేయగలవా? 268 00:20:27,416 --> 00:20:30,541 ఈ పనితో చాలా మంది కష్టపడతారు. కత్తి యుద్ధంతో. 269 00:20:30,958 --> 00:20:34,333 మీరు నవ్వచ్చు, కానీ దీన్నెలా చేయాలనే విడియోలు నెట్‌లో ఉన్నాయి. 270 00:20:34,416 --> 00:20:36,041 గాటుపెట్టడానికి పొడవడానికి తేడా, 271 00:20:36,125 --> 00:20:38,625 నరాలు తెంపాలా లేక అవయవాలు దెబ్బతీయాలా అని. 272 00:20:38,708 --> 00:20:40,625 కానీ నా అనుభవంలో అయితే, 273 00:20:40,708 --> 00:20:42,000 వేగమే కీలకమైన విషయం. 274 00:20:42,958 --> 00:20:46,083 చాలా తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ చిల్లులు పెట్టాలి. 275 00:20:47,041 --> 00:20:48,000 సరళం. అంతే. 276 00:20:51,458 --> 00:20:52,875 దాని గురించి ఆలోచిస్తే, 277 00:20:52,958 --> 00:20:56,291 నువ్వు పొందిన శిక్షణకు ఇది పూర్తిగా విరుద్ధమైనది, కదా? 278 00:20:56,625 --> 00:21:00,416 దాన్ని అధిగమించడం చాలా కష్టమని అనుకుంటున్నా. 279 00:21:00,500 --> 00:21:03,833 ఇక ఇతర ఆటంకాలు ఉండనే ఉన్నాయి, "హాని చేయకు" లాంటి ప్రమాణాలు. 280 00:21:04,291 --> 00:21:07,291 లేదు, నువ్వు ఒక గాటు, గరిష్టంగా ఒక గాటు పెట్టేలోపు, 281 00:21:08,000 --> 00:21:12,250 నేను నిన్ను ఎలా తెరుస్తానంటే... మీరు దాన్ని ఏమంటారు... 282 00:21:13,250 --> 00:21:16,958 జల్లెడకు వడపోత పరికరానికి తేడా ఏంటి? అవి రెండూ ఒకటేనా ఏంటి? 283 00:21:39,833 --> 00:21:43,041 ఇది భలే అద్భుతంగా అనిపించింది. 284 00:21:43,125 --> 00:21:47,041 చెప్పాను కదా, సోదరా. నేను ఇక్కడికే వచ్చేస్తా, పూర్తిగా. 285 00:21:47,125 --> 00:21:48,333 మరి విస్మయం ఏంటి? 286 00:21:48,416 --> 00:21:52,666 మన ముగ్గురిలో ఒకరే మిగిలేంత దాకా, మన శిక్షణా కార్యక్రమం ముగియదు. 287 00:21:55,000 --> 00:21:55,833 విస్మయం. 288 00:22:03,791 --> 00:22:06,000 -అతిపెద్ద భయం? -మా అమ్మ మరణం. 289 00:22:06,375 --> 00:22:09,416 -అతిపెద్ద బలం? -ఎప్పుడు వదిలేయాలో తెలియకపోవడం. 290 00:22:09,500 --> 00:22:10,375 మరి బలహీనతా? 291 00:22:10,458 --> 00:22:11,500 అదే. 292 00:22:11,625 --> 00:22:15,375 కాలాన్ని తిరగేసి, వీటిలో ఏదీ జరగకుండా చేసే శక్తి నీకుంటే, చేస్తావా? 293 00:22:15,458 --> 00:22:16,291 చేయను. 294 00:22:16,375 --> 00:22:20,125 ఈ రెండు ప్రపంచాలకు మధ్యనున్న సంధానాన్ని తెంచగలిగే శక్తి నాకుంటే, 295 00:22:20,208 --> 00:22:21,708 నన్నలా చేయమంటావా? 296 00:22:21,791 --> 00:22:23,166 -చేయమనను. -ఎందుకని? 297 00:22:25,416 --> 00:22:29,250 ఈ జవాబుకి ఎక్కువ సమయం తీసుకున్నావు. బిగుసుకుపోయావు. అలా జరుగుతుంది. 298 00:22:29,333 --> 00:22:30,916 నేనూ కొన్ని ప్రశ్నలు అడగవచ్చా? 299 00:22:32,333 --> 00:22:33,791 మీరు ఇప్పుడు అడిగినలాంటివి? 300 00:22:33,875 --> 00:22:36,125 మూడు అడుగు, నేను ఒక జీనీ అయినట్లు. 301 00:22:36,208 --> 00:22:38,000 మీ అతిపెద్ద భయం ఏంటి? 302 00:22:38,083 --> 00:22:39,125 గతం. 303 00:22:40,208 --> 00:22:42,125 అంటే, నేను వచ్చిన కాలం నుండా? 304 00:22:42,208 --> 00:22:43,166 కచ్చితంగా. 305 00:22:44,291 --> 00:22:46,583 రెండు అయిపోయాయి. ఒక ప్రశ్న మిగిలింది. 306 00:22:50,083 --> 00:22:52,041 మీకు నిజంగానే ఆ శక్తి ఉందా? 307 00:22:53,250 --> 00:22:54,583 మన సంధానాన్ని తెంచే శక్తి? 308 00:22:57,083 --> 00:22:59,000 క్షమించు, మితిమీరి వరాలిచ్చాననుకుంటా. 309 00:22:59,083 --> 00:23:01,458 మీ అన్న, అతని స్నేహితుడు పూర్తి చేశారు, 310 00:23:01,541 --> 00:23:04,333 కనుక నేను సెలవు తీసుకుంటున్నా, శుభాకాంక్షలు. 311 00:23:05,333 --> 00:23:08,541 మన తర్వాతి సందర్శన మరింత క్రియాశీలంగా ఉంటుంది, మాటిస్తున్నా. 312 00:23:40,875 --> 00:23:42,000 పొట్టీ, 313 00:23:43,083 --> 00:23:44,916 నువ్వు భలే అద్భుతమైన మనిషివి. 314 00:24:00,000 --> 00:24:01,875 ఓరి నా దేవుడా! 315 00:24:01,958 --> 00:24:04,083 ఎప్పుడు బయటకొచ్చినా ఇలాగే అనిపిస్తుందా? 316 00:24:04,166 --> 00:24:06,416 కుర్రోడా, నేను ఆమెను పెళ్ళాడుతాను. 317 00:24:07,041 --> 00:24:09,291 -ఎవరిని? -ఆ రోబోట్ అమ్మాయిని. 318 00:24:17,750 --> 00:24:19,208 నేను దీన్ని కూడా చదవలేను. 319 00:24:19,708 --> 00:24:20,708 ఏంటి? 320 00:24:21,291 --> 00:24:24,916 రీస్ అమ్మను అర్జెంట్ మెడ్‌కు తీసుకెళ్ళాడు. వెంటనే రమ్మన్నాడు. పద. 321 00:24:26,541 --> 00:24:27,958 ఛత్. కొంచెం సమయం ఇవ్వు. 322 00:24:28,958 --> 00:24:31,291 ధైర్యాన్ని చూపించు, బర్టన్! మనం వెళ్ళాలి! 323 00:24:46,625 --> 00:24:47,458 హలో? 324 00:24:51,750 --> 00:24:52,708 షెరిఫ్? 325 00:25:50,208 --> 00:25:52,416 అంటే, నేను ఒకరిని చంపాలి. 326 00:25:52,500 --> 00:25:54,666 నేను దాన్ని ఒట్టి చేతులతో... 327 00:25:55,583 --> 00:25:57,416 వీడికి ఇక్కడేం పని? 328 00:26:04,000 --> 00:26:05,541 ఆయుధం సంచిలో పెట్టు, బాబు. 329 00:26:05,625 --> 00:26:08,083 ఏదైనా మంచి చేయడానికి మరీ ఆలస్యంగా వచ్చావు. 330 00:26:08,458 --> 00:26:09,416 ఏం జరిగింది? 331 00:26:09,875 --> 00:26:12,625 ఆ ఖైదీ నీ నుండి తప్పించుకున్నాడు కదా? 332 00:26:13,875 --> 00:26:16,041 ఇక్కడికి వచ్చి మేరీ పికెట్‌ను చంపాడు. 333 00:26:17,041 --> 00:26:18,916 వారి వాహనం ఒకటి దొంగలించాడు. 334 00:26:19,000 --> 00:26:23,041 ఇక్కడ పికెట్ గారు, చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు, ఊహించగలవు కదా. 335 00:26:23,958 --> 00:26:26,250 ప్రస్తుతం, నువ్వు ఫిషర్ల ఇంటికి వెళ్ళి, 336 00:26:26,333 --> 00:26:27,958 బర్టన్‌ను బంధించు. 337 00:26:28,041 --> 00:26:30,166 వాడి చెల్లినీ బంధించు, పనిలో పనిగా. 338 00:26:30,250 --> 00:26:32,000 దీనికి ఫిషర్లకి సంబంధమేంటి? 339 00:26:32,083 --> 00:26:35,375 నేను ఇంకా చిన్న చిన్న వివరాలను పూరిస్తున్నా, టామీ, 340 00:26:35,458 --> 00:26:37,708 కానీ తొలి ప్రతిగా ఇది ఎలా ఉంది? 341 00:26:38,583 --> 00:26:42,083 బర్టన్, అతని సైనిక స్నేహితులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. 342 00:26:42,166 --> 00:26:44,583 అడ్డుతగలకూడని ఒక వ్యక్తికి అడ్డు తగిలారు. 343 00:26:44,666 --> 00:26:48,458 దాంతో ఆ వ్యక్తి వారిని లేపేయడానికి ఎవరో కిరాయి హంతకుడిని పంపాడు. 344 00:26:48,666 --> 00:26:52,041 ఆ కిరాయి హంతకుడు నీ ఆధీనంలో ఉన్నాడు, టామీ. 345 00:26:52,416 --> 00:26:53,583 కానీ తప్పించుకున్నాడు, 346 00:26:53,666 --> 00:26:56,166 అతను పికెట్ ఇంటికి వచ్చాడు, 347 00:26:56,250 --> 00:26:59,125 కారు దొంగిలించి పారిపోవడానికి. 348 00:26:59,208 --> 00:27:02,541 ఆ క్రమంలో పాపం మేరీ పికెట్‌ను చాలా హింసాత్మకంగా చంపాడు. 349 00:27:03,458 --> 00:27:05,125 ఇది ఎలా ఉంది, ఆవేశాల వీరుడా? 350 00:27:06,166 --> 00:27:08,125 మీరు దీన్ని కల్పించినట్టుగా ఉంది. 351 00:27:09,625 --> 00:27:13,166 కథను చెప్పేటప్పుడు మనం చేసేది ఇదే, అసత్యాలను చొప్పించడం. 352 00:27:13,250 --> 00:27:15,958 నువ్వు గత పదేళ్ళుగా చేస్తున్నట్టుగా. 353 00:27:16,041 --> 00:27:18,291 పనులు ఎలా జరుగుతాయో తెలియనట్లుగా నటించడం. 354 00:27:18,375 --> 00:27:20,416 నీకు నువ్వే కట్టుకథ చెప్పుకుంటున్నావు, 355 00:27:20,500 --> 00:27:23,333 దాంతో నువ్వేదో పెద్ద సైన్యాధిపతి అయినట్టు ఫీలవుతావు, 356 00:27:23,416 --> 00:27:25,916 కానీ వాస్తవానికి, నా కింద పని చేస్తుంటావు. 357 00:27:27,250 --> 00:27:29,958 అంటే, నువ్వు కార్బెల్ పికెట్‌కు పని చేస్తున్నావు. 358 00:27:31,000 --> 00:27:32,375 నన్ను నమ్ము, బాబు, 359 00:27:32,666 --> 00:27:35,458 నీతో నువ్వు నిజాయితీగా ఉంటే ఎంతో సులువుగా ఉంటుంది. 360 00:27:35,541 --> 00:27:39,375 ప్రతీ గంటా ఏమీ తెలియని దద్దమ్మలా ఉండటానికి ఎంతో శక్తి ఖర్చవుతుంది. 361 00:27:39,458 --> 00:27:41,458 వెంటనే వెళ్ళి బర్టన్‌ని తీసుకురా. 362 00:27:41,541 --> 00:27:44,083 కార్బెల్ అతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలట. 363 00:27:48,083 --> 00:27:48,916 వెళ్ళను. 364 00:28:00,333 --> 00:28:04,083 అబ్బాయి, ఆ ముసలాడు నీ జీవితం రెండు దారుల మలుపు వద్దకు చేరిందన్నాడు. 365 00:28:04,791 --> 00:28:07,000 ఆ విషయంగా అతను చెప్పింది నికార్సయిన నిజం. 366 00:28:08,375 --> 00:28:11,875 దేవుడా, టామీ, దీన్ని అరటిపండు ఒలిచినట్టు చెప్పాలా? 367 00:28:11,958 --> 00:28:14,833 సరేలే. సరేలే, నువ్వు ఇక్కడ సరైన పనే చేయవచ్చు. 368 00:28:14,916 --> 00:28:19,000 నాకు, కార్బెల్‌‌కు సంకెళ్ళు వేసి రెండు కుక్కల్లా స్టేషన్‌కు ఈడ్చుకెళ్ళచ్చు. 369 00:28:19,083 --> 00:28:23,083 ఆ తర్వాత, మనం ముగ్గురం, ఈ ప్రపంచానికి మన కథల్ని చెబుతాం. 370 00:28:23,166 --> 00:28:28,000 నీ ఓటమికి ఇతరులని నిందించడానికి చూస్తున్నావనే కథను నేను, కార్బెల్ చెబుతాం, 371 00:28:28,083 --> 00:28:31,375 మీ యువకులు, ఆవేశపరులు తరచూ ఇలాంటివే చేస్తారు. 372 00:28:35,166 --> 00:28:36,250 చూయింగ్ గమ్ కావాలా? 373 00:28:41,208 --> 00:28:42,833 నువ్వు గాభరాపడ్డావు, టామీ. 374 00:28:42,916 --> 00:28:45,041 దాంతో ఈ నమ్మలేని కట్టుకథ కల్పించావు, 375 00:28:45,125 --> 00:28:48,041 క్లాంటన్‌కు నాలుగుసార్లు షెరిఫ్‌గా ఎన్నికైన నేను, 376 00:28:48,125 --> 00:28:51,250 నీ వాహనాన్ని కంటికి కనిపించని ఎస్‌యువీతో గుద్దానని, 377 00:28:51,333 --> 00:28:53,000 నీ ఖైదీతో పారిపోయానని, 378 00:28:53,083 --> 00:28:55,500 అతన్ని పికెట్ ఆధీనంలో వదిలేశానని. 379 00:28:55,583 --> 00:29:00,583 ఏ కార్బెల్ పికెట్ అయితే, క్లాంటన్ నగరంలో 50 నుండి 60 శాతం మందికి ఉపాధి కల్పిస్తాడో. 380 00:29:00,666 --> 00:29:05,125 ఆ తర్వాత, నా మతి మండా, టామీ, నాకు కూడా గందరగోళంగా ఉంది. 381 00:29:06,958 --> 00:29:08,958 ఏం చెబుతున్నానో తెలుస్తోందిగా? 382 00:29:09,583 --> 00:29:13,333 కార్బెల్, నేను విడుదలవుతాం, నీ నుండి క్షమాపణలు అందుకున్న తర్వాత. 383 00:29:13,416 --> 00:29:16,833 నువ్వు, గరిష్టంగా శాఖలో నీ ఉద్యోగాన్ని కోల్పోతావు. 384 00:29:16,916 --> 00:29:19,208 కొన్ని అభియోగాలు అలానే ఉండిపోవచ్చు. 385 00:29:19,291 --> 00:29:21,500 తప్పుడు అరెస్టు, అలాంటివి. 386 00:29:23,416 --> 00:29:26,000 లేదా మలుపులో మరో దారి ఉంది. 387 00:29:26,083 --> 00:29:27,958 పైకి రావాలంటే కలిసి పనిచేయాలనే దారి, 388 00:29:28,041 --> 00:29:31,833 ఇందులో అధికారిగా నువ్వు చేస్తున్న చక్కటి పనిని కొనసాగించవచ్చు. 389 00:29:31,916 --> 00:29:34,541 బహుశా ఇతర బాధ్యతలని కూడా పొందవచ్చు, 390 00:29:34,916 --> 00:29:37,583 వాటికి తగిన జీతాలను అందుకుంటూ. 391 00:29:39,333 --> 00:29:42,083 లేదా ఓ ఎదిగిన వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించవచ్చు. 392 00:29:46,000 --> 00:29:48,208 నీకు మరో దారి లేదు, టామీ. అర్థమవుతోందిగా? 393 00:29:49,458 --> 00:29:51,541 ఎందుకంటే నా కథలో నిజం లేకపోవచ్చు, 394 00:29:52,541 --> 00:29:54,916 కానీ అది కచ్చితంగా నిజంగా అనిపిస్తుంది. 395 00:29:55,375 --> 00:29:58,208 అది నీ కథను ప్రతీ ఒక్కసారి ఓడించి తీరుతుంది. 396 00:29:59,208 --> 00:30:01,958 కనుక, మనం ఒకరితో ఒకరం ఈ చెత్త పేచీలు పెట్టుకోకుండా, 397 00:30:02,041 --> 00:30:06,000 నువ్వు వెళ్ళి బర్టన్ ఫిషర్‌ని, వాడి చెల్లిని తీసుకురా. 398 00:30:18,041 --> 00:30:21,916 వాళ్ళు తమ అనుబంధ నైపుణ్యాలను చక్కగా కనుగొన్నారు, వాడుకున్నారు. 399 00:30:22,000 --> 00:30:24,500 దృశ్య శ్రవణ సమాచారాన్ని కలిసి పంచుకుంటున్నారు. 400 00:30:24,583 --> 00:30:28,000 అంటే వారి ప్రాథమిక హాప్టిక్ ఇంప్లాంట్స్ దీనిపై ప్రభావం చూపించాయి. 401 00:30:28,666 --> 00:30:31,750 వారిపై నీ అభిప్రాయం ఏంటి? అంటే, వారి వ్యక్తిత్వాలపై. 402 00:30:32,083 --> 00:30:35,208 ధైర్యవంతులు. బలవంతులు. పట్టుదల ఉంది. 403 00:30:35,625 --> 00:30:38,458 ఆ అమ్మాయి సోదరుడిది ఊహించగల, ఆధారపడదగిన వ్యక్తిత్వం, 404 00:30:38,541 --> 00:30:41,500 కానీ సంక్షోభంలో అతని స్నేహితుడి వైపే మొగ్గు చూపుతాను. 405 00:30:41,916 --> 00:30:42,750 ఎందుకని? 406 00:30:43,625 --> 00:30:44,458 మేడమ్? 407 00:30:44,541 --> 00:30:48,250 సోదరుడు ఆధారపడగలవాడైతే, మిత్రుడి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నావు? 408 00:30:53,875 --> 00:30:56,250 దానిపై నాకు నిర్దిష్ట డేటా లేదు. 409 00:30:57,208 --> 00:31:01,625 ఆ నిర్ణయం నా చేతనలోని అత్యంత కింది పొరలోని నా నాడీ వ్యవస్థలో జరిగింది. 410 00:31:01,708 --> 00:31:02,666 ఆసక్తికరం. 411 00:31:07,541 --> 00:31:08,833 ఇక ఆ యువతి? 412 00:31:08,916 --> 00:31:12,666 తను ఇంకా అర్థం కాని ప్రశ్నే, అందుకు త్వరలోనే జవాబు ఇస్తాననుకుంటా. 413 00:31:16,875 --> 00:31:17,708 ఏంటది? 414 00:31:17,791 --> 00:31:20,541 మీతో కలవాలనే వినతితో చెరీస్ నులాండ్ కింద ఉన్నారు. 415 00:31:20,625 --> 00:31:21,833 మీరు ఆమె రాకను ఆశించారు. 416 00:31:22,833 --> 00:31:26,958 జుబోవ్ ఇంటిని సందర్శించినట్లు ఆర్‌ఐకు తెలిసేలా చేశాను, 417 00:31:27,041 --> 00:31:29,541 మనం వెళ్ళగానే మనపై నిఘా పెట్టడానికి అనుమతించా. 418 00:31:29,625 --> 00:31:34,125 కానీ డా. నులాండ్ ఇంత చురుకుగా స్పందిస్తారని నేను అసలు ఊహించనేలేదు. 419 00:31:35,208 --> 00:31:38,625 దయచేసి ఆమెను పైకి పంపు. ఇందులో చాలా సమాచారం దొరుకుతుంది. 420 00:31:46,958 --> 00:31:48,666 ఒరేయ్ పనికిమాలిన వెధవా. 421 00:31:55,125 --> 00:31:57,375 నువ్వు దీనితో ఎలా జీవించగలవురా? 422 00:31:59,583 --> 00:32:03,208 అంటే, ఎలా జీవిస్తావురా? 423 00:32:29,541 --> 00:32:30,416 ఇప్పుడేంటి? 424 00:32:31,208 --> 00:32:32,125 మనం వేచి చూస్తాం. 425 00:32:32,750 --> 00:32:33,583 ఎవరి కోసం? 426 00:32:36,166 --> 00:32:37,750 నేను ఇద్దరిని చంపాలి. 427 00:32:38,708 --> 00:32:40,708 వారిలో ఒకరు వస్తున్నట్టు ఉన్నారు. 428 00:32:40,791 --> 00:32:42,916 నా పిల్లల గురించి మాట్లాడుతున్నావు కదా? 429 00:32:43,000 --> 00:32:44,666 అవును, మేడమ్. వారి గురించే. 430 00:32:51,041 --> 00:32:53,416 -అమ్మ ఫోన్ ఎత్తడం లేదు. -రీస్ కూడా. 431 00:32:53,500 --> 00:32:56,708 రీస్. "మీ అమ్మ మిమ్మల్ని వీలైనంత త్వరగా రమ్మంటోంది." 432 00:32:57,166 --> 00:32:59,375 -"మీ అమ్మ"నా? -ఇది చాలా వింతగా ఉంది. 433 00:32:59,458 --> 00:33:00,625 అతనితో సంధానమవుతావా? 434 00:33:04,541 --> 00:33:06,166 -ఛత్. -ఏంటి? 435 00:33:06,250 --> 00:33:07,791 నాకు అతని నాడి తెలియడం లేదు. 436 00:33:12,500 --> 00:33:15,333 నేను దాదాపు పోలీసులను పిలవాలనుకున్నా, ఇన్‌స్పెక్టర్. 437 00:33:16,541 --> 00:33:19,708 మనుషులకు రోబోట్లతో ఉండాల్సిన బంధాల నియమావళి, పెరిఫరల్స్ 438 00:33:19,791 --> 00:33:23,208 ఎప్పుడూ స్వతంత్ర జీవులుగా వ్యవహరించకూడదని స్పష్టం చేస్తోంది. 439 00:33:23,541 --> 00:33:27,125 ఆ నియమావళికి ప్రత్యేక మినహాయింపుగా బియాట్రిస్ మనుగడ సాగిస్తోంది. 440 00:33:27,666 --> 00:33:28,500 అవునులెండి. 441 00:33:29,916 --> 00:33:32,375 ఇది ఆర్‌ఐ చేతిపనిగా అనిపించటం లేదు. 442 00:33:34,375 --> 00:33:36,000 నిన్ను కలవడం సంతోషం, బియాట్రిస్. 443 00:33:36,083 --> 00:33:37,500 సంతోషం నాది, మేడమ్. 444 00:33:38,125 --> 00:33:39,458 ఆశ్చర్యమేంటో తెలుసా? 445 00:33:39,750 --> 00:33:44,250 జాక్‌పాట్ ఘటన తరగని ప్రభావం కారణంగా, అత్యధిక శాతం కోయిడ్స్ ఇప్పుడు... 446 00:33:44,333 --> 00:33:47,875 తప్పిపోయిన వ్యక్తిగత బంధువుల రూపాలను పోలి ఉన్నాయి. 447 00:33:48,958 --> 00:33:51,208 తోబుట్టువులవి. సహచరులవి. 448 00:33:51,833 --> 00:33:54,083 కానీ తల్లిదండ్రులని పోలినట్లు లేవు. 449 00:33:54,833 --> 00:33:56,625 ఇది ఆశర్యం కలిగించే అద్భుతం కదా? 450 00:33:57,625 --> 00:34:00,250 అంటే ఒక తండ్రినో, తల్లినో కోల్పోవడం 451 00:34:00,333 --> 00:34:02,208 అనే బాధను మనం సులభంగా ఆమోదించే 452 00:34:02,875 --> 00:34:05,333 సహజ లక్షణమేదో మనలో ఉంది. 453 00:34:06,041 --> 00:34:07,041 కానీ బిడ్డ విషయంలో? 454 00:34:09,250 --> 00:34:10,250 ఒక కూతురు, 455 00:34:11,500 --> 00:34:12,791 ఉదాహరణకు? 456 00:34:14,416 --> 00:34:15,833 నన్ను క్షమించు, బియాట్రిస్. 457 00:34:16,416 --> 00:34:18,750 ప్రస్తుతానికి నిన్ను నువ్వు ఆఫ్ చేసుకో. 458 00:34:18,833 --> 00:34:22,500 అలాగే దయచేసి గత ఐదు నిమిషాలను నీ జ్ఞాపకాల నుండి తుడిచివేయి. 459 00:34:22,583 --> 00:34:25,333 వెంటనే ఆఫ్ చేసుకుంటున్నా. తుడిచివేతను ఆరంభిస్తున్నా. 460 00:34:30,541 --> 00:34:31,875 ఇప్పుడు సంతోషమేనా? 461 00:34:31,958 --> 00:34:34,208 కుతూహలంగా ఉంది. దాన్ని రహస్యంగా ఎందుకుంచాలి? 462 00:34:35,333 --> 00:34:37,000 మా బంధాన్ని సంక్లిష్టం చేస్తుంది. 463 00:34:37,083 --> 00:34:38,333 అవును, అదే అనుకుంటా. 464 00:34:38,416 --> 00:34:39,958 ఎందుకని ఇక్కడికి వచ్చారు? 465 00:34:42,708 --> 00:34:46,875 నా నుండి ఎంతో విలువైనది ఒకటి దొంగిలించబడింది, 466 00:34:48,291 --> 00:34:50,208 నాకు చట్టం తగిన న్యాయం చేయాలి. 467 00:34:59,458 --> 00:35:01,000 దీని గురించి అసహనంగా ఉన్నావు. 468 00:35:01,541 --> 00:35:02,416 "అసహనమా"? 469 00:35:03,625 --> 00:35:05,791 విపరీతమైన భయంతో ఉన్నాను. 470 00:35:06,125 --> 00:35:08,500 క్లెప్ట్ వర్గం వారు జోక్యం చేసుకోవడమే కాదు. 471 00:35:08,583 --> 00:35:09,666 ఇప్పుడు నగర పోలీసులు దిగారు 472 00:35:09,750 --> 00:35:11,083 ఈ ఇద్దరిలో ఎవరైనా మన కథను ముగించేస్తారు... 473 00:35:14,375 --> 00:35:16,000 దీని అర్థాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? 474 00:35:16,083 --> 00:35:17,583 ఇది తెలిసిన వాళ్ళు మనం మాత్రమే. 475 00:35:18,583 --> 00:35:19,500 ఎలీటాకు తెలుసు. 476 00:35:21,041 --> 00:35:21,958 ఎలీటా చనిపోయింది. 477 00:35:22,500 --> 00:35:24,958 లేదంటే ఎంతగా అజ్ఞాతంలోకి వెళ్ళిందంటే, చనిపోయే ఉంటుంది. 478 00:35:25,666 --> 00:35:27,166 ఇది మనది. మనం చేజిక్కించుకుందాం. 479 00:35:27,583 --> 00:35:30,583 మనం బ్యాక్టిరియాను ఎలా అందిపుచ్చుకోవాలి? దాని వరుసక్రమం ఎలా చేయాలి? 480 00:35:30,875 --> 00:35:32,750 మనం చేయాల్సిందల్లా స్టబ్‌లో ఒకరిని పనికి పెట్టుకోవడమే... 481 00:35:34,083 --> 00:35:34,958 ఆయనే, బంగారం. 482 00:35:37,125 --> 00:35:39,708 సుఖంలోని ఈ భాగాన్ని ఎలా కాదనగలం? 483 00:35:41,166 --> 00:35:43,208 అతని అహంకారపు పరిధి నుండి దొంగిలించడం... 484 00:35:43,291 --> 00:35:46,375 అహంకారం ఒకలాంటి మూర్ఖత్వం, 485 00:35:46,458 --> 00:35:47,583 నువ్వు ఒప్పుకుంటావా? 486 00:35:48,875 --> 00:35:51,125 ఉదాహరణకు, ఇది మనకు అహంకారంగా అనిపించవచ్చు, 487 00:35:51,208 --> 00:35:54,000 ఒకరి గుప్తలిపిని ఎవరూ కనుక్కోలేరు అని అనుకోవడం, 488 00:35:54,083 --> 00:35:56,083 ఎందుకంటే, చారిత్రాత్మకంగా, 489 00:35:56,166 --> 00:35:59,208 ఏ గుప్తలిపిని చేధించలేని విషయం అనుకున్నా, 490 00:35:59,750 --> 00:36:03,750 నిరాశాకరంగా, దాని ఆయుష్షు తక్కువనే నిరూపితమైంది. 491 00:36:08,916 --> 00:36:11,708 నాన్న అధ్యయన గదికి వెళ్ళు. అతనికి కత్తి తీసుకురా. 492 00:36:11,791 --> 00:36:13,583 -ఏది? -ఏదైనా సరే. 493 00:36:17,333 --> 00:36:19,458 నేను ఇప్పుడు సందిగ్ధతలో ఉన్నాను. 494 00:36:19,791 --> 00:36:24,583 నాలోని ఒక భాగం, సహజంగానే, మీ ఇద్దరినీ నాశనం చేయాలని అనుకుంటోంది. 495 00:36:24,666 --> 00:36:26,958 నాలోని పిల్లాడు, దాన్ని మీరలా అనవచ్చు. 496 00:36:27,041 --> 00:36:31,083 ఉడికిపోతున్నాడు. ముక్కోపిగా ఉన్నాడు. ప్రతీకారంతో చెలరేగుతున్నాడు. 497 00:36:33,000 --> 00:36:36,625 కానీ నాలో శాంతంగా ఆలోచించే మరో భాగం, 498 00:36:37,041 --> 00:36:39,208 నాకు మీ అవసరం ఎంత ఉందో గ్రహిస్తుంది. 499 00:36:41,291 --> 00:36:43,416 మీ నైపుణ్యాలు, కచ్చితంగా అవసరమే. 500 00:36:46,291 --> 00:36:50,666 ఇక ఇప్పుడు గ్రహిస్తున్న విషయం, మీ రహస్యాలు కూడా నాకు అవసరమే. 501 00:36:53,750 --> 00:36:56,833 అలాగే, మీరంటే నాకు ఇష్టం. 502 00:36:58,791 --> 00:37:00,083 యాష్ నువ్వంటే ఇష్టం. 503 00:37:00,666 --> 00:37:03,625 నేను ఆసియన్‌ను పట్టుకోవచ్చు లేక వదిలేయచ్చు, కానీ నీది, 504 00:37:04,041 --> 00:37:07,083 నీది, నీకు తెలుసో లేదో, క్లెప్ట్ వర్గపు మనసు. 505 00:37:07,541 --> 00:37:12,041 గర్వం. పన్నాగాలు పన్నడం. దూకుడు. 506 00:37:13,208 --> 00:37:14,833 ఇక ఇది కూడా: అహంకారం. 507 00:37:16,333 --> 00:37:18,708 కాబట్టి ఇవన్నీ సులభంగా తెలుస్తున్నాయి... 508 00:37:20,375 --> 00:37:21,541 నాకు భయంగా ఉంది. 509 00:37:23,416 --> 00:37:24,875 నేను ఏం చేయాలి. 510 00:37:30,208 --> 00:37:31,208 నాకు ఇష్టమైనది. 511 00:37:32,208 --> 00:37:34,333 ఇది అందమైనది, కన్నా. 512 00:37:34,625 --> 00:37:36,000 నేను చూడనా, నాన్నా? 513 00:37:36,083 --> 00:37:39,916 వద్దులే. వంటగదికి వెళ్ళిపో, ఆయా పుడింగ్ చేసింది. 514 00:37:49,541 --> 00:37:52,041 -నన్ను క్షమించండి, సర్. -నోర్ముయ్, ఆసియన్. 515 00:37:59,916 --> 00:38:02,875 నీ పన్నాగమేంటో చెప్పు లేదంటే వీడిని చంపుతా. పది క్షణాలు. 516 00:38:10,000 --> 00:38:12,208 పోల్ట్ సోదరుడితో ఉన్నానని ఎలీటా భావించింది. 517 00:38:12,291 --> 00:38:15,583 అతని హాప్టిక్ ఇంప్లాంట్స్‌లో ఆర్‌ఐ ఫైల్స్‌ డౌన్లోడ్ చేయాలనుకుంది. 518 00:38:15,666 --> 00:38:20,166 స్టబ్‌లో భద్రపరచడానికి. మరోలా చెప్పాలంటే, వాటి జాడ కనుక్కోలేని విధంగా. 519 00:38:21,583 --> 00:38:23,916 అద్భుత పథకం, మీరు అంగీకరిస్తారనుకుంటా. 520 00:38:24,541 --> 00:38:26,833 కానీ అతని చెల్లి ఆ పెరిఫరల్‌ను నడిపింది, 521 00:38:26,916 --> 00:38:28,833 ఆ అమ్మాయిలో ఇంప్లాంట్స్ లేవు, దాంతో, 522 00:38:28,916 --> 00:38:31,708 ఆమె హెడ్‌సెట్, ఆ డేటాను క్రిముల డీఎన్ఏ‌గా అనువదించింది. 523 00:38:31,791 --> 00:38:33,625 అవి ఆమె మెదడును ఆక్రమించసాగాయి. 524 00:38:34,791 --> 00:38:37,291 ఆ డేటాతో నువ్వు ఏం చేయాలనుకున్నావు? 525 00:38:38,375 --> 00:38:39,916 ధనికులకు అమ్మాలనుకున్నా. 526 00:38:54,750 --> 00:38:56,333 నీ మాటపై నాకు నమ్మకం లేదు. 527 00:39:04,666 --> 00:39:06,208 దాన్ని నియోప్రిమ్స్‌కు ఇస్తాను. 528 00:39:06,291 --> 00:39:09,416 అసలు వారికి ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావు? 529 00:39:09,500 --> 00:39:14,500 దాంతో వాళ్ళు ఈ ప్రపంచాన్ని బూడిద చేసి, దీని స్థానంలో కొత్త ప్రపంచం నిర్మిస్తారని. 530 00:39:18,583 --> 00:39:19,583 నువ్వు మూర్ఖురాలివి. 531 00:39:21,333 --> 00:39:22,541 కాల్పనిక మూర్ఖురాలివి. 532 00:39:26,333 --> 00:39:28,625 నాకు నువ్వు మళ్ళీ అడ్డుపడాలని చూస్తే, 533 00:39:31,458 --> 00:39:34,791 నాకు మరో దారి ఉండదు, నిన్ను ముక్కలుగా చెక్కి, 534 00:39:35,625 --> 00:39:37,708 నా బుజ్జి జంతువులకు ఇవ్వడం తప్ప. 535 00:39:44,583 --> 00:39:46,416 కానీ నీ మిగతా పథకం నాకు నచ్చింది. 536 00:39:47,208 --> 00:39:48,666 మనం మొదలుపెడదామా? 537 00:39:54,750 --> 00:39:57,333 జాక్‌పాట్‌లోని ప్రతీ మహమ్మారి క్రిమిని 538 00:39:57,875 --> 00:40:00,208 ఒకే మనిషి ఆయుధంగా మలిచాడు. 539 00:40:01,500 --> 00:40:03,375 మానవ స్వభావం. 540 00:40:04,333 --> 00:40:07,291 ఆ స్వభావం తనని తాను స్వార్థంగానో, లేక అవినీతిగానో, 541 00:40:07,375 --> 00:40:09,916 లేక సాధారణ మూర్ఖత్వంగానో వ్యక్తమై ఉండవచ్చు, 542 00:40:10,625 --> 00:40:15,125 కానీ మౌలికంగా, ఇదంతా ఒకే లక్షణాన్ని సూచిస్తోంది, 543 00:40:15,916 --> 00:40:18,541 అందరి మేలును కోరే చర్యలను వ్యతిరేకించే, 544 00:40:18,625 --> 00:40:20,791 ఒక మొండి, స్వీయ-విధ్వంసక నిరోధకత. 545 00:40:23,125 --> 00:40:23,958 నేను చూపనా? 546 00:40:24,583 --> 00:40:25,416 దయచేసి చూపండి. 547 00:40:35,458 --> 00:40:38,583 ఆర్ఐ కొన్ని రాత్రుల క్రితం ఓ భారీ డేటా చోరీని ఎదుర్కొంది, 548 00:40:38,666 --> 00:40:40,750 ఈ పనిని ఒక ఆర్‌ఐ ఉద్యోగి, 549 00:40:40,833 --> 00:40:43,750 అలాగే స్టబ్‌లో నుండి నడపబడే ఒక పెరిఫరల్ చేశారు. 550 00:40:44,333 --> 00:40:47,583 తర్వాత జరిగిన ఒక నేరస్థలంలో, ఈ డేటా చోరీకి సంబంధమున్న 551 00:40:47,666 --> 00:40:51,916 ఒక జుబోవ్ సహాయకుడు ఉండటం, కచ్చితంగా క్లెప్ట్ వర్గపు ప్రమేయాన్ని సూచిస్తోంది. 552 00:40:52,166 --> 00:40:54,125 వాళ్ళ చోరీకి లక్ష్యం, 553 00:40:54,208 --> 00:40:56,166 మా నాడీ వ్యవస్థ మార్పు యంత్రాంగమేనని 554 00:40:56,250 --> 00:41:01,250 నమ్మడానికి మాకు కారణాలున్నాయి, ఇది చాలా సున్నితమైన పరిశోధనా విషయమని మీకూ తెలుసు. 555 00:41:01,333 --> 00:41:04,458 అయితే, నాకేం చెప్తున్నారంటే, మీ నుండి చోరీకి గురైన ఈ డేటా, 556 00:41:04,541 --> 00:41:07,083 ఈ యంత్రాంగపు ఉనికిని నమోదు చేసి ఉంటుందనా? 557 00:41:07,166 --> 00:41:08,000 చేసి ఉంటుంది. 558 00:41:08,083 --> 00:41:09,416 మీ భయం అదేనా? 559 00:41:09,500 --> 00:41:12,958 ఇది బట్టబయలైతే, ప్రజల్లో మీ మీద నిరసన, అసమ్మతి వెల్లడవుతాయనా? 560 00:41:13,041 --> 00:41:14,041 కచ్చితంగా. 561 00:41:14,416 --> 00:41:17,500 కానీ ఈ యంత్రాంగపు చోరీ ఇంకా భయంకరమైనది, 562 00:41:17,583 --> 00:41:19,291 దాన్ని మంచి విధానంలో వాడకపోవచ్చు. 563 00:41:19,375 --> 00:41:22,125 ఈ సాంకేతికతలో అంతర్గతంగా ఉన్న సంభావ్యత ఇది. 564 00:41:23,708 --> 00:41:27,541 మరి, మీరు దీనికి ఒప్పుకుంటారు, ఇన్‌స్పెక్టర్, 565 00:41:27,625 --> 00:41:30,291 ఒక సుత్తి చాలా పనికొచ్చే పరికరమని. 566 00:41:31,458 --> 00:41:34,375 కానీ అది తప్పుడు చేతుల్లో చాలా ప్రాణాంతక పరికరం. 567 00:41:35,916 --> 00:41:38,500 మీరు ఈ మధ్యే లెవ్ జుబోవ్‌ను కలిశారనుకుంటా? 568 00:41:39,500 --> 00:41:44,291 ఆర్‌ఐ స్టబ్‌లో తన ఇటీవలి సాహసాలపై అతను ఆసక్తికరమైన కథనే చెప్పుంటాడు. 569 00:41:45,375 --> 00:41:47,041 "ఆర్‌ఐ"? అంటే స్టబ్ మీ సృష్టా? 570 00:41:47,125 --> 00:41:48,708 దాన్ని నేనే సృష్టించాను కదా? 571 00:41:48,791 --> 00:41:51,583 ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రయోగశాలలా. 572 00:41:52,541 --> 00:41:56,083 క్లెప్ట్ దాన్ని హస్తగతం చేసుకుంటే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో 573 00:41:56,958 --> 00:41:59,166 నేను చెప్పనక్కర్లేదు. 574 00:42:05,000 --> 00:42:06,541 నా నుండి ఏం ఆశిస్తున్నారు? 575 00:42:11,083 --> 00:42:12,333 జుబోవ్‌ కుటుంబాన్ని, 576 00:42:12,750 --> 00:42:15,375 ఫ్లిన్ ఫిషర్‌ను, వారితో సంబంధమున్న అందరినీ చంపండి. 577 00:42:15,458 --> 00:42:17,333 ఇక్కడా అలాగే స్టబ్‌లోనూ. 578 00:42:18,000 --> 00:42:21,416 ఎంతో సులువైన పని, నేను కర్ర ఊపితే చాలు అన్నట్టు చెబుతున్నారు. 579 00:42:21,500 --> 00:42:23,208 గతంలో ఇలా జరిగిందని మీకూ తెలుసు. 580 00:42:23,291 --> 00:42:24,500 సామ్సనోవ్ కుటుంబం. 581 00:42:25,041 --> 00:42:26,541 వారి వంశం మొత్తం 582 00:42:28,125 --> 00:42:31,625 ఈ భూమ్మీదే లేకుండా నాశనమయ్యారు. అదొక అమోఘమైన దృశ్యం. 583 00:42:31,708 --> 00:42:33,541 ఆ పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. 584 00:42:33,625 --> 00:42:34,458 అవునా? 585 00:42:34,541 --> 00:42:36,541 దేశద్రోహం? అలానే అనుకుంటున్నా. 586 00:42:36,625 --> 00:42:39,375 "చట్టబద్ధమైన అధికారిపై హింసను ప్రేరేపించడం 587 00:42:39,458 --> 00:42:42,333 "వారిని పదవీచ్యుతుల్ని చేయాలనే ఉద్దేశ్యంతో." 588 00:42:43,333 --> 00:42:45,708 నాకొక సుత్తి ఉంటే... 589 00:42:49,291 --> 00:42:52,958 నిస్సందేహంగా, మీరు దీన్నంతా స్వీకరించి, ఆకళింపు చేసుకోవాలి. 590 00:42:54,000 --> 00:42:57,375 కానీ మీకు తెలియాలి, నేను దీన్ని మీతో ఎందుకు పంచుకున్నానంటే, 591 00:42:57,458 --> 00:43:01,541 ఈ పరిస్థితిలో ఉన్న తీవ్రతను అర్థం చేసుకునే కుశాగ్రబుద్ధి, సూక్ష్మదృష్టి 592 00:43:01,625 --> 00:43:03,833 మీకు ఉన్నాయని నా విశ్వాసం. 593 00:43:16,208 --> 00:43:17,791 ఈ సారి నా ఇలాఖాకు రండి. 594 00:43:19,083 --> 00:43:21,750 టీ తాగాలని మీకు అనిపిస్తే. 595 00:43:38,083 --> 00:43:39,833 ఇది డబ్బు కోసం చేస్తున్నావా? 596 00:43:40,291 --> 00:43:42,958 డబ్బు ప్రమేయం ఉంది, కానీ అదొక్కటే కారణం కాదు. 597 00:43:43,333 --> 00:43:44,208 మరైతే దేని కోసం? 598 00:43:45,333 --> 00:43:47,083 నాకొక కూతురు ఉంది. 599 00:43:47,916 --> 00:43:49,916 ఆమెను బతికించుకుందాం అనుకుంటున్నా. 600 00:43:50,000 --> 00:43:53,125 నా పిల్లల్ని చంపకపోతే ఆమెను చంపుతామని బెదిరిస్తున్నారా? 601 00:43:53,208 --> 00:43:54,375 అదీ సంగతి. 602 00:43:58,250 --> 00:44:02,083 మా అమ్మ అనేది, "మూర్ఖుడు మాత్రమే ప్రపంచాన్ని అది లేక ఇదిగా చూస్తాడు." 603 00:44:02,916 --> 00:44:07,166 ఒక నిరాడంబరమైన చోటులో నిరాడంబరంగా జీవిస్తున్న మనుషుల నిరాడంబర ఆలోచన అది. 604 00:44:07,250 --> 00:44:09,958 కానీ దురదృష్టవశాత్తూ, అందులో ఏదీ ఇక్కడ నడవదు. 605 00:44:10,041 --> 00:44:12,125 కేవలం రెండే దారులున్నాయని ఊహిస్తున్నావు. 606 00:44:12,625 --> 00:44:16,083 నీ కూతురైనా చావాలి లేక నా పిల్లలైనా చావాలి. వేరే ఏం లేదు. 607 00:44:16,166 --> 00:44:18,041 మరో ఎంపిక ఉందని అంటున్నారా? 608 00:44:18,125 --> 00:44:19,208 ఉందని అంటున్నా. 609 00:44:20,708 --> 00:44:22,583 కేవలం నీ గొంతును విని, 610 00:44:23,166 --> 00:44:26,416 నువ్వు ఆ మాటను పరిగణించే మనిషివి కాదని చెప్పగలను. 611 00:44:29,541 --> 00:44:30,375 ప్రయత్నించండి. 612 00:44:32,458 --> 00:44:33,500 నువ్వు చనిపోవచ్చు. 613 00:44:35,333 --> 00:44:37,666 ఏం చేస్తున్నావురా? ఛత్! 614 00:44:39,458 --> 00:44:40,583 మనం ఎందుకు ఆగాం? 615 00:44:40,666 --> 00:44:43,875 నిదానమే మృదుత్వం. మృదుత్వమే వేగం. పరిస్థితిని విశ్లేషించాలి. 616 00:44:43,958 --> 00:44:45,916 వెంటనే వెళ్ళకపోతే, అమ్మ చనిపోతుంది. 617 00:44:46,000 --> 00:44:49,375 అక్కడ హంతకుడున్నాడు, వల పన్నాడు. లోపలికెళ్తే, అందరం చస్తాం. 618 00:44:49,458 --> 00:44:50,291 బర్టన్... 619 00:44:50,375 --> 00:44:52,500 నాకు బాగా తెలిసిన విషయం ఇదొక్కటే, 620 00:44:52,583 --> 00:44:55,666 కనుక ప్రస్తుతం, ఇది సరిగ్గా చేస్తానని నువ్వు నమ్మాలి. 621 00:44:59,125 --> 00:45:00,125 ఛత్. 622 00:45:00,208 --> 00:45:02,458 వీటిని తీసుకో. అలా వెళ్ళు, కారుకు అటు వైపు. 623 00:45:05,666 --> 00:45:06,958 దీన్ని స్పష్టంగా చెప్తా. 624 00:45:07,041 --> 00:45:10,458 నేను ఇక్కడ చావకూడదని అనుకోవడం నన్ను వెధవను చేస్తుందా? 625 00:45:11,208 --> 00:45:12,541 కేవలం వెధవనే కాదు. 626 00:45:13,750 --> 00:45:15,333 పిరికివాణ్ణి కూడా. 627 00:45:16,333 --> 00:45:17,416 అలాగే స్వార్థపరుడిని. 628 00:45:18,166 --> 00:45:19,958 దుష్టత్వంతో కూడిన స్వార్థం. 629 00:45:20,791 --> 00:45:24,750 నేనంటే మీకు అసలు ఇష్టం లేదనే అభిప్రాయం నాకు ఏర్పడుతోంది. 630 00:45:25,458 --> 00:45:26,916 మూడు ఉష్ణ సంకేతాలు చూశావా? 631 00:45:27,000 --> 00:45:28,541 అలాగే నేలపై చల్లటి సంకేతం? 632 00:45:28,625 --> 00:45:29,458 అది రీస్. 633 00:45:29,541 --> 00:45:31,916 మనకు డీ డీ, మీ అమ్మ, మన లక్ష్యం ఉన్నారు, 634 00:45:32,000 --> 00:45:34,500 ఇది అగ్గిపెట్టె గిగ్గిపెట్టె కోడి ఆటలా ఉంది. 635 00:45:34,583 --> 00:45:36,958 కుడివైపున అతనేనేమో, కానీ కచ్చితంగా తెలియదు. 636 00:45:37,041 --> 00:45:38,291 మనం అతన్ని కదల్చాలి. 637 00:45:40,500 --> 00:45:42,833 రీస్‌తో సంధానించుకో. తన నరాలను ప్రేరేపించు. 638 00:45:42,916 --> 00:45:44,916 ఛత్. వాడు శవానికి సంధానం అవుతాడు. 639 00:45:45,000 --> 00:45:48,041 వాడిని కాస్త ఊపు, రీస్ బతికే ఉన్నాడని ముసలాడు అనుకుంటాడు. 640 00:45:48,125 --> 00:45:50,458 రీస్‌ను చంపాలని చూస్తాడు, తనని గుర్తించగలం. 641 00:45:50,541 --> 00:45:52,500 వినపడుతోందా? లియాన్‌కి నొప్పేస్తుంది. 642 00:45:52,583 --> 00:45:56,625 అవును, రీస్ కూడా అలాగే చేసేవాడు, అతను మన పరిస్థితిలో ఉండుంటే. 643 00:45:56,708 --> 00:45:59,041 మాటలతో మీకు పనేంటి? పని ముగిద్దాం. 644 00:45:59,125 --> 00:46:01,333 ఫ్లిన్, లక్ష్యం స్పష్టమవగానే చెప్పు. 645 00:46:12,791 --> 00:46:13,750 తనే. కదులుతున్నాడు. 646 00:46:15,166 --> 00:46:16,083 లేపేయ్. 647 00:46:32,750 --> 00:46:33,583 అమ్మా! 648 00:46:37,416 --> 00:46:38,250 సమయం ముగిసింది. 649 00:46:49,333 --> 00:46:51,958 నాకు ఆ ముసలాడు సజీవంగా కావాలి, డేవిస్. 650 00:46:52,958 --> 00:46:55,291 వాడికి నేను కొన్ని చేయాలనుకుంటున్నాను. 651 00:46:55,375 --> 00:46:57,083 అర్థం చేసుకోగలను, కార్బెల్. 652 00:46:57,166 --> 00:46:59,000 మనం చేయగలిగినవన్నీ చేద్దాం. 653 00:46:59,625 --> 00:47:01,625 ఆమె అద్భుతమైన స్త్రీ, కార్బెల్... 654 00:47:01,708 --> 00:47:04,083 నేను చక్కటి కథతో వచ్చాననుకుంటా, షెరిఫ్. 655 00:47:06,916 --> 00:47:08,333 మీకు చెప్పాలనుకున్నాను. 656 00:47:09,250 --> 00:47:11,250 ఇక్కడికి ముసలాడు వచ్చాడనుకుందాం, 657 00:47:11,791 --> 00:47:12,833 ఆ పై మేరీని చంపాడు. 658 00:47:15,583 --> 00:47:18,541 అక్కడున్న పికెట్ గారు, పోలీసులకు కాల్ చేశారు, 659 00:47:20,375 --> 00:47:22,166 నేరస్థలంలోకి మీరు మొదట వచ్చారు. 660 00:47:22,250 --> 00:47:23,708 ఎందుకంటే నాలుగు దఫాలైనా కూడా, 661 00:47:23,791 --> 00:47:27,541 మీరు ఉద్యోగాన్ని నిబద్ధతతో చేస్తారు, మేమంతా దాన్ని ప్రశంసిస్తాం. 662 00:47:32,208 --> 00:47:34,125 టామీ, అసలు నువ్వు ఏ చెత్త... 663 00:47:34,208 --> 00:47:35,833 ఆ ముసలాడు ఇంకా ఇక్కడే ఉన్నాడు, 664 00:47:37,250 --> 00:47:39,000 తూటాలున్న ఈ .45 తుపాకీతో. 665 00:47:39,541 --> 00:47:41,041 మీరు మీ ఆయుధం తీయగానే, 666 00:47:41,125 --> 00:47:44,000 ఏమైందో తెలుసా, మిమ్మల్ని కాల్చాడు. 667 00:47:45,625 --> 00:47:47,583 అనేక సార్లు, అనుకుంటాను. 668 00:47:47,666 --> 00:47:49,875 సరే. తేలికగా తీసుకో. శాంతించు, టామీ. 669 00:47:49,958 --> 00:47:52,833 ఇప్పటికే చాలా శాంతించా, షెరిఫ్. నన్నదే భయపెడుతోంది. 670 00:47:53,250 --> 00:47:54,458 మీరన్నట్టుగానే. 671 00:47:54,958 --> 00:47:56,750 నాకు ఇప్పుడు మరో దారి లేదు కదా? 672 00:47:56,833 --> 00:47:57,666 టామీ, వద్దు! 673 00:48:09,791 --> 00:48:11,250 నా దుంప తెగా. 674 00:48:14,041 --> 00:48:15,875 ఇలా జరుగుతుందని ఊహించలేదు. 675 00:48:16,541 --> 00:48:18,083 అసలు ఊహించలేదు. 676 00:48:18,625 --> 00:48:19,458 ఇప్పుడు, 677 00:48:20,333 --> 00:48:22,166 శాంతి గురించి మాట్లాడావు కదా? 678 00:48:22,250 --> 00:48:24,375 నువ్వు నీ తుపాకీని కిందకు దించాలి, 679 00:48:25,500 --> 00:48:26,916 ఆ శాంతి తిరిగి వచ్చేదాకా, 680 00:48:27,458 --> 00:48:29,625 దాంతో దీని గురించి మాట్లాడుకోవచ్చు. 681 00:48:29,708 --> 00:48:31,666 మనం ఒక అవగాహనకు రావచ్చు. 682 00:48:31,750 --> 00:48:35,333 ఆ ముసలాడు నిన్ను బతకనిచ్చి ఉంటాడని నువ్వు అనుకోవడం లేదు, కదా? 683 00:48:35,416 --> 00:48:36,708 నేను ఏమనుకోవడం లేదంటే 684 00:48:37,500 --> 00:48:42,583 ఇది సొంతంగా చేసే దమ్ము నీకు ఉందని, కుర్రాడా. 685 00:48:44,791 --> 00:48:46,000 లేదా తూటాలు ఉన్నాయని. 686 00:48:52,000 --> 00:48:54,041 ఆ చెత్త ఏంటి రా? 687 00:48:54,125 --> 00:48:57,583 ఇది వింత పరికరంరా, పొగరుబోతు వెధవా. 688 00:49:33,833 --> 00:49:36,750 ద పెరిఫరల్‌లో తరువాత 689 00:49:38,416 --> 00:49:39,958 నువ్వు చనిపోతావు, నిజంగానే. 690 00:49:40,041 --> 00:49:41,708 చనిపోయి నా కుటుంబాన్ని కాపాడుతా. 691 00:49:44,166 --> 00:49:45,500 మీరు అతన్ని చంపాలి. 692 00:49:45,833 --> 00:49:46,708 వూల్ఫ్! 693 00:49:46,791 --> 00:49:48,583 నీకు అన్నీ చెప్తా. మాటిస్తున్నా. 694 00:49:49,750 --> 00:49:51,458 డిప్యూటీ? ఒకరికి ఇంకా ప్రాణముంది. 695 00:49:51,541 --> 00:49:52,375 ఎవరికి? 696 00:49:57,500 --> 00:50:00,291 ఆ అమ్మాయి తలలో ఉన్న రహస్యాలే మనకు కావాలి. 697 00:50:02,416 --> 00:50:03,250 వద్దు! 698 00:51:42,666 --> 00:51:44,666 సబ్‌టైటిల్ అనువాద కర్త Pradeep Kumar Maheshwarla 699 00:51:44,750 --> 00:51:46,750 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ